న్యూఢిల్లీ: పండుగ సీజన్‌లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు. ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్‌ను 4 శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో ఉద్యోగులకు డీఏ వారి మూలవేతనంలో 46 శాతానికి చేరింది. అలాగే నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనాన్ని బోనస్‌గా ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ మేరకు పలు నిర్ణయాలు తీసుకున్నారు.
కేబినెట్ నిర్ణయాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తర్వాత మీడియా సమావేశంలో వెల్లడించారు. డీఏ, డీఆర్ పెంపుతో 48.67 లక్షల మంది కేంద్ర ప్రభుత్వోద్యోగులు, 67.95 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందుతారని ఆయన తెలిపారు. వీటితో ఖజానాపై రూ.2,857 కోట్ల భారం పడనుంది. డీఏ పెంపు 2023 జూలై 1 నుంచి వర్తిస్తుంది. గత మార్చి, 2022 సెపె్టంబర్‌లో డీఏ, డీఆర్ 4 శాతం మేరకు పెరిగాయి.
ఇక బోనస్ పెంపుతో లోకో పైలట్లు, గార్డులు, స్టేషన్ మాస్టర్లు, సూపర్‌వైజర్లు, టెక్నీషియన్లు, పాయింట్స్ మెన్, ఇతర గ్రూప్– సి సిబ్బంది సహా 11.07 లక్షల మంది రైల్వే ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. దీని ద్వారా రైల్వేలపై రూ.1,969 కోట్ల ఆరి్ధక భారం పడనుందని ఠాకూర్ తెలిపారు. మరోవైపు చక్కెర ఎగుమతులపై నిషేధాన్ని అక్టోబర్ నెలాఖరును దాటి నిరవధికంగా కేంద్రం పొడిగించింది. భారత్ ప్రపంచంలో అతి పెద్ద చక్కెర తయారీదారు. రెండో అతి పెద్ద ఎగుమతిదారు.
2024–25 రబీ మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించి గోధుమలకు మద్దతు ధరను మరో రూ.150 మేర పెంచుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం క్వింటాల్‌కు మద్దతు ధర రూ.2,125గా ఉంది. దీన్ని రూ.2,275కు పెంచినట్లుగా కేంద్రం ప్రకటించింది. కేంద్రంలో మోదీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచి్చన తర్వాత ఈ స్థాయిలో మద్దతు ధరను పెంచడం ఇదే తొలిసారి.
ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో గోధుమలు సహా బార్లీ, ఎర్రపప్పు, శనగలు, కుసుమ, ఆవాల మద్దతు ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఎర్రపప్పు (మసూర్) ధర రూ.425 మేర పెంచడంతో క్వింటాల్ ధర రూ.6,425కి చేరింది. ఆవాలకు కనీస మద్దతు ధరను రూ.200 పెంచడంతో అది రూ.5,650కి చేరుకుంది. కుసుమలు క్వింటాల్ రూ.5,650గా ఉండగా, రూ.150 చొప్పున పెంచడంతో రూ.5,800లకు చేరింది. బార్లీ మద్దతు ధరను రూ.115 మేర పెంచడంతో ధర 1,735 నుంచి రూ.1,850కి చేరింది. శనగల «కనీస మద్దతు ధరను రూ.150 మేర పెంచారు. దీని ధర క్వింటాల్‌కు రూ.5,335 నుంచి రూ.5,440కి చేరింది.
Comments
Please login to add a commentAdd a comment