![Bjp Mp Laxman Comments On Rahul Gandhi](/styles/webp/s3/article_images/2025/02/15/laxman1.jpg.webp?itok=kZIOvTm4)
సాక్షి, కరీంనగర్ జిల్లా: ఒక పేదవాడు కుటుంబ ఆదాయం కోసం టీ అమ్మాడు తప్పేంటి? అంటూ ప్రశ్నించారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. మోదీ కులాన్ని, వేసుకునే బట్టలను, తినే తిండిని, రాహుల్ గాంధీ విమర్శించారంటూ ఆయన మండిపడ్డారు. కరీంనగర్‌లో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డితో కలిసి రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ, సబ్కా సాత్ సబ్ కా వికాస్ ద్వారా అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే అనేక సంక్షేమ పథకాలను మోదీ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. 5 వేల 700 కోట్లు తెలంగాణాలో రైల్వే అభివృద్ధికి కేటాయించారు. చర్లపల్లిలో కొత్త టెర్మినల్ ను కట్టింది బీజేపీ కాదా?. స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా సికింద్రాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్లను రిస్ట్రక్చర్ చేసిన ఘనత బీజేపీది కాదా?. మెదక్, సిద్ధిపేట, కొమురవెల్లికి రైల్వేస్టేషన్లు ఇచ్చింది మోదీ ప్రభుత్వమే’’ అని లక్ష్మణ్ చెప్పుకొచ్చారు.
‘‘12 లక్షల 70 వేల మెట్రిక్ టన్నుల యూరియాను మోదీ ప్రభుత్వం ఉత్పత్తి చేస్తోంది. జహిరాబాద్‌లో ఇండస్ట్రియల్ కారిడర్‌ను తీర్చిదిద్దాం. 82 లక్షల మందికి ఆయుష్మాన్ భారత్ పథకం అమలు చేస్తున్నాం. తెలంగాణ భవిష్యత్ నిర్ధేశించే ఎన్నికలు కాబట్టి అందరూ అలోచించి ఓటు వేయాలి. మోస పూరితమైన రేవంత్ రెడ్డి మాటల తూటాలకు ప్రజలు మోసపోవద్దు’’ అంటూ లక్ష్మణ్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment