Privilege notice
-
బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలకు ప్రివిలేజ్ నోటీసులు
-
బీఆర్ఎస్ ఎంపీలకు ప్రివిలేజ్ నోటీసులు
సాక్షి, ఢిల్లీ: భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) రాజ్యసభ ఎంపీలకు ప్రివిలేజ్ నోటీసులు జారీ అయ్యాయి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే ఫిర్యాదు మేరకు ఈ నోటీసులు జారీ అయినట్లు సమాచారం. ఈ నెల 28వ తేదీలోపు సమాధానం చెప్పాలని రాజ్యసభ చైర్మన్ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు సభలో రూల్స్‌కు విరుద్ధంగా ఫ్లకార్డులు ప్రదర్శించారని బీజేపీ ఎంపీ(బీహార్) వివేక్ ఠాకూర్ రాజ్యసభ చైర్మన్(ఉపరాష్ట్రపతి) జగదీప్ ధన్‌ఖడ్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో తదుపరి చర్యల్లో భాగంగా బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలకు నోటీసులు జారీ అయ్యాయి. సీనియర్ నేతలు కే.కేశవరావు, కేఆర్ సురేష్‌రెడ్డిలతో పాటు వడ్డీరాజు రవిచంద్ర, లింగయ్య యాదవ్, దామోదర్ రావులు నోటీసులు అందుకున్నవాళ్లలో ఉన్నట్లు సమాచారం. -
ప్రధాని మోదీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ శుక్రవారం రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌కు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు అందజేశారు. మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఇంటి పేరును ఆయన కుటుంబ సభ్యులు ఎందుకు ఉపయోగించుకోలేదంటూ మోదీ చేసిన వ్యాఖ్యలపై కేపీ వేణుగోపాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసే తీర్మానంపై సమాధానం ఇస్తూ ఫిబ్రవరి 9న రాజ్యసభలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీపై రాజ్యసభ కార్యకలాపాల నిర్వహణ నిబంధనల్లోని రూల్ 188 కింద సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తున్నట్లు కేసీ వేణుగోపాల్ తన నోటీసులో పేర్కొన్నారు. నెహ్రూ కుటుంబాన్ని ప్రధాని అవమానించారని ఆక్షేపించారు. నెహ్రూ కుటుంబ సభ్యులైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యులేనని గుర్తుచేశారు. నెహ్రూ ఇంటి పేరును ఆయన కుటుంబ సభ్యులు ఎందుకు వాడుకోలేదని ప్రశ్నించడం అసంబద్ధం, అర్థరహితమని వేణుగోపాల్ తేల్చిచెప్పారు. -
ఎస్టీ రిజర్వేషన్లపై అబద్ధం చెప్పారు!
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ టుడుపై లోక్‌సభలో టీఆర్ఎస్ ఎంపీలు సభా హక్కుల నోటీసు ఇచ్చారు. తెలంగాణలో గిరిజన రిజర్వేషన్ పెంపు అంశంపై ఉద్దేశపూర్వకంగానే పార్లమెంటును పక్కదోవ పట్టించేందుకు బిశ్వేశ్వర్ వ్యవహరించారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ప్రివిలేజ్ నోటీసు అందించారు. దీంతోపాటు బుధవారం సభా కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత ప్లకార్డులతో వెల్‌లో పెద్దఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలిపిన టీఆర్ఎస్ ఎంపీలు అనంతరం సభ నుంచి వాకౌట్ చేశారు. తెలంగాణలో ఎస్టీ రిజర్వేషన్లను 6.8% నుంచి 10శాతానికి పెంచుతూ 2017 ఏప్రిల్ 16న రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లును కేంద్ర హోంశాఖ, కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖకు పంపిన విషయాన్ని నోటీసులో గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి గిరిజన రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి ఎలాంటి ప్రతిపాదన రాలేదని ఈ నెల 21న ఒక ప్రశ్నకు బిశ్వేశ్వర్ లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానం పార్లమెంటును పక్కదోవ పట్టించేదిలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనను బర్తరఫ్ చేసి కేంద్రప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం తెలంగాణభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీఆర్ఎస్ ఎంపీలు కేకే, నామా నాగేశ్వరరావు, కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాలోత్ కవిత మాట్లాడారు. అబద్ధం చెప్పారు ఎస్టీ రిజర్వేషన్ల పెంపు అంశంపై తెలంగాణ నుంచి బిల్లు వచ్చిన విషయం తెలిసినప్పటికీ, బిశ్వేశ్వర్ అబద్ధం చెప్పారని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు ఆరోపించారు. తెలంగాణ నుంచి ఎస్టీ రిజర్వేషన్ల పెంపు అంశంపై బిల్లు తమకు వచ్చిందని మూడేళ్ల క్రితం కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ కేంద్ర హోం శాఖకు లేఖ రాసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ, రాష్ట్రంలో గిరిజనులకు న్యాయం జరగాలన్న ఉద్దేశంతో అసెంబ్లీలో ఏకగ్రీవంగా బిల్లు ఆమోదించి కేంద్రానికి పంపిందన్నారు. ‘ఐదేళ్ళుగా ఈ బిల్లుకు సంబంధించి అనేకసార్లు కేంద్రమంతులకు వినతిపత్రాలు ఇచ్చాం. ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖలు రాయడంతోపాటు భేటీ అయిన సందర్భంలో చర్చించారు. అయినప్పటికీ పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి పచ్చి అబద్ధాలు చెప్పారు. తెలంగాణపై బిశ్వేశ్వర్ అక్కసు వెళ్లగక్కారు’అని నామా చెప్పారు. ఆ నలుగురు ఏంచేస్తున్నారు: ప్రభాకర్ రెడ్డి లోక్‌సభలో ఉన్న తెలంగాణకు చెందిన నలుగురు బీజేపీ ఎంపీలు ప్రతీరోజు కేసీఆర్‌ను తిట్టడమే తప్ప, తెలంగాణకు ఏం చేస్తారో చెప్పరని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. బిశ్వేశ్వర్ సమాధానంతో తెలంగాణ గిరిజనులు కలత చెందారని ఎంపీ మాలోత్ కవిత చెప్పారు. మీడియా సమావేశంలో ఎంపీలు కేఆర్ సురేశ్‌రెడ్డి, వెంకటేశ్ నేత, రంజిత్‌రెడ్డి, రాములు, పసునూరి దయాకర్, లింగయ్య యాదవ్, మన్నె శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. -
నిమ్మగడ్డపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు
సాక్షి, విజయవాడ: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు జారీ అయ్యింది. పంచాయితీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నిమ్మగడ్డకు ఈ నోటీసులు ఇచ్చారు. అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం నిమ్మగడ్డకు మెయిల్ ద్వారా నోటీస్ పంపారు. ఎస్ఈసీ గవర్నర్‌కి లేఖ రాసి.. మీడియాకి లీక్ చేసి తమ ప్రతిష్టకు భంగం కలిగించారని మంత్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎస్ఈసీకి జారీ చేసిన నోటీసులపై స్పీకర్ తమ్మినేని నిర్ణయం తీసుకోనున్నారు. మా హక్కులకు, వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించించే విధంగా తమపై ఆరోపణలు చేసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇవ్వాలని స్పీకర్‌ను కోరినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం మీడియా ద్వారా వెల్లడించారు. తాము లక్ష్మణరేఖ దాటామని నిమ్మగడ్డ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. -
‘సాక్షి’పై సభా హక్కుల నోటీసు
సాక్షి, అమరావతి: ‘సాక్షి’ దినపత్రికపై అధికార తెలుగుదేశం పార్టీ శుక్రవారం శాసనసభ, శాసన మండలి సమావేశాల్లో సభా హక్కుల ఉల్లంఘన నోటీసులను ప్రతిపాదించింది. ‘సబ్‌ప్లాన్ పేరుతో ఓ బోగస్ బిల్లు.. బీసీలపై మరో వంచన వల’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనం సభా హక్కులను ఉల్లంఘించేదిగా ఉందని పేర్కొంటూ ఈ నోటీసులను శాసనసభలో విప్ కూన రవికుమార్, శాసన మండలిలో జి. శ్రీనివాసులు నోటీసులు అందించారు. శాసనసభ ప్రవర్తనా నియమావళిలోని రూల్ నెం.169 ప్రకారం సభాహక్కుల ఉల్లంఘన నోటీసును ఇస్తున్నట్లు రవికుమార్ అసెంబ్లీలో చెప్పారు. సభలో గురువారం బీసీ సబ్‌ప్లాన్ బిల్లుపై జరిగిన చర్చను వక్రీకరించి దురుద్దేశపూర్వకంగా ఈ వార్తను ప్రచురించినట్లు తాను భావిస్తున్నానన్నారు. ఈ కథనం ద్వారా ఈ శాసనసభ సభ్యుడిగా తనకున్న హక్కులను కించపరిచారని, అదేవిధంగా ఈ సభలో జరిగిన చర్చలను వక్రీకరించి ప్రచురించడం ద్వారా ఈ సభను సాక్షి దినపత్రిక అవమానపరిచినట్లుగా భావిస్తున్నట్లు చెప్పారు. ‘చర్చ సందర్భంగా ‘‘సబ్‌ప్లాన్ పేరుతో బోగస్ బిల్లు’’ అని నేనుగానీ, సంబంధిత మంత్రిగానీ, మరే ఇతర సభ్యులుగానీ గౌరవ సభలో మాట్లాడలేదు. అలాంటిది ఆ మాటలను నేనే మాట్లాడినట్లు భావన వచ్చేలా ఆ కథనంలో రాయడం పూర్తిగా దురుద్దేశపూర్వకం. అందుకు సాక్షి దినపత్రిక యాజమాన్యంపై, వార్తా కథనం ప్రచురణకు కారణమైన వారిపై, శాసనసభ నియమ నిబంధనల ప్రకారం సత్వరమే చర్యలు తీసుకుని శాసనసభ గౌరవాన్ని, ప్రతిష్టను, సభ్యుల హక్కులను కాపాడాలి’.. అని స్పీకర్ కోడెల శివప్రసాదరావును రవికుమార్ కోరారు. -
టీడీపీ నేతలు నన్ను బెదిరించారు: బీజేపీ ఎంపీ
-
టీడీపీ నేతలు నన్ను బెదిరించారు: బీజేపీ ఎంపీ
సాక్షి, న్యూఢిల్లీ : టీడీపీ నేతలు తనను బెదిరించారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు వారిపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. రాజ్యసభలో ప్రసంగం అనంతరం టీడీపీ నేతలు ఖబడ్దార్ అంటూ తనని బెదిరించారని ఆయన నోటీసులో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియోలను ఆధారాలుగా రాజ్యసభ సెక్రటేరియట్‌కు సమర్పించారు. టీడీపీ వైఫల్యాలను ఎండగట్టడంతోనే తనను బెదిరించినట్లు జీవీఎల్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. Today, I've submitted a notice for BREACH OF PRIVILEGE against TDP to the Rajya Sabha Secretariat for initiating penal proceedings for blatantly threatening me of "DIRE CONSEQUENCES" after my speech in Rajya Sabha where I exposed TDP govt. Submitted video proof of my complaint. pic.twitter.com/GeX9aD7lcc — GVL Narasimha Rao (@GVLNRAO) July 30, 2018 విభజన చట్టంపై అఫిడవిట్.. ఏపీ విభజన చట్టంపై కేంద్ర మానవ వనరుల శాఖ అఫిడవిట్ దాఖలు చేసింది. విభజన చట్టప్రకారం ఇప్పటికే ఏపీలో అనేక విద్యాసంస్థలు ఏర్పాటు చేశామని, సెంట్రల్ వర్సిటీకి ఇప్పటికే కేబినెట్ సూత్రపాయ ఆమోదం తెలిపిందని పేర్కొంది. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా స్పష్టం చేసింది. -
అన్నంత పని చేసేసిన రేణుకా చౌదరి
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి అన్నంత పని చేసేశారు. కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు ‘శూర్పణక’ పోస్టుకు ఆమె నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం రాజ్యసభలో ఆమె హక్కుల తీర్మానం కూడా ప్రవేశపెట్టారు. పార్లమెంటులో ప్రధాని మోదీ.. రేణుకా చౌదరిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు, తదనంతర కేంద్ర హోంశాఖ సహయ మంత్రి కిరెన్ రిజిజు వివాదాస్పద పోస్టు ఫేస్బుక్లో పెట్టిన సంగతి తెలిసిందే. రామాయణం సీరియల్లోని శూర్పణక పాత్ర నవ్వుతున్న వీడియోకి.. మోదీ మాట్లాడిన సమయంలో రేణుకా చౌదరి నవ్వుతున్న దృశ్యాలను ఆయన జత చేశారు. దీనిపై రేణుకా చౌదరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యసభలో తన నవ్వుపై మోదీ వ్యాఖ్యలను జతచేస్తూ.. రిజిజు వీడియో పోస్టుపై హక్కుల తీర్మానం ఆమె ప్రవేశపెట్టారు. ‘‘ఇది ఓ మహిళను అవమానించడమే కాదు, తీవ్ర అభ్యంతరకరం కూడా... దీనిపై నేను హక్కుల తీర్మానం ప్రవేశపెట్టాను..’’ అని రేణుకా చౌదరి పేర్కొన్నారు. కాగా.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా రేణుక నవ్వడంపై ప్రధాని మాట్లాడుతూ.... ‘‘రామాయణం సీరియల్ తర్వాత ఇంత నవ్వు వినే భాగ్యం నాకు దక్కింది..’’ అన్న సంగతి తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. ఇక తాను ఎందుకలా నవ్వాల్సి వచ్చిందో ఆమె కూడా వివరణ ఇచ్చుకున్నారు. ‘గతంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆధార్ కార్డు అవసరం లేదని పెద్ద ప్రసంగమే చేశారు. అలాంటాయన ఆధార్‌ను పుట్టించిందే తామేనని చెప్తే నవ్వు రాకుండా వుంటుందా’ అంటూ రేణుకా చౌదరి వివరించారు. -
ఇబ్బందుల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు?
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి ఇబ్బందుల్లో పడ్డారు. తాజాగా రాజ్యసభలో సభా హక్కుల నోటీసు జారీ అయింది. ఈ మేరకు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు వేగంగా స్పందించారు. దీనిపై లోక్‌సభ సభ్యుడు రాహుల్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు ప్రివిలేజ్ నోటీసులు పంపించారు. ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ పేరును వక్రీకరిస్తూ రాహుల్ ట్వీట్ చేయడంపై ఈ నోటీసు జారీ చేశారు. ప్రధాని మోదీ, అరుణ్‌జైట్లీ వ్యాఖ్యలతో కూడిన ఓ వీడియోను ట్వీట్ చేసినరాహుల్.. అందులో jaitleyకి బదులు jait lieగా పేర్కోవడంతోపాడు బీజేపీ lies అంటూ ట్వీట్ చేశారు. ప్రధాని చెప్పింది చేయరు.. చేసింది చెప్పరు అనే విషయాన్ని గుర్తుచేసినందుకు ధన్యవాదాలంటై జైట్టీ ఉద్దేశించి పేర్కొన్నారు. దీంతో దుమారం రేగింది. బీజేపీనేత, రాజ్యసభ ఎంపీ భూపిందర్ యాదవ్ రాహుల్ గాంధీపై ఈ నోటీసు ఇచ్చారు. ఇలా చేయడం ఆయనను అగౌరవపరచడమేనంటూ యాదవ్ ఈ నోటీసు ఇచ్చారు. రాహుల్ గాంధీ కావాలనే జైట్లీ ఇంటిపేరును వక్రీకరించారని ఆరోపించారు. ఇది చాలా "అత్యంత అవమానకరమైనది" అని యాదవ్ ఆరోపించారు. ఈ ఆరోపణపై ప్రాథమిక పరిశీలన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నామని వెంకయ్యనాయుడు ప్రకటించారు. రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యుడైనందు వల్ల ఆయనపై తదుపరి చర్యలు తీసుకోవాలని కోరుతూ సదరు నోటీసును రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు లోక్‌సభ స్పీకర్‌కు పంపారు. కాగా బీజేపీ సీనియర్ నేత ఎల్కే అడ్వాణీ నేతృత్వంలోని ఎథిక్స్ కమిటీ వద్ద ఇప్పటికే రాహుల్‌కు సంబంధించిన ఒక ఫిర్యాదు పెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. -
మంగళగిరి డీఎస్పీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు
అమరావతి: గుంటూరు జిల్లా మంగళగిరి డీఎస్పీ రామంజనేయులు, సీఐ బ్రహ్మయ్య, ఎస్ఐ బాలకృష్ణలపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు నిర్ణయించారు. ఏపీ అసెంబ్లీ గేటు బయట దీక్షకు దిగిన పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్‌కు తరలించగా.. ఆయన్ను పరామర్శించేందుకు వెళ్లిన తమ పట్ల పోలీసులు అమర్యాదగా ప్రవర్తించారని ఎమ్మెల్యేలు చెప్పారు. తమ ఆత్మగౌరవానికి భంగం కలిగించారని తెలిపారు. రవాణా శాఖ కమీషనర్ బాలసుబ్రహ్మణ్యంపై దౌర్జన్యం చేసిన టీడీపీ నేతలు కేశినేని నాని, బోండా ఉమామహేశ్వర రావులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఉదయం చెవిరెడ్డి దీక్షకు దిగారు. పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి దాదాపు 6 గంటల పాటు నిర్బంధించారు. తర్వాత ఈ రోజు సాయంత్రం 4 గంటల తర్వాత చెవిరెడ్డిని విడుదల చేశారు. -
చంద్రబాబుపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు
-
చంద్రబాబుపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు
అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళవారం సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది. అసెంబ్లీ నిబంధన 168 కింద స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు ఈ నోటీసు అందచేసింది. కాగా సభలో వైఎస్ఆర్ సీపీ సభ్యులను ఉద్దేశించి చంద్రబాబు ’అలగా జనం’ అంటూ చంద్రబాబు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తమను ఉద్దేశించి ముఖ్యమంత్రి అలగా జనం అంటూ అభ్యంతరకర వ్యాఖ్య చేసినందుకుగాను వైఎస్ఆర్సీపీ ఈ నోటీసులు ఇచ్చింది. ప్రజా సమస్యలను లేవనెత్తుతున్నందుకు తమపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ముఖ్యమంత్రికి అనుచితమని, ఇది సభా హక్కుల ఉల్లంఘన కిందకు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు తమ నోటీసులో పేర్కొన్నారు. కాగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న సభలో ... ‘‘అలగా జనం, అబద్ధాలు, తిన్నింటి వాసాలు, న్యూసెన్స్, గుండెల్లో నిద్రపోతా, మీ బండారం బయటపెడతా, మీ అంతు చూస్తా, పుట్టగతులుండవు’’ వంటి పదాలతో ఊగిపోయిన విషయం విదితమే. -
కేసీఆర్‌పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు
హైదరాబాద్ : శాసనసభను తప్పుదోవ పట్టించారంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుపై బీజేపీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది. బీజేఎల్పీ నేత కిషన్ రెడ్డి శనివారం స్పీకర్ మధుసూదనాచారికి నోటీసు అందచేశారు. ‘గొర్రెల పంపిణీ పథకానికి నిధులు రాష్ట్ర ప్రభుత్వానిదే. కేంద్రం ఎలాంటి సబ్సిడీలు ఇవ్వడం లేదని కేసీఆర్ అసెంబ్లీని తప్పుదోవ పట్టించారు. పశు సంవర్థకశాఖకు కేంద్రం వేయికోట్ల గ్రాంట్ ఇస్తుందని బడ్జెట్ పద్దులో ప్రచురించారు. సభను తప్పుదోవ పట్టించినందున కేసీఆర్ సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడినట్లే. కేసీఆర్‌పై చర్య తీసుకోవాలి’ అని కిషన్ రెడ్డి తన నోటీసులో స్పీకర్‌ను కోరారు. -
రాహుల్ గాంధీపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై బీజేపీ సభ్యుడొకరు లోక్‌సభలో సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. ఈశాన్య ముంబై ఎంపీ అయిన కిరీట్ సోమయ్య స్పీకర్‌కు ఈ నోటీసు అందజేశారు. దీనిపై ఆయన ప్రశ్నోత్తరాల సమయంలో ప్రస్తావించారు. గురువారం నాడు రాహుల్ గాంధీ పార్లమెంటులో మాట్లాడుతూ ప్రధానమంత్రివి 'ప్రతీకార రాజకీయాలు' అంటూ ప్రస్తావించడం తెలిసిందే. తన నియోజకవర్గమైన అమేథీలో ఫుడ్ పార్కును రద్దుచేయాలనుకుంటున్నారని ఆయనీ వ్యాఖ్యలు చేశారు. దీనిపై రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలంటూ సోమయ్యతో పాటు కొందరు బీజేపీ ఎంపీలు సభలో నినాదాలు చేశారు. కానీ ఆ సమయానికి రాహుల్ సభలో లేరు. నినాదాల కారణంగా సభా కార్యకలాపాలకు అంతరాయం కలగడంతో స్పీకర్ సభను పావుగంట సేపు వాయిదా వేశారు. రాహుల్ సభను తప్పుదోవ పట్టించారని, వాస్తవానికి ఫుడ్ పార్కును నిర్వహించలేమంటూ సదరు కంపెనీయే వెనక్కి వెళ్లిందని కిరీట్ సోమయ్య అన్నారు. -
మంత్రులపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు
-
మంత్రులపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు
హైదరాబాద్: తమతో పాటు, సభలో లేని వ్యక్తులపై అనుచితంగా, అమర్యాదకరంగా మాట్లాడిన మంత్రులు, చీఫ్ విప్‌పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇవ్వాలని విపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. మంత్రులు దేవినేని ఉమా మహేశ్వరరావు, అచ్చెన్నాయుడు, రావెల కిశోర్ బాబుతో పాటు చీఫ్‌విప్ కాల్వ శ్రీనివాసులుపై మంగళవారం స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు. తమతో దురుసుగా మాట్లాడటమే కాకుండా, సభలో లేని వ్యక్తుల గురించి మంత్రులు అనుచితంగా మాట్లాడారని వైఎస్ఆర్ సీపీ ఆరోపించింది. అలాగే సభ సమావేశాలకు సంబంధించిన వీడియో ఫుటేజ్‌ను మీడియాకు విడుదల చేయడంపై చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు తీరుపై వైఎస్ఆర్సీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది.