Kangana Ranaut
-
స్త్రీవాదాన్ని అడ్డుపెట్టుకుని ఇలా చేయడం ఘోరం: కంగనా
భార్య వేధింపులు.. భార్య కుటుంబం బ్లాక్‌మెయిలింగ్.. కొడుకును కళ్లారా చూసుకోలేని దుస్థితి, న్యాయం చెప్పాల్సిన కోర్టు కూడా భార్యకే మద్దతు.. ఈ పరిస్థితుల మధ్య అతుల్ సుభాష్ నలిగిపోయాడు, కుమిలిపోయాడు. మగవారికి న్యాయం దొరకదన్న నిరాశ నిస్పృహలోకి వెళ్లిపోయాడు. ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో మరణమే శరణమని వేడుకున్నాడు. బలవన్మరణానికి పాల్పడ్డాడు. సోషల్ మీడియాను కుదిపేస్తున్న ఈ విషాద ఘటనపై హీరోయిన్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ స్పందించారు.99 శాతం మగవారిదే తప్పు: కంగనాకంగనా మాట్లాడుతూ.. యావత్ దేశం షాక్‌లో ఉంది. అతుల్ చివరి వీడియో చూస్తుంటే హృదయవిదారకంగా ఉంది. స్త్రీవాదం పేరుతో ఎంతకైనా తెగించడం హీనమైన చర్య. అతడి ఆర్థిక పరిస్థితికి మించి తన దగ్గరి నుంచి కోట్లాది రూపాయలు దోచుకున్నారు. తీవ్ర ఒత్తిడికి వల్ల అతడు ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. అయితే ఈ ఒక్క సంఘటన వల్ల మహిళలందర్నీ తప్పుపట్టలేం. ఎందుకంటే పెళ్లికి సంబంధించిన 99 కేసుల్లో మగవారిదే తప్పుంటుంది. అందుకే ఇలాంటి పొరపాటు జరిగి ఉంటుంది అని చెప్పుకొచ్చారు.చదవండి: భర్త సుభాష్ బలవన్మరణం: భార్య నిఖిత రియాక్షన్ ఏంటంటే..అసలేం జరిగింది?బెంగళూరుకు చెందిన ఏఐ ఇంజనీర్ అతుల్ సుభాష్ భార్య నితిక సింఘానియా వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. తన మరణానికి ముందు 24 పేజీల సూసైడ్ నోట్‌తో పాటు ఓ సెల్ఫీ వీడియో చిత్రీకరించాడు. తప్పుడు కేసుల వల్ల ఎంతోమంది భర్తలు చనిపోతున్నారని, ఈ విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లాలని తన డెత్ నోట్లో పేర్కొన్నాడు.చదవండి: మంచు మనోజ్‌పై దాడి ఘటన.. ఒకరి అరెస్ట్ -
ప్రధాని మోదీ పక్కన ‘లేడీ ఎస్పీజీ’ వైరల్ : తప్పులో కాలేసిన కంగనా
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పక్కన ఉన్న మహిళా కమాండో ఫోటో తెగ వైరల్ అవుతోంది. ముఖ్యంగా హీరోయిన్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో లేడీ ఎస్పీజీ అంటూ ఈ ఫోటోను షేర్ చేయడం మరింత చర్చకు దారి తీసింది. ప్రధాని భద్రతా విభాగం ఎస్పీజీలోకి కొత్తగా మహిళా కమాండో చేరిందంటూ సందడి మొదలైంది. అసలు సంగతి ఏంటంటే..బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ పార్లమెంట్ వద్ద నరేంద్రమోదీతో పక్కన బ్లాక్ డ్రెస్‌లో నడుస్తున్న ఒక ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటో పోస్ట్ చేశారు. దీంతో ఆమె ప్రత్యేక శిక్షణ తీసుకున్న ఎస్పీజీ అంటూ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై భద్రతా వర్గాలు స్పందించాయి. కొన్ని మహిళా ఎస్పీజీ కమాండోలు 'క్లోజ్ ప్రొటెక్షన్ టీమ్'లో సభ్యులుగా ఉన్నారని వెల్లడించాయి. అలాగే ఆ ఫోటోలో కనిపించిన మహిళ ఎస్పీజీ బృందంలో భాగమని అనుకోవడం తప్పు అని కూడా భద్రతా వర్గాలు స్పష్టం చేశాయి. ఆమె రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కేటాయించిన వ్యక్తిగత భద్రతా అధికారి అని వెల్లడించాయి. అయితే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)లో అసిస్టెంట్ కమాండెంట్‌గా పనిచేస్తున్న ఈ అధికారి పేరు లేదా ఇతర వివరాలు మాత్రం వెల్లడించలేదు.కాగా భారత ప్రధానమంత్రి, మాజీ ప్రధాన మంత్రులు, వారి కుటుంబాలకు భద్రత కల్పించేందుకు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ 1985లో ఏర్పాటైంది. ఇది అత్యున్నత ప్రొఫెషనల్ భద్రతా సంస్థ. -
ఉద్ధవ్ రాక్షసుడు.. మహిళలను అవమానించారు: కంగన
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం అక్కడి రాజకీయాలపై దేశవ్యాప్తంగా జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో తాజాగా నటి, ఎంపీ కంగనా రనౌత్ శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రేపై పలు విమర్శలు గుప్పించారు. మహిళలను అవమానించిన కారణంగానే ‘రాక్షసుడు’ ఈ పరిస్థితిని అనుభవించాల్సి వచ్చిందని కంగనా వ్యాఖ్యానించారు. ఉద్ధవ్ ఠాక్రే ఓటమిని తాను ముందే ఊహించినట్లు ఆమె తెలిపారు. స్త్రీలను గౌరవిస్తున్నారా? వారి సంక్షేమం కోసం కృషి చేస్తున్నారా? అనే దానిని అనుసరించే ఎవరు రాక్షసుడో.. ఎవరు మంచివారో గుర్తించగలమన్నారు. మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి విజయం సాధించిన దరిమిలా కంగనా ఈ విధమైన వ్యాఖ్యానాలు చేశారు.వారు తన ఇంటిని పడగొట్టారని, నానా దుర్భాషలాడారని అటువంటి చర్యలకు పరిణామాలు ఉంటాయని నమ్మానని కంగనా పేర్కొన్నారు. ఉద్ధవ్ ఠాక్రే శిక్షకు అర్హుడని, ఈ ఓటమిని తాను ముందే ఊహించానన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని కొనియాడిన కంగనా ఆయనను అజేయునిగా అభివర్ణించారు. ప్రధాని మోదీ దేశ రక్షణకు నియమితుడైన నేత అని పేర్కొన్నారు.దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూసేవారికి ఈ ఎన్నికల ఫలితాలు గుణపాఠమని కంగనా పేర్కొన్నారు. అభివృద్ధి, సుస్థిరత కోసం మహారాష్ట్ర ప్రజలు ఓట్లు వేశారని కంగనా రనౌత్ పేర్కొన్నారు. కాగా కంగనా ఇంటిని అక్రమ నిర్మాణంగా ఆరోపిస్తూ, 2020, సెప్టెంబర్‌లో బీఎంసీ ఆమె ఇంటిలో కొంత భాగాన్ని కూల్చివేసింది. తరువాత బాంబే హైకోర్టు బీఎంసీ ఆదేశాలను రద్దు చేసింది. కంగనా నష్టపరిహారానికి అర్హురాలిగా ప్రకటించింది.ఇది కూడా చదవండి: డబ్బు కోసం కాదు, మోక్షం కోసం : నృత్యం బాధ నుంచి పుడుతుంది! -
ఎంవీఏ ఓ రాక్షస కూటమి: కంగన
న్యూఢిల్లీ/సిమ్లా/ముంబై: మహిళలను గౌరవించకపోవడం వల్లే మహారాష్ట్రలో ఎంవీఏ కూటమి ఓడిపోయిందని బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ అన్నారు. ఆమె ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఎంవీఏను రాక్షస కూటమిగా అభివర్ణించారు. మహిళలను గౌరవించే వారు దేవతలుగా, గౌరవించనివాళ్లు రాక్షసులుగా మిగిలిపోతారన్నారు. 2020లో అవిభాజ్య శివసేన నేతృత్వంలోని ఎంవీఏ సర్కారు ముంబైలోని కంగనా బంగ్లాను కూల్చేయడం తెలిసిందే. అప్పట్లో తనను అసభ్య పదజాలంతో దూషించారని ఆమె ఆరోపించారు. ‘‘దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకునే వారికి మహారాష్ట్ర ప్రజలు ఓటుతో గుణపాఠం చెప్పారు. అభివృద్ధికి, సుస్థిర ప్రభుత్వానికి ఓటేశారు’’ అన్నారు. -
కంగనా రనౌత్ 'ఎమర్జెన్సీ' విడుదలకు లైన్ క్లియర్
కంగనా రనౌత్ 'ఎమర్జెన్సీ' సినిమా విడుదలపై మరోసారి అధికారిక ప్రకటన వచ్చేసింది. కంగనా లీడ్ రోల్లో నటించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదల కోసం ఆమె అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. వాస్తవంగా ఈ చిత్రం గతేడాదిలోనే విడుదల కావాల్సి ఉంది. అయితే, సెన్సార్ చిక్కుల వల్ల పలు ఇబ్బందలు రావడంతో రిలీజ్ విషయంలో పలుమార్లు వాయిదా పడుతూనే వస్తుంది.ఎట్టకేలకు ఎమర్జెన్సీ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 17న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈమేరకు ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ చిత్రంలో తమ వర్గాన్ని తక్కువ చేసి చూపించారని కొందరు సిక్కులు మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించడంతో విడుదల విషయంలో చిక్కులు వచ్చాయి. వారి వాదనలను పరిగణనలోకి తీసుకోవాలని సీబీఎఫ్‌సీని మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశించడంతో మరోసారి ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. ఎట్టకేలకు కోర్టు నుంచి కూడా అడ్డంకులు లేకపోవడంతో 2025 జనవరి 17న ఈ చిత్రం విడుదల కానుంది.1975లో ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో విధించిన ఎమర్జెన్సీ టైమ్‌లో జరిగిన ఘటనలతో ఈ మూవీ రూపొందింది. ఈ సినిమా పలుమార్లు విడుదల (2023 నవంబరు 24, 2024 జూన్ 14, 2024 సెప్టెంబర్ 6) వాయిదా పడింది. ఈ చిత్రం కోసం నిర్మాతగా మారిన కంగనా రనౌత్ తన సొంత ఆస్తులను కూడా విక్రయించుకున్నారు. -
కంగనా రనౌత్ ఇంట విషాదం.. తనే మా ఇన్స్పిరేషన్!
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ అమ్మమ్మ ఇంద్రానీ ఠాకూర్ కన్నుమూసింది. ఈ విషాద వార్తను ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ సందర్భంగా ఆమెతో కలిసున్న మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ ఎమోషనలైంది. 'మా అమ్మమ్మ ఎంతో శక్తివంతమైనది. తనకు ఐదుగురు సంతానం. అందరికీ మంచి విద్య అందించాలని తాపత్రయపడింది. అంతేకాదు ఉన్నత విద్యతో పాటు పెళ్లయిన తర్వాత కూడా తన కూతుర్లు సొంతకాళ్లపై నిలబడాలని కోరుకుంది. సొంత కాళ్లపై నిలబడాలని..వంటింటికే పరిమితం కాకుండా వారికంటూ సొంత కెరీర్ ఉండాలని భావించింది. అప్పట్లోనే తన కూతుళ్లు ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించుకుని పేరు తెచ్చుకున్నారు. అలా తన సంతానంలోని ఐదుగురు కూడా మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. అది చూసి ఆమె ఎంతో గర్వపడేది. తను ఐదు అడుగుల ఎనిమిది ఇంచుల పొడవుండేది. చాలా ఆరోగ్యంగానూ ఉండేది. బ్రెయిన్ స్ట్రోక్100 ఏళ్ల వయసుపైబడి ఉన్నప్పటికీ తన పనులన్నీ తనే చేసుకునేది. ఆమె ఎత్తూపొడుగు నాకు వచ్చింది. కొద్దిరోజుల క్రితం గది శుభ్రం చేస్తున్న సమయంలో ఆమెకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. దానివల్ల మంచానికే పరిమితమైంది. తననలా చూసి మా మనసు తట్టుకోలేకపోయింది. మా అందరికీ తనే స్ఫూర్తి. తను మా డీఎన్ఏలోనే ఉంది. ఆమెను ఎన్నటికీ మర్చిపోలేం అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది.సినిమాకాగా కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఎమర్జెన్సీ. కంగనా స్వీయదర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్న ఈ మూవీ సెన్సార్ బోర్డు అభ్యంతరాల వల్ల వాయిదా పడింది. ఎట్టకేలకు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ జారీ చేయడంతో సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది.చదవండి: సాయిపల్లవి ఉన్నారా..? అంటూ ఆ యువకుడికి భారీగా ఫోన్ కాల్స్ -
ఎమర్జెన్సీకి లైన్ క్లియర్.. విడుదల తేదీపై ఉత్కంఠ!
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన పొలిటికల్ డ్రామా 'ఎమర్జెన్సీ'. ఇప్పటికే జూలైలోనే విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడుతూ వస్తోంది. గతనెల సెప్టెంబర్ 6న థియేటర్లలోకి వస్తుందని భావించినప్పటికీ.. ఊహించని విధంగా మరోసారి పోస్ట్‌పోన్ అయింది. దీంతో ఇప్పట్లో విడుదలయ్యే అవకాశం లేదని ఫ్యాన్స్ అంతా ఫిక్స్ అయిపోయారు.తాజాగా తన అభిమానులకు కంగనా రనౌత్ గుడ్ న్యూస్ చెప్పింది. ఎమర్జెన్సీ చిత్రానికి సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ జారీ చేసినట్లు ట్విటర్ ద్వారా ప్రకటించింది. మా చిత్రబృందం సెన్సార్ పూర్తి చేసుకుందని.. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపింది. ఈ విషయంలో మీ సహనానికి, మద్దతుకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేసింది.(ఇది చదవండి: కంగనా ఎమర్జెన్సీ.. రిలీజ్‌కు మోక్షం అప్పుడేనా?)కాగా.. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో విధించిన ఎమర్జన్సీ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. దీంతో ఈ మూవీపై ఓ వర్గం సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమను చెడుగా చిత్రీకరించారంటూ ఈ చిత్రంపై ఫిర్యాదు చేశారు. అంతే కాకుండా సెన్సార్ బోర్డ్ సైతం కొన్ని సీన్స్ కట్ చేయాలని చిత్రబృందానికి సూచించింది. అందువల్లే ఎమర్జెన్సీ వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా సెన్సార్ పూర్తి చేసుకోవడంతో త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది. We are glad to announce we have received the censor certificate for our movie Emergency, we will be announcing the release date soon. Thank you for your patience and support 🇮🇳— Kangana Ranaut (@KanganaTeam) October 17, 2024 -
కంగనా ఎమర్జెన్సీ.. రిలీజ్‌కు మోక్షం అప్పుడేనా?
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ లీడ్ రోల్లో నటించిన పొలిటికల్ డ్రామా ఎమర్జెన్సీ. గతంలో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో విధించిన ఎమర్జెన్సీ ఆధారంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం రాజకీయ కారణాలతో పలుసార్లు వాయిదా పడింది. మొదట ఈ సినిమాను సెప్టెంబర్ 6న విడుదల చేయాలని నిర్ణయించినప్పటికీ సాధ్యం కాలేదు.తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా పంజాబ్ ఎన్నికల తర్వాత విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఈ సినిమాపై మొదటి నుంచి వివాదాలు నడుస్తున్నాయి. సెన్సార్ బోర్డు నిబంధనలకు అనుగుణంగా ఈ మూవీని విడుదల చేసేందుకు మేకర్స్ నిర్ణయించారు. ఇప్పటికే ఎమర్జెన్సీ చిత్రానికి యూఏ సర్టిఫికేట్ జారీ చేసింది. అయితే కొన్ని సీన్స్ మాత్రం మార్పులు చేయాలని సూచించింది. కొందరు తమను టార్గెట్ చేసి చెడుగా చూపిస్తున్నారని ఓ వర్గం ఆరోపిస్తోంది. దీంతో సినిమా విడుదల వాయిదా వేయాల్సి వచ్చింది. అందువల్లే పంజాబ్ ఎలక్షన్స్ తర్వాతే ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. -
చిన్నప్పుడు అలా ఉండేదాన్ని.. ఛాన్స్ దొరికితే చాలు!
బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంది. బాల్యంలోనూ కెమెరా ముందు పోజులిచ్చేదాన్నంటూ అందుకు సంబంధించిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. నేడు (అక్టోబర్ 9న) ఆమె సోదరుడు అక్షత్ బర్త్‌డే. దీంతో అతడికి బర్త్‌డే విషెస్ కూడా తెలియజేసింది. చిన్నప్పుడు వీళ్లిద్దరూ ఒకరికొకరు తినిపించుకున్న ఫోటోను సైతం ఇన్స్టాగ్రామ్ స్టోరీలో యాడ్ చేసింది.చిన్నప్పుడు అలా ఉండేదాన్ని'నేను పాత ఆల్బమ్స్ చూసినప్పుడు అస్సలు నవ్వాపుకోలేను. ఎందుకంటే చిన్నప్పుడు భలే సరదాగా ఉండేదాన్ని. నేను దాచుకున్న డబ్బుతో చిన్న కెమెరా కొనుక్కుని ఎక్కడపడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు ఫోటోలు దిగేదాన్ని. మేము కారులో వెళ్లేటప్పుడు నాన్న ఒక్క నిమిషం కారు ఆపినా సరే వెంటనే బయటకు దిగి మళ్లీ ఫోటోలు క్లిక్‌మనిపించేదాన్ని.క్లిక్.. క్లిక్.. క్లిక్..చదువుకోమంటే గదిలోకి వెళ్లి ఫోటోకు పోజులిచ్చేేదాన్ని. తోటలోకి వెళ్లి ఏదైనా కూరగాయలు తెమ్మంటే కూడా అక్కడున్న మొక్కతో కలిసి ఫోటో దిగేదాన్ని. అద్దం ముందు దిగిన ఫోటోలో అయితే నాలో ఉన్న దర్శకురాలి ఆసక్తి ప్రస్ఫుటంగా కనిపిస్తోంది' అని రాసుకొచ్చింది.సినిమా..హిమాచల్ ప్రదేశ్‌లో పుట్టి పెరిగిన కంగనా.. సినిమాలపై ఆసక్తితో ముంబైకి వచ్చింది. 2006లో గ్యాంగ్‌స్టర్ మూవీతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ఏక్ నిరంజన్, చంద్రముఖి 2 సినిమాల్లో నటించింది. ఈమె ప్రధాన పాత్రలో నటించి, స్వీయదర్శకత్వం వహించిన ఎమర్జెన్సీ మూవీ విడుదలకు సన్నద్ధమవుతోంది.బిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఎప్పుడు ఏం మాట్లాడతారో కవర్ చేయడానికి మీడియా అంతా ఇక్కడే అలర్ట్‌గా ఉంది మేడం!
ఏ సమయంలో ఏం మాట్లాడతారోనని కవర్ చేయడానికి మీడియా అంతా ఇక్కడే అలర్ట్‌గా ఉంది మేడం! -
ఖరీదైన ఇల్లు అమ్మేసి లగ్జరీ కారు కొన్న హీరోయిన్
మన దగ్గరేమో గానీ బాలీవుడ్లో సెలబ్రిటీలు చాలామంది ఎప్పటికప్పుడు కొత్త కార్లు కొంటూనే ఉంటారు. ఇప్పుడు ఆ లిస్టులోకి హీరోయిన్ కంగనా రనౌత్ చేరింది. మొన్నీ మధ్యే రూ.32 కోట్ల విలువ చేసే తన ఇంటిని అమ్మేసిన కంగన.. ఇప్పుడు కోట్లు ఖరీదు చేసే రేంజ్ రోవర్ కారు కొనుగోలు చేయడం చర్చనీయాంశమైంది.బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ అనగానే కంగనా రనౌత్ గుర్తొస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుంది. చాలామందిపై విమర్శలు చేసి వార్తల్లో నిలిచింది. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి ఎంపీగానూ గెలిచింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. ఆ మూడు స్పెషల్)ఈ మధ్య కాలంలో 'ఎమర్జెన్సీ' సినిమాతో హాట్ టాపిక్ అయిపోయింది. ఇందిరా గాంధీగా కంగన కనిపించనుంది. లెక్క ప్రకారం సెప్టెంబరు 6న ఈ మూవీ రిలీజ్ కావాలి. కానీ సెన్సార్ బోర్డ్.. కొన్ని సీన్లు కట్ చేయాలని చెప్పింది. అప్పటినుంచి దీని రిలీజ్‌పై ఉత్కంఠ నెలకొంది.ఇవన్నీ పక్కనబెడితే మొన్నీమధ్యే పాలి హిల్స్‌లోని రూ.32 కోట్ల ఖరీదైన బంగ్లాని అమ్మేసిన కంగన.. ఇప్పుడు తన ఆఫీస్ అవసరాల కోసం రేంజ్ రోవర్ ఆటో బయోగ్రఫీ ఎల్‌డబ్ల్యూబీ అనే లగ్జరీ కారు కొనుగోలు చేసింది. మార్కెట్లో దీని ఖరీదు దాదాపు రూ.3.81 కోట్లుగా ఉంది.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8లో మిడ్ వీక్ ఎలిమినేషన్.. ఈసారి ఎవరిపై వేటు?) -
కంగనా 'ఎమర్జెన్సీ'కి లైన్ క్లియర్! అందుకు ఓకే అంటేనే..
కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించి, స్వీయ దర్శకత్వం వహించిన ఎమర్జెన్సీ సినిమా విడుదలకు త్వరలోనే లైన్ క్లియర్ కానుంది. సెన్సార్ సర్టిఫికెట్ విషయంలో ఓ నిర్ణయానికి రావాలని బాంబే హైకోర్టు.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(సీబీఎఫ్సీ)ను ఇటీవలే ఆదేశించింది. సెప్టెంబర్ 25లోగా ఓ నిర్ణయానికి రావాలని సూచించింది. తాజాగా ఈ అంశంపై బుధవారంనాడు హైకోర్టులో విచారణ జరిగింది.సెప్టెంబర్ 30కి విచారణ వాయిదామీ దగ్గర ఏదైనా గుడ్‌న్యూస్ ఉందా? అని జస్టిస్ బిపి కొలబావాలా, జస్టిస్ ఫిర్దోష్ పోనివాలాలతో కూడిన ధర్మాసనం సీబీఎఫ్‌సీని అడిగింది. సినిమాలో కొన్ని కట్స్ సూచించామని, అవి అమలు చేస్తే సెన్సార్ సర్టిఫికెట్ ఇస్తామని, సినిమా థియేటర్లలో విడుదల చేసుకోవచ్చని సీబీఎఫ్సీ తెలిపింది. దీంతో నిర్మాణసంస్థ జీ స్టూడియోస్.. తమకు ఆలోచించుకోవడానికి కొంత సమయం కావాలని కోరింది. బెంచ్ తదుపరి విచారణను సెప్టెంబర్ 30కు వాయిదా వేసింది. సోమవారం అయినా ఎమర్జెన్సీ సినిమాకు చిక్కులు తొలగిపోతాయేమో చూడాలి!ఎమర్జెన్సీఎమర్జెన్సీ మూవీ విషయానికి వస్తే.. 1975లో ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ మూవీ 2023 నవంబర్ 24న విడుదల కావాల్సింది. కానీ సెన్సార్ సర్టిఫికెట్ ఆలస్యం కావడంతో ఏడాదిగా వాయిదా పడుతూ వస్తోంది.చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల -
‘క్షమించండి’ అని వేడుకున్నా.. కంగనాపై ఆగని విమర్శలు
ధర్మశాల : బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మూడు వ్యవసాయ చట్టాలపై తాను చేసిన వ్యాఖ్యలకు ‘తప్పుగా మాట్లాడాను. క్షమించండి’ అని వేడుకున్నా అటు విపక్షాల నుంచి ఇటు సొంత పార్టీ నుంచి విమర్శలు ఆగడం లేదు. ప్రధాని మోదీ స్వయంగా రద్దు చేసిన మూడూ వ్యవసాయ చట్టాలను మళ్లీ తీసుకురావాలంటూ తాజాగా కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె వ్యాఖ్యల్ని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్ ఖంఢించారు. కంగనా మాటలు నిరాధారామైనవని కొట్టిపారేశారు. ప్రధాని మోదీ చేస్తున్న మంచిని దెబ్బ తీసేలా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు.మోదీ చేస్తున్న మంచిని దెబ్బతీయొద్దు‘‘కంగనా రనౌత్ స్టేట్మెంట్కు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు. సిక్కు కమ్యూనిటీకి వ్యతిరేకంగా పనికిరాని, నిరాధారమైన,అసంబద్ధమైన ప్రకటనలు, పంజాబ్ రైతులు పంజాబ్, పంజాబీ సంక్షేమం కోసం మోదీ చేస్తున్న అన్ని మంచి పనులను, అందిస్తున్న సంక్షేమాన్ని దెబ్బ తీసేలా కంగనా వ్యవహరిస్తున్నారు’’ అని షెర్గిల్ మండిపడ్డారు. #WATCH | Delhi: On his tweet on actor & BJP MP Kangana Ranaut, party's national spokesperson Jaiveer Shergill says, "I am grateful to the BJP for distancing themself from the comments of Kangana Ranaut. But as a Punjabi, I must say that Kangana Ranaut's consistent rant, useless,… pic.twitter.com/jVa5qKJpe7— TIMES NOW (@TimesNow) September 25, 2024పంజాబ్, పంజాబ్ రైతులతో ప్రధాని మోదీకి ఉన్న బంధం విడదీయరానిది. మా పార్టీ ఎంపీ కంగనా చేసిన బాధ్యతా రహితమైన వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకుని ఆ బంధాన్ని అంచనా వేయొద్దని విజ్ఞప్తి చేశారు.వ్యవసాయ చట్టాలను తిరిగి తీసుకురావాలిమంగళవారం కంగనా తన నియోజకవర్గం మండిలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ‘రద్దు చేసిన మూడు వ్యవసాయ చట్టాలను తిరిగి తీసుకురావాలని అన్నారు. తాను చేస్తున్న ఈ ప్రకటన వివాదాస్పదమని నాకు తెలుసు. అయితే మూడు వ్యవసాయ చట్టాలను తిరిగి తీసుకురావాలి. రైతులే దానిని డిమాండ్ చేయాలి’ అని పేర్కొన్నారు.వ్యాఖ్యలు.. ఆమె వ్యక్తిగతంఆమె మాటలపై బీజేపీ దూరం పాటించింది. తాము వాటిని ఖండిస్తున్నట్లు పార్టీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా వెల్లడించారు. పార్టీ తరుఫున అలాంటి వ్యాఖ్యలు చేసేందుకు అధికారం లేదని, ఆ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని స్పష్టం చేశారు. ఆ తర్వాత కంగనా క్షమాపణలు చెప్పారు. అయినా బీజేపీ నేతలు మాత్రం కంగనపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా, షెర్గిల్ సైతం ఖండించారు. చదవండి : సీఎం సిద్ధరామయ్యకు మరిన్ని చిక్కులు -
Kangana : నన్ను క్షమించండి..!
-
వ్యవసాయ చట్టాలపై వ్యాఖ్యలు వివాదాస్పదం.. వెనక్కి తగ్గిన కంగనా
వ్యవసాయ చట్టాలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ వెనక్కి తగ్గారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అని తెలిపారు. ఇందులో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.‘ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ఇందులో పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. నా అభిప్రాయాలు, మాటలతో ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే అందుకు నన్ను క్షమించండి. నేను నా మాటలను వెనక్కి తీసుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. ఈ మేరకు కంగనా ఓ వీడియో విడుదల చేశారు.‘నా వ్యాఖ్యలు చాలా మందిని నిరాశకు గురిచేశాయి. ఇప్పుడు నేను కేవలం నటిని మాత్రమే కాదు.. ఓ రాజకీయ నాయకురాలిననే విషయాన్ని గుర్తుంచుకోవాలి. వ్యక్తిగతంగా చెప్పిన అభిప్రాయమైనా సరే పార్టీ వైఖరిని ప్రతిబింబిస్తాయన్న విషయాన్ని తెలుసుకున్నా. నా వ్యాఖ్యల పట్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమాపణలు తెలియజేస్తున్నా. నా మాటలను వెనక్కి తీసుకుంటున్నా. ప్రధాని నిర్ణయానికి కట్టుబడి ఉండటం ప్రతి బీజేపీ సభ్యుడి ఉమ్మడి బాధ్యత’’ అని కంగనా పేర్కొన్నారు. Do listen to this, I stand with my party regarding Farmers Law. Jai Hind 🇮🇳 pic.twitter.com/wMcc88nlK2— Kangana Ranaut (@KanganaTeam) September 25, 2024కాగా మండి ఎంపీ కంగనా రనౌత్.. రద్దయిన మూడు వ్యవసాయ చట్టాలను మళ్లీ తీసుకురావాలని పేర్కొన్నారు. ఇందుకు రైతులే స్వయంగా డిమాండ్ చేయాలని కోరారు. ‘నా ప్రకటన వివాదాస్పదం అవుతుందని నాకు తెలుసు. అయినా మూడు వ్యవసాయ చట్టాలను మళ్లీ తీసుకురావాలి. వీటి కోసం రైతులే డిమాండ్ చేయాలి.ఈ మూడు చట్టాలు రైతులకు ఎంతగానో మేలు చేస్తాయి. కానీ కొన్ని రాష్ట్రాల్లో రైతు సంఘాల ఆందోళనల వల్ల ప్రభుత్వం రద్దు చేయాల్సి వచ్చింది. రైతుల మేలు కోసమే ఈ చట్టాలను మళ్లీ తీసుకురావాలని కోరుకుంటున్నా’ కంగనా పేర్కొన్నారు. కంగన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి.ఈ నేపథ్యంలోనే కంగన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. -
కాషాయ పార్టీని ఇరుకునపెట్టిన కంగనా.. ట్విస్ట్ ఇచ్చిన బీజేపీ
సిమ్లా: కేంద్రం రద్దు చేసిన సాగు చట్టాలపై బీజేపీ ఎంపీ, సినీ నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. దీంతో, ఆమె వ్యాఖ్యలపై బీజేపీ ట్విస్ట్ ఇచ్చింది. బీజేపీ తరఫున ఇలాంటి వ్యాఖ్యలు చేసేందుకు ఆమెకు ఎలాంటి అధికారం లేదని పార్టీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా తెలిపారు.బీజేపీ ఎంపీ కంగనా తాజాగా మండి పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్బంగా కంగనా మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన మూడు సాగు చట్టాలను మళ్లీ అమలులోకి తీసుకురావాలి. రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా ఉండే ఆ చట్టాలను కేంద్రం తీసుకువచ్చి అమలుచేయాలి. దేశ అభివృద్ధికి అన్నదాతలే వెన్నెముక. అందుకే రైతుల కోసం ఉపయోగపడే మూడు చట్టాలను తీసుకురావాల్సిందే. ఇందుకు రైతులే చట్టాలను తీసుకురావాలని డిమాండ్ చేయాలి’ అంటూ కామెంట్స్ చేశారు.ఈ క్రమంలో కంగనా వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కంగనా వ్యాఖ్యలపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో, తన వ్యాఖ్యలపై ఆమె మళ్లీ స్పందించారు. అవి కేవలం తన వ్యక్తిగతమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కంగనా కామెంట్స్ బీజేపీకి సంకటంగా మారాయి. "All three farm laws should be reinstated." -- BJP MP Kangana RanautIs BJP bringing back those 3 Black Farmers law?why BJP is anti-Farmers? pic.twitter.com/OPw5kgaBZC— Swati Dixit ಸ್ವಾತಿ (@vibewidyou) September 24, 2024 ఈ నేపథ్యంలోనే కంగనా వ్యాఖ్యలను బీజేపీ సీరియస్‌గానే తీసుకుంది. బీజేపీకి డ్యామేజ్ కాకుండనే ఉద్దేశ్యంతో కాషాయ పార్టీ కంగనాకు దూరం పాటించింది. కంగనా వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు పార్టీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ఓ ప్రకటనలో వెల్లడించారు. ఆయన ట్విట్టర్ వేదికగా.. ‘అది ఆమె వ్యక్తిగత అభిప్రాయమని అన్నారు. బీజేపీ తరఫున అలాంటి వ్యాఖ్యలు చేసేందుకు ఆమెకు ఎలాంటి అధికారం లేదన్నారు. సాగు చట్టాలపై ఆమె మాటలు బీజేపీ వైఖరిని ప్రతిబింబించవని స్పష్టం చేశారు. పార్టీకి ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. #WATCH | BJP leader Gaurav Bhatia says, "On the social media platforms, BJP MP Kangana Ranaut's statement on the farm bills that was withdrawn by central govt, is going viral. I want to make it clear that this statement is a personal statement of her. Kangana Ranaut is not… pic.twitter.com/hZmJ8j7Qf8— ANI (@ANI) September 24, 2024 అయితే, కంగనా ఎంపీగా ఎన్నికైన నాటి నుంచి ఏదో ఒక విషయంలో కేంద్రంలోకి బీజేపీ సర్కార్‌ను ఇరుకున పెడుతూనే ఉంది. రైతుల నిరసనలపై ఇటీవల ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పార్టీ పెద్దలు ఆమెను మందలించారు. ఈ సమయంలో పార్టీ విధానంపై మాట్లాడే అధికారం ఆమెకు లేదని ఘాటుగానే చెప్పారు. అయినప్పటికీ ఆమె తన తీరును మార్చుకోకపోవడం గమనార్హం. రానున్న రోజుల్లో ఆమె ఇంకా ఏ విషయాలపై స్పందిస్తారో అనే టెన్షన్ బీజేపీ శ్రేణుల్లో నెలకొంది. ఇది కూడా చదవండి: ఆ సొమ్ము సోనియా రిలీఫ్ ఫండ్‌కు : కంగనా ఆరోపణ -
ఆ సొమ్ము సోనియా రిలీఫ్ ఫండ్‌కు : కంగనా ఆరోపణ
హిమాచల్: బీజేపీ నేత, ఎంపీ కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రం(హిమాచల్ ప్రదేశ్)లో ఆర్థికపరమైన సంక్షోభం నెలకొన్నదని ఆమె ఆరోపించారు. దీనిని దేశమంతా గమనిస్తోందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో పైనుంచి డబ్బులు వచ్చేవని, అవి సోనియా రిలీఫ్ ఫండ్‌కు చేరేవని కంగనా ఆరోపించారు.కాంగ్రెస్ నేతలు రాహుల్, ప్రియాంకల పేర్లను ప్రస్తావించకుండా వారి బాల్యం అద్భుతంగా గడిచిందని కంగనా పేర్కొన్నారు. అయితే తన బాల్యాన్ని 15 సంవత్సరాల వయస్సులోనే లాక్కున్నారని, చిన్నప్పటి నుంచి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించానని తెలిపారు. తాను కాలేజీ వయసులో ఉన్నప్పుడు తన వయసులోని అమ్మాయిలు ప్రేమలేఖలు రాసుకునేవారని, తాను మాత్రం స్క్రిప్ట్‌లు రాయడం ప్రారంభించానని కంగనా పేర్కొన్నారు.వారి బాల్యం (రాహుల్, ప్రియాంక) 50 ఏళ్లు కొనసాగుతుందని, తన బాల్యం 15 ఏళ్లు కూడా కొనసాగలేదని కంగనా వాపోయారు. నాటి రోజుల్లోనే తాను దేశ క్షేమం కోసం ఆలోచించడం ప్రారంభించానని అన్నారు. మండి జిల్లాలోని గోహర్‌కు వచ్చిన ఆమె.. తాను తుక్డే గ్యాంగ్‌తో ఒంటరిగా పోరాడిన విషయం అందరికీ తెలుసన్నారు. తాను కష్టాలను భరిస్తూ, దేశ ప్రయోజనాల కోసం ఆలోచిస్తుంటానని, దేశంలోని ఆడపిల్లల రక్షణ కోసం మాట్లాడతానని కంగనా పేర్కొన్నారు. ఇది కూడా చడవండి: యాచకులను నియంత్రించండి.. పాక్‌కు సౌదీ హెచ్చరిక -
వ్యవసాయ చట్టాలను మళ్లీ తీసుకురావాలన్న కంగనా.. కాంగ్రెస్ కౌంటర్
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తన దురుసు వ్యాఖ్యలతో మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. కేంద్ర ప్రభుత్వం గతంలో రద్దు చేసిన మూడు వ్యవసాయ చట్టాలను తిరిగి తీసుకురావాలని ఆమె పేర్కొన్నారు. రైతులకు మేలు చేసే ఈ చట్టాలు తిరిగి అమలు చేసేందుకు రైతులే డిమాండ్ చెయ్యాలని తెలిపారు.ఈ మేరకు హిమాచల్ ప్రదేశ్‌లోని తన నియోజకవర్గం మండిలో ఆమె మాట్లాడుతూ.. మూడు వ్యవసాయ చట్టాలను ప్రభుత్వం తిరిగి తీసుకురావాలని కోరారు. ‘ఈ ప్రకటన వివాదాస్పదమని నాకు తెలుసు. కానీ మూడు వ్యవసాయ చట్టాలు తిరిగి అమలు చేయాలి. ఇందుకు రైతులు స్వయంగా డిమాండ్ చేయాలి. ఈ చట్టాలు రైతులకు ప్రయోజనకరంగా ఉన్నాయి. కానీ కొన్ని రాష్ట్రాల్లో రైతు సంఘాల నిరసనల కారణంగా ప్రభుత్వం దానిని రద్దు చేసింది. దేశాభివృద్ధిలో రైతులే మూల స్థంభం. వారి ప్రయోజనాల కోసం చట్టాలను తిరిగి తీసుకురావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను’ అని పేర్కొన్నారు.అయితే కంగన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. తమ పార్టీ ఎప్పటికీ అది జరగనివ్వదని తెలిపింది. ఈ మేరకు కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాథే మాట్లాడుతూ.. ‘మూడు నల్ల రైతు వ్యతిరేక చట్టాలను వ్యతిరేకిస్తూ 750 మందికి పైగా రైతులు అమరులయ్యారు. వాటిని తిరిగి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మేము దీనిని ఎప్పటికీ అనుమతించం’ అని పేర్కొన్నారు.కాగా 2020లో కేంద్రం కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చింది. అయితే ఈ చట్టాలపై దేశవ్యాప్తంగా రైతులు భగ్గుమన్నారు. ఈ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ సరిహద్దుల వద్ద పంజాబ్, హరియాణా, ఉత్తర ప్రదేశ్ రైతులు 2020 నవంబరు 26 నుంచి నిరసనలు మొదలుపెట్టారు. ఆందోళనల్లో అనేక రైతు సంఘాలు పాల్గొన్నాయి. ఎట్టకేలకు ఈ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నామని ప్రకటిస్తూ 2021 నవంబరు 19న దేశంలోని రైతులందరికీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ క్షమాపణలు చెప్పారు. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటూ పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపచేసింది. అనంతరం ఈ నేపథ్యంలో తమ నిరసనలను రైతులు నిలిపివేశారు. -
సోనియాపై ఆరోపణలు.. కంగనాకు కాంగ్రెస్ వార్నింగ్
హిమాచల్ ప్రభుత్వం, సోనియా గాంధీపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. విపత్తు సాయం కోసం ఉద్ధేశించిన నిధులను హిమాచల్ ప్రభుత్వం.. వాటిని సోనియా గాంధీకి అక్రమంగా బదిలీ చేసినట్లు కంగన చేసిన ఆరోపణలను నిరూపించాలని సవాల్ విసిరింది. లేని పక్షంలో ఆమెపై పరువునష్టం కేసు నమోదు చేస్తామని హెచ్చరించింది.ఈ మేరకు హిమాచల్ ప్రదేశ్ మంత్రి విక్రమాదిత్య సింగ్ సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. కంగనా రనౌత్ తన ఆరోపణలను ఉపసంహరించుకోవాలని లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ‘కంగన తన ప్రకటనను ఉపసంహరించుకోకపోతే.. మేం పరువు నష్టం దావా వేస్తాం. ఆమె ఆధారాలతో అలాంటి ప్రకటన చేసింది? సోనియా గాంధీ లాంటి నాయకురాలిపై ఆమె అలాంటి ప్రకటన చేయడం చాలా దురదృష్టకరం.కేంద్రం నుంచి వచ్చే నిధులు లేదా రాష్ట్ర అభివృద్ధికి కేటాయించిన నిధులు సోనియా గాంధీకి ఇస్తున్నారని చెప్పడం కంటే పెద్ద మూర్ఖపు ప్రకటన మరొకటి ఉండదు. ఒక్క రూపాయి అయినా దారి మళ్లినట్లు రుజువు చేయాలి. లేదంటే నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి క్షమాపణ చెప్పాలి. లేకుంటే ఆమెపై కాంగ్రెస్ పరువునష్టం కేసు పెడుతుంది’ అని తెలిపారు.కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఖజానాను ఖాళీ చేశాయన్న విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు కంగనా రనౌత్. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం అప్పులు చేసి మరి సోనియా గాంధీకి నిధులు బదిలీ చేసినట్లు ఆరోపించారు. దీనివల్ల రాష్ట్ర ఖజానాకు గండి పడిందని అన్నారు. ‘కేంద్రం విపత్తు నిధులు ఇస్తే, అది సీఎం రిలీఫ్ ఫండ్‌కు వెళుతుంది. అయితే హిమాచల్‌లో సోనియా రిలీఫ్ ఫండ్‌కు వెళుతుంది’ అని మనాలిలో ఆదివారం జరిగిన బీజేపీ కార్యక్రమంలో పేర్కొన్నారు. -
సోనియాగాంధీపై కంగన సంచలన ఆరోపణలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీపై బీజేపీ ఎంపీ కంగనరనౌత్ సంచలన ఆరోపణలు చేశారు. హిమాచల్ ప్రదేశ్ దివాలా తీయడానికి సోనియాగాంధీయే కారణమన్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులన్నీ సోనియాగాంధీకే వెళ్లాయని,దీనివల్లే రాష్ట్రం దివాలా తీసిందన్నారు.చివరకు వరద సాయానికిగాను విరాళాలుగా వచ్చిన సొమ్ము కూడా సోనియాకే వెళ్లిందని తీవ్ర ఆరోపణలు చేశారు.‘హిమాచల్‌లో కాంగ్రెస్ అవినీతి ఎంతుందనేది ప్రతి ఒక్కరికి తెలుసు.ఈ అవినీతి వల్లే రాష్ట్రం దశాబ్దాల వెనుకబాటుకు గురైంది. ఇందుకే కాంగ్రెస్‌ను కూకటివేళ్లతో పెకిలించాలని హిమాచల్ ప్రజలను కోరుతున్నా’అని కంగన పిలుపిచ్చారు.కాగా,ప్రస్తుతం హిమాచల్‌ప్రదేశ్ నిధులలేమితో దివాలా అంచున ఉంది. దీంతో సీఎం, మంత్రులు,కార్పొరేషన్ల చైర్మన్లు రెండు నెలల పాటు జీతాలు తీసుకోరని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో కంగన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
దేశాన్ని విడదీయడానికి కూడా వెనుకాడరు: రాహుల్‌పై కంగన మండిపాటు
కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పై బాలీవుడ్ నటి, మండి లోక్‌సభ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాహుల్ అధికారం కోసం దేశాన్ని విడదీయడానికి కూడా వెనుకాడరని వ్యాఖ్యానించారు.భారత్‌లో కొన్ని మతాలు, భాషలు మిగిలిన వాటికంటే తక్కువనే భావన ఆరెస్సెస్‌లో ఉందని అమెరికా పర్యటనలో రాహుల్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై కంగన తాజాగా స్పందిస్తూ కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు మన దేశంపై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో ప్రజలందరికీ తెలుసని అన్నారు అధికారం కోసం దేశాన్ని విడదీయడానికి కూడా ఆయన వెనుకాడరని విమర్శలు గుప్పించారు.అనంతరం తన ‘ఎమర్జెన్సీ’ సినిమా విడుదల వాయిదాపై కంగనా స్పందిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఈ చిత్రాన్ని నేను ఏవిధంగా తెరకెక్కించానో నాకు తెలుసు. చిత్రబృందం నుంచి నాకు ఎలాంటి సపోర్ట్ లేదు. ఇదొక భారీ బడ్జెట్ మూవీ. జీ, కొందరు వ్యక్తుల భాగస్వామ్యంతో దీనిని నిర్మించాను. ఈ సినిమా రిలీజ్ ఆలస్యమవుతున్నకొద్దీ మేము ఎన్నో నష్టాలు ఎదుర్కొంటున్నాం. మా చిత్రాన్ని వీలైనంత త్వరగా విడుదల చేయాల్సిన బాధ్యత సెన్సార్‌పై ఉంది’’ అని ఆమె చెప్పారు. -
బీజేపీ మహిళా మోర్చా మెరుపు ఆందోళన
హైదరాబాద్: ఎంపీ, నటి కంగనా రనౌత్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మహిళా మోర్చా ఆందోళనకు దిగింది. కంగనాపై చేసిన వ్యాఖ్యలకు దానం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ గాంధీ భవన్ మెట్రో స్టేషన్ వద్ద బీజేపీ మహిళా మోర్చా మెరుపు ఆందోళన చేపట్టింది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి ఆధ్వర్యంలో నిరసనకు దిగింది. ఈ క్రమంలోనే దానం నాగేందర్ దిష్టి బొమ్మ దహనం చేశారు బీజేపీ మహిళా మోర్చా మహిళా నేతలు. దానం చేసిన వ్యాఖ్యలు మహిళల్ని కించపరిచే విధంగా ఉన్నాయని మహిళా నేతలు మండిపడ్డారు.దీనిలో భాగంగా బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి మాట్లాడుతూ.. ‘ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌పై దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మహిళలను కించపరిచేలా మాట్లాడితే ఊరుకునేది లేదు. బాధ్యతగల ఎమ్మెల్యేగా చౌకబారు వ్యాఖ్యలు తగదు. దానం నాగేందర్ క్షమాపణలు చెప్పాలి’ అని ఆమె డిమాండ్ చేశారు.సినిమా ఇండస్ట్రీలో బోగం వేషాలు వేసే కంగనా రనౌత్‌కు రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి లేదంటూ దానం వ్యాఖ్యానించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. -
అప్పుడు పెళ్లి చేసుకుంటే ఏం లాభం? : కంగనా రనౌత్
బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ పెళ్లిపై తన మనసులోని మాటను బటయపెట్టింది. అందరిలాగే తనకు కూడా వైవాహిక జీవితాన్ని ఆస్వాదించాలని ఉందని చెప్పింది. అయితే దానికి సరైన సమయం రావాలని, అప్పుడే పెళ్లి చేసుకుంటానని తెలిపింది. పదవిలో ఉండగానే పెళ్లి!తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కంగనాకు పెళ్లిపై ఓ ప్రశ్న ఎదురరైంది. ‘ఎంపీగా ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుంటారా?’ అని ఓ విలేకరి ప్రశ్నించగా.. ‘దేవుడి దయ వల్లే అదే జరగాలని కోరుకుంటున్నాను. ఎంపీగా ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంటాను. ఈ పదవి కాలం ముగిసిన తర్వాత పెళ్లి చేసుకున్న ఏం లాభం’ అని కంగనా నవ్వుతూ బదులిచ్చింది. 2024 ఎన్పికల్లో కంగనా.. బీజేపీ తరపున ఎంపీగా పోటీ చేసి గెలిచింది. 2029 వరకు ఆమె ఈ పదవిలో కొనసాగుతారు. ఈ లోపే పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించాలని కంగానా భావిస్తున్నట్లు ఉంది. పెద్దల సమక్షంలో పెళ్లి జరగాలిఅయితే పెళ్లి గురించి కంగనా మాట్లాడడం కొత్తేమి కాదు. గతంలో కూడా ఓ సినిమా ప్రమోషన్లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రతి అమ్మాయి తన పెళ్లి, పిల్లలు, ఫ్యామిలీ గురించి కలలు కంటుంది. నేను కూడా కుటుంబ వ్యవస్థలకు గౌరవం ఇస్తాను. పెళ్లి చేసుకోవాలని, నాకంటూ ఓ ఫ్యామిలీ ఉండాలనుకుంటున్నారు. రానున్న ఐదేళ్లలో పెళ్లి చేసుకుంటాను. అయితే అది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం అయితేనే చేసుకుంటాను. నా పెళ్లి పెద్దల సమక్షంలో జరగాలని కోరుకుంటున్నాను’అని కంగనా తెలిపింది. (చదవండి: స్త్రీ-2 దెబ్బకు షారూక్ జవాన్ రికార్డ్ బ్రేక్.. ఎన్ని కోట్లంటే?)ఇక సినిమాల విషయానికొస్తే.. కంగనా దర్శకత్వం వహించి, నటించిన సినిమా ‘ఎమర్జెన్సీ’ విడుదలకు సిద్ధమైంది. వాస్తవానికి ఈ సినిమా సెప్టెంబర్ 6న రిలీజ్ కావాల్సింది. కానీ సెన్సార్ సర్టిఫికేట్ రాకపోవడంతో విడుదల వాయిదా వేశారు. త్వరలోనే రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. -
మరో వివాదంలో ఎమర్జెన్సీ.. కంగనకు కోర్టు నోటీసులు
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటించిన ‘ఎమర్జెన్సీ’ చిత్రం వివాదాల సుడిలో చిక్కుకుంది. . తాజాగా ఆమెకు చండీగఢ్‌లోని జిల్లా కోర్టు నోటీసులు జారీ చేసింది. సినిమాలో సిక్కుల ప్రతిష్టను కించపరిచేలా నటించారని ఆరోపిస్తూ.. చండీగడ్ జిల్లా బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, అడ్వకేట్ రవీందర్ సింగ్ బస్సీ కంగనా రనౌత్ కు వ్యతిరేకంగా కోర్టులో పిటీషన్ వేశారు.అయితే సినిమాలను సిక్కు ప్రజలను అభ్యంతరకంగా చూపించారని, అనేక తప్పుడు సన్నివేశాలు ఉన్నాయని ఆరోపిస్తూ కంగనపై కేసు నమోదు చేయాలని ఆయన కోరారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు.. కంగనకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్5కు వాయిదా వేసింది.ఇక నటి, బీజేపీ ఎంపీ అయిన కంగనా నటించి, దర్శకత్వం వహించిన ఎమర్జెన్సీ.. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జీవితం ఆధారంగా సినిమా తెరకెక్కుతుంది. వాస్తవానికి ఈ సినిమా సెప్టెంబర్ 6న విడుదల కావాల్సి ఉండగా.. నిషేధాన్ని ఎదుర్కొంటుంది. సినిమాలో సిక్కులను తప్పుగా చిత్రీకరిస్తున్నారని, చారిత్రక వాస్తవాలను వక్రీకరించిందని శిరోమణి అకాలీదళ్‌తో సహా పలు సిక్కు సంస్థలు ఆరోపించడంతో వివాదంలో చిక్కుకుంది.సెన్సార్ సర్టిఫికేట్ పొందడంలో జాప్యం కారణంగా సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఈ కారణంగా ముంబైలోని తన ఆస్తిని బలవంతంగా విక్రయించాల్సి వచ్చిందని కంగనా ఇటీవల పేర్కొన్నారు. బాంద్రాలోని పాలి హిల్‌లో ఉన్న తన బంగ్లాను రూ. 32 కోట్లకు విక్రయించినట్లు సమాచారం. -
అందుకే నా బంగ్లాను అమ్మేశా: కంగనా రనౌత్
బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఒకవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాల కాంట్రవర్సీలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. పలు కారణాల వల్ల ఆమె నటించి, దర్శకత్వం వహించిన ‘ఎమెర్జెన్సీ’ సినిమా వాయిదా పడింది. ఈ చిత్రం కోసం ఆమె తన ఆస్తులను సైతం తాకట్టు పెట్టింది. అయితే విడుదల వాయిదా పడడంతో డబ్బు కోసం తను ఇష్టంగా కొనుగోలు చేసిన బంగ్లాను అమ్మినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ పుకార్లపై ఆమె స్పందిస్తూ.. బంగ్లాను అమ్మిన మాట నిజమేనని, ఎందుకు అమ్మాల్సి వచ్చిందో కూడా వివరించింది.(చదవండి: 'జాన్వీకపూర్‌ను చూస్తే ఆమెనే గుర్తొచ్చింది'.. జూనియర్ ఎన్టీఆర్ కామెంట్స్!)‘నాకు తెలిసి ఆస్తులు అంటే మనకు అవసరం అయినప్పుడు ఆదుకునేవే. నేను దర్శకత్వం వహించి, నిర్మించిన చిత్రం ‘ఎమర్జెన్సీ’ విడుదల వాయిదా పడింది. నా దగ్గరు ఉన్న డబ్బంతా ఈ సినిమాపై పెట్టాను. విడుదల అయితే తప్ప నాకు డబ్బు రాదు. అందుకే నేను ఇష్టంగా కొనుగోలు చేసిన బంగ్లాను అమ్మేశాను’ అని కంగనా చెప్పుకొచ్చింది. కంగనా అమ్మిన బంగ్లా.. ముంబైలో ఉన్న బాంద్రాలోని పాలిహిల్ పాత్రంలో ఉంది. 2017లో ఈ బంగ్లాను కొనుగోలు చేసింది. తాజాగా రూ. 32 కోట్లకు ఈ బంగ్లాను విక్రయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. (చదవండి: త్రివిక్రమ్‌పై ఆరోపణలు.. పూనమ్ షాకింగ్ ట్వీట్)ఇక ఎమర్జెన్సీ విషయానికొస్తే.. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. వాస్తవానికి సెప్టెంబర్ 6న విడుదల కావాల్సింది. అయితే సెన్సార్ సర్టిఫికేట్ రాకపోవడంతో చివరి నిమిషంలో విడుదల వాయిదా పడింది. త్వరలోనే రిలీజ్ డేట్‌ని ప్రకటించనున్నారు.