Lok Sabha 2024
-
Year Ender 2024: ఈ 10 అంశాలపైనే అంతటా చర్చ
మనమంతా ప్రస్తుతం 2024 చివరి వారంలో ఉన్నాం. ఈ ఏడాది మనదేశంతో పాటు ప్రపంచంలో అనేక ముఖ్యమైన ఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా పేరొందిన భారత్‌లో ఎన్నికలు జరగగా, మరోవైపు ప్రపంచంలోని పలు దేశాల్లో యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. 2024లో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా నిలిచిన 10 అంశాలను ఒకసారి గుర్తుచేసుకుందాం.ఇజ్రాయెల్- ఇరాన్ పోరు2024లో మధ్యప్రాచ్యంలో యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. సిరియాలోని డమాస్కస్‌లో దేశ కాన్సులేట్‌పై దాడికి ప్రతిగా ఇరాన్ ఏప్రిల్ 14న ఇజ్రాయెల్‌పై వందల కొద్దీ డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది. అనంతరం అక్టోబర్ ఒకటిన ఇరాన్ మరోసారి ఇజ్రాయెల్‌పై 200కు పైగా క్షిపణులను ప్రయోగించింది. ఆ దరిమిలా ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. మరోవైపు హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా, హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా మృతి చెందారు. హమాస్ తదుపరి అధినేత యాహ్యా సిన్వార్‌ను గాజాలో ఇజ్రాయెల్ మట్టుబెట్టింది.భారత సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ విజయంభారతదేశంలో 2024 ఏప్రిల్, జూన్ 2024 మధ్య లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. 543 స్థానాలకు 7 దశల్లో జరిగిన ఈ ఎన్నికల ఫలితాలు జూన్ 4 న విడుదలయ్యాయి. లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ కూటమి 292 సీట్లు గెలుచుకుని, మెజారిటీ సాధించింది. అదే సమయంలో విపక్ష పార్టీల ఇండియా కూటమి 234 సీట్లు గెలుచుకుంది. ఇతర పార్టీలకు 17 సీట్లు వచ్చాయి. అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీల విషయానికొస్తే బీజేపీ 240, కాంగ్రెస్ 99, సమాజ్ వాదీ 37, తృణమూల్ కాంగ్రెస్ 29, డీఎంకే 22, టీడీపీ 16, జేడీయూ 12 సీట్లు గెలుచుకున్నాయి. భారత ప్రధానిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు.క్షీణించిన భారత్- కెనడా సంబంధాలు2024 అక్టోబరు మధ్య కాలంలో భారత్- కెనడా మధ్య దౌత్యపరమైన వివాదం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇది ఇరు దేశాల మధ్య వాణిజ్యంతో సహా అనేక రంగాలపై కొంతమేరకు ప్రభావం చూపింది. ఆరుగురు కెనడా దౌత్యవేత్తలను భారత్ బహిష్కరించింది. కెనడా నుండి భారత హైకమిషనర్, ఇతర దౌత్యవేత్తలను వెనక్కి పిలిచింది.ఎమర్జెన్సీ రోజులకు 50 ఏళ్లు2024, జూన్ 25 నాటికి భారతదేశంలో ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తయ్యింది. ఈ అంశంపై కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. దేశంలో ఎమర్జెన్సీ కాలం 1975 నుండి 1977 వరకు కొనసాగింది. ఈ సమయంలో దేశంలో పౌర హక్కులు నిలిపివేశారు. పత్రికా స్వేచ్ఛను పరిమితం చేశారు. సామూహిక అరెస్టులు జరిగాయి. ఎన్నికలను వాయిదా వేశారు. ఎమర్జెన్సీ విధించేందుకు నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం రాజ్యాంగంలోని ప్రత్యేక నిబంధనలను చూపించింది.వయనాడ్‌లో విలయం2024, జూలైలో కేరళలోని వయనాడ్‌లో భారీ కొండచరియలు విరిగిపడి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. మేప్పాడి, ముండక్కై తదితర ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. గత కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా కొండచరియలు విరిగిపడుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.ఆర్జీ కార్ హత్యాచార ఘటన2024 ఆగస్టులో కోల్‌కతాలోని ఆర్జీ కార్ ఆస్పత్రి ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం చేసి, హత్య చేసిన దారుణ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆస్పత్రిలోని సెమినార్ హాల్లో జూనియర్ డాక్టర్ మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన దరిమిలా కోల్‌కతాతో సహా దేశంలోని వివిధ ప్రాంతాలలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ ఘటన అనతరం మహిళలపై లైంగిక వేధింపుల అంశం మరోసారి చర్చకు వచ్చింది. బంగ్లాదేశ్‌లో కుప్పకూలిన షేక్ హసీనా ప్రభుత్వం2024 ఆగష్టులో బంగ్లాదేశ్ రాజకీయ అస్థిరతకు లోనయ్యింది. పలు హింసాత్మక నిరసనల దరిమిలా బంగ్లాదేశ్‌లోని షేక్ హసీనా ప్రభుత్వం అధికారం నుంచి దిగిపోయింది. అనంతరం షేక్ హసీనా బంగ్లాదేశ్ వదిలి భారత్‌కు వచ్చారు. అప్పటి నుంచి బంగ్లాదేశ్‌లో హిందువులపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వానికి ముహమ్మద్ యూనస్ సారధ్యం వహిస్తున్నారు.అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం2024, నవంబర్ 5న అమెరికాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చరిత్రాత్మక విజయం సాధించారు. డెమొక్రాట్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌పై ఆయన భారీ మెజార్టీతో గెలుపొందారు. ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు 312 ఎలక్టోరల్ ఓట్లు రాగా, కమలా హారిస్‌కు 226 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. సెనేట్‌లో కూడా రిపబ్లికన్ పార్టీ మెజారిటీ సాధించింది.సిరియాలో తిరుగుబాటుసిరియాలో చాలాకాలంగా మౌనంగా ఉన్న రెబల్ గ్రూపులు బలాన్ని కూడగట్టుకుని సిరియాలో అధికారాన్ని చేజిక్కించుకున్నాయి. ఫలితంగా 2000 నుంచి సిరియాను పాలిస్తున్న బషర్ అల్ అసద్ అధికారానికి తెరపడింది. అసద్ సిరియా వదిలి రష్యాలో ఆశ్రయం పొందారు. తిరుగుబాటు గ్రూపు హయత్ తహ్రీర్ అల్-షామ్ సిరియా పరిపాలనను చేపట్టింది.ఇది కూడా చదవండి: Year Ender 2024: 999 బెదిరింపులు.. రెండు కంపెనీల మూసివేత.. ఎయిర్‌లైన్స్ పరిణామాలు -
కసవు చీరలో మెరిసిన ప్రియాంక.. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?
కేరళలోని వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ మహిళా నేత ప్రియాంక గాంధీ నాలుగు లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొంది ఘన విజయం సాధించారు. ఇవాళ(గరువారం (నవంబర్ 28, 2024న)) ఆమె లోక్‌సభలో కసవు చీర ధరించి చేతిలో భారత రాజ్యంగ కాపీని పట్టుకొని వయనాడ్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇలా కేరళ చీరలో ఆమె ప్రమాణ స్వీకారం చేయడం అందరినీ ఆకట్టుకుంది. కేరళ వారసత్వానికి చిహ్నమైన ఆ చీరతో ఎంపీగా బాధ్యతలను స్వీకరించి శతాబ్దాల నాటి గొప్ప చరిత్రను మరోసారి వెలుగెత్తి చాటారు. ఈ కసవు చీరతో కేవలం కేరళ సంస్కాృతినే గాక నాటి పూర్వీకుల మూలాలని గుర్తుచేశారు ప్రియాంక. ఈ సందర్భంగా కసవు చీర, దాని ప్రాముఖ్యత గురించి సవివరంగా తెలుసుకుందామా..!కసవు చీర అనేది కేరళలో ఉండే హిందూ, బౌద్ధ, జైన సంస్కృతుల నాటిది. ఏనుగు దంతాలతో కూడిన బంగారు కసవు చీరను పురాతన కాలంలో రాయల్టీకి చిహ్నంగా ప్రభువులు ధరించేవారు. మలయాళీ వేడుకల్లో అంతర్భాగం ఈ చీరలు. ఈ చీరతోనే అక్కడ అసలైన పండుగ వాతావరణ వస్తుంది. నిజానికి సాంప్రదాయ కసవు చీర చేతితో నేసిన పత్తితో తయారు చేస్తారు. అంతేగాదు దీనిలో నిజమైన బంగారం, వెండి దారాలు ఉంటాయి. అయితే ప్రస్తుతం రంగు దారాలను చౌక ధరల్లో లభించేలా ఈ కసవు చీరలను నేస్తున్నారు. ఈ చీరకు జీఐ ట్యాగ్ కూడా లభించింది. నిజానికి ఈ చీరలు నేయడం అత్యంత సంక్లిష్టత, నైపుణ్యంతో కూడిన చేనేత పని. ఈ చీరలు మూడు ప్రధాన చేనేత కేంద్రాలు బలరామపురం, చెందమంగళం , కుతంపుల్లిల వద్ద ప్రసిద్ధిగాంచింది. కుతంపుల్లి చీరల్లో జరీతోపాటు ఏనుగు దంతాకృతి ఉంటుంది. ఒక్కొసారి మానవ బొమ్మలు వంటి మూలాంశాలు ఉంటాయి. ఈ చీరకు ఉన్న సాంస్కృతిక ప్రాముఖ్యత ఏంటంటే మోహినియాట్టం వంటి నృత్య ప్రదర్శనల సమయంలో, కేవలం కసవు వస్త్రాలు మాత్రమే నృత్యకారులు ధరిస్తారు. ఇలా అలాగే కైకొట్టికళి, తిరువాతిరక్కళి వంటి నృత్యాలలో మహిళా ప్రదర్శకులు సాంప్రదాయ ఎరుపు బ్లౌజుతో కూడా కసవు చీరలను ధరిస్తారు.(చదవండి: ఫేస్ యోగా"తో..సెలబ్రిటీల మాదిరి ముఖాకృతి సొంతం!) -
వయనాడ్‌లో బీజేపీ అభ్యర్థి ఖుష్బూ!
సాక్షి, న్యూఢిల్లీ: వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికలో తమ పార్టీ తరఫున సినీనటి ఖుష్బూ సుందర్‌ను బరిలోకి దింపాలని బీజేపీ అధిష్టానం యోచిస్తోందని తెలుస్తోంది. పార్టీ తరఫున పోటీలో నిలిపే అభ్యర్థుల షార్ట్‌లిస్ట్‌లో ఖుష్బూ పేరును సైతం చేర్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకగాంధీకి ఖుష్బూ అయితేనే గట్టిపోటీ ఇవ్వగలరనే భావన వ్యక్తమవుతోంది. వయనాడ్‌లో వచ్చే నెల 13న పోలింగ్ జరగనుంది. పార్టీ సీనియర్లయిన ఎంటీ రమేశ్, శోభా సురేంద్రన్, ఏపీ అబ్దుల్లా కుట్టి, షాన్ జార్జ్ పేర్లను బీజేపీ తీవ్రంగా పరిశీలిస్తోంది. ఈ కసరత్తు కొలిక్కి వస్తున్న వేళ ఖుష్బూ పేరు తెరపైకి వచ్చింది. నిజానికి ఖుష్బూ 2010లో డీఎంకేలో చేరి, అనంతరం 2014లో కాంగ్రెస్‌లో చేరారు. పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా పనిచేశారు. అనంతరం 2021లో కాంగ్రెస్‌ను వీడి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. ఆమె ప్రస్తుతం బీజేపీ తమిళనాడు యూనిట్లో భాగంగా ఉన్నారు. తమిళనాడు నేపథ్యం ఉన్న ఆమెను వయనాడ్‌లో పోటీకి నిలిపే విషయమై బీజేపీ అగ్ర నాయకత్వం రాష్ట్ర పార్టీ నేతల అభిప్రాయాలను సేకరిస్తోంది. రాష్ట్ర శాఖ తెలిపే అభిప్రాయం మేరకు అభ్యర్థిత్వంపై పార్టీ తుది నిర్ణయం తీసుకోనుంది. ఒకట్రెండు రోజుల్లోనే పార్టీ అభ్యర్థిని ప్రకటించనుంది. -
ప్రియాంక ప్రత్యర్థి సత్యన్ మొకెరి
తిరువనంతపురం: వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీపై పోటీకి వామపక్ష ఎల్డీఎఫ్ సత్యన్ మొకెరిని ఎంపిక చేసింది. సీపీఐకి చెందిన మొకెరి కొజికోడ్ జిల్లాలోని నాదపురం మాజీ ఎమ్మెల్యే. వ్యవసాయ రంగానికి చెందిన సమస్యలపై పనిచేసిన వ్యక్తిగా ఆయనకు గుర్తింపు ఉంది. వయనాడ్‌లో సత్యన్ మొకెరి ఎల్డీఎఫ్ అభ్యర్థిగా ఉంటారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి బినోయ్ విశ్వమ్ గురువారం ప్రకటించారు. మొకెరి 2014 వయనాడ్ నుంచి పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి ఎం.ఐ.షానవాజ్ చేతిలో దాదాపు 20 వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. రాహుల్ గాంధీ సార్వత్రిక ఎన్నికల్లో రెండు చోట్ల గెలిచి రాయ్‌బరేలి ఎంపీగా కొనసాగుతూ వయనాడ్‌కు రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వచి్చన విషయం తెలిసిందే. నవంబరు 13న వయనాడ్‌లో పోలింగ్ జరగనుంది. -
తండ్రికి వెన్నుపోటు పొడవడం తగదు : డిప్యూటీ సీఎం
మీ రాజకీయ లబ్ధి కోసం తండ్రికి వెన్నుపోటు పొడవడం తగదు అంటూ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి,ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ మరోసారి ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు.మహరాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల ప్రచారంలో భాగంగా అజిత్ పవార్ జన సమ్మాన్ యాత్ర నిర్వహిస్తున్నారు. ఆ యాత్రలో..రాష్ట్ర మంత్రి ధర్మారావు బాబా ఆత్రం, ఆయన కుమార్తె భాగ్యశ్రీ గురించి మాట్లాడారు. భాగ్యశ్రీ తండ్రి ప్రత్యర్ధి పార్టీ శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పి)లోకి వెళ్తున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. అంతేకాదు తండ్రి ధర్మారావు బాబా ఆత్రంపై కుమార్తె భాగ్యశ్రీ పోటీ చేస్తుందన్న ప్రచారం మొదలైంది. ఆ ప్రచారంపై అజిత్ పవార్ స్పందించారు. ‘ తండ్రిపై కుమార్తె పోటీ చేయడం ఎంత వరకు కరెక్ట్. కూతురిని తన తండ్రి కంటే ఎక్కువగా ఎవరూ ప్రేమించరు. పెళ్లి చేసుకుని భాగ్యశ్రీ బెల్గాం వెళ్లినప్పటికీ..గడ్చిరోలిలో ఆమెకు (తండ్రి ఆత్రం) అండగా నిలిచి జిల్లా పరిషత్ అధ్యక్షురాలిని చేశారు. ఇప్పుడు మీరు (భాగ్యశ్రీ) మీ తండ్రికి వెన్నుపోటు పొడిచి ఆయన మీదే పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. మీ నిర్ణయం సరైందేనా? అని ప్రశ్నించారు. ‘ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మీరు మీ తండ్రికి మద్దతు ఇవ్వండి. అతనిని గెలిపించండి. ఎందుకంటే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే సామర్థ్యం , సంకల్పం ఆయనకు మాత్రమే ఉంది. కుటుంబంలో చీలికలు రావడాన్ని సమాజం అంగీకరించదు. నా విషయంలోనూ ఇదే జరిగింది. లోక్ సభ ఎన్నికల్లో బారామతి స్థానం నుంచి తన సోదరి సుప్రియ సూలేపై తన భార్య సునేత్ర పవార్‌ను పోటీకి దింపి ఉండాల్సింది కాదు. నేను తప్పు చేశా. చేసిన తప్పును ఇప్పుడు ఒప్పుకుంటున్నా’ అని అన్నారు.అజిత్ పవార్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇది రెండో సారి. కొద్ది రోజుల క్రితం ఇలాగే మాట్లాడారు. ఇటీవల మహరాష్ట్ర లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో శరద్ పవార్ తన అనుభవాన్ని రంగరించి, తన వర్గం ఎన్సీపీ (ఎస్పీ) పోటీ చేసిన 10 సీట్లలో ఎనిమిది స్థానాలను గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించారు. అయితే, ఆ ఎన్నికల్లో బారామతి లోక్‌సభ స్థానం నుంచి శరద్ పవార్ ఎన్సీపీ తరుఫున సుప్రీయా సూలే బరిలో దిగగా..అదే స్థానంలో సుప్రియా సూలేపై అజిత్ పవార్ ఎన్సీపీ తరుఫున ఆయన భార్య సునేత్ర పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత సునేత్ర రాజ్యసభకు నామినేట్ అయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో అజిత్ పవార్ పార్టీ పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతుండగా.. మహరాష్ట్ర అధికార కూటమి నుంచి అజిత్ పవార్‌ను బీజేపీ పక్కన పెట్టేస్తుందంటూ వ్యక్తమవుతున్న అభిప్రాయాల నడుమ అజిత్ పవార్ ఇలా మాట్లాడుతుండడం గమనార్హం. -
వివాదాస్పద భూములపై... నిర్ణయాధికారం కలెక్టర్లకే
కేంద్ర ప్రభుత్వం గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన వక్ఫ్ (సవరణ) బిల్లు తేనెతుట్టను కదిపింది. విపక్షాలు, ముస్లిం సంస్థలు దీనిపై తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నాయి. వక్ఫ్ ఆస్తుల రిజి్రస్టేషన్ ప్రక్రియను సెంట్రల్ పోర్టల్ ద్వారా క్రమబదీ్ధకరించాలని ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది. వక్ఫ్ భూముల యాజమాన్య హక్కులపై వివాదం తలెత్తితే ఇప్పటిదాకా వక్ఫ్ ట్రిబ్యూనల్‌కు నిర్ణయాధికారం ఉండేది. కొత్త బిల్లు ఈ అధికారాన్ని కలెక్టర్లకు కట్టబెడుతోంది. వక్ఫ్ చట్టం–1995ను ఇకపై యునిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫీషియెన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్‌గా మారుస్తోంది. మొత్తం 44 సవరణలను ప్రతిపాదిస్తోంది. వక్ఫ్ అంటే ఏమిటి? ఇస్లామిక్ చట్టం కింద మతపరమైన, ధారి్మక కార్యక్రమాల నిమిత్తం అంకితం చేసిన ఆస్తిని వక్ఫ్‌గా పేర్కొంటారు. ఒకసారి వక్ఫ్ ఆస్తిగా ప్రకటిస్తే.. ఇక అది అంతిమం. దాన్ని తిరగదోడటానికి ఉండదు. ఈ అంశంపై దృష్టి సారించాలని బిల్లు ప్రతిపాదిస్తోంది. 9 లక్షల ఎకరాలు దేశంలోని 30 వక్ఫ్ బోర్డులు 9 లక్షల పైచిలుకు ఎకరాలను నియంత్రిస్తున్నాయి. వీటి విలువ రూ.1.2 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. భారత్‌లో పెద్ద మొత్తంలో భూములు కలిగి ఉన్న వాటిల్లో రైల్వేలు, రక్షణ శాఖ తర్వాత వక్ఫ్ బోర్డులు మూడోస్థానంలో ఉన్నాయి. బిల్లులోని కీలకాంశాలు → ఏదైనా ఒక ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా ప్రకటించే అధికారాన్ని వక్ఫ్ బోర్డులకు కట్టబెట్టింది వక్ఫ్ చట్టం– 1995. అందులోని సెక్షన్– 40 ఇందుకు వీలు కలి్పంచింది. కొత్త బిల్లులో ఈ సెక్షన్– 40 రద్దుకు ప్రతిపాదించారు. ఇలా చేయడం ద్వారా వక్ఫ్ బోర్డుల చేతుల్లో నుంచి కేంద్ర ప్రభుత్వం అధికారాన్ని లాగేసుకుంటోందని తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దుమారం రేగుతోంది. → కేంద్ర వక్ఫ్ కౌన్సిల్ ఏర్పాటు. కౌన్సిల్లో, రాష్ట్ర వక్ఫ్ బోర్డుల్లో ఇద్దరేసి ముస్లిం మహిళలకు చోటు. ముస్లిమేతరులకూ స్థానం. ఇద్దరు లోక్‌సభ, ఒక రాజ్యసభ ఎంపీకి కేంద్ర వక్ఫ్ కౌన్సిల్లో చోటు కలి్పంచాలి. ఈ ముగ్గురు ఎంపీలు ముస్లింలే అయ్యుండాలనే నిబంధనేమీ లేదు. పాత చట్టం ప్రకారం తప్పనిసరిగా ముస్లిం ఎంపీలకే కౌన్సిల్లో చోటు ఉండేది. కేంద్ర వక్ఫ్ కౌన్సిల్ కూర్పును మార్చే అధికారాన్ని కూడా బిల్లు కేంద్రానికి కట్టబెడుతోంది. → ఒక ఆస్తి వక్ఫ్‌కు చెందినదా, ప్రభుత్వానిదా అనే వివాదం తలెత్తితే ఇక కలెక్టర్లదే నిర్ణయాధికారం. వక్ఫ్ చట్టం–1995 సెక్షన్– 6 ప్రకారం ఇలాంటి వివాదాల్లో వక్ఫ్ ట్రిబ్యునళ్లు తీర్పు చెప్పేవి. వక్ఫ్ ఆస్తిగా పేర్కొంటున్న దేన్నైనా కలెక్టర్ ప్రభుత్వ భూమిగా తేలి్చతే ఆ మేరకు రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేసి రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక సమరి్పంచొచ్చు. అక్రమంగా ఆస్తులు దక్కించుకోవడానికి స్వార్థపరులు ట్రిబ్యునళ్లను అడ్డం పెట్టుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. → ఏదైనా ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా నమోదు చేసే ముందు సంబంధిత పక్షాలన్నిటికీ నోటీసులు ఇవ్వడం. రెవెన్యూ చట్టాల ప్రకారం నిర్దిష్ట ప్రక్రియను అనుసరించి మ్యూటేషన్ చేయడానికి మార్గదర్శకాలను రూపొందించడం. → కాగ్ నియమించిన ఆడిటర్ ద్వారా ఏదేని వక్ఫ్ బోర్డు ఆస్తుల తనిఖీకి ఆదేశించే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఈ బిల్లు దఖలు పరుస్తుంది. → బోరాలు, అగాఖానీల కోసం ప్రత్యేకంగా ఔఖాఫ్ బోర్డును ఏర్పాటు చేస్తారు. వక్ఫ్ బోర్డుల్లో షియాలు, సున్నీలు, బోరాలు, ఆగాఖానీలు, ముస్లింలోని ఇతర వెనుకబడిన వర్గాలకు ప్రాతినిధ్యం ఉండేలా చూస్తుంది. → తన ఆస్తిని దానంగా ఇవ్వడానికి ఒక వ్యక్తి సిద్ధపడినపుడు.. అతను రాసిన చెల్లుబాటయ్యే అంగీకారపత్రాన్ని (వక్ఫ్‌నామా)ను కొత్త బిల్లు తప్పనిసరి చేస్తోంది. ప్రస్తుతం ఒక వ్యక్తి మౌఖికంగా కూడా తన ఆస్తిని వక్ఫ్‌కు ఇవ్వొచ్చు. → ఐదేళ్లుగా ఇస్లాంను ఆచరిస్తూ.. ఆస్తిపై యాజమాన్య హక్కులున్నపుడే వక్ఫ్ ఇవ్వొచ్చు. → వక్ఫ్ బోర్డులకు వచ్చే డబ్బును వితంతువులు, విడాకులు పొందిన మహిళలు, అనాథల సంక్షేమం కోసం వినియోగించాలి. అదీ ప్రభుత్వం సూచించిన పద్ధతుల్లో. – నేషనల్ డెస్క్, సాక్షి -
Waqf Amendment Bill 2024: జేపీసీకి వక్ఫ్ (సవరణ) బిల్లు
న్యూఢిల్లీ: వక్ఫ్ చట్టం–1995లో పలు మార్పులు తీసుకురావడంతోపాటు చట్టం పేరును ‘యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫీషియెన్సీ, డెవలప్మెంట్ యాక్ట్–1995’గా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వక్ఫ్(సవరణ) బిల్లు–2024ను పార్లమెంట్లో ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టగా, అడ్డుకొనేందుకు ప్రయతి్నంచాయి. సమాజంలో ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని రూపొందించిన ఈ క్రూరమైన బిల్లు వద్దే వద్దంటూ నినదించాయి. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ సమాజాన్ని విచి్ఛన్నం చేసే ఈ బిల్లును ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి. బీజేపీ సహా అధికార ఎన్డీయే కూటమి పక్షాలు బిల్లుకు మద్దతు ప్రకటించాయి. చివరకు ప్రతిపక్షాల నిరసనతో ప్రభుత్వం దిగొచి్చంది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) పరిశీలనకు బిల్లును పంపిస్తున్నట్లు ప్రకటించింది. హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి కోసమే.. కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెణ్ రిజిజు వక్ఫ్(సవరణ) బిల్లును గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అనంతరం బిల్లుపై చర్చ ప్రారంభించారు. బిల్లును ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ సభ్యుడు కేసీ వేణుగోపాల్ నోటీసు ఇచ్చారు. దేశంలో మత స్వేచ్ఛను మోదీ ప్రభుత్వం కాలరాస్తోందని, సమాఖ్య వ్యవస్థపై దాడి చేస్తోందని మండిపడ్డారు. ప్రజల మధ్య చిచ్చు పెడుతూ విభజన రాజకీయాలు చేస్తున్న బీజేపీకి లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని, అయినప్పటికీ హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో లబి్ధకోసమే బిల్లును తీసుకొచ్చిందని విమర్శించారు. ఇప్పుడు ముస్లింలపై దాడి చేస్తున్నారని, తర్వాత క్రైస్తవులపై, జైన్‌లపై దాడి చేస్తారని ధ్వజమెత్తారు. అనంతరం విపక్ష సభ్యులు బిల్లుపై దుమ్మెత్తిపోశారు. డీఎంకే ఎంపీ కనిమొళి, తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు సుదీప్ బందోపాధ్యాయ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎంపీ బషీర్ బిల్లును వ్యతిరేకించారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని తేల్చిచెప్పారు. ఎన్డీయేలోని కొన్ని పార్టీ సభ్యులు మాత్రం బిల్లుకు మద్దతు ప్రకటించారు. సభలో వాడీవేడిగా జరిగిన చర్చ తర్వాత మంత్రి కిరెణ్ రిజిజు స్పందించారు. బిల్లును జేపీసీ పరిశీలనకు పంపిస్తున్నట్లు తెలిపారు. జేపీసీ ఏర్పాటు కోసం త్వరలో అన్ని పారీ్టల నేతలో చర్చిస్తామని వివరించారు. ముసల్మాన్ వక్ఫ్ యాక్ట్–1923ని రద్దు చేసేందుకు ఉద్దేశించిన బిల్లును సైతం రిజిజు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. బీజేపీ రియల్ ఎస్టేట్ కంపెనీ ‘‘కరడుగట్టిన బీజేపీ మద్దతుదారులను సంతోషపర్చడానికి బిల్లును తీసుకొచ్చారు. వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులను నియమిస్తారా? ఇతర మత సంస్థల విషయంలో ఇలాగే చేయగలరా? ఎన్నికల్లో లబ్ధి కోసం బిల్లు రూపొందించారు. బీజేపీ రియల్ ఎస్టేట్ కంపెనీలా పనిచేస్తోంది. ఆ పార్టీ పేరును భారతీయ జమీన్ పారీ్టగా మార్చుకోవాలి. వక్ఫ్ బోర్డుల భూములను కాజేయాలని చూస్తున్నారు. బీజేపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వక్ఫ్ బోర్డు భూములు అమ్మబోమంటూ గ్యారంటీ ఇవ్వాలి. ముస్లింల హక్కులను దోచుకుంటామంటే చూస్తూ ఊరుకోం. కచ్చితంగా అడ్డుకుంటాం’’ – అఖిలేశ్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ మైనారీ్టలను రక్షించుకోవడం బాధ్యత ‘‘బిల్లును మేము వ్యతిరేకిస్తున్నాం. ఓ మతాన్ని లక్ష్యంగా చేసుకోవడం తగదు. బంగ్లాదేశ్‌లో ఏం జరుగుతోందో చూడండి. మైనారీ్టలను రక్షించుకోవడం మన నైతిక బాధ్యత. బిల్లు వెనుక ఉద్దేశం ఏమిటో ప్రభుత్వం బయటపెట్టాలి. బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. అందరితో చర్చించి పారదర్శకమైన బిల్లు రూపొందించాలి’’ – సుప్రియా సూలే, ఎన్సీపీ(శరద్ పవార్) పారదర్శకత కోసమే మద్దతు‘‘బిల్లుకు మద్దతిస్తున్నాం. వక్ఫ్ బోర్డుల నిర్వహణలో పారదర్శకతకు ఈ బిల్లు దోహదపడుతుంది. ముస్లిం వ్యతిరేక చర్య అనడంలో అర్థం లేదు. ఎవరికీ వ్యతిరేకం కాదు’’ –చిరాగ్ పాశ్వాన్, ఎల్జేపీ చీఫ్, కేంద్ర మంత్రి ముస్లింలను శత్రువులుగా చూస్తున్నారు ‘‘వక్ఫ్ చట్టంలో ఇష్టారాజ్యంగా సవరణలు చేయడాన్ని ఖండిస్తున్నాం. రాజ్యాంగ మౌలిక నిర్మాణంపై దాడి చేయడం దుర్మార్గం. ముస్లింలను శత్రువులుగా భావిస్తున్నారు. అందుకు ఈ బిల్లే నిదర్శనం. దర్గా, మసీదు, వక్ఫ్ ఆస్తులను స్వా«దీనం చేసుకోవాలనుకుంటున్నారా? ఈ బిల్లు ద్వారా దేశాన్ని ముక్కలు చేద్దామనుకుంటున్నారా? ఏకం చేద్దామనుకుంటున్నారా? బిల్లుకు వ్యతిరేకంగా ఇప్పటికే రూల్ 72 కింద నోటీసు ఇచ్చాం. ప్రభుత్వం తక్షణమే బిల్లును ఉపసంహరించుకోవాలి’’ – అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం వ్యతిరేకించిన వైఎస్సార్సీపీ సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభలో వక్ఫ్ సవరణ బిల్లును వైఎస్సార్సీపీ వ్యతిరేకించింది. సభలో బిల్లు ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నామని పార్టీ లోక్‌సభా పక్ష నేత మిథున్ రెడ్డి తెలిపారు. ‘ముస్లిం వర్గాల్లో అనేక ఆందోళనలు ఉన్నాయి. కాబట్టి ఈ బిల్లు మరింత ముందుకు తీసుకెళ్లే క్రమంలో ముస్లిం సమాజాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ లేవనెత్తిన ఆందోళనలతో పూర్తిగా ఏకీభవిస్తున్నాం. వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉంది’అని ఎంపీ మిథున్ రెడ్డి పేర్కొన్నారు. ముస్లింలకు వ్యతిరేకం కాదు ఈ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదు. మతపరమైన విభజనలను ప్రోత్సహించడం ప్రభుత్వ ఉద్దేశం కాదు. పారదర్శకత కోసమే బిల్లు రూపొందించారు. ప్రతిపక్షాలు ఈ బిల్లును ఆలయాలతో పోలుస్తున్నాయి. అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నాయి. గతంలో కాంగ్రెస్ పాలనలో వేలాది మంది సిక్కులను ఊచకోత కోశారు. ఇందిరా గాంధీ హత్యకు ఏ ట్యాక్సీ డ్రైవర్ కారణం? దీనిపై కాంగ్రెస్ నాయకుడు కేసీ వేణుగోపాల్ సమాధానం చెప్పాలి. – రాజీవ్ రంజన్ సింగ్, జేడీ(యూ) సభ్యుడు, కేంద్ర మంత్రిరాజ్యసభలో వక్ఫ్ ఆస్తుల బిల్లు ఉపసంహరణ వక్ఫ్ ఆస్తుల(ఆక్రమణదార్ల తొలగింపు) బిల్లు–2014ను ప్రభుత్వం గురువారం రాజ్యసభ నుంచి ఉపసంహరించుకుంది. బిల్లు ఉపసంహరణకు మూజువాణి ఓటుతో సభ్యులు ఆమోదం తెలిపారు. వక్ఫ్ ఆస్తుల్లో ఎవరైనా అనధికారికంగా తిష్టవేస్తే వారిని అక్కడి నుంచి తొలగించడానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా 2014 ఫిబ్రవరి 18న అప్పటి కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కె.రెహా్మన్ ఖాన్ ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. 2014 మార్చి 5న బిల్లును పార్లమెంట్ స్థాయీ సంఘం పరిశీలనకు పంపించారు. అప్పటినుంచి బిల్లు పెండింగ్‌లో ఉంది.టీడీపీ మద్దతు లోక్‌సభలో వక్ఫ్ చట్ట సవరణ బిల్లు–2024కు టీడీపీ మద్దతు ప్రకటించింది. బిల్లును స్వాగతిస్తున్నామని టీడీపీ ఎంపీ హరీశ్ చెప్పారు. అన్ని మతాల వారు తమ మత కార్యక్రమాలకు భూములు, ఆస్తులను విరాళంగా ఇస్తుంటారని తెలిపారు. దాతల ప్రయోజనాలు కాపాడేలా సంస్కరణలు తీసుకొచ్చి ఆ వ్యవస్థలో పారదర్శకత తీసుకురావడం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. -
Union Budget 2024: బడ్జెట్‌కు లోక్‌సభ ఆమోదం
న్యూఢిల్లీ: 2024–25 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌కు సోమవారం లోక్‌సభ ఆమోదముద్ర వేసింది. గత వారం బడ్జెట్‌పై చర్చ ముగిశాక తాజాగా పార్లమెంట్ దిగువసభ తన ఆమోదం తెలిపింది. దీంతోపాటు సభ ఆమోదించిన బడ్జెట్ పద్దుల మేరకు సంచిత నిధి నుంచి మొత్తాలను వినియోగించేందుకు అనుమతించే ద్రవ్య వినిమయ బిల్లుకు లోక్‌సభ ఆమోదముద్ర వేసింది. రైల్వే, విద్య, ఆరోగ్యం, మత్స్యరంగాలకు సంబంధించిన గ్రాంట్ల వినియోగానికి సంబంధిన బిల్లుకూ లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా ప్రతిపాదించిన పన్ను శ్లాబుల సంబంధ ఫైనాన్స్ బిల్లుపై లోక్‌సభలో చర్చ జరగనుంది. రాజ్యసభలో వ్యవసాయం, పునరుత్పాదక శక్తి, సహకార రంగం, గృహ పట్టణాభివృద్ధికి కేటాయింపులపై చర్చ జరగనుంది. ఫైనాన్స్ బిల్లుపై రాజ్యసభలో చర్చ జరిగినా మార్పులు సిఫార్సు చేయబోదు. కేవలం ఆ బిల్లులను తిరిగి లోక్‌సభకు పంపగలదు. ఫైనాన్స్ బిల్లు ఆమోదం పొందాక బడ్జెట్ తంతు మొత్తం ముగుస్తుంది. ఉద్యానవనాల కోసం రూ.18వేల కోట్లు రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా వచ్చే ఐదేళ్లలో ఎగుమతి కోసం ఉద్దేశించి 100 ఉద్యానవనాల క్లస్టర్ల ఏర్పాటు కోసం మొత్తంగా రూ.18,000 కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ సోమవారం రాజ్యసభలో చెప్పారు. వంటనూనెల దిగుమతి వ్యయం తగ్గించుకోవడంతోపాటు దేశీయంగా నూనెగింజల దిగుబడి పెంచేందుకు రూ.6,800 కోట్లను ఆయిల్‌సీడ్ మిషన్‌కు కేటాయిస్తున్నట్లు చౌహాన్ వెల్లడించారు. స్వాతంత్య్ర సిద్ధించాక సేద్యరంగం బాగు కోసం కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిందేమీలేదని వ్యాఖ్యానించారు. దీనిపై విపక్ష సభ్యులు తీవ్ర నిరసన తెలిపారు. దిగి్వజయ్‌సింగ్ వంటి కాంగ్రెస్ నేతలు మాట్లాడేందుకు ప్రయతి్నంచినా ఛైర్మన్ ధన్‌ఖడ్ అనుమతించలేదు. దీంతో విపక్ష సభ్యులు వాకౌట్‌చేశారు. -
శ్రీ వేంకటేశ్వర ఎయిర్‌పోర్ట్‌గా తిరుపతి ఎయిర్పోర్ట్ పేరు !
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి ఎయిర్పోర్ట్ పేరును శ్రీ వేంకటేశ్వర ఎయిర్‌పోర్ట్‌గా మార్చాలని ఏపీ సర్కార్ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిందని లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా పౌరవిమానయాన సహాయ మంత్రి మురళీధర్ మొహోల్ చెప్పారు. ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని మరో రెండు ఎయిర్‌పోర్ట్‌ల పేర్ల మార్పునూ ప్రతిపాదించింది. 10 రాష్ట్రాలు 22 ఎయిర్‌పోర్టుల పేర్ల మార్పు కోసం ప్రతిపాదనలు పంపాయని మంత్రి వెల్లడించారు. దర్బంగా ఎయిర్‌పోర్ట్‌ను విద్యాపతి ఎయిర్‌పోర్ట్‌గా మార్చాలని బిహార్ కోరింది. ఉత్తరప్రదేశ్, హరియాణా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మణిపూర్, ఉత్తరాఖండ్, పంజాబ్, మహారాష్ట్రలూ ఈ జాబితాలో ఉన్నాయి. -
బడ్జెట్ 3.0లోనైనా సంక్షేమం వికసించేనా?
మన దేశంలో బడ్జెట్‌ను ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెడతారు. ఈ సంవత్సరం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఫిబ్ర వరి నెలలో మధ్యంతర బడ్జెట్‌ను మాత్రమే ప్రవేశ పెట్టారు. అందుకే పూర్తి స్థాయిలో నేడు (జూలై 23న) 18వ లోక్ సభలో 2024–25 బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేశారు. గత బడ్జెట్లు అన్నీ సంపన్నులకు లాభం చేకూర్చే విగానే ఉన్నాయనీ, ఈసారైనా కాస్త సామా న్యులకు ఊరట కలిగించేవిగా ఉండాలనీ జనం ఎదురుచూస్తున్నారు. భాగస్వామ్య పక్షాల వెన్ను దన్నుతో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ దూకుడు తగ్గించి సామాన్యుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తుందనీ, ఇవ్వాలనీ ప్రజలు ఆశిస్తున్నారు. కోవిడ్ కాలం నుండి పేదల బతుకుల్లో ఆశించిన మార్పులు లేవు. ఉపాధి కోల్పోయి కొను గోలు శక్తి లేక ఆకలి సైతం తీర్చుకోలేక విలవిలలాడుతున్న దుర్భర పరిస్థితులు ఉండడం బాధాకరం. ఇప్పటికీ వ్యవసాయం, చేనేత,లఘు పరిశ్రమలు వంటివి సంక్షోభంలో పడిపోగా కోట్లాదిమంది అర్ధాకలితో, పస్తులతో గడుపుతున్నారు. 125 దేశాలను పరిగణనలోకి తీసుకున్న అంతర్జాతీయ ఆకలి సూచికలో 111వ స్థానంలో భారత్ ఉంది. దీన్ని బట్టి ఇక్కడ పేదరికం ఎంతగా ఉందో అర్థమవుతుంది. ఆకాశాన్నంటుతున్న నిత్యావసర సరుకుల ధరలు ప్రజలకు పట్టపగలే చుక్కలు చూపిస్తు న్నాయి. ఎన్డీఏ ప్రభుత్వ పాలనలోనే గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగాయి. ఫలితంగా ఆహార ధాన్యాలతోపాటు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి.పెరిగిన ఆహార ద్రవ్యోల్భణం తగ్గించేలా 3.0 బడ్జెట్లో చర్యలు ఉండాలి. గత ఎన్నికలలో ఇచ్చిన హామీల మేరకు పేద ప్రజలందరికీ గృహ నిర్మాణ పథకాన్ని సక్రమంగా అమలు చేయాలి. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేయాలి. 2022–23 బడ్జెట్‌తో పోలిస్తే 2024–25 మధ్యంతర బడ్జెట్లో వ్యవ సాయ అనుబంధ కార్యకలాపాలకు వేల కోట్ల రూపాయలు తగ్గించారు. ఇది సరికాదు. రైతన్నను ఆదుకోవడానికి తగిన కేటాయింపులు ఈసారన్నా జరగాలి. దేశ ప్రగతికి కీలక అవసరమైన విద్యపై గత బడ్జెట్లో ఆశించిన కేటాయింపులు లేవు. ప్రైవేటు విద్యను ప్రోత్సహించేలా ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయి. ప్రభుత్వ యూనివర్సిటీల అభివృద్ధికి నిధుల కేటాయింపు పెంచాలి.అలాగే ప్రభుత్వమే ఉచిత వైద్యం అందించేలా బడ్జెట్ రూపొందించాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం ప్రజారోగ్యంపై స్థూల జాతీయోత్పత్తిలో ఐదు శాతం నిధులు కేటాయించాల్సి ఉండగా కేవలం 2.1 శాతం మాత్రమే మన దేశంలో ఖర్చు పెడుతున్నారు. ఈ బడ్జెట్లోనైనా 5 శాతం నిధులు ప్రజారోగ్యంపై కేటాయించి ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించేందుకు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కృషి చేయాలి. స్టాండర్డ్ డిడక్షన్ కొత్త పన్ను విధానంలో 7 లక్షల నుండి 12 లక్షల వరకు పెంచాలి. అదేవిధంగా నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తక్షణమే అమలు చేయాలి. ‘బేటీ పఢావో బేటీ బచావో’ అనేది నినాదాలకు పరిమితం చేయకుండా మహిళా సాధికారత దిశగా బడ్జెట్లో కేటాయింపులు ఉండాలి. మహిళల పట్ల వేధింపులు లేకుండా ఉపాధి అవకాశాలు కల్పించడం, మహిళలకు రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వానిదే. గ్రామీణ ప్రాంతాలలో ఉపాధిని కల్పించడానికి ఏకైక మార్గమైన ‘ఉపాధి హామీ పథకా’నికి ఎక్కువ నిధులు కేటాయించాలి. మొత్తం మీద ఈ బడ్జెట్ నిరుపేద, మధ్య తరగతి వర్గాలను దృష్టిలో ఉంచుకుని ప్రవేశపెడతారని ప్రజలు ఎదురు చూస్తున్నారు.తండ సదానందం వ్యాసకర్త టీపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్మొబైల్: 99895 84665 -
సీఎం ఏక్నాథ్ షిండేకి ఎదురుదెబ్బ?
పూణే : మహరాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేకి ఎదురుదెబ్బ. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహరాష్ట్ర అధికార మహాయుతి కూటమి ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరనేది ప్రకటించకుండానే ఎన్నికల్లో పోటీచేయాలని భావిస్తోంది. దీంతో ఆ కూటమి తరఫున ప్రస్తుత సీఎంగా కొనసాగుతున్న షిండే మరో మారు ముఖ్యమంత్రి అవుతారా? లేదంటే రాజకీయ ఎత్తుగడలకు బలవుతారా? అన్నది ప్రశ్నార్ధకంగా మారింది.ఇటీవల మహరాష్ట్ర లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో అధికార మహాయుతి కూటమి అంచనాలు తలకిందులయ్యాయి. 48 పార్లమెంట్ స్థానాలకు గాను జరిగిన ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి 17 స్థానాలు.. ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమి 30 స్థానాల్లో విజయం సాధించాయి.బీజేపీ ముందే జాగ్రత్త పడుతోందిఆ ఫలితం సెప్టెంబర్ - అక్టోబర్ నెలల మధ్య కాలంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని అధికార మహాయుతి కూటమికి నేతృత్వం వహిస్తున్న బీజేపీ ముందే జాగ్రత్త పడుతోంది. అందుకే ఆ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్ని కైవసం చేసుకొని అధికార పీఠాన్ని అధిష్టించాలని పావులు కదుపుతోంది.ఏక్నాథ్ షిండేకి చెక్ పెట్టేందుకు ఇందులో భాగంగా 288 మంది అసెంబ్లీ స్థానాలకు ఒక్క బీజేపీ మాత్రం 160 స్థానాల్లో పోటీ చేసేందుకు ఆసక్తని కనబరుస్తుండగా..మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఏక్నాథ్ షిండేకి చెక్ పెట్టేందుకు సీఎం అభ్యర్ధి ఎవరనేది ప్రకటించకుండానే ఆ ఎన్నికల ప్రచారం చేసేలా కూటమిలోని ఇతర పార్టీ అధినేతలు, ముఖ్యనేతలతో చర్చ జరుపుతుందని సమాచారం. 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీకి288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి, ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమిలు నేరుగా తలపడనున్నాయి. అధికార మహాయుతి కూటమికి బీజేపీ నేతృత్వం వహిస్తుండగా.. బీజేపీకి శివసేన (యూబీటీ),ఏక్నాథ్ షిండే వర్గం..నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అజిత్ పవార్ వర్గం మద్దతు పలుకుతున్నాయి. ప్రతిపక్ష ఇండియా కూటమికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్‌కు శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే), ఎన్సీపీలు (శరద్చంద్ర పవార్)లు కీలక భాగస్వామ్యాలుగా ఉన్నాయి.శరద్ పవార్ వర్గం వైపువచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఎన్నికల్లో పోటీ చేయడం దాదాపూ ఖరారైనట్లేనని ‘మహ’ రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో పోటీ చేసే కేవలం ఒక సిటుకే పరిమితం కావడంతో అజిత్ పవార్ వర్గం నేతలు.. శరద్ పవార్ వర్గంలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా సుమారు 15 మంది అజిత్ పవార్ వర్గం ఎమ్మెల్యేలు శరద్ పవార్ టచ్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. దీన్ని అదునుగా భావించిన శరద్ పవార్ తన వర్గం ఎన్సీపీని మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, అందుకు అనుగుణంగా ఎమ్మెల్యేలను ఆహ్వానించేందుకు మొగ్గు చూపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. #WATCH | BJP leader Pankaja Munde celebrates with her supporters she wins Maharashtra MLC pollsAll 9 Mahayuti candidates have won Maharashtra MLC polls.(Video source: Pankaja Munde's Office) pic.twitter.com/WwzsdjqXYY— ANI (@ANI) July 12, 2024అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీకి ఊరటఅసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమనేలా తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు సంకేతాలిచ్చాయి. గత వారం విడుదలైన 12 ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో అధికార మహాయుతి కూటమి 9 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ ఐదు స్థానాలు,ఏక్నాథ్ షిండే వర్గం (2), అజిత్ పవార్ ఎన్సీపీ వర్గం (2) స్థానాల్లో గెలుపొందారు. యూబీటీ శివసేన నుంచి ఒక అభ్యర్థి, కాంగ్రెస్ నుండి ఒకరు విజయం సాధించారు. ఈ ఎన్నికల గెలుపునే రెఫరెండంగా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేలా బీజేపీ ఎన్నికల ప్రచారం చేసేందుకు సమాయత్తమవుతుంది. మరి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు, ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరనేది తెలియాలంటే కొంత కాలం ఎదురు చూడాల్సిందే. -
‘ప్రమాణ స్వీకారం తర్వాత అందుకే నినాదాలు చేశా’
లక్నో: లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని నగీనా లోక్‌సభ స్థానం నుంచి ఆజాద్ సమాజ్ పార్టీ నేత చంద్ర శేఖర్ ఆజాద్ తొలిసారి ఎంపీగా గెలుపొందారు. ఇటీవల 18వ లోక్‌సభలో నగీనా ఎంపీగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ఎంపీగా రాజ్యాంగ ప్రతిని పట్టుకుని ప్రమాణం చేసిన తర్వాత ‘జై భీమ్, జై భారత్, జై సంవిధాన్, జై మండల్, జై జోహార్, జై జవాన్, జై కిసాన్’ అని నినాదాలు చేశారు. అయితే తాజాగా ఆయన ఓ జాతీయా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ప్రమాణ స్వీకారం తర్వాత నినాదాలు చేయటానికి గల కారణాన్ని ఆయన వివరించారు. ‘‘ఆ నినాదాలు గొప్ప వ్యక్తులతో ముడిపడి ఉన్నాయి. 'జై భీమ్', 'జై భారత్' మా గుర్తింపును తెలియజేస్తాయి. మండల్ కమిషన్ అమలులోకి వచ్చాక వెనుకబడిన వర్గాలకు పలు అవకాశాలు లభించాయి. ఆయన వల్లే వెనకడిన వర్గాలు ముందుకు సాగుతున్నాయి. భారత ప్రజాస్వామ్యానికి, ప్రజలకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అయితే నేను లోక్‌సభలో ప్రమాణం చేసిన సమయంలో ఓ ఎంపీ అది నచ్చక ఈరోజే మొత్తం స్పీచ్ ఇస్తావా అంటూ వెక్కిరించారు. నేను ఇక్కడికి స్పీచ్ ఇవ్వడానికే వచ్చానని బదులు ఇచ్చా. నేను మాట్లాడటానికి వచ్చాను. మీరు వినాల్సి ఉంటుందన్నా’’ అని ఆజాద్ తెలిపారు. తమ హక్కులను లాగేసుకున్నవారు లోక్‌సభలో మత గళాన్ని వినడం అలవాటు చేసుకోవాలని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో నగీనా లోక్‌సభ స్థానం నుంచి ఆజాద్ 1,51,473 ఓట్ల మెజార్టీతో బీజేపీకి చెందిన ఓం కుమార్‌పై విజయం సాధించారు. -
పని చేస్తోందా? పట్టు తప్పుతోందా?!
ఇప్పుడిక మనం 18వ లోక్‌సభను ఎన్నుకున్నందున ప్రాథమికమైన రెండు ప్రశ్నలను లేవనెత్తాల్సిన సమయం ఆసన్నమయింది. మొదటిది– లోక్‌సభ మన ఆశలకు అనుగుణంగానే పని చేస్తోందా? రెండవది – కేవలం పాలక పక్షాలు చెప్పింది వినడం వరకే కాక, భారత ప్రజల గొంతును కూడా వినిపించేందుకు తగినంతగా సమయాన్ని సాధించేలా ప్రతిపక్షాన్ని ఒప్పించటానికి ఎలాంటి మార్పులు అవసరం?17వ లోక్‌సభ కేవలం 1,354 గంటలు మాత్రమే పని చేసిందని పీఆర్ఎస్ (పాలసీ రీసెర్చ్ స్టడీస్) లెజిస్లేటివ్ రీసెర్చ్ ప్రచురించిన వాస్తవాలు తెలియజేస్తున్నాయి. మొత్తం అన్ని పూర్తి–కాల లోక్‌సభల పని గంటల సగటు కంటే నలభై శాతం తక్కువగా 1,615 గంటలు మాత్రమే పని చేసిన 16వ లోక్‌సభ కన్నా కూడా ఇది తక్కువ. నిజానికి 17వ లోక్‌సభ 15 సమావేశాలలో 11 సమావేశాలు నిర్దిష్ట సమయానికి ముందే వాయిదా పడ్డాయి. మొత్తం అన్ని పూర్తి–కాల లోక్‌సభలలో ఒక్క 17వ లోక్‌సభ మాత్రమే అతి తక్కువగా కేవలం 274 సార్లు మాత్రమే సమావేశం అయింది. ఏడాదికి 135 రోజులు సమావేశం అయిన తొలి లోక్‌సభతో పోల్చి చూస్తే 17వ లోక్‌సభ ఏడాదికి కేవలం 55 రోజులు మాత్రమే సమావేశమైంది. ఇది చట్ట నిర్వహణ విధానంపై స్పష్టమైన ప్రభావం చూపింది. బిల్లులు చాలావరకు వాటిని ప్రవేశపెట్టిన రెండు వారాల లోపే ఆమోదం పొందాయి. 35 శాతం బిల్లులు గంట కంటే తక్కువ చర్చతోనే చట్టరూపం దాల్చాయి. పార్లమెంటరీ కమిటీల పరిశీలన కోసం కేవలం 16 శాతం మాత్రమే వెళ్లాయి. ఆ ముందరి మూడు లోక్‌సభలలో పరిశీలనకు వెళ్లినవాటి కంటే ఇది తక్కువ. అంటే, లోక్‌సభ పని గంటలు తగ్గిపోతుండటమే కాకుండా, అందులోనూ మళ్లీ... బిల్లుల నిశిత పరిశీలన, బిల్లులపై జరగవలసిన అర్థవంతమైన చర్చల విషయంలో లోక్‌సభ సామర్థ్యం క్షీణించిపోతోంది! లోక్‌సభ అతి ముఖ్యమైన విధులలో ఈ బిల్లుల చర్చ–పరిశీలన ఒకటి కనుక అది మన అంచనాలకు తగ్గట్లుగా లేదని మనం నిస్సంకోచంగా అనుకోవచ్చు. దీనికి పరిష్కారం సరళమైనది, స్పష్టమైనది. అదేమిటంటే, లోక్‌సభలు ప్రతి సంవత్సరం కనీసం ఇన్ని రోజులని నిర్దిష్టంగా సమావేశం అవ్వాలి. బిల్లులు ఆమోదం పొందటానికి ముందు సవివరమైన పరిశీలన కోసం వాటిని పార్లమెంటరీ కమిటీలకు పంపాలి. మరొకటి – ఎంతో క్లిష్టమైనదీ – లోక్‌సభ పనితీరుకు ప్రభుత్వం బాధ్యత వహించేలా చేయటం! ఇక్కడే పాలకపక్షం తమ గొంతును వినటం లేదని ప్రతిపక్షాలు చేస్తున్న వాదనను పరిగణనలోకి తీసుకుని పరిష్కరించవలసిన అవసరం ఉంది. అలా చేస్తే తప్ప ప్రభుత్వాన్ని అర్థవంతంగా ప్రశ్నించటం, సవాలు చేయటం కుదరదు. మరి దీన్నెలా మనం సాధించాలి? దీనికొక కుదురైన పరిష్కారం హౌస్ ఆఫ్ కామన్స్ పాటించే విధానాన్ని స్వీకరించటం! ప్రతి సమావేశాలలోనూ కొన్నిరోజులు ప్రతిపక్షాలే అజెండాను నిర్ణయించేలా చేయటం. బ్రిటన్‌లో వాటిని ‘ప్రతిపక్షాల రోజులు’ అంటారు. ప్రతి పార్లమెంటు సమావేశంలో అవి 20 ఉంటాయి. ప్రధాన ప్రతిపక్షానికి 17, రెండవ అతిపెద్ద ప్రతిపక్షానికి 3 రోజులు. మనం అనుసరించదగిన బ్రిటిష్ పార్లమెంటరీ విధానాలలో రెండవది... పీఎంక్యూస్ (ప్రైమ్ మినిస్టర్స్ క్వశ్చన్స్). సమావేశాలు జరుగుతున్న కాలంలో ప్రతివారం ఒక నిర్ణీత రోజున పూర్తిగా ఒక అరగంట పాటు ప్రతిపక్షాల ప్రశ్నలకు ప్రధానే నేరుగా సమాధానం చెబుతారు. వాటిల్లో కనీసం ఆరు ప్రశ్నలను ప్రతిపక్ష నేత అడుగుతారు. పీఎంక్యూస్ అని బ్రిటన్‌లో వాడుకలో ఉన్న ఈ ప్రశ్నా సమయం అమితమైన ప్రజాసక్తిని కలిగి ఉంది. పీఎం, ప్రతిపక్ష నేతల బలాలను, బలహీనతలను బహిర్గతపరిచే ఉత్తేజభరితమైన క్షణాలు అవి. వారి సమాచార లేమి, సామర్థ్య లోపం ఇట్టే తెలిసిపోతాయి. పీఎంక్యూస్ బ్రిటన్కొక గవాక్షం వంటిది కూడా! తమ నాయకుడు ఎంతటి ఘనుడో ప్రజలు చూస్తారు. ఒక అంచనాకు వస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే, ప్రజాస్వామ్యం పని చేస్తోందా, లేక పట్టుతప్పుతోందా అనేదానికి పీఎంక్యూస్ ఒక రుజువు. ఈ సంప్రదాయాలను మనం స్వీకరించినట్లయితే, ప్రజాస్వామ్యం పట్ల అవి మన విశ్వాసాన్ని పెంపొందింపజేస్తాయి. తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహించాలన్న ప్రతిపక్షాల ప్రయత్నానికి అవి మద్దతును ఇస్తాయి. భిన్నమైన అభిప్రాయాలు, వాదనలకు చర్చావేదిక దొరికిందన్న నమ్మకాన్ని భారత ప్రజలకు కల్పిస్తాయి. చివరిగా, కోల్పోయిన విశ్వాసాన్ని నిజంగా పాదుకొల్పడానికి మనం స్పీకర్ స్థానం విషయమై కూడా మార్పులు చేసుకోవలసిన అవసరం ఉంది. స్పీకర్‌గా ఎంపికైన వారు వెంటనే తమ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయాలి. అప్పుడు మాత్రమే ఆ వ్యక్తి నిష్పక్షపాతంగా, పార్టీలకు అతీతంగా ఉండగలరని నమ్మగలం. ఆమె లేదా అతడు తర్వాతి లోక్‌సభకు కూడా కొనసాగాలని అనుకుంటే వారి ఎన్నిక పోటీ లేకుండానే జరగాలి. అదంతా కూడా ఎలాగూ వారి స్వభావం, ప్రవర్తన మీద ఆధారపడి ఉన్నప్పటికీ వార్ధక్య వైకల్యాలు లేకుండాలి. ఇవి స్పష్టమైన పరిష్కారాలే కానీ ప్రభుత్వం ఆమోదించినప్పుడు మాత్రమే సంభవమౌతాయి. కాంగ్రెస్ పార్టీ తన మ్యానిఫెస్టోలో పేర్కొన్న విధంగా ప్రతిపక్షమే స్వయంగా ఈ మార్పులను సిఫారసు చేయవచ్చు. అందుకు బీజేపీ కనుక నిరాకరిస్తే భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి వంటిది అని చెప్పుకోవటాన్ని ఆ పార్టీ కొనసాగించగలదా? అప్పుడు తల్లి అని కాకుండా సవతి తల్లి అని చెప్పుకోవటమే సరిగ్గా ఉంటుందా?కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
పని చేస్తోందా? పట్టు తప్పుతోందా?!
ఇప్పుడిక మనం 18వ లోక్‌సభను ఎన్నుకున్నందున ప్రాథమికమైన రెండు ప్రశ్నలను లేవనెత్తాల్సిన సమయం ఆసన్నమయింది. మొదటిది– లోక్‌సభ మన ఆశలకు అనుగుణంగానే పని చేస్తోందా? రెండవది – కేవలం పాలక పక్షాలు చెప్పింది వినడం వరకే కాక, భారత ప్రజల గొంతును కూడా వినిపించేందుకు తగినంతగా సమయాన్ని సాధించేలా ప్రతిపక్షాన్ని ఒప్పించటానికి ఎలాంటి మార్పులు అవసరం?17వ లోక్‌సభ కేవలం 1,354 గంటలు మాత్రమే పని చేసిందని పీఆర్ఎస్ (పాలసీ రీసెర్చ్ స్టడీస్) లెజిస్లేటివ్ రీసెర్చ్ ప్రచురించిన వాస్తవాలు తెలియజేస్తున్నాయి. మొత్తం అన్ని పూర్తి–కాల లోక్‌సభల పనిగంటల సగటు కంటే నలభై శాతం తక్కువగా 1,615 గంటలు మాత్రమే పని చేసిన 16వ లోక్‌సభ కన్నా కూడా ఇది తక్కువ. నిజానికి 17వ లోక్స¿¶ 15 సమావేశాలలో 11 సమావేశాలు నిర్దిష్ట సమయానికి ముందే వాయిదా పడ్డాయి. మొత్తం అన్ని పూర్తి–కాల లోక్‌సభలలో ఒక్క 17వ లోక్‌సభ మాత్రమే అతి తక్కువగా కేవలం 274 సార్లు మాత్రమే సమావేశం అయింది.ఏడాదికి 135 రోజులు సమావేశం అయిన తొలి లోక్‌సభతో పోల్చి చూస్తే 17వ లోక్‌సభ ఏడాదికి కేవలం 55 రోజులు మాత్రమే సమావేశమైంది. ఇది చట్ట నిర్వహణ విధానంపై స్పష్టమైన ప్రభావం చూపింది. బిల్లులు చాలావరకు వాటిని ప్రవేశపెట్టిన రెండు వారాల లోపే ఆమోదం పొందాయి. 35 శాతం బిల్లులు గంట కంటే తక్కువ చర్చతోనే చట్టరూపం దాల్చాయి. పార్లమెంటరీ కమిటీల పరిశీలన కోసం కేవలం 16 శాతం మాత్రమే వెళ్లాయి. ఆ ముందరి మూడు లోక్‌సభలలో పరిశీలనకు వెళ్లినవాటి కంటే ఇది తక్కువ. అంటే, లోక్‌సభ పని గంటలు తగ్గిపోతుండటమే కాకుండా, అందులోనూ మళ్లీ... బిల్లుల నిశిత పరిశీలన, బిల్లులపై జరగవలసిన అర్థవంతమైన చర్చల విషయంలో లోక్‌సభ సామర్థ్యం క్షీణించిపోతోంది! లోక్‌సభ అతి ముఖ్యమైన విధులలో ఈ బిల్లుల చర్చ–పరిశీలన ఒకటి కనుక అది మన అంచనాలకు తగ్గట్లుగా లేదని మనం నిస్సంకోచంగా అనుకోవచ్చు. దీనికి పరిష్కారం సరళమైనది, స్పష్టమైనది. అదేమిటంటే, లోక్‌సభలు ప్రతి సంవత్సరం కనీసం ఇన్ని రోజులని నిర్దిష్టంగా సమావేశం అవ్వాలి. బిల్లులు ఆమోదం పొందటానికి ముందు సవివరమైన పరిశీలన కోసం వాటిని పార్లమెంటరీ కమిటీలకు పంపాలి.మరొకటి – ఎంతో క్లిష్టమైనదీ – లోక్‌సభ పనితీరుకు ప్రభుత్వం బాధ్యత వహించేలా చేయటం! ఇక్కడే పాలకపక్షం తమ గొంతును వినటం లేదని ప్రతిపక్షాలు చేస్తున్న వాదనను పరిగణనలోకి తీసుకుని పరిష్కరించవలసిన అవసరం ఉంది. అలా చేస్తే తప్ప ప్రభుత్వాన్ని అర్థవంతంగా ప్రశ్నించటం, సవాలు చేయటం కుదరదు. మరి దీన్నెలా మనం సాధించాలి?దీనికొక కుదురైన పరిష్కారం హౌస్ ఆఫ్ కామన్స్ పాటించే విధానాన్ని స్వీకరించటం! ప్రతి సమావేశాలలోనూ కొన్నిరోజులు ప్రతిపక్షాలే అజెండాను నిర్ణయించేలా చేయటం. బ్రిటన్‌లో వాటిని ‘ప్రతిపక్షాల రోజులు’ అంటారు. ప్రతి పార్లమెంటు సమావేశంలో అవి 20 ఉంటాయి. ప్రధాన ప్రతిపక్షానికి 17, రెండవ అతిపెద్ద ప్రతిపక్షానికి 3 రోజులు.మనం అనుసరించదగిన బ్రిటిష్ పార్లమెంటరీ విధానాలలో రెండవది... పీఎంక్యూస్ (ప్రైమ్ మినిస్టర్స్ క్వశ్చన్స్). సమావేశాలు జరుగుతున్న కాలంలో ప్రతివారం ఒక నిర్ణీత రోజున పూర్తిగా ఒక అరగంట పాటు ప్రతిపక్షాల ప్రశ్నలకు ప్రధానే నేరుగా సమాధానం చెబుతారు. వాటిల్లో కనీసం ఆరు ప్రశ్నలను ప్రతిపక్ష నేత అడుగుతారు.పీఎంక్యూస్ అని బ్రిటన్‌లో వాడుకలో ఉన్న ఈ ప్రశ్నా సమయం అమితమైన ప్రజాసక్తిని కలిగి ఉంది. పీఎం, ప్రతిపక్ష నేతల బలాలను, బలహీనతలను బహిర్గతపరిచే ఉత్తేజభరితమైన క్షణాలు అవి. వారి సమాచార లేమి, సామర్థ్య లోపం ఇట్టే తెలిసిపోతాయి. పీఎంక్యూస్ బ్రిటన్కొక గవాక్షం వంటిది కూడా! తమ నాయకుడు ఎంతటి ఘనుడో ప్రజలు చూస్తారు. ఒక అంచనాకు వస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే, ప్రజాస్వామ్యం పని చేస్తోందా, లేక పట్టుతప్పుతోందా అనేదానికి పీఎంక్యూస్ ఒక రుజువు.ఈ సంప్రదాయాలను మనం స్వీకరించినట్లయితే, ప్రజాస్వామ్యం పట్ల అవి మన విశ్వాసాన్ని పెంపొందింపజేస్తాయి. తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహించాలన్న ప్రతిపక్షాల ప్రయత్నానికి అవి మద్దతును ఇస్తాయి. భిన్నమైన అభిప్రాయాలు, వాదనలకు చర్చావేదిక దొరికిందన్న నమ్మకాన్ని భారత ప్రజలకు కల్పిస్తాయి.చివరిగా, కోల్పోయిన విశ్వాసాన్ని నిజంగా పాదుకొల్పడానికి మనం స్పీకర్ స్థానం విషయమై కూడా మార్పులు చేసుకోవలసిన అవసరం ఉంది. స్పీకర్‌గా ఎంపికైన వారు వెంటనే తమ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయాలి. అప్పుడు మాత్రమే ఆ వ్యక్తి నిష్పక్షపాతంగా, పార్టీలకు అతీతంగా ఉండగలరని నమ్మగలం. ఆమె లేదా అతడు తర్వాతి లోక్‌సభకు కూడా కొనసాగాలని అనుకుంటే వారి ఎన్నిక పోటీ లేకుండానే జరగాలి. అదంతా కూడా ఎలాగూ వారి స్వభావం, ప్రవర్తన మీద ఆధారపడి ఉన్నప్పటికీ వార్ధక్య వైకల్యాలు లేకుండాలి.ఇవి స్పష్టమైన పరిష్కారాలే కానీ ప్రభుత్వం ఆమోదించినప్పుడు మాత్రమే సంభవమౌతాయి. కాంగ్రెస్ పార్టీ తన మ్యానిఫెస్టోలో పేర్కొన్న విధంగా ప్రతిపక్షమే స్వయంగా ఈ మార్పులను సిఫారసు చేయవచ్చు. అందుకు బీజేపీ కనుక నిరాకరిస్తే భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి వంటిది అని చెప్పుకోవటాన్ని ఆ పార్టీ కొనసాగించగలదా? అప్పుడు తల్లి అని కాకుండా సవతి తల్లి అని చెప్పుకోవటమే సరిగ్గా ఉంటుందా?– కరణ్ థాపర్, వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
Rahul Gandhi: గుజరాత్‌లోనూ మోదీని ఓడిస్తాం
అహ్మదాబాద్: ఉత్తరప్రదేశ్‌లో అయోధ్య ఉన్న లోక్‌సభ స్థానంలో బీజేపీని ఓడించినట్టే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓడించబోతున్నామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జోస్యం చెప్పారు. అయోధ్య పరాభవమే అక్కడా ఎదురవుతుందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని సైతం ఓడిస్తామన్నారు. ‘‘నేను చెబుతున్నది చాలా పెద్ద విషయం. అయోధ్యలో బీజేపీని మట్టికరిపించడం ద్వారా అద్వానీ ప్రారంభించిన రామ మందిర ఉద్యమాన్ని కూడా ఇండియా కూటమి ఓడించింది’’ అని పేర్కొన్నారు! శనివారం అహ్మదాబాద్‌లోని కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో రాహుల్ మాట్లాడారు. ‘‘కొన్ని రోజుల క్రితం గుజరాత్ బీజేపీ నేతలు మనల్ని బెదిరించారు. మన కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. మనం గుజరాత్లో బీజేపీ ప్రభుత్వాన్నే ధ్వంసం చేయబోతున్నాం. బీజేపీని, మోదీని చిత్తుగా ఓడిస్తాం. ఇది రాసి పెట్టుకోవాలి. నూతన ఆరంభం ఇక్కడి నుంచే మొదలవుతుంది. మోదీ విజన్ అనే గాలి బుడగ గుజరాత్లో ఇప్పటికే బద్దలైంది. వారణాసి లోక్‌సభ స్థానంలోనూ మోదీ తక్కువ మెజారీ్టతోనే గెలిచారు. అక్కడ మనం కొన్ని పొరపాట్లు చేశాం. లేదంటే మోదీ కచి్చతంగా ఓడేవారు. తొలుత అయోధ్యలో పోటీ చేయాలని మోదీ భావించారు. అక్కడ గెలిచే అవకాశం లేదని, రాజకీయ కెరీర్‌కే తెర పడవచ్చని బీజేపీ సర్వేయర్లు చెప్పడంతో వారణాసికే పరిమితమయ్యారు’’ అని ఎద్దేవా చేశారు. దైవాంశసంభూతుడైన మోదీకి సామాన్య మానవుల కష్టాలు అర్థం కావడం లేదన్నారు. అయోధ్య ఆలయ నిర్మాణానికి పేదల భూములు లాక్కున్నారని, పరిహారం ఇవ్వలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తు ‘హస్తం’ ప్రతి మతంలోనూ ప్రముఖంగా కనిపిస్తుందన్నారు. -
రచ్చ కాదు... చర్చ కావాలి!
కొత్త సభ కొలువు తీరిందన్న మాటే కానీ, పార్లమెంట్లో పాత దృశ్యాలే పునరావృతమయ్యాయి. 18వ లోక్‌సభ ఏర్పడ్డాక జరిగిన తొలి పార్లమెంట్ సమావేశాలు సభ్యుల ప్రమాణ స్వీకారం, రాష్ట్ర పతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానానికే పరిమితమయ్యాయి. కానీ, నేతలెవరు మాట్లాడుతున్నా... వెనుక నుంచి అవే అరుపులు, గందరగోళ పరిస్థితులు, రన్నింగ్ కామెంటరీలు, సభాపతితో వాగ్వాదాలు, చివరకు వాకౌట్లు తప్పలేదు. సర్వసాధారణంగా ఏకగ్రీవం గానో, లేదంటే అధికార – ప్రతిపక్షాల మధ్య పోటీతోనో జరగాల్సిన లోక్‌సభ స్పీకర్ ఎన్నిక సంప్రదాయానికి భిన్నంగా ఈసారి మూజువాణి ఓటుతో సాగింది. ఇక, ప్రతిపక్షాలకు కేటాయించాల్సిన లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవిని తద్భిన్నంగా గత అయిదేళ్ళుగా ఖాళీగా అట్టిపెట్టేసిన అధికార బీజేపీ, ఈసారి కూడా ఆ పదవిని వారికి వదిలిపెట్టే పెద్దమనసు చేస్తున్నట్టు లేదు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ సారథిగా తన మిత్రపక్షాలకు ఆ పదవిని కట్టబెట్టాలని బీజేపీ చూస్తున్నట్టు వస్తున్న కథనాలే అందుకు నిదర్శనం. ఇక, సభానాయకుడికీ, ప్రతిపక్ష నేతకూ మధ్య పొసగని పరిస్థితి సరేసరి. వెరసి లోక్‌సభలో మంగళవారం, రాజ్యసభలో బుధవారం ముగిసిన తొలి సమావేశాలు అసంతృప్తినే మిగిల్చాయి. ఈ పాపంలో అధికార, ప్రతిపక్షాలు రెంటికీ సమాన భాగస్వామ్యం ఉంది. కొద్ది నెలలుగా పూర్తి స్థాయి ఎన్నికల ప్రచారంలో మునిగితేలిన పార్టీలు ఇప్పటికీ ఆ మానసిక స్థితి నుంచి బయట పడినట్టు లేవు. ఎన్నికల ముగిసి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా పార్లమెంట్ సాక్షిగా ఇరుపక్షాలూ పరస్పరం ఎన్నికల ప్రచార తరహా ఆరోపణల పర్వం కొనసాగించడం దురదృష్టం. ప్రతిపక్ష నాయకుడిగా తొలిసారిగా బాధ్యతలు చేపట్టిన రాహుల్ గాంధీ తన ప్రథమ ప్రసంగంలోనే ప్రభుత్వంపై నిశిత విమర్శలతో దూకుడు ప్రదర్శించారు. ఇతర ప్రతిపక్ష నేతలు సైతం శక్తిమంత మైన ప్రసంగాలే చేశారు. కాబట్టి వారికి తగినంత సమయం ఇవ్వలేదన్న ప్రసక్తే లేదు. రాహుల్ ఉద్వేగభరితంగా మాట్లాడుతూ మార్కులు సంపాదించినా, సరైన గణాంకాలతో సమస్యల్ని నిర్దిష్టంగా ప్రస్తావించలేకపోయారు. అగ్నివీర్ లాంటి అంశాల్లో ఆయన లెక్కలు తప్పు చెప్పారు. మరోపక్క ప్రధాని లోక్‌సభలో మాట్లాడుతున్నంత సేపూ ప్రతిపక్షాలు నినాదాలు హోరెత్తించాయే తప్ప, హుందాతనం పాటించలేదు. రాహుల్ సైతం సభలో సభ్యుల్ని రెచ్చిపొమ్మన్నట్టు ప్రేరేపించడం సైతం ఏ మాత్రం సమర్థనీయం కాదు.రాహుల్‌ది పిల్లతనం, కాంగ్రెస్ పరాన్నజీవి లాంటి రాజకీయ విమర్శలు గుప్పించిన మోదీ కూడా తక్కువేమీ తినలేదు. ఎంతసేపటికీ పాత ఎమర్జెన్సీ గాయాన్ని గుర్తు చేసి, కాంగ్రెస్‌ను తప్పు బట్టడానికి ప్రయత్నించారు. లేదంటే గడచిన తమ పదేళ్ళ ప్రస్థానాన్ని గుణగాన సంకీర్తన చేశారు. అంతేతప్ప లోక్‌సభలో చేసిన రెండున్నర గంటల సుదీర్ఘ ప్రసంగంలో ప్రతిపక్షాలు ప్రస్తావించిన, దేశాన్ని పీడిస్తున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కార్యాచరణ ఏమిటన్నది మాత్రం చెప్పలేదు. చెప్పాలనుకోలేదు. సంక్షుభిత మణిపుర్లో ఏడాదిగా ఒక్కసారైన పర్యటించని మోదీ సదరు ఈశాన్య రాష్ట్రంలో పరిస్థితులు మెరుగుపడ్డాయంటూ రాజ్యసభలో అసత్యాలాపన చేయడం మరీ విడ్డూరం. ఒక్కమాటలో... ఈసారి సొంత మెజారిటీ తగ్గి, కూటమి ప్రభుత్వం నడుపుతున్న మోదీ ఇప్పటికీ గత రెండుసార్లు తిరుగులేని మెజారిటీతో సాగిన బీజేపీ ప్రభుత్వ ఆధిపత్య ధోరణినే ప్రదర్శిస్తు న్నారు. ప్రభుత్వ పెద్దగా, అనుభవజ్ఞుడిగా ప్రతిపక్షాలను సైతం కలుపుకొని పోవాలన్న ఆలోచన చేయట్లేదు. పట్టువిడుపులు చూపట్లేదు. దాంతో ఇరుపక్షాలకూ మధ్య రాజీ కుదిరేలా కనిపించట్లేదు.అందరూ కలిసి నాటకీయ చర్యలు, వ్యాఖ్యలతో పార్లమెంట్‌ను (రణ) రంగస్థలిగా మార్చేశా రన్నది చేదు నిజం. అధికార, ప్రతిపక్ష నేతలు అంశాల వారీగా చర్చిస్తే, విభేదిస్తే ఫరవాలేదు కానీ, నిత్యం ఉప్పు నిప్పుగా ఉంటే పార్లమెంట్ నడిచేదెట్లా? మళ్ళీ జనం ముందుకు వెళ్ళడానికి మరో అయిదేళ్ళుండగా, రేపే ఎన్నికలన్నట్టు రాజకీయ విమర్శల్లో మునిగితేలితే లాభమేంటి? నీట్ పరీక్ష, నిరుద్యోగం, ఈ అయిదేళ్ళలో సాగాల్సిన నియోజక వర్గ పునర్విభజన, ఇప్పటికే చాలా ఆలస్యమైపోయిన జనగణన లాంటి అనేక తక్షణ, దీర్ఘకాలిక అంశాలు చర్చకు మిగిలే ఉన్నాయి. అలాంటి వాటిపై దృష్టి పెట్టాలి. కీలకమైన బిల్లుల ఆమోదానికి లోక్‌సభలో టీడీపీ, జేడీయూల పైన, రాజ్యసభలో బిజూ జనతాదళ్ సైతం దూరమైనందున ఇతరులపైన ఆధారపడాల్సిన మోదీ 3.0 ఆభిజాత్యం వదులుకోకపోతే కష్టం. ఘర్షణ, విద్వేషం మరింత పెరిగిపోవడాని కన్నా ముందే నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాలి. దేశ శ్రేయస్సు కోసం హుందా చర్చకు తెర తీయాలి.బడ్జెట్ కోసం జూలై మూడో వారంలో పార్లమెంట్ తిరిగి సమావేశం కానుంది. అప్పుడైనా అధికార, ప్రతిపక్షాలు తమ వైఖరి మార్చుకోవాలి. ఇరుపక్షాలూ విజ్ఞతతో వ్యవహరించాలి. ప్రతిపక్ష వాదనకు చెవి ఒగ్గాల్సిన బాధ్యత పాలకులకు తప్పనిసరిగా ఉంది. అదే సమయంలో– ప్రజలిచ్చిన మెజారిటీతో గద్దెనెక్కి, చెప్పే అధికారం చేజిక్కించుకున్న పాలకుల మాటలను ప్రతిపక్షాలూ సావధానంగా విని తీరాలి. ఎవరు ఎవరిని మాట్లాడనివ్వబోమన్నా, వినిపించుకోబోమన్నా అది ప్రజాస్వామ్యం కాదు. ప్రజాక్షేమానికి అసలు పనికిరాదు. అనేక అంశాలపై పరస్పర భిన్నమైన అభిప్రాయాలు సహజంగానే ఉంటాయి. కానీ పార్లమెంట్లో జరగాల్సింది అర్థవంతమైన చర్చే తప్ప అనవసర రాద్ధాంతం కాదు. ప్రజాస్వామ్య దేవాలయంగా, అత్యున్నత నిర్ణాయక వేదికగా పార్లమెంట్‌కు ఉన్న ప్రతిష్ఠకు భంగం కలిగేలా ప్రవర్తిస్తే అది అందరికీ నష్టం. గత పదేళ్ళుగా చట్ట సభల్లో అంతకంతకూ పెరిగిపోతున్న ఇలాంటి ప్రవర్తన ఇలాగే కొనసాగితే, మొదటికే మోసం వస్తుంది. ప్రజాసమస్యలపై చర్చించాల్సిన చట్టసభల సమావేశాలకు ప్రయోజనం లేకుండా పోతుంది. -
‘సభలో అసత్య ఆరోపణలు చేస్తే.. తప్పించుకోలేరు’
ఢిల్లీ: లోక్‌సభను ఏ సభ్యుడైనా తప్పుదోవ పట్టించాలని చూస్తే.. సభ నియమ, నిబంధనల నుంచి తప్పించుకోలేరని పార్లెమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ లోక్‌సభలో చేసిన ప్రసంగంలో అన్నీ అసత్య ఆరోపణలు ఉన్నాయని స్పీకర్ ఓం బిర్లాకు బీజేపీ నోటీసు ఇచ్చిన నేపథ్యంలో కిరణ్ రిజిజు వ్యాఖ్యలను ప్రాధాన్యత సంతరించుకుంది.‘‘లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చాలా అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని మేము స్పీకర్ ఓం బిర్లాకు నోటీసు ఇచ్చాం. స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని ఎదురు చూస్తున్నాం. సభలో అందరీకి సమానమైన నియమాలు ఉంటాయి. స్పీకర్ కంటే ఎవరూ పెద్ద కాదు. సభ నియమాలను నుంచి ఏ సభ్యుడు తప్పించుకోలేరు. గొప్ప ఫ్యామిలీ నుంచి వచ్చినట్లు భావిస్తే.. సభలో అటువంటి ప్రాధాన్యతలు ఉండవు. ఎవరైనా సభను తప్పుదోవ పట్టించాలని ప్రయత్నిస్తే.. వాళ్లు సభ నియమాలను నుంచి తప్పించుకోలేరు’’ అని మంత్రి కిరణ్ రిజిజు అన్నారు.సోమవారం రాష్ట్రపతి ప్రసంగం ధన్యవాద తీర్మానంపై ప్రతిపక్ష రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. పలు అంశాల్లో బీజేపీ, మోదీ వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. అయితే రాహుల్ వ్యాఖ్యలపై సభలో ప్రధానితో సహా మంత్రులు అభ్యంతరం తెలిపారు. రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రభుత్వం, బీజేపీపై అసత్య ఆరోపణలు చేశారని బీజేపీ ఎంపీ బన్సూరీ స్వరాజ్ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు నోటీసు ఇచ్చారు.చదవండి: PM Narendra Modi: ప్రశాంతంగా మణిపూర్ -
7 రోజులు 34 గంటలు.. ముందుగానే వాయిదా!
ఢిల్లీ: 18వ లోక్‌సభ తొలి సమావేశాలు నిరవధిక వాయిదాతో ముగిశాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన రెండు రోజుల చర్చకు మంగళవారం ప్రధాని మోదీ బదులిచ్చాక సభ నిరవధికంగా వాయిదా పడింది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని లోక్‌సభ సెక్రటేరియట్ ప్రకటించింది.The First Session of the 18th Lok Sabha, which commenced on 24 June, 2024, concluded on July 2. Speaker Om Birla informed that the First Session comprised 7 sittings and lasted for about 34 hours. He informed that Lok Sabha recorded 103% productivity during the Session: Lok Sabha…— ANI (@ANI) July 3, 2024 ఈ సమావేశాలు మొత్తం 7 రోజుల్లో 34 గంటల పాటు చర్చలు జరిగాయి. 103 శాతం ఉత్పాదకత(productivity) నమోదైనట్లు స్పీకర్ ఓ బిర్లా తెలిపారు. జూన్ 24న మొదలైన పార్లమెంట్ సమావేశాలు షెడ్యూల్ ప్రకారం బుధవారం దాకా జరగాల్సి ఉంది. కానీ ఒక రోజు ముందే నిరవధిక వాయిదా వేశారు.Speaker Om Birla informed the House that the discussion on the Motion of Thanks to the President's Address on 27 June lasted for more than 18 hours and 68 Members participated in the discussion. In addition, 50 Members laid their speeches. The discussion concluded with the reply…— ANI (@ANI) July 3, 2024‘రాష్ట్రపతి ప్రసంగం ధన్యవాద తీర్మానంపై జూన్ 27న 18 గంటలపాటు చర్చ జరిగింది. ఈ చర్చలో 68 మంది పాల్గొన్నారు. 50 మంది సభ్యులు మాట్లాడారు. మంగళవారం ప్రధాని మోదీ రాష్ట్రపతి ప్రసంగం ధన్యవాద తీర్మానానికి సమాధానం చెప్పటంతో చర్చ ముగిసింది’ అని లోక్‌సభ సెక్రటేరియట్ తెలిపింది. -
అవకాశం ఉన్నా ప్రత్యేక హోదా ఎందుకు అడగరు?: వైఎస్సార్సీపీ ఎంపీ తనుజారాణి
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని లోక్‌సభలో వైఎస్సార్సీపీ ఎంపీ తనుజారాణి కోరారు. రాష్ట్రంలో అధికారంలో లేకపోయినా ఆంధ్రప్రదేశ్ హక్కుల సాధన కోసం వైఎస్సార్సీపీ పోరాటం చేస్తోంది. సోమవారం లోక్‌సభలో ఎంపీ తనుజారాణి మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీ ప్రత్యేక హోదా ఇవ్వాలన్నారు.ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కావాలి అని గత పది సంవత్సరాలుగా మా వైయస్ఆర్ సీపీ డిమాండ్ చేస్తూనే ఉంది.-గుమ్మ తనూజా రాణి, వైయస్ఆర్ సీపీ ఎంపీ pic.twitter.com/pwE9xTfMqS— YSR Congress Party (@YSRCParty) July 1, 2024 ‘‘టీపీపీ బలంపైనే కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉన్నా ప్రత్యేక హోదా ఆ పార్టీ అడగడం లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై, పార్టీ ఆఫీసులపై టీడీపీ దాడులు మానుకోవాలి. గిరిజనుల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. గిరిజన ప్రాంతాల్లో విద్యాబోధనకు గిరిజనేతర టీచర్లు రావడం లేదు. ఈ సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కావాలని గత పదేళ్లుగా వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తునే ఉంది. ఇప్పటికైనా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి ’’ అని ఆమె అన్నారు.ఇదిలా ఉంటే.. ఎన్డీయే కూటమిలో మూడో స్థానంలో ఉన్న నితీశ్ కుమార్ జేడీయూ(12), బీహార్ ప్రత్యేక హోదా కోసం అసెంబ్లీలో తీర్మానం సైతం పాస్ చేసింది. కానీ, 16 సీట్లతో రెండో స్థానంలో టీడీపీ మాత్రం ఇప్పటివరకైతే టీడీపీ ఏ ఊసు ఎత్తడం లేదు. -
ఎలక్టోరల్ బాండ్లపై విచారణ జరిపించండి: కేసీ వేణుగోపాల్
Updatesఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ అన్నారు.లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగం ధన్యవాద తీర్మానంపై మాట్లాడుతూ.. బీజేపీ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు.బీజేపీలో పాలనలో ఢిల్లీ ఎయిర్ పోర్టు, జబల్పూర్ ఎయిర్‌పోర్టుల రూఫ్‌లు కూలిపోయాయని అన్నారు. రాజ్‌కోట్ ఎయిర్‌పోర్టు రూఫ్ ధ్వంసం అయింది. అయోధ్యలో రోడ్లు అధ్వానంగాఉన్నాయి. రామ మందిరంలో నీరు లీక్ అవుతోంది. ముంబై హార్బర్ లింక్ రోడ్డుకు పగుళ్లు వచ్చాయి. బీజేపీ పాలనలో బిహార్‌లో మూడు బ్రిడ్జ్‌లు కూలిపోయాయి. ఇవాన్ని కూడా ఎన్డీయే ప్రభుత్వంలో చోటు చేసుకున్నాయి. ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారంలో విచారణ జరిపించాలని ప్రధాని మోదీకి సవాల్ విసురుతున్నా అని అన్నారు.#WATCH | Delhi: In the Lok Sabha, Congress MP KC Venugopal says, "... Delhi Airport roof collapsed, Jabalpur Airport roof collapse, Rajkot Airport canopy collapse, conditions of roads in Ayodhya is bad, leakage in Ram Mandir, cracks in Mumbai Harbour link road, three new bridges… pic.twitter.com/CtYCzhLp3E— ANI (@ANI) July 2, 2024 లోక్‌సభ స్పీకర్‌కు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేఖతను నిన్న లోక్‌సభలో మాట్లాడిన ప్రసంగంలో చాలా వ్యాఖ్యలను స్పీకర్‌ను తొలగించటంపై షాక్‌కు గురయ్యా.తన మాటాలను పునురుద్ధరించాలని స్పీకర్‌కు ఓం బిర్లాకు లేఖ రాసిన రాహుల్తన వ్యాఖ్యల రికార్డుల నుంచి తొలగించటం ప్రజాస్వామ్య పార్లమెంట్ సిద్ధాంతాలకు పూర్తిగా విరుద్ధమని రాహుల్ లేఖలో పేర్కొన్నారు.Lok Sabha LoP and Congress MP Rahul Gandhi writes to Speaker Om Birla over the remarks and portions from his speech expunged; requests that the remarks be restored. The letter reads, "...Shocked to note the manner in which considerable portion of my speech have been simply… pic.twitter.com/zoD8A0xvlc— ANI (@ANI) July 2, 2024 రాష్ట్రపతి ప్రసంగం ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా రాజ్యసభలో వైఎస్సాసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడారు.విశాఖ, చెన్నై కోస్టల్ కారిడార్‌పై రాజ్యసభలో ప్రస్తావించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలిఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ కాదు, అది ప్రజల హక్కుఏపీకి ప్రత్యేక హోదా తీసుకొచ్చే అవకాశం టీడీపీకి ఉందిరాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ కేంద్ర ప్రభుత్వంలో కూడా భాగస్వామ్యం పార్టీప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వాన్ని టీడీపీ అడగాలిఅన్యాయంగా విభజించడం వల్ల ఏపీ నష్టపోయిందిప్రత్యేక హోదా వల్ల నష్టాన్ని నివారించే అవకాశం ఉందివిభజన చట్టంలోని పెండింగ్ అంశాలను పూర్తి చేయాలిటీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు వారాల్లోనే వైఎస్సార్సీపీ శ్రేణులపై దారుణంగా దాడులు చేస్తుందిపోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలివైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపివేయాలివిశాఖ స్టీల్ ప్లాంట్ కు తగ్గిన గనులు కేటాయించి లాభాల్లోకి తీసుకురావాలిఏపీలో శాంతిని స్థాపించి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలిఏపీలో ఐదేళ్లలో 16 మెడికల్ కాలేజీలను మాజీ సీఎం వైఎస్ జగన్ స్థాపించారు.తక్కువ ఖర్చుతో డాక్టర్లను తయారు చేసే కార్యక్రమం మొదలుపెట్టారుఫ్యామిలీ డాక్టర్ పథకం ప్రవేశపెట్టి పేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడారురైతులకు గిట్టుబాటు ధరలు అమలు చేయండిగ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో రైతుల పంటలకు తగ్గిన భీమా సౌకర్యం కల్పించాలిరైల్వేలలో ప్రయాణికుల భద్రతకు నిధులను పెంచాలిరైలు ప్రమాదాలు పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో వాటి నివారించేందుకు చర్యలు తీసుకోవాలిభద్రత చర్యలను వెంటనే అప్‌గ్రెడ్ చేయాలిరైల్వే జోన్‌కు ఇప్పటికే ప్రభుత్వం భూములు కేటాయించిందినడికుడి శ్రీకాళహస్తి ప్రాజెక్టును పూర్తి చేయాలివైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌ను వెంటనే పూర్తి చేయాలిభోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని వేగంగా పూర్తి చేయాలివిశాఖపట్నం మెట్రో రైలును భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకు పొడిగించాలి. రాజ్యసభలో ప్రతిపక్ష నేత ఖర్గే వ్యవహరిస్తున్న తీరును ఛైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ తప్పుపట్టారు. ప్రతిసారి రాజ్యసభ ఛైర్మన్‌ను అగౌరవపరచలేరు. దేశ చరిత్రలో రాజ్యసభ కార్యకలాపాల్లో సభ ఛైర్మన్ పట్ల ఇంత నిర్లక్ష్యం ఎప్పుడూ జరగలేదు.తాను ఎప్పుడూ ప్రతిపక్ష సభ్యుల గౌరవాన్ని కాపాడటానికి ప్రయత్నం చేస్తాన్నారు. లోక్ సభలో రాష్ట్రపతి ప్రసంగం ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతోంది.గత ఎన్నికల ఇండియా కూటమి నైతిక విజయం సాధించింది: ఎంపీ అఖిలేష్ యాదవ్బీజేపీ 400 సీట్ల నినాదం విఫలమైంది.జూన్ 4 నుంచి మత రాజకీయాలకు విముక్తి లభించింది400 సీట్లు గెలుస్తామని ప్రచారం చేసుకున్నారు.వర్షాలు వస్తే ఉత్తరప్రదేశ్‌లో నగరాలు చెరువులయ్యాయి. 2024 ఎన్నికల్లో ప్రజాస్వామ్యం గెలిచింది.ఎన్డీయే నడిచే సర్కార్ కాదు.. పడిపోయే ప్రభుత్వం: ఎంపీ అఖిలేష్ యాదవ్ #WATCH | Speaking on the paper leaks issue in Lok Sabha, Samajwadi Party MP Akhilesh Yadav says," Why are paper leaks happening? The truth is that this is being done by the government so that it doesn’t have to give jobs to youth." pic.twitter.com/9EC1y8kUgi— ANI (@ANI) July 2, 2024 జులై 1వ తేదీన లోక్‌సభలో రాహుల్ స్పీచ్ నుంచి కొన్ని వ్యాఖ్యలను పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించినట్లు లోక్‌సభ సెక్రటేరియట్ వెల్లడించింది. హిందూమతాన్ని ఉద్దేశించి రాహుల్ చేసిన వ్యాఖ్యలతో పాటు, బీజేపీ, ఆర్ఎస్ఎస్, అగ్నివీర్, మోదీ, నీట్ పరీక్షల్లో అక్రమాలపై ప్రతిపక్ష నేత అన్న మాటలను తొలగిస్తున్నట్లు లోక్‌సభ సచివాలయం పేర్కొంది. స్పీకర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కూటమి ఎంపీలకు ప్రధాని మోదీ దిశా నిర్దేశం చేశారు.పార్లమెంట్లో ఎంపీలంతా నిబంధనలను పాటించాలి: మోదీలోక్సభ ఎంపీల ప్రవర్తన ఆదర్శవంతంగా ఉండాలి.లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలా వ్యవహరించవద్దుఎంపీలు అభివృద్దిపై దృష్టి పెట్టాలని మోదీ సూచించారు.సమావేశాలు జరగుతున్నప్పడు ఎక్కువ సమయం సభలోనే ఉండాలిప్రధాని నరేంద్ర మోదీ, ఎన్డీయే ఎంపీలు హాజరయ్యారు.#WATCH | PM Modi welcomed by NDA leaders at the NDA Parliamentary Party meeting in Delhi pic.twitter.com/dRZnJ7yHzv— ANI (@ANI) July 2, 2024 ప్రధాని మోదీ నేతృత్వలో జరిగినే ఎన్డీయే కూటమి పార్లమెంటరీ సమావేశంలో పాల్గొనడానికి పలువురు ఎంపీలు పార్లమెంట్‌కు చేరుకుంటున్నారు.Delhi | NDA leaders Giriraj Singh, Milind Deora, Kangana Ranaut and Jayant Chaudhary arrive for NDA parliamentary party meeting in Parliament premises pic.twitter.com/eWnafFv0yN— ANI (@ANI) July 2, 2024 ఢిల్లీ: పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగ ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చ సోమవారం ఉభయ సభల్లో వాడీవేడీగా సాగింది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. నీట్, అగ్నిపథ్ వంటి అంశాలపై మోదీ, బీజేపీ వ్యవహరిస్తున్న తీరును తూర్పారపట్టారు. హిందుత్వ, అగ్నిపథ్ పథకాలపై రాహుల్ చేసిన వ్యాఖ్యలపై అధికారపక్షం తీవ్ర అభ్యంతరం తెలిపారు. రాహుల్ గాంధీ క్షమాపణలు చేప్పాలని హోంశాఖ మంత్రి అమిత్ షా డిమాండ్ చేశారు. ఇవాళ జరిగే లోక్‌సభ సమావేశాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. రాష్ట్రపతి ప్రసంగ ధన్యవాద తీర్మానంపై సాయంత్రం మాట్లాడానున్నారు. సోమవారం లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాటల తూటాలు పేల్చడంతో ఇవాళ ధీటైన సమాధానం ఇచ్చేందుకు మోదీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.లోక్‌సభలో ప్రసంగానికి ముందు ఎన్డీయే కూటమి పార్లమెంట్ పార్టీ సమావేశంలో మోదీ పాల్గొనున్నారు. ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మీటింగ్‌లో ఎన్డీయే ఎంపీలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. అధికారంలోకి వచ్చాక.. ఎన్డీయే ఎంపీలను ఉద్దేశించిన మోదీ తొలిసారి ప్రసంగించనున్నారు. ఇవాళ కూడా లోక్‌సభలో వాడీవేడీగా ఎన్డీయే, ఇండియా కూటమి మధ్య మాటలు యుద్ధం జరగనున్నట్లు తెలుస్తోంది. అందుకే ఎన్డీయే ఎంపీలకు ప్రధాని మోదీ దిశా నిర్దేశం చేయనున్నారు. -
‘అయోధ్య ఎంపీకే లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ ఇవ్వండి!’
ఢిల్లీ: 18వ లోక్‌సభ స్పీకర్ పదవికి 48 ఏళ్ల తర్వాత ఎన్నిక జరగ్గా అధికార ఎన్డీయే కోటా ఎంపీ ఓం బిర్లా తిరిగి ఎన్నిక అయ్యారు. అయితే అధికార ఎన్డీయే ఏకగ్రీవానికి ప్రయత్నించినా.. ఆనవాయితీ ప్రకారం డిప్యూటీ స్పీకర్ పోస్ట్ ఇవ్వాలని ప్రతిపక్ష ఇండియా కూటమి పట్టుపట్టడంతో స్పీకర్ ఎన్నిక అనివార్యం అయింది. స్పీకర్ ఎన్నిక పూర్తికావడంతో ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ పదవి ఎవరిని వరిస్తుందో అనే చర్చ మొదలైంది.అయితే తాజాగా లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవిపై ఇండియా కూటమి భాగస్వామ్య పక్షం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ స్పందించింది. డిప్యూటీ స్పీకర్ పదవిని ఉత్తర ప్రదేశ్‌లోని ఫైజాబాద్ ఎస్పీ ఎంపీ అవధేష్ ప్రసాద్‌కు కేటాయించాలని టీఎంసీ కేంద్రాన్ని కోరుతోంది. ఆయోధ్య ఉన్న ఫైజాబాద్ సెగ్మెంట్లో సమాజ్‌వాదీ పార్టీ నుంచి పోటీ చేసిన అవధేష్ ప్రసాద్ గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు సంబంధించి ఎటువంటి షెడ్యూల్ విడుదలచేయలేదు. గతంలో 17వ లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ పదవిని ఎన్డీయేలోని ఏ మిత్రక్షానికి కూడా ఇవ్వకుండా బీజేపీ ఖాళీగా ఉంచిన ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవికి బలమైన నాయకున్ని ఇండియా కూటమి పోటీలోకి దింపాలనుకుంటున్న నేపథ్యంలో ఎంపీ అవధేష్ ప్రసాద్‌ను ఎన్నుకోవాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అవధేష్ ప్రసాద్ దళిత సమాజిక వర్గానికి చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ. ఫైజాబాద్‌లో బీజేపీ అభ్యర్థి లల్లూ సింగ్‌పై 50వేల మెజార్టీతో విజయం సాధించారు. బీజేపీ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రామమందిరం నేపథ్యంలో ఇక్కడ బీజేపీ అభ్యర్థే గెలుస్తారని అంతా భావించారు. అదే విధంగా జనరల్ స్థానమైన ఫైజాబాద్‌లో అవధేష్ ప్రసాద్ గెలిచి అందిరనీ ఆశ్చర్యపరిచారు.ఇక.. డిప్యూటీ స్పీకర్‌సైతం లోక్స్పీకర్కు ఉండే అన్ని అధికారాలు ఉంటాయి. స్పీకర్ అందుబాటులో లేని సమయంలో డిప్యూటీ స్పీకర్ లోక్‌సభ సమావేశాలను నడిస్తారు. డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు ఇవ్వాలని ఆనవాయితీగా ఉన్న విషయం తెలిసిందే. రెండు రోజులగ్యాప్ తర్వాత.. ఇవాళ పార్లమెంట్ సమావేశాలు తిరిగి ప్రారంభం కానుంది. -
Weekly Roundup : పార్లమెంట్ చిత్రం
18వ లోక్ సభ కొలువుదీరింది. పార్లమెంట్ తాత్కాలిక సమావేశాల్లో భాగంగా నూతనంగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార సమయంలో పలువురు ఎంపీలు చేసిన నినాదాలపై ఎన్డీయే కూటమి అభ్యంతరం వ్యక్తం చేసింది. 48 ఏళ్ల లోక్ సభ చరిత్రలో తొలి సారి స్పీకర్‌కు ఎన్నిక జరిగింది. స్పీకర్ ఓం బిర్లా ఎన్నిక, రాష్ట్రపతి ఎమర్జెన్సీపై వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి ప్రసంగ ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా నీట్ పరీక్ష పేపర్ లీక్‌పై చర్చ జరగాలని ప్రతి పక్షాలు పట్టుబట్టాయి. ప్రధాని మోదీ స్పందించాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ఉభయ సభలు హోరెత్తిరిపోవడంతో సోమవారానికి (జులై 1)కి వాయిదా పడ్డాయి. 18వ లోక్‌సభ సమావేశాల్లో భాగంగా మొదటి రోజు ప్రధాని మోదీతో సహా 262 మంది ఎంపీలు ప్రమాణం చేశారు.ఇంగ్లీష్, సంస్కృతం, హిందీ, డోగ్రీ, బెంగాలీ, అస్సామీ, ఒడియా, కన్నడ, తెలుగు, మరాఠీ ఇలా భారతీయ భాషలలో కొత్తగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయడం వల్ల లోక్‌సభ భాషా వైవిధ్యాన్ని ప్రదర్శించింది.మోదీ ప్రమాణం చేసేటప్పుడు ఎన్డీయే నేతలు జైశ్రీరామ్ నినాదాలు చేశారు. అప్పుడు విపక్ష నేతలంతా లేచి రాజ్యాంగ ప్రతిని చూపించారు.ఏపీ నుంచి కేంద్రమంత్రిగాఉన్న రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం ఎంపీగా తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్లమెంట్ కు పంచె కట్టులో వెళ్లారు.రైతు నేత వీపీఐ (ఎం) ఆమ్రా రామ్ ట్రాక్టర్లో పార్లమెంట్ కు వచ్చారు.తీహార్ జైలులో ఉన్న బారాముల్లా స్వతంత్ర ఎంపీ, నిందితుడు అబ్దుల్లా రషీద్ షేక్ బెయిల్ దొరక్కపోవడంతో ప్రమాణం చేయలేకపోయారు.పార్లమెంట్ సమావేశాల తొలి రోజు ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పార్లమెంట్ హౌజ్‌కు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు సైకిల్‌పై చేరుకున్నారు. లోక్‌సభలో తొలిసారి అడుగుపెట్టిన అప్పలనాయుడు, ఢిల్లీలో తన అతిథి గృహం నుంచి సైకిల్‌పై పార్లమెంట్‌కు చేరుకున్నారు.ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి ప్రమాణ స్వీకార సమయంలో నీట్ అంటూ ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు చేశారు. నీట్ ఫెయిల్డ్ మినిస్టర్ అని నినాదాలు చేశారు.రెండో రోజు ప్రమాణ స్వీకారాలు..రెండో రోజు 274 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు.రెండో రోజు ప్రమాణ స్వీకారంలో భాగంగా స్వతంత్ర సభ్యుడు రాజేష్ రంజన్ అలియాస్ పప్పూ యాదవ్ ' నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించాలి' అని రాసి ఉన్న టీ షర్ట్ ధరించి ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.తమిళనాడులోని కృష్ణగిరి లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచిన గోపీనాథ్ తెలుగులో ప్రమాణ స్వీకారం. తాజాగా జరిగిన ఎన్నికల్లో క్రిష్ణగిరి ఎంపీగా గోపీనాథ్ 1,92, 486 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఏఐఏడీఎంకే పార్టీకి చెందిన జయప్రకాష్ పై గెలుపొంది పార్లమెంటులో అడుగు పెట్టారు.రెండో రోజు సభాపతి స్థానంలో ఉన్న రాధామోహన్ సింగ్ ప్రమాణ స్వీకారం చేయించారు.హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఉర్ధూలో ప్రమాణం చేస్తూ.. జై భీం, జై తెలంగాణ, జై పాలస్తీనా, అల్లాహో అక్బర్ అంటూ ప్రమాణం పూర్తి చేశారు. ఇక అసదుద్దీన్ ఓవైసీ జై పాలస్తీనా నినాదం ఇవ్వడంపై పలువురు మంత్రులు, బీజేపి సభ్యులు అభ్యంతరం చెప్పారు. దీనిపై సభాపతి స్థానంలో ఉన్న రాధామోహన్ సింగ్ నిబంధనల ప్రకారం వ్యవహరిస్తానని, నిబంధనలు పరిశీలించి.. రికార్డుల నుంచి తొలగించే విషయాన్ని పరిశీలిస్తానని సభ్యులకు సూచించారు.ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నుంచి ఎంపీగా గెలిచిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాజ్యాంగ ప్రతిని పట్టుకుని ప్రమాణం చేసి.. 'జై హింద్, జై సంవిధాన్' అని నినదించారు. ఆయన తల్లి సోనియా గాంధీ, సోదరి ప్రియాంక గాంధీ వాద్రా సందర్శకుల గ్యాలరీ నుంచి ఈ కార్యక్రమాన్ని వీక్షించారు.ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీదాదాపు పదేళ్ల తర్వాత లోక్‌సభలో విపక్ష పార్టీ సభ్యుడికి ప్రతిపక్ష నేత హోదా దక్కింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆ బాధ్యతలు స్వీకరించారు. దీంతో కేబినెట్ మంత్రికి ఉండే సౌకర్యాలు పొందనున్నారు. లోక్‌సభలో విపక్ష కూటమికి నేతృత్వం వహించడమే కాకుండా.. ఈసీ, సీబీఐ, ఈడీ వంటి ప్రభుత్వ సంస్థలకు బాస్‌ల నియామకంలో కీలక భూమిక పోషించనున్నారు.2014, 2019లలో మొత్తం సీట్లలో 10 శాతం దక్కించుకోకపోవడంతో ప్రతిపక్ష నేత పాత్ర పోషించే అవకాశం ఎవరికీ రాలేదు. దీంతో రెండుసార్లు ప్రతిపక్ష సభ్యుడి హోదా ఖాళీగా ఉంటూ వచ్చింది. ఈసారి 99 సీట్లను గెలుచుకోవడంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌కు ఆ హోదా దక్కింది. మూడో రోజు సమావేశాల్లో మూజూవాణి ఓటు ద్వారా బుధవారం స్పీకర్‌గా ఓం బిర్లా రెండోసారి ఎన్నిక అయ్యారు.అధికార ఎన్డీయే కూటమి, ప్రతిపక్ష ఇండియా కూటమి మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో 48 ఏళ్ల లోక్ సభ చరిత్రలో తొలి సారి స్పీకర్ కు ఎన్నిక జరిగింది. మూజువాణి ఓటుతో ఎన్డీయే స్పీకర్ అభ్యర్థి కోట ఎంపీ మరోసారి స్పీకర్‌గా ఎన్నిక అయ్యారు.స్పీకర్ తొలి ప్రసంగంలో ఎమర్జెన్సీ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ప్రతిపక్ష ఇండియా కూటమి అభ్యంతం తెలపగా.. ఎన్డీయే ఎంపీలు అనుకూలంగా నినాదాలు చేశారు. రాష్ట్రపతి నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. 1975 నాటి ఎమర్జెన్సీ రోజుల్ని ప్రస్తావించారు.మోదీ, విపక్ష నేత రాహుల్ గాంధీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు 61 ఏళ్ళ ఓం బిర్లాను స్పీకర్ స్థానం వరకు తోడ్కొని వెళ్లి కూర్చోబెట్టారు.స్పీకర్ ఎన్నిక అయ్యక బిర్లాను పోడియం వరకు తీసుకువెళ్లే సందర్భంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. బిర్లాను అభినందించే క్రమంలో మోదీ, రాహుల్ కరచాలనం చేసుకున్నారు.స్పీకర్ ఎన్నిక సందర్భంగా రాహుల్ సరికొత్త వస్త్రధారణతో ఆకట్టుకున్నారు. తెలుపు రంగు లాల్చీ పైజామ ధరించి లోక్ సభకు వచ్చారు.స్పీకర్ బాధ్యతలు చెబడుతూనే ఓం బిర్లా తీసుకున్న తొలి నిర్ణయం లోక్ సభ కాక రేపింది.1975 నాటి ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధానాన్ని ఖండిస్తూ స్పీకర్ స్వయంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో ఎమర్జెన్సీ ప్రస్తావన నిరసిస్తూ ప్రతిపక్షాలు నినాదాలతో హోరెత్తించారు.రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం ఉభయ సభలను ఉదేశిస్తూ ప్రసంగించారు. ఎమర్జెన్సీ ఒక చీకటి అధ్యాయం. రాజ్యాంగంపై దాడి అని వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ప్రసంగంలో ఎమర్జెన్సీ అంశాన్ని చొప్పించడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది.రాష్ట్రపతి ప్రసంగం పూర్తిగా ప్రభుత్వ స్క్రిప్ట్. తప్పుల తడక అని విపక్షాలు విమర్శలు గుప్పించాయి. చివరికి రాష్ట్రపతి ప్రసంగంలో కూడా ఎమర్జెన్సీ ప్రస్తావన తీసుకురావడం సిగ్గుచేటు. నిజానికి మోదీ పదేళ్ల పాలనలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని విపక్షాలు దుయ్యబట్టాయి. ప్రధాని మోదీ మంత్రి వర్గ సభ్యులను ఎగువ సభకు పరిచయం చేశారు.పార్లమెంట్ లో నీట్ రగడ..శుక్రవారం నీట్ పరీక్ష లో అక్రమాలపై వెంటనే చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. లోక్ సభ స్పీకర్ , రాజ్య సభలో చైర్మన్ అంగీకరించలేదు. దీంతో ఉభయ సభలు పలుమార్లు వాయిదా పడ్డాయి.నీట్ పరీక్షపై చర్చ చేపట్టకుండా ప్రభుత్వం ఎందుకు వెనకంజ వేస్తోందని రాజ్య సభలో విపక్షాలు నిలదీశాయి. నీట్‌పై చర్చించాలని 22 నోటీసులు వచ్చాయని, వాటిని తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో విపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెల్‌లోకి దూసుకువెళ్లారు. బిగ్గరగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. రాజ్య సభ మూడు సార్లు వాయిదా పడింది.ప్రతి పక్ష నేత మల్లికార్జున ఖర్గే సైతం వెల్‌లోకి దూసుకురావటంపై రాజ్య సభ చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు చేశారు. అనంతరం నీట్ రగడ నడుమ ఉభయ సభలు సోమవారానికి (జులై 1) వాయిదా పడ్డాయి. -
18వ లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా
న్యూఢిల్లీ, సాక్షి: లోక్‌సభ స్పీకర్ ఎవరనేదానిపై ఉత్కంఠకు తెరపడింది. బుధవారం ఉదయం జరిగిన ఎన్నికలో.. 18వ లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. ఎన్డీయే అభ్యర్థి ఓం బిర్లా పేరును ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించగా.. వరుసగా మంత్రులు ఆ ప్రతిపాదనను బలపరిచారు. అటు ఇండియా కూటమి తరపున కె.సురేశ్ పేరును శివసేన (యూబీటీ) ఎంపీ అరవింద్ సావంత్ తీర్మానం తీసుకొచ్చారు. దీన్ని పలువురు విపక్ష ఎంపీలు బలపర్చారు. అనంతరం మూజువాణీ విధానంలో ఓటింగ్ చేపట్టా.. ఇందులో ఓం బిర్లా విజేతగా నిలిచినట్లు ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రకటించారు.విపక్ష కూటమి ఓటింగ్‌కు పట్టుబట్టకపోవడంతో.. ఓం బిర్లా ఎన్నిక సుగమమైంది. ఓం బిర్లా ఎన్నికపై ప్రధాని మోదీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పరస్పర కరచలనం ద్వారా అభినందనలు తెలియజేశారు. ఈ ఇద్దరితో పాటు పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు దగ్గరుండి ఓం బిర్లాను స్పీకర్ చెయిర్లో కూర్చోబెట్టారు. #WATCH | BJP MP Om Birla occupies the Chair of Lok Sabha Speaker after being elected as the Speaker of the 18th Lok Sabha.Prime Minister Narendra Modi, LoP Rahul Gandhi and Parliamentary Affairs Minister Kiren Rijiju accompany him to the Chair. pic.twitter.com/zVU0G4yl0d— ANI (@ANI) June 26, 2024ప్రధాని మోదీ మాట్లాడుతూ.. సభను నడిపించడంలో స్పీకర్ పాత్ర ఎంతో కీలకం. కొత్తగా ఎన్నికైన ఎంపీలకు స్పీకర్ స్ఫూర్తిగా నిలుస్తారు. గత ఐదేళ్లుగా విజయవంతంగా సభను నడిపించారు. ఓం బిర్లా చరిత్ర సృష్టించారు. 17వ లోక్‌సభను నిర్వహించడంలో ఆయన పాత్ర అమోఘం. ఆయన నేతృత్వంలోనే కొత్త పార్లమెంట్ భవనంలోకి అడుగుపెట్టాం. జీ-20 సమ్మిట్ ఆయన సలహాలు, సూచనలు అవసరం. మరో ఐదేళ్లు కూడా సభను విజయవంతంగా నడిపిస్తారని ఆశిస్తున్నా. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. సభలో విపక్షాల సభ్యులు చర్చించేందుకు అవకాశం ఇవ్వలి. మా గొంతు నొక్కితే సభ సజావుగా నిర్వహించినట్లు కాదు. ప్రజల గొంతుక ఎంత సమర్థవంతంగా వినిపించామన్నదే ముఖ్యం. ఓం బిర్లాకు వైఎస్సార్సీపీ అభినందనలులోక్ సభ స్పీకర్‌గా ఎన్నికైన ఓం బిర్లాకు వైఎస్ఆర్సీపీ అభినందనలు తెలిపింది. లోక్‌సభ పక్ష నేత మిథున్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘గడిచిన లోక్‌సభను ఓం బిర్లా ఎంతో హుందాగా నడిపారు. ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టారు. కొత్తగా ఎన్నికైన సభ్యులకు మాట్లాడే అవకాశం ఇచ్చారు.అదే తరహాలో ఈసారి కూడా విజయవంతంగా సభను నడపాలి’’ అని ఆకాంక్షించారు. ఇక.. రెండోసారి స్పీకర్‌గా ఎన్నికైన ఓం బిర్లాకు వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అభినందనలు తెలిపారు. విజయవంతంగా స్పీకర్ పదవి నిర్వహించాలని కోరారాయన. స్పీకర్‌గా ఓం బిర్లా ట్రాక్ రికార్డు.. లోక్‌సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరగడం 48ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. బుధవారం జరిగిన ఎన్నిక ప్రక్రియలో ఇండియా కూటమి అభ్యర్థి సురేష్‌పై ఓం బిర్లా విజయం సాధించారు. ఓం బిర్లా(61) రాజస్థాన్‌లోని కోటా నుంచి మూడోసార్లు ఎంపీగా గెలిచారు. 2014లో ఎన్నికైన ఆయన లోక్‌సభలో 86శాతం హాజరును నమోదు చేసుకున్నారు. 671 ప్రశ్నలడిగారు. 2019లో గెలిచాక అనూహ్యంగా స్పీకర్ పదవి చేపట్టారు. ఇప్పుడు.. తొలి నుంచి జరుగుతున్న ప్రచారం నడుమే రెండోసారి స్పీకర్ పదవి చేపట్టబోతున్నారు. లోక్‌సభ స్పీకర్ పదవిని వరుసగా రెండుసార్లు చేపట్టిన ఐదో వ్యక్తి ఓం బిర్లా. ఆయనకంటే ముందు ఎం.ఎ.అయ్యంగార్, జి.ఎస్.ధిల్లాన్, బలరాం ఝాఖడ్, జి.ఎం.సి.బాలయోగి వరసగా రెండు విడతలు ఈ పదవికి ఎన్నికయ్యారు. వీరిలో బలరాం ఝాఖడ్ ఒక్కరే పదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేశారు. -
స్పీకర్ ఎన్నిక: ఓటింగ్‌కు ఆ ఏడుగురు దూరం!.. ప్రభావమెంత?
ఢిల్లీ: అధికార ఎన్డీయే, ప్రతిపక్ష ఇండియా కూటమిలో ఏకాభిప్రాయం కుదరకపోవటంతో 18వ పార్లమెంట్‌లోని లోక్‌సభ స్పీకర్ ఎన్నిక అనివార్యం అయింది. ఇవాళ లోక్‌సభ సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఇప్పటికే అన్ని పార్టీలు తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి. అయితే రెండురోజులు పాటు పార్లమెంట్లో ఎంపీల ప్రమాణ స్వీకారం జరగ్గా.. మరో ఏడుగురు సభ్యులు ఎంపీలుగా ప్రమాణం చేయలేదు. ఇది ఇవాళ్టి ఓటింగ్‌పై ప్రభావం చూపబోతుందా? అనే చర్చ నడుస్తోంది. ఎంపీలుగా ప్రమాణం చేయని వాళ్లలో ఇండియా కూటమికి చెందినవారే ఐదుగురు ఉండగా, మిగతా ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు. శశిథరూర్, శతృఘ్న సిన్హాలాంటి ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు. ఎంపీలుగా ప్రమాణం చేయలేదు కాబట్టి ఇవాళ స్పీకర్ ఎన్నికలో ఈ ఏడుగురు ఓటింగ్‌కు దూరంగా ఉండాల్సిన పరిస్థితి. అయితే.. ఓటింగ్‌పై ఇది ప్రభావం చూపెట్టే అవకాశాలు తక్కువేనని విశ్లేషకులు చెబుతున్నారు. సభకు హాజరయ్యే సభ్యుల ఆధారంగనే ఓటింగ్ మెజార్టీని లెక్కగడతారని వారంటున్నారు. అదే సమయంలో.. ఎన్డీయే కూటమి 293 సీట్లతో మెజార్టీలో ఉంది. స్పీకర్ ఎన్నికకు మ్యాజిక్ ఫిగర్ 269గా ఉంది. మరోవైపు బీజేపీ విజ్ఞప్తి మేరకు వైఎస్సార్సీపీ సానుకూలంగానే స్పందించింది. ఇక.. ఇండియా కూటమిలో మొత్తం 232గాను 227 మంది ఎంపీలు ప్రమాణం చేశారు. అంటే ఇండియా కూటమికి మెజార్టీ లేదనే చెప్పాలి. దీంతో స్పీకర్ ఎన్నిక ఎన్డీయే వైపు ఉండే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. ఇక.. స్పీకర్ ఎన్నిక కోసం మెజార్టీ ఎంపీలు ఉన్నప్పటికీ బీజేపీ స్పీకర్ ఎన్నికలో 300 ఎంపీల ఓట్ల కోసం టార్గెట్ పెట్టుకుంది. అందులో భాగంగానే ఎన్డీయే కూటమిలో లేని పార్టీలను సైతం బీజేపీ మద్దతు కోరింది. స్పీకర్ ఎన్నికకు ఎన్డీయే కూటమి మాజీ స్పీకర్ కోటా ఎంపీ ఓం బిర్లాను, ఇడియా కూటమి కేరళ ఎంపీ కే. సురేష్‌ను బరిలోకి దింపాయి. ఇవాళ 11 గంటలకు స్పీకర్ ఓటింగ్ జరగనుంది. -
Lok Sabha Speaker Election: 1946 తర్వాత మళ్లీ ఇప్పుడే..
న్యూఢిల్లీ, సాక్షి: దేశ చరిత్రలోనే తొలిసారి లోక్‌సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరగబోతోంది. స్పీకర్ పదవి విషయంలో అధికార-ప్రతిపక్ష కూటమికి మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం.. ఇరు పక్షాల నుంచి అభ్యర్థులు నిలపడంతో ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో 78 ఏళ్ల తర్వాత.. అదీ స్వాతంత్ర దేశంలో తొలిసారి ఈ ఎన్నిక జరగబోతోంది.దేశంలో.. 1925 ఆగస్టు 24న సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించారు. ఆ ఎన్నికల్లో స్వరాజ్య పార్టీ అభ్యర్థి విఠల్‌భాయ్ జె పటేల్ స్పీకర్‌గా నెగ్గారు. టి.రంగాచారియార్‌పై కేవలం రెండు ఓట్ల (58-56) తేడాతో ఆయన విజయం సాధించారు. 1925 - 1946 మధ్య ఆరుసార్లు స్పీకర్ పదవికి ఎన్నికలు జరిగాయి. అయితే.. 1946లో కాంగ్రెస్ నేత జి.వి.మౌలాంకర్ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. తర్వాత సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ.. పార్లమెంటు(పాత పార్లమెంట్)గా మారింది. ఆ తర్వాత తాత్కాలిక పార్లమెంటుకు కూడా మౌలాంకర్ స్పీకర్‌గా కొనసాగారు.1952లో తొలి సార్వత్రిక ఎన్నికల తర్వాత లోక్‌సభ, రాజ్యసభలు ఏర్పాటయ్యాయి. 1956లో మాలంకర్ మరణంతో డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న అయ్యంగార్.. స్పీకర్ అయ్యారు. ఆ తర్వాత 1957లో రెండో సాధారణ ఎన్నికల తర్వాత కూడా స్పీకర్‌గా అయ్యంగార్ నియమితులయ్యారు. అలా.. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్‌సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. ఎం.ఎ.అయ్యంగార్, జి.ఎస్.ధిల్లాన్, బలరాం జాఖడ్, జి.ఎం.సి.బాలయోగి వరసగా రెండు విడతలు ఈ పదవికి ఎన్నికయ్యారు. లోక్‌సభ స్పీకర్ అధికార పక్షం తీసుకుంటే.. డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షం తీసుకోవడం ఆనవాయితీగా వచ్చింది. యూపీఏ హయాంలో కూడా విపక్షాలకు డిప్యూటీ ఇచ్చారు. అయితే.. 2014లో ఆ ఆనవాయితీని ఎన్డీయే కూటమి బ్రేక్ చేసింది. తన మిత్రపక్షానికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చుకుంది. ఇక 2019 ఎన్నికల్లో బీజేపీ సంపూర్ణ మెజారిటీతో నెగ్గడంతో మిత్రపక్షానికి కూడా ఇవ్వకుండా ఆ పోస్టును ఖాళీగా ఉంచింది. అయితే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలతో లోక్‌సభలో తమ బలాన్ని పెంచుకున్న ప్రతిపక్షాలు ఈసారి డిప్యూటీ సీఎం పదవికి పట్టుబట్టాయి. -
దేశ చరిత్రలోనే తొలిసారి లోక్‌సభ స్పీకర్ పదవికి ఎన్నిక!
ఢిల్లీ, సాక్షి: లోక్‌సభ స్పీకర్ ఎన్నికలో ట్విస్ట్ చోటుచేసుకుంది. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఆ పోస్టుకు ఎన్నిక జరగబోతోంది. ఇన్నేళ్లలో ఏకగ్రీవంగానే లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరుగుతూ వచ్చింది. అయితే 18వ లోక్‌సభ స్పీకర్ పదవి కోసం అధికార-ప్రతిపక్షాల మధ్య ఏకాభిప్రాయం కోసం జరిగిన చర్చలు విఫలం అయ్యాయి. దీంతో.. ఇటు ఎన్డీయే కూటమి, అటు ఇండియా కూటమి అభ్యర్థుల్ని బరిలో నిలిపాయి. ఎన్డీయే కూటమి తరఫున ఓం బిర్లా, ఇండియా కూటమి తరపున సీనియర్ ఎంపీ కే.సురేష్ నామినేషన్ వేశారు. లోక్‌సభలో ఎన్డీయే కూటమికి 294 మంది ఎంపీల బలం ఉంది. అయినప్పటికీ తొలిసారి జరుగుతుండడంతో ఈ ఎన్నికపై ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే.. మరోసారి లోక్‌సభ స్పీకర్ అభ్యర్థిగా ఓం బిర్లానే ఎన్డీయే కూటమి ఎంచుకుంది. స్పీకర్ పోస్టుకు ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అంతకు ముందు.. ఓం బిర్లాను లోక్‌సభ స్పీకర్‌గా కొనసాగిస్తారని ప్రచారం నడిచిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో ఇవాళ ఉదయం ఓం బిర్లా.. ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. అదే సమయంలో.. ఓం బిర్లా ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు ఎన్డీయే తీవ్రంగా యత్నించింది. బీజేపీ అగ్రనేత రాజ్‌నాథ్ సింగ్.. ఇండియా కూటమి నేతలతో చర్చలు జరిపారు. అయితే ఆనవాయితీగా వస్తున్న డిప్యూటీ స్పీకర్ పోస్టును ప్రతిపక్షాలకు వదిలేయాలని కాంగ్రెస్ చీఫ్ ఖర్గేతో పాటు ఇండియా కూటమి నేతలంతా ప్రతిపాదించారు. దీంతో.. మరోసారి ఫోన్ చేసి పిలుస్తామంటూ రాజ్‌నాథ్‌సింగ్ వాళ్లకు చెప్పారు. అయితే డిప్యూటీ స్పీకర్ విషయంలో అధికార కూటమి తటపటాయించింది. ఈ క్రమంలో మరోసారి ఎన్డీయే నుంచి పిలుపు రాకపోవడంతో.. అభ్యర్థినే నిలపాలని ఇండియా కూటమి నిర్ణయించింది. దీంతో దేశచరిత్రలోనే.. రేపు(జూన్ 26, 2024) తొలిసారి లోక్‌సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరగబోతోంది. No consensus on Speaker's post. INDIA bloc is likely to field its candidate for the post of Speaker of the 18th Lok Sabha: Sources pic.twitter.com/seZyieAIhS— ANI (@ANI) June 25, 2024 ఇంతకు ముందు ప్రొటెం స్పీకర్ విషయంలోనూ కే.సురేష్ పేరు తెర మీదకు వచ్చిన సంగతి తెలిసిందే. కేరళ కాంగ్రెస్ సీనియర్ నేత అయిన సురేష్.. ఎనిమిదిసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు.నిన్న 280 మంది ఎంపీలు లోక్‌సభలో ప్రమాణం చేయగా.. ఇవాళ మిగతా వాళ్లు చేస్తున్నారు. ఇక రేపు(జూన్ 26) స్పీకర్ ఎన్నిక జరగనుంది. ప్రొటెం స్పీకర్ భర్తృహరి మెహతాబ్ సమక్షంలో ఎంపీలు స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు. -
Parliament Session: లోక్‌సభ ఎంపీల ప్రమాణ స్వీకారం
పార్లమెంట్ సమావేశాలు.. అప్డేట్స్ ఏపీ నుంచి వైఎస్సార్సీపీ నాయకురాలు గుమ్మా తనుజా రాణి హిందీలో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.మీ అందరి ఆశీస్సులతో.. జగనన్న దీవెనలతో ఈరోజు పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది.. pic.twitter.com/DqRcsYMdc5— Dr Gumma Thanuja Rani (@ArakuPalguna) June 24, 2024 పార్లమెంట్ భవనం మెట్లు దిగుతూ కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్.. అక్కడే ఉన్న కాంగ్రెస్ ఎంపీలు కేసీ వేణుగోపాల్, కె.సురేష్‌ను ఆప్యాయంగా పలికరించారు.#WATCH | Delhi: Congress MPs KC Venugopal and K Suresh, and Union Minister-BJP MP Giriraj Singh share a candid moment on the staircase of the new Parliament building. pic.twitter.com/po1LQqqJLg— ANI (@ANI) June 24, 2024 తెలుగులో బండి సంజయ్ ప్రమాణంతెలంగాణ నుంచి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తెలుగులో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.Union Ministers Bandi Sanjay Kumar and Sukanta Majumdar take oath as members of the 18th Lok Sabha. pic.twitter.com/re8wf295RF— ANI (@ANI) June 24, 2024 కేంద్ర మంత్రులు జి. కిషన్‌రెడ్డి, చిరాగ్ పాశ్వాన్ ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశారు.Union Ministers G Kishan Reddy and Chirag Paswan take oath as members of the 18th Lok Sabha. pic.twitter.com/aUiSfimQyU— ANI (@ANI) June 24, 2024 కేంద్ర మంత్రులు భూపేందర్ యాదవ్, గజేంద్ర షెకావత్ ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశారు.Union Ministers Bhupender Yadav and Gajendra Singh Shekhawat take oath as members of the 18th Lok Sabha. pic.twitter.com/BAXUduVIVt— ANI (@ANI) June 24, 2024 కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.#WATCH | Union Minister and BJP MP Dharmendra Pradhan takes oath as a member of the 18th Lok Sabha. pic.twitter.com/9rcS4OSwkj— ANI (@ANI) June 24, 2024 ఏపీ నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.Union Minister Ram Mohan Naidu Kinjarapu takes oath as a member of the 18th Lok Sabha. pic.twitter.com/d3E1DC8Yjw— ANI (@ANI) June 24, 2024 లోక్‌సభలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.Union Minister and BJP MP Piyush Goyal takes oath as a member of the 18th Lok Sabha. pic.twitter.com/Ls4hhIIDbb— ANI (@ANI) June 24, 2024 కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.Union Minister Shivraj Singh Chouhan takes oath as a member of the 18th Lok Sabha. pic.twitter.com/nZpQ0GGxmz— ANI (@ANI) June 24, 2024 కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ 18 లోక్‌సభ పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.Union Minister Nitin Gadkari takes oath as a member of the 18th Lok Sabha. pic.twitter.com/XMLofSCdX8— ANI (@ANI) June 24, 2024 అమిత్ షా ఎంపీగా ప్రమాణంహోంమంత్రి అమిత్ షా ఎంపీగా లోక్‌సభలో ప్రమాణ స్వీకారం చేశారు.#WATCH | Union Home Minister Amit Shah takes oath as a member of the 18th Lok Sabha. pic.twitter.com/3rlhhGKLbJ— ANI (@ANI) June 24, 2024 రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.#WATCH | Defence Minister Rajnath Singh takes oath as a member of the 18th Lok Sabha. pic.twitter.com/GDJFlyqkth— ANI (@ANI) June 24, 2024 ఎంపీగా మోదీ ప్రమాణంమొదటగా నరేంద్ర మోదీ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి మహతాబ్ ఎంపీ ప్రమాణం చేయించారు.#WATCH | Prime Minister Narendra Modi takes oath as a member of the 18th Lok Sabha. pic.twitter.com/3tjFrbOCJ0— ANI (@ANI) June 24, 2024 రాహుల్ గాంధీ వయనాడ్ స్థానం రాజీనామాను ప్రోటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ఆమోదించారు.Pro-tem Speaker Bhartruhari Mahtab accepts the resignation of Congress leader Rahul Gandhi from Wayanad Lok Sabha seat.Rahul Gandhi kept the Raebareli Lok Sabha seat. pic.twitter.com/rFoya8nCJb— ANI (@ANI) June 24, 2024 పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం.. ప్రారంభమైన 18వ లోక్సభప్రమాణం చేయనున్న ఎంపీలులోక్సభ ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి మహతాబ్మొదట ఎంపీగా ప్రమాణం చేయనున్న ప్రధాని నరేంద్ర మోదీపార్లమెంట్ ప్రాంగణంలో మీడియాతో ప్రధాని మోదీఇది చాలా పవిత్రమైన రోజుఎంపీలందరికీ స్వాగతం పలుకుతున్నాఎంపీలు ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చాలిమాకు మూడోసారి వరుసగా సేవ చేసేందుకు అవకాశం ఇచ్చారు10 ఏళ్లలో దేశాభివృద్ధికి కృషి చేశామూడోసారి ప్రధానిగా ప్రజలకు సేవ చేసే అవకాశం నాకు దక్కిందికొత్త లక్ష్యాలు చేరుకోవడానికి మనమంతా కృషి చేయాలివికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలి#WATCH | PM Narendra Modi says, "...The 18th Lok Sabha is starting today. The world's largest election was conducted in a very grand and glorious manner... This election has also become very important because for the second time after independence, the people of the country have… pic.twitter.com/bASHVtfh3S— ANI (@ANI) June 24, 2024 ఆ ఖర్మ నాకు పట్టలేదు: వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డివైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు, రాజంపేట ప్రజల మద్దతుతో మూడోసారి ఎంపీ ఎన్నికయ్యాహ్యాట్రిక్ విజయాలతో పార్లమెంట్లు అడుగుపెట్టడం సంతోషంగా ఉందిమా పార్టీ అధినేత వైయస్ జగన్‌కు ధన్యవాదాలురాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పార్లమెంట్లో పని చేస్తాజాతీయ, రాష్ట్ర ప్రయోజనాల ఉండే బిల్లులకు మద్దతిస్తాంరాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంటే వ్యతిరేకిస్తాం బీజేపీలో చేరాల్సిన కర్మ నాకు పట్టలేదుకూటమినేతలు మైండ్ గేమ్ ఆడుతున్నారుగతంలో నేను విపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే బీజేపీలో చేరుతారని ప్రచారం చేశారువైయస్ జగన్మోహన్ రెడ్డి నన్ను సొంత తమ్ముడిలా భావిస్తారువైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం సాధించే వరకు కష్టపడతారాజంపేటలో అత్యధిక రోడ్లు వేయించిన ఘనత మాదేసాక్షి టీవీతో ఎంపీ మిథున్ రెడ్డి మరికాసేపట్లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంఎంపీలుగా ప్రమాణం చేయనున్న సభ్యులుప్రధాని మోదీ సహా 280 మంది ప్రమాణంమోదీ తర్వాత కేంద్ర మంత్రులుఆ తర్వాత ఇంగ్లీష్ అక్షర క్రమంలో ఒక్కొక్కరుగా సభ్యుల ప్రమాణంనేడు ఏపీ, రేపు తెలంగాణ ఎంపీల ప్రమాణంప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి మెహతాబ్ ప్రమాణంలోక్సభ ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేసిన భర్తృహరి మెహతాబ్భర్తృహరితో ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము#WATCH | Delhi: BJP MP Bhartruhari Mahtab takes oath as pro-tem Speaker of the 18th Lok SabhaPresident Droupadi Murmu administers the oath pic.twitter.com/VGoL5PGEkT— ANI (@ANI) June 24, 2024ఎన్డీయే అలా ముందుకు..పార్లమెంట్ సమావేశాలు సజావుగా నిర్వహించాలని భావిస్తున్న ఎన్డీయేసభా కార్యకలాపాలకు సహకరించాలని ప్రతిపక్షాలను కోరే అవకాశంస్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకు సహకరించాలని కోరనున్న బీజేపీ అగ్రనేతఅమిత్ షా లేదంటే రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యే ఛాన్స్ ఐక్యంగా ఇండియా కూటమిపార్లమెంట్ సమావేశాల తొలిరోజే ఐక్యత చాటాలని ఇండియా కూటమి నిర్ణయంగతంలో గాంధీ విగ్రహం ఉన్న గేట్-2 వద్ద భేటీఐక్యంగా పార్లమెంట్‌లోకి ఎంట్రీప్రొటెం స్పీకర్ ఎంపిక నిర్ణయంపై నిరసన తెలిపే అవకాశంనీట్పైనా కేంద్ర ప్రభుత్వాన్నినిలదీసే ఛాన్స్సంబంధిత వార్త: ప్రొటెం స్పీకర్‌కు ఇండియా కూటమి సహాయ నిరాకరణ?! కాసేపట్లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి మెహతాబ్ ప్రమాణం18వ లోక్‌సభ తొలి సమావేశంనేడు, రేపు ఎంపీలుగా సభ్యుల ప్రమాణ స్వీకారంసభ్యులతో ప్రమాణం చేయించనున్న ప్రొటెం స్పీకర్ఎల్లుండి స్పీకర్ ఎన్నికడిప్యూటీ స్పీకర్ పోస్టు ఉంటుందా? ఉండదా?.. ఉంటే ఎవరికి వెళ్తుంది? అనే దానిపై చర్చ27న ఉభయ సభల సభ్యుల్ని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం -
ప్రొటెం స్పీకర్‌కు ఇండియా కూటమి సహాయ నిరాకరణ?!
పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా.. పద్దెనిమిదవ లోక్‌సభ ఇవాళ తొలిసారి భేటీ కానుంది. కొత్తగా ఎన్నికైన సభ్యులు ఎంపీలుగా ప్రమాణం చేయడం, స్పీకర్ ఎన్నిక, రాష్ట్రపతి ప్రసంగం.. నేపథ్యాలతో నాలుగు రోజులపాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. అయితే.. ఈ సమావేశాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి సహాయ నిరాకరణ చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. పార్లమెంట్లో ఇవాళ, రేపు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ప్రొటెం స్పీకర్ ప్యానెల్లో ఇండియా కూటమి ఎంపీలు కూడా సభ్యులుగా ఉన్నారు. ప్రొటెం స్పీకర్‌గా ఒడిశాకు చెందిన సీనియర్ ఎంపీ భర్తృహరి మహతాబ్‌ను నియమించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. సీనియర్ ఎంపీలు కే సురేష్(కాంగ్రెస్), టీఆర్ బాలు(డీఎంకే), బీజేపీ ఎంపీలు రాధా మోహన్ సింగ్.. ఫగ్గాన్ సింగ్ కులాస్తే, సుదీప్ బంధోపాధ్యాయ(టీఎంసీ)లను ప్రొటెం స్పీకర్ సహాయ ప్యానెల్లో సభ్యులుగా నియమించారు.అయితే ప్రొటెం స్పీకర్‌గా ఒడిశాకు చెందిన సీనియర్ ఎంపీ భర్తృహరి మహతాబ్ నియామకాన్ని ఇండియా కూటమి తొలి నుంచి వ్యతిరేకిస్తోంది. సభలో సీనియర్ ఎంపీలు ఉన్నప్పటికీ.. ఉద్దేశపూర్వకంగానే భర్తృహరిని ఎంపిక చేశారంటూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రొటెం స్పీకర్ ప్యానెల్‌లోని బీజేపీ ఎంపీలిద్దరు తప్ప మిగతా ముగ్గురు.. భర్తృహరికి సహకరించొద్దని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక.. పార్లమెంట్‌సమావేశాలు ఈ ఉదయం 11గం. ప్రారంభం కానున్నాయి. అరగంట ముందుగానే పార్లమెంట్ కాంప్లెక్స్ గేట్ నంబర్ 2 వద్ద ఇండియా కూటమి ఎంపీలు చేరుకుంటారు. తమ ఐక్యతను ప్రదర్శిస్తూ ఒకేసారి పార్లమెంట్‌లోకి ప్రవేశించబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఈ గేట్ వద్దే ఎంపీలు నిరసన తెలిపే గాంధీ విగ్రహం ఉండేది. ఆ తర్వాత గాంధీ విగ్రహంతో పాటు మిగతా వాటిని ‘ప్రేరణ స్థల్’ కి ఏర్పాటు చేశారు. లోక్‌సభ సమావేశాల్లో.. తొలుత భర్తృహరి మెహతాబ్‌తో ప్రోటెం స్పీకర్ గా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయిస్తారు. ఆ తర్వాత ఎంపీలంతా పార్లమెంట్ భవనానికి చేరుకుంటారు. 18వ లోక్‌సభ ప్రారంభానికి ముందు.. కాసేపు ఎంపీలంతా మౌనం పాటించి కుర్చీల్లో కూర్చుంటారు.ముందుగా ఆనవాయితీ ప్రకారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎంపీగా ప్రమాణం చేస్తారు. ఆ తర్వాత వరుసగా కేంద్ర మంత్రులు సహా మొత్తం 280 మంది ఎంపీలు ఇవాళ ప్రమాణం చేస్తారు. రేపు మిగతా ఎంపీలు ప్రమాణం చేస్తారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి.. ఇవాళ ఏపీ, రేపు తెలంగాణ ఎంపీలు ప్రమాణం చేస్తారు. ఇక.. స్పీకర్ ఎన్నిక 26వ తేదీన ఉండనుంది. ఇక 27వ తేదీన రాష్ట్రపతి ముర్ము లోక్‌సభ-రాజ్యసభ సభల సభ్యుల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు.ఇదిలా ఉంటే.. ఏకాభిప్రాయంతో స్పీకర్ ఎన్నికకు ప్రయత్నాలు సాగిస్తోంది ఎన్డీయే కూటమి. ఈ క్రమంలోనే ఓం బిర్లా కే మళ్లీ స్పీకర్ పదవి ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం నడుస్తోంది. ఇక డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని విపక్ష కూటమి కోరే అవకాశాలున్నాయి. సంప్రదాయంగా ప్రతిపక్షానికి, లేదంటే మిత్రపక్షాలకు డిప్యూటి స్పీకర్ పదవి కట్టబెట్టే అవకాశం లేకపోలేదు.డిప్యూటీ స్పీకర్ విషయంలో.. 2014లో అన్నా డీఎంకేకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చింది ఎన్డీయే కూటమి16 వ లోకసభ లో (2014లో) ఏఐఏడిఎంకే కి చెందిన తంబిదొరై డిప్యూటీ స్పీకర్‌గా నియమితులయ్యారుఅయితే 17 వ లోకసభ లో (2019 లో ) మాత్రం ఆ పోస్ట్ ఖాళీగానే ఉంది -
నేటి నుంచి పార్లమెంట్
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. 18వ లోక్‌సభకు ఎన్నికైన సభ్యులు సోమవారం, మంగళవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రొటెం స్పీకర్ భర్తృహరి వారితో మెహతాబ్ ప్రమాణం చేయిస్తారు. తొలుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరితో ప్రమాణస్వీకారం చేయిస్తారు. అనంతరం తొలుత ప్రధాని నరేంద్ర మోదీ, ఆ తర్వాత సీనియారిటీ ఆధారంగా మంత్రులు, ఎంపీలు ప్రమాణం చేస్తారు. ఆంగ్ల వర్ణక్రమంలో రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల సభ్యులు ప్రమాణస్వీకారం చేస్తారు. బుధవారం లోక్‌సభ సభ్యులందరూ కలిసి నూతన స్పీకర్‌ను ఎన్నుకుంటారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ అనంతరం వచ్చే నెల 3వ తేదీన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ముగియనున్నాయి. వర్షాకాల సమావేశాలు జూలై 22వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. స్పీకర్‌గా మళ్లీ ఓం బిర్లా! ప్రొటెం స్పీకర్ ప్యానెల్లో ఉండడానికి విపక్ష నేతలు విముఖత చూపడంతో స్పీకర్ ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈసారి స్పీకర్ పదవిని ఎన్డీయేలో బీజేపీయేతర పక్షాలకు కేటాయిస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. మరోవైపు మిత్రపక్షాలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో బీజేపీ నాయకత్వం స్పీకర్ పదవిని ఇతరులకు ఇచ్చే అవకాశం తక్కువేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. స్పీకర్ పదవిని మహిళలకు కేటాయించే పక్షంలో గుజరాత్‌కు చెందిన పూనంబెన్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దగ్గుబాటి పురందేశ్వరి పేర్లు వినిపిస్తున్నాయి. గత లోక్‌సభను తనదైన రీతిలో ముందుకు నడిపించిన ఓం బిర్లా పేరు కూడా తెరపైకి వచి్చంది. గత లోక్‌సభలో విపక్ష సభ్యులు తక్కువైనప్పటికీ వారు వినిపించిన ప్రభుత్వ వ్యతిరేక గళం అధికార పక్షంపై ప్రభావం చూపకుండా సభను నడిపించడంలో ఓం బిర్లా చాతుర్యం చూపించారు. -
ప్రొటెం స్పీకర్‌పై రగడ
న్యూఢిల్లీ: 18వ లోక్‌సభ తొలి సమావేశాలకు ముందే అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం వేడెక్కుతోంది. ప్రొటెం స్పీకర్ ఎంపిక తాజా వివాదానికి కారణమైంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏడుసార్లు ఎంపీ అయిన భర్తృహరి మహతాబ్‌ను ప్రొటెం స్పీకర్‌గా నియమించిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. బీజేపీ పార్లమెంటరీ సంప్రదాయాలను తుంగలో తొక్కిందని ఆరోపించింది. తమ పార్టీ ఎంపీ కె.సురేశ్ అందరికంటే సీనియర్ అని, ఆయన ఎనిమిదిసార్లు ఎంపీగా ఎన్నికయ్యారని.. సంప్రదాయం ప్రకారం నూతన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించడానికి ప్రొటెం స్పీకర్‌గా సురేశ్ ను నియమించాల్సిందని వాదిస్తోంది. దళితుడు కాబట్టే సురేశ్ ను బీజేపీ పరిగణనలోకి తీసుకోలేదని ఆరోపించింది. వాస్తవానికి 18వ లోక్‌సభలో కె.సురేశ్. వీరేంద్ర కుమార్‌లు ఇద్దరు ఎనిమిదేసి సార్లు ఎంపికైన, అందరికంటే సీనియర్ సభ్యులు. అయితే వీరేంద్ర కుమార్ కేంద్ర మంత్రివర్గంలో చేరడంతో.. సురేశ్ ప్రొటెం స్పీకర్ కావాలి. కానీ బీజేపీ ఏడుసార్లు ఎంపీ అయిన మహతాబ్‌ను ఎంచుకుంది. ఆయనకు సహాయకారిగా ఉండేందుకు కె.సురేశ్, టీఆర్ బాలు (డీఎంకే), సుదీప్ బందోపాధ్యాయ్ (టీఎంసీ), రాధామోహన్ సింగ్, ఫగ్గన్‌సింగ్ కులస్తే (బీజేపీ)లతో ఛైర్ పర్సన్ ప్యానెల్‌ను ఏర్పాటు చేశారు. బీజేపీ వైఖరికి నిరసనగా ఛైర్ పర్సన్ ప్యానెల్‌కు దూరంగా ఉండే అంశాన్ని విపక్షాలకు చెందిన కె.సురేశ్, టి.ఆర్.బాలు, సుదీప్ బందోపాధ్యాయ్‌లు పరిశీలిస్తున్నారని విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. దళితుడు కాబట్టే సురేశ్ ను ప్రొటెం స్పీకర్‌గా ఎంపిక చేయలేదనే వాదనను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కొట్టిపారేశారు. సురేష్ ఎనిమిదిసార్లు ఎంపిక అయినప్పటికీ.. ఆయన వరుసగా ఎన్నికైన ఎంపీ కాదని, 1998, 2004 లోక్‌సభల్లో ఆయన సభ్యుడు కాదని పేర్కొన్నారు. మరోవైపు మహతాబ్ ఏడుసార్లు వరుసగా ఎంపీగా గెలిచారని, అందుకే ఆయన్ను ప్రొటెం స్పీకర్‌గా ఎంచుకున్నామని వాదించారు. ప్రొటెం స్పీకర్ ఎంపికపై అబద్ధాలు చెబుతూ కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగానే గిరిజన మంత్రి కిరణ్ రిజిజును అవమానిస్తోందని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఎదురుదాడికి దిగారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖను చూస్తున్న తొలి గిరిజన మంత్రిని అయినప్పటికీ కాంగ్రెస్ అబద్ధాలు, బెదిరింపులకు లొంగబోనని రిజిజు అన్నారు. ‘నిబంధనలను పాటిస్తానని, ప్రధాని నరేంద్ర మోదీ ఇచి్చన.. సబ్కా సాత్, సబ్కా వికాస్ నినాదాన్ని అనుసరిస్తారని రిజిజు పేర్కొన్నారు. సురేష్‌ను పరిగణనలోకి తీసుకోకపోవడం పార్లమెంటరీ సంప్రదాయాలను కాలరాసే ప్రయత్నమేనని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అన్నారు. బీజేపీని 240 సీట్లకే ప్రజలు పరిమితం చేసినా కాషాయపార్టీ ప్రజాస్వామ్యం, సంప్రదింపులు, పార్లమెంటరీ సంప్రదాయాలు, ప్రతిపక్షాలు అంటే ఏమిటనే దానిని అర్ధం చేసుకోవడం లేదని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా విమర్శించారు. నిరంకుశ బీజేపీ విపక్ష అభ్యరి్థని ప్రొటెం స్పీకర్‌గా కూడా చూడాలనుకోవడం లేదన్నారు. అందుకే ఫిరాయింపుదారు భర్తృహరి మహతాబ్‌ను ఎంచుకుందన్నారు. మహతాబ్ సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేడీ నుంచి బీజేపీలోకి మారి.. ఆ పార్టీ టికెట్‌పై కటక్ నుంచి గెలుపొందారు.అందరి దృష్టీ స్పీకర్ ఎన్నికపైనే...18వ లోక్‌సభ తొలి సమావేశాలు ఈ నెల 24 నుంచి ప్రారంభమవుతున్న విషయం తెలసిందే. 24, 25 తేదీల్లో నూతన సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. అనంతరం 26న జరిగే స్పీకర్ ఎన్నికపై అందరి దృష్టీ నెలకొంది. -
ఎగ్జిట్ పోల్స్ చిచ్చు.. 30 లక్షల కోట్ల నష్టం.. బీజేపీ,కాంగ్రెస్‌ల మధ్య కొనసాగుతున్న వార్
న్యూఢిల్లీ : ఎగ్జిట్ పోల్స్ రేపిన చిచ్చు ఇటు పార్టీల మధ్య అటు ఎగ్జిట్ పోల్స్టర్స్ మధ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. స్టాక్ మార్కెట్ చరిత్రలో ఎగ్జిట్ పోల్ అనేది అతిపెద్ద స్కామ్ అని కాంగ్రెస్ అంటుంటే ... మోదీ వచ్చిన తరువాతే ఇన్వెస్టర్లకు కాసుల పంట పండుతుందని బీజేపీ అంటోంది. మరొక వైపు కార్పొరేట్లకు, విదేశీ ఇన్వెస్టర్ల ప్రయోజనాల కోసమే ఈసారి ఎగ్జిట్ పోల్స్ ప్రకటించారని కొంత మంది ఆరోపిస్తున్న పరిస్ధితి. దీన్ని ఖండిస్తున్నారు పోల్స్టర్స్ దేనికైనా సిద్ధం అంటూ సవాళ్లు విసురుతున్నారు. అసలు ఎగ్జిట్ పోల్ వివాదం ఎందాక వెళుతోందని ఇన్వెస్టర్లు ఖంగారు పడుతున్నారు.2024 సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ తర్వాత హఠాత్తుగా పెరిగిన షేర్ల ధరలు, ఎన్నికల ఫలితాల రోజు పతనం కావడంపై రచ్చ కొనసాగుతోంది. ఒక వైపు జాయింట్ పార్లమెంటరీ కమిటీ -జేపీసీ విచారణ జరిపించాలని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తుంటే మరొక వైపు ఎగ్జిట్ పోల్స్‌పైన తనపై వస్తున్న ఆరోపణలకు స్పందించారు యాక్సిస్ మై ఇండియా సర్వే ఏజెన్సీ చీఫ్ ప్రదీప్ గుప్తా. ఎలాంటి విచారణకైనా సిద్ధమని ఆయన ఒపెన్ ఛాలెంజ్ విసురుతున్నారు. అంతేకాదు అసలు ఎగ్జిట్ పోల్స్ తప్పంటూ కొంత మంది ఆరోపిస్తున్న నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ ఖచ్చితత్వంపై అనుమానాలు వద్దని. ఖచ్చితంగా మేం ప్రజల నాడీని చెపుతున్నామని గుప్తా అంటున్నారు.జూన్ 1వ తేదీన మళ్ళీ ఎన్‌డిఎ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని.. 400 సీట్లు గెలుస్తుందని చాలా వరకు సర్వే ఏజెన్సీలు ఎగ్జిట్ పోల్స్‌ను ప్రకటించాయి. దీంతో ఎగ్జిట్ పోల్స్ ప్రకటించిన రోజు స్టాక్ మార్కెట్లు కొత్త రికార్డులు సృష్టించాయి. అంతేకాదు లక్షల కోట్లు కొంత మంది జేబులోకి వచ్చిపడ్డాయి. తీరా రిజల్ట్స్ మాత్రం చాలా డిఫెరెంట్‌గా వచ్చాయి. ఎగ్జిట్ పోల్ అంచనాలు తలకిందులు కావడం, బీజేపీ మ్యాజిక్ మార్క్ కూడా దాటలేకపోవడంతో జూన్ 4న స్టాక్‌మార్కెట్లు కుప్పకూలిపోయాయి. దాదాపుగా ఇన్వెస్టర్లు 30లక్షల కోట్లమేర నష్టపోయారు. దీనికంతటికీ ఎగ్జిట్ పోల్స్ చేసిన వారు కొంత మందితో కుమ్మకవ్వడమే కారణమని సర్వత్రా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాదు కాంగ్రెస్ అయితే ఓ అడుగు ముందుకేసి ఇది స్టాక్ మార్కెట్ చరిత్రలో అతిపెద్ద స్కామ్ అని ఆరోపిస్తోంది.ఎగ్జిట్ పోల్స్ ప్రకటించడానికి ముందు రోజు సాక్షాత్తు ప్రధాన మంత్రి, హోమ్ శాఖ మంత్రి స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టమంటూ ఇచ్చిన స్టేట్మెంట్ను హైలైట్ చేస్తున్నాయి ఇండియా కూటమి పార్టీలు. కావాలని కొంత మందికి , కొన్ని కంపెనీలకు ప్రయోజనం కల్పించేందుకు మాత్రమే ఈ ప్రకటనను చేశారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అంతేకాదు జేపీసీ తప్పనిసరిగా విచారించాల్సిన మూడు ప్రశ్నలను సంధిస్తోంది. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే 5 కోట్ల కుటుంబాలకు పీఎం , హోమ్ మినిస్టర్ నిర్దిష్ట పెట్టుబడి సలహా ఎందుకు ఇచ్చారు? ప్రజలకు పెట్టుబడి సలహాలు ఇవ్వడం వారి పని కాదు కదా అంటున్నారు. స్టాక్ మార్కెట్లను తారుమారు చేసినందుకు సెబీ దర్యాప్తులో ఉన్న ఒకే వ్యాపార బృందానికి చెందిన ఒకే మీడియా సంస్థకు రెండు ఇంటర్వ్యూలు ఎందుకు ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. బీజేపీకి , నకిలీ ఎగ్జిట్ పోల్స్టర్లకు సందేహాస్పద విదేశీ పెట్టుబడిదారులకు మధ్య ఉన్న సంబంధం ఏమిటనేది తేలాలని ఇండి కూటమి సభ్యులు కోరుతున్నారు.ఐతే దీన్ని బీజేపీ ఖండిస్తోంది. అలాంటి అవకతవకలకు పాల్పడేలా మోదీ, అమిత్ షా మాట్లాడలేదని.. మోదీ ప్రధాన మంత్రి అయినాక 10 ఏళ్లలో భారత మార్కెట్ క్యాప్ 67 లక్షల కోట్ల నుంచి 415 లక్షల కోట్లకు పెరిగిందని చెపుతున్నారు.మొత్తం మీద ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాడ్డాక కూడా ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. అటు ప్రతిపక్షం, ఇటు అధికార పక్షం ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు వారికి పెద్దగా ఆర్ధికంగా ఎలాంటి నష్టం జరగకపోయినా. వారిచ్చిన స్టేట్మెంట్లు నమ్మిన సగటు స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ మాత్రం నష్టాలతో కొట్టుమిట్టాడుతున్నాడనేది సత్యం. -
Lok Sabha Elections 2024: ఈవీఎంలు వెరిఫికేషన్ చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంలపై కొందరు అభ్యర్థులు అనుమానాలు వ్యక్తంచేస్తూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. ఈవీఎంలలోని మైక్రో–కంట్రోలర్ చిప్‌లు ట్యాంపరింగ్‌కు గురయ్యాయో లేదో తనిఖీ చేయాలని ఆయా లోక్‌సభ నియోజకవర్గాల అభ్యర్థులు ఈసీకి దరఖాస్తు చేసుకున్నారు. ఇలా ఆరు రాష్ట్రాల పరిధిలోని ఎనిమిది లోక్‌సభ నియోజకవర్గాల నుంచి బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులుసహా ఎనిమిది దరఖాస్తులు ఈసీకి అందాయి. తమిళనాడు, హరియాణాలో చెరో రెండు, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఆంధప్రదేశ్, తెలంగాణలో చెరో స్థానంలో ఇలా మొత్తంగా 8 లోక్‌సభ నియోజకవర్గాల నుంచి దరఖాస్తులు వచ్చాయి. పేపర్ బ్యాలెట్ విధానానికి మారుదామంటూ దాఖలైన పిటిషన్లను కొట్టేస్తూ, ఈవీఎం విధానాన్ని సమర్థిస్తూ ఏప్రిల్ 26వ తేదీన సర్వోన్నత న్యాయస్థానం చరిత్రాత్మక తీర్పు వెలువడిన వేళ ఇలా ఈసీకి అభ్యర్థనలు రావడం గమనార్హం. అయితే ఆయా నియోజకవర్గాల్లో ఓడి రెండో, మూడో స్థానంలో నిలిచిన అభ్యర్థులు ఈవీఎంలపై సందేహాలు వ్యక్తంచేస్తే ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో ర్యాండమ్‌గా ఐదు శాతం ఈవీఎంలను చెక్‌చేసేందుకు సుప్రీంకోర్టు అవకాశం కల్పించింది. ఈ వెసులుబాటును వినియోగించుకుంటూ ఓడిన అభ్యర్థులు కొందరు తాజాగా ఈసీని ఆశ్రయించగా ఆయా వివరాలను ఈసీ వెల్లడించింది. ఆరు రాష్ట్రాల్లో కలిపి 92 పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలను చెక్ చేయనున్నారు. అయితే ఒక్కో ఈవీఎం సెట్‌ను తనిఖీచేయడానికి నిర్వహణ ఖర్చుగా రూ.47,200ను ఆ అభ్యర్థి ఫీజు రూపంలో చెల్లించాల్సి ఉంటుందని జూన్ ఒకటో తేదీన ఈసీ ఒక ప్రకటన జారీచేయడం తెల్సిందే. ఈవీఎంల తనిఖీ ఖర్చును భారత్ ఎలక్ట్రానిక్స్ (బెల్), ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఈసీఐఎల్)లు రూ.40,000 నిర్ణయించగా జీఎస్టీ 18 శాతం(రూ.7,200) కలుపుకుంటే ఖర్చు రూ. 47,200గా తేలింది. అయితే ఈవీఎంల తరలింపు, వాటిని తనిఖీని రికార్డ్ చేసేందుకు సీసీటీవీల ఏర్పాటు, విద్యుత్ చార్జీలు, వీడియోగ్రఫీ, జిల్లా ఎన్నికల అధికారి స్థాయిలో ఇతర నిర్వహణ ఖర్చులు అదనంగా ఉండొచ్చని తెలుస్తోంది. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో బీజేపీ అభ్యర్థి సంజయ్ రాధాకృష్ణ విఖే పాటిల్ 40 పోలింగ్ కేంద్రాల్లో తనిఖీ చేయాలని దరఖాస్తుచేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని ఒక లోక్‌సభ పరిధిలోని 4 పోలింగ్ స్టేషన్లను, హరియాణాలోని రెండు లోక్‌సభ స్థానాల్లోని 6 పోలింగ్ స్టేషన్లను, తమిళనాడులోని 2 లోక్‌సభ స్థానాల్లోని 20 పోలింగ్ స్టేషన్లను అభ్యర్థులు తనిఖీకి ఎంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ.. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం లోక్‌సభ స్థానం పరిధిలోని బొబ్బిలి, నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కో పోలింగ్ స్టేషన్లో ఈవీఎంలను తనిఖీ చేయాలని వైఎస్సార్సీపీ అభ్యర్థి కోరారు. గజపతినగరం అసెంబ్లీ స్థానంలో ఒక పోలింగ్ స్టేషన్, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో 12 పోలింగ్ స్టేషన్లను వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఎంచుకున్నారు. తెలంగాణలోని జహీరాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలో ఉన్న నారాయణ్‌ఖేడ్‌లో 7 , జహీరాబాద్‌లో 7, ఆందోల్‌లో 6 పోలింగ్ స్టేషన్లను బీజేపీ అభ్యర్థి ఎంచుకున్నారు. ఒడిశాలోని ఒక అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని 13 పోలింగ్ స్టేషన్లను బీజేడీ అభ్యర్థి ఎంచుకున్నారు. -
సాయంత్రం కేంద్ర కేబినెట్ భేటీ..
ఢిల్లీ: 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్ర మంత్రివర్గం,ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) తొలి సమావేశం ఇవాళ సాయంత్రం 5 గంటలకు జరగనుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ప్రధాన ఆర్థిక విధానాలు,పలు కార్యక్రమాలను చర్చ జరగనుంది.అనంతరం,జులైలో జరగనున్న 2024-25 పూర్తి బడ్జెట్‌పై ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. సీసీఈఏ అంటే ఏమిటి?ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ)కేంద్రంలోని అత్యంత ముఖ్యమైన కమిటీలలో ఒకటి. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, పారిశ్రామిక విధానాలు, ఇతర కీలక ఆర్థిక కార్యక్రమాలకు సంబంధించిన నిర్ణయాలను ఖరారు చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.సీసీఈఏలో 8 కేబినెట్ కమిటీలు:1. కేబినెట్ నియామకాల కమిటీ2. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ 3. రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ4. పెట్టుబడి,వృద్ధిపై కేబినెట్ కమిటీ5. భద్రతపై కేబినెట్ కమిటీ6. పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ7. ఉపాధి,నైపుణ్యాభివృద్ధిపై కేబినెట్ కమిటీ8. వసతిపై కేబినెట్ కమిటీ -
లోక్‌సభ స్పీకర్ రేసులో ఆ ఇద్దరు?!
న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ ఎంపికపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ రోజు సాయంత్రం 5గంటలకు ఢిల్లీలోని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాసంలో బీజేపీ, మిత్రపక్షాల కేంద్రమంత్రులు భేటీ కానున్నారు. 2014, 2019 ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్ని దక్కించుకోవడంతో బీజేపీ కేంద్రంలో అధికారాన్ని చేపట్టింది. ఆ పార్టీ ఎంపీలే స్పీకర్లుగా బాధ్యతలు చేపట్టారు. 16వ లోక్‌సభ స్పీకర్‌గా బీజేపీ ఎంపీ సుమిత్రా మహాజన్ (2014), 17వ లోక్‌సభ స్పీకర్‌గా ఓంబిర్లా (2019) సేవలందించగా, ఏఐఏడీఎంకే నేత ఎం.తంబిదురై డిప్యూటీ స్పీకర్లుగా పనిచేశారు.అయితే 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పేలవ ప్రదర్శనతో కేవలం 240 స్థానాల్ని దక్కించుకుంది. ఇతర పార్టీలైన జేడీయూ, టీడీపీల పొత్తుతో మూడో దఫా అధికారం చేపట్టింది. దీంతో లోక్‌సభ స్పీకర్ పదవి తమకూ కావాలంటూ జేడీయూ, టీడీపీలు పోటీ పడుతుండగా.. కమలం అగ్రనాయకత్వం మాత్రం ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బీజేపీ ఎంపీలనే స్పీకర్లుగా ఎంపిక చేసేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.రేసులో ఆ ఇద్దరులోక్సభ ఎన్నికల ముందు ఒడిశా నుంచి బీజేపీలో చేరిన కటక్ ఎంపీ ఎంపీ భర్తృహరి మహతాబ్, ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందరేశ్వరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండగా.. ఓం బిర్లానే మరోసారి లోక్‌సభ స్పీకర్‌గా నియమించే అవకాశం ఉందంటూ జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.ప్రొటెం స్పీకర్గారాజ్యాంగ నిబంధనలు ప్రకారం.. కొత్త లోక్‌సభ మొదటి సారి సమావేశానికి ముందు స్పీకర్ పదవి ఖాళీ అవుతుంది. కొత్త ఎంపీలతో ప్రమాణస్వీకారం చేయించడానికి సీనియర్ సభ్యుడ్ని ప్రొటెం స్పీకర్‌గా రాష్ట్రపతి నియమిస్తారు. ప్రొటెం స్పీకర్ రేసులో కాంగ్రెస్ సీనియర్ నేత కొడికున్నిల్ సురేశ్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ప్రొటెం స్పీకర్,స్పీకర్,డిప్యూటీ స్పీకర్ ఎవరనేది ఈ రోజు సాయంత్ర ఎన్డీయే, దాని మిత్రపక్ష పార్టీల కేంద్రమంత్రుల సమావేశం అనంతరం స్పష్టత రానుంది. -
వయనాడ్‌ను వదులుకున్న రాహుల్ .. ఉప ఎన్నికల బరిలో ప్రియాంక గాంధీ
న్యూఢిల్లీ : ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ విజయం సాధించారు.దీంతో వయనాడ్ (కేరళ), రాయ్‌బరేలీ (యూపీ) స్థానాల్లో ఒక నియోజకవర్గాన్ని ఆయన వదులుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీనిపై తాను ఎటూ తేల్చుకోలేకపోతున్నానంటూ ఇటీవల రాహుల్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, తన నిర్ణయం రెండు వర్గాల ప్రజలను సంతోషపరుస్తుందని అన్నారు. ఈ తరుణంలో వయనాడ్ స్థానాన్ని వదులుకున్నట్లు రాహుల్ గాంధీ అధికారింగా ప్రకటించారు. రాహుల్ రాజీనామాతో వయనాడ్‌లో జరిగే ఉప ఎన్నికల్లో ఆయన సోదరి ప్రియాంక గాంధీ బరిలోకి దిగడం అనివార్యమైంది.ఈ సందర్భంగా జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. ‘రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ కొనసాగాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. రాయ్ బరేలితో గాంధీ కుటుంబానికి తరతరాల అనుబంధం ఉంది.వయనాడ్ సీటుకు రాహుల్ రాజీనామా చేస్తారు. ఆస్థానంలో ప్రియాంక గాంధీ పోటీ చేయనున్నారు’ అని ఖర్గే వెల్లడించారు.‘వయనాడ్‌తో నాకు అనుబంధం ఉంది. జీవితాంతం వయనాడ్ నాకు గుర్తుంటుంది. ప్రియాంక గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేస్తారు. కష్ట కాలంలో వయనాడ్ నుంచి నన్ను గెలిపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటాం’ అని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.‘వయనాడ్ నుంచి ప్రాతినిధ్యం వహించడానికి సిద్ధంగా ఉన్నా..రాయ్ బరేలిలో నా సోదరుడికి ఎప్పుడు మద్దతుగా ఉంటా’ అని ప్రియాంక గాంధీ అన్నారు.ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రియాంక గాంధీ ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రియాంక గాంధీ అరంగేట్రంపై గత కొంతకాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు కూడా ఆమె అమేథీ లేదా రాయ్‌బరేలీ నుంచి పోటీ చేస్తారని వార్తలు వినిపించాయి. దీనిపై సుదీర్ఘ ఉత్కంఠకు తెరదించుతూ రాయ్‌బరేలీ నుంచి రాహుల్ పోటీ చేసి విజయం సాధించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంపై దృష్టి సారించేందుకే ఆమె పోటీకి దూరమైనట్లు కాంగ్రెస్ నేతలు చెప్పారు. అయితే, ఎక్కడైనా ఉప ఎన్నిక ద్వారా ఆమె పార్లమెంటుకు వెళ్లవచ్చని అన్నారు. తాజా రాహుల్ గాంధీ వయనాడ్‌కు రాజీనామా చేయడంతో..ప్రియాంక గాంధీ ప్రత్యక్ష ఎన్నికల్లో అరంగ్రేటం అనివార్యమైంది. -
ఈవీఎంల ట్యాంపరింగ్‌తో ఎన్నికల్లో విజయం.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : ప్రముఖ బిలియనీర్ ఎలోన్ మస్క్ ఈవీఎంలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంల భద్రతను ప్రశ్నిస్తూ ఎలోన్ మస్క్ చర్చకు తెర లేపారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లను రద్దు చేయాలని పిలుపునిచ్చారు. మానవులు, లేదా ఏఐ ద్వారా ఈవీఎంలను హ్యాక్ చేసే ప్రమాదం చాలా తక్కువ స్థాయిలో ఉన్నప్పటికి వాటి పర్యవసానాలు భారీ స్థాయిలో ఉంటాయని ట్వీట్లో పేర్కొన్నారు. భారత్‌లో ఈవీఎంల పనితీరుపై అనుమానాలు తలెత్తుతున్న తరుణంలో మస్క్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పరోక్షంగా స్పందించారు. EVMs in India are a "black box," and nobody is allowed to scrutinize them. Serious concerns are being raised about transparency in our electoral process.Democracy ends up becoming a sham and prone to fraud when institutions lack accountability. https://t.co/nysn5S8DCF pic.twitter.com/7sdTWJXOAb— Rahul Gandhi (@RahulGandhi) June 16, 2024 దేశంలోని ఈవీఎంలను‘బ్లాక్ బాక్స్’అని అభివర్ణించారు. ముంబై నార్త్ వెస్ట్ లోక్‌సభ స్థానం ఫలితాలపై దుమారం రేపిన వార్తా కథనాల్నిఉదహరిస్తూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ‘భారత్‌లో ఈవీఎంలు ఒక బ్లాక్ బాక్స్. వాటిని పరిశీలించడానికి ఎవరికీ అనుమతి లేదు.మా ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత గురించి తీవ్రమైన ఆందోళనలు తలెత్తుతున్నాయి’అని రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా స్పందించారు.సంస్థల్లో జవాబుదారీతనం లోపించినప్పుడు ప్రజాస్వామ్యం బూటకంగా మారుతుంది. మోసానికి గురవుతుందన్నారు. ముంబై నార్త్ వెస్ట్ లోక్‌సభలో గెలిచిన అభ్యర్థి బంధువులు ఈవీఎంలకు కనెక్ట్ చేసిన ఫోన్‌ను ఉపయోగిస్తున్నారంటూ వచ్చిన కథనాల్ని ట్వీట్ చేశారు.ఫోన్‌తో ఈవీఎంను అన్‌ల్యాక్ చేసిన ఎన్డీఏ అభ్యర్థి!ముంబై నార్త్ వెస్ట్ లోక్‌సభ శివసేన ఎంపీ రవీంద్ర వైకర్ లోక్‌సభ ఎన్నికల్లో 48 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇప్పుడు ఆయన గెలుపుపై వివాదం నెలకొంది. అందుకు జూన్ 4న రెస్కో పోలింగ్ కౌంటింగ్ సెంటర్ బయట ఎంపీ రవీంద్ర వైకర్ బావ మంగేష్ పన్హాల్కర్ ఫోన్ వినియోగించారు. ఆ ఫోన్ వినియోగించడం వల్లే రవీంద్ర వైకర్ 48 ఓట్ల తేడాతో గెలుపొందారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.కౌంటింగ్ సెంటర్లో ఉన్న ఈవీఎం మెషిన్‌కు మంగేష్ పన్హాల్కర్‌కు ఫోన్‌కు మధ్య కనెక్టివిటీ ఉందని, ఫోన్లో ఓటీపీ సాయంతో కౌంటింగ్ సెంటర్లో ఉన్న ఈవీఎం మెషిన్ ఓపెన్ అయ్యేలా టెక్నాలజీని వినియోగించినట్లు పలు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. మంగేష్ ఫన్హాల్కర్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిజానిజాలు తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఈవీఎంలను నిషేధించాలంటూ మస్క్ చేసిన వ్యాఖ్యలపై మాజీ కేంద్రమంత్రి, బీజేపీ నేత రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. భారత్‌లోని ఈవీఎంల తయారీ చాలా కట్టుదిట్టంగా ఉంటుంది. వాటిని ఎవరు కనెక్ట్ చేయలేరు. కనెక్టివిటీ లేదు, బ్లూటూత్, వైఫై,ఇంటర్నెట్ను వినియోగించలేరని అన్నారు.We should eliminate electronic voting machines. The risk of being hacked by humans or AI, while small, is still too high. https://t.co/PHzJsoXpLh— Elon Musk (@elonmusk) June 15, 2024 -
బీఆర్ఎస్పై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఘాటు వ్యాఖ్యలు
నరకాసురుడు చనిపోతే దీపావళి జర్పుకున్నట్టు నేడు మెదక్‌లో బీజేపీ గెలిస్తే అంత సంబరాలు జరుపుకున్నారని మెదక్ బీజేపీ ఎంపీ రఘు నందన్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అన్నీ వర్గాల ప్రజల్ని ప్రజలను అణిచి వేయాలని చూసింది. ఫలితంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయిందన్నారు. తన గెలుపును మల్లన్న సాగర్‌లో తన చితి తానే పెర్చుకొని మరణించిన రైతు మల్లారెడ్డికి అంకితం చేస్తున్నట్లు తెలిపారు.దుబ్బాకలో రఘునందన్ రావుకి ప్రోటోకాల్ లేకుండా చేద్దామని అనుకున్నారు కానీ నేడు సిద్దిపేటలో కూడా ప్రోటోకాల్ వచ్చింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొదటిసారి మెదక్ గడ్డపై కాషాయ జెండా ఎగిరిందన్న రఘనందన్ .. నా గెలుపు కోసం బీఆర్ఎస్ నాయకులు పరోక్షంగా ప్రచారం చేశారని అన్నారు. నరకాసురుడు చనిపోతే దీపావళి జరుపుకున్నట్లు నేడు మెదక్‌లో బీజేపీ గెలిస్తే అంత సంబరాలు జరుపుకున్నారుబీఆర్ఎస్ నేత వెంకట్ రాంరెడ్డి 30రోజులలో గజ్వేల్ ప్రాంత క్షిరా సాగర్ రైతులకు వారి భూములను తిరిగి ఇవ్వకపోతే ఎక్కడి వరకు అయినా పోరాటం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే వెంకట్ రాంరెడ్డి స్వాధీనం చేసుకున్న గజ్వేల్ భూములపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై అవినీతి జరిగిందన్న రేవంత్ రెడ్డి దానిపై చర్యలు ఏవి అని ప్రశ్నించారు. -
స్పీకర్ పదవి.. బీజేపీ రిస్క్ చేస్తుందా?
హోరాహోరీ సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది. అంతా ఊహించినట్టే నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం కూడా చేశారు. మోదీ 3.0 మంత్రివర్గమూ కొలువుదీరింది. కానీ గత రెండు ఎన్నికల మాదిరిగా సొంతంగా మెజారిటీ సాధించడంలో బీజేపీ ఈసారి విఫలమైంది. దాంతో ఎన్డీఏ సంకీర్ణ సర్కారు మనుగడలో భాగస్వామ్య పక్షాల పాత్ర కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో అందరి కళ్లూ అతి కీలకమైన లోక్‌సభ స్పీకర్ పదవిపైనే నెలకొన్నాయి. ఎన్డీఏ కీలక భాగస్వామి టీడీపీ ఆ పదవిపై ఆసక్తిగా ఉందంటూ ముందునుంచీ వార్తలొస్తున్నాయి. తాజాగా జేడీ(యూ) పేరూ విని్పస్తోంది. అవి నాలుగైదు కేబినెట్ బెర్తులు కోరినా ఎన్డీఏ పెద్దన్న బీజేపీ మాత్రం చెరో రెండింటితో సరిపెట్టింది. కనుక స్పీకర్ పోస్టుపై ఆ పార్టీలు పట్టుదలగా ఉన్నట్టు చెబుతున్నారు. కానీ అపారమైన విచక్షణాధికారాలుండే స్పీకర్ పాత్ర కీలక సమయాల్లో అత్యంత నిర్ణాయకంగా మారుతుంటుంది. మరీ ముఖ్యంగా సంకీర్ణ ప్రభుత్వాల్లో లోక్‌సభ స్పీకర్ పాత్రకుండే ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. పైగా గతంలో టీడీపీకి స్పీకర్ పోస్టు ఇచ్చి సర్కారును కుప్పకూల్చుకున్న అనుభవమూ బీజేపీకి ఉంది. ఈ నేపథ్యంలో కీలక పదవిని మిత్రపక్షాల చేతిలో పెట్టే రిస్క్‌కు బీజేపీ పెద్దలు మరోసారి సిద్ధపడతారా అన్నది సర్వత్రా ఆసక్తి రేపుతోంది...అది 1999. రాజకీయ అస్థిరతకు చెక్ పెట్టే ఉద్దేశంతో వాజ్‌పేయి సారథ్యంలోని ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం లోక్‌సభలో బలపరీక్షకు సిద్ధపడింది. మద్దతిస్తామన్న పలు ఇతర పారీ్టలు తీరా అసలు సమయానికి అడ్డం తిరగడంతో ఒకే ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వం కుప్పకూలింది. నాడు స్పీకర్‌గా ఉన్న టీడీపీ నేత జీఎంసీ బాలయోగి తీసుకున్న నిర్ణయమే అందుకు కారణంగా మారడం విశేషం! అంతకు కొద్ది రోజుల ముందే ఒడిశా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కాంగ్రెస్ ఎంపీ గిరిధర్ గమాంగ్‌ను ఓటింగ్‌కు అనుమతించాలా, లేదా అన్న ధర్మసందేహం తలెత్తింది. స్పీకర్‌గా తన విచక్షణాధికారాలను ఉపయోగించి గమాంగ్‌ను ఓటింగ్‌కు అనుమతిస్తూ బాలయోగి నిర్ణయం తీసుకున్నారు. చివరికి విశ్వాస తీర్మానానికి అనుకూలంగా 269 ఓట్లు రాగా వ్యతిరేకంగా 270 వచ్చాయి. అలా గమాంగ్ వేసిన ఒక్క ఓటు ప్రభుత్వాన్ని పడ గొట్టింది. ఎన్డీఏ సర్కారుకు బయటినుంచి మద్దతిచి్చన టీడీపీ అధినేత చంద్రబాబు కోరిక మేరకు స్పీకర్ పదవిని ఆ పారీ్టకిస్తూ నాటి ప్రధాని వాజ్‌పేయి నిర్ణయం తీసుకున్నారు. పాతికేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు బాబు మరోసారి టీడీపీకి స్పీకర్ పదవి కోరుతున్నట్టు వార్తలొస్తుండటం విశేషం! జిస్కా స్పీకర్, ఉస్కీ సర్కార్! మోదీ 3.0 ప్రభుత్వం కొలువుదీరినా బీజేపీకి సొంతంగా మెజారిటీ రాని విషయం తెలిసిందే. లోక్‌సభలో మెజారిటీ మార్కు 272 కాగా బీజేపీకి 240 మంది ఎంపీలే ఉన్నారు. ఎన్డీఏ భాగస్వాముల్లో 16 ఎంపీలున్న టీడీపీ, 12 మంది ఉన్న జేడీ(యూ) ప్రభుత్వ మనుగడకు కీలకంగా మారాయి. సంకీర్ణ ప్రభుత్వాల మనుగడలో స్పీకర్ పదవి ఎంత కీలకమో 1999 నాటి వాజ్‌పేయి ప్రభుత్వ ఉదంతం నిరూపించింది. పైగా ‘జిస్కా స్పీకర్, ఉస్కీ సర్కార్ (స్పీకర్ పదవి దక్కిన వారిదే సర్కారు)’ అన్న నానుడి హస్తిన రాజకీయ వర్గాల్లో బాగా ఫేమస్ కూడా. అలాంటి కీలకమైన స్పీకర్ పదవిని ఈసారి టీడీపీ కోరుతోంది. మోదీ అందుకు అంగీకరించే సాహసం చేస్తారా అన్నదానిపై రకరకాల విశ్లేషణలు వెలువడుతున్నాయి. 2014, 2019ల్లో బీజేపీ సొంతగానే మెజారిటీ సాధించడంతో ఆయనకు ఇలాంటి పరీక్ష ఎదురవలేదు. అయితే మంత్రివర్గ కూర్పులో భాగస్వాముల డిమాండ్లకు మోదీ పెద్దగా తలొగ్గలేదు. టీడీపీ ఐదారు, జేడీ(యూ) నాలుగైదు బెర్తులు అడిగినా వాటికి చెరో రెండు పదవులతో సరిపెట్టారు. పైగా కీలకమైన శాఖలన్నింటినీ బీజేపీకే కేటాయించారు. కనుక స్పీకర్ పదవిని కూడా బీజేపీయే అట్టిపెట్టుకోవచ్చన్న అభిప్రాయం విని్పస్తోంది. పవర్స్ అన్నీ ఇన్నీ కావులోక్సభ స్పీకర్‌కు సాధారణ అధికారాలతో పాటు అత్యంత కీలకమైన విచక్షణాధికారాలు కూడా ఉంటాయి. సభా నిబంధనలను తన విచక్షణ మేరకు నిర్వచించగలుగుతారు. అందుకే స్పీకర్ పదవిని పాలక పక్ష బలానికి, ఆధిపత్యానికి ప్రతీకగా భావిస్తుంటారు. లోక్‌సభను అజమాయిషీ చేస్తూ కార్యకలాపాలను సజావుగా నడిపించేది స్పీకరే. కనుక ఆ పదవి దక్కే పార్టీ సహజంగానే లోక్‌సభ కార్యకలాపాల అజెండా తదితరాలను ప్రభావితం చేయగలుగుతుంది. నిర్ణాయక సందర్భాల్లో ఇది కీలకంగా మారుతుంది. సభలో ప్రవేశపెట్టే బిల్లులు ద్రవ్య బిల్లా, సాధారణ బిల్లా అన్నది స్పీకరే నిర్ధారిస్తారు. సభా సంఘాలను ఏర్పాటు చేస్తారు. వాటి చైర్పర్సన్లు, సభ్యులను నియమిస్తారు. సభ్యుల సస్పెన్షన్ వంటి కీలక నిర్ణయాలు తీసుకోవాల్సింది స్పీకరే. పార్లమెంటు సంయుక్త సమావేశాలకు సారథ్యం వహిస్తారు. అన్నింటికీ మించి ఏ అంశంపై అయినా సభలో ఓటింగ్ జరిగి రెండు పక్షాలకూ సమానంగా ఓట్లొస్తే స్పీకర్ పాత్ర మరింత కీలకంగా మారుతుంది. ఆయన నిర్ణాయక ఓటు ఎవరికి వేస్తే వారే నెగ్గుతారు!– సాక్షి, నేషనల్ డెస్క్ -
24 ఏళ్ల తర్వాత.. ‘కౌన్ బనేగా ఒడిశా సీఎం?’
ఒడిశా కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? ఆయన అధికార నివాసం ఎక్కడా అనే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది.ఇటీవల జరిగిన ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బిజూ జనతాదళ్ ఓటమి పాలైంది. దీంతో 24 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత బీజేపీ ప్రభుత్వ పగ్గాలు చేపట్టనుంది. ఈ తరుణంలో కాబోయే సీఎం ఎవరు? ఆయన అధికారిక నివాసం ఎక్కడా అనే చర్చ మొదలుగా కాగా.. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు చేసే బాధ్యతల్ని బీజేపీ అధిష్టానం రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు అప్పగించింది. సొంత ఇంటి నుంచే బాధ్యతలుమాజీ సీఎం నవీన్ పట్నాయక్ 24ఏళ్ల పదవీ పదవీకాలంలో తన వ్యక్తిగత ఇల్లు నవీన్ నివాస్ నుండి పనిచేశారు. పట్నాయక్ 2000లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రభుత్వం కేటాయించిన ఇంటిలో కాకుండా తన సొంత ఇంటి నుంచే పని చేయాలని నిర్ణయించుకున్నారు. దాదాపు పావు శతాబ్ద కాలం పాటు అన్ని అధికారిక, పరిపాలనా నిర్వహణ పనులను నవీన్ నివాస్ నుంచే నిర్వహించారు. ఆ భవనాన్ని నవీన్ పట్నాయక్ తండ్రి,మాజీ ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ నిర్మించారు. 24 ఏళ్ల తర్వాత కొత్త ప్రభుత్వంతాజా ఎన్నికల ఫలితాలతో కొలువుతీరునున్న బీజేపీ కొత్త ముఖ్యమంత్రి ఎంపిక, అధికారిక నివాసం కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుత ముఖ్యమంత్రి గ్రీవెన్స్ సెల్‌తో సహా అనేక ఖాళీ క్వార్టర్లను షార్ట్‌లిస్ట్ చేసినట్లు సీనియర్ ప్రభుత్వ అధికారి తెలిపారు. 78 స్థానాల్లో బీజేపీ విజయంఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా అధికార బీజేడీ పరాజయం పాలైంది. 24 ఏళ్లుగా ఒడిశా సీఎంగా ఉన్న నవీన్ పట్నాయక్ ప్రతిపక్షానికి పరిమితయ్యారు. ఒడిశా 147 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 78 స్థానాల్ని కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఇక బీజేడీ 51 స్థానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్ 14 స్థానాల్లో విజయం సాధించగా, మూడు ఇండిపెండెంట్ అభ్యర్థులకు దక్కాయి. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 21 స్థానాలకు గాను బీజేపీ 20, కాంగ్రెస్ 1 గెలుచుకోవడంతో బీజేడీ ఘోర పరాజయం పాలైంది.సీఎం రేసులో ఇద్దరు ఎమ్మెల్యేలు ఒడిశా కొత్త సీఎం ఎవరవుతారనే దానిపై రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతున్నది. బీజేపీ సీనియర్ నేత, కొత్తగా ఎమ్మెల్యేగా ఎన్నికైన సురేశ్ పుజారితో పాటు ఒడిశా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మన్మోహన్ సామల్ ముందు వరుసలో ఉన్నట్టు తెలుస్తున్నది.రేపు సాయంత్రమే ఒడిశా కొత్త సీఎం ప్రమాణ స్వీకారం రేపు సాయంత్రం 5 గంటలకు ఒడిశా కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.ఈ ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ రేపు మధ్యాహ్నం 2:30 గంటలకు భువనేశ్వర్ చేరుకుని విమానాశ్రయం నుంచి రాజ్‌భవన్‌కు వెళ్లనున్నారు.అనంతరం సాయంత్రం 5 గంటలకు జనతా మైదాన్‌లో జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొననున్నారు. -
‘నాన్నే నా ప్రాణం’.. చిరాగ్ భావోద్వేగ పోస్ట్
బీహార్‌కు చెందిన లోక్ జనశక్తి పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్ మూడోసారి ఎంపీగా ఎన్నికై, తొలిసారి మోదీ కేబినెట్లో మంత్రి అయ్యారు. మోదీ 3.0 క్యాబినెట్లో చిరాగ్ పాశ్వాన్‌కు ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖను కేటాయించారు. చిరాగ్ తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్ ఒకప్పుడు వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖలను చేపట్టారు. తాజాగా చిరాగ్ పాశ్వాన్ తన తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్‌ను గుర్తుచేసుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగంతో కూడిన పోస్ట్‌ను షేర్ చేశారు.ఈ పోస్టుకు తన తండ్రికి సంబంధించిన కొన్ని వీడియోలు, ఫొటోలను జతచేశారు. నాడు రాష్ట్రపతి భవన్లో రామ్ విలాస్ పాశ్వాన్ క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న ఫొటోను చిరాగ్ పోస్ట్ చేశారు. అలాగే తాను తన తండ్రితో ఉన్నప్పటి ఫొటోలను కూడా షేర్ చేశారు. వీడియోలో రామ్ విలాస్ పాశ్వాన్ రికార్డ్ చేసిన వాయిస్ ప్లే అవుతుంది. అలాగే ఇదే వీడియోలో చిరాగ్ మాట్లాడుతూ ఈ దీపం(చిరాగ్) దేశానికి, ప్రపంచానికి వెలుగు నిచ్చేదిగా మారినందుకు సంతోషిస్తున్నాను’ అని పేర్కొన్నారు.చిరాగ్ షేర్ చేసిన ఈ వీడియోను ఇప్పటి వరకు మూడు కోట్ల మంది వీక్షించగా, 11 లక్షల మంది లైక్ చేశారు. అదే సమయంలో చిరాగ్‌ను ప్రశంసిస్తూ పలువురు కామెంట్లు పెట్టారు. చిరాగ్ పాశ్వాన్ నాయకత్వంలో బీహార్ భవిష్యత్తు బంగారుమయం అవుతుందని కొందరు పేర్కొన్నారు. -
నేడు రాయ్‌బరేలీ సీటుపై రాహుల్ కీలక ప్రకటన?
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన తల్లి సోనియా, సోదరి ప్రియాంకతో కలిసి నేడు (మంగళవారం) యూపీలోని రాయ్‌బరేలీకి వస్తున్నారు. ఈ సందర్భంగా జరిగే కార్యక్రమంలో ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలు, ఓటర్లకు కృతజ్ఞతలు చెప్పనున్నారు. దీనితోపాటు రాయ్‌బరేలీ సీటు విషయంలో తన నిర్ణయం వెలిబుచ్చనున్నారని సమాచారం.గాంధీ కుటుంబానికి దశాబ్దాలుగా యూపీలోని అమేథీ, రాయ్‌బరేలీతో అనుబంధం ఉంది. అందుకే రాయ్‌బరేలీ ఎంపీగా రాహుల్‌గాంధీ కొనసాగుతారనే వాదన చాలాకాలంగా వినిపిస్తోంది. రాహుల్ రాయ్‌బరేలీతో పాటు కేరళలోని వయనాడ్ స్థానం నుంచి కూడా విజయం సాధించారు. ఉత్తరప్రదేశ్‌లోని 17 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేసింది. అందులో ఆరుగురు ఎంపీలుగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు 6.36 శాతం నుంచి 9.46 శాతానికి పెరిగింది. దాదాపు 40 ఏళ్ల తర్వాత ప్రయాగ్‌రాజ్, సహరాన్‌పూర్‌లలో కాంగ్రెస్ ఖాతా తెరిచింది.రాయ్‌బరేలీలో రాహుల్ గాంధీకి 66.17 శాతం ఓట్లు రాగా, 2019లో సోనియా గాంధీకి ఇదే సీటు నుంచి 55.80 శాతం ఓట్లు వచ్చాయి. 2019లో రాహుల్ గాంధీ అమేథీలో ఓటమిని చవిచూశారు. అయితే ఈసారి గాంధీ కుటుంబానికి సన్నిహుతుడైన కిషోరి లాల్ శర్మ 54.99 శాతం ఓట్లు దక్కించుకున్నారు. ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్ రాయ్‌బరేలీలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తోంది. దీనిలో రాహుల్ తాను రాయ్ బరేలీ ఎంపీగా కొనసాగుతాననే సందేశాన్ని ఇస్తారని పలువురు కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.భూమా అతిథి గృహంలో జరిగే ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ, రాయ్‌బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, అమేథీ ఎంపీ కేఎల్ శర్మ, రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ రాయ్, ఇతర సీనియర్ నేతలు, కార్యకర్తలు పాల్గొననున్నారు. -
లోక్‌సభలో ఏకైక ఎంపీ దంపతుల జంట.. అందరి దృష్టి వీరిపైనే?
ఎన్నికల పోరులో వేర్వేరు స్థానాల నుంచి గెలిచి లోక్‌సభకు చేరుకునే దంపతులు చాలా అరుదుగా కనిపిస్తారు. అయితే ఈసారి 18వ లోక్‌సభలో యూపీ నేత అఖిలేష్ యాదవ్, ఆమె భార్య డింపుల్ యాదవ్ పార్లమెంట్లో అడుగుపెట్టనున్నారు. ఈ నేపధ్యంలో ఈ జంట ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆయన భార్య డింపుల్ యాదవ్ ఒకేసారి లోక్‌సభకు ఎన్నికవడం ఇదే తొలిసారి. అఖిలేష్ తన సంప్రదాయ స్థానమైన కన్నౌజ్ నుంచి ఎంపీగా ఎన్నిక కాగా, అతని భార్య డింపుల్ యాదవ్ మెయిన్‌పురి స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో వీరిద్దరూ రికార్డు స్థాయి ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఎస్పీ నుంచి అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలుపొందిన ఎంపీల్లో డింపుల్ యాదవ్ అగ్రస్థానంలో ఉన్నారు. తరువాతి స్థానంలో ఆమె భర్త అఖిలేష్ యాదవ్ ఉండటం విశేషం.లోక్‌సభ కార్యకలాపాల సమయంలో ఇద్దరూ సభలో కూర్చున్నప్పుడు పలువురి దృష్టి వీరిపై నిలవనుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ అజామ్‌గఢ్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. అదే సమయంలో డింపుల్ యాదవ్ కన్నౌజ్ నుంచి పోటీ చేసినా, విజయం సాధించలేకపోయారు. అయితే ఎస్పీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ మరణంతో మెయిన్‌పురి సీటు ఖాళీ అయ్యింది. అప్పుడు అక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించి డింపుల్ యాదవ్ లోక్‌సభకు చేరుకున్నారు.అఖిలేష్ యాదవ్ తొలిసారిగా తన భార్యతో కలిసి లోక్‌సభకు హాజరుకావడమే కాకుండా, ఈసారి ఆయనతో పాటు ఆయన ముగ్గురు సోదరులు కూడా ఎంపీలుగా సభకు రానున్నారు. కన్నౌజ్ నుంచి అఖిలేష్ యాదవ్, మెయిన్‌పురి నుంచి డింపుల్ యాదవ్, అజంగఢ్ నుంచి ధర్మేంద్ర యాదవ్, ఫిరోజాబాద్ నుంచి అక్షయ్ యాదవ్, బదౌన్ నుంచి ఆదిత్య యాదవ్‌లు ఎంపీలుగా ఎన్నికయ్యారు. ఈ విధంగా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఎంపీలుగా లోక్‌సభలోకి అడుగుపెట్టడం మరో రికార్డు కానుంది. -
కేంద్ర సహాయక శాఖ మంత్రిగా సురేష్ గోపి
కేరళ బీజేపీ ఎంపీ, ప్రముఖ నటుడు సురేష్ గోపి సాంస్కృతిక సహాయక శాఖ పదవి దక్కించుకున్నారు. అయితే ఆదివారం (జూన్ 9న) మోదీ 3.0లో కేంద్ర సహాయ శాఖ మంత్రిగా సురేష్ గోపి తన పదవికి రాజీనామా చేస్తున్నారంటూ పలు మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. అయితే రాజీనామా వార్తల్ని సురేష్ గోపి ఖండించారు. ‘నేను కేంద్ర సహాయ మంత్రి పదవికి రాజీనామా చేయబోతున్నామంటూ పలు మీడియా సంస్థలు కథనాల్ని ప్రచారం చేశాయి. ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. అవి పూర్తిగా తప్పుడు కథనాలు’ అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో మేం కేరళ అభివృద్ధి శ్రేయస్సు కోసం కట్టుబడి ఉన్నాము అని గోపి అన్నారు. -
మోదీ కేబినెట్లో ఇదొక సర్ప్రైజ్ ప్యాక్!
కేంద్ర మంత్రివర్గంలో చోటు పొందడం అంటే అది ఒక అత్యున్నత స్థానానికి చేరుకున్నట్లు లెక్క. దేశం అంతటిని ప్రభావితం చేయడానికి అవకాశం ఉంటుంది. ఈసారి ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల నుంచి ఐదుగురికి అవకాశం దక్కింది. ముగ్గురు బీజేపీకి చెందినవారు కాగా, ఇద్దరు టీడీపీవారు. తెలుగుదేశం పార్టీ నాలుగు మంత్రి పదవులు ఆశించినా రెండు మాత్రమే లభించాయి. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఏపీ నుంచి కె రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస వర్మలకు చోటు లభించింది.వీరిలో అనూహ్యమైన పేరు వర్మ అని చెప్పాలి. కొంతకాలం క్రితం వరకు ఆయన ఏపీలో ఒక సాధారణ నేత. భీమవరం ప్రాంతంలో బాగా తెలిసిన వ్యక్తే అయినా, ఇంత వేగంగా ఆయన కేంద్ర మంత్రివర్గంలో సభ్యుడు అవుతారని ఎవరూ ఊహించలేదు. రాజకీయాలలో ఎప్పుడు ఎవరికి అవకాశం వస్తుందో చెప్పలేమనడానికి వర్మ ఒక ఉదాహరణ అవుతారు. ఆయన మొదటి నుంచి భారతీయ జనతా పార్టీలోనే ఉన్నారు. ఆయన టీవీ షోలలో బీజేపీ తరపున చర్చలలో పాల్గొంటుండేవారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడుగా పనిచేశారు. తదుపరి పార్టీ రాష్ట్ర నాయకుడుగా కొనసాగుతున్నారు.తెలుగుదేశంతో పొత్తు కుదిరిన తర్వాత బీజేపీకి కేటాయించిన నరసాపురం నుంచి ఎంపీ పదవికి పోటీచేయాలని వైఎస్సార్సీపీ దూరం అయిన సిట్టింగ్ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు గట్టి ప్రయత్నం చేశారు. ఆయన కూటమిలోని మూడు పార్టీలలో ఏదో ఒక పక్షం సీటు ఇస్తుందని ఆశించారు. బీజేపీ అధిష్టానం ఆయన వైపు మొగ్గు చూపలేదు. ఆయన బీజేపీ సభ్యుడు కాదని అందువల్లే టిక్కెట్ ఇవ్వలేదని ఆ పార్టీవారు చెప్పినా, అది సాకు అని చాలా మంది భావించారు. దాంతో రఘురామ టీడీపీలో చేరి ఉండి స్థానం నుంచి పోటీచేసి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.వర్మ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. నరసాపురంలో క్షత్రియ వర్గానికి చెందిన నేతకు టిక్కెట్ ఇవ్వాలని నిర్ణయించుకున్న తర్వాత అక్కడ ఉన్న వారిలో ఈయనే ప్రముఖుడుగా తెరపైకి వచ్చారు. బహుశా వర్మ కూడా ఊహించి ఉండకపోవచ్చు. వర్మను మార్చించాలని కొంతమంది ప్రయత్నం చేయకపోలేదు. అయినప్పటికీ, పార్టీ కోసం నిలబడిన వ్యక్తిగా వర్మ వైపే బీజేపీ అధిష్టానం మొగ్గు చూపింది. తద్వారా పార్టీలో కష్టపడి పనిచేసేవారికి, సుదీర్ఘకాలం పార్టీలో ఉన్నవారికి అవకాశాలు వస్తాయన్న నమ్మకం కలిగించారు. వర్మ ఇక్కడ నుంచి గెలుస్తారా? లేదా? అనే సంశయం తొలుత ఉన్నప్పటికీ, వైఎస్సార్సీపీ తన అభ్యర్ధిగా బీసీ నేతను ఎంపిక చేసుకోవడం వర్మకు కలిసి వచ్చిందని చెప్పాలి.నరసాపురంలో ఎక్కువసార్లు క్షత్రియవర్గం వారే ఎంపీలు అవుతూ వచ్చారు. ఆ సామాజికవర్గం తక్కువ సంఖ్యలోనే ఉన్నా, వారి పలుకుబడి చాలా పెద్దదిగా భావిస్తారు. అదంతా వర్మకు ప్లస్ పాయింట్ అయింది. మనిషి కూడా సౌమ్యుడుగా పేరొందారు. అన్నీ కలిసి వచ్చి వర్మ ఎంపీగా గెలుపొందడమే కాకుండా ఏకంగా కేంద్ర మంత్రి అయిపోయారు. ఇది కలయో, నిజమో అనుకునేంతలోనే ఈ రాజకీయ పరిణామాలు జరిగిపోయాయి. రాజకీయాలలో కాకలు తీరిన సీ.ఎమ్ రమేష్, పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిలను కాదని వర్మవైపు బీజేపీ మొగ్గుచూపి కేంద్రంలో స్థానం కల్పించారు. ఒకరకంగా రమేష్, పురందేశ్వరిలకు కాస్త అసంతృప్తి కలిగించే అంశమే అయినా, దాని గురించి మాట్లాడకపోవచ్చు.పురందేశ్వరి కాంగ్రెస్ హయాంలో మన్మోహన్ సింగ్ క్యాబినెట్ లో మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆమె బీజేపీలో చేరి 2014, 2019లలో పోటీచేసినా గెలవలేకపోయారు. అయినా పార్టీలో జాతీయ స్థాయిలో క్రియాశీలక పాత్ర పోషించారు. తదుపరి ఆమెను ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా నియమించారు. దాంతో ఆమెకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. మాజీ సీఎం ఎన్.టి రామారావు కుమార్తెగా కూడా ఆమె అందరికి తెలిసిన నేతగా ఉన్నారు. తెలుగుదేశంతో పొత్తు కుదర్చడంలో ఆమె గట్టి ప్రయత్నం చేశారు. అందుకు అధిష్టానం కూడా అంగీకరించింది. ఆమె రాజమండ్రి నుంచి పోటీచేసి విజయం సాధించారు. ఆమెకు కచ్చితంగా మంత్రి పదవి వస్తుందని చాలా మంది అనుకున్నారు. కారణం ఏమో కానీ ఆమెకు అవకాశం రాలేదు. స్పీకర్ లేదా, డిప్యూటి స్పీకర్ వంటి పదవి ఏదైనా వస్తుందా అని ఆమె మద్దతుదారులు ఆశిస్తున్నారు.ఇక మరో కీలకమైన నేత సీఎం రమేష్. ఆయన రాజకీయ జీవితం అంతా తెలుగుదేశంతో ముడిపడి ఉంది. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు సొంత మనిషిగా గుర్తింపు పొందారు. 2019 ఎన్నికలలో టీడీపీ పరాజయం తర్వాత వ్యూహాత్మకంగా బీజేపీలో చేరారు. ఆ పార్టీలో ఉంటూ చంద్రబాబు ప్రయోజనాలను పరిరక్షించడంలో ముఖ్యభూమిక పోషించారని చాలామంది విశ్వసిస్తారు. అలాగే టీడీపీతో పొత్తు పెట్టుకునేలా అధిష్టానాన్ని తనదైన శైలిలో ప్రభావితం చేశారని చెబుతారు. ఆ తర్వాత ఆయన వ్యూహాత్మకంగా అనకాపల్లి స్థానాన్ని ఎంపిక చేసుకుని బీజేపీ టిక్కెట్ సాధించగలిగారు.కడప జిల్లాకు చెందినవారైనప్పటికీ, తన అంగ, అర్ధ బలంతోపాటు, అక్కడ ఉన్న టీడీపీ నేతలంతా తనకు బాగా తెలిసినవారే కావడంతో ఆయనకు కలిసి వచ్చింది. ఫలితంగా ఆయన విజయం సాధించిన తర్వాత కచ్చితంగా ఆయనకున్న పలుకుబడి రీత్యా కేంద్ర మంత్రి పదవి పొందుతారని చాలామంది భావించారు. కానీ బీజేపీ అధిష్టానం ఆయనకు పదవి ఇవ్వలేదు. తెలుగుదేశం పక్షాన కింజారపు రామ్మోహన్ నాయుడు మూడోసారి లోక్ సభకు ఎన్నికై మోదీ మంత్రివర్గంలో క్యాబినెట్ హోదా పొందారు. ఇది అరుదైన విషయమే. ముప్పై ఆరేళ్ల వయసులోనే ఈ స్థాయికి రావడం గొప్ప సంగతే.రామ్మోహన్ నాయుడు తండ్రి ఎర్రన్నాయుడు కూడా కేంద్రంలో యునైటెడ్ ప్రంట్ టైమ్ లో మంత్రి పదవి చేశారు. వాజ్ పేయి ప్రభుత్వ టైమ్ లో స్పీకర్ అవుతారని భావించారు. కానీ ఆ పదవి జి.ఎమ్.సి బాలయోగిని వరించింది. బాలయోగి అనూహ్య మరణం తర్వాత ఆ పదవి వస్తుందని ఆశించారు. కానీ గుజరాత్ పరిణామాల నేపథ్యంలో పదవి తీసుకోవడానికి చంద్రబాబు అంగీకరించలేదు. దాంతో ఎర్రన్నాయుడు కు మళ్లీ అవకాశం రాలేదు. ఇప్పుడు ఆయన కుమారుడు రామ్మోహన్ నాయుడుకు పదవి దక్కడం విశేషం. తండ్రి రాజకీయ వారసత్వంతో పాటు, కేంద్రంలో పదవి కూడా దక్కించుకున్నారు. తెలుగుతోపాటు ఆంగ్లం, హిందీ భాషలలో పట్టు ఉండడం ఈయనకు కలిసి వచ్చే పాయింట్ అని చెప్పాలి. యువకుడు, పార్టీకి కట్టుబడి పనిచేయడం ప్లస్ అయింది. టీడీపీ ఎంపీలలో వరసగా మూడుసార్లు ఎంపీ అయిన వ్యక్తి ఈయనే. ఉత్తరాంధ్రలో బీసీ వర్గానికి చెందిన నేతగా గుర్తింపు పొందారు. గుంటూరు నుంచి ఈసారి గల్లా జయదేవ్ పోటీచేయకపోవడంతో రామ్మోహన్ కు పోటీ లేకపోయిందని చెప్పవచ్చు. గుంటూరు నుంచి గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్ కు కూడా కేంద్రంలో పదవి రావడం విశేషం. ఎన్డీయే అధికారంలోకి రావడంతో ఈయనకు చాన్స్ వస్తుందన్న భావన ఏర్పడింది. దానికి తగ్గట్లే టీడీపీ నాయకత్వం ఈయనకు అవకాశం కల్పించింది. ఆరువేల కోట్ల సంపద కలిగిన నేతగా ప్రచారంలో ఉన్న ఈయన కేంద్రంలో మంత్రి అయ్యారు. జనసేన నుంచి వి. బాలశౌరి కేంద్ర మంత్రి అవుతారని ప్రచారం జరిగినా ఎందుకో కాలేకపోయారు. ఆయన గతంలో వైఎస్సార్సీపీ ఎంపీగా ఉండేవారు. ఈ ఎన్నికలలో జనసేన నుంచి మచిలీపట్నంలో గెలుపొందారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి తీసుకోవడానికి ప్రస్తుతం సిద్దపడలేదని, అందుకే బాలశౌరికి అవకాశం రాలేదని మీడియాలో వార్తలు వచ్చాయి.తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోసారి పదవి దక్కించుకున్నారు. 2018 తెలంగాణ శాసనసభ ఎన్నికలలో అంబర్ పేట నుంచి ఓటమి చెందడమే ఈయనకు వరం అయింది. ఆ తర్వాత 2019 లోక్ సభ ఎన్నికలలో సికింద్రాబాద్ నుంచి పోటీచేసి విజయం సాధించడం, మోదీ మంత్రి వర్గంలో చోటు దక్కడం జరిగిపోయాయి. ఆ రకంగా ఈయన రాజకీయ భవిష్యత్తు మారిపోయింది. పార్టీ కార్యకర్తగా జీవితాన్ని ఆరంభించి కేంద్రంలో క్యాబినెట్ హోదాకు ఎదిగిన నేత ఈయన. ప్రజలతో మమేకం అవడం ద్వారా ఆదరణ చూరగొన్నారు. మరో నేత బండి సంజయ్ కు కేంద్రంలో స్థానం లభించింది. బీసీ వర్గానికి చెందిన ఈయన రాజకీయ ప్రస్తానం కరీంనగర్ మున్సిపల్ రాజకీయాల నుంచి కావడం విశేషం.అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి పొందినా, తదుపరి కరీంనగర్ నుంచి లోక్ సభకు ఎన్నికవడం, ఆ తర్వాత తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కావడం ఒక సంచలనం. ఫైర్ బ్రాండ్ గా అనతికాలంలోనే పేరొందిన ఈయన అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వంపై పెద్ద పోరాటాలే సాగించారు. ఈయనను బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించడం అందరిని ఆశ్చర్యపరచింది. దాంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ విజయావకాశాలు దెబ్బతిన్నాయన్న అభిప్రాయం ఏర్పడింది. దానిని గుర్తించిన పార్టీ నాయకత్వం పార్టీలో జాతీయ హోదా కల్పించింది. తిరిగి ఇప్పుడు కేంద్ర మంత్రివర్గంలో అవకాశం ఇచ్చింది.సీనియర్ నేత డీకే అరుణ, మరో నేత ఈటల రాజేందర్ లు కూడా కేంద్రంలో పదవులు ఆశించారు. కానీ దక్కలేదు. కిషన్ రెడ్డికి పదవి ఇచ్చినందున అరుణకు అవకాశం ఉండదు. అలాగే బండి సంజయ్ కు లభించిన తర్వాత ఈటలకు చాన్స్ రాదు. కాకపోతే ఈటలకు పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వవచ్చని ప్రచారం జరుగుతోంది. ఓడలు బండ్లు అవుతాయి.. బండ్లు ఓడలు అవుతాయని చెప్పడానికి ఈటల రాజకీయ జీవితం కూడా ఉదాహరణే. కేసీఆర్ ప్రభుత్వం నుంచి బర్తరఫ్ అయిన తర్వాత జరిగిన పరిణామాలలో ఆయన గడ్డు పరిస్థితి ఎదుర్కున్నారు. ఒక షెల్టర్ గా ఉంటుందని భావించి బీజేపీలో చేరారు. అది ఆయనకు కలసి వచ్చింది. గత శాసనసభ ఎన్నికలలో ఓటమి చెందినా, మల్కాజిగిరి నుంచి ఎంపీ కాగలిగారు.మొత్తం మీద చూస్తే బీజేపీలో మొదటి నుంచి ఉన్న నేతలకే మోదీ ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తుంది. కిషన్ రెడ్డి, బండి సంజయ్, భూపతిరాజు శ్రీనివాస వర్మలకు అందుకే పదవులు దక్కాయి. దగ్గుబాటి పురందేశ్వరి, సీఎం రమేష్, డి.కె అరుణ, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి వంటి నేతలు ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన నేతలు కావడం గమనార్హం. టీడీపీ నుంచి ఒక బీసీ నేతకు, బీజేపీ నుంచి మరో బీసీ నేతకు అవకాశం వచ్చింది. ముగ్గురు అగ్రవర్ణాల వారికి మంత్రి పదవులు దక్కాయి. వీరందరికి అభినందనలు చెబుదాం.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
అమాంతం పెరిగిన చిరాగ్ ఫ్యాన్ ఫాలోయింగ్
ఇది సోషల్ మీడియా యగం. దీనిలో ఫాలోవర్స్‌ను పెంచుకునేందుకు చాలామంది తాపత్రయ పడుతుంటారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా తమ ప్రతిభను చాటుతున్న పలువురు ఫ్యాన్ ఫాలోయింగ్ కోసం ఎదురు చూస్తుంటారు. అయితే ఎన్నికల నేపధ్యంలో బీహార్‌కు చెందిన లోక్ జనశక్తి పార్టీ నేత చిరాగ్ కుమార్ పాశ్వాన్‌కు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోవర్స్ సంఖ్య అమాంతం పెరిగింది.చిరాగ్ కుమార్ పాశ్వాన్ కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బీహార్‌లోని జముయి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆయన విజయం సాధించారు. లోక్‌సభ ఎన్నికల ప్రకటన వచ్చినది మొదలు చిరాగ్‌కు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ నిరంతరం పెరుగుతూ వచ్చింది. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ (ఎక్స్) తదితర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో చిరాగ్ అభిమానుల సంఖ్య విపరీతంగా పెరిగింది.చిరాగ్ పాశ్వాన్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ప్రకారం ఆయన ఈ ఏడాది మే 26 నాటికి ఒక మిలియన్ (10 లక్షలు) ఫాలోవర్లను సంపాదించుకున్నారు. తాజాగా చిరాగ్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 2.8 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. తనకు పెరుగుతున్న ఫాలోవర్ల గురించి చిరాగ్ తన సోషల్ మీడియా హ్యాండిల్ ఇన్‌స్టాలో సమాచారం ఇచ్చారు.చిరాగ్ పాశ్వాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో కేవలం నలుగురిని మాత్రమే అనుసరిస్తున్నారు. అర్జున్ భారతి, నరేంద్ర మోదీ, రామ్ విలాస్ పాశ్వాన్, అమిత్ షాలను చిరాగ్ అనుసరిస్తున్నారు. తన ఇన్‌స్టాలో చిరాగ్ మొత్తం 2,076 పోస్ట్‌లను షేర్ చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ (ట్విట్టర్)లో 93 లక్షల 27 వేలమంది ఫాలోవర్లు ఉన్నారు. ఎక్స్‌లో పాశ్వాన్ 112 మందిని అనుసరిస్తున్నారు. చిరాగ్‌కు ఫేస్బుక్లో ఏడు లక్షలమంది ఫాలోవర్లు ఉన్నారు. -
‘శిరోముండనం’ ప్రకటన వెనక్కి తీసుకున్న ఆప్ నేత
ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ఎంపికైతే తాను శిరోముండనం చేయించుకుంటానని ప్రకటించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత సోమనాథ్ భారతి ఇప్పుడు తన నిర్ణయంపై యూ టర్న్ తీసుకున్నారు. అంతేకాదు దీనివెనుకగల కారణాన్ని కూడా వివరించారు.నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అయితే తాను గుండు కొట్టించుకుంటానని ఆప్ నేత సోమనాథ్ భారతి ఎగ్జిట్ పోల్స్ వెలువడిన రోజున ప్రకటించారు. అయితే ఇప్పుడు ప్రధాని మోదీ మూడోమారు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన నేపధ్యంలో పలువురు సోమనాథ్ భారతిని శిరోముండనం ఎప్పుడు చేయించుకుంటారని అడుగుతున్నారు.ఈ నేపధ్యంలో సోమనాథ్ భారతి దీనికి సమాధానమిస్తూ, తాను శిరోముండనం చేయించుకోవాల్సిన అవసరం లేదని, ఎందుకంటే ప్రధాని మోదీ తన సొంత సత్తాతో విజయం సాధించలేదని, ఇది ఎన్డీఏ మిత్రపక్షాల ఏకీకృత విజయమేనని అన్నారు. లోక్‌సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వెలువడిన సమయంలో ఢిల్లీ లోక్‌సభ ఆప్ అభ్యర్థి సోమనాథ్ భారతి మీడియాతో మాట్లాడుతూ నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అయితే తాను గుండు కొట్టించుకుంటానని ప్రకటించారు.జూన్ 4న ఓట్ల లెక్కింపు తర్వాత ఎగ్జిట్ పోల్స్ తప్పని తేలిపోతుందని సోమనాథ్ పేర్కొన్నారు. ఢిల్లీలోని ఏడు స్థానాల్లో భారత కూటమి విజయం సాధిస్తుందని కూడా సోమనాథ్ భారతి చెప్పారు. కాగా న్యూఢిల్లీ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి, సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరీ స్వరాజ్ చేతిలో సోమనాథ్ భారతి ఓటమి పాలయ్యారు. -
2027 అసెంబ్లీ ఎన్నికలపై అఖిలేష్ దృష్టి
2024 లోకసభ ఎన్నికలు ముగియగానే ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ 2027 అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించారు. ఈ మేరకు కొత్తగా ఎన్నికైన ఎస్ఫీ ఎంపీలకు పలు సూచనలు చేశారు.ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2027లో జరగనున్నాయి. ఈ నేపధ్యంలో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ తమ పార్టీ నుంచి కొత్తగా ఎంపికైన ఎంపీలతో మాట్లాడుతూ రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రజల మధ్య ఉంటూ, వారి సమస్యలు విని, పరిష్కారానికి కృషి చేయాలని, అప్పుడే భవిష్యత్‌లో విజయం సాధిస్తామని పేర్కొన్నారు.లక్నోలోని ఎస్పీ ప్రధాన కార్యాలయంలో తమ పార్టీ నుంచి కొత్తగా ఎన్నికైన ఎంపీలతో అఖిలేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ్‌వాదీ పార్టీకి పెద్దఎత్తున ప్రజల మద్దతు లభించిందన్నారు. దీంతో సోషలిస్టుల బాధ్యత మరింతగా పెరిగిందని, ప్రజలు చెప్పే విషయాన్ని వినాలని, వారి సమస్యలను పార్లమెంట్లో లేవనెత్తాలని పిలుపునిచ్చారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలోని 80 సీట్లకు గాను ఎస్పీ 37 సీట్లు గెలుచుకోగా, దాని మిత్రపక్షం కాంగ్రెస్ ఆరు సీట్లు దక్కించుకుంది. -
మోదీ నూతన క్యాబినెట్లో అనుప్రియ పటేల్
ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా నేడు (ఆదివారం) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రధాని మోదీతో పాటు పలువురు ఎంపీలు కూడా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అప్నాదళ్ (ఎస్) నాయకురాలు అనుప్రియా పటేల్ మోదీ కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. ఇంతకీ అనుప్రియా పటేల్ ఎవరు?అనుప్రియా పటేల్ ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో 1981 ఏప్రిల్ 28న జన్మించారు. ‘అప్నా దళ్’ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. అనుప్రియ తన విద్యను లేడీ శ్రీ రామ్ కాలేజ్ ఫర్ ఉమెన్, ఛత్రపతి సాహూ జీ మహారాజ్ విశ్వవిద్యాలయంలో పూర్తి చేశారు. ఆమె సైకాలజీలో మాస్టర్స్ డిగ్రీ, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ) పూర్తి చేశారు.ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ పార్లమెంట్ స్థానం నుంచి అప్నాదళ్ (ఎస్) అధ్యక్షురాలు అనుప్రియా పటేల్‌కు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) ఈసారి టికెట్ ఇచ్చింది. అనుప్రియ పటేల్ 37,810 ఓట్ల తేడాతో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అభ్యర్థి రమేష్ చంద్ బింద్‌పై విజయం సాధించారు. ఎన్డీఏ అభ్యర్థిగా పటేల్ వరుసగా మూడోసారి ఇక్కడ నుంచి విజయం సాధించారు. గతంలో అంటే 2014, 2019 ఎన్నికల్లో కూడా ఆమె ఇక్కడి నుంచే గెలుపొందారు.వెనుకబడిన కుర్మీ వర్గానికి చెందిన ప్రముఖ నేత, అప్నా దళ్ వ్యవస్థాపకుడు, దివంగత డాక్టర్ సోనేలాల్ పటేల్ కుమార్తె అనుప్రియా పటేల్. ఈ పార్టీ ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీలో బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీల తర్వాత మూడవ అతిపెద్ద పార్టీ. 2009లో తన తండ్రి మరణించినప్పటి నుంచి ఆమె ‘అప్నాదళ్’ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. -
ఈసారి లోక్‌సభలో ముస్లిం ఎంపీలు ఎందరు?
దేశంలోని అన్ని రంగాల్లో ముస్లింల ప్రాతినిధ్యం కనిపిస్తుంది. రాజకీయాల్లోనూ దీనికి మినహాయింపేమీ లేదు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి పోటీచేసిన ముస్లిం అభ్యర్థులలో ఎందరు విజయం సాధించారు? వీరిలో ఏ పార్టీకి లేదా కూటమికి చెందినవారు ఎందరున్నారు?2024 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 24 మంది ముస్లిం అభ్యర్థులు ఎంపీలుగా ఎన్నికయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే ఈ సంఖ్య ఈ ఏడాది రెండుకు తగ్గింది. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే, వీరిలో ఒక్క ఎంపీ కూడా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకి చెందినవారు లేరు. ఈ 24 మంది లోక్‌సభ ఎంపీలలో 21 మంది ఇండియా అలయన్స్‌కు చెందిన వారే కావడం విశేషం.ఈ జాబితాలో తొమ్మిది మంది ముస్లిం ఎంపీలతో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఐదుగురు ముస్లిం ఎంపీలు ఉన్నారు. నలుగురు ముస్లిం ఎంపీలు సమాజ్‌వాదీ పార్టీకి, ఇద్దరు ఇండియన్ ముస్లిం లీగ్‌కు, ఒకరు నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందినవారున్నారు. అలాగే అసదుద్దీన్ ఒవైసీ ఏఐఎంఐఎంకు చెందిన ముస్లిం ఎంపీ. ఇద్దరు ముస్లిం ఎంపీలు స్వతంత్రులుగా ఎన్నికయ్యారు.ఈసారి లోక్‌సభలో ముస్లింల వాటా కేవలం 4.42 శాతానికి తగ్గింది. 1980 లోక్‌సభ ఎన్నికల్లో అత్యధికంగా 49 మంది ముస్లిం ఎంపీలు విజయం సాధించారు. 1984 లోక్‌సభ ఎన్నికల్లో 45 మంది ముస్లిం ఎంపీలుగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ముస్లిం ఎంపీల సంఖ్య 40కి మించలేదు. 2014లో 11 ప్రధాన పార్టీలు మొత్తం 82 మంది ముస్లిం అభ్యర్థులను నిలబెట్టాయి. వీరిలో 16 మంది అభ్యర్థులు విజయం సాధించారు. 2019లో ఈ పార్టీలు 115 మంది అభ్యర్థులను నిలబెట్టగా, అప్పుడు 16 మంది అభ్యర్థులు మాత్రమే గెలుపొందారు. -
వయనాడ్‌కే రాహుల్ టాటా!
లోక్ సభ ఎన్నికలలో యూపీలోని రాయ్‌బరేలీ, కేరళలోని వయనాడ్ నుంచి మూడు లక్షల పైచిలుకు మెజారిటీ గెలుపు సాధించిన రాహుల్ గాంధీ.. రూల్స్ ప్రకారం ఏదో ఒక సీటును వదులుకోవాల్సిన పరిస్థితి. అయితే ఇవాళ జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(CWC) భేటీలో ఈ అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. ఆయన కేరళ వయనాడ్ సీటునే వదులుకోబోతున్నారని తెలుస్తోంది. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం.. ఒకరు ఒక స్థానం కంటే ఎక్కువ చోట్ల నుంచి పోటీ చేయొచ్చు. కానీ, ప్రాతినిధ్యం మాత్రం ఒక్క స్థానం నుంచే వహించాలి. ఫలితాలు వెలువడిన 14 రోజుల్లో ఒక స్థానానికి కచ్చితంగా రాజీనామా చేయాలి. అలా జరగని పక్షంలో ఆ రెండు స్థానాలను ఆ వ్యక్తి కోల్పోవాల్సి వస్తుంది. అయితే అటు కేరళ, ఇటు ఉత్తర ప్రదేశ్ సీనియర్లు మాత్రం రాహుల్ తమ రాష్ట్రంలోనే కొనసాగాలని ఆకాంక్షిస్తున్నారు. సీడబ్ల్యూసీ భేటీలో యూపీ కాంగ్రెస్ నేత ఆరాధన మిశ్రా.. రాయ్‌బరేలీ గాంధీ కుటుంబానికి చెందిందని, కాబట్టి దానిని వదులుకోకూడదని సూచించారు. అయితే 80 లోక్‌సభ సీట్లున్న ఉత్తర ప్రదేశ్‌లో పార్టీని పటిష్టం చేయడానికి రాహుల్ కొనసాగాల్సిన అవసరం ఉందని పలువురు కోరారు. మరోవైపు కేరళ నేతలు కూడా వయనాడ్ నుంచే కొనసాగాలని కోరినట్లు తెలుస్తోంది. ఇక్కడి నుంచి రెండోసారి గెలిపించినందున ఈ సీట్లోనే కొనసాగాలని కేరళ కాంగ్రెస్ నాయకులు విజ్ఞప్తి చేశారు. అయితే. ఉత్తర ప్రదేశ్‌లో పార్టీ అభివృద్ధిపై దృష్టి సారించడం కోసం ఈ సీటును అట్టిపెట్టుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుస్తోంది. యూపీపై దృష్టి సారించాల్సి ఉందన్న అధిష్ఠానం సూచనల మేరకు కేరళ కాంగ్రెస్ నాయకులు కూడా ఆ తర్వాత అందుకు అంగీకరించారని తెలుస్తోంది.మరోవైపు, రాహుల్ గాంధీ వదులుకుంటే కనుక, అదే వయనాడ్ నుంచి ప్రియాంకా గాంధీని పోటీ చేయించాలన్న విజ్ఞప్తిని కూడా గాంధీ కుటుంబం తిరస్కరించిందని చెబుతున్నారు. కేరళకు చెందిన సీనియర్ నేతను ఇక్కడి నుంచి బరిలోకి దించాలని భావిస్తున్నారు. వచ్చేవారం రాయ్ బరేలీలో సోనియా కుటుంబం పర్యటించనుంది. ఆ తర్వాతే రాహుల్ గాంధీ ఏ సీటును వదులుకుంటారనేదానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. జూన్ 17వ తేదీలోపు దీనిపై స్పష్టమైన ప్రకటన వెలువడనుంది. -
రాజకీయ వారసత్వంపై నవీన్ పట్నాయక్ క్లారిటీ
బీజూ జనతా దళ్‌లో నవీన్ పట్నాయక్ తర్వాత ఎవరు? ఇదే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చలకు.. కొనసాగింపుగా వస్తున్న విమర్శలకు నవీన్ పట్నాయక్ పుల్‌స్టాప్ పెట్టారు. తన రాజకీయ వారసత్వంపై స్పష్టత ఇచ్చారు.బిజూ జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్ రెండు దశాబ్ధాలకు పైగా సీఎంగా కొనసాగారు. ఇప్పటికే ఐదు సార్లు సీఎం పదవిని చేపట్టారు. తాజాగా ఎన్నికల్లో బీజేడీ గెలిచినట్లైతే మరోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. కానీ ఫలితం తారుమారు కావడంతో అధికార పీఠానికి దూరమయ్యారు.ఈ తరుణంలో తన ముఖ్యమంత్రి పదవికి నవీన్ పట్నాయక్ రాజీనామా చేశారు. ఓటమి తర్వాత ఇవాళ తొలిసారి మీడియా ముందుకు వచ్చారాయన. ఎన్నికల ఫలితాలపై పట్నాయక్ మాట్లాడుతూ, ఇంతకాలం పార్టీ సాధించిన విజయాల పట్ల గర్వంగా ఉంది. ఒడిషాలో చాలా అద్భుతంగా పనిచేశాం. ప్రజాస్వామ్యంలో గెలుపుఓటముల్ని ప్రజలే నిర్ధేశిస్తారు. సుదీర్ఘ కాలం తర్వాత మేం ఓడిపోయాం. కాబట్టి, ఈ తీర్పును గౌరవిస్తున్నాం అని వ్యాఖ్యానించారు.వీకే పాండ్యన్‌పై విమర్శలు.. దురదృష్టకరం‘వీకే పాండియన్‌పై పలు విమర్శలున్నాయి ఇది దురదృష్టకరం. పాండ్యన్ రాష్ట్రంలో ఆరోగ్యం, విద్య, క్రీడలు, ఆలయ పునరుద్ధరణ కార్యక్రమాల్లో కీలకంగా పనిచేశారు. బ్యూరోక్రాట్ నుంచి బీజేడీ పార్టీలో చేరారు. కానీ ఎలాంటి పదవులు ఆశించలేదు. ఇక నా వారసుడు ఎవరనే అంశంపై చర్చ జరుగుతోంది. ఆ చర్చను కొనసాగించడం ఇష్టం లేదు. పాండియన్ నా వారసుడు కాదు. ఒడిశా ప్రజలే నా వారసుడు ఎవరో నిర్ణయిస్తారని చెప్పారు. పాండియన్ సేవల్ని మరువలేంఈ సందర్భంగా వీకే ప్యాండన్ ఐఏఎస్ అధికారిగా రాష్ట్రానికి చేసిన సేవల్ని మరోసారి గుర్తు చేశారు. అధికారిగా, అతను అద్భుతంగా పని చేశారు. రాష్ట్రంలో రెండు తుఫానులు,కోవిడ్-19 కష్టకాలంలో ఆయన చేసిన సేవల్ని మరువలేం. బ్యూరోక్రాట్‌గా పదవి విరమణ చేసి బీజేడీలో చేరారు. చిత్తశుద్ది, నిజాయితీ గల వ్యక్తి. ఆయన్ని మనం గౌరవించాలి అని నొక్కి చెప్పారు. 24ఏళ్ల తర్వాత ఓటమిఒడిశాలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో నవీన్ పట్నాయక్ 24 ఏళ్ల తర్వాత ఓటమి పాలయ్యారు. 147 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 78, బీజేడీ51, కాంగ్రెస్ 14, మూడు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో నవీన్ పట్నాయక్ తన పదవికి దూరం అయ్యారు.వీకే పాండ్యన్ మిస్సింగ్ఒడిశా ఎన్నికల ఫలితాలు విడుదలైన నాటి నుంచి వీకే పాండ్యన్ అజ్ఞాతంలోకి వెళ్లారు. ఎవరికీ అందుబాటులో లేకపోవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.సాధారణంగా పట్నాయక్ ఎక్కడికి వెళ్లినా ఆయన వెన్నంటే ఉంటారనే పేరుంది. కానీ పట్నాయక్ ఒంటరిగా రాజ్‌భవన్‌కు వెళ్లి రాజీనామా సమర్పించడంతో వీకే పాండ్యన్ ఇక ఒడిషా రాజకీయ చిత్రం నుంచి తప్పుకున్నారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. -
భారత్‌లో టెస్లా పెట్టుబడులు.. మస్క్ యూటర్న్
టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ యూటర్న్ తీసుకున్నారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా మస్క్ ప్రధాని మోదీతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది.లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న మోదీకి మస్క్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించినందుకు అభినందనలు. మా సంస్థ త్వరలో భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉందని ట్వీట్ చేశారు.భారత్‌కు ఆహ్వానంఆ ట్వీట్‌కు మోదీ స్పందించారు. ప్రతిభావంతులైన భారతీయ యువత, జనాభా, ఊహాజనిత విధానాలు, స్థిరమైన ప్రజాస్వామ్య రాజకీయాలతో మా భాగస్వాములందరికీ వ్యాపార వ్యవహారాల్ని చక్కబెట్టుకునేందుకు అనువైన వాతావరణాన్ని అందించడాన్ని కొనసాగిస్తామని మస్క్ ట్వీట్‌కు రిప్లయి ఇచ్చారు. మస్క్ యూటర్న్.. అంతలోనే భారత్‌లో టెస్లా పెట్టుబడులు నిమిత్తం ఆ సంస్థ సీఈవో ఎలోన్ మస్క్ ఈ ఏడాది ఏప్రిల్ 21,22 తేదీలలో ప్రధాని మోదీతో భేటీ కానున్నట్లు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఆ తర్వాత టెస్లాకు భారీ బాధ్యతలు ఉన్నాయని మస్క్ ట్వీట్ చేయడం..అనూహ్యంగా చైనాలో ప్రత్యక్షమయ్యారు. దీంతో మస్క్ భారత్‌లో పెట్టుబడుల అంశం వెనక్కి తగ్గింది. తాజాగా, మరోమారు పెట్టుబడులు పెట్టడంపై మస్క్ ట్వీట్ చేయడం వ్యాపార వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. -
నాడు చావే శరణ్యం.. నేడు బీజేపీతోనే ప్రయాణం
బీహార్ సీఎం నితిష్ కుమార్ మౌనం వీడారు. ఎన్డీయే కూటమి వెంటే నడుస్తానంటూ అధికారికంగా ప్రకటించారు. దీంతో గతంలో క్రితం బీజేపీ కూటమిలో చేరడం కంటే చావే మేలంటూ సీఎం నితీష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా వైరల్ అవుతున్నాయి.ఇటీవల విడుదలైన 542 లోక్‌సభ స్థానాల ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే (బీజేపీ) కూటమి 240 స్థానాల్లో గెలుపొందగా.. ఇండియా (కాంగ్రెస్) కూటమి 243 స్థానాల్లో విజయం సాధించింది. అయితే తదుపరి కేంద్ర ప్రభుత్వ ఏర్పాటు చేయాలని ఇరు పార్టీలకు స్పష్టమైన మెజార్టీ రాలేదు. అందుకే ఎన్డీయే,ఇండియా కూటమిలు ఇరు పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ, కాంగ్రెస్‌లు పావులు కదిపాయి.ఎన్డీయే కూటమికి కటిఫ్ అంటూఈ తరుణంలో ఏర్పాటు చేసిన ఎన్డీఏ సమావేశానికి నితీష్ కుమార్.. ఇండియా కూటమికి మద్దతు పలికే తేజస్వీతో కలిసి విమానంలో ప్రయాణించారు. ఈ ప్రయాణంతో నితీష్ కుమార్ ఇండియా కూటమికి మద్దతు ఇస్తున్నారని, ఎన్డీయే కూటమికి గుడ్‌బాయ్ చెప్పనున్నారంటూ జాతీయ మీడియా సంస్థలు కథనాలను వండి వార్చాయి.మీ వెంటే నేనుంటాఅయితే నితీష్ కుమార్ మాత్రం తాజా ఎన్డీఏ సమావేశంలో మీ వెంటే నేనుంటా నంటూ మోదీకి మద్దతు పలికారు. ప్రతిపక్షాలు ఏ అభివృద్ధి పని చేయదు అంటూనే, తాను అన్ని వేళలా ప్రధానమంత్రి మోదీతోనే ఉంటానని అని అన్నారు.బీజేపీతో పొత్తంటే.. చావే శరణ్యంఅంతవరకు బాగానే కూటముల్ని మార్చడంలో పేరున్న నితిష్ కుమార్ గతంలో బీజేపీ కూటమికి కటిఫ్ చెప్పి.. కాంగ్రెస్ చెంతన చేరారు. ఆ సమయంలో నితిష్ మాట్లాడుతూ.. మరోసారి బీజేపీతో పొత్తు పెట్టుకోను. అలా పెట్టుకోవడం కంటే చావే శరణ్యం. 2017లో కమలంతో పొత్తు పెట్టుకునే పెద్ద తప్పే చేశాను అని వ్యాఖ్యానించారు. తాజా బీజేపీ కూటమికి మద్దతు పలకడంతో నాడు నితిష్ చేసిన వ్యాఖ్యల్ని నెటిజన్లు ప్రస్తావిస్తున్నారు. -
Association of Democratic Reforms: ఎంపీల్లో 46 శాతం నేర చరితులు
న్యూఢిల్లీ: లోక్‌సభకు తాజాగా ఎన్నికైన 543 మందిలో 46 శాతం అంటే 251 మంది నేరచరితులు ఉన్నారని అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) నివేదించింది. ఈ 251 మందిలో 27 మంది దోషులుగా తేలారు. నేర చరితులు ఇంత భారీ సంఖ్యలో దిగువసభకు ఎన్నికవడం ఇదే మొదటిసారి అని ఏడీఆర్ పేర్కొంది. 2014 ఎన్నికల్లో 34 శాతం అంటే 185 మంది, 2009లో 30 శాతం అంటే 162 మంది, 2004లో 23 శాతం అంటే 125 మంది క్రిమినల్ కేసులున్న వారు లోక్‌సభకు ఎన్నికైనట్లు ఏడీఆర్ వెల్లడించింది. -
మోదీ 3.0లో 3 పదవులపై నితీష్ కన్ను?
దేశంలో మరోమారు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏకు 293 సీట్లు, ఇండియా కూటమికి 234 సీట్లు వచ్చాయి. ఎన్డీఏ మిత్రపక్షం అయిన జేడీయూ బీహార్‌లో 12 సీట్లు గెలుచుకుంది. ఇవి ఎన్డీఏకు చాలా కీలకం.ఈ నేపధ్యంలో జేడీయే నేత, బీహార్ సీఎం నితీష్ కుమార్ బీజేపీ నుంచి మూడు మంత్రిత్వ శాఖలను డిమాండ్ చేసినట్లు సమాచారం. బీహార్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదాతో పాటు నలుగురు ఎంపీలకు ఒక మంత్రిత్వ శాఖ అనే ఫార్ములాను ప్రధాని మోదీ ముందు ఉంచారని జేడీయూ వర్గాలు చెబుతున్నాయి. నితీష్ కుమార్ రైల్వే, వ్యవసాయం, ఆర్థిక మంత్రిత్వ శాఖలను కోరుకుంటున్నారని తెలుస్తోంది. దీనిలో రైల్వే మంత్రిత్వ శాఖపై పట్టుపడతారని అంటున్నారు.లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 240 సీట్లు గెలుచుకుని, మెజారిటీకి దూరంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో 12 సీట్లు గెలిచిన నితీష్ కుమార్(జేడీయూ), 16 సీట్లు గెలిచిన చంద్రబాబు నాయుడు(టీడీపీ) ఎన్డీఏకు కీలకంగా మారారు. ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఈ ఇద్దరు నేతల అవసరం బీజేపీకి ఎంతైనా ఉంది. -
అయోధ్యలో బీజేపీ ఓటమికి కారణాలివే?
లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో యూపీలో బీజేపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలోని 80 సీట్లలో ఎస్పీకి 37, బీజేపీకి 33, కాంగ్రెస్‌కు 6, ఆర్ఎల్డీకి 2, ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్)కి ఒకటి, అప్నాదళ్ (సోనేలాల్)కి ఒక సీటు లభించింది. అయోధ్యలో బీజేపీకి ఘోర పరాభవం ఎదురయ్యింది. దీనికి పలు కారణాలున్నాయంటున్నారు విశ్లేషకులు.అయోధ్యలో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి అవధేష్ ప్రసాద్ 54,567 ఓట్లతో విజయం సాధించారు. ఆయనకు మొత్తం 5,54,289 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి లల్లూ సింగ్‌కు 4,99,722 ఓట్లు వచ్చాయి. బీఎస్పీ అభ్యర్థి సచ్చిదానంద్ పాండే 46,407 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణంతో యూపీ లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధి చేకూరుతుందని బీజేపీ భావించింది. అయితే ఈ విషయంలో బీజేపీ అంచనాలు తలకిందులయ్యాయి.కుల సమీకరణ: అయోధ్యలో పాసి వర్గం (దళితులు) పెద్ద సంఖ్యలో ఉంది. అయోధ్యలో ఎస్పీ తన అభ్యర్థిగా ఈ వర్గానికి చెందిన అవధేష్ ప్రసాద్‌ను ఎన్నికల బరిలో నిలిపింది. అవధేష్ ప్రసాద్ యూపీ రాజకీయాల్లో దళితుల తరపున గొంతువిప్పే నాయకునిగా పేరొందారు.అవధేష్‌కు ఆదరణ: ఎస్పీ అభ్యర్థి అవధేష్ ప్రసాద్‌కు అయోధ్య ప్రజల్లో అత్యధిక ఆదరణ ఉంది. ఆయన తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మంత్రిగా కూడా పనిచేశారు. సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపక సభ్యులలో ఆయన ఒకరు.రాజ్యాంగంపై ప్రకటన: అయోధ్య బీజేపీ అభ్యర్థి లల్లూ సింగ్ రాజ్యాంగానికి సంబంధించి చేసిన ప్రకటనపై బెడిసికొట్టింది. ‘రాజ్యాంగాన్ని మార్చాలంటే మోదీ ప్రభుత్వానికి 400 సీట్లు కావాలని’ లల్లూ సింగ్ వ్యాఖ్యానించారు. ఈ ప్రకటన బీజేపీకి ఎదురుదెబ్బగా మారింది.లల్లూ సింగ్‌పై అసంతృప్తి: లల్లూ సింగ్ అయోధ్య నుంచి రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. బీజేపీ ఆయనను మూడోసారి అభ్యర్థిగా నిలబెట్టింది. అయోధ్య పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి కానరాకపోవడంతో లల్లూపై స్థానికుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమయ్యింది. బీజేపీ రామమందిరంపై దృష్టి పెట్టి, ప్రజా సమస్యలను ఉపేక్షిందనే ఆరోపణలున్నాయి. ఈ కారణంగానే లల్లూ ఓటమి పాలయ్యారు.ఇళ్లు, దుకాణాల కూల్చివేత: అయోధ్యలో 14 కి.మీ పొడవున రామ్ పథాన్ని నిర్మించారు. అలాగే భక్తి పథం, రామజన్మభూమి పథాలు కూడా నిర్మించారు. వీటి కారణంగా తమ ఇళ్లు, దుకాణాలు దెబ్బతిన్నాయని, ఎవరికీ నష్టపరిహారం అందలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.రిజర్వేషన్ అంశం: అయోధ్యలో బీజేపీ నేతలు తమ పార్టీ రిజర్వేషన్లను రద్దు చేస్తుందంటూ ప్రచారాన్ని సాగించారు. రాజ్యాంగాన్ని మారుస్తామని కూడా వ్యాఖ్యానించారు. దీంతో ఓటర్లు ఎస్పీ వైపు మొగ్గు చూపారు.యువతలో ఆగ్రహం: అయోధ్యలో యువత ఓట్లు కూడా బీజేపీకి వ్యతిరేకంగా పడ్డాయి. స్థానికులు అగ్నివీర్ పథకం విషయంలో ప్రభుత్వంతో ఏకీభవించలేదు. పేపర్ లీక్‌లు కూడా మరో కారణంగా నిలిచాయి.కాంగ్రెస్‌పై సానుభూతి: అయోధ్యలోని దళితుల్లో బీజేపీపై ఆగ్రహం నెలకొంది. అదే సమయంలో కాంగ్రెస్‌పై సానుభూతి ఏర్పడింది. దీని ప్రభావం ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. -
ఎన్డీఏ మిత్రపక్షాల డిమాండ్లివే?
ప్రధాని మోదీ నాయకత్వంలో కలిసి ఉంటామని మరోమారు ఎన్డీఏ మిత్రపక్షాలు పునరుద్ఘాటించిన దరిమిలా కేంద్ర క్యాబినెట్ బెర్త్‌లపై బీజేపీ అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఆరు కీలక మంత్రిత్వ శాఖల విషయంలో బీజేపీ రాజీపడే అవకాశం లేదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ మంత్రిత్వ శాఖల జాబితాలో రైల్వే, హోం, ఫైనాన్స్, డిఫెన్స్, లా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉన్నాయిని సమాచారం.అదేవిధంగా మిత్రపక్షాలు 10 నుంచి 12 మంత్రిత్వ శాఖలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇదిలావుండగా బీజేపీ తన మిత్రపక్షాల మద్దతును మరింతగా పెంచుకుంది. తాజాగా ఏడుగురు స్వతంత్రులు, మరో మూడు చిన్న పార్టీల నుండి బీజేపీకి మద్దతు లభించింది. తాజాగా మద్దతునందించిన 10 మంది ఎంపీలతో ఎన్డీఏకు మొత్తం 303 మంది ఎంపీల మద్దతు లభించినట్లయ్యింది.మోదీ ప్రభుత్వం వరుసగా మూడవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న తరుణంలో కీలకమైన మంత్రిత్వ శాఖలకు సంబంధించి కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకోనున్నది. భారతదేశాన్ని ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే అంశంపై ప్రధాని మోదీ దృష్టి సారించారు. అందుకే దీనికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించనున్నారు. రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్, రక్షణ రంగంలో స్వావలంబనకు సంబంధించిన అంశాలపై ప్రధాని మోదీ ఇటీవలే పునరుద్ఘాటించారు.ఆరు కీలక మంత్రిత్వ శాఖలు మినహా మిత్రపక్షాల మంత్రిత్వశాఖల బెర్త్‌ల డిమాండ్లను బీజేపీ అధిష్టానం పరిగణనలోకి తీసుకోనున్నదని సమాచారం. బుధవారం జరిగిన సమావేశంలో ప్రభుత్వ ఏర్పాటు, మద్దతు ఒప్పందం తదితర అంశాలపై ఎన్డీఏ నేతలు చర్చించినప్పటికీ, మంత్రిత్వశాఖల కేటాయింపుపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని బీజేపీ వర్గాలు తెలిపాయి.16 లోక్‌సభ స్థానాలు గెలుచుకున్న టీడీపీ, 12 స్థానాలు గెలుచుకున్న జేడీ (యూ) మిత్రపక్షాల నుంచి ప్రధాన డిమాండ్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రెండు పార్టీలతో పాటు శివసేన (షిండే) ఏడు, ఎల్జేపీ (ఆర్వి) ఐదు, హెచ్ఏఎం ఒక స్థానంలో విజయం సాధించాయి. జూన్ 7న జరగనున్న ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మంత్రి పదవులకు సంబంధించి మిత్రపక్షాల డిమాండ్లు ప్రస్తావనకు రానున్నాయి.జనతాదళ్(యూ) రెండు మంత్రి పదవులను ఆశిస్తోందని, శివసేన (షిండే) తన కేబినెట్ బెర్త్‌తో పాటు రెండు రాష్ట్ర మంత్రి పదవుల కోసం డిమాండ్ చేసినట్లు ఎన్డీఏ వర్గాలు తెలిపాయి. లోక్ జనశక్తి పార్టీ (ఆర్వీ) ఇంకా తన డిమాండ్లను అధికారికంగా వెల్లడించలేదు. అయితే పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్‌కు ఒక మంత్రివర్గం, ఆ పార్టీ నుంచి గెలుపొందిన ఎంపీ శాంభవి చౌదరితో సహా ఇతర ఎంపీలకు రెండు మంత్రి పదవులు ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. గయ నుంచి ఎన్నికైన బీహార్ మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని హెచ్ఏఎం ఒక కేబినెట్ ర్యాంక్ పదవిని కోరినట్లు సమాచారం. -
ప్రధాని మోదీ గ్రూప్ ఫొటో షేర్ చేసిన కంగనా
లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారిగా బీజేపీ టికెట్‌పై పోటీ చేసిన కంగనా రనౌత్ విజయాన్ని అందుకున్నారు. ఆమె హిమాచల్‌లోని మండీ పార్లమెంటరీ స్థానం నుంచి పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్‌పై ఆమె విజయం సాధించారు. తన విజయంపై కంగనా స్పందిస్తూ ఇది ప్రధాని మోదీ వల్లే సాధ్యమయ్యిందని పేర్కొన్నారు.తాజాగా కంగనా రనౌత్ ఒక పోస్ట్‌ను షేర్ చేశారు. ఇది నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. కంగనా రనౌత్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ప్రధాని నరేంద్ర మోదీ ఇతర ప్రముఖ నేతలు ఉన్న గ్రూప్ ఫోటోను షేర్ చేశారు. పీఎం నరేంద్ర మోదీని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డిఏ) నేతగా ఎన్నుకోవడంపై కంగనా రనౌత్ హర్షం వ్యక్తం చేశారు.కంగనా రనౌత్ నటించిన ‘ఎమర్జెన్సీ’ సినిమా త్వరలో విడుదల కానుంది. ఇందిరాగాంధీ పాలనా కాలంలో విధించిన ఎమర్జెన్సీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో కంగనా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి కంగనానే దర్శకత్వం వహించడం విశేషం. -
ఓటింగ్ పెరిగినా.. లోక్‌సభలో తగ్గిన మహిళా ప్రాతినిధ్యం
లోక్‌సభ ఎన్నికల ఫలితాలు పలు చర్చలకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా దేశంలో మహిళా ఎంపీల తగ్గుదల అంశం అందరినోళ్లలో నానుతోంది. ఈ ఎన్నికల్లో మహిళల ఓటింగ్ శాతం పెరిగినా, మహిళా ఎంపీలుగా ఎన్నికైనవారి సంఖ్య తగ్గడం గమనార్హం.ఈ లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 73 మంది మహిళా అభ్యర్థులు ఎన్నిక కాగా, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఈ సంఖ్య 78గా ఉంది. దేశవ్యాప్తంగా దిగువ సభకు ఎన్నికైన మొత్తం మహిళా ఎంపీల్లో 11 మంది పశ్చిమ బెంగాల్‌కు చెందినవారే కావడం విశేషం. ఈ ఎన్నికల్లో మొత్తం 797 మంది మహిళా అభ్యర్థులు పోటీ చేయగా, బీజేపీ అత్యధికంగా 69 మంది మహిళా అభ్యర్థులను, కాంగ్రెస్ 41 మంది మహిళా అభ్యర్థులను నిలబెట్టింది.మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత జరిగిన తొలి ఎన్నికలు ఇవి. ఈ చట్టంలో లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళలకు మూడింట ఒక వంతు సీట్లు రిజర్వ్ చేసే నిబంధన ఉంది. అయితే ఈ చట్టం ఇంకా అమలు కాలేదు. ఎన్నికల కమిషన్ డేటాలోని వివరాల ప్రకారం ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి చెందిన 30 మంది మహిళా అభ్యర్థులు, కాంగ్రెస్‌కు చెందిన 14 మంది, తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన 11 మంది, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన నలుగురు, డీఎంకేకు చెందిన ముగ్గురు, జనతాదళ్ (యునైటెడ్), ఎల్జేపీకి చెందిన ఒక్కో మహిళా అభ్యర్థి గెలుపొందారు. ఈలోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి చెందిన హేమా మాలిని, తృణమూల్‌కు చెందిన మహువా మోయిత్రా, ఎన్సీపీ (శరద్చంద్ర పవార్)కి చెందిన సుప్రియా సూలే, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన డింపుల్ యాదవ్ తమ స్థానాలను నిలబెట్టుకోగా, కంగనా రనౌత్, మిసా భారతిల విజయం అందరి దృష్టిని ఆకర్షించింది. -
రాహుల్ వయనాడ్ వదిలి.. రాయ్‌బరేలీ ఎంపీ అవుతారా?
2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెండు స్థానాల్లో పోటీ చేసి, రెండు చోట్లా విజయం సాధించారు. నిబంధనల ప్రకారం ఒక నేత రెండు స్థానాలలో ఎంపీగా ఉండకూడదు. దీంతో రాహుల్ గాంధీ వయనాడ్ సీటును వదులుకుంటారా లేక రాయ్ బరేలీ సీటును వదులుకుంటారా అనే ప్రశ్న అందరిలో తలెత్తుతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఆయన వయనాడ్ సీటును వదిలి, రాయ్ బరేలీకి ఎంపీగా కొనసాగుతారని తెలుస్తోంది.రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానాన్ని వదిలిపెట్టడానికి కారణం సోనియా గాంధీ అని చెబుతున్నారు. ఎందుకంటే రాయ్‌బరేలీ సీటు కాంగ్రెస్‌కు సాంప్రదాయక స్థానం. రాహుల్ గాంధీ తల్లి సోనియా గాంధీ మాజీ పార్లమెంటు స్థానం కూడా ఇదే. గతంలో సోనియా గాంధీ రాయ్‌బరేలీ ప్రజలను ఉద్దేశిస్తూ ఉద్వేగభరితమైన విజ్ఞప్తి చేశారు.తన జీవితమంతా రాయ్‌బరేలీ ప్రజల ప్రేమ, ఆశీర్వాదాలతో నడిచిందని, ఒంటరితనాన్ని దూరం చేసిందని పేర్కొన్నారు. తన కుమారుడని రాయ్‌బరేలీ ప్రజలకు అప్పగిస్తున్నానని, రాహుల్‌ను మీవాడిగా చూసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి రాహుల్ గాంధీ వరుసగా రెండోసారి విజయం సాధించారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత రాహుల్ మాట్లాడుతూ తాను రాయ్‌బరేలీ, వయనాడ్ స్థానాలను గెలుచుకున్నానని, ఈ రెండు లోక్‌సభ స్థానాల ఓటర్లకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. తాను ఈ రెండు స్థానాలకు ఎంపీని కావాలనుకుంటున్నానని, అయితే ఏదో ఒకటే ఎంపిక చేసుకోవాలని, దీనిపై చర్చించి ఏ సీటును ఎంపిక చేసుకోవాలో నిర్ణయించుకుంటానని రాహుల్ తెలిపారు. -
ఎన్నికల ఫలితాలు తారుమారు.. భారీగా తగ్గిన అంబానీ, అదానీల సంపద
లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అంచనాలు తారుమారయ్యాయి. ఫలితంగా దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా క్రాష్ అయ్యాయి. దీంతో భారత చెందిన అదానీ ఎంటర్ ప్రైజెస్ అధినేత గౌతమ్ అదానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ నికర సంపద భారీగా తగ్గింది.దేశంలో లోక్‌సభ ఎన్నికల ఫలితాల ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపించాయి. లోక్‌సభ ఫలితాలకు ముందు విడుదలైన ఎగ్జిట్ పోల్స్ అనుగుణంగా.. బీజేపీ ఆ స్థాయిలో సీట్లులో రాణించకపోవడం.. అనూహ్యంగా కాంగ్రెస్ పుంజుకోవడంతో స్టాక్ మార్కెట్లు క్రాష్ అయ్యాయి. దీంతో అంబానీ, అదానీ నికర సంపద క్షీణించినట్లు తెలుస్తోంది. ముఖేష్ అంబానీ 8.99 బిలియన్ డాలర్ల సందప క్షీణించింది. ప్రస్తుతం ముఖేష్ అంబానీ సంపద 106 బిలియన్ డాలర్లతో ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో 11వ స్థానంలో ఉన్నారు.గౌతమ్ అదానీ నికర విలువ ఒక్క రోజులో 24.9 బిలియన్ డాలర్లు పడిపోయింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం బుధవారం నాటికి అయన సంపద 97.5 బిలియన్ డాలర్లుగా ఉంది. గౌతమ్ అదానీ ప్రస్తుతం ప్రపంచ సంపన్నుల జాబితాలో 15వ స్థానంలో ఉన్నారు. ముఖేష్ అంబానీ తర్వాత భారత్‌లో రెండవ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. -
చతికిలపడిన ఆమ్ ఆద్మీ పార్టీ
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్నికల సమయంలో అరెస్ట్ చేయడం ఆ పార్టీకి నష్టం చేకూర్చిందా? ఇండియా కూటమి అధికారంలోకి వచ్చేందుకు తమ వంతు సాయం అందిస్తామన్న ఆమ్ ఆద్మీ పార్టీ మాటలు ఒట్టి మాటలుగానే మిగిలిపోయాయా? ఫలితాలను విశ్లేషిస్తే ఇవన్నీ నిజమని అనిపించక మానవు. ఢిల్లీ మొదలుకొని పంజాబ్, గుజరాత్, హర్యానాల్లోనూ పోటీ చేసిన ఈ పార్టీ గెలిచింది మాత్రం మూడంటే మూడు!రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని నడుపుతున్న ఈ పార్టీ ఢిల్లీ, పంజాబ్, గుజరాత్, హర్యానాతో పాటు అసోంలో కూడా తమ అభ్యర్థులను నిలబెట్టింది. ఇండియా కూటమిలో భాగంగా ఉన్నప్పటికీ, పంజాబ్‌లోని మొత్తం 13 స్థానాల్లో ఆప్ తమ అభ్యర్థులను నిలబెట్టింది. ఢిల్లీలో కాంగ్రెస్‌తో కలసి సీట్లను పంచుకుంది. ఢిల్లీలోని నాలుగు స్థానాల్లో ఆప్ అభ్యర్థులు బరిలో నిలిచారు. అదేవిధంగా హర్యానాలోని కురుక్షేత్ర, గుజరాత్‌లోని భావ్‌నగర్, బరూచ్, అస్సాంలోని దిబ్రూఘర్,సోనిత్పూర్ల నుంచి కూడా ఆప్ అభ్యర్థులు పోటీ చేశారు.పంజాబ్‌లోని అన్ని స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తమ అభ్యర్థులను నిలబెట్టింది. రాష్ట్రంలో తమ ప్రభుత్వమే ఉన్నందున 13 సీట్లలో కనీసం 10 సీట్లు గెలుచుకుంటామని ఆప్ ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే హోషియార్పూర్, ఆనంద్‌పూర్ సాహిబ్, సంగ్రూర్ మినహా మిగిలిన 10 స్థానాల్లో ఆప్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.ఢిల్లీలో కాంగ్రెస్‌తో ఆప్ పొత్తు పెట్టుకుని దక్షిణ ఢిల్లీ, తూర్పు ఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ, న్యూఢిల్లీ స్థానాల నుంచి పోటీకి దిగింది. అయితే నాలుగు స్థానాల్లోనూ ఆప్ ఓటమిని చవిచూసింది. హర్యానాలోని కురుక్షేత్ర స్థానాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ గెలుచుకోలేకపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి డాక్టర్ సుశీల్ గుప్తా బీజేపీ అభ్యర్థి నవీన్ జిందాల్ చేతిలో 29 వేల ఓట్ల తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.గత అసెంబ్లీ ఎన్నికల నుంచి గుజరాత్లో ఆప్ హల్ చల్ చేయడం ప్రారంభించింది. ఇప్పుడు భావ్‌నగర్, భరూచ్ స్థానాల్లో ఒంటరిగా పోటీకి దిగింది. అయితే ఈ రెండు స్థానాల్లోనూ ఓటమి పాలయ్యింది. ఈ రెండు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు.దిబ్రూగఢ్, సోనిత్పూర్ స్థానాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దిబ్రూగఢ్ స్థానంలో బీజేపీ అభ్యర్థి సర్బానంద సోనోవాల్ విజయం సాధించారు. సోనిత్పూర్ సీటులో ఆప్ మూడో స్థానంలో నిలిచింది. -
కొత్త ఆటకు సీఎం నితీష్ తెరలేపుతున్నారా?
లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఎన్డీఏ కూటమికి 292 సీట్లు రాగా, ఇండియా కూటమికి 243 సీట్లు వచ్చాయి. సంపూర్ణ మెజారిటీ సంఖ్యను ఒంటరిగా టచ్ చేయడంలో బీజేపీ విజయవంతం కాలేదు. టీడీపీ, జేడీయూ తదితర పార్టీల సాయంతో మోదీ ప్రభుత్వం మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేసింది.లోక్‌సభ ఎన్నికల ఫలితాల వెల్లడి అనంతరం ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సమయం వచ్చింది. మూడోసారి మోదీ ప్రభుత్వం ఏర్పాటుకానుంది. ఈరోజు (బుధవారం) జరిగే ఎన్డీఏ సమావేశంలో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలు జరగనున్నాయి. మరోవైపు ఇండియా కూటమి కూడా ఈరోజు(బుధవారం) భేటీ కానుంది.ఢిల్లీలో జరిగే ఎన్డీఏ సమావేశానికి బీహార్ సీఎం నితీశ్ కుమార్, తేజస్వీ యాదవ్‌లు పట్నా నుంచి బయలుదేరి వెళ్లారు. వీరిద్దరూ ఒకే విమానంలో ఢిల్లీకి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరూ ఫ్లైట్‌లో కూర్చున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో జేడీయూ 12 సీట్లు గెలుచుకోగా, ఆర్జేడీ నాలుగు స్థానాల్లో విజయం సాధించింది. నితీష్, తేజస్వి కలసి వెళుతుండటం చూసిన రాజకీయ విశ్లేషకులు నితీష్ కొత్త ఆటకు తెరలేపుతున్నారా? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
తండ్రి ఓటమిపై స్పందించిన ‘చిరుత’ హీరోయిన్
లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై దేశమంతా ఆసక్తికనబరిచింది. ఈ ఎన్నికల్లో కంగనా రనౌత్, అరుణ్ గోవిల్ తదితర నటులతో పాటు బాలీవుడ్ నటి నేహా శర్మ తండ్రి అజిత్ శర్మ కూడా పోటీ చేశారు. ఆయన బీహార్‌లోని భాగల్పూర్ స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేశారు. అయితే జేడీయూ అభ్యర్థి అజయ్ మండల్ చేతిలో శర్మ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.తన తండ్రి ఓటమిపై నేహా శర్మ ఆవేదనతో సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఆమె తమ కుటుంబానికి ఎదురైన అనుభవాన్ని కవితారూపంలో రాశారు. తన కుటుంబం తదుపరి అధ్యాయం ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నదని ఆమె దానిలో పేర్కొన్నారు.‘ఇది మాకు కష్టమైన రోజు. మేము అన్నివిధాలా పోరాడాం. మా నాన్నను నమ్మి ఆయనకు ఓటు వేసిన వారికి కృతజ్ఞతలు. మేము తదుపరి దశలో సాగే ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాం. ఓటమితో కుంగిపోకుండా ఎప్పుడూ ముందుకు సాగాలని మనం గుర్తుంచుకోవాలి. పర్వతంలా ధృడంగా నిలవాలి. సింహంలా గర్జించాలి. నిర్భయంగా నిలబడాలి. ధైర్యంగా ముందుకు సాగాలి’ అని నేహాశర్మ రాశారు. ఆమె భాగల్పూర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీకి దిగిన తండ్రి తరపున విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు. నేహా శర్మ తెలుగులో రామ్‌చరణ్ సరసన ‘చిరుత’ సినిమాలో నటించారు. -
ఢిల్లీలో 162 మంది పోటీ.. 148 మంది డిపాజిట్లు గల్లంతు
ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల్లో ఆసక్తికర ఫలితాలు వెలువడ్డాయి. ఇక్కడి నుంచి పోటీ చేసిన మొత్తం 162 మంది అభ్యర్థుల్లో 14 మందిని మాత్రమే ప్రజలు ఆమోదించారు. మిగిలిన 148 మంది అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఢిల్లీలో అత్యధిక ఓటింగ్ శాతం తూర్పు ఢిల్లీ స్థానంలో 62.89గా నమోదయ్యింది. న్యూ ఢిల్లీ స్థానంలో అత్యల్పంగా 55.43 శాతం ఓటింగ్ నమోదైంది.న్యూఢిల్లీ లోక్‌సభ స్థానంలో ఎవరైనా అభ్యర్థి డిపాజిట్‌ను కాపాడుకోవాలంటే వారికి 1,40,891 ఓట్లు అవసరం. అదే తూర్పు ఢిల్లీ స్థానంలో అయితే 2,58,180 ఓట్లు అవసరం. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ డిపాజిట్‌ను కాపాడుకునేందుకు మొత్తం ఓట్లలో 1/6 ఓట్లు పొందాలి. పోలింగ్ రోజున ఢిల్లీలోని 1,52,01,936 మంది ఓటర్లలో 58.69శాతం అంటే 89,23,536 మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఢిల్లీలోని ఏడు స్థానాల్లో న్యూఢిల్లీలో అత్యల్పంగా 8.45 లక్షల మంది ఓటర్లున్నారు. ఇక్కడ నిబంధనల ప్రకారం డిపాజిట్ కాపాడుకోవడానికి అభ్యర్థికి 1,40,891 లక్షల ఓట్లు అవసరం. న్యూఢిల్లీ లోక్‌సభ స్థానానికి 17 మంది అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. వీరిలో బన్సూరి స్వరాజ్, సోమనాథ్ భారతికి 1.4 లక్షలకు పైగా ఓట్లు వచ్చాయి. మిగిలిన 15 మంది అభ్యర్థుల సెక్యూరిటీ డిపాజిట్ గల్లంతయ్యింది.అత్యధిక ఓట్లు పొందిన ఈశాన్య ఢిల్లీ స్థానంలోని 24,63,159 మంది ఓటర్లలో 15,49,80 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ స్థానంపై అభ్యర్థులు తమ డిపాజిట్ కాపాడుకోవడానికి 2,58,180 ఓట్లు అవసరం. ఈశాన్య ఢిల్లీ స్థానానికి 28 మంది అభ్యర్థులు పోటీకి దిగారు. వారిలో మనోజ్ తివారీ, కన్హయ్య కుమార్ మినహా 26 మంది అభ్యర్థుల సెక్యూరిటీ డిపాజిట్ గల్లంతయ్యింది. మిగిలిన ఐదు స్థానాల్లో బీజేపీ, మహాకూటమి అభ్యర్థులు మినహా మిగిలిన వారందరినీ ప్రజలు తిరస్కరించారు.ఢిల్లీ మాజీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ లోక్‌సభ ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు. ఆయన బహుజన సమాజ్ పార్టీ టిక్కెట్‌పై న్యూఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఆయనకు 5,629 ఓట్లు వచ్చాయి. మొత్తం పోలైన ఓట్లలో ఇది 0.66 శాతం మాత్రమే. రాజ్‌కుమార్ ఆనంద్‌కు పోస్టల్ ఓటు ద్వారా 28 ఓట్లు రాగా, ఈవీఎంల ద్వారా 5,601 ఓట్లు వచ్చాయి. గతంలో ఢిల్లీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని ఆరోపిస్తూ ఆనంద్ రాజీనామా చేశారు. అనంతరం ఆయన న్యూఢిల్లీ నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. -
‘రామాయణం’ రామునికి టీవీ సీత శుభాకాంక్షలు
రామానంద్ సాగర్ రూపొందించిన ‘రామాయణం’లో రాముని పాత్ర పోషించిన అరుణ్ గోవిల్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులకు సంపాదించుకున్నారు. తాజాగా యూపీలోని మీరట్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన విజయం సాధించారు. దీంతో అరుణ్ గోవిల్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.టీవీ షో ‘రామాయణం’లో సీత పాత్రలో కనిపించిన దీపికా చిఖాలియా కూడా అరుణ్ గోవిల్‌కు అభినందనలు తెలిపారు. అలాగే తన ఇన్‌స్టాలో ఒక వీడియోను షేర్ చేశారు. ఇందులో ఆమె అరుణ్ గోవిల్‌తో ముచ్చటిస్తున్న దృశ్యాలున్నాయి. క్యాప్షన్‌లో అరుణ్ గోవిల్‌కు అభినందనలు తెలిపారు.తన విజయం తర్వాత అరుణ్ గోవిల్ ఒక పోస్ట్‌ను షేర్ చేశారు. దాని క్యాప్షన్‌లో ‘మీరట్ లోక్‌సభ నియోజకవర్గపు ఓటర్లు, కార్యకర్తలు, అగ్ర నాయకత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. మీరందరూ నాపై నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇందుకు హృదయ పూర్వక ధన్యవాదాలు. నేను మీ నమ్మకాన్ని నిలబెట్టేందుకు ప్రయత్నిస్తాను...జై శ్రీరామ్’ అని పేర్కొన్నారు.బీజేపీ అభ్యర్థి అరుణ్ గోవిల్ తన సమీప ప్రత్యర్థి సమాజ్ వాదీ పార్టీకి చెందిన సునీతా వర్మపై 10,585 ఓట్ల తేడాతో గెలుపొందారు. అరుణ్ గోవిల్‌కు మొత్తం 5,46,469 ఓట్లు వచ్చాయి. -
యూపీలో కమల విలాపం!
దేశంలోనే అత్యధికంగా 80 సీట్లతో హస్తినకు రాచమార్గంగా పరిగణించే ఉత్తర ప్రదేశ్‌లో కమలానికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ‘అబ్ కీ బార్ 400 పార్’ అంటూ ఊదరగొట్టిన కాషాయదళాన్ని ఇండియా కూటమి కకావికలం చేసింది. ఈసారి కూడా యూపీ కుంభస్థలాన్ని కొట్టి, ఢిల్లీ కోటపై తిరుగులేని పట్టు సాధించాలన్న వారి కలలకు గండి కొట్టింది. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) సారథి అఖిలేశ్ యాదవ్ బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కారు ఆశలపై నీళ్లుజల్లారు. అంతేకాదు, అట్టడుగుకు పడిపోయిన పార్టీకి మళ్లీ జవసత్వాలు అందించి, రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు తిరుగులేని బాట వేసుకున్నారు.అయోధ్య రామమందిరం కల సాకారం చేసిన కాషాయ పార్టీకి... హిందుత్వ నినాదం ఏమంత కలిసిరాలేదని ఈ ఎన్నికలు తేల్చేశాయి. మరోపక్క, ముస్లిం, దళిత, ఓబీసీ ఓటర్లు కమలానికి ముఖం చాటేయడంతో దాదాపు సగం సీట్లను చేజార్చుకుంది.ఒకప్పుడు కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ వంటి పార్టీల కంచుకోటగా ఉన్న యూపీలో 2014లో బీజేపీ ఏకంగా 71 సీట్లను కొల్లగొట్టి పూర్తిగా పాగా వేసింది. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ప్రత్యర్థులను మట్టి కరిపించింది. అయితే, 2019లో బీజేపీ బలం 62 సీట్లకు తగ్గినప్పటికీ, అత్యధిక స్థానాలను గెల్చుకుని రెండోసారి హస్తిన పీఠాన్ని చేజిక్కించుకోగలిగింది.గత ఎన్నికల్లో మాయావతి నేతృత్వంలోని బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ), అఖిలే‹Ô యాదవ్ సారథ్యంలోని ఎస్పీ కలిసి పోటీ చేయడం బీజేపీ బలాన్ని కాస్త తగ్గించగలిగినప్పటికీ... పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. మరోపక్క, కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసి చేతులు కాల్చుకుంది. కేవలం ఒక్క సీటుకే పరిమితం కావాల్సి వచ్చింది. ఈ ఓట్ల చీలిక కాషాయ పార్టీకి వరంగా మారడంతో పెద్ద సమస్య కాలేదు. కానీ ఈసారి ఇండియా కూటమి కింద పోటీ చేసిన ఎస్పీ–కాంగ్రెస్ సత్తా చాటాయి. వీటికి టీఎంసీ, ఆప్ దన్నుగా నిలిచాయి.ఎన్డీయే కూటమిలో ఉన్న ఆర్ఎల్డీకి రెండు సీట్లిచ్చి మిగతా 78 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ... ఈసారి కనీసం 65–70 స్థానాలను కొల్లగొట్టి, మోదీ 3.0 సర్కారులో తిరుగులేని మెజారిటీ అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. చాలావరకు ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ ఇదే అంచనా వేశాయి. అయితే, ఇవన్నీ పటాపంచలైపోయాయి. ఊహించని విధంగా కాషాయ పార్టీ ఖాతా నుంచి 29 సీట్లు ఎగిరిపోయాయి. కేవలం 33 సీట్లకు పడిపోవడంతో బీజేపీ సొంతంగా మెజారిటీ (272 సీట్లు) మార్కుకు ఆమడదూరంలో నిలిచిపోవాల్సి వచ్చింది. మరోపక్క, గత ఎన్నికల్లో కేవలం 5 సీట్లకు పరిమితమైన ఎస్పీ ఏకంగా 37 స్థానాలను కొల్లగొట్టి దేశంలో బీజేపీ, కాంగ్రెస్ తర్వాత మూడో అతిపెద్ద పార్టీగా, రాష్ట్రంలో నంబర్ వన్‌గా నిలిచింది. సీట్ల సర్దుబాటులో భాగంగా ఎస్పీ 62 సీట్లలో, కాంగ్రెస్ 17 చోట్ల, టీఎంసీ 1 చోట పోటీ చేశాయి. కాంగ్రెస్ కూడా బలం పుంజుకుని 6 చోట్ల గెల్చింది.కలిసొచ్చిన ‘పీడీఏ’ నినాదం...ఎన్నికలకు ముందు అఖిలే‹శ్ యాదవ్ పిచ్డే, దళిత్, అల్పసంఖ్యాక్ – పీడీఏ (వెనుకబడిన, దళిత, మైనారిటీ) నినాదంతో చేపట్టిన యాత్ర ఈ ఎన్నికల్లో కూటమి హవాకు దన్నుగా నిలిచిందని చెప్పొచ్చు. ఈ యాత్ర ప్రధానంగా యూపీలోని ముస్లిం కేంద్రక జిల్లాల్లోనే సాగింది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో పాటు ఎస్పీ–కాంగ్రెస్ జట్టుకట్టడం కూడా కలిసొచ్చింది. – సాక్షి, నేషనల్ డెస్క్ ఫలించని అయోధ్య బ్రహ్మాస్త్రం...ఎన్నికలకు ముందు హడావుడిగా అయోధ్య రామ మందిరాన్ని ప్రజలకు అంకితం చేసిన బీజేపీ, దీన్ని ఈసారి బ్రహ్మాస్త్రంగా ప్రయోగించింది. హిందూ ఓట్లను గంపగుత్తగా కొల్లగొట్టాలన్న కాషాయ పాచిక పారలేదు. అయోధ్య కొలువుదీరిన యూపీలో పార్టీ రెండో స్థానానికి పడిపోవడం దీనికి నిదర్శనం. అంతేకాదు, అయోధ్య అసెంబ్లీ స్థానం ఉన్న ఫైజాబాద్ లోక్‌సభ నియోజకవర్గాన్ని సైతం కమలనాథులు కోల్పోయారు. ఇక్కడ ఎస్పీ అభ్యర్థి అవధేశ్ ప్రసాద్, బీజేపీ నేత లల్లూ సింగ్‌పై దాదాపు 65,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం విశేషం.ఇక్కడ గత ఎన్నికల్లో లల్లూ సింగ్ లక్ష ఓట్లకు పైగా తేడాతో గెలుపొందారు. అంతేకాదు, మరోసారి వారణాసి నుంచి పోటీకి దిగిన మోదీ... కనీవినీ ఎరుగని మెజారిటీతో గెలుపొందడం ద్వారా యూపీ గెలుపును చాటిచెప్పాలనుకున్నారు. ఇది కూడా నెరవేరకపోవడం గమనార్హం. గత ఎన్నికల్లో 4,79,505 ఓట్ల మోజారిటీ సాధించిన మోదీకి ఈసారి గట్టి షాకే తగిలింది. మెజారిటీ 1,52,513కు పడిపోయింది. -
మూడోసారి NDA కూటమి అధికారం చేపట్టబోతుంది: ప్రధాని మోదీ
2024 ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో బీజేపీ ఎన్డీఏ కూటమి 290 స్థానాల్లో విజయం సాధించింది. ఈ సందర్భంగా ఢిల్లీ కేంద్ర కార్యాలయంలో బీజేపీ సంబరాలు నిర్వహించింది. ఈ సంబరాల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు.మోదీ మాట్లాడుతూ దేశం గర్వించేలా ఎన్నికల్ని నిర్వహించిన ఎన్నికల సంఘానికి అభినందనలు తెలిపారు. సబ్కా సాత్ సబ్ కా వికాస్ మంత్రం గెలిచింది. మూడసారి అధికారంలోకి రాబోతున్నామన్న మోదీ.. ఈ విజయం 140 కోట్ల మంది ప్రజలదని అన్నారు. ఎన్డీఏ కూటమిలోని కార్యకర్తలకు అభినందనలు. జమ్మూ కాశ్మీర్ ఓటర్లు కొత్త చరిత్ర సృష్టించారు. భారత ప్రజాస్వామ్యం ప్రపంచానికి ఆదర్శమని ప్రశంసలు కురిపించారు. అరుణాల్ ప్రదేశ్, సిక్కింలో కాంగ్రెస్ తుడిచి పెట్టుకుపోయింది. ఒడిశాలో కూడా అద్భుత ప్రదర్శన చేశాం. మూడో సారి ఎన్డీఏ అధికారం చేపట్టబోతుంది. మధ్య ప్రదేశ్, గుజరాత్, ఛత్తీగడ్,ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్‌లో బీజేపీ క్లీన్ స్వీప్. కేరళలో తొలిసారి బీజేపీ ఒకసీటు గెలిచింది. బీహార్‌లో ఎన్డీయే కూటమి గెలిచిందని మోదీ తెలిపారు. -
మైసూరు మహారాజు వడయార్ ఘన విజయం
లోక్‌సభ ఎన్నికల్లో మైసూరు మహారాజు యదువీర్ కృష్ణదత్త చామరాజ వడయార్ ఘన విజయం సాధిచించారు. మైసూరు లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన వడయార్ సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థిపై 1,39,262 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందారు.ఈ ఎన్నికల్లో యదువీర్ కృష్ణదత్త చామరాజ వడయార్ మొత్తం 7,95,503 ఓట్లు సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎం.లక్ష్మణకు 6,56,241 ఓట్లు వచ్చాయి. మైసూరు రాజ్యాన్ని వడయార్ కుటుంబం 1339 నుంచి 1950 వరకు పాలించింది. స్వాతంత్ర్యం అనంతరం మైసూరు రాజు జయచామ రాజేంద్ర వడయార్ గవర్నర్‌గా నియమితులయ్యారు. ఆ తర్వాత 1974లో శ్రీకంఠదత్త నరసింహరాజ వడయార్ రాజు అయ్యారు.1984-1999 లో కాంగ్రెస్ తరఫున మైసూరు ఎంపీగా గెలుపొందిన ఆయన 2013లో కన్నుమూశారు.శ్రీకంఠదత్త నరసింహరాజ వడయార్ మరణం తర్వాత మైసూరు 27వ రాజుగా యదువీర్ కృష్ణదత్త చామరాజ వడయార్ పట్టాభిషిక్తుడయ్యారు. మసాచుసెట్స్ యూనివర్సిటీలో ఇంగ్లిష్ లిటరేచర్, ఎకనామిక్స్ డిగ్రీ పూర్తి చేశారు. 2016లో దుంగార్పుర్ యువరాణి త్రిషికను వివాహం చేసుకున్నారు. -
జీరో బీఆర్ఎస్.. ఆ మూడు అంశాలే దెబ్బ కొట్టినయా?
మూడు ఎనిమిది అయ్యింది. నాలుగు రెట్టింపయ్యింది. తెలంగాణ లోక్‌సభ ఫలితాల్లో 8 సీట్లు కైవసం చేసుకుని కాంగ్రెస్ సత్తా చాటింది. మరోవైపు బీజేపీ అనూహ్యంగా పుంజుకుని ఏకంగా ఎనిమిది స్థానాలను కైవసం చేసుకుంది. ఫలితాల్లో ఆద్యంతం అధికార కాంగ్రెస్‌తోనే కాషాయం పార్టీకి పోటీ నడిచింది. ఈ క్రమంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ మూడో స్థానానికి పరిమితమైంది.తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీది ఘోరమైన పరిస్థితి. మెదక్ సీటులో.. అదీ కొద్దిసేపు మాత్రమే ఆ పార్టీ అభ్యర్థి ఆధిక్యంలో దూసుకుపోయినట్లు కనిపించినా ఓటమి తప్పలేదు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో దక్కిన విజయం స్ఫూర్తితో.. లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. గత ఎన్నికల్లో మూడు స్థానాలను మాత్రమే గెల్చుకున్న హస్తం పార్టీ.. ఈసారి ఏకంగా ఎనిమిది స్థానాల్లో, అదీ భారీ మెజారిటీతో అభ్యర్థుల్ని గెలిపించుకోలిగింది. ఇక గులాబీ పార్టీ తొమ్మిది నుంచి జీరోకి పడిపోయి ఘోరమైన ఫలితం చవిచూసింది. బీఆర్ఎస్ నుంచి ఐదు స్థానాలను కాంగ్రెస్ గెల్చుకోగా.. మిగిలిన నాలిగింటిని బీజేపీ దక్కించుకుంది. ఎంఐఎం హైదరాబాద్ సీటును నిలబెట్టుకుంది.👉 అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత.. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. ఆ సమయంలో గులాబీ పార్టీలో నాయకత్వ లోపం కనిపించింది. కాంగ్రెస్‌ను టార్గెట్ చేసుకుని విమర్శల పర్వమే కొనసాగింది తప్ప కేడర్‌ను బలపర్చుకోవాలనే ప్రయత్నమూ కనిపించలేదు.👉 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌పైనే బీఆర్ఎస్ విమర్శలు కనిపించాయి. బీజేపీపై అసలు విమర్శలు గుప్పించకపోవడం కూడా మైనస్ అయ్యింది. లిక్కర్ కేసులో కవిత అరెస్ట్.. తదనంతర పరిణామాల నడుమ లోపాయికారి ఒప్పందంలో భాగంగానే బీఆర్ఎస్ ఇలా చేస్తోందని కాంగ్రెస్ ఆరోపణలకు దిగింది. అంతేకాదు దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలోనూ కాంగ్రెస్ సక్సెస్ అయ్యింది.👉 సరిగ్గా ఎన్నికల ముందే బీఆర్ఎస్కు జంప్ జిలానీలు తలపోటుగా పరిణమించారు. దీంతో.. బీఆర్ఎస్కు సరైన అభ్యర్థితత్వమే లేకుండా పోయింది. ఇటు కాంగ్రెస్‌కు, అటు బీజేపీకి ఈ అంశం బాగా కలిసొచ్చాయి.లోక్‌సభ ఎన్నికల్లో పడిపోయిన బీఆర్ఎస్ ఓట్ల శాతంబీఆర్ఎస్కు 16.70 శాతం ఓట్లుకాంగ్రెస్కు 40.11 శాతం ఓట్లుబీజేపీకి 35.01 శాతం ఓట్లుబీజేపీ కన్నా ఐదు శాతం ఎక్కువ ఓట్లు సాధించిన కాంగ్రెస్ -
ఒడిశాలో 24 ఏళ్ల తర్వాత మారనున్న ప్రభుత్వం
ఒడిశాలో అధికార బీజూ జనతాదళ్ (బీజేడీ)కి ఎదురు దెబ్బ తగిలింది. 24 ఏళ్ల తర్వాత తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. తాజాగా విడుదలైన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూసుకుపోతుంది. మధ్నాహ్యం 4.50 గంటల సమయానికి ఒడిశాలో మొత్తం 147 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 80 స్థానాల్లో, బీజూ జనతదాళ్ 52, కాంగ్రెస్ 15 స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతున్నాయి. తాజా అసెంబ్లీ ఫలితాలతో బీజేపీ అధికారం చేపట్టడం అనివార్యమైంది.లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 400 పై చీలూకు స్థానాల్లో విజయం సాధించాలే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ 137 స్థానాల్లో గెలుపొందగా 158 స్థానాల్లో ఆదిక్యంలో కొనసాగుతుండగా.. ఒడిశా లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఊహించని ఫలితాల్ని రాబట్టింది. 21 లోక్‌సభ స్థానాలకు బీజేపీ 19 స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతుండగా.. బీజూ జనతాదళ్, కాంగ్రెస్‌లు చెరోస్థానంలో లీడింగ్‌లో ఉన్నాయి.ఒడిశా బీజేపీ సీఎం ఎవరంటే?ఒడిశా బీజేపీ ముఖ్యమంత్రిగా ఎవరిని నియమిస్తుందనే అంశంపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మన్మోహన్ సమల్.. పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఆ కథనాల ఆధారంగా.. ఒడిశా సీఎం రేసులో నలుగురు అభ్యర్ధులు ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో బీజేపీ కేంద్ర మాజీ మంత్రి, సిట్టింగ్ ఎంపీ జువల్ ఓరం, బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర, బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ బైజయంత్ పాండా,బీజేపీ నేత ధర్మేంద్ర ప్రధాన్‌లు ఉన్నారు. అయితే ఈ నలుగురు ఒడిశా లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో లీడింగ్‌లో ఉన్నారు. పట్నాయక్ ఆశలు అడియాశలుతాజాగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో 24 ఏళ్లగా ఒడిశా సీఎంగా ఉన్న నవీన్ పట్నాయక్ ఆశలు అడియాశలయ్యాయి. ఒడిశా సీఎంగా నవీన్ పట్నాయక్ 23 ఏళ్లుగా అధికారంలో ఉన్నారు. అయితే ఐదోసారి అధికార పీఠాన్ని అధిష్టించి.. సిక్కిం మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన పవన్ కుమార్ చామ్లింగ్ పేరిట ఉన్న (సీఎంగా 24 ఏళ్ల 165 రోజుల) రికార్డును అధిగమించాలన్న నవీన్ పట్నాయక్ ఆకాంక్ష కలగానే మిగిలింది. -
కేరళలో ఖాతా తెరిచిన బీజేపీ.. నటుడికి భారీ విజయం
2024 లోక్ సభ ఎన్నికల్లో భాజపా అభ్యర్థి, నటుడు సురేశ్ గోపి విజయం సాధించారు. కేరళలోని త్రిసూర్ పార్లమెంట్ నుంచి పోటీ చేసిన మలయాళ నటుడు తన ప్రత్యర్థిపై గెలుపొందారు. ఆయన విజయంతో భాజపా కేరళలో తన ఖాతా తెరిచింది. తన సమీప ప్రత్యర్థి వీఎస్ సునీల్ కుమార్‌పై(సీపీఐ) ఘనవిజయం సాధించారు. దాదాపు 73 వేలకు పైగా మెజార్టీతో సురేశ్ గోపి గెలిచారు. -
స్మృతి ఇరానీకి చుక్కలు చూపించిన కేఎల్ శర్మ ఎవరు?
లోక్‌సభ ఎన్నికల ఫలితాలు సంచలనం రేపుతున్నాయి. యూపీలోని అమేథీ లోక్‌సభ స్థానం నుంచి పోటీకి దిగిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వెనుకంజలో ఉండటం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన కిషోరి లాల్ శర్మ (కేఎల్ శర్మ) ఓట్ల ఆధిక్యంతో స్మృతీ ఇరానికి చుక్కలు చూపిస్తున్నారు. కాంగ్రెస్ వ్యూహం, దూకుడుతనం, ఎన్నికల ప్రచారం కేఎల్ శర్మకు కలసివచ్చే అంశాలుగా పరిణమించాయని అంటున్నారు. ఈ నేపధ్యంలో కేఎల్ శర్మ బ్యాక్ గ్రౌండ్ ఏమిటో తెలుసుకునేందుకు పలువురు ఆసక్తి చూపిస్తున్నారు.కెఎల్ శర్మకు గాంధీ కుటుంబంతో పాత పరిచయం ఉంది. చాలా కాలంగా రాయ్‌బరేలీలో ఉంటూ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సలహాదారుగా శర్మ వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యకలాపాల్లో కీలకపాత్ర పోషించే ఆయన గాంధీ కుటుంబపు ఎన్నికల ప్రచారంలోనూ కీలకపాత్ర పోషిస్తుంటారు. కెఎల్ శర్మ రాజీవ్ గాంధీకి కూడా అత్యంత సన్నిహితునిగా పేరొందారు.కేఎల్ శర్మ అమేథీలో 1983, 1991 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎంతగానో పాటుపడ్డారు. 1999లో సోనియా గాంధీ మొదటి ఎన్నికల ప్రచారంలో కూడా శర్మ కీలక పాత్ర పోషించారు. ఆయన కృషి కారణంగానే అమేథీలో సోనియా విజయం సాధించారని చెబుతారు. అయితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీని బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ ఓడించారు. మరి ఇప్పుడు కెఎల్ శర్మ ఎటువంటి ఫలితాలు రాబడతారనే దానిపై అందరి దృష్టి నెలకొంది. -
లోక్‌సభ ఎన్నికల్లో నోటా సంచలనం
ప్రజాస్వామ్యంలో నచ్చిన వ్యక్తిని ప్రజా ప్రతినిధిగా ఎన్నుకునే హక్కు ప్రతీ ఓటర్‌కు ఉంది. అలాగే.. ఏ అభ్యర్థి నచ్చకుంటే నోటా(None Of The Above)కు ఓటేయొచ్చు. ఇందుకోసమే 2013లో నోటాను కేంద్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చింది. అయితే ఈ సార్వత్రిక ఎన్నికల్లో నోటా సరికొత్త రికార్డు సృష్టించింది.మధ్యప్రదేశ్ ఇండోర్ పార్లమెంట్ స్థానంలో ఈసారి ఏకంగా నోటాకు లక్షన్నరకు పైగా ఓట్లు పడ్డాయి. విశేషం ఏంటంటే.. ఇక్కడ బీజేపీ అభ్యర్థి శంకర్ లాల్వానీ 9,90,698 ఓట్లు పోల్‌కాగా, రెండో స్థానంలో నోటా ఓట్లు(1,72,798) ఉన్నాయి. మూడో స్థానంలో బీఎస్సీ అభ్యర్థి సంజయ్ సోలంకీ 20,104 ఓట్లతో నిలిచారు.విచిత్రం ఏంటంటే.. కాంగ్రెస్ తమ ఓట్లను నోటాకే ఓటేయాలని ప్రచారం చేయడం. ఎందుకంటే కాంగ్రెస్ తరఫున ఇక్కడ నామినేషన్ వేసిన అక్షయ్ కంటీ బామ్.. చివరి నిమిషంలో తన నామినేషన్ విత్‌డ్రా చేసుకుని బీజేపీలో చేరారు. ఇది కాంగ్రెస్‌కు పెద్ద షాకే ఇచ్చింది. ఈ పరిణామంపై ఇక్కడి నుంచి ఏడుసార్లు నెగ్గిన అభ్యర్థి, లోక్‌సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్ సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.ఇక్కడి నుంచి ప్రత్యామ్నాయ అభ్యర్థిని బరిలో నిలపాలని కాంగ్రెస్ భావించినా.. అందుకు మధ్యప్రదేశ్ హైకోర్టు అంగీకరించలేదు. దీంతో అనివార్యంగా పోటీ నుంచి వైదొలగింది. అయితే బరిలో నిలిచిన వాళ్లకు మద్దతు ఇవ్వకుండా.. నోటాకు ఓటేయాలని ప్రచారం చేసింది కాంగ్రెస్. తద్వారా తమ పార్టీ అభ్యర్థిని లాక్కెల్లిన బీజేపీకి నోటా ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని ప్రయత్నించింది.నోటా చరిత్ర తిరగేస్తే..2019లో బీహార్ గోపాల్‌గంజ్(ఎస్సీ)లో 51,660 నోటా ఓట్లు పడ్డాయి. ఇది నియోజకవర్గంలో పోలైన మొత్తం ఓట్లలో 5 శాతంఅక్కడ జేడీయూ అభ్యర్థి డాక్టర్ అలోక్ కుమార్ సుమన్ 5,68,160 ఓట్లతో గెలుపొందారు.2014 సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడు నీలగిరిలో 46, 559 నోటా ఓట్లు పడ్డాయి. -
విజయం దిశగా కంగనా? మండీ క్వీన్ ఇంట్లో సంబరాలు
హిమాచల్ ప్రదేశ్‌లోని నాలుగు లోక్‌సభ స్థానాల ఫలితాల ట్రెండ్ వెలువడుతోంది. రాష్ట్రంలోని హాట్ సీట్ అయిన మండీపైనే అధికంగా చర్చలు జరుగుతున్నాయి. ఈ హాట్ సీటు నుంచి 10 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక్కడి నుంచి బీజేపీ టికెట్‌పై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఎన్నికల బరిలో నిలిచారు.ఆమె తొలిసారి ఎన్నికల పోరులో దిగారు. ఎన్నికల ఫలితాల తొలి ట్రెండ్‌లో వెనుకంజలో ఉన్నా, ఆ తరువాత కాంగ్రెస్ ప్రత్యర్థి విక్రమాదిత్య సింగ్‌ను ఆమె అధిగమిస్తూ వస్తున్నారు. విక్రమాదిత్య సింగ్ హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కుమారుడు. వీరభద్ర సింగ్ ఆరుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. విక్రమాదిత్య తల్లి ప్రతిభా సింగ్ హిమాచల్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్నారు.ఎగ్జిట్ పోల్స్ ప్రకారం హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ జెండా ఎగురవేయనుంది. మండీ లోక్‌సభ సీటు నుంచి కంగనాకు గెలవనున్నారనే అంచనాలున్నాయి. హిమాచల్‌ప్రదేశ్‌లోని నాలుగు లోక్‌సభ స్థానాలకు గాను మూడు లోక్‌సభ స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని, ఒక సీటు కాంగ్రెస్‌కు దక్కుతుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఎన్నికల ఫలితాల్లో కంగనా విజయపథాన దూసుకుపోతుండటంతో ఆమె ఇంటిలో సంబరాల వాతావరణం నెలకొంది. -
కాంగ్రెస్ విజయంపై శశిథరూర్ వ్యాఖ్యలు
లోక్‌సభ ఎన్నికల యుద్ధం తుది దశకు చేరుకుంది. కేరళలోని తిరువనంతపురం స్థానం నుంచి పోటీకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి శశిథరూర్ వెనుకంజలో ఉన్నారు. తొలి ట్రెండ్‌లో బీజేపీ అభ్యర్థి రాజీవ్ చంద్రశేఖర్ ముందున్నారు. ఈ నేపధ్యంలో శశిథరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు.‘ఓటింగ్ పూర్తయ్యింది. ఇప్పుడు ఎలాంటి వాదనలకు, చర్చలకు తావులేదు. విజయంపై నమ్మకంతో ఉన్నాం. ఏప్రిల్ 26 నుండి మా అంచనాలు పెరిగాయి. ఎందుకంటే ఓటర్లు ఓటు వేశాక, ఆ ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించాక, ఎటువంటి వాదనలకు లేదా చర్చలకు ఆస్కారం ఉండదు. ఇక క్రాస్ ఓటింగ్ విషయానికొస్తే దానివల్ల కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ లాభం కలగలేదు. గత ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరగలేదు. ఈసారి క్రాస్ ఓటింగ్ జరగాలని మేము ఆశించ లేదు. అయితే మేము గెలుస్తున్నామనే నమ్మకంతో ఉన్నాం’ అని శశిధరూర్ మీడియాతో అన్నారు. తిరువనంతపురంను గతంలో త్రివేండ్రం అని పిలిచేవారు. ఇది కేరళ రాజధాని. రాష్ట్రంలోని 20 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. తిరువనంతపురం కేరళలో అత్యధిక జనాభా కలిగిన నగరంగా పేరొందింది. ఈ నగరం దశాబ్దాలుగా వివిధ పార్టీలకు ప్రాతినిధ్యం వహించింది. ఐక్యరాజ్యసమితి మాజీ దౌత్యవేత్త శశి థరూర్ 2009 నుంచి తిరువనంతపురం ఎంపీగా ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. #WATCH | On exit polls, Congress MP & candidate from Kerala's Thiruvananthapuram, Shashi Tharoor says, "...Expectations were set on 26th April because once people have cast their votes and the boxes are sealed in the strong room then there is no further room for any argument or… pic.twitter.com/12jFp6Yiwm— ANI (@ANI) June 4, 2024 -
దూసుకెళ్తున్న స్వతంత్య్ర అభ్యర్థి 'అమృత్‌పాల్ సింగ్'
ఎలక్షన్ కౌటింగ్ జరుగుతూ ఉంది. జాతీయ పార్టీల నాయకులు మాత్రమే కాకుండా స్వతంత్య్ర అభ్యర్థులు కూడా తమదైన రీతిలో దూసుకెళ్తున్నారు. ఈ జాబితాలో ఖలిస్థానీ వేర్పాటువాది, వారిస్ పంజాబ్ డి చీఫ్ 'అమృత్‌పాల్ సింగ్' ఉన్నారు.పంజాబ్‌లోని ఖదూర్ సాహిబ్ స్థానం నుంచి పోటీ చేసిన 'అమృత్‌పాల్ సింగ్' 50,405 ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ నేత కుల్బీర్ సింగ్ జిరా, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి కూడా వెనుకంజలో ఉన్నారు. 2019లో ఖాదూర్ సాహిబ్ స్థానాన్ని కాంగ్రెస్‌కు చెందిన జస్బీర్ సింగ్ గిల్ గెలుచుకున్నారు.Lok Sabha polls: Jailed pro-Khalistani separatist Amritpal Singh leads from Khadoor Sahib seat with over 50,000 votesRead @ANI Story | https://t.co/Ss7uSG3mZg#LokSabhaPolls #AmritpalSingh #Elections pic.twitter.com/rdUudrkviY— ANI Digital (@ani_digital) June 4, 2024 -
Rajasthan: జీరో నుంచి హీరోగా కాంగ్రెస్?
2024 లోక్‌సభ ఎన్నికల ప్రారంభ ట్రెండ్స్‌లో ఎన్డీఏ మెజారిటీ మార్కును దాటింది. ఎన్డీఏ 288 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇందులో బీజేపీ 240 స్థానాల్లో ముందంజలో ఉంది. మరోవైపు ఇండియా అలయన్స్ కూడా మంచి ఫలితాలను రాబడుతోంది. మొదటి రెండు గంటల్లో 211 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ ఒక్కటే 92+ స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.ప్రారంభ పోకడలు పలు రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీని చూపాయి. ఇందులో రాజస్థాన్ కూడా ఉంది. రాజస్థాన్‌లోని 25 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. కాంగ్రెస్ 13 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, బీజేపీ 12 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.రాజస్థాన్ ట్రెండ్స్ చూస్తుంటే భారీ తిరోగమనం కనిపిస్తోంది. బీజేపీకి పెద్ద దెబ్బ తగులుతున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలోని 25 స్థానాలకు గానూ గతసారి బీజేపీ 24 సీట్లు గెలుచుకుంది. నాడు కాంగ్రెస్ ఖాతా కూడా తెరవలేకపోయింది. అయితే ఈసారి కాంగ్రెస్ ఊహించని రీతిలో దూసుకుపోతూ తొలి ట్రెండ్స్‌లో బీజేపీ కంటే ముందుంది.గతంలో మోదీ హవాతో రాజస్థాన్‌లో కాంగ్రెస్ దెబ్బతింది. 2014లో కాంగ్రెస్ ఖాతా కూడా తెరవలేకపోయింది. 2019లో 34.22 శాతం ఓట్లు సాధించింది. అయితే ఈసారి కాంగ్రెస్ తన సత్తా చాటుతోంది. ప్రారంభ ట్రెండ్స్‌ను పరిశీలిస్తే రాజ్‌సమంద్, జైపూర్, పాలి, అల్వార్ స్థానాలలో బీజేపీ ముందుంది. కరౌలి, బార్మర్, జైపూర్ రూరల్, సవాయ్ మాధోపూర్, టోంక్, భరత్పూర్ తదితర స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. -
TG: కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ హోరాహోరీ
తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే టఫ్ ఫైట్ కనిపిస్తోంది. ఇప్పటివరకు జరిగిన ఓట్ల లెక్కింపులో ఈ రెండు పార్టీలే ముందంజలో ఉన్నాయి. ఫలితాల పట్టికలో బీఆర్ఎస్ మూడో స్థానానికి పడిపోయింది. మొత్తం 17 లోక్‌సభ స్థానాల్లో బీఆర్ఎస్ ఒక్క మెదక్‌లో మాత్రమే ఆధిక్యంలో కనిపించింది. అది కూడా కేవలం వందల ఓట్లతో మాత్రమే లీడ్‌లో ఉంది. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి రావు, కమలం పార్టీ అభ్యర్థి రఘునందన్‌రావుకు గట్టి పోటీనిస్తున్నారు.బీజేపీ తరపున పోటీ చేసిన బండి సంజయ్ (కరీంనగర్), ఈటల రాజేందర్ (మల్కాజ్గిరి), కొండా విశ్వేశ్వర్ రెడ్డి (చేవెళ్ల), డీకే అరుణ (మహబూబ్ నగర్), ధర్మపురి అర్వింద్(నిజామాబాద్), గోడం నగేశ్ (ఆదిలాబాద్), కిషన్ రెడ్డి (సికింద్రాబాద్) ఆధిక్యంలో ఉన్నారు.కాంగ్రెస్ తరపున పోటీ చేసిన బలరాం నాయక్ (మహబూబాబాద్), రామసహాయం (ఖమ్మం), గడ్డం వంశీ కృష్ణ (పెద్దపల్లి), సురేశ్ షెట్కార్ (జహీరాబాద్), రఘువీర్ రెడ్డి (నల్గొండ), కావ్య కడియం (వరంగల్), చామల కిరణ్ కుమార్ రెడ్డి (భువనగిరి), మల్లు రవి (నాగర్ కర్నూల్) ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. హైదరాబాద్‌లో అసదుద్దీన్ ఓవైసీ (ఎంఐఎం) ఆధిక్యంలో కొనసాగుతున్నారు.చదవండి: తెలంగాణ లోక్‌సభ ఎన్నికలు: కొనసాగుతున్న కౌంటింగ్ -
ఫలితాలు ఎలా ఉన్నా.. ప్రజలకు సేవ చేస్తాను: తమిళిసై
ఎలక్షన్ కౌంటింగ్ మొదలైపోయింది. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు తాము గెలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో చెన్నై సౌత్ బీజేపీ అభ్యర్థి 'తమిళిసై సౌందరరాజన్' మీడియాతో మాట్లాడారు.దేశ ప్రజలతో పాటు, రాజకీయ నాయకులు కూడా రాబోయే ఫలితాల కోసం వేచి చూస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. నాకు ఎన్నిక ప్రచారానికి చాలా తక్కువ సమయం ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో ప్రచారం చేయలేకపోయాను. ఫలితాలు ఎలా ఉన్నా.. నేను ప్రజల తీర్పును అంగీకరిస్తాను. ఎప్పటికీ ప్రజలకు సేవ చేస్తాను అని తమిళిసై అన్నారు.#WATCH | Chennai, Tamil Nadu: BJP candidate from Chennai South, Tamilisai Soundararajan says, "...I think that all the politicians and all the leaders should express their confidence in this process. The whole world is appreciating this democratic process. So, we have to express… pic.twitter.com/tgavFz3ntg— ANI (@ANI) June 4, 2024 -
ఎన్డీయే ఆధిక్యం.. మెజార్టీ మార్క్ క్రాస్
న్యూఢిల్లీ, సాక్షి: లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల్లో అధికార ఎన్డీయే కూటమి హవా కొనసాగుతోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. ఆధిక్యంలో మెజార్టీ మార్క్ దాటేసింది. దేశవ్యాప్తంగా సుమారు 301 స్థానాల్లో ఎన్డీయే ముందంజలో ఉంది. ఇండియా కూటమి పోరాటం కొనసాగుతోంది. కాంగ్రెస్ సహా కూటమి అభ్యర్థులు 206 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 272. -
ఉత్తరప్రదేశ్: తొలి రౌండ్లో బీజేపీ ఆధిక్యం
యూపీలో లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలి ట్రెండ్‌లో బీజేపీ ముందంజలో ఉంది. 2024 లోక్‌సభ ఎన్నికలు ఏడు దశల్లో జరిగాయి. లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19న ప్రారంభమై జూన్ ఒకటి వరకు కొనసాగాయి. దేశంలోని 543 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. యూపీలోని మీరట్ ఎస్పీ అభ్యర్థి సునీతా వర్మ ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి అరుణ్ గోవిల్ వెనుకంజలో ఉన్నారు. ఎన్నికల కౌంటింగ్‌కు ముందు గోరఖ్‌పూర్ బీజేపీ అభ్యర్థి రవికిషన్ ఆలయంలో పూజలు నిర్వహించారు. #WATCH उत्तर प्रदेश: गोरखपुर लोकसभा सीट से भाजपा उम्मीदवार रवि किशन ने #LokSabhaElections2024 के मतगणना से पहले पंचमुखी मंदिर में पूजा की। pic.twitter.com/9PHNgUOmcF— ANI_HindiNews (@AHindinews) June 4, 2024 -
ఫలితాల కోసం దేశం మొత్తం వేచి ఉంది: అర్జున్ రామ్ మేఘ్వాల్
ఎన్నికల కౌంటింగ్ మొదలైపోయింది. ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో గెలుస్తుందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఈ తరుణంలో కేంద్ర మంత్రి, బికనీర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి 'అర్జున్ రామ్ మేఘ్వాల్' కీలక వ్యాఖ్యలు చేశారు.భారత పార్లమెంటు చరిత్రలో జూన్ 4, 2024 ఎప్పటికీ చాలా ముఖ్యమైన రోజుగా గుర్తుంచుకోబడుతుంది. ఈ రోజు వచ్చే ఫలితాలు అభివృద్ధి చెందిన భారతదేశం కోసం బలమైన పునాది వేస్తుంది. దేశం మొత్తం దీని కోసం వేచి ఉంది. నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి అవుతారు. ఇప్పటికే బికనీర్ ప్రజలు మమ్మల్ని మూడుసార్లు ఆశీర్వదించారు. నాలుగోసారి కూడా ఆశీర్వదించబోతున్నారని అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు.#WATCH | Bikaner, Rajasthan: Union Minister and BJP candidate from Bikaner Lok Sabha seat, Arjun Ram Meghwal says, "4th June 2024 will always be remembered as a very important day in the history of the Indian Parliament. The results that will come today will lay a strong… pic.twitter.com/4SPmYs8FsS— ANI (@ANI) June 4, 2024 -
రాజస్థాన్‌లో బీజేపీ ముందస్తు సంబరాలు
2024 లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు మరికాసేపట్లో ప్రారంభం కానుంది. 543 స్థానాలకు 7 దశల్లో ఓటింగ్ జరిగింది. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండీ అలయన్స్ రెండూ తమ తమ విజయాలను ప్రకటించుకుంటున్నాయి.ఫలితాలు వెలువడకముందే విజయోత్సవ సంబరాలు జరుపుకునేందుకు బీజేపీ సన్నాహాలు ప్రారంభించింది. ఎగ్జిట్ పోల్స్‌లో భారీ ఆధిక్యం సాధించిన తర్వాత, భారతీయ జనతా పార్టీ నేతల, కార్యకర్తల ఉత్సాహం తారా స్థాయికి చేరింది. అదే సమయంలో కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు ఎగ్జిట్ పోల్స్‌ను తాము అస్సలు నమ్మడం లేదని పేర్కొన్నాయి.మరోవైపు ఓట్ల లెక్కింపునకు ముందే రాజస్థాన్‌లోని బీజేపీ కార్యాలయాన్ని అందంగా అలంకరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజస్థాన్‌లోని 25 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపునకు 13 వేల మందికి పైగా సిబ్బందిని నియమించినట్లు అధికారులు తెలిపారు. #WATCH | BJP party office in Rajasthan's Jaipur is decorated ahead of the Lok Sabha polls result, today.Vote counting of #LokSabhaElections to begin at 8 am.(Video Source: BJP, Rajasthan) pic.twitter.com/pq8MuZEemD— ANI (@ANI) June 4, 2024 -
ఢిల్లీ: 12కు స్పష్టత.. 4కు తుది ఫలితం?
ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలకు సంబంధించిన ఓట్లను లెక్కించేందుకు ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) కార్యాలయం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 8 గంటలకు ఈవీఎంలు తెరవనున్నారు. 8.30 గంటల నుంచి ఎన్నికల ఫలితాల ట్రెండ్లు మొదలు కానున్నాయి.ఓట్ల లెక్కింపు సమయంలో దాదాపు వెయ్యి సీసీ కెమెరాలు కౌంటింగ్ కేంద్రంలోని ఈవీఎంలపై నిఘా ఉంచుతాయి. ఈవీఎంలు, వీవీప్యాట్లు, ఇతర బ్యాలెట్ పేపర్లను పర్యవేక్షించేందుకు వీలుగా ప్రతి పోలింగ్ స్టేషన్లో 100కు పైగా కెమెరాలు ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాల ఎన్నికల ఫలితాలపై మధ్యాహ్నం 12 గంటలకల్లా ఒక స్పష్టత వస్తుందని ఢిల్లీ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ తెలిపారు. సాయంత్రం 4 గంటలకు తుది ఫలితం వెలువడే అవకాశం ఉందని అన్నారు. మే 25న ఢిల్లీలో జరిగిన లోక్‌సభ పోలింగ్‌లో 58.70 శాతం ఓటింగ్ జరిగింది. రెండు అంచెల భద్రతా ఏర్పాట్ల మధ్య ఈవీఎంలను స్ట్రాంగ్‌రూమ్‌లో ఉంచారు. ఢిల్లీలోని ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓట్ల లెక్కింపు ఉంటుంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓట్ల లెక్కింపునకు ప్రత్యేక టేబుళ్లను ఏర్పాటు చేశారు. 15 నుంచి 18 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. -
మరికొన్ని గంటలే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏ పార్టీ ఎన్ని లోక్‌సభ సీట్లు సాధిస్తుందన్న ఉత్కంఠకు కొన్ని గంటల్లో తెరపడనుంది. మంగళవారం ఉదయమే ఓట్ల లెక్కింపు మొదలుకానుంది. ఈ మేరకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) వికాస్‌రాజ్ ప్రకటించారు. గత నెల 13న రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు సాధారణ ఎన్నికలతోపాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగిన విషయంతెలిసిందే. కంటోన్మెంట్ సీటు ఓట్లను సైతం మంగళవారం లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. మొత్తంగా 525 మంది అభ్యర్థులు పోటీపడగా.. 2,18,14,025 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. 65.67శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా 24 రౌండ్లలో లెక్కింపు.. లోక్‌సభ ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్రవ్యాప్తంగా 34 ప్రాంతాల్లో.. మొత్తం 139 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేశారు. ఇందులో 120 హాళ్లలో ఈవీఎం ఓట్లు, 19 హాళ్లలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు. ఒక్కో అసెంబ్లీ స్థానానికి ఒక కౌంటింగ్ హాల్ ఉంటుంది. ఒక్కో హాల్లో 24 టేబుల్స్ ఉంటాయి. మహేశ్వరం స్థానం పరిధిలో 28 టేబుల్స్ ఏర్పాటు చేయాల్సి రావడంతో రెండు హాళ్లలో ఓట్లను లెక్కించనున్నారు.దీంతో ఈవీఎం ఓట్ల కౌంటింగ్ హాళ్ల సంఖ్య 120కి పెరిగింది. మొత్తం 10వేల మంది సిబ్బంది ఈ ప్రక్రియలో పాల్గొననున్నారు. చొప్పదండి, యాకూత్‌పుర, దేవరకొండ అసెంబ్లీ స్థానాల పరిధిలో పోలైన లోక్‌సభ ఓట్లను అత్యధికంగా 24 రౌండ్లలో లెక్కించనున్నారు. ఆర్మూరు, భద్రాచలం, అశ్వారావుపేట అసెంబ్లీ స్థానాల పరిధిలో పోలైన ఓట్లను అత్యల్పంగా 13 రౌండ్లలో లెక్కిస్తారు. చాలా స్థానాల పరిధిలో 18 నుంచి 21 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తికానుంది. రౌండ్ల వారీగా ఫలితాల ప్రకటన.. ఒక్కో టేబుల్ వద్ద ఒక మైక్రో అబ్జర్వర్, ఒక ఏఆర్ఓ, ఇద్దరు సహాయకులు, అభ్యర్థుల కౌంటింగ్ ఏజెంట్లు ఉంటారు. ప్రతి రౌండ్ ఓట్ల లెక్కింపును మైక్రో అబ్జర్వర్ పర్యవేక్షిస్తారు. ఏకకాలంలో అన్ని టేబుళ్లలో నిర్వహించే లెక్కింపును ఒక రౌండ్‌గా పరిగణిస్తారు. అలా రౌండ్ల వారీగా లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ప్రతి రౌండ్ వివరాలను కేంద్రం నుంచి వచి్చన పరిశీలకుడి పరిశీలనకు పంపిస్తారు. పరిశీలకుల ఆమోదం తర్వాత తదుపరి రౌండ్ లెక్కింపును ప్రారంభిస్తారు. అదే సమయంలో ఒక్కో రౌండ్ లెక్కింపు పూర్తయిన కొద్దీ.. స్థానిక ఆర్వో/ఏఆర్వో మీడియా రూమ్ వద్దకు వచ్చి ఫలితాలను ప్రకటిస్తారు.రౌండ్ల వారీగా ఫలితాలపై ఫారం–17సీ మీద కౌంటింగ్ ఏజెంట్ల సంతకాలు తీసుకుంటారు. ప్రతి శాసనసభ స్థానం పరిధిలో ర్యాండమ్‌గా ఐదు పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేసి.. ఈవీఎంలలోని ఓట్లను, వీవీ ప్యాట్ స్లిప్పులను సరిపోల్చి చూస్తారు. ఎన్నికల ఫలితాలను ప్రదర్శించడానికి 78 ప్రాంతాల్లో స్క్రీన్లను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రంలోకి ఎన్నికల సంఘం అనుమతి ఉన్న వ్యక్తులను మాత్రమే రానిస్తారు.నేడు మద్యం షాపులు బంద్‌లోక్‌సభ ఓట్ల లెక్కింపు నేపథ్యంలో మంగళవారం రోజున తెలంగాణలో మద్యం దుకాణాలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. ఇక ఫలితాలు వచి్చన తర్వాత విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడానికి అనుమతి లేదు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పోలీసులు ముందుగా అనుమతిస్తే ర్యాలీలు చేసుకోవచ్చు.ఉదయం 10.30 కల్లా ఆధిక్యతపై స్పష్టత!మంగళవారం ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. 2.18లక్షల పోస్టల్ బ్యాలెట్లు పోలైన నేపథ్యంలో లెక్కింపునకు ఎక్కువే సమయం పట్టే అవకాశం ఉంది. ఇక 8.30 గంటలకు ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఉదయం 10.30 గంటల కల్లా చాలా లోక్‌సభ స్థానాల్లో ఎవరు ఆధిక్యతలో ఉన్నారనేది తేలే అవకాశం ఉంది. మధ్యాహ్నం 12.30 గంటలకల్లా విజయావకాశాలపై స్పష్టత వచ్చే చాన్స్ ఉంది. పోటీ ఎక్కువగా ఉన్న స్థానాల్లో మాత్రం ఆద్యంతం ఉత్కంఠగా కౌంటింగ్ కొనసాగనుంది. కౌంటింగ్, ఫలితాల సరళిని https://results.eci.gov.in ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. -
ఫ్యాను గాలి వీచింది
సాక్షి, అమరావతి: రాష్ట్రమంతా ఫ్యాను గాలి ఉధృతంగా వీచిందని, ఓటర్లలో అధిక శాతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని, ఆ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ప్రముఖ సెఫాలజిస్టులు స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో 50 శాతం కంటే ఎక్కువ ఓట్లతో అత్యధిక శాసన సభ, లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించడం ఖాయమని తేల్చి చెప్పారు. ‘సాక్షి’ టీవీ సోమవారం రాత్రి నిర్వహించిన చర్చలో ప్రముఖ సెఫాలజిస్టులు ‘ఆరా’ మస్తాన్, ‘ఆత్మసాక్షి’ మూర్తి, ‘రేస్’ కిషోర్, ‘ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్’ ఇంద్రనీల్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ సానుకూల ఓటుతో వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధించి అధికారంలోకి వస్తోందని వారంతా స్పష్టం చేశారు.సీఎం జగన్ పాజిటివ్ ప్రచారానికి ప్రజలు సానుకూలంగా స్పందించారుగత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 142కు పైగా శాసనసభ, 22 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధిస్తుందని చెప్పాం. అదే ఫలితాలు వచ్చాయి. 18 రాష్ట్రాల్లో మేం నిర్వహించిన సర్వేలు నిజమయ్యాయి. సైకో పోవాలి.. సైకిల్ రావాలి, ఇదేం ఖర్మ రాష్ట్రానికి అనే నినాదాలతో టీడీపీ నెగెటివ్ ప్రచారం చేసి సెల్ఫ్ గోల్ చేసుకుంది.టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తును ప్రజలు అవకాశవాద పొత్తుగా భావించారు. అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పి ప్రజల్లో ఆత్మస్థైర్యం నింపడంలో టీడీపీ కూటమి విఫలమైంది. ఐదేళ్లు సంక్షేమ పథకాలు, సుపరిపాలన ద్వారా ప్రజలకు మంచి చేసిన సీఎం వైఎస్ జగన్.. మళ్లీ అధికారంలోకి వస్తే మరింత మంచి చేస్తానంటూ చేసిన పాజిటివ్ ప్రచారం పట్ల ప్రజలు సానుకూలంగా స్పందించారు. నేను సర్వేలో చెప్పిన 126 స్థానాలకంటే అధిక స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించడం ఖాయం. – ‘ఆత్మసాక్షి’ మూర్తివైఎస్సార్సీపీకి 120 సీట్లకంటే ఎక్కువే వస్తాయి..సంక్షేమం అభివృద్ధి పథకాల ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన మంచికి కృతజ్ఞ్ఞతలు చెబుతూ ప్రజలు వైఎస్సార్సీపీకి ఓట్లు వేసినట్లు మా సర్వేలో వెల్లడైంది. టీడీపీ కూటమి మొదటి నుంచి నెగెటివ్ ప్రచారానికే పరిమితమైంది. మేనిఫెస్టోను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో కూడా టీడీపీ కూటమి విఫలమైంది. ఇది కూటమిని తీవ్రంగా దెబ్బతీసింది. సానుకూల ఓటుతో వైఎస్సార్సీపీ 120 స్థానాల కంటే అధిక స్థానాల్లో విజయం సాధించడం ఖాయం. – రేస్ కిశోర్గ్రామీణ, పట్టణ ప్రాంతాలూ వైఎస్సార్సీపీ వైపేముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలంతా వైఎస్సార్సీపీ వైపు నిలబడ్డారు. నాడు–నేడుతో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి ఆధునికీకరించి, ఇంగ్లిష్ మీడియంలో పిల్లలకు చదువులు చెప్పడం అగ్రవర్ణాలనూ ఆకట్టుకుంది.సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు సీఎం జగన్ లబ్ధి చేస్తుంటే.. రాష్ట్రాన్ని శ్రీలంకగా మార్చుతున్నారంటూ టీడీపీ, ఇతర విపక్షాలు విమర్శించడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకూ పట్టణ, గ్రామీణ ప్రాంతాలు అనే తేడా లేకుండా ప్రజలు వైఎస్సార్సీపీ వైపు మొగ్గు చూపారు. వైఎస్సార్సీపీ 120 స్థానాలకంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధించి, మళ్లీ అధికారంలోకి రావడం తథ్యం. – ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ ఇంద్ర నీల్నేను చెప్పిన 104 స్థానాల కంటే వైఎస్సార్సీపీకి అధికంగా వస్తాయిగత ఎన్నికల్లో 50 శాతం ఓట్లు సాధించి వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ఐదేళ్లపాటు అధికారంలో ఉంది. ఈసారి కూడా అంతే స్థాయి ఓట్లతో మళ్లీ ఘనవిజయం సాధించి, అధికారంలోకి రాబోతోందన్నది మా సర్వేలో వెల్లడైంది. సీఎం వైఎస్ జగన్ గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజల ఇంటి గుమ్మం వద్దకే అందించడం గ్రామీణ ప్రాంతాల ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. వారిపై పెను ప్రభావం చూపింది. అర్హతే ప్రామాణికంగా అందరికీ సంక్షేమ పథకాలు అందించడం వైఎస్సార్సీపీకి సానుకూలంగా మారింది. సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక సాధికారత సాధించిన మహిళలు 56 శాతం వైఎస్సార్సీపీకి మద్దతుగా ఓట్లు వేశారు.టీడీపీ కూటమితో పోల్చితే వైఎస్సార్సీపీకి మహిళలు 13 నుంచి 14 శాతం అధికంగా ఓట్లు వేశారు. మహిళల ఓటింగ్ శాతం పెరగడం వైఎస్సార్సీపీకి సానుకూలంగా మారింది. వృద్ధాప్య పెన్షన్‌ను నాలుగు దశల్లో రూ.2 వేల నుంచి రూ.3 వేలకు పెంచి ఇవ్వడం, ఇంటి వద్దకే రేషన్ అందించడం ద్వారా వృద్ధులకు సీఎం జగన్ జీవనభద్రత కల్పించారు. ఇది వైఎస్సార్సీపీకి సానుకూలంగా మారింది. ఎన్నికల్లో సీఎం జగన్ తాను చేసింది చెప్పి, అధికారంలోకి వస్తే తాను ఏం చేస్తానో చెబుతూ పాజిటివ్ ప్రచారం చేస్తే.. చంద్రబాబు నెగెటివ్ ప్రచారాన్ని చేశారు.ఇది టీడీపీ కూటమికి ప్రతిబంధకంగా మారింది. సీఎం జగన్ అమలు చేసిన సామాజిక న్యాయం వైఎస్సార్సీపీకి అనుకూలంగా మారింది. నేను చెప్పిన 104 స్థానాలకంటే అత్యధిక స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించడం ఖాయం. ఇండియా టుడే – యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్‌ను సబ్ కాంట్రాక్టుకు ఇచ్చిన సంస్థకు రాజకీయ నేపథ్యం ఉండటం వల్ల అది శాస్త్రీయంగా చేయలేదు. దాని గురించి ఇంతకన్నా చెప్పను. – ‘ఆరా’ మస్తాన్ -
మూడోసారీ మోదీనే ప్రధాని: అయోధ్య ప్రధాన పూజారి
లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి అఖండ విజయాన్ని ఆపాదించాయి. అయితే జూన్ 4న ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో, ఏ ప్రభుత్వం ఏర్పాటు కానున్నదో తెలిసిపోనుంది. అన్ని ప్రాంతాలలో మాదిరిగానే అయోధ్యలో కూడా లోక్‌సభ ఎన్నికలపై చర్చలు జరుగుతున్నాయి.ప్రధాని మోదీ మూడోసారి ప్రధాని కావాలని కోరుకుంటూ రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ ప్రతిరోజూ బాలరాముని ముందు వేడుకుంటున్నారు. ఈ నేపధ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పూర్తి మెజారిటీతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని, మూడోసారి కూడా మోదీ ప్రధాని కాబోతున్నారని జోస్యం చెప్పారు.మోదీ మూడోసారి దేశానికి ప్రధాని అవుతారని తాను గతంలోనే చెప్పానని సత్యేంద్ర దాస్ తెలిపారు. తాను చెప్పినది జూన్ 4న రుజువుకానున్నదని అన్నారు. దేశ ప్రధాని మోదీకి రామ్‌లల్లా ఆశీస్సులు ఉన్నాయని, ఆయన ప్రజలకిచ్చిన హామీలను నెరవేరుస్తారని దాస్ పేర్కొన్నారు. -
ఫలితాల పండుగకు క్వింటాళ్లలో లడ్డూల ఆర్డర్లు
2024 లోక్‌సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వెలువడగానే దేశంలోని రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. ఎన్డీఏ శిబిరంలో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. మరోవైపు ఎగ్జిట్ పోల్స్‌ను తిరస్కరించే పనిలో మహాకూటమి నేతలు బిజీగా ఉన్నారు. అయితే యూపీలోని బీజేపీ శ్రేణుల ఉత్సాహం మిన్నంటుతోంది. యూపీ రాజధాని పట్నాలో బీజేపీ కార్యకర్తలు లెక్కకుమించిన సంఖ్యలో లడ్డూలను ఆర్డర్ చేస్తున్నారు. మంగళవారం ఫలితాలు వెల్లడయ్యాక లడ్డూలు పంచుతూ సంబరాలు చేసుకునేందుకు వారు ప్లాన్ చేశారు.పట్నాలో రాజస్థానీ నెయ్యి లడ్డూలతో పాటు మానేర్ లడ్డూలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. మానేర్ లడ్డూ గురించి ప్రస్తావించారు. ఈ నేపధ్యంలో ఈ లడ్డూలకు బీజేపీ నేతలు, కార్యకర్తలలో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. స్వచ్ఛమైన నెయ్యితో చేసిన రాజస్థానీ లడ్డూలు కిలో రూ.620కు విక్రయిస్తున్నారు. పట్నాకు చెందిన బీజేపీ నేతలు, కార్యకర్తలు ఒక మిఠాయి దుకాణంలో క్వింటాల్ లడ్డూలకు ఆర్డర్ ఇచ్చారు.ఈ లడ్డూలు జూన్ 4న ఉదయం 9 నుండి 10 గంటల మధ్య బీజేపీ కార్యాలయానికి చేరుకోనున్నాయి. ఇందుకోసం బీజేపీ కార్యకర్తలు ముందుగానే సదరు దుకాణదారునికి డబ్బులు కూడా చెల్లించారు. స్వచ్ఛమైన నెయ్యి తో చేసిన క్వింటాల్ లడ్డూ ధర రూ. 62 వేలు అని దుకాణదారు తెలిపారు. -
ప్రధాని మోదీతో సీఎం నితీష్ భేటీ.. బీహార్‌లో ఏం జరగనుంది?
దేశంలో లోక్‌సభ ఎన్నికల తంతు పూర్తయ్యింది. ఇక ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి మాత్రమే మిగిలివుంది. ఈ నేపధ్యంలో దేశంలో పలు ఆసక్తిక రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రధాని మోదీని కలుసుకున్నారు. ఇది చర్చనీయాంశంగా మారింది.ఓట్ల లెక్కింపునకు ఒకరోజు ముందు జరిగిన ఈ భేటీలో బీహార్ రాజకీయాలతో పాటు ఇతర ప్రాంతాల రాజకీయ అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సీఎం నితీష్ కుమార్ ప్రధాని నరేంద్ర మోదీని ఢిల్లీలోని ఆయన నివాసంలో కలుసుకున్నారు. సాయంత్రం 4 గంటలకు హోంమంత్రి అమిత్‌షాతో నితీష్ కుమార్ సమావేశం కానున్నారు.ప్రధానితో సీఎం నితీశ్ కుమార్ భేటీ వెనుక అనేక అంశాలు ఉండవచ్చని విశ్లేషకులు అంటున్నారు. బీహార్ సహా దేశవ్యాప్తంగా ఎన్డీఏ సీట్లను అంచనా వేయడం, నూతన ప్రభుత్వం ఏర్పాటయ్యాక క్యాబినెట్లో జేడీయూ పాత్ర ఎలా ఉండనుంది? భవిష్యత్తులో రెండు ప్రభుత్వాలు కలిసి ఎలా పని చేయాలి? అనే అంశాలపై వీరిమధ్య చర్చ జరిగినట్లు సమాచారం.హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన తర్వాత సీఎం నితీశ్ కుమార్ ఢిల్లీ నుంచి పాట్నాకు తిరిగి వెళ్లనున్నారు. సీఎం నితీశ్ కుమార్ ఢిల్లీ పర్యటనలో ఆయన వెంట జేడీయూ రాజ్యసభ ఎంపీ సంజయ్ ఝా కూడా ఉన్నారు. రేపు (శనివారం) లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. అనంతరం ఫలితాలు వెలువడనున్నాయి. -
ఎగ్జిట్ పోల్స్‌పై సోనియా ఆసక్తికర వ్యాఖ్యలు
2024 లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్ 4న జరగనుంది. అనంతరం ఫలితాలు వెలువడనున్నాయి. ప్రధాని మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. అయితే విపక్షాల ఇండియా కూటమి కూడా తమకు మంచి మెజారిటీ వస్తుందని చెబుతోంది.తాజాగా ఎగ్జిట్ పోల్స్‌పై కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఒక ప్రకటనలో స్పందించారు. రేపు రానున్న ఎన్నికల ఫలితాలను ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ సవాల్ చేస్తున్నాయని అన్నారు. ఫలితాల కోసం వేచి చూడాల్సిందేనని సోనియా అన్నారు.. జస్ట్ వెయిట్ అండ్ సీ.. ఎగ్జిట్ పోల్స్ చెబుతున్న దానికి పూర్తి విరుద్ధంగా ఫలితాలు వస్తాయనే పూర్తి ఆశతో ఉన్నామని సోనియా గాంధీ పేర్కొన్నారు.ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్ అంచనాల ప్రకారం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ (నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్) మొత్తం 543 లోక్‌సభ స్థానాల్లో 371 నుండి 401 స్థానాలను గెలుచుకునే అవకాశాలున్నాయి. దీనిలో బీజేపీకి 319 నుంచి 338 సీట్లు వస్తాయని అంచనా. ఇదే జరిగితే పార్లమెంటులో ఎన్డీఏ దాదాపు మూడు వంతుల మెజారిటీకి చేరుకుంటుంది. VIDEO | “We have to wait. Just wait and see. We are very hopeful that our results are completely the opposite to what the exit polls are showing,” says Congress leader Sonia Gandhi.Lok Sabha elections 2024 results will be declared tomorrow. #LSPolls2024WithPTI… pic.twitter.com/xIElzUjJ8P— Press Trust of India (@PTI_News) June 3, 2024 -
కేంద్రంలో కూటమిదే విజయం: జార్ఖండ్ సీఎం
2024 లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్ 4న జరగనుంది. దేశంలో ఏ ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్నదో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. అయితే దీనికి ముందే ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడ్డాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం దేశంలో ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకానుంది. ఇండియా కూటమి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడేందుకు అవకాశం లేదు. అయితే ఎగ్జిట్ పోల్ కరెక్ట్ కాదని ఇండీయా కూటమి నేతలు అంటున్నారు. తాము 295 సీట్లు గెలుచుకుని, కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని వారు చెబుతున్నారు.జార్ఖండ్ ముక్తి మోర్చా ఇండయా కూటమిలో భాగం. రాష్ట్రంలో ఇండియా కూటమి 10కి పైగా సీట్లను గెలుచుకుంటుందని జార్ఖండ్ ముఖ్యమంత్రి చంపై సోరెన్ అన్నారు. ఇతర రాష్ట్రాల సీట్లతో కలిపి తాము మొత్తం 295 సీట్లు గెలుస్తామన్నారు. ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నదానిలో వాస్తవం లేదు. జార్ఖండ్‌లో కూటమి పరిస్థితి బాగానే ఉందన్నారు. కాగా మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇండియా కూటమి లోక్‌సభలో 295 సీట్లు గెలవడం ఖాయమన్నారు. -
సీఎం పట్నాయక్‌కు అగ్ని పరీక్ష
దేశంలోని తూర్పు రాష్ట్రమైన ఒడిశాలో లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. ఫలితాలు జూన్ 4న వెల్లడికానున్నాయి. ఒడిశాలో అధికార బిజూ జనతాదళ్ తిరిగి అధికారంలోకి వస్తుందా? లేక అక్కడి ప్రజలు ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వబోతున్నారా? అనేది జూన్ 4న తేలిపోనుంది.ఒడిశాలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు మే 13 నుంచి జూన్ ఒకటి మధ్య నాలుగు దశల్లో జరిగాయి. యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ అందించిన ఒడిశా లోక్‌సభ ఎన్నికల ఫలితాల అంచనాల ప్రకారం రాష్ట్రంలో బీజేపీ 18 నుంచి 20 సీట్లు గెలుచుకుంటుందని, బీజేడీకి కేవలం రెండు సీట్లు మాత్రమే వస్తాయని అంచనా వేసింది. నేటి చాణక్య ఎగ్జిట్ పోల్ ప్రకారం ఒడిశాలోని మొత్తం 16 స్థానాలను బీజేపీ గెలుచుకోనుంది. జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్ ప్రకారం బీజేపీ 15 నుంచి 18 సీట్లు గెలుచుకోనుండగా, బీజేడీ 3 నుంచి 7 సీట్లు గెలుచుకునే అవకాశాలున్నాయి. ఇక అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ విషయానికొస్తే ఒడిశాలో బీజేపీ, బీజేడీ పార్టీలకు సమాన స్థానాలు వస్తాయనే అంచనాలున్నాయి.ఒడిశాలో అధికార బిజూ జనతాదళ్ (బీజేడీ) వరుసగా ఆరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నామని ప్రకటించింది. అయితే 147 మంది సభ్యుల ఒడిశా అసెంబ్లీలో అధికార మార్పు ఖాయమని బీజేపీ చెబుతోంది. కాగా ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ప్రకటించిన ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్ ప్రకారం నవీన్ పట్నాయక్ అధికార పార్టీ బిజూ జనతా దళ్‌కు 62 నుంచి 80 సీట్లు రావచ్చు. మరోవైపు బీజేపీకి కూడా 62 నుంచి 80 సీట్లు వస్తాయనే అంచనాలున్నాయి. ఈ ఎగ్జిట్ పోల్ డేటా ప్రకారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అసెంబ్లీలో ఐదు నుండి ఎనిమిది స్థానాలను గెలుచుకోనుంది. ఈ ఎగ్జిట్ పోల్స్‌లో పేర్కొన్న విధంగానే ఫలితాలుంటే ఒడిశాలోని నవీన్ పట్నాయక్ ప్రభుత్వం చిక్కుల్లో పడే అవకాశాలున్నాయి. -
19 వరకూ బెంగాల్లో 400 కంపెనీల కేంద్ర బలగాలు
2024 లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. ఫలితాలను ఎన్నికల సంఘం జూన్ 4న వెల్లడించనుంది. మరోవైపు గత కొన్నేళ్లుగా పశ్చిమ బెంగాల్లో ఎన్నికల తర్వాత చోటు చేసుకుంటున్న హింసను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సుమారు 400 కంపెనీల కేంద్ర బలగాల మోహరింపును జూన్ 19 వరకు పొడిగించాలని నిర్ణయించింది.పశ్చిమ బెంగాల్లో శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించిన అనంతరం 400 కంపెనీల కేంద్ర బలగాల మోహరింపును జూన్ 19 వరకు పొడిగిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని సున్నితమైన ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు జూన్ 19 వరకు కేంద్ర బలగాల భద్రతా సిబ్బందిని మోహరించనున్నామని ఎన్నికల సంఘం అధికారి తెలిపారు.2024 లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం 42 స్థానాలకు ఓటింగ్ జరిగింది. నేడు (సోమవారం) కొన్ని బూత్‌లలో రీపోలింగ్ జరుగుతోంది. ఓట్ల లెక్కింపు ముగిసిన రెండు రోజుల వరకూ అంటే జూన్ 6 వరకు కేంద్ర బలగాలను మోహరించాలని ఎన్నికల సంఘం గతంలో నిర్ణయించింది. అయితే ఇప్పుడు దీనిని ఈ నెల 19 వరకూ కొనసాగించాలని సంబంధిత అధికారులు నిర్ణయించారు.బీజేపీ నేత, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఇటీవల ఎన్నికల సంఘానికి చెందిన ప్రత్యేక పరిశీలకునితో సమావేశమయ్యారు. అలాగే కోడ్ ముగిసిన తర్వాత కూడా మూడు నెలల పాటు కేంద్ర బలగాలను రాష్ట్రంలోనే ఉంచాలని గవర్నర్‌తో పాటు కేంద్ర హోంశాఖ కార్యదర్శి, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. -
‘సిద్ధూ మూసేవాలా కోడ్ ఏమిటి? కాంగ్రెస్ సీట్లతో లింక్ ఎందుకు?
దేశంలో లోక్‌సభ ఎన్నికల ఏడు దశల ఓటింగ్ ముగిసింది. మంగళవారం(జూన్ 4) ఓట్ల లెక్కింపు జరగనుంది. దీనికి ముందే ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ విజయాన్ని ప్రకటించాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ గురించి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ ‘ఇదొక ఫాంటసీ పోల్ అని వ్యాఖ్యానించారు. గాయకుడు సిద్ధూ మూసేవాలా పాటను ప్రస్తావిస్తూ ఇండియా కూటమికి 295 సీట్లు వస్తాయని అన్నారు.ఇంతకీ రాహుల్ గాంధీ సింగర్ సిద్దూవాలా ‘295’ పాటను ఎందుకు వినమన్నారు? విశ్లేషకులు తెలిపిన వివరాల ప్రకారం దీనిలో రెండు అర్థాలు ఉన్నాయి. మొదటిది కాంగ్రెస్ 295 లోక్‌సభ స్థానాలు సాధిస్తుందని, మరొకటి ఈ పాటలోని అర్థాన్ని తెలుసుకోవాలని కోరారు. మూసేవాలా పాడిన పాట ‘295’లో 295 అనేది కేవలం ఒక సంఖ్య కాదు. ఈ హిందీ పాటలోని అర్థం విషయానికి వస్తే దీనిలో మతం ప్రస్తావన ఉంది. నిజం మాట్లాడే చోట సెక్షన్ 295 విధిస్తారు. ఎవరైనా అభివృద్ధి చెందిన చోట ద్వేషం రగులుతుంది. సెక్షన్ 295 పేరుతో మతానికి సంబంధించిన నిబంధనలు పెట్టారని పాటలో పేర్కొన్నారు.ఈ పాట ప్రారంభంలో ‘అబ్బాయ్.. నువ్వు ఎందుకు నేల చూపులు చూస్తున్నావు? నువ్వు బాగా నవ్వేవాడివి కదా? ఈ రోజు మౌనం వహిస్తున్నావు? ఈ రోజు తలుపుపై ఉన్న నేమ్‌బోర్డును ఎత్తుకుపోయి, తిరుగుతున్న వారెవరో నాకు తెలుసు. వారు ఇక్కడ వారి ప్రతిభను వ్యాపింపజేయాలనుకుంటున్నారు. నువ్వు కిందపడాలని కోరుకుంటున్నారు. వారు కీర్తి కాంక్షతో రగిలిపోతున్నారు. నీ పేరుతో ముందుకు రావాలని అనుకుంటున్నారు’ అని పాటలో వినిపిస్తుంది. రాహుల్ ఈ పాట ద్వారా కాంగ్రెస్ పరిస్థితిపై మీడియాకు సమాధానమిచ్చారు.ఎగ్జిట్ పోల్ గణాంకాలు విడుదలైన తర్వాత ప్రతిపక్ష నేతలు ఈ లెక్కలను తప్పుపడుతున్నారు. దేశంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడబోతోందని, ఎన్డీఏ ప్రభుత్వం కాదని వారు అంటున్నారు. ఎగ్జిట్ పోల్ డేటాను ఎవరూ అంగీకరించబోరని కాంగ్రెస్ నేత పవన్ ఖేదా పేర్కొన్నారు. మీడియావారు మాతో ఆఫ్ ది రికార్డ్ మాట్లాడినప్పుడు ఇండియా కూటమి పనితీరు అద్భుతంగా ఉందన్నారు. అయితే ఇప్పుడు చూస్తున్నది ఊహాజనిత మార్కెట్ అయిన షేర్ మార్కెట్ కోసం జరిగిందా? లేక బీజేపీ మరో కుట్ర పన్నుతోందా అని పవన్ ఖేదా ప్రశ్నించారు. దేశంలో బీజేపీ భక్తులు తప్ప ప్రతీ ఒక్కరూ ఈ ఎగ్జిట్ పోల్స్‌ను ఫేక్‌గా పరిగణిస్తున్నారన్నారు. -
ఈ తారల ‘ముందస్తు’ జాతకాలివే..
2024 లోక్‌సభ ఎన్నికల్లో పలువురు సినీ తారలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నించారు. ఎన్నికలు ముగిసిన తరుణంలో ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడయ్యాయి. దీంతో ఏ సెలబ్రిటీ పరిస్థితి ఎలా ఉండబోతోందో ‘ముందస్తు’గా వెల్లడయ్యింది.మనోజ్ తివారీప్రస్తుత ఎన్నికల్లో ఈశాన్య ఢిల్లీ సీటుపైనే ఎక్కువ చర్చ జరిగింది. కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ సిట్టింగ్ బీజేపీ ఎంపీ మనోజ్ తివారీపై పోటీకి దిగారు. పలు ఎగ్జిట్ పోల్స్‌లో మనోజ్ తివారీ విజయం ఖాయమనే అంచనాలు వెలువడ్డాయి.పవన్ సింగ్భోజ్పురి గాయకుడు పవన్ సింగ్ బీహార్‌లోని కరకట్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగారు. ఆయనపై పోటీకి ఎన్డీఏ ఉపేంద్ర కుష్వాహను రంగంలోకి దింపింది. అయితే కరకట్ సీటు పవన్ సింగ్ ఖాతాలోకి వెళ్లే అవకాశం ఉందని పలు ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.కంగనా రనౌత్హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ లోక్‌సభ స్థానం నుంచి బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ను బీజేపీ పోటీకి దింపింది. ఆమెతో కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్ తలపడ్డారు. ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కంగనా రనౌత్ విజయాన్ని దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.నిర్హువాఉత్తరప్రదేశ్లోని అజంగఢ్ లోక్‌సభ స్థానం నుంచి భోజ్‌పురి గాయకుడు, నటుడు నిర్హువాను బీజేపీ పోటీకి దింపింది. ఇదేస్థానం నుంచి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి ధర్మేంద్ర యాదవ్ బరిలోకి దిగారు. కొన్ని ఎగ్జిట్ పోల్స్‌లో నిరాహువాదే పైచేయి అని వెల్లడయ్యింది.హేమామాలినిబాలీవుడ్ నటి హేమామాలిని ఉత్తరప్రదేశ్‌లోని మధుర లోక్‌సభ స్థానం నుంచి మూడోసారి పోటీకి దిగారు. పలు ఎగ్జిట్ పోల్స్‌లో హేమ మాలినిదే పైచేయి అని వెల్లడయ్యింది.రవి కిషన్ఉత్తరప్రదేశ్లోని గోరఖ్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి రవికిషన్ పోటీ చేశారు. ఎగ్జిట్ పోల్ ప్రకారం రవికిషన్ ఇక్కడి నుంచి సునాయాసంగా గెలుస్తారు. గోరఖ్‌పూర్ స్థానం బీజేపీకి కంచుకోట. ఇది ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి నాథ్ ఆదిత్యనాథ్ స్వస్థలం. -
పశ్చిమ బెంగాల్లో బీజేపీకి పట్టం? కారణాలివే?
2024 లోక్‌సభ ఎన్నికల ఏడు దశల ఓటింగ్ ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి. అయితే అందరి చూపు జూన్ 4న వెలువడనున్న తుది ఫలితాలపైనే ఉంది. ఇండియా టీవీ సీఎన్ఎక్స్ సర్వే ప్రకారం పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఆధిక్యంలో నిలవనుంది. బీజేపీకి 22-26 సీట్లు వస్తాయని తేలింది. టీఎంసీ 14-18 సీట్లు దక్కించుకునే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ 1-2 సీట్లతో సరిపెట్టుకునేలా కనిపిస్తోంది. పశ్చి బెంగాల్లో బీజేపీ ఆధిక్యతకు కారణాలివేనంటూ పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.పశ్చిమ బెంగాల్లో హిందూ ఓటర్లు మమతా బెనర్జీ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారట. దీనికి రుజువుగా సోషల్ మీడియాలో పలు వీడియోలు కనిపిస్తాయి. మమత ప్రభుత్వం ఒక వర్గానికి చెందినవారిని ప్రోత్సహిస్తూ, హిందువులను అణచివేస్తున్నదనే ఆరోపణలున్నాయి.సందేశ్‌ఖాలీ బసిర్హత్ లోక్‌సభ స్థానం పరిధిలోకి వస్తుంది. ఇక్కడి మహిళలపై జరిగిన లైంగిక వేధింపుల ఘటనలో బీజేపీ తృణమూల్ కాంగ్రెస్‌ను కార్నర్ చేసింది. నిందితుడు షాజహాన్ షేక్‌కు టీఎంసీతో సంబంధం ఉందని, అందుకే అతని అరెస్టులో జాప్యంపై జాప్యం చేసిందని బీజేపీ దుమ్మెత్తిపోసింది.బెంగాల్లో ఎన్నికలు జరిగినప్పుడల్లా హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటాయి. దీనిని రాజకీయ పార్టీలు సద్వినియోగం చేసుకుంటున్నాయి. రామ నవమి సందర్భంగా ఊరేగింపుపై రాళ్లు రువ్వడం విషయంలో మమత ప్రభుత్వం మౌనం వహించడాన్ని పలువురు తప్పుబట్టారు. మమతా బెనర్జీపై ప్రజల్లో ఆగ్రహం పెరగడానికి ఇదే ప్రధాన కారణమంటారు.ఈ ఏడాది బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో రామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. రామమందిరంతో బీజేపీకి ప్రత్యక్ష సంబంధం ఉండటంతో బెంగాల్లో బీజేపీకి అనుకూల వాతావరణం ఏర్పడింది.ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమిత్ షా లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పలు ర్యాలీలు నిర్వహించారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఓటమి తరువాత, ఆపార్టీ బెంగాల్లో మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. దాని ఫలితంగా ఈ రోజు బీజేపీ బెంగాల్లో ఆధిక్యంలో ఉన్నట్లు సమాచారం.బెంగాల్లో అవినీతి, ఉపాధి లేకపోవడం, ఫ్యాక్టరీల మూసివేత, శాంతిభద్రతల సమస్యలు సర్వసాధారణంగా మారాయి. అటువంటి పరిస్థితిలో ప్రజల్లో అధికార ప్రభుత్వంపై ఆగ్రహం ఏర్పడింది. ఇది కూడా బీజేపీకి ఓట్లు పడేలా చేసిందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. -
ఈ నేతల విజయం పక్కా? పోరు నామమాత్రం?
2024 లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే వివిధ ప్రైవేట్ సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి. ఈ వివరాలపై జనం అమితమైన ఆసక్తికనబరుస్తున్నారు. ఎగ్జిట్‌పోల్స్ ప్రకారం ఉత్తరప్రదేశ్‌లోని ఎనిమిది మంది నేతలు గెలుపు ఖాయమని తెలుస్తోంది. పైగా వీరికి పోరు నామమాత్రంగా ఉండనున్నదని కూడా ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.ప్రధాని నరేంద్ర మోదీప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. గత రెండు ఎన్నికల్లోనూ ఆయన వరుస విజయాలు సాధిస్తూ వచ్చారు. ఈసారి హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమయ్యారు. 2019 ఎన్నికల్లో మోదీకి ప్రత్యర్థిగా నిలబడిన వారందరికీ డిపాజిట్లు గల్లంతు అయ్యాయి. ఈసారి మోదీ 10 లక్షలకు పైగా ఓట్లు సాధిస్తారని బీజేపీ చెబుతోంది.రాజ్‌నాథ్ సింగ్రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈసారి కూడా లక్నో పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. రాజ్ నాథ్ కూడా ఈసారి హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈసారి ఆయన ఐదు లక్షలకు పైగా ఓట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.హేమమాలినిమథుర లోక్‌సభ స్థానం నుంచి హేమమాలిని వరుసగా మూడోసారి పోటీకి దిగారు. గత 10 ఏళ్లలో తాను ఈ ప్రాంతానికి చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని ఆమె ఓటర్లను అభ్యర్థించారు. హేమ మాలిని మథుర నుంచి హ్యాట్రిక్ సాధించడానికి సిద్ధమవుతున్నారు.అఖిలేష్ యాదవ్ కన్నౌజ్ లోక్‌సభ స్థానం నుంచి అఖిలేష్ యాదవ్ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఎస్ఫీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అజంగఢ్ నుండి గెలిచారు. అయితే 2022 అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యే అయ్యాక, ఆయన తన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేశారు. అఖిలేష్‌పై బీజేపీకి చెందిన సుబ్రతా పాఠక్ రంగంలోకి దిగారు.డింపుల్ యాదవ్ఈసారి డింపుల్ యాదవ్ మెయిన్పూర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. 2022లో ములాయం సింగ్ మరణానంతరం ఇక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో డింపుల్ యాదవ్ విజయం సాధించారు. మెయిన్పూర్ సీటు ఎస్పీకి కంచుకోటగా పేరొందింది. ములాయం సింగ్ యాదవ్ ఇక్కడి నుంచి ఎన్నికల్లో విజయం సాధించారు.అనుప్రియా పటేల్అప్నా దళ్ అధ్యక్షురాలు అనుప్రియా పటేల్.. మీర్జాపూర్ లోక్‌సభ స్థానం నుంచి వరుసగా రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఈసారి కూడా ఆమె మీర్జాపూర్ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తూ, హ్యాట్రిక్ సాధించేందుకు సిద్ధమవుతున్నారు.రాహుల్ గాంధీకాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాయ్ బరేలీ స్థానం నుంచి పోటీకి దిగారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాయ్ బరేలీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. గత ఎన్నికల్లో రాహుల్ అమేథీలో స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. దీంతో ఇప్పుడు ఆయన కాంగ్రెస్‌కు రిజర్వ్డ్ స్థానమైన రాయ్‌బరేలీ నుంచి ఎన్నికల బరిలోకి దిగారు.స్మృతీ ఇరానీస్మృతీ ఇరానీ కేంద్రంలోని మోదీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. 2019లో అమేథీ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో రాహుల్ స్మృతీ ఇరానీకి ఘోర పరాజయాన్ని అందించారు. అయితే 2019 ఎన్నికల్లో ఆమె రాహుల్ గాంధీని ఓడించారు. ప్రస్తుతం స్మృతి ఇరానీకి ప్రత్యర్థిగా గతంలోసోనియా గాంధీ వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన కేఎల్ శర్మ రంగంలోకి దిగారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. -
‘ఆఖరి పోరాటం’లో దిగ్విజయ్‌కు పరాభవం?
లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్‌పోల్స్ పలువురు సీనియర్ నేతల అంచనాలను తలకిందులు చేస్తున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత, జాతీయ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ తనకు ఇవే చివరి ఎన్నికలంటూ మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ లోక్‌సభ స్థానం నుంచిపోటీకి దిగారు.భవిష్యత్‌లో తాను పోటీ చేయబోనని, యువతకు రాజకీయాల్లో అవకాశం కల్పిస్తానని రాజ్‌నాథ్ తెలిపారు. పీపుల్స్ ఇన్సైట్, పోల్‌స్ట్రాట్ సంయుక్తంగా నిర్వహించిన ఎగ్జిట్ పోల్ డేటా దిగ్విజయ్ సింగ్‌కు చేదు అనుభవం ఎదురుకానున్నదని చెబుతున్నాయి.మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ఒక్క లోక్‌సభ సీటు కూడా దక్కదని పీపుల్స్ ఇన్సైట్, పోల్‌స్ట్రాట్ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. మధ్యప్రదేశ్‌లో 2019లో కాంగ్రెస్‌కు ఒక్క సీటు మాత్రమే వచ్చింది. రాజ్‌గఢ్ సీటు బీజేపీ ఖాతాలో పడింది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఈసారి కూడా ఈ సీటును బీజేపీ కైవసం చేసుకోనుంది.దిగ్విజయ్ సింగ్‌పై బీజేపీ రోడ్మల్ నాగర్‌ను పోటీకి నిలబెట్టింది. 2014, 2019లలో రాజ్‌గఢ్ లోక్‌సభ ఎన్నికల్లో రోడ్మల్ విజయం సాధించారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఈసారి కూడా రోడ్మల్‌కే విజయ సంకేతాన్ని చూపిస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెల్లడికానున్నాయి. -
కంగనా ఇక మండీ క్వీన్?
హిమాచల్ ప్రదేశ్‌లోని నాలుగు లోక్‌సభ స్థానాలకు వెలువడిన ఎగ్జిట్ పోల్స్ బీజేపీవైపే మొగ్గుచూపాయి. రాష్ట్రంలో బీజేపీ ఆధిక్యతను ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. మండి లోక్‌సభ స్థానం నుంచి పోటీకి దిగిన బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్, కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్ మధ్య భారీ పోటీ ఏర్పడింది. అయితే ఫలితాల్లో కంగనా రనౌత్ గెలిచే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఈ స్థానం నుంచి నుంచి పది మంది అభ్యర్థులు పోటీ చేసినప్పటికీ మండీ కిరీటం కంగనాకే దక్కుతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనావేశాయి. కాంగ్రా లోక్‌సభ స్థానంలో బీజేపీ నుంచి రాజీవ్, కాంగ్రెస్ నుంచి ఆనంద్ శర్మ తలపడ్డారు. ఈ స్థానంలో కూడా బీజేపీ విజయం ఖాయంగా కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రాలోనూ బీజేపీ ఆధిక్యంలో ఉంది. ఈ స్థానం నుంచి పది మంది అభ్యర్థులు పోటీకి దిగారు.హమీర్పూర్ లోక్‌సభ స్థానంలో బీజేపీ నుంచి అనురాగ్ ఠాకూర్, కాంగ్రెస్ నుంచి సత్పాల్ సింగ్ రైజాదా మధ్య పోటీ నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం అనురాగ్ ఠాకూర్ హమీర్పూర్ స్థానాన్ని గెలుచుకునే అవకాశం ఉంది. ఈ స్థానంలో మొత్తం 12 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. సిమ్లా లోక్‌సభ స్థానంలో బీజేపీ నుంచి సురేశ్ కుమార్, కాంగ్రెస్ నుంచి వినోద్ సుల్తాన్‌పురి తలపడ్డారు. ఈ స్థానంలో కూడా బీజేపీ విజయం సాధించనుందని తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా దక్కే అవకాశాలు లేవని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. బీజేపీ ఈ నాలుగు స్థానాల్లో విజయం దక్కించుకునే అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. -
కాంగ్రెస్ ఖాతాలో రాయ్‌బరేలీ? రాహుల్‌కు పట్టం?
దేశంలో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి వెలువడిన పలు ఎగ్జిట్ పోల్స్‌లోని వివరాల ప్రకారం కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ రాయ్ బరేలీ స్థానం నుండి విజయం సాధించే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ తన సంప్రదాయ స్థానమైన రాయ్ బరేలీని కాపాడుకోవడంలో విజయం సాధించనుంది. అలాగే మంచి ఆధిక్యతనూ దక్కించుకోనున్నదని ఎగ్జిట్‌పోల్స్ చెబుతున్నాయి.రాయ్‌బరేలీలో రాహుల్ గాంధీపై బీజేపీ దినేష్ ప్రతాప్ సింగ్‌ను రంగంలోకి దింపింది. ఈ ప్రాంతంలో ఆయనకు మంచి పట్టు ఉంది. అయితే పలు ఎగ్జిట్ పోల్స్ ఈ సీటు కాంగ్రెస్‌కే దక్కుతుందని అంచనా వేస్తున్నాయి. 2019లో ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ గెలుపొందిన ఏకైక స్థానం రాయ్‌బరేలీ. సోనియా గాంధీ ఇక్కడ నుంచి వరుసగా నాలుగోసారి ఎంపీగా గెలిచారు. రాయ్‌బరేలీ మినహా యూపీలోని మరే సీటులోనూ కాంగ్రెస్ ఖాతా తెరవలేదు.2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీ అమేథీ స్థానం నుంచి పోటీ చేసి, ఓటమి పాలయ్యారు. అయితే అదేసమయంలో కేరళలోని వయనాడ్ నుంచి విజయం సాధించారు. సోనియా గాంధీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయలేదు. తన కుమారుడు రాహుల్ గాంధీని రాయ్‌బరేలీ నుంచి పోటీకి దింపాలని సోనియా ముందుగానే నిర్ణయించుకున్నారు. ఎన్నికల ప్రచారంలో సోనియా గాంధీ తన కుమారుడిని రాయ్ బరేలీ ప్రజలకు అప్పగిస్తున్నట్లు పేర్కొన్నారు. సోనియా గాంధీ చేసిన ఈ ప్రకటన ఓటర్లను ఆకట్టుకుంటుందని కాంగ్రెస్ భావించింది. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ అంచనాలకు ఊతమిస్తున్నాయి.రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం కాంగ్రెస్‌కు కంచుకోట. 1951-52లో రాయ్‌బరేలీ ప్రత్యేక స్థానం కాదు. అప్పట్లో రాయ్‌బరేలీ, ప్రతాప్‌గఢ్‌లను కలిపి ఒక సీటు ఉండేది. తొలి ఎన్నికల్లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ భర్త ఫిరోజ్ గాంధీ ఇక్కడి నుంచి పోటీ చేసి ఎంపీ అయ్యారు. ఆ తర్వాత 1957లో రాయ్‌బరేలీ ప్రత్యేక స్థానంగా మారడంతో ఫిరోజ్ గాంధీ ఈ స్థానం నుంచి తరిగి పోటీ చేసి, విజయం సాధించి పార్లమెంటుకు చేరుకున్నారు. ఇందిరా గాంధీ వరుసగా నాలుగు సార్లు ఇక్కడ నుండి ఎంపీ అయ్యారు. మొదటి లోక్‌సభ ఎన్నికల నుండి 2019లో జరిగిన ఎన్నికల వరకు మొత్తం 16 సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు ఈ స్థానం నుండి విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ ఈ స్థానం నుంచి ఓడిపోయిన సందర్భాలు మూడు మాత్రమే ఉన్నాయి. -
ప్రపంచంలోనే ఎత్తయిన పోలింగ్ స్టేషన్లో ఓట్ల పండుగ
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన పోలింగ్ స్టేషన్ హిమాలయాల శిఖరాలపై 15,256 అడుగుల ఎత్తులోని తాషిగ్యాంగ్ అనే చిన్న గ్రామంలో ఉంది. ఈ ప్రాంతంలో మొబైల్ కనెక్టివిటీ కూడా లేదు. అయినా ఇక్కడ ఎన్నికలను నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.భారత్-చైనా సరిహద్దుకు సమీపంలోని స్పితి వ్యాలీ.. హిమాచల్‌లోని నాలుగు పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఇది మండీ లోక్‌సభ స్థానం పరిధిలోకి వస్తుంది. ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్‌పై బీజేపీ నుంచి నటి కంగనా రనౌత్ పోటీకి దిగారు.తాషిగ్యాంగ్‌లో ఏర్పాటు చేసిన ఈ పోలింగ్ బూత్‌లో 62 మంది ఓటు వేయనున్నారు. తాషిగ్యాంగ్‌లో పోలింగ్ నిర్వహించడం ఇది నాలుగోసారి. అదనపు జిల్లా కమిషనర్ జైన్ మాట్లాడుతూ 2022లో విపరీతమైన చలి ఉన్నప్పటికీ ఈ ప్రాంతానికి చెందిన అర్హులైన ఓటర్లంతా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు. -
‘ముందు ఓటు.. తర్వాతే తల్లి అంత్యక్రియలు’
దేశంలో లోక్‌సభ ఎన్నికల తుది విడత పోలింగ్ నేడు(శనివారం) జరుగుతోంది. దీనిలో భాగంగా బీహార్‌లోని జెహనాబాద్ లోక్‌సభ నియోజకవర్గానికి కూడా పోలింగ్ కొనసాగుతోంది. అయితే ఈ నియోజక వర్గంలో ఒక విచ్రిత ఉదంతం వెలుగు చూసింది. ఇది అందరినీ ఆశ్చర్యానికి గురిచేయడమే కాకుండా ఓటర్లకు ఆదర్శంగా నిలుస్తోంది.జెహనాబాద్‌లోని బూత్ నంబర్ 151 పరిధిలోని దేవ్ కులీ గ్రామానికి చెందిన మిథిలేష్ యాదవ్, మనోజ్ యాదవ్‌ల తల్లి వృద్ధాప్య సమస్యలతో మృతి చెందింది. అయితే కుటుంబ సభ్యులు ఓటు వేసి, వచ్చాకనే ఆ మహిళకు దహన సంస్కారాలు చేయాలని నిర్ణయించుకున్నారు.ఈ సందర్భంగా మృతురాలి కుమారుడు మనోజ్‌యాదవ్ మాట్లాడుతూ ఐదేళ్లకోసారి ఓటింగ్ వస్తుందని, ఇవి ఎంతో ముఖ్యమైనవని, అందుకే తామంతా ముందుగా ఓటువేయాలనుకున్నామని తెలిపారు. ఓటింగ్ పూర్తయ్యాకనే తల్లికి దహన సంస్కారాలు చేస్తామన్నారు.మృతురాలి కుటుంబానికి చెందిన ఉషాదేవి మాట్లాడుతూ ఓటింగ్ అనేది తప్పనిసరి అని, అందుకే ముందుగా ఓటు వేయబోతున్నామని తెలిపారు. వారంతా క్యూలో నిలుచుని, తమ వంతు వచ్చాక ఓటువేశారు. ఆ తర్వాత తల్లి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. -
ఓటు వేశాక పంజాబ్ సీఎం భార్య ఏమన్నారంటే..
లోక్‌సభ ఎన్నికల చివరి దశలో పంజాబ్‌లోని మొత్తం 13 స్థానాలకు ఈరోజు(శనివారం) పోలింగ్ జరుగుతోంది. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తన భార్య డాక్టర్ గురుప్రీత్ కౌర్‌తో కలిసి సంగ్రూర్‌లో ఓటు వేశారు. ఓటు వేసిన అనంతరం మీడియాతో పంజాబ్ సీఎం భార్య డాక్టర్ గురుప్రీత్ కౌర్ మాట్లాడుతూ సాధారణంగా మహిళల ఓటింగ్ ఎప్పుడూ తక్కువగానే ఉంటుంది. అయితే ఈసారి మహిళలంతా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఈ విషయంలో కొత్త చరిత్ర సృష్టిస్తూ, నూతన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని కోరారు.పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా మీడియాతో మాట్లాడారు. పంజాబ్ ప్రజలకు ఓటు హక్కుపై పూర్తి అవగాహన ఉందని, వారు పెద్ద సంఖ్యలో ఓటు వేస్తారని భావిస్తున్నానని అన్నారు. పంజాబీలు తమ ఇళ్ల నుండి బయటకు వచ్చి, ఓటు హక్కు వినియోగించుకుని బాధల్లో, సంతోషాల్లో అండగా ఉండే మంచి ప్రతినిధులను ఎన్నుకోవాలని అన్నారు. అలాంటి వారు లోక్‌సభ మెట్లు ఎక్కినప్పుడే మంచి చట్టాలు కూడా వస్తాయన్నారు.పంజాబ్‌లోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో గతంలో 70 నుంచి 80 శాతం ఓటింగ్ నమోదైందని, ఇప్పుడు కూడా ఓటర్లంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. గడచిన 25 రోజుల్లో తాను 122 ర్యాలీలు నిర్వహించానని, ఏ సీటునూ తేలిగ్గా తీసుకోలేదని అన్నారు. తాను అందించిన కరెంటు, నీళ్లు, ఉద్యోగాలు లాంటి సంక్షేమ పథకాల పేరుతో ఓట్లు అడిగానన్నారు. తన మీద ఎన్నికల కమిషన్‌కు ఒక్క ఫిర్యాదు కూడా అందలేదన్నారు. -
2019 ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకూ నిజమయ్యాయి? యూపీలో ఏం జరిగింది?
ఏడు దశల లోక్‌సభ ఎన్నికలు ఈరోజుతో ముగియనున్నాయి. ఆ తర్వాత అందరి దృష్టి ఫలితాలపైనే ఉండనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే దీనికి ముందు జూన్ ఒకటిన చివరి దశ ఓటింగ్ ముగియగానే ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి.పలు ఏజెన్సీలు తమ అధ్యయనాల ఆధారంగా ఎగ్జిట్ పోల్స్‌ను విడుదల చేస్తాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ఎంత వరకూ నిజమయ్యాయో ఇప్పుడు చూద్దాం. 2019 ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో మరోసారి మోదీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్నదని స్పష్టంగా వెల్లడయ్యింది. ఫలితాల్లో కూడా అదే జరిగింది. 2019లో మొత్తం 543 సీట్లకు గాను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 352 సీట్లు దక్కించుకుంది. ఒక్క బీజేపీనే రికార్డు స్థాయిలో 303 సీట్లు దక్కించుకుంది.2019 లోక్‌సభ ఎన్నికల్లో యూపీఏ 90 సీట్లు గెలుచుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని 80 సీట్లకు గాను ఎన్డీఏ 49 సీట్లను గెలుచుకుంటుందనే అంచనాలు ఎగ్జిట్ పోల్స్‌లో వెలువడ్డాయి. అయితే ఎన్నికల ఫలితాల్లో యూపీలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 64 సీట్లు గెలుచుకుంది. రాయ్‌బరేలీ సీటు ఎస్పీకి దక్కింది. 10 సీట్లు బీఎస్పీ, కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి.ఎగ్జిట్ పోల్స్‌లో ఎస్పీ-బీఎస్పీ, ఆర్ఎల్డీలకు 29 సీట్లు వస్తాయని అంచనాలున్నాయి. ఎగ్జిట్ పోల్‌లో కాంగ్రెస్‌కు కేవలం రెండు సీట్లు మాత్రమే వస్తాయని అంచనా వేశారు. అంతకుముందు 2014 ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 73 స్థానాలను గెలుచుకుంది. వాటిలో 71 బీజేపీకి, రెండు అప్నాదళ్‌కు దక్కాయి. ఈసారి ఎన్నికల్లో ఎస్పీ-బీఎస్పీ, ఆర్ఎల్ఏడీ కలిసి పోటీ చేశాయి. యూపీలో జరిగిన మూడు ఉప ఎన్నికల్లో ఈ కూటమి విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసింది. -
వడదెబ్బకు 15 మంది పోలింగ్ సిబ్బంది మృతి
ఉత్తరప్రదేశ్‌లో వడదెబ్బకు 15 మంది పోలింగ్ సిబ్బంది మృతి చెందారు. శుక్రవారం నాడు ఏర్పడిన అత్యధిక ఉష్ణోగ్రతలకు తాళలేక జనం విలవిలలాడిపోయారు. ఈ నేపధ్యంలో ఎన్నికల విధుల్లో నిమగ్నమైన 15 మంది పోలింగ్ సిబ్బంది కన్నుమూశారు. ఈ వివరాలను ఎన్నికల అధికారులు తెలిపారు. యూపీలోని మిర్జాపూర్ జిల్లాలో 13 మంది ఎన్నికల సిబ్బంది ఎండి వేడిమి కారణంగా తీవ్ర జ్వరం, అధిక రక్తపోటుకు గురై చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో 23 మంది ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సోన్‌భద్ర జిల్లాలో ఎన్నికల విధుల్లో ఉన్న మరో ఇద్దరు ఉద్యోగులు మృతి చెందారు.ఉత్తరప్రదేశ్‌లోని 13 లోక్‌సభ స్థానాలకు ఈరోజు (శనివారం) పోలింగ్ జరుగుతోంది. ఈ నేపధ్యంలో ఓటర్లు ఎండవేడిమికి గురికాకుండా ఉండేందుకు పలు ఏర్పాట్లు చేశారు. పోలింగ్ స్టేషన్ల వద్ద పారామెడికల్ సిబ్బందిని, ఆశా వర్కర్లను అందుబాటులో ఉంచారు. ఓటర్లతో పాటు పోలింగ్ సిబ్బంది తేలికపాటి కాటన్ దుస్తులు ధరించాలని, వాటర్ బాటిల్ దగ్గర ఉంచుకోవాలని అధికారుల సూచించారు. -
నాడు దూరదర్శన్‌లో తొలిసారి ఎన్నికల ఫలితాలు వెలువడినప్పుడు..
2024 లోక్‌సభ ఎన్నికలు ముగుస్తున్న తరుణంలో ఈనెల 4న వెలువడబోయే ఫలితాల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు మనకు టీవీల్లో లేదా స్మార్ట్ఫోన్లలో ఎన్నికల ఫలితాలను చూసే అవకాశం ఉంది. అయితే ఒకప్పుడు ఎన్నికల్లో ఎవరు గెలిచారో తెలుసుకునేందుకు మరుసటి రోజు వచ్చే వార్తాపత్రికల కోసం వేచి ఉండాల్సి వచ్చేది. అయితే ‘సత్యం శివం సుందరం’ నినాదంతో మనముందుకొచ్చిన దూరదర్శన్ ఎన్నికల ఫలితాలను తెలుసుకునేందుకు మరుసటి రోజు వరకూ వేచి ఉండాల్సిన అవసరం లేకుండా చేసింది. 1971 ఎన్నికల ఫలితాలు దూరదర్శన్‌లో మొదటిసారి ప్రసారమయ్యాయి. నాటి ఎన్నికలు ఎంతో ఉత్కంఠభరితంగా సాగాయి. దీనికి కారణం అప్పటివరకూ ఐక్యంగా ఉన్న కాంగ్రెస్ రెండుగా చీలిపోయింది. దీంతో ఫలితాలపై దేశ ప్రజలకు ఎక్కడలేని ఆసక్తి ఏర్పడింది. నాటి ఎన్నికల్లో పలు రాజకీయ పార్టీలు ఉనికిలోకి వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ పండిట్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రిల మరణానంతరం విచ్ఛిన్నమైంది. నాటి నేత కామరాజ్ నాయకత్వంలో కాంగ్రెస్ (ఓ), ఇందిరా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ (ఐ) ఏర్పడ్డాయి. ఎన్నికల ఫలితాలు ఇందిరా గాంధీ వర్గంలోని కాంగ్రెస్‌కు అనుకూలంగా వచ్చాయి. భారీ మెజారిటీతో ఇందిరా గాంధీ ప్రధాని అయ్యారు.దూరదర్శన్ 1959 సెప్టెంబర్ 15న ప్రారంభమైంది. తొలినాళ్లలో మన దేశంలో టీవీని కొనుగోలు చేయడం సంపన్న కుటుంబాలకే పరిమితమయ్యింది. తరువాత టీవీలు క్రమక్రమంగా ప్రజలకు చేరువయ్యాయి. 1970 నాటికి ప్రభుత్వ కార్యక్రమాలను దూరదర్శన్ ముమ్మరంగా ప్రసారం చేయడం ప్రారంభించింది. అలాగే భారతదేశంలోని విస్తృత ఎన్నికల రంగంలోకి ప్రవేశించింది. 1971 ఎన్నికల ఫలితాలు దూరద్శన్లో ప్రసారమైనప్పుడు జనం ఎంతో ఆసక్తిగా గమనించారు. -
ఏ పార్టీ ఓటర్లు ఉదాసీనం? జేపీ నడ్డా ఏమన్నారు?
2024 లోక్‌సభ ఎన్నికల్లో నేడు చివరిదశ పోలింగ్ జరుగుతోంది. నేడు ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని మొత్తం 57 స్థానాలకు ఓటింగ్ జరగనుంది. అయితే 2019తో పోల్చి చూస్తే, ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గిందనే మాట సర్వత్రా వినిపిస్తోంది.దీనికి ఒక మీడియా సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తన అభిప్రాయం వెల్లడించారు. ప్రతిపక్ష పార్టీల ఓటర్లు ఉదాసీనంగా ఉన్నారని, అందుకే ఆ పార్టీలకు దక్కిన ఓట్లు తక్కువేనన్నారు. ఈ కారణంగానే ఓటింగ్ శాతం తగ్గిందని పేర్కొన్నారు. బీజేపీ మద్దతుదారులైన ఓటర్లు ఉత్సాహంగా ఓటు వేశారన్నారు.దేశంలో అధికార ప్రభుత్వంపై జనంలో వ్యతిరేకత లేదని, గత ఎన్నికల డేటాను పరిశీలిస్తే అంటే 2019 మొదటి, రెండవ దశ, 2024 మొదటి, రెండవ దశలలో ఓటింగ్‌శాతం బాగానే ఉన్నదన్నారు. దీనిప్రకారం చూస్తే ఉదాసీనత అనేది బీజేపీ మద్దతుదారులలో లేదని, ప్రదిపక్షాల మద్దతుదారులే ఓటు వేయడానికి ముందుకు రావడం లేదన్నారు.సమాజ్‌వాదీ పార్టీ మద్దతుదారుల్లో ఉదాసీనత ఉందని బీజేపీ నేత జేపీ నడ్డా ఆరోపించారు. ఇప్పుడు జరుతున్న ఎన్నికలపైనా, మూడోసారి రాబోయే మోదీ ప్రభుత్వంపైనా బీజేపీ మద్దతుదారుల్లో ఉత్సాహం ఉన్నదన్నారు. బీజేపీకి పోటీ లేని స్థానాల్లో ఓటింగ్ శాతం తక్కువగా ఉన్నదన్నారు. -
ప్రధాని మోదీ ధ్యానంపై కన్యాకుమారి జనం ఏమంటున్నారు?
లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడు చేరుకున్నారు. అక్కడి కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ ధ్యాన మండపంలో ధ్యానం చేస్తున్నారు. ఈ మెమోరియల్ నిర్మాణంలో అప్పటి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రధాన కార్యదర్శి ఏక్నాథ్ రనడే పాత్ర ఎంతో ఉంది.వివేకానంద రాక్ మెమోరియల్‌లో ప్రధాని మోదీ ఉదయాన్నే సూర్య భగవానునికి అర్ఘ్యం సమర్పించి, పూజలు చేసిన తరువాత ధ్యానంలో మునిగిపోయారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలలో ప్రధాని మోదీ కాషాయ దుస్తులు ధరించి, సన్యాసిలా ఏకాంతవాసాన్ని కొనసాగిస్తున్నారు.2019 ఎన్నికల ప్రచారం తర్వాత ప్రధాని కేదార్‌నాథ్‌లో ధ్యానం చేశారు. ఈసారి కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్‌కి వచ్చారు. కాగా స్థానికులు ఇప్పుడు స్వామి వివేకానందతో నరేంద్ర మోదీని పోల్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధాని పేరు.. వివేకానందుని చిన్ననాటి పేరు కూడా నరేంద్ర కావడం విశేషం అని ఇక్కడివారు అంటున్నారు. అందుకే నాటి వివేకానందునిలా భారతదేశాన్ని ప్రపంచ అగ్రగామిగా మార్చాలనే సంకల్పంతో ప్రధాని నరేంద్ర మోదీ పనిచేస్తున్నారని కన్యాకుమారివాసులు చెబుతున్నారు. మోదీ హయాంలో భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతున్నదని స్థానిక మహిళలు అంటున్నారు.కన్యాకుమారిలోని వివేకానంద ఆశ్రమం మీడియా సెల్ కోఆర్డినేటర్ కృష్ణ కుమార్ మాట్లాడుతూ ఈ ఆశ్రమంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ జాయింట్ డైరెక్టర్ ఏక్నాథ్ రనడే సమాధి ఉందన్నారు. నాటి రోజుల్లో అనేక నిరసనలను ఎదుర్కొంటూ, దేశవ్యాప్తంగా 10 కోట్ల మందికి పైగా ప్రజల నుండి రూపాయి నుండి ఐదు రూపాయల వరకు విరాళాలు తీసుకొని వివేకానంద రాక్ మెమోరియల్ నిర్మించారన్నారు. వివేకానంద ఆశ్రమానికి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని, అయితే భారతదేశ తత్వాన్ని, ఆధ్యాత్మికతను ప్రపంచవ్యాప్తంగా విస్తరించే పనిని ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. -
నేటి ఫైనల్ రౌండ్ ఛాంపియన్ ఎవరు? 2019లో ఏం జరిగింది?
2024 లోక్‌సభ ఎన్నికల ప్రయాణం నేటితో ముగింపు దశకు చేరుకోనుంది. నేడు (శనివారం,జూన్ 1) జరిగే ఏడో దశ పోలింగ్‌లో ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని మొత్తం 57 స్థానాలలో ఓటింగ్ జరగనుంది. చివరి దశలో ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటు స్థానం వారణాసిలో కూడా ఓటింగ్ జరగనుంది. కేంద్ర మంత్రి ఆర్కే సింగ్, అనురాగ్ ఠాకూర్, నటి కంగనా రనౌత్, భోజ్‌పురి నటుడు రవి కిషన్, భోజ్‌పురి సింగర్ పవన్ సింగ్, కాజల్ నిషాద్ తదితరులు నేడు జరిగే పోలింగ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.2019లో ఈ 57 సీట్లలో బీజేపీ అత్యధికంగా 25 సీట్లు గెలుచుకుంది. టీఎంసీకి 9, బీజేడీకి 4, జేడీయూ, అప్నాదళ్ (ఎస్)కు చెరో రెండు సీట్లు చొప్పున వచ్చాయి. జేఎంఎం కేవలం ఒక సీటు మాత్రమే గెలుచుకోగలిగింది. పంజాబ్‌లో కాంగ్రెస్ ఎనిమిది సీట్లు గెలుచుకుంది.2024 లోక్‌సభ ఎన్నికల ఏడవ దశలో బహుజన్ సమాజ్ పార్టీ అత్యధికంగా 56 మంది అభ్యర్థులను బరిలో నిలిపింది. బీజేపీ 51 మంది అభ్యర్థులను నిలబెట్టింది. కాంగ్రెస్ 31 మంది అభ్యర్థులను రంగంలోకి దించింది. టీఎంసీ తొమ్మది మంది అభ్యర్థులకు టిక్కెట్ ఇచ్చింది. సమాజ్‌వాదీ పార్టీ తొమ్మిది మంది అభ్యర్థులను నిలబెట్టింది. సీపీఎం ఎనిమిది స్థానాల్లో పోటీ చేస్తోంది. అకాలీదళ్ 13 మంది అభ్యర్థులను ఎన్నికల రంగంలోకి దింపింది. పంజాబ్‌లోని మొత్తం 13 స్థానాల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తోంది. బిజూ జనతాదళ్ ఆరుగురు అభ్యర్థులను నిలబెట్టింది. సీపీఐ ఏడుగురు అభ్యర్థులను రంగంలోకి దించింది.2019 ఎన్నికల్లో మొదటి దశలో 70 శాతం ఓటింగ్ జరిగింది. 2024 మొదటి దశలో ఓటింగ్ శాతం 66.1గా ఉంది. 2019 రెండవ దశలో 70.1శాతం ఓటింగ్ నమోదైంది. 2024 రెండవ దశలో 66.7 శాతం ఓటింగ్ నమోదైంది. 2019 మూడవ దశలో ఓటింగ్ శాతం 66.9శాతం. 2024 మూడో దశలో 65.7 శాతం ఓటింగ్ జరిగింది. 2019 నాలుగో దశలో 69.1 శాతం ఓటింగ్ జరగగా, 2024 నాలుగో దశలో 69.2 శాతం ఓట్లు పోలయ్యాయి. 2019 ఐదో దశలో 62 శాతం ఓట్లు పోలయ్యాయి. 2024 ఐదవ దశలో 62.2 శాతం ఓట్లు పోలయ్యాయి. 2019 ఆరవ దశలో 64.2 శాతం ఓటింగ్ జరిగింది. 2024 ఆరవ దశ ఎన్నికలలో 63.4 శాతం ఓటింగ్ జరిగింది. -
Lok Sabha Election 2024: ఏడో విడతలో టఫ్ ఫైట్
లోక్‌సభ ఎన్నికల పోరు చివరి అంకానికి చేరుతోంది. ఇప్పటిదాకా ఆరు విడతల్లో 486 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ పూర్తయింది. మిగతా 57 సీట్లకు ఆఖరిదైన ఏడో విడతలో శనివారం పోలింగ్ జరగనుంది. ఏడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్ పరిధిలో 904 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు తేల్చనున్నారు. పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్‌లో మొత్తం సీట్లకూ ఈ విడతలోనే పోలింగ్ జరుగుతోంది. బిహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశి్చమ బెంగాల్‌లోని మిగిలిన సీట్లలో ఎన్నికల క్రతువు ముగియనుంది. చివరి విడత నియోజకవర్గాలను విశ్లేషిస్తే గత ఫలితాలకు సంబంధించి ఆసక్తికరమైన అంశాలు తెరపైకొచ్చాయి...చివరి విడతలో పోలింగ్ జరగనున్న 57 స్థానాల్లో గత రెండు లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీయే చక్రం తిప్పింది. ఈ 57 స్థానాల్లో రెండుసార్లూ 25 సీట్ల చొప్పున కొల్లగొట్టింది. కాంగ్రెస్ 2014లో కేవలం 3, 2019లో 8 స్థానాలతో సరిపెట్టుకుంది. ఓట్లపరంగానూ బీజేపీదే పైచేయి. బీజేపీకి 28 సీట్లలో 40 శాతం ఓట్లు రాగా 12 సీట్లలో 30 నుంచి 40 శాతం దక్కాయి. కాంగ్రెస్‌కు 18 సీట్లలో 10 శాతం ఓట్లు కూడా రాలేదు. మొత్తమ్మీద ఈ 57 సీట్లలో 24 చోట్ల పలు పారీ్టలు పటిష్టంగా ఉన్నాయి. తృణమూల్, బీజేపీలకు చెరో 8 సీట్లు కంచుకోటలు. మూడింట బిజూ జనతాదళ్, రెండేసి చోట్ల కాంగ్రెస్, అకాలీదళ్, ఒక చోట జేడీ(యూ) పటిష్టంగా ఉన్నాయి. ఈ స్థానాల్లో గత మూడు ఎన్నికల్లోనూ ఆ పారీ్టలే గెలిచాయి. మరో 14 సీట్లలో ప్రత్యర్థులకు బీజేపీ గట్టి సవాలు విసురుతోంది. వాటిలో 2009 నుంచి కనీసం రెండుసార్లు బీజేపీ గెలిచింది. ఆ లెక్కన 22 చోట్ల బీజేపీదే జోరు. కాంగ్రెస్ బలంగా ఉన్న సీట్లు 6 మాత్రమే. క్లీన్స్వీప్లన్నీ కమలానివే... ఏడో విడత పోలింగ్ జరిగే స్థానాల్లో గత ఎన్నికల్లో ఐదు చోట్ల క్లీన్‌స్వీప్‌లు నమోదయ్యాయి. అంటే గెలిచిన, ఓడిన పార్టీ మధ్య ఓట్ల తేడా 35 శాతం పైగా నమోదైంది. వీటిలో హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి, హమీర్పూర్, సిమ్లా, కాంగ్రా, ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి ఉన్నాయి. ఇవన్నీ బీజేపీ ఖాతాలోనే పడటం విశేషం. ప్రధాని మోదీ గత ఎన్నికల్లో వారణాసిలో 45.2 శాతం ఓట్ల మెజారిటీ సాధించారు!ఆ స్థానాల్లో హోరాహోరీ... ఏడో విడత స్థానాల్లో గత ఎన్నికల్లో పలు స్థానాల్లో నువ్వానేనా అనేలా టఫ్ ఫైట్ జరిగింది. అవి జలంధర్ (పంజాబ్), బలియా, చందౌలీ (యూపీ), బాలాసోర్ (ఒడిశా), జహానాబాద్ (బిహార్). ఈ స్థానాల్లో గెలుపు మార్జిన్ 2 శాతం లోపే! వీటితో పాటు ఏ పారీ్టకీ స్పష్టమైన మొగ్గు లేని స్వింగ్ సీట్లు 11 ఉన్నాయి. గడచిన మూడు ఎన్నికల్లో వీటిలో ఏ పార్టీ కూడా రెండోసారి గెలవకపోవడం విశేషం. గాజీపూర్, ఘోసి, రాబర్ట్స్‌గంజ్, మీర్జాపూర్ (యూపీ), ఆనంద్‌పూర్ సాహిబ్, ఫరీద్కోట్, ఫతేగఢ్ సాహిబ్, పటియాలా (పంజాబ్), బాలాసోర్ (ఒడిశా), జహానాబాద్, కరాకట్ (బిహార్) ఈ స్వింగ్ సీట్ల జాబితాలో ఉన్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ముగిసిన లోక్‌సభ 2024 ఎన్నికల ప్రచారం
న్యూఢిల్లీ, సాక్షి: సార్వత్రిక ఎన్నికల్లో చివరిదైన ఏడో విడత లోక్ సభ ఎన్నికల ప్రచారం గురువారం సాయంత్రంతో ముగిసింది. ఎనిమిది రాష్ట్రాల్లో మైకులు మూగబోయాయి. చివరి విడతలో 57 లోక్ సభ నియోజకవర్గాల్లో జూన్ 1న పోలింగ్ జరగనుంది. బీహార్ లో ఎనిమిది లోక్‌సభ స్థానాలకు 134 మంది అభ్యర్థులు బరిలో నిల్చున్నారు. చండీగఢ్ 1 లోక్ సభ స్థానానికి 19 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. హిమాచల్ ప్రదేశ్ నాలుగు లోక్‌సభ స్థానాలకు 37 మంది పోటీ పడుతున్నారు. జార్ఖండ్ 3 లోక్‌సభ స్థానాల్లో 52 మంది, ఒడిశాలో 6 లోక్‌సభ స్థానాలకు 66 మంది, పంజాబ్ 13 లోక్‌సభ స్థానాలకు 328 మంది, ఉత్తర ప్రదేశ్ 13 లోక్‌సభ స్థానాల్లో 144 మంది బరిలో నిలిచారు. వెస్ట్ బెంగాల్ 9 స్థానాలకు ,124 మంది బరిలో ఉన్నారు. చివరి విడతలో పలు కీలక నియోజకవర్గాలు ఉన్నాయి. వారణాసి నుంచి ప్రధాని మోదీ, మండి నుంచి బీజేపీ అభ్యర్థిగా కంగనా రనౌత్, హామిపూర్ నుంచి కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, గోరక్‌పూర్ నుంచి నటుడు రవికిషన్, డైమండ్ హార్బర్ నుంచి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పోటీలో ఉన్నారు.18వ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ మొత్తం ఏడు దశల్లో 44 రోజులపాటు సాగనుంది. 1951-52లో తొలి పార్లమెంటు ఎన్నికల తర్వాత అత్యంత సుదీర్ఘ కాలం సాగనున్న ఎన్నికలు ఇవే. -
ప్రధాని మోదీ గురించి వారణాసి కూటమి అభ్యర్థి ఏమన్నారు?
దేశంలో లోక్‌సభ ఎన్నికలు చివరి దశకు చేరాయి. ఈ నేపధ్యంలో యూపీలో రసవత్తర రాజకీయాలు నడుస్తున్నాయి. వారణాసి నుంచి ప్రధాని మోదీపై ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ ఎన్నికల బరిలోకి దిగారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని, కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని పేర్కొన్నారు.ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ లోక్‌సభ తొలి దశ ఎన్నికల్లోనే బీజేపీకి గట్టి సందేశం అందిందన్నారు. అటల్ హయాంలో పార్టీ కేడర్‌కు గౌరవం ఉండేదని, ఇప్పుడు అలా లేదని ఆరోపించారు. బీజేపీ వాగ్దానాలకు ప్రజలు విసిగిపోయారని, వారంతా మార్పు కోసం ఎదురు చూస్తున్నారని , ఈసారి తాను గెలుస్తానని రాయ్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ గంగామాత కుమారునిగా వచ్చానని చెప్పారని, ఇప్పుడు గంగ మురికిమయంగా మారిందన్నారు. బీజేపీ నేతలు కాశీని ప్రయోగశాలగా తీర్చిదిద్దారని, రోజుకో కొత్త ప్రయోగంతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు.బీజేపీ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన అజయ్ రాయ్ 2009లో బీజేపీని వీడి సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. తిరిగి 2012లో కాంగ్రెస్‌లో చేరారు. ప్రస్తుతం కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. 2009 నుంచి వారణాసి నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. గడచిన మూడు ఎన్నికల్లోనూ మూడో స్థానంలో నిలిచారు. 2024లో మరోసారి ప్రధాని మోదీతో తలపడుతున్నారు. ఈసారి ఆయన ఎస్పీ కాంగ్రెస్ కూటమి అభ్యర్థిగా రంగంలోకి దిగారు. -
చివరి విడతలో అఖిలేష్‌కు షాక్
లోక్‌సభ ఎన్నికల చివరి దశ పోలింగ్ జూన్ ఒకటిన జరగనుంది. ఇంతలోనే ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్‌వాదీ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. బల్లియాకు చెందిన ప్రముఖ నేత నారద్ రాయ్ ఎస్పీతో తెగతెంపులు చేసుకుని, బీజేపీలో చేరారు. నారద్ రాయ్ ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. నారద్ రాయ్ సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్‌కు, అతని కుమారుడు అఖిలేష్‌కు అతి సన్నిహితునిగా పేరొందారు.నారద్ రాయ్ బుధవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలుసుకుని అతని సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా రాయ్ ఒక ట్వీట్లో తాను బీజేపీలో చేరినట్లు ప్రకటించారు. ‘బరువెక్కిన హృదయంతో నేను సమాజ్ వాదీ పార్టీని వీడుతున్నాను. 40 ఏళ్ల రాజకీయ జీవితం అలానే ఉంది. ఇప్పుడు బీజేపీ కోసం నా బలాన్నంతా ఉపయోగిస్తాను. బీజేపీని గెలిపించేందుకు ప్రయత్నిస్తాను. అఖిలేష్ యాదవ్ నన్ను అవమానించారు. గత ఏడేళ్లుగా ఇదే జరగుతోంది. 2017లో అఖిలేష్ యాదవ్ నా టికెట్ రద్దు చేశారు. అయితే 2022లో తిరిగి టికెట్ ఇచ్చారు. అయితే అదే సమయంలో నా ఓటమికి కుట్ర పన్నారు’ అని పేర్కొన్నారు.యూపీలోని సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వంలో నారద్ రాయ్ రెండుసార్లు క్యాబినెట్ మంత్రిగా పనిచేశారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీని వీడి, బీఎస్పీ టికెట్‌పై అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ టిక్కెట్‌పై పోటీ చేసి మరోమారు ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయన సమాజ్‌వాదీ పార్టీలోనే ఉంటున్నారు.ఇటీవల బల్లియా లోక్‌సభ ఎస్పీ అభ్యర్థి సనాతన్ పాండేకు మద్దతుగా ఏర్పాటు చేసిన ఎన్నికల బహిరంగ సభలో నారద్ రాయ్ పాల్గొన్నారు. అయితే నాడు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఈయన పేరును ప్రస్తావించలేదు. దీంతో ఆగ్రహించిన నారద్ రాయ్ ఎస్పీతో బంధాన్ని తెంచుకోవాలని నిర్ణయించుకున్నారు. -
ఎన్నికల్లో పోటీకి.. పోటీపడిన పార్టీలు
దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. జూన్ ఒకటిన జరిగే ఆఖరి విడత పోలింగ్‌తో ఎన్నికలు ముగియనున్నాయి. తాజాగా ఎన్నికల హక్కుల సంస్థ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) తెలిపిన వివరాల ప్రకారం 2009తో పోలిస్తే 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే రాజకీయ పార్టీల సంఖ్య 104 శాతం పెరిగింది.ఏడీఆర్ విశ్లేషణ ప్రకారం 2024లో 751 రాజకీయ పార్టీలు ఎన్నికల బరిలో నిలవగా, 2019లో 766, 2014లో 464, 2009లో 368 పార్టీలు ఎన్నికల బరిలో నిలిచాయి. 2009 నుంచి 2024 మధ్య ఎన్నికల్లో పోటీ చేసే రాజకీయ పార్టీల సంఖ్య 104 శాతం పెరిగింది. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దిగిన 8,337 మంది అభ్యర్థుల అఫిడవిట్లపై ఏడీఆర్, నేషనల్ ఎలక్షన్ వాచ్ సమగ్ర విశ్లేషణ చేశాయి.2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మొత్తం 8,360 మంది అభ్యర్థుల్లో 1,333 మంది జాతీయ పార్టీల నుంచి, 532 మంది రాష్ట్ర స్థాయి పార్టీల నుంచి, 2,580 మంది రిజిస్టర్డ్ కాని పార్టీల నుంచి, 3,915 మంది స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికల బలిలోకి దిగారు. జాతీయ పార్టీలకు చెందిన 1,333 మంది అభ్యర్థుల్లో 443 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. 295 మంది అభ్యర్థులు పలు క్రిమినల్ కేసుల్లో నిందితులుగా ఉన్నారు. రాష్ట్ర స్థాయి పార్టీలకు చెందిన 532 మంది అభ్యర్థుల్లో 249 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. -
ఫలితాలపై బెట్టింగ్ మార్కెట్ ప్రకంపనలు
2024 లోక్‌సభ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. చివరి దశ ఓటింగ్ జూన్ ఒకటిన జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ లోక్‌సభ ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) విజయం తమదేననే నమ్మకంతో ఉంది. ప్రధాని మోదీ కూడా బీజేపీకి 400కు పైగా లోక్‌సభ స్థానాలు దక్కుతాయని జోస్యం చెప్పారు. అయితే ‘బెట్టింగ్ మార్కెట్’ దీనికి భిన్నమైన వాదన వినిపిస్తోంది.ముంబైకి చెందిన టాప్ బుకీ ఒకరు మీడియాతో మాట్లాడుతూ ప్రారంభంలో అంటే మొదటి దశ ఓటింగ్‌కు ముందు, బీజేపీకి దక్కే సీట్లు అధికంగా ఉంటాయనే అంచనాలున్నాయన్నారు. అయితే అయితే మూడు దశల ఓటింగ్ తర్వాత బీజేపీకి ఆదరణ తగ్గిందన్నారు. ఇప్పుడు ఆరు దశల ఓటింగ్ తర్వాత బీజేపీ పరిస్థితి తారుమారయ్యిదన్నారు.బెట్టింగ్ మార్కెట్ అంచనాల ప్రకారం ప్రస్తుతం బీజేపీ 295 నుంచి 305 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్‌కు 55 నుంచి 65 సీట్లు వస్తాయనే అంచానాలున్నాయి. మార్కెట్ ఎప్పుడూ బీజేపీ చెప్పిన 400 లెక్కకు మద్దతునివ్వలేదు. మార్కెట్ సెంటిమెంట్ ప్రకారం బీజేపీకి 350 సీట్లు కూడా సాధ్యమయ్యేలా కనిపించడం లేదని ముంబై బుకీ తెలిపారు. దేశంలో వివిధ ప్రాంతాల్లోని బెట్టింగ్ మార్కెట్లు అటు బీజేపీకి, ఇటు కాంగ్రెస్‌కు దక్కే లోక్‌సభ సీట్లపై వేసిన అంచనాలిలా ఉన్నాయి.ఫలోడి బెట్టింగ్ మార్కెట్ (రాజస్థాన్)🔹కాంగ్రెస్ - 117🔹ఇండియా - 246🔹బీజేపీ - 209🔹ఎన్డీఏ - 253పాలన్పూర్ (గుజరాత్)🔹కాంగ్రెస్ - 112🔹ఇండియా - 225🔹బీజేపీ - 216🔹ఎన్డీఏ - 247కర్నాల్ (హర్యానా)🔹కాంగ్రెస్ - 108🔹ఇండియా - 231🔹బీజేపీ - 235🔹ఎన్డీఏ-263బెల్గాం (కర్నాటక)🔹కాంగ్రెస్ - 120🔹ఇండియా - 230🔹బీజేపీ - 223🔹ఎన్డీఏ-265కోల్‌కతా 🔹కాంగ్రెస్ - 128🔹భారతదేశం - 228🔹బీజేపీ - 218🔹ఎన్డీఏ - 261విజయవాడ 🔹కాంగ్రెస్ - 121🔹ఇండియా- 237🔹బీజేపీ - 224🔹ఎన్డీఏ - 251ఇండోర్ 🔹కాంగ్రెస్ - 94🔹ఇండియా - 180🔹బీజేపీ - 260🔹ఎన్డీఏ - 283అహ్మదాబాద్ 🔹కాంగ్రెస్ - 104🔹ఇండియా - 193🔹బీజేపీ - 241🔹ఎన్డీఏ-270సూరత్ 🔹కాంగ్రెస్ - 96🔹ఇండియా - 186🔹బీజేపీ - 247🔹ఎన్డీఏ - 282దేశంలోని పలు బెట్టింగ్ మార్కెట్లు లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ - బీజేపీల మధ్య గట్టి పోటీని సూచిస్తున్నాయి. జూన్ ఒకటిన చివరి దశ ఓటింగ్ జరిగాక, జూన్ 4న వెలువడే ఫలితాల్లో ఏ పార్టీ సత్తా ఎంతో తేలిపోనుంది. -
ఏడవ దశకు యూపీ సిద్ధం.. ఏ నియోజకవర్గంలో పరిస్థితి ఏమిటి?
ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో ఏడవ దశకు జూన్ ఒకటిన ఓటింగ్ జరగనుంది. ఈ దశలో దేశంలోని మొత్తం 57 స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ప్రధాని మోదీ పోటీ చేస్తున్న వారణాసికి కూడా ఈ దశలోనే ఎన్నికలు జరగనున్నాయి.చివరి దశలో అంటే జూన్ ఒకటిన యూపీలోని మహారాజ్‌గంజ్, గోరఖ్‌పూర్, ఖుషీనగర్, డియోరియా, బన్స్‌గావ్, ఘోసి, సలేంపూర్, బల్లియా, ఘాజీపూర్, చందౌలీ, వారణాసి, మీర్జాపూర్, రాబర్ట్స్గంజ్లలో మొత్తం 13 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ దశలో ఎన్నికలు జరిగే 13 స్థానాల్లో ఐదు యోగి ఆదిత్యనాథ్ సొంత జిల్లా గోరఖ్‌పూర్ చుట్టూ ఉండగా, నాలుగు ప్రధాని మోదీ నియోజకవర్గం వారణాసిని ఆనుకుని ఉన్నాయి. 2019లో ఈ 13 స్థానాలలో 11 స్థానాల్లో బీజేపీ కూటమి విజయం సాధించింది. మిగిలిన రెండు స్థానాలను బీఎస్పీ దక్కించుకుంది.వారణాసివారణాసి లోక్‌సభ స్థానం నుంచి హ్యాట్రిక్ విజయం సాధించేందుకు ప్రధాని మోదీ పోటీకి దిగారు. ఇక్కడ పోటీ ఏకపక్షంగానే కనిపిస్తోంది. 2003లో మినహా 1991 నుంచి ఈ సీటును బీజేపీనే సొంతం చేసుకుంటోంది.గోరఖ్పూర్గోరఖ్పూర్ను బీజేపీ సంప్రదాయ స్థానంగా పరిగణిస్తారు. ఇక్కడి నుంచి బీజేపీ సిట్టింగ్ ఎంపీ రవికిషన్ను మరోసారి బరిలోకి దింపింది. 2018 ఉప ఎన్నిక మినహా 1989 నుంచి బీజేపీ ఈ స్థానాన్ని దక్కించుకంటూ వస్తోంది.డియోరియా డియోరియా సీటుకు బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రత్యక్ష పోటీ నెలకొంది. ఈ సీటు టిక్కెట్టు ఇప్పుడు ఇండియా కూటమిలోని కాంగ్రెస్‌కు దక్కింది. మాజీ ఎంపీ శ్రీప్రకాష్ మణి త్రిపాఠి కుమారుడు శశాంక్ మణి త్రిపాఠిని బీజేపీ ఇక్కడి నుంచి రంగంలోకి దింపింది. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అఖిలేష్ ప్రతాప్‌సింగ్‌కు టికెట్ ఇచ్చింది. డియోరియా నుంచి బీఎస్పీ నుంచి సందేశ్ యాదవ్ అభ్యర్థిగా బరిలోకి దిగారు.మీర్జాపూర్ యూపీ అసెంబ్లీలో అప్నా దళ్ (ఎస్) మూడో అతిపెద్ద పార్టీ. ఈ పార్టీ నుంచి అనుప్రియ మరోసారి ఇక్కడి నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. ఇక్కడ బీజేపీ, ఎస్పీ, బీఎస్పీ మధ్య త్రిముఖ పోరు నెలకొంది. -
లోక్‌సభ ఎన్నికల ఫలితాలు.. కన్ఫ్యూజన్లో ఎగ్జిట్‌పోల్స్
సార్వత్రిక ఎన్నికల్లో ఆరు విడుతల పోలింగ్ పూర్తయ్యేసరికి ఫలితాలపై ఆసక్తికరమైన చర్చ ప్రారంభమైంది. అసలు పోటీలో లేదనుకున్న ఇండియా కూటమి కొన్ని రాష్ట్రాల్లో గట్టిపోటీ ఇస్తోందనే వార్తలొస్తున్నాయి. ప్రతి దశా కీలకమే అన్నట్టుగా పోలింగ్ సరళి కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. దీంతో జూన్ 1న జోస్యం చెప్పబోయే ఎగ్జిట్‌పోల్ సంస్థలు సైతం కన్ఫ్యూజన్లో ఉన్నట్లు తెలుస్తోంది.అబ్కీ బార్ చార్సౌ పార్ నినాదంతోఅబ్కీ బార్ చార్సౌ పార్ నినాదంతో ఈసారి బీజేపీ ప్రచారంలో అందరికంటే ముందు నిలిచింది. మోదీ చరిష్మాతో మరోసారి అధికారం చేజిక్కించుకోవాలనే పక్కా ప్రణాళికతో కమలదళం ఎన్నికల ప్రచారం కొనసాగించింది. ఓ వైపు మోదీ మరోవైపు అమిత్ షా దేశాన్ని చుట్టేశారు. నాలుగు వందల సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అయితే మొదటి రెండు విడతల పోలింగ్ ముగిసిన తరువాత ఇండియా కూటమి సైతం కాస్త పోటీపడినట్లు కనిపించింది. పుంజుకున్న ఇండియా కూటమిబీహార్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కూటమి బలం పుంజుకుందనే వార్తలు వచ్చాయి. దీంతో ఎన్నికలు ఏకపక్షం కాదనే వాదనలు వినిపించాయి. యూపీలో సైతం తాము చాలా సీట్లు గెలుస్తామని విపక్ష కూటమి ప్రకటించడంతో ఫలితాలపై ఆసక్తికరమైన చర్చ ప్రారంభమైంది. ఎలక్షన్ చివరి అంకానికి చేరుకున్న నేపధ్యంలో ఎన్నికలు నువ్వా నేనా అన్నట్లు జరిగాయనే అభిప్రాయమూ వ్యక్తం అవుతోంది. దీంతో అసలు దేశంలో ఏం జరగబోతుందనే కొత్త చర్చ ప్రారంభం అయింది. చాలామంది ఎలక్షన్ పండితులు బీజేపీ సీట్లు తగ్గుతాయనే అభిప్రాయం చెబుతున్నా..ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందా అనే విషయంపై మాత్రం ఏ ఒక్కరూ కాన్ఫిడెంట్‌గా లేరు.400 సీట్ల టార్గెట్.. ఇది నిజంగా భారీ రికార్డే400 సీట్ల టార్గెట్‌తో రంగంలోకి దిగిన బీజేపీ నిజంగా తన లక్ష్యాన్ని సాధిస్తుందా అనే చర్చతో ఈ సారి సార్వత్రిక ఎన్నికలు ప్రారంభమయ్యాయి. 2019లో సింగిల్‌గా 303 సీట్లు సాధించిన బీజేపీ చరిత్రను తిరగరాసింది. ఇందిరాగాంధీ మరణానంతంరం వచ్చిన సానుభూతితో 1984లో కాంగ్రెస్ పార్టీ 300 మార్కును దాటింది. ఆ తర్వాత మళ్లీ ఏ పార్టీ కూడా సింగిల్‌గా 300 సీట్లు దాటలేదు. కూటమిగా ఎన్డీయే 2019లో ఏకంగా 353 స్థానాలు సాధించింది. ఇది నిజంగా భారీ రికార్డు. తన రికార్డుని తానే తిరగరాస్తానంటూ 400 సీట్లు టార్గెట్ సెట్ చేశారు ప్రధాని మోదీ.బీజేపీ ట్రాప్‌లో ఇండియా కూటమిదీంతో కాంగ్రెస్ కూటమి ప్రచారం కంటే ముందే కుదేలైపోయింది. బీజేపీ ట్రాప్‌లో పడిపోయిన ఇండి కూటమి నాయకులు.. బీజేపీ 400 సాధించలేదంటూ ప్రకటనలు చేసేశారు. కాని బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడానికి 272 సీట్లు చాలన్న చిన్న లాజిక్‌ను కాంగ్రెస్ కూటమి మరిచిపోయింది. తప్పును ఆలస్యంగా తెలుసుకున్న విపక్ష నేతలు తరువాతి కాలంలో అసలు బీజేపీ అధికారంలోకి రాలేదంటూ ప్రకటనలు చేయడం ప్రారంభించారు. అయితే అప్పటికే కీలకమైన రెండు విడతల పోలింగ్ పూర్తైపోయింది. ఈ రెండు విడతల్లో జాతీయ స్థాయిలో మోదీ ఉండాలా వద్దా అనే విషయంపై రెఫరెండంగా ఎన్నికలు జరిగినట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అందుకే మొదటి రెండు విడతల్లో.. పోలింగ్ జరిగిన 190 స్థానాల్లో బీజేపీ హవా కొనసాగినట్లు పోల్ పండిట్లు అంచనా వేస్తున్నారు.నేను పక్కా లోకల్మోదీ హాట్రిక్ నినాదంతో ఎన్నికలు ప్రారంభం కావడానికి ముందే బీజేపీ గెలిచేసిందనే వాదనలు ప్రారంభమయ్యాయి. అయితే మూడు నాలుగు విడతల పోలింగ్ జరిగే సరికి లోక్‌సభ ఎన్నికల్లో లోకల్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ప్రభావితం చూపించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 40 స్థానాలున్న బిహార్‌లో తేజస్వీ యాదవ్ తన ప్రచారంలో ఎక్కువగా నిరుద్యోగం అంశాన్ని హైలైట్ చేశారు. 2019లో బీహార్‌లో ఎన్డీయే కూటమి 39 స్థానాలు గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది. ఈసారి ఇక్కడ కాంగ్రెస్ కూటమి కొన్ని స్థానాలు గెలుస్తుందనే వార్తలు వస్తున్నాయి.ఎన్నికల సరళిపై కొత్త చర్చయూపీలో అఖిలేష్ మీటింగ్స్‌కు సైతం భారీగా జనం హాజరవడం ఎన్నికల సరళిపై కొత్త చర్చకు తెరలేపింది. 80 లోక్‌సభ స్థానాలున్న యూపీలో బీఎస్పీ ఈసారి తన ప్రాభవాన్ని కోల్పోతుందని.. దీనివల్ల లాభపడేది ఎవరనే దానిపై యూపీ రిజల్ట్స్ ఆధారపడి ఉంటాయనేది విశ్లేషకుల అంచనా. ఇక యూపీ తరువాత అతిపెద్ద రాష్ట్రం మహారాష్ట్రలో మరాఠా అస్మితా పేరుతో ఉద్ధవ్ ఠాక్రే తీసుకొచ్చిన ఆత్మగౌరవం నినాదంపైనా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అటు కర్ణాటకలోనూ ప్రజ్వల్ రేవన్న అంశం బీజేపీ కూటమికి వ్యతిరేకంగా పనిచేసినట్లు తెలుస్తోంది. దీంతో మూడు నాలుగు విడతల పోలింగ్ పూర్తయ్యేసరికి ఇండియా కూటమి పోటీలోకి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.400 సీట్లు పెద్ద కష్టమేమీ కాదుబీజేపీ 400సీట్ల నినాదం కేవలం ప్రతిపక్షాలను ట్రాప్ చేయడానికే అనేది స్పష్టమైపోయింది. అయితే బీజేపీ మాత్రం ఇప్పటికీ 400 సీట్లు సాధ్యమనే అంటోంది. 2019లో 353 సీట్లు సాధించిన ఎన్డీయే మరో 40సీట్లు సాధించడం కష్టమేమి కాదని కొంతమంది ఎన్నికల విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా ప్రతిపక్షం బలహీనంగా ఉండటం వల్ల బీజేపీకి పోటీలేకుండా పోయిందని కొంతమంది పోల్స్టర్స్ విశ్లేషిస్తున్నారు.మోదీకి ప్రత్యామ్నాయం లేకపోవడంమోదీకి ప్రత్యామ్నాయం లేకపోవడం, విదేశీ విధానం, ఆర్ధిక పురోగతి లాంటి అంశాలు బీజేపీకి కలిసివచ్చే అంశాలనే వీరు వాదిస్తున్నారు. 400ల సీట్లు సాధ్యమే అని ఒకవేళ 400 సాధ్యం కాకపోయినా.. గతం కంటే బీజేపీ సీట్లు పెరుగుతాయంటున్నారు. ఇక బీజేపీ ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని బీజేపీ సొంతంగా 300 సీట్లు గెలుస్తుందని సీఎస్డీఎస్ సంస్థకు చెందిన సంజయ్ కుమార్ అంచనా వేశారు. బీజేపీ మిత్రపక్షాలు మాత్రం చాలా ఘోరంగా ఓడిపోతాయని.. అందుకే NDAకు నాలుగు వందల సీట్లు సాధ్యం కాదని చెబుతున్నారు. ఈసారి పోటీ నువ్వా నేనా అన్నట్టే ఉందని.. అయితే ఇప్పటికీ బీజేపీకే ఎక్కువ అవకాశాలున్నాయని స్పష్టం చేశారు రాక్ఫెల్లర్ ఇంటర్నేషనల్ చైర్మన్ రుచిర్ శర్మ.250 సీట్లకు పరిమితం అవుతుందంటూఇక కాంగ్రెస్ పార్టీకి కాస్త అనుకూలంగా వ్యవహరించే యోగేంద్ర యాదవ్ లాంటి సెఫాలజిస్టులు కాస్త డిఫరెంట్ వాదన ముందుకు తెస్తున్నారు. ముఖ్యంగా యూపీ, బీహార్, కర్ణాటక, మహారాష్ట్రలో బీజేపీ దాని మిత్రపక్షాలు గతంతో పోలిస్తే 60 నుంచి 70స్థానాలు కోల్పోతారని యాదవ్ అంటున్నారు. బీజేపీ సొంతంగా 250 సీట్లకు పరిమితం అవుతుందని బాంబు పేలుస్తున్నారు యోగేంద్ర యాదవ్. ఇదే నిజం అయితే బీజేపీ కూటమి మద్దతు లేకుండా ప్రభుత్వం నడపలేదని స్పష్టం అవుతోంది.కేక్వాక్ కాదు .. కత్తిమీద సామేఎన్నికల చివరి అంకానికి చేరుకున్న నేపధ్యంలో ఇప్పుడు ఎగ్జిట్‌పోల్స్‌పై చాలా సర్వే సంస్థలు గుంభనంగా ఉన్నాయి. డేటాను విశ్లేషించడంలో తలమునకలైన కీలక సంస్థలన్నీ.. ఈ సారి ఎన్నికల సరళిపై ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడం అంత ఆషామాషీ కాదనే అభిప్రాయానికి వచ్చాయి. 2019లో కేక్‌వాక్‌లా అనిపించిన ఎగ్జిట్‌పోల్స్.. ఈసారి మాత్రం కత్తిమీద సామే అంటున్నారు పొలిటికల్ పండిట్స్. సార్వత్రిక ఎన్నికల తుది దశ పోలింగ్ రోజు అంటే జూన్ 1 సాయంత్రం ఎగ్జిట్‌పోల్స్ వెలువడనున్నాయి. -
కంగనా- విక్రమాదిత్య.. గెలుపోటముల లెక్కలివే?
హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ లోక్‌సభ స్థానానికి గట్టిపోటీ ఏర్పడనుంది. ఎందుకంటే ఇక్కడ అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌లకు సంప్రదాయ ఓటు బ్యాంకు ఉంది. సాధారణ ఓటరును తమవైపు తిప్పుకోవడంలో ఏ పార్టీ విజయం సాధిస్తే అది పార్లమెంటు వరకూ చేరుకోగలుగుతుంది.మోదీ మ్యాజిక్, మాజీ సీఎం జైరాం ఠాకూర్ మద్దతు, స్టార్డమ్ మొదలైనవి బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్‌కు కలసివచ్చే అంశాలుగా భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్‌కు సంప్రదాయ ఓటు బ్యాంకు బలంగా ఉంది. అలాగే అతని తండ్రి, ఆరుసార్లు రాష్ట్రాన్ని ఏలిన మాజీ ముఖ్యమంత్రి, దివంగత వీరభద్ర కె సింగ్ అభిమానులు విక్రమాదిత్యకు అండగా నిలుస్తారనే వాదన వినిపిస్తోంది. దీంతో ఎవరు గెలిచినా వారికి స్వల్ప ఆధిక్యత మాత్రమే దక్కుతుందనే అంచనాలున్నాయి.ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ప్రచార పర్వంలో పరస్పర మాటల యుద్ధం కొనసాగిస్తున్నారు. విక్రమాదిత్య తండ్రి దివంగత వీరభద్ర సింగ్, తల్లి ప్రతిభా సింగ్‌లు మండీ నియోజక వర్గం నుండి మూడుసార్లు ఎంపీలుగా ఎన్నికయ్యారు. 1952 నుంచి 2021 వరకు ఈ నియోజక వర్గంలో జరిగిన 20 ఎన్నికల్లో ఇప్పటివరకు కాంగ్రెస్ 14 సార్లు, బీజేపీ ఐదుసార్లు, జనతా పార్టీ ఒకసారి గెలుపొందాయి. ప్రస్తుతం మండీ నియోజకవర్గంలోని 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు.ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కులు, కిన్నౌర్, లాహౌల్-స్పితి, సిమ్లాలోని రాంపూర్, చంబాలోని భర్మౌర్ స్థానాల్లో ఆధిక్యత సాధించేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాయి. మే 24న మండిలో ప్రధాని నరేంద్ర మోదీ ర్యాలీ నిర్వహించారు. ఈ రోజు (బుధవారం) కులు, సుందర్‌నగర్‌లలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ప్రచారం చేయనున్నారు. -
పార్టీనా?.. కోడలు పిల్లనా?.. సంకటంలో శిబు సోరెన్?
జార్ఖండ్ రాజకీయాల్లో గత నాలుగు దశాబ్దాలుగా దుమ్కా పార్లమెంటరీ నియోజకవర్గం కీలకంగా మారింది. జేఎంఎం చీఫ్ శిబు సోరెన్ పురిటి గెడ్డ దుమ్కాకు రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. వృద్ధుడైన శిబు సోరెన్ ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ దుమ్కా గతంలో కంటే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది.తాజాగా దుమ్కా నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున శిబు సోరెన్ పెద్ద కోడలు సీతా సోరెన్ ఎన్నికల బరిలోకి దిగారు. ఇది మొదలు ఆమె జేఎంఎంపై మాటల యుద్ధం చేస్తున్నారు. దీనికి ప్రతిగా శిబు సోరెన్ చిన్న కోడలు కల్పనా సోరెన్ తన భర్త, మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను జైలుకు పంపినందుకు బీజేపీని కార్నర్ చేస్తున్నారు.ఇటువంటి పరిస్థితుల నేపధ్యంలో శిబు సోరెన్ రాజకీయ ప్రతిష్ట దిగజారుతున్నదనే వాదన వినిపిస్తోంది. ఓ వైపు పార్టీ, మరోవైపు ఇంటి పెద్ద కోడలు.. మధ్యలో శిబు సోరెన్ నలిగిపోతున్నారని వినికిడి. ఇది సోరెన్ కుటుంబానికి మాత్రమే కాకుండా బీజేపీకి కూడా ప్రతిష్టాత్మకంగా మారింది. 2019లో బీజేపీకి చెందిన సునీల్ సోరెన్ దుమ్కా నుంచి గెలిచి, శిబు సోరెన్ కోటను కూల్చివేశారు. ఈసారి సీతను అభ్యర్థిగా నిలబెట్టి, జేఎంఎం (కూటమి)ని గందరగోళపరిచేందుకు బీజేపీ ప్లాన్ చేసింది.అయితే జేఎంఎం.. బీజేపీ అభ్యర్థి సీతకు వ్యతిరేకంగా కుటుంబం నుండి ఎవరినీ అభ్యర్థిగా నిలబెట్టలేదు. అయితే చిన్న కోడలు కల్పనా సోరెన్‌కు పార్టీ ఎన్నికల ప్రచార బాధ్యతలను అప్పగించింది. పార్టీ ఈ స్థానం టిక్కెట్‌ను నలిన్ సోరెన్‌కు కేటాయించింది. 1952లో మొదటిసారిగా దుమ్కా స్థానానికి ఎన్నికలు జరిగాయి. నాడు కాంగ్రెస్‌కు చెందిన పాల్ జుజార్ సోరెన్ విజయం సాధించారు. అప్పటి నుండి ఈ లోక్‌సభ స్థానం 19 ఎన్నికల్లో 11 సార్లు సోరెన్ వర్గం చేతికే దక్కింది. శిబు అనారోగ్యంతో బాధపడుతూ ఎన్నికల్లో పోటీకి దిగలేదు. అయితే ఆయన పార్టీ ఆప్తమిత్రుడు నళిన్ సోరెన్ జెఎంఎం సత్తా చాటేందుకు రంగంలోకి దిగారు.2019 ఎన్నికల డేటా ప్రకారం జార్ఖండ్‌లోని దుమ్కా లోక్‌సభ స్థానంలో మొత్తం ఓటర్ల సంఖ్య 10 లక్షల 25 వేల 968. 2011 జనాభా లెక్కల ప్రకారం ఇక్కడి జనాభా 20 లక్షల 59 వేల 611. ఇక్కడి జనాభాలో 92 శాతం మంది గ్రామాల్లో, మిగిలిన వారు నగరాల్లో నివసిస్తున్నారు. కుల సమీకరణలను పరిశీలిస్తే ఎస్సీ కేటగిరీ జనాభా 7.84 శాతం, ఎస్టీ కేటగిరీ జనాభా 37.39 శాతంగా ఉంది. -
‘మమత’ రాష్ట్రంలో మోదీ రికార్డు.. ఏ ప్రాంతాన్నీ వదలని ప్రధాని?
పశ్చిమ బెంగాల్లో ప్రధాని మోదీ సరికొత్త రికార్డు నెలకొల్పారు. మమతా బెనర్జీకి చెందిన టీఎంసీ అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్‌లోని ఏ ప్రాంతాన్నీ విడిచిపెట్టకుండా ప్రధాని మోదీ ఈ ఏడాది ఏకంగా 22 ర్యాలీలు నిర్వహించారు. ఇంతకు ముందు పశ్చిమ బెంగాల్లో ఏ ప్రధాని కూడా ఇన్ని ర్యాలీలు చేపట్టలేదు.పశ్చిమ బెంగాల్లో మొత్తం 42 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ప్రధాని మోదీ తాను చేపట్టే ర్యాలీలతో పశ్చిమ బెంగాల్‌లోని ప్రతీ ప్రాంతాన్నీ కవర్చేసే ప్రయత్నం చేశారు. ఈసారి పెద్దఎత్తున కాంగ్రెస్ నేతలెవరూ ఇక్కడ ర్యాలీలు చేపట్టకపోవడం విశేషం. మార్చి 16న ఎన్నికల ప్రకటన వెలువడిన అనంతరం ప్రధాని మోదీ బెంగాల్లో భారీ ర్యాలీలు నిర్వహించారు. నేడు (బుధవారం) నిర్వహించే రెండు ర్యాలీలతో మోదీ పశ్చిమ బెంగాల్లో ఈ ఏడాది మొత్తం 22 ర్యాలీలు నిర్వహించినట్లవుతుంది.2021 అసెంబ్లీ ఎన్నికల నుంచి బీజేపీ బెంగాల్‌పై దృష్టి సారించింది. రాష్ట్రంలోని అవినీతి, బంగ్లాదేశ్ నుండి చొరబాట్లు తదితర అంశాలతో ప్రధాని మోదీ అధికార తృణమూల్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. అలాగే రాష్ట్రంలో సీఏఏపై నెలకొన్న గందరగోళాన్ని తొలగించేందుకు ప్రయత్నించారు. సందేశ్‌ఖాలీలోని మహిళల అణచివేతపై దుమ్మెత్తిపోశారు. సందేశ్‌ఖాలీ ప్రాంతంలోని మహిళలకు న్యాయం చేసే విధంగా ఆ ప్రాంతానికి చెందిన రేఖా పాత్రకు టికెట్ ఇచ్చారు. ఈ విధంగా ప్రధాని మోదీ మహిళలకు బీజేపీ అండగా ఉంటుందనే సందేశాన్ని అందించారు. -
ఎన్డీఏకి చుక్కలు చూపిస్తున్న ‘పవర్ స్టార్’
కొంత కాలం క్రితం వరకు బీహార్‌లోని కరకాట్ లోక్‌సభ నియోజకవర్గం ఎవరి దృష్టినీ ఆకర్షించలేదు. ప్రస్తుతం ఇక్కడ నుంచి ఎన్డీఏ తరపున సీనియర్ నేత ఉపేంద్ర కుష్వాహా పోటీలో ఉన్నారు. కూటమి ఒప్పందంలో భాగంగా కుష్వాహాకు చెందిన రాష్ట్రీయ లోక్ మోర్చాకు ఒక సీటు లభించింది. ఆయనకు ప్రత్యర్థిగా సీపీఐ(ఎంఎల్)కు చెందిన రాజారామ్ సింగ్ రంగంలోకి దిగారు. అయితే ఇప్పుడు భోజ్‌పురి పవర్ స్టార్‌గా పేరొందిన నటుడు పవన్ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి, ఎన్డీఏకు చుక్కలు చూపిస్తున్నారు.వివరాల్లోకి వెళితే బీజేపీ గతంలో పవన్సింగ్కు అసన్సోల్ లోక్‌సభ టిక్కెట్ కేటాయించింది. అయితే తనకు అసన్సోల్ వద్దని, తాను కరకాట్ నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్లు బీజేపీకి స్పష్టం చేశారు. కానీ అప్పటికే బీజేపీ ఆ సీటు టిక్కెట్‌ను ఉపేంద్ర కుష్వాహాకు కేటాయించింది. దీంతో భోజ్‌పురి పవర్ స్టార్ పవన్ సింగ్ బీజేపీపై దండెత్తి, కరకాట్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ఇది ఎన్డీఏకు పెద్ద సవాల్‌గా మారింది.16 లక్షలకు పైగా ఓటర్లు ఉన్న కరకాట్ ప్రాంతం వరి సాగుకు ప్రసిద్ధిచెందింది. ఇక్కడ 400 రైస్ మిల్లులు ఉన్నాయి. పవన్ సింగ్ రాకతో కరకాట్ రాజకీయ వాతావరణం వేడెక్కిందని స్థానిక రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కరకాట్ 2009లో ఉనికిలోకి వచ్చింది. ఇక్కడి మొదటి ఎంపీ జేడీయూకి చెందిన మహాబలి సింగ్. 2014లో ఎన్డీఎ భాగస్వామ్య ఆర్ఎల్ఎస్పీ అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వాహ విజయం సాధించారు. 2019లో మహాకూటమి నుంచి పోటీ చేసిన ఉపేంద్ర కుష్వాహాను జేడీయూకు చెందిన మహాబలి సింగ్ ఓడించారు.పవన్ సింగ్ రాజ్‌పుత్ వర్గానికి చెందినవాడు కావడమే అతనికున్న బలం. ఇది కుష్వాహా వర్గపు ఆధిపత్య సీటు అయినప్పటికీ, ఇక్కడ కుష్వాహా, రాజ్‌పుత్, యాదవ వర్గాలకు చెందిన ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. మరోవైపు ఇక్కడ లక్షన్నర మంది ముస్లిం ఓటర్లు కూడా ఉన్నారు. -
సీఎం స్వస్థలంలో హీరో- హీరోయిన్ పోరు
లోక్‌సభకు చివరి దశ పోలింగ్ జూన్ ఒకటిన జరగనుంది. ఈ విడతలో ఉత్తరప్రదేశ్‌లోని 13 స్థానాలకు ఓటింగ్ జరగనుంది. వీటిలో వారణాసి, గోరఖ్‌పూర్ స్థానాల్లో పోటీ ఆసక్తికరంగా మారింది. గోరఖ్‌పూర్ అంటే గీతా ప్రెస్ ఉన్న నగరం. ఈ ప్రాంతం స్వాతంత్ర్య ఉద్యమ సమయంలోనూ కీలకంగా నిలిచింది. ఇది యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వస్థలం. ఇక్కడ ఈసారి బీజేపీ వర్సెస్ సమాజ్‌వాదీ పార్టీల మధ్యప్రత్యక్ష పోరు జరిగే అవకాశం కనిపిస్తోంది.గోరఖ్‌పూర్ లోక్‌సభ స్థానంలో హీరో వర్సెస్ హీరోయిన్ పోరు నెలకొంది. ఇక్కడి నుండి ప్రస్తుత ఎంపీ, నటుడు రవి కిషన్ బీజేపీ తరపున బరిలోకి దిగారు. సమాజ్‌వాదీ పార్టీ భోజ్‌పురి నటి కాజల్ నిషాద్కు ఇక్కడి టిక్కెట్ కేటాయించింది. రవి కిషన్ 2019లో ఇక్కడి నుంచి బీజేపీ టిక్కెట్‌పై విజయం సాధించారు. కాజల్ నిషాద్ 2012లో కాంగ్రెస్‌లో చేరారు. ఆ తర్వాత ఎస్పీ టికెట్‌పై అసెంబ్లీ, మేయర్ ఎన్నికల్లో పోటీ చేసినా ఆమెను విజయం వరించలేదు.1990లో యోగి ఆదిత్యనాథ్ ఇక్కడి నుంచే తన పార్లమెంటరీ జీవితాన్ని ప్రారంభించి, వరుసగా ఐదు సార్లు ఎన్నికల్లో విజయం సాధించారు. 2017లో ఆయన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన రవి కిషన్ విజయం సాధించారు. యోగి ఆదిత్యనాథ్‌ను ఐదుసార్లు ఎంపీని చేసిన ఇక్కడి ఓటర్లు సీఎంపై మరింత నమ్మకం ఉంచారు. అందుకే బీజేపీకి మద్దతుగా నిలుస్తారనే అంచనాలున్నాయి.గోరఖ్‌పూర్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య సుమారు 20 లక్షల 74 వేలు. ఈ సీటులో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉండగా, అవన్నీ బీజేపీ ఖాతాలోనే ఉన్నాయి. 2018 లోక్‌సభ ఉప ఎన్నిక మినహా ప్రతిసారీ సమాజ్‌వాదీ పార్టీ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. -
ముస్లిం ఓటు బ్యాంకు ప్రభావమెంత? ఏ పార్టీకి ప్రయోజనం?
2024 లోక్‌సభ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. ఆరు దశల ఓటింగ్ పూర్తయ్యింది. ఏడో దశకు జూన్ ఒకటిన పోలింగ్ జరగనుంది. దేశంలో హిందువుల జనాభా 80 శాతం. ముస్లిం జనాభా 14 శాతం. అసోం, పశ్చిమ బెంగాల్‌లలో అత్యధిక ముస్లిం ఓటు బ్యాంకు ఉంది. ఈ సారి జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో ముస్లిం ఓటు బ్యాంకు ప్రభావం ఏ మేరకు ఉండనుంది?గత మూడు లోక్‌సభ ఎన్నికల్లో ముస్లిం ఓట్లకు సంబంధించిన సీఎస్డీఎస్ లోక్‌నీతి అందించిన డేటా ప్రకారం 2009 ఎన్నికలలో బీజేపీకి నాలుగు శాతం ముస్లిం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు 38 శాతం ముస్లిం ఓట్లు వచ్చాయి. 58 శాతం ముస్లిం ఓటర్లు ఇతర పార్టీలకు ఓటు వేశారు. 2014 ఎన్నికల్లో బీజేపీకి ఎనిమిది శాతం ముస్లిం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు 38శాతం ముస్లిం ఓట్లు, ఇతర పార్టీలకు 54 శాతం ముస్లిం ఓట్లు వచ్చాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఎనిమిది శాతం ముస్లిం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు 33 శాతం, ఇతరులకు 59 శాతం ముస్లిం ఓట్లు వచ్చాయి.2014 ఎన్నికల్లో 882 మంది ముస్లిం అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. వీరిలో 23 మంది మాత్రమే విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో 819 మంది ముస్లిం అభ్యర్థులు పోటీ చేశారు. వీరిలో 28 మంది మాత్రమే గెలుపొందారు. 2019 ఎన్నికల్లో 27 మంది ముస్లిం ఎంపీలు పార్లమెంటుకు చేరుకున్నారు.ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అమితాబ్ తివారీ తెలిపిన వివరాల ప్రకారం గత రెండు ఎన్నికలను పరిశీలిస్తే ముస్లిం ఓటర్లు తటస్థంగా మారిపోతున్నారు. ఇందుకు పలు కారణాలున్నాయి. 2014కు ముందు అసోంలో ముస్లిం ఓట్లు కేంద్రీకృతమై ఉండేవి. హిందూ ఓట్లు కులాల ప్రాతిపదికన చెల్లాచెదురయ్యాయి. ఫలితంగా అసోం, యూపీ, బీహార్ రాష్ట్రాల్లో బీజేపీకి తక్కువ సీట్లు వచ్చాయి. 2014, 2019 ఎన్నికలను పరిశీలిస్తే ఈ రాష్ట్రాల్లో బీజేపీకి తొమ్మది సీట్లు వచ్చాయి. మొత్తంగా చూస్తే మైనారిటీ ఆధిపత్య స్థానాల్లో బీజేపీ పరిస్థితి బాగానే ఉందని తివారీ పేర్కొన్నారు. -
రాజకీయాల్లోకి ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్?
ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ త్వరలో రాజకీయాల్లోకి రానున్నారా? 2024 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాజన్ కాంగ్రెస్ చేరుతున్నారంటూ వచ్చిన వార్తల్ని ఖండించారు. తాజాగా మరోమారు ఆయన రాజకీయ రంగ ప్రవేశంపై వార్తలు వస్తున్నాయి. దీనిపైన రాజన్ స్పందించారు. రాజకీయాల్లోకి అడుగు పెట్టడం కంటే నేను చేయగలిగిన చోట మార్గనిర్దేశం చేయాలని అనుకుంటున్నాను. ఇప్పుడు అదే ప్రయత్నిస్తున్నాని తెలిపారు. ఈ విషయాన్ని పదేపదే చెబుతున్నాను. నేను విద్యా వేత్తని. ‘మై బిజినెస్ ఈజ్ నాట్ కిస్సింగ్ బేబీస్’. కానీ ప్రజలు ఇప్పటికీ నా మాటల్ని నమ్మడం లేదు. పాలిటిక్స్ అంటే నా భార్యకు, నాకుటుంబానికి ఇష్టం లేదు. రాజకీయాల్లోకి రావడం తనకు ఇష్టం లేదన్నారు.అనంతరం భారత్, అమెరికా తదితర దేశాల్లోని ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, చిన్న పరిశ్రమల ముందున్న సవాళ్లు, ఆర్థిక అసమానతలపై రాజన్ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది ఆర్ధిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రపంచ దేశాల్లో యుద్ధ భయాలతో పాటు ఇతర అంశాలే అందుకు కారణం. దీనికి తోడు అధిక వడ్డీ రేట్ల ప్రభావం ప్రపంచ వృద్ది ఆశించిన స్థాయిలో ఉండదని తెలిపారు.‘మై బిజినెస్ ఈజ్ నాట్ కిస్సింగ్ బేబీస్’ అంటే పరోక్షంగా రాజకీయాల్లో రావడం ఇష్టం లేదు.. సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నాను అని చెప్పేందుకు ఇంగ్లీష్‌లో ఈ పదాన్ని సందర్భాన్ని బట్టి వాడుతుంటారు. -
అద్వానీది పాకిస్తాన్.. ఇక్కడ సెటిలయ్యారు: మాజీ సీఎం రబ్రీదేవి
బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ నేత రబ్రీ దేవి బీజేపీని టార్గెట్ చేశారు. ‘ప్రధాని మోదీ ఇప్పుడు వచ్చారు. పాకిస్తాన్-పాకిస్తాన్ అంటున్నారు. అద్వానీ పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తి. అతను భారత్‌కు వచ్చి స్థిరపడ్డారు. దేశంలో ఇండియా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోతోంది’ అని రబ్రీ వ్యాఖ్యానించారు.పాకిస్తాన్ జిహాదీలు ఇండియా కూటమి నేతలకు మద్దతిస్తున్నారని ప్రధాని మోదీ చేసిన ప్రకటనపై రబ్రీ ఎదురుదాడి చేశారు. ‘మోదీ ప్రకటనల మాదిరిగా పరిస్థితులు ఉంటే భారత ప్రభుత్వ ఏజెన్సీలు ఏం చేస్తున్నాయి? అంటే ప్రధాని మోదీ విఫలమయ్యారా? దేశంలో మహా కూటమి ప్రభుత్వం ఏర్పడబోతోంది. బీహార్‌లో మహాకూటమి ప్రకంపనలు రేపుతోంది’ అని రబ్రీదేవి వ్యాఖ్యానించారు. కాగా ఎన్డీఏ ప్రభుత్వం మనల్ని లాంతరు యుగానికి తీసుకెళ్లింది. ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక 200 యూనిట్ల విద్యుత్తు ఉచితంగా ఇస్తామని రబ్రీదేవి కుమార్తె, పాటలీపుత్ర అభ్యర్థి మిసా భారతి హామీనిచ్చారు.గ్రామాలకు వెళితే కరెంటు బిల్లులు అధికంగా వస్తున్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ప్రతిపక్ష నేతలందరినీ జైల్లో పెడుతున్నారని మిసా భారతి ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. గత పదేళ్లుగా ప్రజలు మోసపోతున్నారు. ద్రవ్యోల్బణం తగ్గలేదు. నిరుద్యోగం పోలేదు అని ఆమె బీజేపీపై మండిపడ్డారు. -
ప్రమాదం బారిన చండీగఢ్ బీఎస్ఫీ అభ్యర్థి
దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో ఎన్నికలకు సంబంధించిన విషయాలు ప్రధానాంశాలుగా నిలుస్తున్నాయి. తాజాగా చండీగఢ్ బీఎస్పీ అభ్యర్థి డాక్టర్ రీతూ సింగ్ ప్రమాదానికి గురయ్యారు. ఆమె తలకు బలమైన గాయమైంది. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా, తలకు కుట్లు వేశారు.వివరాల్లోకి వెళితే స్థానికంగా ఉన్న ఒక కాలనీలోని బీఎస్పీ నేతలు, కార్యకర్తలు డాక్టర్ రీతూ సింగ్‌ను నాణేలతో తూకం వేస్తున్నారు. ఇంతలో ఆ తూకం తెగిపోయి, దాని రాడ్డు ఆమె తలకు తగిలింది. దీంతో ఆమె తలకు తీవ్ర గాయమయ్యింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఆమెకు చికిత్స అందించి, తలకు కుట్లు వేసి ఇంటికి పంపించారు.చండీగఢ్ నుంచి డాక్టర్ రీతూ సింగ్‌ను బీఎస్పీ పోటీకి నిలిపింది. రీతూ.. ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. సైకాలజీ సబ్జెక్టులో ఆమెకు విశేష అనుభవం ఉంది. యూనివర్శిటీలో చదువుకుంటున్న సమయంలో ఆమె దళితుల పక్షాన గొంతెత్తారు. ఈ నేపధ్యంలో ఆమెను డిస్మిస్ చేయడంతో పెద్ద ఎత్తున ఆందోళనలు చోటు చేసుకున్నాయి. డాక్టర్ రీతూ సింగ్ పీహెచ్డీ పకోడా వాలీ పేరుతో ఓ స్టాల్ కూడా పెట్టారు. కుల వేధింపుల ఆరోపణలతో 2023, సెప్టెంబర్‌లో ఆమె ఢిల్లీ యూనివర్సిటీలో నిరసన చేపట్టారు. ఈ సమయంలోనే ఆమె విశ్వవిద్యాలయం నుండి బహిష్కరణకు గుర్యయ్యారు. -
మమత మనసులో ఏముంది? ‘ఇండియా’ భేటీకి ఎందుకు వెళ్లరు?
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రతిపక్ష ఇండియా కూటమితో జత కడతారా లేదా అనే దానిపై పెద్ద ఎత్తున చర్చలు జరగుతున్నాయి. పశ్చిమ బెంగాల్ లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీకి దిగిన మమత ఎన్నికల తర్వాత విపక్షాల కూటమి ఏర్పాటు చేస్తున్న సమావేశానికి హాజరు కాబోనని ముందుగానే ప్రకటించారు.టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఇండియా కూటమి సమావేశంపై తాను తీసుకున్న నిర్ణయానికి లోక్‌సభ ఎన్నికలు, రెమాల్ తుపాను కారణాలని పేర్కొన్నారు. విలేకరులతో మాట్లాడిన ఆమె లోక్‌సభ ఎన్నికల చివరి విడత ఓటింగ్, రెమాల్ తుపాను అనంతరం చేపడుతున్న సహాయక చర్యల కారణంగా జూన్ ఒకటిన జరిగే కూటమి మీటింగ్‌కు హాజరు కాలేనన్నారు.కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే జూన్ ఒకటిన ఇండియా కూటమిలోని భాగస్వామ్య పార్టీల సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రకటించడంతో పాటు, దీనికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని ఆహ్వానించారు. దీనిపై మమతా బెనర్జీ స్పందిస్తూ ఒకవైపు తుఫాన్, మరోవైపు ఎన్నికలు ఈ నేపధ్యంలో తాను వీటిని విస్మరించి, సమావేశానికి ఎలా హాజరుకాగలను అని అని ప్రశ్నించారు.మమత సమాధానంపై స్పందించిన బీజేపీ నేతలు.. కూటమి నుంచి తప్పించుకునేందుకే మమత ఇలాంటి సాకులు చూపుతున్నారని ఆరోపించారు. కాగా ఎన్నికల ఫలితాలకు ముందు మమతా బెనర్జీ బహిరంగంగా ప్రతిపక్ష శిబిరంతో సహవాసం చేయకూడదని భావించివుంటారని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చాక, అప్పటి సీట్ల సంఖ్యను అనుసరించి ఆమె ఇండియా కూటమిలో చేరాలని అనుకుంటున్నారని సమాచారం. లోక్‌సభ ఎన్నికల చివరి దశలో అంటే జూన్ ఒకటిన పశ్చిమ బెంగాల్‌లోని తొమ్మిది స్థానాలకు ఓటింగ్ జరగనుంది. -
ఛత్తీస్‌గఢ్‌లో మారిన సమీకరణలు? కాంగ్రెస్‌కు అనుకూలం?
దేశంలో లోక్‌సభ ఎన్నికల ఆరు దశల ఓటింగ్ ముగిసింది. ఇప్పుడు ఏడవ, చివరి దశకు జూన్ ఒకటిన ఓటింగ్ జరగనుంది. ఈ నేపధ్యంలో పలు రాజకీయ సమీకరణలు మారాయి. ఛత్తీస్‌గఢ్ విషయానికొస్తే 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఛత్తీస్‌గఢ్‌లోని 11 స్థానాలకు గాను 9 స్థానాను బీజేపీ దక్కించుకుంది. అయితే ఈసారి ఓటర్లు ఏ ప్రాతిపదికన ఓటువేశారనే అంశం బీజేపీకి అంతుచిక్కడం లేదని విశ్లేషకులు అంటున్నారు.ఛత్తీస్‌గఢ్‌లో మొదటి మూడు దశల్లో 11 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. దీంతో రాష్ట్రంలోని లోక్‌సభ సీట్లకు ఓటింగ్ పూర్తయింది. ఈ నేపధ్యంలో రాజకీయ విశ్లేషకులు రాష్ట్రంలోని ఓటర్ల మనోభావాలు ఇలా ఉన్నాయంటూ పలు అంశాలు చెబుతున్నారు. రాష్ట్రంలోని మహిళల ఓట్లు బీజేపీకి పడే అవకాశాలున్నాయని, అదే సమయంలో కాంగ్రెస్ హామీపై కూడా ఓటర్లు ఆలోచిస్తున్నారన్నారు. కొన్ని ప్రాంతాలలో ప్రజలు రిజర్వేషన్‌ను రద్దు, రాజ్యాంగాన్ని మార్చడం అనే అంశాలకు మద్దతు పలికారట. ఇది కాంగ్రెస్‌కు ప్రయోజనం చేకూరుస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.2019లో ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ 9 లోక్‌సభ స్థానాలు, కాంగ్రెస్ రెండు లోక్‌సభ స్థానాలను గెలుచుకుంది. అయితే ఈసారి కాంగ్రెస్‌కు కొంత మేలు జరిగేలా కనిపిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లోని 11 లోక్‌సభ స్థానాలకు సంబంధించి ఈసారి కాంగ్రెస్‌కు మూడు సీట్లు రావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాజ్‌నంద్‌గావ్‌లో భూపేష్ బఘేల్, బీజేపీ అభ్యర్థి సంతోష్ పాండే మధ్య గట్టి పోటీ నెలకొంది. అదే సమయంలో దుర్గ్, మహాసముంద్ స్థానాల్లో కులాల ప్రాతిపదికన ఓటింగ్ జరిగిందనే అంచనాలున్నాయి. దీంతో పాటు కోర్బా సీటులో సరోజ్ పాండే, జ్యోత్స్నా మహంత్ మధ్య స్వల్ప ఓట్ల తేడాతో గెలుపు ఓటములుండే అవకాశం ఉంది. -
తగ్గిన ఓటింగ్ శాతంతో బీజేపీకి దెబ్బ? రాజ్‌నాథ్ ఏమన్నారు?
2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆరు దశల ఓటింగ్ పూర్తయ్యింది. ఇంకా ఒక దశ మిగిలివుంది. అయితే 2019తో పోలిస్తే ఓటింగ్ శాతం తగ్గింది. ఇది బీజేపీకి దెబ్బ అనే వాదన వినిపిస్తోంది. ఈ విషయమై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఒక మీడియా సమావేశంలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఓటింగ్ శాతం తక్కువగా ఉంటే అది బీజేపీకి ప్రతికూలమేమీ కాదని, ఓటింగ్ శాతం తగ్గడానికి ఎండవేడిమి ప్రధాన కారణమని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.ఇండియా కూటమి విశ్వసనీయతపై పలు సందేహాలు ఉన్నాయని, ఈ కూటమిని ఏర్పాటు చేయడంలో చాలా జాప్యం జరిగిందన్నారు. ఇండియా కూటమిలోని పార్టీలు విభిన్న అభిప్రాయాలు కలిగినవని అన్నారు. ఇందుకు పంజాబ్‌లోని రాజకీయ పరిస్థితులే ఉదాహరణ అన్నారు. ఇండియా కూటమి ప్రజలకు ఉమ్మడి సందేశాన్ని ఇవ్వలేకపోయిందని, అందుకే ఈ కూటమిపై ప్రజల్లో నమ్మకం లేదన్నారు. ఈ కూటమి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయదని చాలామంది భావిస్తున్నారని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఈసారి కూడా బీజేపీ అత్యధిక మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అన్నారు.ఓటింగ్ శాతం తక్కువగా ఉండటానికి కారణం ఎండ వేడిమి అని అన్నారు. గత ఎన్నికల్లో ఇంతటి వేడి లేదన్నారు. ఈసారి దక్షిణ భారతదేశంలో కూడా బీజేపీకి సీట్లు పెరుగుతాయని భావిస్తున్నామన్నారు. ప్రధాని మోదీ హయాంలో 25 శాతం మంది దారిద్య్ర రేఖ నుంచి బయటపడ్డారని, దేశంలో నిరుద్యోగం గతంలో కన్నా తగ్గిందని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. -
పంజాబ్ ‘సర్దార్’ ఎవరు? ఏ పార్టీకి ఎంత బలముంది?
దేశంలో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. ఇప్పటికే ఆరు విడతల పోలింగ్ ముగియగా, ఇంకా ఏడవ, చివరి దశ ఓటింగ్ జూన్ ఒకటిన జరగాల్సివుంది. కాగా పంజాబ్‌లో లోక్‌సభ ఎన్నికలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ రాష్ట్రంలోని 13 లోక్‌సభ స్థానాలున్నాయి. ఇక్కడ చతుర్ముఖ పోటీ నెలకొంది.పంజాబ్‌లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, అకాలీదళ్, బీజేపీ మధ్య పోటీ కనిపిస్తోంది. రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో చూపిన సత్తాను పునరావృతం చేస్తుందా? లేక గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ చూపిన పనితీరు మరోసారి పునరావృతం అవుతుందా అనే దానిపై చర్చ జరుగుతోంది. పంజాబ్‌లోని ఆరు హాట్ సీట్లలో ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడిపోతారు?అమృత్సర్: ఈ లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లో హాట్సీట్లుగా పరిగణిస్తున్న స్థానాల్లో అమృత్సర్ మొదటి స్థానంలో నిలిచింది. అమృత్‌సర్‌లో ఆల్ రౌండ్ పోటీ నెలకొంది. 1989 ఎన్నికల తర్వాత తొలిసారిగా పంజాబ్‌లో ఇటువంటి పోటీ కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో సిక్కుయేతర ఓట్లపై బీజేపీ దృష్టి సారించింది. అమృత్‌సర్‌లో హిందువుల జనాభా నిర్ణయాత్మక రీతిలోనే ఉంది.పటియాలా: ఈసారి పటియాలాలో జరిగే ఎన్నికలు ఉత్కంఠగా మారాయి. రెండు సార్లు కాంగ్రెస్ టిక్కెట్‌పై విజయం సాధించిన ప్రణీత్ కౌర్ ఇప్పుడు బీజేపీలో చేరారు. ఒకసారి ఆమ్ ఆద్మీ పార్టీ టిక్కెట్‌పై గెలిచిన ధరమ్వీర్ గాంధీ కాంగ్రెస్‌లో చేరారు. కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీలోనే ఉన్నారు. అయితే అమరీందర్ సింగ్ ఈ సారి గడ్డు పరిస్థితులను ఎదుర్కోనున్నారని విశ్లేషకులు అంటున్నారు.జలంధర్: ఈ లోక్‌సభ స్థానంలో హిందువుల జనాభా 40 శాతానికి పైగా ఉంది. ఈ జనాభాపై బీజేపీ ఆశలు పెట్టుకుంది. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, గత సారి ఆమ్ ఆమ్ ఆద్మీ పార్టీపై మొగ్గు చూపిన ఓటర్లు ఈసారి బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తారా? అనే ప్రశ్న అందరిలో తలెత్తుతోంది. భటిండా: గత మూడు ఎన్నికల్లో అకాలీదళ్‌కు చెందిన హర్సిమ్రత్ కౌర్ గెలుపొందారు. అయితే ఈసారి సమీకరణలు మారిపోయాయి. అకాలీదళ్‌పై విశ్వసనీయత గణనీయంగా తగ్గిపోయిందంటున్నారు. బీజేపీ ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పోరాటానికి పూర్తిగా సిద్ధమైంది.లూథియానా: గత మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 2014, 2019 ఎన్నికల్లో గెలిచిన రవ్నీత్ సింగ్ బిట్టు ఢిల్లీకి ప్రమోట్ అయ్యారు. అయితే ఈ ఎన్నికల్లో సమీకరణలు మారాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా రవ్నీత్ సింగ్ బిట్టు బరిలోకి దిగారు. లూథియానాలో కూడా, హిందూ ఓటు బ్యాంకు, రవ్నీత్ సింగ్ బిట్టు ఓటు బేస్ సహాయంతో ఎన్నికల్లో గెలవాలని బీజేపీ కోరుకుంటోంది. గురుదాస్‌పూర్: గత రెండు దఫాల ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో సినీ తారలను బీజేపీ బరిలోకి దించలేదు. గురుదాస్‌పూర్ సీటును నిలబెట్టుకునేందుకు నటుడు సన్నీ డియోల్ అభివృద్ధి కార్యక్రమాలేవీ చేపట్టలేదు.పంజాబ్‌లో ఎప్పుడూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే రాజకీయాలు నడుస్తాయి. 2014లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓటింగ్ జరగ్గా ఎన్డీఏకు ఎక్కువ సీట్లు వచ్చాయి. 2019లో ఎన్డీఏ ఓడిపోయి కాంగ్రెస్‌కు ఎక్కువ సీట్లు వచ్చాయి. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో అన్నివైపుల నుంచి పోటీ నెలకొంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ నుంచే కాకుండా ఆమ్ ఆద్మీ నుంచి కూడా విపరీతమైన పోటీ ఉంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సీట్లు తగ్గే అవకాశం ఉంది. పంజాబ్ రాష్ట్రంలో 58 శాతం సిక్కు జనాభా, 38 శాతం హిందూ జనాభా, 32 శాతం దళిత జనాభా ఉంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పంజాబ్‌లో రాజకీయాలు భిన్నంగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. -
ఎంపీ మనోజ్ తివారీని బంధించిన మహిళ
దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో యూపీలోని వారణాసితో సహా 13 లోక్‌సభ స్థానాలకు చివరి దశలో పోలింగ్ జూన్ ఒకటిన జరగనుంది. ఈ దశలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోటీ చేస్తున్న వారణాసి లోక్‌సభ స్థానంపై అధికంగా చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు వారణాసిలో పలువురు బీజేపీ నేతలు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. వారిలో ఎంపీ, ఢిల్లీ బీజేపీ మాజీ అధ్యక్షుడు మనోజ్ తివారీ కూడా ఉన్నారు.తాజాగా మనోజ్ తివారీ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ఒక వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోను మనోజ్ తివారీ స్వయంగా షేర్ చేశారు. దానిలో ఒక మహిళ తనను బంధించారని తివారీ పేర్కొన్నారు. ఈ వీడియోను షేర్ చేసిన ఆయన దాని ట్యాగ్‌లైన్‌గా ‘కాశీకి చెందిన ఒక మహిళ ఆమె కుమారునికి మనోజ్ తివారీని పరిచయం చేయడానికి బంధించినప్పుడు’ అని రాశారు. ఈ వీడియోలో ఒక మహిళ కూడా కనిపిస్తున్నారు. అలాగే ఆమె తన ఆమె తన కుమారునికి బీజేపీ ఎంపీని పరిచయం చేయడానికి కాల్ చేయడాన్ని కూడా వీడియోలో చూడవచ్చు.మనోజ్ తివారీ వచ్చి ఇంట్లో కూర్చున్నారని ఆ మహిళ ఫోనులో అవతలి వ్యక్తికి చెప్పారు. ఈ క్లిప్ తరువాత మనోజ్ తివారీ ఒక బండి దుకాణం ముందు నిలబడటాన్ని చూడవచ్చు. ఈ సమయంలో చాలా మంది అక్కడ ఉండటాన్ని గమనించవచ్చు. గాయకుడైన మనోజ్ తివారీ పాడిన పాటలు ఉత్తరప్రదేశ్, బీహార్‌లో ఎంతో ఆదరణ పొందాయి. ముఖ్యంగా అతని భోజ్‌పురి పాటలకు లెక్కకుమించిన అభిమానులున్నారు. ప్రస్తుతం మనోజ్ తివారీ రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నారు. ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచారు. जब मनोज तिवारी को काशी की एक महिला ने अपने बेटे से मिलवाने के लिये बनाया बंधक #ModiAgainIn2024 pic.twitter.com/U0aliTTmMY— Manoj Tiwari (मोदी का परिवार) 🇮🇳 (@ManojTiwariMP) May 27, 2024 -
రాహుల్ ఒక కార్టూన్ క్యారెక్టర్: కంగన
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరపున ఎన్నికల బరిలోకి దిగారు. తాజాగా ఆమె నాచన్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని సియాంజ్ గ్రామంలో ఏర్పాటు చేసిన ఎన్నికల బహిరంగ సభలో పాల్గొని, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కార్టూన్ క్యారెక్టర్ అంటూ అభివర్ణించారు.హిమాచల్ ప్రదేశ్‌లోని నహాన్‌లో జరిగిన కాంగ్రెస్ ఎన్నికల ర్యాలీలో మౌంటెన్ క్యాప్ ధరించడంలో రాహుల్ గాంధీ చేసిన చిన్న పొరపాటును కంగనా ఎద్దేవా చేశారు. ఆయనకు మౌంటెన్ టోపీ ఎలా ధరించాలో కూడా తెలియదని వ్యాఖ్యానించారు. రాహుల్ ఆ క్యాప్ పట్టుకుని వేదిక అంతా తిరిగారని, కొద్దిసేపటి తరువాత అక్కడున్న ఒక వ్యక్తి సాయంతో రాహుల్ ఆ క్యాప్ ధరించగలిగారని కంగన అన్నారు.రాహుల్ గాంధీ ఒక కార్టూన్ క్యారెక్టర్ అంటూ, ఏ విషయాలను అర్థం చేసుకోలేనివారు తనను ఎగతాళి చేస్తున్నారని ఆమె ఆరోపించారు. రాహుల్, ప్రియాంక ఈ దేశానికి ప్రాతినిధ్యం వహించాలనుకుంటున్నారని, వారికి మౌంటెన్ క్యాప్ ఎలా ధరించాలో కూడా తెలియదని కంగనా వ్యాఖ్యానించారు. చంద్రునిపై బంగాళదుంపలు పండించడం గురించి మాట్లాడే ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ అని ఆమె వ్యంగ్యంగా అన్నారు.తాను ముంబై వెళ్లినప్పుడు కొందరు తన పహాడీ క్యాప్‌ను చూసి ఎగతాళి చేశారని, తనకి ఇంగ్లీషు రాదని చాలా మంది జోకులు వేసేవారని కంగనా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తాను ఇంగ్లీషు నేర్చుకున్నానని, ముంబైలో కూడా నివసించానని, అయినా తన ప్రాంతంతో అనుబంధాన్ని కోల్పోలేదని కంగన పేర్కొన్నారు. ఈసారి బీజేపీ అభ్యర్థిగా తాను అత్యధిక మెజారిటీతో గెలుస్తానని కంగనా ఆశాభావం వ్యక్తం చేశారు. -
మోదీని మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలి: సీఎం నితీష్
నేతల ఉత్సాహ పూరిత ప్రసంగాల్లో అప్పుడప్పుడు పొరపాట్లు దొర్లుతుంటాయి. తాజాగా బీహార్ సీఎం నితీష్ కుమార్ పొరపాటుగా ఒక వ్యాఖ్యానం చేసి, నలుగురిలో నవ్వులపాలయ్యారు.సీఎం నితీశ్ కుమార్ ఎన్నికల ప్రసంగాల్లో జనాన్ని ఉత్సాహపరిచేందుకు రకరకాల వ్యాఖ్యానాలు చేస్తుంటారు. ఈ నేపధ్యంలో ఒక్కోసారి తడబటడం, నోరు జారడం లాంటివి జరుగుతుంటాయి. తాజాగా ఆదివారం జరిగిన ఎన్నికల బహిరంగ సభలో సీఎం నితీష్ టంగ్ స్లిప్ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలను కోరారు.బీహార్‌లోని పట్నా సాహిబ్ లోక్‌సభ నియోజకవర్గంలోని దానియావాన్‌లో బీజేపీ నేత, ఎన్డీఏ అభ్యర్థి రవిశంకర్ ప్రసాద్‌కు మద్దతుగా బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వేదికపై ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ ప్రసంగిస్తూ, లోక్‌సభలో బీజేపీ 400కు పైగా సీట్లను గెలుచుకుంటుందని, ప్రజలంతా మరోసారి ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. నితీష్ నోటివెంట ఈ మాట రాగానే అక్కడున్నవారంతా షాక్ అయ్యారు. అయితే వేదికపై ఉన్న ఇతర నేతలు జరిగిన పొరపాటును సీఎంకు గుర్తు చేశారు. దీంతో ఆయన.. ప్రధాని మోదీ మరోసారి దేశానికి ప్రధాని అవుతారని సర్దిచెప్పారు.గతంలోనూ సీఎం నితీష్ కుమార్ ఇలా పలుమార్లు నోరు జారారు. వైశాలిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన లోక్ జనశక్తి పార్టీ అభ్యర్థి వీణా దేవికి మద్దతుగా ప్రసంగిస్తూ, బీహార్‌లోని 40 స్థానాల్లో ఎన్డీఏ గెలవాలని కోరుకుంటున్నానని, మన కూటమి దేశం మొత్తం మీద నాలుగు వేల సీట్లు గెలవాలని అభిలషిస్తున్నానని అన్నారు. -
21 లోక్‌సభ స్థానాల్లో పురుషుల కన్నా ఎక్కువగా నమోదైన మహిళల ఓట్లు
-
ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి అఖిలేష్?
దేశంలో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల ఆరవ దశ పోలింగ్ ముగిసింది. ఇంకా ఒక దశ అంటే ఏడవ దశ ఓటింగ్ మాత్రమే మిగిలివుంది. అయితే ఇప్పటికీ ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరనే విషయం వెల్లడికాకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తాజాగా యూపీకి చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే కవీంద్ర చౌదరి దీనికి సమాధానమిచ్చారు.మీడియాతో మాట్లాడిన ఆయన ఈ ఎన్నికలు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఎన్నికలని పేర్కొన్నారు. ఇండియా కూటమి అభ్యర్థి అయిన కవీంద్ర చౌదరి.. ఈసారి ఇండియా కూటమిని అధికారంలోకి తీసుకురావాలని సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారని, అన్ని మతాలు, కులాల వారు బీజేపీపై ఆగ్రహంతో ఉన్నారని పేర్కొన్నారు.రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బీజేపీ నేతలు ఓటర్లపై దాడులకు దిగారని, దీనిపై జిల్లా అధికార యంత్రాంగానికి ఫిర్యాదు చేశామని అన్నారు. బీజేపీకి 147 కంటే తక్కువ సీట్లు వస్తాయని, ఇండియా కూటమి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నదని కవీంద్ర చౌదరి జోస్యం చెప్పారు.ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరనే విషయాన్ని ప్రస్తావించిన ఆయన సమాజ్‌వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆస్ట్రేలియాలో చదువుకున్నారని, ఆయనకు ప్రభుత్వాన్ని నడపడంలో అనుభవం ఉన్నందున ఆయనే ప్రధాని అయ్యేందుకు అర్హత కలిగిన అభ్యర్థి అని పేర్కొన్నారు. -
సార్వత్రిక ఎన్నికల ఆరో విడతలో 61.11 శాతం ఓటింగ్ నమోదు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
ప్రత్యేక ఏర్పాట్ల కోసం టాన్స్ జెండర్ అభ్యర్థి ధర్నా
దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల్లో ఆరో దశ పోలింగ్ నేడు(శనివారం) జరుగుతోంది. ఈ నేపధ్యంలో పలు చోట్ల ఆసక్తికర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దక్షిణ ఢిల్లీకి చెందిన ఏకైక ట్రాన్స్‌జెండర్ అభ్యర్థి రాజన్ సింగ్ పోలింగ్ బూత్ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు.రాజన్ సింగ్ ఓటు వేసేందుకు సంగం విహార్‌లోని జె బ్లాక్‌లో గల ప్రభుత్వ పాఠశాలలోని పోలింగ్ బూత్ నంబర్ 125కి వచ్చారు. అయితే అక్కడ ట్రాన్స్జెండర్లకు ప్రత్యేక ఏర్పాట్లు లేవన్న కారణంతో రాజన్ ఓటు వేయడానికి నిరాకరించారు. పోలింగ్ కేంద్రం బయట ధర్నాకు దిగారు.కొద్దిసేపటి తరువాత ఢిల్లీ పోలీసు సీనియర్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్వతంత్ర అభ్యర్థి, ట్రాన్స్‌జెండర్ రాజన్ సింగ్‌కు పోలీసు రక్షణ మధ్య ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. తాను ట్రాన్స్‌జెండర్ ఓటరునని, దక్షిణ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం అభ్యర్థినని పోలింగ్ బూత్‌లోని ప్రభుత్వ అధికారికి తాను చెప్పినప్పటికీ, తనను నెట్టివేశారని రాజన్సింగ్ ఆరోపించారు.అన్ని పోలింగ్ బూత్‌ల వద్ద రెండు లైన్లు మాత్రమే ఉన్నాయని, అవి మగవారికి, ఆడవారికి మాత్రమే ఉన్నాయని, ట్రాన్స్జెండర్ల కోసం ఎలాంటి క్యూ ఏర్పాటు చేయలేదని రాజన్ సింగ్ ఆరోపించారు. అలాగే ట్రాన్స్ జండర్లుకు పోలింగ్ బూత్‌ల దగ్గర ప్రత్యేక మరుగుదొడ్లు ఏర్పాట్లు చేయలేదని, స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా, తాము ఇంకా వివక్షను ఎదుర్కొంటున్నామని రాజన్ వాపోయారు. -
ఈవీఎంను పరిశీలించిన ‘ఆప్’ నేత.. వీడియో వైరల్
దేశంలో లోక్‌సభ ఎన్నికల జరుగుతున్నాయి. వీటిలో భాగంగా నేడు(శనివారం) ఆరవ దశలో ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. ఇక్కడ బీజేపీ, భారత్ కూటమి మధ్య ప్రత్యక్ష పోటీ నెలకొంది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాలుగు స్థానాల్లో, కాంగ్రెస్ మూడు స్థానాల్లో పోటీకి దిగాయి. ఆప్, కాంగ్రెస్ కలిసి ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి.ఓటు వేసేందుకు వచ్చిన ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ ఈవీఎం యంత్రాన్ని పైనుంచి కింది వరకూ పరిశీలనగా చూశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మద్యం పాలసీ అంశంలో ఒక్క ఆధారం కూడా దొరకలేదని ప్రధానే స్వయంగా అంగీకరించారు. ఇంతకంటే పెద్ద అంశం ఏముంటుందని ఆయన ప్రశ్నించారు. కాగా తూర్పు ఢిల్లీ నుంచి కుల్దీప్ కుమార్, పశ్చిమ ఢిల్లీ నుంచి మహాబల్ మిశ్రా, న్యూఢిల్లీ నుంచి సోమనాథ్ భారతి, దక్షిణ ఢిల్లీ నుంచి సాహి రామ్ పెహల్వాన్లను ‘ఆప్’ బరిలోకి దింపింది. కాంగ్రెస్ తరపున చాందినీ చౌక్ నుంచి జేపీ అగర్వాల్, ఈశాన్య ఢిల్లీ నుంచి కన్హయ్య కుమార్, నార్త్ వెస్ట్ ఢిల్లీ నుంచి ఉదిత్ రాజ్ బరిలో ఉన్నారు.ఈశాన్య ఢిల్లీ నుంచి మనోజ్ తివారీని బీజేపీ తమ అభ్యర్థిగా నిలిపింది. దక్షిణ ఢిల్లీ నుంచి రామ్‌వీర్ సింగ్ బిధూరి, న్యూఢిల్లీ నుంచి బన్సూరి స్వరాజ్, తూర్పు ఢిల్లీ నుంచి హర్ష్ దీప్ మల్హోత్రా, వాయువ్య ఢిల్లీ నుంచి యోగేంద్ర చందోలియా, చాందినీ చౌక్ నుంచి ప్రవీణ్ ఖండేల్వాల్, పశ్చిమ ఢిల్లీ నుంచి కమల్జీత్ సెహ్రావత్ బీజేపీ టిక్కెట్‌పై ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. #WATCH दिल्ली के मंत्री और AAP नेता सौरभ भारद्वाज ने दिल्ली के एक मतदान केंद्र पर #LokSabhaElections2024 के लिए अपना वोट डाला। pic.twitter.com/yzjq5pqPSR— ANI_HindiNews (@AHindinews) May 25, 2024 -
ఓటేసిన రాష్ట్రపతి.. ఆరో విడతలో ఇతర ప్రముఖులు (ఫొటోలు)
-
ఢీల్లీలో కొనసాగుతున్న పోలింగ్
-
మోదీ కొత్త రాగం.. బీజేపీలో బిగ్ ట్విస్ట్!
ఢిల్లీ: భారత్ భవిష్యత్ కోసం ఎప్పుడో 18వ శతాబ్దంలో రూపొందించిన చట్టాలు, పద్దతులను తాను ఉపయోగించలేనన్నారు ప్రధాని మోదీ. కొత్త సంస్కరణలు, చట్టాలు తీసుకురావాలనే ఆలోచనలో తాను ఉన్నట్టు మనసులోకి మాటను కుండబద్దలు కొట్టారు. అలాగే, ఒక ముఖ్యమైన పని కోసం దేవుడు ఆయనను భూమి మీదకు పంపినట్టు చెప్పుకొచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.కాగా, ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ ఎన్డీటీవీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ..‘వికసిత్ భారత్’ కల నెరవేర్చడం కోసం 2047 వరకు నిరంతరాయంగా పనిచేయాలనే బాధ్యతను దేవుడు నా మీద పెట్టాడు. ఆ పనిని పూర్తిచేయడానికే నన్ను భూమి మీదకు పంపించాడని నాకు అనిపిస్తున్నది. దీని కోసం దేవుడు నాకు దారిచూపించి, శక్తిని ఇచ్చాడు. ఇక, 2047 కల్లా వికసిత్ భారత్ లక్ష్యాన్ని నేను నెరవేరుస్తానన్న నమ్మకం నాకుంది. అది నెరవేర్చే వరకు దేవుడు నన్ను పైకి పిలువడు’ అంటూ కామెంట్స్ చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.అయితే, బీజేపీ పార్టీ విషయానికి వస్తే కాషాయ పార్టీలో 75ఏళ్లకే రిటైర్మెంట్ అనే నిబంధన ఉంది. ఈ నిబంధన పార్టీలో ఉన్న ప్రతీ ఒక్కరికీ వర్తిస్తుంది. ఇక, ప్రస్తుతం మోదీ వయసు 74ఏళ్లు. మరో ఏడాదిలో మోదీ రిటైర్మెంట్ తీసుకోవాల్సి ఉంది. ఇలాంటి సమయంలో మోదీ.. వికసిత్ భారత్ నినాదం ఎత్తుకోవడంపై రాజకీయ విశ్లేషకులు, ప్రతిపక్ష నేతలు స్పందిస్తున్నారు.మోదీ మరికొన్నేళ్ల పాటు క్రియాశీల రాజకీయాల్లో ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఇలా కామెంట్స్ చేశారని చెబుతున్నారు. 75 ఏళ్లకే రిటైర్మెంట్ నిబంధన అనేది తనకు వర్తించబోదని మోదీ చెప్పారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తన మనసులో దాచిపెట్టుకొన్న పదవీ ఆకాంక్షను ప్రధాని నరేంద్ర మోదీ ఎట్టకేలకు బయటపెట్టారని అంటున్నారు. ఇక, బీజేపీలో 75 ఏళ్లు దాటిన కారణంగానే సీనియర్లను పక్క పెట్టిన విషయం తెలిసిందే. -
దేశానికి అత్యున్నత నేతలను అందించిన ఢిల్లీ
దేశ రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి చేరిన పలువురు నేతలు ఢిల్లీ తమకు రన్ వే అని నిరూపించారు. ఇక్కడి నుంచి గెలిచిన పలువురు నేతలు రాజకీయాల్లో తారాస్థాయికి చేరుకున్నారు. ఢిల్లీలో విజయం సాధించాక తొలిసారిగా లోక్‌సభకు ముగ్గురు నేతలు చేరారు. వీరిని కేంద్ర ప్రభుత్వంలో కీలక పదవులు వరించాయి. ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించి, దేశ రాజకీయాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వారిలో సుచేతా కృపలానీ పేరు మొదటిగా వినిపిస్తుంది. ఆమె 1952లో న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందారు. తరువాత ఆమె 1960లో ఉత్తరప్రదేశ్‌లో ఎమ్మెల్యేగా ఎన్నికై నాటి రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి పదవి చేపట్టారు. మూడేళ్ల తరువాత 1963లో ఆమె ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. దేశంలో ఇంతటి అత్యున్నత పదవిని చేపట్టిన మొదటి మహిళగా సుచేతా కృపలానీ నిలిచారు.బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ కూడా తొలిసారిగా 1989లో ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ తర్వాత ఆయన దేశ రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆయన లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడయ్యారు. ఆ తర్వాత దేశానికి ఉప ప్రధానిగా కూడా నియమితులయ్యారు. 1991లో న్యూ ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల్లో ఆయన గెలుపొందారు. నాడు కాంగ్రెస్ అభ్యర్థి, సినీ నటుడు రాజేష్ ఖన్నాను ఓడించారు. ఈ క్రమంలోనే 1977లో లాల్ కృష్ణ అద్వానీ కేంద్ర మంత్రి కూడా అయ్యారు.బీజేపీ దిగ్గజ నేత, ఢిల్లీ తొలి మహిళా సీఎం సుష్మా స్వరాజ్ కూడా ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా లోక్‌సభకు చేరుకున్నారు. 1996లో రాజ్యసభ పదవీకాలం ముగిసిన తర్వాత, ఆమె దక్షిణ ఢిల్లీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. ఈ ఎన్నికల తర్వాత ఆమె 13 రోజుల అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. దీని తరువాత ఆమె 1998లో దక్షిణ ఢిల్లీ నుంచి మరోమారు గెలిచారు. అప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. ఈ సమయంలో సాహిబ్ సింగ్ స్థానంలో బీజేపీ ఆమెను ఢిల్లీ ముఖ్యమంత్రిని చేసింది. 2009-2014 మధ్యకాలంలో ఆమె లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలిగా కూడా వ్యవహరించారు. మోదీ ప్రభుత్వంలో సుష్మా స్వరాజ్ విదేశాంగ మంత్రిగా పనిచేశారు. -
రేపే ఆరో విడత.. 58 స్థానాలకు పోలింగ్
న్యూఢిల్లీ, సాక్షి: సుదీర్ఘంగా సాగుతున్న(46 రోజులపాటు) సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో భాగంగా.. రేపు(మే 25, శనివారం) ఆరో విడత పోలింగ్ జరగనుంది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 58 స్థానాలకు ఉదయం 7గం.కు పోలింగ్ ప్రారంభం కానుంది. ఈ విడతలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన మొత్తం 889 మంది ఎన్నికల బరిలో నిలబడ్డారు.ఢిల్లీ, హర్యానా, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్టాల్లోని 58 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. పోటాపోటీగా సాగిన ఎన్నికల ప్రచారం గురువారంతో ముగిసింది. ఢిల్లీ పరిధిలోని మొత్తం ఏడు నియోజకవర్గాల్లో, హర్యానాలోని మొత్తం 10 స్థానాల్లో ఒకేదఫాలో శనివారం పోలింగ్ నిర్వహిస్తున్నారు. వీటితోపాటు ఒడిశా అసెంబ్లీ ఎన్నికల మూడో విడతలో 42 ఎమ్మెల్యే స్థానాలకూ రేపే పోలింగ్ జరగనుంది. బరిలో ముఖ్య నేతలు బీజేపీ నేతలు మనోహర్ లాల్ ఖట్టర్(హరియాణాలోని కర్నాల్), ధర్మేంద్ర ప్రధాన్(ఒడిశాలోని సంబల్పూర్), అభిజిత్ గంగోపాధ్యాయ్(పశి్చమబెంగాల్‌లోని తామ్లుక్), నవీన్ జిందాల్ (కురుక్షేత్ర), రావు ఇందర్జిత్ సింగ్( గురుగ్రామ్), మేనకా గాంధీ( ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్పూర్)తోపాటు పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ( జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్–రాజౌరీ) బరిలో ఉన్నారు. నార్త్ ఈస్ట్ ఢిల్లీ నుంచి బీజేపీ నేత మనోజ్ తివారీ, కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ పోటీ పడుతున్నారు.ఇప్పటివరకు ఐదు దశల్లో వివిధ రాష్ట్రాల్లో 428 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. జూన్ 1వ తేదీన సార్వత్రిక ఎన్నికల ఏడో విడత మిగిలిన 57 స్థానాలకు పోలింగ్‌తో సార్వత్రిక ఎన్నికల నిర్వహణ ముగుస్తుంది. జూన్ 4వ తేదీన లోక్‌సభతో పాటు ఒడిషా, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. తెలంగాణ కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఫలితం వెలువడనుంది. -
ఢిల్లీ మెట్రోలో రాహుల్.. ఫొటో వైరల్
దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఐదు దశల ఎన్నికలు ఇప్పటికే ముగియగా, ఇంకా మరో రెండు దశల ఎన్నికలు మిగిలివున్నాయి. ఈ క్రమంలో మే 25న ఢిల్లీలో ఆరో దశలో ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సామాన్య ప్రజలకు చేరువయ్యేందుకు ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు. రాహుల్ గాంధీ మెట్రోలో ప్రయాణిస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఢిల్లీ మెట్రోలో ప్రయాణిస్తున్న రాహుల్ గాంధీ సామాన్య ప్రజలతో మమేకమై, వారితో ఫొటోలు కూడా దిగారు. రాహుల్ గాంధీ ఢిల్లీ మెట్రోలో మంగోల్‌పురిలో జరిగే ర్యాలీకి బయలుదేరారు. ఆయనతో పాటు ఈశాన్య ఢిల్లీ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి కన్హయ్య కుమార్ కూడా ఉన్నారు. ఢిల్లీలో మే 25వ తేదీన ఓటింగ్ జరగనుంది. -
’ఆప్‘ రాకతో నెలకు రూ. 18 వేలు ఆదా: రాఘవ్ చద్దా
ఢిల్లీలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ప్రచారపర్వంలో అటు బీజేపీ ఇటు ఆప్, కాంగ్రెస్‌లు దూసుకుపోతున్నాయి. ఈ నేపధ్యంలో తాజాగా ప్రచారంలో పాల్గొన్న ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా మాట్లాడుతూ ఢిల్లీలో తమ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రతి కుటుంబం విద్యుత్, తాగునీరు, మందులు, పాఠశాల ఫీజులపై ప్రతి నెలా రూ. 18 వేలు ఆదా చేస్తున్నదని పేర్కొన్నారు.త్వరలో కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీలోని మహిళలకు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల చొప్పున అందజేయనుందని అన్నారు. తూర్పు ఢిల్లీ లోక్‌సభ స్థానం నుండి ఆప్ అభ్యర్థి కుల్దీప్ కుమార్ తరపున ప్రచారం చేపట్టిన ఆయన.. నిరాడంబరమైన నేపథ్యాలు కలిగిన వారు ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి పదవులకు చేరుకోవడానికి తమ పార్టీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు.‘ఆప్’ ఎల్లప్పుడూ సాధారణ కుటుంబాలకు చెందిన వారిని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా చేసిందని, కుల్దీప్ కుమార్, తాను దీనికి ఉదాహరణ అని ఆయన అన్నారు. విద్యావంతులు, నిజాయితీ గల ప్రతినిధులను ఎన్నుకోవడానికి గల ప్రాముఖ్యతను రాఘవ్ చద్దా వివరించారు. -
‘బీజేపీ చేయలేని పని రాహుల్ చేస్తున్నారు’
లోక్‌సభ ఎన్నికలు చివరి దశకు చేరుకుంటున్నాయి. ఐదు దశల ఎన్నికల ఓటింగ్ పూర్తియ్యింది. ఇక రెండు దశలు మాత్రమే మిగిలివున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 400పైగా సీట్లను దక్కించుకుంటామని చెబుతోంది. అదే సమయంలో ఇండియా కూటమి కూడా తాము సాధించే సీట్లపై అంచనాలు వేసుకుంటోంది. ఇదిలా ఉంటే తాజాగా కాంగ్రెస్ పార్టీ మాజీ నేత ఆచార్య ప్రమోద్ కృష్ణం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ అందరికన్నా మహనీయుడని వ్యంగ్యంగా అన్నారు.రాహుల్ గాంధీ గొప్ప వ్యక్తి అని, ఆయన దేనికైనా సమాధానం చెప్పగలరని ప్రమోద్ కృష్ణం అన్నారు. మొదటి నుంచి రాహుల్ అన్ని విషయాలను ఎక్కువ చేసి చెబుతారని, అతని గురించి ఏమి చెప్పగలనని ప్రశ్నించారు. రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు. నాడు కాంగ్రెస్‌ను రద్దు చేయాలని మహాత్మా గాంధీ కలలు కన్నారు. అయితే బీజేపీ కూడా ఆ పని చేయలేకపోయింది. ఇప్పుడు రాహుల్ గాంధీ ఆ పని చేస్తున్నారని ప్రమోద్ కృష్ణం పేర్కొన్నారు.కాంగ్రెస్‌ను నాశనం చేసేందుకు రాహుల్ గాంధీ కంకణం కట్టుకున్నారని ప్రమోద్ కృష్ణం ఆరోపించారు. ఈ విషయంలో రాహుల్ తన బాధ్యతలను చాలా చక్కగా నిర్వర్తిస్తున్నారు. ఈ విషయం దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది కాంగ్రెస్ కార్యకర్తలకు తెలుసు. జూన్ 4 తర్వాత ఇప్పటి వరకు అతి తక్కువ సీట్లు గెలుచుకున్న పార్టీగా కాంగ్రెస్ నిలుస్తుందని ప్రమోద్ కృష్ణం అన్నారు. -
కన్హయ్యకు రూ. 52 లక్షలు? ఎవరెవరిచ్చారు?
ఢిల్లీలో లోక్‌సభ ఎన్నికలు అత్యంత ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా ఈశాన్య ఢిల్లీలో బీజేపీ అభ్యర్థి మనోజ్ తివారి, కాంగ్రెస్ అభ్యర్థి కన్హయ్య కుమార్ మధ్య పోరు ఉత్కంఠను రేకెత్తిస్తోంది. జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేతగా రాజకీయాల్లో కాలుమోపిన కన్హయ్య ఆ తరువాతి కాలంలో కాంగ్రెస్‌లో చేరారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల్లో తన సత్తా చాటేందుకు సమాయత్తమవుతున్నారు.కన్హయ్య కుమార్ తన ప్రచార ఖర్చుల కోసం గడచిన ఏడు రోజుల్లో రూ. 52 లక్షలను క్రౌడ్ ఫండింగ్ రూపంలో సేకరించారు. ఆయన మే 15 నుంచి ఫ్యూయల్ డ్రీమ్ అనే వెబ్సైట్ ద్వారా చందాలను స్వీకరించడం ప్రారంభించారు. బుధవారం రాత్రి నాటికి కన్హయ్య కుమార్‌కు మొత్తం 2,250 మంది రూ. 52 లక్షలను చందాల రూపంలో అందించారు. కన్హయ్యకు చందాలు ఇచ్చిన వారిలో హాస్య కళాకారుడు కుణాల్ కుమార్, సినీ నిర్మాత విశాల్ భరద్వాజ్, అతని భార్య, గాయని రేఖా భరద్వాజ్, జెఎన్యూ మాజీ ప్రొఫెసర్ జయతి ఘోష్, మాజీ ప్రొఫెసర్ మోహన్‌రావు తదతరులు ఉన్నారు.కన్హయ్య కుమార్ ‘క్రౌడ్ ఫండింగ్’ రూపంలో మొత్తం రూ. 75 లక్షలు సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఈ ఫండ్ సేకరణకు ముందు కన్హయ్య కుమార్ ఒక వీడియో విడుదల చేస్తూ తాను శాంతి, ప్రగతి, న్యాయం కోసం ఎన్నికల బరిలోకి దిగుతున్నానని పేర్కొన్నారు. ఫ్యూయల్ డ్రీమ్ అనే వెబ్సైట్ ద్వారా తాను చందాలు సేకరిస్తున్నానని, అలాగే గూగుల్ పే నంబర్ ద్వారా కూడా చందాలు సేకరిస్తున్నానని తెలియజేశారు. -
మిగిలిన రెండు దశలకు కాంగ్రెస్ ప్రచారాస్త్రాలివే?
దేశంలో ఏడు విడతలుగా జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో ఐదు దశల ఎన్నికలు ముగిశాయి. ఆరు, ఏడో దశ ఎన్నికలు ఇంకా మిగిలి ఉన్నాయి. ఈ రెండు దశల్లోనూ ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించాలని కాంగ్రెస్ ప్లాన్ చేసిందని సమాచారం. ఢిల్లీ, హర్యానా, హిమాచల్, పంజాబ్ కాంగ్రెస్‌కు చాలా ముఖ్యమైనవి. ఈసారి ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ మెరుగైన ఫలితాలు రాబడుతందని పార్టీ అంచనా వేస్తోంది.ఈ నాలుగు రాష్ట్రాల్లో పంజాబ్ మినహా మిగిలిన మూడు స్థానాల్లో పోటీ బీజేపీ, ఇండియా కూటమి మధ్యే నెలకొంది. హర్యానా, హిమాచల్‌లలో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య ప్రత్యక్ష పోటీ నెలకొంది. ఈ నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్‌లో మొత్తం 35 సీట్లు ఉన్నాయి. గతంలో వాటిలో 24 సీట్లు బీజేపీకి దక్కగా, రెండు సీట్లు ఎన్డీఏలో భాగమైన అకాలీదళ్‌కు దక్కాయి. కాంగ్రెస్‌కు ఎనిమిది సీట్లు, ఆప్‌కు ఒక సీటు వచ్చాయి. ఈసారి ఇక్కడ కాంగ్రెస్ మెరుగైన పలితాలు సాధిస్తుందని ఆ పార్టీ భావిస్తోంది. అందుకే ఈ రాష్ట్రాల్లో పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది.ఢిల్లీలోని ఏడు స్థానాల్లో కాంగ్రెస్, ఆప్‌తో కలిసి పోటీకి దిగింది. దీంతో కాంగ్రెస్, ఆప్ నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈసారి చీపురు గుర్తు బటన్‌ను నొక్కి, కేజ్రీవాల్‌కు ఓటు వేస్తానని రాహుల్ గాంధీ అన్నారు. ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాల్లో మోదీ ప్రభుత్వ హ్యాట్రిక్‌ను అడ్డుకునేందుకు ఇరు పార్టీలు కలిసి పోరాటం చేస్తున్నాయి.ఈ రెండు దశల ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ద్రవ్యోల్బణం, నిరుద్యోగంతో పాటు రైతుల సమస్యలు, అగ్నివీర్ అంశంపై దృష్టి పెడుతున్నదని సమాచారం. హర్యానాలో పొత్తులో భాగంగా కాంగ్రెస్ కురుక్షేత్ర సీటును ఆప్‌కి ఇచ్చింది. రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, ఇక్కడ అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవడం ద్వారా గట్టి పునాదిని ఏర్పర్పాటు చేసుకోవాలని కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది. హర్యానాలో కాంగ్రెస్ జోరుగా ర్యాలీలు నిర్వహిస్తోంది. తాజాగా రాహుల్ గాంధీ రాష్ట్రంలోని మహేంద్రగఢ్, పచ్కుల, సోనిపట్‌లలో మూడు ర్యాలీలు నిర్వహించారు. -
Lok Sabha Election 2024: దేశ రాజధానిలో... బీజేపీకి సవాలే
దేశ రాజధానివాసులు గత రెండు లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీకి జైకొట్టారు. ఈసారి మాత్రం కాంగ్రెస్–ఆప్ గట్టి పోటీ ఇస్తున్నాయి. 2014, 2019 ఎన్నికల్లో మూడు పారీ్టలూ విడిగా పోటీ చేయడం బీజేపీకి బాగా కలిసొచ్చింది. ఇండియా కూటమి భాగస్వాములైన కాంగ్రెస్ 3, ఆప్ 4 చోట్ల బీజేపీకి సవాలు విసురుతున్నాయి. దాంతో అధికార వ్యతిరేకతను అధిగమించేందుకు ఏకంగా ఆరుగురు సిట్టింగులను కాషాయ పార్టీ మార్చేసింది! ఆప్ సర్కారుపై అవినీతి ఆరోపణలనే ప్రచారాస్త్రంగా చేసుకుంది. అదంతా తమ పార్టీని అంతం చేసే కుట్రలో భాగమంటూ ఆప్ తిప్పికొడుతోంది. జైలు నుంచి తిరిగొచ్చిన అధినేత కేజ్రీవాల్ ప్రచార భారాన్ని భుజాలపై మోశారు. శనివారం జరిగే పోలింగ్‌లో ఓటర్లు ఎవరిని దీవిస్తారన్నది ఉత్కంఠగా మారింది... న్యూఢిల్లీకేంద్ర మంత్రి మీనాక్షి లేఖి స్థానంలో దివంగత సుష్మా స్వరాజ్ కుమార్తె, యువ న్యాయవాది, బాసురీ స్వరాజ్‌కు బీజేపీ టికెటిచ్చింది. 40 ఏళ్ల బాసురీ రాజకీయాలకు కొత్త కాదు. 2013, 2015, 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మాలవీయనగర్ నుంచి విజయం సాధించారు. ఆప్ అభ్యర్థి సోమనాథ్ భారతి కూడా లాయరే. ఇద్దరూ పోటాపోటీగా ప్రచారం చేశారు. ప్రధాని, కేంద్ర మంత్రులు, విపక్ష నేతలు, ప్రభుత్వ ఉన్నతాధికారుల నివాసాలు ఈ వీఐపీ స్థానం పరిధిలోనే ఉన్నాయి. ట్రాఫిక్ జామ్, మురుగునీటి సమస్యలపై ప్రజల్లో అసంతృప్తి ఉంది. చాందినీ చౌక్ విస్తీర్ణంలో దేశంలోనే అతి చిన్న లోక్‌సభ స్థానమిది. సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి హర్షవర్ధన్ బదులు వ్యాపారి ప్రవీణ్ ఖండేల్వాల్ (64)కు బీజేపీ టికెటిచ్చింది. కాంగ్రెస్ నుంచి జై ప్రకాశ్ అగర్వాల్ పోటీలో ఉన్నారు. ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉండే వర్తకుల కోసం తాము చేసిన పనులను గుర్తు చేస్తూ అగర్వాల్, ఖండేల్వాల్ ఓట్లడిగారు. ఆప్ మద్దతు అగర్వాల్‌కు అదనపు బలం.నార్త్ ఈస్ట్ ఢిల్లీ విస్తీర్ణంలో దేశంలోనే అతి చిన్న లోక్‌సభ స్థానమిది. సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి హర్షవర్ధన్ బదులు వ్యాపారి ప్రవీణ్ ఖండేల్వాల్ (64)కు బీజేపీ టికెటిచ్చింది. కాంగ్రెస్ నుంచి జై ప్రకాశ్ అగర్వాల్ పోటీలో ఉన్నారు. ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉండే వర్తకుల కోసం తాము చేసిన పనులను గుర్తు చేస్తూ అగర్వాల్, ఖండేల్వాల్ ఓట్లడిగారు. ఆప్ మద్దతు అగర్వాల్‌కు అదనపు బలం.నార్త్ ఈస్ట్ ఢిల్లీ బీజేపీ సిట్టింగ్ ఎంపీ, భోజ్‌పురి నటుడు మనోజ్ తివారీ హ్యాట్రిక్ కోసం ప్రయతి్నస్తున్నారు. మాజీ విద్యార్థి నేత కన్హయ్య కుమార్ కాంగ్రెస్ అభ్యరి్థగా సవాల్ విసురుతున్నారు. బిహార్, యూపీ, జార్ఖండ్ నుంచి వలస వచ్చిన ఓటర్లు ఇక్కడ ఏకంగా 30 శాతం పైగా ఉంటారు. అందుకే బిహార్‌కు చెందిన కన్హయ్యకు కాంగ్రెస్ చాన్సిచి్చంది. అయితే ఆయన పోటీ తమకే కలిసొస్తుందని బీజేపీ అంటోంది. ఢిల్లీ జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకునిగా కన్హయ్య ఎదుర్కొన్న ఆరోపణలను ప్రచారంలో పదేపదే ప్రస్తావించింది.ఈస్ట్ ఢిల్లీ సిట్టింగ్ ఎంపీ, ప్రముఖ క్రికెటర్ గౌతమ్ గంభీర్ బదులు హర్షా మల్హోత్రాకు బీజేపీ టికెటిచ్చింది. ఆప్ నుంచి కులదీప్ కుమార్ పోటీ చేస్తున్నారు. వీరిద్దరూ తొలిసారి లోక్‌సభ బరిలో దిగారు. అయితే ఈస్ట్ ఢిల్లీ మేయర్‌గా చేసిన అనుభవం మల్హోత్రా సొంతం. ఈస్ట్ ఢిల్లీ బీజేపీ కంచుకోట అనే చెప్పాలి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అయిన పీసీసీ మాజీ చీఫ్ రవిందర్ సింగ్ లవ్లీ ఇటీవలే బీజేపీలో చేరడం ఆ పారీ్టకి మరింత కలిసి రానుంది.నార్త్‌వెస్ట్ ఢిల్లీ ఈ ఎస్సీ రిజర్వ్డ్ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ హన్స్‌రాజ్ హన్స్ బదులు కౌన్సిలర్ యోగేంద్ర చందోలియాకు బీజేపీ చాన్సిచి్చంది. ఆయన గతంలో నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా చేశారు. 2014 ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై ఎంపీగా గెలిచిన ఉదిత్‌రాజ్ ఈసారి కాంగ్రెస్ అభ్యరి్థగా బరిలో దిగడం ఆసక్తికరం. ఆయన ఎంపీగా నియోజకవర్గానికి ముఖం కూడా చూపించలేదని ప్రచారంలో చందోలియా పదేపదే చెప్పారు.వెస్ట్ ఢిల్లీ ఆప్ నేత మహాబల్ మిశ్రా, బీజేపీ అభ్యర్థి కమలీత్ షెరావత్ మధ్య గట్టి పోటీ నెలకొంది. 70 ఏళ్ల మహాబల్ మిశ్రాది బిహార్‌లోని మధుబని. ఇక్కడ బిహారీ ఓటర్లు భారీగా ఉండటం ఆయనకు అనుకూలించే అంశం. షెరావత్ బీజేపీ మహిళా మోర్చా ప్రెసిడెంట్‌గా పనిచేశారు. ఎక్కువ మంది ఇంటి నుంచి ఓటేసిన లోక్‌సభ స్థానంగా ఈసారి వెస్ట్ ఢిల్లీ వార్తల్లోకెక్కింది. 85 ఏళ్లు పై బడిన 969 మంది, 179 మంది దివ్యాంగులు ఇంటి నుంచి ఓటేశారు.సౌత్ ఢిల్లీ సిట్టింగ్ ఎంపీ, వివాదాస్పద నేత రమేశ్ బిదురి బదులు బదార్పూర్ ఎమ్మెల్యే రామ్‌వీర్ సింగ్ బిదురికి బీజేపీ టికెటిచి్చంది. ఆప్ నుంచి సాహిరాం పహిల్వాన్ బరిలో ఉన్నారు. ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని 10 అసెంబ్లీ సీట్లలో బీజేపీ చేతిలో ఉన్నది బదార్పూర్ ఒక్కటే! అభ్యర్థులిద్దరూ గుర్జర్ సామాజికవర్గానికి చెందిన వారే కావడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. – సాక్షి, నేషనల్ డెస్క్