dr laxman
-
టీ అమ్మితే తప్పేంటి?: లక్ష్మణ్
సాక్షి, కరీంనగర్ జిల్లా: ఒక పేదవాడు కుటుంబ ఆదాయం కోసం టీ అమ్మాడు తప్పేంటి? అంటూ ప్రశ్నించారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. మోదీ కులాన్ని, వేసుకునే బట్టలను, తినే తిండిని, రాహుల్ గాంధీ విమర్శించారంటూ ఆయన మండిపడ్డారు. కరీంనగర్లో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డితో కలిసి రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ, సబ్కా సాత్ సబ్ కా వికాస్ ద్వారా అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే అనేక సంక్షేమ పథకాలను మోదీ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. 5 వేల 700 కోట్లు తెలంగాణాలో రైల్వే అభివృద్ధికి కేటాయించారు. చర్లపల్లిలో కొత్త టెర్మినల్ ను కట్టింది బీజేపీ కాదా?. స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా సికింద్రాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్లను రిస్ట్రక్చర్ చేసిన ఘనత బీజేపీది కాదా?. మెదక్, సిద్ధిపేట, కొమురవెల్లికి రైల్వేస్టేషన్లు ఇచ్చింది మోదీ ప్రభుత్వమే’’ అని లక్ష్మణ్ చెప్పుకొచ్చారు.‘‘12 లక్షల 70 వేల మెట్రిక్ టన్నుల యూరియాను మోదీ ప్రభుత్వం ఉత్పత్తి చేస్తోంది. జహిరాబాద్‌లో ఇండస్ట్రియల్ కారిడర్‌ను తీర్చిదిద్దాం. 82 లక్షల మందికి ఆయుష్మాన్ భారత్ పథకం అమలు చేస్తున్నాం. తెలంగాణ భవిష్యత్ నిర్ధేశించే ఎన్నికలు కాబట్టి అందరూ అలోచించి ఓటు వేయాలి. మోస పూరితమైన రేవంత్ రెడ్డి మాటల తూటాలకు ప్రజలు మోసపోవద్దు’’ అంటూ లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. -
దీని వెనుక ఏదో మతలబు ఉంది: ఎంపీ లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ను ఆర్ఆర్ఆర్(రీజినల్ రింగ్ రోడ్డు) బాధితులు ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కలిశారు. తమ సమస్యను ఎంపీ దృష్టికి బాధితులు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రీజినల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో మార్పులు తీసుకురావాలని గత ప్రభుత్వాన్ని రైతులు కోరారని.. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల పేదలు, రైతులు నష్టపోయారని పేర్కొన్నారు.‘‘కొన్ని ప్రాంతాల్లో ఆర్ఆర్ఆర్ దూరాన్ని కుదించడంలో మతలబు ఉంది. హెచ్ఎండీఏకు అవతల ఆర్ఆర్ఆర్ నిర్మాణం జరగాలి. అశాస్త్రీయ అలైన్మెంట్ ద్వారా నష్టం జరుగుతుంది. అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామని ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఆ రోజు ఎంపీగా ఉన్నవారు ఈ రోజు మంత్రులుగా కొనసాగుతున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నీరు గార్చుతున్నారనే దానికి ఇదే నిదర్శనం’’ అని లక్ష్మణ్ చెప్పారు.ఇప్పటికే కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు నితిన్ గడ్కారీ దృష్టికి తీసుకెళ్లారు, పేదవాళ్ల భూములు లాక్కోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. పేదలకు అండగా బీజేపీ ఉంటుంది. అన్యాయంగా భూములు లాక్కుంటే ఎంతటి పోరాటానికి అయిన బీజేపీ వెనకాడదు’’ అని ఎంపీ లక్ష్మణ్ స్పష్టం చేశారు. -
'ఎవరైనా ఫ్రంట్ పెట్టుకుని.. టెంట్లు వేసుకోవొచ్చు'
సాక్షి, హైదరాబాద్ : బీజేపీ జాతీయ సమావేశాలు ఉత్సాహభరితంగా జరిగాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. మరోసారి మోదీ అనే నినాదంతో ఎన్నికలకు వెళ్లాలని జాతీయ సమావేశం నిర్వహించిందని పేర్కొన్నారు. ఇద్దరు చంద్రులు ఫ్రంట్ల కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని, ఇద్దరి ప్రయత్నాలు విఫలం కావడం తథ్యమన్నారు. ఎవరైనా ఫ్రంట్ పెట్టుకోవచ్చు, టెంట్లు వేసుకోవచ్చని, దాని వల్ల ఎవరికీ ఇబ్బంది లేదని లక్ష్మణ్ తెలిపారు. ఈ ఫ్రంట్లు టెంట్ల వల్ల ప్రయోజనం లేదన్నారు. గతంలో ఇలాంటి ప్రయత్నాలు విఫలమయ్యాయని చెప్పారు. ఇదంతా కుటుంబపార్టీలన్ని కలిసి తమ ఉనికి చాటుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు మాత్రమేనన్నారు. జాతీయ పార్టీ లేని కూటములు ఎన్నికట్టినా అది విఫలమవుతుందన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణప్రజలు సైతం మోదీకే పట్టం కట్టాలని ఆసక్తి చూపుతున్నారని, పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్కు ఓటు వేసే పరిస్థితి లేదని చెప్పారు. కూటములు, ఫ్రంట్లు ప్రధాని అభ్యర్థి ఎవరనేది తేల్చుకోలేకపోతున్నాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ కూటమి కూడా ప్రధాని అభ్యర్థి ఎవరనేది తేల్చుకోవాలని లక్ష్మణ్ అన్నారు. -
డల్లాస్‌లో గాంధీ మెమోరియల్‌ను సందర్శించిన లక్ష్మణ్
డల్లాస్, టెక్సాస్ : తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు, ముషీరాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కె. లక్ష్మణ్ డల్లాస్‌లోని మహాత్మా గాంధీ మెమోరియల్‌ను సందర్శించి జాతిపితకు ఘన నివాళులర్పించారు. డల్లాస్‌లోని మహాత్మా గాంధీ మెమోరియల్‌ను సందర్శించడం తన అమెరికా పర్యటనలో ఒక మరపురాని అనుభూతిగా మిగిలిపోతుందని అన్నారు. భారత దేశ స్వాతంత్ర్యం కోసం, ప్రపంచ శాంతి, సౌభ్రాతృత్వాల కోసం తన జీవితాన్ని అంకితం చేసి విశ్వ మానవుడిగా గుర్తింపు పొందిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని డల్లాస్‌లో నెలకొల్పడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. దీని సాధనలో కృషి చేసిన గాంధీ మెమోరియల్ సంస్థ ఛైర్మన్ డాక్టర్. ప్రసాద్ తోటకూర, కార్యవర్గ సభ్యులు, ప్రభుత్వ అధికారులు, ప్రవాస భారతీయులను లక్ష్మణ్ అభినందించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుమేరకు ప్రతి ఏటా జూన్ 21వ తేదీన ఈ మెమోరియల్ దగ్గర అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా సముచితంగా ఉందని లక్ష్మణ్ అన్నారు. మహాత్మా గాంధీ మెమోరియల్ సంస్థ ఛైర్మన్ డాక్టర్. ప్రసాద్ తోటకూర, డాక్టర్. లక్ష్మణ్‌కు స్వాగతం పలుకుతూ ఇదే ప్రాంగణంలో ఆగష్టు 15 వ తేదీన భారతదేశపు 72వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను వందలాది ప్రవాస భారతీయుల మధ్య జరుపుకోవడానికి తగు సన్నాహాలు చేస్తున్నామని తెలియజేశారు. తీరికలేని కార్యక్రమాల ఒత్తిడి ఉన్నా వీలు చేసుకొని గాంధీ మెమోరియల్‌ను సందర్శించినందుకు లక్ష్మణ్‌కు తమ సంస్థ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూతురు శ్రీనివాస్ రెడ్డి, అజయ్ కల్వల, సతీష్, భీమ పెంట, రవి పటేల్‌లు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి అధిష్టానం ప్రత్యేక దృష్టి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో పార్టీ బలోపేతానికి అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించనుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ తెలిపారు. ఇక్కడ జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు శనివారం ముగిశాయి. అనంతరం లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో పార్టీ పరిస్థితిపై సమావే శంలో నివేదించినట్టు ఆయన చెప్పారు. భద్రాచలంలో ఈ నెల 21, 22 తేదీల్లో నిర్వహించనున్న రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో పార్టీని బలోపేతం చేయడానికి కార్యాచరణ రూపొందించనున్నట్టు తెలిపారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా 3 రోజులపాటు రాష్ట్రంలో పర్యటించనున్నారని తెలిపారు. సమావేశంలో పార్టీ సమన్వయకర్త బాలరాజ్ పాల్గొన్నారు. -
'పన్నులు కడుతున్నా.. పనులు జరగడం లేదు'
-
'పన్నులు కడుతున్నా.. పనులు జరగడం లేదు'
హైదరాబాద్: జీహెచ్ఎంసీలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు డా. లక్ష్మణ్ మండిపడ్డారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో చాలా సమస్యలు ఉన్నాయన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందని లక్ష్మణ్ పేర్కొన్నారు. పన్నులు కడుతున్నా పనులు జరగడం లేదని ధ్వజమెత్తారు. విద్యుత్ సరఫరా అంశంలో ఇంకా మెరుగుపడాల్సి ఉందని సూచించారు. హైదరాబాద్‌ను కాపాడుకోకుంటే తెచ్చుకున్న తెలంగాణకు అర్థం లేదని ఆయన అన్నారు. ఇటీవలి కాలంలో హైదరాబాద్ అభివృద్ధి కుంటుపడిందన్నారు. హైదరాబాద్‌లో నాలాల్లో పూడికతీత పనులు చేపట్టాలని బీజేఎల్పీ నేత కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. -
కోట పులకించింది
గోల్కొండ: చారిత్రక గోల్కొండ కోట తొలిసారి పూలవనమై పులకించింది. ఆడపడుచుల బతుకమ్మ ఆటపాటలతో పరవశించింది. గుమ్మడి పూలో.. అమ్మ.. బంతీపూలో.. తంగెడపూలో తల్లి.. ఎంగిలిపూలో.. అంటూ సాగిన జానపదాలు కొండ గాలితో కలిసి నగరాన్ని చుట్టేశాయి. రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మంగళవారం కోటలో బతుకమ్మ వేడుకలు అద్భుతంగా నిర్వహించారు. రకరకాల పూలతో కూర్చిన బతుకమ్మలను ప్రాంగణంలో ఉంచి.. చక్కని పాటలకు మహిళా నేతలంతా లయబద్దంగా కదులుతుంటే.. వారితో కలిసి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ సైతం పాదం కలిపారు. ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి, బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు జి.పద్మజారెడ్డి తదితరులు బతుకమ్మ ఆడారు. -
అక్టోబరులో నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ నెలలో తెలంగాణలో పర్యటిస్తారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో రెండు గంటల పాటు సాగిన తెలంగాణ బీజేపీ కోర్ కమిటీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సెప్టెంబర్ నెలలో కేంద్ర మంత్రులు, పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తెలంగాణకు వస్తారని కూడా లక్ష్మణ్ తెలిపారు. తెలంగాణాలో పార్టీ బలోపేతం, ప్రభుత్వ వైఫల్యాల గురించి ప్రజాందోళనలను చేపట్టాలని కోర్ కమిటీలో నిర్ణయం తీసుకున్నామన్నారు. పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, తెలంగాణ ఇన్ చార్జి కృష్ణదాసు, కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, బండారు దత్తాత్రేయలతో సమావేశమయ్యామని, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా సమావేశంలో చర్చించామని లక్ష్మణ్ చెప్పారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్టు పార్టీ అధిష్ఠానం గుర్తించిందని, తెలంగాణ, ఏపీ, ఒడిషా రాష్ట్రాలలో అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు జాతీయ నాయకులకు వివరించామని తెలిపారు. తెలంగాణ సర్కారు కుటుంబ పాలన, పార్టీ ఫిరాయింపులు, ప్రతిపక్షాలను అణగదొక్కడమే లక్ష్యంగా పని చేస్తోందని చెప్పారు. -
'మోదీ రెండేళ్ల పాలనపై రేపు వర్క్‌షాపు'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో జూన్ 7 నుంచి 10 మధ్యలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటించనున్నట్టు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు డా. లక్ష్మణ్ వెల్లడించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో అధికారం దిశగా బీజేపీ కార్యక్రమాలు చేపట్టనున్నట్టు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ రెండేళ్ల పరిపాలనపై రేపు (మంగళవారం) హైదరాబాద్‌లో వర్క్‌షాపు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ వర్క్‌షాపుకు కేంద్రమంత్రులు, జాతీయ నాయకులు హాజరుకానున్నట్టు చెప్పారు. నరేంద్రమోదీ రెండేళ్ల పరిపాలనపై వికాస్ పర్వ్ పేరుతో మే 26 నుంచి జూన్ 15 వరకు కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. గ్రామ గ్రామానికి బీజేపీ, ఇంటింటికి నరేంద్ర మోదీ పేరుతో కార్యక్రమాలు చేపడుతామని లక్ష్మణ్ పేర్కొన్నారు. -
కేసీఆర్ కు రైతుల గోడు పట్టదా?
♦ కరువు విలయతాండవం చేస్తున్నా పట్టింపులేదు ♦ 400 మండలాల్లో తాగునీరు లేక అల్లాడుతున్నారు ♦ రైతుల కోసం ప్రధాని మోదీ రూ.36వేల కోట్లు విడుదల చేశారు ♦ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ మహేశ్వరం: కరువుతో పంటలు పండక రైతులు అల్లాడుతుంటే వారి సంక్షేమాన్ని కేసీఆర్ పట్టించుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. శనివారం మహేశ్వరం మండలం నాగిరెడ్డిపల్లిలో బీజేపీ నిర్వహించిన కిసాన్ గ్రామసభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో సుమారు 400 మండలాల్లో తాగు, సాగునీరు లేక జనం కరువుతో అలమటిస్తున్నారని అన్నారు. గ్రాసం లేక రైతులు పశువులను సాగలేక కబేళాలకు తరలిస్తున్నాని అన్నారు. ప్రభుత్వం వెంటనే కరువు నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కేంద్రం ప్రతి ఇంటికీ దీపం పథకం కింద సబ్సిడీ గ్యాస్‌లను అందిస్తుందని చెప్పారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అవినీతి రహిత పాలన చేస్తుందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయకుండా నిరుద్యోగాన్ని పెంచిపోషిస్తుందని డాక్టర్ లక్ష్మణ్ విమర్శించారు. అంతకుముందు గ్రామంలో ఇంకుడుగుంత నిర్మాణ పనులకు లక్ష్మణ్ శంకుస్థాపన చేశారు. అనంతరం బీజేపీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు డాక్టర్ లక్ష్మణ్‌ను ఘనంగా సన్మానించారు. పలు సమస్యలపై గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు ఆయనకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లారెడ్డి, చింతా సాంబమూర్తి, జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, సెన్సార్ బోర్డు సభ్యుడు బోసుపల్లి ప్రతాప్, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విక్రంరెడ్డి, సర్పంచ్ మాధవచారి, ఉప సర్పంచ్ రాజు, నాయకులు పాపయ్య, కడారి జంగయ్య యాదవ్, శంకర్‌రెడ్డి, ప్రేమ్‌రాజ్, మదన్మోహన్, విజయలక్ష్మి, సుదర్శన్ యాదవ్, సుదర్శన్‌రెడ్డి, కుండె వెంకటేష్ పాల్గొన్నారు. -
'పార్టీలు ఫిరాయింపుల కోసమే వాడుకుంటున్నాయి'
న్యూఢిల్లీ: అసెంబ్లీ స్థానాల పెంపు అంశాన్ని టీడీపీ, టీఆర్ఎస్లు ఫిరాయింపుల కోసం వాడుకుంటున్నాయని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు డా.లక్ష్మణ్ తప్పుబట్టారు. సోమవారం న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, తెలంగాణలో టీఆర్ఎస్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నాయంటూ మండిపడ్డారు. పాలనా సౌలభ్యం, సుస్థిర అభివృద్ధి కోసమే సీట్ల పెంపు ఉండాలన్నారు. అసెంబ్లీ సీట్ల పెంపుపై హోంమంత్రితో చర్చించానని తెలిపారు. మే మూడో వారంలో హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పర్యటించనున్నట్టు తెలిపారు. ప్రజా సమస్యలపై అందరితో కలిసి పోరాడుతామని చెప్పారు. పసుపు, మిర్చి రైతుల సమస్యల పరిష్కారం కోసం కేంద్ర మంత్రులతో చర్చించినట్టు డా. లక్ష్మణ్ పేర్కొన్నారు. -
ఓడిపోతామనే భయంతో..
-
'చీవాట్లు తినడానికే కేసీఆర్ సర్కారు పరిమితం'
పార్లమెంటరీ సెక్రటరీల నియామకంపై టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. హైకోర్టుతో చీవాట్లు తినడానికే కేసీఆర్ సర్కారు పరిమితం అవుతోందని ఆయన మండిపడ్డారు. వాటర్ గ్రిడ్ పథకం మీద కూడా తాము హైకోర్టుకు వెళ్తామన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంటులో స్కాం జరిగిందని, విచారణలోనే దాని వాస్తవాలు తెలుస్తాయని ప్రభాకర్ అన్నారు. ఇక పార్లమెంటు సెక్రటరీల నియామకం రాజ్యాంగ విరుద్ధమని తాము గతంలోనే చెప్పినట్లు బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. పార్లమెంటరీ సెక్రటరీల నియామకం చెల్లదని హైకోర్టు చెప్పడం కేసీఆర్ తొందరపాటు పనులకు నిదర్శనమని ఆయన విమర్శించారు. ఓటుబ్యాంకు, రాజకీయ పునరావాస విధానాలకు ఇప్పటికైనా కేసీఆర్ స్వస్తి పలకాలని డాక్టర్ లక్ష్మణ్ చెప్పారు.