'మోదీ రెండేళ్ల పాలనపై రేపు వర్క్షాపు' | Workshop to be held on two years of narendra modi's rulling | Sakshi
Sakshi News home page

'మోదీ రెండేళ్ల పాలనపై రేపు వర్క్షాపు'

May 23 2016 5:17 PM | Updated on Mar 29 2019 6:00 PM

తెలంగాణ రాష్ట్రంలో జూన్ 7 నుంచి 10 మధ్యలో కేంద్రహోం మంత్రి అమిత్ షా పర్యటించనున్నట్టు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు డా. లక్ష్మణ్ వెల్లడించారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో జూన్ 7 నుంచి 10 మధ్యలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటించనున్నట్టు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు డా. లక్ష్మణ్ వెల్లడించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో అధికారం దిశగా బీజేపీ కార్యక్రమాలు చేపట్టనున్నట్టు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ రెండేళ్ల పరిపాలనపై రేపు (మంగళవారం) హైదరాబాద్లో వర్క్షాపు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ వర్క్షాపుకు కేంద్రమంత్రులు, జాతీయ నాయకులు హాజరుకానున్నట్టు చెప్పారు.

నరేంద్రమోదీ రెండేళ్ల పరిపాలనపై వికాస్ పర్వ్ పేరుతో మే 26 నుంచి జూన్ 15 వరకు కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. గ్రామ గ్రామానికి బీజేపీ, ఇంటింటికి నరేంద్ర మోదీ పేరుతో కార్యక్రమాలు చేపడుతామని లక్ష్మణ్ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement