
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీపై బీజేపీ ఎంపీ కంగనరనౌత్ సంచలన ఆరోపణలు చేశారు. హిమాచల్ ప్రదేశ్ దివాలా తీయడానికి సోనియాగాంధీయే కారణమన్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులన్నీ సోనియాగాంధీకే వెళ్లాయని,దీనివల్లే రాష్ట్రం దివాలా తీసిందన్నారు.
చివరకు వరద సాయానికిగాను విరాళాలుగా వచ్చిన సొమ్ము కూడా సోనియాకే వెళ్లిందని తీవ్ర ఆరోపణలు చేశారు.‘హిమాచల్‌లో కాంగ్రెస్ అవినీతి ఎంతుందనేది ప్రతి ఒక్కరికి తెలుసు.ఈ అవినీతి వల్లే రాష్ట్రం దశాబ్దాల వెనుకబాటుకు గురైంది. ఇందుకే కాంగ్రెస్‌ను కూకటివేళ్లతో పెకిలించాలని హిమాచల్ ప్రజలను కోరుతున్నా’అని కంగన పిలుపిచ్చారు.
కాగా,ప్రస్తుతం హిమాచల్‌ప్రదేశ్ నిధులలేమితో దివాలా అంచున ఉంది. దీంతో సీఎం, మంత్రులు,కార్పొరేషన్‌ల చైర్మన్‌లు రెండు నెలల పాటు జీతాలు తీసుకోరని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో కంగన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment