DA
-
ఈపీఎఫ్ కనీస పెన్షన్.. నెలకు రూ. 7500?
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కింద ఉన్న, ప్రైవేట్ రంగ ఉద్యోగులు చాలా కాలంగా తమ కనీస పెన్షన్‌ను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రకటన 2025-26 బడ్జెట్ సమావేశంలో నిర్మలా సీతారామన్ ప్రకటిస్తారేమో అని చూసారు. కానీ ఫలితం లేకుండా పోయింది. అయితే ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో దీనికి సంబంధించిన ప్రకటలను వెలువడే అవకాశం ఉంది.2024-25 ఆర్థిక సంవత్సరానికి.. ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ రేటును ఖరారు చేయడానికి EPFO సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) ఫిబ్రవరి 28, 2025న సమావేశం కానుంది. ఇందులో పెన్షన్ సవరణకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు. వడ్డీ రేటుకు సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా.. పెన్షన్ పెంపుదల అంశం చర్చనీయాంశంగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.2014 నుంచి మినిమమ్ పెన్షన్ నెలకు రూ. 1,000గా ఉంది. దీనిని 7500 రూపాయలకు పెంచాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. EPF సభ్యులు తమ జీతంలో 12 శాతం ప్రావిడెంట్ ఫండ్‌కు జమ చేస్తారు. అంతే మొత్తంలో సంస్థ కూడా జమచేస్తుంది. కంపెనీ జమచేసి 12 శాతంలో.. 8.33 శాతం ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS)కి కేటాయిస్తారు. మిగిలిన 3.67 శాతం EPF స్కీమ్‌కి వెళుతుంది.గత కొన్ని సంవత్సరాలుగా.. పెన్షనర్లు, న్యాయవాద సంఘాలు ప్రస్తుత పెన్షన్ స్కీమును విమర్శిస్తున్నాయి. దాదాపు నాలుగు దశాబ్దాలుగా నెలకు రూ.1,000 పెన్షన్ సరిపోదని చెబుతున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వైద్య ఖర్చులతో, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. కాబట్టి ఇక సీబీటీ నిర్ణయం కోసం వారందరూ ఎదురు చూస్తున్నారు.EPFO కనీస పెన్షన్ పెంపు2025 బడ్జెట్‌కు ముందు.. EPS-95 పదవీ విరమణ చేసిన వారి ప్రతినిధి బృందం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి, నెలకు రూ. 7,500 కనీస పెన్షన్ పెంపు, డియర్నెస్ అలవెన్స్ (DA) గురించి వివరించారు. ఆ విషయాలను తప్పకుండా పరిశీలిస్తామని ఆర్థిక మంత్రి హామీ ఇచ్చారని EPS-95 జాతీయ కమిటీ పేర్కొంది. దీన్ని బట్టి చూస్తే.. మినిమమ్ పెన్షన్ పెంపు తప్పకుండా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు
సాక్షి, హైదరాబాద్: దీపావళి సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు 3.64 శాతం డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. డీఏ పెంపు 2022 జులై ఒకటో తేదీ నుంచి వర్తిస్తుందని వెల్లడించింది. నవంబరు జీతంతో కలిపి పెరిగిన డీఏ చెల్లింపులు చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.అక్టోబర్ 26న కేబినెట్ భేటీలో ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న డీఏల విడుదలకు పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగులకు రెండు డీఏలు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీపావళి పండుగ వేళ పెండింగ్‌లో ఉన్న డీఏ విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.👉పెరిగిన డీఏ 2022 జులై 1వ తేదీ నుంచి వర్తింపు👉డిసెంబర్ 1న చెల్లించే నవంబర్ జీతంతో కలిపి పెరిగిన డీఏ చెల్లింపు👉2022 జులై 1 నుంచి ఈనెల వరకు డీఏ బకాయిలు జీపీఎఫ్ ఖాతాలో జమ👉సీపీఎస్ ఉద్యోగులకు డీఏ బకాయిలు 10 శాతం ప్రాన్ ఖాతాకు జమ👉సీపీఎస్ ఉద్యోగులకు మిగతా 90 శాతం 17 వాయిదాల్లో చెల్లింపు👉సీపీఎస్ ఉద్యోగులకు 2025 ఫిబ్రవరి నుంచి 17 వాయిదాల్లో చెల్లింపులు👉జీపీఎఫ్ ఖాతాలు లేని పుల్టైం కంటింజెంట్ ఉద్యోగులకు 17 వాయిదాల్లో చెల్లింపు👉కంటింజెంట్ ఉద్యోగులకు 2025 ఫిబ్రవరి నుంచి 17 వాయిదాల్లో చెల్లింపులు👉రిటైర్డ్ ఉద్యోగులకు డీఏ బకాయిలు 2025 జనవరి నుంచి 17 వాయిదాల్లో చెల్లింపు -
మూడేళ్ల తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లిస్తాం అనడం దుర్మార్గం : హరీష్ రావు
సిద్దిపేట: కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగులకు ఇవ్వాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు మన్మోహన్ వీడ్కోలు కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రిటైర్డ్ అయిన 6 వేల మంది ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడం లేదు. ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ 3 సంవత్సరాల తర్వాత చెల్లిస్తాం అనడం దుర్మార్గం.4 డీఏలకు ఒక డీఏ మాత్రమే ప్రకటించి ప్రభుత్వ ఉద్యోగులను నిరాశపరిచింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగులకు ఇవ్వాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను వెంటనే విడుదల చేయాలని హరీష్ రావు సూచించారు. -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు
న్యూఢిల్లీ: పండగ సీజన్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందింది. ఉద్యోగులకు డీఏ(డియర్నెస్ అలవెన్స్), పెన్షనర్లకు డీఆర్(డియర్నెస్ రిలీఫ్)ను మూడు శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో ఉద్యోగులకు డీఏ వారి మూలవేతనంలో 45 శాతానికి చేరింది. ఈ పెంపు జులై 1, 2024 నుంచి అమలు చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రస్తుతం రూ.18 వేలు బేసిక్ వేతనం అందుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగికి అదనంగా రూ.540 పెంపు ఉంటుందని అంచనా.పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం డియర్నెస్ అలవెన్స్ (డీఏ), డీఆర్(డియర్నెస్ రిలీఫ్)లో మార్పులు చేస్తుంటుంది. ప్రభుత్వ తాజా నిర్ణయం వల్ల కోటి మందికిపైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. సాధారణంగా డీఏ పెంపు ఏడాదిలో రెండుసార్లు ప్రకటిస్తారు. మార్చిలో హోళీ పండగ సమయంలో ఒకసారి, దీపావళి పండగ నేపథ్యంలో అక్టోబర్-నవంబర్ సమయంలో రెండోసారి ప్రకటిస్తారు. అందులో భాగంగానే ఈ నెల చివరివారంలో దీపావళి ఉండడంతో డీఏ పెంపును ప్రకటించినట్లు తెలిసింది.ఇదీ చదవండి: బంగారం స్వచ్ఛత తెలుసుకోండిలా..ఛత్తీస్‌గఢ్‌లో నాలుగు శాతం పెంపుఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ (డీఏ) పెంచుతున్నట్లు ప్రకటించారు. దీపావళి పండగ సీజన్‌కు ముందు డీఏను నాలుగు శాతం పెంచుతున్నట్లు చెప్పారు. ఈ నిర్ణయం వల్ల దాదాపు 3.9 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుందని తెలిపారు. ఈ పెంపు అక్టోబర్ 1 నుంచి అమలు కానుందని పేర్కొన్నారు. -
రెండు డీఏలకు త్వరలో మోక్షం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యం(డీఏ) బకాయిలను త్వరలో చెల్లించనున్నారు. పెండింగ్‌లో ఉన్న నాలుగు బకాయిల్లో రెండింటిని వీలున్నంత త్వరగా మంజూరు చేయా లని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. ఈ మేరకు రెండు డీఏల ప్రతిపాదనలు, అవసర మైన నిధుల అంచనాలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశాలిచ్చారు. వీలును బట్టి సెప్టెంబర్‌లోనే ఈ రెండు డీఏలను మంజూరు చేయాలని, లేదంటే దసరా కానుకగా ప్రకటించాలనే యోచనలో ప్రభు త్వం ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి నెలా మొదటి తేదీనే ఉద్యోగులకు వేతనాలు అందుతున్నాయని, పెండింగ్‌లో ఉన్న డీఏలను మంజూరు చేయడం ద్వారా వారిలో మరింత మనోస్థై ర్యాన్ని నింపాలన్న ఉద్యోగ సంఘాల విజ్ఞప్తులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. వీలైనంత త్వరలోనే రెండు డీఏలను మంజూరు చేస్తూ అధి కారిక ప్రకటన చేసే అవకాశాలున్నాయి. నెలకు రూ.150 కోట్ల భారంవాస్తవానికి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. 2022 జూలై, 2023 జనవరి, జూలై, 2024 జనవరికి సంబంధించిన డీఏలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. 2024 జూలై డీఏను కేంద్రం ఇంకా ప్రకటించలేదు. అంటే కేంద్రం ప్రకటించిన విధంగా ప్రతి డీఏ కింద బేసిక్‌పేలో 3.64 శాతం వేతనాన్ని ప్రకటించాల్సి ఉంది. నాలుగు డీఏలు కలిపి అది 14.56 శాతానికి చేరుతుంది. ఇప్పుడు రెండు డీఏలు మంజూరు చేయాల్సి వస్తే 7.28 శాతం వేతనం ప్రకటించాలి. ప్రస్తుత వేతన స్కేల్ ప్రకారం ప్రతి శాతం వేతనానికి ఏడాదికి రూ.250 కోట్ల చొప్పున ప్రభుత్వంపై భారం పడు తుందని ఉద్యోగ సంఘాలు చెపుతున్నాయి. ఈ లె క్కన రెండు డీఏలు కలిపి రూ.1,820 కోట్లు అవ సరమవుతాయి. అంటే ప్రతి నెలా రాష్ట్ర ఖజానాపై రూ.150 కోట్ల పైచిలుకు భారం పడనుంది. -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో శుభవార్త?
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో శుభవార్త. ఇటీవల కేంద్రం..కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ 4శాతం పెంచింది. అయితే తాజాగా హెచ్ఆర్ఏ (హౌస్ రెంట్ అలవెన్స్) వంటి నిర్దిష్ట అలవెన్సులు సవరించే యోచనలో ఉన్నట్లు సమాచారం. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ప్రకారం..త్వరలో హెచ్ఆర్ఏ పెంపుకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలో వెలువడనున్నట్లు తెలుస్తోంది.దీంతో డీఏ 50శాతానికి చేరినందున హెచ్ఆర్ఏ పెంపును ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు విడుదల చేస్తుందా? ఒకే వేళ విడుదల చేస్తే హెచ్ఆర్ఏలో ఎంత పెంపు ఉంటుందా? అని ఉద్యోగులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 50 శాతానికి చేరినందున హెచ్ఆర్ఏ ఎంత పెరుగుతుంది? హెచ్ఆర్ఏ అనేది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి నివాసం ఉండే ప్రాంతాన్ని బట్టి ఉంటుంది. హెచ్ఆర్ఏ గణన కోసం జనాభా లెక్కలు ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని వాటి ఆధారంగా నగరాలను టైప్ ఎక్స్, వై, జెడ్‌గా వర్గీకరించబడ్డాయి. 7వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం జులై 1, 2017 నుండి ఉద్యోగులు తమ బేసిక్ శాలరీ రూ.35,000లలో ఎక్స్ కేటగిరీ నగరానికి చెందిన ఉద్యోగి బేసిక్ పే రూ. 35,000లో 27శాతం = రూ. 9,450 వై కేటగిరీ నగరానికి చెందిన ఉద్యోగి బేసిక్ పే రూ. 35,000లో 18శాతం అంటే = రూ. 6,300 జెడ్ కేటగిరీ నగరానికి చెందిన ఉద్యోగి బేసిక్ పే రూ.35,000లో 9శాతం అంటే = రూ. 3,150 దీన్ని బట్టి 7వ పే కమీషన్ డీఏ 50శాతానికి చేరుకున్నప్పుడు ఉద్యోగికి చెల్లించే బేసిక్ పేలో ఎక్స్ కేటగిరీ నగరాల ఉద్యోగులకు 30 శాతం, వై కేటగిరీ నగరాల ఉద్యోగులకు 20 శాతం, వై కేటగిరీ నగరాల ఉద్యోగులకు 10 శాతంతో హెచ్ఆర్ఏ రేట్లు సవరించాలని సిఫార్సు చేసింది. దీన్ని బట్టి ఉద్యోగి బేసిక్ పే రూ.35,000లలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి హెచ్ఆర్ఏకి ఎక్స్ కేటగిరీ నగరానికి చెందిన ఉద్యోగి బేసిక్ పే రూ. 35,000లో 30శాతం అంటే = రూ. 10,500 వై కేటగిరీ నగరానికి చెందిన ఉద్యోగి బేసిక్ పే రూ. 35,000లో 20శాతం అంటే = రూ. 7,000 జెడ్ కేటగిరీ నగరానికి చెందిన ఉద్యోగి బేసిక్ పే రూ.35,000లో 10శాతం = రూ. 3,500 లు అందించే అవకాశం ఉందని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్ఆర్ఏ పెంపు: హెచ్ఆర్ఏ సవరణకు సంబంధించి కేంద్రం ప్రత్యేక ఉత్తర్వులు విడుదల చేస్తుందా? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల హెచ్ఆర్ఏలో ఈ సవరణను ప్రస్తావిస్తూ కేంద్రం ప్రత్యేక ఉత్తర్వులు విడుదల చేస్తుందా అన్న ప్రశ్నలకు ఆర్ధిక నిపుణులు మాట్లాడుతూ.. జూలై 7, 2017 నాటి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆఫీస్ మెమోరాండం ప్రకారం డీఏ 50శాతం దాటిన తర్వాత హెచ్ఆర్ఏకి సంబంధించి స్పష్టమైన సూచనలు ఉన్నాయి. అందువల్ల, మరొక నోటిఫికేషన్ అవసరం లేదని, ఈ నోటిఫికేషన్ నేరుగా అమలు చేస్తుందని చెబుతున్నారు. -
ఆర్టీసీ ఉద్యోగులకు డీఏ 43.2%
సాక్షి, హైదరాబాద్: వేతన సవరణలో భాగంగా ఆర్టీసీ ఉద్యోగులకు 43.2 శాతం కరువు భత్యం(డీఏ) ఖరారైంది. వేతన సవరణ అనంతరం ఉండే మూలవేతనంపై అంతమేర కరువు భత్యాన్ని లెక్కించి జీతంలో భాగంగా చెల్లించనున్నారు. ప్రభుత్వం సవరించిన ఇంటిఅద్దె భత్యం (హెచ్ఆర్ఏ) తాజా వేతన సవరణతో ఆర్టీసీ ఉద్యోగులకు కూడా వర్తించనున్న విషయం తెలిసిందే. హెచ్ఆర్ఏ భారీగా తగ్గిపోవటంతో ఉద్యోగుల వేతనంపై పెద్ద ప్రభావమే చూపనుంది. హెచ్ఆర్ఏలో కోత వల్ల, కొత్త జీతం ఆశించిన స్థాయిలో పెరగలేదని ఉద్యోగులు కొంత ఆందోళనతో ఉన్నారు. కానీ, ఇప్పుడు మెరుగైన కరువు భత్యం అందనుండటంతో.. ఆ వెలితి కొంత తీరినట్టేనని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్టీసీ ఉద్యోగుల డీఏ 82.6 శాతం ఉంది. ఇప్పుడు 2017 ఏప్రిల్ నాటి వేతన సవరణను అమలులోకి తెస్తున్నందున, అప్పటికి ఉన్న 31.1 శాతం డీఏ ఉద్యోగుల మూల వేతనంలో కలిసి పోతుంది. అది పోయిన తర్వాత 51.5 శాతం డీఏ ఉంటుంది. దాన్ని ఉన్నది ఉన్నట్టుగా మూలవేతనంపై లెక్కించరని తెలుస్తోంది. వేతన సవరణ పద్ధతిలో భాగంగా దాన్ని న్యూట్రలైజ్ చేసి కొత్త డీఏను ఖరారు చేస్తారు. ఆ లెక్క ప్రకారం.. తాజా డీఏ 43.2 శాతంగా తేలింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికీ నాలుగు విడతల డీఏ బకాయిలు పేరుకుపోయి ఉన్నాయి. కానీ ఆర్టీసీ ఉద్యోగులకు మాత్రం అన్ని విడతల డీఏలు చెల్లించటం విశేషం. 2024 జనవరి విడతకు సంబంధించి 3.9 శాతాన్ని తాజా వేతన సవరణలో భాగంగా చెల్లించనుండటం విశేషం. గతంలో ఆర్టీసీ ఉద్యోగులకు ఏకంగా ఏడు విడతల డీఏ బకాయిలు పేరుకుపోయి ఉండేవి. అయితే కార్మిక సంఘాల ఒత్తిడి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కృషి ఫలితంగా తక్కువ సమయంలోనే ప్రభుత్వం డీఏ బకాయిలను చెల్లించింది. కొన్ని విడతలు మిగిలి ఉండగా, గత ఎన్నికల సమయంలో ప్రభుత్వం వాటిని కూడా ప్రకటించింది. దీంతో మొత్తం బకాయిలు క్లియర్ అయి ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగులకు తాజా విడత కరువు భత్యం కూడా అందబోతోంది. -
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రెండు డీఏలు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. వారికి రెండు డీఏలను మంజూరు చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతేడాది జనవరి 1 నుంచి ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇవ్వాల్సిన డీఏ 3.64 శాతం, అలాగే గతేడాది జూలై 1 నుంచి ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇవ్వాల్సిన మరో డీఏ 3.64 శాతం మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. గతేడాది జనవరి 1 నుంచి ఇవ్వాల్సిన డీఏను ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వేతనాలతో నగదు రూపంలో చెల్లించనున్నారు. అలాగే గతేడాది జూలై 1 నుంచి ఇవ్వాల్సిన డీఏను ఈ ఏడాది జూలై నుంచి వేతనాలతో నగదు రూపంలో చెల్లిస్తారు. డీఏ బకాయిలను సమాన వాయిదాల్లో జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్)కు జమ చేయనున్నారు. డీఏ పెంపు గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్ కార్పొరేషన్, వ్యవసాయ మార్కెట్ కమిటీలు, జిల్లా గ్రంథాలయ సమితి, సవరించిన రెగ్యులర్ స్కేళ్లు పొందుతున్న వర్క్ చార్జ్డ్ ఉద్యోగులకు వర్తిస్తుందని ఉత్తర్వుల్లో తెలిపారు. సవరించిన రెగ్యులర్ స్కేళ్లు పొందుతున్న ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్ టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది, ఎయిడెడ్ పాలిటెక్నిక్, యూనివర్సిటీ సిబ్బంది, ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన యూనివర్సిటీ టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి డీఏ పెంపు వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సీఎం జగన్‌కు ఉద్యోగ సంఘాల కృతజ్ఞతలు చెప్పిన మాట మేరకు ఉద్యోగులకు రెండు డీఏలను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య తరఫున చైర్మన్ కె.వెంకట్రామిరెడ్డి ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పలు ఉద్యోగ సంఘాల నాయకులు సైతం సీఎంకు కృతజ్ఞతలు తెలియజేశారు. -
ఉద్యోగులకు, పెన్షనర్లకు కేంద్రం శుభవార్త!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించే కరువు భత్యాన్ని (డీఏ)ని కేంద్రం 4శాతం పెంచే అవకాశం ఉన్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ పెంపు తర్వాత డియర్ నెస్ అలవెన్స్, డియర్ నెస్ రిలీఫ్ (డీఆర్) 50 శాతానికి పైగా పెరగనుంది. చివరి సారిగా 2023 అక్టోబర్ లో కేంద్రం డీఏని 4 శాతం పెంచింది. ఆ నాలుగు శాతం పెంపుతో డీఏ 42 శాతం నుంచి 46 శాతానికి పెరిగింది. తాజా నిర్ణయంతో 48.67 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 67.95 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. గతంలో పారామిలటరీ బలగాలతో సహా గ్రూప్ సి, నాన్ గెజిటెడ్ గ్రూప్ బి స్థాయి అధికారులకు దీపావళి బోనస్‌లను ప్రభుత్వం ఆమోదించింది. 2022–2023కి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉత్పాదకత లేని బోనస్‌ల (అడ్ హాక్ బోనస్‌లు) లెక్కింపు కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖ రూ.7,000 పరిమితిని నిర్ణయించింది . దేశ ద్రవ్యోల్బణం రేటు ఆధారంగా ప్రభుత్వం డీఏ పెంపుపై నిర్ణయం తీసుకుంటుంది. ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంటే, డీఏ మరింత పెరిగే అవకాశం ఉంది. డీఏ, డీఆర్ పెరుగుదలలు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (AICPI) యొక్క 12 నెలల సగటు పెరుగుదల శాతం ద్వారా నిర్ణయించబడతాయి. -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పేనా?
ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభం కానున్న మధ్యంతర బడ్జెట్‌పై అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా కేంద్రం ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్ దారులు ఈ బడ్జెట్ కోసం ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు. ఎన్నికల ముందు ప్రవేశ పెట్టే ఈ బడ్జెట్లో సుధీర్ఘ కాలంగా నిలిచిన కరువు భత్యంపై కేంద్రం అనుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎకనమిక్స్ టైమ్స్ నివేదిక ప్రకారం.. మధ్యంతర బడ్జెట్ నేపథ్యంలో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కార్మిక సంఘం ‘భారతీయ ప్రతిరక్ష మజ్దూర్ సంఘ్’ జనరల్ సెక్రటరీ ముఖేసింగ్ 18 నెలల కాలంలో నిలిచిపోయిన డీఏ బకాయిలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. కరోనా సంక్షోభంలో తలెత్తిన ఆర్ధిక ఇబ్బందులను తలెత్తాయని అంగీకరిస్తూనే.. దేశం మహమ్మారి నుంచి కోలుకుని ఆర్ధిక పరిస్థితులు చక్కబడ్డాయని అన్నారు. పునసమీక్షించాలని లేఖ కాబట్టి, రాబోయే బడ్జెట్ సమావేశాల్లో మూడు విడుతల కరువు భత్యం నిలుపుదల నిర్ణయాన్ని పునసమీకక్షించాలని లేఖ రాశారు. నిలిపివేసిన డీఏ బకాయిలను విడుదల చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పదవీ విమరణ చేసిన వారి కృషిని గుర్తించడమే కాకుండా దేశానికి చిత్తశుద్ధితో సేవలందించిన వారికి ఉపశమనం లభిస్తుందన్నారు. ముఖేష్ సింగ్ లేఖపై కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. కరువు భత్యం నిలిపివేసింది కోవిడ్-19 మహమ్మారి దృష్ట్యా మోదీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛన్‌దారులకు చెల్లించేందుకు డియర్నెస్ అలవెన్స్ (డీఏ), డియర్నెస్ రిలీఫ్ (డీఆర్)ను జనవరి 2020 నుంచి జూన్ 2021 అంటే సుమారు 18 నెలలు పాటు నిలిపివేసింది. ఆ సమయంలో కోవిడ్-19 విజృంభణ కారణంగా కేంద్రం ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంటూ కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..!
-
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఈసీ గుడ్‌న్యూస్ !
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలకు డీఏ విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం(ఈసీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉద్యోగులకు మొత్తం మూడు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో ఒకటి రిలీజ్ చేసేందుకు అనుతివ్వాల్సిందగా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈసీని కోరింది. డీఏ చెల్లింపులు ఎందుకు ఆలస్యమయ్యాయని, ఇప్పుడే ఎందుకివ్వాల్సి వస్తోందని ఈసీ ప్రభుత్వాన్ని అడిగినట్లు తెలిసింది. దీనికి ప్రభుత్వ సమాధానం సంతృప్తికరంగా ఉండటంతో డీఏ విడుదలకు ఈసీ ఓకే అంది. కాగా, ప్రభుత్వంతో పాటు ఉద్యోగసంఘాలు కూడా డీఏ విడుదలపై ఈసీకి లేఖ ద్వారా విజ్ఞప్తి చేశాయి. ఇప్పటికే రాష్ట్రంలో పోలింగ్ ముగిసినందున ఈసీ వారి విజ్ఞప్తికి అంగీకరించింది. ఇదీచదవండి..కేటీఆర్‌ది మేనేజ్మెంట్ కోటా..నాది మెరిట్ కోటా : రేవంత్‌రెడ్డి -
డీఏపై నిర్ణయం రాలేదు!
సాక్షి, హైదరాబాద్: రైతుబంధు, రుణ మాఫీ పథకాలకు నిధుల విడుదల, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం (డీఏ) మంజూరుకు అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నిర్ణయంవెలువడాల్సి ఉందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) వికాస్‌రాజ్ చెప్పారు. తమను ఈసీ కోరిన వివరణలను పంపించామని తెలిపారు. గురువారం బీఆర్కేఆర్ భవన్‌లోని తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఓటరు గుర్తింపు కార్డులు, స్లిప్పుల పంపిణీ ‘ఈ ఏడాది 51 లక్షల ఓటరు గుర్తింపు కార్డులను ముద్రించామని, పోస్టు ద్వారా వీటి పంపిణీ చివరి దశకు చేరుకుంది. గురువారం నాటికి 86 శాతం అనగా 2.81 కోట్ల ఓటర్లకు ఓటరు ఇన్ఫర్మేషన్ స్లిప్పులను పంపిణీ చేశాం. శనివారంలోగా మిగిలిన స్లిప్పుల పంపిణీ పూర్తి చేస్తాం. ఓటర్లకు అవగాహన కోసం ఓటర్ గైడ్ బుక్, సీ–విజిల్‌పై కరత్రాలను సైతం పంపిణీ చేశాం. 4,70,287 పోస్టల్ బ్యాలెట్ పత్రాలు, 8,84,584 ఈవీఎం బ్యాలెట్ పత్రాలను ముద్రించాం. టెండర్ ఓట్లు, చాలెంజ్ ఓట్లను సేకరించడం కోసం అధిక సంఖ్యలో ఈవీఎం బ్యాలెట్ పత్రాలు ముద్రించాం. ఇప్పటివరకు 32,730 మంది ఎన్నికల సిబ్బంది, 253 మంది అత్యవసర సేవల ఓటర్లు ఫెసిలిటేషన్ కేంద్రాల్లో ఓటేశారు. బుధవారం నాటికి 9,386 మంది వయోజన ఓటర్లు, 522 మంది దివ్యాంగులు ఇంటి నుంచే ఓటేశారు. 9,813 మంది సర్వీసు ఓటర్లు ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్‌ను డౌన్లోడ్ చేసుకోగా, గురువారం నాటికి 275 మంది ఓటేసి వాటిని తిరిగి పంపించేందుకు తపాలా శాఖలో బుకింగ్ చేశారు..’అని సీఈఓ వెల్లడించారు. గడువులోగా ఫామ్ 12డీ సమర్పించినా తమకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించలేదని పలువురు జర్నలిస్టులు చెప్పగా..పరిశీలిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రతి రౌండ్‌కు పరిశీలకుడి నిర్ధారణ ‘ఈసారి ప్రతి శాసనసభ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు ప్రక్రియ పరిశీలకుడి సమక్షంలో జరగనుంది. ప్రతి రౌండ్ లెక్కింపును పశీలకుడు నిర్ధారించిన తర్వాతే తదుపరి రౌండ్‌కి వెళ్తారు. ప్రతి కౌంటింగ్ కేంద్రంలో 14+1 టేబుళ్లను ఏర్పాటు చేసి ఓట్లను లెక్కిస్తారు. 500కి మించి పోలింగ్ కేంద్రాలున్న 6 కేంద్రాల్లో మాత్రం టేబుళ్ల సంఖ్య రెట్టింపుగా ఉంటుంది. ఈ నెల 30న పోలింగ్ జరగనుండగా, 29న పోలింగ్ సిబ్బంది డిస్త్రిబ్యూషన్ సెంటర్ల నుంచి ఈవీఎంలను తీసుకుని పోలింగ్ కేంద్రాలకు వెళతారు. జీపీఎస్ ద్వారా వాహనాల ట్రాకింగ్ రాష్ట్ర వ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. అందులో 299 అనుబంధ పోలింగ్ కేంద్రాలు కూడా ఉన్నాయి. ఎన్నికల్లో మొత్తం 59,779 బ్యాలెట్ యూనిట్లను వాడుతున్నాం. అభ్యర్థుల సంఖ్య అధికంగా ఉన్న ఓ పోలింగ్ కేంద్రంలో గరిష్టంగా నాలుగు బ్యాలెట్ యూనిట్లను వాడుతుండగా, మరికొన్ని చోట్ల రెండు, మూడు బ్యాలెట్ యూనిట్లను వినియోగించనున్నాం. ఈవీఎంలను తరలించే వాహనాలను జీపీఎస్ ద్వారా ట్రాక్ చేస్తాం..’అని సీఈఓ వివరించారు. ఆ నగదు ఎవరిదో దర్యాప్తులో తేలుతుంది ‘హైదరాబాద్‌లో రూ.కోట్లలో పట్టుబడిన నగదు ఏ పార్టీకి చెందిందో అన్న అంశం పోలీసుల దర్యాప్తులో తేలుతుంది. ఇప్పటివరకు రూ.669 కోట్ల విలువైన నగదు, ఇతర వస్తువులను జప్తు చేయగా, ఇందుకు సంబంధించి 10,106 ఎఫ్ఐఆర్లు నమోదు చేశాం. ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సంబంధించి మరో 777 కేసులు పెట్టాం. పెద్ద ఎత్తున ఎన్నికల ప్రలోభాలను పట్టుకున్నాం. వాటిని క్లెయిమ్ చేసుకోవడానికి ఏ రాజకీయ పార్టీ, అభ్యర్థి ముందుకు రావడం లేదు..’అని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఓటేయాలి ‘అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటేసేందుకు రావాలి. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా, నిర్భయంగా, నైతికంగా, ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి. 40 వేల మంది రాష్ట్ర పోలీసు బలగాలు, 25 వేల మంది పొరుగు రాష్ట్రాల పోలీసు బలగాలు, 375 కంపెనీల కేంద్ర బలగాలను మోహరిస్తున్నాం. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరిస్తాం..’అని సీఈఓ తెలిపారు. అదనపు సీఈఓ లోకేశ్‌కుమార్, జాయింట్ సీఈఓ సర్ఫరాజ్ అహ్మద్, డిప్యూటీ సీఈఓ సత్యవాణి పాల్గొన్నారు. -
రాష్ట్ర ఉద్యోగులకు డీఏ విడుదల
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మరో రెండు హామీలను నెరవేర్చారు. దసరా పండుగకు 3.64 శాతం డీఏను విడుదల చేయడంతోపాటు రాష్ట్ర విభజన నాటికి ప్రభుత్వ శాఖల్లో నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ ప్రభుత్వం రెండు వేర్వేరు ఉత్తర్వులను జారీ చేసింది. ఉద్యోగులకు వారి బేసిక్ పేలో 22.75 శాతం నుంచి 26.39 శాతానికి పెంచిన కరువు భత్యాన్ని 2022 జూలై 1 నుంచి అమల్లోకి తీసుకొస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి ప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. పెరిగిన కరువు భత్యం నవంబర్ 2023 నుంచి అమల్లోకి వస్తుందని, పెరిగిన డీఏను నగదు రూపంలో డిసెంబర్ జీతంలో అందుకుంటారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2022 జూలై1 నుంచి ఈ ఏడాది అక్టోబర్31 వరకు ఉన్న బకాయిలను మూడు దఫాలుగా జనరల్ ప్రావిడెంట్ ఫండ్‌లో జమ చేయనున్నట్టు తెలిపారు. సీపీఎస్ ఉద్యోగులకు బకాయిల్లో 10 శాతం ప్రాన్ అకౌంట్లో జమ చేసి మిగిలిన 90 శాతం మూడు దఫాలుగా అందజేస్తారు. వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్, జూలై, అక్టోబర్ నెలల్లో ఈ బకాయిలను జమ చేస్తారు. జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీలు, మునిసిపాల్టీలు, నగరపాలక సంస్థలు, అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీలు, జిల్లా గ్రంథాలయ సమితులు, రివైజ్డ్ పేస్కేల్ 2022 కింద రెగ్యులర్‌గా జీతాలు అందుకుంటున్న వారు, ఎయిడెడ్ పాలిటెక్నిక్ కాలేజీలతో పాటు అన్ని ఎయిడెడ్ విద్యాసంస్థల్లోని బోధన, భోధనేతర సిబ్బంది, యూనివర్సిటీల్లో పనిచేసే బోధన, బోధనేతర సిబ్బందికి ఈ డీఏ పెంపు వర్తిస్తుంది. ఈ మేరకు ట్రెజరీ సిబ్బంది తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులను జారీ చేసింది. రాష్ట్ర విభజన జరిగిన తేదీ 2–6–2014కు ముందు వివిధ ప్రభుత్వ శాఖల్లో నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులను ఆయా శాఖల్లో ఖాళీల ఆధారంగా భర్తీ చేయాల్సిందిగా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కేవలం ప్రభుత్వ శాఖల్లోని నియామకాలకే ఇది వర్తిస్తుందని వివిధ పథకాలు, ప్రాజెక్టులు కింద పనిచేసే వారికి ఇది వర్తించదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆయా శాఖాధిపతులు నిబంధనల ప్రకారం అర్హత కలిగిన కాంట్రాక్ట్ ఉద్యోగులను గుర్తిస్తూ ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుస్తూ డీఏతో పాటు కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఛైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కాగా.. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై ఏపీ స్టేట్ కాంట్రాక్ట్ ఫార్మాసిస్ట్స్ అండ్ ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.రత్నాకర్‌బాబు, ప్రధాన కార్యదర్శి వీఎన్‌వీఆర్ కిషోర్ హర్షం వ్యక్తం చేశారు. దశాబ్దాల బానిసత్వానికి విముక్తి కల్పిస్తూ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. -
AP: దసరా కానుక.. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ విడుదల
సాక్షి, విజయవాడ: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం దసరా కానుక అందించింది. డీఏ విడుదల చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల సమావేశంలో సీఎం జగన్ ప్రకటన మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. డీఏ 3.64 శాతం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ డీఏను 2022 జూలై ఒకటో తేదీ నుంచి ఇస్తారు. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. చదవండి: AP: 31న కేబినెట్ భేటీ -
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుక
సాక్షి, విజయవాడ: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం దసరా కానుక ప్రకటించింది. ఉద్యోగులకు డీఏ మంజూరు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. రేపు(శనివారం) డీఏ విడుదల ఉత్తర్వులు వెలువడనున్నాయి. 3.64 శాతం డీఏ విడుదల చేయనున్నారు. జీపీఎస్ అమలు బిల్లుకి గవర్నర్ ఆమోదం ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్ అమలు బిల్లుకి గవర్నర్ ఆమోదం తెలిపారు. గవర్నర్ ఆమోదంతో గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన భద్రత కల్పిస్తూ సీఎం జగన్ ప్రభుత్వం చట్టం చేసింది. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో జీపీఎస్ చట్టానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సీపీఎస్ ఉద్యోగులకు పెన్షన్ భద్రత కల్పించేలా జీపీఎస్ అమలు చేయనున్నారు. పదవి విరమణ సమయంలో మూల వేతనం లో 50 శాతం పెన్షన్ భద్రత కల్పిస్తూ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త కాగా, కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరణ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లుకు గెజిట్‌ను గవర్నర్ జారీ చేశారు. చదవండి: నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్ -
కేంద్ర ప్రభుత్వోద్యోగులకు 4 శాతం డీఏ
న్యూఢిల్లీ: పండుగ సీజన్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు. ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్‌ను 4 శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో ఉద్యోగులకు డీఏ వారి మూలవేతనంలో 46 శాతానికి చేరింది. అలాగే నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనాన్ని బోనస్‌గా ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ మేరకు పలు నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ నిర్ణయాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తర్వాత మీడియా సమావేశంలో వెల్లడించారు. డీఏ, డీఆర్ పెంపుతో 48.67 లక్షల మంది కేంద్ర ప్రభుత్వోద్యోగులు, 67.95 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందుతారని ఆయన తెలిపారు. వీటితో ఖజానాపై రూ.2,857 కోట్ల భారం పడనుంది. డీఏ పెంపు 2023 జూలై 1 నుంచి వర్తిస్తుంది. గత మార్చి, 2022 సెపె్టంబర్లో డీఏ, డీఆర్ 4 శాతం మేరకు పెరిగాయి. ఇక బోనస్ పెంపుతో లోకో పైలట్లు, గార్డులు, స్టేషన్ మాస్టర్లు, సూపర్వైజర్లు, టెక్నీషియన్లు, పాయింట్స్ మెన్, ఇతర గ్రూప్– సి సిబ్బంది సహా 11.07 లక్షల మంది రైల్వే ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. దీని ద్వారా రైల్వేలపై రూ.1,969 కోట్ల ఆరి్ధక భారం పడనుందని ఠాకూర్ తెలిపారు. మరోవైపు చక్కెర ఎగుమతులపై నిషేధాన్ని అక్టోబర్ నెలాఖరును దాటి నిరవధికంగా కేంద్రం పొడిగించింది. భారత్ ప్రపంచంలో అతి పెద్ద చక్కెర తయారీదారు. రెండో అతి పెద్ద ఎగుమతిదారు. 2024–25 రబీ మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించి గోధుమలకు మద్దతు ధరను మరో రూ.150 మేర పెంచుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం క్వింటాల్‌కు మద్దతు ధర రూ.2,125గా ఉంది. దీన్ని రూ.2,275కు పెంచినట్లుగా కేంద్రం ప్రకటించింది. కేంద్రంలో మోదీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచి్చన తర్వాత ఈ స్థాయిలో మద్దతు ధరను పెంచడం ఇదే తొలిసారి. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో గోధుమలు సహా బార్లీ, ఎర్రపప్పు, శనగలు, కుసుమ, ఆవాల మద్దతు ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఎర్రపప్పు (మసూర్) ధర రూ.425 మేర పెంచడంతో క్వింటాల్ ధర రూ.6,425కి చేరింది. ఆవాలకు కనీస మద్దతు ధరను రూ.200 పెంచడంతో అది రూ.5,650కి చేరుకుంది. కుసుమలు క్వింటాల్ రూ.5,650గా ఉండగా, రూ.150 చొప్పున పెంచడంతో రూ.5,800లకు చేరింది. బార్లీ మద్దతు ధరను రూ.115 మేర పెంచడంతో ధర 1,735 నుంచి రూ.1,850కి చేరింది. శనగల «కనీస మద్దతు ధరను రూ.150 మేర పెంచారు. దీని ధర క్వింటాల్‌కు రూ.5,335 నుంచి రూ.5,440కి చేరింది. -
సీఎం జగన్‌కు వీఆర్ఏ సంఘం నేతల కృతజ్ఞతలు
సాక్షి, అమరావతి: వీఆర్ఏ సంఘం నేతలు శుక్రవారం క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో టీడీపీ ప్రభుత్వం వీఆర్ఏలకు ఇస్తున్న రూ.300 డీఏను రద్దు చేసింది. ఈ విషయాన్ని ఏపీజీఎఫ్ ప్రతినిధులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సీఎం.. డీఏను పునరుద్ధరించడమే కాకుండా డీఏను రూ.500కు పెంచుతూ ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో వీఆర్ఏ సంఘం నేతలు సీఎంను కలిసి సన్మానించారు. ఏపీజీఎఫ్ చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి, వీఆర్ఏ సంఘం నేతలు ధైర్యం, సత్యరాజ్, సుధాకర్, వెంకటేశ్వర్లు ఉన్నారు. -
సీఎం జగన్‌ను సత్కరించిన వీఆర్ఏ సంఘం నాయకులు
సాక్షి, గుంటూరు: వీఆర్ఏ సంఘం నాయకులు సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని కలిశారు. రద్దైన డీఏను పెంచి మరీ అందిస్తుండడంపై వాళ్లు ఆయనకు కృతజ్ఙతలు తెలిపారు. టీడీపీ ప్రభుత్వం గతంలో వీఆర్ఏలకు ఇస్తున్న రూ. 300 డీఏను రద్దు చేసింది. అయితే.. ఈ విషయం సీఎం జగన్ దృష్టికి వెళ్లింది. దానిని కొనసాగించాలంటూ ఏపీజీఎఫ్ ప్రతినిధులు ఆయనకు విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం రూ. 300కు బదులుగా డీఏని రూ. 500 కు పెంచి మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో.. ఏపీజీఎఫ్ ఛైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో వీఆర్ఏ సంఘ నాయకులు ధైర్యం, సత్యరాజ్, సుధాకర్, వెంకటేశ్వర్ల బృందం సీఎం జగన్‌ను సత్కరించి, కృతజ్ఞతలు తెలిపారు. -
ఆర్టీసీ ఉద్యోగులకు మరో 5శాతం డీఏ
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ తమ ఉద్యోగులకు మరో విడత కరువు భత్యాన్ని (డీఏ) ప్రకటించింది. ఈసారి డీఏను 5 శాతం పెంచింది. దీనితో ప్రస్తుతమున్న 72.8 శాతం నుంచి 77.8 శాతానికి డీఏ పెరిగిందని.. సెప్టెంబర్ వేతనం నుంచే దీనిని చెల్లిస్తామని అధికారులు తెలిపారు. 2019 జూలై నుంచి పెండింగ్‌లో ఉన్న డీఏలను ఇటీవల వరుసగా ప్రక టిస్తూ రాగా.. ప్రస్తుతం 2023 జూలై డీఏ ఒక్కటి మాత్రమే పెండింగులో ఉన్నట్టయింది. ఆర్టీసీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఇప్పటివరకు సంస్థ 8 డీఏలను మంజూరు చేసిందని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఉద్యో గులు కష్టపడి పనిచేస్తున్నారని, బకాయిలను త్వరలోనే ఇవ్వడానికి యాజమాన్యం ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. పెండింగ్ బకాయిల ప్రస్తావన లేదు పెండింగ్ డీఏల అమలును ప్రకటిస్తూ వస్తున్న ఆర్టీసీ.. వాటికి సంబంధించిన బకాయిలు (ఇప్పటివరకు చెల్లించాల్సిన మొత్తాన్ని) మాత్రం ఇవ్వటం లేదు. కేవలం అమల్లోకి తెచ్చిన నెల నుంచే లెక్కిస్తూ చెల్లి స్తోంది. ఇలా ఇప్పటివరకు సుమారు 168 నెలల బకాయిలు ఉన్నాయని, ఆ మొత్తాన్ని వెంటనే చెల్లించాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఓ విడత డీఏ బకాయిని ప్రకటించేలోపు పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు దాని లబ్ధి కలగటం లేదని.. అలాంటి వారికి లబ్ధి కలగాలంటే బకాయిలు చెల్లించాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికైనా డీఏలను చెల్లించడాన్ని స్వాగతిస్తు న్నామని.. అయితే బకాయిల సొమ్ము కూడా అందితేనే అందరు ఉద్యోగులకు న్యాయం జరిగినట్టు అవుతుందని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి వీఎస్‌రావు పేర్కొన్నారు. -
వీఆర్ఏలకు శుభవార్త
సాక్షి, అమరావతి : విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ (వీఆర్ఏ)లకు డీఏ పెంచుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో వీఆర్ఏలకు రూ.300 ఉన్న డీఏను చంద్రబాబు ప్రభుత్వం రద్దుచేయడంతో దీన్ని తిరిగి పునరుద్ధరించాలంటూ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (ఏపీజీఈఎఫ్) సీఎంను కలిసి కోరగా తక్షణం సానుకూలంగా స్పందించినట్లు ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించిన ఫైల్ సర్క్యులేట్ చేయాల్సిందిగా అధికారులను ఆదేశించడమే కాక అందులో డీఏను రూ.300 నుంచి రూ.500కు పెంచుతూ సీఎం సంతకం చేసినట్లు తెలిపారు. డీఏను పునరుద్ధరించడంతోపాటు దానిని పెంచుతూ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకోవడంపట్ల వీఆర్ఏలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఈ నిర్ణయంవల్ల సుమారు 20,000 మందికి ప్రయోజనం చేకూరుతుందని అంచనా వేస్తున్నారు. ఇక వీరికి డీఏ మంజూరు చేసిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ఇతర రెవెన్యూ శాఖాధికారులకు ఏపీజీఈఎఫ్ తరఫున వెంకట్రామిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు వీఆర్ఏలకు గతంలో కేవలం రూ.300గా ఉన్న డీఏను నేడు రూ.500కు పెంచే ఫైలును ఆమోదించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్, ఏపీ జేఏసీ అమరావతి పక్షాన బొప్పరాజు, పలిశెట్టి దామోదర్‌రావు, చేబ్రోలు కృష్ణమూర్తిలు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, ఈ సమస్యపై ముఖ్యమంత్రికి సిఫార్సు చేసిన మంత్రివర్గ ఉపసంఘానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేశారు. గత ప్రభుత్వం వీఆర్ఏల డీఏను రద్దుచేస్తే ఈ ప్రభుత్వం పునరుద్ధరించడమే కాక.. రూ.300 నుంచి రూ.500కు పెంచడంపై ఏపీ రెవెన్యూ జేఏసీ చైర్మన్ వాసా దివాకర్, ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు భూపతిరాజు రవీంద్రరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. అప్పలనాయుడులు కూడా ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. -
Fact Check: వీఆర్ఏలకు వెన్నుపోటు పొడిచింది బాబే
సాక్షి, అమరావతి: నిజాలకు పాతరేసి అబద్ధాలను అచ్చేయడంలో అందెవేసిన చెయ్యి అయిన రామోజీ తాజాగా వీఆర్ఏల డీఏపై పడ్డారు. టీడీపీ పాలనలో చేసిన నిర్వాకాలను మరిచిపోయినట్లుగా నటిస్తున్నారు. వీఆర్ఏల డీఏను తొలగించి వారిని నిండా ముంచింది చంద్రబాబు అనే విషయం అందరికీ తెలిసిన విషయమైనా రామోజీ అదేమీ తెలీనట్లు ఉంటూ సొల్లు పురాణం అందుకున్నారు. నిజానికి.. చంద్రబాబు అధికారంలో ఉండగానే 2018లో వీఆర్ఏలకు డీఏ వర్తించదని జీఓ ఇచ్చారు. ఆ అన్యాయాన్ని సరిదిద్దేందుకు ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తోంది. త్వరలోనే దీనిపై ఒక సానుకూల నిర్ణయం వెలువడే అవకాశం కూడా ఉంది. కానీ, ఈ నిజాలకు ముసుగేసి వీఆర్ఏలకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు చెప్పినట్టల్లా ఆడుతున్న ఈనాడు.. బరితెగించి మరీ అడ్డగోలు కథనం రాయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఇదీ నిజం.. వీఆర్ఏలకు నెలకు రూ.300 చొప్పున ఇచ్చే కరువు భత్యాన్ని (డీఏ)ను కేవలం 5 నెలలకు మాత్రమే పరిమితం చేస్తూ 2019 జనవరి 29న టీడీపీ ప్రభుత్వం జీఓ–14 జారీచేసింది. 2018 జూన్ 1 నుంచి వీఆర్ఏలకు డీఏ వర్తించదని ప్రకటించింది. ఈ అన్యాయాన్ని సరిదిద్దాలని రెవెన్యూ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని పలు సందర్భాల్లో కోరాయి. టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన జీఓను మార్చి కరువు భత్యాన్ని పునరుద్ధరించాలని కోరుతుండగా ఉద్యోగ సంఘాల సమస్యలను పరిశీలించి, పరిష్కరించడం కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తరచూ నిర్వహించే సమావేశాల్లోనూ దీనిపై చర్చ జరిగింది. ఈ విషయాలను మరచిపోయి ఉద్యోగుల్లో భయాందోళనలు కలిగించే ఉద్దేశంతో అబద్ధాలను అచ్చోసింది. రాష్ట్రంలో ప్రస్తుతం 19,359 మంది వీఆర్ఏలు సేవలు అందిస్తున్నారు. సాధారణ ప్రక్రియలో భాగంగా వారిలో ఎంతమంది ఏవిధంగా డీఏ డ్రా చేశారని తెలుసుకునేందుకే ఖజానా, అకౌంట్స్ శాఖ మెమో ఇచ్చింది. రాష్ట్రంలో ఒక్క వీఆర్ఏ నుంచి కూడా అదనంగా డ్రా చేసిన డీఏను రికవరీ చేయలేదు. ఈ విషయం తెలిసి కూడా ఈనాడు నిస్సిగ్గుగా వీఆర్ఏల నుంచి డీఏలను రికవరీ చేస్తున్నట్లు అబద్ధాలు రాసిపారేసింది. కానీ, డీఏలు రికవరీ లేకుండా చేయడంతోపాటు ప్రతినెలా డీఏను కొనసాగించేలా రెవెన్యూ శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. వీటిపై అతి త్వరలో నిర్ణయం వెలువడే అవకాశముంది. వీఆర్ఏలకు మేలు జరిగింది ఈ ప్రభుత్వంలోనే.. ఇక వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీఆర్ఏలకు మేలు చేసే అనేక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సుమారు 3,795 మంది వీఆర్ఏలకు వీఆర్ఓలుగా పదోన్నతి కల్పించింది. ఈ సంవత్సరమే 66 మంది వీఆర్ఏలకు గ్రేడ్–2 వీఆర్ఓలుగా పదోన్నతులిచ్చింది. ఇవన్నీ మర్చిపోయి.. అవాస్తవాలు ప్రచారం చేయడం ద్వారా ఉద్యోగులు, ప్రజల్లో అపోహలు సృష్టించేందుకే ఈనాడు కంకణం కట్టుకుని వార్తలు ప్రచురిస్తున్నట్లు స్పష్టమవుతోంది. -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. దేశంలో కోటి మంది ఉద్యోగులకు 4 శాతం డేర్‌నెస్ అలవెన్స్ (dearness allowance)లను పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. 38 శాతం నుంచి 42 శాతానికి పెరిగిన ఈ డీఏ జనవరి 1, 2023 నుంచి అమల్లోకి వస్తున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా డీఏ పెంపును కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. దీంతో కేంద్రంపై రూ. 12,815 కోట్ల భారం పడనున్నట్లు చెప్పారు. కరువు భత్యం(డీఏ) పెంపుతో 47.58లక్షల కేంద్రం ప్రభుత్వ ఉద్యోగులకు 69.76లక్షల మందికి పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. 7వ వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా నిర్ణయించిన ఫార్ములా ఆధారంగా ఈ పెంచుతుంది. -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4 శాతం డీఏ పెంపు?
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు కరవు భత్యం(డీఏ) 4 శాతం మేర పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే డీఏ పర్సంటేజీ ప్రస్తుతమున్న 38% నుంచి 42%కి చేరుకుంటుంది. కార్మిక శాఖ నెలవారీగా విడుదల చేసే పారిశ్రామిక సిబ్బంది వినియోగ ధరల సూచీ(సీపీఐ–ఐడబ్ల్యూ) ప్రాతిపదికగా తీసుకుని కేంద్రం ఉద్యోగులు, పింఛనుదారుల డీఏను ఖరారు చేస్తుంటుంది. ఆల్ ఇండియా రైల్వేమెన్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ శివ గోపాల్ మిశ్రా తాజా వార్తలపై స్పందిస్తూ..‘డిసెంబర్ 2022 సీపీఐ–ఐడబ్ల్యూ జనవరి 31, 2023న విడుదలైంది. దీని ప్రకారంగా డీఏ పెంపు 4% ఉంటుంది. అప్పుడు 42%కి చేరుకుంటుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రతిపాదనలను తయారు చేసి కేంద్ర కేబినెట్ ఆమోదం కోసం పంపుతుంది’అని ఆయన అన్నారు. ఒకవేళ ఈ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపితే డీఏ ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి అమలవుతుంది. ప్రస్తుతం ఒక కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులు 38% డీఏను పొందుతున్నారు. సెప్టెంబర్ 28, 2022ను రివిజన్ డీఏ 2022 జూలై నుంచి అమల్లోకి వచ్చింది. -
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మరో డీఏ విడుదల
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు మరో డీఏ విడుదల చేసింది యాజమాన్యం. ఈ నెల జీతంతో కలిపి దీన్ని ఇవ్వనున్నట్లు తెలిపింది. దీంతో టీఎస్ఆర్టీసీ మొత్తం 7 డీఏలకు గానూ 6 డీఏలను ఇచ్చింది. ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు మరో విడత కరవు భత్యం (డీఏ) మంజూరు చేయాలని యాజమాన్యం ఇదివరకే నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఫిబ్రవరి నుంచి దీన్ని చెల్లించనుంది. -
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు మరో విడత డీఏ
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులకు బకాయి ఉన్న మరో విడత కరువు భత్యం మంజూరైంది. గత నెలలో రెండు విడతల పెండింగ్ డీఏ మంజూరు కాగా, ఇప్పుడు మరో విడతగా 3.9 శాతం కరువు భత్యాన్ని ఆర్టీసీ మంజూరు చేసింది. దీన్ని బుధవారం చెల్లించనున్నారు. ఈ డీఏను మంగళవారమే మంజూరు చేసినందున, నెల జీతంలో దా న్ని కలిపేందుకు ఒక రోజు సమయం పట్టనుంది. ఇందుకోసం ఈనెల జీతాలు ఒకటో తేదీన కాకుండా 2న చెల్లించనున్నారు. ప్రస్తుతానికి కరువు భత్యంతో సరి.. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు దీర్ఘకాలం పెండింగులో ఉన్న బకాయిల చెల్లింపుపై దృష్టి సారించింది. మునుగోడు ఆర్టీసీ ఉద్యోగుల సమాఖ్య పేరుతో కార్మిక సంఘాలు టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ప్రచారానికి దిగటంతో మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులు ఆ సమాఖ్య నేతలను పిలిపించి చర్చించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం ఓ డీఏను ప్రకటిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. గత నెలలో రెండు విడతల డీఏ ఇవ్వగా ఇప్పుడు మూడో విడత ఇవ్వటంతో మొత్తం డీఏ 63.9 శాతానికి చేరింది. దీంతోపాటు 2019 జనవరికి చెందిన డీఏ ను ఆలస్యంగా విడుదల చేసినందున దాని తాలూకు ఎరియర్స్‌ను కూడా ఈనెల జీతంతో ఇవ్వనున్నట్టు తెలిసింది. ఇక దసరా పండగ అడ్వాన్సును కూడా చెల్లించనున్నారు.ఇక 2022 సంవత్సరానికి సంబంధించిన రెండు విడతల డీఏలు మాత్రమే పెండింగులో ఉంటాయి. -
ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం!
ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల ప్రారంభంలో కేంద్రం, 7వ వేతన సంఘం ప్రకారం జీతం తీసుకునే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4% డీఏ పెంపును ప్రకటించిన సంగతి తెలిసిందే. దీపావళికి కొద్ది రోజులే ముందు, తాజాగా ఉద్యోగుల డీఏను 15 శాతం పెంచింది. ఈ పెంపు 5వ, 6వ పే కమీషన్ కింద జీతాలు తీసుకుంటున్నట్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర సంస్థ ఉద్యోగులకు వర్తించనున్నట్లు తెలిపింది. 5వ వేతన సంఘం ప్రకారం.. వేతనాలను విత్ డ్రా చేసుకునే ఉద్యోగుల డీఏ రేటును 15% మేర 381% నుంచి 396%కి పెంచారు. ఇది జూలై 1, 2022 నుంచి అమలులోకి వస్తుంది. అదేవిధంగా, 6వ వేతన సంఘం ప్రకారం.. తమ వేతనాలను తీసుకుంటున్న ఉద్యోగుల డీఏ రేటును 9% పెంచి బేసిక్ పేలో 203% నుంచి 212%కి పెంచారు. ఇది జూలై 1, 2022 నుండి అమలులోకి వస్తుంది. చదవండి: ఇది ఊహించలేదు.. యూజర్లకు భారీ షాకిచ్చిన జియో! -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు కేంద్రం శుభవార్త చెప్పింది. 4 శాతం డేర్‌నెస్ అలవెన్స్(డీఏ)ను పెంచుతూ కేబినెట్ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు.తాజా పెంపుతో ఉద్యోగుల డీఏ 38 శాతానికి చేరనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCEA) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పెరిగిపోతున్న ధరల కారణంగా డేర్‌నెస్ అలవెన్స్ పెంచుతూ మోదీ ప్రతిపాదించారు. మోదీ ప్రతిపాదనలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో ఉద్యోగులకు, పెన్షనర్లకు డీఏ అలవెన్స్ పెరిగింది. కేబినెట్ తాజా నిర్ణయంతో 47.68 లక్షల మంది ఉద్యోగులకు, 68.62 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. వీరితో పాటు సివిలియన్ ఎంప్లాయిస్, డిఫెన్స్ విభాగానికి చెందిన ఉద్యోగులు సైతం డీఏ అలవెన్స్ వర్తించనుంది. ఇక కేంద్రం పెంచిన డీఏ అలవెన్స్ ఈ ఏడాది జులై 1 నుంచి లబ్ధి దారులు పొందవచ్చు. జులై 1 నుంచి ఉద్యోగులు తీసుకున్న శాలరీస్‌తో పాటు పెండింగ్‌లో ఉన్న బకాయిలు (arrears) సైతం చెల్లిస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక వీటితో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర మంత్రి వర్గ కీలక నిర్ణయాలు ►గరిబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం మరో మూడు నెలలు పొడిగింపు ►డిసెంబర్ 2023 వరకు పథకం పొడిగిస్తూ క్యాబినెట్ నిర్ణయం ►కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్ దారులకు 4 శాతం డీ ఎ పెంపు ►ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ల ఆధునీకరణకు 10వేల కోట్లు మంజూరు చేస్తూ క్యాబినెట్ నిర్ణయం -
ఆర్టీసీ ఉద్యోగులకు ఒక విడత డీఏ
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కరువుభత్యం బకాయిల్లో ఒకదాన్ని చెల్లించాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఆరు విడతల డీఏ బకాయి ఉండగా, అందులో ఒక విడత 5.4 శాతం డీఏను చెల్లించనున్నట్టు ప్రకటించింది. దీంతో 45.9 శాతంగా ఉన్న కరువు భత్యం 51.6 శాతానికి పెరిగింది. ఈనెల జీతంతో దీన్ని చెల్లించనున్నారు. 2013 వేతన సవరణకు సంబంధించిన మూలవేతనంపై లెక్కించి ఇవ్వనున్నారు. ఇంకా ఐదు విడతల డీఏ చెల్లించాల్సి ఉంది. 2020 జనవరి నుంచి ఆర్టీసీ ఉద్యోగులకు కరువు భత్యం చెల్లించడం లేదు. ఒక విడత డీఏ ప్రకటించటం పట్ల ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నప్పటికీ, కార్మిక సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఎరియర్స్ లేకుండా కేవలం డీఏ చెల్లించటం సరికాదని సీనియర్ కార్మిక నేత నాగేశ్వరరావు పేర్కొన్నారు. డీజిల్ సెస్ పెంచిన తర్వాత నష్టాలు రూ.641 కోట్ల మేర తగ్గాయని ప్రకటించిన తర్వాత కూడా ఎరియర్స్ ఇవ్వకపోవటం దారుణమన్నారు. ఇప్పుడు ప్రకటించిన డీఏ ఏ విడతదో కూడా తెలపకపోవటం వెనక ఎరియర్స్ ఇవ్వకూడదన్న ఉద్దేశం ఉన్నట్టు స్పష్టమవుతోందని టీఎంయూ అధ్యక్షుడు తిరుపతి పేర్కొన్నారు. -
ప్రభుత్వ ఉద్యోగుల ఆశలు ఆవిరి.. ఇప్పట్లో లేదని కేంద్రం క్లారిటీ!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల పెంపు కోసం 8వ వేతన సవరణ సంఘాన్ని ఇప్పట్లో ఏర్పాటు చేసే ఆలోచన లేదని కేంద్రం ప్రకటించింది. ఈ అంశంపై కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. 7వ వేతన సవరణ సంఘం సిఫార్సులే ఇంకా పూర్తి స్థాయిలో అమలు కాలేదని అందుకే కొత్త సంఘం ఏర్పాటు చేయడం లేదని చెప్పారు. ఉద్యోగుల జీతాల పెంపునుకు ప్రతి 6 నెలలకు ఒకసారి డీఏ సవరిస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక సంవత్సరం చివరి నాటికి డీఏ(DA) పెంపు అంచనా ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో మరోసారి డీఏ పెంపు కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ద్రవ్యోల్బణం రేట్లు అలాగే ఉన్నందున, కేబినెట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లందరికీ డీఏను పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి నిర్ణయాన్ని త్వరలో ప్రకటించనున్నారని సమాచారం. గత కొంతకాలంగా 7% కంటే ఎక్కువగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం ఆధారంగా డీఏ లెక్కిస్తున్నారు. నివేదికల ప్రకారం, డీఏ 3% నుంచి 4% మధ్య పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులందరికీ 34% డీఏ అందుతోంది. 50 లక్షల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లు డీఏ సవరణ ప్రయోజనాలను పొందుతున్నారు. కాగా ప్రభుత్వం 7వ కేంద్ర వేతన సంఘాన్ని ఫిబ్రవరి 28, 2014న ఏర్పాటు చేసింది. చదవండి: వారానికి 4 రోజులే పని, త్వరలోనే అమల్లోకి కొత్త లేబర్ చట్టాలు! -
Telangana: ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త..!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త. మూడ్రోజుల క్రితం 5 శాతం కరువు భత్యాన్ని ప్రకటించిన సంస్థ త్వరలో మరో రెండు విడతల కరువు భత్యాన్ని ఇవ్వాలని ఆలోచిస్తోంది. జూలై, ఆగస్టు నెలల్లో రెండు దఫాలుగా డీఏ ప్రకటించేలా ఏర్పాట్లు ప్రారంభించింది. రెండు కలిపి దాదాపు 9 శాతం వరకు ఉంటుందని సమాచారం. ఈ మూడింటిని జోడిస్తే జూనియర్ డ్రైవర్, కండక్టర్ల వేతనాలకు నెలవారీ రూ.1,300 వరకు, సీనియర్లకు రూ.1,600 నుంచి రూ.2,000 వరకు, అధికారుల్లో స్థాయిని బట్టి రూ.3,800 నుంచి రూ.10 వేల వరకు పెరగనున్నాయి. అసంతృప్తి చల్లార్చేందుకు.. ఆర్టీసీ తమ ఉద్యోగులకు 6 విడతల డీఏ పెంపు బకాయి పడింది. సంస్థలో సమ్మె జరిగిన 2019లో జూలై విడత నుంచి డీఏ పెంపు నమోదవలేదు. అప్పటి నుంచి డీఏ 40.9 శాతం నిలిచిపోయి ఉంది. తాజాగా మూడ్రోజుల క్రితం అధికారికంగా ప్రకటన లేకుండా 5 శాతం డీఏ పెంచుతూ ఎండీ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఉద్యోగుల డీఏ మొత్తం 45.9 శాతానికి చేరుకుంది. దీన్ని స్వాగతించినా బకాయిల ఊసు లేకపోవడం అసంతృప్తిని మిగిల్చింది. ప్రస్తుతం డీజిల్ ధరలు పెరిగి నష్టాలు మరింత ఎక్కువైనందున ఆక్యుపెన్సీ రేషియోను 80 శాతం దాటించటం ద్వారా బ్రేక్ ఈవెన్‌కు చేర్చాలని ఎండీ వంద రోజుల ప్రణాళిక ప్రారంభించారు. ఇది విజయం సాధించేందుకు ఉద్యోగుల కృషి అవసరం. దీంతో వారిలో అసంతృప్తిని తగ్గించేందుకు డీఏ పెంచాలని భావిస్తున్నారు. -
ఆర్టీసీ ఉద్యోగులకు 5 శాతం డీఏ
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులకు మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కరువు భత్యం పెరుగుతోంది. వచ్చేవేతనాల నుంచి అందుకునేలా 5% డీఏను చెల్లించనున్నట్టు ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. మూల వేతనంపై ఐదు శాతం అంటే.. డ్రైవర్, కండక్టర్, శ్రామిక్ వంటి యూనిఫారం ఉద్యోగులకు కనిష్టంగా రూ.600 నుంచి గరిష్టంగా రూ.1,500 వరకు భత్యం జతకలుస్తుంది. వివిధ కేటగిరీల్లోని అధికారులకు రూ.1,500 నుంచి రూ.5,500 వరకు వేతనం అదనంగా అందనుంది. ఈ డీఏ ప్రకటనతో ఆర్టీసీపై నెలకు రూ.5 కోట్ల వరకు భారం పడుతుం దని అధికారులు చెప్తున్నారు. వాస్తవానికి ఉద్యోగులు 2019లో సుదీర్ఘ సమ్మె చేయటం, తర్వాత కోవిడ్ దెబ్బతో.. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి బాగా దెబ్బతిని, డీఏల చెల్లింపు ఆగిపోయింది. ఆరు డీఏలు కలిపి 27శాతం వరకు రావాల్సి ఉందని.. వెంటనే చెల్లించా లని ఉద్యోగులు చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజా డీఏ ఆదేశాలు జారీ అయ్యాయి. బకాయిల అంశాన్ని మాత్రం ప్రస్తావించలేదు. అసలు అధికారికంగా ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు. కాగా.. సుదీర్ఘ విరామం తర్వాత డీఏ పెంచటం కార్మికులకు ఆర్థికంగా వెసులుబాటేనని.. అయితే పెండింగ్ డీఏల ప్రకారం ఇవ్వాలని, ఎరియర్స్ చెల్లించాలని టీఎంయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తిరుపతి, ఏఆర్ రెడ్డి, ఎన్ఎంయూ అధ్యక్ష, కార్యదర్శులు కమాల్‌రెడ్డి, నరేందర్ డిమాండ్ చేశారు. -
ఏపీ: ప్రభుత్వ ఉద్యోగుల డీఎలు విడుదల
-
ఏపీ: ప్రభుత్వ ఉద్యోగుల డీఎలు విడుదల
సాక్షి, అమరావతి: ఉద్యోగులు, పెన్షనర్లకు సీఎం జగన్మోహన్రెడ్డి ప్రకటించిన మేరకు 23 శాతం ఫిట్‌మెంట్‌కు అనుగుణంగా కొత్త పీఆర్సీ అమలుతోపాటు పెండింగ్ డీఏలను విడుదల చేస్తూ ఆర్థికశాఖ సోమవారం వేర్వేరు ఉత్తర్వులు జారీచేసింది. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశమైన సందర్భంగా సీఎం జగన్ 23 శాతం ఫిట్మెంట్ ఇస్తామని, పెండింగ్ డీఏలు విడుదల చేస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అందుకనుగుణంగా ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఉత్తర్వులు జారీచేశారు. పే రివిజన్ కమిషన్ నివేదికపై సీఎస్ అధ్యక్షతన వేసిన కమిటీ చేసిన పలు సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కోవిడ్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ రాబడి కన్నా వేతనాలు, జీతభత్యాల వ్యయం ఎక్కువగా ఉందని సీఎస్ కమిటీ పేర్కొనడంతో.. ఐదేళ్లకొకసారి వేతన సవరణ కమిషన్‌ను ఏర్పాటు చేయలేమని, కేంద్ర ప్రభుత్వ విధానాన్ని అమలు చేస్తామని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. జనాభా ప్రాతిపదికన సీఎస్ కమిటీ సూచించిన మేరకు ఉద్యోగుల ఇంటి అద్దె అలవెన్స్ (హెచ్ఆర్ఏ)ను అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ► 50 లక్షలకు పైబడి జనాభా ఉండే నగరాల్లో పనిచేసే ఉద్యోగులకు బేసిక్ స్కేలుపై 24 శాతం హెచ్ఆర్ఏ, 5–50 లక్షల మధ్య జనాభా ఉండే నగరాలు, పట్టణాల్లో పనిచేసే ఉద్యోగులకు 16 శాతం, 5 లక్షల లోపు జనాభా ఉండే పట్టణాలు, గ్రామాల్లో పనిచేసే ఉద్యోగులకు 8 శాతం హెచ్ఆర్ఏగా నిర్దారిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ► ఐఏఎస్ అధికారులతో పాటు యూనివర్సిటీలు, అఫిలియేటెడ్ డిగ్రీ కాలేజీలలో యూజీసీ వేతనాలతో పనిచేసే వారికి రివైజ్డ్ హెచ్ఆర్ఏ వర్తించదని తెలిపారు. ► కన్సాలిడేటెడ్ పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్‌దారులకు కూడా కొత్త పీఆర్సీ అమలు ప్రకారం 23 శాతం ఫిట్‌మెంట్‌ను అమలు చేస్తూ మరో ఉత్తర్వు జారీ చేశారు. ► 1993 నవంబరు 25వ తేదీకి ముందు ఎన్ఎంఆర్, పార్ట్‌టైం ఉద్యోగులుగా చేరిన వారికి కూడా కొత్త పే స్కేళ్ల ప్రకారం వేతనాలు అమలు చేస్తూ ఇంకో ఉత్తర్వు జారీ చేశారు. ► అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్లో కేటగిరీ–1లో పేర్కొన్న వారికి రూ.21,500 చొప్పున, కేటగిరీ–2 వారికి రూ.18,500, కేటగిరీ–3 వారికి రూ.15,000 చొప్పున కొత్త వేతనాన్ని అమలు చేస్తూ జీవో జారీ చేశారు. -
AP: విద్యుత్ ఉద్యోగులకు త్వరలో శుభవార్త
సాక్షి, అమరావతి: విద్యుత్ ఉద్యోగులు డీఏ విషయంలో త్వరలోనే శుభవార్త వింటారని ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్) ద్వితీయ వార్షికోత్సవం, విద్యుత్ సంస్థల నూతన సంవత్సర డైరీలు, క్యాలెండర్లను విజయవాడలో మంగళవారం మంత్రి ఆవిష్కరించారు. 13 జిల్లాల నుంచి ఏపీ ట్రాన్స్‌కో, జెన్కో, మూడు డిస్కంలు, నెడ్‌క్యాప్, ఏపీఎస్ఈసీఎం, ఏపీసీడ్కో విభాగాల ఉద్యోగులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి బాలినేని ప్రసంగిస్తూ..పే రివిజన్ కమిటీతో జీతాలు తగ్గుతా యని సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను ఉద్యోగులెవరూ పట్టించుకోవలసిన అవసరం లే దని స్పష్టం చేశారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఇ బ్బందులను పరిగణనలోకి తీసుకుని వారికి న్యాయం జరిగేలా సానుకూల నిర్ణయం తీసుకుంటా మని మంత్రి భరోసా ఇచ్చారు. చదవండి: (పోలీసుల అదుపులో స్మగ్లర్ చంద్రబాబు?) బహిరంగ మార్కెట్లో విద్యుత్‌ను చవకగా కొనుగోలు చేసి రూ.2,500 కోట్లు ఆదా చేయగలిగిన విద్యుత్ రంగాన్ని క్షేత్రస్థాయి నుంచి పటిష్టపర్చడంలో భా గంగా రికార్డు స్థాయిలో ఒకేసారి సుమారు 7,329 మంది లైన్ మెన్లను, 213 మంది అసిస్టెంట్ ఇంజనీర్లను నియమించామన్నారు. ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ మాట్లాడుతూ..ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచి రెండేళ్లలో రూ.28,166 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. సీఎండీ జె పద్మజనార్ధన రెడ్డి, ఏపీ జెన్కో ఎండీ బి. శ్రీధర్, జేఎండీలు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఉద్యోగులకు ‘కొత్త’ కానుక
సాక్షి, చెన్నై: ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త సంవత్సర కానుక ప్రకటించింది. డీఏను 14 శాతం మేరకు పెంచుతూ మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. తమ డిమాండ్ల పరిష్కారం కోసం గత ప్రభుత్వ హయంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు జాక్టో జియో వేదికగా సాగించిన ఉద్యమాలు, సమ్మెల గురించి తెలిసిందే. డీఎంకే సర్కారు అధికా రంలోకి వచ్చిన అనంతరం తమ సమస్యలపై దృష్టి పెట్టాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞపి చేశాయి. ఇందుకు తగ్గట్టుగా అసెంబ్లీలో ఉద్యోగులకు అనుకూలంగా సీఎం స్టాలిన్ ప్రకటన చేశారు. ఈ మేరకు మంగళవారం కొత్త సంవత్సరం కానుకగా డీఏను 14 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు 17 శాతంగా ఉన్న డీఏను 31 శాతంగా పెంచారు. జనవరి ఒకటో తేదీ నుంచి ఈ పెంపును వర్తింప చేశారు. ఈ పెంపుతో రాష్ట్ర ప్రభుత్వంపై రూ.8,724 కోట్ల అదనపు భారం పడిందన్నారు. అలాగే సీ, డీ ఉద్యోగులకు సంక్రాంతి కానుకగా రూ. 3,000 ప్రకటించారు. పెన్షనర్లకు రూ. 500 ఇవ్వనున్నారు. ఇక, ప్రత్యేక కేటగిరిలో పనిచేస్తున్న గ్రామ అధికారులకు రూ. 1000 రూ, పదవీ విరమణ పొందిన వారికి రూ. 300 ఇవ్వనున్నారు. ఈ కానుకతో రూ. 169 కోట్ల వరకు భారం పడినట్లు అధికారులు వెల్లడించారు. -
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్
సాక్షి, అమరావతి : ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపుపై ఏపీ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు విడుదల చేసింది. 2018లోజులైలో పెంచిన 3.144 శాతం కరువు భత్యం మంజూరు చేస్తున్నట్లు పేర్కొంది. దీంతో కరువు భత్యం 27.248 నుంచి 30.392కు పెరిగినట్లయింది. 2021 జనవరి జీతాలతో (ఫిబ్రవరి 1న) కలిపి నగదుగా చెల్లింపులు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 2018, జులై 1 నుంచి 2020 డిసెంబర్ 31 వరకు 30 నెలల బకాయిలు జీపీఎఫ్/జడ్పీపీఎఫ్ వారికి 3 సమ భాగాల్లో పీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తామన్నారు. సీపీఎస్ వారికి 30 నెలల ఆరియర్స్ 90 శాతం నగదుతో పాటు 10శాతం ప్రాన్ అకౌంట్‌కు..జనవరి జీతాల చెల్లింపు తర్వాత 3 సమ భాగాల్లో జమ చేస్తామని తెలిపింది.2019 జనవరి డీఏ 2021 జూలై నుంచి.. 2019 జూలై డీఏ ..2022 జనవరి నుంచి చెల్లించడానికి హామీ ఇచ్చారు. -
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త
-
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెండింగ్‌లో ఉన్న మూడు డీఏ(కరువు భత్యం)ల చెల్లింపులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో డీఏల చెల్లింపునకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కార్యాచరణను ప్రకటించింది. దాని ప్రకారం జూలై 2018 నాటి మొదటి డీఏను 2021 జనవరి జీతాల్లో చెల్లించాలని ఆదేశించింది. మొదటి డీఏ చెల్లింపు ద్వారా ప్రభుత్వ ఖజానాపై 1035 కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది. ఇక జనవరి 2019 నాటి రెండో డీఏను 2021 జూలై జీతాల్లో చెల్లించాలని ఆదేశించగా.. దీని ద్వారా 2074 కోట్ల అదనపు భారం పడనుంది. (చదవండి: కేంద్ర ఉద్యోగులకు డీఏ పెంపు నిలిపివేత) జూలై 2019 నాటి మూడో డీఏను 2022 జనవరి నుంచి చెల్లించాలని ఆదేశించారు. ఇక మూడో డీఏ చెల్లింపు ద్వారా ప్రభుత్వ ఖజానాపై 3802 కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది. మొదటి డీఏ బకాయిలను జీపీఎఫ్‌లో 3 ఇన్స్టాల్మెంట్స్లో జమ చేయాలని ఆదేశించారు. సీఎం జగన్ నిర్ణయంతో 4.49 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు, 3.57 లక్షల పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. సీఎం జగన్ ఉద్యోగుల పక్షపాతి: వెంకట్రామిరెడ్డి ప్రభుత్వం డీఏల చెల్లింపుకు ఆమోదం తెలపడం చాలా సంతోషంగా ఉందన్నారు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి. వాయిదా పడ్డ జీతాలను కూడా నవంబర్ 1 నుంచి చెల్లించనున్నారు అని తెలిపారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. సీఎం జగన్ ఉద్యోగుల పక్షపాతి అని ప్రశంసించారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులలో ఉన్న సరే సీఎం జగన్ఉ ద్యోగులకు మేలు చేయడం ఆనందంగా ఉంది అన్నారు రెవిన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు. వాయిదా పడ్డ జీతాలను, పెండింగ్ డీఏలను చెల్లించేందుకు అంగీకరించడం సంతోషంగా ఉందన్నారు. కరోనా కష్టకాలంలో కూడా సీఎం జగన్ ఉద్యోగులకు మేలు చేశారన్నారు. ఉద్యోగ సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకోవడం సంతోషం అన్నారు. -
డీఏ పెంపు 5.24 శాతం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం 5.24 శాతం కరువు భత్యం(డీఏ) పెంచింది. తక్షణమే ఒక డీఏ చెల్లించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించడంతో... ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మూల వేతనంపై కరువు భత్యం 33.536 శాతం నుంచి 38.776 శాతానికి పెరిగింది. 2019 జూలై 1 నుంచి డీఏ పెంపు వర్తించనుంది. డిసెంబర్లో చెల్లించనున్న నవంబర్ వేతనం/ పెన్షన్‌తో కలిపి పెరిగిన కరువు భత్యాన్ని ప్రభుత్వం చెల్లించనుంది. బకాయిల చెల్లింపు ఇలా.. 2019 జూలై 1 నుంచి 2020 అక్టోబర్ 31 మధ్యకాలానికి సంబంధించిన పెరిగిన డీఏ బకాయిలను సంబంధిత ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాలో ప్రభుత్వం జమ చేయనుంది. 2021 మార్చి 31కి ముందు పదవీ విరమణ చేసే ఉద్యోగులకు సంబంధించిన డీఏ బకాయిలను మాత్రం ప్రభుత్వం నగదు రూపంలో చెల్లించనుంది. ఈ ఉత్తర్వుల జారీకి ముందే ఎవరైనా ఉద్యోగులు మరణిస్తే వారి చట్టబద్ధ వారసులకు నగదు రూపంలో డీఏ బకాయిలను ప్రభుత్వం చెల్లించనుంది. 2004 సెప్టెంబర్ 1 తర్వాత నియామకమై, కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం (సీపీఎస్) వర్తించే ఉద్యోగులకు, 2019 జూలై 1 నుంచి 2020 అక్టోబర్ 31 మధ్యకాలానికి సంబంధించిన పెరిగిన డీఏ బకాయిల్లో 10 శాతాన్ని వారి ప్రాణ్ ఖాతాల్లో జమ చేస్తారు. మిగిలిన 90 శాతం డీఏ బకాయిలను డిసెంబర్ నుంచి నాలుగు సమవాయిదాల్లో ప్రభుత్వం చెల్లించనుంది. పెన్షనర్లకు సంబంధించిన డీఏ బకాయిలను సైతం నాలుగు సమ వాయిదాల్లో 2020 డిసెంబర్ నుంచి చెల్లించనున్నారు. జీపీఎఫ్‌కు అనర్హులైన ఫుల్‌టైమ్ కాంటిజెంట్ ఉద్యోగుల డీఏ బకాయిలను డిసెంబర్లో చెల్లించనున్న వేతనంతో కలిపి నగదు రూపంలో చెల్లించనుంది. -
తక్షణమే ఒక డీఏ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2019 జూలై 1 నుంచి రావాల్సిన ఒక కరువు భత్యం(డీఏ)ను వెంటనే చెల్లిం చాలని ఆర్థికశాఖను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. డీఏ విషయంలో ప్రస్తుత విధానాన్ని మార్చా లన్నారు. ‘ప్రస్తుతం డీఏ ఎంతనే విష యంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నది. దాన్ని రాష్ట్రాలు అను సరిస్తున్నాయి. కేంద్రం అంచనాలు తయారు చేసి, నిర్ణయం తీసుకునే విషయంలో జాప్యం జరుగుతోంది. ప్రస్తుతం మూడు డీఏలు చెల్లించాల్సి ఉంది. ఇందులో రెండు డీఏల విష యంలో కేంద్రం తన నిర్ణయాన్ని ప్రక టించాల్సి ఉంది. కేంద్రం నిర్ణయంలో జాప్యం వల్ల రాష్ట్రాలు జాప్యం చేయాల్సి వస్తున్నది. ఫలితంగా బకా యిలు పేరుకుపోతున్నాయి. ఉద్యోగు లకు సకాలంలో డీఏ అందడం లేదు. ఈ పరిస్థితి మారాలి. ప్రతీ 6నెలలకు ఒకసారి గడువు తేదీ రాగానే రాష్ట్రంలో చెల్లించాల్సిన డీఏ నిర్ణయించాలి.కేంద్రం అంచనాలు అందిన తర్వాత అవసరమైతే దాన్ని సవరించాలి. ఉదాహరణకు రాష్ట్రం 3 శాతం డీఏ ప్రకటించి అమలు చేయాలి. కేంద్రం 3.5 శాతం అని ప్రకటిస్తే మిగిలిన 0.5 శాతం చెల్లించాలి. 2.5గా నిర్ణయిస్తే 0.5 శాతం తగ్గించి చెల్లిం చాలి. ఈ విషయంలో వెంటనే ప్రతిపాదనలు తయారుచేయాలి. కేబినెట్లో చర్చించి విధాన నిర్ణయం తీసుకుంటాం’అని ముఖ్యమంత్రి ప్రకటించారు. దసరా పండుగ మరుసటి రోజైన 26వ తేదీని సెలవు దినంగా ప్రకటిం చాలని నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రతీ ఏడాది దసరా మరుసటి రోజును సెలవుగా నిర్ణయిస్తూ షెడ్యూల్ రూపొందించాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. ఉద్యోగుల విరాళం రూ. 33 కోట్లు వరద బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న సహాయ కార్యక్రమాలకు మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ ఒక రోజు వేతనం రూ.33 కోట్లను విరాళంగా అందించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన అంగీ కార పత్రాన్ని ఉద్యోగ సంఘాల నాయకులు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ నేతృత్వంలో శుక్రవా రం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందజేశారు. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్లు, తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్లు, నాల్గవ తరగతి ఉద్యోగులు, డ్రైవర్లు తమ ఒక రోజు వేతనాన్ని విరాళంగా అందించనున్నా రు. ఈ సందర్భంగా ఉద్యోగ నేతలకు సంబంధించిన పలు విజ్ఞప్తుల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. త్వరలోనే ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశమై అన్ని అంశాలను చర్చించి, సమస్యలను పరి ష్కరిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమం త్రిని కలిసివారిలో టీజీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.మమత, ఎ.సత్యనారా యణ, టీఎన్జీవోల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిళ్ల రాజేందర్, రాయ కంటి ప్రతాప్, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గడ్డం జ్ఞానేశ్వర్ ఉన్నారు రాష్ట్ర బడ్జెట్‌పై మధ్యంతర సమీక్ష కరోనా నేపథ్యంలో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు భారీగా తగ్గినందున 2020–21 బడ్జెట్‌పై మధ్యంతర సమీక్ష నిర్వహించాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ‘కరోనా లాక్డౌన్ వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం భారీగా తగ్గింది. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్లో కోత పడింది. కేంద్ర జీడీపీ కూడా మైనస్ 24 శాతానికి పడిపోయింది. దీని ప్రభావం రాష్ట్రాలపై పడుతుంది. ఈ పరిస్థితుల నేపథ్యంతో వాస్తవానికి ఎన్ని నిధులు అందుబాటులో ఉంటాయో అంచనా వేయాలి. ఏఏ శాఖలకు ఎన్ని నిధులు విడుదల చేసే వెసులుబాటు ఉంటుందో నిర్ణయించాలి. మొత్తం బడ్జెట్‌పై సమీక్ష నిర్వహించి, ప్రభుత్వానిక నివేదిక ఇవ్వాలి’అని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరోనా కాటు
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా కష్టం కాలంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు షాక్ ఇచ్చింది కోవిడ్-19 సంక్షోభంతో ఆర్థిక వ్యవస్థపై భారం పెరిగిన నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు డీఏ (డియర్నెస్ అలవెన్స్) చెల్లింపులను నిలిపివేసింది. 4 శాతం నుంచి 12 శాతానికి పెంచుతూ మార్చి13 నాటి కేంద్ర కేబినెట్ నిర్ణయం అమలును నిలిపివేసింది. తద్వారా కేంద్ర ఖజానాపై 2020-21 ఆర్థిక సంవత్సరానికి గానూ సుమారు 27,000 కోట్ల రూపాయలు భారాన్ని తగ్గించుకోనుంది. 2020 జనవరి 1 నుంచి జూన్ వరకు ఇది వర్తిస్తుందని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నిర్ణయంతో సుమారు 49.26 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 61.17 లక్షల మంది పెన్షనర్లను ప్రభావితం చేస్తుంది. పెరుగుతున్నధరల కనుగుణంగా దీన్ని సంవత్సరానికి రెండుసార్లు సవరిస్తారు. తదుపరి సమీక్ష జూలైలో ఉండనుంది కరోనా సంక్షోభం, మార్చి 24 నుంచి లాక్డౌన్ అమలవుతున్న కారణంగా పన్నుల నుండి వచ్చే ఆదాయం తగ్గిపోయింది. ఉత్పత్తుల ఖర్చులు పెరిగాయి. నిధుల కొరత నేపధ్యంలో ప్రభుత్వం ఎక్కువగా ఖర్చులను తగ్గించుకుంటోంది. అన్ని శాఖలకు కేటాయించిన బడ్జెట్లో 40 శాతం కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రధాన మంత్రి, మంత్రులు, అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుల జీతాలను ప్రభుత్వం ఇప్పటికే 30 శాతం తగ్గించింది. ఎంపీ లాడ్స్ నిధులను కూడా రెండు సంవత్సరాలు నిలిపివేసింది. దీంతోపాటు కరోనా బాధితులను, నష్టపోయిన ప్రజానీకాన్ని ఆదుకునేందుకుగాను కేంద్ర ప్రభుత్వోద్యోగుల (రెవెన్యూ శాఖ) ఒక రోజు వేతనాన్ని కోత విధించి ఈ నిధులను పీఎం కేర్స్ జాతీయనిధికి జమ చేయాలని కేంద్రం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు తమ ఉద్యోగుల జీతాలను తగ్గించిన సంగతి తెలిసిందే. (ఆసియాలో అపర కుబేరుడుగా అంబానీ) చదవండి : చెల్లింపుల జోష్ : వొడాఫోన్ ఐడియా జంప్ కరోనా కల్లోలం : జీడీపీపై ఫిచ్ షాకింగ్ అంచనాలు -
3.144% డీఏ పెంపు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఉద్యోగుల కరువు భత్యాన్ని (డీఏ) 3.144 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగుల మూల వేతనంపై కరువు భత్యం 27.248 శాతం నుంచి 30.392 శాతానికి పెరిగింది. 2018 జూలై 1 నుంచి డీఏ పెంపు వర్తించనుంది. జూలైలో చెల్లించనున్న జూన్ నెల వేతనంతో పెరిగిన కరువు భత్యాన్ని ప్రభుత్వం చెల్లించనుంది. డీఏ బకాయిల చెల్లింపు ఇలా... 2018 జూలై 1 నుంచి 2019 మే 31 మధ్యకాలానికి సంబంధించిన పెరిగిన డీఏ బకాయిలను సంబంధిత ఉద్యోగుల జీపీఏ ఖాతాలో ప్రభుత్వం జమ చేయనుంది. 2019 సెప్టెంబర్ 30కి ముందు పదవీ విరమణ చేసే ఉద్యోగులకు సంబంధించిన డీఏ బకాయిలను మాత్రం ప్రభుత్వం నగదు రూపంలో చెల్లించనుంది. 2004 సెప్టెంబర్ 1 తర్వాత నియామకమై కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం (సీపీఎస్) వర్తించే ఉద్యోగులకు, 2018 జూలై 1 నుంచి 2019 మే 31 మధ్యకాలానికి సంబంధించిన పెరిగిన డీఏ బకాయిల్లో 10 శాతాన్ని వారి ప్రాణ్ (పీఆర్ఏఎన్) ఖాతాల్లో ప్రభుత్వ వాటా కలిపి జమ కానుంది. మిగిలిన 90 శాతం డీఏ బకాయిలను జూలైలో చెల్లించనున్న జూన్ నెల వేతనంతో కలిపి నగదు రూపంలో చెల్లించనుంది. జీపీఎఫ్‌కు అనర్హులైన ఫుల్‌టైం కాంటిజెంట్ ఉద్యోగుల డీఏ బకాయిలను జూలైలో చెల్లించనున్న జూన్ నెల వేతనంతో కలిపి నగదు రూపంలో చెల్లించనుంది. 3.144 శాతం పెంపు వీరికే... 2015 పీఆర్సీ ప్రకారం వేతనాలు అందుకుంటున్న జెడ్పీ, మండల పరిషత్, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీలు, జిల్లా గ్రంథాలయ సంస్థలు, వర్క్ చార్జీడ్ ఎస్టాబ్లిష్మెంట్, ఎయిడెడ్ సంస్థలు, ఎయిడెడ్ పాలిటెక్నిక్‌ల బోధన, బోధనేతర సిబ్బంది, ప్రొఫెసర్ కె. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, జేఎన్టీయూహెచ్ సహా ఇతర వర్సిటీల బోధన, బోధనేతర సిబ్బందికి 3.114 శాతం డీఏ పెంపు వర్తించనుందని ప్రభుత్వం తెలిపింది. యూజీసీ వేతనాలపై 6 శాతం డీఏ పెంపు సవరించిన యూజీసీ వేతనాలు–2006 అందుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను 142 శాతం నుంచి 148 శాతానికి ప్రభుత్వం పెంచింది. సవరించిన యూజీసీ వేతనాలు–2006 అందుకుంటున్న ప్రభుత్వ, ఎయిడెడ్ అనుబంధ డిగ్రీ కళాశాలల బోధన, బోధనేతర సిబ్బంది, ప్రొఫెసర్ కె. జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, జేఎన్టీయూహెచ్తోపాటు ఇతర వర్సిటీలు, ప్రభుత్వ పాలిటెక్నిక్‌ల బోధన సిబ్బందికి ఈ పెంపు వర్తించనుంది. పద్మనాభన్ కమిటీ నివేదిక ఆధారంగా 2010లో జారీ చేసిన జీవో 73 మేరకు వేతన సవరణ పొందిన న్యాయాధికారుల కరువు భత్యాన్ని 142 శాతం నుంచి 148 శాతానికి ప్రభుత్వం పెంచింది. వేతన సవరణ–2010 ప్రకారం వేతనాలు పొందుతున్న ప్రభుత్వ ఉద్యోగుల డీఏ రేటును 107.856 శాతం నుంచి 112.992 శాతానికి పెంచింది. పార్ట్‌టైం విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లకు నెలకు రూ. 100 వేతనం పెంచింది. ఈ ఉత్తర్వుల జారీకి ముందు ఎవరైనా ఉద్యోగులు మరణిస్తే వారి చట్టబద్ధ వారసులకు నగదు రూపంలో డీఏ బకాయిలను ప్రభుత్వం చెల్లించనుంది. -
రాజకీయ నేతల్లా.. ఉద్యోగ సంఘాల నాయకులు
సాక్షి, కాకినాడ సిటీ: ఉద్యోగుల సంక్షేమం గాలికి వదిలేసి రెండు ప్రధాన ఉద్యోగ సంఘాల నాయకులు రాజకీయ నాయకులుగా వ్యవహరించడాన్ని వ్యతిరేకించాలని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల సమాఖ్య పిలుపునిచ్చింది. ఉద్యోగ సంఘాల నాయకులు వ్యవహరిస్తున్న తీరుపై ఆలోచించండి, మద్దతియ్యండి అంటూ ఉద్యోగుల్లో మార్పు తీసుకువచ్చేందుకు వీలుగా చేపట్టిన ప్రచారం సందర్భంగా శుక్రవారం కాకినాడలోని ట్రెజరీ కార్యాలయం, ఇండస్ట్రియల్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సమాఖ్య కన్వీనర్ కె.వెంకట్రామిరెడ్డి, కో కన్వీనర్ అరవ పాల్ మాట్లాడారు. ఉద్యోగుల సమస్యలపై ఉద్యోగ సంఘాల నాయకులు ఎప్పుడూ పట్టించుకోలేదని, ఒక మహిళా ఉద్యోగిపై విచక్షణా రహిత దాడి జరిగినపుడుకాని, ప్రభుత్వం నిరంతరంగా 2, 3 డీఏలు పెండింగ్‌లో పెడుతున్నా, పనితీరు పేరుతో 50 ఏళ్లకే ఉద్యోగుల బలవంతపు పదవీ విరమణ జీఓ తయారైనపుడు కాని, సమీక్షలు, వీడియో కాన్ఫరెన్స్‌ల వల్ల ఉద్యోగులు తీవ్రమైన వత్తిడికి గురౌతున్నా పట్టించుకున్న పాపానపోలేదన్నారు. నాయకుల మార్పుతోనే ఉద్యోగుల మనుగడ సాధ్యం అనే నినాదంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. విద్యా సంవత్సరం మధ్యలో రాజధాని ఉద్యోగులను తరలించినప్పుడు, అస్తవ్యస్థమైన బయోమెట్రిక్ విధానంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నా ఉద్యోగ సంఘాల నాయకులు తమ స్వార్థ రాజకీయాల కోసం పట్టించుకోలేదని విమర్శించారు. గతం ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చించి వారి అంగీకారంతో ఐఆర్ మంజూరు చేస్తే, ఇప్పటి ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో కనీసం చర్చించకుండా 20 శాతం ఐఆర్ మంజూరు చేసిందన్నారు. ఈ ప్రభుత్వం ఉద్యోగ సంఘాల అస్థిత్వాన్ని దెబ్బతీసే చర్యలు చేపడుతున్నా నాయకులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ప్రభుత్వ ధోరణి ఇలాగే కొనసాగితే భవిష్యత్తు తరాల ఉద్యోగులు చాలా నష్టపోతారని వెంకట్రామిరెడ్డి, అవరపాల్ వాపోయారు. 2009లో ఉద్యోగులకు 22 శాతం, 2014లో 27 శాతం మధ్యంతర భృతి ఇచ్చినప్పుడు ఎవరూ సన్మానాలు చేయలేదని, హైదరాబాద్‌లో అత్యంత విలువైన గచ్చిబౌలిలో ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కోసం ఎకరం రూ. 38 వేలకు ఇచ్చినప్పుడు సన్మానాలు ఎందుకు చేయలేదన్నారు. ఇప్పుడు కేవలం 30 శాతం మధ్యంతర భృతి అదీ పోస్ట్‌డేటెడ్ తరహాలో ఇచ్చినందుకు, కొత్త రాజధానిలో ఎకరం రూ.కోటిపైగా రేటుతో ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇచ్చినందుకు సన్మానాలు చేస్తున్నారంటే మన నాయకులు పరిస్థితి ఏమిటో ఒకసారి ఆలోచించాలని ఉద్యోగులను కోరారు. 2014 నుంచి డీఏలు పెండింగ్ ఉంటూనే ఉన్నాయన్నారు. ఇప్పటికైనా ఉద్యోగులంతా మేల్కొని నాయకులను మార్చుకోకపోతే ఉద్యోగుల మనుగడకే ప్రమాదమన్నారు. సీపీఎస్ విధానం రద్దు కాదని, భవిష్యత్‌లో ఉద్యోగులకు డీఏ రాదని, పీఆర్సీ ఎప్పుడు అమలవుతుందో తెలియదని, హెల్త్‌కార్డులు పని చేయవని, 50 ఏళ్లకే బలవంతపు పదవీ విరమణ జీఓలు ఏ క్షణమైనా విడుదల అవ్వోచ్చని, బయోమెట్రిక్ విధానంతో ఉద్యోగులను బానిసలుగా చేసుకొంటారని, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌తో రెగ్యులర్ విధానాన్ని రద్దు చేస్తారన్న భయం ఉద్యోగుల్లో ఉందని వెంకట్రామిరెడ్డి, అరవపాల్ అన్నారు. ఈ విషయాలపై రాష్ట్రం అంతా తిరుగుతూ ఉద్యోగుల్లో నాయకుల మార్పు కోరుతూ చైతన్యం తీసుకువస్తున్నట్లు తెలిపారు. ప్రతి విషయంలో ఉద్యోగులకు జరిగే అన్యాయం ప్రశ్నించేందుకు వీలుగా ఒక బలమైన వేదిక అవసరమని గుర్తించి ప్రభుత్వ, ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమాఖ్యను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమలాకర శర్మ, ఎం.రమేష్, లెక్కల జమాల్‌రెడ్డి, ఖాదర్‌బాబా, పటేల్ తదితరులు పాల్గొన్నారు. -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు డీఏ 3 శాతం పెంపు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు తీపి కబురు. వారి కరువు భత్యం(డీఏ)ను 3 శాతం పెంచుతూ కేం ద్రం నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ నేతృత్వంలో మంగళవారం సమావేశమైన కేబినెట్ ఇందుకు అంగీకరించింది. ఈ నిర్ణయంతో సుమారు 48.41 లక్షల మంది ఉద్యోగులకు, 62.03 లక్షల మంది పింఛన్‌దారులకు లబ్ధి చేకూరుతుంది. ఈ పెంపు జనవరి 1 నుంచే అమల్లోకి వస్తుందని కేంద్రం ప్రకటించింది. ఫలితంగా 2019 జనవరి, 2020 ఫిబ్రవరి మధ్యకాలంలో ఖజానాపై సుమారు రూ. 19,864 కోట్ల భారం పడుతుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. కేబినెట్ మరిన్ని నిర్ణయాలు.. తలాక్ ఆర్డినెన్స్, కంపెనీల చట్టం (రెండో సవరణ) ఆర్డినెన్స్, మెడికల్ కౌన్సిల్ ఆర్డినెన్స్, పోంజి పథకాల నివారణ ఆర్డినెన్స్‌కు ఆమోదం. రాజ్యసభలో సంబంధిత బిల్లు లు నిలిచిపోవడంతో ఆర్డినెన్స్‌లు తెచ్చింది. రూ.30,274 కోట్ల వ్యయంతో ఢిల్లీ–గజియాబాద్–మీరట్ మార్గంలో రీజినల్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ (ఆర్ఆర్టీఎస్) ఏర్పాటుకు అంగీకారం. 82 కి.మీ దూరాన్ని 60 నిమిషాల్లో చేరుకునేలా వేగవంతమైన, పర్యావరణ హితమైన రైల్వే వ్యవస్థను అందుబాటులోకి తెస్తారు. 2025నాటికి కోటి ఉద్యోగాల కల్పనే లక్ష్యం గా నూతన ఎలక్ట్రానిక్స్ పాలసీసి ఓకే క్యాప్టివ్ మైనింగ్(సొంత అవసరాలకు మాత్రమే వినియోగించే) ద్వారా ఉత్పత్తి చేసిన బొగ్గులో నిర్వహణ కంపెనీలు 25 శాతాన్ని బహిరంగ మార్కెట్లో విక్రయించేందుకు అనుమతి. చమురు, సహజవాయువు బావుల వేలానికి రెండు దశాబ్దాల క్రితం నాటి విధానం పునరుద్ధరణ. ఇందులో భాగంగా గతంలో మాదిరిగా ప్రభుత్వానికి రెవెన్యూలో నేరుగా వాటా లభించదు. కానీ ఆపరేటర్ సదరు క్షేత్రం నుంచి ఏడాదిలో 2.5 బిలియన్ డాలర్లకు పైగా అనూహ్య లాభాలు గడిస్తే మాత్రం ఆదాయం పొందుతుంది. -
విజేతకు ఇంకా డబ్బులు అందలేదు!
ముంబై: పుష్కర కాలం తర్వాత విజయ్ హజారే ట్రోఫీని గెలుచుకున్న ముంబై జట్టు సభ్యులకు ఇప్పటి వరకు టోర్నీకి సంబంధించిన ఒక్క రూపాయి కూడా లభించలేదు. ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ)లో పరిపాలన స్తంభించిపోవడంతో వారికి ఈ పరిస్థితి ఎదురైంది. నిబంధనల ప్రకారం బీసీసీఐ నేరుగా ఆటగాళ్లకు డబ్బు లు ఇవ్వకుండా సదరు సంఘం ద్వారానే చెల్లింపులు జరుపుతుంది. ఒక్కో ఆటగాడికి రోజూవారీ భత్యం కింద రూ.1500 లభిస్తుంది. దాదాపు నెల రోజులు సాగిన ఈ టోర్నీ ద్వారా ఒక్కో ఆటగాడికి రూ. 45 వేల వరకు రావాల్సి ఉంది. విజేతగా నిలిచిన జట్టుకు లభించే రూ. 20 లక్షల ప్రైజ్‌మనీ కూడా ముంబై ఆటగాళ్లకు దక్కలేదు. దీంతో పాటు 11 మ్యాచ్‌లు ఆడిన ముంబై ఆటగాళ్లకు ఒక్కో మ్యాచ్ ఫీజు కింద రూ. 35 వేల వంతున కూడా ఇవ్వాల్సి ఉంది. ఎంసీఏలో చెక్‌లపై సంతకం పెట్టే అధికారం కూడా ప్రస్తుతం ఎవరికీ లేకపోవడంతో ఆటగాళ్లు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో బొనాంజ
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరో బంపర్ బొనాంజ పొందబోతున్నారు. వేతన కమిషన్ బొనాంజతో ఇప్పటికే 2 శాతం పెరిగిన డియర్నెస్ అలవెన్స్(డీఏ), మరో విడత వేతన పెంపు ఉండబోతుందని తెలుస్తోంది. డీఏను గణించడానికి ఇండెక్స్‌ను, బేస్ ఇయర్‌ను ప్రభుత్వ సవరించబోతుంది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి వేతనం పెరగబోతుందని తెలుస్తోంది. కార్మికుల డీఏను నిర్ణయించడానికి ... ఇండస్ట్రియల్ వర్కర్ల కోసం కొత్త సిరీస్ వినియోగదారుల ధరల సూచీపై కార్మిక మంత్రిత్వ శాఖ పనిచేస్తోందని తెలిసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రభుత్వ రంగ ఉద్యోగులకు, పెన్షనర్లకు జీవన సర్దుబాటు భత్యం ఖర్చు కింద డీఏను చెల్లిస్తారు. బేస్ ఇయర్ 2016తో కొత్త సీపీఐ-ఐడబ్ల్యూను కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ కింద పనిచేసే లేబర్ బ్యూరో ఖరారు చేసిందని ప్రభుత్వ రంగ సీనియర్ అధికారి చెప్పారు. జీవన ఖర్చులు మారుతుండటంతో, ప్రతి ఆరేళ్లకు ఒక్కసారి ఈ బేస్‌ను కూడా మార్చాలని ప్రతిపాదించామని తెలిపారు. ప్రస్తుతమున్న సీపీఐ-ఐడబ్ల్యూ 2001 బేస్ ఇయర్ అని పేర్కొన్నారు. బేస్ ఇయర్‌ను మార్చడంతో, ప్రస్తుతం 1.1 కోట్ల మంది ఉద్యోగులకు, పెన్షనర్లకు లబ్ది చేకూరనుంది. గతంలో 2006లో బేస్ ఇయర్‌ను మార్చారు. కాగ, 7వ వేతన కమిషన్ ప్రతిపాదనల మేరకు మార్చిలోనే కేంద్ర కేబినెట్ డీఏను 5 శాతం నుంచి 7 శాతానికి పెంచింది. ఈ పెంచిన డీఏ 2018 జనవరి నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో 48.41 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 61.17 లక్షల మంది పెన్షనర్లు లబ్ది పొందుతున్నారు. -
ఇంటర్ ‘స్పాట్’లో గొడవ
అనంతపురం ఎడ్యుకేషన్: ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం చేసినందుకు చెల్లించే భత్యం (డీఏ) మంజూరులో ప్రభుత్వం అన్యాయం చేస్తోందంటూ అధికారులతో అధ్యాపకులు గొడవకు దిగారు. ఇందులో భాగంగా అనంతపురంలోని కొత్తూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్పాట్ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న అధ్యాపకులు మంగళవారం మధ్యాహ్నం పెన్‌డౌన్ చేసి నిరసన తెలిపారు. 50 కిలోమీటర్ల పైబడిన దూరం నుంచి స్పాట్ విధులకు వస్తున్న అధ్యాపకులకు రూ. 450 ఇవ్వాల్సి ఉందన్నారు. అలాగే 50 కిలోమీటర్ల లోపు దూరం నుంచి వచ్చేవారికి రూ. 300 ఇవ్వాల్సి ఉందన్నారు. రూ. 300ను రూ. 120కు తగ్గించినట్లు సామాజిక మాద్యమాల్లో మెసేజ్‌లు వస్తున్నాయని దీనిపై స్పష్టమైన హామీ ఇవ్వాలని అధికారులను డిమాండ్ చేశారు. గతంలో కంటే ధరలు పెరిగాయని ఈ పరిస్థితుల్లో ఇంకా పెంచాల్సిందిపోయి డీఏ తగ్గించడం అన్యాయమని వాపోయారు. స్థానికంగా (లోకల్) ఉంటూ స్పాట్‌కు వచ్చే అధ్యాపకులకు గతంలో రూ. 130 దాకా ఇచ్చే రెమ్యూనరేషన్ ఈసారి రద్దు చేసినట్లు తెలిసిందని దీనిపై కూడా అధికారులు స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారులు మాట్లాడుతూ పరీక్షల విధుల్లో పాల్గొన్నవారికి డీఏ మొత్తంలో తగ్గించారు తప్ప స్పాట్ విధుల్లో పాల్గొన్నవారికి తగ్గించాలనే సమాచారం తమకు రాలేదన్నారు. -
రాష్ట్ర ఉద్యోగులకు 2.096 శాతం డీఏ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యాన్ని (డీఏ) 2.096 శాతం పెంచుతూ సర్కారు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది జనవరి నుంచే ఇది అమల్లోకి వస్తుందని పేర్కొంటూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఉద్యోగులకు మూల వేతనంపై 22.008 శాతం డీఏ అమల్లో ఉంది. పెరిగిన డీఏతో కలిపి 24.104 శాతానికి చేరుతోంది. దీనితో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు నాలుగున్నర లక్షల మంది ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. డీఏ పెంపుతో ప్రభుత్వంపై ఏటా రూ.400 కోట్ల భారం పడుతుందని అంచనా. ఈ నెల నుంచి నగదుగా.. సెప్టెంబర్æ నెల వేతనం నుంచి పెరిగిన డీఏను నగదుగా చెల్లిస్తారు. అంటే దసరా పండుగకు ముందే ఈ నెల 25న చెల్లించే జీతంతో పెరిగిన డీఏ ఉద్యోగుల చేతికి అందనుంది. ఇక జనవరి నుంచి ఆగస్టు వరకు ఉన్న బకాయిని ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌లో కొనసాగుతున్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు 90 శాతం బకాయిలు నగదుగా చెల్లిస్తారు. మిగతా పది శాతాన్ని ప్రాన్ (పీఆర్ఏఎన్) ఖాతాలో జమ చేస్తారు. బకాయిలకు సంబంధించి నవంబర్ 30లోగా ట్రెజరీ, పే అండ్ అకౌంట్స్ కార్యాలయాల్లో బిల్లులు సమర్పించాలని ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. పెన్షనర్లపై త్వరలో ఉత్తర్వులు ఉద్యోగ, ఉపాధ్యాయులందరికీ పెరి గిన డీఏ వర్తిస్తుంది. జిల్లా పరిషత్, మం డల పరిషత్, గ్రామ పంచాయతీ, మున్సి పాలిటీలు, కార్పొరేషన్లు, మార్కెట్ కమి టీలు, జిల్లా గ్రంథాలయ సంస్థల్లో రెగ్యు లర్ జీతంపై పనిచేస్తున్న వారికి, రాష్ట్రం లోని వర్సిటీలు, ఎయిడెడ్ విద్యా సంస్థలు, ఎయిడెడ్ పాలిటెక్నిక్‌లలో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందికి, ఉద్యో గులకు పెరిగిన డీఏ వర్తిస్తుంది. అయితే పెన్షనర్లకు సంబంధించిన కరువు భృతి ఉత్తర్వులను ఒకటి రెండు రోజుల్లో విడు దల చేయనున్నట్లు సమాచారం. -
కేంద్ర ఉద్యోగులకు 1% డీఏ పెంపు
-
కేంద్ర ఉద్యోగులకు 1% డీఏ పెంపు
► పింఛనుదారులకు కూడా.. ► పన్నురహిత గ్రాట్యుటీ రూ.20 లక్షలకు పెంపు ► కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ► కీలక కమిటీల్లోకి కొత్త కేబినెట్ మంత్రులు న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు మేలు చేసేలా కరువు భత్యం (డీఏ), డియర్నెస్ రిలీఫ్ (డీఆర్)లను పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం జరిగిన కేబినెట్ భేటీలో ప్రస్తుతమున్న 4 శాతం (మూల వేతనం/పింఛనుపై) డీఏను మరో శాతం పెంచేందుకు అంగీకారం తెలిపారు. దీని ద్వారా 50 లక్షల మంది ఉద్యోగులు, 61 లక్షల మంది పింఛనుదారులకు లాభం చేకూరనుంది. ఈ ఏడాది జూలై 1 నుంచి ఈ ఒక శాతం డీఏ, డీఆర్ పెంపు వర్తిస్తుందని కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది.ఈ పెంపు ద్వారా ఖజానాపై ఏడాదికి రూ. 3,068.26 కోట్ల భారం పడనుండగా.. 2017–18 సంవత్సరానికే (జూలై 2017–ఫిబ్రవరి 2018) రూ. 2,045.50 కోట్లు భారం పడుతుంది. దీంతోపాటుగా ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ నియంత్రణలోని స్వతంత్ర సంస్థల (సెంట్రల్ సివిల్ సర్వీసెస్ నిబంధనలు వర్తించని) ఉద్యోగులకు చెందాల్సిన పన్ను రహిత గ్రాట్యుటీని రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంచుతూ సవరించిన బిల్లుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఈ గ్రాట్యుటీ (సవరణ) బిల్లు–2017ను పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కేబినెట్ అంగీకారం తెలిపింది. 7వ వేతన కమిషన్ ప్రతిపాదనల అమలుకు ముందు ఇది రూ. 10 లక్షలుగా ఉండేది. ఈ పెంపు జనవరి 1, 2016 నుంచి అమల్లోకి రానుంది. రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగులకు సామాజిక భద్రత కల్పించేందుకే పన్నురహిత గ్రాట్యుటీ పరిధిని పెంచారు. ఒప్పందాల వివరాలు తెలపరా? విదేశాలతో చేసుకునే ఒప్పందాలను తమకు వెల్లడించటంలేదంటూ కేబినెట్ సెక్రటేరియట్ వివిధ ప్రభుత్వ శాఖలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. దేశ భద్రత, విదేశాలతో సంబంధాలు మినహా సంస్కృతి, సైన్స్ మొదలైన అన్ని ఒప్పందాలను సంబంధిత మంత్రి ఆమోదం తర్వాత కేబినెట్ సెక్రటేరియట్‌కు తెలియజేయాలని కోరింది. తద్వారా విదేశాంగ శాఖకు, కేబినెట్‌కు సమాచారం అందించేందుకు వీలుంటుందని పేర్కొంది. ఒప్పందం జరిగిన నెలలోపు ఈ సమాచారం కేబినెట్ సెక్రటేరియట్‌కు తెలియాల్సిందేనని స్పష్టం చేసింది. మరిన్ని కేబినెట్ నిర్ణయాలు: ► పదోన్నతి పొందిన మంత్రులు నిర్మలా సీతారామన్ (భద్రత, ఆర్థిక, రాజకీయ వ్యవహారాలు), పీయూష్ గోయల్ (రాజకీయ, ఆర్థిక వ్యవహారాలు), ధర్మేంద్ర ప్రధాన్ (ఆర్థిక వ్యవహారాలు)లను కీలకమైన కేబినెట్ కమిటీల్లో సభ్యులుగా నియమించారు. మంత్రి ఉమాభారతికి ఇప్పుడు ఏ కమిటీలోనూ సభ్యత్వం లేదు. ► రూ.2,081.27 కోట్లతో దౌండ్–మన్మాడ్ రైల్వే డబ్లింగ్ (247.5 కి.మీ.) పనులకూ కేబినెట్ పచ్చజెండా ఊపింది. ► మొరాకో, అర్మేనియా దేశాలతో జరిగిన ఒప్పందాలకూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. -
ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ : 50 లక్షల మంది ఉద్యోగులకు, 61 లక్షల మంది పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. డియర్నెస్ అలవెన్స్‌ను, డియర్నెస్ రిలీఫ్‌ను 1 శాతం పెంచి 5 శాతం చేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో మంగళవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. బేసిక్ వేతనం, పెన్షన్ కింద ప్రస్తుతం ఇస్తున్న 4 శాతం డీఏ రేటును, 1 శాతం పెంచుతున్నట్టు అధికారిక ప్రకటన వెలువరించింది. ఈ కొత్త రేటు జూలై 1 నుంచి అమల్లోకి వస్తుందని కేబినెట్ పేర్కొంది. డీఏ, డీఆర్ రెండింటి ఖాతాల ద్వారా ఖజానాపై పడే ప్రభావం వార్షికంగా రూ.3,068.26 కోట్లు ఉంటుందని, అదే 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఎనిమిది నెలల కాలానికి( 2017 జూలై నుంచి 2018 ఫిబ్రవరి) రూ.2,045.50 కోట్లుగా ఉంటుందని తెలిసింది. కేంద్ర కేబినెట్ మంగళవారం తీసుకున్న నిర్ణయంతో 49.26 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 61.17 లక్షల మంది పెన్షనర్లు లబ్ది పొందనున్నారు. -
ఉద్యోగులకు ఒక బకాయి డీఏ
సాక్షి, అమరావతి: ఉద్యోగులకు వ్యతిరేకంగా రూపొందించిన ముసాయిదా జీఓలపై వెల్లువెత్తిన నిరసనను చల్లార్చేందుకు ఏపీ ప్రభుత్వం వారికి బకాయి డీఏల్లో ఒకటి చెల్లించాలని నిర్ణయించింది. సర్వీసు నిబంధనల్లో మార్పులు చేయడం ద్వారా రిటైర్మెంట్ వయసు తగ్గించడంతో పాటు ఉద్యోగులకు వ్యతిరేకంగా రూపొందించిన ముసాయిదా జీఓలను ‘సాక్షి’ బయటపెట్టిన విషయం తెలిసిందే. దీనిపై ఉద్యోగుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుండటంతో దాన్నుంచి తప్పించుకునేందుకు తక్షణం బకాయి పడిన రెండు డీఏల్లో ఒకటి మాత్రమే చెల్లించాలని నిర్ణయించారు. వెలగపూడి సచివాలయంలో గురువారం సీఎం బాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. వివరాలను మంత్రులు కళా వెంకట్రావు, ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు. ఠి ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటివరకూ ఐదు డీఏలు ఇవ్వగా మరో రెండు డీఏలు బకాయి పడ్డాయి. వాటిలో ఒకదాన్ని చెల్లిం చేందుకు ఆమోదం. 2016 జనవరి 1 నుంచి 2017 ఆగస్టు 31 వరకూ బకాయి పడిన 20 నెలల డీఏను ఉద్యోగుల జీపీఎఫ్ అకౌంట్లో వేసేందుకు అనుమతి. సెప్టెంబర్ నుంచి ఉద్యోగుల జీతాలతోపాటు ఈ డీఏ చెల్లిం చేందుకు ఆమోదం. ఇందుకు నెలకు రూ. 100 కోట్లు ఖర్చవుతుంది. ఠి అభ్యంతరాలు లేని ఆక్రమణలను క్రమబద్ధీకరించాలని నిర్ణయం. ఒకటి నుంచి 100 చదరపు గజాల వరకూ బీపీఎల్ కుటుంబాలకు ఉచితంగా క్రమబద్ధీకరణ. ఏపీఎల్ కుటుంబాలకు 1–100 చదరపు గజాల వరకు 7.5 శాతం, 101–250 చదరపు గజాల వరకు 15 శాతం, 500 చదరపు గజాల వరకూ 30 శాతం ఫీజు వసూలు. 500 గజాలు దాటిన ఆక్రమణలు తొలగించాలని నిర్ణయం. -
3.668% డీఏ పెంపు
-
3.668% డీఏ పెంపు
ఉద్యోగులకు కరువు భత్యం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు పెరిగిన డీఏ గతేడాది జూలై నుంచే అమల్లోకి.. మే ఒకటిన ఇచ్చే జీతంతో చెల్లింపులు 2016 జూలై నుంచి ఉన్న బకాయిలు జీపీఎఫ్‌లో జమ మొత్తంగా 22.008 శాతానికి పెరిగిన డీఏ సాక్షి, హైదరాబాద్: ఉద్యోగులకు కరువు భత్యం (డీఏ) పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది జూలై నుంచి 3.668 శాతం చొప్పున పెరిగిన డీఏ వర్తించనుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 4.50 లక్షల మంది ఉద్యోగులు లబ్ధిపొందనున్నారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వానికి ఏటా రూ.400 కోట్ల అదనపు భారం పడనుంది. ప్రస్తుతం ఉద్యోగులకు మూల వేతనంపై 18.34 శాతం డీఏ అమల్లో ఉండగా.. తాజా పెంపుతో అది 22.008 శాతానికి పెరిగింది. గురువారం ఈ మేరకు ఆర్థిక శాఖ కార్యదర్శి శివశంకర్ జీవో నం.58 జారీ చేశారు. ఏప్రిల్ నెల జీతంతోనే పెరిగిన కరువు భత్యాన్ని నగదుగా చెల్లిస్తారు. ఆ ప్రకారం మే ఒకటో తారీఖున పెరిగిన డీఏ ఉద్యోగుల చేతికందుతుంది. గతేడాది జూలై నుంచి ఈ ఏడాది మార్చి వరకు ఉన్న డీఏ బకాయిలను ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌లో కొనసాగుతున్న ఉద్యోగ ఉపాధ్యాయులకు 90 శాతం బకాయిలు నగదుగా చెల్లిస్తారు. మిగతా పది శాతాన్ని ప్రాన్ (పీఆర్ఏఎన్) అకౌంట్లో జమ చేస్తారు. ఈ ఏడాది ఆగస్టు 31 లోగా పదవీ విరమణ చేయనున్న ఉద్యోగులకు వంద శాతం బకాయిలు నగదు రూపంలోనే చెల్లిస్తారు. జీపీఎఫ్ ఖాతా లేని ఉద్యోగులుంటే వారి డీఏ బకాయిల మొత్తాన్ని ప్రభుత్వం కంపల్సరీ సేవింగ్ అకౌంట్లో జమ చేస్తుంది. సదరు ఉద్యోగులు ఖాతాలు తెరిచిన తర్వాత జీపీఎఫ్‌లో సర్దుబాటు చేస్తారు. బకాయిలకు సంబంధించి మే 15 లోగా ట్రెజరీ, పే అండ్ అకౌంట్స్ కార్యాలయాల్లో బిల్లులు సమర్పించాలని ఆర్థిక శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగ ఉపాధ్యాయులు, జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, మార్కెట్ కమిటీలు, జిల్లా గ్రంథాలయ సంస్థల్లో రెగ్యులర్ జీతంపై పని చేస్తున్న వారికి, రాష్ట్రంలోని యూనివర్సిటీలు, ఎయిడెడ్ విద్యా సంస్థలు, ఎయిడెడ్ పాలిటెక్నిక్‌ల్లో పని చేస్తున్న టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి, ఉద్యోగులకు పెరిగిన డీఏ వర్తిస్తుంది. పెన్షనర్లకు సంబంధించిన కరువు భృతి ఉత్తర్వులను ఒకటి రెండ్రోజుల్లో ప్రభుత్వం విడుదల చేయనుంది. -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంపు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించే కరువు భత్యం( డీఏ) పెంచుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఉద్యోగులకు, పెన్షనర్లకు చెల్లించే డియర్ నెస్ అలవెన్స్‌ను అదనంగా 2 శాతం పెంచేందుకు నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం జరిగిన క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. జనవరి 2017 నుంచి ఈ డీఏ/డీఆర్ 2 శాతం పెంపును అమలు చేయనున్నారు. డీఏ పెంపు వల్ల 50 లక్షల మంది ఉద్యోగులతో పాటు 58 లక్షల మంది పింఛన్ దారులు లబ్ది పొందనున్నారు. కాగా పెరుగుతున్న నిత్యావసరాల ధరలకు అనుగుణంగా డీఏ పెంపు లేదని ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. నిత్యా వసరాలు ఆకాశాన్నం టుతుంటే కేంద్రం తక్కు వగా పెంచుతోందని కేంద్ర ఉద్యోగుల సమాఖ్య ఇటీవల విమర్శించిన సంగతి తెలిసిందే. -
2 శాతం డీఏ పెంచనున్న కేంద్రం!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్ దా రులకు 2 నుంచి 4 శాతం వరకు కరువు భత్యం (డీఏ) పెరగనుంది. త్వరలో కేంద్ర ప్రభుత్వం దీనిపై ప్రకటన చేయనుంది. డీఏ పెంపు వల్ల 50 లక్షల మంది ఉద్యోగులతో పాటు 58 లక్షల మంది పింఛన్ దారులు లబ్ధి పొందనున్నారు. కేంద్రం ఆమోదించిన ప్రకారం డీఏ పెంపు 2017 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి. పెరుగుతున్న నిత్యావసరాల ధరలకు అనుగుణంగా డీఏ పెంపు లేదని ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. నిత్యా వసరాలు ఆకాశాన్నం టుతుంటే కేంద్రం తక్కు వగా పెంచుతోందని కేంద్ర ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కె.కె.ఎన్ .కుట్టీ మండిపడ్డారు. -
ఘనంగా ఇంజనీర్స్‌డే వేడుకలు
అనంతగిరి(కోదాడఅర్బన్): మండల పరిధిలోని అనంతగిరిలోని అనురాగ్ ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఇంజనీర్స్‌డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎంవీ శివప్రసాద్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకుని ఇంజనీరింగ్ విద్యార్థులు దేశాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా విద్యార్ధులకు క్విజ్, పోస్టర్ ప్రెజెంటేషన్, డిబేట్, పేపర్ ప్రెజెంటేషన్, మాక్ ఇంటర్వూలు నిర్వహించి విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలు విభాగాల హెచ్ఓడీలు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
డీఏ పెంపు అమల్లోకి..
అక్టోబర్ ఒకటిన ఇచ్చే జీతంతో చెల్లింపులు ►జనవరి నుంచి ఇవ్వాల్సిన బకాయిలు జీపీఎఫ్‌లో జమ ►3.144 శాతం పెరిగి 18.340 శాతానికి చేరిన డీఏ ►4.5 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు ప్రయోజనం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3.144 శాతం కరువు భత్యం (డీఏ) పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది జనవరి నుంచే ఇది వర్తించనుంది. దీంతో దాదాపు 4.50 లక్షల మంది ఉద్యోగులు లబ్ధి పొందనుండగా.. ఖజానాపై ఏటా రూ.300 కోట్ల భారం పడనుంది. ప్రస్తుతం ఉద్యోగులకు మూల వేతనంపై 15.196 శాతం డీఏ అమల్లో ఉంది. ప్రస్తుతం పెంచిన 3.144 శాతం కలిపి మొత్తంగా డీఏ 18.340 శాతానికి చేరింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శివశంకర్ గురువారం జీవో నం.103 జారీ చేశారు. సెప్టెంబర్ నెల వేతనం నుంచి అంటే అక్టోబర్ ఒకటిన చేతికందే జీతంతోపాటు పెరిగిన కరువు భత్యాన్ని నగదుగా చెల్లిస్తారు. జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, మార్కెట్ కమిటీలు, జిల్లా గ్రంథాలయ సంస్థల్లో రెగ్యులర్ జీతంపై పనిచేస్తున్న వారికి, రాష్ట్రంలోని యూనివర్సిటీలు, ఎయిడెడ్ విద్యా సంస్థలు, ఎయిడెడ్ పాలిటెక్నిక్‌ల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది, ఉద్యోగులకు పెరిగిన డీఏ వర్తిస్తుంది. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు ఉన్న డీఏ బకాయిలను ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తారు. ఇక కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌లో కొనసాగుతున్న ఉద్యోగులకు 90 శాతం బకాయిలను నగదుగా చెల్లిస్తారు. మిగతా పది శాతాన్ని ప్రాన్ (పీఆర్ఏఎన్) ఖాతాలో జమ చేస్తారు. ఈ ఏడాది డిసెంబర్ 31లోగా పదవీ విరమణ చేయనున్న ఉద్యోగులకు వంద శాతం బకాయిలు నగదు రూపంలోనే చెల్లిస్తారు. జీపీఎఫ్ ఖాతా లేని ఉద్యోగులున్నట్లయితే.. వారి డీఏ బకాయిల మొత్తాన్ని ప్రభుత్వం కంపల్సరీ సేవింగ్ ఖాతాలో జమ చేస్తుంది. సదరు ఉద్యోగులు ఖాతాలు తెరిచిన తర్వాత జీపీఎఫ్‌లో సర్దుబాటు చేస్తారు. బకాయిలకు సంబంధించి అక్టోబర్ 15లోగా ట్రెజరీ, పే అండ్ అకౌంట్స్ కార్యాలయాల్లో బిల్లులు సమర్పించాలని ఆర్థిక శాఖ ఆదేశించింది. ఇక పెన్షనర్లకు కరువు భృతి పెంపు ఉత్తర్వులను ఒకటి రెండు రోజుల్లో విడుదల చేసే అవకాశముంది. -
ఏపీ ఉద్యోగులకు అత్తెసరు డీఏ!
-
ఉద్యోగులకు అత్తెసరు డీఏ!
♦ ఒక్క కరవు భత్యంతోనే సరి ♦ గత ఏడాది జూలై నుంచి డీఏకు నేటి కేబినెట్లో ఆమోదం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు నెలల తరబడి ఎదురు చూస్తున్న కరువు భత్యం (డీఏ)పై కోత వేసేం దుకు సర్కారు సిద్ధమైంది. గత ఏడాది జూలై నుంచి, ఈ ఏడాది జనవరి నుంచి రెండు డీఏలను ఉద్యోగులకు ఇవ్వాల్సి ఉండగా... ప్రస్తుతం ఒక్క డీఏ ఇచ్చేందుకే సీఎం చంద్రబాబు అంగీకరించారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇవ్వాల్సిన కరువు భత్యాన్ని పెండిం గ్లో పెట్టేశారు. మరోవైపు ఈ ఏడాది జూలై నుంచి కూడా మరో కరువు భత్యం ఇవ్వాల్సి ఉంది. ఒక్క డీఏ మంజూరు ఫైలును విజయవాడలో శనివారం జరగనున్న మంత్రివర్గ సమావేశానికి పంపించాలని ప్రభుత్వ సీఎస్ సత్యప్రకాశ్ టక్కర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జూలై నుంచి డిసెంబర్ వరకు 3.144 శాతం కరువు భత్యం మంజూరు చేయనున్నారు. అంటే కరువు భత్యం 12.052 శాతం నుంచి 15.196 శాతానికి పెరగనుంది. జూలై నుంచి ఆగస్టు వరకు పెరిగిన కరువు భత్యాన్ని ఉద్యోగుల జీపీఎఫ్‌లో జమ చేస్తారు. సెప్టెంబర్ నుంచి పెరిగిన కరువు భత్యాన్ని అక్టోబర్ 1వ తేదీ జీతాలతో కలిపి ఇవ్వనున్నారు. కరువు భత్యం పెంపు కారణంగా ఏడాదికి రూ.1900 కోట్ల వ్యయం కానుంది. ఇలా ఉండగా బియ్యం, పప్పులు విక్రయాలపై రాష్ట్రంలో రెండు శాతం సీఎస్టీ చెల్లిం చాల్సి ఉంది. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, మహారాష్ర్టలో సీఎస్టీ లేదని, ఆ రాష్ట్రాల్లో విక్రయించిన బియ్యం, పప్పులపై సీఎస్టీ చెల్లించాలనడం సమంజసం కాదని, రద్దు చేయాలని మిల్లర్లు ప్రభుత్వాన్ని కోరారు. ఇందుకు వాణిజ్య, ఆర్థిక శాఖలు తిరస్కరించాయి. ఈ నేపథ్యంలో ఓ సీనియర్ మంత్రి మిల్లర్లతో మాట్లాడుకుని సీఎస్టీ రద్దుకు పావులు కదిపారు. ఈ మేరకు శనివారం జరగనున్న మంత్రివర్గ సమావేశానికి సీఎస్టీ రద్దు అంశం రానుంది. ఇదే జరిగితే రాష్ట్ర ఖజానాకు రూ.450 కోట్లు నష్టం వాటిల్లుతుందని వాణిజ్య పన్నుల శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు! వచ్చే నెల 8వ తేదీలోగా జీఎస్టీ బిల్లును రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించి పంపించాలని కేంద్రం కోరింది. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు శుక్రవారం అధికారులతో సమీక్షించారు. ప్రత్యేకంగా ఒక రోజు అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తారా లేదా వర్షాకాల సమావేశాల్లోనే ఆమోదిస్తారా? అనే విషయాన్ని స్పష్టం చేయాల్సిందిగా వాణిజ్య పన్నుల శాఖ ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై కూడా శనివారం జరగనున్న మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. -
డీఎ అమలు దిశగా తెలంగాణ సర్కారు
-
సెప్టెంబర్ 1న వేతనంతోపాటు డీఏ
కరువు భత్యం ఫైలు సిద్ధం చేసిన ఆర్థిక శాఖ 20న జరిగే కేబినెట్ సమావేశంలో నిర్ణయం 18.340 శాతానికి చేరిన డీఏ 3.5 లక్షల మంది ఉద్యోగులు, 2.5 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి జూలై డీఏపై కేంద్రం ప్రకటన వెలువడిన తర్వాత నిర్ణయం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఎదురుచూపులు ఫలించనున్నాయి. సెప్టెంబర్ 1వ తేదీన ఉద్యోగులకు ఇచ్చే వేతనంతోపాటు కరువు భత్యం(డీఏ) చెల్లించేం దుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించిన ఫైలును ఇప్పటికే ఆర్థిక శాఖ సిద్ధం చేసింది. ఈ నెల 20న జరిగే కేబినెట్ సమావేశం దీనికి ఆమోదం తెలుపనుంది. 2016 జనవరి నెలలో ఇవ్వాల్సిన డీఏ కోసం రాష్ట్రంలోని 3.5 లక్షల మంది ఉద్యోగులు, కరువు భృతి(డీఆర్) కోసం 2.5 లక్షల మంది పెన్షనర్లు ఎదురుచూస్తున్నారు. డీఏ ఇవ్వాలని ఉద్యోగులు, పెన్షనర్లు ఇప్పటికే ప్రభుత్వానికి పలు దఫాలుగా విజ్ఞప్తి చేశారు. చివరకు ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను కలసి విజ్ఞాపనపత్రాలు అందజేశారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో సెప్టెంబరు 1న వేతనంతోపాటు డీఏ చెల్లించేందుకు ఆర్థిక శాఖ చర్యలు చేపట్టింది. కేబినెట్ ఆమోదం లభించగానే డీఏ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయనుంది. 18.340 శాతానికి చేరిన డీఏ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు 2016 జనవరి నాటికే మూల వేతనంపై 15.196 శాతం డీఏ అమల్లో ఉంది. దీనికి జనవరి నెలలో రావాల్సిన మరో 3.144 శాతం డీఏ కలిపి ఇవ్వాల్సి ఉంది. అంటే జనవరి నుంచి 18.340 శాతం డీఏ రావాల్సి ఉంది. సాధారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా రెండుసార్లు(జనవరిలో ఒకసారి, జూలైలో మరోసారి) ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్ ఇస్తాయి. అయితే కేంద్రం ప్రకటించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. గత జనవరిలో ఇవ్వాల్సిన డీఏను కేంద్రం ఇప్పటికే మంజూరు చేసి ఇచ్చింది. మొన్నటి జూలైలో ఇవ్వాల్సిన డీఏను త్వరలోనే మంజూరు చేసే అవకాశం ఉంది. రాష్ట్రంలో మాత్రం జనవరిలో ఇవ్వాల్సిన డీఏ చెల్లింపునకు 20న జరిగే కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోనుంది. ఇక జూలైలో రావాల్సిన డీఏకు సంబంధించి కేంద్రం నుంచి ప్రకటన వెలువడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. -
8 కి .మీ. దాటితే టీఏ,డీఏ ఇవ్వాల్సిందే
యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సాక్షి, రంగారెడ్డి జిల్లా : పదో తరగతి స్పాట్‌కు ఎనిమిది కిలోమీటర్లకు పైబడి హాజరయ్యే ఉపాధ్యాయులందరికీ టీఏ, డీఏ ఇవ్వాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆంజనేయు లు, గాలయ్య సోమవారం డిమాండ్ చేశారు. వాల్యూయేషన్‌కు వచ్చే వారికి కనీస సౌకర్యాలు కల్పించాలన్నారు. గత ఐదేళ్లుగా హయత్‌నగ ర్ వర్డ్ అండ్ డీడ్ పాఠశాలలో స్పాట్ వాల్యూయేషన్ జరుగుతుందని, 50 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం నుంచి టీచర్లు వచ్చి ప్రక్రియలో పాల్గొంటున్నారని తెలిపారు. కానీ వారికి తగిన భత్యం ఇవ్వకుండా విద్యాశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలిపారు. ఇప్పటి నుంచి అయినా.. ఎనిమిది కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం నుంచి వచ్చే ప్రతి ఉపాధ్యాయుడికి దినసరి భత్యం సంతృప్తికరంగా ఇవ్వాలని వారు ఈ మేరకు డిమాండ్ చేశారు. -
జీపీఎఫ్‌లోకి డీఏ బకాయిలు
* డీఏ సొమ్ములు అందేది ఏప్రిల్‌లోనే * రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 3.144 శాతం పెంపు * 8.908 శాతం నుంచి 12.052 శాతానికి పెరుగుదల * పీఆర్సీ తర్వాత తొలి డీఏ ప్రకటన * 15 నెలల బకాయిలు ఏప్రిల్ 1న చెల్లింపు సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన కరువు భత్యం (డీఏ) పెంపు జీవో వెలువడింది. డీఏను 3.144 శాతం పెంచుతూ ప్రభుత్వం గురువారం పూర్తిస్థాయి జీవో విడుదలచేసింది. బుధవారం రాత్రి పొద్దుపోయాక డీఏ జీవో నంబర్ అప్లోడ్ చేయడానికే పరిమితమైన ఆర్థిక శాఖ.. పూర్తి కాపీని గురువారం ఆన్లైన్లో ఉంచింది. 2015 జవవరి నుంచి డీఏ పెంపు అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తాజా పెంపుతో ఉద్యోగుల డీఏ 8.908 శాతం నుంచి 12.052 శాతానికి పెరిగింది. 2015 జనవరి నుంచి 2016 ఫిబ్రవరి వరకు.. 14 నెలల బకాయిలను జీపీఎఫ్ ఖాతాలో జమ చేయనున్నారు. మార్చి నుంచి నగదు రూపంలో ఉద్యోగులకు చెల్లించనున్నారు. అంటే ఏప్రిల్ 1న అందనున్న జీతంతో పాటు కరువు భత్యం ఉద్యోగులకు నగదు రూపంలో అందనుంది. 2004 తర్వాత ఉద్యోగాల్లో చేరిన వారికి డీఏ బకాయిల్లో 10 శాతం ‘చందాతో కూడిన పెన్షన్ పథకం’ కింద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శాశ్వత ఖాతాలో జమ చేయనున్నారు. బకాయిల్లో మిగతా 90 శాతాన్ని నగదు రూపంలో ఇవ్వనున్నారు. ఈ ఏడాది జూన్ 30న లేదా అంత కంటే ముందు పదవీ విరమణ చేయనున్న ఉద్యోగులకు మొత్తం డీఏ బకాయిలను నగదు రూపంలోనే చెల్లించనున్నారు. 2010 పీఆర్సీ స్కేళ్లలో కొనసాగుతున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 77.896 శాతం నుంచి 83.032 శాతానికి పెరగనున్నాయి. 2005 పీఆర్సీ స్కేళ్లలో కొనసాగుతున్న ఉద్యోగులకు 191.226 శాతం నుంచి 201.558 శాతానికి పెరగనున్నాయి. 1999 పీఆర్సీ స్కేళ్ల ప్రకారం జీతాలు తీసుకొంటున్న ఉద్యోగులకు 196.32 శాతం నుంచి 205.318 శాతానికి డీఏ పెరగనుంది. ఐదో జ్యుడీషియల్ వేతన సంఘం సిఫారసుల మేరకు జీతాలు పొందుతున్న జ్యుడీషియల్ అధికారుల డీఏ 212 శాతం నుంచి 223 శాతానికి పెరగనుంది. పద్మనాభన్ కమిటీ నివేదిక ప్రకారం జీతాలు తీసుకుంటున్న జ్యుడీషియల్ అధికారుల డీఏ 107 శాతం నుంచి 113 శాతానికి పెరగనుంది. 2006 యూజీసీ స్కేళ్లలోని ఉద్యోగులకు డీఏ 107 శాతం నుంచి 113 శాతానికి, 1996 యూజీసీ స్కేళ్లు పొందుతున్న ఉద్యోగులకు 212 నుంచి 223 శాతానికి డీఏ పెరగనుంది. గ్రామ సేవకులు, పార్ట్‌టైం అసిస్టెంట్లకు రూ. 100 పెరగనుంది. పెన్షనర్లకు డీఆర్ పెంపు పెన్షనర్లకు 2015 జనవరి నుంచి 3.144 శాతం కరవు భృతి (డీఆర్) పెంచుతూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. డీఆర్ పెంపు జీవో ఒకట్రెండు రోజుల్లో వెలువడనుంది. 2015 జనవరి నుంచి 2016 మార్చి వరకు 15 నెలల బకాయిలను ఏప్రిల్ 1న పెన్షన్‌తో పాటు నగదు చెల్లించనున్నారు. పాత పేస్కేళ్ల ప్రకారం పెన్షన్లు పొందుతున్న వారికి డీఏ తరహాలోనే డీఆర్ పెరగనుంది. రెండో డీఏ ఎప్పుడో.. ఏటా జనవరి, జూలైలో డీఏ పెంచుతారు. 2015 జనవరి నుంచి ఇవ్వాల్సిన డీఏ ఇన్నాళ్లకు ఇచ్చారు. జూలై నుంచి ఇవ్వాల్సిన రెండో డీఏ ఎప్పుడిస్తారనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. రెండో డీఏ కూడా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2016 జనవరి నుంచి మూడో డీఏ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. దీనికి సంబంధించి వచ్చే నెల్లో ప్రకటించే అవకాశం ఉంది. కేంద్రం ప్రకటించిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా డీఏ మంజూరు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. -
ఉద్యోగులకు కాస్తంత ఉపశమనం
‘యాజమాని-ఉద్యోగి’ బంధం ప్రారంభమయ్యిందంటే ఉద్యోగిని ‘వేతనం-జీతం’ ఖాతాలోవేసి పన్ను భారానికి గురిచేస్తారు. 12 నెలల కాలంలో ఇచ్చిన జీతభత్యాలను ఆదాయపు లెక్కింపులోకి తీసుకుంటారు. జీతం పరిధిలో చాలా అంశాలున్నాయి. బోనస్, బకాయిపడ్డ జీతం, అడ్వాన్స్, నోటీసు పీరియడ్‌లో జీతం, లీజ్ జీతం... ఇలా ఎన్నో! పెన్షన్నూ ఆదాయంగా పరిగణిస్తారు. కుటుంబ పెన్షన్ కూడా ఆదాయమే. అయితే దాన్ని ఇతర ఆదాయంగా పరిగణలోకి తీసుకుంటారు. అలవెన్సులు రకరకాలు.. డీఏ, ఎంటర్టైన్మెంట్ అలవెన్స్‌పై పన్ను ఉం టుంది. అంతేకాకుండా టిఫిన్ అలవెన్స్‌లు, మీల్స్ అలవెన్స్‌లు, డిన్నర్ అలవెన్స్‌లు, మెడికల్ అలవెన్స్‌లు, టెలిఫోన్ అలవెన్స్‌లు, హాలిడే అలవెన్స్‌లు, ఎడ్యుకేషన్ అలవెన్స్‌లు, సర్వెంట్ అలవెన్స్‌లు, స్పెషల్ అలవెన్స్‌లను ఆదాయం కింద లెక్కిస్తారు. అకడమిక్ అలవెన్స్‌లు... పుస్తకాలు కొన్నంత వరకు మినహాయింపు ఇస్తారు. న్యూస్‌పేపర్ అలవెన్స్ ఆదాయం కాదు. కన్వేయన్స్ అలవెన్స్‌పై ఖర్చు పెట్టినంత వరకు మినహాయింపు ఉంటుంది. ఎల్ఐసీ, గ్రాట్యుటీ, వాలంటరీ రిటైర్మెంట్ చెల్లింపులు, ట్రావెలింగ్ అలవెన్స్‌లు... తదితర వాటికి మినహాయింపులు ఇస్తారు. పరిలబ్ధులు లెక్కించి ఆదాయంగా పరిగణిస్తారు. యజమాని ఒలకబోసే ప్రేమంతటినీ ఆదాయంగా పరిగణిస్తార ంటే అతిశయోక్తి కాదు. అయితే ఒక్కటే ఒక్క మినహాయింపు వైద్య ఖర్చులు. చికిత్స నిమిత్తం గుర్తింపు పొందిన హాస్పిటళ్లలో చికిత్స జరగాలి. సర్టిఫికెట్స్ జతపరచాలి. యాజమాని ఉద్యోగి ఆదాయాన్ని లెక్కించిన తర్వాత పన్ను భారాన్ని లెక్కించే ముందు కొన్ని తగ్గింపులు, మినహాయింపులు ఇస్తారు. ఉదాహరణకు వృత్తి పన్ను, 80 సీ సేవింగ్స్, చెల్లింపులు, 80 సీసీసీ పెన్షన్ చెల్లిం పులు, 80 డీ మెడిక్లెయిమ్, 80 డీడీ అంగవైకల్యం వారికి వర్తించేవి, 80 డీడీబీ వైద్య ఖర్చులు, 80 ఈ కింద విద్యా రుణాల మీద వడ్డీ, విరాళాలు తదితర వాటిని పరిగణలోకి తీసుకోవాలి. వీటి విషయంలో యాజమాని తగిన జాగ్రత్త వహిస్తాడు. పన్ను భారాన్ని లెక్కించడం, పన్నుని రికవరీ చేయడం, ఆ మొత్తాన్ని సకాలంలో చెల్లించడం వంటివి యాజమాని భాద్యతలు. పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చు * ఇంటి వసతి/ఇళ్లు విషయాల్లో యాజమాని కట్టించిన ఇళ్లు ఇస్తే.. ఇద్దరికీ ఉపయోగం. యాజమాని ఇళ్లు ఫీజు తీసుకొని ఉద్యోగికి ఇళ్లు ఇచ్చినా ఉపయోగం. * అలాగే ఉద్యోగికి ఫర్నీచర్ ఇవ్వొచ్చు. * పిల్లలకి ఎడ్యూకేషన్ ఎలవెన్స్ మినహాయింపు ఉంది. అయితే ఇది చాలా తక్కువ మొత్తం. దీనికి బదులుగా యాజమాని నిర్వహించే పాఠశాలలోనే చదివితే మంచిది. అంతేకాకుండా పిల్లలకి స్కాలర్షిప్లను ఇవ్వొచ్చు. * యాజమాని ఉద్యోగులకు యూనిఫామ్ ఇవ్వొచ్చు. పన్నుభారం ఎవరికి ఉండదు. * ఇవికాకుండా యూనిఫామ్‌తోపాటు షూస్, రిస్ట్‌వాచ్‌లు, బ్రీఫ్‌కేసులు తదితర వస్తువులను ఉద్యోగికి ఇవ్వొచ్చు. అటు యాజమానికి ఈ ఖర్చులకు మినహాయింపు ఉంటుంది. ఇటు ఉద్యోగికి పన్ను భారం ఉండదు. -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 6% డీఏ పెంపు
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఉద్యోగులకు 6 శాతం డీఏ పెంపు ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించే కరువు భత్యాన్ని(డీఏ) ఆరు శాతం పెంచుతూ కేంద్ర మంత్రివర్గం ఈ మేరకు బుధవారం నిర్ణయం తీసుకుంది. దీంతో మూల వేతనంపై 119 శాతానికి డీఏ పెరిగినట్లయింది. జూలై 1 నుంచి ఈ పెంపు అమల్లోకి రానుంది. ఆరో వేతన సంఘం సిఫారసుల మేరకు ఈ పెంపు చోటు చేసుకుంది. గతంలో 113 శాతంగా ఉండిన డీఏ ప్రస్తుతం 119 శాతానికి పెరిగింది. -
6 శాతం డీఏ పెంపు
18 లక్షల ఉద్యోగులకు లబ్ధి సర్కారుపై అదనపు భారం సాక్షి, చెన్నై: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచుతూ సీఎం పన్నీరు సెల్వం నిర్ణయం తీసుకున్నారు. ఆరు శాతం మేరకు వర్తింప చేస్తూ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. 18 లక్షల ఉద్యోగులకు ఈ పెంపు వర్తించనున్నది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవల డీఏ పెరిగిన విషయం తెలిసిందే. తమకు కూడా డీఏ పెంచాలన్న డిమాండ్‌ను ఉద్యోగులు తెర మీదకు తెచ్చారు. ఓ వైపు తమ డిమాండ్ల సాధన లక్ష్యంగా ఉద్యోగులు పోరు బాటకు సిద్ధం అవుతున్న సమయంలో వారికి డీఏను పెంచుతూ బుజ్జగించే పనిలో సీఎం పన్నీరు సెల్వం నిమగ్నం అయ్యారు. డీఏ పెంపు: రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అన్ని విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగ సిబ్బంది, అంగన్వాడీ, పౌష్టికాహారం తదితర ప్రభుత్వ ప్రత్యేక పథకాల అమల్లో నిమగ్నమైన ఉద్యోగులు, ప్రభుత్వ, ప్రభుత్వ సహకారంతో నడిచే పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ప్రభుత్వ రంగ, స్థానిక సంస్థల్లో పని చేస్తున్న సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు పెంచిన తరహాలో డీఏను పెంచేందుకు చర్యలు తీసుకున్నారు. ఆ మేరకు సీఎం పన్నీరు సెల్వం ఆదేశాలతో అధికార వర్గాలు డీఏ పెంపును ప్రకటించాయి. ఆరు శాతం మేరకు డీఏను పెంచుతూ, అందుకు తగ్గ వివరాలతో ప్రకటనను విడుదల చేశారు. వివిధ కేటగిరిల ఆధారంగా రూ.336 నుంచి రూ.4,620 వరకు ఉద్యోగులకు డీఏను పెంచారు. 18 లక్షల మంది సిబ్బంది లబ్ధి పొందనున్నారు. ఈ డీఏ పెంపు కారణంగా రాష్ట్ర ప్రభుత్వం మీద అదనంగా 1212.76 కోట్లు భారం పడనుందని వివరించారు. ఈ పెంపును ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి వర్తింప చేయనున్నారు. తాజా పెంపు మేరకు ప్రస్తుతం రూ. 4800 వరకు జీతం తీసున్న వాళ్లకు ఇక, రూ.1300 డీఏ లభిస్తుంది. అలాగే, రూ.5200 నుంచి 20 వేల వరకు జీతం తీసుకుంటున్న వాళ్లకు 1800 నుంచి 2800 వరకు, 9300 నుంచి 34 వేల వరకు జీతం తీసుకుంటున్న వాళ్లకు 4200 నుంచి 4900 వరకు డీఏ పెరగనుంది. -
తుపాను విధుల్లోని అధికారులకు అదనంగా 50% డీఏ
* సీఎం చంద్రబాబు ఆదేశాలు * అధికారుల టీఏ, డీఏలకే రూ.50 కోట్లు * హైదరాబాద్‌లోని అధికారుల భోజనాలు, టిఫిన్లకు రూ.25 లక్షలు * పోలీసులకోసం అదనంగా రూ.2 కోట్లు సాక్షి, హైదరాబాద్: ఒకవైపు తుపాను తాకిడికి ఉత్తరాంధ్ర ప్రజానీకం విలవిల్లాడుతుంటే మరోవైపు సహాయక చర్యల పర్యవేక్షణకు వెళ్లిన ఐఏఎస్ అధికారులతోపాటు తుపాను విధుల్లో పాల్గొంటున్న అధికారులందరికీ అదనంగా 50 శాతం డీఏ ఇవ్వాలంటూ సీఎం చంద్రబాబునాయుడు ఆదేశాలు జారీ చేశారు. తుపాను కారణంగా సర్వస్వం కోల్పోయిన బాధితులకు ఇంతవరకు అరకొరగా కూడా ప్రభుత్వం సాయం అందకపోయినప్పటికీ.. సహాయక చర్యలను పర్వవేక్షిస్తున్న అధికారులకు మాత్రం ఎలాంటి లోటు రాకుండా ప్రభుత్వం చూస్తోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తుపాను సహాయక చర్యలకోసం రాష్ట్రప్రభుత్వం ఏకంగా 40 మంది ఐఏఎస్‌లను ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకు పంపింది. అదే సమయంలో హైదరాబాద్‌లోనే ఉండి సహాయక చర్యలను మరో 25 మంది అధికారులు పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్‌లోని అధికారులకు ఉదయం, సాయంత్రం టిఫిన్లతోపాటు మధ్యాహ్నం, సాయంత్రం భోజనాలకోసం అడ్వాన్స్‌గా రూ.పాతిక లక్షలు విడుదల చేశారు. ఐఏఎస్‌లుగానీ, ఇతర అధికారులుగానీ వేరే జిల్లాలకు వెళితే సాధారణంగా వారికి డీఏ మంజూరు చేస్తారు. ఇప్పుడు సాధారణంగా ఇచ్చే డీఏకు అదనంగా మరో 50 శాతం ఇవ్వాలంటూ సీఎం ఆదేశాలిచ్చారు. తుపాను బాధితులకు ఆర్థికసాయం అందించడం మాట ఎలాగున్నా ఇప్పుడు అధికారుల టీఏ, డీఏలకే రూ.50 కోట్ల మేరకు వ్యయమవుతోందని అధికార వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్ నుంచి వెళ్లిన అధికారులకు వసతి, భోజన సదుపాయం, ఇతర సౌకర్యాలు కల్పించే అదనపు బాధ్యతలు స్థానిక అధికారులపై పడుతున్నాయని, సహాయక చర్యల అమలుపైకన్నా ఎక్కువ దృష్టి వీరికి సౌకర్యాలు కల్పించడంపైనే ఉంటోందని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. కాగా తుపాను ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు అదనంగా రూ.2 కోట్లు విడుదల చేయాల్సిందిగా డీజీపీ కార్యాలయం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. -
కార్మికుల డీఏ నిర్ధారణ కోసం ‘ధరల సూచిక’ విడుదల
హైదరాబాద్: పారిశ్రామిక కార్మికుల డీఏను నిర్ణయించేందుకు వినియోగించే ‘వినియోగదారుల ధరల సూచిక’లను శుక్రవారం కార్మిక శాఖ విడుదల చేసింది. 2014 జూన్‌తో ముగిసిన అర్ధ వార్షికానికి సంబంధించి పారిశ్రామిక కార్మికులకు 1116 పాయింట్లు.. పార్ట్-2లో ని వ్యవసాయ కార్మికులకు 822 పాయింట్లు కేటాయిం చింది. ఈ పాయింట్లు 2014 అక్టోబర్ 1 నుంచి 2015 మార్చి 31 వరకు అమలులోకి ఉంటాయని తెలిపింది. -
ఉద్యోగుల డీఏ ఉత్తర్వులు జారీ
71.904 శాతం నుంచి 77.896 శాతానికి పెరిగిన కరువు భత్యం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు దసరా కానుకగా 5.99 శాతం కరువు భత్యాన్ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్ నెల వేతనం వరకు కరువు భత్యాన్ని జీపీఎఫ్‌లో జమ చేస్తున్నట్లు.., అక్టోబర్ నుంచి వేతనంలో కలిపి నగదు రూపంలో ఇవ్వనున్నట్లు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి నాగిరెడ్డి బుధవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో తెలిపారు. ప్రస్తుతం ఉద్యోగులకు 71.904 శాతం ఉన్న కరువు భత్యం, 77.896 శాతానికి పెరుగుతుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. యూజీసీ స్కేల్ తీసుకుంటున్న వారికి ప్రస్తుతం ఉన్న డీఏ 100 నుంచి 107 శాతానికి పెరిగినట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీఆర్ఏ, పార్ట్‌టైమ్ అసిస్టెంట్స్‌కు రూ.100 నగదును చెల్లించనున్నట్లు కూడా ఆ ఉత్తర్వుల్లో తెలిపారు. జీపీఎఫ్ అకౌంట్స్ లేని శాశ్వత ఉద్యోగులకు వేతనంతోనే బకాయిల మొత్తాన్ని చెల్లిస్తారు. -
కేంద్ర ఉద్యోగులకు 7% డీఏ పెంపు
కేంద్ర కేబినెట్ నిర్ణయం * 107%కు పెరిగిన కరువు భత్యం * ఈ ఏడాది జూలై 1 నుంచి వర్తింపు న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త! ఉద్యోగుల కరువు భత్యాన్ని (డీఏ) కేంద్రం మరో 7 శాతం పెంచింది. దీంతో మూలవేతనంలో ప్రస్తుతం 100 శాతంగా ఉన్న డీఏ 107 శాతానికి చేరింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన గురువారం ఢిల్లీలో సమావేశమైన కేంద్ర కేబినెట్ డీఏ పెంపు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఈ ఏడాది జూలై 1 నుంచి వర్తించేలా సాధారణ ప్రభుత్వోద్యోగులకు డీఏ అదనపు ఇన్స్టాల్మెంట్, పెన్షనర్లకు డియర్నెస్ రిలీఫ్ (డీఆర్) అదనపు ఇన్స్టాల్మెంట్ విడుదలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ప్రభుత్వ నిర్ణయం వల్ల దాదాపు 30 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, సుమారు 50 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. నిత్యావసరాల ధరల పెరుగుదలకు అనుగుణంగా డీఏ, డీఆర్‌ను పెంచినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ నిర్ణయం వల్ల 2014-15 ఆర్థిక సంవత్సరంలో (2014 జూలైనుంచి 2015 ఫిబ్రవరి వరకూ మొత్తం 8 నెలలు) ఖజానాపై డీఏ వల్ల రూ. 7,691 కోట్లు, డీఆర్ వల్ల రూ. 5,127 కోట్ల ఆర్థిక భారం పడనుంది. పారిశ్రామిక కార్మికులపై వినియోగదారుల ధరల సూచీ 12 నెలల సగటు ఆధారంగా ప్రభుత్వం డీఏను లెక్కించింది. దీనిప్రకారం 2013 జూలై 1 నుంచి 2014 జూన్ 30 వరకూ పారిశ్రామిక కార్మికులపై ద్రవ్యోల్బణం సగటు రేటు 7.25 శాతంగా ఉండటంతో ఉద్యోగులకు డీఏను కేంద్రం పెంచిం ది. గత యూపీఏ ప్రభుత్వం ఫిబ్రవరి 28న డీఏను 90 శాతం నుంచి 100 శాతానికి పెంచింది. కేబినెట్ మరికొన్ని నిర్ణయాలు... సంప్రదాయ ఔషధ విధానంతోపాటు హోమియోపతిని బంగ్లాదేశ్‌లో ప్రోత్సహించేందుకు ఆ దేశంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవాలన్న ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది. దేశంలో పర్యావరణ నియంత్రణ సంస్థ ఏర్పాటు చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలపై చర్చించేందుకు కమిటీ వేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కేంద్ర మంత్రులు గడ్కారీ, అనంత్ కుమార్, గోయల్, జవదేకర్లు ఈ కమిటీలో సభ్యులుగా ఉండనున్నారు. కాగా, ప్రధాని మోడీ తన జపాన్ పర్యటనను విజయవంతంగా, పూర్తి చేసినందుకు ప్రశంసిస్తూ హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా ఇతర మంత్రులంతా మద్దతు తెలిపారు. -
ఉద్యోగులకు, పెన్షనర్లకు 7 శాతం డీఏ పెంపు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛనుదారులకు శుభవార్త.వారికి చెల్లించే కరువు భత్యాన్ని (డీఏ) ఏడు శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేబినెట్ గురువారం ఆమోదముద్ర వేసింది. ప్రస్తుతమున్న డీఏను వంద శాతం నుంచి 107 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెంపు జూలై 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ తాజా పెంపుతో దాదాపు 30 లక్షల మంది కేంద్ర ఉద్యోగులకు, మరో 50 లక్షల మంది పింఛనుదారులకు లబ్ధి చేకూరుతుంది. యూపీఏ ప్రభుత్వం చివరిసారిగా ఈ ఏడాది ఫిబ్రవరి 28న డీఏను 90 శాతం నుంచి నూరు శాతానికి పెంచింది. ఆ పెంపు ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ఈ నూతన డీఏ పెంపు ఎనిమిది నెలలపాటు అంటే వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ ఉద్యోగులకు, పింఛన్ దారులకు వర్తించనుంది. -
భత్యాల్ని మెక్కేశారా!
సాక్షి, కాకినాడ : పంచాయతీ ఎన్నికలు జరిగి ఏడాదైనా ఎన్నికల విధులు నిర్వహించిన అధికారులకు, సిబ్బందికి రావాల్సిన టీఏ, డీఏలు (ప్రయాణ, దినభత్యాలు) నేటికీ రాలేదు. జిల్లాలో ఇందుకు సంబంధించి సుమారు రూ.2 కోట్లు పక్కదారి పట్టాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ఏడాది జూలైలో మూడు విడతల్లో జిల్లాలోని 962 పంచాయతీల సర్పంచ్‌లకు, 10,742 వార్డు సభ్యులకు ఎన్నికలు జరిగాయి. తొలివిడతలో 23న రాజమండ్రి, రంపచోడవరం డివిజన్లలోని 324 పంచాయతీలకు, రెండో విడతలో 27న కాకినాడ, పెద్దాపురం డివిజన్లలోని 369 పంచాయతీలకు, మూడో విడతలో 31న అమలాపురం డివిజన్లోని 272 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఇందుకోసం 10,803 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణ కోసం 346 మంది స్టేజ్ వన్ రిటర్నింగ్ అధికారులు, 962 మంది స్టేజ్ టూ రిటర్నింగ్ అధికారులతో పాటు ప్రతి స్టేషన్‌కూ ప్రిసైడింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్, ఓ సహాయకుని చొప్పున సుమారు 35 వేల మంది సిబ్బందిని వినియోగించారు. మండలానికో రకంగా కేటాయింపు.. పొరుగు జిల్లాల్లో ఎన్నికల నిర్వహణకు మంజూరైన నిధులను పంచాయతీల సంఖ్య ను బట్టి మండలాలకు కేటాయించారు. కానీ జిల్లాలో అలా కాక మండలానికో రీతిలో కేటాయింపులు జరిపారనే ఆరోపణలు వచ్చాయి. తొలి విడతలో జరిగిన మండలాల పరిధిలోని పంచాయతీల ఎన్నికల నిర్వహణలో పాల్గొన్న సిబ్బందికి భత్యాల చెల్లింపు పూర్తిగా జరిగినా.. తర్వాత రెండు విడతల్లో పాల్గొన్న సిబ్బందికి కనీసం 30 శాతం చెల్లించలేదు. మండలానికి రూ.7.50 లక్షల నుంచి రూ.9 లక్షల మేర మొదటి విడత ఎన్నికలు జరిగిన మండలాలకు కేటాయించగా, తర్వాత రెండు విడతల్లో జరిగిన మండలాలకు కేవలం రూ.4.50 లక్షల లోపే కేటాయించారు. ఈ ఏడాది జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు ఒక్కో మండలానికీ ఏకంగా రూ.12 లక్షల చొప్పున మంజూరు చేశారు. కేవలం 57 జెడ్పీటీసీలతో పాటు 1063 ఎంపీటీసీ సభ్యుల ఎన్నికల నిర్వహణకు రూ.7 కోట్లకు వరకు చెల్లించారు. 962 సర్పంచ్‌లతో పాటు 10,742 వార్డు సభ్యులకు జరిగే పంచాయతీ ఎన్నికలకు మాత్రం అరకొర కేటాయింపులు జరపడం గమనార్హం. పోనీ ఆ కొద్ది పాటి నిధులైనా పూర్తి స్థాయిలో కేటాయించారా అంటే అదీ లేదు. చివరి రెండు విడతల్లో ఎన్నికలు జరిగిన కాకినాడ (9 మండలాలు), పెద్దాపురం (12 మండలాలు), అమలాపురం(16 మండలాలు) డివిజన్లలో ఒక్కో మండలానికీ ఇంకా రూ.5 లక్షల నుంచి రూ.ఏడులక్షల వరకు చెల్లిం చాల్సి ఉంది. అంటే 37 మండలాలకు రూ.5 లక్షల చొప్పున వేసుకున్నా సుమారు భత్యాలుగా చెల్లించాల్సింది రూ.1.85 కోట్ల వరకు ఉంటుందన్నమాట. వాస్తవానికి ఈ మొత్తం రూ.2.50 కోట్ల వరకు ఉంటుందని చెబుతున్నారు. తప్పుడు బిల్లులతో దారి తప్పిన సొమ్ము..! ఎన్నికల నిర్వహణకు అవసరమైన నిధులన్నీ ఎన్నికల సమయంలోనే ప్రభుత్వం విడుదల చేసింది. మంజూరైన నిధులను జిల్లాస్థాయి అధికారులు ఇతర అవసరాలకు పక్కదారి పట్టించడం వలనే ఈ పరిస్థితి ఏర్పడిందని కొందరంటున్నారు. అయితే కారణం అది కాదని, ఎన్నికల నిర్వహణ నిధులను లెక్కాపత్రం లేకుండా ఇష్ట మొచ్చినట్టు తప్పుడు బిల్లులతో డ్రా చేసి సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఎన్నికలను పర్యవేక్షించిన అధికారి జిల్లా ఉన్నతాధికారి వత్తాసుతోనే ఈ నిధులను దారి తప్పించారంటున్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణలో పాలు పంచుకున్న ఉద్యోగులకు ఇంతవరకూ భత్యాలు చెల్లించని విషయమై జిల్లా పంచాయతీ అధికారి శ్రీధర్‌రెడ్డిని వివరణ కోరగా సకాలంలో బిల్లులు సమర్పించకపోవడం వలన రూ.60 లక్షలు వెనక్కి మళ్లిపోయాయన్నారు. అందువలనే భత్యాల చెల్లింపులో జాప్యం జరిగిందని చెప్పుకొచ్చారు. కాగా.. భత్యాలుగా ఇవ్వాల్సింది కోటి వరకు ఉంటుందని, కొన్ని మండలాలకు రూ.7 లక్షల వరకు ఇవ్వాలని అంగీకరించిన డీపీఓ మొత్తం నిధుల కోసం ఇప్పటికే కలెక్టర్ ప్రభుత్వానికి రాశారని, రాగానే పంపిణీ చేస్తామని చెప్పారు. డీపీఓ చెప్పినట్టు రూ.60 లక్షలు వెనక్కి వెళ్లినా మిగిలిన దాదాపు రూ.2 కోట్ల మొత్తం ఏమైందన్న ప్రశ్న మిగిలిపోతోంది. -
ఎట్టకేలకు డీఏ వచ్చేసింది
గవర్నర్ జోక్యంతో జీవో జారీచేసిన అధికారులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 8.5 శాతం కరువు భత్యం పెంపు 63.344% నుంచి 71.904 శాతానికి పెరిగిన డీఏ.. జనవరి 1 నుంచి అమలు సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు కరువు భత్యం (డీఏ) పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. డీఏ పెంపునకు సంబంధించిన ఫైలుపై గవర్నర్ సంతకం చేసిన తర్వాత కూడా ఆర్థికశాఖ ఆ ఫైలును తొక్కిపట్టిందంటూ ‘సాక్షి’ బుధవారం వార్త ప్రచురించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో డీఏ ఫైల్‌ను తొక్కిపట్టిన అధికారులపై గవర్నర్ కార్యాలయం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో ఆర్థిక శాఖ అధికారులు వెంటనే డీఏ పెంపు జీవో జారీకి చర్యలు తీసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇదే చివరి డీఏ. రాష్ట్రపతి పాలనలో డీఏ పెంచుతూ ఉత్తర్వులు ఇవ్వడం చరిత్రాత్మకమని ఉద్యోగులు పేర్కొంటున్నారు. కాగా, డీఏ పెంపునకు గవర్నర్ ఆమోదం తెలిపారని, ఫలితంగా 12 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు మేలు జరుగుతుందని గవర్నర్ కార్యాలయం పత్రికా ప్రకటన విడుదల చేసింది. 63.344 శాతం నుంచి 71.904 శాతానికి పెంపు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 8.5 శాతం డీఏ పెంచుతూ ప్రభుత్వం బుధవారం జీవో విడుదల చేసింది. తాజా పెంపుతో ఉద్యోగుల డీఏ 63.344 శాతం నుంచి 71.904 శాతానికి పెరగనుంది. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఈ పెంపు వర్తిస్తుంది. ఈనెల 24నే అందనున్న మే నెల జీతంతోపాటు పెరిగిన డీఏని ఉద్యోగులకు చెల్లించనున్నారు. జనవరి నుంచి ఏప్రిల్ వరకు నాలుగు నెలల డీఏ బకాయిలను ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాలో జమ చేయనున్నారు. జీపీఎఫ్ ఖాతాలు లేని ఉద్యోగులకు ఎస్పీఎఫ్ (స్టేట్ ప్రావిడెంట్ ఫండ్) ఖాతాల్లో వేయనున్నారు. 2004 తర్వాత ఉద్యోగాల్లో చేరినవారికి డీఏ బకాయిల్లో 10 శాతాన్ని ‘చందాతో కూడిన పెన్షన్ పథకం’ కింద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శాశ్వత ఖాతాలో జమ చేయనున్నారు. బకాయిల్లో మిగతా 90 శాతాన్ని నగదు రూపంలో ఇవ్వనున్నారు. ఈ ఏడాది ఆగస్టు 31న లేదా అంత కంటే ముందు పదవీ విరమణ చేయనున్న ఉద్యోగులకు మొత్తం డీఏ బకాయిలను నగదు రుపంలోనే చెల్లిస్తారు. 2005 పీఆర్సీ స్కేళ్లలో కొనసాగుతున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 163.908 శాతం నుంచి 179.922 శాతానికి పెంచనున్నారు. 1999 పీఆర్సీ స్కేళ్ల ప్రకారం జీతాలు తీసుకుంటున్న ఉద్యోగులకు 172.598 శాతం నుంచి 186.504 శాతానికి డీఏ పెరగనుంది. ఐదో జ్యుడీషియల్ వేతన సంఘం సిఫారసుల మేరకు జీతాలు పొందుతున్న జ్యుడీషియల్ అధికారుల డీఏ 183 శాతం నుంచి 200 శాతానికి, పద్మనాభన్ కమిటీ నివేదిక ప్రకారం జీతాలు తీసుకుంటున్న జ్యుడీషియల్ అధికారుల డీఏ 90 శాతం నుంచి 100 శాతానికి పెంచనున్నారు. గ్రామ సేవకులు, పార్ట్‌టైం అసిస్టెంట్లకు రూ.100 పెరగనుంది. పెన్షనర్లకు కూడా ఈ మేరకు కరవు భృతి (డీఆర్) పెరుగుతుంది. ఉద్యోగులు డీఏ బకాయిల వివరాలను నిర్దేశిత పత్రంలో సంబంధిత సబ్ ట్రెజరీ కార్యాలయాల్లో సమర్పించాలని ఆర్థిక శాఖ సూచించింది. డీఆర్ పెంపు జీవో ఒకట్రెండు రోజుల్లో వెలువడనుంది. -
ఉద్యోగుల డీఏకి గ్రీన్‌సిగ్నల్
భన్వర్‌లాల్ ఓకే.. నేడు ఉత్తర్వులు! సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం (డీఏ) మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) భన్వర్‌లాల్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఉద్యోగులకు గత జనవరి నుంచి వర్తించేలా 8.56 శాతం డీఏ ఇచ్చేందుకు గవర్నర్ నరసింహన్ ఆమోదం తెలిపిన విషయం విదితమే. ఈ మేరకు ఫైలుపై సంతకం చేసిన గవర్నర్.. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున దీనికి ప్రత్యేక అనుమతి ఇవ్వాలంటూ సీఈవోకు పంపించారు. దీనిని పరిశీలించిన భన్వర్‌లాల్ ఉద్యోగులకు డీఏ ఇచ్చేందుకు అభ్యంతరం లేదని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు శుక్రవారం జారీ అయ్యే అవకాశం ఉంది. -
కరువు భత్యానికి ఆమోదం
-
డీఏపై దయ తలుస్తారా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉద్యోగులు, పెన్షనర్లకు కరువు భత్యం (డీఏ) మంజూరు చేసి రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కరుణిస్తారా లేదా అనేది త్వరలోనే తేలిపోనుంది. పదిహేను లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ మంజూరుకు సంబంధించిన ఫైలును ఆర్థిక శాఖ మంగళవారం గవర్నర్ ఆమోదానికి పంపించింది. విభజన నేపథ్యంలో తొలుత ఆర్థిక శాఖ ఉన్నతాధికారి డీఏ మంజూరుకు విముఖత వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో ఈ నెల 24వ తేదీనే ఉద్యోగులకు జీతాలు, పెన్షనర్లకు పెన్షన్లు చెల్లించాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జనవరి నుంచి మంజూరు చేయాల్సిన డీఏ కూడా విభజనకు ముందే ఇవ్వాలని, ఈ విషయంలో గవర్నర్ చొరవ తీసుకోవాలని ఉద్యోగులు కోరిన విషయం తెలిసిందే. ‘సాక్షి’ వార్తలతో డీఏ ఫైలుకు ఆర్థిక శాఖలో కదలిక వచ్చింది. జీతాలు ముందుగా ఇస్తున్నందున డీఏ కూడా ఇచ్చేయాలనే అభిప్రాయానికి అధికారులు వచ్చా రు. దీంతో సంబంధిత ఫైలును గవర్నర్‌కు పంపారు. ఆ ఫైలుకు గవర్నర్ ఓకే చెబితే.. ఉద్యోగులకు డీఏ మంజూరు చేసిన తొలి గవర్నర్‌గా నరసింహన్ రికార్డు సృష్టిస్తారు. ఆ ఫైలుకు ఆమోదం లభిస్తే గత జనవరి నుంచి జూన్ వరకు ఉద్యోగులకు 8.56 శాతం డీఏ మంజూరు కానుంది. -
పోలింగ్ సిబ్బందికి నో ‘టీఏ’
మోర్తాడ్, న్యూస్‌లైన్ : జిల్లాలో బుధవారం నిర్వహించిన సాధారణ ఎన్నికల పోలింగ్‌లో విధులు నిర్వహించిన తమకు డీఏ మాత్రం చెల్లించి టీఏను ఎగ్గొట్టారని ఉద్యోగులు వాపోతున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లడం, దూర ప్రాంతాల నుంచి రావడం వల్ల రవాణా చార్జీలు తమకు భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో తొమ్మిది శాసన సభ నియోజకవర్గాల్లో 2,057 పోలింగ్ కేంద్రాలు ఉండగా 18,885 మంది ఉద్యోగులు విధులు నిర్వహించారు. ఇందులో ప్రిసైడింగ్ అధికారులకు 1400 చెల్లించారు. ప్రిసైడింగ్ అధికారులు రెండు మార్లు శిక్షణకు హాజరయ్యారు. రెండు రోజుల శిక్షణ, రెండు రోజుల పోలింగ్ విధులకు కలిపి 1400 చెల్లిం చారు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలోని గ్రామాలలో ఓటు హక్కు ఉండటం, ఉద్యో గం నిర్వహించిన వారికి జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో పోలింగ్ బాధ్యతలను అప్పగించారు. అలాగే జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఉద్యోగులకు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో విధులను అప్పగించారు. అనేక మంది ఉద్యోగులు శిక్షణ, పోలింగ్ విధులకు రవాణా చార్జీల కోసం 400కు పైగా ఖర్చు చేశారు. అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు కూడా రెండు రోజుల శిక్షణ, రెండు రోజుల పోలింగ్ విధులు నిర్వహించినందుకు రోజుకు 250 చొప్పున వెయ్యి చెల్లించారు. పోలింగ్ క్లర్క్‌లకు ఒక రోజు శిక్షణ, రెండు రోజుల పోలింగ్ విధులకు హాజరైనందుకు రోజుకు 250 చొప్పున 750 చెల్లించారు. వీటితో పాటు ప్రతి ఉద్యోగికి కనీసం 300 నుంచి 400 రవాణా చార్జీలను చెల్లించాల్సి ఉంది. ఎన్నికల సంఘం కూడా టీఏ చెల్లించాలని ఆదేశించిందని ఉద్యోగులు చెబుతున్నారు. దూర ప్రాంతాలలో ఎన్నికల విధులు నిర్వహించిన వారికి రవాణా చార్జీలు చెల్లించక పోవడం సరికాదన్నారు. అధికారులు మాత్రం ఎన్నికల శిక్షణకు, పోలింగ్ విధులకు హాజరైన వారికి భోజన సదుపాయం ఏర్పాటు చేసిన ట్లు చెబుతున్నారు. దీంతో రవాణా చార్జీలను చెల్లిం చలేమంటున్నారు. ఇప్పుడు చెల్లించిన సొమ్ము నుంచి రవాణా చార్జీలు భరించుకోవాలని సూచిస్తున్నారు. రవాణా చార్జీలు విధిగా చెల్లించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించినా అధికారులు పట్టించుకోవడంలేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. గతంలో నిర్వహించిన సర్పంచ్ ఎన్నికల్లో కూడా అధికారులు టీఏ, డీఏ చెల్లించడంలో సరైన నిబంధనలను పాటించలేదని అ ధికారులు ఆరోపిస్తున్నారు. జిల్లా అధికారులు చొరవ తీసుకుని పోలింగ్ సిబ్బందికి టీఏ ప్రత్యేకంగా చెల్లిం చే ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. -
100 శాతానికి చేరిన డీఏ
కేంద్ర ప్రభుత్వోద్యోగులకు 10 % డీఏ పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వోద్యోగులకు 10 శాతం కరువు భత్యం (డీఏ) ఇవ్వాలన్న ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ శుక్రవారం ఆమోదముద్ర వేసింది. దీంతోపాటు ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఏడో వేతన సవరణ సంఘాని (పీఆర్సీకి)కి మార్గదర్శకాలను, విధి విధానాలను ఖరారు చేసింది. ఉద్యోగుల కనీస పింఛనును రూ. 1,000కి పెంచడం, సబ్సిడీ సిలిండర్లను నెలకు ఒకటికంటే ఎక్కువగా పొందడానికి అవకాశం కల్పించడం వంటి పలు అంశాలకు ఆమోదం తెలిపింది. మరికొద్ది రోజుల్లో సాధారణ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో... ఈ కీలక నిర్ణయాలను కేంద్ర కేబినెట్ ఆమోదించడం గమనార్హం. డీఏ పెంపు 2014 జనవరి 1 నుంచే... ప్రస్తుతం 10 శాతం పెంపుతో.. కేంద్ర ఉద్యోగులకు ఇప్పటివరకూ 90 శాతంగా ఉన్న డీఏ 100 శాతానికి చేరుకుంది. ఇది దేశవ్యాప్తంగా దాదాపు 50 లక్షల మంది ఉద్యోగులు, 30 లక్షల మంది పెన్షనర్లకు లాభం చేకూర్చనుంది. దీనిని 2014 జనవరి 1 నుంచే అమలు చేయనున్నారు. అయితే, ఉద్యోగులకు మాత్రం నగదు రూపేణా మార్చి నుంచి (ఏప్రిల్‌లో చెల్లించే వేతనంతో) చెల్లిస్తారు. పింఛన్‌దారులకు బకాయితో సహా మొత్తాన్నీ చెల్లిస్తారు. దీనివల్ల 2015 ఫిబ్రవరి వరకు కేంద్ర ఖజానాపై రూ. 12,920 కోట్ల అదనపు భారం పడనుంది. ఏడో వేతన సంఘానికి మార్గదర్శకాలు.. ఉద్యోగుల వేతన సవరణ కోసం ఏడో వేతన సంఘానికి మార్గదర్శకాలు, విధి విధానాలను కేబినెట్ ఖరారు చేసింది. సుప్రీం మాజీ న్యాయమూర్తి జస్టిస్ అశోక్‌కుమార్ మాథుర్ ఆధ్వర్యంలోని ఈ కమిషన్... ఏర్పాటు చేసిన తేదీ నుంచి 18 నెలల్లో నివేదిక ఇవ్వాలి. దేశంలోని ఆర్థిక పరిస్థితులు, వనరుల ఆధారంగా... వేతనాలు, పింఛన్లు, ఇతర అలవెన్సుల సవరణను సూచించాలని విజ్ఞప్తి చేసింది. ఆలోగా 50 శాతం డీఏను మూలవేతనంలో కలిపేదిశగా మధ్యంతర ప్రతిపాదనలను వేతన సంఘం చేసే అవకాశముంది. 50 శాతం డీఏను మూలవేతనంలో కలిపితే... కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అందుకునే వేతనాలు 30 శాతం వరకూ పెరుగుతాయి. నెలకు ఒకటి కంటే ఎక్కువ... సబ్సిడీపై అందించే సిలిండర్ల సంఖ్యను ఏడాదికి 12కు పెంచిన కేంద్రం.. తాజాగా వాటిని నెలకు ఒకటికన్నా ఎక్కువ సిలిండర్లను వినియోగించేందుకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. వినియోగదారులు ఒక సిలిండర్ తీసుకున్న 21 రోజుల తర్వాత మరో సబ్సిడీ సిలిండర్‌ను పొందవచ్చు. టన్ను యూరియాపై రూ. 350 పెంపు.. యూరియా ధరను టన్నుకు రూ. 350 పెంచుతూ.. కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో యూరియా ఫిక్స్డ్ ధర టన్ను రూ 2,300కు చేరుతోంది. దీంతోపాటు 30 ఏళ్ల కిందటి యూరియా ప్లాంట్లకు టన్నుకు మరో రూ. 150ను అదనంగా ఇస్తారు. గిరిజనులకు 150 రోజులు ‘ఉపాధి’.. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్ఆర్ఈజీఏ) కింద గిరిజన కుటుంబాలకు ఏడాదిలో 150 రోజుల పాటు పని కల్పించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏప్రిల్ ఒకటోతేదీ నుంచి ఇది అమల్లోకి రానుంది. అటవీ హక్కుల చట్టం కింద భూమి హక్కులు పొందిన.. దాదాపు 14 లక్షల మంది గిరిజనులకు ఇది ప్రయోజనం కల్పించనుంది. వీరు తొలుత వందరోజుల పని పూర్తిచేసుకోగానే.. మరో రంగులో ఉండే జాబ్‌కార్డును అందజేసి, అదనపు పని కల్పిస్తారు. కేబినెట్ ఇతర నిర్ణయాలు 12వ పంచవర్ష ప్రణాళిక కాలంలో నూతనంగా 54 కేంద్రీయ విద్యాలయాలు, 3,500 మోడల్ పాఠశాలల స్థాపనకు ఓకే చెప్పింది. ఈ ప్రణాళిక కాలంలో సమగ్ర శిశు రక్షణ పథకం (ఐసీపీఎస్) కొనసాగింపునకు రూ. 3,000.33 కోట్లు కేటాయించింది. పథకంలో నిర్మాణాలకు సంబంధించి చదరపు అడుగుకు రూ. 600 నుంచి రూ. 1,000 పెంచింది. అంధ విద్యార్థులు వినియోగించగలిగే మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు సమకూర్చడానికి పచ్చజెండా ఊపింది. వికలాంగులు తమ పరికరాల కొనుగోలులో మరింత రాయితీ పొందేందుకు వీలుగా ఆదా య పరిమితిని పెంచడానికి కూడా కేబినెట్ అంగీకరించింది. ఇవి ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఆరోగ్య పరిశోధనలో మానవ వనరుల అభివృద్ధి పథకానికి వచ్చే పంచవర్ష ప్రణాళిక అంచనావ్యయం రూ. 597 కోట్లకు ఆమోదం తెలిపింది. ప్రసారభారతికి మౌలిక సదుపాయాల కల్పన, నెట్‌వర్క్‌నకు రూ. 3,500 కోట్ల కేటాయింపునకు అనుమతిచ్చింది. ఎన్నికల ఖర్చు పెంపునకు అనుమతి వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచారం ఖర్చు పెంపు పరిమితులపై ఎన్నికల సంఘం ప్రతిపాదనలకు కేంద్ర కేబినెట్ అంగీకారం తెలిపింది. పెద్ద రాష్ట్రాల్లోని లోక్‌సభ నియోజకవర్గాల్లో అభ్యర్థుల గరిష్ట పరిమితిని రూ. 70 లక్షలుగా, చిన్న రాష్ట్రాల్లో రూ. 54 లక్షలుగా చేయాలని ఇటీవల ఈసీ కోరింది. అలాగే పెద్ద రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఖర్చు గరిష్ట పరిమితిని 28 లక్షలు, ఈశాన్య రాష్ట్రాలు, గోవా, పాండిచ్చేరిల్లో రూ. 20 లక్షలుగా చేయాలని ఈసీ నివేదించింది. ఓటర్లు, పోలింగ్ స్టేషన్లు, ద్రవ్యోల్బణ సూచీని దృష్టిలో ఉంచుకుని గతంలో ఉన్న లోక్‌సభ అభ్యర్థుల గరిష్ట పరిమితిని రూ. 40 లక్షల నుంచి రూ. 70 లక్షలకు, గోవా, ఈశాన్య రాష్ట్రాలు, పర్వతప్రాంతాలతో పాటు ఇతర కేంద్ర పాలిత ప్రాంతాల్లో గతంలో నియోజకవర్గాలను బట్టి ఉన్న రూ. 27 లక్షల నుంచి రూ. 37 లక్షలు పరిమితిని రూ. 54 లక్షలకు పెంచుతూ 1961 ఎన్నికల నిబంధనలకు సవరణలు చేశారు. కనీస పింఛన్ రూ.వెయ్యికి పెంపు ఉద్యోగుల పింఛన్ పథకం (ఈపీఎస్-95) కింద పదవీవిరమణ పొందిన ప్రైవేటు ఉద్యోగులు నెలనెలా అందుకునే కనీస పింఛన్‌ను రూ. 1,000కి పెంచే ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది. ప్రైవేటు రంగంలో పనిచేసి రిటైరైన ఈపీఎఫ్ చందాదారులందరికీ ఇది వర్తిస్తుంది. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే ఈ పెంపు కోసం కేంద్రం ఈపీఎఫ్‌వోకు రూ. 1,217 కోట్లను చెల్లించనుంది. దీంతో 5 లక్షల మంది వితంతువులు సహా.. 28 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. ఇప్పటివరకూ కనీస పెన్షన్ ఏదీ లేకపోవడం, చాలా మంది రిటైరైన ప్రైవేటు ఉద్యోగులు పెన్షన్ కింద నెలకు అతితక్కువగా రూ. 200 కూడా అందుకుంటున్న పరిస్థితులన్న నేపథ్యంలో కనీస పెన్షన్‌ను వెయ్యికి పెంచారు.