bjd
-
బీజేడీ నుంచి ఎంపీ బహిష్కరణ.. కాసేపటికే బీజేపీలోకి
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడన్న కారణంతో రాజ్యసభ ఎంపీ సుజీత్ కుమార్‌ను మాజీసీఎం నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజూ జనతాదళ్(బీజేపీ) పార్టీ నుంచి బహిష్కరించింది. ఎంపీ సుజీత్ కుమార్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నామని, ఈ బహిష్కరణ తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంటూ బీజేపీ చీఫ్ నవీన్ పట్నాయక్ పేరుతో ఒక ప్రకటన విడుదల చేసింది. తనను రాజ్యసభకు పంపిన పార్టీని, కలహండి జిల్లా ప్రజల ఆశలు, ఆకాంక్షలను అతను నెరవేర్చడంలో విఫలమయ్యాడని ఉత్తర్వుల్లో పేర్కొంది.దీంతో సుజీత్‌కుమార్ వెంటనే తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. సుజీత్ కుమార్ రాజీనామా లేఖను భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌కఢ్ ఆమోదించారు. అనంతరం ఆయన బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, పార్టీ ఒడిశా ఇన్ఛార్జ్ విజయపాల్ సింగ్ తోమర్, ఎంపీ భర్తృహరి మహతాబ్, పార్టీ సీనియర్ నేతల సమక్షంలో సుజీత్ కుమార్ కాషాయ కండువా కప్పుకున్నారు.అనంతరం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కుమార్ మాట్లాడుతూ.. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా, 2036 నాటికి ఒడిశాను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న ప్రధాని నరేంద్ర మోదీ కృషి, ఆయన దృక్పథానికి ఆకర్షితుడై తాను కాషాయ పార్టీలో చేరానని చెప్పారు.‘నాకు దేశమే ప్రథమం. నేషన్ ఫస్ట్ అనేది నా ఫిలాసఫీ. నేను చాలా సంవత్సరాలు విదేశాల్లో నివసించాను . యునైటెడ్ నేషన్స్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం వంటి సంస్థల కోసం పనిచేశాను. దేశ అభివృద్ధి కోసం 2011లో భారతదేశానికి తిరిగి వచ్చాను.ఒడిశాలోని కలహండి జిల్లా అనేక అవినీతి కారణంగా అభివృద్ధి చెందలేదని నేను. ఇందులో జిల్లాకు చెందిన పలువురు బీజేడీ నాయకుల హస్తం ఉంది. ఈ విషయాన్ని బీజేడీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లడానికి చాలాసార్లు ప్రయత్నించాను. కానీ సాధ్యపడలేదు. అందుకే బీజేపీలో చేరాలనే నిర్ణయం తీసుకున్నాను.’ అని పేర్కొన్నారు. BJD expels party leader Sujeet Kumar for "anti-party activities."He resigned from Rajya Sabha and his resignation has been accepted by Vice President and Rajya Sabha Chairman Jagdeep Dhankhar. pic.twitter.com/asjLLxpnOw— ANI (@ANI) September 6, 2024 -
ఇక బీజేపీకి మద్దతిచ్చేది లేదు.. ప్రతిపక్షపాత్రే: బీజేడీ
భువనేశ్వర్: తమ పార్టీకి చెందిన తొమ్మిది మంది రాజ్యసభ ఎంపీలతో బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ సోమవారం సమావేశం నిర్వహించారు. జూన్ 27వ తేదీ నుంచి ప్రారంభంకానున్న పార్లమెంట్ సమావేశాల సమయంలో.. శక్తివంతమైన, చురుకైన ప్రతిపక్షంగా రాజ్యసభలో వ్యవహరించాలని తమ పార్టీ ఎంపీలకు ఆయన దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి చెందిన సమస్యలపై కూడా సభలో కేంద్ర సర్కారును నిలదీయాలని చెప్పారు.నవీన్ పట్నాయక్‌తో జరిగిన సమావేశం అనంతరం రాజ్యసభ ఎంపీ సస్మిత్ పాత్ర మీడియాతో మాట్లాడుతూ .. ఈసారి బీజేడీ ఎంపీలు కేవలం సమస్యలపై మాత్రమే మాట్లాడరని, ఒడిశా ప్రయోజనాలను కేంద్రం విస్మరిస్తే, అప్పుడు బీజేపీ సర్కారుపై తీవ్ర పోరాటం చేస్తామని చెప్పారు. ఒడిశాకు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్‌ను లేవనెత్తనున్నట్లు చెప్పారు.రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ కనెక్టివిటీ బలహీనంగా ఉందని, బ్యాంకులకు చెందిన బ్రాంచీలు కూడా తక్కువగా ఉన్నాయని ఆయన తెలిపారు. బొగ్గు రాయాల్టీని కూడా సవరించాలన్న ఒడిశా డిమాండ్‌ను గత పదేళ్ల నుంచి కేంద్రం విస్మరించిందని, దీని వల్ల రాష్ట్ర ప్రజలకు సరైన వాటా దక్కకుండా పోతుందని మండిపడ్డారు. రాజ్యసభలో తొమ్మిది మంది ఎంపీలు బలమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తారని, పార్లమెంటులో రాష్ట్ర ప్రజల హక్కుల కోసం పోరాడాలని నవీన్ పట్నాయక్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు.BJD President & Leader of Opposition @Naveen_Odisha today chaired a meeting of party's Rajya Sabha MPs at Naveen Nivas MPs have been directed to vociferously raise issues affecting the State's interests in the Upper HouseBJD now has 9 Rajya Sabha members pic.twitter.com/ssuoULUqnU— Soumyajit Pattnaik (@soumyajitt) June 24, 2024కాగా దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు ఒడిశాను పాలించిన బిజు జనతాదళ్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం చవిచూసిన విషయం తెలిసిందే. మొత్తం 147 స్థానాలకు గాను బీజేపీ 78 సీట్లతో అధికారం కైవసం చేసుకోగా.. బిజు జనతాదళ్ 51, కాంగ్రెస్ 14, స్వతంత్రులు 1, సీపీఎం 1 స్థానాలు చొప్పున గెలుచుకున్నాయి. దీంతో బీజేపీకి చెందిన ఆదివాసీ నేత మోహన్‌చరణ మాఝి ఒడిశా కొత్త సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. అటు లోక్‌సభ ఎన్నికల్లో బీజేడీ ఒక్క సీటు కూడా గెలవలేదు. 21 స్థానాలకు గానూ బీజేపీ 20 చోట్ల విజయ కేతనం ఎగురవేయగా.. కాంగ్రెస్ ఒక చోట గెలుపొందింది. -
లోక్‌సభ స్పీకర్ రేసులో ఆ ఇద్దరు?!
న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ ఎంపికపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ రోజు సాయంత్రం 5గంటలకు ఢిల్లీలోని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాసంలో బీజేపీ, మిత్రపక్షాల కేంద్రమంత్రులు భేటీ కానున్నారు. 2014, 2019 ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్ని దక్కించుకోవడంతో బీజేపీ కేంద్రంలో అధికారాన్ని చేపట్టింది. ఆ పార్టీ ఎంపీలే స్పీకర్లుగా బాధ్యతలు చేపట్టారు. 16వ లోక్‌సభ స్పీకర్‌గా బీజేపీ ఎంపీ సుమిత్రా మహాజన్ (2014), 17వ లోక్‌సభ స్పీకర్‌గా ఓంబిర్లా (2019) సేవలందించగా, ఏఐఏడీఎంకే నేత ఎం.తంబిదురై డిప్యూటీ స్పీకర్లుగా పనిచేశారు.అయితే 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పేలవ ప్రదర్శనతో కేవలం 240 స్థానాల్ని దక్కించుకుంది. ఇతర పార్టీలైన జేడీయూ, టీడీపీల పొత్తుతో మూడో దఫా అధికారం చేపట్టింది. దీంతో లోక్‌సభ స్పీకర్ పదవి తమకూ కావాలంటూ జేడీయూ, టీడీపీలు పోటీ పడుతుండగా.. కమలం అగ్రనాయకత్వం మాత్రం ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బీజేపీ ఎంపీలనే స్పీకర్లుగా ఎంపిక చేసేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.రేసులో ఆ ఇద్దరులోక్సభ ఎన్నికల ముందు ఒడిశా నుంచి బీజేపీలో చేరిన కటక్ ఎంపీ ఎంపీ భర్తృహరి మహతాబ్, ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందరేశ్వరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండగా.. ఓం బిర్లానే మరోసారి లోక్‌సభ స్పీకర్‌గా నియమించే అవకాశం ఉందంటూ జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.ప్రొటెం స్పీకర్గారాజ్యాంగ నిబంధనలు ప్రకారం.. కొత్త లోక్‌సభ మొదటి సారి సమావేశానికి ముందు స్పీకర్ పదవి ఖాళీ అవుతుంది. కొత్త ఎంపీలతో ప్రమాణస్వీకారం చేయించడానికి సీనియర్ సభ్యుడ్ని ప్రొటెం స్పీకర్‌గా రాష్ట్రపతి నియమిస్తారు. ప్రొటెం స్పీకర్ రేసులో కాంగ్రెస్ సీనియర్ నేత కొడికున్నిల్ సురేశ్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ప్రొటెం స్పీకర్,స్పీకర్,డిప్యూటీ స్పీకర్ ఎవరనేది ఈ రోజు సాయంత్ర ఎన్డీయే, దాని మిత్రపక్ష పార్టీల కేంద్రమంత్రుల సమావేశం అనంతరం స్పష్టత రానుంది. -
ఒడిశాకు కొత్త సీఎం.. ఎవరీ మోహన్ చరణ్ మాఝీ?
భువనేశ్వర్ : ఒడిశాకు కాబోయే ముఖ్యమంత్రి? ఎవరనే ఉత్కంఠతకు బీజేపీ అధిష్టానం తెరదించింది. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన గిరిజన నేత మోహన్ చరణ్ మాఝీని ఎంపిక చేసింది.ఇటీవల రాష్ట్రానికి చెందిన ఇద్దరు సీనియర్ రాష్ట్ర నాయకులు ధర్మేంద్ర ప్రధాన్, జోయల్ ఓరంలకు కేంద్ర నాయకత్వం కేబినెట్ పదవుల్ని కట్టబెట్టింది. దీంతో ఒడిశా కొత్త సీఎంగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన,పార్టీ గిరిజన నేత మోహన్ చరణ్ మాఝీ ఎంపిక ఖరారైంది. మోహన్ చరణ్ మాఝీతో పాటు డిప్యూటీ సీఎంలగా కేవీ సింగ్ డియో,ప్రవతి పరిదాలకు అవకాశం కల్పించింది. కియోంఝర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన మాఝీ ప్రజా సేవ, సంస్థాగత నైపుణ్యాలు ముఖ్యమంత్రి పదవి వరించేలా చేశాయి.డిప్యూటీ సీఎంలుగాకేవీ సింగ్ డియో బోలంగీర్ నియోగజకవర్గం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా,బీజేపీ-బిజూ జనతాదళ్ కూటమి 2009 వరకు నవీన్ పట్నాయక్ ప్రభుత్వంలో తొమ్మిదేళ్లపాటు మంత్రిగా పనిచేశారు.తీవ్ర కసరత్తుఇక 24ఏళ్ల తర్వాత ఒడిశా కొత్త ముఖ్యమంత్రి నియామకంపై కేంద్రం తీవ్ర కసరత్తు చేసేంది. సీఎం నియామకంపై కమలం అధిష్టానం పరిశీలకులుగా కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, భూపేంద్ర యాదవ్‌లను పంపింది. భువనేశ్వర్‌లోని రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశానికి కీలక నేతలు, కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, జువల్ ఓరమ్ కూడా హాజరయ్యారు. -
24 ఏళ్ల తర్వాత.. ‘కౌన్ బనేగా ఒడిశా సీఎం?’
ఒడిశా కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? ఆయన అధికార నివాసం ఎక్కడా అనే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది.ఇటీవల జరిగిన ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బిజూ జనతాదళ్ ఓటమి పాలైంది. దీంతో 24 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత బీజేపీ ప్రభుత్వ పగ్గాలు చేపట్టనుంది. ఈ తరుణంలో కాబోయే సీఎం ఎవరు? ఆయన అధికారిక నివాసం ఎక్కడా అనే చర్చ మొదలుగా కాగా.. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు చేసే బాధ్యతల్ని బీజేపీ అధిష్టానం రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు అప్పగించింది. సొంత ఇంటి నుంచే బాధ్యతలుమాజీ సీఎం నవీన్ పట్నాయక్ 24ఏళ్ల పదవీ పదవీకాలంలో తన వ్యక్తిగత ఇల్లు నవీన్ నివాస్ నుండి పనిచేశారు. పట్నాయక్ 2000లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రభుత్వం కేటాయించిన ఇంటిలో కాకుండా తన సొంత ఇంటి నుంచే పని చేయాలని నిర్ణయించుకున్నారు. దాదాపు పావు శతాబ్ద కాలం పాటు అన్ని అధికారిక, పరిపాలనా నిర్వహణ పనులను నవీన్ నివాస్ నుంచే నిర్వహించారు. ఆ భవనాన్ని నవీన్ పట్నాయక్ తండ్రి,మాజీ ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ నిర్మించారు. 24 ఏళ్ల తర్వాత కొత్త ప్రభుత్వంతాజా ఎన్నికల ఫలితాలతో కొలువుతీరునున్న బీజేపీ కొత్త ముఖ్యమంత్రి ఎంపిక, అధికారిక నివాసం కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుత ముఖ్యమంత్రి గ్రీవెన్స్ సెల్‌తో సహా అనేక ఖాళీ క్వార్టర్లను షార్ట్‌లిస్ట్ చేసినట్లు సీనియర్ ప్రభుత్వ అధికారి తెలిపారు. 78 స్థానాల్లో బీజేపీ విజయంఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా అధికార బీజేడీ పరాజయం పాలైంది. 24 ఏళ్లుగా ఒడిశా సీఎంగా ఉన్న నవీన్ పట్నాయక్ ప్రతిపక్షానికి పరిమితయ్యారు. ఒడిశా 147 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 78 స్థానాల్ని కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఇక బీజేడీ 51 స్థానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్ 14 స్థానాల్లో విజయం సాధించగా, మూడు ఇండిపెండెంట్ అభ్యర్థులకు దక్కాయి. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 21 స్థానాలకు గాను బీజేపీ 20, కాంగ్రెస్ 1 గెలుచుకోవడంతో బీజేడీ ఘోర పరాజయం పాలైంది.సీఎం రేసులో ఇద్దరు ఎమ్మెల్యేలు ఒడిశా కొత్త సీఎం ఎవరవుతారనే దానిపై రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతున్నది. బీజేపీ సీనియర్ నేత, కొత్తగా ఎమ్మెల్యేగా ఎన్నికైన సురేశ్ పుజారితో పాటు ఒడిశా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మన్మోహన్ సామల్ ముందు వరుసలో ఉన్నట్టు తెలుస్తున్నది.రేపు సాయంత్రమే ఒడిశా కొత్త సీఎం ప్రమాణ స్వీకారం రేపు సాయంత్రం 5 గంటలకు ఒడిశా కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.ఈ ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ రేపు మధ్యాహ్నం 2:30 గంటలకు భువనేశ్వర్ చేరుకుని విమానాశ్రయం నుంచి రాజ్‌భవన్‌కు వెళ్లనున్నారు.అనంతరం సాయంత్రం 5 గంటలకు జనతా మైదాన్‌లో జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొననున్నారు. -
క్రియాశీల రాజకీయాలకు గుడ్ బై: వీకే పాండ్యన్
ఒడిశా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేడీ ఘోర ఓటమి చవిచూడటంతో క్రియాశీల రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు మాజీ అధికారి, ఆ పార్టీ నేత వీకే పాండ్యన్ ప్రకటించారు. బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్‌కు సాయంగా ఉండేందుకు మాత్రమే రాజకీయాల్లోకి వచ్చినట్లు ఆయన ఆదివారం విడుదల చేసిన ఒక వీడియోలో పేర్కొన్నారు. అందుకే ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదని చెప్పారు. -
ఒడిశా: పాలిటిక్స్‌కు వీకే పాండియన్ గుడ్‌బై
భువనేశ్వర్: సాధారణ ఎన్నికల ఫలితాలు ఒడిశా రాజకీయాల్లో పెను మార్పులకు కారణమవుతున్నాయి. మాజీ సీఎం నవీన్‌పట్నాయక్ ఆంతరంగికుడు, బిజూ జనతాదళ్(బీజేడీ) కీలక నేత వీకే పాండియన్ క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు ఆదివారం(జూన్9) ఆయన ఒక వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో వీకే మాట్లాడుతూ ‘క్రియాశీలక రాజకీయాల్లో నుంచి నేను తప్పుకుంటున్నా. నా ఈ ప్రయాణంలో ఎవరినైనా గాయపరిస్తే సారీ. నాపై జరిగిన ప్రచారం వల్లే పార్టీ ఓడిపోతే క్షమించండి. నేను చాలా చిన్న గ్రామం నుంచి వచ్చాను. ఐఏఎస్ అయి ప్రజలకు సేవ చేయడం చిన్నతనం నుంచే నాకల.పూరీ జగన్నాథుని ఆశీస్సులతో అది సాధించగలిగాను. మా కుటుంబం ఒడిశాలోని కేంద్రపరకు చెందినది కావడం వల్లే ఒడిశాకు వచ్చాను. నేను ఒడిశాలో అడుగుపెట్టినప్పటి నుంచి ఇక్కడి ప్రజల కోసం కష్టపడి పనిచేశా’అని చెబుతూ వీకే పాండియన్ భావోద్వేగానికి గురయ్యారు. -
నాడు చావే శరణ్యం.. నేడు బీజేపీతోనే ప్రయాణం
బీహార్ సీఎం నితిష్ కుమార్ మౌనం వీడారు. ఎన్డీయే కూటమి వెంటే నడుస్తానంటూ అధికారికంగా ప్రకటించారు. దీంతో గతంలో క్రితం బీజేపీ కూటమిలో చేరడం కంటే చావే మేలంటూ సీఎం నితీష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా వైరల్ అవుతున్నాయి.ఇటీవల విడుదలైన 542 లోక్‌సభ స్థానాల ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే (బీజేపీ) కూటమి 240 స్థానాల్లో గెలుపొందగా.. ఇండియా (కాంగ్రెస్) కూటమి 243 స్థానాల్లో విజయం సాధించింది. అయితే తదుపరి కేంద్ర ప్రభుత్వ ఏర్పాటు చేయాలని ఇరు పార్టీలకు స్పష్టమైన మెజార్టీ రాలేదు. అందుకే ఎన్డీయే,ఇండియా కూటమిలు ఇరు పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ, కాంగ్రెస్‌లు పావులు కదిపాయి.ఎన్డీయే కూటమికి కటిఫ్ అంటూఈ తరుణంలో ఏర్పాటు చేసిన ఎన్డీఏ సమావేశానికి నితీష్ కుమార్.. ఇండియా కూటమికి మద్దతు పలికే తేజస్వీతో కలిసి విమానంలో ప్రయాణించారు. ఈ ప్రయాణంతో నితీష్ కుమార్ ఇండియా కూటమికి మద్దతు ఇస్తున్నారని, ఎన్డీయే కూటమికి గుడ్‌బాయ్ చెప్పనున్నారంటూ జాతీయ మీడియా సంస్థలు కథనాలను వండి వార్చాయి.మీ వెంటే నేనుంటాఅయితే నితీష్ కుమార్ మాత్రం తాజా ఎన్డీఏ సమావేశంలో మీ వెంటే నేనుంటా నంటూ మోదీకి మద్దతు పలికారు. ప్రతిపక్షాలు ఏ అభివృద్ధి పని చేయదు అంటూనే, తాను అన్ని వేళలా ప్రధానమంత్రి మోదీతోనే ఉంటానని అని అన్నారు.బీజేపీతో పొత్తంటే.. చావే శరణ్యంఅంతవరకు బాగానే కూటముల్ని మార్చడంలో పేరున్న నితిష్ కుమార్ గతంలో బీజేపీ కూటమికి కటిఫ్ చెప్పి.. కాంగ్రెస్ చెంతన చేరారు. ఆ సమయంలో నితిష్ మాట్లాడుతూ.. మరోసారి బీజేపీతో పొత్తు పెట్టుకోను. అలా పెట్టుకోవడం కంటే చావే శరణ్యం. 2017లో కమలంతో పొత్తు పెట్టుకునే పెద్ద తప్పే చేశాను అని వ్యాఖ్యానించారు. తాజా బీజేపీ కూటమికి మద్దతు పలకడంతో నాడు నితిష్ చేసిన వ్యాఖ్యల్ని నెటిజన్లు ప్రస్తావిస్తున్నారు. -
24 ఏళ్లు.. 89 రోజులు
భువనేశ్వర్: సార్వత్రిక ఎన్నికల్లో దిగ్భ్రాంతికరమైన పరాజయం తర్వాత ఒడిశాలో బుధవారం ఓ శకం ముగిసింది. 24 ఏళ్ల 89 రోజులు ముఖ్యమంత్రి పాలనకు తెరపడింది. ఈ ఓటమి భారత దేశంలోనే అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నవీన్ కలలను తుడిచివేయడంతో బిజూ జనతా దళ్ భవిష్యత్తును అగమ్య గోచరం చేసింది. ఆయన నేతృత్వంలో ఐదు పర్యాయాలలో బీజేడీ ప్రభుత్వం ప్రజలను ముందంజలో ఉంచి ఉన్నత రాజకీయాల శకం ఆవిష్కరణకు నాంది పలికింది. పేదల కోసం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలు నవీన్ పాలనలో మైలురాళ్లుగా మిగిలిపోయాయి. సగటు మనిషిని సాధికార బాటలో నడిపించే మార్గదర్శిగా ఆయన మిగిలిపోయారు. రూ.1కే కిలో బియ్యం వంటి సాధారణ సంక్షేమ పథకంతో అన్ని వర్గాల రైతాంగం సంక్షేమానికి బహుదూర దృష్టితో రైతుల కోసం కాలియా (కృషక్ సహాయం జీవనోపాధి మరియు ఆదాయ వృద్ధి) పథకం, అందరికీ ఆరోగ్యం నినాదంతో బిజు స్వాస్థ్య కళ్యాణ్ యోజన (బీఎస్‌కేవై), లక్మీ బస్ సరీ్వస్, రాష్ట్ర వ్యాప్తంగా అత్యున్నత స్థాయి రహదారుల నిర్మాణం వంటి కార్యకలాపాలతో మిషన్ శక్తి సంకల్పంతో మహిళల ఆర్థిక, రాజకీయ సాధికారత, రాష్ట్రంలో ఏడు మిలియన్ల మంది మహిళలను ఒక తాటిపై నడిపించేందుకు ముందంజ వేసిన మహిళా స్వయం సహాయక బృందాలు అద్భుతమైన విజయ సోపానంగా నిలిచిపోతుంది. మిత భాషి.. కార్య సాధకుడు రాజకీయాల్లో అవగాహన అనేది కీలకమని ప్రబోధించిన తత్వవేత్త. అత్యంత మిత భాషి. నిశ్చలమైన దృక్పథంతో నిర్ధారిత కాల పరిమితిలో వాస్తవ కార్యాచరణ దక్షత చాటుకున్న అరుదైన నాయకుడు. దైనందిన పాలనలో వాస్తవాలు, రోజువారీ అనుభవం ఆధారంగా ప్రజల్లో ఒకడిగా కదిలాడే వ్యక్తిగా సమయోచిత కార్యాచరణతో సత్వర ప్రయోజనాలు అక్కరకు తీసుకువచ్చి దాదాపు రెండున్నర దశాబ్దాలు సుదీర్ఘ ప్రజా పాలన అందజేసి ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం పదిలపరచుకున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజా విధానాలు ప్రజల సామర్థ్యాలను పెంపొందించడానికి, వారి చట్టబద్ధమైన హక్కులతో సాధికారిత కలి్పంచే రూపకల్పన నవీన్ పట్నాయక్ పాలనలో సుస్పష్టంగా తారసపడుతుంది. ఈ దిశలో మహిళా సాధికారతకు ఆయన చేపట్టిన సంస్కరణలు వెలకట్టలేనివి. పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు మహిళకు కనీసం మూడింట ఒక వంతు ప్రాతినిథ్యం కలి్పంచడం అనివార్యంగా శాసించారు. ఈ నేపథ్యంలో పంచాయతీల్లో 50 శాతం, భారత పార్లమెంటుకు మూడింట ఒక వంతు మహిళలకు ప్రాతినిథ్యం కల్పించిన ఉన్నత శ్రేణి నాయకుడు నవీన్. ఈ దృక్పథం జాతీయ స్థాయిలో పలు రాజకీయ పక్షాలు, ప్రముఖ నాయకుల్ని చలింపజేసింది. అహింస నినాదం.. అహింసావాదంతో జాతికి వన్నె తెచ్చిన జాతిపిత మహాత్మ గాంధీ నినాదం భారత రాజ్యాంగంలో నిర్వచనంగా చోటు చేసుకోవాలని సంకల్పించిన ఏకైక నాయకుడుగా నిలిచారు. మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా భారత రాజ్యాంగ పీఠికలో అహింసను చేర్చాలని, అలా చేయడం ద్వారా దేశం మహాత్మా గాం«దీకి నిజమైన నివాళులరి్పంచినట్లు అవుతుందని పేర్కొన్నారు. విపత్తుపై విజేత.. ప్రజలకు సమర్థవంతమైన పాలన అందించడమే కాకుండా తుపాను, వరదలు, కరువు కాటకాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు, రైలు దుర్ఘటనలు వంటి మానవ కృత్యాల వైఫల్యాలతో అకస్మాతుగా తలెత్తే ఆకస్మిక విపత్తుల్ని అవలీలగా నిర్వహించి కనురెప్ప పాటులో పునరుద్ధరణ, పునరి్నర్మాణ కార్యకలాపాలతో బతుకుపై ఆశ కోల్పోయిన బాధిత వర్గానికి ఆపద్బాంధవుడుగా నిలిచారు. విపత్తు నిర్వహణలో రాష్ట్రం యునెస్కో వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు గుర్తించి ప్రశంసించడం విశేషం. శూన్య ప్రాణ హాని నినాదం విపత్తు నిర్వహణ మూలమంత్రంగా అనుబంధ యంత్రాంగం అలవరచుకోగలిగింది. గెలుపు కష్టం కాదు.. ఎన్నికలలో గెలవడం కంటే ప్రజలకు సమర్ధవంతమైన పాలన అందజేయడం అత్యంత క్లిష్టం. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడానికి రాష్ట్ర యంత్రాంగాన్ని సమయ స్ఫూర్తితో స్పందింప జేయడం సమర్థవంతమైన పాలనకు నిదర్శనం. కష్టాల కన్నీళ్లుతో తడిచిన ఒడిశా ఆధునిక భారతదేశం పురోగతికి మార్గదర్శి కావాలనే ఆయన దృఢ సంకల్పం అనిర్వచనీయం. 1999 నాటి పెను తుపాను (సూపర్ సైక్లోన్) పొరుగు రాష్ట్రం దయదాక్షిణ్యాలతో మేలుకుని దాదాపు నెల రోజుల తర్వాత రాష్ట్రం వెలుగు చూసింది. ఈ చేదు అనుభవంతో చలించిన ముఖ్యమంత్రి నవీన్ పటా్నయక్ నేడు విపత్తు నిర్వహణలో ప్రపంచ దిక్సూచిగా రాష్ట్రం వెలుగొందుతుంది. ప్రజలకు చేరువ.. పాలన పగ్గాలు చేపట్టేందుకు కాదు ఎన్నికలలో విజయం.. మార్పు, పరివర్తన దృక్పథంతో పాలన చేపడితే ప్రజలకు చేరువై నిజమైన ప్రజాస్వామ్య పాలకులుగా చరిత్రలో మిగిలిపోయే నాయకులు అవుతారని ఆదర్శ ముఖ్యమంత్రి అవార్డు అందుకున్న సందర్భంగా జాతికి పిలుపునిచ్చారు. ఈ కోవకు చెందిన వారిలో జాతిపిత మహాత్మా గాం«దీ, దివంగత ముఖ్యమంత్రి బిజూ పటా్నయక్ వంటి మహా నాయకుల తరహాలో నిరంతరం ప్రజల గుండెల్లో నిలిచిపోతారని పేర్కొన్నారు. ప్రజలను ముందంజలో ఉంచి కొనసాగించే పాలన రాజకీయ యాత్రగా కాకుండా ఆధ్యాతి్మక అనుభవంగా అద్భుత సంతృప్తిని మిగుల్చుతుందని వర్ధమాన నాయకుల్ని ఉద్దేశించి ప్రబోధించిన మహానేత నవీన్ పట్నాయక్ ప్రజా తీర్పుతో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ని్రష్కమించారు. -
నవీన్ చరిష్మాకు తెర!
