ఒడిశా కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? ఆయన అధికార నివాసం ఎక్కడా అనే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇటీవల జరిగిన ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బిజూ జనతాదళ్ ఓటమి పాలైంది. దీంతో 24 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత బీజేపీ ప్రభుత్వ పగ్గాలు చేపట్టనుంది. ఈ తరుణంలో కాబోయే సీఎం ఎవరు? ఆయన అధికారిక నివాసం ఎక్కడా అనే చర్చ మొదలుగా కాగా.. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు చేసే బాధ్యతల్ని బీజేపీ అధిష్టానం రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు అప్పగించింది.
సొంత ఇంటి నుంచే బాధ్యతలు
మాజీ సీఎం నవీన్ పట్నాయక్ 24ఏళ్ల పదవీ పదవీకాలంలో తన వ్యక్తిగత ఇల్లు నవీన్ నివాస్ నుండి పనిచేశారు. పట్నాయక్ 2000లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రభుత్వం కేటాయించిన ఇంటిలో కాకుండా తన సొంత ఇంటి నుంచే పని చేయాలని నిర్ణయించుకున్నారు. దాదాపు పావు శతాబ్ద కాలం పాటు అన్ని అధికారిక, పరిపాలనా నిర్వహణ పనులను నవీన్ నివాస్ నుంచే నిర్వహించారు. ఆ భవనాన్ని నవీన్ పట్నాయక్ తండ్రి,మాజీ ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ నిర్మించారు.
24 ఏళ్ల తర్వాత కొత్త ప్రభుత్వం
తాజా ఎన్నికల ఫలితాలతో కొలువుతీరునున్న బీజేపీ కొత్త ముఖ్యమంత్రి ఎంపిక, అధికారిక నివాసం కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుత ముఖ్యమంత్రి గ్రీవెన్స్ సెల్‌తో సహా అనేక ఖాళీ క్వార్టర్లను షార్ట్‌లిస్ట్ చేసినట్లు సీనియర్ ప్రభుత్వ అధికారి తెలిపారు.
78 స్థానాల్లో బీజేపీ విజయం
ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా అధికార బీజేడీ పరాజయం పాలైంది. 24 ఏళ్లుగా ఒడిశా సీఎంగా ఉన్న నవీన్ పట్నాయక్ ప్రతిపక్షానికి పరిమితయ్యారు. ఒడిశా 147 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 78 స్థానాల్ని కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఇక బీజేడీ 51 స్థానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్ 14 స్థానాల్లో విజయం సాధించగా, మూడు ఇండిపెండెంట్ అభ్యర్థులకు దక్కాయి. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 21 స్థానాలకు గాను బీజేపీ 20, కాంగ్రెస్ 1 గెలుచుకోవడంతో బీజేడీ ఘోర పరాజయం పాలైంది.
సీఎం రేసులో ఇద్దరు ఎమ్మెల్యేలు
ఒడిశా కొత్త సీఎం ఎవరవుతారనే దానిపై రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతున్నది. బీజేపీ సీనియర్ నేత, కొత్తగా ఎమ్మెల్యేగా ఎన్నికైన సురేశ్ పుజారితో పాటు ఒడిశా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మన్మోహన్ సామల్ ముందు వరుసలో ఉన్నట్టు తెలుస్తున్నది.
రేపు సాయంత్రమే ఒడిశా కొత్త సీఎం ప్రమాణ స్వీకారం
రేపు సాయంత్రం 5 గంటలకు ఒడిశా కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.ఈ ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ రేపు మధ్యాహ్నం 2:30 గంటలకు భువనేశ్వర్ చేరుకుని విమానాశ్రయం నుంచి రాజ్‌భవన్‌కు వెళ్లనున్నారు.అనంతరం సాయంత్రం 5 గంటలకు జనతా మైదాన్‌లో జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొననున్నారు.
Comments
Please login to add a commentAdd a comment