హైదరాబాద్ : శాసనసభను తప్పుదోవ పట్టించారంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుపై బీజేపీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది. బీజేఎల్పీ నేత కిషన్ రెడ్డి శనివారం స్పీకర్ మధుసూదనాచారికి నోటీసు అందచేశారు. ‘గొర్రెల పంపిణీ పథకానికి నిధులు రాష్ట్ర ప్రభుత్వానిదే. కేంద్రం ఎలాంటి సబ్సిడీలు ఇవ్వడం లేదని కేసీఆర్ అసెంబ్లీని తప్పుదోవ పట్టించారు. పశు సంవర్థకశాఖకు కేంద్రం వేయికోట్ల గ్రాంట్ ఇస్తుందని బడ్జెట్ పద్దులో ప్రచురించారు. సభను తప్పుదోవ పట్టించినందున కేసీఆర్ సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడినట్లే. కేసీఆర్‌పై చర్య తీసుకోవాలి’ అని కిషన్ రెడ్డి తన నోటీసులో స్పీకర్‌ను కోరారు.