Sonia Gandhi
-
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి అస్వస్థత
-
రాష్ట్రపతిపై అనుచిత వ్యాఖ్యలు.. సోనియా గాంధీపై కేసు నమోదు
పట్నా: కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మరోమారు చిక్కుల్లో పడ్డారు. ఆమె రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ‘పేద మహిళ’(Poor Lady) అని అభివర్ణించినందుకు బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఆమెపై పోలీసు కేసు నమోదైంది. సుధీర్ ఓజా అనే న్యాయవాది సీజీఎం కోర్టులో ఈ ఫిర్యాదు దాఖలు చేశారు. దీనిని కోర్టు స్వీకరించగా, ఈ కేసు ఫిబ్రవరి 10న విచారణకు రానుంది.ఈ కేసులో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi), కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాలను కూడా సహ నిందితులుగా పిటిషనర్ పేర్కొన్నారు. వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సోనియా గాంధీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అవమానించడానికి ప్రయత్నించారని పిటిషనర్ సుధీర్ పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగం అనంతరం సోనియా గాంధీ రాష్ట్రపతిపై చేసిన వ్యాఖ్య చాలా అభ్యంతరకరంగా ఉంది. రాష్ట్రపతి ఒక మహిళ అని, గిరిజన సమాజం నుండి వచ్చారని, ఆమెపై ఈ వ్యాఖ్య అభ్యంతరకరమని ఓజా పేర్కొన్నారు.రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu) ప్రసంగం తర్వాత సోనియా గాంధీ పాత్రికేయులతో మాట్లాడుతూ ‘చివరికి ఆ పేద మహిళ అలసిపోయింది’ అని అన్నారు. అదే సమయంలో రాహుల్ గాంధీ రాష్ట్రపతి ప్రసంగాన్ని బోరింగ్‌గా అభివర్ణించారు. కాగా సోనియా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. సోనియా వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. ఇది దురదృష్టకర, అవమానకర వ్యాఖ్య అని రాష్ట్రపతి భవన్ పేర్కొంది. సోనియా గాంధీ వ్యాఖ్యపై ప్రధాని మోదీ(Prime Minister Modi) మాట్లాడుతూ నేడు దేశం మరోసారి కాంగ్రెస్ రాజకుటుంబ అహంకారాన్ని చవిచూసిందని అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించారు. అభివృద్ధి చెందిన భారతదేశం సాధించిన విజయాలు, దార్శనికత గురించి ఆమె దేశ ప్రజలకు తెలియజేశారు. హిందీ ఆమె మాతృభాష కాదు, అయినప్పటికీ ఆమె చాలా చక్కగా మాట్లాడారు. కానీ కాంగ్రెస్ రాజకుటుంబం ఆమెను అవమానించడం ప్రారంభించింది. ఇది దేశంలోని గిరిజన సోదరసోదరీమణులకు అవమానకరం అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: కుంభమేళా మోనాలిసా.. మరో వీడియో వైరల్ -
సోనియా వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన రాష్ట్రపతి కార్యాలయం
ఢిల్లీ : పార్లమెంట్ బడ్జెట్ (Union Budget 2025-26) సమావేశంలో తొలిరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (droupadi murmu) చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ ఎంపీ సోనియా గాంధీ (sonia gandhi) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అన్నీ తప్పుడు హామీలే ఇచార్చు. పైగా రాష్ట్రపతి ముర్ము తన ప్రసంగంలో బాగా అలసి పోయారు. పూర్ థింగ్’ అంటూ కామెంట్స్ చేశారు. అయితే, సోనియా గాంధీ వ్యాఖ్యలపై రాష్ట్రపతి కార్యాలయం ధీటుగా బదులిచ్చింది. సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు ఆమోదయోగ్యంగా లేవని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఓ లేఖను విడుదల చేసింది.ఆ లేఖలో .. సోనియా గాంధీ వ్యాఖ్యలో ఆమోదయోగ్యంగా లేవు. ఉన్నత పదవి గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యానించారు. సోనియా గాంధీ తన మాటల్లో రాష్ట్రపతి అలసి పోయారని,చాలా కష్టంగా మాట్లాడారని అన్నారు. ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలని అనుకున్నాం. #WATCH | Delhi | After the President's address to the Parliament, Congress MP Sonia Gandhi says,"...The President was getting very tired by the end...She could hardly speak, poor thing..." pic.twitter.com/o6cwoeYFdE— ANI (@ANI) January 31, 2025రాష్ట్రపతి ఏ సమయంలోనూ అలసిపోలేదు. ఎప్పటికి అలసిపోరు. బడ్జెట్ ప్రసంగంలో నిజానికి, అట్టడుగు వర్గాల కోసం, మహిళలు, రైతుల గురించి చాలా చక్కగా మాట్లాడారు. ఆమె ప్రసంగాన్ని నాయకులు (సోనియాగాంధీని ఉద్దేశిస్తూ) హిందీ వంటి భారతీయ భాషలలోని యాస, ఉపన్యాసాలపై పరిచయం లేని కారణంగా రాష్ట్రపతి ప్రసంగంపై తప్పుడు అభిప్రాయాన్ని ఏర్పడి ఉండొచ్చని రాష్ట్రపతి కార్యాలయం విశ్వసిస్తోంది. సోనియా గాంధీ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. ఖండించదగినవి’ అని పేర్కొంది. 👉చదవండి : రాష్ట్రపతిపై సోనియా వివాదాస్పద వ్యాఖ్యలు -
రాష్ట్రపతిపై సోనియా వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ:రాష్ట్రపతి ద్రౌపదిముర్ముపై సోనియాగాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. బడ్జెట్ సమావేశాల తొలిరోజు రాష్ట్రపతి ప్రసంగం అనంతరం సోనియా,రాహుల్ పార్లమెంట్ ఆవరణలోకి వచ్చారు. అయితే ఇక్కడ రాహుల్‌గాంధీ మాత్రమే మీడియాతో మాట్లాడారు.రాష్ట్రపతి ప్రసంగం బోరింగ్‌గా ఉందని రాహుల్ అన్నారు. దీనికి సోనియా కల్పించుకుని ‘అన్నీ తప్పుడు హామీలే. రాష్ట్రపతి చివర్లో బాగా అలసిపోయారు. ఆమె అసలు మాట్లాడలేకపోయారు. పూర్ థింగ్’ అని అన్నారు. ఈ మాటలకు తల ఊపిన రాహుల్ రాష్ట్రపతి చెప్పిన విషయాన్నే మళ్లీ మళ్లీ చెప్పారన్నారు. రాష్ట్రపతినుద్దేశించి మీడియాతో సోనియాగాంధీ నేరుగా మాట్లాడకపోయినప్పటికీ బీజేపీ మాత్రం ఆమెపై విమర్శల దాడికి దిగింది. ‘సోనియాగాంధీ వెంటనే రాష్ట్రపతికి క్షమాపణలు చెప్పాలి. ఆమె మాటలు కాంగ్రెస్ పార్టీ గిరిజన,పేదల వ్యతిరేక వైఖరిని తెలియజేస్తోంది’అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా ఎక్స్(ట్విటర్)లో డిమాండ్ చేశారు.సోనియా వ్యాఖ్యలు రాష్ట్రపతి గౌరవాన్ని తగ్గిస్తున్నాయని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు.కాగా, బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా శుక్రవారం(జనవరి31) పార్లమెంట్ ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. ఎన్డీఏ మూడో టర్ములో పనులు గతం కంటే మూడు రెట్ల వేగంతో జరుగుతున్నాయన్నారు. వక్ఫ్ బిల్లు, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంశాల్లో పురోగతే ఇందుకు నిదర్శనమన్నారు. -
ఢిల్లీలో ఏఐసీసీ కొత్త కేంద్ర కార్యాలయం ప్రారంభం
-
జెండాకు నమస్కరించని వారు దేశం గురించి మాట్లాడతారా?: రాహుల్ గాంధీ
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నూతన కాంగ్రెస్(congress Office) పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభమైంది. పార్టీ కార్యాలయ భవనాన్ని కాంగ్రెస్ పార్టీ చైర్పర్సన్ సోనియాగాంధీ ప్రారంభించారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjuna Kharge) పార్టీ జెండా ఎగురవేశారు. ఆరు అంతస్తుల్లో అత్యాధునిక సౌకర్యాలతో కొత్త భవనం నిర్మించారు. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, ఎంపీలు పాల్గొన్నారు. ఇక, కొత్త భవనానికి ‘ఇందిరాగాంధీ భవన్’ అని పేరు పెట్టారు.ఈ సందర్బంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(rahul Gandhi) మాట్లాడుతూ.. దేశాన్ని విచ్చిన్నం చేసే వారిని ఆపగలిగేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. జాతీయ జెండాకు నమస్కరించరని వారు దేశం గురించి మాట్లాడుతున్నారు. స్వాతంత్ర్య పోరాటాన్ని కించపరిచే విధంగా మోహన్ భగవత్ వ్యాఖ్యలు ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ ఐడియాలజీతో పోరాడుతూనే ఉంటాం. బ్రిటీష్ వారితో పోరాడిన యోధులను అవమానించేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ భవనం ప్రతీ కార్యకర్తకు చెందుతుంది. దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రత్యర్థులపై ఉపయోగిస్తున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయి అంటూ కామెంట్స్ చేశారు.#WATCH | Delhi: Lok Sabha LoP and Congress MP Rahul Gandhi says "The Constitution was essentially attacked yesterday by Mohan Bhagwat when he said that the Constitution was not the symbol of our freedom, but also after that, thousands of our workers died in Punjab, Kashmir,… pic.twitter.com/ghK13PDOk2— ANI (@ANI) January 15, 2025ఇదిలా ఉండగా.. ప్రస్తుతం అక్బర్ రోడ్డు 24వ నంబర్ భవనంలో ఏఐసీసీ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ బంగ్లాల్లో పార్టీ కార్యాలయాలు ఉండకూడదని గతంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు అనుగుణంగానే పార్టీలు సొంత భవనాలు నిర్మించుకున్నాయి. ఐదు దశాబ్దాలుగా అక్బర్ రోడ్డులోనే కాంగ్రెస్ కార్యకలాపాలు నిర్వహించింది. 1978 నుంచి ఇది ఏఐసీసీ కేంద్ర కార్యాలయంగా ఉంది.9A కోట్లా రోడ్డులో 6 అంతస్తుల్లో అత్యాధునిక సౌకర్యాలతో కాంగ్రెస్ నూతన కార్యాలయాన్ని నిర్మించారు. కోట్లా మార్గ్‌కు ఏఐసీసీ కార్యాలయాన్ని తరలించినా.. అక్బర్ రోడ్డు నుంచి కూడా కార్యకలాపాలు ఉంటాయని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. 2008లో దీన్‌దయాళ్ ఉపాధ్యాయ మార్గ్‌లో కాంగ్రెస్ పార్టీకి కేంద్ర ప్రభుత్వం స్థలం కేటాయించింది. అనంతరం దీన్‌దయాళ్ ఉపాధ్యాయ మార్గ్ నుంచి కోట్లా మార్గ్ వైపు ప్రవేశాన్ని మార్చుకున్నారు. 2009లో కేంద్ర కార్యాలయం నిర్మాణం మొదలు పెట్టారు. 15 ఏళ్ల పాటు ఇందిరాగాంధీ భవన్ నిర్మాణం సాగింది.#WATCH | Congress MP Sonia Gandhi inaugurates 'Indira Bhawan', the new headquarters of the party in Delhi Congress president Mallikarjun Kharge, MP Rahul Gandhi and other prominent leaders of the party also present pic.twitter.com/9X7XXNYEOn— ANI (@ANI) January 15, 2025 -
New Delhi: కాంగ్రెస్‌కు కొత్త కార్యాలయం.. నేడు ప్రారంభించనున్న సోనియా
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం చిరునామా మారింది. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నేడు (జనవరి 15) పార్టీ కొత్త ప్రధాన కార్యాలయం 'ఇందిరా భవన్'ను ప్రారంభించనున్నారు. గత ఐదు దశాబ్దాలుగా పార్టీ ప్రధాన కార్యాలయం ఢిల్లీలోని 24, అక్బర్ రోడ్లో ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ కొత్త ప్రధాన కార్యాలయం పేరు ‘ఇందిరా భవన్’.. ఇది 9-ఎ కోట్ల రోడ్డులో ఏర్పాటయ్యింది. నేటి ఉదయం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు పలువురు నేతలు పాల్గొననున్నారు. VIDEO | Delhi: Congress MP Priyanka Gandhi (@priyankagandhi) leaves after inspecting Congress' new headquarters - Indira Gandhi Bhawan - in Delhi, ahead of its inauguration on Wednesday. (Full video available on PTI Videos- https://t.co/dv5TRAShcC)#Delhi pic.twitter.com/TLp1zjg7Nf— Press Trust of India (@PTI_News) January 14, 2025మీడియాకు అందిన వివరాల ప్రకారం ఈ నూతన కార్యాలయ నిర్మాణం ప్రియాంక గాంధీ సారధ్యంలో కొనసాగింది. కార్యాలయ మ్యాప్‌ను ఖరారు చేయడం మొదలుకొని పెయింటింగ్, చిత్రాలు, కర్టెన్లు, ఫర్నిచర్ వరకు ప్రియాంక స్వయంగా అన్నింటినీ పర్యవేక్షించారు. ఈ కొత్త కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలు పాత ఛాయాచిత్రాలను ఏర్పాటు చేశారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసీ వేణుగోపాల్ మంగళవారం ట్విట్టర్లో ఇలా పోస్ట్ చేశారు.. ‘2025, జనవరి 15న ఉదయం 10 గంటలకు, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సమక్షంలో కొత్త ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ‘ఇందిరా గాంధీ గాంధీ భవన్’ను ప్రారంభించనున్నారు’ అని తెలిపారు.It is time for us to move ahead with the times and embrace the new!On 15 January, 2025 at 10am, in the esteemed presence of INC President Sh. Mallikarjun @kharge ji and LOP Sh. @RahulGandhi ji, Hon’ble CPP Chairperson Smt. Sonia Gandhi ji will inaugurate the new AICC…— K C Venugopal (@kcvenugopalmp) January 7, 2025కాంగ్రెస్ నూతన కేంద్ర కార్యాలయం ‘ఇందిరా గాంధీ భవన్’ పార్టీలో పెరుగుతున్న అవసరాలను తీర్చడానికి, పరిపాలనా, సంస్థాగత, వ్యూహాత్మక విధుల నిర్వహణకు అనువుగా ఆధునిక సౌకర్యాలతో రూపొందింది. 1978లో కాంగ్రెస్(ఐ) ఏర్పడినప్పటి నుండి పార్టీ ప్రధాన కార్యాలయం '24, అక్బర్ రోడ్'లో ఉంది. -
కాంగ్రెస్‌కు కౌంటర్.. సోనియాపై జేపీ నడ్డా విమర్శలు
ఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు స్మారకం నిర్మాణం విషయంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజకీయం ఆసక్తికరంగా మారింది. రెండు పార్టీ నేతలు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సోనియా గాంధీపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.మాజీ ప్రధాని మన్మోహన్‌కు స్మారకం నిర్మించడంపై కాంగ్రెస్, బీజేపీ నేతలు పరస్పర విమర్శలు చేసుకున్నారు. మన్మోహన్‌ను కేంద్ర ప్రభుత్వం అవమానించిందని, స్మారకం నిర్మించే ప్రాంతంలో కాకుండా నిగంబోధ్లో అంత్యక్రియలు నిర్వహించిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఆరోపణలపై బీజేపీ చీఫ్ జేపీ నడ్డా స్పందిస్తూ.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై సంచలన ఆరోపణలు చేశారు.తాజాగా జేపీ నడ్డా మాట్లాడుతూ..‘మన్మోహన్ మృతితో విషాదం నెలకొన్న సమయంలోనూ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ చౌకబారు రాజకీయాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మన్మోహన్ స్మారకం కోసం స్థలాన్ని కేటాయించింది. ఆ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు కూడా తెలియజేశాం. మన్మోహన్ ప్రధానిగా ఉండగా.. సోనియా గాంధీ సూపర్ ప్రధానిగా వ్యవహరించి ప్రధాని పదవిని అవమానించారు. ఒక ఆర్డినెన్స్‌ను చించేయడం ద్వారా మన్మోహన్‌ను రాహుల్ గాంధీ కూడా అవమానించారు. అదే కాంగ్రెస్ ఇప్పుడు ఆయన మరణంపై రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు.This is the way Gandhi family treated Ex PM #ManmohanSingh .. Shameful act by Sonia Gandhi .. watch pic.twitter.com/Bi8UrbNOU5— #Bagri (@Bagriml) December 27, 2024ఇదే సమయంలో పీవీ అంశంపై కూడా నడ్డా స్పందించారు. ఈ సందర్బంగా నడ్డా మాట్లాడుతూ..‘పీవీ నరసింహారావు స్మారకం నిర్మించడానికి సోనియా గాంధీ అంగీకరించలేదు. కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన పార్థివదేహాన్ని ఉంచడానికి కూడా ఆమె అనుమతించలేదు. చివరకు ఆయన అంత్యక్రియలను ఢిల్లీలోని నిర్వహించనీయలేదని ధ్వజమెత్తారు. అలాగే, 2015లో పీవీ కోసం ప్రధాని మోదీ స్మారకం ఏర్పాటు చేశారని, భారత రత్న కూడా ఇచ్చారని గుర్తు చేశారు. ప్రణబ్ ముఖర్జీ మరణించినప్పుడు కాంగ్రెస్ పార్టీ కనీసం సీడబ్ల్యూసీ సమావేశం ఏర్పాటు చేయలేదని విమర్శించారు. దీంతో, ఆయన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి.Sonia Gandhi, who insulted PM Dr #ManmohanSingh ji in this manner, ever apologized till date??? Was this not an insult to the Prime Minister of India, Manmohan Singh ? pic.twitter.com/6Yj4OavpTT— Ayesha (@KashmiriAyesha1) December 27, 2024 -
ప్రముఖులతో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (ఫొటోలు)
-
ఆ లేఖల్లో ఏముంది?
దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ లేఖలు మరోసారి వార్తల్లోకెక్కాయి. స్వాతంత్య్ర పోరాట సమయంలో పుంఖానుపుంఖాలుగా ఆయన రాసిన లేఖలు అనంతర కాలంలో ఎంతగానో ప్రసిద్ధికెక్కాయి. బ్రిటిషర్ల చెరలో జైలు జీవితం అనుభవిస్తూ కూతురు ఇందిరకు రాసిన లేఖలైతే సంకలనాలుగా వెలువడి ఎంతో ఆదరణ కూడా పొందాయి. జయప్రకాశ్ నారాయణ్ వంటి రాజకీయ ఉద్ధండులు మొదలుకుని భౌతికశాస్త్ర దిగ్గజం ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ దాకా ప్రముఖులెందరితోనో నెహ్రూ జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలు లోకప్రసిద్ధం. చక్కని రచనా శైలికే గాక అద్భుతమైన అభివ్యక్తికి వాటిని నిలువెత్తు నిదర్శనంగా చెబుతుంటారు. నెహ్రూ తదనంతరం ఆయన లేఖలన్నింటినీ ప్రధానమంత్రి మ్యూజియం, లైబ్రరీ (పీఎంఎంఎల్)లో భద్రపరిచారు. అయితే యూపీఏ హయాంలో 2008లో కాంగ్రెస్ అగ్ర నేత సోనియాగాంధీ వాటన్నింటినీ తన నివాసానికి తరలించిన వైనం ఇప్పుడు రాజకీయ రగడకు దారితీస్తోంది. నెహ్రూ లేఖలతో కూడిన ఏకంగా 51 పెట్టెలను తన సోనియా తరలించుకుని వెళ్లారని బీజేపీ ఆరోపిస్తోంది. వాటన్నింటినీ తిరిగివ్వాల్సిందిగా పీఎంఎంఎల్ తాజాగా సోనియాను కోరింది. కనీసం జిరాక్సులో, పీడీఎఫ్‌లో అయినా అందజేస్తే భద్రపరుస్తామంటూ విజ్ఞప్తి చేసింది. దాంతో, ‘‘అసలు నెహ్రూ లేఖలను సోనియా పనిగట్టుకుని తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచి్చంది? అందుకెవరు అనుమతించారు? 16 ఏళ్లుగా తన వద్దే ఎందుకు ఉంచుకున్నారు? ఎందుకు తిరిగివ్వడం లేదు? అంతగా దాచాల్సిన అంశాలు ఆ లేఖల్లో ఏమున్నాయి?’’ వంటి అనేకానేక ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. వీటికి సమాధానంగా అన్ని వేళ్లూ నెహ్రూ–ఎడ్వినా లేఖలవైపే చూపిస్తుండటం విశేషం. ఎడ్వినా నాటి వైస్రాయ్ లార్డ్ మౌంట్‌బాటెన్ భార్య. ఆమెకు, నెహ్రూకు మధ్య చాలా సాన్నిహిత్యం ఉందంటారు. ‘‘నిజానికిది బహిరంగ రహస్యమే. అప్పట్లో రాజకీయ వర్గాల్లో నిత్యం అందరి నోళ్లలోనూ నానిన అంశం కూడా’’ అని చరిత్రకారులు కూడా చెబుతారు. ‘‘నెహ్రూ, ఎడ్వినా సాన్నిహిత్యానికి వారి నడుమ సాగిన లేఖలు అద్దం పట్టాయి. దాంతో అవి వెలుగు చూడకూడదని సోనియా భావించారు. అందుకే వాటితో పాటు అన్ని లేఖలనూ పీఎంఎంఎల్ నుంచి తరలించుకుపోయారు’’ అని బీజేపీ ఆరోపిస్తోంది. ‘గాం«దీ–నెహ్రూ కుటుంబం’ అంటూ ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ అవకాశం దొరికినప్పుడల్లా పదునైన విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈ లేఖల రగడ ఎంత దూరం వెళ్తుందన్నది ఆసక్తికరంగా మారింది. సోనియా తరలించుకుపోయిన నెహ్రూ లేఖలన్నింటినీ తిరిగి ఇప్పించాలంటూ ఆమె కుమారుడు, విపక్ష నేత రాహుల్‌గాం«దీకి పీఎంఎంల్ సభ్యుడు, చరిత్రకారుడు రిజ్వాన్ కాద్రీ డిసెంబర్ 10న లేఖ రాశారు. ‘‘అవన్నీ ఎడ్వినా, ఐన్‌స్టీన్, జేపీ, పద్మజా నాయుడు, విజయలక్ష్మీ పండిట్, అరుణా అసఫ్ అలీ, బాబూ జగ్జీవన్‌రాం, జేబీ పంత్ తదితరులకు నెహ్రూ జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలు. 1971లో ఇందిర వాటిని పీఎంఎంల్ (అప్పట్లో నెహ్రూ మ్యూజియం)కు అప్పగించారు. అవి పీఎంఎంల్లో ఉంటే స్కాలర్లకు, పరిశోధకులకు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుంది’’ అని పేర్కొన్నారు. దాంతో నెహ్రూతో ఎడ్వినా సాన్నిహిత్యం ఆయన మరణించిన 80 ఏళ్ల తర్వాత మరోసారి తెరపైకి వచ్చింది. మిగతా లేఖల సంగతి ఎలా ఉన్నా గత చరిత్ర, బీజేపీ ఆరోపణల పుణ్యమా అని నెహ్రూ–ఎడ్వినా లేఖలపైనే అందరికీ ఆసక్తి నెలకొంది. ‘‘వాటిలో అంత గోప్యంగా ఉంచాల్సిన అంశాలేమున్నాయి? ఎందుకు వాటిని సోనియా తన ఇంట్లో దాచిపెట్టుకున్నారు? ఆమె బదులిచ్చి తీరాలి’’ అంటూ బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ డిమాండ్ చేయడం విశేషం. పార్టీ మరో అధికార ప్రతినిధి సంబిత పాత్ర కూడా సోమవారం ఏకంగా లోక్‌సభలోనే ఈ అంశాన్ని ప్రస్తావించారు. దీనిపై సరైన చర్యలు తీసుకుంటామంటూ కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ బదులివ్వడం విశేషం. అనంతరం పాత్ర మీడియాతో కూడా దీనిపై మాట్లాడారు. ‘‘నెహ్రూ లేఖలు గాంధీ కుటుంబపు వ్యక్తిగత ఆస్తి కాదు. దేశ సంపద. వాటిని బయట పెట్టడానికి గాంధీ కుటుంబం వెనకాడుతుండటం ఎన్నో సందేహాలకు తావిస్తోంది. సరిగ్గా పీఎంఎంల్లోని లేఖల డిజిటైజేషన్ ప్రక్రియ మొదలు పెట్టే ముందే నెహ్రూ లేఖలను సోనియా తీసుకెళ్లారు. వాళ్లేం దాస్తున్నారో తెలుసుకోవాలని దేశం భావిస్తోంది’’ అన్నారు. ‘గాఢమైన’ బంధం నెహ్రూ, ఎడ్వినా మధ్య నడిచిన లేఖలు ఇప్పుడు ఎవరికీ అందుబాటులో లేవు. అయితే ఎడ్వినా కూతురు పమేలా హిక్స్ తదితరులు వాటికి సంబంధించిన పలు విశేషాలను గతంలో పంచుకున్నారు. నెహ్రూ, ఎడ్వినా మధ్య ‘అత్యంత గాఢమైన’ బంధం కొనసాగిందని పమేలా తన పుస్తకంలో స్పష్టంగా పేర్కొనడం విశేషం! ‘‘నా తల్లి, నెహ్రూ పరస్పరం ఎంతగానో ప్రేమించుకున్నారు. ఒకరంటే ఒకరికి చెప్పలేనంత గౌరవాభిమానాలుండేవి. దీన్ని నేను ఎన్నోసార్లు గమనించాను. మా అమ్మ తానెంతగానో తపించిన ఆదర్శ సాహచర్యాన్ని పండిట్జీ (నెహ్రూ) రూపంలో పొందింది. అయితే వారిద్దరి మధ్య శారీరక బంధానికి అంతగా అవకాశం లేకపోయింది. నిత్యం తమను చుట్టుముట్టి ఉండే సిబ్బంది తదితరుల వల్ల ఏకాంతం దొరకడం గగనంగా ఉండేది. ఎడ్విన్ భారత్ వీడేముందు నెహ్రూకు ఓ ఉంగరమివ్వాలని భావించారు. తీసుకుంటారో లేదోనని చివరికి ఆయన కుమార్తె ఇందిరకు ఇచ్చి వెళ్లారు’’ అని పమేలా చెప్పుకొచ్చారు. నెహ్రూ తన వీడ్కోలు ప్రసంగంలోనూ ఎడ్వినాను ఆకాశానికెత్తిన వైనాన్నీ ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రాహుల్ గాంధీకి ప్రధాని మ్యూజియం లేఖ
న్యూఢిల్లీ: దేశ తొలి ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూ రాసిన లేఖలను, మరికొన్ని పత్రాలను వెనక్కి ఇచ్చేయాలంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని, ప్రధానమంత్రి సంగ్రహాలయం కోరింది. సోనియా గాంధీ వాటిని తీసుకెళ్లారని.. వాటిని తిరిగి ఇచ్చేయాలంటూ మ్యూజియం సభ్యుడొకరు ఆయనకు లేఖ రాశారు.2008 యూపీఏ పాలనలో.. అప్పటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ అప్పటి పీఎంఎంఎల్(Prime Ministers' Museum and Library) డైరెక్టర్ అనుమతితో ఆ పత్రాలన్నింటిని తీసకెళ్లారు. అయితే వాటిని ఇప్పుడు వెనక్కి ఇవ్వాలంటూ పీఎంఎంఎల్ సభ్యుడు రిజ్వాన్ ఖాద్రి, రాహుల్‌కు లేఖ రాశారు. ఒకవేళ ఒరిజినల్ లేఖలు ఇవ్వడం ఇష్టంలేని తరుణంలో ఫొటోకాపీలు లేదంటే డిజిటల్ కాపీలైనా ఇవ్వాలని కోరారు.అయితే ఈ పత్రాల గురించి నెహ్రూ కుటుంబాన్ని కోరడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని మ్యూజియం వార్షిక సమావేశం జరిగింది. అందులో.. నెహ్రూ సంబంధిత లేఖలు, ఇతరత్రా పేపర్లు కనిపించకుండా పోవడంపై చర్చ జరిగింది. చారిత్రకంగా అవి ఎంతో ప్రాధాన్యం పత్రాలుగా అభిప్రాయపడుతూ.. వాటిని ఎలాగైనా వెనక్కి రప్పించాలని పీఎంఎంఎల్ మండలి నిర్ణయించింది. ఈ విషయంలో అవసరమైతే న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలని భావించింది. ఈ మేరకు.. సెప్టెంబర్‌లో సోనియా గాంధీని కోరుతూ ప్రధాని మ్యూజియం ఓ లేఖ రాసింది. అయితే ఆమె నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో.. ఇప్పుడు రాహుల్ గాంధీకి మరో లేఖ రాసింది. నెహ్రూ ప్రధానిగా ఉన్న టైంలో పలు కీలక పత్రాలు సైతం.. ఆ సేకరణలో ఉన్నట్లు పీఎంఎంల్ భావిస్తోంది. అలాగే.. ఎడ్విన్ మౌంట్‌బాటెన్, అల్బర్ట్ ఐన్‌స్టీన్, జయప్రకాశ్ నారాయణ్, పద్మజా నాయుడు, విజయలక్ష్మి పండిట్, అరుణా అసఫ్ అలీ, బాబు జగ్జీవన్ రామ్, గోవింద్ వల్లభ్ పంత్ లాంటి ప్రముఖలతో నెహ్రూకు మధ్య జరిగిన ఉత్తర-ప్రత్యుత్తరాలు ఆ కలెక్షన్స్‌లో ఉన్నాయి.నెహ్రూ దస్తూరితో ఉన్న ఈ లేఖలను 1971లో నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీలో(ఇప్పుడదే ప్రధానుల మ్యూజియంగా మారింది) భద్రపరిచారు. అయితే యూపీఏ హయాంలో వాటిని సుమారు 51 బాక్సుల్లో సోనియా గాంధీ నివాసానికి తరలించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. పీఎంఎంల్ మండలి కాలపరిమితి ఈ నవంబర్లోనే ముగియాల్సి ఉంది. అయితే ఆఖరి నిమిషంలో.. ఆ కాలపరిమితిని మరో రెండు నెలలు పొడిగించడం గమనార్హం.ఇదీ చదవండి: ‘తప్పులు కప్పిపుచ్చుకోవడానికే నెహ్రూ పేరు వాడుకుంటున్నారు’ -
Sanjay Gandhi Birthday: ఇందిరకు నచ్చని మేనక?.. అయినా సంజయ్‌తో పెళ్లెలా జరిగింది?
సంజయ్ గాంధీ.. భారత తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ కుమారుడు. సంజయ్ గాంధీ 1946 డిసెంబరు 14న జన్మించారు. రాజీవ్ గాంధీ ఈయన సోదరుడు. సంజయ్ గాంధీ అత్యంత విచిత్ర పరిస్థితుల్లో మేనకా గాంధీని కలుసుకున్నారు. ఆ తరువాత వివాహం చేసుకున్నారు. అది 1973వ సంవత్సరం.. అప్పటికి సంజయ్ గాంధీ వయసు 27 ఏళ్లు. లండన్‌లో చదువు పూర్తి చేసుకుని సంజయ్ గాంధీ ఇండియాకు తిరిగివచ్చారు. అప్పటికే ఆయన ఇద్దరు యువతులతో ప్రేమ వ్యహారాలు నడిపారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. తొలుత సంజయ్ గాంధీ ఒక ముస్లిం యువతిని ప్రేమించారు. అయితే అది ఎక్కువకాలం కొనసాగలేదు. తరువాత ఆయన జర్మన్ యువతి సబీన్ వాన్ స్టీగ్లిట్జ్ ప్రేమలో పడ్డారు. ఆమె సోనియాగాంధీకి స్నేహితురాలుసోనియా స్నేహితురాలు సబీన్తో..ఆ సమయంలో సబీన్ ఢిల్లీలో టీచర్‌గా పనిచేసేవారు. ఆమె తరచూ రాజీవ్,సోనియాల ఇంటికి వచ్చేవారు. ఆ సమయంలో సంజయ్‌గాంధీ..సబిన్తో మాట్లాడేవారు. కొంతకాలం తరువాత వారిలో చిగురించిన ప్రేమను గమనించిన సోనియా వారిద్దరూ వివాహం చేసుకుంటే బాగుంటుందని భావించారట. అయితే అప్పట్లో సంజయ్ గాంధీ.. మారుతి కారు భారత్‌కు తీసుకురావాలనే ప్రయత్నంలో బిజీగా ఉన్నారు. సబీనాతో పెళ్లికి అంత ప్రాథాన్యత ఇవ్వలేదు. దీంతో సబీన్ యూరప్‌కు వెళ్లిపోవాలని నిర్ణయించుకుని విమనాశ్రయానికి వెళ్లారు. విషయం తెలుసుకున్న సంజయ్ ఆ విమానంలోని పైలెట్‌తో రేడియోలో మాట్లాడి, సబీన్ను తిరిగి రమ్మని అభ్యర్థించారు. అలా ఆమె వెనక్కు వచ్చింది. అయితే తరువాతి కాలంలో సంజయ్- సబిన్ మధ్య విబేధాలు వచ్చి వారు విడిపోయారు.మోడలింగ్ రంగంలో మేనకకు అవార్డులు1973, సెప్టెంబర్ 14న సంజయ్ తన స్నేహితుని పెళ్లి వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అతని స్నేహితుడు సంజయ్‌కు మేనకా ఆనంద్ అనే యువతిని పరిచయం చేశారు. ఆమె రిటైర్డ్ సిక్కు కల్నల్ కుమార్తె. మోడలింగ్ చేస్తూ, ఈ రంగంలో ఎన్నో అవార్డులు గెలుచుకున్నారు. జర్నలిస్టు కావాలనేది ఆమె కల. అలా పరిచయమైన మేనకతో సంజయ్ ప్రేమలో పడ్డారు. ఇది సంజయ్ అన్నయ్య రాజీవ్ గాంధీ, వదిన సోనియాలకు అంతగా నచ్చలేదు. మేనక ప్రవర్తన వారికి నచ్చలేదు. కొన్నాళ్ల తరువాత సంజయ్ తన తల్లి ఇందిరకు మేనకను పరిచయం చేశాడు. ఇందిరాగాంధీని కలిసే సమయంలో మేనకా చాలా భయపడ్డారు. తొలిసారి ఇందిరను కలుసుకున్న మేనక తాను మోడల్ననే విషయాన్ని ఆమెకు చెప్పలేదు.మేనక గురించి తెలుసుకున్న ఇందిరదీనికి ముందు కూడా సంజయ్ పలువురు యువతులను ఇందిరకు పరిచయం చేశారు. మేనక కూడా ఇలాంటి స్నేహితురాలే అయివుంటుందని ఇందిరా గాంధీ తొలుత భావించారు. అయితే తరువాత సంజయ్ తన తల్లి ఇందిరను ఒప్పించి, మేనకతో తన వివాహానికి 1974, జూలై 29న నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ హడావుడిలో ఇందర.. మేనక కుటుంబం గురించి తెలుసుకోలేకపోయారు. నిశ్చితార్థ వేడుక పూర్తయ్యాక, ఇరు కుటుంబాలకు ఇందిర ఇంట్లో విందు జరిగింది. అప్పడు ఇందిర స్వయంగా మేనక కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకున్నారు.భర్తను ప్రధానిగా చూడాలనుకున్న మేనకఅప్పటికే నిశ్చితార్థం జరిగిపోవడంతో ఇందిర మరేమీ చేయలేక మౌనం వహించారు. 1974, సెప్టెంబర్ 23న సంజయ్ గాంధీ, మేనకా గాంధీల వివాహం జరిగింది. అయితే మేనక ప్రవర్తన సోనియాకు నచ్చేది కాదని వినికిడి. ఏదో ఒకరోజు తన భర్త సంజయ్ ప్రధాని అవుతారని మేనక అందరికీ చెబుతుండేవారట. సంజయ్, మేనకలకు 1980లో వరుణ్‌గాంధీ జన్మించాడు. ఇది జరిగిన మూడు నెలలకు 1980 జూన్‌లో సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో మరణించారు. రెండేళ్ల తరువాత ఇందిరాగాంధీ ఇంటి నుంచి మేనకా గాంధీ తన కుమారుడు వరుణ్ గాంధీని తీసుకుని మరో ఇంటికి వెళ్లిపోయారు. ఆ సమయంలో సోనియా, మేనకల మధ్య సత్సంబంధాలు లేవని చెబుతుంటారు.ఇది కూడా చదవండి: Year Ender 2024: ‘జెన్ జెడ్’.. ఎందుకంత భిన్నం? ఏ తరం వారు ఏం చేస్తున్నారు? -
Sharad Pawar Birthday: సోనియా.. శరద్ పవార్ వైరం వెనుక..
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత శరద్ పవార్ నేటితో (2024 డిసెంబర్ 12) 84 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. శరద్ పవార్ 1940, డిసెంబర్ 12న జన్మించారు. ఆయన తన రాజీకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. అయితే కాంగ్రెస్‌ను వీడి సొంతంగా పార్టీ వ్యవస్థాపించడం ఆయన జీవితంలో మైలురాయిగా నిలుస్తుంది. ‘శరద్ పవార్: అపనీ షర్తోం పర్’ అనే పుస్తకంలో ఆయన జీవితానికి సంబంధించిన పలు అంశాలు కనిపిస్తాయి. నాడు 12వ లోక్‌సభ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ ఫ్రంట్‌లో గందరగోళం ఏర్పడిందని ప్రముఖ రచయిత రాజ్‌కమల్ ప్రకాశన్ ‘శరద్ పవార్: అపనీ షర్తోం పర్’ అనే తన పుస్తకంలో ప్రస్తావించారు. ఆ పుస్తకంలోని వివరాల ప్రకారం.. అప్పటికేప్పటికే పవార్, సోనియా గాంధీల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో ఆమె కాంగ్రెస్ అధ్యక్షురాలిగా, పవార్ లోక్‌సభలో పార్టీ నేతగా ఉన్నారు. పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు కోసం పవార్ స్వయంగా సోనియా గాంధీతో చర్చించి, ఆమె ఆమోదం తీసుకున్నారు. జాబితాను లోక్‌సభ స్పీకర్‌కు పంపారు. మర్నాడు నాటి స్పీకర్ జిఎంసీ బాలయోగి.. పవార్‌కు ఫోన్ చేసి.. ‘నాకు ఇప్పుడొక సమస్య ఏర్పడింది. మీ పార్టీ నుంచి నాకు రెండు జాబితాలు అందాయి. కాంగ్రెస్ చీఫ్ డైరెక్టర్ పీజే కురియన్ నాకు మరో జాబితా పంపారు. ఈ రెండు జాబితాల్లోనూ పేర్లు వేర్వేరుగా ఉన్నాయి’ అని అన్నారు.లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నాయకునిగా ఉన్నందున, కమిటీ సభ్యుల జాబితాను స్పీకర్‌కు సమర్పించడంపై శరద్ పవార్‌కు హక్కు ఉంది. అయితే దీనిని అతిక్రమిస్తూ మరో జాబితా విడుదలైంది. రెండో జాబితా ఫోటోకాపీ అందిన తర్వాత పవార్ వివరాలు తెలుసుకునేందుకు కురియన్ను సంప్రదించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలి సూచనల మేరకే రెండో జాబితాను సిద్ధం చేసినట్లు వారి మాటల్లో వెల్లడైంది. వెంటనే పవార్ స్వయంగా సోనియాను కలిశారు. సోనియాతో మీరు రూపొందించిన జాబితాను ఉపసంహరించుకోవాలని పవార్‌ను కోరారు.1999 మే 15న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పిలుపునిచ్చినట్లు ఆ పుస్తకంలో పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆమె విదేశీయురాలనే అంశం ప్రస్తావనకు వచ్చింది. ఈ సమావేశంలో అర్జున్ సింగ్, ఏకే ఆంటోనీ, గులామ్‌నబీ ఆజాద్, అంబికా సోనీ తదితరులు సోనియాపట్ల తమ విధేయతను ప్రకటించారు. అయితే పీఏ సంగ్మా ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. సంగ్మాకు శరద్ పవార్, తారిఖ్ అన్వర్ మద్దతు పలికారు. కొద్దిరోజుల తరువాత పార్టీ ఈ ముగ్గురినీ పార్టీ నుంచి ఆరేళ్ల పాటు సస్పెండ్ చేసింది. అనంతరం ఈ ముగ్గురూ మరికొందరు నేతల సహాయంతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)ని స్థాపించారు.ఇది కూడా చదవండి: బోరుబావి ప్రమాదాలకు అంతం లేదా? నాలుగేళ్లలో 281 మంది చిన్నారులు మృతి -
పార్లమెంటులో ‘సోరోస్’
న్యూఢిల్లీ: దేశ వ్యతిరేక కార్యలాపాల ఆరోపణలు ఎదుర్కొంటున్న జార్జ్ సోరోస్ ఫౌండేషన్‌తో కాంగ్రెస్ అగ్ర నేత సోనియాగాంధీ సంబంధాల వ్యవహారం సోమవారం పార్లమెంటును కుదిపేసింది. దీనిపై ప్రభుత్వ, ప్రతిపక్షాల ఆందోళనలు, పరస్పర ఆరోపణ, విమర్శలతో ఉభయ సభలూ అట్టుడికాయి. సోరోస్ ఫౌండేషన్ నిధులతో నడుస్తున్న ఫోరం ఆఫ్ డెమొక్రాటిక్ లీడర్స్ ఆసియా పసిఫిక్ (ఎఫ్డీఎల్–ఏపీ) అనే సంస్థకు సోనియా కో ప్రెసిడెంట్‌గా ఎందుకున్నారో చెప్పాలని బీజేపీ సభ్యులు పట్టుబట్టారు. వారి ఆరోపణలన్నింటినీ కాంగ్రెస్ సభ్యులు తోసిపుచ్చారు. అదానీ అంశంపై బదులివ్వలేకే ఉద్దేశపూర్వకంగా దీన్ని తెరపైకి తెచ్చారని మండిపడ్డాయి. ఇరు పక్షాల ఆందోళనల నేపథ్యంలో ఉభయ సభలూ కార్యకలాపాలేవీ చేపట్టకుండానే మంగళవారానికి వాయిదా పడ్డాయి. రాజ్యసభ కార్యకలాపాలు మొదలవగానే సోరోస్ అంశంపై చర్చ జరగాలంటూ సభ నాయకుడు జేపీ నడ్డా పట్టుబట్టారు. ఇది దేశ భద్రతకు సంబంధించిన అతి ముఖ్యమైన అంశమని ఆయనన్నారు. నడ్డాకు మద్దతుగా అధికార పక్ష సభ్యులంతా లేచి నిలబడి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బిగ్గరగా నినాదాలు చేశారు. దాంతో సభ కాసేపు వాయిదా పడింది. తర్వాత కూడా ఈ అంశంపైనే దుమారం సాగింది. జమ్మూ కశీ్మర్‌ను భారత్‌కు సంబంధం లేని ప్రత్యేక ప్రాంతంగా పరిగణించే ఎఫ్డీఎల్–ఏపీ సంస్థతో జార్జ్ సోరోస్ లింకులు ఆందోళన కలిగించే అంశమని నడ్డా అన్నారు. ఇలాంటి వాటి చేతుల్లో కాంగ్రెస్ పావుగా మారిందని ఆరోపించారు. ఎన్డీఏ సభ్యులంతా ఆయనతో గొంతు కలిపారు. తమ డిమాండ్లను పట్టించుకోని చైర్మన్, అధికార పక్షం లేవనెత్తగానే ఈ అంశాన్ని మాత్రం చర్చకు ఎలా అనుమతిస్తారని జైరాం రమేశ్, ప్రమోద్ తివారీ (కాంగ్రెస్) అభ్యంతరం వెలిబుచ్చారు. సభలో లేని సభ్యురాలి ప్రతిష్టకు ఇలా భంగం కలిగించడం సరికాదని విపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆక్షేపించారు. ‘‘దేశ ప్రతిష్టకు భంగం కలిగించజూసే శక్తులతో పొంచి ఉన్న ప్రమాదాన్ని నిర్లక్ష్యం చేయజాలం. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు దన్నుగా నిలుస్తోందని అభియోగాలున్న సంస్థకు ఈ సభలోని సభ్యురాలే కో ప్రెసిడెంట్ అన్నది మర్చిపోరాదు’’ అని చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ బదులిచ్చారు. ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. చైర్మన్ అధికార పక్షం పట్ల పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. లోక్‌సభలోనూ ఇవే దృశ్యాలు కని్పంచాయి. అనంతరం పార్లమెంటు బయట కూడా సోరోస్ అంశంపై కేంద్ర మంత్రి కిరెణ్ రిజిజుతో పాటు బీజేపీ నేతలు సోనియాపై విమర్శలు గుప్పించారు. వాటిని కాంగ్రెస్ నేతలు ఖండించారు.ధన్‌ఖడ్‌పై విపక్షాల ‘అవిశ్వాసం’!రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్‌తో విపక్షాల అభిప్రాయ బేధాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఆయన్ను ఉపరాష్ట్రపతి పదవి నుంచి తొలగించే దిశగా అవి పావులు కదుపుతున్నాయి. ఈ మేరకు రాజ్యసభలో అతి త్వరలో తీర్మానం ప్రవేశపెట్టనున్నట్టు ప్రతిపక్షాలు చెబుతున్నాయి. ‘‘గత ఆగస్టులోనే విపక్ష ఇండియా కూటమి పక్షాలం ఈ దిశగా ప్రయత్నాలు చేశాం. కానీ ధన్‌ఖడ్‌కు మరో అవకాశమివ్వాలనే ఉద్దేశంతో ఊరుకున్నాం. కానీ సోమవారం సభలో ఆయన ప్రవర్తించిన తీరు చూశాక అవిశ్వాస తీర్మానం తప్ప మరో దారి లేదని తేలిపోయింది’’ అని విపక్ష నేతలు కొందరు వెల్లడించారు. ‘‘ధన్‌ఖడ్ ప్రవర్తన ఎంతమాత్మూ ఆమోదయోగ్యం కాదు. బీజేపీకి ఆ పార్టీ అధికార ప్రతినిధి కంటే కూడా విశ్వాసపాత్రునిగా ఆయన వ్యవహరిస్తున్నారు’’ అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్‌తో పాటు సమాజ్‌వాదీ, తృణమూల్ తదితర పారీ్టలు ఈ విషయంలో కలిసొస్తున్నట్టు సమాచారం. ఆరి్టకల్ 67(బి) ప్రకారం తీర్మానాన్ని రాజ్యసభ సాధారణ మెజారిటీతో ఆమోదించాక లోక్‌సభ ఆమోదం కూడా పొందితే ఉపరాష్ట్రపతిని తొలగించవచ్చు. -
నా జీవితంలో మర్చిపోలేను... సోనియాపై సీనియర్ నాయకురాలు సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్పర్సన్ నజ్మా హెప్తుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక విషయాన్ని సోనియా గాంధీకి తెలియజేసేందుకు తాను గంట పాటు ఫోన్ కాల్లో వేచి ఉండాల్సి వచ్చిందని తనను జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకున్నారు. ఆనాటి ఘటన ఇప్పటికీ తన మనసులో అలాగే ఉండిపోయిందని ఆమె చెప్పుకొచ్చారు.మాజీ రాజ్యసభ డిప్యూటీ చైర్పర్సన్, బీజేపీ నాయకురాలు నజ్మా హెప్తుల్లా తన ఆత్మకథ..‘ఇన్ పర్స్యూట్ ఆఫ్ డెమోక్రసీ: బియాండ్ పార్టీ లైన్స్’ను తాజాగా విడుదల చేశారు. ఈ సందర్భంగా తన రాజకీయ జీవితంలో ఎదుర్కొన్న కొన్ని కీలక ఘటనలను ఇందులో వెల్లడించారు. ఈ క్రమంలో 1999లో తాను కాంగ్రెస్ పార్టీలో సభ్యురాలిగా ఉన్న సమయంలో ఎదుర్కొన్న ఓ అవమానాన్ని గుర్తు చేసుకున్నారు.ఆత్మకథలో ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. నజ్మా హెప్తుల్లా 1999లో ఇంటర్-పార్లమెంటరీ యూనియన్ (IPU) అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి చెప్పడానికి ప్రయత్నించారు. నజ్మా హెప్తులా బెర్లిన్ నుంచి ఇండియాలో ఉన్న సోనియా గాంధీకి కాల్ చేశారు. ఆ సమయంలో సోనియా సిబ్బంది ఫోన్ లిఫ్ట్ చేసి మేడమ్ బిజీగా ఉన్నారని ఆమెకు చెప్పారు. దీంతో, గంట పాటు ఆమె.. ఫోన్ కాల్‌లోనే వేచి ఉన్నట్టు చెప్పారు. చివరికి సోనియాతో మాట్లాడకుండానే కాల్ కట్ చేసినట్టు తెలిపారు. ఆ ఘటన తన మనసులో తిరస్కరణ భావాన్ని కలిగింపజేసినట్టు ఆమె చెప్పుకొచ్చారు. అది ఇప్పటికీ తన మనసులో అలాగే ఉన్నట్టు రాసుకొచ్చారు. సోనియా చుట్టూ ఉన్న ఓ కోఠరీనే దీనికి కారణమని ఆరోపించారు. ఈ ఘటనే తనను కాంగ్రెస్ పార్టీకి దూరం చేసిందని అన్నారు.అయితే, సోనియా గాంధీకి కాల్ చేసే ముందు.. తాను ఆనాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి సమాచారం అందించినట్టు చెప్పారు. ఈ సందర్భంగా వాజ్‌పేయి ఆమెతో మాట్లాడి అభినందనలు చెప్పారని గుర్తు చేసుకున్నారు. ఇదే సమయంలో సోనియాపై ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. సోనియా గాంధీ నాయకత్వ శైలిని ఇందిరా గాంధీతో విభేదించారు. పార్టీ నేతలంటే ఆమెకు చులకన భావమనే విధంగా ఆరోపణలు చేశారు. ఇదిలా ఉండగా.. 2004 ఎన్నికల సందర్భంగా సోనియాతో విభేదాలు రావడంతో నజ్మా హెప్తుల్లా కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. ఆమె కాంగ్రెస్ సభ్యురాలిగా ఉన్నప్పుడు పదహారేళ్లపాటు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా ఉన్నారు. ఇక, బీజేపీ ప్రభుత్వంలో 2014-2016 మధ్య కేంద్రమంత్రిగా పనిచేశారు. మైనారిటీ వ్యవహారాల మంత్రిగా కొనసాగారు. అలాగే, 2016 నుండి 2024 మధ్య కాలంలో మూడు సార్లు ఆమె మణిపూర్ గవర్నర్‌గా పనిచేశారు. 2017 నుండి 2023 వరకు జామియా మిలియా ఇస్లామియా ఛాన్స్‌లర్‌గా ఉన్నారు. హమీద్ అన్సారీ మీద భారతీయ జనతా పార్టీ తరఫున ఉప రాష్ట్రపతి పదవికి పోటీ చేసి ఓడారు. ఇక, నజ్మా హెప్తుల్లా.. ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ మనుమరాలు. -
నేటి పార్లమెంట్లో.. ముచ్చటగా ముగ్గురు ‘గాంధీ’ ఎంపీలు
న్యూఢిల్లీ: కేరళలోని వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ మహిళా నేత ప్రియాంకా గాంధీ తన సోదరుడు రాహుల్, తల్లి సోనియా గాంధీలతో పాటు నేడు (గురువారం) పార్లమెంటుకు చేరుకోనున్నారు. ఈరోజు ఆమె లోక్‌సభ ఎంపీగా ప్రమాణం చేయనున్నారు. రాహుల్ గత లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్, రాయ్‌బరేలీ రెండు స్థానాలలో విజయం సాధించారు. తరువాత ఆయన వయనాడ్‌ను వదులుకున్నారు. తాజాగా ఈ స్థానం నుంచి ప్రియాకా గాంధీ పోటీ చేసి నాలుగు లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.2024 లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయకూడదని సోనియా గాంధీ నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత ఆమె రాజ్యసభకు ఎన్నికయ్యారు. సోనియా సంతానం రాహుల్, ప్రియాంక ఇప్పుడు లోక్‌సభకు చేరుకున్నారు. అంటే పార్లమెంటు ఎగువ సభలో తల్లి, దిగువ సభలో కుమారుడు, కుమార్తె కూర్చోనున్నారు.ఇదేవిధంగా సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆయన భార్య డింపుల్ యాదవ్ కూడా లోక్ సభ సభ్యులు. అఖిలేష్ యాదవ్ లోక్‌సభ ఎన్నికల్లో కన్నౌజ్ నుంచి గెలుపొందగా, ఆయన భార్య ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి స్థానం నుంచి ఎన్నికయ్యారు. అఖిలేష్ యాదవ్ బంధువు అక్షయ్ యాదవ్ ఫిరోజాబాద్ స్థానం నుంచి గెలుపొందగా, మరో బంధువు ధర్మేంద్ర యాదవ్ బదౌన్ నుంచి గెలుపొందారు. అఖిలేష్ కుటుంబానికి చెందిన నలుగులు ఎంపీలుగా ఉన్నారు.బీహర్ నేత పప్పు యాదవ్ పూర్నియా లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. ఆయన భార్య రంజిత్ రంజన్ ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ నుండి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. శరద్ పవార్ ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు. 2014 నుంచి ఆయన సభకు ఎన్నికవుతూవస్తున్నారు. ఆయన కుమార్తె సుప్రియా సూలే మహారాష్ట్రలోని బారామతి లోక్‌సభ స్థానం నుంచి ప్రస్తుత ఎంపీగా ఉన్నారు.ఇది కూడా చదవండి: Pakistan: షియా-సున్నీల ఘర్షణ.. 10 మంది మృతి -
సమాజానికి ‘ఎక్స్‌రే’!
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో అన్ని వర్గాలకు సామాజిక న్యాయం జరగాలంటే కులగణన తప్పనిసరని... ఇది సమాజానికి ‘ఎక్స్‌రే’వంటిదని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. సమాజానికి ‘మెగా హెల్త్ చెకప్’జరగాలంటే కులగణన చేసి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో సామాజిక న్యాయ సాధనకోసం చేపట్టే మూడో ఉద్యమంలో కులగణన భాగమని చెప్పారు. ఇప్పటికే తెలంగాణలో కులగణన చేపట్టి, దేశానికే ఆదర్శంగా నిలిచామని పేర్కొన్నారు. మంగళవారం 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏఐసీసీ ఎస్సీ, ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని తోల్‌కటోరా స్టేడియంలో నిర్వహించిన ‘సంవిధాన్ రక్షక్ అభియాన్’కార్యక్రమంలో సీఎం రేవంత్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు.ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి కులగణన అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. వివరాలు ఆయన మాటల్లోనే... ‘‘దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ, బీఆర్ అంబేడ్కర్, ఇందిరాగాంధీ తమ హయాంలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు, బ్యాంకుల జాతీయీకరణ వంటివి తెచ్చారు. 140 కోట్ల మంది పేదలకు రాజ్యాంగపరమైన హక్కులు కల్పించారు. రిజర్వేషన్ల ద్వారా విద్య, ఉద్యోగ అవకాశాలు ఇచ్చారు. అగ్రికల్చర్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ద్వారా పేదలకు భూమి హక్కులు కలి్పంచి వారి గౌరవాన్ని రెట్టింపు చేశారు. అది చరిత్రలో 1.0గా నిలిచింది. ఇక 2.0లో భాగంగా రాజీవ్‌గాంధీ మొదలు పీవీ నర్సింహారావు వరకు మండల్ కమిషన్ ద్వారా ఓబీసీలకు, స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేశారు. 18 ఏళ్లకే ఓటు హక్కు తెచ్చారు. ఐఐటీ, ఐఐఎంలలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళలకు సామాజిక న్యాయం చేశారు. ఎంత జనాభా ఉంటే అంత హక్కు ఇక 3.0లో భాగంగా సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గేల నిర్దేశంలో రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశీ్మర్ వరకు పాదయాత్ర చేసి... నిరుద్యోగులు, పేదలు, రైతులను కలసి కులగణన చేస్తామని హామీ ఇచ్చారు. ‘జిత్నీ భాగీ దారీ.. ఉత్నీ హిస్సే దారీ (ఎంత జనాభా ఉంటే అంత హక్కు)’అని నినదించారు. ఈ కులగణన అనేది ఎక్స్‌రే వంటిది. సమాజానికి ఇది ‘మెగా హెల్త్ చెకప్’వంటిదే. దేశంలో జనాభా ఆధారంగా రిజర్వేషన్లు దక్కాలన్నా, సామాజిక న్యాయం జరగాలన్నా కులగణన తప్పనిసరి. దేశంలోనే తొలిసారి తెలంగాణలో కులగణన మొదలుపెట్టాం. 92శాతం పూర్తయింది. భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకున్నాం. సామాజిక న్యాయం చేయడంలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలబడింది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం జనగణనలో భాగంగా కులగణన కూడా చేపట్టాల్సిందే. కులగణన చేసేంతవరకు మోదీ ప్రభుత్వంపై రాహుల్ ఒత్తిడి తెస్తూనే ఉంటారు.గాంధీ పరివార్.. మోదీ పరివార్ మధ్య యుద్ధందేశంలో ప్రస్తుతం మోదీ పరివార్, గాంధీ పరివార్‡ అని రెండు వర్గాలే ఉన్నాయి. ఇందులో గాంధీ పరివార్ రాజ్యాంగాన్ని రక్షించాలని భావిస్తుంటే... మోదీ పరివార్ రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తోంది. ఈ సమయంలో ప్రజలంతా రాజ్యాంగ రక్షకులైన గాంధీ కుటుంబానికి వెన్నుదన్నుగా నిలవాలి. గతంలో రైతులకు వ్యతిరేకంగా కేంద్రం తెచి్చన నల్లచట్టాలపై రాహుల్ దృఢంగా నిలబడి కొట్లాడారు. రాహుల్ పోరాటంతో కేంద్రం వెనకడుగు వేసింది. అదే రీతిలో కులగణనపై కొట్లాడాలి. ఈ అంశంలో రాహుల్ చేసే ప్రతి పోరాటానికి మద్దతుగా మేముంటాం..’’అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.ఖర్గేతో భేటీ.. ప్రియాంకకు శుభాకాంక్షలు సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో మంగళవారం ఉదయం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో విడిగా కొంతసేపు భేటీ అయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతోపాటు జనగణన ప్రక్రియ సాగుతున్న తీరును వివరించినట్టు సమాచారం. కులగణన ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న డిమాండ్‌పై వారి మధ్య చర్చ జరిగినట్టు తెలిసింది. డిసెంబర్ ఒకటి నుంచి జరగనున్న ప్రజా పాలన దినోత్సవాల ఏర్పాట్లపైనా మాట్లాడుకున్నట్టు సమాచారం. ఇక ఇటీవల వయనాడ్ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన ఎంపీ ప్రియాంకా గాం«దీని రేవంత్, భట్టి విక్రమార్క కలసి శుభాకాంక్షలు తెలిపారు. -
వయనాడ్‌లో ప్రియాంకం
సాక్షి, న్యూఢిల్లీ: కేరళలోని వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ భారీ విజయంతో బోణీ కొట్టారు. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక తన సోదరుడు రాహుల్ గాంధీ రాజీనామాతో అనివార్యమైన వయనాడ్ లోక్‌సభ స్థానం ఉప ఎన్నికల్లో 6,22,338 ఓట్లు సాధించారు. కాగా తన సమీప ప్రత్యర్థి సీపీఐ అభ్యర్థి సత్యన్ మొకెరి కన్నా 4,10,931 ఓట్లు ఎక్కువ సాధించారు.ప్రియాంకతో పోలిస్తే 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ అత్యధికంగా 6,47,445 ఓట్లు సాధించడం విశేషం. ఆనాడు రాహుల్ 3,64,422 ఓట్ల తేడాతో గెలిస్తే శనివారం ప్రియాంక అంతకుమించిన మెజారిటీతో జయకేతనం ఎగరేయడం గమనార్హం. వయనాడ్‌లో గెలిచిన తర్వాత ప్రియాంక కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో ఢిల్లీలో శనివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వయనాడ్ నుంచి పోటీ చేసేందుకు తనకు అవకాశం ఇచ్చినందుకు పార్టీకి, ఖర్గేకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ‘ఎక్స్’వేదికగా వయనాడ్ ఓటర్లకు ప్రియాంక కృతజ్ఞతలు తెలిపారు. ‘నా ప్రియతమ సోదరసోదరీమణులారా.. వయనాడ్‌లో మీరు నాపై ఉంచిన నమ్మకానికి నేను కృతజ్ఞతతో పొంగిపోయా. రాబోయే రోజుల్లో ఈ గెలుపు మీ విజయమని మీరు భావించేలా పనిచేస్తా. మీ కోసం నేను పోరాడతా. పార్లమెంట్లో మీ గొంతు వినిపించేందుకు నేను ఎదురుచూస్తున్నా. నాకు ఈ గౌరవం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నా తల్లి సోనియా, భర్త రాబర్ట్, రత్నాల్లాంటి పిల్లలు రైహాన్, మిరాయా... మీరు నాకు ఇచ్చిన ప్రేమ, ధైర్యానికి ఏ కృతజ్ఞతా సరిపోదు. నా సోదరుడు రాహుల్.. నువ్వు అందరికంటే ధైర్యవంతుడివి. నాకు దారి చూపినందుకు, ఎల్లప్పుడూ నాకు అండగా నిలిచినందుకు ధన్యవాదాలు’’అని ప్రియాంక వ్యాఖ్యానించారు. తన విజయం కోసం కృషిచేసిన యూడీఎఫ్ కూటమి నేతలు, కాంగ్రెస్ నేతలు, వలంటీర్లకు రుణపడి ఉన్నానని ప్రియాంక అన్నారు. ఏప్రిల్‌లో సార్వత్రిక ఎన్నికల వేళ వయనాడ్‌లో 74 శాతంగా నమోదైన పోలింగ్ ఈసారి నవంబర్ ఉప ఎన్నికల్లో 65 శాతానికి తగ్గింది. ప్రియాంకతో పోటీపడిన సత్యన్ మోకెరికి 2,11,407 ఓట్లు, బీజేపీ నాయకురాలు నవ్యా హరిదాస్‌కు కేవలం 1,09,939 ఓట్లు పడ్డాయి. నిఖార్సయిన నేత సోదరుడితో కలిసి ప్రచారవేదికల్లో సరదాగా సంభాషించినా, తండ్రి మరణం, తల్లి నిర్వేదంపై మనసుకు హత్తుకునేలా మాట్లాడి, ప్రజాసమస్యలపై గళమెత్తి తనలోని నిఖార్సయిన రాజకీయనేత పార్శా్యలను అద్భుతంగా ఆవిష్కరించి ఓటర్ల మనసును చూరగొన్నారు. తాజా లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ 99 సీట్లు సాధించడంలో ప్రియాంక కృషి కూడా ఉంది. ‘‘ప్రత్యక్ష రాజకీయాలకు కొత్తేమోగానీ రాజకీయాలకు కొత్తకాదు’’అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు తెగ ప్రాచుర్యం పొందాయి. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ 2019 జనవరిలో ఉత్తరప్రదేశ్ తూర్పు రీజియన్ ఎన్నికల ప్రచారబాధ్యతలను మోశారు. మొత్తం రాష్ట్రానికి జనరల్ సెక్రటరీ(ఇన్చార్జ్)గానూ పనిచేశారు. 1972 జనవరి 12న జని్మంచిన ప్రియాంక ఢిల్లీలోని మోడర్న్ స్కూల్, కాన్వెంట్ ఆఫ్ జీసెస్ అండ్ మేరీ పాఠశాలల్లో చదువుకున్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో సైకాలజీలో డిగ్ర పట్టా పొందారు. బుద్దుని బోధనలపై పీజీ చేశారు. My dearest sisters and brothers of Wayanad, I am overwhelmed with gratitude for the trust you have placed in me. I will make sure that over time, you truly feel this victory has been your victory and the person you chose to represent you understands your hopes and dreams and…— Priyanka Gandhi Vadra (@priyankagandhi) November 23, 2024ఎట్టకేలకు లోక్‌సభకు పార్టీ ప్రచారకర్త నుంచి పార్లమెంట్‌దాకా 52 ఏళ్ల ప్రియాంక స్ఫూర్తిదాయక ప్రస్థానం కొనసాగించారు. టీనేజర్‌గా ఉన్నపుడు తండ్రి ప్రధాని హోదాలో పార్లమెంట్లో ప్రసంగిస్తున్నపుడు పార్లమెంట్లో తొలిసారిగా అడుగుపెట్టిన ప్రియాంక ఇప్పుడు తల్లి సోనియా, సోదరుడు రాహుల్‌తో కలిసి పార్లమెంట్ మెట్లు ఎక్కబోతున్నారు. యూపీఏ ప్రభుత్వాల హయాంలో కాంగ్రెస్ హవా కొనసాగినా ప్రియాంక ఏనాడూ తేరగా పదవులు తీసుకోలేదు. ప్రజాస్వామ్యయుతంగా ఓటర్ల మెప్పుపొందాకే రాజ్యాంగబద్ధ హోదాకు అర్హురాలినని ఆనాడే చెప్పారు. అందుకే దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాసరే ఏనాడూ పదవులు తీసుకోలేదు. నెహ్రూ–గాంధీ కుటుంబం నుంచి పార్లమెంట్‌లోకి అడుగుపెట్టిన 10వ సభ్యురాలుగా ప్రియాంక నిలిచారు. ఆమె కంటే ముందు వారి కుటుంబం నుంచి జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాం«దీ, ఫిరోజ్ గాం«దీ, రాజీవ్ గాంధీ, సంజయ్ గాం«దీ, సోనియా గాం«దీ, మేనకా గాం«దీ, రాహుల్ గాం«దీ, వరుణ్ గాంధీ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. పెద్ద రాష్ట్రాల్లో అధికారంలోలేని ప్రస్తుత తరుణంలో సోదరుడు రాహుల్‌తో కలసి పార్లమెంట్ వేదికగా ప్రజా గొంతుకను బలంగా వినిపించాల్సిన తరుణం వచ్చింది. -
తొలిసారి పోటీ చేస్తున్నా, భారీ మెజారిటీతో గెలిపించండి: ప్రియాంక
తిరువనంతపురం: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా నేడు(బుధవారం) వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికకు కాసేపట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్‌కు ముందు కల్పేట కొత్త బస్టాండ్ నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ భారీ రోడ్‌షో నిర్వహించారు. ప్రియాంక ర్యాలీకి యూడీఎఫ్ నేతలు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు.అనంతరం బహిరంగ సభలో ప్రియాంక మాట్లాడారు. గత 35 ఏళ్లుగా వివిధ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించానని, మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని, తన కోసం తాను ప్రచారం చేసుకుంటున్నానని తెలిపారు. ప్రజలందరి మద్దతు తనకు ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచమంతా తన సోదరుడికి వ్యతిరేకంగా ఉన్న సమయంలో వాయనాడ్ ప్రజలు అండగా నిలిచారని అన్నారు. మీరు ఇచ్చిన మద్దతుతోనే ఆయన దేశంలో 8 వేల కిలోమీటర్ల యాత్ర చేయగలిగారని ఆమె పొగిడారు.‘నా సోదరుడికి మద్దతుగా నిలిచిన మీ అందరికీ మా కుటుంబం రుణపడి ఉంటుందని చెప్పారు. ఆయన ఇప్పుడు మిమ్మల్ని విడిచి వెళ్లాల్సి వచ్చిందని, కానీ నేను ఆయనకు, మీకు మధ్య బంధాన్ని బలోపేతం చేస్తాను. వయనాడ్ నియోజకవర్గం సమస్యల గురించి నా సోదరుడు చెప్పాడు. ఇప్పుడు నేను ప్రత్యక్షంగా మీ సమస్యలు తెలుసుకుంటాను. ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాను. వాయనాడ్‌లో భారీ మెజారిటీతో గెలిపించండి ’ ఆమె హామీ ఇచ్చారు.కాంగ్రెస్ ఎంపీ రాహుల్ మాట్లాడుతూ.. దేశంలో ఇద్దరు ఎంపీలు ఉన్న ఏకైక లోక్‌సభ నియోజకవర్గం వాయనాడ్ అని అన్నారు. దేశంలో ఏ లోక్‌సభ స్థానానికైనా ఒకరే ఎంపీ ఉంటారని, కానీ వాయనాడ్‌కు మాత్రం ఇద్దరు ఎంపీలు ఉంటారని చెప్పారు. ప్రియాంకాగాంధీ అధికారిక ఎంపీగా ఉంటే, తాను అనధికారిక ఎంపీగా కొనసాగుతానని అన్నారు. ఇద్దరం కలిసి వాయనాడ్ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.ప్రియాంక నామినేషన్ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ మాజీ చీఫ్‌లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ హాజరు కానున్నారు. వయనాడ్ జిల్లా కలెక్టర్ ఎదుట ప్రియాంక నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇదిలా ఉండగా తొలిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ. వయనాడ్‌లో ఆమె ముక్కోణపు పోటీ ఎదుర్కొంటున్నారు. దశాబ్దకాలంగా ప్రజాప్రతినిధిగా ఉన్న బీజేప అభ్యర్థి నవ్యా హరిదాస్ ప్రియాంకకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఎల్డీఎఫ్ తరఫున సీపీఐ నేత, మాజీ ఎమ్మెల్యే సత్యన్ మొకెరీ పోటీ చేస్తున్నారు. కాగా ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌బరేలీ, వయనాడ్‌ల నుంచి పోటీ చేసి గెలిచిన రాహుల్ గాంధీ.. వయనాడ్ స్థానాన్ని వదులుకున్నారు. దీంతో ఉపఎన్నిక అనివార్యమైంది. నవంబర్ 13న ఇక్కడ ఉప ఎన్నిక జరగనుంది.#WATCH | Kerala: Congress leader and Lok Sabha LoP Rahul Gandhi arrives in Wayanad for the nomination filing of party's national general secretary and his sister, Priyanka Gandhi Vadra for Wayanad Lok Sabha by-elections. Visuals from Sultan Bathery. pic.twitter.com/EgCeMpGolL— ANI (@ANI) October 23, 2024 -
సోనియాపై ఆరోపణలు.. కంగనాకు కాంగ్రెస్ వార్నింగ్
హిమాచల్ ప్రభుత్వం, సోనియా గాంధీపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. విపత్తు సాయం కోసం ఉద్ధేశించిన నిధులను హిమాచల్ ప్రభుత్వం.. వాటిని సోనియా గాంధీకి అక్రమంగా బదిలీ చేసినట్లు కంగన చేసిన ఆరోపణలను నిరూపించాలని సవాల్ విసిరింది. లేని పక్షంలో ఆమెపై పరువునష్టం కేసు నమోదు చేస్తామని హెచ్చరించింది.ఈ మేరకు హిమాచల్ ప్రదేశ్ మంత్రి విక్రమాదిత్య సింగ్ సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. కంగనా రనౌత్ తన ఆరోపణలను ఉపసంహరించుకోవాలని లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ‘కంగన తన ప్రకటనను ఉపసంహరించుకోకపోతే.. మేం పరువు నష్టం దావా వేస్తాం. ఆమె ఆధారాలతో అలాంటి ప్రకటన చేసింది? సోనియా గాంధీ లాంటి నాయకురాలిపై ఆమె అలాంటి ప్రకటన చేయడం చాలా దురదృష్టకరం.కేంద్రం నుంచి వచ్చే నిధులు లేదా రాష్ట్ర అభివృద్ధికి కేటాయించిన నిధులు సోనియా గాంధీకి ఇస్తున్నారని చెప్పడం కంటే పెద్ద మూర్ఖపు ప్రకటన మరొకటి ఉండదు. ఒక్క రూపాయి అయినా దారి మళ్లినట్లు రుజువు చేయాలి. లేదంటే నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి క్షమాపణ చెప్పాలి. లేకుంటే ఆమెపై కాంగ్రెస్ పరువునష్టం కేసు పెడుతుంది’ అని తెలిపారు.కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఖజానాను ఖాళీ చేశాయన్న విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు కంగనా రనౌత్. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం అప్పులు చేసి మరి సోనియా గాంధీకి నిధులు బదిలీ చేసినట్లు ఆరోపించారు. దీనివల్ల రాష్ట్ర ఖజానాకు గండి పడిందని అన్నారు. ‘కేంద్రం విపత్తు నిధులు ఇస్తే, అది సీఎం రిలీఫ్ ఫండ్‌కు వెళుతుంది. అయితే హిమాచల్‌లో సోనియా రిలీఫ్ ఫండ్‌కు వెళుతుంది’ అని మనాలిలో ఆదివారం జరిగిన బీజేపీ కార్యక్రమంలో పేర్కొన్నారు. -
సోనియాగాంధీపై కంగన సంచలన ఆరోపణలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీపై బీజేపీ ఎంపీ కంగనరనౌత్ సంచలన ఆరోపణలు చేశారు. హిమాచల్ ప్రదేశ్ దివాలా తీయడానికి సోనియాగాంధీయే కారణమన్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులన్నీ సోనియాగాంధీకే వెళ్లాయని,దీనివల్లే రాష్ట్రం దివాలా తీసిందన్నారు.చివరకు వరద సాయానికిగాను విరాళాలుగా వచ్చిన సొమ్ము కూడా సోనియాకే వెళ్లిందని తీవ్ర ఆరోపణలు చేశారు.‘హిమాచల్‌లో కాంగ్రెస్ అవినీతి ఎంతుందనేది ప్రతి ఒక్కరికి తెలుసు.ఈ అవినీతి వల్లే రాష్ట్రం దశాబ్దాల వెనుకబాటుకు గురైంది. ఇందుకే కాంగ్రెస్‌ను కూకటివేళ్లతో పెకిలించాలని హిమాచల్ ప్రజలను కోరుతున్నా’అని కంగన పిలుపిచ్చారు.కాగా,ప్రస్తుతం హిమాచల్‌ప్రదేశ్ నిధులలేమితో దివాలా అంచున ఉంది. దీంతో సీఎం, మంత్రులు,కార్పొరేషన్ల చైర్మన్లు రెండు నెలల పాటు జీతాలు తీసుకోరని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో కంగన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
సీతారాం ఏచూరి పార్ధివదేహానికి సోనియా గాంధీ పుష్పాంజలి
-
2026 మార్చిలో ‘దేవాదుల’ ప్రారంభం
సాక్షి ప్రతినిధి, వరంగల్: దేవాదుల ప్రాజెక్టు పెండింగ్ పనులు 2026 మార్చి లోపు వందశాతం పూర్తి చేసి, అదే నెలలో సోనియాగాంధీ చేతుల మీదుగా ప్రారంభిస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రకటించారు. ఏడాదిలో 300 రోజుల పాటు 60 టీఎంసీల నీటిని వినియోగించుకుని ఏడు జిల్లాలను సస్యశ్యామలం చేస్తామని చెప్పారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని తుపాకులగూడెం దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును శుక్రవారం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, నీటిపారుదల శాఖ నిపుణులతో కలిసి ఆయన సందర్శించారు.దేవాదుల పంప్‌హౌస్ వద్ద ప్రాజెక్ట్ పురోగతిపై ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిర్దేశిత గడువులోపు దేవాదుల పూర్తి చేసి 5.57 లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తామని చెప్పారు. సమ్మక్క సారక్క బరాజ్ ఎన్వోసీ కోసం ఛత్తీస్‌గఢ్‌ను ఒప్పిస్తామన్నారు. ధరలు పెరగడంతో ఇరిగేషన్ ప్రాజెక్టులకు భూసేకరణ ఇబ్బందిగా మారిందని, ఇందుకోసం ప్రత్యేక ఐఏఎస్ అధికారిని నియమిస్తున్నామని తెలిపారు. కాలపరిమితిని పెట్టి వీలైనంత త్వరగా సీతారామసాగర్, పాలమూరు–రంగారెడ్డిలను పూర్తి చేసి వినియోగంలోకి తెస్తామని చెప్పారు. ప్రతి ప్రాజెక్టులో వేల కోట్ల స్కాం ఇరిగేషన్ శాఖను అడ్డుపెట్టుకొని మాజీ సీఎం కేసీఆర్ డెకాయిట్లా వ్యవహరించారని, ప్రతి ప్రాజెక్టులో వేల కోట్ల స్కాం జరిగిందని ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టును నాశనం చేశారని, ఇరిగేషన్ ప్రాజెక్టులపై అవగాహన లేకుండా తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో ప్రాజెక్ట్‌ల పేరుతో రూ.1.81 లక్షల కోట్ల నిధులు ఖర్చుపెట్టారని, రూ.14 వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉంచారని వెల్లడించారు. రూ.1.81 లక్షల కోట్ల నిధులను ఖర్చు చేసినా లక్ష ఎకరాలకు కూడా అదనంగా సాగునీరు ఇవ్వలేకపోయారని విమర్శించారు. దేవాదుల ప్రాజెక్టు పెండింగ్ బిల్లులను తప్పనిసరిగా చెల్లిస్తామని మంత్రి ఈ సందర్భంగా చెప్పారు. 15 ఏళ్లుగా నత్తనడకన దేవాదుల: పొంగులేటి దేవాదుల ప్రాజెక్ట్ పనులు 15 ఏళ్లుగా నత్తనడకలో సాగాయని మంత్రి పొంగులేటి విమర్శించారు. దీనికోసం మరో 3 వేల ఎకరాల భూసేకరణ నవంబర్ 15 లోపు జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు ఇచి్చన హామీ మేరకు, భూములకు నష్టపరిహారం చెల్లిస్తామని తెలిపారు. మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, గండ్ర సత్యనారాయణరావు, మురళీ నాయక్, యశస్వినిరెడ్డి, కేఆర్ నాగరాజు, ప్రభుత్వ కార్యదర్శి ప్రశాంత్ జీవన్‌పాటిల్, ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ పాల్గొన్నారు. చెరువులు ఆక్రమిస్తే ఊపేక్షించం సాక్షి, యాదాద్రి: రాష్ట్ర వ్యాప్తంగా చెరువులు, కుంటలు ఎవరు ఆక్రమించినా ఉపేక్షించేది లేదని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో ఉన్న నీటిపారుదల వనరులపై ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. గత పదేళ్లలో అన్ని శాఖల కంటే ఎక్కువగా నష్టపోయింది నీటిపారుదల శాఖే అని అన్నారు. సీఎం ఆలోచనల మేరకు మూసీ నదిలో నీటి లభ్యతను పెంచుతామన్నారు. అంతకు ముందు హన్మాపురం వద్ద బునాదిగాని కాలువను మంత్రులు పరిశీలించారు. రుణమాఫీకి మరో రూ.500 కోట్లు: పొంగులేటి రైతు రుణమాఫీ కోసం అవసరమైమే అదనంగా మరో రూ.500 కోట్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. ఇంకా ఇవ్వాల్సిన రూ.13 వేల కోట్లతో పాటు అవసరమైతే మరిన్ని నిధులు ఇస్తామన్నారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అ«ధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, వేముల వీరేశం, మందుల సామేల్, మల్రెడ్డి రంగారెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కలెక్టర్ హనుమంతు కే.జెండగే, నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు. -
మీ సోనియా ఇటలీ నుంచి వచ్చారు కదా !
శివాజీనగర: తాను రాజస్థాన్ నుండి వచ్చినవాడైతే మీ పార్టీ అధినాయకురాలు సోనియాగాంధీ ఇటలీ నుండి వచ్చారు, ఆమె కూడా తమ రాష్ట్ర నుండి రాజ్యసభకు ఎంపికయ్యారనేది మరువరాదని మంత్రి ప్రియాంక్ ఖర్గేకు రాజ్యసభ సభ్యుడు లెహర్ సింగ్ ఎదురుదాడికి దిగారు. కేఐఏడీబీ భూముల వ్యవహారాన్ని ప్రశ్నించినందుకు ఖర్గే జూనియర్ వారి స్నేహితులు రాజస్థాన్ వారని తనపై ఆరోపణ చేశారు. తాను అడిగేందుకు ఇష్టపడుతున్నాను. సోనియాగాంధీ రాజస్థాన్ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఇటలీలో జని్మంచారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కే.సీ.వేణుగోపాల్ సికార్‌లో, రణదీప్ సింగ్ సుర్జేవాలా చురులో జని్మంచారు. వారు ఏ రాష్ట్రం నుండి రాజ్యసభకు ఎంపికయ్యారని ఆయన ప్రశ్నించారు. రాజస్థానీ కావటం నేరమా? రాజస్థాన్ పాకిస్థాన్‌లో లేదని అన్నారు. నెహ్రూ కుటుంబం ఉత్తరప్రదేశ్ నుండి వచ్చిందా లేదా కాశీ్మర్ నుండి వచ్చిందా అని ప్రశ్నించారు. తాను 59 సంవత్సరాల నుండి కర్ణాటకలో నివసిస్తున్నాను. తాను కన్నడ మాట్లాడుతున్నాను. చదువుతాను, రాస్తాను. తాను కర్ణాటక బీజేపీలో కోశాధికారి అని, తాను తన పార్టీలో ఎమ్మెల్సీ, ఎంపీగా సేవలందించాను. తాను రాజకీయం వంశం నుండి వచ్చినవాడు కాదు. రాహుల్ గాని, ఖర్గే జూనియర్.. రాళ్లు వేసే ముందు గాజు గదిలో ఉన్నారనేది తెలుసుకోవాలి అని లెహర్ సింగ్ ధ్వజమెత్తారు. -
సోనియా గాంధీకి ‘నూరీ’ ఇష్టం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాందీకి ఎవరంటే ఎక్కువ ఇష్టం? కుమారుడు రాహుల్ గాం«దీనా? లేక కుమార్తె ప్రియాంక గాందీనా? వీరిద్దరూ కాదు. బుజ్జి కుక్కపిల్ల ‘నూరీ’ అంటే సోనియాకు చాలా అభిమానం. ఈ విషయం రాహుల్ గాంధీ స్వయంగా వెల్లడించారు కాబట్టి మనం నమ్మక తప్పదు. జాక్ రస్సెల్ బ్రిటీష్ జాతికి చెందిన నూరీని బ్యాక్ప్యాకప్లో వీపుపై సోనియా కట్టుకున్న సరదా ఫోటోను రాహుల్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశారు. మామ్స్ ఫేవరేట్ అనే వ్యాఖ్య జోడించారు. తన తల్లికి కన్నబిడ్డల కంటే నూరీనే ఎక్కువ ఇష్టమని పేర్కొన్నారు. ఇంట్లో నూరీని చాలా ముద్దు చేస్తుంటారని తెలిపారు. రాహుల్ పోస్టుకు నెటిజన్ల నుంచి విశేషమైన స్పందన లభించింది. 24 గంటల వ్యవధిలో 7.81 లక్షల లైక్‌లు, 5,400 కామెంట్లు వచ్చాయి. నిజానికి కుక్కపిల్ల నూరీని రాహుల్ గతేడాది స్వయంగా సోనియాకు బహూకరించారు. View this post on Instagram A post shared by Rahul Gandhi (@rahulgandhi) అప్పటి నుంచి అది ఆమెకు ప్రీతిపాత్రమైపోయింది. సోనియా కుటుంబంలో ఇప్పుడు అందరికీ అదొక ముఖ్యమైన, ప్రియమైన సభ్యురాలు. ఉత్తర గోవాలోని మపూసా పట్టణంలో 2023 ఆగస్టులో నూరీని రాహుల్ గాంధీ తొలిసారిగా చూశారు. దానిపై ముచ్చటపడ్డారు. కొనుగోలు చేసి, తల్లికి బహూకరించి ఆశ్చర్యపరిచారు. సోనియా కుటుంబ సభ్యులకు జంతవులంటే చాలా ఆపేక్ష. వారి ఇంట్లో చాలాఏళ్లుగా పలు శునకాలు ఉన్నాయి. ‘పిడి’ అనే శునకం రాహుల్ గాంధీ సోషల్ మీడియా పోస్టులో తరచుగా కనిపిస్తూ ఉంటుంది. దానికి చాలామంది అభిమానులున్నారు. -
సోనియా గాంధీ ఇంటికి వెళ్లిన ఎంపీ రఘునందన్ రావు
-
సోనియా నివాసానికి రఘునందన్.. కారణం ఇదే..
సాక్షి, ఢిల్లీ: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పౌరసత్వం విషయంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సోనియా గాంధీ నివాసానికి బీజేపీ ఎంపీ రఘునందన్ రావు చేరుకుని బ్లిట్జ్ పత్రిక కథనంపై జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు.కాగా, బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఢిల్లీలోని సోనియా గాంధీ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ బ్రిటన్ పౌరుడని బ్లిట్జ్ పత్రిక ఇచ్చిన కథనాలను సోనియా ఇంటి వద్ద ఉన్న సెక్యూరిటీకి చూపించి లోపలికి వెళ్లారు. అనంతరం.. సోనియా, రాహుల్ బ్లిట్జ్ పత్రిక కథనంపై జవాబు చెప్పాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. -
‘జయా అమితాబ్ బచ్చన్’ వివాదం.. రాజ్యసభలో విపక్షాల వాకౌట్
న్యూఢిల్లీ: ‘జయా అమితాబ్ బచ్చన్’ ప్రస్తావన రాజ్యసభలో మరోసారి గందరగోళాన్ని సృష్టించింది. సమాజ్‌వాదీ ఎంపీ అయిన జయా బచ్చన్‌ను రాజ్యసభలో శుక్రవారం చైర్మన్ జగదీప్ ధన్ఖర్ జయా అమితాబ్ బచ్చన్‌గా సంబోధించడంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఇప్పటికే జయా బచ్చన్నుఇప్పటికే రెండు సార్లు ఆ పేరుతో పిలవడం వల్ల ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే నేడు మరోసారి ఇదే తంతు పునరావృతం కావడంతో జయా బచ్చన్ అసహనానికి గురయ్యారు. మరోసారి అలా పిలవొద్దని అన్నారు. దీనిపై దన్ఖడ్ ఆగ్రహం వ్యక్తంచేస్తూ.. ‘నాకు పాఠాలు బోధించవద్దు’ అని తీవ్రంగా స్పందించారు. అయితే ఛైర్మన్ క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేయడంతో సభలో గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఛైర్మన్ వైఖరిని నిరసిస్తూ విపక్ష ఎంపీలంతా వాకౌట్ చేశాయి. జయా బచ్చన్‌కు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ శుక్రవారం మధ్యాహ్నం రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. వాకౌట్ తర్వాత జయా బచ్చన్ విలేకరులతో మాట్లాడుతూ.. ఇది అవమానకరమైన అనుభవమని తెలిపారు. అధికార బీజేపీ నేతలు ప్రతిపక్ష ఎంపీల పట్ల వ్యవహరిస్తున్న తీరును విమర్శించారు. ‘ చైర్మన్ ఏదీ మాట్లాడిన చెల్లుతుందా? ఆయన కూడా మనలంటి ఎంపీనే. ఛైర్మన్ ఉపయోగించిన స్వరాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. మేం స్కూల్ పిల్లలం కాదు. మాలో కొందరు సీనియర్ సిటిజన్లు కూడా ఉన్నారు.ప్రతిపక్ష నేత (కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే) మాట్లాడేందుకు నిల్చున్న సమయంలో ఆయన మాట తీరు బాధించింది. మైక్ కట్ చేశారు. అలా ఎలా ప్రవర్తిస్తారు? మీరు సెలబ్రిటీ అయితే ఏంటి నేను పట్టించుకోనంటూ తీవ్ర పదజాలం వాడుతుంటారు. ఆయన పట్టించుకోవాలని నేను అడగడం లేదు. ఐదోసారి నేను రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నా. నాకు తెలీదా ఏం మాట్లాడాలో..? ఇలాంటి ప్రవర్తన పార్లమెంట్లో ఎన్నడూ చూడలేదు. ఆయన మాట్లాడిన తీరు మహిళలకు అగౌరపరిచేలా ఉంది. దీనిపై క్షమాపణలు చెప్పాలి’’ అని ఆమె డిమాండ్ చేశారు. ఆ సమయంలో ఆమె వెంట సోనియా గాంధీ కూడా ఉన్నారు.కాగా ఇటీవల రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణసింగ్.. ‘జయా అమితాబ్ బచ్చన్’ మాట్లాడాలంటూ ఆహ్వానించారు. దీనిపై జయాబచ్చన్ అభ్యంతరం వ్యక్తంచేశారు. ‘జయా బచ్చన్ అంటే సరిపోతుంది’ అంటూ పేర్కొన్నారు. ‘రికార్డుల్లో మీ పూర్తి పేరు ఇలానే ఉంది’ అంటూ చెప్పగా.. ‘మహిళలను వారి భర్త పేరుతోనే పిలస్తారా, వారికంటూ స్వతహాగా గుర్తింపు లేదా’ అంటూ మండిపడ్డారు. అనంతరం గత సోమవారం కూడా జయా అమితాబ్ బచ్చన్ అని సంభోధించారు. దీనిపై ఎంపీ స్పందిస్తూ.. జయా బచ్చన్ అని సంబోధిస్తే సరిపోతుందని అన్నారు.పార్లమెంట్ నిరవధిక వాయిదాపార్లమెంట్ ఉభయసభలు నిరవధికంగా వాయిదాపడ్డాయి. -
అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కండి: సోనియా
న్యూఢిల్లీ: ప్రజామోదం కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉందని ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియాగాంధీ వ్యాఖ్యానించారు. త్వరలో జరగబోయే కీలకమైన రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు సంసిద్ధం కావాలని నేతలకు ఆమె దిశానిర్దేశం చేశారు. బుధవారం ఆమె పార్టీ నేతలు, కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. ‘‘లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పట్ల ప్రజల్లో సానుకూలత బాగా పెరిగింది. ఇది చూసి అతివిశ్వాసాన్ని మీ దరి చేరనీయకండి’ అని నేతలకు హితవు పలికారు. -
సోనియాతో హేమంత్ సోరెన్ భేటీ
న్యూఢిల్లీ: జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ శనివారం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్ సోనియాగాంధీతో భేటీ అయ్యారు. ఇటీవలే సీఎంగా మరోసారి బాధ్యతలు చేపట్టిన హేమంత్ తన భార్య కల్పనతో పాటు 10, జనపథ్ నివాసంలో సోనియాను కలుసుకున్నారు. ఇది కేవలం మర్యాదపూర్వకంగా జరిగిన సమావేశమని అనంతరం మీడియాకు చెప్పారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత సోనియా గాంధీతో సమావేశమవలేదని, జైలు నుంచి విడుదలైనందున ఆమెతో మాట్లాడేందుకు వచ్చినట్లు వివరించారు. మరికొద్ది నెలల్లో జరగాల్సిన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలపై చర్చించారా అని అడగ్గా..రాజకీయాలు ప్రస్తావనకు రాలేదని స్పష్టం చేశారు. భూకుంభకోణం మనీలాండరింగ్ కేసులో జనవరి 31వ తేదీన అరెస్టయిన హేమంత్ అంతకు కొద్ది గంటల ముందే సీఎం పదవికి రాజీనామా చేశారు. జైలులో 5 నెలలపాటు ఉన్న ఆయన బెయిల్ రావడంతో జూలై 4న విడుదలయ్యారు. అనంతరం మరోసారి సీఎం పదవి చేపట్టడం తెల్సిందే. -
వైఎస్ఆర్ పాదాల చెంతకు సోనియా, రాహుల్ గాంధీ?
-
వైఎస్ రాజశేఖరరెడ్డి మహోన్నత నాయకుడు... ఆయన లేరని ప్రతిరోజూ విచారిస్తూనే ఉన్నాం... సందేశం విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీశ.. ఇంకా ఇతర అప్డేట్స్
-
Sonia Gandhi: ఫలితాలు ప్రధానికి నైతిక ఓటమే
న్యూఢిల్లీ: ఎన్డీఏ కూటమికి మెజారిటీ తగ్గిస్తూ తాజా లోక్‌సభ ఎన్నికల్లో వెలువడిన ప్రజాతీర్పు ప్రధాని మోదీ వ్యక్తిగత, రాజకీయ, నైతిక ఓటమికి నిదర్శనమని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ విమర్శించారు. ఒక జాతీయ పత్రికలో రాసిన సంపాదకీయంలో మోదీ, ఎన్డీఏ ప్రభుత్వంపై సోనియా విమర్శలు సంధించారు. ‘‘ ఎన్నికల ప్రచారంవేళ తానొక దైవాంశ సంభూతుడిని అన్నట్లు స్వయంగా ప్రకటించుకుని 400 సీట్ల ఖాయమని భ్రమలో గడిపిన ప్రధాని మోదీకి జూన్ 4న వెల్లడైన ఫలితాలు ప్రతికూల సంకేతాలు చూపించాయి. విభజన, విద్వేష రాజకీయాలు, మోదీ పరిపాలనా విధానాలను ప్రజలు తిరస్కరిస్తున్నట్లు నాటి ఫలితాల్లో వెల్లడైంది. ఏకాభిప్రాయం ఉండాలని మోదీ వల్లెవేస్తారుగానీ ఆచరణలో అవేం ఉండవు. స్పీకర్ ఎన్నికలు ఇందుకు తార్కాణం. డెప్యూటీ స్పీకర్ పదవి విషయంలో విపక్షాల సహేతుక విజ్ఞాపనను పట్టించుకుంటే స్పీకర్ ఎన్నిక విషయంలో ప్రభుత్వానికి మేం సంపూర్ణ మద్దతు ఇస్తామని ‘ఇండియా’ కూటమి స్పష్టంచేసింది. అయినాసరే మోదీ వైఖరి మారలేదు. 17వ లోక్‌సభలోనూ డెప్యూటీ స్పీకర్ పదవిని విపక్షాలకు కేటాయించలేదు’’ అని అన్నారు. అంతటి మెజారిటీ మోదీ సర్కార్‌కు రాలేదు ‘‘రాజ్యాంగంపై ఎన్డీఏ దాడి అంశం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే లోక్‌సభ తొలి సెషన్లోనే ఎమర్జెన్సీ అంశాన్ని మోదీ సర్కార్ పదేపదే ప్రస్తావించింది. పారీ్టలకతీతంగా, పక్షపాతరహితంగా వ్యవహరించాల్సిన స్పీకర్ కూడా అదే బాటలో పయనిస్తూ ‘ఎమర్జెన్సీ’పై తీర్మానం చదవడం దిగ్భ్రాంతికరం. నాటి ఎమర్జెన్సీకి కారణమైన ఇందిరాగాం«దీని ఆనాడు ప్రజలు తిరస్కరించినా తర్వాత సార్వత్రిక ఎన్నికల్లో ఆమెకు ఓటర్లు బ్రహ్మరథం పట్టారు. భారీ మెజారిటీతో గెలిపించారు. అంతటి మెజారిటీ మోదీ సర్కార్‌కు కూడా రాలేదు’’ అని సోనియా అన్నారు. ఆ మూడు చట్టాల అమలు నిలిపేయాలి ‘‘పార్లమెంట్లో దారుణమైన భద్రతావైఫల్యాన్ని ఎలుగెత్తిచాటినందుకు అక్రమంగా ఇరుసభల్లో 146 మంది విపక్ష సభ్యులను బహిష్కరించారు. వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే కీలకమైన మూడు నూతన నేర బిల్లులను ఎలాంటి చర్చ జరపకుండానే ఏకపక్షంగా చట్టాలుగా ఆమోదింపజేసుకున్నారు. బిల్లులను సంస్కరించాల్సిఉందని, చర్చ జరగాలని ఎందరో న్యాయకోవిదులు మొత్తుకున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. అందుకే వీటిపై సమగ్ర చర్చ జరగాలి. అప్పటిదాకా ఈ నేర చట్టాల అమలును తాత్కాలికంగా నిలిపేయాలి’’ అని సోనియా అన్నారు. నీట్ లీకేజీలపై ప్రధాని మాట్లాడరా? ‘‘లక్షలాది మంది యువత భవిష్యత్తును ఛిద్రం చేస్తూ నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ ఉదంతం వెలుగుచూస్తే మోదీ మాట్లాడరా? పరీక్ష పే చర్చా అంటూ తరచూ విద్యార్థులతో మాట్లాడే మోదీ ఈసారి ఎందుకు అదే విద్యార్థులకు మరోసారి పేపర్ లీక్ కాబోదని భరోసా ఇవ్వలేకపోతున్నారు? దారుణ నిర్లక్ష్యానికి విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించాలి. ఎన్సీఈఆర్టీ, యూజీసీ, విశ్వవిద్యాలయాల్లో ప్రమాణాలు గత పదేళ్లలో ఎంతగా పడిపోయాయో ఇట్టే అర్థమవుతోంది’’ అని అన్నారు. -
నైతిక, రాజకీయ ఓటమి...
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ఫలితాలను ప్రధాని నరేంద్ర మోదీకి నైతిక, రాజకీయ ఓటమిగా సోనియాగాంధీ అభివర్ణించారు. ‘‘కనుక మోదీ దేశానికి నాయకత్వం వహించే నైతిక హక్కు కోల్పోయారు. ఎందుకంటే బీజేపీని, భాగస్వామ్య పక్షాలను పూర్తిగా పక్కన పెట్టారు. కేవలం తన పేరుతోనే ప్రజా తీర్పు కోరారు. కనుక ఓటమికి ఆయనే పూర్తి బాధ్యత వహించాలి. కానీ ఆ పని చేయకపోగా మరోసారి గద్దెనెక్కేందుకు సిద్ధపడుతున్నారు’’ అంటూ దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌గా సోనియా తిరిగి ఎన్నికయ్యారు. శనివారం సీడబ్ల్యూసీ భేటీ అనంతరం పార్లమెంటు సెంట్రల్ హాల్లో జరిగిన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలంతా ఈ మేరకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. అనంతరం ఎంపీలనుద్దేశించి ఆమె మాట్లాడారు. ‘‘మోదీ నైజం తెలిసిన వారెవరూ ప్రజా తీర్పును ఆయన గౌరవిస్తారని, పాలన తీరుతెన్నులను మార్చుకుంటారని అనుకోరు. కనుక మోదీ సర్కారు తీరును వేయి కళ్లతో గమనించడం, ప్రజా వ్యతిరేక చర్యలను ఎప్పటికప్పుడు ఎండగట్టడం మనందరి బాధ్యత. లౌకిక, ప్రజాస్వామ్య విలువలకు పాతరేసే యత్నాలను అడ్డుకుంటూ పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి’’ అని ఎంపీలకు ఉద్బోధించారు. ‘‘అయితే లోక్‌సభలో కాంగ్రెస్‌తో పాటు ఇండియా కూటమి సభ్యుల సంఖ్య భారీగా పెరిగింది. పార్లమెంటులో మోదీ సర్కారు ఏకపక్ష పోకడలు గత పదేళ్ల మాదిరిగా సాగబోవు. చర్చల్లేకుండా బిల్లుల ఆమోదం, విపక్ష సభ్యులను అవమానించడం, సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించడం వంటివి చెల్లబోవు’’ అన్నారు. మనకు ఏకంగా శ్రద్ధాంజలి ఘటించారు... ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఎలాగైనా కుప్పకూల్చేందుకు అధికార పార్టీ చేయని ప్రయత్నం లేదని సోనియా అన్నారు. ‘‘పారీ్టని ఆర్థికంగా కుంగదీశారు. అందరిపైనా కేసులు పెట్టి వేధించారు. చాలామంది కాంగ్రెస్‌కు ఏకంగా శ్రద్ధాంజలే ఘటించారు! కానీ బీజేపీ కుటిల యత్నాలన్నింటినీ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు మొక్కవోని దీక్షతో అడ్డుకున్నారు. కలసికట్టుగా శ్రమించి మంచి ఫలితాలు సాధించారు. వారి ధైర్యానికి మా సెల్యూట్. ఈ విజయంలో అధ్యక్షుడు ఖర్గేది కీలక పాత్ర. ఆయన మనందరికీ స్ఫూర్తిగా నిలిచారు. ఖర్గే నుంచి అందరూ ఎంతో నేర్చుకోవాలి. అలాగే చరిత్రాత్మక భారత్ జోడో యాత్రలు చేసిన రాహుల్ ప్రత్యేక అభినందనలకు అర్హుడు’’ అన్నారు. పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఆశించిన ఫలితాలు సాధించకపోవడంపై ఆత్మశోధన జరగాలని ఎంపీలను కోరారు. సీపీపీ చైర్‌పర్సన్‌గా తిరిగి ఎన్నికవడం తనకెంతో భావోద్వేగపూరిత క్షణమని సోనియా అన్నారు. ‘‘మీరంతా నాపై ఎంతో ప్రేమ చూపుతూ వస్తున్నారు. మీ నమ్మకాన్ని కాపాడుకోవడానికి శాయశక్తులా కృషి చేస్తా’’ అని చెప్పారు. -
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌గా సోనియా.. రాహుల్ నిర్ణయంపైనే ఉత్కంఠ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌గా మరోసారి సోనియా గాంధీని ఎన్నుకున్నారు. శనివారం సాయంత్రం జరిగిన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు సీడబ్ల్యూసీ భేటీలో రాహుల్ గాంధీని లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా తీర్మానం జరిగింది. అయితే ఆ తీర్మానానికి రాహుల్ అంగీకరించనట్లు సమాచారం. కాసేపట్లో దీనిపై ఒక స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. -
ఇండియా కూటమిలోకి కొత్త పార్టీలను ఆహ్వానిస్తున్నాం: ఖర్గే
-
స్మృతి ఇరానీకి చుక్కలు చూపించిన కేఎల్ శర్మ ఎవరు?
లోక్‌సభ ఎన్నికల ఫలితాలు సంచలనం రేపుతున్నాయి. యూపీలోని అమేథీ లోక్‌సభ స్థానం నుంచి పోటీకి దిగిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వెనుకంజలో ఉండటం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన కిషోరి లాల్ శర్మ (కేఎల్ శర్మ) ఓట్ల ఆధిక్యంతో స్మృతీ ఇరానికి చుక్కలు చూపిస్తున్నారు. కాంగ్రెస్ వ్యూహం, దూకుడుతనం, ఎన్నికల ప్రచారం కేఎల్ శర్మకు కలసివచ్చే అంశాలుగా పరిణమించాయని అంటున్నారు. ఈ నేపధ్యంలో కేఎల్ శర్మ బ్యాక్ గ్రౌండ్ ఏమిటో తెలుసుకునేందుకు పలువురు ఆసక్తి చూపిస్తున్నారు.కెఎల్ శర్మకు గాంధీ కుటుంబంతో పాత పరిచయం ఉంది. చాలా కాలంగా రాయ్‌బరేలీలో ఉంటూ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సలహాదారుగా శర్మ వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యకలాపాల్లో కీలకపాత్ర పోషించే ఆయన గాంధీ కుటుంబపు ఎన్నికల ప్రచారంలోనూ కీలకపాత్ర పోషిస్తుంటారు. కెఎల్ శర్మ రాజీవ్ గాంధీకి కూడా అత్యంత సన్నిహితునిగా పేరొందారు.కేఎల్ శర్మ అమేథీలో 1983, 1991 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎంతగానో పాటుపడ్డారు. 1999లో సోనియా గాంధీ మొదటి ఎన్నికల ప్రచారంలో కూడా శర్మ కీలక పాత్ర పోషించారు. ఆయన కృషి కారణంగానే అమేథీలో సోనియా విజయం సాధించారని చెబుతారు. అయితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీని బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ ఓడించారు. మరి ఇప్పుడు కెఎల్ శర్మ ఎటువంటి ఫలితాలు రాబడతారనే దానిపై అందరి దృష్టి నెలకొంది. -
ఎగ్జిట్ పోల్స్‌పై సోనియా ఆసక్తికర వ్యాఖ్యలు
2024 లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్ 4న జరగనుంది. అనంతరం ఫలితాలు వెలువడనున్నాయి. ప్రధాని మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. అయితే విపక్షాల ఇండియా కూటమి కూడా తమకు మంచి మెజారిటీ వస్తుందని చెబుతోంది.తాజాగా ఎగ్జిట్ పోల్స్‌పై కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఒక ప్రకటనలో స్పందించారు. రేపు రానున్న ఎన్నికల ఫలితాలను ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ సవాల్ చేస్తున్నాయని అన్నారు. ఫలితాల కోసం వేచి చూడాల్సిందేనని సోనియా అన్నారు.. జస్ట్ వెయిట్ అండ్ సీ.. ఎగ్జిట్ పోల్స్ చెబుతున్న దానికి పూర్తి విరుద్ధంగా ఫలితాలు వస్తాయనే పూర్తి ఆశతో ఉన్నామని సోనియా గాంధీ పేర్కొన్నారు.ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్ అంచనాల ప్రకారం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ (నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్) మొత్తం 543 లోక్‌సభ స్థానాల్లో 371 నుండి 401 స్థానాలను గెలుచుకునే అవకాశాలున్నాయి. దీనిలో బీజేపీకి 319 నుంచి 338 సీట్లు వస్తాయని అంచనా. ఇదే జరిగితే పార్లమెంటులో ఎన్డీఏ దాదాపు మూడు వంతుల మెజారిటీకి చేరుకుంటుంది. VIDEO | “We have to wait. Just wait and see. We are very hopeful that our results are completely the opposite to what the exit polls are showing,” says Congress leader Sonia Gandhi.Lok Sabha elections 2024 results will be declared tomorrow. #LSPolls2024WithPTI… pic.twitter.com/xIElzUjJ8P— Press Trust of India (@PTI_News) June 3, 2024 -
పరేడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా ఆవిర్భావ వేడుకలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఆదివారం ఉదయం సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఈ వేడుకలు జరిగాయి. ఉదయం 9.30 గంటల సమయంలో గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్ద సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు నివాళులు అర్పించారు. 9.55 గంటలకు పరేడ్ గ్రౌండ్స్‌కు చేరుకున్నారు. సీఎం రేవంత్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి.. వివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్ర అధికారిక గేయంగా ఖరారు చేసిన అందెశ్రీ రచన ‘జయ జయహే తెలంగాణ..’సంక్షిప్త రూపాన్ని ఆవిష్కరించారు. ఈ గేయాన్ని వినిపిస్తున్న సమయంలో కవి అందెశ్రీ భావోద్వేగంతో కన్నీటి పర్యంతమవడం కనిపించింది. కేసీఆర్ కోసం ప్రత్కేకంగా సోఫా..: రాష్ట్ర ఆవి ర్భావ వేడుకలకు రావాలంటూ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సీఎం రేవంత్ ఆహ్వనం పంపిన విషయం తెలిసిందే. ఆదివారం పరేడ్ గ్రౌండ్స్ సభలో ముందు వరసలో కేసీఆర్ కోసం ప్రత్యేకంగా సోఫా ఏర్పా టు చేశారు. కేసీఆర్‌కు కేటాయించిన స్థానం అంటూ కాగితంపై రాసి ఉంచారు.సోనియాగాంధీ వీడియో సందేశం వేడుకలకు ముఖ్య అతి థిగా సోనియాగాంధీని సీఎం రేవంత్ ఆహ్వానించినా.. అనివార్య కారణాలతో రాలేకపోయారు. అయితే తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ సోనియా ఒక వీడియో సందేశం పంపారు. పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన ఎల్రక్టానిక్ తెరలపై ఈ సందేశం వీడియోను ప్రదర్శించారు. ‘‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎందరో అమరవీరుల త్యాగఫలం. రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులందరికీ నివాళులు అర్పిస్తున్నాను.తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను గుర్తించి 2004 లో కరీంనగర్ సభలో హామీ ఇచ్చాను. అది సొంత పార్టీలో అసమ్మతి స్వరాలకు కారణమైంది. కొందరు నేతలు మా నిర్ణయంతో విభేదించారు. అయినా మాట నిలబెట్టుకుంటూ తెలంగాణ ఏర్పాటు చేశాం. ఇప్పుడు రాష్ట్ర ప్రగతికి కట్టుబడి ఉన్నాం. సీఎం రేవంత్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీ హామీలు నెరవేరుస్తుంది. ప్రజలకు శుభం జరగాలి. జైహింద్.. జై తెలంగాణ’’అని వీడియో సందేశంలో సోనియా పేర్కొన్నారు. -
తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ సందేశం
-
సోనియా వల్లే ఆత్మహత్యలు.. బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్
సాక్షి, ఢిల్లీ: సోనియా గాంధీని తెలంగాణ ఉత్సవాలకు ఆహ్వానించిన రేవంత్.. బీజేపీ నాయకులకు ఆహ్వానం ఇవ్వలేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ మండిపడ్డారు. శనివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఇచ్చిన మాట సోనియా వెనక్కి తీసుకోవడం వల్లే ఆత్మహత్యలు జరిగాయని వ్యాఖ్యానించారు.కేసీఆర్‌ను వెతికి మరి ఆహ్వానం ఇచ్చి ప్రేమ ఒలకబోసిన రేవంత్‌కు, తెలంగాణకు మద్దతు ఇచ్చిన బీజేపీని ఎందుకు పిలవడం లేదని ప్రశ్నించారు. సోనియా, కేసీఆర్ ఒకే వేదిక పంచుకునేలా ఎత్తుగడ వేశారు. ఫోన్ ట్యాపింగ్‌లో బయటపడేందుకు కేసీఆర్, కాంగ్రెస్‌ను అన్ని రకాల లోబరుచుకున్నారు. అందుకే కాళేశ్వరం కేసు, ఫోన్ ట్యాపింగ్‌పై రేవంత్ చర్యలు తీసుకోవడం లేదు. అందుకే ఈ కేసుల దర్యాప్తు సీబీఐకి అప్పగించాలి’’ బండి సంజయ్ డిమాండ్ చేశారు.‘‘కేంద్రం దర్యాప్తు చేస్తే, కవిత అరెస్టు ఎలా జరిగిందో చూశారు. ఏఐసీసీకి తెలంగాణ ఒక ఏటిఎంగా మారింది. తెలంగాణ అధికారిక చిహ్నంలో చార్మినార్ ఉండొద్దు. తెలంగాణ అధికారిక చిహ్నంలో అమర వీరుల స్తూపం ఉంటే మంచిదే’’ అని బండి సంజయ్ పేర్కొన్నారు. -
TG: గవర్నర్‌కు ఆహ్వానం.. సోనియా రాక డౌటే!
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల వేడుకలకు గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు ప్రభుత్వం తరఫున ఆహ్వానం వెళ్లింది. శనివారం ఉదయం రాజ్‌భవన్ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆ ఆహ్వానం గవర్నర్‌కు అందించారు. జూన్ 2న సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్వహించాలని నిర్ణయించింది. రాజకీయ పార్టీలకు, పలువురు నేతలకు హాజరు కావాలని ఆహ్వానం పంపింది. ఈ సందర్భంగా పలు అధికారిక కార్యక్రమాలు జరగనున్నాయి. మరోవైపు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ పరిసరాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. జూన్ 2న ఉదయం పరేడ్ మైదానంలో జాతీయ జెండా ఆవిష్కరణ, ఇతర కార్యక్రమాలు ఉంటాయి. సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన కళాబృందాలతో ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు.సోనియా రాక అనుమానమే!ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీకి ఆహ్వానం వెళ్లింది. ఢిల్లీ వెళ్లి మరీ సీఎం రేవంత్‌రెడ్డి సోనియాకు ఆహ్వానం అందించారు. ఈలోపు రేపటి వేడుకల కార్యక్రమాల్లోనూ ఆమె ఐదు నిమిషాలు ప్రసంగిస్తారని ఉంది. దీంతో ఆమె రాక ఖరారైందని అంతా అనుకున్నారు. అయితే ఆమె అనారోగ్యం.. పైగా ఎండలు తీవ్రంగా ఉండడంతో ఈ పర్యటన రద్దయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటివరకైతే సోనియా కార్యాలయం తెలంగాణ పర్యటనపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. -
ఇది కదా జగన్ అంటే.. ఆ రికార్డ్ ఆయనకే సొంతమవుతుంది.!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మే 30న తన పదవీకాలం ఐదేళ్లు సంపూర్ణంగా పూర్తి చేసుకున్నందుకు ముందుగా అభినందనలు, శుభాకాంక్షలు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఇలాగే ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా 2014లో ఎన్నికయ్యాక ఐదేళ్లు పాలన చేసినట్లే అయినా, సాంకేతికంగా చూస్తే ఆయన ఎనిమిది రోజులు ముందుగానే పదవి కోల్పోయారు. ఎందుకంటే చంద్రబాబు 2014 జూన్ 8న పదవీ చేపట్టగా, ఎన్నికల్లో ఓడిపోయి 2019 మే 30 కంటే ముందే సీఎం పదవిని వదలిపెట్టవలసి వచ్చింది. కానీ వైస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డిలకు ఆ ఇబ్బంది రాలేదు. చంద్రబాబునాయుడు 1995లో తన మామ ఎన్టీఆర్‌ను కూలదోసి సీఎంగా అధికారం చేపట్టారు. 1999 అక్టోబర్ లో రెండోసారి అధికారంలోకి వచ్చినా, 2003లో అసెంబ్లీని రద్దు చేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో ఓటమి కారణంగా 2004 మే నెలలోనే పదవిని కోల్పోయారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మిగిలిన సీఎంల కన్నా విభిన్నమైన రాజకీయవేత్త అని చెప్పాలి. వైఎస్సార్సీపీను స్థాపించడం, ఆ తర్వాత ఆయన అనేక కష్ట, నష్టాలు ఎదుర్కోవడం అంతా ప్రజలు గమనించారు. అక్రమ కేసులలో ఆయన జైలులో ఉన్నప్పుడు, ఆయన కోసం రాజీనామా చేసిన వారి నియోజకవర్గాలలో జరిగిన ఉప ఎన్నికలలో వైఎస్సార్సీపీ సంచలనాత్మకమైన రీతిలో గెలుపొందడం కూడా విశేషమే.2014 సాధారణ ఎన్నికలలో YSRCP అధికారంలోకి రాలేకపోయినా, గౌరవనీయ సంఖ్యలో విజయాలు సాధించింది. విపక్షంలో ఉన్నప్పుడు 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేసినా, వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో పోరాట పటిమ తగ్గలేదు. తదుపరి సైతం అనేక పోరాటాలు చేయవలసి రావడం వంటి ఘట్టాల నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019లో చరిత్రాత్మకమైన రీతిలో విజయం సాధించారు. ఉమ్మడి రాష్ట్రంలో సైతం ఎవరికి సాధ్యం కానీ రీతిలో దాదాపు 50 శాతం ఓట్లు సాధించి 151 సీట్లతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగలగడం ఒక రికార్డు. ఉమ్మడి ఏపీలో NTR, KCR, YS జగన్మోహన్ రెడ్డిలే సొంత పార్టీ పెట్టుకుని అధికారంలోకి రాగలిగారు. తెలుగు రాష్ట్రాలలో తండ్రులు ముఖ్యమంత్రులు అయ్యాక, వారి కుమారులు పలువురు రాజకీయాలలోకి వచ్చి మంత్రులు కాగలిగారు తప్ప, ముఖ్యమంత్రి అయింది మాత్రం YS జగన్మోహన్ రెడ్డి ఒక్కరే.వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అడుగుజాడల్లో 2009 లోనే ఎంపీగా గెలుపొందిన మాట నిజమే. కానీ వైఎస్ రాజశేఖరరెడ్డి అనూహ్య మరణం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు ఒకరకంగా చెప్పాలంటే గందరగోళంలో పడింది. మెజార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చినా, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాందీ మాత్రం అప్రజాస్వామికంగా వ్యవహరించి అవకాశం ఇవ్వలేదు. అదే ఆయనకు ఛాలెంజ్‌గా మారింది. సొంతంగా పార్టీ పెట్టుకున్నారు, తనదైనా పంథాలో ముందుకు సాగారు, గెలిచినా, ఓడినా సొంత రాజకీయం సాగించారు. సోనియాగాంధీ చేతిలో కేంద్ర ప్రభుత్వం ఉన్నందున కేసులు పెడుతుందన్న భయంతో వైఎస్ సన్నిహితులు సైతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట నడవడానికి భయపడినా, తాను మాత్రం తిరుగుబాటు వీరుడుగానే జనంలోకి వెళ్లి వారి హృదయాలను గెలుచుకున్నారు.మామ ఎన్టీఆర్‌నే కుట్ర పూరితంగా సీఎం పదవిని లాగిపడేసిన వ్యక్తి చంద్రబాబు. ఎప్పుడు ఎవరితో అవసరమైతే వారితో పొత్తు పెట్టుకోగల వ్యక్తి, ఆచరణ సాద్యం కానీ హామీలు ఇచ్చే వ్యక్తిగా పేరొందిన చంద్రబాబు వంటి నేతను ఢీకొట్టడం అంటే తేలిక కాదని చాలామంది భావిస్తారు. కుట్ర రాజకీయాలలో ఘనాపాటిగా పేరొందిన చంద్రబాబును ఓడించడం ద్వారా రాజకీయాలలో విశ్వసనీయతకు ప్రాధాన్యం ఉందని మొదటిసారిగా రుజువు చేసిన నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు తెచ్చుకున్నారు. అనైతిక రాజకీయాల జోలికి వెళ్లకుండా, ప్రజలకు తాను ఏమి చెప్పానో, అవి చేయాల్సిందే అనే పట్టుదలతో కృషి చేసిన ముఖ్యమంత్రిగా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తింపు పొందారు.చంద్రబాబు 2014 లో తాను ఇచ్చిన మానిఫెస్టోని మాయం చేస్తే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019లో తాను ప్రకటించిన మానిఫెస్టోని మంత్రులు, ఐఎఎస్ అధికారులకు ఇచ్చి అమలు చేయాల్సిందేనని చెప్పి కొత్త సంస్కృతికి నాంది పలికారు. గతంలో ఏ ముఖ్యమంత్రి ఇంత సాహసోపేతంగా సంక్షేమ పథకాలు చేయలేదని చెప్పాలి. అంతేకాదు... తన టరమ్ పూర్తి అవుతున్న తరుణంలో మానిఫెస్టో కాపీలతో పాటు, ఏ కుటుంబానికి ఎంత మేలు చేసింది వివరిస్తూ ప్రతి ఇంటికి అభివృద్ది నివేదికలను తన ఎమ్మెల్యేల ద్వారా అందించి కొత్త ట్రెండ్ సృష్టించిన నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పాలి. మనిషిని చూస్తే ఈయన నిజంగానే ఇన్ని చేశారా అనిపిస్తుంది. ఇంతమంది ఆయనపై కక్ష కడితే వారందరిని ఒంటి చేత్తో ఎదుర్కున్నారా? అనే భావన వస్తుంది. బక్కపలచగా ఉండి, సింపుల్ డ్రెస్‌లో కనిపించే ఈయన ఏపీలో ఇన్ని వ్యవస్థల్లో సమూల మార్పులు తీసుకొచ్చి ప్రజల ముందుకు పరిపాలనను తెచ్చి రాష్ట్రాన్ని సరికొత్తగా మార్చగలరని ఎవరూ ఊహించి ఉండకపోవచ్చు.ప్రభుత్వంలోని దాదాపు అన్నీ రంగాలలో తనదైన మార్కును వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూపించగలిగారు. పేదలు vs పెత్తందార్లు అనే నినాదాన్ని చేపట్టినప్పటికీ, రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వ్యవస్థలను ఆయన తెచ్చారంటే అతిశయోక్తి కాదు. కరోనా సంక్షోభ సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న చొరవ, వ్యాధి పాలిట పడిన వారికి అందించిన వైద్యసేవలు మొదలైనవి ప్రశంసనార్హం. ఆ టైమ్‌లో సైతం స్కీములను అమలు చేసి ఆదుకున్న నేతగా ప్రజల గుండెల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిరస్థాయిగా నిలిచిపోయారంటే ఆశ్చర్యం కాదు. ఓ రకంగా ఆంధ్రప్రదేశ్‌లో ఆయన రోల్ మోడల్ ప్రభుత్వాన్ని నడిపారు. దేశంలోనే ఎవరూ చేయని సరికొత్త ప్రయోగాలు చేశారని చెప్పాలి. అందులో అనేకం కీలకంగా ఉన్నాయి.వలంటీర్ల వ్యవస్థను పెడతానని ఎన్నికల మానిఫెస్టోలో చెప్పినప్పుడు ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు. ప్రభుత్వంలోకి రాగానే వలంటీర్లను పెడుతుంటే వీరంతా ఏమి చేస్తారో అనే అభిప్రాయం ఉండేది. రెండున్నర లక్షల మంది స్వచ్చంద సైన్యాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తయారు చేశారన్న సంగతి ఆ తర్వాత కానీ జనానికి అర్దం కాలేదు. వలంటీర్లు ఇళ్లకు వచ్చి కుశల సమాచారం అడగడం కాదు.. వారి పరిపాలనకు సంబంధించిన అవసరాలను తీర్చే వ్యవస్థగా మారారు. ప్రభుత్వం చుట్టూ తిరగడం కాదు. ప్రభుత్వమే ప్రతి ఒక్కరి గడప వద్దకు వెళ్లి సేవలందించడం అని పరిపాలనకు కొత్త నిర్వచనం ఇచ్చి అమలు చేయడం అతి పెద్ద విజయం అనిపిస్తుంది. గ్రామ, వార్డు సచివాలయాలలో ప్రజలకు అవసరమైన పనులన్ని జరిగిపోవడం కొత్త అనుభూతి. ఒకప్పుడు ఏ సర్టిఫికెట్టు కావాలన్నా, వేరే ఏ పని ఉన్నా, మండల ఆఫీస్‌ల చుట్టూనో, ఆ పైన ఉండే అదికారుల చుట్టూనో తిరిగే పరిస్థితిని తప్పించి తమ ఇళ్లకే అవన్ని చేరే ఏర్పాటు చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిజంగా అభినందనీయుడు.ఈ సచివాలయాల కోసం ఏకంగా లక్షన్నర ఉద్యోగాలను ఒకే ఏడాదిలో ప్రభుత్వ పరంగా ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రైతులు ఒకప్పుడు ఎరువులు, విత్తనాల కోసం తమ చెప్పులను ఆయా షాపుల వద్ద, ప్రభుత్వ గౌడౌన్ల వద్ద క్యూలో పెట్టవలసి వచ్చేది. ఇప్పటికి తెలంగాణలో అదే పరిస్థితి కొనసాగుతోంది. ఆదిలాబాద్‌లో జరిగిన రైతుల ఆందోళన ఇందుకు ఉదాహరణ. ఏపీలో ఆ ఇబ్బంది లేకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేయగలిగారు. రైతులు తమ గ్రామంలోనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలనుంచి అన్నీ సేవలు పొందగలుగుతున్నారు. అందువల్లే ఈ ఐదేళ్లలో ఎక్కడా ఒక్క రైతు ఆందోళన చూడలేదు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక హామీలు అమలు చేస్తామని చెబుతూ అంతా వచ్చి దరఖాస్తు చేసుకోమన్నారు. అప్పుడు బారీ క్యూలు తెలంగాణ వ్యాప్తంగా కనిపించాయి. అదే ఏపీలో ఆ అవసరమే లేదు. వలంటీర్లే ఇళ్లకు వెళ్లి అర్హత ఉంటే వారే నమోదు చేసుకుని స్కీమ్ అమలు చేశారు. ఇది ఉదాహరణ మాత్రమే.ఏపీలో ప్రభుత్వ స్కూళ్లలో జరిగిన మార్పులు ఒక విప్లవం అని చెప్పాలి. స్కూళ్లు బాగు చేయడం మొదలు, ఆంగ్ల మీడియం, వారికి మంచి ఆహారం, డ్రెస్, పుస్తకాలు మొదలైనవి స్కూల్ తెరిచిన మొదటి రోజుల్లోనే ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు. గతంలో ఇలా జరిగిన సందర్భాలు దాదాపు లేవని చెప్పాలి. ఆంగ్ల మీడియం, ఐబీ సిలబస్, టోఫెల్ మొదలైన వినూత్న మార్పులు జరిగింది ఏపీలో మాత్రమే. వైద్య రంగంలోకూడా గణనీయమైన మార్పులు తెచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రులను మార్చారు. ప్రజల వద్దకే డాక్టర్లను పంపించే విధానం తెచ్చారు. ఊళ్లలో ఆరోగ్య శిబిరాలు పెట్టారు. ఆరోగ్యశ్రీలో వ్యాధుల సంఖ్య పెంచారు. తను చెప్పిన సంక్షేమ స్కీములను యధాతధంగా అర్హులైన వారందరికి అమలు చేసి చూపించారు. ప్రాంతం చూడలేదు. కులం చూడలేదు. మతం చూడలేదు. పార్టీ చూడలేదు. ఇది చాలామందికి నమ్మశక్యం కానీ విషయమే.అంతకుముందు టీడీపీ పాలనలో జన్మభూమి కమిటీల అవినీతి తతంగాలు చూసినవారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకు వచ్చిన ఈ మార్పు ఆశ్చర్యాలను కలిగించింది. అమ్మ ఒడి, చేయూత, కాపు నేస్తం, రైతు భరోసా, చేనేత నేస్తం.. ఇలా ఒకటేమిటి సుమారు ముప్పైకి పైగా స్కీములను ఒక్క రూపాయి అవినీతి లేకుండా లబ్దిదారుల ఖాతాలలోకి వెళ్లేలా డిబిటి పద్దతి అమలు చేసిన ఘనత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే. పేదలకు 31లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఒక సంచలనం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. విపక్ష టీడీపీ తొలుత వీటన్నిటిని విమర్శించినా, తదుపరి తామూ అమలు చేస్తామని చెప్పడమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజన్‌ను తెలియచేస్తుంది. అభివృద్ది వైపు చూస్తే స్కూళ్లు, ఆస్పత్రులు బాగు చేయడం అన్నిటికన్నా పెద్ద ప్రగతి అని వేరే చెప్పనవసరం లేదు. తీర ప్రాంతంలో నాలుగు పోర్టులు, పది ఫిషింగ్ హార్బర్లు, ఫిషరీస్ యూనివర్శిటీ, ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రి, 700 కోట్లతో 800 గ్రామాలకు నీటి స్కీము, పదిహేడు మెడికల్ కాలేజీలు, పలు కొత్త పరిశ్రమలు, పార్మాహభ్, రెండున్నర లక్షల కోట్ల విలువైన పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్లు, నలభై వేల కోట్ల విలువైన సోలార్ పానెల్ పరిశ్రమ.. బద్వేలు వద్ద సెంచరీ ప్లైవుడ్, కొప్పర్తి ఎలక్ట్రానిక్ పారిశ్రామికవాడ.. ఇలా అనేకం టేక్ ఆఫ్ అయ్యాయి. విశాఖ నగరాన్ని ఒక సూపర్ సిటీగా తీర్చిదిద్దే ప్రక్రియ చేపట్టారు. ఆదాని డేటా సెంటర్, ఇన్ ఫోసిస్ తదితర కంపెనీలు రావడం.. ఇలా ఒకటేమిటి వివిధ రంగాలలో తనకంటూ ఒక ప్రత్యేకతను తెచ్చుకునేలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేసింది. ఇదేదో పొగడడానికి చెప్పడం లేదు. అలా అని విమర్శలు లేవని కాదు. ఏ ప్రభుత్వంలో అయినా కొన్ని లోటుపాట్లు ఉంటాయి. ఒక్క మద్య నిషేధం హామీని అమలు చేయలేకపోయామని పార్టీనే అధికారికంగా చెప్పింది.శాంతి భద్రతలు ఐదేళ్లుగా పూర్తి అదుపులో ఉన్నా, ప్రతిపక్షం, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా దారుణమైన అబద్దాలు ప్రచారం చేశాయి. వీటిని ఎదుర్కోవడం వైఎస్ జగన్మోహన్ రెడ్డికు పెద్ద సవాల్ అయింది. ఒకేసారి వివిధ రంగాలలో సంస్కరణలు చేపట్టడం, ఆయా వర్గాలలోని పెత్తందార్లకు ఆగ్రహం తెప్పించింది. ఉదాహరణకు ప్రభుత్వ స్కూళ్లు బాగు చేయడం కార్పొరేట్ విద్యా సంస్థల యజమానులకు నచ్చలేదు. ప్రభుత్వ సేవలన్ని ప్రజల ఇళ్ల వద్దకు చేర్చడం, తద్వారా తమ ప్రాధాన్యత తగ్గిందన్న భావన, ముడుపులు దక్కకుండా పోతున్నాయన్న ఆక్రోశం అందరిలో కాకపోయినా కొంతమంది ఉద్యోగులలో ఏర్పడిందని అంటారు. ప్రభుత్వ స్కూళ్లు బాగు చేసి టైమ్‌కు టీచర్లను రావాలని చెబితే వారిలో కొందరికి కోపం వచ్చిందని చెబుతారు. ఏపీలో సినిమా షూటింగ్‌లు చేయాలని, ఇతరత్రా పేదలకు ధరలు అందుబాటులో ఉంచాలని, దానిని బట్టి టిక్కెట్ల రేట్లు నిర్ధారిస్తామని చెప్పడం బడా సినిమా పెట్టుబడిదారులకు నచ్చలేదు.ఆస్పత్రులను బాగు చేసి, డాక్టర్లను పేదల ఇళ్లకు పంపడం కొన్ని ప్రైవేటు ఆస్పత్రులకు అంతగా ఇష్టం ఉండదు. భూముల రీసర్వే, ఈ స్టాంప్ విధానం, లాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా భూ వివాదాలు తగ్గించడం, బడా భూస్వాములు, రియల్ ఎస్టేట్ దందాలు చేసేవారికి అసంతృప్తి కలిగించింది. అందుకే లాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు, పవన్ కళ్యాణ్, రామోజీరావు, రాధాకృష్ణ వంటివారు పచ్చి అబద్దాలను ప్రచారం చేశారు. ఆయా వ్యవస్థలను చంద్రబాబు బాగా ప్రభావితం చేస్తూ ప్రభుత్వాన్ని బాగా ఇబ్బంది పెట్టారు. అందులో న్యాయ వ్యవస్థ ద్వారా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికు బాగా తలనొప్పి తెప్పించారని చెప్పవచ్చు. మూడు రాజధానుల వ్యవహారం ఒక కొలిక్కి రానీవ్వకుండా విపక్షం వ్యవస్థల ద్వారా అడ్డుపడింది.ఇన్ని జరిగినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడా వెనక్కి తగ్గలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ పెత్తందార్ల ప్రతినిధిగా ఉండడానికి ఇష్టపడలేదు. పాదయాత్రలో సామాన్యుల కష్టాలు ఎలా తెలుసుకున్నారో, ఆ విధంగానే పేదల ప్రతినిధిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగించారు. అదే శ్రీరామరక్ష అవుతుందని ఆయన నమ్మారు. అందుకే ధైర్యంగా తను మంచి చేసి ఉంటేనే ఓటు వేయండని ప్రజలకు పిలుపు ఇవ్వగలిగారు. ఇలా చేసిన ముఖ్యమంత్రి దేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరే. ఎంత ఆత్మ విశ్వాసం లేకుంటే ఆయన ఆ మాట చెప్పగలుగుతారు! అదే ఆత్మ స్థైర్యంతో, ప్రత్యర్ధులు ఎంతగా వేధించినా తొణకకుండా, బెణకకుండా ఐదేళ్లు పూర్తి చేసుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సగర్వంగా ప్రజల ముందు నిలబడ్డారు. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు విజయానికి సంకేతంగా కనిపిస్తుంది.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా
సాక్షి, న్యూఢిల్లీ: జూన్ 2న పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ హాజరు కానున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. మంగళవారం సాయంత్రం 10 జన్‌పథ్ నివాసంలో సోనియాతో సీఎం భేటీ అయ్యారు. రాష్ట్ర దశాబ్ది వేడుకలకు రావాలంటూ ఆహ్వానించారు. సుమారు అరగంట సేపు జరిగిన సమావేశానంతరం రేవంత్ మీడియాతో మాట్లాడారు. 4 కోట్ల ప్రజలకు సంతోషకరమైన వార్త ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై పదేళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా జరుపుతున్న ఉత్సవాల్లో సోనియా భాగస్వామ్యం కావాలని ప్రజలు కోరుకుంటున్నా రు. రాష్ట్ర మంత్రివర్గం కూడా ఈ మేరకు తీర్మానం చేసింది. ఈరోజు సోనియాగాం«దీని కలిసి ఆహా్వనించాం. అందుకు ఆమె సానుకూలంగా స్పందించారు. ఇది రాష్ట్రంలోని 4 కోట్ల ప్రజలకు సంతోషకరమైన వార్త. సోనియా గాంధీ పర్యటన, అవతరణ ఉత్సవాల కోసం కాంగ్రెస్ శ్రేణులంతా ఎదురుచూ స్తున్నాం. రాష్ట్రాన్నిచ్చి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టినందుకు సోనియా గాం«దీని సత్కరించడం ద్వారా కృతజ్ఞత తెలియజేయాలని అనుకుంటున్నాం. మా ఆహ్వానాన్ని మన్నించినందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున, రాష్ట్ర ముఖ్యమంత్రిగా సోనియాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అందరికీ సముచిత గౌరవం ప్రజా పాలనలో చేసుకుంటున్న తొలి ఉత్సవాలు ఇవి. తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్న ప్ర తి ఒక్కరినీ ఇందులో భాగస్వాముల్ని చేస్తాం. అందరినీ అధికారికంగా ఆహా్వనిస్తున్నాం. వారందరికీ సముచితమైన గౌరవం దక్కుతుంది. ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో తెలంగాణ ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలోనే ఆ వివరాలు వెల్లడిస్తాం..’ అని సీఎం తెలిపారు. కేసీ వేణుగోపాల్‌తో భేటీ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో కూడా రేవంత్ భేటీ అయ్యారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు హాజరు కావాలంటూ ఆహ్వానించారు. సుమారు 40 నిమిషాలకు పైగా సాగిన ఈ భేటీలో రాష్ట్ర రాజకీయాలు, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు, ఇతర అంశాలపై చర్చించినట్లు తెలిసింది. దీనికి ముందు తుగ్లక్ రోడ్డులోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో జరుగుతున్న మరమ్మతు పనులను రేవంత్ పరిశీలించారు. బంగ్లా మొత్తం కలియ తిరిగి అధికారులకు కొన్ని మార్పులు సూచించారు. త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. సీఎం సోమవారం అర్ధరాత్రి కేరళ నుంచి ఢిల్లీకి వచ్చారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌కు వెళ్లారు. -
సోనియాను ఏ ప్రాతిపదికన, ఎలా పిలుస్తారు? : జి.కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: జూన్ 2న జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి ఏ ప్రాతిపదికన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాందీని ముఖ్యఅతిథిగా ప్రభుత్వం ఆహ్వానిస్తుందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్య క్షుడు జి.కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో జాప్యం చేసి.. 1,500 మంది ఉద్యమకారులను పొట్టన పెట్టుకున్నందుకు ఆమెను పిలుస్తారా అని నిలదీశారు. సోనియాను ఆవిర్భావ ఉత్సవానికి పిలవడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. బుధవారం పార్టీ కార్యాలయంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వలేదని, అప్పటి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ ప్రజలు తెచ్చుకున్నారని చెప్పారు. రాష్ట్ర ఏర్పాటుకు సుష్మాస్వరాజ్ ఆధ్వర్యంలో బీజేపీ పూర్తిస్థాయిలో పోరాటం చేసిందని, తమ పార్టీ పార్లమెంట్లో మద్దతు ఇచ్చింది కాబట్టే యూపీఏ హయాంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రస్తుతం సీఎంగా ఉన్న రేవంత్‌రెడ్డి సోనియాను దయ్యం అన్నారని, ఇప్పుడు ఆయనకు ఆమె దేవత అయ్యిందా అని ఎద్దేవా చేశారు. తమకు సోనియాగాంధీ అప్పుడూ ఇప్పుడూ దయ్యమేనని వ్యాఖ్యానించారు. రైతులకు రాష్ట్ర సర్కారు వెన్నుపోటు పొడిచే ప్రయత్నం రాష్ట్ర రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేసిందని, అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటేసినందుకు రైతులకు ‘చెయ్యి’ ఇస్తున్నారని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. రూ.2లక్షల రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి, అమలు చేయకుండా రైతాంగాన్ని నిలువునా ముంచిందని ధ్వజమెత్తారు. దొడ్డు, సన్న అనే తేడా లేకుండా ప్రతి రైతుకూ బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుభరోసా కింద రైతులు, కౌలు రైతులకు రూ. 15 వేల చొప్పున ఇవ్వలేదన్నారు. సన్న బియ్యాన్ని ప్రోత్సహించాలని అనుకుంటే రూ.1000 బోనస్ ఇవ్వాలని, దొడ్డు రకానికి రూ.500 బోనస్ ఇవ్వాలని చెప్పారు. దొడ్డు బియ్యం కొనడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా, రైతులకు ఇచి్చన హామీ నుంచి తప్పించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తో్తందన్నారు.తెలంగాణలో 90 శాతంమంది దొడ్డు రకం వడ్లు వేస్తుండగా, సన్నాలకే బోనస్ ఇస్తామని ఎలా చెబుతారని ప్రశ్నించారు. రాష్ట్రంలో సకాలంలో ధాన్యం సేకరించలేకపోతున్నారు ‘2023–24 ఒప్పందం ప్రకారం కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాల్సిన బియ్యం ఇంకా ఇవ్వలేదు. సకాలంలో ధాన్యం సేకరించలేకపోతోంది. అకాల వర్షాలతో ధాన్యం కల్లాలోనే తడిసిపోతోంది. కొనుగోలు కేంద్రాల్లో నెలల తరబడి రైతులు పడిగాపులు కాస్తున్నారు. నిన్న కేవలం 75 వేల టన్నుల మాత్రమే కొనుగోలు చేసింది. ఇలాగే కొనసాగితే ధాన్యం కొనుగోలు పూర్తి కావడానికి మరో రెండు నెలల సమయం పడుతోంది’ అని కిషన్‌రెడ్డి చెప్పారు. -
జూన్ 2న సోనియాతో సభ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటై పదేళ్లు పూర్తవుతుండటం, రాష్ట్రంలో తొలిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. జూన్ 2న భారీ బహిరంగ సభ నిర్వహించి, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాందీతోపాటు తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్న పెద్దలందరినీ పిలిచి సన్మానం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకు అనుమతి కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయనుంది. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేసిన తీర్మానాన్ని రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అనంతరం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కూడా ఆ సభకు పిలుస్తామని.. ఈ విషయంలో భేషజాలు లేవని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. ‘బీఆర్ఎస్ ప్రభుత్వం గత ఏడాదే తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను నిర్వహించిందని, ఇప్పుడు మళ్లీ నిర్వహిస్తారా?’ అని మీడియా ప్రశ్నించగా.. ‘‘తెలంగాణ వచ్చి 10 ఏళ్లు అయింది అప్పుడా? ఇప్పుడు అవుతోందా అన్న విషయం అందరికీ తెలుసు..’’ అని మంత్రి పొంగులేటి బదులిచ్చారు. తడిసిన ధాన్యమంతా కొనుగోలు.. ఇటీవలి అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించిందని మంత్రి పొంగులేటి చెప్పారు. రైతులెవరూ ఆందోళన చెందవద్దని, మద్దతు ధరకు ఒక్క రూపాయి తగ్గించకుండా తడిసిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. విపక్షాల మాయమాటలను నమ్మవద్దని పేర్కొన్నారు. యాసంగిలో పండించిన 36లక్షల టన్నుల ధాన్యాన్ని పౌర సరఫరాల శాఖ సేకరించిందని.. దేశంలో, రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా రైతులకు 3 రోజుల్లోపే చెల్లింపులు చేసిందని చెప్పారు. కాగా.. ఒక్క గింజ తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేశామని, ఎక్కడైనా తరుగు తీస్తే చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. వర్షాలతో దెబ్బతిన్న పంటల వివరాలను వ్యవసాయ శాఖ సమరి్పంచిందని.. బాధిత రైతులకు పరిహారం చెల్లించాలని నిర్ణయించామని వివరించారు. రైతు భరోసా పథకం ఎప్పుడు ప్రారంభిస్తారని మీడియా ప్రశ్నించగా.. విధివిధానాలను తయారు చేయాల్సి ఉందని చెప్పారు. ఆధునిక పాఠశాలలుగా తీర్చిదిద్దుతాం.. జూన్ 12 నుంచి బడులు పునఃప్రారంభం అవుతున్న నేపథ్యంలో.. అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా ప్రభుత్వ స్కూళ్ల నిర్వహణ చేపట్టాలని కేబినెట్ నిర్ణయించినట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. కమిటీల ఆధ్వర్యంలో నెల రోజుల్లోగా వాటిని ఆధునిక పాఠశాలలుగా తీర్చిదిద్దుతామన్నారు. ఇందుకోసం రూ.600 కోట్లను కేటాయించామని.. అడ్వాన్స్‌గా రూ.120 కోట్లను విడుదల చేశామని తెలిపారు. అమ్మ ఆదర్శ కమిటీల్లో ప్రధానోపాధ్యాయులు, స్వశక్తి సంఘాల మహిళలు ఉంటారన్నారు. ఈ అంశంపై మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. మూసివేసిన పాఠశాలలు తెరుస్తాం హేతుబదీ్ధకరణ పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం మూసివేసిన 5,600 ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి.. విద్యార్థులు వచ్చేవాటిని తిరిగి ప్రారంభించాలని నిర్ణయించినట్టు మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. పాఠశాల, సాంకేతిక, ఉన్నత విద్యతోపాటు ఉపాధి కలి్పంచే నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేయాలని.. మంచి మార్పు చూపించాలని కేబినెట్లో సుదీర్ఘంగా చర్చించామన్నారు. నాణ్యమైన విద్యతోపాటు మౌలిక సదుపాయాలు, బోధన, బోధనేతర అంశాలపై దృష్టి పెడతామని చెప్పారు. మరుగుదొడ్లు, పెయింటింగ్, ఇతర అన్ని హంగులతో ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దుతామన్నారు. విద్యార్థులకు యూనిఫారాలను కుట్టే బాధ్యతను మహిళా సంఘాలకు ఇచ్చామని.. ప్రతి విద్యార్థికి రెండు జతలు సరఫరా చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలోని కమిటీ ఫీజుల నియంత్రణ అంశాన్ని పరిశీలిస్తుందని పొంగులేటి తెలిపారు. టెస్టుల తర్వాతే బ్యారేజీలకు మరమ్మతులు కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల విషయంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నిపుణుల కమిటీ మూడు కీలక సిఫార్సులు చేసిందని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్‌బాబు తెలిపారు. ‘‘బ్యారేజీల గేట్లన్నీ ఎత్తి ఉంచాలని నిపుణుల కమిటీ చెప్పింది. డబ్బులు ఖర్చు చేసి మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు చేసినా అది ఉంటుందో లేదో నమ్మకం ఇవ్వలేమని పేర్కొంది. బ్యారేజీలకు జియోఫిజికల్, జియోటెక్నికల్ పరీక్షలు నిర్వహించాలని సిఫారసు చేసింది. బ్యారేజీలకు పరీక్షలు పూర్తయ్యే వరకు తదుపరిగా ఏ రకమైన పనుల చేపట్టవద్దని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మూడు కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పరీక్షలు నిర్వహించాలని.. ప్రతి బ్యారేజీకి రెండు సంస్థలతో పరీక్షలు నిర్వహించి, రెండింటి అభిప్రాయాల ఆధారంగా మరమ్మతులు చేయాలని నిర్ణయించాం..’’ అని వెల్లడించారు. ఈ పరీక్షలు త్వరగా నిర్వహించేలా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లి ఎన్డీఎస్ఏతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపారు. బ్యారేజీల్లో రాళ్ల కట్టతో పంపింగ్‌కు ప్రయతి్నస్తాం.. కాళేశ్వరం బ్యారేజీల పరిధిలో తక్కువ ఖర్చుతో రాళ్ల కట్టను నిర్మించి.. నీళ్లను పంపింగ్ చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులను మంత్రివర్గం ఆదేశించిందని మంత్రి పొంగులేటి చెప్పారు. ప్రాజెక్టుపై గత ప్రభుత్వం చేసిన ఖర్చు వృథా కాకుండా.. నిపుణుల సూచనలతో తాత్కాలిక ఏర్పాట్లు చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. గత ప్రభుత్వ తప్పును సాకుగా చూపి రైతులను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం తమకు లేదన్నారు. ధర్నాల పేరుతో డ్రామాలు.. ధాన్యం కొనుగోళ్ల పరిశీలన కోసం కలెక్టర్లను క్షేత్రస్థాయికి వెళ్లాలని ఆదేశించినట్టు మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. ధర్నాల పేరుతో డ్రామాలు చేశారని, వారు రైతులకు ఏం చేశారో అందరికీ తెలుసని బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేయబోతున్నామని చెప్పారు. సన్న ధాన్యం పండిస్తే రూ.500 బోనస్ వచ్చే వానాకాలంలో సన్న ధాన్యం పండించిన రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ చెల్లించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఆ సన్నవడ్ల రకాలను వ్యవసాయ శాఖ ప్రకటించనుంది. బడుల్లో మధ్యాహ్న భోజనానికి, హాస్టళ్లకు విద్యార్ధి, రెండు రూపాయలకే కిలో బియ్యం వంటి పథకాలకు ఏటా 36 లక్షల టన్నుల బియ్యం అవసరం కాగా.. వాటన్నింటికీ సన్న బియ్యం ఇస్తామని గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చామని మంత్రి పొంగులేటి చెప్పారు. బయటి రాష్ట్రాల నుంచి సన్నబియ్యం కొనుగోలు చేయవద్దని నిర్ణయం తీసుకున్నామని, అందుకే రాష్ట్రంలో సన్నబియ్యం పండించిన రైతులకు బోనస్ చెల్లిస్తామని వివరించారు. విత్తనాలు, ఎరువులు, ఇతర అవసరాలకు ఇబ్బంది రావద్దని.. నకిలీ విత్తనాల తయారీదారులు, విక్రయదారులు, నకిలీ రశీదులు జారీ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారని చెప్పారు. రైతులు లూజు విత్తనాలు కొనవద్దని, కంపెనీల వద్దే కొనాలని, సాగు ముగిసేవరకు రసీదులు దాచిపెట్టుకోవాలని సూచించారు. -
Sonia Gandhi: రాహుల్‌ను మీకు అప్పగిస్తున్నా
రాయ్‌బరేలి: ‘నా కుమారుడిని రాయ్‌బరేలీ ప్రజలకు అప్పగిస్తున్నా. రాహుల్ మిమ్మల్ని నిరాశపర్చడు’ అని కాంగ్రెస్ నేత సోనియా గాంధీ శుక్రవారం రాయ్‌బరేలీలో ప్రచార సభలో పేర్కొన్నారు. ఎంపీగా 20 ఏళ్లు మీకు సేవ చేసుకునే అవకాశం ఇచ్చినందకు ధన్యావాదాలని అన్నారు. ‘నాకున్న ప్రతిదీ మీరిచి్చందే. కాబట్టి సోదరసోదరీమణులారా నా బిడ్డను మీ చేతుల్లో పెడుతున్నా. మీరంతా నన్ను మీ దానిగా భావిస్తారు’ అని అన్నారు. ఓటర్లతో భావోద్వేగ పూరితమైన బంధాన్ని నెలకొల్పే ప్రయత్నంలో రాహుల్‌నీ మీ సొంతవాడిగా భావించాలని విజ్ఞప్తి చేశారు. వేదికపై రాహుల్, ప్రియాంక గాం«దీలు సోనియా పక్కన నిలబడ్డారు. ‘ఇందిరా గాం«దీ, రాయ్‌బరేలీ ప్రజలు నాకు నేర్పిన విలువలు, పాఠాలనే నేను రాహుల్, ప్రియాంకలకు నేర్పాను. అందరినీ గౌరవించండి. బలహీనుల పక్షాన నిలబడి వారిని కాపాడండి. అన్యాయాలను ఎదిరించండి. ప్రజల హ క్కుల కోసం పోరాడండి. భయపడొద్దు. పోరాటాలు, సంప్రదాయాల్లో మీ మూలాలు బలంగా ఉన్నాయి’ అని వారిద్దరికీ నేర్పానని సోనియా గాంధీ అన్నారు. సోనియా తొలిసారిగా 2004లో రాయ్‌బరేలి ఎంపీగా గెలిచారు. రాజ్యసభకు ఎన్నికై ఇటీవల రాజీనామా చేసేదాకా 20 ఏళ్లు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ బరిలో ఉన్నారు. 20 ఏళ్లు ఎంపీగా సేవ చేసుకునే అవకాశాన్ని తనకు రాయ్‌బరేలీ ప్రజలు కలి్పంచారని, ఇది తన జీవితంలో అమూల్యమైన ఘట్టమని సోనియా పేర్కొన్నారు. గత 100 ఏళ్లుగా తన కుటుంబం మూలాలు ఇక్కడి నేలతో ముడిపడి ఉన్నాయన్నారు. ఈ బంధం ఎంతో పవిత్రమైనదని, గంగా మాతతో అవధ్, రాయ్‌బరేలి రైతులకు ఉన్న బంధం లాంటిదే ఇదని పేర్కొన్నారు. రాయ్‌బరేలీకి ఇందిరా గాంధీ హృదయంలో ప్రత్యేక స్థానముందని, ఆమె పనిని తాను దగ్గరగా గమనించానని, రాయ్‌బరేలీ ప్రజల పట్ల ఇందిరకు ఎనలేని అభిమానమని పేర్కొన్నారు. అనారోగ్య కారాణాలు వల్ల సోనియా గాంధీ ఈ లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారానికి దూరంగా ఉన్నప్పటికీ కుమారుడి కోసం శుక్రవారం ప్రచారం చేయడం గమనార్హం. సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ కూడా ఈ సభలో పాల్గొన్నారు. సోనియాకు ముందు మాట్లాడిన రాహుల్ దేశంలోని యువత ఒక నిశి్చతాభిప్రాయానికి వచ్చారని, వారు మోదీని కోరుకోవడం లేదని తెలిపారు. జూన్ 4 తర్వాత ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని, అది ప్రజాప్రభుత్వమని చెప్పారు. భారత రాజ్యాంగ ప్రతిని చూపుతూ దీన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్లు చింపి పాడేయాలని చూస్తున్నాయని ఆరోపించారు. రాయ్‌బరేలీతో సమానంగా అమేథీని చూస్తా తాను గెలిస్తే అభివృద్ధి విషయంలో రాయ్‌బరేలి, అమేథీలను సమానంగా చూస్తానని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అమేథీలో మూడుసార్లు ఎంపీగా నెగ్గిన రాహుల్ 2019లో స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అభ్యర్థి, తమ కుటుంబానికి నమ్మినబంటు కిశోరీలాల్ శర్మ తరఫున రాహుల్, ఎస్పీ చీఫ్ అఖిలేశ్‌తో కలిసి శుక్రవారం ప్రచారం నిర్వహించారు. ‘రాయ్‌బరేలిలో అభివృద్ధి పనులకు రూ. 10 ఖర్చు చేస్తే అదే పది రూపాయలు అమేథిలోనూ ఖర్చు పెడతాం.. అది నా హామీ’ రాహుల్ పేర్కొన్నారు. అమేథీ ప్రజలకు 40 ఏళ్ల పాటు నిస్వార్థంగా సేవలందించినందుకు కిశోరీలాల్ శర్మకు ధన్యవాదాలు చెప్పారు. అగి్నవీర్ నియామక విధానాన్ని రద్దు చేసి పరి్మనెంట్ నియామక పద్ధతిని తీసుకొస్తామని.. దీంట్లో పెన్షన్‌కు కూడా అవకాశం ఉంటుందని తెలిపారు. -
'నా కొడుకు రాహుల్‌ని మీకు అప్పగిస్తున్నాను': సోనియా గాంధీ
దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రచార హోరు జోరుగా సాగుతోంది. జాతీయ పార్టీల కీలక నేతలు సైతం క్యాంపెయిన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే.. కాంగ్రెస్ అధినేత్రి 'సోనియా గాంధీ' శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు.రాహుల్ గాంధీకి తన (సోనియా గాంధీ) పట్ల చూపిన అదే ప్రేమ, ఆప్యాయతలను అందించాలని సోనియా గాంధీ ప్రజలను కోరారు. ''నా కొడుకును మీకు అప్పగిస్తున్నాను. మీరు నన్ను మీవారిలా భావించినట్లే, అతనికి కూడా అదే ప్రేమ, ఆప్యాయతని అందించండి''. రాహుల్ మిమ్మల్ని మీరసపరిచేది లేదని అన్నారు.తమ కుటుంబానికి ఎప్పుడూ మద్దతు ఇచ్చే రాయ్‌బరేలీ ఈ సారి కూడా తప్పకుండా సపోర్ట్ చేస్తుందని సోనియా గాంధీ పేర్కొన్నారు. ఆరోగ్య సమస్యలు, వయసు రీత్యా తాను లోక్‌సభ ఎన్నికలలో పాల్గొనడం లేదని సోనియా గాంధీ ఇప్పటికే ప్రకటించారు. ఈమె 2004 నుంచి రాయ్‌బరేలీకి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చింది.ప్రజలను ఉద్దేశించి సోనియా గాంధీ మాట్లాడుతూ.. రాయ్‌బరేలీ ప్రజలకు 20 ఏళ్ల పాటు ఎంపీగా పని చేసే అవకాశం కల్పించారు. అదే నాకు పెద్ద ఆస్తి. రాయ్‌బరేలీకి చెందిన నా కుటుంబ సభ్యులు, చాలా కాలం తర్వాత మీ మధ్య ఉండే అవకాశం నాకు లభించినందుకు సంతోషంగా ఉందని అన్నారు.రాయ్‌బరేలీ మాదిరిగానే.. అమేథీ కూడా నా ఇల్లు అని పేర్కొంటూ.. నా జీవితంలోని సున్నితమైన జ్ఞాపకాలు, కుటుంబ మూలాలు ఈ మట్టితో ముడిపడి ఉన్నాయి. గంగామాత వలె పవిత్రమైన ఈ సంబంధం అవధ్ మరియు రాయ్‌బరేలీ రైతుల ఉద్యమంతో ప్రారంభమైంది, ఇది నేటికీ కొనసాగుతోందని సోనియా గాంధీ అన్నారు.मैं आपको अपना बेटा सौंप रही हूं।: श्रीमती सोनिया गांधी जी📍 रायबरेली, यूपी pic.twitter.com/5kwxLtM8nt— Congress (@INCIndia) May 17, 2024 -
Lok Sabha Election 2024: మహిళలకు ‘మహాలక్ష్మి’ గ్యారెంటీ: సోనియా
న్యూఢిల్లీ: ప్రస్తుత కష్టకాలంలో మహిళలు పడుతున్న అవస్థలను కాంగ్రెస్ పార్టీ తొలగిస్తుందని, ఇదే పార్టీ గ్యారెంటీ అని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ చెప్పారు. ఈ మేరకు సోమవారం సోనియా ఒక వీడియో సందేశం ఇచ్చారు. ‘‘ ప్రియమైన సోదరీమణులారా.. మహిళలు దేశ స్వాతంత్రోద్యమం నుంచి నవభారత నిర్మాణం దాకా తమ వంతు అద్భుత తోడ్పాటునందించారు. అయితే మహిళలు ప్రస్తుతం ద్రవ్యోల్బణం మాటున సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. మహిళల కష్టానికి సరైన న్యాయం దక్కేలా కాంగ్రెస్ విప్లవాత్మకమైన గ్యారెంటీని ఇస్తోంది. కాంగ్రెస్ మహాలక్ష్మీ పథకం ద్వారా పేద కుటుంబంలోని మహిళకు ఏటా రూ.1లక్ష సాయం అందించనుంది. ఇప్పటికే అమలవుతున్న పథకాలతో కర్ణాటక, తెలంగాణలో ప్రజల జీవితాలు మెరుగయ్యాయి. ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టం, విద్యాహక్కు చట్టం, ఆహార భద్రతా చట్టాలలాగే కాంగ్రెస్ తాజాగా కొత్త పథకాన్ని ముందుకు తేనుంది. కష్టకాలంలో ఎల్లప్పుడూ కాంగ్రెస్ ఆపన్నహస్తం అందిస్తుంది’ అని ముగించారు. సోనియా సందేశాన్ని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, రాహుల్ గాం«దీ ‘ఎక్స్’లో షేర్చేశారు. సోనియా సందేశంపై రాహుల్ స్పందించారు. ‘‘ పేద కుటుంబాల మహిళలు ఒక్కటి గుర్తుంచుకోండి. మీ ఒక్క ఓటు ఏటా మీ ఖాతాలో జమ అయ్యే రూ.1 లక్షతో సమానం. పెరిగిన ధరవరలు, నిరుద్యోగ కష్టాల్లో కొట్టుమిట్లాడుతున్న పేద మహిళలకు మహాలక్ష్మీ పథకం గొప్ప చేయూత. అందుకే ఓటేయండి’ అని అన్నారు. -
సోనియా గాంధీ భావోద్వేగ సందేశం.. వీడియో వైరల్
ఢిల్లీ: ఈ రోజు మూడోదశ సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఈ తరుణంలో సోనియా గాంధీ ఓటర్లకు ఉద్వేగభరితమైన సందేశాన్ని వినిపించారు. దీనికి సంబంధించిన వీడియో కాంగ్రెస్ ఎక్స్ (ట్విటర్) ఖాతాలో తెగ వైరల్ అవుతోంది.మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించి.. నిరుద్యోగం, మహిళలపై నేరాలు, దళితులు, ఆదివాసీలు, మైనారిటీలపై వివక్ష తారాస్థాయికి చేరింది. ఇవన్నీ ప్రధాని మోదీ, బీజేపీ నుంచి ఉత్పన్నమయ్యాయి. మన రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతోంది. పేదలు వెనుకబడి ఉండటం నాలో వేదనను నింపుతోందని వీడియోలో సోనియా గాంధీ వెల్లడించారు.ఈ రోజు నేను మరోసారి మీ మద్దతును కోరుతున్నాను. కాంగ్రెస్ హామీల ప్రధాన ఉద్దేశ్యం దేశాన్ని ఏకం చేయడం. భారతదేశంలోని పేదలు, యువత, మహిళలు, రైతులు, కార్మికులు, వెనుకబడిన వర్గాల కోసం పని చేయడం కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది.మన రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది. అబద్ధపు ప్రతిపాదకులను తిరస్కరించండి. అందరికీ ఉజ్వలమైన, సమానమైన భవిష్యత్తు కోసం కాంగ్రెస్‌కు ఓటు వేయండి. హ్యాండ్ బటన్‌ను నొక్కండి. అందరి సహకారంతో మరింత ఐక్యమైన భారతదేశాన్ని నిర్మిస్తాం అని సోనియాగాంధీ వీడియోలో భావోద్వేగమైన ప్రసంగం చేశారు.My dear brothers and sisters,Youth unemployment, crimes against women, and discrimination against Dalits, Adivasis, and minorities have reached unprecedented levels. These challenges stem from the ‘niyat’ and ‘niti’ of PM Modi and the BJP which aim for power rejecting… pic.twitter.com/4npHwd8DNW— Congress (@INCIndia) May 7, 2024 -
ప్రియాంక విజయానికి ‘స్పెషల్ 24’!
యూపీలోని కాంగ్రెస్ కంచుకోట రాయ్ బరేలీ నుంచి ప్రియాంక గాంధీ పోటీ విషయమై పార్టీ అధిష్టానం ఏ క్షణంలోనైనా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. రాయ్‌బరేలీలో ఎన్నికల నిర్వహణ కోసం రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ 24 మంది సభ్యులతో కూడిన సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. దీనిలో అసెంబ్లీ ప్రతినిధులు, ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ, జిల్లా కాంగ్రెస్ కమిటీ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.రాయ్‌బరేలీ నుంచి ఎవరు పోటీ చేయనున్నారనేది కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రకటించనున్నారు. తాజాగా జరిగిన కాంగ్రెస్ సెంట్రల్ కోర్ కమిటీ సమావేశంలో మల్లికార్జున్ ఖర్గేకు టికెట్ ఖరారు చేసే అధికారాన్ని పార్టీ అధిష్టానం అప్పగించింది. ప్రస్తుతానికి ప్రియాంకగాంధీ పేరు ఫైనల్ అయినట్లు భావిస్తున్నప్పటికీ, అధిష్టానం అధికారికంగా ప్రకటించలేదు.రాయ్‌బరేలీ లోక్‌సభ ఎన్నికల కోసం సోనియా గాంధీ ప్రత్యేకంగా 24 మంది సభ్యులతో కూడిన సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో సోనియాగాంధీతోపాటు ఆమె ప్రతినిధి కేఎల్ శర్మ, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పంకజ్ తివారీ, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు ధీరజ్ శ్రీవాస్తవ, బచ్రావాన్ ఎమ్మెల్యే సుశీల్ పాసి, హర్చంద్పూర్ మాజీ ఎమ్మెల్యే సురేంద్ర విక్రమ్‌సింగ్, డాక్టర్ మనీష్ సింగ్ చౌహాన్, సరేని ఎమ్మెల్యే సుధా ద్వివేది, అతుల్ సింగ్, ఉంచహార్ ఎమ్మేల్యే సాహబ్ శరణ్ పాశ్వాన్, రాయ్‌బరేలీ మున్సిపాలిటీ అధ్యక్షుడు శత్రోహన్ సోంకర్, లాల్ గంజ్ నగర్ పంచాయతీ అధ్యక్షురాలు సరితా గుప్తా, రాయ్ బరేలీ మాజీ అధ్యక్షుడు ఇలియాస్, ఏఐసీసీ మాజీ సభ్యుడు కళ్యాణ్ సింగ్ గాంధీ, డీడీసీకి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత వీకే శుక్లాలు ఉన్నారు. ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, డీకే శివకుమార్, ఉత్తరప్రదేశ్ ఇన్ఛార్జ్ అవినాష్ పాండే, రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఆరాధన మిశ్రా రాయ్‌బరేలీ ఎన్నికల్లో వ్యూహకర్తలుగా కీలక పాత్ర పోషిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. -
‘ఉగ్రవాదుల మృతిపై సోనియా గాంధీ కన్నీరు పెట్టుకున్నారు’
పట్నా: 2008లో జరిగిన బాట్లా హౌస్ ఎన్కౌంటర్లో ఉగ్రవాదుల మరణంపై కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ కన్నీళ్లు పెట్టుకున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శలు చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం బిహార్‌లోని మధుబని ర్యాలీలో పాల్గొన్న నడ్డా కాంగ్రెస్‌పై మండిపడ్డారు.‘బాట్లా ఎన్కౌంటర్ సమయంలో ఉగ్రవాదులు మరణిస్తే.. కాంగ్రెస్ నేత సోనియా గాంధీ కన్నీరు పెట్టుకున్నారని ఆ పార్టీ నేతలు అన్నారు. ఆమె ఉగ్రవాదుల కోసం ఏడ్చారు. ఉగ్రవాదులతో ఏం సంబంధం ఉంది?. ఉగ్రవాదులపై సానుభూతి చూపాల్సిన కారణం ఏంటి? ఉగ్రవాదులతో ఉన్న లింక్ ఏంటి?. కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి దేశాన్ని బలహీనపరిచేందుకు దేశ వ్యతిరేకులకు మద్దతగా నిలుస్తుంది. దేశాన్ని బలహీనపరిచే వారిపట్ట కాంగ్రెస్ పార్టీ సానుభూతి ప్రదర్శిస్తుంది. ఇండియా కూటమి ఒక అహంకారపూరితమై కూటమి. అటువంటి కూటమికి మీరు (ప్రజలు) మద్దతు పలుకుతారా?’ అని నడ్డా అన్నారు.2008లో బాట్లా హౌస్ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ఢిల్లీ పోలీసు ఇన్స్పెక్టర్ మోహన్ శర్మా, ఇద్దరు ఉగ్రవాదలు మరణించారు. 2012 ఎన్నికల సమావేశంలో కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ చేసిన వ్యాఖ్యల గుర్తు చేస్తూ జేపీ నడ్డా.. సోనియా గాంధీపై విమర్శలు గుప్పించారు.‘బాట్లా ఎన్కౌంటర్ జరిగిన సమయంలో నేను మంత్రిని కాదు. అయితే ఆ ఎన్కౌంటర్ విషయంలో సానియా గాంధీ కన్నీరు పెట్టుకున్నారు’ అని సల్మాన్ ఖుర్షీద్ అన్నారు. అదే సమయంలో మరో కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ సల్మాన్ ఖుర్షీద్ వ్యాఖ్యలను ఖండించారు. ‘సోనియా గాంధీ కన్నీరుపెటుకోలేదు. సల్మాన్ ఖుర్షీద్ చేసిన వ్యాఖ్యలు ఆయన సొంతంగా అనుకున్నవి మాత్రమే’ అని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో ఈ విషయంపై జేపీ నడ్డా వ్యాఖ్యలు చేయటంతో మళ్లీ తెరపైకి వచ్చింది. -
Lok sabha elections 2024: దేశ గౌరవం ధ్వంసం: సోనియా
జైపూర్: దేశ గౌరవాన్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ధ్వంసం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ ఆరోపించారు. కుట్రలు కుతంత్రాలు, బెదిరింపులతో ప్రతిపక్ష నాయకులను బీజేపీలో చేర్చుకుంటున్నారని మండిపడ్డారు. శనివారం రాజస్తాన్‌లోని జైపూర్‌లో ఎన్నికల ప్రచార సభలో ఆమె ప్రసంగించారు. గత పదేళ్ల ఎన్డీయే పాలనలో ఒరిగిందేమీ లేదని అన్నారు. దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభం, అసమానతలు విపరీతంగా పెరిగిపోయాయని చెప్పారు. నేడు దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో చిక్కుకుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలు విధ్వంసానికి గురవుతున్నాయని తెలిపారు. ఎన్డీయే పాలనలో రాజ్యాంగాన్ని మార్చే కుట్రలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరంకుశ పాలనలను సహించే ప్రసక్తే లేదని, తగిన బుద్ధి చెప్పడం ఖాయమని స్పష్టం చేశారు. ఈ దేశం ఏ ఒక్కరి సొత్తు కాదని, ఇది ప్రజలందరికీ చెందుతుందని పేర్కొన్నారు. ‘గ్యారంటీ’ని దొంగిలించిన మోదీ: ఖర్గే అబద్ధాల నాయకుడు నరేంద్ర మోదీ అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ‘గ్యారంటీ’ అనే పదాన్ని కాంగ్రెస్ నుంచి మోదీ దొంగిలించారని చెప్పారు. అవినీతిపరులు బీజేపీలో చేరగానే పరిశుద్ధులుగా మారిపోతున్నారని ప్రియాంకాగాంధీ వాద్రా ఎద్దేవా చేశారు. -
దేశం కొందరి సొత్తు కాదు.. సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు
జైపూర్: త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. దేశం మొత్తం మోదీ పర్యటన సాగుతోంది. కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రచారం చేస్తున్నారు. సోనియా గాంధీ కూడా కొన్ని సమావేశాల్లో పాల్గొంటున్నారు. జైపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో సోనియా గాంధీ ప్రసంగిస్తూ.. ప్రధాని నరేంద్ర మోదీ దేశ గౌరవాన్ని, ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కారని, ప్రతిపక్ష నేతలను బీజేపీలో చేర్చుకునేందుకు రకరకాల వ్యూహాలు పన్నుతున్నారని ఆరోపించారు. ఈరోజు మన దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను నాశనం చేస్తున్నారు, మన రాజ్యాంగాన్ని మార్చడానికి కుట్ర జరుగుతోంది అని సోనియా గాంధీ ఆరోపించారు. ఇది నియంతృత్వ పరిపాలన, దీనికి మనమందరమూ సమాధానం ఇవ్వాలని అన్నారు. తనకు తానే గొప్పవాడినని భావించుకుంటూ.. దేశం గౌరవాన్ని, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారని పేర్కొన్నారు. దేశం కొందరి సొత్తు కాదనీ, అందరికీ చెందుతుందని, మన పూర్వీకులు దాని కోసం రక్తాన్ని చిందించారని అన్నారు. విపక్ష నేతలను బెదిరించి బీజేపీలో చేరేలా చేసేందుకు రకరకాల వ్యూహాలు పన్నుతున్నారని సోనియా గాంధీ ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రసంగిస్తూ.. ప్రధాని మోదీని అబద్ధాల నాయకుడు అని అభివర్ణించారు. గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ఆయన ఏ చర్యలు తీసుకున్నారో చెప్పాలని కోరారు. మీరు మూడింట రెండొంతుల మెజారిటీ ఇస్తే.. ఈ దేశ రాజ్యాంగాన్ని మారుస్తామని ప్రధాని మోదీ, ఆయన వ్యక్తులు, ఆర్ఎస్ఎస్ చెబుతున్నాయని ఖర్గే అన్నారు. #WATCH | Jaipur: Congress Parliamentary Party Chairperson Sonia Gandhi says "...'Modi ji khud ko mahaan maan kar, desh aur loktantra ki maryada ka cheer haran kar rahe hain'...Opposition leaders are threatened to join the BJP. Today, the democracy of our country is in… pic.twitter.com/dgAImvNzRt — ANI (@ANI) April 6, 2024 -
Nyay Patra-2024: ఐదు న్యాయాలు.. 25 గ్యారంటీలు
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ప్రకటనకు ముందు వివిధ సందర్భాల్లో ఇచ్చిన హామీలతో కూడిన ఎన్నికల ప్రణాళిక(మేనిఫెస్టో)ను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. యువతకు ఉద్యోగాల కల్పన, నిమ్నవర్గాల సంక్షేమం, సంపద సృష్టి వంటి కీలక హామీలను ప్రకటించింది. పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా ఆపన్న హస్తం అందిస్తామని వాగ్దానం చేసింది. పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, అగ్నిపథ్ పథకం రద్దు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి ఎత్తివేత, దేశవ్యాప్తంగా కుల గణన వంటి అంశాలను మేనిఫెస్టోలో చేర్చింది. శుక్రవారం ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేతలు సోనియా గాందీ, రాహుల్ గాందీ, మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ చిదంబరం, కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ ‘న్యాయ్ పత్ర–2024’ పేరిట 45 పేజీల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఇందులో ప్రధానంగా వివిధ వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఐదు న్యాయాలను ప్రకటించారు. ఒక్కో న్యాయం కింద ఐదు గ్యారంటీల చొప్పున మొత్తం 25 గ్యారంటీలు ఇచ్చారు. ఐదు న్యాయాలు ఏమిటంటే.. నారీ న్యాయ్ ► మహాలక్ష్మీ పథకం కింద దేశవ్యాప్తంగా పేద కుటుంబాల్లోని మహిళకు ఏడాదికి రూ.లక్ష నగదు బదిలీ ► కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ► ఆశ, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులకు రెట్టింపు వేతనం ► మహిళ హక్కుల రక్షణ కోసం ప్రత్యేకంగా ‘మైత్రి’ అధికారి నియామకం ► మహిళా ఉద్యోగుల కోసం సావిత్రిబాయి పూలే పేరుతో వసతి గృహాలు కిసాన్ న్యాయ్ ► స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం పంటలకు కనీస గిట్టుబాటు ధర(ఎంఎస్పీ)కు చట్టబద్ధత ► రుణమాఫీ కమిషన్ ఏర్పాటు ► పంట నష్టపోయిన 30 రోజుల్లో బీమా పరిహారం చెల్లింపు ► రైతులు లబ్ధి పొందేలా ఎగుమతి, దిగుమతి విధానం ► వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ మినహాయింపు యువ న్యాయ్ ► కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖల్లో 30 లక్షల ఉద్యోగాల భర్తీ ► యువత కోసం ‘అప్రెంటీస్íÙప్ హక్కు చట్టం’. డిప్లొమా చదివినవారికి లేదా 25 ఏళ్లలోపు ఉన్న గ్రాడ్యుయేట్‌కు ఏడాదిపాటు అప్రెంటీస్íÙప్ చేసే అవకాశం. వారికి సంవత్సరానికి రూ.లక్ష సాయం. ► ప్రశ్నాపత్రాల లీకేజీలను అరికట్టేందుకు కఠిన చట్టం ► గిగ్ వర్కర్ల సామాజిక భద్రతకు చర్యలు ► స్టార్టప్ కంపెనీలు ప్రారంభించే యువత కోసం రూ.5,000 కోట్ల నిధి శ్రామిక్ న్యాయ్ ► కార్మికుల కోసం ఆరోగ్య హక్కు చట్టం ► కనీస వేతనం రోజుకు రూ.400. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో సైతం వర్తింపు ► పట్టణ ప్రాంతాల్లోనూ ఉపాధి హామీ పథకం అమలు ► అసంఘటిత రంగాల్లోని కార్మికులకు జీవిత బీమా, ప్రమాద బీమా వర్తింపు ► ప్రభుత్వంలో కాంట్రాక్టు ఉద్యోగాల నియామకాలు రద్దు హిస్సేదారీ న్యాయ్ ► అధికారంలోకి రాగానే సామాజిక, ఆర్థిక కుల గణన ► ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్ల విషయంలో 50 శాతం సీలింగ్(పరిమితి) తొలగింపు ► ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలుకు ప్రత్యేక బడ్జెట్ కేటాయింపు ► జల్, జంగల్, జమీన్‌పై చట్టబద్ధమైన హక్కులు ► గిరిజనులు అధికంగా ఉన్న ప్రాంతాలకు షెడ్యూల్డ్ ఏరియాలుగా గుర్తింపు న్యాయ్ పత్రలోని కీలక హామీలు ► సీనియర్ సిటిజన్లు, వితంతువులకు నెలకు రూ.1,000 చొప్పున పెన్షన్ ► రైల్వే ప్రయాణాల్లో వృద్ధులకు రాయితీ ► ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’ ఆలోచనకు చెల్లుచీటి.. ► పదో షెడ్యూల్ సవరణ. పార్టీ ఫిరాయించిన నేతల లోక్‌సభ, అసెంబ్లీ సభ్యత్వాలు రద్దు ► సైన్యంలో నియామకాలకు ఉద్దేశించిన అగ్నిపథ్ పథకం రద్దు ► అన్ని కులాల్లో ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు (ఈడబ్ల్యూఎస్) విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో 10 శాతం కోటా అమలు. ► జమ్మూకశ్మీర్‌కు, పుదుచ్చేరికి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా ► ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఎన్నికల తర్వాత ప్రధాని అభ్యర్థి: రాహుల్ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అధికార ఎన్డీయేకు పరాభవం తప్పదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పష్టంచేశారు. 2004లో ‘భారత్ వెలిగిపోతోంది’ అంటూ ఎన్నికలకు వెళ్లిన ఎన్డీయే బోల్తా పడిందని, ఈసారి కూడా అదే పునరావృతం కాబోతోందని జోస్యం చెప్పారు. శుక్రవారం ఢిల్లీలో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమి విజయం ఖాయమని అన్నారు. ఎన్నికల్లో నెగ్గిన తర్వాత తమ ప్రధానమంత్రి అభ్యర్థిని ఉమ్మడిగా నిర్ణయిస్తామని తెలిపారు. తమ పార్టీ మేనిఫెస్టోను ప్రజలే రూపొందించారని, ఇందులో అక్షరాలను మాత్రమే తాము ముద్రించామని వివరించారు. 99 శాతం మంది ప్రజలు కోరుకున్న అంశాలు మేనిఫెస్టోలో ఉన్నాయని తెలిపారు. అదానీ లాంటి కేవలం ఒకటి, రెండు శాతం మంది బడాబాబులు కోరుకున్న అంశాలు బీజేపీ మేనిఫెస్టోలో ఉంటాయని ఎద్దేవా చేశారు. -
రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణం చేసిన సోనియా గాంధీ
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలుగా ప్రమాణస్వీకారం చేశారు. ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కడ్ సోనియా గాంధీ చేత ప్రమాణం చేయించారు. సోనియా గాంధీ రాజస్థాన్ రాష్ట్రం నుంచి ఏకగ్రీవంగా రాజ్యసభ సభ్యురాలుగా ఎన్నికైన విషయం తెలిసిందే. సోనియాగాంధీతో పాటు కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, కాంగ్రెస్ కోశాధికారి అజయ్ మాకెన్ ప్రమాణ స్వీకారం చేశారు. #WATCH | Rajya Sabha Chairman #JagdeepDhankhar administers Oath/ Affirmation to the newly - elected member Shrimati Sonia Gandhi in the Parliament House.#RajyaSabha @VPIndia @SoniaGandhi_FC @harivansh1956 pic.twitter.com/HdeqVvUUh7 — SansadTV (@sansad_tv) April 4, 2024 మరో వైపు తెలుగు రాష్ట్రాల్లో గెలుపొందిన అభ్యర్థులు రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేశారు. రాజ్యసభ సభ్యులుగా వైఎస్సార్సీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడా రఘునాథ్ రెడ్డిలు ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ ప్రమాణం స్వీకారం చేయించారు. తెలంగాణ నుంచి బీఆర్ఎస్ పార్టీకి చెందిన వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. వద్దిరాజు రవిచంద్ర తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. #WATCH | Rajya Sabha Chairman #JagdeepDhankhar administers Oath/ Affirmation to the re- elected member Ravi Chandra Vaddiraju in the Parliament House.#RajyaSabha @VPIndia @vaddirajumprs @harivansh1956 pic.twitter.com/2hCKkYkOAd — SansadTV (@sansad_tv) April 4, 2024 -
ఒక శకం ముగిసింది.. మన్మోహన్పై ఖర్గే ప్రశంసలు
సాక్షి, ఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నేడు రాజ్యసభ సభ్యుడిగా రిటైర్ కానున్నారు. రాజ్యసభలో తన 33 ఏళ్ల పార్లమెంటరీ ఇన్నింగ్స్‌ను మన్మోహన్ సింగ్ ముగించారు. ఈ నేపథ్యంలో మాజీ ప్రధాని మన్మోహన్పై అన్ని పార్టీలు ప్రశంసలు కురిపించాయి. ఇక, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. మన్మోహన్ సింగ్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన సేవలను కొనియాడుతూ ఖర్గే లేఖ రాశారు. ఈ లేఖలో ఒక శకం ముగిసిందని వ్యాఖ్యానించారు. భారత రాజకీయాలకు, దేశానికి మన్మోహన్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. మన్మోహన్ ఎల్లప్పుడూ మధ్యతరగతి, ఆకాంక్ష యువతకు హీరో, పారిశ్రామికవేత్తలకు నాయకుడు మార్గదర్శకుడు అని కొనియాడారు. మన్మోహన్ ఆర్థిక విధానాల వల్ల పేదరికం నుండి బయటపడగలిగిన పేదలందరికీ శ్రేయోభిలాషి అని చెప్పుకొచ్చారు. ఉపాధి హామీ పథకంతో మన్మోహన్ సింగ్ గ్రామీణులకు కష్ట సమయాల్లో ఆదాయం, తలెత్తుకు బతికే అవకాశం కల్పించారని అన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుతో కలిసి మన్మోహన్ సింగ్ వేసిన ఆర్థిక పునాదుల ఫలాలు నేటి సమాజానికి అందుతున్నాయని తెలిపారు. కానీ, నేటి రాజకీయ నాయకులు ఆయన పాత్రను గుర్తించట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరెన్ని విమర్శలు చేసినా క్షమించగలిగే పెద్ద మనసు ఆయన సొంతమని ప్రశంసించారు. మన్మోహన్ రాజకీయ ప్రస్థానం.. ఆర్థిక రంగంలో ఎన్నో సాహసోపేతమైన సంస్కరణలకు నాంది పలికిన మన్మోహన్ సింగ్ 1991 అక్టోబర్‌లో తొలిసారి రాజ్యసభ సభ్యుడయ్యారు. 1991 నుంచి 1996 వరకు పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన సింగ్ 2004 నుంచి 2014 వరకు దేశ ప్రధానిగా ఉన్నారు. 1991 అక్టోబర్ 1 నుంచి 2019 జూన్ 14 వరకూ అస్సాం నుంచి ఐదు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆ తరువాత 2019 ఆగస్టు 20న రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైయ్యారు. ఏప్రిల్ 3న బుధవారం 91 ఏళ్ల మన్మోహన్ సింగ్ పదవీ కాలం పూర్తి కావస్తుండటంతో ఆ స్థానంలో తొలిసారి రాజస్థాన్ నుంచి సోనియాగాంధీ రాజ్యసభలో అడుగుపెట్టబోతున్నారు. -
మోడీ సర్కార్ పై మండిపడిన సోనియా, రాహుల్, ఖర్గే
-
Lok sabha elections 2024: పార్టీని ఆర్థికంగా చిదిమేసే కుట్ర
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ సభలు, ర్యాలీలు, అభ్యర్థుల భారీ ప్రచార కార్యక్రమాలకు ఎంతో ధనం అవసరమైన వేళ ప్రధాని మోదీ వ్యవస్థీకృతంగా కుట్రలు పన్ని కాంగ్రెస్ పార్టీని ఆర్థికంగా చిదిమేసేందుకు బరితెగించారని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం ఢిల్లీలో పత్రికా సమావేశంలో సోనియా, పార్టీ చీఫ్ ఖర్గే, రాహుల్ గాం«దీలు మాట్లాడారు. పార్టీలో ముగ్గురు అగ్రనేతలు ఒకేసారి మీడియాతో మాట్లాడటం ఇటీవలికాలంలో ఇదే తొలిసారి. దేశవ్యాప్తంగా పార్టీ అభ్యర్థుల ప్రచారఖర్చులు, ప్రకటనలకు భారీ మొత్తంలో నగదు అవసరమైన వేళ తమ బ్యాంక్ ఖాతాలను అదునుచూసి స్తంభింపజేయడాన్ని నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. ‘కాంగ్రెస్‌కు ప్రజలిచి్చన నగదు విరాళాలను బలవంతంగా లాగేసుకున్నారు. ఇది చాలా తీవ్రమైన అంశం. ఓవైపు ఎలక్టోరల్ బాండ్లపై నిషేధం, మరోవైపు ఖాతాల స్తంభనతో ఎదురైన ఆర్థిక ఇబ్బందులు. ఇవి నిజంగా అనూహ్యమైన తీవ్ర అవరోధాలు. ఇలా అత్యంత క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటూ కూడా మా శక్తిమేరకు అద్భుతంగా ఎన్నికల ప్రచార కార్యక్రమాలను చేపట్టగలుగుతున్నాం. ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకున్నారన్నది సుస్పష్టం. ప్రధాన ప్రతిపక్షం ఆర్థికమూలాలపై దాడి చేశారు’ అని సోనియా ఆగ్రహం వ్యక్తంచేశారు. డీఫ్రీజ్ చేస్తేనే ఆరోగ్యకర పోటీ సాధ్యం: ఖర్గే ‘డీఫ్రీజ్ చేయడమే ఎన్నికల్లో ఆరోగ్యకర పోటీకి బాటలుపరుస్తుంది. సాధారణ ప్రజానీకం కాంగ్రెస్‌కు విరాళంగా ఇచి్చన మొత్తాలను ఫ్రీజ్ చేసి, ఐటీ శాఖతో బలవంతంగా రూ.115.32 కోట్లు నగదు విత్‌డ్రా చేయించి మమ్మల్ని బీజేపీ లూటీ చేసింది. స్వేచ్ఛాయుత, పారదర్శకమైన ఎన్నికలు అత్యావశ్యకమైన ఈ తరుణంలో రాజ్యాంగబద్ధ సంస్థలు కాంగ్రెస్ పార్టీ ఖాతాలను డీఫ్రీజ్ చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి’ అని ఖర్గే కోరారు. ‘బీజేపీ అధికారంలో ఉంది. పైగా ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీ తమ ఖాతాలను వేల కోట్ల రూపాయలతో నింపేసుకుంది. ఎన్నికల్లో దీటైన పోటీకి వీలు లేకుండా మా పార్టీ ఆర్థిక మూలాలను దెబ్బతీసింది. అధికారంలో ఉన్న వారు ప్రత్యక్షంగాగానీ పరోక్షంగానీ రాజ్యాంగబద్ధ సంస్థలపై నియంత్రణ కల్గి ఉండొద్దు. వనరులపై గుత్తాధిపత్య ధోరణి అస్సలు మంచిది కాదు’ అని ఖర్గే వ్యాఖ్యానించారు. రూ.2 కూడా చెల్లించలేని పరిస్థితి: రాహుల్ ‘ప్రధాన ప్రతిపక్షం అన్ని అకౌంట్లను ఫ్రీజ్చేయడం అంటే అది కాంగ్రెస్‌పై మాత్రమే ప్రభావం చూపదు దేశ ప్రజాస్వామ్యానికీ అది విఘాతమే. ఎన్నికల్లో పోటీచేసే సామర్థ్యాన్ని దెబ్బతీశారు. మేం ప్రచార కార్యక్రమాలు చేసుకోలేకపోతున్నాం. ఫ్రీజ్ చేసి ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేరపూరిత చర్యకు పాల్పడ్డారు. ఇలాంటి చర్యలతో దేశంలో ప్రజాస్వామ్యం ఉందనడం అబద్ధమే అవుతుంది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన రాజ్యాంగబద్ధ సంస్థలేవీ ఇక్కడ పని చేయట్లేవు’ అని రాహుల్ అన్నారు. ‘ఖాతాల స్తంభనతో కరెన్సీ కష్టాలు విపరీతంగా పెరిగాయి. మా నేతలు, అభ్యర్థులు విమానాల్లో దేశంలోని ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వెళ్లలేని పరిస్థితి. విమానం సంగతి పక్కనబెట్టండి. కనీసం రైలు టికెట్ కొనేందుకు కూడా కష్టపడుతున్నాం. 20 శాతం ఓటుబ్యాంక్ మాకున్నా రూ.2 కూడా చెల్లించలేని పరిస్థితి. అదునుచూసి ఎన్నికలకు రెండు నెలల ముందు మోదీ పన్నిన కుట్ర ఇది. ఇంత జరుగుతున్నా ఈసీ మౌనంవహించడం విచారకరం. ఈ విషయంలో ఈసీ ఇంతవరకు స్పందించలేదు’ అని రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిపై బీజేపీ స్పందించింది. ఓటమి ఖాయం కావడంతో కావాలనే కాంగ్రెస్ ఇలాంటి ఆరోపణలు గుప్పిస్తోందని బీజేపీ ప్రతివిమర్శ చేసింది. అసుర శక్తిపైనే పోరాటం: రాహుల్ విద్వేషం నిండిన ఆసుర(రాక్షస) శక్తిపై తమ పార్టీ పోరాటం సాగిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉద్ఘాటించారు. ‘శక్తికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం’ అంటూ ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్య లు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. రాహుల్ వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా బీజేపీ నాయకులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్వేషం నిండిన అసుర శక్తిపైనే తమ పోరాటం అని రాహుల్ గురువారం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో స్పష్టం చేశారు. అసుర శక్తిని ఓడించడమే తమ లక్ష్యమన్నారు. -
డబ్బుల్లేవ్.. ప్రచారం చేసుకోలేకపోతున్నాం: కాంగ్రెస్ ఆవేదన
సాక్షి, ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి కొత్త కష్టాలు ఎదురువుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఖాతాలను స్తంభింపజేసి ఎన్నికల్లో తమకు డబ్బులు లేకుండా దెబ్బతీయాలని బీజేపీ చూస్తోందని పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. ఇది ప్రజాస్వామ్యంపై అతి పెద్ద దాడి అని సోనియా గాంధీ అభివర్ణించారు. ఈ సందర్బంగా కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. మల్లికార్జున ఖర్గే మీడియాతో మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల్లో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలి. బీజేపీ పెద్ద ఎత్తున రాజకీయ చందాలు వసూలు చేసింది. కానీ, వారు మా పార్టీ ఖాతాలను స్థంభింపజేశారు. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. మా బ్యాంకు ఖాతాలను తక్షణమే ఆపరేట్ చేసేందుకు అనుమతించాలి. బీజేపీ అన్ని వనరులపై ఏకఛత్రాధిపత్యం వహిస్తోంది. మాకు డబ్బు లేకుండా చేసి ఎన్నికల్లో దెబ్బతీయాలని చూస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. #WATCH | Congress President Mallikarjun Kharge in Delhi, says "I don't want to mention how the BJP took money from some companies. As SC is probing the matter, I hope the truth will be before us soon. I appeal to the Constitutional institutions that if they want free and fair… pic.twitter.com/M5lj2AEdAA — ANI (@ANI) March 21, 2024 సోనియా గాంధీ మాట్లాడుతూ.. ఎన్నికల ముందు కాంగ్రెస్‌ను ఇబ్బంది పెట్టేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారు. నెల కిందట కాంగ్రెస్ అకౌంట్లను అక్రమంగా సీజ్ చేశారు. ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా కాంగ్రెస్‌కు 11 శాతం ఫండ్స్ మాత్రమే వచ్చాయి. ఫండ్స్‌ను కట్టడి చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. కేంద్రం తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా బయటపడ్డ సమాచారంపై విచారణ జరగాల్సిందే. బీజేపీకి వచ్చిన బాండ్స్‌పై విచారణ జరగాలి. కాంగ్రెస్‌ను ఆర్థికంగా దెబ్బకొట్టాలని బీజేపీ చూస్తోంది. #WATCH | Congress Parliamentary Party Chairperson Sonia Gandhi says, "...This issue affects not just Congress, it impacts our democracy itself most fundamentally. A systematic effort is underway by the Prime Minister to cripple the Indian National Congress financially. Funds… pic.twitter.com/HT4dSCuhpc — ANI (@ANI) March 21, 2024 రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కు సంబంధించిన అన్ని అకౌంట్లు ఫ్రీజ్ చేశారు. మా దగ్గర ఫండ్స్ లేవు. కాంగ్రెస్‌ను ఆర్థికంగా దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. ఈసీ దీనిపై స్పందించడం లేదు. దేశంలో 20 శాతం ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేశారు. 14 లక్షల రూపాయలకు సంబంధించిన లెక్కల వివాదంపై మొత్తం కాంగ్రెస్ పార్టీ ఖాతాలను స్తంభింప చేశారు. రూ.200 కోట్లు జరిమానా వేశారు. ఆలస్య చెల్లింపుకు రూ.10వేలకు మించి జరిమానా వేయకూడదు. ప్రధానమంత్రి క్రిమినల్ చర్యలకు పాల్పడుతున్నారు. డబ్బులు లేకపోవడంతో ప్రచారాలు బుక్ చేసుకోలేకపోతున్నాం. మా అభ్యర్థులకు సహాయపడలేకపోతున్నాం. విమాన టికెట్లు కాదు, కనీసం రైల్వే టికెట్లు కొనలేకపోతున్నాం. ఈ అంశంపై దేశంలోని రాజ్యాంగ సంస్థలు, ప్రజలు స్పందించాలి అని కోరారు. #WATCH | On freezing of party accounts ahead of Lok Sabha elections, Congress MP Rahul Gandhi says, "This is a criminal action on the Congress party, a criminal action done by the Prime Minister and the Home Minister...So, the idea that India is a democracy is a lie. There is no… pic.twitter.com/W9SOKyxU4z — ANI (@ANI) March 21, 2024 అజయ్ మాకెన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఖాతాల స్తంభన ప్రజాస్వామ్యంపైన దాడి వంటిది. మా ఖాతాలో ఉన్న రూ.285కోట్ల రూపాయలను ఖర్చు చేయలేకపోతున్నాము. ఐదు వారాల నుంచి ఎన్నికల్లో ప్రచారం కోసం ఖర్చు చేయడానికి నిధులు లేకుండా చేశారు. 30ఏళ్ల కిందటి లెక్కలను ఆధారం చేసుకుని ఇప్పుడు మా ఖాతాలను ఎలా స్పందింప చేస్తారు. అన్ని రాజకీయ పార్టీలకు మినహాయింపు ఉన్నట్టు మేము మినహాయింపులు పొందాము. కానీ, సరిగ్గా ఎన్నికల ముందు మా ఖాతాలు నన్ను స్తంభింపచేశారు. ఆదాయం పన్ను చట్టం 230ఎఫ్ ప్రకారం ఆలస్య చెల్లింపులకు 10 వేలకు మించి జరిమానా వేయకూడదు. 210 కోట్ల రూపాయల పెనాల్టీ వేశారు. ఇదెక్కడి ప్రజాస్వామ్యం అని ప్రశ్నించారు. -
కాంగ్రెస్‌కు ఓటు వేయలేని స్థితిలో రాహుల్, సోనియా?
ఈ టైటిల్ చూసి ఏవేవో ఊహలకు వెళ్లకండి. ఓటు వేసే విషయంలో వారిపై ఎటువంటి నిర్బంధం లేదు. అయితే ఇక్కడొక ట్విస్ట్ ఉంది. అదేమిటో, వారితో పాటు ప్రియాంకా గాంధీ కూడా కాంగ్రెస్‌కు ఓటు వేయలేని పరిస్థితిలో ఎందుకు ఉన్నారో, దీనికి గల కారణమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఢిల్లీలో ఆసక్తిగా మారనున్న రాజకీయ సమీకరణాలను మనం చూడబోతున్నాం. ‘ఇండియా కూటమి’ ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీతో సీట్లను పంచుకున్నప్పుడు, గాంధీ కుటుంబానికి చెందిన ఈ ముగ్గురు నేతల ఓట్లు కాంగ్రెస్‌కు పడే అవకాశాలు లేవని ఎవరూ ఊహించివుండరు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు న్యూఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన ఓటర్లు. అయినా వారు ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో వారి సొంత పార్టీకి ఓటు వేసుకోలేరు. ‘ఆప్’తో పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉన్న న్యూఢిల్లీ స్థానాన్ని అరవింద్ కేజ్రీవాల్ పార్టీకి అప్పగించింది. న్యూఢిల్లీ, దక్షిణ ఢిల్లీ, తూర్పు ఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ లోక్‌సభ స్థానాల్లో ‘ఆప్’ పోటీ చేయనుండగా, కాంగ్రెస్ చాందినీ చౌక్, ఈశాన్య ఢిల్లీ, నార్త్ వెస్ట్ ఢిల్లీలో పోటీ చేస్తోంది. న్యూఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్ రాజకీయాలకు నెలవుగా ఉండేది. అయితే 2014లో మోదీ వేవ్ ఇక్కడి అన్ని సమీకరణలను తుడిచిపెట్టేసింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి గాంధీ కుటుంబ సభ్యులు తమ సొంత పార్టీకి ఓటు వేయలేని పరిస్థితి ఏర్పటడం బహుశా ఇదే తొలిసారి. నిజానికి కాంగ్రెస్ పార్టీ తనకు తగ్గుతున్న మద్దతు కారణంగా, యూపీ, ఢిల్లీతో సహా అనేక రాష్ట్రాల్లో ఇతర పార్టీలతో చేతులు కలపవలసి వచ్చింది. 1952- 2009 మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ న్యూఢిల్లీ స్థానాన్ని ఏడు సార్లు గెలుచుకుంది. బీజేపీకి చెందిన మీనాక్షి లేఖి ఇక్కడి నుంచి వరుసగా రెండుసార్లు లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. 2004, 2009 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ న్యూఢిల్లీ స్థానం నుండి గెలిచి పార్లమెంటుకు చేరుకున్నారు. కాంగ్రెస్ నేతలైన సోనియా, రాహుల్, ప్రియాంకల ఇళ్లు న్యూఢిల్లీ ఏరియాలోనే ఉండటంతో వారికి ఇక్కడే ఓటు హక్కు ఉంది. మరోవైపు ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రాజీవ్ శుక్లా కూడా న్యూఢిల్లీ ఓటర్లే. దీంతో వీరు కూడా కాంగ్రెస్‌కు ఓటు వేయలేని స్థితిలో ఉన్నారు. -
CWC Meeting: సీడబ్ల్యూసీ భేటీ ప్రారంభం
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో గెలుపు వ్యూహాలను సిధ్దం చేసేందుకు కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) భేటీ ప్రారంభమైంది. మంగళవారం ఉదయం జరుగుతున్న ఈ భేటీలో లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోకు తుది రూపు ఇచ్చి.. ఆమోదించనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ భేటీలో మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు కీలక నేతలు హాజరయ్యారు. తెలంగాణ, కర్ణాటక ముఖ్యమంత్రులు సైతం సాయంత్రం పాల్గొననున్నట్లు తెలుస్తోంది. రైతులు, మహిళలు, యువత, బలహీన వర్గాలే లక్ష్యంగా ‘భాగిదారీ న్యాయ్’(భాగస్వామ్య న్యాయం), ’కిసాన్ న్యాయ్’, ’నారీ న్యాయ్’, ’శ్రామిక్ న్యాయ్’,’యువ న్యాయ్’పేరిట ఇప్పటికే తన హామీలను ప్రజల ముందుంచిన కాంగ్రెస్ వాటిపై నేతలకు మార్గనిర్దేశం చేయనుంది. ఇక.. పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం, రైతులకు వడ్డీలేని రుణాలు, ప్రస్తుతం కేంద్రం అందిస్తున్న సాయం పెంపు, యువత కోసం 30 లక్షల ఉద్యోగాల భర్తీ, ప్రభుత్వ లేక ప్రైవేట్ రంగంలో 25 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ప్రతి డిప్లొమా లేక డిగ్రీ హోల్డర్‌కు అప్రెంటిస్ షిప్ శిక్షణకు రూ.లక్ష సాయం, 30 ఏళ్లలోపు యువత స్టార్టప్‌లకు నిధులు సమకూర్చడానికి రూ.5,000 కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు, పేపర్ లీకేజీల నివారణకు ప్రత్యేక చట్టం, మహిళల కోసం నిరుపేద కుటుంబంలోని ఒక మహిళకు ఏడాదికి రూ.లక్ష సాయం వంటి 25 హామీలపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది. అయితే మేనిఫెస్టో విడుదల మాత్రం తర్వాతే ఉటుందని పార్గీ వర్గాలు చెబుతున్నాయి. అభ్యర్థుల ఎంపికపై సీఈసీ.. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి ఇప్పటికే పలు మార్లు భేటీ అయిన కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) మంగళవారం మళ్లీ సమావేశం కానుంది. ఇప్పటికే రెండు విడతలుగా 82 మంది పేర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. 19న జరిగే భేటీలో తెలంగాణలోని మిగతా స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేసే అవకాశాలున్నాయి. భేటీలో పాల్గొనేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమ వారం మధ్యాహ్నం ముంబై నుంచి నేరుగా ఢిల్లీ చేరుకోగా, సీఈసీ సభ్యుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీడబ్ల్యూసీ సభ్యుడు దామోదర రాజనర్సింహ మంగళవారం ఉదయానికి ఢిల్లీ చేరుకునే అవకాశం ఉంది. -
ఢిల్లీలో సీఎం రేవంత్.. సోనియా గాంధీతో భేటీ.. కీలక చర్చ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో రేవంత్ భేటీ అయ్యారు. రేవంత్ వెంట రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జ్ దీపా మున్షి కూడా ఉన్నారు. తెలంగాణలోని రాజకీయ పరిణామాలపై సోనియాకు రేవంత్ వివరించినట్లు తెలుస్తోంది. లోక్‌సభ అభ్యర్ధుల ఎంపికపైనా చర్చించినట్లు సమాచారం. ఎన్నికల వ్యూహాలు, పార్టీ ప్రచార సభలపై చర్చించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సోనియా, రాహుల్, ప్రియాంక ప్రచార సభలపై చర్చించిన రేవంత్.. తెలంగాణలో వందరోజుల పాలనపై అధిష్టానానికి వివరించినట్లు తెలుస్తోంది. టీవల కాంగ్రెస్‌లో చేరిన వారికి టికెట్లు ఖరారు అంశంపై చర్చించినట్లు వినికిడి. రేపు(మంగళవారం) కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ఉంది. ఈ సమావేశంలో రేవంత్ పాల్గొననున్నారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరగనున్నీ సమాఏశంలో ఎన్నికల మేనిఫెస్టోతో పాటు..దేశంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. కాంగ్రెస్ తరపున పోటీ చేయనున్న లోక్ సభ అభ్యర్ధులను ఖరారు.. వివిధ రాష్ట్రాల్లో భాగస్వామ్య పార్టీలతో సీట్ల సర్దుబాటుపై కుదిరిన ఒప్పందాలకు ఆమోద ముద్ర వేసే అవకాశముంది. ఇక రేపు కాంగ్రెస్ జాబితా రానుండటంతో రేవంత్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. చదవండి: -
సోనియా గాంధీని కలిసిన అశోక్ చవాన్?.. స్పందించిన మాజీ సీఎం
ముంబై: కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీని తాను అసలు కలవనేలేదని ఇటీవల బీజేపీలో చేరిన మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ అన్నారు. ఆయన సోమవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ‘ఒకవేళ రాహుల్ గాంధీ నా గురించే మాట్లాడి ఉంటే. ఆయన చేసిన వ్యాఖ్యలు ఆధారంలేని అసత్యాలు. నేను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయటం నిజం. నేను ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేశా. అయితే నేను రాజీనామా చేశానని కొంతమందికి తెలియదు’ అని అశోక్ చవాన్ అన్నారు. ‘నేను కాంగ్రెస్ నాయకులురాలు సోనియా గాంధీని అసలు కలవలేదు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా నిరూపితం కాని అసత్యాల. నేను సోనియా గాంధీ వద్ద ఎటువంటి భావాలు వ్యక్తం చేయలేదు. ఇటువంటి వ్యాఖ్యలు కేవలం ఎన్నికల సందర్భంగా చేసే రాజకీయ స్టేట్మెంట్లు మాత్రమే’ అని అశోక్ చవాన్ స్పష్టం చేశారు. అయితే నిన్న(ఆదివారం) రాహుల్‌గాంధీ తాను చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ముగింపు సందర్భంగా పేరు ప్రస్తావించకుండా కాంగ్రెస్ పార్టీ వీడిన ఓ సీనియర్ నేత తన తల్లి సోనియా గాంధీ వద్దకు వచ్చి పార్టీ వీడే పరిస్థతి వచ్చినందుకు కన్నీటిపర్యంతమయ్యారని అన్నారు. అయితే ఆయన పరోక్షంగా ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన మాజీ సీఎం అశోక్ చవాన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించటం గమనార్హం. ‘తాను కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిపోవడానికి చాలా సిగ్గుపడుతున్నా. వారితో పోరాడటానికి నాకు శక్తి లేదు. నాకు జైలుకు వెళ్లటం ఇష్టం లేదు. అందుకే పార్టీ మారుతున్నాని నా తల్లి సోనియా గాంధీ వద్దకు వచ్చి సదరు సీనియర్ నేత కన్నిటీపర్యంతమయ్యారు’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు. ఇక.. మహారాష్ట్ర కాంగ్రెస్‌లో కీలక నేతగా ఉన్న అశోక్ చవాన్ గత నెలలో బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. -
సోనియా గాంధీని కలిసిన డానిష్ అలీ.. కాంగ్రెస్ తరఫున పోటీ!
ఢిల్లీ: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సస్పెండెడ్ బీఎస్పీ ఎంపీ డానిష్ అలీ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయనున్నట్లు ఊహాగానాలు వ్యాప్తిస్తున్నాయి. ఆయన ఈ రోజు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీని ఆమె నివాసంలో కలిశారు. దీంతో ఆయన అమ్రోహా లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగుతారన్న వార్తలకు ప్రాధాన్యత చేకూరుతోంది. ‘నేను సోనియా గాంధీ ఆశీస్సులు తీసుకున్నా. రానున్న ఎన్నికల్లో అమ్రోహా లోక్‌సభ స్థానం నుంచి రెండోసారి పోటీ చేస్తాను. ఆమె హృదయం పేద ప్రజలకు కోసం తపిస్తూ ఉంటుంది’అని డానిష్ అలీ ‘ఎక్స్’ ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. సోనియా గాంధీ నేతృత్వంలోని నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్(NAC).. ఎంఎన్ఆర్ఈజీ, ఆర్టీఐ, విద్యా హక్కు, ఆహార భద్రతా బిల్లు వంటి పేదల, పారదర్శక చట్టాలను ప్రయోగాత్మకంగా రూపొందించిందని డానిష్ అన్నారు. లోక్‌సభ ఎన్నికల కోసం ప్రతిపక్షాల ఇండియా కూటమిలో భాగంగా సమాజ్‌వాదీ పార్టీతో సీట్ల సంప్రదింపుల్లో అమ్రోహా సెగ్మెంట్ గురించి చర్చలు జరిపింది. Honoured to get blessings of epitome of sacrifice, Smt #SoniaGandhi for my 2nd #LokSabhaElection from #Amroha. Her heart beats for India’s poor. It was NAC headed by her that piloted landmark pro-poor & transparency laws like MNREGA, #RTI, Right to Education, Food Security Bill. pic.twitter.com/AAesBjF2FH — Kunwar Danish Ali (@KDanishAli) March 14, 2024 అయితే రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్రలో డానిష్ అలీ జనవరిలో మణిపూర్‌లో పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...‘ ఈ సందర్భంగా నాకు చాలా ముఖ్యమైంది. ఇక్కడ రావటంతో నా మనసు కుదుటపడింది. నాకు రెండు మార్గాలు ఉన్నాయి. నాలో మార్పు లేకుండా దళితులు, వెనబడిన, గిరిజన, మైనార్టీలు, పేదల దోపిడీని విస్మరించడం. లేదా.. దేశంలో భయం, ద్వేషం, దోపిడడీ, విభజన వాతావరణానికి వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభించటం’ అని డానిష్ అన్నారు. ‘కాంగ్రెస్ నేతలతో సన్నిహతంగా ఉంటుంన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. పార్టీలో చేరే సమయంలో ఇచ్చిన హామీలు మరచిపోయారు. ఆ కారణంగా డానిష్ అలీని సస్పెండ్ చేస్తున్నాం’బీఎస్పీ గతేడాది వివరణ ఇచ్చింది. డానిష్ అలీపై బీఎస్సీ పార్టీ ఎంపీ రమేష్ బిధూరి చేసిన అనుచిత వ్యాఖ్యలు చేసిన సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. అలీకి మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. -
నేడు కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన!
సాక్షి, హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. ఈ ప్రక్రియలో కీలకమైన కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశం గురువారం ఢిల్లీలో జరగనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగే ఈ భేటీలో పార్టీ మాజీ చీఫ్‌లు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలతో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, అంబికా సోని పాల్గొననున్నారు. రాష్ట్రం నుంచి సీఈసీ సభ్యుడి హోదాలో రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ ఏర్పాటు చేసిన తెలంగాణ స్క్రీనింగ్ కమిటీ సభ్యులు హాజరు కానున్నారు. ఇప్పటికే పీసీసీల స్థాయిలో షార్ట్ లిస్ట్ అయిన ఆశావహుల జాబితా నుంచి వీలున్నన్ని పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయడమే ఎజెండాగా ఈ సమావేశం జరగనుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. భేటీ అనంతరం దేశవ్యాప్తంగా 100 మందికి పైగా అభ్యర్థులతో వీలుంటే గురువారం నాడే లేదంటే శుక్రవారం తొలి జాబితా విడుదల చేస్తారని తెలుస్తోంది. ఇక ఏకాభిప్రాయం సాధ్యమైతే తెలంగాణలోని దాదాపు అన్ని స్థానాలకు (ఒకట్రెండు మినహా) ఒకేసారి అభ్యర్థులను ప్రకటిస్తారని, లేదంటే 8 నుంచి 10 మంది అభ్యర్థులను ప్రకటిస్తారనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. సికింద్రాబాద్, చేవెళ్ల, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, కరీంనగర్, నిజామాబాద్ స్థానాలపై ఇప్పటికే ఏకాభిప్రాయం వచ్చిందని తెలుస్తోంది. మిగిలిన స్థానాలపై కూడా సీఈసీ సమావేశంలో చర్చించిన అనంతరం పలు ప్రాతిపదికల ఆధారంగా అభ్యర్థులను నిర్ణయిస్తారని సమాచారం. రాహుల్ పోటీపైనా స్పష్టత! రాష్ట్రం నుంచి రాహుల్‌గాంధీ పోటీ చేస్తారా లేదా? అన్నదానిపై కూడా ఈ సమావేశంలోనే స్పష్టత రానుంది. ఒకవేళ రాహుల్ పోటీ చేసే పక్షంలో ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఏఐసీసీ అధికారికంగా విడుదల చేసే తొలి జాబితాలోనే ప్రకటించే అవకాశం ఉందని గాంధీభవన్ వర్గాలంటున్నాయి. కానీ ఏఐసీసీ వర్గాల కథనాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఆయన తిరిగి ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ, కేరళలోని వయనాడ్ రెండింటి నుంచి పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం. ఇక ప్రియాంకగాంధీ.. తల్లి సోనియాగాంధీ ఐదుసార్లు గెలిచిన రాయ్‌బరేలీ నుండి పోటీ చేసే అవకాశం ఉందని అంటున్నారు. హస్తినకు ఆశావహులు సీఈసీ సమావేశం నేపథ్యంలో టికెట్ ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే అంచనాలున్న స్థానాల్లో తమ అభ్యర్థిత్వాలు ఖరారవుతాయో లేదోననే ఆసక్తితో కొందరు నేతలు ఢిల్లీ చేరుకున్నట్టు సమాచారం. వివిధ సర్వేల నివేదికలు, పార్టీ విధేయత ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉండనున్నట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసే అవకాశాలున్న తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, పంజాబ్ వంటి రాష్ట్రాల నుంచి తొలి జాబితాలో ఎక్కువమందికి అవకాశం ఉంటుందని తెలుస్తోంది. -
టార్గెట్ రాహుల్.. సోనియాకు స్మృతి ఇరానీ చురకలు
లక్నో: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా మంగళవారం తన మాజీ నియోజకవర్గం అమేథీలో ర్యాలీని ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. రాత్రిపూట మద్యం సేవించే వారితో ఉత్తరప్రదేశ్ భవిష్యత్తు నృత్యం చేస్తోందని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ సొంత నియోజకవర్గం వారణాలో మద్యం సేవించి రోడ్డుపై పడి ఉన్న వ్యక్తులు కనిపించారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వారణాసి వెళ్లిన తనకు రాత్రిపూట వాయిద్యాలు మోగించడం.. మద్యం తాగి రోడ్డుపై పడి ఉన్నవారిని చూశానని అన్నారు. అయితే రామ మందిరంలో ప్రధాని మోదీ, అంబానీ, అదానీలతోపాటు భారతదేశంలోని కోటీశ్వరులందరు ఉంటారు కానీ ఒక్క వెనుకబడిన లేదా దళిత వ్యక్తి కూడా కనిపించడని వ్యంగ్యస్త్రాలు సంధించారు. రాహుల్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి, అమేథీ బీజేపీ ఎంపీ స్మృతి ఇరానీ కౌంటర్ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్‌పై రాహుల్‌గాంధీ మనసులో ఎంత విషం ఉందో ఆయన వ్యాఖ్యలను బట్టి తెలుస్తోందన్నారు. వాయనాడ్‌లోనూ ఉత్తరప్రదేశ్ ఓటర్లపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. అయోధ్య రామాలయంలో జరిగే 'ప్రాణప్రతిష్ఠ' కార్యక్రమానికి ఆహ్వానాన్నిఆయన తిరస్కరించారని,, నేడు వారణాసి ఉత్తరప్రదేశ్ యువత గురించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. చదవండి: ఢిల్లీ, పుణెలో రూ.2,500 కోట్ల విలువైన ‘మ్యావ్ మ్యావ్’ పట్టివేత.. ఏంటిది? కాంగ్రెస్ భవిష్యత్తు అంధకారంలో ఉందని కానీ ఉత్తరప్రదేశ్ భవిష్యత్తు అభివృద్ధి వైపు పయనిస్తోందన్నారు. తన కొడుకును మంచిగా పెంచలేకపోతే కనీసం అతన్ని పిచ్చిపిచ్చిగా మాట్లాడకుండా ఉండమని చెప్పాలంటూ సోనియాగాంధీకి చురకలంటించారు. మరోవైపు ఉత్తరప్రదేశ్ మంత్రి దినేష్ ప్రతాప్ సింగ్ కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఖండించారు. దేశానికి ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో కాంగ్రెస్‌కు గట్టి పట్టు ఉన్నప్పటికీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది. స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ 55,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. యూపీలోని మొత్తం 80 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ కేవలం ఒక్క సీటు గెలుచుకుంది. ఆ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఒక్కరే రాయబరేలి నుంచి గెలిచారు. రాహుల్ గాంధీ అమేథీలో ఓటమిని చవిచూడగా, కేరళలోని వయనాడ్‌లో గెలిచారు. -
రాజ్యసభకు సోనియా గాంధీ ఏకగ్రీవ ఎన్నిక
జైపూర్: కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదే రాష్ట్రం నుంచి నామినేషన్ వేసిన బీజేపీ నేతలు చున్నీలాల్ గరాసియా, మదన్ రాథోడ్ కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు మంగళవారం సాయంత్రం ముగిసింది. రాష్ట్రంలో మూడు స్థానాలకు బరిలో ముగ్గురే మిగలడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. లోక్‌సభ ఎంపీగా 6 పర్యాయాలు పనిచేసిన సోనియా గాంధీ.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు చెందిన జైపూర్ నుంచి తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. కాగా సోనియా 2006 నుంచి రాయ్‌బరేలీ నుండి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019 ఎన్నికల్లోనూ అమెథీలో రాహుల్ ఓడిపోయినప్పటికీ సోనియా రాయ్‌బరేలీ స్థానాన్ని గెలుచుకొని ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ గెలుచుకున్న ఏకైక స్థానంగా నిలిచింది. చదవండి: చండీగఢ్ మేయర్ ఎన్నికపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు -
హారిజాంటల్ రిజర్వేషన్లు దారుణం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగావకాశాల్లో మహిళల హక్కులను హరించేలా రోస్టర్ పాయింట్లు లేని హారిజాంటల్ రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం దారుణమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. తెలంగాణలో ఆడబిడ్డలతో పాటు దివ్యాంగుల ఉద్యోగాలకు భద్రత లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగ నియామకాల్లో ఆడబిడ్డలకు అన్యాయం చేసేలా ఉన్న జీవో 3ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాం«దీకి రాసిన లేఖలను కవిత సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆడబిడ్డలకు తీరని అన్యాయం చేస్తోందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు మహిళలకు రోస్టర్ పాయింట్లతో కూడిన హారిజాంటల్ రిజర్వేషన్లు అమలవుతున్నాయని, మహిళలకు హారిజాంటల్ రిజర్వేషన్ ఇస్తూనే వర్టీకల్ రిజర్వేషన్లతో సమానంగా అమలు చేయాలంటే రోస్టర్ పాయింట్లను పెట్టాలనే ప్రతిపాదన 1996లో తెరమీదికి వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో అప్పటి ప్రభుత్వం జీవో 41, 56లను జారీ చేసిందన్నారు. పాత విధానం ప్రకారం మహిళలకు కచ్చితంగా 33 శాతం ఉద్యోగాలతో పాటు అదనంగా మరిన్ని ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉండేందన్నారు. హారిజాంటల్ రిజర్వేషన్ విధానంతో ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకే తీవ్రంగా నష్టం జరుగుతుందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఆడబిడ్డలకు అన్యాయం చేసే జీవో 3ను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ప్రకటించారు. -
సీఎం రేవంత్ కొత్త జీవోను వ్యతిరేకిస్తూ.. సోనియాకు ఎమ్మెల్సీ కవిత లేఖ
-
సీఎం రేవంత్ కొత్త జీవో..సోనియాకు కవిత లేఖ
-
సీఎం రేవంత్ కొత్త జీవోను వ్యతిరేకిస్తూ.. సోనియాకు ఎమ్మెల్సీ కవిత లేఖ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. ఉపాధి అవకాశాల్లో మహిళలకు రిజర్వేషన్లపై కాంగ్రెస్ అవలంభిస్తున్న వైఖరిపై విమర్శలు గుప్పించారు. రిజర్వేషన్ల స్ఫూర్తిని పక్కనబెడుతూ సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అంటూ ఫిబ్రవరి 10న కొత్త జీవో తీసుకురావడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. ఆడబిడ్డల హక్కులను కాంగ్రెస్ తుంగులో తొక్కుతుందని, ఈ అంశంపై జాతీయ పార్టీ వైఖరి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘1996లో అనేక పోరాటాల ఫలితంగా మహిళలకు ఉపాధి అవకాశాల్లో 33.3 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో నంబర్ 41, 56 జారీ అయ్యాయి. దీనికి 1992లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఇందిరా సాహ్ని తీర్పు కూడా ఎంతో తోడ్పాటునిచ్చింది. ఆ తర్వాత రాజ్యంగబద్ధంగా మహిళలకు రోస్టర్ పాయింట్లతో కూడిన హారిజాంటల్ రిజర్వేషన్లు కల్పించారు. మన దేశంలో సామాజిక రిజర్వేషన్లు ఎలా అయితే ఉన్నాయో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కచ్చితంగా అమలు చేసే పద్ధతి నడుస్తోంది. ఇన్నేళ్ల నుంచి సాగుతున్న ఈ పద్ధతిని ఇటీవల రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పరిగణలోకి తీసుకొని తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల హక్కులను కాలరాస్తూ జీవో 41, 56ను రద్దు చేస్తూ ఈ నెల 10న కొత్తగా జీవో 3ను తీసుకువచ్చింది. రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీచేసినా.. తాము మహిళల హక్కులను హరించబోమని 2023 జనవరిలో కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. చదవండి: కాసేపట్లో ఢిల్లీకి సీఎం రేవంత్.. ఆ జాబితాపై హైకమాండ్‌తో భేటీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎవరితో సంప్రదింపులు జరపకుండా మహిళల హక్కులకు భంగం కలిగిస్తూ ఈ నెల 6న రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. తద్వారా మహిళల హక్కులను సంపూర్ణంగా, శాశ్వతంగా హరిస్తూ రోస్టర్ పాయింట్లు లేకుండా హారిజాంటల్ పద్ధతిలో రిజర్వేషన్లను కల్పిండానికి జీవో 3ను ప్రభుత్వం జారీ చేసింది. ఇది మహిళల ఉద్యోగావకాశాలకు శరాఘాతంగా నిలవనుంది. ఉదాహరణకు ఈ ఏడాది దాదాపు 2 లక్షల 50 వేల మంది ఇప్పటికే టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో నమోదుచేసుకున్నారు. వారిలో లక్ష మంది ఆడబిడ్డలు ఉన్నారు. ఈ ఏడాది 2 లక్షల కొలువులు ఇస్తామని ప్రభుత్వం చెబుతుంనది. అంటే 33.3 శాతం రిజర్వేషన్ల మేరకు కనీసం 66 వేల మంది మహిళలకు ఉద్యోగాలు కచ్చితంగా రావాలి. అదనంగా మరింత మంది మహిళలకు ఉద్యోగాలు లభించాలి. అదే ఈ రిజర్వేషన్ల స్ఫూర్తి. దీనిని పక్కనబెడుతూ సీఎం రేవంత్ రెడ్డి కొత్త జీవో తీసుకురావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నాను. ఈ అంశంపై జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ వైఖరి ఏమిటో చెప్పాలి. సుప్రీంకోర్టు తీర్పును పాటించబోమంటూ బీహార్, కర్ణాటక రాష్ట్రాలు జీవోలు జారీ చేశాయి. కానీ తెలంగాణలో మాత్రం మీ గ్యారెంటీతో ఇందిరమ్మ రాజ్యంగా చెబుతూ ఏర్పడిన కొత్త ప్రభుత్వంలో ఇంటి ఆడబిడ్డలకు తీరని అన్యాయం జరుగుతోంది. ఈ విషయంలో జోక్యం చేసుకొని ఆ జీవోను తక్షణమే వెనక్కి తీసుకునేలా ముఖ్యమంత్రికి ఆదేశాలు జారీ చేయాలి’ అని విజ్ఞప్తి చేశారు. -
సోనియా గాంధీ ఆస్తుల విలువెంతో తెలుసా?
ఢిల్లీ: ఏడు సార్లు లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ ఈ సారి రాజ్యసభకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. రాయ్‌బరేలీ సీటును వదులుకొని రాజస్థాన్ నుంచి పెద్దల సభలో అడుగుపెట్టనున్నారు. తన ఎన్నికల అఫిడవిట్లో ఆస్తుల వివరాలను ఆమె ప్రకటించారు. ప్రస్తుతం తన వద్ద రూ. 90,000 నగదు ఉందని, తన మొత్తం ఆస్తుల విలువ రూ. 12,53,76,822 (రూ.12.53 కోట్లు)గా పేర్కొన్నారు తనకు రూ.12.53 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. ఇటలీలో తన తండ్రికి చెందిన రూ.27 లక్షల విలువైన ఆస్తిలో వాటా ఉందని, వీటితో పాటు 88 కిలోల వెండి, 1,267 గ్రాముల బంగారం, ఆభరణాలు ఉన్నట్లు సోనియా తెలిపారు. ఢిల్లీలోని డేరా మండి గ్రామంలో మూడు బిగాల వ్యవసాయ భూమి ఉందని, ఎంపీగా వచ్చే వేతనం, రాయల్టీ ఆదాయం, మూలధన లాభాలను ఆదాయంగా ఆమె పేర్కొన్నారు. తన వద్ద రూ.90 వేల నగదు ఉందని తన ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. 2019 లోక్ సభ ఎన్నికల సమయంలో ఆమె తన ఎన్నికల అఫిడవిట్లో తనకు మొత్తం రూ. 11.82 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని వెల్లడించారు. తనకు వ్యక్తిగతంగా సొంత కారు కూడా లేదన్న సోనియా.. సోషల్ మీడియాలో తనకు ఖాతా లేదని తెలిపారు. ఇదీ చదవండి: ప్రియాంక గాంధీకి అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక -
మీ నమ్మకాన్ని పొందటం నాకు గర్వకారణం
న్యూఢిల్లీ: దశాబ్దాలుగా రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి విజయం సాధిస్తూ ప్రస్తుతం వయోభారం కారణంగా ప్రజాసభను వదిలి ఎగువ సభకు తన రాజకీయ పథాన్ని మార్చుకుంటున్న కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ తన నియోజకవర్గ ఓటర్లకు భావోద్వేగంతో ఒక లేఖ రాశారు. ‘‘ నేనిప్పుడు ఈ స్థాయిలో ఉన్ననంటే దానికి మీరే కారణమని గర్వంగా చెబుతా. మీ వల్లే, మీరు నాపై ఉంచిన నమ్మకం వల్లే నా శక్తిమేరకు మీకు సేవచేయగలిగాను. అనారోగ్యం, వయోభారం సమస్యల కారణంగా ఇక మీదట లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయదల్చుకోలేదు. ఈ నిర్ణయం తర్వాత ప్రత్యక్షంగా మీకు సేవచేసే అవకాశం నాకు లేదని తెలుసు. కానీ నా మనసు నిండా మీరే ఉన్నారు. గతంలోలాగే ఇక మీదట కూడా మీరు నాకు, నా కుటుంబానికి అండగా నిలబడతారని తెలుసు’’ అని హిందీలో సోనియా ఓటర్లకు ఒక సందేశం పంపారు. ‘‘ మీరు లేకుండా ఢిల్లీలో నా కుటుంబం సంపూర్ణం కాదు. రాయ్‌బరేలీకి వచ్చి మిమ్మల్ని కలిసినప్పుడే మొత్తం కుటుంబం అనే భావన కలుగుతోంది. మీ బంధం దశాబ్దాలనాటిది. నా అత్తగారి నుంచే నేనీ బంధాన్ని వారసత్వంగా పొందా. రాయ్‌బరేలీతో నా కుటుంబ బంధం బలంగా పెనవేసుకుంది. నా మామగారు ఫిరోజ్ గాంధీ స్వాతంత్య్ర సిద్ధించాక తొలి సార్వత్రిక ఎన్నికల్లో ఇదే రాయ్‌బరేలీ నుంచి లోక్‌సభలో అడుగుపెట్టారు. ఆ తర్వాత ఇందిరా గాంధీని ఆశీర్వదించి లోక్‌సభకు పంపారు. జీవితంలో ఎన్ని ఎత్తుపల్లాలు ఎదురైనా తోడుగా నిలిచి బంధాన్ని మరింత పటిష్టం చేశారు. అత్తను కోల్పోయినప్పుడు, భర్తను కోల్పోయినప్పుడూ మీ చెంతకొచి్చన నన్ను ఆదరించి అక్కున చేర్చుకున్నారు. ఇంతటి మద్దతు, ప్రోత్సాహాన్ని జీవితంలో మరువను. గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో గడ్డుపరిస్థితులు ఎదురైనా మీరు నావెంటే నడిచారు. నా కంటే పెద్దవారికి ధన్యవాదాలు, యువతకు ప్రేమాశీస్సులు. త్వరలోనే మిమ్మల్ని కలుస్తా’ అని సోనియా తన సందేశం పంపారు. రాజస్తాన్ నుంచి రాజ్యసభకు నామినేషన్ దాఖలుచేసిన మరుసటి రోజు సోనియా తన నియోజకవర్గ ప్రజలను గుర్తుచేసుకుంటూ లేఖ రాయడం గమనార్హం. సోనియా కుమార్తె ప్రియాంక గాంధీ ఈసారి రాయ్‌బరేలీ నుంచి సార్వత్రిక సమరంలో నిలబడతారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. -
సోనియా గాంధీ భావోద్వేగ లేఖ!
రాజ్యసభ ఎన్నికలకు సోనియా గాంధీ బుధవారం (ఫిబ్రవరి 14) నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు రాజ్యసభకు వెళుతుండటంపై పలువురు విమర్శిస్తున్నారు. ఈ నేపధ్యంలో సోనియా గాంధీ ఆ విమర్శలకు వివరణగా రాయ్‌బరేలీ ప్రజలను ఉద్దేశిస్తూ భావోద్వేగంతో కూడిన లేఖ రాశారు. ‘ఢిల్లీలో మా కుటుంబం అసంపూర్ణంగా ఉంది. రాయ్‌బరేలీకి వచ్చి మిమ్మల్ని కలవడం ద్వారా దీనికి సంపూర్ణత ఏర్పడింది. ఈ సన్నిహిత సంబంధం ఎంతో పాతది. నా అత్తమామల నుండి నాకు అదృష్టంలా వచ్చింది’ అని సోనియా గాంధీ ఆ లేఖలో రాశారు. CPP चेयरपर्सन श्रीमती सोनिया गांधी जी का रायबरेली की जनता के नाम संदेश- pic.twitter.com/6zlJkWjwvi — Congress (@INCIndia) February 15, 2024 రాయ్‌బరేలీతో అనుబంధం.. ‘రాయ్‌బరేలీతో మా కుటుంబ సంబంధాలు చాలా లోతుగా ఉన్నాయి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జరిగిన తొలి లోక్‌సభ ఎన్నికల్లో మీరు నా మామగారైన ఫిరోజ్ గాంధీని ఇక్కడి నుంచి గెలిపించారు. ఆయన తర్వాత నా అత్తగారు ఇందిరాగాంధీని కూడా ఇలానే ఢిల్లీకి పంపారు. నా జీవితంలోని ఒడిదుడుకులలలో మీ ప్రేమ, ఉత్సాహం దొరికింది’ గత రెండు దఫాల ఎన్నికల్లో.. ‘నా అత్తగారిని, నా జీవిత భాగస్వామిని కోల్పోయిన తరువాత, నేను మీ వద్దకు వచ్చాను. మీరు నా కోసం ఆప్యాయంగా చేతులు చాచారు. గత రెండు దఫాల ఎన్నికల్లో మీరు నాకు అండగా నిలిచిన సంగతి మరచిపోలేను. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే అది మీ కారణంగానే అని గర్వంగా చెబుతాను. మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నిరంతరం ప్రయత్నించాను’ ఆరోగ్యం, పెరుగుతున్న వయస్సు.. ‘ఇప్పుడు నా ఆరోగ్యం, పెరుగుతున్న వయస్సు కారణంగా నేను రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఈ నిర్ణయం తీసుకున్నాక నేను మీకు నేరుగా సేవ చేసే అవకాశాన్ని పొందలేను. నా మనసులో ఈ వేదన అలానే ఉంటుంది. అయితే నా ప్రాణం ఎప్పుడూ ఇక్కడే ఉంటుంది. ఇప్పటి వరకు నన్ను మీరు ఆదుకున్నట్లే ఇకపై నన్ను, నా కుటుంబాన్ని ప్రతి కష్టంలోనూ మీరు ఆదుకుంటారని నాకు తెలుసు.పెద్దలకు నమస్కారాలు, పిల్లలకు ప్రేమాభినందనలు. త్వరలోనే కలుస్తానని వాగ్దానం చేస్తున్నాను’ అని సోనియా ఆ లేఖలో పేర్కొన్నారు. -
సోనియా రాజ్యసభ నామినేషన్.. వెంటవచ్చిన రాహుల్, ప్రియాంక!
రాజ్యసభ ఎన్నికల్లో రాజస్థాన్ నుంచి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పోటీ చేస్తున్నారు. ఇందుకోసం ఆమె ఈరోజు(బుధవారం) నామినేషన్ దాఖలు చేయనున్నారు. రాజధాని జైపూర్ చేరుకున్న ఆమె వెంట రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు. సోనియా గాంధీ లోక్‌సభ నుంచి కాకుండా రాజ్యసభ నుంచి పార్లమెంటుకు చేరుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రియాంక గాంధీ యూపీలోని రాయ్‌బరేలీ స్థానం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో బరిలోకి దిగుతారనే ప్రచారం జరుగుతోంది. రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోటసార నివాసంలో సోనియాగాంధీ నామినేషన్ సెట్‌పై ఎమ్మెల్యేలందరూ సంతకాలు చేశారు. #WATCH कांग्रेस संसदीय दल की अध्यक्ष सोनिया गांधी राज्यसभा चुनाव के लिए अपना नामांकन दाखिल करने के लिए जयपुर, राजस्थान पहुंचीं। उनके बेटे और पार्टी सांसद राहुल गांधी और उनकी बेटी और पार्टी महासचिव प्रियंका गांधी वाड्रा उनके साथ हैं। pic.twitter.com/0oGUmMr1to — ANI_HindiNews (@AHindinews) February 14, 2024 సీనియర్ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ 1999 లోక్‌సభ సభ్యురాలుగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలి లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె అమేథీ లోక్‌సభ సభ్యురాలిగానూ ఉన్నారు. ఆమె పార్లమెంటు ఎగువ సభకు వెళ్లడం ఇదే తొలిసారి. ఫిబ్రవరి 8వ తేదీ నుంచి రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్ పత్రాల పరిశీలన ఫిబ్రవరి 16న జరగనుంది. అభ్యర్థులు ఫిబ్రవరి 20లోగా తమ పేర్లను ఉపసంహరించుకోవచ్చు. అవసరమైతే ఫిబ్రవరి 27న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ నిర్వహించి, అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నారు. -
RS: సోనియా గాంధీ నామినేషన్.. కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన
ఢిల్లీ: కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్, మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ(77) రాజ్యసభకు నామినేషన్ వేశారు. ఆ సమయంలో ఆమె వెంట కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తనయుడు రాహుల్ గాంధీ, తనయ ప్రియాంక గాంధీ వాద్రా ఉన్నారు. అదే సమయంలో.. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను పార్టీ విడుదల చేసింది. సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి బరిలోకి దిగనున్నారు. ఇక బిహార్ నుంచి అఖిలేశ్ ప్రసాద్ సింగ్, హిమాచల్ ప్రదేశ్ నుంచి అభిషేక్ మను సింఘ్వీ, మహారాష్ట్ర నుంచి చంద్రకాంత్ హండోరె పోటీ చేయనున్నారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిర్ణయం తీసుకొన్నట్లు కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటన జారీ చేశారు. CPP चेयरपर्सन श्रीमती सोनिया गांधी जी ने जयपुर, राजस्थान में राज्यसभा के लिए नामांकन पत्र भरा। pic.twitter.com/aPpWNndFJ5 — Congress (@INCIndia) February 14, 2024 #WATCH | Sonia Gandhi, Rahul Gandhi and Priyanka Gandhi Vadra leave from Jaipur, Rajasthan. The Congress Parliamentary Party Chairperson filed her nomination for Rajya Sabha Election from Rajasthan today. pic.twitter.com/PxxeCC8hHr — ANI (@ANI) February 14, 2024 రాజస్థాన్ నుంచి ఖాళీ అవుతున్న మూడు రాజ్యసభ స్థానాలకు ఈ నెల 27న ఎన్నికలు జరగనున్నాయి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో ఈ స్థానానికి ఎన్నిక జరుగుతోంది. అందులో ఒకటి కాంగ్రెస్‌కు దక్కనుంది. నెహ్రూ కుటుంబం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యే రెండో నేతగా సోనియా నిలవబోతున్నారు. 1964 ఆగస్టు నుంచి 1967 ఫిబ్రవరి వరకూ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. ప్రస్తుతం సోనియా ఆమె రాయ్ బరేలీ లోక్‌సభ స్థానానికి ఎంపీగా ఉండగా.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఇదిలా ఉంటే.. మొత్తం లోక్‌సభకు ఐదుసార్లు సోనియా గాంధీ ఎన్నికయ్యారు. రాబోయే ఎన్నికల్లో రాయ్ బరేలీ నుంచి ఆమె తనయ ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేయబోతున్నారనే ప్రచారం నడుమ.. ఆమె రాజ్యసభకు వెళ్లాలని నిర్ణయించుకోవడం గమనార్హం. వయసురిత్యా.. అలాగే అనారోగ్య కారణాలతోనే ఆమె పార్టీ కార్యకలాపాలకు(ఎన్నికల ప్రచారంతో సహా) దూరంగా ఉంటూ వస్తున్నారు. -
ప్రత్యక్ష ఎన్నికలకు దూరం.. రాజ్యసభకు సోనియా!
సాక్షి, ఢిల్లీ: వృద్ధాప్యం, అనారోగ్య కారణాలతో కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియా గాంధీ ప్రత్యక్ష రాజకీయాలకు దూరం కానున్నట్లు సమాచారం. సోనియాను రాజ్యసభకు పంపాలని పార్టీ అగ్ర నాయకత్వం యోచిస్తునట్లు తెలిసింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న ఏఐసీసీ.. సోనియాను రాజస్ధాన్ నుంచి రాజ్యసభకు పంపించాలని కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ఇటీవల సోనియా గాంధీని కలిసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. ఖమ్మం నుంచి పోటీ చేయాలని కోరిన సంగతి తెలిసిందే. ఇక సోనియా గాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్న రాయ్ బరేలి నుంచి ప్రియాంక గాంధీ లోక్‌సభ ఎన్నికల బరిలో ఉంటారని సమాచారం. రాయ్ బరేలి నుంచి ప్రియాంక గాంధీ పోటీలో ఉంటే ఉత్తరాదిలోని కీలక రాష్ట్రంలో విపక్ష కూటమికి అనుకూల వాతావరణం నెలకొనే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. ఇదీ చదవండి: బలపరీక్ష నెగ్గిన నితీష్ సర్కార్ -
నాథుడు లేని పార్టీకి అందలమెలా..
అది ఎంత మహా వృక్షమైనా కావొచ్చు. ఎన్నిఆటుపోట్లనైనా తట్టుకుని ఉండొచ్చు. చివరికి ఓ చిన్నపాటి గాలివాన చాలు.. కూకటి వేళ్ళతో కూలిపోవడానికి.. దశాబ్దాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి ఈ దృష్టాంతం అతికినట్లు సరిపోతుంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చకచకా పావులు కదుపుతూ ప్రత్యర్థి పార్టీలకు సవాలు విసరాల్సింది పోయి అంతర్గత సమస్యలహో అల్లాడుతూ పఠనం దిశగా సాగుతోంది. మరోపక్క ప్రస్తుత ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మాత్రం అందనంత ఎత్తులో మూడోమారు అందాలన్నీ దక్కించుకునే రేసులో దూసుకుపోతోంది. ఒక జాతీయ పార్టీగా రాజకీయాలను శాసించి.. దిగ్గజాలకు ఆలవాలమై దుర్బేధ్యమైన కోటను నిర్మించుకున్న కాంగ్రెస్ ఇప్పుడు దిక్కులేని స్థాయికి ఎందుకు దిగజారింది?? ఎందుకీ దుర్గతి పట్టింది..?? ఎన్నికల వేళ పార్టీ ని సరైన పంథాలో నడిపించే నాథుడు లేక ఎందుకు విలాలలాడుతోంది..?? రాబోయే రోజుల్లో ఇది ఒక ప్రాంతీయ పార్టీగానైనా నిలబడుతుందా..?? నాలుగు దశాబ్దాల కిందట 400 పై చిలుకు స్థానాలతో ప్రత్యర్థులను గడగడ లాడించిన పార్టీ నేడు కనీస సీట్లు అయినా సాధించుకోలేని పరిస్థితికి ఎందుకు వచ్చింది?? ఇవన్నీ సమాధానం వెతకాల్సిన ప్రశ్నలే.. పతనం దిశగా.. వాస్తవాలు ఎప్పుడూ కఠినంగానే ఉంటాయి. కాంగ్రెస్ పఠనం వెనుక కఠోర సత్యాలు కూడా దాచిపెట్టేవి ఏమీ కాదు. పార్టీ ప్రస్తుత దుర్భర పరిస్థితికి ప్రధాన కారణం స్వయంకృతమేనని చెప్పుకోవాలి. నెహ్రు, ఇందిర, రాజీవ్‌ల హయాం తర్వాత పార్టీ మసకబారడం మొదలైంది. రాజీవ్ మరణానంతరం సోనియా అధికార విముఖతతో ప్రధాని పదవిని చేపట్టిన పీవీ.. మన్మోహన్ సాయంతో దేశాన్ని సంస్కరణల బాట అయితే పట్టించగలిగారు కానీ పార్టీకి అవసరమైన శక్తియుక్తులు నింపడంలో మాత్రం తన చాణక్య నీతిని ప్రదర్శించలేక పొయారనే చెప్పొచ్చు. కారణం పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు. అదీగాక పీవీ హయాంలోనే వెలుగు చూసిన హర్షద్ మెహతా కుంభకోణం పార్టీకి తీరని నష్టాన్ని మిగిల్చింది. ఫలితంగా తొలిసారి వాజపేయి దేశ ప్రధాని అయ్యారు. ఇక 2004 ఎన్నికల్లో ‘ఇండియా షైనింగ్‘ నినాదంతో ఎన్డీయే కూటమి బలమైన ప్రభావాన్నే చూపినప్పటికీ గుజరాత్ మత కల్లోలాలు ఆ కూటమిని కాదని యూపీఏ (ఇప్పటి ఇండియా కూటమి) కూటమికి అధికార పగ్గాలు అప్పగించాయి. మన్మోహన్ ప్రధాని అయ్యారు. దశాబ్ద కాలం పాటు రెండు విడతల్లోనూ ప్రధాని అయితే కాగలిగారు కానీ.. మౌన మునిగా ముద్రపడటం.. కర్త, కర్మ, క్రియ అంతా సోనియారాహుల్ లే అయ్యి ముందుకు నడిపించడం ప్రజల్లో ఒక రకమైన అసంతృప్తికి ఆస్కారం కలిగించింది. దీంతో రానురానూ పార్టీ ప్రాభవం అడుగంటుతూ వచ్చింది. మన్మోహన్ రెండో విడతలో రకరకాల స్కాములు వెలుగు చూడటం, ధరల నియంత్రణ లేకపోవడం, నిరుద్యోగిత రేటు పెచ్చుమీరడం, పార్టీ నాయకుల్లో పొరపొచ్చాలు ప్రతిస్థను అథఃపాతాళానికి దిగజార్చేశాయి. ఎన్డీయే కూటమి ఈ అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకుంది. మోదీని తెరపైకి తెచ్చింది.. పగ్గాలు దక్కించుకుంది. అప్పటినుంచి ఇప్పటిదాకా ఎదురేలేకుండా దూసుకుపోతోంది. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ సొంతంగా 51 సీట్లు గెలుచుకోగా.. యూపీఏ కూటమి కేవలం 91 సీట్లతో, అది కూడా కేవలం 20 శాతం ఓటు బ్యాంకు తో సరిపెట్టుకోవాల్సి వచ్చిందంటే పార్టీ ఏ స్థాయికి పడిపోయిందో అర్ధం చేసుకోవచ్చు. అక్కరకు రాని అన్నా చెల్లెల్లు మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడంతోనే యూపీఏకు నూకలు చెల్లడం మొదలైనట్లేనని భావించొచ్చు. ఇంటి పెద్దగా సోనియా పైపైన పెద్దరికం వహిస్తున్నా.. మోదీ, అమిత్ షాల ద్వయాన్ని ఎదుర్కొనే దీటైన నాయకుడ్ని తీర్చిదిద్ద లేకపోవడం కాంగ్రెస్ పార్టీని వేధిస్తున్న ప్రధాన సమస్యగా చెప్పుకోవచ్చు. ఇందుకు రాహుల్, ప్రియాంకల ఉదంతాలే ఓ పెద్ద ఉదాహరణ. పదేళ్ల కిందట ప్రజల్లోని అసంతృప్తి సెగలతో అధికార పీఠాన్ని వదులుకున్న కాంగ్రెస్ కూటమి తర్వాతి తరుణంలోనూ కోలుకునే ప్రయత్నం చేయలేక పోయింది. పార్టీకి రాహుల్, ప్రియాంకల రూపంలో యువ నాయకత్వం అందుబాటులో ఉన్నప్పటికీ సద్వినియోగం చేసుకోవడంలో పార్టీ విఫలమైంది. యువ నాయకునిగా చాకచక్యంగా వ్యవహరిస్తూ పార్టీకి మనోధైర్యాన్ని నింపి ముందుకు నడిపించలేకపోయాడు రాహుల్.. అంచెలంచెలుగా నాయకునిగా ఎదగాల్సిన చోట తనవల్ల కాదంటూ పార్టీ అధికార బాధ్యతలకు ఆమడ దూరం వెళ్లిపోయాడు ఆయన.. ఒక నెహ్రు, ఇందిరా, రాజీవ్‌ల వంశీకుడైనా ఆ లక్షణాలు పుణికిపుచ్చుకోలేక పోవడం రాహుల్ ప్రధాన వైఫల్యంగా భావించొచ్చు. ఇక అప్పట్లో ఇందిరమ్మ డైనమిజంతో పోలుస్తూ ప్రియాంకను రంగంలోకి దింపేందుకు శతవిధాలా ప్రయత్నించింది కాంగ్రెస్ కోటరీ. వ్యక్తిగత సమస్యలో, అనుకోని అవాంతారాలో కానీ ఆ యత్నాలేవీ ఫలించలేదు. ఆమె తన ప్రాబల్యాన్ని చూపించి ఉంటే ప్రస్తుత రాజకీయ సమీకరణాలు మరింత రసవత్తరంగా మారేవి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అడపాదడపా ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలప్పుడు అక్కడకు వెళ్లి ప్రచార సభల్లో మొహం చూపించి పోవడం తప్ప ప్రజల్లో బలమైన ముద్ర వేయలేకపోయింది ప్రియాంక. కాంగ్రెస్ అంటేనే నెహ్రు వారసులుగా భావించే ప్రజానీకంలో అన్నా చెల్లెళ్ళ వెనకడుగు ఆ పార్టీని మరింత బలహీనంగా మార్చేస్తోంది. పార్టీ బాధ్యతలు ఖర్గే చేతుల్లో పెట్టినా.. ఈయన పాత్ర మరో మన్మోహన్ మాదిరిగానే ఉండొచ్చన్న అభిప్రాయం ప్రజల్లో గూడు కట్టుకుపోవడం పెద్ద మైనస్‌గా భావించొచ్చు. ఈ నేపథ్యంలో ప్రజలు యే ధీమాతో ఇండియా కూటమికి ఓటు వేస్తారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న మిత్రులే కానీ.... తలో దారి.. ఎన్నికలు కూతవేటు దూరంలో ఉన్న ప్రస్తుత తరుణంలో విబేధాలను పరిష్కరించుకుని కలిసికట్టుగా సాగాల్సింది పోయి కాంగ్రెస్ మిత్ర గణం చెరో దారీ వెతుక్కుంటూంటే ఇదే అదనుగా ఎన్డీయే పక్షం బలం పెంచుకుంటూ పోతోంది. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఇటీవలి బీహార్ పరిణామాల గురించే. కాంగ్రెస్ సాయంతో ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న జనతాదళ్ (యూ) అధినేత నితీష్ కుమార్ తాజాగా ఇచ్చిన ఝలక్ బీహార్ రాజకీయాల్లో పెను సంచలనమే అయింది. ఈ విషయాన్ని ముందస్తు పసిగట్టడంలో కాంగ్రెస్ అధిష్ఠానం విఫలమైంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరోపక్క పంజాబ్‌లో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని తృణమూల్ కాంగ్రెస్‌లు రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించేశాయి. ఇక మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో మొన్నీ మధ్యే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తిష్ఠ వేసుకుని కూర్చుంది. హిమాచల్ ప్రదేశ్, అస్సాం, హర్యానా, గుజరాత్‌లలో పెత్తనం ఎటూ బీజేపీదే, కర్ణాటకలో తమ పార్టీయే అధికారంలో ఉన్నప్పటికీ, హామీల విషయంలో అక్కడి ప్రభుత్వ వైఖరి అయోమయంలో పడేస్తోంది. ఇక ఉత్తరప్రదేశ్‌లో ఎన్డీయే ముందు నోరు మెదిపి పరిస్థితి ఎటూ లేదు. కళ్లు తెరవకపోతే.. 2019 ఎన్నికల తర్వాత నుంచి ఇప్పటిదాకా పార్టీ పునరుజ్జీవం దిశగా అడుగులు పడిన దాఖలాలు కనిపించడం లేదు. ఖర్గే పేరుతో తెచ్చిన దళిత కార్డు ప్రభావం నామమాత్రమేనని చెప్పొచ్చు. ఇక పార్టీకి ఏకైక ఆశాకిరణం రాహుల్ గాంధీయే. ఆయన నేతృత్వం తక్షణ అవసరం.. పరిస్థితి తీవ్రత గమనించి దిద్దుబాటు చర్యలు చేపట్టడం ద్వారా ఓటర్లలో ఓ కొత్త నమ్మకాన్ని, ప్రశ్నిచే గళం ఒకటి ఉండనే ధీమాను కలిగించాలి. సరైన రీతిలో పావులు కదిపి మోదీ సర్కారుకు సవాలు విసిరేలా పార్టీ రూపురేఖలు మార్చే ప్రయత్నం చేయగలగాలి. సహజంగా అధికార పార్టీలపై ఉండే అసంతృప్తి సెగల్ని సొమ్ము చేసుకుని తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోఎలాగైతే అధికారాన్ని అందిపుచ్చుకోగలిగారో.. అదే మాదిరి ప్రయత్నాలు అన్నిచోట్లా చేయాలి. 70 ఏళ్లు పైబడిన వృద్ధ నాయకులను గౌరవ పదవులకు పరిమితం చేస్తూ.. వాళ్ళ సలహాలు, సూచనలతో యువ రక్తాన్ని రంగంలోకి దింపి ఫలితాన్ని రాబట్టాలి. మొహమాటాలకు పోకుండా గెలుపు గుర్రాలను వెతికి పట్టుకుని ఎన్నికల పోరుకు సిద్ధమవ్వాలి. అప్పుడే సార్వత్రిక రణం హోరాహోరీగా సాగే అవకాశం ఉంటుంది. బహుశా ప్రస్తుతానికి సమయం మించిపోయిందనే చెప్పొచ్చు. రాబోయే రోజుల్లోనైనా ప్రజల్లో నమ్మకాన్ని పెంచుకునే చర్యల ద్వారా ఆయా రాష్ట్రాల్లో బలం పుంజుకుంటూ ఒక్కో అడుగు ముందుకు వేస్తే 2029లోనైనా మళ్లీ కేంద్రంలో కొలువుదీరే అవకాశాన్ని దక్కించుకోవచ్చు. ప్రజలకు భరోసా కల్పించనంత వరకు ఎన్ని జోడో యాత్రలు చేపట్టినా అవన్నీ కంటితుడుపు చర్యలుగా మిగిలిపోతాయే తప్ప అధికారాన్ని మాత్రం అందించవు. ఇప్పటికైనా కళ్ళు తెరిస్తే సరే... లేదంటే ముందే చెప్పినట్లు ఒక చిన్న గాలివాన చాలు.. కాంగ్రెస్ అనే మహావృక్షం కూకటివేళ్లతో సహా కూలిపోవడానికి. తెలంగాణను చూసి మురిసిపోతే.. రెండు నెలల కిందటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని హస్తగతం చేసుకున్నప్పటికీ అది సంబరపడేటంత మురిపెమేమీ కాదు. అదే సమయంలో జరిగిన రాజస్థాన్, మధ్య ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో ఓడిపోయింది అన్న విషయాన్ని విస్మరించలేం. జోడో యాత్రలో, కాంగ్రెస్‌పై పెరిగిన మమకారమే తెలంగాణాలో ఆధికారాన్ని తెచ్చిపెట్టలేదు. స్థానిక పరిస్థితులు, కేసీఆర్ సర్కారుపై పెల్లుబికిన అసంతృప్తి అధికార మార్పు జరిగేలా చేశాయి. సాధారణంగా రెండు దఫాలు అధికారంలో కూర్చున్న ఏ పార్టీకైనా ప్రజల్లో కొంతమేర అసంతృప్తి ఉండటం సహజం. దీనికి నిదర్శనం ఉభయ పక్షాల మధ్య ఉన్న గెలుపు ఓటముల అంతరాలే. భారాసా స్వయంకృత చేష్టలు ఆ పార్టీని 39 సీట్లకే పరిమితం చేస్తే కాంగ్రెస్ పార్టీకి కేవలం 64 సీట్ల బొటాబొటీ మెజార్టీతో అధికార పీఠాన్ని అప్పగించాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి లాంటి వాళ్ళ ప్రయత్నాలు, 6 గ్యారంటీల పథకాలు తమవంతు సాయం అందించాయి. మరోపక్క కాంగ్రెస్ గ్యారంటీలు అమలులో ఎంత ఇబ్బందికరమో అనుభవైక వేద్యమవుతోంది. ఇలాంటి హామీలు, యాత్రలను నమ్ముకుని కేంద్రంలో అధికారాన్ని సొంతం చేసుకుందాం అనుకోవడం కల్లే అవుతుంది. అదే సమయంలో పక్కనే ఉన్న మరో తెలుగు రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్‌లో అన్నపై చెల్లెలి అస్త్రాన్ని ప్రయోగించినా ప్రయోజనం శూన్యమే. ఇటీవల ఇండియాటుడే సమ్మిట్‌లో ఆంధ్ర ముఖ్యమంతి జగన్మోహన్రెడ్డి రాబోయే ఎన్నికల్లో పోటీ వైస్సార్సీపీ, టీడీపీ, జనసేనల మధ్యే ఉంటుందని, తన చెల్లెలి చేరిక తమ పార్టీపై ఏమాత్రం ప్రభావం చూపబోదని తేల్చిపడేశారు కూడా.. వాస్తవానికి ఆయన చెప్పింది అసెంబ్లీ ఎన్నికల గురించే అయినప్పటికీ పార్లమెంట్ ఎన్నికలకూ ఇది వర్తిస్తుందని చెప్పొచ్చు. -బెహరా శ్రీనివాస రావు సీనియర్ పాత్రికేయులు ఇదీ చదవండి: కొంప ముంచే డైరీలు..! -
తెలంగాణ నుంచి పోటీ చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియాగాందీకి ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఇప్పటికే పీసీసీ తీర్మానించిన విషయాన్ని ఆమె దృష్టికి తీసుకొచ్చారు. సోనియాను తెలంగాణ ఇచ్చిన తల్లిగా రాష్ట్ర ప్రజలు గుర్తిస్తున్నందున రాష్ట్రం నుంచి పోటీ చేయాల్సిందిగా కోరుతున్నట్లు చెప్పారు. కాగా దీనిపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటానని సోనియా.. రేవంత్‌కు చెప్పారు. సోమవారం ఢిల్లీలోని సోనియా అధికారిక నివాసం 10, జన్‌పథ్‌లో.. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలు ఆమెతో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న హామీల గురించి సోనియాగాందీకి రేవంత్ వివరించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు హామీల్లో ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి రూ.15 లక్షలకు పెంపు అమలు చేస్తున్నామని తెలిపారు. తాజాగా రూ.500కే గ్యాస్ సిలిండర్ , 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచిత సరఫరా అమలుకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. బీసీ కులగణన చేపడుతున్నాం రాష్ట్రంలో బీసీ కుల గణన చేపట్టాలని నిర్ణయించామని, ఇందుకు సంబంధించి సన్నాహాలు చేస్తున్నామని రేవంత్‌రెడ్డి చెప్పారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక స్థానాలు సాధించేందుకు ప్రయత్నిస్తున్నామని, ఈ మేరకు ఇప్పటికే అన్ని రకాల సన్నాహాలు పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రతి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించామని, వాటిపై పూర్తిస్థాయిలో కసరత్తు అనంతరం బలమైన అభ్యర్థులను ఎంపిక చేస్తామని వివరించారు. భారత్ న్యాయ్ యాత్రలో సీఎం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ భారత్ న్యాయ్ యాత్రలో రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. భట్టి, పొంగులేటితో కలిసి జార్ఖండ్ వెళ్లిన సీఎం రాజధాని రాంచీలో రాహుల్‌ను కలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఇప్పటికే అమలు చేస్తున్న రెండు గ్యారంటీల గురించి వివరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో సోనియాగాంధీ తెలంగాణ నుంచి పోటీ చేసేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతున్న తీరును కూడా వివరించారు. రూ.1,800 కోట్ల గ్రాంటు విడుదలకు సహకరించండి కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు రావల్సిన రూ.1,800 కోట్ల గ్రాంటు వెంటనే విడుదలయ్యేలా సహకరించాలని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ భేరీకి సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. సోమవారం ఢిల్లీలో ఆయనతో భేటీ అయిన రేవంత్.. హైదరాబాద్‌లో మూసీ నది రివర్ ఫ్రంట్ అభివృద్ధికి అవసరమైన నిధులు ఇప్పించాలని కోరారు. ప్రపంచ బ్యాంకు ఎయిడ్ విడుదలకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో తాగునీటి సరఫరాకు అవసరమైన నిధులు ఇవ్వాలని, వైద్య, ఆరోగ్య, విద్యా రంగాల్లో తమ ప్రభుత్వం తీసుకురానున్న సంస్కరణలకు మద్దతు ఇవ్వాలని సీఎం కోరారు.