rtc
-
హైదరాబాద్‌కు 2,800 ఎలక్ట్రిక్ బస్సులు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు భారీగా రాబోతున్నాయి. పీఎం ఈ–డ్రైవ్ పథకం కింద 2,800 ఎలక్ట్రిక్ బస్సులు ఇవ్వాలని గత సెప్టెంబర్ లో తెలంగాణ ఆర్టీసీ కేంద్రానికి దరఖాస్తు చేసిన విషయం తెలిసిందే. ఈ పథకాన్ని పర్యవేక్షిస్తున్న కేంద్ర భారీ పరిశ్రమల శాఖ తాజాగా ఆర్టీసీ కోరిన బస్సులకు సబ్సిడీ మొత్తాన్ని ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. త్వరలో ఈ బస్సుల సరఫరాకు టెండర్లు పిలవనున్నారు. జూన్ నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి సరఫరా ప్రారంభించనున్నారు. టెండర్ దక్కించుకునే సంస్థ విడతలవారీగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టి, గ్రాస్ కాస్ట్ కాంట్రాక్టు (జీసీసీ) విధానంలో నిర్వహిస్తుంది. ప్రస్తుతానికి రెండు నగరాలకే.. దేశవ్యాప్తంగా 40 లక్షల కంటే ఎక్కువ జనా భా ఉన్న 9 నగరాల్లో వీలైనన్ని ఎక్కువ ఎలక్ట్రిక్ బస్సులు నడపాలని కేంద్ర ప్రభుత్వం పీఎం ఈ–డ్రైవ్ పథకం మొదటి విడతలో లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి విడత 2026 మార్చి వరకు కొనసాగనుంది. ఇందులో మొత్తం 14,028 బస్సులను సరఫరా చేయా లని నిర్ణయించింది. ఇందుకోసం 4,391 కోట్లు కేటాయించింది. ఈ పథకం కింద 2,800 బస్సులు ఇవ్వాలని తెలంగాణ ఆర్టీసీ దరఖాస్తు చేసింది. బెంగళూరు సిటీ కోసం కర్ణాటక ఆర్టీసీ 7 వేల బస్సులు కోరింది. కేంద్రం ఈ రెండు నగరాలకు 9,800 బస్సుల సబ్సిడీ మొత్తానికి ఆమోదం తెలిపింది. ఈ పథకంలో పేమెంట్ సెక్యూరిటీ మెకానిజం అనే అంశాన్ని కేంద్రం పొందుపరిచింది. జీసీసీ పద్ధతిలో ప్రైవేటు సంస్థ ఈ బస్సులను ఆర్టీసీ పరిధిలో నిర్వహిస్తుంది. ఆ బస్సులు తిరిగిన దూరం ఆధారంగా అద్దెను ఆ సంస్థకు ఆర్టీసీ చెల్లించాలి. ఒకవేళ నెల రోజులపాటు ఆర్టీసీ చెల్లించలేకపోతే, ఆ మొత్తాన్ని కేంద్రం చెల్లించి, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పూచీకత్తు పేమెంట్ సెక్యూరిటీ మెకానిజం నుంచి ఆ మొత్తాన్ని తీసేసుకుంటుంది. అంతమేర సొమ్మును తిరిగి మూడు నెలల్లో రాష్ట్రం ఆ మెకానిజంలో భర్తీ చేయాల్సి ఉంటుంది. నగరానికి సరఫరా అయ్యే 2,800 బస్సులకు సాలీనా అద్దె దాదాపు రూ.120 కోట్లు ఉంటుందని ఆర్టీసీ అంచనా వేసింది. రూ.1.85 కోట్ల విలువైన ఒక్కో బస్సుపై గరిష్టంగా 30 శాతం వరకు కేంద్రం సబ్సిడీ ఇస్తోంది. -
లక్షలాది జనం.. రవాణా ఘోరం
సాక్షి, హైదరాబాద్: ఆధ్యాత్మిక యాత్ర విషాదభరితంగా మారుతోంది. తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు ఉత్తరప్రదేశ్ మహాకుంభమేళాకు తరలి వెళ్తున్నారు. కానీ డిమాండ్ మేరకు రైళ్లు అందుబాటులో లేవు. ఇటు తెలంగాణ ఆర్టీసీ కానీ, అటు ఏపీఎస్ఆర్టీసీ కానీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయలేదు. భక్తులు మధ్యతరగతి, సామాన్యప్రజలకు ఏ మాత్రం అందనంతగా విమానచార్జీలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసి రావాలని కోరుకుంటున్న జనం తోచిన మార్గంలో వెళ్తున్నారు. సామర్థ్యం లేని ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణం చేసి ప్రమాదాల బారిన పడుతున్నారు. నాచారం (హైదరాబాద్) నుంచి యూపీ ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభమేళాకు మినీబస్సులో వెళ్లిన ఏడుగురు భక్తులు తిరుగు ప్రయాణంలో లారీ ఢీకొని మరణించిన ఉదంతం ఆందోళన రేపుతోంది. ప్రయాణికుల రద్దీ కారణంగా ఒకవైపు రహదారులు వందలకొద్దీ కిలోమీటర్లతో కిక్కిరిసిపోతుండగా, మరోవైపు మినీబస్సులు, మ్యాక్సీక్యాబ్‌లు వంటి చిన్న వాహనాల్లో ఎక్కువమంది ప్రయాణం చేస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. అరకొర రైళ్లు...: ప్రయాణికుల రద్దీ మేరకు రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కానీ అరకొర రైళ్లు అందుబాటులో ఉన్నాయి. పైగా సికింద్రాబాద్ నుంచి పట్నా, దానాపూర్, గోరఖ్‌పూర్, లక్నో, తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించే రెగ్యులర్ రైళ్లలో జనవరి నాటికే బుకింగ్ నిలిచిపోయింది. వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినప్పటికీ వెయిటింగ్ లిస్టు 200 దాటింది. మరిన్ని అదనపు రైళ్లు నడిపితే తప్ప తెలుగు రాష్ట్రాల నుంచి కుంభమేళాకు ప్రయాణం చేయడం సాధ్యం కాదు. సాధారణంగా సంక్రాంతి, దసరా వంటి పండుగలు, మేడారం వంటి జాతరలకు ఆర్టీసీ వేలకొద్దీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తుంది. కానీ ఈ కుంభమేళాకు లక్షలాది మంది తరలి వెళ్తున్నట్లు తెలిసి కూడా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయకపోవడం శోచనీయం.ప్రైవేట్ ట్రావెల్స్ నిలువుదోపిడీప్రతిసారీ పండుగ ప్రయాణాన్ని సొమ్ము చేసుకొనే ప్రైవేట్ ట్రావెల్స్, టూరిస్ట్ సంస్థలు మహాకుంభమేళా భక్తులను కూడా వదలకుండా నిలువుదోపిడీకి పాల్పడుతున్నాయి. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో ఫిట్నెస్ ఉన్నా లేకున్నా పెద్దఎత్తున వాహనాలను నడుపుతున్నాయి. 30 నుంచి 40 మంది ప్రయాణం చేసే ప్రైవేట్ బస్సులతోపాటు, 14 నుంచి 20 మంది వరకు ప్రయాణం చేసే సామర్థ్యం ఉన్న మినీ బస్సులు, మ్యాక్సీ క్యాబ్‌లు, ఇతరత్రా వాహనాలను ఎడాపెడా రోడ్డెక్కిస్తున్నాయి. ప్యాకేజీల పేరుతో ఒక్కో ప్రయాణికుడి వద్ద రూ. 25,000 నుంచి 30,000 వరకు వసూలు చేస్తున్నాయి. సాధారణంగా సుదీర్ఘమైన ప్రయాణం చేసే వాహనాల్లో ఇద్దరు డ్రైవర్లు తప్పనిసరిగా ఉండాలి. ప్రతి 8 గంటలకు ఒకసారి విధులు మార్చుకోవాలి. కానీ ప్రయాగ్‌రాజ్‌కు వెళ్తున్న వాహనాలు చాలావరకు ఒక డ్రైవర్‌తోనే బయలుదేరుతున్నాయి. హైదరాబాద్ నుంచి ప్రయాగ్‌రాజ్ వరకు సుమారు 1,136 కి.మీ. దూరం నిరాటంకంగా వాహనాలను నడపడం వల్ల డ్రైవర్లు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. -
ఆర్టీసీ ‘చలాన్’ బకాయి రూ.కోటి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఉల్లంఘనలో ప్రైవేట్ వాహనాలతో ఆర్టీసీ బస్సులు పోటీ పడుతున్నాయి. టీజీఎస్ఆర్టీసీ బస్సులపై ఏటా ట్రాఫిక్ పోలీసులు వేల సంఖ్యలో ఈ–చలాన్లు జారీ చేస్తున్నారు. 2022 నుంచి గత నెల 27 వరకు ఆర్టీసీ బస్సులకు 25,609 ఈ–చలాన్లు జారీ చేశారు. వీటికి సంబంధించి ఆర్టీసీ రూ.కోటికి పైగా చెల్లించాల్సి ఉంది. స్వచ్ఛంద సంస్థ యుగాంతర్ ఫౌండేషన్‌కు చెందిన యూఆర్టీఐ సంస్థ సమాచార హక్కు చట్టం కింద ట్రాఫిక్ పోలీసు విభాగం నుంచి ఈ సమాచారం సేకరించింది. ప్రయాణీకుల కోసమే ఉల్లంఘనలు..ఆర్టీసీ బస్సుల ట్రాఫిక్ ఉల్లంఘనల్లో ఎక్కువగా ప్రయాణికుల కోసం చేస్తున్న పొరపాట్లే ఉంటున్నాయి. రోడ్లపై ఎక్కడపడితే అక్కడ బస్సులు ఆపడం, బస్‌బేలను పట్టించుకోకపోవడం, స్టాప్‌లైన్ క్రాసింగ్, ఫ్రీ లెఫ్ట్ వయలేషన్ వంటి ఉల్లంఘనలపై పోలీసులు అధికంగా చలాన్లు విధిస్తున్నారు. కొందరు ప్రయాణికులు ఎక్కడపడితే అక్కడ బస్సులను ఆపాలని కోరుతున్నారు.]సంస్థ ఆదాయం గురించి ఆలోచిస్తున్న డ్రైవర్లు.. చెయ్యెత్తిన చోట బస్సులు ఆపుతుండటంతో ట్రాఫిక్ పోలీసులు చలాన్లు విధిస్తున్నారు. బస్ స్టాపుల్లో ఆటోలు తిష్టవేస్తుండటంతో బస్సులు రోడ్ల పైనే ఆగాల్సి వస్తోంది. కాగా, ట్రాఫిక్ జరిమానాలను చెల్లించడంలో ఆర్టీసీ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. ప్రైవేటు వాహనాల మాదిరిగా ట్రాఫిక్ పోలీసులు ఆర్టీసీ బస్సులపై కఠిన చర్యలు తీసుకోకపోవటంతో చలాన్లు పెండింగ్‌లో ఉండిపోతున్నాయి. -
అద్దె బస్సులే ముద్దు
‘ఆర్టీసీ బస్సులో ప్రయాణం సుఖవంతం.. సురక్షితం’ అన్నది ఆర్టీసీ నినాదం. అయితే దీనికి టీడీపీ కూటమి ప్రభుత్వం మరో సరికొత్త నినాదాన్ని కూడా జోడిస్తోంది. అదే ‘అద్దె బస్సులే ముద్దు... ఆర్టీసీ బస్సులు వద్దు’. అసలు విషయమేమంటే... ఆర్టీసీ కొత్త బస్సుల కొనుగోలుకు ముగింపు పలికి అద్దె బస్సుల సంఖ్యను పెంచాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. తద్వారా 14వేల ఉద్యోగాల కోతకు కూడా సిద్ధపడేలా ప్రభుత్వ ప్రణాళిక ఇలా ఉంది. – సాక్షి, అమరావతిఅద్దె బస్సులు రెట్టింపు చేద్దాం.. ఆర్టీసీలో మొత్తం 11,216 బస్సులు ఉన్నాయి. వాటిలో సొంతవి 8,465 కాగా అద్దె బస్సులు(Rental buses) 2,751 ఉన్నాయి. ప్రస్తుతం ఆర్టీసీలో అద్దె బస్సుల శాతం 24.6గా ఉంది. ఉద్యోగ భద్రత, ఉద్యోగుల సేవలను సది్వనియోగం చేసుకోవడం, ప్రభుత్వ రంగ సంస్థ అయినా ఆర్టీసీ(Rtc) ప్రయోజనాల పరిరక్షణ తదితర అంశాలకు ప్రభుత్వం ప్రాధాన్యమివ్వాల్సిన అవసరం ఉంది. అందుకే అద్దె బస్సులు గరిష్టంగా 25శాతం దాటకూడదని గతంలోనే ఆర్టీసీ పాలకమండలి తీర్మానించింది. ఈ విధానాన్ని ఇప్పటివరకు అన్ని ప్రభుత్వాలు పాటించాయి. ఇలా ఉంటే, ఆర్టీసీ బస్సుల కొనుగోలు, కొత్తగా విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టడం తదితర అంశాలపై ఇటీవల సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. కొత్త బస్సుల కొనుగోలుకు నిధులు సమకూర్చలేమని ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. ఆ అంశాన్ని దృష్టిలో ఉంచుకునే సమీక్షా సమావేశానికి నివేదిక రూపొందించాలని ఆర్టీసీ ఉన్నతాధికారులకు ప్రభుత్వం స్పష్టం చేసింది. దాంతో ఆర్టీసీ ప్రయోజనాల పరిరక్షణకు అద్దె బస్సులు గరిష్టంగా 25శాతానికి పరిమితం చేయాల్సి ఉందని ఆర్టీసీ అధికారులు నివేదించారు. ఇక్కడే... సీఎం ఉద్దేశాన్ని గుర్తించిన ఆర్టీసీ అధికారులు ‘ప్రభుత్వం కోరితే అద్దె బస్సులను 50 శాతానికి పెంచుతాం’ అని కూడా నివేదికలో పొందుపరచడం గమనార్హం. తద్వారా ఆర్టీసీలో ప్రస్తుతం 24.6 శాతంగా ఉన్న అద్దె బస్సులను 50 శాతానికి పెంచేందుకు సిద్ధపడ్డారు. తాము అనుకున్న ప్రతిపాదనను ఆర్టీసీ అధికారులే ప్రతిపాదించేట్టుగా ప్రభుత్వం కథ నడిపించింది. ఇక అద్దె బస్సులను 50 శాతానికి పెంచాలన్న ప్రతిపాదనకే సీఎం చంద్రబాబు పచ్చ జెండా ఊపారు. ఈ చర్యతో అద్దె బస్సులు రెట్టింపు కానున్నాయనేది సుస్పష్టం. ఈ ప్రకారంగా కొత్తగా 2,857 అద్దె బస్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్టే. 14వేల ఉద్యోగాలకు కోతే... సగం బస్సులు అద్దెవి కానుండటంతో ఆర్టీసీ ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలగనుంది. ఒక్కో ఆర్టీసీ బస్సుకు సగటున ఐదుమంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ఆ ప్రకారం కొత్తగా ప్రవేశపెట్టే 2,857 అద్దె బస్సులకు కలిపి 14,285 ఉద్యోగాలకు కోత పడనుంది. ఆర్టీసీలో ప్రస్తుతం దాదాపు 50వేల మంది ఉద్యోగులు ఉన్నారు. రిటైరయ్యే ఉద్యోగుల స్థానంలో కొత్త నియామకాలను ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టేస్తుందన్నది స్పష్టమవుతోంది. అలా దశల వారీగా ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీని నిలిపివేస్తే... కొంతకాలానికి ప్రైవేటుపరమయ్యే ప్రమాదం ఉందని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇక అద్దె బస్సులను కూడా రాబడి అధికంగా ఉన్న రూట్లలోనే తిప్పేందుకు ఆర్టీసీ ప్రాధాన్యమిస్తుంది. దాంతో పల్లెలు ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని కోల్పోవాల్సి వస్తుందని కూడా విమర్శిస్తున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం ఇవేమీ వినకుండా అద్దె బస్సుల సంఖ్యను రెట్టింపు చేయాలని స్పష్టం చేసినట్టు ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి. -
సంక్రాంతికి సొంతూరు వెళ్లేదెలా?
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న నగరవాసులకు ఇప్పటినుంచే బస్సులు, రైళ్లు చుక్కలు చూపిస్తున్నాయి. ఈసారి అనూహ్యంగా ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా వేడుకలు రావడంతో హైదరాబాద్‌తో పాటు, వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లు నడిపేందుకు దక్షిణమధ్య రైల్వే చర్యలు చేపట్టింది. ప్రస్తుతం శబరిమలకు నడుస్తున్న రైళ్లను క్రమంగా ప్రయాగ్‌రాజ్‌కు మళ్లిస్తున్నారు. దీంతో సంక్రాంతికి ప్రత్యేక రైళ్ల సంఖ్య గణనీయంగా తగ్గనుంది. ఇప్పటికే అన్ని రెగ్యులర్ రైళ్లలో బుకింగ్‌లు భర్తీ అయ్యాయి. ఏసీ, నాన్ ఏసీల్లో ఫిబ్రవరి వరకు కూడా బెర్తులు అందుబాటులో లేవు. కొన్ని రైళ్లలో స్లీపర్ కోచ్‌లలో వెయిటింగ్ లిస్ట్ 250పైనే కనిపిస్తోంది. దీంతో హైదరాబాద్ నుంచి కాకినాడ, తిరుపతి, విశాఖ, భువనేశ్వర్, బెంగళూరు వంటి నగరాలకు ప్రయాణికుల డిమాండ్ మేరకు ప్రత్యేక రైళ్లు నడిపితే తప్ప సొంత ఊళ్లకు బయలుదేరడం సాధ్యం కాదు. ఆర్టీసీ యథావిధిగా అ‘ధనం’సంక్రాంతి సందర్భంగా ఈసారి సుమారు 6 వేల బస్సులు అదనంగా నడిపేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. ఈ నెల 10వ తేదీ నుంచి 15 వరకు ప్రయాణికుల రద్దీకనుగుణంగా బస్సులను నడపనున్నారు. సాధారణంగా హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు నడిచే సుమారు 3,500 రెగ్యులర్ బస్సులకు ఇవి అదనంగా అందుబాటులో ఉంటాయి. తెలంగాణలోని వివిధ జిల్లాలతో పాటు ఏపీలోని అన్ని ప్రధాన ప్రాంతాలకు బస్సులను నడిపేందుకు చర్యలు చేపట్టారు. ఈసారి కూడా యథావిధిగా అదనపు చార్జీలు విధించే అవకాశం ఉంది. ప్రత్యేక చార్జీల ప్రస్తావన లేకుండానే గతంలో తెలంగాణ జిల్లాలకు 25 శాతం, ఏపీకి వెళ్లే బస్సుల్లో 50 శాతం చార్జీలు అదనంగా వసూలు చేశారు. ఈసారి కూడా గుట్టుచప్పుడు కాకుండా సంక్రాంతి రద్దీని సొమ్ము చేసుకొనేందుకు ఆర్టీసీ రంగంలోకి దిగింది. ప్రైవేట్ బస్సుల దారిదోపిడీ...సంక్రాంతి రద్దీ కంటే ముందే ప్రైవేట్ బస్సులు దారిదోపిడీకి దిగాయి. డిమాండ్ మేరకు రైళ్లు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ బస్సులను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఇప్పటినుంచే సంక్రాంతి బుకింగ్‌లపై చార్జీలు పెంచాయి. కాంట్రాక్ట్ క్యారేజీలుగా నమోదైన వందలాది బస్సులు స్టేజీక్యారేజీలుగా రోడ్డెక్కి ప్రయాణికుల జేబులు లూఠీ చేసేందుకు సిద్ధమయ్యాయి. హైదరాబాద్ నుంచి విజయవాడకు సాధారణ రోజుల్లో రూ.350 వరకు చార్జీ ఉంటే ప్రస్తుతం రూ.550 వరకు పెంచారు. ఈనెల 12వ తేదీ నాటికి ఇంకా పెరగవచ్చునని ట్రావెల్ ఏజెంట్లు స్పష్టం చేస్తున్నారు.విమాన చార్జీలూ భారమే..మరోవైపు హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే డొమెస్టిక్ ఫ్లైట్లలో కూడా చార్జీలు భారీగా పెరిగాయి. ప్రయాణికుల రద్దీ, డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని పలు ఎయిర్‌లైన్స్ ఇప్పటి నుంచే చార్జీలు పెంచేశాయి. ప్రస్తుతం సంక్రాంతి రద్దీతో పాటు, శబరిమల, మహాకుంభమేళాకు వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని చార్జీలు పెంచాయి. హైదరాబాద్ నుంచి విశాఖకు సాధారణంగా అయితే రూ.5,200 వరకు ఉంటుంది. కానీ ప్రస్తుతం రూ.8,000 దాటింది.సంక్రాంతి నాటికి ఇది రూ.12 వేల వరకు చేరే అవకాశం ఉన్నట్లు ట్రావెల్స్ సంస్థలు చెబుతున్నాయి. అన్ని రూట్లలోనూ ఇదే డిమాండ్ కనిపిస్తోంది. -
డీజిల్ బస్సుకు ఎలక్ట్రిక్ రూపు
సాక్షి, హైదరాబాద్: ఖర్చులు తగ్గించుకొనేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఆర్టీసీ) అన్ని మార్గాలను వెదుకుతోంది. ఇంధన భారం తడిసి మోపెడవుతుండటంతో ఇప్పటికే ఎలక్ట్రిక్ బస్సుల వైపు మొగ్గుచూపింది. ఆ బస్సులుఖరీదైనవి కావటంతో అద్దెకు తీసుకొని నడుపుతోంది. అదే సమయంలో సంస్థకు గుదిబండగా మారుతున్న పాత డీజిల్ బస్సులనూ ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. రెట్రో ఫిట్మెంట్ టెక్నాలజీ ద్వారా పాత డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చటానికి రెండేళ్ల క్రితమే రాష్ట్ర ప్రభుత్వ సాయం కోరింది. కానీ, ప్రభుత్వం స్పందించకపోవటంతో తాజాగా కేంద్రం తలుపు తట్టింది. రెట్రో ఫిట్‌మెంట్‌కు ఆర్థిక సాయం చేయాలని లేఖ రాసింది. ఆ ప్రయోగం సక్సెస్.. డీజిల్ వ్యయాన్ని భరించలేక ఎలక్ట్రిక్ బస్సుల వైపు మొగ్గు చూపాలని మూడేళ్ల క్రితం ఆర్టీసీ ప్రయత్నాలు ప్రారంభించింది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఫేమ్ పథకం కింద 40 ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు సరఫరా చేసింది. వాటిని ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఎయిర్‌పోర్టుకు నడుపుతోంది. ఆ సమయంలో ఒక్కో బస్సు ధర రూ.2 కోట్ల వరకు ఉండటంతో సొంతంగా ఎలక్ట్రిక్ బస్సులు కొనటం సాధ్యం కాదని చేతులెత్తేసింది. రెట్రో ఫిట్మెంట్ ద్వారా రూ.60 నుంచి రూ..65 లక్షలతోనే డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చవచ్చని గుర్తించి, అందుకోసం టెండర్లు పిలిచింది. ఎలక్ట్రిక్ రైల్ లోకోమోటివ్‌లు తయారు చేస్తున్న ఓ ప్రైవేటు సంస్థ రెట్రో ఫిట్‌మెంట్‌కు ఆసక్తి చూపింది. శాంపిల్‌గా ముషీరాబాద్ డిపోకు చెందిన ఒక బస్సును ఆ సంస్థ రెట్రో ఫిట్మెంట్ చేసి ఇచ్చింది. ప్రస్తుతం అది ఉప్పల్ డిపో పరిధిలో తిరుగుతోంది. ఈ ప్రాజెక్టు భారాన్ని మొత్తం మోయలేనని భావించిన ఆర్టీసీ.. రేండేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వ సాయం కోరింది. ప్రభుత్వం కూడా సాయం చేయలేనని చేతులెత్తేయటంతో ప్రాజెక్టు అంతటితో ఆగిపోయింది. కేంద్రం వైపు ఆర్టీసీ చూపు నగరంలో డీజిల్ బస్సులను తొలగించి వాటి స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులే తిప్పాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా పీఎం ఈ–డ్రైవ్ పథకానికి శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా 9 ప్రధాన నగరాలకు 11 వేల ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేయాలని నిర్ణయించింది. వాటిలో తనకు 2,500 బస్సులు కావాలని ఆర్టీసీ దరఖాస్తు చేసుకుంది. పనిలో పనిగా రెట్రో ఫిట్మెంట్ ద్వారా పాత డీజిల్ బస్సులను ఎలక్రి్టక్ బస్సులుగా మార్చేందుకు కూడా ఓ విధానం ప్రకటించాలని లేఖ రాసింది. రెట్రో ఫిట్మెంట్ పరిజ్ఞానాన్ని ప్రోత్సహిస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందని లేఖలో పేర్కొంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రయోగాత్మకంగా తిరుగుతున్న బస్సును ఉదహరించింది. ఈ లేఖపై కేంద్రం ఇంకా స్పందించలేదు. కేంద్రం గనుక రాయితీ పద్ధతిలో రెట్రో ఫిట్‌మెంట్‌కు పాలసీ అందుబాటులోకి తెస్తే, ఆర్టీసీ వద్ద ఉన్న పాత డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చి నిర్వహించేందుకు చాలా సంస్థలు ముందుకొచ్చే అవకాశం ఉంది. కొత్త ఎలక్ట్రిక్బస్సు ఖరీదు రూ.1.50కోట్లు పాత డీజిల్ బస్సును ఎలక్ట్రిక్ బస్సుగా మార్చేందుకు అయ్యే వ్యయం రూ.60 లక్షలు డీజిల్ బస్సుఖర్చు కి.మీ.కు రూ.20ఎలక్ట్రిక్ బస్సుకు అయ్యే వ్యయం రూ.6 -
బస్సు డ్రైవర్ కు గుండెపోటు..
-
రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ డిస్పెన్సరీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులు, రిటైరైన సిబ్బంది ఇకపై ఉచిత చికిత్సల కోసం తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రికి వరకు రావాల్సిన బాధ తప్పనుంది. ఆర్టీసీ ఆసుపత్రికి అనుబంధంగా ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన డిస్పెన్సరీలను ఆసుపత్రులుగా మారుస్తుండటమే అందుకు కారణం. నిధుల సమస్యతో ఇంతకాలం డిస్పెన్సరీలను బాగుచేయలేని పరిస్థితి నెలకొనగా తాజాగా వాటిని ఉద్యోగులకు చేరువ చేసేలా ఎండీ సజ్జనార్ చర్యలు తీసుకున్నారు. వైద్యులు.. పరికరాలు.. మందులు.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 14 చోట్ల ఆర్టీసీ డిస్పెన్సరీలున్నాయి. వాటిల్లో నాలుగు హైదరాబాద్‌లోనే ఉన్నాయి. కానీ కొన్ని డిస్పెన్సరీల్లో వైద్యులు లేరు. అలాగే ఎక్కడా కూడా వైద్య పరికరాలు లేవు. ఇప్పుడు అన్ని డిస్పెన్సరీలకూ వైద్యులను కేటాయించారు. నలుగురు వైద్యులను ప్రభుత్వం కేటాయించగా మిగతా వైద్యులను, టెక్నీíÙయన్లను అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఆర్టీసీ సమకూర్చుకుంది. వారు స్థానికంగా అందుబాటులో ఉంటూ సాధారణ చికిత్సలకు పూర్తిస్థాయిలో సేవలందించనున్నారు. అయితే ఎమర్జెన్సీ కేసులకు మాత్రం కీలక చికిత్సలు డిస్పెన్సరీల్లో ఉండవు. అత్యవసర వైద్యం అవసరమయ్యే రోగులు ఆర్టీసీ ప్రధాన ఆసుపత్రికో లేదా ఆర్టీసీ రిఫరల్ జాబితాలోని ప్రైవేటు ఆసుపత్రులకో వెళ్లే వరకు అవసరమయ్యే ప్రాథమిక చికిత్సలు అందిస్తారు. అలాగే అన్ని రకాల మందులను కూడా డిస్పెన్సరీల్లో సమకూరుస్తున్నారు. ఆర్టీసీ ప్రధాన ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న వారు మందుల కోసం ప్రతిసారీ హైదరాబాద్‌కు రావాల్సి వస్తోంది. ఇకపై డిస్పెన్సరీల్లోనే ఉచితంగా మందులు అందిస్తారు. మరోవైపు కొత్తగా ఏర్పడ్డ పెద్ద జిల్లా కేంద్రాల్లో కూడా డిస్పెన్సరీలు ఏర్పాటు చేయాలన్న నిర్ణయంలో భాగంగా తాజాగా నాగర్‌కర్నూల్‌లో డిస్పెన్సరీ ఏర్పాటైంది. మిగతా వాటిల్లో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. -
గోండియా వద్ద అదుపు తప్పి తిరగబడిన బస్సు
-
ఆర్టీసీలో అసంతృప్తి స్వరం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఆర్టీసీ కార్మిక సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. గతంలో ప్రధాన సంఘాలకు నాయకత్వం వహించిన నేతల్లో ఎక్కువమంది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి పూర్తి అనుకూలంగా ఉన్నా, ప్రస్తుతం వారు కూడా ఇతర సంఘాల తరహాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. సోనియాగాంధీ పుట్టిన రోజు నాటికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించని పక్షంలో ప్రత్యక్ష పోరాట కార్యాచరణకు సిద్ధమవుతున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం ఆర్టీసీలో ఉమ్మడి ఐక్య కార్యాచరణ కమిటీ అంటూ లేదు. కొన్ని సంఘాలు కలిపి ఒక కమిటీగా, మరికొన్ని సంఘాలు కలిపి ఒక సంఘంగా పనిచేస్తున్నాయి. ఈ రెండు జేఏసీలతో సంబంధం లేకుండా కొన్ని సంఘాల ప్రతినిధులు సొంతంగా వ్యవహరిస్తున్నారు. ఆర్టీసీ కారి్మకుల సమస్యల విషయంలో ప్రభుత్వం ఏమాత్రం స్పందించని నేపథ్యంలో అన్ని సంఘాలు కలిపి ఒక జేఏసీగా ఏర్పడి ఉమ్మడి కార్యాచరణకు సిద్ధమయ్యేలా చేస్తామంటూ కొన్ని సంఘాలు చెబుతున్నాయి. కార్మిక సంఘాల గుర్తింపే ప్రధాన లక్ష్యం గత ప్రభుత్వం ఆర్టీసీలో కార్మిక సంఘాల ఉనికి లేకుండా చేసింది. వాటి స్థానంలో డిపోల్లో ఉద్యోగుల ఆధ్వర్యంలో సంక్షేమ మండళ్లను ఏర్పాటు చేసి ఆయా అంశాలు మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లే బాధ్యత అప్పగించింది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇదే విధానాన్ని కొనసాగిస్తోంది. దీంతో వెంటనే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలన్న లక్ష్యంతో కార్మిక సంఘాలు ఒత్తిడి పెంచుతున్నాయి. కార్మిక సంఘాలకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవటంతో ఇటీవల ఓ సంఘం సీఎంకు సీఐటీయూ ప్రతినిధుల ద్వారా వినతిపత్రం ఇప్పించాల్సి వచి్చంది. కార్మిక సంఘాలను భాగస్వాములను చేయాలి ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించటంతోపాటు వారికి అందాల్సిన ఆర్థిక ప్రయోజనాలను వెంటనే అందించాలి. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం అంశంతో సంబంధం లేని 11 అంశాలను ముందుగా పరిష్కరించాలి. ప్ర భుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనంతో సంబంధం ఉన్న మరి కొన్ని అంశాలను పరిష్కరించాల్సి ఉంది. ఆయా అంశాలపై తీసు కునే నిర్ణయాల్లో కార్మిక సంఘాలను భాగస్వాములను చేయాలి. – వీఎస్‌రావు, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఇవీ డిమాండ్లు.. » ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీన అంశాన్ని పరిశీలిస్తున్నామంటూ ప్రకటించటం మినహా ప్రస్తుత ప్రభుత్వం దానిని అమలులోకి తేలేదు. ఫలితంగా ఆర్టీసీ ఉద్యోగులు.. ఆర్టీసీ ఉద్యోగులుగానే ఉండిపోవాల్సి వచ్చింది. దీన్ని ప్రధాన డిమాండ్‌గా కొన్ని సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. » సరిపోను డ్రైవర్లు లేక ఉన్నవారిపై అదనపు భారం పడుతోంది. దీనివల్ల వారు తీవ్ర ఒత్తిడి ని ఎదుర్కొంటున్నారు. దీన్ని నివారిస్తూ అన్ని రకాల పోస్టుల్లో ఖాళీలు భర్తీ చేయాలన్న డి మాండ్‌ను అన్ని సంఘాలు పేర్కొంటున్నాయి. » సాంకేతిక సమస్యలతో జరిగే పొరపాట్లు, చి న్నచిన్న తప్పిదాలకు కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని, వెంటనే వారికి ఉద్యో గ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. » 2021 వేతన సవరణ జరపాలని, 2017 వేతన సవరణ బకాయిలు చెల్లించాలని, చనిపోయిన, మెడికల్ అన్‌ఫిట్ అయిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలిచ్చి వారిని పూర్తిస్థాయి ఉద్యోగులుగా తీసుకోవాలని, ఆర్టీసీలో అద్దె బస్సుల సంఖ్య తగ్గించి, అవసరమైన సంఖ్యలో బస్సులను సొంతంగా సమకూర్చుకోవాలని, మహిళా ఉద్యోగులను రాత్రి 8 తర్వాత పని చేయించవద్దని, రిటైర్ అయిన వారికి ఇవ్వాల్సిన అన్ని బకాయిలు చెల్లించాలని... ఇలా పలు అంశాలను ప్రభుత్వం ముందుంచుతున్నారు. -
మీ వాహనానికి హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ లేదా?
సాక్షి, సిటీబ్యూరో: మీ వాహనానికి హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ లేదా? అయితే రవాణా శాఖ లెక్కల్లో అది లేనట్టే. అలాంటి వాహనాన్ని అమ్మాలన్నా, కొనాలన్నా కష్టమే. అంతేకాదు.. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బదిలీ చేయడం కూడా సాధ్యం కాదు. ఒక్కమాటలో చెప్పాలంటే హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ (హెచ్ఎస్ఆర్పీ) లేని వాహనాలకు రవాణా శాఖ ఆమోదం లేనట్లుగానే భావించాలి. వాటిపై ఆర్టీఏ నుంచి ఎలాంటి పౌరసేవలు లభించవు. ఇంత కీలకమైన హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ అమలుకు నోచుకోవడం లేదు. వాహనదారులు ఇష్టారాజ్యంగా తమకు నచి్చన నంబర్ ప్లేట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. కాగా.. ఇప్పటికైనా హెచ్‌ఎస్‌ఆర్‌పీని అమర్చుకోవాలని రవాణా శాఖ అధికారులు సూచిస్తున్నారు. వాహనాల భద్రత, రహదారి భద్రత దృష్ట్యా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఉమ్మడి రాష్ట్రంలోనే హెచ్ఎస్ఆర్పీ అమల్లోకి వచి్చంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దీని అమలు తీరు నత్తనడకను తలపిస్తోంది. లక్షలాది వాహనాలు హెచ్ఎస్ఆర్పీకి దూరంగానే ఉన్నాయి. నాణ్యతపై నమ్మకం లేక.. ఆరీ్టఏలో రిజిస్ట్రేషన్ అయ్యే ప్రతీ వాహనానికి ఒక కోడ్‌ను కేటాయిస్తూ హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లో హోలోగ్రామ్‌ను ఏర్పాటు చేస్తారు. దీనిలో నమోదైన కోడ్ ఆధారంగానే రవాణా శాఖ కార్యకలాపాలను నిర్వహిస్తుంది. వాహనం ఒకరి నుంచి మరొకరికి బదిలీ చేయాలన్నా, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మార్చుకోవాలన్నా, పన్నులు, ఫీజులు చెల్లించాలన్నా ఈ కోడ్ ఆధారంగానే సాధ్యమవుతుంది. చాలామంది వాహనదారులు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ల నాణ్యత నాసిరకంగా ఉందని, అమర్చిన కొద్దిరోజులకే ఇవి పాడవుతున్నాయని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అల్యూమినియం నంబర్ ప్లేట్‌పై నల్లటి రంగులో రాసే అంకెలు సైతం ఎక్కువ కాలం ఉండడం లేదు. ఒకటి రెండేళ్లలోనే చెదిరిపోతున్నాయి. దీంతో వాహనదారులు తమకు నచి్చన విధానంలో నంబర్ ప్లేట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ నిర్లక్ష్యానికి బాధ్యులెవరు? ⇒వాహనాల భద్రత దృష్ట్యా 2013లో అప్పటి ప్రభుత్వం హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లను అమల్లోకి తెచి్చంది. దీని అమలు బాధ్యతను అప్పట్లో ఆర్టీసీకి అప్పగించారు. ఓ ప్రైవేట్ సంస్థ సహకారంతో ఆర్టీఏ కార్యాలయాల్లోనే హెచ్ఎస్ఆర్పీ సెంటర్లను ఏర్పాటు చేశారు. కానీ కొత్తగా రిజి్రస్టేషన్ అయ్యే వాహనాల డిమాండ్ మేరకు హెచ్ఎస్ఆర్పీ సరఫరాలో ఆ సంస్థ విఫలమైంది. ⇒ ప్రతిరోజూ సుమారు 2,500 వాహనాలు కొత్తగా నమోదవుతుండగా రోజుకు కనీసం వెయ్యి వాహనాలకు కూడా నంబర్ప్లేట్లు అందడంలేదు. దీంతో వాహనదారులు రిజి్రస్టేషన్ల కోసం 3 నుంచి 6 నెలల వరకు పడిగాపులు కాయాల్సివస్తోంది. ఈ క్రమంలో రవాణాశాఖ అధికారులు తయారీ సంస్థపై ఒత్తిడి పెంచడంతో పాటు నంబర్ ప్లేట్ ఉంటేనే బండి రిజి్రస్టేషన్ తప్పనిసరి చేశారు. అయినా పెద్దగా పురోగతి కనిపించడంలేదు. ఆర్టీఓ స్థాయిలోనే మార్పు హెచ్ఎస్ఆర్పీ లేకపోవడం వల్ల నిలిచిపోయిన ట్రాన్సాక్షన్స్‌ను పునరుద్ధరించే సదుపాయం ఇప్పటి వరకు రవాణా కమిషనర్ కార్యాలయానికే పరిమితం కాగా.. ఇటీవల దీనిని వికేంద్రీకరించారు. కిందిస్థాయిలో జిల్లా, ప్రాంతీయ రవాణా అధికారులు కూడా పునరుద్ధరించే సదుపాయం కలి్పంచారు. వాహనదారులు ఇందుకోసం హెచ్‌ఎస్‌ఆర్‌పీని ఏర్పాటు చేసుకొని అధికారులను సంప్రదించవచ్చు. -
అద్దె బస్సులతో ఆర్టీసీ ఆగమాగం!
సాక్షి, హైదరాబాద్ : అద్దె బస్సులు ఆర్టీసీని కబళించేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతానికి రూపొందించిన ప్రణాళిక ప్రకారం అద్దె బస్సులు సమకూరితే, ఆర్టీసీ సొంత బస్సుల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. క్రమంగా ఇది సంస్థ మనుగడనే ప్రశ్నార్థకం చేయనుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అద్దె బస్సుల సంఖ్యను పెంచటంపై చాలాకాలంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. సంక్షేమ పథకాలను దృష్టిలో ఉంచుకుని నిధుల వినియోగంపై ప్రభుత్వం అనధికారికంగా పరిమితులు విధిస్తుండటంతో, సొంతంగా కొత్త బస్సులు కొనటం ఆర్టీసీకి కష్టంగా మారింది. దీంతో అద్దె బస్సులకు గేట్లు బార్లా తెరిచేస్తోంది. అద్దె బస్సులకు డ్రైవర్లను వాటి నిర్వాహకులే నియమిస్తారు. డ్రైవర్ల జీతాల పద్దు తగ్గుతుండటంతో ఆర్టీసీ దీనివైపు మొగ్గు చూపుతోంది. 30 శాతానికి చేరిన అద్దె బస్సులు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన 2014లో ఆర్టీసీలో అద్దె బస్సుల వాటా 17 శాతం మాత్రమే. అద్దె బస్సుల సంఖ్యపై పరిమితి ఉన్నందున, అంతకు మించి వాటిని సమకూర్చుకునేందుకు వీలుండేది కాదు. కానీ ప్రభుత్వం ఆర్టీసీకి ఇవ్వాల్సిన నిధులు బకాయి పడటం, గ్రాంట్లు ఇవ్వకపోవటంతో తప్పనిసరి పరిస్థితుల్లో వాటి సంఖ్య పెంచుతూ వస్తున్నారు. ప్రస్తుతం ఆర్టీసీలో మొత్తం 9,800 బస్సులు తిరుగుతున్నాయి. వీటిల్లో ప్రైవేటు వ్యక్తులు ఆర్టీసీకి అద్దెకిచ్చిన బస్సులు 2,800 ఉన్నాయి. గతంలో కేంద్ర ప్రభుత్వం ‘ఫేమ్’పథకం కింద సమకూరి హైదరాబాద్ విమానాశ్రయానికి తిప్పుతున్న 40 ఎలక్ట్రిక్ బస్సులు కూడా ఉన్నాయి. ఇవి కూడా ఒలెక్ట్రా అన్న సంస్థ అద్దెకిచ్చినవే. అదే సంస్థ ఇటీవల మరో 100 బస్సులు సమకూర్చింది. ఇటీవల ఢిల్లీకి చెందిన జేబీఎం సంస్థ మరో 90 ఎలక్ట్రిక్ బస్సులు సమకూర్చింది. అలాగే మరో 40 బస్సులు కూడా కొత్తగా వచ్చాయి. వీటిని ప్రారంభించాల్సి ఉంది. ఇలా ప్రస్తుతం మొత్తం బస్సుల్లో అద్దె బస్సుల వాటా దాదాపు 30 శాతానికి చేరింది. ఇక ఏడాది, ఏడాదిన్నరలోగా ఆర్టీసీ, అద్దె బస్సుల సంఖ్య చెరి సగం అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ముంచెత్తనున్న అద్దె బస్సులు హైదరాబాద్‌లో తిరిగేందుకు మొత్తం 500 ఎలక్ట్రిక్ బస్సులు రావాల్సి ఉంది. వాటిల్లో కొన్ని వచ్చాయి. ఏడాది కాలంలో మరో 400 సమకూరుతాయి. జేబీఎం సంస్థ కూడా 500 ఎలక్ట్రిక్ బస్సులు సమకూర్చాల్సి ఉంది. ఇప్పటికి కొన్ని బస్సులే రాగా మరో 400 బస్సులను సమకూర్చాల్సి ఉంది. దశలవారీగా అవి కూడా వస్తాయి. ఇక హైదరాబాద్‌లో కాలుష్యాన్ని నివారించేందుకు మొత్తం బ్యాటరీ బస్సులనే తిప్పాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ‘పీఎం ఈ–డ్రైవ్’పథకం కింద 2,800 బస్సులు మంజూరు చేయాలంటూ ఆర్టీసీ దరఖాస్తు చేసింది. దేశవ్యాప్తంగా ఆ పథకం కింద ఎలక్ట్రిక్ బస్సులు తిప్పేందుకు కేంద్రం 9 నగరాలను ఎంపిక చేసింది. అందులో హైదరాబాద్ కూడా ఒకటి. అంటే ఆర్టీసీ దరఖాస్తు మేరకు ఎలక్ట్రిక్ బస్సులు మంజూరు కానున్నాయి. తాజాగా మహిళా సంఘాలు 1,000 బస్సులను ఆర్టీసీలో అద్దె ప్రాతిపదికన నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే మూడేళ్లలో అద్దె బస్సుల సంఖ్య 8 వేలకు చేరే అవకాశం ఉంది. అప్పుడు ఆర్టీసీ సొంత బస్సులు 6 వేల లోపే ఉంటాయి. అయితే అప్పటికి చాలా బస్సులు పాతబడి తుక్కుగా మారిపోతాయి. వాటి స్థానంలో కొత్తగా సొంత బస్సులు రాకపోతే ఆర్టీసీ సొంత బస్సుల సంఖ్య 4 వేలకు తగ్గుతుంది. అద్దె బస్సులు భారీగా వస్తున్నందున సొంత బస్సులు కొనేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపే పరిస్థితి ఉండదని అంటున్నారు. డ్రైవర్ల నియామకం అంతేనా? ఆర్టీసీలో ప్రస్తుతం డ్రైవర్లకు కొరత ఉంది. దీంతోఇటీవలే దాదాపు 2 వేల పోస్టుల భర్తీకి ఆర్టీసీ ప్రతిపాదించింది. దానికి ప్రభుత్వం కూడా సమ్మతించి రిక్రూట్మెంట్ బోర్డుకు ఆదేశాలిచ్చి0ది. పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఎంపిక చేయాల్సి ఉంది. కానీ వాటి ఊసే లేకుండాపోయింది. భవిష్యత్తులో అద్దె బస్సుల సంఖ్య పెరుగుతున్నందున సొంత డ్రైవర్ల అవసరం అంతగా ఉండదన్న ఉద్దేశంతోనే ఎంపిక ప్రక్రియను వాయిదావేస్తున్నారని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. సంస్థ మనుగడకేప్రమాదం: సంఘాల నేతలు ‘ఆర్టీసీలో అద్దె బస్సుల సంఖ్య విచ్చలవిడిగా పెరగటం సంస్థకు మంచిది కాదు. భవిష్యత్తులో సంస్థ ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళ్తుంది. ఇది ప్రైవేటీకరణను ప్రేరేపిస్తుంది. గతంలోలాగా అద్దె బస్సుల సంఖ్యపై సీలింగ్ విధించి కావాల్సినన్ని బస్సులను ప్రభుత్వమే కొనాలి..’అని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు నరేందర్, నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. -
మద్యం మత్తులో మహిళా కండక్టర్‌పై దాడి
జరుగుమల్లి (సింగరాయకొండ): మద్యం మత్తులో ఓ యువకుడు ఆర్టీసీ మహిళా కండక్టర్‌పై దాడి చేశాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా కామేపల్లిలో శుక్రవారం జరిగింది. కామేపల్లికి చెందిన ప్రత్తిపాటి హరిబాబు మద్యం తాగి గ్రామంలోని షాపుల వద్దకు వెళ్లి ఒక్కొక్కరు రూ.100 ఇవ్వాలని డిమాండ్ చేశాడు. వారు గద్దించడంతో అటుగా వస్తున్న టంగుటూరు–కామేపల్లి ఆర్టీసీ బస్సు ఎదుట అడ్డంగా పడుకున్నాడు. కండక్టర్ సుభాష్ ని సెల్ఫోన్లో వీడియో తీసేందుకు ప్రయతి్నంచగా ఫోన్ లాక్కొని పగులగొట్టాడు. సుధారాణి కిందపడిపోగా ఆమె ఛాతీపై తన్నాడు.అనంతరం తన చేతికి చిన్న గాయమైందని ప్రభుత్వాస్పత్రికి వెళ్లిన హరిబాబు ఆయా డ్రస్సింగ్ చేస్తుండగా డాక్టర్ ఎక్కడ అని కేకలేస్తూ ఆస్పత్రిలోని సీసీ కెమెరాలు, ఫరి్నచర్ ధ్వంసం చేశాడు. డాక్టర్ రేష్మి ఫిర్యాదు మేరకు జరుగుమల్లి పోలీసులు కేసు నమోదుచేశారు. కండక్టర్ సుహాసినిని ప్రథమ చికిత్స అనంతరం కందుకూరు ఏరియా ఆస్పత్రికిపంపించారు. -
ఆర్టీసీకి బీఎస్–6 బస్సులు
సాక్షి, హైదరాబాద్: భారత్ స్టేజ్–6 బస్సుల వాడకంపై ఆర్టీసీ దృష్టి సారించింది. వాయు కాలుష్య కారకాల ఉత్పత్తిని నియంత్రించేందుకు ఉద్దేశించిన ఉద్గారాల ప్రమాణాల జాబితాలోని బీఎస్–6 బస్సుల వాడకానికి ఎట్టకేలకు శ్రీకారం చుట్టింది. ఇంతకాలం బీఎస్–4 ప్రమాణాల బస్సుల వాడకానికి పరిమితమైన ఆర్టీసీకి ఇప్పుడు బీఎస్–6కు చెందిన 1,500 బస్సులు కొత్తగా సమకూరాయి. 2020 నుంచి మన దేశంలో ఈ ప్రమాణ బస్సులను అందుబాటులోకి తెచ్చినా..ఆర్టీసీ కొత్త బస్సులు కొనకపోవటంతో ఆ శ్రేణి బస్సులు ఇప్పటివరకు సమకూరలేదు.గతేడాది ఆర్టీసీ కొత్త బస్సులకు ఆర్డర్ ఇవ్వగా, దశలవారీగా అవి సమకూరుతున్నాయి. కొత్త బస్సులన్నీ బీఎస్–6 శ్రేణి బస్సులే. తాజా యూరో ప్రమాణాల మేరకు ఇవి రూపొందాయి. కర్బన ఉద్గారాలు తక్కువ పరిమితిలో విడుదల చేయటంతోపాటు ఎక్కువ ఎల్రక్టానిక్ డిజైన్‌తో ఇవి రూపొందాయి. దీంతో వీటి వినియోగంపై అవగాహన కల్పించేందుకు బీఎస్–6 బస్సులున్న డిపోలను పర్యవేక్షిస్తున్న అధికారులకు చెన్నైలోని అశోక్ లేలాండ్ కంపెనీలో వాటి తయారీ ఇంజినీర్ల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆ బస్సుల ప్రత్యేకత ఏంటంటే... మన దేశంలో 2000 సంవత్సరం నుంచి భారత్ స్టేజ్ ఎమిషన్ స్టాండర్డ్స్ అమలులోకి వచ్చింది. తొలుత భారత్ స్టేజ్–1 ప్రారంభమైంది. అలా 2020 నుంచి బీఎస్–6 ప్రమాణాలు మొదలయ్యాయి. అంతకుముందు శ్రేణి వాహనాలతో పోలిస్తే వీటిల్లో కాలుష్య కారకాల ఉత్పత్తి చాలా తక్కువగా ఉండేలా ఇంజిన్లను ఆధునికీకరించారు. అంతకు ముందున్న బీఎస్–4 (బీఎస్–5 స్కిప్) డీజిల్ బస్సుల్లో నైట్రోజన్ ఆక్సైడ్ పరిమితి 250 మి.గ్రా.గా ఉండేది. దానిని బీఎస్–6 బస్సుల్లో 80 మి.గ్రా.కు కట్టడి చేశారు. పరి్టక్యులేట్ మ్యాటర్ పరిమితిని 25 మి.గ్రా.ల నుంచి 4.5 మి.గ్రా/కి.మీ.కు తగ్గించారు. దీనివల్ల కొత్తతరం బస్సుల్లో కాలుష్య కారకాల విడుదల చాలా తక్కువగా ఉంటుంది. డాష్ బోర్డులో పలు రకాల సూచనలు ఈ బస్సుల్లో డాష్‌బోర్డుపై పలు రకాల సూచనలు బ్లింక్ అవుతుంటాయి. ఆ మేరకు డ్రైవర్లు బస్సులను నడపాలి. ఈ బస్సుల్లోని చాలా భాగాలు సెన్సార్ల ఆధారంగా పనిచేస్తాయి. వీటిల్లో దాదాపు 31 సెన్సార్లు ఏర్పాటు చేశారు. పాత బస్సుల్లో డాష్ బోర్డుకు ప్రాధాన్యమే ఉండేదికాదు. డిస్ప్లే బోర్డులో రీడింగ్ మీటర్లు పగిలిపోయి రంధ్రాలే కనిపిస్తుండేవి. కానీ, కొత్తతరం బస్సుల్లో 31 సెన్సార్లు అలర్ట్‌లను చూపుతుంటాయి.ఏదైనా బ్లింక్ కనిపిస్తే, సంబంధిత ఇంజిన్ భాగంపై దృష్టి సారించాలి. దీనికి సంబంధించి ఆయా బస్సులను నిర్వహిస్తున్న డిపోల అధికారులకు ముందు అవగాహన కలిగితే, వారు డ్రైవర్లను ప్రశ్నిస్తూ బస్సులు మెరుగ్గా నడిచేలా చూస్తారని సంస్థ భావిస్తోంది. ఈమేకు ఆయా డిపోల అధికారులను చెన్నైలోని అశోక్‌లేలాండ్ ప్లాంట్‌కు పంపింది. మొదటి బ్యాచ్ అధికారుల బృందం ప్రస్తుతం చెన్నై ప్లాంట్‌లో ఉంది. త్వరలో రెండో బృందం వెళ్లనుంది. కాలుష్య కణాలు వెలువడవుబస్సు వదిలే పొగలో లక్షల సంఖ్యలో కాలుష్య కణాలుంటాయి. అవి మన శరీరంలోకి చేరితే తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. పొగగొట్టం నుంచి వెలువడే పొగతో అవి వాతావరణంలోకి చేరతాయి. కానీ, బీఎస్–6 బస్సుల్లో ప్రత్యేక వ్యవస్థ ఉంది. డీజిల్ మండిన తర్వాత వెలువడే ఈ సూక్ష కణాలు ఒకచోట జమవుతాయి. నిర్ధారిత సమయంలో అవి మరోసారి మండి బూడిదగా మారి నేల మీద పడిపోతాయి. పొగ రూపంలో అవి వాతావరణంలో కలిసే ప్రమాదం బాగా తగ్గిపోతుంది. అందుకే ఈ బస్సుల్లో, పాతతరం బస్సుల తరహాలో పొగగొట్టం ఉండదు. డ్రైవర్ పక్కనున్న ఇంజిన్ కిందే ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది. ఇలాంటి ప్రత్యేకతలు ఈ బస్సుల్లో ఎన్నో ఉన్నాయి. -
‘పీఎం ఈ–డ్రైవ్’ కింద 2500 బస్సులు
సాక్షి, హైదరాబాద్: ఎలక్ట్రిక్ బస్సులను పెద్ద మొత్తంలో సమకూర్చుకోవాలని ఆర్టీసీ నిర్ణయించింది. పీఎం ఈ–డ్రైవ్ పథకంలో హైదరాబాద్ నగరానికి ఎలక్ట్రిక్ బస్సులు ఇవ్వాలని దరఖాస్తు చేసుకుంది. నరేంద్రమోదీ తొలి దఫా ప్రభుత్వం అమలు చేసిన ‘ది ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యాన్యుఫాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఫేమ్) పథకంలో భాగంగా తెలంగాణ తొలిసారి ఎలక్ట్రిక్ బస్సులను పొందింది. వాటిని విమానాశ్రయానికి నడుపుతున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఫేమ్–2లో కూడా కొన్ని ఎలక్ట్రిక్ బస్సులను సమకూర్చుకుంది. వాటిని దూర ప్రాంతాలతోపాటు హైదరాబాద్‌లో సిటీ బస్సులుగా తిప్పుతోంది. ఈ రెండు పథకాలను నిలిపేసిన కేంద్రం పీఎం ఈ–డ్రైవ్ పేరుతో కొత్త పథకాన్ని మంగళవారం ప్రారంభించింది. దీని మార్గదర్శకాలు వెల్లడి కావటంతోనే, టీజీఎస్ ఆర్టీసీ ఈ పథకానికి ప్రతిపాదనలు పంపింది. ఈ పథకం అక్టోబర్ 1 నుంచి 2026 మార్చి వరకు కొనసాగుతుందని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ వెల్లడించింది. ఈ పథకాన్ని ఆ శాఖ ద్వారానే కేంద్ర ప్రభుత్వం అమలు చేయబోతోంది. ఈ పథకానికి రూ.10,900 కోట్లు కేటాయించింది. ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాలు, ఈ–రిక్షా/ ఈ–కార్డులు, ఎలక్ట్రిక్ అంబులెన్సులు, ఈ–ట్రక్కు లు, ఎలక్ట్రిక్ బస్సులు, ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ కేంద్రాల ఏర్పాటు, టెస్టింగ్ ఏజన్సీల బలోపేతానికి ఈ నిధులు వినియోగిస్తారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 40 లక్షల జనాభా దాటిన నగరాలకు ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించాలని నిర్ణయించారు. మొత్తంగా 14,028 బస్సులు సమకూర్చడానికి రూ.4391 కోట్లు కేటాయించారు. ఈ పథకానికి సంబంధించిన విధివిధానాలను రెండు రోజుల క్రితమే వెల్లడిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ వెంటనే తెలంగాణ ఆర్టీసీ హైదరాబాద్ నగరానికి 2,500 బస్సులు కేటాయించాలని ప్రతిపాదిస్తూ దరఖాస్తు చేసింది. వీలైనన్ని ఎక్కువ బస్సులు వచ్చేలా.. హైదరాబాద్‌లో వాహన కాలుష్యం తీవ్రమవుతున్న నేపథ్యంలో ఇక్కడ డీజిల్ బస్సులను నడపొద్దని ప్రభుత్వం ఆర్టీసీని ఆదేశించిన విషయం తెలిసిందే. ఉన్న బస్సులను తొలగించి వాటి స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను సమకూర్చుకోవాలని పేర్కొంది. ప్రస్తుతం ఒక్కో ఎలక్ట్రిక్ బస్సు ధర రూ.1.85 కోట్ల వరకు ఉంది. అంత ఖర్చు భరించే పరిస్థితి లేనందున, గ్రాస్ కాస్ట్ మోడల్ పద్ధతిలో అద్దెకు తీసుకోవాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం ద్వారా హైదరాబాద్‌కు ఎన్ని బస్సులు మంజూరు చేస్తుందో తేలిన తర్వాత, అన్ని బస్సులు జీసీసీ పద్ధతిలో నిర్వహించేందుకు వీలుగా టెండర్లు పిలవనుంది. æఒక్కో కిలోమీటరుకు తక్కువ అద్దెను ప్రతిపాదించే సంస్థను ఎంపిక చేస్తుంది. ఆ కంపెనీ అన్ని బస్సులను ఆరీ్టసీలో అద్దె ప్రాతిపదికన నిర్వహించాల్సి ఉంటుంది. కొత్తగా పది డిపోల ఏర్పాటు.. ఈ బస్సులకు ప్రస్తుతమున్న డిపోలు సరిపోవని ఆర్టీసీ భావిస్తోంది. వాటి చార్జింగ్ వ్యవస్థ ఏర్పాటుకు చాలా స్థలం అవసరమవుతున్నందున కొత్తగా పది డిపోలను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో బస్సుకు రూ.30 లక్షల రాయితీ.. పీఎం ఈ–డ్రైవ్‌లో భాగంగా ఒక్కో బస్సు కొనుగోలుపై కేంద్రం రూ.30 లక్షల వరకు సబ్సిడీ ఇస్తుంది. గతంలో ఫేమ్–1లో ఆ మొత్తం రూ.50 లక్షలుండేది. గతంతో పోలిస్తే ఎలక్ట్రిక్ బస్సుల తయారీ కొంత సులభతరం కావటం, బ్యాటరీ ధరలు తగ్గటం, ఇప్పుడు మన దేశంలో కూడా బ్యాటరీలను తయారు చేస్తున్నందున సబ్సిడీ మొత్తాన్ని కేంద్రం తగ్గించినట్టు సమాచారం. సబ్సిడీ అమలు చేస్తున్నందున బస్సులు సమకూర్చేందుకు తయారీ సంస్థలు పోటీ పడతాయని భావిస్తున్నారు. -
బీమా సొమ్ము.. ఆర్టీసీ సొంత అవసరాలకు
సాక్షాత్తూ భవిష్యనిధి(పీఎఫ్) సంస్థ కల్పించిన బీమా పథకానికి ఆర్టీసీ గండి కొట్టింది. ఆ పథకం ద్వారా మృతుడి కుటుంబ సభ్యుల(నామినీకి)కు గరిష్టంగా రూ.7 లక్షలు అందే ఓ చట్టబద్ధ ప్రయోజనాన్ని ఏడాదిన్నరగా అందించటం లేదని తెలిసింది. ఇప్పుడు ఈ ఆర్థిక ప్రయోజనం కోసం దాదాపు 300కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. సాక్షి, హైదరాబాద్: భవిష్యనిధిలో అంతర్భాగంగా ‘‘ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూ్యరెన్స్ (ఈడీఎల్ఐ)’’స్కీమ్ ఆర్టీసీలో కొనసాగుతోంది. ఓ సంస్థలో 20 మంది కంటే ఎక్కువ మంది ఉద్యోగులుండి, వారికి ఇంతకంటే మెరుగైన మరే బీమా పథకాన్ని సంస్థ అమలు చేయని పక్షంలో, కచ్చి తంగా దీనిని అమలు చేయాల్సి ఉంటుంది. ఇది ఉద్యోగి నుంచి ఎలాంటి ప్రత్యేక కాంట్రిబ్యూషన్ అంటూ లేకుండా సాగుతుంది. ఉద్యోగి బేసిక్ ప్లస్ డీఏ (మూల వేతనం ప్లస్ కరువు భత్యం)మీద 0.5 శాతం లేదా గరిష్టంగా రూ.75 చొప్పున ప్రతినెలా సంస్థ ఉద్యోగిపక్షాన అతని/ఆమె భవిష్య నిధి ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. భవిష్యనిధిలో సభ్యత్వం ఉన్న ప్రతి ఉద్యోగి (అర్హతలను అనుసరించి) దీని ప్రయోజనం పొందవచ్చు. ఉద్యోగి చనిపోతే అతని/ఆమె నామినీకి కనిష్టంగా రూ.రెండున్నర లక్షలు.. నెలవారీ వేతనం, భవిష్యనిధి నిల్వ తదితరాల ఆధారంగా గరిష్టంగా రూ.ఏడు లక్షల వరకు చెల్లిస్తారు. ఉద్యోగి నయాపైసా కాంట్రిబ్యూషన్ లేకుండా ఇది అందుతుంది. ఇష్టారాజ్యానికి ఇదే కారణం.. భవిష్యనిధి ఖాతాల నిర్వహణలో ఆరీ్టసీకీ ప్రత్యేక మినహాయింపు ఉంది. సొంతంగానే పీఎఫ్ ట్రస్టును నిర్వహిస్తుంది. దీనికి ఓ నిర్వహణ కమిటీని కూడా ఏర్పాటు చేస్తుంది (ప్రస్తుతం కమిటీ లేదు). ఈ వెసులుబాటే ఇప్పుడు ఆర్టీసీ ఇష్టారాజ్యానికి కారణమైంది. భవిష్యనిధి చెల్లింపులు పూర్తి చట్టబద్ధమైనమే అయినా, కాంట్రిబ్యూషన్‌ను ట్రస్టుకు జమ చేయకుండా సొంత అవసరాలకు వాడుకుంటోంది. దాదాపు పదేళ్ల క్రితం ఈ కట్టు తప్పే సంప్రదాయం ఆర్టీసీలో మొదలైంది. ఎండీగా సజ్జనార్ బాధ్యతలు తీసుకున్న తర్వాత దాన్ని కొంతమేర తగ్గించి గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నా.. సంస్థ ఆర్థిక అవసరాలు, ప్రభుత్వం నుంచి సకాలంలో సాయం అందకపోవటం లాంటి వాటి వల్ల దానికి పూర్తిగా అడ్డుకట్ట పడలేదు. ఈ క్రమంలోనే ఈ బీమా పథకం కోసం యాజమాన్యం చెల్లించే వాటాను ట్రస్టులో డిపాజిట్ చేయకుండా సొంత అవసరాలకు వాడుకుంటోంది. ఫలితంగా ఏడాదిన్నరగా దీని చెల్లింపులు నిలిచిపోయాయి. గతేడాది మార్చి వరకు భవిష్యనిధి బీమా పథకం చెల్లింపులు జరిగాయి. ఆ తర్వాత నిలిచిపోయినట్టు సమాచారం. ప్రతి మూడు నెలలకోమారు ఈ పథకం కోసం ఆర్టీసీ నిధులు విడుదల చేసే పద్ధతి ఉండేది. ఏడాదిన్నరగా అవి కూడా నిలిచిపోయాయి. అప్పటి నుంచి దాదాపు 300 మందికిపైగా ఉద్యోగులు మరణించారు. వీరి కుటుంబ సభ్యుల(నామినీ)కు ఆ బీమా మొత్తాన్ని చెల్లించటం లేదని తెలిసింది. -
బ్యాటరీ బస్సులే తిప్పండి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో డీజిల్ బస్సులకు బదులు అన్నీ బ్యాటరీ బస్సులే తిరగా లని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు చెప్పారు. నగరంలో 2,700 బస్సులు తిరుగుతున్నాయని అధికారులు చెప్పగా.. వాటిల్లో డీజిల్ బస్సులను తొలగించి అన్నింటినీ క్రమంగా బ్యాటరీ సర్వీసుల్లోకి మార్చే అంశాన్ని పరిశీలించాలని సీఎం సూచించారు. ఒక సంవత్సరంలో ఎన్ని బస్సులు సమకూర్చుకునే అవకాశం ఉందో తేల్చాలని, దీని సాధ్యాసాధ్యా లను పరిశీలించి నివేదిక అందజేయాలని ఆదేశించారు. మంగళవారం సాయంత్రం ఆయన ఆర్టీసీపై ఉన్నత స్థాయిలో సమీక్షించారు. బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణంపై ఆరా తీశారు. ప్రస్తుతం 7,292 బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతి అమలవుతోందని, ఇప్పటివరకు ఈ పథకాన్ని 83.42 కోట్ల మంది వినియోగించుకుని, రూ.2,840.71 కోట్లు ఆదా చేసుకున్నారని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఈ పథకం ప్రారంభమైన తర్వాత వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్‌లోని ఆసుపత్రులకు వచ్చే మహిళల సంఖ్య పెరుగుతోందని అధికారులు తెలిపారు. మహిళల ఉచిత ప్రయాణంతో పెరిగిన ఆక్యుపెన్సీ రేషియో, ప్రభుత్వం చెల్లిస్తున్న రీయింబర్స్‌మెంట్‌తో సంస్థ లాభాల్లోకి వస్తోందని చెప్పారు.బ్యాటరీల దిగుమతి ఇబ్బందిగా ఉందినగరంలో తిప్పేందుకు 500 ఎలక్ట్రిక్ బస్సులకు ఆర్డర్ ఇస్తే, ఇప్పటికీ అన్నీ సరఫరా కాలేదని, విదేశాల నుంచి బ్యాటరీలను దిగుమతి చేసుకోవాల్సి రావటం బస్సు తయారీ సంస్థలకు ఇబ్బందిగా ఉందని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. సొంతంగా ఎలక్ట్రిక్ బస్సులు కొనాలంటే భారీ వ్యయం అవుతుందని, ఒక్కో బస్సు రూ.1.85 కోట్ల వరకు ధర పలుకుతోందని చెప్పారు. సంస్థ ప్రస్తుతం ఆద్దె ప్రాతిపదికన బస్సులు తీసుకుని నిర్వహిస్తోందని వివరించారు. దీంతో ఆయా కంపెనీల ప్రతినిధులను పిలిపించి చర్చించాలని, కావల్సినన్ని బస్సుల సరఫరాకు ఉన్న సమస్యను అధిగమించేందుకు ఉన్న మార్గాలపై చర్చించేందుకు మరో సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని సీఎం చెప్పారు. ఆ సమావేశంలో ఈ బస్సుల అంశంతో పాటు, బ్యాంకు అప్పులపై వడ్డీని తగ్గించుకునేందుకు ఉన్న మార్గాలపై చర్చిద్దామని చెప్పారు.అప్పుల రీస్ట్రక్చర్‌కు మార్గాలు పరిశీలించండిఆర్టీసీకి లాభాలు వస్తున్నా, వివిధ బ్యాంకుల నుంచి తెచ్చిన రూ.వేల కోట్ల రుణాలపై చెల్లిస్తున్న వడ్డీ ఎక్కువగా ఉండటం సంస్థకు ఇబ్బందిగా మారి నందున.. ఆ అప్పులను రీస్ట్రక్చర్ చేసుకునేం దుకు ఉన్న మార్గాలను పరిశీలించాలని ముఖ్య మంత్రి సూచించారు. వడ్డీ తగ్గించుకునేందుకు ఉన్న అన్ని అవకాశాలు పరిశీలించి నివేదిక అందజేయాలని ఆదేశించారు. ఆర్టీసీ బస్సుల్లో పెరు గుతున్న ప్రయాణికుల సంఖ్య దృష్ట్యా కొత్త బస్సుల కొనుగోలుకు ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. కాగా వివిధ బ్యాంకుల నుంచి తెచ్చిన అప్పులు, ఉద్యోగుల భవిష్య నిధి నుంచి వాడు కున్న నిధులు, విశ్రాంత ఉద్యోగులకు చెల్లించాల్సి న బకాయిలు కలిపి రూ.6,322 కోట్లు ఉన్నాయని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. వన్‌టైమ్ సెటిల్మెంట్ కింద సంస్థ అప్పులను ప్రభుత్వం క్లియర్ చేస్తే బాగుంటుందన్నారు. సమీక్షలో సీఎస్ శాంతికుమారి, రవాణాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్, సీఎం కార్యద ర్శులు షానవాజ్ ఖాసిం, చంద్రశేఖరరెడ్డి, టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఈడీలు పాల్గొన్నారు. -
ఆర్టీసీకి ‘ప్రవాస్ 4.ఓ రెడ్‌బస్ పీపుల్స్ చాయిస్’ అవార్డు
సాక్షి, అమరావతి: వరుసగా రెండో ఏడాది ఏపీఎస్ ఆర్టీసీ ‘ప్రవాస్ 4.ఓ రెడ్‌బస్ పీపుల్స్ చాయిస్ అవార్డు’ను సాధించింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తున్నందుకు గాను ఈ అవార్డును ప్రకటించారు. ప్రవాస్ 4.ఓ అవార్డును సాధించడంపై ఆర్టీసీ ఎండీ సీహెచ్.ద్వారకా తిరుమలరావు సంతోషం వ్యక్తం చేశారు. ఆర్టీసీ అధికారులు, సిబ్బందిని శుక్రవారం అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఈడీలు కేఎస్ బ్రహా్మనందరెడ్డి, చంద్రశేఖర్, వి.సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ ఉద్యోగులకు సర్కారు షాక్
సాక్షి, అమరావతి: ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. నైట్ డ్యూటీ అలవెన్స్‌లు, టీఏ, ఇతర డ్యూటీ ఆధారిత అలవెన్స్‌లను జీతాల బిల్లులతో కలిపి ఇవ్వకూడదని నిర్ణయించింది. దాంతో రాష్ట్రంలోని దాదాపు 50వేల మంది ఆర్టీసీ ఉద్యోగుల ప్రయోజనాలు దెబ్బతిననున్నాయి. తమకు జీతాలతోపాటే నైట్ డ్యూటీ అలవెన్స్‌లు, టీఏ, ఇతర అలవెన్స్‌లు చెల్లించాలని ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు దీర్ఘకాలంగా డిమాండ్ చేస్తూ వచ్చారు. ఎందుకంటే నిధుల కొరత లేదా ఇతర కారణాలతో అలవెన్స్‌లు ఏళ్ల తరబడి చెల్లించేవారు కాదు. ఉద్యోగ సంఘాల కోరిక మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ అంశంపై కూడా సానుకూలంగా స్పందించింది. అలవెన్స్‌లను కూడా గ్రేడ్–1 ఉద్యోగులకు రూ.600 నుంచి రూ.800కు, గ్రేడ్–2 ఉద్యోగులకు రూ.400 నుంచి రూ.600కు, గ్రేడ్–3 ఉద్యోగులకు రూ.300 నుంచి రూ.400కు పెంచింది. ఆ అలవెన్స్‌లను జీతాల బిల్లులతోపాటే ఆమోదించి ప్రతి నెలా జీతాలతోపాటే చెల్లించాలని నిర్ణయించింది. దాంతో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి డ్రైవర్లు, కండక్టర్లకు జీతాలతోపాటు అలవెన్స్‌లను కూడా చెల్లిస్తూ వచ్చారు. కాగా.. టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించింది. ఆగస్టు నెల జీతాల బిల్లులతో నైట్‌డ్యూటీ అలవెన్స్‌లు, టీఏలు, ఇతర డ్యూటీ ఆధారిత అలవెన్స్‌లను కలపవద్దని విజయవాడలోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. దాంతో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు షాక్‌కు గురయ్యారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో తమకు అలవెన్స్‌లు ఏళ్లకు ఏళ్లు పెండింగులో ఉండే విషయాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. ప్రస్తుతం అదే పరిస్థితి పునరావృతమయ్యేలా ఆందోళన చెందుతున్నారు. నేడు నిరసనప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అన్ని డిపోల్లో ఉద్యోగులు ఈ నెల 30న నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవ్వాలని నిర్ణయించాం. నిరసన ప్రదర్శన నిర్వహిస్తాం. రిటైరైన ఉద్యోగులకు సకాలంలో సెటిల్మెంట్ చేయకుండా ట్రెజరీ శాఖ తీవ్ర ఇబ్బందులు పెడుతోంది. ఈ అంశంపై కూడా నిరసన తెలుపుతాం. – పీవీ రమణారెడ్డి, అధ్యక్షుడు, – వై.శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి, నేషనల్ మజ్దూర్ యూనియన్ -
ఛాసీలు ఇలా.. బస్సులు మరెలా?
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ పెద్దసంఖ్యలో బస్సు ఛాసీలను కొనుగోలు చేసింది. అయితే నగరంలో ఉన్నవి చిన్న వర్క్‌షాప్‌లు కావడం, అందులో పనిచేసే కార్మికులు సొంతూళ్లకు వెళ్లడంతో కొత్త బస్సులకు బాడీలు కట్టేవారు కరువయ్యారు. దీంతో నెలల తరబడి ఆ ఛాసీలు పార్కింగ్ యార్డులో ఎదురుచూడాల్సి వస్తోంది. వర్షాలు కురుస్తుండటంతో ఆ ఛాసీల్లోంచి గడ్డి, పిచ్చిమొక్కలు ఏపుగా పెరగ్గా, తీగజాతి మొక్కలు వాటిని అల్లుకుపోతున్నాయి. కొన్ని ఛాసీలైతే సరిగ్గా కనిపించనంతగా వాటిని చుట్టేశాయి. చాలా ఏళ్ల తర్వాత కొత్త బస్సులు ఆర్టీసీ చాలాఏళ్ల తర్వాత 1,200 కొత్త బస్సులను సమకూర్చుకుంటోంది. ఈ తరుణంలో ఇటీవల పెద్ద సంఖ్యలో బస్సుల ఛాసీలు ఆర్టీసీ పార్కింగ్ యార్డుకు చేరుకున్నాయి. గతంలో మియాపూర్‌లోని బస్‌బాడీ వర్క్‌షాప్‌లో సొంతంగా ఛాసీలకు బాడీలు నిర్మించుకునేది. ప్రస్తుతం ఆ వర్క్‌షాపు నీర సించిపోయింది. అక్కడ నెలకు 25 ఛాసీలకు మాత్రమే బాడీ లు నిర్మిస్తోంది. త్వరలో నెలకు 15 బస్సులకు బాడీలు నిర్మించేలా కొత్త లైను ఏర్పాటు చేస్తున్నారు. అయితే బాడీలు కట్టే పనులను త్వరగా పూర్తి చేసేందుకు ఆర్టీసీ 34 ప్రైవేట్ వర్క్‌షాపులకు ఆర్డర్ ఇచ్చి0ది. కానీ వాటి సామర్థ్యం చాలా తక్కు వ. ఒక్కో వర్క్‌షాపు నెలకు మూడు నుంచి ఐదు ఛాసీలకు మాత్రమే బాడీలు నిర్మించేంత చిన్నవి. అందులోనూ ఒడిశా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారే కార్మికులుగా పనిచేస్తున్నారు. వారు ఏడాదిలో రెండు మూడు పర్యాయాలు సెలవుల్లో వెళతారు. ఇటీవల వేసవి సెలవుల కోసం వెళ్లినవారు గత నెలలోనే తిరిగొచ్చారు. దీంతో రెండు నెలల పాటు వాటి ల్లో పనులు సరిగ్గా జరగలేదు. ఫలితంగా ఛాసీలన్నీ పేరుకుపోయాయి. వానాకాలం ముంచుకురావటంతో గడ్డిలో కూరుకుపోయాయి. ఇక ఏపీ ఆర్టీసీ బస్సులతోపాటు, ప్రైవేట్ బ స్సులకు కూడా ఆ వర్క్‌షాపులే దిక్కవుతుండటంతో పనుల్లో మరింత జాప్యం జరుగుతోంది. అయితే రెండుమూడు నెలలపాటు వానకు తడిసినా, గడ్డి మధ్య కూరుకుపోయినా ఛాసీలు పాడు కావని మరోవైపు అధికారులు చెబుతున్నారు. బడా కంపెనీలతో సంప్రదింపులు తాను కొంటున్న బస్సు ఛాసీలకు స్థానికంగానే బాడీ కట్టిస్తు న్న ఆర్టీసీ ఇకపై ముంబయి, జైపూర్లలో ఉన్న బడా కంపెనీలకు ఆర్డరివ్వాలని భావిస్తోంది. ఉత్తర, మధ్య భారత్ ప్రాంతాల్లోని బడా కంపెనీలకు తరలించి బాడీ నిర్మించి హైదరాబాద్‌కు తీసుకురావాలని అనుకుంటోంది. ఈ మేరకు ఆయా నగరాల్లో ఉన్న బడా బస్‌బాడీ నిర్మాణ కంపెనీలతో ఆర్టీసీ సంప్రదిస్తోంది. ఒక బస్సు ఛాసీకి బాడీ నిర్మించాలంటే రూ.11 లక్షల వరకు ఖర్చవుతుండగా, దూర ప్రాంతాల్లోని బడా కంపెనీలకు ఆర్డరిస్తే ఈ ఖర్చు మరికాస్త పెరిగే అవకాశముంది. అయితే వేగంగా బస్సు సిద్ధమై రోడ్డెక్కితే వెంటనే ఆదాయం పెరిగే వీలున్నందున, లాభమే ఉంటుందన్నది ఆర్టీసీ ఆలోచన. -
పొడుగూ సీట్లూ ఎక్కువే..
సాక్షి, హైదరాబాద్: మహిళలకు ఉచిత ప్రయాణ వెసులుబాటుతో కోల్పోయిన రోజువారీ టికెట్ ఆదాయాన్ని కొంతమేర తిరిగి రాబట్టుకునేందుకు ఉద్దేశించిన సెమీ డీలక్స్ కేటగిరీ బస్సులను ఆర్టీసీ రోడ్డెక్కించింది. ప్రయోగాత్మకంగా మూడు నెలల పాటు ఈ కేటగిరీ బస్సులను తిప్పి ప్రయాణికుల స్పందనను పరిశీలించాలని నిర్ణయించింది. తొలుత నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో బస్సులను ప్రారంభించారు. కొత్త బస్సులు సమకూరే కొద్దీ ఇతర జిల్లాలకు పంపనున్నారు. ఇదే తరహాలో హైదరాబాద్ నగరంలో కొత్తగా మెట్రో డీలక్స్ కేటగిరీ బస్సులను ప్రారంభించారు. నగరంలో 125 బస్సులను వివిధ మార్గాల్లో నడపబోతున్నారు. ఇప్పటికే 24 బస్సులను.. 300, 1హెచ్, 49ఎం, 3కే, 16ఏ రూట్లలో ప్రారంభించారు.ప్రయాణికుల్లో అయోమయం..ప్రస్తుతం ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయా ణ వెసులుబాటు కొనసాగుతోంది. నగరంలో ఈ కేటగిరీ బస్సులే ఎక్కువగా ఉంటాయి. మెట్రో లగ్జరీ పేరుతో నడిచే ఏసీ బస్సులు చూడగానే గుర్తించేలా ఉండటంతో.. మహిళలకు వేటిలో ఉచితం, ఏ తరహా బస్ పాస్‌లు చెల్లుబాటు అవుతాయన్న స్పష్టత ఉంది. అయితే కొత్తగా ప్రవేశపెట్టిన మెట్రో డీలక్స్ బస్సులు కూడా ఎక్స్‌ప్రెస్‌లే అనుకుని ఉచితంగా ప్రయాణించేందుకు ఎక్కుతు న్నారు. కాదని తెలిశాక దిగిపోతున్నారు. ఈ కేటగిరీ బస్సులపై ప్రచారం లేకపోవటమే దీనికి కారణం. జిల్లాల్లో ప్రారంభమైన సెమీ డీలక్స్‌ల విషయంలోనూ ఇదే తరహా గందరగోళం ఏర్పడు తోంది. ప్రస్తుతం అవి తక్కువ ఆక్యుపెన్సీతో నడుస్తున్నా యి.కనీస చార్జీ రూ.30హైదరాబాద్‌లో రోడ్డెక్కిన మెట్రో డీలక్స్ బస్సులు పూర్తిగా కొత్తవి. కంపెనీ నుంచి కొత్త ఛాసిస్లు మాత్రమే కొని బస్ బాడీని విడిగా తయారు చేయించినవి. కానీ జిల్లాల్లో తిరిగే సెమీ డీలక్స్‌లు మాత్రం పాత బస్సులే. ఆర్టీసీ పాతబడిపోయిన రాజధాని బస్సులను ఒక్కొక్కటిగా తొలగిస్తూ.. వాటి స్థానంలో కొత్త బస్సులను చేరుస్తోంది. తొలగించిన పాత రాజధాని బస్సుల బాడీ తొలగించి.. వాటి ఛాసిస్‌లపై కొత్తగా సెమీ డీలక్స్ బస్ బాడీలను ఏర్పాటు చేయిస్తోంది. సాధారణంగా డీలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్సులు 10 మీటర్ల పొడవు ఉంటే.. రాజధాని ఏసీ బస్సులు 12 మీటర్ల పొడవు ఉంటాయి. వాటినే సెమీ డీలక్స్‌గా మార్చుతున్నందున.. పొడవుకు అనుగుణంగా సీట్ల సంఖ్య ఎక్కువగా ఉంటోంది.అంటే డీలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో 51 సీట్లే ఉంటే.. సెమీ డీలక్స్లలో 59 సీట్లు వస్తున్నాయి. ఎక్స్‌ప్రెస్ తరహాలో సెమీ డీలక్స్ బస్సుల్లో 3 ప్లస్ 2 పద్ధతిలో సీట్లు ఏర్పాటు చేశారు. ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో సాధారణ రెగ్జిన్ సీట్లు ఉంటే.. సెమీ డీలక్స్లలో ఫ్యాబ్రిక్ సింగిల్ సీట్లను ఏర్పాటు చేశారు. ఇవి చూడటానికి ఆకర్షణీయంగా ఉన్నాయి. ఎక్స్‌ప్రెస్ బస్సుల్లాగే సెమీ డీలక్స్ కనీస చార్జీని రూ.30గానే నిర్ధారించినా.. తదుపరి ప్రతి కిలోమీటర్‌కు 11 పైసల చొప్పున ఎక్స్‌ప్రెస్‌ల కంటే అదనంగా చార్జీ ఉంటుంది. ప్రస్తుతం ఆర్టీసీ 280 డీలక్స్ బస్సులను తిప్పుతోంది. అవి లేని మార్గాల్లో సెమీ డీలక్స్ బస్సులు తిరుగుతాయి. ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో సీట్ల కోసం నిత్యం కుస్తీలు పట్టాల్సి వస్తున్నందున.. పురుష ప్రయాణికులు, కొంతమేర మహిళలు ఖాళీగా, కొత్తగా కనిపించే సెమీ డీలక్స్ బస్సుల వైపు మళ్లుతారని ఆర్టీసీ భావిస్తోంది. -
ఆర్టీసీ లక్ష్యం.. బిలియన్ డాలర్ టర్నోవర్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ తొలిసారి ఒక బిలియన్ డాలర్ల(దాదాపు రూ.8,300 కోట్లు) టర్నోవర్ క్లబ్లో చేరేందుకు లక్ష్యం నిర్ధారించుకుంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో సమకూరిన ఆదాయంతో సంస్థలో కొత్త ఉత్సాహం నెలకొంది. దీంతో మిగతా మూడు త్రైమాసికాల్లో దానికి తగ్గకుండా ఆదాయాన్ని సాధించటం ద్వారా ఒక బిలియన్ డాలర్ టర్నోవర్ సాధించే అరుదైన మైలు రాయిని చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ఆర్టీసీ చరిత్రలో ఓ అరుదైన ఘట్టంగా మిగులుతుందని సంస్థ భావిస్తోంది. ఓవైపు భారీగా రికార్డవుతున్న సంస్థాగత వ్యయం, అప్పులపై చెల్లిస్తున్న రూ.వందల కోట్ల వడ్డీ.. వెరసి సంస్థకు కొంత నష్టాలనే మిగులుస్తున్నా, ఆదాయ పరంగా ఈ కొత్త రికార్డు సృష్టించాలని నిర్ణయించుకుంది. ఆదాయం పెంపుపైనే దృష్టి పెట్టి.. గత కొంతకాలంగా ఆదాయాన్ని భారీగా పెంచుకునేందుకు ఆర్టీసీ శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఏడాదిన్నర క్రితం పలు రకాల సెస్‌లను సవరించి పరోక్షంగా బస్ చార్జీలను పెంచింది. దాని ద్వారా ఆదాయం భారీగా పెరిగింది. ఎండీ సజ్జనార్ వినూత్న ఆలోచనలతో ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తూ ఆదాయం పెంచటంలో సక్సెస్ అయ్యారు. పండగలు, ప్రత్యేక సందర్భాల్లో స్పేర్‌లో ఉన్నవి సహా అన్ని బస్సులను రోడ్డెక్కించి, సిబ్బంది ప్రత్యేక పర్యవేక్షణ ద్వారా ప్రయాణికుల సంఖ్య పెరిగేలా చూస్తున్నారు. లక్షే లక్ష్యం పేరుతో .. ప్రతి డిపో నిత్యం రూ.లక్ష వరకు అదనపు ఆదాయం సాధించేలా కొత్త టార్గెట్‌ను అమలు చేస్తున్నారు. ఫలితంగా 38 డిపోలు లాభాల్లోకి వచ్చాయి. ఇలాంటి ప్రత్యేక చర్యల వల్ల గత మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.6,942 కోట్ల ఆదాయాన్ని సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అది రూ.2 వేల కోట్లను మించింది. మహిళల ఉచిత ప్రయాణంతో.. ఉచితంగా ప్రయాణించే మహిళలకు బస్సుల్లో జీరో టికెట్లు జారీ చేస్తున్నారు. వాటి విలువను లెక్కగట్టి ప్రభుత్వం ఆరీ్టసీకి రీయింబర్స్ చేయాల్సి ఉంది. మహిళల సంఖ్య భారీగా పెరగటంతో ఆర్టీసీ ఆదాయం కూడా బాగా పెరిగింది. ఆ మేరకు తొలి త్రైమాసిక ఆదాయం రూ.2 వేల కోట్లను దాటింది. ఇక త్వరలో దశలవారీగా 500 వరకు కొత్త బస్సులు సమకూరనున్నాయి. వీటి ద్వారా కూడా ఆదాయం పెరుగుతుంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ.8,300 కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. దాన్ని మన రూపాయల్లో కాకుండా ప్రత్యేకంగా డాలర్లలో పే ర్కొంటే బిలియన్ డాలర్ల మొత్తంగా అవుతుంది. దీంతో ఆ పేరుతో ఈ లక్ష్యాన్ని నిర్ధారించుకున్నారు. అంకెల్లో ఆదాయం.. వాస్తవరూపందాలుస్తుందా? మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళల ఉచిత ప్రయాణాలకు సంబంధించి ఇప్పటి వరకు రూ.2,350 కోట్ల విలువైన జీరో టికెట్లు జారీ అయ్యాయి. కానీ, ప్రభుత్వం మాత్రం ఆర్టీసీకి రూ.1,740 కోట్లు మాత్రమే రీయింబర్స్ చేసింది. మిగతా రూ.610 కోట్లు బకాయిలు పేరుకుపోయాయి. కానీ, ‘‘బిలియన్ డాలర్ల టర్నోవర్’’లో మాత్రం రూ.2,350 కోట్ల మొత్తాన్ని ఆదాయంగా చూపుతారు. అంటే అంకెల్లో ఆదాయం కనిపిస్తుంది, వాస్తవంగా లోటులో ఉంటుంది. అంకెల్లో ఉన్న ఆదాయం వాస్తవం కావాలంటే ప్రభుత్వం ఆ మొత్తాన్ని రీయింబర్స్ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఆర్థిక చేయూతనిస్తేనే అసలు ఆదాయం ఆర్టీసీ లో 2015లో చేసిన వేతన సవరణకు సంబంధించి బాండ్ల మొత్తాన్ని ఉద్యోగులకు ఇవ్వనున్నట్టు గత ఫిబ్రవరిలో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. దానికి సంబంధించిన రూ.281 కోట్ల మొత్తాన్ని విడుదల చేస్తున్నట్టు వెల్లడించారు. కానీ, కేవలం రూ.81 కోట్లు మాత్రమే రావటంతో ఆర్టీసీ దానికి డ్రైవర్లకు అందించింది. మిగతా నిధులు ఇప్పటి వరకు నిధులు విడుదల కాలేదు. త్వరలో చెల్లిస్తామంటూ రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొంటున్నారే తప్ప, ఎప్పటికి ఇస్తారో మాత్రం చెప్పలేకపోతున్నారు. భవిష్యనిధికి బకాయి చెల్లించకపోవటంతో ఆ సంస్థ ఇటీవల ఏకంగా ఆర్టీసీ ప్రధాన బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసింది. సంస్థ ఆర్థిక పరిస్థితి ఇలా ఉన్న తరుణంలో బిలియన్ డాలర్ల టర్నోవర్ లాంటి ఫీట్ చేపట్టడం విశేషం. ప్రభుత్వపరంగా ఆరీ్టసీకి పూర్తి చేయూతనందిస్తే ఈ ఫీట్ ప్రత్యక్షంగా సంస్థకు ఉపయోగంగా ఉండనుంది. -
ఆర్టీసీ నియామకాల్లో ‘మూడు ముక్కలాట’
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో ఖాళీల భర్తీ వ్యవహారం మూడు ముక్కలాటగా మారింది. సంస్థలో 3035 పోస్టుల భర్తీకి ఇటీవలే ప్రభుత్వం అనుమతించింది. అయితే ఇప్పటి వరకు ఆర్టీసీలో ఖాళీల భర్తీకి సంస్థనే సొంతంగా నియామకాలు చేపడుతూ వస్తోంది. కానీ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ అధికారానికి కోత పెడుతూ.. సొంతంగా భర్తీ చేసుకునే వీలు లేకుండా నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ బాధ్యత చూస్తున్న టీఎస్పీఎస్సీకి ఆ బాధ్యత అప్పగించింది. డ్రైవర్‌లాంటి పోస్టుల భర్తీ బాధ్యత తమకు వద్దంటూ ఆ సంస్థ పేర్కొనటంతో పోలీసు రిక్రూట్‌బోర్డుకు అటాచ్ చేసింది. డ్రైవర్లు, శ్రామిక్‌లు, సూపర్వైజర్లు లాంటి పోస్టుల నియామక బాధ్యతను దానికి అప్పగించారు. వైద్య ఆరోగ్య సిబ్బంది నియామకాల బాధ్యతను వైద్య ఆరోగ్యశాఖ నియామక విభాగానికి అప్పగించారు. దీంతో ఈ మూడు సంస్థలు ఆర్టీసీలో ఖాళీల భర్తీని చూడనున్నాయి. ఫలితంగా పోస్టులు ఎప్పుడు భర్తీ అవుతాయో ఆర్టీసీకే తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. జాబ్ కేలండర్ ఆధారంగానే... ఒకే అభ్యర్థి ఏక కాలంలో రెండుమూడు ఉద్యోగాల కోసం యత్నించటం సహజం. దీంతో అర్హత ఉన్న అన్ని ప్రవేశ పరీక్షలు రాస్తుంటారు. ఆయా పరీక్షలన్నింటికీ వారు హాజరు కావాలంటే వాటి నిర్వహణ తేదీలు వేరువేరుగా ఉండాల్సి ఉంటుంది. ఒకేరోజు రెండు పరీక్షలుంటే, ఏదో ఒక పరీక్షను మిస్ చేసుకోవాల్సిందే. దీంతో ఆయా సంస్థలు సమన్వయం చేసుకుని వేర్వేరు తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తాయి. జాబ్ క్యాలెండర్ ఆధారంగా ఇది సాగుతుంది. ఇప్పుడు ఇదే ఆర్టీసీకి ఇబ్బందిగా మారింది. ఆర్టీసీకేమో ఖాళీల భర్తీ అత్యవసరం. కానీ, భర్తీ ప్రక్రియ చూసే మూడు సంస్థలు ప్రత్యేకంగా ఆర్టీసీ కోసం ఏర్పాట్లు చేసేందుకు ససేమిరా అంటున్నాయి. ఇతర శాఖల్లోని ఖాళీల భర్తీకి సంబంధించి పరీక్షల నిర్వహణకు రూపొందించే షెడ్యూల్ ఆధారంగానే ప్రక్రియ ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రం వ చ్చిన తర్వాత కొత్త నియామకాల్లేవ్ ఉమ్మడి రాష్ట్రంలో 2012లో చివరి సారిగా ఆర్టీసీలో ఖాళీల భర్తీ జరిగింది. తెలంగాణ రాష్ర్‌్టరం ఏర్పడ్డ తర్వాత కొత్త నియామకాలు చేపట్టలేదు. ప్రతినెలా పదవీ విరమణలు కొనసాగుతుండటంతో క్రమంగా సిబ్బంది సంఖ్య తగ్గిపోతూ బస్సుల నిర్వహణ పెద్ద సమస్యగా మారింది. ఓ దశలో మూడు వేలకుపైగా డ్రైవర్ పోస్టులు ఖాళీ అయ్యాయి. 2019లో ప్రభుత్వం ఆదేశించిందంటూ ఏకంగా 2 వేల బస్సులను ఆర్టీసీ తగ్గించుకుంది. అలా కొంత సమస్యను అధిగమించింది. ఆ తర్వాత మళ్లీ కొత్త బస్సులు అవసరమంటూ అద్దె బస్సుల సంఖ్యను ఒక్కసారిగా పెంచింది. అద్దె బస్సుల్లో వాటి యజమానులే డ్రైవర్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇలాంటి పద్ధతులతో ఎలాగోలా నెట్టుకొస్తూ వస్తోంది. మొత్తంగా చూస్తే ప్రస్తుతం 1200 డ్రైవర్ల కొరత ఉంది. ఫలితంగా ఉన్న డ్రైవర్లకు డబుల్ డ్యూటీలు వేస్తున్నారు. ఇది డ్రైవర్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. నిద్ర కూడా చాలని స్థితిలో వారు డ్రైవింగ్ విధుల్లో ఉంటున్నారు. ఇది బస్సు ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారమిస్తోందని కారి్మక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.కనీసం డ్రైవర్ పోస్టులు భర్తీ చేయాలంటూ.. డ్రైవర్ల కొరత తీవ్రంగా ఉందనీ వెంటనే ఖాళీల భర్తీని చేపట్టాలంటూ తాజాగా పోలీసు రిక్రూట్మెంట్ బోర్డును ఆర్టీసీ అభ్యరి్థంచింది. పలుదఫాలు కోరిన మీదట ఆగస్టులో చూద్దామని ఆ బోర్డు పేర్కొన్నట్టు సమాచారం. -
ఫ్రీ బస్ ఎఫెక్ట్.. త్వరలో ‘కేఎస్ఆర్టీసీ’ ఛార్జీల పెంపు!
బెంగళూరు: ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలను 15నుంచి20 శాతం వరకు పెంచేందుకు కర్ణాటక ఆర్టీసీ(కేఎస్ఆర్టీసీ) సిద్ధమవుతోంది. ఛార్జీలు పెంచక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయని కేఎస్ఆర్టీసీ చైర్మన్ ఎస్ఆర్ శ్రీనివాస్ ఆదివారం(జులై 14)చెప్పారు. ఛార్జీల పెంపు ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపామన్నారు.ఛార్జీలు పెంచాలా వద్దా అనే విషయంలో సీఎం సిద్ధరామయ్య తుది నిర్ణయం తీసుకుంటారన్నారు. డీజిల్,నిర్వహణ వ్యయం పెరగడం వల్లే ఛార్జీలు పెంచాల్సి వస్తోందన్నారు. 2019 నుంచి బస్సుల్లో టికెట్ ఛార్జీలను పెంచలేదన్నారు. గడిచిన మూడు నెలల్లో సంస్థకు రూ.295 కోట్ల నష్టం వచ్చిందని చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ‘శక్తి’ పథకం ద్వారా బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తోంది.ఛార్జీల పెంపుతో కేవలం పురుష ప్రయాణికులపైనే భారం వేస్తామనే వాదన సరికాదన్నారు. మహిళల ఛార్జీలను కూడా ప్రభుత్వం చెల్లిస్తున్నందున పెరిగిన మేరకు డబ్బులను కూడా ప్రభుత్వం ఆర్టీసీకి ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. -
బొకే ఇచ్చి.. బైబై
సాక్షి, హైదరాబాద్: పదవీవిరమణ పొందిన ఉద్యోగుల వీడ్కోలు కార్యక్రమాలు భావోద్వేగ వాతావర ణం మధ్య జరుగుతాయి. ఉద్యోగి దంపతులకు పూలమాలలు, శాలువాలతో సత్కరించి వారి సేవలను ఘనంగా పొగు డుతారు. వారికి రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్లలో కొన్నింటిని అదేరోజు చెల్లించి దర్జాగా సాగనంపుతారు. ఆర్టీసీలోనూ ఈ తంతు సాధారణమే. కానీ కొన్ని నెలలుగా తీరు మారింది. పూలమాలలు, బొకేలు ఇచ్చి వీడ్కోలు చెప్పేస్తున్నారు. పదవీ విరమణ ఆర్థిక ప్రయో జనాల మాటేమిటి అంటే ఆ ఒక్కటి అడగొద్దంటోంది సంస్థ. నష్టాల వల్ల నిధులు లేవన్న కారణంతో రిటైర్డ్ ఉద్యోగులను టెన్షన్ పెడుతోంది. ఇప్పుడు వందలమంది రిటైర్డ్ ఉద్యోగులు తమకు రావాల్సిన ఆర్థిక ప్రయో జనాల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. నిలిచిపోయిన గ్రాట్యుటీ..పదవీవిరమణ పొందిన కొద్ది రోజుల్లోనే గ్రాట్యుటీ మొత్తం చెల్లించే పద్ధతి ఉండేది. కానీ, ఇప్పుడు నెలల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. » ఈ సంవత్సరం జనవరి వరకు వెంటవెంటనే గ్రాట్యుటీ చెల్లించారు. » ఫిబ్రవరి నుంచి బ్రేక్ పడింది. ఆ నెలలో రిటైర్ అయిన వారికి నెల ఆలస్యంగా చెల్లించారు. » మార్చిలో రిటైర్ అయిన వారికి మూడు రోజుల క్రితం చెల్లించారు. » ఏప్రిల్ నుంచి పదవీ విరమణ పొందుతున్న వారు ఎదురుచూపుల జాబితాలో ఉన్నారు. వీరికి ఎప్పుడు చెల్లిస్తారో స్పష్టత లేదు. ఆర్టీసీలో పదవీ విరమణ పొందిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్‌గా వచ్చే వాటిల్లో ఇదే పెద్ద మొత్తం. దీని ఆధారంగా భవిష్యత్ కార్యాచరణకు ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఉంటారు. కానీ, ఆ మొత్తం చేతికందటంలో జరుగుతున్న జాప్యం ఆర్టీసీ కార్మికుల్లో గందరగోళానికి కారణమవుతోంది. డ్రైవర్, కండక్టర్ లాంటి వారికి దాదాపు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఈ మొత్తం అందాల్సి ఉంటుంది. ఈడీ లాంటి పెద్ద పోస్టులోని అధికారులకు రూ.60 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది. చిరుద్యోగులుగా ఉండి రిటైర్ అయినవారు ఇప్పుడు ప్రత్యామ్నాయ నిధి లేక ఈ మొత్తంపైనే ఆశలు పెట్టుకున్నారు. దాదాపు ఐదొందల కుటుంబాలు ఇప్పుడు ఆ మొత్తం కోసం ఎదురుచూస్తున్నాయి. బాండ్ డబ్బులూ అంతే..ఆర్టీసీలో 2013 వేతన సవరణను 2015లో అమలు చేశారు. రెండేళ్ల బకాయిల్లో 50 శాతం మొత్తాన్ని బాండ్ల రూపంలో చెల్లించాల్సి ఉంది. సర్వీసు ఉద్యోగులకు పెండింగ్‌లో పెట్టినా, రిటైర్ అయిన వారికి వెంటనే చెల్లిస్తూ వస్తున్నారు. కానీ జనవరి నుంచి రిటైర్ అయిన వారికి కూడా చెల్లించటం నిలిపేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో అందరు ఉద్యోగులకు బాండ్ బకాయిలు చెల్లించనున్నట్టు మూడునెలల క్రితం సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. కానీ, కొన్ని నిధులే విడుదల కావటంతో ఇటీవల కేవలం డ్రైవర్లకు చెల్లించి వదిలేశారు. జనవరి నుంచి రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లింపులు మాత్రం పునరుద్ధరించలేదు. ఒక్కో ఉద్యోగికి దాదాపు రూ.లక్షన్నర వరకు అందాల్సి ఉంది. దాదాపు 1500 రిటైర్డ్ ఉద్యోగుల కుటుంబాలు ఈ నిధుల కోసం ఎదురుచూస్తున్నాయి.‘చివరి నెల వేతనం’ హుళక్కే..ఉద్యోగి పదవీవిరమణ పొందేప్పుడు చివరి నెల వేతనాన్ని తాత్కాలికంగా నిలిపేస్తారు. ఆ ఉద్యోగి సంస్థకు ఏవైనా బకాయిలు చెల్లించాల్సి ఉంటే, లెక్కలు చూసి చివరి నెల వేతనం నుంచి మినహాయించి మిగతా మొత్తాన్ని అందిస్తారు. రిటైర్ అయిన నెల రోజుల్లో ఆ మొత్తం విడుదల అవుతుంది. కానీ, జనవరి నుంచి ‘చివరి నెల వేతనం’ ఆపేశారు.ఆర్జిత సెలవు మొత్తం ఏమైంది? ఉద్యోగ కాలంలో పోగైన 300 ఆర్జిత సెలవు (ఈఎల్స్)ల ఎన్‌క్యాష్‌మెంట్ ఉంటుంది. ఆ సెలవులకు సంబంధించి నగదు చెల్లిస్తారు. ఆర్టీసీలో పదవీవిరమణ వయసు 60 ఏళ్లకు పెంచిన తర్వాత, తిరిగి రిటైర్మెంట్లు మొదలైన 2022 డిసెంబరు నుంచి ఆర్జిత సెలవుల మొత్తం చెల్లించటం ఆగిపోయింది. ఈ మొత్తం కనిష్టంగా రూ.5 లక్షల వరకు ఉంటుంది.కరువు భత్యం బకాయిలకూ దిక్కులేదు ఆర్టీసీ ఉద్యోగు లకు గతంలో నాలుగున్నరేళ్ల పాటు కరువు భత్యం సవరించలేదు. అవన్నీ పేరుకుపోయాయి. విడతవారీగా ఆ తర్వాత 9 డీఏలను సవరించి వేతనంలో చేర్చారు. కానీ, ఆ డీఏలను వర్తింప చేయాల్సినకాలం నుంచి వర్తింపచేసినకాలం మధ్య రిటైర్ అయినవారికి కూడా ఆ లబ్ధి అందాల్సి ఉంది. కానీ రిటైర్డ్ ఉద్యోగులకు వాటిని చెల్లించలేదు. ఈ మధ్యకాలంలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబసభ్యులకు కూడా వాటిని చెల్లించాల్సి ఉన్నా చెల్లించలేదు.వేతన సవరణ బకాయిలేమయ్యాయి? 2017లో జరగా ల్సిన వేతన సవర ణను గత మే నెల నుంచి అమలులోకి తెచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం 21% ఫిట్మెంట్తో దాన్ని అమలులోకి తెచ్చిన విషయం తెలిసిందే. కానీ వాటి బకాయిలను రిటైర్మెంట్ సమయంలోనే చెల్లించనున్నట్టు అప్పట్లో ఆర్టీసీ వెల్లడించింది. మరి, ఈ ఫిట్మెంట్ అమలులోకి తెచ్చేలోపు రిటైర్ అయినవారి విషయంలో మాత్రం చెల్లింపు ఊసే లేకుండాపోయింది. దానిపై కనీసం స్పష్టత కూడా ఇవ్వటం లేదు.మమ్మల్ని విడిచి వెళ్లొద్దు సార్..కన్నీటి పర్యంతమైన విద్యార్థులుకుల్కచర్ల: విద్యాబుద్ధులు నేర్పడంతో పాటు పాఠశాల అభ్యున్నతికి కృషి చేసిన తమ హెచ్ఎం బదిలీపై వెళ్లడాన్ని విద్యార్థులు తట్టుకోలేకపోయారు. ‘మమ్మల్ని వదిలి.. మీరు వెళ్లొద్దు సార్’ అంటూ కంటతడి పెట్టుకున్నారు. గురువుగా పాఠాలు చెప్పడంతో పాటు తండ్రిలా బంధాన్ని పెనవేసుకున్న తమ సార్ మరో స్కూల్‌కు వెళ్తున్నారని తెలిసి ఆవేదనకు గురయ్యారు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని చౌడాపూర్ ఉన్నత పాఠశాల హెచ్ఎంగా పనిచేస్తున్న తిమ్యా, ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న భాస్కర్ స్కూల్ అసిస్టెంట్ల బదిలీల్లో భాగంగా మరో చోటకు ట్రాన్స్ఫర్ అయ్యారు. మంగళవారం విధుల నుంచి రిలీవ్ అయి వెళ్తుండగా.. విద్యార్థులు వెక్కివెక్కి ఏడ్చారు. వారిని ఊరడించిన మాస్టారు.. ‘బాగా చదువుకోండి. మిమ్మల్ని చూసేందుకు అప్పుడప్పుడు వచ్చి వెళ్తాం’ అని చెప్పి బరువెక్కిన హృదయంతో బైబై చెప్పుకుంటూ వెళ్లిపోయారు. -
రోడ్డు ప్రమాదం ఎలా జరిగింది?
ఆర్టీసీ బస్సు ఢీకొని చనిపోయిన సందర్భాల్లో పోలీసులు కేసు దర్యాప్తు చేయటం సహజం. వారి దర్యాప్తు నివేదిక ఆధారంగానే కోర్టులు తీర్పులు చెబుతాయి . అయితే ఆ ప్రమాదానికి గల కారణాలపై స్వయంగా ఆర్టీసీ కూడా ఆధారాలు సేకరించి కోర్టులకు సమర్పించాలని నిర్ణయించింది. ప్రమాదానికి కారణాలేంటి, అందులో ఆర్టీసీ డ్రైవర్ తప్పు లేనప్పుడు.. ప్రమాదానికి ఎదుటివారు ఎలా కారణమయ్యారు? రెండు వైపులా తప్పు ఉంటే.. ప్రమాద తీవ్రతలో ఆర్టీసీ డ్రైవర్ తప్పిదం ఎంత.. తదితర వివరాలను శాస్త్రీయంగా సేకరించబోతోంది. దీనికోసం పుణె కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ ఆర్టీసీ ఉద్యోగులకు శిక్షణ ప్రారంభించింది.కొన్ని నెలల క్రితం నగరంలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆర్టీసీ బస్సు ఢీకొని చనిపోయాడు. అమెరికాలో ఉద్యోగం చేస్తున్నందున అతని సంపాదన పెద్దదే. దీంతో అతని కుటుంబానికి ఆర్టీసీ రూ.కోటిన్నర వరకు పరిహారం చెల్లించాల్సి వచ్చింది. సంపాదనతో ప్రమేయం లేకున్నా, ఓ మనిషి చనిపోతే కనిష్టంగా రూ.20 లక్షల వరకు పరిహారం చెల్లించాల్సిన పరిస్థితి ఉంది.సాక్షి, హైదరాబాద్: రోడ్లు నెత్తురోడుతున్నాయి. పెరిగిన ట్రాఫిక్, అధునాతన వాహనాల వినియోగం, రోడ్డుభద్రత నియమాల ఉల్లంఘన.. వెరసి ప్రమాదాలకు కారణమవుతోంది. ఈ ప్రమాదాల్లో ఆర్టీసీ బస్సుల వాటా కూడా ఉంటోంది. తెలంగాణ ఆర్టీసీ బస్సులు ఢీకొని సంవత్సరానికి సగటున 250 మంది నుంచి 300 మంది వరకు చనిపోతున్నారు. ప్రమాదం జరగ్గానే బస్సు డ్రైవర్‌దే తప్పు అన్న భావన సగటు వ్యక్తిలో కలుగుతుంది. పోలీసు విభాగంలో కూడా ఇదే తరహా ముందస్తు భావన కలుగుతోంది. దీన్నే ‘బిగ్ వెహికిల్ సిండ్రోమ్’గా పరిగణిస్తారు. ద్విచక్రవాహనదారు తప్పిదం వల్లనే ప్రమాదం చోటు చేసుకున్నా.. ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై కేసు నమోదవుతోంది. సరైన ఆధారాలు లేని సందర్భాల్లో ఆర్టీసీ డ్రైవర్‌కు శిక్ష పడటంతోపాటు, చనిపోయిన వ్యక్తి కుటుంబానికి సంస్థ భారీగా పరిహారం చెల్లించాల్సి వస్తోంది. ఏడాదికి రూ.100 కోట్లు పరిహారంనాలుగేళ్ల క్రితం నాటి ప్రమాదాల తాలూకు పరిహారాలు ఇప్పుడు (కోర్టు కేసులు ముగిసిన తర్వాత) చెల్లిస్తున్నారు. ప్రస్తుతం ఆ మొత్తం సగటున ఏడాదికి రూ.100 కోట్ల వరకు ఉంటోంది.. ప్రస్తుతం జరుగుతున్న ప్రమాదాల్లో మృతి చెందిన వారికి పరిహారం చెల్లించేనాటికి ఆ మొత్తాం రూ.150 కోట్ల వరకు చేరుకుంటుందని అంచనా. అసలే నష్టాల్లో కుదేలవుతున్న ఆర్టీసీకి ఇది పెద్ద భారంగా మారబోతోంది. దానిని భారీగా తగ్గించుకోవాలని సంస్థ భావిస్తోంది.డ్రైవర్లకు శిక్షణ ఇస్తున్నా... రోడ్డు ప్రమాదాలను నిరోధించేందుకు డ్రైవర్లకు ఆర్టీసీ ప్రత్యేకంగా శిక్షణ ఇస్తోంది. ఎప్పటికప్పుడు వారిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది, డిపో స్థాయిలో గేట్ మీటింగ్స్ ద్వారా డ్రైవర్లు నిరంతరం అప్రమత్తంగా ఉండేందుకు అవగాహన కల్పిస్తోంది. అయినా.. ప్రమాదాలు తప్పటం లేదు. ప్రమాదాలకు ఆధారాలు సేకరించడంపైనే..హైదరాబాద్‌లోని అన్ని ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు ఉన్నందున.. ప్రమాదానికి కారణాలేంటో స్పష్టంగా తెలుస్తుంది. ఆర్టీసీ బస్సు డ్రైవర్ తప్పులేనప్పుడు సీసీటీవీ ఫుటేజీని కోర్టుల్లో ప్రవేశపెట్టి పరిహారం నుంచి బయటపడొచ్చు. కానీ సీసీటీవీ కెమెరాలు లేని ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో, బస్సు డ్రైవర్ తప్పు లేకున్నా, పెద్ద వాహనం అన్న భావనతో కారణం బస్సు డ్రైవర్ మీదకే వస్తోందని ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. ఇలాంటి సందర్భాల్లో ఎదుటి వాహనదారులు/పాదచారుల తప్పిదంతో ప్రమాదం జరిగి వారు చనిపోతున్నా ఆర్టీసీ డ్రైవర్‌కు శిక్ష పడుతోంది, ఆర్టీసీ పరిహారం చెల్లించాల్సి వస్తోంది. ఇలాంటి సందర్భాల్లో ప్రమాదానికి కారణాల ఆధారాలను శాస్త్రీయంగా సేకరించాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ విషయంలో మంచి అనుభవం ఉన్న జేపీ రీసెర్చ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో ఆర్టీసీ అవగాహన కుదుర్చుకుంది. కోయంబత్తూరు, పూణె కేంద్రాలుగా ఈ సంస్థ నడుస్తోంది. పుణె కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ నిపుణులు తాజాగా ఆర్టీసీ అధికారులకు ఈ విషయంలో శిక్షణ మొదలుపెట్టారు. సీసీటీవీ కెమెరాలు లాంటివి లేని ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు.. ప్రమాదానికి కారణాలను శాస్త్రీయపద్ధతిలో ఎలా గుర్తించాలి అన్న విషయంలో నిపుణులు శిక్షణ కార్యక్రమాల ద్వారా వెల్లడిస్తున్నారు. దాదాపు 500 అంశాల ఆధారంగా ప్రమాదానికి కారణాలను కచ్చితంగా గుర్తించే వీలుంటుందని, ఆయా అంశాలు ఐదు భాగాలుగా పరిగణించాల్సి ఉంటుందని పేర్కొంటూ వాటిల్లో ముఖ్యమైన అంశాల వారీగా అధికారులకు శిక్షణ ఇస్తున్నారు. డిపో మేనేజర్లు, ట్రాఫిక్ సీఐలను మూడు జట్లుగా విభజించి శిక్షణ ఇస్తున్నారు. ఇందులో తొలిదఫా శిక్షణ మూడు రోజులు కొనసాగింది. శిక్షణలో పాల్గొన్న అధికారులు వారివారి డిపోల్లోని ఇతర సిబ్బంది వాటిపై అవగాహన కల్పించనున్నారు. -
బస్టాండ్‌లో మహిళ ప్రసవం
కరీంనగర్ టౌన్: భర్తతో కలిసి స్వస్థలానికి వెళ్లేందుకు బస్సు కోసం ఎదురుచూస్తున్న ఓ నిండు గర్భిణి కరీంనగర్ బస్టాండులో ఆదివారం సాయంత్రం పండంటి ఆడబిడ్డను ప్రసవించింది. ఆర్టీసీ, 108 సిబ్బంది ఆ మహిళకు పురుడుపోశారు. ఒడిశాకు చెందిన కుమారి– దూల దంపతులు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలోని ఇటుక బట్టీలో కొద్దిరోజులుగా కూలీలుగా పనిచేస్తున్నారు.నిండు గర్భిణి అయిన కుమారిని తీసుకుని ఆమె భర్త దూల ఆదివారం కుంట–భద్రాచలం మీదుగా స్వస్థలానికి వెళ్లేందుకు కరీంనగర్ బస్‌స్టేషన్ చేరుకున్నారు. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో కుమారికి పురిటినొప్పులు వచ్చాయి. కాసేపటికి ఎక్కువ కావడంతో ఆమె భర్త అక్కడే ఉన్న ఆర్టీసీసిబ్బంది సాయం కోరాడు. వారు వెంటనే 108 సిబ్బందికి ఫోన్ చేశారు. ఇంతలో అక్కడే ఉన్న ఆర్టీసీ మహిళా సిబ్బంది పరిస్థితిని గమనించి ప్లాట్‌ఫాం ఎదురుగా ఉన్న చెట్టు కిందకు కుమారిని తీసుకెళ్లారు. చుట్టూ చీరలు అడ్డుగా పెట్టి డెలివరీ చేశారు. అదే సమయంలో 108 సిబ్బంది అక్కడికి చేరుకొని సాయం అందించారు. పండంటి ఆడబిడ్డ జని్మంచగా.. 108 వాహనంలో తల్లీబిడ్డను జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. పురుడుపోసిన ఆర్టీసీ స్వీపర్లు సైదమ్మ, స్రవంతి, లావణ్య, భవానీ, రేణుకను అధికారులు, ప్రయాణికులు అభినందించారు. కాగా తన భార్యకు డెలివరీ సమయం వచ్చే వరకు ఇటుక బట్టీ యాజమాని కూలీ డబ్బులు ఇవ్వలేదని, రేపుమాపు అంటూ దాటవేయడం వల్లే ఈ పరిస్థితి వచి్చందని కుమారి భర్త దూల ఆవేదన వ్యక్తం చేశారు. -
ఆర్టీసీ టికెట్ ధరల్లో స్వల్ప పెరుగుదల
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ టికెట్ చార్జీల్లో టోల్ గేట్ రుసుములు (యూజర్ చార్జీలు) పెరిగాయి. టోల్ ప్లాజాలు ఉన్న మార్గాల్లో ప్రయాణించే ఆర్టీసీ బస్సుల టికెట్ ధరలు రూ.3 చొప్పున పెరిగాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం టోల్ రుసుములను సవరించిన విషయం తెలిసిందే. జాతీయ రహదారులపై అన్ని టోల్గేట్లలో ఈ రుసుములు స్వల్పంగా పెరిగాయి. ఆర్టీసీ బస్సులు కూడా టోల్రుసుములు చెల్లించాల్సి ఉంటున్నందున, టికెట్ ధరల్లో ఆ రుసుము కూడా జత చేస్తున్నారు. ఇప్పుడు టోల్ గేట్ చార్జీలు పెరగడంతో ఆర్టీసీ కూడా ఆ భారాన్ని ప్రయాణికులపైనే మోపింది. టికెట్ చార్జీల్లో కలిసి ఉన్న టోల్ రుసుములను రూ.3 చొప్పున పెంచింది. ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో రూ.10గా ఉన్న టోల్‌రుసుమును రూ.13కు, డీలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ, వజ్ర బస్సుల్లో ఉన్న రూ.13ను రూ.16కు, గరుడ ప్లస్ బస్సుల్లో రూ.14 నుంచి రూ.17కు, నాన్ ఏసీ స్లీపర్, హైబ్రీడ్ స్లీపర్ బస్సుల్లో రూ.15 నుంచి రూ.18కి, ఏసీ స్లీపర్ బస్సుల్లో రూ.20 నుంచి రూ.23కు పెంచారు. -
ఒక్క రోజే 65 లక్షల మంది ప్రయాణం 24 కోట్ల రూపాయల ఆదాయం
సాక్షి, హైదరాబాద్ : ఒకే రోజు బస్సుల్లో 65 లక్షల మందిని గమ్యం చేర్చి ఆర్టీసీ మరో రికార్డు సృష్టించింది. సోమవారం రోజున ఈ ఘనత చోటు చేసుకుంది. సాధారణ రోజులతో పోలిస్తే సోమవారాల్లో ఎక్కువ మంది ప్రయాణిస్తుంటారు. ఈ పదో తేదీ సోమవారం రోజున ఆ రద్దీ మరింత ఎక్కువగా నమోదైంది. ఆర్టీసీ చరిత్రలో ఎప్పుడూ రికార్డు కాని రీతిలో ఏకంగా 109.8 శాతం ఆక్యుపెన్సీ రేషియో నమోదైంది. బస్సులన్నీ కిక్కిరిసి ప్రయాణించటంతో ఆర్టీ సీకి 24 గంటల్లో ఏకంగా రూ.24.06 కోట్ల ఆదాయం సమకూరింది. ఇందులో జీరో టికెట్ల వాటా కూడా ఉంది. ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలు కొనుగోలు చేసిన జీరో టికెట్ల మొత్తాన్ని ప్రభుత్వం ఆర్టీ సీకి రీయింబర్స్ చేయాల్సి ఉంది. వాటితో కలుపుకొని ఈ రికార్డు స్థాయి ఆదాయాన్ని ఒకే రోజు ఆర్టీసీ పొందినట్టయింది. ప్రభుత్వం రీయింబర్స్ చేస్తేనే..ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రారంభించిన తర్వాత బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగిన విషయం తెలిసిందే. సోమవారాల్లో ఆ రద్దీ మరీ ఎక్కువగా ఉంటోంది. దీంతో గత కొన్ని నెలలుగా సోమవారాల్లో ఆర్టీసీ అధిక ఆదాయాన్ని సాధిస్తోంది. జీరో టికెట్ల రూపంలో రికార్డుస్థాయిలో ఆదాయం నమోదవుతున్నా, ఆర్టీ సీకి మాత్రం అదే రోజు ఆ ఆదాయం రావడం లేదు. ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా, ప్రతినెలా ఆ మొత్తాన్ని ఆర్టీసీకి చెల్లిస్తేనే దాన్ని ఆదాయంగా పరిగణించాల్సి వస్తుంది. కానీ, పాత బకాయిలతోపాటు, ఈ ఆదాయం మొత్తంగా ఇప్పటి వరకు ఆర్టీ సీకి అందలేదని తెలుస్తోంది. గతేడాది బడ్జెట్‌కు సంబంధించిన బకాయిలతో కలుపుకుంటే ఆర్టీ సీకి ప్రభుత్వం రూ.2200 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంది. కానీ, ఇప్పటి వరకు అంతమొత్తం విడుదల కాలేదు. ఇక 2015 వేతన సవరణకు సంబంధించి బాండ్ల డబ్బులు కూడా పూర్తిస్థాయిలో అందలేదు. ఆ మొత్తానికి సంబంధించిన నిధులు ఆర్టీ సీకి విడుదల చేస్తున్నట్టు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించినా, కేవలం డ్రైవర్లకు మాత్రమే ఆ నిధులందాయి. మిగతావారు ఎదురుచూస్తున్నారు. దీనికి కూడా నిధులు లేకపోవటమే కారణంగా కనిపిస్తోంది. ఇప్పుడు కాగితాలపై రికార్డు స్థాయి ఆదాయం నమోదైనా.. ప్రభుత్వం రీయింబర్స్ చేసినప్పుడే అది నిజం ఆదాయంగా ఆర్టీసీ పరిగణించాల్సి ఉంటుంది. -
ఆర్టీసీలో కన్సాలిడేటెడ్ రెమ్యునరేషన్ పెంపు
సాక్షి, హైదరాబాద్: కారుణ్య నియామకాల కింద పనిచేసే ఉద్యోగులు, పదవీ విరమణ అనంతరం సర్వీసులో కొనసాగే వారి వేతనాల(కన్సాలిడేటెడ్ రెమ్యునరేషన్)ను ఆర్టీసీ పెంచింది. ఇటీవల ఆర్టీసీ ఉద్యోగుల వేతనాలను సవరించిన విషయం తెలిసిందే. 2017 వేతన సవరణకు సంబంధించి ప్రభుత్వం 21 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటించి అమలులోకి తెచ్చింది. దీంతో వారి వేతనాలు భారీగా పెరిగాయి. ఈ క్రమంలో కన్సాలిడేటెడ్ చెల్లింపులనూ సవరిస్తూ ఆర్టీసీ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. బ్రెడ్ విన్నర్ స్కీం పేరుతో ఆర్టీసీలో కారుణ్య నియామకాలు కొనసాగుతాయి. సర్వీసులో ఉండి చనిపోయే ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తారు. వారి అర్హతల ఆధారంగా ఈ కేటాయింపులుంటాయి. అయితే, ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి దిగజారిన నేపథ్యంలో, గత ప్రభుత్వం కారుణ్య నియామకాలను సరిగా చేపట్టలేదు. దీంతో దాదాపు 1800 కుటుంబాలు ఎదురుచూస్తూ వచ్చాయి. ఆయా కుటుంబాల ఒత్తిడి పెరగటంతో దశలవారీగా వారికి ఉద్యోగాలివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, పూర్తిస్థాయి ఉద్యోగం కాకుండా, తాత్కాలిక పద్ధతిలో ఇవ్వనుంది. మూడేళ్లపాటు వారి పనితీరు పరిశీలించి తదనుగుణంగా పర్మినెంట్ చేసే విషయంపై నిర్ణయం తీసుకునేలా అమల్లోకి తెచ్చింది. అప్పటివరకు కన్సాలిడేటెడ్ రెమ్యునరేషన్ చెల్లించనుంది. డ్రైవర్ గ్రేడ్–2, కండక్టర్ గ్రేడ్–2, ఆర్టీసీ కానిస్టేబుల్, శ్రామిక్ పోస్టుల్లో నియామకాలు ప్రారంభించింది. ఇప్పుడు ఆయా పోస్టుల్లో పనిచేస్తున్న వారి రెమ్యునరేషన్‌ను పెంచింది. అలాగే, ఆర్టీసీలో వివిధ పోస్టుల్లో పనిచేసి పదవీ విరమణ చేసినవారు తిరిగి వారి సేవలు కొనసాగించే పద్ధతి కూడా అమలులో ఉంది. ఆయా స్థాయిల్లో ఖాళీగా ఉండే పోస్టుల ఆధారంగా వారి సర్వీసులను ఆర్టీసీ కొనసాగిస్తుంది. వారికి కూడా ఆయా పోస్టుల ఆధారంగా కన్సాలిడేటెడ్ రెమ్యునరేషన్ చెల్లిస్తారు. ఇప్పుడు వాటిని కూడా పెంచింది. -
ప్రాణాలు కాపాడిన కండక్టర్
-
TGSRTC ఫేక్ ప్రచారంపై సజ్జనార్ క్లారిటీ
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ పేరును టీజీఎస్సార్టీసీగా మార్చేసింది ప్రభుత్వం. అధికారికంగా బుధవారమే దీనిపై ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడినట్లు సాక్షి సహా పలు మీడియా చానెల్స్ సైతం కథనాలిచ్చాయి. అయితే TGSRTCపై సోషల్ మీడియాలో జరుగుతున్న ఓ ప్రచారాన్ని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ ఖండించారు. TGSRTC కొత్త లోగో ఇదే నంటూ ఇంటర్నెట్లో ఒకటి వైరల్ అవుతోంది. అయితే ఆ ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని సజ్జనార్ స్పష్టత ఇచ్చారు. ‘‘అధికారికంగా ఇప్పటివరకు కొత్త లోగోను సంస్థ విడుదల చేయలేదు. టీజీఎస్ఆర్టీసీ కొత్త లోగో అంటూ సోషల్ మీడియాలో ప్రచారంచేస్తోన్న లోగో ఫేక్. .. ఆ లోగోతో సంస్థకు ఎలాంటి సంబంధం లేదు. కొత్త లోగోను సంస్థ రూపొందిస్తోంది. కొత్త లోగోను టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఇంకా ఫైనల్ చేయలేదు అని సజ్జనార్ ఎక్స్ ద్వారా తెలియజేశారు. #TGSRTC కొత్త లోగో విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు. అధికారికంగా ఇప్పటివరకు కొత్త లోగోను సంస్థ విడుదల చేయలేదు. టీజీఎస్ఆర్టీసీ కొత్త లోగో అంటూ సోషల్ మీడియాలో ప్రచారంచేస్తోన్న లోగో ఫేక్. ఆ లోగోతో సంస్థకు ఎలాంటి సంబంధం లేదు. కొత్త లోగోను సంస్థ… pic.twitter.com/n2L0rezuoo— VC Sajjanar - MD TGSRTC (@tgsrtcmdoffice) May 23, 2024 అత్యుత్సాహంతో కొన్ని వెబ్సైట్లు అలా లోగోను డిజైన్ చేసి కథనాలిచ్చాయి. దీంతో అదే నిజమైన లోగో అంటూ వైరల్ అయ్యింది. టీజీఎస్సార్టీసీ తాజా ప్రకనటతో కొత్త లొగోను త్వరలోనే అధికారికంగా ప్రకటించే ఛాన్స్ కనిపిస్తోంది. -
తెలంగాణ ‘ఆర్టీసీ విలీనం’ అంతేనా?
సాక్షి, హైదరాబాద్: ‘ఆర్టీసీ ఉద్యోగుల విలీన’ప్రక్రియ ఊసే లేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఐదున్నర నెలలు దాటినా, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై కిమ్మనటం లేదు. ఇప్పటికిప్పుడు సంస్థ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తే, వారి జీతాలు పెంచాలి. దీంతో ప్రభుత్వ ఖజానాపై భారం పడుతుంది. 2015 నాటి వేతన సవరణ బకాయిలను చెల్లించేందుకే ప్రభుత్వం కిందామీదా పడుతోంది. ఈ తరుణంలో ఆర్టీసీ ఉద్యోగుల జీతాల భారాన్ని తలపైకెత్తుకోవటం ఎందుకన్న ఉద్దేశంతో దాన్ని పక్కనపెట్టిందన్న అనుమానాలున్నాయి. ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు ఎన్ని పర్యాయాలు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా నోరు మెదపటం లేదు. 2019లోనే విలీనంపై చర్చ ⇒ ఆర్టీసీలో 2019లో సుదీర్ఘ సమ్మె జరిగిన సమయంలో ఉద్యోగుల విలీనంపై కొంత చర్చ జరిగింది. అప్పట్లో కాంగ్రెస్ నేతలు కూడా నాటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ తర్వాత అది చల్లారిపోయింది. ⇒గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనూహ్యంగా 2023 ఆగస్టులో విలీనం అంశాన్ని ఉన్నట్టుండి తెరపైకి తెచి్చంది. ⇒అదే నెలలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో దానిపై సానుకూలత వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు కూడా ప్రవేశపెట్టారు. ⇒సెపె్టంబర్ మొదటివారంలో బిల్లుపై గవర్నర్ ఆమోదముద్ర వేయటంతో ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారినట్టు అయ్యింది. ⇒విధివిధానాలకు ఓ కమిటీ ఏర్పాటు చేసి వదిలేసింది. ⇒ అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమలులోకి రావటంతో ఆ ప్రక్రియ అక్కడితో ఆగిపోయింది. ఎన్నికల హామీలో ఉంది.. నిలబెట్టుకోవాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున వెంటనే, ఆ హామీని నెరవేర్చాలి. విలీనం కోసం ఉద్యోగులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. తక్కువ జీతాలతో పనిచేస్తున్నామన్న ఆవేదన నుంచి ఉపశమనం పొందే ఆ ప్రక్రియను వెంటనే చేపట్టి వారికి న్యాయం చేయాలి. –అశ్వత్థామరెడ్డి, ఆర్టీసీ కార్మిక సంఘం నేత కొత్త కమిటీ వేసి నివేదిక తెప్పించాలి విలీన ప్రక్రియ 90 శాతం పూర్తయింది. విధివిధానాలకు గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ వద్దనుకుంటే ఈ ప్రభుత్వం కొత్త కమిటీ వేసి వీలైనంత తొందరలో నివేదిక తెప్పించుకొని దాన్ని అమలు చేయాలి. ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు కూడా పెరిగేందుకు ప్రభుత్వం సహకరించినట్టవుతుంది. – మర్రి నరేందర్ఉద్యోగుల్లో తీవ్ర నైరాశ్యంఆర్టీసీ ఉద్యోగులకు ప్రత్యేక వేతన సవరణ ఉన్నందున వీరికి పీఆర్సీ వర్తించదు. విలీనమయితేనే పీఆర్సీ పరిధిలోకి వస్తారు. జీతాలు కూడా కాస్త అటూఇటుగా ప్రభుత్వ ఉద్యోగుల దరికి చేరుతాయి,. అయితే విలీన ప్రక్రియ కాలయాపన జరిగే కొద్దీ, పదవీ విరమణ పొందే ఆర్టీసీ ఉద్యోగులు ఆ లబి్ధకి దూరమవుతున్నారు. ఇప్పటికే 1,800 మంది పదవీ విరమణ పొందారు. ప్రభుత్వ ఉద్యోగిగా పదవీ విరమణ పొందితే ప్రత్యేక ఆర్థిక ప్రయోజనాలుంటాయి. దీంతో ఆర్టీసీ ఉద్యోగుల్లో రోజురోజుకూ ఆందోళన పెరుగుతోంది. -
మెట్రోను ముంచేసిన ‘మహాలక్ష్మి’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం ప్రతిష్టా త్మకంగా ప్రవేశపెట్టిన ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం మహాలక్ష్మి పథకం వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని ఎల్ అండ్ టీ అధ్యక్షుడు, శాశ్వత డైరెక్టర్ ఆర్.శంకర్ రామన్ తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ లో రోజూ సుమారు 4.80 లక్షల మంది మెట్రో ప్రయాణికులు ఉన్న ట్లు పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టిన తరువాత మహి ళా ప్రయాణికులు బాగా తగ్గారని వివరించారు. ప్రయాణికులు పెర గకపోవడం వల్ల వరుసగా నష్టాలను ఎదుర్కొంటున్నట్లు ఆయన ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. నష్టాల వల్ల 2026 నాటికి హైదరాబాద్ మెట్రో నుంచి వైదొలగాలని భావి స్తున్నట్లు ఆయన వెల్లడించారు.పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైల్ మొదటి దశ ప్రాజెక్ట్ ను నిర్మించడం తెలిసిందే. ఈ మేరకు ఆ సంస్థకు 64 ఏళ్ల పాటు మె ట్రోలో భాగస్వామ్యం ఉంటుంది. అయినప్పటికీ మహాలక్ష్మి పథకం వల్ల వస్తున్న నష్టాలను అధిగమించేందుకు మెట్రో నుంచి తప్పుకో వాలని భావించడం తాజాగా చర్చనీయాంశంగా మారింది. -
ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణలో ఆర్టీసీకి సహకరిస్తాం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణకుగాను యూకే తరపున ఆర్థికంగా, సాంకేతికంగా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్టు బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ ప్రకటించారు. గురువారం ఆయన బస్‌భవన్‌లో ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఇతర అధికారులతో భేటీ అయ్యారు. గతేడాది గోవాలో జరిగిన జీ–20 దేశాల మంత్రుల సమావేశం సందర్భంగా భారత్‌లో పర్యావరణహిత బస్సుల నిర్వహణకు సహకరించేందుకు యూకే, యూఎస్‌లు ముందుకొచ్చి భారత్‌తో ఒప్పందం చేసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. జీరో ఎమిషన్ వెహికిల్ పైలట్ ప్రాజెక్టు నిర్వహణలో భాగంగా ఆర్టీసీ అధికారులతో చర్చించేందుకు బస్‌భవన్‌కు వచ్చినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ అభినందనీయమని, వాటి సంఖ్య మరింత పెరగాల్సి ఉందని, ఈ విషయంలో ఆర్థిక, సాంకేతిక తోడ్పాడుకు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు.ఎలక్ట్రిక్ బస్సులను నిర్వహిస్తున్న తీరును ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో బ్రిటిష్ హైకమిషనర్ సీనియర్ అడ్వయిజర్ జావైద్ మల్లా, తెలంగాణ ప్రభుత్వ ఆటోమోటివ్ అండ్ ఈవీ సెక్టార్ డైరెక్టర్ గోపాలకష్ణ, టీఎస్ఆర్టీసీ సీఓఓ డాక్టర్ రవీందర్, జాయింట్ డైరెక్టర్ అపూర్వరావు, డబ్ల్యూఆర్ఐ ఇండియా ప్రతినిధి చైతన్య కనూరి, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన అనన్య బెనర్జీ తదితరులు పాల్గొన్నారు. -
‘పోలీస్ బోర్డు’ ద్వారా ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ల ఎంపిక
సాక్షి, హైదరాబాద్: ‘పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు’ ద్వారా ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లను ఎంపిక చేయనున్నారు. ఆర్టీసీలో మూడు వేల ఖాళీల భర్తీకి ఇటీవల ఆ సంస్థ ప్రతిపాదించింది. ఆర్థికశాఖ వద్ద ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న ఆ ప్రతిపాదన ఎన్నికల కోడ్ ముగిశాక సీఎం పరిశీలనకు వెళుతుంది. దానికి ఆయన ఆమోదముద్ర వేయగానే ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుంది. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కు ఆర్టీసీ ఉద్యోగుల ఎంపిక బాధ్యత అప్పగించటంపై ఆయన ఎలాంటి అభ్యంతర్థిరం వ్యక్తం చేయకపోతే ఈ నియామకాలు చకచకా జరుగుతాయి. టీఎస్పీఎస్సీ అనాసక్తితో.. దశాబ్దాలుగా అంతర్గత ఉద్యోగాల నియామకా లను సొంతంగా ఆర్టీసీనే చూస్తూ వచ్చింది. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ఓ దశలో దీనిని ప్రశ్నించింది. ప్రభుత్వ సంస్థల్లో అన్ని రకాల నియామకాలను టీఎస్పీఎస్సీ పర్యవేక్షిస్తుండగా, ఆర్టీసీలో ఆ సంస్థ చేపట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీలో అప్పటి వరకు నియామకాలు లేకపోవటం, తొలిసారి ఖాళీల భర్తీకి శ్రీకారం చుట్టాలని నిర్ణయించిన తరుణంలో ఈ ప్రశ్న ఉత్పన్నమైంది. దీంతో ఆర్టీసీ ఉద్యోగాల ఎంపిక కూడా టీఎస్పీఎస్సీనే చూడాలని ఆదేశించింది. తొలుత ఆర్టీసీ ఫైనాన్స్, పర్సనల్ విభాగాల్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల నియామక ప్రక్రియ చేపట్టింది. కానీ అప్పట్లో వాటి నియామకాలు జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నియామక ఉత్తర్వులు జారీ అయ్యాయి. డ్రైవర్ల నియామక ప్రక్రియ వరకు వచ్చేసరికి టీఎస్పీఎస్సీ చేతులెత్తేసింది. ఇతర ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో బిజీగా ఉండగా, వీటిని చేపట్టడం సాధ్యం కాదని పేర్కొంది. దీంతో విషయం నాటి ప్రభుత్వ చివరిదశలో మరోసారి ప్రభుత్వ పరిశీలనకు వెళ్లింది. మళ్లీ దీనిపై సమాలోచనలు చేసి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు అప్పగించింది. ఈలోపు ఎన్నికలు రావటం, ప్రభుత్వం మారిపోవటంతో ఆ ప్రక్రియ అలాగే ఆగిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతి కలి్పంచటంతో బస్సుల సంఖ్య భారీగా పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఉద్యోగుల కొరత ఉన్న సమయంలో కొత్త బస్సులు సమకూర్చుకుంటే వాటి నిర్వహణ అసాధ్యంగా మారే పరిస్థితి ఉంది. దీంతో 8 వేల మంది డ్రైవర్లు, కండక్టర్లను నియమించుకోవాలని నిర్ణయించి ప్రభుత్వానికి ఆర్టీసీ ప్రతిపాదించింది. అన్ని నియామకాలు వద్దని ఆర్థికశాఖ మౌఖికంగా సూచించంతో 3 వేల పోస్టుల భర్తీకి మళ్లీ ప్రతిపాదించింది. ఇందులో 2 వేల మంది డ్రైవర్లు ఉండగా శ్రామిక్‌లు, డిపో మేనేజర్లు ఇలా మిగతా విభాగాలకు చెందిన మరో వెయ్యి మంది ఉన్నారు. సీఎం గ్రీన్‌సిగ్నల్ ఇస్తే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు మూడు వేల ఆర్టీసీ ఖాళీల భర్తీ ప్రక్రియ చేపడతారు.డ్రైవర్ల డబుల్ డ్యూటీ రూ.వెయ్యికి పెంపు ప్రస్తుతం ఆర్టీసీలో ‘లక్షే లక్ష్యం’ పేరుతో ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతోంది. 2017 నాటి వేతన సవరణ అమలు చేయనుండటంతో ఆర్టీసీపై రోజువారీగా రూ.కోటి చొప్పున భారం పడుతుంది. ఆ భారాన్ని పూడ్చుకునేందుకు సంస్థ, రోజువారీ ఆదాయాన్ని రూ.కోటి మేర అదనంగా పెంచుకోవాలని నిర్ణయించింది. ఇందుకుగాను ప్రతి డిపో రోజుకు రూ.లక్ష చొప్పున ఆదాయాన్ని పెంచుకునే కసరత్తు ప్రారంభించింది. లక్షే లక్ష్యం పేరుతో దీనిని చేపట్టింది. కానీ, ఈ రూపంలో డ్రైవర్లపై భారం మరింత పెరిగిందంటూ ఇటీవల డిపో మేనేజర్లు ఎండీ దృష్టికి తెచ్చారు. తీవ్ర ఎండలున్న ప్రస్తుత తరుణంలో ఇది ఇబ్బందిగా మారిందని పేర్కొన్నారు. దీంతో మే, జూన్ నెలలకు సంబంధించి డ్రైవర్ల డబుల్ డ్యూటీ మొత్తాన్ని రూ.వెయ్యికి పెంచాలని తాజాగా ఆర్టీసీ నిర్ణయించి ఆదేశాలు జారీ చేసింది. ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందేలా డ్రైవర్ల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. -
‘పోలీస్ బోర్డు’ ద్వారా ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ల ఎంపిక
సాక్షి, హైదరాబాద్: ‘పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు’ ద్వారా ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లను ఎంపిక చేయనున్నారు. ఆర్టీసీలో మూడు వేల ఖాళీల భర్తీకి ఇటీవల ఆ సంస్థ ప్రతిపాదించింది. ఆర్థికశాఖ వద్ద ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న ఆ ప్రతిపాదన ఎన్నికల కోడ్ ముగిశాక సీఎం పరిశీలనకు వెళుతుంది. దానికి ఆయన ఆమోదముద్ర వేయగానే ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుంది. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కు ఆర్టీసీ ఉద్యోగుల ఎంపిక బాధ్యత అప్పగించటంపై ఆయన ఎలాంటి అభ్యంతర్థిరం వ్యక్తం చేయకపోతే ఈ నియామకాలు చకచకా జరుగుతాయి. టీఎస్పీఎస్సీ అనాసక్తితో.. దశాబ్దాలుగా అంతర్గత ఉద్యోగాల నియామకా లను సొంతంగా ఆర్టీసీనే చూస్తూ వచ్చింది. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ఓ దశలో దీనిని ప్రశ్నించింది. ప్రభుత్వ సంస్థల్లో అన్ని రకాల నియామకాలను టీఎస్పీఎస్సీ పర్యవేక్షిస్తుండగా, ఆర్టీసీలో ఆ సంస్థ చేపట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీలో అప్పటి వరకు నియామకాలు లేకపోవటం, తొలిసారి ఖాళీల భర్తీకి శ్రీకారం చుట్టాలని నిర్ణయించిన తరుణంలో ఈ ప్రశ్న ఉత్పన్నమైంది. దీంతో ఆర్టీసీ ఉద్యోగాల ఎంపిక కూడా టీఎస్పీఎస్సీనే చూడాలని ఆదేశించింది. తొలుత ఆర్టీసీ ఫైనాన్స్, పర్సనల్ విభాగాల్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల నియామక ప్రక్రియ చేపట్టింది. కానీ అప్పట్లో వాటి నియామకాలు జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నియామక ఉత్తర్వులు జారీ అయ్యాయి. డ్రైవర్ల నియామక ప్రక్రియ వరకు వచ్చేసరికి టీఎస్పీఎస్సీ చేతులెత్తేసింది. ఇతర ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో బిజీగా ఉండగా, వీటిని చేపట్టడం సాధ్యం కాదని పేర్కొంది. దీంతో విషయం నాటి ప్రభుత్వ చివరిదశలో మరోసారి ప్రభుత్వ పరిశీలనకు వెళ్లింది. మళ్లీ దీనిపై సమాలోచనలు చేసి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు అప్పగించింది. ఈలోపు ఎన్నికలు రావటం, ప్రభుత్వం మారిపోవటంతో ఆ ప్రక్రియ అలాగే ఆగిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతి కలి్పంచటంతో బస్సుల సంఖ్య భారీగా పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఉద్యోగుల కొరత ఉన్న సమయంలో కొత్త బస్సులు సమకూర్చుకుంటే వాటి నిర్వహణ అసాధ్యంగా మారే పరిస్థితి ఉంది. దీంతో 8 వేల మంది డ్రైవర్లు, కండక్టర్లను నియమించుకోవాలని నిర్ణయించి ప్రభుత్వానికి ఆర్టీసీ ప్రతిపాదించింది. అన్ని నియామకాలు వద్దని ఆర్థికశాఖ మౌఖికంగా సూచించంతో 3 వేల పోస్టుల భర్తీకి మళ్లీ ప్రతిపాదించింది. ఇందులో 2 వేల మంది డ్రైవర్లు ఉండగా శ్రామిక్‌లు, డిపో మేనేజర్లు ఇలా మిగతా విభాగాలకు చెందిన మరో వెయ్యి మంది ఉన్నారు. సీఎం గ్రీన్‌సిగ్నల్ ఇస్తే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు మూడు వేల ఆర్టీసీ ఖాళీల భర్తీ ప్రక్రియ చేపడతారు.డ్రైవర్ల డబుల్ డ్యూటీ రూ.వెయ్యికి పెంపు ప్రస్తుతం ఆర్టీసీలో ‘లక్షే లక్ష్యం’ పేరుతో ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతోంది. 2017 నాటి వేతన సవరణ అమలు చేయనుండటంతో ఆర్టీసీపై రోజువారీగా రూ.కోటి చొప్పున భారం పడుతుంది. ఆ భారాన్ని పూడ్చుకునేందుకు సంస్థ, రోజువారీ ఆదాయాన్ని రూ.కోటి మేర అదనంగా పెంచుకోవాలని నిర్ణయించింది. ఇందుకుగాను ప్రతి డిపో రోజుకు రూ.లక్ష చొప్పున ఆదాయాన్ని పెంచుకునే కసరత్తు ప్రారంభించింది. లక్షే లక్ష్యం పేరుతో దీనిని చేపట్టింది. కానీ, ఈ రూపంలో డ్రైవర్లపై భారం మరింత పెరిగిందంటూ ఇటీవల డిపో మేనేజర్లు ఎండీ దృష్టికి తెచ్చారు. తీవ్ర ఎండలున్న ప్రస్తుత తరుణంలో ఇది ఇబ్బందిగా మారిందని పేర్కొన్నారు. దీంతో మే, జూన్ నెలలకు సంబంధించి డ్రైవర్ల డబుల్ డ్యూటీ మొత్తాన్ని రూ.వెయ్యికి పెంచాలని తాజాగా ఆర్టీసీ నిర్ణయించి ఆదేశాలు జారీ చేసింది. ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందేలా డ్రైవర్ల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. -
డబుల్ డెక్కర్ వద్దే వద్దు!
సాక్షి, హైదరాబాద్: ఒకప్పుడు హైదరాబాద్ రోడ్లపై గంభీరంగా విహరించిన ఆర్టీసీ డబుల్ డెక్కర్ బస్సులు మళ్లీ రోడ్డెక్కే పరిస్థితి కనిపించటం లేదు. గతంలో తీవ్ర నష్టాలు రావటంతో వాటిని క్రమంగా వదిలించుకున్న ఆర్టీసీ, ఇక డబుల్ డెక్కర్ బస్సుల ఊసును పూర్తిగా తెరమరుగు చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అశోక్‌లేలాండ్ అనుబంధ సంస్థ స్విచ్ మొబిలిటీతో ఉన్న టెండర్ ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకుంటున్నట్టు తెలిసింది. అప్పట్లో.. కేటీఆర్ కోరిక మేరకు నగరంలో 2004 చివరి వరకు డబుల్ డెక్కర్ బస్సులు నడిచాయి. నిర్వహణలో నష్టాలు పెరుగుతుండటంతో వాటిని ఆర్టీసీ పక్కన పెట్టేసింది. మూడేళ్ల క్రితం నగరవాసి ఒకరు పాత డబుల్ డెక్కర్ ఫొటోను షేర్ చేస్తూ, నగరంలో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు నడిపితే బాగుంటుందని సామాజిక మాధ్యమం ద్వారా కోరారు.దీనికి నాటి మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించి, ఆ బస్సులు నడిపే అవకాశాన్ని పరిశీలించాలని రవాణా శాఖను కోరారు. దీనికి రవాణాశాఖ సై అనటంతో ప్రయోగాత్మకంగా కొన్ని డబుల్ డెక్కర్ బస్సులు కొని నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. చాలా రోడ్లపై ఫ్లైఓవర్లు, ఫుట్ ఓవర్ వంతెనలు ఏర్పడటంతో, వాటిని నడిపేందుకు ఇబ్బంది లేని కొన్ని మార్గాలను ఎంపిక చేసింది. సుచిత్ర మీదుగా సికింద్రాబాద్–మేడ్చల్ మధ్య, బాలానగర్ మీదుగా సికింద్రాబాద్–పటాన్చెరు, అమీర్‌పేట మీదుగా కోటి–పటాన్చెరు, సీబీఎస్–జీడిమెట్ల, దుర్గం చెరువు కేబుల్ వంతెన మీదుగా నడపాలని నిర్ణయించింది. ఇక దేశంలోని పలు నగరాలకు డబుల్ డెక్కర్ బస్సులను సరఫరా చేస్తున్న స్విచ్ మొబిలిటీ సంస్థ టెండర్లు దక్కించుకుంది. ధర విషయంలోనూ ఆర్టీసీతో చర్చలు జరిపి ఖరారు చేసింది. సర్కారు మార్పుతో మారిన సీన్ అంతా.. ఓకే అనుకుని బస్సులు సరఫరా చేసే వేళ రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోయింది. ఫ్లైఓవర్లు, పాదచారుల వంతెనలతో డబుల్ డెక్కర్ బస్సుల నిర్వహణ ఇబ్బందే కాకుండా నష్టాలు రావటం తథ్యమన్న భావనతో ఉన్న ఆర్టీసీ నాటి మంత్రి కేటీఆర్ కోరిక మేరకు అయిష్టంగానే వాటి కొనుగోలుకు ఒప్పుకుంది. ఇప్పుడు ప్రభుత్వం మారిపోవటంతో ఆ ప్రతిపాదనను విరమించుకోవాలని ఆర్టీసీ నిర్ణయించినట్టు తెలిసింది. ఓల్వో లాంటి విదేశీ బ్రాండ్ బస్సుల నిర్వహణనే భారంగా భావిస్తున్న ఆర్టీసీ.. ఏకంగా ఒక్కో బస్సు కొనుగోలుకు రూ.2 కోట్లయ్యే డబుల్ డెక్కర్ బస్సుల జోలికి పోవద్దని నిర్ణయించుకుంది. స్విచ్ మొబిలిటీ సంస్థకు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్టు సమాచారం. దీంతో హైదరాబాద్ కోసం డబుల్ డెక్కర్ బస్సుల తయారీ ప్రయత్నాన్ని విరమించుకుందని తెలుస్తోంది. ఆ బస్సులను ఆర్టీసీకి ఇవ్వొచ్చు కదా.. ప్రస్తుతం నగరంలో హెచ్ఎండీఏ 6 డబు ల్ డెక్కర్ బస్సులు తిప్పుతోంది. వాస్తవానికి పర్యాటకుల పేరుతో అవి రోడ్ల మీద ఖాళీగా తిరుగుతున్నాయి. అంత ఖరీదైన బస్సులను ఇలా వృథాగా తిప్పే బదులు.. వాటిని సాధారణ ప్రయాణికుల సర్విసులుగా వినియోగిస్తే, ప్రయాణికులకు వెసులుబాటుగా ఉంటుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ దిశగా ప్రభు త్వం ఆలోచించి ఆ బస్సులను హెచ్ఎండీఏ నుంచి ఆర్టీసీకి స్వాధీనం చేయాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
ఆర్టీసీలో కొత్తగా సెమీ డీలక్స్ బస్సులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్టీసీ కొత్తగా మరో కేటగిరీ బస్సు సర్వీసులను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. ఎక్స్‌ప్రెస్– డీలక్స్ కేటగిరీల మధ్య.. సెమీ డీలక్స్ పేరుతో వీటిని ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. తద్వారా టికెట్ల ఆదాయం కాస్త పెరుగుతుందని, సిబ్బందికి వేతన సవరణతో పెరిగే భారం పూడుతుందని భావిస్తోంది. ఆర్టీసీ ఆదాయాన్ని పెంచుకునేందుకు ఇటీవల ఆరు బృందాలతో రెండు దఫాలుగా మేధోమథనం నిర్వహించి, సూచనలను స్వీకరించింది. అందులోంచి ముఖ్యమైన, అమలు చేయదగిన వాటిని గుర్తించింది. సెమీ డీలక్స్ సర్వీసు కూడా అందులో ఉన్నట్టు సమాచారం. వేతన సవరణ భారంతో.. ఆర్టీసీ సిబ్బందికి రెండు వేతన సవరణ (పీఆర్సీ)లు బకాయి ఉంది. అందులో ఒకదాన్ని అమలు చేయాలని ఇటీవల ప్రభుత్వం నిర్ణయించింది. 21 శాతం ఫిట్‌మెంట్‌ను కూడా ప్రకటించింది. వచ్చే నెల నుంచే ఇది అమల్లోకి రానుంది. సంస్థపై రోజుకు రూ.కోటి వరకు వేతన భారం అదనంగా పెరగనుంది. దీనితో ఆ మేర ఆదాయాన్ని పెంచుకోవడంపై ఆర్టీసీ దృష్టి సారించింది. ఎక్స్‌ప్రెస్‌ల కంటే కాస్త ఎక్కువగా.. ప్రస్తుతం ఆర్టీసీలో బాగా డిమాండ్ ఉన్న కేటగిరీ.. ఎక్స్‌ప్రెస్ సర్వీసు. మిగతా కేటగిరీ బస్సుల కంటే వీటి సంఖ్య ఎక్కువ. దీనిపై ఉన్న డీలక్స్ సర్వీస్ బస్సుల సంఖ్య చాలా తక్కువ. ఇప్పుడు ఈ రెండు కేటగిరీల మధ్య సెమీ డీలక్స్ పేరుతో కొత్త కేటగిరీ ప్రారంభించాలన్నది ఆలోచన. ఎక్స్‌ప్రెస్ బస్సుల కంటే కొంత ఎక్కువ చార్జీతో టికెట్ ధరలు ఖరారు చేయాలని భావిస్తున్నారు. తక్కువ ఆక్యుపెన్సీ రేషియోతో తిరుగుతున్న బస్సులను గుర్తించి.. వాటిని ఈ కొత్త కేటగిరీకి తగ్గట్టుగా మార్చి నడుపుతారు. దీనితో రోజువారీ టికెట్ ఆదాయం కొంత పెరిగే అవకాశం ఉంటుంది. ఎక్స్‌ప్రెస్ బస్సులతో పోలిస్తే.. మరికొంత దూర ప్రాంతాలకు వీటిని తిప్పుతారని.. సీట్లు కూడా కాస్త మెరుగ్గా పుష్బ్యాక్ తరహాలో ఉంటాయని ఆర్టీసీ వర్గాలు చెప్తున్నాయి. మహాలక్ష్మితో తగ్గిన టికెట్ వసూళ్లు రాష్ట్రంలో పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభించిన తర్వాత ఆర్టీసీకి నేరుగా వసూలయ్యే టికెట్ ఆదాయం భారీగా తగ్గింది. సంస్థకు టికెట్ల ద్వారా రోజుకు రూ.16 కోట్ల వరకు సమకూరే ఆదాయం.. రూ.పదిన్నర కోట్లకు పడిపోయింది. మిగతా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం రీయింబర్స్ చేయాల్సి ఉంది. కానీ ఇంకా ప్రభుత్వం నుంచి ఈ నిధుల విడుదల మొదలుకాలేదు. దీనితో టికెట్ ఆదాయం పెంపుపై ఆర్టీసీ దృష్టి పెట్టింది. -
లాభాలొస్తున్నా.. ఫలితం సున్నా
2023 మార్చి నెలలో ఆర్టీసీకిరూ.528 కోట్ల ఆదాయం సమకూరింది. ఇందులో టికెట్ల రూపంలో వచ్చింది రూ.428 కోట్లు. ఆ నెలలో సంస్థకు అయిన మొత్తంఖర్చు రూ.605 కోట్లు. ఫలితంగా రూ.77 కోట్ల నష్టం నమోదైంది. 2024 మార్చి నెలలో సంస్థ నమోదు చేసుకున్న మొత్తం ఆదాయం 696 కోట్లు. ఇందులో టికెట్ల ద్వారా వచ్చింది రూ. 598 కోట్లు. మొత్తం వ్యయం రూ.552 కోట్లు. దీంతో రూ.144 కోట్ల ఆదాయం నమోదైంది. సాక్షి, హైదరాబాద్: మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణమే అమలవుతున్నా ఆర్టీసీ జీరో టికెట్లు జారీ చేస్తోంది. అలా ప్రతినెలా జారీ అయ్యే మొత్తం జీరో టికెట్ల పూర్తి చార్జీని ప్రభుత్వం రీయింబర్స్ చేయాల్సి ఉంది. దీంతో దాన్ని ఆదాయంగానే భావిస్తోంది. ఫలితంగా నష్టాల ఆర్టీసీ ఒక్కసారిగా లాభాల్లోకి వచ్చింది. నష్టం కనుమరుగై ఒకే నెలలో ఏకంగా రూ.144 కోట్ల లాభాన్ని నమోదు చేసుకున్నట్టు తాజాగా లెక్కలు రూపొందించింది. మరి నిజంగా ఇది ఆర్టీసీ లాభాల ఫలితాలు అనుభవిస్తోందా..? వాస్తవం ఎలా ఉందంటే... మహాలక్ష్మి పథకం రీయింబర్స్మెంట్ పేరుతో ప్రభుత్వం ఆర్టీసీకి ప్రతినెలా ఆ మొత్తాన్ని విడుదల చేయటం లేదు. ఆ రూపంలో నిధులు ఇవ్వటం లేదు. మహిళల ఉచిత ప్రయాణం మొదలైన తర్వాత జారీ అవుతున్న జీరో టికెట్ల మొత్తాన్ని పరిశీలిస్తే, సగటున ప్రతినెలా రూ.350 కోట్ల వరకు అవుతోంది. మార్చి నాటికి ప్రభుత్వం ఆ రూపంలో రూ.1400 కోట్లు విడుదల చేయాలని కోరినట్టు, ఆర్టీసీ ఇటీవల మరో కేసు విషయంలో హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో స్పష్టం చేసింది. కానీ, వరుసగా గత మూడు నెలల్లో ప్రభుత్వం రూ.285 కోట్లు, రూ.285 కోట్లు, రూ.275 కోట్లు చొప్పున విడుదల చేసింది. కానీ వీటిని మహాలక్ష్మి రీయింబర్స్‌మెంట్‌గా ఇవ్వలేదు. గత ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్లో ఆర్టీసీకి కేటాయించిన మొత్తంలో పేరుకుపోయిన బకాయిలుగానే సంస్థ భావిస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తన చివరి బడ్జెట్లో ఆర్టీసీకి రూ.1500 కేటాయిస్తూ ప్రతిపాదించింది. కానీ, ఆ ప్రభుత్వ హయాంలో కేవలం రూ.500 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. గత డిసెంబరు నుంచి కొత్త ప్రభుత్వం రూ.1,000 కోట్లు విడుదల చేసింది. మార్చి నెలతో చెల్లించిన మొత్తంతో ఆ బడ్జెట్ కేటాయింపులు క్లియర్ అయ్యాయి. దీంతో వాటిని బడ్జెట్ చెల్లింపులుగానే సంస్థ భావిస్తోంది. అదే నిజమైతే, మహాలక్ష్మి పథకం రూపంలో సంస్థకు ఇప్పటి వరకు ప్రభుత్వం నిధులు ఇవ్వనట్టుగానే భావించాల్సి ఉంటుంది. ఇలా రీయింబర్స్మెంట్ చెల్లింపులో జాప్యం జరిగితే సంస్థ మళ్లీ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుపోవటం ఖాయంగా కనిపిస్తోంది. లాభాలు ఉత్తిత్తి లెక్కలే.. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే.. లాభాలకు సంబంధించి కాగితాలపై చూపిన ఉత్తుత్తి లెక్కలుగా తేలిపోతోంది. ప్రభుత్వం నుంచి డబ్బులు రాకపోవటంతో, ఆ లాభాల తాలూకు ఫలితాలు ఎక్కడా కనిపించటం లేదు. ఆర్టీసీకి సహకార పరపతి సంఘం బకాయిలు, పీఎఫ్ బకాయిలు, కరువు భత్యం బకాయిలు పేరుకు పోయి ఉన్నాయి. 2013 వేతన సవరణకు సంబంధించి ఉన్న బకాయిల్లో బాండ్ల తాలూకు చెల్లింపులు కూడా అర్ధంతరంగా నిలిచిపోయాయి. వీటికి సంబంధించి స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి ఫిబ్రవరి నెలలో రూ.280 కోట్లు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ, వాటిల్లో కేవలం కొంతమంది డ్రైవర్లకు మాత్రమే రూ.80 కోట్ల వరకు చెల్లించినట్టు తెలుస్తోంది. -
ఆర్టీసీ ఉద్యోగుల వేతన సవరణ లెక్కలు తేలాయ్!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగుల వేతన సవరణ లెక్కలు తేలాయి. 2017 వేతన సవరణను అములు చేయాలని వారం క్రితం ప్రభుత్వం నిర్ణయించి 21 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటించడం తెలిసిందే. 2018 నుంచి 16 శాతం ఇంటెరిమ్ రిలీఫ్ (ఐఆర్)ను కొనసాగిస్తున్నందున దాన్ని తొలగించి ఆ స్థానంలో కొత్త ఫిట్‌మెంట్‌ను చేర్చి ఏ ఉద్యోగికి ఎంత మేర వేతనాన్ని సవరించాలో తాజాగా అధికారులు లెక్కలు సిద్ధం చేశారు. డిపో మేనేజర్, ఆ పైస్థాయి అధికారులకు సంబంధించిన సవరణ లెక్కలను విడిగా ఖరారు చేయనున్నారు. డిపో మేనేజర్ స్థాయి కంటే తక్కువ హోదా ఉన్న ఉద్యోగుల లెక్కలను సిద్ధం చేసి శనివారం ఆయా డిపోలకు పంపారు. కరువు భత్యంపై సందిగ్ధం.. ప్రస్తుతం ఆర్టీసీ ఉద్యోగులకు 82.6 శాతం కరువు భత్యం (డీఏ) అమలవుతోంది. ఇందులో 31.1 శాతం 2017 వేతన సవరణ గడువుకు పాతది. దీంతో తాజా వేతన సవరణలో ఈ 31.1 శాతాన్ని జోడించారు. 2017 వేతన సవరణ గడువు తర్వాత ఉద్యోగులకు వర్తింపజేసిన మిగతా 51.5 శాతం కరువు భత్యాన్ని మూల వేతనంలో కలిపే వీల్లేదు. దాన్ని ఎంత మేర వర్తింపజేయాలన్న విషయాన్ని ఇంకా ఖరారు చేయలేదు. ఆ వివరాలను తర్వాత వెల్లడించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. గ్రేడ్ పే కొనసాగింపు.. ప్రభుత్వ ఉద్యోగులకు లేని గ్రేడ్ పే వెసులుబాటు ఆర్టీసీలో అమలవుతోంది. ఆయా అధికారుల హోదాను బట్టి జీతం కాకుండా అదనంగా గ్రేడ్ పే పేరుతో కొంత మొత్తాన్ని ప్రతినెలా చెల్లిస్తారు. అది సూపర్వైజర్ స్థాయి అధికారుల నుంచి మొదలవుతుంది. ఆ దిగువ హోదాలో ఉండే కండక్టర్లు, డ్రైవర్లు, ఇతర ఉద్యోగులకు ఉండదు. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి రీత్యా ఈ విధానాన్ని తొలగించాలని గతంలో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ దాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. తాజా వేతన సవరణ తర్వాత కూడా దాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. హెచ్ఆర్ఏ తగ్గింపుపై ఆందోళన.. వేతన సవరణతో జీతాలు పెరుగుతాయన్న ఆనందం ఉద్యోగుల్లో ఓవైపు ఉన్నప్పటికీ మరోవైపు ఇంటి అద్దె భత్యం తగ్గిపోనుండటంతో అంçతృప్తి వ్యక్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వం పలు రకాల సూచీల ఆధారంగా ఇంటి అద్దె భత్యంలో మార్పులు చేసింది. దాన్ని అమలు చేయాల్సి రావడంతో మూడేళ్ల క్రితమే ప్రభుత్వ ఉద్యోగుల పే స్కేల్ సమయంలో అమలులోకి తెచ్చింది. ఆర్టీసీలో వేతన సవరణ జరగకపోవటంతో అప్పటి నుంచి పాత హెచ్ఆర్ఏలే కొనసాగుతున్నాయి. తాజా వేతన సవరణ నేపథ్యంలో 2020 నుంచి హెచ్ఆర్ఏ తగ్గింపును అమలు చేయబోతున్నారు. దీంతో హైదరాబాద్‌లో ఉంటున్న ఉద్యోగులకు ఇక నుంచి 30 శాతం బదులు 24 శాతమే హెచ్ఆర్ఏ అందుతుంది. దీనిప్రభావంతో చిరుద్యోగుల జీతాల్లో దాదాపు రూ.4 వేల నుంచి రూ.6 వేల వరకు కోత పడబోతోంది. హెచ్ఆర్ఏ సీలింగ్ పరిమితిని రూ. 43 వేలకు పెంచారు. ఇది ఉన్నతాధికారులకు మేలు చేయనుండగా ఉద్యోగులకు పెద్దగా ఉపయోగపడదు. -
త్వరలోనే ఇంటి నుంచి పార్శిళ్ల సేకరణ, డెలివరీ
సాక్షి, హైదరాబాద్: టికెటేతర ప్రత్యామ్నాయ ఆదాయం పెంచుకునేందుకు ప్రభుత్వ సహకా రంతో లాజిస్టిక్స్ విభాగ నెట్‌వర్క్‌ను మరింత గా విస్తరిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ సజ్జనార్ తెలిపారు. విని యోగదారులకు వేగవంతమైన సేవలను అందజేసేందుకు త్వరలో ఇంటి నుంచే పార్శిళ్ల సేక రణ, డెలివరీ సేవలను అందుబాటులోకి తేను న్నట్లు వెల్లడించారు. దిల్సుఖ్నగర్ బస్ స్టేషన్ ప్రాంగణంలో కొత్తగా ఏర్పాటు చేసిన లాజి స్టిక్స్ మోడల్ కౌంట ర్ను గురువారం ఆయ న ప్రారంభించారు. లాజిస్టిక్స్ విభాగం కొత్త లోగో, బ్రోచర్‌ను ఆర్టీసీ ఉన్నతాధికారు లతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం పార్శిళ్ల హోం పికప్, డెలివరీ కోసం విని యోగించే కొత్త వాహనాన్ని కూడా ఎండీ జెండా ఊపి ప్రారంభించారు. టీఎస్ఆర్టీసీ లాజి స్టిక్స్ విభాగం ద్వారా ప్రతిరోజూ సగటున 15 వేల పార్శిళ్లను బట్వాడా చేస్తున్నట్లు వివరించా రు. ఈ ఆర్థిక సంవత్సరంలో 60 లక్షల పార్శి ళ్లను ఆర్టీసీ బస్సుల్లో రవాణా చేశామన్నారు. దీంతో ఈ ఏడాది తమకు సుమారు రూ.120 కోట్ల ఆదాయం లభించిందన్నారు. ప్రస్తుతం దిల్సుఖ్నగర్ ప్రాంతంలో మాత్రమే విని యోగదారుల ఇంటి నుంచి వస్తువుల సేకరణ, డెలివరీ సేవలు అందుబాటులోకి తెచ్చామని, త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఆర్టీసీ లాజిస్టిక్స్ సేవలకు... నగరవాసులు ఆర్టీసీ లాజిస్టిక్స్ సేవలకు సంబంధించి సలహాలు, సూచనలు, ఫిర్యాదుల కోసం కాల్ సెంటర్ నంబర్ 040–69440069 కు సంప్రదించవచ్చు.లేదా ఆర్టీసీ వెబ్సైట్ జ్టి్టpట://ఠీఠీఠీ.్టటట్టఛి ౌజజీట్టజీఛిట.జీnలో కూడా లాగిన్ కావచ్చు. -
మహాలక్ష్మి స్కీమ్ తో మహిళలకు అవస్థలు.. సజ్జనార్ క్లారిటీ
-
Hyderabad: బస్సులు లేక హైదరాబాద్ లో ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు నరకం
-
జీరో టికెట్ @10 కోట్లు
సాక్షి, హైదరాబాద్: కేవలం 45 రోజుల వ్యవధిలోనే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతిని పదికోట్లమంది మహిళలు వినియోగించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. డిసెంబరు ఏడో తేదీన ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు తీసుకోగా, అదే నెల తొమ్మిదే తేదీన మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచి తంగా ప్రయాణించే వెసులుబాటు కల్పించారు. సోనియాగాంధీ పుట్టినరోజును పురస్కరించుకుని దీన్ని ఆ రోజు ప్రారంభించినట్టు స్వయంగా సీఎం వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో ఇది కూడా ఒకటి. రెండు కేటగిరీ బస్సుల్లో మహిళలకు జీరో టికెట్ జారీ ద్వారా, బస్సుల్లో ప్రయాణిస్తున్న వారి సంఖ్యను గుర్తిస్తున్నారు. సోమవారం నాటికి జారీ అయిన జీరో టికెట్ల సంఖ్య 10 కోట్లను దాటింది. రూ.550 కోట్ల మేర ఆదా పది కోట్ల జీరో టికెట్ల రూపంలో మహిళా ప్రయాణికులకు రూ.550 కోట్ల మేర ఆదా అయినట్టు తెలిసింది. అంతమేర ఆదాయం ఆర్టీసీ కోల్పోయినందున, ఆ మొత్తాన్ని ప్రభుత్వం రీయింబర్స్ చేయాల్సి ఉంది. ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు ఉండటంతో బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్య సగటున నిత్యం 10 లక్షల కంటే ఎక్కువ మేర పెరిగింది. కానీ, ఆ తాకిడిని తట్టుకునే సంఖ్యలో ఆర్టీసీ వద్ద బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న విషయం తెలిసిందే. కొత్త బస్సులు కొంటున్నామని ఆర్టీసీ చెబుతున్నా, కొన్ని నామమాత్రంగానే వచ్చాయి. ఇప్పటికిప్పుడు కనీసం 4 వేల బస్సులు అవసరమన్న అభిప్రాయాన్ని ఆర్టీసీనే వ్యక్తం చేస్తోంది. కానీ, వాటిని కొనేందుకు అవసరమైన నిధులు సంస్థ వద్ద లేనందున, ప్రభుత్వమే సాయం చేయాల్సి ఉంది. సరిపోను బస్సులు లేక జనం పడుతున్న ఇబ్బందులు ఎలా ఉన్నా, ఈ పథకం విజయవంతమైందన్న విషయాన్ని జనంలోకి తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. విజయోత్సవం తరహాలో ఓ కార్య క్రమం నిర్వహించాలనే ఆలోచనలో ఉంది. 10 కోట్ల మంది మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించినట్టు తేలగానే కార్యక్రమం నిర్వహించాలని అనుకున్నా, అనివార్య కారణాల వల్ల వాయిదా వేశారు. వీలైతే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొనేలా కార్యక్రమం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. బకాయిల చెల్లింపు ప్రకటనకు అవకాశం దీర్ఘకాలంగా ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం బకాయిలు చెల్లించటం లేదు. దీనిపై కార్మికుల నుంచి ఒత్తిడి వస్తోంది. రెండు వేతన సవరణలు, అంతకుముందు వేతన సవరణ తాలూకు బాండ్ల మొత్తం బకాయి ఉంది. సీసీఎస్, పీఫ్ బకాయిలూ ఉన్నాయి. దీంతో సమ్మక్క–సారలమ్మ జాతరలోపు ఏదో ఒక బకాయి చెల్లింపుపై ప్రకటన చేయాలని ఈ భేటీలో నిర్ణయించినట్టు తెలిసింది. బాండ్ల మొత్తం, పీఎఫ్ బకాయిల చెల్లింపుపై ప్రకటన చేసే అవకాశముంది. ఉద్యోగులు వేతన సవరణపై ఒత్తిడి తెస్తున్నా, అది ఖజానాపై పెద్ద భారమే మోపేలా ఉన్నందున దాని విషయంలో ఆచితూచి నిర్ణయించాలని భావిస్తున్నారు. సీఎంతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారు. రూ.1,040 కోట్లతో కొత్త బస్సులు గత ప్రభుత్వ హయాంలోనే ఆర్టీసీ 1,050 బస్సులకు టెండర్లు పిలిచింది. అవి దశలవారీగా సమకూరాల్సి ఉంది. మరో వేయి ఎలక్ట్రిక్ బస్సులు కూడా రావాల్సి ఉంది. మహిళలకు ఉచిత ప్రయాణ వసతి కల్పిస్తున్న పల్లెవెలుగు, ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల సంఖ్య వెంటనే పెంచాల్సి ఉన్న విషయాన్ని ఆర్టీసీ తాజాగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో మంగళవారం రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ అయి బడ్జెట్ పద్దులపై చర్చించారు. ఈ సందర్భంగా 2 వేల బస్సులు కొనేందుకు రూ.1,040 కోట్లు కేటాయించాలని కోరినట్టు తెలిసింది. దీనికి భట్టివిక్రమార్క సానుకూలంగా స్పందించారు. అయితే, ఆర్టీసీ అంతర్గత ఆదాయాన్ని పెంచుకునేందుకు మరింత కసరత్తు చేయాలని, మెట్రో రైలు తరహాలో దీనిపై దృష్టి సారించాలని సూచించారు. -
కిక్కిరిసిన బస్సులు.. కొత్తవి ఎప్పుడు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులు కిక్కిరిసి ప్రయాణిస్తున్నాయి. సంస్థ చరిత్రలోనే తొలిసారిగా 100 శాతానికిపైగా ఆక్యుపెన్సీ రేషియో నమోదవుతోంది. ‘మహాలక్ష్మి’పథకంతో ఉచిత ప్రయాణం నేపథ్యంలో మహిళలు పెద్ద సంఖ్యలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఈ పథకం విజయవంతంగా నడుస్తున్నా.. మరోవైపు ఇదే తీవ్ర ఆందోళనకూ కారణమవుతోంది. ఇప్పుడున్న ఆర్టీసీ బస్సుల్లో చాలా వరకు పాతబడ్డాయి. కొన్ని అయితే డొక్కుగా మారాయి. అలాంటి బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసి నడిస్తే ఎక్కడ అదుపు తప్పుతాయోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు బస్సుల్లోని సీట్లలో చాలా వరకు మహిళలతో నిండిపోతుండటంతో.. పురుషులకు సీట్లు దొరక్క ప్రైవేటు వాహనాల వైపు మొగ్గుతున్నారన్నదీ ఆందోళన రేపుతోంది. కొత్త బస్సులు అందుబాటులోకి వస్తే.. ఈ రెండు సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అధికారవర్గాలు చెప్తున్నాయి. కానీ ఎన్ని బస్సులు కొందాం, ఏ కేటగిరీలో ఎన్ని ఉండాలన్న ప్రతిపాదనలు, సమావేశాలకే సర్కారు పరిమితం అవుతోందన్న విమర్శలు వస్తున్నాయి. అదనంగా 10లక్షల మంది.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో భాగంగా తొలుత ‘మహాలక్ష్మి’పథకాన్ని ప్రారంభించింది. కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 9న దీన్ని పట్టాలెక్కించారు. ఈ పథకం విజయవంతంగా నడుస్తోంది. బస్సుల్లో నిత్యం 10 లక్షల మందికిపైగా అదనంగా ప్రయాణిస్తున్నారు. గతంలో 66శాతంగా ఉన్న ఆక్యుపెన్సీ రేషియో 90శాతం దాటింది. ప్రత్యేక రోజుల్లో 101 శాతానికీ చేరుతోంది. ఉచిత ప్రయాణానికి సంబంధించిన సొమ్మును ప్రభుత్వం రీయింబర్స్ చేసే నేపథ్యంలో ఆర్టీసీ రోజువారీ ఆదాయం రూ.10 కోట్ల మేర పెరిగింది. ఈ నెల 17, 18 తేదీల్లో ఏకంగా రూ.22.50 కోట్ల చొప్పున ఆదాయం నమోదైంది. అయితే పెరిగిన రద్దీకి అనుగుణంగా బస్సులు లేక ఇబ్బందులు వస్తున్నాయి. కర్ణాటకలో ఇదే తరహాలో పథకాన్ని ప్రారంభించినప్పుడు బస్సులు సరిపోక తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. మన ఆర్టీసీ అధికారులు అక్కడికి వెళ్లి పరిశీలించినప్పుడు ఈ అంశం కూడా వారి దృష్టికి వచ్చింది. ఈ క్రమంలో యుద్ధప్రాతిపదికన కొత్త బస్సులు సిద్ధం చేసుకుని పథకాన్ని ప్రారంభించి ఉండాల్సిందని.. అలా చేయకపోవడంతో సమస్యలు వస్తున్నాయని అభిప్రాయం వ్యక్తమవుతోంది. నాలుగు వేల బస్సులు అవసరం ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలవుతోంది. ఈ కేటగిరీలకు సంబంధించి 7,292 బస్సులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. స్పేర్‌లో ఉంచే బస్సులను కూడా వాడేస్తున్నారు. ఇప్పుడున్న రద్దీని నియంత్రించాలంటే కనీసం నాలుగు వేల అదనపు బస్సులు అవసరమని అంచనా. ఇటీవల వచ్చిన కొత్త బస్సులు 50 మాత్రమే. గత ప్రభుత్వ హయాంలో వెయ్యి బస్సులకు ఆర్టీసీ ఆర్డర్ ఇచ్చింది. మరో వెయ్యి ఎలకిŠట్రక్ బస్సులు కొనేందుకు ఏర్పాట్లు చేసింది. అవి అందేందుకు కొన్ని నెలలు పట్టవచ్చని అధికారులు అంటున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సులు అవసరం. ఇప్పటికిప్పుడు కొత్త బస్సులు కొనేందుకు ఆర్టీసీ వద్ద నిధులు లేవు. ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తే, లేదా ప్రభుత్వ పూచీకత్తుతో రుణాలు తీసుకుంటేనే కొనుగోళ్లు సాధ్యం. దీనిపై ఇంకా ఎలాంటి స్పష్టత లేకుండా పోయింది. -
ఆర్టీసీ ఉద్యోగుల అర్జీలు సకాలంలో పరిష్కారం
సాక్షి, అమరావతి: ఆర్టీసీ ఉద్యోగుల సర్వీసు నిబంధనలు, క్రమశిక్షణ చర్యలపై అప్పీళ్ల పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగుల డిమాండ్లపై సానుకూలంగా స్పందిస్తూ వారి అర్జీల పరిష్కారానికి విధి విధానాలను ఖరారు చేసింది. ఈమేరకు ఆర్టీసీ రీజినల్ మేనేజర్లకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జారీ చేసిన ఆదేశాలిలా ఉన్నాయి.. ► ఉద్యోగులకు ఇంక్రిమెంట్లను సకాలంలో మంజూరు చేయాలి ► క్రమశిక్షణ చర్యలపై అర్జీలను వెంటనే పరిష్కరించాలి ► సిక్ లీవుకు సంబంధించిన జీతాలను ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా మంజూరు చేయాలి ► ఉద్యోగులపై దాడికి పాల్పడ్డవారిపై సత్వరం కఠిన చర్యలు తీసుకునేలా పర్యవేక్షించాలి ► కేఎంపీఎల్, ఈపీకేలపై ఉద్యోగులను కౌన్సెలింగ్‌కు పంపించడం నిలిపివేయాలి ► తక్కువ రాబడి వచ్చే బస్ షెడ్యూళ్లను రీ షెడ్యూల్ చేయాలి ► బీఎస్ 4, బీఎస్ 6 వాహనాల వీల్‌బోల్ట్ మెషిన్లు, మయాటిక్ గన్స్, ఎలక్ట్రికల్ పరికరాలను అన్ని గ్యారేజీలలో అందుబాటులో ఉంచాలి ► ఉద్యోగులు పనిచేసే ప్రదేశాలు, భోజనశాలలు పరిశుభ్రంగా ఉంచాలి ► మూడు, నాలుగు షెడ్యూళ్లను నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలి ► వైఫల్యాలను కారణంగా చూపుతూ గ్యారేజ్ ఉద్యోగులను బదిలీ చేయకూడదు ► తగిన శిక్షణ లేకుండా డ్రైవర్లకు టిమ్ డ్యూటీలను అప్పగించకూడదు ► జీతాల కోత విధిస్తూ సెలవులు మంజూరు చేయకూడదు. -
పందెం కోడికి ఆర్టీసీ వేలం
సాక్షిప్రతినిధి, కరీంనగర్: సంక్రాంతి వేళ..కరీంనగర్లో ఓ పందెం కోడి వార్త సందడి చేస్తోంది. ఆసక్తి ఉన్నవారు ఈ కోడిని వేలంపాటలో దక్కించుకోవచ్చంటూ ఆర్టీసీ డిపో–2 మేనేజర్ మల్లయ్య గురువారం ఒక ప్రకటన చేయడమే ఇందుకు కారణం. ఇంతకీ ఈ కోడి కథాకమామీషు ఏంటో ఓసారి చూద్దాం! అసలేం జరిగిందంటే...? ఈనెల 9వ తేదీన కరీంనగర్ ఆర్టీసీ డిపో–2కు చెందిన ఎక్స్‌ప్రెస్ బస్సు వరంగల్ నుంచి వేములవాడకు వెళ్లింది. అక్కడి నుంచి తిరిగి కరీంనగర్ డిపోకి చేరుకుంది. బస్సు దిగి ఇంటికి వెళదామని బస్సు డ్రైవర్, కండక్టర్ సిద్ధమవుతుండగా, ఇంతలో కోడి కూత వినబడటంతో ఇద్దరూ అవాక్కయ్యారు. సీటు కింద దాన్ని సంచిలో జాగ్రత్తగా కట్టేసిన తీరు చూసి, ఎవరో ప్రయాణికుడు మర్చిపోయాడని గుర్తించారు. కోడి యజమాని వస్తాడని కొద్దిసేపు చూశారు. కానీ, ఎవరూ రాకపోవడంతో ఏం చేయాలో తోచక కంట్రోలర్‌కు ఆ కోడిని అప్పగించారు. మూడురోజులుగా ఆ కోడిని ఓ ఇనుప బోనులో రక్షణ కల్పిస్తున్నారు. దానికి దాణా, నీళ్లు ఇస్తూ అతిథిలాగే మర్యాదలు చేస్తున్నారు. కోడి యజమానికి తెలియజేసే క్రమంలో మీడియాలోనూ ప్రకటన విడుదల చేశారు. అయినా కోడి ఆచూకీ కోసం ఎవరూ రాలేదు. దీంతో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు కరీంనగర్ డిపో–2 ఆవరణలో బహిరంగ వేలం వేసేందుకు నిర్ణయించారు. ఆసక్తి ఉన్న వారు వేలం పాటలో పాల్గొనవచ్చునని డిపో మేనేజర్ మల్లయ్య పేర్కొన్నారు. ఇంతకీ సర్కారు వారి పాట ఎంత ఉంటుందో..? ఆ కోడి యజమాని వస్తాడా? రాడా..? ఇంతకీ వేలం పాటలో దేవుని పాట ఎంతకు మొదలవుతుంది? అన్న విషయంపై చర్చ సాగుతోంది. -
కారుణ్య నియామకాలకు ఆర్టీసీ ఓకే
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు కారుణ్య నియామక ప్రక్రియకు ఆర్టీసీ శ్రీకారం చుట్టింది. విధి నిర్వహణ లో మరణించిన సిబ్బంది వారసులకోసం కారుణ్య నియామకాల కింద కండక్టర్ పోస్టులను భర్తీ చే యాలని సంస్థ నిర్ణయించింది. ప్రస్తుతం ఆర్టీసీలో దాదాపు 1,600 కుటుంబాలు ఈ పథకంకోసం ఎదురు చూస్తున్నాయి. వాటిల్లో 813 దరఖాస్తులను మాత్రమే డిపో అధికారులు బస్ భవన్‌కు ఫార్వర్డ్ చేశారు. ఇప్పట్లో ఈ నియామకాలు వద్దని గతంలో ఉన్నతాధికారులు మౌఖికంగా ఆదేశించటంతో మిగతా దరఖాస్తులు అలాగే ఉండిపోయాయి. ఇప్పుడు కారుణ్య నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించడంతో అధికారులు ప్రక్రియ ప్రారంభించారు. ఇందులో భాగంగా 813 కండక్టర్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. కాగా, కారుణ్య నియామకాలపై ఎన్ఎంయూ నేత నరేందర్, టీజేఎంయూ నేత హన్మంతు, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి వీఎస్ రావు ధన్యవాదాలు తెలిపారు. అయితే నియామకాలు తాత్కాలిక పద్ధతిలో కాకుండా రెగ్యులర్ బేసిస్‌లో చేపట్టాలని ఓ ప్రకటనలో కోరారు. ఆ కుటుంబాలకు న్యాయం: మంత్రి పొన్నం ‘ఆర్టీసీలో నియామకాలు పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే కండక్టర్ నియామకాలు చేపట్టాం. దానిలో భాగంగా 813 మంది కండక్టర్లను నియమించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. సంవత్సరాలుగా కారుణ్య నియామకాల కోసం ఎదురు చూస్తున్న కుటుంబాలకు దీంతో న్యాయం జరుగుతుంది’. -
‘అద్దె బస్సు’ డిమాండ్లు పరిశీలిస్తాం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ అద్దె బస్సు నిర్వాహకుల డిమాండ్లను పరిశీలించి వాటి అమలు సాధ్యాసాధ్యాలపై నివేదిక ఇచ్చేందుకు కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ఆర్టీసీ ప్రకటించింది. వారం రోజుల్లో నివేదికను పరిశీలించి తదనుగుణంగా చర్యలు తీసుకోనున్నట్టు వెల్లడించింది. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ వసతి అందుబాటులోకి వచ్చాక రద్దీ విపరీతంగా పెరగటంతో ఐదు రకాల సమస్యలు ఎదురవుతు న్నాయని, వాటిని పరిష్కరించాలంటూ కొద్దిరోజులుగా అద్దె బస్సు యజ మానులు కోరుతున్నారు. అయినా ఆర్టీసీ స్పందించటం లేదని ఆరో పిస్తూ శుక్రవారం నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. గురువారం ఉదయం అద్దె బస్సు యజమానుల సంఘం ప్రతినిధులు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో భేటీ అయి సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. ఆయన వెంటనే ఎండీతో మాట్లాడి, సంఘం ప్రతినిధులతో చర్చించాలని స్పష్టం చేశారు. చర్చలు జరిపిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మంత్రి ఆదేశాల మేరకు బస్‌భవన్‌లో ఎండీ సజ్జనార్, ఉన్నతాధికారులతో కలిసి సంఘం ప్రతినిధులతో చర్చించారు. బస్సుల్లో రద్దీ ఎక్కువై డీజిల్ వినియోగం పెరిగినందున కేఎంపీల్ను జిల్లా సర్వీసుల్లో 4.50కి, సిటీలో 4కు మార్చాలని, టైర్లు ఎక్కువగా అరుగుతున్నందున ఆర్టీసీకి అందించే బల్క్ ధరలకే తమకూ కొత్త టైర్లు కేటాయించాలని, ఓవర్ లోడింగ్‌తో నిర్వహణ ఖర్చులు పెరిగినందున అద్దె మొత్తాన్ని రూ.3 చొప్పున పెంచాలని వారు కోరారు. దీనిపై కమిటీ వేసి అమలు సాధ్యాసాధ్యా లపై నిర్ణయం తీసుకుంటామని ఎండీ సజ్జనార్ వారికి హామీ ఇచ్చారు. ఈ మేరకు సమ్మె ప్రతిపాదనను సంఘం ప్రతినిధులు విరమించుకున్నట్టు సమావేశానంతరం ఎండీ ప్రకటించారు. యధావిధిగా బస్సులు నడుస్తాయని, సంక్రాంతికి ప్రత్యేక బస్సులు కూడా అందుబాటులో ఉంటాయని, మహిళలకు ఉచిత ప్రయాణ వసతి ఇబ్బందుల్లేకుండా కొనసాగుతుందని వెల్లడించారు. సమావేశంలో ఆర్టీసీ ఈడీలు మునిశేఖర్, కృష్ణకాంత్, వెంకటేశ్వర్లు, వినోద్, అధికారులు మైపాల్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి సహా పలువురు బస్సు యజమానుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. -
భారం పడనీయం.. చార్జీలు పెంచం
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం పథకానికి నిధుల కొరత రానీయబోమని.. ఎప్పటి కప్పుడు ఆర్టీసీకి నిధులు సమకూరుస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్ర మార్క, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ప్రయాణికులపై ఎలాంటి చార్జీల భారం మోపబోమని...సంస్థ ఆదాయం పెంచుకునే మార్గాలను అన్వేషించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయంలో వారిద్దరూ ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆర్టీసీ ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రత్యామ్నాయ ఆదాయమార్గాలపై దృష్టి పెట్టాలని, నిర్వహణ సామర్థ్యం పెంచుకోవాలని అధికారులకు సూచించారు. టీఎస్ ఆర్టీసీ ఆర్థిక అంశాలు, మహాలక్ష్మి పథకం అమలుతీరు, ప్రభుత్వ ఆర్థిక సహాయం, తదితర విషయాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో సంస్థ ఉన్నతాధికారులు మంత్రులకు వివరించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఈ పథకం కింద ఇప్పటివరకు 6.50 కోట్ల మంది మహిళలు ప్రయాణాలు సాగించడం గొప్ప విషయమని, ఈ పథకం ఇలానే ప్రశాంత వాతావరణంలో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. సిబ్బందికి రావాల్సిన బకాయిలు, సంస్థ అప్పులు, పీఎఫ్, సీసీఎస్, ఇతర సెటిల్మెంట్లకు సంబంధించిన నిధులపై సమీక్షించి..త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మహాలక్ష్మి పథకం కింద ప్రతీరోజు సగటున 27 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తున్నారని, దాదాపు రూ.10 కోట్ల విలువైన జీరో టికెట్లు మంజూరు చేస్తున్నామని ఆర్టీసీ ఉన్నతాధికారులు వివరించగా.. రోజు వారీ నిర్వహణకు అవసరమైన నిధులను ప్రభుత్వం సమకూర్చుతుందని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఆర్టీసీ ప్రజల సంస్థ.. దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ప్రత్యామ్నాయ ఆదాయమార్గాలపై సంస్థ ఆలోచిస్తోందని, టికెట్ ఆదాయంపైనే కాకుండా..లాజిస్టిక్స్, వాణిజ్య, తదితర టికెటేతర ఆదాయంపై దృష్టి పెట్టిందని చెప్పారు. ఈ సమావేశంలో ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు, రవాణా, రోడ్లు, భవనాలశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, టీఎస్ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మునిశేఖర్, కృష్ణకాంత్, ఆర్థిక సలహాదారు విజయపుష్ప, సీఎంఈ రఘునాథరావు, సీటీఎం జీవన ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
మహా రద్దీ..
సాక్షి, హైదరాబాద్: ‘మహాలక్ష్మి పథకం’ ఇప్పుడు ఆర్టీసీకి పెద్ద సవాలుగా మారింది. ఈ నెల 9వ తేదీ మధ్యాహ్నం నుంచి ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో తెలంగాణ మహిళలకు ఉచిత ప్రయాణ వసతి కల్పించిన విషయం తెలిసిందే. దీంతో ఆర్టీసీ బస్సులో ప్రయాణించే మహిళల సంఖ్య భారీగా పెరిగింది. తాజా లెక్కల ప్రకారం.. ‘మహాలక్ష్మి’తర్వాత బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళల సంఖ్య దాదాపు 13 లక్షల మేర పెరిగింది. గతంలో 66 శాతంగా ఉన్న ఆర్టీసీ బస్సుల ఆక్యుపెన్సీ రేషియో ఇప్పుడు 90 శాతానికి చేరుకుంది. కొన్ని మార్గాల్లో అది వందశాతం కూడా దాటింది. అంటే సీట్ల సామర్థ్యం కంటే ఎక్కువ మంది బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. మహిళా ప్రయాణికులు 70 శాతం సీట్లలో కూర్చుంటున్నారు. దీంతో మిగతా మహిళలు, పురుషులు నిలబడే ప్రయాణించాల్సి రావడం వివాదాలకు కారణమవుతోంది. బస్సులు సరిపోక... పెరిగిన రద్దీని క్రమబద్ధికరించాలంటే బస్సుల సంఖ్య భారీగా పెంచాలి. ప్రస్తుతం సాధారణ రోజుల్లో ఆర్టీసీ బస్సుల్లో సగటున 41 లక్షల మంది, రద్దీ ఎక్కువగా ఉండే సోమవారాల్లో 51 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఆక్యుపెన్సీ రేషియో 90 శాతంగా ఉంటోంది. మహిళలకు ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అవకాశం ఉంది. ఈ కేటగిరీ బస్సులు ప్రస్తుతం ఆర్టీసీలో 7292 బస్సులు మాత్రమే ఉన్నాయి. నిజానికి ఆర్టీసీ డిపోల్లో ఉన్న అన్ని బస్సులు రోజూ రోడ్డెక్కవు. వాటిల్లో కొన్ని బ్రేక్‌డౌన్‌లో ఉంటాయి. కొన్ని ఇతర అవసరాల కోసం స్పేర్‌లో ఉంటాయి. సాధారణ రోజుల్లోనే బస్సులు సరిపోక ట్రిప్పులకు ఇబ్బంది అవుతూ వస్తున్న తరుణంలో, మహిళలకు ఉచిత ప్రయాణ వసతి అమలులోకి రావటంతో బస్సులకు ఒక్కసారిగా తీవ్ర కొరత ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో వంద శాతాన్ని మించి ఆక్యుపెన్సీ రేషియో నమోదవుతుండటంతో అదనపు ట్రిప్పు నడపాల్సి వస్తోంది. కానీ బస్సులు అందుబాటులో లేక సర్దుబాటు చేయలేకపోతున్నారు. ఫలితంగా, ప్రయాణికులతో కిక్కిరిసి నడపాల్సి వస్తోంది. స్థలం సరిపోక కొందరు ప్రయాణికులు దిగిపోవాల్సి వస్తోంది. దీంతో అదనపు బస్సు నడపాలంటూ వారు సిబ్బందితో ఘర్షణ పడుతున్నారు. ఇప్పటికిప్పుడు 4 వేల బస్సులు కావాల్సిందే.. ప్రస్తుత రద్దీని తట్టుకునేందుకు ఆర్టీసీ ఇప్పటికిప్పుడు దాదాపు 4 వేల వరకు కొత్త బస్సులు సమకూర్చుకోవాల్సి ఉంది. గతంలోనే ఆర్టీసీ రెండు వేల బస్సులకు ఆర్డరిచ్చింది. వాటిల్లో ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సులు 1,500 వరకు ఉంటాయి. కానీ ఆ బస్సులు అందుబాటులోకి రావాలంటే ఇంకా నాలుగు నెలల సమయం పడుతుంది. వచ్చే మార్చి చివరి నాటికి అవి దశలవారీగా అందుబాటులోకి వస్తాయి. మరో 20 రోజుల్లో 50 బస్సులు అందనున్నాయి. కానీ అప్పటి వరకు ఈ రద్దీని తట్టుకునే పరిస్థితి లేదు. రోజురోజుకు ప్రయాణికులు–ఆర్టీసీ సిబ్బంది మధ్య వివాదాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో పెరిగిందని సంతోషపడుతున్నా.. రోజూ నిలబడి ప్రయాణించటం ఇబ్బందిగా భావించేవారు మళ్లీ ఆటోల వైపు మళ్లుతారు. దీంతో పెరిగిన ఆక్యుపెన్సీ రేషియో కొంత పడిపోతుంది. ఇది జరగకుండా ఉండాలంటే నాలుగు వేల బస్సులు కావాలి. కానీ, అన్ని బస్సులు సమకూర్చుకోవటానికి ఆర్టీసీ వద్ద నిధులు లేవు. ఇప్పటి వరకు ప్రభుత్వం కొత్త బస్సుల అంశాన్ని ప్రస్తావించలేదు. ఎలక్ట్రిక్ బస్సులు లాగుతాయా.. త్వరలో వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ సమకూర్చుకోనుంది. వాటిలో 500 బస్సులు సిటీ సర్వీసులుగా తిరుగుతాయి. నగరంలో ఓఆర్ 90 శాతాన్ని దాటింది. అంత లోడ్‌ను ఎలక్ట్రిక్ బస్సులు లాగుతాయా అన్న సందేహం అధికారుల్లో వ్యక్తమవుతోంది. లాగినా, బ్యాటరీలు ముందుగానే డిస్ఛార్జి అవుతాయని ఆందోళన చెందుతున్నారు. మళ్లీ అద్దె బస్సుల నోటిఫికేషన్ సమస్య నుంచి గట్టెక్కాలంటే వెంటనే కొత్త బస్సులు సమకూర్చుకోవాల్సి ఉన్నందున, ఆర్టీసీ అధికారులు మరోసారి అద్దె ప్రాతిపదికన ప్రైవేటు వ్యక్తుల నుంచి బస్సులు సమకూర్చుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు అద్దె బస్సులు కావాలంటూ నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే, ప్రస్తుతం రద్దీ విపరీతంగా పెరిగినందున, పాత అద్దె రేట్లకు బస్సులు పెట్టేందుకు ప్రైవేటు వ్యక్తులు సుముఖంగా లేరు. అద్దె చార్జీలు సవరించాలని కోరుతున్నారు. సవరిస్తే ఆర్టీసీపై ఆర్థిక భారం పడుతుంది. వారంలో 50 కొత్త బస్సులు: ఎండీ సజ్జనార్ కొత్తగా వచ్చే బస్సుల నమూనాను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ శుక్రవారం పరిశీలించారు. వాటిల్లో లహరి స్లీపర్ కమ్ సీటర్, రాజధాని, ఎక్స్‌ప్రెస్ బస్సులున్నాయి. సంక్రాంతి నాటికి 200 బస్సులు రోడ్డెక్కుతాయని, వీటిలో 50 బస్సులు వారం రోజుల్లో అందుతాయని సజ్జనార్ వెల్లడించారు. నాలుగైదు నెలల్లో విడతలవారీగా 400 ఎక్స్‌ప్రెస్, 512 పల్లెవెలుగు, 92 లహరి స్లీపర్ కమ్ సీటర్, 56 రాజధాని, 540 ఎలక్ట్రిక్ సిటీ బస్సులు, నగరం వెలుపల తిరిగేందుకు 500 ఎలక్ట్రిక్ బస్సులు అందుతాయని వెల్లడించారు. -
కిటకిటలాడుతున్న ఆర్టీసీ బస్సులు
సాక్షి, హైదరాబాద్: మహాలక్ష్మి పథకం ఆర్టీసీ బస్సులపై పెద్ద ప్రభావమే చూపుతోంది. నిత్యం 13 లక్షల మేర ప్రయాణికుల సంఖ్య పెరిగింది. అదనంగా ప్రయాణిసున్న వారిలో 90 శాతం మహిళలే అన్నది సుస్పష్టం. ఈ రూపంలో ఆర్టీసీకి రోజువారీ ఆదాయం దాదాపు రూ.4.50 కోట్లు పెరిగినట్టు లె క్కలు చెబుతున్నాయి. మహిళా ప్రయాణికులు ఆర్టీసీ బస్సు (ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్)ల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నందున టికెట్ రూపంలో నేరుగా ఆర్టీసీకి ఆదాయం తగ్గుతుంది త ప్ప పెరగదు. కానీ ఈ పథకంతో ఆర్టీసీ కోల్పోయే ఆదాయా న్ని ప్రభుత్వం రీయింబర్స్ చేయనున్నందున ఆ రూపంలో అదనపు ఆదాయం వచ్చి పడుతుంది. గతంలో సాధారణ రోజుల్లో ఆర్టీసీకి నిత్యం రూ.13–14 కోట్ల వరకు ఆదాయం వస్తుండగా, ఇప్పుడది రూ.18.25 కోట్లకు చేరుతోంది. గతంలో సాధారణ రోజుల్లో (సోమవారం కాకుండా) నిత్యం బస్సుల్లో 25–30 లక్షల మధ్య ప్రయాణించేవారు. ఇప్పుడది 43 లక్షలు దాటుతోంది. వెరసి.. ఈ పథకం ప్రారంభమయ్యాక 40 శాతం ప్రయాణికులు పెరిగనట్టు గుర్తించారు. జీరో టికెట్ జారీతో తేలిన లెక్క సాధారణంగా ఆర్టీసీ బస్సుల్లో సోమవారం రద్దీ అధికంగా ఉంటుంది. సాధారణ రోజుల్లో సగటున 28 లక్షల మంది ప్రయాణిస్తే, సోమవారాల్లో ఆ సంఖ్య 34 లక్షల వరకు ఉంటుంది. మహిళలకు ఉచిత ప్రయాణ వసతి ప్రారంభమయ్యాక, గత సోమవారం 51 లక్షల మంది ప్రయాణించినట్టు అధికారులు లెక్కలేశారు. అయితే, ఆరోజు వరకు మహిళలకు టికెట్ల జారీ ప్రక్రియ ప్రారంభం కాలేదు. టికెట్లు జారీ చేస్తే, ఎంతమంది మహిళలు బస్సులెక్కారో కచ్చితంగా తెలుస్తుంది. మూడు రోజుల క్రితం జీరో టికెట్ల జారీ ప్రక్రియ మొదలుపెట్టారు. మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణించారో ఆ టికెట్ల జారీతో తేలుతుంది. దానికి ఎంత చార్జీ చెల్లించాల్సి ఉంటుందో కూడా అందులో స్పష్టమవుతుంది. ఆర్టీసీ ఆ లెక్కలను ప్రతినెలా ప్రభుత్వానికి అందిస్తుంది. దాని ఆధారంగానే ఆ మొత్తాన్ని ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుంది. ఇప్పుడు జీరో టికెట్ల జారీ ప్రకారం 16వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో 43,12,033 మంది ప్రయాణించినట్లు తేలింది. వీరి ద్వారా రూ.1,826.49 కోట్ల ఆదాయం సమకూరింది (ప్రభుత్వం రీయింబర్స్ చేసే మొత్తంతో కలిపి). నాలుగువేల బస్సులు పాతవే... మహిళల సంఖ్య భారీగా పెరిగినందున బస్సులు కిక్కిరిసి పోతున్నాయి. చాలా బస్సుల్లో మూడొంతుల స్థలంలో మహిళలే ఉంటున్నారు. దీంతో పురుషులు కొందరు స్థలం లేక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితి అదుపుతప్పకుండా ఉండాలంటే కనీసం 2,500 కొత్త బస్సులు సమకూర్చుకోవాల్సి ఉంటుందని అధికారులు లెక్కలేశారు. ప్రస్తుతం 40 శాతం రద్దీ పెరిగినా, ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఉన్న బస్సులతోనే నెట్టుకొస్తున్నారు. అయితే, ఆర్టీసీలో దాదాపు 4 వేల బస్సులు బాగా పాతబడి ఉన్నాయి. ఈ బస్సుల్లో రద్దీ పెరిగితే అదుపుతప్పే ప్రమాదం ఉంటుంది. ప్రమాదాలు చోటుచేసుకునే వరకు ఎదురుచూడకుండా కొత్త బస్సులు సమకూర్చుకోవాలని ఆర్టీసీ భావిస్తోంది. గతంలో ఆర్డర్ ఇచ్చిన బస్సులు కొన్ని త్వరలో సమకూరే అవకాశం ఉంది. కానీ అవి సరిపోవు. ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుని కొత్త బస్సులు కొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని నిర్ణయించింది. -
రేపటి నుంచే ఆర్టీసీ బస్సుల్లో..
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల్లో ప్రధానమైన ఆరు గ్యారంటీలలో రెండింటిని సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా శనివారం నుంచే (ఈనెల 9) అమల్లోకి తేవాలని కొత్త ప్రభుత్వం నిర్ణయించింది. గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో దీనికి పచ్చజెండా ఊపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ వైద్య చికిత్సల పరిమితిని రూ.10 లక్షలకు పెంచే హామీల అమలుకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. మరోవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పూర్తిస్థాయిలో సమీక్షించి, దశలవారీగా పకడ్బందీగా ఆరు గ్యారంటీలను అమలు చేయాలని ఆలోచనకు వచ్చారు. ఈ భేటీ అనంతరం కేబినెట్ నిర్ణయాలను మంత్రులు దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ మీడియాకు వెల్లడించారు. ఆరు గ్యారంటీలపై సుదీర్ఘ చర్చ కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలపై కేబినెట్ భేటీలో సుదీర్ఘంగా చర్చించినట్టు మంత్రులు తెలిపారు. ఈ హామీలను దశలవారీగా పూర్తిస్థాయిలో అమలు చేయాలని తీర్మానించినట్టు వివరించారు. ఆరు గ్యారంటీలతోపాటు ప్రజలకు ఇచ్చిన ఇతర హామీలను ఐదేళ్లలోగా నెరవేర్చడమే తమ ప్రభుత్వ కర్తవ్యమన్నారు. ముందుగా ఈ నెల 9వ తేదీ నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఆధార్, రేషన్‌కార్డు లేదా ఏదైనా గుర్తింపు కార్డు తీసుకొని బస్సుల్లో వెళ్లవచ్చని తెలిపారు. ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా చర్చ జరిగిందని మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ‘‘2014 నుంచి గురువారం (డిసెంబర్ 7వ తేదీ) వరకు రాష్ట్ర ఆర్థిక స్థితిగతులకు సంబంధించి ఏయే ప్రభుత్వ విభాగాలు ఎంత ఖర్చు చేశాయి? దేని కోసం, ఏం ప్రయోజనాల కోసం ఖర్చు చేశాయి? ఆ ఖర్చులతో ఒనగూరిన ప్రయోజనాలేమిటన్న అంశాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు వివరాలు అందజేయాలని అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసిన ఖర్చు, చేకూరిన ప్రయోజనాలు తెలంగాణ ప్రజలందరికీ తెలియజేసేలా అన్ని వివరాలు కావాలని అధికారులను ఆదేశించారు’’ అని మంత్రులు వివరించారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసి, గ్యారంటీల అమలుకు అవసరమైన ఆర్థిక వనరులను సేకరించి హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయనున్నట్టు తెలిపారు. గ్రూప్–1, 2 పరీక్షల అంశంపైనా కేబినెట్ చర్చించినట్టు వివరించారు. నేడు విద్యుత్ అధికారులతో సమావేశం రాష్ట్రంలో రైతులకు, పరిశ్రమలకు నిరంతరాయంగా 24 గంటల విద్యుత్ అందించాలని మంత్రివర్గం సమావేశంలో తీర్మానించినట్టు మంత్రులు వెల్లడించారు. ఈ క్రమంలో 2014 నుంచి ఇప్పటివరకు విద్యుత్ అంశానికి సంబంధించి చోటు చేసుకున్న తప్పుడు నిర్ణయాలపై చర్చించామని, ఆయా అంశాల్లో అధికారుల వివరణ కోరామని తె లిపారు. శుక్రవారం విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి, అధి కారులతో సీఎం రేవంత్ సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్టు వివరించారు. గత పదేళ్లలో విద్యుత్‌కు సంబంధించి అనేక అంశాల్లో తప్పులు జరిగాయని, వాటిని స మీక్షించి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై తగిన నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలిపారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా అమలుపైనా చర్చించనున్నట్టు వెల్లడించారు. 9న కొత్త ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం కొత్త శాసనసభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని 9వ తేదీన చేపట్టాలని కేబినెట్ భేటీలో నిర్ణయించినట్టు మంత్రులు తెలిపారు. ఇందుకోసం అసెంబ్లీలో సీనియర్ సభ్యుడిని ప్రొటెం స్పీకర్‌గా ఎన్నుకోవడం జరుగుతుందని.. తర్వాత స్పీకర్ ఎన్నిక, గవర్నర్ ప్రసంగం తదితర కార్యక్రమాలు ఉంటాయని వెల్లడించారు. పూర్తి స్థాయి కేబినెట్ కూర్పుపై సీఎం, పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటాయని తెలిపారు. రెవెన్యూ గ్రామంగా జయశంకర్ ఊరు వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలంలోని ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామం అక్కంపేటను రెవెన్యూ గ్రామంగా ప్రకటించాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి గురువారం ప్రిలిమినరీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రస్తుతం అక్కంపేట గ్రామం పెద్దాపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలో ఉంది. మరోవైపు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం ఇంద్రవెల్లి గ్రామం–బి లో ఉన్న అమరవీరుల స్తూపం వద్ద స్మృతి వనం సుందరీకరణ, అభివృద్ధి కోసం ఎకరం భూమి కేటాయిస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పనులను వెంటనే చేపట్టాలని ఆదిలాబాద్ కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు. -
జీవన్‌రెడ్డికి షాక్‌ల మీద షాక్‌లు
ఆర్మూర్: అధికారం చేజారగానే బీఆర్ఎస్కు చెందిన ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డికి ఆర్టీసీ, ట్రాన్స్‌కో అధికారులు ఏకకా లంలో బకాయిల వసూ లుకు చర్యలు ప్రారంభిస్తూ షాక్ ఇచ్చారు. పూర్వా పరాలిలా.. ఆర్మూర్ పట్టణంలోని టీఎస్ ఆర్టీసీ స్థలాన్ని జీవన్‌రెడ్డి సతీమణి రజితరెడ్డి తాను మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న విష్ణుజిత్ ఇన్‌ఫ్ట్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట లీజ్‌కు తీసుకుని మాల్ అండ్ మల్టిప్లెక్స్ పేరిట 5 అంతస్తుల భారీ షాపింగ్ మాల్ నిర్మించారు. గతేడాది దసరా రోజున ప్రారంభించిన ఈ మాల్లో రిలయన్స్ స్మార్ట్, ట్రెండ్స్, ఎలక్ట్రానిక్స్, కేఎఫ్‌సీ, పీవీఆర్ సినిమా హాళ్లకు అద్దెకు ఇచ్చారు. మొన్నటి వరకు జీవన్‌రెడ్డి అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో ఈ మాల్ అద్దె బకా యిలు వసూలు చేయడంలో ఆర్టీసీ, ట్రాన్స్‌కో అధికారులు నిర్లక్ష్యం వహించారు. దీంతో విష్ణుజిత్ ఇన్‌ఫ్ట్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ .. ఆర్టీసీకి చెల్లించాల్సిన అద్దె 7 కోట్ల 23 లక్షల 71 వేల 807 రూపాయలు, విద్యుత్‌కు సంబంధించి ట్రాన్స్‌కోకు 2 కోట్ల 57 లక్షల 20 వేల 2 రూపాయలు బకాయిలుగా పేరుకుపోయాయి. ఇప్పుడు రాష్ట్రంలో, నియోజకవర్గంలో అధికార మార్పు జరగగానే ఆర్టీసీ, ట్రాన్స్‌కో అధికారులు ఈ బకాయిల వసూళ్లకు నడుం బిగించారు. మూడు రోజుల్లో చెల్లించాలి ఆర్టీసీ నిజామాబాద్ ఆర్ఎం జానీరెడ్డి, ఆర్మూర్ డిపో ఇన్చార్జి మేనేజర్ పృథ్వీరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌కు చెందిన పోలీసు అధికారులు తోడు రాగా జీవన్ మాల్లో గురువారం హెచ్చరికలు జారీ చేసారు. మూడు రోజుల్లో లీజుదారులు అద్దె బకాయిలు చెల్లించని పక్షంలో మల్టీప్లెక్స్‌ను సీజ్ చేస్తామంటూ మైక్‌లో హెచ్చరించారు. మరో వైపు ట్రాన్స్‌కో ఆర్మూర్ ఏడీఈ శ్రీధర్ ఆధ్వర్యంలో ట్రాన్స్‌కో అధికారులు సైతం మూడు రోజుల్లో బకాయిలు చెల్లించాలంటూ విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో షాపింగ్ మాల్‌కు జనరేటర్లతో విద్యుత్ సరఫరా చేస్తున్నారు. -
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి షాక్
-
ఉచిత ప్రయాణానికి ఆర్టీసీ లెక్కలు.. అధ్యయనానికి బెంగుళూరుకు బృందం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయి. ఏయే కేటగిరీ బస్సుల్లో అమలు చేస్తే ఎంత భారం పడనుందనే విషయంలో ఆర్టీసీ అధికారులు లెక్కలు సిద్ధం చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలో ఈ పథకం ఎలా అమలవుతోంది, అక్కడ ఎంత ఖర్చవుతోంది, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎలా సర్దుబాటు చేస్తోంది..అన్న విషయాలను పరిశీలించేందుకు నలుగురు ఆర్టీసీ అధికారుల బృందం బెంగళూరుకు వెళ్తోంది. రెండు రోజుల పాటు అక్కడ పరిశీలించి నివేదికను సిద్ధం చేయనుంది. అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతి కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజా ఎన్నికల్లో ఆ పార్టీ అధికారంలోకి రావటంతో అధికారులు పూర్తి వివరాలతో నివేదిక సిద్ధం చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం కొలువుదీరబోతోంది. దీంతో వీలైనంత తొందరలో ఈ పథకం అమలు చేసే అవకాశం ఉన్నందున, ముఖ్యమంత్రి అడిగిన వెంటనే నివేదిక అందజేసేందుకు వీలుగా ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో కూడా అమలు చేస్తే.. దక్షిణాదిలో తొలుత తమిళనాడు రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతి కల్పించారు. కానీ అక్కడ, కేవలం నగర, పట్టణ ప్రాంతాల్లో తిరిగే సిటీ ఆర్డినరీ బస్సుల్లో మాత్రమే ఈ వెసులుబాటు కల్పించారు. ఇందుకోసం ప్రత్యేకంగా గులాబీ రంగులో ఉండే బస్సులను అందుబాటులోకి తెచ్చారు. వాటిల్లోనే ఈ వెసులుబాటు ఉంటుంది. కానీ, కర్ణాటకలో మాత్రం రాష్ట్రవ్యాప్తంగా ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో ఈ వసతి కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీని ప్రకటించింది. అధికారంలోకి రావటంతో దాన్ని అమలులోకి తెచ్చింది. తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. కానీ కర్ణాటక మోడల్‌ను అనుసరిస్తుందా, తమిళనాడు మోడల్‌ను చేపడుతుందా అన్న విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. కర్ణాటక తరహాలో పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌బస్సుల్లో ఈ పథకాన్ని అమలు చేస్తే సాలీనా రూ.2200 కోట్లు అవుతుంది. పల్లెవెలుగు బస్సులకే పరిమితం చేస్తే ఏటా రూ.750 కోట్లు అవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం ఇవ్వాల్సింది ప్రతినెలా దాదాపు రూ.185 కోట్లు.. మహిళలకు ఉచిత ప్రయాణ పథకం ప్రారంభమైతే, ఆ రూపంలో ఆర్టీసీ కోల్పోయే టికెట్ ఆదాయాన్ని ప్రభుత్వం రీయింబర్స్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్‌ప్రెస్ కేటగిరీ బస్సుల వరకు ఈ పథకాన్ని అమలు చేస్తే సాలీనా రూ.2200 కోట్ల వరకు రీయింబర్స్ చేయాలి. అంటే ప్రతి నెలా రూ.185 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. జీరో టికెట్ ప్రవేశపెడతారా..? ఎంతమంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారన్నది లెక్క తేలాల్సి ఉంటుంది. ఇందుకోసం కర్ణాటకలో జీరో టికెట్ విధానం ప్రారంభించారు. మహిళలకు రూ.సున్నా అని ఉండే జీరో టికెట్‌ను జారీ చేస్తారు. అలా రోజుకు ఎన్ని టికెట్లు జారీ అయ్యాయో నమోదు చేసి నెలవారీగా లెక్కిస్తారు. ఇక్కడ అదే పద్ధతి ప్రవేశపెడతారా లేక మరో విధానాన్ని అనుసరిస్తారా అన్నది తేలాల్సి ఉంది. -
ఆర్టీసీలో రెండు కేటగిరీలుగా పదోన్నతులు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజారవాణా విభాగం(ఆర్టీసీ) ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం తన సానుకూలతను మరోసారి చాటుకుంది. ఉద్యోగుల సర్వీసు నిబంధనలకు సంబంధించి కీలక డిమాండ్‌పై సానుకూలంగా స్పందించింది. ఆర్టీసీ ఉద్యోగులకు రెండు కేటగిరీల ప్రకారం పదోన్నతులు కల్పించేలా కార్యాచరణ చేపట్టింది. ప్రభుత్వంలో విలీనం చేయకముందు అంటే.. 2020, జనవరి 1 కంటే ముందు నుంచి ఆర్టీసీలో ఉన్న ఉద్యోగులకు గతంలో అమలు చేసిన ఆర్టీసీ సర్వీస్ నిబంధనలనే వర్తింపజేయాలని నిర్ణయించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాక ఉద్యోగాల్లో చేరినవారికి ప్రజా రవాణా విభాగం(పీటీడీ) సర్వీసు నిబంధనలను అమలు చేస్తారు. ఈ మేరకు పీటీడీ సర్వీసు నిబంధనల్లోని సెక్షన్ 5ను సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గతంలో ఆర్డినెన్స్ ఇచ్చింది. అనంతరం సవరణ బిల్లునూ ఆమోదించింది. దీనిపై త్వరలోనే తుది మార్గదర్శకాలను ఖరారు చేస్తూ ఉత్తర్వులు వెలువరించాలని నిర్ణయించింది. రెండు కేటగిరీలుగా పదోన్నతులు 2020, జనవరి 1 కంటే ముందు నుంచి ఉన్న దాదాపు 50 వేల మంది ఉద్యోగులకు పదోన్నతులు, క్రమశిక్షణ చర్యలు మొదలైనవన్నీ ఆర్టీసీ సర్వీసు నిబంధనల మేరకే కల్పిస్తారు. ఎందుకంటే గతంలో ఆర్టీసీలో ఉద్యోగులుగా నియమితులైవారికి పదోన్నతులకు సంబంధించి విద్యార్హతల నిబంధనలు ప్రత్యేకంగా ఉండేవి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు నిబంధనలనే.. ఆర్టీసీ ఉద్యోగులకు వర్తింపజేశారు. దీంతో గతంలో తక్కువ విద్యార్హతతో ఉద్యోగాలు పొంది.. పదోన్నతులకు అర్హత కలిగిన ఉద్యోగులు తాజాగా ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు నిబంధనలతో నష్టపోయే అవకాశాలున్నాయని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ విషయాన్ని పరిశీలించిన ప్రభుత్వం ఉద్యోగుల పదోన్నతులకు ఎలాంటి అడ్డంకుల్లేకుండా సరైన విధాన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చింది. ఈ మేరకే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేనాటికి(2020, జనవరి 1) ఉద్యోగులుగా ఉన్నవారికి ఆర్టీసీ సర్వీసు నిబంధనల మేరకు పదోన్నతులు కల్పించాలని నిర్ణయించింది. దాంతో 2020, జనవరి 1 కంటే ముందు నుంచి ఉద్యోగులుగా ఉన్న దాదాపు 50 వేల మందికి ఆర్టీసీ సర్వీసు నిబంధనలే వర్తిస్తాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాక ఉద్యోగాల్లో చేరిన వారికి ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు నిబంధనల మేరకు పదోన్నతులు కల్పిస్తారు. ప్రస్తుతం ఆ కేటగిరీలో ఆర్టీసీలో 311 మంది ఉద్యోగులున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. -
సెల్‌ఫోన్ వదిలితేనే స్టీరింగ్
సాక్షి, హైదరాబాద్: డ్రైవర్లు బస్సు నడిపే క్రమంలో మొబైల్ఫోన్లు వాడుతూ ప్రమాదాలబారిన పడుతున్న ఘటనలు ఇటీవలి కాలంలో చోటుచేసుకుంటుండటంతో టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నియంత్రణ చర్యలు ప్రారంభించింది. డ్రైవర్ల ఏకాగ్రత దెబ్బతినకుండా ఉండే చర్యల్లో భాగంగా వారు విధుల్లో ఉన్నప్పుడు సెల్ఫోన్ల వినియోగాన్ని నియంత్రించాలని నిర్ణయించింది. దీంతోపాటు డ్యూటీలో భాగంగా గమ్యం చేరిన తర్వాత.. తిరిగి మళ్లీ బయలుదేరేలోగా ఉన్న విశ్రాంతి సమయంలోనూ మొబైల్ ఫోన్లు వాడకుండా నిషేధించింది. ఈ చర్యలకు డ్రైవర్లు అలవాటుపడేలా వారికి అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తోంది. ఆ తర్వాత దీన్ని పాటించని వారిపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. నిబంధనలు ఇలా... హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే టీఎస్ఆర్టీసీ బస్సుల డ్రైవర్లు బస్టాండ్‌కు చేరుకోగానే అక్కడి టీఎస్ఆర్టీసీ కేంద్రంలోని ఏటీఎం కార్యాలయంలో మొబైల్ ఫోన్లను డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. తిరిగి బస్సు బయలుదేరే సమయంలో వాటిని తీసుకోవాలి. ఇతర దూరప్రాంతాలకు వెళ్లే ఏసీ బస్సుల్లో ఉండే అటెండర్‌కు డ్రైవర్ తన మొబైల్ ఫోన్ అప్పగించాలి. ఏవైనా ఫోన్ కాల్స్ వస్తే అటెండరే మాట్లాడి డ్రైవర్‌కు సమాచారం చెప్పాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచో, లేదా ఇతరుల నుంచో వచ్చే ముఖ్యమైన కాల్స్ ఉంటే బస్సును పక్కన ఆపి మాట్లాడిన తర్వాతే బస్సును నడపాల్సి ఉంటుంది. ఇద్దరు డ్రైవర్లు ఉండే నాన్–ఏసీ దూరప్రాంత బస్సుల్లో అయితే రెండో డ్రైవర్‌కు ఫోన్ అప్పగించాల్సి ఉంటుంది. హైదరాబాద్ సిటీ బస్సు సర్వీసుల్లోనూ కఠిన నిబంధనల అమలు ప్రారంభించారు. డిపోనకు రాగానే అక్కడి కంట్రోలర్‌కు డ్రైవర్లు ఫోన్లను అప్పగించాలి. ఈలోగా ముఖ్యమైన ఫోన్ కాల్స్ వస్తే విషయాన్ని తెలుసుకొని కంట్రోలర్లు ఆయా దారుల్లో ఉండే పాయింట్ల మీది కంట్రోలర్ల ద్వారా ఆ సమాచారాన్ని డ్రైవర్లకు చేరవేయాలి. అవగాహన కార్యక్రమాల తర్వాత ఈ నిబంధన పాటించని వారి నుంచి మొబైల్ ఫోన్లు స్వాదీనం చేసుకుని 2 నెలలపాటు బస్ డిపోల్లోనే ఉంచనున్నారు. అప్పటికీ తీరు మారకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నారు. ఆ డ్రైవర్లకు భారం తప్పించే ఏర్పాటు.. బస్సు టికెట్లను అడ్వాన్సుగా ఆన్లైన్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టం (ఓపీఆర్ఎస్) ద్వారా బుక్ చేసుకున్నప్పుడు ప్రయాణికుడికి బస్సు డ్రైవర్ సెల్ నంబర్ అందిస్తున్నారు. బస్సును ట్రాక్ చేసే క్రమంలో ప్రయాణికుడు డ్రైవర్‌కు పలుమార్లు ఫోన్లు చేయడం ప్రమాదకరంగా మారింది. ఈ నేపథ్యంలో ఇటీవలే ఆర్టీసీ రూపొందించిన గమ్యం యాప్‌ను ప్రయాణికులు ఫోన్లో డౌన్లోడ్ చేసుకుంటే బస్సును సులభంగా ట్రాక్ చేసుకోవడంతోపాటు ఇతర సమస్త సమాచారం తెలుస్తుంది. ఈ దిశగా ప్రయాణికులకు అవగాహన కల్పించే ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతోపాటు టికెట్ బుక్ చేసుకుంటే.. డ్రైవర్ నంబర్‌కు బదు లు ప్రత్యేకంగా ఏర్పాటు చేసే సెంటర్ నంబర్ ఇవ్వనున్నారు. ప్రయాణికుడు ఫోన్ చేయగానే ఆ సెంటర్ సిబ్బంది సిస్టంలో గమ్యం యాప్ తెరిచి బస్సు వివరాలు తెలుసుకుని చేరవేస్తారు. -
నిద్రలేమి.. అయినా డ్యూటీ!
శుక్రవారం సాయంత్రం 5:18 గంటలు.. 64 కి.మీ. వేగంతో వరంగల్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న వోల్వో రాజధాని బస్సు వెనుక నుంచి ఓ ట్యాంకర్‌ను బలంగా ఢీకొంది. ఈ దుర్ఘటనలో డ్రైవర్ చనిపోగా ముగ్గురు ప్రయాణికులు గాయమపడ్డారు. ఇంకా చీకటి పడనప్పటికీ డ్రైవర్ ట్యాంకర్‌ను గుర్తించలేకపోవడం గమనార్హం. శనివారం తెల్లవారుజాము 2:20 గంటలు.. విజయవాడ జాతీయ రహదారిపై నార్కట్‌పల్లి ప్రాంతం.. గంటకు 80 కి.మీ. వేగంతో రాజధాని వోల్వో బస్సు నడుపుతున్న ఆర్టీసీ డ్రైవర్.. ఆగి ఉన్న లారీని గమనించక వెనుక నుంచి బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందగా 8 మంది ప్రయాణికులు గాయపడ్డారు. సాక్షి, హైదరాబాద్: వరుస డ్యూటీలతో డ్రైవర్ల నిద్రలేమి, తీవ్ర అలసట, పని ఒత్తిడి వల్ల ఇటీవల కాలంలో ఆర్టీసీ బస్సు ప్రమాదాలు పెరుగుతున్నాయి. గత ఆరు నెలల్లో దా దాపు 300 వరకు బస్సు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. తాజాగా గంటల వ్యవధిలో రెండు రాజధాని బస్సులు ప్ర మాదానికి గురై రెండు బస్సుల డ్రైవర్లు దుర్మరణం చెందడం దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో వెంటనే అన్ని డిపోల్లో గేట్ మీటింగ్స్ ఏర్పాటు చేసి డ్రైవర్లలో అవగాహన కల్పించాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశించారు. లెక్క తప్పినా... ఆర్టీసీ కొన్ని దశాబ్దాల క్రితమే శాస్త్రీయ అధ్యయనంతో ఓ నిబంధన ప్రవేశపెట్టింది. దీని ప్రకారం బస్సు–డ్రైవర్ల దామాషా 1:2.6. అంటే ప్రతి 10 బస్సులకు 26 మంది డ్రైవర్లు ఉండాలి. మూడు షిఫ్టుల్లో బస్సు నడవాలంటే అందరు డ్రైవర్లు ఉండాల్సిందే. డ్రైవర్ల సెలవులను దృష్టిలో పెట్టుకొని ఈ దామాషా రూపొందించారు. కానీ ప్రస్తుతం 10 బస్సులకు 23 మంది మాత్రమే ఉన్నారు. టీఎస్ఆర్టీసీలో ప్రస్తుతం 6,375 బస్సులు ఉండగా వాటికి 14,894 మంది డ్రైవర్లు ఉన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం నేపథ్యంలో ఇటీవలే దాదాపు 400 మంది డ్రైవర్లకు అసిస్టెంట్ డిపో క్లర్కులుగా పదోన్నతి కల్పించారు. దీంతో వారి సంఖ్య అంతమేర తగ్గింది. అయినప్పటికీ అప్పటికప్పుడు సెలవుల్లో ఉన్న వారితోపాటు అనారోగ్యం నుంచి ఇంకా కోలుకోని వారికి, డ్యూటీ దిగిన వారికి డబుల్ డ్యూటీలు చేయాలని అధికారులు ఆదేశిస్తున్నారు. అలాంటి పరిస్థితిలో డ్యూటీకి వచ్చిన డ్రైవర్లు నడిపే బస్సులే ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నాయి. శుక్రవారం రోడ్డు ప్రమాదానికి గురై చనిపోయిన డ్రైవర్ పగలు ఓ వేడుకలో ఎక్కువ సేపు గడిపి నేరుగా డ్యూటీకి వచ్చినట్లు తెలిసింది. దీంతో అతనికి కావాల్సినంత నిద్ర లేకుండా పోయింది. తీవ్ర ఒత్తిడిలో డ్రైవర్లు.. కొన్ని గంటలపాటు బస్సును నడపటమే ఒత్తిడితో కూడుకున్న ఉద్యోగం. ఇది చాలదన్నట్లు డబుల్ డ్యూటీలు వేస్తుండటంతో డ్రైవర్లు ఒత్తిడి తట్టుకోలేకపోతున్నారు. ఇటీవల ఓ డ్రైవరు 7–8 గంటలపాటు డ్రైవింగ్ అనంతరం తాను తీసుకుంటున్న చికిత్సలో భాగంగా మాత్ర వేసుకొని నిద్రపోయాడు. కానీ డ్రైవరు కొరతతో అధికారులు అతనికి డబుల్ డ్యూటీ వేశారు. అయితే తాను మాత్ర వేసుకున్నందున నిద్ర వస్తుందంటూ డ్యూటీకి డ్రైవర్ నిరాకరించడంతో అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారని కారి్మక సంఘాలు పేర్కొంటున్నాయి. డబుల్ డ్యూటీ చేయకుంటే చర్యలు తీసుకుంటున్నారన్న భయంతో విధులకు వెళ్లకతప్పని పరిస్థితి వారికి ఎదురవుతోందంటున్నారు. ఇది ప్రమాదాలకు కారణమవుతోందన్నది వారి మాట. ఆదాయం కోసం... ఆర్టీసీ యాజమాన్యం 100 రోజుల ఫెస్టివల్ చాలెంజ్ పేరుతో డిపోలవారీగా ఆదాయాన్ని పెంచుకొనేందుకు ప్రత్యేక కసరత్తు చేస్తోంది. దీంతో ఫిట్‌గా లేడన్న కారణంతో డ్రైవర్లకు డ్యూటీలు వేయకుండా కొన్ని బస్సు ట్రిప్పులను రద్దు చేస్తే ఇది తమ రీజియన్ పరిధిలో ఆదాయంపై ప్రభావం చూపుతుందని ఉన్నతాధికారులు డిపో మేనేజర్లపై ఒత్తిడి పెంచుతున్నారు. దూరప్రాంతాలకు బస్సులు ఎక్కువగా తిప్పే డిపోల్లో ఒకటైన బీహెచ్ఈఎల్ డిపోకు చెందిన బస్సులు ఏడాది కాలంలో ఎక్కువ ప్రమాదాలకు గురయ్యాయి. శుక్రవారం అర్ధరాత్రి దాటాక విజయవాడ దారిలో ప్రమాదానికి గురైన బస్సు కూడా ఆ డిపోదే కావటం గమనార్హం. గుర్తించే పద్ధతి ఏది? దూరప్రాంతాలకు డ్రైవింగ్‌కు వెళ్లి వచ్చాక ఆ డ్రైవర్ తగినంత నిద్రపోవాల్సి ఉంటుంది. అందుకే అన్ని ప్రాంతాల్లో ఆర్టీసీ రెస్ట్ రూమ్స్ ఏర్పాటు చేశారు. నిద్రలేమి ఉంటే ఆ విషయాన్ని అధికారులకు చెప్పాలి. అతని పరిస్థితిని పరిశీలించాకే బస్సును కేటాయించాల్సి ఉంటుంది. కానీ ఆర్టీసీలో ప్రస్తుతం ఆ పద్ధతి అమలు కావట్లేదు. మద్యం తాగాడా లేదా అన్నది మాత్రమే బ్రీథ్ అనలైజర్‌తో తనిఖీ చేస్తున్నారు తప్ప మిగతా విషయాలను గుర్తించలేకపోతున్నారు. -
ఆత్మహత్యకు అసిస్టెంట్ మేనేజర్ శాలిని కారణమని ఆరోపణ
-
కొత్తగా వెయ్యి ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు
నర్సీపట్నం (అనకాపల్లి జిల్లా): ఈ ఏడాది కొత్తగా వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేస్తున్నామని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. మంగళవారం ఆయన నర్సీపట్నం ఆర్టీసీ డిపోను సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ విజయదశమి ఆర్టీసీకి ఆదాయం తెచ్చే పండుగ అన్నారు. దసరాకు విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం 5,500 స్పెషల్ బస్సులను తిప్పుతున్నామన్నారు. గతంలో దసరా పర్వదినాల్లో 50 శాతం అదనపు చార్జీలు విధించటం జరిగేదని, రెండేళ్లుగా చార్జీల పెంపునకు స్వస్తి పలికామని చెప్పారు. రాను పోను ప్రయాణికులకు 10 శాతం రాయితీ కల్పిస్తున్నామన్నారు. రాయితీలు కల్పించి ఓఆర్ పెంచి ఆదాయ పెంపునకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కొత్తగా 1500 డీజిల్ బస్సులు ఆర్డర్ చేశామన్నారు. డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ ఏడాది వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేశామని, మూడు నెలల్లో ఎలక్ట్రికల్ బస్సులు అందుబాటులోకి వస్తాయన్నారు. ఇకపై ప్రతి ఏటా వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులు కొనేందుకు నిర్ణయం తీసుకున్నామని వివరించారు. అలాగే పీఎఫ్ బకాయిలు సకాలంలో కేంద్ర ప్రభుత్వానికి చెల్లించటం వల్ల సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం హయ్యర్ పెన్షన్ ఆప్షన్ ఇచ్చిందన్నారు. ప్రస్తుతం రూ.3 వేలు నుంచి రూ.4 వేలు పెన్షన్ వచ్చే కేడర్‌లో ఉన్న వారికి ఇకపై రూ.25 వేలు పెన్షన్, రూ.5 నుంచి 6 వేలు ఉన్న వారికి రూ.30 వేలు నుంచి రూ.50 వేలు వరకు పెన్షన్ వస్తుందన్నారు. ఈ సందర్భంగా ఆయన డిపో ఆవరణలో మొక్కలు నాటారు. స్థానిక ఏఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా తిరుమలరావును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఎండీ వెంట జిల్లా ప్రజారవాణా సంస్థ అధికారి పద్మావతి ఉన్నారు. -
వందేభారత్ X గరుడ ప్లస్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైల్వే విస్తరణతో ఆర్టీసీకి పోటీ ఎదురైంది. ఇటీవలే ప్రారంభమైన కాచిగూడ–బెంగళూరు వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు ఆదరణ లభించడం.. ప్రతి ట్రిప్పులో దాదాపు 500 మంది ప్రయాణికులు ఈ రైల్లో ప్రయాణిస్తుండటంతో ఇది హైదరాబాద్–బెంగళూరు మధ్య పగటిపూట తిరిగే ఆర్టీసీ గరుడ బస్సులపై కొంత ప్రభావం చూపుతోంది. వందేభారత్ సైతం పగలే పరుగులు తీస్తున్నా కేవలం ఎనిమిదిన్నర గంటల్లోనే గమ్యం చేరుతుండటం ప్రజాదరణకు కారణమవుతోంది. దీంతో రానున్న రోజుల్లో మరింత ఎక్కువ మంది ఈ రైలు వైపు మళ్లితే గరుడ ప్లస్ బస్సుల ఆక్యుపెన్సీ రేషియో తగ్గే అవకాశం ఉందని గుర్తించిన ఆర్టీసీ యాజమాన్యం అప్రమత్తమైంది. ప్రయాణికులను ఆకర్షించే చర్యలు చేపట్టింది. పక్కాగా డైనమిక్ ఫేర్ సిస్టం... కాచిగూడ–బెంగళూరు వందేభారత్ ఎనిమిదన్నర గంటల్లో గమ్యం చేరుకుంటుంటే హైదరాబాద్–బెంగళూరు గరుడ ప్లస్ బస్సు 11 గంటలు తీసుకుంటోంది. దీంతో ప్రయాణికులు పెద్ద సంఖ్యలో అటు మళ్లుతున్నారు. ఈ నేపథ్యంలో బస్సులపై ప్రభావం పెద్దగా లేకుండా ఉండేందుకు డైనమిక్ ఫేర్ విధానాన్ని పక్కాగా నిర్వహించాలని ఆర్టీసీ నిర్ణయించింది. వందేభారత్ రైలు టికెట్ చార్జీ (భోజనం చార్జీ లేకుండా) రూ. 1,255గా ఉండగా ఆర్టీసీ గరుడ ప్లస్ బస్సు టికెట్ చార్జీ 1,200గా ఉంది. అందువల్ల డైనమిక్ ఫేర్ విధానాన్ని పక్కాగా అమలు చేయడం ద్వారా వారాంతాల్లో కాకుండా డిమాండ్ తక్కువగా ఉండే సాధారణ రోజుల్లో టికెట్ ధర రూ. 880గా మారుతోంది. మంగళ, బుధ, గురువారాల్లో తక్కువ ధర, మిగతా రోజుల్లో కాస్త ఎక్కువ ధర ఉంటోంది. సాధారణ రోజులు, ప్రయాణ సమయం వంటి మొత్తం 44 అంశాలను పరిగణనలోకి తీసుకొని టికెట్ ధరలను రకరకాల మొత్తాలకు తగ్గించి ఆర్టీసీ ఖరారు చేస్తోంది. ఇది ఆటోమేటిక్‌గా ఖరారయ్యేలా సాంకేతికను వినియోగిస్తోంది. టికెట్ చార్జీ భారీగా తగ్గడంతో బస్సుల వైపు ప్రయాణికులు మొగ్గు చూపుతున్నారు. సిద్దిపేట, ఇతర ప్రాంతాలకు రైలు సర్వీసులతో.. ఇక ప్రస్తుతం సిద్దిపేటకు ఆర్టీసీ నిత్యం 15 నిమిషాలకో బస్సు నడుపుతోంది. ఇవి ఆర్టీసీకి కాసులు కురిపిస్తున్నాయి. కానీ మరో మూడు రోజుల్లో సిద్దిపేట నుంచి కాచిగూడకు రైలు సర్వీసు ప్రారంభం అవుతోంది. ఒక ట్రిప్పులో వెయ్యి మందిని తరలించే అవకాశం ఉండటంతో ఇది కూడా ప్రభావం చూపుతుందని ఆర్టీసీ భావిస్తోంది. ఇక మహబూబ్‌నగర్ సమీపంలోని జక్లేర్, మక్తల్, మాగనూరు, కృష్ణా లాంటి ప్రాంతాల నుంచి ప్రయాణికులు ఎక్కువగా ఆర్టీసీ బస్సులపైనే ఆధారపడి ప్రయాణిస్తుంటారు. అయితే దేవరకద్ర–కృష్ణా మధ్య ఆదివారం నుంచి రైలు సర్విసు ప్రారంభం కానుంది. దీంతో కృష్ణా–కాచిగూడ, సిద్దిపేట–కాచిగూడ రైళ్లు ప్రారంభమయ్యాక వాటిల్లో ప్రయాణికుల సంఖ్య ఏ మేరకు ఉంటోంది? ఏయే ప్రాంతాల్లో ఎక్కువ మంది ఎక్కి దిగుతున్నారు లాంటి అంశాలను పరిశీలించేందుకు ఆర్టీసీ ఉన్నతాధికారులు కొందరు సిబ్బందిని నియమించారు. వారు ఈ వివరాలు పరిశీలించి సమాచారం ఇచ్చాక తదనుగుణంగా బస్సుల విషయంలో మార్పుచేర్పులు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. -
ఆర్టీసీ ఉద్యోగులు.. ఇక ప్రభుత్వ ఉద్యోగులే
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోద ముద్ర వేశారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లుకు గవర్నర్ గురువారం ఓకే చెప్పడంతో చట్ట బద్ధత లభించింది. దీంతో 43,373 మంది ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. టీఎస్ ఆర్టీసీ (ఉద్యో గులను ప్రభుత్వంలో విలీనం) బిల్లు–2023ను శాసనసభ గతనెలలో ఆమోదించగా, రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ బిల్లుపై సంతకం చేసినట్టు రాజ్భవ న్ తాజాగా ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ సందర్భంగా ఆమె ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన ఆర్టీసీ కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉంటే.. జూలై 31న సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసే అంశానికి సంబంధించి ఆమోద ముద్ర వేయడం, ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాలని నిర్ణ యించిన విషయం విదితమే. అయితే ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్న ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టడానికి ముందు గవర్నర్ అనుమతి తప్పనిసరి కావడంతో, గవర్నర్ బిల్లు ను పరిశీలించి పలు అనుమానాలు వ్యక్తం చేయడం, మొద ట సంస్థ ఆస్తులు, కేంద్ర గ్రాంట్లు, వాటా, విభజన చట్టంలో 9వ షె డ్యూల్, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చూస్తారా.? వారి సీనియారిటీ, పారిశ్రామిక వి వాదాల చట్టం వర్తిస్తుందా..? ప్రభుత్వ ఉద్యోగులతో సమా నంగా పెన్షన్ వర్తిస్తుందా..?అన్ని ప్రయోజనాలు కల్పి స్తారా..? ప్రభుత్వ ఉద్యోగాల్లో కండక్టర్, కంట్రోలర్ వంటి పోస్టులు లేవు మరి వారిని ఏ విధంగా సర్దుబాటు చేస్తారు.? కేంద్రం నుంచి అనుమతి తీసుకున్నారా.? డిపోల్లో కేటగిరి వారీగా ఉన్న ఉద్యోగుల సంఖ్య ఎంత.. కాంట్రాక్టు, క్యాజువ ల్ కార్మికుల పరిస్థితి ఏమిటీ..? ఆర్టీసీ ప్రస్తుత స్వరూపంతోనే పనిచేస్తుందా..? ఆస్తులను ప్రభుత్వం విలీనం చేసు కుంటుందా.? బస్సుల నిర్వహణ, ఆజమాయిషీ ఎవరిది లాంటి అనేక ప్రశ్నలు గవర్నర్ లేవనెత్తడం.. వాటిన్నింటికి ప్రభుత్వం సమాధానం ఇవ్వడంతోపాటు, బిల్లులో పొందుపరిచి అసెంబ్లీలో పాస్ చేసిన సంగతి విదితమే. బిల్లు వచ్చిన తర్వాత మళ్లీ న్యాయశాఖ పరిశీలనకు పంపించిన గవర్నర్.. ఈనెల 3వ తేదీన న్యాయశాఖ నుంచి బిల్లు తిరిగి వచ్చిన తర్వాత దాదాపు పదిరోజుల పరిశీలన అనంతరం బిల్లుకు ఆమోదం తెలిపారు. సీఎంకు ధన్యవాదాలు : బాజిరెడ్డి గోవర్ధన్ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంతో ఆర్టీసీ ఉద్యోగులంతా రుణపడి ఉంటారని పేర్కొన్నారు. తాను సంస్థ చైర్మన్‌గా ఉన్న సమయంలో వారంతా ప్రభుత్వ ఉద్యోగులుగా మారడం ఆనందంగా ఉందన్నారు. -
చివరి నెల వేతనం హుళక్కే!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులకు పదవీ విరమణ సమయంలో అందించే బెనిఫిట్స్ పూర్తిగా ఇవ్వకుండా ఆర్టీసీ కోత పెడుతోంది. గతేడాది సెప్టెంబరు వరకు పద్ధతిగానే చెల్లింపులు జరిగినా, ఆ తర్వాత నుంచి కొన్ని బెనిఫిట్స్ ఇవ్వకుండా ఎగ్గొడుతోంది. దీంతో గత సెప్టెంబరు తర్వాత పదవీ విరమణ పొందిన వారంతా వాటి కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయబోతున్న నేపథ్యంలో, బకాయిలను చెల్లించిన తర్వాతే విలీనం చేయాలని వారంటున్నారు. లేకపోతే తాము నష్టపోవాల్సి వస్తుందని వాపోతున్నారు. ఆ నాలుగింటిలో కోత.. ఆర్టీసీ ఉద్యోగులు పదవీ విరమణ పొందిన వెంటనే, సంస్థ నుంచి వారికి రావాల్సిన అన్ని రకాల బెనిఫిట్స్ అప్పటికప్పుడు చెల్లించే ఆనవాయితీ ఉండేది. కొన్నేళ్లుగా ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో ఉండటంతో ఈ చెల్లింపుల్లో జాప్యం జరుగుతూ వచ్చింది. ఏడాదిగా కొన్నింటిని నిలిపేసి మిగతావి చెల్లించే విచిత్ర పద్ధతి ప్రారంభమైంది. పీఎఫ్, ఎస్ఆర్బీఎస్, ఎస్బీటీ, గ్రాట్యూటీ లాంటి వాటిని చెల్లి స్తున్నా... నాలుగింటి విషయంలో కోత తప్పటం లేదు. వేతన సవరణ బాండ్లు: 2013లో ఆర్టీసీ వేతన సవరణ జరగాల్సి ఉండగా, రాష్ట్రం విడిపోయాక దాన్ని 2015లో అమలు చేశారు. ఆ సమయంలో బకాయిలను సగం నగదు రూపంలో, మిగతా సగం బాండ్ల రూపంలో చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పింది. ఆ బాండ్ల రూపంలో చెల్లించే మొత్తాన్ని పదవీ విరమణ సమయంలో ముట్టచెబుతూ వస్తున్నారు. గతేడాది సెప్టెంబరు నుంచి వీటిని చెల్లించడం లేదు. లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్: గరిష్టంగా 300 వరకు ఆర్జిత సెలవుల మొత్తాన్ని పదవీ విరమణ సమయంలో చెల్లించటం ఆనవాయితీ. డ్రైవర్, కండక్లర్లకు రూ.4–5 లక్షల వరకు, అధికారులకైతే వారి స్థాయినిబట్టి రూ.10–15 లక్షలు, అంతకంటే ఎక్కువ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని కూడా ఏడాదిగా చెల్లించకుండా పెండింగులో పెట్టారు. చివరి నెల వేతనం: పదవీ విరమణ పొందిన నెలకు సంబంధించిన వేతనాన్ని కాస్త ఆలస్యంగా అందిస్తారు. ఏ రూపంలోనైనా సంస్థకు అతను చెల్లించాల్సిన మొత్తం ఏమైనా ఉంటే అందులో నుంచి మినహాయించి మిగతాది ఇస్తారు. ఈ లెక్కలు చూసేందుకు నాలుగైదు రోజుల సమయం తీసుకుని, రిటైరైన వారంలోపు చెల్లించేవారు. ఇప్పుడు దాన్నీ ఆపేశారు. కరువు భత్యం బకాయిలు: కొన్నేళ్లుగా డీఏలు సకాలంలో చెల్లించటం లేదు. దాదాపు 8 డీఏలు పేరుకుపోయాయి. వాటిని గత కొన్ని నెలల్లో క్లియర్ చేశారు. ఆ డీఏ చెల్లించాల్సిన కాలానికి ఉద్యోగి సర్వీసులోనే ఉన్నా, ఆలస్యంగా దాన్ని చెల్లించే నాటికి కొందరు రిటైర్ అవుతున్నారు. ఇలా ఆలస్యంగా చెల్లిస్తున్న వాటిని... సర్వీసులో ఉన్న వారికి మాత్రమే ఇస్తున్నారు, కానీ రిటైరైన వారికి ఇవ్వడం లేదు. ఇక సీసీఎస్ మాటేమిటి? ఆర్టీసీ ఉద్యోగుల సహకార పరపతి సంఘం (సీసీఎస్) నిధులను ఆర్టీసీ వాడేసుకుని వడ్డీతో కలిపి రూ.వేయి కోట్లు బకాయి పడింది. కార్మికుల వేతనం నుంచి ప్రతినెలా నిర్ధారిత మొత్తం కోత పెట్టి సీసీఎస్‌లో జమ చేస్తున్న విషయం తెలిసిందే. ఆ మొత్తాన్ని రిటైరైన వెంటనే చెల్లించాలి. కార్మికులు వాటిని డిపాజిట్లుగా సీసీఎస్‌లో అలాగే ఉంచితే దానిపై వడ్డీ చెల్లించాలి. ఇదంతా సీసీఎస్ పాలక మండలి చూస్తుంది. కానీ, ఆ నిధులు ఆర్టీసీ వాడేసుకుని ఖాళీ చేయటంతో రిటైరైన వారికి చెల్లించే పరిస్థితి లేకుండా పోయింది. సర్వీసులో ఉన్న వారు వారి అవసరాలకు తీసుకుందామన్నా ఇవ్వటం లేదు. ఇది పదవీ విరమణ పొందిన వారితోపాటు సర్వీసులో ఉన్న వారికీ సంబంధించిన సమస్య. -
ఆర్టీసీకి 910 కొత్త బస్సులు
సాక్షి, హైదరాబాద్: మూడునెలల్లో ఆర్టీసీకి 910 కొత్త బస్సులు సమకూరబోతున్నాయి. చాలా కాలంగా పాతబడ్డ బస్సులతో లాక్కొస్తుండగా, వాటిల్లోంచి కొన్నింటిని తుక్కుగా మార్చేసి.. కొత్త బస్సులు అందుబాటులోకి తేవాలని సంస్థ నిర్ణయించింది. ఇప్పటికే టెండర్లు పిలవగా టాటా, అశోక్ లేలాండ్ కంపెనీలు తక్కువ కొటే షన్తో ముందుకొచ్చాయి. టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి నెగోషియేషన్స్ ద్వారా వాటి కొటేషన్ మొత్తాన్ని కొంతమేర తగ్గించేందుకు ఆర్టీసీ అధి కారులు చర్చలు జరుపుతున్నారు. మరికొద్ది రో జుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసి, రెండు కంపెనీలు ఒకే ధరకు ముందుకొచ్చేలా చేసి, వాటికే ఆర్డర్ ఇవ్వాలని చూస్తున్నారు. ఈ నెలలోనే కంపెనీ లకు బస్సులు ఆర్డర్ ఇస్తే...బస్ బాడీల నిర్మా ణానికి మూడు నెలల సమయం పడుతుంది. ఎక్స్‌ప్రెస్ బస్సులు 540 ఆర్టీసీలో బాగా డిమాండ్ ఉన్న ఎక్స్‌ప్రెస్ కేటగిరీని బలోపేతం చేయాలని సంస్థ నిర్ణయించింది. ప్రస్తుతం అద్దె బస్సులుపోను సొంతంగా 1,800 వరకు ఎక్స్‌ప్రెస్ బస్సులున్నాయి. ఇవి ఎక్కువ ఆక్యుపెన్సీ రేషియోతో నడుస్తూ ఆర్టీసీకి మంచి ఆదాయాన్ని తెచ్చి పెడుతున్నాయి. దూర ప్రాంత పట్టణాల మధ్య ఇవి తిరుగుతున్నాయి. కొన్ని ఇతర రాష్ట్రాలకు కూడా వెళుతున్నాయి. ఈ నేపథ్యంలో 540 కొత్త ఎక్స్‌ప్రెస్ బస్సులు సమకూర్చుకోవాలని ఆర్టీసీ అనుకుంటోంది. వాటి రాకతో డొక్కు ఎక్స్‌ప్రెస్ బస్సులు అదే సంఖ్యలో తొలగిస్తారు. వాటిల్లో కొన్నింటిని సిటీ బస్సులుగా, మరికొన్నింటిని పల్లెవెలుగు బస్సులుగా కన్వర్ట్ చేస్తారు. అంతమేర సిటీ, పల్లెవెలుగు పాత డొక్కు బస్సులను తుక్కుగా మారుస్తారు. స్లీపర్ కమ్ సీటర్ రాజధాని బస్సులు 50 లేదా 60 ఇక దూరప్రాంత పట్టణాల మధ్య తిరుగుతున్న రాజధాని (ఏసీ) బస్సులకు కూడా మంచి ఆదరణ ఉంది. ప్రస్తుతం ఉన్న బస్సులు బాగా పాతబడిపోయాయి. వాటిల్లోంచి మరీ పాత బస్సులను తొలగించి కొన్ని కొత్తవి సమకూ ర్చాలన్న ఉద్దేశంతో 50 లేదా 60 బస్సులు కొంటున్నారు. ప్రస్తుతం రాజధాని కేటగిరీ బస్సు లన్నీ సీటర్ బస్సులే. తొలిసారి ఆ కేటగిరీలో స్లీపర్ బస్సులు సమకూర్చనున్నారు. పైన కొన్ని బెర్తులు, దిగువ సీట్లు ఉండే స్లీపర్ కమ్ సీటర్ బస్సులు తీసుకోవాలని నిర్ణయించారు. ఎట్టకేలకు పల్లెవెలుగుకు కొత్త బస్సులు సాధారణంగా ఎక్స్‌ప్రెస్, రాజధాని బస్సులు పాతబడ్డాక వాటిని తొలగించి సిటీ ఆర్డినరీ, పల్లె వెలుగు బస్సులుగా కన్వర్ట్ చేస్తారు. దీంతో ఆ బస్సులు చాలా పాతబడి ఉంటున్నాయి. అయితే కొత్తగా ఇప్పుడు 100 నుంచి 120 మధ్యలో కొత్త బస్సులు సమకూర్చాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం చాలా ఊళ్లకు అద్దె బస్సులే నడుస్తున్నాయి. మరో 200 కొత్త బస్సులు హైదరాబాద్ సిటీకి కేటాయిస్తారు. -
ఆర్టీసీ ఉద్యోగులకు మరో 5శాతం డీఏ
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ తమ ఉద్యోగులకు మరో విడత కరువు భత్యాన్ని (డీఏ) ప్రకటించింది. ఈసారి డీఏను 5 శాతం పెంచింది. దీనితో ప్రస్తుతమున్న 72.8 శాతం నుంచి 77.8 శాతానికి డీఏ పెరిగిందని.. సెప్టెంబర్ వేతనం నుంచే దీనిని చెల్లిస్తామని అధికారులు తెలిపారు. 2019 జూలై నుంచి పెండింగ్‌లో ఉన్న డీఏలను ఇటీవల వరుసగా ప్రక టిస్తూ రాగా.. ప్రస్తుతం 2023 జూలై డీఏ ఒక్కటి మాత్రమే పెండింగులో ఉన్నట్టయింది. ఆర్టీసీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఇప్పటివరకు సంస్థ 8 డీఏలను మంజూరు చేసిందని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఉద్యో గులు కష్టపడి పనిచేస్తున్నారని, బకాయిలను త్వరలోనే ఇవ్వడానికి యాజమాన్యం ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. పెండింగ్ బకాయిల ప్రస్తావన లేదు పెండింగ్ డీఏల అమలును ప్రకటిస్తూ వస్తున్న ఆర్టీసీ.. వాటికి సంబంధించిన బకాయిలు (ఇప్పటివరకు చెల్లించాల్సిన మొత్తాన్ని) మాత్రం ఇవ్వటం లేదు. కేవలం అమల్లోకి తెచ్చిన నెల నుంచే లెక్కిస్తూ చెల్లి స్తోంది. ఇలా ఇప్పటివరకు సుమారు 168 నెలల బకాయిలు ఉన్నాయని, ఆ మొత్తాన్ని వెంటనే చెల్లించాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఓ విడత డీఏ బకాయిని ప్రకటించేలోపు పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు దాని లబ్ధి కలగటం లేదని.. అలాంటి వారికి లబ్ధి కలగాలంటే బకాయిలు చెల్లించాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికైనా డీఏలను చెల్లించడాన్ని స్వాగతిస్తు న్నామని.. అయితే బకాయిల సొమ్ము కూడా అందితేనే అందరు ఉద్యోగులకు న్యాయం జరిగినట్టు అవుతుందని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి వీఎస్‌రావు పేర్కొన్నారు. -
ఆర్టీసీ బస్సులకు భారీ గి‘రాఖీ’
సాక్షి, హైదరాబాద్: ఈసారి రాఖీ పౌర్ణమి ఆర్టీసీకి బాగా కలిసొచ్చింది. బస్సులు కిటకిటలాడగా, ఖజానా కళకళలాడింది. డీజిల్ సెస్‌ను భారీగా పెంచిన తర్వాత గతేడాది రాఖీ పండుగ రోజు రికార్డు స్థాయిలో రూ.21.66 కోట్ల ఆదాయం రాగా, ఈసారి అంతకంటే ఎక్కువ రాబడి రావాలంటూ ఆర్టీసీ ఎండీ అధికారులకు లక్ష్యం నిర్దేశించారు. దీంతో ఈసారి రాఖీ పండగరోజు రూ.22.65 కోట్ల ఆదాయం సాధించి పాత రికార్డును అధిగమించింది. పండగ రోజైన గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో 40.922 లక్షల మంది ప్రయాణించారు. గత రాఖీ పండుగ రోజుతో పోలిస్తే లక్ష మంది ప్రయాణికులు అధికం కావటం విశేషం. ఆర్టీసీ బస్సుల్లో ఒకేరోజు ఇంత మంది ప్రయాణించటం కూడా రికార్డేనని అధికారులు పేర్కొంటున్నారు. గురువారం ఆర్టీసీ బస్సులు 36.77 లక్షల కి.మీ. తిరిగాయి. ఇది కూడా గతేడాది కంటే( 35.54 లక్షల కి.మీ.) ఎక్కువే. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 86.41 శాతం ఆక్యుపెన్సీ రేషియో(ఓఆర్) నమోదైంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిదిలో 104.68 శాతం నమోదైంది. నార్కట్‌పల్లి మినహా మిగతా 6 డిపోలు 100 శాతానికిపైగా సాధించాయి. ఉమ్మడి వరంగల్‌లో 97.05, ఉమ్మడి మెదక్, మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాల్లో 90 శాతానికిపైగా ఓఆర్ నమోదైంది. హుజూరాబాద్, నల్లగొండ, భూపాలపల్లి, హుస్నాబాద్, పరకాల, కల్వకుర్తి, తొర్రూరు, మహబూబాబాద్, మిర్యాలగూడ, దేవరకొండ, యాదగిరిగుట్ట, గజ్వేల్– ప్రజ్ఞాపూర్, కోదాడ, నర్సంపేట, సూర్యాపేట, దుబ్బాక, జనగామ, సిద్దిపేట, గోదావరిఖని, షాద్‌నగర్ డిపోలు 100 శాతానికిపైగా ఓఆర్ సాధించాయి. కి.మీ.కు సగటున రూ.56.18 ఆదాయం రాగా, గరిష్టంగా వరంగల్–1 డిపో రూ.65.94, భూపాలపల్లి డిపో రూ.65.64 చొప్పున సాధించి రికార్డు సృష్టించాయి. సిబ్బంది సమష్టి కృషి వల్లే...: ‘‘ఇంత భారీ ఆదాయం వచ్చేందుకు సిబ్బంది సమష్టి కృషే కారణం, ప్రజలు పండుగలో నిమగ్నమై ఉంటే ఆర్టీసీ సిబ్బంది రోడ్ల మీద ఉండి అహరహం శ్రమించారు. వారందరికీ అభినందనలు’అని ఆర్టీ సీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. -
ఆర్టీసీ లో ‘ఆగస్టు’ టెన్షన్
ఆ 183 మంది ఆర్టీసీ ఉద్యోగులుగానే రిటైర్మెంట్ తీసుకుంటారా? ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా అందే అన్ని రకాల బెనిఫిట్స్ పోయినట్టేనా ? ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనమయ్యే ప్రక్రియ ఆలస్యమవుతున్న కొద్దీ వారిలో తీవ్ర ఆందోళన నెలకొంది. కోరుకున్న అవకాశం అందినట్టే అందిచేజారిపోతుందనే బాధ వారిలో స్పష్టంగా కనిపిస్తోంది. సాక్షి, హైదరాబాద్: ఈ నెల నుంచే ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు చెల్లించేందుకు సిద్ధమని ఇటీవల ఆర్టీసీ చైర్మన్ స్వయంగా ప్రకటించారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నామని ఆర్టీసీ ఉన్నతాధికారులూ వెల్లడించారు. ఆర్టీసీ ఉద్యోగుల వివరాలు, వారు పనిచేస్తున్న విభాగాల వారీగా ఆర్థికశాఖకు వెళ్లాయి. జీతాలు చెల్లింపునకు అంతా సిద్ధమవుతోంది. కానీ, ఇప్పటి వరకు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్టుగా ప్రభుత్వ ఉత్తర్వు మాత్రం జారీ కాలేదు. ఏ తేదీ నుంచి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలో ఆ ఉత్తర్వులో పేర్కొనాల్సి ఉంది. ఆ తేదీ విషయంలో స్పష్టత లేకపోయేసరికి ఇప్పుడు ఆర్టీసీ లో గందరగోళం నెలకొంది. ఆగస్టు నెలాఖరుకు ఆర్టీసీలో 183 మంది పదవీ విరమణ పొందాల్సి ఉంది. రిటైర్మెంట్కు ఇంకా 13 రోజులు మాత్రమే ఉంది. ఇప్పటి వరకు ప్రభుత్వ ఉత్తర్వు వెలువడకపోవటంతో తాము విలీన ప్రక్రియ కంటే ముందే విరమణ చేయాల్సి వస్తుందేమోనన్న టెన్షన్ వారిలో ఉంది. వాస్తవానికి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని గత నెల31నే మంత్రివర్గ సమావేశం తీర్మానించింది. దీంతో తాము కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా పదవీ విరమణ చేయొచ్చని ఈ 183 మంది ఆశపడ్డారు. కానీ నెలాఖరు సమీపిస్తున్నా, అసలు తంతు మాత్రం ఇంకా పెండింగ్‌లో ఉండడంతో వారు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. గవర్నర్ ఆమోదంలో జాప్యంతో..: ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనానికి సంబంధించిన బిల్లును ఈ నెల 6వ తేదీన శాసనసభ ఆమోదించింది. ఆ వెంటనే బిల్లు గవర్నర్ ఆమోదానికి పంపిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు రాజ్‌భవన్ దానిపై ఆమోదముద్ర వేయలేదు. పది రోజులు దాటినా గవర్నర్ ఆమోదం లభించలేదు. దీంతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయలేదు. తాజాగా ఆ బిల్లుపై సందేహాల నివృత్తికి న్యాయశాఖ కార్యదర్శి అభిప్రాయం కోసం పంపినట్టు రాజ్‌భవన్‌వర్గాలు అధికారికంగా ప్రకటన విడుదల చేశాయి. దీంతో బిల్లుపై గవర్నర్ సంతకం, ప్రభుత్వ ఉత్తర్వు జారీకి మరికొంత సమయంపట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ బెనిఫిట్స్ కోల్పోయినట్టేనా ? ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ పరిధిలోకి వస్తే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నుంచి సీనియర్ డిపో మేనేజర్ వరకు పెద్దగా ప్రయాజనం లేకున్నా, కిందిస్థాయి ఆర్టీసీ ఉద్యోగుల వేతనాల్లో మంచి పెరుగుదల ఉంటుంది. గ్రాట్యూటీ, పీఎఫ్ మొత్తం కూడా పెరుగుతుంది. కొత్త పీఆర్సీ వస్తే జీతాలు పెరుగుదల మరింతగా ఉంటుంది. ఆర్టీసీలో ప్రస్తుతం ఉద్యోగ విరమణ వయసు 60 ఏళ్లుగా ఉండగా, ప్రభుత్వంలో అది 61 ఏళ్లుగా ఉంది. దీంతో ఒక సంవత్సరం ఎక్కువగా పనిచేసే వెసులుబాటు కలుగుతుంది. పెరిగిన జీతం 12 నెలల పాటు అందుకునే వీలు చిక్కుతుంది. ఉద్యోగ భద్రతకు భరోసా ఉంటుంది. -
బిల్లుల లొల్లి.. మళ్లీ!.. గవర్నర్ వద్ద నిలిచిపోయిన 12 బిల్లులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మధ్య పెండింగ్ బిల్లుల జగడం మళ్లీ రాజుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ, మండలిలో 12 బిల్లులను పాస్ చేసి గవర్నర్ తమిళిసై ఆమోదం కోసం పంపించగా.. వారం రోజుల నుంచి రాజ్‌భవన్‌లోనే పెండింగ్‌లో ఉన్నాయి. ఆర్టీసీ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ఉద్దేశించిన టీఎస్ఆర్టీసీ చట్ట సవరణ బిల్లు–2023 కూడా వీటిలో ఉంది. గవర్నర్ ఆమోదించాక, ప్రభుత్వం గజిట్ నోటిఫికేషన్లను జారీ చేశాక ఈ బిల్లులు చట్టరూపం దాల్చి, అమల్లోకి రానున్నాయి. రెండోసారి పంపినా నిరీక్షణ గవర్నర్ తమిళిసై గతంలో తిప్పి పంపిన 3 బిల్లులు, తిరస్కరించిన మరో బిల్లుతో కలిపి మొత్తం 4 బిల్లులను ప్రభుత్వం ఇటీవల రెండోసారి అసెంబ్లీలో ఆమోదించింది. వీటితోపాటు మరో 8 కొత్త బిల్లులను సైతం ఆమోదించి.. మొత్తం 12 బిల్లులను రాజ్‌భవన్‌కు పంపింది. వీటి విషయంలో గవర్నర్ కార్యాలయం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. గవర్నర్ తిప్పి పంపిన బిల్లులను అసెంబ్లీ మళ్లీ ఆమోదించి పంపిస్తే.. గవర్నర్ ఆమోదించక తప్పదని రాజ్యాంగంలోని నిబంధనలు పేర్కొంటున్నాయి. ఈ మేరకు సదరు నాలుగు బిల్లులను ఆమోదించడం తప్ప గవర్నర్‌కు గత్యంతరం లేదని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. మరికొన్ని రోజులు గవర్నర్ స్పందన కోసం నిరీక్షించిన అనంతరం.. పెండింగ్ బిల్లుల వ్యవహారంపై మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. రెండు నెలల్లో శాసనసభ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండటంతో.. ఆలోగానే బిల్లులను అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఎమ్మెల్సీ అభ్యర్థులపై ‘పరిశీలన’! గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎరుకల సామాజికవర్గానికి చెందిన కుర్ర సత్యనారాయణ, బలహీనవర్గాల నుంచి దాసోజు శ్రవణ్‌లను నామినేట్ చేయాలని రాష్ట్ర కేబినెట్ గత నెల 31న తీర్మానం చేసి పంపినా.. గవర్నర్ తమిళిసై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎమ్మెల్సీలుగా నియమించేందుకు వారికి ఉన్న అర్హతలను గవర్నర్ పరిశీలిస్తున్నారని రాజ్‌భవన్ వర్గాలు చెప్తున్నాయి. ఈ ఇద్దరు నేతలు గతంలో కొంతకాలం బీజేపీలో పనిచేసి.. తర్వాత బీఆర్ఎస్లో చేరినవారే. గతంలో కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్సీగా నామినేట్ చేసేందుకు గవర్నర్ సమ్మతించకపోవడం నేపథ్యంలో.. ప్రస్తుతం ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది. నెలల తరబడి పరిశీలనలోనే..! పెండింగ్ బిల్లులపై గవర్నర్ తమిళిసై న్యాయ సలహా కోరినట్టు సమాచారం. బిల్లులు రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా? లేదా? అన్న అంశంపై పరిశీలన కోసం తనకు అవసరమైనంత సమయం తీసుకుంటానని గవర్నర్ గతంలో పలుమార్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో నెలల తరబడి బిల్లులు రాజ్‌భవన్ ‘పరిశీలన’లో ఉండిపోతున్నాయి. రాజ్‌భవన్‌లో ఉన్న బిల్లులు ఇవీ.. రెండోసారి ఆమోదించి పంపినవి.. తెలంగాణ మున్సిపల్ బిల్లు–2022 తెలంగాణ ప్రైవేటు వర్సిటీల బిల్లు–2022 రాష్ట్ర పంచాయతీరాజ్ బిల్లు–2023 తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ (రెగ్యులేషన్ ఆఫ్ ఏజ్ ఆఫ్ సూపర్ యాన్యూయేషన్) బిల్లు–2022 తొలిసారిగా ఆమోదించి పంపినవి.. తెలంగాణ పంచాయతీరాజ్ (మూడో సవరణ) బిల్లు – 2023 తెలంగాణ మున్సిపాలిటీల (రెండో సవరణ) బిల్లు–2023 తెలంగాణ ఆర్టీసీ బిల్లు (సర్కారులో ఉద్యోగుల విలీనం) – 2023 తెలంగాణ పంచాయతీరాజ్ (రెండో సవరణ) బిల్లు–2023 తెలంగాణ జీఎస్టీ చట్ట సవరణ బిల్లు–2023 తెలంగాణ స్టేట్ మైనారిటీస్ కమిషన్ బిల్లు–2023 ఫ్యాక్టరీల చట్ట సవరణ బిల్లు–2023 టిమ్స్ వైద్య సంస్థల బిల్లు–2023 -
సూపర్ లగ్జరీ ప్రయాణికులపై ‘వాటర్ చార్జ్’
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు టికెట్ ధర రూ.10 చొప్పున పెరిగింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత శనివారం (ఆగస్టు 12) తొలి సరీ్వసు నుంచి ఇది అమల్లోకి వస్తోంది. ఇంతకాలం ఏసీ బస్సుల్లో ప్రయాణికులకు మంచినీటి సీసాలు అందించే పద్ధతిని ఇప్పుడు సూపర్ లగ్జరీ బస్సుల్లో కూడా ప్రవేశపెడుతున్నారు. ప్రతి ప్రయాణికుడికి అరలీటరు మంచినీటి సీసాను అందించనున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతి టికెట్ ధరపై రూ.10 చొప్పున అదనంగా వసూలు చేయనున్నారు. దూరంతో ప్రమేయం లేకుండా ఈ అదనపు మొత్తం చార్జి చేస్తారు. టికెట్ ధరలోనే దాన్ని కలిపేస్తారు. దీంతో ప్రయాణికుడికి మంచినీటి సీసా అవసరం ఉన్నా లేకున్నా ఈ అదనపు చార్జీతో కూడిన టికెట్ తీసుకోవాల్సిందే. నిత్యం లక్ష మంది ప్రయాణికులపై ఈ తాజా నిర్ణయం ప్రభావం చూపనుంది. టికెట్‌తో పాటే జీవా బాటిల్.. దూర ప్రాంతాలకు ప్రయాణం చేసేవారు సాధారణంగా వాటర్ బాటిళ్లు దగ్గర పెట్టుకుంటారు. చాలామంది బస్టాండ్లలో కొంటారు. బయటి నీటిని తాగేందుకు ఇష్టపడని వారు ఇంటి నుంచి తెచ్చుకుంటారు. దీనిని దృష్టిలో పెట్టుకుని గరుడ ప్లస్, గరుడ, లహరి, రాజధాని ఏసీ బస్సుల్లో ప్రయాణికులకు అరలీటరు పరిమాణంలో ఉన్న నీటి సీసాలను అందించడం ప్రారంభించారు. గతంలో బిస్లరీ సంస్థతో చేసుకున్న ఒప్పందం మేరకు ఆ బ్రాండు మంచినీళ్లు అందించేవారు. ఇటీవల జీవా పేరుతో ఆర్టీసీ సొంతంగా ప్యాకేజ్డ్ మంచినీటిని మార్కెట్లోకి తెచ్చింది. ఆర్టీసీ బస్టాండ్లలో ఈ నీటిని విక్రయిస్తున్నారు. ఏసీ బస్సుల్లో కూడా గతంలో ఇచ్చిన బిస్లరీ బాటిళ్లకు బదులు జీవా నీటినే ఇస్తున్నారు. ఇప్పుడు అదే నీటిని సూపర్ లగ్జరీ బస్సుల్లోనూ పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఆర్టీసీకి ఏం లాభం? జీవా నీటికి ఇంకా ఆదరణ పెరగలేదు. దీన్ని మార్కెట్లోకి తెచ్చిన సమయంలో సీసా, అందులోని నీటి నాణ్యత విషయంలో ఫిర్యాదులొచ్చాయి. స్వయంగా సొంత సిబ్బందే నాణ్యతపై ప్రశ్నించటంతో, ఒప్పందం చేసుకున్న సంస్థను నాణ్యత విషయంలో సంస్థ హెచ్చరించింది. ఈ క్రమంలో కొంతకాలం నిలిపేసి దిద్దుబాటు తర్వాత ఇటీవలే మళ్లీ విడుదల చేశారు. అయితే ఇప్పటికీ అది ప్రయాణికులకు పూర్తిస్థాయిలో పరిచయం కాలేదు. ఈ నేపథ్యంలోనే జీవా బ్రాండ్‌కు ప్రాచుర్యం కల్పించడమే లక్ష్యంగా ఆర్టీసీ తాజా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు దీని ద్వారా కొంత అదనపు ఆదాయం కూడా లభిస్తుందనేది ఆర్టీసీ ఆలోచనగా చెబుతున్నారు. ప్రతి అరలీటరు సీసాపై రూ.5.50 చొప్పున, దాన్ని తయారు చేస్తున్న ప్రైవేటు సంస్థకు చెల్లిస్తారు. డ్రైవర్‌కు ఇన్సెంటివ్‌గా 50 పైసలు చెల్లిస్తుంది. మిగతా రూ.4ను తన ఆదాయంగా ఆర్టీసీ లెక్కలు వేస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీలో దాదాపు 700 సూపర్ లగ్జరీ బస్సులున్నాయి. వీటిల్లో నిత్యం దాదాపు లక్ష మంది ప్రయాణిస్తున్నారు. ఈ లెక్కన వారిపై రోజుకు రూ.10 లక్షల అదనపు భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. -
TSRTC: ఆర్టీసీ బస్సుల్లో సీటు బెల్టులు
సాక్షి, హైదరాబాద్: సాధారణంగా కార్లలో సీటు బెల్టులు వాడుతుంటారు. కానీ, తొలిసారి నగరంలో సీట్ బెల్టులుండే సిటీ బస్సులు అందుబాటులోకి రాబోతున్నాయి. విదేశాల్లో బస్సుల్లో కూడా సీటు బెల్టులు తప్పని సరి. వాస్తవానికి మన దగ్గర కూడా బస్సుల్లోనూ సీటు బెల్టులుండాలనే నిబంధ న ఉన్నా అది అమలుకావటం లేదు. తొలిసా రి ఆర్టీసీ సిటీ సర్విసుల్లో ఆ తరహా సీట్లను అందుబాటులోకి తెస్తోంది. నగరంలో మరో నెలన్నరలో అందుబాటులోకి రానున్న ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్లో ఇవి కనిపించనున్నాయి. ఆ బస్సులు ఎలా ఉండనున్నాయో అధికారులు పరిశీలించేందుకు వీలుగా నమూనా బస్సును సోమవారం బస్‌భవన్‌కు తీసుకురాగా, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పరిశీలించారు. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఐటీ కారిడార్ మార్గాల్లో తిరిగేందుకు వీలుగా ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను తిప్పాలని ఆర్టీసీ ఇటీవల నిర్ణయించింది. ఇప్పటికే పుష్పక్ పేరుతో 40 ఎలక్ట్రిక్ బస్సులు విమానాశ్రయం మార్గంలో తిరుగుతున్న విషయం తెలిసిందే. అవన్నీ లాభాల్లో ఉండటం, రద్దీకి చాలినన్ని లేకపోవటంతో అదనంగా మరిన్ని బస్సులు తిప్పాలని నిర్ణయించారు. దానితోపాటు ఐటీ కారిడార్‌లో మెట్రో రైలు సేవలు అందుబాటులో లేని రూట్లలో కొన్ని తిప్పనున్నారు. ప్రస్తుతం విమానాశ్రయ మార్గంలో నడుస్తున్న ఎలక్ట్రిక్ బస్సులతో పోలిస్తే ఆధునిక వసతులు అదనంగా ఉన్న ఈ కొత్త బస్సులు ప్రయాణికులకు మెరుగైన రవాణా వసతిని అందించనున్నాయి. 500 బస్సులకు ఆర్డర్ 500 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నగరంలో తిప్పాలని నిర్ణయించిన ఆరీ్టసీ, ఇప్పటికే ఆర్డర్ ఇచి్చన విషయం తెలిసిందే. సిటీ బస్సులుగా తిప్పే సర్విసులకు సంబంధించి తొలి విడతలో 50 బస్సులు అందుబాటులోకి రానున్నాయి. అందులో 20 శంషాబాద్ విమానాశ్రయానికి, 30 ఐటీ కారిడార్‌లో తిరుగుతాయి. ఇందులో 25 బస్సులు నెలనెలన్నరలో రోడ్డెక్కుతాయని అధికారులు అంటున్నారు. గ్రాస్ కాస్ట్ కాంట్రాక్టు పద్దతిలో వీటిని ఆర్టీసీ అద్దెకు తీసుకుంటోంది. ఇవి కాకుండా మరో 800 ఎలక్ట్రిక్ బస్సులను దశలవారీగా సమకూర్చుకోవాలనేది ఆర్టీసీ ఆలోచన. వాటికి ఇంకా టెండర్లు పిలవలేదు. ఆకుపచ్చ, తెలుపు రంగుతో.. ఆకుపచ్చ, తెలుపు రంగుతో ఈ బస్సులుంటాయి. రంగుల మేళవింపుపై ఎండీ సంతృప్తి వ్యక్తం చేశారు. బస్సు ముందువైపు ఆర్టీసీ లోగో లేకపోవటాన్ని ప్రశ్నించిన ఆయన, ప్రయాణికులకు కనిపించేలా లోగో ఏర్పాటు చేయాలని సూచించారు. కొన్ని సీట్లకే బెల్టులుండటంతో, అన్ని సీట్లకు ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో సీఓఓ రవీందర్, సీఎంఈ రఘునాథరావు, సీఈఐటీ రాజశేఖర్, ఒలెక్ట్రా కంపెనీ ప్రతినిధులు వేణుగోపాలరావు, ఆనంద్, యతీశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 12 మీటర్ల పొడవు.. ఇప్పుడు కొత్తగా సమకూరే ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు 12 మీటర్ల పొడవుతో ఉంటాయి. ఒక్కో బస్సులో 35 సీట్లుంటాయి.ప్రతి సీటు వద్ద మొబైల్ చార్జింగ్ సాకెట్ అందుబాటులో ఉంటుంది. బస్సుల్లో మూడు సీసీ టీవీ కెమెరాలు అమర్చి ఉంటాయి. అవి ఒక నెల రికార్డింగ్ బ్యాకప్‌తో ఉంటాయి. రివర్స్ చేసేప్పుడు డ్రైవర్‌కు వెనక భాగం కనిపించేలా రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరా ఉంటుంది. ప్రయాణికులకు సూచనలు అందజేసేందుకు వీలుగా బస్సులో నాలుగు ఎల్ఈడీ డిస్ప్లే బోర్డులుంటాయి. అగ్నిప్రమాదాలను ముందుగానే గుర్తించేందుకు వీలుగా బస్సులో ఫైర్ డిటెక్షన్ సప్రెషన్ సిస్టం ఉంటుంది. వెహికిల్ ట్రాకింగ్ సిస్టం కూడా ఉంటుంది. ఒకసారి ఫుల్ చార్జి అయితే 225 కి.మీ. దూరం వరకు ప్రయాణిస్తాయి. ఫుల్ చార్జింగ్కు దాదాపు 3 గంటల సమయం పడుతుంది. -
ప్రగతి రథచక్రాలు ఎన్నటికీ ఆగవు: పువ్వాడ
ఖమ్మం మయూరిసెంటర్: సీఎం కేసీఆర్ సారథ్యాన టీఎస్ ఆర్టీసీని బతికించుకునేందుకు అనేక చర్యలు తీసుకున్నామని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా ప్రగతి రథచక్రాలు ఇక ఎన్నటికీ ఆగవని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. సోమవారం ఖమ్మం చేరుకున్న మంత్రి పువ్వాడకు ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు, మున్నేరు పరీవాహక ప్రాంతాల ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. అసెంబ్లీలో ఆర్టీసీ విలీనం బిల్లు ప్రవేశపెట్టడమే కాక మున్నేరుకు ఇరువైపులా రూ.150 కోట్లతో ఆర్సీసీ వాల్ నిర్మాణానికి కేబినెట్లో ఆమోదం పొందేలా కృషి చేసినందుకు మంత్రిని సత్కరించారు. ఈ సందర్భంగా పువ్వాడ మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులను కడుపులో పెట్టుకుని చూసుకున్నామని, 43 వేలమంది ఆర్టీసీ ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు అందరూ రుణపడి ఉండాలని అన్నారు. ఇక నుంచి ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత ఉంటుందని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు తీసుకునే అవకాశం ఉందని చెప్పారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, సీఎం కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా అధికారంలోకి రాబోతున్నారని పువ్వాడ ధీమా వ్యక్తం చేశారు. -
గవర్నర్‌కు జ్ఞానోదయం అయినందుకు సంతోషం: సీఎం
సాక్షి, హైదరాబాద్: ‘ఆర్టీసీ బిల్లు విషయంలో గవర్నర్ పాపం తెలిసో తెలియకో అనవసరంగా వివాదం కొని తెచ్చుకున్నారు. ఎందుకు పని పెట్టుకున్నారో తెలియదు. 96 క్లారిఫికేషన్లు అడిగారు. ఆ అంశాలన్నింటినీ ప్రభుత్వం పరిశీలించి, పరిగణనలోకి తీసుకున్నవే. మొత్తం మీద గవర్నర్‌కు జ్ఞానోదయమై ఆదివారం మధ్యాహ్నం బిల్లుకు ఆమోదం తెలిపి పంపినందుకు సంతోషం. ప్రభుత్వం, ఆర్టీసీ ఉద్యోగుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం..’ అని సీఎం కేసీఆర్ అన్నారు. ఆదివారం అసెంబ్లీలో ఈ అంశంపై ముఖ్యమంత్రి మాట్లాడారు. ‘ఆర్టీసీని పెట్టిందే ప్రజారవాణా ఉండాలని. కాలక్రమేణా సంస్థ నష్టాల్లో పడింది. నేను రవాణా మంత్రిగా అంకితభావంతో పనిచేసి రూ.14 కోట్ల నష్టంలోని సంస్థను రూ.14 కోట్ల లాభాల్లోకి తెచ్చా. శక్తిసామర్థ్యాలుంటే సంస్థ నష్టాలను పూడ్చవచ్చు. కానీ డీజిల్ ధరల పెరుగుదలతో పరిస్థితి చేయిదాటింది. తమను ప్రభుత్వంలోకి తీసుకోవాలని గతంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే, తగిన డబ్బిస్తామని నడిపించుకోవాలని చెప్పాం. లాభాలు తీసుకురావాలని బెస్ట్ ఐపీఎస్ అధికారిని నియమించాం. మంచి అనుభవమున్న బాజిరెడ్డి గోవర్దన్‌ను చైర్మన్‌ను చేశాం. వారు విశ్వప్రయత్నాలు చేసినా డీజిల్ ధరలు విపరీతంగా పెరగడంతో నష్టాలు మరింత పెరిగాయి. డీజిల్ లీటర్ రూ. 60 నుంచి రూ.110 కావడంతో ఆమాంతంగా ఖర్చు పెరిగి రోజుకు రూ.2.5 కోట్ల నష్టం వాటిల్లింది. దీంతో ఇటీవల కేబినెట్లో.. గతంలో ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో కలపొద్దని అనుకున్నామని, ఇప్పుడేం చేద్దామని చర్చించాం. ప్రజలకు రవాణా సదుపాయం కల్పించడం ఏ ప్రభుత్వానికైనా సామాజిక బాధ్యత. పైగా ఆర్టీసీని తీసేయడానికి లేదు. అది మంచి నైపుణ్యాలున్న సంస్థ. జీరో యాక్సిడెంట్‌తో ప్రయాణికులను క్షేమంగా చేరవేసే సంస్థ. కానీ అది మనుగడ సాగించే అవకాశం లేదు. దీంతో ప్రభుత్వమే సాకాలి. మరో దారిలేదు. ఇప్పటికే ఏడాదికి బడ్జెట్లో పెట్టి మరీ రూ.1,500 కోట్లు వారికి ఇస్తున్నాం. ప్రభుత్వంలో లేదన్న పేరే తప్ప గవర్నమెంటే సాదుతోంది. కాబట్టి ప్రభుత్వంలోకి తీసుకుందాం. ఉద్యోగులకు భద్రత వస్తుంది. సంస్థకు చిక్కులు పోతాయనే ఉద్దేశంతో విలీనం నిర్ణయం కేబినెట్లో తీసుకున్నాం’ అని కేసీఆర్ వివరించారు. భూములపై కన్ను అంటూ నీచంగా మాట్లాడుతున్నారు.. ‘గతంలో వద్దన్నవారే మళ్లీ ఎట్లా తీసుకున్నారని పిచ్చివాగుడు చేసే వాళ్లు ఉన్నారు. ప్రభుత్వం ఏ పనిచేసినా ఓ బాధ్యతతో, దృక్పథంతో, పరిశీలనతో చేస్తుంది. ఇక సగం సగం ఎందుకు పూర్తిగానే బాధ్యత తీసుకుందామని నిర్ణయించాం. మరో ఇద్దరు యువ ఐఏఎస్ అధికారులను పెట్టి ఆదాయం పెంచే చర్యలు తీసుకోవాలని అనుకున్నాం. కానీ ఆర్టీసీ ఆస్తులపై ప్రభుత్వం కన్నేసిందని కొందరు దుర్మార్గులు, నీచులు మాట్లాడుతున్నారు. ఇంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా? ఇంటి పిల్లవాడిని సాదుకోవాలి తప్ప చంపుకోలేము. మరిన్ని సౌకర్యాలు పెంచి, అవసరమైతే మరిన్ని స్థలాలు సేకరించి ప్రభుత్వ పరంగా సరీ్వసులు పెంచుతాం. ఆర్టీసీ ఉద్యోగులకూ పీఆర్సీ ఇస్తాం. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చేవి వారికి కూడా వస్తాయి’ అని సీఎం తెలిపారు. -
‘విలీనానికి’ అనుమతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ప్రతిపాదించిన ఆర్టీసీ చట్ట సవరణ బిల్లు–2023కు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్ర రవాణా శాఖ, ఆర్టీసీ అధికారులతో ఆదివారం రాజ్‌భవన్‌లో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం పలు సిఫారసులతో బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టేందుకు అనుమతించారు. దీంతో విలీనంపై మూడురోజులుగా కొనసాగిన ఉత్కంఠకు తెరపడినట్టయ్యింది. ముగిసిన హైడ్రామా ఆర్టీసీ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్ అనుమతి కోరుతూ ఈ నెల 2న రాష్ట్ర ప్రభుత్వం బిల్లును రాజ్‌భవన్‌కు పంపింది. అయితే బిల్లు పరిశీలనకు సమయం కావాలని 3వ తేదీన రాజ్‌భవన్ ప్రకటించింది. ఉద్యోగుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం కావడంతో అదే రోజు బిల్లును పరిశీలించిన గవర్నర్ తమిళిసై 5 సందేహాలపై ప్రభుత్వ నుంచి వివరణలు కోరారు. మరోవైపు ఆర్టీసీ ఉద్యోగులు రాజ్‌భవన్‌ను ముట్టడించి ధర్నా నిర్వహించగా, ప్రభుత్వ ప్రొద్బలమే ఇందుకు కారణమని రాజ్‌భవన్ ఆరోపించింది. కాగా ప్రభుత్వం పంపిన వివరణలతో సంతృప్తి చెందని గవర్నర్.. ఈ నెల 5న రెండోసారి మరికొన్ని సందేహాలకు సమాధానాలను కోరగా, ప్రభుత్వం వెంటనే ఆ మేరకు వివరణలు పంపించింది. రవాణా శాఖ, ఆర్టీసీ ఉన్నతాధికారులతో చర్చించిన అనంతరం ఎట్టకేలకు ఆదివారం బిల్లుకు గవర్నర్ సమ్మతి తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ ప్రభుత్వానికి పలు సిఫారసులు చేశారు. కారుణ్య నియామకాలు చేపట్టాలి ప్రభుత్వంలో ఉద్యోగుల విలీనం తర్వాత కూడా సంస్థ భూములు, ఆస్తులపై యాజమాన్య హక్కులను ఆర్టీసీ సంస్థే కలిగి ఉండాలి. సంస్థ అవసరాల కోసమే వాటిని వినియోగించాలి. ఈ మేరకు ప్రభుత్వం హామీ ఇవ్వాలి. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఏపీ, తెలంగాణ మధ్య ఆస్తుల పంపిణీ ప్రక్రియ పూర్తి కావాలి. ఉమ్మడి ఏపీఎస్ఆర్టీసీ నుంచి రావాల్సిన బకాయిల చెల్లింపుపై స్పష్టత ఇవ్వాలి. బకాయిల చెల్లింపు బాధ్యతను తీసుకోవాలి. విలీనం తర్వాత ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పారితోశాకాలు, జీతభత్యాలు, పే స్కేలు, సర్విసు నిబంధనలు, బదిలీలు, పదోన్నతులు, పెన్షన్, ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ వంటి ప్రయోజనాలు వర్తింపజేయాలి. వైద్యపరంగా అనర్హులు(మెడికల్లీ అన్‌ఫిట్)గా మారే ఉద్యోగులు కారుణ్య నియామకం కింద తమ కుటుంబ సభ్యులకు ఉద్యోగం కోరే సదుపాయాన్ని కల్పించాలి. అత్యంత కఠినంగా ఉన్న ఆర్టీసీ ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యల ప్రక్రియను సరళీకరించి మానవీయంగా మార్చాలి. అందరికీ సమాన ప్రయోజనాలు ఆర్టీసీ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రెగ్యులర్ ఉద్యోగుల తరహాలో రాష్ట్ర సర్విసు నిబంధనల మేరకు సమాన ప్రయోజనాలు, జీతాలు, పీఎఫ్ చెల్లించాలి. వారి ఉద్యోగ భద్రతను పరిరక్షించి వారి సేవలను ఇతర శాఖల్లో వినియోగించుకోవాలి. ఆర్టీసీ ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు సర్విసులో ఉన్నంత కాలం వారికి ఆర్టీసీ ఆస్పత్రుల్లో వైద్య సేవలు కొనసాగించాలి. ఉద్యోగుల కుటుంబ సభ్యులకు సైతం వైద్య ప్రయోజనాలు అందించాలి. బస్సుల నిర్వహణలో ఆర్టీసీ సంస్థ, యూనియన్ల పాత్రే కీలకం. ప్రజల భద్రత కోసం బస్సుల నిర్వహణను ప్రభుత్వం తీసుకుని, ఔట్సోర్సింగ్ పద్ధతిలో స్వతంత్ర సంస్థకు లేదా మరేదైనా పద్ధతిలో అప్పగించాలి. నిర్వహణ వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇవ్వాలి. -
ఆర్టీసీ విలీనం డ్రాఫ్ట్ బిల్లుకు గవర్నర్ తమిళిసై ఆమోదం
-
కార్మికులకు అండగా ఉన్నా..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బిల్లును హడావుడిగా ప్రవేశపెట్టడం సరికాదని, అందులోని అంశాలపై విస్తృత చర్చ కోసం భాగస్వామ్య పక్షాలకు తగిన సమయం ఇవ్వాల్సి ఉందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పష్టం చేశారు. బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు అనుమతి ఆపడం వెనక తనకు వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాలేమీ లేవని.. ప్రజలు, ఆర్టీసీ ఉద్యోగులు, సంస్థ ప్రయోజనాలను రక్షించడమే తన ఉద్దేశమని చెప్పారు. తాను ఎల్లçప్పుడూ ఆర్టీసీ కార్మికుల పక్షాన ఉంటానని, గత సమ్మె సమయంలో కూడా కార్మికులకు అండగా నిలబడి అర్ధరాత్రి వారి సమస్యలను విన్నానని గుర్తు చేశారు. శనివారం ఆమె పుదుచ్చేరి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ, తెలంగాణ మజ్దూర్ యూనియన్ల ప్రతినిధులతో మాట్లాడారు. 43,373 మంది ఆర్టీసీ ఉద్యోగుల భవిష్యత్తు పట్ల ఆందోళన, సానుభూతి వ్యక్తం చేశారు. ఆర్టీసీ బిల్లుపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి తగిన వివరణలు అందాక.. ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సరైన నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చారు. పీఆర్సీ, గ్రాట్యుటీ చెల్లింపు ఎప్పుడు? ఆర్టీసీ ఉద్యోగుల వేతన సవరణలు (పీఆర్సీలు), ఈపీఎఫ్, గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ బకాయిల చెల్లింపు వంటివి పెండింగ్‌లో ఉండటంపై గవర్నర్ ఆందోళన వ్యక్తం చేశారు. రిటైర్డ్ ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమ సహకార సొసైటీకి చెందిన రూ.3 వేల కోట్లకుపైగా నిధులను ప్రభుత్వం తీసుకుని ఇప్పటివరకు చెల్లించలేదని గుర్తు చేశారు. రాష్ట్రానికి రాజ్యాంగబద్ధ అధిపతిగా రాజ్యాంగ నియమాల పరిరక్షణతోపాటు ప్రజలు, ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడే బాధ్యత తనపై ఉందన్నారు. ధర్నాకు మంత్రుల వ్యూహరచన: ఉద్యోగ సంఘాలు ఉద్యోగ సంఘాలు ఎలాంటి సమ్మెకు పిలుపు ఇవ్వలేదని వీడియో కాన్ఫరెన్స్‌లో జేఏసీ ప్రతినిధులు గవర్నర్‌కు చెప్పారు. ప్రభుత్వ ప్రోద్బలంతో బలవంతంగా సమ్మె చేయించారని, మహిళా ఉద్యోగులను సైతం వదిలిపెట్టలేదని ఆరోపించారు. రాజ్‌భవన్ ముట్టడి జరపాలని తమపై ఒత్తిడి తెచ్చారని.. ధర్నాకు ఎమ్మెల్యేలు, మంత్రులు వ్యూహరచన చేశారని పేర్కొన్నారు. -
పెండింగ్‌లో పెట్టి తప్పించుకునే యత్నం
సాక్షి, హైదరాబాద్: ’’ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని మేము అడిగితే తలకాయ ఉన్నోడు చేయడు అని సీఎం కేసీఆర్ అన్నారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడ్డాయని ప్రకటన చేశారు. బిల్లును పెండింగ్‌లో పడేటట్టు చేసి తప్పించుకునే పనిలో కేసీఆర్ ఉన్నారు. అని కాంగ్రెస్ శాససనసభా పక్షం నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. బిల్లు విషయంలో కుంటి సాకులు ఎందుకని ప్రశ్నించారు. శనివారం సభ వాయిదా పడిన అనంతరం ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, సీతక్కలతో కలిసి ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. 60 రోజులు జరగాల్సిన శాసనసభా సమావేశాలను గరిష్టంగా 10 రోజులకు కుదించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని ఎద్దేవా చేశారు. కేటీఆర్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు ప్రతిపక్షాలు లేవనెత్తిన సమస్యలపై కేటీఆర్ అసెంబ్లీలో అడ్డగోలుగా మాట్లాడారని భట్టి విమర్శించారు. ప్రతిపక్ష నేతలను పందులు, కుక్కలు, గాడిదలు అని మాట్లాడటం చూస్తుంటే సభకు ఎందుకు వస్తున్నామా అని అనిపిస్తోందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండేది రెండు నెలలేనని, ఇప్పుడు బుకాయించినా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వారి తప్పులు తేలుస్తామని హెచ్చరించారు. సభ నడిపే విధానం ఇది కాదని, ఈ విషయంపై ఆదివారం స్పీకర్‌ని కలుస్తామని చెప్పారు. ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మాట్లాడుతూ సమస్యలు చెప్తే ఓపికగా వినాల్సిన మంత్రులు అసహనంతో మాట్లాడుతున్నారని, మంత్రుల తీరును రాష్ట్ర ప్రజలు గమనించాలని కోరారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రజల పక్షాన బాధ్యతతో తాము చెపుతున్నామని, ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చే విషయంలో సభ హుందాతనం కాపాడే విధంగా స్పీకర్ వ్యవహరించాలని కోరారు. అసెంబ్లీనా. బీఆర్ఎస్ కార్యాలయమా?: శ్రీధర్ ఈ అసెంబ్లీ తీరు చూస్తుంటే ప్రజలకు భరోసా ఇచ్చే వేదికలా లేదని, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలా మారిందని శ్రీధర్‌బాబు వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ వరద బాధితులకు అసెంబ్లీ ద్వారా భరోసా ఇస్తారని తాము అనుకున్నామని, అలా కాకుండా అసెంబ్లీని పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. టిఫిన్ చేయడానికి తాము బయటకు వెళితే సభలో కాంగ్రెస్ సభ్యులు లేరనే ప్రజలకు అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారన్నారు. -
గుండెపోటుతో ఆర్టీసీ ఉద్యోగి మృతి
మంచిర్యాల: ఆసిఫాబాద్ ఆర్టీసీ డిపోలో సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న బూసి బాపు(53) శనివారం విధులు నిర్వహిస్తుండగా మధ్యాహ్నం భోజనం తర్వాత అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు మంచిర్యాలకు తీసుకెళ్లమని సూచించారు. వెంటనే పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసువెళ్లి చూపించగా వారు కూడా మంచిర్యాలకు రెఫర్ చేశారు. కాగజ్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతునికి భార్య గౌరుబాయి, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
ఆర్టీసీ బిల్లు.. మరో ట్విస్ట్ ఇచ్చిన గవర్నర్
ఆర్టీసీ డ్రాఫ్ట్ బిల్లును ఈ దఫా అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు తెలంగాణ సర్కార్ చేస్తున్న ప్రయత్నాలకు రాజ్‌భవన్ నుంచి ఇంకా అనుమతి దక్కలేదు. తాజాగా ఈ వ్యవహారంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ట్విస్ట్ ఇచ్చారు. మరో మూడు వివరాలపై ప్రభుత్వం నుంచి వివరణ కోరారు. దీంతో గవర్నర్ సంధించిన ప్రశ్నలపై ప్రభుత్వం సమాధానాలు సిద్ధం చేస్తోంది. ► ఆర్టీసీకి చెందిన భూములు, భవనాలు ఎన్ని ఉన్నాయి. ► డిపోలవారీగా ఉద్యోగుల సంఖ్య ఎంత? ► పర్మినెంట్ కానిఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారా? ‘‘నిన్న బిల్లు పంపి ఇవ్వాళ సంతకం కావాలంటే కరెక్ట్ కాదు. నేను ఆర్టీసీ కార్మికుల భవిష్యత్ కోసమే ప్రభుత్వాన్ని క్లారిటీ అడుగుతున్నా. ఏ బిల్లులోలైనా నిబంధనల ప్రకారమే నేను వెళ్తున్నాను. రాజ్యాంగం ప్రకారమే ప్రభుత్వాన్ని క్లారిటీ అడుగుతున్నా. ప్రతీ బిల్లుకు కొన్ని రూల్స్ ఉంటాయి. కార్మికులకు వివిధ రూపాల్లో రావాల్సిన బకాయిలు, నిధుల గురించి ప్రభుత్వాన్ని అడిగాము. నేను పీపుల్ ఫ్రెండ్లి గవర్నర్ ను. బిల్లుపై రాజ్ భవన్ ఆఫీస్ కు ఎలాగైతే నిరసనగా వచ్చారో..ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేయండి. రాజ్ భవన్ కు నిరసనగా కార్మికులు వచ్చినందుకు నేనేం బాధపడటం లేదు. రిటైర్మెంట్ బెనిఫిట్స్...హెల్త్ బెనిఫిట్స్ పై ముసాయిధలో స్పష్టత లేదు. మీరు భవిష్యత్ హక్కుల కోసం అడగటం న్యాయమే కానీ బకాయిల విషయంలో మీ పోరాట స్ఫూర్తిని ఎందుకు ప్రశ్నించడం లేదు?. నేను ఆర్టీసీ కార్మికుల కోసమే ఉన్నా...మీ హక్కుల కోసమే అడుగుతున్నా ప్రాధాన్యత క్రమంలో మీ సమస్యలను పరిష్కరించేందుకు ముందుండాలని అడుగుతున్నా. బిల్లులో స్పష్టత లేవని గవర్నర్ అడుగుతున్నట్లు...ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లండి. బాధ్యతాయుత గవర్నర్ వ్యవస్థలో భాగంగానే నేను మీ న్యాయమైన అంశాల విషయంలో స్పష్టత కోసమే ఆపాను. అంతే తప్ప ఇంకో ఉద్దేశం లేదు. భవిష్యత్ ఎలాంటి సమస్యలు రాకూడదనే బిల్లులో స్పష్టత కోరుతున్నా అని ఆమె యూనియన్ నేతలను ఉద్దేశించి ఆమె పుదుచ్చేరి నుంచి వీడియో కాల్ ద్వారా వ్యాఖ్యానించినట్లు సమాచారం. టీఎస్సార్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియకు సంబంధించిన బిల్లులో ఐదు అంశాలను ప్రస్తావిస్తూ తెలంగాణ ప్రభుత్వం నుంచి వివరణ కోరారు. ఆర్టీసీలో కేంద్ర గ్రాంట్లు, వాటాలు, లోన్ల వివరాలు లేవు. ఉద్యోగుల ప్రయోజనాలు ఎలా కాపాడతారు? ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వారికి పింఛన్ ఇస్తారా? విజభన చట్టం ప్రకారం ఆర్టీసీ స్థితిని మార్చడంపై వివరాలు లేవు. పదోన్నతులు, క్యాడర్ నార్మలైజేషన్లో న్యాయం ఎలా చేస్తారు? వీటితో పాటు ఆర్టీసీ కార్మికుల భద్రత, ప్రయోజనాలపై స్పష్టమైన హామీలను గవర్నర్ కోరారు. దీనికి ప్రభుత్వం నుంచి.. ఉద్యోగులను మాత్రమే ప్రభుత్వంలోకి తీసుకుంటున్నామని.. సంస్థ యథాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. కార్పొరేషన్ (TSRTC) యథాతథంగా కొనసాగుతున్నందున విభజన చట్టానికి ఎలాంటి ఇబ్బంది లేదని వెల్లడించింది. అలాగే కేంద్ర వాటా, గ్రాంట్లు, రుణాల వివరాలు అవసరం లేదని పేర్కొంది. ఉద్యోగుల ప్రయోజనాల పరిరక్షణే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం స్పష్టం చేసింది. పింఛన్లు, తదితరాలకు సంబంధించి ఎలాంటి అయోమయం లేదన్న ప్రభుత్వం.. ప్రభుత్వంలో తీసుకున్న తర్వాత కార్మికులతో చర్చించే నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించింది. వేతనాలు, భత్యం, కేడర్, పదోన్నతులకు ఎలాంటి సమస్య ఉండదని పేర్కొంది. ఈ మేరకు గవర్నర్ అడిగిన అన్ని అంశాలపై వివరణ ఇచ్చామని.. శాసనసభలో ఆర్టీసీ బిల్లును ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అంతకు ముందు గవర్నర్ ఆర్టీసీ బిల్లు డ్రాఫ్ట్‌పై సంతకం చేయాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. కాసేపు బస్సులు నిలిపివేసి నమ్మె చేపట్టారు. హైదరాబాద్‌లో రాజ్‌భవన్ వద్దకు చేరుకుని కొందరు ఉద్యోగులు గవర్నర్ సంతకం చేయాలంటూ ధర్నా చేపట్టారు. రేపటితో అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో బిల్లు క్లియరెన్స్ అవుతుందా? లేదా? అనే ఉత్కంఠ నెలకొంది.