సాక్షి, న్యూఢిల్లీ: ఒడిశా ముఖ్యమంత్రిగా నవీన్ పట్నియక్ 24 ఏళ్ల పాలనకు తెర పడింది. ఆయన సారథ్యంలోని బిజూ జనతా దళ్(బీజేడీ) పార్టీ అధికారం కోల్పోయింది. మొత్తం 147 అసెంబ్లీ స్థానాలకుగాను 78 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. ఒడిశా అస్మిత (ఆత్మగౌరవం) నినాదానికి తోడు బీజేపీ అగ్రనేతలు మోదీ, అమిత్ షాల ప్రచారం బీజేపీని విజయతీరాలకు చేర్చింది. గత ఎన్నికల్లో బీజేపీ కేవలం 23 చోట్ల గెలిచింది. సీఎం అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికల బరిలోకి దిగిన కమలం పార్టీ తొలిసారి అధికారపీఠాన్ని కైవసం చేసుకుంది. 2019 ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో 113 చోట్ల గెలిచిన బీజేడీ ఈసారి 51 చోట్ల, కాంగ్రెస్ 14 చోట్ల, సీపీఐఎం ఒకచోట గెలిచాయి. సుదీర్ఘ సీఎం రికార్డ్ మిస్ 2000 సంవత్సరం నుంచి నవీన్ పట్నాయక్ ఒడిశా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఈ ఎన్నికల్లో కూడా పటా్నయక్ పార్టీ గెలిచి సీఎం పదవి చేపడితే దేశంలో అత్యధిక కాలం సీఎంగా ఉన్న వ్యక్తిగా రికార్డు సొంతం చేసుకునేవారు. అయితే బీజేడీ విజయయాత్రకు బీజేపీ బ్రేకులు వేసింది. హింజిలి నియోజకవర్గంలో కేవలం 4,636 ఓట్ల తేడాతో నవీన్ ఎలాగోలా గెలిచారు.పనిచేసిన ఒడిశా అస్మిత నినాదం ఈ ఎన్నికల్లో సమస్యల కంటే బీజేపీ ‘ఒడిశా అస్మిత’ ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లింది. నవీన్ పట్నియక్ అనారోగ్య కారణాలను ఆసరాగా చేసుకుని తమిళనాడుకు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి కార్తికేయ పాండియన్ బీజేడీ పారీ్టపై ఆధిపత్యాన్ని చలాయించారు. ఈ అంశాన్ని బీజేపీ విజయవంతంగా ప్రచార అస్త్రంగా మలిచింది. ఒడిశా భవిష్యత్తును స్థానికేతరుల చేతిలో పెట్టి ప్రజల ఆత్మగౌరవాన్ని బీజేడీ తాకట్టు పెట్టిందని పాండ్యన్ లక్ష్యంగా అస్మిత నినాదాన్ని బీజేపీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. వ్యక్తిగతంగా పటా్నయక్ అవినీతి మరకలు లేని నేత. కానీ బీజేడీ సర్కార్‌లో మంత్రులఅవినీతినే ప్రధాన ప్రచారా్రస్తాలుగా మలచి బీజేపీ విజయబావుటా ఎగరేసింది. -
ఒడిశాలో హోరాహోరీ
భువనేశ్వర్: 147 స్థానాలున్న ఒడిశా శాసనసభ ఎన్నికల్లో ఈసారి హోరాహోరీ పోరు తప్పదని ఇండియా టుడే–యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ వెల్లడించింది. విపక్ష బీజేపీకి 62 నుంచి 80 స్థానాలు లభించే అవకాశం ఉందని, అధికార బిజూ జనతాదళ్(బీజేడీ)కి సైతం 62 నుంచి 80 స్థానాలే దక్కే వీలుందని అంచనా వేసింది. దీన్నిబట్టి చూస్తే ఒడిశాలో బీజేపీ అధికారం దక్కించుకొనేందుకు ఆస్కారం ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఒకవేళ బీజేడీకి స్పష్టమైన మెజార్టీ రాకపోతే ముఖ్యమంత్రి నవీన్ పటా్నయక్ రాజకీయ ప్రస్థానం దాదాపు ముగిసినట్లే అని చెప్పొచ్చు. ఆయన ఐదుసార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. నవీన్ పట్నాయక్ ఇప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఒడిశాలో కాంగ్రెస్ 5 నుంచి 8 అసెంబ్లీ స్థానాలు గెలుచుకొనే అవకాశం ఉన్నట్లు ఎగ్జిట్ పోల్ వెల్లడించింది. బీజేపీ ఓట్ల శాతం 42 శాతానికి పెరుగుతుందని, బీజేడీ ఓట్ల శాతం 42 శాతం పడిపోతుందని, కాంగ్రెస్‌కు 12 శాతం ఓట్లు లభించే అవకాశం ఉందని తెలియజేసింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడీ 112 సీట్లు, బీజేపీ 23, కాంగ్రెస్ 9 సీట్లు గెలుచుకున్నాయి. 21 లోక్‌సభ స్థానాల్లో బీజేపీకి ఏకంగా 18–20 వస్తాయని ఇండియా టుడే అంచనా వేసింది! -
ఒడిశాలొ ‘పాండియన్’ పాలిటిక్స్.. నవీన్ పట్నాయక్ ఆసక్తికర వ్యాఖ్యలు
భువనేశ్వర్: బీజేడీ నేత వీకే పాండియన్ వ్యవహారం ఒడిశా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒడిశా సీఎంను పాండియన్ నియంత్రిస్తున్నారని బీజేపీ విమర్శలు గుప్పిస్తుంది. మరోవైపు సీఎం నవీన్ పట్నాయక్‌కు పాండియన్ రాజకీయ వారసుడంటూ ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఈ క్రమంలో బీజేడీ చీఫ్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ గురువారం స్పందించారు.ఈ నేపథ్యంలో ట్విటర్ వేదికగా నవీన్ పట్నాయక్.. ‘‘ నా వారసుడి విషయంలో ఇదివరకే చాలా క్లారిటీగా చెప్పాను. నా వారసుడిని ఒడిశా రాష్ట్ర ప్రజలు నిర్ణయిస్తారు. ఇలాంటివి చాలా సహజంగా ప్రజల ద్వారానే జరిగిపోయే విషయాలు. ప్రజస్వామ్యంలో పార్టీల్లో నేతలు వివిధ పదువుల్లో ఉంటారు. మంత్రులుగా ప్రజల ప్రతినిధులు ఉంటారు. అదేవిధంగా అధికారాలను కలిగి ఉంటారు. పాండియన్ ప్రభుత్వ పదవికి రాజీనామా చేసి పార్టీలో చేరినట్లు స్పష్టం చేశారు.#WATCH | On being asked about "putting VK Pandian above other BJD leaders", Odisha CM Naveen Patnaik says "I find all of this quite nonsensical..."On VK Pandian, he further says "Party members have a great say, they have high positions, they are ministers, they are the people's… pic.twitter.com/XigUlX4wS1— ANI (@ANI) May 30, 2024 ఇక.. వీకే పాండియన్ నన్ను కంట్రోల్ చేస్తున్నారన్న ఆరోపణలు చాలా హాసాస్పదం.. వాటికి అసలు ఎటువంటి ప్రాధాన్యతా లేదు. నేను ఆరోగ్యంగానే ఉన్నాను. రాష్ట్రంలో తిరిగి బీజేడీ ప్రభుత్వ ఏర్పడుతుంది. లోక్‌సభ ఎన్నికల్లో సైతం 21 స్థానాల్లో గెలుస్తాం. ఒడిశా ప్రజలకు సంక్షేమం అందించడమే నా తొలి ప్రాధాన్యం’’ అని అన్నారు.ఇటీవల ఓ కార్యక్రమంలో సీఎం నవీన్ పట్నాయక్ మాట్లాడుతుండగా వణుకుతున్న ఆయన చేతులను పాండియన్ సరిచేసిన విషయం తెలిసిందే. దీనిపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ స్పందిస్తూ సీఎం పట్నాయక్‌పై విమర్శలు గుప్పించారు. వీకే పాండియన్ మాత్రమే నవీన్ పట్నాయక్‌తో ఎందుకు ఉంటారో సమాధానం చెప్పాలి. పట్నాయక్‌తో పాటు పాండియన్ మైక్ పట్టుకొని, వణుకుతున్న చేతులను కంట్రోల్ చేస్తున్నారు అని వ్యాఖ్యలు చేశారు. ఎవరీ వీకే పాండియన్..?తమిళనాడుకు చెందిన వీకే పాండియన్ 2000 సంవత్సరంలో ఒడిశా ప్రభుత్వంలో బ్యూరోక్రాట్‌గా చేరారు. మొదట్లో ధరమ్‌ఘర్, కలహండి సబ్ కలెక్టర్‌గా పనిచేశారు. ఒడిశాలోని అతిపెద్ద జిల్లా మయూర్‌భంజ్‌లో కలెక్టర్‌గా మారుమూల గ్రామాలను అభివృద్ధి చేశారు. హెచ్ఐవీ సోకిన వ్యక్తులకు పునరావాసం కల్పించిన కృషికి వీకే పాండియన్‌కు జాతీయ అవార్డు అందుకున్నారు. 5T కార్యక్రమాల వల్ల దాదాపు తొంభై శాతానికి పైగా ప్రజల ఫిర్యాదులు పరిష్కరించడంలో పాండియన్ కీలకమైన బ్యూరోక్రాట్‌గా పేరు సంపాధించారు. 2011 సంవత్సరంలో వీకే పాండియన్ ప్రతిభను గమనించి సీఎం నవీన్ అతన్ని సీఎం కార్యాలయానికి తీసుకున్నారు. సీఎంకు ప్రైవేట్ సెక్రటరీగా కూడా పని చేశారు. ఇక.. 2023లో వీకే పాండియన్ తన బ్యూరోక్రాట్ పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. అనంతరం 2023, నవంబర్ 27న సీఎం నవీన్ పట్నయక్ సమక్షంలో బిజు జనతా దళ్‌లో చేరి సీఎంకు సన్నిహితంగా ఉంటూ పార్టీ నేతగా కొనసాగుతున్నారు. -
Lok Sabha Election 2024: ఒడిశాలో రసవత్తర పోటీ
బీజేపీ, అధికార బీజేడీ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా హోరాహోరీ పోరు సాగుతున్న ఒడిశాలో ఎన్నికల ప్రక్రియ తుది అంకానికి చేరుతోంది. 15 లోక్‌సభ, వాటి పరిధిలోని అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ఇప్పటికే ముగిసింది. చివరి దశలో భాగంగా మిగతా 6 లోక్‌సభ స్థానాలు, వాటి పరిధిలోని అసెంబ్లీ స్థానాలకు శనివారం పోలింగ్ జరగనుంది. వీటిలో 4 బీజేడీ, 2 బీజేపీ సిట్టింగ్ స్థానాలు. వాటిపై ఫోకస్...జగత్సింగ్పూర్ ఇక్కడ రెండు దశాబ్దాలుగా బీజేడీ చక్రం తిప్పుతోంది. బీజేపీ ఖాతా తెరవలేదు. 2019లో భారీ మెజారిటీతో నెగ్గిన రాజశ్రీ మల్లిక్ బీజేడీ నుంచి, ఆయన చేతిలో ఓడిన బిబూ ప్రసాద్ తరాయ్ బీజేపీ నుంచి మళ్లీ బరిలో ఉన్నారు. తరాయ్ 2009లో ïసీపీఐ నుంచి, 2014లో కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేశారు. ఆయన ఓటు బ్యాంకును చూసి బీజేపీ మరోసారి చాన్సిచి్చనట్టు చెబుతున్నారు. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి రవీంద్ర కుమార్ సేథీ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు బీజేడీలోకి చేరడం ఆ పారీ్టకి అనుకూలించే అంశం.కేంద్రపర ఇదీ బీజేడీ కంచుకోటే. ఈసారి మాత్రం బీజేపీ అనుకూల పవనాలు వీస్తున్నాయి. 2009, 2014ల్లో బీజేడీ నుంచి గెలిచిన బైజయంత్ పాండా గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగి బీజేడీ నేత, సినీ నటుడు అనుభవ్ మహంతి చేతిలో ఓటమి చవిచూశారు. ఒకప్పుడు సీఎం నవీన్ పట్నాయక్‌కు అత్యంత సన్నిహితుడైన బైజయంత్ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుని హోదాలో మరోసారి ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. సిట్టింగ్ ఎంపీ అనుభవ్ మహంతి కూడా బీజేపీలో చేరడంతో బీజేడీ సంకట స్థితిలో పడింది. అన్షుమన్ మహంతిని పోటీకి దింపింది. మయూర్భంజ్ సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ తుడు స్థానంలో ఎమ్మెల్యే, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సన్నిహితుడు నాబా చరణ్ మఝికి ఈసారి బీజేపీ టికెటిచ్చింది. ద్రౌపది ముర్ము 2009లో ఈ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఐదుసార్లు ఎమ్మెల్యే అయిన విద్యా శాఖ మంత్రి సుదమ్ మరాండీని బీజేడీ బరిలో దింపింది. జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ సోదరి అంజని సోరెన్ జేఎంఎం తరఫున పోటీలో ఉండటంతో త్రిముఖ పోటీ నెలకొంది.భద్రక్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మన్మోహన్ సమల్ భద్రక్ లోక్‌సభ స్థానం పరిధిలోని చాంద్‌బలి అసెంబ్లీ స్థానంలో పోటీ చేస్తున్నారు. దాంతో భద్రక్‌లో గెలుపు బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారింది. బీజేపీ నుంచి కేంద్ర మాజీ మంత్రి అరుణ్ చరణ్ సేథీ కుమారుడు అవిమన్యు సేథీ పోటీ చేస్తున్నారు. బీజేడీ నుంచి సిట్టింగ్ ఎంపీ మంజులతా మండల్, కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ అనంత ప్రసాద్ సేథీ బరిలో ఉన్నారు.జజ్పూర్ బీజేడీ నుంచి సిట్టింగ్ ఎంపీ శరి్మష్ఠ సేథీ మళ్లీ బరిలో ఉన్నారు. రవీంద్ర నారాయణ బెహరాకు బీజేపీ టికెటిచి్చంది. కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ ఆంచల్ దాస్ పోటీ చేస్తున్నారు. ఆయన 1996లో ఇక్కడ జనతాదళ్ నుంచి గెలిచారు. గత ఐదేళ్లలో బీజేపీ ఓటు బ్యాంక్ బాగా పెరిగిందన్న ధీమా ఆ పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది. అయితే పార్టీ అభ్యర్థి బెహరా స్థానికులకు పరిచయస్తుడే అయినా రాజకీయాలకు కొత్త.బాలాసోర్ బీజేపీ సిట్టింగ్ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి మళ్లీ బరిలో ఉన్నారు. బీజేడీ నుంచి మాజీ బీజేపీ నేత లేఖశ్రీ సమంత సింగార్ పోటీ చేస్తున్నారు. పార్టీని అస్తమానం విమర్శించే లేఖశ్రీకి టికెటివ్వడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. నిజానికి కందమాల్ నుంచి బీజేపీ తరఫున పోటీకి లేఖశ్రీ ఆసక్తి చూపారు. నీలగిరి నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని అధిష్టానం సూచించడంతో బీజేడీలో చేరారు. కాంగ్రెస్ నుంచి కేంద్ర మాజీ మంత్రి శ్రీకాంత్ కుమార్ జెనా పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి మూడుసార్లు గెలిచిన కరబేల స్వైన్ స్వతంత్ర అభ్యర్థిగా రెండు పారీ్టలకూ సవాలు విసురుతున్నారు.బరిలో కోటీశ్వరులు ఒడిశాలో తుది విడత బరిలో ఉన్న 66 మంది అభ్యర్థుల్లో 20 మంది కోటీశ్వరులే. కేంద్రపర బీజేపీ అభ్యర్థి బైజయంత్ పాండాకు అత్యధికంగా రూ.148 కోట్లున్నాయి. తర్వాత స్వతంత్ర అభ్యర్థి శ్రీరామ్ పాండే రూ.18.23 కోట్లు, భద్రక్ బీజేపీ ఎంపీ మంజులత మండల్‌కు రూ.14.86 కోట్ల ఆస్తులున్నాయి. 15 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. వీరిలో 10 మంది తీవ్ర కేసుల్లో నిందితులని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) పేర్కొంది. -
Odisha Assembly Elections 2024: బీజేపీకి సవాల్
ఒడిశాలో రెండో విడత ఎన్నికలకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలో 21 లోక్‌సభ స్థానాలుండగా నాలుగింటికి 13న పోలింగ్ ముగిసింది. ఈ నెల 20న రెండో విడతలో ఐదు లోక్‌సభ స్థానాలు, వాటి పరిధిలోని 35 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ ఐదు లోక్‌సభ స్థానాల్లో మూడు బీజేపీ సిట్టింగ్ సీట్లే కావడం విశేషం. ఆ పారీ్టకి గట్టి మద్దతున్న ఈ స్థానాల్లో అధికార బీజేడీ నుంచి సవాలు ఎదురవుతోంది... బోలంగీర్ రాష్ట్రమంతటా ఆసక్తి నెలకొన్న స్థానమిది. బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ, రాజ వంశీకురాలు సంగీతా సింగ్‌దేవ్ బరిలో ఉన్నారు. బీజేడీ గత అభ్యర్థి కల్కేశ్ నారాయణ్ సింగ్‌దేవ్ స్థానంలో సురేంద్ర సింగ్ భోయ్‌ని పోటీకి దింపింది. కాంగ్రెస్ నుంచి మనోజ్ మిశ్రా పోటీలో ఉన్నారు. ఇక్కడ సంగీత నాలుగుసార్లు గెలిచారు. ఆమె భర్త కనకవర్ధన్ సింగ్‌దేవ్ పాటా్నగఢ్–బోలంగీర్ మహరాజు రాజ్రాజ్ సింగ్‌దేవ్ కుమారుడు. ఒడిశా బీజేపీ చీఫ్‌గా, రాష్ట్ర మంత్రిగా కూడా చేశారు. కరువు బాధిత జిల్లా అయిన బోలంగీర్ నుంచి ఏటా 30 వేల మందికి పైగా ఉపాధి కోసం వలస పోతున్నారు. ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సీట్లలో నాలుగు బీజేడీ చేతిలో ఉన్నాయి. కాంగ్రెస్ రెండు చోట్ల, బీజేపీ ఒక్క స్థానంలో గెలిచాయి.సుందర్‌గఢ్ ఒడిశాలో కీలక లోక్‌సభ స్థానాల్లో ఇదీ ఒకటి. ఇక్కడ బీజేపీదే హవా. గత రెండు ఎన్నికల్లో గెలిచిన బీజేపీ సిట్టింగ్ ఎంపీ జుయల్ ఓరం మళ్లీ బరిలో ఉన్నారు. 1998 నుంచి ఇక్కడ ఆయన ఐదుసార్లు గెలవడం విశేషం. 2009 ఎన్నికల్లో మాత్రం ఓరంపై కాంగ్రెస్ నేత హేమానంద బిశ్వాస్ విజయం సాధించారు. అధికార బీజేడీ ఇక్కడ ఖాతాయే తెరవలేదు! రాష్ట్రంలో ఆ పార్టీ ఇప్పటిదాకా నెగ్గని ఏకైక స్థానమిది. గత మూడుసార్లుగా అభ్యర్థులను మారుస్తున్నా ఫలితం దక్కడం లేదు. ఈసారి భారత హాకీ జట్టు మాజీ కెపె్టన్ దిలీప్ టిర్కీని బీజేడీ మరోసారి బరిలో దింపింది. 2014లో ఆయన 18 వేల ఓట్ల తేడాతో ఓడారు. ఈ గిరిజన ప్రాబల్య నియోజకవర్గంలో బీజేపీని ఓడించడం కష్టమేనని విశ్లేషకులు అంటున్నారు. ప్రపంచ స్థాయి హాకీ స్టేడియం ఏర్పాటు, టిర్కీ ఆదరణ కలిసొచ్చి ఈసారి గట్టెక్కుతామని బీజేడీ భావిస్తోంది. కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే జనార్దన్ దెహూరీ పోటీ చేస్తున్నారు. ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సీట్లలో మూడు బీజేపీ చేతిలో ఉన్నాయి. రెండింట బీజేడీ, కాంగ్రెస్, సీపీఎం చెరో చోట గెలిచాయి.కందమాల్ ఈ స్థానం బీజేడీ కంచుకోట. కందమాల్, బౌద్ జిల్లాలు మొత్తం దీని పరిధిలోకే వస్తాయి. బీజేడీ నుంచి సిట్టింగ్ ఎంపీ, ప్రముఖ విద్యావేత్త అచ్యుతానంద సామంత బరిలో ఉన్నారు. బీజేపీ ప్రతిసారీ కొత్త అభ్యరి్థని నిలుపుతున్నా నిరాశే ఎదురవుతోంది. ఈసారి సుకాంత కుమార్ పాణిగ్రాహికి టికెటిచి్చంది. కాంగ్రెస్ నుంచి అమీర్‌చంద్ నాయక్ పోటీలో ఉన్నా పోటీ బీజేపీ, బీజేడీ మధ్యే ఉంది. సామంతకు విద్యా, దాతృత్వ కార్యక్రమాలు గట్టి దన్ను. కాగా తాగు, సాగునీటి సమస్య, రోడ్ల దుస్థితి తదితర అంశాలను పాణిగ్రాహి ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఆయనకు మద్దతుగా ప్రధాని మోదీ ఇప్పటికే ప్రచారం చేశారు.బార్గఢ్ 2008 నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఏర్పడిన ఈ స్థానంలో విజయం పారీ్టల చేతులు మారుతూ వస్తోంది. 2009లో కాంగ్రెస్ నేత సంయజ్ భోయ్ గెలవగా, 2014లో బీజేడీకి చెందిన డాక్టర్ ప్రవాస్ కుమార్ సింగ్ విజయం సాధించారు. 2019లో బీజేపీని విజయం వరించింది. బీజేడీ సీనియర్ నేత ప్రసన్న ఆచార్యను బీజేపీ నేత సురేశ్ పూజారి ఓడించారు. ఈసారి ఆయనకు బదులు ప్రదీప్ పురోహిత్‌కు బీజేపీ టికెటిచి్చంది. పూజారిని అసెంబ్లీ ఎన్నికల్లో మోహరించింది. బీజేడీ కూడా పరిణీత మిశ్రాకు అవకాశం ఇచ్చింది. కాంగ్రెస్ నుంచి సంజయ్ భోయ్ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బీజేడీ ప్రభుత్వ వైఫల్యాలపై బలంగా గళం వినిపించే ప్రదీప్‌కు స్థానికంగా మంచి పేరుంది. మోదీ సర్కారు సంక్షేమ కార్యక్రమాలను ప్రస్తావిస్తూ ఓటర్లకు దగ్గరవుతున్నారు.అస్కా బీజేడీకి కంచుకోట. సీఎం నవీన్ పటా్నయక్‌కు ప్రతిష్టాత్మక లోక్‌సభ స్థానం. ఆయన పోటీ చేస్తున్న హింజిలి అసెంబ్లీ స్థానం దీని పరిధిలోనే ఉంది. తండ్రి బిజూ పటా్నయక్ మరణానంతరం 1997 లోక్‌సభ ఉప ఎన్నికల్లో అస్కా నుంచే నవీన్ లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1998, 1999 ఉప ఎన్నికల్లోనూ విజయం సాధించారు. వాజ్‌పేయి ప్రభుత్వంలో ఉక్కు, గనుల శాఖ మంత్రిగా చేశారు. ఇక్కడ ఏ అభ్యర్థినీ రెండోసారి నవీన్ కొనసాగించకపోవడం గమనార్హం. బీజేడీ నుంచి 2019లో ప్రమీలా బిసోయ్ గెలిచారు. ఈసారి ఆమెను కాదని 33 ఏళ్ల రంజితా సాహుకు బీజేడీ టికెట్ దక్కింది. ఆమె వలస కారి్మకుల కోసం ‘కొడాల యూత్ ఫోరం’ అనే స్వచ్ఛంద సంస్థ నడుపుతున్నారు. సామాన్యుల్లో ఆమెకున్న గుర్తింపు చూసే సీఎం టికెటిచ్చారు. బీజేపీ నుంచి మరోసారి అనితా శుభదర్శిని పోటీ చేస్తున్నారు. ఆమె తండ్రి రామకృష్ణ పటా్నయక్ మాజీ మంత్రి. బిజూ, నవీన్ పట్నాయక్‌లకు అత్యంత సన్నిహితుడు. గంజాం జిల్లాలో ఆయనకు మంచి పేరుంది.ముగ్గురిలో ఒకరిపై కేసు ఒడిశాలో రెండో విడతలో పోలింగ్ జరిగే ఐదు లోక్‌సభ స్థానాల్లో 40 మంది పోటీలో ఉన్నారు. వీరిలో 13 మంది కోటీశ్వరులే. సంగీతా కుమారి రూ.67.3 కోట్లతో జాబితాలో టాప్‌లో ఉన్నారు. 12 మంది అభ్యర్థులు తమపై క్రిమినల్ కేసులున్నట్టు పేర్కొన్నారు. వీరిలో 8 మంది తీవ్ర నేరాలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 21 మంది గ్రాడ్యుయేషన్, అంతకంటే ఉన్నత విద్యావంతులని ఏడీఆర్ సంస్థ ప్రకటించింది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఏఐ యూనివర్సిటీ.. ఒడిశా మేనిఫెస్టోలో ఆసక్తికర హామీలు
భువనేశ్వర్: ఒడిశాలోని బిజూ జనతాదళ్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోను గురువారం విడుదల చేసింది. ఒడిశా అసెంబ్లీ తోపాటు లోక్‌సభకు ఏకకాలంలో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులతో సమానంగా కళింగశ్రీ, కళింగ భూషణ్ అవార్డులను ప్రవేశపెడుతున్నట్లు బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ మేనిఫెస్టో విడుదల చేస్తూ ప్రకటించారు.ఏఐ (AI) యూనివర్సిటీ, 100 యూనిట్ల ఉచిత విద్యుత్, కలియా పథకం వంటి కార్యక్రమాలను కొనసాగించాలని, విస్తరించాలని పార్టీ యోచిస్తోంది. ఎన్నికల తర్వాత కొత్త బీజేడీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత రాష్ట్ర మంత్రివర్గం తన మొదటి సమావేశంలోనే ఈ మేనిఫెస్టోను ఆమోదిస్తుందని నవీన్ పట్నాయక్ చెప్పారు. 5టీ గవర్నెన్స్ మోడల్ ద్వారా ఈ మ్యానిఫెస్టోను అమలు చేస్తే ఒడిశా ఆధునికత, అభివృద్ధిలో ప్రత్యేక గుర్తింపు సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.మేనిఫెస్టోలో కీలక అంశాలు⇒ వచ్చే దశాబ్దంలో ఒడిశా యువత కోసం రూ. 1 లక్ష కోట్ల ప్రత్యేక బడ్జెట్⇒ వచ్చే ఐదేళ్లలో బాలబాలికలకు స్కాలర్‌షిప్‌ల పెంపు⇒ రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు⇒ స్కిల్స్ అండ్ ఎంట్రాప్రీన్యూర్షిప్ యూనివర్సిటీ, స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, ఏఐ యూనివర్సిటీ కోసం ప్రణాళికలు⇒ 100 యూనిట్ల వరకు గృహాలకు ఉచిత విద్యుత్⇒ 100 నుంచి 150 యూనిట్లు వరకు సబ్సిడీపై విద్యుత్⇒ మధ్యతరగతి కుటుంబాల కోసం బిజూ స్వాస్త్య కళ్యాణ్ యోజన, గృహ రుణాలపై వడ్డీ రాయితీ, పిల్లల చదువుల కోసం స్కాలర్షిప్లు⇒ మహిళలు, గిరిజన, ఓబీసీ, మైనారిటీ వర్గాలకు వడ్డీ లేని రుణాలు⇒ స్వయం సహాయక బృందాలకు ఆర్థిక సాయం, పెన్షన్ పథకాల ద్వారా సాధికారత⇒ రైతులకు పంట రుణాలు, కలియా పథకం కొనసాగింపు, రైతుల అమ్మాయిల వివాహాల కోసం ఆర్థిక సహాయం. -
‘సూపర్ సీఎం’ పాండియన్!
వి.కార్తికేయన్ పాండియన్. వయసు 49. వదులు చొక్కా, సాదాసీదా ప్యాంటు, కాళ్లకు చెప్పులు. అత్యంత నిరాడంబరమైన ఆహార్యం. కానీ ఒడిశా సీఎం, బిజూ జనతాదళ్ చీఫ్ నవీన్ పటా్నయక్ తర్వాత రాష్ట్రమంతటా ఆ స్థాయిలో మారుమోగుతున్న పేరు. నవీన్ వెనుక ఆయనే ప్రధాన చోదక శక్తి. అత్యంత నమ్మకస్తుడు కూడా. ఇటీవలే ఐఏఎస్ పదవికి రాజీనామా చేసి బీజేడీలో చేరారు. ప్రభుత్వాధికారిగా ‘సూపర్ సీఎం’ అని, పారీ్టలో చేరాక ‘నంబర్ టూ’అని ముద్రపడ్డారు. పటా్నయక్ సలహాదారుగా, ప్రభుత్వ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ 5టీ చైర్మన్‌గా కేబినెట్ హోదాలో ఉన్నారు. బీజేడీ ప్రధాన ప్రచారకర్తగా దూసుకుపోతున్నారు. ప్రధాని మోదీ మొదలుకుని రాహుల్‌గాంధీ దాకా పాండియన్నే లక్ష్యం చేసుకుని విమర్శలు చేస్తున్నారంటే ఒడిశా ఎన్నికలను ఆయన ఎంతగా ప్రభావితం చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు! పటా్నయక్ రాజకీయ వారసునిగా కూడా పాండియన్ పేరు మారుమోగుతోంది... పాండియన్ది తమిళనాడులోని మదురై. 2000 బ్యాచ్ పంజాబ్ కేడర్ ఐఏఎస్ అధికారి. ఒడిశాకు చెందిన ఐఏఎస్ అధికారి సుజాత రౌత్‌ను పెళ్లాడారు. అలా 2002లో ఒడిశా కేడర్‌కు మారడం ఆయన కెరీర్లో కీలక మలుపు. ధర్మగఢ్ సబ్ కలెక్టర్‌గా ఒడిశాలో కెరీర్ ప్రారంభించారు. సీఎం సొంత జిల్లా మయూర్భంజ్, గంజాం కలెక్టర్‌గా చేశారు. 2011 నుంచి 12 ఏళ్లు పటా్నయక్ వ్యక్తిగత కార్యదర్శిగా చేశారు. ఆయనకు అత్యంత నమ్మకస్తునిగా మారారు. ఒడియా అనర్గళంగా మాట్లాడుతూ పలు కార్యక్రమాల ద్వారా ప్రజలకూ చేరువయ్యారు. 2023లో వీఆర్ఎస్ తీసుకుని బీజేడీలో చేరారు. నాటినుంచి పార్టీ నిర్ణయాలన్నింట్లోనూ ఆయనదే కీలక పాత్ర. 2014, 2019ల్లోనూ పటా్నయక్ ఎన్నికల వ్యూహాల్లో తెరవెనుక పాత్ర పాండియన్దే. ప్రభుత్వానికి, ప్రజలకు వారధి ఒడిశాలో నవీన్ ప్రజాదరణకు మూల కారణమైన ఫ్లాగ్షిప్ కార్యక్రమాలన్నింటి వెనకా ఉన్నది పాండియనే. సాధారణంగా యంత్రాంగంపై రాజకీయ ఆధిపత్యం దేశమంతటా ఉండే సమస్య. ఒడిశా మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడం నుంచి వాటిపై స్పందన తెలుసుకునే దాకా అంతా ఐఏఎస్‌ల మయం. ఇందుకోసం పాండియన్ సారథ్యంలో ఐఏఎస్‌ల బృందమే పని చేసింది! ఒడిశాలో బజ్ వర్డ్‌గా మారిన 5టీ (బృంద కృషి, సాంకేతికత, పారదర్శకత, పరివర్తన, సమయం) సూత్రధారి కూడా పాండియనే. 2019 నుంచి అధికారులకు, ప్రాజెక్టులకు ఇదే మార్గదర్శి! దీనిలో భాగంగా నాలుగేళ్లలో ఏకంగా 460 రకాల ప్రభుత్వ సేవలు ఆన్‌లైన్‌లోకి వచ్చాయి. హెలికాప్టర్ వివాదం.. ప్రభుత్వ వ్యవహారాలతో పాటు రాజకీయంగానూ బీజేడీలో అడుగడుగునా పాండియన్దే జోక్యం. 2019 ఎన్నికల్లో పార్టీ వ్యూహాలు, ఎత్తుగడల నుంచి టికెట్ల పంపిణీ దాకా అన్నింటా ఆయనదే ప్రధాన భూమిక! అధికారిగా ఉంటూ ప్రభుత్వ హెలికాప్టర్లో 30 జిల్లాల్లోనూ పాండియన్ సుడిగాలి పర్యటన చేయడం తీవ్ర వివాదం రేపింది. ఇవి బీజేడీ ర్యాలీల్లా ఉన్నాయంటూ విపక్షాలు దుయ్యబట్టాయి. ఆలిండియా సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించారంటూ ఆయనపై కేంద్రానికి బీజేపీ ఫిర్యాదు కూడా చేసింది! పాండియన్ పెత్తనంపై బీజేడీలోనూ అసమ్మతి మొదలైంది. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆయన సీఎం పక్కనే ఉండటమే గాక ఒక్కరే సమావేశాలూ నిర్వహించడం, మంత్రులను కూడా పక్కకు పెట్టడం తీవ్ర అసంతృప్తికి దారి తీసింది. అయినా పటా్నయక్ పట్టించుకోలేదు. పైగా పాండియన్‌ను విమర్శించినందుకు బీజేడీ ఉపాధ్యక్షురాలు, ఎమ్మెల్యే సౌమ్య రంజన్‌ను పదవి నుంచి తొలగించారు! నవీన్ వారసుడు...?! నవీన్ పూర్తిస్థాయిలో ‘ఒడియా అస్తిత్వ’ నినాదాన్ని ఎత్తుకునేలా చేసింది పాండియనే. దాంతో విపక్షాల విమర్శలకు ఆయనే లక్ష్యంగా మారారు. ‘‘పాండియన్ వల్ల ఒడియా ఉనికే ప్రమాదంలో పడింది. సమీప భవిష్యత్తులో బయటి వ్యక్తి ఒడిశా పాలకుడుగా మారే ప్రమాదముంది’’ అంటూ విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. బీజేపీ కూడా బీజేడీని ఎదుర్కోవాలంటే పాండియన్‌ను ఎదుర్కోవాలన్న ఆలోచనకు వచి్చంది. అందుకే ఆయన ‘బయటి వ్యక్తి’ అంటూ ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలంతా పదేపదే విమర్శిస్తున్నారు. ‘‘ఒడియా అస్మిత (ఆత్మగౌరవం) ప్రమాదంలో పడింది. ప్రజలు దీన్ని ఎక్కువ కాలం సహించబోరు’’ అని మోదీ ఇటీవల స్థానిక ప్రచార సభలో అన్నారు. పాండియన్ మాత్రం వీటిని తేలిగ్గా తోసిపుచ్చుతున్నారు. ‘‘నవీన్ పటా్నయక్ విలువలకు నేను సహజ వారసుడిని. ఒడిశా నా కర్మభూమి. పాతికేళ్లుగా ఇక్కడే పని చేస్తున్నా. నా భార్య, పిల్లలూ ఇక్కడివాళ్లే. ఒడిశా ప్రజలు నన్ను తమ వ్యక్తిగా ప్రేమిస్తున్నారు’’ అంటారు! – సాక్షి, న్యూఢిల్లీ -
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
ఒడిశాలో ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతుంది. ఈ తరుణంలో బీజేపీ అగ్రనేతలు ఒడిశాపై దృష్టి సారించారు. మోదీ, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌లు బీజేపీ అభ్యర్థుల తరుపున ప్రచారం చేయనున్నారు. ప్రధాని మోదీ ఇటీవలే బెర్హంపూర్, నబరంగ్‌పూర్ లోక్‌సభ స్థానాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే మే 13న ఒడిశాలో మొదటి రౌండ్ ఎన్నికలకు ముందు కమలం నేతలు తమ ప్రచారాన్ని మరింత ఉదృతం చేయనున్నారు.రాష్ట్ర బీజేపీ విశ్వసనీయ సమాచారం మేరకు మే 10న మోదీ భువనేశ్వర్‌లో రోడ్‌షో, మే 11న బొలంగీర్‌లో ఎన్నికల ర్యాలీలో ప్రసంగించనున్నారు. ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ రెండు రోజుల పర్యటన నిమిత్తం మే 8న బరంగ్‌పూర్, కోరాపుట్‌లలో బహిరంగ సభలలో పాల్గొననున్నారు. అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీలు హైవే ప్రాజెక్టులు, ఒడిశాలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఆవశ్యకత వంటి అంశాలను హైలైట్ చేయనున్నారు. బీజేపీ జాతీయ నాయకులు,కేంద్ర మంత్రులతో ఎన్నికల ప్రచారం నిర్వహించగా.. మరోవైపు ఒడిశా అధికార బీజేడీ మాత్రం సీఎం పట్నాయక్ ఆయన సన్నిహితుడు పాండియన్ ద్వయం రాబోయే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల కోసం మే 13 నుంచి జూన్ మధ్య నాలుగు సార్లు సుడిగాలు పర్యటనలు చేయనున్నారు. -
ఒడిషా: బీజేడీకి ‘ఈసీ’ బిగ్ షాక్
భువనేశ్వర్: ఎన్నికల వేళ ఒడిషాలో ఎన్నికల కమిషన్(ఈసీ)కొరడా ఝుళిపించింది. ప్రభుత్వంలో ఉన్నతాధికారిగా ఉన్న సుజాత ఆర్.కార్తికేయన్‌ను ఈసీ బదిలీ చేసింది. ప్రభుత్వ బాధ్యతలను దుర్వినియోగం చేస్తున్నారని బీజేపీ చేసిన ఫిర్యాదుతో గంట్లోపే ఈసీ చర్య తీసుకుంది. ఎన్నికల వ్యవహారాలకు సంబంధం లేని విభాగానికి సుజాతను బదిలీ చేసింది. ఒడిశా సీఎం, బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్ సన్నిహితుడికి వీకే పాండియన్ సతీమణి సుజాత. దీంతో సుజాత బదిలీ రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారింది. సుజాత మిషన్ శక్తి విభాగంలో సెక్రటరీగా నిధులు నిర్వర్తించారు.ఈమె భర్త వీకేపాండియన్ ఐఏఎస్ అధికారిగా గత ఏడాది వీఆర్ఎస్ తీసుకున్నారు. పాండియన్ ప్రభుత్వంలో పనిచేసినపుడు సీఎం నవీన్ పట్నాయక్‌కు నమ్మకమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. తెరవెనుక పాలనను మొత్తం నడిపేవారని పాండియన్‌కు పేరుంది. పదవీవిరమణ తర్వాత బీజేడీలో చేరారు. ప్రతిపక్షాలు పాండియన్‌ను సూపర్‌సీఎంగా పిలుస్తాయి. -
నవీన్ పట్నాయక్ లక్ష్యం అదే.. వీకే పాండియన్
భువనేశ్వర్: ఒడిశాను అన్ని రంగాల్లో అగ్రగామికి తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి 'నవీన్ పట్నాయక్' పక్కా ప్రణాళికతో ఉన్నారని, రాష్ట్రం నుంచి వలసలు పూర్తిగా ఆగిపోవాల్సిన అవసరం ఉందని ఆయన సన్నిహితుడు వీకే పాండియన్ అన్నారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలలో బిజూ జనతాదళ్ రాష్ట్రాన్ని క్లీన్ స్వీప్ చేస్తుందని అన్నారు.ప్రజలు నవీన్ పట్నాయక్ ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని గతంలో ముఖ్యమంత్రి ప్రైవేట్ కార్యదర్శిగా పనిచేసిన పాండియన్ అన్నారు. పట్నాయక్ కేవలం అధికారం కోసం మాత్రమే కాకుండా.. ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాలు చేస్తారు. దీన్ని ప్రజలు కూడా అర్థం చేసుకుంటారని ఆయన అన్నారు.ఐదు పర్యాయాలు ముఖ్యమంత్రి పదవిని అధిష్టించి నవీన్ పట్నాయక్.. ఆరో సారి ఏమైనా విశ్రాంతి తీసుకుంటారా? వారిలో ఏమైనా అలసట కనిపించిందా? అనే ప్రశ్నకు పాండియన్ సమాధానమిస్తూ.. మంచిపని చేస్తే అలసట ఎలా వస్తుంది, ప్రతి ఎన్నికల్లోనూ అయన గొప్ప విజయం సాధిస్తారని అన్నారు.ఒడిశా రాష్ట్రంలోని 21 లోక్‌సభ స్థానాలకు, 147 స్థానాలున్న రాష్ట్ర అసెంబ్లీకి కలిసి ఎన్నికలు జరగనున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేడీ 12 సీట్లు గెలుచుకోగా, బీజేపీకి ఎనిమిది, కాంగ్రెస్‌కు ఒక్క సీటు మాత్రమే లభించింది. అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడీ సంఖ్య 117 నుంచి 112కి పడిపోయింది. ఆ సమయంలో బీజేపీ 19 నుంచి 23 స్థానాలకు ఎగబాకింది. కాంగ్రెస్‌కు తొమ్మిది స్థానాలు మాత్రమే రాగా, ఇతరులు రెండు అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించారు.పంచాయితీ, మునిసిపాలిటీ, అసెంబ్లీ లేదా లోక్‌సభ ఎన్నికల ఏవీ నవీన్ పట్నాయక్ విజయాన్ని అడ్డుకోలేవు. ఆయనకు ప్రజల్లో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఈ కారణంగానే ఆయన ఎన్నికల గురించి పెద్దగా పట్టించుకోరని పాండియన్ అన్నారు. ఇప్పటికే క్రీడలు, విపత్తు నిర్వహణ, పేదరిక నిర్మూలన లేదా ఆహారోత్పత్తి వంటి రంగాల్లో అగ్రస్థానంలో ఉన్నాము. అయితే ఒడిశా అన్ని రంగాల్లోనూ అగ్రస్థానంలో ఉండాలని నవీన్ పట్నాయక్ కోరుకుంటున్నారని ఆయన అన్నారు. -
ఎన్నికల బరిలో సినీ నటి.. ఎవరో తెలుసా (ఫోటోలు)
-
బీజేపీలో సాధారణ వ్యక్తి సైతం సీఎం, పీఎం కూడా అవ్వొచ్చు
న్యూఢిల్లీ : ఒడిశా రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఒడిశా అధికార పార్టీ బిజు జనతాదళ్ (బీజేడీ) మాజీ ఎంపీ ప్రభాస్ కుమార్ సింగ్ బీజేపీలో చేరారు. ఒడిశా బార్‌ఘర్ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించిన ప్రభాస్ కుమార్ సింగ్.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్, ఇతర సీనియర్ సమక్షంలో కాషాయం కండువా కప్పుకున్నారు. పొత్తులు విఫలం ఒడిశాలో అధికార బిజు జనతాదళ్, భారతీయ జనతా పార్టీ ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. పదేళ్లుగా అనధికార మిత్రులుగా కొనసాగిన ఇరు పార్టీలు.. పదిహేనేళ్ల తర్వాత అధికారికంగా జట్టు కట్టేందుకు జరిగిన చర్చలు ఫలించలేదు. ఒంటరి పోరు తమకే లాభమని ఇరుపార్టీలు భావించాయి. ఈ తరుణంలో బీజేడీ-బీజేపీల మధ్య పొత్తుల చర్చలు విఫలం కావడంతో పలువురు ఒడిశా అధికార పార్టీ బీజేడీ నేతలు బీజేపీలో చేరుతున్నారు. మోదీ వ్యక్తిత్వం తాజాగా ప్రభాస్ కుమార్ సింగ్ బీజేపీలో చేరారు. ‘ఇది నాకు ప్రత్యేకమైన క్షణం. ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిత్వం నన్ను బాగా ప్రభావితం చేసింది. సమయంలో బిజూ జనతాదళ్ (బీజేడీ)పై విమర్శనాస్త్రాలు సంధించారు. బీజేడీలో గౌరవం, ఆత్మగౌరవం లేదు. ఒడియా కళ సంస్కృతి, వారసత్వం పట్ల గౌరవం లేదని మండిపడ్డారు. సాధారణ వ్యక్తి సీఎం,పీఎం అవ్వొచ్చు దేశ ప్రజలు మోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్న ప్రభాస్ కుమార్ సింగ్.. గడిచిన 10ఏళ్లలో బీజేపీ దేశ ప్రజలకు చేసిన కృషిని కొనియాడారు. బీజేపీలో గౌరవం, ఆత్మగౌరవం, ప్రజాస్వామ్యం ఉన్నాయి. ఇక్కడ (బీజేపీలో) సాధారణ వ్యక్తి కూడా ప్రధాని, ముఖ్యమంత్రి కాగలడు. బీజేపీలో చేరడం నా అదృష్టమని తెలిపారు. ఒడిశాలో గెలుపు మాదే ఒడిశాలో బీజేపీ విజయ బావుటా ఎగురవేస్తుందని, లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించి కేంద్రంలో మోడీ నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రభాస్ కుమార్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. -
జయపురం టిక్కెట్టు ఎవరికో?
జయపురం: అవిభక్త కొరాపుట్ జిల్లాలో ఏకైక జనరల్ స్థానం జయపురం టిక్కెట్టు కోసం అధికార బీజేడీ పార్టీ నాయకులు పోటీ పడుతున్నారు. కొరాపుట్ జిల్లాలోని 5 శాసనసభ స్థానాల్లో కొరాపుట్, కోట్పాడ్ స్థానాలకు బీజేడీ అభ్యర్థులను ప్రకటించినా, జయపురం, లక్ష్మీపూర్, పొట్టంగి స్థానాలకు ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేదు. ముఖ్యంగా జయపురం నియోజకవర్గంలో ఎవరికి టిక్కట్టు ఇస్తారనే దానిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అందుకు కారణం గత రెండు ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి తారాప్రసాద్ బాహిణీపతిని ఎదుర్కొనే నేత ఎవరా అని ఎదురు చూస్తున్నారు. అయితే అతడిని ఎదుర్కొనే అభ్యర్థి కోసం బీజేడీ అధిష్టానం మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నియోజకవర్గంలో హ్యాట్రిక్ సాధించిన మాజీ మంత్రి రబినారాయణ నందో టిక్కెట్టు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ గత రెండు ఎన్నికల్లో ఆయన బాహిణీపతి చేతిలో ఓటమి చెందారు. అందువలన రబి నందోకు టిక్కెట్టు లభిస్తుందా లేదా అన్నది చర్చనీయాంశమైంది. రబినందోపై విముఖత..? రబినందోకు టిక్కెట్టుపై సీఎం నవీన్ పట్నాయక్ విముఖత ప్రదర్శిస్తున్నట్లు అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే ఇటువంటి అభిప్రాయాలే 2019 ఎన్నికల సమయంలో వినిపించాయని, అయినా రబి నారాయణ నందోకు అప్పట్లో అధిష్టానం టిక్కెట్టు ఇచ్చిందని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. అందువలన ఈసారి కూడా ఆయనకు టిక్కెట్టు లభించే అవకాశం లేకపోలేదని కొంతమంది అభిప్రాయం. అయితే ఒకవేళ పార్టీ టిక్కెట్టు తనకు లభించకపోయినా తన సతీమణికి వచ్చేటట్లు రబి నందో పావులు కదుపుతున్నట్లు సమాచారం. కొరాపుట్ కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షురాలిగా గతంలో పదవి నిర్వహించిన డాక్టర్ ఇందిరా నందో గత పదేళ్లుగా పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. అందువలన తనకు టిక్కెట్టు రాకపోయినా తన భార్యకు రాగలదని రబి నందో ఆశాభావంతో ఉన్నారు. అలాగే ఈసారి జయపురం బీజేడీ టిక్కెట్టు కోసం కొరాపుట్ కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షుడు ఈశ్వర చంద్ర పాణిగ్రాహి ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత మూడు ఎన్నికల నుంచి పార్టీ టిక్కెట్టు కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్న సీనియర్ మహిళా నాయకురాలు బిందు రాణి మిశ్ర కూడా మరోసారి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఆమె జిల్లా పరిషత్ సభ్యురాలుగా ఉండేవారు. పార్టీ కార్యకలాపాలలో పాల్గొంటూ రాష్ట్రస్థాయి నాయికత్వంతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. బీజేడీ టిక్కెట్టుపై ఆశావాహుల్లో రాధా బినోద్ సామంతరాయ్ పేరుకూడా వినిపిస్తున్నది. అయితే వీరిలో బీజేడీ పార్టీ అధి ష్టానం ఎవరికి టిక్కెట్టు ఇస్తుందో వేచి చూడాలి. -
Odisha : ఒడిషా రాజకీయం ఎటు తిరుగుతోంది?
ఒడిశాలో ఎన్నికల స్నేహానికి బీజేపీ, బీజేడీ సిద్ధమవుతున్నాయా? పొత్తు కుదరలేదని తాజా వార్త. కాదు... కుదరవచ్చని ఊహాగానం. ఇప్పటికింకా పూర్తి స్పష్టత లేదు. దోస్తీ మాట నిజమే అయితే, ఒక ప్రశ్న ఉదయిస్తుంది! ‘‘అసలు ఈ రెండు పార్టీలూ కలవాల్సిన అవసరం ఏముంది?’’ రాష్ట్రంలో సర్కార్ ఏర్పాటుకై బీజేడీకి బీజేపీ అవసరం లేదు. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బీజేపీకి బీజేడీ అవసరం లేదు. మరి ఏ ప్రయోజనాలు ఆశించి మోదీ, పట్నాయక్‌లు స్నేహహస్తాలు చాస్తున్నారు. 2008 నాటి క్రైస్తవుల హత్యోదంతాల అనంతరం 2009లో బీజేపీతో తెగతెంపులు చేసుకున్న పట్నాయక్... పదిహేనేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఎందుకు ఆ పార్టీతో నెయ్యానికి చర్చలు జరిపారు? అడగవలసిన ప్రశ్నలెన్నో ఉన్నాయి! గతాన్ని గుర్తు చేయటం రాజకీయ నాయ కులకు ఇష్టం ఉండదు. అది వారికి ‘‘ఒక పరదేశం’’. ఎల్.పి.హార్ట్లీ చెప్పిన విధంగా, ‘‘వారు అక్కడ పనులను భిన్నంగా చేస్తారు’’. సరిగ్గా అలానే చేసే ఉద్దేశంతో నేనివాళ ఉన్నాను. భారతీయ జనతా పార్టీతో నవీన్ పట్నాయక్ కొత్తగా పొత్తు కుదుర్చుకోవాలని చూస్తున్నట్టు వినగానే పదిహేను సంవత్సరాల క్రితం ఆయన చెప్పిన మాటల్ని జ్ఞాపకం చేసుకోవాలని నాకు అనిపించింది. వాటిని మీకు గుర్తు చేసి, మీ సొంతంగా ఒక అభిప్రాయానికి వచ్చేందుకు మిమ్మల్ని వదిలేస్తాను. 2008లో కొంధమాల్లో జరిగిన క్రైస్తవుల దారుణ హత్యోదంతాల అనంతరం నేను నవీన్ పట్నాయక్‌ను ఇంటర్వ్యూ చేశాను. ఆ హత్యలు దేశాన్ని కుదిపి వేయటమే కాకుండా, పట్నాయక్ ప్రతిష్ఠను పదేపదే దెబ్బతీశాయి. తేరుకోవటానికి ఆయన తలకిందులుగా తపస్సు చేయవలసి వచ్చింది. ‘‘నా దేహంలోని ప్రతి అస్థికా మతంతో సంబంధం లేనిది. ఆ అస్థికల్లో ఏవైనా దెబ్బతిని ఉంటాయని నేను అనుకోను’’ – అని, లౌకికవాదిగా తనకై తను ఆయన ఒక ఉనికిని ఇచ్చుకున్నారు. ఆరు నెలల తర్వాత, 2009 సార్వత్రిక ఎన్నికలకు ముందు, బీజేపీతో తనకున్న తొమ్మిదేళ్ల పొత్తును విచ్ఛిన్నం చేసుకున్నారు. అప్పుడు మళ్లీ నేను ఆయన్ని ఇంటర్వ్యూ చేశాను. పట్నాయక్: ‘‘బీజేపీతో తెగతెంపులు చేసుకోవటం తప్పనిసరి అయింది. ఎందుకంటే, నా రాష్ట్రానికి వారినిక ఏమాత్రంగానైనా ఆరోగ్యకరమని నేను పరిగణించటం లేదు. కొంధమాల్ తర్వాత అది ప్రతి ఒక్కరికీ స్పష్టమై ఉంటుందని అనుకుంటున్నాను.’’ థాపర్: ‘‘కొంధమాల్ తర్వాత ఎలాంటి పరిస్థితుల్లోనూ బీజేపీతో కొనసాగలేమని మీరు చెబుతున్నారా?’’ పట్నాయక్ : ‘‘కొనసాగటం చాలా చాలా కష్టంగా మారింది.’’ థాపర్: ‘‘అంటే కొంధమాల్ ఒక విధంగా మీ పొత్తు విచ్ఛిత్తికి కారణం అయిందనేనా?’’ పట్నాయక్ : ‘‘నిజానికి, అంతే.’’ (ఈ సంభాషణ మరింతగా ముందుకు సాగింది. చెప్పాలంటే, అలా జరగాలన్న ఆసక్తి ఆయనలో కనిపించింది.) థాపర్: కొంధమాల్ ఘటనలతో పట్టణ ప్రాంత మధ్య తరగతి ప్రజలు మిమ్మల్ని నరేంద్ర మోదీతో పోల్చడం ప్రారంభించారు. కొంతమంది మిమ్మల్ని రెండవ నరేంద్ర మోదీ అని కూడా అన్నారు. అది మిమ్మల్ని కలవరపరిచిందా? నొప్పించింది కూడానా?’’ పట్నాయక్: ‘‘నన్ను నేను ఎప్పుడూ కూడా వ్యక్తిగతంగా అలా చూసుకోలేదు. నేను ఎల్లవేళలా లౌకికవాద ధోరణిలోనే ఆలోచిస్తాను. నాది పూర్తిగా లౌకికవాద నేపథ్యం. కనుక నేను దానిని నాపై వచ్చిన సరైన ఆరోపణగా ఏనాడూ పరిగణించలేదు.’’ థాపర్: ‘‘దానర్థం... నరేంద్ర మోదీతో పోల్చడం మిమ్మల్ని బాగా గాయపరచేదిగా ఉండి ఉండాలి.’’ పట్నాయక్: ‘‘నా మీద అలాంటి ఆరోపణ వస్తుందని నేను అస్సలు నమ్మలేకపోయాను.’’ (కొంధమాల్ తర్వాత పట్నాయక్ బీజేపీని ఎలా చూశారన్నది స్పష్టం అయింది. అయితే ఆయన చెప్పాలనుకున్నది ఇంకా ఉండింది. అక్కడితో ముగించలేదు.) థాపర్: ‘‘కొంధమాల్ తర్వాత నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు మీ శరీరంలోని ప్రతి అస్థికా మత రహితమైనదేనని మీరు చెప్పారు. అది నిజమేనని... మీరిప్పుడు బీజేపీతో తెగతెంపులు చేసుకోవటమన్నది రుజువు చేస్తోందని మీరు చెప్పగలరా?’’ పట్నాయక్: ‘‘మీరేమనుకుంటున్నారు కరణ్? నేనేమిటో మీకు ఎప్పటి నుండో తెలుసు.’’ థాపర్: ‘‘అది నిజమేనని రుజువు చేస్తోందని నేను చెప్పగలను.’’ పట్నాయక్: ‘‘థ్యాంక్యూ.’’ (మరొక ప్రశ్న అడగవలసిన అవసరం ఉందని నా ప్రవృత్తి చెప్పింది. అది ఆయనపై ముష్టిఘాతాన్ని విసిరింది.) థాపర్: ‘‘ఆ పని (బీజేపీతో తెగతెంపులు) మీరు మనస్ఫూర్తిగా చేసినదే కదా?’’ పట్నాయక్: ‘‘చివరికొచ్చేటప్పటికి ఎవరి నమ్మకాలపై వారు నిలబడతారు. కాదా చెప్పండి? ఎవరి నమ్మకాలపై వారు నిలబడి తీరాలి కూడా.’’ (అయిపోయింది – స్పష్టంగా, క్లుప్తంగా, నిశ్చయంగా పట్నా యక్ తనేమిటో చెప్పేశారు. ఆయన నమ్మకాలు తమను తాము పునరుద్ఘాటించుకున్నాయి. పాత పట్నాయక్ ప్రత్యక్షమయ్యారు. బీజేపీతో జతపడి ఉండటం అన్నదిక చరిత్రే.) థాపర్: ‘‘తను నమ్మిన సిద్ధాంతాలపై నిలబడేందుకు నవీన్ పట్నాయక్‌కు తొమ్మిదేళ్లు పట్టిందని చాలామంది అంటారు. మిమ్మల్ని బాగా ఎరిగిన వారికి మీరు లౌకికవాదులు, ఉదారవాదులు, నవీ నులు. నిజంగా మీరు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారంటే, ఆ పొత్తు దీర్ఘకాలం సాగిందంటే వారికి ఆశ్చర్యంగా ఉంటుంది. మీ నమ్మికలు ఏమిటో మీరు కనుగొనడానికి ఎందుకు మీకంత ఎక్కువ సమయం పట్టింది?’’ పట్నాయక్: ‘‘గత పన్నెండేళ్లలో బీజేపీకి అనేక లౌకికవాద పక్షాల పొత్తు ఉండటం మీరు చూసే ఉంటారు. మమతా బెనర్జీ లేదా హెగ్డే లేదా ఫరూఖ్ అబ్దుల్లా, చివరికి జార్జిఫెర్నాండెజ్, నితిశ్‌కుమార్. అనేక మిత్ర పక్షాలూ ఉండేవి. అంతేకాదు, ఒడిశాలో మన అదృష్టవశాత్తూ మొదటి ఎనిమిదేళ్లలో ఎలాంటి మతపరమైన సంఘటనలూ జరగ లేదు. కొంధమాల్ జరగనంత వరకు మొత్తంగా పరిస్థితే మారలేదు.’’ ప్రస్తుతం ఒకే ఒక ప్రశ్న మిగిలింది. పరిస్థితి ఏం మారింది? బీజేపీతో తెగతెంపులు చేసుకుని, ఆ తర్వాత బాగా పని చేసిన పట్నాయక్ తిరిగి ఇప్పుడు వారి ఆలింగనం కోసం ఎందుకు వెనక్కు నడవాలని తపిస్తున్నారు? వారి అవసరం లేకుండానే ఆయన మళ్లీ గెలుస్తారు కదా!అయితే విషయం అది కాదు. ఆయన తెగతెంపులు చేసుకున్న బీజేపీ ఎల్.కె. అద్వానీ నేతృత్వం లోనిది. ఆయనిప్పుడు తిరిగి వెళ్ళాలని చూస్తున్నది నరేంద్ర మోదీ సారథ్యం లోనిది. నేను మరింతగా చెప్పాల్సిన అవసరం ఉందంటారా? పట్నాయక్ మళ్లీ బీజేపీతో ఎందుకు పొత్తు కుదుర్చుకోవాలని అనుకున్నారో నాకెప్పటికైనా తెలుస్తుందా అని నా సందేహం. కానీ తను యూ–టర్న్ తీసుకోవటాన్ని ఆయన ఎలా సమర్థించుకుంటారో తెలుసుకోవాలన్న ఆసక్తి నాకు ఉంది. ఈలోగా మీదైన అభిప్రాయా లకు మీరు వచ్చేందుకు మిమ్మల్ని వదిలేస్తాను. బహుశా మీలోకొందరు... మీరూ నాలాగే ఊహించారని భావించే అవకాశం ఉంది. - వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ - కరణ్ థాపర్ -
Odisha: ఎన్నికల వేళ ‘బీజేడీ’కి గట్టి దెబ్బ
భువనేశ్వర్: అసెంబ్లీ,లోక్‌సభ ఎన్నికలు జరగనున్న వేళ ఒడిషాలో అధికార బీజేడీకి గట్టి దెబ్బ తగిలింది. సీనియర్ నేత, ఆరుసార్లు ఎంపీ భర్తృహరి మెహతాబ్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి, బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్‌కు రాజీనామా లేఖ పంపినట్లు తెలిపారు. అవినీతిపై పోరాటంలో పార్టీకి కమిట్మెంట్ లేనందునే తాను రాజీనామా చేయాల్సి వచ్చిందని మెహతాబ్ వెల్లడించారు. అవినీతిపై పోరకు తాను ఇచ్చిన సలహాలు సూచనలకు పార్టీ నుంచి ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి దానికి ఓపిక ఉంటుందని, ఇప్పుడది నశించిందని అందుకే పార్టీని వీడుతున్నట్లు తెలిపారు. పార్టీని వీడినప్పటికీ అవినీతిపై తన పోరాటం కొనసాగిస్తానన్నారు. ప్రస్తుతం కటక్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న భర్తృహరి మెహతాబ్ ఒడిషా తొలి ముఖ్యమంత్రి హరేకృష్ణ మెహతాబ్ కుమారుడు. కాగా, ఈ ఎన్నికల్లో బీజేడీ, బీజేపీ పొత్తు ప్రయత్నాలు ఫలించకపోవడంతో బీజేడీ ఒంటరిగానే పోటీ చేస్తోంది. ఇదీ చదవండి.. లోక్‌సభ బరిలో లాలూ ఇద్దరు కుమార్తెలు -
బీజేడీకి షాక్.. రాజీనామా చేసిన సీనియర్ నేత
సీనియర్ బీజేడీ ఎంపీ 'భర్త్రుహరి మహ్తబ్' (Bhartruhari Mahtab) శుక్రవారం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కటక్ లోక్‌సభ నియోజకవర్గానికి వరుసగా ఆరు పర్యాయాలు ప్రాతినిధ్యం వహించిన మహ్తబ్, ఈరోజు సాయంత్రం 4 గంటలకు రాజీనామా లేఖను బీజేడీ అధ్యక్షుడు.. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు పంపినట్లు పేర్కొన్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న తరుణంలో భర్త్రుహరి మహ్తబ్ తీసుకున్న నిర్ణయం నవీన్ పట్నాయక్ సర్కారుకు పెద్ద షాకిచ్చింది. ఇటీవల ఒడిశాలో అరిందమ్ రాయ్ బీజేడీకి గుడ్‌బై చెప్పి బీజేపీ పార్టీలో చేరిన తరువాత.. మహ్తబ్ బీజేడీ పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీ, బీజేడీల మధ్య పొత్తు కుదరకపోవడంతో.. ఒడిశాలో వచ్చే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ స్వతంత్రంగా పోటీ చేస్తుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మన్మోహన్ సమాల్ ప్రకటించారు. గత కొన్ని రోజులుగా అధికార బీజేడీ.. ప్రతిపక్ష బీజేపీ మధ్య ఎన్నికలకు ముందు పొత్తుపై చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి రెండు పార్టీలో ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు స్పష్టమవుతోంది. -
ఒడిశాలో ఒంటరిగానే పోటీ: బీజేపీ
భువనేశ్వర్: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఒడిశా రాష్ట్రంలో ఒంటరిగానే పోటీ చేసేందుకు బీజేపీ సిద్ధమైంది. అధికార బిజూ జనతాదళ్‌తో పొత్తు లేకుండానే.. రాష్ట్రంలో స్వతహాగా పోటీ చేయనున్నట్లు బీజేపీ శుక్రవారం ప్రకటించింది. ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగనున్నట్లు రాష్ట్ర పార్టీ చీఫ్ మన్మోహన్ సమాల్ వెల్లడించారు. ‘గత 10 సంవత్సరాలుగా నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీ జాతీయ ప్రాముఖ్యత కలిగిన అనేక విషయాలలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తోంది. ఇందుకు మేము ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కానే నేడు కేంద్రం ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాలు ఒడిశాలో సామాన్యులకు చేరడం లేదు. దీని కారణంగా రాష్ట్ర ప్రజలు కేంద్ర ప్రయోజనాలను పొందడం లేదు. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లో ఒడిశాలో బీజేడీ పొత్తు పెట్టుకోకూడదని బీజేపీ నిర్ణయించింది. ‘ఒడిశాలో 21 లోక్‌సభ, 147 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఒంటరిగా పోరాడబోతుంది. ప్రధాని మోదీ నాయకత్వంలో నాలుగున్నర కోట్ల ఓడిశా ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు బీజేపీ సిద్ధమైంది’ అని సమాల్ ట్విటర్లో పేర్కొన్నారు. కాగా పట్నాయక్ పార్టీతో పొత్తు బీజేపీ ప్రయోజనాలకు విరుద్ధమని ఒడిశా రాష్ట్ర నేతలు ఢిల్లీలో పార్టీ పెద్దలతో సమావేశమైన అనంతరం ఈ పరిణామం చోటుచేసుకుంది. కాగా ఒడిశాలో లోక్‌సభ అసెంబ్లీ ఎన్నికలకు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సారథ్యంలోని బీజేడీతో బీజేపీ పొత్తు పెట్టుకోబోతుందంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. పాత మిత్రులు ఒక్కటయ్యారని, 11 సంవత్సరాల తర్వాత బీజేడీ, బీజేపీ మళ్లీ లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీచేయబోతున్నాయంటూ ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలోని 21 లోక్‌సభ స్థానాల్లో బీజేడీ 13, బీజేపీ 8 చోట్ల పోటీ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో పొత్తుపై బీజేపీ తాజాగా క్లారిటీ ఇచ్చింది. ఒంటరిగానే పోటీకి దిగనున్నట్లు స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా రాష్ట్రంలో బీజేడీ, బీజేపీలు మొదటిసారిగా 1998 ఎన్నికల్లో కలిసి పోటీచేశారు. 11 ఏళ్ల కొనసాగిన ఇరు పార్టీల స్నేహానికి బ్రేక్ పడింది. 2009 ఎన్నికలలో బీజేపీ అధిష్ఠానం ఒటరిగా పోటీచేసింది. దీంతో ఎన్డీఏ నుంచి బీజేడీ బయటకు వచ్చేసింది.. అయినప్పటికీ కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వానికి గత పదేళ్లుగా బీజేపీ మద్దతు తెలుపుతూనే ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీకి 8 మంది ఎంపీలు, 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. చదవండి: అరెస్టు తర్వాత 'కేజ్రీవాల్' ఫస్ట్ రియాక్షన్ ఇదే.. -
ఒడిశా అధికార పార్టీ బీజేడీకి ఎదురు దెబ్బ
సాక్షి, భువనేశ్వర్ : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఒడిశా అధికార పార్టీ బిజూ జనతాదళ్ (బీజేడీ)కి ఎదురు దెబ్బ తగిలింది. ప్రముఖ ఒడియా నటుడు, బీజేడీ నేత అరిందమ్ రాయ్ బీజేపీలో చేరారు. ‘బీజేడీలో ఉన్నప్పుడు నేను సీఎం నవీన్ పట్నాయక్‌ను కలవడానికి చాలాసార్లు ప్రయత్నించాను. అయితే, పార్టీ రాజకీయాల కారణంగా నేను సీఎంను కలిసే అవకాశం పొందలేకపోయాను. ప్రధాని నరేంద్రమోదీ స్ఫూర్తితో బీజేపీలో చేరానని, రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానంటూ పార్టీ మారడానికి గల కారణాల్ని వెల్లడించారు. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం చుబా అవో ఒడిశా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నవీన్ పట్నాయక్ తన పరిపాలనలో.. కేంద్ర ప్రభుత్వ పథకాలను తామే ప్రవేశ పెట్టినట్లు ప్రజల్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు. దేశ అభివృద్ది కోసం ప్రధాని మోదీ చేస్తున్న కృషి అమోఘం అన్న ఆయన..ఈ సారి ఎన్నికల్లో బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందని ధీమా వ్యక్తం చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఒడిశాలో 21 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికలలో బిజూ జనతాదళ్ (బీజేడీ) అత్యధిక స్థానాలను గెలుచుకుంది. బీజేపీ, కాంగ్రెస్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. బీజేడీ 12 స్థానాల్లో గెలుపొందగా, బీజేపీ 8 స్థానాలతో రెండో స్థానంలో నిలవగా, కాంగ్రెస్ ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో 147 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికలతో పాటు ఏకకాలంలో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడీ 113 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ 23 స్థానాల్లో రెండో స్థానంలో నిలవగా, కాంగ్రెస్ 9, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) 1, స్వతంత్ర అభ్యర్థి మరో సీటుతో రెండో స్థానంలో నిలిచారు. -
పొత్తు లేనట్లే.. బీజేపీ తేల్చేసిందా?
సాక్షి, భువనేశ్వర్ : బీజేపీ - బీజేడీల మధ్య ఇక పొత్తు లేనట్లేనని తెలుస్తోంది. ఈ సారి లోక్‌సభ ఎన్నికలకు 15 ఏళ్ల తర్వాత పాత మిత్రులు మళ్లీ ఒక్కటవ్వనున్నారని అందరూ అనుకున్నారు. కానీ తాజా రాజకీయ పరిణామాలు అందుకు తావు ఇవ్వడం లేదని సమాచారం. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఒడిశా రాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం ప్రధాని మోదీ ఒడిశాలో పర్యటించారు. ఆ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేడీ అధినేత, ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్‌లు మంతనాలు జరిపారు. అనంతరం 15 ఏళ్ల తర్వాత బీజేపీతో జతకట్టేలా సంకేతాలిచ్చారు. అమిత్ షా తో సుదీర్ఘంగా చర్చలు ఇందులో భాగంగా పొత్తు పెట్టుకుని లోక్‌సభ ఎన్నికల బరిలో దిగేలా ఇరు పార్టీల అగ్రనేతలు చర్చలు జరిపారు. అయితే, సీట్ల పంపకాల్లో విభేదాలు తలెత్తడంతో.. బీజేపీ ఒంటరిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తుందంటూ ఒడిశా బీజేపీ అధ్యక్షుడు మన్మోహన్ సామల్ ప్రకటించారు. పొత్తుపై చర్చించేందుకు అధిష్టానం పిలుపుతో ఢిల్లీకి వెళ్లిన మన్మోహన్ సాముల్.. కేంద్రమంత్రి అమిత్ షాతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. చర్చల అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పొత్తులపై మన్మోహన్ సాముల్ మాట్లాడుతూ.. ‘మా జాతీయ అధ్యక్షుడు, పార్లమెంటరీ పార్టీ ఏది చెబితే అది తుది నిర్ణయం’ అని అన్నారు. సీనియర్ నేతలతో సీఎం భేటీ ఆ తర్వాతే ఒడిశాలో బీజేపీ సొంతంగా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందంటూ ఎక్స్.కామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు. కొద్ది సేపటికే ఆ పోస్ట్‌ను డిలీట్ చేశారు. మరోవైపు బీజేడీ పార్టీ అధ్యక్షుడు, సీఎం నవీన్ పట్నాయక్ తన నివాసంలో పార్టీ సీనియర్ నేతల సమావేశాన్ని నిర్వహించారు. ఇలా వరుస పరిణామాలతో ఒడిశా రాష్ట్ర రాజకీయాలు రసకందాయంగా మారాయి. పోలింగ్‌కు సమయం ఉంది కాబట్టి పొత్తులపై బీజేపీ- బీజేడీలు చర్చలు జరుపుతుంటే.. ఇరు పార్టీల నేతలు మాత్రం ఎప్పుడు ఏం జరుగుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తుండడం గమనార్హం. -
‘మేం ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవడం లేదు.. ఒంటరిపోరే’ : బీజేపీ
భువనేశ్వర్ : ‘మేం ఎవరితో పొత్తు పెట్టుకోవడం లేదు. 147 అసెంబ్లీ, 21 లోక్ సభ స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం’ అంటూ ఒడిశా రాష్ట్ర బీజేపీ అధికారంగా ప్రకటించింది. త్వరలో జరగనున్న పార్లమెంట్, అంసెబ్లీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఆయా పలు పార్టీలు పొత్తులు కుదుర్చుకుంటున్నాయి. సీట్లను పంచుకుంటున్నాయి. ఈ తరుణంలో ఒడిశా అధికార పార్టీ బిజు జనతా దళ్ - బీజేపీల మధ్య పొత్తు ఉంటుందంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతూ వస్తుంది. ఆ ప్రచారంపై ఒడిశా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మన్మోహన్ సమాల్ స్పందించారు. ఎన్నికల నేపథ్యంలో అధిష్టానం పిలుపు మేరకు ఢిల్లీ వెళ్లారు. అనంతరం, రాష్ట్రానికి వచ్చిన ఆయన ఎన్నికల గురించి మాట్లాడారు. కేంద్రం పెద్దలతో జరిగిన సమావేశంలో ఒడిసా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా చర్చించామే తప్పా అలయన్స్ గురించి, లేదంటే సీట్ల పంపకం గురించి ప్రస్తావించ లేదని అన్నారు. #BJP will fight alone in both #LokSabha and #Odisha assembly polls: State BJP president Manmohan Samal Does that mean talks derailed ? pic.twitter.com/4N7qxH4jDA — Indrajit Kundu | ইন্দ্রজিৎ (@iindrojit) March 8, 2024 అంతేకాదు రాష్ట్రంలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా సొంతంగా గెలిచి సామర్ధ్యం ఉందని స్పష్టం చేశారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు లేకుండా ఒంటరిగానే బరిలోకి దిగుతుందని వెల్లడించారు. కుదరని సయోధ్య పలు జాతీయ మీడియా కథనాల ప్రకారం.. బీజేపీ-బీజేడీల మధ్య సీట్ల పంపకంలో సయోధ్య కుదలేదని తెలిపాయి. ఎన్నికలకు ముందు పొత్తుకు ఇరు పార్టీలు పరస్పరం అంగీకరించినప్పటికీ సీట్ల పంపకంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఒడిశా రాష్ట్రంలో మొత్తం 147 అసెంబ్లీ స్థానాలు ఉండగా..అందులో 100 సీట్లకు పైగా పోటీ చేయాలని అధికార పార్టీ బీజేడీ ప్రయత్నించగా, అందుకు బీజేపీ ఒప్పుకోలేదు. రాష్ట్ర బీజేపీకే తీవ్ర నష్టం ప్రస్తుతం అధికార బీజేడీ 114 అసెంబ్లీ స్థానాలకు ప్రాతినిధ్య వహిస్తుంది. ఈ సారి ఎన్నికల్లో బీజేపీతో పొత్తుకు అంగీకరించిన బీజేడీ మొత్తం 112 సీట్లలో పోటీ చేసేందుకు సిద్ధమైంది. అందుకు కమలం నేతలు అంగీకరించలేదు. ‘బీజేడీ మాకు ఆమోదయోగ్యం కాని విధంగా 75 శాతం అసెంబ్లీ సీట్లను డిమాండ్ చేస్తోంది. అధికార పార్టీ నిర్ణయం మా పార్టీ భవిష్యత్‌పై తీవ్ర ప్రతి కూల ప్రభావం చూపుతుందని’ రాష్ట్ర బీజేపీ సీనియర్ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ప్రతిపాదన తిరస్కరించిన బీజేడీ మరోవైపు, పొత్తులో భాగంగా ఒడిశాలోని 21 లోక్‌సభ స్థానాల్లో 14 స్థానాల్లో పోటీ చేసేందుకు బీజేపీ.. బీజేడీతో చర్చలు జరిపింది. అందుకు బీజేడీ తిరస్కరించింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేడీ 12 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 8 సీట్లు గెలుచుకుంది. ఢిల్లీలో మూడు రోజుల మకాం ఒడిశా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మన్మోహన్ సమాల్ నేతృత్వంలోని ఒడిశా బీజేపీ నేతలు మూడు రోజుల పాటు ఢిల్లీలో మకాం వేశారు. రాష్ట్ర ఎన్నికల ఇంచార్జి, రాజ్యసభ ఎంపీ విజయ్ పాల్ సింగ్ తోమర్ నివాసంలో పలువురు కేంద్ర నేతలతో వరుస సమావేశాలు నిర్వహించారు. రెండు రోజుల క్రితం, మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ జుయల్ ఓరమ్, తోమర్ నివాసంలో జరిగిన సమావేశానికి హాజరైన తర్వాత, బీజేడీతో పొత్తుపై చర్చ జరిగిందని, అయితే ఏమీ ఖరారు కాలేదని తేలింది. మోదీ పర్యటనతో మారిన రాజకీయం ఒడిశా బీజేపీ నాయకులు బీజేడీతో పొత్తును వ్యతిరేకిస్తున్నప్పటికీ మార్చి 5న ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాన్ని సందర్శించిన తర్వాత రాష్ట్ర రాజకీయం పూర్తిగా మారిపోయింది. మోదీ పర్యటన అనంతరం అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పొత్తు చర్చలు జరిగాయి. అదే సమయంలో రాష్ట్ర, ప్రజల ప్రయోజనం కోసం పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నామని బీజేడీ సూచించింది. 11ఏళ్ల పొత్తులో గతంలో ఒడిశాలో బీజేపీ-బీజేడీలు (1998 - 2009) సుమారు 11 ఏళ్ల పాటు పొత్తులో ఉన్నాయి. మూడు లోక్‌సభ, రెండు అసెంబ్లీ ఎన్నికలలో కలిసి ఎన్నికల బరిలోకి దిగాయి. 1998లో జనతాదళ్ విడిపోయినప్పుడు, పట్నాయక్ తన సొంత పార్టీని స్థాపించి, ఉక్కు, గనుల మంత్రిగా వాజ్‌పేయి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో చేరారు. 2000లో తొలిసారి 2000లో తొలిసారి, 2004లో రెండు పార్టీలు కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశాయి. అంతకుముందు బీజేడీ, బీజేపీల మధ్య సీట్ల షేరింగ్ రేషియో 4:3గా ఉంది. బీజేడీ 84 అసెంబ్లీ, 12 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయగా, బీజేపీ 63 అసెంబ్లీ, 9 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసింది. 1998 సార్వత్రిక ఎన్నికల్లో 48.7 శాతం ఓట్లతో 21 సీట్లలో 17 స్థానాలను కూటమి గెలుచుకుంది. కూటమి మళ్లీ 1999లో 19 స్థానాలకు మెరుగైంది. ఇది 2004లో 18కి కొద్దిగా తగ్గింది. మళ్లీ ఇప్పుడు బీజేడీ- బీజేపీల మధ్య పొత్తు అంశం తెరపైకి వచ్చింది. -
నాడు తండ్రి బహిష్కరణ.. నేడు కొడుక్కి ఘన స్వాగతం!
ఒడిశా రాజకీయాలలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ నేత, 24 సంవత్సరాల క్రితం బీజేడీ నుంచి బహిష్కరణకు గురైన బిజోయ్ మహపాత్ర కుమారుడు అరబింద మహపాత్ర అదే బీజేడీలో చేరారు. ఆయన్ను బీజేడీ అధ్యక్షుడు, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పార్టీలోకి స్వాగతించారు. సీఎం నవీన్ పట్నాయక్ నివాసంలో అరబింద మహాపాత్ర పార్టీలో చేరారు. అరబిందను ఆత్మీయంగా పార్టీలోకిక ఆహ్వానించిన నవీన్ పట్నాయక్.. కేంద్రంపద జిల్లాలో పార్టీ మరింత బలోపేతం కోసం కృషి చేయాలని కోరారు. "మేము మిమ్మల్ని బీజేడీలోకి స్వాగతిస్తున్నాము. కేంద్రపద జిల్లా కోసం కష్టపడి పని చేయండి. మీకు నా ఆశీస్సులు ఉన్నాయి. అలాగే మీ తండ్రికి కూడా ధన్యవాదాలు" అని పట్నాయక్ అన్నారు. ఒడిశాలో అధికార బిజూ జనతాదళ్, బీజేపీ ఇటీవల విడివిడిగా సమావేశాలు నిర్వహించిన రెండు పార్టీల సీనియర్ నేతలతో పొత్తు ఖరారు చేసుకునే దశలో ఉన్నాయనే సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. 1980 నుంచి 2000 మధ్య కాలంలో పట్కురా నుండి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన బిజోయ్, ప్రస్తుత ముఖ్యమంత్రి తండ్రి, మాజీ సీఎం బిజూ పట్నాయక్‌కు నమ్మకస్తుడిగా పేరుగాంచారు. 1997 ఏప్రిల్ 17న బిజూ పట్నాయక్ మరణించిన తర్వాత బీజేడీ ఏర్పాటులో, బిజూ చిన్న కుమారుడు నవీన్ పట్నాయక్ నాయకత్వం వహించడంలో బిజోయ్ కీలకపాత్ర పోషించారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీకి కూడా ఆయన నాయకత్వం వహించారు. అయితే ఆ తర్వాత నవీన్ పట్నాయక్ చాలా నిర్ణయాలను బిజోయ్ వ్యతిరేకించారు. ఇదే బీజేడీ నుంచి నిష్క్రమించడానికి కారణమని చాలా మంది నమ్ముతారు. తరువాత 2001లో బిజోయ్ ఒడిషా గణ పరిషత్‌ను స్థాపించారు. అది తరువాత ఎన్సీపీలో విలీనమైంది. ఆ తర్వాత బిజోయ్ మహపాత్ర బీజేపీలో చేరారు. ఒడిశాలో 21 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేడీకి అత్యధిక సీట్లు వచ్చాయి. బీజేడీ 12, బీజేపీ 8, కాంగ్రెస్ ఒక సీటు గెలుచుకున్నాయి. -
బీజేపీ, బీజేడీ పొత్తు!.. ప్రజల ప్రయోజనాలే లక్ష్యం: దేబి ప్రసాద్ మిశ్రా
లోక్‌సభ ఎన్నికలకు ముందు బిజూ జనతా దళ్ (బీజేడీ) బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మధ్య పొత్తు గురించి ఢిల్లీ, ఒడిశా రాజకీయ వర్గాల్లో భారీగా ఊహాగానాలు చెలరేగుతున్న నేపథ్యంలో.. బీజేడీ వైస్ ప్రెసిడెంట్ 'దేబి ప్రసాద్ మిశ్రా' పార్టీ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తుందని వ్యాఖ్యానించారు. ఒడిశా ప్రజల ప్రయోజనాలకు ఏది ఉపయోగపడుతుందో అది మా మార్గదర్శక సూత్రమని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ఇతర సీనియర్ బీజేడీ నాయకులు రాబోయే ఎన్నికలపై చర్చించడానికి త్వరలోనే సమావేశమవుతారని, ఇందులో ఒడిశా అభివృద్ధికి కావలసిన నిర్ణయాలు తీసుకుంటారని మిశ్రా వ్యాఖ్యానించారు. బీజేపీ, బీజేడీ మధ్య చర్చలు తుది దశకు చేరుకున్నాయని అన్నారు. సీట్ల పంపకాలపైన తాత్కాలిక ఒప్పందం జరిగిందని, ఈ విషయం మీద త్వరలోనే అధికారికి ప్రకటన వెలువడుతుందని సమాచారం. బీజేపీ, బీజేడీ నాయకుల సమావేశం ఓ ముఖ్యమైన పరిణామాన్ని సూచిస్తోందని.. ఎన్డీఏ నుంచి విడిపోయిన 15 సంవత్సరాల తరువాత మళ్ళీ బీజేడీ కూటమిలో కలవనున్నట్లు పరిస్థితులు చెబుతున్నాయి. 2009లో సీట్ల పంపకాల మీద కొన్ని విభేదాలు వచ్చినప్పటికీ.. ఇకపైన రెండు పార్టీలకు అనుకూలంగా ఉండే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. -
బీజేడీకి షాక్.. రాజీనామా చేసిన సీనియర్ ఎమ్మెల్యే
భువనేశ్వర్: పార్లమెంట్ ఎన్నికలు, ఒడిశాలో అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బిజూ జనతా దళ్(బీజేడీ) నేతలు ఆ పార్టీకి షాక్ ఇస్తున్నారు. తాజాగా ఐదుసార్లు ఎమ్మెల్యే అయిన అరబింద ధాలి శనివారం అధికార బీజేడీ పార్టీకి రాజీనామా చేశారు. అయిన బీజేపీ చేరనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అరబింద ధాలి కోరాధా జిల్లాలోని జయదేవ్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు. ధాలి తన రాజీనామా పత్రాన్ని బీజేడీ అధ్యక్షుడు, సీఎం నవీన్ పట్నాయక్‌కు ఇ-మెయిల్ ద్వారా పంపారు. అయితే ఆయన రాజీనామా చేయడానికి గల కారణాలను వెల్లడించలేదు. ధాలి మొదటిసారి 1992లో బీజేపీ టికెట్‌పై మల్కాక్గిరి ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం రెండు పర్యాయాలు ఆ స్థానంలోనే ధాలి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తర్వాత ధాలి బీజేడీలో చేరారు. 2009లో ఆయన జయదేవ్ నియోజకవర్గంలో విజయం సాధించారు. గత 2019లో కూడా ఇదే నియోజకవర్గంలో బీజేడీ టికెట్‌పై ఎమ్మెల్యేగా గెలుపొందారు. నవీన్ పట్నాయక్ కేబినెట్లో ధాలి.. ట్రాన్స్‌పోర్టు మంత్రిగా పనిచేశారు. గత నెల.. బీజేడీ నుంచి బహిష్కరణకు గురైన ఇద్దరు ఎమ్మెల్యేలు పాణిగ్రాహి, ప్రశాంత్ జగదేవ్ ప్రతిపక్ష బీజేపీలో చేరారు. మాజీ రాష్ట్ర మంత్రి దేబాసిస్ నాయక్ సైతం ఇటీవల బీజేడీ నుంచి పార్టీ మారారు. ఒడిశాలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నేతల రాజీనామాలు బీజేడీకి తలనొప్పిగా మారింది. -
సీఎం నవీన్ పట్నాయక్ ప్రైవేటు సెక్రటరీకి.. కేబినెట్ హోదా
భువనేశ్వర్: ఐఏఎస్ అధికారి, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు ప్రైవేటు సెక్రటరీగా పనిచేస్తున్న వీకే పాండియాన్ ప్రభుత్వ సర్వీసు నుంచి స్వచ్ఛంద విరమణ తీసుకున్నారు. సీఎం పట్నాయక్‌కు సన్నిహితుడిగా పాండియన్ పేరు తెచ్చుకున్నారు. అయితే అధికార పార్టీ ప్రయోజనాల కోసం తన ప్రభుత్వ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడంతో ఇటీవల తరుచూ వివాదాల్లో చిక్కుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేసిన పాండియన్.. ప్రజా ఫిర్యాదులను స్వీకరించడానికి 190 సమావేశాలు నిర్వహించారు. దీంతో తన ఐఏఎస్ పదవికి రాజీనామా చేసి అధికారికంగా బీజేడీ పార్టీలో చేరి రాజకీయాలు చేసుకుంటే సరిపోతుందని విమర్శలు గుప్పించాయి పాండియన్ రాజీనామా కాంగ్రెస్‌కే మేలు సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సలుజా పాండియన్ స్వచ్ఛంద విరమణ నిర్ణయాన్ని స్వాగతించారు. ఈ పని ఇంతకముందే చేయాల్సి ఉండేదని, ఆలస్యం చేశారని పేర్కొన్నారు. ఆయన రాజకీయాల్లోకి వస్తారో లేక తిరిగి సొంత రాష్ట్రానికి వస్తారో తెలియదని.. అయితే బీజేడీలో చేరితే మాత్రం ప్రతిపక్షాలకు ముఖ్యంగా కాంగ్రెస్‌కు ఎంతో సహాయం చేసిన వారవుతారని అన్నారు. రాజకీయాల కోసమే రాజీనామా తన రాజకీయ జీవితంలోకి అడుగుపెట్టేందుకే పాండియన్ రాజీనామా చేసినట్లు బీజేపీ చీఫ్ విప్ మోహన్ మాఝీ మండిపడ్డారు. ఇప్పుడు తాను బ్యూరోక్రాట్ ముసుగుతో కాకుండా బహిరంగంగా రాజకీయాలు చేయగలడని, ఒడిశా ప్రజలు అతన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించరని తెలిపారు. కాగా తమిళనాడుకు చెందిన పాండియన్ ఒడిశా కేడర్‌కు చెందిన 2000 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. స్వచ్ఛంద పదవీ విరమణ కొరుతూ పాండియన్ ఒడిశా ప్రభుత్వానికి లేఖ రాయగా.. సర్కార్ ఆమోదం తెలిపింది. కేబినెట్ ర్యాంకు హోదా స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఒకరోజు తర్వాత మాజీ ఐఏఎస్ అధికారి వీకే పాండియన్‌కు ఒడిశా ప్రభుత్వం కేబినెట్ మంత్రి హోదా కల్పిస్తూ నిర్ణయం తీసుకుంఇ 5టీ(ట్రాన్స్ఫౄర్మేషనల్ ఇనిషియేటివ్), ‘నబిన్ ఒడిశా’ పథకానికి చైర్మన్‌గా నియమించింది. ఈ మేరకు ఒడిశా జనరల్ అడ్మినిష్ట్రేషన్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్ డిపార్ట్మెంట్ ఉత్తర్వుల్లో పేర్కొంది పకల్పించినట్లుద సమాచారం. దీంతో పాండియన్ నేరుగా ముఖ్యమంత్రి కింద పని చేయనున్నారు. -
గత ఎన్నికల్లో పార్టీ ఓటమి.. అక్కడి నుంచే పోటీలోకి బిహార్ సీఎం
భువనేశ్వర్: బిజూ జనతా దళ్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పూరీ నుంచి పోటీ చేస్తారని పలు వర్గాల నుంచి ప్రచారం ఊపందుకుంది. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈసారి కొత్త నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలపై పలు వర్గాల్లో చర్చ సాగుతోంది. గత ఎన్నికల్లో పూరీ శాసనసభ స్థానం బీజేడీ చేజార్చుకుంది. ఈ వ్యవధిలో ఈ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఉనికిని బలపరచుకుంది. ఈ పరిస్థితుల్లో బిజూ జనతా దళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ పూరీ నియోజకవర్గం నుంచి సత్తా చాటుకోవాలనే సవాళ్లు తలెత్తాయి. ఈ చర్చ రాజకీయ శిబిరాల్లో వాడివేడిగా సాగుతోంది. పూరీ నుంచి నవీన్ రంగంలోకి దిగితే బీజేపీ, బీజేడీ మధ్య హోరాహోరీ పోటీ శాసనసభ ఎన్నికల ఘట్టాన్ని రక్తి కట్టిస్తుంది. ఆయనదే తుది నిర్ణయం ఏ స్థానం నుంచి పోటీ చేయాలనేది బీజేడీ అధ్యక్షుడిగా నవీన్ పట్నాయక్‌దే తుది నిర్ణయం. అయితే చిట్ట చివరి క్షణం వరకు కీలక నిర్ణయాలను బయటకు పొక్కనీయకుండా ఆయన అత్యంత జాగ్రత్త ప్రదర్శిస్తారు. ఈసారి ముందస్తుగా ఆయన వార్తల్లోకి ఎక్కడం విశేషం. సాధారణంగా బహిరంగ చర్చలు, వ్యాఖ్యలు వగైరా వ్యవహారాల్లో నవీన్ ప్రస్తావన శూన్యం. ఆయనకు అత్యంత సన్నిహితంగా మెసలుతున్న 5టీ కార్యదర్శి వి.కె.పాండియన్ విహంగ పర్యటనల దుమారంతో ముఖ్యమంత్రి హోదాలో ప్రత్యక్షంగా హాజరై సభలో వివరణ ఇవ్వాల్సి వచ్చింది. వివాదాలకు దూరంగా ఉంటూ హుందాతనానికి మారుపేరుగా సుపరిచిత నవీన్ పట్నాయక్ ఇలా సభలో వివరణ ఇవ్వడం ప్రముఖుల దృష్టిని ఆకట్టుకుంది. వ్యూహాత్మక శైలి ముందస్తు ఎన్నికలపై చెలరేగిన దుమారం మీద పెదవి కదపని ముఖ్యమంత్రి పలు ప్రజాకర్షిత పథకాలను శరవేగంగా ప్రవేశపెట్టి విపక్షాలకు కంటి మీద కునుకు లేకుండా చేశారు. ప్రధానంగా మహిళా ఓటర్లను ఆకట్టుకునే దిశలో పలు పథకాలను చకచకా ప్రవేశ పెడుతున్నారు. మిషన్ శక్తి ఆధ్వర్యంలో సార్వత్రిక ఎన్నికలు–2024 మిషన్ విజయ బాటలో దూసుకుపోవడం తథ్యమనే సంకేతాలు బలపడుతున్నాయి. పూరీ ప్రాంతంలో ఇటీవల బీజేడీ వ్యతిరేక పవనాలు బలం పుంజుకుంటున్నాయి. ఈ పరిస్థితి విపత్తుగా పరిణమించక ముందే జాగ్రత్త వహించే దిశలో నవీన్ పట్నాయక్ అభ్యర్థిత్వాన్ని తెరపైకి తేవడం రాజకీయ వ్యూహంగా స్పష్టం అవుతుంది. పూరీ శ్రీజగన్నాథ మందిరం ప్రాకార ప్రాజెక్టు మొదలుకొని పలు పథకాలు, ప్రాజెక్టుల కార్యాచరణ తీవ్ర కలకలం రేపాయి. ఈ వివాదాలు నేటికీ చాప కింద నీరులా మరుగున పొంచి ఉన్నాయి. పూరీ నుంచి పోటీ చేయాలని ముఖ్యమంత్రికి పలు వర్గాలు అభ్యర్థిస్తున్నాయి. ప్రజారణతో శ్రీజగన్నాథుని ఆశీస్సులు తమ నాయకునికి అండగా నిలిపి ప్రతిష్టాత్మకంగా గెలిపిస్తాయని బీజేడీ శిబిరాల్లో చర్చ నడుస్తోంది. పూరీ నుంచి పోటీ ఊహాగానాలు వాస్తవ రూపం దాల్చితే సొంత పార్టీ శ్రేణులకు అతీతంగా ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బలమైన మద్దతుతో భారీ ఆధిక్యతతో గెలిపిస్తారని శ్రీజగన్నాథుని సీనియర్ సేవాయత్ రామకృష్ణ దాస్ మహాపాత్రో ఇటీవల ఒక సందర్భంలో పేర్కొన్నారు. ఈ ప్రకటన నవీన్ పట్నాయక్ పూరీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం తథ్యం అనే సంకేతాలు పంపిస్తోంది. విజయం తథ్యం ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు ఎక్కడి నుంచి పోటీ చేసినా విజయం తథ్యమని ఆ పార్టీ సీనియర్ నాయకుడు శశి భూషణ్ బెహరా శుక్రవారం అన్నారు. నవీన్ నాయకత్వంపై రాష్ట్ర ప్రజల్లో మక్కువ బలపడింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల ఆదరాభిమానాలు ఆయనను తిరుగులేని నాయకుడిగా నిలబెట్టాయి. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఆయన ఏ స్థానం నుంచి పోటీ చేసినా ప్రజలు విజయ కిరీటంతో పట్టం గడతారని పేర్కొన్నారు. రాష్ట్ర బహుముఖ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి తీసుకుంటున్న చర్యలు విశేష గుర్తింపు సాధించాయన్నారు. ఆయన నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వ పాలన విశేష ప్రజాదరణ చూరగొంది. నవీన్ సుదీర్ఘ సుస్థిర పాలన ప్రజల్లో చెక్కు చెదరని నమ్మకానికి పీఠం వేసింది. ఏటా ఆయన ప్రజాదరణ బలపడుతునే ఉందని బీజేడీ వర్గాలు ధీమా వ్యక్తం చేయడం విశేషం. -
‘థర్డ్ ఫ్రంట్‌కి ఛాన్సే లేదు.. మాది ఒంటరి పోరు’
ఢిల్లీ: బిజూ జనతా దళ్ పార్టీ చీఫ్, ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ విపక్షాలకు ఝలక్ ఇచ్చారు. 2024 ఎన్నికలకు విపక్షాలతో తన పార్టీ చేతులు కలపబోదని, ఒంటరిగానే ముందుకు వెళ్తామని ప్రకటించారు. ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్.. ఇవాళ సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. పూరిలో ఎయిర్‌పోర్ట్‌కు సంబంధించి తాను ప్రధానిని కలిశానని, అందుకు ప్రధాని కూడా సహకరిస్తానని హామీ ఇచ్చారనే విషయాన్ని ఆయన మీడియాకు తెలిపారు. అయితే.. ఎన్నికలకు ఒంటరిగా వెళ్లబోతున్నారా? అని మీడియా ప్రశ్నించగా ఆయన స్పందించారు. 2024 సార్వత్రిక ఎన్నికల కోసం బీజేడీ విపక్షాలతో కలవదు. మా పార్టీ ఎప్పుడూ ప్రణాళిక బద్దంగానే ముందుకు సాగుతుంది అని తెలిపారు. అలాగే.. తన ఢిల్లీ పర్యటనలో ఏ రాజకీయ పార్టీతోనూ భేటీ కాబోనని వెల్లడించారాయన. తనకు తెలిసినంత వరకు థర్డ్ ఫ్రంట్ అవకాశమే లేదని పేర్కొన్నారాయన. #WATCH | Delhi: There is no possibility of a Third front as far as I am concerned: Odisha CM Naveen Patnaik after his meeting with PM Narendra Modi pic.twitter.com/dRr1fxsiYm — ANI (@ANI) May 11, 2023 ఇదిలా ఉంటే.. రెండు రోజుల కిందట బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, పట్నాయక్‌తో భేటీ అయ్యారు. దీంతో పొత్తులపై భేటీ అనే ప్రచారం జరగ్గా.. పట్నాయక్ దానిని ఖండించారు. తదనంతరం ఇవాళ ఢిల్లీకి వెళ్లిన ఒడిషా సీఎం.. పలు పార్టీల నేతలతో భేటీ అవుతారనే ఊహాగానాలు తెర మీదకు వచ్చాయి. అయితే ఆ అంచనాలను పటాపంచల్ చేస్తూ అసలు విపక్షాలతో చేతులు కలపబోనని, థర్డ్ ఫ్రంట్‌కు ఆస్కారం ఉండబోదంటూ నవీన్ పట్నాయక్ వ్యాఖ్యానించడం గమనార్హం. మరోవైపు మూడో కూటమి కోసం బీహార్ సీఎం నితీశ్ కుమార్ విపరీతమైన ప్రయత్నాల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విపక్షాల నేతలను కలుస్తూ వస్తున్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ భేటీ కావడం, మరోవైపు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్.. ఇలా వరుసగా నేతల భేటీ నేపథ్యంలో విపక్షాల ఆధ్వర్యంలో మూడో కూటమికి ఆస్కారం ఉందన్న చర్చ తెర మీదకు వచ్చింది. -
Congress: ఇక కాంగ్రెస్ లేకుండానే ముందుకు..
ఢిల్లీ: దేశంలోని విపక్షాలు ఒక్కొక్కటిగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే మూడు ప్రధాన పార్టీలు హస్తం పార్టీకి దూరంగా జరగాలని నిర్ణయించుకున్నాయి. బీజేపీ-కాంగ్రెస్‌లను దొందూ దొందుగానే భావిస్తున్న విపక్షాల్లోని కొన్ని పార్టీలు.. 2024 సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్ రహిత కొత్త ఫ్రంట్‌తో వెళ్లాలని భావిస్తున్నాయి. తాజాగా.. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ భేటీ ఇదే విషయాన్ని ధృవీకరిస్తోంది కూడా. విపక్షాల్లోని మూడు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు.. టీఎంసీ, ఎస్పీ, బీజేడీ(బీజూ జనతా దళ్)లు కాంగ్రెస్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాయి. ఈ మేరకు కోల్‌కతాలో ఇవాళ(శుక్రవారం) అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీలు భేటీ కావడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. అంతేకాదు.. వచ్చే వారంలో దీదీ, ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తోనూ భేటీ కానున్నట్లు స్పష్టత వచ్చింది. బీజేపీ స్ట్రాటజీకి కౌంటర్‌గా? లండన్ ప్రసంగంపై విమర్శల వంకతో.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని విపక్షాల నాయకుడిగా చూపించే ప్రయత్నం చేస్తోంది బీజేపీ. ఈ పరిణామం విపక్షాల్లోని కొన్ని పార్టీలకు ఏమాత్రం నచ్చడం లేదు. అందుకే ఎన్నికల నాటికి కాంగ్రెస్‌కు పూర్తి దూరంగా జరగాలని భావిస్తున్నాయి. ఒకవైపు మమతా బెనర్జీ, మరోవైపు అఖిలేష్ యాదవ్.. ఇద్దరూ కూడా బీజేపీ, కాంగ్రెస్‌ను సమానంగా చూడాలని, రెండింటినీ దూరంగానే పెట్టాలని భావిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయంపై టీఎంసీ ఎంపీ సుదీప్ బంధోపాధ్యాయ మరింత స్పష్టత ఇచ్చారు. ‘‘రాహుల్ గాంధీ ఎక్కడో విదేశాల్లో వ్యాఖ్యలు చేశారు. కానీ, బీజేపీ క్షమాపణలు కోరుతూ పార్లమెంట్‌ను అడ్డుకుంటోంది. కాంగ్రెస్‌ను అడ్డుపెట్టుకుని పార్లమెంట్ కార్యకలాపాలను అడ్డుకోవాలని బీజేపీ యత్నిస్తోందన్న విషయం స్పష్టమవుతోంది. రాహుల్‌ను విపక్షాల ప్రతినిధిగా చూపించడం ద్వారా.. లాభపడొచ్చని బీజేపీ భావిస్తోంది. కానీ, 2024 ఎన్నికలకు ప్రధాని అభ్యర్థిత్వాన్ని నిర్ణయించే అవసరం లేదు కదా.. అని సుదీప్ వ్యాఖ్యానించారు. విపక్షాలను కాంగ్రెస్ ఒక బిగ్ బాస్ లాంటిదన్నది భ్రాంతేనన్న టీఎంసీ ఎంపీ.. బీజేపీ, కాంగ్రెస్‌లతో సంబంధం లేకుండా విపక్షాలు ఏకతాటిపైకి వచ్చే ప్రయత్నాలు మొదలైనట్లు స్పష్టత ఇచ్చారు. అయితే.. దీనిని థర్డ్ ఫ్రంట్ అని చెప్పలేమని, కానీ, బీజేపీని ఢీ కొట్టడానికి ప్రాంతీయ పార్టీల్ని బలపడాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. माननीय राष्ट्रीय अध्यक्ष श्री अखिलेश यादव जी ने पार्टी के वरिष्ठ नेताओं के साथ पश्चिम बंगाल की मुख्यमंत्री ममता बनर्जी जी के आवास पर की शिष्टाचार भेंट। pic.twitter.com/i0cv6GqOTZ — Samajwadi Party (@samajwadiparty) March 17, 2023 బెంగాల్లో మేం మమతా దీదీతోనే ఉన్నాం. ప్రస్తుతానికి బీజేపీ, కాంగ్రెస్‌లను సమానంగా చూడాలనే ఉద్దేశంలో మేం ఉన్నాం అంటూ ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ చెప్పుకొచ్చారు. మరోవైపు కాంగ్రెస్‌తో దోస్తీ, బీజేపీ జట్టు కంటే ప్రమాదకరమైందని వ్యాఖ్యానించిన దీదీ.. ఇకపై రెండు పార్టీలను సమానంగానే చూస్తామంటూ వ్యాఖ్యానించడం విశేషం. -
విరాళాల సేకరణలో శివసేన టాప్
సాక్షి, న్యూఢిల్లీ: 2019–20 ఆర్థిక సంవత్సరంలో జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం)కు వచ్చిన విరాళాలు 37,794 శాతం, లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ)కి విరాళాలు 410 శాతం, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)కి 317 శాతం, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి 156 శాతం పెరిగాయి. 2018–19లో జేఎంఎంకు 0.017 కోట్లు, ఎల్జేపీకి 0.515 కోట్లు, ఎస్పీకి రూ.1.054 కోట్లు రాగా, 2019–20లో ఆయా పార్టీలకు వరుసగా రూ.6.442 కోట్లు, రూ.2.629 కోట్లు, రూ.4.392 కోట్లు వచ్చాయి. పలు ప్రాంతీయ రాజకీయ పార్టీలు స్వీకరించిన విరాళాలపై అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) రూపొందించిన నివేదిక శుక్రవారం విడుదలయ్యింది. 2019–20లో అత్యధిక విరాళాలు ప్రకటించిన టాప్–5 పార్టీల్లో శివసేన, ఏఐఏడీఎంకే, ఆప్, బీజేడీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉన్నాయి. 2018–19లో కంటే 2019–20లో తమకు విరాళాలు తగ్గాయని శివసేన, బీజేడీ, వైఎస్సార్సీపీ ప్రకటించగా, తాము స్వీకరించిన విరాళాలు పెరిగాయని ఏఐఏడీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ వెల్లడించాయి. టాప్–5 పార్టీలకు రూ.189.523 కోట్లు తమకు అందినట్లుగా 27 ప్రాంతీయ పార్టీలు ప్రకటించిన విరాళాల మొత్తం రూ.233.686 కోట్లుగా ఉందని ఏడీఆర్ గుర్తించింది. ఇందులో రూ.62.859 కోట్లతో శివసేన ముందంజలో ఉంది. ఆ తర్వాత ఏఐఏడీఎంకే రూ.52.17 కోట్లను స్వీకరించినట్లు ప్రకటించింది. మూడో స్థానంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ రూ.37.37 కోట్లు అందుకుంటున్నట్లు తెలిపింది. ప్రాంతీయ పార్టీలు అందుకున్న మొత్తం విరాళాలలో 81.10 శాతం.. అంటే రూ.189.523 కోట్లు కేవలం టాప్–5 ప్రాంతీయ పార్టీలకే అందాయి. తగ్గిన విరాళాలు 2018–19 నాటి విరాళాలతో పోలిస్తే 2019–20లో జేఎంఎం, ఎల్జేపీ, ఎస్పీ, ఆప్‌లకు విరాళాలు భారీగా పెరిగాయి. అదే సమయంలో వైఎస్సార్సీపీకి రూ.71.651 కోట్లు, తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)కి రూ.40.876 కోట్లు, తెలుగుదేశం పార్టీ(టీడీపీ)కి రూ.23.573 కోట్లు, శివసేనకు రూ.7.371 కోట్లు, జేడీయూకు రూ.7.098 కోట్ల మేర విరాళాలు తగ్గాయి. ప్రాంతీయ పార్టీలు ప్రకటించిన మొత్తం రూ.233.686 కోట్ల విరాళాలలో, 2019–20 ఆర్థిక సంవత్సరంలో 421 విరాళాల నుండి రూ.4.884 కోట్లు నగదు రూపంలో స్వీకరించాయి. ఇది పార్టీలకు వచ్చిన మొత్తం విరాళాలలో 2.09% అని నివేదికలో పేర్కొన్నారు. అత్యధికంగా మహారాష్ట్ర నుంచే విరాళాల కింద అత్యధికంగా మహారాష్ట్ర నుంచి రూ.110.475 కోట్లు, ఢిల్లీ నుంచి రూ.46.24 కోట్లు, కర్ణాటక నుంచి రూ.9 కోట్లు అందుకున్నట్లు ప్రాంతీయ పార్టీలు ప్రకటించాయి. 2019–20 ఆర్థిక సంవత్సరంలో ప్రాంతీయ పార్టీలకు కార్పొరేట్/వ్యాపార రంగాల నుంచి విరాళాల ద్వారా రూ.181.522 కోట్లు రాగా, 5,916 మంది వ్యక్తిగత దాతలు రూ.42.48 కోట్లు ఇచ్చారు. అదే సమయంలో మరో రూ.30.766 కోట్ల విరాళాల సమాచారాన్ని పార్టీలు బయటపెట్టలేదు. విరాళాలు స్వీకరించినట్లు ప్రకటించిన 27 ప్రాంతీయ పార్టీలలో 16 పార్టీలు శాశ్వత ఖాతా సంఖ్య(పాన్) వివరాలు లేకుండా రూ.24.779 కోట్ల విరాళాలు స్వీకరించినట్లు వెల్లడించాయి. కాగా, 14 ప్రాంతీయ పార్టీలు.. టీఆర్ఎస్, వైఎస్సార్సీపీ, టీడీపీ, బీజేడీ, డీఎంకే, శివసేన, ఆప్, జేడీయూ, ఎస్పీ, జేడీఎస్, శిరోమణి అకాలీదళ్, ఏఐఏడీఎంకే, ఆర్జేడీ, జేఎంఎంలు రూ.447.498 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలు అందుకున్నట్లు పేర్కొన్నాయి. అయితే 2019–20 ఆర్థిక సంవత్సరానికి గాను ఎన్డీపీపీ, డీఎండీకే, జేకేఎన్సీ పార్టీలు తాము అందుకున్న విరాళాల వివరాలను ప్రకటించలేదు. -
ఉప ఎన్నిక: నాన్న కల నిజం చేస్తా!
భువనేశ్వర్: పూరీ జిల్లా పిప్పిలి శాసన సభ నియోజక వర్గంలో ఉప ఎన్నిక ముఖచిత్రం స్పష్టమవుతోంది. ఈ నియోజక వర్గంలో త్రిముఖ పోటీ తప్పనట్లు కనిపిస్తోంది. 3 ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బిజూ జనతా దళ్, భారతీయ జనతా పార్టీ పిప్పిలి నియోజకవర్గంలో సిగపట్లు పట్టనున్నాయి. బీజేడీ, బీజేపీ ఒకరి తర్వాత ఒకరుగా తమ అభ్యర్థుల్ని ప్రకటించాయి. ఈ రెండు పార్టీల కంటే ముందుగా గెలుపు అవకాశాలు ఉన్న ముగ్గురు అభ్యర్థుల్ని ఖరారు చేసినట్లు కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. అయితే అధికారికంగా అభ్యర్థిని ప్రకటించకపోవడంపట్ల సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బీజేడీ నుంచి రుద్రప్రతాప్ అధికార బీజేడీ పార్టీ అభ్యర్థిగా రుద్ర ప్రతాప్ మహారథిని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ శుక్రవారం ఖరారు చేసి ప్రకటించారు. దివంగత ఎమ్మెల్యే ప్రదీప్ మహారథి కుమారుడు రుద్రప్రతాప్ మహారథి. త్వరలో ఆయన నామినేషన్ దాఖలు చేస్తారు. నాన్న కల సాకారం చేస్తా: రుద్ర ప్రతాప్ మహారథి తల్లిదండ్రులు, బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ ఆశీస్సులతో పిప్పిలి ఉప ఎన్నిక టికెట్ లభించడం అదృష్టం. ముఖ్యమంత్రి నమ్మకం వమ్ము కాకుండా నాన్న కలను సాకారం చేసే దిశలో కృషి చేస్తానని రుద్ర ప్రతాప్ మహారథి ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. పిప్పిలి ఉపఎన్నికకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఆశ్రిత్ పట్నాయక్ తొలుత నామినేషన్ దాఖలు చేశారు. ఆయన ఈ నియోజక వర్గం నుంచి పోటీ చేయడం వరుసగా ఇది మూడోసారి. తొలుత 2014వ సంవత్సరంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 18 వేల ఓట్లు సాధించారు. రెండో సారి 2019వ సంవత్సరంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి 72 వేల ఓట్లు సాధించారు. 15 వేల 787 ఓట్ల తేడాతో ఆయన పరాజయం పాలైనప్పటికీ అధికార పక్షం బిజూ జనతా దళ్ అభ్యర్థికి గట్టి పోటీనిచ్చారు. ప్రస్తుతం జరగనున్న ఉప ఎన్నికకు బీజేపీ తరఫున ఆశ్రిత్ పట్నాయక్ తగిన అభ్యర్థిగా అధిష్టానం నిర్ధారించి టికెట్ కేటాయించింది. భారీ ఊరేగింపు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సమీర్ మహంతి, పలువురు పార్టీ ఎమ్మెల్యేలు ఊరేగింపుగా బయల్దేరి పూరీ జిల్లా అదనపు మేజిస్ట్రేట్ సమక్షంలో నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ టికెట్ రేసులో ముగ్గురు కాంగ్రెస్ టికెట్ కోసం ప్రాథమికంగా ఖరారైన అభ్యర్థుల జాబితాలో నిషికాంత మిశ్రా అగ్రస్థానంలో ఉన్నారు. మిగిలిన ఇద్దరిలో అజిత్ మంగరాజ్, పూర్ణ చంద్ర స్వంయి ఉన్నారు. ఈ ముగ్గురిలో ఒకరికి కాంగ్రెస్ టికెట్ లభిస్తుంది. చదవండి: పిప్పిలి సమరానికి కసరత్తు.. -
ఉప ఎన్నిక సమరానికి కసరత్తు.. కాంగ్రెస్ ముందంజ!
భువనేశ్వర్: పూరీ జిల్లాలోని పిప్పిలి అసెంబ్లీ నియోజక వర్గం ఉపఎన్నిక ఏప్రిల్ 17 వ తేదీన నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయడంతో రాజకీయ శిబిరాల్లో కొత్త వాతావరణం నెలకొంది. అభ్యర్థుల ఎంపికపై ప్రధాన రాజకీయ పక్షాలు కసరత్తు చేస్తున్నాయి. రాష్ట్ర శాసనసభలో ఈ నియోజక వర్గానికి ప్రత్యేక ఉనికి ఉంది. గతంలో కాంగ్రెస్ ఈ స్థానం నుంచి దీర్ఘకాలం పాటు ప్రాతినిధ్యం వహించగా ఇటీవల అధికార పక్షం బిజూ జనతా దళ్ ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది. బీజేడీ సిట్టింగ్ సభ్యుడు ప్రదీప్త మహారథి అకాల మరణంతో త్వరలో జరగనున్న ఉపఎన్నిక ఈ రెండు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. గెలుపు అవకాశాల కోసం కాంగ్రెస్, బీజేడీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. పూరీ జిల్లా కేంద్రం నుంచి ఎమ్మెల్యేగా ప్రతిపక్ష బీజేపీ అభ్యర్థి ప్రాతినిధ్యం వహిస్తుండడంతో పిప్పిలి స్థానం కూడా కైవసం చేసుకోవాలని ఆ పార్టీ ఆరాటపడుతోంది. ఈ నేపథ్యంలో తరచూ బీజేపీ ప్రముఖులు నియోజక వర్గంలో పర్యటిస్తున్నారు. ముందంజలో కాంగ్రెస్ పిప్పిలి నియోజక వర్గానికి అభ్యర్థిని ఖరారు చేయడంలో రాష్ట్ర కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఔత్సాహిక అభ్యర్థుల నుంచి గెలుపు గుర్రాల జాబితాను ఖరారు చేసి పార్టీ అధిష్టానం ఆమోదం కోసం సిఫారసు చేసినట్లు ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నిరంజన పట్నాయక్ తెలిపారు. ఈ నెల 30వ తేదీ నాటికి పిప్పిలి నియోజక వర్గం నుంచి పార్టీ అభ్యర్థి పేరును ప్రకటించడం తథ్యమని ఆయన స్పష్టం చేశారు. 30 మంది ప్రచారకులు పిప్పిలి ఉపఎన్నికను పురస్కరించుకుని కాంగ్రెస్ ప్రచార సన్నాహాల్ని చేపడుతోంది. జాతీయ, రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ నాయకులు ఉప ఎన్నిక ప్రచార కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాలుపంచుకుంటారు. ఈ మేరకు 30 మంది ప్రముఖ స్టార్ క్యాంపెయినర్లను రంగంలోకి దింపేందుకు యోచిస్తోంది. సమీక్ష సమావేశాల్లో బీజేపీ పిప్పిలి నియోజక వర్గం నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థిని ఖరారు చేయడంలో భారతీయ జనతా పార్టీ తలమునకలై ఉంది. పార్టీ ప్రముఖులు డాక్టర్ సంబిత్ పాత్రో, పృథ్వీరాజ్ హరిచందన్, గోలక్ మహా పాత్రోలు అభ్యర్థిని ఖరారు చేయడంలో సమీక్షిస్తున్నారు. సానుభూతి వైపు మొగ్గు అధికార పక్షం బిజూ జనతా దళ్ సానుభూతి సూత్రంతో పిప్పిలి నియోజక వర్గం నుంచి పోటీకి సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దివంగత నాయకుడు ప్రదీప్త మహారథి కుటుంబీకుల నుంచి ఒకరికి టికెట్ కట్టబెట్టి నియోజక వర్గం ఓటర్ల సానుభూతితో గట్టెక్కే యోచనలో ఉంది. కాంగ్రెస్, బీజేపీల వ్యూహం బెడిసి కొట్టాలంటే ఇంతకంటే బీజేడీకి ఇంతకంటే అనుకూలమైన మార్గం మరొకటి లేనట్లు విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ప్రదీప్త మహారథి భార్య, ఆయన కుమారుడు పిప్పిలి నుంచి అధికార పక్షం బిజూ జనతా దళ్ నుంచి పోటీ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. వారి ప్రయత్నాలు ఫలించి ఒకరికి టికెట్ లభించడం తథ్యమనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. చదవండి: అడవి పంపిన బిడ్డ -
నటుడు, ఎంపీపై కేసులు పెట్టిన భార్య
భువనేశ్వర్ : నటుడు, బిజు జనతా దళ్ ఎంపీ అనుభవ్ మొహంతిపై ఆదివారం గృహహింస, వరకట్న వేధింపుల కేసులు నమోదయ్యాయి. భార్య, నటి వర్ష ప్రియదర్శి ఈ మేరకు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అనుభవ్‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. అనుభవ్, అతడి స్నేహితులిద్దరు తనను కటక్‌లోని తమ నివాసంలోని ఓ గదిలో బంధించారని, పోలీసులు సహాయంతో బయటపడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది. కాగా, గతంలో కూడా పలుమార్లు భర్తపై ఆమె కేసులు పెట్టారు. కొన్ని నెలల క్రితం.. అనుభవ్, వర్ష గొడవపడుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. భర్త తన క్యారెక్టర్‌ను దెబ్బతీయటానికి ప్రయత్నిస్తున్నాడంటూ పోలీసులను ఆశ్రయించారు. ( స్నేహితులతో కలిసి భార్యపై అత్యాచారం ) అనుభవ్ తనను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నాడని ఆగస్టు 7న కోర్టులో గృహహింస కేసు పెట్టారు. ఈ నేపథ్యంలో అనుభవ్ తనకు భార్యనుంచి విడాకులు కావాలంటూ ఢిల్లీలోని పటియాలా కోర్టుకెక్కారు. అయితే తమ విడాకుల కేసును కటక్ ఫ్యామిలీ కోర్టుకు బదిలీ చేయాలని ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజా కేసు నేపథ్యంలో అనుభవ్ డీజీపీకి ఓ లేఖ రాశారు. ‘‘ నాకు, నా కుటుంబానికి ప్రమాదం పొంచి ఉంది. దయచేసి మమ్మల్ని కాపాడండి’’ అని లేఖలో పేర్కొన్నాడు. -
ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్.. కేసు నమోదు
భువనేశ్వర్ : కోవిడ్ మార్గదర్శకాలను పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశిస్తున్నా ఏమాత్రం పట్టించుకోవడంలేదు. సామాన్య ప్రజలకు చెప్పాల్సిన బాధ్యతగల ప్రజాప్రతినిధిలే నిబంధనలను గాలికొదిలేస్తున్నారు. కరోనా మార్గదర్శకాలను పాటించకుండా పాజిటివ్‌గా తేలిన ఓ ఎమ్మెల్యే.. బయటకు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఒడిశాలోని పూరీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీజూ జనతాదళ్ (బీజేడీ) సీనియర్, ఎమ్మెల్యే ఉమాకంఠ ఇటీవల కరోనా సోకింది. పెద్దగా కోవిడ్ లక్షణాలు లేనప్పటికీ రెండు వారాల పాటు స్వీయ నిర్బంధలో ఉండాలని వైద్యులు సూచించారు. ఈ క్రమంలోనే బీజేడీ సీనియర్ నేత ప్రదీప్ మహారాతి అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం మరణించారు. (కరోనా: మానసిక ఆరోగ్యంలో మార్పులు) అయితే కరోనా నేపథ్యంలో అతని అంతిమయాత్రకు ఎవరూ హాజరవ్వదని పోలీసులు హెచ్చరించారు. అంత్యక్రియల్లో సమీప బంధువులకు మాత్రమే అనుమతినిచ్చారు. కానీ కరోనా బారినపడిన అధికార పార్టీ ఎమ్మెల్యే ఉమాకంఠ కూడా హాజరుకావడం కలకలం రేపింది. కోవిడ్ బాధితుడు అంత్యక్రియలకు హాజరుకావడంతో పోలీసులు అతనిపై చర్యలకు ఉపక్రమించారు. ఐపీసీ సెక్షన్ 269, 270 (అంటువ్యాధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ఇతరులకు ఇబ్బంది కలిగించడం), అంటువ్యాధుల నియంత్రణ చట్టం వంటి సెక్షల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మరోవైపు ఇదే అంత్యక్రియలకు హాజరైన ఇద్దరు మంత్రులపై మాత్రం పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదు. వారికి కూడా కరోనా సోకిందని, క్వారెంటైన్ గడువు ముగియకముందే అంత్యక్రియల్లో పాల్గొన్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎంపీ అపరాజితపై చర్యలు తీసుకోవాలి భువనేశ్వర్: స్థానిక లోక్ సభ సభ్యురాలు, భారతీయ జనతా పార్టీకి చెందిన అపరాజిత షడంగికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని రాష్ట్రంలోని అధికార పక్షం బిజూ జనతా దళ్ డిమాండ్ చేసింది. ఆమె జన్మదినం సందర్భంగా శుక్రవారం భారీ సమూహంతో వినోద కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న ఆమె అభిమానులు, అనుచరులు, శ్రేయోభిలాషులు అంతా కోవిడ్–19 నిబంధనలకు నీళ్లొదిలారు. ముఖానికి మాస్కు తొడగకుండా భౌతిక దూరం పాటించకుండా గానా బజానాతో విందు వినోదాల్లో పాల్గొన్న వీడియో శుక్రవారం వైరల్ అయింది. కరోనా విజృంభణతో రాజధాని నగరం అల్లాడుతున్న సమయంలో బాధ్యతాయుతమైన ప్రజ్రా ప్రతినిధిగా ఎంపీ అపరాజిత షడంగి నిర్లక్ష్య వైఖరిపై సర్వత్రా విచారం వ్యక్తమైంది. ఎంపీ అపరాజతి షడంగికి వ్యతిరేకంగా చర్యలు చేపట్టాలని కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్‌కు రాష్ట్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కెప్టెన్ దివ్య శంకర మిశ్రా లేఖ రాశారు. కేంద్రమంత్రికి వీడియో క్లిప్పింగ్ ఈ నెల 8వ తేదీన స్థానిక ఎంపీ అపరాజిత షడంగి జన్మదిన వేడుకల్ని వందలాది మంది మహిళలతో కలిసి వేడుకగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమెతో పాల్గొన్న వారంతా కోవిడ్–19 మార్గదర్శకాల్ని బాహాటంగా ఉల్లంఘించారు. ఈ సంఘటన వీడియో క్లిప్పింగు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రసారమవుతోంది. ఈ క్లిప్పింగును కేంద్ర మంత్రికి రాష్ట్రమంత్రి పంపారు. ఎంపీ అపరాజిత షడంగి కోవిడ్–19 నిబంధనలకు వరుసగా 3వ సారి ఉల్లంఘించినట్లు రాష్ట్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కెప్టెన్ దివ్య శంకర మిశ్రా ఈ సందర్భంగా లేఖలో గుర్తు చేశారు. లోగడ ఆమెకు జారీ చేసిన హెచ్చరికల్ని గాలికి వదిలి కోవిడ్ నిబంధనల్ని బాహాటంగా ఉల్లంఘిస్తున్నారు. ఆమె బాధ్యతారాహిత్యమైన చర్యలు కరోనా యోధుల ఉత్సాహాన్ని నిర్వీర్యం చేసి పరిస్థితుల్ని విషమంగా మలుస్తాయని మంత్రి దివ్య శంకర మిశ్రా ఆవేదన వ్యక్తం చేశారు. నగర ప్రజల ప్రాణాల్ని పణంగా పెట్టే కోవిడ్–19 నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన ఎంపీకి వ్యతిరేకంగా చర్యలు చేపట్టేందుకు కేంద్ర హోమ్ శాఖ మంత్రి, ప్రధాన మంత్రికి సిఫారసు చేయాలని లేఖలో కోరారు. -
అసెంబ్లీ సాక్షిగా తల్లి మెడపై కత్తి పెట్టి..
-
అసెంబ్లీ సాక్షిగా తల్లి మెడపై కత్తి పెట్టి..
భువనేశ్వర్ : ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో అసెంబ్లీ భవన్ ఎదుట గురువారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అసెంబ్లీ సాక్షిగా ఒక వ్యక్తి తన కన్నతల్లి మెడపై కత్తిపెట్టి చంపేస్తానంటూ సైకోలాగా ప్రవర్తించాడు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిజు జనతాదళ్ ప్రభుత్వంలో కొందరు అవినీతి మంత్రులు ఉన్నారని వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని.. లేకుంటే తన తల్లిని చంపేస్తానంటూ గట్టిగట్టిగా అరిచాడు. తన దగ్గరకు రావాలని చూసిన వారిని కత్తితో బెదిరించాడు. చివరకు పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోలేదు. (చదవండి : హత్రాస్ బాధితురాలిపై రేప్ జరగలేదు) అయితే యువకుని తల్లి వివరాల మేరకు సదరు యువకుడు మానసిక సమస్యతో బాధపడుతున్నాడని తెలిసింది. కొడుకును ఆసుపత్రిలో చూపించేందుకు తల్లి, కొడుకులు ఆటోలో కలసి బయలుదేరారు. అసెంబ్లీ భవన్ వద్దకు చేరుకోగానే యువకుడు సైకోలాగా ప్రవర్తిస్తూ బ్యాగ్‌లో ఉన్న కత్తిని తీసుకొని ఆటో నుంచి కిందకు దిగాడు. ఆ తర్వాత తల్లి మెడపై కత్తి పెట్టి చంపేస్తానంటూ బెదిరించాడు. దీంతో పాటు బీజేడీ ప్రభుత్వంలో ఉన్న అవినీతి మంత్రులపై చర్యలు తీసుకోవాలంటూ గట్టిగట్టిగా నినాదాలు చేశాడు. అయితే పోలీసులు జోక్యం చేసుకొని అతని వద్ద నుంచి కత్తి స్వాధీనం చేసుకొని తల్లిని విడిపించి యువకుడిని కస్టడీలోకి తీసుకున్నారు. యువకుడు మానసిక సమస్యతో బాధపడుతున్నాడని.. ఆసుపత్రిలో చూపించేందుకు తీసుకెళుతుండగా.. ఇంతలోనే ఈ ఘటన చోటుచేసుకుందని భువనేశ్వర్ డీసీపీ ఉమాశంకర్ దశ్ పేర్కొన్నారు. కాగా యువకుడు కత్తితో సైకోలాగా ప్రవర్తిస్తూ హల్చల్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (చదవండి : భారీ చేపతో బామ్మకు జాక్‌పాట్) -
ఏసీ ప్రమాదం: బీజేడీ నేతతో సహా ముగ్గురి మృతి
భువనేశ్వర్ : అధికార బీజేడీ నాయకుడు ఆలేఖ్ చౌదరి ఇంట్లో శుక్రవారం వేకువజామున అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఆలేఖ్ చౌదరి సహా మొత్తం ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా తీవ్ర విషాదం నింపింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బరంపురలోని గుసానినువాగం, పాణిగ్రహి వీధిలో నివాసం ఉంటున్న ఆలేఖ్ చౌదరి రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఆయన గదిలోని ఏసీ(ఎయిర్ కండిషనర్)లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో ఆ గదిలో నిద్రిస్తున్న ఆలేఖ్ చౌదరికి మెలుకువ వచ్చింది. దీంతో అప్రమత్తమైన ఆయన కుటుంబ సభ్యులను ఇంటి నుంచి బయటకు పంపించేశారు. అనంతరం తన గదిలో నిద్రిస్తున్న బావమరిది భగవాన్ పాత్రో, బంధువు సునీల్ బెహరాను కాపాడేందుకు వెళ్లిన ఆయనకి ఊపిరాడకపోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లి, అదే గదిలో పడిపోయారు. ఎంతసేపటికీ ఆయన ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడ ఎగసిపడుతున్న మంటలను ఆర్పివేసి, అందులో అపస్మారక స్థితిలో పడి ఉన్న వారిని వైద్య సేవల నిమిత్తం ఎంకేసీజీ మెడికల్‌కు తరలించారు. అయితే అప్పటికే వారు చనిపోయినట్లు సమాచారం. బరంపురం సహకార సమితి మాజీ చైర్మన్‌గా, బీజేడీ గంజాం జిల్లా ఉపాధ్యక్షుడిగా ఆయన సేవలందించారు. మంచి జనాదరణ ఉన్న నేతగా గుర్తింపు ఉంది. ఇదిలా ఉండగా, ఆయన మరణ వార్త విన్న ఎంపీ చంద్రశేఖర సాహు, ఎమ్మెల్యే విక్రమ్ పండా ఎంకేసీజీ ఆస్పత్రి చేరుకుని, వారి మృతికి సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇదే విషయంపై కేసు నమోదు చేసిన పోలీసులు పాణిగ్రాహి వీధిలో దర్యాప్తు చర్యలు ప్రారంభించారు. ఘటన ఎలా జరిగిందన్న విషయంపై అక్కడి ప్రత్యక్ష సాక్షుల నుంచి సమాచారం సేకరించారు. అంతిమ వీడ్కోలు.. పోస్టుమార్టం అనంతరం ఇంటికి తీసుకువచ్చిన ఆలేఖ్ చౌదరి మృతదేహానికి అంత్యక్రియలు జరిపారు. ఈ సందర్భంగా బీజేడీ నాయకులు, కార్యకర్తలు, మిత్రులు, బంధువర్గం ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు. -
ఆ చట్టం విదేశీయులకే : నవీన్ పట్నాయక్
బువనేశ్వర్: నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్(ఎన్ఆర్సీ) బిల్లుకు బీజేడీ మద్దతివ్వదని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు. ఒడిశా ప్రజలు అపోహలు నమ్మవద్దని శాంతియుతంగా వ్యవహరించాలని సూచించారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)తో భారతీయులకు ఎలాంటి నష్టం లేదని తెలిపారు. ఈ చట్టం విదేశీయులకు మాత్రమేనని పేర్కొన్నారు. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్(ఎన్ఆర్సీ) చట్టాన్నిలోక్సభ, రాజ్యసభలో బిజు జనతా దల్(బీజేడీ) ఎంపీలు వ్యతిరేకించారని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అక్రమ వలసదారుల ఏరివేత కోసం ఇటీవలే ఈ ఎన్ఆర్సీ ప్రక్రియను చేపట్టిన విషయం తెలిసిందే. పౌరసత్వ సవరణ చట్టం విజయవంతంగా చట్ట సభల్లో ఆమోదం పొందాక ఎన్ఆర్సీపై ఆసక్తి నెలకొంది. కాగా పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై వ్యతిరేకత రోజురోజుకీ తీవ్రమవుతోంది. మొదట అస్సాం, త్రిపుర వంటి ఈశాన్య రాష్ట్రాలకే పరిమితమైన ఆందోళనలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధానిలోని జామియా యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళనలకు పలు ఇతర యూనివర్సిటీలు, ఐఐటీలు సంఘీభావం ప్రకటించి, నిరసన ప్రదర్శనలు నిర్వహించిన విషయం విదితమే. చదవండి : పౌరసత్వ వివాదం: సీఎం మిస్సింగ్..! -
జవాన్ మృతదేహంపై పార్టీ జెండా
భువనేశ్వర్: ఉగ్రవాదుల ఎన్కౌంటర్లో అమరుడైన ఓ జవాన్ మృతదేహంపై రాజకీయ పార్టీకి చెందిన జెండాను ఉంచడం వివాదాస్పదంగా మారింది. ఒడిశాకు చెందిన అజిత్ సాహో అనే ఆర్మీ జవాన్ ఈనెల 12న కశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో మృతిచెందాడు. అయితే అంత్యక్రియల నిమిత్తం అతని మృతదేహాన్ని ఒడిశాలోని ఆయన స్వగృహానికి తరలించారు. అనంతరం అధికార బీజూ జనతాదళ్ (బీజేడీ)కి చెందిన కొందరు నాయకులు వచ్చి మతదేహంపై వారి పార్టీ జెండాను కప్పి.. నివాళి అర్పించారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో వెంటనే దానిని తొలగించారు. ఈ ఘటపై ప్రతిపక్ష బీజేపీ తీవ్రంగా మండిపడుతోంది. దేశం కోసం ప్రాణాలర్పించిన జవాన్ మృతదేహంపై పార్టీ జెండాను ఉంచి.. బీజేడీ తీవ్రంగా అవమానించిందని మండిపడింది. అమరుల త్యాగాలకు కించపరిచే విధంగా బీజేడీ ప్రవర్తించిందని విమర్శించింది. బీజేపీ వ్యాఖ్యలపై స్పందించిన ఆ పార్టీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర.. ఈ ఘటనతో తమ పార్టీకి ఎలాంటి సంబంధంలేదన్నారు. ఆ జెండాను ఎవరు కప్పారో కూడా తమకు నిజంగా తెలీదన్నారు. ఘటనకు కారకులైన వారిపై వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా జవాను సోదరుడు పరేశ్వరన్ మాట్లాడుతూ.. స్థానిక బీజేడీ నాయకులు వచ్చి పార్టీ జెండాను మృతదేహంపై కప్పి వెళ్లారని తెలిపారు. విషాదంలో ఉన్న తాము దీని గురించి పెద్దగా పట్టించుకోలేదన్నారు. పక్కవారు చెప్పడంతో వెంటనే జెండాను తొలగించామని, తమ సోదరుడు దేశం కోసం ప్రాణ త్యాగం చేశాడని చెప్పుకొచ్చారు. -
మంత్రులు ప్రతినెలా రిపోర్టు చేయాల్సిందే..
భువనేశ్వర్: ఐదోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు బాధ్యత మంత్రులదేనని స్పష్టం చేశారు. అలాగే మంత్రులందరూ ప్రతినెల అమలు చేసిన పథకాల గురించి తనకు రిపోర్టు చేయాలని ఆదేశించారు. ప్రతినెల ఏడు తేదీన మంత్రులందరూ రిపోర్టు పత్రాలను సీఎంవో కార్యాలయానికి పంపాలన్నారు. ఈమేరకు ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ఏర్పాటు చేసిన తొలి మంత్రిమండలి సమావేశంలో మంత్రులకు దిశానిర్ధేశం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీలు (మేనిఫెస్టో)ను ప్రజలకు చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కాగా లోక్‌సభ ఎన్నికలతో పాటు జరిగిన ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో నవీన్ నేతృత్వంలోని బీజూజనతాదళ్ అద్బుత విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే .రాష్ట్రంలోని 142 స్థానాలకు గాను 112 స్థానాలను గెలుపొంది.. వరుసగా ఐదోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. విజయంలో ఆయనకెంతో దోహదం చేసిన సంక్షేమ పథకాలను పకడ్భందీగా అమలుచేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలను, అధికారులను నవీన్ ఆదేశించారు. -
ఒడిశా, అరుణాచల్ సీఎంల ప్రమాణం
భువనేశ్వర్/ఈటానగర్: ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌ల్లో నూతన ప్రభుత్వాలు కొలువుదీరాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బిజు జనతా దళ్ (బీజేడీ) అధినేత నవీన్ పట్నాయక్ ఒడిశా సీఎంగా వరుసగా ఐదోసారి ప్రమాణం చేశారు. భువనేశ్వర్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో గవర్నర్ గణేశీలాల్ ఆయన చేత ప్రమాణం చేయించారు. అలాగే ఆయనతో పాటు 20 మంది నూతనంగా ఎన్నికైన బీజేడీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణంచేశారు.147 అసెంబ్లీ స్థానాలున్న ఒడిశాలో బీజేడీ 112 స్థానాల్లో గెలుపొందింది. ఒడిశాలో 2000 సంవత్సరం నుంచి బీజేడీ అధికారంలో కొనసాగుతోంది. నవీన్ వరుసగా 2000, 2004, 2009, 2014ల్లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ‘పట్నాయక్‌కు అభినందనలు. ఒడిశా అభివృద్ధికి కేంద్రం నుంచి మా వంతు పూర్తి సహకారం ఉంటుంది’అని మోదీ ట్వీట్ చేశారు. అరుణాచల్ సీఎంగా పెమా ఖండూ బీజేపీ సీనియర్ నేత పెమా ఖండూ అరుణాచల్ ప్రదేశ్ పదో సీఎంగా బుధవారం ప్రమాణం చేశారు. ఈటానగర్‌లో ఆ రాష్ట్ర గవర్నర్ మిశ్రా ఆయన చేత ప్రమాణం చేయించారు. డిప్యూటీ సీఎం చౌనా మేతో సహా 11 మంది కేబినెట్ మంత్రులు పెమా ఖండూతో పాటు ప్రమాణం స్వీకారం చేశారు. అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, మణిపూర్ సీఎంలు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పెమా ఖండూ మాట్లాడుతూ.. ‘ఇది రాష్ట్రంలో చారిత్రాత్మక రోజు. మా ప్రభుత్వం అవినీతి రహితంగా పనిచేస్తుంది’ అని అన్నారు. 60 అసెంబ్లీ స్థానాలున్న అరుణాచల్‌లో బీజేపీ 41 స్థానాల్లో గెలుపొందింది. -
ఎలాగైనా గెలవాలని..
ఒడిశా అంటే నవీన్ పట్నాయక్.. నవీన్ పట్నాయక్ అంటే ఒడిశా అన్నట్టుగా 20 ఏళ్లుగా రాజకీయాలు మారిపోయాయి. ఒడిశా ఎన్నికల చరిత్రలో బిజూ జనతాదళ్ అధినేత, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రస్థానం తిరుగులేనిది. ఒడిశా.. రాష్ట్రంగా చూస్తే వెనుకబడిందే.. కానీ ఖనిజ సంపదలో చాలా విలువైనది. ఈ ఖనిజాల చుట్టూ జరిగే వ్యాపారాలను ప్రోత్సహించడం ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించి నవీన్ పట్నాయక్ గత నాలుగు ఎన్నికల్లోనూ అందలాన్ని అందుకున్నారు. కానీ ఇప్పటివరకు బిజూ జనతాదళ్ అడుగు పెట్టలేకపోయిన ప్రాంతం ఏదైనా ఉందీ అంటే అది సుందర్‌గఢ్. ఈ లోక్‌సభ నియోజకవర్గంలో బీజేడీ ఒక్కసారి కూడా గెలవలేకపోయింది. అందుకే ఈసారి ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో వ్యూహాలు రచిస్తోంది. అటవీ హక్కుల చట్టం అమలే ప్రధానాంశం ఒడిశాలో సుందరగఢ్ నియోజకవర్గం కీలకమైనది. ఇది ఎస్టీ రిజర్వుడు స్థానం. ప్రతీ ఐదుగురిలో ఒకరు గిరిజనుడే. 2014 ఎన్నికల్లో ఏకైక బీజేపీ ఎంపీగా జుయల్ ఒరమ్ ఇక్కడ గెలుపొంది రికార్డు సృష్టిం చారు. ఆ తర్వాత కేంద్ర గిరిజన మంత్రి పదవినీ అందుకున్నారు. జుయల్ ఒరమ్కి విజయం అంత సులభంగా లభించలేదు. చాలా అసెంబ్లీ సెగ్మెంట్లలో అప్పట్లోనే ఒమర్‌కి బీజేడీ అభ్యర్థి దిలీప్ కుమార్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఈసారి మోదీ వేవ్ ఆ స్థాయిలో లేకపోగా కేంద్ర గిరిజన మంత్రిగా నియోజకవర్గానికి, ఆదివాసీల సంక్షేమానికి ఆయన చేసిందేమీ లేదన్న విమర్శలున్నాయి. ఆదివాసీలకు భూ యాజమాన్య హక్కుల్ని కల్పిస్తూ 2006లో అటవీ హక్కుల గుర్తింపు చట్టం (ఫ్రా) తీసుకువచ్చినా వారికి ప్రయోజనం కలగలేదు. ఆ చట్టంలో లొసుగుల ఆధారంగా ఎందరో ఆదివాసీలకు యాజమాన్య హక్కుల్ని తిరస్కరించారు. తమ నియోజకవర్గం ఎంపీ కేంద్రంలో గిరిజనుల మంత్రిగా ఉన్నప్పటికీ తమకు ఒరిగిందేమీ లేదన్న అసంతృప్తి ఆదివాసీల్లో నెలకొంది. ‘ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఫ్రా కీలకపాత్ర పోషిస్తుంది. ఒడిశాలో పార్టీలన్నీ దీనిని సీరియస్‌గా తీసుకున్నాయి. మేనిఫెస్టోల్లో దీనినే ప్రధానంగా ప్రస్తావించాయి’ అని వసుంధర అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన గిరిరావు వ్యాఖ్యానించారు. జాతీయ సగటు కంటే ఒడిశాలో తక్కువ జాతీయ స్థాయిలో ఎన్నో స్వచ్ఛంద సంస్థలు అటవీ హక్కుల గుర్తింపు చట్టంపై ఈ మధ్య కాలంలో ఆదివాసీల్లో అవగాహన పెంచుతున్నాయి. దీంతో ఎన్నికల్లో ఇదే ప్రధాన అస్త్రం కానుంది. ఈ చట్టం అమల్లో జాతీయ సగటు కంటే రాష్ట్ర సగటు చాలా తక్కువగా ఉంది. ఈ చట్టం కింద భూ యాజమాన్య హక్కుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి అనుమతించే జాతీయ సగటు రేటు 81 శాతంగా ఉంటే, ఒడిశాలో 71 శాతమే ఉంది. షెడ్యూల్ తెగలు మాత్రమే కాకుండా ఇతర సంప్రదాయ ఆదివాసీలు తవ్వకాల కోసం పెట్టుకున్న అనుమతుల్లో 2 శాతం మాత్రమే ప్రభుత్వం అంగీకరించింది. ఇది కూడా జాతీయ సగటు (13%) కంటే చాలా తక్కువ. కేంద్ర గిరిజన మంత్రిగా ఒడిశా రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఉన్నప్పటికీ ఫ్రా చట్టం అమలు ఇంత ఘోరంగా ఉండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విపక్షాలకు అదే ఎన్నికల ప్రచారాస్త్రంగా మారింది. త్రిముఖ పోటీ సుందర్గఢ్లో ఒక్కసారి కూడా నెగ్గలేకపోవడంతో బీజేడీ దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 33 శాతం మహిళలకు టికెట్లు ఇచ్చిన ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్.. సుందర్గఢ్లో మాజీ ముఖ్యమంత్రి హేమానంద బిశ్వాల్ కుమార్తె సునీతా బిశ్వాల్‌కు అవకాశం ఇచ్చారు. ఒడిశాకు మొదటి గిరిజన ముఖ్యమంత్రి హేమానంద బిశ్వాల్‌కు మంచి పేరే ఉంది. అదే సునీతా బిశ్వాల్‌కు అనుకూలంగా మారుతుందన్న అంచనాలున్నాయి. ఒడిశా సుందర్‌గఢ్ నియోజకవర్గంలో 2000 సంవత్సరం నుంచి జుయల్ ఒరమ్, హేమానంద బిశ్వాల్ మధ్యే పోటీ ఉంటోంది. బిశ్వాల్ కుమార్తెను రంగంలోకి దింపడం ద్వారా నవీన్ తెలివిగా వ్యవహరించారన్న ప్రశంసలు వినిపిస్తున్నాయి. ఇక, బీరమిత్రపూర్ నుంచి స్వతంత్ర ఎమ్మెల్యేగా ఉన్న జార్జ్ తిర్కీ కాంగ్రెస్ గూటికి చేరుకొని ఈ లోక్‌సభ బరిలో సవాల్ విసురుతున్నారు. సుందర్‌గఢ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి 2.6 లక్షల ఓట్లు సంప్రదాయంగా పడుతూ వస్తున్నాయి. దానికి తోడు తనకున్న వ్యక్తిగత ఇమేజ్ ద్వారా లక్ష ఓట్ల వరకు సంపాదించగలరని అంచనా. దీంతో జార్జ్ తిర్కీ బలమైన అభ్యర్థిగానే మారారు. అయితే అన్ని పార్టీల్లోనూ రెబెల్స్ బెడద ఉండటంతో ఈసారి వీరు ఏ పార్టీ విజయావకాశాల్ని దెబ్బతీస్తారోనన్న ఆందోళన నెలకొంది. కాంగ్రెస్ పార్టీ తన పూర్వ వైభవాన్ని సాధించడం కోసం పార్టీ ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా చాలామంది నాయకులపై వేటు వేసింది. వీరంతా సుందర్‌గఢ్ బరిలో నిలవడంతో అన్ని పార్టీలకు గండంగా మారింది. -
నవీనమా...వికాసమా
సాక్షి, సెంట్రల్‌డెస్క్ : చీకట్లో మగ్గిన ఒడిశా రాష్ట్రంలో పారిశ్రామిక వెలుగులు నింపిన ప్రజాకర్షక నాయకుడు ఇప్పుడు ఏటికి ఎదురీదుతున్నారా? పందొమ్మిదేళ్లుగా రాష్ట్రాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్న నవీన్ పట్నాయక్ పాలనకు ఇక తెరపడుతుందా? బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురవుతోందా? 120 సీట్లు తమ లక్ష్యమని బీజేపీ ప్రకటిస్తే, 123 గెలుస్తామన్న ధీమా నవీన్‌ది. ఒకేసారి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న ఒడిశాలో రాజకీయ ముఖచిత్రం ఎలా ఉండనుంది? అయిదోసారి కూడా నవీనపథంలో ప్రజలు నడుస్తారా? లేదంటే ప్రత్యామ్నాయం వైపు మొగ్గు చూపుతారా?.. ఇప్పుడు అందరిలోనూ అదే ఆసక్తి.. సరిగ్గా 19 ఏళ్ల క్రితం ఒడిశా అత్యంత వెనుకబడిన రాష్ట్రం. కొండలు, గుట్టలు, దట్టమైన అడవులున్న ఈ రాష్ట్రంలో ఆదివాసీలే ఎక్కువ. ఎటు చూసినా పేదరికం, ఆకలి కేకలు, ఉద్యోగాల కొరత.. వీటికి తోడు పులి మీద పుట్రలా ఎప్పుడు తుపాన్లు ముంచేస్తాయో తెలియదు. అలాంటి రాష్ట్రానికి ఆపద్బాంధవుడిలా వచ్చారు బిజూ జనతాదళ్ (బీజేడీ) అధినేత నవీన్ పట్నాయక్. 2000 సంవత్సరంలో ఒడిశా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన ఆయన.. అవినీతి బురదలో కూరుకుపోయిన అధికారులు, రాజకీయ నాయకుల్లో మార్పు తెచ్చారు. పారిశ్రామికంగా రాష్ట్రాన్ని పరుగులు తీయించారు. సుపరిపాలన, ప్రజాసేవ, ఇతరుల్ని గౌరవించడమే పార్టీ నినాదాలుగా మార్చుకొని జనంలో పట్టు పెంచుకున్నారు. పేదలకు తక్కువ ధరకే బియ్యం, పాఠశాల విద్యార్థినులకు సైకిళ్లు, దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికి పక్కా ఇళ్ల నిర్మాణం వంటి పథకాలతో ప్రజల్లో చెరగని ముద్ర వేశారు. ఒకప్పటి ముఖ్యమంత్రి, ఒడిశా ప్రజల ఆరాధ్య దైవం బిజూ పట్నాయక్ కుమారుడైన నవీన్ పట్నాయక్ తనపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ఎన్నడూ వమ్ము చేయలేదు. బొగ్గు, బాక్సైట్, ఉక్కు, ఇతర ఖనిజాలు సమృద్ధిగా ఉండడంతో వాటిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేశారు. మైనింగ్ కార్యకలాపాలతోనే మధ్య తరగతి జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. గత అయిదేళ్లలో రాష్ట్ర జీడీపీ సగటున 6.66 శాతం పెరుగుతూ వచ్చింది. ఆదివాసీల జీవన ప్రమాణాలను పెంచడానికి చర్యలు చేపట్టారు. గత ఏడాది దేశవ్యాప్తంగా నెలకొన్న మోదీ ప్రభంజనంలోనూ నవీన్ పట్నాయక్ సొంతంగానే అఖండ మెజార్టీని సొంతం చేసుకున్నారు. 147 అసెంబ్లీ స్థానాలకు 117 కైవసం చేసుకున్నారు. 21 లోక్‌సభ స్థానాల్లో 20 సీట్లలో విజయకేతనం ఎగురవేశారు. నవీన్‌కు ఎందుకింత ఆదరణ? సిక్కింలో పవన్‌కుమార్ చామ్లింగ్, త్రిపురలో మాణిక్ సర్కార్, పశ్చిమ బెంగాల్లో జ్యోతిబసు.. ఒకే రాష్ట్రాన్ని అత్యధిక కాలం పరిపాలించిన ముఖ్యమంత్రుల సరసన నవీన్ పట్నాయక్ కూడా చేరారు. నాలుగేళ్లు వరసగా అధికారం దక్కించుకోవడానికి ఎన్నో కారణాలున్నాయి. పెళ్లి చేసుకోకుండా ప్రజాసేవకే జీవితాన్ని అంకితం చేశారని జనం బలంగా నమ్మడం మొదటి కారణం. రెండోది– ప్రతిపక్షాల బలహీనతలు. కాంగ్రెస్ పార్టీలో జేబీ పట్నాయక్ హవా తగ్గిపోయాక నవీన్ పట్నాయక్‌ను ఢీకొట్టే నాయకుడే కనిపించలేదు. బీజేపీ కూడా ఇప్పటివరకు సమర్థుడైన నాయకుడ్ని తయారు చేయలేకపోయింది. 2008లో ఆదివాసీల అభ్యన్నతి కోసం పనిచేస్తున్న ఆస్ట్రేలియాకు చెందిన మత ప్రచారకుడు గ్రహం స్టెయిన్స్, ఆయన పిల్లల్ని వీహెచ్‌పీ కార్యకర్తలు ఖందమాల్లో దారుణంగా హత్య చేశారన్న ఆరోపణతో ఇరువర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. దీంతో అప్పటివరకు ఎన్డీయేతో ఉన్న నవీన్ పట్నాయక్ ఆ కూటమితో తెగదెంపులు చేసుకొని సెక్యులర్ నాయకుడిగా ఎదిగారు. వరదలు, ప్రకృతి వైపరీత్యాల బారిన పడే ఒడిశాలో 2013లో ఫైలాన్ తుపాను సమయంలో ఆయన చూపించిన సన్నద్ధత తీసుకున్న చర్యల్ని ఐక్యరాజ్య సమితి కూడా ప్రశంసించింది. అంతర్గత పోరే ఎసరు పెడుతుందా? నవీన్ పట్నాయక్‌కు జనంలో ఎంత చరిష్మా ఉన్నా.. సొంత పార్టీలో వ్యతిరేకత ఈసారి బలంగానే కనిపిస్తోంది. రెండో స్థాయి నాయకత్వాన్ని ఎదగనీయకుండా పార్టీని తన గుప్పెట్లో ఉంచుకోవడం మైనస్‌గా మారింది. గత కొన్నేళ్లలో 36 మంది మంత్రులపై ఏకపక్షంగా వేటు వేశారు. బీజేడీని స్థాపించిన తొలినాళ్లలో నవీన్‌కు అండదండగా ఉన్నవారినే తొలగించారు. వ్యవస్థాపక సభ్యుడు బిజయ్ మహాపాత్రో, రాజకీయ సలహాదారు పైరిమోహన్ మహాపాత్రో వంటి వారిని చాలా ఏళ్ల క్రితమే పార్టీ నుంచి గెంటేశారు. మూడేళ్లుగా నవీన్ పట్నాయక్ ప్రైవేటు సెక్రటరీ వి.కె.పాండ్యన్ ఆడింది ఆటగా మారింది. పోస్కో స్టీల్‌ప్లాంట్, మరికొన్ని నేచురల్ ప్రాజెక్టుల చుట్టూ వివాదాలు నెలకొన్నాయి. పాండ్యన్ రాజ్యాంగేతర శక్తిగా ఎదగడంతో ఎంపీ బలభద్ర మాఝి, ఎమ్మెల్యేలు సుకాంత నాయక్, త్రినాథ్ గొమాంగో పార్టీని వీడారు. బీజేపీ బలం ఎలా పెరుగుతోందంటే.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా చాలాకాలంగా ఒడిశాపై దృష్టి పెట్టారు. 120+ సీట్లు లక్ష్యంగా పని చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టపరచడానికి షా.. వ్యూహంతో ముందుకెళ్తున్నారు. మోదీ, షా తరచూ ఒడిశాలో పర్యటిస్తున్నారు. 2012లో 36 జిల్లా పరిషత్‌లను సాధించిన బీజేపీ, గత ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో ఏకంగా 297 స్థానాల్లో గెలుపొందింది. ఇది కచ్చితంగా నవీన్ పట్నాయక్ సర్కార్‌కు డేంజర్ బెల్స్ మోగినట్టేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక బలభద్ర మాఝీ వంటి వారి చేరికతో మరింత బలం చేకూరింది. బాలాకోట్ దాడుల తర్వాత ఒడిశాలో జాతీయ భావం బాగా పెరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి క్రేజ్ పెరిగింది. ఇవన్నీ బీజేపీకి కలిసొచ్చే అంశాలు. అయితే రాష్ట్ర స్థాయిలో పేరున్న నాయకుడు లేకపోవడం ఆ పార్టీకి మైనస్‌గా మారింది. మరోవైపు రాహుల్ గాంధీ కూడా హిందీ రాష్ట్రాల్లో గెలుపొందిన ఆత్మవిశ్వాసంతో ఒడిశాలో పార్టీ బలోపేతానికి ప్రయత్నాలైతే చేస్తున్నారు. తరచూ ఒడిశా వెళుతూ క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తున్నారు. మొత్తమ్మీద చూస్తే బీజేడీ వర్సెస్ బీజేపీ మధ్య పోటీ ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. ఎన్నికల్లో ప్రభావం చూపే అంశాలు ఆకలి మరణాలు, ఆదివాసీలు ఎక్కువుండే ఈ రాష్ట్రంలో కోటి మంది కరువు ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు నిరుద్యోగం 6.6 శాతానికి చేరుకుంది. 85 లక్షల మంది యువత ఉద్యోగాల్లేక ఖాళీగా ఉన్నారని అధ్యయనాలు చెబుతున్నాయి వ్యాపారాలన్నీ అగ్రవర్ణాల చేతుల్లోనే ఉండటంతో సామాన్యుల్లో అసంతృప్తి.. ప్రజా పంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తం బీజేడీ అనుకూల అంశాలు సీఎం నవీన్ పట్నాయక్‌పై జనంలో సడలని నమ్మకం 19 ఏళ్లలో అభివృద్ధి, సంక్షేమాలతో పాటు పారిశ్రామిక ప్రగతి మహిళలకు 33 శాతం టికెట్ల కేటాయింపు ప్రతికూల అంశాలు 19 ఏళ్లుగా అధికారంలో ఉండడంతో ప్రభుత్వ వ్యతిరేకత బీజేడీ నుంచి నాయకులు పార్టీని వీడడం బీజేపీ అనుకూల అంశాలు క్షేత్ర స్థాయిలో పెరుగుతున్న పట్టు బీజేడీ నుంచి తరలివస్తున్న నాయకగణం పుల్వామా తర్వాత ప్రజల్లో పెరిగిన దేశభక్తి ప్రతికూల అంశాలు సమర్థులైన నాయకుల కొరత నవీన్ పట్నాయక్‌కు ఉన్న జనాకర్షణ -
ఐదేళ్లలో 5 రెట్లు పెరిగిన ఒడిశా సీఎం ఆస్తులు
భువనేశ్వర్ : దేశంలోనే అత్యంత నిరాడంబరుడైన ముఖ్యమంత్రుల్లో నవీన్ పట్నాయక్ ఒకరు. అలాంటిది గడిచిన ఐదేళ్లలో ఆయన ఆస్తుల విలువ దాదాపు ఐదు రెట్లు పెరిగింది. అయితే ఇందులో కొత్తగా కూడబెట్టిన ఆస్తులేవి లేవు. గతంలో ఉన్న ఆస్తుల మార్కెట్ విలువ పెరగడం వల్లే ప్రస్తుతం ఆయన ఆస్తి ఐదు రెట్లు పెరిగిందంటున్నారు అధికారులు. నిన్ననే హింజిలీ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఛత్రాపూర్ సబ్ కలెక్టర్ ఆఫీసులో నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నవీన్ పట్నాయక్ ప్రస్తుతం తన పేర రూ. 63 కోట్ల ఆస్తులున్నట్లుగా ఎన్నికల ప్రమాణపత్రంలో పేర్కొన్నారు. అయితే 2014 నాటికి బంగారం, నగదు, ఇళ్లు, వాహనాల మొత్తం కలిపి రూ. 12 కోట్ల ఆస్తులున్నట్లు చూపించారు. ప్రస్తుతం వీటి విలువ ఐదురెట్లు పెరగడంతో ఆస్తి మొత్తం రూ.63 కోట్లు అయ్యింది. ప్రస్తుతం నవీన్ పట్నాయక్ చేతిలో రూ. 25 వేల నగదుతో పాటు తొమ్మిదివేల రూపాయలు విలువ చేసే 1980 నాటి మోడల్ అంబాసిడర్ కార్ ఉన్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా నవీన్ పట్నాయక్ తొలిసారి రెండు అసెంబ్లీ స్థానాల బరిలో నిలువనున్నారు. అందులో ఒక స్థానం హింజిలీ కాగా మరొకటి బిజేపూర్. -
నవీన్ పట్నాయక్ నామినేషన్ దాఖలు
భువనేశ్వర్: ఒడిషా ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్ పార్టీ (బీజేడీ) అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ బుధవారం నామినేషన్ వేశారు. ఆయన మొదటిసారి రెండు అసెంబ్లీ స్థానాల బరిలో నిలువనున్నారు. అందులో ఒక స్థానం హింజిలీ కాగా మరొకటి బిజేపూర్. ఈ రెండు స్థానాల్లో ఎన్నికలు ఏప్రిల్ 18న రెండో దఫాలో జరగనున్నాయి. హింజిలీ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఛత్రాపూర్ సబ్ కలెక్టర్ ఆఫీసులో నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశానని, త్వరలోనే బిజేపూర్‌లో మరో నామినేషన్‌ను వేస్తానని నవీన్ పట్నాయక్ మీడియాకు తెలిపారు. విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మళ్లీ ఒడిషాలో తామే గెలుస్తామని, బీజేడీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమన్న ధీమాని పట్నాయక్ వ్యక్తం చేశారు. నామినేషన్‌కు ముందు కొందరు బీజేడీ నాయకులతో కలిసి హింజిలీకి సమీపంలోని తరాతరిని దేవాలయాన్ని (గంజం జిల్లా) నవీన్ పట్నాయక్ సందర్శించారు. బీజేడీ అధినేత హింజిలీ నుంచి పోటీచేయడం ఇది ఐదోసారి. -
బీజేపీ, కాంగ్రెస్‌కు సమదూరం: నవీన్
భువనేశ్వర్: లోక్‌సభ ఎన్నికలకు ముందు విపక్షాలు ప్రతిపాదిస్తున్న మహాకూటమిలో చేరబోమని బీజేడీ అధ్యక్షుడు, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌లకు సమాన దూరం పాటిస్తామని బుధవారం తేల్చిచెప్పారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ఏకం కావాలని బీజేపీయేతర పక్షాలు ప్రయత్నిస్తున్న సమయంలో నవీన్ పట్నాయక్ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. మహాకూటమిలో చేరికపై నిర్ణయానికి కొంత సమయం కావాలని ఆయన ఢిల్లీలో చెప్పిన మరుసటి రోజే ఈ విధంగా స్పందించడం గమనార్హం. బీజేడీకి కాంగ్రెస్‌తో రహస్య అవగాహన ఉందని బీజేపీ ఆరోపించగా, బీజేడీ ఎప్పటికీ బీజేపీ పక్షమేనని కాంగ్రెస్ పేర్కొంది. -
మహాకూటమిలో చేరేది లేదు : నవీన్ పట్నాయక్
న్యూఢిల్లీ : మహా కూటమిలో చేరే ఉద్దేశమే లేదని బిజూ జనతాదళ్ అధ్యక్షుడు, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఏర్పాటు చేస్తోన్న మహా కూటమిలోగానీ, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలోగానీ తమ పార్టీ చేరబోదని బుధవారం ప్రకటించారు. దేశంలోని రెండు ప్రధాన పార్టీలకు బీజేడీ దూరంగా ఉండి, వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తుందని నవీన్ పట్నాయక్ తెలిపారు. బీజేడీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ.. రైతుల సమస్యలన్నీ తీర్చుతామని 2014 ఎన్నికలకు ముందు బీజేపీ హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడు అన్నదాతల గురించి పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అందుకే వచ్చే ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటి చేస్తామని వెల్లడించారు. ఒడిశాలో మొత్తం 21 లోక్ సభ స్థానాలున్నాయి. అయితే గత ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ కేవలం ఒక్క స్థానాన్ని మాత్రమే గెలుచుకుందని 20 స్థానాల్లో బీజేడి ఘనవిజయం సాధించిందని గుర్తుచేశారు. దాంతో ఈ సారి ఎన్నికల్లో బీజేపీ ఒడిశాలో ఎక్కువ సీట్ల గెలుపొందాలనే ప్రయత్నంలో ఉంది. ఇక పోతే గత ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ ఒక్కసీటును కూడా దక్కించుకోలేకపోయింది. -
మహాకూటమిలో చేరికపై ఒడిషా సీఎం వ్యాఖ్యలివే..
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికలకు ముందు విపక్ష పార్టీలతో కూడిన మహాకూటమిలో చేరికపై తనకు మరికొంత సమయం కావాలని బీజేడీ నేత, ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ పేర్కొన్నారు. మహాకూటమిలో చేరికకు సంబంధించి తాము ఆలోచించి ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. క్వింటాల్ ధాన్యానికి మద్దతు ధరను రూ 2930కు పెంచాలనే డిమాండ్‌తో బీజేడీ ఆధ్వర్యంలో మంగళవారం దేశ రాజధానిలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పట్నాయక్ మాట్లాడుతూ మోదీ సర్కార్‌పై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. మద్దతు ధర కల్పించడం కేంద్ర ప్రభుత్వ బాధ్యతని, దీని నుంచి కేంద్రం తప్పించుకోలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి తాము పలుసార్లు మద్దతు ధరపై విన్నవించినా పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. బీజేపీ, కాంగ్రెస్‌లకు ఇప్పటివరకూ సమదూరం పాటిస్తున్న బీజేడీ మోదీ సర్కార్‌పై విమర్శలతో విరుచుకుపడటం గమనార్హం. గత నాలుగున్నరేళ్లుగా ఒడిషా ప్రభుత్వం వ్యవసాయంపై రూ 30,000 కోట్లు వెచ్చించిందన్నారు. -
మాజీ ఎంపీ హెలికాప్టర్ సీజ్..!
భువనేశ్వర్ : బీజూ జనతాదళ్ మాజీ ఎంపీ జే పాండా హెలికాప్టర్‌ను అధికారులు సీజ్ చేశారు. గగనతల నిబంధనలు ఉల్లఘించారన్న ఆరోపణలతో ఆయన హెలికాప్టర్‌ను మంగళవారం సీజ్ చేసినట్లు పూరి పోలీసులు వెల్లడించారు. భువనేశ్వర్ సమీపంలోని చిలికా సరస్సు వద్ద నిషేధిత వాతవరణ జోన్లో ఆయన చాపర్‌ను నడిపారని పోలీసులు తెలిపారు. చిలికా సరస్సు ప్రాంతంలో అతి తక్కువ ఎత్తులో హెలికాఫ్టర్ ప్రయాణించిందని ఫారెస్ట్ అధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారించి సీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. చాపర్ సీజ్ చేయడంతో పాటు అతనిపై కేసు కూడా నమోదు చేశామని పోలీసులు తెలిపారు. కాగా బీజూ జనతాదళ్‌కు చెందిన జే పాండా ఇటీవల పార్టీకి, ఎంపీ పదవికి రాజనామా చేసిన విషయం తెలిసిందే. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడతున్నారంటూ పాండాను అంతకు ముందే పార్టీ నుంచి బహిష్కరించారు. -
చర్చ ప్రారంభం.. బీజేడీ ఔట్
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు ఎక్కుపెట్టిన అవిశ్వాస తీర్మానంపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆసక్తి నెలకొంది. భరత్ అనే నేను సినిమాను ప్రస్తావిస్తూ.. అవిశ్వాసం తీర్మాన చర్చను టీడీపీ తరుఫున కేశినేని నానికి బదులు గల్లా జయదేవ్ ప్రారంభించారు. ఇది ఓ ధర్మ యుద్ధమని, పార్లమెంట్ చరిత్రలోనే ఇది చాలా ముఖ్యమైన రోజని అభివర్ణించారు. ఇది మెజారిటీకి, మొరాలిటీకి జరిగే యుద్ధమని గల్లా జయదేవ్ అన్నారు. అయితే లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ ప్రారంభం కావడానికి కంటే ముందే బిజూ జనతాదళ్(బీజేడీ) సభ నుంచి వాకౌట్ చేసింది. విపక్షాలకు మాట్లాడేందుకు ఇచ్చిన సమయం సరిపోదంటూ కాంగ్రెస్ విపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతున్న వేళ, బీజేడీ పక్ష నేత తనకు మైక్ కావాలని తీసుకున్నారు. తాము సభ నుంచి వాకౌట్ చేస్తున్నామని, అవిశ్వాసంతో ఒడిశాకు ఒరిగేదే ఏమీ లేదన్నారు. ఒడిశాకు జరిగే అన్యాయంపై ఏ ప్రభుత్వంపై పట్టించుకోవడం లేదని, అందుకే సభ నుంచి వాకౌట్ చేస్తున్నామని తెలిపారు. తమ రాష్ట్రానికి కేంద్రం చాలా అన్యాయం చేసిందని, కేంద్రం వైఖరికి నిరసనగానే తాము వాకౌట్ చేస్తున్నామని, రెండు మాటలు చెప్పి బయటకు వెళ్లిపోయారు. కాగ, అవిశ్వాసంపై చర్చలో మాట్లాడేందుకు బీజేడీకి స్పీకర్ 15 నిమిషాల సమయం కేటాయించిన సంగతి తెలిసిందే. మొత్తం లోక్‌సభలో బీజేడీ తరుఫున 20 మంది ఎంపీలున్నారు. వీరెవరూ అవిశ్వాసంపై జరిగే ఓటింగ్‌లో పాల్గొనరని తెలిసింది. మరోవైపు అవిశ్వాసంపై చర్చకు స్పీకర్ కేటాయించిన సమయం సరిపోదని, మరికొంత సమయం కావాలని విపక్షాలు కోరుతున్నాయి. అయితే లంచ్ సమయంలో కూడా చర్చను కొనసాగిస్తామని స్పీకర్ చెప్పారు. అవిశ్వాసంపై చర్చలో పాల్గొనకుండా ముందే సభ నుంచి వెళ్లిపోయిన బీజేడీపై కాంగ్రెస్ పార్టీ సైతం సీరియస్ అయింది. బీజేపీకి కొమ్ము కాస్తూ సభ నుంచి వెళ్లిపోతారా? అంటూ వ్యాఖ్యానించింది. -
కాంగ్రెస్ నేతలకు బీజేడీ తీర్థం
పర్లాకిమిడి : భువనేశ్వర్‌లోని నవీన్ పట్నాయక్ నివాసంలో జరిగిన ‘మిశ్రణ పర్వ్’ కార్యక్రమంలో భాగంగా గజపతి జిల్లా నుంచి వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు, సర్పంచ్‌లు, సమితి సభ్యులు, వార్డు మెంబర్లు ముఖ్యమంత్రి సమక్షంలో బీజేడీ పార్టీలో చేరినట్టు మాజీ ఎమ్మెల్యే కోడూరు నారాయణ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ హయాంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి గజపతి జిల్లాలోని కాశీనగర్, గుసాని సమితులకు చెందిన కాంగ్రెస్ నేతలు బీజేడీలో చేరుతున్నారని తెలిపారు. దీంతో పర్లాకిమిడి నియోజకవర్గంలో బీజేడీ పార్టీ మరింత బలోపేతం అయిందన్నారు. మిశ్రణ పర్వ్‌లో జిల్లా బీజేడీ పరిశీలకుడు గోపాల్పూర్ ఎమ్మెల్మే డాక్టర్ ప్రదీప్ కుమార్ పాణిగ్రాహి, బరంపురం ఎంపీ సిద్ధాంత మహాపాత్రో, కేంద్ర మాజీ మంత్రి చంద్రశేఖర సాహు తదితరులు పాల్గొన్నారు. -
ఒడిశాలో ఎన్నికల ముందు సీన్
సాక్షి, హైదరాబాద్ : దేశానికి సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలోనే ఒడిశా రాష్ట్రానికి 2019లోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. నవీన్ పట్నాయక్ నాయకత్వంలో 1997లో ఏర్పాటైన బిజూ జనతా దళ్ 2000 సంవత్సరం నుంచి రాష్ట్ర రాజకీయాలను శాసిస్తోంది. 2004 నుంచి ఇప్పటి వరకు నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఓ ప్రాంతీయ పార్టీ ఇన్నేళ్లు వరుసగా రాష్ట్ర రాజకీయాలను శాసించడం విశేషం. అందుకు ఒడిశాకున్న భిన్నమైన లక్షణం. సంస్కృతే కారణం. ఇక్కడ కాంగ్రెస్ తరహా ఓట్ల రాజకీయాలకు, బీజేపీ తరహా హిందూత్వ రాజకీయాలకు ఆస్కారం లేదు. కుల, మతాల ప్రాతిపదికన ఒడిశా ప్రజలు విడిపోయి లేరు. వారంతా అభివృద్ధి అజెండా, మంచి పాలన ప్రాతిపదికన ఓటేస్తున్నారు. రాష్ట్రంలో 96 శాతం హిందువులు ఉన్నప్పటికీ హిందూత్వ రాజకీయాలకు ఇక్కడి ప్రజలు దూరంగా ఉన్నారు. వారిపై భిన్న సంస్కృతుల ప్రభావం కనిపిస్తున్నది. ఖండాయత్ సామాజిక వర్గం బలమైనప్పటికీ రాజకీయాల్లో వారి పాత్ర తక్కువే. దాదాపు 40 శాతం మంది ఎస్సీ, ఎస్టీలు ఉన్నప్పటికీ ఓటింగ్ సరళి కులాల ప్రాతిపదికన సాగినట్లు కనిపించదు. బ్రాహ్మణులు, కరణాలు రాష్ట్రంలో తక్కువే ఉన్నప్పటికీ గత 70 ఏళ్లుగా రాష్ట్ర రాజకీయాల్లో వారి ప్రభావం కనిపిస్తోంది. అంటే ఒక విధంగా అర్ధ భూస్వామ్య వ్యవస్థ ప్రభావం కనిపిస్తోంది. మతాల ప్రాతిపదిక ప్రజలను రాజకీయంగా సమీకరించేందుకు ఇక్కడ అక్కడక్కడ ప్రయత్నాలు జరిగాయి. గతేడాది జరిగిన భద్రక్ హింసాకాండే అందుకు ఉదాహరణ. ముఖ్యంగా ఓ పార్టీ మతం ప్రాతిపదికన ప్రజలను విభజించేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. అంతే బలంగా ఆ రాజకీయాలను తిప్పి కొట్టేందుకు ప్రయత్నాలు జరిగాయి. మత రాజకీయాలకన్నా అభివృద్ధినే ప్రజలు ఎక్కువగా కోరుకుంటున్నందున ఒడిశా ప్రజలు సామరస్య జీవనానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. కంధమాల్ హింసాకాండ కూడా అలాంటిదే. కుల, మతాల ప్రాతిపదికన అక్కడ ప్రజల సమీకరణకు బలమైన ప్రయత్నాలు జరిగాయి. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అక్కడ బీజేపీ అందుకే లాభ పడింది. అయితే అన్ని ప్రాంతాల్లో అలా జరగలేదు. రాజకీయ, ఆర్థిక అభివృద్ధి ఎజెండానే నమ్ముకున్నందున ఇంతకాలం బీజేడి అధికారంలో కొనసాగుతూ వస్తోంది. వచ్చే ఎన్నికల్లో కూడా అదే ఎజెండా కాబోతోందా? అదే విజయాన్ని అందిస్తోందా? అసలు బీజేడీ హయాంలో అభివృద్ధి ఎంత జరిగింది ? మరే ఇతర అంశాలు రానున్న ఎన్నికలను ప్రభావితం చేయనున్నాయి? ఇతర పార్టీల వైఖరీ, ఎజెండాలేమిటీ? ప్రజలు ఎవరి గురించి ఏం అనుకుంటున్నారు? మొత్తంగా ఏ అంశాలు ఓటింగ్ రాజకీయాలను శాసిస్తాయి? అన్న ప్రశ్నలకు సమాధానాలు రాబట్టేందుకు పీపుల్స్ పల్స్ రాజకీయ, సామాజిక అధ్యయన, పరిశోధన సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా 20వేల కిలోమీటర్లు ప్రయాణించి వివిధ వర్గాల ప్రజల అభిప్రాయాలను, దృక్పథాలను నేరుగా అడిగి తెలుసుకుంది. విద్యావేత్తలను, యూనివర్శిటీ ప్రొఫెసర్ల అభిప్రాయలను కూడా పరిగణలోకి తీసుకుంది. నవీన్ పట్నాయక్‌కు కలసివచ్చే అంశాలు...ప్రతికూలించే అంశాలు 1. రూపాయికి కిలోబియ్యం, ఐదు రూపాయలకు ఆహార పథకం. విద్యార్థినులకు సైకిళ్లు, ఉచిత గొడుగులు. స్వయం ఉపాధి బృందాలకు రుణాలపై వడ్డీ మాఫీ, ప్రతిభగల విద్యార్థులకు ఉచితంగా లాప్‌టాప్‌లు. తమళపాకుల వ్యాపారంలో వాటిని ఏరే వారికి వాటా. 2. ముఖ్యమంత్రిగా నాయకత్వ లక్షణాలు. ఆయనకు ప్రత్యామ్నాయ నాయకుడు కనిపించడం లేదు. 3. సుదీర్ఘకాలంగా ప్రభుత్వంలో ఉన్నందున బీజేడీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ప్రభుత్వం వ్యతిరేకత కనిపిస్తోంది. 4. యువతలో నిరుద్యోగ సమస్య. ధరల పెరుగుదల 5. భూ కుంభకోణాలు, మైనింగ్ స్కాములు, చిట్‌ఫండ్ స్కాములున్నా అవి పట్నాయక్ ప్రభుత్వంపై ప్రభావం చూపించడం లేదు. 6. స్థానిక ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా బీజేపీ ఉత్సాహంగా ఉంది. చాలా చోట్ల అధికార బీజేడీకి గట్టిపోటీ బీజేపీయే కానుంది. 7. ఆందోళనకరమైన పరిస్థితి కాంగ్రెస్‌దే. ప్రధాన పోటీ బీజేడీతో కాకుండా ప్రతిపక్ష పార్టీ హోదా కోసం బీజేపీతోనే కాంగ్రెస్ పార్టీ పోడాల్సి వస్తోంది. 8. రాష్ట్రంలో ధరల పెరుగుదలకు ఎవరు కారణం అన్న ప్రశ్నకు 60 శాతం మంది ప్రజలు కేంద్రం అని, 40 శాతం మంది ప్రజలు రాష్ట్రమని సమాధానమిచ్చారు. 9. మహానది జలాల సమస్య. వ్యవసాయ సంక్షోభం. 10. ఆందోళనలో రైతులు. విత్తనాలు, ఎరువుల ధరలు ఎక్కువ. గిట్టుబాటు ధర తక్కువ. స్థానికంగా మార్కెట్ సౌకర్యాలు మృగ్యం. కొందరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే కొందరు వలసపోతున్నారు. 11. కొన్ని ప్రాంతాల్లో మంచినీటికి, వ్యవసాయానికి నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. 12. గ్రామాలకు కలిపే లింకు రోడ్డు సరిగ్గా లేవు. చాలా ప్రాంతాల్లో ఆరోగ్య సౌకర్యాలు అంతంత మాత్రమే. 13. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల కొరత. ప్రభుత్వ దిగువ స్థాయిలో అవినీతి ఎక్కువగా ఉంది. పోలీసు స్టేషన్లు, ఆస్పత్రుల్లో కూడా చేయి తడిపితేగానీ పనులు కావడం లేదు. 14. పెద్ద స్కామ్‌ల ప్రభావం పెద్దగా లేకపోయినా స్థానికంగా అవినీతిని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. 15. హిందూత్వ ప్రభావం లేదు. 16. తెలంగాణలాగా కొన్ని ప్రాంతాల్లో ప్రాంతీయ వాదం కనిపించినా అంత బలంగా లేదు. కోస్తా నుంచి వేరన్న భావన పశ్చిమ ప్రాంతంలో లేదు. అయినప్పటికీ ప్రాంతీయ వాదాన్ని, అటు ఓబీసీల అభివృద్ధి ఎజెండాతో బీజేపీ లాభ పడాలని చూస్తోంది. 17. అగ్రవర్ణాలు, ఓబీసీల మద్దతు ఎక్కువగా పాలకపక్ష బీజేడీకే ఉంది. కాంగ్రెస్‌కు దళితులు, ఆదివాసీలు, క్రైస్తవుల మద్దతు ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో బీజేడీకి గట్టి పునాదులుండగా, పట్టణ ప్రాంతాల్లో బీజేపీ బలపడుతోంది. 18. కాంగ్రెస్‌కు స్థానిక నాయకుల కొరత ఉంది. పార్టీలో అంతర్గత విభేదాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 19. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ధర్మేంద్ర ప్రధాన్‌ను ముందుకు తీసుకొచ్చింది. 20. పంచాయతీ ఎన్నికల్లో విజయంతో ఉత్సాహంగా ఉన్న బీజేపీ, బీజేడీకి గట్టిపోటీ ఇవ్వనుంది. -
బీజేడీ నేత జే పాండా పార్టీకి రాజీనామ
-
ఈ నేల నాకెంతో ప్రత్యేకం : మోదీ
కటక్ : ‘ఈ నేల నాకెంతో ప్రత్యేకం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి ఎందరో మహానుభావులు జన్మించిన పవిత్ర స్థలం కటక్‌లో ఎన్డీయే ప్రభుత్వ నాలుగో వార్షికోత్సవాన్ని జరుపుకోవడం నాకెంతో గర్వకారణంగా ఉంది’ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు నాలుగేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా కటక్‌లో బీజేపీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగించారు. ‘ఈ నాలుగేళ్ల పాలన.. 125 కోట్ల మంది భారతీయులకు దేశం అభివృద్ధి దిశగా దూసుకుపోతోందనే నమ్మకాన్ని ఇచ్చిందన్నారు. గత అరాచక ప్రభుత్వం నుంచి విముక్తి కలిగించి సుపరిపాలన అందిస్తున్నామంటూ’ మోదీ వ్యాఖ్యానించారు. దేశాన్ని పురోగమనంలో నడిపించేందుకు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడానికి తమ ప్రభుత్వం వెనుకాడబోదని మోదీ పేర్కొన్నారు. పేద ప్రజలకు బ్యాంకు అకౌంట్ ఖాతా తెరవడం, జీఎస్టీ ద్వారా ఆర్థిక సంస్కరణలకు నాంది పలకడం, బలమైన విదేశాంగ విధానాన్ని ప్రవేశపెట్టడం వంటి అంశాలు దేశ భవిష్యత్తు పట్ల తమ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను తెలియజేస్తున్నాయన్నారు. సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించడం ద్వారా శత్రుదేశాలకు గట్టి హెచ్చరికలు జారీ చేశామని మోదీ వ్యాఖ్యానించారు. కాగా 2014 ఎన్నికల్లో భాగంగా వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన బీజేపీ.. ఒడిశాలో కూడా అధికారాన్ని చేజిక్కించుకోవాలని శాయశక్తులా ప్రయత్నించింది. కానీ నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీని ఎదుర్కోలేక కేవలం పది స్థానాలకే పరిమితమైంది. -
కుమారస్వామి ప్రమాణానికి ఆయనెందుకు రాలేదు?
బెంగళూరు/భువనేశ్వర్: నరేంద్ర మోదీ ప్రాభవానికి, ఎన్డీఏ వరుస విజయాలకు అడ్డుకట్టవేసే క్రమంలో ఒక్కటవుతోన్న విపక్ష పార్టీలు నేడు ఓకే వేదికపై చేరాయి. జనతాదళ్(సెక్యూలర్) చీఫ్ హెచ్డీ కుమారస్వామి బుధవారం కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి బీజేపీ వ్యతిరేక పార్టీల అధినేతలంతా హాజరయ్యారు. ముగ్గురు తప్ప! వారు.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్, బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్. కేసీఆర్, స్టాలిన్లు కుమార ప్రమాణానికి రాలేకపోవడానికి గల కారణాలను ఇదివరకే ప్రకటించారు. బీజేపీ-కాంగ్రెసేతర ఫ్రంట్ కోసం యత్నిస్తోన్న కేసీఆర్.. రాహుల్ గాంధీతో వేదిక పంచుకోవడం ఇష్టంలేదు. అందుకే మంగళవారమే బెంగళూరు వెళ్లి కుమారస్వామి, దేవేడౌడలను కలిసొచ్చారు. తమిళనాడులోని తూత్తుకుడిలో వేదాంత కాపర్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా ఉద్యమం తీవ్రతరం కావడంతో తాను రాలేనని డీఎంకే నేత స్టాలిన్ కుమారస్వామికి వర్తమానం పంపారు. అయితే నవీన్ పట్నాయక్ మాత్రం స్పష్టమైన కారణాలేవీ వెల్లడించలేదు. 2019 ఎన్నికల నేపథ్యంలో బెంగళూరు వేదికగా విపక్షాల ఐక్యతను చాటిచెప్పాలని ఆయా నేతలు భావిస్తున్నవేళ నవీన్ గైర్హాజరు రాజకీయంగా చర్చనీయాంశమైంది. నవీన్ ఎందుకు రాలేదు?: 18 ఏళ్లుగా ఒడిశాలో అధికారంలో కొనసాగుతోన్న నవీన్ పట్నాయక్.. తొలి నుంచీ ఢిల్లీ రాజకీయాలపట్ల అనాసక్తిని ప్రదర్శిస్తూ వచ్చారు. అయితే కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా వారితో సఖ్యతగా మెలగటం అలవాటుగా మార్చుకున్నారు. ఇప్పుడు ఎస్పీ, బీఎస్పీ, టీడీపీ, టీఆర్ఎస్, ఎన్సీపీ, టీఎంసీ తదితర పార్టీలన్నీ బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కటవ్వాలని భావిస్తున్న సందర్భంలోనూ నవీన్ స్థిమితంగా ఉండిపోయారుతప్ప కూటమిలో కలిసేందుకు పెద్దగా ఆసక్తిని ప్రదర్శించలేదు. ఒకవైపు ఒడిశాలో తన ప్రత్యర్థి బీజేపీనే అయినా.. కాషాయ వ్యతిరేక కూటమిలో చేరికపై నవీన్ నిర్లిప్తత ఒకింత ఆశ్చర్యం కలిగించకమానదు. మైనింగ్ కుంభకోణం, శారద స్కామ్ వంటి కేసుల్లో బీజేడీ పెద్ద తలల ప్రమేయం ఉండటం, ఆ కేసుల్లో సీబీఐ నేతృత్వంలో కొనసాగుతోన్న దర్యాప్తు.. కేంద్రం సూచనలకు అనుగుణంగా జరుగుతుండటం తదితర కారణాల వల్లే నవీన్ బీజేపీపై గట్టిగా గళం విప్పడంలేదని ఒడిశా కాంగ్రెస్ ఆరోపిస్తోంది. విచిత్రమేమంటే బీజేపీ కూడా నవీన్-కాంగ్రెస్‌ల సయోధ్యపై సరిగ్గా ఇలాంటి వ్యాఖ్యానాలే చేస్తుంది. ఇటు బీజేపీకి-అటు కాంగ్రెస్‌కు సమదూరాన్ని పాటించే నవీన్ పట్నాయక్.. ఏ ఒక్క పార్టీని వ్యతిరేకించే కూటమిలోనో చేరబోరని బీజేడీ వర్గాలు పేర్కొన్నాయి. అందుకే ఆయన కుమారస్వామి ప్రమాణస్వీకారానికి ఉద్దేశపూర్వకంగానే గైర్హాజరవుతున్నట్లు తెలిసింది. -
బీజేపీయే మహా అడ్డు
భువనేశ్వర్ : రాష్ట్రంలో మహా నది నీటి ప్రవాహాన్ని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) అడ్డుకుంటుందని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆరోపించారు. మహా నది జలాల పంపిణీ వివాదంపై బిజూ జనతా దళ్(బీజేడీ) రాష్ట్ర శాఖ కార్యాలయంలో ఆదివారం ప్రత్యేక వర్కు షాపు కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలో తీవ్ర కలకలం రేకెత్తిస్తున్న మహా నది జలాల వివాదంపై పార్టీ శ్రేణుల్లో అవగాహన పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో మహా నది జలాలు అడుగంటి పోతున్నాయన్నారు. ఛత్తీస్గడ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పాలిత ప్రభుత్వం మహా నది ఎగువ భాగంలో అక్రమ కట్టడాలు చేపట్టి రాష్ట్రంలో లోతట్టు ప్రాంతాలకు మహా నది జలాల ప్రవాహాన్ని అడ్డుకుంటుందని బాహాటంగా ఆరోపించారు. ఈ వివాదం పరిష్కారానికి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి అభ్యర్థించిన పెడ చెవిన పెట్టడంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించినట్టు గుర్తు చేశారు. ఈ పరిస్థితుల దృష్ట్యా పార్టీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల దగ్గరకు వెళ్లి మహా నది జలాల పంపిణీ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. మహా నది ఇరు వైపులా విశేష సంఖ్యలో మొక్కలు నాటి హరిత పర్యావరణ పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా హరిత మహా నది కార్యక్రమాన్ని చేపట్టినట్టు ప్రకటించారు. ప్రాంతీయ పార్టీగా కేంద్రంలో పాలనా పగ్గాలు చేపట్టే అవకాశం లేనందున రాష్ట్ర పురోగతి కుంటుపడుతుందని పార్టీ ఎంపీలు విచారం వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలంతా సమైక్యంగా కృషి చేసి రానున్న ఎన్నికల్లో మహా నది ప్రధాన శీర్షికగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. మహా నది తీర ప్రాంతాల్లో 15 ప్రభావిత జిల్లాల్లోని పార్టీ నాయకులు, కార్యకర్తలతో పార్టీ కార్యాలయంలో మహా సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. ఈ 15 జిల్లాలకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తలు, ఇతరేతర అనుబంధ వర్గాలు మహా సమ్మేళనంలో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా మహా నదిపై చైతన్య సంచికను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. -
కాంగ్రెస్‌కు గుడ్‌బై
బరంపురం:బరంపురం మున్సిపల్ కార్పొరేషన్‌లోని 10 మంది కాంగ్రెస్ కార్పొరేటర్లు అధికార బీజేడీలో ఆదివారం చేరారు. అధికార బీజేడీ ఆపరేషన్ ఆకర్‡్ష పేరుతో ఇతర పార్టీ నాయకులను తమ పార్టీలోకి చేర్చుకుంటుంది. దీనిలో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి చంద్రశేఖర్ సాహు ఇటీవలే అధికార పార్టీలో చేరారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న కాంగ్రెస్ కార్పొరేటర్లు ఆయన వెంట వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీంతో 10 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేడీలో చేరారు. బీజేడీలో చేరిన వారు 4వ వార్డు కార్పొరేటర్ అనిల్ నాయక్, 5వ వార్డు కార్పొరేటర్ మురళీకృష్ణ, 6వ వార్డు కార్పొరేటర్ రంజిత్ నాయక్, 20వ వార్డు కార్పొరేటర్ లిల్లి బెహరా, 21వ వార్డు కార్పొరేటర్ గీతా మాధురి, 29వ వార్డు కార్పొరేటర్ సంజుక్త్ పాత్రో, 32వ వార్డు కార్పొరేటర్ ప్రియాంక చౌదరి, 33వ వార్డు కార్పొరేటర్ ఎమ్.మీనాక్షి, 34వ వార్డు కార్పొరేటర్ శ్రీనివాసరావు, 40వ వార్డు కార్పొరేటర్ మినతి బిశాయిలు కేంద్ర మాజీ మంత్రి చంద్రశేఖర్ సాహు సమక్షంలో అధికార బీజేడీలో చేరారు. వీరంతా ఈ నెల 4వ తేదీన స్థానిక కళ్లికోట్ మైదానంలో నిర్వహించే మిశ్రమ సమ్మేళన పర్బ్‌లో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సమక్షంలో అధికారికంగా బీజేడీలో చేరనున్నారు. -
‘అపరేషన్ అకర్ష్’
బరంపురం : రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఒడిస్సాలో రాజకీయాలు పలు మలుపులు తిరుగుతున్నాయి. 2019లో రానున్న సాధారణ ఎన్నికలకు ముందుగా ఒడిస్సాలో మరో నాలుగు నెలల్లో జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను సెమీఫైనల్స్‌గా భావించి ఒకవైపు అధికార పార్టీ బీజేడీ..మరోవైపు జాతీయ పార్టీ బీజేపీ పరస్పర ఎన్నికల యుద్ధానికి ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నాయి. ఇందుకు ప్రధానంగా ఒక వైపు దక్షిణ ఒడిస్సా కేంద్ర బిందువు బరంపురం..మరోవైపు పశ్చిమ ఒడిస్సా ప్రాణకేంద్రం సంబల్పూర్ నగరాలు వేదికలు కానున్నాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 4న బీజేడీ బరంపురం నగరంలోను, 5వ తేదీన బీజేపీ సంబల్పూర్లోను మిశ్రమ సమ్మేళన్ పర్బ్ పేరుతో ‘అపరేషన్ అకర్ష్’ చేపట్టి తమ తమ ప్రత్యర్థి పార్టీల నుంచి భారీ స్థాయిలో వలసలనుపోత్సహించేందుకు ఇరు పార్టీలు తమదైన రాజకీయ శైలిలో పావులు కదుపుతున్నాయి. అమిత్ షా–నవీన్ ‘ఢీ’ ఏప్రిల్ 4, 5 తేదీల్లో బీజేడీ, బీజేపీ చేపట్టే మిశ్రమ సమ్మేళన్ వేర్వేరు బహిరంగ మహాసభల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ‘ఢీ’ కొడుతున్నారు. ఏప్రిల్ 4వ తేదీన అధికార రాష్ట్ర బీజేడీ పార్టీ బరంపురం కళ్లికోట్ కళాశాల మైదానంలో నిర్వహించనున్న మిశ్రమ సమ్మేళన్ పర్బ్కు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ హాజరుకానుండగా..మరుసటి రోజు 5వ తేదీన సంబల్పూర్లో బీజేపీ మిశ్రమసమ్మేళన్ పర్బ్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పాల్గొంటున్నారు. గత ఎన్నికల్లో పశ్చిమ ఒడిస్సాలో బీజేపీ తన ఓటు బ్యాంక్‌ను పెంచుకుని రెండో స్థానంలో ఉండగా వచ్చే 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించేందుకు అమిత్ షా ఎన్నికల చదరంగంలో పావులు కదుపుతున్నారు. ఇందుకు 5వ తేదీన పశ్చిమ ఒడిస్సా, సంబల్పూర్లో జరగనున్న బీజేపీ మిశ్రమ సమ్మేళన్ సభలో భారీ స్థాయిలో యువ శక్తిని పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే రీతిలో 4వ తేదీన దక్షిణ ఒడిస్సా, బరంపురంలో జరగనున్న అధికార పార్టీ బీజేడీ మిశ్రమ సమ్మేళన్ పర్బ్‌లో స్థానిక రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి, స్థానిక మాజీ ఎంపీ చంద్ర శేఖర్ సాహు, ఏఐసీసీ సభ్యుడు విక్రమ్ పండా, డీసీసీ అధ్యక్షుడు భగవాన్ గంతాయత్లతో పాటు కాంగ్రెస్ నాయకులు బీజేడీలో చేరనున్నారు. కాంగ్రెస్ కంచుకోటకు బీటలు? ఒకప్పుడు కంచుకోటగా ఉన్న గంజాం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం బీటలు వారుతున్నాయి. గంజాం జిల్లా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రముఖ నాయకులంతా అధికార పార్టీ బీజేడీ పార్టీలోకి వలస పోతుండడంతో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కానరాకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. గతంలో బరంపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆర్.జగన్నాథ్ రావు 7 సార్లు పోటీ చేసి వరుస విజయాలు సాధించిన ఘనత ఉంది. మరోవైపు అత్యధికంగా తెలుగు ప్రజల ఓట్లు ఉండే బరంపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి అప్పటి దేశ ప్రధాని పీవీ నరసింహారావు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసి అత్యధిక మెజార్టీతో విజయం సాధించడంతో దేశంలోనే కాంగ్రెస్ పార్టీకి బరంపురం కంచుకోటగా నిలిచింది. కాంగ్రెస్ కంచుకోటగా ఘనచరిత్ర ఉన్న బరంపురం ప్రస్తుత వలసలతో జిల్లాలో కాంగెస్ కానరాకుండా పోయే దయనీయ పరిస్థితి ఏర్పడింది. -
అవిశ్వాస తీర్మానం; ఆ పార్టీలు ఎటువైపు?
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన పోరాటంలో భాగంగా కేంద్ర సర్కారుపై వైఎస్సార్సీపీ, టీడీపీలు ఇచ్చిన అవిశ్వాసతీర్మానాలు నేడు లోక్‌సభ ముందుకు రానున్నాయి. ముందు టీడీపీ తీర్మానం చర్చకు వచ్చినా మద్దతు ఇస్తామని వైఎస్ జగన్ ఇదివరకే ప్రకటించారు. కాంగ్రెస్, సీపీఎంలు సైతం అవిశ్వాసానికి బేషరతుగా మద్దతు పలికాయి. అయితే ఎన్డీఏ ఏతర పార్టీల్లో అత్యధికులు అవిశ్వాసానికి మద్దతు పలకగా, ఎన్డీఏ మాజీ మిత్రులు మాత్రం గుంభనంగా వ్యవహరిస్తున్నారు. పార్లమెంట్లో 28 మంది ఎంపీలు(20 లోక్‌సభ, 8 రాజ్యసభ) ఉన్న బిజూ జనతాదళ్(బీజేడీ) ఇప్పటికీ తన వైఖరిని వెల్లడించలేదు. ఆపార్టీ అధినేత, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ పలు సందర్భాల్లో బీజేపీపై విమర్శలు చేస్తున్నప్పటికీ, తృతీయ లేదా ఫెడరల్ ఫ్రంట్‌లో చేరిక గురించి ఇంకా ఆలోచించలేదని ఇటీవల అన్నారు. కీలకమైన అవిశ్వాసం విషయంలోనూ నవీన్ ఇంకా నిర్ణయాన్ని ప్రకటించకపోవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇటు లోక్‌సభలో 14 మంది ఎంపీలు (అందులో ముగ్గురు జంప్‌జిలానీలు) ఉన్న టీఆర్ఎస్(ఏన్డీఏ కానప్పటికీ) కూడా తన స్టాండ్‌ను బయటపెట్టలేదు. కాగా, గులాబీ ఎంపీలు సభకు గౌర్హాజరయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వినవస్తున్నాయి. టీఆర్ఎస్, అన్నాడీఎంకేలు మళ్లీ..?: రిజర్వేషన్ల అంశంతో టీఆర్ఎస్, తమిళనాడు సమస్యలపై అన్నాడీఎంకే ఎంపీలు లోక్‌సభలో నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదా అంశంలో కేంద్రంపై వైఎస్సార్సీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం శుక్రవారమే సభ ముందుకు వచ్చిన సందర్భంలోనూ.. టీఆర్ఎస్, ఏఐఏడీఎంకేలు నిరసనలు కొనసాగించడం, సభ ఆర్డర్లో లేదన్న కారణంగా స్పీకర్ నీటీసులను తిరస్కరించడం తెలిసిందే. అటుపై వైఎస్సార్సీపీ, టీడీపీలు విడివిడిగా ఇచ్చిన అవిశ్వాసం నోటీసులు సోమవారం సభ ముందుకు రానున్నాయి. అయితే మొన్నటిలాగే నేడు కూడా ఆయా పార్టీలు (వారికున్న హక్కుల మేరకు) నిరసనలకు దిగితే.. మళ్లీ సభలో గందరగోళం తలెత్తేఅవకాశముంది. కాగా, సమావేశాలకు గైర్హాజరయ్యే సభ సజావుగా ఉన్నప్పుడు మాత్రమే అవిశ్వాసంపై చర్చ చేపట్టాలన్న నియమం అందరికీ తెలిసిందే. ఇక ఏఐఏడీఎంకే.. తాను ఎన్డీఏలో లేకపోయినప్పటికీ సర్కారుకు మద్దతిస్తామని చెబుతోంది. మొన్నటిదాకా బీజేపీపై శివాలెత్తిన శివసేన.. తాజాగా అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఓటువేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. -
ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేడీ గెలుపు
భోపాల్/భువనేశ్వర్: మధ్యప్రదేశ్‌లోని రెండు, ఒడిశాలోని ఒక అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ రెండింటిని నిలబెట్టుకోగా, బీజేడీ ఒక చోట గెలుపొందింది. మధ్యప్రదేశ్‌లోని ముంగావోలీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీకి చెందిన మహేంద్ర సింగ్ కలుఖేడా ఆకస్మికంగా మృతి చెందటంతో ఫిబ్రవరి 24వ తేదీన ఉప ఎన్నిక జరిగింది. కాంగ్రెస్ అభ్యర్ధి బ్రజేంద్ర సింగ్ యాదవ్ బీజేపీకి చెందిన బైషాబ్ యాదవ్‌ను 2,124 ఓట్ల తేడాతో ఓడించారు. కొలరస్ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్ధి మహేంద్ర సింగ్ యాదవ్, బీజేపీకి చెందిన దేవేంద్ర జైన్‌పై 8,083 ఓట్లతో గెలుపొందారు. ఒడిశాలోని బిజేపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సుబల్ సాహు గత ఏడాది ఆగస్టులో మృతి చెందటంతో ఇక్కడ ఉప ఎన్నిక జరిపారు. బీజేడీకి చెందిన రితూ సాహు, బీజేపీ అభ్యర్ధి అశోక్ పాణిగ్రాహిపై 41, 933 ఓట్ల తేడాతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్ది ప్రణయ సాహు మూడో స్థానంలో నిలిచారు. -
ప్రజలే దైవాలు
సాక్షి, బరంపురం : ఒడిశా రాష్ట్రంలోని 4 కోట్ల ప్రజలే తమ ఆరాధ్య దైవాలుగా భావిస్తూ ప్రజల మద్దతుతో బీజేడీ 17 ఏళ్లుగా అధికారం చేపడుతూ వివిధ ప్రజాసంక్షేమ పథకాలు అమలు చేసిందని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ చెప్పారు. బీజేపూర్ ఉపఎన్నికలో బీజేడీ పార్టీ అభ్యర్థి తరఫున ప్రచారం చేసేందుకు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మంగళవారం నియోజకవర్గంలో బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా బిజేపూర్‌లో బీజేడీ పార్టీ తరఫున ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ ఒడిశాలో గడిచిన 17 ఏళ్ల బీజేడీ పాలనలో వివిధ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి అమలు చేస్తున్నట్లు చెప్పారు. మనిషి పుట్టిననాడు మమత యోజన నుంచి మనిషి మరణించిన నాడు హరిశ్చంద్ర పథకం వరకు అమలు చేసి ప్రజల వద్దకు పాలనకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. బీజేపూర్ ఉప ఎన్నికలో బీజేడీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థి రీతా సాహును శంఖం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో వేలాదిమంది జనం పాల్గొన్నారు. -
ఏం చేస్తారో..? ఆ నలుగురు
భువనేశ్వర్: బిజేపూర్ ఉపఎన్నికకు అధికార పక్షం బిజూ జనతా దళ్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఈ ఎన్నికలో విజయాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ప్రత్యర్థుల వ్యూహాత్మకచర్యల్ని పటిష్టంగా ఎదుర్కొనేందుకు బిజూ జనతా దళ్ పకడ్బందీ సన్నాహాలు చేస్తోంది. ఉప ఎన్నిక ఆద్యంతాల్లో ప్రత్యర్థులు అవాంఛనీయ సంఘటనలకు పాల్పడి ఓటరును తప్పుదారి పట్టించకుండా చేసేందుకు పార్టీ వ్యూహాత్మక కార్యాచరణ ఖరారు చేసింది. ఉప ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయిన నాటినుంచి ఎంటి మీద కునుకు లేకుండా అధికార పార్టీ వర్గాలుశ్రమిస్తున్నాయి. బిజేపూర్ అసెంబ్లీ సెగ్మెంట్‌ను సొంతం చేసుకునేందుకు బీజేడీ యుద్ధ ప్రాతిపదికన కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో 3 అంచెల్లో పరిశీలకులు, పర్యవేక్షకుల్ని నియమించింది. అసెంబ్లీ, సమితి, పంచాయతీ స్థాయిలో పర్యవేక్షక బృందం కృషి చేస్తోంది. వీరితో పాటు ఒక్కో స్థానిక నాయకుడు ప్రతి 10 కుటుంబాలకు బాధ్యత వహించేందుకు వ్యూహాత్మక పరిశీలన ఏర్పాట్లను బీజూ జనతా దళ్ పూర్తి చేసింది. ఈ వ్యవహారాలకు పార్టీ నుంచి ఎంపిక చేసిన నలుగురు ప్రముఖుల్ని బీజేడీ ఖరారు చేసింది. వీరిలో సుశాంత సింగ్,సంజయ్ కుమార్ దాస్ వర్మ, ప్రణబ్ ప్రకాశ్ దాస్, నిరంజన్ పూజారి ఉన్నారు. మంత్రి సుశాంత్ సింగ్, ప్రణబ్ ప్రకాశ దాస్ బిజేపూర్ సమితి వ్యవహారాల్ని పర్యవేక్షిస్తారు. బర్పాలి సమితిబాధ్యతల్ని మాజీ మంత్రి సంజయ్ కుమార్ దాస్ వర్మకు కేటాయించగా గైసిలేట్ సమితి బాధ్యతల్ని మంత్రి నిరంజన్ పూజారికి కేటాయించారు. ఎంఎల్‌ఏలకూ పనే వీరితోపాటు పార్టీ ఎమేల్యేలంతా వరుస క్రమంలో బిజేపూర్ నియోజకవర్గాన్ని ప్రత్యేక్షంగా సందర్శించేందుకు పార్టీ అధ్యక్షుడు,ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆదేశించారు. వీరంతాఅసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ప్రతి పంచయతీని సందర్శిస్తారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ ఆధీనంలో కొనసాగిన బిజేపూర్ అసెంబ్లీ సెగ్మెంట్లో పాగా వేసేందుకు కాంగ్రెస్‌తో ఉభయ బిజూజనతా దళ్, భారతీయ జనతా పార్టీలు ప్రకటించాయి. కాంగ్రెస్ ఇంతవరకు తమ అభ్యర్థిని ఖరారు చేయలేదు. గాలింపు కొనసాగిస్తోంది. ప్రతి పంచాయతీపై గట్టి నిఘా బిజేపూర్ అసెంబ్లీ సెగ్మెంట్లో ప్రతి పంచాయతీపై ఎమ్మెల్యేలంతా గట్టి నిఘా వేయాలని పార్టీ అధ్యక్షుడు ఆదేశించారు. ఈ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో 59 పంచాయతీలు ఉన్నాయి.ఒక్కో పంచాయతీ బాధ్యతను ఒక్కో ఎమ్మెల్యేకి కేటాయించారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ప్రతి పంచాయతీని ప్రత్యక్షంగాసందర్శించేందకుకార్యక్రమం ఖరారు చేశారు. -
సోషల్ మీడియాతో రిలేషన్
ఎలాగైనా రాష్ట్రంలో పాగా వేసి దీర్ఘకాలంగా అధికారంలో ఉన్న బీజేడీని కూలదోయాలని బీజేపీ ఆరాటం..గత వైభవాన్ని సాధించాలని కాంగ్రెస్ పార్టీ పోరాటం..ఎటువంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొనైనా ఆధిపత్యం నిలబెట్టుకోవాలని అధికార బీజేడీ తాపత్రయం..వెరసి రాష్ట్రంలో 2019వ సంవత్సరంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్ని రాజకీయ పక్షాలు ప్రతిష్టాత్మకంగా పరిగణిస్తున్నాయి. భువనేశ్వర్: రాష్టంలో దీర్ఘకాలంగా అధికారంలో కొనసాగుతున్న బిజూ జనతా దళ్‌ను గద్దె దించాలనే యోచనతో భారతీయ జనతా పార్టీ తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తోంది. క్రమంగా ఉనికిని కోల్పోతున్న తాము ఈ సారి రాహుల్ గాంధీ నేతృత్వంలో పూర్వ వైభవం సాధించాలని కాంగ్రెస్ ఆశల పల్లకిలో విహరిస్తోంది. ప్రతిపక్షాలు వేస్తున్న ఎత్తుగడలను ఎలాగైనా చిత్తుచేసి ఆధిపత్యం నిలబెట్టుకోవాలని బిజూజనతా దళ్ అనుక్షణం పరిశోధిస్తోంది. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈ బాధ్యతలకు ప్రత్యక్షంగా సారథ్యం వహిస్తున్నారు. ప్రజాభీష్టంతో విజయం తథ్యమని ఇటీవల జరిగిన పార్టీ 20వ వ్యవస్థాపక దినోత్సవంలో పార్టీ శ్రేణులకు ఆయన ప్రబోధించారు. ప్రజల మనసు దోచుకోవడంలో ప్రభుత్వ నిధులు, యంత్రాంగం, అధికార దుర్వినియోగం వంటి ఆరోపణలు తెరపైకి రాకుండా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ట్రిపుల్ టీ (టీమ్‌వర్క్–ట్రాన్స్పరెన్సీ– టెక్నాలజీ) కార్యాచరణతో అధికారుల్ని కట్టుదిట్టం చేశారు. అధికారుల ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధుల్ని క్రమబద్ధీకరిస్తున్నట్లు స్పష్టమవుతోంది. అధికారుల ఆధ్వర్యంలో క్షేత్ర స్థాయిలో ప్రజా ప్రతినిధులను పూచీదారులుగా గురిపెట్టిన నవీన్ పట్నాయక్ తాజాగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల్ని సోషల్ మీడియా సమూహంలో చేర్చేందుకు కంకణం కట్టుకున్నారు. వాట్సాప్ వినియోగంపై అవగాహన పార్టీ వర్గీయులు వాట్సాప్ వినియోగంపట్ల పూర్తిస్థాయి అవగాహన పెంపొందించుకోవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో పార్టీ ప్రధాన కార్యాలయం, ముఖ్యమంత్రి నివాసం నవీన్ నివాస్ ప్రాంగణంలో పార్టీ వర్గీయులకు వాట్సాప్ వినియోగంపట్ల ప్రత్యేక అవగాహన శిబిరం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో వార్డుల వారీగా వాట్సాప్ ఖాతాల్ని తెరవాలని ఆదేశించారు. వార్డులవారీగా వాట్సాప్, ఫేస్ బుక్ ఆధ్వర్యంలో ప్రజలతో ప్రత్యక్షంగా సంప్రదించాలి. వారి బాగోగుల్ని నమోదు చేసుకోవాలి. ప్రజా సంక్షేమం, సామాజిక పురోగతి, ప్రాంతీయ అభివృద్ధి వగైరా రంగాల్లో ప్రభుత్వం నిర్వహిస్తున్న పలు ఆకర్షణీయ పథకాల కార్యాచరణకు సంబంధించి సోషల్ మీడియాలో ప్రసారం చేయడం అనివార్యంగా నవీన్ పట్నాయక్ పేర్కొన్నారు. ప్రాంతీయ, స్థానిక, క్షేత్ర ప్రజా ప్రతినిధులంతా ప్రజల అభియోగాలు, ఆరోపణలు, ఫిర్యాదులపట్ల సోషల్ మీడియా సమూహంలో స్పందిస్తూ ఉండాలని ప్రబోధించారు. రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా వాట్సాప్ సమూహాన్ని ఆవిష్కరించాలని సూచించారు. అసెంబ్లీ పరిధిలో వార్డులవారీగా ప్రజల బాగోగుల్ని అనుబంధ (పార్టీకి చెందిన) ప్రజా ప్రతినిధులు ఎవరికి వారుగా స్పందించాలని తాజా మార్గదర్శకం జారీ చేశారు. పార్టీ ఎమ్మెల్యేలు ఇతరేతర వర్గాల వాట్సాప్, ఫేస్బుక్ వ్యవహారాల్ని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తామని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు. స్మార్ట్ ఫోన్లు వాడాలి సోషల్ మీడియాతో ప్రజాసంబంధాల్ని మెరుగుపరుచుకునేందుకు ప్రతి ఒక్కరూ కంప్యూటర్‌తో పాటు స్మార్ట్ఫోన్లను వినియోగించడం నేర్చుకోవాలి. కాలక్షేపానికి స్మార్ట్‌ఫోన్‌కు పరిమితం కాకుండా ప్రజా ప్రాతినిధ్యం నిత్యం బలపడేందుకు వినియోగించుకోవడమే కొత్త మార్గదర్శకం సారాంశంగా నవీన్‌పట్నాయక్ పేర్కొన్నారు. ప్రజలకు చేరువయ్యేందుకు సోషల్ మీడియా వేదిక కంటే ఘనమైనది ఏదీ లేదు. ప్రజల వద్దకు పాలన పేరుతో నవీన్ పట్నాయక్ ఏటా జనసంపర్క్ పాదయాత్రను నిర్వహిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ జయంతిని పురస్కరించుకుని లోక్ నాయక్ జయ ప్రకాష్ నారాయణ్ జయంతి వరకు ఏటా నిరవధికంగా బీజేడీ జన సంపర్క్ పాదయాత్ర విజయవంతంగా నిర్వహిస్తున్నారు. మారిన కాలమాన పరిస్థితుల్లో ఏడాదికోసారి సంప్రదింపులు అరకొరగా మిగులుతాయి. ప్రతిపక్షాల విమర్శల్ని నీరు గార్చేందుకు పార్టీ వర్గీయులు సోషల్ మీడియాలో ప్రజలతో నిత్యం సంప్రదించడం తప్పనిసరిగా గుర్తించారు. కాలానికి అనుగుణంగా మారిన నవీన్ దిగువ స్థాయి కార్యకర్తల్లో ఈ ఉత్సాహాన్ని ప్రేరేపించేందుకు కొన్ని నెలల ముందుగా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సెల్ఫీ ముచ్చటను ఆచారంగా మార్చుకున్నారు. లోగడ ఆయన జన సమూహంలో ప్రత్యక్షంగా హాజరయ్యేది అత్యంత సూక్ష్మం. మీడియా వ్యాఖ్యల్లో ఎంతో సూక్ష్మత ప్రదర్శించి మెరుపు వేగంతో కనుమరుగయ్యేవారు. ప్రతిపక్షాల పోటు పెరగడంతో ఈ వ్యవహారాన్ని దారి తప్పించి ప్రజలతో ప్రత్యక్షంగా ముచ్చటించేందుకు ముందుకు వచ్చారు. ఈ క్రమంలో ఫేస్బుక్, ట్విటర్ ఖాతాల్ని తెరిచారు. స్థానిక, రాష్ట్ర, జాతీయ రాజకీయ వ్యవహారాలపట్ల సోషల్ మీడియా ప్రసారంలో పాలుపంచుకోవడం ప్రారంభించారు. మలి దశలో ఈ సంస్కృతిని అధికారులకు కట్టబెట్టారు. తాజాగా పార్టీ శ్రేణుల్ని సోషల్ మీడియాలో విలీనం చేసి భవిష్యత్తులో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు ముందుగానే ప్రజలతో సంపర్కాల్ని బలోపేతం చేస్తుండడం విశేషం. -
పవర్ఫుల్ సీఎం
సాక్షి, భువనేశ్వర్: ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పాలనలో పారదర్శకత పట్ల అత్యంత మక్కువ కనబరుస్తారు. రాష్ట్ర రాజకీయాల్లో అడుగిడిన తొలి రోజుల నుంచి పారదర్శక పాలన నినాదాన్ని నిరవధికంగా కొనసాగిస్తున్నారు. మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఈ నినాదాన్ని సోషల్ మీడియాతో అనుసంధానపరిచారు. ట్రిపుల్ టీ మంత్రం.. ఈ నేపథ్యంలో పాలన అధికారులకు ట్రిపుల్ టీ మంత్రాన్ని ప్రబోధించారు. టీమ్‌వర్క్–ట్రాన్స్పరెన్సీ (పారదర్శకత)–టెక్నాలజీ సూత్రంతో ప్రజలకు ప్రభుత్వ సేవల్ని సకాలంలో అందజేయాలని ఆదేశించారు. అధికారులకు ఆదేశాలు జారీ కంటే ముందుగా మంత్రి మండలి సభ్యులకు ఈ మేరకు సంకేతాలు జారీ చేస్తారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ సభ్యులకు వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు, ఆరోపణలు వంటి సందర్భాల్లో పార్టీ నుంచి తొలగించడంలో ఆయన ముందంజ వేస్తున్నారు. ప్రతిఒక్కరూ పూచీదారులే రాష్ట్రంలో బిజూ జనతాదళ్ ఆవిర్భవించి రెండు దశాబ్దాలు పూర్తి అయింది. ఈ వ్యవధిలో గత 17 ఏళ్ల నుంచి పార్టీ అధికారంలో నిరవధికంగా కొనసాగుతోంది. వ్యవస్థాపక అధ్యక్షునిగా నియమితులైన నవీన్ పట్నాయక్ నిరవధికంగా కొనసాగుతున్నారు. ఆయన అధ్యక్షతలో సభ్యులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ప్రజలకు పూచీదారులుగా వ్యవహరించాల్సిందేనంటారు. 44 మంది మంత్రుల తొలగింపు ఈ కార్యాచరణలో భాగంగా ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్ 17 ఏళ్ల పాలనలో 44 మంది మంత్రుల్ని తొలగించారు. వీరిలో అత్యధికులు అతిరథ మహారథులే. నిందిత సభ్యులు నిర్దోషులుగా రుజువు చేసుకునేంతవరకు పార్టీ వ్యవహారాల్లో చొరబడేందుకు ఏమాత్రం అవకాశం కల్పించరు. ఇటీవల కాలంలో నిర్దోషులుగా రుజువు చేసుకోవడంతో పాటు ఆయన వ్యక్తిగత విశ్వసనీయతను కూడా చూరగొనడం అనివార్యంగా పరోక్ష సంకేతాలు జారీ చేస్తున్నారు. పార్టీ నుంచి దీర్ఘకాలంగా దూరమైన పలువురు సీనియర్లను అక్కున చేర్చుకునేందుకు నవీన్ పట్నాయక్ యోచిస్తున్నారు. అయితే అంతకుముందు ఆయన ఒక్కొక్కరి పూర్వాపరాల్ని సమీక్షించిన మేరకు తుది నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు. ఇప్పటికి ఏడాది గడిచినా ఇంతవరకు ఈ మేరకు దాఖలాలు కనిపించడం లేదు. తొలగింపునకు గురైన పలువురు ప్రముఖులు పార్టీ అధ్యక్షుని పిలుపు కోసం నిరీక్షిస్తున్నారు. పునఃప్రవేశం ఆరుగురికి మాత్రమే నవీన్ పట్నాయక్ పాలనా కాలంలో తొలగింపునకు గురైన 44 మంది మంత్రుల్లో కేవలం ఇద్దరు మాత్రమే రాజీనామా చేశారు. కాగా 6గురు మాత్రం నిర్దోషులుగా రుజువు చేసుకుని అధ్యక్షుని మనసు చూరగొని తిరిగి పార్టీలో ప్రవేశం సాధించగలిగారు. ఈ జాబితాలో దేబీ ప్రసాద్ మిశ్రా, డాక్టర్ దామోదర్ రౌత్, విజయ శ్రీ రౌత్రాయ్, రొబి నారాయణ నొందొ, ప్రతాప్ చంద్ర జెనా, ప్రదీప్ మహారథి ఉన్నారు. అలాగే క్రమంగా నిజాయితీ ప్రదర్శించి నవీన్ పట్నాయక్ విశ్వసనీయత కూడగట్టుకోవడంతో తొలుత పుష్పేంద్ర సింగ్‌దేవ్, అతున్ సవ్యసాచి నాయక్‌లకు పార్టీలో ప్రవేశానికి అవకాశం సాధించారు. 2014 ఎన్నికల్లో పార్టీ విజయానికి సారథ్యం వహించడంతో వీరికి కొనసాగుతున్న క్యాబినెట్లో స్థానం కల్పించారు. తదుపరి దశల్లో ప్రఫుల్ల సామల్, ప్రతాప్ జెనా నవీన్ పట్నాయక్ మంత్రి మండలిలో స్థానం సాధించుకున్నారు. ఆది నుంచి ఇదే వరస నవీన్ పట్నాయక్ నేతృత్వంలో తొలి ప్రభుత్వం 2000వ సంవత్సరంలో ఏర్పడింది. 2004వ సంవత్సరం వరకు కొనసాగింది. ఈ వ్యవధిలో 6గురు మంత్రుల్ని క్యాబినెట్ నుంచి తొలగించి అవాక్కయ్యేలా చేశారు. నవీన్ తొలి వేటుకు బలైన వారిలో కమలా దాస్, ప్రొశాంతొ నొందొ, నళినీ కాంత మహంతి, అమర ప్రసాద్ శత్పతి, దేవీ ప్రసాద్ మిశ్రా, ఎ.పి. సింగ్ ఉన్నారు. ఈ విడతలో రాష్ట్ర రాజకీయాల్లో ఆరి తేరిన నాయకునిగా వెలుగొందిన రామకృష్ణ పట్నాయక్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. క్రమశిక్షణ చర్యల కింద.. అప్పట్లో ఆయన ఆర్థిక శాఖకు సారథ్యం వహించారు. రెండో విడత 2004 నుంచి 2009 సంవత్సరాల మధ్య పాలనలో క్రమ శిక్షణ చర్యల కింద నవీన్ పట్నాయక్ 14 మంది మంత్రుల్ని తొలగించారు. వీరిపట్ల పార్టీ వ్యతిరేక కార్యకలాపాల ఆరోపణలున్నాయి. ప్యారీ అంకుల్ కూడా అతీతులు కాదు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రాజకీయ గురువు, మార్గదర్శి, శ్రేయోభిలాషిగా వెలుగొందిన ప్యారీ మోహన మహాపాత్రో పట్ల కూడా ఆయన క్రమ శిక్షణ చర్యల్లో భాగంగా పార్టీ నుంచి బహిష్కరించేందుకు వెనుకంజ వేయలేదు. అప్పట్లో ఈ సంఘటన తీవ్ర కలకలం రేకెత్తించింది. దివంగత ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్‌తో అత్యంత సన్నిహితునిగా చలామణి అయిన ప్యారీ మోహన మహాపాత్రోను ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అంకుల్‌గా పిలిచే వారు. ప్యారీ తెర వెనక కథానాయకునిగా నవీన్ పట్నాయక్‌తో పాలన నిర్వహించిన ఘనుడుగా పేరొందారు. రాష్ట్ర పాలనలో ఆయనను అందరూ తృతీయ శక్తిగా గుర్తించారు. ఇంతటి బంధం కూడా క్రమ శిక్షణ ఉల్లంఘనతో ఒక్కసారిగా బెడిసికొట్టింది. ప్యారీ మోహన మహాపాత్రో కన్ను మూసేంత వరకు పార్టీ శిబిరం వైపు కన్నెత్తి చూడలేని దయనీయ పరిస్థితులు చోటుచేసుకున్నాయి. బీజేడీ చరిత్రలో అర్ధరాత్రి కుట్ర.. మూడో విడత 2009 నుంచి 2014 సంవత్సర కాలంలో బీజేడీ పాలన వ్యవధిలో ప్యారీ మోహన మహాపాత్రోపై వేటు పడింది. అంత వరకు పార్టీ ఆవిర్భావం నుంచి అపర చాణుక్యునిగా ఆయన వెలుగొందారు. ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలో ఉండగా గద్దెని ఎక్కే యోచనతో ప్యారీ మోహన మహాపాత్రో పన్నిన కుట్ర బహిర్గతమైంది. నవీన్ పట్నాయక్ విదేశీ పర్యటన అర్ధాంతరంగా ముగించుకుని రాష్ట్రానికి తిరిగి వచ్చారు. తక్షణమే ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారు. ఈ వ్యవహారంలో ఆయనకు సహకరించిన అనుచరుల్ని కూడా తొలగించారు. ప్రఫుల్ల చంద్ర ఘొడై, ప్రఫుల్ల సామల్, ప్రతాప్ చంద్ర జెనా, పుష్పేంద్ర సింగ్‌దేవ్, అతున్ సవ్యసాచి నాయక్ పార్టీ బహిష్కరణకు గురయ్యారు. ఈ విచారకర సంఘటన 2012 లో జరిగింది. ఈ వ్యూహం బీజేడీ చరిత్రలో అర్ధరాత్రి కుట్రగా మిగిలిపోయింది. ప్రస్తుత పరిస్థితి అదే పార్టీ సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలపట్ల బిజూ జనతా దళ్ అధ్యక్షునిగా నవీన్ పట్నాయక్ వైఖరిలో ఏమాత్రం మార్పు రాలేదు. బ్రాహ్మణులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసి ప్రభుత్వ పాలనకు కళంకం తెచ్చిన ఆరోపణ కింద రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, పార్టీ ఉపాధ్యక్షుడు డాక్టర్ దామోదర్ రౌత్‌ను బహిష్కరించిన విషయం తెలిసిందే. అయితే దామోదర్ రౌత్ నోటి దురుసుతనమే ఈ చర్యకు కారణం. లోగడ 2 సార్లు దామోదర్ రౌత్ పార్టీ క్రమ శిక్షణ వేటుకు గురయ్యారు. కొనసాగుతున్న 2014–19 విడత పాలనలో శ్రీ జగన్నాథుని నవ కళేబర మహోత్సవం, చిట్‌ఫండ్ మోసాల ఆరోపణలను పురస్కరించుకుని తలెత్తిన ఆరోపణల నేపథ్యంలో అరుణ్ సాహు, సంజయ్ కుమార్ దాస్ వర్మను నవీన్ పట్నాయక్ తొలగించారు. -
బీజేడీ, కాంగ్రెస్ మాటల యుద్ధం
భువనేశ్వర్: బిజేపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ సిటింగ్ ఎమ్మెల్యే సుబొలొ సాహు మరణానంతరం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు నిత్యకృత్యంగా మారింది. బిజేపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ చేతి నుంచి అధికార పక్షం బిజూ జనతా దళ్‌కు హస్తగతమైనట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బిజూ జనతా దళ్, కాంగ్రెస్ పార్టీల మధ్య వాగ్యుద్ధం తారస్థాయికి చేరుకుంది. ఇరు పార్టీల నాయకులు మాటల తూటాలతో దుమ్మెత్తి పోసుకుంటున్నారు. బిజూ జనతా దళ్ ఉపాధ్యక్షుడు, సిటింగ్ మంత్రి సూర్య నారాయణ పాత్రో, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, పీసీసీ అధ్యక్షుడు నిరంజన్ పట్నాయక్ల మధ్య బుధవారం తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. అధోగతిలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వ లోపంతో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ తునాతునకలైంది. అతి త్వరలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఛాయ లేకుండా పోతుందని బిజూ జనతా దళ్ ఉపాధ్యక్షుడు, సిటింగ్ మంత్రి సూర్య నారాయణ పాత్రో ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఈ పరిస్థితులకు బిజేపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ తార్కాణంగా ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా చలామణి అయిన పశ్చిమ ఒడిశాలోని బర్గడ్ జిల్లా బిజేపూర్ అసెంబ్లీ సెగ్మెంట్లో కాంగ్రెస్ ఖాతా శాశ్వతంగా మూతబడింది. ఆ పార్టీ దివంగత నాయకుని కుటుంబీకులతో పాటు పార్టీ అనుచరులు విశేష సంఖ్యలో అధికార పక్షం బిజూ జనతా దళ్‌లో చేరిన విషయం తెలిసిందే. అరకొరగా బిజేపూర్ అసెం బ్లీ సెగ్మెంట్ కాంగ్రెస్ గూటిలో మిగిలిన వారు కూడా అతి త్వరలో బీజేడీ గూటికి తరలి వస్తారు. క్రమంగా రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ శిబిరం ఖాళీ అవడం తథ్యమని సూర్యనారా యణ పాత్రో స్పష్టం చేశారు. బిజేపూర్ అసెంబ్లీ ని యోజకవర్గం ఉప ఎన్నికలో బీజేడీ గెలుపు తథ్యమని ఆయన ముందస్తుగా ధీమా వ్యక్తం చేశారు. పాత్రోది పొరబాటు అధికార బిజూ జనతా దళ్ నాయకుడు సూర్య నారాయణ పాత్రో పొరబడ్డారని పీసీసీ మాజీ అధ్యక్షుడు నిరంజన్ పట్నాయక్ ఎదురు తిరిగారు. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పార్టీ అధ్యక్షునిగా కొనసాగినంత కాలమే బిజూ జనతా దళ్ డాంబికాలు. ఆయన తర్వాత ఆ పార్టీ పుట్టగతులు లేకుండా పోతుంది. మరో 2, 3 ఏళ్లలో నవీన్ పట్నాయక్ అధ్యక్ష పదవి నుంచి విరామం పొందుతారు. ఆ తర్వాత బీజేడీని ముందుకు నడిపించే నాథుడు లేడు. ఆయన తర్వాత బీజేడీ నుంచి ప్రతి ఒక్కరు మాతో (కాంగ్రెస్) లేదా భారతీయ జనతా పార్టీ శిబిరానికి చేరి పబ్బం గడపాల్సిన రోజులు పొంచి ఉన్న విషయాన్ని మంత్రి సూర్య నారాయణ పాత్రో గుర్తించకుండా మాట జారుతున్నారని నిరంజన్ పట్నాయక్ అన్నారు. చారిత్రాత్మక పార్టీగా కాంగ్రెస్ ఎప్పుడూ గుర్తింపును కోల్పోయే పరిస్థితే లేదన్నారు. ఒడిదుడుకుల్ని సమర్థంగా ఎదుర్కొని పాలనా పగ్గాలు చేపట్టిన అనుభవాలు కోకొల్లలుగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షాల అభ్యర్థిపట్ల ఉత్కంఠ బిజేపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నిక విపక్షాలకు పక్షాలకు ప్రతిష్టాత్మకంగా మారింది. సిటింగ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకుడు దివంగత సుబొలొ సాహు మరణానంతరం ఆయన కుటుంబీకుల్ని బిజూ జనతా దళ్‌లో విలీనం చేసి సుబొలొ సాహు భార్యకు పార్టీ టికెట్ కేటాయిస్తున్నట్లు పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు. దీంతో పార్టీ తరఫున బిజేపూర్ ప్రతిష్టాత్మక ఉప ఎన్నికలో బీజేడీ అభ్యర్థిని ముందస్తుగా స్పష్టం చేశారు. తదుపరి కార్యాచరణ అంతటినీ జిల్లా పర్యవేక్షకులు, అగ్ర శ్రేణి నాయకుల భుజస్కంధాలపై పెట్టి నవీన్ పట్నాయక్ ధీమాగా ఉన్నారు. అధికార పక్షంతో సానుభూతి వ్యూహంపై గురిపెట్టడంతో ఉభయ ప్రతిపక్షాలు కంగు తిన్నాయి. సానుభూతి అస్త్రం అధికార పక్షం బిజూ జనతా దళ్ పొదికి చేరింది. తదుపరి కార్యాచరణ ఏమిటో ప్రతిపక్షాల శిబిరం నుంచి అస్పష్టంగా కనిపిస్తోంది. సుబొలొ సాహు భార్యతో తలపడి విజయావకాశాలు కలిగిన దీటైన అభ్యర్థి కోసం కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు అభ్యర్థి అన్వేషణలో పడ్డాయి. గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి అధికార పక్షానికి నీళ్లు తాగించిన అశోక్ పాణిగ్రాహిని ఈసారి భారతీయ జనతా పార్టీ బరిలోకి దింపేందుకు దాదాపు రంగం సిద్ధం చేసినట్లు పరోక్షంగా తెలుస్తోంది. కాంగ్రెస్ పరిశీలనలో ముగ్గురు రాష్ట్ర కాంగ్రెస్ కూడా ముగ్గురు ఔత్సాహిక అభ్యర్థుల పేర్లను పార్టీ హై కమాండ్‌కు సిఫారసు చేసింది. పార్టీ అధిష్టానం ఆమోదం కోసం రాష్ట్ర కాంగ్రెస్ నిరీక్షిస్తోంది. బిజేపూర్ ఉప ఎన్నిక రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు పెను సవాల్‌గా నిలుస్తోంది. గతంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సుబొలొ సాహు వరుస విజయాలు సాధించారు. ప్రజల్లో విశేష ఆదరణ సాధించారు. ఆయనపట్ల ఉన్న ప్రజాదరణను పార్టీపరంగా కాంగ్రెస్ ఎంతవరకు సానుకూలంగా మలచుకుంటుందోననే ఉత్కంఠ సర్వత్రా కొనసాగుతోంది. -
జనంలోకి అడుగులు
సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుని పర్యటనలు ముమ్మరమవుతున్నాయి. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం కేంద్రం విడుదల చేస్తున్న నిధుల చిట్టా బహిరంగ సభల్లో ఆయన తెలియజేస్తున్నారు. రాష్ట్రానికి మంజూరైన నిధుల వినియోగం పట్ల లెక్కలపై నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏటా నిర్వహించే పాదయాత్రకు బీజేడీ కసరత్తు చేస్తోంది. పాదయాత్రలో ప్రజలతో మమేకమై కేంద్రం వివక్షను వివరించి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు విస్తృత ప్రచారం కల్పించాలని భావిస్తోంది. భువనేశ్వర్: రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు వివరించి వైఫల్యాల్ని ప్రతిపక్షాల నెత్తిన రుద్దే రీతిలో అధికార పక్షం బిజూ జనతా దళ్ ఏటా పాదయాత్ర నిర్వహిస్తోంది. ఏటా మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబరు 2వ తేదీ నుంచి ఈ యాత్రను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తారు. లోక్‌నాయక్ దివంగత జయ ప్రకాష్ నారాయణ్ జయంతి అక్టోబరు 11వ తేదీ వరకు బీజేడీ పాదయాత్ర నిరవధికంగా కొనసాగుతుంది. ఈ ఏడాది ప్రారంభించనున్న పాదయాత్రను వ్యూహాత్మకంగా వినియోగించుకోవాలని బిజూ జనతా దళ్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ మేరకు మంగళవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. పాదయాత్ర–2017 కార్యాచరణ, పార్టీ ప్రముఖుల నుంచి క్షేత్ర స్థాయి ప్రజా ప్రతినిధులు, కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పాదయాత్రలో ప్రజల మనోగతాల్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని నవీన్ పట్నాయక్ సందేశం జారీ చేశారు. రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం ప్రదర్శిస్తున్న వివక్షపై ప్రజల్లో పూర్తి విశ్వాసాన్ని బలోపేతం చేసే రీతిలో బీజేడీలోని ప్రతి ఒక్కరూ కృషిచేయాలని కోరారు. బీజేపీ తీరును ఎండగట్టండి పలు ప్రజాకర్షణ పథకాలకు కేంద్ర ప్రభుత్వం కుదించిన నిధుల మంజూరు విషయంలో ప్రజలకు గణాంకాల్ని స్పష్టంగా వివరించడం అనివార్యమని చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రతిపాదనకు తుంగలో తొక్కి రాష్ట్ర ప్రయోజనాలకు కేంద్రం నీళ్లొదిలిందని తెలియజేయాలని సూచించారు. రాష్ట్ర జీవన రేఖగా పొంగి పొరలే మహానది జలాలు మన రాష్ట్రానికి ప్రవహించకుండా ఎగువ ప్రాంతంలో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి కొమ్ముగాస్తున్న వైనాన్ని వివరించాలని తెలియజేశారు. పొరుగు రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు పురోగతికి ప్రోత్సహించి ఒడిశాకు అన్యాయం చేస్తున్న ఉద్దేశపూర్వక చర్యలపట్ల రాష్ట్ర ప్రజలకు వివరించి భారతీయ జనతా పార్టీ తీరుపట్ల ఎండగట్టాలని పార్టీ అధ్యక్షుడు పిలుపునిచ్చారు. క్షేత్ర స్థాయికి వెళ్లండి పాదయాత్రను పురస్కరించుకుని పార్టీ అగ్రశ్రేణి నాయకులు క్షేత్ర స్థాయిలో గ్రామీణ ప్రాంతాలకు కదలాల్సిందే. రాజధాని వీడి గ్రామీణ పంచాయతీ ప్రతినిధులు వగైరా వర్గాలతో ప్రత్యక్షంగా సంప్రదించి రాష్ట్రవ్యాప్తంగా ప్రజలతో కలిసి ఈ ఏడాది పాద యాత్రను విజయవంతం చేయాలని నవీన్ పట్నాయక్ ఆదేశించారు. జిల్లా పర్యవేక్షకులు సత్వరమే ఆయా జిల్లాలకు చేరాలని స్పష్టం చేశారు. బిజూ జనతా దళ్ ప్రభుత్వం ప్రవేశ పెట్టి అమలు జేస్తున్న పలు ప్రజాహిత పథకాలపట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఉపదేశించారు. “అమ్మొ గాంవ్ – అమ్మొ బికాష్’, “అమ్మొ సొహొరొ–అమొరొ ఉన్నతి’ వంటి అత్యాధునిక బీజేడీ ప్రజాహిత పథకాలపట్ల ప్రజల్ని చైతన్యపరిస్తే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ వాస్తవ కార్యాచరణ ఏమిటో సామాన్యునికి సులభంగా అర్థమవుతుందని పార్టీ ప్రముఖులు సూచించారు. పాదయాత్రలో విశేష సంఖ్యలో విద్యార్థులు, యువజనం, మహిళలు, యువతులు వగైరా వర్గాల నుంచి ప్రజల్ని ఏకీకృతం చేసుకుని పాదయాత్ర ఫలప్రదం చేయాలని నవీన్ పట్నాయక్ కార్యకర్తల్ని ఉత్తేజపరిచారు. -
సానుభూతికే మొగ్గు
భువనేశ్వర్: పశ్చిమ ఒడిశాలోని బర్గఢ్ జిల్లా బిజేపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ ఉప ఎన్నికలో అధికార పక్షం బిజూ జనతా దళ్ అభ్యర్థిత్వం పట్ల నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. బిజేపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ ఉపఎన్నికలో విజయ సాధనకు సానుభూతే విజయసోపానంగా ప్రధాన రాజకీయ పక్షాలు భావించాయి. అయితే ఈ క్రమంలో అధికార పక్షం బిజూ జనతా దళ్ నిర్ణయించి తొలివిజయం సాధించింది. దివంగత నాయకుల కుటుంబీకుల్ని తమ పార్టీలో విలీనం చేసుకుని వారినే అభ్యర్థులుగా బరిలోకి దింపుతున్నట్లు కూడా బహిరంగపరిచింది. ఈ నియోజకవర్గం నుంచి తమ పార్టీ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే సుబొలొ సాహు భార్య రీతా సాహు పోటీ చేస్తారని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సోమవారం ప్రకటించారు. ఆమె అభ్యర్థిత్వం పట్ల రెండు రోజులుగా అధికార పక్షం బిజూ జనతా దళ్ శిబిరం నుంచి ప్రసారమైన భిన్నాభిప్రాయాలు పార్టీ శ్రేణులకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. ఆమె భర్త, కాంగ్రెస్ అభ్యర్థిగా తిరుగులేని విజయాల్ని సాధించి నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా జీవించారు. ఆయన మరణానంతరం కుటుంబీకులు అనుచరులతో కలిసి అధికార పక్షం బిజూ జనతా దళ్‌లో చేరినట్లు శనివారం ప్రకటించారు. దీంతో రాజకీయ వాతావరణం అకస్మాత్తుగా మలుపులు తిరిగింది. పార్టీ ఫిరాయించి బీజేడీలో చేరిన వారిని బిజేపూర్ నియోజకవర్గం ఉపఎన్నిక అభ్యర్థిగా ఖరారు చేయనట్లు బీజేడీ ఉపాధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ ప్రసన్న కుమార్ ఆచార్య ఆదివారం ప్రకటించడంతో దుమారం చెలరేగింది. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్షుని హోదాలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తాజా ప్రకటన చేశారు. ఈ ప్రకటన నేపథ్యంలో పార్టీలో ఎటువంటి అసంతృప్తివాదం లేనట్లు ఎంపీ ప్రసన్న ఆచార్య కూడా సోమవారం ప్రకటించారు. ఎందరో ఔత్సాహికులు పశ్చిమ ఒడిశా బర్గఢ్ జిల్లా బిజేపూర్ అసెంబ్లీ నియోజకవర్గం అత్యంత కీలకం. దశాబ్దాలుగా ఈ నియోజకవర్గం కాంగ్రెస్ కంచుకోటగా వెలుగొందింది. త్వరలో జరగనున్న ఉప ఎన్నికలో కాంగ్రెస్ కోటను కైవసం చేసుకునేందుకు పలు పార్టీలు ఉరకలేస్తున్నాయి. అంతకంటే ఉత్సాహంగా ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించడంలో మజా వేరుగా ఉంటుందని ప్రముఖ రాజకీయ పార్టీల నుంచి పలువురు ఔత్సాహిక అభ్యర్థులు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. అధికార పక్షం బిజూ జనతా దళ్ శిబిరంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని ఆ పార్టీ బర్గఢ్ జిల్లా పర్యవేక్షకుడు, సిటింగ్ మంత్రి ప్రఫుల్ల మల్లిక్ ప్రకటించారు. ఇంతలో పార్టీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ రీతా సాహును గత ఎన్నికల్లో అధికార పక్షం టికెట్‌తో బిజూ జనతా దళ్ ఉపాధ్యక్షుడు డాక్టర్ ప్రసన్న ఆచార్య బిజేపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. స్వల్ప తేడాతో విజేతకు సింహ స్వప్నంగా నిలిచారు. సిటింగ్ ఎమ్మెల్యే అకాల మరణంతో ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నికకు రంగం సిద్ధం అయింది. ఈసారి పోటీ చేసి తన సత్తా చాటుకోవడం తథ్యమని భావించిన డాక్టర్ ప్రసన్న ఆచార్యకు ఆశాభంగం కలిగినట్లు పరోక్ష సంకేతాలు లభిస్తున్నాయి. రీతా సాహును తప్పించి తాను పోటీ చేసేందుకు ఆయన చేసిన గిమ్మిక్కులు కలిసి రాలేదు. టికెట్ ఖరారుపట్ల ఆయన చేసిన వ్యాఖ్యలకు స్పందించిన బీజేడీ అధ్యక్షుడు 24 గంటలు పూర్తి కాకుండా ఘాటుగా స్పందించి ప్రసన్న ఆచార్య దూకుడుకు కళ్లెం వేశారు. శనివారం నుంచి ప్రతి 24 గంటలకోసారి బిజేపూర్ రాజకీయ ముఖచిత్రం ఆకస్మిక మార్పులతో రాష్ట్ర రాజకీయాల్లో తళుక్కుమంటోంది. -
బీజేడీ ఎమ్మెల్యే అరెస్టు
- సీషోర్ చిట్‌ఫండ్ కుంభకోణం కేసు విచారణ భువనేశ్వర్ : ఒడిశాలో ఓ చిట్‌ఫండ్ కుంభ కోణం కేసు విచారణలో భాగంగా అధికార బీజేడీ ఎమ్మెల్యే ప్రవత్ రంజన్ బిస్వాల్‌ను సీబీఐ అరెస్టు చేసింది. కోట్ల రూపాయల సీషోర్ గ్రూప్ చిట్‌ఫండ్ కుంభకోణం కేసును విచారిస్తున్న సీబీఐ సోమవారం సాయంత్రం బిస్వాల్‌ను ప్రశ్నించి అదుపులోకి తీసుకుంది. ఆ తరువాత సీబీఐ కోర్టులో ప్రవేశపెట్టగా, ఆయన్ని 5 రోజులు సీబీఐ కస్టడీకి అప్పగించింది. -
ఒడిశాలో బీజేపీ '120 మంత్రం'!
సాక్షి, భువనేశ్వర్: ఇప్పటికే ఉత్తర భారతంలో బలంగా పాగా వేసిన బీజేపీ.. ఇక ఇప్పుడు తాము అధికారంలో లేని ఇతర రాష్ట్రాలపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా ఒడిశాలో కాషాయ జెండాను రెపరెపలాడించాలని దృఢంగా భావిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటినుంచి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, అధికార పార్టీ బీజూ జనతాదళ్ (బీజేడీ)పై దాడి ముమ్మరం చేసింది. బుధవారం భువనేశ్వర్‌లో భారీ ర్యాలీ నిర్వహించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. మూడింట రెండొంతుల మెజారిటీతో ఒడిశాలో బీజేపీ విజయకేతనం ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఒడిశాలో 120 సీట్లు గెలుచుకోవడం బీజేపీ లక్ష్యమని ప్రకటించారు. ఒడిశా అసెంబ్లీలో 147 స్థానాలు ఉండగా.. అందులో 120 కైవసం చేసుకొని తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి రావాలని కమలం శ్రేణులకు ఉద్భోదించారు. తాజాగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. నవీన్ పట్నాయక్ ప్రభుత్వంపై ఒడిశా ప్రజలు విశ్వాసం కోల్పోయారని, రానున్న ఎన్నికల్లో తాము విజయం సాధించడం ఖాయమని, ఎలాంటి పొత్తులు లేకుండానే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందని ఆయన గురువారం ధీమా వ్యక్తం చేశారు. ఒడిశా అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇటీవలి కేంద్రమంత్రిమండలి పునర్వ్యవస్థీకరణలో ధర్మేంద్ర ప్రధాన్‌కు కేబినెట్ హోదాతో ప్రమోషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. -
వెంకయ్యకు ఓటేయబోమన్న బీజేడీ
భువనేశ్వర్: రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు లభించినట్లే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ భారీ మద్దతు లభిస్తుందని భావించిన ఎన్డీఏకి బిజూ జనతాదళ్(బీజేడీ) షాకిచ్చింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీనే తాము బలపరుస్తామని బీజేడీ చీఫ్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేడీ.. ఎన్డీఏ అభ్యర్థిని రామ్‌నాథ్ కోవింద్‌ను సమర్థించిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రపతి పోలింగ్ ముగిసి 24 గంటలైనా గడవకముందే బీజేపీకి మింగుడుపడని నిర్ణయం తీసుకున్నారు నవీన్ పట్నాయక్. మంగళవారం భువనేశ్వర్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. యూపీఏ అభ్యర్థి గాంధీ తనకు చిరకాల మిత్రుడని చెప్పారు. రాజకీయాల్లోకి రాకముందు నుంచే తాము స్నేహితులమని గుర్తుచేవారు. ప్రస్తుతం బీజేడీకి పార్లమెంట్లో 28 మంది ఎంపీలున్నారు, ఒక స్వతంత్ర అభ్యర్థి మద్దతు కూడా ఉంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో బీజేడీ తీసుకున్న నిర్ణయంపై బీజేపీ మండిపడుతోంది. కాంగ్రెస్‌తో బీజేడీ తెరవెనుక ఒప్పందం కుదుర్చుకుందని ఒడిశా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బసంత పండా ఆరోపించారు. -
‘బుల్లెట్లు కూడా నన్ను పడగొట్టలేవ్’
న్యూఢిల్లీ: ‘గుడ్లు, రాళ్లు మర్చిపోండి.. వాళ్లు బుల్లెట్లు నాపై ప్రయోగించినా కూడా ఏమీ చేయలేరు’అనే బిజు జనతాదల్ పార్టీ నేత, పార్లమెంటు సభ్యుడు జై పాండా (53)అన్నారు. మంగళవారం తన నియోజకవర్గంలో ఓ నీటి శుద్ధి ప్లాంటును ప్రారంభించేందుకు వచ్చిన ఆయనపై అదే పార్టీకి చెందిన కొంతమంది ఆయన వ్యతిరేక వర్గానికి చెందినవారు రాళ్లు, గుడ్లతో దాడులు చేశారు. దీంతో పాండా వర్గం వాళ్లు కూడా ప్రత్యర్థులపై దాడులకు దిగారు. ఈ నేపథ్యంలోనే ‘రాళ్లు, కోడిగుడ్లు ప్రత్యర్థులపై విసరడం మర్చిపోవాలి. వారు తనపై బుల్లెట్లు ప్రయోగించినా ఏం కాదు’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. బీజేపీతో చేతులు కలిపి సొంత పార్టీని చీల్చే కుట్రలు చేస్తున్నారంటూ పాండాపై బీజేడీ నాయకుడు తథాగత సత్పతి తీవ్ర ఆరోపణలు చేశారు. పరిణామాలు కూడా అలాగే కనిపించడంతో ఆయనను పార్టీ అధికారిక ప్రతినిథి బాధ్యతల నుంచి తప్పించారు. దీంతో నేరుగా సొంతపార్టీపైనా, పార్టీ అధినాయకుడు, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌పై కూడా పాండా రెచ్చిపోయి మాటలన్నారు. నిజనిజాలు తెలుసుకోకుండా తనపై చర్యలు తీసుకున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అప్పటి నుంచి బీజేడీలోనే రెండు అనుకూల వ్యతిరేక వర్గాలు ఏర్పడి నిత్యం వార్తల్లో ఉండేలా చేస్తున్నాయి. -
దొందూ.. దొందే..
► కేంద్రంలో బీజేపీ.. రాష్ట్రంలో బీజేడీ ►ధ్వజమెత్తిన ఒడిశా ప్రతిపక్ష నాయకుడు నరసింహ మిశ్రా బరంపురం: ఎన్నికల ముందు ప్రజలకు తప్పుడు హమీలు చేస్తూ కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీజేడీ పార్టీలు ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చినట్లు రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు నరసింహ మిశ్రా అరోపించారు. గురువారం బరంపురంలోని స్టేషన్ రోడ్లో గల సరనూయ్యట్ హౌస్‌లో ఒడిశా కాంగ్రెస్ పార్టీ తరఫున విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రతిపక్ష నాయకుడు నరసింహ మిశ్రా మాట్లాడుతూ గత 2014లో సాధారణ ఎన్నికల్లో ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడి విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని దేశానికి తెచ్చి 6 నెలల్లో దేశ ప్రజల ప్రతి ఒక్కరి బ్యాంక్ అకౌంట్లలో రూ.15 లక్షలు జమ చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి 3 ఏళ్లు గడిచినా ఇంతవరకు ఒక బ్యాంక్ అకౌంట్లో కూడా 15 పైసలు జమకాలేదని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో ఈ విషయమై ప్రతి పక్షనాయకులు ప్రశ్నించగా ఎన్నికల ముందు ఎన్నో హామీలు చేస్తామని అవన్నీ నేరవేర్చ వలసిన పనిలేదని స్వయాన ప్రధాని నరేంద్ర మోడి బదులు చెప్పడం ప్రజలను మోసం చేయడమేనన్నారు. ఉద్యోగాలేవీ? ఇదేవిధంగా దేశంలో ప్రతి ఏడాదికి కోటి ఉద్యోగాలు కల్పిస్తామని కేంద్రంలో బీజేపీ, ఒడిశాలో ఏడాదికి లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని రాష్ట్రం లో బీజేడీ ప్రజలకు హామీలు ఇచ్చాయన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన బీజేపీ, బీజేడీ ప్రభుత్వాలు ఇంతవరకు ఒక్క ఉద్యోగం కూడా కల్పించ లేదన్నారు. ఒడిశా రాష్ట్రానికి ప్రత్యేక హో దా సాధిస్తామని 2014 ఎన్నికల్లో స్వయానా ముఖ్యమంత్రి నవీన్ పట్నా యక్ చెప్పారని కానీ అధికారంలో వచ్చిన బీజేడీ ఇంతవరకు ఒక్క అడుగు ముందుకు వేయలేదని విమర్శించారు. ప్రాజెక్ట్‌లేవీ? వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం రైతులకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తామని ముఖ్యమంత్రి నవీన్ చెప్పారని కానీ రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వకుం డా మరో వైపు విద్యుత్ బిల్లు టారిఫ్ పెంచుకుంటూ పోతున్నారన్నారు. రాష్ట్రంలో గడిచిన 17 ఏళ్ల బీజేడీ పాలనలో ఒక్క నీటి ప్రాజెక్ట్ కట్టలేదని, చెక్ డ్యామ్‌లు లేవని గుర్తు చేశారు. ప్రజల ను మోసం చేయడంలో బీజేపీ, బీజేడీ అంతరంగికంగా సహకారం చేసుకుంటున్నాయని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న మోసాలను ప్రజలు గ్రహిస్తున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో అయా పార్టీలకు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. సమావేశంలో మాజీ కేంద్ర మంత్రి చంద్రశేఖర్ సాహు, పీసీసీ కార్యదర్శి విక్రమ్ పండా, డీసీసీ అధ్యక్షుడు భగవాన్ గంగాయత్, బరంపురం పార్లమెంట్ సెగ్మెంట్ అధ్యక్షుడు అజిత్ కుమార్ పండా, జిల్లా కార్యదర్శి దుర్గా ప్రసాద్ పండా పాల్గొన్నారు. -
గీతా మెహతా తెరవెనుకే సారథి
♦ సీఎం నవీన్ తదుపరి వారసులు ఎవరు? ♦ రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా సాగుతున్న చర్చ లోగడ..ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ విదేశీ పర్యటనకు వెళ్లిన తరుణంలో ఆయనకు అత్యంత సన్నిహితుడు, రాజకీయ సలహాదా రుగా చలామణి అవుతున్న ప్యారీ మోహన్ మహాపాత్రో అర్ధరాత్రి ఆపరేషన్ నిర్వహించి రాష్ట్ర రాజకీయాల్లో గందరగోళం సృష్టించారు. ప్రస్తుతం.. రాష్ట్రంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార బీజేడీ డీలాపడింది. అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ బలం పుంజు కుంది. ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్ ఆరోగ్య స్థితి మెరుగు కోసం విదేశీ పర్యటనకు యోచిస్తున్నారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి గందరగోళ పరిస్థితి ఏర్పడకుండా అధికార బీజేడీ పార్టీ వ్యవహారాల్ని పటిష్టంగా పర్యవేక్షించేందుకు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రణాళిక వేస్తున్నారు. సోదరి గీతా మెహతాను ఆయన ప్రతినిధిగా నియమిస్తారని రాష్ట్రంలో జోరుగా చర్చ సాగుతోంది. అయితే ఈ చర్చ అంతా సీఎం బహిరంగ ప్రకటనతో తుస్సుమంది. భువనేశ్వర్: పంచాయతీ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో రాజకీయ చర్చలు బలం పుంజుకున్నాయి. ఈ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రధాన రాజకీయ పార్టీల భావి స్థితిగతులపట్ల విశ్లేషణలు అలా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో దివంగత ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ కుమార్తె, వర్ధమాన ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సోదరి గీతా మెహతా రాష్ట్ర రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా రంగ ప్రవేశం చేయనున్నట్లు చర్చ ఊపందుకుంది. ఆమె నవీన్ పట్నాయక్ తర్వాత రాష్ట్రంలో బిజూ జనతా దళ్‌కు సారథ్యం వహిస్తారని రాజకీయ శిబిరాల్లో ప్రధాన చర్చనీయాంశమైంది. రాజకీయ గణాంకాలు, విశ్లేషణలతో రాష్ట్ర రాజకీయాల్లో దివంగత ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ మరో వారసురాలు అడుగిడుగుతుందనే నమ్మకం దాదాపు స్థిరపడిన క్షణంలో అంతా తుస్సుమంది. బీజేడీలో కేంద్ర శక్తి గీతా మెహతా రాష్ట్రంలో అధికార పక్షం బిజూ జనతా దళ్ పార్టీలో గీతా మెహతా ప్రముఖ పాత్రధారిగా నిలుస్తారనే చర్చ ఇటీవల కాలంలో ఊపందుకుంది. పార్టీ అంతరంగిక వ్యవహారాలతో పాటు నవీన్ పట్నాయక్ తర్వాత ఆమె రాష్ట్ర రాజకీయాల్లో పాలనాపగ్గాలు చేపడతారనే ఊహాగానాలు భారీగా ఊపందుకున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ ఫలితాలు దిగజారిన సందర్భంగా ప్రత్యక్ష రాజకీయాల్లో విశ్వసనీయ వ్యక్తిగా తన సోదరిని నవీన్ పట్నాయక్ రంగంలోకి దించుతున్నట్లు వార్తలు ఊపందుకున్నాయి. వ్యూహాత్మక కార్యాచరణలో నవీన్‌కు సాటి ఎవరూ లేరని అంతా విశ్వసిస్తారు. ఈ క్రమంలో చర్చ ఇలా సాగుతోంది. తొలుత రాజ్యసభ రాష్ట్ర రాజకీయాల్లోకి గీతా మెహతాను దింపేందుకు రంగం సిద్ధం అయింది. ఇంత వరకు పార్టీ ప్రధాన శిబిరంలో తెర వెనక ఉంటూ పంచాయతీ ఎన్నికల విశ్లేషణ, సమీక్షలు నిర్వహించిన సోదరికి నవీన్ పట్నాయక్ పట్టం గడతారు. రాష్ట్రంలో బిజూ జనతా దళ్ సంఖ్యా బలాన్ని అనుకూలంగా మలుచుకుని సోదరిని ప్రతిష్టాత్మక పదవితో ప్రత్యక్ష రాజకీయాల్లోకి దించుతారు. ఈ నేపథ్యంలో రాజ్యసభ రేసులో ఉన్న బిష్ణు దాసును తప్పించి రాష్ట్ర ప్రణాళిక బోర్డు డిప్యుటీ చైర్మన్‌గా నియమించారు. దీంతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఆయన సోదరి గీతా మెహతాను సిఫారసు చేయించి ప్రత్యక్ష రాజకీయాల నుంచి నవీన్ పట్నాయక్ అంచెలంచెలుగా తప్పుకునేందుకు పావులు కదుపుతున్నట్లు రాజకీయ వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. బీజేడీ శిబిరంలో ఉత్సాహం దివంగత ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ వారసులు రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యక్ష పాత్ర పోషించడంపట్ల బిజూ జనతా దళ్ శిబిరం నుంచి సానుకూల పవనాలు వేగం పుంజుకున్నాయి. ఆరోగ్య పరీక్షల కోసం ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ దీర్ఘకాలం విదేశీ పర్యటనకు సన్నాహాలు చేస్తున్నారు. ఆయన గైర్హాజరులో రాష్ట్రంలో పార్టీ వ్యవహారాల్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించేందుకు విశ్వసనీయమైన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. ఈ జాబితాలో ఆయన సోదరి గీతా మెహతా ఏకైక వ్యక్తిగా పేరు వినిపించింది. గీతా మెహతా పార్టీ వ్యవహారాల్ని చేపట్టి ప్రత్యక్షంగా రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగిడితే అంతా మేలు జరుగుతుందని బీజేడీ శ్రేణులు సానుకూలంగా స్పందించాయి. ప్రధానంగా పార్టీ సీనియర్ వర్గం ఆమె ప్రవేశంపట్ల అమితానందం ప్రదర్శించింది. రాజకీయ పదవులపట్ల అనాసక్తి సోదరి గీతా మెహతాకు ఎటువంటి రాజకీయ పదవులు, హోదాపట్ల ఆసక్తి లేనట్లు నవీన్ పట్నాయక్ సోమవారం బహిరంగంగా ప్రకటించారు.ఆయన తాజా ప్రకటనతో గీతా రాజకీయ ప్రవేశానికి తెరపడింది. రాజ్యసభ లేదా ఇతర రాజకీయ పదవులపట్ల ఆమె ఎటువంటి ఆసక్తి కనబరచడం లేదని ముఖ్యమంత్రి సూటిగా బహిరంగపరిచారు.