
లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారిగా బీజేపీ టికెట్‌పై పోటీ చేసిన కంగనా రనౌత్ విజయాన్ని అందుకున్నారు. ఆమె హిమాచల్‌లోని మండీ పార్లమెంటరీ స్థానం నుంచి పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్‌పై ఆమె విజయం సాధించారు. తన విజయంపై కంగనా స్పందిస్తూ ఇది ప్రధాని మోదీ వల్లే సాధ్యమయ్యిందని పేర్కొన్నారు.
తాజాగా కంగనా రనౌత్ ఒక పోస్ట్‌ను షేర్ చేశారు. ఇది నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. కంగనా రనౌత్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ప్రధాని నరేంద్ర మోదీ ఇతర ప్రముఖ నేతలు ఉన్న గ్రూప్ ఫోటోను షేర్ చేశారు. పీఎం నరేంద్ర మోదీని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఏ) నేతగా ఎన్నుకోవడంపై కంగనా రనౌత్ హర్షం వ్యక్తం చేశారు.
కంగనా రనౌత్ నటించిన ‘ఎమర్జెన్సీ’ సినిమా త్వరలో విడుదల కానుంది. ఇందిరాగాంధీ పాలనా కాలంలో విధించిన ఎమర్జెన్సీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో కంగనా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి కంగనానే దర్శకత్వం వహించడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment