breaking news
dusara festival
-
అక్కడ అమ్మవారి నైవేద్యాన్ని పీర్లకు ప్రసాదంగా..!
దుర్గా పూజ హిందూ పండుగ అని తెలిసిందే. అయితే, ఇక్కడ మాత్రం హిందూ–ముస్లిం మత సామరస్యంతో జరుపుకోవడంలో ప్రసిద్ధి చెందింది. పశ్చిమ బెంగాల్ తూర్పు మిడ్నాపూర్ జిల్లా కొంటైలోని కిషోర్‌నగర్ గర్ రాజ్‌బరి వద్ద జరుపుకుంటున్న స్వర్ణదుర్గాదేవి పూజలో అమ్మవారికి సమర్పించిన నైవేద్యాన్ని మొదటగా అక్కడి పీర్లకు ఇస్తారు. ఆ తర్వాతే రాజకుటుంబీకులు స్వీకరిస్తారు. భక్తులకు పంచిపెడతారు. ఇలా దాదాపు 300 సంవత్సరాలుగా జరుగుతోంది. ఈ పూజకు దూర్రప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. హిందూ–ముస్లిం సామరస్యం ఒక ప్రధాన లక్షణం, ఇక్కడ విగ్రహ నిమజ్జనానికి ముందు ముస్లిం పీర్లకు దేవత ప్రసాదాన్ని అందిస్తారు. ముందుగా పూజ సమయంలో ఒక ఉత్సవం జరుగుతుంది, ఈ ఉత్సవంలో కూడా స్థానిక హిందువులతోపాటు ముస్లింలు కూడా పాల్గొంటారు. వీరితోపాటు ఇతర మతాల వారు కూడా పూజలోపాలు పంచుకుంటారు, స్వర్ణదుర్గమ్మకు జీడిపప్పు భోగంపూజ సమయంలో అమ్మవారికి పండ్లు, తీపి పదార్థాలను నివేదిస్తారు. వీటితోపాటు వేయించిన జీడిపప్పు, ఇంట్లో తయారు చేసిన జున్ను, చక్కెరతో వండిన ప్రత్యేక భోగాన్ని నివేదిస్తారు.(చదవండి: ‘విరామ భోగ్‘: అక్కడ నైవేద్యాన్ని అమ్మవారే స్వయంగా..!) -
96 ఏళ్లుగా కళాప్రదర్శన
ముంబైలో జరిగే దుర్గా పూజ సాంస్కృతిక వైభవానికి, భక్తికి చిహ్నంగా నిలుస్తోంది. బొంబాయి దుర్గా బారి సమితి ప్రారంభం 1930ల నాటిది. అప్పట్లో బెంగాలీల చిన్న సమావేశంగా ప్రారంభమైన ఈ ఉత్సవం ఇప్పుడు గొప్ప కళా ప్రదర్శనగా నిలుస్తోంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే, ఈసారి కూడా వారు మట్టి, ఎండుగడ్డితో చేసిన పర్యావరణ అనుకూలమైన విగ్రహాన్ని తయారు చేశారు. అక్టోబర్ 1చ మహానవమి నాడు కుమారీపూజ జరుగుతుంది. అదేరోజు సాయంత్రం ధునుచి నాచ్, 2న మహాదశమి నాడు సిందూర్ ఉత్సవ్ జరుగుతుంది, తరువాత గిర్గామ్ చౌపట్టిలో విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు. ‘ఇది మతపరమైన వేడుక మాత్రమే కాదు, సాంస్కృృతిక కళా ప్రదర్శన కూడా‘ అని చైర్పర్సన్ మితాలి పోద్దార్ అన్నారు. ‘కోల్‌కతాకు చెందిన ప్రఖ్యాత కళాకారులు స్థానిక యువతతో కలిసి ప్రదర్శనలు ఇస్తారు. ఇది భవిష్యత్ తరాలకు కళాత్మక, సాంస్కృతిక వారసత్వాన్ని అందించడం కోసం కూడా. అందుకే మేం ప్రతి సంవత్సరం, పర్యావరణ అనుకూల విధానంతో సంప్రదాయాన్ని పాటిస్తాం–‘ అని చెబుతున్నారామె. వేడుకలతోపాటు పేదపిల్లలకు స్కాలర్షిప్లు, ఆసుపత్రులకు వైద్యపరికరాల విరాళాలు – వంటివి కూడా ఉంటాయి‘ అని మితాలి పేర్కొన్నారు.(చదవండి: వెయ్యేళ్ల నాటి ఆలయం..! ఇక్కడ దుర్గమ్మకు రక్తం చిందించని బలి..) -
అక్కడ దసరా విజయదశమి నుంచే ..
మన దేశంలో ఈ దసరా పండుగ పలు సంప్రదాయాలకు అనుగుణంగా విభిన్నంగా చేసుకుంటుంటారు. ఆయా ప్రాంతాల ఆచార వ్యవహారాలకు అనుగుణంగా నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇదే పండుగ పర్యాటక ప్రేమికులు ఇష్టపడే హిమచల్‌ప్రదేశ్ కులుమనాలిలోని కులు లోయలో ఎలా జరుగుతుందో తెలిస్తే విస్తుపోతారు. ఈ పండుగను అక్కడ అత్యంత విచిత్రంగా నిర్వహిస్తారు. అన్నిచోట్ల నవరాత్రులు విజయదశమితో ముగిస్తే..అక్కడ ఆ రోజు నుంచి మొదలవుతాయట. ఇదేంటని అనుకోకండి. ఎందుకంటే అందుకు ఓ పెద్ద స్టోరీనే ఉంది. ఇంకెందుకు ఆలస్యం చకచక చదివేయండి..కులు లోయలో జరిగే ఈ పండుగ ప్రపంచంలోని ప్రత్యేకమైన పండుగలలో ఒకటిగా ప్రసిద్ధిగాంచింది. మనకు దసరా పాడ్యమి నుంచి మొదలై విజయ దశమితో మగుస్తాయి. కానీ ఈ కులు లోయలో విజయదశమి రోజు నుంచి మొదలై.. సరిగ్గా వారం రోజులు ఘనంగా నిర్వహిస్తారు. ఇది 375 ఏళ్ల నాటి పండుగ అట. సింపుల్‌గా చెప్పాలంటే సుమారు 17వ రాజా జగత్ సింగ్ ఆధ్వర్యంలో రూపుదొద్దుకుందట. అలా అప్పటి నుంచి అదే ఆచారంలో నిర్వహిస్తున్నారట ఈ దసరా వేడుకని. ఈ పండుగ వెనుకున్న ఆసక్తికర కథేంటంటే..శాపం నుంచి వచ్చిన పండుగ..పురాణ కథనాల ప్రకారం..దుర్గా దత్ అనే బ్రహణుడు వద్ద ముత్యాల గిన్నె ఉంది. అది అందరిని అమితంగా ఆకర్షించేది. గిన్నె గురించి కులు లోయ రాజు రాజా జగత్ సింగ్‌కి తెలుస్తుంది. అలాంటి వస్తువులు తనలాంటి వాళ్ల వద్ద ఉండాలన్న అహకారంతో తన భటులకు వెంటనే దాన్ని తీసుకురావాల్సిందిగా ఆజ్ఞాపిస్తాడు. ఆ రాజు సైనికులు ఆ దుర్గా దత్ అనే బ్రాహ్మణుడి ఇంటికి వెళ్లి ధౌర్జన్యం చేసి మరి తీసుకువెళ్లే సాహసం చేస్తారు భటులు. దాంతో ఆ బ్రహ్మణుడు కోపంతో ఆ భటులతో ఆ గిన్నె కోసం ఆ రాజే స్వయంగా వచ్చి తీసుకోవాలని చెబుతాడు. దీని కోసం మా రాజు గారు రావాలంటావా నీకెంత ధైర్యం అంటూ ఆ బ్రహ్మణుడిని అతడి కుటుంబాన్ని అతడి ఇంటిలోనే సజీవదహనం చేసేస్తారు సైనికులు. అయితే ఆ బ్రహ్మణుడు దుర్గాదత్ చనిపోతూ.. నీ దురాశకు తగిన ఫలితం అనుభవిస్తావంటూ రాజుని శపిస్తాడు. అది మొదలు రాజు జగత్సింగ్కి ఆ బ్రహ్మణుడి కుటుంబ సభ్యుల ఆత్మలు కలలోకి వచ్చి మనశ్శాంతి లేకుండా చేస్తాయి. ఫలితంగా రాజుకి కంటిమీద కునుకు కరువై రోజురోజుకి అతడి ఆరోగ్యం క్షీణిస్తుంటుంది. ఈ వార్త రాజ్యమంతా దావానలంలా వ్యాపిస్తుంది. ఇది తెలుసుకున్న కృష్ణ దత్(పహారి బాబా) అనే బైరాగి రాజుని కలిసి తక్షణమే రాముడి శరణు కోరమని సూచిస్తాడు. దాంతో రాజు రఘనాథుడుని ఆహ్వానించేందుకు కులు లోయ చుట్టుపక్కల ఉండే గ్రామ దేవతలందరిని ఆహ్వానిస్తాడు. ఆ గ్రామ దేవతలను సుమారు 300కి పైగా పల్లకిలపై ఘనంగా తీసుకువచ్చి సమావేశపరిచి..రాముడి కరుణ పొందుతాడు. అలా ఏటా ఈ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించి ప్రజారంజకంగా పాలన సాగించాడు. అలా ఆ రాజు శాపం నుంచి విముక్తి పొందాడు. ఆ రాజు ఈ పండుగను సరిగ్గా విజయ దశమి రోజున నుంచి గ్రామ దేవతలను ఆహ్వానించడం మొదలుపెట్టాడు. అలా మొదలైన ఆచారం నేటికి నిరాటంకంగా అదే సంప్రదాయంలో జరుగుతుండటం విశేషం. ఎలా జరుగుతుందంటే..ఈ పండుగను వారం రోజులపాటు నిర్వహిస్తారు. అక్టోబర్ 2 నుంచి మొదలై ఈ నెల 8తో ముగుస్తుంది. అంటే విజయదశమి రోజున ప్రారంభమై, ఒక వారం తర్వాత కులులోని ధల్పూర్ మైదానంలో ముగుస్తుంది. కాలినడకన పల్లకీల్లో చుట్టుపక్కల గ్రామ దేవతలను తీసుకురావడం అనేది రోజుల తరబడి సాగుతుందట. అది కూడా డ్రమ్స్, నృత్యాలతో సాదరంగా ఆ గ్రామ దేవతల్ని కులు రాజ్యానికి తీసుకువచ్చి దేవతలందరి సమావేశ పరిచి రాముడని ఘనంగా సత్కరిస్తారట. అన్ని చోట్ల విజయదశమి రోజున రావణ దహనం వంటివి నిర్వహిస్తే..ఇక్కడ రాముడిని భక్తి ప్రపత్తులతో కొలుచుకునేందుకు గ్రామదేవతలను పిలవడం విశేషం. (చదవండి: కన్నడిగుల విభిన్న దసరా వేడుక..! నవ ధాన్యాలతో నవరాత్రి పూజలు..) -
దేవి నవరాత్రులు: నవ దుర్గలు... వర్ణాలు
దేవీ నవరాత్రులు వచ్చాయి. ఈ తొమ్మిది రోజులూ భక్తులు అమ్మవారిని రోజుకో రూపంలో అలంకరించి ఆమెకు ఇష్టమైన నైవేద్యాలు పెట్టి నృత్య గానాలు చేసి భక్తి పారవశ్యంలో ఓలలాడుతుంటారు. అయితే అమ్మవారికి రోజుకో నైవేద్యం పెట్టినట్లే రోజుకో రంగు వస్త్రాలతో అలంకరిస్తారు. అంతేకాదు, తాము కూడా ఆ రంగు వస్త్రాలను ధరించి, అమ్మవారి అనుగ్రహాన్ని అందుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. నవరాత్రులలో ఇప్పటికే రెండు రోజులు గడచిపోయాయి. మిగిలిన రోజుల్లో అయినా అమ్మవారిని ఆమెకు ఇష్టమైన రంగులతో అలంకరిద్దాం. అమ్మ అనుగ్రహానికి పాత్రులమవుదాం. 1. శైలపుత్రి: మొదటి రోజున అమ్మవారిని శైలపుత్రిగా అలంకరించి ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తారు. శైలపుత్రి అలంకారం బలానికి, శక్తికి ప్రతీక అయితే, ఎరుపు రంగు అభిరుచికి, ధైర్యానికి సూచిక. నైవేద్యం: పులిహోర, కట్టు పొంగలి2. బ్రహ్మచారిణి: నీలం రంగునీలవర్ణం నిశ్శబ్దానికి, ప్రశాంతతకు, భక్తికి ప్రతీక అయితే, బ్రహ్మచారిణి అమ్మవారు క్రమశిక్షణ, ఏకాగ్రత అలవడేలా చేసి, ఆధ్యాత్మికాభివృద్ధిని కలిగిస్తుంది. నైవేద్యం: కొబ్బరి అన్నం, పాయసాన్నం3. చంద్రఘంట: భక్తులు చంద్రఘంటాదేవిని సౌందర్యానికి, సాహసానికి ప్రతీకగా భావిస్తారు. ఈ అమ్మను ఆరాధించడం వల్ల భయం, ప్రతికూలతలు తొలగుతాయని నమ్ముతారు. ఈ రోజున సంతోషానికి, సానుకూల భావనలకు చిహ్నమైన పసుపు రంగు వస్త్రాలను ధరిస్తారు.నైవేద్యం : క్షీరాన్నం, దద్దోజనం, గారెలు4. కూష్మాండ: ఈ అలంకారంలో అమ్మవారు సాక్షాత్తూ ఈ విశ్వానికి ప్రతీకగా భావిస్తారు. ఈ తల్లిని ఆరాధించడం వల్ల ఏ పనినైనా సాధించగలిగే శక్తి సామర్థ్యాలు అలవడతాయని నమ్ముతారు. ఈ రోజు ధరించే ఆకుపచ్చ రంగు ప్రకృతిని ప్రతిబింబిస్తుంది. ఆకుపచ్చ వృద్ధికి, ఉపశమనానికి సంకేతంగా నిలుస్తుంది. నైవేద్యం : దద్దోజనం, క్షీరాన్నం5. స్కందమాత: స్కందుడు అంటే కార్తికేయుడు అంటే కుమారస్వామి. అమ్మవారిని స్కందమాతగా ఆరాధించడం వల్ల సంతానం లేని వారికి సంతానం కలగడంతోపాటు ధైర్యం కూడా లభిస్తుంది. ఈ అమ్మవారికి ధూమ్రవర్ణం అంటే బూడిదరంగు ఇష్టం. బూడిద రంగు సమతుల్యతకు, స్థిరత్వానికి, తెలివితేటలకూ చిహ్నం. నైవేద్యం : కేసరి, పరమాన్నం, దద్దోజనం6. కాత్యాయని: ఈ అమ్మవారి ఆరాధన వల్ల ఆత్మవిశ్వాసం అభివృద్ధి చెందడంతో΄ాటు సమస్యలను ఎదుర్కొనే శక్తి చేకూరుతుందని భక్తుల విశ్వాసం. కాత్యాయనీ దేవికి ఇష్టమైన నారింజ రంగు ధైర్యానికి, జిజ్ఞాసకు, పరివర్తనకూ ప్రతీక. నైవేద్యం : చక్కెర పొంగలి, క్షీరాన్నం7. కాళరాత్రి: దుర్గాదేవి రౌద్రరూపానికి ప్రతీకగా కాలరాత్రి అమ్మవారిని సంభావిస్తారు. ఈ అమ్మవారి ఆరా«దనతో భయాలు తొలగి, దేనినైనా ఎదుర్కొనగలిగే ధైర్యం కలుగుతుందంటారు. ఈమెకు ప్రీతికరమైన తెలుపు రంగు స్వచ్ఛతకు, ప్రశాంతతకూ ప్రతీక. నైవేద్యం : కదంబం, శాకాన్నం8. మహాగౌరి: సంతోషానికి, ప్రశాంతతకు, ఆధ్యాత్మిక శక్తికి ప్రతీక అయిన ఈ అమ్మవారిని గులాబీ రంగు వస్త్రాలతో అలంకరిస్తారు. గులాబీరంగు వస్త్రాలను ధరించడం వల్ల కరుణ భావనలు కలుగుతాయి. మనసుకు ప్రశాంత చేకూరుతుంది. నైవేద్యం : చక్కెర పొంగలి9. సిద్ధిదాత్రి: ఈ అమ్మవారి ఆరాధన వల్ల అతీంద్రియ శక్తులు సిద్ధిస్తాయని, విజ్ఞానం, సంపద చేకూరతాయని భక్తుల విశ్వాసం. ఈమెకు ప్రీతికరమైన ఊదారంగు శక్తికి, ఆధ్యాత్మికతకు, ఆశయ సాధనకూ తోడ్పడుతుంది, నైవేద్యం : పులిహోర, లడ్డూలు, బూరెలు, గారెలు.రంగులు.. మానసిక ప్రభావంఏ రోజుకు నిర్దేశించిన రంగును ఆ రోజున వాడటం వల్ల మనసుకు ఉత్సాహం, ఉల్లాసం కలుగుతాయని ఆధ్యాత్మిక వేత్తలతోపాటు మనస్తత్వ నిపుణులు కూడా చెబుతారు. – డి.వి.ఆర్. (చదవండి: 'స్వచ్ఛమైన భక్తి' కోసం అలాంటి పాట..! ప్రదాని మోదీ ఆసక్తికర ట్వీట్) -
కన్నడిగుల విభిన్న దసరా వేడుక..! నవ ధాన్యాలతో..
విభిన్న సంస్కృతులు, భిన్న ఆచార వ్యవహారాలతో మినీ భారత్‌ను తలపిస్తోంది హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ. విభిన్న ప్రాంతాలకు చెందిన వారు విభిన్న రీతుల్లో దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. వేర్వేరు రాష్ట్రాలకు చెందిన ప్రజలంతా ఒక్కచోట చేరి కలసికట్టుగా నవరాత్రులు జరుపుకుంటున్నారు. నగరంలో స్థిరపడిన రాజస్థాన్, గుజరాత్, హర్యాణ, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర వంటి ప్రాంతాలకు చెందిన ప్రజలు అగర్వాల్ కుటుంబీకులు, మరాఠాలు, కన్నడిగులు, బెంగాలీలు తమతమ సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా ఉత్సవాలు జరుపుకుంటున్నారు. నగరంలో స్థిరపడిన కన్నడిగులు దసరా ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. జియాగూడ, అత్తాపూర్, సికింద్రాబాద్, గుల్జార్‌హౌజ్, మామ జుమ్లా పాటక్, చార్‌కమాన్, కోకర్‌వాడీ, చెలాపురా, ఘాన్సీబజార్, జూలా, కూకట్పల్లి, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో కన్నడిగులు దసరా వేడుకను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. దుర్గామాత చిత్రపటం వద్ద నల్లరేగడి మట్టిలో నవధాన్యాల విత్తనాలను వేస్తారు. ఇవి మొలకెత్తడంతో తొమ్మిది రోజుల పాటు వాటికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. నవధాన్యాల మొలకలు పెరిగిన ఎత్తు అమ్మవారి కటాక్షానికి కొలమానంగా భావిస్తారు. కన్నడిగుల అష్టమి కడాయి.. దుర్గాష్టమి సందర్భంగా గోధుమ పిండితో అమ్మవారి ఆభరాలను తయారు చేస్తారు. వీటిని కడాయిలో వేసి వేపుతారు. అమ్మవారి పుస్తె, మట్టెలు, జడ వంటి ఆభరణాలను తయారుచేసి అమ్మవారి విగ్రహం చుట్టు వేలాడదీస్తారు. పండుగ సందర్భంగా ఇంటికి వచ్చే బంధు మిత్రులకు వీటిని అందజేసి దసరా శుభాకాంక్షలు చెబుతారు. ఉపవాసం అనంతరం.. తొమ్మిది రోజుల ఉపవాసం అనంతరం విజయ దశమినాడు జమ్మిచెట్టు పూజతో పాటు చెరుకుగడ, బంగారం ఇస్తూ ఆలింగనం చేసుకుంటారు. పాలపిట్టను చూడటంతో కన్నడిగుల దసరా ఉత్సవాలు ముగుస్తాయి. బెంగాలీలకు ఐదు రోజులే.. పశ్చిమబెంగాల్‌కు చెందిన బెంగాలీలు దసరా ఉత్సవాలను ఐదు రోజుల పాటు నిర్వహిస్తారు. ఇదే వారి ప్రధాన పండుగ. దుర్గామాతను ప్రతిష్టించిన నాటి నుంచి నాలుగు రోజుల వరకూ ప్రత్యేక పూజలు నిర్వహించి విజయ దశమి రోజు నిమజ్జనం చేస్తారు. కోల్‌కతాలో దుర్గామాత వద్ద మేకలను బలిస్తామని.. ఇక్కడ మాత్రం తొమ్మిది రకాల వేర్వేరు ఫలాలను ప్రసాదంగా పెడతామని తెలిపారు. మొదటి రెండు రోజులు శాకాహారం, మిగిలిన రెండు రోజులు మాంసాహారం భుజిస్తారు. అగర్వాల్ ఉపవాస దీక్షలు.. ఉత్తర భారతీయులైన అగర్వాల్ కుటుంబీకులు తొమ్మిది రోజులపాటు ఉపవాస దీక్షలు చేస్తారు. గోడకు పటం వేసి గోధుమలు, జోన్నలు మట్టి కుండలో పెడతారు. మొలకెత్తిన విత్తనాల ఆకులను విజయదశమి రోజు తలపాగలో, చెవులపై ధరించి పాదాభివందనం చేస్తారు. విజయ దశమి నాడు 2–8 ఏళ్ల వయసున్న తొమ్మిది మంది బాలికలను ప్రత్యేకంగా పూజించి తాంబూలం సమరి్పస్తారు. ఈ సందర్భంగా పూజా తాలీ పోటీలు నిర్వహిస్తారు. ఐక్యతకు నిదర్శనం.. మేము ఉత్తర భారతీయులమైనప్పటికీ దశాబ్దాలుగా నగరంలో జీవిస్తూ కలసిమెలసి ఉత్సవాలు చేసుకుంటున్నాం. దసరా వేడుకను ఘనంగా జరుపుకుంటాం. ఇది శక్తి, ఐక్యతకు నిదర్శనం. శ్రీరాముని విజయమైనా, దుర్గామాత పూజ అయినా రెండూ శక్తి ఆరాధన రూపాలే. – పంకజ్ కుమార్ అగర్వాల్, హైదరాబాద్ కుంభమేళా అగర్వాల్ సమితి అధ్యక్షులు కోల్‌కతా మాదిరిగానే.. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను కోల్‌కతాలో నిర్వహించినట్లుగానే ఇక్కడా నిర్వహిస్తాం. ఐదు రోజులపాటు బెంగాలీ మాతను పూజించి, అనంతరం హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేస్తాం. ఐదు రోజులపాటు ప్రత్యేక పూజలు, అన్న ప్రసాద వితరణ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తాం. – జగన్నాథ్ అడక్, బెంగాలీ యంగ్ స్టార్ అసోసియేషన్ అధ్యక్షులుకలిసి మెలిసి ఉత్సవాలు ఏన్నో ఏళ్ల క్రితం నగరానికి వచ్చిన మేమంతా ఇక్కడ కలిసి మెలసి ఉత్సవాలు చేసుకుంటాం. ఇది నిజాం కాలం నుంచి వస్తోంది. రాష్ట్రాలు, ప్రాంతాలు వేరైనా..ఉత్సవాలను మాత్రం మా ఆచార వ్యవహారాలకు అనుగుణంగా నిర్వహించుకుంటున్నాం. ఇక దసరా వేడుకలను కర్ణాటక రాష్ట్రంలో ఎలా నిర్వహిస్తారో..అదే పద్ధతిలో ఇక్కడా నిర్వహిస్తున్నాం. పాలపిట్టను చూడటంతో కన్నడిగుల దసరా ఉత్సవాలు ముగుస్తాయి. – డాక్టర్ నాగ్నాథ్ మాశెట్టి, టీఎస్ బసవ కేంద్రం అధ్యక్షులు -
రాజాధిరాజ.. రాజమార్తాండ.. బహుపరాక్!
మైసూరు ప్యాలెస్‌లో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ఆరంభమయ్యాయి. అంబా విలాస్ ప్యాలెస్‌లో మైసూరు రాజవంశస్తులు వైభవం అంబరాన్ని అంటింది. రాజవంశీకుడు, స్థానిక ఎంపీ యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడెయార్ బంగారు, రత్న సింహాసనం పైన 11వసారి ఆసీనులై దర్బార్ని నిర్వహించారు. ముత్యాలు పొదిగిన సంప్రదాయ పట్టు వస్త్రాలను ఆయన ధరించారు. గండభేరుండ చిహ్నంతో సహా పలు రకాల బంగారు ఆభరణాలతో మెరిసిపోయారు. 12:42 గంటల తరువాత శుభ ముమూర్తంలో రాజవంశానికి చెందిన ఖడ్గాన్ని పట్టుకొని సింహాసనాన్ని అధిష్టించారు. ఈ సందర్భంగా భటులు జయహొ మహారాజా అంటు నినాదాలు చేశారు. మంగళ వాయిద్యాలు మారుమోగాయి, రాజ మార్తాండ సార్వభౌమ, యదుకుల తిలక, యదువీర ఒడెయార బహుపరాక్ బహుపరాక్ అని గట్టిగా స్వాగత వచనాలు పలికారు. నవగ్రహ పూజ:ముందుగా దర్బార్ ప్రాంగణానికి చేరుకున్న యదువీర్ అక్కడే నవగ్రహాలకు పూజలు చేశారు. కొంత సమయం సింహాసనంపై కూర్చున్నారు. ఈ సందర్భంగా ఆయన సతీమణి త్రిషిక భర్తకు పాద పూజ చేశారు. ఆపై ఆయన అందరికీ నమస్కరించి ఆనాటి మహారాజుల తరహాలో దర్బార్ని నిర్వహించారు. చాముండికొండ, పరకాల మఠం, నంజనగూడు, మేలుకొటె, శ్రీరంగపట్టణ, శృంగేరిలతో పాటు 23 ఆలయాల నుంచి పురోహితులు తీసుకువచ్చిన పూర్ణ ఫల ప్రసాదాలను స్వీకరించారు. తరువాత పండితులకు చిన్న చిన్న కానుకలను అందజేశారు. అర్ధగంట సేపు దర్బార్ సాగింది. రాజమాత ప్రమోదా దేవి పాల్గొన్నారు. మైసూరు దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మొదటిరోజు సోమవారం నాడిన శక్తిదేవత చాముండేశ్వరి దేవి అమ్మవారు శైలపుత్రి అలంకారంలో భక్త కోటికి దర్శనమిచ్చారు. 9 రోజులపాటు అమ్మవారిని రోజుకొక్క అవతారంలో అలంకరిస్తారు. వేలాదిగా భక్తులు దర్శించుకుని తరించారు. ఫలపుష్ప ప్రదర్శన మైసూరు దసరా ఉత్సవాలలో ఫలపుష్ప ప్రదర్శనను సీఎం సిద్దరామయ్య ప్రారంభించారు. కుప్పణ్ణ పార్క్‌లో ఏర్పాటైన ఈ ఫ్లవర్ షో అక్టోబరు 2వ తేదీ వరకు కొనసాగుతుంది. మంత్రులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫల పుష్ప విన్యాసాలను తిలకించిన సిద్దరామయ్య సంతోషం వ్యక్తంచేశారు. ఉప్పు సత్యాగ్రహం మహాత్మాగాంధీ పోరాటం విగ్రహాలను చూసి వివరాలను తెలుసుకున్నారు. (చదవండి: నవరాత్రుల్లో అక్కడ దుర్గమ్మకి నైవేద్యాలుగా చేపలు, మాంసం..! ఎందుకంటే..) -
ఈసారి శరన్నవరాత్రి తొమ్మిది రోజులు కాదు..!
గణపతి నవరాత్రలు ముగిసిన వెంటనే దేవి నవరాత్రులు కోలాహలం మొదలవుతుంది. ఊరు, వాడ, గ్రామంలోని ప్రతి ఆలయం శరన్నవరాత్రి ఉత్సవాలకు సర్వాలంకరంణలతో ముస్తాబవుతుంది. అందులోనూ విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయనే విషయం తెలిసిందే. ఈ ఏడాది దేవి నవరాత్రులు సెప్టెంబర్ 22వ తేదీన ప్రారంభం కాగా, ఈ నవరాత్రులు ఎప్పటిలా తొమ్మిది రోజులు కాకుండా పది రోజులు జరగడం విశేషం. చివరి రోజు విజయ దశమితో కలిపి పదకొండు రోజులు పాటు నిర్వహించనున్నట్లు పండితులు చెబుతున్నారు. ఈ ఏడాది ఇలా దుర్గమ్మ పది అవతారాల రూపంలో దర్శనమివ్వడానికి కారణం ఏంటంటే..ప్రతి పదేళ్లకు ఒక సారి తిథి వృద్ధి చెందుతుంది. దీంతో దసరా శరన్నవరాత్రులు 11 రోజుల పాటు జరుగుతాయి. ఇంతకు ముందు ఇలా 2016లో 11 రోజుల పాటు జరిగాయి. అప్పుడు కూడా తిథి వృద్ధి చెందడంతో అమ్మవారిని కాత్యాయినీదేవిగా అలంకరించారు. మళ్లీ ఈ ఏడాది అమ్మవారిని కాత్యాయినీదేవి అలంకారం చేయనున్నారు. అయితే సెప్టెంబర్ 29వ తేదీన అమ్మవారి జన్మనక్షత్రం మూలా నక్షత్రం రోజున సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ దసరా పండుగ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు తొమ్మిది రోజుల దేవీ నవరాత్రులు ఈసారి పది రోజులు జరగనున్నాయి. ఇక చివరిరోజు విజయదశమి కలసి దసరా అంటారు. కాబట్టి ఈ శరన్నవరాత్రుల్లో మొత్తం 11 రోజులు 11 అవతారాల్లో దుర్గమ్మ భక్తులకు దర్శనమివ్వనుందని పండితులు చెబుతున్నారు. భక్తుల కొంగు బంగారమై కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా పూజలందుకుంటున్న దుర్గమ్మ పదకొండు అలంకారాలు ఇవే..!.సెప్టెంబర్ 22 - శ్రీ బాలాత్రిపురసుందరిదేవి అలంకారంసెప్టెంబర్ 23 - శ్రీ గాయత్రి దేవి అలకారంసెప్టెంబర్ 24 - శ్రీ అన్నపూర్ణ దేవి అలంకారంసెప్టెంబర్ 25 - శ్రీ కాత్యాయినీ దేవి అలంకారంసెప్టెంబర్ 26 - శ్రీ మహా లక్ష్మీదేవి అలంకారంసెప్టెంబర్ 27 - శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకారంసెప్టెంబర్ 28 - శ్రీ మహా చండీదేవి అలంకారంసెప్టెంబర్ 29 - మూలా నక్షత్రం రోజున శ్రీసరస్వతి దేవి అలంకారంసెప్టెంబర్ 30 - శ్రీ దుర్గా దేవి అలంకారంఅక్టోబర్ 1 - శ్రీ మహిషాసురమర్ధిని దేవి అలంకారంఅక్టోబర్ 2 - విజయదశమి రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంగమనిక: ఈ కథనంలో తెలియజేసిన విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. కొన్ని శాస్త్రాల్లో, కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా తెలియజేశాము. (చదవండి: విష్ణు సేనాపతి విష్వక్సేనుడు) -
సందేశాత్మకం నవరాత్రి అలంకరణం
త్రేతాయుగం, ద్వాపరయుగం...ఇలా ఏ కాలంలోనైనా, ఏ అంశంలోనైనా స్త్రీని అత్యున్నత స్థానంలో ఉంచి గౌరవించారు. ఆమెను తొలిగురువుగా, ఆది శక్తిగా భావించి ఆరాధించారు. మన పురాణాలను కూలంకషంగా పరిశీలించినట్లైతే ఈ విషయం మనకు అవగతమౌతుంది. భారతావని అంతటా వైభవోపేతంగా జరిగే దసరా నవరాత్రి ఉత్సవాల్లోనూ అమ్మవారిదే వైభోగమంతా. ఆ జగన్మాతని ఆరాధించేందుకే ఈ మహా శరన్నవరాత్రి సంరంభమంతా... విజయదశమి....పదిరోజుల పండుగ...మనిషిలో దాగిన లోభం, అలసత్వం, జడత్వం, దురాశ, పాప–చింతనలాంటి వికారాలను నశింపచేసి, సాత్వికప్రవృత్తి వైపు నడిపిస్తుంది. మనలోని శక్తిని జాగృతం చేసి శుభసంకల్పాలకు నాంది పలికి చైతన్యం వైపుగా నడిపిస్తుంది. విజయదశమి–నవరాత్రి–దుర్గాపూజ...అన్ని శబ్దాలకూ ఒకటే అర్థం....తొమ్మిది రోజుల పాటు తొమ్మిది అవతారాలుగా భావిస్తూ ఆ జగన్మాతని పూజించుకోవటం. అసలు దసరా పండుగను తొమ్మిది రోజుల పాటు ఎందుకు జరుపుకుంటారు, అమ్మవారిని తొమ్మిది రూపాల్లో ఎందుకు కొలుస్తారు, దీని వెనుక ఉన్న పరమార్థం ఏమిటి తెలుసుకుందాం. త్రిపురసుందరి, త్రిపురేశ్వరి, పరమేశ్వరి, కామేశ్వరి, రాజరాజేశ్వరి వంటి అనేక నామాలతో పూజలందుకుంటున్న లలితాదేవి అఖిలాండకోటి బ్రహ్మాండాలకు జనని. పిపీలికాది బ్రహ్మపర్యంతమూ సకల జీవకోటికీ మాతృదేవత. తన బిడ్డలుగా భావించిన ప్రజలను పట్టి పీడిస్తున్న భండాసురుడనే రాక్షసుడినీ, వాడి ముప్ఫైమంది సంతతినీ, వారి సైన్యాన్నీ ఆదిశక్తి అవలీలగా వధించింది. అలాగే చండాసురుడు, ముండాసురుడు, మహిషాసురుడు అనే లోకకంటకులైన రాక్షసులను సంహరించి, చతుర్దశ భువనాలకూ శాంతిని ప్రసాదించింది. అందుకు ప్రతీకగా జరుపుకుంటున్నవే దసరా ఉత్సవాలు. దశహరా అంటే పది రకాల పాపాలను నశింపజేసేవని అర్థం. అదే క్రమేణా దసరాగా మారింది. విజయదశమి – వివిధ కారణాలు ఆయా రాక్షసులపై జగజ్జనని సాధించిన విజయానికి ప్రతీకగా ప్రజలు జరుపుకునే పండుగే విజయదశమి. ఇవి గాక విజయదశమి జరుపుకోవడానికి మరికొన్ని కారణాలున్నాయి. మహర్నవమినాడు శ్రీరామచంద్రుడు దేవిని ధ్యానించి రావణ సంహారం చేయగా దేవతలు పరమానందభరితులై దేవీపూజ చేశారు. నాటినుండి ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు దేవీనవరాత్రులను, పదవరోజున విజయదశమినీ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దుర్గాదేవి మహిషారుని సంహరించిన రోజని, అజ్ఞాతవాస పరిసమాప్తి కాగానే విజయుడు (అర్జునుడు) ఉత్తర గోగ్రహణం చేసి విజయం సాధించిన రోజని మరో గా«థ ఉంది. ఐకమత్యమే ఆయుధ బలం ఎంతటి దైవమైనా రాక్షసులను సంహరించాలంటే ఒక్కరి వల్లే కాదు. ఎందుకంటే రాక్షసులు కూడ తపశ్శక్తి సంపన్నులే! కాని వారి లక్షణాలు మాత్రం సరైనవి కావు. అందుకే ఆ తల్లి ఈశ్వరుడి నుంచి త్రిశూలాన్ని, కుమారస్వామినుంచి శక్తి ఆయుధాన్ని, వినాయకుడి నుంచి విఘ్న నివారణ ఆయుధాన్ని, విష్ణువు నుంచి చక్రాయుధాన్ని, ఇంద్రుని నుంచి వజ్రాయుధాన్ని, విశ్వకర్మనుంచి డాలుని, అగ్నిదేవుని నుంచి ఆగ్నేయాస్త్రాన్ని, యుముని నుండి పాశాన్ని, వరుణుని నుంచి వారుణాస్త్రాన్ని, వీటన్నింటినీ కూడగట్టుకోవడానికి కుబేరుని నుంచి ధనరాశులతో నిండిన కుండను, దానితోబాటు వారందరి బలాన్ని కూడగట్టుకుని యుద్ధంచేసి విజయం సాధించింది. సమష్టి బలం దీనిని బట్టి మనం తెలుసుకోవలసినదేమంటే ఏ ఒక్కరూ విడిగా చేయలేని పనిని ఐకమత్యంగా ఉండి, అందరి శక్తినీ ఒక్కచోట చేర్చితే ఎంతటి క్లిష్టమైన పనినైనా సాధించగలం. విజయదశమి పండుగ మనకు సమైక్యతతో ఉండవలసిన ఆవశ్యకతను, స్త్రీ శక్తి ప్రాధాన్యతనూ చాటి చెబుతోందన్నమాట. అందరి మొరలూ ఆలకించే అసలైన అమ్మ మన మనస్సులోని తలంపులు స్వచ్ఛంగా ఉన్నప్పుడు అమ్మ ప్రసన్నవదనంతోనూ, కలుషితంగా ఉన్నప్పుడు అమ్మ భయంకరాకారంలోనూ కనిపిస్తుంది. నిశ్చల చిత్తంతో అమ్మను పూజిస్తే అభీష్టాలు నెరవేరుతాయి. దుర్గాదేవి ప్రకృతి స్వరూపిణి కాబట్టి ఆమెను ఆరాధించడమంటే ప్రకృతిని ఆరాధించడమే. ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మను పూజిస్తే ఐహిక, ఆముష్మిక ఫలితాలు కలుగుతాయి. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ జరుగుతుంది. లౌకిక బంధాల నుంచి విముక్తి లభిస్తుంది. వ్యాధి పీడితులకు ఆరోగ్యం చేకూరుతుంది. చిత్తస్థై్థర్యం, శత్రు విజయం చేకూరతాయి. ఒక్కరోజు పూజతో సంవత్సర ఫలం దసరా పర్వదినాలలో సింహవాహిని అయిన అమ్మవారిని షోడశోపచారాలతో అర్చించడం వల్ల సంవత్సరమంతా పూజించిన ఫలం దక్కుతుంది. తొమ్మిది రోజులు పూజించలేనివారు మూడు రోజులు, మూడురోజులు కూడా కుదరని వారు కనీసం చివరి రోజయిన విజయ దశమినాడు ఒక్కరోజయినా సరే ఆ దివ్యమంగళస్వరూపాన్ని దర్శనం చేసుకుని తీరాలి. అలా అమ్మను దర్శించుకుని పూజ చేయడం వల్ల పాపాలన్నీ పటాపంచలవడంతోపాటు శత్రుజయం కలుగుతుంది. సకల శుభాలూ చేకూరతాయి. ఇక విజయదశమినాడు శమీవృక్షాన్ని (జమ్మిచెట్టును) దర్శించుకుని, ‘‘శమీ శమయితే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారీ, రామస్య ప్రియదర్శనం’’ అని స్తుతించాలి. జమ్మిని పెద్దలకు ఇచ్చి వారి ఆశీస్సులను అందుకోవాలి. శమీవృక్షానికీ, విజయ దశమికీ అవినాభావ సంబంధం ఉంది. శమీవృక్షం కనక ధారలు కురిపిస్తుందనే విశ్వాసం, శమీవృక్ష నీడ, శమీవృక్షపు గాలులు అన్నీ విజయ సోపానాలకు దారితీస్తాయనే నమ్మకం అనాదిగా ఉంది. శ్రీరాముడు వనవాసం చేసేటప్పుడు శమీవృక్షం కలపతోనే కుటీరం నిర్మించుకున్నాడని చెబుతారు. శమీవృక్షం విశిష్ఠతను పాండవులకు శ్రీకృష్ణుడే స్వయంగా చెప్పి, వారి ఆయుధాలను ఆ వృక్షం మీద దాయడం వల్ల కలిగే శుభఫలితాలను వివరించడం వల్ల పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లేముందు తమ దివ్యాస్త్రాలను జమ్మిచెట్టుపైనే దాచారు. మహిషాసురమర్దిని: సర్వదేవతల తేజస్సుల కలయిక అయిన ఆదిశక్తి మహిషాసుర మర్దిని. ఆశ్వయుజ శుద్ధ నవమిరోజున మహిషాసురుడిని సంహరించింది కనుక మహర్నవమినాడు అమ్మకు ఆ అలంకరణ చేస్తారు. సింహవాహన అయిన మహిషాసురమర్దిని నేటి పర్వదినాన ఉగ్రరూపంలోగాక శాంతమూర్తిగా దర్శనమివ్వడం విశేషం. మహిషాసురమర్దిని అలంకార ంలో అమ్మను దర్శించుకోవడం వల్ల సకల శుభాలూ చేకూరడమేగాక పిశాచబాధలు తొలగుతాయని భక్తుల విశ్వాసం. శ్రీరాజరాజేశ్వరి: లోకశుభంకరి, అపరాజితాదేవి అయిన శ్రీ రాజరాజేశ్వరీదేవి దసరా ఉత్సవాల ముగింపు రోజయిన విజయదశమినాడు భక్తులకు చెరకుగడతో, అభయముద్రతో, ఆర్తితో పిలవగానే వచ్చే పాపగా దర్శనమిస్తుంది. రాజరాజేశ్వరీ అవతారాన్ని దర్శించడం వల్ల సర్వకార్యానుకూలత, దిగ్విజయ ప్రాప్తి కలుగుతాయి. దుష్టరాక్షసులయిన రావణ కుంభకర్ణమేఘనాథులను సంహరించినందుకు గుర్తుగా కొన్ని ప్రాంతాలలో వారి దిష్టిబొమ్మలను తయారు చేసి టపాసులతో పేల్చేయడమో లేదా దహనం చేయడమో ఒక ఉత్సవంగా నిర్వహిస్తారు. దీనికే రామలీల అని పేరు. తెలంగాణ ప్రాంతం నవరాత్రులలో బతుకమ్మ పండుగకు ప్రాధాన్యమిస్తే, విజయనగరంలో పైడితల్లి వేడుకలు జరుపుతారు. ఆంధ్రప్రాంతంలోని పల్లెలలో ‘శమీశమయితే పాపం శమీ శత్రువినాశనం, అర్జునస్య ధనుర్ధారీ, రామస్య ప్రియదర్శనం’ అంటూ శమీపూజ చేయడం, రైతులు, వివిధ వృత్తులవారు, కళాకారులు వారి వారి పనిముట్లను పూజించడం ఆచారం. తెలంగాణలో జమ్మి ఆకును తీసుకు వచ్చి, జమ్మి బంగారాన్ని అందరికీ పంచి ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకోవడం, పెద్దలకు జమ్మిని ఇచ్చి వారి ఆశీస్సులు అందుకోవడం ఒక వేడుకగా జరుగుతుంది. పెద్ద పెద్ద సంస్థలలోనూ, కర్మాగారాలలోనూ యంత్రాలను పూజిస్తారు. బాక్స్ దుర్గానవరాత్రులో ఆఖరి అవతారం శ్రీరాజరాజేశ్వరి. భక్తులకు ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, ఙ్ఞానశక్తిని ప్రసాదించే అవతారం శ్రీరాజరాజేశ్వరి. ఏ దేవి రూపమైనా, ఏ శక్తి రూపమైనా అన్నిటికి మూలమైన శక్తి పరమేశ్వరి. ఈరోజు లలితా సహస్రనామ పారాయణతో పూజించాలి. చేమంతులతో ఆరాధన చేయాలి. భక్ష్య, భోజ్యాలతో మహానివేదన చేయాలి. ఈ రోజున అశ్వపూజ, ఆయుధపూజ, ఉఛ్చైశ్రవ పూజ, వాహన పూజ నిర్వహిస్తారు. శ్రీరాముడు విజయదశమి రోజున ‘అపరాజితాదేవిని’ పూజించి రావణునిపై విజయాన్ని సాధించాడు. నవరాత్రుల అనంతరం దశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన సమయంలో శమీవృక్షం వద్ద అపరాజితాదేవిని స్మరిస్తారు. ‘‘శమీ శమయతే పాపం, శమీ శత్రువినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియ దర్శినీ’’ ఈ మంత్రంతో తమ తమ గోత్రనామాలు చెప్పుకుని జమ్మి వృక్షాన్ని పూజ చేసి మూడు ప్రదక్షిణలు చేస్తారు. శ్రీరాముడు దశకంఠుని సంహరించిన రోజు గనుక ‘దశహర’ అని కూడా పిలువబడుతోంది. దేవదానవులు క్షీరసాగర మథనం చేసి అమృతాన్ని సంపాదించినది కూడా దశమి రోజునే. తిథి, వార, నక్షత్ర గణన లేకుండా విజయదశమి రోజున చేపట్టిన సకల కార్యాలు విజయం పొందుతాయని నమ్మిక. ఇదే విషయం ‘చతుర్వర్గ చింతామణి’ అనే ఉద్గ్రంథం విపులీకరించింది. దేవీ ఉపాసకులు అంతవరకు తాము చేసిన జప సంఖ్యననుసరించి హోమాలు చేస్తారు. నవరాత్రి వ్రత సమాప్తి గావించిన వారు సర్వ సిద్ధులు పొందుతారు, సర్వాభీష్ట సిద్ధి కలుగుతుంది. చెడుపై మంచి సాధించిన విజయం దానవత్వంపై దైవం సాధించిన విజయానికి చిహ్నంగా మనం ఈ పండుగను జరుపుకుంటున్నాం. ఇప్పుడు మనం పోరాటం చేయడానికి దానవులు లేరు –మానవులు తప్ప. కానీ మనం పోరాడి తీరవలసిన శత్రువులున్నారు. వారే అందరిలోనూ ఉండే అరిషడ్వర్గాలనే శత్రువులు. వారితోనే మనం పోరాడి విజయం సాధించాలి. జీవితాలను ఆనందమయం చేసుకోవాలి. విజయదశమి అంటే సకల విజయాలనూ కలుగ చేసే దశమి. ఆ రోజున ఆరంభించే ఏ శుభకార్యమైనా, మంచి పని అయినా, రకరకాల వృత్తులు, వ్యాపారాలు అయినా అఖండ విజయం సాధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ పర్వదినాన్ని ముహూర్తంగా ఎంచుకుని మంచి పనులు ప్రారంభిద్దాం. ఈ విజయ దశమి అందరికీ సుఖ సంతోషాలను, విజయాలను ప్రసాదించాలని అమ్మను కోరుకుందాం. –డి.వి.ఆర్. భాస్కర్ (చదవండి: సింహం వద్ద సలహదారు ఉద్యోగం! ) -
కేంద్ర ప్రభుత్వోద్యోగులకు 4 శాతం డీఏ
న్యూఢిల్లీ: పండుగ సీజన్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు. ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్‌ను 4 శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో ఉద్యోగులకు డీఏ వారి మూలవేతనంలో 46 శాతానికి చేరింది. అలాగే నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనాన్ని బోనస్‌గా ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ మేరకు పలు నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ నిర్ణయాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తర్వాత మీడియా సమావేశంలో వెల్లడించారు. డీఏ, డీఆర్ పెంపుతో 48.67 లక్షల మంది కేంద్ర ప్రభుత్వోద్యోగులు, 67.95 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందుతారని ఆయన తెలిపారు. వీటితో ఖజానాపై రూ.2,857 కోట్ల భారం పడనుంది. డీఏ పెంపు 2023 జూలై 1 నుంచి వర్తిస్తుంది. గత మార్చి, 2022 సెపె్టంబర్లో డీఏ, డీఆర్ 4 శాతం మేరకు పెరిగాయి. ఇక బోనస్ పెంపుతో లోకో పైలట్లు, గార్డులు, స్టేషన్ మాస్టర్లు, సూపర్వైజర్లు, టెక్నీషియన్లు, పాయింట్స్ మెన్, ఇతర గ్రూప్– సి సిబ్బంది సహా 11.07 లక్షల మంది రైల్వే ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. దీని ద్వారా రైల్వేలపై రూ.1,969 కోట్ల ఆరి్ధక భారం పడనుందని ఠాకూర్ తెలిపారు. మరోవైపు చక్కెర ఎగుమతులపై నిషేధాన్ని అక్టోబర్ నెలాఖరును దాటి నిరవధికంగా కేంద్రం పొడిగించింది. భారత్ ప్రపంచంలో అతి పెద్ద చక్కెర తయారీదారు. రెండో అతి పెద్ద ఎగుమతిదారు. 2024–25 రబీ మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించి గోధుమలకు మద్దతు ధరను మరో రూ.150 మేర పెంచుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం క్వింటాల్‌కు మద్దతు ధర రూ.2,125గా ఉంది. దీన్ని రూ.2,275కు పెంచినట్లుగా కేంద్రం ప్రకటించింది. కేంద్రంలో మోదీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచి్చన తర్వాత ఈ స్థాయిలో మద్దతు ధరను పెంచడం ఇదే తొలిసారి. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో గోధుమలు సహా బార్లీ, ఎర్రపప్పు, శనగలు, కుసుమ, ఆవాల మద్దతు ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఎర్రపప్పు (మసూర్) ధర రూ.425 మేర పెంచడంతో క్వింటాల్ ధర రూ.6,425కి చేరింది. ఆవాలకు కనీస మద్దతు ధరను రూ.200 పెంచడంతో అది రూ.5,650కి చేరుకుంది. కుసుమలు క్వింటాల్ రూ.5,650గా ఉండగా, రూ.150 చొప్పున పెంచడంతో రూ.5,800లకు చేరింది. బార్లీ మద్దతు ధరను రూ.115 మేర పెంచడంతో ధర 1,735 నుంచి రూ.1,850కి చేరింది. శనగల «కనీస మద్దతు ధరను రూ.150 మేర పెంచారు. దీని ధర క్వింటాల్‌కు రూ.5,335 నుంచి రూ.5,440కి చేరింది. -
దేశ వ్యాప్తంగా ఘనంగా జరిగిన దేవి నవరాత్రి ఉత్సవాలు
-
మూడు రాజధానులకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలి : కొడాలి నాని
-
దసరా సంబరాల్లో ప్రధాని నరేంద్ర మోదీ
-
నాగపూర్ లో ఆర్ఎస్ఎస్ దసరా ర్యాలీ
-
ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా మహోత్సవాలు
-
ఇంటింటా దసరా...
-
విజయాలనిచ్చే విజయదశమి...
-
అక్టోబర్ 5న కేసీఆర్ జాతీయ పార్టీ పేరు ప్రకటన..?
సాక్షి, హైదరాబాద్: కొత్త జాతీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించి సన్నాహాలు వేగవంతం చేసిన టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అక్టోబర్ 5న దసరా పండుగ పురస్కరించుకుని లాంఛనంగా పార్టీ పేరును ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. 5న పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ శాసనసభా పక్షం, పార్లమెంటరీ పార్టీ, రాష్ట్ర కార్యవర్గం ఉమ్మడి సమావేశానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు అధికారికంగా ఎలాంటి సమాచారం అందలేదు. అయితే ఈ సమావేశం ఉంటుందని కేసీఆర్‌కు సన్నిహితంగా ఉండే కొందరు నేతలు ధ్రువీకరిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. పార్టీ పేరు మార్పు, జాతీయ పార్టీగా విస్తరించడానికి సంబంధించి శాసనసభా పక్షం, పార్టీ రాష్ట్ర కార్యవర్గం తీర్మానాన్ని ఆమోదించేలా కసరత్తు జరుగుతోంది. కొత్త జాతీయ పార్టీ పేరుపై చివరి నిమిషం వరకు గోప్యత పాటిస్తూ ఉత్కంఠను పెంచడం ద్వారా జాతీయ స్థాయిలో దృష్టిని ఆకర్షించవచ్చనే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. తీర్మానం కాపీ సిద్ధం! ఎన్నికల సంఘం నిబంధనలను పాటిస్తూనే టీఆర్ఎస్ను జాతీయ పార్టీగా మార్చేందుకు ఇప్పటికే న్యాయ నిపుణులతో చర్చించిన కేసీఆర్.. ఐదో తేదీన జరిగే సమావేశంలో చేయాల్సిన తీర్మానం కాపీని సైతం సిద్ధం చేసినట్లు తెలిసింది. ఈ సమావేశంలోనే పార్టీ ఆశయాలు, లక్ష్యాలను వివరిస్తూ ‘విజన్ డాక్యుమెంట్’ను విడుదల చేసే అవకాశముంది. 2001 ఏప్రిల్ 27న టీఆర్ఎస్ ఆవిర్భావ ప్రకటనకు ముందు కేసీఆర్ సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయపల్లి వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కేసీఆర్ పోటీ చేసే ప్రతి ఎన్నికలోనూ నామినేషన్ పత్రాలతో ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడం ఆయనకు ఆనవాయితీగా మారింది. ఈ నేపథ్యంలో కొత్త జాతీయ పార్టీ ప్రకటన రోజు కూడా కోనాయపల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసే అవకాశముంది. అయితే పూజల నిర్వహణకు సంబంధించి స్థానిక నాయకత్వానికి ఇంకా ఎలాంటి సమాచారం అందలేదు. పాటలు, సాహిత్యంపైనా కసరత్తు జాతీయ పార్టీని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అవసరమైన సాహిత్యం, పాటలపైనా కేసీఆర్ సూచనలకు అనుగుణంగా కసరత్తు జరుగుతున్నట్లు తెలిసింది. తొలుత హిందీ భాషలో సాహిత్యాన్ని సిద్ధం చేసి, తర్వాత ఇంగ్లిష్, ప్రాంతీయ భాషల్లోకి తర్జుమా చేయాలని భావిస్తున్నట్లు సమాచా రం. తెలంగాణ ఉద్యమ పాటల తరహాలో ఆయా రాష్ట్రాల్లో స్థానికులను ఆకట్టుకునే బాణీల్లోనే పాటలను రూపొందించాలని రచయితలకు సూచించినట్లు తెలిసింది. అఖిలేశ్, కుమారస్వామి రాక! జాతీయ పార్టీపై ప్రకటన చేస్తున్న నేపథ్యంలో జాతీయ స్థాయిలో పలువురు ముఖ్య నేతలు, రైతు, దళిత, గిరిజన సంఘాల నేతలతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానాలు పంపినట్లు తెలిసింది. మాజీ ముఖ్యమంత్రులు అఖిలేశ్ యాదవ్ (సమాజ్‌వాదీ), కుమారస్వామి (జేడీఎస్)తో పాటు మరికొందరు నేతల రాక ఇప్పటికే ఖరారైంది. జాతీయ పార్టీ పేరును ప్రకటించిన తర్వాత జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ రాకను స్వాగతిస్తూ వారు అభినందనలు తెలియజేస్తారు. విమానానికి విరాళాలు! కొత్త పార్టీ ఏర్పాటును స్వాగతిస్తూ దేశ వ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో ఫ్లెక్సీల ఏర్పాటు, జాతీయ పత్రికలు, మీడియాలో విస్తృత ప్రకటనలు ఇచ్చేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు జాతీయ స్థాయి మీడియా సంస్థలతో టీఆర్ఎస్ వర్గాలు సంప్రదింపులు కూడా పూర్తి చేసినట్లు సమాచారం. కాగా జాతీయ పార్టీ ఏర్పాటు నేపథ్యంలో అవసరమైన విస్తృత పర్యటనల కోసం రూ.80 కోట్లతో 12 సీట్ల సామర్ధ్యం కలిగిన ప్రత్యేక విమానం కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో పార్టీ అవసరాల కోసం ప్రస్తుతమున్న హెలికాప్టర్‌ను కొనసాగించాలా? లేక కొత్తది కొనుగోలు చేయాలా? అనే అంశాన్ని కూడా కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. విమానం కొనుగోలుకు గతంలో పార్టీ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలైన నేతతో పాటు ఇటీవల రాజ్యసభ్యుడిగా ఎన్నికైన వ్యాపారవేత్త, మరో ఇద్దరు ఎంపీలు తమ వంతు విరాళాన్ని కేసీఆర్‌కు అందజేసినట్లు ప్రచారం జరుగుతోంది. -
విజయవాడ : ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు
-
విజయవాడ : దసరా ఉత్సవాలకు ముస్తాబు అవుతున్న దుర్గ గుడి
-
‘పీపీఈ’ డ్యాన్స్ చూశారా.. భలే ఉందే!
గుజరాత్: కోవిడ్ -19 దృష్ట్యా గత కొన్నేళ్లుగా పండుగ వాతావరణం కనుమరుగవుతుందేమో అన్నట్లుగా తయారయ్యింది. ఈ కరోనా మహమ్మారీ కారణంగా ఎవరి ఇళ్ల వద్ద వాళ్లే పండుగు చేసుకుంటున్నారు. బంధువుల సందడి, సాముహిక పూజలు, ఉత్సవాలు, ఆటపాటలతో జరిగే సంబరాలను గతేడాది నుంచే నిలిచిపోయిన సంగతి తెలిసిందే. (చదవండి: 9 రోజులు జగన్నాథుని ఆలయాన్ని మూసేవేయనున్నట్లు నిర్ణయం) పైగా ఈ కరోనా మహమ్మారీ ప్రపంచదేశాలను ఇంకా పీడిస్తూనే ఉన్న నేపథ్యంలో గుజరాత్‌లోని బాలికలు ఈ దసరా పండుగను కరోనా నిబంధనలను పాటిస్తునే విన్నూతనంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కి చెందిని బాలికలంతా దేవి నవరాత్రి సందర్భంగా గుజరాత్లో ప్రముఖంగా నిర్వహించే గర్బా(గుజరాతీ వాసుల నృత్యం) కార్యక్రమంలో పీపీఈ కిట్లు ధరించి నృత్యం చేశారు. పైగా వారు ఒక పక్క కోవిడ్ నియంత్రణ ప్రజలకు అవగాహన కల్పించే విధంగానూ మరోవైపు వారి సంప్రదాయాన్ని పాటిస్తూ విన్నూతనమైన రీతిలో ఈ ఉత్సవాన్ని జరుపుకోవడం విశేషం. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ మేరకు గర్బా కార్యక్రమ నిర్వాహకుడు కోవిడ్ -19 నియంత్రణ పై ప్రజలకు అవగాహన కల్పించటమే లక్క్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నాడు. (చదవండి: ఎర్ర జెండాలనే ఎందుకు వాడుతున్నారో తెలుసా?) -
నిరూపిస్తే.. 101 గుజీలు తీస్తా: దీదీ
కోల్‌కతా: ఒక రాజకీయ పార్టీ కావాలనే తన మీద బురద చల్లే ప్రయత్నం చేస్తుందని.. దానిలో భాగంగానే తాను ఈ ఏడాది దుర్గా పూజకు అనుమతివ్వలేదని అబద్ధాలు ప్రచారం చేస్తుందని నిప్పులు చెరిగారు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఈ ఏడాది దుర్గాపూజ వద్దని తాను అన్నట్లుగా నిరూపిస్తే.. ప్రజల ముందు 101 సార్లు గుంజీలు తీస్తానని సవాలు చేశారు దీదీ. బెంగాల్ పోలీస్ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దీదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఏడాది సెప్టెంబర్ 1న బెంగాలో పోలీసు డే నిర్వహిస్తారు. కానీ ఈ ఏడాది మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణంతో ఈ కార్యక్రమం నేటికి వాయిదా పడింది. ఈ సందర్భంగా దీదీ కోల్‌కతా పోలీసుల ధైర్య సాహసాలను ప్రశంసించారు. కోవిడ్ నియంత్రణ కోసం వారు ఎంతో కృషి చేస్తున్నారు అన్నారు. అనంతరం దుర్గా పూజపై వస్తోన్న ఆరోపణలపై స్పందించారు దీదీ. (చదవండి: కరోనా కట్టడిలో మహిళా నేతలు భేష్!) అక్టోబర్ నెలలో వస్తున్న దసరా పండగను ప్రతి ఏటా కోల్‌కతాలో ఘనంగా నిర్వహించే విషయం తెలిసిందే. అయితే దసరా సందర్భంగా జరిపే దుర్గా పూజపై ఇప్పటి వరకు తాను ఎలాంటి సమావేశం జరుపలేదని, ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మమత స్పష్టంచేశారు. కరోనా కారణంగా ఈసారి దుర్గా పూజను రద్దు చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని ఆమె కొట్టిపారేశారు. ఓ రాజకీయ పార్టీ దురుద్దేశంతోనే దీనిపై తప్పుడు వదంతులు ప్రచారం చేస్తున్నదని.. ప్రజలు వాటిని నమ్మవద్దని మమత వెల్లడించారు. -
దసరా వేడుకల్లో బాలీవుడ్ తారలు
-
ఆదిత్యాయ.. అద్భుత కాంతి తేజాయ
దసరా దేవి నవరాత్రుల్లో ఆదిత్యుడు అద్భుత దర్శన భాగ్యాన్ని కలిగించాడు. దశాబ్దాల కాలం తర్వాత ఇంతటి కాంతితో, తేజోవంతుడిగా మూలవిరాట్టు మెరిసిపోయింది. – శంకరశర్మ, ఆలయ ప్రధాన అర్చకుడు అరసవల్లి (శ్రీకాకుళం): శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో కొలువైన ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామిని తొలి సూర్యకిరణాలు తాకిన అద్భుత దృశ్యం బుధవారం భక్తులకు కనువిందు చేసింది. ఉత్తరాయణం నుంచి దక్షిణాయన కాలమార్పుల్లో భాగంగా సూర్యకిరణాల కాంతిలో ఆదిత్యుడు బంగారు ఛాయలో మెరిసిపోయాడు. సూర్య కిరణాలు రాజాగోపురం నుంచి అనివెట్టి మండపం దాటుతూ ధ్వజస్తంభాన్ని తాకుతూ అంతరాలయం దాటుకుంటూ నేరుగా గర్భాలయంలోని ఆదిత్యుని మూలవిరాట్టును తాకాయి. కాంతితేజంలా కన్పించిన ఈ అద్భుత దృశ్యాన్ని చూసి భక్తులు పులకించిపోయారు. ఆలయ ఈవో వి.హరిప్రసాద్ ఏర్పాట్లను పర్యవేక్షించగా.. ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. కిరణాలు తాకాయిలా... - బుధవారం ఉదయం సరిగ్గా 6.04 నిమిషాల సమయంలో దివ్య తేజస్సుతో తొలి లేలేత బంగారు వర్ణ కిరణాలు ఆదిత్యుని మూలవిరాట్టు పాదాలను తాకాయి. - అదే నిమిషం నుంచి అలా అలా.. పైపైకి కిరణ కాంతులు స్వామి ఉదరం, వక్ష భాగాలను స్పృశిస్తూ.. ముఖ భాగం, కిరీట భాగాన్ని తాకాయి. - ఒక్కసారిగా గర్భాలయమంతా కాంతివంతమైంది. - ఏడు గుర్రాలతో నిత్యం స్వారీ చేస్తున్న వెలుగుల రేడును అదే ఏడు నిమిషాలపాటు కిరణాలు అంటిపెట్టుకుని ఉండిపోయాయి. - గత కొన్ని దశాబ్దాల కాలంలో ఇలాంటి కిరణ దర్శనం కలుగలేదని సాక్షాత్తు అర్చకులు చెబుతున్నారు. ఆలయ చరిత్ర గంగా వంశరాజు గుణశర్మ వారసుడైన కళింగరాజు దేవేంద్రవర్మ క్రీ.శ.663లో ఈ దేవాలయాన్ని నిర్మించారని శాసనాలు చెబుతున్నాయి. క్రీ.శ. 16వ శతాబ్దంలో హర్షవల్లి ప్రాంతానికి నిజాం నవాబు సుబేదార్‌గా వచ్చిన షేర్ మహమ్మద్ ఖాన్, తానే ఈ ఆలయాన్ని ధ్వంసం చేసినట్లుగా ఒక శాసనంలో చెప్పుకున్నారు. ఆయన వద్ద ఉద్యోగిగా ఉన్న సీతారామస్వామి అనే పండితుడు.. మహమ్మద్ ఖాన్, హర్షవల్లిపై దండెత్తుతాడని తెలుసుకుని మూలవిరాట్టును తీసుకుని సమీపంలోని ఒక బావిలో దాచారట. క్రీ.శ 1778లో ఎలమంచిలి పుల్లాజీ పంతులు ఆ బావిలో మూలవిరాట్టును కనుగొని, తర్వాత ధ్వంసమైన ఆలయాన్ని పునర్నిర్మించి, విగ్రహ ప్రతిష్ట చేశారు. నాడు హర్షవల్లి.. నేడు అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి వారు కొలువైన ఏకైక దివ్యక్షేత్రంగా, దేశంలోనే నిత్య పూజలందుకుంటున్న ఏకైక సూర్యదేవాలయంగా అరసవల్లి విరాజిల్లుతోంది. ఇక్కడి సూర్యదేవుణ్ని దర్శించుకుని అభిషేకాలు, సూర్యనమస్కారాలు చేసిన వారు, తమ కోర్కెలు ఫలించగా,ఎంతో హర్షితులై తిరిగి వెళ్లేవారు. అందువల్ల ఈ క్షేత్రాన్ని హర్షవల్లి అని పిలిచేవారు. కాలక్రమేణా ఇది అరసవల్లిగా మారింది. ఏడాదికి రెండు సార్లు మూలవిరాట్టు ఉన్న స్థానబలం వల్ల ప్రతి ఏటా ఉత్తరాయణ, దక్షిణాయన కాలమార్పుల్లో నేరుగా తొలి లేత కిరణాలు నేరుగా స్వామి వారి మూలవిరాట్టును ప్రతి భాగమూ స్పృశించడం ఇక్కడి క్షేత్ర మహత్మ్యం. ప్రతి ఏటా మార్చి 9,10,11,12 తేదీల్లోనూ, అలాగే అక్టోబర్ 1,2,3,4 తేదిల్లోనూ స్వామి వారిని సూర్య కిరణాలు తాకుతుంటాయి. అక్కడ తిరుమలలో.. ఇక్కడ అరసవల్లిలో తిరుమలలో వెంకన్న స్వామికి, ఇక్కడ అరసవల్లి ఆదిత్యునికి కూడా నడుముకు చురిక (చిన్న కత్తి)ను ఆయుధంగా ధరించినట్లుగా కొలువుతీరడం ప్రత్యేకం. ఈ సూర్యక్షేత్రంలో శ్రీ ఉషా పద్మిని ఛాయా దేవి అనే ముగ్గురు భార్యలతో సూర్యభగవానుడు శాలిగ్రామ ఏక శిలతో విగ్రహరూపుడై ఉంటారు. స్వామి సింహలగ్న జాతకుడైనందున ఆయన విరాట్టుపై సింహతలాటం ఉంటుంది. ఆయనకు రెండు హస్తాలుంటాయి. -
దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు సర్వం సిద్ధం
సాక్షి, ఇంద్రకీలాద్రి: శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో దసరా మహోత్సవాలకు సర్వం సిద్ధమైంది. 10 రోజుల పాటు జరిగే వేడుకలకు రాష్ట్ర నలుమూల నుంచి గాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు ఇంద్రకీలాద్రికి విచ్చేయనున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా దేవస్థానం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తోంది. తొలి రోజున ఉదయం 9 గంటలకు దర్శనంఉత్సవాలలో భాగంగా తొలి రోజైన 29వ తేదీ ఆదివారం తెల్లవారుజామున అమ్మవారికి స్నపనాభిషేకం, అలంకరణ, పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 9 గంటలకు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఉత్సవాలలో తొలి రోజు ఆదివారం కావడంతో అమ్మవారు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా దర్శనమివ్వనున్నారు. మహా మండపం ఆరో అంతస్తులో అమ్మవారి ఉత్సవ మూర్తిని ప్రతిష్టించి పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. అనంతరం ప్రత్యేక కుంకుమార్చన, విశేష ఛండీయాగాలు ప్రారంభం అవుతాయి. ఆదివారం ఉత్సవాలలో తొలి రోజు కావడంతో రికార్డు స్థాయిలో భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు. వినాయకుడి గుడి నుంచి క్యూలైన్లు అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులు వినాయకుడి గుడి నుంచి ప్రారంభమయ్యే క్యూలైన్ల ద్వారా కొండపైకి చేరుకోవాల్సి ఉంటుంది. భవానీపురం వైపు నుంచి వచ్చే భక్తులు హెడ్ వాటర్ వర్క్స్ నుంచి ప్రారంభయ్యే క్యూలైన్లను టోల్‌గేటు వద్ద మొయిన్ క్యూలైన్లో కలుపుతారు. కొండపై భాగంలో క్యూలైన్లు దాదాపు పూర్తి కాగా, కొండ దిగువన పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా దుర్గాఘాట్, దర్గా, రథం సెంటర్లో క్యూలైన్లు పనులు పూర్తి కావాల్సి ఉంది. మరో వైపున ఉత్సవాలకు మరో రోజు మాత్రమే మిగిలి ఉండటంతో ఆదివారం నాటికి పనులు పూర్తి చేసేందుకు అధికారులు, సిబ్బంది సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. ఉత్సవాల నాటికి రెండు లక్షల లడ్డూలు సిద్ధం దసరా ఉత్సవాలలో అమ్మవారిని దర్శించుకునేందుకు విచ్చేసే భక్తులకు ప్రసాదాలు అందేలా దేవస్థానం ఏర్పాట్లు చేసింది. కొండ దిగువన ఉన్న లడ్డూ తయారీ కేంద్రంలో రోజుకు లక్ష లడ్డూలను తయారు చేసే విధంగా సిబ్బందిని నియమించారు. ఆదివారం ఉత్సవాలు ప్రారంభం అయ్యే నాటికి రెండు లక్షల లడ్డూలను సిద్ధం చేస్తామని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. మరో వైపున కొండపైన పాత వేద పాఠశాలలో పులిహోర ప్రసాదాన్ని సిద్ధం చేస్తున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అవసరమైన మేరకు పులిహోర తయారు చేస్తామని, ప్రతి రోజు 10 నుంచి 15 క్వింటాళ్లకు పైగా పులిహోర ప్రసాదం తయారు చేసే విధంగా సిబ్బంది అందుబాటులో ఉన్నారని అధికారులు వివరిస్తున్నారు. ప్రసాదాల విక్రయాల కోసం దేవస్థానం కనకదుర్గనగర్‌లో ప్రసాద కౌంటర్లను ఏర్పాటు చేశారు. అర్జున వీధిలో అన్నదానం.. దసరా ఉత్సవాలలో నిత్యం వేలాది మంది భక్తులకు అన్నప్రసాదాన్ని అందించేలా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. అర్జున వీధిలో దేవస్థానం నిర్మించిన షెడ్డులో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అన్న ప్రసాద వితరణ జరుగుతుంది. ఇక మూలా నక్షత్రం, విజయదశమి రోజున భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రసాద వితరణ చేస్తామని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. మెట్ల మార్గంలో హోమగుండం దసరా ఉత్సవాల పది రోజులు భక్తులు అమ్మవారి దీక్షను స్వీకరించడం జరుగుతుంది. భక్తులు అమ్మవారికి ఇరుముడులను సమర్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మల్లేశ్వర స్వామి వారి ఆలయం సమీపంలోని మెట్ల మార్గం దిగువన దేవస్థానం హోమ గుండాన్ని ఏర్పాటు చేసింది. హోమ గుండం సమీపంలోనే ఇరుముడులను సమర్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. గత ఏడాది దసరా ఉత్సవాల చివరి రెండు రోజులలో సుమారు 2 లక్షలు పైగా భవానీలు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఈ దఫా కూడా ఇదే తరహాలో భవానీలు వస్తారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): దసరా ఉత్సవాలలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. దసరా ఉత్సవాల ఏర్పాట్లను ఇన్చార్జి మంత్రితో పాటు దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్, మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్‌లు పరిశీలించారు. తొలుత కెనాల్‌రోడ్డులో ఏర్పాటు చేసిన క్యూలైన్లు.. తర్వాత సీతమ్మ వారి పాదాల వద్ద కేశఖండన శాలను పరిశీలించారు. ఉత్సవ ఏర్పాట్ల గురించి దేవస్థాన ఈవో ఎంవీ సురేష్‌బాబు, దేవస్థాన ఇంజినీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉత్సవాలకు 15 నుంచి 18 లక్షల మంది భక్తులు విచ్చేసే అవకాశం ఉందని, ఆ రద్దీని తట్టుకునేలా ఏర్పాట్లు ఉండాలన్నారు. 5న సీఎం పట్టువస్త్రాల సమర్పణ.. కన్నబాబు మాట్లాడుతూ అక్టోబర్ 5వ తేదీన సీఎం జగన్మోహన్రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పిస్తారన్నారు. ఉత్సవాల సందర్భంగా గతంలో ఎదురైన ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని మరింత సమర్థంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఉత్సవాలలో దేవదాయ శాఖ, రెవెన్యూ, పోలీసు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వలంటీర్ల సేవలను వినియోగిస్తున్నామన్నారు. తుది దశకు పనులు.. దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ దసరా ఉత్సవాల ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. వృద్ధులు, వికలాంగులకు అమ్మవారి దర్శనం త్వరతిగతిన పూర్త అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పర్యటనలో సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డీసీసీ సీహెచ్, విజయరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చక్రపాణి తదితరులు ఉన్నారు. సాక్షి, అమరావతి: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని రాష్ట్రం నలుమూలల నుంచి విచ్చేసే భక్తులు, యాత్రికుల భద్రత దృష్ట్యా పటిష్ట చర్యలు చేపడుతున్నామని విజయవాడ పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావు చెప్పారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ.. వీఐపీల రాక కారణంగా వారు ఇబ్బంది పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. దాదాపు 4,500 మంది అధికారులు, సిబ్బందిని మోహరిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు విజయవాడ కమిషనరేట్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆ వివరాలు..అంచనా 16 లక్షల మంది..ఈ ఏడాది జరిగే దసరా ఉత్సవాలకు సుమారు 16 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు సీపీ చెప్పారు. సాధారణ రోజుల్లో 50వేల నుంచి లక్ష మంది వరకు, మూలా నక్షత్రం రోజున 2.5లక్షల మంది వస్తారని.. ప్రారంభోత్సవం ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశాలున్నాయన్నారు. తెప్పోత్సవం సందర్భంగా కూడా భక్తుల సంఖ్య అధికంగా ఉంటారని భావిస్తున్నామని.. దీంతో అదే స్థాయిలో బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. 25 సెక్టార్లుగా విభజన.. ఈ ఏడాది బందోబస్తును 25 సెక్టార్లుగా విభజించి, కమిషనరేట్ పరిధిలోని 2వేల మంది సిబ్బందితోపాటు వివిధ జిల్లాల నుంచి వచ్చే మరో 2,500 మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నామని సీపీ తెలిపారు. వీరితోపాటు 35 సాయుధ పోలీసు ప్లటూన్లను వినియోగిస్తున్నామన్నారు. ఎక్కువ మందిని ఆలయం, దుర్గా ఘాట్, పరిసర ప్రాంతాల్లో మోహరించామని.. మిగిలిన వారిని ట్రాఫిక్, కీలకమైన చోట్ల ఉంచుతామని చెప్పారు. మొత్తం మూడు విడతల్లో సిబ్బంది విధులు నిర్వహిస్తారన్నారు. సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా నగరంలో ముఖ్యమైన ప్రాంతాల్లో ఈసారి ఎక్కువ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. డ్రోన్లను వినియోగిస్తున్నామని.. నేరస్తుల కదలికలపై నిఘా ఉంచామని చెప్పారు. సీసీ కెమెరాలతో పాటు, మఫ్తీలో పోలీసు సిబ్బంది గమనిస్తుంటారని.. చోరీలు, వంటి వాటిని అరికట్టే లక్ష్యంతో వీరు పనిచేస్తారని తెలిపారు. çకంట్రోల్ రూమ్‌ల ద్వారా పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామన్నారు. ఒకటో పట్టణ స్టేషన్, నగర పోలీసు కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయని.. 24 గంటల పాటు ఇక్కడ సిబ్బంది పరిశీలిస్తుంటారని పేర్కొన్నారు. వర్షాలు పడుతున్నందున విధుల్లో ఉన్న సిబ్బందికి రెయిన్ కోట్లు కూడా ఇస్తున్నామన్నారు. భవానీ సేవాదళ్ ఆసరా గత ఏడాది మాదిరిగానే ఈసారి భవానీ సేవాదళ్ సిబ్బంది ద్వారా వృద్ధులు, దివ్యాంగులకు సాయం అందిస్తారని చెప్పారు. మొత్తం 120 మంది విధుల్లో ఉంటారని.. ప్రతి షిఫ్ట్‌లో 40 మంది పనిచేస్తారన్నారు. భక్తుల సౌకర్యార్థం సమాచార కేంద్రాలు.. ఉత్సవాలకు తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం నగరంలో ఏడు చోట్ల పోలీసు శాఖ ఆధ్వర్యంలో సమాచార కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఆలయంలో రద్దీ ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోవచ్చని తెలిపారు. పరిస్థితిని బట్టి దర్శనానికి వెళ్లొచ్చని. వన్‌టౌన్, భవానీపురం, పోలీసు కంట్రోల్ రూమ్, పోలీసు కమిషనర్ కార్యాలయం, స్టేట్ గెస్ట్ హౌస్, కమాండ్ కంట్రోల్ కేంద్రం, పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్, రైల్వేస్టేషన్లో వీటిని ఏర్పాటు చేశామన్నారు. వీఐపీల దర్శనానికి ప్రత్యేక సమయాలు.. అమ్మవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో వీఐపీలు కూడా రానున్నారన్నారు. దీని వల్ల సాధారణ భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ప్రముఖులకు నాలుగు సమయాల్లో ప్రత్యేక దర్శనం కల్పించనున్నట్లు వెల్లడించారు. వీఐపీలు కచ్చితంగా ఆ సమయాలలోనే రావాల్సి ఉంటుందన్నారు. ఉదయం 7 నుంచి 8, 11 నుంచి 12, మధ్యాహ్నం 3 నుంచి 4, రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు అనుమతించే ఆలోచన ఉందని చెప్పారు. పార్కింగ్‌కు ప్రత్యేక యాప్.. ఆలయానికి సొంత వాహనాల్లో వచ్చే భక్తుల సౌకర్యార్థం సమీపంలో పలుచోట్ల పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశామని సీపీ చెప్పారు. దాదాపు 12 చోట్ల ద్విచక్ర వాహనాలు, కార్లు నిలిపేందుకు ఆస్కారం ఉదన్నారు. దీని కోసం ప్రత్యేకంగా పార్కింగ్ యాప్‌ను రూపొందించామని.. మొబైల్లోనే తమ సమీపంలోని పార్కింగ్ ప్రాంతాలను చూసుకునే అవకాశంతోపాటు అక్కడ ఎంత జాగా ఉందో కూడా తెలుసుకోవచ్చన్నారు. -
దేశవ్యాప్తంగా ఘనంగా దసరా సంబరాలు
-
పాక్ సరిహద్దుల్లో రాజ్‌నాథ్ దసరా
న్యూఢిల్లీ: భారత్–పాక్ సరిహద్దుల్లోని అత్యంత సున్నిత ప్రాంతమైన బికనూర్‌లో దసరా, ఆయుధపూజ కార్యక్రమాల్లో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పాల్గొననున్నారు. ఇండో–పాక్ సరిహద్దుల్లో ఆయుధపూజ కార్యక్రమంలో ఓ సీనియర్ కేంద్రమంత్రి పాల్గొనడం ఇదే మొదటిసారి. రాజస్తాన్‌లోని బికనూర్ వద్దనున్న పాక్ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ జవాన్లతో ఈ నెల 19న దసరా వేడుకల్లో రాజ్‌నాథ్ పాల్గొంటారని కేంద్ర హోంశాఖ వర్గాలు తెలిపాయి. అలాగే అక్కడి ప్రాంతంలో నిర్వహించబోయే ఆయుధపూజలో కూడా రాజ్‌నాథ్ పాల్గొంటారని వెల్లడించాయి. రెండ్రోజుల పర్యటనలో భాగంగా రాజ్‌నాథ్ ఈ నెల 18న రాత్రి బికనూర్ బోర్డర్ ఔట్‌పోస్టుకు చేరుకుంటారని.. 19న దసరా వేడుకల్లో జవాన్లతో కలసి పాల్గొంటారని అధికారులు తెలిపారు. పర్యటన సందర్భంగా రాజ్‌నాథ్ సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులపై సమీక్షించనున్నారు. గతేడాది చైనా సరిహద్దుల్లోని ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్ లో దసరా వేడుకల్లో రాజ్‌నాథ్ పాల్గొన్నారు. -
జైత్రయాత్ర.. సంప్రదాయ పాత్ర
హొళగుంద, ఆలూరు/రూరల్, న్యూస్‌లైన్: దసరా పండగ వస్తుందంటే జిల్లా ప్రజలందరి చూపు దేవరగట్టుపైనే ఉంటుంది. ఉన్నతాధికారులు సైతం ఇక్కడ జరిగే వేడుకలపైనే ప్రత్యేక దృష్టి సారిస్తారు. ఈ ఏడాది నాటుసారా నియంత్రణ, కర్రల ఏరివేత, హెల్మెట్ల పంపిణీ.. ఇలా రక్షణ చర్యలు తీసుకున్నారు. పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. అయినా ఇక్కడ సంప్రదాయానిదే పెమైట్టు అయింది. ఎన్నో ఏళ్లుగా వస్తున్న కర్రల సమరాన్ని భక్తులు కొనసాగించారు. రాష్ట్ర నలుమూలల నుంచేకాక కర్ణాటక, మహారాష్ట్రల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. సోమవారం సాయంత్రం ఆరు గంటల కల్లా మాళమల్లేశర స్వామి ఆలయం పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. అర్ధరాత్రి స్వామి కళ్యాణోత్సవం అనంతరం ఉత్సవ విగ్రహాలను పల్లకిలో కొలువుంచి కొండదిగువకు జయజయధ్వానాల మధ్య తీసుకొచ్చారు. నెరణికి, నెరణికి తాండ, కొత్తపేట గ్రామాలకు చెందిన వేలమంది భక్తులు పల్లకోత్సవం వద్దకు చేరుకొన్నారు. ఉత్సవాలను సమైక్యంగా, వర్గ వైషమ్యాలకు అతీతంగా వైభవంగా నిర్వహించాలని పాల బాస తీసుకున్నారు. ఈ తరుణంలో జైత్రయాత్ర ప్రారంభానికి సూచనగా కొందరు ఔట్లు పేల్చారు. కొందరు డిర్..గోపరక్..బహుపరాక్ అంటూ బిగ్గరగా నినదించారు. ఒక్కసారిగా వేలాదిమంది భక్తుల చేతిలో రింగులు తొడిగిన కర్రలు కరాళ నృత్యం చేశాయి. ఈ సందర్బంగా భక్తులు స్వామి బండారం (పసుపు)ను పెద్ద ఎత్తున వెదజల్లారు. వేలాది మంది భక్తులు తమ ఇలవేల్పుకు రక్షణ కల్పించే సంప్రదాయ క్రీడలో భాగంగా దివిటీలు, కర్రలతో పరస్పరం కొట్టుకున్నారు. మాళమల్లేశ్వరా బహుపరాక్ అంటూ అంటూ భక్తులు దిక్కులు పిక్కటిల్లేలా చేసిన నినాదాలు, కర్రల శబ్దాలు, అరుపులు, కేకలతో ఆ ప్రాంతం అంతా మారుమోగింది. భీకర యుద్ధాన్ని తలపించింది. పోలీసులపై ఎదురు దాడి: జైత్ర యాత్ర ముందుకు సాగి పోయినా కొందరు అల్లరి మూకలు మల్లప్ప గుడి వద్ద దివిటీలను మహిళలపై విసిరారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టేందుకు యత్నించారు. తిరగబడిన అల్లరి మూకలు కర్రలతో దాడికి దిగగా కొండపై ఉన్న మరి కొందరు రాళ్లు విసిరారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మూకల దాడికి తట్టుకోలేమని అంచనాకు వచ్చిన పోలీసులు వెంటనే కాళ్లకు పని చెప్పారు. దాడిలో 15 మందికి గాయాలు అయినట్లు సమాచారం. పెద్దకడుబూరులో పని చేస్తున్న కానిస్టేబుల్ మహమ్మద్ రఫీ చెవి కోసుకు పోగా కొందరికి కాళ్లు, చేతులు, తలకు బలమైన గాయాలు అయినట్లు తెలిసింది. క్షతగాత్రులలో ఒక డీఎస్సీ ఉన్నట్లు సమాచారం. అయితే వివరాలు తెలిపేందుకు అధికారులు ఆసక్తి చూపలేదు. ఇదిలా ఉండగా డాక్టరైన జిల్లా ఎస్పీ రఘురామిరెడ్డి స్వయంగా వైద్యుడి అవతారం ఎత్తి క్షతగాత్రులకు వైద్యం చేశారు. క్షతగాత్రులకు వైద్య శిబిరంలో చికిత్స: గాయాలపాలైన భక్తులకు వైద్య శిబిరంలో చికిత్స చేశారు. వైద్యులు షమీఉల్లా, తాహెర్భాష, చంద్రశేఖర్, మహమ్మద్‌తో సిబ్బంది క్షత గాత్రులకు వైద్య సాయం అందించిన వారిలో ఉన్నారు. తీవ్ర గాయాలకు గురి అయిన వారిని మరింత ఉన్నత చికిత్స కోసం ఆలూరు, ఆదోని, కర్నూలు, బళ్లారికి తరలించారు. రక్త సంతర్పణ : ఆలయానికి దాదాపు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న రక్ష పడిలో జరిగిన రక్త సంతర్పణ కార్యక్రమం భక్తులను తీవ్ర ఉత్కంఠతకు గురి చేసింది. పల్లకోత్సవం రక్ష పడికి చేరుకోగానే అక్కడ ఉన్న మల్లప్ప తాత తన ఎడమ కాలు పిక్కల్లో డబ్బణం గుచ్చి, నులకను లాగి పిడికెడు రక్తంను మణి ,మల్లాసురులకు సంతర్పణ చేశారు. భక్తులను ఇష్టారాజ్యంగా సంహరించుకుండా రాక్షసుల కోరిక మేరకు ఐదు చుక్కల రక్తాన్ని భక్తుల తరఫున తాను ఐదు చుక్కలు రక్తాన్ని సంతర్పణ చేశానని మల్లప్పతాత తెలిపారు. జమ్మి పత్రితో శుభాకాంక్షలు తెలుపుకున్న భక్తులు: మాత మాళమ్మ, మల్వేశ్వరి స్వామి పల్లకోత్సవం శమీ(జమ్మి చెట్టు) వృక్షం వద్దకు చేరుకోగానే కర్రల సమరం మరోసారి నిలిచి పోయింది. శమీ వృక్షానికి పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు పరస్పరం జమ్మి పత్రి ఇచ్చుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ‘భవిష్యవాణి ’కి ప్రత్యేకత : బన్ని ఉత్సవాలలో భవిష్యవాణికి ప్రత్యేకత ఉంది. భక్తులు భవిష్యవాణి ఆధారంగానే పంటలు సాగు చేస్తారు. జైత్ర యాత్ర బసవన్న కట్టకు చేరుకోగానే ఆలయ ప్రధాన అర్చకుడు మల్లయ్య స్వామి బసవన్న గుడి పై ఎక్కి డిర్.్ర..ర్.్ర.గోపరక్..బహుపరక్ అనగానే భక్తులు ఒక్క సారిగా కర్రల సమరంను నిలిపి వేసి నిశ్బబ్దం పాటించారు. పంటలు ఆశాజనకంగా ఉంటాయని చెప్పిన మల్లయ్య స్వామి ధరలు మాత్రం కొంత నిరాసపరుస్తాయని పేర్కొన్నారు. పత్తి ధర క్వింటాలు రూ.3 500, జొన్న రూ.2100 ఉండొచ్చని అర్థం వచ్చేలా 6-3, 3-6 అనగా వాణిజ్య పంటల ధరలు నిలకడగా ఉండవని చెప్పారు. దేవేంద్రుడు దేవ లోకం నుంచి వజ్రాయుధంతో దిగి భూలోకంలో తిరుగుతున్నాడని, శివ గంగి మానస సరోవరంలో పర్యటిస్తోందని పేర్కొన్న స్వామి వరదలు వచ్చే సూచనలు చేశారు. భారీ బందోబస్తు: ఉత్సవాలకు పోలీసులు భారీ బందోబస్లు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ రఘురామిరెడ్ది నేతృత్వంలో ఆదోని డీఎస్పీ శివరామిరెడ్డి ఆధ్వర్యంలో ఐదుగురు డీఎస్పీలు, 21 మంది సీఐలు, 89 మంది ఎస్ఐలు, 950 మంది బందోబస్తు నిర్వహించారు. ఎస్పీ ఉత్సవాలను స్వయంగా పర్యవేక్షిస్తూ అధికారులు సిబ్బందికి అవసరం అయిన సలహాలు, సూచనలు చేశారు. దేవరగట్టు ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టులో పోలీసులు కర్రలను స్వాధీనం చేసుకుని ఆలూరు పోలీసు స్టేషన్‌కు తరలించారు. అయితే జైత్ర యాత్ర ప్రారంభం కాగానే వేలాది మంది చేతిలో ఇనుప రింగులు తొడిగిన కర్రలు ప్రత్యక్షం కావడం గమనార్హం. -
వైభవంగా దసరా సంబరాలు
మహబూబ్‌నగర్ కల్చరల్, న్యూస్‌లైన్: గత తొమ్మిది రోజులుగా దుర్గామాతను వివిధ రూపాల్లో దర్శించి తరిం చిన ప్రజలు ఆదివారం అచ్చంపేట, కల్వకుర్తి, మక్తల్, గద్వాల, అలంపూర్, జడ్చర్ల, షాద్‌నగర్, కొడంగల్, నా రాయణపేట, వనపర్తి, నాగర్‌కర్నూల్ నియోజకవర్గాల్లో దసరా పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. నవమి, దశమి ఒకేరోజు వచ్చినప్పటికీ ఆదివారమే విజ యదశమిని జరుపుకోవాలని నిర్ణయించడంతో ఉద యం నుంచే పండుగ వేడుకలు ప్రారంభమయ్యాయి. పై-లీన్ ప్రభావంతో భారీవర్షాలు కురుస్తాయన్న సమాచారం కొంత కలవరపెట్టినప్పటికీ వాతావరణం అనుకూలించడంతో పాలమూరు పట్టణప్రజలు దసరా ధ్వజం ఊరేగింపులో భారీసంఖ్యలో పాల్గొన్నారు. స్థానిక దసరాఉత్సవ కమిటీ, ఆర్యసమాజ్ ఆధ్వర్యంలో బ్రాహ్మణవాడిలోని మందిరంలో ఉదయం 8గంటలకు దేవయజ్ఞం, వే దోపదేశం నిర్విహ ంచారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రా రంభమైన ఊరేగింపులో గౌలి వెంకటేశ్ నాయకత్వంలో రాయిచూర్నుంచి వచ్చిన సుమారు 100మంది గౌలి సమాజం ప్రతినిధులు, హనుమాన్ వ్యాయామశాల నిర్వాహకులు వివిధ దేవతల వేషధారణ, కోలాట ప్రదర్శనలు నిర్వహించారు. ధ్వజధారిగా న్యాయవాది వి.మనోహర్‌రెడ్డి వ్యవహరించారు. 3 గంటలకు రాంమందిర్ చౌరస్తాలో ఉన్న దసరాకట్ట దగ్గర జనసమ్మేళనాన్ని నిర్వహించి ధ్వజారోహణం చేశారు. అక్కడి నుంచి బయలుదేరిన ర్యాలీ పాన్‌చౌరస్తా, క్లాక్‌టవర్, అశోక్‌టాకీస్ చౌరస్తా, అంబేద్కర్ విగ్రహం ద్వారా జిల్లా పరిషత్ క్రీడామైదానానికి చేరింది. వే లాది మంది పాల్గొన్న బహిరంగసభలో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించిన అనంతరం పర్వదిన ప్రాముఖ్యతను వారణాసిలోని స్యాతక పాణిని కన్యాగురుకులం ఉపన్యాసకురాలు రావికంటి జ్యోతిశ్రీ సందేశమిచ్చారు. నవరాత్రులకు చిహ్నంగా బెలూన్ల ద్వారా ఆకాశంలోకి పంపిన 9 రకాల జ్యోతులు అలరించాయి. తదుపరి టంగుటూరు నుంచి వచ్చిన హరనాథ్ బృందం వివిధ రంగులు, ఆకృతుల్లో పేల్చిన బాణాసంచా ముచ్చట గొలిపింది. అనంతరం రావణాసుర దహన ప్రక్రియను పూర్తిచేశారు. విజయానికి స్ఫూర్తి దసరా చెడుపై మంచి, అధర్మంపై ధర్మం, అన్యాయంపై న్యాయం గెలుస్తుందని ఈ వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్ ఎం. గిరిజాశంకర్, ఎస్పీ నాగేంద్రకుమార్, ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీ విఠల్‌రావు, మాజీ మంత్రి పి.చంద్రశేఖర్ తదితరులు తమ సందేశాల్లో వెల్లడించారు. విజయానికి స్ఫూర్తిగా నవరాత్రులు, విజయదశమి వేడుకలు నిలుస్తాయన్నారు. కార్యక్రమంలో ఏజీసీ డాక్టర్ రాజారాం, ట్రైనీ కలెక్టర్ విజయరామరాజు, ఆర్టీఓ హన్మంత్‌రావు, డీసీసీ అధ్యక్షుడు కొత్వాల్, మునిసిపల్ మాజీ చైర్మన్ సహదేవ్‌యాదవ్, ఉత్సవ కమిటీ ప్రతినిధులు డాక్టర్ మురళీధర్‌రావు, ముత్యాల ప్రకాశ్, కేఎస్ రవికుమార్, చంద్రయ్య, సత్తూరు రాములుగౌడ్, గోపాల్ యాదవ్, చంద్రకుమార్ గౌడ్, పులి అంజనమ్మతోపాటు పట్టణ ప్రముఖులు, ప్రజలు భారీగా పాల్గొన్నారు.