సీనియర్ బీజేడీ ఎంపీ 'భర్త్రుహరి మహ్తబ్' (Bhartruhari Mahtab) శుక్రవారం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కటక్ లోక్‌సభ నియోజకవర్గానికి వరుసగా ఆరు పర్యాయాలు ప్రాతినిధ్యం వహించిన మహ్తబ్, ఈరోజు సాయంత్రం 4 గంటలకు రాజీనామా లేఖను బీజేడీ అధ్యక్షుడు.. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు పంపినట్లు పేర్కొన్నారు.
త్వరలో ఎన్నికలు జరగనున్న తరుణంలో భర్త్రుహరి మహ్తబ్ తీసుకున్న నిర్ణయం నవీన్ పట్నాయక్ సర్కారుకు పెద్ద షాకిచ్చింది. ఇటీవల ఒడిశాలో అరిందమ్ రాయ్ బీజేడీకి గుడ్‌బై చెప్పి బీజేపీ పార్టీలో చేరిన తరువాత.. మహ్తబ్ బీజేడీ పార్టీకి రాజీనామా చేశారు.
బీజేపీ, బీజేడీల మధ్య పొత్తు కుదరకపోవడంతో.. ఒడిశాలో వచ్చే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ స్వతంత్రంగా పోటీ చేస్తుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మన్మోహన్ సమాల్ ప్రకటించారు. గత కొన్ని రోజులుగా అధికార బీజేడీ.. ప్రతిపక్ష బీజేపీ మధ్య ఎన్నికలకు ముందు పొత్తుపై చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి రెండు పార్టీలో ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు స్పష్టమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment