
అహ్మదాబాద్ (గుజరాత్): మతాల మధ్య ప్రధాని మోదీ చిచ్చుపెడుతున్నారని.. గాంధీ విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటూ అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఏఐసీసీ ప్లీనరీ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గాడ్సే సిద్ధాంతాన్ని మోదీ ప్రోత్సహిస్తున్నారని.. ఎట్టిపరిస్థితుల్లోనూ తెలంగాణలో బీజేపీని అడుగుపెట్టనివ్వం అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు.
వచ్చే రోజుల్లో బీజేపీని ఓడించే బాధ్యత కార్యకర్తలు తీసుకోవాలి. దేశంలో కుల గణన చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ. బ్రిటీష్ వాళ్లు ఎలా దేశాన్ని లూటీ చేశారో.. బీజేపీ నేతలు కూడా అలానే లూటీ చేస్తున్నారు. బిట్రీష్ వాళ్ల కంటే బీజేపీ వాళ్లే ప్రమాదకరం. బ్రిటీష్ వాళ్లను తరమికొట్టినట్టే బీజేపీని కూడా ఓడగొట్టాలి. సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు.’’ అని రేవంత్ చెప్పుకొచ్చారు.