![Kangana invites Deepika Padukone to be first customer at her restaurant](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/5/kangana_0.jpg.webp?itok=ssOP_mml)
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ వ్యాపారం రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. తన సొంత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్‌లో తన బిజినెస్‌ను ప్రారంభించనుంది. అందమైన పర్వతాల మధ్యలో సరికొత్త రెస్టారెంట్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపింది. మనాలిలో ఏర్పాటు చేయనున్న ఈ రెస్టారెంట్‌కు ది మౌంటైన్ స్టోరీ అనే పేరును కూడా ఖరారు చేసింది. తన కొత్త రెస్టారెంట్‌కు మొదటి కస్టమర్‌గా బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణెను ఆహ్వానించింది కంగనా రనౌత్. హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలిలో ఏర్పాటు చేసిన ది మౌంటైన్ స్టోరీ రెస్టారెంట్‌ను ఫిబ్రవరి 14న ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ కంగనా ఓ వీడియోను పోస్ట్ చేసింది.
ఈ సందర్భంగా రెస్టారెంట్‌ను తెరవాలనే తన కోరికను వ్యక్తం చేస్తూ తాను గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వీడియోను షేర్ చేసింది. ప్రపంచస్థాయి మెనూను కలిగి ఉండాలనుకునే రెస్టారెంట్‌ను తెరవాలనుకుంటున్నా అని కంగనా అన్నారు. అదే ఇంటర్వ్యూలో పాల్గొన్న దీపిక పదుకొణె నీ రెస్టారెంట్‌కు నేనే మీ మొదటి క్లయింట్ అవుతానని చెప్పింది. మరోసారి ఆ వీడియోను షేర్ చేస్తూ దీపికా పదుకొణె నా నా మొదటి కస్టమర్‌గా వస్తానని ప్రామిస్ చేశావ్ అంటూ కంగనా పోస్ట్ చేసింది. అంతేకాకుండా రెస్టారెంట్ ప్రారంభించడం చిన్ననాటి కల అని వెల్లడించింది. కాగా.. సినిమాల విషయానికొస్తే కంగనా రనౌత్ చివరిగా ఎమర్జెన్సీలో కనిపించింది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో విధించిన ఎమర్జన్సీ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీకి కంగనానే దర్శకత్వం వహించారు.
Comments
Please login to add a commentAdd a comment