Amit Shah
-
పంతం నెగ్గించుకున్న ఎన్డీయే
ఎవరు ఎంతగా వ్యతిరేకించినా వక్ఫ్ సవరణ బిల్లు చట్టంగా మారబోతోంది. అంతా సవ్యంగా ఉన్నప్పుడు ఎవరైనా స్వోత్కర్షలకు పోవచ్చు. కానీ క్లిష్ట సమయాలే ఎవరేమిటన్నది నిగ్గుదేలుస్తాయి. బిల్లు పార్లమెంటులో గట్టెక్కడం మాట అటుంచి టీడీపీ ఇన్నాళ్లుగా వేస్తున్న సెక్యులర్ వేషాలకు తెరపడింది. టీడీపీ, జేడీ(యూ)ల మద్దతు లేనిదే కేంద్రంలో ప్రభుత్వాన్నే నడపటం సాధ్యం కాని దీనస్థితిలోవున్న ఎన్డీయే సర్కారు... ఇప్పుడు వక్ఫ్ బిల్లుపై సునాయాసంగా తన పంతం నెగ్గించు కోవటం ఎలా సాధ్యమైందో అందరికీ తేటతెల్లమైంది. వీరితోపాటు మొదట వీరావేశంతో మాట్లాడిన ఒడిశాకు చెందిన బీజేడీ ఆఖరి నిమిషంలో స్వరం మార్చి పార్టీ ఎంపీలకు స్వేచ్ఛనిస్తున్నట్టు ప్రకటించటం ప్రభుత్వానికి కలిసొచ్చింది. నిరుడు ఆగస్టులో ఈ బిల్లు ప్రవేశపెట్టి ఆదరా బాదరాగా ఆమోదింపజేసుకోవాలని ప్రభుత్వం తహతహలాడినా విపక్షాలు తీవ్రంగా ప్రతిఘటించటంతో దీన్ని సంయుక్త పార్లమెంటరీ సంఘం (జేపీసీ) పరిశీలనకు పంపక తప్పలేదు. ఎన్డీయే సర్కారు ఏర్పాటైన పదేళ్లలో ఒక బిల్లు జేపీసీకి వెళ్లటం అదే ప్రథమం. రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల అనంతరం పెరిగిన బలం వల్లనైతేనేమి, ఏపీకి చెందిన కొందరు దిగజారుడు ఎంపీలతో రాజీనామాలు చేయించటం వల్లనైతేనేమి అప్పటితో పోలిస్తే ఇప్పుడు రాజ్యసభలో ఎన్డీయే బలం పెరిగింది. అందుకే వక్ఫ్ బిల్లు సునాయాసంగా గట్టెక్కుతుందని అధికారపక్షం నిర్ణయానికొచ్చింది. వక్ఫ్ ఆస్తులకు సంబంధించి సమస్యలు లేవని ఎవరూ అనరు. ఎన్నడో 1954లో వచ్చిన తొలి వక్ఫ్ చట్టం అవసరాలకు అనుగుణంగా లేదన్న ఉద్దేశంతో 1995లో దాని స్థానంలో మరో చట్టం తీసుకొచ్చారు. 2013లో సవరణలు చేశారు. అయినా మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం వున్నదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. వక్ఫ్‌కు సంబంధించిన ఆస్తుల్లో దాదాపు సగంవరకూ వాటి యాజమాన్యం లేదా నిర్వహణకు సంబంధించి సమస్యలున్నాయి. అవినీతి ఉన్నదనీ, అక్రమాలు చోటుచేసుకుంటున్నాయనీ ఆరోపణలు రావటం కూడా వాస్తవం. పారదర్శకత పాటించటంలేదన్న విమర్శ కూడా ఉంది. వీటిని సరిదిద్దాలంటే ముస్లిం పండితులతో, నిపుణులతో, ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వంటి సంస్థలతో మాట్లాడాలి. ఎలావుంటే బాగుంటుందన్న అంశంలో సూచనలూ, సలహాలూ తీసుకోవాలి. కానీ ఇవేమీ చేయకుండా బిల్లు తీసుకురావటంతో ముస్లిం వర్గాల్లో సంశయాలకు అవకాశం ఏర్పడింది. ముస్లింల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ బిల్లు తీసుకొచ్చినట్టు ప్రభుత్వం చెప్పటం బాగానేవున్నా ఆచరణ అందుకు విరుద్ధంగా ఉంది.బుజ్జగింపు ధోరణితో, ఓటుబ్యాంకు రాజకీయాలపై దృష్టితోనే బిల్లును వ్యతిరేకిస్తున్నారని విపక్షాలపై ఆరోపణలు చేస్తున్న ప్రభుత్వం తాను చేసిందేమిటో ఆలోచించిందా? నిజంగా చిత్తశుద్ధి వుంటే బిల్లు రూపకల్పనకు ముందు ఆ వర్గాలతో చర్చించటానికి అభ్యంతరమేమిటి? ముస్లిమేతరులకు వక్ఫ్ బోర్డులు, కౌన్సిళ్లలో స్థానం ఎందుకు కల్పించారన్న విషయమై ప్రభుత్వం ఇచ్చిన సంజా యిషీ ఏమాత్రం సంతృప్తికరంగా లేదు. మసీదుల నిర్వహణ లేదా మతపరమైన ఇతర అంశాలకు సంబంధించి వక్ఫ్ కౌన్సిళ్లు జోక్యం చేసుకోబోవని, కేవలం వక్ఫ్ ఆస్తుల వ్యవహారాలనే చూస్తాయని కేంద్రమంత్రులు అమిత్ షా, కిరణ్ రిజుజు చెబుతున్నారు. కానీ మౌలికంగా వక్ఫ్ ఆస్తి అంటే సంపన్న ముస్లింలు భక్తిభావనతో మతపరమైన అవసరాల కోసం, ఆ వర్గాల అభ్యున్నతి కోసం దానం చేసే ఆస్తి. అటువంటప్పుడు ఆ ఆస్తుల నిర్వహణలో అన్యులకు చోటీయటం అసమంజసం కాదా? ఇతర మతాలకు సంబంధించిన ధార్మిక ఆస్తుల నిర్వహణలో కూడా ముస్లింలకు అవకాశం ఇస్తారా? ఒకవేళ అలా ఇచ్చినా అందుకు ఆ మతస్తులు అంగీకరిస్తారా? ఇంతకాలం ముస్లిమేతరులు సైతం తమ ఆస్తిని కారుణ్య భావనతో వక్ఫ్‌కు ఇవ్వొచ్చన్న నిబంధన ఉండేది. కానీ తాజా సవరణ ప్రకారం అయిదేళ్లపాటు ఇస్లామ్‌ను ఆచరిస్తేనే అందుకు అర్హత వస్తుంది. అయితే ఇస్లామ్ ఆచరణే మిటో బిల్లు వివరించలేదు. 2013లో ఆ మరుసటి సంవత్సరం జరిగే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో వుంచుకుని ఆదరా బాదరాగా వక్ఫ్ చట్టానికి అప్పటి యూపీఏ ప్రభుత్వం సవరణలు తెచ్చిందని, అందువల్ల ఒక్క ఢిల్లీలోనే అనేక ఆస్తులు వక్ఫ్ ఆస్తులుగా మారాయని ప్రభుత్వం చెబుతున్నది. కానీ ఆ సవరణలను నాటి బీజేపీ నేతలు ఎల్కే అడ్వాణీ, సుష్మాస్వరాజ్ సమర్థించారు. సవరణలు పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదించటంలో తోడ్పడ్డారు. వక్ఫ్ బిల్లు తీసుకొచ్చిన ఉద్దేశంపై దేశవ్యాప్తంగావున్న 20 కోట్లమంది ముస్లింలలో ఎన్నో సంశయాలున్నాయి. బిల్లులోని నిబంధనలు ఆ సంశయాలను మరింత పెంచేవిగా ఉన్నాయి. వక్ఫ్ ఆస్తుల్ని ఆర్నెల్లలోపు డేటా బేస్‌లో నమోదు చేయనిపక్షంలో వాటికి సంబంధించిన వివాదాలపై న్యాయస్థానాల మెట్లెక్కటం అసాధ్యమని బిల్లు చెప్పటం సమంజసంగా అనిపించదు. వివాదంలో పడిన వక్ఫ్ ఆస్తులపై ప్రభుత్వ ఉన్నతాధికారి నిర్ణయం అంతిమం కావటం కూడా సమస్యాత్మకం. ఏ ఉన్నతాధికారైనా ప్రభుత్వ ప్రయోజనాలకు విరుద్ధంగా నిర్ణయం తీసుకోవటం సాధ్యమేనా? ఇది అనుమానాలు రేకెత్తించే అవకాశం లేదా? మొత్తానికి తెలుగుదేశం వంటి పక్షాలు బిల్లుకు ఓటేసి, ఆపైన సవరణలు తీసుకొచ్చామంటూ లీకులిస్తూ, తమ సవరణలతో బిల్లు పకడ్బందీగా వచ్చింద నడం హాస్యాస్పదం. అందులోని డొల్లతనం ఏమిటో ఈ నిబంధనలే చెబుతున్నాయి. క్లిష్ట సమయాల్లో తటస్థత వహించటం ద్రోహంతో సమానం. తటస్థత మాట అటుంచి నిస్సంకోచంగా బిల్లును సమర్థించి టీడీపీ తన నైజాన్ని బయట పెట్టుకుంది. ఇందుకు మూల్యం చెల్లించక తప్పదు. -
బిహార్‌లో బీజేపీ ఎన్నికల నగారా
గోపాల్‌గంజ్: హోం మంత్రి అమిత్ షా ఆదివారం బిహార్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగించారు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏకి తిరిగి అధికారం కట్టబెట్టడం ద్వారా ప్రధాని మోదీని బలపర్చాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతిపక్ష ఆర్జేడీకి గట్టిపట్టున్న గోపాల్ గంజ్‌లో జరిగిన బహిరంగ సభలో మంత్రి అమిత్ షా ప్రసంగించారు. గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల అనంతరం అమిత్ షా పాల్గొంటున్న మొదటిసారి సభ ఇదే కావడం గమనార్హం. ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్డీదేవి అధికారం చెలాయించిన 15 దశాబ్దాల కాలంలో బిహార్‌లో జంగిల్ రాజ్ నడిచిందని, కిడ్నాప్‌లు, హత్యలు, దోపిడీలు ఒక పరిశ్రమగా మారాయని నిప్పులు చెరిగారు. ‘రాష్ట్రంలో రక్షణ కొరవడటంతో ముఖ్యమైన వ్యాపారవేత్తలంతా ఆ సమయంలో రాష్ట్రాన్ని వీడారు. దాణా కుంభకోణానికి పాల్పడిన లాలు ప్రసాద్ యాదవ్ పేరు ప్రపంచ దేశాల్లోనే మారుమోగింది, బిహార్‌కు ఆయన తీరని కళంకం తెచ్చారు’అని అమిత్ షా ఆరోపించారు. ‘కుటుంబ రాజకీయాలు చేసే లాలు.. భార్యను సీఎం పీఠంపై కూర్చోబెట్టారు. కుమార్తెను పార్లమెంట్‌కు పంపారు. ఆయన ఇద్దరు కుమారులు ఇప్పుడు సీఎం అవ్వాలనుకుంటున్నారు’అని ఎద్దేవా చేశారు. ‘అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా చెప్పుకునే లాలు.. దాణా కూడా బొక్కేశారు. అటువంటి వ్యక్తి రికార్డు స్థాయిలో స్కాములే తప్ప, పేదలకు చేసేదేమీ లేదు’అని మండిపడ్డారు. సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలో జేడీయూ, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాకే పరిస్థితులు మెరుగుపడ్డాయని చెప్పారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న వరదల సమస్యకు చెక్ పెట్టామని చెప్పారు. లాలు–రబ్డీల జంగిల్ రాజ్ కావాలో, మోదీ, నితీశ్‌ల అభివృద్ధి కావాలో తేల్చుకునే సమయం ఇప్పుడు వచ్చిందని షా అన్నారు. ‘మరికొద్ది నెలల్లో అసెంబ్లీ జరిగే ఎన్నికల్లో కమలం గుర్తు బటన్‌నే మీరు నొక్కుతారని, బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏకే ఓటేస్తారని నాకు తెలుసు. మోదీ అంటే బిహార్ ప్రజలు ఎప్పుడూ అభిమానం చూపుతూనే ఉన్నారు. ఆయన్ను మళ్లీ మీరు బలపరుస్తారని ఆశిస్తున్నా’అని అమిత్ షా తెలిపారు. బిహార్ అసెంబ్లీకి వచ్చే అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. -
కేంద్రంలో మరో 20 ఏళ్లు బీజేపీనే
న్యూఢిల్లీ: కేంద్రంలో బీజేపీ కనీసం 30 ఏళ్లపాటు అధికారంలో ఉంటుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తంచేశారు. స్థిరమైన పనితీరు కనబరుస్తున్న తమ పార్టీ పట్ల ప్రజాదరణ చెక్కుచెదరదని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ పార్టీ విజయమైనా కష్టపడి పనిచేసే లక్షణంపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. సొంత బాగు కోసం కాకుండా దేశం కోసం పనిచేస్తే విజయం కచ్చితంగా సొంతమవుతుందని వెల్లడించారు. కేంద్రంలో బీజేపీ రాబోయే 30 ఏళ్లపాటు అధికారంలో ఉంటుందని తాను పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చెప్పానని గుర్తుచేశారు. గత పదేళ్లుగా అధికారంలో కొనసాగుతోందని, మరో 20 ఏళ్లపాటు పార్టీకి ఢోకా లేదని తేల్చిచెప్పారు. శుక్రవారం రాత్రి ‘టైమ్స్ నౌ’సదస్సులో అమిత్ షా మాట్లాడారు. చక్కటి పరిపాలన అందించిన పార్టీకి ప్రజాదరణ లభిస్తుందని, తద్వారా ఎన్నికల్లో విజయం సాధిస్తామన్న ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అన్నారు. ప్రజలు మెచ్చే పాలన అందించలేని పార్టీలకు ఇలాంటి ఆత్మవిశ్వాసం లభించదని స్పష్టంచేశారు. పదేళ్లలో 16,000 మంది లొంగుబాటు దేశంలో అంతర్గత భద్రతకు ప్రస్తుతం వచ్చిన ముప్పేమీ లేదని అమిత్ షా స్పష్టంచేశారు. నక్సలైట్ల హింసాకాండ, జమ్మూకశీ్మర్‌లో ఉగ్రవాదం, ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రవాదం అనే మూడు సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ మూడు అంశాలకు సంబంధించి గత పదేళ్లలో 16,000 మంది యువత లొంగిపోయారని వెల్లడించారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో శాంతి నెలకొల్పాల్సిన బాధ్యత హోంమంత్రిగా తనపై ఉందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు నరేంద్ర మోదీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఆరాధన స్థలాల చట్టం–1991పై ఇప్పుడు తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేనని పేర్కొన్నారు. ఈ అంశం కోర్టు పరిధిలో ఉండడంతో మనం మాట్లాడడం సరైంది కాదన్నారు. కోర్టులో ప్రభుత్వం తరఫున అఫిడవిట్ దాఖలు చేస్తామన్నారు. ఈ చట్టంపై సుప్రీంకోర్టు సరైన నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నట్లు చెప్పారు. కోర్టు ఆదేశాలను తప్పనిసరిగా పాటిస్తామన్నారు. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ వలసదార్లను ఓటుబ్యాంకుగా మార్చుకుంటోందని అమిత్ షా మండిపడ్డారు. పొరుగు దేశం నుంచి వచ్చినవారిని ఓటర్లుగా చేర్పిస్తున్నారని ఆరోపించారు. తృణమూల్ కాంగ్రెస్ ఆటలు సాగనివ్వబోమని హెచ్చరించారు. ప్రభుత్వ కార్యకలాపాల్లో ఆర్ఎస్ఎస్ జోక్యం లేదు ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ)పై అమిత్ షా స్పందించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలన్నీ ఒకదాని వెంట ఒకటి యూసీసీని ప్రవేశపెట్టబోతున్నాయని వెల్లడించారు. ఉత్తరాఖండ్‌లో యూసీసీపై చట్టం తీసుకొచ్చారని, గుజరాత్‌లోనూ దీనిపై కమిటీ ఏర్పాటు చేశారని తెలిపారు. బీజేపీ ఏర్పాటైనప్పటి నుంచి పార్టీ ఎజెండాలో యూసీసీ అనేది అత్యంత కీలకమైన అంశమని ఉద్ఘాటించారు. దేశంలో యూసీసీని అమలు చేస్తామంటూ హామీ ఇచ్చామని తెలిపారు. అది జరిగి తీరుతుందని స్పష్టంచేశారు. యూసీసీని తీసుకురావాలన్నది రాజ్యాంగ సభ నిర్ణయమని పేర్కొన్నారు. ఆ విషయం కాంగ్రెస్ పార్టీ మర్చిపోయినప్పటికీ బీజేపీ మర్చిపోలేదన్నారు. చెప్పినట్లుగానే ఆర్టికల్ 370ని రద్దు చేశామని, అయోధ్యలో రామమందిరం నిర్మించామని, ఇక యూసీసీని అమలు చేయడం తథ్యమని వివరించారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో నోట్ల కట్టలు దొరికిన ఘటనపై త్రిసభ్య కమిటీ ఇచ్చే నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. కమిటీ విచారణకు ప్రభుత్వం సహకరిస్తోందని అన్నారు. మోదీ ప్రభుత్వ కార్యకలాపాల్లో ఆర్ఎస్ఎస్ జోక్యం చేసుకుంటోందన్న విమర్శల్లో ఎంతమాత్రం వాస్తవం లేదని వెల్లడించారు. సంఘ్ గత వందేళ్లుగా దేశభక్తులను తయారు చేస్తోందని ప్రశంసించారు. -
అక్రమవలసలపై మోదీ ఉక్కుపాదం
-
Amit Shah: భారతదేశం ధర్మశాల కాదు
న్యూఢిల్లీ: భారతదేశం ధర్మశాల కాదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తేల్చిచెప్పారు. దేశానికి ముప్పు కలిగించేవారు ఇక్కడికి వచ్చి తిష్ట వేస్తామంటే సహింబోమని హెచ్చరించారు. విదేశాల నుంచి పర్యాటకులుగా లేదా విద్య, వైద్యం, వ్యాపారం, పరిశోధనల కోసం ఎవరైనా వస్తామంటే సాదరంగా ఆహా్వనించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కానీ, దేశంలో విధ్వంసం సృష్టించడానికి వచ్చేవారిపై కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. దేశంలోకి అక్రమంగా చొరబడేవారిపై కన్నేసి ఉంచుతామన్నారు. కీలకమైన ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లు–2025 గురువారం లోక్‌సభలో మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. ఈ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా అమిత్ షా మాట్లాడారు. ప్రమాదకరమైన ఉద్దేశాలతో దేశానికి వచ్చేవారిని కచి్చతంగా అడ్డుకుంటామని తెలిపారు. అందరికీ ఆశ్రయం ఇవ్వడానికి ఇది ధర్మశాల కాదన్నారు. జాతీయ భద్రతకు ముప్పుగా మారిన వారిని అనుమతించబోమన్నారు. దేశ అభివృద్ధిలో భాగస్వాములుగా మారడానికి వచ్చేవారిని స్వాగతిస్తామన్నారు. ప్రతిపాదిత ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ చట్టంతో దేశ భద్రత మరింత పటిష్టంగా మారుతుందని అమిత్ షా వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థకు, వ్యాపార రంగానికి మేలు జరుగుతుందని పేర్కొన్నారు. మన దేశాన్ని సందర్శించే ప్రతి ఒక్కరి సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఈ చట్టం అవసరమని తెలియజేశారు.బెంగాల్‌పై ధ్వజంపశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అక్రమ చొరబాటుదార్లను ముద్దు చేస్తోందని అమిత్ షా ధ్వజమెత్తారు. చట్టవిరుద్ధంగా దేశంలోకి ప్రవేశించినవారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. బెంగాల్ ప్రభుత్వం భూమిని అప్పగించకపోవడం వల్ల భారత్–బంగ్లాదేశ్ సరిహద్దులో 450 కిలోమీటర్ల మేర కంచె నిర్మాణం నిలిచిపోయిందని చెప్పారు. అక్కడ కంచె నిర్మించడానికి ప్రయత్నాలు జరిగినప్పుడల్లా తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు అలజడి సృష్టిస్తున్నారని, మతపరమైన నినాదాలు చేస్తున్నారని విమర్శించారు. చొరబాటుదార్లపై తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రేమాభిమానాలు ప్రదర్శిస్తుండడం వల్లే కంచె నిర్మాణం పెండింగ్‌లో ఉండిపోయిందని అన్నారు. ఏమిటీ బిల్లు? → ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లు–2025 ప్రకారం.. నకిలీ పాస్‌పోర్టు లేదా నకిలీ వీసాతో ఇండియాలోకి ప్రవేశించినా, ఇక్కడ నివసిస్తున్నా, బయటకు వెళ్లిపోయేందుకు ప్రయత్నించినా ఏడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.10 లక్షల దాకా జరిమానా విధించవచ్చు. → తమ వద్ద బస చేస్తున్న విదేశీయుల వివరాలను హోటళ్లు తప్పనిసరిగా ప్రభుత్వానికి అందజేయాలి. విద్యాసంస్థలు, హాస్పిటళ్లు, నర్సింగ్ హోమ్‌లలో కూడా విదేశీయులు ఉంటే ఆ సమాచారాన్ని యాజమాన్యాలు ప్రభుత్వానికి తెలియపర్చాలి. → చెల్లుబాటు అయ్యే పాసుపోర్టు లేదా ట్రావెల్ డాక్యుమెంట్ లేకుండా ఇండియాలోకి ప్రవేశిస్తే ఐదేళ్ల దాకా జైలు శిక్ష లేదా రూ.5 లక్షల దాకా జరిమానా విధించవచ్చు. ఒక్కోసారి ఈ రెండు శిక్షలు కలిపి విధించవచ్చు. -
అమిత్ షాపై సభా హక్కుల నోటీసు తిరస్కరణ
న్యూఢిల్లీ, సాక్షి: కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ సమర్పించిన సభా హక్కుల ఉల్లంఘన నోటీసులను గురువారం రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ తిరస్కరించారు. ఆయన వ్యాఖ్యలను పరిశీలించాను. అందులో అతిక్రమణ ఏదీ కనిపించలేదని చెబుతూ నోటీసులను తిరస్కరించారు. విపత్తుల నిర్వహణ బిల్లు 2024పై రాజ్యసభలో మంగళవారం జరిగిన చర్చలో అమిత్‌షా మాట్లాడుతూ ‘‘కాంగ్రెస్ హయాంలో ప్రధానమంత్రి సహాయనిధి కేవలం ఒక కుటుంబం గుప్పిట్లో ఉండేదని, ప్రధానమంత్రి సహాయనిధిని ప్రభుత్వం ఏర్పాటు చేసినా అందులో కాంగ్రెస్ అధ్యక్షులు సభ్యులుగా ఉండేవారు’’ అని వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలు పరోక్షంగా సోనియా గాంధీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేవిగా ఉన్నాయని, హోం మంత్రి సభ్యులను తప్పుదోవ పట్టించారని, ఇది సభా హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని పేర్కొంటూ జైరాం రమేశ్ ప్రివిలేజ్ నోటీసు రాజ్యసభ చైర్మన్‌కు అందించారు. -
వైవిధ్య వైరుద్ధ్యాలు
ఒక కుటుంబం నుంచి, సమాజం నుంచి, ఒక దేశం వరకు వైవిధ్యాలు అనేకం ఉంటాయి. వాటిని వైరుద్ధ్యాలుగా మారకుండా చూసుకోవటంలోనే విజ్ఞత ఉంటుంది. ఆ విధంగా చూసినపుడు, లోక్‌సభ నియోజక వర్గాల పునర్విభ జనపై తలెత్తిన వివాదం ఒక వైవిధ్య స్థితి నుంచి వైరుద్ధ్య స్థాయికి చేరుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఈ అంశంపై ఈ నెల 22న చెన్నైలో జరిగిన సమావేశం దేశానికంతా ఒక హెచ్చరిక వంటిదని చెప్పాలి. నియోజక వర్గాల పునర్విభజనతో ముడిపడి మరొక రెండు అంశాలు కూడా ఉన్నాయన్నది గుర్తించవలసిన విషయం. ఒకటి – హిందీ భాషను హిందీయేతర రాష్ట్రాలపై బలవంతంగా రుద్దుతున్నారనే ఫిర్యాదు. ఈ విషయం చెన్నైలో చర్చకు రాలేదు. కానీ ఎప్పటినుంచో ఉన్నదే. రెండవది – దక్షిణ–ఉత్తర భారతాల మధ్య సాధారణ రూపంలోనే ఉన్నాయనే విభేదాలు. ఈ భావన నియోజక వర్గాల పునర్విభజనకు, హిందీ భాషకు పరిమితమైనది కాదు. ఇటువంటి భావనలకు గల చరిత్ర మూడు దశలలో కనిపిస్తుంది. ఒకటి– ఉత్తరాది వారికి దక్షిణాది వారిపట్ల ఎప్పుడూ చిన్నచూపేనన్నది. రెండు – దాక్షిణాత్యుల రంగురూపులు, భాషా సంస్కృతులు, ఆహార విహారాల పట్ల స్వాతంత్య్రానికి ముందు నుంచే ఉన్నదనే ఈసడింపు దృష్టి. మూడవది–ఈ రెండింటికన్నా ప్రమాదకరమైనది, ప్రాచీనమైనది. అది ఆర్య–ద్రవిడ వాదనలు. వివాదాలకు ఆస్కారం ఇచ్చేలా...మరే దేశంలోనూ లేనంతటి వైవి«ధ్యాలు ఇక్కడ ఉన్నాయి. సాంస్కృతికంగా, విశ్వాసాలపరంగా ఒక ఏక రూపత, కనీసం స్థూలమైన విధంగా, అనాదిగా ఉండిన ప్పటికీ, బ్రిటిష్ వలస పాలన ముగిసినాక చరిత్రలో మొదటిసారిగా మొత్తం నాలుగు చెరగులకూ కలిపి భౌగోళికంగా, రాజకీయంగా దేశానికి ఏకరూపత సిద్ధించింది. వైవిధ్యాలను సరిహద్దులు చెరిపివేసి ఒకటి చేసే ప్రయత్నాలు 1885లో కాంగ్రెస్ వ్యవస్థాపన కాలం నుంచి మొదలై, 1947లో స్వాతంత్య్ర సాధన, 1950 నుంచి రాజ్యాంగం అమలు, 1951–52లో మొదటి సార్వత్రిక ఎన్నికలతో ఒక రూపానికి వచ్చాయి. వైవిధ్యాలు వైరు ద్ధ్యాలుగా మారగల అవకాశాలకు ఆ విధంగా ముగింపు పలికినట్లయింది. కనీసం అందుకు ఒక బలమైన ప్రాతిప దిక సూత్రరీత్యా ఏర్పడింది. దానిని అదే ప్రకారం స్థిర పరచి మరింత పటిష్ఠం చేయవలసిన బాధ్యతను చరిత్ర పాలకులకు అప్పగించింది. అందుకు పునాదుల స్థాయిలో భంగపాట్లు జరిగాయని అనలేముగానీ, వేర్వేరు సాయుల్లో జరుగుతూ వస్తున్న దాని పర్యవసానమే ప్రస్తుత వివాదాలు.ఇటువంటి వివాదాలకు కేంద్ర ప్రభుత్వం ఆస్కార మివ్వనట్లయితే చెన్నై సమావేశపు అవసరమే ఉండేది కాదు. ఆ సమావేశం దరిమిలా కేంద్ర హోంమంత్రిఅమిత్ షా ఏమీ స్పందించలేదుగానీ, దక్షిణాదికి చెందిన ముగ్గురు బీజేపీ మంత్రులు మాట్లాడుతూ, విభజనకు సంబంధించి ఇంకా నిర్ణయం జరగలేదు, విధివిధానాలు రూపొందలేదు, ప్రకటనేమీ వెలువడలేదు, అటువంటపుడు ఈ సమావేశాలు, విమర్శలు ఎందుకని ప్రశ్నించారు. విధివిధానాల రూపకల్పన, ప్రకటన జరగక పోవచ్చు. కానీ నష్టపోతా మనుకునే రాష్ట్రాలకు స్థూలమైన అభిప్రాయాలు కలగకుండా ఎట్లా ఉంటాయి? వారు ఆ విషయమై మాట్లాడకుండా ఎట్లా ఉంటారు?ఇటువంటి విషయాలలో చర్చలు ఒక ప్రజాస్వామిక రాజకీయ వ్యవస్థలో ముందునుంచే జరుగుతాయి తప్ప, అంతా ముగిసిపోయే వరకు ఆగవు. విషయం వివాదాస్పదమవుతున్న సూచనలు కనిపించినప్పుడు చర్చలు మరింత అవసరం. కానీ అమిత్ షా అదేమీ చేయకుండా, దక్షిణాదికి ఎటువంటి నష్టం ఉండ దనీ, అక్కడి స్థానాలు ఇప్పటికన్నా పెరుగుతాయనటం మొదలుపెట్టారు. ఇందులో ఒక చాతుర్యం ఉంది. ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలు రెండింటికీ స్థానాలు ఇప్పటికన్న పెరిగినా, దక్షిణాదికన్న ఉత్తరాదికి పెరిగేవి చాలా ఎక్కువని, ఆ విధంగా రెండు ప్రాంతాల మధ్య గల ప్రస్తుత వ్యత్యాసం బాగా ఎక్కువవుతుందని అంచనా. అమిత్‌షా ఈ కోణాన్ని దాచిపెడుతున్నారు. అట్లాగాక ఏ వ్యత్యాసమూ, నష్టమూ ఉండదనుకుంటే ఆయన ఆ మాటను దక్షిణ రాష్ట్రాలను సమావేశపరచి వివరించాలి.సమావేశం అవసరం!చెన్నైలో జరిగిన సంయుక్త కార్యాచరణ కమిటీ సమావేశానికి పార్టీ తేడాలు లేకుండా పలువురు హాజరయారంటేనే, విభజన ప్రతిపాదనలు ఎటువంటి అనుమానాలను కలిగిస్తున్నాయో అర్థమవుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పాల్గొనటం. ఎందుకంటే, దేశమంతటాగల ఆ పార్టీ ఇటువంటి వైఖరి తీసుకుంటే వారికి ఉత్తరాదిన వ్యతిరేకత రాగలదనీ, ఆ భయంతో వారు హాజరు కాకపోవచ్చుననీ బీజేపీ అంచనా వేసింది. కానీ విభజనకు వ్యతిరేకంగా పార్టీ అధ్యక్షుడు ఖర్గే ముందుగానే మాట్లాడారు.ఇందులో రెండవవైపున చూస్తే, విభజనకు అనుకూలించటం వల్ల బీజేపీ దక్షిణాదిన నష్టపోగలదనే అభిప్రాయం ఉన్నా, ఆ పార్టీ అదే వైఖరికి కట్టుబడి ఉంటున్నది. దీనిని బట్టి ఇరువురూ, ఆయా ప్రాంతాలలో ప్రజాభిప్రాయాలు ఎట్లున్నా తమ వైఖరులను మార్చుకోదలచలేదని అర్థమవుతున్నది. దాని పర్యవసానాలు ఏమిటన్నది తర్వాతి విషయం. అది సూత్రబద్ధమైన వైఖరి అనుకుంటే మాత్రం ఆ మేరకు వారిని మెచ్చుకోవాలి.ఈ వైవిధ్యాలన్నీ వైరుద్ధ్యాలుగా మారి తీవ్ర స్థాయికి వెళ్ళకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, పార్టీలను సమావేశపరచాలి. ఈ విషయమై తమ అభిప్రాయాన్ని ఒక తీర్మానంగా ఆమోదించిన చెన్నై సమావేశం, ఆ తీర్మాన ప్రతిని ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల కాలంలోనే ప్రధాని మోదీకి అందజేయగలమని ప్రకటించింది. ఆయన ఆ సందర్భాన్ని అవకాశంగా తీసుకుని ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయటం మంచిదవుతుంది. చెన్నైలో తీర్మానించినట్లు విభజనను 25 సంవత్సరాల వరకు గాక, దక్షిణాదికి ఆమోదయోగ్యమయే ప్రత్యామ్నాయాన్ని కనుగొనే వరకు నిరవధికంగా వాయిదా వేయటం మంచిది.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
అణచివేతే పరిష్కారమా?!
చాన్నాళ్లుగా ఘర్షణాత్మక ప్రాంతంగా ముద్రపడిన ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యంలో మరోసారి మావోయిస్టులకూ, భద్రతా బలగాలకూ మధ్య గురువారం రెండు వేర్వేరు చోట్ల జరిగిన కాల్పుల్లో 30 మంది మావోయిస్టులూ, ఒక డీఆర్జీ జవాను మరణించారు. ఈ ఏడాది ఇంతవరకూ 113మంది నక్సలైట్లు మరణించారు. నిరుడు ఇదేకాలంలో 29 మంది ఎదురుకాల్పుల్లో చనిపోయారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం రాజ్యసభలో చేసిన ప్రసంగం ప్రభుత్వ దృఢ సంక ల్పాన్ని తెలియజెబుతుంది. మావోయిస్టులను వచ్చే ఏడాది మార్చి 31 నాటికి పూర్తిగా తుడిచి పెడతామని ఆయన ప్రకటించారు. ఈ ఏడాది ఇంతవరకూ 104 మందిని అరెస్టు చేశామని,164 మంది లొంగిపోయారని తెలిపారు. ఛత్తీస్‌గఢ్ ఒకప్పుడు మావోయిస్టుల కంచుకోట.ముఖ్యంగా 3,900 చదరపు కిలోమీటర్ల వైశాల్యంగల దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మఢ్ అటవీప్రాంతంలోకి మావోయిస్టులు మినహా అన్యులు ప్రవేశించటం అసంభవమన్న అభిప్రాయంవుండేది. అక్కడే మావోయిస్టు శిక్షణ శిబిరాలు, భారీ ఆయుధ డంప్‌లు, ఆహారపదార్థాల గోడౌన్ లుండేవి. పల్లెసీమల్లో వారికి గట్టి పట్టుండేది. ఇప్పుడక్కడ దాదాపు 300 వరకూ కేంద్ర బలగాల స్థావరాలున్నాయి. ఇవిగాక సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ దళాల శిబిరాలున్నాయి. బస్తర్ అడవుల్లోఅత్యంత మారుమూల ప్రాంతం కావటంవల్ల, చుట్టూ వున్న ఎత్తయిన కొండలు, వాటిపై దట్టంగా విస్తరించిన వృక్షాలుండటంవల్ల మావోయిస్టులకు అది రక్షణ కవచంగా ఉండేది. దాన్ని ‘విముక్త ప్రాంతం’గా పరిగణించేవారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఉండటంవల్లే వారి అణచివేత వేగం పుంజుకుందన్న అభిప్రాయం పాక్షిక సత్యం మాత్రమే. యూపీయే ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ మావోయిస్టులను ‘జాతీయ భద్రతకు పెనుముప్పు’గా ప్రకటించారు. తదనుగుణంగా అనేక చర్యలు మొదలయ్యాయి. అప్పటి హోంమంత్రి చిదంబరం ‘ఆపరేషన్ గ్రీన్ హంట్’ పేరుతో నక్సల్స్ ఏరివేతకు చర్యలు తీసుకున్నారు. అదిప్పుడు ‘ఆపరేషన్ కగార్’ అయింది. ఈ క్రమంలోనే మావోయిస్టులపై భద్రతా బలగాలు క్రమేపీ పైచేయి సాధించాయి. కేంద్రంలో ఎవరున్నా నక్సల్స్ అణచివేతలో ఛత్తీస్‌గఢ్‌కు పూర్తి సహకారం అందింది.రాజ్యానికుండే ఆయుధ సంపత్తి, దాని సుశిక్షిత భద్రతా బలగాల ముందు ఎవరూ సరి పోరన్నది వాస్తవం. ఆ అంబులపొదిలో ఇప్పుడు ఆధునిక సాంకేతికత చేరింది. అందువల్లే కావొచ్చు... దట్టమైన అరణ్యాల్లో సైతం మావోయిస్టు దళాల కదలికలను వెంటనే నిఘా వర్గాలు గుర్తించగలుగుతున్నాయి. అబూజ్‌మÉŠ అరణ్యంలో ఏం జరుగుతున్నదో ఎప్పటికప్పుడు ఆరా తీయగలిగేలా నిఘా డ్రోన్లు సంచరిస్తున్నాయి. ఇప్పటికేవున్న భద్రతా బలగాలకు అదనంగా గత నెలలో మరో 2,500 మంది జవాన్లను తరలించినట్టు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వర్గాలు ప్రకటించాయి. జిల్లా రిజర్వ్ గార్డ్(డీఆర్జీ) పేరిట ఏర్పాటు చేసిన బలగాలు కేంద్ర దళాల చేతుల్లో తిరుగు లేని ఆయుధం. ఎందుకంటే డీఆర్జీలో దాదాపు అందరూ ఆదివాసీ తెగలవారు. మావోయిస్టుల్లో పనిచేసినవారు. వీరికి ఆ ప్రాంతం కొట్టిన పిండి. ఎక్కడున్నామో, ఎటుపోతున్నామో తెలియని దుర్గ మారణ్యాల్లో వీరు సునాయాసంగా చొచ్చుకెళ్లగలుగుతున్నారు. ఒకప్పుడు మావోయిస్టుల్లో పనిచేసి వెలుపలికొచ్చినవారినీ, ఇతరులనూ ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ‘సల్వాజుడుం’ పేరిట సమీకరించి ఆయు ధాలిచ్చి, వారిద్వారా మావోయిస్టుల్ని అణచడానికి ప్రయత్నించింది. ఇలా ప్రైవేటు సైన్యాలను రూపొందించటం రాజ్యాంగ విరుద్ధమని, దాన్ని తక్షణమే రద్దు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. దురదృష్టమేమంటే భద్రతా బలగాలకూ, మావోయిస్టులకూ మధ్య జరిగే పోరుతో సంబంధంలేని సాధారణ ఆదివాసీ ప్రజానీకం సైతం భయంతో బతకాల్సి వస్తున్నది. ఘర్షణ జరిగే ప్రాంతాల్లో ఎక్కడైనా ఇదే పరిస్థితి. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ జిల్లాల్లో, ఏజెన్సీప్రాంతాల్లో నక్సల్స్‌కు సహకరిస్తున్నారన్న అనుమానంతో సాధారణ పౌరులను పోలీసులు వేధించే వారన్న అభిప్రాయం వుండేది. అలాగే నక్సల్స్ సైతం ఇన్ఫార్మర్ల పేరిట అనేకుల్ని హతమార్చిన ఉదంతాలు ఉండేవి. ఇప్పుడు ఛత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్లలో పదులకొద్దీమంది మరణిస్తున్నారు. కానీ వారంతా మావోయిస్టులేనా? ఆ ఉదంతాలు జరిగాక హక్కుల సంఘాలు చేసే ప్రకటనలు తప్ప అక్కడికి మీడియా వెళ్లి జరిగిందేమిటో చెప్పే పరిస్థితులు లేవు. అటు మావోయిస్టులు సైతం ఛత్తీస్‌గఢ్‌లో ఇన్ఫార్మర్ల పేరిట కొందరిని హతమారుస్తున్న ఉదంతాలు వెల్లడవుతున్నాయి.వచ్చే ఏడాదికల్లా మావోయిస్టుల్ని అంతం చేస్తామన్న అమిత్ షా ప్రకటనలు నెరవేరే అవకాశం ఉండొచ్చని వరస ఉదంతాలు గమనిస్తే అర్థమవుతుంది. 2013లో తొమ్మిది రాష్ట్రాల్లోని 126 జిల్లాలు నక్సల్స్ ప్రభావంలోవుంటే నిరుడు ఆ సంఖ్య 38కి పడిపోయింది. రహదారుల నిర్మాణం కూడా జోరందుకుంది. కానీ ఇవి మాత్రమే తిరుగుబాటునూ, అసంతృప్తినీ అంతర్థానం చేస్తాయని భావించటం పొరపాటు. ఆదివాసీ సంస్కృతినీ, అక్కడి సహజవనరులనూ పరిరక్షించటానికి చర్యలు తీసు కుంటేనే... ఆ ప్రాంతానికి స్వయంప్రతిపత్తి కల్పించి, రాజ్యాంగం పూచీపడిన హక్కులు సక్రమంగా అమలు చేస్తేనే సమస్య పరిష్కారమవుతుంది. ఇందిరాగాంధీ హయాంలో బీడీ శర్మ వంటి అంకిత భావంతో పనిచేసిన ఐఏఎస్ అధికారులు బస్తర్ ప్రాంత అభివృద్ధికీ, ఆదివాసీల సంక్షేమానికీ ఎన్నో పథకాలు అమలు చేశారు. ఆ నమూనాను ఆదర్శంగా తీసుకోవాలి. -
ఆ రోజులు పోయాయి.. ఉగ్రవాదంపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
సాక్షి, ఢిల్లీ: కశ్మీర్లో ఉగ్రవాద దాడులు తగ్గిపోయాయని.. సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తెలిపారు. శుక్రవారం ఆయన రాజ్యసభలో హోం శాఖ పనితీరుపై జరిగిన చర్చలో సమాధానం ఇస్తూ.. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానం అనుసరిస్తున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు ఓటు బ్యాంక్ రాజకీయాలతో కశ్మీర్‌ను నాశనం చేశాయంటూ ఆయన మండిపడ్డారు. దేశంలో శాంతి భద్రతలు కాపాడటంపైనే తాము ప్రధానంగా దృష్టి పెట్టినట్లు అమిత్ షా వెల్లడించారు.కశ్మీరీ యువకులు ఇప్పుడు ఉద్యోగాలు కూడా చేసుకుంటున్నారన్న అమిత్ షా.. గతంలో జరిగినట్లు ఉగ్రవాదులకు సానుభూతిగా ఆందోళనలు జరగడం లేదన్నారు. కశ్మీర్లో ఉగ్రవాదులను దేశ భక్తులుగా కొనియాడే రోజులు పోయాయంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు కశ్మీర్లో సినిమా ధియేటర్లు కూడా నిండుతున్నాయని అమిత్ షా అన్నారు.‘‘మా ప్రభుత్వ హయాంలో నక్సలిజాన్ని దాదాపుగా రూపుమాపాం. 2026 మార్చికల్లా నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తాం. ఉగ్రవాదాన్ని జీరో టోలరెన్స్ విధానంతో కఠినంగా అణిచివేశాం కశ్మీర్లో రాళ్లురువ్వే సంఘటనలు పూర్తిగా నిలిచిపోయాయి. కాంగ్రెస్ హయాంలో పోలిస్తే మా హయాంలో కాశ్మీర్లో ఉగ్రవాద దాడులు చాలా వరకు తగ్గిపోయాయి. వేర్పాటు వాదానికి ఆర్టికల్ 370 మూల కారణం. పిఎఫ్ఐ నెట్‌వర్క్‌ను పూర్తిగా నిర్మూలించాం. బింద్రే సానుభూతిపరులను జైలు ఊచలు లెక్కబెట్టించాము’’ అని అమిత్ షా వివరించారు. -
Amit Shah : నక్సల్స్‌కు అమిత్‌షా వార్నింగ్
ఢిల్లీ : కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నక్సల్స్‌కు హెచ్చరికలు జారీ చేశారు. లొంగిపోయేందుకు మావోయిస్ట్‌లకు కేంద్రం అవకాశం ఇస్తుంది. కాదు కూడదు అంటే వారి పట్ల కేంద్రం కఠినంగా వ్యవహరిస్తోందన్నారు. వచ్చేడాది మార్చి నెల లోపు నక్సలిజాన్ని అంతచేస్తామని పునరుద్ఘాటించారు.గురువారం, ఛత్తీస్ ఘడ్ దండకారణ్యంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు జరిపిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో 22మంది (అమిత్‌షా ట్విట్ చేసే సమయానికి)మావోయిస్టులు మృతి చెందారు.ఈ ఎన్‌కౌంటర్‌పై అమిత్‌షా ఎక్స్ వేదికగా స్పందించారు. ‘నక్సల్ భారత్ ముక్త్ అభియాన్’ భారత సైనికులు మరో విజయం సాధించారు. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం బిజాపుర్,కంఖేర్ రెండు వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహించిన కూంబింగ్‌లో 22మంది నక్సల్స్ మరణించారు. కేంద్రం నక్సల్స్ లొంగిపోయేందుకు అవకాశం ఇస్తుంది. కాదు కూడదు అంటే.. వారిపట్ల కేంద్రం కఠినంగా వ్యవహరిస్తోందని హెచ్చరించారు. వచ్చే ఏడాది మార్చి లోపు నక్సల్స్ రహిత దేశంగా భారత్‌ను తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ‘नक्सलमुक्त भारत अभियान’ की दिशा में आज हमारे जवानों ने एक और बड़ी सफलता हासिल की है। छत्तीसगढ़ के बीजापुर और कांकेर में हमारे सुरक्षा बलों के 2 अलग-अलग ऑपरेशन्स में 22 नक्सली मारे गए।मोदी सरकार नक्सलियों के विरुद्ध रुथलेस अप्रोच से आगे बढ़ रही है और समर्पण से लेकर समावेशन की…— Amit Shah (@AmitShah) March 20, 2025 -
బోడో ఒప్పందంతో శాంతి, అభివృద్ధి
గౌహతి/కొక్రాఝర్: బోడో ఒప్పందాన్ని అమలు చేసి ఈ ప్రాంతంలో శాంతిని, అభివృద్ధిని సుసాధ్యం చేశామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. బోడోలాండ్ టెరిటోరియల్ రీజియన్(బీటీఆర్)లోని యువత నేడు తుపాకులకు బదులుగా త్రివర్ణ పతాకాన్ని ధరించారని ఆయన తెలిపారు. 2020లో బోడో ఒప్పందం కుదరడం వల్లే ఇది సాధ్యమైందని మంత్రి ప్రకటించారు. ఆదివారం ఆయన అస్సాంలోని కొక్రాఝర్ జిల్లా దొట్మాలో ఆల్ బోడో స్డూటెండ్స్ యూనియన్(ఏబీఎస్‌యూ) 57వ వార్షిక భేటీని ఉద్దేశించి ప్రసంగించారు.ఒప్పందం విషయంలో ఏబీఎస్‌యూ చూపిన చొరవ ఫలితంగానే నేడు శాంతియుత పరిస్థితులు సాధ్యమయ్యాయని చెప్పారు. లేకుంటే, బీటీఆర్‌లో శాంతి లేదు, బోడో ఒప్పందం ఒక జోక్ అంటూ కాంగ్రెస్ ఎద్దేవా చేసి ఉండేదని ఆయన అన్నారు. ఒప్పందంలోని 82 శాతం షరతులను ఇప్పటికే అమలు చేశామని, వచ్చే రెండేళ్లలో 100 శాతం పూర్తవుతుందని చెప్పారు. ఈ ప్రాంతాన్ని సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం(ఏఎఫ్ఎస్పీఏ) నుంచి పూర్తిగా మినహాయించామని వివరించారు.మూడేళ్లలోనే ఎన్డీఎఫ్బీ సభ్యులు 4,881 మంది లొంగిపోయారని, వీరి పునరావాసానికి రూ.287 కోట్లు వెచ్చించామని ఇందులో 90 శాతం కేంద్రమే సమకూర్చిందని వివరించారు. 2020 జనవరి 27న ఏబీఎస్‌యూ, ఎన్డీఎఫ్బీ తదితర బోడో గ్రూపులతో కేంద్రం బోడో శాంతి ఒప్పందం కుదుర్చుకోవడం తెల్సిందే. నేర చట్టాల అమలుపై అమిత్ షా సమీక్ష కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం కొత్తగా అమల్లోకి వచి్చన నేర చట్టాలు బీఎన్ఎస్, బీఎన్ఎస్ఎస్, బీఎస్ఏ చట్టాలు ఈశాన్య రాష్ట్రాల్లో అమలుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన ఉండటంతో ఆ రాష్ట్రం తరఫున గవర్నర్ అజయ్ భల్లా హాజరయ్యారు. ఆయా రాష్ట్రాల సీఎంలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతోపాటు డీజీపీలు హాజరయ్యారు. -
మిజోరాం ‘వండర్ కిడ్’కు గిటార్
ఐజ్వాల్: ‘మా తుఝే సలాం’ పాటతో శ్రోతలను మంత్రముగ్ధులను చేసిన మిజోరాం ‘వండర్ కిడ్’ ఎస్తేర్ లాల్దుహామి హ్నామ్టేకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా గిటార్ బహుమతిగా ఇచ్చారు. 2021లో ఆమె పాడిన ‘మా తుఝే సలాం’ పాట వైరలై దేశమంతటి దృష్టినీ ఆకర్షించింది. ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో ఉన్న అమిత్ షా ఆదివారం ఐజ్వాల్‌లో ఆమెను రాజ్‌భవన్‌కు ఆహ్వనించారు. తనకు గిటార్ అందజేసిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇదొక మైమరపించే అనుభవంగా ఆయన అభివర్ణించారు. ‘భారత్ పట్ల ప్రేమే మనందరినీ ఏకం చేస్తుంది.ఎస్తేర్ వందేమాతరం పాట విని చలించిపోయాను. దేశంపై ఆమెకున్న ప్రేమ పాటలో ప్రతిఫలించింది’ అంటూ ప్రశంసించారు. దీనిపై ఆమె తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. దక్షిణ మిజోరంలోని లుంగ్లీ పట్టణానికి చెందిన హ్నామ్టే 2016 జూన్ 9న జన్మించింది. మూడేళ్ల వయసులోనే పాడటం ప్రారంభించింది. ఆమె ‘మా తుఝే సలాం’ మ్యూజిక్ వీడియోను యూట్యూబ్‌లో వారం రోజుల్లోనే 30 లక్షల మంది చూశారు. ఈ సంఖ్య ప్రస్తుతం 4.7 కోట్లకు చేరింది. ఆమె జీవితంపై తీసిన ‘ఎ స్టార్ ఈజ్ బోర్న్’కు 2023లో ఈశాన్య చలన చిత్రోత్సవంలో ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డు వచి్చంది. -
మిజోరం వండర్ కిడ్కి అమిత్ షా స్పెషల్ గిఫ్ట్
మిజోరాం: ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటిస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.. ఓ చిన్నారికి గిటార్‌ను బహుమతిగా ఇచ్చారు. శనివారం మిజోరాంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో ఏడేళ్ల చిన్నారి ఎస్తేర్ లాల్దుహవ్మి హనామ్టే వందేమాతరాన్ని పాడింది. ఆ చిన్నారిని అభినందిస్తూ గిటార్‌ను బహుమతిగా ఇచ్చారు. ఆ చిన్నారిని "వండర్ కిడ్"గా అభివర్ణించిన అమిత్ షా.. భారత్‌పై ప్రేమ మనల్ని ఏకం చేసిందన్నారు. ‘‘చిన్నారి ఎస్తేర్ వందేమాతరాన్ని పాడి నా హృదయాన్ని కదిలించింది.. ఏడేళ్ల చిన్నారికి దేశంపై ఉన్న ప్రేమ తన పాటలో కనిపించింది’ అంటూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆ చిన్నారి పాట వీడియోను కూడా ఆయన పంచుకున్నారు. కాగా, 2020లో ‘మా తుజే సలామ్’ పాట వీడియోతో అందరి దృష్టిని ఆకర్షించిన ఎస్తేర్.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆమె అనేక అవార్డులను కూడా అందుకుంది.Love for Bharat unites us all.Deeply moved to listen to Mizoram's wonder kid Esther Lalduhawmi Hnamte, singing Vande Mataram in Aizawl today. The seven-year-old's love for Bharat Mata poured out into her song, making listening to her a mesmerizing experience.Gifted her a… pic.twitter.com/7CLOKjkQ9y— Amit Shah (@AmitShah) March 15, 2025 -
అస్సాంలో అశాంతికి కాంగ్రెసే కారణం
దెర్గావ్జ్వాల్: అస్సాంలో శాంతియుత వాతావరణం నెలకొల్పి, మౌలిక వనరులను అభివృద్ధి చేసింది ప్రధాని మోదీయేనని హోం మంత్రి అమిత్ షా చెప్పారు. యువతకు ఉపాధి అవకాశాలను కల్పించిందని తెలిపారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు రాష్ట్రంలో శాంతి నెలకొనకుండా అడ్డుకున్నాయని ఆయన ఆరోపించారు. అప్పట్లో రాష్ట్రానికి ఎటువంటి గ్రాంట్లు అందకపోవడంతో ఆందోళనలు, హింసాత్మక కార్యక్రమాలకు, వెనుకబాటుకు మారుపేరుగా మారిందని విమర్శించారు.శనివారం మంత్రి అమిత్ షా గోలాఘాట్ జిల్లా దెర్గావ్లోని లచిత్ బార్‌పుకాన్ పోలీస్ అకాడెమీ పునరుద్ధరణ మొదటి దశ పనులను ప్రారంభించడంతోపాటు రెండో దశ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘అస్సాంలో 10 వేల మందికి పైగా యువకులు ఆయుధాలు వదిలేసి జనజీవన స్రవంతిలో కలిశారు. దీంతో గత పదేళ్లుగా రాష్ట్రంలో శాంతి నెలకొంది. ఆందోళనలు, హింస, వేర్పాటువాదానికి పేరున్న అస్సాంలో నేడు రూ.27 వేల కోట్లకు పైగా పెట్టుబడితో అత్యాధునిక సెమీ కండక్టర్ పరిశ్రమ నడుస్తోంది. ఇది అస్సాం భవిష్యత్తునే మార్చనుంది’అని అన్నారు.ఇటీవల ముగిసిన అడ్వాంటేజ్ అస్సాం 2.0లో మరో రూ.3 లక్షల కోట్ల విలువైన పెట్టుబడుల ప్రతిపాదనలు అందాయి. ఇవి ఏర్పాటైతే యువతకు ఎన్నో అవకాశాలు అందుబాటులోకి వస్తాయి’అని మంత్రి చెప్పారు. మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్‌లతో ఉన్న సరిహద్దు వివాదాలను పరిష్కరించామన్నారు. విద్యార్థిగా ఉండగా అస్సాంకు వచ్చినప్పుడు జరిగిన పరిణామాలను ఆయన గుర్తు చేసుకుంటూ.. ‘అప్పట్లో కాంగ్రెస్ నేత హితేశ్వర్ సైకియా సీఎంగా ఉండేవారు. ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. అరెస్టయిన వారిలో నేనూ ఉన్నా. అస్సాం జైలులో వారం పాటు నన్ను ఉంచారు’అని తెలిపారు.అప్పటి కాంగ్రెస్ హయాంతో, ఇప్పటి బీజేపీ పాలనతో పోల్చుకుంటే అస్సాంలో గుర్తు పట్టలేనన్ని మార్పులు సంభవించాయన్నారు. వచ్చే ఐదేళ్లలో లచిత్ బార్‌పుకాన్ పోలీస్ అకాడెమీ దేశంలోనే అగ్రగామిగా మారనుందని చెప్పారు. అనంతరం అమిత్ షా మిజోరం రాజధాని ఐజ్వాల్‌లో అస్సాం రైఫిల్స్ క్యాంప్‌లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. మిజోరంలో అభివృద్ధి పనుల పురోగతిపై స్వయంగా ప్రధాని మోదీయే సమీక్ష చేస్తున్నారని ఆయన అన్నారు.అస్సాం రైఫిల్స్ క్యాంప్‌ను ఐజ్వాల్ వెలుపలికి మార్చడం కీలక పరిణామంగా పేర్కొన్నారు. మిజో ప్రజల అభీష్టానికి అనుగుణంగా కేంద్రం పనిచేస్తుందనడానికి ఇదే ఉదాహరణ అని ఆయన తెలిపారు. 2014కు పూర్వం ప్రధానమంత్రులంతా కలిసి ఈశాన్య రాష్ట్రాలకు వచ్చింది 21 సార్లు మాత్రమే రాగా, ప్రధాని మోదీ ఈ ప్రాంతంలో 78 పర్యాయాలు పర్యటించారని అమిత్ షా చెప్పారు. -
LKG విద్యార్థి Phd హోల్డర్‌కు ఉపన్యాసం ఇచ్చినట్టుంది: కేంద్రంపై స్టాలిన్ సెటైర్లు
సాక్షి, చెన్నై: తమిళనాడులో హిందీ(Hindi) భాష విషయమై రాజకీయం పీక్ స్టేజ్‌కు చేరుకుంది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్((MK Stalin), కేంద్రమంత్రుల మధ్య విమర్శలు చోటుచేసుకుంటున్నాయి. స్టాలిన్ వ్యాఖ్యలకు తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కౌంటరిచ్చారు. తమిళ భాషకు కేంద్రం తగిన గుర్తింపు ఇస్తుందన్నారు. తమిళం విషయంలో స్టాలిన్ రాజకీయం సరికాదన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తమిళనాడు(Tamil Nadu)లోని రాణిపేటలో పర్యటిస్తున్నారు. శుక్రవారం సీఐఎస్ఎఫ్ కార్యక్రమానికి అమిత్ షా హాజరయ్యారు. ఈ సందర్బంగా అమిత్ షా మాట్లాడుతూ..‘ఇంజనీరింగ్, మెడికల్ విభాగాల్లో ఉన్నత విద్య కోసం తమిళ భాషలోనే సిలబస్ తీసుకొస్తాం. వీలైనంత త్వరగా చర్యలు చేపడతాం. తమిళ భాష అభివృద్ధి, సంస్కృతికి కట్టుబడి ఉన్నాం. దేశంలో ప్రాంతీయ భాషలు అన్నింటినీ గౌరవిస్తాం. ఇప్పటివరకు సీఏపీఎఫ్(CAPF) నియామకంలో మాతృభాషకు స్థానం లేదు. ఈ నేపథ్యంలో యువతకు నష్టం జరుగుతోందని ప్రధాని మోదీ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నారు. అన్ని భాషలతో పాటు తమిళంలో కూడా సీఏపీఎఫ్ పరీక్షలు నిర్వహించాలని మోదీ నిర్ణయించారు. ఇప్పటికైనా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను సీఎం స్టాలిన్ మానుకోవాలి’ అని కామెంట్స్ చేశారు.#WATCH | Arakkonam, Tamil Nadu: Union Home Minister Amit Shah says, "... Till now, there was no place for mother tongue in the CAPF recruitment... PM Narendra Modi decided that our youth will now be able to write their CAPF exam in all languages in the eight list, including… pic.twitter.com/Q8pXv1IzZ4— ANI (@ANI) March 7, 2025అంతకుముందు, కేంద్రంపై సీఎం స్టాలిన్ విరుచుకుపడ్డారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై ఆయన విమర్శలు చేశారు. స్టాలిన్ ట్విట్టర్ వేదికగా..‘విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎప్పటికీ గెలవని యుద్ధం మొదలుపెట్టారు. చెట్టు ప్రశాంతంగా ఉండాలని అనుకున్నా.. గాలి రాకుండా మాత్రం ఉండదు కదా!. అలాగే.. భాష విషయంలో ఆయన మమ్మల్ని రెచ్చగొడుతున్నారు. అందుకే ఆయనకు వరుసగా లేఖలు రాస్తున్నాం. ఎన్ఈపీని తిరస్కరిస్తున్న తమిళనాడు.. ఇప్పటికే విద్యావిధానంలో అనేక లక్ష్యాలను సాధించింది.త్రిభాష విషయంలో.. ఎల్కేజీ విద్యార్థి పీహెచ్డీ హోల్డర్‌కి ఉపన్యాసం ఇచ్చినట్లు ఉంది ఆయన తీరు. మేం ఢిల్లీ ఆదేశాలను తీసుకోం. త్రిభాషా విధానంపై బీజేపీ సర్కారు చేస్తున్న సంతకాల ప్రచారం హాస్యాస్పదంగా ఉంది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ అంశాన్నే ప్రధాన అజెండాగా చేసుకొని బరిలో దిగాలని సవాల్ విసురుతున్నా. పథకాల దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఇచ్చే అవార్డుల వరకు అన్నింటికీ హిందీ పేర్లను పెట్టారు. దేశంలో అధికంగా ఉన్న హిందీయేతర ప్రజలను ఇది ఉక్కిరిబిక్కిరి చేస్తుంది’ అని స్టాలిన్ చెప్పుకొచ్చారు. 🎯 "The tree may prefer calm, but the wind will not subside." It was the Union Education Minister who provoked us to write this series of letters when we were simply doing our job. He forgot his place and dared to threaten an entire state to accept #HindiImposition, and now he… pic.twitter.com/pePfCnk8BS— M.K.Stalin (@mkstalin) March 7, 2025 -
త్వరలో ల్యాండ్ గ్రాబింగ్ ప్రొవిజన్ బిల్లు
సాక్షి, న్యూఢిల్లీ: త్వరలో రాష్ట్రంలో ‘ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొవిజన్’ బిల్లును తీసుకురానున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌తో ఆయన వేర్వేరుగా భేటీ అయ్యారు. అనంతరం ఎంపిక చేసుకున్న మీడియాతో సీఎం సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఐదేళ్లలో అనేక భూములు కబ్జాకు గురయ్యాయని ఆరోపించారు. ప్రతి పది కేసుల్లో ఆరు భూ వివాదాలకు సంబంధించినవే అన్నారు. భూముల కంప్యూటరీకరణలో సరైన విధానం లేక సమస్యలు ఎదురవుతున్నట్లు చెప్పారు. ప్రైవేటు భూములను బలవంతంగా 22ఏలో చేర్చారని.. అటవీ భూములను అధికారులతో కలిసి ఆక్రమించారని ఆరోపించారు. గుజరాత్లో ల్యాండ్ గ్రాబింగ్ బిల్లు విజయవంతంగా అమలవుతోందని, దాని అమలును ఏపీలో కూడా అనుమతించాలని కోరినట్లు చెప్పారు. డీలిమిటేషన్ నిరంతర ప్రక్రియనియోజకవర్గాల పునర్విభజన అనేది నిరంతర ప్రక్రియ అని.. దీనిపై సమయానుకూలంగా స్పందిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. గతంలో జనాభా నియంత్రణను ప్రోత్సహించానని, ఇప్పుడు జనాభాను పెంచాలనే విషయం అర్థమై పిలుపునిస్తున్నట్లు చెప్పారు.పోలవరం 2027 కల్లా పూర్తిగత ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల బకాయిలను వదిలిపెట్టిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలకు తెలిపినట్లు చంద్రబాబు చెప్పారు. రాయలసీమ వంటి కరువు ప్రాంతాలకు నీరందించేందుకు.. సముద్రంలో కలిసే జలాలను వినియోగించుకుంటామని కేంద్రం దృష్టికి తీసుకెళ్లామన్నారు. పోలవరంను 2027 కల్లా పూర్తి చేస్తామని తెలిపారు. 189 కి.మీ. మేర అమరావతి ఔటర్ఎనిమిది లైన్లతో 189 కి.మీ. మేర అమరావతి ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చర్చించినట్లు చంద్రబాబు చెప్పారు. శ్రీశైలం ఆలయం వద్ద ట్రాఫిక్ రద్దీని పరిష్కరించేందుకు రోడ్డును విస్తరించాలని, వినుకొండ–అమరావతి తదితర ప్రాజెక్టులపై చర్చించినట్లు తెలిపారు. డీపీఆర్‌లు సిద్ధం చేసిన తర్వాత టెండర్లు పిలుస్తామని గడ్కరీ చెప్పారని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రానికి రూ.6.5 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయన్నారు. మిర్చి క్వింటాకు రూ.11,781 మద్దతు ధర ఇచ్చేందుకు కేంద్రం ఒప్పుకొందన్నారు. కాగా, ఎమ్మెల్యేల కోటాలో ఖాళీ అవుతున్న 5 ఎమ్మెల్సీ స్థానాల సర్దుబాటుకే చంద్రబాబు ఢిల్లీ వచ్చారని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. -
శాశ్వత శాంతిని పునరుద్ధరించండి
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి పాలనలో ఉన్న మణిపూర్‌లో శాశ్వత శాంతిని పునరుద్ధరించేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఉన్నతాధికారులను ఆదేశించారు. మార్చి 8 నుంచి మణిపూర్‌లోని అన్ని రహదారులపై ప్రజలు స్వేచ్ఛగా రాకపోకలు సాగించేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించాలని సూచించారు. శాంతిని పునరుద్ధరించే విషయంలో అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అమిత్ షా దిశానిర్దేశం చేశారు. మణిపూర్ భద్రతా పరిస్థితిపై శనివారం న్యూఢిల్లీలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా పలు కీలక ఆదేశాలు చేశారు. ఈ సమావేశంలో మణిపూర్ గవర్నర్, అజయ్‌కుమార్ భల్లా, కేంద్ర హోం కార్యదర్శి గోవింద్ మోహన్, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్, ఆర్మీ డిప్యూటీ చీఫ్, తూర్పు కమాండ్ ఆర్మీ కమాండర్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్), అస్సాం రైఫిల్స్ డైరెక్టర్ జనరల్స్, మణిపూర్ భద్రతా సలహాదారు సహా పలువురు ఉన్నతస్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో మణిపూర్‌లో శాశ్వత శాంతిని పునరుద్ధరించడానికి అవసరమైన పూర్తి సహాయాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అమిత్ షా పేర్కొన్నారు. అంతేగాక దోపిడీకి సంబంధించిన అన్ని కేసులలో కఠినమైన చర్యలు తీసుకోవడం కొనసాగించాలని... మణిపూర్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఏర్పాటు చేసిన ఎంట్రీ పాయింట్లకు ఇరువైపులా కంచె వేయడం వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కేంద్ర హోంమంత్రి సూచించారు. మణిపూర్‌ను మాదకద్రవ్య రహితంగా మార్చేందుకు, మాదకద్రవ్య వ్యాపారంలో పాల్గొన్న మొత్తం నెట్‌వర్క్‌ను నిర్మూలించాలని ఆదేశించారు. -
మణిపూర్ సంక్షోభం.. కేంద్రం కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: సంక్షోభంలో ఉన్న మణిపూర్‌కు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. జనసంచారంపై ఉన్న ఆంక్షలను ఎత్తేయాలని.. మార్చి 8వ తేదీ నుంచి ఆ రాష్ట్రంలో సాధారణ స్థితి నెలకొల్పాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇవాళ జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో హోం శాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) సంబంధిత ఆదేశాలను జారీ చేశారు.మార్చి 8వ తేదీ నుంచి మణిపూర్(Manipur)లో అన్ని రోడ్లపై ప్రజలు స్వేచ్ఛగా తిరగాలి. ఎవరైనా జనసంచారానికి ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకోండి అని అమిత్ షా మణిపూర్ అధికార యంత్రాంగానికి సూచించారు. మణిపూర్‌లో రాష్ట్రపతి విధింపు తర్వాత.. అక్కడి శాంతి భద్రతలపై జరిగిన తొలి సమీక్షా సమావేశం ఇదే కావడం గమనార్హం.ఈ సమావేశానికి మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా(Ajay Kumar Bhalla), ఇతర ఉన్నతాధికారులు, సైన్యం.. పారామిలిటరీ తరపున ప్రతినిధులు హాజరయ్యారు. 2023 మే నుంచి ఈ ఈశాన్య రాష్ట్రంలో తెగల వైరంలో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొనేలా ప్రయత్నాలను కేంద్రం ఇప్పుడు ముమ్మరం చేసింది.దాదాపు రెండేళ్లుగా జాతుల మధ్య వైరంతో రగులుతున్న మణిపుర్లో కల్లోల పరిస్థితుల నేపథ్యంలో.. ఇటీవల ఫిబ్రవరి 13వ తేదీన సీఎం బీరెన్ సింగ్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ రాష్ట్రపతి పాలన విధించిన కేంద్ర ప్రభుత్వం అధికారాలన్నింటినీ అక్కడి గవర్నర్‌కు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కల్లోల పరిస్థితులను ఆసరాగా చేసుకుని భద్రతా బలగాలకు చెందిన ఆయుధాలను కొందరు ఎత్తుకెళ్లారు. ఈ నేపథ్యంలో.. అక్కడి ప్రజలకు గవర్నర్ అజయ్ కుమార్ భల్లా కీలక విజ్ఞప్తి చేశారు. తమ వద్ద ఉన్న అక్రమ ఆయుధాలు, పేలుడు పదార్థాలను ఏడు రోజుల్లోగా అప్పగించాలని అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిర్ణీత సమయంలోగా ఆయుధాలను తిరిగి ఇస్తే ఎలాంటి చర్యల ఉండవని.. లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
ఉత్తరాఖండ్ ఘటనపై అమిత్ షా
-
పునర్విభజన పేచీ తేల్చేదెలా?
ఎప్పటినుంచో చర్చకొస్తున్న నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ అంశంపై ఎట్టకేలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నోరువిప్పారు. ఈ ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగబోదని హామీ ఇచ్చారు. దీనిపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని కూడా అన్నారు. ఏ విషయమైనా వివాదాస్పదమైనప్పుడు వెంటనే వివరణనిచ్చి సందేహాలను తొలగించటం ప్రభుత్వాల బాధ్యత. 2023 సెప్టెంబర్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా డీఎంకే నాయకురాలు కనిమొళి దీన్ని ప్రస్తావించారు. జనాభా ప్రాతిపదికన పునర్విభజన ప్రక్రియ అమలు చేస్తే దక్షిణాదికి, ముఖ్యంగా తమిళనాడుకు అన్యాయం జరుగుతుందని ఆమె తెలిపారు. ఆ సమస్యే తలెత్తదని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఇప్పుడు అమిత్ షా అయినా, గతంలో మోదీ అయినా అన్యాయం జరగబోదని వాగ్దానం చేస్తున్నారు. మంచిదే. మరైతే పునర్వి భజన ఎలా ఉండబోతోంది? ఏ ప్రాతిపదికన చేస్తారు? అది చెప్పనంత కాలమూ ఈ సంశయాలు సమసిపోవు. జనాభా ప్రాతిపదికనే తీసుకుంటే అన్యాయం జరుగుతుందన్నది దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న సందేహం. అందుకు ఇతరత్రా ప్రాతిపదికలు తీసుకోబోతున్నామని తేటతెల్లం చేసినప్పుడే అందరికీ స్పష్టత వస్తుంది. దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాది రాష్ట్రాలు చాలా అంశాల్లో సాపేక్షంగా వెనకబడి వున్నాయి. విద్య, వైద్యం, ఆర్థికం వగైరాల్లో దక్షిణాదిదే ముందంజ. ఇదంతా జనాభాను అదుపు చేయటం వల్లనే సాధ్యమైంది. 2011 జనాభా లెక్కల ప్రకారం బిహార్‌లో జనాభా పెరుగుదల రేటు 25 శాతంగావుంటే, కేరళలో అది 5 శాతం మాత్రమే. ఎన్నికలు జరిగినప్పుడల్లా బీజేపీ ‘డబుల్ ఇంజన్ సర్కారు’ను తెరపైకి తెస్తుంది. ఆ సంగతెలా వున్నా దేశానికి ‘గ్రోత్ ఇంజన్’ దక్షిణాది అని చెప్పవచ్చు. అందుకే పునర్విభజనపై ఉన్న సందేహాలను పారదోలటం అవసరం.జనాభా లెక్కల సేకరణ జరిగి గణాంకాలు వెల్లడైనప్పుడల్లా ఆ ప్రాతిపదికన నియోజకవర్గాల హద్దులు, చట్టసభల్లో స్థానాల సంఖ్య మార్చాలని రాజ్యాంగం నిర్దేశిస్తోంది. దానికి అనుగుణంగా 1951, 1961, 1971 సంవత్సరాల జనాభా లెక్కల ప్రాతిపదికన లోక్‌సభ, రాజ్యసభ, రాష్ట్రాల అసెంబ్లీల్లోని స్థానాల సంఖ్య మారుతూ వచ్చింది. నియోజకవర్గాల పరిధులు కూడా మారాయి. కానీ 1976లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దీనికి బ్రేక్ వేశారు. ఆత్యయిక స్థితి కొనసాగుతున్న వేళ 42వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి 2001 వరకూ పునర్విభజన ప్రక్రియను స్తంభింపజేశారు. అధిక జనాభా ఉన్న రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసి జనాభా పెరుగుదలను అరికడితే ఏ రాష్ట్రమూ స్థానాల సంఖ్యను కోల్పోకుండా ఉంటుందని ఆమె ప్రభుత్వం భావించింది. కానీ ఎప్పటిలా దక్షిణాది రాష్ట్రాలే జనాభా అదుపులో ముందున్నాయి. 2001లో తప్పనిసరై పునర్విభజన ప్రక్రియ మొదలెట్టినా అది కేవలం నియోజకవర్గాల పరిధుల్లో మార్పులకే పరిమితమైంది. స్థానాల సంఖ్య యథాతథంగా ఉండిపోయింది. దక్షిణాది రాష్ట్రాల ఆందోళనను దృష్టిలో ఉంచుకునే ఆ పనిచేశారు.జనాభా పెరుగుదల రేటులో అసమతౌల్యం చాలా సమస్యలకు దారితీస్తోంది. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్‌లో ఒక ఎంపీ సగటున 30 లక్షలమంది జనాభాకు ప్రాతినిధ్యం వహించాల్సి వుంటుంది. అదే తమిళనాడులో అయితే దాదాపు 18 లక్షలమంది జనాభాకు ప్రతినిధిగా ఉంటారు. అంటే పునర్విభజన ప్రక్రియ ప్రాతిపదిక అన్ని అంశాల్లోనూ సమతుల్యతను సాధించాల్సి వుంటుంది. 1977 నాటి లోక్‌సభలో ప్రతి ఎంపీ సగటున 10.11 లక్షల జనాభాకు ప్రాతినిధ్యంవహించారు. అయితే అన్ని నియోజకవర్గాలూ ఈ చట్రంలో ఇమిడే అవకాశం ఉండదు గనుక కాస్త అటూ ఇటూగా నిర్ణయించారు. జనాభా లెక్కల సేకరణలో ఇప్పటికే మనం నాలుగేళ్లు వెనకబడి వున్నాం. కానీ కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ అంచనా ప్రకారం ప్రస్తుత జనాభా దాదాపు 143 కోట్లు. ఈ జనాభాకు 1977 నాటి ప్రాతిపదికన ఎంపీ స్థానాలు నిర్ణయించాల్సివస్తే వాటి సంఖ్య ఇంచుమించు 1,400కు చేరుతుంది. దీని ప్రకారం యూపీ స్థానాల సంఖ్య (ఉత్తరాఖండ్ కలుపు కొని) 85 నుంచి మూడురెట్లు పెరిగి 250కి చేరుతుంది. బిహార్‌కు (జార్ఖండ్ కలుపుకొని) ప్రస్తుతం ఉన్న 25 స్థానాలూ 82కు చేరుతాయి. తమిళనాడుకు దాదాపు రెట్టింపు సీట్లు పెరిగి 39 నుంచి 76 అవుతాయి. కేరళకు మాత్రం ప్రస్తుతం ఉన్న 20 కాస్తా 36 అవుతాయి. నియోజకవర్గానికి 20 లక్షల జనాభా ఉండాలనుకుంటే మొత్తం స్థానాలు 707 అవుతాయి. కానీ అలా జరిగితే తమిళనాడు స్థానాల సంఖ్య ఇప్పుడున్న మాదిరే ఉండిపోతుంది. కేరళ మాత్రం రెండు స్థానాలు కోల్పోతుంది. యూపీ మాత్రం 126కు చేరుతుంది. మన నూతన పార్లమెంటు భవనం 888 మంది ఎంపీలు ఆసీనులు కావటానికి వీలుగా నిర్మించారు. ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగకుండా, ఉన్న స్థానాలు కోల్పోకుండా పునర్విభజన ఉంటుందని అమిత్ షా చెప్పటం ఊరట కలిగిస్తుంది. కానీ జమ్మూ, కశ్మీర్లో జరిగిందేమిటి? అక్కడ అసెంబ్లీ స్థానాలు (లద్దాఖ్ మినహా) 83 నుంచి 90కి చేరు కున్నాయి. కొత్తగా పెరిగిన 7 స్థానాల్లో హిందువులు అధికంగా వున్న జమ్మూకు 6 వస్తే, ముస్లింల ప్రాబల్యంవున్న కశ్మీర్‌కు ఒక్కటి మాత్రమే పెరిగింది. అందుకే కేవలం అన్యాయం జరగదన్న హామీ మాత్రమే సరిపోదు. పునర్విభజన ప్రక్రియకు ఇక ఎంతో సమయం లేదు గనుక దానికి అనుసరించే ప్రాతిపదికలేమిటో తేటతెల్లం చేయటం అవసరం. అది చేయనంత కాలమూ సందేహాలు ఉత్పన్నమవుతూనే ఉంటాయి. వాటిని అబద్ధాలుగా కొట్టిపారేసినంత మాత్రాన సమసిపోవు. -
డీలిమిటేషన్‌తో ఒక్క సీటూ తగ్గదు
కోయంబత్తూరు: దామాషా విధానంలో చేపట్టే పునర్వ్యవస్థీకరణ వల్ల లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్య తగ్గదని హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. తమిళనాడుకే కాదు, ఏ ఒక్క దక్షిణాది రాష్ట్రానికి కూడా నష్టం జరగదని ఆయన కుండబద్దలు కొట్టారు. డీలిమిటేషన్ విషయంలో దక్షిణాది రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రధాని మోదీ వ్యవహరిస్తారని చెప్పారు. ఒక్క సీటు కూడా నష్టపోనివ్వరని మంత్రి హామీ ఇచ్చారు. పునర్వ్యవస్థీకరణ కారణంగా దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగదంటూ మోదీ ప్రభుత్వం ఇప్పటికే పార్లమెంట్లో ప్రకటించిందని ఆయన గుర్తు చేశారు. ఈ విషయంలో తమిళనాడు సీఎం స్టాలిన్ తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. డీలిమిటేషన్ వల్ల తమిళనాడు లోక్‌సభ సీట్ల సంఖ్య 39 నుంచి 31కి తగ్గిపోతుందని సోమవారం సీఎం స్టాలిన్ వ్యాఖ్యానించడం, దీనిపై చర్చించేందుకు 5న అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేశామనడం తెల్సిందే. తమిళనాడుకు నిధుల మంజూరు విషయంలో కేంద్రం అన్యాయం చేస్తోందంటూ సీఎం ఎంకే స్టాలిన్ చేసిన ఆరోపణలను మంత్రి తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే స్టాలిన్ డీలిమిటేషన్‌తో నష్టం జరుగుతుందని చెబుతున్నారని ధ్వజమెత్తారు. బుధవారం అమిత్ షా కోయంబత్తూరులో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. తిరువణ్ణామలై, రామనా థపురంలలో పార్టీ కార్యాలయాలను వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా కా ర్యకర్తలు, ప్రజలనుద్దేశించి మంత్రి ప్రసంగించారు. దేశ వ్యతిరేక ధోరణి పెరిగిందిరాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడటంలో విఫలమైందంటూ అధికార డీఎంకేపై అమిత్ షా విరుచుకుపడ్డారు. తమిళనాడులో జాతి వ్యతిరేక ధోరణి గరిష్ట స్థాయికి చేరుకుందంటూ వ్యాఖ్యానించారు. 1998 బాంబు పేలుళ్ల కేసులో నిందితుడు, ప్రధాన సూత్రధారి ఎస్ఏ బాషా అంతిమ యాత్రకు తమిళనాడు ప్రభుత్వం భద్రత కల్పించిందని విమర్శించారు. ‘రాష్ట్రంలో డ్రగ్స్ విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. మైనింగ్ మాఫియానే ఇక్కడ రాజకీయాలను నడిపిస్తోంది. శాంతిభద్రతల పరిస్థితి అధ్వానంగా ఉన్న రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఉంది. అవినీతిలో డీఎంకే మంత్రులంతా మాస్టర్స్ డిగ్రీ చేశారు. డీఎంకే నేతలపై ఉద్యోగాలను అమ్ముకున్న కేసులు, మనీలాండరింగ్ ఆరోపణలు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు, రూ.6 వేల కోట్ల కుంభకోణం కేసులున్నాయి. వీటిన్నిటినీ చూస్తే అవినీతికి పాల్పడిన వారికే డీఎంకే సభ్యత్వం ఇచ్చినట్లుగా కనిపిస్తోంది’అని అమిత్ షా వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతుండగా వాటిని పరిష్కరించడం మానేసిన సీఎం, ఆయన కుమారుడు ఉదయనిధి వారి దృష్టిని మళ్లించేందుకు ఇతర అంశాలను తెరపైకి తెస్తున్నారని ఆరోపించారు.నిధులపై వాస్తవ గణాంకాలివీ..కేంద్రం నుంచి అందిన నిధులపై చేతనైతే సీఎం స్టాలిన్ వాస్తవాలను వెల్లడించాలని అమిత్ షా సవాల్ విసిరారు. ‘మోదీ ప్రభుత్వ హయాంలో పదేళ్ల వ్యవధిలో తమిళనాడుకు రూ.5,08,337 లక్షల కోట్ల నిధులందాయి. వీటికి తోడు, మౌలిక వనరుల అభివృద్ధి కోసం మరో 1.43 లక్షల కోట్లను అందజేశాం. అదే, యూపీఏ హయాంలో 2004–14 సంవత్సరాల మధ్య కాలంలో తమిళనాడుకు కేవలం రూ.1.52 లక్షల కోట్లే దక్కాయి. అయితే, మోదీ ప్రభుత్వం అన్యాయం చేసిందని మీరంటున్నారు. వాస్తవానికి రాష్ట్రానికి యూపీఏ హయాంలో, అప్పటి ప్రభుత్వం మీరు కూడా భాగస్వాములుగా ఉండగానే అన్యాయం జరిగింది’అని షా చెప్పారు. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో విద్యార్థినులకు భద్రత కరువైందని ఆరోపించారు. అక్రమ సారాయి విక్రయాలను వ్యతిరేకించిన కాలేజీ విద్యార్థులు దారుణ హత్యకు గురవుతున్నారన్నారు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులో ఎన్డీయే ఘన విజయం సాధిస్తుందని, మహారాష్ట్ర, హరియాణాల్లో బీజేపీ సాధించిన గెలుపు కంటే ఇది మిన్నగా ఉంటుందన్నారు. -
జగన్ ప్రాణాలకు ముప్పు కేంద్రానికి ఎంపీ సంచలన లేఖ
-
ప్రధాని, హోంమంత్రులకు వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి లేఖ
సాక్షి, ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు వైఎస్సార్సీపీ లోక్‌సభ పక్ష నేత మిథున్ రెడ్డి లేఖ రాశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్ జగన్‌కు రక్షణ కల్పించడంలో ఏపీ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని.. గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ పర్యటనకు వెళ్ళిన వైఎస్ జగన్‌కు పోలీసులు రక్షణ కల్పించలేదు. జగన్ పర్యటనలో తీవ్రమైన భద్రత వైఫల్యం తలెత్తింది’’ అని లేఖలో మిథున్‌రెడ్డి వివరించారు.జెడ్ ప్లస్ సెక్యూరిటీ కేటగిరిలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు వెంటనే కేంద్ర బలగాలతో రక్షణ కల్పించండి. ఇటీవల వైఎస్ జగన్ నివాసం వద్ద కొన్ని ఘటనలు జరిగాయి. ఇవి భారీ ఎత్తున పన్నిన కుట్రలో భాగంగా జరుగుతున్న ఘటనలు. వైఎస్ జగన్ ప్రాణాలకు ముప్పు తెచ్చే విధంగా భద్రత వైఫల్యం కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం విధానాల వల్ల మాజీ ముఖ్యమంత్రి ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. ప్రజాస్వామ్య విధానాలకు తూట్లు పొడిచేలా ప్రమాదకర ధోరణికి తెరలేపుతోంది’’ అని లేఖలో మిథున్‌రెడ్డి పేర్కొన్నారు.ఇదీ చదవండి: జనం గుండెల్లో జగన్.. కూటమి గుండెల్లో రైళ్లుకాగా.. మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ గుంటూరు పర్యటనలో అడుగడుగునా భద్రతా వైఫల్యం కనిపించింది. మాజీ సీఎం పర్యటనలో భద్రత కల్పనపై ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఈ వైఫల్యంపై వైఎస్సార్సీపీ నేతలు గురువారం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. -
అమిత్ షా కొడుకు పేరుతో వసూళ్లు.. మోసగాడి అరెస్ట్
డెహ్రాడూన్:కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు,ఐసీసీ ఛైర్మన్ జై షాపేరుతో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరాఖండ్‌కు చెందిన ప్రియాంషు పంత్ (19) జై షా పేరు చెప్పి ఇక్కడి ఎమ్మెల్యే ఆదేశ్ చౌహాన్‌కు ఫోన్ చేశాడు.తనను అమిత్ షా కుమారుడు జై షాగా పరిచయం చేసుకొని పార్టీ కోసం రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.అనుమానం వచ్చిన ఎమ్మెల్యే ప్రశ్నించగా తమ మధ్య జరిగిన సంభాషణను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు.దీంతో ఎమ్మెల్యే మోసగాడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాలింపు మొదలు పెట్టిన పోలీసులు మోసానికి పాల్పడుతున్న ప్రియాంశు పంత్‌ను ఢిల్లీలో అరెస్టు చేశారు. అయితే నిందితుడు మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కూడా జై షా పేరుతో ఫోన్ చేసి డబ్బులిస్తే మంత్రి పదవులు ఇప్పిస్తానని చెప్పినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.విలాసవంతమైన జీవితం గడిపేందుకే పంత్ ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పడ్డట్టు పోలీసులు తెలిపారు. -
మేఘాలయలో కలుద్దాం!
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో అలరించిన జాతీయ క్రీడలు అట్టహాసంగా ముగిశాయి. తదుపరి మేఘాలయ జాతీయ క్రీడల ఆతిథ్యానికి సిద్ధం కానుంది. 2027లో అక్కడ 39వ నేషనల్ గేమ్స్ జరుగనున్నాయి. శుక్రవారం మేఘాలయ ముఖ్యమంత్రి కొంగ్‌కల్ సంగ్మా క్రీడాజ్యోతి అందుకోవడంతో దీనికి సంబంధించిన లాంఛన ప్రకియ కూడా ముగిసింది. 18 రోజుల పాటు విజయవంతంగా నిర్వహించిన తాజా జాతీయ క్రీడల్లో సర్వీసెస్ 121 పతకాలతో ఓవరాల్ చాంపియన్‌షిప్ గెలుచుకుంది. సర్వీసెస్ క్రీడాకారులు 68 స్వర్ణాలు, 26 రజతాలు, 27 కాంస్యాలు గెలిచారు. మహారాష్ట్ర అత్యధికంగా 198 పతకాలు గెలిచినప్పటికీ పసిడి వేట (54 స్వర్ణాలు)లో వెనుకబడిపోవడంతో రెండో స్థానంలో నిలిచింది. 71 రజతాలు, 73 కాంస్యాలు మరాఠా క్రీడాకారులు చేజిక్కించుకున్నారు. హరియాణా 153 పతకాలు (48 పసిడి, 47 రజతాలు, 58 కాంస్యాలు) మూడో స్థానంలో నిలువగా, ఆతిథ్య ఉత్తరాఖండ్ 24 స్వర్ణాలు, 35 రజతాలు, 44 కాంస్యాలతో మొత్తం 103 పతకాలు సాధించి ఏడో స్థానంలో నిలిచింది. తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ (14 పతకాలు) 18వ స్థానంలో, తెలంగాణ (18 పతకాలు) 26వ స్థానంలో నిలిచాయి. 2036 ఒలింపిక్స్‌కు సిద్ధం: అమిత్ షా జాతీయ క్రీడల ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విశ్వక్రీడల నిర్వహణకు భారత్ సిద్ధంగా ఉందని చెప్పారు. ‘క్రీడల్లో భారత్‌కు బంగారు భవిష్యత్తు ఉంది. 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చేందుకు రెడీగా ఉంది. ఉత్తరాఖండ్ అంటేనే దేవభూమిగా ప్రసిద్ధి. అయితే తాజా ఈవెంట్ నిర్వహణ ద్వారా ఖేల్ భూమి అయ్యింది. కేవలం క్రీడల నిర్వహణే కాదు. ఆటగాళ్లు రాటుదేలిన తీరు సాధించిన ప్రగతి రాష్ట్ర ప్రభుత్వం క్రీడారంగంలో చేసిన విశేష కృషికి నిదర్శనం. గత జాతీయ క్రీడల్లో ఉత్తరాఖండ్ 21వ స్థానంలో నిలిచింది. తాజా క్రీడల్లో ఏడో స్థానానికి ఎగబాకింది. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడం వల్లే క్రీడారంగంలో ఆ రాష్ట్రం ఇంతలా ఎదిగింది. ఇదే జోరు ఇకమీదటా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నా’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి, కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ, భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలు పీటీ ఉష, మేఘాలయ ముఖ్యమంత్రి కొంగ్‌కల్ సంగ్మా తదితరులు పాల్గొన్నారు. పీటీ ఉష మాట్లాడుతూ ‘ఈ మహత్తర ప్రయాణం ఇక్కడితో ముగిసేది కాదు. ఎల్లప్పుడు దిగి్వజయంగా సాగేది. భారత క్రీడల ప్రగతిని చాటేది’ అని ఆమె కితాబిచ్చారు. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ ‘2036 విశ్వక్రీడల్లో టాప్–10లో నిలిచేందుకు ఇదొక గొప్ప ఆరంభం. దేశంలో క్రీడాసంస్కృతి పెరుగుతుందనడానికి ఇదో నిదర్శనం’ అని అన్నారు. -
ఢిల్లీ సీఎం ఎంపికలో సర్ప్రైజింగ్ నిర్ణయం!
దేశ రాజధాని రీజియన్‌లో దాదాపు.. మూడు దశాబ్దాల తర్వాత బీజేపీ అధికారం కైవసం చేసుకుంది. అయితే ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో తొందరపాటు పనికి రాదని భావిస్తోంది. ఇందుకు గత అనుభవాలతో పాటు ప్రస్తుత సామాజిక పరిస్థితులు కారణాలుగా తెలుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ ప్యాకేజీల సర్ప్రైజ్లను ఇవ్వబోతుందని సంకేతాలు అందుతున్నాయి.ఢిల్లీకి 1991లో పాక్షిక రాష్ట్ర హోదా దక్కింది. 1993లో జరిగిన ఢిల్లీ తొలి ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. అయితే.. ఐదేళ్ల కాలంలో రాజకీయ ఒత్తిళ్లు, ప్రజల అసంతృప్తి నడుమ ముగ్గురు ముఖ్యమంత్రులను(మదన్ లాల్ ఖురానా, షాహిబ్ సింగ్ వర్మ, సుష్మా స్వరాజ్) మార్చాల్సి వచ్చింది. ఆపై అధికారం కోసం మళ్లీ ఇన్నేళ్లు ఎదురు చూడాల్సి వచ్చింది. ఈ తరుణంలో.. సుదీర్ఘ కాలం తర్వాత దక్కిన అధికారాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలనుకుంటోంది.సర్ప్రైజ్ తప్పదా?ఈ మధ్య గెలిచిన రాష్ట్రాల్లో సీఎం అభ్యర్థుల ఎంపిక విషయంలో బీజేపీ నిర్ణయాలు రాజకీయ వర్గాల అంచనాలను సైతం బోల్తా కొట్టించాయి. మధ్యప్రదేశ్‌కు మోహన్ యాదవ్, రాజస్థాన్‌కు భజన్ లాల్ శర్మ, ఛత్తీస్‌గఢ్‌కు విష్ణుదేవ్ సాయ్‌లను ఎంపిక చేయడమే ఇందుకు నిదర్శనం. ఇందులో.. రాజస్థాన్ విషయంలో ఏకంగా తొలిసారి ఎమ్మెల్యేగా నెగ్గిన భజన్ లాల్‌కు సీఎం పగ్గాలు ఇవ్వడం అప్పట్లో అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో ఢిల్లీ విషయంలోనూ ఇలాంటి సర్ప్రైజ్ నిర్ణయం వెలువడే అవకాశం లేకపోలేదు. అదే ఫార్ములా!ఢిల్లీ కోసం ఇద్దరు డిప్యూటీ సీఎంల ఫార్ములాను బీజేపీ తెరపైకి తెస్తోంది. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్‌లలో ఇదే పద్ధతిని అవలంభిస్తోంది. అలాగే.. ఢిల్లీని బీజేపీ మినీ ఇండియాగా భావిస్తోంది. బీజేపీ విజయంలో పంజాబీలు, సిక్కులు, పూర్వాంచలీస్, ఉత్తరాఖండీస్, వైశ్యాస్, జాట్.. ఇలా అన్ని వర్గాల ప్రజలు భాగమయ్యారని బీజేపీ భావిస్తోంది. కాబట్టి డిప్యూటీ సీఎంల ఎంపికలోనూ సామాజిక సమీకరణను ప్రముఖంగా పరిగణనలోకి తీసుకోవాలని భావిస్తోంది.రేసులో ఎవరంటే..ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేష్ వర్మ పేరు ఈ రేసులో ప్రముఖంగా వినిపిస్తోంది. ఢిల్లీ బీజేపీ మాజీ ఛీప్‌లు విజేందర్ గుప్తా, సతీష్ ఉపాధ్యాయలతో పాటు సీనియర్ నేతలు మంజిదర్ సింగ్ సిర్సా, పవన్ శర్మ, అశిష్ సూద్ మహిళా నేతలు రేఖా గుప్తా, శిఖా రాయ్ పేర్లు ప్రస్తావనకు వస్తున్నాయి. ఇక.. కొత్తగా ఎమ్మెల్యేలుగా నెగ్గిన కర్ణెయిల్ సింగ్, రాజ్‌కుమార్ భాటియా పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే.. హ్యాట్రిక్ ఎంపీ మనోజ్ కుమార్ తివారీ(సింగర్), కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా పేరును సైతం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో జాతీయ నాయకత్వం ఇప్పటికే ఢిల్లీ బీజేపీ వర్గాలతో సంప్రదింపులు జరుపుతోంది. సీఎం రేసుతో పాటు కేబినెట్ కోసం పలువురి పేర్లతో కూడిన జాబితాను పరిశీలిస్తోంది. అవినీతి ప్రభుత్వంగా పేర్కొంటూ ఆప్‌ను బీజేపీ గద్దె దించింది. ఈ క్రమంలో సీఎం అభ్యర్థి విషయంలో కుల సమీకరణాలతో పాటు ‘క్లీన్ ఇమేజ్’ను పరిగణనలోకి తీసుకుంటోందని సమాచారం. ప్రస్తుతం బీజేపీ అగ్రనేత, ప్రధాని మోదీ విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన తిరిగి రాగానే బీజేపీ అగ్రనేతలతో సమావేశమై ఈ అంశంపై చర్చించనున్నారు. అలాగే.. సోమ, లేదంటే మంగళవారాల్లో బీజేఎల్పీ సమావేశం జరగనుంది. ఆ భేటీ తర్వాత సీఎం ఎవరనేదానిపై స్పష్టమైన ప్రకటన వెలుడే అవకాశం ఉంది. ఈ నెల 19 లేదంటే 20వ తేదీ ఢిల్లీ నూతన సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగే అవకాశాలు ఉన్నాయన్నది తాజా సమాచారం. -
ఢిల్లీ సీఎంపై జోరుగా కసరత్తు
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ దంగల్‌లో ఆప్‌ను చిత్తు చేసిన బీజేపీ నూతన ముఖ్యమంత్రి ఎంపికపై కసరత్తు ముమ్మరం చేసింది. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. కొత్త సీఎం ఎంపికపై వారిద్దరూ చర్చించారు. ముఖ్యమంత్రి రేసులో పర్వేశ్ వర్మ ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది. సతీశ్ ఉపాధ్యాయ, విజేందర్ గుప్తా, ఆశిష్ సూద్, పవన్ శర్మతో పాటు పార్టీ ఎంపీ మనోజ్ తివారీ పేరు కూడా చక్కర్లు కొడుతోంది. జాట్ నేత అయిన పర్వేశ్ ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించి సంచలనం సృష్టించడం తెలిసిందే. ఆయనే సీఎం అవుతారని ప్రచారం జరుగుతున్నా రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా మాదిరిగా కమలనాథులు అనూహ్య నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యం లేదంటున్నారు. పూర్వాంచల్ నేపథ్యమున్న నేతను, లేదా మహిళను, లేదంటే సిక్కు వర్గం నాయకుడిని సీఎం ఎలా చేస్తే ఎలా ఉంటుందన్న దానిపైనా బీజేపీ పెద్దలు సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణాలు, భవిష్యత్తు అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, ఒడిశాల్లో పెద్దగా పేరు ప్రఖ్యాతుల్లేని నేతలను ముఖ్యమంత్రులుగా బీజేపీ నియమించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఏం చేస్తారన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. కొత్త సీఎం ఎంపికపై తుది నిర్ణయం అధిష్టానానిదేనని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా పునరుద్ఘాటించారు. తమ కొత్త ఎమ్మెల్యేలందరికీ సీఎంగా రాణించగల సత్తా ఉందన్నారు. అతిశీ రాజీనామా ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీ రాజీనామా చేశారు. ఆదివారం లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె.సక్సేనాకు రాజీనామా లేఖ సమర్పించారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరేదాకా కొనసాగాలని ఆయన కోరారు. మరోవైపు ఫలితాల నేపథ్యంలో ఢిల్లీ అసెంబ్లీని ఎల్జీ రద్దు చేశారు. ఈ నిర్ణయం శనివారం నుంచే అమల్లోకి వచి్చంది. అతిశీ గతేడాది సెపె్టంబర్లో అరవింద్ కేజ్రీవాల్ రాజీనామాతో సీఎంగా ఆతిశీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం తెలిసిందే. తాజా ఫలితాల్లో కేజ్రీవాల్ ఓడినా ఆమె మాత్రం నెగ్గారు. పథకాలను బీజేపీ ఆపకుండా చూస్తాం: ఆప్22 మంది ఆప్ కొత్త ఎమ్మెల్యేలతో పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం సమావేశమయ్యారు. ప్రజల కోసం పనిచేయాలని, వారి సమస్యలను పరిష్కరించాలని వారిని కోరారు. తమ పార్టీ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని అనంతరం ఆతిశీ మీడియాకు చెప్పారు. ‘‘మార్చి 8 నుంచి మహిళలకు బీజేపీ నెలకు రూ.2,500 కచ్చితంగా ఇవ్వాలి. ప్రజలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్తు, ఇతర సౌకర్యాలు కల్పించాలి. పదేళ్లుగా ఆప్ అమలు చేసిన ఉచిత సేవలు, పథకాలను నిలిపేయకుండా మేం చూస్తాం’’ అన్నారు.మోదీ అమెరికా నుంచి తిరిగి వచ్చాకే! ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్, అమెరికా దేశాల్లో పర్యటించనున్నారు. 13వ తేదీన ఆయన తిరిగొస్తారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారం ఆ తర్వాతే జరిగే అవకాశముందని బీజేపీ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. సీఎం ఎంపిక కూడా మోదీ వచ్చాకే జరగవచ్చని తెలిపాయి. -
ఎరుపెక్కిన ఇంద్రావతి!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/చర్ల: ఛత్తీస్‌గఢ్ అడవులు మరోసారి ఎరుపెక్కాయి. అక్కడి ఇంద్రావతి నేషనల్ పార్క్‌లో ఆదివారం ఉదయం జరిగిన భారీ ఎన్కౌంటర్లో 31 మంది మావోయిస్టులు మరణించారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు కూడా చనిపోగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. చనిపోయిన మావోయిస్టుల వివరాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ఐజీ సుందర్రాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇంద్రావతి నేషనల్ పార్కులో మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ, ఇంద్రావతి ఏరియా కమిటీలు ఒకేచోట సంచరిస్తున్నట్టుగా పోలీసులకు సమాచారం అందింది. దీనితో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్, బస్తర్ ఫైటర్స్, స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌లకు చెందిన జవాన్లు కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం 8 గంటలకు బలగాలు, మావోయిస్టులు ఎదురుపడటంతో ఎన్కౌంటర్ జరిగింది. అనంతరం ఘటనా స్థలంలో 31 మంది మావోయిస్టుల మృతదేహాలు లభించాయి. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు చనిపోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ప్రత్యేక హెలికాప్టర్లో రాయ్‌పూర్ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలం నుంచి ఏకే 47, ఇన్సాస్, ఎస్ఎల్ఆర్ రైఫిళ్లను, పేలుడు పదార్థాలను భద్రతా దళాలు స్వా«దీనం చేసుకున్నాయి. మృతుల్లో తెలంగాణ నేతలు? ఛత్తీస్‌గఢ్ – మహారాష్ట్ర సరిహద్దుల్లోని ఇంద్రావతి నేషనల్ పార్కులో మావోయిస్టు తెలంగాణ స్టేట్ కమిటీ షెల్టర్ తీసుకోగా, ఇంద్రావతి ఏరియా కమిటీ రక్షణగా ఉందని పోలీసులకు సమాచారం అందింది. దీనితో వివిధ భద్రతా దళాలకు చెందిన 650 మందికిపైగా జవాన్లు వేర్వేరు దిశల నుంచి శుక్రవారం రాత్రి కూంబింగ్ చేపట్టారు. శనివారం రాత్రికల్లా మావోయిస్టులు బస ప్రదేశాన్ని భద్రతా దళాలు చుట్టుముట్టాయి. ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో బలగాలను గమనించిన మావోయిస్టులు కాల్పులు జరపడంతో జవాన్లు ఎదురుకాల్పులు ప్రారంభించారు. ఎన్కౌంటర్ మృతుల్లో ఎక్కువ మంది జనమిలీషియా సభ్యులే ఉన్నట్టు సమాచారం. వారితోపాటు తెలంగాణ కమిటీకి చెందిన కీలక నేత కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. మృతదేహాల గుర్తింపు ప్రక్రియ మొదలైతే ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశముంది. టార్గెట్ చేసి.. రెండో సారి.. భద్రతా దళాలు కొన్ని నెలలుగా మావోయిస్టు తెలంగాణ కమిటీ టార్గెట్‌గా పనిచేస్తున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణ– ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని పూజారీ కాంకేర్ అడవులను జల్లెడపట్టడం మొదలుపెట్టాయి. ఈ క్రమంలో జనవరి 16న జరిగిన ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు చనిపోగా.. మిగిలినవారు తప్పించుకున్నారు. ఆ ఘటనలో తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి దామోదర్ అలియాస్ బడే చొక్కారావు మృతి చెందినట్టు ప్రచారం జరిగింది. కానీ దామోదర్ సురక్షితంగానే ఉన్నారని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఈ క్రమంలో రెండోసారి తెలంగాణ కమిటీ లక్ష్యంగా ఇంద్రావతి నేషనల్ పార్క్‌లో భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. దండకారణ్యంపై భద్రతా దళాల పట్టు మావోయిస్టులు స్థాపించిన జనతన సర్కారుకు దండకారణ్యమే కేంద్ర బిందువుగా నిలిచింది. కానీ గడిచిన ఏడాదిలో భద్రతా బలగాలు దండకారణ్యాన్ని క్రమంగా తమ ఆ«దీనంలోకి తెచ్చుకుంటున్నాయి. గత ఏడాది చివరిలో కొండపల్లిలో భద్రతా దళాల క్యాంపు ఏర్పాటైన తర్వాత.. దండకారణ్యం తమకు సురక్షితం కాదని మావోయిస్టులు నిర్ణయానికి వచ్చారు. అక్కడున్న వివిధ కమిటీలు, దళాలకు చెందిన కీలక నేతలు సమీపంలో ఉన్న టైగర్ రిజర్వ్ ఫారెస్టులకు తరలివెళ్లినట్టు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. టైగర్ రిజర్వ్‌లపై ఫోకస్ ఇంద్రావతి నేషనల్ పార్క్ 2,779 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉంది. దీన్ని 1983లో టైగర్ రిజర్వ్‌గా ప్రకటించారు. మావోయిస్టుల అడ్డాలైన అబూజ్మడ్, దండకారణ్యం మధ్య ఈ అడవి వారధిగా నిలిచింది. ఇందులో సగానికిపైగా మావోయిస్టుల ఆ«దీనంలోనే ఉంది. ఫారెస్టు గార్డులు కూడా అక్కడ కాలు పెట్టలేని పరిస్థితి ఉందని అంటారు. ఇలా టైగర్ రిజర్వులలో షెల్టర్ తీసుకుంటున్న మావోయిస్టులపై కొన్నేళ్లుగా భద్రతా దళాలు ఫోకస్ చేశాయి. ఇంతకుముందు ఉదంతి – సీతానది టైగర్ రిజర్వ్‌లో భాగంగా ఉన్న ఘరియాబండ్ అడవుల్లో జనవరి 24న జరిగిన ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి సహా 16 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇప్పుడు ఇంద్రావతి రిజర్వు ఫారెస్ట్‌లో ఏకంగా 31 మంది మృతి చెందారు. గడువు కంటే ముందే మావోయిస్టుల అంతం: అమిత్షామావోయిస్టు ముక్త భారత్ లక్ష్యంగా సాగుతున్న ఆపరేషన్‌కు ‘ఇంద్రావతి’తో భారీ విజయం దక్కిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. గడువుగా పెట్టుకున్న 2026 మార్చి కంటే ముందే దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామన్నారు. ఎన్కౌంటర్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు దేశం రుణపడి ఉంటుందని చెప్పారు. ఆ జవాన్ల కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న భద్రతా దళాలకు ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్‌సాయ్ అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ వల్లే యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ వేగంగా జరుగుతున్నాయన్నారు.40 రోజుల్లో 81 మంది మృతిఛత్తీస్గఢ్లో ఈ ఏడాది మొదలైన 40 రోజుల్లో 81 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లలో చనిపోయారు. అందులో 65 మంది బస్తర్‌లో జరిగిన ఘటనల్లో కన్నుమూశారు. గతేడాది ఛత్తీస్‌గఢ్‌లో 217 మంది మావోయిస్టులు చనిపోయినట్టు పోలీసులు తెలిపారు. -
భారీ ఎన్‌కౌంటర్‌పై అమిత్ షా కీలక ప్రకటన
న్యూఢిల్లీ:ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్ జిల్లాలో ఆదివారం(ఫిబ్రవరి 9) జరిగిన భారీ ఎన్కౌంటర్లో 31 మంది మావోయిస్టులు మరణించారు.ఈ ఎన్‌కౌంటర్‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎక్స్(ట్విటర్)లో స్పందించారు. దేశాన్ని నక్సల్స్ రహితంగా మార్చే క్రమంలో భద్రతాదళాలు భారీ విజయాన్ని సాధించాయన్నారు. వచ్చే ఏడాది మార్చినాటికి నక్సలిజాన్ని పూర్తిగా రూపుమాపుతామని తెలిపారు.‘ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పుల్లో 31 మంది మావోయిస్టులను భద్రతాబలగాలు మట్టుబెట్టాయి. ఈ ఆపరేషన్లోనే పెద్దఎత్తున ఆయుధాలు,మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. నక్సలిజాన్ని అంతం చేసే క్రమంలో ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు జవాన్లనూ కోల్పోయాం.ఆ అమరవీరులకు దేశం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది. 2026 మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తాం’ అని అమిత్ షా పేర్కొన్నారు. -
మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ రాజీనామా
ఇంఫాల్ : ఈశాన్య రాష్ట్రాల్లో రత్నాల భూమిగా, సిట్జర్లాండ్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన మణిపూర్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మణిపూర్ సీఎం ఎన్ బీరెన్ సింగ్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్‌కు బీరెన్ సింగ్ సమర్పించారు. మణిపూర్ అల్లల్లు. రెండు జాతుల మధ్య రేగిన వైరం. ఎంతటి హింసకు దారి తీసిందో అంతా చూశాం. ఇప్పటికీ ఇదే విషయంలో మణిపూర్ రగులుతూనే ఉంది. ఈ హింసకు మూల కారణమైన కుకీ, మైతేయ్ తెగల మధ్య వైరం ఇప్పుడు యావత్ ప్రపంచం దృష్టి నిలిపేలా చేసింది. అయితే, ఈ అల్లర్ల వెనుక సీఎం బీరేన్ సింగ్ ఉన్నారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ తరుణంలో ఇటీవల బీరేన్ సింగ్.. హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు. భేటీ అనంతరం, కొద్ది సేపటి క్రితం బీరేన్ సింగ్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనా చేశారు. -
కయ్యాలతో కాలం గడిపిన ఆప్
న్యూఢిల్లీ: దేశంలో గత పదేళ్లలో డబుల్ ఇంజిన్ బీజేపీ ప్రభుత్వమున్న కొన్ని రాష్ట్రాలు అభివృద్ధి బాటలో ముందుకు సాగుతుండగా, కేంద్ర ప్రభుత్వంతో ఆప్ కయ్యాలు పెట్టుకుంటూ ఢిల్లీని వెనుకబాటుకు గురి చేసిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. జంగ్పురలో సోమవారం జరిగిన బీజేపీ ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు. ఆప్ చీఫ్ కేజ్రీవాల్, ఆ పార్టీ నేత మనీశ్ సిసోడియా బడే మియా–చోటే మియా మాదిరిగా ఢిల్లీని దోచుకున్నారంటూ ఎద్దేవా చేశారు. మద్యం కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవించిన ఏకైక విద్యావంతుడు ఈయన మాత్రమేనంటూ సిసోడియానుద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. తరగతిగదుల పేరుతో కుంభకోణానికి పాల్పడిన సిసోడియా ఢిల్లీ చిన్నారుల భవిష్యత్తును నాశనం చేశారన్నారు. అబద్ధాలతో మభ్యపెడుతున్న కేజ్రీవాల్.. చెత్తాచెదారం, విష జలం, అవినీతిని మాత్రమే ఢిల్లీ ప్రజలకిచ్చారన్నారు. ఆప్ తరఫున ఎన్నికైన వారిలో ప్రస్తుతం సగం మంది మాత్రమే మిగిలి ఉన్నారని, ఆ పార్టీ మునిగిపోయే ఓడ అని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిగా ఢిల్లీ మార్చే సత్తా ఉన్న ఏకైక పార్టీ బీజేపీయేనని చెప్పారు. -
చేజారుతున్న కర్రిగుట్టలు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఆపరేషన్ కగార్ ఫలితంగా.. దండకారణ్యంలో తమకు పట్టున్న ఒక్కొక్క ప్రాంతాన్ని మావోయిస్టులు (Maoists) కోల్పోతున్నారు. ఈనెల 16న జరిగిన ఎన్‌కౌంటర్‌తో తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రిగుట్టలు ప్రాంతం సైతం మావోయిస్టుల చేజారిపోతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.జాయింట్ టాస్క్ ఫోర్స్ ..కర్రిగుట్టలు కేంద్రంగా మావోయిస్టులు తెలంగాణలో మళ్లీ ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ గతేడాది జూలై 4న సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) కేంద్ర హోంమంత్రి అమిత్‌షా (Amit Shah) దృష్టికి తీసుకెళ్లారు. మావోయిస్టుల దూకుడుకు అడ్డుకట్ట వేసేలా.. ఈ గుట్టలకు సరిహద్దుగా ఉన్న ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాక, భద్రాద్రి జిల్లా చర్ల మండలం కొండవాయిలో సీఆర్పీఎఫ్ (CRPF) జాయింట్ టాస్క్ ఫోర్స్ క్యాంపులు ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం జూలై 19న కర్రిగుట్టల్లోకి స్పెషల్ పార్టీ పోలీసులు కూంబింగ్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు చనిపోగా.. మిగిలిన దళ సభ్యులు తప్పించుకున్నారు. దీంతో గాలింపు ఉధృతం చేసే లక్ష్యంతో అదనపు బలగాలు ఈ గుట్టల్లోకి వెళ్లాయి. ఆ సమయాన వర్షాల కారణంగా పొంగిన వాగులు, వంకలతో స్పెషల్ పార్టీ పోలీసులంతా అడవిలో చిక్కుకుపోయారు. వీరికి వాయుమార్గంలో సాయమందించడం వీలు పడలేదు. దీంతో ప్రతికూల పరిస్థితుల నడుమ సుమారు 60 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ తెలంగాణ సరిహద్దుకు.. తెలంగాణ పోలీసులు చేరుకోగా.. చివరకు వారిని హెలీకాప్టర్ సాయంతో కాపాడారు.కర్రిగుట్టల్లో భద్రతా దళాలు కర్రిగుట్టల్లో ఛత్తీస్‌గఢ్ వైపు పూజారి కాంకేర్ – మారేడుబాక అటవీ ప్రాంతంలోని మావోయిస్టులు, భద్రతా దళాల నడుమ ఈనెల 16న ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో అధికారిక లెక్కల ప్రకారం 12 మంది మావోయిస్టులు చనిపోగా.. మిగిలిన వారు తప్పించుకుని సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. ప్రస్తుతం కర్రిగుట్టల్లో సుమారు రెండు వేల మందికి పైగా సంయుక్త భద్రతా దళాల జవాన్లు కూంబింగ్ చేస్తూ.. ఈ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తెచ్చుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. వచ్చే వేసవి చివరి నాటికి ఈ ప్రాంతంలో మావోయిస్టుల ఉనికి నామమాత్రం చేయాలని భద్రతా దళాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇప్పటికే ఈ దాడిలో మావోయిస్టుల ఆయుధాల తయారీ కేంద్రాన్ని భద్రతా దళాలు కనుగొన్నాయి. అయితే, ఇప్పటికీ మావోయిస్టు శిబిరాలు భద్రతా దళాలకు చిక్కకపోవడం.. ఈ గుట్టల్లో నెలకొన్న సంక్లిష్టతను చెబుతోంది.మావోయిస్టుల అడ్డా బస్తర్ దేశంలోనే మావోయిస్టులకు బస్తర్ ప్రాంతం అడ్డాగా ఉంది. ఇక్కడి నుంచే బస్తరేతర ప్రాంతాలకు చెందిన వివిధ రాష్ట్ర, డివిజన్, ఏరియా కమిటీలు పని చేస్తున్నట్టు సమాచారం. బస్తర్‌కు చెందిన కీలక కమిటీలైన దండకారణ్య స్పెషల్ జోనల్, దక్షిణ బస్తర్ జోన్ వంటి కమిటీలు సంచరిస్తూ పని చేస్తుంటాయి. కానీ, బస్తర్ బయటి ప్రాంతాలకు చెందిన కమిటీలు ఎక్కువగా శిబిరాల్లోనే షెల్టర్ తీసుకుంటాయి. ఈ కమిటీలకు చెందిన వివిధ దళాలు.. అప్పుడప్పుడు తమ సంబంధిత ప్రాంతాలకు వెళ్లి తిరిగి షెల్టర్ జోన్లకు చేరుకుంటున్నా యి. అందులో భాగంగానే తెలంగాణతో పాటు ఇతర డివిజన్, ఏరియా కమిటీలు కర్రిగుట్టలు కేంద్రంగా షెల్టర్ తీసుకున్నట్టు తెలుస్తోంది. పాల్వంచ – మణుగూరు, ఏటూరునాగారం – మహదేవపూర్ ఏరియా కమిటీల సభ్యులు కర్రిగుట్టల నుంచి తెలంగాణకు వచ్చి గతేడాది జరిగిన ఎన్కౌంటర్లలో 15 మంది చనిపోయారు.రాష్ట్రాలకు సహజ సరిహద్దుగా..తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు సహజ సరిహద్దుగా కర్రిగుట్టలు ఉన్నాయి. మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దులో.. ఇంద్రావతి నది గోదావరిలో కలిసే చోటునుంచి ప్రారంభమయ్యే కర్రిగుట్టలు.. చర్ల మండలంలో తాలిపేరు వాగు గోదావరిలో కలిసే వరకు ఇంచుమించు 100 కిలోమీటర్ల పొడవుతో వ్యాపించి ఉంటాయి.చదవండి: వరుస ఎదురుదెబ్బలు.. మావోయిస్టుల సంచలన నిర్ణయం గుట్టలకు ఆవలి వైపు బీజాపూర్ జిల్లా ఉండగా.. తెలంగాణ వైపు ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం మండలాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో కొద్ది భాగం ఉంటాయి. ఈ గుట్టల మధ్య పుష్కలమైన జలవనరులు ఉన్నాయి. దీంతో ఏళ్ల తరబడి ఈ ప్రాంతం మావోయిస్టులకు షెల్టర్ జోన్‌గా ఉపయోగపడుతోంది. తెలంగాణలో పట్టు కోసం మావోయిస్టులు ఇక్కడి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారు. -
‘కేజ్రీవాల్.. ఆ విషం పేరేంటో చెప్పు’
ఢిల్లీ : అసెంబ్లీ ఎన్నికల తరుణంలో యమునా (yamuna) నదిపై రాజకీయ రంగు పులుముకుంది. ఢిల్లీకి జీవనాడి యమునాపై బీజేపీ (bjp) విషం కక్కుతోందంటూ ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (arvind kejriwal) వ్యాఖ్యలపై కేంద్ర హోమంత్రి అమిత్‌షా ఎదురుదాడికి దిగారు. కేజ్రీవాల్ చిల్లర రాజకీయాలు చేసే బదులు ఆ విషం పేరేంటే బయట పెట్టాలని సూచించారు. గురువారం రోహిణిలో బీజేపీ ఎన్నికల ర్యాలీ నిర్వహించింది.ఈ ర్యాలీలో అమిత్ షా మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో ఓటమి ఖాయమని కేజ్రీవాల్‌కు అర్ధమైంది. అందుకే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే యమునా వాటర్‌లో విషం కలిపారని ఆరోపిస్తున్నారు. యమునా నదిలో విషం ఉందన్న ల్యాబ్ రిపోర్టును విడుదల చేయాలి. అబద్ధాల పుట్టఎన్నికల్లో గెలవాలంటే అబద్ధాలు చెప్పడం మానేయమని కేజ్రీవాల్‌కు చెప్పాలనుకుంటున్నాను. ఢిల్లీ ప్రజలను ఇబ్బంది పెట్టేందుకు హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం యమునా నీళ్లలో విషం కలిపిందని అంటున్నారు. యమునాలో విషం కలిపితే ఏ విషం కలిపారు? విషయం ఉన్నట్లు లేబొరేటరీలో గుర్తించారు. అంతేకాదు, ఆప్ ప్రభుత్వం మద్యం దుకాణాలను మూసివేస్తామని హామీ ఇచ్చిందని, బదులుగా ఆలయాలు,స్కూల్ పరిసర ప్రాంతాల్లో తెరిచారు. కోట్ల విలువైన మద్యం కుంభకోణంలో జైలు పాలయ్యారు’ అని అమిత్ షా ఆరోపించారు.తనను తాను నిజాయితీ పరుడినని చెప్పుకుని తిరిగే కేజ్రీవాల్ మద్యం కుంభకోణం, జల్ బోర్డులో రూ. 28400 కోట్ల కుంభకోణం, రేషన్ పంపిణీలో రూ. 5,400 కోట్ల కుంభకోణంలో ప్రమేయం ఉందన్నారు. -
యమున నీటిని తాగే దమ్ముందా?
న్యూఢిల్లీ: యమునా నది నీరు విషపూరితంగా మారుతున్న సంగతి నిజమేనని, ఈ నీటిలో అమ్మోనియం స్థాయి ఇటీవల విపరీతంగా పెరుగుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వినర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. ఢిల్లీలోని నీటి శుద్ధి కేంద్రాలు సక్రమంగా పనిచేయకుండా కొందరు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. నది నీటిలో అమ్మోనియా స్థాయి 7 పీపీఎం ఉందన్నారు. ఇది కచ్చితంగా విషంతో సమానమేనని అన్నారు. కేజ్రీవాల్ బుధవారం మీడియాతో మాట్లాడారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీలకు యమునా నది నీటిని ప్రజల సమక్షంలో బహిరంగంగా తాగే దమ్ముందా? అని సవాలు విసిరారు. ఎగువ రాష్ట్రంలో హరియాణాలో ఈ నదిలో విషపదార్థాలు కలుస్తున్నాయని మరోసారి ఆరోపించారు. అక్కడి బీజేపీ ప్రభుత్వం నదిని విషతుల్యం చేస్తోందన్నారు. కేజ్రీవాల్‌కు హరియాణా కోర్టు సమన్లుయమున నదిలో విషం కలుపుతున్నారంటూ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై హరియాణా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హరియాణా ప్రభుత్వంపై ఆయన చేసిన ఆరోపణలను తప్పుపట్టింది. ఫిబ్రవరి 17వ తేదీన తమ ఎదుట హాజరు కావాలని ఆదేశిస్తూ బుధవారం కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసింది. ఆరోపణలపై వివరణ ఇవ్వాలని పేర్కొంది. యమునా నదిని హరియాణా ప్రభుత్వం విషతుల్యం చేస్తున్నట్లు ఆధారమేంటో చెప్పాలని, నివేదిక సమర్పించాలని స్పష్టంచేసింది. -
కుంభమేళా తొక్కిసలాట ఘటన.. యోగికి మోదీ, అమిత్ షా కాల్
-
అలిగిన లోకేష్..!సన్నిహితుల వద్ద తీవ్ర ఆవేదన
సాక్షి,విజయవాడ:డిప్యూటీ సీఎం పదవి రాకపోవడంతో మంత్రి నారా లోకేష్ అలకబూనినట్లు ప్రచారం జరుగుతోంది. లోకేష్ డిప్యూటీ సీఎం ఆశలపై బీజేపీ అగ్రనేత,కేంద్ర హెం మంత్రి అమిత్‌షా నీళ్లు చల్లినట్లు తెలుస్తోంది. తనను డిప్యూటీ సీఎం చేయడానికి అమిత్ షా ఒప్పుకోలేదని లోకేష్ సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. లోకేష్,పవన్‌కల్యాణ్ మధ్య జరిగిన పోరులో లోకేష్ పరాజయం పాలయ్యారని కూటమి వర్గాలు అంతర్గతంగా చర్చించుకుంటున్నాయి. ఇందుకే లోకేష్ అలిగి పార్టీ పదవి వదులుకున్నట్లు చెబుతున్నారు. చంద్రబాబునే టార్గెట్ చేసి లోకేష్ పార్టీ పదవిని వదులుకున్నట్లు తెలుస్తోంది.లోకేష్ ప్రభుత్వంలో పార్టీలో సూపర్‌పవర్‌గా ఉండాలని చంద్రబాబు భావించారు. అయితే తమ ప్లాన్ పారకపోవడంతో వారు తీవ్ర ఆవేదన చెందుతున్నట్లు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇటీవల దావోస్ పర్యటనలోనూ చంద్రబాబు లోకేష్‌ను ఆకాశానికెత్తిన విషయం తెలిసిందే.కాగా, ఇటీవల లోకేష్‌ను సీఎం చేయాలంటూ టీడీపీలో సీనియర్లతో పాటు ముఖ్యనేతలంతా ప్రెస్మీట్లు పెట్టి మరీ డిమాండ్ చేశారు. లోకేష్ యువగళం వల్లే పార్టీ అధికారంలోకి వచ్చిందని పొగడ్తలు కురిపించారు. వీటికి కౌంటర్‌గా అటు జనసేన నేతలు తమ నేత పవన్‌కల్యాణ్‌ను సీఎం చేయాలని మాట్లాడే దాకా వెళ్లారు.దీంతో కూటమిలో టీడీపీ, జనసేనల మధ్య లోకేష్ డిప్యూటీ సీఎం అంశం చిచ్చుపెట్టేదాకా వెళ్లింది. చివరికి అమిత్‌షా మోకలడ్డడంతో లోకేష్‌కు అసంతృప్తి మిగిలి పవన్‌దే పైచేయి అయిందన్న ప్రచారం జరుగుతోంది. -
Delhi Elections: 7 రోజులు.. 100 సమావేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అధికారపీఠంపై ఇరవై ఆరేళ్ల తర్వాత పార్టీ జెండా ఎగురవేయాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. చివరి నిమిషంలో తన ప్రచారాన్ని హోరెత్తించేలా ప్రణాళికలు రచించింది. వచ్చే వారం రోజుల పాటు బూత్ స్థాయి వరకు పార్టీ హామీలపై ప్రచారం జరిగేలా పార్టీ జాతీయ స్థాయి నేతల నుంచి పార్టీ విస్తారక్ల వరకు అందరినీ కదనరంగంలోకి దించనుంది. 29 నుంచి ప్రధాని మోదీ తన ప్రచారాన్ని మొదలుపెట్టనున్నారు. బీజేపీపాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేంతా నియోజకవర్గాల వారీగా ప్రచార బాధ్యతలు అప్పగించారు. ఈ నియోజకవర్గాల్లో 100కు పైగా సమావేశాలు, ర్యాలీల్లో భాగస్వాములు కానున్నారు. అసెంబ్లీకి 20వేల ఓట్లు అదనం గడిచిన 2015 అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లలో బీజేపీ 32 శాతం ఓట్లను సాధించింది. మొత్తం 70 స్థానాలకు గానూ కేవలం మూడు చోట్ల నెగ్గింది. 2020 ఎన్నికల్లో 38.51 శాతం ఓట్లతో 8 సీట్లు సాధించింది. ఈ సారి కనీసంగా 50 శాతం ఓట్లు సాధించాలనే లక్ష్యంగా ముందుకెళుతోంది. గతంలో గెలిచిన స్థానాలతో పాటు పోటీ చేసిన అన్ని స్థానాల్లో గతంలో వచ్చిన ఓట్ల కన్నా కనీసంగా 20 వేల ఓట్లు అధికంగా సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీని కోసం ప్రతి బూత్ స్థాయిలో పోలయ్యే ఓట్లలో 50శాతం ఓట్లు సాధించేలా మైక్రో మేనేజ్మెంట్ వ్యూహాన్ని అమలు చేస్తోంది. కొన్ని నెలలుగా బీజేపీ ఓటర్ల జాబితాలను బూత్‌ల వారీగా తెప్పించి బీజేపీ అనుకూల, ప్రతికూల, స్ధిరమైన ఓటర్లను గుర్తించింది. ఢిల్లీలో అందుబాటులో లేని ఓటర్లను వివిధ మార్గాల ద్వారా సంప్రదింపుల ప్రక్రియ పూర్తి చేసింది. ప్రతి బూత్‌లోని ఓటర్ల సామాజిక ప్రొఫైల్‌లను గుర్తించి స్థానిక పార్టీ నేతలు, సామాజికవర్గ నేతలను రంగంలోకి దించి వారికి దగ్గరయ్యే ప్రయత్నాలు చేసింది. ఢిల్లీలోని వివిధ ప్రాంతాలకు బీజేపీ క్లస్టర్లను ఏర్పాటు చేసి ప్రతి క్లస్టర్‌కు ఒక్కో ముఖ్య నేతను ఇంచార్జ్‌గా నియమించింది. మురికివాడలు, అనధికార కాలనీలతోపాటు వీధి వ్యాపారులనూ ఆకట్టుకునే పనిలో పడ్డారు. ఇందుకు ఆర్ఎస్ఎస్ నేతలు కూడా సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర రాష్ట్రాలవాసులు ఎక్కువ మంది ఉండే ప్రాంతాల్లో ఆ రాష్ట్రాలకు చెందిన నేతలనే ఇంఛార్జిలుగా నియమించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలు సుమా రు 3లక్షల మంది ఉన్నారు. వీళ్లు అత్యధికంగా ఉండే ఆర్కేపురం, పాండవ నగర్, కరోల్‌భాగ్ ప్రాంతాలకు రాష్ట్రానికి చెందిన ఎంపీలు ధర్మపురి అరవింద్, డీకే అరుణ వంటి నేతలకు ప్రచార బాధ్యతలు కట్టబెట్టారు. ఉత్తర ప్రదేశ్, బిహార్, ఉత్తరాఖండ్, పంజాబ్ ప్రజలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఆయా రాష్ట్రాల మంత్రులు, ఎంపీలు పనిచేస్తున్నా రు. ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో విస్తృతంగా ప ర్యటిస్తూ స్థానిక మోర్చాలను కలుసుకోవడం, స మావేశాలను నిర్వహించడం, పథకాలపై అవగాహ న కల్పించడం వంటివి చేస్తున్నారు. కేంద్రం తెచ్చిన బేటీ బచావో– బేటీ పఢావో ప్రచారంతో పాటు, జన్‌ధన్ ఖాతా, ఉజ్వల గ్యాస్ పథకం, ఉచిత గృహాలు, మరుగుదొడ్లు, ముస్లిం మహిళలకు ట్రిపుల్ తలాక్ నుండి స్వేచ్ఛ, స్వయం సహాయక సంఘాలకు రుణాలు, మహిళా రిజర్వేషన్లు, హిందూ ఆలయాల పునరి్నర్మాణం వంటి అనేక పథకాలపై అవగాహన కల్పించే పనిని అప్పగించారు. ముఖ్యంగా యువ ఓటర్లు లక్ష్యంగా దేశ సమగ్రత, సనాతన ధర్మ పరిరక్షణ, 2047 నాటికి వికసిత్ భారత్ దిశగా అడుగులు, మేక్ ఇన్ ఇండియాతో యువతకు పెరిగిన ఉపాధి వంటి అవకాశాలపై ప్రేరణ కల్పించేలా ప్రణాళికలు రూపొందించారు. రేపటి నుంచి మోదీ, షా, యోగి.. ఇక ప్రధాని నరేంద్ర మోదీ సహా పార్టీ కీలక నేతలంతా బుధవారం నుంచి ప్రచార పర్వంలో క్రియాశీలక పాత్ర పోషించనున్నారు. ప్రధాని మోదీ 29వ తేదీన కర్కర్దామా, 31వ తేదీన యమునా ఖాదర్, ఫిబ్రవరి రెండో తేదీన ద్వారాకా ప్రాంతాల్లో బహిరంగ సభలు, ర్యాలీల్లో పాల్గొననున్నారు. ఢిల్లీ ప్రధాన ప్రాంతాల్లో భారీ ర్యాలీలు జరిపేలా ప్రణాళికలున్నాయి. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షా సైతం ఆరు బహిరంగ సభలు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ యోగి దాదాపు 10 బహిరంగ సభలు, ర్యాలీల్లో పాల్గొనేలా ప్రణాళికలు సిద్ధంచేశారు. డజన్ల కొద్దీ కేంద్ర మంత్రులు, జాతీయ పార్టీల నేతలు, బీజేపీపాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, పొరుగు రాష్ట్రాల మంత్రులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిపి మొత్తంగా 100కు పైగా సభలకు ప్లాన్ చేశారు. ప్రచార అంశాలను పర్యవేక్షించడానికి ప్రతి కేంద్ర మంత్రికి రెండు అసెంబ్లీ నియోజకవర్గాలను కేటాయించారు. -
మోదీ, అమిత్ షా, కుంభమేళాపై ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు
ఢిల్లీ: బీజేపీ నేతలు, మహా కుంభమేళాపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే(Mallikarjun Kharge) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నో తప్పులు చేసిన బీజేపీ నేతలు కుంభమేళాలోని గంగా నీటిలో మునిగితే విముక్తి కలగదు అన్నారు. ఇదే సమయంలో మోదీ, అమిత్ షా కచ్చితంగా నరకానికే వెళ్తారు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఖర్గే వ్యాఖ్యలకు బీజేపీ నేతలు కౌంటరిస్తున్నారు.కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే సోమవారం మీడియాతో మాట్లాడుతూ..‘గంగా నదిలో స్నానం చేయడం వల్ల పేదరికం తొలగిపోతుందా?. అది ఆహారాన్ని అందిస్తుందా?. నేను ఎవరి విశ్వాసాన్ని దెబ్బతీయాలని అనుకోవడం లేదు. నా మాటలు ఎవరినైనా బాధపెట్టి ఉంటే నేను క్షమాపణలు కోరుతున్నాను. కానీ, పిల్లలు ఆకలితో చనిపోతున్నప్పుడు, పాఠశాలకు వెళ్లలేకపోతున్నప్పుడు, కార్మికులకు జీతం అందనప్పుడు, బీజేపీ నాయకులు గంగలో స్నానం చేయడానికి పోటీ పడుతున్నారు. వారు టీవీల్లో పబ్లిసిటీ కోసమే ఇదంతా చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తుల నుండి దేశం ప్రయోజనం పొందదు. అలాగే.. ప్రధాని మోదీ(Modi), అమిత్ షా(Amit Shah) ఎన్నో తప్పులు చేశారు. అలాంటి వ్యక్తులు కుంభమేళాలో స్నానాలు చేస్తే విముక్తి రాదు. మోదీ, అమిత్ షా కచ్చితంగా నరకానికి వెళ్తారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఈ నేపథ్యంలో ఖర్గే వ్యాఖ్యలకు బీజేపీ నేతలు కౌంటరిస్తున్నారు. తాజాగా బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా స్పందిస్తూ ఖర్గే వ్యాఖ్యలను సనాతన ధర్మంపై దాడిగా అభివర్ణించారు. ఆయన మరే ఇతర మతం గురించి అలాంటివి చెప్పగలరా? అలాంటి ప్రకటనలు ఖండించదగినవి. దీనిపై కాంగ్రెస్ పార్టీ వివరణ ఇవ్వాలి. ఖర్గే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా అంటూ కామెంట్స్ చేశారు.#WATCH | Indore, MP | Congress National President Mallikarjun Kharge says, "On one hand Narendra Modi salutes the Constitution and on the other, he does everything against it... Don't be fooled by Narendra Modi's false promises. Does taking a dip in Ganga alleviate poverty?...… pic.twitter.com/lgCJW4HYtY— ANI (@ANI) January 27, 2025మరోవైపు.. ఖర్గే వ్యాఖ్యలపై అమిత్ మాలవీయా స్పందిస్తూ.. కుంభమేళాపై ఖర్గే చేసిన వ్యాఖ్యలు ఆయనవి కాదు. ఆ మాటలు గాంధీ కుటుంబానికి చెందినవి. కాంగ్రెస్ హిందువులను ఎందుకు అంతగా ద్వేషిస్తుంది?. మహా కుంభామేళా 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ప్రజల నమ్మకాలను కాంగ్రెస్ అవమానిస్తోంది. కాంగ్రెస్ నేతలు కావాలనే కుంభమేళాను అవమానిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇదిలా ఉండగా.. ఈరోజు కేంద్రహోం మంత్రి అమిత్ షా కుటుంబ సభ్యులు మహా భమేళాలో పవిత్ర స్నానాలు చేశారు. ఆ తర్వాత ప్రయాగ్‌రాజ్‌లో త్రివేణి సంగమానికి అమిత్ షా అర్చన చేసి గంగా హారతి ఇచ్చారు. ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాలో ఇది 15వ రోజు. ఇప్పటికే కుంభమేళాకు 13 కోట్లకుపైగా భక్తులు హాజరయ్యారు. ఫిబ్రవరి 5వ తేదీన మహాకుంభమేళాకు ప్రధాని మోడీ రాబోతున్నారు. దానికి ముందే ఇవాళ ప్రయాగ్‌రాజ్‌కు అమిత్ షా రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు ఈ కుంభమేళాకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. ప్రపంచ దేశాల నుంచి ప్రయాగ్‌రాజ్‌లో పుణ్యస్నానాలు చేస్తున్నారు. రష్యా, ఉక్రెయిన్, అమెరికా, జపాన్, జర్మనీ, నెదర్లాండ్, కెనడా, స్విట్జర్లాండ్, స్వీడన్, సహా 73 దేశాల దౌత్యవేత్తలు సైతం ఫిబ్రవరి 1న కుంభమేళాలకు వస్తున్నారు.बोल खड़गे जी रहे हैं, पर शब्द गांधी परिवार के हैं। आखिर कांग्रेस को हिंदुओं से इतनी नफरत क्यों है? 144 साल में एक बार महाकुंभ आता है, लेकिन कांग्रेस के नेता इस तरह बौखला गए हैं कि हिंदुओं को कोस रहे हैं। पहले कांग्रेस के हुसैन दलवी ने कुंभ को बुरा-भला कहा, और अब स्वयं कांग्रेस… pic.twitter.com/UAqLNMVLzZ— Amit Malviya (@amitmalviya) January 27, 2025 -
ఢిల్లీ బీజేపీ తుది మేనిఫెస్టోలో కీలక హామీలివే..
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల మూడో విడత మేనిఫెస్టోను బీజేపీ ప్రకటించింది. శనివారం(జనవరి25) కేంద్రమంత్రి అమిత్ షా మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా షా మాట్లాడుతూ ‘బీజేపీ మేనిఫెస్టోలో బూటకపు వాగ్దానాలు లేవు. ఢిల్లీలో చేపట్టాల్సిన పనుల జాబితా మాత్రమే ఉంది. ఢిల్లీకి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఆప్ ప్రభుత్వం విఫలమైంది.కలుషితమైన యుమునా నదిని శుభ్రం చేయించలేదు. ప్రజలకు సరైన తాగునీటి సౌకర్యం కల్పించలేదు. దేశ రాజధానిని కాలుష్య రహితంగా మార్చలేదు. గత ప్రభుత్వంలో కేజ్రీవాల్ నేతృత్వంలో ఢిల్లీలో అవినీతి మరింతగా పెరిగిపోయింది. ఢిల్లీలో రోడ్ల నిర్మాణానికి రూ. 41 వేల కోట్లు, రైల్వే లైన్ల కోసం రూ. 15 వేల కోట్లు, ఎయిర్‌పోర్టుకు రూ. 21 వేల కోట్లను కేంద్రం అందించింది. పేదల సంక్షేమ పథకాలను నిలిపివేయం. చేసిన వాగ్దానాలను కచ్చితంగా మా పార్టీ అమలు చేస్తుంది. బీజేపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో యుమునా నదిని పూర్తిగా శుభ్రం చేయిస్తాం. గిగ్ వర్కర్ల కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తుంది. 1,700 అనధికార కాలనీలలో కొనుగోలు, అమ్మకంతో పాటు నిర్మాణం, యజమానులకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తాం. రూ. 10 లక్షల ఆరోగ్య బీమా, రూ.5 లక్షల ప్రమాద బీమా అందిస్తాం’ అని అమిత్‌షా హామీ ఇచ్చారు. కాగా, ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. 8వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. బీజేపీ తన మేనిఫెస్టోలో ప్రధానంగా మహిళలకు రూ.2500 నగదు, సబ్సిడీపై రూ.500కే గ్యాస్ సిలిండర్లు లాంటి కీలక హామీలిచ్చింది. ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ బీజేపీ, ఆప్ మధ్యే ఉండనుంది. -
కేజ్రీవాల్ హత్యకు కేంద్రం కుట్ర: ఆప్ సంచలన ఆరోపణలు
ఢిల్లీ: తమ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)ను అంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులు కుట్ర పన్నారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) సంచలన ఆరోపణలు చేసింది. ఢిల్లీ సీఎం అతిషి, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మీడియాతో మాట్లాడుతూ.. ఆ కుట్రలో భాగంగానే కేజ్రీవాల్ రక్షణ కోసం పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చిన భద్రతా బృందాన్ని బీజేపీ సారథ్యంలోని కేంద్ర సర్కార్ ఉపసంహరించిందంటూ వ్యాఖ్యలు చేశారు.కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే ఈ అంశంపై స్పందించాలని.. కేజ్రీవాల్‌కు పంజాబ్ ప్రభుత్వం కల్పించిన భద్రతను పునరుద్ధరించాలన్నారు. కేజ్రీవాల్ ప్రాణాలకు ముప్పు కలిగించడానికి ఇప్పటి వరకు జరిగిన దాడులపై విచారణ జరిపించాలని అప్ సీఎంలు డిమాండ్ చేశారు.కేంద్ర హోంమంత్రి అమిత్ షా కనుసన్నల్లో ఢిల్లీ పోలీసులు పనిచేస్తున్నారని అతిషి, భగవంత్ మాన్ మండిపడ్డారు. కేజ్రీవాల్‌పై పదేపదే దాడులు జరుగుతున్నా కానీ వారు పట్టించుకోవడం లేదని.. అందుకే వారిపై తమ పార్టీకి నమ్మకం లేదంటూ వారు చెప్పుకొచ్చారు. దీనిపై తాము కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ కూడా రాశామని పేర్కొన్నారు.ఇదీ చదవండి: బీజేపీ నుంచి సీఎం ఆఫర్ వచ్చింది.. సిసోడియా సంచలన వ్యాఖ్యలు -
యోగీ జీ.. అమిత్ షాకు కాస్త చెప్పండి: కేజ్రీవాల్
ఢిల్లీ: ఢిల్లీలో లా అండ్ ఆర్డర్ బాలేదన్న యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్(Yogi Adityanath) వ్యాఖ్యలతో ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) ఏకీభవించారు. ఢిల్లీ నగరంలో లా అండ్ ఆర్డర్ అనేది కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతిలో ఉందని, ఆ విషయాన్ని ఆయనకే మీరు కాస్త కూర్చొని చెప్పండని కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు. ఢిల్లీ నగరంలో లా అండ్ ఆర్డర్‌ను ఎలా మరుగుపరుచాలో అమిత్ షాకు కాస్త దిశా నిర్దేశం చేయండి యోగీ జీ అంటూ కేజ్రీవాల్ సెటైర్లు వేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు(Delhi assembly election 2025) ఫిబ్రవరి 5వ తేదీన జరుగనున్న నేపథ్యంలో ఇటు ఆప్, అటు బీజేపీలు తమ ప్రచార జోరును కొనసాగిస్తున్నాయి. కౌంటర్‌కు రీ కౌంటర్ అన్నట్లు సాగుతోంది ఇర పార్టీల ప్రచారం. దీనిలోభాగంగా యోగీ ఆదిత్యానాథ్ మాట్లాడిన మాటలకు కేజ్రీవాల్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మీరు చెప్పింది నిజమే యోగీ జీ..‘ నిన్న( గురువారం) యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఒక మంచి విషయం చెప్పారు. దీనికి ఢిల్లీ ప్రజల కూడా మద్దతుగా నిలుస్తారు. ఢిల్లీలో లా అండ్ ఆర్డర్ బాలేదని యోగి అన్నారు. దాంతో ఢిల్లీ ప్రజలు వంద శాతం ఏకీభవిస్తారు. ఢిల్లీలో గ్యాంగ్స్టర్లు చాలా ఫ్రీగా తిరుగుతున్నారు. ఢిల్లీలో చాలా గ్యాంగ్‌స్టర్ గ్రూపులున్నాయి. వీరంతా ఢిల్లీ నగరాన్ని విభజించి వారి వారి కార్యకలాపాల్ని ఎంతో స్వేచ్ఛగా చేసుకుంటున్నారు. ఇక్కడ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లని బెదిరించి వారి అరాచకాల్ని సాగిస్తున్నాయి గ్యాంగ్‌స్టర్ గ్రూపులు. ప్రధానంగా ఇక్కడ వ్యాపారాలు చేస్తున్న బడా వ్యాపారస్తులకు ఏ రోజు సుఖం లేదు. రోజూ ఏదొక గ్యాంగ్స్టర్గ్రూప్ నుంచి వారు బెబెదిరింపు కాల్స్ రిసీవ్ చేసుకుంటూనే ఉన్నారు. వారి కుటుంబాల్ని చంపేస్తామంటూ మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయల్ని గ్యాంగ్‌స్టర్ గ్రూపులు వసూలు చేస్తూ ఉంటాయి. ఢిల్లీలో జరిగే గ్యాంగ్ వార్స్‌కి అక్కడి రోడ్లే సాక్ష్యం. ఢిల్లీలో మహిళలు ఇళ్లు ాదాటి బయటకు రావాలంటే చాలా భయానక పరిస్థితులు ఉన్నాయి. ఢిల్లీ నగరంలో చిన్న పిల్లలు, మహిళలు తరచు కిడ్నాప్‌లకు గురౌవుతుంటారు. ఇక్కడ గ్యాంగ్స్టర్లకు కత్తుల్ని వారి వద్దనున్న మారణాయుధాల్ని చాలా బహిరంగంగా వాడుతుంటారు. హత్యలు, చైన్ స్నాచింగ్‌లు, దొంగతనాలు నిత్యం ఏదో మూలన జరుగుతూనే ఉంటాయి. ఢిల్లీ ప్రజలు చాలా భయాందోళన మధ్య బ్రతుకుతున్నారనేది నిజం’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.ఢిల్లీలో శాంతి భద్రతల బాధ్యత అమిత్ షాదే..‘యూపీలో లా అండ్ ఆర్డర్ అనేది ఎంతో అమోగంగా ఉందన్నారు. ఒక ఫిక్స్డ్ లా అండ్ ఆర్డర్ యూపీలో ఉందన్నారు. యూపీలో గ్యాంగ్‌స్టర్ గ్రూపులను కట్టడి చేశామని చెప్పారు యోగీ జీ. అక్కడ లా అండ్ ఆర్డర్ బాగుందా.. బాలేదా అనేది నాకైతే తెలీదు. ఢిల్లీలో లా అండ్ ఆర్డర్ మాత్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) చేతుల్లో ఉంది. మరి మీరు(యోగీ ఆదిత్యానాథ్) యూపీలో లా అండ్ ఆర్డర్ ఏదైతే మెరుగైందని చెప్పారో అదే విషయాన్ని అమిత్ షాకు కూడా చెప్పి ఢిల్లీ నగరంలో శాంతి భద్రతల్ని మెరుగుపర్చండి. ఢిల్లీలో గ్యాంగ్స్టర్లకు ఎలా అడ్డుకట్ట వేయాలో కాస్త అమిత్ షా జీకి చెప్పండి యోగీ జీ’ అని కేజ్రీవాల్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. -
బీజేపీ నాకు తల్లిలాంటిది.. మారే ఆలోచన లేదు
సాక్షి,బళ్లారి: బీజేపీ తనకు తల్లిలాంటిదని, రాజకీయంగా ఎదగడానికి ఎంతో తోడ్పాటును అందించిందని, ప్రస్తుతం పార్టీని వీడే ఆలోచన లేదని, ఒక వేళ పార్టీని వీడే సందర్భమే ఏర్పడితే ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లి తగిన నిర్ణయం తీసుకుంటానని మాజీ మంత్రి బీ.శ్రీరాములు పేర్కొన్నారు. ఆయన గురువారం నగరంలోని తన నివాస గృహంలో విలేకరులతో మాట్లాడుతూ గాలి జనార్దనరెడ్డిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. సండూరు ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమికి తాను కారణమని పేర్కొనడంలో అర్థం లేదన్నారు. తాను నిజాయితీగా పార్టీ అభ్యర్థి గెలుపునకు శ్రమించానన్నారు. తల్లిలాంటి పార్టీకి తాను ఎన్నటికీ ద్రోహం చేయబోనన్నారు. తనను రాజకీయంగా ముగించేందుకు కొందరు ఎత్తులు వేస్తున్నారని మండిపడ్డారు. ఏ ఒక్కరి శక్తి, సహకారంతో రాజకీయాల్లో రాణించలేదన్నారు. ఉద్ధండులతో పోరాడి పైకెదిగా కష్టపడి, ఎందరో ఉద్ధండులకు వ్యతిరేకంగా పోరాడి ముందుకు వచ్చానన్నారు. తనను ఎన్నికల్లో గెలిపించానని గాలి జనార్దనరెడ్డి వ్యాఖ్యానించడంపై ఆయన స్పందిస్తూ, ఆయనేమైనా మ్యాజిక్ చేస్తారా? అని ప్రశ్నించారు. ప్రజలు తన వెంట ఉండటం వల్లనే గెలిచానని, రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజమేనన్నారు. గాలి జనార్దనరెడ్డి అబద్ధాలు చెబుతూ రాజకీయ కోటను నిర్మించుకోవాలని చూస్తున్నారన్నారు. ఏ ఒక్కరి ఆశీర్వచనంతో తాను రాజకీయాల్లో రాణించలేదన్నారు. 40 ఏళ్లుగా ఎన్నో కష్టాలు, ఒడిదొడుకులు పడుతూ రాజకీయాల్లో పైకెదిగానన్నారు. తనకు ఏకకాలంలో మొళకాల్మూరు, బాదామి రెండు అసెంబ్లీ సీట్లు బీజేపీ కేటాయించిందన్నారు. తన శక్తి ఏమిటో పార్టీ అగ్రనేతలకు తెలుసన్నారు. తన సమాజానికి చెందిన వారు, ఇతర కులాలకు చెందిన వారి సహకారం తనకు ఎంతో ఉందన్నారు. ఆయన అబద్ధాలు చెబితే వినడానికి నేనేమి చిన్న పిల్లవాడిని కాదన్నారు. ప్రజలు చాలా మేధావులు ప్రజలు కూడా చాలా బుద్ధివంతులని, ఆయన మాటలను వినే పరిస్థితిలో లేరన్నారు. కోర్ కమిటీ సమావేశంలో పార్టీ ఇన్‌ఛార్జి తనపై తీవ్ర ఆరోపణ చేశారన్నారు. సండూరులో పార్టీ ఓటమికి తానే కారణమని పేర్కొనడంతో తాను సంజాయిషీ ఇచ్చానన్నారు. పార్టీ అధ్యక్షుడు విజయేంద్ర తన గురించి ఎందుకు స్పందించలేదో తెలియదన్నారు. సదానంద గౌడ మినహా తనకు మద్దతుగా ఎవరూ మాట్లాడలేదన్నారు. గాలి జనార్దనరెడ్డి అబద్ధాలు చెప్పడం మానుకోవాలన్నారు.› ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి వారి స్వశక్తి ఉంటుందన్నారు. తన వల్ల అంతా రాజకీయంగా ముందుకు వెళుతున్నారనే భ్రమను ఆయన వీడాలన్నారు. 1999 లోక్‌సభ ఎన్నికల్లో అప్పట్లో పార్టీ అగ్రనాయకురాలు దివంగత సుష్మాస్వరాజ్ గెలుపు కోసం ఎంతో కష్టపడ్డామన్నారు. అప్పటి నుంచి తాను బీజేపీలో తనదైన ముద్ర వేసుకుని కష్టపడి పని చేసి ముందుకు వచ్చానన్నారు. పలువురు శ్రీరాములు అభిమానులు పాల్గొన్నారు. -
మరో దాడి.. అది వాళ్ల పనే : కేజ్రీవాల్
ఢిల్లీ : మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ కన్వినర్ అర్వింద్ కేజ్రీవాల్ (arvind kejriwal) కారుపై మరోసారి దాడి జరిగింది. గురువారం హరినగర్‌లో అగంతకులు తన కారుపై దాడి చేశారని కేజ్రీవాల్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.‘నా కారుపై దాడి జరిగింది. ఇది ప్రత్యర్థి పార్టీ నేతల మద్దతు దారుల పనే. ఢిల్లీ పోలీసులే దాడికి పాల్పడ్డ నిందితుల్ని నా బహిరంగ సభలోకి ప్రవేశించేందుకు అనుమతించారు. దాడి వెనుక కేంద్ర హోంమంత్రి అమిత్ షా (amit shah) హస్తం ఉంది. ఢిల్లీ పోలీసులను బీజేపీ వ్యక్తిగత సైన్యం’గా ఉపయోగించుకుంటుంది. ‘ఈరోజు హరి నగర్లో జరిగిన పార్టీ బహిరంగ సభలోకి ప్రవేశించడానికి విపక్షాల అభ్యర్థులను పోలీసులు అనుమతించారు. నా కారుపై దాడి చేశారు’ అని ట్వీట్లో తెలిపారు. ఇదంతా అమిత్ షా ఆదేశాల మేరకే జరుగుతోంది. అమిత్ షా ఢిల్లీ పోలీసులను బీజేపీకి వ్యక్తిగత సైన్యంగా మార్చారు. ఇలాంటి దాడులపై ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతోందని విమర్శించారు. ఒక జాతీయ పార్టీ, జాతీయ అధ్యక్షుడు, దాని నాయకులపై నిరంతరం దాడులు జరుగుతున్నాయని.. అయినప్పటికీ ఎన్నికల సంఘం చర్యలు తీసుకోకపోవడంపై ప్రశ్నలు గుప్పించారు. आज हरि नगर में विपक्षी उम्मीदवार के लोगों को पुलिस ने मेरी जनसभा में घुसने दिया और फिर मेरी गाड़ी पर हमला करवाया। ये सब अमित शाह जी के आदेश पर हो रहा है। अमित शाह जी ने दिल्ली पुलिस को बीजेपी की निजी आर्मी बना दिया है। चुनाव आयोग पर बड़े सवाल उठ रहे हैं कि एक राष्ट्रीय पार्टी…— Arvind Kejriwal (@ArvindKejriwal) January 23, 2025జనవరి 18న న్యూ ఢిల్లీ నియోజకవర్గంలో అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో ఆయన వాహనంపై బీజేపీ మద్దతు దారులు దాడి చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆరోపించారు. కేజ్రీవాల్ ప్రచారం చేస్తున్న సమయంలో బీజేపీ నేత పర్వేష్ వర్మ మద్దతు దారులు తమ పార్టీ అధినేత కారుపై కర్రలు ఇటుకలు, రాళ్లతో దాడి చేశారని ఆ పార్టీ పేర్కొంది. ఆ ఆరోపణలను వర్మ ఖండించారు. ‘అరవింద్ కేజ్రీవాల్ వాహనం ఇద్దరు యువకులను ఢీకొట్టింది. ఆప్ ప్రభుత్వం తమకు చేసిన అభివృద్ది ఏంటో చెప్పాలని స్థానికులు ప్రశ్నించారు. ఆ సమయంలో స్థానికుల్ని ఏ మాత్రం పట్టించుకోకుండా కేజ్రీవాల్ కారు ముందుకు సాగింది. కేజ్రీవాల్ కారు ఢీ కొని ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. కేజ్రీవాల్‌కు ఓటమి భయం పట్టుకుంది. అందుకే ఇలా మాట్లాడుతున్నారు. ఆస్పత్రిలో గాయపడ్డ యువకుల్ని పరమర్శించేందుకు నేను ఇప్పుడే వెళ్తున్నాను’ అంటూ బీజేపీ నేత పర్వేష్ వర్మ మీడియాతో మాట్లాడారు. -
జమ్ము మిస్టరీ మరణాలపై కేంద్రం ప్రకటన
మిస్టరీగా మారిన జమ్ము కశ్మీర్ వరుస మరణాల(Mysterious Deaths)పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. అంతుచిక్కని అంటువ్యాధితో మరణిస్తున్నారనే వాదనను కేంద్రం తోసిపుచ్చింది. అయితే విషపూరిత పదార్థాల వల్లే వరుస మరణాలు సంభవించాయని, ఈ వ్యవహారంపై కుట్ర కోణం సహా అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోందని గురువారం ప్రకటించింది.రాజౌరీ(Rajouri) జిల్లాలోని ఓ గ్రామంలో నెలవ్యవధిలో 17 మంది వరుసగా ఒకే తరహా లక్షణాలతో జబ్బుపడి మరీ చనిపోయారు. చనిపోయిన వాళ్లలో చిన్నపిల్లలే(13) ఎక్కువగా ఉన్నారు. వాళ్ల మరణాలకు విషపూరిత పదార్థాలే కారణమని కేంద్రం నిర్ధారించింది. అయితే ఆ టాక్సిన్ ఏంటన్నదానిపై మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉందని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర సైన్స్&టెక్నాలజీ మంత్రి(స్వతంత్ర) డాక్టర్ జితేంద్ర సింగ్ గురువారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు.‘‘లక్నోలోని సీఎస్ఐఆర్(CSIR) ల్యాబ్ నిర్వహించిన ప్రాథమిక పరీక్షల్లో.. ఇది వైరల్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షనో కాదని తేలింది. మృతదేహాల నుంచి సేకరించిన నమునాల్లో విషపదార్థాలు ఉన్నట్లు తేలింది. అయితే ఆ విషపదార్థాలు ఏంటన్న దానిని నిర్ధారించుకునే పనిలో శాస్త్రవేత్తలు ఉన్నారు. వారం, పదిరోజుల్లో దీనిపై స్పష్టమైన ప్రకటన రానుంది’’ అని ఆయన తెలిపారు. ఇక అన్నికోణాల్లో ఈ అంశంపై దర్యాప్తు జరుగుతోంది. ఇందులో ఏదైనాకుట్ర ఉందని తేలితే.. బాధ్యులెవరైనా వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అని అన్నారాయన. ఇదిలా ఉంటే.. ఐటీఆర్ (టాక్సికాలజీ రీసెర్చ్) నిర్వహించిన విశ్లేషణలోనూ ఇంతకు ముందు విషపూరిత పదార్థాలు ఉన్నట్లు గుర్తించింది.డిసెంబర్ 7 నుంచి జనవరి 19వ తేదీల మధ్యలో రాజౌరీలోని బధాల్ అనే కుగ్రామంలో ఈ వరుస మరణాలు(Serial Deaths) సంభవించాయి. జ్వరం, ఒళ్లు నొప్పులు, అలసట, విపరీతంగా చెమటలు పోయడం, స్పృహ కోల్పోవడం తదితర లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరారు. పైగా మూడు కుటుంబాలకే చెందిన వ్యక్తులు వరుసగా జబ్బు చేసి మరణించడం గమనార్హం. పైగా ఆ కుటుంబాలకు చెందిన బంధువులు చుట్టుపక్కల నాలుగు గ్రామాల్లో విస్తరించి ఉన్నారు. అయితే అనూహ్యంగా వాళ్లలో కూడా కొందరు ఇదే రీతిలో జబ్బు పడ్డట్లు సమాచారం. అందులోనూ కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.దీంతో బుధవారం అక్కడి అధికారులు బధాల్ గ్రామాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. సుమారు 40 మందిని ఐసోలేషన్‌కు తరలించారు. ఇక ప్రజల్లో ఆందోళన నెలకొన్న దృష్ట్యా.. బహిరంగా జనం గుమిగూడటంపై ఆంక్షలు అమలు చేస్తున్నారు. వరుస మరణాలతో జమ్ము కశ్మీర్లో హెల్త్ ఎమర్జెన్సీ(Health Emergency) ప్రకటిస్తారనే వదంతులు చక్కర్లు కొట్టాయి. అయితే వైద్య ఆరోగ్య అధికారులు మాత్రం వాటిని కొట్టిపారేశారు. ఆ అవసరం లేదని స్పష్టత ఇచ్చారు. నమునాల్లో న్యూరోటాక్సిన్స్ ఉన్నట్లు తేలడంతో.. కుట్ర కోణం తెర మీదకు వచ్చింది. నిజాలు నిగ్గుతేల్చేందుకు కశ్మీర్ పోలీస్ శాఖ సిట్‌ను ఏర్పాటుచేసింది. మంగళవారం బధాల్కు వెళ్లిన ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా.. త్వరలోనే అన్ని నిజాలు బయటకు వస్తాయని ప్రకటించారు. మరోవైపు.. వరుస మరణాల నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసేందుకు 11 మందితో కూడిన ప్రత్యేక బృందాన్ని కశ్మీర్‌కు పంపింది. -
వరుస ఎన్ కౌంటర్లతో మావోయిజాన్ని ఆపలేరు
-
ఏపీలో బడా నేతల కాలక్షేపం కబుర్లు!
ఇద్దరు ప్రజా ప్రతినిధులు.. అది కూడా పెద్ద స్థాయి వారు కలిస్తే ఏం మాట్లాడుకోవాలి? ప్రజలకు ఎలాంటి మేలు చేయాలి? ఇచ్చిన వాగ్ధానాల అమలు ఎలా? ఆ క్రమంలో వస్తున్న ఇబ్బందులను అధిగమించడం ఎలా? వంటివని మనం అనుకుంటాం. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం దీనికి భిన్నంగా జరుగుతోంది. ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇటీవల అమరావతికి వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృష్ణా కరకట్టపై నిర్మించిన అక్రమ భవనంలో భేటీ అయ్యారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌లు కూడా హాజరైన ఈ సమావేశంలో వాళ్లు మాట్లాడుకున్న విషయాలు తెలిస్తే సామాన్యులు విస్తు పోవాల్సిందే. తెలుగుదేశం మీడియా చెప్పిన దాని ప్రకారమే.. ఈ సమావేశంలో ప్రధాన చర్చ మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు ఉన్న భవనాలపై సాగింది! అంత పెద్ద నేతలు ఇంత చీప్‌గా టైమ్‌పాస్ మాటలు మాట్లాడుకుంటారా? అబద్ధాల ముచ్చట్లు పెట్టుకుంటారా?. జగన్ భవనాల గురించి ఇప్పుడు చర్చించుకోవాల్సిన అవసరం ఏమిటన్న అనుమానం మీకూ రావచ్చు. అయితే ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా జగన్‌పై బురద చల్లడమే లక్ష్యంగా పనిచేస్తున్న పచ్చ బ్యాచ్‌కు మాత్రం ఈ సందేహం రాలేదు. అందుకే టీడీపీ జాకీ మీడియా ఆ సొల్లు పురాణాన్ని పతాక శీర్షికలకు ఎక్కించి సంతోషించింది. ‘‘జగన్ జల్సా భవన్లు’’లపై ఆరా తీసిన అమిత్ షా అంటూ ఆనందపడింది. టీడీసీ,జనసేన, బీజేపీల కూటమి అధికారంలోకి వచ్చి ఏడున్నర నెలలు కావస్తున్నా ఈ పచ్చ మూక జగన్‌పై విమర్శలు మినహా సాధించిందేమీ లేదన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో కూటమి పెద్దలు ఇలా డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. చంద్రబాబు నివాసాన్ని చూస్తూ, ‘‘నది పక్కన మీ ఇల్లు చాలా బాగుంది’’ అని అమిత్ షా మెచ్చుకున్నారట. పనిలో పనిగా జగన్ పాలెస్ల గురించి ఆరా తీసినట్లు తెలిసిందని ఈ జాకీ మీడియా రాసింది. అది చూస్తే ఒకటి మాత్రం స్పష్టం అవుతుంది. అమిత్ షా మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇంటి గురించి అడిగి ఉండే అవకాశం లేదు. ఎందుకంటే అది అక్కడ టాపిక్ కాదు. కానీ.. విజయవాడలో ప్రకృతి వైపరీత్యానికి కారణమైన చంద్రబాబు ఇంటి గురించి హోం మంత్రి అడిగారన్న సమాచారమే బయటకు వెళితే అది తమకు ఇబ్బంది అవుతుంది కనుక టీడీపీ నేతలు పనిగట్టుకుని ఇలా అబద్ధాలు ప్రచారం చేసి ఉండాలి. హైదరాబాద్‌లో జగన్‌కు వంద గదలు ప్యాలెస్ ఉందని టీడీపీ నేతలు చెబితే అమిత్ షా చెవిలో పువ్వు పెట్టుకుని విన్నారన్నమాట!. ఈ సోది రాసిన పత్రిక వారికి నిజం తెలియదా? నాలుగు బెడ్ రూమ్‌ల ఇల్లు ఉంటే వంద రూమ్లని వీళ్లు రాస్తారా? కడుపునకు అన్నం తినేవారు ఎవరైనా ఇంత చెత్తగా వార్తా కథనాలు ఇచ్చి పాఠకులను మోసం చేస్తారా?. జగన్ ఇంటి గురించి నిజంగానే సమాచారం కావాలంటే నిమిషాలలో తెప్పించుకునే శక్తి అమిత్ షా కు ఉండదా? బెంగుళూరులో ఇల్లు ఉంది, తాడేపల్లిలో ఇల్లు ఉందని చెప్పారట. ఈ రోజుల్లో కాస్త మధ్యతరగతి, ఉన్నతాదాయ వర్గాలవారు సైతం ఆయా ముఖ్యమైన నగరాలలో రెండు, మూడు ఇళ్లు కలిగి ఉంటున్నారు. అందులోను హైదరాబాద్‌తోపాటు ఏపీలోని సొంత ప్రాంతంలో కూడా ఇళ్లు ఉంటాయి. దానిని భూతద్దంలో చూపి జగన్ పై దుష్ప్రచారం చేయడానికి వీరు చూపిన శ్రద్ద రాష్ట్ర సమస్యలను వివరించడంపై పెట్టి ఉంటే బాగుండేది. పోనీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లకు హైదరాబాద్ లో ఇళ్లు లేవా? ఏపీలోని అమరావతి ప్రాంతంలో ఇళ్లు లేవా? అవి ఎంత భారీగా ఉన్నాయో తెలియదా? అవి ప్యాలెస్‌లు కాదా? కృష్ణ కరకట్టపై అక్రమంగా నిర్మించిన ఇంటిలో చంద్రబాబు నివాసం ఉండడం లేదా? ఆ ప్యాలెస్ ప్రభుత్వానిది అని ఒకసారి, లింగమనేని రమేష్ ది అని మరోసారి మాటలు మార్చలేదా? ఆ ఇల్లు మునిగిపోకుండా చూడడానికి బుడమేరు లాకులను ఎత్తివేసిన ఫలితంగానే విజయవాడ మునిగిందన్న సంగతి నిజం కాదా? హోం మంత్రి అమిత్ షా కు పర్యావరణం, ప్రకృతి వైపరీత్యాల నివారణలపై ఏమాత్రం శ్రద్ద ఉన్నా ముందుగా చేయవలసిన పని ఏమిటి? చంద్రబాబు కృష్ణానది ఒడ్డున కోస్టల్ రెగ్యులేషన్ చట్టాన్ని అతిక్రమించిన కట్టిన ఇంటిలో ఎలా ఉంటున్నావని హోం మంత్రి ప్రశ్నించాలి కదా? ఆ పని చేయలేదా? చేసినా దాని గురించి ప్రచారం చేయకుండా జగన్ పై కట్టుకధలు వ్యాప్తిలోకి తెచ్చారా? చంద్రబాబుకు జూబ్లిహిల్స్ లో ఉన్నది ఎంత పెద్ద పాలెస్సో ఆ రోడ్డులోకి వెళ్లి చూసిన వారందరికి తెలుస్తుంది. ఆ భవన నిర్మాణానికి ఏ,ఏ దేశాల నుంచి వస్తువులు తెప్పించింది ఆ రోజుల్లో పలు వార్తలు వచ్చాయి కదా? అయినా ఆయన చాలా సింపుల్ గా ఉన్నట్లు అనుకోవాలి. తాజాగా.. అమరావతి సుమారు ఐదెకరాల విస్తీర్ణంలో ఇల్లు కట్టుకుంటున్నారని చెబుతున్నారు కదా. ఇది కాకుండా కుప్పంలో కూడా గృహ నిర్మాణం చేస్తున్నారు కదా? వీటి గురించి ఏమి చెబుతారు? ఇక్కడ ఒక సంగతి చెప్పాలి. ఉమ్మడి ఏపీ విభజన తర్వాత ఆ రాష్ట్ర రాజధాని అమరావతిలో ఇల్లు కట్టుకున్న ఏకైక నేత వైఎస్ జగన్. అంతేకాదు. సతీసమేతంగా పూర్తిగా అక్కడే నివసిస్తున్న నేత కూడా ఆయనే. చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లు పూర్తిగా అక్కడే ఉంటున్నారా? చంద్రబాబు కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోనే నివసిస్తుంటారు కదా! ఇది తప్పని చెప్పడం లేదు. కాని ఎదుటి వ్యక్తిమీద మాత్రం బురద వేసి సంతోషపడుతుండడమే దారుణమనిపిస్తుంది. అమిత్ షా కు మరో విషయం గుర్తుకు రాలేదా? ఈ మధ్య కాలంలో ఏడిఆర్ నివేదిక ఒకటి వచ్చింది కదా? అందులో చంద్రబాబు రూ.931 కోట్ల ఆస్తితో అత్యంత ధనికుడైన సీఎం అని వెల్లడైంది కదా? దానిపై హోం మంత్రి వివరాలు తెలుసుకునే యత్నం చేయలేదా? ప్రధాని మోదీతో పాటు అమిత్ షా కూడా 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబును ఉద్దేశించి అవినీతిపరుడు అని తీవ్ర స్థాయిలో విమర్శించారు కదా! మళ్లీ పొత్తు కుదరగానే నీతిమంతుడు అయిపోయారా? అలాగే చంద్రబాబు కూడా వీరిద్దరిని ఎన్ని మాటలు అన్నారు. జనం ఇవేవి గుర్తుకు తెచ్చుకోరాదన్న ఉద్దేశంతో జగన్ పై డైవర్ట్ చేస్తుంటారు.అమిత్ షా మరుసటి రోజు ఎన్డీఆర్ఎఫ్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఏపీకి మూడు లక్షల కోట్ల రూపాయల మేర కేంద్రం సాయం చేసిందని ప్రకటించారు. అది నిజమా? కాదా? దానిని ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి కాస్త మార్చి రాశాయి. ఏపీకి మూడులక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని అమిత్ షా అన్నట్లు ఈనాడు మార్చేసింది. హిందూ పత్రికలో మాత్రం మూడు లక్షల కోట్ల ఆర్థిక సాయం చేసినట్లు అమిత్ షా చెప్పారని పేర్కొన్నారు. అమరావతి రాజధాని కోసం రూ.15 వేల కోట్ల గ్రాంట్ ఇచ్చారని చంద్రబాబు తన ప్రసంగంలో చెబితే, అమిత్ షా మాత్రం దానిని రుణంగానే చెప్పారన్న సంగతి తెలుస్తుంది. హడ్కో, వరల్డ్ బ్యాంకు ద్వారా రూ.27 వేల కోట్ల రుణం ఇప్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. వక్రీకరించి వార్తలు రాసి పాఠకులను టీడీపీ జాకీ మీడియా మోసం చేస్తోందని పదే,పదే రుజువు చేసుకుంటున్నాయి. కేంద్రం నిజంగానే రూ.మూడు లక్షల కోట్లు సాయం చేసి ఉంటే ఆ డబ్బంతా ఏమైపోయిందో అర్థం కాదు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా, పెద్దగా అభివృద్ది పనులు ఏమీ చేపట్టకుండా ఆ నిధులు ఎటు మళ్లిస్తున్నారో ప్రభుత్వం వివరించాలి. ఇవి చాలక ఇప్పటికే రూ.70 వేల కోట్ల అప్పులు తీసుకు వచ్చారు. కరెంటు ఛార్జీల రూపంలో రూ.15 వేల కోట్ల మేర బాదారు. ఈ విషయాల గురించి కానీ విభజన హామీల గురించి ప్రస్తావించకుండా అమిత్ షా భజన చేయడానికే చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు అధిక సమయం కేటాయించినట్లు ఉంది. కేంద్రం మద్దతుతో వెంటిలేటర్ నుంచి బయటపడ్డామని, ఇప్పటికీ పేషంటే అని చంద్రబాబు చెబుతున్నారు. యథాప్రకారం రూ.పది లక్షల కోట్ల అప్పు అని అదని, ఇదని గత ప్రభుత్వానికి సంబంధించి అబద్దాలు చెప్పి అమిత్ షాను మోసం చేస్తే ఏమి లాభం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగైతే సూపర్ సిక్స్ హామీలను చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదో తెలపాలి కదా! అమిత్ షా తో తమ సూపర్ సిక్స్, ఎన్నికల ప్రణాళిక హామీల అమలు తీరు గురించి మాత్రం చర్చించలేదు. జగన్ ఇళ్ల గురించి ఇంత కీలక నేతలు మాట్లాడుకున్నారంటే ప్రజల పట్ల వీరికి ఉన్న చిత్తశుద్ది ఏమిటో తెలియడం లేదా! పోచికోలు కబుర్లు చెప్పుకోవడానికి వీరికి ఇంత ఖాళీ టైమ్ ఉంటుందా!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
నక్సలిజం కొన ఊపిరితో ఉంది: కేంద్ర హోంమంత్రి అమిత్ షా
ఛత్తీస్‌గఢ్–ఒడిశా సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో 14 మంది నక్సలైట్లు మృతిచెందడం మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘నక్సలిజానికి మరో పెద్ద ఎదురుదెబ్బ. దేశాన్ని నక్సల్ రహితం చేయాలన్న లక్ష్యం దిశగా భద్రతాబలగాలు పెద్ద విజయం సాధించాయి. సీఆర్పీఎఫ్, ఒడిశా స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్, ఛత్తీస్‌గఢ్ పోలీసు బలగాలు చేపట్టిన సంయుక్త ఆపరేషన్‌లో 14 మంది నక్సలైట్లు మృతి చెందారు. నక్సల్స్ లేని భారత్ దిశగా ఇదొక ముందడుగు. దేశంలో నక్సలిజం కొన ఊపిరితో ఉంది..’ అని అమిత్ షా పేర్కొన్నారు.2026 నాటికి అంతం చేస్తాం: ఛత్తీస్‌గఢ్ సీఎంకేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉన్న డబుల్ ఇంజన్ సర్కారు నక్సలిజం అణచివేతను విజయవంతంగా కొనసాగిస్తోందని ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ పేర్కొన్నారు. ‘2026 మార్చి నాటికి నక్సలిజం అంతం చేస్తాం. ఆ దిశగా భద్రతా దళాలు ముందుకెళుతున్నాయి’ అని ఆయన తెలిపారు. -
మావోయిజం చివరి దశలో ఉంది: అమిత్ షా
-
ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌పై అమిత్ షా ట్వీట్
సాక్షి, ఢిల్లీ: ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. నక్సలిజం చివరి దశలో ఉందన్న అమిత్.. మావోయిస్టులను ఏరివేసే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. త్వరలోనే మనం మావోయిస్టులు లేని ఇండియాను చూస్తామంటూ ట్వీట్లో పేర్కొన్నారు.మన భద్రతాదళాలు సాధించిన గొప్ప విజయంగా పేర్కొన్న అమిత్‌షా.. నక్సలిజానికి ఇది గట్టి ఎదురుదెబ్బ అన్నారు. నక్సల్స్ లేని భారత్ దిశగా ఇది కీలక అడుగని.. దేశంలో నక్సలిజం కొన ఊపిరితో ఉందన్నారు.ఛత్తీస్‌గఢ్-ఒడిశా సరిహద్దులో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఎదురు కాల్పుల్లో 19 మంది మావోయిస్టులు మృతిచెందారు. మావోయిస్టుల కీలక నేతలు కూడా మృతి చెందారు. మృతుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు చలపతి, మనోజ్ ఉన్నారు. గతంలో వారిపై ప్రభుత్వం కోటి రూపాయలు రివార్డ్ ప్రకటించింది. ఇదీ చదవండి: భారీ ఎన్కౌంటర్.. మావోయిస్ట్ కీలక నేత చలపతి మృతిమావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా సరిహద్దు జిల్లాలైన గరియాబంద్, నౌపాడలో ఛత్తీస్‌గఢ్, ఒడిశా పోలీసులు, సీఆర్పీఎఫ్ సిబ్బంది కలిసి ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జరిగిన ఎన్కౌంటర్లో నిన్న ఇద్దరు మావోయిస్టులు మృతి చెందగా.. తెల్లవారుజామున జరిపిన గాలింపులో మరో 14 మంది మృతదేహాలు లభ్యం కాగా, ఇవాళ మధ్యాహ్నానికి 19కి పెరిగింది. భారీస్థాయిలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఈ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.Another mighty blow to Naxalism. Our security forces achieved major success towards building a Naxal-free Bharat. The CRPF, SoG Odisha, and Chhattisgarh Police neutralised 14 Naxalites in a joint operation along the Odisha-Chhattisgarh border. With our resolve for a Naxal-free…— Amit Shah (@AmitShah) January 21, 2025 -
పరువు నష్టం కేసులో రాహుల్‌కు ఊరట
న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాందీకి ఊరట లభించింది. ట్రయల్ కోర్టు విచారణపై సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది. 2019లో లోక్‌సభ ఎన్నికల సమయంలో జార్ఖండ్‌లోని చైబాసా పట్టణంలో బహిరంగ సభలో రాహుల్ మాట్లాడుతూ అమిత్ షాపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన హంతకుడు అని మండిపడ్డారు. రాహుల్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీజేపీ నాయకుడు నవీన్ ఝా 2019లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమిత్ షా పరువుకు నష్టం కలిగించేలా రాహుల్ మాట్లాడారని ఆరోపించారు. రాహుల్‌పై పరువునష్టం కేసు పెట్టారు. ఈ కేసు విచారణలో భాగంగా తమ ఎదుట వ్యక్తిగతంగా హాజరుకావాలని రాహుల్ గాం«దీని రాంచీలోని మెజిస్టీరియల్ కోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వు జారీ చేసింది. ఈ ఉత్తర్వును సవాలు చేస్తూ ఆయన తొలుత జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. కింది కోర్టు ఉత్తర్వులో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించింది. దీంతో రాహుల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. జార్ఖండ్ ప్రభుత్వానికి, బీజేపీ నేత నవీన్ ఝాకు నోటీసు జారీ చేసింది. రాహుల్ దాఖలు పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా కింది కోర్టులో రాహుల్‌పై విచారణ నిలిపివేయాలని తేల్చిచెప్పింది. రాహుల్ తరఫున సీనియర్ అడ్వొకేట్ అభిõÙక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. -
అమిత్ షా అన్నదొకటి చిన్నమ్మ చెప్పిందొకటి
-
అమిత్‌షా పర్యటనతో ఏం ఒరిగింది: పోతిన మహేష్
సాక్షి,విజయవాడ:అమిత్‌షా ఆంధ్రప్రదేశ్‌కు వస్తే వరాల జల్లు కురిపిస్తారని అందరూ ఊహించారని, అయితే అది జరగలేదని వైఎస్సార్సీపీ సీనియర్ నేత పోతినమహేష్ విమర్శించారు. మహేష్ సోమవారం(జనవరి20) ఈ విషయమై మీడియాతో మాట్లాడారు.‘అమిత్ షా రాకను చంద్రబాబు ఏ విధంగా ఉపయోగించుకున్నారో చెప్పాలి. ఆంధ్రప్రదేశ్,కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో ఉంది. అమిత్ షాతో రాష్ట్రానికి రావాల్సిన నిధులపైన చర్చించి ప్రకటన చేయించి ఉంటే బాగుండేది. తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన విద్యుత్ బకాయిలు 8వేల కోట్లు ఉన్నాయి. వీటిని తీసుకురావడానికి వైఎస్ జగన్ కృషి చేశారు. కృష్ణా జలాల అంశంపై కనీసం మాట్లాడలేదు. రాష్ట్రానికి రావాల్సిన అంశాలపై మాట్లాడడంపై మానేసి వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని తక్కువ చేసే విధంగా మాట్లాడారు.విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్యాకేజీపై కార్మికసంఘాలు,ప్రజలకు అనుమానాలున్నాయి. స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ నిలపివేస్తున్నామని,సెయిల్ లో కలుపుతున్నామని అమిత్‌షాతో ఎందుకు ప్రకటన చేయించలేకపోయారు. అమిత్ షా పర్యటనతో రాష్ట్రానికి ఒరిగింది ఏంటి? చంద్రబాబు నివాసం అక్రమనిర్మాణం కాదా? వరదల్లో మునిగిపోలేదా?ఇటువంటి విషయాలు అమిత్ షాకి చూపించాల్సింది.వైఎస్ జగన్‌పై అబద్దపు ప్రచారాం ఎంతకాలం చేస్తారు. ఇది మంచిపద్దతి కాదు. చంద్రబాబు హైదరాబాద్‌లో కట్టుకున్న ప్యాలెస్‌లోకి ఏ కార్యకర్తనైనా తీసుకుని వెళ్లాడా?కనీసం ప్రవేశం ఉందా? వైఎస్ జగన్ తాడేపల్లి ఇంట్లోనే పార్టీ కార్యక్రమాలు,సమావేశాలు జరుగుతున్నాయి. దేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ అంశంపై అమిత్ షా స్పందించలేదు. అమరావతిలో 5ఎకరాలు భూమి కొన్నారు.ఈ అంశంపై అమిత్ షా మాట్లాడడలేదు.రుషికొండ భవనాలపై విష ప్రచారం చేస్తున్నారు. పవన్‌కి ఒక్కడికే బాబు ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. వైఎస్జగన్ సామాజిక న్యాయం చేసి బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనారిటీలకు ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. చంద్రబాబు ఇప్పుడు లోకేష్‌కే కాదు.బీసీ,ఎస్సీ,ఎస్టీలకు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి. వైఎస్ జగన్ సామాజిక న్యాయం చేస్తే బాబు సామాజిక మోసం చేశారు.పవన్ కళ్యాణ్‌కు ఉపముఖ్యమంత్రి పదవి అమిత్ షా రెకమెండ్ చేస్తే ఇచ్చారని ట్విటర్లో పెట్టారు. బాబు సామాజిక మోసంపై తెలుగుదేశం,జనసేన కార్యకర్తలు మాట్లాడాలి. 30లక్షల మంది పేదవారికి సొంతింటి కలను నేరవేర్చాడం విధ్వంసకర పాలన అంటారా?ప్రజలకు పరిపాలన దగ్గర చేసేందుకు గ్రామవార్డు సచివాలయాలు పెట్టడం విధ్వంసకర పాలన అంటారా? విద్యా,వైద్య రంగాలను అభివృద్ది చేస్తే విధ్వంసకర పాలన అంటారా?హర్బర్లు,పోర్టులు,మెడికల్ కాలేజీలు పెట్టి అభివృద్ది చేయడం విధ్వంసకర పాలన అంటారా’అని మహేష్ ప్రశ్నించారు. -
అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలు.. CPI నేతలు సీరియస్ వార్నింగ్
-
2014 నుంచి 2019 వరకు ఏపీలో విధ్వంసం
సాక్షి, అమరావతి: ‘అపార సహజ వనరులు ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో 2014 నుంచి 2019 వరకు విధ్వంసం సృష్టించారు. అది మానవ తప్పిదాలతో సృష్టించిన విధ్వంసం (మ్యాన్ మేడ్ డిజాస్టర్). దాంతో ఆ ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. అభివృద్ధి పూర్తిగా అడుగంటింది’ అని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా(Amit Shah) స్పష్టం చేశారు. రాష్ట్రంలో 2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో అమిత్ షా(Amit Shah) వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.గన్నవరం మండలం కొండపావులూరులోని ఆదివారం నిర్వహించిన ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అమిత్ షా(Amit Shah) తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్‌లో ఆ ఐదేళ్లలో జరిగిన విధ్వంసానికి మూడు రెట్లు అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. కాగా, అమిత్ షా(Amit Shah) హిందీ ప్రసంగాన్ని తెలుగులో అనువదించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మాత్రం చంద్రబాబు పట్ల స్వామిభక్తి ప్రదర్శించారు. అమిత్ షా(Amit Shah) ప్రసంగాన్ని తెలుగులోకి అనువదిస్తూ ‘2019 నుంచి ఐదేళ్లపాటు రాష్ట్రంలో జరిగిన విధ్వంసం’ అని మార్చి చెప్పారు. అమిత్ షా(Amit Shah) 2014 నుంచి 2019 వరకు అని స్పష్టంగా ప్రసంగిస్తే... పురందేశ్వరి మాత్రం 2019 నుంచి ఐదేళ్లపాటు అని అనువదించారు. కానీ అమిత్ షా(Amit Shah) ప్రసంగాన్ని అధికారికంగా విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వ సమాచార విభాగం ‘ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) మాత్రం అసలు విషయాన్ని వెల్లడించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘2014 నుంచి 2019 వరకు మానవ తప్పిదం సృష్టించిన విధ్వంసంతో ఆంధ్రప్రదేశ్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది’ అని అమిత్ షా(Amit Shah) ప్రసంగించినట్టు ఆ ప్రకటనలో అధికారికంగా పేర్కొంది.మరోవైపు అమిత్ షా(Amit Shah) నేరుగా హిందీలో చేసిన ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మోదీ మనసులో ఉన్న మాటనే అమిత్ షా(Amit Shah) చెప్పారని పలువురు వ్యాఖ్యానించారు. అంటే చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో విధ్వంసం సృష్టించిందని, అది మానవ తప్పిదంతో జరిగిన విధ్వంసమేనని అమిత్ షా(Amit Shah) చెప్పారని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. -
ప్రజల భద్రతకు ఎన్డీఆర్ఎఫ్ భరోసా
సాక్షి, అమరావతి: విపత్తులు సంభవించినప్పుడు ప్రజల భద్రతకు భరోసానిస్తూ జాతీయ విపత్తు స్పందన దళం(ఎన్డీఆర్ఎఫ్) నిరుపమాన సేవలు అందిస్తోందని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) అన్నారు. గన్నవరం మండలం కొండపావులూరులో ఆదివారం నిర్వహించిన ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్, దక్షిణ క్యాంపస్ భవనాలను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని చెప్పారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం మూడింతల అభివృద్ధి సాధిస్తుందన్నారు. ఆరు నెలల్లోనే రాష్ట్రానికి రూ.3 లక్షల కోట్ల విలువైన సహకారం అందించామని తెలిపారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు రూ.11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించడంతోపాటు రాజధాని అమరావతి నిర్మాణానికి హడ్కో ద్వారా రూ.27 వేల కోట్ల సహాయం అందిస్తున్నామని చెప్పారు. 2028 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ అమిత్ షా(Amit Shah) మనిషిలా కాకుండా మెషిన్లా పని చేస్తున్నారని, ఆయన పనితీరు చూస్తుంటే అసూయ కలుగుతోందన్నారు. పీపీపీ విధానంలో ‘గోదావరి – బనకచర్ల’ అనుసంధానానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు.ఈ బృహత్తర కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలని కోరారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ విపత్తులను తక్షణం ఎదుర్కొనేందుకు గ్రామ స్థాయిలో కూడా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, బండి సంజయ్, భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనిత తదితరులు పాల్గొన్నారు. అనంతరం అమిత్ షా(Amit Shah) గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని, ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరారు. తొక్కిసలాట ఘటనపై దృష్టి తిరుపతిలో ఇటీవల చోటు చేసుకున్న తిరుమల శ్రీవారి భక్తుల తొక్కిసలాట ఘటనపై కేంద్ర హోమ్ శాఖ సైతం దృష్టి సారించిందని ఆ శాఖ మంత్రి అమిత్‌షా వీహెచ్‌పీ నేతల భేటీలో వెల్లడించారు. అధికారిక కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఆయనతో ఆదివారం ఉదయం వీహెచ్‌పీ జాతీయ ఉపాధ్యక్షుడు గోకరాజు గంగరాజు నేతృత్వంలో సంఘ ప్రముఖ్‌లు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇటీవల విజయవాడలో వీహెచ్‌పీ నిర్వహించిన హైందవ శంఖారావం సభ గురించి వారు అమిత్‌షాకు వివరించారు. దేశవ్యాప్తంగా ఆలయాలను ప్రభుత్వ పరిధి నుంచి పూర్తిగా తప్పించి, స్వయం ప్రతిపత్తి క ల్పించేందుకు కేంద్రం తగిన చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా తిరుపతి తొక్కిసలాట అంశం వారి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. ఈ ఘటనపై కేంద్ర హోం శాఖ కూడా పరిశీలిస్తోందని కేంద్ర మంత్రి వీహెచ్‌పీ నేతలకు వివరించారని తెలిసింది. ప్రజలు ఏమనుకుంటున్నారు.. రాష్ట్రంలో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలు ఎలాంటి భావంతో ఉన్నారని అమిత్ షా(Amit Shah).. రాష్ట్ర బీజేపీ నేతలను అడిగి తెలుసుకున్నారు. ఆదివారం ఉదయం ఆయన బస చేసిన హోటల్లో రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, కేంద్ర సహాయ మంత్రి భూపతి శ్రీనివాసవర్మ, రాష్ట్ర పార్టీ సంఘటన కార్యదర్శి మధుకర్‌లతో కొద్దిసేపు సమావేశమై రాష్ట్ర రాజకీయాలపై చర్చించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం అందిస్తున్న సహాయ సహకారాలపై పెద్ద ఎత్తున ప్రజలకు వివరించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని నేతలకు సూచించారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని దిశా నిర్దేశనం చేశారు. నామినేటెడ్ పదవులు పంపకం సహా కూటమి పారీ్టల మధ్య సమన్వయం ఎలా ఉందన్న దానిపై కూడా ఈ భేటీలో చర్చ జరిగింది. -
అమిత్‌షా ఏం మాట్లాడారో మాకు తెలుసు: అంబటి రాంబాబు
సాక్షి,తాడేపల్లి:అందితే జుట్టు అందకపోతే కాళ్లు అనేది చంద్రబాబుకు తెలిసిన విద్య అని మాజీ మంత్రి,వైఎస్సార్సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ఆదివారం(జనవరి19) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.‘నాడు తిరుమల దర్శనానికి వచ్చినపుడు అమిత్‌షాపై రాళ్ల వర్షం కురిపించారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలున్నాయి. విభజన సమస్యలు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయి. ఇలాంటి సమయంలో చంద్రబాబు, పవన్‌కల్యాణ్ సమస్యల గురించి మాట్లాడకుండా విందులేంటో. సమస్యలన్నీ పక్కనపెట్టి వైఎస్ జగన్ ప్యాలెస్‌ల గురించి మాట్లాడుతున్నారు. అమిత్ షాతో చంద్రబాబు వైజాగ్ స్టీల్‌ప్లాంట్ విషయం మాట్లాడలేదు.లోకేష్‌ను అదుపులో పెట్టుకోమని అమిత్ షా వార్నింగ్..అమిత్‌షా ఏం మాట్లాడారో మాకు సమాచారం ఉంది. లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేస్తానని చంద్రబాబు అమిత్‌షాను అడిగారట. లోకేష్ అన్ని శాఖల్లో వేలు పెడుతున్నారని, ఆయనను ముందు అదుపులో పెట్టుకోవాలని అమిత్‌షా చంద్రబాబును హెచ్చరించారు. లోకేష్ వసూళ్ల కార్యక్రమంలో నిమగ్నమైనందున స్పీడ్ తగ్గించుకోవాలని అమిత్ షా బాబుకు సూచించారు.అమిత్ షా సలహాలు బయటికి రాకుండా కథలు వండి వారుస్తున్నారు. గత్యంతరం లేకే చంద్రబాబు పవన్‌కల్యాణ్‌ను డిప్యూటీ సీఎం చేశారు. చంద్రబాబు తప్పిదం వల్లే పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నది.వైఎస్ జగన్ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా జరిగాయి’అని అంబటి తెలిపారు.అంబటి రాంబాబు ఇంకా ఏమన్నారంటే..చంద్రబాబు అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకునే రకంరాష్ట్రంలో ఎన్నో సమస్యలున్నాయ్విభజన సమస్యలు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయిరాష్ట్రంలోని సమస్యలను వదిలేసి జగన్ ఆస్తుల గురించి అమిత్ షా అడిగారని ప్రచారం చేస్తున్నారుఆవు కథ మాదిరి వైఎస్ జగన్ పై బురదజల్లడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారుచంద్రబాబు నివాసముండేదే అక్రమ కట్టడంఅక్రమకట్టడంలోనే విందు ఇస్తున్నామని అమిత్ షాకు ఎందుకు చెప్పలేదుఆ ఇల్లు క్విడ్ ప్రోకోలో కొట్టేసిందని అమిత్ షాకు ఎందుకు చెప్పలేదుకృష్ణమ్మ వరద ముంచేసిన ఇంట్లోనే మీరు కూర్చున్నారని ఎందుకు చెప్పలేదుహైదరాబాద్లో ఇల్లు కట్టుకున్న చంద్రబాబు ఎవరికైనా చూపించాడాచంద్రబాబు మాదిరి జగన్ మోహన్ రెడ్డి క్విడ్ ప్రోకోలో ఇళ్లు తీసుకోలేదులోకేష్ ను ఉపముఖ్యమంత్రిగా చేయాలని అమిత్ షా ను చంద్రబాబు అడిగారుమీ అబ్బాయి లోకేష్ స్పీడ్ ను తగ్గించుకోమని అమిత్ షా చెప్పారుఎక్కడపడితే అక్కడ వేలు పెడుతున్నాడు...కొంచెం తగ్గమని చెప్పారువైఎస్ జగన్ ఇళ్ల గురించి పాతచింతకాయ పచ్చడి కథలెందుకుపోలవరం రెండవ డయాఫ్రమ్ వాల్ పనులు నిన్న ప్రారంభించారుడయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి చంద్రబాబు అవివేకంటీడీపీలో చేసిన తప్పిదమే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందిచంద్రబాబు,దేవినేని ఉమా , టీడీపీ తప్పిదాన్ని జగన్ పై నెట్టడం తప్పువైఎస్ జగన్ హయాంలోనే పోలవరం పనులు అద్భుతంగా జరిగాయిస్పిల్ వే , కాఫర్ డ్యామ్ లు జగన్ హయాంలోనే పూర్తి చేశారుతిరుపతి ఘటన మానవతప్పిదంతిరుపతికి ఇప్పుడు రమ్మని చెప్పండి ఎన్డీయేనుతిరుపతి పై ఈ ప్రభుత్వం పూర్తిగా పట్టు కోల్పోయిందిలడ్డూలో కల్తీ నెయ్యి కలిపారని మాపై అభాండాలు వేశారుఆ పాపమే ఇప్పుడు కూటమి పాలనను వెంటాడుతోందిచెప్పేటందుకే చంద్రబాబు నీతులుచంద్రబాబు, ఆయన కుమారుడు ఒక్కొక్కరినే కంటారుపేదలు మాత్రం ఇద్దరు ముగ్గురు కనమంటున్నారుఏపీలో అసమర్ధపాలన సాగుతోందిలోకేష్ భజన తగ్గించాడు...పవన్ చంద్రబాబు భజన మొదలు పెట్టాడుఅలా భజన చేస్తున్నాడు కాబట్టే బాగా లబ్ధి పొందుతున్నాడుమళ్లీ మీరే ఉంటారని గ్యారంటీ ఇవ్వాలని కంపెనీలు లోకేష్ ను అడుగుతున్నాయంటున్నారు ఈ ప్రభుత్వం మీద పారిశ్రామికవేత్తలకు నమ్మకం లేదువైఎస్ జగన్ మళ్లీ రావడం ఖాయమని పారిశ్రామికవేత్తలకు అర్ధమైపోయిందిజగన్ హయాంలోనే పెట్టుబడులు పెడదామని పారిశ్రామిక వేత్తలు ఎదురు చూస్తున్నారుచంద్రబాబు అనుభవజ్ఞుడే అవ్వొచ్చు ...కానీ అసమర్ధుడు -
అమిత్ షాపై చంద్రబాబు ఒత్తిడి.. తగ్గిన కేంద్రం
-
విజయవాడ: ‘గో బ్యాక్ అమిత్ షా’
విజయవాడ, సాక్షి: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏపీ పర్యటనలో నిరసన సెగ తగిలింది. అంబేద్కర్‌పై షా చేసిన వ్యాఖ్యల ఆధారంగా ‘‘ గో బ్యాక్ అమిత్ షా’’ నినాదాలతో నగరంలో ఆదివారం వామపక్షాలు నిరసన చేపట్టాయి. అంబేద్కర్‌ని అవమాన పరిచిన అమిత్ షా రాజీనామా చేయాలని, ఆయన వెంటనే వెనక్కి వెళ్లిపోవాలంటూ డిమాండ్ చేశారు వాళ్లు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ.. ప్రధాని మోది అమిత్ షాకు మద్దతు ఇవ్వడం సిగ్గుమాలిన చర్య. రాజ్యాంగాన్ని రచించిన మహనీయుడికి మీరు ఇచ్చిన గౌరవం ఇదేనా. అంబేద్కర్ ను అవమానించిన షా.. తన వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకోవాలి. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం’’ అని అన్నారు. ‘‘పార్లమెంట్ వేదికగా నిండు సభలో అవమానించారు. పైగా ఆయన తన వ్యాఖ్యల్ని సమర్ధించుకుంటున్నారు. అమిత్ షా ఆ వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకొని క్షమాపణ చెప్పాలి’’ అని సీపీఎం నేత ఉమా మహేశ్వరరావు అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో ఇతర వామపక్ష పార్టీల నేతలు పాల్గొన్నారు. కేంద్ర సాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లండి: అమిత్ షానగరంలోని నోవాటెల్ హోటల్లో ఏపీ బీజేపీ (BJP) నేతలతో ఆ పార్టీ అగ్రనేత అమిత్‌షా (Amit shah) సమావేశం ముగిసింది. సుమారు గంటన్నరపాటు ఈ భేటీ కొనసాగింది. కీలక అంశాలపై రాష్ట్ర భాజపా నేతలకు అమిత్‌షా దిశానిర్దేశం చేశారు.ఏపీకి కేంద్రం అందిస్తున్న సాయం, రాష్ట్ర అభివృద్ధికి చేపడుతున్న చర్యలు, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు. అంతర్గత విభేదాలను పక్కన పెట్టి రాష్ట్రంలో భాజపా బలోపేతానికి అందరూ కృషి చేయాలన్నారు. ‘హైందవ శంఖారావం’ సభ విజయం పట్ల పార్టీ, వీహెచ్‌పీ నేతలకు అమిత్‌షా అభినందనలు తెలిపారు. తిరుమల తొక్కిసలాట ఘటనపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. దీనిపై కేంద్రహోంశాఖ దృష్టిపెట్టిందని అమిత్‌షా చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నేతలు ముందుకెళ్లాలని ఆయన సూచించారు. ఎన్డీఆర్ఎఫ్ వేడుకల్లో షా.. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం(NDRF) 20వ వ్యవస్థాపక దినోత్సవం వేడుకల్లో కేంద్ర మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. కృష్ణా జిల్లా కొండపావులూరులోని 10వ NDRF బెటాలియన్ వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ (NIDM) సౌత్ క్యాంపస్‌ను అమిత్ షా ప్రారంభించారు. అనంతరం ముగ్గురు మొక్కలు నాటారు. అంతకు ముందు.. నగరంలోని నోవాటెల్‌లో అమిత్ షాతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా పది నిమిషాలపాటు భేటీ అయ్యారు. అక్కడి నుంచి ఇద్దరూ కలిసి కొండపావులూరు చేరుకున్నారు. అంతకంటే ముందే పవన్ అక్కడికి చేరుకున్నారు. -
ఏపీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన
-
‘విష్ణుమాయ ముందు చంద్రమాయ భస్మం కాకతప్పదు’
తిరుపతి, సాక్షి: తిరుమలలో వరుస ఘటనలను తీవ్రంగా పరిగణించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దర్యాప్తునకు ఆదేశించింది. అయితే ఏం జరిగిందో ఏమోగానీ.. రాత్రికిరాత్రే ఈ ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది. ఈ పరిణామంపై టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్‌రెడ్డి(Bhumana Karunakar Reddy) స్పందించారు. ‘‘అధికారంలోకి వచ్చాక తిరుమలపై పాప ప్రక్షాళన చేస్తామని చంద్రబాబు(Chandrababu), పవన్ కల్యాణ్(Pawan kalyan) చెప్పారు. అయితే ఆలయ పవిత్రతను సర్వనాశనం చేశారు అని కేంద్రం స్పందించింది. తిరుమలలో రాష్ట్రం సరైన చర్యలు తీసుకొక పోవడంతోనే కేంద్రం చర్యలు చేపట్టింది. వరుస ఘటనలపై నిగ్గు తేల్చేందుకు అధికారిని కేంద్రం పంపుతామంది. కానీ, విజయవాడకు వచ్చిన అమిత్ షాను చంద్రబాబు, పవన్ బతిమిలాడారు. రాత్రికి రాత్రే నిర్ణయాన్ని నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ఒత్తిడి తెచ్చారు. హడావుడిగా ఇచ్చిన జీవోలో అధికారుల సంతకాలు లేవు’’ అని భూమన ఆరోపించారు. తిరుమలలో ఎన్నడూ లేని విధంగా వరుస దురాగతాలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరంతరం ఏదో ఒకటి జరుగుతోంది. అధికారుల అలసత్వంతో.. అవినీతితో విచ్చలవిడితనం కనిపిస్తోంది. బ్రహ్మాండనాయకుడి కొండపై మద్యం, బిర్యానీలు లభ్యమవుతున్నాయి. మాడ వీధుల్లో కూడా చెప్పులు వేసుకుని తిరుగుతున్నారు అంటే మీ పర్యవేక్షణ ఏవిధంగా ఉందో అర్థం పడుతోంది. తిరుమలలో ఈ మధ్యకాలంలో నాలుగుసార్లు ఎర్రచందనం దొరికింది. మిమ్మల్ని చూసుకుని సప్లై చేస్తున్న దొంగలు ఎవరు? అటవీశాఖ మంత్రిగా ఉన్న పవన్ ఏం చేస్తున్నారు?. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొండపై కొండపై అరాచకాలు పెరిగిపోయాయి. తిరుమల కొండపై అవినీతి ఏరులై పారుతోంది. టీడీపీ, జనసేన(Jana Sena) నాయకులు టికెట్లు అమ్ముకుంటూ సంపద సృష్టిస్తున్నారు. ఇది దైవానికి జరుగుతున్న ద్రోహంగా ప్రజలు భావిస్తున్నారు. సర్వ సాక్షి అయిన వేంకటేశ్వర స్వామిని మోసం చేయాలని చూస్తే శిక్ష తప్పదు. ఆరుగురి మరణానికి కారకులెవరూ?‘‘క్రౌడ్ మేనేజ్మెంట్కు సంబంధించి టీటీడీ నుంచి ప్రత్యేక బృందం అయోధ్య రామలయానికి పంపిన ఘనత మాది. మీ పాలనలో టీటీడీ పరువు తీశారు. వైకుంఠ దర్శనానికి వచ్చిన భక్తులను పశువుల దొడ్డిలో పడేశారు. తొక్కిసలాట(Stampede)లో ఆరుగురు భక్తులు మరణించడం బాధాకరం. ఆ మరణాలకు బాధ్యులు ఎవరు?. ప్రమాదానికి కారకులపై ఎందుకు చర్యలు తీసుకోలేదు. టీటీడీ ఈవో, అడిషనల్ ఈవో, కలెక్టర్‌పై చర్యలు తీసుకోకుండా.. తూతూమంత్రంగా ఎస్పీని సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు. పైగా మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూపాయి కూడా ఇవ్వలేదు. వైకుంఠ ఏకాదశి కు సునీత గౌడ అనే కర్ణాటక భక్తురాలు 70 లక్షలు ఖర్చు చేసి పుష్ప అలంకరణ చేస్తే బయట పెట్టేశారు. అక్షర మాయకు ఆ దేవుడే బదులిస్తాడుచంద్రబాబు పాపలపుట్ట కొండగా మారుతోంది. ఒక న్యూస్ చానల్ అధినేత బీఆర్ నాయుడు(BR Naidu)కు చైర్మన్ పదవి ఒక్కటే ప్రామాణికం కాదు. లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి అంటూ అసత్య ప్రచారం చేశారు. వైఎస్సార్సీపీపై బురద జల్లాలని ప్రయత్నించారు. లడ్డూ వ్యవహారంలో సిట్ ఏం తేల్చింది?. ఇప్పుడు నెపాన్ని మా మీద నెట్టేసే పరిస్థితులు కూడా దాటిపోయాయి. ఈ అపచారాలకు భగవంతుడు తప్పకుండా శిక్ష వేస్తాడు. చంద్రబాబు ఎల్లో మీడియా అక్షర మాయతో మాపై బురద చల్లితే.. విష్ణు మాయ ముందు చంద్రమాయ భస్మం కాక తప్పదు’’ అని భూమన అన్నారు. -
అమిత్ షాకు చంద్రబాబు విందు
సాక్షి, అమరావతి/విమానాశ్రయం (గన్నవరం): కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సీఎం చంద్రబాబు శనివారం రాత్రి విందు సమావేశంలో పాల్గొన్నారు. వారు కొద్దిసేపు రాజకీయ అంశాలపై చర్చించినట్లు కూటమి నేతలు తెలిపారు. గన్నవరం మండలం కొండపావులూరులో ఏర్పాటు చేసిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ (ఎన్ఐడీఎం), ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ క్యాంపస్‌లను అమిత్‌షా ఆదివారం ప్రారంభించనున్నారు. ఇందుకోసం విజయవాడ వచ్చిన ఆయనకు సీఎం చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో విందు ఏర్పాటు చేశారు. అమిత్‌షా శనివారం రాత్రి 8.20 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా చంద్రబాబు నివాసానికి వెళ్లారు. అక్కడ ఆయనకు చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు. విందు అనంతరం అమిత్ షాతో వారిద్దరూ సమావేశమయ్యారు. ఈ విందు సమావేశంలో కేంద్ర మంత్రులు బండి సంజయ్, భూపతిరాజు శ్రీనివాసవర్మ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, రాష్ట్ర మంత్రులు సత్యకుమార్, నారా లోకేశ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం అమిత్ షా విజయవాడలోని ఓ హోటల్లో బస చేశారు.విమానాశ్రయంలో అమిత్‌షాకు ఘనస్వాగతంకేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా శనివారం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం (గన్నవరం)లో రాష్ట్ర నేతలు ఘన స్వాగతం పలికారు. కేంద్ర మంత్రులు బండి సంజయ్, భూపతిరాజు శ్రీనివాసవర్మ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, కె. అచ్చన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, నారా లోకేశ్, కొలుసు పార్ధసారథి, కొల్లు రవీంద్ర, సత్యకుమార్ యాదవ్, డోలా బాల వీరాంజనేయులు స్వామి, నాదెండ్ల మనోహర్, వాసంశెట్టి సుభాష్, ఎంపీలు వల్లభనేని బాలశౌరి, కేశినేని శివనాథ్, సీఎం రమేష్, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఎన్టీఆర్ఎఫ్ డీజీ పీయూష్ ఆనంద్, ఐజీ నరేంద్రసింగ్, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. -
మోదీ జీ.. వారిని ఎప్పుడు ఓబీసీల్లో చేరుస్తారో చెప్పండి?
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అటు ఆప్ ప్రభుత్వం, ఇటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీజేపీలు ఎక్కడా కూడా తగ్గడం లేదు. కౌంటర్‌కు రీ కౌంటర్ అన్నట్లు వారి ప్రచారం సాగుతోంది. రోజూ ఏదో కొత్త అంశంపై వీరి ప్రచారం జోరు సాగుతోంది. అయితే దీనిలో భాగంగా ప్రధాని మోదీకి లేఖాస్త్రం సంధించారు ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal). ఇందులో ఢిల్లీలోని జాట్ కమ్యూనిటీని కేంద్రం ఎప్పుడుఓబీసీ జాబితాలో చేరుస్తారో చెప్పాలంటూ ప్రశ్నించారు కేజ్రీవాల్,ఈ మేరకు ఒక సుదీర్ఘనమైన లేఖను ప్రధాని మోదీకి రాసినట్లు కేజ్రీవాల్ తెలిపారు. కేజ్రీవాల్ ‘ జాట్స్ కమ్యూనిటీని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ఓబీసీ జాబితాలో చేర్చాం. కానీ కేంద్ర ప్రభుత్వం జాబితాలో వారిని ఇంకా ఓబీసీ జాబితాలో చేర్చలేదు. ఒకవేళ ఇలా చేస్తే రాజస్తాన్ నుంచే వచ్చే జాట్స్ ఢిల్లీ యూనివర్శటీల్లో అడ్మిషన్లు పొందడంతో పాటు, ఎయిమ్స్‌లో జాబ్స్‌కూ పొందవచ్చు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని అన్మి సంస్థల్లో ఉపాధి అవకాశాలు పొందే అవకాశం ఉంటుంది. కేవలం ఇది ఢిల్లీలోని జాట్స్‌కు మాత్రమే ఇలా ఉండకూడదు కదా? అని డిమాండ్ చేశారుమీరు ప్రామిస్ చేశారు.. మరిచిపోయారా?దేశంలోని జాట్స్ కమ్యూనిటీని ఓబీసీల్లో చేర్చుతామని మీరే ప్రామిస్ చేశారు. బీజేపీలో ఇద్దరు అగ్రనేతలు హామీ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi), కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah), జాట్స్‌కు ప్రామిస్ చేశారు. వారిని కేంద్ర స్థాయిలో ఓబీసీల్లో చేర్చుతామని హామీలు అయితే ఇచ్చారు కానీ దాన్ని ఇంకా అమలు చేయలేదు. ఆ హామీ ఇంకా అసంపూర్ణంగానే ఉండిపోయింది’ అని ఆరోపించారు కేజ్రీవాల్మోదీ జీ, అమిత్ షాలను అడుగుతున్నా..ఈ హామీ ఇచ్చిన ప్రధాని మోదీని, అమిత్ షాలను అడుగుతున్నాను. జాట్స్ కమ్యూనిటీని ఎప్పుడు కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చుతారో చెప్పండి. ఈ విషయంలో జాట్ నాయకులు నన్ను కలిశారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దీనిపై ఇప్పటివరకూ నోరు మెదపకపోవడం వారు ఆగ్రహంతో ఉన్నారు. గత పదేళ్ల నుంచి తమకు అన్యాయం జరుగుతూనే ఉందని వారు ఆరోపిస్తున్నారు’ అని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.మీరు మురికివాడలను బాగు చేయండి..ఢిల్లీలో అన్ని మురికివాడల కంటే.. కేజ్రీవాల్ సీఎంగా ఉన్న సమయంలో నివసించిన శీష్ మహల్ టాయిలెట్ల ఖరీదే ఎక్కవంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను కేజ్రీవాల్ తిప్పికొట్టారు. మీరు మురికివాడ(Delhi Slums)లను బాగు చేస్తే, తాను ఎన్నికల్ల్లో పోటీచేయనంటూ సవాల్ విసిరారు. ఢిల్లీలోని మురికివాడల కూల్చివేతలపై కేసులను ఉపసంహరించుకోవడంతో పాటు వారికి పునరావాసం కల్పిస్తే తాను ఎన్నికల్లో పోటీ చేయడాన్ని విరమించుకుంటానన్నారు.‘మీరు మురికివాడల ప్రజలపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోండి. దీనిపై కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయండి. ఇళ్లు కోల్పోయిన మురికివాడ ప్రజలందరికీ అదే స్థలంలో ఇళ్లు నిర్మించండి. అప్పుడు నేను ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరమే ఉండదు. ఈ నా చాలెంజ్ మీరు స్వీకరిస్తారా? అని ధ్వజమెత్తారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5 వ తేదీన జరుగనున్న సంగతి తెలిసిందే. -
46 ఏళ్ల ‘పవార్’ రాజకీయానికి బీజేపీ చెక్ పెట్టింది: అమిత్ షా
ముంబై: ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ లక్ష్యంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో 1978 నుంచి శరద్ పవార్.. అస్థిర, వెన్నుపోటు రాజకీయాలు చేశారు. మహారాష్ట్రలో బీజేపీ విజయంతో పవార్ రాజకీయాలకు ముగింపు పలికినట్టు అయ్యిందన్నారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ఆదివారం షిర్డీలో పర్యటించారు. ఈ సందర్బంగా అమిత్ షా మాట్లాడుతూ..‘మహారాష్ట్రలో 1978లో శరద్ పవార్ భిన్నమైన రాజకీయాలను మొదలుపెట్టారు. అస్థిర, వెన్నుపోటు రాజకీయాలకు తెరలేపారు. కానీ, 2024 ఎన్నికల్లో ప్రజలు వాటిని తిరస్కరించారు. అదేవిధంగా ఉద్ధవ్ ఠాక్రే కుటుంబ రాజకీయాలకు కూడా ప్రజలకు ముగింపు పలికారు. కుట్రపూరిత రాజకీయాలు కూడా తిరస్కరణకు గురయ్యాయి. వాళ్లిద్దర్నీ మహారాష్ట్ర ప్రజలు ఇంటికి సాగనంపారు. బీజేపీతో పాటు నిజమైన శివసేన, ఎన్సీపీలను గెలిపించారు. వారి ఓటమితో మహారాష్ట్రలో అస్థిర రాజకీయాలకు ముగింపు పడిందన్నారు.ఉద్ధవ్ థాక్రే మమ్మల్ని మోసం చేశాడు. 2019లో ఆయన బాలాసాహెబ్ సిద్ధాంతాన్ని విడిచిపెట్టారు. ఈరోజు మీరు ఆయనకు తన స్థానాన్ని మీరే చూపించారు. ఆయన ద్రోహం ప్రజలకు అర్థమైంది. రాష్ట్రంలో బీజేపీ సాధించిన పెద్ద విజయానికి పార్టీ కార్యకర్తలే కారణం. అందరి శ్రమతోనే ఘన విజయం అందుకున్నాం అంటూ వ్యాఖ్యలు చేశారు.ఇదే సమయంలో ముఖ్యమంత్రిగా, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిగా పనిచేసిన శరద్ పవార్.. అనేక సహకార సంస్థలకు నేతృత్వం వహించారు. కానీ, రైతుల ఆత్మహత్యలను మాత్రం ఆయన ఆపలేకపోయారు. బీజేపీ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోంది. రైతుల సంక్షేమం కోసమే మోదీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది’ అంటూ కీలక కామెంట్స్ చేశారు.#WATCH | Maharashtra: Union Home Minister Amit Shah says, "... The victory (of BJP) in Maharashtra ended the politics of instability and backstabbing started by Sharad Pawar in 1978. Uddhav Thackeray betrayed us, he left the ideology of Balasaheb in 2019. Today you have shown him… pic.twitter.com/BzACZ9bOSJ— ANI (@ANI) January 12, 2025ఇదిలా ఉండగా.. ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. దీంతో, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే, ఎన్సీపీ నేత అజిత్ పవార్, శివసేన నాయకుడు ఏక్నాథ్ షిండే డిప్యూటీ సీఎంలుగా ప్రమాణం చేశారు. -
మీరు అలా చేస్తే.. నేను పోటీనే చేయను: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీలో అన్ని మురికివాడల కంటే.. కేజ్రీవాల్(Arvind Kejriwal) సీఎంగా ఉన్న సమయంలో నివసించిన శీష్ మహల్ టాయిలెట్ల ఖరీదే ఎక్కవంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) చేసిన వ్యాఖ్యలను ఆప్ చీఫ్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తిప్పికొట్టారు. మీరు మురికివాడ(Delhi Slums)లను బాగు చేస్తే, తాను ఎన్నికల్ల్లో పోటీచేయనంటూ సవాల్ విసిరారు. ఢిల్లీలోని మురికివాడల కూల్చివేతలపై కేసులను ఉపసంహరించుకోవడంతో పాటు వారికి పునరావాసం కల్పిస్తే తాను ఎన్నికల్లో పోటీ చేయడాన్ని విరమించుకుంటానన్నారు.‘మీరు మురికివాడల ప్రజలపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోండి. దీనిపై కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయండి. ఇళ్లు కోల్పోయిన మురికివాడ ప్రజలందరికీ అదే స్థలంలో ఇళ్లు నిర్మించండి. అప్పుడు నేను ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరమే ఉండదు. ఈ నా చాలెంజ్ మీరు స్వీకరిస్తారా? అని ధ్వజమెత్తారు.‘ఒకవేళ ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే మురికివాడలను కూల్చివేయాలని భావిస్తోంది. వారి స్థలాలను ఆక్రమించేందుకు బీజేపీ కుట్ర చేస్తోంది. ముందు మీ ఓట్లు కావాలి.. తర్వాత మీ స్థలం కావాలి. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత ఐదేళ్లలో ఢిల్లీలోని మురికివాడ ప్రజలకు కేవలం 4,700 ఫ్లాట్లు మాత్రమే నిర్మించి ఇచ్చింది. ఢిల్లీ మహానగరంలో నాలుగు లక్షలకు మందికి పైగా మురికివాడల్లో ఉన్నారు. మీరు అది చేయాలంటే మీకు వెయ్యేళ్లు పడుతుంది’ అంటూ సెటైర్లు వేశారు. తాను రాజకీయాల్లోకి వచ్చింది ఏదో హోదా అనుభవించడం కోసం కాదని, ప్రజల హోదా పెంచడం కోసమని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. మురికివాడల కంటే.. శీష్ మహల్లో టాయిలెట్ల ఖరీదే ఎక్కువఢిల్లీ సీఎంగా ఉన్న సమయంలో ఆప్ జాతీయ కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్ అధికార నివాసం ‘శీష్ మహల్’ను అత్యంత విలాసవంతంగా నిర్మించారని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించిన సంగతి తెలిసిందే. నిన్న( శనివారం). ఢిల్లీలోని అన్ని మురికివాడల కంటే శీష్ మహల్‌లోని టాయిలెట్లే అత్యంత ఖరీదైనవని ఆయన వ్యాఖ్యానించారు.దేశంలోని పేదల కోసం ప్రధాని మోదీ 3.58 కోట్ల ఇళ్లు నిర్మించి ఇస్తే..కేజ్రీవాల్ మాత్రం ప్రజల సొమ్ముతో ఆర్భాటంగా ఖరీదైన నివాసాన్ని నిర్మించారని విమర్శించారు. మంత్రి అమిత్ షా శనివారం జేఎల్ఎన్ స్టేడియంలో మురికివాడల నివాసితులతో ఏర్పాటైన సమావేశంలో మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వస్తే మురికివాడల్లోని ప్రతి ఒక్కరికీ పక్కా ఇల్లు నిర్మించి ఇస్తుందని భరోసా ఇచ్చారు. ఢిల్లీలో మౌలిక వనరుల కల్పనకు మోదీ ప్రభుత్వం రూ.68వేల కోట్లను వెచ్చించిందన్నారు.మురికివాడల్లో సమస్యలు, వాటి పరిష్కారంపై ఇప్పటికే ప్రధాని మోదీకి, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాకు వివరాలను అందజేశామన్నారు. అధికారం చేపట్టిన వెంటనే వీటన్నిటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. -
ఢిల్లీలోని మురికివాడల కంటే.. శీష్ మహల్లో టాయిలెట్ల ఖరీదే ఎక్కువ: అమిత్ షా
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎంగా ఉన్న సమయంలో ఆప్ జాతీయ కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్ అధికార నివాసం ‘శీష్ మహల్’ను అత్యంత విలాసవంతంగా నిర్మించారని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. ఢిల్లీలోని అన్ని మురికివాడల కంటే శీష్ మహల్‌లోని టాయిలెట్లే అత్యంత ఖరీదైనవని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలోని పేదల కోసం ప్రధాని మోదీ 3.58 కోట్ల ఇళ్లు నిర్మించి ఇస్తే..కేజ్రీవాల్ మాత్రం ప్రజల సొమ్ముతో ఆర్భాటంగా ఖరీదైన నివాసాన్ని నిర్మించారని విమర్శించారు. మంత్రి అమిత్ షా శనివారం జేఎల్ఎన్ స్టేడియంలో మురికివాడల నివాసితులతో ఏర్పాటైన సమావేశంలో మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వస్తే మురికివాడల్లోని ప్రతి ఒక్కరికీ పక్కా ఇల్లు నిర్మించి ఇస్తుందని భరోసా ఇచ్చారు. ఢిల్లీలో మౌలిక వనరుల కల్పనకు మోదీ ప్రభుత్వం రూ.68వేల కోట్లను వెచ్చించిందన్నారు. మురికివాడల్లో సమస్యలు, వాటి పరిష్కారంపై ఇప్పటికే ప్రధాని మోదీకి, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాకు వివరాలను అందజేశామన్నారు. అధికారం చేపట్టిన వెంటనే వీటన్నిటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలను పట్టించుకోకుండా, ఢిల్లీ అభివృద్ధికి కేజ్రీవాల్ ‘ఆపద’ప్రభుత్వం అడ్డంకిగా మారిందన్నారు. గత పదేళ్లుగా ఢిల్లీ ఎలాంటి అభివృద్ధికీ నోచుకోలేదని చెప్పారు. కనీసం తాగునీరు, రోడ్లు, డ్రెయినేజీ వసతులు కూడా లేని మురికివాడలు చెత్తకుప్పల్లా మారాయని చెప్పారు. సుమారు 5.25 లక్షల మంది ఢిల్లీ విద్యార్థులకు పాఠశాల విద్య అందడం లేదంటూ కేజ్రీవాల్‌ను నిలదీశారు. -
తీవ్ర ప్రమాదంలో రాజ్యాంగం
బెళగావి: మన రాజ్యాంగం మునుపెన్నడూ ఎదుర్కోనంతటి తీవ్ర ముప్పును ఎదుర్కొంటోందని కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేసింది. పార్లమెంట్లో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్‌ను అవమానించడం హోం మంత్రి అమి త్ షా రాజీనామా చేయాల్సిందేనని స్పష్టం చేసింది. దేశ ప్రజలకు ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ వర్కింగ్ కమి టీ(సీడబ్ల్యూసీ) సమావేశం డిమాండ్ చేసింది. అమిత్ షా చర్య రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసేందుకు ఆర్ఎస్ఎస్–బీజేపీలు దశాబ్దాలుగా సాగిస్తున్న కుట్రలో భాగమేనని మండిపడింది. సీడబ్ల్యూసీ సమావేశం గురువారం కర్ణాటకలోని బెళగావిలో జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ చీఫ్ ఖర్గే మాట్లాడారు. పెరుగుతున్న ధరలు, అవినీతి, రాజ్యాంగంపై దాడి వంటి వాటిపై పాదయాత్రలు వంటి రాజకీయ ప్రచార కార్యక్రమాలను 13 నెలలపాటు చేపడతామన్నారు. జవాబుదారీతనం, సమర్థత ప్రాతిపదికగా పారీ్టలో భారీగా సంస్థాగత ప్రక్షాళన చేపడతామని చెప్పారు. అసత్యాలను వ్యాప్తి చేసే వారిపై పోరాటానికి పారీ్టకి 2025 సంస్థాగత సాధికారిత వత్సరంగా ఉంటుందని ఖర్గే తెలిపారు. ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసేందుకు ప్రాంతీయ, నూతన నాయకత్వానికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌ను అమలు చేసి ఏఐసీసీ నుంచి బూత్ స్థాయి వరకు ఎన్నికలు జరుపుతామన్నారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్‌కు గౌరవం కల్పించేందుకు పార్టీ పోరాడుతుందన్నారు. ఖర్గేతోపాటు పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శులు జైరాం రమేశ్, కేసీ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్న ‘నవ సత్యాగ్రహ బైఠక్’ఈ మేరకు రెండు రాజకీయ తీర్మానాలను చేసింది. ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’వంటి విధానాలను తీసుకురావడం ద్వారా సమాఖ్య వ్యవస్థను దెబ్బతీసేందుకు ప్రభుత్వం ప్రయతి్నస్తోంది. న్యాయవ్యవస్థ, ఎన్నిక కమిషన్, మీడియాలను తీవ్ర ఒత్తిడులకు గురిచేసి అనుకూలంగా మార్చుకుంటోంది. ఇటీవలి పార్లమెంట్ సమావేశాలకు పాలకపక్షం తీవ్ర అవరోధాలు కలిగించింది. పోలింగ్ పత్రాలను ప్రజలకు అందుబాటులో లేకుండా చేసేలా ఎన్నికల నిబంధనావళిని మార్చుకుంటోంది’అంటూ సీడబ్ల్యూసీ మండిపడింది. హరియాణా, మహారాష్ట్రలలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల సమగ్రత దెబ్బతిందని ఆరోపించింది. మైనారిటీ వర్గం లక్ష్యంగా విద్వేషం, హింసను ప్రభుత్వమే ప్రేరేపించడంపై ఆందోళన వ్యక్తం చేసింది. కుల గణనను సాధ్యమైనంత త్వరగా చేపట్టాలని కేంద్రాన్ని కోరింది. ఆర్థిక పురోగతి మందగించిందని, అత్యవసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయని తెలిపింది. పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కలి్పంచాలని, ఉపాధి హామీ పథకానికి అవసరమైన నిధులివ్వాలని కోరింది. మహాత్ముని ఆశయాలకు భంగం: సోనియా గాంధీ మహాత్మా గాం«దీయే స్ఫూర్తిగా తమ పార్టీ ఇకపైనా కొనసాగుతుందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్ సోనియా గాంధీ స్పష్టం చేశారు. మహాత్ముని ఆశయాలు, సిద్ధాంతాలు, సంస్థలకు కేంద్రంలో అధికారంలో ఉన్న వారి నుంచి ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గాంధీజీ హత్యకు దారి తీసిన విషపూరిత వాతావరణాన్ని సృష్టించిన శక్తులైన మోదీ ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్లతో పోరాడాలంటూ ఆమె కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. గురువారం సోనియా ఈ మేరకు సీడబ్ల్యూసీకి పంపిన సందేశాన్ని చదివి వినిపించారు. -
కొత్తగా 10,000 కోఆపరేటివ్ సొసైటీలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా బుధవారం ఒక్కరోజే 10,000 బహుళ ప్రయోజన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (కోఆపరేటివ్ సొసైటీలు/ఎం–పీఏసీఎస్) ఏర్పాటయ్యాయి. కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి అమిత్‌షా వీటిని ప్రారంభించారు. వచ్చే ఐదేళ్ల కాలంలో 2 లక్షల ఎం–పీఏసీఎస్‌లను ఏర్పాటు చేయాలన్నది కేంద్ర ప్రభుత్వం లక్ష్యమని పంచాయతీ స్థాయిలో కోఆపరేటివ్ సొసైటీలు సమర్థవంతంగా పనిచేస్తే తప్పించి వీటి ద్వారా ఆశించిన సంపద సృష్టి సాధ్యపడదని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. సహకార రంగంలో డిజిటలైజేషన్ ప్రాధానాన్ని మంత్రి గుర్తు చేశారు. ఇప్పటికే అన్ని పీఏసీఎస్‌లను కంప్యూటరీకరించి, వాటిని అనుసంధానించినట్టు చెప్పారు. కొత్తగా ఏర్పాటు చేసిన సొసైటీలకు రిజి్రస్టేషన్ సరి్టఫికెట్లు, మైక్రో ఏటీఎంలు, రూపే కిసాన్ కార్డులను ఈ సందర్భంగా అందించారు. -
భారత‘రత్న’ వాజ్‌పేయి శతజయంతి.. ప్రముఖుల నివాళి (చిత్రాలు)
-
Ambedkar Row: కౌన్సిలర్ల డిష్యూం.. డిష్యూం
చండీగఢ్: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యల వేడి ఇంకా చల్లారలేదు. ఈలోపు.. మంగళవారం చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం రసాభాసగా మారింది. షా వ్యాఖ్యల నేపథ్యంతో.. కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్ల ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.గత వారం రాజ్యసభలో రాజ్యాంగంపై చర్చ సందర్భంగా అంబేద్కర్‌పై చేసిన వ్యాఖ్యలతో అమిత్ షా రాజీనామా చేయాలంటూ చండీఘడ్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ కౌన్సిలర్లు తమ ఆమోదాన్ని తెలిపారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ కౌన్సిలర్లు జవహర్లాల్ నెహ్రూ హయాంలో బీఆర్ అంబేద్కర్‌కు అవమానం జరిగిందని ఆరోపించారు. దీంతో కౌన్సిలర్లు మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. దాదాపు 20 నిమిషాల పాటు కౌన్సిలర్లు భౌతికంగా కలబడ్డారు. #WATCH | Scuffle erupted between Congress and BJP councillors over the subject of Dr BR Ambedkar during the general house meeting of Chandigarh Municipal Corporation todayNominated councillor Anil Masih had targeted Congress and stated that Rahul Gandhi is out on bail, citing… pic.twitter.com/iZmLidgbT0— ANI (@ANI) December 24, 2024అయితే జనవరి 30న నిర్వహించిన చండీగఢ్ మేయర్ ఎన్నికలో రిటర్నింగ్ అధికారి, నామినేటడ్ కౌన్సిలర్ అనిల్ మసీహ్ వివాదాస్పదంగా వ్యవహరించారు. రిటర్నింగ్ అధికారి బ్యాలెట్ పత్రాలను తారుమారు చేసేందుకు ఉద్దేశపూర్వంగా వ్యవహరించారని స్పష్టంగా తేలింది. దీనిపై సుప్రీం కోర్టు అనిల్ మసీహ్‌పై అంక్షితలు వేసింది.ఇవాళ జరిగిన మున్సిపల్ సమావేశంలో బీజేపీ నుంచి నామినేటెడ్ కౌన్సిలర్‌గా ఉన్న అనిల్ మసీహ్‌ను కాంగ్రెస్ కౌన్సిలర్లు నాటి ఘటనను ప్రస్తావిస్తూ ఎన్నికల దొంగ అంటూ సంభోదించారు. బదులుగా అనిల్ మసీహ్ సైతం.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నేషనల్ హెరాల్డ్ కేసులో బెయిల్‌పై బయట తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. దీంతో కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్లు ఘర్షణకు దారి తీసింది. -
నరేంద్ర మోదీ (ప్రధాని) రాయని డైరీ
‘‘తప్పై పోయింది మోదీజీ...’’ అన్నారు అమిత్‌షా, దించిన తల ఎత్తకుండానే. ‘‘మీరన్న మాటలో తప్పేమీ లేదు అమిత్జీ. కానీ, మీరసలు ‘ఆయన’ మాటే ఎత్తకుండా ఉండాల్సింది కదా...!’’ అన్నాను.‘‘నిజమే మోదీజీ. ‘ఆయన’ మాట ఎత్తినా తప్పే, ఎత్తకపోయినా తప్పేనన్న కాలమాన పరిస్థితులను కాంగ్రెస్ పార్టీ సృష్టిస్తున్నప్పుడు ‘ఆయన’ మాట ఎత్తి తప్పు చేయటం కంటే, ఎత్తకుండా తప్పు చేయటమే కొంతైనా నయంగా ఉండేది...’’ అన్నారు అమిత్‌షా. పక్కనే జేపీ నడ్డా, కిరణ్ రిజుజు, అశ్వినీ వైష్ణవ్, పీయుష్ గోయల్ ఉన్నారు. ‘‘అప్పటికీ ప్రెస్ మీట్ పెట్టి, ‘ఆయనంటే’ మనకెంత గౌరవమో చెప్పాం మోదీజీ...’’ అన్నారు జేపీ నడ్డా. ‘‘అవును మోదీజీ... ‘ఆయనకు’ రెస్పెక్ట్ ఇవ్వటంలో కాంగ్రెస్ కన్నా మన పార్టీనే ఎప్పుడూ ముందుంటుందని కూడా చెప్పాం...’’ అన్నారు కిరణ్ రిజుజు. ‘‘నిజానికి కాంగ్రెస్సే ‘ఆయన’కు యాంటీ అని; ‘ఆయన’కు మాత్రమే కాదు... రాజ్యాంగానికి, రిజర్వేషన్లకు కూడా కాంగ్రెస్యాంటీనే అని కూడా చెప్పాం మోదీజీ...’’ అన్నారు అశ్వినీ వైష్ణవ్, పీయుష్ గోయల్.మంటల్ని ఆర్పేందుకు శతవిధాల ప్రయత్నించి వచ్చి, అలసట తీర్చుకుంటున్న ఫైర్ ఇంజన్లలా కనిపిస్తున్నారు మంత్రులు నలుగురూ. ‘‘మనం ‘ఆయన’ మాటెత్తటం వల్ల సడన్‌గా ఇప్పుడాయన మన పార్టీ ఇమేజ్‌కి సెంటర్ పాయింట్ అయ్యారు కనుక ఇకపై మనలో ఎవరు ఏం మాట్లాడినా ‘ఆయన్ని’ సెంటర్ పాయింట్‌గా చేసుకునే మాట్లాడాలి...’’ అన్నాను అమిత్‌షా వైపు చూస్తూ.వెంటనే రిజుజు స్పందించారు. ‘‘నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను మోదీజీ! ‘దేశంలో ‘ఆయన’ తర్వాత లా మినిస్టర్ అయిన తొలి బుద్ధిస్టును నేనే...’ అనే సంగతిని ఇప్పటికే ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగాను...’’ అన్నారు రిజుజు. ‘‘నేనేతై, మోదీజీ పాలనలో ‘ఆయన్ని’ ఇన్సల్ట్ చేయడమన్నదే జరగదు...’’ అని గట్టిగానే జవాబిచ్చాను...’’ అన్నారు నడ్డా. ‘‘కాంగ్రెస్ ‘ఆయన’ విషయంలో అమిత్జీ మాటల్ని మెలిదిప్పి, బీజేపీపై దుష్ప్రచారం చేస్తోందని ప్రజలకు చాటి చెబుతున్నాం మోదీజీ...’’ అన్నారు వైష్ణవ్, పీయుష్ గోయల్. పార్టీలో ఒక నాయకుడిపై బయటి నుంచి విమర్శలు వచ్చినప్పుడు పార్టీలోని అందరూ ఆ విమర్శలు చేసిన వారిపై వరుసపెట్టి విరుచుకుపడటం బీజేపీలోని ఒక సత్సంప్రదాయం. ఆ సంప్రదాయం క్రమంగా బలహీనపడుతోందా? అందుకే...‘ఆయన’ మాటెత్తినందుకు అమిత్‌షాను మంత్రిగా తొలగించమని డిమాండ్ చేసేంతగా కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు బలపడుతున్నాయా? అమిత్ షా వైపు చూశాను. ‘‘అమిత్జీ... కనీసం మీరు – ‘కాంగ్రెస్ పార్టీ పదే పదే ‘ఆయన’ జపం చేస్తోంది’ – అన్నంత వరకే ఆగి పోవలసింది. మధ్యలోకి దేవుడిని తెచ్చి... ‘ఆ జపమేదో దేవుడికి చేస్తే పుణ్యమైనా దక్కేది...’’ అని అనటం వల్లనే.. ‘ఆయన వేరు, దేవుడు వేరా!’ అని కాంగ్రెస్ రెచ్చగొడుతోంది...’’ అన్నాను. ‘‘నేనలా అనుకోవటం లేదు మోదీజీ...’’ అన్నారు అమిత్‌షా!‘‘మరి?!’’ అన్నాను. ‘‘ఆయన వేరు, దేవుడు వేరా – అని కాదు మోదీజీ... కాంగ్రెస్ రెచ్చకొడుతోంది, అసలు ‘ఆయన’కు వేరొకరితో పోలికేమిటని ‘ఊక’పొయ్యిని రాజేస్తోంది...’’ అన్నారు అమిత్‌షా!!నా నోట మాట లేదు! అవతారమూర్తి అయిన శ్రీకృష్ణుడు అశ్వత్థామకు పెట్టిన శాపం విని అప్రతిభుడై, శిలా ప్రతిమలా నిలుచుండి పోయిన వ్యాసమహర్షి నాకు – అదాటున – గుర్తొచ్చారు. మంటలు, కాల్చి బూడిద చేస్తాయి. మాటలు బూడిద నుంచి కూడా మంటల్ని రేపుతాయి! -
అమిత్ షా క్షమాపణ చెప్పాలి..
-
అంబేద్కర్ వల్లే మోదీ, అమిత్ షాకు పదవులు: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. ఇదే సమయంలో అంబేద్కర్ రాజ్యాంగం వేరు.. భగవంతుడు వేరు అన్న విషయం అమిత్ షా గుర్తించాలి అంటూ కామెంట్స్ చేశారు.తాజాగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘అంబేద్కర్‌ను అమిత్ షా అవమానించిన విధానంపై రాహుల్ గాంధీ గళం విప్పారు. పార్లమెంట్ నిండు సభలో అంబేద్కర్‌ను అవమానించేలా అమిత్ షా చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొనే వరకు రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారు. చట్టాలు, న్యాయాలు అంబేద్కర్ రాజ్యాంగం వల్లే ఉన్నాయి. బీసీలుగా చెప్పుకొనే మోదీ, అమిత్ షా కూడా అంబేద్కర్ రాజ్యాంగం వల్లే పదవులు పొందారు.అమిత్ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. దేశ ప్రజల భావాలు దృష్టిలో పెట్టుకొని రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారు. రాహుల్ గాంధీ బాధ్యత.. గాంధీ, నెహ్రూ అడుగుజాడల్లో నడవటం. అంబేద్కర్ రాజ్యాంగం వేరు భగవంతుడు వేరు అనే విషయం అమిత్ షా గుర్తించాలి. అమిత్ షా, రాహుల్ గాంధీకి తేడా.. రాహుల్ గాంధీ దేవుని మొక్కుతాడు కానీ పబ్లిసిటీ చేయరు. బీజేపీ నేతలు కూడా దేవుడ్ని మొక్కతారు కానీ, పబ్లిసిటీ చేసుకుంటారు. దేవుడు అనేది నమ్మకం ధైర్యం.. భగవంతుడు అనేది వ్యక్తిగత విషయం. కాంగ్రెస్ కార్యకర్తలు రాహుల్ గాంధీ పిలుపునకు సిద్ధంగా ఉంటారు’ అని కామెంట్స్ చేశారు. -
అంబేడ్కర్ పేరు ఒక భరోసా!
అంబేడ్కర్ గురించి మాట్లాడడం ఫ్యాషన్ అయిపోయిందని పార్లమెంట్లో అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఇప్పటివరకూ కప్పి ఉంచిన కొన్ని వాస్తవాలను వెలికి తీశాయి. ‘తాము మాట్లాడితే ప్రేమ, ఎదుటివారు మాట్లాడితే ఫ్యాషన్’ అన్నంతగా బీజేపీ ప్రభుత్వానికి అంబేడ్కర్ పట్ల స్వాధీనత ఉందని మాట వరసకి అనుకుందాం. కానీ తర్వాతి వాక్యాలని గుడ్డిగా సమర్థించుకోవడం ఆశ్చర్యమే. కాంగ్రెస్ సభ్యులు అంబేడ్కర్‌ని ప్రస్తావించడం మీద అమిత్ షా వ్యాఖ్యానిస్తూ ‘అంబేడ్కర్ అంబేడ్కర్ అంబేడ్కర్... వారు ఇన్ని సార్లు దేవుడి నామం స్మరిస్తే ఏడేడు జన్మల స్వర్గలోక ప్రాప్తి వచ్చే’దని అనడం అంబేడ్కర్ పట్ల గౌరవాన్ని వ్యక్త పరిచినట్లు కాదు; అలాగని ఆ కామెంట్స్ కేవలం కాంగ్రెస్ మీద చేసిన విమర్శగా కూడా చూడలేము. కాంగ్రెస్ మీది కోపాన్ని అంబేడ్కర్ మీద చూపినట్లుగా మాత్రమే కాక, లోపల జీర్ణించుకున్న చులకనభావం బైట పడి నట్లుగా కూడా ఆ మాటలు ఉన్నాయి. సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాలలో జాతి నిర్మాణం కోసం పాటుపడిన అంబేడ్కర్‌ని – విశ్వాసాల మీద ఆధారపడిన దైవభావనతో పోల్చి తక్కువ చేయడం వ్యతిరేకించాల్సిన విషయం. కడుపు నిండిన వారికి స్వర్గలోక ద్వారాల వైపు చూపు ఉండొచ్చు. కానీ కులం, మతం, జెండర్ వంటి అనేక వివక్షలకి లోనయ్యే పీడితులు, పేదలు అంబేడ్కర్‌ని తమ ‘అన్నం గిన్నె’గా అభివర్ణించుకుంటారు. అంబేడ్కర్ పేరు పదేపదే స్మరించడం వారి జీవితాలకి భరోసా. ప్రధాని ‘ఎక్స్’ వేదికగా అమిత్ షా వ్యాఖ్యలను సమర్థించడం మరొక విచిత్రం. అసలు వ్యాఖ్యల సంగతి వదిలేసి చరిత్రలో కాంగ్రెస్ పార్టీ అంబేడ్కర్‌కి చేసిన అన్యాయాలను తవ్వితీయడం గొప్ప చతురత. కాంగ్రెస్ చేసిన అన్యాయాలను అంబేడ్కర్‌వాదులు తప్పక ప్రశ్ని స్తారు కానీ ఇప్పటి అమిత్ షా వ్యాఖ్యల సంగతేమిటి? ప్రజలకి నిజం తెలుసుననీ, అది కాంగ్రెస్ వారి దురదృష్టమనీ అన్నారు. అవును, ప్రధానమంత్రి గారూ, ప్రజ లకి నిజం తెలుసు. అయితే అది మీరు నిర్మించే నిజం కాదు. అంబేడ్కర్ చరిత్రను తుడిపివేసేందుకు కాంగ్రెస్ చేసిన పన్నాగాలను బట్టబయలు చేశామన్న ప్రధానమంత్రి, అంబేడ్కర్ ఆశయాలను నెరవేర్చేందుకు బీజేపీ ప్రభుత్వం తీసుకున్న కార్యాచరణ వివరించారు. పంచ తీర్థ, చైత్యభూమి సమస్య, అంబేడ్కర్ చివరి దశలో గడిపిన ఇల్లు, లండన్‌లో అంబేడ్కర్ నివసించిన ఇల్లు కొనుగోలు చేయడం ద్వారా ఆయన ఆశ యాలు నెరవేర్చే పనులు చేశామని అన్నారు. ఇవన్నీ అంబేడ్కర్ పట్ల కృతజ్ఞతతో ప్రజలూ ప్రభుత్వాలూ తమ కోసం తాము ప్రతీకగా చేసే పనులు. నాయకారాధన పట్ల స్పష్టమైన అవగాహనతో మాట్లాడిన అంబేడ్కర్ ఎపుడూ తన చిహ్నాల ఉద్ధరణ తన ఆశయ మని చెప్పలేదు. ఆయన రచనలు, ప్రసంగాలు, ఆచరణ గురించి తెలుసుకుంటే ఆశయాలు ఏమిటో తెలుస్తాయి. అవి మతతత్వ, కులవాద, పితృస్వామిక రాజకీయ పార్టీలను, వ్యవస్థలను నిరంతరం నిలదీస్తాయి. వాటి పీడనకి, వివక్షకి గురయ్యేవారిని అక్కున చేర్చుకుని ‘సమీకరించు, బోధించు, పోరాడు’ అని వెన్ను తడతాయి. కానీ పీడక పార్టీలు, వ్యవస్థలు ఈరోజు అంబేడ్కర్ ప్రభావాన్ని విగ్రహాలకి, నివసించిన స్థలాలకి కుదించి అవే ఆయన ఆశయాలని ప్రచారం చేస్తున్నాయి.బీజేపీ ప్రభుత్వానికి అంబేడ్కర్ ఆశయాలను నెర వేర్చాలన్న ఆకాంక్ష బలంగా ఉంటే రాజకీయాల్లో మెజారిటీ మత చొరబాట్లను నిరోధించి లౌకిక విలువలను స్వయంగా ప్రచారం చేయాలి. కుల నిర్మూలనకి అంబే డ్కర్ ఇచ్చిన సూచనలు అమలు చేయాలి. కులాంతర, మతాంతర పెళ్లిళ్లను ప్రోత్సహించాలి. వేదాలు, పురా ణాలు స్త్రీలను, దళితులను ఎంత అమానవీయంగా చూశాయో గుర్తించి వాటిని కల్పనా సాహిత్యంగా మాత్రమే పరిగణించాలి.దళితుల విద్యా ఉద్యోగ రాజ్యాధికారాలకి ప్రణాళికలు వేయాలి. పౌరులకు ఉన్న రాజ్యాంగబద్ధ హక్కులను గౌరవించాలి. మరీ ముఖ్యంగా మాట్లాడితేనో, నచ్చిన ఆహారం తింటేనో తీసుకెళ్ళి జైళ్ళలో పడేయకూడదు. ప్రజాస్వామ్య భావనని దాని నిజార్థంలో ఆచరించాలి. ఏకత – ఐక్యతలు ఒకటి కావని గుర్తించాలి. ఇలా మన ప్రభుత్వ వ్యవస్థల నియంతృత్వాన్ని సమూలంగా మార్చేయగల అనేక మార్పులను చేయడమే ఆయన ఆశయాలను నెరవేర్చడం. అందుకే కేవలం ఎక్కడో నాలుగు విగ్రహాలు పెట్టి గొప్ప ఆచరణగా ప్రకటించడం కన్నా, అసంఖ్యాకంగా ఉన్న అంబేద్కర్ రచనలను, ప్రసంగా లను, వివిధ ఘట్టాల్లో ఆయన పని తీరును అధ్యయనం చేయడం ద్వారా ప్రజలకు మేలు చేసే నిజమైన కార్యాచరణ రూపొందించుకోవచ్చు. ‘అంబేడ్కర్ ఆలోచనల తాత్వికత’ పేరిట ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక అంతర్జాల మాధ్యమంలో 21 వారాల పాటు 48 ప్రసంగాల సిరీస్ నిర్వహిస్తున్నది. 2024 డిసెంబర్ 22 నుంచి 2025 మే 18 వరకూ నడిచే ఈ సిరీస్‌లో తెలుగు సమాజంలోని మేధావులు అంబేడ్కర్ ఆలోచనల తాత్వికతను ఆయన రచనలు, ప్రసంగాల ఆధారంగా పరిచయం చేస్తారు. ఆసక్తి ఉన్నవారు (zoom ID: 8254545523 Password PRARAVERK) ద్వారా పాల్గొనవచ్చు. కె.ఎన్. మల్లీశ్వరి వ్యాసకర్త ప్రరవే ఏపీ కార్యదర్శి ‘ 88850 16788 -
పార్లమెంట్లో హోరెత్తిన ‘జై భీమ్’
న్యూఢిల్లీ: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పట్ల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్ ఉభయ సభలు గురువారం దద్దరిల్లాయి. రాజ్యాంగ నిర్మాతను అవమానించినందుకు అమిత్ షా వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు అలజడి సృష్టించాయి. నిరసనలు, నినాదాలతో ఉభయ సభలు పలుమార్లు వాయిదాపడ్డాయి. లోక్‌సభ ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగానే విపక్ష ఎంపీలు తమ స్థానాల్లో నిల్చొని నినాదాలు ప్రారంభించారు. అమిత్ షా క్షమాపణ చెప్పాలని పట్టుబట్టారు. శాంతించాలని స్పీకర్ ఓం బిర్లా కోరారు. తమిళనాడుకు చెందిన ఎంపీ ఇళంగోవన్ మృతిపట్ల సంతాపం ప్రకటించారు. దివంగత సభ్యుడి ఆత్మశాంతి కోసం ఎంపీలంతా కొంతసేపు మౌనం పాటించారు. అనంతరం విపక్ష సభ్యులు మళ్లీ నినాదాలు చేశారు. దీంతో సభను స్పీకర్ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. ప్రియాంకగాంధీ వాద్రా సహా విపక్ష ఎంపీలు జైభీమ్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. సభలో అంబేడ్కర్ చిత్రపటాలు ప్రదర్శించారు. 2 గంటలకు సభ పున:ప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. అమిత్ షా క్షమాపణ చెప్పేదాకా ఆందోళన కొనసాగిస్తామని ప్రతిపక్ష ఎంపీలు తేలి్చచెప్పారు. నినాదాల హోరుతో సభ మార్మోగిపోయింది. సభకు సహకరించాలంటూ స్పీకర్ స్థానంలో ఉన్న దిలీప్ సైకియా పదేపదే కోరిన విపక్ష ఎంపీలు పట్టించుకోలేదు. దీంతో సభను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు దిలీప్ సైకియా ప్రకటించారు. స్పీకర్‌స్థానాన్ని చుట్టుముట్టేందుకు కాంగ్రెస్ ఎంపీలు ప్రయతి్నంచగా మార్షల్స్ అడ్డుకున్నారు. సభ వాయిదా పడిన తర్వాత కూడా ప్రతిపక్ష సభ్యులు నినాదాలు కొనసాగించారు. జమిలి ఎన్నికలపై రెండు బిల్లులను జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)కి సిఫార్సు చేయడానికి లోక్‌సభలో గురువారం తీర్మానం ఆమోదించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ, సభలో గందరగోళం కారణంగా తీర్మానంపై చర్చ జరగలేదు. రాహుల్ అనుచితంగా ప్రవర్తించారు అమిత్ షా వ్యాఖ్యలు పార్లమెంట్ ఎగువ సభలోనూ అలజడి రేపాయి. అంబేడ్కర్‌ను అమిత్ షా ఘోరంగా అవమానించారని, ఈ అంశంపై తక్షణమే చర్చించాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. జైభీమ్ అంటూ నినదించారు. పార్లమెంట్ ప్రాంగణంలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న తమపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అనుచితంగా ప్రవర్తించారని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎంపీలు పట్టుబట్టారు. బీజేపీ మహిళా ఎంపీ కోన్యాక్ను రాహుల్ గాంధీ నెట్టివేశారని, మరో ఇద్దరు ఎంపీలపై దాడి చేశారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. బీజేపీ సభ్యుల పట్ల అనుచిత ప్రవర్తనకు కాంగ్రెస్ ఎంపీలంతా సభకు, దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని కేంద్ర మంత్రి జేపీ నడ్డా మండిపడ్డారు. అనంతరం డీఎంకే సభ్యుడు తిరుచ్చి శివ మాట్లాడారు. విపక్ష సభ్యులపై రాహుల్ గాంధీ దాడి చేయలేదని పేర్కొన్నారు. పార్లమెంట్ సభ్యులను గౌరవిస్తామని అన్నారు. మహిళలపై తమకు ఎంతో గౌరవం ఉందని చెప్పారు. ఇరుపక్షాల ఆందోళనలు, నినాదాలతో ఎగువసభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఎవరూ వెనక్కి తగ్గకపోవడంతో సభను పలుమార్లు వాయిదా వేయాల్సి వచి్చంది. చివరకు సభ శుక్రవారానికి వాయిదాపడింది. -
పార్లమెంట్ ప్రాంగణంలో తీవ్ర ఘర్షణ
న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రాంగణంలో మునుపెన్నడూ లేనివిధంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ చోటుచేసుకుంది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు చివరకు ఘర్షణకు దారితీయడం గమనార్హం. ఇరుపక్షాల ఎంపీలు ఒకరినొకరు తోసేసుకోవడం, పరస్పరం గొడవ పడడం, ఇద్దరు బీజేపీ ఎంపీలు గాయపడి ఆసుపత్రిలో చేరడం, ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకోవడం, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు కావడం, రాహుల్ తనతో అభ్యంతరకరంగా ప్రవర్తించారని బీజేపీ మహిళా ఎంపీ కోన్యాక్ ఆరోపించడం వంటి పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగించాయి. మొత్తానికి పార్లమెంట్ సాక్షిగా గురువారం దిగ్భ్రాంతికర సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. నినాదాలు, అరుపులు, కేకలతో ఉద్రిక్తత అంబేడ్కర్‌పై అమిత్ షా వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఉదయం ఉభయ సభలు ప్రారంభం కావడానికి కొన్ని నిమిషాల ముందు విపక్ష ‘ఇండియా’ కూటమి ఎంపీలు పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. నీలం రంగు దుస్తులు ధరించి, అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాహుల్ గాం«దీ, ప్రియాంకగాంధీ వాద్రాతోపాటు కాంగ్రెస్, డీఎంకే, ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీ, ఎన్సీపీ, సీపీఐ, సీపీఎం తదితర పారీ్టల సభ్యులు ఈ నిరసనలో పాల్గొన్నారు. తర్వాత వారంతా మకరద్వారం గుండా పార్లమెంట్ లోపలికి ప్రవేశించేందుకు ముందుకు కదిలారు. అప్పటికే అక్కడ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ఎంపీలు బైఠాయించారు. అంబేడ్కర్‌ను కాంగ్రెస్ కించపర్చిందని ఆరోపిస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ బిగ్గరగా నినాదాలు ప్రారంభించారు. మకరద్వారం మెట్లపై ఇరువర్గాలు పరస్పరం ఎదురుపడ్డాయి. తాము ముందుకెళ్లడానికి దారి ఇవ్వడం లేదని ఇండియా కూటమి ఎంపీలు మండిపడ్డారు. దాంతో ఎన్డీయే ఎంపీలు మరింత బిగ్గరగా నినాదాలు చేశారు. ఇండియా కూటమి సభ్యులు సైతం స్వరం పెంచారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. తోపులాటలు, అరుపులు కేకలతో ఈ ప్రాంతం రణరంగాన్ని తలపించింది. అసలేం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. తోపులాటలో కొందరు ఎంపీలు కిందపడ్డారు. మెట్ల మధ్యభాగంలో నిలబడిన తమను రాహుల్ గాంధీ బలంగా తోసివేశారని బీజేపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ముందుకెళ్లడానికి పక్కనే తగినంత దారి ఉన్నప్పటికీ ఆయన తమపై ఉద్దేశపూర్వకంగా దురుసుగా ప్రవర్తించారని అన్నారు. రాహుల్ గాంధీ తోసివేయడంతో తమ ఎంపీలు ప్రతాప్ సారంగి, ముకేశ్ రాజ్‌పుత్ గాయపడ్డారని చెప్పారు. నడవలేని స్థితిలో ఉన్న సారంగిని చక్రాల కురీ్చలో అంబులెన్స్ దాకా తీసుకెళ్లారు. అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. అయితే, బీజేపీ ఎంపీలే దారికి అడ్డంగా నిల్చొని, రాహుల్ గాం«దీని ముందుకు వెళ్లనివ్వలేదని కాంగ్రెస్ సభ్యులు చెప్పారు. తమను రెచ్చగొట్టేలా ప్రవర్తించారని బీజేపీ సభ్యులపై విరుచుకుపడ్డారు. మోదీ పరామర్శ పార్లమెంట్ ప్రాంగణంలో జరిగిన ఘర్షణలో గాయపడిన ప్రతాప్ సారంగితోపాటు ముకేశ్ రాజ్‌పుత్ చికిత్స నిమిత్తం ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చేరారు. సారంగి కణతకు కుట్లు పడ్డాయి. ముకేశ్ రాజ్‌పుత్ తలకు గాయాలయ్యాయి. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీ వారిద్దరినీ ఫోన్లో పరామర్శించారు. జరిగిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీయే ఎంపీలు సైతం ఆసుపత్రికి చేరుకొని ప్రతాప్ సారంగి, ముకేశ్ రాజ్‌పుత్‌లను పరామర్శించారు. బీజేపీ ఎంపీలు కర్రలతో బెదిరించారు: రాహుల్ బీజేపీ ఎంపీలు తనపై బల ప్రయోగం చేశారని, దురుసుగా తోసివేశారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. కింద పడిపోయానని, తనకు గాయాలయ్యాయని చెప్పారు. బీజేపీ ఎంపీలే తమపై దౌర్జన్యానికి పాల్పడి, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. పార్లమెంట్ ప్రాంగణంలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న తమపై బీజేపీ ఎంపీలు అనుచితంగా ప్రవర్తించారని ప్రియాంక గాంధీ మండిపడ్డారు. బీజేపీ ఎంపీలే తమపై భౌతిక దాడులు చేశారని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. కర్రలు చేతపట్టుకొని తమను అడ్డుకున్నారని, బెదిరించారని, పార్లమెంట్ లోపలికి వెళ్లనివ్వలేదని చెప్పారు. పార్లమెంట్ రెజ్లింగ్ రింగ్ కాదు: రిజిజు తమ ఎంపీ సారంగిని రాహుల్ గాంధీ నెట్టివేశారని, రౌడీలా ప్రవర్తించారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే దుయ్యబట్టారు. ఒక వృద్ధుడిని నెట్టివేసినందుకు రాహుల్ సిగ్గుపడాలని అన్నారు. తాను నాలుగుసార్లు ఎంపీగా గెలిచానని, తన రాజకీయ జీవితంలో ఇలాంటి దారుణమైన ఘటన ఏనాడూ చూడలేదని స్పష్టంచేశారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. పార్లమెంట్ అనేది బల ప్రదర్శనకు వేదిక కాదని, కుస్తీలు పట్టడానికి రెజ్లింగ్ రింగ్ కాదని సూచించారు. గురువారం నాటి ఘర్షణపై తగిన చర్యలు ఉంటాయని తేల్చిచెప్పారు. అమిత్ షాపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు అంబేడ్కర్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ కేంద్ర మంత్రి అమిత్ షాపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గురువారం రాజ్యసభలో సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. రాజ్యసభ చైర్మన్ ధన్‌ఖడ్‌కు ఈ నోటీసు అందజేశారు. రాజ్యసభ సాక్షిగా రాజ్యాంగ నిర్మాతను అమిత్ షా అవమానించారని ఖర్గే ఆరోపించారు. పార్లమెంట్‌లోకి వెళ్తుంటే ఎగతాళి చేశారుతాము పార్లమెంట్‌లోకి వెళ్తుండగా బీజేపీ ఎంపీలు ఎగతాళి చేశారని, లోపలకి వెళ్లకుండా అడ్డుకున్నారని కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఆరోపించారు. అంబేడ్కర్‌ను అవమానించినందుకు హోంమంత్రి పదవికి అమిత్ షా రాజీనామా చేయాలని, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వారు గురువారం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అమిత్ షాను కాపాడేందుకు బీజేపీ ముందస్తుగానే కుట్ర పన్నిందని విమర్శించారు.పరస్పరం ఫిర్యాదులు మొత్తం గొడవకు రాహుల్ గాంధీ కేంద్ర బిందువుగా మారారు. ఆయనపై బీజేపీ నేతలు పార్లమెంట్ హౌస్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హత్యాయత్నం, భౌతిక దాడి, హింసకు ప్రేరేపించడం వంటి ఆరోపణలతో ఫిర్యాదు అందించారు. రాహుల్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాంగ్రెస్ నేతలు సైతం బీజేపీ ఎంపీలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కూడా కలిశారు. రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీలు దారుణంగా ప్రవర్తించారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ఓం బిర్లాకు ఫిర్యాదు అందజేశారు. మల్లికార్జున ఖర్గే సైతం ఓం బిర్లాకు లేఖ రాశారు. బీజేపీ ఎంపీల దాడిలో తన మోకాలికి గాయమైందని పేర్కొన్నారు. ఈ దాడిపై దర్యాప్తు జరపాలని కోరారు. రాజ్యసభ చైర్మన్ ధన్‌ఖడ్‌కు కూడా కాంగ్రెస్ ఎంపీలు ఫిర్యాదు చేశారు. బీజేపీ నేతలు సైతం కాంగ్రెస్ ఎంపీలపై లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. నా ఆత్మగౌరవం దెబ్బతీశారురాహుల్ గాందీపై నాగాలాండ్‌కు చెందిన బీజేపీ మహిళా ఎంపీ ఫాంగ్నన్ కోన్యాక్ ఆరోపణలు చేయడం సంచలనాత్మకంగా మారింది. ఆమె గురువారం రాజ్యసభలో మాట్లాడారు. ‘‘మకరద్వారం వద్ద శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుండగా రాహుల్ గాంధీ నాకు చాలా సమీపంలోకి వచ్చారు. కోపంగా చూస్తూ నాపై గట్టిగా అరిచారు. నాకు చాలా అసౌకర్యంగా అనిపించింది. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ ప్రవర్తన ఇదేనా?’’ అని ప్రశ్నించారు. రాహుల్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాజ్యసభ చైర్మన్ ధన్‌ఖడ్‌కు లేఖ అందజేశారు. ‘‘నేను గిరిజన మహిళను. రాహుల్ నా పట్ల అనుచితంగా ప్రవర్తించారు. నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. నాకు రక్షణ కల్పించాలి’’ అని లేఖలో పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదును పరిశీలిస్తున్నానని ధన్‌ఖడ్ చెప్పారు. హోం మంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలంటూ పార్లమెంట్ ప్రాంగణంలో ఇండియా కూటమి ఎంపీల నిరసన -
‘అమిత్‌షాకు మతి భ్రమించింది’
పాట్నా : ‘కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు మతి భ్రమించింది. వెంటనే ఆయన రాకీయాల నుంచి తప్పుకోవాలని’ అని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ డిమాండ్ చేశారు.అంబేద్కర్ పేరు ప్రస్తావించడం కాంగ్రెస్‌కు ప్యాషనైందంటూ రాజ్యసభలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై లాలూ ప్రసాద్ యాదవ్ స్పందించారు. ‘అమిత్ షాకు మతి భ్రమించింది. బాబాసాహెబ్ అంబేద్కర్‌పై అమిత్‌షా రగిలిపోతున్నారు. ఆయన తీరును ఖండిస్తున్నా. అంబేద్కర్ గొప్పవారు. అమిత్‌షా రాజకీయాలను వదిలేయాలి' అని లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు.पगला गया है अमित शाह !इस्तीफा देकर जल्द दे जल्द भाग जाए केंद्रीय गृह मंत्री !संविधान रक्षक - लालू प्रसाद यादव@laluprasadrjd 🔥🔥#तड़ीपार_माफ़ी_मांग pic.twitter.com/uOaBHFBtSw— सरपंच साहेब (@sarpanchsaheb3) December 19, 2024అంతకుముందు,బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ మాట్లాడారు. అమిత్ షా,బీజేపీ రాజ్యాంగానికి వ్యతిరేకమని ఆరోపించారు. అంబేద్కర్ మా ఫ్యాషన్. మా ప్రేరణ. బాబాసాహెబ్ అంబేద్కర్‌ను ఎవరు అవమానించినా మేం అంగీకరించం. అలాంటి వ్యక్తులు ద్వేషాల్ని రగిల్చే వారు. రాజ్యాంగ వ్యతిరేకులు,పార్లమెంటులో ఉపయోగించిన భాష ఆమోదించదగిన అంశం కాదు. రాజ్యంగ వజ్రోత్సవాలపై రాజ్యసభలో రెండు రోజుల చర్చకు ఆయన బదులిచ్చారు. ఆ సందర్భంగా కాంగ్రెస్‌ను విమర్శిస్తూ అంబేద్కర్ ప్రస్తావన తెచ్చారు. అంబేద్కర్, అంబేద్కర్ అనడం వాళ్లకు ఇప్పుడో ఫ్యాషనైపోయింది. అన్నిసార్లు దైవనామ స్మరణ చేస్తే కనీసం ఏడు జన్మల దాకా స్వర్గమన్నా దక్కేది’ అంటూ ఎద్దేవా చేశారు. అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలను డిమాండ్ చేస్తూ విపక్షాలు పార్లమెంట్ వెలుపల నిరసన చేపట్టాయి. ఆ నిరసన ఉద్రిక్తతకు దారి తీసింది. అధికార, విపక్ష ఎంపీల మధ్య జరిగిన తోపులాటలో ఒడిశా బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగికి గాయాలయ్యాయి. -
మీరేమంటారు?.. చంద్రబాబు, నితీశ్‌కు కేజ్రీవాల్ లేఖ
ఢిల్లీ, సాక్షి: ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, బీహార్ సీఎం నితీశ్ కుమార్‌లకు లేఖ రాశారు. అంబేద్కర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై స్పందనేంటో తెలియజేయాలని లేఖలో కోరారాయన.‘‘బాబా సాహెబ్‌ను అమిత్ షా అవమానించారు. ఈ అవమానానికి మీ మద్ధతు ఉందా?.. మీ నుంచి సమాధానం కోసం యావత్ దేశం ఎదురు చూస్తోంది’’ అని ఎక్స్ ఖాతాలో ప్రశ్నించారాయన. టీడీపీ, జేడీయూలు ఎన్డీయే కూటమిలో ప్రధాన భాగస్వామ్య పార్టీలుగా ఉన్న సంగతి తెలిసిందే.అలాగే.. అంబేద్కర్‌పై అమిత్ షా వ్యాఖ్యలు సమర్థనీయం కాదు. కోట్లాది మంది మనోభావాలు దెబ్బ తిన్నాయి. అమిత్ షా కనీసం క్షమాపణలు కూడా చెప్పలేదు. ప్రధాని మోదీ కూడా అమిత్ షానే సమర్థిస్తున్నారు. బీజేపీ మద్దతుపై పునరాలోచించుకోవాలి అని లేఖలో కేజ్రీవాల్ లేఖలో కోరారు.बीजेपी ने संसद में बाबा साहेब का अपमान किया है। लोगों को लगता है कि बाबा साहेब को चाहने वाले बीजेपी का समर्थन नहीं कर सकते। आप भी इस पर विचार करें।My Letter to Shri N Chandra Babu Naidu ji. pic.twitter.com/87pKYTfdDY— Arvind Kejriwal (@ArvindKejriwal) December 19, 2024 बीजेपी ने संसद में बाबा साहेब का अपमान किया है। लोगों को लगता है कि बाबा साहेब को चाहने वाले बीजेपी का समर्थन नहीं कर सकते। आप भी इस पर विचार करें।श्री नीतीश कुमार जी को मेरा पत्र। pic.twitter.com/YLd7lXrqmn— Arvind Kejriwal (@ArvindKejriwal) December 19, 2024బాబాసాహెబ్ అంబేద్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. పార్లమెంట్ లోపల, వెలుపల నిరసనలతో ఇండియా కూటమి హోరెత్తిస్తోంది. అమిత్ షా రాజీనామా చేయాలని.. లేదంటే ప్రధాని మోదీ ఆయన్ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. మరోవైపు.. రాజ్యసభలో షాపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు తృణమూల్ ఎంపీ డెరెక్ ఓబ్రియన్.ఏమన్నారంటే.. భారత రాజ్యాంగంపై చర్చ సమయంలో.. రాజ్యసభలో సమాధానం ఇచ్చిన కేంద్రమంత్రి అమిత్ షా.. కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. రాజకీయ లబ్ధి కోసమే హస్తం పార్టీ బీఆర్ అంబేద్కర్ పేరును వాడుకుంటోందని విమర్శించారు. అంబేద్కర్ పేరు జపించడం ఆ పార్టీ నేతలకు ఫ్యాషన్‌గా మారిందని.. అన్నిసార్లు దేవుడు పేరు జపిస్తే, ఏడు జన్మలకు సరిపడా పుణ్యం వచ్చి.. స్వర్గానికి వెళ్లేవారని ఆక్షేపించారు. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఆప్ నేషనల్ కన్వీనర్ కేజ్రీవాల్, BSP అధినేత్రి మాయావతి, నటుడు.. TVK చీఫ్ విజయ్ సహా పలువురు విపక్ష నేతలు షా వ్యాఖ్యలను ఖండించారు.దీనికి అధికార పక్షం గట్టిగానే కౌంటర్ ఇచ్చింది.లోక్‌సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘవాల్, రాజ్యసభలో కేంద్రమంత్రులు జేపీ నడ్డా, కిరణ్ రిజిజు .. కాంగ్రెస్ నేతలపై ధ్వజమెత్తారు. తన వ్యాఖ్యలకు కాంగ్రెస్ కావాలని వక్రీకరిస్తోందని మండిపడ్డారు కేంద్రమంత్రి అమిత్ షా. కాంగ్రెస్ విమర్శలు కొనసాగుతున్న వేళ.. అమిత్ షాకు మద్దతుగా నిలిచారు ప్రధాని నరేంద్ర మోదీ. ఎక్స్ వేదికగా కాంగ్రెస్‌ను కడిగి పారేశారు. అంబేద్కర్‌ను అవమానించిన కాంగ్రెస్ చీకటి చరిత్రను షా బహిర్గతం చేశారని.. దీంతో హస్తం పార్టీ ఉలిక్కిపడి.. డ్రామాలకు తెరతీసిందని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ కొన్నేళ్లపాటు దేశంలో అధికారంలో ఉన్నప్పటికీ ఎస్సీ, ఎస్టీల సాధికారత కోసం ఏమీ చేయలేదన్నారు ప్రధాని మోదీ. అంబేద్కర్‌ను ఎన్నికల్లో కాంగ్రెస్ రెండుసార్లు ఓడిపోయేలా చేసిందని.. ఆయనకు భారతరత్న ఇచ్చేందుకు నిరాకరించడమే కాకుండా.. అంబేద్కర్ చిత్రపటాన్ని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో పెట్టడాన్ని వ్యతిరేకించిందంటూ.. కాంగ్రెస్ పాపల చిట్టాను ఎక్స్‌లో పోస్ట్ చేశారు.If the Congress and its rotten ecosystem think their malicious lies can hide their misdeeds of several years, especially their insult towards Dr. Ambedkar, they are gravely mistaken!The people of India have seen time and again how one Party, led by one dynasty, has indulged in…— Narendra Modi (@narendramodi) December 18, 2024 -
రాజకీయం ‘అదిరింది’.. అమిత్ షాకు విజయ్ కౌంటర్
చెన్నై: బీఆర్ అంబేద్కర్‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే అమిత్ షా వ్యాఖ్యలకు ఇండియా కూటమి నేతలు కౌంటర్ ఇవ్వగా తాజాగా తమిళనాడు నేత, నటుడు విజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్ షాను టార్గెట్ చేసి సంచలన ఆరోపణలు చేశారు.అమిత్ షా వ్యాఖ్యలపై తమిళగ వెట్రి కళగం నేత విజయ్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘అంబేడ్కర్ పేరు వింటే కొందరికి అలర్జీ. ఆయన సాటిలేని రాజకీయ మేధావి. స్వేచ్ఛా వాయువులు పీల్చిన భారత ప్రజలందరూ అంబేద్కర్‌ను గౌరవించారు. అంబేద్కర్ అనే పేరు వింటే మనసు, పెదవులకు సంతోషంగా ఉంటుంది. ఆయనను అవమానించడాన్ని సహించబోమంటూ కామెంట్స్ చేశారు. దీంతో, ఆయన బీజేపీనే టార్గెట్ చేసి ఇలా కామెంట్స్ చేశారని పలువురు చెబుతున్నారు.Our TVK President @tvkvijayhq strongly condemned the Union Home Minister Amit Shah for disrespecting Ambedkar, our ideological leader. He said such insults are unacceptable and expressed his disapproval on behalf of the Tamilaga Vettri Kazhagam 🙏🏼🔥 pic.twitter.com/SzKpJ05laV— velpparsuriya (@SuriyaCreation3) December 18, 2024ఇదిలా ఉండగా.. నటుడు విజయ్ తన రాజకీయ పార్టీ టీవీకే పార్టీ మొదటి ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా అంబేద్కర్ తన పార్టీ సైద్దాంతిక గురువు అని చెప్పుకొచ్చారు. మరోవైపు.. విజయ్ వ్యాఖ్యలపై తమిళనాడు బీజేపీ నేతలు మండిపడుతున్నారు. అంతకుముందు పార్లమెంట్ సమావేశాల సందర్బంగా అమిత్ షా క్షమాపణలు చెప్పాలంటూ విపక్షాలు నిరసనలకు దిగాయి. దీంతో, పార్లమెంటు ఉభయ సభలు బుధవారం దద్దరిల్లాయి. సభలోనే కాకుండా బయటా ప్రతిపక్షాలు నిరసనలు వ్యక్తం చేశాయి. అమిత్ షా రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండు చేసింది. అయితే కాంగ్రెస్ పార్టీనే ఇప్పటిదాకా అంబేడ్కర్‌ను అవమానిస్తూ వస్తోందని, తామే ఆయనను సంపూర్ణంగా గౌరవిస్తున్నామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.ఇదే సమయంలో తన వ్యాఖ్యలను కాంగ్రెస్ వక్రీకరించిందని అమిత్ షా వివరణ ఇచ్చారు. పదే పదే అంబేడ్కర్ పేరును జపించే బదులు.. ఏ దేవుడిని స్మరించుకున్నా ఏడు జన్మలదాకా స్వర్గ ప్రాప్తి లభించేదని అమిత్ షా మంగళవారం రాజ్యసభలో వ్యాఖ్యానించినట్లు కాంగ్రెస్ ఆరోపించింది. ఆ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది. అయితే తమకు అంబేడ్కరే దేవుడని ఆ పార్టీ స్పష్టం చేస్తూ అమిత్ షా క్షమాపణలు చెప్పడంతోపాటు రాజీనామా చేయాలని లేదంటే ప్రధాని ఆయనను తొలగించాలని డిమాండు చేసింది. కాంగ్రెస్‌కు బుధవారం విపక్షాలు తోడవడంతో పార్లమెంటు దద్దరిల్లింది. మరోవైపు దేశవ్యాప్తంగా అమిత్ షాకు వ్యతిరేకంగా విపక్షాలు ఆందోళనలు నిర్వహించాయి. -
మాటలు.. మంటలు
న్యూఢిల్లీ: మాటలు మంటలు రేపాయి. అంబేడ్కర్‌ను ప్రస్తావిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారానికి దారితీశాయి. రాజ్యాంగ వజ్రోత్సవాలపై రాజ్యసభలో రెండు రోజుల చర్చకు మంగళవారం ఆయన బదులిచ్చారు. ఆ సందర్భంగా కాంగ్రెస్‌ను విమర్శిస్తూ అంబేడ్కర్ ప్రస్తావన తెచ్చారు. ‘‘అంబేడ్కర్, అంబేడ్కర్ అనడం వాళ్లకు ఇప్పుడో ఫ్యాషనైపోయింది. అన్నిసార్లు దైవనామ స్మరణ చేస్తే కనీసం ఏడు జన్మల దాకా స్వర్గమన్నా దక్కేది’’ అంటూ ఎద్దేవా చేశారు. ‘‘కాంగ్రెస్ పదేపదే అంబేడ్కర్ నామస్మరణ చేస్తుండటం మాకూ ఆనందమే. కానీ ఆయనపై వారి అసలు వైఖరేమిటో కూడా బయటపెట్టాలి. అంబేడ్కర్‌ను పదేపదే అవమానించిన చరిత్ర కాంగ్రెస్‌ది. ఆర్టికల్ 370తో పాటు పలు విధానాలపై నెహ్రూ సర్కారు విధానాలతో విభేదించి ఆయన మంత్రివర్గం నుంచి అంబేడ్కర్ వైదొలిగాల్సి వచి్చంది. అలా మీరు నిత్యం వ్యతిరేకించిన అంబేడ్కర్ పేరునే ఇప్పుడు ఓటుబ్యాంకు రాజకీయాల కోసం వాడుకుంటున్నారు. ఇదెంత వరకు సమంజసం?’’ అంటూ కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. అయితే అమిత్ షా చేసిన ‘అంబేడ్కర్–దైవ నామస్మరణ’ పోలిక తీవ్ర విమర్శలకు దారితీసింది. జాతీయ రాజకీయాలు బుధవారమంతా వాటిచుట్టే తిరిగాయి. రాజ్యాంగ నిర్మాతనే గాక దేశంలోని దళితులందరినీ అమిత్ షా తీవ్రంగా అవమానించారని కాంగ్రెస్‌తో పాటు విపక్షాలన్నీ దుయ్యబట్టాయి. ఆయన తక్షణం బహిరంగంగానూ, పార్లమెంటులోనూ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశాయి. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మరో అడుగు ముందుకేసి, ‘‘షా తక్షణం రాజీనామా చేయాల్సిందే. లేదంటే ప్రధాని మోదీయే ఆయన్ను మంత్రి పదవి నుంచి తొలగించాలి. అంబేడ్కర్ పట్ల మోదీకి ఏమాత్రం గౌరవమున్నా బుధవారం అర్ధరాత్రిలోపు ఈ పని చేయాలి’’ అంటూ అల్టిమేటం జారీ చేశారు. లేదంటే దేశవ్యాప్త ఆందోళనలు, వీధి పోరాటాలు తప్పవని హెచ్చరించారు. అమిత్ షా వ్యాఖ్యలపై విపక్షాల ఆందోళనతో పార్లమెంటు కూడా అట్టుడికిపోయింది. ఉభయ సభలూ కార్యకలాపాలేవీ చేపట్టకుండానే గురువారానికి వాయిదా పడ్డాయి. ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విపక్షాలు నిరసనలకు, ఆందోళనలకు దిగాయి. ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయం ముందు అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలో ఆప్ నేతలు, కార్యకర్తలు నిరసన ప్రదర్శనకు దిగారు. ‘అమిత్ షా సిగ్గు పడు’, ‘క్షమాపణలు చెప్పు’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. విపక్షాల ఆరోపణలను అమిత్ షా తీవ్రంగా ఖండించారు. ‘‘ప్రసంగంలో కొంత భాగాన్ని తీసుకుని వక్రీకరిస్తున్నారు. కాంగ్రెస్‌కు మరే అంశాలూ లేక నిస్పృహతో చౌకబారు చర్యలకు అన్నారు. ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు అమిత్ షాకు బాసటగా మాట్లాడారు. దేశమంతా అగ్గి రాజుకుంటుంది: ఖర్గే బీజేపీ అహంభావ ధోరణికి, అంబేడ్కర్‌పై వారికున్న ద్వేషానికి అమిత్ షా వ్యాఖ్యలు అద్దం పట్టాయని ఖర్గే మండిపడ్డారు. ‘‘అంబేడ్కర్‌కు, రాజ్యాంగానికి ఏమాత్రం గౌరవం ఇవ్వొద్దని మనుస్మృతి సిద్ధాంతాన్ని ఆచరించే బీజేపీ, ఆరెస్సెస్ నిర్ణయించుకున్నాయి. మనుస్మృతికి చోటివ్వలేదంటూ రాజ్యాంగ ప్రతిని, అంబేడ్కర్ దిష్టి»ొమ్మలను తగలబెట్టిన చరిత్ర బీజేపీది’’ అని ఆరోపించారు. ఉభయ సభలు వాయిదా పడ్డాక పార్లమెంటు ప్రాంగణంలో విపక్షాలన్నీ అమిత్ షా వ్యాఖ్యలపై ఆందోళనకు దిగాయి. నేతలంతా నల్లజెండాలు, ప్లకార్డులు చేతబట్టి నిరసన వ్యక్తం చేశారు. రాహుల్‌గాం«దీ, ప్రియాంకతో పాటు తృణమూల్, ఆప్, ఆర్జేడీ, ఎస్పీ, శివసేన (యూబీటీ), వామపక్షాల నేతలు పాల్గొన్నారు. వారితో కలిసి ఖర్గే మీడియాతో మాట్లాడారు. అమిత్ షా ఇలాగే మాట్లాడితే దేశమంతటా అగ్గి రాజుకుంటుందని హెచ్చరించారు. ‘‘ఎవరైనా రాజ్యాంగంపై ప్రమా ణం చేసిన మీదటే కేంద్ర మంత్రి అవుతారు. రాజ్యాంగ నిర్మాతనే అవమానించే వారికి ఆ పదవిలో కొనసాగే అర్హతే లేదు’’ అన్నారు. ఆయన రాజీనామాకు విపక్షాలన్నీ డిమాండ్ చేస్తున్నాయన్నారు. ‘‘అమిత్ షాపై మోదీ చర్యలు తీసుకోవాల్సింది పోయి ఆయనకు మద్దతుగా పోస్టులు చేస్తున్నారు. ఆప్తమిత్రులు ఒకరి పాపాలను ఒకరు కప్పిపుచ్చుకుంటున్నారు’’ అంటూ ఎద్దేవా చేశారు.మనువాదానికి తార్కాణం: రాహుల్ ‘‘మనువాదులకు అంబేడ్కర్ సహజంగానే నచ్చరు. అమిత్ షా వ్యాఖ్యలు దాన్ని మరోసారి నిరూపించాయి’’ అని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అన్నారు. ‘‘బీజేపీ ఎప్పుడూ రాజ్యాంగానికి, అంబేడ్కర్‌కు, ఆయన సిద్ధాంతాలకు వ్యతిరేకమే. అంబేడ్కర్ చరిత్రను, రాజ్యాంగ రచనలో ఆయన కృషిని తెరమరుగు చేసేందుకు ప్రయతి్నస్తోంది. కానీ బాబాసాహెబ్‌ను అవమానిస్తే దేశం సహించబోదు. అమిత్ షా క్షమాపణలు చెప్పి తీరాల్సిందే’’ అని స్పష్టం చేశారు. ప్రియాంక కూడా ఈ మేరకు ఎక్స్‌లో డిమాండ్ చేశారు. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తదితరులు కూడా అమిత్ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.కాంగ్రెస్‌ది చౌకబారుతనం: బీజేపీ అమిత్ షా వ్యాఖ్యలను కాంగ్రెస్ వక్రీకరిస్తోందని బీజేపీ దుయ్యబట్టింది. ఇది ఆ పార్టీ చౌకబారు మనస్తత్వానికి నిదర్శనమని కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, జేపీ నడ్డా, కిరెణ్ రిజిజు, అశ్వినీ వైష్ణవ్, రవ్నీత్ బిట్టూ తదితరులు మండిపడ్డారు. అంబేడ్కర్‌ను ఆయన జీవితపర్యంతమూ, తదనంతరమూ పథకం ప్రకారం అవమానించిన చరిత్ర కాంగ్రెస్‌దేనన్నారు. ‘‘దాన్నే అమిత్ షా రాజ్యసభ సాక్షిగా నిరూపించారు. దాన్ని తట్టుకోలేక ఆయనపై తప్పుడు ఆరోపణలకు దిగింది’’ అని రాజ్‌నాథ్ ఆరోపించారు. తీవ్ర నిస్పృహలో కూరుకుపోయిన కాంగ్రెస్ చివరికి అబద్ధాలు ప్రచారం చేసే దుస్థితికి దిగజారిందని నడ్డా ఎద్దేవా చేశారు. బీజేపీ మనస్తత్వం బయటపడిందిపుణే: అమిత్ షా వ్యాఖ్యలను అంబేడ్కర్ మనవడు, వంచిత్ బహుజన అఘాడీ అధ్యక్షుడు ప్రకాశ్ అంబేడ్కర్ ఖండించారు. బీజేపీ పాత మనస్తత్వం ఆయన మాటలతో బయటపడిందని అన్నారు. అంబేడ్కర్ పట్ల బీజేపీ వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదని ఆక్షేపించారు. ‘‘బీజేపీ మాతృసంస్థలు ఆర్ఎస్ఎస్, జన సంఘ్ అంబేడ్కర్‌ను వ్యతిరేకించాయి. రాజ్యాంగాన్ని ఆమోదించే సమయంలో అంబేడ్కర్‌ను తప్పుబట్టాయి. అంబేడ్కర్ భావజాలం దేశంలో బలంగా ఉండటం వల్లే బీజేపీ తన పాత ప్రణాళికలు అమలు చేయడానికి జంకుతోంది. ఆ ఉక్రోషం కొద్దీ ఆయన పట్ల కోపాన్ని ఇలా వెళ్లగక్కుతోంది’’ అని ఆరోపించారు. అట్టుడికిన రాజ్యసభ షాపై హక్కుల తీర్మానం సభలో టీఎంసీ నోటీసు అంబేడ్కర్‌పై చేసిన వ్యాఖ్యలకు గాను అమిత్ షాపై చర్యలు తీసుకోవాలంటూ సభా హక్కుల తీర్మానం పెట్టాలని తృణమూల్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. 187వ నిబంధన మేరకు టీఎంసీ పార్లమెంటరీ పార్టీ నేత డెరెక్ ఓబ్రియాన్ బుధవారం రాజ్యసభలో ఈ మేరకు నోటీసిచి్చనట్టు సమాచారం. అమిత్ షా వ్యాఖ్యలపై విపక్ష సభ్యుల నిరసనలతో సభ అట్టుడికింది. మంత్రి రాజీనామాకు సభ్యులంతా డిమాండ్ చేశారు. షా ప్రసంగంలో కేవలం 12 సెకన్ల భాగాన్నే ప్రచారం చేస్తూ కాంగ్రెస్ వక్రీకరిస్తోందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు ఆరోపించారు. 1990 దాకా ఆయనకు భారతరత్న కూడా ఇవ్వని చరిత్ర ఆ పారీ్టదని ఎద్దేవా చేశారు. అంబేడ్కర్‌కు కాంగ్రెస్ చేసిన ద్రోహాన్నే అమిత్ షా నిండు సభలో ఎండగట్టారన్నారు. అయినా విపక్ష సభ్యులు వెనక్కు తగ్గలేదు. ‘అంబేడ్కర్‌కు అవమానాన్ని దేశం సహించబోదు’’ అంటూ పెద్దపెట్టున నినాదాలకు దిగారు. ఆయన్ను అవమానించింది కాంగ్రెసేనంటూ రిజిజు కౌంటరిచ్చారు. విపక్ష నేత మల్లికార్జున ఖర్గే లేచి అంబేడ్కర్ పోస్టర్‌ను ప్రదర్శించారు. ఆందోళనల నడుమ సభను మధ్యాహ్నం రెండింటి దాకా చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ వాయిదా వేశారు. తిరిగి సమావేశమయ్యాక కూడా అవే దృశ్యాలు కొనసాగడంతో సభను చైర్మన్ గురువారానికి వాయిదా వేశారు. లోక్‌సభలోనూ ఇవే దృశ్యాలు కనిపించాయి. విపక్ష సభ్యులు అంబేడ్కర్ పోస్టర్లతో వెల్‌లోకి దూసుకెళ్లి ‘జై భీమ్’ అంటూ నినాదాలకు దిగారు. దాంతో సభ తొలుత మధ్యాహ్నం దాకా, తర్వాత గురువారానికి వాయిదా పడింది. ముసుగు తొలగింది ‘‘మొత్తానికి ముసుగు తొలగింది. రాజ్యాంగ వజ్రోత్సవాల వేళ రాజ్యాంగ నిర్మాతనే అమిత్ షా అవమానించారు. ఆయన వ్యాఖ్య లు బీజేపీ కులవాదానికి, దళిత వ్యతిరేక భావజాలానికి నిదర్శనం. 240 లోక్‌సభ సీట్లొస్తేనే ఇలా ప్రవర్తిస్తున్నారు. అదే 400 వస్తే అంబేడ్కర్ స్మృతులనే పూర్తిగా చెరిపేస్తూ చరిత్రను తిరగరాసేవాళ్లేమో!’’ – తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశి్చమబెంగాల్ సీఎం మమతా బెనర్జీఅంబేడ్కర్ పేరే జపిస్తాం ‘‘పాపాలు చేసేవాళ్లే పుణ్యం కోసం ఆలోచిస్తారు. దేశం, ప్రజలు, రాజ్యాంగ పరిరక్షణ గురించి తపించేవాళ్లు అంబేడ్కర్ నామాన్నే జపిస్తారు’’ – డీఎంకే చీఫ్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ దొందూ దొందే ‘‘బీజేపీ, కాంగ్రెస్ దొందూ దొందే. అంబేడ్కర్ పేరును రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నాయి. దళితులకు, అణగారిన వర్గాలకు అవి చేసిందేమీ లేదు’’ – బీఎస్పీ అధినేత్రి మాయావతి -
బదులివ్వలేకే దుష్ప్రచారం
న్యూఢిల్లీ: అంబేడ్కర్‌పై రాజ్యసభలో తాను చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పూర్తిగా వక్రీకరించిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరోపించారు. తన వ్యాఖ్యలపై దుష్ప్రచారం చేయడం ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించడానికి కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు. ‘‘కాంగ్రెస్ పార్టీ ఫక్తు అంబేడ్కర్ వ్యతిరేకి. రాజ్యాంగ వ్యతిరేకి. రిజర్వేషన్ల వ్యతిరేకి. ఈ వాస్తవాలను రాజ్యాంగంపై చర్చ సందర్భంగా పార్లమెంట్ సాక్షిగా నిరూపించాం. మేం లేవనెత్తిన అంశాలకు కాంగ్రెస్ వద్ద ఏ సమాధానమూ లేకపోయింది. అందుకే తీవ్ర అసహనంతో ఇలా తప్పుడు దారి ఎంచుకుంది.ప్రధాని వ్యాఖ్యలను కూడా ఇలాగే వక్రీకరిస్తోంది. వాటిపై ఆందోళనలకు దిగుతూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కుట్రలు పన్నుతోంది’’ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. మంగళవారం రాజ్యసభలో అంబేడ్కర్ గురించి తాను మాట్లాడినదాంట్లో ఎలాంటి సందిగ్ధతా లేదని స్పష్టం చేశారు. ‘‘రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను కలలో సైతం అవమానపరచని పార్టీ నుంచి, సిద్ధాంతం నుంచి వచ్చాను. బీజేపీ అధికారంలో ఉన్నప్పుడల్లా అంబేడ్కర్ సిద్ధాంతాలను విస్తృతంగా ప్రచారం చేసింది.రిజర్వేషన్లను బలోపేతం చేసేందుకు కృషి చేసింది’’ అన్నారు. ‘‘కాంగ్రెస్ చర్యలు ఆక్షేపణీయం. నాపై ఆ పార్టీ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నా’’ అని చెప్పారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారా అని ప్రశ్నించగా అన్ని అవకాశాలూ పరిశీలిస్తామన్నారు. అంబేడ్కర్‌పై తాను చేసిన పూర్తి వ్యాఖ్యలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మీడియాకు విజ్ఞప్తి చేశారు. అలాగే అంబేడ్కర్‌కు కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని కూడా ప్రజలకు తెలియజెప్పాలని కోరారు. నెహ్రూ కుటుంబం అంబేడ్కర్ వ్యతిరేకికాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగానే తన ప్రసంగంలో కేవలం కొంత భాగాన్ని మాత్రమే చూపిస్తోందని అమిత్ షా ఆక్షేపించారు. తద్వారా అయోమయం సృష్టించడమే ఆ పార్టీ లక్ష్యమన్నారు. ఇటీవల ఎన్నికల ప్రచారం సందర్భంగా కృత్రిమ మేధ సాయంతో తన వ్యాఖ్యలను, మోదీ వ్యాఖ్యలను వక్రీకరించేందుకు ప్రయతి్నంచిందని ఆరోపించారు.‘అంబేడ్కర్‌ను పూర్తిగా పక్కన పెట్టేందుకు ప్రయత్నించిన చరిత్ర తొలి ప్రధానినెహ్రూది. నెహ్రూ కుటుంబంలో నాలుగు తరాల నేతలూ అంబేడ్కర్‌ను వ్యతిరేకిస్తూనే వస్తున్నారు. ఆయనకు భారతరత్నను వీలైనంతగా ఆలస్యం చేసింది కాంగ్రెసే. కనీసం ఇప్పుడైనా ఆ పార్టీ అంబేడ్కర్ గురించి మాట్లాడుతుండడం ఆనందం కలిగిస్తోంది. అయితే అంబేడ్కర్‌కు ఇన్నాళ్లూ వాళ్లు ఏమాత్రం గౌరవం ఇవ్వని విషయం కూడా చెబితే బాగుంటుంది’’ అన్నారు. చీలిక దిశగా పయనిస్తున్న విపక్ష ఇండియా కూటమికి తిరిగి ఒక్కటయ్యే అవకాశాన్ని మీ వ్యాఖ్యలు కల్పించాయా అని ప్రశ్నించగా తప్పుడు పునాదులపై ఒక్కతాటిపైకి రావడం వారికి అలవాటేనని అమిత్ షా అన్నారు. ‘‘ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. విపక్షాలకు వ్యతిరేకంగా వారు వరుసగా తీర్పులిస్తున్నారు. అందుకే ఓసారి ఈవీఎంలపై, మరోసారి ఇంకో అంశంపై ఆరోపణలు తదితరాలతో ప్రజలను అయోమయపరిచేందుకు ప్రయత్నిస్తున్నాయి’’ అని ఆరోపించారు. బాక్సు ఖర్గే సంతోషిస్తానంటే తప్పుకుంటా తాను రాజీనామా చేయాలన్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ హాస్యాస్పదమని అమిత్ షా అన్నారు. ‘‘నా రాజీనామా ఖర్గేకు సంతోషం కలిగిస్తుందంటే అలాగే చేస్తా. కానీ నేను పదవి నుంచి తప్పుకున్నా ఖర్గే సమస్యలు తీరవు. ఆయన కనీసం మరో 15 ఏళ్లపాటు అక్కడే (ప్రతిపక్షంలోనే) ఉంటారు’’ అంటూ ఎద్దేవా చేశారు. ‘‘అంబేడ్కర్ మాదిరిగానే ఖర్గే కూడా దళితుడే. కనీసం ఆయనైనా ఈ బురదజల్లుడు కార్యక్రమంలో భాగస్వామి కాకుండా ఉంటే బాగుండేది. రాహుల్‌గాంధీ ఒత్తిళ్లకు తలొగ్గి నాపై తప్పుడు ఆరోపణలకు దిగుతున్నారు’’ అని అమిత్ షా అన్నారు. -
‘అంబేద్కర్‌కు అవమానం..’ షా వర్సెస్ ఖర్గే
సాక్షి,న్యూఢిల్లీ: రాజ్యసభలో అంబేద్కర్‌పై కేంద్రహోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. అమిత్ షా వ్యాఖ్యలపై బుధవారం(డిసెంబర్ 18) తొలుత మల్లికార్జున ఖర్గే మీడియాతో మాట్లాడారు. ఆ తర్వాత వెంటనే అమిత్ షా మీడియా సమావేశం నిర్వహించారు. అమిత్ షా దేశానికి క్షమాపణ చెప్పాలని ఖర్గే డిమాండ్ చేయగా రాహుల్‌గాంధీ ఒత్తిడితోడే ఖర్గే మాట్లాడుతున్నారని అమిత్ షా కౌంటర్ ఇచ్చారు. ప్రధానికి అంబేద్కర్‌పై గౌరవం ఉంటే అమిత్ షాను వెంటనే తొలగించాలి: ఖర్గే షా అంబేద్కర్‌పై చేసిన వ్యాఖ్యల పట్ల దేశానికి క్షమాపణ చెప్పాలిప్రధాని మోదీకి అంబేద్కర్‌పై గౌరవం ఉంటే షాను మంత్రి వర్గం నుంచి వెంటనే తొలగించాలిబీజేపీకి రాజ్యాంగం పై నమ్మకం లేదు మనుస్మృతినే వారు నమ్ముతారు అంబేద్కర్ కులం గురించి ఎప్పుడు మాట్లాడలేదుపేదల తరపున అంబేద్కర్ గొంతెత్తారుఅంబేద్కర్ను కొందరికి పరిమితం చేయడం సరికాదు #WATCH | Delhi: On Union HM's speech in RS during Constitution debate, Rajya Sabha LoP and Congress president Mallikarjun Kharge says, "Our demand is that Amit Shah should apologize and if PM Modi has faith in Dr Babasaheb Ambedkar then he should be sacked by midnight... He has… pic.twitter.com/uKoMZqj8F4— ANI (@ANI) December 18, 2024నా మాటలు ఎడిట్ చేసి వక్రీకరించారు: అమిత్ షా అంబేద్కర్ పై నా మాటలను కాంగ్రెస్ పార్టీ వక్రీకరించింది.దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటా.నేను మాట్లాడిన విషయాలను ఎడిట్ చేసి వక్రీకరించారు.అంబేద్కర్ ను, ఆయన సిద్ధాంతాలను కలలో కూడా మేము వ్యతిరేకించలేదు.అంబేద్కర్ అంటే మాకు అపారమైన గౌరవం.నేను రాజ్యసభలో మాట్లాడిన వ్యాఖ్యలను పూర్తిగా చూస్తే అన్ని విషయాలు అర్థమవుతాయి.గతంలో నా మాటలను ఏఐ టెక్నాలజీ ఉపయోగించి కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేసింది.మా ప్రభుత్వం రిజర్వేషన్లను బలపరిచింది. రాజీవ్ గాంధీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పనిచేశారు.రాహుల్ గాంధీ ఒత్తిడితో మల్లికార్జున ఖర్గే మాట్లాడుతున్నారు.కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల్లో అంబేద్కర్‌ను అవమానించింది#WATCH | Delhi: Union Home Minister Amit Shah says, "...When the discussion was going on in the Parliament, it was proved how the Congress opposed Baba Saheb Ambedkar. How the Congress tried to make fun of Baba Saheb even after his death... As far as giving Bharat Ratna is… pic.twitter.com/rzMAU3mzNg— ANI (@ANI) December 18, 2024 -
అమిత్ షా ను బర్త్ రఫ్ చేయాలి..
-
అమిత్ షాకు ‘టీఎంసీ’ షాక్.. రాజ్యసభలో ప్రివిలేజ్ మోషన్
న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) షాకిచ్చింది. రాజ్యాంగంపై చర్చ సందర్భంగా మంగళవారం రాజ్యసభలో అంబేద్కర్‌పై చేసిన వ్యాఖ్యలకుగాను టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రియెన్ షాపై రాజ్యసభలో సభా హక్కుల ఉల్లంఘన (ప్రివిలేజ్ మోషన్) నోటీసు ఇచ్చారు. నోటీసు ఇచ్చిన అనంతరం డెరెక్ ఒబ్రియెన్ మాట్లాడుతూ అమిత్ షా వ్యాఖ్యలు అంబేద్కర్‌ను తక్కువ చేయడమే కాకుండా సభా మర్యాదను తగ్గించాయన్నారు. సభా మర్యాదను కించపరిచినందుకు షా పై చర్య తీసుకోవాలని ఒబ్రియెన్ కోరారు.అమిత్ షా రాజీనామా చేయాలి:కాంగ్రెస్అంబేద్కర్పై చేసినవ్యాఖ్యలకు గాను అమిత్ షా తన పదవికి రాజీనామా చేయాలని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. ఈ విషయమై ఆయన బుధవారం(డిసెంబర్ 18) పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. రాజీనామా చేయడమే కాకుండా దేశ ప్రజలకు షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
‘అమిత్‌షా క్షమాపణలు చెప్పాల్సిందే’
ఢిల్లీ : భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను అవమానించినందుకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.భారత రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా పార్లమెంట్ ఉభయ సభల్లో భారత రాజ్యాంగం పై చర్చ రెండు రోజుల పాటు చర్చ జరిగింది. మంగళవారం జరిగిన చర్చ సమయంలో అమిత్‌షా కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. రాజకీయ లబ్ధి కోసం బీఆర్ అంబేద్కర్ పేరును వినియోగించుకోవడం 'ఫ్యాషన్'గా మారిందని అన్నారు. అంబేద్కర్,అంబేద్కర్ అని జపం చేస్తున్నారు. బదులుగా దేవుడి పేరు తలుచుకుంటేనైనా పుణ్యం వస్తుంది. స్వర్గానికి వెళ్లొచ్చని విరుచుకు పడ్డారు. "अभी एक फैशन हो गया है- अंबेडकर, अंबेडकर, अंबेडकर, अंबेडकर, अंबेडकर..इतना नाम अगर भगवान का लेते तो सात जन्मों तक स्वर्ग मिल जाता."अमित शाह ने बेहद घृणित बात की है. इस बात से जाहिर होता है कि BJP और RSS के नेताओं के मन में बाबा साहेब अंबेडकर जी को लेकर बहुत नफरत है.नफरत… pic.twitter.com/UMvMAq43O8— Jairam Ramesh (@Jairam_Ramesh) December 17, 2024 అయితే, అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీతో పాటు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ స్పందించారు. మనుస్మృతిని విశ్వసించే వారు ఖచ్చితంగా అంబేద్కర్‌తో విభేదిస్తారు' అని ట్వీట్లో పేర్కొన్నారు.బాబాసాహెబ్ అంబేద్కర్‌ను హోంమంత్రి అవమానించడంతో బీజేపీ-ఆర్ఎస్ఎస్ త్రివర్ణ పతాకానికి వ్యతిరేకమని, వారి పూర్వీకులు అశోక్ చక్రాన్ని వ్యతిరేకించారని, సంఘ్ పరివార్ ప్రజలు మనుస్మృతిని అమలు చేయాలనుకుంటున్నారని ఖర్గే అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ దేవుడి కంటే తక్కువేం కాదు.. ఆయన దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు, మైనారిటీలు, పేదల దూతగా ఉంటారని చెప్పారు. -
రాజ్యాంగం వాళ్లకు ప్రైవేట్ జాగీరు!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీపై, నెహ్రూ– గాంధీ కుటుంబంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం రాజ్యసభలో నిప్పులు చెరిగారు. ‘‘కాంగ్రెస్ పార్టీతో పాటు రాజ్యాంగాన్ని కూడా తమ వ్యక్తిగత జాగీరుగా ఆ కుటుంబం పరిగణించింది. అందుకే కనీసం పార్లమెంటు అనుమతి కూడా లేకుండానే రాజ్యాంగంలోకి ఆర్టీకల్ 35ఏను చొప్పించే దుస్సాహసానికి తెగబడింది. చివరికి పార్లమెంటును కూడా మోసగించిన చరిత్ర కాంగ్రెస్‌ది! రాజ్యాంగం పేరిట 75 ఏళ్లుగా లెక్కలేనన్ని ద్రోహాలకు పాల్పడుతూ వస్తోంది’’ అంటూ మండిపడ్డారు. స్వీయ రాజకీయ లబ్ధి కోసం రాజ్యాంగాన్ని కాంగ్రెస్ ఇష్టానికి సవరించిందంటూ పలు ఉదంతాలను ఉటంకించారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు గండికొట్టే తొలి రాజ్యాంగ సవరణతో దేశ మొదటి ప్రధాని నెహ్రూయే ఇందుకు తెర తీశారని ఆరోపించారు. ‘‘సంతుష్టికరణ రాజకీయాలకు కాంగ్రెస్ చిరునామా. తన ఓటు బ్యాంకుకు భంగం కలుగుతుందని ముస్లిం మహిళలకు ఏళ్ల తరబడి హక్కులను నిరాకరించిన చరిత్ర ఆ పార్టీది. ముస్లింలకు రిజర్వేషన్లు కలి్పచేందుకు 50 శాతం పరిమితిని అతిక్రమించేందుకు కూడా వెనకాడలేదు! తన పాలనలోని రెండు రాష్ట్రాల్లో రాజ్యాంగ విరుద్ధంగా మతాధారిత రిజర్వేషన్లు తెచి్చంది’’ అంటూ ఆరోపించారు. రాజ్యాంగ వజ్రోత్సవాల సందర్భంగా రాజ్యసభలో జరిగిన రెండు రోజుల చర్చకు మంత్రి బదులిచ్చారు. బీజేపీకి పార్లమెంటులో ప్రాతినిధ్యం ఉన్నంత కాలం మతాధారిత రిజర్వేషన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని ప్రకటించారు. వెనకబడ్డ వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ ఏనాడూ ప్రయతి్నంచలేదని షా ఆరోపించారు. ఎన్నికల ఓటమికి ఈవీఎంలను సాకుగా చూపడం ఇప్పటికైనా కాంగ్రెస్ మానుకోవాలని సూచించారు. ఉత్తరాఖండ్‌లో మాదిరిగా అన్ని రాష్ట్రాల్లోనూ ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేస్తామని పునరుద్ఘాటించారు.జమిలి బిల్లు కాంగ్రెస్ పుణ్యమే: నడ్డా కేంద్రంలో దశాబ్దాల పాటు అధికారంలో ఉండగా కాంగ్రెస్ చేసిన నిర్వాకాల వల్లే మోదీ సర్కారు జమిలి ఎన్నికల బిల్లు తేవాల్సిన అవసరం ఏర్పడిందని రాజ్యసభ నాయకుడు జేపీ నడ్డా అన్నారు. మంగళవారం రాజ్యాంగ వజ్రోత్సవాలపై రాజ్యసభలో చర్చలో ఆయన మాట్లాడారు. ‘‘లోక్‌సభకు, అన్ని అసెంబ్లీలకూ తొలుత ఒకేసారి ఎన్నికలు జరిగేవి. అప్పట్లో కాంగ్రెస్ పాలకులు తమకు ఇష్టం లేని రాష్ట్ర ప్రభుత్వాలను యథేచ్ఛగా కూలదోయడంతో జమిలికి బ్రేక్ పడింది’’ అని చెప్పారు. ‘‘ఎమర్జెన్సీ కాంగ్రెస్ చరిత్రపై చెరగని మచ్చ. అందుకు ఆ పార్టీ క్షమాపణలు చెప్పిందనడం పచ్చి అబద్ధం. మైనారిటీల సంతుïÙ్టకరణ రాజకీయాల్లో భాగంగా మతాధారిత రిజర్వేషన్లకు కాంగ్రెస్ తెర తీయజూస్తోంది. ఆ ప్రయత్నాలను పలుమార్లు కోర్టులు అడ్డుకున్నా దాని తీరు మారడం లేదు. ట్రిపుల్ తలాక్, ఆర్టీకల్ 370పై కాంగ్రెస్ వైఖరి మొదలుకుని షాబానో తీర్పును నిర్వీర్యం చేసేందుకు రాజ్యాంగ సవరణ దాకా ఇందుకు ఉదాహరణలెన్నో’’ అని నడ్డా ఆరోపించారు. వాటిపై ఆ పార్టీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చారు. గుజరాత్లో బీజేపీ ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్ల మాటేమిటని కాంగ్రెస్ సభ్యుడు జైరాం రమేశ్ ప్రశ్నించారు. అవి కేవలం ఆర్థిక వెనకబాటు ప్రాతిపదికన కలి్పంచినవంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలి్పంచుకున్నారు. సభను జైరాం తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ కూడా సామాజిక, ఆర్థిక వెనకబాటు ప్రాతిపదికనే రిజర్వేషన్లు కల్పించింది తప్ప మతాధారితంగా కాదంటూ జైరాం బదులిచ్చారు. వారిద్దరి మధ్య వాడివేడి చర్చ సాగింది. -
Omar Abdullah: బీజేపీకి దగ్గరవుతున్నారా?
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనేది బాగా వాడుకలో ఉన్న నానుడి. జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్పరెన్స్ అగ్రనేత ఒమర్ అబ్దుల్లా తాజా ప్రకటనలు ఇదే తరహాలో ఉన్నాయి. కాషాయ పార్టీకి ఆయన దగ్గరవుతున్న సూచనలు కన్పిస్తున్నాయి. ఈవీఎంల ట్యాంపరింగ్ వ్యవహారంపై ఆయన చేసిన వాఖ్యలు బీజేపీతో సామీప్యతను సంతరించుకోవడంతో ఈ వాదనకు బలం చేకూరుతోంది. ఇదంతా కాకతాళీయంగా జరిగింది కాదన్న అభిప్రాయాలు ప్రత్యర్థుల నుంచి వ్యక్తమవుతున్నాయి.మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఈవీఎంల ట్యాంపరింగ్‌పై కాంగ్రెస్ చేసిన ఆరోపణలకు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కౌంటర్ ఇచ్చారు. ఆయన మాట్లాడిన తర్వాత రోజే ఒమర్ అబ్దుల్లా కూడా మాట్లాడారు. అయితే స్వపక్షమైన కాంగ్రెస్ పార్టీని తప్పుబడుతూ ఆయన వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఎన్నికల్లో విజయాలను తమ ఖాతాలో వేసుకుని, అపజయాలను మాత్రం ఈవీఎంలపైకి నెట్టేయడం సరికాదన్న చందంగా ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. సరిగ్గా అమిత్ షా ఏదైతే అన్నారో అలాగే కశ్మీర్ సీఎం స్పందించారు. ఇప్పుడు ఇదే రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.రాహుల్ గాంధీకి అమిత్ షా కౌంటర్లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 100 ఎంపీ సీట్లు గెలిచినప్పుడు సంబరాలు చేసుకున్నారని, ఈ దశాబ్దంలోనే ఉత్తమ పనితీరు కనబరిచామని పొంగిపోయారని రాహుల్ గాంధీని ఉద్దేశించి అమిత్ షా కమెంట్ చేశారు. ‘లోక్‌సభ ఎన్నికల్లో తాను గెలిచాను కాబట్టి ఈవీఎంలు బాగా పనిచేశాయని రాహుల్ గాంధీ నమ్ముతున్నారు. జార్కండ్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఈవీఎంలు కరెక్ట్‌గానే పనిచేస్తున్నాయని అనుకున్నారు. మహారాష్ట్రలో ప్రజలు ఓడించేసరికి ఈవీఎంలు వారికి చెడుగా కన్పిస్తున్నాయి. పని చేతగానివాడు పనిముట్లను నిందించిట్టుగా రాహుల్ గాంధీ వ్యవహారం ఉంద’ని అమిత్ షా అన్నారు.కాంగ్రెస్‌ను తప్పుబట్టిన ఒమర్ అబ్దుల్లామరుసటి రోజు ఒమర్ అబ్దుల్లా కూడా ఇదే లైన్లో మాట్లాడారు. గెలిచినప్పుడు ఒకలా, ఓడిపోయినప్పుడు మరో విధంగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం తగదని హితవు పలికారు. ఈవీఎంలతోనే లోక్‌సభ ఎన్నికల్లో 100 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ మహారాష్ట్ర ఫలితాల తర్వాత మాట మార్చడాన్ని ఆయన తప్పుబట్టారు. ప్రజాతీర్పుపై విశ్వాసం లేనట్టుగా మాట్లాడం మానుకోవాలని, ఓటమికి ఈవీఎంలను బాధ్యులు చేయడం కరెక్ట్ కాదన్నారు. ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యలకు కాంగ్రెస్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. సీఎం అయ్యాక ఆయన ఎందుకు యూటర్న్ తీసుకోవాల్సి వచ్చిందో అంటూ ప్రశ్నించింది.చదవండి: EVMలపై పోరు.. ధోరణి మారింది ఎందుకో?బీజేపీపై సీఎం అబ్దుల్లా ప్రశంసలుఅయితే ఇక్కడితో ఆగిపోకుండా బీజేపీపై ప్రశంసలు కురిపించారు కశ్మీర్ సీఎం అబ్దుల్లా. సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ ఎంతో మంచిదని, కొత్త పార్లమెంటు భవనం నిర్మించడం అద్భుతమైన ఆలోచన అంటూ కాషాయపార్టీని పొగిడారు. ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీని తప్పుబడుతూ బీజేపీ అధికార ప్రతినిధిలా మాట్లాడుతున్నారన్న వాదనను ఒమర్ అబ్దుల్లా కొట్టిపారేశారు. జమ్మూకశ్మీర్‌కు మంచి చేయాలన్న ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలను కొనసాగిస్తున్నానని, రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యమని చెప్పుకొచ్చారు. కాగా, జమ్మూకశ్మీర్‌కు రాష్ట్రహోదా పునరుద్దరణ కోసం అమిత్‌షాను బుధవారం ఢిల్లీలో సీఎం అబ్దుల్లా కలవనున్నారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో వీరిద్దరి భేటీపై ఆసక్తి నెలకొంది. -
లొంగుబాటా.. దాడులా...
రాయ్‌పూర్: లొంగిపోవడమా, తీవ్ర పరిణాలు ఎదుర్కోవడమా ఏదో ఒకటి తేల్చుకోవాలని నక్సలైట్లకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హెచ్చరికలు జారీ చేశారు. ‘‘వెంటనే ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలవండి. లేదంటే భద్రతా దళాల దాడులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి’’ అని స్పష్టం చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో 2026 మార్చి చివరి నాటికి నక్సలిజాన్ని పూర్తి నిర్మూలించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయన్నారు. నక్సలిజం నుంచి ఛత్తీస్ విముక్తి పొందినప్పుడే దేశమంతా ఆ ముప్పు నుంచి బయటపడుతుందన్నారు. అమిత్ ఆదివారం చత్తీస్‌గఢ్‌లో పర్యటించారు. రాయ్‌పూర్‌లో ప్రెసిడెంట్స్ పోలీసు కలర్ అవార్డు ప్రదానోత్సవంలో మాట్లాడారు. జగదల్పూర్లో బస్తర్ ఒలింపిక్స్ క్రీడోత్సవాల్లో ప్రసంగించారు. తీవ్రవాదాన్ని అరికట్టడంలో ఛత్తీస్ పోలీసులు ఏడాదిగా గణనీయమైన పురోగతి సాధించారని ప్రశంసించారు. ‘‘లొంగిపోయిన నక్సలైట్ల పునరావాసానికి రాష్ట్ర ప్రభుత్వం అద్భుత విధానం అమలు చేస్తోంది. తీవ్రవాదులు హింసకు స్వస్తి పలికి రాష్ట్ర ప్రగతికి చేయూతనందించాలి’’ అని పిలుపునిచ్చారు. ఏడాదిలో 287 మంది హతం ఛత్తీస్‌గఢ్‌లో గత ఏడాదిలో 287 మంది నక్సలైట్లు మరణించారని, 1,000 మంది అరెస్టయ్యారని, 837 మంది లొంగిపోయారని అమిత్ వివరించారు. నక్సలిజంపై పోరాటంలో పురోగతికి ఈ గణాంకాలే నిదర్శనమన్నారు. ‘‘ఏడాదిలో 14 మంది నక్సల్స్ అగ్ర నేతలు హతమయ్యారు. నక్సల్స్ హింసాకాండలో మరణించిన భద్రతా సిబ్బంది, సాధారణ పౌరుల సంఖ్య 100లోపే. నాలుగు దశాబ్దాల్లో ఇదే అతి తక్కువ. మావోయిస్టుల దాడుల్లో భద్రతా సిబ్బంది, పౌర మరణాలు 70 శాతం తగ్గాయి. నక్సలిజంపై చివరిదెబ్బ కొట్టడానికి కేంద్ర, రాష్ట్ర బలగాలు సిద్ధంగా ఉన్నాయి. ప్రెసిడెంట్స్ పోలీసు కలర్ పురస్కారం అందుకోవాలంటే కనీసం పాతికేళ్లు సేవలందించి ఉండాలి. కానీ ఛత్తీస్‌గఢ్‌లో 2000లో ఏర్పాటైనా రాష్ట్ర పోలీసు దళానికి ఈ అవార్డు దక్కడం హర్షణీయం. పోలీసుల అంకితభావం, త్యాగం, ధైర్యసాహసాలే ఇందుకు కారణం. జమ్మూకశీ్మర్ కంటే బస్తర్ అందమైన ప్రాంతం. నక్సలిజం అంతమైతే ఇక్కడికి పర్యాటకులు భారీగా వస్తారు’’ అని అన్నారు.వేసక్టమీ చేసుకుంటేనే పెళ్లి లొంగిపోయిన మావోయిస్టుల వెల్లడి ‘‘కుటుంబ నియంత్రణ ఆపరేషన్. నక్సలైట్లలో తరచూ వినిపించే మాట. దళంలో ఉండగా పెళ్లి చేసుకోవాలంటే ముందు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకోవాలి. లేకపోతే పెళ్లికి అనుమతివ్వరు. అగ్రనేతల ఆదేశాలతో బలవంతంగానైనా ఆపరేషన్ చేయిస్తారు. నాకూ అలా ఆపరేషన్ చేయించారు’’ అని తెలంగాణకు చెందిన మాజీ మావోయిస్టు వెల్లడించారు. ‘‘ఆయుధాలు వదిలేసి లొంగిపోయి సాధారణ జీవితం మొదలు పెట్టాక సంతానం కావాలనిపించింది. మళ్లీ ఆపరేషన్ చేయించుకుని ఒక బాబుకు తండ్రినయ్యా’’ అని హోం మంత్రి అమిత్ షాకు తన అనుభవం వివరించారు. లొంగిపోయిన నక్సలైట్లతో ఆయన జగదల్పూర్లో ప్రత్యేకగా సమావేశమయ్యారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల మాజీ నక్సల్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘‘దళంలో స్త్రీ, పురుష సభ్యులు పెళ్లాడటం పరిపాటి. పిల్లలు పుడితే వారి సంరక్షణ, అడవుల్లో తిరగడం కష్టమవుతుందని, ఉద్యమానికీ ఇబ్బందని అగ్ర నేతలు చెబుతుంటారు. అందుకే నక్సలైట్లకు వేసక్టమీ తప్పనిసరి చేశారు’’ అని వారన్నారు. -
అమిత్ షా టూర్ వేళ అపశృతి..పేలుడులో జవాన్‌కు గాయాలు
రాయ్‌పూర్:కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం(డిసెంబర్15) ఛత్తీస్‌గఢ్ పర్యటన సందర్భంగా అపశృతి దొర్లింది. షా పర్యటనను పురస్కరించుకుని ఛత్తీస్‌గఢ్ కాంకేర్‌లో భద్రతా సిబ్బంది ముందస్తు తనిఖీలు చేపట్టారు.ఈ తనిఖీల్లో మావోయిస్టులు అమర్చిన ఐఈడీని భద్రతా సిబ్బంది గుర్తించారు. ఐఈడీని నిర్వీర్యం చేసే సమయంలో అది ఒక్కసారిగా పేలడంతో భద్రతా సిబ్బంది ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.దీంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. తర్వాత భద్రతా సిబ్బంది ఆ ప్రాంతంలో విస్త్రృత సోదాలు నిర్వహించారు. పేలుడు పదార్థాలతో తిరుగుతున్న తొమ్మిది మంది మావోయిస్టులను అరెస్టు చేశారు. అమిత్ షా పర్యటన వేళ ఈ ఘటన చోటుచేసుకోవడంతో కాంకేర్‌లో హై అలర్ట్ ప్రకటించారు.ఈ ప్రాంతంలో భద్రతా దళాలను భారీగా మోహరించినట్లు కాంకేర్ జిల్లా ఎస్పీ తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లో రెండు రోజుల పర్యటన నిమిత్తం కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం రాయ్‌పుర్ చేరుకున్నారు. రాయ్‌పూర్,బస్తర్ జిల్లాల్లో జరిగే పలు కార్యక్రమాలకు ఆయన హాజరవుతారు. -
హిడ్మా ఇంటికి హోంమంత్రి అమిత్ షా?
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టు పార్టీకి గుండెకాయ వంటి దక్షిణ బస్తర్ ఏరియాలో, ఆ పార్టీ కీలక నేత హిడ్మా స్వగ్రామంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటించనున్నట్టు తెలిసింది. ఛత్తీస్‌గఢ్ పర్యటనలో భాగంగా ఆదివారం (ఈ నెల 15న) ఆయన హిడ్మా స్వగ్రామం పువర్తికి వెళ్లనున్నట్టు సమాచారం.మావోయిస్టులకు గట్టి హెచ్చరికలు జారీ చేయడంతోపాటు... యాంటీ నక్సల్స్ ఆపరేషన్లలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న సీఆర్పీఎఫ్, డీఆర్జీ, కోబ్రా, ఎస్టీఎఫ్, ఐటీబీపీ, బస్తర్ ఫైటర్స్ తదితర దళాల్లో ఆత్మస్థైర్యం నింపడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. పువర్తి పర్యటన సందర్భంగా హిడ్మా తల్లితోపాటు ఇతర స్థానికులతో అమిత్ షా మాట్లాడనున్నట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే అధికవర్గాలు దీనిని ధ్రువీకరించలేదు. ఎనిమిది నెలలుగా భద్రతా దళాల గుప్పిట్లో... ఛత్తీస్‌గఢ్‌లోని జిల్లా కేంద్రమైన సుక్మా నుంచి 120 కిలోమీటర్ల దూరంలో మడావి హిడ్మా స్వగ్రామం పువర్తి ఉంది. మురియా ఆదివాసీ తెగకు చెందిన హిడ్మా.. 2001లో అజ్ఞాతంలోకి వెళ్లి అంచెలంచెలుగా ఎదిగి పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ, బెటాలియన్ వన్ కమాండర్‌గా ఎదిగారు. పూర్తి అటవీ ప్రాంతం మధ్యలో ఉన్న పువర్తిలో ప్రత్యేక కమ్యూనికేషన్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకున్నారు. సుమారు పదేళ్ల ప్రయత్నం తర్వాత 2024 ఫిబ్రవరిలో భద్రతా దళాలు పువర్తికి చేరుకుని క్యాంపు ఏర్పాటు చేయగలిగాయి. దీనితోపాటు దండకారణ్యంలో మావోయిస్టుల కీలక కేంద్రాలైన కొండపల్లి, జీడిపల్లిలోనూ క్యాంపులు ఏర్పాటు చేశాయి. అక్కడి నుంచి చుట్టుపక్కల ప్రాంతాల్లో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లు చేపడుతున్నాయి. ప్రతి గా మావోయిస్టులు కూడా ఈ క్యాంపులపై తరచూ దాడులు చేస్తున్నారు. ఇటీవల జీడిపల్లి క్యాంప్‌పై పదిహేను రోజుల వ్యవధిలో రెండుసార్లు చేసిన దాడులకు హిడ్మా నేతృత్వం వహించినట్టు ప్రచారం జరిగింది. ఇలాంటి చోట అమిత్ షా పర్యటించనున్నారనే ప్రచారంతో ఉత్కంఠ నెలకొంది. -
నేరాలకు రాజధానిగా ఢిల్లీ.. అమిత్‌షాకు కేజ్రీవాల్ లేఖ
ఢిల్లీ: ఢిల్లీలో పెరుగుతున్న నేరాలపై అమిత్‌షాకు మాజీ సీఎం, ఆమ్ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ లేఖ రాశారు. నేరాలకు రాజధానిగా ఢిల్లీ మారిందని.. మహిళలపై నేరాలు, హత్యల్లో ఢిల్లీది మొదటిస్థానం అంటూ మండిపడ్డారు. ఢిల్లీలో బాంబు బెదిరింపులు నిత్యకృత్యంగా మారాయి. ఢిల్లీ శాంతిభద్రతలపై తక్షణమే చర్చలు జరపాలని డిమాండ్ చేశారుభారత్లోని మెట్రో నగరాలతో పోలిస్తే అత్యధికంగా ఢిల్లీలోనే మహిళలపై నేరాలు జరుగుతున్నాయి. డ్రగ్స్ సంబంధిత నేరాలు 350 శాతం పెరిగాయని కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. బాంబు బెదిరింపుల కారణంగా విద్యార్థుల తల్లిదండ్రులు నిత్యం భయంభయంగా బతుకుతున్నారు. పట్టపగలే హత్యలు, కిడ్నాప్‌లు జరుగుతున్నాయి. రాజధానిలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి. ఈ వైఫల్యాల కారణంగా ఢిల్లీకి ‘రేప్ క్యాపిటల్’, ‘క్రైం క్యాపిటల్’ అనే కొత్త పేర్లు వస్తున్నాయి’’ అని లేఖలో కేజ్రీవాల్ దుయ్యబట్టారు.ఇదీ చదవండి: ఆ ముగ్గురూ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీశారు.. కాంగ్రెస్‌పై మోదీ ఫైర్ -
‘మహా’ కేబినెట్ విస్తరణ.. షిండేకు బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బీజేపీ!
ఢిల్లీ: మహారాష్ట్ర కేబినెట్ విస్తరణపై మరో కీలక ట్విస్ట్ చోటుచేసుకుంది. మహాయుతి కూటమి ప్రభుత్వంలో శివసేనకు గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. శివసేన ఆశిస్తున్నట్టు హోంశాఖ వారికి దక్కే చాన్స్ లేనట్టు కీలక నేత ఒకరు చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో శివసేనకు అర్బన్ డెవలప్మెంట్ మంత్రిత్వశాఖ కేటాయించవచ్చని ఆయన తెలిపారు.మహారాష్ట్రలోని మహాయుతి ప్రభుత్వంలో మంత్రి విస్తరణ కోసం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ బుధవారం ఢిల్లీకి వెళ్లారు. ఈ సందర్భంగా కేబినెట్ విస్తరణపై అమిత్ షా, నడ్డాతో ఫడ్నవీస్ నిన్న అర్ధరాత్రి వరకు చర్చలు జరిపారు. ఈ క్రమంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు బీజేపీకి చెందిన కీలక నేత ఒకరు చెప్పారు. ఈ సందర్బంగా ఆయన జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. మహారాష్ట్రలో మంత్రి వర్గ విస్తరణకు ముహుర్తం ఖరారైంది. డిసెంబర్ 14 నాటికి విస్తరణ జరగనుంది. కూటమి పొత్తులో భాగంగా బీజేపీకి సీఎం పదవితో సహా 21 నుండి 22 మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉంది. కేబినెట్లో నాలుగు నుండి ఐదు మంత్రి పదవులు ఖాళీగా ఉంచవచ్చని ఆయన చెప్పారు.ఇదే సమయంలో సదరు కీలక నేత మరో బాంబు పేల్చారు. మహాయుతి కూటమిలో భాగస్వామ్య పక్షమైన శివసేనకు వారు కోరుకున్నట్లు హోం శాఖ దక్కే అవకాశం లేదన్నారు. అలాగే, మరో కీలకమైన ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా శివసేనకు ఇచ్చే ఛాన్స్ లేదని చెప్పుకొచ్చారు. ఇక, చివరకు శివసేనకు అర్బన్ డెవలప్మెంట్ శాఖ కేటాయించవచ్చని ఆయన తెలిపారు. దీంతో, శివసేన నేతల్లో టెన్షన్ నెలకొన్నట్టు తెలుస్తోంది. కేబినెట్ విస్తరణ మహాయుతి కూటమిలో ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందోనని రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.#MaharashtraGovtFormation | Maharashtra Chief Minister Devendra Fadnavis met Home Minister Amit Shah, Deputy Chief Minister Eknath Shinde skips meeting as per sources; talks likely on portfolio allocation pic.twitter.com/g9aM3hXP2x— NDTV (@ndtv) December 12, 2024ఇదిలా ఉండగా.. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఫలితాలు వెలువడిన తర్వాత దాదాపు 10 రోజుల అనంతరం వివిధ నాటకీయ పరిణామాల అనంతరం ఎట్టకేలకు సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇదే సమయంలో ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ డిప్యూటీ సీఎంలుగా ప్రమాణం చేశారు. -
లోక్‌సభలో రాజ్యాంగంపై చర్చ.. సమాధానమివ్వనున్న మోదీ
న్యూఢిల్లీ: భారత రాజ్యాంగంపై లోక్‌సభలో డిసెంబర్ 14న జరిగే చర్చకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమాధానం ఇవ్వనున్నారు. లోక్‌సభలో శుక్రవారం, శనివారం (డిసెంబర్ 13, 14) రెండు రోజులపాటు రాజ్యాంగంపై చర్చలు జరగనున్నాయి. అటు రాజ్యసభలోనూ డిసెంబర్ 16, 17వ తేదీల్లో చర్చ జరగనుంది. డిసెంబరు 16న ఎగువ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో చర్చ జరగనుంది.కాగా భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఉభయసభల్లో రాజ్యాంగంపై చర్చించాలని ప్రతపక్షాలు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ప్రాథమిక స్థాయిలో మార్చేందుకు ప్రయత్నిస్తోందని విపక్షాలు ఆరోపించాయి. ఈ క్రమంలో గతవారం నిర్వహించిన అఖిలపక్షం సమావేశంలో రాజ్యాంగంపై చర్చలకు అధికార, ప్రతిపక్ష లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు అంగీకరించాయి -
సరిహద్దు భద్రతకు యాంటీ–డ్రోన్ యూనిట్
జోద్పూర్: మన దేశ సరిహద్దులను శత్రుదుర్భేద్యంగా మార్చడానికి చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. సరిహద్దుల్లో సమగ్ర యాంటీ–డ్రోన్ యూనిట్ ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. శత్రుదేశాల నుంచి డ్రోన్లు, మానవ రహిత వైమానిక వాహనాల ముప్పు పెరుగుతోందని అన్నారు. రాబోయే రోజుల్లో ఈ సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం కనిపిస్తోందని పేర్కొన్నారు. అందుకే సరిహద్దుల్లో శత్రుదేశాల డ్రోన్లను గుర్తించి, ధ్వంసం చేయడానికి యాంటీ–డ్రోన్ యూనిట్ నెలకొల్పాలని నిర్ణయించినట్లు స్పష్టంచేశారు. సరిహద్దు భద్రతా దళాలు, రక్షణ శాఖ, పరిశోధన సంస్థలు, డీఆర్డీఓ భాగస్వామ్యంతో దీన్ని తీసుకురాబోతున్నట్లు వివరించారు. రాజస్తాన్‌లో ఆదివారం సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) 60వ రైజింగ్ డేలో అమిత్ షా పాల్గొన్నారు. బీఎస్ఎఫ్ జవాన్లను ఉద్దేశించి ప్రసంగించారు. లేజర్‌తో పనిచేసే యాంటీ–డ్రోన్ గన్ మౌంటెడ్ వ్యవస్థను ఇప్పటికే ప్రవేశపెట్టామని, దీంతో సత్ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. పంజాబ్‌లో భారత్–పాకిస్తాన్ సరిహద్దుల్లో ఈ వ్యవస్థ అమల్లో ఉందని అమిత్ షా పేర్కొన్నారు. అధికారిక గణాంకాల ప్రకారం.. 2023లో భారత్–పాకిస్తాన్ సరిహద్దుల్లో భారత సైన్యం 110 డ్రోన్లను కూలి్చవేసింది, కొన్నింటిని స్వాధీనం చేసుకుంది. -
కాంగ్రెస్ వైఫల్యాలపై బీజేపీ సభ.. తెలంగాణకు అమిత్ షా: కిషన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేదన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను డిసెంబర్ 6న బహిరంగ సభ ద్వారా ప్రజలకు వెల్లడించనున్నట్టు చెప్పుకొచ్చారు.కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బీజేపీ ఆఫీసులో శనివారం మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదు. హామీల అమలులో కాంగ్రెస్ ఫెయిల్ అయ్యింది. రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్లు లేవు. గత ప్రభుత్వం పరీక్షలు నిర్వహించిన వాటికి వీళ్లు భర్తీ చేశామని చెప్తున్నారు. అరకొర రుణమాఫీ చేసి మొత్తం పూర్తి చేశామని చెప్తున్నారు.రానున్న రోజుల్లో ప్రజలను సంఘటితం చేసేలా ఉద్యమం చేయాలి. కొత్త రక్తం పార్టీలో చేరబోతుంది. గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కొత్త నాయకత్వం రాబోతుంది. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మంచి నాయకత్వం వచ్చేలా కమిటీలు వేయాలి. తెలంగాణలో బీజేపీకి మంచి భవిష్యత్తు ఉందని ప్రధాని మోదీ తెలిపారు. మీరు ధైర్యంగా ముందుకి వెళ్ళాలని ప్రధాని మాకు భరోసా ఇచ్చారు.ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని సూచించారు. ప్రధాని మోదీ స్ఫూర్తితో ముందుకు వెళ్తాం. రేపు బీజేపీ ఛార్జ్ షీట్ విడుదల చేస్తాం. అసెంబ్లీ, జిల్లలా వారీగా ఛార్జ్‌షీట్ తయారు చేసి విడుదల చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై డిసెంబర్ 6న సరూర్ నగర్ స్టేడియంలో బీజేపీ బహిరంగ సభ నిర్వహించబోతున్నాం. సభ ద్వారా కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలను వివరిస్తాం. సభకు బీజేపీ జాతీయ నేతలు హాజరవుతారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా లేదా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యే అవకాశం ఉంది’ అని చెప్పుకొచ్చారు. -
పదవుల కోసం పాకులాడం: ఏక్నాథ్ షిండే
ముంబై : మహరాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? అనే అంశంపై అధికార మహాయుతి కూటమిలో చర్చలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే భేటీ అయ్యారు.ఈ ఇద్దరి మధ్య భేటీ సానుకూలంగా జరిగిందని ఏక్నాథ్ షిండే మీడియాకు వెల్లడించారు.‘అమిత్‌షాతో రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి,ప్రమాణ స్వీకారం వంటి అంశాలపై చర్చించాం. మిత్రపక్షాల మధ్య మంచి సమన్వయం ఉంది. మహారాష్ట్ర సీఎం ఎవరు? అనేది రెండు రోజుల్లో స్పష్టత వస్తుంది.ఈ అంశంపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. మహా సీఎం ఎంపికపై కసరత్తు పూర్తయిన వెంటనే వివరాల్ని వెల్లడిస్తాం. మహారాష్ట్ర ప్రజలు తమను భారీ మెజారిటీతో మరోసారి గెలిపించారు. ప్రజల ఆదేశాల్ని గౌరవించడమే ప్రాధాన్యత. పదవుల కోసం పాకులాడం’ అని ఏక్నాథ్ షిండే వెల్లడించారు. కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి భారీ విజయాన్ని సాధించింది. బీజేపీ 132 సీట్లు సొంతం చేసుకోగా.. షిండే శివసేనకు 57, అజిత్ పవార్ ఎన్సీపీకి 41 సీట్లు దక్కాయి. ఆ నిర్ణయం కమలం పెద్దలదేమహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార మహాయుతి కూటమి విజయం సాధించింది. దీంతో మహారాష్ట్ర సీఎంగా ఎవరిని నియమించాలనే నిర్ణయాన్ని మహాయుతి కూటమిలో అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ,ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన మహా సీఎం నిర్ణయాన్ని బీజేపీ పెద్దలకే అప్పగిస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించారు. ఈ క్రమంలో అమిత్ షాతో ఏక్నాథ్ షిండే భేటీ జరిగింది. ఈ భేటీ అనంతరం మహరాష్ట్ర సీఎం ఎవరు? ఏ కూటమికి ఎన్ని మంత్రి పదవులుతో పాటు ఇతర అంశాలపై రెండు రోజుల్లో స్పష్టత రానుంది. -
తెలుగు రాష్ట్రాల సహకార సంస్థలకు నాఫ్స్కాబ్ అవార్డులు
న్యూ ఢిల్లీ: నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ (నాఫ్స్కాబ్) 60ఏళ్ల ఉత్సవ వేడుకలు కొత్త ఢిల్లీలోని భారత్ మండపం సమావేశ మందిరంలో మంగళవారం సాయంత్రం వైభవంగా ప్రారంభమయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రఖ్యాత సహకారవేత్తలు కొండూరు రవీంద్రరావు, భీమా సుబ్రహ్మణ్యం నేతృత్వం వహిస్తున్న ఈ జాతీయ సహకార సంస్థ 60ఏళ్ల వేడుకలను కేంద్ర హోమ్, సహకార శాఖల మంత్రి అమిత్ షా జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఉత్తమ సేవలకు గాను నాఫ్స్కాబ్ ప్రతి ఏటా ఇచ్చే అవార్డులను ఇదే వేదికపై మంత్రి అమిత్ షా ఆయా సంఘాల ప్రతినిధులకు అందజేశారు.కేంద్ర మంత్రి అమిత్ షా చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న కేడీసీసీబీ పర్సన్ ఇంచార్జ్, జెసి గీతాంజలి శర్మ, సీఈవో శ్యామ్ మనోహర్ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంక్ (ఆప్కాబ్) మూడో బహుమతి పొందింది. ఆప్కాబ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి కేంద్ర మంత్రి అమిత్ షా చేతులమీదుగా అవార్డు అందుకున్నారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల్లో కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ మొదటి బహుమతిని, కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ మూడో బహుమతిని పొందాయి. కరీంనగర్ డిసిసి పొందిన అవార్డును అధ్యక్షులు రవీందర్ రావు, సీఈవో సత్యనారాయణ రావు కేంద్ర మంత్రి అమిత్ షా చేతులమీదుగా అందుకున్నారు. కెడిసిసి బ్యాంక్ బహుమతిని పర్సన్ ఇంచార్జ్, జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామ్ మనోహర్ కేంద్ర మంత్రి అమిత్ షా చేతులమీదుగా అందుకున్నారు. -
ప్రభుత్వాలు మేల్కొనాలి!
స్వేచ్ఛ నిజమైన విలువేమిటో గుర్తించాలంటే కారాగారం గురించి కాస్తయినా తెలిసి వుండాలంటారు. జైలంటే కేవలం అయినవాళ్లకు దూరం కావటమే కాదు... సమాజం నుంచి పూర్తిగా వేరుపడి పోవడం, పొద్దస్తమానం తనలాంటి అభాగ్యుల మధ్యే గడపాల్సిరావటం. అటువంటివారిలో విచా రణ ఖైదీలుగా ఉన్నవారికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన తాజా ప్రకటన ఊరటనిస్తుంది. కేసు విచారణ పూర్తయి పడే గరిష్ట శిక్షలో కనీసం మూడోవంతు కాలం జైల్లో గడిపి ఇంకా న్యాయం కోసం ఎదురుచూస్తూనేవున్న ఖైదీలను ఈనెల 26న జరగబోయే రాజ్యాంగ దినోత్సవానికి ముందు విడుదల చేస్తామని అమిత్ షా తెలియజేశారు. విచారణ కోసం దీర్ఘకాలం ఎదురుచూస్తూ గడిపే ఖైదీ ఒక్కరు కూడా ఉండరాదన్నది తమ ఉద్దేశమని చెప్పారు. ఇది మంచి నిర్ణయం. ప్రజాస్వామిక వాదులు ఎప్పటినుంచో ఈ విషయంలో ప్రభుత్వాలకు విజ్ఞప్తులు చేస్తూనేవున్నారు. కఠిన శిక్షలుపడి దీర్ఘకాలం జైల్లో వున్నవారిలో సత్ప్రవర్తన ఉన్నపక్షంలో జాతీయ దినోత్సవాల రోజునో, మహాత్ముడి జయంతి రోజునో విడుదల చేయటం ఆనవాయితీగా వస్తోంది. అయితే విచారణలోవున్న ఖైదీల విషయంలో ప్రభుత్వాలు క్రియాశీలంగా ఎప్పుడూ దృష్టి పెట్టలేదు. తగిన విధానం రూపొందించ లేదు. ఇందువల్ల జైళ్లు కిక్కిరిసి ఉంటున్నాయి. వాటి సామర్థ్యానికి మించి ఖైదీల సంఖ్య ఉండటంతో జైళ్ల నిర్వహణ అసాధ్యమవుతున్నది. అసహజ మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ఖైదీల మధ్య కొట్లాటలు జరుగుతున్నాయి. ఖైదీల్లో అత్యధికులు అట్టడుగు కులాలవారూ, మైనారిటీ జాతుల వారూ ఉంటారు. వీరంతా నిరుపేదలు. కేవలం ఆ ఒక్క కారణం వల్లే వీరి కోసం చొరవ తీసుకుని బెయిల్ దరఖాస్తు చేసేవారు ఉండరు. కనీసం పలకరించటానికి రావాలన్నా అయినవాళ్లకు గగన మవుతుంది. రానూ పోనూ చార్జీలు చూసుకుని, కూలి డబ్బులు కోల్పోవటానికి సిద్ధపడి జైలుకు రావాలి. అలా వచ్చినా ఒక్కరోజులో పనవుతుందని చెప్పడానికి లేదు. రాత్రి ఏ చెట్టుకిందో అర్ధాకలితో గడిపి మర్నాడైనా కలవడం సాధ్యమవుతుందా లేదా అన్న సందేహంతో ఇబ్బందులుపడే వారెందరో! బెయిల్ వచ్చినా ఆర్థిక స్తోమత లేక కారాగారాల్లోనే ఉండిపోతున్న ఖైదీల కోసం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2023 బడ్జెట్లో ఒక పథకాన్ని ప్రతిపాదించారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలోని కమిటీల సిఫార్సుతో ఈ పథకం వర్తిస్తుంది. విచారణలోవున్న ఖైదీకి రూ. 40,000, శిక్షపడిన ఖైదీకి రూ. 25,000 మంజూరుచేసి బెయిల్‌కు మార్గం సుగమం చేయటం దాని ఉద్దేశం. బెయిల్ వచ్చినా జామీను మొత్తం సమకూరకపోవటంతో 24,879 మంది ఖైదీలు బందీలుగా ఉండి పోయారని మొన్న అక్టోబర్‌లో సుప్రీంకోర్టు పరిశోధన విభాగం సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ ప్లానింగ్ (సీఆర్పీ) వెల్లడించింది. అయితే దీనివల్ల లబ్ధి పొందినవారు ఎందరని తరచి చూస్తే ఎంతో నిరాశ కలుగుతుంది. ప్రముఖ డేటా సంస్థ ‘ఇండియా స్పెండ్’ ఢిల్లీతోపాటు ఎనిమిది రాష్ట్రాల్లో ఈ పథకం అమలు తీరు ఎలావున్నదో ఆరా తీస్తూ సమాచార హక్కు చట్టంకింద దరఖాస్తులు చేస్తే ఇంతవరకూ కేవలం ఆరు రాష్ట్రాలు జవాబిచ్చాయి. అందులో మహారాష్ట్ర 11 మందిని, ఒడిశా ఏడుగురిని విడు దల చేశామని తెలపగా 103 మంది అర్హులైన ఖైదీలను గుర్తించామని ఢిల్లీ తెలిపింది. మూడు బిహార్ జైళ్లు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా విడుదలైనవారి వివరాలిచ్చాయి తప్ప పథకం లబ్ధిదారు లెందరో చెప్పలేదు. పథకం ప్రారంభం కాలేదని బెంగాల్ చెప్పగా, బీజేపీ రాష్ట్రాలైన యూపీ, మధ్య ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లు డేటా విడుదల చేయలేదు. కేరళ స్పందన అంతంతమాత్రం. ఫలానా పథకం అమలు చేస్తే ఇంత మొత్తం గ్రాంటుగా విడుదల చేస్తామని కేంద్రం ప్రకటిస్తే అంగలార్చుకుంటూ తొందరపడే రాష్ట్రాలకు దిక్కూ మొక్కూలేని జనానికి తోడ్పడే పథకమంటే అలుసన్న మాట!ఒక డేటా ప్రకారం దేశవ్యాప్తంగా ఖైదీల సంఖ్య 5,73,220 కాగా, అందులో 75.8 శాతంమంది... అంటే ప్రతి నలుగురిలో ముగ్గురు విచారణలో ఉన్న ఖైదీలే. మొత్తం 4,34,302 మంది విచారణ ఖైదీలని ఈ డేటా వివరిస్తోంది. విచారణ ఖైదీల్లో 65.2 శాతంమందిలో 26.2 శాతంమంది నిరక్షరాస్యులు. పదోతరగతి వరకూ చదివినవారు 39.2 శాతంమంది. రద్దయిన సీఆర్పీసీలోని సెక్షన్ 436ఏ నిబంధనైనా, ప్రస్తుతం వున్న బీఎన్ఎస్ఎస్లోని సెక్షన్ 479 అయినా నేరానికి పడే గరిష్ట శిక్షలో సగభాగం విచారణ ప్రారంభంకాని కారణంగా జైల్లోనే గడిచిపోతే బెయిల్‌కు అర్హత ఉన్నట్టే అంటున్నాయి. అయితే మరణశిక్ష లేదా యావజ్జీవ శిక్ష పడే నేరాలు చేసినవారికి ఇది వర్తించదు. బీఎన్ఎస్ఎస్ అదనంగా మరో వెసులుబాటునిచ్చింది. తొలి నేరం చేసినవారు విచారణ జరిగితే పడే గరిష్ట శిక్షలో మూడోవంతు జైలులోనే ఉండిపోవాల్సి వస్తే అలాంటి వారికి బెయిల్ ఇవ్వొచ్చని సూచించింది. బహుళ కేసుల్లో నిందితులైన వారికిది వర్తించదు.నిబంధనలున్నాయి... న్యాయస్థానాలు కూడా అర్హులైన వారిని విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. నిరుడు కేంద్రమే ఖైదీల కోసం పథకం తీసుకొచ్చింది. పైగా బీఎన్ఎస్ఎస్ 479 నిబంధనను ఎందరు వర్తింపజేస్తున్నారో చెప్పాలని సుప్రీంకోర్టు 36 రాష్ట్రాలూ, కేంద్రపాలిత ప్రాంతా లకూ మొన్న ఆగస్టులో ఆదేశాలిస్తే ఇంతవరకూ 19 మాత్రమే స్పందించాయి. ఇది న్యాయమేనా? పాలకులు ఆలోచించాలి. ఈ అలసత్వం వల్ల నిరుపేదలు నిరవధికంగా జైళ్లలో మగ్గుతున్నారు.కేంద్రం తాజా నిర్ణయంతోనైనా ప్రభుత్వాలు మేల్కొనాలి. విచారణలోవున్న ఖైదీల్లో ఎంతమంది అర్హుల్లో నిర్ధారించి, కేంద్ర పథకం కింద లబ్ధిదారుల జాబితాను రూపొందించాలి. వారి విడుదలకు చర్యలు తీసుకోవాలి. -
అప్రమత్తంగా ఉండాలి!
న్యూఢిల్లీ/ఇంఫాల్: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో కొనసాగుతున్న హింసాకాండ, ప్రజల భద్రత, తాజా పరిణామాలపై కేంద్ర హోంశాఖ అమిత్ షా వరుసగా రెండో రోజు సోమవారం సైతం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మణిపూర్ అధికారులతోపాటు కేంద్ర ప్రభుత్వ అధికారులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో సాధ్యమైనంత త్వరగా శాంతి భద్రతలను పునరుద్ధరించాలని, ఆ దిశగా వెంటనే చర్యలు చేపట్టాలని అమిత్ షా ఈ సందర్భంగా ఆదేశించారు.మణిపూర్‌లో కేంద్ర బలగాల మోహరింపుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సాధారణ పరిస్థితులు నెలకొనేదాకా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జాతుల మధ్య ఘర్షణలతో మణిపూర్ గత ఏడాదిన్నర కాలంగా అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. మైతేయి, కుకీ వర్గాల మధ్య హింసాకాండలో ఇప్పటిదాకా 220 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. మణిపూర్‌కు 50 కంపెనీల బలగాలు మణిపూర్‌కు అదనంగా 50 కంపెనీల సెంట్రల్ ఆర్మ్డ్ పోలీసు ఫోర్సెస్(సీఏపీఎఫ్) బలగాలను పంపించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బలగాల్లో 5,000 మందికిపైగా సిబ్బంది ఉంటారని అధికార వర్గాలు సోమవారం వెల్లడించాయి. రాష్ట్రంలో భద్రతా పరమైన సవాళ్లను ఎదుర్కోవడానికి, శాంతి భద్రతలను పునరుద్ధరించడానికి అదనపు బలగాలను రంగంలోకి దించాలని నిర్ణయించినట్లు తెలియజేశాయి. కేంద్ర హోంశాఖ ఇప్పటికే 20 అదనపు సీఏపీఎఫ్ కంపెనీలను మణిపూర్‌కు పంపించింది. ఇందులో 15 సీఆర్పీఎఫ్, ఐదు బీఎస్ఎఫ్ కంపెనీలు ఉన్నాయి. మరో వారం రోజుల్లోగా అదనంగా 50 కంపెనీలను పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు మణిపూర్ సమగ్రతపై ఏర్పాటైన సమన్వయ కమిటీ(కోకోమీ) నేతృత్వంలో నిరసనకారులు కర్ఫ్యూ నిబంధనలను ధిక్కరిస్తూ సోమవారం ఇంఫాల్ వెస్ట్ జిల్లాలో పలు ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు వేశారు. జిరిబామ్‌లో ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారుల హత్యకు నిరసనగా వారు తాళాలు వేసే కార్యక్రమం చేపట్టారు. కోకోమీకి మైతేయిల్లో బలమైన పట్టుంది. రాష్ట్రంలో ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ సేవలను మరో రెండు రోజులపాటు నిలిపివేస్తూ మణిపూర్ ప్రభుత్వం సోమవారం నిర్ణయం తీసుకుంది.మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం సమావేశం మణిపూర్ పరిణామాలపై చర్చించడానికి ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ సోమవారం సాయంత్రం మంత్రులు, ఎన్డీయే ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. శాంతి భద్రతలపై సమీక్షించారు. మణిపూర్‌లో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి నేషనల్ పీపుల్స్ పారీ్ట(ఎన్పీపీ) మద్దతు ఉపసంహరించిన సంగతి తెలిసిందే. 60 స్థానాలున్న మణిపూర్ అసెంబ్లీలో ఎన్పీపీకి ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎన్పీపీ మద్దతు ఉపసంహరించినప్పటికీ ప్రభుత్వానికి వచి్చన ముప్పేమీ లేదు. బీజేపీకి 32 మంది ఎమ్మెల్యేలు ఉండగా, నాగా పీపుల్స్ ఫ్రంట్‌కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు, జేడీ(యూ)కు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు సైతం ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు. -
అమిత్ షా వరుస రివ్యూలు.. మణిపూర్‌కు అదనపు బలగాలు
న్యూఢిల్లీ:మణిపూర్‌లో ఇటీవల మళ్లీ హింస చెలరేగుతోంది. దీంతో అక్కడి తాజా పరిస్థితులపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దేశ రాజధాని ఢిల్లీలో వరుస ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మణిపూర్‌లో శాంతిభద్రతలు అదుపులోకి తెచ్చేందుకు కేంద్రహోంశాఖ చర్యలు మొదలుపెట్టింది. త్వరలో 50 కంపెనీల అదనపు బలగాలను కేంద్రం మణిపూర్‌కు తరలించేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది.దీనిపై హోం మంత్రిత్వ శాఖలో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా కేంద్ర హోం మంత్రిత్వశాఖ బృందం త్వరలో రాష్ట్రంలోని కీలక ప్రాంతాలను సందర్శించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. కాగా, మణిపూర్‌లో జాతుల మధ్య వైరం ఇంకా కొనసాగుతూనే ఉంది. -
Video: అమిత్‌షా హెలికాప్టర్‌ను తనిఖీ చేసిన ఈసీ అధికారులు
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముంగిట రాష్ట్రంలో అధికారుల తనిఖీలు ముమ్మరం చేశారు. సాధారణ పౌరులతోపాటు ప్రముఖ రాజకీయ నేతల వాహనాలను క్షణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలే, శిసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే, సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ దేవేంద్ర ఫడ్నవీస్‌ల వాహనాలను సైతం తనిఖీ చేశారు. తాజాగా హింగోలి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం కోసం వచ్చిన హోంమంత్రి అమిత్ షా హెలికాప్టర్లో ఎన్నికల సంఘం అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆయన బ్యాగ్‌లను చెక్ చేశారు. ఈ విషయాన్ని అమిత్ షా నే స్వయంగా వెల్లడించారు. తనిఖీలకు సంబంధించిన వీడియోను ఎక్స్‌లో పోస్టు చేశారు.‘ఎన్నికల ప్రచారం మహారాష్ట్రలోని హింగోలి అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చిన క్రమంలో నా హెలికాప్టర్‌ను ఈసీ అధికారులు తనిఖీ చేశారు. నిష్పక్షపాత, ఆరోగ్యకరమైన ఎన్నికల వ్యవస్థను బీజేపీ విశ్వసిస్తోంది. ఎన్నికల సంఘం రూపొందించిన అన్ని నిబంధనలను పాటిస్తుంది. ఎన్నికల నిర్వహణ సజావుగా సాగేందుకు మనమంతా సహకరించాలి. ప్రపంచంలో శక్తిమంతమైన ప్రజాస్వామ్య వ్యవస్థగా భారత్‌ను కొనసాగించడంలో మన బాధ్యతలను నిర్వర్తించాలి’ అని అమిత్ షా పేర్కొన్నారు.आज महाराष्ट्र की हिंगोली विधानसभा में चुनाव प्रचार के दौरान चुनाव आयोग के अधिकारियों के द्वारा मेरे हेलिकॉप्टर की जाँच की गई। भाजपा निष्पक्ष चुनाव और स्वस्थ चुनाव प्रणाली में विश्वास रखती है और माननीय चुनाव आयोग द्वारा बनाए गए सभी नियमों का पालन करती है। एक स्वस्थ चुनाव… pic.twitter.com/70gjuH2ZfT— Amit Shah (@AmitShah) November 15, 2024 -
Amit Shah: 23న హేమంత్ అండ్ కంపెనీకి వీడ్కోలే
దుమ్రీ: జార్ఖండ్‌లో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అండ్ కంపెనీకి ఈ నెల 23న బీజేపీ వీడ్కోలు పలకడం ఖాయమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. జార్ఖండ్‌లోకి అక్రమ చొరబాట్లను హేమంత్ ప్రభుత్వం ప్రోత్సహించిందని ఆరోపించారు. చొరబాటుదార్లు ఇక్కడి గిరిజనుల బిడ్డలను వివాహాలు చేసుకున్నారని, వారి భూములను ఆక్రమించుకున్నారని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి చొరబాటుదార్లను బయటకు తరిమికొడతామని, భూములను వెనక్కి తీసుకొని గిరిజనులకు అందజేస్తామని ప్రకటించారు. ఇందుకోసం ఒక చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. గురువారం జార్ఖండ్‌లోని దుమ్రీలో ఎన్నికల ప్రచారంలో అమిత్ షా పాల్గొన్నారు. హేమంత్ సోరెన్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, ప్రజల సంక్షేమం కోసం ఖర్చు చేయాల్సిన నిధులను దోచుకుందని మండిపడ్డారు. జనం సొమ్మును కొట్టగొట్టిన హేమంత్ అండ్ కంపెనీకి వీడ్కోలు తప్పదని స్పష్టంచేశారు. జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన కాంగ్రెస్, ఆర్జేడీ కూటమితో హేమంత్ సోరెన్ జట్టుకట్టారని విమర్శించారు. పరిశ్రమలు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కావాలంటే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని అమిత్ షా కోరారు. జమ్మూకశీ్మర్‌లో ఇండియాలో అంతర్భాగమని, ఆరి్టకల్ 370ని మళ్లీ తీసుకొచ్చేసత్తా ఎవరికీ లేదని తేల్చిచెప్పారు. ఓబీసీ రిజర్వేషన్లను ముస్లింలకు అప్పగించడానికి ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోమని, రాహుల్ బాబా నా లుగో తరం కూడా ఆ పని చేయలేదని అన్నారు. చట్టంలో సవరణ తీసుకొస్తాం రాహుల్ గాందీని రాజకీయాల్లో ప్రవేశపెట్టేందుకు ఆయన మాతృమూర్తి సోనియా గాంధీ ఇప్పటిదాకా 20 సార్లు ప్రయతి్నంచారని అమిత్ షా చెప్పారు. ఆ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని, రాహుల్ గాంధీ విమానం ల్యాండ్ కాలేదని అన్నారు. 21వ ప్రయత్నంలో జార్ఖండ్‌లో రాహుల్ గాంధీ విమానం కుప్పకూలడం తథ్యమని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలనలోని కర్ణాటకలో వక్ఫ్ బోర్డు హిందూ ప్రాచీన దేవాలయాల భూములను ఆక్రమించిందని ఆరోపించారు. వ్యవసాయ భూములను కూడా కబ్జా చేసిందని పేర్కొన్నారు. ఇలాంటి కబ్జాలను అడ్డుకోవడానికి చట్టంలో సవరణ చేస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా, జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ నెల 23న జరుగనుంది. -
ఇందిరా గాంధీ తిరిగొచ్చినా ఆర్టికల్ 370 పునురుద్దరించబోం: అమిత్ షా
కేంద్రపాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దుపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. దివంగత ఇందిరా గాంధీ స్వర్గం నుంచి తిరిగొచ్చినా.. ఆర్టికల్ 370 పునరుద్దరించబోమని స్పష్టం చేశారు. ఈ మేరకు మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ.. పదేళ్ల సోనియా గాంధీ-మన్మోహన్ సింగ్ పాలనలో ఉగ్రవాదులు సులభంగా జమ్ముకశ్మీర్‌లో ప్రవేశించి బాంబు దాడులకు పాల్పడ్డారని విమర్శలు గుప్పించారు. శ్రీనగర్‌లోని లాల్ చౌక్‌ను సందర్శించిన సందర్భంగా తాను భయపడ్డానని కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుశీల్‌కుమార్ షిండే చేసిన వ్యాఖ్యలపై షా స్పందిస్తూ.. షిండే జీ, మీ మనవళ్లతో కలిసి ఇప్పుడు కాశ్మీర్‌కు వెళ్లండి, మీకు ఎటువంటి హాని జరగదు’ అని అన్నారు.కాగా జమ్ముకశ్మీర్‌లో ఇటీవల ఏర్పడిన ఓమర్ అబ్దుల్లా నేతృత్వంలోని ఎన్సీ ప్రభుత్వం.. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370ను పునరుద్దరించాలని అసెంబ్లీలో తీర్మాణాన్ని ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే.కొద్ది రోజుల క్రితం మహారాష్ట్రలో జరిగిన మరో ర్యాలీలో కేంద్రమంత్రి ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. రాహుల్ గాంధీ నాల్గో తరం కూడా కాశ్మీర్లో ఆర్టికల్ 370ని పునరుద్ధరించలేరని అన్నారు. దేశ భద్రత కోసం ప్రధాని మోదీ చాలా కృషి చేశారని షా అన్నారు. -
కేంద్రమంత్రి అమిత్ షాకు బొత్స సత్యనారాయణ లేఖ
-
ముంబయి: రాహుల్‌గాంధీపై అమిత్ షా ఫైర్
ముంబయి: రాహుల్‌గాంధీ నాలుగు తరాలొచ్చినా జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 పునరుద్ధరించలేరని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం(నవంబర్ 11) ముంబయిలో నిర్వహించిన ప్రచార సభలో అమిత్ షా ప్రసంగించారు.‘ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో ఉగ్రవాదం, నక్సలిజం నిర్మూలించారు.మీ నాలుగు తరాలొచ్చినా కశ్మీర్లో ఆర్టికల్ 370 పునరుద్ధరణ సాధ్యం కాదని రాహుల్‌కు చెబుతున్నా.బీజేపీకి రాజకీయ అధికారం కన్నా కశ్మీర్ సమస్యే హృదయానికి దగ్గరగా ఉంటుంది’అని అమిత్ షా అన్నారు. కాగా, ఇటీవలే మహారాష్ట్రలో బీజేపీ మేనిఫెస్టోను అమిత్ షా విడుదల చేశారు.వృద్ధులకు పెన్షన్ పెంపు, మహిళలకు నగదు బదిలీ వంటి హామీలను బీజేపీ ఇచ్చింది. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 20న జరగనున్నాయి. 23న ఫలితాలు వెలువడనున్నాయి. మహాయుతి(ఎన్డీఏ), మహావికాస్ అఘూడీ(ఎంవీఏ) కూటములు ఎన్నికల్లో పోటీపడుతున్నాయి.ఇదీ చదవండి: మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం.. కన్నెత్తి చూడని సెలబ్రిటీలు -
మావోయిస్టులు కూడా అంతర్మథనం చేసుకుని..
మానవ సమాజ పరి ణామ క్రమంలో పుట్టుకు వచ్చిన పెట్టుబడిదారీ వ్యవ స్థలో... యజమాని, కూలి వంటి వర్గాలు ఏర్పడ్డాయి. వర్గాల మధ్య అంతర్గత మైన అణచివేతలు, దోపిడీ కొనసాగింది. రైతులు, కూలీలు చేసిన ఉత్ప త్తులను యాజమానులు సంపదగా మలుచుకొని దోపిడీకి తెగబడ్డారు. మానవ సమాజాన్ని కారల్ మార్క్స్ అధ్యయనం చేసి దోపిడీ చేసే వర్గం సమాజంలో తక్కువగా ఉన్నదనీ, దోపిడీకి గురయ్యే వర్గం ఎక్కువగా ఉన్నదనీ చెప్పాడు. దోపిడీకి గురైన వారు ఐక్యంగా ఉండి తిరగ బడినప్పుడు మాత్రమే దోపిడీ రహిత సమాజాన్ని నిర్మించవచ్చని తెలిపాడు. దానికి మొదటగా 1848లో మొదటి ‘కమ్యూనిస్టు ప్రణాళిక’ను ప్రవేశ పెట్టాడు. మానవ కల్యాణానికి వర్గ రహిత సమాజ నిర్మాణానికి కారల్ మార్క్స్ కృషి చేశాడు.1895 అమెరికాలోని షికాగో నగరంలో అణచి వేయబడిన కార్మికులు... తడిచిన రక్తంలో తడిచిన కండువాను ఎర్రజెండాగా ఎగురవేసి కార్మికుల హక్కులకై పోరాటం చేశారు. ఈ ఉద్యమం అణచివేత, ఆవేదన, దోపిడీ నుండి పుట్టుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా వామపక్ష పార్టీలు విస్తరించాయి. ఈ విస్తరణలో భాగంగా శ్రీలంకలో వామపక్ష పార్టీ అధికార పగ్గాలు చేపట్టింది. ఈ క్రమంలోనే భారత్‌లోని అన్ని వామ పక్షాలూ ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరాన్ని గుర్తించాలి.భారతదేశం విభిన్న కులాలు, మతాలు, సంస్కృతుల సమ్మేళనం. ఇక్కడ వామపక్ష భావజాలా నికి స్థానం ఉంది. అయితే విస్తరించడానికి అడ్డంకులు ఉన్నాయి. భారతదేశంలో 1925లో కమ్యూ నిస్టు పార్టీ (సీపీఐ) స్థాపన జరిగింది. అయితే సిద్ధాంతపరమైన విభేదాల వలన ఇది అనేక పార్టీలుగా చీలిపోయింది. 1952లో సాధారణ ఎన్నికలు జరిగాయి. ప్రజల చేత, ప్రజల కొరకు ప్రభుత్వం ఏర్పడాలి. కానీ కుల, మత పార్టీలు పుట్టుకొచ్చాయి. భారతదేశంలో కమ్యూనిస్టులు శ్రమజీవుల పక్షాన, కార్మికుల పక్షాన నిలబడ్డారు. కమ్యూనిస్టులు పోరాటాల ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజాస్వామ్య పద్ధతులలో హక్కులను పొందాలని ప్రయత్నిస్తున్నారు. అయితే వామపక్ష పార్టీలలో మావోయిస్టులు తుపాకీ గొట్టం ద్వారానే హక్కులను సాధించుకుందామనే ఆలోచనతో పోరాటం చేస్తున్నారు. వారు చేస్తున్న పోరాట రూపం తప్పు కావచ్చు. కానీ లక్ష్యం సరైనదే.నరేంద్రమోదీ, అమిత్‌షాలు వామపక్ష పార్టీలే ప్రధాన బద్ధశత్రువులుగా చూస్తున్నారు. వామపక్ష భావాలు కలిగిన వారిపై ఉపా, రాజద్రోహం కేసులు పెడుతూ బెయిల్ రాకుండా సంవత్సరాల తరబడి జైల్లోనే ఉంచటం చూస్తున్నాము. ఇప్పుడు మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా వందలమంది మావోయిస్టులను బలిగొంటున్నారు. వచ్చే ఏడాదికి నక్సలైట్లను నిర్మూలిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటనలు ఇస్తున్నారు. దానికి కారణం భారతదేశంలో వామపక్ష పార్టీలు లేకుండా చేయాలనే దుర్బుద్ధి తప్ప మరొకటి కాదు.చదవండి: ఆ ప్రాజెక్టుకు 10 లక్షల చెట్ల బలి!మావోయిస్టు పార్టీలే కాదు... పార్లమెంట్ పంథాలో పనిచేస్తున్న వామపక్షాలు కూడా అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటున్నాయి. ప్రజాస్వామ్యంలో ఓట్లు కీలకమైనందున ఓట్లు రాబట్టడానికి వామపక్షేతర పార్టీలు అడ్డమైనదారులు తొక్కుతూ అధికారమే పరమావధిగా ఓటర్లను ప్రభావితం చేసే సాధనాలను ఆశ్రయిస్తున్నాయి. డబ్బు, మద్యం, సంక్షేమ పథకాల ఎర చూపి అరచేతిలో స్వర్గం చూపిస్తున్నాయి. అందుకే అవి గెలుస్తు న్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలవాలి. కాని దోపిడీ శక్తులూ, వారికి అండగా ఉండే మతోన్మాద శక్తులూ అధికారం హస్తగతం చేసుకుంటున్నాయి. దీంతో కార్మికులు, కూలీలు, బడుగు బలహీనవర్గాల శ్రమకు తగ్గ ఫలితం రావడం లేదు. సామాజిక న్యాయం నినాదానికే పరిమితం అయ్యింది.వామపక్ష పార్టీలు ఎక్కడ అణచివేతలు, దోపిడీ ఉంటాయో అక్కడే ఉంటాయి. కొన్ని పార్టీల వారిని ఉగ్రవాదులుగా ముద్రవేసి వారిని నిర్మూలిస్తామని ప్రభుత్వం ప్రకటిస్తున్నది. అయితే ఉగ్రవాదులని అంటున్న వారికీ ప్రజా మద్దతు ఉన్న విషయాన్ని మరువరాదు. ఇదే తరుణంలో మావోయిస్టులు కూడా అంతర్మథనం చేసుకుని ప్రత్యామ్నాయ ఆలోచనలకు పదును పెట్టాలి.చదవండి: గ్రామీణ భారత వెన్ను విరుస్తారా?ప్రజలు తమ వంతుగా ప్రజాస్వామ్య ఫలాలు పొందడానికి పాలకులను ఆలోచింప చేసే విధంగా చైతన్యాన్ని ప్రదర్శించాలి. ప్రభుత్వ దమన చర్యలను ప్రజాస్వామ్య పద్ధతులలో మావోయిస్టులు తిప్పిగొట్టాలి. ‘కన్నుకు కన్ను... చావుకు చావు’ అనే సిద్ధాంతం నుండి కాకుండా కమ్యూ నిస్టులు ఐక్య పోరాటం చేసి అణచివేతలను వర్గ రహిత సమా జాన్ని నిర్మించాలి. మితవాద, మతవాద శక్తుల నుండి దేశం తీవ్ర ప్రమాదం ఎదుర్కొంటున్న ఈ దశలో వామపక్ష, ప్రజాతంత్ర, ప్రగతిశీల శక్తులన్నీ ఐక్యంగా దానిని తిప్పికొట్టాలి. అందుకు తరుణమిదే! - చాడ వెంకటరెడ్డిసీపీఐ జాతీయ కార్యవర్గసభ్యులు -
మహారాష్ట్ర బీజేపీ మ్యానిఫెస్టో విడుదల
-
Maharashtra Assembly elections 2024: మతమార్పిడి నిరోధ చట్టం
ముంబై: మహారాష్ట్రలో అధికారంలోకి వస్తే కఠినమైన నిబంధనలతో మత మార్పిడి నిరోధక చట్టం తెస్తామని బీజేపీ ప్రకటించింది. అల్పాదాయ కుటుంబాలకు ఉచితంగా రేషన్ సరుకులు అందజేస్తామని, యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి పరిశ్రమల అవసరాలకు తగ్గట్టు తీర్చిదిద్దుతామని పేర్కొంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం ‘సంకల్ప పత్రం–2024’ పేరిట బీజేపీ మేనిఫెస్టోను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం విడుదల చేశారు. మేనిఫెస్టోలో 25 హామీలను పొందుపర్చారు. → బలవంతపు, మోసపూరిత మత మార్పిడులను అడ్డుకోవడానికి కఠిన చట్టం → లడ్కీ బెహన్ యోజన కింద మహిళలకు ఆర్థిక సాయం నెలకు రూ.1,500 నుంచి రూ.2,100→ యువతకు 25 లక్షల ఉద్యోగాల సృష్టి. 10 లక్షల మంది విద్యార్థులకు నెలకు రూ.10 వేల స్టైపెండ్ → అక్షయ్ అన్న యోజన కింద అల్పాదాయ వర్గాలకు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఉచితంగా రేషన్ సరుకులు → అడ్వాన్స్డ్ రోబోటిక్ అండ్ ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ట్రైనింగ్ హబ్‌గా మహారాష్ట్ర అభివృద్ధి → ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆకాంక్ష సెంటర్ల ద్వారా కొత్తగా 10 లక్షల మంది బిజినెస్ లీడర్ల తయారీ → 2027 నాటికి 50 లక్షల మంది లఖ్పతతీ దీదీల సృష్టి. 500 సంఘాలతో పారిశ్రామిక క్లస్టర్ → ఆధునిక ఏరోనాటికల్, స్పేస్ మాన్యుఫ్యాక్చరింగ్ సెంటర్లుగా నాగపూర్, పుణే, ఛత్రపతి శంభాజీనగర్, నాసిక్, అహిల్యానగర్అధికారం కోసం ఓటు బ్యాంకు రాజకీయాలా: అమిత్ షాజల్గావ్/బుల్దానా: మహారాష్ట్రలో విపక్ష మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) బుజ్జగింపు, ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని అమిత్ షా ఆరోపించారు. రాజకీయ అవసరాల కోసం ఏ స్థాయికైనా దిగజారడం ఆ కూటమికి అలవాటేనన్నారు. ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు కలి్పంచాలంటూ ఉలేమా కౌన్సిల్ చేసిన డిమాండ్‌కు పీసీసీ అధ్యక్షుడు నానా పటోలే అంగీకరించారన్నారు. ఆదివారం మహారాష్ట్రలోని జల్గావ్, బుల్దానాల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో అమిత్ షా ప్రసంగించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు లాక్కొని ముస్లింలకు కట్టబెట్టానికి ఎంవీఏ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి ఉందని గుర్తుచేశారు. ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలంటే ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లలో కోత పెట్టాల్సి ఉంటుందన్నారు. ఎంవీఏ నేతలు అధికార దాహంతో బడుగు బలహీన వర్గాలకు అన్యాయం చేయడానికి సిద్ధపడుతున్నారని విమర్శించారు. -
ఆర్టికల్ 370 పునరుద్ధరణపై రాహుల్ గాంధీకి అమిత్ షా వార్నింగ్
రాంచీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రాజ్యాంగానికి సంబంధించిన నకిలీ కాపీని చూపించి అవమానించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. మైనారిటీలకు రిజర్వేషన్లు అమలు చేసేందుక కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలను బీజేపీ ఎప్పటికీ అనుమతించదని అన్నారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షా.. పాలమూలో నిర్వహించిన సభలో మాట్లాడారు.‘‘రాహుల్ గాంధీ రాజ్యాంగం కాపీని చూపించారు. ఆయన చూపించిన రాజ్యాంగం కాపీ కవర్‌పై భారత రాజ్యాంగం అని వ్రాసి ఉంది. అందులో ఏ కంటెంట్ లేదు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేశాడు. నకిలీ రాజ్యాంగ కాపీతో బీఆర్ అంబేద్కర్‌ను అవమానించారు. నవంబర్ 26వ తేదీని రాజ్యాంగ దినోత్సవంగా నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించారు. ఓబీసీలు, గిరిజనులు, దళితుల నుంచి రిజర్వేషన్లను లాక్కోవడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోంది. ఆ రిజర్వెషన్లనుమైనారిటీలకు ఇవ్వాలని యోచిస్తోంది. ప్రధాని మోదీ నాయకత్వంలో.. మత ఆధారిత రిజర్వేషన్లను బీజేపీ ఎన్నటికీ అనుమతించదు. కశ్మీర్లో ఆర్టికల్ 370ని పునరుద్ధరించడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోంది. కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం. కాంగ్రెస్ నాలుగో తరం కూడా ఆర్టికల్ 370ని తిరిగి తీసుకురాదని నేను రాహుల్ గాంధీని హెచ్చరిస్తున్నా. జార్ఖండ్‌లో జేఎంఎం నేతృత్వంలోని ప్రభుత్వం.. దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వాన్ని దించాల్సిన అవసరం ఉంది. ఇక.. అవినీతిపరులను తలకిందులుగా వేలాడదీస్తాం’ అని అన్నారు.ఇక.. జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 13, 20 తేదీల్లో రెండు దశల్లో జరగనున్నాయి. నవంబర్ 23న ఫలితాలు విడుదల కానున్నాయి.చదవండి: దారుణం: రైలు ఇంజిన్-బోగీల మధ్య ఇరుక్కుపోయి ఉద్యోగి మృతి -
రాహుల్ భావితరాలు కూడా.. ఆర్టికల్ 370ని పునరుద్ధరించలేవు
సాంగ్లి (మహారాష్ట్ర): కాంగ్రెస్ నేత రాహుల్ గాం«దీ, ఆయన వారసులు కూడా జమ్మూశ్మీమర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370 పునరుద్ధరించలేరని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. అది వారి వల్లకాదన్నారు. సాంగ్లిలో మహాయుతి తరఫున శుక్రవారం అమిత్ షా ప్రచారంలో పాల్గొన్నారు. ప్రత్యేక ప్రతిపత్తి పునరుద్ధరించాలని సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం బుధవారం జమ్మూశ్మీమర్ అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయం తెలిసిందే. దీనికి కాంగ్రెస్ మద్దతునివ్వడంతో అమిత్ షా హస్తం పార్టీని లక్ష్యంగా చేసుకున్నారు. ఆర్టికల్ 370 రద్దును విపక్ష నేతలు రాహుల్ గాందీ, ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్లు వ్యతిరేకించారని షా గుర్తుచేశారు. ‘ఛత్రపతి శివాజీ మహారాజ్ గడ్డపై నుంచి చెబుతున్నా.. రాహుల్ బాబా. మీరు లేదా మీ నాలుగోతరం వారసులు కూడా ఆర్టికల్ 370ని పునరుద్ధరించలేరు. శ్మీమర్ కోసం దేశంలోని ప్రతి వ్యక్తి పోరాటానికి సిద్ధంగా ఉన్నారు’అని అమిత్ షా అన్నారు. ‘ఆర్టికల్ 370ని రద్దు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకున్నపుడు పార్లమెంటులో నేనా బిల్లును ప్రవేశపెట్టాను. రాహుల్ గాం«దీ, మమతా బెనర్జీ, శరద్ పవార్, అఖిలేశ్ యాదవ్, ఎంకే స్టాలిన్లు దీన్ని వ్యతిరేకించారు. దీనివల్ల శ్మీమర్ లోయలో రక్తపాతం జరుగుతుందన్నారు. రక్తం ప్రవహించడం మాట అటుంచితే కనీ సం రాయి విసిరే సాహసం కూడా ఎవరూ చేయలేదు’అని అమిత్ షా పేర్కొన్నారు. యూపీఏ హయాంలో తరచూ ఉగ్రదాడులు జరిగేవి. ఉరి, పుల్వామా ఘటనల తర్వాత చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్‌తో పాకిస్తాన్‌లోని తీవ్రవాదులు తుడిచిపెట్టుకుపోయారని ఆయన అన్నారు. 70 ఏళ్లుగా అయోధ్యలో రామమందిరం నిర్మాణాన్ని కాంగ్రెస్ అడ్డుకుందని ఆరోపించారు. మోదీ ప్రయత్నాల వల్ల అది సాకారమైందని అమిత్ షా అన్నారు. -
Amit Shah: త్వరలో ఉగ్రవాద వ్యతిరేక విధానం
న్యూఢిల్లీ: ఉగ్రవాదులను ఏరిపారేయడంతోపాటు వారి నెట్‌వర్క్‌ను పూర్తిగా ధ్వంసం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. త్వరలో జాతీయ స్థాయిలో ఉగ్రవాద వ్యతిరేక విధానం తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి పటిష్టమైన వ్యూహంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని అన్నారు. ఉగ్రవాద నియంత్రణపై గురువారం ఢిల్లీలో జరిగిన సదస్సులో అమిత్ షా మాట్లాడారు. రాష్ట్రాల డీజీపీలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భద్రతా, నిఘా సంస్థల అధినేతలు పాల్గొన్నారు. శాంతి భద్రతలు రాష్ట్రాల పరిధిలోని అంశమే అయినప్పటికీ, రాష్ట్రాలు భౌతికమైన సరిహద్దులు కలిగి ఉన్నప్పటికీ, రాజ్యాంగపరంగా కొన్ని పరిమితులు ఉన్నప్పటికీ.. ఉగ్రవాదానికి అలాంటి సరిహద్దులు, పరిమితులు ఉండవని అమిత్ షా గుర్తుచేశారు. అందుకే ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి అన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి వ్యూహాలు, నిఘా సమాచారాన్ని పంచుకోవడం, పరస్పర సమన్వయం వంటి చర్యలు అవసరమని సూచించారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల కోసం మోడల్ ఉగ్రవాద వ్యతిరేక స్క్వాడ్ (ఏటీఎస్), మోడల్ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ (ఎస్టీఎఫ్) తీసుకు రావాలని యోచిస్తు న్నట్లు వెల్లడించారు. ఉగ్రవాదాన్ని ఎదిరించడానికి ఇవి ఉమ్మడి వేదికలుగా ఉపయోగపడతాయని పేర్కొ న్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకు రానున్న యాంటీ–టెర్రరిజం పాలసీ, స్ట్రాటజీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భద్రతా సిబ్బంది, పోలీసుల పాత్ర అత్యంత కీలకమని ఉద్ఘాటించారు. ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. -
Big Question: ఢిల్లీలో డీసీఎం పాలిటిక్స్.. టెన్షన్ లో బాబు
-
తస్సుమనిపించిన పవన్ ఢిల్లీ పర్యటన!
న్యూఢిల్లీ, సాక్షి: హస్తిన పర్యటనకు వెళ్లిన ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. గంట గడవక ముందే తిరుగుపయనం అయ్యారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అని చెప్పి హడావిడి చేసి.. కేవలం 10-15 నిమిషాలపాటే ఆయనతో చర్చించారు. తీరా బయటకు వచ్చాక ‘జరిగింది మర్యాదపూర్వక భేటీ’ అని స్టేట్మెంట్ ఇచ్చి తుస్సుమనిపించారు.ఏపీ కూటమి ప్రభుత్వంలో భాగమైన బీజేపీ అగ్రనేతతో, అందునా హోం మంత్రితో పవన్ కల్యాణ్ భేటీ అవుతుండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అందుకు.. రెండ్రోజుల కిందట పవన్ చేసిన సంచలన వ్యాఖ్యలే కారణం. ఏపీలో శాంతిభద్రతలు దారుణంగా క్షీణించాయని, పోలీసులు పదే పదే చెప్పించుకుంటున్నారని, హోం మంత్రి అనిత కూడా బాధ్యతయుతంగా ఉండాలని.. లేనిపక్షంలో తప్పుకోవాలని హెచ్చరించారు. అలాగే.. తాను హోం మంత్రి పదవి తీసుకుంటే పరిస్థితులు మరోలా ఉంటాయని వ్యాఖ్యానించారు.దీంతో ఏపీ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కూటమి పార్టీల నడుమ నిజంగానే ఏదైనా జరుగుతోందా? లేదంటే డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే ఈ డ్రామానా? అనే అనుమానాలు తలెత్తాయి. ఈలోపే.. పవన్ ఉన్నపళంగా ఢిల్లీకి వెళ్లి హోం మంత్రి అమిత్ షాతో భేటీ అవుతుండడంపై అనేక కోణాల్లో చర్చ నడిచింది. పవన్ తాజా వ్యాఖ్యలే ప్రధానాంశంగా ఈ భేటీ ఉండొచ్చనే కోణమూ అందులో ఉంది. కానీ, వాటన్నింటిని పటాపంచల్ చేస్తూ.. మర్యాదపూర్వక భేటీ అని చెప్పి తుస్సుమనిపించారు. దీంతో ఇది కూడా డ్రామానేనా? అనే అనుమానాలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. అంతేకాదు డిప్యూటీ సీఎం హోదాలో తన తొలి ఢిల్లీ పర్యటనలోనే ప్రజాధనాన్ని పవన్ ఇలా వృథా చేశారన్నమాట. -
‘యూసీసీ’ అమలు చేస్తాం.. జార్ఖండ్ బీజేపీ మేనిఫెస్టోలో కీలక హామీలు
రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల బీజేపీ మేనిఫెస్టోను కేంద్రహోం మంత్రి అమిత్‌షా ఆదివారం(నవంబర్ 3) రాంచీలో విడుదల చేశారు. మేనిఫెస్టోకు సంకల్ప్ పత్ర’ అని నామకరణం చేశారు. సంకల్ప పత్రలో బీజేపీ పలు కీలక హామీలిచ్చింది. బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) అమలు చేస్తామని(గిరిజనులకు మినహాయింపు), ‘గోగో దీదీ’ స్కీమ్ కింద మహిళలకు నెలకు రూ.2100 నగదు ఇస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడి 25 ఏళ్లు పూర్తయినందున రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన మొత్తం 25 ముఖ్యమైన అంశాలను మేనిఫెస్టోలో పొందుపరిచారు.జార్ఖండ్ ప్రజలకు బీజేపీ కీలక హామీలివే..జార్ఖండ్ నుంచి చొరబాటుదారులను తరిమేస్తాం21 లక్షల కుటంబాలకు ఇళ్ల నిర్మాణం, ఇంటింటికి మంచి నీటి కనెక్షన్కెరీర్లో నిలదొక్కుకునేందుకు రెండు సంవత్సరాల పాటు నిరుద్యోగ యువతకు రూ.2వేల భృతియువతకు 2,87వేల ప్రభుత్వ ఉద్యోగాలు,5లక్షల స్వయం ఉపాధి అవకాశాలులక్ష్మీ జోహార్ యోజన కింద రూ.500కే గ్యాస్ సిలిండర్, సంవత్సరానికి రెండు ఉచిత సిలిండర్లుగిరిజన సంస్కృతి ప్రమోషన్‌కు పరిశోధన కేంద్రం ఏర్పాటు మేనిఫెస్టో విడుదల సందర్భంగా అమిత్‌షా కీలక వ్యాఖ్యలు..బీజేపీ అధికారంలోకి వస్తే జార్ఖండ్‌లో చొరబాటుదారులు ఆక్రమించుకున్న భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంటామని అమిత్‌షా అన్నారు. చొరబాటుదారులు ఇక్కడికి వచ్చి ఆడపడుచులను ప్రలోభపెట్టి పెళ్లిళ్లు చేసుకొని భూములను ఆక్రమించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చొరబాటుదారులను అరికట్టకపోతే రాష్ట్ర సంస్కృతికి, ఉపాధికి, ఆడబిడ్డలకు భద్రత ఉండదని అన్నారు. రాష్ట్రంలో ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫాం సివిల్ కోడ్) ప్రవేశపెడతామని, అయితే గిరిజనులను అందులో నుంచి మినహాయిస్తామని క్లారిటీ ఇచ్చారు. ఇదీ చదవండి: జార్ఖండ్ ఎన్నికలు.. ఇండియా కూటమిలో సీట్ల షేరింగ్ ఖరారు -
భారత్‌పై కెనడా మంత్రి ప్రేలాపనలు
న్యూఢిల్లీ: భారత్‌కు వ్యతిరేకంగా కెనడా ప్రభుత్వ పెద్దల ప్రేలాపనలు ఆగడం లేదు. ఒకవైపు ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటున్నప్పటికీ మరోవైపు వారు మరింత ఆజ్యం పోస్తున్నారు. కెనడాలో ఖలిస్తానీ మద్దతుదారులపై దాడులకు, కుట్రలకు భారత హోంశాఖ మంత్రి అమిత్ షా కారణమంటూ కెనడా విదేశాంగ శాఖ ఉప మంత్రి డేవిడ్ మోరిసన్ చేసిన ఆరోపణలతో వివాదం మరింత ముదురుతోంది. మోరిసన్ మంగళవారం కెనడా జాతీయ భద్రతా కమిటీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులతో మాట్లాడుతూ అమిత్ షా ప్రస్తావన తీసుకొచ్చారు. కెనడాలో ఉన్న సిక్కు వేర్పాటువాదులకు, ఖలిస్తానీ సానుభూతిపరులకు వ్యతిరేకంగా హింసను ప్రేరేపించాలని, సిక్కులను భయాందోళనకు గురి చేయాలని, వారికి సంబంధించిన సమాచారం సేకరించాలంటూ భారత నిఘా అధికారులను అమిత్ షా ఆదేశించారని చెప్పారు. అయితే, అమిత్ షా ఈ ఆదేశాలిచి్చనట్లు కెనడాకు ఎలా తెలిసిందో మోరిసన్ వెల్లడించలేదు. 2023 జూన్‌లో జరిగిన ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తం ఉందని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో పదేపదే ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. జస్టిన్ ట్రూడో వైఖరితో భారత్–కెనడా మధ్య సంబంధాలు ఇప్పటికే చాలావరకు క్షీణించాయి. అయినా కూడా కెనడా మంత్రి మోరిసన్ నోరుపారేసుకోవడం గమనార్హం. కెనడా హైకమిషన్ ప్రతినిధికి నిరసన కెనడా మంత్రి డేవిన్ మోరిసన్ చేసిన ఆరోపణలపై భారత్ తీవ్రంగా స్పందించింది. అర్థంపర్థం లేని, ఆధారాల్లేని ఆరోపణలు చేశారని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ«దీర్ జైస్వాల్ మండిపడ్డారు. తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. బాధ్యతారాహిత్యమైన ప్రవర్తన భారత్, కెనడా సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. అసంబద్ధమైన ఆరోపణలతో పరిస్థితిని దిగజార్చవద్దని సూచించారు. భారత్‌ను అప్రతిష్టపాలు చేసే కుతంత్రాలు మానుకోవాలని కెనడాకు స్పష్టంచేశారు. కెనడా మంత్రులు, అధికారులు భారత్ గురించి అంతర్జాతీయ మీడియాకు ఉద్దేశపూర్వకంగా తప్పుడు లీకులు ఇస్తున్నారని రణ«దీర్ జైస్వా ల్ ఆరోపించారు. కెనడా మంత్రి మోరిస్ తాజా ఆరోపణల పట్ల భారత్‌లోని కెనడా హైకమిషన్ ప్రతినిధిని పిలిపించి, తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశామని తెలిపారు. కెనడాలో భారత కాన్సులర్ సిబ్బందికి వేధింపులు కెనడాలోని భారత కాన్సులర్ సిబ్బందిని కెనడా ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోందని రణ«దీర్ జైస్వాల్ ఆరోపించారు. వారిపై ఆడియో, వీడియో నిఘా పెట్టిందని చెప్పారు. సిబ్బంది మధ్య సమాచార మారి్పడిని అడ్డుకుంటోందని వెల్లడించారు. తరచుగా వేధించడంతోపాటు భయభ్రాంతులకు గురిచేస్తోందని ధ్వజమెత్తారు. దౌత్యపరమైన నిబంధనలు, ఒప్పందాలను కెనడా ఉల్లంఘిస్తోందని విమర్శించారు. దీనిపై తమ నిరసనను కెనడా ప్రభుత్వానికి తెలియజేశామని చెప్పారు. -
అమిత్ షాపై కెనడా ఆరోపణలు.. స్పందించిన అమెరికా
న్యూయార్క్: భారతదేశ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై కెనడా చేసిన ఆరోపణలను అమెరికా తీవ్రంగా ఖండించింది. ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను లక్ష్యంగా చేసుకోవడంలో కేంద్ర మంత్రి అమిత్ షా హస్తం ఉందంటూ కెనడా ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలపై తాజాగా అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. ‘‘కెనడా ప్రభుత్వం చేసిన ఆరోపణలు ఆందోళనకరమైన పరిణామం. మేం ఆ ఆరోపణల గురించి కెనడా ప్రభుత్వంతో సంప్రదింపులు కొనసాగిస్తాం. ఈ ఆరోపణలపై పూర్తి సమాచారం తెలుసుకుంటాం’ అని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తెలిపారు.Canada’s allegations against Union Home Minister Amit Shah are “concerning”, the United States said on Wednesday, noting that it would continue to consult Ottawa on the issue @PMOIndia @AmitShah @AmitShahOffice #India @State_SCA @StateDeptSpox pic.twitter.com/RQKU94pX7K— Jahanzaib Ali (@JazzyARY) October 31, 2024 కెనడాలోని ఖలిస్తానీలను లక్ష్యంగా చేసుకుని హింసాత్మక కార్యకలాపాలకు భారత హోంశాఖ మంత్రి అమిత్ షా అనుమతి ఇచ్చారని కెనడా డిప్యూటీ విదేశాంగ మంత్రి నటాలియా డ్రౌయిన్ ఆరోపణలు చేశారు.‘‘కెనడాలో ఖలిస్తానీ ఏర్పాటువాది నిజ్జర్ హత్య కేసులో భారత ప్రభుత్వ అధికారుల హస్తం ఉంది. ఖలిస్తానీలను లక్ష్యంగా చేసుకుని హింసాత్మక కార్యకలాపాలకు అమిత్ షా అనుమతి ఇచ్చారు. ఈ విషయాలను మేము వెల్లడిస్తున్నాం. ఇదే సమయంలో ఉగ్రవాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్య కేసులో దర్యాప్తు విషయాలను తాము కావాలనే అమెరికా పత్రిక వాషింగ్టన్ పోస్టుకు లీక్ చేశాం’’ అని అన్నారు.కేంద్ర మంత్రి అమిత్ షాను టార్గెట్ ఆరోపణలు చేయటంపై ఇప్పటికే భారత్ తీవ్రంగా ఖండించింది.చదవండి: US Elections 2024: చెత్త చుట్టూ అమెరికా ఎన్నికల సమరం -
అమిత్ షాపై కెనడా సంచలన ఆరోపణ
అట్టావా: భారత హోంమంత్రి అమిత్ షాపై కెనడా సంచలన ఆరోపణలు చేసింది. కెనడాలోని ఖలిస్తానీలను లక్ష్యంగా చేసుకుని హింసాత్మక కార్యకలాపాలకు అమిత్ షా అనుమతి ఇచ్చారని కెనడా డిప్యూటీ విదేశాంగ మంత్రి చెప్పుకొచ్చారు. దీంతో, రెండు దేశాల మధ్య మరోసారి రాజకీయం వేడెక్కింది.తాజాగా ఓ కార్యక్రమంలో కెనడా డిప్యూటీ విదేశాంగ మంత్రి నటాలియా డ్రౌయిన్ మాట్లాడుతూ..‘కెనడాలో ఖలిస్తానీ ఏర్పాటువాది నిజ్జర్ హత్య కేసులో భారత ప్రభుత్వ అధికారుల హస్తం ఉంది. ఖలిస్తానీలను లక్ష్యంగా చేసుకుని హింసాత్మక కార్యకలాపాలకు అమిత్ షా అనుమతి ఇచ్చారు. ఈ విషయాలను మేము వెల్లడిస్తున్నాం. ఇదే సమయంలో ఉగ్రవాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్య కేసులో దర్యాప్తు విషయాలను తాము కావాలనే అమెరికా పత్రిక వాషింగ్టన్ పోస్టుకు లీక్ చేసినట్లు అంగీకరించారు.ఈ విషయాలు చెప్పేందుకు, తాను ఆ సమాచారం లీక్ చేయడానికి ట్రూడో అనుమతి అవసరం లేదన్నారు. ఈ దౌత్య వివాదంలో ఒక అమెరికన్ మీడియా కెనడా వాదనను వినిపించేలా చేస్తానన్నారని డిప్యూటీ విదేశాంగ మంత్రి డేవిడ్ మోరిసన్ తెలిపారు. తమ కమ్యూనికేషన్ వ్యూహం మొత్తాన్ని ట్రూడో ఆఫీస్ పర్యవేక్షిస్తోందని చెప్పారు.🚨 HUGE. Canada ACCUSES 🇮🇳 Home Minister Amit Shah.Canadian Deputy foreign Minister says "Amit Shah AUTHORISED violent operations targeting Khalistanis in Canada."– This statement will BACKFIRE Canada only & will boost Modi govt's image in India 🎯pic.twitter.com/28y5t1VK13— Megh Updates 🚨™ (@MeghUpdates) October 30, 2024 ఇక, అక్టోబర్ 14వ తేదీకి ముందు తాను వాషింగ్టన్ పోస్టు పత్రికకు వెల్లడించిన సమాచారం సీక్రెట్ ఏమీ కాదని నటాలియా సదరు ప్యానల్‌కు వెల్లడించారు. భారత్‌తో సహకారానికి తాము తీసుకొన్న చర్యలు కూడా అందులో ఉన్నాయన్నారు. కెనడా వాసులపై జరుగుతున్న దాడులకు సంబంధించిన ఆధారాలను న్యూఢిల్లీకి వెల్లడించినట్టు చెప్పుకొచ్చారు. -
చొరబాట్లకు మమత సర్కారే కారణం: అమిత్‌షా
కోల్‌కతా: బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం చొరబాట్లను ప్రోత్సహిస్తోందని కేంద్రహోం మంత్రి అమిత్‌షా ఆరోపించారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తమ ముందున్న పెద్ద టార్గెట్ అన్నారు. ఆదివారం(అక్టోబర్ 27) కోల్‌కతాలో పర్యటన సందర్భంగా బీజేపీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో అమిత్ షా పాల్గొని మాట్లాడారు.బెంగాల్లో చొరబాట్లను తక్షణమే ఆపాలన్నారు. బెంగాల్లో చొరబాట్లు,అవినీతి ఆగాలంటే 2026లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తేనే సాధ్యమన్నారు.బెంగాల్లో మహిళలకు భద్రత లేదని చెప్పడానికి సందేశ్ ఖాలీ హింస,ఆర్జీ కర్ ఆస్పత్రి ఘటనలే నిదర్శనమన్నారు.అక్రమ వలసలు పెరగడం వల్ల దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని అమిత్ షా ఆందోళన వ్యక్తంచేశారు. చొరబాట్లను ఆపినప్పుడే బెంగాల్లో శాంతి నెలకొంటుందన్నారు.కాగా, పశ్చిమబెంగాల్లో రూ.500 కోట్లతో నిర్మించిన ల్యాండ్‌పోర్ట్‌ను అమిత్‌షా ప్రారంభించారు. ఇదీ చదవండి: దీపావళి తర్వాత జార్ఖండ్‌లో ప్రధాని ఎన్నికల ప్రచారం -
దీపావళి తర్వాత జార్ఖండ్‌లో ప్రధాని మోదీ ఎన్నికల ర్యాలీ
రాంచీ: జార్ఖండ్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో రాష్ట్ర బీజేపీ ఎన్నికల కసరత్తు ప్రారంభించింది. నవంబర్ ఒకటి నుంచి నవంబర్ 10 వరకు ఎన్నికల ర్యాలీల కోసం ప్రధాని నరేంద్ర మోదీతో సహా స్టార్ క్యాంపెయినర్లు సమయం కేటాయించాలని పార్టీ కోరింది.మీడియాకు అందిన తాజా సమాచారం ప్రకారం జార్ఖండ్‌లో దీపావళి తర్వాత బీజేపీ స్టార్ క్యాంపెయినర్ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాల ఎన్నికల ర్యాలీలు జరగనున్నాయి. ప్రధానమంత్రి ఆరు ఎన్నికల ర్యాలీలలో పాల్గొనేలా బీజేపీ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. పార్టీలోని ఆరు సంస్థాగత విభాగాల్లోనూ ప్రధాని ఎన్నికల సభను నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కొంతకాలం క్రితం ప్రధాని మోదీ రాష్ట్రంలో రెండు ర్యాలీలు నిర్వహించారు.గడచిన నవంబర్ 15న జంషెడ్‌పూర్‌లో ప్రధాని మోదీ తన మొదటి ర్యాలీ నిర్వహించారు. రెండో ర్యాలీ అక్టోబర్ 2న హజారీబాగ్‌లో జరిగింది. బీజేపీ పరివర్తన్ యాత్రను ఆయన రాష్ట్రంలో ముగించారు. బీజేపీ అగ్రనేత అమిత్ షా సాహిబ్‌గంజ్, గిరిడిహ్లలో ఎన్నికల ర్యాలీలలో పాల్గొన్నారు. రాష్ట్రంలో నెలకొన్న నిరుద్యోగం, అవినీతి, బంగ్లాదేశ్ చొరబాట్లు వంటి వివిధ సమస్యలు ప్రధాని మోదీ, అమిత్ షాల ప్రచారాస్త్రాలుగా ఉండనున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీంతోపాటు పేపర్ లీక్ ఉదంతం కూడా ఎన్నికల ప్రచారంలో ప్రధానాశం కానుంది.ఇది కూడా చదవండి: బ్రెయిన్ స్ట్రోక్: ఇన్‌టైంలో వస్తే.. అంతా సేఫ్..! -
అడవిలో ఆఖరి పోరాటం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: దేశంలో మావోయిస్టులను 2026 మార్చి కల్లా ఏరివేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఇటీవల ప్రకటించడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. సల్వాజుడుం పేరుతో 2007లో మావోయిస్టుల ఏరివేతలో నేరు గా కేంద్రం జోక్యం చేసుకునే ప్రక్రియ.. ప్రస్తుతం ఆపరేషన్ కగార్ (ఫైనల్ మిషన్)కు చేరుకుంది. యూపీఏ హయాంలో.. దేశంలోని ప్రధాన విప్లవ శక్తులైన పీపుల్స్‌వార్, మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్లు విలీనమై 2004 సెపె్టంబర్ 21న భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)గా ఆవిర్భవించాయి. నేపాల్‌లోని పశుపతినాథ్ నుంచి ఏపీలోని తిరుపతి వరకు రెడ్ కారిడార్ ఏర్పాటు చేస్తామని ఆయా పార్టీల నేతలు ప్రభుత్వానికి సవాల్ విసిరారు. దీంతో మావోయిస్టు పార్టీకి గెరిల్లా జోన్‌గా ఉన్న బస్తర్ అడవుల నుంచి యాంటీ నక్సల్స్ ఆపరేషన్‌ను కేంద్రం ప్రారంభించింది. మావోయిస్టులకు ఎక్కువ మద్దతిచ్చే తెగకు.. ఎదురు నిలిచే మరో తెగ సభ్యులను ప్రత్యేక పోలీసు అధికారులుగా నియమించింది. వారి చేతికి ఆయుధాలిచ్చి శాంతిదళం (సల్వాజుడుం)ను 2007లో ఏర్పాటు చేసింది. సల్వాజుడుం మొదటి అడుగు నుంచి 2011లో రద్దయ్యే వరకు వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంది. సల్వాజుడుంపై విమర్శలు ఎక్కువ రావడంతో 2009 సెప్టెంబర్‌లో పెద్దఎత్తున సీఆర్పీఎఫ్ బలగాలను బస్తర్ అడవుల్లోకి పంపాలని కేంద్రం నిర్ణయించింది. దీన్నే ఆపరేషన్ గ్రీన్‌హంట్‌గా పేర్కొంటున్నారు. ఆపరేషన్ గ్రీన్‌హంట్ కారణంగా మావోయిస్టుల చేతిలో భద్రతా దళాలకు చెందిన జవాన్లు తీవ్రంగా నష్టపోయారు. బస్తర్ అడవులపై ప్రభుత్వ దళాలకు పట్టు చిక్కలేదు. నాగా కమాండోలు.. 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. గత ప్రభుత్వం అమలు చేసిన గ్రీన్‌హంట్‌కు మరింత పదును పెట్టింది. అప్పటికే పశ్చిమ బెంగాల్లో మావోయిస్టులను అణచివేయడంలో కీలక పాత్ర పోషించిన నాగా బెటాలియన్‌ను బస్తర్ అడవులకు పంపాలని నిర్ణయించింది. వీరి చేతుల్లో అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్, శాటిలైట్ ఫోన్లు పెట్టింది. అప్పటికే కోబ్రా (కమాండో బెటాలియన్ ఫర్ రిసొల్యూట్ యాక్షన్) దళాలు రంగంలో ఉన్నాయి. అయినప్పటికీ కేంద్రం ఆశించిన ఫలితాలు రాలేదు. ఆపరేషన్ సమాధాన్.. యాంటీ మావోయిస్టు ఆపరేషన్లు చేపట్టి పదేళ్లు దాటినా బస్తర్ అడవులపై పట్టు చిక్కకపోవడానికి వ్యూహాల్లో లోపాలే కారణమనే భావనకు కేంద్రం వచ్చి0ది. దీంతో 2017లో ఆపరేషన్ సమాధాన్ (ఎస్ – స్మార్ట్ లీడర్íÙప్, ఏ – అగ్రెసివ్ స్ట్రాటెజీ, ఎం – మోటివేషన్ అండ్ ట్రైనింగ్, ఏ – యాక్షనబుల్ ఇంటెలిజెన్స్, డీ – డ్యాష్‌బోర్డ్ బేస్డ్ కీ రిజల్ట్ ఏరియా, హెచ్ – హర్నెస్టింగ్ టెక్నాలజీ, ఏ – యాక్షన్ ప్లాన్, ఎన్ – నో ఆక్సెస్ టు ఫైనాన్సింగ్)ను తెరపైకి తెచ్చి0ది. మావోయిస్టుల ఆర్థిక వనరులపై దెబ్బ కొట్టడం, వారి స్థావరాలను కచ్చితంగా కనుక్కోవడం, ఔషధాలు అందకుండా చూడటం, మావోయిస్టుల్లోకి కొత్త నియామకాలు జరగకుండా జాగ్రత్త పడటం వంటి పనులపై ఎక్కువ శ్రద్ధ చూపించారు. దీంతో పాటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణంలో వేగం పెంచారు. గగనతల దాడులు ఆపరేషన్ సమాధాన్‌తో పరిస్థితులు అనుకూలంగా మారాయని నిర్ధారణకు వచ్చిన తర్వాత 2021 జూన్ 19న తొలిసారిగా వాయుమార్గంలో మావోయిస్టు శిబిరాలపై కేంద్ర బలగాలు దాడులు చేశాయనే ఆరోపణలు వచ్చాయి. అయితే మావోయిస్టు శిబిరాలపై వాయుమార్గంలో దాడులు చేయడంపై ఆందోళన వ్యక్తం కావడం, నిరసనలు రావడంతో.. ఈ తరహా దాడులపై కేంద్రం వెనక్కి తగ్గింది. అయినప్పటికీ 2021 జూన్ నుంచి 2022 చివరి వరకు నాలుగుసార్లు తమపై గగనతల దాడులు జరిగాయని మావోయిస్టు పార్టీ పలు సందర్భాల్లో ఆరోపణలు చేసింది. లోపాలను అధిగమిస్తూ.. మావోయిస్టుల ఏరివేతలో గతంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని సరికొత్త వ్యూహాలను కేంద్రం, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వాలు అమల్లోకి తెచ్చాయి. లొంగిపోయిన, అరెస్టయిన మావోయిస్టుల (సాధారణంగా స్థానిక ఆదివాసీలకే అధికారం)తో డి్రస్టిక్ట్ రిజర్వ్ గార్డ్ పేరుతో ప్రత్యేక దళాలను తయారు చేసింది. నాగా కమాండోలు ఇక్కడి అడవులపై పట్టు సాధించలేకపోవడంతో.. వారికి బదులుగా ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ)లను రంగంలోకి దించింది.సాయుధులైన పురుష కమాండోల వల్ల వచ్చే ఇబ్బందులను తగ్గించేందుకు ప్రత్యేకంగా విమెన్ కమాండో దళాలను తయారు చేసింది. ఎండాకాలం, వానాకాలం అని తేడా లేకుండా ఏడాదంతా అడవుల్లో కూంబింగ్ చేపట్టేలా ఆపరేషన్ సూర్యశక్తి, ఆపరేషన్ జల్‌శక్తి పేర్లతో జవాన్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి0ది. దీంతో ఆఖరికి వానాకాలంలో కూడా మావోయిస్టులు నిర్భయంగా సంచరించే పరిస్థితి లేకుండా పోయింది. ఫలితంగా భద్రతా దళాలపై మావోలు జరిపే వ్యూహాత్మక ఎదురుదాడులను గణనీయంగా తగ్గించగలిగారు. విస్తృతంగా పారా మిలిటరీ క్యాంపులు సంఖ్య, శిక్షణ, ఆధునిక ఆయుధాలు, లేటెస్ట్ టెక్నాలజీ పరంగా సంసిద్ధమైన తర్వాత బస్తర్ అడవుల్లో ప్రతీ ఆరు కిలోమీటర్లకు ఒకటి చొప్పున భద్రతా దళాలకు చెందిన క్యాంపులను ఏర్పాటు చేస్తూ.. మావోయిస్టులను కేంద్రం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రస్తుతం బస్తర్‌లో 370కి పైగా పారా మిలిటరీ క్యాంపులున్నాయి. సుక్మా, బీజాపూర్, దంతెవాడ, బస్తర్ జిల్లాలతో కూడిన దండకారణ్యంలో మావోయిస్టుల గెరిల్లా జోన్లు తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లిపోయాయి. చివరికి మావోయిస్టు అగ్రనేత హిడ్మా స్వగ్రామమైన పువర్తిలోనూ.. ఈ ఏడాది ఫిబ్రవరిలో భద్రతా దళాలు క్యాంపును ఏర్పాటు చేశాయి. ఆపరేషన్ కగార్ సీఆర్పీఎఫ్, డీఆర్జీ, స్పెషల్ టాస్‌్కఫోర్స్, కోబ్రా, పోలీసులు.. ఇలా అన్ని విభాగాలను సమన్వయం చేస్తూ జాయింట్ ఆపరేషన్లకు శ్రీకారం చుడుతూ ఆపరేషన్ కగార్ (ఫైనల్ మిషన్)ను 2024 జనవరిలో ప్రారంభించారు. మావోయిస్టుల షెల్టర్ జోన్‌గా ఉన్న అబూజ్మడ్ (బీజాపూర్, నారాయణ్‌పూర్, కాంకేర్, కొండగావ్) అడవులపై ప్రభుత్వం గురి పెట్టింది.ఈనెల 5న తుల్తులీ ఎన్కౌంటర్లో ఏకంగా 38 మంది మావోయిస్టులు చనిపోయారు. ఇప్పటి వరకు జరిగిన వివిధ ఎన్కౌంటర్లలో 200 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు. మరో 400 మందికి పైగా లొంగిపోవడం లేదా అరెస్టయ్యారు. ప్రభుత్వ దళాల నిర్బంధం పెరిగిపోవడంతో మావోయిస్టు అగ్రనేతలు చెల్లాచెదురయ్యారనే ప్రచారం జరుగుతోంది. -
అమిత్‌షాతో సీఎం ఓమర్ అబ్దుల్లా భేటీ.. రాష్ట్ర హోదాపై హామీ?
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. న్యూఢిల్లీలో అరగంటపాటు జరిగిన ఈ సమావేశంలో.. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి కేంద్రం పూర్తి మద్దతునిస్తుందని అమిత్‌షా హామీ ఇచ్చినట్లు సమాచారం. అదే విధంగా జమ్ముకశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా కల్పించడంపై హోంమంత్రి సానుకూలంగాస్పందించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర హోదా పునరుద్ధరణ ప్రక్రియను ప్రారంభించేందుకు కేంద్రం పూర్తి మద్దతునిస్తుందని హోంమంత్రి చెప్పినట్లు సమాచారం.కాగా జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తూ రాజ్యాంగం అందించిన 370 ఆర్టికల్ కేంద్రం 2019లో రద్దు చేసిన విషయం తెలిసిందే. జమ్ముకశ్మీర్ రాష్ట్ర హోదాను తొలగిస్తూ జమ్ము కశ్మీర్, లడఖ్ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. అయితే ఇది జరిగిన అయిదేళ్ల తర్వాత రాష్ట్ర హోదాను పునరుద్దరించే ప్రక్రియను కేంద్రం ప్రారంభించే అవకాశం ఉంది. ఇక గత వారం జరిగిన మొదటి కేబినెట్ భేటీలో జమ్ముకశ్మీర్ రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వం ఓ తీర్మానాన్ని ఆమోదించిన విషయం తెలిసిందే. అబ్దుల్లా నేడు సాయంత్రం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకుని ఆ తీర్మానం కాపీని సమర్పించే అవకాశం ఉంది.ఇదిలా ఉండగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అబ్దుల్లా నేషనల్ కాన్ఫరెన్స్ 90 స్థానాలకు గాను 42 స్థానాలను కైవసం చేసుకుని ఘన విజయాన్ని సాధించింది. దీంతో పార్టీ నేత ఓమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. -
హోం మంత్రి అమిత్ షాకు కోల్‌కతా డాక్టర్ తండ్రి లేఖ
కోల్‌కతా: కోల్‌కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజీ ఘటనలో హత్యాచారానికి గురైన యువ లేడీ డాక్టర్ తండ్రి మంగళవారం(అక్టోబర్22) కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు లేఖ రాశారు. తమ కుటుంబం తీవ్ర మానసిక ఒత్తిడి ఎదుర్కొంటోందని లేఖలో ఆయన అమిత్‌షాకు తెలిపారు.‘నా కుమార్తెకు జరిగిన అమానవీయ ఘటనతో మా కుటుంబం మొత్తం తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది. మేం నిస్సహాయులమని అనిపిస్తోంది. ఈ కేసు దర్యాప్తు వేగంగా పూర్తయ్యేందుకు,మా కుమార్తెకు న్యాయం జరిగేందుకు మీ మార్గదర్శకత్వం ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. ఈ విషయమై మిమ్మల్ని కలుసుకునే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను’ అని లేఖలో పేర్కొన్నారు. మంత్రికి బాధితురాలి తండ్రి తన లేఖను ఈ-మెయిల్ చేశారు.ఇదీ చదవండి: వక్ఫ్ జేపీసీలో గొడవ.. టీఎంసీ ఎంపీ సస్పెన్షన్ -
ఉగ్రవాదంపై రాజీలేని పోరు: అమిత్ షా
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్, ఈశాన్య భారతం, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో సాపేక్షంగా శాంతిని నెలకొల్పినట్టు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఉగ్రవాదం, చొరబాట్లు, మతపరమైన ఉద్రిక్తతలను సృష్టించే కుట్రలపై పోరాటం కొనసాగుతుందన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పోలీసు అమరుల త్యాగం వృథా కాదన్నారు. ‘‘స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దేశ భద్రత కోసం 36,438 మంది పోలీసులు ప్రాణత్యాగం చేశారు. గతేడాదే 216 మంది ప్రాణాలు కోల్పోయారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. వారి త్యాగానికి దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందన్నారు. కొత్త నేర న్యాయ చట్టాలతో భారత న్యాయ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత ఆధునికంగా మారిందన్నారు. పోలీసు సిబ్బంది, కుటుంబీకులు ఇక ఏ ఆయుష్మాన్ ఆసుపత్రిలోనైనా ఉచిత చికిత్స పొందవచ్చని హోం మంత్రి తెలిపారు. ‘‘సీఏపీఎఫ్ సిబ్బంది కోసం 13 వేల ఇళ్ల నిర్మాణానికి అనుమతులిచ్చాం. వచ్చే మార్చి నాటికి 11,276 ఇళ్లు సిద్ధమవుతాయి’’ అని వెల్లడించారు. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు సిబ్బందికి ఆయన నివాళులర్పించారు. -
ఉగ్రవాదంపై యుద్ధం ఇంకా ముగియలేదు: అమిత్ షా
న్యూఢిల్లీ: దేశంలో ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టాలనే లక్ష్యంతో ఎన్డీయే ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. సోమవారం ఉదయం ఢిల్లీలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో భాగంగా.. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరులకు అమిత్ షా నివాళులర్పించారు.అనంతరం అమిత్ షా మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల కార్యకలాపాలను అణచివేయడానికి భారత బలగాలు గత పదేళ్లుగా శాయశక్తులా కృషి చేస్తున్నాయని.. అయినప్పటికీ ఉగ్రవాదంపై యుద్ధం ఇంకా ముగియలేదని తెలిపారు.2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే తమ లక్ష్యమన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశాన్ని రక్షించడానికి 36,468 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారని, వారి త్యాగాల వల్లే దేశం సురక్షితంగా ఉందని అన్నారు. గత ఏడాది కాలంలో దాదాపు 216 మంది పోలీసు సిబ్బంది విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. వీరి త్యాగాలను దేశం ఎప్పటికీ మరిచిపోదన్నారు.On #PoliceCommemorationDay, laid a wreath at the National Police Memorial and offered my solemn tributes to the martyrs of the nation’s police forces.They have scripted an indelible history of patriotism with their selfless service and supreme sacrifice. Their lives will remain… pic.twitter.com/LihvtR9CiT— Amit Shah (@AmitShah) October 21, 2024 ‘మా పదేళ్ల పాలనలో జమ్ము కశ్మీర్, వామపక్ష అతివాద ప్రభావిత ప్రాంతాల్లో శాంతి నెలకొంది. అయినా మా పోరాటాన్ని ఆపం. కశ్మీర్లో మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాలు, మతపరమైన ఉద్రిక్తతలను సృష్టించే కుట్రలు, చొరబాట్లకు పాల్పడుతున్న ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటాము’’ అని షా అన్నారు. కాగా 1959లో లడఖ్‌లో చైనా సైనికులు జరిపిన ఆకస్మిక దాడిలో మరణించిన పోలీసులు, ఇతర అధికారుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీసు సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. -
నాయబ్‌సింగ్ సైనీ అనే నేను..
చండీగఢ్: హరియాణా ముఖ్యమంత్రిగా ఓబీసీ నాయకుడు నాయబ్‌సింగ్ సైనీ ప్రమాణ స్వీకారం చేశారు. పంచకులలోని దసరా గ్రౌండ్లో గురువారం అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో ఆయనతో రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. నూతన మంత్రుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. గురువారం వాలీ్మకి జయంతి కావడంతో ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకారానికి బీజేపీ నాయకత్వం ఇదే రోజును ముహూర్తంగా ఎంచుకుంది. ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, చిరాగ్ పాశ్వాన్తోపాటు బీజేపీ/ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్, భూపేంద్ర పటేల్, ప్రమోద్ సావంత్, హిమంత బిశ్వ శర్మ, విష్ణుదేవ్ సాయి, పుష్కర్‌సింగ్ దామీ తదితరులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం కంటే ముందు సైనీ గురుద్వారాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇటీవల జరిగిన హరియాణా శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గాను కమలం పార్టీ 48 స్థానాలు గెలుచుకుని వరుసగా మూడోసారి అధికారంలోకి వచి్చంది. మోదీ అభినందనలు హరియాణా సీఎం నాయబ్‌సింగ్ సైనీతోపాటు కొత్త మంత్రులకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. మంత్రివర్గం కూర్పు చక్కగా ఉందని ప్రశంసించారు. ఈ మేరకు గురువారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. హరియాణా ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం నెరవేరుస్తుందని, రాష్ట్ర అభివృద్ధిని నూతన శిఖరాలకు చేరుస్తుందని పేర్కొన్నారు. పేదలు, రైతులు, యువత, మహిళలతోపాటు సమాజంలోని ఇతర వర్గాల సంక్షేమం, సాధికారత విషయంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుందన్న విశ్వాసం తనకు ఉందన్నారు. బీజేపీతో మూడు దశాబ్దాల అనుబంధం బీజేపీ సీనియర్ సీనాయకుడు నాయబ్‌సింగ్ సైనీని మరోసారి అదృష్టం వరించింది. హరియాణా సీఎంగా వరుసగా రెండోసారి ఆయన ప్రమాణం చేశారు. ఈ ఏడాది మార్చి నెలలో ఆయన తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. మనోహర్‌లాల్ ఖట్టర్ స్థానంలో ఆయనను బీజేపీ అధిష్టానం నియమించింది. ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించడంతోపాటు ఓబీసీల ఓట్లపై గురిపెట్టిన కమల దళం అదే వర్గానికి చెందిన సైనీని తెరపైకి తీసుకొచి్చంది. ఈ ప్రయోగం సత్ఫలితాలు ఇచి్చంది. హరియాణాలో బీజేపీ వరుసగా మూడోసారి నెగ్గింది. అనూహ్యంగా పార్టీని గెలిపించిన సైనీకే మళ్లీ సీఎం పీఠం దక్కింది. ఆయన సాధారణ కార్యకర్త స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నారు. సైనీ 1970 జనవరి 25న అంబాలా జిల్లాలోని మీర్జాపూర్ మాజ్రా గ్రామంలో జని్మంచారు. మూడు దశాబ్దాలుగా బీజేపీలో కొనసాగుతున్నారు. పార్టీలో వివిధ బాధ్యతలు నిర్వర్తించారు. 2014లో ఎమ్మెల్యేగా, 2019లో ఎంపీగా గెలిచారు. 2014 నుంచి 2019 దాకా మనోహర్‌లాల్ ఖట్టర్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. 2023 అక్టోబర్‌లో హరియాణా బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. బీజేపీ అధిష్టానం ఆదేశాల మేరకు ఖట్టర్ ఈ ఏడాది మార్చి సీఎం పదవితోపాటు కర్నాల్ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. ఖట్టర్ స్థానంలో సైనీ ముఖ్యమంత్రి అయ్యారు. మే నెలలో జరిగిన కర్నాల్ ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అక్టోబర్ 5న జరిగిన అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో లాడ్వా స్థానం నుంచి 16,054 ఓట్ల మెజారీ్టతో జయకేతనం ఎగురవేశారు. -
హర్యానా సీఎంగా నయాబ్ సింగ్ సైనీ ప్రమాణం
చండీగఢ్: హర్యానా ముఖ్యమంత్రిగా బీజేపీ నేత నయాబ్ సింగ్ సైనీ ప్రమాణం చేశారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సైనీ చేత సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో సహా.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఇతర సీఎంలు, డిప్యూటీ సీఎంలు, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. హర్యానాలో మూడోసారి బీజేపీ సర్కార్ కొలువుదీరింది.#WATCH | Nayab Singh Saini takes oath as Haryana CM for the second consecutive time, in PanchkulaPrime Minister Narendra Modi, Union Home Minister Amit Shah, BJP national president JP Nadda, Defence Minister Rajnath Singh, UP CM Yogi Adityanath and other CMs, Deputy CMs, Union… pic.twitter.com/WK9ljGLwzd— ANI (@ANI) October 17, 2024 కంప్యూటర్ ఆపరేటర్ టు సీఎం..బీజేపీలో కార్యకర్త స్థాయి నుంచి ఎదిగిన సైనీ1996లో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా చేరికమాజీ సీఎం ఖట్టర్ సాన్నిహిత్యంలో రాజకీయంగా ఎదిగిన సైనీ2014లో నారాయణ్ గఢ్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నిక మనోహర్ లాల్ ఖట్టర్ కేబినెట్లో హోంమంత్రిగా సేవలు 2019లో కురుక్షేత్ర నుంచి లోక్‌సభకు ఎన్నిక2023 అక్టోబర్‌లో హర్యానా బీజేపీ అధ్యక్షుడిగా నియామకం2024 మార్చిలో హర్యానా సీఎంగా బాధ్యతలు200 రోజుల్లో హర్యానా బీజేపీకి హ్యాట్రిక్ విజయంలో కీలక పాత్రపుట్టిన తేదీ: 1970 జనవరి 25సొంతూరు అంబాల జిల్లా మిర్జాపూర్ మజ్రా గ్రామంబీఏ, ఎల్ఎల్బీ, ఆర్ఎస్ఎస్తో సుదీర్ఘ అనుబంధం హర్యానా ముఖ్యమంత్రిగా నయాబ్ సింగ్ సైనీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు పంచకుల సెక్టార్ 5లోని దసరా మైదానానికి ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు.#WATCH | Prime Minister Narendra Modi reaches Dussehra Ground in Sector 5, Panchkula, for the swearing-in ceremony of Haryana CM-designate Nayab Singh Saini and the new Haryana government pic.twitter.com/pycGFJoZMY— ANI (@ANI) October 17, 2024 #WATCH | Haryana CM-designate Nayab Singh Saini to shortly take oath as Haryana CM, in Panchkula pic.twitter.com/2mzAKm0iGf— ANI (@ANI) October 17, 2024 హర్యానా సీఎంగా నయాబ్ సింగ్ సైనీ ప్రమాణస్వీకారోత్సవానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఇతర సీఎంలు, డిప్యూటీ సీఎంలు, కేంద్ర మంత్రులు హాజరయ్యారు.#WATCH | Union Home Minister Amit Shah, BJP national president JP Nadda, Union Minister Nitin Gadkari, Maharashtra CM Eknath Shinde, UP CM Yogi Adityanath and other CMs, Deputy CMs, Union Ministers, NDA leaders present at the swearing-in ceremony of Haryana CM-designate Nayab… pic.twitter.com/evktPWkU7p— ANI (@ANI) October 17, 2024 హర్యానా ముఖ్యమంత్రిగా నయాబ్ సింగ్ సైనీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చండీగఢ్ చేరుకున్నారు.#WATCH | Union Minister and BJP national president JP Nadda arrives in Chandigarh to attend the swearing-in ceremony of Haryana CM-designate Nayab Singh Saini pic.twitter.com/zTkoc24GC7— ANI (@ANI) October 17, 2024 పంచకులకు బీజేపీ, ఎన్డీయే పాలిత సీఎంలు చేరుకుంటున్నారు.ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ అగ్రనేతలు హాజరుకానున్నారు. సైనీ రెండోసారి సీఎం ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇక.. బుధవారం పంచకులలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సైనీ.. బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.#WATCH | Panchkula: Haryana CM-designate Nayab Singh Saini says, "CMs, Deputy CMs and senior leaders of NDA will participate in the swearing-in ceremony today. After that, there will be a meeting of NDA leaders." pic.twitter.com/uSebe32S6s— ANI (@ANI) October 17, 2024 ఈనెల 5న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 48 స్థానాలు నెగ్గి హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అధికారంలోకి రావడం ఖాయమని సర్వేలన్నీ అంచనా వేసిన కాంగ్రెస్ 37 స్థానాల వద్దే నిలిచిపోయింది.Haryana CM-designate Nayab Saini offers prayers at Valmiki Temple, says double engine government will take state forward at fast paceRea @ANI story | https://t.co/Uidj8lvTvK#Haryana #NayabSaini #BJP #NDA pic.twitter.com/nUlUyWdSCh— ANI Digital (@ani_digital) October 17, 2024 -
హరియాణా బీజేపీఎల్పీ నేతగా సైనీ
చండీగఢ్/ పంచకుల: హరియాణా బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా నాయబ్‌సింగ్ సైనీ ఏకగ్రీవంగా ఎన్నిక య్యారు. బుధవారం పంచకులలో సమావేశమైన బీజేపీ ఎమ్మెల్యేలు సైనీని తమ నాయకుడిగా ఎన్ను కున్నారు. సైనీ పేరును ఎమ్మెల్యే క్రిషన్ కుమార్ బేడీ ప్రతిపాదించగా.. సీనియ ర్ నేత అనిల్ విజ్ బలపరిచారు. అనిల్ విజ్ సైతం సీఎం పదవిని ఆశించినప్పటికీ బీజేపీ అగ్రనేతలు సైనీ వైపు మొగ్గారు. పరిశీలకుడిగా హాజరైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. సైనీ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. అనంతరం సైనీ గవర్నర్ బండారు దత్తాత్రేయను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధతను వ్యక్తం చేశారు. ఈనెల 5న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 48 స్థానాలు నెగ్గి హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అధికారంలోకి రావడం ఖాయమని సర్వేలన్నీ అంచనా వేసిన కాంగ్రెస్ 37 స్థానాల వద్దే నిలిచిపోయింది. హరియాణా ముఖ్యమంత్రి రెండోసారి సైనీ గురువారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి మోదీ, రాజ్‌నాథ్ సింగ్‌లతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఎన్డీయే సీఎంలు హాజరుకానున్నారు. -
Amit Shah: అవినీతిరహితుడు నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై గత పదేళ్లలో ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేదని, ఆయన అవినీతిరహితుడు అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. మోదీ విధానాలతో దేశ ఆర్థికాభివృద్ధి వేగం పుంజుకుందని అన్నారు. భారత్‌ను ప్రపంచంలోని అత్యున్నత ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలిపారని ప్రశంసించారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) భారత్‌ను ‘వెలుగుతున్న తార’ అని కొనియాడిందని గుర్తుచేశారు. గురువారం ఢిల్లీలో పీహెచ్డీ చాంబర్ ఆర్ కామర్స్, ఇండస్ట్రీ వార్షిక సదస్సులో అమిత్ షా మాట్లాడారు. మోదీ ప్రభుత్వం చేపట్టిన ప్రగతిశీల చర్యలతో మనదేశం ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటిగా నిలిచిందని తెలిపారు. కేంద్రంలో 2014లో మోదీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత వేర్వేరు రంగాల్లో సంస్కర ణలకు శ్రీకారం చుట్టిందని, వాటి ఫలితా లు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయని, అనుసంధానం పెరిగిందని, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ అందుబాటు లోకి వచ్చిందని, రైల్వే నెట్వర్క్ భారీగా విస్తరించిందని, విద్యుత్ వాహనాలు, సెమి–కండక్టర్ల తయారీ పరిశ్రమలు ఏర్పాటయ్యాయని వివరించారు. -
నోయెల్ టాటాకు మోదీ ఫోన్.. అంత్యక్రియలకు అమిత్‌షా
రతన్ టాటా.. పరిచయం అక్కర్లేని పేరు. భారత్‌లో తిరుగులేని వ్యాపార సామ్రాజ్యాన్ని నెలకొల్పి.. విలువలు, దాతృత్వానికి పెట్టింది పేరు. విజయవంతమైన వ్యాపారవేత్తగా నిలవడంతోపాటు మంచి స్వభావం గల వ్యక్తిగా కూడా పేరు సంపాదించారు. అలాంటి గొప్ప వ్యక్తి ఇక మన మధ్యలేరనే నిజాన్ని అంగీకరించడం ఎవరి వల్ల అవ్వడం లేదు. 86 ఏళ్ల వయసులో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో కన్నుమూసిన పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాకు భారత్ నుంచే కాకుండా ప్రపంచ దేశాల ప్రముఖుల నుంచి నివాళులు వెల్లువెత్తుతున్నాయి. రతన్ టాటా మృతిపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.తాజాగా రతన్ టాటా సోదరుడు నోయెల్ టాటాతో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడి సంతాపం వ్యక్తం చేశారు. ముంబైలో జరగబోయే ఆయన అంత్యక్రియలకు కేంద్ర ప్రభుత్వం తరపున కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరవుతారని నోయెల్‌కు మోదీ తెలిపారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ ముందస్తు షెడ్యూల్ ప్రకారం రెండు రోజుల లావోస్ పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో రతన్ టాటా అంత్యక్రియలను అమిత్ షా పర్యవేక్షిస్తారని కేంద్ర వర్గాలు వెల్లడించాయి. కాగా రతన్ టాటా మృతికి గౌరవ సూచికంగా మహారాష్ట్ర ప్రభుత్వం గురువారం సంతాప దినంగా ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను సగానికి ఎగురవేస్తామని సీఎం ఏక్నాథ్ షిండే ప్రకటించారు. నేడు జరగాల్సిన అన్ని వినోదాత్మక కార్యక్రమాలను రద్దు చేశారు.#WATCH | Mumbai | Mortal remains of veteran industrialist Ratan N Tata being taken to NCPA lawns for the public to pay their last respectsHe will be accorded state funeral this evening. pic.twitter.com/6JUgirUqkG— ANI (@ANI) October 10, 2024మరోవైపు టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా పార్దివదేహాన్ని కోల్బాలోని నివాసానికి తరలించారు. అనంతరం ఉదయం ముంబైలోని నారిమన్ పాయింట్లో ఉన్న నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ (ఎన్సీపీఏ) గ్రౌండ్లో ప్రజల సందర్శనార్థం ఉంచారు. మధ్యాహ్నం 4 గంటలకు అంతిమయాత్ర ప్రారంభం కానుంది. అధికారిక లాంఛనాలతో సాయంత్రం వర్లీ ప్రాంతంలో రతన్ టాటా అంత్యక్రియలు జరగనున్నాయి. వ్యాపార దిగ్గజానికి కడసారి వీడ్కోలు పలికేందుకు సామాన్య ప్రజలు, ప్రముఖులు బారులు తీరనున్నారు.అంతకముందు రతన్ టాటా మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన దూరదృష్టి ఉన్న వ్యాపారవేత్త అని, ఎంతో దయగల అసాధారణమైన వ్యక్తి అని కొనియాడారు. భారత్‌లోని ప్రతిష్టాత్మక వ్యాపార సంస్థలకు రతన్ టాటా స్థిరమైన నాయకత్వం అందించారని, మెరుగైన సమాజం కోసం ఆయన తనవంతు కృషి చేశారని పేర్కొన్నారు.ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే ఆయన ధోరణి ఆచరణాత్మకమని, దయార్ద్ర హృదయంతో మెరుగైన సమాజం కోసం అనుక్షణం తపించే వారిని ప్రధాని కొనియాడారు. -
హర్యానా ప్రజలకు నా సెల్యూట్: ప్రధాని మోదీ
ఢిల్లీ: జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో జమ్ము కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్- కాంగ్రెస్ పార్టీ కూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 90 సీట్లకు కాంగ్రెస్ కూటమి 49 స్థానాల్లో గెలుపొందింది. బీజేపీ 29 స్థానాల్లో గెలిచి రెండో స్థానంలో నిలిచింది. హర్యానాలో బీజేపీ ఘన విజయం సాధించింది. హర్యానా, జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. బీజేపీ మూడో గెలుపు అందించిన సందర్భంగా హర్యానా ప్రజలకు సెల్యూట్ చేస్తున్నానని అన్నారు.‘‘భారతీయ జనతా పార్టీకి మరోసారి స్పష్టమైన మెజారిటీని అందించినందుకు హర్యానా ప్రజలకు సెల్యూట్ చేస్తున్నా. ఇది అభివృద్ధి, సుపరిపాలన రాజకీయాల విజయం. హర్యానా ప్రజల ఆశయాలను నెరవేర్చుతాం. జమ్ము- కశ్మీర్లో బీజేపీ పనితీరుపై గర్వంగా ఉంది. ‘నేషనల్ కాన్ఫరెన్స్’కు అభినందనలు. ఆ పార్టీ ప్రదర్శన మెచ్చుకోదగినది’’ అని అన్నారు.PM Narendra Modi tweets, "I salute the people of Haryana for giving a clear majority to the Bharatiya Janata Party once again. This is the victory of the politics of development and good governance. I assure the people here that we will leave no stone unturned to fulfil their… pic.twitter.com/EHVXMjgbTD— ANI (@ANI) October 8, 2024 PM Narendra Modi tweets, "... I am proud of the BJP’s performance in Jammu and Kashmir. I thank all those who have voted for our Party and placed their trust in us. I assure the people that we will keep working for the welfare of Jammu and Kashmir. I also appreciate the… pic.twitter.com/Vo3vpnWDo2— ANI (@ANI) October 8, 2024 జమ్ము కశ్మీర్ ప్రజలకు కృతజ్ఞతలు: అమిత్ షా‘‘జమ్ము కశ్మీర్ ప్రజలు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని అత్యధిక ఓట్లతో ఆశీర్వదించారు. బీజేపీ ఇప్పటివరకు కశ్మీర్ చరిత్రలో అత్యధిక సీట్లను అందించారు. ఇందుకు నేను హృదయపూర్వకంగా జమ్ము కశ్మీర్ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ ఎన్నికల కోసం అవిశ్రాంతంగా పని చేసిన బీజేపీ పార్టీ కార్యకర్తలందరినీ అభినందిస్తున్నా. జమ్ము కశ్మీర్లో శాంతియుత ఎన్నికలు జరుగుతాయని ప్రధాని మోదీ గతంలోనే వాగ్దానం చేశారు. ఈ క్రమంలోనే తొలిసారి పారదర్శకంగా ఎన్నికలు జరిగాయి. ఈ చరిత్రాత్మక ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంపై కేంద్ర ఎన్నికల సంఘం, జమ్ము కశ్మీర్ పాలనాయంత్రాంగం, భద్రత బలగాలు, పౌరులకు అభినందనలు...కాంగ్రెస్ హయాంలో జమ్ము కశ్మీర్లో ఉగ్రపాలనే సాగేది. అయితే బీజేపీ పాలనలో ప్రజాస్వామ్య పండుగను ఘనంగా చేసుకున్నాం. బీజేపీ హర్యానాలో భారీ విజయం సాధించింది. ప్రధాని మోదీ ప్రభుత్వంపై రైతులు, పేదలు, వెనుకబడిన వర్గాలు, సైనికులు, యువత నమ్మకానికి నిదర్శనం’’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు.Union Home Minister Amit Shah tweets "The people of Jammu and Kashmir have blessed the BJP with the highest percentage of votes in this assembly election and have given the BJP the highest number of seats in its history so far. For this, I express my heartfelt gratitude to the… pic.twitter.com/gyVt8c2G1o— ANI (@ANI) October 8, 2024 -
ఢిల్లీలో బిజీబిజీగా సీఎం రేవంత్ రెడ్డి
-
మానవ హక్కుల్ని కాలరాశారు: అమిత్‌షా
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో మానవహక్కుల్ని నక్సల్స్ దారుణంగా ఉల్లంఘిస్తున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఆరోపించారు. 2026 మార్చికల్లా నక్సల్స్‌ను అంతంచేస్తామని ప్రకటించారు. నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల్లో భద్రతా పరిస్థితిపై సమీక్ష, నక్సల్స్ ఏరివేతకు ఉమ్మడి వ్యూహం, నక్సల్స్ ప్రభావిత వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి, అందుకు కేంద్రం సాయం తదితర అంశాలపై సోమవారం అమిత్ షా నేతృత్వంలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, జార్ఖండ్, బిహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ముఖ్య కార్యదర్శులు, డీజీపీలు, కేంద్ర మంత్రులు, కేంద్ర సాయుధ బలగాల, ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ‘‘దేశంలో గిరిజనులుసహా 8 కోట్ల మంది ప్రజలకు అభివృద్ధి, కనీస సంక్షేమ అవకాశాలు దక్కకుండా నక్సల్స్ దారుణంగా మానవహక్కుల్ని ఉల్లంఘిస్తున్నారు. అటవీ, మారుమూల ప్రాంతాలకు విద్య, ఆరోగ్యం, అనుసంధానత, బ్యాంకింగ్, పోస్టల్ సేవలు అందకుండా అడ్డుకుంటున్నారు. అభివృద్ధికి అవరోధంగా తయారయ్యారు’’ అని అమిత్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘భద్రతాబలగాలు గతంలో రక్షణాత్మక ధోరణిని అవలంభించేవి. ఇప్పుడు దీటుగా సమాధానమిస్తున్నాయి. ఇటీవలికాలంలో బలగాలు ఘన విజయాలను సాధించాయి’’ అని ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌ను అమిత్ షా పరోక్షంగా ప్రస్తావించారు. ‘‘ నక్సల్స్‌తో పోరాటం తుది అంకానికి చేరుకుంది. అందరి సహకారంతో 2026 మార్చికల్లా నక్సల్స్‌ను రూపుమాపుతాం. దీంతో దశాబ్దాల సమస్యకు ముగింపు పలుకుతాం. మావోయిస్టుల ప్రభావిత గిరిజన, ఆదివాసీ ప్రాంతాలకు ప్రభుత్వ పథకాల ఫలాలు అందిస్తూనే మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి్దపై దృష్టి పెట్టినప్పుడు నక్సలిజాన్ని అడ్డుకోగలం. పోలీస్ సామర్థ్యాన్ని పెంపొందించడంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర పనితీరు అద్భుతం. ఛత్తీస్‌గఢ్‌లో వామపక్ష తీవ్రవాదాన్ని అణచివేయడంలో గ్రేహౌండ్స్ పైచేయి సాధించింది. 2022 ఏడాదిలో గత 30 ఏళ్లలో ఎన్నడూలేనంతగా వామపక్ష ప్రభావిత హింసకారణంగా మరణాలు వందలోపునకు దిగొచ్చాయి. ఇప్పటిదాకా ఈశాన్య రాష్ట్రాలు, కశ్మీర్, వామపక్ష ప్రభావిత ప్రాంతాల నుంచి 13,000 మంది హింసను వీడి జనజీవన స్రవంతిలో కలిశారు. ఇకనైనా నక్సల్స్ ఆయుధాలు వీడాలి’’ అని అమిత్ షా పిలుపునిచ్చారు. ఛత్తీస్‌గఢ్ విజయం స్ఫూర్తిదాయకం‘‘ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం అన్ని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలో కొత్త అభివృద్ధి ప్రచారాన్ని ప్రారంభించింది. ఇది రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలను గిరిజ నులకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఛత్తీస్‌గఢ్‌లో ఈఏడాది జనవరి నుంచి ఇప్పటిదాకా 237 మంది నక్సలైట్లు చనిపో యారు. 812 మంది అరెస్టయ్యారు. 723 మంది నక్సలైట్లు లొంగిపోయారు’’ అని వివరించారు. తగ్గిన హింసాత్మక ఘటనలు‘‘ఇటీవలికాలంలో నక్సల్స్ హింసాత్మక ఘటనలు గణనీయంగా తగ్గాయి. నక్సల్స్ హింస ఘటనలు 16,463 నుంచి 7,700కి దిగొచ్చాయి. పౌరులు, భద్రతా సిబ్బంది మరణాలు 70శాతం తగ్గాయి. హింస బారినపడిన జిల్లాల సంఖ్య 96 నుంచి 16కు తగ్గింది. తమ పరిధిలో హింసాత్మక ఘటనలు జరుగుతున్న పోలీసు స్టేషన్ల సంఖ్య 465 నుంచి 171కి తగ్గింది. ఇది కేంద్రం, రాష్ట్రాల ఉమ్మడి ప్రయత్నాల ఫలితం. నక్సలిజం రూపుమాపేందుకు తీసుకునే చర్యల పురోగతిని సీఎంలు నెలకోసారి సమీక్షించాలి. డీజీపీలు ప్రతి 15 రోజులకే సమీక్ష జరపాలి’’ అని అమిత్ సూచించారు. -
అమిత్ షా అధ్యతన వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సమావేశం
-
5 వేల కోట్ల డ్రగ్స్ రాకెట్.. కాంగ్రెస్‌పై అమిత్ షా ధ్వజం
న్యూఢిల్లీ: ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలోనే పెద్ద ఎత్తున మత్తు పదార్థాలు పట్టుబడిన సంగతి తెలిసిందే. ఏకంగా రూ.5 వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ను ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. దీనిపై కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా స్పందిస్తూ.. దేశంలోని యువతను డ్రగ్స్‌తో నిండిన చీకటి ప్రపంచంలోకి కాంగ్రెస్ నడిపిస్తోందని ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ ప్రభుత్వం డ్రగ్స్‌పై ‘జీరో టాలరెన్స్’ విధానానికి కట్టుబడి ఉందని తెలిపారు. యువతను విద్య, క్రీడలు ఆవిష్కరణల వైపు నడిపించేందుకు బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తుంటే.. కాంగ్రెస్ తన రాజకీయ పరపతిని ఉపయోగించుకొని మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చేస్తోందని మండిపడ్డారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ‘మాదక ద్రవ్య రహిత భారత్’ కోసం మోదీ ప్రభుత్వం జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తున్న వేళ.. ఢిల్లో స్వాధీనం చేసుకున్న రూ. 5,600 కోట్ల మాదక ద్రవ్యాల కేసులో ప్రముఖ కాంగ్రెస్ నేత ప్రమేయం ఉండటం అత్యంత ప్రమాదకరం. సిగ్గుచేటు’ అని షా పేర్కొన్నారు.एक ओर जहाँ मोदी सरकार 'नशामुक्त भारत' के लिए जीरो टॉलरेंस की नीति अपना रही है, वहीं उत्तर भारत से पकड़ी गई ड्रग्स की ₹5,600 करोड़ की खेप में कांग्रेस के एक प्रमुख व्यक्ति की संलिप्तता बेहद खतरनाक और शर्मनाक है।कांग्रेस के शासन में ड्रग्स से पंजाब, हरियाणा और समग्र उत्तर भारत…— Amit Shah (@AmitShah) October 4, 2024కాంగ్రెస్ హయాంలో పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాల్లో యువతపై డ్రగ్స్ ప్రభావం చూపిందని విమర్శించారు.యువతను మళ్లీ డ్రగ్స్ ప్రపంచంలోకి లాగేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అదే మోదీ ప్రభుత్వం యువతను క్రీడలు, విద్య, ఆవిష్కరణల వైపు మళ్లించేందుకు కృషి చేస్తోందని అన్నారు. కాంగ్రెస్ నేతలు తమ రాజకీయ ప్రభావాన్ని ఉపయోగించి యువతను డ్రగ్స్ ఊబిలోకి నెట్టడం దారుణమన్నారు. దీనిని మోదీ ప్రభుత్వం ఎప్పటికీ జరగనివ్వదని, రాజకీయాలతో సంబంధం లేకుండా డ్రగ్స్ నెట్‌వర్క్‌ను పూర్తిగా నిర్మూలించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని షా అన్నారు.అయితే తుషార్ గోయల్‌తో ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ ఖండించింది. అయినప్పటికీ ఆయన గతంలో 2022 వరకు ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్‌కు ఆర్టీఐ సెల్ చైర్మన్‌గా పనిచేశాడనిఅధికారుల విచారణలో అంగీకరించాడు. సోషల్ మీడియాలో డిక్కీ గోయల్ పేరుతో అతడు లోక్‌సభ ఎంపీ దీపేందర్ సింగ్ హుడా, హర్యానా కాంగ్రెస్ చీఫ్ ఉదయ్ భాన్తోతో సహా పలువురు ప్రముఖ కాంగ్రెస్ నేతలతో దిగిన ఫోటోలను పోస్టు చేసినట్లు అధికారులు గుర్తించారు. -
ఖర్గే ప్రసంగంపై అమిత్ షా సెటైర్లు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీని అధికారం నుంచి తప్పించేంత వరకు తాను బతికే ఉంటానని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన ప్రసంగంపై కేంద్ర హోమంత్రి అమిత్‌షా స్పందించారు. ఖర్గే ప్రసంగం అసహ్యకరమైన, అవమానకరమైనది’గా అభివర్ణించారు.ఖర్గే ప్రసంగం ఆద్యంతం ప్రధాని మోదీ పట్ల కాంగ్రెస్‌కు ఉన్న ద్వేషం,భయం స్పష్టంగా తెలుస్తుంది. ఆయన తన ప్రసంగంతో కాంగ్రెస్, ఆ పార్టీ నేతలను మించిపోయారు’ అని అన్నారు. మోదీని అధికారం నుండి తొలగించిన తర్వాత మాత్రమే చనిపోతానని చెప్పి అనవసరంగా తన వ్యక్తిగత ఆరోగ్య విషయాలలోకి ప్రధాని మోదీని లాగారు’అని వ్యాఖ్యానించారు.Yesterday, the Congress President Shri Mallikarjun Kharge Ji has outperformed himself, his leaders and his party in being absolutely distasteful and disgraceful in his speech.In a bitter display of spite, he unnecessarily dragged PM Modi into his personal health matters by…— Amit Shah (@AmitShah) September 30, 2024 ఈ సందర్భంగా కాంగ్రెస్‌కు ప్రధాని మోదీ పట్ల ఎంత ద్వేషం,భయం ఉందో చూడండి. అందుకే కాంగ్రెస్ నేతలు మోదీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఖర్గే జీ మీరు ఆరోగ్యంగా ఉండాలని.. ప్రధాని మోదీ, నేను ఆ దేవుణ్ని ప్రార్థిస్తున్నాం. 2047 నాటికి విక్షిత్ భారత్‌ను రూపొందించే వరకు ఆయన జీవించాలని కోరుకుంటున్నా అని హోంమంత్రి అమిత్‌షా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. जब तक मोदी को नहीं हटाएँगे ...तब तक मैं ज़िंदा रहूँगा, आपकी बात सुनूँगा... आपके के लिए लड़ूँगा !! pic.twitter.com/M58zGxVNuX— Mallikarjun Kharge (@kharge) September 29, 2024మోదీ గురించి ఖర్గే ఏమన్నారంటేజమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం జమ్మూ సమీపంలోని జస్‌రోటీ గ్రామంలో నిర్వహించిన సభలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మాట్లాడారు. ప్రసంగం మధ్యలో కాస్త అస్వస్థతకు గురయ్యారు. తూలిపడబోతుండగా సీనియర్ నేగలు పట్టుకున్నారు. వారి సాయంతోనే ఖర్గే ప్రసంగాన్ని కొనసాగించారు. ‘‘జమ్మూకశ్మీర్‌కు పూర్తి రాష్ట్ర హోదా దక్కేదాకా పోరాటం కొనసాగిస్తా. దీన్ని వదలను. నాకు 83 ఏళ్లు. నేను ఇంత తొందరగా చనిపోను. (ప్రధాని) మోదీని అధికారం నుండి తొలగించే వరకు నేను బతికే ఉంటాను. కశ్మీరీల బాధలు వింటా. వవారి సమస్యల పరిష్కారానికి పోరాడుతా. ఇంకా మాట్లాడాలనుంది.కానీ కళ్లు తిరగడంతో నేను మట్లాడలేకపోతున్నా.నన్ను క్షమించాలి ’’ అని అన్నారు. -
అమిత్‌షాపై ఉద్ధవ్ సంచలన వ్యాఖ్యలు
ముంబై : శివసేన (యూబీటీ) అధ్యక్షుడు, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కేంద్ర హోం మంత్రి అమిత్‌షాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష పార్టీలను నిర్విర్యం చేసేలా అమిత్‌షా తన సొంత పార్టీ నేతల్ని ఉసిగొల్పారని వ్యాఖ్యానించారు. ఇందులో భాగంగా బీజేపీ.. శివసేనతో పాటు ఎన్సీపీ (ఎస్పి) శరద్ పవార్‌ను ఎంపిక చేసుకున్నారని తెలిపారు. అయితే, తన రాజకీయ భవిష్యత్తును ప్రజలే నిర్ణయిస్తారని, అధికారంలో ఉన్న బీజేపీ కాదని సూచించారు. తనను (ఉద్ధవ్), శరద్ పవార్‌ను రాజకీయంగా నిలువరించేలా కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ నాయకులకు ఆదేశాలు జారీ చేశారని వెల్లడించారు.అమిత్ షా ఇటీవల నాగ్‌పూర్‌లో పర్యటించినప్పుడు బీజేపీ నాయకులతో సమావేశం నిర్వహించారు. అక్కడ ప్రతిపక్ష శ్రేణులను విభజించి.. నన్ను, శరద్ పవార్‌ను రాజకీయంగా నిలువరించాలని కోరారు. అమిత్ షా ఇలా ఎందుకు చేయాలని అనుకుంటున్నారని ప్రశ్నించారు.‘రాబోయే ఎన్నికలు అధికారం కోసం కాదు. మహారాష్ట్ర దోపిడీకి గురికాకుండా నిరోధించడానికి అవి చాలా కీలకం’ అని మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. మహా వికాస్ అఘాడీ కూటమికి భారీ విజయాన్ని అందించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. -
Haryana Assembly elections 2024: రాహుల్ గ్యారెంటీలు అట్టర్ ఫ్లాప్: అమిత్
చండీగఢ్: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఇస్తున్న ఎన్నికల హామీలు అమలే కావడం లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. హిమాచల్ ప్రదేశ్, కర్నాటకల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాహుల్ గ్యారెంటీల అమలులో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ఆయన ఆదివారం హరియాణాలోని గురుగ్రాంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అమలుకు వీలుకాని ఎలాంటి హామీనీ బీజేపీ ఇవ్వదని మంత్రి అన్నారు. ‘‘కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రాహుల్ బాబా అండ్ కంపెనీ ఎలాంటి అభివృద్ధీ చేయలేదు. హరియాణాలో మా డబుల్ ఇంజన్ ప్రభుత్వం మాత్రమే అభివృద్ధికి హామీ ఇస్తుంది’’ అన్నారు. ‘‘సరిహద్దులను రక్షిస్తాం. రిజర్వేషన్లను కాపాడుతాం. ఆరి్టకల్ 370ను మళ్లీ రానివ్వం’’ అని స్పష్టం చేశారు. వక్ఫ్ నిబంధనల్లో లొసుగులను సరిదిద్దేందుకే పార్లమెంట్లో వక్ఫ్ బిల్లు పెడుతున్నట్లు చెప్పారు. రాహుల్‌ను అబద్ధాల మిషన్‌గా అభివరి్ణంచారు. అగి్నవీర్లకు ఉద్యోగాలు రావంటూ దు్రష్పచారం చేస్తున్నారని ఆరోపించారు. -
చొరబాటుదారులపై అమిత్ షా వ్యాఖ్యలు.. బంగ్లా అభ్యంతరం
ఢాకా: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్ సోమవారం ఆయన వ్యాఖ్యలపై నిరసన తెలిపింది. అమిత్ షా.. బంగ్లా జాతీయులపై చేసిన వ్యాఖ్యలు అత్యంత విచారకరమని పేర్కొంది. ఢాకాలోని భారత డిప్యూటీ హైకమిషనర్‌కు బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తమ నిరసన పత్రాన్ని అందజేశారు. ఇక.. అమిత్ చేసిన వ్యాఖ్యలు తీవ్రమైన బాధ, విచారాన్ని కలిగించాయని అందులో పేర్కొన్నారు.ఈ సందర్భంగా పొరుగు దేశంపై అభ్యంతరకరమైన, ఆమోదయోగ్యం కాని వ్యాఖ్యలు చేయకుండా తమ రాజకీయ నేతలను హెచ్చరించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి.. పొరుగు దేశం జాతీయులకు ఇలా వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయటం ఇరు దేశాల స్నేహపూర్వక పరస్పర గౌరవం, అవగాహన స్ఫూర్తిని దెబ్బతీస్తాయని పేర్కొంది.ఇటీవల జార్ఖండ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించిన బంగ్లాదేశ్ జాతీయులపై కీలక వ్యాఖ్యలు చేశారు. జార్ఖండ్ ప్రజలు బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకువస్తే.. జార్ఖండ్‌లోకి అక్రమంగా చొరబడిన ప్రతీ బంగ్లాదేశ్ చొరబాటుదారుడిని తలకిందులుగా వేలాడదీసి మరీ గుణపాఠం చెబుతామని అన్నారు. ఈ వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.చదవండి: శాంతి పునరుద్దరణకు భారత్ మద్దతు.. జెలెన్స్కీకి మోదీ హామీ -
జమ్ములో కాల్పులు జరిపే ధైర్యం ఎవరికీ లేదు: అమిత్ షా
శ్రీనగర్: ఉగ్రవాదాన్ని అంతం చేసేవరకు పాకిస్థాన్‌తో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్చలు జరపదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారంలో భాగంగా నౌషేరాలో జరిగిన ర్యాలీని అమిత్ షా పాల్గొని మాట్లాడారు.‘‘నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్షాలు డిమాండ్ చేసిన విధంగా జమ్ము కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆర్టికల్ 370ని తిరిగి తీసుకువస్తామని మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా అంటున్నారు. ఆర్టికల్ 370ని ఎవరూ తిరిగి తీసుకురాలేరు. ప్రస్తుతం బంకర్లు అవసరం లేదు ఎందుకంటే ఎవరూ బుల్లెట్లు కాల్చడానికి ధైర్యం చేయలేరు. జమ్ము కశ్మీర్లో 30 ఏళ్లుగా కొనసాగిన ఉగ్రవాదం 40వేల మందిని బలి తీసుకుంది.కశ్మీర్ ఉగ్రవాదంతో కాలిపోతున్నప్పుడు.. ఫరూఖ్ అబ్దుల్లా లండన్‌లో హాలిడే గడిపారు.#WATCH | Rajouri, J&K: Addressing a public meeting in Nowshera, Union Home Minister Amit Shah says, "... Farooq Abdullah says that they will bring back Article 370. Farooq Sahab, nobody can bring back Article 370... Now, bunkers are not needed because no one can dare to fire… pic.twitter.com/cciMG6psOb— ANI (@ANI) September 22, 2024..పాకిస్థాన్‌తో మనం చర్చలు జరపాలని వారు కోరుకుంటున్నారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించే వరకు పాకిస్థాన్‌తో చర్చలు జరపబోం. ఉగ్రవాదులను జైళ్ల నుంచి విముక్తి చేయాలనుకుంటున్నారు. ప్రధాని మోదీ హయాంలో ఉగ్రవాదులను ఒక్కొక్కరిగా అంతం చేశాం. ఉగ్రవాది, రాళ్లదాడికి పాల్పడివారు జైలు నుంచి విడుదల కాలేరు. జమ్ము కశ్మీర్లో ఏ ఉగ్రవాది కూడా స్వేచ్ఛగా పరిస్థితి ఇకమీదట ఉండదని మీకు బీజేపీ హామి ఇస్తుంది’ అని అన్నారు.మరోవైపు..జమ్ము కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత మొదటిసారిగా అసెంబ్లీ ఎన్నికలు (సెప్టెంబరు 18న తొలి విడత, సెప్టెంబరు 25న రెండో విడత, అక్టోబరు 1న మూడో విడత)జరుగుతున్నాయి.అక్టోబరు 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. -
పాక్‌కు మోదీ అంటే భయం..: అమిత్ షా
మెంఢర్: ‘‘ప్రధాని నరేంద్ర మోదీ అంటే పాకిస్తాన్ భయపడుతోంది. అందుకే జమ్మూకశీ్మర్‌లో సరిహద్దులు ప్రశాంతంగా ఉన్నాయి’’ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. సరిహద్దుల్లో ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా భారత్ సమాధానం ఎంత తీవ్రంగా ఉంటుందో పాక్‌కు తెలుసన్నారు. సరిహద్దుల్లోని పూంఛ్ జిల్లాలో శనివారం ఎన్నికల ప్రచార ర్యాలీల్లో మంత్రి మాట్లాడారు. కేంద్ర పాలిత ప్రాంతంలోని యువకులకు తుపాకులు, రాళ్ల స్థానంలో ల్యాప్‌టాప్‌లను అందించడం ద్వారా ఇక్కడ తీవ్రవాదాన్ని తుడిచిపెట్టామన్నారు. 1990ల్లో తరచూ చోటుచేసుకున్న సీమాంతర ఉగ్రవాదం నేడు కనిపిస్తోందా అని ప్రజలను ప్రశ్నించారు. ‘‘గతంలో ఇక్కడి పాలకులు పాకిస్తాన్‌ను చూసి భయపడేవారు. ఇప్పుడు మోదీని చూసి పాక్‌కు భయం పట్టుకుంది. కాల్పులకు దిగేందుకు సాహసించడం లేదు. జమ్మూకశీ్మర్‌లో 1990ల్లో మొదలైన ఉగ్రవాదానికి 2014 నాటికి 40 వేల మంది బలయ్యారు. దాన్ని ఆపడంలో ఆ మూడు (అబ్దుల్లా, ముఫ్తీ, నెహ్రూ) కుటుంబాలు విఫలమయ్యాయి. పైపెచ్చు, ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టాయి. జమ్మూకశ్మీర్‌లో ప్రజాస్వామ్యం వేళ్లూనడానికి వాళ్లు ఎప్పుడూ ప్రయతి్నంచలేదు. ఆ మూడు కుటుంబాల పాలనకు ముగింపు పలికేలా అసెంబ్లీ ఎన్నికల్లో తీరి్పవ్వండి’’ అని అమిత్ షా పిలుపునిచ్చారు.ఉగ్రవాదంతో ఎవరికీ లాభం లేదు ‘ఉగ్రవాదం వల్ల ఎవరికీ ప్రయోజనం లేదు. తుపాకులను మన పిల్లలకు అందజేద్దాం. మన యువతను ఆర్మీ, పోలీసు విభాగాల్లోకి పంపేందుకు ప్రయతి్నద్దాం. ఇందుకోసం సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ డ్రైవ్‌లను ఏర్పాటు చేస్తాం’’ అని అమిత్ షా ప్రకటించారు. ‘‘కేంద్రంలో 2014లో బీజేపీ ప్రభుత్వమే ఏర్పడకుంటే ఇక్కడ పంచాయతీరాజ్ ఎన్నికలు జరిగేవే కావు, 30 వేల మంది పంచాయతీ సభ్యుల ఎన్నికయ్యే వారే కాదు. ప్రజలపై ఎన్సీ, పీడీపీ, కాంగ్రెస్ పారీ్టల మూడు కుటుంబాల పెత్తనం మరింత పెరిగి ఉండేది’’ అని అమిత్ షా దుయ్యబట్టారు. గుజరాత్‌కు చెందిన ఒక నేత నియంత్రణ రేఖకు అతి సమీపంలోని మెంఢర్‌కు వచ్చి ఉండేవారే కాదని తన పర్యటనను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 1947లో సరిహద్దులను కాపాడిన పహాడీలు, బకర్వాలాలు, గుజ్జర్లను చూసి జాతి గరి్వస్తోందన్నారు. -
ఆ మూడు కుటుంబాల పాలన అంతమే ఈ ఎన్నికలు: అమిత్ షా
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ ఎన్నికలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికలు రాహుల్ గాంధీ, మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా అనే మూడు కుటుంబాల పాలనను అంతం చేయబోతున్నాయని పేర్కొన్నారు. ఈ మూడు కుటుంబాలే ఎన్నోఏళ్లుగా జమ్ముకశ్మీర్‌లో ప్రజాస్వామ్యాన్ని అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. 2014లో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి రాకపోతే, జమ్మూకశ్మీర్‌లో ఎప్పటికీ పంచాయతీ లేదా బ్లాక్ స్థాయి ఎన్నికలు జరిగేవి కావని అన్నారు.ఈ మేరకు జమ్ముకశ్మీర్‌లోని మెంధార్‌లో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో శనివారం కేంద్రమంత్రి అమిత్‌షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్ధేశించి ఆయన ప్రసంగిస్తూ.. ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జమ్మూలో మూడు కుటుంబాలు (గాంధీ, ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా)హింసను ప్రేరేపించాయని, కాబట్టి ఆ మూడు పార్టీల (కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ) వారసత్వ రాజకీయాలకు ముగింపు పలకాలని ప్రజలకు పిలుపునిచ్చారు.‘1947 నుంచి పాకిస్థాన్‌తో జరిగిన ప్రతి యుద్ధంలోనూ జమ్ము సైనికులు భారత్‌కు రక్షణగా నిలిచారు. సరిహద్దుల్లో దైర్యసాహాలు ప్రదర్శించి బుల్లెట్లను ఎదుర్కొన్నారు. ప్రస్తుతం మోదీ ప్రభుత్వం జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని అంతం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం యువతకు రాళ్లు, తుపాకులు బదులు పెన్నులు, ల్యాప్‌టాప్‌లు ఇచ్చింది. ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత ఇక్కడ అభివృద్ధి వేగంగా జరుగుతోంది. ప్రజల భద్రత కోసం సరిహద్దుల్లో మరిన్ని బంకర్లను ఏర్పాటు చేస్తాం.जम्मू-कश्मीर के मेंढर की जनसभा में लोगों का उत्साह बता रहा है कि यहाँ भाजपा की जीत सुनिश्चित है। https://t.co/7gGuXRtocV— Amit Shah (@AmitShah) September 21, 2024మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓబీసీలు, వెనుకబడిన తరగతులు, గుజ్జర్ బకర్వాల్లు, పహారీలకు రిజర్వేషన్లు వచ్చాయి. ఆ బిల్లును నేను పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు ఫరూక్ అబ్దుల్లా పార్టీ దానిని వ్యతిరేకించి ఇక్కడి గుజ్జర్ సోదరులను రెచ్చగొట్టడం చేశారు. అప్పుడు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చాను. గుజ్జర్-బకర్వాల్ సోదరుల రిజర్వేషన్లను తగ్గించకుండా కొండ ప్రాంత ప్రజలకు.. ఆ హామీని నెరవేర్చాం’అని పేర్కొన్నారు.जम्मू-कश्मीर का ये चुनाव, यहाँ तीन परिवारों का शासन समाप्त करने वाला चुनाव है। अब्दुल्ला परिवार, मुफ्ती परिवार और नेहरू-गांधी परिवार... इन तीनों परिवारों ने यहां जम्हूरियत को रोक कर रखा था। अगर 2014 में मोदी सरकार न आती तो पंचायत, ब्लॉक, जिले के चुनाव नहीं होते: श्री @AmitShah…— Office of Amit Shah (@AmitShahOffice) September 21, 2024 కాగా జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత మొదటిసారిగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. సెప్టెంబరు 18న తొలివిడత పోలింగ్ నిర్వహించగా.. రెండో దశ సెప్టెంబరు 25న, చివరిదశ అక్టోబర్ 1న జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలను అక్టోబర్ 8న వెల్లడి కానున్నాయి. -
2026కల్లా నక్సలిజం అంతం
న్యూఢిల్లీ/షహీబ్‌గంజ్ (జార్ఖండ్): దేశంలో నక్సలిజం 2026 మార్చి నాటికి పూర్తిగా అంతమైపోతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ‘‘2026 మార్చి 31లోగా నక్సల్స్ హింసను, భావజాలాన్ని దేశం నుంచి తుడిచిపెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించారు. అంతకంటే ముందే నక్సలిజాన్ని అంతం చేస్తాం’’ అని పేర్కొన్నారు. హింసను విడనాడి ఆయుధాలు వదిలేసి లొంగిపోవాలని మావోయిస్టులకు విజ్ఞప్తి చేశారు. నక్సల్ హింసకు గురైన 55 మంది బాధితులనుద్దేశించి బుధవారం ఆయన మాట్లాడారు. ‘‘మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లలో భద్రతా దళాలు భారీ విజయాలు సాధించాయి. సమస్య ఇప్పుడు ఛత్తీస్‌గఢ్‌లోని నాలుగు జిల్లాలకు మాత్రమే పరిమితమైంది. పశుపతినాథ్ (నేపాల్) నుంచి తిరుపతి (ఏపీ) దాకా కారిడార్ ఏర్పాటు చేయాలని మావోయిస్టులు ఒకప్పుడు అనుకున్నారు. కానీ ఆ ప్రణాళికలను మోదీ ప్రభుత్వం తిప్పికొట్టింది. ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్స్ ప్రభావిత ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కేంద్ర హోం శాఖ త్వరలో సంక్షేమ పథకం రూపొందిస్తుంది. ఉద్యోగాలు, ఆరోగ్య సంరక్షణ, ఇతర రంగాల్లో సంక్షేమ కార్యక్రమాల ద్వారా సాయం చేస్తుంది’’ అని వెల్లడించారు. జార్ఖండ్‌లో జేఎంఎం–కాంగ్రెస్ సంకీర్ణ సర్కారు బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లను విపరీతంగా ప్రోత్సహిస్తోందని అమిత్ షా ధ్వజమెత్తారు. దీనికి అడ్డుకట్ట వేయని పక్షంలో మరో పాతికేళ్లలో చొరబాటుదారులే రాష్ట్రంలో మెజారిటీ ప్రజలుగా మారిపోతారని హెచ్చరించారు. స్థానిక గిరిజన సంస్కృతిని వాళ్లు సర్వనాశనం చేస్తున్నారని ఆరోపించారు. జార్ఖండ్‌లోని గిరి«ద్లో పరివర్తన్ యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఓటుబ్యాంకు రాజకీయాల కోసం చొరబాటుదారులను రాష్ట్ర ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందని ధ్వజమెత్తారు. వీటి దెబ్బకు సంతాల్ పరగణాల్లో స్థానిక గిరిజనుల జనాభా 44 శాతం నుంచి 28 శాతానికి తగ్గిందన్నారు. -
ఈ టర్మ్‌లోనే జమిలి ఎన్నికలు
న్యూఢిల్లీ: ప్రస్తుత ప్రభుత్వ పాలనా కాలంలోనే జమిలి(ఒకేసారి దేశవ్యాప్త) ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టంచేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో మూడోసారి ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలి 100 రోజుల పాలనలో సాధించిన విజయాలపై మంగళవారం పత్రికాసమావేశంలో మంత్రి అశ్వనీవైష్ణవ్‌తో కలిసి అమిత్ సుదీర్ఘంగా మాట్లాడారు. జనగణన ఎప్పుడో త్వరలో చెప్తాం జనగణన ఎప్పుడు జరపబోయేది త్వరలోనే వెల్లడిస్తామని, ప్రకటన చేశాక సంబంధిత వివరాలను తెలియజేస్తామని అమిత్ చెప్పా రు. జనగణన, కులగణన తక్షణం జరపాలంటూ విపక్షాల నుంచి విపరీతమైన డిమాండ్లు వెల్లువెత్తుతున్న తరుణంలో అమిత్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. రైతుల కోసం రూ.15 లక్షల కోట్ల పథకాలు ‘‘రైతాంగం బాగు కోసం సాగురంగంలో 14 విభాగాల్లో రూ.15 లక్షల కోట్ల విలువైన పథకాలను ఈ 100 రోజుల్లో అమల్లోకి తెచ్చాం. వ్యవసాయంలో మౌలిక వసతుల కల్పనకు మౌలిక సాగు నిధి ఏర్పాటుచేశాం. మోదీ మూడోసారి ప్రధాని అయ్యాక తొలి నిర్ణయం రైతుల కోసమే తీసుకున్నారు. మెరుగైన మౌలిక వసతులకు రూ.3 లక్షల కోట్లు కేటాయించాం.25వేలకు పైగా కుగ్రామాలకు రోడ్ల అనుసంధానం పెంచుతున్నాం. ఉల్లి, బాస్మతి బియ్యంపై కనీస ఎగుమతి ధరను తొలగించాం. వక్ఫ్ ఆస్తులను కాపాడేందుకు కట్టుబడ్డాం. ఆస్తుల దురి్వనియోగాన్నీ వక్ఫ్ (సవరణ) బిల్లు అడ్డుకుంటుంది. గత నెలలో లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టాం. సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు బిల్లును పంపాం. త్వరలోనే పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందుతుంది’’ అని షా అన్నారు. -
‘అగ్నివీర్’పై రాహుల్‌ది తప్పుడు ప్రచారం: అమిత్ షా
చండీగఢ్:కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ,హర్యానా మాజీ సీఎం భూపీందర్సింగ్హుడాపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫైర్ అయ్యారు. అగ్నివీర్ పథకంపై రాహుల్,హుడా రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. హరియాణా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం(సెప్టెంబర్17)లోహారులో నిర్వహించిన ప్రచార సభలో అమిత్‌షా మాట్లాడారు. రాహుల్ ఏ భాషలోనైనా అబద్ధాలు చెప్పగలరని ఎద్దేవా చేశారు. జమ్మూకశ్మీర్‌లో ఒకవేళ కాంగ్రెస్ కూటమి విజయం సాధిస్తే రాహుల్ గాంధీ, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) నేత ఒమర్ అబ్దుల్లాలు ఉగ్రవాదులందరినీ విడుదల చేస్తారని హెచ్చరించారు.జమ్మూకశ్మీర్‌లో ‘ఆర్టికల్ 370’ని రద్దు చేయడంపై రాహుల్ తన వైఖరిని స్పష్టం చేయాలని అమిత్ షా డిమాండ్ చేశారు. ఆర్మీలో ‘వన్ ర్యాంక్ వన్ పెన్షన్’ పథకాన్ని అమలు చేసిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందన్నారు. హర్యానాలోని 90 అసెంబ్లీ సీట్లకు అక్టోబర్5న పోలింగ్, 8న కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఇదీ చదవండి.. మోదీ వందరోజుల పాలన బుక్లెట్ విడుదల -
మోదీ 100 రోజుల పాలన.. రూ.3 లక్షల కోట్లతో ప్రాజెక్టులు: అమిత్ షా
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు ఏర్పడి వంద రోజులు దాటింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేడు ఓ బుక్‌లెట్‌ను విడుదల చేశారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో బీజేపీ ప్రభుత్వం సాధించిన ప్రగతి పనులను ఇందులో వెల్లడించారు.జాన్‌లో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి దాదాపు రూ. 15 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రకటించినట్లు పేర్కొన్నారు. ఇందులో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వంరూ. 3 లక్షల కోట్లు కేటాయించిందని, 49,000 కోట్లతో దాదాపు 25,000 గ్రామాలను రోడ్డు నెట్‌వర్క్‌లకు అనుసంధానం చేసినట్లు తెలిపారు. 50,600 కోట్లతో దేశవ్యాప్తంగా ప్రధాన రహదారులను విస్తరించాలని కేంద్రం నిర్ణయించిందని మంత్రి వెల్లడించారు. గత పదేళ్లలో ఇళ్లు, టాయిలెట్లు, గ్యాస్ కనెక్షన్లు, త్రాగునీరు, విద్యుత్తు, ఉచిత ఆహార ధాన్యాలు, ఆరోగ్యం అందించినట్లు చెప్పారు. వచ్చే ఎన్నికల వరకు దేశంలోల్లు లేని వారు ఉండకూడదన్న లక్ష్యంతో పనిచేయనున్నట్లు అమిత్ షా తెలిపారు.మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు దేశంలో రాజకీయ స్థిరత్వాన్ని తీసుకువచ్చిందన్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశామని, ప్రజలు వాటికి సాక్ష్యాలుగా నిలిచినట్లు ఆయన పేర్కొన్నారు. రూ. 76,000 కోట్లతో మహారాష్ట్రలోని వాధ్వన్లో మెగా పోర్ట్‌ను నిర్మించనున్నారని చెప్పారు. ఇది ప్రపంచంలోనే టాప్ 10 పోర్టులలో ఒకటిగా మారనుందని తెలిపారు. ప్రభుత్వం PM eBus సేవా పథకాన్ని ప్రారంభించిందని, స్టార్టప్‌ల కోసం ఏంజెల్ పన్ను రద్దు ద్వారా 31% పన్ను భారాన్ని తొలగించిందని, అభివృద్ధి కోసం భారతదేశం అంతటా 12 పారిశ్రామిక జోన్లను గుర్తించిందని పేర్కొన్నారు. సైబర్ సెక్యూరిటీ గురించి మంత్రి మాట్లాడుతూ.. సైబర్‌క్రైమ్‌ను పరిష్కరించడానికి వచ్చే ఐదేళ్లలో 5,000 మంది సైబర్ కమాండోలను నియమించనున్నట్లు చెప్పారు.చదవండి: Atishi Marlena: ఢిల్లీ సీఎం కాబోతున్న ఈ మహిళ ఎవరుయువత కోసం రూ. 2 లక్షల కోట్ల ప్రధానమంత్రి ప్యాకేజీని కూడా ప్రకటించామని కేంద్ర హోంమంత్రి తెలిపారు. ఐదేళ్లలో 4.10 కోట్ల మంది యువత దీని ద్వారా లబ్ధి పొందుతారని, కోటి మంది యువతకు అలవెన్సులు, వన్‌టైమ్ సహాయంతో పాటు అగ్రశ్రేణి కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ అవకాశాలను కూడా అందించాలనితమ ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు. ‘ఈ 100 రోజుల్లో మధ్యతరగతి వారికి కూడా చాలా ఉపశమనం లభించింది. ఇప్పటి వరకు రూ. 7 లక్షల వరకు ఆదాయంపై ఎలాంటిపన్ను లేదు. ఒక ర్యాంక్ వన్ పెన్ష మూడవ ఎడిషన్ అమలు చేస్తున్నాం. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద 3 కోట్ల ఇళ్లు మంజూరు చేశాం. వాటిలో 1 కోటి పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 2 కోట్ల ఇళ్లు నిర్మాణం జరుగుతున్నాయి.పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి, వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం, పశ్చిమ బెంగాల్‌లోని బాగ్డోగ్రా, బీహార్‌లోని బిహ్తా విమానాశ్రయాన్ని అప్‌గ్రేడ్ చేస్తున్నా. అగట్టి, మినికాయ్‌లో కొత్త ఎయిర్‌స్ట్రిప్‌లను కూడా నిర్మిస్తున్నాం. బెంగళూరు మెట్రో, పూణే ప్రాజెక్టులను కూడా చేపట్టాం. ఈ 100 రోజుల్లో మెట్రో, థానే ఇంటిగ్రేటెడ్ రింగ్ మెట్రో అనేక ఇతర మెట్రో పనులు చేస్తున్నాం.వ్యవసాయ రంగంలో, 17వ విడత పిఎం కిసాన్ సమ్మాన్ యోజనలో 9.5 కోట్ల మంది రైతులకు ప్రభుత్వం రూ. 20,000 కోట్లు పంపిణీ చేసింది ఇప్పటి వరకు 12.33 కోట్ల మంది రైతులకు రూ. 3 లక్షల కోట్లు పంపిణీ చేశాం. గుజరాత్‌లోని సనంద్‌లో రూ. 3,300 కోట్లతో ప్రభుత్వం సెమీకండక్టర్ యూనిట్‌ను కూడా ఏర్పాటు చేస్తుంది. యూనిట్ రోజుకు ఆరు మిలియన్ చిప్స్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. "రాబోయే 10 సంవత్సరాలలో, సెమీకండక్టర్స్‌లో భారతదేశం ప్రధాన పాత్ర పోషిస్తుంది.’ అని తెలిపారుఇదిలాఉండగా.. మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తవడంతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా వివిధ మంత్రిత్వశాఖలు, పార్టీ నాయకులు వివరణాత్మక ప్రణాళికను రూపొందించాయన్నారు. ఇందులోభాగంగా సేవా పఖ్వాడా అనే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారన్నారు. ఈ కార్యక్రమాలు మంగళవారం నుంచి అక్టోబరు 2 వరకు కొనసాగుతాయన్నారు. -
Amit Shah: ఉగ్రవాదాన్ని పాతిపెడతాం
గులాబ్‌గఢ్/కిష్ట్వార్: మళ్లీ కోలుకోనంతగా ఉగ్రవాదాన్ని బీజేపీ ప్రభుత్వం పాతాళంలోకి పాతిపెట్టనుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. జమ్మూకశ్మీర్‌లోని కిష్ట్వార్ జిల్లాలోని పెదర్–నగ్సేని నియోజకవర్గ పరిధిలో సోమవారం గులాబ్‌గఢ్‌లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో అమిత్ ప్రసంగించారు. ‘‘1990దశకం నుంచి ఉగ్రవాదంతో కష్టాలుపడుతున్న జమ్మూ కశ్మీర్ ప్రజలకు ఈరోజు మాట ఇస్తున్నా. మళ్లీ ఈ గడ్డపై కనిపించనంత లోతుల్లో ఉగ్రవాదాన్ని మా ప్రభుత్వం పాతిపెడుతుంది. ఇక్కడ తమ ప్రభుత్వం ఏర్పాటైతే జైళ్ల నుంచి ఉగ్రవాదులను విడుదలచేస్తామని నేషనల్ కాన్ఫెరెన్స్(ఎన్సీ) కాంగ్రెస్ పార్టీలు హామీ ఇచ్చాయి. మచియాల్ మాత సాక్షిగా చెబుతున్నా. భారతగడ్డపై ఉగ్రవాదాన్ని వ్యాప్తిచేసే సాహసం ఇంకెవ్వరూ చేయరు. ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు గ్రామ రక్షణ గార్డులు, స్పెషల్ పోలీస్ అధికారులకు పాతరకం .303 రైఫిళ్ల స్థానంలో అధునాతన ఆయుధాలిచ్చాం. ఎక్కడి నుంచైనా ఇక్కడికి ఉగ్రవాదులొస్తే వారి కథ ఇక్కడి మంచుకొండల్లో ముగిసిపోతుంది’’ అని అన్నారు. ఈ సందర్భంగా ఎన్సీ, కాంగ్రెస్‌లపై అమిత్ విమర్శలుచేశారు. ‘‘ డోగ్రాల చివరి రాజు మహారాజా హరిసింగ్‌ను వీళ్లు అవమానించారు. కశ్మీరీ పండిట్లు బలవంతంగా వెళ్లిపోవడానికి కారణం వీళ్లే. వీళ్లు మహిళ హక్కులను లాగేసుకున్నారు. అవసరమైన వర్గాలకు రిజర్వేషన్ ఫలాలు దక్కకుండా చేశారు’’ అని ఆరోపించారు. ‘‘ రువ్వేందుకు రాళ్లు పట్టుకున్న యువతకు జైళ్లు సిద్ధంగా ఉన్నాయి. అలాగే ల్యాప్‌టాప్‌లు, త్రివర్ణపతాకం పట్టుకున్న యువతకు ఉద్యోగాలు సిద్ధంగా ఉన్నాయి’ అని షా అన్నారు. రాహుల్ కశ్మీర్లో ఐస్‌క్రీమ్ తినొచ్చురామ్బాన్లో జరిగిన ర్యాలీలోనూ అమిత్ మాట్లాడారు. ‘‘ కశ్మీర్‌ను ఎన్డీఏ సర్కార్ సురక్షితమైన ప్రాంతంగా మార్చేసింది. అయితే ఇటీవల రాహుల్ ఇక్కడి కొచ్చి లాల్‌చౌక్‌లో ఐస్‌క్రీమ్ తిన్నారు. బైక్ నడిపారు. పైగా మా ప్రభుత్వాన్నే విమర్శిస్తున్నారు. రాహుల్ బాబా.. మీరు మమ్మల్ని విమర్శిస్తున్నారుగానీ ఇంతటి రక్షణ వాతావరణం మా వల్లే సాధ్యమైంది. మీ ప్రభుత్వాల్లో ఇది అసాధ్యం’’ అని అన్నారు. కాంగ్రెస్ హయాంలో హోం మంత్రిగా ఉండి కూడా లాల్‌చౌక్ ప్రాంతానికి వెళ్లాలంటేనే భయపడేవాడినని కాంగ్రెస్ నేత సుశీల్‌కుమార్ షిండే చేసిన వ్యాఖ్యలను అమిత్ గుర్తుచేశారు. ‘‘ షిండే గారూ.. ఇప్పుడు పిల్లాజెల్లాతో వచ్చేయండి. ఎంచక్కా లాల్‌చౌక్‌లో వాకింగ్ చేయండి. మీకు హాని చేసేందుకు ఎవరూ సాహసించరు’’ అని అమిత్ అన్నారు. -
ఉగ్రవాదం అంతమే లక్ష్యం : అమిత్‌షా
జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఆ పార్టీ అగ్రనాయకత్వం ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది.ఈ సందర్భంగా మొదటి దశ ప్రచారానికి చివరి రోజున కేంద్ర హోం మంత్రి అమిత్ షా కిష్త్వార్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. జమ్మూకశ్మీర్‌ను తిరిగి తీవ్రవాదంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ దాని మిత్రపక్షమైన నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) తీవ్రవాదంపై అలసత్వం ప్రదర్శిస్తున్నాయని, ఉగ్రవాదులు,దాడులకు పాల్పడిన వారిని జైళ్ల నుంచి విడిచి పెట్టాలని యోచిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షా మాట్లాడుతూ.. ఈ ప్రాంత అమరవీరుల్ని స్మరించుకుంటూ.. ఉగ్రవాదాన్ని అంతం చేస్తామని హామీ ఇస్తున్నాను’అని అన్నారు.ఆర్టికల్ 370 రద్దు చేసిన చరిత్ర బీజేపీదేనని పునరుద్ఘాటించారు. కాగా,జమ్మూ కశ్మీర్ ఎన్నికలు మూడు దశల్లో సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1న జరగనున్న విషయం తెలిసిందే. ఇక అక్టోబర్ 5న హర్యానా అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి. రెండు రాష్ట్రాలకు అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడిస్తారు. VIDEO | "Today, I remember all the martyrs from this region and make a promise before you, that we will end terrorism in such a way that it will never rise again. There are efforts being made to support terrorism here again. The NC and Congress have even made promises that if… pic.twitter.com/cZi1Zacljs— Press Trust of India (@PTI_News) September 16, 2024ఇదీ చదవండి : సందీప్ ఘోష్ ఓ అబద్ధాల పుట్ట.. -
కేంద్రానికి చెంపపెట్టు
న్యూఢిల్లీ: కేజ్రీవాల్ విడుదలను సీబీఐకి, అమిత్ షాకు, కేంద్రానికి చెంపపెట్టుగా ఆప్ అభివరి్ణంచింది. ‘‘సీబీఐ పంజరంలో చిలుకేనని సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యలు మరోసారి రుజువు చేశాయి. అవి నేరుగా కేంద్రంపై చేసిన వ్యాఖ్యలు. కనుక కేంద్ర హోం మంత్రి అమిత్ షా తక్షణం రాజీనామా చేయాలి’’ అని ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ డిమాండ్ చేశారు. మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా దర్యాప్తు సంస్థలు ఇప్పటిదాకా ఏ సాక్ష్యాన్నీ సంపాదించలేకపోయాయని ఢిల్లీ మంత్రి ఆతిషి ఎద్దేవా చేశారు. హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తారని ఆ రాష్ట్ర పార్టీ చీఫ్ సుశీల్ గుప్తా అన్నారు. కేజ్రీవాల్ విడుదలను ప్రజాస్వామ్య విజయంగా సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ అభివరి్ణంచారు. ఆప్ విమర్శలను బీజేపీ తిప్పికొట్టింది. ‘‘కేజ్రీవాల్‌కు షరతులతో కూడిన బెయిల్ మాత్రమే వచి్చందని మర్చిపోవద్దు. మద్యం కేసులో ప్రధాన నిందితుడైన ఆయన తక్షణం రాజీనామా చేయాలి’’ అని డిమాండ్ చేసింది. లేదంటే ఢిల్లీ ప్రజలే ఆయన రాజీనామాకు పట్టుబట్టే రోజు ఎంతో దూరం లేదంది. -
పోర్టు బ్లెయర్ పేరు మార్చిన కేంద్రం.. కొత్తగా..
ఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ సర్కార్ దేశంలోని పలు ప్రాంతాల పేర్లను మార్చడంలో బిజీగా ఉంది. ఉత్తరాదిలో ఇప్పటికే పలు ప్రాంతాల పేర్లను మార్చిన కేంద్రం.. తాజాగా అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్ పేరును కేంద్ర ప్రభుత్వం మార్చింది. ఇక, నుంచి పోర్టు బ్లెయిర్ పేరును శ్రీ విజయపురంగా పిలవాలని సూచించింది.ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ట్విట్టర్ వేదికగా.. ప్రధాని నరేంద్ర మోదీ ఆశయాలకు అనుగుణంగా పోర్ట్‌బ్లెయిర్ పేరును శ్రీ విజయపురంగా మార్చాలని నిర్ణయించాం. మునుపటి పేరు వలసవాద వారసత్వాన్ని సూచిస్తోంది. శ్రీ విజయపురం అనేది భారత స్వాతంత్ర్య పోరాటంలో సాధించిన విజయానికి ప్రతీక. నాటి పోరాటంలో అండమాన్ నికోబార్ పాత్ర ఎంతో ప్రత్యేకం అని చెప్పుకొచ్చారు. Inspired by the vision of PM @narendramodi Ji, to free the nation from the colonial imprints, today we have decided to rename Port Blair as "Sri Vijaya Puram."While the earlier name had a colonial legacy, Sri Vijaya Puram symbolises the victory achieved in our freedom struggle…— Amit Shah (@AmitShah) September 13, 2024 Central Government renames Port Blair in Andaman and Nicobar Islands to "Sri Vijaya Puram" pic.twitter.com/pw18yukCOl— All India Radio News (@airnewsalerts) September 13, 2024 ఇది కూడా చదవండి: కోల్‌కతా అభయ కేసులో బిగ్ ట్విస్ట్.. -
బీజేపీ ఉన్నంతకాలం రిజర్వేషన్లను ఎవరూ రద్దు చేయలేరు: అమిత్ షా
అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య పొలిటికల్ వార్ నడుస్తోది. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అమెరికా వేదికగా కేంద్రంలోని ప్రధాని మోదీ సర్కార్‌పై విమర్శలు గుప్పిస్తుంటే.. అదే స్థాయిలో కేంద్రమంత్రులు, బీజేపీ నేతలు.. కాంగ్రెస్ నేత వ్యాఖ్యలను తప్పికొడుతున్నారు. తాజాగా రాహుల్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మండిపడ్డారు. దేశాన్ని విభజించేందుకు కుట్ర పన్నుతున్న శక్తులకు అండగా నిలబడటం రాహుల్‌కు, కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందని అమిత్ షా విమర్శించారు. ‘దేశాన్ని విభజించేందుకు కుట్ర పన్నుతున్న శక్తులకు అండగా నిలవడం, దేశవ్యతిరేక ప్రకటనలు చేయడం రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి అలవాటైపోయింది. అది జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన దేశ వ్యతిరేక, రిజర్వేషన్ వ్యతిరేక ఎజెండాకు మద్దతివ్వడమైనా సరే లేదా విదేశీ గడ్డపై భారత వ్యతిరేక ప్రకటనలు చేయడమైనా సరే.. రాహుల్ గాంధీ ఎప్పుడూ దేశ భద్రతను ముప్పులో పడేస్తున్నారు. ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారు.ప్రాంతీయవాదం, మతం, భాషా భేదాల తరహాలో చీలికలు తెచ్చే కాంగ్రెస్ రాజకీయాలను రాహుల్ గాంధీ ప్రకటన బయటపెట్టింది. దేశంలో రిజర్వేషన్ల రద్దు గురించి మాట్లాడటం ద్వారా.. కాంగ్రెస్‌కు, ఆయనకు రిజర్వేషన్‌పై ఉన్న వ్యతిరేకతను మరోసారి తెరపైకి తీసుకొచ్చారు. ఆయన మనసులో మెదిలే ఆలోచనలే చివరికి మాటల రూపంలో బయటపడ్డాయి. ఇక్కడ నేను రాహుల్‌కు ఒక విషయం స్పష్టంచేయాలని అనుకుంటున్నాను. బీజేపీ ఉన్నంతకాలం రిజర్వేషన్లను ఎవరూ రద్దు చేయలేరు. అలాగే దేశభద్రతతో ఎరూ ఆటలాడలేరు’ అంటూ మండిపడ్డారు. -
సైబర్ నేరాల కట్టడికి ఏఐని వాడండి
న్యూఢిల్లీ: కృత్రిమ మేధ(ఏఐ) సాంకేతికను వినియోగించుకుంటూ సైబర్ నేరాల కట్టడికి కృషి చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా దర్యాప్తు సంస్థలను కోరారు. ఆన్లైన్లో చిన్నారులు, మహిళలపై వేధింపులకు పాల్పడటం, తప్పుడు వార్తలను ప్రచారం చేయడం, మాయమాటలతో జనం కష్టార్జితాన్ని దోచుకునే నేరగాళ్లను ఏఐ ద్వారా గుర్తించొచ్చని మంత్రి తెలిపారు. ప్రపంచ డిజిటల్ లావాదేవీల్లో దాదాపు సగం, 46 శాతం వరకు భారత్ వాటా ఉందని, ఇలాంటి సమయంలో నేరాలను నివారించడం అత్యంత కీలకమని అన్నారు.అయితే, దర్యాప్తు విభాగాలకు ఇది పెద్ద సవాల్‌తో కూడుకున్న వ్యవహారమని చెప్పారు. మంగళవారం ఇండియన్ సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్(ఐ4సీ) మొట్టమొదటి వ్యవస్థాపక దినోత్సవంలో మంత్రి అమిత్ షా కీలకోపన్యాసం చేశారు. కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో 2018లో ఐ4సీ ఏర్పాటైంది. సైబర్ నేరాల కట్టడికి జాతీయ స్థాయిలో సమన్వయ కేంద్రంగా ఐ4సీ పనిచేస్తుంది. ఈ సందర్భంగా సైబర్ ఫ్రాడ్ మిటిగేషన్ సెంటర్(సీఎఫ్ఎంసీ), సమన్వయ వేదిక, సైబర్ కమాండోస్ ప్రోగ్రాం, సస్పెక్ట్ రిజిస్ట్రీ అనే నాలుగు విభాగాలను ఐ4సీలో అమిత్ షా ప్రారంభించారు.సైబర్ నేరాలపై సమర్థవంత పోరాటం కోసం పాతకాలపు ‘అవసరమైన విషయం మాత్రమే చెప్పడం’అనే పద్ధతిని విడనాడి, ‘బాధ్యతలను పంచుకోవడం’అనే విధానాన్ని అనుసరించాలని సూచించారు.