centrel government
-
ఈసారి 33 విమానాలకు బెదిరింపులు
న్యూఢిల్లీ: దేశీయ విమానాలకు బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి. శనివారం మరో 33 విమానాలకు ఈ హెచ్చరికలు అందాయని అధికారవర్గాలు తెలిపాయి. దీంతో, గత 13 రోజుల్లో 300కు పైగా విమానాలకు ఉత్తుత్తి బెదిరింపులు అందినట్లయింది. ఇండిగో, విస్తార, ఎయిరిండియాలకు చెందిన 11 చొప్పున విమానాలకు శనివారం సామాజిక మాధ్య మ వేదికల ద్వారానే చాలా వరకు బెదిరింపులు అందాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సామాజిక మాధ్యమ వేదికలకు అడ్వైజరీ జారీ చేసింది. బెదిరింపులు శాంతియుత వాతావరణానికి, దేశ భద్రతకు భంగం కలిగించడంతోపాటు దేశ ఆర్థిక భద్రతకు ముప్పుగా పరిణమించాయని ఆందోళన వ్యక్తం చేసింది. వీటి వల్ల విమాన ప్రయాణికులు, భద్రతా విభాగాలపై ప్రతికూల ప్రభావం చూపిందని, విమానయాన సంస్థలు తమ సాధారణ కార్యకలాపాలు కొనసాగించ లేకపోయాయని తెలిపింది. ఐటీ నిబంధనల మేరకు ఇటువంటి తప్పుడు సమాచారంపై ఓ కన్నేసి ఉంచాలని, కనిపించిన వెంటనే తొలగించడం లేదా నిలిపివేయాలని కోరింది. భారత సార్వ¿ౌమత్వం, భద్రత, సమగ్రత, ఐక్యతలకు భంగం కలిగించే చర్యలపై ప్రభుత్వానికి సమాచారం అందించడం తప్పనిసరని స్పష్టం చేసింది. ఆయా మాధ్యమ వ్యవస్థలు తమ నియంత్రణ లేదా ఆ«దీనంలో సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా లేదా 72 గంటల్లోగా అందించడంతోపాటు సంబంధిత దర్యాప్తు సంస్థలకు విచారణలో సహకరించాల్సి ఉంటుందని గుర్తు చేసింది. ఏ యూజర్ అయినా చట్ట విరుద్ధమైన లేదా తప్పుడు సమాచారం ప్రచురణ, ప్రసారం, ప్రదర్శించడం, అప్లోడ్, స్టోర్, అప్డేట్, షేర్ వంటివాటిని అడ్డుకునేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత సామాజిక మాధ్యమ వేదికలదేనని పేర్కొంది. ఉల్లంఘించిన వారిపై ఐటీ చట్టం, భారతీయ న్యాయ సంహిత–2023 ప్రకారం చర్యలుంటాయని తెలిపింది. విషయ తీవ్రత దృష్యా్ట ఈ అడ్వైజరీ జారీ చేస్తున్నట్లు ఎల్రక్టానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ తెలిపింది. విమానయాన సంస్థలకు అందుతున్న ఉత్తుత్తి బెదిరింపులకు సంబంధించిన సమాచారాన్ని అందజేయాలంటూ రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం మెటా, ఎక్స్ వంటి సామాజిక మాధ్యమ వేదికలను కోరడం తెలిసిందే. -
ఈసారి 95 విమానాలకు బాంబు బెదిరింపులు
న్యూఢిల్లీ: దేశీయ విమానయాన సంస్థలకు చెందిన దేశీయ, అంతర్జాతీయ విమానాలకు బాంబు బెదిరింపుల పర్వం కొనసాగుతోంది. గురువారం మొత్తం 95 విమానాల సర్వీసుల్లో బాంబులు పెట్టినట్లు బెదిరింపులు వచ్చాయి. ఇవన్నీ వట్టివేనని తేలింది. ఇందులో ఆకాశ ఎయిర్‌కు చెందిన 25, ఎయిరిండియా, ఇండిగో, విస్తారలకు చెందిన 20 చొప్పున, స్పైస్ జెట్, అలయెన్స్ ఎయిర్‌లకు చెందిన ఐదేసి విమానాలు ఉన్నాయి. దీంతో గడిచిన 11 రోజుల్లో 250కు పైగా సర్వీసులకు బెదిరింపులు అందినట్లయింది. సామాజిక మాధ్యమాల ద్వారా ఆగంతకులు చేసిన హెచ్చరికలతో అధికార యంత్రాంగం, రక్షణ బలగాలు, విమా నాశ్రయాల సిబ్బందితోపాటు ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు, అసౌకర్యానికి లోనయ్యారు. విమానయాన సంస్థలకు ఆర్థికంగా నష్టం వాటిల్లింది. ఇండిగోకు చెందిన హైదరాబాద్– గోవా, కోల్‌కతా–హైదరాబాద్, కోల్‌కతా–బెంగళూరు, బెంగళూరు–కోల్‌కతా, ఢిల్లీ–ఇస్తాంబుల్, ముంబై–ఇస్తాంబుల్, బెంగళూరు– ఝర్సుగూడ, హైదరాబాద్–బగ్దోరా, కోచి– హైదరాబాద్ తదితర సర్వీసులున్నాయి. బుధవారం మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో ఉన్న దుమ్నా విమానాశ్రయాన్ని పేల్చి వేస్తానంటూ ఆ ఆగంతకుడు ఫోన్లో చేసిన బెదిరింపు వట్టిదేనని తేలింది.మెటా, ఎక్స్‌లను సమాచారం కోరిన కేంద్రంవిమానాలకు బాంబు బెదిరింపులు కొనసా గుతుండటాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. వీటి వెనుక ఉన్న వారిని గుర్తించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రజా సంక్షేమంతో ముడిపడి ఉన్న అంశం కావడంతో పలు విమానయాన సంస్థలకు పదేపదే అందుతున్న బెదిరింపు హెచ్చరికలకు సంబంధించిన పూర్తి డేటాను అందజేయాలని సామాజిక మాధ్యమ వేదికలైన మెటా, ఎక్స్‌లను కోరింది. -
చట్టాల కోరలు తీశారు
న్యూఢిల్లీ: దేశంలో పర్యావరణ చట్టాల్లో సవరణలు చేసి, చివరకు వాటిని కోరల్లేనివిగా మార్చేశారని కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను దహనాన్ని నియంత్రించడానికి తీసుకొచి్చన ‘దేశ రాజధాని, పరిసర ప్రాంతాల్లో వాయు నాణ్యత నిర్వహణ కమిషన్(సీఏక్యూఎం) చట్టం–2021’ను ఎందుకు కఠినంగా అమలు చేయడం లేదని ప్రశ్నించింది. సీఏక్యూఎం చట్టం విషయంలో కేంద్రం తీరును న్యాయస్థానం తప్పుపట్టింది. చట్టం అమలుకు అవసరమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయకుండానే ఈ చట్టాన్ని తీసుకొచ్చారని ఆక్షేపించింది. ఢిల్లీలో కాలుష్యం తీవ్రత, పంట వ్యర్థాల దహనం సమస్యపై జస్టిస్ అభయ్ ఎస్.ఓకా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటీ వాదనలు వినిపించారు. సీఏక్యూఎం చట్టంలోని సెక్షన్ 15కు సంబంధించి మరికొన్ని నియంత్రణలను మరో 10 రోజుల్లో జారీ చేయబోతున్నట్లు తెలిపారు. ఈ చట్టాన్ని ప్రభావవంతంగా అమలు చేయడానికి ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించడంతోపాటు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని వివరించారు. పంజాబ్, హరియాణా అధికారులకు, కాలుష్య నియంత్రణ మండళ్లకు సీఏక్యూఎం ఇప్పటికే లేఖలు రాసిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పంట వ్యర్థాలను దహనం చేస్తూ కాలుష్యానికి కారణమవుతునవారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలని ఆదేశించిందని అన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో తమకు తెలుసని పేర్కొంది. కాలుష్యాన్ని అరికట్టడంలో విఫలమవుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని తేల్చిచెప్పింది. చటాన్ని ఉల్లంఘించే వారిపై పర్యావరణ పరిహార పన్నును మరింత పెంచేలా చట్టంలో సవరణ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పంజాబ్, హరియాణా ప్రభుత్వాల తీరుపైనా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పంట వ్యర్థాల దహనాన్ని ఎందుకు అరికట్టడం లేదని నిలదీసింది. సీఏక్యూఎం ఆదేశాలను ఆయా ప్రభుత్వాలు అమలు చేయడం లేదని మండిపడింది. కాలుష్య నియంత్రణ విషయంలో పంజాబ్, హరియాణా ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలు కేవలం కంటితుడుపు తప్ప అందులో కార్యశీలత లేదని ఆక్షేపించింది. పంట వ్యర్థాలను దహనం చేసేవారికి కేవలం రూ.2,500 చొప్పున జరిమానా విధించడం ఏమిటని ప్రశ్నించింది. కేవలం నామమాత్రంగా జరిమానా విధించి, కాలుష్యానికి లైసెన్స్ ఇస్తున్నారా అని న్యాయస్థానం మండిపడింది. -
వారిక ‘నో ఫ్లై లిస్టు’లో
న్యూఢిల్లీ: విమానాలకు బాంబు బెదిరింపులతో హడలెత్తిస్తున్న ఆకతాయిలు, అసాంఘిక శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇలాంటి ఉత్తుత్తి బాంబు బెదిరింపులతో ప్రమాణికులకు తీవ్ర అసౌకర్యం కల్పిస్తున్న వారిని, భయాందోళనలకు గురిచేస్తున్న వారిని ఇకమీదట విమాన ప్రయాణానికి అనర్హుల జాబితా (నో ఫ్లై లిస్టు)లో చేర్చనున్నారు. మూడు రోజుల్లో మొత్తం 19 జాతీయ, అంతర్జాతీయ విమానా లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. కొన్ని విమానాలను దారిమళ్లించి దగ్గర్లోని విమానాశ్రయాల్లో దింపి తనఖీలు పూర్తి చేశారు. ఇవన్నీ ఉత్తుత్తి బాంబు బెదిరింపులేనని తేలింది. సమస్య తీవ్రతను గుర్తించిన కేంద్ర పౌర విమానయాన శాఖ అధికారులు బుధవారం సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ, కేంద్ర హోంశాఖ అధికారులతో సమావేశమై తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. నిఘా సంస్థలు, పోలీసుల సహకారంతో బాంబు బెదిరింపులకు దిగుతున్న వారిని గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. ప్రభుత్వం పరిస్థితిని నిశితంగా గమనిస్తోందని, చట్టసంస్థలు ప్రతికేసులోనూ లోతుగా దర్యాప్తు జరుపుతున్నాయని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు బుధవారం తెలిపారు. మరో ఏడు విమానాలకు బెదిరింపులుబుధవారం మరో ఏడు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇవన్నీ ఉత్తవేనని తేలింది. నాలుగు ఇండిగో విమానాలు, రెండు స్పైస్‌జెట్ విమానాలు, ఒక ఆకాశ ఎయిర్ విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. రియాద్–ముంబై ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో దాన్ని దారి మళ్లించి మస్కట్ (ఒమన్)లో దింపారు. చెన్నై– లక్నో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో లక్నోలో దిగగానే ప్రయాణికులను సురక్షితంగా దింపి.. విమానాన్ని నిర్జన ప్రదేశానికి తీసు కెళ్లారు. అలాగే ఢిల్లీ– బెంగళూరు ఆకాశ ఎయిర్ విమానానికి బెదిరింపు రావడంతో దాన్ని తిరిగి దేశ రాజధానికి మళ్లించి.. క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఇలాగే ముంబై– ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో అహ్మదాబాద్‌కు మళ్లించారు. మైనర్ అరెస్టు: ముంబై: మూడు విమానాలను లక్ష్యంగా చేసుకొని సోషల్‌మీడియాలో బాంబు బెదిరింపులు పంపిన చత్తీస్‌గఢ్‌లోని ఒక 17 ఏళ్ల మైనర్‌ను బుధవారం ముంబై పోలీసులు అరెస్టు చేశారు. -
ఢిల్లీలో సబ్సిడీ రేటుకే
సాక్షి, న్యూఢిల్లీ: టమాటాలను అధిక ధరలకు విక్రయిస్తూ సామాన్యుల జేబుకు చిల్లుపెడుతున్న దళారుల ధరల దోపిడీ నుంచి సామాన్యులకు కాస్తంత ఉపశమనం కలి్పంచే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ముందుకొచి్చంది. ఢిల్లీ సహా జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)లో సబ్సిడీ ధరకే కేజీ రూ.65కు టమాటాలు విక్రయిస్తోంది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి ఖరే సోమవారం ఢిల్లీలో మొబైల్ వ్యాన్లను జెండా ఊపి ప్రారంభించారు. మరో నాలుగు రోజుల్లో ధరలు తగ్గుముఖం పడతాయని నిధి ఖరే చెప్పారు. నేషనల్ కోఆపరేటివ్ కన్జూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్సీసీఎఫ్) కు చెందిన వ్యాన్‌లో ఢిల్లీసహా శివారులోని 56 ప్రాంతాల్లో రూ.65కే టమాటాలు విక్రయిస్తున్నారు. టమాటా పండించే ప్రధాన రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఇటీవల తుపాన్లు, వరదల కారణంగా టమాటా దిగుబడి బాగా తగ్గింది. దీంతో దళారులు ఒక్కసారిగా టమాటా రేటు పెంచేశారు. ప్రస్తుతం ఢిల్లీసహా రాజధాని శివారు ప్రాంతాల్లో కిలో టమాటా ధర రూ.100 నుంచి రూ.120 పలుకుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలకు నేరుగా హోల్‌సేల్ మార్కెట్ల నుంచి కొనుగోలు చేసి టమాటా కిలో రూ.65కే అందించాలని కేంద్రం నిర్ణయించడం తెల్సిందే. -
పుంజుకున్న ‘వ్యాపార విశ్వాస సూచీ’
న్యూఢిల్లీ: సీఐఐ వ్యాపార విశ్వాస సూచీ జూలై–సెప్టెంబర్ కాలంలో రెండు త్రైమాసికాల గరిష్ట స్థాయి 68.2కు చేరింది. కేంద్ర ప్రభుత్వ విధానాల కొనసాగింపుతో పరిశ్రమల్లో ఉత్సాహం వ్యక్తమైంది. సాధారణ ఎన్నికల అనంతరం సీఐఐ నిర్వహించిన మొదటి సర్వే ఇది. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకున్నట్టు సీఐఐ తెలిపింది. అంతర్జాతీయంగా సవాళ్లు నెలకొన్నప్పటికీ భారత ఆర్థిక వృద్ధి బలంగా నిలదొక్కుకున్నట్టు పేర్కొంది. ప్రస్తుత పండుగల సీజన్ ఈ వృద్ధి అవకాశాలను మరింత బలోపేతం చేస్తుందని అభిప్రాయపడింది. సీఐఐ 128వ బిజినెస్ అవుట్‌లుక్ సర్వే 2024 సెపె్టంబర్లో జరిగింది. అన్ని రంగాలు, ప్రాంతాల నుంచి 200 సంస్థలు ఇందులో పాల్గొన్నాయి. సర్వేలో పాల్గొన్న కొన్ని కంపెనీలు సుదీర్ఘకాలం పాటు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేశాయి. అలాగే, అంతర్జాతీయంగా కమోడిటీల ధరలు పెరిగిపోవడం, వెలుపలి డిమాండ్ బలహీనంగా ఉండడాన్ని ప్రస్తావించాయి. మరోవైపు వినియోగం మెరుగుపడడం, వర్షాలు మెరుగ్గా పడడం, సంస్కరణల పట్ల సానుకూల ధోరణి వంటి సానుకూలతలనూ పేర్కొన్నాయి. ప్రైవేటు పెట్టుబడులు పుంజుకోవడం సానుకూలమన్నారు. 2024–25 మొదటి ఆరు నెలల్లో ప్రైవేటు పెట్టుబడులు, అంతకుముందు ఆరు నెలల కాలంతో పోలి్చతే పుంజుకున్నట్టు సర్వేలో 59 శాతం కంపెనీలు తెలిపాయి. రేట్ల కోతపై అంచనాలు ఆర్బీఐ వడ్డీ రేట్ల కోతను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో (అక్టోబర్–డిసెంబర్) మొదలు పెట్టొచ్చని 34% కంపెనీలు అభిప్రాయపడుతున్నాయి. వడ్డీ రేట్ల తగ్గింపు నాలుగో త్రైమాసికంలో (2025 జనవరి–మార్చి) ఆరంభం కావొచ్చని 31% కంపెనీలు అంచనా వేస్తున్నాయి. -
27 లక్షల మహిళా పారిశ్రామికవేత్తలకు లబ్ధి
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం రూపొందించిన సీజీటీఎంఎస్ఈ పథకం కింద మహిళల ఆధ్వర్యంలోని సూక్ష్మ, చిన్న తరహా సంస్థలకు 90 శాతం వరకు మెరుగైన రుణ హామీ కవరేజీ లభిస్తుందని కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ తెలిపారు. 27 లక్షల మహిళల ఎంఎస్ఎంఈలకు (సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు) దీని కింద ప్రయోజనం దక్కుతుందన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలు బ్యాంకుల నుంచి హామీలేని రుణ సాయాన్ని పొందే దిశగా ఇది కీలక నిర్ణయం అవుతుందన్నారు. క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో, స్మాల్ ఎంటర్ప్రైజెస్ (సీజీటీఎంఎస్ఈ) బోర్డ్ ఆమోదానికి ముందు మహిళల ఆధ్వర్యంలోని సంస్థలకు 85 శాతం వరకే రుణ హామీ రక్షణ ఉండేది. దీన్ని 90 శాతానికి పెంచడం వల్ల మరింత మందికి ప్రయోజనం దక్కుతుందని మంత్రి మాంఝీ పేర్కొన్నారు. నరేంద్ర మోదీ సర్కారు 100 రోజుల పాలనలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్ఎంఈ) మంత్రిత్వ శాఖ సాధించిన విజయాలను మంత్రి మీడియాకు వెల్లడించారు. 5.07 కోట్ల ఎంఎస్ఎంఈలు సంఘటిత వ్యవస్థలోకి చేరాయని, 21 కోట్ల ఉద్యోగాలు ఏర్పడినట్టు వివరించారు. ప్రధానమంత్రి ఉద్యోగ కల్పన కార్యక్రమం (పీఎంఈజీపీ) కింద గడిచిన 100 రోజుల్లో 26,426 సూక్ష్మ సంస్థలు ఏర్పాటయ్యాయని, వాటికి రూ.3,148 కోట్ల రుణాలు మంజూరైనట్టు మంత్రి వెల్లడించారు. వీటి రూపంలో 2.11 లక్షల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం పెరుగుతుందన్నారు. 14 టెక్నాలజీ కేంద్రాలు రూ.2,800 కోట్లతో, ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా దేశవ్యాప్తంగా 14 టెక్నాలజీ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి జితన్ రామ్ మాంఝీ తెలిపారు. నాగ్‌పూర్, పుణె, బొకారోలోనూ వీటిని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ‘‘వీటిని ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యంతో నెలకొల్పుతాం. స్థానిక ఎంఎస్ఎంఈలు వీటి ద్వారా తయారీలో అత్యాధునిక సాంకేతికతలు, నైపుణ్యాభివృద్ధి, వ్యాపార సలహా సేవలు పొందొచ్చు. టెక్నాలజీ లభ్యతతో లక్ష ఎంఎస్ఎంఈలు ప్రయోజనం పొందుతాయి. వచ్చే ఐదేళ్ల కాలంలో 3 లక్షల మంది యువతకు శిక్షణ ఇస్తాం’’అని మంత్రి వివరించారు. పీఎం విశ్వకర్మ పథకం మొదలై ఏడాది అయిన సందర్భంగా మహారాష్ట్రలోని వార్ధాలో ఈ నెల 20న ఓ మెగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. -
పెట్టుబడులకు షిప్‌బిల్డింగ్ ఆహ్వానం
గోవా: దేశీయంగా షిప్ బిల్డింగ్, ఓడల మరమ్మతు రంగాలకు ప్రోత్సాహాన్నివ్వాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు దక్షిణ కొరియా, జపాన్ నుంచి పెట్టుబడులతోపాటు.. టెక్నాలజీ బదిలీకావలసి ఉన్నట్లు పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ సెక్రటరీ టీకే రామచంద్రన్ పేర్కొన్నారు. షిప్ రిపేర్ క్లస్టర్లకు దన్నునివ్వడం ద్వారా షిప్పింగ్ సరఫరాను మెరుగుపరచవలసి ఉన్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం భారత్ షిప్ బిల్డింగ్ మార్కెట్లో 1 శాతానికంటే తక్కువవాటాను కలిగి ఉన్నట్లు వెల్లడించారు. ప్రపంచ షిప్‌బిల్డింగ్ మార్కెట్లో చైనా, దక్షిణ కొరియా, జపాన్ ఆధిపత్యం వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వెరసి దక్షిణ కొరియా, జపాన్‌వైపు పెట్టుబడులుసహా సాంకేతికతల కోసం చూస్తున్నట్లు వెల్లడించారు. తద్వారా దేశీయంగా నౌకా నిర్మాణం, నౌకల మరమ్మతుల క్లస్టర్లను అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్లు తెలియజేశారు. మ్యారీటైమ్ స్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్(ఎంఎస్డీసీ) 20వ సదస్సుకు హాజరైన సందర్భంగా రామచంద్రన్ విలేకరులతో పలు అంశాలపై స్పందించారు. పలు రాష్ట్రాలలో విస్తరించేలా మెగా షిప్ బిల్డింగ్ పార్క్ ఏర్పాటుకు ఎంఎస్డీసీ యోచిస్తోంది. కాగా.. టెక్నాలజీ, పెట్టుబడులతో రావలసిందిగా ఇప్పటికే దక్షిణ కొరియా, జపాన్‌లను ఆహా్వనించినట్లు రామచంద్రన్ వెల్లడించారు. వీటి ఏర్పాటుకు వీలుగా భూమిని సమకూరుస్తామని హామీ ఇచి్చనట్లు తెలియజేశారు. -
ఆధార్ ఉచిత అప్డేట్ గడువు పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ: ఆధార్ కార్డుల్లోని వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకొనే గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడగించింది. శనివారంతో గతంలో ఇచి్చన గడువు ముగియడంతో ఉడాయ్ (యూఐడీఏఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ‘ఎక్స్’లో ఈ వివరాలను వెల్లడించింది. పదేళ్ల కిందటి ఆధార్ కార్డులకు సంబంధించిన మార్పులు, చేర్పులకు సంబంధించిన అప్డేట్లను ఉచితంగా చేసుకొనేందుకు గడువును మరో మూడునెలల పాటు.. డిసెంబర్ 14 వరకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ పొడగించింది. ఆన్లైన్లో ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ ద్వారా మై ఆధార్ వెబ్సైట్లో లాగిన్ అయి మార్పులను ఉచితంగా చేసుకోవచ్చని ఉడాయ్ పేర్కొంది. ఇప్పటి వరకు వివరాలను అప్డేట్ చేసుకోలేకపోయిన వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఉడాయ్ సూచించింది. ఒకవేళ డిసెంబర్ 14లోగా ఉచితంగా అప్డేట్ చేసుకోలేని వారు... తర్వాత 50 రూపాయలు చెల్లించి ఆధార్ కేంద్రాల్లో వివరాలను అప్డేట్ చేసుకోవచ్చు. -
గోధుమ ధరల పెరుగుదలకు చెక్!
న్యూఢిల్లీ: గోధుమల ధరల పెరుగుదలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది. ట్రేడర్లు, హోల్‌సేల్ వర్తకులు, బడా రిటైల్ మాల్స్ నిర్వాహకులకు గోధుల నిల్వలపై పరిమితులను కఠినతరం చేసింది. జూన్ 24న విధించిన నిల్వ పరిమితులను సవరించింది. ట్రేడర్లు, టోకు వర్తకులు 2,000 టన్నుల వరకే నిల్వ చేసుకోగలరు. ఇప్పటి వరకు ఇది 3,000 టన్నులుగా ఉంది.3 బడా రిటైల్ చైన్లు ప్రతి ఔట్లెట్ (స్టోర్)లో 10 మెట్రిక్ టన్నుల వరకే గోధుమల నిల్వలకు పరిమితం కావాల్సి ఉంటుంది. డిపోలో స్టోర్ సంఖ్యకు 10 రెట్లకు మించి ఉండరాదు. గతంలో స్టోర్‌వారీ పరిమితుల్లేవు. అదే గోధుమ ప్రాసెసర్లు అయితే నెలవారీ స్థాపిత సామర్థ్యంలో ఇప్పటి వరకు 70 శాతం వరకు నిల్వలు కలిగి ఉండేందుకు అవకాశం ఉంటే, దీనిని 60 శాతానికి తగ్గించింది. విడిగా రిటైల్ స్టోర్లు అయితే 10 టన్నుల గోధుమలు నిల్వ చేసుకోవచ్చు. 2025 మార్చి 31 వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని కేంద్రం ప్రకటించింది. ఉల్లిగడ్డలు, బాస్మతీ ఎగుమతులపై ఆంక్షల తొలగింపు ఉల్లిగడ్డలు, బాస్మతీ బియ్యం ఎగుమతులకు సంబంధించి కనీస ఎగుమతి ధర (ఎంఈపీ)లను కేంద్ర ప్రభుత్వం తొలగించింది. కీలకమైన హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల ముందు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మహారాష్ట్ర రైతులు ఎక్కువగా ఉల్లిని ఎగుమతి చేస్తుంటారు. హర్యానా, పంజాబ్‌లో బాస్మతీ సాగు ఎక్కువగా జరుగుతుంటుంది. బాస్మరీ బియ్యం ఎగుమతికి టన్నుకు కనీసం 950 డాలర్ల ధర పరిమితిని తొలగించింది. అలాగే, టన్ను ఉల్లిగడ్డలపై 550 డాలర్లుగా ఉన్న కనీస ఎగుమతి ధరను కూడా తొలగించినట్టు డైరెక్టరేట్ నరల్ ఆఫ్ ఫారీన్ ట్రేడ్ ప్రకటించింది. ఈ నిర్ణయం ఎగుమతుల వృద్దికి, రైతుల ఆదాయం మెరుగుపడేందుకు దారితీస్తుందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. -
నిరసనలు కేంద్రం కుట్ర: మమత
కోల్‌కతా: వైద్యురాలి హత్యాచారంపై నిరసనల వెనుక కేంద్ర ప్రభుత్వం కుట్ర ఉందని పశి్చమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. వామపక్షాలూ ఈ కుట్రలో భాగమయ్యాయన్నారు. సచివాలయం నబన్నాలో సోమవారం ఒక అధికారిక సమీక్షలో మమత ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్.జి.కర్ ఆసుపత్రిలో ఆగస్టు 9న పీజీ ట్రైనీ డాక్టర్ రేప్, హత్య ఉదంతంలో నెలరోజులుగా బెంగాల్లో ప్రజలు నిరసన ప్రదర్శనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. బాధితురాలి తల్లిదండ్రులకు తానెప్పుడూ డబ్బు ఇవ్వజూపలేదని మమత అన్నారు. ఈమేరకు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. దుర్గాపూజ సమీపిస్తున్నందున నిరసనలు వీడి.. పండుగ ఏర్పాట్లు చేపట్టాలని ప్రజలను కోరారు. ‘వైద్యురాలి కుటుంబానికి నేనెప్పుడూ డబ్బు ఇవ్వజూపలేదు. అభాండాలు వేస్తున్నారు. కూతురి జ్ఞాపకార్థం ఏదైనా కార్యక్రమం చేపట్టదలిస్తే మా ప్రభుత్వం అండగా ఉంటుందని తల్లిదండ్రులకు చెప్పాను. ఎప్పుడేం మాట్లాడాలో నాకు తెలుసు. నిరసనలు ముమ్మాటికీ కేంద్ర ప్రభుత్వ కుట్రే. కొన్ని వామపక్ష పార్టీలకు ఇందులో భాగస్వామ్యముంది. పొరుగుదేశంలో అస్థిరత చూసి.. ఇక్కడా అలాంటి ఆందోళనలు రేకెత్తించాలని కొందరు చూస్తున్నారు. భారత్, బంగ్లాదేశ్‌లు రెండు వేర్వేరు దేశాలని వారు మర్చిపోయారు’ అని మమత ధ్వజమెత్తారు. ఆందోళన నేపథ్యంలో కోల్‌కతా పోలీసు కమిషనర్ వినీత్ గోయల్ రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారని, దుర్గాపూజ వేళ శాంతి భద్రతలపై పట్టున్న అధికారి అవసరం ఉందని దాన్ని తిరస్కరించినట్లు తెలిపారు. సాధ్యమైనంత త్వరగా విధుల్లో చేరాలని జూనియర్ డాక్టర్లకు విజ్ఞప్తి చేశారు. -
మెరుగైన పెన్షన్ కావాలంటే?
సర్కారు ఉద్యోగం.. ఎంతో మంది నిరుద్యోగుల ఆకాంక్ష. ఆకర్షణీయమైన వేతనం, ఇతర ప్రయోజనాలతోపాటు, రిటైర్మెంట్ తర్వాత మెరుగైన పింఛను వస్తుందన్న భరోసా ఎక్కువ మందిని ఆకర్షించే అంశాలు. కానీ, 2004 నుంచి అమల్లోకి వచి్చన నూతన ఫింఛను విధానంతో రిటైర్మెంట్ తర్వాత వచ్చే ప్రయోజనాలు మారిపోయాయి. దీంతో పాత పింఛను విధానాన్ని తిరిగి పునరుద్ధరించాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. దీనికి పరిష్కారంగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్)ను కేంద్ర సర్కారు తాజాగా తెరపైకి తీసుకొచ్చింది. పదవీ విరమణ చివరి ఏడాది వేతనంలో కనీసం 50 శాతాన్ని పింఛనుగా అందించే హామీ ఉంటుంది. మరి ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న వారి సంగతి ఏంటి? రిటైర్మెంట్ తర్వాత మెరుగైన పింఛను పొందాలంటే అసాధ్యమేమీ కాదు. ఇందుకు చేయాల్సిందల్లా.. ప్రణాళిక మేరకు ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లడమే. ఈపీఎఫ్‌తోపాటు, ఎన్‌పీఎస్‌లోనూ నిర్ణీత శాతం మేర పెట్టుబడి పెట్టడం ద్వారా విశ్రాంత జీవితాన్ని మెరుగ్గా గడిపేందుకు మార్గం ఉంది. ఇందుకు ఏం చేయాలో నిపుణుల విశ్లేషణ చూద్దాం. కేటాయింపులు కీలకం.. ప్రభుత్వరంగ ఉద్యోగుల మాదిరే ప్రైవేటు రంగ ఉద్యోగులూ తమ రిటైర్మెంట్ పెట్టబడులను కొంత మేర ఎన్పీఎస్కు కేటాయించుకోవడం ఇక్కడ కీలకం. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి వేతనం నుంచి 10 శాతం, వారి తరఫున ప్రభుత్వం నుంచి 14 శాతం చొప్పున ఎన్‌పీఎస్‌లోకి పెట్టుబడిగా వెళుతుంది. అయినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులకు కొన్ని పరిమితులు ఉన్నాయి. మొత్తం ఎన్పీఎస్ పెట్టుబడుల్లో ఈక్విటీలకు 15 శాతం మించి కేటాయించుకోలేరు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్‌పీఎస్‌లో రాబడుల వృద్ధి పరిమితంగానే ఉంటుంది. అంటే 10 శాతంలోపు అని అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ప్రైవేటు రంగంలోనూ ఇంచుమించుగా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ప్రైవేటు రంగ ఉద్యోగులకు ఈపీఎఫ్ అమలవుతుంది. ఉద్యోగి, యాజమాన్యం చెరో 12 శాతం చొప్పున మూల వేతనం, డీఏపై ఈపీఎఫ్ ఖాతాకు జమ చేస్తుంటాయి. దీనిపై రాబడి 8 శాతం స్థాయిలోనే ఉంది. దీనివల్ల దీర్ఘకాలంలో చెప్పుకోతగ్గ భవిష్యనిధి ఏర్పడుతుందేమో కానీ, రిటైర్మెంట్ అవసరాలను తీర్చే స్థాయిలో కాదు. కనుక ప్రైవేటు రంగ ఉద్యోగులు ఈపీఎఫ్ కాకుండా ఎన్‌పీఎస్‌లోనూ ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఈపీఎఫ్–ఎన్పీఎస్ కలయిక కేంద్ర ఉద్యోగులకు ప్రతిపాదించిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్)లో అతిపెద్ద ఆకర్షణ.. చివరి వేతనంలో కనీసం 50 శాతాన్ని పింఛనుగా పొందడం. కానీ దీర్ఘకాలం పాటు సేవలు అందించిన తర్వాత చివరి వేతనంలో 50% భారీ మొత్తం కాబోదు. ప్రైవేటు రంగంలో పనిచేసే వారు సైతం తమ చివరి వేతనంలో 50 శాతాన్ని ఉద్యోగ విరమణ తర్వాత పొందొచ్చు. ప్రణాళిక మేరకు క్రమశిక్షణతో వ్యవహరిస్తే ఇంతకంటే ఎక్కువే సొంతం చేసుకోవచ్చు. ఈపీఎఫ్, ఎన్‌పీఎస్‌లో సమకూరిన నిధితోపాటు, ఈపీఎఫ్‌లో భాగమైన ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్) కూడిన పెట్టుబడుల ప్రణాళిక ఒకటి. ఉదాహరణకు ఈపీఎఫ్ కింద ఉద్యోగి మూల వేతనం నుంచి 12%, అంతే చొప్పున యాజమాన్యం జమ చేస్తాయి. దీనికితోడు పాత పన్ను విధానంలో కొనసాగే వారు ఎన్పీఎస్ ఖాతా తెరిచి తమ వేతనంలో 10 % మేర యాజమాన్యం ద్వారా జమ చేసుకోవాలి. దీనికి సెక్షన్ 80సీసీడీ(2) కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. ఒకవేళ కొత్త పన్ను విధానంలోకి మళ్లిన వారు తమ వేతనంలో 14 శాతాన్ని ఎన్పీఎస్కు జమ చేయించుకోవడం ద్వారా ఆ మొత్తంపై పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఉద్యోగ జీవితంలో క్రమం తప్పకుండా ఈ పెట్టుబడులు కొనసాగించడం ద్వారా చివరి వేతనంలో 50 శాతాన్ని పొందొచ్చు. ప్రభుత్వ ఉద్యోగులు కాని ఇతరులు అందరూ.. ఎన్‌పీఎస్‌లో ఈక్విటీలకు గరిష్టంగా 75% కేటాయింపులు చేసుకోవచ్చు. దీని ద్వారా రిటైర్మెంట్ నాటికి భారీ నిధి సమకూరుతుంది. నెలవారీ ఆదాయం.. ప్రైవేటు ఉద్యోగంలో ఆరంభ మూల వేతనం రూ.14,000తో ప్రారంభమై.. ఏటా 10% చొప్పున పెరుగుతూ వెళితే.. పైన చెప్పుకున్న విధంగా ఈపీఎఫ్, ఎన్‌పీఎస్‌లకు 30 ఏళ్ల పాటు చందాలు జమ చేసుకుంటూ వెళ్లినట్టయితే, రిటైర్మెంట్ తర్వాత నెలవారీ రూ.2.9 లక్షలు పొందొచ్చు. చివరి ఏడాదిలో వేతనం రూ.2.44 లక్షల కంటే ఇది ఎక్కువ. రిటైర్మెంట్ నాటికి ఎన్‌పీఎస్‌లో సమకూరిన నిధిలో 40 శాతంతో యాన్యుటీ ప్లాన్ (పింఛను) తీసుకోవాలి. మిగిలిన 60% ఫండ్‌ను వెనక్కి తీసుకోవచ్చు. అలాగే, ఈపీఎఫ్‌లో సమకూరిన నిధిని కూడా వెనక్కి తీసుకోవచ్చు. ఈ మొత్తాన్ని ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసి సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ/సిప్‌కు విరుద్ధమైనది) ఎంపిక చేసుకోవాలి. తద్వారా ప్రతి నెలా కోరుకున్నంత వెనక్కి తీసుకోవచ్చు. అలాగే, పనిచేసిన కాలం ఆధారంగా ఈపీఎఫ్‌లో భాగమైన ఎన్పీఎస్ నుంచి నెలవారీ నిరీ్ణత మొత్తం పింఛనుగా అందుతుంది. ఎన్‌పీఎస్‌లో 60% నిధి, ఈపీఎఫ్‌లో భవిష్యనిధి వాటా కింద సమకూరిన మొత్తాన్ని.. రిస్క్, రాబడుల ఆకాంక్షలకు అనుగుణంగా డెట్ ఫండ్స్, ఈక్విటీ ఫండ్స్ లేదా హైబ్రిడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. కన్జర్వేటివ్ లేదా బ్యాలన్స్డ్ హైబ్రిడ్ ఫండ్స్ అయితే రిస్్క–రాబడుల సమతుల్యంతో ఉంటాయి. వ్యాల్యూ రీసెర్చ్ డేటా ప్రకారం గడిచిన పదేళ్లలో కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్ విభాగం సగటు వార్షిక రాబడి 8.41 శాతంగా ఉంది. బ్యాలన్స్డ్ హైబ్రిడ్ ఫండ్స్ విభాగంలో రాబడి 9.83% మేర ఉంది. ఈ ఫండ్స్‌లో వార్షిక రాబడి రేటు కంటే తక్కువ మొత్తాన్ని ఏటా ఉపసంహరించుకోవాలి. దీనివల్ల కాలక్రమంలో పెట్టుబడి కూడా కొంత మేర వృద్ధి చెందుతుంది. పెట్టుబడి విలువలో ప్రతి నెలా 0.5% చొప్పున ఎస్‌డబ్ల్యూపీ ద్వారా వెనక్కి తీసుకోవాలి. ఏటా ఈ మొత్తాన్ని 5% (ద్రవ్యో ల్బణం స్థాయిలో) పెంచుకుని ఉపసంహరించుకున్నా సరే.. రిటైర్మెంట్ నిధి ఏటా 10% చొప్పున వృద్ధి చెందితే 25 ఏళ్లలో రూ.2.05 కోట్ల నుంచి రూ.2.9 కోట్లకు చేరుతుంది. రిటైర్మెంట్ ఫండ్ విలువ మరింత పెరగాలంటే, నెలవారీ ఉపసంహరణ రేటు వీలైనంత తక్కువగా ఉండేలా చూడాలి. ఎంత మేర..?ఆరంభ మూల వేతనం రూ.14,000. ఏటా 10% పెరిగేట్టు. ఈపీఎఫ్‌లో నిబంధనల మేరకు ఇన్వెస్ట్ చేస్తూనే, ఎన్‌పీఎస్‌లోనూ పాత పన్ను విధానంలో 10% మొత్తాన్ని యాజమాన్యం ద్వారా డిపాజిట్ చేయించుకుంటే ఎంత వస్తుందో చూద్దాం. ఈపీఎఫ్ నిధిపై 8% రాబడి రేటు. ఎన్పీఎస్ జమలపై 12% రాబడి రేటు అంచనా. ఎన్పీఎస్ 40% ఫండ్‌తో యాన్యుటీ ప్లాన్ తీసుకుంటే, దీనిపై 6% రాబడి ప్రకారం ప్రతి నెలా వచ్చే ఆదాయం అంచనాలు ఇవి. ప్రత్యామ్నాయంప్రైవేటు రంగ ఉద్యోగులకు ఈపీఎఫ్ ఎలానూ ఉంటుంది. దీనికితోడు ఎన్పీఎస్ జోడించుకోవడం రాబడుల రీత్యా మంచి నిర్ణయం అవుతుంది. రిటైర్మెంట్ నాటికి ఎన్పీఎస్ నిధిలో 60 శాతాన్ని ఎలాంటి పన్ను లేకుండా ఉపసంహరించుకోవచ్చు. ఈపీఎఫ్ నిధిపైనా ఎలాంటి పన్ను లేదు. పన్ను కోణంలో ఈ రెండింటి కంటే మెరుగైనవి లేవు. ఎన్‌పీఎస్‌లో 75 శాతం ఈక్విటీలకు కేటాయించుకోవచ్చు. కానీ, ఎన్పీఎస్ ఫండ్ మేనేజర్లు టాప్–200 కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేయగలరు. ఒకవేళ ఇంతకంటే అదనపు రాబడులు ఆశించే వారు ఎన్పీఎస్ బదులు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో క్రమానుగతంగా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. రిటైర్మెంట్ సమయంలో మొత్తం వెనక్కి తీసుకోకుండా, క్రమానుగతంగా ఉపసంహరణ ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ) ఎంపిక చేసుకోవాలి. దీనివల్ల పన్ను భారం చాలా వరకు తగ్గుతుంది. అయితే పదవీ విరమణ తర్వాత నూరు శాతం ఈక్విటీల్లోనే పెట్టుబడులు ఉంచేయడం సరైనది కాదు. కనుక 50% మేర అయినా డెట్ ఫండ్స్‌కు మళ్లించుకోవాలి. కనుక ఈ మొత్తంపై పన్ను భారం పడుతుంది. అయినా సరే యాక్టివ్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా పన్ను భారానికి దీటైన రాబడులు సొంతం చేసుకోవడం సాధ్యమే. ఈ సంక్లిష్టతలు వద్దనుకునే వారికి సులభమైన మార్గం ఎన్పీఎస్. ఇందులో వ్యయాలు చాలా తక్కువ. పైగా పన్ను భారం లేకుండా ఈక్విటీ నుంచి డెట్‌కు, డెట్ నుంచి ఈక్విటీకి పెట్టుబడుల కేటాయింపులు మార్చుకోవచ్చు. అలాగే, భవిష్యత్తులో ఎన్‌పీఎస్‌లోనూ ఎస్‌డబ్ల్యూపీ ప్లాన్ వచ్చే అవకాశం లేకపోలేదు. ఇదే జరిగితే ఎన్పీఎస్ ద్వారా 50% పెట్టుబడులను ఈక్విటీల్లో, మిగిలినది డెట్‌లో కొనసాగిస్తూ, క్రమానుగతంగా కావాల్సినంత మేర వెనక్కి తీసుకోవచ్చు. గమనిక: కొత్త పన్ను విధానంలో ఉన్న వారు ఎన్పీఎస్కు 14 శాతం మేర వేతనంలో ప్రతి నెలా కేటాయించుకుంటే.. చివర్లో 40 శాతం యాన్యుటీ ప్లాన్‌పై ప్రతి నెలా టేబుల్లో పేర్కొన్న ఆదాయం కంటే 40 శాతం అధికంగా, ఎస్‌డబ్ల్యూపీ ద్వారా ప్రతి నెలా 10 శాతం మేర అదనంగా పొందొచ్చు. – సాక్షి, బిజినెస్‌డెస్క్ -
టాటా.. గుడ్‌బై.. విస్తారా ఇక కనుమరుగు..
న్యూఢిల్లీ: పదేళ్లుగా కార్యకలాపాలు సాగిస్తున్న విమానయాన సంస్థ విస్తారా ఇక కనుమరుగు కానుంది. నవంబర్ 12 నుంచి టాటా గ్రూప్‌లో భాగమైన మరో సంస్థ ఎయిరిండియాలో విలీనం కానుంది. విస్తారా సేవల నిలిపివేతకు నవంబర్ 11 ఆఖరు తేదీగా నిర్ణయించారు. నవంబర్ 12 నుంచి సంస్థ విమానాలు, సిబ్బంది ఎయిరిండియాకు బదిలీ అవుతారని కంపెనీ సీఈవో, ఎండీ క్యాంప్‌బెల్ విల్సన్ తెలిపారు. నవంబర్ 12 లేదా ఆ తర్వాత చేసే ప్రయాణాలకు సంబంధించి సెపె్టంబర్ 3 నుంచి బుకింగ్స్ నిలిచిపోతాయని విస్తారా ఒక ప్రకటనలో తెలిపింది. ఆ తర్వాత నుంచి తమ వెబ్సైట్లో బుకింగ్స్ అన్ని ఎయిరిండియా సైటుకు రీడైరెక్ట్ అవుతాయని పేర్కొంది. నవంబర్ 12 తర్వాత ప్రయాణాలకు బుక్ చేసుకున్నవారి ఫ్లయిట్ నంబర్లను సెపె్టంబర్లో దశలవారీగా ఆటోమేటిక్‌గా ఎయిరిండియాకు మారుస్తారు. కస్టమర్లకు ఆ వివరాలు తెలియజేస్తారు. మరింత విస్తృత నెట్వర్క్, విమానాలతో మెరుగైన ప్రయాణ అనుభూతిని అందించేందుకు ఈ విలీనం తోడ్పడగలదని విస్తారా సీఈవో వినోద్ కణ్ణన్ తెలిపారు. ఎయిరిండియాలో ఎస్‌ఐఏకి 25.1 శాతం వాటా.. విలీన డీల్‌లో భాగంగా ఎయిరిండియాలో రూ. 2,058.50 కోట్ల మేర సింగపూర్ ఎయిర్‌లైన్స్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) పెట్టే ప్రతిపాదనకు శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. దీనితో విలీనానికి మార్గం సుగమమైందని, ఈ ఏడాది ఆఖరు నాటికి ప్రక్రియ పూర్తి కావచ్చని సింగపూర్ ఎయిర్‌లైన్స్ తెలిపింది. విలీనానంతరం ఎయిరిండియాలో సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కి 25.1 శాతం వాటా లభిస్తుంది. ఫిట్మెంట్ ప్రక్రియ ప్రారంభం.. ఎయిరిండియా, విస్తారా విలీన ప్రక్రియపై ప్యాసింజర్లకు స్పష్టతనిచ్చేందుకు ఇప్పటికే ఎఫ్ఏక్యూలను (సందేహాలు, సమాధానాలు) సిద్ధం చేశారు. అలాగే ఫిట్మెంట్ ప్రక్రియను కూడా ప్రారంభించారు. టాటా గ్రూప్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ జాయింట్ వెంచర్‌గా విస్తారా 2015 జనవరిలో కార్యకలాపాలు ప్రారంభించింది. విస్తారాకు 70 విమానాలు ఉండగా, 50 పైచిలుకు గమ్యస్థానాలకు సరీ్వసులు నిర్వహిస్తోంది. ఎయిరిండియాలో కంపెనీ విలీనాన్ని 2022 నవంబర్‌లో ప్రకటించారు. 2023 సెపె్టంబర్లో ఈ డీల్‌కు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆమోదం తెలిపింది. నష్టాల్లోనే కొనసాగుతున్న ఎయిరిండియా, విస్తారాలో 23,000 మంది పైగా ఉద్యోగులు ఉన్నారు. ప్రస్తుతం ఎయిరిండియా గ్రూప్ గొడుగు కింద ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, ఏఐఎక్స్ కనెక్ట్ (గతంలో ఎయిర్ఏషియా ఇండియా) కార్యకలాపాలు సాగిస్తున్నాయి. -
పేటీఎం పేమెంట్స్‌లో పెట్టుబడులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: అనుబంధ సంస్థ పేటీఎం పేమెంట్స్ సరీ్వసెస్‌లో (పీపీఎస్ఎల్) పెట్టుబడులు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం లభించినట్లు పేటీఎం బ్రాండ్ మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ వెల్లడించింది. కేంద్ర ఆర్థిక శాఖలో భాగమైన ఆర్థిక సేవల విభాగం ఆగస్టు 27న అనుమతులు మంజూరు చేసినట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేసింది. దీంతో పేమెంట్ అగ్రిగేటర్ (పీఏ) లైసెన్సు కోసం మరోసారి దరఖాస్తు చేసుకోనున్నట్లు వివరించింది. ఈ–కామర్స్ మార్కెట్‌ప్లేస్ సేవలను, పేమెంట్ అగ్రిగేటర్ సరీ్వసులను ఒకే కంపెనీ అందించకూడదనే నిబంధన కారణంగా, 2022 నవంబర్‌లో పీఏ లైసెన్సు కోసం పేటీఎం సమరి్పంచిన దరఖాస్తును రిజర్వ్ బ్యాంక్ తిరస్కరించింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి నిబంధనలకు సంబంధించిన ప్రెస్ నోట్ 3కి అనుగుణంగా మరోసారి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ప్రెస్ నోట్ 3 ప్రకారం భారత సరిహద్దు దేశాల నుంచి వచ్చే పెట్టుబడులకు కేంద్రం నుంచి ముందస్తుగా అనుమతి తీసుకోవాలి. అప్పట్లో పేటీఎంలో చైనాకు చెందిన అలీబాబా గ్రూప్ అతి పెద్ద వాటాదారుగా ఉండేది. తాజాగా మారిన పరిస్థితుల ప్రకారం కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో, ప్రెస్ నోట్ 3 నిబంధనలకు అనుగుణంగా పేటీఎం మరోసారి పీఏ లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకోనుంది. -
నైట్ పెట్రోలింగ్ ఉండాలి
న్యూఢిల్లీ: కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై రేప్, హత్య ఘటనసహా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బందిపై లైంగికదాడుల ఘటనలపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. వైద్య సిబ్బంది భద్రతకు ఆస్పత్రుల్లో అమలుచేయాల్సిన మార్గదర్శకాలను అన్ని రాష్ట్రాలకు కేంద్రప్రభుత్వం బుధవారం జారీచేసింది. బుధవారం వర్చువల్ విధానంలో జరిగిన నేషనల్ టాస్క్ ఫోర్స్ భేటీలో కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్, ఆరోగ్య శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర, ప్రధాన కార్యదర్శలు, డీజీపీలు, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భేటీలో సూచించిన మార్గదర్శకాల్లో ముఖ్యమైనవి..→ పెద్ద ఆస్పత్రుల్లో జనం పెద్దగా తిరగని చోట్ల, చీకటి ప్రాంతాలు, మూలగా ఉండే చోట్ల సీసీటీవీలు బిగించాలి→ ఆస్పత్రుల్లో భద్రతపై జిల్లా కలెక్టర్లు, డీఎస్పీలు, జిల్లా ఆస్పత్రి యంత్రాంగం ఎప్పటికప్పుడు సమీక్ష జరిపి తగు సెక్యూరిటీ ఏర్పాట్లు చూసుకోవాలి→ సెక్యూరిటీ, ఇతర సిబ్బందిని భద్రతా తనిఖీలు చేయాలి→ రాత్రుళ్లు అన్ని ఆస్పత్రులు, వైద్య కళాశాలల్లో సెక్యూరిటీ పెట్రోలింగ్ తరచూ జరుపుతుండాలి→ పెద్ద జిల్లా ఆస్పత్రులు, వైద్య కళాశాలల్లో కంట్రోల్‌రూమ్‌ను ఏర్పాటుచేయాలి. సీసీటీవీలను ఎప్పటికప్పుడు చెక్చేస్తూనే డాటాను కూడా తరచూ బ్యాకప్ తీసుకోవాలి→ అత్యవసర కాల్స్‌కు స్పందించి కంట్రోల్ రూమ్, సెక్యూరిటీ, అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా ఉండేలా చూసుకోవాలి. కాంట్రాక్ట్ సెక్యూరిటీ సిబ్బంది శారీరకదారుఢ్యం మెరుగు కోసం వారికి శిక్షణ ఇప్పించాలి→ రోగులను స్ట్రెచర్, ట్రాలీ, చక్రాల కుర్చీల్లోకి మారుస్తూ ఎక్కువ మంది బంధువులు ఆస్పత్రుల్లో పోగుబడుతున్నారు. వీరి సంఖ్యను తగ్గించేందుకు ఆస్పత్రులే ఈ పనులకు తగు సిబ్బందిని నియమించాలి→ వైద్యారోగ్య సిబ్బంది రక్షణ కోసం ఉన్న భారతీయ న్యాయ సంహిత చట్టాలు, వారిపై దాడులకు పాల్పడితే బాధ్యులకు విధించే శిక్షలకు సంబంధించిన వివరాలను ఆసుపత్రి ప్రాంగణంలో స్పష్టంగా ప్రదర్శించాలి→ తమ రాష్ట్రాల్లో హెల్ప్‌లైన్ నంబర్లు 100, 112 ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని చాలా రాష్ట్రాలు స్పష్టంచేశాయి.→ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక వంటి కొన్ని రాష్ట్రాల్లో వైద్య సిబ్బంది రక్షణ కోసం మెరుగైన విధానాలు అమల్లో ఉన్నాయని ఆయా రాష్ట్రాలను కేంద్రం మెచ్చుకోవడం విశేషం. -
పవార్‌కు ‘జడ్ ప్లస్’ భద్రత
న్యూఢిల్లీ: రాజకీయ కురువృద్ధుడు, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎప్పీ) అధ్యక్షుడు శరద్ పవార్‌కు కేంద్ర ప్రభుత్వం జడ్ ప్లస్ భద్రతను కల్పించింది. వీఐపీ భద్రతలో జడ్ ప్లస్ అత్యధిక రక్షణ కవచం. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయిన 83 ఏళ్ల శరద్ పవార్‌కు జడ్ ప్లస్ రక్షణను కలి్పంచాలని కేంద్ర హోంశాఖ సెంట్రల్ రిజర్వు పోలీసు ఫోర్స్ (సీఆర్పీఎఫ్)ను కోరింది. జడ్ ప్లస్ కేటగిరీ కింద 55 మంది సాయుధ సీఆర్పీఎఫ్ సిబ్బంది రక్షణ కలి్పస్తారు. కేంద్ర ఏజెన్సీలు ముప్పును అంచనా వేసి.. శరద్ పవార్‌కు అత్యంత పటిష్టమైన భద్రతను కలి్పంచాలని సిఫారసు చేశాయి. -
గోల్డ్ బాండ్.. రివర్స్!
సావరీన్ గోల్డ్ బాండ్ల (ఎస్జీబీ) పథకం విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆశించిన లక్ష్యాలు నెరవేరలేదు. ముఖ్యంగా దిగుమతులను తగ్గించడంతోపాటు.. బంగారంపై పెట్టుబడులను డిజిటల్‌వైపు మళ్లించే లక్ష్యాలతో తీసుకొచ్చిందే సావరీన్ గోల్డ్ బాండ్ పథకం. పసిడిపై పెట్టుబడులను డిజిటల్ రూపంలోకి మళ్లించడంలో కేంద్రం ఒక విధంగా సక్సెస్ అయింది. కానీ, బంగారం దిగుమతులు ఏ మాత్రం తగ్గలేదు. ఎస్జీబీలకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రభుత్వ హామీతో కూడిన సాధనం కావడంతో పెట్టుబడులకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఎస్‌జీబీల రూపంలో ప్రభుత్వంపై చెల్లింపుల భారం పెరిగిపోయింది. మరోవైపు బంగారం దిగుమతులు ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 16 శాతం పెరిగిగి 376 టన్నులకు చేరాయి. క్రితం ఏడాది మొదటి ఆరు నెలల్లో 325 టన్నుల పసిడిని భారత్ దిగుమతి చేసుకున్నట్టు ప్రపంచ స్వర్ణ మండలి గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఊరిస్తున్న రాబడులు ఎస్‌జీబీలపై రాబడి ఇన్వెస్టర్లను ఊరిస్తోంది. మొదటి ఎస్జీబీ సిరీస్‌లో పెట్టుబడి పెట్టిన వారికి ఎనిమిదేళ్లలో రెట్టింపునకు పైగా రాబడి వచి్చనట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఈ ఏడాది సెపె్టంబర్లో ఒక ఎస్జీబీ మెచ్యూరిటీ (గడువు ముగింపు) తీరనుంది. దీనికి సంబంధించి ఎనిమిదేళ్ల క్రితం గ్రాము జారీ ధర రూ.3,007. నవంబర్‌లో మెచ్యూరిటీ తీరనున్న ఎస్‌జీబీకి సంబంధించి గ్రాము జారీ ధర రూ.3,150. ప్రస్తుతం గ్రాము ధర సుమారు రూ.7వేల స్థాయిలో ఉంది. అంటే ఎనిమిదేళ్లలోనే 130 శాతం రాబడి వచ్చింది. పైగా ఇటీవలే బంగారం దిగుమతిపై కస్టమ్స్ సుంకాన్ని కేంద్రం 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించడంతో ధరలు కొంత దిగొచ్చాయి. ఎస్‌జీబీలపై చెల్లింపుల భారం తగ్గించుకునేందుకే కేంద్రం సుంకం తగ్గించిందన్న అభిప్రాయాలు విశ్లేషకుల నుంచి వ్యక్తమయ్యాయి. పైగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంత వరకు ఒక్క ఎస్జీబీ ఇష్యూని కూడా కేంద్రం చేపట్టలేదు. సెపె్టంబర్లో తీసుకురావచ్చన్న అంచనాలున్నాయి. ఇటీవల ధరలు తగ్గడంతో ప్రభుత్వం తీసుకొచ్చే కొత్త ఇష్యూకి ఇన్వెస్టర్ల నుంచి మరింత స్పందన రావచ్చని చాయిస్ బ్రోకింగ్ కమోడిటీ అనలిస్ట్ ఆమిర్ మక్దా అభిప్రాయపడ్డారు. దీర్ఘకాల దృష్టితో ఇన్వెస్ట్ చేసుకోవాలని భావించే వారు, స్టాక్ ఎక్సే్ఛంజ్‌ల నుంచి సైతం కొనుగోలు చేసుకోవచ్చని సూచించారు. -
రక్షణ కార్యదర్శిగా రాజేష్ సింగ్
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఉన్నతస్థాయిలో పలువురు సీనియర్ బ్యూరోకాట్లను బదిలీ చేసి కొత్త స్థానాల్లో నియమించింది. రాజేష్ సింగ్ రక్షణశాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. ప్రస్తుతం పరిశ్రమలు, వాణిజ్య అభివృద్ధి శాఖ కార్యదర్శిగా ఉన్న రాజేష్ తొలుత రక్షణ మంత్రిత్వ శాఖలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా చేరతారు. ప్రస్తుత రక్షణశాఖ కార్యదర్శి అరమానే గిరిధర్ అక్టోబరు 31న పదవీ విరమణ చేయనున్నారు. అప్పుడు గిరిధర్ స్థానంలో రాజేష్‡ బాధ్యతలు స్వీకరిస్తారు. పున్యా సలీలా శ్రీవాస్తవ ఆరోగ్యశాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. పస్తుతం మైనారిటీ వ్యవహారాల కార్యదర్శిగా ఉన్న కటికిథల శ్రీనివాస్.. హౌసింగ్, పట్టణాభివృద్ధి వ్యవహారాల శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. సీనియర్ బ్యూరోకాట్ దీప్తి ఉమాశంకర్‌ను రాష్ట్రపతి కార్యదర్శిగా నియమించారు. నాగరాజు మద్దిరాల ఆర్థిక సేవల కార్యదర్శిగా నియమితులయ్యారు. ప్రస్తుతం నాగరాజు బోగ్గుశాఖలో అదనపు కార్యదర్శిగా ఉన్నారు. -
కల్నల్ మన్‌ప్రీత్‌కు కీర్తిచక్ర
న్యూఢిల్లీ: కశ్మీర్ లోయలో ఉగ్రవాదులతో పోరులో వీరమరణం పొందిన కల్నల్ మన్‌ప్రీత్‌సింగ్, జమ్మూకశ్మీర్ డీఎస్పీ హుమయూన్ ముజ్జామిల్ భట్‌కు కేంద్ర ప్రభుత్వం కీర్తిచక్ర అవార్డ్‌ను ప్రకటించింది. రైఫిల్మన్ రవికుమార్ (మరణానంతరం), మేజర్ మల్ల రామగోపాల్ నాయుడు, (మరణానంతరం)లనూ కీర్తిచక్రతో ప్రభుత్వం గౌరవించింది. శాంతిసమయంలో ప్రకటించే రెండో అత్యున్నత గ్యాలెంట్రీ అవార్డ్‌కు ఈసారి నలుగురికి ఎంపికచేశారు. అనంత్ నాగ్ అడవుల్లో ఆర్మీ బృందానికి నాయకత్వం వహిస్తూ ప్రాణాలను లెక్కచేయకుండా ఉగ్రవాదులను నేరుగా ఎదుర్కొని ఒక ఉగ్రవాదిని కల్నల్ మన్‌ప్రీత్ హతమార్చారు. తర్వాత నక్కిన ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఆయన ప్రాణాలు కోల్పోయారని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. త్రివిధ దళాల సర్వసైన్యాధ్యక్ష హోదాలో రాష్ట్రపతి ముర్ము బుధవారం మొత్తం 103 గ్యాలంట్రీ అవార్డులను ప్రకటించారు. కీర్తిచక్రతోపాటు 18 మందికి శౌర్య చక్ర, ఒకరికి బార్ టు సేనా మెడల్, 63 మందికి సేనా మెడల్, 11 మందికి నావో సేనా మెడల్, ఆరుగురికి వాయుసేనా మెడల్ ప్రకటించారు. ఒక ప్రెసిడెంట్ తట్‌రక్షక్ మెడల్, మూడు తట్‌రక్షక్ మెడళ్లనూ తీర గస్తీ దళాలకు ప్రకటించారు. -
వక్ఫ్ బోర్డులోకి మహిళలు, ముస్లిమేతరులు !
న్యూఢిల్లీ: ముస్లిం మతపరమైన, ధార్మిక ప్రయోజనాల కోసం దానంగా వచ్చిన ఆస్తులను పర్యవేక్షించే వక్ఫ్ బోర్డుల్లో మరింత పారదర్శకత సాధించే లక్ష్యంతో సంబంధిత చట్టంలో కీలక మార్పులకు కేంద్రం నడుంబిగించింది. ఇందులోభాగంగా వక్ఫ్ బోర్డుల పాలనా వ్యవహారాల్లో మహిళలు, ముస్లి మేతరులకు చోటు కల్పించాలని భావిస్తోంది. ఈ మేరకు వక్ఫ్ చట్టంలో సవరణలు తేవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా వక్ఫ్ చట్టం,1995 పేరును యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫీషియెన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్,1995గా మార్చుతూ వక్ఫ్ (సవరణ)బిల్లును గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. సంబంధిత బిల్లు వివరాలు మంగళవారం లోక్‌సభ సభ్యులకు అందాయి. ఆ బిల్లులోని అభ్యంతరాలు, అందుకు కారణాల జాబితా ప్రకారం ప్రస్తుత వక్ఫ్ చట్టంలోని సెక్షన్ 40ని తొలగించనున్నారు. ఏదైనా ఆస్తి వక్ఫ్‌కు చెందినదిగా నిర్ణయించే అధికారం ప్రస్తుతం వక్ఫ్ బోర్డుకే ఉంది. ఇంతటి అపరిమిత అధికా రాలను తగ్గించాలని బిల్లులో ప్రతిపాదించారు. కేంద్ర వక్ఫ్ మండలి, రాష్ట్రాల వక్ఫ్ బోర్డుల్లో భిన్న వర్గాలకు, ముస్లిం పురుషులతోపాటు మహిళలు, ముస్లిమేత రులకూ ప్రాతినిధ్యం కల్పించనున్నారు. ముస్లింలలో బోరా, అగాఖనీల కోసం ప్రత్యేకంగా బోర్డ్ ఆఫ్ ఔఖాఫ్‌ను ఏర్పాటు చేయనున్నారు. కనీసం ఐదేళ్లుగా ఇస్లామ్ మతాన్ని ఆచరిస్తూ సొంత ఆస్తిని దానంగా ఇస్తేనే దానిని ‘వక్ఫ్’గా పేర్కొనాలని ‘వక్ఫ్’ పదానికి బిల్లు కొత్త నిర్వచనం ఇచ్చింది. -
President Droupadi Murmu: మీరే సంధానకర్తలు
న్యూఢిల్లీ: కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గవర్నర్లు అనుసంధానకర్తలుగా వ్యవహరించాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సూచించారు. శనివారం ముగిసిన గవర్నర్ల రెండు రోజుల సదస్సులో ఆమె ప్రసంగించారు. శాఖల మధ్య మరింత సమన్వయానికి చర్యలపై సదస్సులో చర్చించినట్టు రాష్ట్రపతి భవన్ పేర్కొంది. మెరుగైన పనితీరుకు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సమాచారాన్ని పొందేందుకు, నిరంతర సంప్రదింపులకు సాగించడంలో గవర్నర్లు సంశయించరాదని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ సూచించారు. రాజ్భవన్లలో ఆదర్శ పాలనా నమూనాను రూపొందించడానికి గవర్నర్లు కృషి చేయాలని ప్రధాని మోదీ సూచించారు. గవర్నర్లు సాంకేతికతను అందిపుచ్చుకోవాలని, డిజిటైజేషన్‌ను ప్రోత్సహించాలని కోరారు. -
INDIA bloc: విపక్షాల గొంతు నొక్కుతోంది
న్యూఢిల్లీ: బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం విపక్షాల గొంతు నొక్కేస్తోందని ‘ఇండియా’ కూటమి నేతలు హస్తిన వేదికగా ధ్వజమెత్తారు. ఆప్ కనీ్వనర్ కేజ్రీవాల్‌ను అన్యాయంగా జైళ్లో పడేసి ఆరోగ్యపరిస్థితిని దారుణంగా దిగజార్చారని మండిపడ్డారు. కేజ్రీవాల్‌ను విడుదలచేయాలంటూ కూటమి నేతలు మంగళవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద భారీ ధర్నా చేపట్టారు. భారత్ మాతాకీ జై, నియంతృత్వం నశించాలి నినాదాలతో ధర్నాస్థలి హోరెత్తింది. ఆప్ పిలుపుమేరకు చేపట్టిన ఈ ధర్నాకు ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్‌పవార్, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ నేత దీపాంకర్ భట్టాచార్య, లోక్‌సభలో కాంగ్రెస్ డెప్యూటీ లీడర్ గౌరవగొగోయ్, శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్, ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా, కాంగ్రెస్, ఆప్ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, భారీ సంఖ్యలో ఆప్ కార్యకర్తలు హాజరయ్యారు. -
విద్యార్థుల జలసమాధిపై ఉన్నతస్థాయి కమిటీ
న్యూఢిల్లీ: ఢిల్లీలో కోచింగ్ సెంటర్లో విద్యార్థుల జలసమాధి ఘటనపై కేంద్ర ప్రభుత్వం అత్యున్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. అదనపు కార్యదర్శి ఆధ్వర్యంలో దర్యాప్తు కమిటీని ఏర్పాటుచేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సోమవారం ప్రకటించింది. ఘటనకు కారణాలను తెల్సుకోవడంతోపాటు బాధ్యులెవరో తేల్చనుంది. ఘటనలు పునరావృతంకాకుండా తీసుకోవాల్సిన చర్యలతోపాటు అవసరమైతే విధానపర నిర్ణయాల్లో చేపట్టాల్సిన మార్పులను కమిటీ సిఫార్సుచేయనుంది. గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీలో ఢిల్లీ ప్రభుత్వ(హోంశాఖ) ముఖ్య కార్యదర్శి, ఢిల్లీ పోలీస్, ఫైర్ స్పెషల్ కమిషనర్ సభ్యులుగా ఉంటారు. హోం శాఖ సంయుక్త కార్యదర్శి ఈ కమిటీకి కనీ్వనర్‌గా ఉంటారు. 30 రోజుల్లోపు ఈ కమిటీ తన నివేదికను సమర్పించనుందని హోం శాఖ అధికార ప్రతినిధి సోమవారం చెప్పారు మరో ఐదుగురి అరెస్ట్ ఈ ఘటనలో బేస్మెంట్ యజమానులపాటు మొత్తం ఐదుగురిని సోమవారం పోలీసులు అ రెస్ట్చేశారు. డ్రైనీజీలపై అక్రమ కట్టడాలను అధికారులు బుల్డోజర్లతో కూల్చేయడం మొదలెట్టారు.20 బేస్మెంట్లకు సీలుకోచింగ్ కేంద్రాలకు నిలయమైన పాత రాజీందర్ నగర్ ప్రాంతంలో సోమవారం అధికారులు అక్రమ కట్టడాలపై చర్యలకు ఉపక్రమించారు. అక్రమంగా నడుస్తున్న పలు కోచింగ్ సెంటర్లకు సంబంధించిన 20 బేస్మెంట్లకు సీల్‌వేశారు. అధిక కోచింగ్ సెంటర్లు ఉండే మరో ప్రాంతం ముఖర్జీ నగర్లోనూ ఆకస్మిక పర్యటనలు చేయించండి. అభ్యర్థులను శాంతింపజేయడానికి లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సోమవారం అక్కడి చేరుకుని వారితో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు తలో రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. -
కేంద్రానికి బ్యాంకుల భారీ డివిడెండ్ @ రూ. 6,481 కోట్లు
న్యూఢిల్లీ: నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకులు కేంద్ర ప్రభుత్వానికి భారీ డివిడెండ్‌ను చెల్లించాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు చెక్ రూపేణా మొత్తం రూ. 6,481 కోట్లు అందించాయి. గత ఆర్థిక సంవత్సరానికి (2023–24)గాను ప్రభుత్వానికి ఉమ్మడిగా డివిడెండ్‌ను చెల్లించాయి. దీనిలో బ్యాంక్ ఆఫ్ బరోడా రూ. 2,514 కోట్లు, కెనరా బ్యాంక్ రూ. 1,838 కోట్లు, ఇండియన్ బ్యాంక్ రూ. 1,193.5 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 935.5 కోట్లు చొప్పున డివిడెండ్‌ను అందించాయి. అంతేకాకుండా వీటికి జతగా ఎగ్జిమ్ బ్యాంక్ సైతం రూ. 252 కోట్ల డివిడెండ్ చెక్‌ను ప్రభుత్వానికి అందజేసింది. -
రుతుస్రావ సెలవులపై మోడల్ పాలసీ
న్యూఢిల్లీ: నెలసరివేళ ఇబ్బందిపడే ఉద్యోగిను లకు రుతుస్రావ సెలవులపై మోడల్ పాలసీని రూపొందించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. ఈ విషయంలో సంబంధిత వర్గాలు, రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి అందరికీ ఆమోదయోగ్యమైన విధానానికి రూపకల్పన చేయాలని సోమవారం కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది. అయితే విధాన నిర్ణేతల పరిధిలోని ఈ అంశాల్లో కోర్టులు జోక్యంచేసుకోబోవని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా విద్యార్థినులు, ఉద్యోగినులకు ప్రతినెలా నెలసరి సెలవులు ఇవ్వాలంటూ లాయర్ శైలేంద్రమణి త్రిపాఠి వేసిన పిటిషన్‌ను కొట్టేస్తూ కోర్టు పలు వ్యాఖ్యలు చేసింది. ‘‘రుతుస్రావ సెలవుపై కోర్టు నిర్ణయాలు తీసుకుంటే ఉద్యోగినుల ఉపాధిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశముంది. అసౌకర్యంవేళ సెలవు దొరుకుతుందని భావిస్తే ఎక్కువ మంది ఉద్యోగాలు చేసేందుకు మొగ్గుచూపుతారు. అయితే ఉద్యోగినులకు ఇలాంటి సెలవు ఇవ్వడం ఇష్టంలేని సంస్థలు, యాజమాన్యాలు మహిళలకు ఉద్యోగం ఇచ్చేందుకు విముఖత చూపే ప్రమాదం కూడా ఉంది. ఉన్న ఉద్యోగినులను కూడా తగ్గించుకునే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి విపరిణామాలకు మేం అవకాశం ఇవ్వదల్చుకోలేదు. వాస్తవానికి ఇది ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం. ఇందులో కోర్టు జోక్యం ఉండకూడదు’’ అని కోర్టు వ్యాఖ్యానించింది. చైనా, బ్రిటన్, జపాన్, ఇండోనేసియా, స్పెయిన్, జాంబియా, దక్షిణకొరియాలో ఏదో ఒక కేటగిరీ కింద ఇలాంటి సెలవులు ఇస్తున్నాయంటూ లాయర్ చేసిన వాదనలను కోర్టు తోసిపుచ్చింది. ‘‘ఈ సెలవులు ఇవ్వాలని గత ఏడాది మే నెలలోనే పిటిషనర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్రం నుంచి ఇంతవరకు స్పందన లేదు. విధానపర నిర్ణయమైన ఇలాంటి అంశంలో కోర్టులు జోక్యం చేసుకోలేవు’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. -
‘ఇన్ఫ్రా’లో కోటి కొలువులు!
మౌలిక రంగం భారీ ఉపాధి అవకాశాలకు వేదిక కానుంది. మౌలిక వసతులను పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేందుకు కేంద్ర సర్కారు ప్రాధాన్యం ఇస్తుండడంతో ఈ రంగంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే కోటి ఉద్యోగాలు కొత్తగా ఏర్పడతాయని ఉద్యోగ నియామక సేవలు అందించే ‘టీమ్‌లీజ్ సర్వీసెస్’ అంచనా వేసింది. కేంద్రంలో మూడోసారి కొలువు దీరిన మోదీ సర్కారు రహదారులు, రైళ్లు, విమానాశ్రయాలు తదితర మౌలిక వసతుల అభివృద్ధికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తుందన్న అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ రంగంలో అసలు నైపుణ్యాలు లేని వారితోపాటు, స్వల్ప నైపుణ్యాలు, పూర్తి నైపుణ్యాలు కలిగిన వారికి పెద్ద ఎత్తున ఉపాధి లభించనున్నట్టు టీమ్‌లీజ్ సరీ్వసెస్ అంచనా. ఈ రంగంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 2024–25 ఆర్థిక సంవత్సరంలో 98 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కొత్తగా వస్తాయని తన తాజా నివేదికలో తెలిపింది. ‘కొత్త ప్రభుత్వం ఈ రంగానికి ప్రాధాన్యతను కొనసాగిస్తుందని భావిస్తున్నాం. దేశ అభివృద్ధి, ఆర్థిక వృద్ధికి ఇది తప్పనిసరి. వ్యూహాత్మక పెట్టుబడులు ఉపాధి అవకాశాలతోపాటు, అన్ని ప్రాంతాలు సమానాభివృద్ధికి వీలు కలి్పస్తాయి’అని టీమ్‌లీజ్ సర్వీసెస్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ పి. సుబ్రమణియమ్ తెలిపారు. రవాణా రంగంపైనా ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రణాళికలతో ఉన్నట్టు చెప్పారు. విమానాశ్రయాల సంఖ్యను 220కి పెంచడం, 2025 చివరికి జాతీయ రహదారుల నిడివిని 2 లక్షల కిలోమీటర్లకు చేర్చే దిశగా పనిచేస్తున్నట్టు గుర్తు చేశారు. అలాగే, 2030 నాటికి 23 జల రవాణా మార్గాల అభివృద్ధితోపాటు, 35 మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్‌ల అభివృద్ధిని సైతం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. భారీగా వ్యయాలు.. ‘మౌలిక రంగంలోని పలు ఉప విభాగాల మధ్య ప్రాధాన్యతల్లో మార్పు ఉండొచ్చు. మౌలిక రంగానికి సంబంధించిన ప్రభుత్వ మూలధన వ్యయాలు ఆరోగ్యకరమైన వృద్ధితో కొనసాగుతాయి. ఈ రంగంలో రైల్వే, రహదారులు, నీటి ప్రాజెక్టులకు ప్రభుత్వ కేటాయింపులు పెరుగుతాయి. ఇది ఉపాధి అవకాశాల కల్పనకు మద్దతునిస్తుంది’ అని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా జూన్‌లో విడుదల చేసిన నివేదిక సైతం ఈ రంగంలో వృద్ధి అవకాశాలను తెలియజేస్తోంది. మౌలిక రంగం, సామాజికాభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించడం.. పట్టణీకరణ పెరగడం, రహదారుల అనుసంధానత ఇవన్నీ ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల అభివృద్ధికి దోహదం చేస్తాయని జీఐ గ్రూప్ హోల్డింగ్ కంపెనీస్ కంట్రీ మేనేజర్ సోనాల్ అరోరా తెలిపారు. పెద్ద, భారీ కాంట్రాక్టులు వస్తుండడంతో తాము నియామకాలను పెంచినట్టు ఎల్అండ్టీ గ్రూప్ హెచ్ఆర్ చీఫ్ ఆఫీసర్ సి.జయకుమార్ తెలిపారు.కేంద్ర ప్రభుత్వం లక్ష్యాలు.. విమానాశ్రయాల విస్తరణ.. 2202025 నాటికి జాతీయ రహదారుల నిర్మాణం 2,00,000 కిలోమీటర్లు2030 నాటికి జలరవాణా మార్గాల ఏర్పాటు 23 మల్టీ మోడల్ లాజిస్టిక్స్ 35 పార్క్‌ల నిర్మాణం -
కేంద్ర సర్కారు రుణభారం రూ.172 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ స్థూల రుణాలు గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసిక కాలంలో (2024 జనవరి–డిసెంబర్) 3.4 శాతం మేర పెరిగి రూ.171.78 లక్షల కోట్లకు చేరాయి. అంతకుముందు త్రైమాసికం చివరికి (2023 అక్టోబర్–డిసెంబర్) ఇవి రూ.166.14 లక్షల కోట్లుగా ఉన్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ స్థూల రుణాల్లో పబ్లిక్ డెట్ (బాండ్లు, సెక్యూరిటీల రూపంలో) వాటా 90.2 శాతంగా ఉంది. ‘‘మధ్యంతర బడ్జెట్లో అంచనాలకంటే తక్కువ రుణ సమీకరణ ప్రతిపాదనలు, జీడీపీలో ద్రవ్యలోటును 5.1 శాతానికి పరిమితం చేయడం, 2025–26 నాటికి 4.5 శాతానికి తగ్గించే చర్యలను ప్రకటించడంతో దేశీ బాండ్ ఈల్డ్ మార్చి త్రైమాసికంలో నెమ్మదించాయి. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల పెట్టుబడులు, స్థిరమైన ద్రవ్యోల్బణం కూడా ఇందుకు సహకరించాయి’’అని ఆర్థిక శాఖ వివరించింది. మరోవైపు ఇదే కాలంలో యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ అస్థిరంగా ఉన్నట్టు తెలిపింది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్స్ 4.33 శాతం గరిష్ట స్థాయిని తాకినట్టు గుర్తు చేసింది. ద్రవ్యలోటు 3 శాతమే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మే చివరి నాటికి ద్రవ్యలోటు మొత్తం ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అంచనాలో 3 శాతంగా ఉన్నట్టు కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల (ఏప్రిల్, మే) కాలంలో లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా ప్రవర్తనా నియమావళి అమల్లో ఉండడం తెలిసిందే. సాధారణంగా ప్రవర్తనా నియామావళి అమల్లో ఉన్న కాలంలో కొత్త ప్రాజెక్టులపై వ్యయాలకు కేంద్రం దూరంగా ఉంటుంది. ఇదే ద్రవ్యలోటు తక్కువగా ఉండడానికి ప్రధాన కారణం. క్రితం ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల కాలంలో ద్రవ్యలోటు మొత్తం ఏడాదికి బడ్జెట్ అంచనాల్లో 11.8 శాతంగా ఉండడం గమనార్హం. ప్రభుత్వ వ్యయాలు, ఆదాయం మధ్య అంతరాన్నే ద్రవ్యలోటుగా చెబుతారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తానికి జీడీపీలో ద్రవ్యలోటు 5.1 శాతంగా (రూ.16,85,494 కోట్లు) ఉండొచ్చని కేంద్ర ప్రభుత్వం అంచనా. మే చివరికి ద్రవ్యలోటు రూ.50,615 కోట్లుగా ఉన్నట్టు సీజీఏ తెలిపింది. ఇక మొదటి రెండు నెలల్లో నికర పన్ను ఆదాయం రూ.3.19 లక్షల కోట్లుగా ఉన్నట్టు వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో పన్నుల ఆదాయం లక్ష్యంలో ఇది 12.3 శాతానికి సమానమని పేర్కొంది. మొత్తం వ్యయాలు ఏప్రిల్, మే చివరికి రూ.6.23 లక్షల కోట్లుగా ఉండగా, బడ్జెట్ అంచనాల్లో ఇది 13.1 శాతానికి సమానమని సీజీఏ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం మొత్తానికి ద్రవ్యలోటు జీడీపీలో 5.6 శాతంగా ఉండడం గమనార్హం. -
ఐబీ చీఫ్ డేకా పదవీకాలం ఏడాది పొడిగింపు
న్యూఢిల్లీ: ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) చీఫ్ తపన్ కుమార్ డేకా పదవీ కాలాన్ని మరో ఏడాదిపాటు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన 2025 జూన్ వరకు బాధ్యతల్లో కొనసాగుతారని సోమవారం కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ తెలిపింది. ఈ నెల 30వ తేదీన ముగియనున్న డేకా పదవీ కాలాన్ని ఏడాది పాటు పొడిగించేందుకు కేబినెట్ నియామ కాల కమిటీ ఆమోదించిందని వెల్లడించింది. 1988 బ్యాచ్ హిమాచల్ ప్రదేశ్ కేడర్ ఐపీఎస్ అయిన డేకా 1998లో ఐబీలో చేరారు. 2022 జూలై ఒకటో తేదీన ఆయన ఐబీ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. అదేవిధంగా, జాతీయ మానవహక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) సెక్రటరీ జనరల్ భరత్ లాల్ పదవీ కాలాన్ని ఏడాదిపాటు పొడిగిస్తూ సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులిచి్చంది. -
26 నుంచి కొత్త టెలికం చట్టం
న్యూఢిల్లీ: టెలికమ్యూనికేషన్స్ చట్టం, 2023 కింద కొన్ని నిబంధనలు ఈ నెల 26 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం, 1885.. వైర్లెస్ టెలిగ్రాఫ్ చట్టం, 1993.. టెలిగ్రాఫ్ వైర్స్ చట్టం, 1950 స్థానంలో కొత్త చట్టం పాక్షికంగా అమలు కానుంది. ‘‘ద టెలికమ్యూనికేషన్స్ యాక్ట్, 2023 అమలు తేదీని జూన్ 26గా నిర్ణయించడమైనది. నాటి నుంచి చట్టంలోని 1, 2, 10 నుంచి 30 వరకు, 42 నుంచి 44 వరకు, 46, 47, 50 నుంచి 58 వరకు, 61, 62 సెక్షన్లు అమల్లోకి వస్తాయి’’అని ప్రభుత్వ నోటిఫికేషన్ స్పష్టం చేసింది. కొత్త చట్టంలోని నిబంధనల కింద కేంద్ర సర్కారు జాతి భద్రత ప్రయోజనాల పరిరక్షణ, యుద్ధ సమయాల్లో టెలికమ్యూనికేషన్ల నెట్‌వర్క్‌లు లేదా సేవలను తన ఆ«దీనంలోకి తీసుకోవడంతోపాటు నిర్వహించగలదు. స్పామ్, హానికారక కాల్స్, ఎస్ఎంఎస్ల నుంచి (సమాచారం) వినియోగదారులకు రక్షణ కలి్పంచడం తప్పనిసరి. -
NEET-UG 2024: ‘నీట్’పై కేంద్రం, ఎన్టీఏకు సుప్రీం నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: నీట్–యూజీలో చోటుచేసుకున్న అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు స్పందించింది. కేంద్ర ప్రభుత్వానికి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)కి నోటీసులు జారీ చేసింది. హతేన్‌సింగ్ కాశ్యప్‌తోపాటు ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ శుక్రవారం విచారణ చేపట్టింది. రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ కేంద్రానికి, ఎన్టీఏకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 8వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. రాజస్తాన్‌లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు జరిగాయని ప్రస్తావించారు. దీనిపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. అనవసరమైన భావోద్వేగపూరిత వాదనలు చేయొద్దని హితవు పలికింది. -
వికసిత భారత్ దిశగా సంస్కరణలు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో మూడోసారి ఏర్పడ్డ కేంద్ర ప్రభుత్వం వికసిత భారత్ లక్ష్య సాధన దిశగా తదుపరి సంస్కరణలను అమలు చేయగలదని కార్పొరేట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధానిగా మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో పలువురు కార్పొరేట్ దిగ్గజాలు ఎక్స్ వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. మరింత పురోగతి వరుసగా మూడోసారి భారత ప్రధానిగా ఎన్నికైన నరేంద్ర మోదీజీకి శుభాకాంక్షలు. మీ దార్శనిక సారథ్యంలో భారత్ అనేక మైలురాళ్లను అధిగమించింది. ఇకపైనా దేశం వృద్ధి బాటలో ముందుకు దూసుకెడుతుందని విశ్వసిస్తున్నాం.– అనిల్ అగర్వాల్, చైర్మన్, వేదాంత గ్రూప్దేశాభివృద్ధి కొనసాగుతుంది నెహ్రూజీ తర్వాత వరుసగా మూడోసారి ప్రధాని పదవిని చేపట్టిన మోదీజీకి శుభాకాంక్షలు. కొత్త కేబినెట్ ఏర్పాటుతో దేశ అభివృద్ధి, పురోగతి కొనసాగగలదని ఆశిస్తున్నాను.– సజ్జన్ జిందాల్, సీఎండీ, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్కీలక సమయం భారతదేశ అభివృద్ధి, శ్రేయస్సుకు ఈ విడత మరింత కీలకం కాగలదని ఆశిస్తున్నాను. – ఆనంద్ మహీంద్రా, చైర్మన్, మహీంద్రా గ్రూప్లక్ష్యానికి పటిష్ట పునాదులు ఎన్డీఏ వరుసగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడమనేది సంస్కరణల ఎజెండా కొనసాగింపునకు దోహదపడగలదు. ఆర్థిక, సామాజికాభివృద్ధికి తోడ్పడుతూ, వికసిత భారత్ లక్ష్యానికి గట్టి పునాదులు వేసే పురోగామి విధానాలు, చర్యలను కొత్త ప్రభుత్వం తీసుకోగలదని ఆశిస్తున్నాము. – అనీష్ షా, ప్రెసిడెంట్, ఫిక్కీసంస్కరణల అమలు లక్ష్యం అంతర్జాతీయంగా అవకాశాలను అందిపుచ్చుకునేందుకు, ఆర్థిక వ్యవస్థ ఫండమెంటల్స్‌ను పటిష్టపర్చేందుకు మోదీ నాయకత్వంలోని కొత్త ప్రభుత్వం తదుపరి విడత సంస్కరణలు అమలు చేయగలదని ఆశిస్తున్నాం. – చంద్రజిత్ బెనర్జీ, డైరెక్టర్, సీఐఐఎకానమీ మరింత స్పీడ్ కీలక దేశాలకు మించి అత్యధిక వృద్ధి రేటును కొనసాగిస్తూ, దేశ నాయకత్వం భారత్‌ను కొత్త ఎత్తులకు తీసుకెళ్లగలదని కార్పొరేట్లు విశ్వసిస్తున్నారు.– దీపక్ సూద్, సెక్రటరీ జనరల్, అసోచాం -
బ్లాక్‌లిస్టులో ఈవీ కంపెనీలు!
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ఉన్న హీరో ఎలక్ట్రిక్, ఒకినావా ఆటోటెక్, బెన్లింగ్ ఇండియాను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాల నుండి బ్లాక్‌లిస్ట్ చేసే అవకాశం ఉందని సమాచారం. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఫేమ్–2 పథకం కింద తప్పుగా అందుకున్న సబ్సిడీ ప్రయోజనాలను తిరిగి ఇవ్వడంలో ఈ సంస్థలు విఫలం కావడమే ఇందుకు కారణం. ఈ పథకం కింద నమోదైన వివిధ తయారీ సంస్థలు ఫేమ్–2 మార్గదర్శకాలను ఉల్లంఘించడంపై భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖకు 2022లో ఫిర్యాదులు అందాయి. ఫేమ్–2 నిబంధన ప్రకారం దేశీయంగా విడిభాగాలను కొనుగోలు చేయకుండా విదేశాల నుంచి పెద్ద ఎత్తున దిగుమతి చేసుకున్నాయన్నది ఈ ఫిర్యాదుల సారాంశం. -
PM Narendra Modi: మతం ఆధారంగా బడ్జెట్ కేటాయింపులా?
నాసిక్: కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో 15 శాతం నిధులను మైనారీ్టలకే కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ కుట్రలు పన్నుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. మతం ఆధారంగా బడ్జెట్ కేటాయింపులను తాము అనుమతించే ప్రసక్తే లేదని తేలి్చచెప్పారు. అలాగే విద్య, ఉద్యోగాల్లో మతపరమైన రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని స్పష్టంచేశారు. 2004 నుంచి 2014 దాకా కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు బడ్జెట్లో 15 శాతం నిధులను వారికి ప్రీతిపాత్రమైన ఓటు బ్యాంక్‌కు కట్టబెట్టడానికి ప్రయతి్నంచిందని చెప్పారు. అప్పట్లో బీజేపీ గట్టిగా ప్రతిఘటించడంతో కాంగ్రెస్ వెనక్కి తగ్గిందని పేర్కొన్నారు. ఆ సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న తాను కాంగ్రెస్ ప్రతిపాదనను వ్యతిరేకించానని తెలిపారు.కానీ, మైనారీ్టలకు 15 శాతం నిధుల ఆలోచనను కాంగ్రెస్ ఇప్పటికీ విరమించుకోలేదని, ఒకవేళ కేంద్రంలో అధికారంలోకి వస్తే అమలు చేయాలని యోచిస్తోందని విమర్శించారు. బుధవారం మహారాష్ట్రలోని పింపాల్‌గావ్ బస్వంత్, థానే పట్టణాల్లో లోక్‌సభ ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. మతం ఆధారంగా బడ్జెట్ కేటాయింపులు అనేది చాలా ప్రమాదకరమైన ఆలోచన అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మత ఆధారంగా దేశాన్ని ఇప్పటికే ఒకసారి విభజించిందని, మరో సారి అలాంటి పథకమే రచిస్తోందని ధ్వజమెత్తారు. తాము మతాలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. గత పదేళ్లలో తమ ప్రభుత్వం సాధించిన ఘనతలను ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఇప్పుడు జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలు కేవలం ఎంపీలను ఎన్నుకోవడం కోసం కాదని అన్నారు. దేశం కోసం బలమైన నిర్ణయాలు తీసుకొనే సామర్థ్యం గల ప్రధానమంత్రిని ఎన్నుకోవడానికి జరుగుతున్నాయని ఉద్ఘాటించారు. ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని వివరించారు. గత పదేళ్లలో తన పని తీరును ప్రజలు గమనించారని. వికసిత్ భారత్ కోసం తనను మూడోసారి గెలిపించాలని కోరారు. -
Central government: సీబీఐ మా నియంత్రణలో లేదు
న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) తమ నియంత్రణలో లేదని కేంద్ర ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. సీబీఐ ఒక కేసును నమోదు చేయడాన్ని గానీ, సీబీఐ దర్యాప్తును గానీ తాము పర్యవేక్షించలేమని వెల్లడించింది. సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని, విపక్షాలను లక్ష్యంగా చేసుకొని వేధించడానికి వాడుకుంటోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇచి్చన వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. తమ రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తునకు ఇచి్చన సాధారణ సమ్మతిని బెంగాల్ ప్రభుత్వం 2018 నవంబర్ 16న ఉపసంహరించుకుంది. దాంతో రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తు చేయలేదు. కొన్ని నెలల క్రితం బెంగాల్లో ఈడీ అధికారుల బృందంపై జరిగిన దాడిపై సీబీఐ కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించింది. సందేశ్‌ఖాలీ అక్రమాలపై దర్యాప్తు చేపట్టింది. దీనిపై బెంగాల్ సర్కారు అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ అనుమతి తీసుకోకుండానే సీబీఐ తమ రాష్ట్రంలో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, కేసులు దర్యాప్తు చేస్తోందని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రాజ్యాంగంలోని ఆరి్టకల్ 131 కింద కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేసింది. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. బెంగాల్లో కేసులను భారత ప్రభుత్వం నమోదు చేయలేదని, సీబీఐ నమోదు చేసిందని తెలిపారు. సీబీఐపై ప్రభుత్వæ నియంత్రణ ఉండదన్నారు. స్వతంత్ర దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ దర్యాప్తులో కేంద్రం జోక్యం చేసుకొనే ప్రసక్తే లేదని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. -
Rahul Gandhi: బీజేపీని విమర్శిస్తే దూషిస్తారా?
కన్నూర్: కేంద్రంలోని అధికార బీజేపీ విధానాలను, సిద్ధాంతాలను విమర్శించినందుకు కొన్ని మీడియా సంస్థలు నిత్యం తనను దూషిస్తున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. తన ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను విమర్శించడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. గురువారం కేరళలోని కన్నూర్, పాలక్కాడ్, కొట్టాయంలో సార్వత్రిక ఎన్నికల ప్రచార సభల్లో రాహుల్ మాట్లాడారు. బీజేపీ తీరుపై నిప్పులు చెరిగారు. ఆ పార్టీ విధానాలు దేశ ప్రజలకు శాపంగా మారాయన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్పై తాను పోరాటం సాగిస్తున్నానని చెప్పారు. అందుకు దూషణలు ఎదుర్కోవాల్సి వస్తోందని అన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్కు చెందిన మీడియా చానళ్లు తనను లక్ష్యంగా చేసుకొని రోజంతా తిట్లదండకం వల్లిస్తున్నాయని ఆక్షేపించారు. బీజేపీతో పినరయి విజయన్ లాలూచీ భారతదేశం ఇప్పుడున్నంత అస్తవ్యస్తంగా గతంలో ఎన్నడూ లేదని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. సంపద పంపిణీలో ఇప్పుడున్న అసమానతలు గతంలో లేవని గుర్తుచేశారు. అందుకే రాబోయే తమ ప్రభుత్వంలో పేదల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై రాహుల్ మండిపడ్డారు. బీజేపీతో విజయన్ లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ఇద్దరు ముఖ్యమంత్రులు జైలులో ఉన్నారని, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయన్ ఎందుకు వెళ్లలేదని నిలదీశారు. ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలు ఆయనను ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు. దేశ ప్రజలపై ఒకే భాష, ఒకే చరిత్రను రుద్దడానికి కమల దళం కుట్రలు పన్నుతోందని పేర్కొన్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొనే ఎన్నికలివి ఈ ఎన్నికలు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొనేందుకు జరుగుతున్న ఎన్నికలు అని రాహుల్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన గురువారం కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు వీడియో సందేశం ఇచ్చారు. భారతదేశం అనే భావనను నిరీ్వర్యం చేసేందుకు బీజేపీ సాగిస్తున్న కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కాంగ్రెస్‌కు కార్యకర్తలే వెన్నుముక అని, వారిపై పెద్ద బాధ్యత ఉందని చెప్పారు. స్వతంత్ర రాజ్యాంగబద్ధ సంస్థలపై, న్యాయ వ్యవస్థపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ దాడికి దిగుతున్నాయని ఆరోపించారు. -
కశ్మీర్ వేర్పాటువాద గ్రూపులపై నిషేధం
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ పీపుల్స్ ఫ్రీడం లీగ్(జేకేపీఎఫ్‌ఎల్)తోపాటు వేర్పాటువాద హురియత్ కాన్ఫరెన్స్‌తో సంబంధమున్న జమ్మూకశ్మీర్ పీపుల్స్ లీగ్(జేకేపీఎల్)లోని అన్ని గ్రూపులపై ఉగ్రవాద వ్యతిరేక చట్టం(ఉపా) కింద కేంద్ర ప్రభుత్వం శనివారం నిషేధం విధించింది. దీంతోపాటు, ఉగ్రవాద ఆరోపణలపై జైలులో ఉన్న యాసిన్ మాలిక్ సారథ్యంలోని జమ్మూకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్(జేకేఎల్ఎఫ్)పై నిషేధాన్ని మరో అయిదేళ్లు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వెలువడటానికి కొద్ది గంటల ముందు ఈ నిర్ణయాన్ని వెలువరించింది. ఉగ్ర సంస్థలపై మోదీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని హోం మంత్రి అమిత్ షా తెలిపారు. -
కొత్త ఈవీ పాలసీ
న్యూఢిల్లీ: టెస్లా వంటి అంతర్జాతీయ విద్యుత్ వాహనాల దిగ్గజాల నుంచి పెట్టుబడులను ఆకర్షించే దిశగా కేంద్ర ప్రభుత్వం కొత్త ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) పాలసీకి ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం దేశీయంగా తయారీ యూనిట్లపై కనీసం 500 మిలియన్ డాలర్లు (రూ. 4,150 కోట్లు) ఇన్వెస్ట్ చేసే సంస్థలకు సుంకాలపరమైన ప్రోత్సాహకాలు ఇవ్వనుంది. అధికారిక ప్రకటన ప్రకారం ఈవీ ప్యాసింజర్ కార్లను ఏర్పాటు చేసే కంపెనీలు 35,000 డాలర్లకు పైబడి విలువ చేసే వాహనాలపై 15 శాతం సుంకాలతో పరిమిత సంఖ్యలో కార్లను దిగుమతి చేసుకునేందుకు వీలుంటుంది. ప్రభుత్వం అనుమతి లేఖ ఇచి్చన తేదీ నుంచి అయిదేళ్ల వ్యవధికి ఇది వర్తిస్తుంది. ప్రస్తుతం పూర్తి స్థాయి కారును (సీబీయూ)ని దిగుమతి చేసుకుంటే.. ఇంజిన్ పరిమాణం, ఖరీదు, బీమా, రవాణా (సీఐఎఫ్) మొదలైనవి కలిపి విలువను బట్టి 70 శాతం నుంచి 100 శాతం దాకా కస్టమ్స్ సుంకాలు ఉంటున్నాయి. దీనికి 40,000 డాలర్ల విలువను ప్రామాణికంగా పరిగణిస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి భారత్‌ను గమ్యస్థానంగా మార్చేందుకు, పేరొందిన అంతర్జాతీయ ఈవీల తయారీ సంస్థల నుంచి పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ పాలసీ ఉపయోగపడగలదని కేంద్రం పేర్కొంది. భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ పెరుగుతుండటం, అమెరికాకు చెందిన టెస్లా, వియత్నాం సంస్థ విన్‌ఫాస్ట్ మొదలైనవి ఇక్కడ ఇన్వెస్ట్ చేయడంపై ఆసక్తిగా ఉన్న నేపథ్యంలో కొత్త విధానం ప్రాధాన్యం సంతరించుకుంది. స్కీముకి సంబంధించి మరిన్ని వివరాలు.. ► ఆమోదం పొందిన దరఖాస్తుదారులు ఎలక్ట్రిక్ 4 వీలర్ల ఉత్పత్తి కోసం భారత్‌లో కనీసం రూ. 4,150 కోట్ల (500 మిలియన్ డాలర్ల) పెట్టుబడితో తయారీ ప్లాంటు నెలకొల్పాలి. ► కేంద్ర భారీ పరిశ్రమల శాఖ అనుమతి మంజూరు చేసిన తేదీ నుంచి 3 సంవత్సరాల్లోగా ప్లాంటును ఏర్పాటు చేయాలి. ప్రాథమికంగా దేశీయంగా కనీసం 25 శాతం విలువను (డీవీఏ) జోడించాలి. అయిదేళ్లలో దీన్ని 50 శాతానికి పెంచాలి. డీవీఏని 50 శాతానికి పెంచి, కనీసం రూ. 4,150 కోట్లు ఇన్వెస్ట్ చేయడం పూర్తయిన తర్వాతే బ్యాంక్ గ్యారంటీలను ప్రభుత్వం వాపసు చేస్తుంది. ► తక్కువ సుంకాలతో గరిష్టంగా ఏడాదికి 8,000 ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్లను దిగుమతి చేసుకోవచ్చు. వార్షిక పరిమితి కన్నా తక్కువగా దిగుమతి చేసుకుంటే మిగతాది తర్వాత ఏడాదికి క్యారీఫార్వార్డ్ చేసుకునేందుకు వీలుంటుంది. ► స్కీమును నోటిఫై చేసిన సుమారు 120 రోజుల్లో దరఖాస్తులను ఆహా్వనిస్తారు. కంపెనీలు దరఖాస్తు చేసుకున్న 120 రోజుల్లోగా వాటిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. -
రెండు దశల్లో ‘జమిలి’ ఎన్నికలు
న్యూఢిల్లీ: ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’పై అధ్యయనం చేయడానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి కమిటీ తన నివేదికను గురువారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సమరి్పంచింది. రామ్‌నాథ్ కోవింద్‌తోపాటు కమిటీ సభ్యులైన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఫైనాన్స్ కమిషన్ మాజీ చైర్మన్ ఎన్.కె.సింగ్, లోక్‌సభ మాజీ సెక్రెటరీ జనరల్ సుభాష్ కాశ్యప్, లోక్‌సభలో మాజీ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్, కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ముర్మును నివేదిక అందజేశారు. జమిలి ఎన్నికలపై 18,629 పేజీల ఈ నివేదికలో ఉన్నత స్థాయి కమిటీ కీలక సిఫార్సులు చేసింది. రెండంచెల విధానాన్ని సూచించింది. తొలుత లోక్‌సభ, అన్ని రాష్ట్రాల శాసనసభలకు కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేసింది. ఆ తర్వాత 100 రోజుల్లోగా అన్ని రకాల స్థానిక సంస్థలకు కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని పేర్కొంది. జమిలి ఎన్నికలతో అభివృద్ధి వేగవంతం అవతుందని, దేశానికి మేలు జరుగుతుందని ఉద్ఘాటించింది. ఈ ఎన్నికల కోసం కోవింద్ కమిటీ రాజ్యాంగానికి మొత్తం 18 సవరణలు సూచించింది. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగానే.... రామ్‌నాథ్ కోవింద్ కమిటీని 2023 సెప్టెంబర్ 23న కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ 191 రోజులపాటు విస్తృత పరిశోధన సాగించింది. భాగస్వామ్యపక్షాలు, నిపుణులతో సంప్రదింపులు జరిపింది. దక్షిణాఫ్రికా, స్వీడన్, బెల్జియం, జర్మనీ, జపాన్, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, బెల్జియం తదితర దేశాల్లో అమల్లో ఉన్న జమిలి ఎన్నికల ప్రక్రియలను అధ్యయనం చేసింది. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగానే కోవింద్ కమిటీ సిఫార్సుల చేసిందని అధికార వర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించాయి. ఈ సిఫార్సుల ప్రకారం రాజ్యాంగానికి కనిష్ట సవరణలతో జమిలి ఎన్నికలు నిర్వహించవచ్చని పేర్కొన్నాయి. 32 పార్టీల మద్దతు జమిలి ఎన్నికలపై రాజకీయ పార్టీల అభిప్రాయాలను కోవింద్ కమిటీ సేకరించింది. అభిప్రాయం చెప్పాలంటూ 62 పార్టీలకు సూచించగా, 47 పార్టీలు స్పందించాయి. ఇందులో 32 పార్టీలు జమిలికి జైకొట్టాయి. 15 పార్టీలు వ్యతిరేకించాయి. మిగిలిన 15 పార్టీలు స్పందించలేదు. బీజేపీ, నేషనల్ పీపుల్స్ పార్టీ, ఏఐఏడీఎంకే, బిజూ జనతాదళ్, మిజో నేషనల్ ఫ్రంట్, శివసేన, జనతాదళ్(యూ), శిరోమణి అకాలీదళ్ తదితర పార్టీలు మద్దతు ప్రకటించగా, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీ, సీపీఎం, సీపీఐ, ఎంఐఎం, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, నాగా పీపుల్స్ ఫ్రంట్, సమాజ్‌వాదీ పార్టీ వంటివి వ్యతిరేకించాయి. త్వరలో లా కమిషన్ నివేదిక ఏకకాలంలో ఎన్నికలపై లా కమిషన్ త్వరలో తన నివేదిక సమర్పించనున్నట్లు తెలిసింది. 2029 నుంచి జమిలి ఎన్నికలు ప్రారంభించాని లా కమిషన్ సిఫార్సు చేయబోతున్నట్లు సమాచారం. లోక్‌సభ, శాసనసభలు, స్థానిక సంస్థలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని లా కమిషన్ సూచించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. కోవింద్ కమిటీ సిఫార్సులు ► లోక్‌సభలో హంగ్, అవిశ్వాస తీర్మానం వంటి సందర్భాలు ఎదురైనప్పుడు మళ్లీ తాజాగా ఎన్నికలు నిర్వహించాలి. కొత్త సభను ఏర్పాటు చేయాలి. ► ఎన్నికలు జరిగి కొత్తగా కొలువుదీరిన లోక్‌సభ ఐదేళ్లు కొనసాగదు. అంతకంటే ముందున్న సభ గడువు ఎన్నాళ్లు మిగిలి ఉంటుందో అప్పటివరకు మాత్రమే కొత్త సభ మనుగడ సాగిస్తుంది. ► రాష్ట్రాల శాసనసభలు లోక్‌సభ కాల వ్యవధి ముగిసేవరకు(ముందుగా రద్దయితే తప్ప) పనిచేస్తాయి. ► జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 83(పార్లమెంట్ కాల వ్యవధి), ఆర్టికల్ 172(శాసనసభ కాల వ్యవధి)కు సవరణ చేయాలి. ► ఆర్టికల్ 83, ఆర్టికల్ 172కు సవరణ చేయడానికి రాష్ట్రాల అమోదం అవసరం లేదు. ► జమిలి ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రాల ఎన్నికల సంఘాలతో సంప్రదించి ఒక ఉమ్మడి ఓటరు జాబితా, ఓటరు గుర్తింపు కార్డులు రూపొందించాలి. ఇందుకోసం ఆర్టికల్ 325కి సవరణ చేయాల్సి ఉంటుంది. ► స్థానిక సంస్థలతో ఏకకాలంలో ఎన్నికల కోసం ఆర్టికల్ 324ఏను సవరించాలి. ► ఆర్టికల్ 325, ఆర్టికల్ 324ఏకు సవరణ చేయాలంటే రాష్ట్రాల ఆమోదం తప్పనిసరి. ► ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రతిఏటా ఏదో ఒక చోట ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. దీనివల్ల ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఆర్థిక భారం పడుతోంది. విలువైన సమయం వృథా అవుతోంది. జమిలి ఎన్నికలతో ఇలాంటి సమస్యలు పరిష్కరించవచ్చు. ► జమిలి ఎన్నికల కోసం ప్రభుత్వం ఒక పటిష్టమైన చట్టబద్ధ యంత్రాంగాన్ని రూపొందించాలి. -
పీఎస్‌యూ బ్యాంకుల్లో వాటా విక్రయం
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిబంధనల ప్రకారం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కేంద్ర ప్రభుత్వం కొంతమేర వాటాలను విక్రయించనుంది. పబ్లిక్కు కనీసం 25 శాతం వాటా నిబంధన(ఎంపీఎస్) అమలులో భాగంగా ఐదు బ్యాంకుల్లో వాటాలను ఆఫర్ చేయనుంది. ఈ జాబితాలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(సీబీఐ), బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐవోబీ), యుకో బ్యాంక్, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్(పీఎస్బీ) ఉన్నట్లు ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ వివేక్ జోషీ పేర్కొన్నారు. 2023 మార్చి 31కల్లా మొత్తం 12 పీఎస్‌యూ బ్యాంకుల్లో 4 ఎంపీఎస్ నిబంధనలను అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ బాటలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24)లో మరో 3 ప్రభుత్వ రంగ బ్యాంకులు 25 శాతం ఎంపీఎస్‌ను సాధించినట్లు పేర్కొన్నారు. ఇకపై మిగిలిన 5 బ్యాంకులు సైతం నిబంధనలను అందుకునే కార్యాచరణకు తెరతీయనున్నట్లు తెలియజేశారు. ప్రస్తుత తీరిలా: ప్రస్తుతం పీఎస్బీలో కేంద్ర ప్రభుత్వం 98.25 శాతం వాటాను కలిగి ఉంది. ఈ బాటలో ప్రభుత్వానికి ఐవోబీలో 96.38 శాతం, యుకో బ్యాంక్‌లో 95.39 శాతం, సెంట్రల్ బ్యాంక్‌లో 93.08 శాతం, బ్యాంక్ మహారాష్ట్రలో 86.46 శాతం చొప్పున వాటాలున్నాయి. -
సీఈసీ, ఈసీల నియామక చట్టంపై 15న సుప్రీం అత్యవసర విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్య ఎన్నికల కమిషనర్(సీఈసీ), ఎన్నికల కమిషనర్ల(ఈసీలు) నియామకం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచి్చన నూతన చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఈ నెల 15వ తేదీన విచారణ చేపడతామని సుప్రీంకోర్టు బుధవారం వెల్లడించింది. సీఈసీ, ఈసీ నియామకం కోసం ఉద్దేశించి ప్యానెల్ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కేంద్రం తప్పించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స(ఏడీఆర్) అనే ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తమ పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ చేపట్టాలని ఏడీఆర్ విజ్ఞప్తి చేసింది. ‘చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఆదర్ ఎలక్షన్ కమిషనర్స్ యాక్ట్– 2023’లోని సెక్షన్ 7 అమలుపై స్టే విధించాలని కోరింది. దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం స్పందించింది. శుక్రవారం విచారణ చేపట్టేందుకు అంగీకరించింది. -
Lok Sabha elections 2024: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 4 శాతం పెంపు
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర మంత్రివర్గ సమావేశం గురువారం జరిగింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యాన్ని(డీఏ), పెన్షనర్లకు కరువు సహాయాన్ని(డీఆర్) బేసిక్ పే/పెన్షన్‌పై మరో 4 శాతం పెంచింది. ప్రస్తుతం డీఏ/డీఆర్ 46 శాతం ఉంది. తాజా పెంపుతో ఇది 50 శాతానికి చేరింది. పెంచిన భత్యం ఈ ఏడాది జనవరి 1 నుంచే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. దీనివల్ల కోటి మందికిపైగా ఉద్యోగులకు, పెన్షనర్లకు లబ్ధి చేకూరుతుందని తెలియజేసింది. ఉద్యోగులకు డీఏ అదనపు వాయిదా సొమ్ము, పెన్షనర్లకు కరువు సహాయం(డీఆర్) సొమ్ము ఈ ఏడాది జనవరి 1 నుంచి చెల్లించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ధరలు పెరగడంతో ఉద్యోగులకు, పెన్షనర్లకు డీఏను 50 శాతానికి పెంచినట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఈ పెంపు వల్ల ఖజానాపై ప్రతిఏటా రూ.12,869 కోట్ల భారం పడనుంది. 2024 జవవరి నుంచి 2025 ఫిబ్రవరి వరకు ప్రభుత్వం రూ.15,014 కోట్లు చెల్లించనుంది. డీఏ పెంపుతో ఉద్యోగులకు ఇతర భత్యాలు, గ్రాట్యుటీ సైతం పెరుగుతాయి. డీఏ/డీఆర్ కాకుండా ఇతర భత్యాల పెంపు కారణంగా ప్రభుత్వ ఖజానాపై ఏటా రూ.9,400 కోట్ల భారం పడుతుంది. ఏడో కేంద్ర వేతన కమిషన్ సిఫార్సుల ప్రకారమే డీఏ/డీఆర్‌ను కేంద్రం పెంచింది. ఉజ్వల రాయితీ గడువు పెంపు ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద పేద మహిళలకు వంట గ్యాస్ సిలిండర్లపై రూ.300 చొప్పున ఇస్తున్న రాయితీ గడువును కేంద్రం మరో ఏడాది పెంచింది. వాస్తవానికి ఈ గడువు ఈ ఏడాది మార్చి 31న ముగియనుంది. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే 2024–25 ఆర్థిక సంవత్సరంలోనూ రాయితీని వర్తింపజేయాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ప్రతిఏటా 12 సిలిండర్లకు ఈ రాయితీ వర్తిస్తుంది. ముడి జనపనారకు మరో రూ.285 ముడి జనపనారకు కనీస మద్దతు ధరను కేంద్రం మరో రూ.285 పెంచింది. దీనివల్ల క్వింటాల్ ముడి జనపనార ధర రూ.5,335కు చేరుకుంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఈ కనీస మద్దతు ధర వర్తిస్తుంది. రూ.10,037 కోట్లతో ‘ఉన్నతి’ ఈశాన్య రాష్ట్రాల్లో పారిశ్రామికాభివృద్ధి, ఉద్యోగాల సృష్టికి ప్రోత్సాహం ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కొత్త పథకం ‘ఉన్నతి’కి కేబినెట్ ఆమోదం తెలియజేసింది. ఈ పథకం రూ.10,037 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో పరిశ్రమలు స్థాపించే పెట్టుబడిదారులకు ప్రోత్సాహకాలు ఇస్తారు. 2034 మార్చి 31 దాకా ఈ పథకం అమల్లో ఉంటుంది. రూ.10,372 కోట్లతో కృత్రిమ మేధ ఐదేళ్ల పాటు అమలు చేసే ఇండియా కృత్రిమ మేధ(ఏఐ) మిషన్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఈ మిషన్‌కు ప్రభుత్వం రూ.10,373 కోట్లు కేటాయించింది. ఈ మిషన్‌లో భాగంగా 10,000 జీపీయూ సూపర్ కంప్యూటింగ్ కెపాసిటీని అందుబాటులోకి తీసుకొస్తారు. -
ఎల్ఐసీ రూ. 2,441 కోట్ల డివిడెండ్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) కేంద్ర ప్రభుత్వానికి రూ. 2,441 కోట్ల డివిడెండ్ చెల్లించింది. ఎల్ఐసీ చైర్మన్ సిద్ధార్థ మొహంతి నుంచి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ మేరకు చెక్ అందుకున్నారు. ఫైనాన్షియల్ సరీ్వసెస్ సెక్రటరీ వివేక్ జోషి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
Defense Deals: రక్షణ ఉత్పత్తుల కొనుగోలుకు ఒప్పందాలు
న్యూఢిల్లీ: బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిస్సైళ్లు, అత్యాధునిక రాడార్లు, ఆయుధ వ్యవస్థలు, మిగ్–29 జెట్ విమానాలకు ఏరో ఇంజిన్ల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం రూ.39,125 కోట్ల విలువైన ఒప్పందాలను కుదుర్చుకుంది. ఇందులో హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్)తో ఒకటి, బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్(బీఏపీఎల్)తో రెండు, లార్సెన్ అండ్ టూబ్రోతో రెండు ఒప్పందాలు ఉన్నాయి. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రక్షణశాఖ కార్యదర్శి గిరిధర్ అరమానె సమక్షంలో శుక్రవారం ఆయా సంస్థల ప్రతినిధులు ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు. ‘సైనిక బలగాల పోరాట సామర్థ్యాన్ని మరింత ఇనుమడింప జేసే ఈ ఒప్పందాలు దేశీయ సంస్థల సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయి, విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేస్తాయి. భవిష్యత్తులో విదేశీ పరికరాల తయారీపై ఆధారపడటాన్ని తగ్గిస్తాయి’అని రక్షణశాఖ తెలిపింది. ఒప్పందంలో భాగంగా భారత్– రష్యాల జాయింట్ వెంచర్ బీఏపీఎల్ నుంచి 200 బ్రహ్మోస్ క్షిపణులను రక్షణశాఖ కొనుగోలు చేయనుంది. -
PM Surya Ghar Muft Bijli Yojna: రూఫ్‌టాప్ సోలార్ రాయితీ 78 వేలు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రూఫ్‌టాప్ సౌర విద్యుత్ పథకం ‘పీఎం–సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజన’కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని అధ్యక్షతన మంత్రివర్గం గురువారం సమావేశమైంది. రూ.75,021 కోట్లతో అమలు చేసే ఈ పథకం కింద దేశవ్యాప్తంగా కోటి కుటుంబాలకు ప్రతినెలా 300 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయనున్నారు. ఇళ్లపై సౌర ఫలకాల ఏర్పాటుకు లబి్ధదారులకు రూ.78,000 వరకు రాయితీ ఇవ్వనున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలియజేశారు. కేబినెట్ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు. జిల్లాకో మోడల్ సోలార్ గ్రామం రూప్‌టాప్ సౌర విద్యుత్ పథకాన్ని ప్రధాని మోదీ ఈ ఏడాది ఫిబ్రవరి 13వ తేదీన ప్రారంభించారు. పథకం అమలులో భాగంగా 2 కిలోవాట్ల సౌర విద్యుత్ వ్యవస్థ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం 60 శాతం ఆర్థిక సాయం అందిస్తుంది. 2 కిలోవాట్ల నుంచి 3 కిలోవాట్ల సోలార్ పవర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి అదనంగా మరికొంత ఆర్థిక సాయం అందజేస్తుంది. 3 కిలోవాట్ల వరకే పరిమితి విధించారు. ఒక కిలో వాట్ వ్యవస్థకు రూ.30 వేలు, 2 కిలోవాట్ల వ్యవస్థకు రూ.60 వేలు, 3 కిలోవాట్ల వ్యవస్థకు రూ.78 వేల చొప్పున కేంద్రం నుంచి రాయితీ లభిస్తుంది. లబ్ధిదారులు రాయితీ సొమ్ము కోసం నేషనల్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసే కంపెనీని పోర్టల్ ద్వారా ఎంపిక చేసుకోవచ్చు. కేంద్రం ఇచ్చే రాయితీ మినహా మిగిలిన పెట్టుబడి కోసం ఎలాంటి పూచీకత్తు లేకుండానే తక్కువ వడ్డీకే రుణం తీసుకొనే అవకాశం కలి్పంచారు. సౌర విద్యుత్‌పై గ్రామీణ ప్రజలకు అవగాహన కలి్పంచడానికి ప్రతి జిల్లాలో ఒక మోడల్ సోలార్ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రూఫ్‌టాప్ సోలార్ పథకాన్ని ప్రమోట్ చేసే పట్టణ స్థానిక సంస్థలకు, పంచాయతీరాజ్ సంస్థలకు కేంద్రం ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వనుంది. 2025 నాటికి అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలపై రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్స్ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. 3 కిలోవాట్ల సౌర విద్యుత్ వ్యవస్థ నెలకు 300 యూనిట్లకుపైగా కరెంటును ఉత్పత్తి చేస్తుంది. 300 యూనిట్లు ఉచితంగా ఉపయోగించుకొని, మిగిలిన కరెంటును డిస్కమ్‌లకు విక్రయించి ఆదాయం పొందవచ్చు. పీఎం–సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజన కింద సౌర విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి, రాయితీ పొందడానికి https:// pmsuryaghar.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ పథకం ద్వారా కొత్తగా 17 లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని కేంద్రం అంచనా వేస్తోంది. -
జూలై 1 నుంచి ‘భారత’ చట్టాలు
న్యూఢిల్లీ: వలసపాలన నాటి నేర న్యాయ వ్యవస్థ చట్టాలను సంస్కరించి నేటి ఆధునిక సమాజ అవసరాలకు తగ్గట్లుగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్యా చట్టాలు జూలై ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించిన నిబంధనలు మాత్రం ఇప్పుడే అమలుకావు. హిట్ అండ్ రన్ కేసులపై ట్రక్కు డ్రైవర్లు దేశవ్యాప్తంగా కొద్దివారాల క్రితం ధర్నాకు దిగిన నేపథ్యంలో ఈ నిబంధనల అమలును ప్రస్తుతానికి పక్కనబెట్టారు. ఈ మూడు నూతన చట్టాలకు గత ఏడాది డిసెంబర్ 21న పార్లమెంట్ ఆమోదం తెలపగా డిసెంబర్ 25వ తేదీన రాష్ట్రపతి ముర్ము ఆమోదముద్ర వేశారు. ఇండియన్ పీనల్ కోడ్, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసిజర్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్1872ల స్థానంలో ఈ మూడు చట్టాలు తెచి్చన సంగతి తెల్సిందే. దోషులను శిక్షించడంకంటే ముందు బాధితులకు సత్వర న్యాయం అందించే లక్ష్యంతోనే ఈ చట్టాలను తెచ్చామని బిల్లులపై చర్చ సందర్భంగా పార్లమెంట్లో హోం మంత్రి అమిత్‌షా వ్యాఖ్యానించారు. ఐపీసీలో లేని ఉగ్రవాదం అనే దానికి తొలిసారిగా కొత్త చట్టంలో సరైన నిర్వచనం పొందుపరిచారు. రాజదోహ్రం అనే పదాన్ని తొలగించి దాని స్థానంలో ‘దేశ వ్యతిరేక నేరాలు’ అనే సెక్షన్‌ను జతచేశారు. వేర్పాటువాదం, సాయుధపోరాటాలు, దేశ సార్వ¿ౌమత్వాన్ని భంగపరిచే చర్చలు, దేశ, విదేశాల్లో ఉంటూ చేసే విధ్వంసకర కుట్రలు, దేశ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసే కుట్ర విద్వేష ప్రసంగాలు.. ఇలా పలు రకాల నేరాలను ఇకపై దేశవ్యతిరేక నేరాలుగా పరిగణిస్తారు. ఈ నేరాలకు గరిష్టంగా జీవితఖైదు పడొచ్చు. రాజద్రోహం అనే పదాన్ని తొలగించి దేశద్రోహం అనే నిర్వచించారు. దోషులకు మేజిస్ట్రేట్ విధించే జరిమానా మొత్తాలను పెంచారు. అన్ని భాగస్వామ్య వర్గాల సలహాలు, సూచనలు స్వీకరించి సమగ్ర చర్చలు, సంప్రతింపుల తర్వాతే ముసాయిదా బిల్లులు చట్టాలుగా రూపుదాల్చాయని అమిత్ షా అన్నారు. -
గ్రామాల అభివృద్ధితోనే ‘వికసిత్ భారత్’
అహ్మదాబాద్: గ్రామాలకు సంబంధించిన ప్రతి అంశానికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా సన్నకారు రైతుల జీవితాలను మెరుగుపర్చడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. గ్రామీణ ఆర్థికాభివృద్ధితోనే ‘వికసిత్ భారత్’ లక్ష్యం నెరవేరుతుందని స్పష్టం చేశారు. దేశం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందాలంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలని అన్నారు. గురువారం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గుజరాత్ కో–ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్(జీసీఎంఎంఎఫ్) 50వ వార్షికోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. లక్ష మందికిపైగా రైతులు, పాడి పశువుల పెంపకందారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రఖ్యాత అమూల్ కంపెనీని నిర్వహిస్తున్న జీసీఎంఎంఎఫ్ని ప్రపంచంలో నంబర్ వన్ డెయిరీగా మార్చడానికి కృషి చేయాలని పాడి రైతులకు, భాగస్వామ్యపక్షాలకు మోదీ పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఈ సహకార సంఘం(అమూల్) ప్రపంచంలో ఎనిమిదో అతిపెద్ద డెయిరీ కంపెనీగా స్థానం దక్కించుకుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా డెయిరీ రంగం ఏటా 2 శాతం వృద్ధి సాధిస్తుండగా, మన దేశంలో మాత్రం 6 శాతం వృద్ధిని సాధిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా 10 వేల రైతు ఉత్పత్తి సంస్థలు(ఎఫ్‌పీఓ) ఏర్పాటు చేయాలని నిర్ణయించామని మోదీ చెప్పారు. ఇప్పటికే 8 వేల ఎఫ్పీఓలు అందుబాటులోకి వచ్చాయన్నారు. సన్నకారు రైతులను వ్యవసాయ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా, ఎగుమతిదారులుగా మార్చాలని సంకలి్పంచామని అన్నారు. అన్నదాతల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు, తీసుకొచి్చన పథకాలను ప్రస్తావించారు. రైతుల కోసం మైక్రో ఏటీఎంలు, గోబర్దన్ పథకం, ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలు తీసుకొచ్చామని గుర్తుచేశారు. ఇంధన దాతగా, ఎరువుల దాతగా రైతులు జంతు సంపదను వ్యాధుల బారి నుంచి కాపాడానికి రూ.15,000 కోట్లతో ఉచిత వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించామని, ఇప్పటికే 60 కోట్ల టీకా డోసుల ఇచ్చామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. గ్రామాల్లో కిసాన్ సమృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఇక్కడ పంటలకు సంబంధించి రైతుల సమస్యలకు శాస్త్రీయ పరిష్కార మార్గాలు లభిస్తున్నాయని వివరించారు. సేంద్రీయ ఎరువుల తయారీలో రైతులకు సహకారం అందిస్తున్నామని చెప్పారు. బయో గ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు సైతం తోడ్పాటు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులను ‘అన్నదాత’ నుంచి ఇంధన దాతగా, ఎరువుల దాతగా మార్చాలన్నదే ప్రభుత్వ అకాంక్ష అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం రైతుల సంక్షేమం విషయంలో తమ ప్రతిజ్ఞను నెరవేర్చడానికి కట్టుబడి ఉన్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రైతులకు సంబంధించిన ప్రతి డిమాండ్‌ను నెరవేర్చడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో రైతన్నల బాగు కోసం ఇప్పటిదాకా ఎన్నో చర్యలు చేపట్టామని, చెరకు ధర పెంచడం కూడా అందులో ఒకటి అని తెలిపారు. దీనివల్ల కోట్లాది మంది చెరకు రైతులు ప్రయోజనం పొందుతారని పేర్కొన్నారు. కేంద్ర కేబినెట్ తాజాగా తీసుకున్న నిర్ణయాలను ప్రస్తావిస్తూ మోదీ గురువారం ‘ఎక్స్’లో పలు పోస్టు చేశారు. క్వింటాల్ చెరకు కనీస ధర(ఎఫ్ఆర్పీ)ను మరో రూ.25 చొప్పున పెంచుతూ మోదీ నేతృత్వంలో కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో క్వింటాల్ చెరకు కనీస ధర రూ.350కు చేరుకుంది. ఇదొక చరిత్రాత్మక నిర్ణయమని మోదీ అభివరి్ణంచారు. అంతరిక్ష రంగంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను(ఎఫ్‌డీఐ) అనుమతిస్తూ కేబినెట్ మరో నిర్ణయం తీసుకుందని గుర్తుచేశారు. గుర్రాలు, గాడిదలు, కంచర గాడిదలు ఒంటెలు వంటి జంతువుల సంతతి వృద్ధికి సంబంధించిన పరిశ్రమలు, వ్యక్తులకు 50 శాతం పెట్టుబడి రాయితీ మంజూరు చేస్తూ కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. నన్ను అవమానించడమే వారి ఎజెండా నవ్సారీ: సొంత రాష్ట్రం గుజరాత్లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ గురువారం కాంగ్రెస్ పారీ్టపై విమర్శల బాణాలు వదిలారు. దక్షిణ గుజరాత్‌లోని నవ్సారీ పట్టణంలో ఒక ప్రజా కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ‘‘ మోదీ కులాన్ని ఎంత మంది కాంగ్రెస్ నేతలు దూషించారో మీరందరూ చూసే ఉంటారు. కానీ కాంగ్రెస్ వాళ్లకు తెలియని విషయం ఏంటంటే వాళ్లెంతగా నన్ను తిడతారో 400 లోక్‌సభ సీట్లు గెలవాలన్న మా సంకల్పం అంతగా బలపడుతుంది. దేశం కోసం కాంగ్రెస్‌కు ఎలాంటి ఎజెండా లేదు. నన్ను తిట్టడమే వారి ఎజెండా. దేశ భవిష్యత్తుపై వాళ్లకు ఎలాంటి చింతా లేదు. ఎంతగా మాపై బురద జల్లుతారో అంతగా ఆ బురదలో 370(సీట్లు) కమల పుష్పాలు విరబూస్తాయి’ అంటూ లోక్‌సభ ఎన్నికల్లో కనీసం 370 సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తంచేశారు. ‘‘వారసత్వ రాజకీయాల మాటకొస్తే కాంగ్రెస్‌ను మించినది మరోటి లేదు’ అని విమర్శించారు. ‘బంధుప్రీతి, అవినీతి, బుజ్జగింపు రాజకీయాలు చేసేవారికి దేశ ఘన వారసత్వ పరిరక్షణ చేతకాదు’ అని వ్యాఖ్యానించారు. 2 అణు విద్యుత్ రియాక్టర్లు జాతికి అంకితం సూరత్: నవ్సారిలో సభ అనంతరం ఆయన పొరుగునే సూరత్ జిల్లాలో ఉన్న కక్రాపర్కు చేరుకున్నారు. కక్రాపర్ అణు విద్యుత్ స్టేషన్ వద్ద ప్రధాని మోదీ రెండు అణు విద్యుత్ రియాక్టర్లను జాతికి అంకితం చేశారు. కక్రాపర్ ఆటమిక్ పవర్ స్టేషన్లో 700 మెగావాట్ల చొప్పున సామర్థ్యం కలిగిన 3, 4 యూనిట్లను న్యూక్టియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఎన్పీసీఐఎల్) రూ.22,500 కోట్లతో ఏర్పాటు చేసింది. దేశీయంగా రూపుదిద్దుకున్న అతిపెద్ద ప్రెస్సరైజ్డ్ హెవీ వాటర్ రియా క్టర్లు ఇవే కావడం విశేషం. ప్రధాని ఇక్కడి సీనియర్ శాస్త్రవేత్తలు, ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఇక్కడ తయారైన విద్యుత్ గుజరాత్‌తోపాటు మహా రాష్ట్ర, గోవా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, కేంద్రపాలిత ప్రాంతాలు దాద్రా నాగర్ హవేలీ, డామన్ డయ్యూలకు సరఫరా అవుతుంది. -
కేంద్రం ఆఫర్ తిరస్కరణ.. చర్చలు విఫలం
చండీగఢ్: కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కు చట్టబద్ధత తదితర డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వానికి, రైతు సంఘాలకు మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. సమస్య పరిష్కారానికి కేంద్ర మంత్రుల కమిటీ చేసిన తాజా ప్రతిపాదనలను కూడా రైతు సంఘాల నేతలు తిరస్కరించారు. అవి రైతులకు మేలు చేసేవి కాదని నేతలు జగ్జీత్సింగ్ దల్లేవాల్, శర్వాన్‌సింగ్ పంథేర్ తదితరులు సోమవారం కుండబద్దలు కొట్టారు. ప్రతిపాదనలపై సంఘాలన్నీ చర్చించుకున్న మీదట ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు. తమ ‘ఢిల్లీ చలో’ ఆందోళన బుధవారం ఉదయం 11 నుంచి శాంతియుతంగా కొనసాగుతుందని ప్రకటించారు. దాంతో సమస్య మొదటికొచ్చింది. రైతు సంఘాలతో ఆదివారం సాయంత్రం మొదలైన కేంద్ర మంత్రుల కమిటీ నాలుగో దశ చర్చలు అర్ధరాత్రి తర్వాత ముగిశాయి. చర్చల్లో మంత్రులు పీయూష్ గోయల్, అర్జున్ ముండా, నిత్యానంద రాయ్‌తో పాటు పంజాబ్ ముఖ్యమంత్రి, ఆప్ నేత భగవంత్ మాన్ కూడా పాల్గొన్నారు. ‘ఐదేళ్ల ఒప్పంద’ ప్రతిపాదనను మంత్రులు తెరపైకి తెచ్చారు. ప్రభుత్వంతో కుదుర్చుకున్న రైతుల నుంచి పప్పు ధాన్యాలు, మొక్కజొన్న, పత్తి పంటలను ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని చెప్పారు. ఆ పంటలకు ఐదేళ్లపాటు ఎంఎస్పీ చెల్లింపుకు సుముఖత వ్యక్తం చేశారు. వారి నుంచి ఎంత పంటనైనా కొనుగోలు చేస్తామన్నారు. ఇది వినూత్నమైన ఆలోచన అని అనంతరం గోయల్ మీడియాతో చెప్పారు. ‘‘ఐదేళ్లపాటు ఎంఎస్పీకి ఆయా పంటల కొనుగోలుకు ఎన్సీసీఎఫ్, నాఫెడ్ వంటి ప్రభుత్వ రంగ సహకార సంఘాలు రైతులతో ఒప్పందం కుదుర్చుకుంటాయి. ఇందుకు ఒక పోర్టల్ అభివృద్ధి చేస్తాం’’ అని చెప్పారు. కనీస మద్దతు ధరకు ఇప్పటికిప్పుడు చట్టబద్ధత అసాధ్యమని తేల్చిప్పారు. ఈ ప్రతిపాదనపై రైతులు, నిపుణులతో చర్చించి రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని పంథేర్ సోమవారం ఉదయం చెప్పారు. అప్పటిదాకా ‘ఢిల్లీ చలో’ కార్యక్రమాన్ని నిలిపేస్తున్నామన్నారు. కానీ ప్రతిపాదనలను తిరస్కరిస్తున్నామంటూ రైతు నేతల నుంచి రాత్రికల్లా ప్రకటన వెలువడింది. -
ఫార్మాకు కొత్త పీఎల్ఐ పథకం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ రంగానికి కొత్త ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాన్ని ప్రవేశపెట్టడంపై కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్ (ఏపీఐ) తయారీకి అవసరమైన కీలక రసాయనాల ఉత్పత్తిని దేశీయంగా పెంచడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తద్వారా కీలక రసాయనాల ఉత్పత్తుల కోసం భారతీయ కంపెనీలు చైనాపై ఆధారపడటాన్ని తగ్గించడం ఈ నిర్ణయం వెనుక ఉన్న ముఖ్య ఉద్ధేశం. ఫార్మాతో ముడిపడి ఉన్న అన్ని విభాగాలు ప్రస్తుత పీఎల్ఐ కింద కవర్ కాలేదు. దీని కారణంగా ఈ రసాయనాలు ఇప్పటికీ చైనా నుండి పెద్దమొత్తంలో భారత్‌కు దిగుమతి అవుతున్నాయి. అయితే కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాత్రమే నూతన పీఎల్ఐ కార్యరూపంలోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే తదుపరి కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదిత పథకం భాగం కావచ్చు. ప్రస్తుత పథకానికి సవరణ.. భారత్‌కు దిగుమతి అవుతున్న ఫార్మా ముడిపదార్థాల్లో 55–56 శాతం వాటా చైనాదే. 2013–14లో దిగుమతైన యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్స్‌లో చైనా వాటా విలువ పరంగా 64 శాతం, పరిమాణం పరంగా 62 శాతం వృద్ధి నమోదైంది. 2022–23 వచ్చేసరికి ఇది వరుసగా 71 శాతం, 75 శాతానికి ఎగబాకింది. చైనా నుంచి ముడిపదార్థాల (బల్క్ డ్రగ్) దిగుమతులు 2013–14లో 2.1 బిలియన్ డాలర్లు, 2018–19లో 2.6 బిలియన్ డాలర్లు, 2022–23 వచ్చేసరికి 3.4 బిలియన్ డాలర్లకు ఎగబాకాయి. చైనాలో ఈ రసాయనాల తయారీ వ్యయాలు చాలా తక్కువగా ఉన్నాయి. దీని కారణంగా ఏపీఐల ఉత్పత్తికై భారతీయ తయారీ సంస్థలు చైనా నుంచే వీటిని ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ రసాయనాలు కాలుష్యకారకాలు. ఈ రసాయనాలను పీఎల్ఐ పరిధిలోకి చేర్చేందుకు ప్రస్తుత పథకాన్ని సవరించడాన్ని కూడా ప్రభుత్వం పరిశీలించవచ్చని తెలుస్తోంది. జాప్యాలకు దారితీయవచ్చు.. ప్రస్తుతం ఉన్న ఫార్మా పీఎల్ఐ పథకం కింద పరిశ్రమకు కీలక స్టారి్టంగ్ మెటీరియల్స్, డ్రగ్ ఇంటర్మీడియట్స్, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్‌ను స్థానికంగా తయారు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తోంది. ఫార్మా సరఫరా వ్యవస్థ మొత్తాన్ని ప్రస్తుత పీఎల్ఐ పథకం కవర్ చేయడం లేదు. అయితే ఏపీఐల తయారీలో వాడే రసాయనాల ధరలను చైనా తగ్గించింది. పీఎల్ఐ పథకంలో భాగం కాని కంపెనీలు చైనా నుంచి ఈ రసాయనాలను తక్కువ ధరకు దిగుమతి చేసుకుంటున్నాయి. కీలక ఔషధ ముడి పదార్ధాల కోసం ఒకే దేశంపై ఎక్కువగా ఆధారపడటం భారత ఫార్మా పరిశ్రమకు ప్రమాదం కలిగించే అవకాశమూ లేకపోలేదు. దీనికి కారణం ఏమంటే సరఫరా వ్యవస్థలో అంతరాయాలు ఏర్పడినట్టయితే మందుల కొరత, తయారీ జాప్యాలకు దారితీయవచ్చు. -
Parliament Budget Session 2024: ‘ఇది కర్తవ్య కాలం’
న్యూఢిల్లీ: ‘‘కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం వదిలిపెట్టిన సవాళ్లను ఎన్డీయే ప్రభుత్వం గత పదేళ్లలో విజయవంతంగా అధిగమించింది. దేశాన్ని అభివృద్ధి మార్గంలో నడిపించడానికి కఠిన నిర్ణయాలు తీసుకుంది’’ అని కేంద్ర ప్రభుత్వం తమ శ్వేతపత్రం(వైట్ పేపర్)లో వెల్లడించింది. దేశ ఆర్థిక వ్యవస్థపై రూపొందించిన 59 పేజీల ఈ శ్వేతపత్రాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. యూపీఏ సర్కారు హయాంలో దేశ ఆర్థిక పరిస్థితి, మోదీ ప్రభుత్వ పాలనలో సాధించిన ఆర్థిక ప్రగతిని వైట్ పేపర్లో ప్రస్తావించారు. దీనిపై శుక్రవారం లోక్‌సభలో చర్చ జరిగే అవకాశం ఉంది. చర్చ అనంతరం మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానమిస్తారు. ‘‘2014లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సమయానికి దేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత బలహీనంగా ఉంది. ఆర్థిక నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఆర్థిక క్రమశిక్షణ మచ్చుకైనా లేదు. అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది. నిజంగా అదొక సంక్షోభ పరిస్థితి. యూపీఏ ప్రభుత్వ నిర్వాకాల వల్ల ఆర్థిక వ్యవస్థ వెనక్కిపోయింది. ఆర్థిక కార్యకలాపాల నిర్వహణలో అప్పటి ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. యూపీఏ పాలనలో భారత్ ప్రపంచంలో అత్యంత బలహీన ఐదు ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉండేది. యూపీఏ హయాంలో లెక్కలేనన్ని కుంభకోణాలు జరిగాయి. అప్పటి అవినీతి వ్యవహారాలు దేశ ప్రజల విశ్వాసాన్ని బలహీనపర్చాయి. 2013లో విదేశీ మారక నిల్వలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. దానివల్ల మనం పెద్ద మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. అప్పటి బలహీన నాయకత్వం వల్ల రక్షణ రంగం సైతం సన్నద్ధత కోల్పోయింది. 2014లో దారుణంగా దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థ యూపీఏ నుంచి ఎన్డీయే ప్రభుత్వానికి వారసత్వంగా వచ్చింది. ఆర్థిక వ్యవస్థను, పరిపాలనా వ్యవస్థను గాడిలో పెట్టే పనికి ఎన్డీయే ప్రభుత్వం పూనుకుంది. ఒక క్రమపద్ధతిలోకి తీసుకొచ్చింది. ఆర్థికంగా దేశానికి మంచి జరగాలంటే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను మోదీ ప్రభుత్వం గుర్తించింది. దేశ ఆర్థిక వ్యవస్థ పునాదులను పటిష్టంగా మార్చింది. ఇప్పుడు అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మారింది. ప్రపంచంలో పెట్టుబడులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా భారత్ అవతరించింది. మోదీ నాయకత్వంలో మన దేశం ప్రస్తుతం ప్రపంచంలో మొదటి ఐదు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా మారింది. మోదీ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల వల్ల కేవలం పదేళ్లలోనే ఈ ఘనత సాధ్యమైంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల పరిణామాలు, సవాళ్లు ఉన్నప్పటికీ మన ఆర్థిక వ్యవస్థ పురోగమనంలో కొనసాగుతోంది. చేయాల్సింది ఇంకా మిగిలే ఉంది. నిద్రించేలోగా చేరాల్సిన మైళ్లు, ఎక్కాల్సిన పర్వతాలు ఎన్నో ఉన్నాయి. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుకోవాలి. అదే మన గమ్యం. ఇది మనందరి కర్తవ్య కాలం’’ అని శ్వేతపత్రంలో ఎన్డీయే ప్రభుత్వం పిలుపునిచ్చింది. -
Public Exam Bill 2024: పేపర్ లీకేజీలు, రిక్రూట్మెంట్ పరీక్షల్లో అక్రమాలపై కేంద్రం కొరడా
న్యూఢిల్లీ: ఉద్యోగాల భర్తీ పరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీకేజీ ఉదంతాలతో దేశవ్యాప్తంగా కోట్లాది మంది విద్యార్థులు, నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతున్న నేపథ్యంలో పరీక్షల అక్రమార్కులపై కేంద్రం కఠిన చర్యల కొరడా ఝులిపించింది. పేపర్ లీకేజీలు, నకిలీ వెబ్సైట్లుసహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రవేశపరీక్షల్లో అవకతవకలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు కేంద్రం ‘ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్(ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) బిల్లు–2024’ను తీసుకొచ్చింది. కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ సోమవారం ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కేంద్ర ప్రభుత్వం, దాని ఏజెన్సీలు నిర్వహించే పబ్లిక్ ఎగ్జామ్స్‌లో అక్రమాలకు పాల్పడిన వారిని శిక్షించేందుకు ఇన్నాళ్లూ ప్రత్యేకంగా ఎలాంటి చట్టం లేకపోవడంతో దీనిని తీసుకొచ్చారు. బిల్లులో ఏముంది? ► ప్రశ్నపత్రం, ప్రశ్నపత్రం కీ లీకేజీకి పాల్పడి నా, కంప్యూటర్ నెట్వర్క్/ రీసోర్స్/ సిస్టమ్‌ను ట్యాంపర్ చేసిన వ్యక్తులు/సంస్థలను కఠినంగా శిక్షిస్తారు ► నకిలీ వెబ్సైట్లు నిర్వహించడం, నకిలీ ఉద్యోగ/ప్రవేశ పరీక్షలు చేపట్టడం, నకిలీ అడ్మిట్ కార్డులు, ఆఫర్ లెటర్లు ఇవ్వడం, ఒకరి బదులు ఇంకొకరితో ఎగ్జామ్ రాయించడం వంటి అవకతవకలు చేసి నగదు వసూళ్లకు పాల్పడితే గరిష్టంగా ఐదేళ్ల జైలు, రూ.10 లక్షల జరిమానా విధిస్తారు. ► వీటితో ప్రమేయమున్న వ్యక్తులు/సంస్థలు/ఏజెన్సీలు/వ్యాపారసంస్థలు/ సబ్‌కాంట్రాక్టర్‌కు రూ.1 కోటి జరిమానా విధిస్తారు. ఇంకోసారి ప్రభుత్వం నుంచి సంబంధిత పనులు చేపట్టకుండా నాలుగేళ్లపాటు నిషేధం విధిస్తారు. ► యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ, ఐబీపీఎస్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వంటి సంస్థలు నిర్వహించే కంప్యూటర్ ఆధారిత ఎగ్జామ్స్‌లో కలగజేసుకున్న అక్రమార్కులను సంబంధిత నియమాల కింద శిక్షిస్తారు. నీట్, జేఈఈ, సీయూఈటీ పరీక్షలకూ ఈ బిల్లులోని నియమాలు వర్తిస్తాయి. ► ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ బాధ్యతలు చూసే కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాల సిబ్బంది మొత్తం ఈ చట్టపరిధిలోకి వస్తారు. -
కేంద్రం బకాయిలను మేమే ఇస్తాం: మమత
కోల్‌కతా: వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి కేంద్రప్రభుత్వం నుంచి పశి్చమబెంగాల్ రాష్ట్రానికి రావాల్సిన బకాయిలపై ఇక ఎవరినీ అడిగేదిలేదని, తామే చెల్లిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలపై కోల్‌కతాలో శుక్రవారం నుంచి 48 గంటల ధర్నాకు దిగిన మమత శనివారం మాట్లాడారు. ‘‘ ఇకపై మేం బీజేపీ ప్రభుత్వాన్ని దేహీ అని అడుక్కోవాలనుకోవట్లేదు. వాళ్ల భిక్ష మాకు అక్కర్లేదు. రాష్ట్రంలో ఉపాధి హామీ పనులు చేసి కేంద్రం నుంచి బకాయిల కోసం ఎదురుచూస్తున్న 21 లక్షల మంది కారి్మకుల ఖాతాలకు ఆ మొత్తాలను ఫిబ్రవరి 21కల్లా మా ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఆవాస్ యోజన పథకంపైనా త్వరలో నిర్ణయం తీసుకుంటాం’’ అన్నారు. ధర్నా వద్దే మమత రాత్రి బస ధర్నాకు దిగిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం రాత్రంతా ధర్నా స్థలి వద్దే గడిపారు. అక్కడే నిద్రించి ఉదయం మారి్నంగ్‌వాక్‌కు వెళ్లారు. -
అడ్వాణీకి భారతరత్న
న్యూఢిల్లీ: రాజకీయ కురు వృద్ధుడు, బీజేపీ అగ్ర నేత లాల్‌కృష్ణ అడ్వాణీ (96)కి కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఎక్స్‌లో ఈ మేరకు పోస్ట్ చేశారు. ఆ వెంటనే రాష్ట్రపతి భవన్ నుంచి ఈ మేరకు ప్రకటన వెలువడింది. అయోధ్యలో రామాలయం నిర్మాణం కోసం 1990లో దేశవ్యాప్త రథయాత్రతో బీజేపీకి ఊపు తెచ్చి అధికార సాధనకు బాటలు పరిచిన అడ్వాణీని, రామాలయ ప్రారం¿ోత్సవం జరిగిన కొద్ది రోజులకే భారతరత్న వరించడం విశేషం. అడ్వాణీకి ఈ సందర్భంగా మోదీ అభినందనలు తెలిపారు. ‘‘సమకాలీన రాజకీయవేత్తల్లో అత్యంత గౌరవనీయుడు అడ్వాణీ. దేశాభివృద్ధిలో ఆయనది అత్యంత కీలక పాత్ర. అచంచలమైన చిత్తశుద్ధి, అంకితభావంతో దేశానికి దశాబ్దాల పాటు సేవ చేశారు. ప్రజాస్వామ్యానికి జాతీయవాద విలువలను కూర్చిన గొప్ప నాయకుడు. అత్యంత కింది స్థాయి నుంచి మొదలై ఉప ప్రధానిగా ఎదిగారు. రాజకీయాల్లో నైతిక విలువలకు నూతన ప్రమాణాలు నెలకొల్పారు’’ అంటూ ప్రశంసించారు. ‘‘ఇది నాకెంతో భావోద్వేగపూరిత క్షణం. అడ్వాణీతో అత్యంత సన్నిహితంగా మెలిగి ఎంతగానో నేర్చుకునే అవకాశం నాకు దక్కింది’’ అని ఈ సందర్భంగా మోదీ అన్నారు. ప్రకటన అనంతరం అడ్వాణీకి మోదీ ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. తనకు అత్యున్నత పౌర పురస్కారం లభించడం పట్ల అడ్వాణీ హర్షం వెలిబుచ్చారు. ‘‘దేశం కోసమే నా జీవితమంతా ధారపోశా. నా ఆశయాలకు సిద్ధాంతాలకు దక్కిన గౌరవమిది. నాకెంతో ఆనందంగా ఉంది’’ అన్నారు. ప్రధాని మోదీకి, దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయనకు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తాయి. అద్వానీతో కలిపి ఇప్పటిదాకా 50 మందికి ఈ పురస్కారం దక్కింది. పది రోజుల క్రితమే బిహార్ దివంగత ముఖ్యమంత్రి, ప్రఖ్యాత సామాజికవేత్త కర్పూరి ఠాకూర్‌కు కూడా కేంద్రం భారతరత్న ప్రకటించడం తెలిసిందే. ఒక ఏడాదిలో గరిష్టంగా ముగ్గురికి ఈ పురస్కారం ఇవ్వవచ్చు. కానీ 1999లో మాత్రం నలుగురికి భారతరత్న ప్రకటించారు. కుటుంబ రాజకీయాలను సవాలు చేసిన అడ్వాణీ: మోదీ సంభాల్పూర్ (ఒడిశా): అడ్వాణీ ఆజన్మాంతం కుటుంబ రాజకీయాలను సవాలు చేశారని, దేశ ప్రజాస్వామిక విలువల పునరుద్ధరణ కోసం పోరాడారని మోదీ అన్నారు. బీజేపీపై అంటరాని పార్టీ ముద్రను పోగొట్టి ప్రపంచంలోకెల్లా అతి పెద్ద రాజకీయ వేదికగా తీర్చిదిద్దారని కొనియాడారు. ‘‘దివంగత ప్రధాని వాజ్పేయితోకలిసి భారత ప్రజాస్వామ్యానికి అడ్వాణీ జాతీయ విలువలద్దారు. దేశ ప్రజాస్వామ్యాన్ని ఒక కుటుంబ గుత్తాధిపత్యం నుంచి విముక్తం చేసేందుకు నిరంతరం పోరాడారు. ఆయనకు భారతరత్న లభించడం బీజేపీకి, దాని అసంఖ్యా కార్యకర్తలకు కూడా గొప్ప గౌరవం’’ అని ఒడిశాలోని సంభాల్పూర్ ర్యాలీలో మోదీ పేర్కొన్నారు. మరోవైపు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్, అనురాగ్ ఠాకూర్ తదితరులతో పాటు పలు పారీ్టల నాయకులు కూడా అడ్వాణీకి అభినందనలు తెలిపారు. దేశానికి, బీజేపీకి, పార్టీ సిద్ధాంతానికి ఆయన చేసిన నిస్వార్థ సేవలను వరి్ణంచేందుకు మాటలు చాలవని షా అన్నారు. తన గురువైన అద్వానీకి ఇంతటి గౌరవం దక్కడం ఆనందంగా ఉందని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. ఆయనకు ఫోన్లో శుభాకాంక్షలు తెలిపానన్నారు. జేడీ(ఎస్) నేత కుమారస్వామి, ఎల్జేపీ (రాంవిలాస్) చీఫ్ చిరాగ్ పాశ్వాన్, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు తదితరులు అడ్వాణీకి అభినందనలు తెలిపారు. నేడు అయోధ్యలో రామాలయం కొలువుదీరిందంటే అందుకు అడ్వాణీయే కారణమని బీజేపీ సీనియర్ నేత యడియూరప్ప అన్నారు. త్వరలో దిగిపోనున్న మోదీ సర్కారు బీజేపీ ఓటుబ్యాంకును కాపాడుకునేందుకే అడ్వానీకి భారతరత్న ప్రకటించిందని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ విమర్శించారు. నేను ఆచరించిన విలువలకు, నా సేవలకు గుర్తింపు ‘‘భారతరత్న పురస్కారం నాకు అత్యున్నత గౌరవం మాత్రమే కాదు. నేను జీవితాంతం ఆచరించిన విలువలకు, శక్తివంచన లేకుండా అందించిన సేవలకు గుర్తింపు కూడా. దీన్ని అత్యంత వినమ్రతతో, కృతజ్ఞతతో స్వీకరిస్తున్నా. 14 ఏళ్ల వయసులో కార్యకర్తగా ఆరెస్సెస్‌లో చేరిన రోజు నుంచి భరతమాతకు నిస్వార్థంగా సేవ చేయడమే లక్ష్యంగా బతికా. ఈ జీవితం నాది కాదు, దేశానిదేనన్న భావనే నన్ను ముందుకు నడిపింది. ఈ సందర్భంగా పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజ్‌పేయిలను కృతజ్ఞతతో గుర్తు చేసుకుంటున్నా. ఈ ఇద్దరు మహనీయులతో కలిసి పని చేసే అదృష్టం నాకు దక్కింది. సుదీర్ఘ ప్రజా జీవితంలో నాతో పాటు కలిసి పని చేసిన లక్షలాది బీజేపీ, ఆరెస్సెస్ కార్యకర్తలు తదితరులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నాకు భారతరత్న ప్రకటించినందుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు, ప్రధాని మోదీకి కృతజ్ఞతలు. నాకు అడుగడుగునా అంతులేని ప్రేరణ శక్తిగా నిలిచిన నా కుటుంబీకులను, ముఖ్యంగా నన్ను వీడి వెళ్లిన నా భార్య కమలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నా. నా దేశం మరిన్ని ఘనతలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నా’’ – భారతరత్న ప్రకటన అనంతరం విడుదల చేసిన ప్రకటనలో అడ్వాణీ. -
ఆరు హైకోర్టులకు సీజేల నియామకం
న్యూఢిల్లీ: ఆరు హైకోర్టులకు నూతన ప్రధాన న్యాయమూర్తులను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లూ రాజస్థాన్ హైకోర్టుకు యాక్టింగ్ చీఫ్ జస్టిస్‌గా ఉన్న మనీంద్ర మోహన్ శ్రీవాస్తవను అదే కోర్టులో చీఫ్ జస్టిస్(సీజే)గా నియమించారు. పంజాబ్, హరియాణా హైకోర్టు యాక్టింగ్ సీజే జస్టిస్ రీతూ బహ్రీని ఉత్తరాఖండ్ హైకోర్టు సీజేగా నియమించారు. పట్నా హైకోర్టు జడ్జి జస్టిస్ చక్రధారి శరణ్ సింగ్‌ను ఒడిశా హైకోర్టు సీజేగా నియమించారు. రాజస్తాన్ హైకోర్టు జడ్జి జస్టిస్ విజయ్ బిష్ణోయ్‌ను గౌహతీ హైకోర్టు సీజేగా నియమించారు. రాజస్తాన్ హైకోర్టులో జడ్జి జస్టిస్ అరుణ్ భన్సాలీని అలహాబాద్ హైకోర్టు సీజేగా నియమించారు. మద్రాస్ హైకోర్టులో జడ్జి జస్టిస్ ఎస్. వైద్యనాథన్‌ను మేఘాలయ హైకోర్టుకు సీజేగా నియమించారు. -
ఎస్సీ వర్గీకరణపై కేంద్రం కమిటీ
సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. శుక్రవారం కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ కమిటీలో అయిదు మంత్రిత్వ శాఖలకు చెందిన కార్యదర్శులు సభ్యులుగా ఉన్నారు. హోం, న్యాయ, గిరిజన సంక్షేమ, సామాజిక న్యాయం, సిబ్బంది, శిక్షణ శాఖల కార్యదర్శులకు ఇందులో చోటు కలి్పంచారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి తీసుకోవాల్సిన పాలనాపరమైన చర్యలను పరిశీలించి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు, వీలైనంత త్వరగా తమ నివేదికను అందించేందుకు వీలుగా ఈ కమిటీ ఈనెల 23న తొలిసారి భేటీ కానుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో హైదరాబాద్‌లో మందకృష్ణ మాదిగ నేతృత్వంలో జరిగిన ఎస్సీ ఉపకులాల విశ్వరూప మహాసభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనడం తెలిసిందే. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు త్వరలో కమిటీ వేస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణ కోసం కమిటీ ఏర్పాటు చేయాలని గత నవంబర్ 24న ఆదేశించారు. గౌబా కమిటీ ఏర్పాటుకు తాజాగా నిర్ణయం తీసుకున్నారు. -
పీఎల్ఐ కింద రూ.4,415 కోట్ల ప్రోత్సాహకాలు
న్యూఢిల్లీ: ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్ నాటికి, ఎనిమిది రంగాలకు రూ.4,415 కోట్ల ప్రోత్సాహకాలను కేంద్ర సర్కారు మంజూరు చేసింది. ఈ విషయాన్ని వాణిజ్య శాఖ విభాగం డీపీఐఐటీ అదనపు కార్యదర్శి రాజీవ్ సింగ్ ఠాకూర్ వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికి రూ.11,000 కోట్లను మంజూరు చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నట్టు ప్రకటించారు. కేవలం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వరకే చూస్తే అక్టోబర్ నాటికి జారీ చేసిన మొత్తం రూ.1,515 కోట్లుగా ఉన్నట్టు, 2022–23లో రూ.2,900 కోట్లు మంజూరు చేసినట్టు వివరించారు. పెద్ద స్థాయి ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ, ఐటీ హార్డ్‌వేర్, బల్క్ డ్రగ్స్, వైద్య పరికరాలు, ఫార్మా, టెలికం, ఫుడ్ ప్రాసెసింగ్, డ్రోన్స్ రంగాలకు ఈ ప్రోత్సాహకాలను అందించినట్టు తెలిపారు. శామ్సంగ్ కంపెనీకి సంబంధించి ప్రోత్సాహకాల క్లెయిమ్‌లలో ఒక కేసు పరిష్కారమైనట్టు చెప్పారు. 2021లో కేంద్ర సర్కారు 14 రంగాలకు పీఎల్ఐ పథకాల కింద ప్రోత్సాహకాలను ప్రకటించడం గమనార్హం. టెలికం, వైట్ గూడ్స్, టెక్స్టైల్స్, వైద్య పరికరాల తయారీ, ఆటోమొబైల్స్, స్పెషాలిటీ స్టీల్, ఆహారోత్పత్తులు, అధిక సామర్థ్యం కలిగిన సోలార్ పీవీ మాడ్యూల్స్, అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ బ్యాటరీ, డ్రోన్లు, ఫార్మా తదితర రంగాలకు రూ.1.97 లక్షల కోట్ల ప్రోత్సాహకాలను ప్రకటించింది. వీటికి సంబంధించి దేశీ తయారీని ప్రోత్సహించాలన్నది కేంద్ర సర్కారు లక్ష్యంగా ఉంది. పీఎల్ఐ కింద ప్రోత్సాహకాల పంపిణీ అన్నది ఆయా శాఖల బాధ్యతగా ఠాకూర్ చెప్పారు. ప్రాజెక్టు పర్యవేక్షక ఏజెన్సీలు (పీఎంఏలు), కంపెనీల మధ్య సరైన సమాచారం లేకపోవడం వల్ల సమయం వృధా అవుతున్న సందర్భాలున్నట్టు తెలిపారు. దీంతో దరఖాస్తుల మదింపు ప్రక్రియకు పట్టే సమయాన్ని తగ్గించేందుకు వీలుగా ప్రామాణిక విధానాన్ని రూపొందించుకోవాలని ఆదేశించినట్టు వెల్లడించారు. రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు ఇప్పటి వరకు పీఎల్ఐ కింద 14 రంగాల్లోని కంపెనీల నుంచి 746 దరఖాస్తులు వచ్చాయని, ఇవి రూ.3 లక్షల కోట్లను పెట్టుబడిగా పెట్టనున్నట్టు రాజీవ్‌సింగ్ ఠాకూర్ తెలిపారు. 2023 నవంబర్ నాటికి రూ.1.03 లక్షల కోట్ల పెట్టుబడులు నమోదైనట్టు చెప్పారు. వీటి ద్వారా రూ.8.61 లక్షల కోట్ల అమ్మకాలు, 6.78 లక్షల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఫార్మా, టెలికం తదితర రంగాల్లో ప్రోత్సాహకాలను అందుకునే వాటిల్లో 176 ఎంఎస్ఎంఈలు కూడా ఉన్నట్టు పేర్కొన్నారు. పీఎల్ఐ ప్రోత్సాహకాల మద్దతుతో రూ.3.2 లక్షల కోట్ల ఎగుమతులు నమోదైనట్టు ఠాకూర్ తెలిపారు. ఎగుమతుల్లో ఎలక్ట్రానిక్స్, ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, టెలికం రంగాల భాగస్వామ్యం ఎక్కువగా ఉందన్నారు. -
గోల్డీని ఉగ్రవాదిగా ప్రకటించిన కేంద్రం
న్యూఢిల్లీ: కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్ సతీందర్‌జిత్ సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్‌ను కేంద్రం ఉగ్రవాదిగా ప్రకటించింది. ఉగ్రవాద వ్యతిరేక ఉపా చట్టం కింద అతడిని ఉగ్రవాది ప్రకటిస్తున్నట్లు హోం శాఖ సోమవారం తెలిపింది. పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ఇతడు మాస్టర్ మైండ్‌గా ఉన్నాడు. పాకిస్తాన్ దన్నుతో కార్యకలాపాలు సాగిస్తున్న ఇతడికి పలు హత్య కేసులతో సంబంధం ఉందని హోం శాఖ నోటిఫికేషన్లో తెలిపింది. పంజాబ్‌లోని శ్రీముక్త్సర్ సాహిబ్‌కు చెందిన బ్రార్ ప్రస్తుతం కెనడాలోని బ్రాంప్టన్‌లో ఉంటున్నాడు. ఇతడిపై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. -
పెట్రో ధరలు తగ్గించే యోచనలో కేంద్రం!
న్యూఢిల్లీ: అధిక పెట్రో ధరల నుంచి ప్రజానీకానికి కాస్తంత ఉపశమనం కల్గించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మూడు రాష్ట్రాల్లో గెలుపుతో జోరు మీదున్న బీజేపీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించే ఉద్దేశంతో ప్రజలకు పెట్రో ధరల భారం తగ్గించనుందని జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్‌కు రూ.6–10 తగ్గించాలని మోదీ సర్కార్ భావిస్తోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ధరల తగ్గింపునకు సంబంధించిన ప్రతిపాదనలను పెట్రోలియం శాఖ అధికారులు ప్రధాని మోదీ ఆమోదం కోసం పంపించారని వార్తలొచ్చాయి. అయితే ఈ ధరల సవరణపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. చాలా నెలలుగా ప్రభుత్వరంగ రిటైల్ చమురు కంపెనీలు పెట్రో ధరలను తగ్గించలేదు, పెంచలేదు. గత ఆర్థికసంవత్సరంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడంతో రిటైల్ కంపెనీలు ఆ ధరల భారాన్ని ప్రజలపై పడేశాయి. దీంతో అప్పుడు ధరలు పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గినా ఆమేరకు రిటైల్ అమ్మకం ధరలను సంస్థలు తగ్గించలేదు. దాంతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హెచ్‌పీసీఎల్‌లు ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి ఆరు నెలల్లో ఏకంగా రూ.58,198 కోట్ల ఆదాయాన్ని మూటగట్టుకున్నాయి. చివరిసారిగా 2022 మే 22వ తేదీన కేంద్రం పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ఎక్సయిజ్ సుంకాన్ని తగ్గించింది. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ.8 , లీటర్ డీజిల్ ధర రూ.6 తగ్గింది. కొద్ది నెలలుగా కీలక రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో పెట్రో ధరలను పెంచలేదని, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మరింత తగ్గించనున్నారని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. -
భారతీయ జర్నలిస్టుల ఫోన్లపై పెగాసస్ నిఘా!
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్‌కు చెందిన పెగాసస్ నిఘా సాఫ్ట్‌వేర్‌తో కేంద్రప్రభుత్వం హ్యాకింగ్‌కు పాల్పడిందన్న ఆరోపణలకు తాజాగా బలం చేకూరింది. ప్రభుత్వ ప్రాయోజిత హ్యాకర్లతో దేశంలోని ప్రముఖుల ఐఫోన్లను లక్ష్యంగా చేసుకున్నారంటూ ‘యాపిల్’ నుంచి అప్రమత్తత సందేశాలు అక్టోబర్‌లో వచి్చన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఇద్దరు భారతీయ జర్నలిస్టులు తమ ఫోన్లను ల్యాబ్ పరీక్షకు పంపించగా అవి పెగాసస్ స్పైవేర్ హ్యాకింగ్‌కు గురయ్యాయని తేలింది. తమ సెక్యూరిటీ ల్యాబ్ పరీక్షలో ఈ విషయం నిర్ధారణ అయిందని లాభాపేక్షలేని అంతర్జాతీయ సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ గురువారం ప్రకటించింది. దీంతో ఆనాడు చాలా మందికి పొరపాటున అలర్ట్‌లు వచ్చాయన్న యాపిల్ ఇచి్చన వివరణ తప్పు అని తేలింది.∙పెగాసస్ తమ నిఘా సాఫ్ట్‌వేర్‌ను కేవలం దేశాల ప్రభుత్వాలకే విక్రయిస్తోంది. భారత్‌కు చెందిన నిఘా విభాగం సైతం ఇదే సంస్థ నుంచి కొంత హార్డ్‌వేర్‌ను 2017లో కొనుగోలుచేసినట్లు వాణిజ్య గణాంకాల్లో వెల్లడైంది. ఈ స్పైవేర్ సాయంతో దేశంలోని ప్రముఖులు, రాజకీయవేత్తలు, సామాజిక కార్యకర్తలు, న్యాయమూర్తుల ఫోన్లను హ్యాక్ చేశారని 2021 జూలైæ నెలలో అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడటం తెల్సిందే. భారత్‌లోనూ ప్రముఖులు ఈ హ్యాకింగ్బారిన పడ్డారని ‘ది వైర్’ వార్తాసంస్థ సంచలన కథనం వెలువరిచింది. ‘ది వైర్’ వెబ్సైట్ ఎడిటర్ సిద్ధార్థ్ వరదరాజన్, ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అండ్ కరప్షన్ రిపోర్ట్ ప్రాజెక్ట్(ఓసీసీఆర్పీ) సౌత్ ఆసియా ఎడిటర్ ఆనంద్ మంగ్నాలే ఫోన్లను హ్యాకర్లు లక్ష్యంగా చేసుకున్నారని ఆమ్నెస్టీ వెల్లడించింది. వివాదాన్ని కప్పిపుచ్చే ఉద్దేశంతోనే భారత ప్రభుత్వమే యాపిల్ సంస్థపై ఒత్తిడి తెచ్చి తప్పుడు అలర్ట్‌లు వచ్చాయని చెప్పించిందని ‘వాషింగ్టన్ పోస్ట్’ పేర్కొంది. ‘ భారత్‌లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా 150 దేశాల ఐఫోన్ యూజర్లకు ఇలా పొరపాటున అలర్ట్‌లు వెళ్లాయి’’ అని యాపిల్ ఆనాడు ప్రకటించింది. రాహుల్ గాం«దీసహా పలువురు విపక్ష నేతలు, జడ్జీలు, సామాజిక కార్యకర్తల ఫోన్ల హ్యాకింగ్ ఉదంతం గతంలో పార్లమెంట్‌నూ కుదిపేసింది. ఇంత జరిగినా ‘‘తాము స్పైవేర్‌ను ఇజ్రాయెల్ సంస్థ నుంచి కొనలేదు. వినియోగించలేదు’’ అని మోదీ సర్కార్ చెప్పకపోవడం గమనార్హం. భారత రక్షణ నిఘా విభాగానికి చెందిన సిగ్నల్ ఇంటెలిజెంట్ డైరెక్టరేట్ గతంలో కాగ్సైట్ అనే సంస్థ నుంచి నిఘా పరికరాలు కొనుగోలు చేసిందని ఆరోపణలు వచ్చాయి. -
సస్పెన్షన్ కోసం వాళ్లే అభ్యర్థించారు: జోషి
న్యూఢిల్లీ: ప్రతిపక్ష ఎంపీలను లోక్‌సభ నుంచి సస్పెండ్ చేయాలని కేంద్రప్రభుత్వం అనుకోలేదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. సభకు అంతరాయం కలిగించిన కొందరు ఎంపీలను సస్పెండ్ చేయడంతో తమను కూడా సస్పెండ్ చేయాలంటూ ప్రతిపక్ష ఎంపీలు తమను కోరారని ఆయన చెప్పారు. శుక్రవారం మంత్రి ప్రహ్లాద్ జోషి మీడియాతో మాట్లాడారు. ‘ఎంపీలను సస్పెండ్ చేయాలనే ఉద్దేశం మాకు లేదు. ప్లకార్డులతో రావొద్దని కోరాం. చర్యలుంటాయని ముందుగానే వారికి చెప్పాం. నిబంధనలు ఉల్లంఘించి కొందరు ఎంపీలు సస్పెన్షన్‌కు గురయ్యారు. క్రమశిక్షణారాహిత్యం కింద తమను కూడా సస్పెండ్ చేయాలంటూ మిగతా వారు కూడా కోరారు. కాంగ్రెస్ స్థాయి అంతగా దిగజారింది. లోక్‌సభ నుంచి 100 మంది, రాజ్యసభ సభ్యులు 46 మంది మొత్తం 146 మంది ఎంపీలు బహిష్కరణకు గురయ్యారు’అని మంత్రి చెప్పారు. తాజాగా పార్లమెంట్ ఆమోదం పొందిన మూడు క్రిమినల్ బిల్లుల్లో ఏమైనా లోపాలున్నాయని భావిస్తే కోర్టుకు వెళ్లే స్వేచ్ఛ ప్రతిపక్షాలకు ఉందని ఆయన చెప్పారు. -
వ్యవసాయ ఎగుమతులకు ఆంక్షల దెబ్బ
న్యూఢిల్లీ: గోధుమలు, బాస్మతియేతర బియ్యం, చక్కెర ఎగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించిన నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వ్యవసాయ ఎగుమతులపై 4–5 బిలియన్ డాలర్ల మేర ప్రతికూల ప్రభావం పడొచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. అయితే, బాస్మతి, పండ్లు..కూరగాయలు, మాంసం..డెయిరీ మొదలైన వాటి ఎగుమతులు పెరుగుతుండటంతో కనీసం గత ఆర్థిక సంవత్సరం స్థాయినైనా నిలబెట్టుకోగలమని ప్రభుత్వం ఆశిస్తోంది. కానీ, ఎర్ర సముద్రంలో హౌతీ రెబెల్స్ దాడుల కారణంగా బాస్మతి బియ్యం ఎగుమతులపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఒకవేళ యూరోపియన్ యూనియన్, ఆఫ్రికా మార్కెట్లకు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాల్సి వస్తే వ్యయాల భారం 15–20 శాతం మేర పెరగొచ్చని సంబంధిత వర్గాలు తెలి పాయి. ‘‘పరిమితుల వల్ల వ్యవసాయ ఎగుమ తులపై 4–5 బిలియన్ డాలర్ల మేర ప్రభావం పడినా, మొత్తం మీద చూస్తే ఎగుమతులు గతేడాది స్థాయి లో ఉండొచ్చని అంచనా వేస్తున్నాం’’ అని పేర్కొన్నాయి. 2022–23లో వ్యవసాయ ఎగుమతులు 53.15 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. బాస్మతి టాప్.. భారత్ నుంచి ఎగుమతయ్యే వ్యవసాయోత్పత్తుల్లో బాస్మతి బియ్యం అగ్రస్థానంలో ఉంటోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్ వరకు ఈ ప్రీమియం వెరైటీ ఎగుమతులు 3 బిలియన్ డాలర్లకు చేరాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో బాస్మతి బియ్యం ఎగుమతులు 15–20 శాతం అధికంగా ఉండొచ్చని ప్రభు త్వం అంచనా వేస్తోంది. మరోవైపు, ఎర్ర సముద్రంలో హౌతీ రెబెల్స్ దాడుల కారణంగా బాస్మతి ఎగుమతులపై ఆందోళన నెలకొంది. దీంతో ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న రిసు్కలపై చర్చించేందుకు కేంద్ర వాణిజ్య శాఖ విభాగం వారితో సమావేశమైంది. ఇప్పటివరకైతే దాడులపరంగా ఎలాంటి ప్రభావమూ లేదని, ఒకవేళ రిసు్కలు అలాగే కొనసాగిన పక్షంలో యూరోపియన్ యూనియన్, ఆఫ్రికా మార్కెట్లకు చేరుకోవడానికి వారు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేíÙంచాల్సి వస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ‘‘దీనితో వారి వ్యయాలు 15– 20% పెరగవచ్చు. అది ధరల్లోనూ ప్రతిఫలించే అవకాశం ఉంది’’ అని వివరించాయి. బాస్మతి బియ్యం ప్రీమియం ఉత్పత్తి కావడంతో ధర కొంత పెరిగినా డిమాండ్‌లో మార్పేమి ఉండకపోవచ్చని తెలిపాయి. -
ఆరోగ్య రంగానికీ నియంత్రణలు!
న్యూఢిల్లీ: ఆరోగ్య పరిరక్షణ రంగానికి ఒక నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీంతోపాటు.. అందరికీ ఆరోగ్య బీమా అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక, ఆరోగ్య శాఖల మధ్య ఇందుకు ప్రాథమిక చర్చలు ప్రారంభమైనట్లు సంబంధిత ప్రభుత్వ అధికారులు ఇద్దరు తెలియజేశారు. అందరికీ ఆరోగ్య బీమా లక్ష్యాన్ని సాధించేందుకు మరింత సమర్ధవంత చర్యలకు తెరతీయవలసి ఉన్నట్లు పేర్కొన్నారు. ఆరోగ్య బీమాను అందుబాటులో అందరికీ అందించేందుకు ప్రత్యేక దృష్టి సారించవలసి ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. ఇటీవల జాతీయ బీమా ఏజెన్సీ(ఎన్ఐఏ) వెలువరించిన నివేదిక ప్రకారం 40 కోట్లమందికిపైగా వ్యక్తులకు జీవిత బీమా అందుబాటులో లేదు. అంటే మొత్తం జనాభాలో మూడో వంతుకు బీమా అందడం లేదు. బీమా వ్యాప్తిలేకపోవడం, చాలీచాలని కవరేజీ, ఆరోగ్య పరిరక్షణా వ్యయాలు పెరిగిపోవడం ఇందుకు కారణాలుగా అధికారులు పేర్కొన్నారు. అయితే చికిత్సా వ్యయాలలో ప్రామాణికత, ఆరోగ్య క్లెయిములను పరిష్కారించడం తదితర అంశాలలో విభిన్న సవాళ్లు, అవకాశాలు ఉన్నట్లు వివరించారు. ఆరోగ్య రంగంలో తాజాగా ఏర్పాటు చేయతలపెట్టిన నియంత్రణ సంస్థ తప్పనిసరిగా వీటిని పరిష్కరించవలసి ఉంటుందని తెలియజేశారు. వెరసి సవాళ్ల పరిష్కార వ్యూహాలు, నియంత్రణ సంస్థ(హెల్త్ రెగ్యులేటర్) పాత్ర వంటి అంశాలపై చర్చించేందుకు ఆరోగ్య బీమా రంగ కంపెనీలతోపాటు.. సంబంధిత వ్యక్తులు, సంస్థలతో సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. అంతేకాకుండా హెల్త్ రెగ్యులేటర్.. ఆరోగ్య క్లెయిముల జాతీయ ఎక్సే్ఛంజీ(ఎన్‌హెచ్‌సీఎక్స్) పరిధిని విస్తరించడం, పరిశ్రమను మరింత సమర్ధవంతంగా పర్యవేక్షించే అధికారాలను కలిగి ఉండటం ముఖ్యమని మరో అధికారి వ్యాఖ్యానించారు. -
Winter Parliament Session 2023: క్రిమినల్ చట్టాలకు ఆమోదం
న్యూఢిల్లీ: బ్రిటిష్ వలస పాలన నాటి క్రిమినల్ చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న మూడు కీలక బిల్లులకు గురువారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లులను లోక్‌సభ బుధవారం మూజు వాణి ఓటుతో ఆమోదించిన విషయం తెలిసిందే. భారతీయ న్యాయ సంహిత బిల్లు, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత బిల్లు, భారతీయ సాక్ష్య బిల్లును కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్‌సభలో ప్రవేశ పెట్టారు. ఇండియన్ పీనల్ కోడ్–1860, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ యాక్ట్–1898, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్–1872 స్థానంలో ఈ మూడు బిల్లులను తీసుకొచ్చారు. ‘ఈ బిల్లులు చట్ట రూపం దాల్చితే ఎఫ్ఐఆర్ నమోదు ప్రక్రియ మొదలుకొని తీర్పు వరకు అన్నీ ఆన్లైన్ అవుతాయి. దేశ విద్రోహ చట్టం రద్దయి పోయింది. రాజద్రోహాన్ని దేశద్రోహంగా మార్చారు. దేశ సార్వభౌమాధికారం, సమగ్రతకు భంగం కలిగించే చర్యలకు కొత్త చట్టం ప్రకారం శిక్షలుంటాయి’అని అమిత్ షా వివరించారు. దేశంలోని అన్ని పోలీస్ స్టేషన్లు, కోర్టులు డిజిటైజ్ అవుతాయని చెప్పారు. వీటిల్లో చండీగఢ్ మొట్టమొదటగా డిజిటైజ్ అవుతుందన్నారు. బ్రిటిష్ పాలనలో గాంధీజీ, తిలక్, సావర్కర్ వంటి వారిని జైళ్లకు పంపిన నిబంధనలను తొలగించడం సంతోషాన్నిచ్చిందని మంత్రి చెప్పారు. బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ సభ్యులు సభలో లేనప్పటికీ మంత్రి ఆ పార్టీపై విమర్శలు చేశారు. ఇటాలియన్ అద్దాలు ధరించిన వారు భారత పార్లమెంట్ కొత్త క్రిమినల్ చట్టాలను రూపొందించడాన్ని సగర్వంగా భావించరంటూ కాంగ్రెస్ నేత సోనియానుద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. -
కోవిడ్ కేసులు పైపైకి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యగా అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం సూచనలు జారీచేసింది. కోవిడ్ కేసుల్లో పెరుగుదల, కేరళలో కరోనా కొత్త సబ్‌వేరియంట్ జేఎన్1 (బీఏ 2.86.1.1) వెలుగుచూసిన నేపథ్యంలో కేంద్రం సోమవారం ముందస్తు చర్యలకు దిగింది. ‘‘ కోవిడ్ కేసుల్లో ఉధృతి కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా చర్యలు తీసుకోవాలి. పెరుగుతున్న కేసులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాలన్నీ అప్రమత్తంగా ఉండాలి. భారత వాతావరణాన్ని తట్టుకుని వేరియంట్లు విజృంభించేలోపు ముందస్తు చర్యలతో సమాయత్తం అవుదాం’’ అని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి సుధాన్‡్ష పంత్ రాష్ట్రాలకు లేఖ రాశారు. ఆదివారం దేశవ్యాప్తంగా ఐదుగురు కోవిడ్‌తో కన్నుమూశారు. కొత్తగా వందలాది కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. -
ఎల్రక్టానిక్ విడిభాగాల తయారీకి ఊతం
న్యూఢిల్లీ: ఎల్రక్టానిక్ ఉత్పత్తుల తయారీని దేశీయంగా పెంచేందుకు ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకాలను (పీఎల్ఐ) ప్రకటించిన కేంద్ర సర్కారు.. ఇప్పుడు ఎల్రక్టానిక్ విడిభాగాల స్థానిక తయారీని సైతం ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇందుకు సంబంధించి కొత్త పథకాలపై కసరత్తు చేస్తున్నట్టు కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ సెక్రటరీ ఎస్.కృష్ణన్ వెల్లడించారు. సీఐఐ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రస్తుతం దేశ మొబైల్ ఫోన్ల మార్కెట్లో 99% స్థానికంగానే తయారవుతున్నట్టు చెప్పారు. ‘‘అసెంబ్లీ యూనిట్లకు అదనంగా 10–15 శాతం విలువ జోడింపుపైనే ఆధారపడకూడదు. మనం ఇంకా ఏమి చేయగలమో, విలువ ఆధారిత సరఫరాలో మరింత ముందుకు ఎలా వెళ్లగలమో ఆలోచించాలి’’అని సూచించారు. ఏ దేశం కూడా మొత్తం వ్యాల్యూచైన్‌లో ఆధిపత్యం చూపించలేదన్నారు. చైనా విషయానికొస్తే వ్యాల్యూచైన్‌లో 40–45% వాటా కలిగి ఉన్నట్టు చెప్పారు. భారత్ 35–40% సొంతం చేసుకోవడంపై దృష్టి పెట్టాలని పరిశ్రమకు సూచించారు. ఎల్రక్టానిక్ ఉత్పత్తుల విడిభాగాలకు సంబంధించి రెండో విడత పీఎల్ఐ పథకాన్ని ప్రకటించనున్నట్టు తెలిపారు. -
డీప్ ఫేక్ వీడియోలపై కేంద్రం సీరియస్
సాక్షి, న్యూఢిల్లీ: డీప్ ఫేక్ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ముఖ్యమైన సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌కు కేంద్ర ఎల్రక్టానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సూచనలు చేసింది. ఈ వివరాలను కేంద్ర సహయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ రాజ్యసభకు తెలిపారు. ‘డీఫ్ ఫేక్’ ఫొటోలు, వీడియోల సృష్టికర్తల ఆగడాలను ఊపేక్షించేదిలేదని, భారీ జరిమానాలను వి«ధిస్తామని ఇటీవల కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ సంస్థల సమావేశంలో హెచ్చరించిన విషయం తెల్సిందే. సంబంధిత మార్గదర్శకాలను, త్వరలో తీసుకురాబోయే చట్టాలను, నిబంధనలను రాజ్యసభ దృష్టికి తీసికెళ్లినట్లు మంత్రి పేర్కొన్నారు. సెక్షన్ 66డీ కింద కంప్యూటర్ ఆధారిత సాంకేతికతతో ఇలాంటి చర్యలకు పాల్పడితే మూడేళ్ల జైలు శిక్ష, రూ.1 లక్ష జరిమానా విధిస్తామని మంత్రి చంద్రశేఖర్ రాజ్యసభకు తెలిపారు. -
2024లో ఇస్రో 10 కీలక ప్రయోగాలు
న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) వచ్చే ఏడాది 10 కీలక ప్రయోగాలు చేపట్టనుందని కేంద్ర ప్రభుత్వం గురువారం రాజ్యసభలో వెల్లడించింది. ఇందులో ఆరు పీఎస్ఎల్వీ మిషన్లు, మూడు జీఎస్ఎల్వీ ప్రయోగాలు, ఒక లాంచ్ వెహికల్ మార్క్–3 వాణిజ్య ప్రయోగం ఉందని తెలియజేసింది. ఈ మేరకు సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. ఇస్రో అభివృద్ధి చేసిన నూతన స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్(ఎస్ఎస్ఎల్వీ) ద్వారా ఒక ఉపగ్రహాన్ని ప్రయోగాత్మకంగా నింగిలోకి పంపించనున్నట్లు వివరించారు. ప్రతిష్టాత్మక గగన్‌యాన్ కార్యక్రమంలో భాగంగా కక్ష్య మాడ్యూల్‌ను నిర్ధారించుకొనేందుకు రెండు మానవ రహిత మిషన్లు చేపట్టాలని ఇస్రో భావిస్తోందని జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. -
Parliament Winter sessions 2023: రేపు అఖిలపక్ష భేటీ
న్యూఢిల్లీ: డిసెంబర్ నాలుగో తేదీ నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మొదలుకానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష భేటీకి పిలుపునిచ్చింది. డిసెంబర్ రెండో తేదీన(శనివారం) అఖిలపక్ష సమావేశానికి హాజరుకావాలని సంబంధిత రాజకీయ పార్టీలకు కేంద్రం ఆహ్వానం పంపింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రల్హాద్ జోషీ అధ్యక్షతన జరిగే ఈ భేటీలో కేంద్రం తరఫున రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, వాణిజ్య మంత్రి పియూశ్ గోయల్‌తోపాటు రాజకీయ పార్టీల లోక్‌సభ, రాజ్యసభ పక్ష నేతలు పాల్గొంటారు. ప్రస్తుతం పార్లమెంట్ వద్ద 37 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ సారి సెషన్లో ఏడు బిల్లులను ప్రవేశపెట్టాలని, 12 బిల్లులను ఆమోదింపజేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గ్రాంట్ల తొలి అదనపు బిల్లులను ప్రవేశపెట్టాలని సర్కార్ భావిస్తోంది. లోక్‌సభలో ‘నగదుకు ప్రశ్నలు’ ఉదంతంలో టీఎంసీ మహిళా ఎంపీ మహువా మొయిత్రాపై బహిష్కరణ వేటు వేయాలంటూ నైతికవిలువల కమిటీ ఇచ్చిన సిఫార్సును ఈసారి సభలో ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తోంది. భారతీయ శిక్షా స్మృతి, నేర శిక్షా స్మృతి, సాక్ష్యాధారాల చట్టాల స్థానంలో కొత్త బిల్లులను సభ ముందు ఉంచాలని మోదీ ప్రభుత్వం భావిస్తోంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఎలక్షన్ కమిషనర్ల నియామక బిల్లునూ ప్రవేశపెట్టే అవకాశముంది. -
కొలీజియం సిఫార్సుల అమలేదీ?
న్యూఢిల్లీ: హైకోర్టు న్యాయమూర్తుల బదిలీల విషయంలో సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడం, నచి్చన జడ్జిలనే బదిలీ చేయడం, ఇతరులను పెండింగ్‌లో పెట్టడంపై సుప్రీంకోర్టు ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలాంటి వైఖరి తప్పుడు సంకేతాలను పంపిస్తుందని వెల్లడించింది. 11 మంది జడ్జిలను బదిలీ చేయాలని కొలీజియం సిఫార్సు చేయగా, ఐదుగురిని కేంద్ర ప్రభుత్వం బదిలీ చేసింది. మరో ఆరుగురి బదిలీ వ్యవహారం పెండింగ్‌లో ఉంది. కొలీజియం సిఫార్సుల అమలు విషయంలో 2021 నాటి సుప్రీంకోర్టు తీర్పునకు కేంద్ర న్యాయ శాఖ కట్టుబడటం లేదని, కోర్టు ధిక్కరణ కింద చర్యలు చేపట్టాలని కోరుతూ బెంగళూరు అడ్వొకేట్స్ అసోసియేషన్‌తోపాటు మరికొందరు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుధాంశు ధూలియా ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. హైకోర్టు జడ్జిలుగా పలువురి పేర్లను కొలీజియం ఇటీవల సిఫార్సు చేయగా, 8 మంది పేర్లకు కేంద్రం ఇంకా ఆమోదం తెలియజేయాలని గుర్తుచేసింది. కేంద్రం జడ్జిలుగా నియమించిన వారికంటే వీరిలో కొందరు సీనియర్లు ఉన్నారని వెల్లడించింది. -
One Nation One Election: జమిలి ఎన్నికలకు 30 లక్షల ఈవీఎంలు కావాలి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లోక్‌సభతోపాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలంటే 30 లక్షల ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాలు(ఈవీఎంలు) అవసరమని అధికార వర్గాలు వెల్లడించాయి. అలాగే జమిలి ఎన్నికలకు సన్నాహాలు పూర్తిచేయడానికి దాదాపు ఏడాదిన్నర సమయం కావాలని పేర్కొన్నాయి. జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై దేశంలో చర్చ జరుగుతోంది. లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. కేంద్ర లా కమిషన్ ప్రస్తుతం జమిలి ఎన్నికల అంశంపై కసరత్తు చేస్తోంది. జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే ఈవీఎంలు ఎన్నికావాలి? ఎంత సమయం అవసరం? అన్నదానిపై ఎన్నికల సంఘం అధికారులు లా కమిషన్‌కు కొన్ని నెలల క్రితం సమాచారం ఇచి్చనట్లు తెలుస్తోంది. ఒక్కో ఈవీఎంలో భాగంగా ఒక కంట్రోల్ యూనిట్, ఒక బ్యాలెట్ యూనిట్, ఒక వీవీప్యాట్ ఉంటాయి. జమిలి ఎన్నికలకు 30 లక్షల కంట్రోల్ యూనిట్లు, 43 లక్షల బ్యాలెట్ యూనిట్లు, 32 లక్షల వీవీప్యాట్లు కావాలని చెబుతున్నారు. కొన్ని బ్యాలెట్ యూనిట్లు, వీవీప్యాట్లను రిజర్వ్‌లో ఉంచాల్సి ఉంటుంది కాబట్టి అదనంగా అవసరమని పేర్కొంటున్నారు. ఒకవేళ జమిలి ఎన్నికలు నిర్వహిస్తే కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు, వీవీప్యాట్లు కలిపి దాదాపు 35 లక్షల ఓటింగ్ యూనిట్లను కొత్తగా సమకూర్చుకోవాల్సి ఉంటుందని సమాచారం. 12.50 లక్షల పోలింగ్ కేంద్రాలు లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగినప్పటికీ రెండు ఓట్లు వేర్వేరుగా వేయాల్సి ఉంటుంది. అందుకు రెండు ఈవీఎంలు కావాలి. జమిలి ఎన్నికల్లో ఓటింగ్ పూర్తయిన తర్వాత ఈవీఎంలను భద్రపర్చడానికి తగిన వసతులు ఉండాలని ఎన్నికల సంఘం పేర్కొంది. గత లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 12.50 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో 15 లక్షల కంట్రోల్ యూనిట్లు, 15 లక్షల వీవీప్యాట్లు, 18 లక్షల బ్యాలెట్ యూనిట్లు ఉపయోగించారు. అన్నీ కలిపి కోటి యూనిట్లు కొనుగోలు చేయాలంటే రూ.15,000 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుందని అంచనా. లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభలతోపాటు మున్సిపాల్టీలు, పంచాయతీల ఎన్నికలు నిర్వహించడంపై(ఒక దేశం, ఒకే ఎన్నిక) మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ అధ్యయనం కొనసాగిస్తోంది. -
ఎన్నికల రాష్ట్రాల్లో ‘వికసిత్ భారత్ సంకల్ప్’ వద్దు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తమ పథకాలు తదితరాల గురించి ప్రజలకు వివరించేందుకు తలపెట్టిన వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రను అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో డిసెంబర్ ఐదో తేదీదాకా చేపట్టరాదని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబాకు గురువారం ఈ మేరకు లేఖ రాసింది. ‘నవంబర్ 20 నుంచి మొదలవుతున్న ఈ యాత్ర కోసం జిల్లా రథ్ ప్రహారీలుగా సీనియర్ ప్రభుత్వాధికారులను నామినేట్ చేయాల్సిందిగా రాష్ట్రాలకు కేంద్రం లేఖ రాసినట్టు మా దృష్టికి వచి్చంది. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న ఐదు రాష్ట్రాల్లో, నాగాలాండ్‌లో ఉపఎన్నిక జరుగుతున్న తపీ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో డిసెంబర్ ఐదో తేదీదాకా ఇలాంటి కార్యకలాపాలేవీ చేపట్టరాదు’ అని ఆదేశించింది. -
ఎరువులపై రూ.22,303 కోట్ల సబ్సిడీ
న్యూఢిల్లీ: రబీ సీజన్లో పాస్ఫరస్, పొటాషియం (పీ అండ్ కే) సంబంధిత ఎరువులపై రూ.22,303 కోట్ల సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. 50 కేజీల డీఏపీ బస్తా ధరను రూ.1,350గానే కొనసాగించాలని నిర్ణయించింది. 2023–24 రబీ సీజన్(2023 అక్టోబర్ ఒకటో తేదీ నుంచి 2024 మార్చి 31 దాకా)లో పోషకాల ఆధారిత సబ్సిడీకి ఎరువులు, రసాయనాల శాఖ చేసిన ప్రతిపాదనలకు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ఆమోదముద్ర వేసింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర సమాచార, ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ తర్వాత మీడియాకు వెల్లడించారు. రైతులకు అందుబాటు ధరల్లో చాలినన్ని ఎరువులను అందుబాటులో ఉంచడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన చెప్పారు. ‘ నత్రజని, ఫాస్ఫరస్, పొటాíÙయంలు పాత ధరకే లభిస్తాయి. అంటే బస్తా నత్రజని పాత రూ.1,470 ధరకే, ఎస్ఎస్పీ(సింగిల్ సూపర్ ఫాస్ఫేట్) బస్తా దాదాపు రూ.500కు దొరుకుతాయి. ఫొటాష్(ఎంఓపీ) బస్తా ధర రూ.1,655కు తగ్గనుంది’ అని మంత్రి వివరించారు. గత ఖరీఫ్ సీజన్‌కు రూ.38,000 కోట్ల ఎరువుల సబ్సిడీని కేంద్రం అందజేయడం తెలిసిందే. మొత్తం వార్షిక ఎరువుల సబ్సిడీ రూ.2.55 లక్షల కోట్లకు పెరిగిందని ఠాకూర్ చెప్పారు. -
కేంద్ర ప్రభుత్వోద్యోగులకు 4 శాతం డీఏ
న్యూఢిల్లీ: పండుగ సీజన్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు. ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్‌ను 4 శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో ఉద్యోగులకు డీఏ వారి మూలవేతనంలో 46 శాతానికి చేరింది. అలాగే నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనాన్ని బోనస్‌గా ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ మేరకు పలు నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ నిర్ణయాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తర్వాత మీడియా సమావేశంలో వెల్లడించారు. డీఏ, డీఆర్ పెంపుతో 48.67 లక్షల మంది కేంద్ర ప్రభుత్వోద్యోగులు, 67.95 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందుతారని ఆయన తెలిపారు. వీటితో ఖజానాపై రూ.2,857 కోట్ల భారం పడనుంది. డీఏ పెంపు 2023 జూలై 1 నుంచి వర్తిస్తుంది. గత మార్చి, 2022 సెపె్టంబర్లో డీఏ, డీఆర్ 4 శాతం మేరకు పెరిగాయి. ఇక బోనస్ పెంపుతో లోకో పైలట్లు, గార్డులు, స్టేషన్ మాస్టర్లు, సూపర్వైజర్లు, టెక్నీషియన్లు, పాయింట్స్ మెన్, ఇతర గ్రూప్– సి సిబ్బంది సహా 11.07 లక్షల మంది రైల్వే ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. దీని ద్వారా రైల్వేలపై రూ.1,969 కోట్ల ఆరి్ధక భారం పడనుందని ఠాకూర్ తెలిపారు. మరోవైపు చక్కెర ఎగుమతులపై నిషేధాన్ని అక్టోబర్ నెలాఖరును దాటి నిరవధికంగా కేంద్రం పొడిగించింది. భారత్ ప్రపంచంలో అతి పెద్ద చక్కెర తయారీదారు. రెండో అతి పెద్ద ఎగుమతిదారు. 2024–25 రబీ మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించి గోధుమలకు మద్దతు ధరను మరో రూ.150 మేర పెంచుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం క్వింటాల్‌కు మద్దతు ధర రూ.2,125గా ఉంది. దీన్ని రూ.2,275కు పెంచినట్లుగా కేంద్రం ప్రకటించింది. కేంద్రంలో మోదీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచి్చన తర్వాత ఈ స్థాయిలో మద్దతు ధరను పెంచడం ఇదే తొలిసారి. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో గోధుమలు సహా బార్లీ, ఎర్రపప్పు, శనగలు, కుసుమ, ఆవాల మద్దతు ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఎర్రపప్పు (మసూర్) ధర రూ.425 మేర పెంచడంతో క్వింటాల్ ధర రూ.6,425కి చేరింది. ఆవాలకు కనీస మద్దతు ధరను రూ.200 పెంచడంతో అది రూ.5,650కి చేరుకుంది. కుసుమలు క్వింటాల్ రూ.5,650గా ఉండగా, రూ.150 చొప్పున పెంచడంతో రూ.5,800లకు చేరింది. బార్లీ మద్దతు ధరను రూ.115 మేర పెంచడంతో ధర 1,735 నుంచి రూ.1,850కి చేరింది. శనగల «కనీస మద్దతు ధరను రూ.150 మేర పెంచారు. దీని ధర క్వింటాల్‌కు రూ.5,335 నుంచి రూ.5,440కి చేరింది. -
‘నిర్మాణ పరికరాల’ ఆదాయం 15 శాతం అప్
న్యూఢిల్లీ: దేశీయంగా నిర్మాణ పరికరాల రంగం ఆదాయం 2023–24 ఆర్థిక సంవత్సరంలో 14–15 శాతం మేర వృద్ధి చెందనుంది. మౌలికరంగంపై కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెడుతుండటం ఇందుకు దోహదపడనుంది. అలాగే, రియల్ ఎస్టేట్, మైనింగ్ రంగాల్లో కార్యకలాపాలు పుంజుకోవడం కూడా తోడ్పాటు అందించనుంది. క్రిసిల్ రేటింగ్స్ ఒక నివేదికలో ఈ మేరకు అంచనా వేసింది. ‘‘గత ఆర్థిక సంవత్సరంలో అధిక బేస్ (29 శాతం) ప్రాతిపదికన ఈ ఆర్థిక సంవత్సరంలో దేశీ నిర్మాణ పరికరాల రంగం ఆదాయం 14–15 శాతం మేర వృద్ధి చెందవచ్చు. నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ (ఎన్ఐపీ)తో పాటు రహదారులు, మెట్రోలు, రైల్వేలు మొదలైన మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టడం ఇందుకు దోహదపడనుంది’’ అని క్రిసిల్ రేటింగ్స్ పేర్కొంది. సాధారణంగా నిర్మాణ పరికరాల వినియోగంలో రహదారుల వాటా 40 శాతం వరకు ఉంటుంది. రోడ్ల నిర్మాణం పనులు వేగవంతం అవుతుండటం పరిశ్రమ వృద్ధికి సహాయకరంగా ఉండనుంది. వంతెనలు.. విమానాశ్రయాలూ.. రియల్ ఎస్టేట్, మైనింగ్ రంగాలతో పాటు వంతెనలు, విమానాశ్రయాలు, మెట్రో కారిడార్లు మొదలైన వాటి కాంట్రాక్టర్ల నుంచి తయారీ సంస్థలకు ఆర్డర్లు బాగా ఉంటున్నాయని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ పూనమ్ ఉపాధ్యాయ్ తెలిపారు. 2024 ఏప్రిల్ 1 నుంచి పరిశ్రమ స్టేజ్–వీ2 ఉద్గార ప్రమాణాలకు మళ్లనుండటం వల్ల పరికరాల ధరలు పెరగనుండటంతో ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో పరికరాలను ముందుగానే కొంత కొని పెట్టుకునే ధోరణులు కూడా కనిపించవచ్చని వివరించారు. పరిమాణంపరంగా చూస్తే గత ఆర్థిక సంవత్సరంలో 1.1 లక్షల యూనిట్ల అమ్మకాలు నమోదు కాగా .. ఈ ఆర్థిక సంవత్సరం ఆల్ టైమ్ గరిష్టంగా 1.2 లక్షల యూనిట్ల స్థాయిలో విక్రయాలు నమోదు కావచ్చని అంచనా వేస్తున్నట్లు నివేదిక పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం అమ్మకాల పరిమాణంలో ఎర్త్‌మూవింగ్ పరికరాల వాటా 70 శాతంగా, కాంక్రీట్ పరికరాల వాటా 22 శాతంగా ఉండగా.. మిగతాది మెటీరియల్ ప్రాసెసింగ్ పరికరాలది ఉన్నట్లు వివరించింది. -
పాత పింఛన్ పథకాన్ని పునరుద్ధరించాలి
న్యూఢిల్లీ: పాత పింఛన్ పథకాన్ని(ఓపీఎస్) పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వ, ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో ఆదివారం ‘పెన్షన్ శంఖనాథ్ మహార్యాలీ’ పేరిట భారీ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 20కిపైగా రాష్ట్రాల నుంచి వేలాది మంది ఉద్యోగులు తరలివచ్చారు. ప్రభుత్వం తీసుకొచి్చన కొత్త పింఛన్ పథకాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రిటైర్మెంట్ తర్వాత తమ జీవితానికి భరోసానిచ్చే పాత పింఛన్ పథకాన్ని పునరుద్ధరించాలని తేల్చిచెప్పారు. జాయింట్ ఫోరం ఫర్ రిస్టోరేషన్ ఆఫ్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్, నేషనల్ జాయింట్ కౌన్సిల్ ఆఫ్ యాక్షన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టినట్లు నిరసనకారులు వెల్లడించారు. 2004 జనవరి 1 తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో చేరినవారు కొత్త పింఛన్ పథకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు అలిండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ జాతీయ కనీ్వనర్ శివగోపాల్ మిశ్రా చెప్పారు. -
Law Commission: 2029 నుంచే జమిలి ఎన్నికలు!
న్యూఢిల్లీ: లోక్‌సభతోపాటు అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడంపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. జమిలి ఎన్నికలు వచ్చే ఏడాది సాధ్యం కాదని లా కమిషన్ తేలి్చచెప్పినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వ సిఫార్సు మేరకు జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై జస్టిస్ రితూరాజ్ అవస్థీ నేతృత్వంలోని లా కమిషన్ అధ్యయనం చేస్తోంది. 2029 నుంచి లోక్‌సభతోపాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడానికి వీలుగా కమిషన్ ఓ ఫార్ములాను ప్రతిపాదిస్తున్నట్లు తెలిసింది. దాని ప్రకారం.. కొన్ని రాష్ట్రాల శాసనసభల కాలపరిమితిని పొడిగించాలి. మరికొన్ని రాష్ట్రాల శాసనసభల కాలపరిమితిని తగ్గించాలి. ఈ ఫార్ములాతోజమిలి ఎన్నికలు నిర్వహించడం సులువేనని లా కమిషన్ నిర్ణయానికి వచి్చనట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. జమిలి ఎన్నికలపై అధ్యయనానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని సైతం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఉమ్మడి ఓటర్ల జాబితాతో మేలు ఓటర్ల జాబితా విషయంలోనూ లా కమిషన్ కీలక సిఫార్సును తెరపైకి తీసుకొస్తోంది. లోక్‌సభ, శాసనసభలు, స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రస్తుతం వేర్వేరు ఓటర్ల జాబితాలను ఉపయోగిస్తున్నారు. వీటిని కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్రాల ఎన్నికల సంఘాలు రూపొందిస్తున్నాయి. అన్ని రకాల ఎన్నిలకు ఒక ఉమ్మడి ఓటర్ల జాబితా ఉండాలన్నదే లా కమిషన్ ఉద్దేశమని సమాచారం. దీనివల్ల ఖర్చు, మానవ వనరుల వినియోగం గణనీయంగా తగ్గుతాయని అభిప్రాయపడుతోంది. ఉమ్మడి ఎన్నికల జాబితా కోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని చెబుతోంది. జమిలి ఎన్నికల ప్రక్రియలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయడానికి ఓటర్లు పోలింగ్ బూత్‌కు కేవలం ఒకే ఒక్కసారి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని లా కమిషన్ సూచిస్తోంది. అంటే ఒకే పోలింగ్ బూత్‌లో ఒకేసారి రెండు ఎన్నికల్లో ఓట్లు వేసేలా ఏర్పాట్లు ఉండాలని చెబుతోంది. జమిలి ఎన్నికలపై లా కమిషన్ సిఫార్సులు కొన్ని అనధికారికంగా బయటకు వచి్చనప్పటికీ తుది నివేదిక ఇంకా సిద్ధం కాలేదు. ఇంకా కొన్ని అంశాలపై మరింత అధ్యయనం చేయాల్సి ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఏడాది వ్యవధిలో రెండు దశలు లోక్‌సభ, శాసనసభలతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై అధ్యయనం బాధ్యతను రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీకి కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. లా కమిషన్ మాత్రం ఏకకాలంలో లోక్‌సభ, శాసనసభల ఎన్నికలు నిర్వహించడంపై అధ్యయనం చేస్తోంది. కోవింద్ కమిటీ ఏర్పాటు నేపథ్యంలో లా కమిషన్ కూడా మూడు రకాల ఎన్నికలపై దృష్టి పెట్టినట్లు సమాచారం. లోక్‌సభ, శాసనసభల ఎన్నికలను ఒక దశలో, స్థానిక సంస్థల ఎన్నికలను రెండో దశలో నిర్వహించాలని లా కమిషన్ అభిప్రాయపడుతోంది. -
పీఎం విశ్వకర్మ పథకానికి 1.4 లక్షల దరఖాస్తులు
న్యూఢిల్లీ: పీఎం విశ్వకర్మ పథకాన్ని ప్రధాని మోదీ ఈ నెల 17న ప్రారంభించగా, పది రోజుల్లోనే 1.4 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఈ విషయాన్ని కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) మంత్రి నారాయణ్ రాణే తెలిపారు. భారీ సంఖ్యలో దరఖాస్తులు రావడం పథకం విజయానికి నిదర్శనమన్నారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన విశ్వకర్మ సోదరులు, సోదరీమణుల సమగ్రాభివృద్ధికి పీఎం విశ్వకర్మ పథకం మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. కోల్పోయిన వారి గుర్తింపు తిరిగి పూర్వపు స్థతికి చేరుకుంటుందన్నారు. చేతి పనివారి సామర్థ్యాన్ని పెంచడం, వారి ఉత్పత్తులను దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ల కు తీసుకెళ్లడం ఈ పథ కం లక్ష్యాలుగా పేర్కొన్నారు. ఈ పథకం కింద 18 విభాగాల చేతివృత్తుల పనివారు, కళాకారులు ప్రయోజనం పొందుతారని చెప్పారు. వీరికి ఈ పథకం కింద శిక్షణ ఇవ్వడంతోపాటు, శిక్షణాకాలంలో రోజుకు రూ.500 చొప్పున స్టైఫెండ్ కూడా లభిస్తుందన్నారు. టూల్‌కిట్స్ కొనుగోలుకు రూ. 15,000 అందజేస్తామన్నారు. లబి్ధదారులు హామీ లేని రూ.3 లక్షల రుణానికి అర్హులని చెప్పారు. -
International Lawyers Conference 2023: భారతీయ భాషల్లో భారత చట్టాలు
న్యూఢిల్లీ: దేశంలో అమల్లో ఉన్న చట్టాలను అందరికీ సులభంగా అర్థమయ్యే రీతిలో భారతీయ భాషల్లో రచించడానికి కేంద్ర ప్రభుత్వం నిజాయితీగా కృషి చేస్తోందని ప్రధాని మోదీ చెప్పారు. ఆయన శనివారం ఢిల్లీలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అంతర్జాతీయ న్యాయవాదుల సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రపంచవ్యాప్తంగా సైబర్ ఉగ్రవాదం, మనీ లాండరింగ్ నేరాలు విపరీతంగా పెరిగిపోతుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. విధ్వంసకర కార్యకలాపాల కోసం అరాచక శక్తులు కృత్రిమ మేధ(ఏఐ)ను వాడుతున్నాయని చెప్పారు. ముష్కరుల కార్యకలాపాలకు, సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయడానికి దేశాలన్నీ చట్టాలకు లోబడి కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. దేశాల మధ్య అమల్లో ఉన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థల తరహాలోనే సైబర్ ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్ రూపొందించుకోవాలని చెప్పారు. 2047 నాటికి దేశం పూర్తిగా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో భారత్ కృషి చేస్తోందని, ఇందుకోసం బలమైన, నిష్పక్షపాతంతో కూడిన న్యాయ వ్యవస్థ కావాలని చెప్పారు. రెండు రూపాల్లో చట్టాలు కక్షిదారులకు న్యాయం చేకూర్చడంలో న్యాయ ప్రక్రియ, చట్టాలను రాసేందుకు ఉపయోగించిన భాష కీలక పాత్ర పోషిస్తాయని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. చట్టాలు రెండు రూపాల్లో ఉండాలని ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. న్యాయ నిపుణులు ఉపయోగించే భాషలో, సామాన్య ప్రజలు ఉపయోగించే భాషలో చట్టాలు ఉండాలన్నారు. ప్రజల భాషలో చట్టాలు ఉన్నప్పుడు వారు వాటిని సొంతం చేసుకుంటారని తెలిపారు. చట్టాలను సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా సులభతరంగా మార్చే ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. అది పూర్తి కావడానికి సమయం పడుతుందన్నారు. డేటా ప్రొటెక్షన్ చట్టంతో ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టామని వివరించారు. కక్షిదారులకు తీర్పు కాపీలను వారి మాతృభాషలో అందజేయాలన్న సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. భారత న్యాయ వ్యవస్థను కాపాడడంలో జ్యుడీíÙయరీ, బార్ కౌన్సిల్ సాగిస్తున్న కృషి ప్రశంసనీయమని చెప్పారు. భారత స్వాతంత్య్ర పోరాటంలో ఎంతోమంది న్యాయవాదులు ముందంజలో నిలిచారని గుర్తుచేశారు. అంతర్జాతీయ న్యాయవాదుల సదస్సులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్, యూకే న్యాయ సహాయ శాఖ మంత్రి అలెక్స్ చాక్ కె.సి., భారత అటార్నీ జనరల్ ఆర్.వెంటకరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, బార్ కౌన్సిల్ చైర్మన్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు. న్యాయవాదుల పాత్ర మారాలి: జస్టిస్ చంద్రచూడ్ నేటి ప్రపంచీకరణ శకంలో అంతర్జాతీయంగా న్యాయరంగంలో సవాళ్లను ఎదుర్కొనే దిశగా న్యాయవాదుల పాత్ర మార్పు చెందాలని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ సూచించారు. ఆధునిక పరిజ్ఞానాన్ని లాయర్లు అందిపుచ్చుకోవాలన్నారు. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ వంటి అంశాల్లో సాంకేతికపరమైన మార్పులను కక్షిదారులు, ప్రభుత్వాలు అందిపుచ్చుకొనేలా లాయర్లు కృషి చేయాలని సీజేఐ తెలిపారు. -
India-Canada Relations: కెనడా పౌరులకు ‘నో’ వీసా
న్యూఢిల్లీ: భారత్, కెనడా మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ రాజుకుంటున్నాయి. గత జూన్‌లో ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తం ఉందని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ఆరోపించడంతో ఇరు దేశాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఇరు దేశాలు దౌత్య ప్రతినిధుల్ని వెనక్కి తీసుకునే వరకు వెళ్లిన ఈ వ్యవహారంలో కెనడాకు షాకిస్తూ భారత్ మరో నిర్ణయం తీసుకుంది. కెనడా పౌరులకు వీసాల మంజూరును భారత్ తాత్కాలికంగా నిలిపివేసింది. భద్రతా కారణాల రీత్యా ఈ వీసాలను ఆపేసినట్టు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కెనడాలో భారత హైకమిషన్లు, కాన్సులేట్లకు రక్షణ లేదని, వాటికి బెదిరింపులు వస్తున్నాయని అందుకే తాత్కాలికంగా వీసాలను నిలిపివేసినట్టుగా తెలిపింది. అంతే కాకుండా భారత్‌లో ఉన్న కెనడా దౌత్యసిబ్బంది సంఖ్య తగ్గించుకోవాలని చెప్పింది. మరోవైపు కెనడాలో భారత్ పౌరులు అప్రమత్తంగా ఉండాలన్న కేంద్రం సూచనల్ని కెనడా ప్రభుత్వం తిరస్కరించించి. ప్రపంచంలో కెనడా అత్యంత సురక్షితమైన దేశమని పేర్కొంది. తమ దేశంలో భారత పౌరులకు వచ్చే ఇబ్బందేమీ లేదని పేర్కొంది. వీసాలు జారీ చేసే పరిస్థితి లేదు వీసా దరఖాస్తులను పరిశీలించడానికి ఏర్పాటైన ఒక ప్రైవేటు ఏజెన్సీ బీఎల్ఎస్ ఇంటర్నేషనల్ గురువారం నాడు తాత్కాలికంగా వీసాల పరిశీలన నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. నిర్వహణ కారణాలతోనే ఆపేస్తున్నట్టు వెల్లడించింది. ఆ తర్వాత కాసేపటికే విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి విలేకరులతో మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య భద్రతా పరమైన ఉద్రిక్తతల కారణంగా వీసా దరఖాస్తుల ప్రక్రియ ముందుకు సాగడం లేదని తెలిపారు. ఇతర దేశాల నుంచి దరఖాస్తులు చేసుకునే కెనడియన్లకు కూడా వీసాలివ్వలేమని చెప్పారు. ‘‘కెనడా ప్రజలు భారత్ రాకుండా అడ్డుకోవాలన్నది మా విధానం కాదు. సరైన వీసాలు ఉన్న వారు (గతంలో వీసాలు మంజూరైన వారు) యధావిధిగా రాకపోకలు సాగించవచ్చు. వారు ఎప్పుడైనా మన దేశానికి రావొచ్చు. కానీ ఆ దేశంలోని పరిస్థితులు మన హైకమిషన్ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నాయి’’ అని బాగ్చి వివరించారు. ఇరు దేశాల మధ్య పరిస్థితుల్ని సమీక్షిస్తామని, భారత హైకమిషన్లు, దౌత్య కార్యాలయాలకు రక్షణ ఉందని తేలితే వీసాల జారీ పునరుద్ధరిస్తామని బాగ్చి స్పష్టం చేశారు. ఉగ్రవాదులకు అడ్డాగా కెనడా కెనడా ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి బాగ్చి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కెనడా ప్రభుత్వం ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తోందని విమర్శించారు. కెనడాలో ఖలిస్తాన్ ఉగ్రవాదుల అరాచకాల ఆధారాలన్నింటినీ ఆ ప్రభుత్వానికి ఇచ్చామని, 20–25 మందిని మన దేశానికి అప్పగించాలని కోరినప్పటికీ స్పందన లేదన్నారు. ఉగ్రవాది నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తం ఉందని ట్రూడో చేసిన ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమైనవని మండిపడ్డారు. నిజ్జర్ హత్య గురించి ఎలాంటి సమాచారం కెనడా పంచుకోలేదన్నారు. అంతర్గత వ్యవహారాల్లో కెనడా జోక్యం భారత అంతర్గత వ్యవహారాల్లో కెనడా దౌత్యవేత్తల జోక్యం పెరిగిపోతోందని బాగ్చి చెప్పారు. ఇరు దేశాల్లో దౌత్యవేత్తల విషయంలో సమానత్వం లేదన్నారు. ‘‘కెనడాలో ఉన్న భారతీయ దౌత్య వేత్తల కంటే, మన దేశంలో కెనడా దౌత్యవేత్తలు ఎక్కువ మంది ఉన్నారు. వారి సంఖ్యను తగ్గించాల్సిన అవసరం ఉంది’’ అని అన్నారు. ఈ విషయాన్ని కెనడా దృష్టికి తీసుకువెళ్లినట్టు వివరించారు. ఇక భారత్‌లో ఉన్న కెనడా దౌత్య సిబ్బంది ఎంత మంది ఉన్నారో అంచనాలు వేస్తున్నామని కెనడా హైకమిషన్ వెల్లడించింది. భారత్‌లో కెనడా దౌత్యవేత్తలకి బెదిరింపులు వస్తున్నాయని వారికి భద్రత కల్పించాల్సిన బాధ్యత భారత ప్రభుత్వంపైనే ఉందన్నారు. కెనడాలో మరో ఖలిస్తాన్ ఉగ్రవాది హత్య చండీగఢ్: భారత్, కెనడా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో కెనడాలో మరో ఖలిస్తానీ మద్దతుదారు హత్య జరిగింది. పంజాబ్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్లో ఒకరైన సుఖ్దుల్ సింగ్ అలియాస్ సుఖ దునెకె మృతి చెందినట్టుగా తెలుస్తోంది. దీనిపై కెనడా ప్రభుత్వం స్పందించలేదు. కెనడాలోని విన్నిపెగ్‌లో బుధవారం రాత్రి సుఖ్దుల్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి చంపేశారు. గ్యాంగ్ వార్‌లో భాగంగానే ఘటన జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుఖ్దుల్ సింగ్‌పై మన దేశంలో హత్య, హత్యాయత్నం, దోపిడీకి సంబంధించిన 18 కేసులు ఉన్నాయి. సుఖ్దుల్ హత్య తమ పనేనని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సామాజిక మాధ్యమాల్లో ప్రకటించింది. పంజాబ్‌లోని మోగా జిల్లా దునెకె కలాన్ గ్రామానికి చెందిన సుఖ్దుల్ 2017 డిసెంబర్లో నకిలీ ధ్రువపత్రాలతో కెనడాకు పరారయ్యాడు. -
Womens Reservation Bill 2023: ఇంకెంతకాలం నిరీక్షణ
మహిళా రిజర్వేషన్ బిల్లు అనేది కేవలం చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం కాదు. ఇది మహిళల పట్ల పక్షపాతం, అన్యాయాన్ని తొలగించడానికి ఉద్దేశించినది. మహిళలకు ప్రత్యేకంగా వందనాలు అవసరం లేదు. అందరితోపాటు సమాన గౌరవాన్ని పొందాలని మహిళలు కోరుకుంటున్నారు. మహిళా కోటాను అమలు చేయడంలో జాప్యం తగదు. జనగణన, నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే మహిళా రిజర్వేషన్లు అమలవుతాయనడం సరైంది కాదు. ఇంకా ఎంత కాలం నిరీక్షించాలి? రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం సాధ్యమే – కనిమొళి, డీఎంకే ఎంపీ ఓబీసీ కోటా సంగతేంటి? చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లలో ఓబీసీలకు ప్రత్యేక కోటా కల్పించాలి. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లను అమలు చేయకపోతే పార్లమెంట్‌ను ప్రత్యేకంగా సమావేశపర్చి బిల్లును ప్రవేశపెట్టాల్సిన అవసరం ఎముంది? ఇది పోస్టు–డేటెడ్ చెక్కులాగా ఉంది. ఎస్సీ, ఎస్టీలతోపాటు ఓబీసీ మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి ఈ సమావేశాల్లో రాజ్యాంగ సవరణ చేయాలి. మహిళా రిజర్వేషన్లను ఎప్పటి నుంచి అమలు చేస్తారో కచి్చతమైన తేదీ, టైమ్‌లైన్‌ను ప్రభుత్వం ప్రకటించాలి. దేశంలో ప్రస్తుతం కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ప్రత్యేక సమావేశాల్లో కరువు నివారణ చర్యలపై చర్చించాలి – సుప్రియా సూలే, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ బడుగు వర్గాల మహిళలకు భాగస్వామ్యం కావాలి మహిళా రిజర్వేషన్లలో వెనుకబడిన తరగతులు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు భాగస్వామ్యం కల్పించాల్సిందే. ఈ మేరకు అవసరమైతే చట్టంలో సవరణలు చేయాలి. బడుగు వర్గాల మహిళలకు న్యాయం చేకూర్చాలి. – డింపుల్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ మహిళలను తప్పుదోవ పట్టిస్తున్నారు మహిళా రిజర్వేషన్ బిల్లుతో కేంద్ర ప్రభుత్వం దేశంలో మహిళలను తప్పుదోవ పట్టిస్తోంది. ఈ రిజర్వేషన్లను రాబోయే ఎన్నికల్లో అమలు చేయకుండా జాప్యం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాం. అధికార బీజేపీ నాయకులు మహిళలపై ఎన్నో నేరాలకు పాల్పడ్డారు. వారిపై ఎలాంటి చర్యలకు తీసుకోలేదు. దేశంలో గత ఐదేళ్లలో మహిళలపై నేరాలు 26 శాతం పెరిగినప్పటికీ మోదీ ప్రభుత్వం స్పందించడం లేదు – హర్సిమ్రత్ కౌర్ బాదల్, శిరోమణి అకాలీదళ్ ఎంపీ మహిళా సాధికారతను అడ్డుకోవద్దు మహిళా రిజర్వేషన్లలో మైనారీ్టలకు కోటా కల్పించాలనడం అర్థరహితం. మతపరమైన రిజర్వేషన్లపై రాజ్యాంగం నిషేధం విధించింది. చట్ట ప్రకారం.. జనగణన, నియోజకవర్గాల పునర్విభజన పూర్తయిన తర్వాతే మహిళా రిజర్వేషన్లను అమలు చేయాల్సి ఉంటుంది. వెంటనే అమలు చేయాలని కోరడం సమంజసం కాదు. ఎవరైనా సరే రాజ్యాంగబద్ధమైన ప్రక్రియను అనుసరించాల్సిందే. మహిళా సాధికారతను అడ్డుకోవద్దని ప్రతిపక్షాలను కోరుతున్నా – స్మతి ఇరానీ, కేంద్ర మంత్రి, బీజేపీ నేత 40 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి పశ్చిమ బెంగాల్లో లోక్‌సభ ఎన్నికల్లో మా పార్టీ మహిళలకు 40 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం సైతం దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల్లో మహిళలకు 40 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. కేవలం 33 శాతం కాదు, కేంద్ర ప్రభుత్వానికి నిజంగా ధైర్యం ఉంటే 40 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి. ఈ విషయంలో మీకు చేతనైతే మమ్మలి్న(తణమూల్ కాంగ్రెస్)ను పట్టుకోండి చూద్దాం – కకోలీ ఘోష్–దస్తీదార్, తణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పేరును ‘రీషెడ్యూలింగ్ బిల్లు’ అని పెడితే పోలా? ఈ బిల్లు ఒట్టి మాయ. షెడ్యూల్ ప్రకారం ఫలానా తేదీకల్లా అమల్లోకి వస్తుందని చెప్పలేము. అలాంటప్పుడు ఈ బిల్లుకు మహిళా రిజర్వేషన్ రీషెడ్యూలింగ్ బిల్లుగా మారిస్తే సరిపోతుంది’ అని తణమూల్ కాంగ్రెస్ మహిళా నేత మహువా మొయిత్రా సభలో ఎద్దేవా చేశారు. ఇదంతా పెద్ద గిమ్మిక్కు. – టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా -
Womens Reservation Bill 2023: మహిళా బిల్లుకు జై
న్యూఢిల్లీ: లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చరిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్‌సభ దాదాపు ఏకగ్రీవంగా ఆమోదించింది. రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 368(2) ప్రకారం ఈ బిల్లు ఆమోదం పొందింది. దీనిప్రకారం సభలోని మొత్తం సభ్యుల్లో మూడింట రెండొంతుల మంది మద్దతు తెలపాల్సి ఉంటుంది. పార్టీలకు అతీతంగా సభ్యులు బిల్లుకు జై కొట్టారు. పార్లమెంట్ నూతన భవనంలో ఆమోదం పొందిన మొట్టమొదటి బిల్లు ఇదే కావడం విశేషం. ‘నారీశక్తి వందన్ అధినియమ్’ పేరిట కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ ఈ నెల 19న లోక్‌సభలో ప్రవేశపెట్టిన ‘రాజ్యాంగ(128వ సవరణ) బిల్లు–2023’పై బుధవారం దాదాపు 8 గంటలపాటు సుదీర్ఘంగా చర్చ జరిగింది. కేంద్ర మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ ఎంపీ సోనియా గాంధీ సహా వివిధ పార్టీలకు చెందిన దాదాపు 60 మంది సభ్యులు మాట్లాడారు. కొందరు బిల్లుకు మద్దతుగా ప్రసంగించారు. మరికొందరు మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళా కోటా గురించి ప్రశ్నించారు. ఈ రిజర్వేషన్లను వెంటనే అమల్లోకి తీసుకురావాలన్న డిమాండ్లు సైతం వినిపించాయి. చర్చ అనంతరం స్పీకర్ ఓం బిర్లా ఓటింగ్ నిర్వహించారు. బిల్లుకు అనుకూలంగా 454 మంది సభ్యులు ఓటు వేయగా, ఇద్దరు ఎంపీలు వ్యతిరేకంగా ఓటేశారు. ఓటింగ్ ప్రక్రియలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. చర్చ అనంతరం అదే రోజు ఓటింగ్ నిర్వహిస్తారు. ఎగువ సభలోనూ బిల్లు ఆమోదం పొందడం లాంఛనమే. అనంతరం రాష్ట్రపతి సంతకంతో మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టరూపం దాల్చనుంది. జన గణన, నియోజకవర్గాల పునర్విభజన పూర్తయిన తర్వాత 2029 నుంచి అమల్లోకి రానున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఓటింగ్ జరిగిందిలా.. మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉండటంతో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా స్లిప్‌ల ద్వారా ఓటింగ్ నిర్వహించారు. మాన్యువల్ పద్ధతిలో ఓటింగ్ జరిగింది. ఎరుపు, ఆకుపచ్చ రంగు స్లిప్‌లను సభ్యులకు అందజేశారు. ఓటు ఎలా వేయాలో లోక్‌సభ సెక్రెటరీ జనరల్ వివరించారు. బిల్లుకు మద్దతు తెలిపితే ఆకుపచ్చ స్లిప్పై ‘ఎస్’ అని రాయాలని, వ్యతిరేకిస్తే ఎరుపు రంగు స్లిప్పై ‘నో’ అని రాయాలని చెప్పారు. ఆ ప్రకారమే ఓటింగ్ జరిగింది. బిల్లుకు మద్దతుగా 454 ఓట్లు, వ్యతిరేకంగా కేవలం 2 ఓట్లు వచ్చాయి. ఈ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నామని లోక్‌సభలో జరిగిన చర్చ సందర్భంగా ఏఐఎంఐంఎ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. ఆ పార్టీకి లోక్‌సభలో ఓవైసీతోపాటు మరో ఎంపీ సయ్యద్ ఇంతియాజ్ జలీల్(ఔరంగాబాద్) ఉన్నారు. బిల్లుకు వ్యతిరేకంగా వారిద్దరూ ఓటేసినట్లు తెలుస్తోంది. చాలా సంతోషంగా ఉంది: ప్రధాని మోదీ మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్‌సభలో భారీ మెజార్టీతో ఆమోదం పొందడం చాలా సంతోషంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా బిల్లుకు మద్దతు ఇచ్చిన ఎంపీలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు మోదీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. నారీశక్తి వందన్ అధినియమ్ ఒక చరిత్రాత్మక చట్టం అవుతుందన్నారు. ఈ చట్టంతో మహిళా సాధికారతకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని, మన రాజకీయ వ్యవస్థలో మహిళామణుల భాగస్వామ్యం ఎన్నో రెట్లు పెరుగుతుందని ప్రధానమంత్రి తెలిపారు. ప్రస్తుతం రాజీవ్ గాంధీ కల సగమే నెరవేరింది. బిల్లు చట్టరూపం దాల్చాకే ఆయన కల నెరవేరుతుంది. నాదో ప్రశ్న. మహిళలు తమ రాజకీయ బాధ్యతలు నెరవేర్చుకునేందుకు గత 13 ఏళ్లుగా వేచిచూస్తున్నారు. ఇంకా మనం వాళ్లని రెండేళ్లు, నాలుగేళ్లు, ఆరేళ్లు, ఎనిమిదేళ్లు వేచి ఉండండని చెబుదామా? భారతీయ మహిళల పట్ల ఇలా ప్రవర్తించడం సముచితం కాదు. ఈ బిల్లు వెంటనే అమల్లోకి రావాల్సిందే. కుల గణన తర్వాత ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మహిళలకు రిజర్వేషన్లలో ప్రాతినిధ్యం దక్కాలి. – సోనియా మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణం అమల్లోకి తేవాలన్న విపక్షాల డిమాండ్ సరికాదు. ఒకవేళ రాహుల్ ప్రాతినిధ్యం వహిస్తున్న వయనాడ్, అసదుద్దీన్ ఒవైసీ (మజ్లిస్ అధినేత) ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ లోక్‌సభా స్థానాలు మహిళలకు రిజర్వ్ అయితే మా ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందంటూ అందుకు మళ్లీ మోదీ సర్కారునే నిందిస్తారు. అందుకే నియోజకవర్గాల పునరి్వభజనను సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి సారథ్యంలోని కమిషన్ పూర్తి పారదర్శకంగా చేపడుతుంది. రాబోయే సార్వత్రిక ఎన్నికల తర్వాత కేంద్రంలో వచ్చే నూతన ప్రభుత్వం వెంటనే జన గణన, నియోజకవర్గాల పునర్విభజన చేపడుతుంది. లోక్‌సభ, అసెంబ్లీల్లో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్ల కలను సాకారం చేస్తుంది. – అమిత్ షా ఈ బిల్లుతో సవర్ణ మహిళలకే మేలు మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకిస్తున్నాం. ఈ బిల్లుతో అగ్ర వర్ణాల మహిళలకే మేలు జరుగుతుంది. పార్లమెంట్లో అతి తక్కువ ప్రాతినిధ్యం ఉన్న ఓబీసీ, మైనార్టీ మహిళలకు ఈ రిజర్వేషన్లలో ప్రత్యేకంగా కోటా కలి్పంచకపోవడం దారుణం. దేశ జనాభాలో ముస్లిం మహిళలు 7 శాతం ఉన్నారు. లోక్‌సభలో వారి సంఖ్య కేవలం 0.7 శాతమే ఉంది. లోక్‌సభలో సవర్ణ మహిళల సంఖ్య పెంచాలని మోదీ ప్రభుత్వం కోరుకుంటోంది. ఓబీసీ, మైనార్టీ మహిళలు ఈ సభలో ఉండడం ప్రభుత్వానికి ఇష్టం లేదు. ఆయా వర్గాల మహిళలను మోదీ సర్కారు దగా చేస్తోంది – అసదుద్దీన్ ఓవైసీ, ఎంఐఎం పార్లమెంట్ సభ్యుడు లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా పారీ్టలకతీతంగా మహిళా ఎంపీలు బిల్లుకు ఏకగ్రీవంగా జై కొట్టారు. లోక్‌సభలో 82 మంది మహిళా ఎంపీలుండగా బుధవారం చర్చలో 27 మంది మహిళా ఎంపీలు మాట్లాడారు. అందరూ బిల్లుకు మద్దతుగా మాట్లాడారు. అయితే, బిల్లు ఆలస్యంగా అమలయ్యే అంశాన్ని ప్రధానంగా తప్పుబట్టారు. -
మరో అద్భుతం ‘యశోభూమి’
ప్రాచీన కట్టడాలు, దర్శనీయ క్షేత్రాలకు నిలయమైన దేశ రాజధాని ఢిల్లీ కీర్తికిరీటంలో మరో మణిహారం చేరబోతోంది. చూపు తిప్పుకోనివ్వని సుందరమైన, విశాలమైన ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో సెంటర్(ఐఐసీసీ) యశోభూమి ప్రారంభానికి సిద్ధమైంది. దేశంలో సభలు, సమావేశాలు, ఎగ్జిబిషన్ల కోసం ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలన్న ప్రధానమంత్రి సంకల్పం మేరకు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో యశోభూమిని అత్యాధునిక పరిజ్ఞానం, అద్భుతమైన వసతులతో నిర్మించింది. ప్రధాన ఆడిటోరియం, కన్వెన్షన్ హాళ్లు, బాల్రూమ్, మీటింగ్ రూమ్‌లతో యశోభూమి సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్లలో ఒకటిగా నిలువనుంది. ఎనిమిది అంతస్తుల యశోభూమిలో మీటింగ్స్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్సెస్, ఎగ్జిబిషన్స్(ఎంఐసీఈ) సదుపాయాలన్నీ ఉన్నాయి. ఐఐసీసీ మొదటి దశను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 17వ తేదీన స్వయంగా ప్రారంభించనున్నారు. అలాగే జాతికి అంకితం ఇస్తారు. విశేషాలివీ.. 1. యశోభూమి కన్వెన్షన్ సెంటర్ ప్రాజెక్టు ఏరియా 8.9 లక్షల చదరపు మీటర్లు, బిల్ట్–అప్ ఏరియా 1.8 లక్షల చదరపు మీటర్లు. కన్వెన్షన్ సెంటర్‌ను 73,000 చదరపు మీటర్లకుపైగా వైశాల్యంలో నిర్మించారు. 2. మొత్తం ప్రాజెక్టులో ప్రధాన ఆడిటోరియంతో సహా మొత్తం 15 కన్వెన్షన్ హాళ్లు, ఒక బాల్రూమ్, 13 మీటింగ్ రూమ్‌లు ఉన్నాయి. 3. అన్ని గదుల్లో కలిపి ఏకకాలంలో 11,000 మంది ఆసీనులు కావొచ్చు. 4. 6,000 మంది అతిథులు సౌకర్యవంతంగా కూర్చునేలా ప్రధాన ఆడిటోరియం(ప్లీనరీ హాల్) నిర్మించారు. ఆటోమేటెడ్ సీటింగ్ సిస్టమ్ ఉంది. 5. అందమైన సీలింగ్‌తో ఆకట్టుకుంటున్న బాల్రూమ్ సీటింగ్ సామర్థ్యం 2,500. ఇక్కడే మరో 500 మంది కోసం ఓపెన్ ఏరియా ఉంది. 6. అలాగే 1.07 లక్షల చదరపు మీటర్ల వైశాల్యంలో ఎగ్జిబిషన్ హాళ్లు ఉన్నాయి. 7. మీడియా రూమ్‌లు, వీవీఐపీ గదులు, విజిటర్ ఇన్ఫర్మేషన్ సెంటర్, టికెటింగ్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. 8. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ ఇక్కడ వర్షం నీటిని, మురుగు నీటిని శుద్ధి చేసుకొని మళ్లీ ఉపయోగించుకునే ఏర్పాట్లున్నాయి. 9. సౌర విద్యుత్ కోసం రూప్‌టాప్ సోలార్ ప్యానళ్లు బిగించారు. ఈ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణంలో భారతీయ సంస్కృతి, కళలకు పెద్దపీట వేశారు. 10. యశోభూమి కన్వెన్షన్ సెంటర్ భారత పరిశ్రమల సమాఖ్యకు చెందిన ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్(ఐజీబీసీ) నుంచి గ్రీన్ సిటీస్ ప్లాటినమ్ సరి్టఫికేషన్ పొందింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అంతరిక్ష రంగానికి ప్రభుత్వ దన్ను
న్యూఢిల్లీ: అంతరిక్ష(స్పేస్) సంబంధ రంగాలకు దన్నునిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి(ఎఫ్‌డీఐ) నిబంధనలను మరింత సరళీకరించింది. తద్వారా స్పేస్ విభాగంలో మరిన్ని విదేశీ పెట్టుబడులకు వీలు చిక్కనుంది. తాజా సవరణలతో స్పేస్ సంబంధ పరిశ్రమల్లో భారీ పెట్టుబడులకు వీలున్నట్లు పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ(డీపీఐఐటీ) సెక్రటరీ రాజేష్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. ప్రధానంగా సౌదీ అరేబియా కంపెనీలు ఏవియేషన్, ఫార్మా, బల్క్ డ్రగ్స్, రెనెవబుల్ ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రిటెక్ తదితర రంగాలలో ఇన్వెస్ట్ చేసేందుకు వీలుంటుందని తెలియజేశారు. అంతేకాకుండా ఏఐ, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ, ఆటోమేషన్ తదితర విభాగాలలో భారీస్థాయిలో సాంకేతిక సహకారాలకు తెరలేవనున్నట్లు అభిప్రాయపడ్డారు. స్పేస్ రంగంలో ప్రయివేట్ పెట్టుబడులతోపాటు.. విదేశీ పెట్టుబడులకూ అవకాశం కలి్పంచేలా నిబంధనలను మరింత సరళీకరించే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. సౌదీ అరేబియా ఇన్వెస్ట్మెంట్ సదస్సు సందర్భంగా సింగ్ ఇంకా పలు అంశాలను పేర్కొన్నారు. ప్రస్తుతం స్పేస్ రంగంలో శాటిలైట్స్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ ఆపరేషన్స్ విభాగంలో ప్రభుత్వ అనుమతి ద్వారా 100 శాతం ఎఫ్‌డీఐలకు వీలుంది. కాగా.. ఇప్పటికే సౌదీ కంపెనీలు సౌర, పవన విద్యుత్ రంగంలో పెట్టుబడులు తీసుకువచి్చనట్లు సింగ్ ప్రస్తావించారు. ప్రభుత్వం సౌదీ కంపెనీలతో చేతులు కలిపేందుకు చూస్తున్నట్లు తెలియజేశారు. సౌదీ మిలటరీ పరిశ్రమలు, మేకిన్ ఇండియా కార్యక్రమాలు కలిసి సంయుక్తంగా రక్షణ ప్రాజెక్టులను చేపట్టేందుకు అవకాశమున్నదని వివరించారు. 2022–23కల్లా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 52.8 బిలియన్ డాలర్లను తాకినట్లు వెల్లడించారు. -
G20 Summit: నేతలకు పేదరికం కనిపించకుండా దాస్తోంది
న్యూఢిల్లీ: జీ20 భేటీని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో చేపట్టిన చర్యలపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మురికి వాడలను కనిపించకుండా చేయడం, ధ్వంసం చేయడం వంటి వాటితోపాటు వీధుల్లో తిరిగే కుక్కలు తదితర జంతువులను క్రూరంగా బంధించడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. అతిథుల ఎదుట మన దేశ వాస్తవాలను దాచాల్సిన అవసరం లేదన్నారు. విదేశీ పర్యటనలో ఉన్న రాహుల్ శనివారం ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఉన్న మురికివాడల చుట్టూ పచ్చని పాలిథిన్ షీట్లను కప్పి ఉంచినట్లుగా ఉన్న వీడియోను ‘ఎక్స్’లో షేర్ చేశారు. ‘ప్రభుత్వం మమ్మల్ని పురుగులుగా భావిస్తోంది. మేం మనుషులం కామా?’ అని స్లమ్ నివాసి ఒకరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా ఉంది. ఈ విషయమై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్.. మోదీ చర్యలను విమర్శించారు. ‘మోదీ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే జీ20 శిఖరాగ్రం వేళ మురికివాడలను కనిపించనీయడం లేదు. ఎందుకంటే రాజు పేదలను ద్వేషిస్తాడు’అని కాంగ్రెస్ ప్రధాని మోదీనుద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించింది. -
కేంద్రం వైఖరిని సమర్థిస్తున్నాం
లండన్: రష్యా–ఉక్రెయిన్ సంక్షోభం విషయంలో బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వైఖరిని పూర్తిగా సమర్థిస్తున్నామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెప్పారు. విశాలమైన దేశం అయినందున ప్రపంచదేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగించాల్సిన అవసరం భారత్‌కు సహజంగానే ఉంటుందని చెప్పారు. బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో జరిగిన మీడియా సమావేశంలో రాహుల్ మాట్లాడారు. ఉక్రెయిన్ సంక్షోభం విషయంలో మోదీ ప్రభుత్వం తీసుకున్న వైఖరికి రష్యా నుంచి చమురు సరఫరాయే కారణమా అన్న మీడియా ప్రశ్నకు ఆయన పైవిధంగా సమాధానమిచ్చారు. ‘రష్యాతో మాకు సంబంధాలున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ విషయంలో ప్రభుత్వ, ప్రతిపక్షం వైఖరి భిన్నంగా ఉంటుందని నేను భావించడం లేదు’అని వివరించారు. రష్యా నుంచి దూరంగా తమవైపు భారత్‌ను లాక్కునేందుకు పశ్చిమ దేశాల నేతలు ప్రయత్నించారా అన్న ప్రశ్నకు రాహుల్ గాంధీ.. ‘‘వాస్తవానికి భారత్‌కు రష్యాతో సత్సంబంధాలున్నాయి. అదేవిధంగా అమెరికాతోనూ సంబంధాలు న్నాయి. భారత్ విశాల దేశం. పెద్ద దేశం కావడం వల్ల అనేక ఇతర దేశాలతో వివిధ స్థాయిల్లో సంబంధాలు కొనసాగుతున్నాయి. ఎవ్వరితోనైనా సంబంధాలు కొనసాగించే హక్కు భారత్‌కు ఉంది’అని రాహుల్ చెప్పారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ద్వారా కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు విషయంలో ప్రతిపక్షం వైఖరిపై ఆయన..కశ్మీర్ అభివృద్ధిని కాంగ్రెస్ గట్టిగా కోరుతోంది. అక్కడ శాంతి నెలకొనాలని ఆకాంక్షిస్తోంది’అని రాహుల్ వివరించారు. కశ్మీర్ అంశం పరిష్కారానికి అంతర్జాతీయ దౌత్యం అవసరమని భావిస్తున్నారా అన్న ప్రశ్నకు రాహుల్ సూటిగా సమాధానమిచ్చారు. వాస్తవానికి కశ్మీర్ భారత్‌లో అంతర్భాగం. కశ్మీర్ మా సొంత విషయం. అందులో భారత్‌కు తప్ప మరెవ్వరి జోక్యం అవసరం లేదు’అని కుండబద్దలు కొట్టారు. -
ప్రపంచ స్థాయి భద్రత
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన నాయకులు హాజరవుతున్న జీ20 శిఖరాగ్ర సదస్సుకు కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 9, 10వ తేదీల్లో జరుగనున్న శిఖరాగ్ర సదస్సుకు 20 దేశాల అధినేతలు సహా 14 అంతర్జాతీయ సంస్థల అధిపతులు హాజరు కానున్నారు. సదస్సు సందర్భంగా 80,000 మంది ఢిల్లీ పోలీసులతో సహా దేశ రాజధానికి సుమారు 1,30,000 మంది భద్రతా సిబ్బంది రక్షణ కలి్పస్తారని కేంద్రం వెల్లడించింది. సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) సహా, విదేశీ నేతలకు సంబంధించిన భద్రత కోసం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్), నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్జీ), స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) కమెండోలను నియమించారు. వీరికి అదనంగా పారామిలిటరీ బలగాలు, ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) సైతం భద్రతా చర్యల్లో పాలుపంచుకోనున్నాయి. అదనంగా, ప్రపంచ నాయకుల జీవిత భాగస్వాములు, కుటుంబ సభ్యుల రక్షణ బాధ్యతను సశస్త్ర సీమాబల్ (ఎస్ఎస్బీ) దళాలకు అప్పగించారు. అమెరికాకు చెందిన సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (సీఐఏ), చైనా భద్రతా శాఖ (ఎంఎస్ఎస్), యునైటెడ్ కింగ్డమ్కు చెందిన ఎంఐ–6, ఇతర విదేశీ గూఢచార సంస్థలు సైతం ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నాయి. రాఫెల్‌లు.. హెలికాప్టర్లు.. యాంటీ డ్రోన్లు దేశాధినేతల భద్రతా వ్యవస్థలో బాగంగా గగనతల దాడులను సైతం సమర్థంగా ఎదుర్కొనేలా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్), ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీఎస్), ఇతర ఏజెన్సీలు జాగ్రత్తలు తీసుకున్నాయి. అత్యవసర సమయాల్లో ఎన్ఎస్జీ కమెండోలు, ఐఏఎఫ్ సిబ్బందిని తరలించేలా హెలికాప్టర్లను మోహరించింది. ఢిల్లీ, దాని సమీప ప్రాంతాలలో సమగ్ర ఏరోస్పేస్ రక్షణ కోసం ఇప్పటికే పారాగ్లైడర్లు, పారామోటర్లు, హ్యాంగ్–గ్లైడర్లు, మైక్రోలైట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, రిమోట్‌గా పైలట్ చేసిన ఎయిర్‌క్రాఫ్ట్, హాట్ ఎయిర్ బెలూన్లు, చిన్న విమానం, క్వాడ్కాప్టర్లు నిర్వహణను నిషేధించారు. -
రామ్‌నాథ్ కోవింద్‌తో న్యాయ శాఖ ఉన్నతాధికారుల భేటీ
న్యూఢిల్లీ: దేశంలో జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసి, నివేదిక ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ చీఫ్, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆదివారం న్యాయ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. కమిటీ ఎజెండాపై చర్చించారు. న్యాయ శాఖ కార్యదర్శి నితిన్ చంద్ర, శాసన కార్యదర్శి రీటా వశిష్ట తదితరులు కోవింద్‌ను కలిశారు. జమిలి ఎన్నికల విషయంలో అధ్యయనం చేయాల్సిన అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. చట్టపరమైన విషయాలపై చర్చించుకున్నారు. ఉన్నత స్థాయి కమిటీకి నితిన్ చంద్ర కార్యదర్శిగా నియమితులయ్యారు. ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’పై అధ్యయనం కోసం 8 మంది సభ్యులతో హైలెవెల్ కమిటీని నియమిస్తూ కేంద్రం శనివారం ఉత్తర్వు జారీ చేసిన సంగతి తెలిసిందే. లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభ ఎన్నికలతోపాటు స్థానిక సంస్థల ఎన్నికలను సైతం ఒకేసారి నిర్వహించాలనికేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. -
2030 నాటికి మూడవ స్థానానికి
న్యూఢిల్లీ: భారత వాహన పరిశ్రమ 2030 నాటికి ప్రపంచంలో మూడవ స్థానానికి ఎగబాకుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వాహనాలు, విడిభాగాల తయారీని పెంపొందించేందుకు ఉద్ధేశించిన రూ.25,938 కోట్ల ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్ఐ) వంటి పథకాలు ఇందుకు దోహదం చేస్తాయని కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ వివరించింది. ‘పీఎల్ఐ కోసం దరఖాస్తు చేసే కంపెనీలు పరిశ్రమ వృద్ధిలో కీలకంగా వ్యవహరించనున్నాయి. వాహన పరిశ్రమ మద్దతు, వృద్ధి లేకుండా దేశంలో అధునాతన ఆటోమోటివ్ సాంకేతికత, ఉత్పత్తుల స్థానికీకరణ, అభివృద్ధి లక్ష్యం సాధ్యం కాదు. దేశంలో ఆర్థిక వ్యవస్థ ప్రధాన స్తంభాలలో వాహన పరిశ్రమ ఒకటి. దేశీయ స్థూల ఉత్పత్తిలో ఈ రంగం వాటా 1992–93లో 2.77 శాతమే. ఇప్పుడు ఏకంగా ఇది 7.1 శాతానికి ఎగసింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 1.9 కోట్ల మందికి ఉపాధి కలి్పస్తోంది. వాహన రంగంలో ద్విచక్ర వాహనాలు 77 శాతం, ప్యాసింజర్ కార్లు 18 శాతం వాటా కలిగి ఉన్నాయి. ప్యాసింజర్ కార్లలో చిన్న, మధ్యస్థాయి కార్లదే సింహ భాగం. 2024 డిసెంబర్ నాటికి ఆటోమొబైల్ రంగం రెండింతలై రూ.15 లక్షల కోట్లకు చేరుకోవాలన్నది భారత్ లక్ష్యం. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) రూపంలో ఈ రంగంలోకి 2000 ఏప్రిల్ నుంచి 2022 సెపె్టంబర్ మధ్య 33.77 బిలియన్ డాలర్ల నిధులు వెల్లువెత్తాయి. ఈ కాలంలో భారత్ అందుకున్న మొత్తం ఎఫ్‌డీఐల్లో వీటి వాటా 5.48 శాతం’ అని తెలిపింది. -
మూడు బిల్లులపై పరిశీలన ప్రారంభం
న్యూఢిల్లీ: ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకురాదలి్చన మూడు బిల్లులపై పార్లమెంటరీ స్థాయీసంఘం గురువారం పరిశీలన ప్రారంభించింది. బీజేపీ ఎంపీ, మాజీ ఐపీఎస్ అధికారి బ్రిజ్‌లాల్ నేతృత్వంలో హోంశాఖ వ్యవహారాలపై ఈ పార్లమెంటరీ స్థాయీ సంఘం ఏర్పాటైంది. మూడు బిల్లులపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా పార్లమెంట్ సభ్యులకు ప్రజెంటేషన్ ఇచ్చారు. వారి అభిప్రాయాలు, అభ్యంతరాలు తెలుసుకున్నారు. ప్రతిపక్ష ఎంపీలు పలు అంశాలను లేవనెత్తారు. మూడు బిల్లులకు హిందీ పేర్లు పెట్టడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 348ను ఉల్లంఘించడమే అవుతుందని డీఎంకే సభ్యుడు దయానిధి మారన్ ఆక్షేపించారు. తన అభ్యంతరాలు, డిమాండ్లపై మారన్ ఒక లేఖ సమర్పించారు. మారన్ డిమాండ్లకు పలువురు విపక్ష ఎంపీలు మద్దతు పలికారు. మూడు బిల్లులను బీజేపీ సభ్యులు స్వాగతించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ‘భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య బిల్లు’ను పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. -
అత్యధిక రేటుకి ఉల్లిని కొంటాం: కేంద్రం
న్యూఢిల్లీ: టమాటా బాటలో ఉల్లి ధరలు పయనిస్తున్నాయి. ఉల్లి ధరలు భారీగా పెరిగిపోతూ ఉండడంతో వాటిని అదుపు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఉల్లిపై 40% ఎగమతి సుంకాన్ని విధిస్తూ తీసుకున్న నిర్ణయంపై రైతులు నిరసనలకు దిగుతున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఉల్లిపాయలని క్వింటాల్‌కి రూ.2,410 రూపాయలు ఇచ్చి కొనుగోలు చేస్తామని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయెల్ చెప్పారు. మరోవైపు ఉల్లిపాయలు దొరకకపోతే, ధరలు ఎక్కువుంటే ఒక రెండు నుంచి నాలుగు నెలలు తినకపోతే వచ్చే నష్టమేమీ లేదని మహారాష్ట్ర మంత్రి దాదా భూసే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ ఎవరికైనా అంత ధర ఇచ్చి కొనే శక్తి లేకపోతే వారు రెండు నుంచి నాలుగు నెలలు మానేయచ్చు. దాని వల్ల ఏం నష్టం లేదు’ అని వ్యాఖ్యానించారు. రైతులు, వ్యాపారుల ధర్నాతో మహారాష్ట్రలోని నాసిక్‌లోని ఉల్లిమార్కెట్ బోసిపోయింది. -
ప్రచారం కోసం జీ20ని వాడుకుంటోంది: కాంగ్రెస్
న్యూఢిల్లీ: దేశంలో త్వరలో జరిగే జీ20 సమావేశాన్ని కేంద్రప్రభుత్వం ఎన్నికల ప్రచారం కోసం వాడుకుంటోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. వాస్తవ అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇలా చేస్తోందని విమర్శించింది. 1999లో అవతరించిన జీ20లో 19 దేశాలు, ఈయూ సభ్యులుగా ఉన్నాయి. ఇప్పటి వరకు 17 దేశాల్లో సమావేశాలు జరిగాయి. ఈసారి భారత్ వంతు వచ్చింది. కానీ, ఇప్పటి వరకు ఏదేశంలోనూ లేని విధంగా కేంద్రం దీనిని ప్రచారాస్త్రంగా ఉపయోగించుకుంటోంది’అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ శనివారం ఎక్స్‌లో పేర్కొన్నారు. జీ20 శిఖరాగ్ర సమావేశాలు సెప్టెంబర్ 9, 10 తేదీల్లో ఢిల్లీలో జరగనున్నాయి. -
పీఎం–ఈబస్ సేవాతో ఎలక్ట్రిక్ వాహనాల విస్తరణ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 10,000 ఎలక్ట్రిక్ బస్‌లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘పీఎం–ఈబస్ సేవా’ పథకం.. క్షేత్ర స్థాయిలో ఈవీల విస్తరణకు దోహదపడుతుందని పరిశ్రమ వర్గాల్లో ఆశాభావం వ్యక్తమైంది. పట్టణాల్లో ఎలక్ట్రిక్ బస్ సేవలకు వీలుగా ఈ పథకానికి కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. 169 పట్టణాలకు 10,000 బస్‌లను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో కేటాయించనున్నారు. ప్రభుత్వ నిర్ణయం ఎలక్ట్రిక్ ఆటోమోటివ్ కంపెనీలకు ప్రయోజనం కలిగించనుంది. ఈ పథకంపై జేబీఎం ఆటో వైస్ చైర్మన్, ఎండీ నిశాంత్ ఆర్య స్పందిస్తూ.. ప్రముఖ పట్టణాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, పర్వత ప్రాంతాలకు, ఈశాన్య రాష్ట్రాలకు కేటాయింపులు చేయడంతో ఎలక్ట్రిక్ బస్‌లను క్షేత్రస్థాయికి తీసుకెళ్లిన్టటు అవుతుందన్నారు. దేశవ్యాప్తంగా ఈవీ ఎకోసిస్టమ్ మరింత అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. పీఎంఐ ఎలక్ట్రిక్ మొబిలిటీ సొల్యూషన్స్ సీఈవో ఆంచాల్ జైన్ సైతం దీన్ని నిర్ణయాత్మక, పరిశ్రమ ముఖచిత్రాన్ని మార్చేసే పథకంగా పేర్కొన్నారు. స్థానికంగా ఈబస్ల తయారీని ప్రోత్సహిస్తుందన్నారు. -
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంలో చాలా లోపాలు
న్యూఢిల్లీ: ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంలో చాలా లోపాలున్నాయని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ టీమ్ పేర్కొంది. ఆండ్రాయిడ్– 13 సహా పలు వెర్షన్లు వైరస్ల బారిన పడే ప్రమాదం చాలా ఉందని ఆందోళన వెలిబు చ్చింది. వాటి వినియోగంలో జాగ్రత్తగా ఉండాలంటూ యూజర్లకు సోమవారం ’అతి తీవ్ర’ హెచ్చరిక లు జారీ చేసింది. లేదంటే మొబైల్స్ తదితరాల్లో సున్నిత సమాచారం హాకర్ల బారిన పడే ప్రమాదం పొంచి ఉందని వివరించింది. ఆండ్రాయిడ్ 10, 11, 12, 12ఎల్, 13 వెర్షన్లలో వీటిని ప్రధానంగా గమనించినట్టు చెప్పింది. వీటివల్ల ఫ్రేంవర్క్, ఆండ్రాయిడ్ రన్ టైం, సిస్టం కంపోనెంట్, గూగుల్ ప్లే సిస్టమ్ అప్డేట్స్, కెర్నల్, ఆర్మ్ కంపోనెంట్స్, మీడియా టీ కంపోనెంట్, కలోకాం క్లోజ్డ్ సోర్స్ కంపోనెంట్స్ వంటివాటి పనితీరు లోపభూయిష్టంగా మారుతుందని వివరించింది. అప్డేషన్ ఇలా... ఆండ్రాయిడ్ ఆధారిత డివైస్ల భద్రత కోసం లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచెస్‌కు తక్షణం అప్డేట్ చేసుకోవాలని సూచించింది. ఇందుకు డివైస్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి సిస్టమ్‌పై క్లిక్ చేయాలి..సిస్టమ్ అప్ డేట్స్‌పై క్లిక్ చేయండి. అప్డేట్స్ ఉంటే డౌన్ లోడ్ చేసుకోండి. -
స్వాతంత్య్ర దిన వేడుకలు.. సామాన్యులే అతిథులు
న్యూఢిల్లీ: భారత 77వ స్వాతంత్య్ర దిన వేడుకలకు కేంద్ర ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేస్తోంది. పంద్రాగస్టున ఢిల్లీలోని ఎర్రకోటలో అంబరాన్నంటే సంబరాల్లో సామాన్యుడికి పెద్దపీట వేసింది. దేశానికి వెన్నుముకలాంటి రైతులు, చెమటోడ్చి పని చేసే కార్మికులు, జీవనోపాధి కోసం ప్రాణాలనే పణంగా పెట్టే జాలర్లు, సేవాగుణం కలిగిన నర్సులు, గ్రామాల సర్పంచ్‌లను ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించింది. ఢిల్లీలో ఎర్రకోటపై మంగళవారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించిన తర్వాత జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. 2047 స్వాతంత్య్ర దిన శతాబ్ది ఉత్సవాల నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశాల సరసన చేర్చాలన్న లక్ష్యంతో ఈ ఏడాది ఆజాదీకా అమృతోత్సవ్‌లో భాగంగానే స్వాతంత్య్ర దిన వేడుకల్ని జరుపుతున్నారు. ఇక ఇంటింటిలోనూ త్రివర్ణ పతాకం ఎగరాలన్న ప్రచారం ఆదివారం నుంచే మొదలైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమాల్లో ప్రతీ ఒక్కరూ జాతీయ జెండాను డిస్ప్లే పిక్చర్ (డీపీ) గా పెట్టుకోవాలని పిలుపునిచ్చారు. చైతన్యవంత గ్రామాల నుంచీ.. స్వాతంత్ర దిన వేడుకలకు ప్రత్యేకంగా 1,800 మంది అతిథుల్ని ఆహ్వానించారు. దేశంలోని అత్యంత చైతన్యవంతమైన గ్రామాలుగా గుర్తింపు పొందిన 660కి పైగా గ్రామాల నుంచి 400 మందికి పైగా సర్పంచ్‌లు, 250 మంది రైతులు, పార్లమెంటు కొత్త భవనం, సరిహద్దుల్లో రోడ్ల నిర్మాణంలో భాగస్వామ్యులైన 50 మంది కార్మికులు, 50 మంది ఖాదీ పనివారుతో పాటు జాలర్లు, టీచర్లు, నర్సులు ఇలా సమాజంలో కీలకమైన వర్గాల వారందరికీ ఆహ్వానం పలికినట్టుగా కేంద్రం ఒక ప్రకటనలో వెల్లడించింది. సతీ సమేతంగా హాజరయ్యే ఈ అతిథులకి బస ఏర్పాట్లు చేస్తోంది. సెల్ఫీ పాయింట్లు స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా యువతీయువకులకు సెల్ఫీ పోటీలు నిర్వహిస్తోంది. ఇందు కోసం 12 ప్రాంతాల్లో సెల్ఫీ పాయింట్లను వివిధ థీమ్‌లతో తీర్చి దిద్దింది. నేషనల్ వార్ మెమోరియల్, ఇండియా గేట్, విజయ్ చౌక్, రైల్వే స్టేషన్, ప్రగతి మైదాన్, రాజ్‌ఘాట్, జమా మసీదు మెట్రో స్టేషన్, రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్, ఢిల్లీ గేట్ మెట్రో స్టేషన్,, ఇలా 12 ప్రాంతాల్లో పెట్టిన సెల్ఫీ పాయింట్లలో సెల్ఫీలు తీసుకొని ఆగస్టు 15–20 మధ్య మైగవ్ పోర్టల్‌లో అప్లోడ్ చేయాలి. ఒక్కో సెల్ఫీ పాయింట్ నుంచి అత్యుత్తమమైన దానిని ఎంపిక చేసి 12 మంది విజేతలకు రూ.10 వేల చొప్పున బహుమానం అందిస్తారు. డీపీలుగా జాతీయ జెండా హర్‌ఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా సోషల్ మీడియా వినియోగదారులందరూ తమ అకౌంట్లలో డీపీని జాతీయ జెండాతో మార్చాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మోదీ తన అకౌంట్లలో త్రివర్ణ పతాకాన్నే డీపీగా పెట్టుకున్నారు. ఆగస్టు 13 నుంచి 15 వరకు ఇదో ఉద్యమంగా చేయాలన్నారు. దేశానికి, ప్రజలకి మధ్య ఉండే ఉద్వేగభరితమైన సంబంధానికి ప్రతీకగా జాతీయ జెండాను డీపీగా ఉంచాలని ప్రధాని పిలుపునిచ్చారు. స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు స్ఫూర్తిగా నిలిచే జాతీయ జెండాలతో ఫోటోలు దిగి హర్ ఘర్ తిరంగా వెబ్సైట్లో అప్లోడ్ చేయాలన్నారు. -
బీజేపీ భారత్ వీడిపో
కోల్‌కతా: మణిపూర్ హింసాకాండ కారకులపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. అందుకే ప్రస్తుతం దేశంలో ‘‘బీజేపీ భారత్ వీడిపో’’ అన్న నినాదం మారుమోగుతోందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అవినీతిపై మాట్లాడే హక్కు లేదన్నారు. పెద్ద నోట్ల రద్దు, రఫేల్ ఒప్పందం, పీఎం కేర్ నిధుల అంశంలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న మోదీ ప్రభుత్వం అవినీతి గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని మమత అన్నారు. కోల్‌కతాలో శనివారం జరిగిన జీ–20 అవినీతి వ్యతిరేక సమావేశంలో ప్రధాని మోదీ వర్చువల్‌గా పాల్గొని మాట్లాడారు. అవిశ్వాస తీర్మానం సమయంలో లోక్‌సభ నుంచి విపక్ష పార్టీ సభ్యులు పారిపోయారని, వారు వ్యాప్తి చేసిన నెగిటివిటీని తాము సమర్థంగా ఎదుర్కొన్నామని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు మమత కౌంటర్ ఇచ్చారు. దేశంలో నిరుపేద ప్రజలు బతకడం బీజేపీకి ఇష్టం లేదని, అందుకే ప్రధాని మోదీ ఇష్టారాజ్యంగా నిందలు వేస్తున్నారని అన్నారు. ‘‘‘ప్రధానమంత్రి జాతిని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రతిపక్షాల గురించి మాట్లాడుతున్నారు. దేశంలో నిరుపేదలు బతకడం బీజేపీకి ఇష్టం లేదు’’ అని మమత తాను విడుదల చేసిన ఒక ఆడియో మెసేజ్‌లో ఆరోపించారు. బ్రిటిష్ పాలకుల్ని క్విట్ ఇండియా అంటూ అప్పట్లో మహాత్మా గాంధీ నినదించారని, ఇప్పుడు దేశ ప్రజలు బీజేపీ క్విట్ ఇండియా అంటున్నారని మమత కేంద్రంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. -
రూ.13,000 కోట్ల పీఎల్ఐ ప్రోత్సాహకాలు
న్యూఢిల్లీ: ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకం కింద అర్హత కలిగిన సంస్థలకు కేంద్ర ప్రభుత్వం రూ.13,000 కోట్లను మంజూరు చేయనుంది. ఇక మీదట పీఎల్ఐ కింద ఏటా ఇచ్చే ప్రోత్సాహకాల మొత్తం గణనీయంగా ఉంటుందని పారిశ్రామిక ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు. ఈ ఏడాది ఇలా విడుదల చేసే మొత్తం రూ.13వేల కోట్లుగా ఉండొచ్చన్నారు. పీఎల్ఐ కింద కేంద్ర సర్కారు 14 రంగాలకు ప్రోత్సహకాలను ఇప్పటి వరకు ప్రకటించగా, మరిన్ని రంగాలు సైతం ప్రోత్సాహకాల కోసం డిమాండ్ చేస్తున్నాయి. టెలీకమ్యూనికేషన్స్, వైట్ గూడ్స్, టెక్స్టైల్స్, వైద్య ఉపకరణాల తయారీ, ఆటోమొబైల్స్, స్పెషాలిటీ స్టీల్, ఫుడ్ ఉత్పత్తులు, అధిక సామర్థ్యం కలిగిన సోలార్ పీవీ మాడ్యూల్స్, అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ బ్యాటరీ, డ్రోన్లు, ఫార్మా రంగాలకు ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.1.97 లక్షల కోట్ల ప్రోత్సాహకాలను ప్రకటించింది. అయితే వీటిల్లో సోలార్ పీవీ మాడ్యూళ్లు, అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ (ఏసీసీ) బ్యాటరీలు, టెక్స్టైల్ ఉత్పత్తులు, స్పెషాలిటీ స్టీల్ రంగాలకు పీఎల్ఐ కింద ప్రోత్సాహకాల విడుదల మొదలు కావాల్సి ఉంది. దేశీయ తయారీని పెంచడం, దిగుమతులు తగ్గించడం, అంతర్జాతీయంగా ఎగుమతుల్లో పోటీ పడడం అనే లక్ష్యాలతో కేంద్ర సర్కారు 2021లో పీఎల్ఐ పథకాన్ని తీసుకురావడం గమనార్హం. 4 లక్షల మందికి ఉపాధి.. పర్యావరణ అనుమతుల్లో జాప్యం, చైనా నుంచి నిపుణుల సాయం పొందేందుకు వీసా మంజూరులో సమస్యలను భాగస్వాములు ప్రస్తావించారని, వాటి పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తున్నట్టు రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు. పీఎల్ఐ కింద ఇప్పటికే రూ.78వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, రూ.6 లక్షల కోట్ల అమ్మకాలు నమోదయ్యాయని వెల్లడించారు. 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు వచి్చనట్టు తెలిపారు. ఆట»ొమ్మలు, ఇతర రంగాలకు పీఎల్ఐ అభ్యర్థనలు అంతర్గత మంత్రిత్వ శాఖల పరిశీలనలో ఉన్నట్టు సింగ్ పేర్కొన్నారు. ఇటీవలే ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, కంప్యూటర్ల దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు అమలు చేయగా, తర్వాత అక్టోబర్ 31 వరకు వాయిదా వేయడం తెలిసిందే. దీనిపై సింగ్ మాట్లాడుతూ.. ఇది స్వేచ్ఛాయుత లైసెన్సింగ్ విధానమని ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. దీని పట్ల పెద్దగా ఆందోళన అవసరం లేదన్నారు. -
నవంబర్ నుంచి కంప్యూటర్లపై ఆంక్షలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, ట్యాబ్లెట్ పీసీల దిగుమతులపై విధించిన ఆంక్షల అమలును మూడు నెలలు వాయిదా వేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. దిగుమతులపై విధించిన ఆంక్షలు నవంబర్ 1 నుంచి అమలులోకి రానున్నాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) వెల్లడించింది. ఎల్రక్టానిక్స్ కంపెనీలు ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, ట్యాబ్లెట్ పీసీలను భారత్‌కు దిగుమతి చేసుకోవాలంటే నవంబర్ 1 నుంచి ప్రభుత్వ లైసెన్స్ తప్పనిసరి. కాగా, లైసెన్స్ కలిగిన కంపెనీలు మాత్రమే ఈ పరికరాలను దిగుమతి చేసుకోవాల్సి ఉంటుందని, ఉత్తర్వులు వెంటనే అమలులోకి తీసుకువస్తున్నట్టు ఆగస్ట్ 3న కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు వెలువరించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయంతో పరిశ్రమ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. కంప్యూటర్లలో అంతర్గత భద్రత లొసుగులతో కార్పొరేట్ కంపెనీలు, వ్యక్తుల డేటాకు ముప్పు ఏర్పడే ప్రమాదం పొంచి ఉందన్న కారణంతో తప్పనిసరి లైసెన్స్ విధానానికి కేంద్ర ప్రభుత్వం తెరతీసింది. -
కంప్యూటర్ల దిగుమతిపై నియంత్రణ
న్యూఢిల్లీ: దేశీయంగా తయారీని ప్రోత్సహించేందుకు, భద్రతాపరమైన కారణాల రీత్యా ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు అలాగే కొన్ని రకాల కంప్యూటర్ల దిగుమతులపై కేంద్రం గురువారం నియంత్రణలు విధించింది. చైనా, కొరియా వంటి దేశాల నుంచి దిగుమతులను కట్టడి చేసేందుకు ఇవి ఉపయోగపడనున్నాయి. నియంత్రణలు తక్షణమే అమల్లోకి వచ్చినట్లు సీనియర్ ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు. ఇకపై ఈ ఉత్పత్తులను దిగుమతి చేసుకునేందుకు దిగుమతిదారులు ప్రభుత్వం నుంచి అనుమతి, లైసెన్సులు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. నియంత్రణల విధింపునకు పలు కారణాలు ఉన్నప్పటికీ పౌరుల భద్రతను పరిరక్షించడం అన్నింటికన్నా ప్రధానమైనదని ఆయన వివరించారు. ఆంక్షలు విధించడమనేది దిగుమతులను పూర్తిగా నిషేధించే ఉద్దేశంతో తీసుకున్నది కాదని, వాటిని నియంత్రించడం మాత్రమే లక్ష్యమని చెప్పారు. దీనివల్ల దేశీయంగా ధరలేమీ పెరగబోవని తెలిపారు. కొన్ని మినహాయింపులు ఉంటాయి.. ‘ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, ఆల్–ఇన్–వన్ పర్సనల్ కంప్యూటర్లు, అల్ట్రా చిన్న స్థాయి కంప్యూటర్లు, సర్వర్ల దిగుమతులపై తక్షణమే నియంత్రణలు అమల్లోకి వస్తాయి‘ అని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) ఒక నోటిఫికేషన్లో తెలిపింది. అయితే, కొన్ని సందర్భాల్లో మినహాయింపులు ఉంటాయని పేర్కొంది. ఆగస్టు 3 కన్నా ముందుగానే లెటర్ ఆఫ్ క్రెడిట్ జారీ చేసిన కన్సైన్మెంట్లను దిగుమతి చేసుకోవచ్చని వివరించింది. ఆగస్టు 4 నుంచి దిగుమతిదారు లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. అలాగే ఆర్అండ్డీ, టెస్టింగ్, రిపేర్ అండ్ రిటర్న్ తదితర అవసరాల కోసం కన్సైన్మెంట్కు 20 ఐటమ్‌ల వరకు దిగుమతి చేసుకునేందుకు లైసెన్సు తీసుకోనక్కర్లేదని వివరించింది. ఈ–కామర్స్ పోర్టల్స్ ద్వారా కొనుగోలు చేసే ఒక ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్, పీసీ, లేదా అల్ట్రా స్మాల్ ఫారం ఫ్యాక్టర్ కంప్యూటర్లకు కూడా మినహాయింపులు వర్తిస్తాయి. అయితే, వాటికి వర్తించే సుంకాలను చెల్లించాల్సి ఉంటుంది. దిగుమతులపై ఆంక్షల వల్ల దేశీయంగా ఆయా ఉత్పత్తుల రేట్లు పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. బిలియన్ డాలర్ల కొద్దీ దిగుమతులు.. 2022–23లో భారత్ 5.33 బిలియన్ డాలర్ల విలువ చేసే పర్సనల్ కంప్యూటర్లు .. ల్యాప్‌టాప్‌లను, 553 మిలియన్ డాలర్ల విలువ చేసే ప్రత్యేక డేటా ప్రాసెసింగ్ మెషీన్లను దిగుమతి చేసుకుంది. భారత్‌లో ఎక్కువగా హెచ్‌సీఎల్, డెల్, ఎల్జీ ఎల్రక్టానిక్స్, లెనొవొ, యాపిల్, హెచ్‌పీ, శాంసంగ్ తదితర ఎల్రక్టానిక్ దిగ్గజాల ఉత్పత్తులు అమ్ముడవుతున్నాయి. భారత్ ఈ తరహా ఉత్పత్తులను ఏటా 7–8 బిలియన్ డాలర్ల మేర దిగుమతి చేసుకుంటోంది. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీíÙయేటివ్ (జీటీఆర్ఐ) నివేదిక ప్రకారం భారత్ చైనా నుంచి దిగుమతి చేసుకునే వాటిల్లో 65 శాతం వాటా ఎల్రక్టానిక్స్, యంత్రాలు, ఆర్గానిక్ రసాయనాలు ఉంటున్నాయి. రోజువారీ ఉపయోగించే మొబైల్ ఫోన్స్, ల్యాప్‌టాప్‌లు, సోలార్ సెల్ మాడ్యూల్స్ మొదలైన వాటి కోసం ఎక్కువగా చైనాపైనే ఆధారపడాల్సి ఉంటోంది. దీన్ని తగ్గించుకునే దిశగా దేశీయంగా ఎల్రక్టానిక్స్ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు కేంద్రం పలు చర్యలు తీసుకుంటోంది. -
కేంద్ర పోలీస్ విభాగాల్లో 1.14 లక్షల ఖాళీలు
న్యూఢిల్లీ: సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఢిల్లీ పోలీసు వంటి కేంద్ర పోలీస్ విభాగాల్లో 1,14,245 ఉద్యోగాలు ఇంకా భర్తీ చేయాల్సి ఉందని కేంద్రప్రభుత్వం బుధవారం వెల్లడించింది. రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా బుధవారం ఈ వివరాలు తెలిపారు. ఈ ఏడాది 31,879 పోస్టులకు ప్రకటనలు జారీచేయగా ఇప్పటిదాకా 1,126 పోస్టులే భర్తీ అయ్యాయి. కేంద్ర హోం శాఖ, దాని విభాగాలైన బీఎస్ఎఫ్, సశస్త్ర సీమా బల్, సీఆర్పీఎఫ్, ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్, అస్సాం రైఫిల్స్, సీఐఎస్ఎఫ్, కేంద్ర పోలీసు సంస్థలు, ఢిల్లీ పోలీస్ ఇలా అన్ని విభాగాల్లో మొత్తంగా 1,14,245 ఖాళీలు ఉన్నట్లు మంత్రి తెలిపారు. వీటిలో షెడ్యూల్ కులాల పోస్టులు 16,356 ఉన్నాయి. షెడ్యూల్ తెగలకు 8,759, ఇతర వెనుకబడిన వర్గాలకు 21,974, ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు 7,394 పోస్టులు, మిగతా 59వేలకుపైగా జనరల్ కేటగిరీ పోస్టులు ఉన్నాయి. -
మైనార్టీలకు దగ్గరవడానికి కార్యక్రమాలు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ రద్దు నిర్ణయం వల్ల ముస్లిం మహిళలకు ఎనలేని భద్రత లభించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ముస్లిం మహిళల పురోగతికి తాము చేపడుతున్న చర్యల గురించి అందరిలోనూ అవగాహన పెంచాలని తనను కలిసిన పార్టీ ఎంపీలకు చెప్పారు. పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్‌కు చెందిన బీజేపీ ఎంపీలు ప్రధాని మోదీని కలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఎంపీలతో మాట్లాడుతూ 2024 ఎన్నికలకు అందరూ సన్నద్ధంగా ఉండాలన్నారు. రానున్న రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకొని మైనార్టీ వర్గాల ప్రయోజనాల కోసం కేంద్రం తీసుకున్న చర్యల్ని విస్తృతంగా ప్రచారం చేయాలని ప్రధాని చెప్పినట్టుగా కొందరు ఎంపీలు వెల్లడించారు. -
‘అవిశ్వాసం’ పూర్తయ్యేదాకా సభలో బిల్లులు ఆమోదించొద్దు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత ఇతర బిల్లులను ఆమోదించడం సరైంది కాదని కాంగ్రెస్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి మనీశ్ తివారీ అభిప్రాయపడ్డారు. అవిశ్వాసంపై చర్చ, ఓటింగ్ జరిగి ఫలితం తేలిన తర్వాతే ఇతర బిల్లును ప్రవేశపెట్టడం లేదా ఆమోదించడం చేయాలని అన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వంపై లోక్‌సభలో విపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. నిబంధనల ప్రకారం దీనిపై 10 రోజుల్లోగా చర్చ, ఓటింగ్ నిర్వహించాల్సి ఉంది. బిల్లులను ఇష్టారాజ్యంగా ఆమోదింపజేసుకోవడానికి ఈ గడువును వాడుకోవద్దని మనీశ్ తివారీ హితవు పలికారు. అలా చేయడం పార్లమెంటరీ సంప్రదాయాలకు, నైతిక విలువలకు విరుద్ధమన్నారు. -
విదేశాల్లో నేరుగా దేశీ సంస్థల లిస్టింగ్
న్యూఢిల్లీ: దేశీ కంపెనీలు తమ షేర్లను నేరుగా విదేశీ స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్ట్ చేసుకునేందుకు అనుమతించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవానికి కోవిడ్–19 సహాయక ప్యాకేజీ కింద 2020 మేలోనే ప్రకటించినప్పటికీ, దీనిపై తాజాగా నిర్ణయం తీసుకుంది. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిర్వహించిన కార్పొరేట్ డెట్ మార్కెట్ డెవలప్మెంట్ ఫండ్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాలు తెలిపారు. ‘ఐఎఫ్ఎస్సీ ఎక్సే్చంజీల్లో లిస్టెడ్, అన్‌లిస్టెడ్ కంపెనీలు నేరుగా లిస్ట్ అయ్యేందుకు అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది‘ అని ఆమె చెప్పారు. సంస్థలు అంతర్జాతీయంగా పెట్టుబడులు సమీకరించుకునేందుకు, మెరుగైన వేల్యుయేషన్స్ దక్కించుకునేందుకు దీనితో తోడ్పాటు లభించగలదని మంత్రి పేర్కొన్నారు. మరికొద్ది వారాల్లో దీనికి సంబంధించిన నిబంధనలను నోటిఫై చేయనున్నట్లు ఆర్థిక శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. తొలుత గుజరాత్ గిఫ్ట్ సిటీలోని ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ (ఐఎఫ్ఎస్సీ)లో లిస్ట్ అయ్యేందుకు, ఆ తర్వాత ఎనిమిది లేదా తొమ్మిది నిర్దిష్ట దేశాల్లో లిస్టింగ్‌కు అనుమతినివ్వొచ్చని పేర్కొన్నారు. ఈ జాబితాలో బ్రిటన్, కెనడా, స్విట్జర్లాండ్, అమెరికా మొదలైనవి ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి. స్టార్టప్‌లు.. రిలయన్స్‌కు బూస్ట్.. కొత్త పాలసీతో యూనికార్న్‌లు (1 బిలియన్ డాలర్లకు పైగా వేల్యుయేషన్ గల స్టార్టప్‌లు), విదేశాల్లో లిస్టింగ్‌పై కసరత్తు చేస్తున్న రిలయన్స్ డిజిటల్ విభాగానికి ఊతం లభించగలదని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ప్రస్తుత విధానం ప్రకారం భారతీయ సంస్థలు.. ప్రధానంగా అమెరికన్ డిపాజిటరీ రిసీట్స్ (ఏడీఆర్), గ్లోబల్ డిపాజిటరీ రిసీట్స్ (జీడీఆర్) రూపంలో విదేశాల్లో లిస్ట్ కావాల్సి ఉంటోంది. ఇన్ఫోసిస్, విప్రో తదితర సంస్థలు ఇదే బాటలో లిస్ట్ అయ్యాయి. విదేశాల్లో లిస్టింగ్ వల్ల భారతీయ కంపెనీలు వివిధ దేశాల్లోని ఎక్సే్చంజీల ద్వారా విదేశీ నిధులను సమకూర్చుకునేందుకు వీలుంటుంది. -
76 శాతం థర్మల్ ప్లాంట్ల నుంచే
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశం మొత్తం విద్యుత్ అవసరాల్లో దాదాపు 76 శాతం అవసరాలను థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నుంచే సమకూర్చుకోవాల్సి ఉందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 1,750 కోట్ల యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా లోక్‌సభలో విద్యుత్, పునరుత్పాదక ఇంథన శాఖ మంత్రి ఆర్కే సింగ్ చెప్పారు. విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచుకునే ఉద్దేశంతో నిర్మిస్తున్న భిన్నరకాల విద్యుత్ ప్లాంట్ల వివరాలనూ మంత్రి వెల్లడించారు. ‘మొత్తంగా 25వేలకుపైగా మెగావాట్ల సామర్థ్యంతో 18 బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నిర్మిస్తున్నారు. వాటిలో ఒకటి గ్యాస్ ఆధారిత థర్మల్ ప్లాంట్ ఉంది. మొత్తంగా 18వేల మెగావాట్ల సామర్థ్యంతో 42 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు. 8వేల మెగావాట్ల సామర్థ్యంతో అణువిద్యుత్ కేంద్రాలను నెలకొల్పుతున్నారు. డిమాండ్‌కు తగ్గట్లు విద్యుత్ సామర్థ్యం దేశం సొంతం. 3.6 శాతం మిగులును సాధించాం. డిమాండ్ అత్యధికంగా ఉన్నప్పుడూ 0.7 శాతం మిగులును సాధించాం’ అని మంత్రి వెల్లడించారు. అయితే 2023 ఏప్రిల్–జూన్ కాలంలో మాత్రం 0.2 శాతం లోటు కనిపించిందని మరో ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా మంత్రి వెల్లడించడం గమనార్హం. -
ITPO complex: ‘భారత మండపం’ రెడీ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న జీ–20 సదస్సుకి వేదిక సిద్ధమైంది. సెపె్టంబర్లో జరగనున్న ఈ సదస్సుకి అమెరికా, బ్రిటన్, చైనా సహా 20 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ సదస్సుని నిర్వహించడానికి ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ సెంటర్ (ఐఈసీసీ)కు కొత్తగా హంగులు చేకూర్చారు. మరమ్మతులు నిర్వహించి ఆధునీకరించారు. ఈ సెంటర్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించి దానికి కొత్తగా భారత మండపం అని పేరు పెట్టారు. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయెల్, ఇతర మంత్రుల సమక్షంలో డ్రోన్ ద్వారా ఈ సెంటర్‌ని ప్రారంభించారు. ఐఈసీసీ కాంప్లెక్స్‌ని జాతీయ ప్రాజెక్టు కింద రూ.2,700 కోట్లతో అభివృద్ధి చేశారు. ప్రగతి మైదాన్‌లో ఇండియా ట్రేడ్ ప్రొమోషన్ ఆర్గనైజేషన్ (ఐటీపీఒ) కాంప్లెక్స్‌లో ఇది భాగంగా ఉంది. అంతకు ముందు ప్రధాని మోదీ ఐటీపీఒలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కాంప్లెక్స్ మరమ్మతు పనుల్లో పాల్గొన్న కార్మికుల్ని ప్రధాని సత్కరించారు. ప్రగతి మైదాన్ దాదాపుగా 123 ఎకరాల్లో ఇది విస్తరించి ఉంది. భారత్‌లో అంతర్జాతీయ సదస్సులు , పారిశ్రామిక సమావేశాలు నిర్వహించే కాంప్లెక్స్‌లో అతి పెద్దది. ఎన్నో అత్యాధునిక సదుపాయాలు కలిగిన ఐఈసీసీ ప్రపంచ స్థాయి ప్రమాణాలు కలిగిన టాప్ –10 వేదికల్లో ఒకటి. మూడో అంతస్తులు ఏడువేల మంది పట్టే ఒక కాన్ఫరెన్స్ హాలు ఉంది. జీ–20 శిఖరాగ్ర సదస్సు నిర్వహించడానికి భారతీయత ఉట్టిపడేలా దీనిని నిర్మించడంతో భారత మండపం అని పేరు పెట్టారు. -
808 ఎఫ్ఎం రేడియో స్టేషన్లకు త్వరలో ఈ వేలం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 284 నగరాల్లో 808 ఎఫ్ఎం రేడియో స్టేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వం త్వరలోనే ఈ వేలం నిర్వహించనుందని కేంద్ర సమాచార ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. ప్రస్తుతం దేశంలోని 26 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 113 నగరాల్లో 388 ఎఫ్ఎం స్టేషన్లు నడుస్తున్నాయని చెప్పారు. కవరేజీ పెంచేందుకు గాను మారుమూల ప్రాంతాల్లోనూ రేడియో టవర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కమ్యూనిటీ రేడియోలు సహా రేడియో స్టేషన్లకు లైసెన్స్ జారీ ప్రక్రియను సులభతరం చేశామన్నారు. టయర్–2, 3 నగరాల్లోనూ విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఆలిండియా రేడియో ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ల ద్వారా దేశంలోని భౌగోళిక ప్రాంతాన్ని 59 శాతం నుంచి 66 శాతానికి, జనాభాలో 68 నుంచి 80 శాతం మందికి సేవలందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. మారుమూల, గిరిజన, వామపక్ష తీవ్రవాద ప్రాబల్య ప్రాంతాల్లోని వారికి ఉచితంగా 8 లక్షల డీడీ ఫ్రీ డిష్ సెట్ టాప్ బాక్సులను అందజేయనున్నామని తెలిపారు. -
Kuno cheetah deaths: రేడియో కాలర్ మృత్యుపాశమై!
కేంద్ర ప్రభుత్వం ఎన్నో వ్యయప్రయాసలకోర్చి విదేశాల నుంచి తీసుకొచ్చిన చీతాలు ఒక్కొక్కటి ప్రాణాలు కోల్పోతున్నాయి. నాలుగు నెలల వ్యవధిలో ఏకంగా ఎనిమిది చీతాలు మరణించాయి. భారత్‌లో చీతా ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గత ఏడాది సెప్టెంబర్ 17న ఆయన పుట్టిన రోజు నాడు నమీబియా నుంచి తీసుకువచ్చిన 8 చీతాలను కునో జాతీయ పార్క్‌లో ప్రవేశపెట్టారు. రెండో విడతలో భాగంగా ఈ ఏడాది దక్షిణాఫ్రికా నుంచి మరో 12 చీతాలు తీసుకువచ్చారు. మార్చిలో జ్వాల అనే చీతా నాలుగు కూనలకు జన్మనిచ్చింది. అయితే ఏడాది తిరక్కుండానే ఎనిమిది చీతాలు మృత్యువాత పడడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల తేజస్, సూరజ్ అనే రెండు చీతాలు మరణించాయి. ఆ చిరుతల రేడియో కాలర్ల కింద గాయాలన్నట్టు వైద్యులు గుర్తించారు. ఆ గాయాల్లో పురుగులు కూడా ఉన్నట్టు వారు నిర్ధారించారు. ఇదే తరహా గాయాలు మరో రెండు చీతాల్లో కూడా ఉండడంతో వాటికి రేడియో కాలర్లు తొలగించి చికిత్స అందిస్తున్నారు. వాటి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో రేడియో కాలర్లే చీతాల మృతికి కారణం కావచ్చునన్న అనుమానాలు బలపడ్డాయి. రేడియో కాలర్లలో ఉండే చిప్ ఉపగ్రహాల ద్వారా జంతువులకు సంబంధించిన సమాచారాన్ని చేరవేస్తుంది. చీతాల భద్రత, సంరక్షణ కోసం వీటి అవసరం చాలా ఉంది. రేడియో కాలర్స్ ఎలా కబళించాయి? ► చీతాల కదలికల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం కోసం వాటి మెడకి రేడియో కాలర్స్ కట్టారు. వేసవి కాలంలో చెమట, దురద వల్ల చీతాలు తరచుగా మెడపై గీరుకోవడం వల్ల చీతాలకు గాయాలై అది చర్మ సంబంధితమైన ఇన్ఫెక్షన్కు దారితీసి ప్రాణాలు కోల్పోయి ఉండే అవకాశాలున్నట్టు మధ్యప్రదేశ్ అటవీ సంరక్షణ మాజీ అధికారి అలోక్‌కుమార్ అభిప్రాయపడ్డారు. ► వర్షాకాలం వచ్చాక వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉండడంతో రేడియో కాలర్స్ కట్టిన మెడ చుట్టూ ఒరుసుకొని పోయి చీతాలకు గాయాలయ్యాయి. ఆ గాయాల మీద క్రిమి కీటకాదులు ముసిరి ఇన్ఫెక్షన్గా మారుతోంది. దీనివల్ల రక్త ప్రసరణకు సంబంధించిన సెప్టిసీమియా అనే పరిస్థితి తలెత్తి చీతాల మరణానికి దారితీసింది. ► ఏదైనా ఒక వస్తువుని సుదీర్ఘకాలం శరీరంపై ఉంచడం వల్ల బ్యాక్టీరీయా సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉందని జర్నల్ ఆఫ్ క్లినికల్ డయాగ్నస్టిక్ రీసెర్చ్‌లో తేలింది. ముఖ్యంగా చీతాల మెడ చుట్టూ ఉండే జుట్టు మృదువుగా ఉండడం వల్ల రేడియో కాలర్‌తో వివిధ అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ► జంతువులకి వాడే రేడియో కాలర్ బరువు ఆ జంతువు అసలు బరువులో 3% మాత్రమే ఉండాలి. సాధారణంగా రేడియో కాలర్ల బరువు 400 గ్రాముల వరకు ఉంటుంది. 20 నుంచి 60 కేజీల బరువు ఉండే చీతాలకు ఇది సరిపోతుంది. అయితే చీతా మెడ కంటే తల పెద్దది కాదు. దీని వల్ల రేడియో కాలర్ వాటికి అత్యంత బరువుగా అనిపిస్తాయి. చిన్న జంతువులన్నింటిలోనూ ఈ సమస్య ఉంటుంది. రేడియో కాలర్ కట్టడం వల్ల సమస్యలు ఎక్కవయిపోతాయని లండన్‌లోని రాయల్ వెటర్నరీ కాలేజీ ప్రొఫెసర్ అలన్ విల్సన్ చెప్పారు. ► చీతాలకు గత కొన్ని నెలలుగా రేడియో కాలర్ కట్టే ఉంచారు. కానీ వేసవిలో ఇలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదు. వానలు కురవడం ప్రారంభమయ్యాక చర్మం నిరంతరం తడిగా ఉండడం వల్ల రేడియో కాలర్ గాయాలు మరింత పెద్దవై చీతాలు మృత్యువాత పడ్డాయి. అన్నీ ఒక్క చోటే ఎందుకు ? : సుప్రీం దక్షిణాఫ్రికా, నమీబియా నుంచి తీసుకువచ్చిన చీతాల్లో 40% మృత్యువాత పడడం ఆందోళనకంగా ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. చీతాల ప్రాజెక్టుని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒక్కచోటే ఎందుకు ఉంచుతున్నారని కేంద్రాన్ని ప్రశ్నించింది. మధ్యప్రదేశ్ కునో నుంచి వేరే రాష్ట్రాల్లో వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాలకు చీతాలను తరలించే మార్గాలను అన్వేషించాలని కేంద్ర ప్రభుత్వాన్ని జస్టిస్ బి.ఆర్.గవాయ్. జె.బి. పర్దివాలా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన డివిజన్ బెంచ్ చెప్పింది. ‘‘చీతాలు మరణించడానికి కారణాలేంటి ? అసలు ఏమిటి సమస్య ? వాతావరణం చీతాలకు అనుకూలంగా లేదా ? ఇంకా ఏమైనా కారణాలున్నాయా ? గత వారంలో రెండు చీతాలు మరణించాయి ? అలాంటప్పుడు అన్ని చీతాలను మధ్యప్రదేశ్ కునోలో ఎందుకు ఉంచాలి ? వాటిని వేరే కేంద్రాలకు ఎందుకు తరలించకూడదు ? అంటూ కేంద్రంపై ప్రశ్నల వర్షం కురిపించింది. కేంద్రం తరఫున కోర్టుకి హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి త్వరలోనే చీతాల మృతికి గల కారణాలను వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేస్తామని స్పష్టం చేశారు. జులై 29లోగా దీనిపై పూర్తి స్థాయి వివరణ ఇవ్వాలని సుప్రీం ఆదేశించింది. నమీబియా నుంచి తెచ్చిన చీతాలు: 8 దక్షిణాఫ్రికా నుంచి తెచ్చిన చీతాలు: 12 మార్చిలో పుట్టిన చీతాలు : 4 మృతి చెందిన చీతాలు: 3 కూనలు సహా 8 మిగిలిన చీతాలు :16 – సాక్షి, నేషనల్ డెస్క్ -
టమాటా ధర కిలో రూ.80
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా టమాటా ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇటీవలే కిలో రూ.250 దాకా పలికిన సందర్భాలున్నాయి. ప్రస్తుతం దేశంలో సగటు ధర కిలోకు రూ.117గా ఉంది. వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం రాయితీపై టమాటాలు విక్రయిస్తోంది. పలు నగరాల్లో కొన్ని రోజులపాటు కిలో రూ.90కి విక్రయించగా, ఆదివారం నుంచి రూ.80కే అందుబాటులోకి తీసుకొచి్చంది. భారత జాతీయ సహకార వినియోగదారుల సంఘం(ఎన్సీసీఎఫ్), భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సంఘం(నాఫెడ్) ద్వారా ప్రభుత్వం టమాటాలను రాయితీపై విక్రయిస్తోంది. ప్రభుత్వ జోక్యంతో రిటైల్ మార్కెట్లో టమాటా ధరలు తగ్గుముఖం పట్టాయని అధికార వర్గాలు చెప్పాయి. ఆదివారం ఢిల్లీ, నోయిడా, లక్నో, కాన్పూర్, వారణాసి, పాట్నా తదితర నగరాల్లో కిలో టమాటాలు రూ.80 చొప్పున విక్రయించారు. సోమవారం నుంచి మరికొన్ని నగరాల్లో ఈ రాయితీ ధరతో టమాటాలను విక్రయించనున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో బహిరంగ మార్కెట్లో టమాటా కిలో రూ.178, ముంబైలో రూ.150, చెన్నైలో రూ.132 చొప్పున పలుకుతోంది. సాధారణంగా జూలై–ఆగస్టు, అక్టోబర్–నవంబర్‌లో టమాటా ధరలు పెరుగుతుంటాయి. ఈసారి వర్షాలు ఆలస్యం కావడం వల్ల ధరలు భారీగా పెరిగిపోయాయి. ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లి, కర్ణాటకలోని కోలార్, మహారాష్ట్రలోని సంగనేరీ నుంచి కేంద్ర ప్రభుత్వం టమాటాలను సేకరిస్తోంది. -
రూ. 7.27 లక్షల వరకు ఆదాయ పన్ను ఉండదు
ఉడుపి (కర్ణాటక): మధ్యతరగతి వర్గాలకు కేంద్ర ప్రభుత్వం పన్నులపరంగా పలు ప్రయోజనాలు కలి్పంచిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వార్షికంగా రూ. 7.27 లక్షల వరకు ఆదాయం పొందే వారికి కొత్త పథకంలో పన్ను భారం నుంచి మినహాయింపు ఇవ్వడం కూడా ఇందులో ఒకటని వివరించారు. 2023–24 బడ్జెట్లో రూ. 7 లక్షల వరకు ఆదాయంపై మినహాయింపు ప్రకటించినప్పుడు ఆ పరిమితికి మించి కాస్తంతే ఎక్కువగా ఆర్జిస్తున్న వారి పరిస్థితి ఏమిటని కొన్ని వర్గాల్లో సంశయాలు తలెత్తాయని ఆమె తెలిపారు. దీంతో అదనంగా ఆర్జించే ప్రతి రూపాయిపై ఏ స్థాయి నుంచి పన్ను కట్టాల్సి ఉంటుందనే అంశం మీద తమ బృందం మళ్లీ కసరత్తు చేసిందని వివరించారు. మొత్తం మీద ప్రస్తుతం రూ. 7.27 లక్షల వరకు పన్ను లేదని, ఆ తర్వాతే ట్యాక్స్ వర్తిస్తుందని మంత్రి చెప్పారు. కొత్త స్కీములో స్టాండర్డ్ డిడక్షన్ లేదంటూ ఫిర్యాదులు రావడంతో దాన్ని కూడా చేర్చినట్లు చెప్పారు. -
మన డేటా ఎంత భద్రం? కేంద్రం ముసాయిదా బిల్లులో ఏముంది ?
మనమున్న సైబర్ ప్రపంచంలో అడుగడుగునా ప్రమాదాలు పొంచి ఉన్నాయి. పౌరుల వ్యక్తిగత గోప్యత ప్రశ్నార్థకంగా మారింది. ఒక యాప్ డౌన్ లోడ్ చేసుకున్నా చాలు మన వ్యక్తిగత సమాచారం బజార్లో పడినట్టే. మెటా, ట్విట్టర్, గూగుల్ వంటి దిగ్గజ సంస్థలతో పాటు ఈ– కామర్స్ సైట్లు పౌరుల వ్యక్తిగత డేటాతో ఆటాడుకుంటున్నాయి. వీటి దూకుడుకు కళ్లెం వేయడానికే ఇప్పుడీ ముసాయిదా బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. ‘‘డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటక్షన్ బిల్లు–2022’’ను (డీపీడీపీ) వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశ పెట్టనున్నారు. ఈ డిజిటల్ ప్రపంచంలో పౌరుల వ్యక్తిగత సమాచారం గోప్యతకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. గత ఆరేళ్లుగా మేధోమథనం సాగించిన కేంద్రం ప్రభుత్వం ఎట్టకేలకు ముసాయిదా బిల్లును రూపొందించింది. గతేడాది నవంబర్‌లో ప్రజలు, సామాజిక సంస్థల అభిప్రాయం కోసం వెలువరించిన ముసాయిదా బిల్లులో అంశాలే ఇంచుమించుగా ఇందులో ఉన్నాయి. అయితే విదేశీ సంస్థలు సమాచార సేకరణలో కొన్ని ఆంక్షల్ని విధించారు. బిల్లులో ఏముందంటే ? డీపీడీపీ బిల్లును ఇంకా పార్లమెంటులో ప్రవేశపెట్టాల్సి ఉండడంతో దీని వివరాలను కేంద్రం అత్యంత గోప్యంగా ఉంచింది. అయితే కొన్ని జాతీయ మీడియా కథనాల ప్రకారం నిపుణులు ఆందోళన వ్యక్తం చేసిన కొన్ని వివాదాస్పద అంశాలు అలాగే ఉన్నట్టు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం, దాని అనుబంధ సంస్థలకు విస్తృతమైన మినహాయింపులు ఇవ్వడం, డేటా ప్రొటక్షన్ బోర్డు పాత్రను గణనీయంగా తగ్గించడం వంటివి ఉన్నట్టు ఆ కథనాలు పేర్కొన్నాయి. ఇక ప్రభుత్వాధికారులు, ఇతర నాయకులకు సంబంధించిన డేటా కూడా ఈ చట్టం కింద గోప్యంగా ఉంచడం వల్ల సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేస్తుందనే ఆందోళనలున్నాయి. ఇంకా బిల్లులో ఉన్న అంశాలివే.. ► ఆన్లైన్ లేదంటే ఆఫ్‌లైన్ ద్వారా సమాచారం సేకరించి డిజిటలైజ్ చేసే పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని పూర్తిగా వారి సమ్మతితో సేకరించాలి. దానిని భద్రంగా ఉంచాల్సిన బాధ్యత ఆ సంస్థలదే. తమ పని పూర్తి కాగానే ఆ సమాచారాన్ని తొలగించాలి. ► మన దేశంలో డిజిటల్ పర్సనల్ డేటాను సేకరించి ప్రాసెస్ చేయవచ్చు. అదే విదేశాల్లో వస్తు, సేవల వినియోగంలో మాత్రం డేటాను సేకరించే అవకాశం ఉంటుంది. ► వివిధ సామాజిక మాధ్యమాలు, ఈ కామర్స్ సంస్థలు, మొబైల్ యాప్స్ జవాబుదారీ తనం పెరిగేలా సేకరించిన సమాచారాన్ని ఎలా భద్రపరుస్తున్నారు, ఏ రకంగా సేకరిస్తున్నారు ? పౌరుల సమాచారాన్ని ఏ రకంగా ఉపయోగిస్తున్నారు ? వంటి ప్రశ్నలకు ఆయా సంస్థలు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది ► ఏదైనా సమాచారం చుట్టూ వివాదం చెలరేగితే కేంద్రం ఏర్పాటు చేయనున్న డేటా ప్రొటక్షన్ బోర్డు ఆఫ్ ఇండియా వాటిని పరిష్కరి స్తుంది. ఈ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ను కేంద్రమే నియమిస్తుంది. ► పౌరుల వ్యక్తిగత సమాచారం ఉల్లంఘన జరిగితే సదరు కంపెనీలకు అత్యధికంగా రూ.250 కోట్ల జరిమానా విధించవచ్చు. ► ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలకు వేర్వేరు విధివిధానాలున్నాయి. జాతి భద్రతకు సంబంధించిన అంశాల్లో సమాచార సేకరణపై మినహాయింపులున్నాయి. ► పౌరులు తమ డేటాను వాడుకున్నారని భావిస్తే నష్టపరిహారం కోసం కోర్టుకి ఎక్కొచ్చు. చిన్నారుల వ్యక్తిగత డేటాను సేకరించాల్సి వచ్చిన ప్పుడు వారి లీగల్ గార్డియన్ అనుమతి తప్పనిసరిగా ఉంటుంది. ► ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే యూరోపియన్ యూనియన్ వంటి దేశాలతో వాణిజ్య లావాదేవీల్లో అత్యంత కీలకం కానుంది. గతంలో ఏం జరిగింది? వ్యక్తిగత డేటా పరిరక్షణకు ప్రపంచ దేశాలన్నీ కఠినమైన నిబంధనల్నీ విధిస్తూ ఉంటే మన ప్రభుత్వం 2018 నుంచి ఈ చట్టంపై కసరత్తు చేస్తోంది. వ్యక్తిగత డేటా పరిరక్షణ కోసం ఉద్దేశించిన శ్రీకృష్ణ కమిటీ 2018లో ఒక ముసాయిదా బిల్లు కేంద్రానికి సమర్పించింది. కానీ కేంద్రానికి, దిగ్గజ సామాజిక మాధ్యమ సంస్థలకి మధ్య ఒక అంగీకారం రాలేదు. చివరికి 2019లో ఒక ముసాయిదా బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టింది. అయితే ఈ బిల్లులో సమగ్రత లోపించిందని స్వయంగా జస్టిస్ శ్రీకృష్ణ పేర్కొనడం కలకలం రేపింది. డేటా పరిరక్షణ బిల్లు నిబంధనల్ని అతిక్రమించే వారి జాబితా నుంచి ప్రభుత్వం తనని తాను మినహాయించుకోవడంతో దీనిపై తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఆ బిల్లులో 81 సవరణలు చేయాలంటూ పార్లమెంటరీ స్థాయీ సంఘం సూచించడంతో గత ఏడాది ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లును ఉపసంహరించుకుంది. విదేశాల్లో వ్యక్తిగత గోప్యతకు అత్యంత ప్రాధాన్యం ప్రపంచంలోని 71% దేశాల్లో వ్యక్తిగత సమాచారం భద్రతపై కఠినమైన చట్టాలే ఉన్నాయి. వాణిజ్యం, అభివృద్ధిపై ఐక్యరాజ్య సమితి సదస్సులో తీసుకున్న నిర్ణయానికనుగుణంగా 194 దేశాల్లోని 137 దేశాలు డేటా పరిరక్షణ కోసం చట్టాలు రూపొందించాయి. ► ఆఫ్రికా దేశాల్లో 54గాను 33 దేశాల్లో (61%) డేటా చట్టాలు అమల్లో ఉన్నాయి. ► ఆసియా దేశాల్లో ఇది ఇంకా తక్కువగా 57% మాత్రమే ఉంది. ► 60 దేశాలకు గాను 34 దేశాలు చట్టాలను రూపొందించాయి. ఇక వెనుకబడిన దేశాలు 46కి గాను 22 దేశాల్లో మాత్రమే చట్టాలున్నాయి. అంతర్జాతీయంగా ఈయూ మోడల్, యూఎస్ మోడల్ చట్టాలే అత్యధికంగా ప్రాచుర్యం పొందాయి. ఈయూ మోడల్లో వ్యక్తిగత సమాచార సేకరణ నిబంధనలు అత్యంత కఠినంగా ఉంటాయి. పౌరుల డేటా బయటకు వచ్చిందంటే ఆయా సంస్థలకు భారీగా జరిమానాలు విధిస్తాయి. అత్యధిక దేశాలు ఈ మోడల్‌నే అనుసరిస్తున్నాయి. ఇక అమెరికా మోడల్లో డేటా భద్రతని వ్యక్తుల స్వేచ్ఛ పరిరక్షణగా చూస్తారు. ప్రభుత్వాలు కూడా వ్యక్తుల పర్సనల్ స్పేస్‌లోకి వెళ్లవు. వ్యక్తుల డేటా అవసరమైన ప్రతీ సారి వారి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. -సాక్షి, నేషనల్ డెస్క్ -
మన వర్సిటీలు ప్రపంచంలో మేటి
న్యూఢిల్లీ: విద్యా రంగంలో కేంద్ర ప్రభుత్వం గత కొన్నేళ్లలో అమల్లోకి తీసుకొచి్చన విధానాలు, తీసుకున్న నిర్ణయాలతో భారతీయ విశ్వవిద్యాలయాలకు ప్రపంచవ్యాప్తంగా మరింత గుర్తింపు లభించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. మన వర్సిటీలు ప్రపంచంలో అగ్రగామిగా ఎదుగుతున్నాయని చెప్పారు. శుక్రవారం ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ది వేడుకల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2014లో క్యూఎస్ గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో కేవలం 12 భారతీయ యూనివర్సిటీలు చోటు దక్కించుకున్నాయని, ఇప్పుడు వాటి సంఖ్య 45కు చేరుకుందని గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్, ఎన్ఐటీల సంఖ్య పెరిగిందని చెప్పారు. నవ భారత నిర్మాణంలో అవి విశిష్టమైన పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. ఇటీవల జరిగిన తన అమెరికా పర్యటనను మోదీ ప్రస్తావించారు. మన దేశ యువత పట్ల ప్రపంచానికి విశ్వాసం పెరిగిందన్నారు. అమెరికాతో పలు ఒప్పందాలు కుదుర్చుకున్నామని, వీటివల్ల అంతరిక్షం, సెమీ కండక్టర్లు, కృత్రిమ మేధ వంటి కీలక రంగాల్లో మన దేశ యువతకు నూతన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు. మన విద్యా వ్యవస్థకు ఘన చరిత్ర మైక్రాన్, గూగుల్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు భారత్‌లో పెట్టుబడులు భారీగా పెట్టబోతున్నాయని, మనదేశ ఉజ్వల భవిష్యత్తుకు ఇదొక సూచిక అని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఢిల్లీ యూనివర్సిటీ అంటే కేవలం ఒక విద్యాలయం కాదని, ఒక ఉద్యమమని వ్యాఖ్యానించారు. ప్రాచీన కాలంలో నలంద, తక్షశిల వంటి విశ్వవిద్యాలయాలు సంతోషానికి, సౌభాగ్యానికి వనరులుగా నిలిచాయని చెప్పారు. భారతీయ విద్యావ్యవస్థకు ఘన చరిత్ర ఉందన్నారు. విదేశీయుల నిరంతర దాడుల వల్ల భారతీయ విద్యావ్యవస్థ కుప్పకూలిందని, తద్వారా అభివృద్ధి ఆగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్య్రం అనంతరం వర్సిటీలు నైపుణ్యం కలిగిన యువతను దేశానికి అందించాయని, అభివృద్ధికి పాటుపడ్డాయని మోదీ ప్రశంసించారు. ‘యుగే యుగే భారత్’ మ్యూజియం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో గిరిజన ప్రదర్శనశాలలు(మ్యూజియమ్స్) ఏర్పాటు చేశామని, ఢిల్లీలోని ‘ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం’ ద్వారా స్వతంత్ర భారత్ అభివృద్ధి ప్రయాణాన్ని తెలుసుకోవచ్చని నరేంద్ర మోదీ చెప్పారు. ‘యుగే యుగే భారత్’ పేరిట ప్రపంచంలోనే అతిపెద్ద హెరిటేజ్ మ్యూజియాన్ని ఢిల్లీలో నిర్మిస్తున్నామని తెలిపారు. మన స్టార్టప్ కంపెనీల సంఖ్య లక్ష మార్కును దాటిందన్నారు. 2014లో కేవలం వందల సంఖ్యలోనే స్టార్టప్‌లు ఉండేవన్నారు. ఢిల్లీ యూనివర్సిటీ కంప్యూటర్ సెంటర్, ఫ్యాకల్టీ ఆఫ్ టెక్నాలజీ భవనాలు, నార్త్ క్యాంపస్ అకడమిక్ బ్లాక్ నిర్మాణానికి ప్రధాని పునాదిరాయి వేశారు. ఢిల్లీ యూనివర్సిటీ 1922 మే 1న ఏర్పాటైంది. ప్రస్తుతం ఈ వర్సిటీలో 86 డిపార్ట్మెంట్లు, 90 కాలేజీలు ఉన్నాయి. మెట్రో రైలులో మోదీ ప్రయాణం ప్రధాని మోదీ శుక్రవారం ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణించారు. ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఆయన మెట్రో రైలులో వచ్చారు. రైలులో విద్యార్థులతో సరదాగా సంభాíÙంచారు. అనంతరం ఢిల్లీ యూనివర్సిటీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తన మెట్రో రైలు ప్రయాణ అనుభవాన్ని పంచుకున్నారు. ఓటీటీల్లో ప్రసారమవుతున్న కొత్త వెబ్ సిరీస్‌ల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నానని చెప్పారు. ఏ వెబ్ సిరీస్ బాగుంది? ఏ రీల్స్ బాగున్నాయో వారు చెప్పగలరని పేర్కొన్నారు. మాట్లాడేందుకు విద్యార్థుల వద్ద ఎన్నో అంశాలు ఉన్నాయన్నారు. సైన్స్ నుంచి ఓటీటీల్లోని కొత్త వెబ్ సిరీస్‌ల దాకా చాలా విషయాలను వారితో మాట్లాడొచ్చని వెల్లడించారు. ఏ ఒక్క అంశాన్నీ వారు వదిలిపెట్టరని వ్యాఖ్యానించారు. భూగోళంపై ఉన్న అన్ని అంశాలను విద్యార్థులు చక్కగా చర్చించగలరని ట్వీట్ చేశారు. -
నిరుపేదలు, మధ్యతరగతిని మర్చిపోయిన కేంద్రం: రాహుల్
న్యూఢిల్లీ: నిత్యావసరాలు, కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. నిరుపేదలు, మధ్యతరగతిని మోదీ సర్కార్ మర్చిపోయిందన్నారు. పెట్టుబడిదారుల సంపద పెంచడంలో మునిగిపోయిన కేంద్రం మధ్యతరగతి కుటుంబాలను విస్మరిస్తోందన్నారు. ప్రజా సమస్యల నుంచి దృష్టి మరల్చడానికి బీజేపీ వేసే ఎత్తుల్ని సాగనివ్వమని రాహుల్ బుధవారం ఒక ట్వీట్లో పేర్కొన్నారు. ‘‘టమాటా కేజీ రూ.140, కాలీఫ్లవర్ కేజీ రూ.80, కందిపప్పు కేజీ రూ.148, గ్యాస్ సిలిండర్ రూ.1100 పై మాటే. ధరలు ఇలా పెంచుకుంటూ పోతూ పెట్టుబడుదారుల ఆస్తుల్ని పెంచుతోంది. ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తూ వారి ప్రయోజనాలనే విస్మరిస్తోంది’’ అని ట్వీట్ చేశారు. దేశంలో నిరుద్యోగ యువత పెరిగిపోతున్నారని అన్నారు. -
చెరకు ధర క్వింటాల్‌కు రూ.315
న్యూఢిల్లీ: చెరకు పంటకు ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్(ఎఫ్ఆర్పీ)ను క్వింటాల్‌కు రూ.10 చొప్పున పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. దీంతో ఈ ఏడాది అక్టోబర్ నుంచి ప్రారంభమయ్యే 2023–24 సీజన్లో సంవత్సరంలో క్వింటాల్ చెరకు ధర రూ.315కు పెరిగింది. చక్కెర మిల్లులు రైతులకు క్వింటాల్‌కు కనీసం రూ.315 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలపై కేంద్ర కేబినెట్ సమావేశం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగింది. ఎఫ్ఆర్పీని పెంచుతూ ఈ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. 2022–23లో క్వింటాల్ చెరుకు ఎఫ్ఆర్పీ రూ.305 ఉండగా, ఈసారి రూ.315 కానుందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. వ్యవసాయం, అన్నదాతల సంక్షేమానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. రైతన్నలకు మన ప్రధానమంత్రి ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్(సీఏసీపీ) సిఫార్సుల ఆధారంగా చెరుకు ఎఫ్ఆర్పీని ఖరారు చేస్తుంటారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలను సైతం పరిగణనలోకి తీసుకుంటారు. 2014–15 సీజన్లో చెరకు ఎఫ్ఆర్పీ క్వింటాల్‌కు రూ.210 ఉండేది. 2013–14లో చక్కెర మిల్లులు రూ.57,104 కోట్ల విలువైన చెరకు పంటను కొనుగోలు చేశాయి. 2022–23లో రూ.1,11,366 కోట్ల విలువైన 3,353 లక్షల టన్నుల చెరకును సేకరించాయి. ఇండియాలో దాదాపు 5 కోట్ల మంది రైతులు చెరుకు సాగు చేస్తున్నారు. చక్కెర మిల్లుల్లో దాదాపు 5 లక్షల మంది ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారు. నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటు! దేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో పరిశోధనలకు మరింత ఊతం ఇవ్వడమే లక్ష్యంగా నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్(ఎన్ఆర్ఎఫ్) ఏర్పాటుకు సంబంధించిన బిల్లుపై కేంద్ర మంత్రివర్గం ఆమోదం ముద్రవేసింది. ప్రధాని మోదీ అధ్యక్షత బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం వెల్లడించారు. నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ బిల్లు–2023ను త్వరలో పార్లమెంట్లో ప్రవేశపెట్టునున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న ‘సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డు చట్టం–2008’ స్థానంలో ఈ బిల్లును తీసుకొన్నట్లు వివరించారు. 2027–28 దాకా పరిశోధనల కోసం రూ.50,000 కోట్లు ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ఇందులో రూ.14,000 కోట్లను వచ్చే ఐదేళ్లలో ప్రభుత్వమే ప్రత్యక్షంగా ఖర్చు చేస్తుందన్నారు. మిగతా రూ.36,000 కోట్లను ప్రైవేట్ రంగ సంస్థలు, అంతర్జాతీయ పరిశోధక సంస్థల నుంచి సేకరిస్తామన్నారు. ఎన్ఆర్ఎఫ్ పాలక మండలికి ప్రధానమంత్రి నేతృత్వం వహిస్తారని, ఇందులో 15 నుంచి 25 మంది నిపుణులు, పరిశోధకులు సభ్యులుగా ఉంటారని అనురాగ్ ఠాకూర్ చెప్పారు. ప్రభుత్వ ముఖ్య శాస్త్రీయ సలహాదారు నేతృత్వంలో కార్యనిర్వాహక మండలి సైతం పని చేస్తుందన్నారు. ‘పీఎం–ప్రణామ్’కు ఆమోదం ప్రత్యామ్నాయ ఎరువుల వాడకాన్ని పెంచడం, రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించడమే లక్ష్యంగా రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు ఉద్దేశించిన ‘పీఎం–ప్రణామ్’ కొత్త పథకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అలాగే యూరియా సబ్సిడీ పథకాన్ని మరో మూడేళ్లపాటు కొనసాగించాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.3.68 లక్షల కోట్లు ఖర్చు చేయనుంది. సేంద్రియ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించడానికి రూ.1,451 కోట్ల రాయితీ ఇచ్చేందుకు ఆర్థిక వ్యవహారాలపై ఏర్పాటైన కేబినెట్ కమిటీ నిర్ణయం తీసుకుంది. అలాగే దేశంలో సల్ఫర్–కోటెడ్ యూరియా(యూరియా గోల్డ్)ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. నేలలో సల్ఫర్ లోపాన్ని సరిచేయడానికి ఈ యూరియా తోడ్పడుతుంది. నేల సారాన్ని కాపాడుకోవడమే ‘పీఎం–ప్రణామ్’ లక్ష్యమని కేంద్రం వెల్లడించింది. -
మణిపూర్‌కు అఖిలపక్షాన్ని పంపించాలి
న్యూఢిల్లీ/ఇంఫాల్: మణిపూర్‌లో పరిస్థితులపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం శనివారం పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో అఖిలపక్ష భేటీ నిర్వహించింది. హోం మంత్రి అమిత్ షా అధ్యక్షత వహించిన ఈ సమావేశానికి కాంగ్రెస్, బీజేపీ, టీఎంసీ, డీఎంకే, ఏడీఎంకే, బీజేడీ, ఆప్, ఆర్జేడీ, శివసేనతోపాటు వామపక్షాల పార్టీల నేతలు హాజరయ్యారు. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, నిత్యానంద్ రాయ్, అజయ్ కుమార్ మిశ్రా, హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా, ఐబీ డైరెక్టర్ తపన్ డేకా కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను నెలకొల్పేందుకు కేంద్రం తీసుకుంటున్న పలు చర్యలను హోం మంత్రి అమిత్ షా వారికి వివరించారు. ప్రధాని మోదీ స్వయంగా ప్రతిరోజూ అక్కడి పరిస్థితులపై వాకబు చేస్తున్నారని, ఆయన ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అయితే, అక్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలించేందుకు వెంటనే అఖిలపక్ష బృందాన్ని పంపించాలని కాంగ్రెస్, టీఎంసీ సహా పలు పార్టీల నేతలు కోరారు. శాంతి భద్రతలను కాపాడటంలో రాష్ట్ర యంత్రాంగం పూర్తిగా విఫలమైందని, సీఎం బిరెన్ సింగ్‌ను వెంటనే తొలగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని ఎస్పీ కోరింది. హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ..రాష్ట్రంలో సాధారణ పరిస్థితులను నెలకొల్పేందుకు కేంద్రం చేయగలిగిందంతా చేస్తోందని చెప్పారు. అఖిలపక్ష బృందాన్ని పంపించడంపై అమిత్ షా ఎటువంటి ప్రకటన చేయలేదని అనంతరం బీజేపీ మణిపూర్ ఇన్చార్జి సంబిత్ పాత్ర మీడియాకు తెలిపారు. ప్రభుత్వం మణిపూర్‌ను మరో కశ్మీర్‌లాగా మార్చాలనుకుంటున్నట్లుందని అక్కడి పరిస్థితులపై టీఎంసీ నేత డెరెక్ ఒ బ్రియాన్ మీడియాతో వ్యాఖ్యానించారు. మణిపూర్‌లో మంత్రి గోదాముకు నిప్పు మణిపూర్‌లో నిరసనకారుల గుంపు మరోసారి రెచ్చిపోయింది. శుక్రవారం రాత్రి తూర్పు ఇంఫాల్ జిల్లా చింగారెల్‌లోని మంత్రి ఎల్.సుసింద్రోకు చెందిన ప్రైవేట్ గోదాముకు నిప్పుపెట్టడంతో అది కాలిబూడిదయింది. అనంతరం ఖురాయ్‌లోని మంత్రి ఇంటికి నిప్పు పెట్టేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారిపై బాష్పవాయువును ప్రయోగించామన్నారు. -
చైనా మొబైల్ కంపెనీలకు షాక్
న్యూఢిల్లీ: దేశంలో కార్యకలాపాలు నిర్వహించే చైనా మొబైల్ తయారీ కంపెనీలకు కేంద్ర సర్కారు స్పష్టమైన మార్గదర్శనం చేసింది. భారత్‌లో విక్రయాలకు, భారత్ నుంచి ఎగుమతుల కోసం మొబైల్ ఫోన్లు, ఇతర ఎల్రక్టానిక్ ఉపకరణాలను ఇక్కడే తయారు చేయాలని, భారతీయ సంస్థల భాగస్వామ్యంతో నిర్వహించాలని కోరినట్టు తెలిసింది. భారత్‌లో కార్యకలాపాలకు స్థానిక భాగస్వాములను చేర్చుకోవాలని కోరింది. కేంద్రం నిర్వ హించిన సమావేశానికి హాజరైన ముగ్గురు ఎగ్జిక్యూటివ్‌లు ఈ వివరాలను మీడియాతో పంచుకోవడం వల్ల బయటకు తెలిసింది. అంతేకాదు సదరు జా యింట్ వెంచర్ కంపెనీల్లో కీలక స్థానాల్లో భారతీయులనే నియమించుకోవాలని కూడా కోరింది. సీఈవో, సీవోవో, సీఎఫ్‌వో, సీటీవో తదితర స్థానాలకు భారతీయులను తీసుకోవాలని ఆదేశించింది. భారత కాంట్రాక్టు తయారీ సంస్థలను నియమించుకోవాలని, స్థానికంగానే విడిభాగాల తయారీని కూడా చేపట్టాలని కూడా కోరింది. ప్రస్తుతం చైనీ సంస్థలు ఇక్కడ అసెంబ్లింగ్ వరకే చేస్తుండడం గమనార్హం. విడిభాగాల తయారీని కూడా భారత భాగస్వామ్య సంస్థలతో కలసి చేపట్టి, ఇక్కడి నుంచి మరిన్ని ఎగుమతులు చేయాలని కోరినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పంపిణీదారులు కూడా స్థానికులే ఉండాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం కొన్ని కంపెనీలు చైనా డి్రస్టిబ్యూటర్లను కలిగి ఉన్నాయి. భారత చట్టాలను విధిగా అనుసరించాలని, పన్ను ఎగవేతలకు పాల్పడరాదని తేల్చి చెప్పింది. చైనాకు చెందిన షావోమీ, ఒప్పో, రియల్మీ, వివోతోపాటు, ఇండియా సెల్యులర్ అండ్ ఎల్రక్టానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ)కు ఇటీవలి సమావేశంలో కేంద్రం ఈ మేరకు సూచనలు జారీ చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ సమావేశాన్ని నిర్వ హించింది. ఇది నిజమేనన్నట్టు.. దేశీ కాంట్రాక్టు తయారీ సంస్థ డిక్సన్ టెక్నాలజీస్‌తో షావోమీ ఒ ప్పందాన్ని కుదుర్చుకోవడం గమనార్హం. భారత్‌లో మొబైల్ ఫోన్లను తయారు చేసి ఇవి ఎగుమతి చేయనున్నాయి. మరికొన్ని సంస్థలతోనూ ఇదే విధమైన భాగస్వామ్యంపై డిక్సన్ చర్చలు నిర్వహిస్తుండడం గమనార్హం. -
ఎల్ఏసీ వద్ద పరిణామాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి
న్యూఢిల్లీ: చైనాతో సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంబడి పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. చైనాతో సరిహద్దు వివాదంపై పార్లమెంట్లో సమగ్రంగా చర్చ జరపాలని డిమాండ్ చేసింది. కాంగ్రెస్ ప్రతినిధి మనీష్ తివారీ సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘సరిహద్దులు దాటి మన భూభాగంలోకి ఎవరూ ప్రవేశించలేదు. మన ఆర్మీ పోస్టులను ఎవరూ స్వాధీనం చేసుకోలేదని మూడేళ్ల క్రితం గల్వాన్ ఘర్షణలు జరిగాక అఖిలపక్ష భేటీలో ప్రధాని మోదీ చెప్పారు. చైనా సైనికులు సరిహద్దులు దాటి చొచ్చుకొచ్చేందుకు, మన భూభాగంలో టెంట్లు వేసేందుకు ప్రయతి్నంచడంతో గల్వాన్ ఘటన జరిగిందంటూ విదేశాంగ శాఖ ప్రకటించింది. ఇవి రెండూ పరస్పర విరుద్ధ ప్రకటనలు’అని తివారీ తెలిపారు. అందుకే భారత్–చైనా సరిహద్దు వివాదంపై పార్లమెంట్లో సమగ్ర చర్చ జరపడంతోపాటు గత మూడేళ్లుగా ఎల్ఏసీ వెంట జరుగుతున్న వాస్తవ పరిణామాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని బాధ్యతాయుత ప్రతిపక్షంగా కాంగ్రెస్ కోరుతోందన్నారు. ‘ఎల్ఏసీ వెంట ఉన్న 65 పెట్రోలింగ్ పాయింట్లకు గాను 26 వరకు మన ఆర్మీ నియంత్రణలో లేవన్న విషయం నిజమా? చైనా ఆక్రమణలను మనం ఎందుకు ఆపలేకపోయాం?’అని తివారీ కేంద్రాన్ని నిలదీశారు. -
యువత ఆశల్ని కేంద్రం చిదిమేసింది
న్యూఢిల్లీ: పెట్టుబడిదారులైన కొందరు మిత్రుల కోసం కేంద్ర ప్రభుత్వం లక్షలాది మంది యువత ఆశల్ని చిదిమేసిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. రెండేళ్ల కాలంలో ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్‌యూ)ల్లోని 2 లక్షల ఉద్యోగాలను లేకుండా చేసిందని విమర్శించారు. దేశంలో నిరుద్యోగిత రికార్డు స్థాయికి చేరుకుందని తెలిపారు. దేశానికి గర్వకారణమైన ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగం సంపాదించడం ప్రతి నిరుద్యోగ యువతకు కల..అలాంటి వాటిని ప్రభుత్వం వదిలేసిందన్నారు. రాహుల్ గాంధీ ఆదివారం ఈ మేరకు పలు ట్వీట్లు చేశారు. ‘2014లో పీఎస్‌యూల్లో 16.9 లక్షల ఉద్యోగాలుండగా 2022 వచ్చే సరికి వాటి సంఖ్య 14.9 లక్షలకు పడిపోయింది. బీఎస్ఎన్ఎల్లో 1,81,127 ఉద్యోగాలు, సెయిల్‌లో 61,928, ఎంటీఎన్ఎల్లో 34,997, ఎస్ఈసీఎల్లో 29,140, ఎఫ్‌సీఐలో 28,063, ఓఎన్జీసీలో 21,120 ఉద్యోగాలు తగ్గిపోయాయి. అభివృద్ధి చెందుతున్న దేశంలో ఉద్యోగిత పడిపోతుందా?’అని ఆయన ప్రశ్నించారు. ఏడాదికి రెండు కోట్ల మందికి ఉద్యోగాలిస్తామంటూ తప్పుడు వాగ్దానాలు చేసిన ప్రభుత్వం.. ఉద్యోగాల కల్పనను మరిచిపోయి 2 లక్షల ఉద్యోగాలను లేకుండా చేసిందన్నారు. ఇదే సమయంలో పీఎస్‌యూల్లో కాంట్రాక్టు నియామకాలు పెరిగిపోయాయి. ఇలా కాంట్రాక్టు ఉద్యోగాలకు ప్రాధాన్యం ఇవ్వడం రిజర్వేషన్ హక్కును లాగేసుకోవడం కాదా? ఇది ఈ సంస్థలను ప్రైవేట్‌పరం చేసే కుట్ర కాదా?’అని రాహుల్ ప్రశ్నించారు. ఒక వైపు పారిశ్రామిక వేత్తల రుణాల మాఫీ, మరోవైపు పీఎస్‌యూల్లో ప్రభుత్వ ఉద్యోగాల తొలగింపు! అమృత్కాల్ అంటే ఇదేనా’అని ప్రభుత్వాన్ని నిలదీశారు. -
కోవిన్ పోర్టల్.. ఫుల్ సేఫ్
న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం తీసుకొచ్చిన కోవిన్ పోర్టల్‌లో రిజిస్టర్ అయిన టీకా లబ్ధిదారుల డేటా లీకైనట్లు వచ్చిన వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఈ వార్తలకు ఎలాంటి ఆధారాల్లేవని స్పష్టం చేసింది. నోడల్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ అయిన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సెర్ట్–ఇన్) ఈ వ్యవహారాన్ని సమీక్షిస్తోందని వెల్లడించింది. పోర్టల్‌లోని డేటా భద్రంగా ఉందని, డేటా ప్రైవసీ కోసం అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. డేటా లీక్ అంటూ జరుగుతున్న ప్రచారం ఆకతాయిల పనేనని పేర్కొంది. డేటా లీక్ వార్తలపై సెర్ట్–ఇన్ వెంటనే స్పందించిందని, కోవిన్ యాప్‌పై లేదా డేటాబేస్‌పై ప్రత్యక్షంగా దాడి జరిగినట్లు ఆధారాలు లభించలేదని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. టెలిగ్రామ్ యాప్‌లో ఫోన్ నెంబర్లు ఎంట్రీ చేస్తే కోవిన్ యాప్ వివరాలను చూపిస్తోందని చెప్పారు. అంతేతప్ప వ్యాక్సిన్ లబ్ధిదారుల వివరాలు లీక్ కాలేదని స్పష్టం చేశారు. కాగా, కోవిన్ పోర్టల్ నుంచి ముఖ్యమైన డేటా లీకైనట్లు తెలుస్తోందని, ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోని మొత్తం డేటా మేనేజ్మెంట్ వ్యవస్థ గోప్యతపై ఉన్నత స్థాయి న్యాయ విచారణ జరిపించాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ సోమవారం డిమాండ్ చేశారు. అసలేం జరిగింది? కరోనా టీకా తీసుకున్న వారి వ్యక్తిగత డేటా కోవిన్ పోర్టల్‌లో నిక్షిప్తమైన సంగతి తెలిసిందే. టీకా లబ్ధిదారుల వ్యక్తిగత వివరాలు ఆన్లైన్ మెసెంజర్ యాప్ ‘టెలిగ్రామ్’లో కనిపిస్తున్నట్లు కొందరు ట్విట్టర్ ఖాతాదారులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీనిపై దేశవ్యాప్తంగా కలకలం మొదలైంది. ఈ వ్యవహారంపై కొన్ని రాజకీయ పార్టీలు స్పందించాయి. ప్రజల వ్యక్తిగత డేటాకు భద్రత లేకపోవడం ఏమిటని ప్రభుత్వాన్ని నిలదీశాయి. దాంతో కేంద్ర ఆరోగ్య శాఖ స్పందించి, వివరణ ఇచ్చింది. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ఆధారిత ధ్రువీకరణ ద్వారా మాత్రమే కోవిన్ పోర్టల్‌లోని తమ వివరాలను లబ్ధిదారులు తెలుసుకోవచ్చని పేర్కొంది. లబ్ధిదారులు మినహా ఇతరులు తెలుసుకోవడానికి అవకాశం లేదని స్పష్టం చేసింది. లబ్ధిదారుల చిరునామాలు తెలుసుకొనే వెలుసుబాటు కూడా లేదని వెల్లడించింది. -
కోల్ ఇండియా @ రూ. 225
న్యూఢిల్లీ: పీఎస్‌యూ దిగ్గజం కోల్ ఇండియాలో కేంద్ర ప్రభుత్వం 3 శాతం వాటాను విక్రయించనుంది. ఇందుకు రూ. 225 ఫ్లోర్ ధరను నిర్ణయించింది. నేడు(జూన్ 1)న సంస్థాగత ఇన్వెస్టర్లకు, శుక్రవారం(2న) రిటైలర్లకు ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్)ను చేపడుతోంది. ప్రతిపాదన ప్రకారం ప్రభుత్వం తొలుత 1.5 శాతం వాటాకు సమానమైన 9.24 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనుంది. ఆఫర్‌కు అత్యధిక స్పందన లభిస్తే మరో 1.5 శాతం వాటాను సైతం విక్రయించేందుకు గ్రీన్ షూ ఆప్షన్ ఎంచుకుంది. వెరసి కంపెనీ ఈక్విటీలో 3 శాతం వాటాకు సమానమైన మొత్తం 18.48 కోట్ల షేర్లను ఆఫర్ చేస్తోంది. ఆఫర్ ధర ప్రకారం ప్రభుత్వం విక్రయిస్తున్న వాటాకు రూ. 4,158 కోట్లు లభించనున్నాయి. వెరసి ఈ ఏడాది(2023–24) తొలిసారి పీఎస్యూలో ప్రభుత్వం వాటాను విక్రయించనుంది. ప్రస్తుతం కంపెనీలో ప్రభుత్వానికి 66.13 శాతం వాటా ఉంది. ఈ ఏడాది డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా ప్రభుత్వం రూ. 51,000 కోట్ల సమీకరణను లక్ష్యంగా పెట్టుకున్న విషయం విదితమే. బీఎస్ఈలో బుధవారం కోల్ ఇండియా షేరు 1.3 శాతం నష్టంతో రూ. 241 వద్ద ముగిసింది. ఈ ధరతో పోలిస్తే 6.7 శాతం డిస్కౌంట్లో ఓఎఫ్ఎస్ ప్రారంభంకానుంది. -
మళ్లీ సుప్రీంకోర్టుకు కేంద్రం, ఆప్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం మధ్య లొల్లి మళ్లీ సుప్రీంకోర్టుకు చేరింది. ఢిల్లీలోని ప్రభుత్వాధికారులపై అజమాయిషీ రాష్ట్ర ప్రభుత్వానిదేనంటూ మే 11న సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించడం తెలిసిందే. ఆ వెంటనే పలువురు కీలక అధికారులను బదిలీ చేస్తూ కేజ్రీవాల్ సర్కారు నిర్ణయం తీసుకున్నా అవి అమలు కాకుండా లెఫ్టినెంట్ గవర్నర్ అడ్డుపడ్డారు. ప్రభుత్వానికి గొడవ నడుస్తుండగానే సుప్రీం తీర్పును పూర్వపక్షం చేసేలా కేంద్రం శుక్రవారం ఆర్డినెన్స్ జారీ చేయడం తెలిసిందే. దాని ద్వారా ఢిల్లీ పరిధిలోని ఐఏఎస్, గ్రూప్ ఏ అధికారుల పోస్టింగ్, బదిలీ, క్రమశిక్షణ చర్యలు తదితరాలపై నిర్ణయాలకు జాతీయ రాజధాని సివిల్ సర్వీస్ అథారిటీని ఏర్పాటు చేసింది. అంతేగాక అధికారులపై నిర్ణయాధికారాలను రాష్ట్ర ప్రభుత్వానికే కట్టబెడుతూ ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ సుప్రీంకోర్టులో శనివారం కేంద్రం రివ్యూ పిటిషన్ కూడా దాఖలు చేసింది. దేశ రాజధానిలోని ప్రభుత్వ పనితీరు మొత్తం దేశాన్నే ప్రభావితం చేస్తుందని అందులో వాదించింది. మరోవైపు ఆర్డినెన్స్‌పై కేజ్రీవాల్ మండిపడ్డారు. మే 18 నుంచి సుప్రీంకోర్టుకు వేసవి సెలవులున్న సందర్భాన్ని చూసుకుని తెలివిగా ఈ చర్యకు దిగిందన్నారు. రాష్ట్ర అధికారాలకు దొడ్డిదారిన గండి కొట్టిన ఈ రాజ్యాంగ విరుద్ధ నిర్ణయంపై తాము కూడా సుప్రీం తలుపు తడతామని స్పష్టం చేశారు. ఆర్డినెన్స్ రాజ్యసభ ఆమోదం పొందకుండా చూడాలని విపక్షాలకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై విపక్ష నేతలందరినీ కలుస్తానని ప్రకటించారు. అంతేగాక ఢిల్లీలో ఇంటింటికీ వెళ్లి కేంద్రం అప్రజాస్వామిక తీరుపై ప్రజలను చైతన్యవంతం చేస్తానన్నారు. ఈ ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. అధికారులను కేజ్రీవాల్ సర్కారు వేధిస్తున్నందున ప్రజా ప్రయోజనార్థమే ఆర్డినెన్స్ తెచ్చినట్టు పార్టీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా చెప్పుకొచ్చారు. దమ్ముంటే ఆర్డినెన్స్‌పై సుప్రీంకు వెళ్లి చూడాలని బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ సవాలు చేవారు. ఢిల్లీ పాలనాధికారాలు తదితరాలపై ఆప్ ప్రభుత్వానికి, కేంద్రానికి ఎనిమిదేళ్లుగా గొడవలు జరుగుతుండటం తెలిసిందే. -
కొత్త చట్టం పట్ల సీఏల్లో ఆందోళన
న్యూఢిల్లీ: చార్టర్ట్ అకౌంటెంట్లను నల్లధనం నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) పరిధిలోకి తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విదేశీ పెట్టుబడుల పై, వ్యాపార సులభతర నిర్వహణపై ప్రభావం చూపిస్తుందన్న ఆందోళన పరిశ్రమ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. సీఏలతోపాటు, కాస్ట్ అకౌంటెంట్లు, కంపెనీ సెక్రటరీలను పీఎంఎల్ఏ పరిధిలోకి తీసుకొస్తూ కేంద్ర సర్కారు ఇటీవలే ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. నిధుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్రం ఈ చర్య తీసుకుంది. సీఏలు, కంపెనీ సెక్రటరీలు భారత్‌లో విదేశీ కంపెనీల ఏర్పాటుకు సహకారం అందిస్తుంటారని, తొలి దశలో విదేశీ కంపెనీల తరఫున తమ సొంత చిరునామా ఇస్తుంటారని పరిశ్రమ వర్గాలు వెల్లడించా యి. విదేశీ కంపెనీకి రెసిడెంట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తూ, ఇక్కడ కార్యాలయం ఏర్పాటుకు సాయం అందిస్తుంటారని.. తమ క్లయింట్ల తరఫున బ్యాంకు ఖాతాలను నిర్వహిస్తుంటారని తెలిపాయి. విదేశీ క్లయింట్ భారత్‌కు తీసుకొచ్చే పెట్టుబడి సొంతమా లేక నల్లధనమా, వాటి మూలం తెలుసుకునే అవ కాశం సీఏలు, కంపెనీ సెక్రటరీలు లేదని పేర్కొన్నా యి. ప్రాపర్టీల కొనుగోలు, విక్రయం, బ్యాంకు ఖాతాలు లేదా ఆస్తుల నిర్వహణ, లిమిటెడ్ లయబి లిటీ పార్ట్నర్షిప్ లేదా ట్రస్ట్‌ల నిర్వహణ వ్యవహారాలన్నీ పీఎంఎల్ఏ పరిధిలోకి రానున్నాయి. ఫార్మే షన్ ఏజెంట్లు లేదా డైరెక్టర్/సెక్రటరీ/పార్ట్నర్గా వ్యవహరించే వారినీ పీఎంఎల్ఏ పరిధిలోకి తీసుకొ స్తూ కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. -
మొండి రుణాలపై బ్యాడ్ బ్యాంక్ దృష్టి
కేంద్ర ప్రభుత్వం ప్రమోట్ చేసిన జాతీయ ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీ(ఎన్ఏఆర్సీఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24)లో మరిన్ని మొండి రుణాల కొనుగోలుకి ప్రణాళికలు వేస్తోంది. ఇందుకు సుమారు 300 కంపెనీల నుంచి రూ. 3 లక్షల కోట్ల రుణాల జాబితా సిద్ధంగా ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. బ్యాడ్ బ్యాంక్‌గా పిలిచే ఎన్ఏఆర్సీఎల్ గతేడాది(2022–23) రూ. 50,000 కోట్ల మొండి రుణాలను సొంతం చేసుకోవాలనే లక్ష్యం విధించుకున్నప్పటికీ రూ. 10,378 కోట్ల రుణాలను మాత్రమే కొనుగోలు చేయగలిగింది. వివరాలు చూద్దాం.. ముంబై: గత ఆర్థిక సంవత్సరంలో బ్యాడ్ బ్యాంక్ తొలుత పెట్టుకున్న భారీ లక్ష్య సాధనలో విఫలమైనప్పటికీ ఈ ఏడాది మరింత వేగంగా ముందుకు సాగాలని భావిస్తోంది. కొన్ని ప్రాథమిక అవాంతారాలు లక్ష్య సాధనలో అడ్డు తగిలినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఏడాది మరింత పటిష్టంగా రుణ కొనుగోలు చేపట్టాలని చూస్తోంది. నిజానికి 300 కంపెనీల నుంచి మొత్తం రూ. 3 లక్షల కోట్ల మొండి రుణాలు నమోదైనట్లు బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ముందుగా విక్రయించాల్సిన మొండి ఖాతాలను గుర్తించమంటూ ఈ నెల మొదట్లో ఆర్థిక శాఖ ప్రభుత్వ రంగ బ్యాంకులను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పీఎస్‌యూ బ్యాంకులు ఎన్ఏఆర్సీఎల్కు పలు మొండి ఖాతాలను ఆఫర్ చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. వీటి ప్రకారం విక్రయానికి సిద్ధమైన జాబితా నుంచి 20–25 శాతం ఖాతాలను బ్యాడ్ బ్యాంక్ కొనుగోలు చేయనుంది. జాబితా పెద్దదే.. ఈ ఏడాది విక్రయానికి సిద్ధంకానున్న మొండి ఖాతాల జాబితాలో వీడియోకాన్ ఇండస్ట్రీస్, ఫ్యూచర్ రిటైల్, ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్, జీటీఎల్, వీసా స్టీల్, క్వాలిటీ, గాయత్రి ప్రాజెక్ట్స్, ఎరా ఇన్ఫ్రా, రీడ్ అండ్ టేలర్ ఇండియా, కోస్టల్ ఎనర్జెన్ తదితరాలున్నాయి. కాగా.. ఇటీవల విదర్భ ఇండస్ట్రీస్(రూ. 1,150 కోట్లు), రోల్టా(రూ. 600 కోట్లు), వీవోవీఎల్(రూ. 1,100 కోట్లు) ఖాతాలను ప్రభుత్వ బ్యాంకులు బ్యాడ్ బ్యాంకుకు ఆఫర్ చేశాయి. ఈ బాటలో ధరణి షుగర్స్ ఖాతా(రూ. 619 కోట్లు)ను దాదాపు రూ. 223 కోట్లకు కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదేవిధంగా రెయిన్బో పేపర్స్ రూ. 1,136 కోట్ల రుణాలకుగాను ఎన్ఏఆర్సీఎల్ రూ. 87 కోట్ల యాంకర్ ఆఫర్ చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. గతేడాది ఇలా.. 2022–23లో జేపీ ఇన్ఫ్రాటెక్, ఎస్ఎస్ఏ ఇంటర్నేషనల్, హీలియోస్ ఫొటో వోల్టాయిక్కు చెందిన మొత్తం రూ. 10,378 కోట్ల రుణాలను ఎన్ఏఆర్సీఎల్ చేజిక్కించుకుంది. ఇందుకు నగదు, సెక్యూరిటీల జారీ ద్వారా రూ. 3,636 కోట్లు ఆఫర్ చేసింది. కాగా.. కొన్ని రుణాల విషయంలో ఎన్ఏఆర్సీఎల్ ఆఫర్లను రుణదాతలు తిరస్కరిస్తున్నాయి. మరికొన్ని కేసుల్లో మరింత మెరుగైన ఆఫర్లు లభిస్తున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు వివరించాయి. జీటీఎల్‌కు బ్యాడ్ బ్యాంకు ప్రతిపాదిత రూ. 360 కోట్ల ఆఫర్ అంచనాలను చేరకపోవడంతో తిరస్కరణకు గురైంది. రుణదాతలు రూ. 550 కోట్లు ఆశించడం గమనార్హం! ఇక మెక్నల్లీ భారత్ విషయంలో నాల్వా స్టీల్ రూ. 424 కోట్లకుపైగా ఆఫర్ చేసింది. ఇదేవిధంగా మిట్టల్ కార్ప్‌నకు ఎన్ఏఆర్సీఎల్ రూ. 228 కోట్లు ఆఫర్ చేయగా.. రూ. 405 కోట్ల బిడ్‌తో ఖాతాను ఫీనిక్స్ ఏఆర్సీ గెలుచుకుంది. కాగా.. బ్యాడ్ బ్యాంక్ మొండి రుణాల కొనుగో లుని 15–85 నిష్పత్తిలో ఆఫర్ చేస్తుంది. అంటే 15 శాతం ముందస్తు చెల్లింపు, మిగిలిన 85% బకాయిల నుంచి రికవరీ ద్వారా చెల్లిస్తుంది. -
వజ్రంలో వజ్రం..బీటింగ్ హార్ట్‌గా పేరు.. అమూల్యమైన విలువ!
సూరత్: వజ్రాన్ని చూస్తేనే కళ్లు చెదురుతాయి. ధగధగలాడుతూ చూపరుల్ని కట్టి పడేస్తుంది. అలాంటిది వజ్రంలో వజ్రం ఉంటే ఇంక వేరే చెప్పాలా. కళ్లు కూడా తిప్పుకోలేం. అలాంటి అరుదైన వజ్రం గుజరాత్లో సూరత్‌లో వి.డి. గ్లోబల్ అనే వజ్రాల కంపెనీకి లభించింది. ఆ వజ్రం లోపలున్న వజ్రం కూడా లోపల అటూఇటూ ఎంచక్కా కదులుతోందని ఆ కంపెనీ వెల్లడించింది. 0.329 క్యారట్ల ఈ వజ్రానికి బీటింగ్ హార్ట్ అని పేరు పెట్టారు. వజ్రాల గనుల తవ్వకాల్లో గత ఏడాది అక్టోబర్‌లో ఈ వజ్రం లభించింది. అరుదైన వజ్రం కావడంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ది జెమ్ అండ్ జ్యుయెలరీ ఎక్స్పోర్ట్ ప్రొమోషన్ కౌన్సిల్ (జీజేఈపీసీ) దానిపై మరింత అధ్యయనం చేసింది. ఆప్టికల్, ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్స్ ద్వారా విశ్లేషించి 2019లో సైబీరియాలో లభించిన వజ్రం మాదిరిదే బీటింగ్ హార్ట్ కూడానని తేల్చింది. అప్పట్లో సైబీరియాలో లభించిన ఈ వజ్రంలో వజ్రం 80 కోట్ల ఏళ్ల కిందటిదని, విలువ అమూల్యమని చెప్పుకున్నారు. ఆ వజ్రానికి మత్రోష్కా అని పేరు పెట్టారు. రష్యాలో తయారు చేసే ఒక దానిలో ఒకటి ఇమిడిపోయే చెక్క బొమ్మల్ని మత్రోష్కా అని పిలుస్తారు. ఇప్పుడు అచ్చంగా అదే మాదిరి వజ్రం మన దేశంలో కూడా లభించడం విశేషం. ఈ వజ్రం లోపలి వజ్రం కూడా అత్యంత స్పష్టంగా కనిపిస్తోంది. వజ్రాలపై అధ్యయనం చేసే ‘డి బీర్స్’గ్రూప్‌కు చెందిన నిపుణురాలు సమంతా సిబ్లీ గత 30 ఏళ్లలో బీటింగ్ హార్ట్‌లాంటి అరుదైన వజ్రాన్ని చూడలేదని చెప్పారు. ఈ వజ్రం ఎలా ఏర్పడిందో అధ్యయనం చేస్తామని తెలిపారు. -
హెచ్ఏఎల్లో 3.5% వాటా అమ్మకం
ముంబై: రక్షణ రంగ పీఎస్‌యూ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్)లో కేంద్ర ప్రభుత్వం 3.5 శాతం వాటా(1.17 కోట్ల షేర్లు)ను విక్రయించనుంది. ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) ద్వారా రూ. 10 ముఖ విలువగల ఒక్కో షేరునీ రూ. 2,450 ధరలో ప్రభుత్వం అమ్మనున్నట్లు హెచ్ఏఎల్ స్టాక్ ఎక్సే్ఛంజీలకు తెలియజేసింది. తద్వారా ప్రభుత్వానికి రూ. 2,867 కోట్లు సమకూరే వీలుంది. ఆఫర్లో భాగంగా ప్రభుత్వం తొలుత 1.75 శాతం ఈక్విటీని(58.51 లక్షల షేర్లు) విక్రయానికి ఉంచనుంది. అధిక సబ్స్క్రిప్షన్ లభిస్తే మరో 1.75 శాతం వాటాను సైతం ఇన్వెస్టర్లకు బదిలీ చేయనుంది. ఈ నెల 23న సంస్థాగత ఇన్వెస్టర్లకు, 24న రిటైలర్లకు ఓఎఫ్ఎస్ విండో ఓపెన్ కానుంది. కాగా.. బుధవారం ముగింపు ధర రూ. 2,625తో పోలిస్తే 6.7 శాతం(రూ. 175) డిస్కౌంట్లో ప్రభుత్వం ఫ్లోర్ ధరను నిర్ణయించింది. 2020లో ప్రభుత్వం కంపెనీలో 15 శాతం ఈక్విటీని షేరుకి రూ. 1,001 ధరలో విక్రయించింది. దీంతో రూ. 5,000 కోట్లు అందుకుంది. 2018 మార్చిలో లిస్టయిన కంపెనీలో ప్రభుత్వానికి 75.15 శాతం వాటా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఇప్పటివరకూ డిజిన్వెస్ట్‌మెంట్, సీపీఎస్ఈల షేర్ల బైబ్యాక్‌ల ద్వారా దాదాపు రూ. 31,107 కోట్లు సమకూర్చుకుంది. హెచ్ఏఎల్ వాటా ద్వారా మరో రూ. 2,867 కోట్లు జమ చేసుకునే వీలుంది. బడ్జెట్ అంచనాలు రూ. 65,000 కోట్లుకాగా.. ప్రభుత్వం గత నెలలో డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాన్ని రూ. 50,000 కోట్లకు కుదించిన విషయం విదితమే. -
ప్రభుత్వ కమిటీ లేదు ‘అదానీ దర్యాప్తు’పై లోక్‌సభలో కేంద్రం
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ మీద వచ్చిన ఆరోపణలపై విచారణకు ప్రభుత్వపరంగా ఎలాంటి కమిటీనీ వేయలేదని కేంద్రం స్పష్టం చేసింది. వాటిపై నియంత్రణ సంస్థ సెబీ దర్యాప్తు చేస్తోందని గుర్తు చేసింది. ఈ విషయమై లోక్‌సభలో పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఈ మేరకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. ‘‘ఇండొనేసియా నుంచి బొగ్గు దిగుమతుల విషయమై కూడా అదానీ కంపెనీపై విడిగా జరుగుతున్న దర్యాప్తు ఇంకా తుది దశకు చేరలేదు. విద్యుదుత్పత్తి, సంపిణీ పరికరాల దిగుమతికి సంబంధించి అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణల మీద డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ దర్యాప్తు పూర్తయింది. నివేదిక కూడా అందింది. హిండెన్‌బర్గ్ నివేదిక వెలుగు చూసిన తర్వాత గత జనవరి 24 నుంచి మార్చి 1 మధ్య అదానీ గ్రూప్‌కు చెందిన 9 లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్లో 60 శాతం క్షీణత నమోదైంది’’ అని మంత్రి చెప్పారు. -
ఎన్పీఎస్, ఏపీవై పథకాలకు ఆదరణ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం నిర్వహించే అటల్ పెన్షన్ యోజన (ఏపీవై), నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) పథకాలకు మంచి ఆదరణ లభిస్తోంది. చందాదారులు పెద్ద ఎత్తున ఈ పథకాల్లో చేరుతున్నారు. గడిచిన ఏడాది కాలంలో (2022 మార్చి 5 నుంచి 2023 మార్చి 4 నాటికి) ఈ రెండు పథకాల కింద చందాదారుల సంఖ్య 23 శాతం పెరిగి 6.24 కోట్లుగా ఉంది. ఈ వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. విడిగా చూస్తే ఏపీవై చందాదారుల్లో 28 శాతం వృద్ధి ఉంది. గతేడాది మార్చి 4 నాటికి ఈ రెండు పథకాల కింద చందారుల సంఖ్య 5.20 కోట్లుగా ఉంది. ఎన్పీఎస్ చందాదారుల్లో 23.86 లక్షల మంది కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు కాగా, 60.72 లక్షల మంది రాష్ట్రాల ఉద్యోగులు కావడం గమనార్హం. కార్పొరేట్ ఉద్యోగుల సంఖ్య 16.63 లక్షలుగా ఉంది. ఏపీవై చందాదారులు 4.53 కోట్లుగా ఉన్నారు. 2015 జూన్ 1న కేంద్ర ప్రభుత్వం ఏపీవై పథకాన్ని తీసుకొచ్చింది. ఎలాంటి సామాజిక భద్రత లేని కార్మికులకు, ముఖ్యంగా అసంఘటిత రంగంలో పనిచేసే వారికి, వృద్ధాప్యంలో పింఛను సదుపాయం కోసం దీన్ని ప్రారంభించింది. సభ్యులు నెలవారీ చెల్లించిన చందానుబట్టి 60 ఏళ్లు వచ్చిన తర్వాత నుంచి ప్రతి నెలా రూ.1,000–5,000 మధ్య పింఛను లభిస్తుంది. 2022 అక్టోబర్ 1 నుంచి పన్ను చెల్లింపుదారులు ఈ పథకంలో చేరుకుండా కేంద్రం నిషేధించింది. -
పులుల మరణాలపై నివేదిక ఇవ్వండి
న్యూఢిల్లీ: దేశంలో అభయారణ్యాల్లో పులుల మరణాలపై మూడు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పెద్ద సంఖ్యలో పులులు చనిపోతున్నాయంటూ వచ్చిన వార్తా కథనాలపై జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నల ధర్మాసనం ఈ మేరకు స్పందించింది. దేశవ్యాప్తంగా పులుల సంఖ్య తగ్గిపోతున్నందున వాటిని రక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై ధర్మాసనం ప్రస్తుతం విచారణ జరుపుతోంది. నేషనల్ టైగర్ కాన్జర్వేషన్ అథారిటీ(ఎన్టీసీఏ) గణాంకాల ప్రకారం..దేశంలో 2012 నుంచి ఇప్పటి వరకు 1,059 పులులు మరణించాయి. వీటిలో ఏకంగా 270 పులులు టైగర్ స్టేట్‌గా పేరున్న మధ్యప్రదేశ్‌లోనివే కావడం గమనార్హం. -
‘స్టాక్ మార్కెట్ల’పై సుప్రీంకోర్టు కమిటీ
న్యూఢిల్లీ: స్టాక్ట్ మార్కెట్లపై నియంత్రణ చర్యలను బలోపేతం చేయడానికి నిపుణుల కమిటీ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం చేసిన సూచనలను సీల్డ్ కవర్లో స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. మదుపరుల ప్రయోజనాలను కాపాడే విషయంలో పూర్తి పారదర్శకత కావాలని తాము కోరుకుంటున్నట్లు స్పష్టం చేసింది. ప్రభుత్వ ప్రతిపాదిత నిపుణుల కమిటీ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి సిట్టింగ్ జడ్జిని నియమించడం సాధ్యం కాదని పేర్కొంది. అదానీ గ్రూప్ కంపెనీలపై హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత మదుపరులు భారీగా నష్టపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లపై నియంత్రణ చర్యలను బలోపేతం చేయాలని, ఇందుకోసం సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయాలని, మదుపరుల ప్రయోజనాలను కాపాడాలని కోరుతూ న్యాయవాదులు ప్రశాంత్ భూషణ్, ఎంఎల్ శర్మతోపాటు పలువురు సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు(పిల్స్) దాఖలు చేశారు. వీటిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస జేబీ పార్దివాలాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. నియంత్రణ చర్యలను బలోపేతం చేయడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని గత విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. కమిటీ సభ్యుల పేర్లు, విధివిధానాలను శుక్రవారం సీల్డ్ కవర్లో అందజేయగా, ధర్మాసనం స్వీకరించలేదు. ప్రభుత్వం సూచించిన సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తే అది పూర్తిగా ప్రభుత్వ కమిటీ అవుతుందని అభిప్రాయపడింది. పారదర్శకత కావాలి కాబట్టి తామే ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని, తద్వారా న్యాయస్థానంపై ప్రజలకు విశ్వాసం పెరుగుతుందని వెల్లడించింది. ఇకపై సిట్టింగ్ న్యాయమూర్తులు ఈ అంశాన్ని విచారిస్తారని, కమిటీలో మాత్రం వారు సభ్యులుగా ఉండబోరని తెలిపింది. -
వేగవంత అభివృద్ధి ఉపాధిని సృష్టిస్తోంది
న్యూఢిల్లీ: మౌలిక, అనుబంధ రంగాల్లో వడివడిగా అభివృద్ధి అడుగులు పడుతుండటం వల్లే దేశంలో పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు పుట్టుకొస్తున్నాయని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాలు, శాఖల్లో కొత్తగా ఉద్యోగాలు పొందిన 71,426 మందికి శుక్రవారం నియామక పత్రాలను ప్రధాని మోదీ ఎలక్ట్రానిక్ పద్ధతిలో అందజేశారు. రోజ్‌గార్ మేళాలో భాగంగా శుక్రవారం ఢిల్లీలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొత్తగా ఎంపికైన సిబ్బందితో మోదీ కొద్దిసేపు మాట్లాడారు. ‘ నియామక ప్రక్రియలో పూర్తి పారదర్శకత, వేగం తెస్తూ కచ్చితమైన కాలవధితో రిక్రూట్మెంట్ చేస్తున్నాం. కొత్తగా వేలాది మందికి ఉద్యోగాలతో కొనసాగుతున్న ఈ రోజ్‌గార్ మేళానే మా ప్రభుత్వ పనితీరుకు చక్కని నిదర్శనం’ అని వ్యాఖ్యానించారు. విధిలో బాధ్యతగా మెలగండి నూతన ఉద్యోగాల్లో కొలువుదీరే సిబ్బందిని ఉద్దేశించి మోదీ కొన్ని సూచనలు చేశారు. ‘ వ్యాపారి తన వినియోగదారుడికి అత్యంత ప్రాధాన్యతనిస్తాడు. ఇదే మంత్రం మీ మదిలో ప్రతిధ్వనించాలి. ప్రజాసేవకు అంకితం కావాలి. కార్యనిర్వహణలో పౌరుడి సేవే ప్రథమ కర్తవ్యంగా ఉండాలి. ప్రజాసేవే ముఖ్యం’ అని సూచించారు. ‘ప్రతీ గ్రామం భారత్‌నెట్ ప్రాజెక్టులో భాగస్వామి అయిననాడు అక్కడ ఉపాధి కల్పన ఎక్కువ అవుతుంది. టెక్నాలజీని అంతగా అర్థంచేసుకోలేని వారు ఉండేచోట వారికి ఆన్లైన్ సేవలు అందిస్తూ కొత్త వ్యాపారం ప్రారంభించేందుకు అవకాశం చిక్కుతుంది. ఇలాంటి కొత్త వ్యాపారాలు చేసేందుకు రెండో శ్రేణి, మూడో శ్రేణి పట్టణాలు అక్కడి అవకాశాలను అందిపుచ్చుకునే నిరుద్యోగ యువతకు నూతన గుర్తింపును తీసుకొస్తున్నాయి’ అని అన్నారు. ‘భవిష్యత్తులో దేశంలో వివిధ రంగాల్లో మరింతగా ఉపాధి కల్పనకు రోజ్‌గార్ మేళా ఒక ఉత్ప్రేరకంగా పనిచేయగలదు. దేశాభివృద్ధిలో భాగస్వాములయ్యే యువతకు సరైన ఉపాధి అవకాశాలు దక్కాలి’ అని ఈ సందర్భంగా ప్రధాని కార్యాలయం పేర్కొంది. -
మా సిఫార్సులను... పదేపదే తిప్పి పంపొద్దు..
న్యూఢిల్లీ: న్యాయమూర్తులుగా తాము చేసిన సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం పదేపదే తిప్పి పంపజాలదని సుప్రీంకోర్టు కొలీజియం మరోసారి స్పష్టం చేసింది. పలు హైకోర్టులకు న్యాయమూర్తులుగా ఇప్పటికే పలుమార్లు చేసిన ఐదు గత సిఫార్సులను తాజాగా మరోసారి కేంద్రానికి పంపింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ ఎస్.కె.కౌల్, జస్టిస్ కె.ఎం.జోసెఫ్‌తో కూడిన సుప్రీంకోర్టు కొలీజియం మంగళ, బుధవారాల్లో సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వీరిలో తాను స్వలింగ సంపర్కినని ప్రకటించుకున్న సీనియర్ అడ్వకేట్ సౌరభ్ కృపాల్ కూడా ఉన్నారు. ఆయనను ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమించాలన్న 2021 నవంబర్ 11 నాటి సిఫార్సును కొలీజియం తాజాగా పునరుద్ఘాటించింది. న్యాయవాదులు ఆర్.జాన్ సత్యంను మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిగా, సోమశేఖర్ సుందరేశన్‌ను బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా తిరిగి సిఫార్సు చేసింది. వీరితో పాటు అమితేశ్ బెనర్జీ, సఖ్య సేన్‌ను కలకత్తా హైకోర్టు న్యాయమూర్తులుగా వెంటనే నియమించాలని కూడా పేర్కొంది. అలాగే కర్నాటక, అలహాబాద్, మద్రాస్ హైకోర్టులకు న్యాయమూర్తులుగా మరో 20 పేర్లను సిఫార్సు చేసింది. వీరిలో 17 మంది న్యాయవాదులు, ముగ్గు్గరు జడ్జిలున్నారు. ఈ సందర్భంగా కేంద్రాన్ని ఉద్దేశించి కొలీజియం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ సిఫార్సులను కేంద్రం పదేపదే తిప్పి పంపడాన్ని అనుమతించలేమని స్పష్టం చేసింది. అమితేశ్, సేన్ పేర్లను కేంద్రం ఇప్పటికే రెండేసిసార్లు తిప్పి పంపింది. అమితేశ్ తండ్రి జస్టిస్ యు.సి.బెనర్జీ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి. గోధ్రాలో సబర్మతి రైలు ప్రమాదం వెనక కుట్ర కోణమేదీ లేదని తేల్చిన కమిషన్‌కు సారథి. ఇక సత్యం ప్రధాని మోదీపై విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారని, ప్రభుత్వ విధానాలు, పథకాలపై సుందరేశన్ ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారని వారి పేర్లను కేంద్రం తిప్పి పంపింది. ఈ అభ్యంతరాలను కొలీజియం తాజాగా తోసిపుచ్చింది. స్వేచ్ఛగా అభిప్రాయాలను వ్యక్తీకరించడం రాజ్యాంగపరమైన పదవులు చేపట్టేందుకు అడ్డంకి కాబోదని స్పష్టం చేసింది. -
కొలీజియం కాక.. కేంద్రం, న్యాయ వ్యవస్థ మధ్య ముదురుతున్న వివాదం
సుప్రీంకోర్టు కొలీజియం. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ నడుమ వివాదంగా మారిన అంశం. కొలీజియం వ్యవస్థను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకం, బదిలీల్లో తమ పాత్ర లేకపోవడం ఏమిటంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కొలీజియం వ్యవస్థే రాజ్యాంగ విరుద్ధమంటూ పలువురు కేంద్ర మంత్రులు బాహాటంగా గళం విప్పుతున్నారు. కొలీజియం సభ్యులేమో సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల నియామకానికి తాము సిపార్సులు మాత్రమే చేస్తామని, తుది నిర్ణయం కేంద్రానిదేనని అంటున్నారు. ఏమిటీ కొలీజియం...? సుప్రీంకోర్టు న్యాయమూర్తుతో పాటు దేశవ్యాప్తంగా హైకోర్టుల్లో ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తుల నియామకం, బదిలీలను సిఫార్సు చేయడానికి ఉద్దేశించినదే కొలీజియం వ్యవస్థ. సుప్రీంకోర్టు కొలీజియంలో ప్రధాన న్యాయమూర్తి, మరో నలుగురు అత్యంత సీనియర్ న్యాయమూర్తులు సభ్యులుగా ఉంటారు. న్యాయమూర్తుల నియామకం, బదిలీల విషయంలో కొలీజియంలో భిన్నాభిప్రాయాలు ఉంటే మెజార్టీ సభ్యులదే తుది నిర్ణయం. అయితే ప్రధాన న్యాయమూర్తిని తప్పనిసరిగా సంప్రదించి, ఆయన అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కొలీజియం తన సిఫార్సులను కేంద్రానికి పంపుతుంది. ఇక హైకోర్టు కొలీజియంలో ప్రధాన న్యాయమూర్తి, ఇద్దరు సీనియర్ మోస్ట్ న్యాయమూర్తులు సభ్యులు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సులు పంపుతుంది. ముఖ్యమంత్రి వాటిని కేంద్ర న్యాయ శాఖ మంత్రికి పంపిస్తారు. వాస్తవానికి రాజ్యాంగంలో కొలీజియం ప్రస్తావన లేదు. కొలీజియం చేసే సిఫార్సులపై కేంద్రం తన విచక్షణ మేరకు నిర్ణయం తీసుకుంటుంది. అయితే ఒకే పేరును కొలీజియం రెండోసారి సిఫార్సు చేస్తే కేంద్రం ఆమోదించాల్సిందేనంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం గతంలో తీర్పు వెలువరించింది. రాజ్యాంగం ఏం చెబుతోంది? రాజ్యాంగంలోని ఆర్టికల్ 124 ప్రకారం సుప్రీంకోర్టు జడ్జిలను రాష్ట్రపతి నియమించాలి. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను సంప్రదించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే సీజేఐ మినహా మిగతా నియామకాల్లో సీజేఐ అభిప్రాయం తెలుసుకోవాలి. ఆర్టికల్ 217 ప్రకారం హైకోర్టు న్యాయమూర్తుల నియామకంలో సీజేఐ, గవర్నర్, హైకోర్టు సీజేలను సంప్రదించాలి. ఏమిటీ వివాదం? 1950 నుంచి 1973 వరకూ కేంద్రం, సీజేఐ కలిసి చర్చించుకుని ఏకాభిప్రాయంతో న్యాయమూర్తులను నియమించే విధానముండేది. సుప్రీంకోర్టులో సీనియర్ మోస్ట్ న్యాయమూర్తిని సీజేఐగా నియమించడం ఆనవాయితీగా కొనసాగింది. 1973లో మాత్రం ముగ్గురు సీనియర్లను పక్కన పెట్టి జస్టిస్ ఎ.ఎన్.రేను సీజేఐగా అప్పటి ప్రభుత్వం నియమించింది. తర్వాత మరో సీజేఐ నియామకంలోనూ ఇలాగే జరగడం కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల మధ్య వివాదానికి దారితీసింది. న్యాయమూర్తుల నియామకంలో కార్యనిర్వాహక వ్యవస్థ కంటే న్యాయ వ్యవస్థకే ఎక్కువ అధికారాలుంటాయని ఫస్ట్ జడ్జెస్ కేసు (1981), సెకండ్ జడ్జెస్ కేసు (1993), థర్డ్ జడ్జెస్ కేసు (1998)ల్లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎలా ఏర్పాటైంది? పార్లమెంట్ చట్టంగానీ, రాజ్యాంగ విధివిధానాలు గానీ లేకుండానే మన దేశంలో 1993లో కొలీజియం వ్యవస్థ మొదలైంది. న్యాయమూర్తుల నియామకంలో ఆర్టికల్ 124(2)లో ఉన్న ‘సంప్రదింపుల అనంతరం’ అర్థాన్ని ‘సమ్మతించిన తర్వాత’గా మారుస్తూ తొమ్మిది మంది సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. తద్వారా న్యాయమూర్తుల నియామకం, బదిలీల అధికారం సీజేఐ నేతృత్వంలోని వ్యవస్థ అయిన కొలీజియానికి దక్కింది. ప్రత్యామ్నాయముందా? కొలీజియంకు ప్రత్యామ్నాయంగా నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్(ఎన్‌జేఏసీ)ని కేంద్రం తెరపైకి తెచ్చింది. ఇది స్వతంత్ర కమిషన్.దీనికి సీజేఐ చైర్‌పర్సన్‌గా ఉంటారు. మరో ఇద్దరు అత్యంత సీనియర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కేంద్ర న్యాయ మంత్రి ఎక్స్–ఆఫీషియో సభ్యులుగా ఉంటారు. పౌర సమాజం నుంచి ఇద్దరు ప్రముఖులను సభ్యులుగా సీజేఐ, ప్రధాని, లోక్‌సభలో ప్రతిపక్ష నేతతో కూడిన కమిటీ నామినేట్ చేయాలి. ఈ ఇద్దరిలో కనీసం ఒకరు ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/మైనార్టీ లేదా మహిళ అయి ఉండాలి. రాజ్యాంగ (99వ సవరణ) చట్టం–2014, నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్స్‌మెంట్ కమిషన్ చట్టం (2014) ద్వారా ఎన్ఏజేసీని కేంద్రం ప్రతిపాదించింది. సంబంధిత బిల్లులు 2014లోనే పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందాయి. కానీ ఈ బిల్లుల రాజ్యాంగబద్ధతను ప్రశ్నిస్తూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎన్‌జేఏసీని కోర్టు కొట్టేసింది. అయితే న్యాయమూర్తుల ఎంపికకు కొలీజియం స్థానంలో కేంద్రం మరో వ్యవస్థను తీసుకొస్తే అభ్యంతరం లేదని ఇటీవలే స్పష్టం చేసింది. కొలీజియంలో ప్రభుత్వ నామినీలు సీజేఐకి కేంద్ర న్యాయ మంత్రి రిజిజు లేఖ న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో చీఫ్ జస్టిస్‌లు, జడ్జిలను నియమించే కొలీజియం వ్యవస్థలో ప్రభుత్వం నామినేట్ చేసేవారికి సైతం చోటుండాలని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు పునరుద్ఘాటించారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు ఆయన తాజాగా లేఖ రాశారు. ‘‘జడ్జిల నియామకంలో పారదర్శకత, జవాబుదారీతనం గురించి ప్రజలకు తెలియజేయడం అవసరం. అందుకే న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియలో ప్రభుత్వ ప్రతినిధులకు చోటు కల్పించాలి’’ అని లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. కొలీజియం వ్యవస్థ రాజ్యాంగ విరుద్ధమని కిరణ్ రిజిజు ఇటీవల విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. కోర్టుల్లో పెండింగ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోవడానికి కొలీజియమే కారణమని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో సీజేఐకి ఆయన లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది. న్యాయ వ్యవస్థకు విషగుళిక: జైరామ్ రమేశ్ న్యాయ వ్యవస్థను పూర్తిగా ఆక్రమించుకొనేందుకు కేంద్రం కుట్రలు పన్నుతోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేశ్ సోమవారం ఆక్షేపించారు. న్యాయ వ్యవస్థను భయభ్రాంతులకు గురిచేస్తోందని ఆరోపించారు. సీజేఐకి రిజిజు లేఖను తప్పు పట్టారు. మంత్రి సూచన న్యాయ వ్యవస్థకు విషగుళిక అన్నారు. అయితే కొలీజియంలో సంస్కరణలు అవసరమేనని జైరాం అభిప్రాయపడ్డారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పీఏఎఫ్‌ఎఫ్‌పై కేంద్రం నిషేధం
న్యూఢిల్లీ: దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్(పీఏఎఫ్ఎఫ్)పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ‘‘జమ్మూకశ్మీర్ తదితర ప్రాంతాల్లో హింసాత్మక చర్యలకు దిగుతున్న జైషే మహ్మద్‌కు ఇది మారుపేరు. ఇతర ఉగ్ర సంస్థలతో కలిసి హింసాత్మక చర్యలకు కుట్ర పన్నుతోంది. యువతను ఉగ్ర భావజాలం వైపు ఆకర్షిస్తోంది’’ అని కేంద్ర హోం శాఖ పేర్కొంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ప్రకారం పీఏఎఫ్‌ఎఫ్‌పై నిషేధం విధిస్తున్నట్లు వెల్లడించింది. -
కరోనా కేసుల పెరుగుదలపై కేంద్రం అప్రమత్తం
న్యూఢిల్లీ: చైనా సహా పలు దేశాల్లో కోవిడ్ కేసులు భారీగా నమోదవుతుండటం ప్రపంచాన్ని కలవరపెడుతోంది. విదేశాల్లో కరోనా కేసుల పెరుగుదలపై భారత్ అప్రమత్తమైంది. కోవిడ్ కేసుల పెరుగుదలపై అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు చేసింది కేంద్ర ప్రభుత్వం. కొత్త వేరియంట్లపై అప్రమత్తంగా ఉండాలని, పాజిటివ్ కేసుల నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపాలని సూచించింది. ఇన్సాకాగ్ నెట్వర్క్ ద్వారా కొత్త కేసులను ట్రాక్ చేయాలని సూచిస్తూ రాష్ట్రాలకు లేఖ రాసింది కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ. ‘జపాన్, అమెరికా, కొరియా, బ్రెజిల్, చైనాలో ఒక్కసారిగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొత్త వేరియంట్లను ఇన్సకాగ్ నెట్వర్క్ ద్వారా ట్రాక్ చేసేందుకు పాజిటివ్ కేసుల నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపే ప్రక్రియను వేగవంతం చేయాలి. అలా చేయడం ద్వారా సరైన సమయంలో కొత్త వేరియంట్లను గుర్తించగలుగుతాం. దానికి తగినట్లుగా వైద్య సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురాగలుగుతాం.’ - కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషన్. ప్రజాగ్రహంతో ఇటీవలే కరోనా ఆంక్షలను సడలించింది చైనా. దీంతో రోజువారి కొత్త కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. వచ్చే మూడు నెలల్లో ఆ దేశ జనాభాలో 60 శాతం మంది ప్రజలు కోవిడ్ బారినపడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు.. జపాన్, అమెరికా, కొరియా, బ్రెజిల్ వంటి దేశాల్లోనూ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు 35 లక్షల కొత్త కేసులు నమోదవుతున్నాయి. భారత్‌లో మంగళవారం 112 కొత్త కేసులు వెలుగుచూశాయి. ప్రస్తుతం క్రియాశీల కేసులు 3,490 ఉన్నాయి. ఇదీ చదవండి: షాకింగ్.. మరికొన్ని రోజుల్లో ఊహించని రీతిలో కరోనా కేసులు.. లక్షల్లో మరణాలు! -
రోజ్‌గార్ మేళాల ద్వారా 1.47 లక్షల ఉద్యోగాలు
న్యూఢిల్లీ: రోజ్‌గార్ మేళాల కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, స్వతంత్య్ర సంస్థలు, బ్యాంకులు, ప్రభుత్వరంగ సంస్థల్లో కొత్తగా 1.47 లక్షల మందిని నియమిస్తూ నియామకపత్రాలు అందజేశామని కేంద్రప్రభుత్వం తెలిపింది. ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ గురువారం రాజ్యసభలో ఈ విషయం వెల్లడించారు. ఇంకా భర్తీకాని పోస్టులకుగాను నియామక ప్రక్రియ కొనసాగుతోందని స్పష్టంచేశారు. 2020–21 కాలానికిగాను దేశంలో నిరుద్యోగిత 4.2 శాతంగా నమోదైందని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అదే కాలానికి దేశంలోని మొత్తం జనాభాలో ఏదైనా ఒక వృత్తిలో నిమగ్నమైన జనాభా(వర్కర్ పాపులేషన్ రేషన్–డబ్లూపీఆర్) 52.6 శాతంగా నమోదైందని తెలిపారు. కొత్త ఉద్యోగాలను సృష్టించేందుకు, కోవిడ్ సంక్షోభం నుంచి దేశార్థికాన్ని ఆదుకునేందుకు ఆత్మనిర్భర్ భారత్ పథకం కింద కేంద్రప్రభుత్వం రూ.27 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీని అమలుచేసిందన్నారు. ఈ పథకం కింద లబ్దిపొందాలనుకునే సంస్థల రిజిస్ట్రేషన్ గడువు ఈ ఏడాది మార్చి 31నాడే ముగిసిందన్నారు. 60 లక్షల ఉద్యోగాల సృష్టి కోసం రూ.1.97 లక్షల కోట్లతో ఉత్పత్తి ప్రోత్సాహక రాయితీ పథకం తెచ్చామని మంత్రి చెప్పారు. -
10ఎఫ్ దాఖలుకు మార్చి వరకు గడువు
న్యూఢిల్లీ: నాన్ రెసిడెంట్ (భారత్‌లో నివసించని) పన్ను చెల్లింపుదారులు 10ఎఫ్ పత్రాన్ని మాన్యువల్‌గా (భౌతికంగా) దాఖలు చేసేందుకు 2023 మార్చి 31 వరకు కేంద్ర సర్కారు గడువు ఇచ్చింది. దీనివల్ల నిబంధనల అమలు భారం తగ్గుతుందని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) ప్రకటించింది. తక్కువ టీడీఎస్ అమలు చేసేందుకు వీలుగా నాన్ రెసిడెంట్ పన్ను చెల్లింపుదారులు ఆన్లైన్లో ఫామ్ 10ఎఫ్ దాఖలు చేయడం తప్పనిసరి అంటూ ఈ ఏడాది జూలైలో సీబీడీటీ ఆదేశాలు తీసుకొచ్చింది. పాన్ నంబర్లు లేని వారు ఫామ్ 10ఎఫ్ దాఖలు చేసేందుకు ఆదాయపన్ను శాఖ ఈఫైలింగ్ పోర్టల్ అనుమతించడం లేదు. దీంతో పన్ను చెల్లింపుదారులు ఫామ్10 ఎఫ్ దాఖలు విషయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి వెళ్లాయి. దీంతో భౌతికంగా దాఖలు చేసేందుకు అనుమతి ఇచ్చింది. -
‘నోట్ల రద్దు’పై కేంద్రం, ఆర్బీఐకి సుప్రీంకోర్టు కీలక ఆదేశం
న్యూఢిల్లీ: పెద్ద నోట్లను రద్దు చేస్తూ(డిమానిటైజేషన్) 2016లో తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన రికార్డులు సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)ను సుప్రీంకోర్టు ఆదేశించింది. వాటిని తాము పరిశీలిస్తామని తెలిపింది. నోట్ల రద్దు నిర్ణయాన్ని సవాలు చేస్తూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 58 పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ ఎస్ఏ నజీర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం కొంతకాలంగా విచారణ కొనసాగిస్తోంది. ఆర్బీఐ తరపున అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి, పిటిషనర్ల తరపున సీనియర్ అడ్వొకేట్లు పి.చిదంబరం, శ్యామ్ దివాన్ బుధవారం వాదనలు వినిపించారు. ఈ నెల 10వ తేదీ నాటికి లిఖితపూర్వకంగా వాదనలు తెలియజేయాలని ధర్మాసనం సూచించింది. తీర్పును రిజర్వు చేసింది. ఇదీ చదవండి: ఢిల్లీలో బీజేపీకి బ్రేక్.. ఫలించిన కేజ్రీవాల్ ప్లాన్స్ -
జీ–20పై నేడు అఖిలపక్షం
న్యూఢిల్లీ: భారత్ ఆధ్వర్యంలో వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో జరగనున్న జీ–20 సదస్సులో చర్చించాల్సిన అంశాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై సలహాలు, సూచనలు స్వీకరించడానికి కేంద్ర ప్రభుత్వం సోమవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. సమావేశానికి దాదాపుగా 40 రాజకీయ పార్టీలకు చెందిన అధినేతల్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఆహ్వానించారు. ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తదితరులు హాజరుకానున్నారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కూడా ఈ సమావేశానికి హాజరవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. జీ–20 శిఖరాగ్ర సదస్సుకి ముందు హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా 200కిపైగా సమావేశాలు నిర్వహించనున్నారు. మరోవైపు జీ–20 మొట్టమొదటి ప్రతినిధుల సదస్సు రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో ఆదివారం జరిగింది. సమ్మిళిత అభివృద్ధి, మెరుగైన జీవన ప్రమాణాలు, ఆరోగ్యరంగంలో సదుపాయాలు, నాణ్యమైన జీవనం వంటివాటిపై భారత్ ప్రతినిధి అమితాబ్ కాంత్ మాట్లాడారు. -
కక్షతోనే ఆంక్షలు.. కేంద్రం తీరుతో రాష్ట్రానికి రూ. 40,000 కోట్ల గండి
సాక్షి, హైదరాబాద్: అభ్యుదయ పథంలో నడుస్తున్న తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విధిస్తున్న అనవసర ఆంక్షలతో తీవ్ర నష్టం కలుగుతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు. 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రానికి సమకూరాల్సిన ఆదాయంలో రూ.40 వేల కోట్లకుపైగా గండిపడిందని, ఈ రాజకీయ ప్రేరేపిత, కక్షపూరిత విధానాలు సరికాదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలకు సవివరంగా తెలియజేసేందుకు డిసెంబర్ నెలలో వారం రోజుల పాటు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, శాసనసభ వ్యవహారాల మంత్రి ప్రశాంత్‌రెడ్డిలను ఆదేశించారు. ఈ మేరకు వివరాలతో సీఎం కార్యాలయం గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రకటనలోని అంశాలివీ.. అకస్మాత్తుగా పరిమితులు మార్చి.. ‘‘ప్రతి ఆర్థిక సంవత్సరానికి ముందు కేంద్రం విడుదల చేసే బడ్జెట్ గణాంకాలను అనుసరించి రాష్ట్రాలు తమ బడ్జెట్ అంచనాలను రూపొందించుకుంటాయి. ఆర్థిక వనరులను సమకూర్చుకునేందుకు ప్రతి రాష్ట్రానికి ఆనవాయితీగా ఎఫ్ఆర్బీఎం పరిమితులను ముందస్తుగా కేంద్రం విధిస్తోంది. 2022–23 ప్రారంభంలోనే తెలంగాణ ఎఫ్ఆర్బీఎం రుణాల పరిమితిని రూ.54 వేల కోట్లుగా కేంద్రం ప్రకటించింది. దానికి అనుగుణంగా రాష్ట్రం బడ్జెట్ అంచనాలను రూపొందించుకుంది. కానీ కేంద్రం అకస్మాత్తుగా తెలంగాణ ఎఫ్ఆర్బీఎం రుణ పరిమితిని రూ.39 వేల కోట్లకు కుదించడంతో రాష్ట్రానికి అందాల్సిన రూ.15వేల కోట్లు తగ్గాయి. ఆర్థికంగా పటిష్టంగా ఉన్న రాష్ట్రాలు ఎఫ్ఆర్బీఎం పరిమితికి అదనంగా 0.5 శాతం రుణాలు సేకరించుకునేందుకు నిబంధనలు అనుమతిస్తాయి. ఆర్థికంగా అత్యంత పటిష్టంగా ఉన్న తెలంగాణకు మాత్రం ఈ అవకాశాన్ని ఇవ్వలేదు. వ్యవసాయ, రైతాంగ వ్యతిరేక విద్యుత్ సంస్కరణలను రాష్ట్రంలో అమలు చేస్తామంటేనే 0.5 శాతం అదనపు రుణ పరిమితికి అనుమతిస్తామని కేంద్రం ఆంక్షలు పెట్టింది. దీనితో మరో రూ.6 వేల కోట్ల రుణాలను సమీకరించుకునే అవకాశాన్ని రాష్ట్రం కోల్పోయింది. ఎన్ని కష్టాలనైనా భరిస్తామని.. కానీ తెలంగాణ రైతులకు, వ్యవసాయానికి నష్టం చేసే కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సంస్కరణలకు ఒప్పుకోబోమని సీఎం కేసీఆర్ కేంద్రానికి ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన రూ.21 వేల కోట్ల నిధులు కేంద్ర ప్రభుత్వ సంకుచిత విధానాల వల్ల నిలిచిపోయి రాష్ట్రం ఆర్థికంగా నష్టపోయింది. అక్కడితో ఆగకుండా రాష్ట్రానికి రావాల్సిన రూ.20 వేల కోట్ల బడ్జెటేతర రుణాలను కూడా కేంద్రం నిలిపివేయించింది. ఈ అనాలోచిత విధానాలు, పూర్తి ఆర్థిక అజ్ఞానంతో కూడిన నిర్ణయాలతో రాష్ట్రానికి రావాల్సిన రూ.40వేల కోట్లకుపైగా నిధులకు గండిపడింది. ఒప్పంద రుణాలూ నిలిపివేసి.. ప్రజల అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కార్యక్రమాల కోసం రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే పలు ఆర్థిక సంస్థలతో చేసుకున్న ఒప్పందాల ప్రకారం నిధులు (రుణాలు) సమీకరిస్తోంది. కానీ కేంద్రం ఆ నిధులను కూడా కక్షసాధింపు నిబంధనలతో రాకుండా నిలిపివేయించింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో అధికారులు ఆయా సంస్థలతో నిరంతర సంప్రదింపులు జరిపారు. రాష్ట్ర ప్రగతి కోసం వారిచ్చే రుణాలను తిరిగి చెల్లించే ఆర్థిక పరిపుష్టి కలిగి ఉన్నామని స్పష్టంగా వివరించారు. దీనిని అర్థం చేసుకున్న ఆర్థిక సంస్థలు రాష్ట్రం మీద భరోసాతో గత ఒప్పందాల మేరకు నిధులను విడుదల చేస్తున్నాయి. దేశ అభివృద్ధికి గొడ్డలిపెట్టు కేంద్రం అడుగడుగునా రాష్ట్రాన్ని ఆర్థిక దిగ్భంధం చేసి ప్రగతికి అడ్డుపుల్లలు వేస్తోంది. కేంద్ర అసమర్థ, అనుచిత నిర్ణయాలతో సకాలంలో నిధులు అందక అభివృద్ధి ఆగిపోయి రాష్ట్రాల ప్రగతి కుంటుపడే పరిస్థితులు దాపురిస్తున్నాయి. కేంద్ర తప్పుడు విధానాలు దేశాభివృద్ధికే గొడ్డలిపెట్టుగా మారే ప్రమాదం పొంచి ఉంది. పూర్తి ఆర్థిక అజ్ఞానంతో కూడిన, అనాలోచిత, అసంబద్ధ నిర్ణయాలతో ఒక్క తెలంగాణ ప్రగతిని మాత్రమే కాదు దేశ ఆర్థిక పరిస్థితిని కూడా కేంద్రం దిగజారుస్తోంది. రాజకీయ ప్రేరేపితమైన కక్షపూరిత దిగజారుడు విధానాలతో దేశంలోని అన్ని రాష్ట్రాల గొంతు కోస్తూ, నష్టపరుస్తూ, కేంద్రం సమాఖ్య స్పూర్తికి తూట్లు పొడుస్తోంది..’’ అని సీఎంఓ ప్రకటనలో పేర్కొంది. కక్షసాధింపు చర్యలపైనా నిలదీసేలా.. కేంద్ర ఆంక్షలతో నిధులు అందకపోవడాన్ని ప్రజలకు వివరించడం కోసం అసెంబ్లీ సమావేశాల ఏర్పాటుకు కేసీఆర్ నిర్ణయించినా.. ఇతర కీలక అంశాలు కూడా ఎజెండాలో ఉండనున్నట్టు టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక జరుగుతున్న సమయంలో ‘ఎమ్మెల్యేలకు ఎర’ అంశం తెరమీదికి రాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేసింది. మరోవైపు మంత్రులు గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని కొన్నిరోజులుగా ఆదాయపన్ను శాఖ దాడులు జరుగుతున్నాయి. దీనితో కేంద్రం సీబీఐ, ఐటీ, ఈడీ సంస్థలను అడ్డుపెట్టుకుని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని టీఆర్ఎస్ ఆరోపణలు చేస్తోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చి వేసేందుకే ఎమ్మెల్యేల కొనుగోళ్లతోపాటు ఐటీ, ఈడీ సంస్థల ద్వారా దాడులకు పాల్పడుతోందనే అంశాన్ని అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ వివరించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు జరిగిన ప్రయత్నాలు, తాము అడ్డుకున్న తీరును కూడా ప్రజలకు వివరించాలని భావిస్తున్నట్టు సమాచారం. ఒకట్రెండు రోజుల్లో అసెంబ్లీ తేదీలు ఖరారు సీఎం కేసీఆర్ చెప్పిన మేరకు అసెంబ్లీ సమావేశాల తేదీలు ఒకట్రెండు రోజుల్లో ఖరారు చేసే అవకాశం ఉందని టీఆర్ఎస్ శాసనసభాపక్ష వర్గాలు వెల్లడించాయి. టీఆర్ఎస్ 2018లో రెండోసారి అధికారంలోకి వచి్చన తర్వాత ఇప్పటివరకు 11 సార్లు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించగా.. తొలిసారిగా శీతాకాలంలో సమావేశాలను నిర్వహిస్తోంది. -
సరికొత్త ‘డేటా’ పరిరక్షణ
ఇటు పౌరసమాజ కార్యకర్తలనూ, అటు దిగ్గజ సైబర్ సంస్థలనూ సమానంగా వణికించిన పాత డేటా పరిరక్షణ ముసాయిదా బిల్లు స్థానంలో సరికొత్త ముసాయిదా బిల్లు శుక్రవారం వెలువడింది. పాత బిల్లు ఉపసంహరించుకున్న మూణ్ణెల్లలోపులో దీన్ని తీసుకురావడాన్నిబట్టి డేటా పరిరక్షణ బిల్లు విషయంలో కేంద్రం ఎంత పట్టుదలగా ఉన్నదో వెల్లడవుతోంది. 2019లో రూపొంది పార్లమెంటులో ప్రవేశించిన ముసాయిదా బిల్లుపై అన్నివైపులా తీవ్ర విమర్శలు చెలరేగటంతో దాన్ని ఉపసంహరించక తప్పలేదు. సైబర్ ప్రపంచంలో అడుగడుగునా ప్రమాదాలు పొంచివుంటున్నాయి. పౌరుల వ్యక్తిగత గోప్యత ప్రశ్నార్థకమవుతున్నది. లక్షల కోట్లకు పడగెత్తిన మెటా (ఫేస్బుక్), ట్విటర్, ఇన్స్టాగ్రామ్, గూగుల్ వంటి దిగ్గజ సంస్థలు మొదలుకొని సాధారణ వ్యాపార, వాణిజ్య సంస్థల వరకూ పౌరుల డేటాతో ఆటలాడుకుంటున్నాయి. వారి వ్యక్తిగత గోప్యతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. వీటి దూకుడుకు కళ్లెం వేసేలా ఇప్పటికే చాలా దేశాలు పకడ్బందీ చట్టాలు చేశాయి. ఆ చట్టాలను ఉల్లంఘించిన పక్షంలో భారీ జరిమానాలు విధిస్తున్నాయి. కానీ మన దేశం మాత్రం పుష్కరకాలంగా తాత్సారం చేస్తోంది. చట్టం తెస్తామనటమే తప్ప దాని ఆచూకీ లేదు. అందుకోసం జస్టిస్ బీఎస్ శ్రీకృష్ణ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ 2018లోనే ఒక ముసాయిదా బిల్లును కేంద్రానికి సమర్పించింది. చివరకు మరో ఏడాది కాలం తర్వాత దాని ఆధారంగా కేంద్రం ఒక ముసాయిదా బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. అయితే తమ బిల్లుకూ, కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లుకూ పొంతనలేదని జస్టిస్ శ్రీకృష్ణ పెదవి విరిచారు. పార్లమెంటు లోపలా, వెలుపలా ఆ ముసాయిదాపై విస్తృతంగా చర్చ జరిగిన సందర్భంగా అందులో సమగ్రత గల్లంతయిందని అనేకులు విమర్శించారు. డేటా పరిరక్షణ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే ఏ చర్యలు తీసుకోవాలో అందులో ప్రతిపాదించారు. కానీ దీన్నుంచి ప్రభుత్వం తనను తాను మినహాయించుకోవటం అన్ని వర్గాలనూ దిగ్భ్రాంతిపరిచింది. అలాగే ఇక్కడ సేకరించే డేటా సరిహద్దులు దాటిపోరాదన్న నిబంధన అందులో ఉంది. ఈ నిబంధన సరికాదని మెటా, ట్విటర్వంటివి విమర్శించాయి. చివరకు ఈ విషయంలో అమెరికా ప్రభుత్వం సైతం జోక్యం చేసుకుంది. ఏమైతేనేం...ఆ బిల్లును పార్లమెంటరీ స్థాయీ సంఘానికి పంపాలని కేంద్రం నిర్ణయించింది. ఆ సంఘం బిల్లుకు మొత్తం 81 సవరణలు సూచించింది. ఈ నేపథ్యంలో ఆ బిల్లు ఉపసంహరణే ఉత్తమమని ప్రభుత్వం భావించింది. చాలా సైబర్ సంస్థలు, ఈ–కామర్స్, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసు సంస్థలు వినియోగదారుల డేటాను ఇష్టానుసారం సేకరిస్తున్నాయి. వీటిల్లో చేరాలంటే చాలా వివరాలు సమర్పించుకోవాల్సి వుంటుంది. ఖాతా తెరవాలన్న తొందరలో అత్యధికులు వెనకాముందూ చూడకుండా అడిగిన వివరాలన్నీ అందజేస్తున్నారు. ఈ వ్యక్తిగత డేటాను సంస్థలు దుర్వినియోగం చేస్తున్నాయి. ఆ వివ రాలు అసాంఘిక శక్తుల చేతుల్లోకి పోయి పౌరుల బ్యాంకు ఖాతాలు ఖాళీ కావటం, వారి వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు అవాంఛనీయ వ్యక్తుల చేతుల్లో పడటం రివాజైంది. ఇలాంటివి చోటుచేసు కున్నప్పుడు ఆ మాధ్యమాలు తమకు సంబంధం లేనట్టు వ్యవహరిస్తున్నాయి. పకడ్బందీ రక్షణ వ్యవస్థ లేనప్పుడు డేటా సేకరణ ఎందుకు చేస్తున్నారన్న ప్రశ్నకు జవాబు లేదు. ఆ సంగతలా ఉంచి పౌరుల డేటాను ప్రభుత్వం అడిగినప్పుడు ఏం చేయాలన్న ప్రశ్న ఉండనే ఉంది. పాత ముసాయి దాలో భద్రతా సంస్థలకు పూర్తిస్థాయి మినహాయింపునీయటం విమర్శలకు తావిచ్చింది. ప్రస్తుత ముసాయిదాలో సైతం అదే కొనసాగింది. జాతీయ భద్రత కీలకం గనుక అవాంఛనీయ శక్తుల కదలికపై నిఘా వేయటం, వారి కార్యకలాపాలను కనిపెట్టి ఉండటం అవసరం కావొచ్చు. కానీ ఆ మాటున నికార్సయిన అసమ్మతిని అణచాలని చూడటం, ఆ కృషిలో నిమగ్నమయ్యే వ్యక్తులనూ, సంస్థలనూ వేధించటం సరైంది కాదు. ప్రభుత్వాల విధానాలూ, చర్యలూ సరిగాలేవని భావించిన వారు శాంతియుత పద్ధతుల్లో నిరసించటం ప్రజాస్వామిక హక్కు. దీనికి భంగంవాటిల్లని రీతిలో భద్రతా సంస్థలు మెలిగితే ఎవరూ అభ్యంతరపెట్టరు. అందుకు భిన్నంగా వ్యవహరించినప్పుడే సమస్య తలెత్తుతుంది. ఏ అధికారైనా హద్దుమీరిన పక్షంలో ఎలాంటి చర్యలుంటాయో చెప్పాలి. తాజా ముసాయిదాలో డేటా పరిరక్షణ బోర్డు ఏర్పాటు ప్రతిపాదన భేషైనది. పౌరుల వ్యక్తిగత డేటాను పరిరక్షించటంలో విఫలమైన సంస్థలపై రూ. 250 కోట్ల వరకూ జరిమానా విధించే అధి కారం ఈ బోర్డుకుంది. అలాగే డేటా లీకయిందని తెలిసిన వెంటనే ఖాతాదార్లకు ఆ సంగతి చెప్పక పోతే రూ. 200 కోట్లవరకూ జరిమానా విధించొచ్చు. ఉద్దేశించిన ప్రయోజనం నెరవేరాక సేకరించిన డేటాను సంస్థలు పూర్తిగా తొలగించాలన్న నిబంధన, వినియోగదారులు తమ డేటా తొలగించాలని కోరినా, సవరించాలని కోరినా సంస్థలు అంగీకరించాలన్న నిబంధన మంచిదే. తమ డేటా సేకరణ ప్రక్రియ చట్ట నిబంధనలకు అనుగుణంగా ఉందో లేదో చూసేందుకు సంస్థలు ఆడిటర్‌ను నియ మించుకోవాలన్న నిబంధన కూడా మంచిదే. అయితే భారత్‌లో సేకరించిన డేటాను ఇక్కడి సర్వర్ల లోనే భద్రపరచాలన్న అంశంలో ప్రభుత్వం రాజీపడింది. అందుకు బదులు ఏయే దేశాల్లో డేటా ఉంచవచ్చునో ప్రభుత్వమే నోటిఫై చేస్తుంది. తనకు అవసరమైనపక్షంలో డేటా తీసుకోవటం సాధ్య పడే దేశాల్లో సర్వర్లు ఉండొచ్చన్నది సర్కారు భావన. మొత్తానికి తాజా ముసాయిదాపై కూడా లోతైన చర్చ జరగాలి. అందుకు పౌరుల హక్కులు, ప్రయోజనాల పరిరక్షణే గీటురాయి కావాలి. ఇదీ చదవండి: సెలక్షన్ కమిటీ రద్దు.. కొత్త సెలక్టర్ల కోసం బీసీసీఐ ప్రకటన -
కాళేశ్వరానికి ‘అదనపు’ కష్టాలు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి అదనపు టీఎంసీ ఎత్తిపోసే అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కాళేశ్వరం అదనపు టీఎంసీ డీపీఆర్‌కు అనుమతుల జారీ ప్రక్రియ విషయంలో యథాతథ స్థితి కొనసాగించాలని కేంద్ర జలశక్తి శాఖ ఆదేశించింది. సాంకేతిక అనుమతుల ప్రక్రియ విషయంలో యథాతథ స్థితిని కొనసాగించాలని గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ)కు ఇటీవల లేఖ రాసింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని విషయాల్లో స్టేటస్ కో కొనసాగించాలని కేంద్ర న్యాయ శాఖ సూచించినట్లు గోదావరి బోర్డుకు జలశక్తి శాఖ తెలియజేసింది. దీంతో కాళేశ్వరం అదనపు టీఎంసీ పనుల ప్రాజెక్టు డీపీఆర్ పరిశీలనను ప్రస్తుతానికి గోదావరి బోర్డు పక్కనబెట్టింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో అదనపు టీఎంసీ ప్రాజెక్టు పనులను నిలుపుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా అనుమతుల ప్రక్రియకు సైతం బ్రేక్ పడినట్టు అయింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే రూ. 85 వేల కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. అదనపు టీఎంసీ సహా ఇతర పనుల పూర్తికి మరో రూ. 30 వేల కోట్లను ఖర్చు చేయాల్సి ఉంది. డీపీఆర్ పరిశీలనకు గోదావరి బోర్డు నో గోదావరి నుంచి రోజుకు 2 టీఎంసీల జలాలను తరలించే లక్ష్యంతో కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని అన్ని రకాల అనుమతులతో చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం... ఆ తర్వాత అదనపు టీఎంసీ తరలింపు పనులను మాత్రం ఎలాంటి అనుమతులు లేకుండానే మొదలుపెట్టింది. అయితే ఈ పనులను అనుమతిలేని ప్రాజెక్టుల జాబితాలో చేర్చిన కేంద్ర జలశక్తి శాఖ... 6 నెలల్లోగా అనుమతి పొందాలని 2021 జూలై 15న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్లో ఆదేశించింది. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం... అదనపు టీఎంసీ తరలింపు కోసం చేపడుతున్న పనులు కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమేనని... అందువల్ల అనుమతిలేని ప్రాజెక్టుల జాబితా నుంచి దీన్ని తొలగించాలని విజ్ఞప్తి చేసింది. దీంతో సవరించిన కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్‌ను సమర్పించి అనుమతులు పొందాలని కేంద్రం సూచించింది. కేంద్ర జలసంఘానికి ఇప్పటికే సవరించిన డీపీఆర్‌ను రాష్ట్ర ప్రభుత్వం సమర్పించగా హైడ్రాలజీ, కాస్ట్ అప్రైజల్ అనుమతులు లభించాయి. అనంతరం సవరించిన డీపీఆర్‌ను గోదావరి బోర్డుకు సాంకేతిక అనుమతుల కోసం పంపింది. బోర్డు ఈ డీపీఆర్‌ను పరిశీలించి సంతృప్తి చెందితే కేంద్ర జలశక్తి శాఖలోని సాంకేతిక సలహా కమిటీ(టీఏసీ) ఆమోదం కోసం సిఫారసు చేయాల్సి ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ ప్రక్రియను తాజాగా గోదావరి బోర్డు పక్కన బెట్టింది. మరికొంత కాలం తప్పని జాప్యం... పరిహారం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన కొందరు ప్రాజెక్టు భూనిర్వాసితులు... రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అనుమతులు లేకుండానే అదనపు టీఎంసీ పనులు చేపడుతోందని నివేదించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. కాళేశ్వరం అదనపు టీఎంసీ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని రకాల అంశాలపై స్టేటస్ కో కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తమ తుది తీర్పునకు లోబడి చర్యలు ఉండాలని ఆదేశించింది. అయితే ఈ ఉత్తర్వులను ఉపసంహరించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఇదీ చదవండి: మునుగోడులో పోస్టర్ వార్ -
ఉక్రెయిన్ విద్యార్థులకు దేశీయంగా సీట్లు కల్పించలేం
సాక్షి, న్యూఢిల్లీ: ఉక్రెయిన్నుంచి తిరిగి వచ్చిన వైద్య విద్యార్థులకు దేశీయ కళాశాలల్లో ప్రవేశాలు కల్పించలేమని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. ఉక్రెయిన్ కళాశాలల అనుమతితో మరో దేశంలో వైద్య విద్య పూర్తి చేయడానికి అవకాశం కల్పిస్తామని తెలిపింది. ఈ మేరకు గురువారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు విచారించింది. ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన వైద్య విద్యార్థులను దేశీయ కళాశాలల్లో ప్రవేశం కల్పించడం చట్టపరంగా సాధ్యం కాదని అఫిడవిట్లో కేంద్రం పేర్కొంది. ‘నీట్లో తక్కువ మార్కులు రావడంతోనే వారంతా ఉక్రెయిన్ వెళ్లారు. నీట్లో తక్కువ మెరిట్ ఉన్న వీరికి ఇక్కడ ప్రవేశాలు కల్పిస్తే ఆయా కాలేజీల్లో సీట్లు పొందలేకపోయిన అభ్యర్థుల నుంచి పిటిషన్లు వెల్లువెత్తే ప్రమాదముంది. ఉక్రెయిన్ యుద్ధంతో కోర్స్ పూర్తి చేయలేని విద్యార్థుల కోసం సెప్టెంబరు ఆరున నేషనల్ మెడికల్ కమిషన్ జారీ చేసిన పబ్లిక్ నోటీస్‌తో మాకు అభ్యంతరం లేదు. అయితే ఆ నోటీసు వీరికి ఇక్కడి కాలేజీల్లో బ్యాక్ డోర్ ఎంట్రీగా భావించరాదు’ అని ప్రభుత్వం స్పష్టం చేసింది. ‘తిరిగొచ్చిన విద్యార్థుల్ని దేశీయ మెడికల్ కాలేజీలకు బదిలీ చేస్తే దేశంలో వైద్య విద్య ప్రమాణాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది’ అని కేంద్రం పేర్కొంది. ఉక్రెయిన్ నుంచి వచ్చిన వైద్య విద్యార్థులు అకడమిక్ మొబిలిటీ ప్రోగ్రామ్ కింద ఏయే దేశాల్లోని యూనివర్సిటీల్లో వైద్య విద్య పూర్తి చేయొచ్చో తెలిపే జాబితాను గురువారం నేషనల్ మెడికల్ కమిషన్ విడుదల చేసింది. అమెరికా, ఇటలీ, స్పెయిన్, బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్, లిథువేనియా, పోలండ్, స్వీడన్, ఈజిప్టు, ఇజ్రాయెల్, గ్రీస్, ఇరాన్, చెక్ రిపబ్లిక్, జార్జియా, కజకిస్తాన్, స్లోవేకియా, హంగేరీ, ఉజ్బెకిస్తాన్, బెలారస్, లాత్వియాల్లో వైద్య విద్య పూర్తి చేయొచ్చని తెలిపింది. ఇదీ చదవండి: సర్వం అధినాయకత్వం కనుసన్నల్లోనే! -
సఫలం.. సంక్షేమం.. సామరస్యం.. మా 8 ఏళ్ల పాలన సారాంశమిదే!
సాక్షి, హైదరాబాద్: ‘విదేశాల నుంచి నల్లధనం తేవడంలో ఫెయిల్.. పేదల ఖాతాల్లో రూ.15 లక్షలు వేయడంలో ఫెయిల్.. ఏటా 2 కోట్ల ఉద్యోగాలివ్వడంలో ఫెయిల్.. పెద్ద నోట్ల రద్దు ఫెయిల్.. రైతు ఆదాయం రెట్టింపు చేయడంలో ఫెయిల్.. చిన్న పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈలకు) రుణాలివ్వడంలో ఫెయిల్.. అర్హులకు ఇండ్లు కట్టించడంలో ఫెయిల్.. మేకిన్ ఇండియా ఫెయిల్.. పటిష్టమైన లోక్‌పాల్ బిల్లు ఫెయిల్.. గంగానది ప్రక్షాళన ఫెయిల్.. నదుల అనుసంధానం ఫెయిల్.. బుల్లెట్ రైలు ఫెయిల్.. హర్‌ఘర్‌కో జల్ ఫెయిల్.. ఫెయిల్.. ఫెయిల్... ఫెయిల్. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఎనిమిదేళ్ల పాలన సారాంశం అన్నింటా వైఫల్యం, విషం, విద్వేషం. కానీ తెలంగాణలో మా ఎనిమిదేళ్ల పాలనా సారాంశం మాత్రం.. సఫలం, సంక్షేమం, సామరస్యం..’ అని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేశారు. పచ్చని పంటలు పండాలనేది టీఆర్ఎస్ సిద్ధాంతమైతే, మతం పిచ్చి మంటలు రగిలించాలనేది బీజేపీ సిద్ధాంతమని విమర్శించారు. గోదావరి, కృష్ణా జలాలు పారించాలనేది టీఆర్ఎస్ అభిమతమైతే, తలలు పగిలి రక్తాలు పారించాలనేది బీజేపీ అభిమతమని దుయ్యబట్టారు. మంగళవారం శాసనసభలో ‘ఎఫ్ఆర్బీఎం చట్టం అమలులో కేంద్రం ద్వంద్వ వైఖరి–రాష్ట్ర ప్రగతిపై ప్రభావం’ అనే అంశంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడారు. బలమైన కేంద్రం, బలహీన రాష్ట్రాలు బీజేపీ ఉద్దేశం ‘బలమైన కేంద్రం, బలహీన రాష్ట్రాలు ఉండాలనేది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఉద్దేశం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే అప్పులను సమీక్షించేందుకు ఉన్నతస్థాయిలో అంతర ప్రభుత్వ కమిటీ వేయాలని 15వ ఆర్థిక సంఘం సూచిస్తే అలాంటి కమిటీని ఏర్పాటు చేయకుండానే ఎఫ్ఆర్బీఎం చట్టానికి సవరణలు తెచ్చే ప్రయత్నం కేంద్రం చేసింది. తాను తీసుకునే అప్పులను రికవరీలో పెట్టకుండా రాష్ట్రాలు తీసుకునే అప్పులను మాత్రం రికవరీలో పెట్టి పరిమితులు విధించడం, వాటిని గతంలో తీసుకున్న అప్పులకు కూడా వర్తింపజేయడం కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ నీతికి నిదర్శనం. నీతి ఏదైనా కేంద్రానికి, రాష్ట్రాలకు ఒకే విధంగా ఉండాలి. అలా కాకుండా కోతల విషయంలో రాష్ట్రాలకు, తీసుకునే విషయంలో కేంద్రానికి నిబంధనలు వర్తింపజేస్తున్నారు. రాష్ట్ర బడ్జెట్ ఆమోదం పొందిన తర్వాత ఎఫ్ఆర్బీఎం పేరుతో కోతలు పెట్టారు. అలాంటప్పుడు బడ్జెట్ అంచనాలే తలకిందులవుతాయి. రాష్ట్రాలతో చర్చించకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం తగదు..’ అని హరీశ్ పేర్కొన్నారు. ప్రతిపైసా మూలధన వ్యయం కిందే ఖర్చు చేస్తున్నాం ‘గతంలో దేశాన్ని పాలించిన ప్రభుత్వాలు ఆర్థిక సంఘం సిఫారసులను తు.చ. తప్పకుండా అమలు చేశాయి. కానీ దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 15వ ఆర్థిక సంఘం సిఫారసులను అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం కుట్రతో, కక్షతో తెలంగాణకు రావాల్సిన నిధులను నిలిపివేసింది. పన్నుల్లో రాష్ట్రాల వాటాను 32–42 శాతానికి పెంచినప్పుడు నిజమేనని నమ్మాం. కానీ వాస్తవంగా ఇస్తోంది 29.6 శాతమే. ఒకవేళ 42 శాతం చొప్పున ఇస్తే రూ.33,712 కోట్లు అదనంగా రావాల్సి ఉంది. పన్నుల్లో వాటా అయితే రాష్ట్రాలకు ఇవ్వాల్సి వస్తుందనే కారణంతో కేంద్రం సెస్సుల రూపంలో వసూలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం 2017–18లో రూ.81,282 కోట్లు, 2018–19లో రూ.1.58 లక్షల కోట్లు రెవెన్యూ వ్యయం కోసం బడ్జెట్ వెలుపలి అప్పులు చేసింది. దాన్ని కాగ్ కూడా తప్పు పట్టింది. తెలంగాణ మాత్రం ప్రతి పైసా మూలధన వ్యయం కిందే ఖర్చు చేస్తోంది. గ్యాస్ సిలిండర్లపై ఫొటోలు పెట్టుకోండి ఎఫ్ఆర్బీఎంని మించి రూ.6 లక్షల కోట్లు అప్పు చేసిన ఘనత కేంద్రానికే దక్కుతుంది. కేంద్ర ప్రభుత్వ అప్పు రూ.1,52,17,910 కోట్లు. దేశ జనాభాతో లెక్కిస్తే తలసరి అప్పు రూ.1,25,679 ఉంది. అదే రాష్ట్రం చేసిన రూ.3,29,980 కోట్లకు రాష్ట్ర జనాభాను లెక్కగడితే రూ.94,272 మాత్రమే. దేశ ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. ద్రవ్యోల్బణం అదుపు తప్పుతోంది. రూ.400 ఉన్న గ్యాస్ సిలిండర్ రూ.1,200 అయ్యింది. ప్రతి ఇంటికీ వెళ్లే గ్యాస్ సిలిండర్లపై మీ ఫోటోలు పెట్టుకోండి..’ అని హరీశ్ ఎద్దేవా చేశారు. ఆర్థిక అంశాల్లో తెలంగాణ చాంపియన్ ‘ఆర్థిక అంశాల్లో తెలంగాణ చాంపియన్‌గా నిలుస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. అప్పులతో పాటు రాష్ట్రంలో ఆదాయమూ పెరిగింది. 2015–16 నుంచి 2020–21 ఆర్థిక సంవత్సరాల్లో సొంత పన్నుల రాబడిలో తెలంగాణ సగటున 11.5 శాతం వృద్ధి రేటు నమోదు చేసి దేశంలోనే నంబర్ 1గా నిలిచింది. 2014లో దేశ జీడీపీలో తెలంగాణ వాటా 4 శాతం అయితే, ఇప్పుడు 4.9 శాతం. ఏ దేశమైనా, ఏ రాష్ట్రమయినా అప్పులు తీసుకోవాల్సిందే. తెలంగాణ స్థూల ఉత్పత్తిలో అప్పు కేవలం 23.5 శాతం మాత్రమే. గత ఎనిమిదేళ్లలో రాష్ట్రం నుంచి కేంద్రానికి రూ.3,65,797 కోట్లు చెల్లిస్తే, కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చింది రూ.1,96,448 కోట్లే. తెలంగాణనే కేంద్రానికి రూ.1,69,349 కోట్లు ఇచ్చింది. కేంద్రంతో పాటు దేశంలోని అనేక రాష్ట్రాలను తెలంగాణ సాదుతోంది. మేము సంపదను పెంచి పేదలకు పంచాం. కేంద్రం మాత్రం గద్దలకు పంచుతోంది. కార్పొరేట్ కంపెనీలకు వేల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేస్తోంది. నిధులిచ్చి ఉంటే రూ.లక్ష కోట్ల అప్పులు తగ్గేవి తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సిన నిధులను కేంద్రం ఇచ్చి ఉంటే రాష్ట్రం అప్పులు రూ.లక్ష కోట్లు తగ్గేవి. ఎఫ్ఆర్బీఎం పరిమితి తగ్గింపు వల్ల రూ.17,033 కోట్లు, విద్యుత్ సంస్కరణల పేరిట 5 శాతం కింద రూ.6,104 కోట్లు, 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు రూ.6,268 కోట్లు, 14వ ఆర్థిక సంఘం కింద రూ.817 కోట్లు, పన్నుల్లో 42 శాతం వాటా కింద రూ.33,712 కోట్లు, ఏపీ నుంచి విద్యుత్ బకాయిల కింద రూ.17,828 కోట్లు, 2014–15లో పొరపాటున ఏపీకి జమచేసిన రూ.495 కోట్లు, ప్రత్యేక సహాయ గ్రాంట్ల కింద రూ.1,350 కోట్లు, నీతి ఆయోగ్ సిఫారసు మేరకు మిషన్ భగీరథకు రూ.19,205 కోట్లు, కాకతీయకు రూ.5వేల కోట్లు రాష్ట్రానికి రావాల్సి ఉంది..’ అని మంత్రి తెలిపారు. బీజేపీ నేతలకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేంద్రంతో మాట్లాడి ఆ నిధులిప్పించాలని కోరారు. అలా చేస్తే దండేసి దండం పెడతామని, సభలోనే కృతజ్ఞతలు చెపుతామని అన్నారు. ఇదీ చదవండి: ఆనాటి తారకరాముడి డైలాగ్‌తో అదరగొట్టిన కేటీఆర్.. అసెంబ్లీలో చప్పట్ల మోత! -
20 లక్షల ఉద్యోగాలు ఊడతాయ్!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సంస్కరణల పేరుతో తీసుకొస్తున్న బిల్లును ఉపసంహరించుకోవాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మరోసారి శాసనసభ తీర్మానం చేసి పంపించాలని నిర్ణయించినట్లు చెప్పారు. సోమవారం అసెంబ్లీలో ‘కేంద్ర విద్యుత్ బిల్లు’పై మాట్లాడిన కేసీఆర్.. గతంలో భూ, రైతు చట్టాలను ఉపసంహరించుకున్న విధంగానే విద్యుత్ సంస్కరణల పేరుతో తీసుకొచ్చిన చట్టాలను కూడా ఉపసంహరించుకోవాలని సూచించారు. దేశంలో ఇప్పటికే ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్ సంస్థలను ప్రైవేటు పరం చేశారని, ఇప్పుడు దేశంలోని విద్యుత్ సంస్థలను కూడా ప్రైవేటు పరం చేయాలని కేంద్రం యోచిస్తోందని చెప్పారు. ఇదే జరిగితే దేశంలోని విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న 20 లక్షల మంది ఉద్యోగాలు పోతాయని అన్నారు. ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. తాను చెబుతున్న లెక్కలు తప్పయితే ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా రాజీనామా చేస్తానని ప్రకటించారు. దగాపై దేశం మేల్కొని పోరాడాలి.. ‘జవహర్లాల్ నెహ్రూ కాలం నాటి నుంచి దశాబ్దాలుగా విద్యుత్ సంస్థలు, డిస్కంలు, ట్రాన్స్‌కో,జెన్కోల ద్వారా సముపార్జించిన లక్షల కోట్ల ఆస్తులను ప్రైవేటు షావుకార్లకు కట్టబెట్టే కుట్ర జరుగుతోంది. సంస్కరణల పేరిట దేశానికి చేస్తున్న దగా ఇది. దీనిపై దేశం మేల్కొని పోరాడాలి. ఇవి ప్రజల ఆస్తులు... ఎక్కడిదాకైనా కొట్లాడతం..’అని ముఖ్యమంత్రి అన్నారు. ‘రైతుబంధు’నిజమైన ఉద్దీపన ‘ఉమ్మడి రాష్ట్రంలో 20 ఎకరాలున్న రైతులు కూడా నగరానికి వచ్చి కూలీ పనులు చేశారు. ఆటోలు నడిపారు. జగద్గిరిగుట్టకు వలస వచ్చారు. నిన్నా ఇవాళ రైతుల మొఖం తెల్లబడుతోంది. 66 లక్షల మందికి ఇచ్చే రైతుబంధు నిజమైన ఉద్దీపన. అందుకే ఏం చేసైనా సరే తెలంగాణలో ఉచిత విద్యుత్ బంద్ చేయాలని చూస్తున్నారు. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ ఈఆర్సీ రుణాలు రాకుండా అడ్డుపడుతున్నారు. కేంద్రం ఒత్తిడి మేరకు ‘ఉదయ్’పథకంలో చేరితే ఇబ్బందులు పెడుతున్నారు. ఎఫ్ఆర్ఎంబీలో కోతలు పెడతామని అంటున్నారు. విశ్వగురు విశ్వరూపం భయంకరం. శ్రీలంకలో భారత ప్రధానికి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు..’అని తెలిపారు. విద్యుత్ ఉద్యోగులు జూలు విదిలించాలి ‘కేంద్రం తీసుకొచ్చే విద్యుత్ బిల్లుల వల్ల రైతులు, పేద ప్రజలు తీవ్రంగా నష్టపోతారు. అందువల్ల విద్యుత్ బిల్లులను వెనక్కు తీసుకోవాలి. ఇది పోరాటాల గడ్డ.. పౌరుషాల గడ్డ.. ఇక్కడ మీ పిట్ట బెదిరింపులు పనిచేయవు. 20 లక్షల మంది విద్యుత్ ఉద్యోగులు జూలు విదిలించాలి. లక్షల కోట్ల విద్యుత్ ఆస్తులను కాపాడేందుకు ఉద్యమం చేయాలి. విద్యుత్ బిల్లు వెనక్కు తీసుకోకపోతే , బాయిల కాడ మీటర్లు పెడితే బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపుతాం..’అని సీఎం స్పష్టం చేశారు. తట్టుకోలేక కొత్త కుట్రలు.. ‘తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ నుంచి రావలసిన రూ.17,828 కోట్లు కేంద్రం ఇప్పించకుండా, తెలంగాణ బకాయి ఉన్న రూ.3 వేల కోట్లకు ఎక్కడా లేని విధంగా 18 శాతం వడ్డీ చొప్పున మరో రూ.3 వేల కోట్లు కలిపి నెలరోజుల్లో రూ.6 వేల కోట్లు చెల్లించాలని హుకుం జారీ చేసింది. నెలలో కట్టకపోతే చర్యలు తీసుకుంటారట. కేంద్రాన్ని రూపాయి అడగకుండా రైతాంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నది తెలంగాణ ఒక్కటే. దానిని కేంద్రం జీర్ణించుకోలేకపోతోంది. ఈ వానాకాలం సీజన్లోనే 65 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి. మొత్తం 1.30 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యే పరిస్థితి. దీన్ని తట్టుకోలేక కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. ఆనాడు సీలేరు ప్రాజెక్టును గుంజుకున్నారు. ఇప్పుడు కొత్త కుట్రలు చేస్తున్నారు..’అని కేసీఆర్ మండిపడ్డారు. ఇదీ చదవండి: ఇంకా 18 నెలలే.. మోదీ సర్కారును దేవుడు కూడా కాపాడలేడు! -
ఇంకా 18 నెలలే.. మోదీ సర్కారును దేవుడు కూడా కాపాడలేడు!
సాక్షి, హైదరాబాద్: ‘కేవలం 36 శాతం ఓట్లు తెచ్చు కునే.. కేంద్రంలో రాజ్యమేలుతున్న బీజేపీ ప్రభుత్వం విపరీతంగా విర్రవీగుతోంది. బీజేపీ ప్రభుత్వ తీరుతో భారత మాత గుండెమీద గాయం అవుతోంది. అధికారం నెత్తికెక్కితే కాలమే కఠినంగా శిక్షిస్తది. అధికారం శాశ్వతం కాదు, మోదీ ప్రభుత్వానికి ఇంకా 18 నెలల సమయమే మిగిలింది. దేవుడు కూడా దాన్ని కాపాడలేడు. బుద్ధుడు నడయాడిన, ప్రపంచానికి శాంతి సందేశాన్ని ఇచ్చిన మహాత్మాగాంధీ పుట్టిన దేశంలో ఇప్పుడేం జరుగుతోంది?’ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కేంద్ర ప్రభుత్వ విద్యుత్తు బిల్లు–పర్యవసానాలు’ అంశంపై సోమవారం ఉదయం శాసనసభలో జరిగిన లఘు చర్చకు ముఖ్యమంత్రి సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా మోదీ సర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఒక్క మంచి పనికూడా చేయలేని అసమర్థ ప్రభుత్వంగా అభివర్ణించారు. సంస్కరణలకు అందమైన ముసుగు ‘నాణ్యమైన కరెంటు ఇచ్చే అవకాశం ఉండి కూడా ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం, సంస్కరణలు అనే అందమైన ముసుగు వేసి షావుకార్లకు అడ్డంగా దోచిపెట్టే దోపిడీకి తెరదీసింది. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి అమ్మేసుకుంటూ, ఆర్టీసీ లాంటి సంస్థలను తీసేస్తే రూ.వేయి కోట్లు చొప్పున బహుమతి ఇస్తానని చెప్తున్న కేంద్రం.. వ్యవసాయ, విద్యుత్ రంగాలను కూడా షావుకార్ల చేతుల్లో పెట్టేవరకు నిద్రపోను అన్నట్టుగా వ్యవహరిస్తోంది. పంట ఉత్పత్తులను ధర ఎక్కువగా ఉండే ఏ ప్రాంతంలోనైనా అమ్ముకోవచ్చంటూ వ్యవసాయ చట్టాలను తెచ్చేందుకు ప్రయత్నించడంలోని లోగుట్టును గుర్తించలేమా? బాన్సువాడ రైతు పంటను పంజాబ్‌కు తీసుకెళ్లి అమ్ముకోగలడా? ఈ మహానుభావుల పుణ్యాన పెరిగిన డీజిల్ ధరలతో అది సాధ్యమా? ఎరువుల ధరలు, దున్నే ఖర్చులు, కోసే ఖర్చులు పెరిగి భరించలేక తట్టాపార కిందపెట్టాలి. అప్పుడు సూట్‌కేసులు పట్టుకుని షావుకార్లు దిగుతరు. మీ పొలాలను మాకు అప్పగించండి, మీరు మా దగ్గర కూలీలుగా పనిచేయండి అంటరు. ఇదే మోదీ ప్రభుత్వం అసలు లోగుట్టు. ఇలా షావుకార్లకు అప్పగించేందుకే ఈ సంస్కరణల భాగోతం’ అంటూ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్కరణలు అమల్లోకొస్తే ప్రీపెయిడ్ మీటర్లే.. ‘సమైక్య రాష్ట్రంలో సరైన కరెంటు దొరక్క అన్ని వర్గాలు ప్రజలు ఎన్ని అవస్థలు పడ్డారో అందరికీ తెలిసిందే. సొంత రాష్ట్రం వచ్చాక పరిస్థితిని చక్కదిద్దుకుందామంటే ఆది నుంచి కేంద్రం కుట్రలు చేస్తూనే ఉంది. మోదీ తొలి కేబినెట్ సమావేశంలోనే ఏడు మండలాలను, సీలేరు పవర్ ప్రాజెక్టును ఏపీకి అప్పగించారు. తాజాగా ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యుత్ రంగం విషయంలో, రాష్ట్రాల ప్రమేయం లేకుండా కేంద్రం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. చట్ట సవరణ బిల్లులో కూడా అదే జరిగింది. మోటార్లకు మీటర్లు పెట్టకుండా కరెంటు కనెక్షనే ఉండదన్న విషయాన్ని రాష్ట్రాల అభిప్రాయంతో ప్రమేయం లేకుండా పొందుపరిచింది. కేంద్ర విద్యుత్ సంస్కరణలు అమల్లోకి వస్తే ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు లేకుండా ఎలాంటి కరెంటు కనెక్షన్ అయినా ఇవ్వడానికి వీలు ఉండదు..‘ అని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇదీ మోదీ ఘనత.. ‘తెలంగాణ ఆవిర్భవించిన 2014 నాటికి తెలంగాణ తలసరి విద్యుత్తు వినియోగం 970 యూనిట్లు కాగా, జాతీయ తలసరి వినియోగం 957 యూనిట్లు. ఎనిమిదేళ్ల తర్వాత తెలంగాణ తలసరి వినియోగం 2,126 యూనిట్లకు చేరితే, జాతీయ వినియోగం కేవలం 1,255 యూనిట్లకు మాత్రమే చేరింది. ఇవి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ లెక్కలు. ఇక ఇంటర్నేషనల్ అథారిటీ లెక్కలు పరిశీలిస్తే, ఐస్‌ల్యాండ్ తలసరి వినియోగం 51,696 యూనిట్లు, యూఎస్ 12,154, జపాన్ 7,150, చైనా 6,312, భూటాన్ వినియోగం 3,126 యూనిట్లుగా ఉంది. 140 దేశాల జాబితాలో మన దేశం ర్యాంకు 104. ఇది విశ్వగురువు ఘనత..’ అని ఎద్దేవా చేశారు. చేష్టలుడిగిన సర్కార్.. ‘ఒక చిన్న సర్దుబాటుతో బిహార్ దుఖదాయినులుగా ముద్రపడ్డ కోసి, గండకి నదులపై విద్యుదుత్పత్తి ప్రారంభిస్తే ఇటు కరెంటు అందుబాటులోకి వస్తుంది. అటు వరదల బాధా తప్పుతుంది. అలాంటి సలహా ఇచ్చినా చేయలేని అసమర్ధ ప్రభుత్వం మోదీది. దేశంలో 24 గంటలు కరెంటు సరఫరా చేయగలిగే 2,42,890 మెగావాట్ల కరెంటు అందుబాటులో ఉన్నా సరిగా వినియోగించలేని దుస్థితి నెలకొంది. ఇది కాకుండా వనరుల ఆధారంగా ఉత్పత్తి అయ్యే వేరియబుల్ పవర్ మరో 1.60 లక్షల మెగావాట్ల మేర ఉంది. చివరకు చెత్తనుంచి కూడా విరివిగా కరెంటును ఉత్పత్తి చేయగలిగే అవకాశం ఉన్నా మోదీ ప్రభుత్వం చేష్టలుడిగిపోయింది’ అని కేసీఆర్ విమర్శించారు. ఇదీ చదవండి: సికింద్రాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. ఏడుగురు సజీవదహనం -
పాలకుల కర్తవ్యం ఇదేనా?
కాలానికీ, అవసరాలకూ తగ్గట్టుగా అన్నీ మారతాయి... మారాల్సిందే. అయితే, ఆ మార్పుల వెనుక ఉద్దేశాల పట్ల అనుమానాలు తలెత్తినప్పుడే అభ్యంతరాలు వస్తాయి. కేంద్రంలోని బీజేపీ సర్కారు దేశ రాజధానిలో చేపట్టిన ‘సెంట్రల్ విస్టా’ ఆధునికీకరణ ప్రాజెక్ట్ తొలి దశ గురువారం సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమైన తీరు, ‘రాజ్‌పథ్’కు ‘కర్తవ్యపథ్’గా పేరు మార్చడం చర్చకు తావిచ్చింది అందుకే! కేవలం 19 నెలల్లో ఇండియా గేట్ పరిసరాలు కళ్ళు చెదిరేలా మారిపోయాయి. కనువిందు చేస్తూ, గర్వకారణమనిపించే ఈ ఆధునిక మార్పులను ఆహ్వానించాల్సిందే. ఇండియాగేట్ సమీపాన బ్రిటీష్ కాలంలో కింగ్ అయిదో జార్జ్ విగ్రహమున్నచోట నేతాజీ ప్రతిమ పెట్టడమూ స్ఫూర్తిదాయ కమే. కానీ, భారీ విగ్రహాలు పెట్టి, రోడ్లకు పేర్లు మార్చి, దేశం సుభిక్షమని నమ్మింపజూస్తేనే చిక్కు. బానిసత్వాన్ని వదిలించుకోవాలని నోటితో చెబుతూ, తాము ప్రభువులమన్నట్టు ప్రవర్తిస్తేనే కష్టం. కాశీ విశ్వనాథ ఆలయ కారిడార్, కొత్త పార్లమెంట్‌పై 4 సింహాల చిహ్నం, ఐఎన్ఎస్ విక్రాంత్, సెంట్రల్ విస్టా... ఇలా ప్రతి కొత్త ప్రారంభోత్సవం ఇవాళ ఒక జాతీయవాద ప్రచార ఆర్భాటం. ప్రజల్లోకి చొచ్చుకుపోయేందుకు ఓ సరికొత్త రాజకీయ నేరేటివ్. గత నెలరోజుల్లోనే దేశవ్యాప్తంగా 30 ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనో, ప్రారంభమో చేశారు. అలా దీన్ని 2024 ఎన్నికలకు ముందస్తు సన్నాహంగా మార్చడం పాలకుల గడుసుతనం. ఈ క్రమంలో వలసవాద అవశేషాలను తొలగిస్తున్నామంటూ... సామాన్యులు సైతం స్వేచ్ఛగా తిరిగిన ఇండియాగేట్ ప్రాంతాన్ని ‘కర్తవ్య పథ్’గా వారికి దూరం చేయడమే విరోధాభాస. ఈ ఏడాది స్వాతంత్య్ర దిన ప్రసంగంలోనే ప్రధాని ఈ ‘కర్తవ్యపథ’ నిర్దేశం చేసేశారు. ప్రభుత్వం చేసిన వాగ్దానాల్ని నిలబెట్టుకోవాలన్న డిమాండ్లను పక్కన బెట్టి, పౌరుల కర్తవ్యాన్ని నొక్కిచెప్పారు. ప్రజలే ప్రభువులని గుర్తు చేస్తున్న రాజ్‌పథ్‌ను, ప్రజలకు వారి కర్తవ్యాన్ని గుర్తుచేసే కర్తవ్యపథ్గా మార్చారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం లాంటి సమస్యల పరిష్కారం పాలకుల కర్తవ్యం. అది వదిలేసి ‘నామ్‌కే వాస్తే’ మార్పులపై దృష్టిపెడితే ఎలా? కాన్వాయ్‌ల మొదలు అనేక అంశాల్లో నేటికీ వలస పాలన అవశేషాలనే అనుసరిస్తున్న మన పాలకులు ముందుగా వారు వదులుకోవాల్సినవి చాలా ఉన్నాయి. నిజానికి, రాష్ట్రపతి భవన్ నుంచి విజయ్ చౌక్, ఇండియా గేట్ మీదుగా పురానా ఖిల్లా దాకా సాగే మార్గం రాజ్‌పథ్. రైజీనా హిల్‌పై నుంచి పురానా ఖిల్లా దాకా ఆ మార్గాన్ని పరికిస్తున్నట్టుగా కట్టిన అప్పటి వైస్రాయ్ భవనమే నేటి రాష్ట్రపతి భవన్. ఆ మాటకొస్తే న్యూఢిల్లీ, అక్కడి భవనాలు, ఇండియా గేట్ లాంటి చారిత్రక కట్టడాలు బ్రిటీష్ హయాంలో నిర్మాణమైనవే. వాటన్నిటినీ బానిస చిహ్నాలుగా తృణీకరిస్తామా? చక్రవర్తి అయిదో జార్జ్ 1911లో భారత సందర్శనకు వచ్చినప్పుడు ‘ఢిల్లీ దర్బార్’ జరిగింది. కలకత్తా నుంచి ఢిల్లీకి దేశ రాజధానిని మార్చారు. ఆ జ్ఞాపకంగా బ్రిటీషర్లు ఈ మార్గానికి ‘కింగ్స్ వే’ అని పేరు పెట్టారు. దాని మీదుగా వెళ్ళే మరో రోడ్‌ను ‘క్వీన్స్ వే’ అన్నారు. స్వాతంత్య్రం వచ్చాక ‘కింగ్స్ వే’ను ‘రాజ్‌పథ్’ అనీ, ‘క్వీన్స్ వే’ను ‘జన్‌పథ్’ అనీ నాటి కాంగ్రెస్ ప్రభుత్వం మార్చింది. నిజానికి, ఆ కొత్త పేర్లేమీ పాతవాటికి అనువాదాలు కావు. ‘రాజ్ పథ్’ అంటే రాజుల మార్గమని కాదు... ‘రాజ్య (ప్రభుత్వ) పథ’మనే అర్థం. ఆ రకంగా అప్పుడే ఆ వలస పాలకుల నామకరణా లను ప్రజాస్వామ్య చిహ్నాలుగా మార్చారు. ఆ పేర్లలో జన్‌సంఘ్ సహా ఎవరికీ కనిపించని వలస వాదం, బానిసత్వం తీరా ఇప్పుడు దర్శనమివ్వడమే విడ్డూరం. పేరులో ఏముంది పెన్నిధి అంటారు కానీ, ప్రతి పేరూ భావోద్వేగాలు రేకెత్తించగలదని ఎనిమిదిన్నరేళ్ళుగా దేశాన్ని ఏలుతున్న బీజేపీకి తెలుసు. అధికారంలోకి వచ్చిన ఏడాదికే 2015లోనే వీధులు, నగరాలు, అవార్డుల పేర్లు మార్చే పనిలో పడింది. ఢిల్లీలోని ఔరంగజేబ్ రోడ్‌ను అబ్దుల్ కలామ్ రోడ్‌గా మార్చడంతో మొదలుపెట్టి, ప్రధాని నివాసం ఉండే రేస్‌కోర్స్ రోడ్‌ను లోక్‌కల్యాణ్ మార్గ్‌గా, నెహ్రూ స్మారక మ్యూజియమ్ – లైబ్రరీ ఉన్న ఒకప్పటి నెహ్రూ నివాసం తీన్‌మూర్తి భవన్‌ను ‘ప్రధానమంత్రి సంగ్రహాలయ’గా మార్చేసింది. అక్బర్ రోడ్, హుమాయూన్ రోడ్ పేర్లు తదుపరి అజెండాలో ఉన్నాయట. ఈ దేశపు సమ్మిశ్రిత సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలిచిన పేర్లను తొలగించి, హిందూ పునరుద్ధరణవాద నామకరణాల వల్ల సమాజంలో సామరస్యం కొరవడితే అది పూడ్చలేని నష్టం. ఒక వర్గం కన్నా అధికులమనే భావన మరో వర్గంలో కలిగితే, అది సమాజాన్ని నిలువునా చీలు స్తుంది. 2019 ఎన్నికలకు ముందు ఒక్క యూపీలోనే అలహాబాద్‌ను ప్రయాగరాజ్‌గా, ఫైజాబాద్ జిల్లాను అయోధ్య జిల్లాగా, మొఘల్ సరాయ్ రైల్వే జంక్షన్‌ను జన్‌సంఘ్ సిద్ధాంతవేత్త పేరిట దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్‌గా ఏ వలసవాద పాలన అవశేషాలున్నాయని మార్చారు? ఇది దేశ బహుళత్వ గుర్తింపును నిరాకరించడమే. చరిత్రలో మొఘల్ చక్రవర్తుల భాగాన్ని కనుమరుగు చేసే ప్రయత్నమే. రాజీవ్ ఖేల్‌రత్న అవార్డ్ పేరు ధ్యాన్‌చంద్ అవార్డుగా మారడం వెనుకా హాకీ దిగ్గజంపై గౌరవం కన్నా రాజకీయంగా తేల్చుకోదలచిన లెక్కలే ఎక్కువ. హైదరాబాద్ పేరును ‘భాగ్య నగర్’గా మారుస్తామని ఇటీవల బీజేపీ నేతలు ప్రకటించారు. ఏ చారిత్రక ఆధారాలతో ఆ మాట అన్నారో చెప్పలేం. ఇక, ఢిల్లీని ‘ఇంద్రప్రస్థం’గా మారుస్తారనీ ఓ ప్రచారం. వెరసి, ఈ పేర్ల మార్పు ధోరణితో ఎక్కడికెళతాం? వలస పాలకులు పోయారు కానీ, గద్దెపై పెద్దలు ప్రాధాన్యాలు మర్చిపో తేనే ఇబ్బంది. పాలకులు కర్తవ్యం విడిచి, దోవ తప్పితే ప్రజాస్వామ్యంలో ప్రజలకు కిం కర్తవ్యం? -
మరో 1.58 కోట్ల మందికి ఆహార భద్రత!
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో గ్రామీణ, పట్టణ పేదల కడుపు నింపుతున్న జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోకి మరికొంత మందిని చేర్చే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దేశవ్యాప్తంగా సుమారు కోటిన్నర మందిని కొత్తగా ఈ చట్టం పరిధిలోకి తీసుకురావాలని యోచిస్తోంది. ఇందుకు కసరత్తు ప్రారంభించింది. దరఖాస్తుల ప్రక్రియ ఆగస్టు ఆఖరు నుంచి మొదలయ్యే అవకాశాలున్నాయని ఆహార శాఖ వర్గాలు చెబుతున్నాయి. లబ్ధిదారుల్లో కొత్త ఆశలు ప్రస్తుతం జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలో 81.35 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇందులో అంత్యోదయ అన్న యోజన కింద 10 కోట్ల మందికి ప్రతినెలా 35 కిలోల ఉచిత బియ్యం సరఫరా చేస్తున్నారు. మరో 71 కోట్ల మందికి రేషన్ కార్డుపై కిలో రూ.3 చొప్పున 5 కిలోల బియ్యం, రూ.2కి గోధుమలు వంటి నిత్యావసరాలను అందజేస్తున్నారు. ఆహార పంపిణీ కోసం రాయితీ రూపంలో కేంద్రం రూ.4.22 లక్షల కోట్ల ఆర్థిక భారం మోస్తోంది. ఆహార భద్రతా చట్టం పరిధిలో గ్రామీణ ప్రాంతాల్లోని 75 శాతం, పట్టణ ప్రాంతాల్లో 50 శాతం జనాభాను చేర్చారు. చాలా ఏళ్లుగా కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ చేపట్టలేదు. పైగా 2013 నుంచి 2021 వరకూ ఆధార్ సంఖ్యలతో రేషన్ కార్డులను సీడింగ్ చేయడం ద్వారా అనర్హులను తొలగించారు. వలస వెళ్లిన కుటుంబాలు, ఒకే కుటుంబంలో రెండు, అంతకంటే ఎక్కువ కార్డులు కలిగి ఉన్న వారి వివరాలు, ఒకే కుటుంబంలో తెలుపు, గులాబీ కార్డులు కలిగి ఉన్న వారి వివరాలు, నివాసంలో లేకుండా రేషన్ కార్డులున్న వారి వివరాలు, చనిపోయిన వారి వివరాలను సేకరించి దేశవ్యాప్తంగా 4.70 కోట్ల కార్డులను ఏరివేశారు. వారి స్థానంలో ప్రస్తుతం అర్హులైన 1.58 కోట్ల మందిని తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రాలపైనే ఎంపిక బాధ్యత కొత్త లబ్ధిదారుల ఎంపిక బాధ్యత రాష్ట్రాలపైనే ఉంటుందని, ఇందులో తమ పాత్ర ఉండదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. కొత్త రేషన్‌కార్డుల జారీకి ఆన్లైన్ ఫ్లాట్‌ఫామ్ ద్వారా ఉమ్మడి రిజిస్ట్రేషన్ సదుపాయాన్ని ప్రారంభించనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. దేశంలో ఆహార ఉత్పత్తి గణనీయంగా పెరినప్పటికీ పెద్ద సంఖ్యలో పిల్లలు, మహిళలు ఇప్పటికీ పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం.. దేశంలో 38.4 శాతం మంది పిల్లలు ఉండాల్సిన దానికంటే తక్కువ ఎత్తు ఉన్నారు. 21 శాతం మంతి తక్కువ బరువుతో ఉన్నారు. మహిళల్లో ఏకంగా 55 శాత మంది రక్తహీనత సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సవాళ్లకు ఆహార భద్రతా చట్టంతో చెక్ పెట్టొచ్చని కేంద్రం చెబుతోంది. -
Fact Check: ఆ జీఎస్టీ వార్తలు తప్పు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ: నివాస అద్దెలపై ఎటువంటి జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. జీఎస్టీ కింద నమోదైతే నివాస గృహాల అద్దెలపైనా కిరాయిదారు 18 శాతం జీఎస్టీ చెల్లించాలంటూ వచ్చిన వార్తలు తప్పుదోవ పట్టించేవిగా పేర్కొంది. నివాస యూనిట్లను (ఇళ్లు, ఫ్లాట్లు) కార్యాలయం, వ్యాపార వినియోగానికి అద్దెకు ఇచ్చినప్పుడే జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. ‘‘ఒక వ్యక్తి నివాసం కోసం ఇల్లు అద్దెకు తీసుకుంటే దానిపై జీఎస్టీ లేదు. ఒక వ్యాపార సంస్థ యజమాని లేదా భాగస్వామి తన వ్యక్తిగత నివాసానికి అద్దెకు తీసుకున్నా జీఎస్టీ ఉండదు’’అని కేంద్ర సర్కారు ఓ ట్వీట్ ద్వారా స్పష్టం చేసింది. ప్రభుత్వం ఇచ్చిన స్పష్టత జీఎస్టీ రిజిస్టర్డ్ వ్యాపారస్తులకు ఊరటనిస్తుందని కేపీఎంజీ ఇండియా పార్ట్నర్ అభిషేక్ జైన్ పేర్కొన్నారు. వారు తమ నివాస గృహాల అద్దెపై జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం ఉండదన్నారు. Claim: 18% GST on house rent for tenants #PibFactCheck ▶️Renting of residential unit taxable only when it is rented to business entity ▶️No GST when it is rented to private person for personal use ▶️No GST even if proprietor or partner of firm rents residence for personal use pic.twitter.com/3ncVSjkKxP — PIB Fact Check (@PIBFactCheck) August 12, 2022 -
పన్ను చెల్లింపుదారులకు షాక్, 'ఏపీవై' పథకంలో చేరకుండా కేంద్రం నిషేధం!
న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులు అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) పథకంలో చేరకుండా కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ‘‘అక్టోబర్ 1 నుంచి పన్ను చెల్లింపుదారులు ఎవరైనా ఏపీవైలో చేరేందుకు అనర్హులు’’అంటూ కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అక్టోబర్ 1లోపు చేరిన వారికి నూతన నిబంధన వర్తించదని స్పష్టం చేసింది. ఈ అటల్ పెన్షన్ యోజన పథకం కింద పెన్షన్ ప్రయోజనాలను ప్రధానంగా లక్ష్యిత వర్గాలకు అందించాలన్న ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. అక్టోబర్ 1, ఆ తర్వాత నుంచి ఏపీవైలో చేరిన సభ్యుల్లో ఎవరైనా పన్ను చెల్లింపుదారునిగా బయటపడితే వారి ఏపీవై ఖాతాను మూసేసి, అందులో జమ అయిన మొత్తాన్ని తిరిగి చెల్లించనున్నట్టు ఆర్థిక శాఖ నోటిఫికేషన్ స్పష్టం చేసింది. అసంఘటిత రంగంలో పనిచేసే వారికి.. వృద్ధాప్యంలో ఎటువంటి సామాజిక భద్రతా సదుపాయం లేదు. చదవండి👉 ఇన్కమ్ టాక్స్ నుంచి 143 (1) నోటీసు వచ్చిందా?..అప్పుడేం చేయాలి ? దీంతో అటువంటి వారిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర సర్కారు 2015 జూన్ 1 నుంచి ఏపీవై పథకాన్ని తీసుకొచ్చింది. రూ.1,000–5,000 మధ్య ఎంత పెన్షన్ కావాలో ఎంపిక చేసుకుని, ఆ మేరకు నెలవారీ లేదా త్రైమాసికం లేదా, వార్షికంగా చందా చెల్లించాల్సి ఉంటుంది. 60 ఏళ్ల తర్వాత నుంచి పెన్షన్ అందుకోవచ్చు. 18 ఏళ్ల నుంచి 39 ఏళ్లు పూర్తయ్యే వరకు ఈ పథకంలో చేరేందుకు అర్హత ఉంది. -
ఉచితాలకు అడ్డుకట్ట వేద్దాం.. కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
న్యూఢిల్లీ: ఎన్నికల సమయంలో ఓటర్లను ఆకర్షించేందుకు పార్టీలు చేసే ఉచిత వాగ్దానాలు తీవ్రమైన అంశమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ‘‘వీటిని వ్యతిరేకించడానికి, పార్లమెంటులో చర్చించడానికి ఏ పార్టీ కూడా ఇష్టపడదు. ఇవి కొనసాగాలనే కోరుకుంటుంది. కాబట్టి ఈ పోకడకు అడ్డుకట్ట వేయడానికి ఏం చేయాలో కేంద్ర ప్రభుత్వంతో పాటు నీతి ఆయోగ్, ఫైనాన్స్ కమిషన్, ఆర్బీఐ వంటి సంస్థలు మేధోమథనం చేసి నిర్మాణాత్మక సూచనలివ్వాలి. విపక్షాలను కూడా ఈ ప్రక్రియలో భాగస్వాములను చేయాలి’’ అని సూచించింది. ఉచిత పథకాలను ప్రకటించే పార్టీల గుర్తింపును, వాటి ఎన్నికల గుర్తును రద్దు చేసేందుకు ఎన్నికల సంఘానికి అధికారాలు కల్పించాలంటూ అశ్వినీ ఉపాధ్యాయ్ అనే న్యాయవాది దాఖలు చేసిన పిల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, న్యాయమూర్తులు జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మానసం బుధవారం విచారణ జరిపింది. ఈ విషయంలో ఏమీ చేయలేమని మాత్రం కేంద్రం, ఎన్నికల సంఘం చెప్పొద్దని, కూలంకషంగా పరిశీలించి సలహాలివ్వాలని స్పష్టం చేసింది. పిల్లో లేవనెత్తిన అంశాలకు కేంద్రం కూడా మద్దతిస్తోందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పారు. ‘‘ప్రజాకర్షక పథకాలతో ఇష్టారీతిన ఉచితాల పంపకం మున్ముందు ఆర్థిక వినాశనానికి దారి తీస్తుంది. ఉచితాల ద్వారా తన కుడి జేబులోకి కొంత వస్తున్నా తర్వాత్తర్వాత ఎడమ జేబుకు ఎంత కోత పడుతుందో సగటు పౌరుడు ఎప్పటికీ అర్థం చేసుకోలేడు. కనుక ఓటర్లు తమ ఓటు హక్కును తెలివిడితో ఉపయోగించుకునే వీల్లేకుండా పోతుంది’’ అంటూ ఆందోళన వెలిబుచ్చారు. ఈ అంశం ఈసీ పరిధిలోనిదని ఇప్పటిదాకా కేంద్రం చెబుతూ వచ్చిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ అంశమై కేంద్రానికి సలహాలిచ్చేందుకు ఓ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశాలిస్తామని ధర్మాసనం సంకేతాలిచ్చింది. దీనిపై గురువారం కూడా విచారణ కొనసాగనుంది. -
ఫార్మా ఎంఎస్ఎంఈలకు కొత్త పథకాలు
న్యూఢిల్లీ: ఫార్మాస్యూటికల్ పరిశ్రమలో సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి (ఎంఎస్ఎంఈ) కంపెనీలను బలోపేతం చేసే లక్ష్యంతో కేంద్ర సర్కారు మూడు కొత్త పథకాలను గురువారం ప్రారంభించింది. ఈ వివరాలను కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రి మన్సుఖ్ మాండవీయ మీడియాకు తెలిపారు. టెక్నాలజీ నవీకరణ, ఫార్మా ఎంఎస్ఎంఈ క్లస్టర్ల వద్ద ఉమ్మడి పరిశోధన కేంద్రాలు, వ్యర్థాల శుద్ధి కర్మాగాలను ఈ పథకాల కింద ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పారు. చిన్న కంపెనీలు అయినా కానీ, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తమ కేంద్రాలను అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. ‘‘ఈ పథకాల నుంచి ఫార్మా రంగం ఎంతో ప్రయోజనం పొందుతుంది. దీర్ఘకాలంలో భారత ఫార్మా పరిశ్రమ మరింత బలోపేతంగా, భవిష్యత్తుకు సన్నద్ధంగా, స్వావలంబన సాధిస్తుంది’’అని మాండవీయ అన్నారు. ఫార్మా ఎంఎస్ఎంఈ యూనిట్లు టెక్నాలజీ నవీకరణకు వడ్డీ సబ్సిడీతో కూడిన రుణాలను పొందొచ్చు. ఉమ్మడి పరిశోధన, టెస్టింగ్ కేంద్రాల ఏర్పాటుకు రూ.20 కోట్ల వరకు లభిస్తుంది. సిడ్బీ ఈ పథకాల అమలుకు కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తుంది. రూ.10 కోట్ల వరకు తీసుకునే రుణాలకు 10 శాతం క్యాపిటల్ సబ్సిడీ కూడా లభిస్తుంది. మూడేళ్ల కాల వ్యవధికి తీసుకోవచ్చు. ఫార్మా క్లస్టర్లలో సదుపాయాల అభివృద్ధికి చేపట్టే ప్రాజెక్టు వ్యయంలో 70 శాతాన్ని (రూ.20 కోట్ల వరకు) కేంద్రం సమకూరుస్తుంది. -
9.79 లక్షల ఖాళీలు: కేంద్రం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో 2021 మార్చి 1వ తేదీ నాటికి 9.79 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్ వెల్లడించారు. ఈ మేరకు బుధవారం లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ప్రభుత్వం మంజూరు చేసిన పోస్టుల సంఖ్య 40.35 లక్షలు అని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో 2021 మార్చి 1 నాటికి 30,55,876 మంది ఉద్యోగులు ఉన్నారని పేర్కొన్నారు. ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ బాధ్యత సంబంధిత శాఖ, డిపార్టుమెంట్దేనని తేల్చిచెప్పారు. ఖాళీ పోస్టుల భర్తీ అనేది నిరంతర ప్రక్రియ అని తెలిపారు. నిర్ణీత గడువులోగా ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. -
Azadi Ka Amrit Mahotsav: హర్ ఘర్ తిరంగా..మన ఇంటిపై మూడు రంగుల జెండా
గొప్ప సందర్భం దగ్గర పడింది. దేశమంతా పండగ కళ రానుంది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరుతో ఊరూ వాడా వేడుకలు జరగనున్నాయి. అయితే ఈసారి ‘ఇంటిని’ కూడా భాగస్వామ్యం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ‘హర్ ఘర్ తిరంగా’ పేరుతో మూడు రోజుల పాటు 20 కోట్ల ఇళ్ల మీద జాతీయ పతాకాన్ని ఎగరేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ సందర్భంగా కుటుంబంలో ఎలాంటి వాతావరణం ఉండాలి? ఉత్సవ సందర్భంగా ఏం చేస్తే బాగుంటుంది? పిల్లల చేత ఏం చేయిస్తే బాగుంటుంది. కొన్ని ఆలోచనలు. ఒక మహా దృశ్యాన్ని ఊహించండి. డ్రోన్ షాట్. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు డ్రోన్ కెమెరా ఎగురుతూ వుంటే ప్రతి ఇంటి మీదా రెపరెపలాడుతున్న త్రివర్ణ పతాకం. భారత ప్రజల సగర్వ స్ఫూర్తి. ఉప్పొంగే గుండెల దీప్తి. ఎలా ఉంటుంది? అద్భుతం కదూ. ఇప్పుడు ఆ ఊహ నిజం కాబోతోంది. 75వ స్వాతంత్య్ర దినోత్సవం ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా ఆగస్టు 13 నుంచి 15 వరకు మూడు రోజుల పాటు దేశంలోని 20 కోట్ల ఇళ్ల మీద త్రివర్ణ పతాకం ఎగరాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు తగిన ప్రచారం కోసం, ప్రోత్సాహం కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు హోం శాఖ సూచనలు చేసింది. మీడియా, స్వచ్ఛంద సంస్థలు ఈ విషయమై ప్రచారం చేయాలని తెలిపింది. పిల్లలు, యువత, వయోజనులు అందరూ కలిసి ఈ తేదీలకు ముందు బృందాలుగా ఏర్పడి త్రివర్ణ పతాకాలు చేబూని పల్లెల్లో తిరుగుతూ ‘ప్రభాత్ ఫేరి’ చేస్తే ప్రజలు స్పందిస్తారని చెప్పింది. గాంధీజీ 1930లలో దేశభక్తి ప్రేరేపించడానికి తెల్లవారుజామున దేశభక్తి గీతాలు ఆలపిస్తూ ‘ప్రభాత్ ఫేరి’ (ప్రభాత భ్రమణం) నిర్వహించేవారు. ఇప్పుడు ఇంటింటా త్రివర్ణ పతాకం ఎగరాలంటే ఇలాంటి ప్రభాత భ్రమణాలు అవసరమని కేంద్రం తెలిపింది. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ త్రివర్ణ పతాకాలతో సెల్ఫీలు పెట్టమని చెప్పింది. మొత్తంగా ఇంటింటా జాతీయ జెండా రెపరెపలాడాలని కోరింది. మూడు రోజుల పాటు 20 కోట్ల ఇళ్ల మీద జెండాలు ఎగరడానికి మూడు సైజులలో తయారీకి, అందుబాటుకు ఏర్పాట్లు చేసింది. ఇవి ఆన్లైన్లో, పోస్ట్ ఆఫీసుల్లో అందుబాటులోకి వస్తాయి. ప్రతి ఇంటి పండగ అవును. ఇది ప్రతి ఇంటి పండగ. ఒక అపూర్వఘట్టంలో మన ఇంటి మీద జెండా ఎగరనున్న పండగ. పెద్దలకి, పిల్లలకు, స్త్రీలకు, పురుషులకు ఇంతకు మించిన జ్ఞాపకం ఏమైనా ఉంటుందా? ఒక త్రివర్ణ పతాకంతో మించిన ఫ్యామిలీ ఫొటో ఉంటుందా? అయితే ఈ ఘట్టంలో మనం ఏ మాత్రం యోగ్యతతో ఉన్నామో చెక్ చేసుకోవాలి. కొన్ని తప్పక చేయాలి. కొన్ని చేయమని ఇతరులకు చెప్పాలి. మన ఇంట్లో దేశ స్వాతంత్య్రానికి సంబంధించిన ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? చెక్ చేసుకోవాలి. ఈ సందర్భంగా ప్రతి ఇంట్లో గాంధీజీ ఆత్మ కథ ‘సత్యశోధన’ కనీసం ఉండాలి. నెహ్రూ రచనలు, భగత్ సింగ్ జీవిత కథ తెలుగు యోధులు అల్లూరి, ప్రకాశం పంతులు వంటి వారి పరిచయ పుస్తకాలు ఉండాలి. నలుగురిలో కలిసి ‘జనగణమన’ పాడటం కాదు. ఒక్కళ్లమే తప్పుల్లేకుండా ఉచ్చారణ దోషం లేకుండా జాతీయ గీతం పాడటం ప్రాక్టీసు చేయాలి. ‘వందేమాతరం’ కంఠతా పట్టాలి. ‘రఘుపతి రాఘవ రాజారామ్’, ‘సారే జహాసే అచ్ఛా’ వంటి గీతాలు పిల్లల చేత కంఠతా పట్టించాలి. ఉంటున్న వీధుల్లో, అపార్ట్మెంట్లలో ఆగస్టు పదిహేను లోపు వీలున్న సమయాల్లో, శని, ఆదివారాల్లో పిల్లల చేత ఇవన్నీ ప్రాక్టీసు చేయించాలి. వారికి క్విజ్లు పెట్టాలి. ఈ మూడు రోజులు దేశ నాయకుల పోస్టర్లు ఇంట్లో అలంకరించాలి. గాంధీ, నెహ్రూ, అంబేద్కర్, సుభాస్ చంద్రబోస్, సర్దార్ పటేల్, భగత్ సింగ్, అబుల్ కలామ్ ఆజాద్... వంటి నేతల్లో ఎవరో ఒకరన్నా మన డ్రాయింగ్ రూమ్‌లో కొలువుదీరాలి. కమ్యూనిటీ ఉత్సవాలు జరుపుకోవాలి. అంటే వీధుల్లో, వాడల్లో, అపార్ట్మెంట్లలో ఆ మూడు రోజులు దేశభక్తి సినిమాలు ప్రదర్శించవచ్చు. నాటకాలు, ఫ్యాన్సీ డ్రెస్‌లు, ఏకపాత్రాభినయాలు... ఇవన్నీ పెద్దలు, పిల్లలు కలిసి చేయవచ్చు. ఫోన్ పలకరింపుల్లో ‘హలో’ బదులు ‘వందేమాతరం’, ‘బై’ బదులు ‘జైహింద్’ వాడితే ఆ అనుభూతే వేరు. ఈ స్వాతంత్య్రం ఎందరో తెలిసిన తెలియని దేశభక్తుల త్యాగఫలం. వేలాది మంది తమ ఇళ్లను, కుటుంబాలను వదిలి దేశం కోసం ప్రాణాలు అర్పించారు. వారి త్యాగం వల్లే మనం ఇవాళ మన ఇంటిలో హాయిగా ఉన్నాం. కనుక వారందరి స్మృతిలో అన్నదానం, అనాథలకు సహాయం, అవసరంలో ఉన్నవారికి చేదోడు పనులు చేయడం కనీస కృతజ్ఞత. ఇంటింటా త్రివర్ణపతాకం కోసం ఇప్పటి నుంచే సిద్ధం అవుదాం. సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేద్దాం. మూడు రోజుల పాటు దేశపటాన్ని కాషాయ, ధవళ, ఆకుపచ్చ వర్ణాలతో మిలమిలమెరిపిద్దాం.