Womens quota
-
Womens Reservation Bill 2023: తక్షణమే అమలు చేయండి
న్యూఢిల్లీ: లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్లు కలి్పస్తూ మోదీ సర్కారు పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లుకు కాంగ్రెస్ పూర్తిగా మద్దతిస్తుందని ఆ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ ప్రకటించారు. అయితే జన గణన, డీ లిమిటేషన్ వంటివాటితో నిమిత్తం లేకుండా బిల్లును తక్షణం అమల్లోకి తేవాలని డిమాండ్ చేశారు. అలాగే మూడో వంతు రిజర్వేషన్లను ఎస్సీ, ఎస్టీలతో పాటు ఓబీసీ మహిళలకు కూడా వర్తింపజేయాలన్నారు. బుధవారం లోక్‌సభలో మహిళా బిల్లుపై చర్చను విపక్షాల తరఫున ఆమె ప్రారంభించారు. రిజర్వేషన్ల అమలులో ఏ మాత్రం ఆలస్యం చేసినా అది భారత మహిళల పట్ల దారుణ అన్యాయమే అవుతుందని అన్నారు. ‘కుల గణన జరిపి తీరాల్సిందే. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రధాన డిమాండ్. ఇందుకోసం తక్షణం కేంద్రం చర్యలు చేపట్టాలి‘ అని పునరుద్ఘాటించారు. రాజకీయాలతో పాటు వ్యక్తిగతాన్నీ, భావోద్వేగాలను కూడా రంగరిస్తూ సాగిన ప్రసంగంలో సోనియా ఏమన్నారంటే... ‘దేశాభివృద్ధిలో మహిళల పాత్రను సముచితంగా గుర్తుంచుకునేందుకు, కృతజ్ఞతలు తెలిపేందుకు ఇది సరైన సమయం. అందుకే, నారీ శక్తి విధాన్ అధినియమ్‌కు కాంగ్రెస్ పార్టీ పరిపూర్ణంగా మద్దతిస్తుంది. దాన్ని వీలైనంత త్వరగా అమలు చేయాలి. ఆ దారిలో ఉన్న అడ్డంకులను తలగించాలి‘. వంటింటి నుంచి అంతరిక్షం దాకా... ‘మసిబారిన వంటిళ్ల నుంచి ధగధగా వెలిగిపోతున్న స్టేడియాల దాకా, అంతరిక్ష సీమల దాకా భారత మహిళలది సుదీర్ఘ ప్రయాణం. అటు పిల్లలను కని, పెంచి, ఇటు ఇల్లు నడిపి, మరోవైపు ఉద్యోగాలూ చేస్తూ అంతులేని సహనానికి మారుపేరుగా నిలిచింది మహిళ. అలాంటి మహిళల కష్టాన్ని, గౌరవాన్ని, త్యాగాలను సముచితంగా గుర్తించినప్పుడు మాత్రమే మానవతకు సంబంధించిన పరీక్షలో మనం గట్టెక్కినట్టు‘. స్వాతంత్య్ర పోరులోనూ నారీ శక్తి ‘దేశ స్వాతంత్య్ర సంగ్రామంలోనూ, అనంతరం ఆధునిక భారత నిర్మాణంలో కూడా భారత మహిళలు పురుషులతో భుజం కలిపి సాగారు. కుటుంబ బాధ్యతల్లో మునిగి సమాజం, దేశం పట్ల తమ బాధ్యతలను ఎన్నడూ విస్మరించలేదు. సరోజినీ నాయుడు, సుచేతా కృపాలనీ, అరుణా అసఫ్ అలీ, విజయలక్ష్మీ పండిట్, రాజ్ కుమార్ అమృత్ కౌర్, ఇంకా ఎందరెందరో మహిళామణులు మనకు గర్వకారణంగా నిలిచారు. గాం«దీ, నెహ్రూ, పటేల్, అంబేడ్కర్ తదితరుల ఆకాంక్షలు నెరవేర్చడంలో తమ వంతు పాత్ర పోషించారు‘. రాజీవ్ కల.. అప్పుడే సాకారం ‘చట్ట సభల్లో మహిళలకు సముచిత ప్రాతి నిధ్యం దక్కాలన్న దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ కల సగమే నెరవేరింది. బిల్లు ఆమోదం పొందినప్పుడే అది పూర్తిగా సాకారవుతుంది. నేనో ప్రశ్న అడగాలనుకుంటున్నా. భారత మహిళలు తమ రాజకీయ బాధ్యతలను తలకెత్తుకునేందుకు 13 ఏళ్లుగా వేచిచూస్తున్నారు. ఇప్పుడు కూడా వారిని ఇంకా ఆరేళ్లు, ఎనిమిదేళ్లు... ఇలా ఇంకా ఆగమంటూనే ఉన్నారు. భారత మహిళల పట్ల ఇలాంటి ప్రవర్తన సరైనదేనా?‘ మహిళా శక్తికి ప్రతీక ఇందిర... ఇక దివంగత ప్రధాని ఇందిరా గాంధీ వ్యక్తిత్వం భారత మహిళల శక్తి సామర్థ్యాలను తిరుగులేని ప్రతీకగా ఇప్పటికీ నిలిచి ఉంది. వ్యక్తిగతంగా నా జీవితంలో ఇది చాలా ముఖ్యమైన సందర్భం. మహిళలకు స్థానిక సంస్థల్లో మూడో వంతు రిజర్వేషన్లు కలి్పస్తూ నా జీవిత భాగస్వామి, దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ తొలిసారిగా రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. కానీ రాజ్యసభలో ఆ బిల్లును కేవలం ఏడు ఓట్లతో ఓడించారు. అనంతరం పీవీ నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని పాస్ చేయించింది. ఫలితంగా నేడు 15 లక్షలకు పైగా మహిళలు దేశవ్యాప్తంగా స్థానిక సంస్థల్లో ప్రతినిధులుగా రాణిస్తున్నారు‘. -
Womens Reservation Bill 2023: ఇంకెంతకాలం నిరీక్షణ
మహిళా రిజర్వేషన్ బిల్లు అనేది కేవలం చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం కాదు. ఇది మహిళల పట్ల పక్షపాతం, అన్యాయాన్ని తొలగించడానికి ఉద్దేశించినది. మహిళలకు ప్రత్యేకంగా వందనాలు అవసరం లేదు. అందరితోపాటు సమాన గౌరవాన్ని పొందాలని మహిళలు కోరుకుంటున్నారు. మహిళా కోటాను అమలు చేయడంలో జాప్యం తగదు. జనగణన, నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే మహిళా రిజర్వేషన్లు అమలవుతాయనడం సరైంది కాదు. ఇంకా ఎంత కాలం నిరీక్షించాలి? రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం సాధ్యమే – కనిమొళి, డీఎంకే ఎంపీ ఓబీసీ కోటా సంగతేంటి? చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లలో ఓబీసీలకు ప్రత్యేక కోటా కల్పించాలి. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లను అమలు చేయకపోతే పార్లమెంట్‌ను ప్రత్యేకంగా సమావేశపర్చి బిల్లును ప్రవేశపెట్టాల్సిన అవసరం ఎముంది? ఇది పోస్టు–డేటెడ్ చెక్కులాగా ఉంది. ఎస్సీ, ఎస్టీలతోపాటు ఓబీసీ మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి ఈ సమావేశాల్లో రాజ్యాంగ సవరణ చేయాలి. మహిళా రిజర్వేషన్లను ఎప్పటి నుంచి అమలు చేస్తారో కచి్చతమైన తేదీ, టైమ్‌లైన్‌ను ప్రభుత్వం ప్రకటించాలి. దేశంలో ప్రస్తుతం కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ప్రత్యేక సమావేశాల్లో కరువు నివారణ చర్యలపై చర్చించాలి – సుప్రియా సూలే, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ బడుగు వర్గాల మహిళలకు భాగస్వామ్యం కావాలి మహిళా రిజర్వేషన్లలో వెనుకబడిన తరగతులు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు భాగస్వామ్యం కల్పించాల్సిందే. ఈ మేరకు అవసరమైతే చట్టంలో సవరణలు చేయాలి. బడుగు వర్గాల మహిళలకు న్యాయం చేకూర్చాలి. – డింపుల్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ మహిళలను తప్పుదోవ పట్టిస్తున్నారు మహిళా రిజర్వేషన్ బిల్లుతో కేంద్ర ప్రభుత్వం దేశంలో మహిళలను తప్పుదోవ పట్టిస్తోంది. ఈ రిజర్వేషన్లను రాబోయే ఎన్నికల్లో అమలు చేయకుండా జాప్యం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాం. అధికార బీజేపీ నాయకులు మహిళలపై ఎన్నో నేరాలకు పాల్పడ్డారు. వారిపై ఎలాంటి చర్యలకు తీసుకోలేదు. దేశంలో గత ఐదేళ్లలో మహిళలపై నేరాలు 26 శాతం పెరిగినప్పటికీ మోదీ ప్రభుత్వం స్పందించడం లేదు – హర్సిమ్రత్ కౌర్ బాదల్, శిరోమణి అకాలీదళ్ ఎంపీ మహిళా సాధికారతను అడ్డుకోవద్దు మహిళా రిజర్వేషన్లలో మైనారీ్టలకు కోటా కల్పించాలనడం అర్థరహితం. మతపరమైన రిజర్వేషన్లపై రాజ్యాంగం నిషేధం విధించింది. చట్ట ప్రకారం.. జనగణన, నియోజకవర్గాల పునర్విభజన పూర్తయిన తర్వాతే మహిళా రిజర్వేషన్లను అమలు చేయాల్సి ఉంటుంది. వెంటనే అమలు చేయాలని కోరడం సమంజసం కాదు. ఎవరైనా సరే రాజ్యాంగబద్ధమైన ప్రక్రియను అనుసరించాల్సిందే. మహిళా సాధికారతను అడ్డుకోవద్దని ప్రతిపక్షాలను కోరుతున్నా – స్మతి ఇరానీ, కేంద్ర మంత్రి, బీజేపీ నేత 40 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి పశ్చిమ బెంగాల్లో లోక్‌సభ ఎన్నికల్లో మా పార్టీ మహిళలకు 40 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం సైతం దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల్లో మహిళలకు 40 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. కేవలం 33 శాతం కాదు, కేంద్ర ప్రభుత్వానికి నిజంగా ధైర్యం ఉంటే 40 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి. ఈ విషయంలో మీకు చేతనైతే మమ్మలి్న(తణమూల్ కాంగ్రెస్)ను పట్టుకోండి చూద్దాం – కకోలీ ఘోష్–దస్తీదార్, తణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పేరును ‘రీషెడ్యూలింగ్ బిల్లు’ అని పెడితే పోలా? ఈ బిల్లు ఒట్టి మాయ. షెడ్యూల్ ప్రకారం ఫలానా తేదీకల్లా అమల్లోకి వస్తుందని చెప్పలేము. అలాంటప్పుడు ఈ బిల్లుకు మహిళా రిజర్వేషన్ రీషెడ్యూలింగ్ బిల్లుగా మారిస్తే సరిపోతుంది’ అని తణమూల్ కాంగ్రెస్ మహిళా నేత మహువా మొయిత్రా సభలో ఎద్దేవా చేశారు. ఇదంతా పెద్ద గిమ్మిక్కు. – టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా -
పంచాయతీల్లో మహిళలకు 50%!
రిజర్వేషన్ పెంచేందుకు కేంద్రం కసరత్తు * వచ్చే బడ్జెట్ సమావేశాల్లో సవరణలు * ‘వితంతు పింఛన్’ వయసు తగ్గింపునకు యోచన * కేంద్ర మంత్రి బీరేందర్ వెల్లడి న్యూఢిల్లీ: పంచాయతీల్లో మహిళల కోటాను 50 శాతానికి పెంచేందుకు అవసరమైన సవరణలను వచ్చే బడ్జెట్ పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. గురువారమిక్కడ ‘పెసా (పంచాయతీలను షెడ్యూల్డ్ ప్రాంతాలకు విస్తరించే) చట్టం అమల్లో సమస్యలు, పురోగతి’ అంశంపై ప్రారంభమైన రెండ్రోజుల సదస్సులో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బీరేందర్ సింగ్ మాట్లాడారు. బడ్జెట్ సమావేశాల్లో ఈ సవరణలను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. ప్రస్తుతం ఒక వార్డును మహిళలకు ఐదేళ్లపాటు రిజర్వేషన్ కింద కేటాయిస్తున్నారని, దీన్ని రెండు విడతలకు (పదేళ్లు) పెంచే ప్రణాళికను రూపొందిస్తున్నామని చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్‌ను 50 శాతానికి పెంచేందుకు అవసరమైన రాజ్యాంగ సవరణలపై ఏ పార్టీ కూడా విముఖత చూపకపోవచ్చని పేర్కొన్నారు. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ సంస్థల్లో మహిళలకు 33 శాతం సీట్లను రిజర్వేషన్ కింద కేటాయించారు. అలాగే ప్రస్తుతం వితంతు పింఛన్‌కు అర్హత వయసు 40 ఏళ్లు ఉండగా, ఈ వయసును తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. దేశంలో గిరిజనులు తమ సంస్కృతికి, విలువలకు కట్టుబడి ఉన్నారని, అందువల్లనే సామ్రాజ్యవాద శక్తులు ఇతర దేశాల్లో మాదిరి వారిని నిర్మూలించలేకపోతున్నాయన్నారు. 10 రాష్ట్రాలకు చెందిన పంచాయతీరాజ్, గిరిజన అభివృద్ధి శాఖ మంత్రులు కార్యక్రమంలో పాల్గొన్నారు. గిరిజన పరిశోధన సంస్థలకు మరింత స్వయంప్రతిపత్తి! గిరిజన పరిశోధన సంస్థలకు మరింత స్వయంప్రతిపత్తి ఇవ్వాలని కేంద్రం యోచిస్తోంది. పీహెచ్డీ పట్టాలను ఇచ్చేందుకు వీలుపడడమేకాక అత్యున్నతస్థాయి పరిశోధనలకోసం నిపుణులను నియమించుకోవడానికి అవకాశముంటుందని భావిస్తోంది. గిరిజన పరిశోధన సంస్థలకు ఆర్థిక, విద్యాసంబంధ విషయాల్లో మరింత స్వయంప్రతిపత్తి కల్పించే అంశాన్ని పరిశీలిస్తోంది. కోర్టు వెలుపలి పరిష్కారాలకు చట్టం! కోర్టు వెలుపలి పరిష్కారాలను ప్రోత్సహించే దిశగా కొత్త చట్టం రూపకల్పనకు ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం ఈ మధ్యవర్తిత్వ విధానం వైవాహిక సమస్యల పరిష్కారానికే ఎక్కువగా ఉపయోగపడుతోందని, కొత్త చట్టం అమల్లోకి వస్తే పారిశ్రామిక వివాదాలు, భూ యజమానులు-కౌలు రైతుల వివాదాలు కూడా ఈ విధానం ద్వారా పరిష్కారమవుతాయని భావిస్తోంది.