సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ తమ ఉద్యోగులకు మరో విడత కరువు భత్యాన్ని (డీఏ) ప్రకటించింది. ఈసారి డీఏను 5 శాతం పెంచింది. దీనితో ప్రస్తుతమున్న 72.8 శాతం నుంచి 77.8 శాతానికి డీఏ పెరిగిందని.. సెప్టెంబర్ వేతనం నుంచే దీనిని చెల్లిస్తామని అధికారులు తెలిపారు.
2019 జూలై నుంచి పెండింగ్‌లో ఉన్న డీఏలను ఇటీవల వరుసగా ప్రక టిస్తూ రాగా.. ప్రస్తుతం 2023 జూలై డీఏ ఒక్కటి మాత్రమే పెండింగులో ఉన్నట్టయింది. ఆర్టీసీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఇప్పటివరకు సంస్థ 8 డీఏలను మంజూరు చేసిందని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఉద్యో గులు కష్టపడి పనిచేస్తున్నారని, బకాయిలను త్వరలోనే ఇవ్వడానికి యాజమాన్యం ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు.
పెండింగ్ బకాయిల ప్రస్తావన లేదు
పెండింగ్ డీఏల అమలును ప్రకటిస్తూ వస్తున్న ఆర్టీసీ.. వాటికి సంబంధించిన బకాయిలు (ఇప్పటివరకు చెల్లించాల్సిన మొత్తాన్ని) మాత్రం ఇవ్వటం లేదు. కేవలం అమల్లోకి తెచ్చిన నెల నుంచే లెక్కిస్తూ చెల్లి స్తోంది. ఇలా ఇప్పటివరకు సుమారు 168 నెలల బకాయిలు ఉన్నాయని, ఆ మొత్తాన్ని వెంటనే చెల్లించాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఓ విడత డీఏ బకాయిని ప్రకటించేలోపు పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు దాని లబ్ధి కలగటం లేదని.. అలాంటి వారికి లబ్ధి కలగాలంటే బకాయిలు చెల్లించాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికైనా డీఏలను చెల్లించడాన్ని స్వాగతిస్తు న్నామని.. అయితే బకాయిల సొమ్ము కూడా అందితేనే అందరు ఉద్యోగులకు న్యాయం జరిగినట్టు అవుతుందని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి వీఎస్‌రావు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment