
న్యూఢిల్లీ, సాక్షి: కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ సమర్పించిన సభా హక్కుల ఉల్లంఘన నోటీసులను గురువారం రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్ తిరస్కరించారు. ఆయన వ్యాఖ్యలను పరిశీలించాను. అందులో అతిక్రమణ ఏదీ కనిపించలేదని చెబుతూ నోటీసులను తిరస్కరించారు.
విపత్తుల నిర్వహణ బిల్లు 2024పై రాజ్యసభలో మంగళవారం జరిగిన చర్చలో అమిత్‌షా మాట్లాడుతూ ‘‘కాంగ్రెస్ హయాంలో ప్రధానమంత్రి సహాయనిధి కేవలం ఒక కుటుంబం గుప్పిట్లో ఉండేదని, ప్రధానమంత్రి సహాయనిధిని ప్రభుత్వం ఏర్పాటు చేసినా అందులో కాంగ్రెస్ అధ్యక్షులు సభ్యులుగా ఉండేవారు’’ అని వ్యాఖ్యానించారు.
అయితే ఈ వ్యాఖ్యలు పరోక్షంగా సోనియా గాంధీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేవిగా ఉన్నాయని, హోం మంత్రి సభ్యులను తప్పుదోవ పట్టించారని, ఇది సభా హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని పేర్కొంటూ జైరాం రమేశ్ ప్రివిలేజ్ నోటీసు రాజ్యసభ చైర్మన్‌కు అందించారు.