మహిళా రిజర్వేషన్ బిల్లు అనేది కేవలం చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం కాదు. ఇది మహిళల పట్ల పక్షపాతం, అన్యాయాన్ని తొలగించడానికి ఉద్దేశించినది. మహిళలకు ప్రత్యేకంగా వందనాలు అవసరం లేదు. అందరితోపాటు సమాన గౌరవాన్ని పొందాలని మహిళలు కోరుకుంటున్నారు. మహిళా కోటాను అమలు చేయడంలో జాప్యం తగదు. జనగణన, నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే మహిళా రిజర్వేషన్లు అమలవుతాయనడం సరైంది కాదు. ఇంకా ఎంత కాలం నిరీక్షించాలి? రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం సాధ్యమే
– కనిమొళి, డీఎంకే ఎంపీ
ఓబీసీ కోటా సంగతేంటి?
చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లలో ఓబీసీలకు ప్రత్యేక కోటా కల్పించాలి. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లను అమలు చేయకపోతే పార్లమెంట్‌ను ప్రత్యేకంగా సమావేశపర్చి బిల్లును ప్రవేశపెట్టాల్సిన అవసరం ఎముంది? ఇది పోస్టు–డేటెడ్ చెక్కులాగా ఉంది. ఎస్సీ, ఎస్టీలతోపాటు ఓబీసీ మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి ఈ సమావేశాల్లో రాజ్యాంగ సవరణ చేయాలి. మహిళా రిజర్వేషన్లను ఎప్పటి నుంచి అమలు చేస్తారో కచి్చతమైన తేదీ, టైమ్‌లైన్‌ను ప్రభుత్వం ప్రకటించాలి. దేశంలో ప్రస్తుతం కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ప్రత్యేక సమావేశాల్లో కరువు నివారణ చర్యలపై చర్చించాలి
– సుప్రియా సూలే, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ
బడుగు వర్గాల మహిళలకు భాగస్వామ్యం కావాలి
మహిళా రిజర్వేషన్లలో వెనుకబడిన తరగతులు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు భాగస్వామ్యం కల్పించాల్సిందే. ఈ మేరకు అవసరమైతే చట్టంలో సవరణలు చేయాలి. బడుగు వర్గాల మహిళలకు న్యాయం చేకూర్చాలి.
– డింపుల్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ
మహిళలను తప్పుదోవ పట్టిస్తున్నారు
మహిళా రిజర్వేషన్ బిల్లుతో కేంద్ర ప్రభుత్వం దేశంలో మహిళలను తప్పుదోవ పట్టిస్తోంది. ఈ రిజర్వేషన్లను రాబోయే ఎన్నికల్లో అమలు చేయకుండా జాప్యం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాం. అధికార బీజేపీ నాయకులు మహిళలపై ఎన్నో నేరాలకు పాల్పడ్డారు. వారిపై ఎలాంటి చర్యలకు తీసుకోలేదు. దేశంలో గత ఐదేళ్లలో మహిళలపై నేరాలు 26 శాతం పెరిగినప్పటికీ మోదీ ప్రభుత్వం స్పందించడం లేదు
– హర్‌సిమ్రత్ కౌర్ బాదల్, శిరోమణి అకాలీదళ్ ఎంపీ
మహిళా సాధికారతను అడ్డుకోవద్దు
మహిళా రిజర్వేషన్లలో మైనారీ్టలకు కోటా కల్పించాలనడం అర్థరహితం. మతపరమైన రిజర్వేషన్లపై రాజ్యాంగం నిషేధం విధించింది. చట్ట ప్రకారం.. జనగణన, నియోజకవర్గాల పునర్విభజన పూర్తయిన తర్వాతే మహిళా రిజర్వేషన్లను అమలు చేయాల్సి ఉంటుంది. వెంటనే అమలు చేయాలని కోరడం సమంజసం కాదు. ఎవరైనా సరే రాజ్యాంగబద్ధమైన ప్రక్రియను అనుసరించాల్సిందే. మహిళా సాధికారతను అడ్డుకోవద్దని ప్రతిపక్షాలను కోరుతున్నా
– స్మతి ఇరానీ, కేంద్ర మంత్రి, బీజేపీ నేత
40 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి
పశ్చిమ బెంగాల్‌లో లోక్‌సభ ఎన్నికల్లో మా పార్టీ మహిళలకు 40 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం సైతం దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల్లో మహిళలకు 40 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. కేవలం 33 శాతం కాదు, కేంద్ర ప్రభుత్వానికి నిజంగా ధైర్యం ఉంటే 40 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి. ఈ విషయంలో మీకు చేతనైతే మమ్మలి్న(తణమూల్ కాంగ్రెస్)ను పట్టుకోండి చూద్దాం
– కకోలీ ఘోష్–దస్తీదార్, తణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ
పేరును ‘రీషెడ్యూలింగ్ బిల్లు’ అని పెడితే పోలా?
ఈ బిల్లు ఒట్టి మాయ. షెడ్యూల్ ప్రకారం ఫలానా తేదీకల్లా అమల్లోకి వస్తుందని చెప్పలేము. అలాంటప్పుడు ఈ బిల్లుకు మహిళా రిజర్వేషన్ రీషెడ్యూలింగ్ బిల్లుగా మారిస్తే సరిపోతుంది’ అని తణమూల్ కాంగ్రెస్ మహిళా నేత మహువా మొయిత్రా సభలో ఎద్దేవా చేశారు. ఇదంతా పెద్ద గిమ్మిక్కు.
– టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా
Comments
Please login to add a commentAdd a comment