'పార్టీలు ఫిరాయింపుల కోసమే వాడుకుంటున్నాయి' | Telangana BJP president Laxman slams TDP, BJP | Sakshi
Sakshi News home page

'పార్టీలు ఫిరాయింపుల కోసమే వాడుకుంటున్నాయి'

Published Mon, Apr 18 2016 2:31 PM | Last Updated on Mon, May 28 2018 4:01 PM

Telangana BJP president Laxman slams TDP, BJP

న్యూఢిల్లీ: అసెంబ్లీ స్థానాల పెంపు అంశాన్ని టీడీపీ, టీఆర్ఎస్లు ఫిరాయింపుల కోసం వాడుకుంటున్నాయని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు డా.లక్ష్మణ్ తప్పుబట్టారు. సోమవారం న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, తెలంగాణలో టీఆర్ఎస్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నాయంటూ మండిపడ్డారు. పాలనా సౌలభ్యం, సుస్థిర అభివృద్ధి కోసమే సీట్ల పెంపు ఉండాలన్నారు. అసెంబ్లీ సీట్ల పెంపుపై హోంమంత్రితో చర్చించానని తెలిపారు.

మే మూడో వారంలో హైదరాబాద్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పర్యటించనున్నట్టు తెలిపారు. ప్రజా సమస్యలపై అందరితో కలిసి పోరాడుతామని చెప్పారు. పసుపు, మిర్చి రైతుల సమస్యల పరిష్కారం కోసం కేంద్ర మంత్రులతో చర్చించినట్టు డా. లక్ష్మణ్ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement