Bharatiya Janata Party (BJP)
-
బీజేపీకి వ్యతిరేక గాలి వీస్తోంది: మమత
కోల్‌కతా: దేశవ్యాప్తంగా భారతీయ జనతా పారీ్టకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, ఉప ఎన్నికల ఫలితాలే దీనికి నిదర్శనమని పశి్చమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. 13 సీట్లలో ఇండియా కూటమి 10 చోట్ల గెలవడంపై స్పందిస్తూ.. ఎన్డీయేకు 46 శాతం ఓట్లు రాగా. ఇండియా కూటమికి 51 శాతం ఓట్లు వచ్చాయని చెప్పారు. బెంగాల్లో నాలుగింటికి నాలుగు స్థానాల్లో టీఎంసీని గెలిపించడం పట్ల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మధ్యప్రదేశ్‌లో మినహా ఎక్కడా బీజేపీ మంచి ప్రదర్శన చేయలేకపోయిందని, దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీకి వ్యతిరేకంగానే తీర్పు వచి్చందన్నారు. ఇప్పుడు బీజేపీ మళ్లీ ‘ఏజెన్సీ రాజ్ (సీబీఐ, ఈడీ తదితర కేంద్ర దర్యాప్తు సంస్థలను విపక్షాలపైకి ఉసిగొల్పడం)’ను మొదలుపెట్టిందని ఆరోపించారు. కొత్త నేర చట్టాల్లో ఏముందో న్యాయవాదులు, పోలీసులకే స్పష్టమైన అవగాహన లేదన్నారు. ‘స్వేచ్ఛకు ముప్పు పొంచి వుంది. ప్రతి ఒక్కరూ, ఎలాంటి ఆధారాలు లేకపోయినా.. బాధితులుగా మారొచ్చు’ అని మమత అన్నారు. మార్పునకు సంకేతం: కాంగ్రెస్ బీజేపీ సృష్టించిన భయాలు, భ్రమలు పటాపంచలయ్యాయని ఉప ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. రైతులు, యువత, కారి్మకులు, వ్యాపారవేత్తలు, ఉద్యోగులు.. ఇలా దేశంలోని అన్ని వర్గాల వారూ నియంతృత్వానికి పాతరేయాలని కోరుకుంటున్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి, తమ జీవితాల బాగు కోసం ప్రజలు ఇండియా కూటమికే పూర్తిగా అండగా నిలుస్తున్నారని రాహుల్ అన్నారు. దేశంలో మారుతున్న రాజకీయ ముఖచిత్రానికి ఈ ఫలితాలు సంకేతమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. మోదీ, అమిత్ షాల విశ్వసనీయత పడిపోతుందనడానికి ఫలితాలు గట్టి నిదర్శనమన్నారు. -
నాడు కాంగ్రెస్ ఖాతాలో 414.. నేడు బీజేపీ అధిగమించేనా?
దేశంలో ఎంతో చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ నేడు సొంతంగా కనీస ఓట్లను కూడా పొందలేని స్థితికి చేరిందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. 1991 నుంచి పార్టీ ప్రాభవం తగ్గుతూ వస్తోంది. 1991 తర్వాత 2009 లోక్‌సభ ఎన్నికల్లో మాత్రమే కాంగ్రెస్ 200 సీట్ల సంఖ్యను తాకగలిగింది. మరి ఈసారి పరిస్థితులు ఎలా ఉంటాయో వేచి చూడాలి. 1951-52లో జరిగిన తొలి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 364 సీట్లు వచ్చినట్లు ఎన్నికల సంఘం లెక్కలు చెబుతున్నాయి. ఆ పార్టీకి మొత్తం 44.99 శాతం ఓట్లు వచ్చాయి. 1962లో లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓట్ల శాతంతో పాటు సీట్లు కూడా తగ్గాయి. ఓట్లు 44.71 శాతం ఉండగా, సీట్లు 361కి తగ్గాయి. 1967లో పార్టీ ప్రజాదరణ మరింత క్షీణించింది. ఓట్లు 40.78 శాతానికి, సీట్లు 283కి తగ్గాయి. అయితే 1971లో పార్టీకి వైభవం తిరిగివచ్చింది. ఓట్లు 43.68 శాతానికి, సీట్లు 352కి పెరిగాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోని 28 సీట్లు, బీహార్‌లో 39 సీట్లు, మహారాష్ట్రలో 42 సీట్లు, ఉత్తరప్రదేశ్‌లోని 73 సీట్లు వచ్చాయి. 1977లో నాటి ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించారు. లోక్‌సభ పదవీకాలం నవంబర్‌తో ముగియాల్సి ఉంది. అయితే హఠాత్తుగా ఆ ఏడాది ఎన్నికలు ప్రకటించారు. ఎమర్జెన్సీతో ఆగ్రహించిన ప్రజానీకం ఏకమై కాంగ్రెస్‌ను కేవలం 154 సీట్లకు పరిమిత చేశారు. ఓట్ల శాతం కూడా 34 శాతానికి తగ్గింది. మరోవైపు జనతా పార్టీ 295 సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే జనతా పార్టీ ప్రభుత్వం ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేయలేకపోయింది. 1980లో మధ్యంతర ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 42.69 శాతం ఓట్లతో 353 సీట్లు వచ్చాయి. 1984లో కూడా పార్టీ ఈ సంఖ్యను దాటేసింది. నాడు ప్రధాని ఇందిరా గాంధీని ఆమె సొంత సెక్యూరిటీ గార్డులే హత్య చేశారు. దీంతో దేశంలో కాంగ్రెస్‌పై సానుభూతి వెల్లువెత్తింది. 1984 నాటి రికార్డును పార్టీ ఇప్పటి వరకు దాటలేదు. నాడు సానుభూతి వెల్లువలో కాంగ్రెస్ ఓట్లు 48 శాతానికి పెరిగాయి. సీట్లు కూడా రికార్డు స్థాయిలో 414కు పెరిగాయి. గత పదేళ్లలో అటు బీజేపీగానీ, ఇటు కాంగ్రెస్‌గానీ ఈ రికార్డును దాటలేదు. కాగా లోక్‌సభలో మెజారిటీ కోసం 272 సీట్లు అవసరం. 1984 తర్వాత కాంగ్రెస్‌కు ఒక్కసారి కూడా ఒంటరిగా మెజారిటీ రాలేదని గణాంకాలు చెబుతున్నాయి. 1989లో 39.53 శాతం ఓట్లు, 197 సీట్లు వచ్చాయి. 1991లో పార్టీ 36.40 శాతం ఓట్లు, 244 సీట్లు సాధించగలిగింది. ఆ సమయంలో బీజేపీకి తొలిసారిగా 120 సీట్లు రాగా, 20 శాతానికి పైగా ఓట్లు ఆ పార్టీకి దక్కాయి. 2004 ఎన్నికల వరకు కాంగ్రెస్ పరిస్థితి దిగజారుతూనే వచ్చింది. 1996లో కాంగ్రెస్‌కు 140 సీట్లు, బీజేపీకి 161 సీట్లు వచ్చాయి. 1998లో ఆ పార్టీ 141 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 184 సీట్లు గెలుచుకుంది. 1999లో బీజేపీ 182 సీట్లు గెలుచుకుని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు కాంగ్రెస్‌కు 114 సీట్లు దక్కాయి. అయితే రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 370 సీట్లు సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. -
Karnataka election results 2023: వాడిపోయిన కమలం
సాక్షి, నేషనల్ డెస్క్: కర్ణాటకలో ఆనవాయితీ మారలేదు. అధికార పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేకపోయింది. శాసనసభ ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఘోర పరాజయం చవిచూసింది. మొత్తం 224 స్థానాలకు గాను 2018లో 104 స్థానాలు సాధించిన ఆ పార్టీ ఈసారి కేవలం 65 స్థానాలతో సరిపెట్టుకుంది. కనీసం అధికారానికి చేరువగా కూడా రాలేదు. ఈ ఓటమిని బీజేపీ పెద్దలు ఏమాత్రం ఊహించలేకపోయారు. హేమాహేమీలు క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేసినా ఫలితం లేకుండాపోయింది. ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మా కూడా గట్టెక్కించలేదు. రాష్ట్రంలో బీజేపీ పేలవమైన పనితీరుకు ఎన్నో కారణాలు కనిపిస్తున్నాయి. కర్ణాటకలో బీజేపీని ముందుండి నడిపించడానికి బలమైన నాయకులు లేకుండాపోయారు. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం దాకా.. అంతా అధిష్టానం కనుసన్నల్లోనే సాగింది. ముఖ్యమంత్రి పదవి నుంచి యడియూరప్పను తొలగించి బసవరాజ్ బొమ్మైని గద్దెనెక్కించడం బీజేపీకి నష్టం చేకూర్చింది. ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై ప్రజలను ఏమాత్రం మెప్పించలేకపోయారు. బొమ్మై పరిపాలనపై రగిలిన అసంతృప్తి సెగలు బీజేపీ కొంపముంచాయి. ఇతర వర్గాలపై చిన్నచూపు రాష్ట్రంలో లింగాయత్, ఒక్కళిగ వంటి ప్రధాన సామాజిక వర్గాల ఓట్లు కొల్లగొట్టడమే లక్ష్యంగా బీజేపీ పలు హామీలు ఇచ్చింది. రిజర్వేషన్ల అస్త్రాన్ని ప్రయోగించింది. కానీ, దళితులు, ఆదివాసీలు, ఓబీసీలు, మైనార్టీలను ఆకట్టుపోవడంలో విఫలమైంది. ఇంతచేసినా లింగాయత్‌లు, ఒక్కళిగలు బీజేపీని ఆదరించలేదు. ముస్లింలు, దళితులు, ఓబీసీలు మాత్రమే కాకుండా లింగాయత్‌లు, ఒక్కళిగలు సైతం కాంగ్రెస్‌కే ఓటేశారు. పెచ్చరిల్లిన అవినీతి.. కమీషన్లు దందా ‘40 శాతం ప్రభుత్వం’అంటూ బీజేపీ సర్కారు కమీషన్ల దందాపై కాంగ్రెస్ చేసి ప్రచారం ప్రజల్లోకి వేగంగా దూసుకెళ్లింది. ప్రభుత్వ అవినీతిపై కాంగ్రెస్ నేతలు నిప్పులు చెరిగారు. ఎన్నికల ప్రచారంలో అవినీతి అంశం ప్రముఖంగా తెరపైకి వచ్చింది. జనంలో విస్తృతంగా చర్చ జరిగింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కేఎస్ ఈశ్వరప్ప మంత్రి పదవికి రాజీనామా చేయడం బీజేపీకి ఇబ్బందికరంగా పరిణమించింది. అవినీతి బాగోతం, కమీషన్ల వ్యవహారంపై కర్ణాటక కాంట్రాక్టర్ల సంఘం ప్రధానికి ఫిర్యాదు చేయడం కలకలం సృష్టించింది. ప్రభుత్వ వ్యతిరేకత రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వంపై జనంలో వ్యతిరేకత నానాటికీ పెరిగింది. ఎన్నికల్లో ఓటమికి ఇదో ప్రధాన కారణమని చెప్పొచ్చు. నిత్యావసర సరుకుల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోవడంతోపాటు బీజేపీ ఇచ్చిన హమీలు అమలు కాకపోవడం జనాన్ని నిరాశపర్చింది. ప్రజా వ్యతిరేకతను తగ్గించుకొనే ప్రయత్నాలేవీ బీజేపీ పెద్దలు చేయలేదు. బీజేపీ ఇంకా అధికారంలో కొనసాగితే ఒరిగేదేమీ లేదన్న నిర్ణయానికి ప్రజలు వచ్చారు. అందుకే ఇంటికి సాగనంపారు. ప్రధాని మోదీ కర్ణాటకలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రైల్వే ప్రాజెక్టులు, జలవనరుల పథకాలు, రోడ్డు నిర్మాణాలు, ఎక్స్‌ప్రెస్ వే వంటివి చేపట్టినా ప్రజలు పట్టించుకోలేదు. పనిచేయని హిందూత్వ కార్డు హలాల్, హిజాబ్, అజాన్, జై భజరంగబలి, హనుమాన్ చాలీసా.. ఇవన్నీ కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ నమ్ముకున్న ఆయుధాలు. కర్ణాటకలో తలెత్తిన హలాల్, హిజాబ్, అజాన్ వివాదాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారా యి. ఎన్నికల్లో నెగ్గడానికి బీజేపీ మతాన్ని వాడుకుంటోందన్న విమర్శలు వెల్లువెత్తాయి. కానీ, అవేవీ బీజేపీని కాపాడలేకపోయాయి. బీజేపీ హిందూత్వ కార్డు కర్ణాటకలో ఎంతమాత్రం పనిచేయలేదని స్పష్టంగా తేలిపోయింది. ఫలితాలపై స్పందన వచ్చే లోక్‌సభ ఎన్నికలతో మొదలయ్యే బీజేపీ అంతానికి ఆరంభం ఇది. దారుణ నిరంకుశ, ఆధిపత్య రాజకీయాలను జనం అంతంచేశారు. –తృణమూల్ చీఫ్ మమతా బెనర్జీ ఇకపై తమ పాచికలు పారవని బీజేపీ ఇకనైనా గుర్తించాలి. –ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి పూర్తి బాధ్యత నాదే. మెరుగైన ఎన్నికల వ్యూహం కాంగ్రెస్ విజయానికి ప్రధాన కారణాల్లో ఒకటి కావొచ్చు –కర్ణాటక మాజీ సీఎం బొమ్మై ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అవినీతికి వ్యతిరేకంగా కొత్త సానుకూల భారత్ దిశగా ప్రజలిచ్చిన తిరుగులేని తీర్పు – ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయానికి దోహదపడింది. మోదీతో ఏదైనా సాధ్యమనే నినాదాన్ని ప్రజలు తిప్పికొట్టారు. – ఎన్సీపీ చీఫ్ శరద్‌పవార్ కాంగ్రెస్‌కు చరిత్రాత్మక విజయాన్ని అందించిన కర్ణాటక ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ ఎన్నికల్లో గెలవడమంటే కర్ణాటక రాష్ట్రాభివృద్ధే ముఖ్యమన్న ఆలోచనకు జై కొట్టడమే. దేశాన్ని ఐక్యం చేసే రాజకీయ గెలుపు ఇది. పార్టీ కోసం చెమట చిందించి పనిచేసిన కార్యకర్తలకు ప్రజలు చెల్లించిన మూల్యమిది. ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చేందుకు పార్టీ అవిశ్రాంతంగా పనిచేస్తుంది. రాహుల్ భారత్ జోడో పాదయాత్ర వెంటే విజయం పాదం కదిపింది. – ప్రియాంక గాంధీ -
అలా కుట్ర పన్నినందుకే ఓటర్లు బీజేపీకి తగిన పాఠం చెప్పారు!
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని వేధించినందుకు ఓటర్లు బీజేపీకి తగిన గుణపాఠం చెప్పారని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే అన్నారు. ఈ మేరకు ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..దాదాపు పదేళ్ల తర్వాత దక్షిణాదిలో కాంగ్రెస్ సొంతంగా అధికారాన్ని కైవసం చేసుకుంది. రాహుల్ గాంధీని లోక్‌సభ సభ్యునిగా అనర్హత వేటు వేయాలని, ఆయనను నిరాశ్రయులను చేయాలని బీజేపీ కుట్ర పన్నిందని నానో పటోలే అన్నారు. గత మార్చి నెలలో గుజరాత్ సూరత్ కోర్టు పరవు నష్టం కేసులో దోషిగా తేలుస్తూ శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్లమెంటులో అనర్హత వేటు, ఆ తర్వాత వెంటనే అధికార నివాసాన్ని ఖాళీ చేయించడం తదితర చర్యలతో రాహుల్‌ని అవమానపరిచారు. కానీ ఇప్పుడు కర్ణాటక ప్రజలే తమ ఓట్లతో భారతీయ జనతా పార్టీకి తగిన రీతిలో గుణపాఠం చెప్పారన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని అంగీకరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పటానికి కర్ణాటక ఫలితాలే ఇందుకు నిదర్శనమని నానా పటోలే అన్నారు. ఈ క్రమంలో శివసేనలో చీలికకు సంబంధించిన వివిధ అంశాలపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం.. 16 మంది సేన ఎమ్మెల్యేలపై పెండింగ్‌లో ఉన్న అనర్హత నోటీసులపై మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని అన్నారు. మాహా వికాస్ అఘాడి ప్రభుత్వ హయాంలో స్పీకర్‌గా పనిచేసిన పటోలే రాహుల్ నార్వేకర్ తాను నిర్వహిస్తున్న పదవిని కించపరిచేలా చేయకూడదని హితవు పలికారు. (చదవండి: ఆ నేత ఎంగేజ్మెంట్ రోజే.. భారీ మెజార్టీతో పార్టీ గెలుపు) -
ఖర్గే కుటుంబాన్ని హత్య చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోంది!
కర్ణాటకలో ఒకే విడతలో మే 10న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇంకా నాలుగు రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ప్రచారం కూడా దాదాపు తుది అంకానికి చేరుకోనుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. సరిగ్గా ఈ సమయంలో కాంగ్రెస్ బీజేపీపై సంచలన ఆరోపణలు చేసింది. భారతీయ జనతా పార్టీ(బీజేపీ) కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అతన్ని కుటుంబాన్ని హత్య చేయడానికి కుట్ర పన్నుతోందని ఆరోపణలు చేస్తోంది కాంగ్రెస్. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ బెంగళూరు మీడియా సమావేశంలో ఓ ఆడియో క్లిప్‌ని ప్లే చేసింది. బెంగళూరులోని చిత్తాపూర్ని బీజేపి అభ్యర్థిగా మణికంఠ రాథోడ్‌ని బరిలోకి దింపింది. అతను ఎలాంటి వాడో ప్రధాని నరేంద్ర మోదీ, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి తెలుసని, అతని నేర చరిత్రకు సంబంధించిన ట్రాక్ రికార్డు గురించి వారికి బాగా తెలసునంటూ వ్యాఖ్యానించింది. ఐతే అదే ప్రాంతం నుంచి కాంగ్రెస్ పార్టీ తరుఫున మల్లిఖార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే పోటీ చేస్తున్నారు. కావాలనే బీజేపీ ఇలా మణికంఠని మల్లిఖార్జున్ ఖర్గే కుమారుడిపైకి పోటికి దింపిందని ఫైర్అయ్యింది. చిత్రాపూర్ నియోజకవర్గం ప్రజలను అవమానించేందుకే బీజేపి ఇలా ఒక రౌడీషీటర్ని దింపోతోందని విమర్శించింది. పైగా కాంగ్రెస్ విడుదల చేసిన ఆ ఆడియో క్లిప్‌లో బీజేపీ అభ్యర్థి అనుచిత పదజాలంతో మల్లిఖార్జున ఖర్గేని, అతని కుటుబాన్ని మట్టుబెడతానని చెబుతున్నట్లు వినిపిస్తోంది. దీంతో కాంగ్రెస్ బీజేపీ కావాలనే ఇలా చేస్తుందని, ఒకవేళ ఏదైనా జరిగినా..మోదీతో సహా కర్ణాటక పోలీసులు, భారత ఎన్నికల సంఘం కూడా మౌనంగా ఉంటుందని మండిపడింది కాంగ్రెస్. ఐతే కర్ణాటక ప్రజలు దీన్ని చూసి మౌనంగా ఉండరని తగిన సమాధానం చెబుతారని నొక్కి చెప్పింది. కాగా, బీజేపీ అభ్యర్థి మణికంఠ 30కి పైగా క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వివాదాస్పద అభ్యర్థి. కలబురిగి నుంచి బహిష్కరించారు కూడా. గతంలో మల్లిఖార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక ఖర్గేని హత్య చేస్తానని బహిరంగంగా బెందిరించి అరెస్టు అయ్యాడు. ఆ తదుపడి బెయిల్‌పై విడుదలయ్యాడు. Meet Manikant Rathod, the BJP candidate from Chittapur constituency, who has over 40 criminal cases against him. He also happens to be the "blue-eyed boy" of PM Modi & CM Bommai. In this viral audio, the BJP leader can be heard saying- *"Will wipe off Kharge's family"* Here's… pic.twitter.com/NIcBMkgDhD — Congress (@INCIndia) May 6, 2023 (చదవండి: కారు కింద 15 అడుగులు భారీ కింగ్ కోబ్రా..పట్టుకున్న తీరు చూస్తే..) -
బీజేపీ నేతలకు శిక్షణ తరగతులు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర స్థాయి ముఖ్య నాయకులు మూడురోజుల శిక్షణ తరగతులకు సిద్ధమవుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం శామీర్‌పేటలోని లియోనియా రిసార్ట్స్‌లో ఈ శిబిరాన్ని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్‌చుగ్ ప్రారంభిస్తారు. ప్రారంభ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పార్టీ రాష్ట్ర సంస్థాగత ఇన్చార్జి సునీల్ బన్సల్, జాతీయ సంస్థాగత సహ కార్యదర్శి శివప్రకాశ్, జాతీయకార్యదర్శి అరవింద్ మీనన్, బీజేపీ ప్రశిక్షణ్ కమిటీ జాతీయ ఇన్చార్జి పి. మురళీధర్‌రావు పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. మంగళవారం వరకు ఈ తరగతులు జరుగుతాయి. బీజేపీ జిల్లా అధ్యక్షుల నుంచి జాతీయ కార్యవర్గ సభ్యుల వరకు దాదాపు 300 మంది నాయకులు తరగతులకు హాజరు కానున్నారు. మొత్తం 14 సెషన్స్.. పార్టీలో పలువురు కొత్త నాయకులు చేరిన నేపథ్యంలో వారితో పాటు రాష్ట్ర నాయకులకు పార్టీ సిద్ధాంతాలు, వివిధ అంశాలపై అవగాహన పెంచే దిశగా శిక్షణ తరగతులను ఏర్పాటు చేశారు. ప్రధానంగా బీజేపీ నేపథ్యం, సైద్ధాంతిక భూమిక, ఆరెస్సెస్‌తో పార్టీ సంబంధాలు, మోదీ హయాంలో దేశ ఆర్థిక పరిస్థితి, విదేశాంగ విధానంతో దేశానికి కలిగిన ప్ర యోజనాలు తదితర అంశాలపై వివరించనున్నా రు. ప్రారంభం, ముగింపు కార్యక్రమాలతో కలిపి మొత్తం 14 సెషన్స్ ఉంటాయని పార్టీ ముఖ్యనేత ఒకరు సాక్షికి వెల్లడించారు. మోదీ సర్కార్ సాధించిన విజయాలపై కిషన్‌రెడ్డి, విదేశాంగ విధానంపై విజయ్ చౌతేవాలా, సంస్థాగత అంశాలపై సునీల్ బన్సల్, పార్టీ చరిత్రపై మురళీధర్‌రావు, సాంస్కృతిక జాతీయ వాదం అంశాలపై ఆరెస్సెస్‌లో పనిచేస్తున్న ఇద్దరు తెలుగునేతలు ప్రసంగించనున్నారు. బీఎల్ సంతోష్ హాజరవుతారా? టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో ఈ నెల 21న తమ ఎదుట హాజరుకావాలంటూ సిట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఈ శిబిరానికి బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి బీఎల్ సంతోష్ హాజరవుతారా? లేదా? అనే అంశం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ముందుగా సిద్ధం చేసిన షెడ్యూల్ ప్రకారం సంతోష్ ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. కాగా, సంతోష్‌ను తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశించడం బీజేపీకి ఊరట కలిగించే అంశమని చెబుతున్నారు. ఇదీ చదవండి: నిలబడి.. కలబడేదెలా?.. భవిష్యత్తు కార్యాచరణపై టీపీసీసీ -
Pankaj Tripathi: వెండితెర వాజ్‌పేయి
భారత మాజీ ప్రధానమంత్రి, భారతీయ జనతా పార్టీ దివంగత ప్రముఖ నేత అటల్ బిహారీ వాజ్‌పేయి బయోపిక్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు రవి జాదవ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో వాజ్‌పేయీగా పంకజ్ త్రిపాఠి నటిస్తున్నట్లుగా శుక్రవారం ప్రకటించారు. ‘‘అటల్ బిహారి వాజ్‌పేయి కేవలం రాజకీయవేత్త మాత్రమే కాదు...మంచి మానవతావాది, రచయిత, కవి కూడా. ఇలాంటి వ్యక్తి పాత్రలో నటిస్తున్నందుకు ఓ నటుడిగా నాకు సంతోషంగా ఉంది’’ అని పంకజ్ త్రిపాఠి పేర్కొన్నారు. ఈ సినిమాను అటల్ బిహారి వాజ్‌పేయి 99వ జయంతి సందర్భంగా వచ్చే ఏడాది క్రిస్మస్కు రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
మీ ప్రతిభాశక్తి ఆదర్శనీయం
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని అనుక్షణం ఆచరిస్తూ అత్యున్నత శిఖరాలకు ఎదిగిన మిమ్మల్ని సదా అనుసరిస్తామని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును ప్రధాని మోదీ శ్లాఘించారు. బుధవారం ఉపరాష్ట్రపతిగా పదవీకాలం ముగిసిన వెంకయ్యనాయుడుకు ప్రధాని మోదీ గురువారం మూడు పేజీల లేఖ రాశారు. ‘జ్ఞానగని అయిన మీ ప్రతిభాశక్తి మొదట్నుంచీ నన్ను అమితంగా ఆకర్షిస్తోంది. దశాబ్దాల మీ అపార అనుభవం అడుగడుగునా ప్రస్ఫుటమవుతోంది. చురకత్తుల్లాంటి మీ ఏకవాక్య పలుకులు నన్ను ఎన్నోసార్లు సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. భావ వ్యక్తీకరణ అనేది మీలోని అత్యంత ప్రధానమైన అస్త్రం. నెల్లూరు నుంచి న్యూఢిల్లీదాకా సాగిన మీ అసాధారణ ప్రయాణ ఘట్టం అద్భుతం, సదా ఆదర్శనీయం వెంకయ్య గారూ’ అంటూ వెంకయ్యపై మోదీ పొగడ్తల వాన కురిపించారు. ‘సవాళ్లు ఎదురైన ప్రతీసారీ మరింత రెట్టించిన ధైర్యం, ఉత్సాహం, బాధ్యతలతో ముందుకు సాగారు. రాజ్యసభ చైర్మన్‌గా పార్లమెంటరీ క్రమశిక్షణ, సంప్రదాయాల పరిరక్షణలో అందరికీ చుక్కానిగా మారారు. రాజ్యసభలో సభ్యులు అనుచితంగా ప్రవర్తించినపుడు పార్లమెంట్ గౌరవాన్ని తగ్గి్గస్తున్నారంటూ మీరు పడే బాధ ప్రతిసారీ మీ స్వరంలో ప్రతిధ్వనించింది’ అని అన్నారు. బీజేపీ కార్యకర్తకు స్ఫూర్తిప్రదాత ‘బీజేపీతో దశాబ్దాల మీ అనుబంధం చిరస్మరణీయం. వ్యవస్థీకృత అంశాల్లో మీ అంకితభావం ప్రతీ పార్టీ కార్యకర్తకు స్ఫూర్తిదాయకం. తొలినాళ్లలో పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో అంతగా విస్తరించని కాలంలోనే బీజేపీ సిద్ధాంతం పట్ల ఆకర్షితులై పార్టీలో చేరారు. అకుంఠిత దీక్షతో పనిచేశారు. పార్టీ కార్యాలయాలు ఏర్పాటుచేసి పార్టీని వ్యవస్థాగతంగా పటిష్టంచేశారు. ప్రస్తుతం అవి ప్రజాసేవా కేంద్రాలుగా భాసిల్లుతున్నాయి. పార్టీలో దశాబ్దాల అనుబంధంలో మీ నుంచి నేను నేరుగా ఎన్నో అంశాల్లో సలహాలు, సూచనలు పొంది లబ్ధిపొందాను. చిన్న మాటల్లోనే పెద్ద భావాలను పలికించగల భావ వ్యక్తీకరణ మీ సొత్తు. ఈ విషయంలో మీరు వినోబా భావేను స్మరణకు తెస్తారు’ అని మోదీ అన్నారు. -
జగ్గారెడ్డిని ఈడ్చుకెళ్తున్న పోలీసులు
-
కాంగ్రెస్ పార్టీ రాజ్ భవన్ ముట్టడిలో ఉద్రిక్తత
-
ఎస్ఐ కాలర్ పట్టుకున్నరేణుకా చౌదరి
-
పువ్వాడ అజయ్ పై రేణుక చౌదరి దారుణ వ్యాఖ్యలు
-
సగం సొంతం చేసుకుందాం
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సన్నాహాలు మొదలుపెట్టిన భారతీయ జనతా పార్టీ గత లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన స్థానాలపైనే ప్రధానంగా దృష్టిసారించింది. పార్టీ బలహీనంగా ఉన్న లోక్‌సభ స్థానాల్లో బూత్ స్థాయి నుంచి బలోపేతం చేసే కార్యాచరణను సిద్ధం చేసుకుంది. 2019 ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన 144 లోక్‌సభ స్థానాల్లో సగమైనా గెలుచుకునేలా జూన్ ఒకటి నుంచి రంగంలోకి దిగనుంది. దీనికి సంబంధించి రెండ్రోజుల కిందటే పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్ షా, పార్టీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ సీనియర్ నేతలు, కేంద్ర మంత్రులు, ఆఫీస్ బేరర్లకు దిశానిర్దేశం చేశారు. రోడ్ మ్యాప్ సిద్ధం ముందుగా గుర్తించిన 144 లోక్‌సభ స్థానాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై అంతర్గతంగా ఓ రోడ్‌మ్యాప్‌ను బీజేపీ సిద్ధం చేసింది. మొదటగా ఈ స్థానాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బూత్‌ల వారీగా పార్టీ బలహీనతలకు సంబంధించిన సమాచారం సేకరిస్తారు. ఈ సమాచారం ఆధారంగా మూడు స్థాయిల్లో నేతలు బరిలోకి దిగనున్నారు. మొదటి స్థాయిలో జాతీయ స్థాయి నేతల కమిటీ ఈ 144 లోక్‌సభ స్థానాల్లో కార్యాచరణ అమలు బాధ్యతను పర్యవేక్షిస్తుంది. రెండో స్థాయిలో ఒక్కో కేంద్ర మంత్రికి రెండు లేక మూడు లోక్‌సభ స్థానాల బాధ్యతలు అప్పగిస్తారు. సోషల్ మీడియా గ్రూప్‌లు ప్రతి లోక్‌సభ పరిధిలో ఒక సోషల్ మీడియా గ్రూప్‌ను సైతం ఏర్పాటు చేస్తారు. ఈ గ్రూప్ అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా కులాలు, సమస్యలు, పార్టీల బలహీనతలు వంటి సమాచారాన్ని సేకరిస్తుంది. నియోజకవర్గంలో కులాల సమీకరణల ఆధారంగా పార్టీ అభ్యర్థిని ఎంపిక చేసేలా పార్టీకి సాయపడుతుంది. లోక్‌సభ సోషల్ మీడియా ఇన్చార్జి కనీసం 50వేల మందిని ఈ గ్రూపుల్లో చేర్చే బాధ్యత తీసుకోవాలి. డిసెంబర్ నాటికే ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. మొత్తంగా ఏడాదిన్నరలో ఈ నియోజకవర్గాల పరిధిలోని 74వేల బూత్‌లను బలోపేతం చేసి సగానికి పైగా సీట్లను గెలుచుకునే వ్యూహాలను బీజేపీ సిద్ధం చేసింది. -
బీజేపీలో చేరితే దావూద్‌కూ మంత్రి పదవి: ఠాక్రే
ముంబై: భారతీయ జనతా పార్టీపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన నేత ఉద్ధవ్ థాకరే మరోసారి విరుచుకుపడ్డారు. బీజేపీ నకిలీ హిందుత్వ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. ఆయన శనివారం సాయంత్రం ముంబైలో భారీ బహిరంగ సభలో మాట్లాడారు. రెండేళ్ల తర్వాత బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం బీజేపీలో చేరితే ఏకంగా మంత్రి పదవి కూడా ఇస్తారని ఎద్దేవా చేశారు. మహారాష్ట్ర నుంచి ముంబై నగరాన్ని వేరు చేసేందుకు బీజేపీ పన్నుతున్న కుట్రలు సాగవని హెచ్చరించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీజేపీతో తమ కూటమి విచ్ఛిన్నమయ్యాక గాడిదలను తన్ని తరిమేశామని ఉద్ధవ్ వ్యాఖ్యానించారు. -
కన్నడనాట కాంగ్రెస్‌కు భారీ షాక్?
సాక్షి, బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో కర్ణాటకలో రాజకీయ వేడి మొదలు కాబోతోంది. అధికారం నిలబెట్టుకునేందుకు భారతీయ జనతా పార్టీ ఇతర పార్టీ నేతలకు ఆహ్వానం పలుకుతోంది. ఇందులో భాగంగా కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్యకు బీజేపీ గాలం వేసినట్లు తెలిసింది. ఇప్పటికే సీట్ల సర్దుబాటు విషయం కూడా చర్చించినట్లు సమాచారం. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో విధానసభ ఎన్నికల్లో తన వర్గానికి మొత్తం 20 అసెంబ్లీ సీట్లు కావాలని సిద్ధరామయ్య అడిగారట. దీనిపై బీజేపీ అధిష్టానం పునరాలోచిస్తున్నట్లు సమాచారం. అన్నీ కుదిరితే సిద్ధరామయ్య కమలం గూటికి చేరడం ఖాయమనిపిస్తోంది. మంత్రివర్గంలో సిద్ధూ అనుచరులు కర్ణాటక కేబినెట్లో ఇప్పటికే సుమారు 15 మంది మంత్రులు సిద్ధూ అనుచరులు అని చెప్పవచ్చు. కాంగ్రెస్ – జేడీఎస్ సంకీర్ణంలో అమాత్యగిరి దక్కలేదని అసమ్మతి వ్యక్తం చేస్తూ బీజేపీలో చేరిన వారంతా సిద్ధూ అనుచరులుగానే చెబుతారు. వారందరిలో ఒకరిద్దరు మినహా అందరికీ ప్రస్తుత బీజేపీ ప్రభుత్వంలో మంత్రి పదవులు లభించాయి. దీంతో అసెంబ్లీ ఎన్నికలవేళకి సిద్ధరామయ్య కూడా కమలం గూటికి చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. సీట్ల సర్దుబాటు తేలకపోవడంతో ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. 20 స్థానాలపై సిద్ధూ పట్టు బీజేపీ నేతల ఆహ్వానానికి ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే తన వర్గానికి సుమారు 20 అసెంబ్లీ స్థానాల టికెట్లు ఇవ్వాలని పట్టుబట్టారు. వరుణ, చాముండేశ్వరి, హుణసూరు, హెబ్బాళ, చామరాజపేటె, కోలారు తదితర స్థానాలను సిద్ధూ ఆశించారు. మైసూరు జిల్లా హుణసూరు నుంచి సిద్ధూ పోటీ చేసినా తనకు ఇష్టమే అని మాజీ మంత్రి హెచ్.విశ్వనాథ్ అన్నారు. సిద్ధరామయ్య కోసం తన సీటును వదులుకుంటానని స్పష్టం చేశారు. పాత మైసూరుపై పట్టు కోసమే.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ సొంతబలంతో అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో ఇతర పార్టీల నేతలకు గాలం వేస్తోంది. ఇందులో భాగంగా బీజేపీ ప్రాబల్యం లేని పాత మైసూరు ప్రాంతంలో పట్టు సాధించేందుకు అక్కడి నేతలపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా మాజీ సీఎం సిద్ధరామయ్యను బీజేపీలో చేర్చుకునేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది. పాత మైసూరు ప్రాంతంలో మొత్తం 89 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ప్రస్తుతం 10 చోట్ల మాత్రమే బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తోంది. త్వరలోనే కాంగ్రెస్‌కు సిద్ధూ గుడ్‌బై: మరి కొన్ని రోజుల్లో మాజీ సీఎం సిద్ధరామయ్య కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి.. బీజేపీలో చేరుతారని రాష్ట్ర మంత్రి ఆర్.మునిరత్న వ్యాఖ్యానించారు. గురువారం ఆయన విధానసౌధలో మీడియాతో మాట్లాడారు. వచ్చే 2023 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఘోర పరాభవం తప్పదని జోస్యం చెప్పారు. గతంలో రామకృష్ణ హెగ్డేకు వచ్చిన పరిస్థితే.. ఇప్పుడు సిద్ధరామయ్యకు వస్తుందన్నారు. అదేవిధంగా మండ్య ఎంపీ సుమలతను బీజేపీలో చేర్చుకునే అంశంపై పార్టీ పెద్దలు నిర్ణయిస్తారని చెప్పారు. కర్ణాటక అసెంబ్లీ స్థానాలు – 224+1 (నామినేటెడ్), బీజేపీ – 122 (స్పీకర్ విశ్వేశ్వర హెగ్డే కాగేరితో కలిపి) కాంగ్రెస్ – 69 జేడీఎస్ – 32 స్వతం్రత్రులు– 2 -
అసెంబ్లీ సాక్షిగా నెక్స్ట్ టార్గెట్ అసెంబ్లీనే: బండి సంజయ్
-
తృణమూల్‌లో కాంగ్రెస్ విలీనం కావాల్సిందే: మమతా బెనర్జీ
-
చండీగఢ్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి చుక్కెదురు
చండీగఢ్: ప్రతిష్టాత్మకమైన చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అతిపెద్ద పార్టీగా అవతరించింది. 35 స్థానాలకు గాను 14 చోట్ల నెగ్గింది. పంజాబ్, హరియాణాల ఉమ్మడి రాజధాని, కేంద్ర పాలితప్రాంతమైన చండీగఢ్‌లో కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ బరిలోకి దిగిన మొదటిసారే తమ సత్తా చాటుకుంది. అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 12 వార్డుల్లో గెలిచి రెండోస్థానంలో నిలిచింది. కాంగ్రెస్ ఎనిమిది స్థానాలు నెగ్గగా... శిరోమణి అకాలీదళ్ ఒకచోట గెలుపొందింది. చిత్రమేమింటే... 8 సీట్లు నెగ్గి మూడోస్థానంలో నిలిచిన కాంగ్రెస్‌కు అన్ని పార్టీలకంటే ఎక్కువగా 29.79 శాతం ఓట్లు పోలయ్యాయి. గతంలో 26 వార్డులుండగా (బీజేపీ 20, కాంగ్రెస్ 4, శిరోమణి అకాలీదళ్ 1) ప్రస్తుతం వాటి సంఖ్య 35కు పెరిగింది. శుక్రవారం ఎన్నికలు జరగగా... సోమవారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. ప్రస్తుత చండీగఢ్ మేయర్ రవికాంత్ శర్మ 17వ వార్డులో ఆప్ అభ్యర్థి దమన్‌ప్రీత్ సింగ్ చేతిలో 828 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. మేయర్ పదవిని చేపట్టాలంటే సాధారణ మెజారిటీ.. 18 స్థానాలు కావాలి. పంజాబ్‌లో వచ్చే ఫిబ్రవరి– మార్చి నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందువల్ల కాంగ్రెస్, అకాలీదళ్‌లు ఆప్‌కు మద్దతు ఇచ్చే అవకాశాలు స్వల్పం. 12 స్థానాలు నెగ్గిన బీజేపీ ఓటమిని అంగీకరించి... మేయర్ పదవికి పోటీకి దూరంగా ఉంటుందా? లేక ఇతర పార్టీల కార్పొరేటర్లకు వలవేసి మళ్లీ అధికారపీఠాన్ని దక్కించుకునే ప్రయత్నం చేస్తుందా? అనేది చూడాలి. పంజాబ్‌లో మార్పుకు సంకేతం: కేజ్రీవాల్ చండీగఢ్ కార్పొరేషన్ ఫలితాలు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే పంజాబ్‌లో రాబోయే మార్పుకు సంకేతమని ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. చండీగఢ్ వాసులు నీతివంతమైన పాలనకు పట్టం కట్టారని, ప్రత్యర్థి పార్టీల అవినీతిమయమైన రాజకీయాలను తిరస్కరించారని పేర్కొన్నారు. ఆప్ కార్యకర్తలకు, విజేతలకు అభినందనలు తెలిపారు. ఆప్ పంజాబ్ వ్యవహారాల ఉపబాధ్యుడు రాఘవ్ చద్దా (ఢిల్లీ ఎమ్మెల్యే) స్పందిస్తూ.. ‘పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇది ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా ముందుంది’ అని వ్యాఖ్యానించారు. -
విశ్వసనీయ వారధిగా మారండి
న్యూఢిల్లీ: పార్టీకి, సామాన్య ప్రజలకు మధ్య విశ్వసనీయ వారధిగా మారాలని భారతీయ జనతా పార్టీ శ్రేణులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశంలో సామాన్య ప్రజల ప్రయోజనాల కోసం బీజేపీ కట్టుబడి ఉందని గుర్తుచేశారు. వచ్చే ఏడాది పలు రాష్ట్రాల్లో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ప్రజల విశ్వాసాన్ని కచ్చితంగా చూరగొంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని ఎన్ఎండీసీ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధాని పార్టీ నేతలను ఉద్దేశించి ప్రసంగించారు. సేవా, సంకల్పం, అంకితభావం అనే విలువలపై ఆధారపడి బీజేపీ పని చేస్తోందని చెప్పారు. కేవలం ఒక కుటుంబం చుట్టే తిరగడం లేదంటూ పరోక్షంగా కాంగ్రెస్‌కు చురకలంటించారు. బీజేపీ కుటుంబ పార్టీ కాదని, ఒక కుటుంబం పెత్తనం కింద కొనసాగడం లేదన్నారు. ప్రజా సంక్షేమం అనే సంస్కృతే బీజేపీకి ఆయువుపట్టు అని వ్యాఖ్యానించారు. ప్రజల బాగు కోసం పని చేస్తోంది కాబట్టే కేంద్రంలో తమ పార్టీ అధికారంలో ఉందని వివరించారు. కోవిడ్ మహమ్మారి వ్యాప్తి ఉధృతంగా ఉన్న సమయంలో కార్యకర్తలు ప్రజలకు విశేష సేవలందించారని కొనియాడారు. ప్రజలకు సేవ చేయడమే బీజేపీకి పరమావధి అని స్పష్టం చేశారు. అభివృద్ధి ఎజెండాకు ప్రజామోదం తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధించిందని మోదీ ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్‌లో బద్వేల్ ఉప ఎన్నికలోనూ ఓట్ల శాతాన్ని భారీగా పెంచుకుందని వివరించారు. బద్వేల్ ఉప ఎన్నికలో పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలపై మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. 2019 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ బీజేపీకి కేవలం 750 ఓట్లు వచ్చాయని, ఈసారి ఏకంగా 21,000కుపైగా ఓట్లు సాధించిందని హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ అభివృద్ధి అజెండాకు ప్రజామోదం లభిస్తోందనడానికి ఇవే నిదర్శనాలని పేర్కొన్నారు. పార్టీలోని సీనియర్ నేతలు, కార్యకర్తలతో సంబంధాలు పెంచుకోవాలని, వారి నుంచి ఎంతో నేర్చుకోవచ్చని బీజేపీ శ్రేణులకు సూచించారు. కార్యకర్తలకు నడ్డా దిశానిర్దేశం వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ ముఖ్యమంత్రులు, బీజేపీ అధ్యక్షులు పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో వర్చువల్‌గా పాల్గొన్నారు. తమ రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితిని వివరిస్తూ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సమావేశంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రసంగించారు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం కోసం కృషి చేయాలంటూ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ ఏడాది డిసెంబర్ 25 నాటికి 10.40 లక్షల పోలింగ్ స్టేషన్ల పరిధిలో బూత్ లెవెల్ కమిటీల ఏర్పాటును పూర్తిచేస్తామన్నారు. రాజకీయ తీర్మానం ప్రధాని మోదీ నాయకత్వ ప్రతిభను కొనియాడుతూ, ప్రతిపక్షాల అవకాశవాద వైఖరిని ఎండగడుతూ బీజేపీ జాతీయ కార్యకర్గ సమావేశంలో యూపీ సీఎం ఆదిత్యనాథ్ ఒక రాజకీయ తీర్మానాన్ని ప్రతిపాదించారు. వచ్చే ఏడాది ప్రారంభంలో జరగబోయే నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ ఘన విజయం సాధించడం ఖాయమని తీర్మానంలో పేర్కొన్నారు. మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను ఇందులో ప్రస్తావించారు. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం పట్ల మోదీని అభినందించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ దేశంలోనే పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన ఆదిత్యనాథ్ రాజకీయ తీర్మానాన్ని ప్రతిపాదించడంలో ఎలాంటి తప్పు లేదన్నారు. ప్రతిపక్షాలు పచ్చి అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. -
నిశ్శబ్ద వ్యూహకర్త
న్యూఢిల్లీ: అధికార బీజేపీకి జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన హిమాచల్ ప్రదేశ్ కు చెందిన జగత్ ప్రకాష్ నడ్డా(59)కు మృదు స్వభావిగా పేరుంది. స్వభావరీత్యా ఒదిగి ఉండే నడ్డా కార్యాచరణలో మాత్రం దృఢ సంకల్పంతో వ్యవహరిస్తారు. ఆర్భాటాలపై ఆసక్తిలేని నడ్డా అనతికాలంలోనే ఎదిగి, అపరచాణుక్యుడిగా పేరొందిన అమిత్‌షా నిర్వర్తించిన బాధ్యతల్ని స్వీకరిస్తున్నారు. నడ్డా నిశ్శబ్ద వ్యూహకర్త. ఆయన నిశ్శబ్దం వెనుక పట్టుదల, నిబద్ధత, సంస్థాగత నైపుణ్యం దాగి ఉన్నాయంటారు ఆయనను ఎరిగిన వారు. ఆరెస్సెస్‌కు నమ్మకస్తుడు ఆరెస్సెస్‌తో పాటు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాల విశ్వాసాన్ని చూరగొన్న వ్యక్తి నడ్డా. బీజేపీలో ప్రస్తుతం నడ్డా అత్యంత బలమైన మూడో వ్యక్తి. పార్టీ భవిష్యత్ వ్యూహంలో భాగంగానే గత ఏడాది నడ్డాని వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు. విద్యార్థి దశనుంచే రాజకీయాల్లోకి జేపీ నడ్డా 1960 డిసెంబర్ 2వ తేదీన బిహార్‌లోని పట్నాలో జన్మించారు. నడ్డా తండ్రి ఎన్.ఎల్. నడ్డా. ఈయన పాట్నా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా పనిచేశారు. విద్యార్థి దశనుంచే బీజేపీ అనుబంధ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ)లో చురుకైన కార్యకర్తగా పనిచేసిన అనుభవం జేపీ నడ్డాకి ఉంది. పాఠశాలలను అప్‌గ్రేడ్ చేయాలంటూ నిర్వహించిన ఉద్యమానికి నాయకత్వం వహించినందుకు నడ్డాని 45 రోజుల పాటు నిర్బంధంలో ఉంచారు. ‘ఛత్రా సంఘర్‡్ష సమితిలో చేరడానికి జేపీ ఉద్యమం నుంచి ప్రేరణ పొందాను’ అని నడ్డా ఒకచోట ప్రస్తావించారు. ఆ తరువాత ఏబీవీపీ, బీజేపీ యువజన సంఘం భారతీయ యువ మోర్చాతో కలిసి పనిచేశారు. రాజకీయ కుటుంబం కాదు నడ్డాది సామాన్య బ్రాహ్మణ కుటుంబం. కానీ, రాజకీయ నేపథ్య కుటుంబం నుంచి వచ్చిన యువతిని వివాహం చేసుకున్నారు. నడ్డా భార్య మల్లిక జబల్పూర్ ఎంపీ జయశ్రీ బెనర్జీ కుమార్తె. జేపీ నడ్డా రాజకీయాల్లో ఆసక్తి కనపరిస్తే, మల్లిక నడ్డా విద్యారంగం పట్ల ఆసక్తి కలిగి ఉన్నారు. బిలాస్పూర్ నుంచి అసెంబ్లీలోకి డిగ్రీ వరకు బిహార్‌లో చదివిన నడ్డా.. ఎల్ఎల్బీని హిమాచల్‌ప్రదేశ్‌లో చదివారు. బిలాస్పూర్ నుంచి 1993లో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. పలుమార్లు నడ్డా ఇదే స్థానం నుంచి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. రాష్ట్రంలో అటవీశాఖ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా కూడా నడ్డా పనిచేశారు. -
కమలనాథులకు కొత్త దళపతి
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) అధ్యక్షుడిగా జగత్ ప్రకాశ్ నడ్డా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జేపీ నడ్డా బీజేపీ 11వ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారని సోమవారం పార్టీ సంస్థాగత ఎన్నికల ఇన్చార్జ్ రాధామోహన్ సింగ్ ప్రకటించారు. నూతన అధ్యక్షుడు జేపీ నడ్డాకు ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి, పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటున్న అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇతర సీనియర్ నేతలు అభినందనలు తెలిపారు. ఐదున్నర ఏళ్ల పాటు పార్టీని విజయవంతంగా నడిపి, పలు రాష్ట్రాల్లో బీజేపీని అధికారంలో నిలిపిన అమిత్ షా స్థానంలో నడ్డా పార్టీ పగ్గాలు చేపట్టారు. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన నడ్డాకు హంగు, ఆర్భాటాలకు దూరంగా ఉండే నేతగా పేరుంది. ఆయన అభ్యర్థిత్వాన్ని పార్టీ సైద్ధాంతిక దిక్సూచి ఆరెస్సెస్, ప్రధాని మోదీ, అమిత్ షా సమర్ధించారు. ఈ సంస్థాగత ఎన్నికలో నడ్డా తరఫున మాత్రమే నామినేషన్లు దాఖలు కావడంతో ఆయన ఎన్నిక లాంఛనప్రాయంగానే ముగిసింది. నడ్డా తరఫున కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, పలువురు రాష్ట్ర శాఖల ప్రతినిధులు నామినేషన్లు వేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి విజయాన్ని అందించడం కొత్త అధ్యక్షుడిగా నడ్డా ముందున్న తక్షణ సవాలు. ఇప్పటివరకు విజయం సాధించని రాష్ట్రాల్లో బీజేపీకి అధికారాన్ని సాధించిపెట్టడమే తన ముందున్న ప్రధాన లక్ష్యమని నడ్డా పేర్కొన్నారు. ఎన్నిక అనంతరం నడ్డా అభినందన కార్యక్రమం పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, హోం మంత్రి షా, పార్టీ అగ్ర నేతలు ఎల్కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు, ఇతర సీనియర్ నాయకులు హాజరయ్యారు. మోదీ కొత్త ప్రభుత్వంలో హోంమంత్రిగా అమిత్ షా చేరడంతో.. గత జూన్‌లోనే బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నడ్డా ఎన్నికయ్యారు. అమిత్ షా పార్టీ అధ్యక్షుడిగా కూడా ఉండటం వల్ల.. ఒక వ్యక్తికి ఒకే పదవి అని బీజేపీలో ఉన్న సంప్రదాయం నేపథ్యంలో నడ్డా నాడు కార్యనిర్వాహక అధ్యక్షుడు అయ్యారు. పార్టీ అధ్యక్షుడిగా నడ్డా ఎన్నికవడంపై అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. కొత్త అధ్యక్షుడి హయాంలో, మోదీ మార్గనిర్దేశంలో బీజేపీ కొత్త శిఖరాలకు చేరుతుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ‘నడ్డా నేతృత్వంలో పార్టీ మరింత వైభవాన్ని, మరిన్ని విజయాలను సాధించాలి’ అని రాజ్‌నాథ్ సింగ్ ఆకాంక్షించారు. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి పార్టీ అధ్యక్షుడి స్థాయికి నడ్డా ఎదగడం బీజేపీ కార్యకర్తల పార్టీ అనే విషయాన్ని స్పష్టం చేస్తోందని మరోమంత్రి గడ్కరీ పేర్కొన్నారు. ఇది బీజేపీలోనే సాధ్యం ఒక సాధారణ కార్యకర్త పార్టీ అధ్యక్షుడు కావడం కేవలం బీజేపీలోనే సాధ్యమని కొత్త అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. ‘దేశంలోనే అత్యధిక సంఖ్యలో ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ బీజేపీనే. అయితే, మనం ఇక్కడే ఆగిపోం. కొన్ని రాష్ట్రాలు మిగిలాయి. మన దృష్టి ఇకపై వాటిపైననే. త్వరలో వాటినీ సాధిస్తాం’ అన్నారు. కలిసి స్కూటర్‌పై తిరిగాం నడ్డా అభినందన కార్యక్రమంలో ప్రధాని మోదీ.. గత స్మృతులను గుర్తుచేసుకున్నారు. నడ్డా, తాను పాత స్నేహితులమని, పార్టీ కార్యక్రమాల్లో భాగంగా తాము కలిసి స్కూటర్‌పై తిరిగేవారమని చెప్పారు. నడ్డా హయాంలో పార్టీకి కొత్త శక్తి, ఆశ, ఆకాంక్షలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అధ్యక్షుడికి అందరం పూర్తి సహకారం అందించాలన్నారు. అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలగుతున్న అమిత్ షా నిరుపమాన కార్యకర్త అని ప్రశంసించారు. మరోవైపు, ఇదే వేదికపై నుంచి మోదీ విపక్షాలపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించిన వారు కొత్త ఆయుధాలను పట్టుకు తిరుగుతున్నారని ఆరోపించారు. అబద్ధాలను, గందరగోళాన్ని వ్యాప్తి చేయడమే వారు పనిగా పెట్టుకున్నారన్నారు. పౌరసత్వ సవరణ చట్ట వ్యతిరేక ఆందోళనలను ప్రత్యక్షంగా ప్రస్తావించకుండా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు పెట్టుకోవాలని, అదే బీజేపీ బలమని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. -
బీజేపీ చీఫ్‌గా నడ్డా!
న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్థానంలో బీజేపీ అధ్యక్షుడిగా జగత్ ప్రకాశ్ నడ్డాను ఎన్నుకునేందుకు రంగం సిద్ధమైంది. జేపీ నడ్డా ప్రస్తుతం బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నారు. పోటీ లేకుండానే సోమవారం నడ్డా ఎన్నిక జరిగే అవకాశముంది. నడ్డాకు మద్దతుగా నామినేషన్లను సమర్పించేందుకు కేంద్రమంత్రులు సహా పలువురు పార్టీ సీనియర్ నేతలు, రాష్ట్రాల ప్రతినిధులు సోమవారం ఢిల్లీ వస్తున్నారు. విద్యార్థి సంఘ కార్యకలాపాలు సహా దశాబ్దాలుగా పార్టీలో పనిచేసిన అనుభవం, కీలక పదవులను సమర్ధవంతంగా నిర్వహించిన తీరు, ఆరెస్సెస్‌తో అనుబంధం, వివాద రహితుడిగా ఉన్న పేరు.. మొదలైనవి జేపీ నడ్డాకు అనుకూలంగా పరిణమించాయి. దాంతో, ప్రస్తుత అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని మోదీ కూడా ఆయనకే మొగ్గు చూపుతున్నారు. పార్టీ అధ్యక్షుడి ఎన్నికకు నామినేషన్లను జనవరి 20న దాఖలు చేస్తారని, అవసరమైతే, ఆ మర్నాడు ఎన్నిక నిర్వహిస్తామని బీజేపీ సంస్థాగత ఎన్నికల ఇన్చార్జ్ రాధామోహన్ సింగ్ ఆదివారం ప్రకటించారు. అమిత్ షా అడుగు జాడల్లో.. ఐదున్నర ఏళ్లకు పైగా బీజేపీ అధ్యక్షుడిగా అమిత్ షా ఉన్నారు. షా హయాంలో బీజేపీ అత్యున్నత దశను అనుభవించింది. పలు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది. మోదీ తాజా ప్రభుత్వంలో అమిత్ షా హోంమంత్రిగా చేరడంతో ‘ఒక వ్యక్తికి ఒకే పదవి’ అనే సంప్రదాయం ప్రకారం పార్టీ అధ్యక్ష పదవి కోసం మరొకరిని ఎన్నుకోవడం అనివార్యమైంది. నడ్డా ప్రస్తుతం పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నారు. గత మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఇన్చార్జ్గా నడ్డా వ్యవహరించారు. -
బీజేపీ నేత ఇంటిని పేల్చివేసిన నక్సల్స్
పట్నా: సార్వత్రిక ఎన్నికల వేళ నక్సల్స్ ఘాతుకానికి పాల్పడ్డారు. ఎన్నికలను బహిష్కరించాలనే డిమాండ్‌తో ఓ బీజేపీ నేత ఇంటిని నక్సల్స్ పేల్చివేశారు. వివరాల్లోకి వెళ్తే.. బిహార్‌లోని దుమారియా గ్రామంలో బీజేపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ అనుజ్ కుమార్ సింగ్ నివాసంపై నక్సల్స్ దాడికి తెగబడ్డారు. డైనమైట్ సాయంతో ఇంటిని కూల్చివేశారు. ఈ దాడిలో అనుజ్ నివాసం పూర్తిగా దగ్ధమైంది. అయితే ఈ ఘటనలో ఎవరు గాయపడలేదని సమాచారం. ఈ దాడి అనంతరం నక్సల్స్ ఆ ప్రాంతంలో కొన్ని పోస్టర్లను విడిచి వెళ్లారు. లోక్‌సభ ఎన్నికలను బహిష్కరించాల్సిందిగా వారు అందులో పేర్కొనానరు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. జిల్లా కేంద్రం గయాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న దుమారియా నక్సల్స్ ప్రభావిత ప్రాంతంగా ఉంది. ఈ ప్రాంతంలో నక్సల్స్ కదలికలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో వారిని ఎదుర్కొవడం భద్రతా బలగాలకు సవాలుగా మరింది. ఎన్నికల సమయం కావడంతో ఈ ప్రాంతంలో మరింత భద్రత పెంచాలని అధికారులు భావిస్తున్నారు. -
‘‘చౌకీదార్’ అని తగిలించుకోనందుకు టికెట్ ఇవ్వలేదు’
లక్నో : 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ‘మైభీ చౌకీదార్’ ప్రచారాన్ని ఉదృతం చేసిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా బీజేపీ నాయకులంతా ట్విటర్ అకౌంట్లో తమ పేరుకు ముందు చౌకీదార్ అని తగిలించుకుంటున్నారు. అయితే తాను పేరుకు ముందు ‘చౌకీదార్’ అని తగిలించుకోనందుకే పార్టీ తనకు టిక్కెట్ నిరాకరించిందని బీజేపీ ఎంపీ అన్షుల్ వర్మ ఆరోపించారు. బుదవారం బీజేపీ నుంచి సమాజ్‌వాదీ పార్టీలో చేరిన అన్షుల్ వర్మ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ట్విటర్లో నా పేరుకు ముందు ‘చౌకీదార్’ అని తగిలించుకోలేదు. అదికాక ఈ మధ్య పార్టీ చేస్తోన్న కొన్ని పనులను వ్యతిరేకించాను. ఆలయ ప్రాంగణంలో బీజేపీ నాయకులు మద్యం సరఫరా చేయడాన్ని తప్పు పట్టాను. అధిష్టానానికి వ్యతిరేకంగా మాట్లాడాను. అందువల్లే నాకు టికెట్ ఇవ్వలేదు. ఈ విషయంలో నేను చాలా బాధపడ్డాను. దీని గురించి సీఎం యోగీ ఆదిత్యనాథ్‌కు సైతం లేఖ రాశాను. కానీ ఆయన స్పందించలేద’ని అన్షుల్ వర్మ తెలిపారు. అంతేకాక బీజేపీలో నిరంకుశత్వం రాజ్యం చేస్తోందని ఆయన ఆరోపించారు. తాను ఎస్పీలోకి ఎలాంటి షరతులు లేకుండా చేరానని అన్షుల్ తెలిపారు. అంతేకాక రానున్న ఎన్నికల్లో ఎస్పీ - బీఎస్పీ కూటమి విజయం సాధిస్తుందని అన్షుల్ ధీమా వ్యక్తం చేశారు. 2014 ఎన్నికల్లో అన్షుల్ వర్మ హర్దోయ్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున విజయం సాధించారు. అయితే ఈసారి మాత్రం బీజేపీ ఈ టికెట్‌ను జై ప్రకాశ్ రావత్‌కు కేటాయించింది. -
40 శాతం కమీషన్‌కు పాత నోట్ల మార్పిడి
న్యూఢిల్లీ/తిరువనంతపురం: నోట్లరద్దు అనంతరం ఓ బీజేపీ నేత 40 శాతం కమీషన్ తీసుకుని పాత నోట్లు మార్చారని ఆరోపిస్తూ అందుకు సాక్ష్యంగా ఓ వీడియోను పలు ఇతర విపక్షాలతో కలిసి కాంగ్రెస్ మంగళవారం విడుదల చేసింది. 30 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో అహ్మదాబాద్‌లో చిత్రీకరించినదనీ, కొందరు జర్నలిస్టులు ఈ వీడియో తీశారని పేర్కొంది. టీడీపీ, ఎన్సీ, ఆర్జేడీ, లోక్తాంత్రిక్ జనతా దళ్ తదితర పార్టీల నేతలతో కలిసి కాంగ్రెస్ నాయకుడు కపిల్ సిబల్ ఈ వీడియోను విడుదల చేశారు. అయితే ఆ వీడియో నిజమైనదే అనడానికి, అందులోని వ్యక్తి బీజేపీ మనిషేననడానికి కాంగ్రెస్ ఎలాంటి ఆధారాలనూ చూపలేదు. మరోవైపు ఆ వీడియో నకిలీదనీ, పార్టీ పరిస్థితి దిగజారి నైరాశ్యంలో కూరుకుపోయిన కాంగ్రెస్ ఇలా రోజుకో నకిలీ సమాచారంతో ప్రజలను మోసగించాలని చూస్తోందని బీజేపీ ఎదురుదాడి చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ కాంగ్రెస్ నకిలీ పనులు మరీ విపరీతంగా నవ్వు తెప్పించేలా ఉంటున్నాయని అన్నారు. -
ఏపీ బీజేపీ మేనిఫెస్టో విడుదల
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సామాజిక సాధికారత సాధించేందుకు కృషి చేస్తామని బీజేపీ హామీయిచ్చింది. తమకు అధికారం కట్టబెడితే ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు ఏర్పాటు చేసి వెనుకబడిన జిల్లాలకు ప్రాధాన్యం కల్పిస్తామని వాగ్దానం చేసింది. ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ మంగళవారం విడుదల చేసింది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా ప్రకటిస్తామని తెలిపింది. ఎస్సీ, ఎస్టీలతో పాటు బీసీ వర్గీకరణ చేస్తామని.. అక్రమ కేసులను ఎత్తేస్తామని పేర్కొంది. రైతులకు ఒకేసారి రుణమాఫీ చేస్తామని, 16 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తామని హామీయిచ్చింది. సన్నకారు, కౌలు రైతుల బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపింది. జాతీయ స్థాయిలో ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని సక్రమంగా అమలు చేయడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడతామని భరోసాయిచ్చింది. మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం ఉద్యోగులతో సమానంగా వేతనాలు డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌ల పంపిణీ డిగ్రీలో చేరిన విద్యార్థినులకు 90 శాతం సబ్సిడీపై స్కూటీలు చేనేత కార్మికులకు రుణాల మాఫీ సాగునీటి ప్రాజెక్టుల సత్వర నిర్మాణం, ఆధునీకరణ అంచెలంచెలుగా మద్యపాన నిషేధం పారిశ్రామిక కేంద్రంగా రాయలసీమ అభివృద్ధికి చర్యలు విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్రలో పారిశ్రామిక ప్రగతికి కృషి హిందూ మత పరిరక్షణ వ్యాప్తి కోసం చర్యలు 60 ఏళ్లు నిండిన వృద్ధులకు రూ. 3000 పెన్షన్ 1000 కోట్ల నిధిలో యువత సాధికార పథకం హోంగార్డులకు నెలకు రూ. 20 వేలు జీతం -
ఓమై గాడ్ నాకు ఎంపీ టికెటా..!
సాక్షి, బెంగళూరు: కర్ణాటక లోక్‌సభ అభ్యర్థుల ఎంపికలో బీజేపీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. సీనియర్, బలమైన నేతలను కాదని బెంగళూరు దక్షిణ లోక్‌సభ టికెట్‌ను 28ఏళ్ల యువ న్యాయవాదికి కేటాయించి ఆశ్చర్యపరిచింది. ఈ స్థానం నుంచి బీజేపీ దివంగత నేత, కేంద్ర మాజీమంత్రి అనంత కుమార్ సతీమణి తేజస్విణీని బరిలో దించాలని రాష్ట్ర నాయకత్వం భావించింది. ఐతే ఆఖరి నిమిషంలో ఆమెను కాదని కర్ణాటక హైకోర్టులో న్యాయవాదిగా విధులు నిర్వర్తిస్తున్న తేజస్వీ సూర్యను తెరపైకి తీసుకువచ్చింది. సూర్యను బెంగళూరు దక్షిణ స్థానానికి తమ అభ్యర్థిగా బీజేపీ ఎన్నికల కమిటీ మంగళవారం ప్రకటించింది. ప్రతిష్ఠాత్మక స్థానానికి తనను అభ్యర్థిగా ఎంపిక చేయడంపై తేజస్వీ షాక్‌కు గురయ్యారు. ‘‘ఓమై గాడ్ నాకు బీజేపీ ఎంపీ టికెట్ ఇచ్చిందన్న వార్తను ఇంకా నమ్మలేకపోతున్నా’’అని సూర్య ట్విటర్లో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత బీకే హరిప్రసాద్‌పై తేజస్వీ పోటీపడనున్నారు. యువ నేతలకు అవకాశాలు ఇవ్వాలని, వారికి పార్టీలో సముచితస్థానం కల్పించాలని అభ్యర్థుల ఎంపికలో నిర్ణయించినట్లు ఒక బీజేపీ వర్గాలు తెలిపారు. ఈ నియోజకవర్గం నుంచి అనంత్ కుమార్ వరుసగా ఆరుసార్లు గెలుపొందారు. 2014లో కాంగ్రెస్ నేత నందన్ నీలేకనిపై అనంత్ కుమార్ గెలుపొందిన విషయం తెలిసిందే. I am humbled. Grateful. Overwhelmed. I thank PM @narendramodi for giving me this opportunity. I can't thank you enough, Modi Ji. I promise you that I shall work ceaselessly for our motherland till my last breath. That is the only way I can repay this debt of gratitude. THANK YOU! — Chowkidar Tejasvi Surya (@Tejasvi_Surya) March 25, 2019 -
చౌకీదార్‌కు ఫైన్ మోత
సాక్షి, భోపాల్: వాహనం నంబర్ ప్లేట్‌పై చౌకీదార్ అని రాసి ఉన్నందుకు పోలీసులు ఎమ్మెల్యేకు చలాన్ విధించిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. బీజేపీ తమ ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘మై భీ చౌకీదార్’ అనే నినాదాన్ని ఈ మధ్య బాగా పాపులర్ చేసింది. అయితే ఈ నినాదానికి తనపేరును కూడా జోడించి చౌకీదార్ పంధాన అని సొంత కార్ నెంబర్ ప్లేట్ మీద రాయించుకున్నారు మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే రాందాంగోర్. బీజేపీ ఎంపీ అభ్యర్థి, ఖండ్వా ఎమ్మెల్యే నందకుమార్ సింగ్‌ను కలవడంతోపాటు పట్టణంలో రంగులపంచమికి హాజరవడానికి రాందాంగోర్ వచ్చారు. ఉత్సవ సమయం కావడంతో పోలీసులు కొన్నిచోట్ల చెక్‌పోస్టులు పెట్టారు. ఎమ్మెల్యే రాందాంగోర్ వాహనాన్ని రోడ్డుపై వెళ్తున్నప్పుడు నెంబర్ ప్లేట్‌ను చూసిన పోలీసులు.. వాహనాన్ని ఆపి నెంబర్ ప్లేట్ చట్టం ప్రకారం ఫైన్ విధించారు. చలాన్ వివరాలను కోర్టులో ప్రవేశపెడతామని పోలీసులు తెలిపారు. తాను ఎటువంటి అతిక్రమణలకు పాల్పడలేదని, పోలీసుల ఫైన్ విధింపులో కాంగ్రెస్ కుట్ర దాగుందని ఎమ్మెల్యే రాందాంగోర్ ఆరోపించారు. -
బీజేపీ గెలుపు ఖాయం
సాక్షి, పాలమూరు : జిల్లాలో డీకే అరుణకు ఉన్న ప్రజాదరణను గుర్తించిన పార్టీ నాయకత్వం మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థిగా ఆమెను బరిలో దించిందని, ఫలితంగా 20 ఏళ్ల తర్వాత పాలమూరులో మళ్లీ బీజేపీ గెలవబోతుందని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ అన్నారు. తెలంగాణలో బీజేపీని పటిష్టం చేయడంలో పార్లమెంట్ ఎన్నికలు మొదటి మెట్టుగా భావిస్తున్నామన్నారు. మహబూబ్‌నగర్ పార్లమెంట్ సీటును 20 ఏళ్ల తర్వాత సీటు గెలవాలని కార్యకర్తలు భావిస్తున్నారు. డీకే అరుణ గెలుపు కోసం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 29న మోదీ మహబూబ్‌నగర్‌కు వస్తున్నారు.. దీన్ని బట్టి డీకే అరుణపై బీజేపీకి ఎంత నమ్మకం ఉందో తెలుస్తుందన్నారు. రాష్ట్రంలోని 17 సీట్లలో కొన్ని ముఖ్య స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నిజాం నియంతృత్వ పాలనను ప్రజలు ఎండగడతారనే విశ్వాసం తమలో పెరుగుతుందన్నారు. రజాకార్ల పార్టీతో పొత్తు పెట్టుకుని కేసీఆర్ మత రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఎన్నికల కోసం అయోధ్య రామాలయం అంశాన్ని వాడుకునే అవసరం బీజేపీకి లేదని, ఆ అంశం జాతీయ అంశమని వ్యాఖ్యానించారు. రామ జన్మభూమి గురించి కేసీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. దేశ భద్రత కోసం.. దేశ భవిష్యత్తు కోసం నరేంద్రమోదీ నాయకత్వాన్ని బలపరిచే విధంగా డీకే అరుణని గెలిపించాలని పిలుపునిచ్చారు. నిధులను దారి మళ్లించారు.. బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ మాట్లాడుతూ కేంద్రం ఎన్నో నిధులు తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చినా.. వాటిని సద్వినియోగం చేసుకోకుండా ఇచ్చిన నిధులను టీఆర్ఎస్ పాలకులు దారి మళ్లించారని ఆరోపించారు. కేంద్రంలో చక్రం తిప్పి, ప్రధాని అవుతానని చెబుతున్న కేసీఆర్ కేవలం 16 సీట్లతో ఏవిధంగా ప్రధాని అవుతారో ప్రజలకు చెప్పాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష బాధ్యతను పోషించలేని దుస్థితికి చేరిన నేపథ్యంలో తెలంగాణలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీ అని చెప్పారు. దేశ భద్రత, సంక్షేమం కోసం దేశ ప్రజలు మోదీ నాయకత్వం కోరుకుంటున్నారన్నారు. తెలంగాణలో కొనసాగుతున్న అరాచక పాలనను, నిజాం వారసత్వ రాజకీయాలను తరిమికొట్టాలంటే బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయమన్నారు. బీజేపీకి ఓటు వేయడం ద్వారా దేశ సమగ్రతను కాపాడుకోవచ్చన్నారు. -
సీనియర్లకు ‘నమో’ నమః
సాక్షి, సెంట్రల్‌డెస్క్ : లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 184 మందితో తొలి జాబితా విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, గడ్కరీ వంటి నేతలు ఈ జాబితాలో ఉన్నారు. అయితే, సీనియర్ నేతలయిన ఎల్కే ఆడ్వాణీ, మురళీ మనోహర్ జోషీ వంటి వారికి ఈ సారి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించలేదు. మరి కొందరు సీనియర్ నాయకులు స్వచ్ఛందంగానే ఎన్నికల బరి నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. మొత్తమ్మీద చూస్తే పార్టీ నాయకత్వం సీనియర్ నేతలు పలువురిని పక్కకు తప్పించినట్టు తెలుస్తోంది. 75 ఏళ్లు దాటిన వారిని ఎన్నికల్లో నిలబెట్టి వారిని ఇబ్బంది పెట్టవద్దన్న ఆర్ఎస్ఎస్ సూచనను బీజేపీ నాయకత్వం పాటించినట్టు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, బీజేపీకి పెద్దదిక్కుగా, ఆ పార్టీకి జాతీయ గుర్తింపు రావడానికి కారకుడిగా పేరొందిన ఆడ్వాణీని కూడా తప్పించడాన్ని విపక్షాలు తప్పు పడుతున్నాయి. గాంధీనగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆరుసార్లు వరసగా గెలిచిన ఆడ్వాణీ స్థానంలో అమిత్ షాను బరిలో దింపింది. కావాలనే పక్కన పెడుతున్నారా? నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత పార్టీలో సీనియర్లను పథకం ప్రకారం పక్కన పెడుతున్నారన్న విమర్శలున్నాయి. వాజ్‌పేయి హయాంలో అత్యంత గౌరవనీయ స్థానం పొందిన ఆడ్వాణీని మోదీ అసలు పట్టించుకోలేదు. ఎదుట పడినా పలకరించకుండా ముఖం చాటేసిన సందర్భాలున్నాయి. దశాబ్దాల తరబడి పార్టీకి సేవలందిస్తూ పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యులుగా ఉన్న జశ్వంత్‌సింగ్, యశ్వంత్‌సింగ్, మురళీ మనోహర్ జోషీ, ఆడ్వాణీ, శాంతకుమార్ వంటి సీనియర్లను మోదీ బోర్డు నుంచి తొలగించారు. వారిని మార్గదర్శక్ మండల్ పేరుతో ఏర్పాటు చేసిన కమిటీలో వేశారు. ఇన్నేళ్లలో ఈ కమిటీ ఒక్కసారీ సమావేశం కాలేదు. దీన్నిబట్టి మోదీ ఉద్దేశపూర్వకంగానే సీనియర్లను పక్కన పెడుతున్నారన్న భావన కలుగుతోందని పరిశీలకులు అంటున్నారు. ఈ నేతల్లో చాలామంది మోదీ పాలనను విమర్శించిన వారే కావడం గమనార్హం. ఇంకొందరు తప్పుకున్నారు.. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయనని ఆడ్వాణీయే చెప్పినట్టు బీజేపీ నాయకత్వం ప్రచారం చేస్తోంది. అయితే, నాయకత్వం ఆడ్వాణీని టికెట్ విషయంలో సంప్రదించనే లేదని ఆయన కార్యదర్శి చెబుతున్నారు. మరో సీనియర్ నాయకుడు, గతంలో మంత్రిగా పనిచేసిన మురళీ మనోహర్ జోషీ, బండారు దత్తాత్రేయకు కూడా ఈసారి టికెట్ లభించలేదు. అలాగే, సుమిత్ర మహాజన్, కరియ ముండా, శాంతకుమార్, బీజీ ఖండూరి వంటి అనుభవజ్ఞులనూ బీజేపీ ఈ ఎన్నికల్లో పక్కన పెట్టేసింది. కల్రాజ్ మిశ్రా, భగత్‌సింగ్ కోషియారి ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్టు స్వచ్ఛందంగా ప్రకటించారు. -
బీజేపీ ఉపాధ్యక్షురాలిగా ఉమా భారతి
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి ఉమా భారతి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమితులయ్యారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోనంటూ ఆమె ప్రకటించిన నేపథ్యంలో ఆమెకు ఈ బాధ్యతలు అప్పగించడం గమనార్హం. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమా భారతి.. వచ్చే మే నెల నుంచి ఏడాదిన్నరపాటు తీర్థయాత్రలకు వెళ్లాలనుకుంటున్నాననీ, అందుకే ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోవడం లేదని పార్టీ నాయకత్వానికి సమాచారం అందించారు. దీంతో హిందుత్వవాదిగా పేరున్న ఉమా భారతికి పార్టీ ఉపాధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. -
ఆరుగురితో బీజేపీ రెండో జాబితా
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను బీజేపీ అధిష్టానం శనివారం ప్రకటించింది. ఇటీవల 10 మందితో తొలి జాబితాను ప్రకటించగా.. రెండో జాబితాలో ఆరుగురికి స్థానం కల్పించింది. మెదక్ స్థానాన్ని పెండింగ్‌లో పెట్టింది. ఇటీవల పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే సోయం బాబురావును ఆదిలాబాద్ లోక్‌సభ స్థానం నుంచి బరిలో నిలిపింది. పెద్దపల్లి నుంచి ఎస్.కుమార్ వైపే అధిష్టానం మొగ్గు చూపుతోంది. ఈ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్య, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎస్.కుమార్, బెల్లంపల్లి నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన కొయ్యల ఏమాజీ పేర్లను అధిష్టానానికి పార్టీ రాష్ట్ర కమిటీ పంపింది. అయితే, సింగరేణి కార్మికుల ఓట్లు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో గోదావరి ఖనికి చెందిన ఎస్.కుమార్ వల్ల ఓట్ల శాతం పెరుగుతుందని భావించిన అధిష్టానం ఆయనకే సీటు కేటాయించింది. జహీరాబాద్ సీటు కోసం బానాల లక్ష్మారెడ్డి, బిష్కిం ద పీఠాధిపతి సోమాయప్పల పేర్లును పరిశీలించిన అధిష్టానం ఈసారి బానాల లక్ష్మారెడ్డికే అవకాశం కల్పించింది. హైదరాబాద్ స్థానం నుంచి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను బరిలో నిలపాలని భావించినా ఆయన విముఖత చూపారు. దీంతో భగవంతరావుకు సీటు కేటాయించింది. చేవెళ్ల నుంచి పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గంగాపురం కిషన్‌రెడ్డి, బెక్కరి జనార్దన్‌రెడ్డి, వికారాబాద్ జిల్లాకు చెందిన నందకుమార్ యాదవ్‌ల పేర్లను పరిశీలించి జనార్దన్రెడ్డికే అధిష్టానం అవకాశం కల్పించింది. లోక్‌సభ అభ్యర్థులు.. అదిలాబాద్ (ఎస్టీ): సోయం బాబూరావు; పెద్దపల్లి (ఎస్సీ): ఎస్.కుమార్; జహీరాబాద్: బానాల లక్ష్మారెడ్డి; హైదరాబాద్: డా.భగవంతరావు; చేవెళ్ల: బెక్కరి జనార్దన్‌రెడ్డి; ఖమ్మం: వాసుదేవ్‌రావు -
‘అందుకే ఆయన పోటీ చేయడం లేదు’
న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తొలి విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ లిస్ట్‌లో బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వాణీతో పాటు అస్సాం బీజేపీ సీనియర్ నాయకుడు హిమంత బిశ్వా శర్మ పేరు కూడా లేదు. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ ట్రబుల్ షూటర్‌గా పేరు పొందిన హిమంత బిశ్వాకు టికెట్ కేటాయించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా హిమంతకు టికెట్ కేటాయించకపోవడం వెనక గల కారణాలను ట్విటర్ ద్వారా తెలిపారు. ఈ విషయం గురించి ఆయన ‘ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ప్రస్తుతం హిమంత బిశ్వా శర్మ నార్త్ ఈస్ట్ డెమొక్రటిక్ అలయెన్స్(ఎన్‌డీఏసీ) కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అస్సాం, ఈశాన్య రాష్ట్రల్లో పార్టీని బలపర్చడం ముఖ్యం. ఈ బాధ్యతలను హిమంత బిశ్వా చక్కగా నిర్వర్తిస్తారని పార్టీ నమ్ముతుంది. అందుకే ఆయనకు టికెట్ కేటాయించలేదు. అస్సాం బీజేపీ శ్రేణులతో పాటు ఈశాన్య రాష్ట్రాల బీజేపీ నేతలు కూడా ఈ నిర్ణయాన్ని ఆమోదిస్తారని ఆశిస్తున్నాను. ఈ నిర్ణయం వల్ల అస్సాంతో పాటూ ఈశాన్య భారతం కూడా పూర్తిగా అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నానం’టూ అమిత్ షా ట్విట్ చేశారు. ప్రస్తుతం బిశ్వా అస్సాం ఆర్థిక మంత్రిగా విధులు నిర్వహిస్తున్నారు. -
ఎంపీ నామినేషన్లకు రెండ్రోజులే చాన్స్!
నిర్మల్: ఎంపీ నామినేషన్ల దాఖలు గడువు ముంచుకొస్తోంది. కేవలం రెండే రెండు రోజుల సమయముంది. ఈనెల 18న ప్రారంభమైన నామినేషన్ల దాఖలు ప్రక్రియ 25న సాయంత్రం 3 గంటలకు ముగియనుంది. గురువారం హోలీ పండుగ, 23న నాలుగో శనివారం, 24న ఆదివారం సెలవు దినాలు కావడంతో ఆ రోజుల్లో నామినేషన్ల స్వీకరణ ఉండదు. ఇక నామినేషన్ల దాఖలుకు కేవలం 22, 25 తేదీలు మాత్రమే మిగిలాయి. ఇప్పటి వరకు ఆదిలాబాద్ లోక్‌సభ స్థానానికి కేవలం ఒకేఒక్క నామినేషన్ దాఖలైంది. కాంగ్రెస్ అభ్యర్థి రాథోడ్ రమేశ్ మాత్రమే ఇక్కడ నామినేషన్ వేశారు. టీఆర్ఎస్, బీజేపీలతోపాటు స్వతంత్రులూ ఇప్పటి వరకూ స్పందించపోవడం గమనార్హం! పెద్దపల్లి లోక్‌సభ పరిధిలో కూడా కాంగ్రెస్ నుంచి ఏ.చంద్రశేఖర్ నామినేషన్ వేయగా, చిన్న పార్టీలతోపాటు పలువురు స్వతంత్రులు నామినేషన్లు వేశారు. రెండు చోట్లా.. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన 18వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. పని దినాల్లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు రిటర్నింగ్ అధికారులు అందుబాటులో ఉంటున్నారు. ఆది లాబాద్ లోక్‌సభ స్థానానికి సంబంధించి ఆదిలాబాద్, పెద్దపల్లి లోక్‌సభ స్థానానికి సంబంధించి పెద్దపల్లి కలెక్టర్లు దివ్యదేవరాజన్, శ్రీదేవసేన రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తున్నారు. అభ్యర్థులు నామినేషన్లను ఆయా జిల్లా కేం ద్రాల్లోనే వేయాల్సి ఉంటుంది. నామినేషన్ల దాఖలు సోమవారం ప్రారంభమైనప్పటికీ పెద్దగా స్పందన లేదు. ఆది లాబాద్ స్థానం నుంచి పోటీలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి రాథోడ్ రమేశ్ మాత్రమే నామినేషన్ వేశారు. పార్టీ తన పేరును ప్రకటించిన తెల్లారే ఆయన ఆదిలాబాద్ వెళ్లి రిట ర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. పెద్దపల్లి లోక్‌సభ స్థానం పరిధిలో కాస్త పర్వాలేదనిపిం చారు. ఇక్కడ ప్రధాన పార్టీల్లో కాంగ్రెస్ నుంచి ఏ.చంద్రశేఖర్ ఒక్కరే బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. టీఆర్ఎస్, బీజేపీలు బుధవారం వరకు అభ్యర్థులను ప్రకటించలేదు. ప్రజాబంధు పార్టీ అభ్యర్థి తాడెం రాజప్రకాశ్, పిరమిడ్ పార్టీ అభ్యర్థి ఇరుగురాల భాగ్యలక్ష్మి, స్వతంత్ర అభ్యర్థులుగా కొయ్యడ స్వామి, దుర్గం రాజ్‌కుమార్,అంబాల మహేందర్ తదితరులు తమ నామినేషన్లను అందించారు. అభ్యర్థుల ప్రకటనే ఆలస్యం.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్, కేంద్రంలోని బీజేపీల కంటే ముందుగా కాంగ్రెస్ తమ ఎంపీ అభ్యర్థుల పేర్లు తెలిపింది. బరిలో నిలిచే వారి జాబితాను నోటిఫికేషన్ సమయానికి ప్రకటించేసింది. టీఆర్ఎస్ అభ్యర్థులు ఎవరనేది స్పష్టత ఉన్నా.. వారి పేర్లను ఆ పార్టీ అధికారంగా ప్రకటించలేదు. గురువారం హోళీ పండుగ రోజు పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటిస్తారని చెబుతున్నారు. ఆదిలాబాద్ స్థానానికి టీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ గోడం నగేశ్ బరిలో ఉండనున్నారు. ఇప్పటికే ఆయన ఉమ్మడి జిల్లాలోని తన లోక్‌సభ స్థానం పరిధిలో పర్యటిస్తూ.. ప్రచారాన్నీ చేపడుతున్నారు. పెద్దపల్లిలో దాదాపుగా మాజీ ఎంపీ వివేక్‌కే సీటు కేటాయించే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేంద్రంలో మళ్లీ అధికారంలోకి రావాలన్న తపనతో ఉన్న బీజేపీ కూడా ఇప్పటి వరకు ఆదిలాబాద్, పెద్దపల్లి లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించ లేదు. బోథ్ నియోజవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌కు చెందిన సోయం బాపురావు ఇటీవల బీజేపీలో చేరారు. ఆదిలాబాద్ లోక్‌సభ టికెట్ దాదాపుగా ఈయనకే ఇస్తారని బీజేపీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. పెద్దపల్లిలో సీనియర్ నాయకుడు కాసిపేట లింగయ్య, ఎస్.కుమార్‌లతో పాటో బెల్లంపల్లికి చెందిన కొయ్యల ఏమాజీ పోటీ పడుతున్నారు. స్వతంత్రులు సైలెంట్.. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులూ నామినేషన్ల దాఖలులో స్థబ్ధుగా ఉన్నారు.పెద్దపల్లి స్థానంలో కాస్త పర్వాలేదనిపించేలా పోటీ పడుతున్నా.. ఆదిలాబాద్‌లో ఇప్పటి వరకు ఒక్క స్వతంత్ర అభ్యర్థి కూడా నామినేషన్ దాఖలు చేయకపోవడం గమనార్హం. గత 2014 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి స్వతంత్రులుగా నేతావత్ రాందాస్, పవార్ కృష్ణ, బంక సహదేవ్, మొసలి చిన్నయ్య తదితరులు బరిలో నిలిచారు. ఈసారి ఇప్పటి వరకూ ఈ స్థానం నుంచి ఒక్క స్వతంత్ర అభ్యర్థి కూడా నామినేషన్ వేయకపోవడం గమనార్హం. పెద్దపల్లి లోక్‌సభ స్థానం నుంచి కె.జయరావు, జి.వినయ్‌కుమార్, జి. రమేశ్, జె.రమాదేవి, టి.శ్రీనివాస్, బి.నారాయణ, ఎం. రవీందర్‌లు స్వతంత్రులుగా పోటీ చేశారు. ఉన్నది రెండ్రోజులే.. కేంద్ర ఎన్నికల సంఘం నామినేషన్ల ప్రక్రియకు వారం రోజులు గడువిచ్చింది. ఈనెల 18 సోమవారం నుంచి 25 సోమవారం వరకు సమయమిచ్చింది. ఇందులో 21న హోళీ, 23న నాలుగో శనివారం, 24న ఆదివారం సెలవు దినాలు వచ్చాయి. మొదటి మూడు రోజులు అభ్యర్థుల నుంచి పెద్దగా స్పందన రాలేదు. ఇక గురు, శని, ఆదివారాలు సెలవులు కాగా.. మిగిలింది రెండురోజులే. కేవలం శుక్రవారం, చివరి రోజైన సోమవారం మాత్రమే నామినేషన్లు వేసేందుకు మిగిలాయి. ఈ రెండు పనిదినాల్లోనూ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3గంటల వరకు మాత్రమే నామినేషన్లను స్వీకరించనున్నారు. పండితుల లెక్క ప్రకారం శుక్రవారం కంటే 25న సోమవారం మంచి ముహూర్తం ఉందని చెబుతున్నారు. ఈనేపథ్యంలో మిగిలిన అభ్యర్థులు చివరిరోజునే దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక 26న స్క్రుటిని, 28న నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉండనుంది. -
హోలీ వేడుకల్లో విషాదం : ఎమ్మెల్యేపై కాల్పులు
లక్నో : ఉత్తర్ ప్రదేశ్‌లో హోలీ వేడుకలు శ్రుతిమించాయి. బీజేపీ కార్యాలయంలో గురువారం జరిగిన హోలీ వేడుకల్లో లఖీంపూర్ ఖేరీ బీజేపీ ఎమ్మెల్యే యోగేష్ వర్మపై కాల్పులు కలకలం రేపాయి. వర్మను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం ఆయన ప్రమాదం నుంచి గట్టెక్కారని సమాచారం. లఖీంపూర్ బీజేపీ ఎమ్మెల్యే యోగేష్ వర్మపై హోలీ వేడుకల్లో దుండగుడు కాల్పులు జరిపాడని, కాల్పుల్లో ఆయన కాలికి బుల్లెట్ గాయాలయ్యాయని జిల్లా ఎస్పీ పూనం తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వర్మ ప్రస్తుతం కోలుకుంటున్నారని, ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్పీ పూనం వెల్లడించారు. పార్టీ కార్యాలయంలో కొంతమందితో ఎమ్మెల్యే ముచ్చటిస్తున్న క్రమంలో వాగ్వాదం చేసుకోవడంతో ఆయనపై కాల్పులు జరిపారని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యేఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని లఖీంపూర్ జిల్లా మేజిస్ర్టేట్ ఎస్ సింగ్ చెప్పారు. ఎమ్మెల్యేపై కాల్పులకు తెగబడిన వ్యక్తిని పోలీసులు త్వరలోనే అరెస్ట్ చేస్తారని సింగ్ పేర్కొన్నారు. -
కమలంలో నైరాశ్యం
సాక్షి, వికారాబాద్: కేంద్రంలో అధికారంలోకి రావాలని, మోదీని మరోమారు ప్రధాని పీఠంపై కూర్చోబెట్టాలని భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో ముమ్మర ప్రచారం చేస్తోంది. మెజార్టీ ఎంపీ సీట్లు సాధించేలా వ్యూహరచన చేస్తోంది. ఇందుకు అనుగుణంగా ఎంపీ అభ్యర్థులను ఎంపిక చేయటంతో పాటు కేడర్‌లోనూ జోష్ నింపుతోంది. అయితే రాష్ట్రంలో మాత్రం ఈ ఉత్సాహం కనిపించడం లేదు. ముఖ్యంగా చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో కమలం పార్టీ క్రియాశీలకంగా వ్యవహరించడం లేదని చెప్పవచ్చు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ప్రతికూల ఫలితాలే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. మరోవైపు లోక్‌సభ ఎన్నికలపై పార్టీ ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వకపోవడం, అభ్యర్థుల ప్రకటనలో జాప్యం చేస్తుండటం నాయకులు, కార్యకర్తలను అసంతృప్తికి గురిచేస్తోంది. మరీ ముఖ్యంగా పార్టీ వ్యవహారశైలితో కార్యకర్తలు నిరాశకు గురవుతున్నారు. కేంద్రంలో పాలనా పగ్గాలు చేపట్టాలని చూస్తున్న నేతలు.. ఇప్పటికే ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తే పార్టీకి లాభం చేకూరేదని జిల్లాకు చెందిన బీజేపీ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. ద్వితీయ శ్రేణి నేతల అసహనం చేవెళ్ల పార్లమెంట్ స్థానానికి బలమైన అభ్యర్థి ని బరిలో దింపాలని ఆపార్టీకి చెందిన జిల్లా నాయకులు భావిస్తున్నారు. అయితే బీజేపీ అధిష్టానం మాత్రం ఇప్పటి వరకు అభ్యర్థి విషయంలో స్పష్టత ఇవ్వటంలేదు. అధిష్టానం వ్యవహార శైలివల్లే ఎన్నికల్లో పార్టీ ప్రతికూల ఫలితాలను ఎదుర్కోవాల్సి వస్తోందని ద్వితీయ శ్రేణి నేతలు అసహనం వ్యక్తంచేస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల తీరును గుర్తు చేసుకుంటున్నారు. పరిగి అసెంబ్లీకి సంబంధించి ఆ పార్టీ ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు ప్రహ్లాదరావు టికెట్ ఆశించారు. అయితే చివరి నిమిషం వరకు బీజేపీ అధిష్టానం ఆయన పేరును ప్రకటించలేదు. దీం తో మనస్తాపానికి గురైన ఆయన పార్టీ వీడతానని ప్రకటించటంతో ఎట్టకేలకు తనను అభ్యర్థిగా ప్రకటించింది. పరిగిలో పార్టీ బలంగానే ఉన్నా.. ఎన్నికల ప్రచారానికి అనుకున్నంత సమయం దక్కకపోవటంతో ప్రహ్లాదరావుకు ఓటమి తప్పలేదు. తాండూరు నియోజకవర్గానికి సంబంధించి సీనియర్ నాయకుడు రమేశ్ తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కోరుతూ వచ్చారు.అసెంబ్లీ టికెట్‌ను సీ నియర్ నేత రమేశ్ కోరుతూ వచ్చారు.అయితే అ ధిష్టానం ఎన్ఆర్ఐ పటేల్ రవిశంకర్‌కు టికెట్ కట్టబెట్టింది. అధిష్టానం నిర్ణయం ఓవర్గం బీజేపీ నా యకులను అసంతృప్తికి గురిచేసింది. ఫలితంగా తాండూరులో యోగి అదిత్యనాథ్ ఇతర ము ఖ్యనేతలు ప్రచారం చేసినా బీజేపీ ఓటమిపాలైంది. కలిసిరాని ఫలితాలు.. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఫలితాలు కలిసిరాలేదు. చేవెళ్ల పార్లమెంట్‌కు రెండుసార్లు ఉన్నికలు జరిగాయి. 2009 ఎన్నికల్లో బీజేపీ నుంచి సీనియర్ నేత బద్దం బాల్‌రెడ్డి పోటీ చేశారు. ఈయన గెలుస్తారని భావించినా కేవలం 1,12,417 ఓట్లు మాత్రమే వచ్చాయి. 2014లో బీజేపీ, టీడీపీ పొత్తులో ఉమ్మడి అభ్యర్థిగా వీరేందర్‌గౌడ్‌ను బరిలో దించగా ఆయన ఓటమిపాలయ్యారు. 2014 ఎన్నికల్లో వీరేందర్‌గౌడ్‌కు 3, 53,203 ఓట్లు వచ్చాయి. ఇక ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీకి ఏమాత్రం కలిసిరాలేదు. వికారాబాద్, పరిగి, తాండూరులో బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్లు దక్కలేదు. పరిగి బీజేపీ పార్టీ తరఫున ప్రహ్లాదరావు పోటీ చేయగా ఓటమి పాలయ్యారు. ఆయనకు 6,739 ఓట్లు వచ్చాయి. వికారాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థి సాయికృష్ణ పోటీ చేసి ఓడిపోయారు. ఆయనకు కేవలం 1,973 ఓట్లు వచ్చాయి. ఇక తాండూరు నియోజకవర్గం నుంచి పటేల్ రవిశంకర్ పోటీ చేయగా ఆయనకు 10,548 ఓట్లు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బేరీజు వేసుకుంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఏమేర ప్రభావం చూపుతుందో వేచి చూడాలి. జనార్దన్రెడ్డికే అవకాశం..? ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల్లోనైనా పార్టీ అధిష్టానం జిల్లా నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని వెంటనే ఎంపీ అభ్యర్థిని ప్రకటించాలని జిల్లా నాయకులు, కార్యకర్తలు కోరుతున్నారు. అయితే బీజేపీ అధిష్టానం మాత్రం ఇప్పటి వరకు అభ్యర్థిని ప్రకటించలేదు. చేవెళ్ల టికెట్ కోసం జనార్దన్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారు. అదేసమయంలో మాజీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి సైతం ఇక్కడి నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం సాగుతోంది. మరోవైపు రాజాసింగ్ పోటీ చేస్తే బాగుంటుందని కొంతమంది కార్యకర్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా బీజేపీ అధిష్టానం మాత్రం జనార్దన్రెడ్డికే టికెట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డికి సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతో జనార్దన్‌రెడ్డికి దాదాపు లైన్ క్లియర్ అయినట్లేనని సమాచారం. మంగళవారం లేదా బుధవారం బీజేపీ అధిష్టానం చేవెళ్ల ఎంపీ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. -
పోటీకి దూరంగా లక్ష్మణ్?
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితాను బీజేపీ శనివారం ప్రకటించే అవకాశముంది. శుక్రవారమే ఈ జాబితాను ప్రకటించాలని భావించినా జాతీయ పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ఈ నెల 16కి వాయిదా పడటంతో అభ్యర్థుల ప్రకటన కూడా ఆలస్యమైంది. శనివారం జరిగే పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో అభ్యర్థులను ఖరారు చేసి, శనివారం లేదా ఆదివారం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఢిల్లీలో జరిగే ఈ సమావేశానికి రాష్ట్రం నుంచి పార్టీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, సీనియర్ నేతలు బండారు దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి, మురళీధర్‌రావు, మంత్రి శ్రీనివాస్, రాంచంద్రరావు హాజరయ్యేందుకు శుక్రవారం రాత్రి బయలుదేరి వెళ్లనున్నారు. పార్టీ కోర్ కమిటీ సమావేశంలో ఒక్కో నియోజకవర్గానికి ఇద్దరు లేదా ముగ్గురి పేర్లతో జాబితాను రూపొందించి తమ వెంట తీసుకువెళ్తున్నారు. కొత్తవారికి చాన్స్.. ఈ సారి కొన్ని నియోజకవర్గాల్లో కొత్త వారికి అవకాశం కల్పించాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు ఎమ్మెల్యేగా పోటీ చేసిన వారిలో ఎక్కువ మంది ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తితో ఉన్నారు. దీంతో నియోజకవర్గాల వారీగా వారి పేర్లను కూడా జాబితాలో చేర్చినట్లు తెలిసింది. ఆ జాబితాపై పార్లమెంటరీ బోర్డు సమావేశంలో చర్చించి లోక్‌సభ ఎన్నికల్లో పోటీలో నిలపాల్సిన అభ్యర్థుల పేర్లను ఖరారు చేయనున్నారు. మొత్తంగా 17 స్థానాల్లో పోటీ చేయాలని ఇప్పటికే నిర్ణయించిన పార్టీ మొదట 10 స్థానాలకు, తర్వాత ఒకట్రెండు రోజులకు మిగతా స్థానా లకు పోటీలో నిలిపే అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ కూడా సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించినా, సిట్టింగ్ ఎంపీ బండారు దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి కూడా ఆ స్థానానికి పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో లక్ష్మణ్ తన పోటీ యోచనను విరమించుకున్నట్లు తెలిసింది. దానిపైనా శనివారం స్పష్టత రానుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కనుక పోటీ చేయాలని ఆదేశిస్తే లక్ష్మణ్ సికింద్రాబాద్ స్థానం నుంచి పోటీలో నిలిచే అవకాశముంది. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా ఆశావహుల వివరాలు.. ►సికింద్రాబాద్: కిషన్‌రెడ్డి/బండారు దత్తాత్రేయ/లక్ష్మణ్ ►నాగర్‌కర్నూల్: బంగారు శ్రుతి ►మహబూబ్‌నగర్: శాంతకుమార్/కొత్తవారికి అవకాశం ►చేవెళ్ల: జనార్దన్‌రెడ్డి/యోగానంద్ ►జహీరాబాద్: సోమాయప్ప ►నిజామాబాద్: ధర్మపురి అరవింద్/సదానందరెడ్డి ►కరీంనగర్: దుగ్యాల ప్రదీప్‌రావు/బండి సంజయ్/రామకృష్ణారెడ్డి ►పెద్దపల్లి: కాసిపేట లింగయ్య/ఎస్.కుమార్ ►ఆదిలాబాద్: రేష్మారాథోడ్/కొత్తవారికి అవకాశం ►వరంగల్: చింతా సాంబమూర్తి /బాబుమోహన్ ►మహబూబాబాద్: హుస్సేన్ నాయక్/చందా లింగయ్య దొర ►భువనగిరి: డాక్టర్ అనిల్/శ్యాంసుందర్ ►నల్లగొండ: శ్రీధర్/గోలి మధుసూదన్‌రెడ్డి ►హైదరాబాద్: అమర్‌సింగ్ ►మల్కాజిగిరి: రాంచంద్రరావు/ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్/మల్లారెడ్డి ►మెదక్: రఘునందన్‌రావు/రాజేశ్వర్‌రావు దేశ్‌పాండే/కరుణాకర్‌రెడ్డి ►ఖమ్మం: వాసుదేవ్ -
రేపు బీజేపీ అభ్యర్థుల జాబితా
సాక్షి, హైదరాబాద్: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోని 17 నియోజకవర్గాలకు ఆశావహులతో బీజేపీ జాబితా సిద్ధమైంది. బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశం గురువారం రాత్రి నగరంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. ఈ భేటీలో ముఖ్య నేతలు అరవింద లింబావలి, మురళీధర్‌రావు, బండారు దత్తాత్రేయ, కె.లక్ష్మణ్, కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రతి లోక్‌సభ సెగ్మెంట్‌కు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఒక్కో స్థానానికి మూడు పేర్ల చొప్పున జాబితా రూపొందించారు. ఈ జాబితాను రాష్ట్ర ముఖ్య నేతలు ఢిల్లీకి తీసుకెళ్లారు. శనివారం ఢిల్లీలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారని పార్టీ నేతలు తెలిపారు. -
దీదీపై ఈసీకి బీజేపీ నేతల ఫిర్యాదు
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌పై ప్రత్యేకంగా దృష్టిసారించిన బీజేపీ అందుకు కార్యాచరణ రూపొందించింది. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షాల ర్యాలీలతో హోరెత్తించిన కమలనాధులు బెంగాల్లో కనీసం 22 లోక్‌సభ స్ధానాల్లో గెలుపు కోసం వ్యూహాలకు పదునుపెడుతున్నారు. బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రాబల్యానికి అడ్డుకట్ట వేసేందుకు పావులు కదుపుతున్నారు. ఇక బుధవారం ఎన్నికల కమిషన్‌ను కలిసిన బీజేపీ నేతలు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా పశ్చిమ బెంగాల్‌ను సమస్యాత్మక రాష్ట్రంగా ప్రకటించాలని కోరారు. బెంగాల్లో స్వేచ్ఛగా, సజావుగా ఎన్నికలు జరిగే అవకాశం లేదని తాము ఈసీ దృష్టికి తీసుకువచ్చామని బీజేపీ ప్రతినిధి బృందానికి నేతృత్వం వహించిన కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. స్ధానిక సంస్థలు, గ్రామ పంచాయితీ ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింస, మృతుల వివరాలతో పాటు బీజేపీ నేతల హెలికాఫ్టర్ల ల్యాండింగ్‌కు అనుమతి నిరాకరణ వంటి అన్ని అంశాలను ఈసీకి నివేదించామన్నారు. మరోవైపు కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్‌ను బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, మోదీ ఓటమే లక్ష్యంగా అవసరమైతే తాను ప్రధాని నియోజకవర్గం వారణాసిలో ప్రచారం చేపడతానని దీదీ సంకేతాలిచ్చారు. -
‘కేంద్ర బలగాల పర్యవేక్షణలో పోలింగ్’
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్లో లోక్‌సభ ఎన్నికలను కేంద్ర బలగాల పర్యవేక్షణలో నిర్వహించాలని బీజేపీ నేతలు మంగళవారం ఈసీని కోరనున్నారు. తమకు బెంగాల్ పోలీసులపై విశ్వాసం లేనందున కేంద్ర బలగాలు జోక్యం చేసుకోవాలని వారు ఈసీకి విన్నవించనున్నారు. ఈసీ అధికారులతో బీజేపీ నేతలు సాయంత్రం 5 గంటలకు భేటీ కానున్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఓటర్లను బెదిరిస్తున్నారని బీజేపీ ఇప్పటికే ఈసీకి ఫిర్యాదు చేసింది. పశ్చిమ బెంగాల్లో ప్రజాస్వామ్యం లేదని, ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత కూడా తృణమూల్ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. కేంద్ర బలగాలు రెండు రోజులే ఉంటాయని, ఆ తర్వాత ప్రజలు రాష్ట్ర పోలీసులపైనే ఆధారపడాలని తృణమూల్ మంత్రి ఒకరు ఓటర్లను బెదిరించారని బీజేపీ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడు జై ప్రకాష్ మజుందార్ ఆరోపించారు. బెంగాల్లో లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 11న ప్రారంభమై మే 19తో ఏడు దశల పోలింగ్‌తో ముగుస్తాయి. -
అన్నింటా పోటీ.. గెలిచేవి ఎన్నో?
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలకు తెలంగాణ బీజేపీ సిద్ధం అవుతోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 118 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ పార్లమెంటు ఎన్నికల్లోనూ రాష్ట్రంలోని మొత్తం 17 స్థానాల్లో పోటీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. అన్ని స్థానాల్లో పోటీ చేయనున్నట్లు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఇప్పటికే ప్రకటించారు. అభ్యర్థుల ఖరారుపైనా పార్టీ దృష్టి సారించింది. అయితే ఎన్ని స్థానాలు గెలుస్తారన్నదే కమలం పార్టీ శ్రేణులకు ఆందో«ళన కలిగిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 118 స్థానాల్లో పోటీ చేసినా ఒక్కస్థానంలోనే గెలిచింది. వందకుపైగా స్థానాల్లో డిపాజిట్ సైతం కోల్పోయింది. దీంతో లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు అవకాశాలపై బీజేపీ నేతలు, శ్రేణుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా ఒంటిరిగా పోటీ చేసి సత్తా చాటాలని బీజేపీ భావించింది. పార్టీ బలోపేతం కోసం గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీతోపాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సైతం పర్యటించారు. తీరా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మాత్రం కాషాయ పార్టీకి చేదునే మిగిల్చాయి. 2004 ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ బలం ఒక్క స్థానానికి పరిమితమైంది. ఈ ఓటమి నుంచి కోలుకోకముందే లోక్‌సభ ఎన్నికలు వచ్చాయి. ప్రతి లోక్‌సభ సెగ్మెంట్‌పైనా బీజేపీ ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. గెలుపు అవకాశాలు ఉన్న వారికి టికెట్లు ఇచ్చేలా కసరత్తు చేసింది. ఆశావహులు అధికంగానే ఉన్నా.. పార్టీ నుంచి పోటీ చేసేందుకు అశావహులు అధికంగానే ఉన్నారు. అందులో పార్టీ సీనియర్లే ఎక్కువ మంది టికెట్లను ఆశిస్తున్నారు. ముఖ్యంగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నేతలంతా పార్లమెంటు ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధం అవుతున్నారు. వారిలో పార్టీ అధ్య క్షుడు లక్ష్మణ్ సహా ముఖ్య నేతలంతా ఉన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎంపీ బండారు దత్తాత్రేయ, లక్ష్మణ్, కిషన్‌రెడ్డి పోటీ చేయా లని భావిస్తున్నారు. మల్కాజిగిరి నుంచి పార్టీ ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎస్.మల్లారెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రరావు, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ టికెట్ ఆశిస్తున్నారు. హైదరాబాద్ నుంచి షెహజాదీ ఉన్నారు. కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మ పురి అర్వింద్, జహీరాబాద్ నుంచి బానాల లక్ష్మారెడ్డి ఉన్నారు. తనకు సికింద్రాబాద్‌లో టికెట్ ఇవ్వకపోతే చేవెళ్ల నుంచి ఇవ్వాలని కిషన్‌రెడ్డి కోరుతున్నట్లు తెలిసింది. భువనగిరి నుంచి పీవీ శ్యాం సుందర్, మహబూబ్‌నగర్ నుంచి శాంతికుమార్, నాగర్‌కర్నూల్ నుంచి బంగారు శృతి, రజినిరెడ్డి, మెదక్ నుంచి రఘునందన్‌రావు, రాజేశ్వర్‌రావు దేశ్‌పాండే, వరంగల్ నుంచి చింతా సాంబమూర్తి, జైపాల్ యాదవ్; పెద్దపల్లి నుంచి ఎస్.కుమార్, కాశిపేట లింగయ్య; నల్లగొండ నుంచి గోలి మధుసూదన్‌రెడ్డి, పాదూరి కరుణ ఆశిస్తుండగా మరో మూడు స్థానాలనుంచి అభ్యర్థులను ఖరారు చేసేందుకు కసరత్తు చేస్తోంది. 15న అభ్యర్థుల జాబితాతో రండి: అమిత్ షా సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర బీజేపీ నేతలకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆదేశాలిచ్చారు. ఈ నెల 15లోపు రాష్ట్ర స్థాయిలో అభ్యర్థులను ఖరారు చేసి జాబితాతో రావాలని సూచించారు. లోక్‌సభ ఎన్నికల కోసం తెలంగాణలో అనుసరించాల్సిన వ్యూహాలపై రాష్ట్ర నేతలకు అమిత్ షా దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి తదితరులు అమిత్ షాను సోమవారం ఢిల్లీలోని ఆయ న నివాసంలో కలిశారు. ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. అభ్యర్థుల ఎంపిక కసరత్తును పూర్తి చేసి ఈ నెల 15న తిరిగి రావాలని అమిత్ షా సూచించినట్టు సమాచారం. పార్టీ అభ్యర్థులను ఈ నెల 15న బీజేపీ ఖరారు చేయనుంది. ఈ నెల 14వ తేదీనాడే పార్టీ కోర్ కమిటీ సమావేశమై అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసి, జాతీయ పార్టీ పార్లమెంటరీ బోర్డు ఆమోదం కోసం పంపించ నుంది. 14న రాత్రికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆ జాబితాను తీసుకెళ్లనున్నారు. 15న పార్లమెంట రీ బోర్డు సమావేశంలో అభ్యర్థులను ఖరారు చేసి, ఢిల్లీలోనే ప్రకటించే అవకాశం ఉంది. -
అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కసరత్తు
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలకు పార్టీ అభ్యర్థుల ఎంపికపై రాష్ట్ర బీజేపీ కసరత్తు ప్రారంభించింది. శనివారం బీజేపీ కార్యాలయంలో జరిగిన రాష్ట్ర ముఖ్య నేతల కోర్ కమిటీ సమావేశంలో దీనిపై ప్రాథమిక చర్చ జరిగింది. బీజేపీ నుంచి పోటీకి రిటైర్డ్ అధికారులతోపాటు కొందరు సీనియర్ ప్రభు త్వ అధికారులు కూడా ఆసక్తి కనబరిచినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్‌ల నుంచి టికెట్ ఆశించి భంగపడే నేతలెవరైనా వస్తే పార్టీ నుంచి పోటీకి దింపే అవకాశాలున్నాయని ఊహాగానాలు సాగుతున్నాయి. అభ్యర్థుల ఎంపికపై ప్రాథమిక జాబితా సిద్ధం చేసేందుకు పార్లమెంట్ ఇన్చార్జులను నియమించారు. వారు సంబంధిత నియోజకవర్గంలో పోటీకి అర్హులైన ముగ్గురేసి సభ్యులతో జాబితాలు సిద్ధం చేస్తున్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎంపీ బండారు దత్తాత్రేయతోపాటు పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేఎల్పీ మాజీ నేత కిషన్‌రెడ్డి పోటీలో ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. చేవెళ్ల నుంచి దత్తాత్రేయ సమీప బంధువు జనార్దనరెడ్డి టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సీటు నుంచి కిషన్‌రెడ్డిని కూడా పార్టీ జాతీయ నాయకత్వం పోటీకి దింపే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. మల్కాజిగిరి స్థానం నుంచి మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్‌తోపాటు ఎమ్మెల్సీ ఎన్. రామచంద్రరావు కూడా పోటీ పడుతున్నట్లు సమాచారం. మరో 3, 4 రోజుల్లో మళ్లీ భేటీ కావాలని కోర్ కమిటీ నిర్ణయించింది. లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల ఖరారుకు సంబంధించిన కసరత్తులో భాగంగా సోమవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో లక్ష్మణ్ సమావేశం కానున్నారు. కరీంనగర్ నియోజకవర్గంపై దృష్టి కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి శాసనమండలికి జరగనున్న ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి సుగుణాకరరావు గెలుపుకోసం కృషి చేయాల ని పార్టీ కోర్ కమిటీ నిర్ణయించింది. ఈ స్థానం నుంచి పార్టీ టికెట్ ఆశించి భంగపడి రెబెల్‌గా రంగంలోకి దిగిన ఏబీవీపీ మాజీ నేత రణజిత్ మోహన్ పార్టీ పేరుతోపాటు ప్రధాని మోదీ ఫొటోతో ప్రచా రం నిర్వహించడాన్ని కోర్ కమిటీ తీవ్రంగా పరిగణిం చినట్లు తెలుస్తోంది. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని బీజేపీ నాయకులు నిర్ణయించా రు. ఈ భేటీలో లక్ష్మణ్, దత్తాత్రేయ, మురళీధర్‌రావు, రామచంద్రరావు, నల్లు ఇంద్రసేనారెడ్డి, పేరాల శేఖర్‌రావు, కిషన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మోదీ పోటీ రెండు చోట్ల నుంచా?
న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు బీజేపీ పార్లమెంటరీ బోర్డు శుక్రవారం ఢిల్లీలో సమావేశమైంది. ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ తదితరులు పాల్గొన్న ఈ కీలక భేటీలో తీసుకున్న నిర్ణయాలపై అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న యూపీలోని వారణాసి నుంచే మోదీ పోటీ చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయన ఈ ఒక్క చోటు నుంచేనా లేక మరో నియోజకవర్గం నుంచి సైతం పోటీచేస్తారా అనేది నిర్ణయించలేదని సమాచారం. 2014 ఎన్నికల్లో మోదీ రెండు చోట్ల నుంచి పోటీ చేసి గెలుపొందారు. అభ్యర్థుల ఖరారులో గెలుపు అవకాశాలు, వయోపరిమితి వంటివి పరిగణనలోకి తీసుకోవాలనే యోచనలో పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం పార్టీ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్ మాట్లాడుతూ..జార్ఖండ్‌లోని ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్‌తో బీజేపీ పొత్తు పెట్టుకోనుందని వెల్లడించారు. ఇప్పటికే ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన ఈ పార్టీ కి రాష్ట్రంలోని ఒక సీటు ఇచ్చారు. -
టీఆర్ఎస్కు ఓటేస్తే గులాంగిరికి వేసినట్లే
సాక్షి, హైదరాబాద్: రానున్న పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఓటు వేస్తే గులాంగిరికి ఓటు వేసినట్లేనని బీజేపీ నేత కిషన్‌రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ఎంపీలు కల్వకుంట్ల కుటుంబానికి గులాంగురి చేసేందుకు ఉపయోగపడుతారు తప్ప రాష్ట్రానికి ఒరిగేదేముండదన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే నెహ్రూ కుటుంబానికి ఓటేసినట్లేనని, ఈ రెం డు పార్టీల నుంచి గెలిచే ఎంపీలు ఆ రెండు కుటుంబాలకే గులాంగిరీ చేస్తారన్నారు. బీజేపీకి ఓటేస్తే దేశాభివృద్ధికి ఉపయోగపడుతుందని, అది కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఓటేసినట్లు అవుతుందని చెప్పారు. ఈ ఎన్నిక లు దేశభవిష్యత్‌కు సంబంధించినవని, ప్రజలు సమర్థమైన నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. 16 సీట్లు గెలిస్తే ఎవరు ప్రధాని అవుతారో చెప్పే ధైర్యం కేటీఆర్‌కు ఉందా.. అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు ప్రధాని గా మోదీ కావాలని కోరుకుంటున్నారని.. ఆ విశ్వాసాన్ని ప్రజల్లో మోదీ కల్పించారన్నారు. దేశసేవకులా.. కుటుంబాలకు బానిసలా పాకిస్తాన్‌కు పట్టిన దయ్యాన్ని వదిలించిన ఘనత మోదీదేనని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. దేశానికి సేవకులు కావాలా.. కుటుంబాలకు బానిసలు కావాలో ప్రజలు ఆలోచించాలన్నారు. బుధవారం కేటీఆర్ సభ కోసం విద్యార్థులను ఎండలో రోడ్లపై నిలబెట్టారని విమర్శించారు. ఇది ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినట్లేనని.. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంకా బీజేపీ అభ్యర్థులను ప్రకటించలేదని, ప్రతి నియోజక వర్గానికి ముగ్గురు పేర్లతో జాబితా పంపమని కేంద్ర పార్టీ కోరిందన్నారు. పార్లమెంట్ క్లస్టర్ల సమావేశం తరువాత భేటీ అయి ప్రతి నియోజకవర్గానికి ముగ్గురి పేర్లతో జాబితా తయారు చేసి పంపిస్తామన్నారు. ఒకరు పాల్.. మరొకరు చంద్రబాబు ఆంధ్రాలో ఇద్దరు గొప్ప నాయకులు మాట్లాడుతున్నారని, అందులో ఒకరు కేఏ పాల్ అయితే మరొకరు ఏపీ సీఎం చంద్రబాబని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. వారు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాక ప్రజలు తలలు పట్టుకుంటున్నారన్నారు. రాఫెల్ విషయంలో విపక్షాల విమర్శలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, ఇంత వరకు ఒక్క ఆధారం కూడా చూపెట్టలేదన్నారు. ఓట్ల గల్లంతు రెండు రాష్ట్రాలకు సంబంధించిందని, దానిపై సీబీఐ విచారణ జరిపించాలని పేర్కొన్నారు. -
త్వరలో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం
-
కలలు సాకారం చేస్తాం
సాక్షి, చెన్నై: బలమైన భారత్ లక్ష్యంగా ముందుకు సాగుదామని, మరో అవకాశం ఇస్తే కలలు సాకారం చేస్తానని తమిళ ఓటర్లను ప్రధాని మోదీ బుధవారం కోరారు. చెన్నై శివారు కిలాంబాక్కం వేదికగా అన్నాడీఎంకే మెగా కూటమి నేతృత్వంలో ఎన్నికల శంఖారావ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. పుల్వామా దాడులు, ప్రతిదాడులు, వింగ్ కమాండర్ అభినందన్ మళ్లీ భారత్‌కు రావడాన్ని గుర్తు చేస్తూ, తీవ్రవాదంపై పోరాటంలో వెనక్కు తగ్గేది లేదన్నారు. ఎంతవరకైనా వెళ్లడానికి సిద్ధమేనని ప్రకటించారు. తమిళనాట అన్నాడీఎంకే–బీజేపీ నేతృత్వంలోని మెగా కూటమి ఖరారు అయింది. పొత్తులో భాగంగా తమిళనాడులో బీజేపీకి–5, పీఎంకేకు–7, పుదియ తమిళగం–1, పుదియ నిధి కట్చి –1, ఎన్ఆర్ కాంగ్రెస్‌కు పుదుచ్చేరిలోని దక్కాయి. మరికొన్ని చిన్న పార్టీలు కూటమిలో ఉన్న సీట్ల కేటాయింపులు అధికారికంగా వెలువడాల్సి ఉంది. మిగిలిన సీట్లలో అన్నా డీఎంకే పోటీ చేయనుంది. ఈ బహిరంగ సభతో పాటు అధికారిక వేడుక నిమిత్తం బుధవారం మోదీ చెన్నైకు వచ్చారు. ముందుగా తమిళనాడు సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీరుసెల్వంతో కలిసి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. భారతరత్న ఎంజీఆర్ పేరును చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్‌కు పెడుతున్నట్లు మోదీ ప్రకటించారు. కర్ణాటకలో రిమోట్ కంట్రోల్ సీఎం సాక్షి, బెంగళూరు: కర్ణాటక కలబురిగిలో బీజేపీ ఎన్నికల సభలోనూ మోదీ పాల్గొన్నారు. ‘ రాష్ట్ర సీఎం కుమారస్వామి ఒక రిమోట్ కంట్రోల్ సీఎం. రాష్ట్రంలో ఒక బలహీనమైన ప్రభుత్వం పాలన సాగిస్తోంది’ అని విమర్శించారు. రాష్ట్రంలో దొంగలు, అవినీతిపరుల దుకాణం బంద్ చేయడానికి సమయం ఆసన్నమైందన్నారు. రైతులకు నగదు బదిలీ పథకాన్ని ప్రారంభించిన తర్వాత దీన్ని కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకించాయని, అందులో కర్ణాటక ప్రభుత్వం కూడా ఒకటని ఆరోపించారు. ఎలాంటి అవినీతికీ తావు లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లోకే నగదు బదిలీ చేస్తుండడంతో కమీషన్లకు అలవాటు పడిన రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు ఈ పథకాన్ని వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. మోదీ విరాళం 21 లక్షలు ప్రధాని మోదీ తన దాతృత్వాన్ని మరోసారి చాటారు. కుంభమేళాలో పని చేసిన పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం కోసం తన సంపాదన నుంచి రూ.21 లక్షలు విరాళంగా ఇచ్చినట్టు ప్రధాని కార్యాలయం ప్రకటించింది. -
ఎమ్మెల్యేను షూతో చితక్కొట్టిన బీజేపీ ఎంపీ
లక్నో : ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ప్రజా ప్రతినిధులు...తాము ఎక్కడ ఉన్నామో, ఏం చేస్తున్నామో అనే ఇంగిత జ్ఞానం మర్చిపోయారు. శిలా ఫలకంపై పేరు లేదంటూ జరిగిన వాగ్వివాదం కాస్త.. బీజేపీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యే బహిరంగంగా చెప్పులతో పరస్పరం కొట్టుకునేంతవరకూ వెళ్లింది. ఉత్తరప్రదేశ్ సంత్ కబీర్ నగర్ కలెక్టరేట్లో జరిగిన ఈ తతంగానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.... బుధవారం సంత్ కబీర్ నగర్ జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశానికి బీజేపీ ఎంపీ శరద్ త్రిపాఠీ, ఎమ్మెల్యే రాకేష్ సింగ్ హాజరు అయ్యారు. ఈ సందర్భంగా స్థానికంగా రోడ్డు నిర్మాణం సందర్భంగా ఏర్పాటు చేసిన శిలా ఫలకంపై తన పేరు ఎందుకు లేదంటూ ఎంపీ శరద్ త్రిపాఠీ స్థానిక ఎమ్మెల్యే అయిన రాకేష్ సింగ్‌ను ప్రశ్నించారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య కొద్దిపాటి వాగ్వివాదం చోటుచేసుకుంది. అది కాస్తా తీవ్రస్థాయికి చేరడంతో ఇద్దరు ప్రజా ప్రతినిధులు ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ నేపథ్యంలో సహనం కోల్పోయిన ఎంపీ శరద్ త్రిపాఠీ.. కాలికి ఉన్న షూ తీసి ఎమ్మెల్యేను చితక్కొట్టాడు. దీంతో ఎమ్మెల్యే రాకేష్ సింగ్ కూడా ఎంపీపై చేయి చేసుకున్నాడు. అయితే వారికి సర్ధిచెప్పేందుకు అక్కడున్న పార్టీ నేతలు, అధికారులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరకు పోలీసులు రంగప్రవేశం చేసి, ఇద్దరు నేతలను శాంతింప చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ వ్యవహారం మొత్తం యూపీ మంత్రి అశుతోష్ టండన్ సమక్షంలోనే జరగడం గమనార్హం. మరోవైపు ఎంపీ శదర్ త్రిపాఠీపై చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మెల్యే అనుచరులు ఆందోళనకు దిగారు. ఈ సంఘటనపై రాష్ట్ర బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. -
శిలా ఫలకంపై పేరు లేదని.. షూతో కొట్టుకున్నారు!
-
‘కేంబ్రిడ్జ్ అనలిటికా కంటే పెద్ద స్కాం’
సాక్షి విశాఖపట్నం: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినట్లు రుణమాఫీ మాత్రం జరగలేదుగానీ ఓట్లమాఫీ మాత్రం జరిగిందని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ వ్యాఖ్యానించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష పార్టీకి కేవలం ఐదులక్షల ఓట్లు మాత్రం తేడా ఉన్నాయని, వాటిని తొలగించేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఐటీగ్రిడ్స్ స్కాం కేంబ్రిడ్జ్ అనలిటికా కంటే పెద్ద కుంభకోణమని విమర్శించారు. ఏమీ తప్పుచేయని చంద్రబాబు గుమ్మడికాయ దొంగాల భుజాలెందుకు తడుముకుంటున్నారని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే ఐటీగ్రిడ్స్ సీఈవోను తెలంగాణ పోలీసులకు అప్పగించాలని మాధవ్ డిమాండ్ చేశారు. చంద్రబాబు వివేకం కోల్పోయి.. దిగజారుడు తనానికి పాల్పడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో ఎవ్వరికీ రక్షణ లేకుండా పోయిందని, ప్రజల వ్యక్తిగత జీవితాలతో చెలగాటం ఆడటం మంచిది కాదని హితవుపలికారు. ఐటీగ్రిడ్స్ సంస్థ ప్రజల డేటాను ఎవరికిచ్చిందో విచారణ చేసి వారిపై చర్యలు తీసుకోవాలని మాధవ్ డిమాండ్ చేశారు. -
తమిళనాట డీఎంకే కూటమి ఖరారు
సాక్షి, చెన్నై: తమిళనాట లోక్‌సభ ఎన్నికలకు డీఎంకే మెగా కూటమి ఖరారైంది. మిత్రులకు 20 సీట్లను డీఎంకే కేటాయించింది. మరో 20 స్థానాల్లో తమ అభ్యర్థులు పోటీ చేస్తారని ఆ పార్టీ అ«ధ్యక్షుడు స్టాలిన్ ప్రకటించారు. పుదుచ్చేరి, తమిళనాడులో 40 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. అన్నాడీఎంకే– బీజేపీ నేతృత్వంలో ఓ మెగా కూటమి ఏర్పాటు చివరి దశలో ఉండగా డీఎంకే–కాంగ్రెస్ నేతృత్వంలో మరో కూటమి మంగళవారం రారైంది. సీట్ల సర్దుబాటు వివరాలను స్టాలిన్ ప్రకటించారు. తమ కూటమిలోని కాంగ్రెస్‌కు పుదుచ్చేరితో పాటు రాష్ట్రంలో 10 స్థానాలు కేటాయించామన్నారు. ఎండీఎంకేకు ఓ ఎంపీ సీటు, ఓ రాజ్యసభ సీటును ఖరారు చేసినట్టు వివరించారు. ఇక, సీపీఎం 2, సీపీఐ 2, వీసీకే 2, ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ (ఐయూఎంఎల్) 1, కొంగునాడు దేశీయ మక్కల్ కట్చి(కేడీఎంకే)1, ఇండియ జననాయగ కట్చి(ఐజేకే)1లకు ఒకటి చొప్పున సీట్లు కేటాయించినట్టు ప్రకటించారు. మిత్రులకు 20 కేటాయించామని, తమ అభ్యర్థులు 20 స్థానాల్లో పోటీ చేస్తారని వివరించారు. డీఎంకే గుర్తుపై కేడీఎంకే, ఐజేకే అభ్యర్థులు పోటీ చేస్తారని తెలిపారు. వీసీకే, ఎండీఎంకే, ఐయూఎంఎల్ అభ్యర్థులు కూడా ఇదే గుర్తుపై పోటీ చేసే అవకాశాలున్నాయన్నారు. -
కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ ఎంపీ
లక్నో: సార్వత్రిక ఎన్నికల ముందు కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఎంపీ సావిత్రి బాయి పూలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. గతంలో అధికార బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన సావిత్రి.. రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఆమెతో పాటు ఎస్పీ మాజీ ఎంపీ రాకేష్ సచాన్ కూడా కాంగ్రెస్ గూటికి చేరారు. బీజేపీ పాలనలో రాజ్యాంగం ప్రమాదంలో పడిపోయే అవకాశం ఉందని, దాని పరిరక్షణ కోసం కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు పూలే తెలిపారు. ఈ సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా పాల్గొన్నారు. కాగా ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో యూపీలో మరిన్ని సీట్లు సాధించడమే లక్ష్యంగా ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు స్వీకరించిన ప్రియాంక కృషి చేస్తున్నారు. దానిలో భాగంగానే చేరికలపై దృష్టిసారించారు. సావిత్రిబాయి పూలే 2000 సంవత్సరంలో బీజేపీలో చేరి 2002, 2007, 2012 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి విజయం సాధించారు. బహ్రైచ్ నియోజకవర్గం నుంచి 2014 సాధారణ ఎన్నికల్లో పోటీచేసి లోక్‌సభకు ఎంపికయ్యారు. -
‘అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తా’
లక్నో : బీజేపీ నాయకత్వంతో విభేదిస్తున్న ఆ పార్టీ ఎంపీ శత్రుఘ్న సిన్హా తాను తిరిగి పట్నా సాహిబ్ స్ధానం నుంచే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేస్తానని స్పష్టం చేశారు. పార్టీ నాయకత్వం నిర్ణయంతో నిమిత్తం లేకుండా తాను నియోజకవర్గం మారే ప్రసక్తే లేదని తెగేసిచెప్పారు. ఏ పరిస్థితుల్లోనైనా తాను పోటీ చేసే నియోజకవర్గంలో మాత్రం ఎలాంటి మార్పూ ఉండదన్నారు. 2015 బిహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచి పలు అంశాలపై సిన్హా పార్టీ అగ్రనాయకత్వంతో విభేదిస్తున్న సంగతి తెలిసిందే. నోట్ల రద్దు, జీఎస్టీ సహా పలు నిర్ణయాలపై సిన్హా సొంత పార్టీని ఇరకాటంలో పెట్టే వ్యాఖ్యలు చేయడంతో పాటు ఈ ఏడాది జనవరిలో కోల్‌కతాలో జరిగిన బీజేపీ వ్యతిరేక ర్యాలీలో పాల్గొని స్టార్ స్పీకర్‌గా విపక్షాల ప్రశంసలు అందుకున్నారు.మరోవైపు తన భార్య పూనం సిన్హాను యూపీలోని లక్నో నుంచి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌పై పోటీకి నిలిపేందుకు శత్రుఘ్న సిన్హా యోచిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌తో ఇటీవల లక్నోలో సిన్హా భేటీని ఇందుకు సంకేతంగా చెబుతున్నారు. అయితే ఈ ప్రచారాన్ని ధ్రువీకరించని సిన్హా దీన్ని తోసిపుచ్చలేనని కూడా నర్మగర్భంగా వ్యాఖ్యానించడం విశేషం. కాగా రానున్న లోక్‌సభ ఎన్నికల్లో సిన్హా ఎస్పీ టికెట్‌పై పోటీలో ఉంటారని భావిస్తున్నారు. యూపీలో ఎస్పీ, బీఎస్పీ పొత్తుతో బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే. -
పాకిస్తాన్‌కు దీటుగా బదులిచ్చాం : అమిత్ షా
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో పాకిస్తాన్‌కు భారత్ గట్టిగా బుద్ధిచెప్పిందని బీజేపీ చీఫ్ అమిత్ షా అన్నారు. భారత్‌తో సంబంధాలపై ఇప్పుడు పాకిస్తాన్ తేల్చుకోవాల్సి ఉందని చెప్పుకొచ్చారు. ఇండియా టుడే కాంక్లేవ్ 2019లో శుక్రవారం అమిత్ షా మాట్లాడుతూ ఫిబ్రవరి 14న పుల్వామా ఉగ్రదాడితో భారత్, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయన్నారు. పాక్ భూభాగంలో ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసేందుకు భారత్ వైమానిక దాడులు చేపట్టిందని, మన దేశంలోకి చొచ్చుకువచ్చిన పాక్ యుద్ధవిమానాలను భారత్ సమర్ధంగా తిప్పికొట్టిందని అమిత్ షా పేర్కొన్నారు. పాక్ చెరలో ఉన్న వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ భారత్‌కు తిరిగి రానున్నారని చెప్పారు. సీబీఐని మోదీ ప్రభుత్వం దుర్వినియోగపరచలేదని అమిత్ షా చెప్పుకొచ్చారు. రాబర్ట్ వాద్రా, మాయావతిలపై కేసులు మోదీ ప్రభుత్వం హయాంలోనివి కాదని గుర్తుచేశారు. ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించడంపై వ్యాఖ్యానిస్తూ రాజకీయాల్లో ఆమె రాక నూతనంగా జరిగింది కాదని, ఆమె గత 12 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారని అమిత్ షా అన్నారు. పుల్వామా ఉగ్రదాడిని బీజేపీ రాజకీయాలకు వాడుకుంటోందన్న కాంగ్రెస్ విమర్శలను ఆయన తిప్పికొట్టారు. దేశంలో ఎమర్జెన్సీ విధించిన కాంగ్రెస్ పార్టీకి తమ సర్కార్ పనితీరును తప్పుపట్టే హక్కు లేదన్నారు. -
భారత సైన్యం మీద పూర్తి నమ్మకం ఉంది
-
భారత్ అన్నింటా ఒక్కటిగానే..
న్యూఢిల్లీ : భారత్ ఐకమత్యంతో స్థిరంగా ముందుకు సాగుతూ అభివృద్ధి సాధిస్తుందనీ, పోరాడి గెలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సైనిక బలగాల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడం ఎవరి వల్లా కాదని నిరూపించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. గురువారం ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ శ్రేణులతో మాట్లాడారు. ‘భారత్ ఆత్మ విశ్వాసంతో ఉంది. ఒక్కటిగా నిలుస్తుంది. అభివృద్ధి చెందుతుంది. ఐకమత్యంతో పోరాడి విజయం సాధిస్తుంది’అని అన్నారు. పాక్‌లోని ఉగ్ర శిబిరాలపై దాడుల అనంతరం ప్రజల్లో భావోద్వేగాలు మరింతగా పెరిగాయని పేర్కొన్న ప్రధాని.. మన జవాన్లు సరిహద్దులతోపాటు వెలుపల కూడా అసమాన ధైర్యాన్ని ప్రదర్శించారని, దేశం యావత్తూ వారి పక్షాన నిలుస్తుందని స్పష్టం చేశారు. సైనికుల త్యాగాలను బీజేపీ రాజకీయలబ్ధికి ఉపయోగించుకుంటోందంటూ ప్రతిపక్షాలు చేసి ఆరోపణలపై ఆయన స్పందించారు. ‘మన సైనికుల సామర్థ్యంపై నమ్మకం ఉంది. వారి మనోస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు గానీ, శత్రువు మన వైపు వేలెత్తి చూపే అవకాశం గానీ లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. ఉగ్రదాడుల ద్వారా అభివృద్ధిని అడ్డుకుని, దేశాన్ని అస్థిరం పరచడం శత్రువుకున్న లక్ష్యాల్లో ఒకటి’అని ఆయన తెలిపారు. అది అవినీతిమయ కూటమి ప్రతిపక్షాలతో ఏర్పడిన మహాకూటమిని ప్రధాని మోదీ పూర్తిగా అవినీతిమయ (మహా మిలావత్)కూటమిగా అభివర్ణించారు. ‘దేశాన్ని ఈ కూటమి ఇంటెన్సివ్ కేర్ యూనిట్(ఐసీయూ)లోకి పంపుతుంది. మునిగిపోతున్న కాంగ్రెస్‌ను రక్షించేందుకే ఈ కూటమి ఏర్పడింది. బీజేపీ విరోధులతో చేతులు కలిపేందుకు కాంగ్రెస్ ఎంతకైనా దిగజారుతుందనేందుకు ఈ కూటమి ఒక ఉదాహరణ. ఇది నూనె, నీటి కలయిక వంటిది. దీనివల్ల వారికి ఎటువంటి ఉపయోగమూ లేదు. ఒకరినొకరు చూసుకునేందుకు ఇష్టపడని నేతల కలయికతో ఏర్పడిన కూటమి అది’అని ఆయన వాఖ్యానించారు. 2004లో మాదిరిగా వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలైతే.. దేశంలో అభివృద్ధి కార్యక్రమాలకు అంతరాయం కలుగుతుందనీ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్థానంలో ఈజ్ ఆఫ్ కరెప్షన్(అవినీతి) వస్తుందని వ్యాఖ్యానించారు. 2014 ఎన్నికలు దేశ ప్రజల అవసరాలను తీర్చడం లక్ష్యం కాగా, ప్రజల ఆకాంక్షలే ఎజెండా 2019 సాధారణ ఎన్నికలు రానున్నాయని తెలిపారు. దక్షిణాదిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ గణనీయ ఫలితాలను సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయ గిమ్మక్కు కాదు.. అది నా సంస్కారం అలహాబాద్ కుంభమేళాలో తను పారిశుధ్య కార్మికుల పాదాలను కడగడం రాజకీయ ప్రయోజనం కోసం కాదని, అది తనకున్న సంస్కారమని ప్రధాని చెప్పారు. పుణేకు చెందిన ఒక కార్యకర్త అడిగిన ప్రశ్నకు ఆయన ఈ సమాధానం ఇచ్చారు. ‘యూపీలో జరుగుతున్న కుంభమేళాకు ఇటీవల వెళ్లాను. దాదాపు 22 కోట్ల మంది ప్రజలు సందర్శించుకున్న ప్రాంతమది. అయినప్పటికీ అక్కడ చాలా పరిశుభ్రంగా ఉంది. అక్కడ పనులు చేస్తున్న పారిశుధ్య కార్మికులదే ఈ గొప్ప తనమంతా. వాళ్లు నిజమైన కర్మయోగులు. అందుకే గౌరవభావంతో వారి కి కాళ్లు కడిగి కృతజ్ఞతలు తెలిపాను. ఇది తెలియని వారు రాజకీయ తమాషా అనుకున్నారు’అని తెలిపారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా అయినప్పుడు అధికార నివాసంలోకి గృహ ప్రవేశం ఎలా చేస్తారని అధికారులు నన్ను అడిగారు. నాలుగో తరగతి ప్రభు త్వ ఉద్యోగి ఒకరిని పిలిపించండి అని వారికి చెప్పా. ఒక దళిత ఉద్యోగిని వారు తీసుకువచ్చారు. అతని కుమార్తె చేతుల్లో కలశం ఉంచి గృహ ప్రవేశం చేయించా’అంటూ అప్ప టి అనుభవాన్ని వివరించారు. అప్పుడు బ్యాట్‌మెన్.. ఇప్పుడు బాహుబలి దేశం అభివృద్ధి బాటన సాగుతున్న ఈ సమయంలో ఎవరికి వారు తాము మరింత చురుకుగా ఉండాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ‘ఇది వరకు భారత్ అంటే పేదరికం. కానీ, ఇప్పుడు పెట్టుబడులకు స్వర్గధామం. పూర్వం భారత్ అంటే పాములను ఆడించే వారి దేశం. నేడు శాస్త్ర– సాంకేతిక రంగాలకు, ఉపగ్రహాలు, శాటిలైట్లకు పేరుగాంచింది. ఇదివరకు దేశంలో విద్యుత్తు కొరతతో చీకటి తాండవించేది. కానీ, భారత్ అంటే ఇప్పుడు ఎల్ఈడీ విప్లవం. ఇప్పటిదాకా బ్యాట్‌మెన్‌ను ప్రపంచం హీరోగా భావించేది. ఇప్పుడు బాహుబలి అంటే ఎవరో ప్రపంచానికి తెలిసింది’అని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ రికార్డు రానున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో గురువారం ప్రధా ని మోదీ ‘మేరా బూత్ సబ్ సే మజ్బూత్’కార్యక్రమంలో భాగంగా ’దేశవ్యాప్తం గా 15వేల ప్రాంతాల్లోని కోటి మంది బీజేపీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ప్రముఖులనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. నమో యాప్ ద్వారా జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్స్ ప్రపంచంలోనే అతి పెద్దదని బీజేపీ మీడియా విభా గం అధిపతి అనిల్ బలూనీ ఒక ప్రకటనలో తెలి పారు. దాదాపు 85 నిమిషాల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో పాక్ సైన్యానికి చిక్కిన వింగ్ కమాండర్ అభినందన్ గురించి మాత్రం ప్రధాని ఎక్కడా ప్రస్తావించకపోవ డం గమనార్హం. -
‘సీ టర్న్, జెడ్ టర్న్ కూడా తీసుకుంటాను’
ముంబై: ప్రతిపక్షాలను అధికారానికి దూరంగా ఉంచడం కోసమే తమ పార్టీ తిరిగి బీజేపీతో పొత్తు పెట్టుకుందని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసి పోటీ చేయనున్నట్టు ఇటీవల ఇరుపార్టీల నేతలు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే గత కొంతకాలంగా బీజేపీపై పలు ఆరోపణలు చేసిన శివసేన తిరిగి బీజేపీతో జత కట్టడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం శివసేన అనుబంధ సంస్థ స్థానీయ లోకాధికార్ సమితి(ఎస్ఎల్ఎస్) నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఉద్దవ్ పార్టీ శ్రేణులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నేను యూ టర్న్ తీసుకున్నానని.. బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో శివసేన కార్యకర్తలు తీవ్ర నిరాశలో ఉన్నారనే కథనాలు వస్తున్నాయి. పార్టీపై వస్తున్న ఆ విమర్శలను పట్టించుకోవద్దు. నేను పార్టీ సైనికులు సహకారంతో శివసేనను నడుపుతున్నాను. అవసరమైతే నేను సీ టర్న్, జెడ్ టర్న్ కూడా తీసుకుంటాను. ఒంటరిగా పోటీ చేస్తే మన పార్టీ విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఏ రాజకీయ పార్టీ కూడా ఒంటరిగా ఎన్నికల బరిలో నిలవడానికి సిద్దంగా లేదు. దేశంలోని అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఒకవేళ మనం ఒంటరిగా పోటీ చేస్తే విజయం సాధించినప్పటికీ.. హంగ్ ఏర్పడే అవకాశం ఉంటుంది. మనం బీజేపీతో 25 ఏళ్ల నుంచి కలిసి ప్రయాణిస్తున్నాం. గత ఐదేళ్ల నుంచి ఇరు పార్టీల మధ్య సమస్యలు తలెత్తాయి. అయితే దేశ ప్రజలు కాంగ్రెస్‌కు 50 ఏళ్లు అధికారం ఇచ్చారు. ఇప్పుడు బీజేపీకి మరో ఐదేళ్లు అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒకవేళ కేంద్రంలో కాంగ్రెస్ అధికారం చేపడితే.. చాలా అంశాలతో పాటు హిందుత్వం కూడా వెనుకబడిపోతుంద’ని తెలిపారు. కాగా, గత నెలలో ఎస్ఎల్ఎస్ సమావేశంలో ప్రసగించిన ఉద్దవ్.. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉండాలని శ్రేణులకు పిలుపునివ్వడం గమనార్హం. ఇంకా ఈ కార్యక్రమంలో మంగళవారం భారత వైమానిక దళం అధికారులు జరిపిన మెరుపు దాడులకు ఉద్ధవ్ సెల్యూట్ చేశారు. సైనికుల త్యాగాలను రాజకీయం చేయకూడదన్నారు. పాక్ చెరలో చిక్కుకున్న ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ పరిస్థితిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. -
పోరాట యోధుడి ప్రతిఫలం
‘నువ్వెక్కాల్సిన రైలు జీవితకాలం లేటు’.. రైళ్ల సమయపాలన విషయంలో ఎప్పటినుంచో ఉన్న నానుడి ఇది. యాధృచ్ఛికమే గానీ.. విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు విషయంలో ఈ నానుడి నిజమైంది. విశాఖతోపాటు ఉత్తరాంధ్రవాసుల దశాబ్దాల కల ఈడేరింది. సుదీర్ఘ పోరాటాలు ఫలించాయి. ప్రత్యేక రైల్వేజోన్ ఏర్పాటు ఎట్టకేలకు సాకారమైంది. మొదట కోల్‌కతా కేంద్రంగా ఉన్న ఆగ్నేయ రైల్వేలోనూ.. అనంతరం భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పుకోస్తా రైల్వే జోన్‌లోనూ వాల్తేర్ డివిజన్‌కు జరుగుతున్న అన్యాయాలతో విసిగివేసారిన ఉత్తరాంధ్ర ప్రజలు దశాబ్దాలనాడే విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ డిమాండ్‌తో గళమెత్తారు. కీలకమైన రైల్వే ప్రాజెక్టులు పశ్చిమ బెంగాల్, ఒడిశా ప్రాంతాలకు తరలించుకుపోవడం.. రైలు సర్వీసులను పొడిగించుకొని వాల్తేర్ సీట్ల కోటాకు ఎసరుపెట్టడం.. కొత్త కోచ్‌లు, ఇంజిన్లు తమ ప్రాంతాల్లో అట్టిపెట్టుకొని, వాల్తేర్‌కు పాతవి అంటగట్టడం.. వంటి వివక్షపూరిత చర్యలు ప్రత్యేక జోన్ వాదనను పదునెక్కించాయి..ఇక రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పరీక్షలకు వెళ్లే ఆంధ్ర నిరుద్యోగులను అక్కడి కేంద్రాల్లో పరీక్షలు రాయకుండా అడ్డుకోవడం, కొట్టడం వంటి సంఘటనలు.. జోన్ ఉద్యమాన్ని ఉడుకెక్కించాయి. ప్రత్యేక జోన్ ఏర్పాటుకు అప్పుడప్పుడూ కొన్ని ప్రయత్నాలు జరిగినా.. మన ప్రజాప్రతినిధుల మెతకదనం, అప్పటి ఆగ్నేయ, ప్రస్తుత తూర్పుకోస్తా రైల్వేలకు ఆదాయపరంగా బంగారు బాతులా ఉన్న వాల్తేర్ డివిజన్‌ను వదులుకోవడం ఇష్టంలేక ఆ రాష్ట్రాలు మోకాలడ్డటం.. వంటి చర్యలు రైల్వేజోన్ ఏర్పాటు ప్రక్రియకు ఎప్పటికప్పుడు రెడ్ సిగ్నల్ వేశాయి. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా రూపొందించిన విభజన చట్టంలో విశాఖ రైల్వేజోన్ ఇస్తామని అప్పటి ప్రభుత్వం హామీ ఇచ్చినా.. సాంకేతిక ఇతరత్రా సాకులతో ఎప్పటికప్పుడు దాటవేస్తుండటాన్ని నిరసిస్తూ.. రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఉద్యమించారు.. ఆ తర్వాత దాన్ని అందిపుచ్చుకున్న ఆ పార్టీ నేతలు ఎంపీ విజయసాయిరెడ్డి, గుడివాడ అమర్నాథ్లు కూడా పాదయాత్రలు, నిరవధిక దీక్షలతో రైల్వేజోన్ డిమాండ్‌ను ఎలుగెత్తిచాటారు. ఎట్టకేలకు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. కేంద్రం పచ్చజెండా ఊపడంతో ఆలస్యంగానైనా విశాఖ రైల్వేజోన్ పట్టాలెక్కింది. విశాఖసిటీ: నాటి స్వాతంత్య్రోద్యమం నుంచి.. మొన్నటి విశాఖ ఉక్కు సంకల్పం.. నిన్నటి జై ఆంధ్ర.. సమైక్యాంధ్ర పోరాటాలు.. వీటన్నింటికీ నాయకత్వం వహించిన వారు స్వాతంత్య్ర యోధులు, మేధావులు వంటి మహోన్నతులు. అదే స్ఫూర్తి.. అదే ఉక్కు సంకల్పం.. నేటి రైల్వేజోన్, ప్రత్యేక హోదా ఉద్యమానికి దారి చూపిన జాజ్వల్యమైన దీప్తి..కానీ.. ఈ ఉద్యమాన్ని నడిపించింది.. నడిపిస్తున్నది మాత్రం ఒకే ఒక్కడు. మడమతిప్పని యోధుడు.రెండు ప్రధాన డిమాండ్లతో అతడే సైన్యమై జోన్ కోసం పోరాటం చేస్తూ.. రాష్ట్ర ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలిస్తూ.. విజయం వైపు నడిపించిన ధీరుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు పెంచుకున్న ఆశలు రెండింటిపైనే.. ఒకటి ప్రత్యేక హోదా.. రెండోది విశాఖ రైల్వేజోన్. విభజన హామీలు సాధించే విషయంలో అధికార పార్టీ గుంభనంగా వ్యవహరించడంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చిన మాట నెరవేర్చకుండా కాలయాపన చేసింది. ఏడాది గడిచినా రాష్ట్రానికి ఏమీ విదిల్చకపోవడం.. రాష్ట్ర ప్రభుత్వం కూడా నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిచడంతో.. ఉద్యమ భారాన్ని తన భుజస్కందాలపై వేసుకొని మొదటి అడుగు వేశారు ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి. హోదాతో పాటు రైల్వో జోన్ సాధించే పోరుకు శంఖారావం పూరించారు. ఆయన వేసిన అడుగు.. ప్రభంజనమైంది. సామాన్యులు, ప్రజా సంఘాలు, ఇతర రాజకీయ పార్టీల్లో చైతన్యం నింపింది. జోన్ ఆవశ్యకత, హోదా వస్తే లాభాల గురించి ఏపీలోని ప్రతి పౌరుడూ తెలుసుకునే విధంగా చైతన్యవంతం చేసిన జగన్మోహన్రెడ్డి ఉద్యమాన్ని ఉద్ధృతం చేశారు. పార్లమెంట్ లోపలా, బయటా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తూ పోరాటాలు సాగించారు. ఆయన స్ఫూర్తితో వాడవాడలా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. విద్యార్థి, ఉద్యోగ, ప్రజా సంఘాలు, రాజకీయ, రాజకీయేతర నేతలు.. ఇలా అందరూ.. జగన్ పోరాటంతో స్ఫూర్తి పొందుతూ.. జోన్ కోసం అనేక ఉద్యమాలు చేశారు. అధినేత జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా జోన్ కోసం దీక్షలు, ధర్నాలు, రాస్తారోకోలు.. ఇలా ప్రతి పోరాటం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చారు. జగన్ స్ఫూర్తితో సాగిన ఐదేళ్ల పోరాటానికి ప్రతిఫలం దక్కింది. ఉత్తరాంధ్ర వాసులు ఎన్నాళ్ల నుంచో ఆశగా ఎదురు చూస్తున్న విశాఖ రైల్వేజోన్ కల సాకారమైంది. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి పీయూష్‌గోయల్ బుధవారం రాత్రి ప్రకటించారు. ఇది ప్రజా విజయం.. ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తూ.. రైల్వేజోన్ సాధనలో కీలక పాత్ర పోషించిన వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ విజయం. జోన్ కోసం ‘విజయ’ యాత్ర స్థానికంగా పేరుకుపోయిన సమస్యలు తీరడంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక నిరాశలో కుంగిపోయిన యువతకు ధైర్యం చెబుతూ.. జోన్ సాధనే లక్ష్యంగా పాదయాత్ర చేసిన వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి జోన్ సాధనలో కీలక పాత్ర పోషించారు. ఏడు నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తూ.. ప్రతి ఒక్కరిలో జోన్ గురించి చైతన్యపరచడంలో ఆయన ముఖ్య భూమిక పోషించారు. జోన్ విషయంలో వెనకడుగు వేసేది లేదని స్పష్టం చేస్తూ.. చేపట్టిన రాస్తారోకోలు, ర్యాలీలు, ధర్నాల్లో పాల్గొన్నారు. రాజ్యసభలో జోన్ ప్రస్తావనను పదే పదే తీసుకొస్తూ... కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు. విశాఖ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే.. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ రావాల్సిందేనంటూ పదే పదే ప్రధానమంత్రి, కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లేలా పార్లమెంట్లో ఉద్యమించిన విజయసాయిరెడ్డి.. జోన్ ప్రకటనపై హర్షం వ్యక్తం చేశారు. జగనన్న బాటలో అమర్ వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనలతో ఆయన మార్గదర్శకత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన ప్రస్తుత అనకాపల్లి సమన్వయకర్త గుడివాడ అమర్నాథ్.. రైల్వేజోన్ కోసం సుదీర్ఘ పోరాటం చేశారు. అలుపెరగని ధీరుడు సంకల్పాన్ని స్ఫూర్తిగా తీసుకొని.. నెల రోజుల్లో జోన్ ప్రకటించకుంటే ఆమరణ దీక్ష చేస్తానని అల్టిమేటం జారీ చేశారు. కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో 2016 ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆమరణ దీక్ష చేపట్టారు. ఐదురోజుల పాటు దీక్ష సాగిన నేపథ్యంలో ఏప్రిల్ 18న వైఎస్ జగన్మోహన్రెడ్డి దీక్షకు హాజరయ్యారు. జోన్‌పై పోరాటం ఉద్ధృతం చేసేందుకు అన్ని వర్గాలతో కలిసికట్టుగా పోరాటం చెయాల్సిన అవసరం ఉందంటూ జగన్మోహన్రెడ్డే స్వయంగా నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. అప్పటి నుంచి రైల్ రోకోలు, రాస్తారోకోలు, జాతీయ రహదారుల దిగ్బంధనాలు, ధర్నాలు, సమ్మెలు నిర్వహించిన అమర్నాథ్.. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. 2017 మార్చి 30 నుంచి ఏప్రిల్ 9 వరకూ 200 పై చిలుకు కిమీ పాదయాత్ర చేస్తూ.. రైల్వేజోన్ వస్తే.. ఎలాంటి ఉపయోగం ఉంటుంది, యువతకు ఎలా ఉపాధి అవకాశాలు వస్తాయి. విశాఖతో పాటు ఇతర ప్రాంతాలు ఎలా అభివృద్ధి అవుతాయనే అంశాలపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి.. జోన్ సాధనలో కీలక పాత్ర పోషించారు. -
సమాజాభివృద్ధిలో ఎన్జీవోల పాత్ర కీలకం
సాక్షి, హైదరాబాద్: సమాజాభివృద్ధిలో ఎన్జీవోల పాత్ర చాలా కీలకమైందని, మహిళల హక్కులు, అత్యాచారాలు లాంటి పలు అంశాలపై ఎన్జీవోలు పోరాడుతున్నారని బీజేపీ మహిళా జాతీయ మోర్చా అధ్యక్షురాలు విజయ రహత్కర్ అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన ‘ఎన్జీవోస్ మీట్’ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉగ్రమూకలకు మోదీ వాళ్ల భాషలోనే సరైన సమాధానం చెప్పారన్నారు. ఎన్జీవోలు ఇచ్చే సలహాలను మోదీ దృష్టికి తీసుకెళ్తామన్నారు. మోదీ తప్ప దేశానికి మరో ప్రత్యామ్నాయం లేదన్నారు. మహిళల అభివృ ద్ధి, సంక్షేమం కోసం ప్రధాని మోదీ అనేక పథకాలను చేపట్టి సమర్థంగా అమలు చేస్తున్నారని చెప్పారు. మహిళా పక్షపాతి మోదీ జాతీయవాద ఆలోచనలున్న వారందరూ బీజేపీలోకి రావాలని, ఎన్జీవోస్ నిస్వార్థంగా సేవ చేస్తూనే రాజకీయంగా రాణించాల్సిన అవసరం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పేర్కొన్నారు. మోదీ మహిళా పక్షపాతి అని, రక్షణ శాఖ మంత్రి సహా పలు కీలక పదవులు మహిళలకు కేటాయించడమే ఇందుకు నిదర్శనమని కొనియాడారు. ఎన్జీవోలు చాలా మంచి పనులు చేస్తాయన్నారు. దేశం మొత్తం మీద కమలం వికసిస్తోందని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ ని గెలిపించాలని పిలుపునిచ్చారు. పాక్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడుతున్నా మన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి సర్జికల్ స్ట్రైక్ లు, మెరుపు దాడులను చేస్తూ ఉగ్రవాదులను తుదముట్టించే విధంగా మోదీ ప్రభుత్వం శ్రమిస్తోందన్నారు. సమాజ మార్పునకు ఎన్జీవోలు ప్రభుత్వంతో పాటు ఎన్జీవోలు సమాజ మార్పునకు కృషి చేస్తున్నారని ఎంపీ దత్తాత్రేయ అన్నారు. కమర్షియల్‌గా కాకుండా పనిచేసే ఎన్జీవోలకు మోదీ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. అందరమూ కలసి మరోసారి మోదీని ప్రధాని చేయాలని కోరారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యకురాలు ఆకుల విజయ పాల్గొన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం మానుకోవాలి: లక్ష్మణ్ భారత వైమానిక దళం పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేయడాన్ని దేశ ప్రజలు స్వాగతిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం పాకిస్తాన్ ఇకనైనా మానుకోవాలని పేర్కొన్నారు. ఇది ఒక దేశంపైనో, ప్రాంతంపైనో దాడి కాదని, దీనిని ప్రతీకార చర్యగా కాకుండా ఉగ్రవాదాన్ని అణిచివేసే చర్యగానే చూడాలని తెలిపారు. దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి భారత సేనలు జైషే మహ్మద్ లాంటి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాయని వెల్లడించారు. -
జగన్‌తో సినీ నటుల భేటీ దురదృష్టకరం
సాక్షి, అమరావతి: జగన్‌తో సినీనటులు సమావేశమవడం దురదృష్టకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇలాంటి సమావేశాల వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయన్నారు. సినీ ప్రముఖుడు నాగార్జున మంగళవారం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ను కలిసిన నేపథ్యంలో చంద్రబాబు బుధవారం టీడీపీ నాయకులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధికి అందరూ అండగా ఉండాలన్నారు. హైదరాబాద్‌లో ఆస్తులను చూపించి బెదిరింపులు చేయడం వల్లే టీడీపీకి కొందరు దూరం అవుతున్నారని, ఆస్తులు కాపాడుకునేందుకే వైఎస్సార్సీపీలో చేరుతున్నారని విమర్శించారు. అభ్యర్థుల ఎంపికను ప్రజాభిప్రాయం ప్రకారం చేస్తామని తెలిపారు. ప్రత్యక్ష ఎన్నికల్లో కొందరికి అవకాశం రాదని, అలాంటి వారికి నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ రూ. 10 వేలు పెంచామని, ప్రైవేటు పాఠశాలలకు పలు రాయితీలు ఇచ్చామని చెప్పారు. ప్రభుత్వ లబ్ధి పొందిన వారంతా టీడీపీ వెంటే ఉంటారని చెప్పారు. వైఎస్సార్సీపీ తప్పుడు సర్వేలు చేస్తోందని, ఇతరులు సర్వే చేస్తే అడ్డుంకులు పెడుతోందని విమర్శించారు. రాష్ట్రానికి ద్రోహం జరిగి సరిగ్గా ఐదేళ్లయిందని, నమ్మక ద్రోహానికి ఐదవ వార్షిక నిరసనలు జరపాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక హాదాతో సహా మిగిలిన ఐదు హామీలను గాలికి వదిలేశారని, పారిశ్రామిక రాయితీలు ఇవ్వలేదని చెప్పారు. మమత వ్యాఖ్యలతో చర్చ జరుగుతోంది... స్వార్థంతో దేశ భద్రతను ఫణంగా పెడితే సహించేది లేదని, రాజకీయ లాభాల కోసం సైన్యంతో ఆటలాడితే సహించమని చెప్పారు. పుల్వామా దాడిపై ప్రజల్లో అనుమానాలున్నాయని,పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలతో దేశంలో చర్చ జరుగుతోందని తెలిపారు. పాకిస్తాన్ ప్రధాని వ్యాఖ్యలపై అనేక అనుమానాలున్నాయని, పాలకుల అసమర్థతతో దేశ భద్రతకు ప్రమాదం ఏర్పడిందన్నారు. ప్రజల్లో బీజేపీ పూర్తిగా పలుచనైందని, అందుకే చిన్నాచితకా పార్టీలతో పొత్తుల కోసం ఆరాటపడుతోందని విమర్శించారు. అధికారం కోసం బీజేపీ దేనికైనా దిగజారుతుందన్నారు. -
ఎమ్మెల్యే కారు ఢీకొని ఇద్దరు దుర్మరణం
తుమకూరు: రోడ్డు పక్కన నిలబడి ఉన్న వ్యక్తులను చిక్కమగళూరు బీజేపీ ఎమ్మెల్యే సీటీ రవి ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందిన ఘటన సోమవారం అర్ధరాత్రి జిల్లాలోని కుణిగల్ సమీపంలోని ఉర్కేనహళ్లి గ్రామ శివార్లలోని జాతీయ రహదానిపై చోటు చేసుకుంది. కనకపురలోని సూరేన హళ్లి గ్రామానికి చెందిన శశికుమార్ (28), సునీల్‌గౌడ (27)లు స్నేహితులు మునిరాజు, జయచంద్ర, పునీత్, మంజునాథ్‌లతో కలసి కొల్లూరు, శృంగేరి, ధర్మస్థల పర్యటనకు వెళ్లి తిరిగి కార్లలో గ్రామానికి పయనమయ్యారు. మార్గంమధ్యలో ఉర్కేనహళ్లి శివార్లలోని జాతీయ రహదారిపై కాలకృత్యాల తీర్చుకోవడానికి వాహనాలు రోడ్డుపక్కన నిలిపారు. అదే సమయంలో చిక్కమళూరు నుంచి బెంగళూరు వైపు వెళుతున్న ఎమ్మెల్యే సీటీ రవి ప్రయాణిస్తున్న కారు వెనుకవైపు నుంచి రోడ్డుపక్కన నిలిపి ఉంచిన కార్లను ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా కార్లపక్కన ఉన్న వ్యక్తులపై దూసుకెళ్లింది. ఘటనలో శశికుమార్, సునీల్గౌడలు అక్కడిక్కడే మృతి చెందగా మునిరాజు, జయచంద్ర, పునీత్, మంజునాథ్‌లు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనలో ఎమ్మెల్యే రవితో పాటు కారు డ్రైవర్ ఆకాశ్, గన్‌మెన్ రాజు నాయక్‌లు కూడా గాయపడ్డారు. స్థానికులు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న కుణిగల్ పోలీసులు శశికుమార్, సునీల్‌ల మృతదేహాలను కుణిగల్ ఆసుపత్రికి తరలించి గాయపడ్డ నలుగురు యువకులను బెంగళూరు ఆసుపత్రిలో చేర్పించారు. ఘటన జరిగిన అనంతరం ఎమ్మెల్యే ఏమైందని కూడా అడగకుండానే మరొక కారులో బెంగళూరుకు వెళ్లిపోయారంటూ గాయపడ్డ యువకులు ఆరోపించారు. విషయం తెలుసుకొని కుణిగల్ ఆసుపత్రికి చేరుకున్న మృతుల కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే రవి ఆసుపత్రికి రావాలంటూ ఆసుపత్రి ఎదుట ధర్నా చేశారు. ఎమ్మెల్యే రవి ఇక్కడికి వచ్చే వరకు నిరసన విరమించమంటూ ఆసుపత్రి ఎదుట బైఠాయించారు. కుణిగల్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
జవాన్ అంతిమయాత్రలో ఎంపీ అభ్యంతరకర ప్రవర్తన
సాక్షి, న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన సీఆర్పీఎఫ్ జవాన్ అజిత్ కుమార్ అంతిమ యాత్ర సందర్భంగా బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ వ్యవహార శైలి వివాదాస్పదమైంది. ఉగ్రవాదుల దాడిలో నేలకొరిగిన అజిత్ కుమార్‌కు కడసారి నివాళులు అర్పించేందుకు భారీ సంఖ్యలో ప్రజలు ఉన్నావ్‌కు తరలిరాగా జవాన్ భౌతికకాయం ఉంచిన వాహనంపై స్ధానిక ఎంపీ సాక్షి మహరాజ్ వారందరికీ నవ్వుతూ అభివాదం తెలపడం పట్ల విమర్శలు వెల్లువెత్తాయి. ఆయన తీరును సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా ఎండగట్టారు. కాగా, జవాన్ అంతిమయాత్రలో సాక్షి మహరాజ్ అభ్యంతరకర ప్రవర్తనతో కూడిన వీడియో, ఫోటోలను మరికొందరు పోస్ట్ చేశారు. బీజేపీ ఎంపీ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. బీజేపీ ఎంపీ తీరును నిరసిస్తూ కాంగ్రెస్ ప్రతినిధి ప్రియాంక చతుర్వేది ట్వీట్ చేశారు. సాక్షి మహరాజ్ జవాన్ అంతిమ యాత్రను అభినందన యాత్రగా పీలవుతున్నారని ఓ నెటిజన్ వ్యంగ్యాస్త్ర సంధించగా, బీజేపీ ఎంపీ చర్య సిగ్గుచేటని మరో యూజర్ మండిపడ్డారు. -
‘మోదీ వర్సెస్ రాహుల్’
సాక్షి, హైదరాబాద్: రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఢీ కొట్టడం, ప్రధాని నరేంద్ర మోదీని గద్దె దించడమే లక్ష్యంగా ముందుకు పోవాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. ఈ ఎన్నికలు పూర్తిగా ప్రధాని మోదీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మధ్యే ఉంటాయన్న భావనను ప్రజల్లోకి బలం గా తీసుకెళ్లేవిధంగా వ్యూహం సిద్ధం చేసింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలకు వివరించి మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవాలని నేతలకు దిశానిర్దేశం చేసింది. పార్లమెంట్ ఎన్నికలపై కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా శుక్రవారం ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్, జహీరాబాద్, వరంగల్ లోక్‌సభ స్థానాలపై విడతలవారీగా గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు హోటల్లో సమీక్షలు జరిపింది. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా, కార్యదర్శి శ్రీనివాస కృష్ణన్, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతోపాటు ఆయా నియోజకవర్గాల ముఖ్యనేతలు ఈ భేటీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో గెలుపునకు అనుసరించాల్సిన వ్యూహం, నేతల మధ్య సమన్వయం, అభ్యర్థుల ఎంపిక పార్టీ మేనిఫెస్టో తదితరాలపై చర్చించారు. పార్లమెంటు ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీల మధ్యే ఉంటుందని, కాంగ్రెస్‌ను గెలిపించి రాహుల్‌గాంధీని ప్రధానిగా చేయడం కోసం అందరూ కలసికట్టుగా పనిచేయాలని నేతలు సూచించారు. ఎన్నికల హామీలను అమ లు చేయడంలో మోదీ విఫలమయ్యారని, మతపరమైన రాజకీయాలతో మైనార్టీలను భయపెడుతున్నారనే విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. మైనార్టీలను అభద్రతాభావంలోకి నెట్టి వేస్తున్న తీరును, నోట్ల రద్దు, జీఎస్టీతో ప్రజలపై పడిన, పడుతున్న భారాన్ని వివరించాలన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే 2 కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పిన మోదీ 2 లక్షలు కూడా కల్పించలేదని, దీనిపై యువత లో అవగాహన కల్పించాలన్నారు. రాహుల్ ప్రధాని అయితే రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీ లు నెరవేర్చలేదనే విషయాలు ప్రచారం చేయా లన్నారు. డీసీసీలు, ముఖ్యనేతలు కలసి పార్లమెంట్ స్థానాలకు ముగ్గురేసి ఆశావహుల పేర్ల ను పంపాలని, అందులో ఒకరిని అభ్యర్థిగా హైకమాండ్ ప్రకటిస్తుందని కుంతియా తెలి పారు. ఈ నెల 25 లోపు అధిష్టానానికి అభ్యర్థుల జాబితా పంపిస్తామని, నెలాఖరుకు అభ్యర్థుల ప్రకటన ఉంటుందని వెల్లడించారు. రాహుల్‌ను ప్రధాని చేయడమే లక్ష్యం కావాలి: ఉత్తమ్ బీజేపీ ప్రభుత్వం మత ప్రాతిపదికన విభజన రాజకీయాలు చేస్తోందని ఉత్తమ్ విమర్శించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీల మధ్య పోటీ ఉంటుందని, దేశమంతా రాహుల్‌ను ప్రధానిని చేయాలని ఎదురుచూస్తోందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి అనేక కారణాలున్నాయని, అయితే, పార్లమెంట్ ఎన్నికలు భిన్నంగా ఉంటాయని తెలిపారు. రాహుల్, మోదీ మధ్యే పోరు ఉంటుందని, నేతలంతా రాహుల్‌ను ప్రధానిని చేయడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. భారత సైనికులపై ఉగ్రమూకల దాడిని ఉత్తమ్ ఖండించారు. -
కలకలం; బీజేపీ నాయకుడి కూతురు కిడ్నాప్!
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్లో బీజేపీ నాయకుడి కూతురు కిడ్నాప్ అవడం కలకలం రేపుతోంది. ఇంట్లోకి చొరబడిన గుర్తు తెలియని దుండగులు ఆమెను అపహరించడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వివరాలు.... లబ్ధ్పూర్కు చెందిన సుప్రభాత్ బత్యబయాల్ గురువారం రాత్రి ఓ సమావేశం నిమిత్తం బయటికి వెళ్లారు. ఆ సమయంలో ఆయన కూతురితో పాటు సుప్రభాత్ సోదరుడు మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఈ క్రమంలో ఇంట్లోకి వచ్చిన ఐదుగురు ఆగంతకులు సుప్రభాత్ కూతురిని కిడ్నాప్ చేశారు. ఈ విషయం గురించి సుప్రభాత్ సోదరుడు మాట్లాడుతూ... ‘ ఐదుగురు వ్యక్తులు వచ్చారు. మొదట మమ్మల్ని ఇంట్లో బంధించి తాళం వేశారు. ఆ తర్వాత కాసేపటికి ఇంట్లో చొరబడి తుపాకీతో బెదిరించి నా సోదరుడి కూతురిని లాక్కెళ్లారు. కార్లో ఎక్కించుకుని పరారయ్యారు’ అని పేర్కొన్నారు. కాగా ఐదు నెలల క్రితమే సుప్రభాత్ అధికార తృణమూల్ కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. ఈ నేపథ్యంలో ఆయన కూతురు కిడ్నాప్ అవడంతో లబ్ధ్పూర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన స్థానికులు పోలీసు స్టేషను ఎదుట నిరసనకు దిగారు. ఇక ఈ విషయంలో రాజకీయ నాయకుల ప్రమేయం లేదని భావిస్తున్నట్లు బీర్భూమ్ జిల్లా ఎస్పీ శ్యామ్ సింగ్ తెలిపారు. అలా అని ఈ విషయాన్ని పూర్తిగా కొట్టి పారేయలేమని పేర్కొన్నారు. త్వరలోనే బాధితురాలి ఆచూకీ కనుగొంటామని హామీ ఇవ్వడంతో పరిస్థితి కుదుటపడింది. -
బీజేపీ ఎమ్మెల్యేను చితకబాదిన తల్లి, భార్య
-
బీజేపీ ఎమ్మెల్యేను చితకబాదిన తల్లి, భార్య
సాక్షి, ముంబై : బీజేపీ ఎమ్మెల్యే రాజు నారాయణ తోడ్సమ్‌కు చేదు అనుభవం ఎదురైంది. రెండో భార్యతో కలిసి ఉంటూ తనను నిర్లక్ష్యం చేస్తున్న కారణంగా రాజు నారాయణ మొదటి భార్యతో తల్లి కూడా రోడ్డుపైనే ఆయనను చితకబాదారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలేం జరిగిందంటే.. మహారాష్ట్రలోని ఆర్ని(ఎస్టీ)నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న రాజు నారాయణ తన రెండో భార్య ప్రియాతో కలిసి మంగళవారం 42వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకొన్నారు. అనంతరం ఓ క్రీడా కార్యక్రమాన్ని ప్రారంభించి ఇంటికి తిరిగి వెళ్లేందుకు పయనమయ్యారు. ఈ క్రమంలో నారాయణ తల్లి, ఆయన మొదటి భార్య అర్చన అక్కడికి చేరుకున్నారు. వారిని వాహనాన్ని అడ్డగించి ప్రియాను కిందకి లాగి ఆమెపై దాడి చేశారు. చెంప దెబ్బలు కొడుతూ, తన్నుతూ ఆమెపై పిడిగుద్దులు కురిపించారు. దీంతో ప్రియాను కాపాడేందుకు వాళ్లకు అడ్డుపడిన రాజు నారాయణను కూడా చితకబాదారు. వీరికి అక్కడ ఉన్న స్థానికులు కూడా మద్దతుగా నిలిచారు. ప్రధానికి ఫిర్యాదు చేస్తాం ఈ ఘటనపై స్పందించిన రైతు నాయకుడు కిషోర్ తివారీ మాట్లాడుతూ.. ‘ ఓ ప్రజాప్రతినిధి ఇలా సిగ్గులేకుండా మరో మహిళతో ఉంటూ తన భార్యకు అన్యాయం చేస్తున్నారు. ఆయన ఎనిమిదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న అర్చనకు, ఆమె ఇద్దరు పిల్లలకు 48 గంటల్లోగా న్యాయం చేయాలి. లేనిపక్షంలో శనివారం ఇక్కడి రానున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేస్తాం అని పేర్కొన్నారు. ఇక బీజేపీ ట్రైబల్ వింగ్ చీఫ్ అంకిత్ మాట్లాడుతూ రాజు నారాయణ తన మొదటి భార్యకు న్యాయం చేయకపోతే ప్రధాని మోదీ, సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌తో వేదిక పంచుకోనివ్వమని పేర్కొన్నారు. అదేవిధంగా మహిళా వ్యతిరేకత మూటగట్టుకుంటే రాజు నారాయణ వచ్చే ఎన్నికల్లో టికెట్ కూడా పొందలేరని వ్యాఖ్యానించారు. కాగా ఈ ఘటనకు సంబంధించి ఎటువంటి కేసు నమోదు కాలేదు. ఈ విషయం గురించి పోలీసు అధికారి డీఎస్ తెంబరే మాట్లాడుతూ.. ఘటన జరిగిన తర్వాత ఇరువర్గాలు పోలీసు స్టేషనుకు వచ్చాయని, సామరస్యంగా సమస్య పరిష్కరించుకుంటామని చెప్పడంతో కేసు నమోదు చేయలేదని తెలిపారు. -
బీజేపీదే విజయం
సాక్షి, హైదరాబాద్: రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని, నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని కావడం ఖాయమని బీజేపీ జాతీయ సంఘటన ప్రధాన కార్యదర్శి రామ్‌లాల్ ధీమా వ్యక్తం చేశారు. మేరా పరివార్ భాజపా పరివార్ (మా కుటుంబం – బీజేపీ కుటుంబం) కార్యక్రమాన్ని పురస్కరించుకొని బీజేపీ రాష్ట్ర కార్యాల యంపై బీజేపీ జెండాను రామ్‌లాల్ ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికలు ప్రాంతీయ ఎన్నికలు కావని, ప్రాంతీయ నాయకులు ప్రధానమంత్రి కాలేరని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశ ప్రధాని ఎవరు అనే అంశంపైనే ఎన్నికలు జరుగబోతున్నాయన్నారు. అన్ని సర్వేలు కూడా మోదీనే ఘన విజయం సాధిస్తారని తెలియజేస్తున్నాయన్నారు. ప్రధాని మోదీ ఐదేళ్ల పనితీరుపై ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను దేశవ్యాప్తంగా చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారన్నారు. కార్మికులు, కర్షకులు, మహిళలు, చేతివృత్తుల వారి సంక్షేమానికి మోదీ ప్రభుత్వం పెద్దపీట వేసిందని, దేశాన్ని ప్రపంచంలో అందరూ గర్వించే స్థాయికి తీసుకెళ్లిన ఘనత మోదీదేనన్నారు. ఆ నాయకులకు భయం పట్టుకుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివృద్ధి పనులతో కొన్ని పార్టీలకు, కొంతమంది నాయకులకు భయం పట్టుకుందని, అందుకే ఆయనని, బీజేపీని దూషిస్తున్నారని రామ్‌లాల్ విమర్శించారు. దూషించేవారెవరూ ఎన్నికల్లో ఇంతకుముందు గెలవలేదని, ఇప్పుడూ వారికి ఓటమి తప్పదన్నారు. 55 ఏళ్ల కాంగ్రెస్ పాలన, ఐదేళ్ల బీజేపీ పాలన చూసిన వారికి తేడా అర్థం అవుతోందని వ్యాఖ్యానించారు. మోదీ అభివృద్ధి దేశంలో ఎక్కడికి వెళ్లినా కనిపిస్తుందన్నారు. ఈనెల 28న నరేంద్ర మోదీ టెలీకాన్ఫరెన్స్ ద్వారా బీజేపీ కార్యకర్తలతో మాట్లాడతారని తెలిపారు. మార్చి 2న దేశ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లు ఇంద్రసేనారెడ్డి, పేరాల శేఖరరావు, ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు, నేతలు కిషన్‌రెడ్డి, చింతా సాంబమూర్తి, ఆచారి, ప్రేమేందర్‌డ్డి, మనోహర్ రెడ్డి, మంత్రి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మోదీని మళ్లీ ప్రధాని చేయాలి: లక్ష్మణ్ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏను తిరిగి అధికారంలోకి తీసుకురావాలని, నరేంద్రమోదీని మరోసారి ప్రధాని చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దేశాన్ని శక్తివంతమైన దేశంగా చేసేందుకు, నవ భారత్ నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ విశేషంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం ప్రతీ కార్యకర్త కృషి చేయాలని కోరారు. అధిష్టానం పిలుపు మేరకు మేరా పరివార్–బీజేపీ పరివార్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం లక్ష్మణ్ హైదరాబాద్‌లోని తన నివాసంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..పార్టీలో వివిధ బాధ్యతలు నిర్వహిస్తున్న వారు ఈనెల 15 వరకు, పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులు ఈనెల 25 వరకు తమ నివాసాలపై పార్టీ జెండాను ఎగురవేయాలని కోరారు. -
నల్ల జెండాలను చూస్తే వారికి భయం
సాక్షి, న్యూఢిల్లీ : భారత్ లాంటి ప్రజాస్వామ్య దేశాల్లో నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేయడం ప్రజల హక్కు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, బీజేపీ ముఖ్యమంత్రులకు ఇప్పుడు నల్ల జెండాల భయం పట్టుకున్నట్లుంది. ఎక్కడైన వారికి నల్ల జెండాల నిరసన ఎదురయితే భరించలేక పోతున్నారు. నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేసిన వారిని కటకటాల వెనక్కి పంపిస్తున్నారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో పోలీసులు కూడా ఒకప్పుడు ఎర్ర జెండాలను చూస్తే రెచ్చిపోయినట్లుగా ఇప్పుడు నల్ల జెండాలను చూస్తే రెచ్చి పోతున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అస్సాం పర్యటన సందర్భంగా గువాహటిలో శనివారం ఆయన కాన్వాయ్ ముందు నల్ల జెండాలను ప్రదర్శించినందుకు తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు. వారంతా విద్యార్థులే. అస్సాం పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా వారు నిరసన వ్యక్తం చేశారు. వారు అంతకుముందు చొక్కాలు చింపుకొని అర్ధనగ్నంగా కూడా ప్రదర్శనలు జరిపారు. దాంతో స్థానిక పోలీసు అధికారులు ఓ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి, నిరసన ప్రదర్శనల్లో విపరీత పోకడలు వద్దని, మౌనంగా నల్ల జెండాలతో ప్రదర్శన జరిపేందుకు అనుమతిస్తున్నామని ప్రకటించారు. ఆ తర్వాత ప్రధాని మోదీ పర్యటనను పురస్కరించుకొని అనుమతిని రద్దు చేస్తున్నామని ప్రకటించారు. రాజస్థాన్‌లో, 2018, మార్చి నెలలో నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగానే ‘నేషనల్ రూరల్ హెల్త్ మిషన్’కు చెందిన కాంట్రాక్టు కార్మికులు నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేయగా, వారిని అరెస్ట్ చేశారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగి లక్నో యూనివర్శిటీ సందర్శన సందర్భంగా గత జూన్ నెలలో 23 ఏళ్ల పూజా శుక్లా, మరో పది మంది నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేయగా, వారిని 26 రోజులపాటు జైల్లో పెట్టారు. ఆ మరుసటి నెల జూలైలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కాన్వాయ్ ముందు నెహా యాదవ్, మరో ముగ్గురు నల్ల జెండాలను ప్రదర్శించగా వారిని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. సమాజ్‌వాది పార్టీకి చెందిన శుక్లా, యాదవ్‌లను జాతి వ్యతిరేకులుగా ముద్రవేసి జైల్లో చితకబాదారట. ఎన్కౌంటర్ చేసి చంపేస్తామని బెదిరించారట. ఇలా నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేసిన అందరిపైనా చట్ట విరుద్ధంగా సమావేశమయ్యారని, అల్లర్లకు పాల్పడ్డారని, ప్రభుత్వ అధికారుల విధులకు అడ్డం పడ్డారని, ప్రజల్లో అలజడి సృష్టిస్తున్నారంటూ కేసులు దాఖలు చేయగా, రాజస్థాన్‌లోని ఆరోగ్య కార్యకర్తలపై ఇతరుల ప్రాణాలకు ముప్పు తీసుకొచ్చారని అభియోగాలు మోపారు. ఇలా నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేయడం యూరప్ దేశాల్లో అనార్కిస్టు పార్టీల నుంచి వచ్చింది. యూరప్ వీధుల్లో మొదటిసారి 1982లో నల్ల జెండాల ప్రదర్శన జరిగినట్లు చరిత్రలో నమోదయింది. అప్పట్లో అనార్కిస్టులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ నిరసన వ్యక్తం చేయడానికి నల్ల జెండాలనే కాకుండా ఎర్ర జెండాలను కూడా ప్రదర్శించేవారు. సోవియట్ యూనియన్‌లో అక్టోబర్ రెవెల్యూషన్ తర్వాత ఎర్ర జెండా కమ్యూనిస్టుల అధికారిక జెండాగా మారడంతో అనార్కిస్టులు ఎర్రజెండాను వదిలేశారు. అలా మొదలైన నల్లజెండాల ప్రస్థానం ప్రజాస్వామిక దేశాల్లో ప్రజల నిరసనకు చిహ్నంగా మారింది. -
టీడీపీ స్పెషల్ ఫ్లైట్‌లో బీజేపీ ఎంపీ
సాక్షి, హైదరాబాద్ : బీజేపీ-టీడీపీ రహస్య కాపురం గుట్టు రట్టైంది. పబ్లిగ్గా దుమ్మెత్తి పోసుకుంటూ.. ప్రైవేట్‌గా కొనసాగిస్తున్న ప్రేమాయాణాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా బయట పెట్టారు. ధర్మపోరాట దీక్ష కోసం ఢిల్లీకి టీడీపీ నేతలు ఎక్కిన ప్రత్యేక విమానంలో బీజేపీ ఎంపీ హరిబాబు ప్రత్యక్షమయ్యారు. ఈ ఫొటోలను విజయసాయిరెడ్డి షేర్ చేస్తూ బీజేపీ-టీడీపీ అక్రమ సంబంధానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. అంతేకాకుండా ఆయన ట్విటర్ వేదికగా చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ తీరును ఎండగట్టారు. బాబు.. ప్రజలు గమనిస్తున్నారు ధర్మ పోరాట దీక్షల పేరుతో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ.. వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న చంద్రబాబు నాయుడిని ప్రజలు గమనిస్తున్నారని విజయసాయిరెడ్డి హెచ్చరించారు. ధర్మపోరాట దీక్షలతో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న చంద్రబాబు రూ. 200 కోట్ల ప్రజాధనాన్ని తిరిగి చెల్లించక తప్పదన్నారు. ఎవరి సొమ్మని పచ్చ కుల మీడియాకు వేల కోట్లు దోచి పెడుతున్నారని మండిపడ్డారు. సొంత పనులకు హెలికాప్టర్, విమాన ప్రయాణాలు చేస్తూ ప్రభుత్వ ఖజానాకు కన్నం పెట్టడాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారని హెచ్చిరించారు. మరో ట్వీట్లో లోకేష్ బాబుకి ఇండిపెండెన్స్ డేకు రిపబ్లిక్ డేకు తేడా తెలియదని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి కట్టబెట్టినా చంద్రబాబుకూ చిట్టి నాయుడిపై ఏమాత్రం నమ్మకం లేదన్నారు. అందుకే తెలంగాణా ఎన్నికల్లో సరిహద్దు దాటకుండా గీత గీశాడని గుర్తు చేశారు. కానీ దోచుకోవడంలో మాత్రం లోకేష్ తండ్రి శిక్షణలో రాటు తేలాడని, ఇందులో A గ్రేడ్ ఇవ్వక తప్పదని అభిప్రాయపడ్డాడు. -
ప్రియాంకపై బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వేషధారణపై బీజేపీ ఎంపీ హరీష్ ద్వివేది వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక గాంధీ ఢిల్లీలో జీన్స్, టాప్ ధరిస్తారని, గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించే సమయంలో చీర ధరించి కట్టుబొట్టు పాటిస్తారని అన్నారు. యూపీలోని బస్తీ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమలో హరీష్ ద్వివేదీ ఈ వ్యాఖ్యలు చేశారు. రాహుల్ విఫలమైనందునే ప్రియాంక గాంధీని తెరపైకి తెచ్చారని వ్యాఖ్యానించారు. రాహుల్ బాటలోనే ప్రియాంక సైతం విఫలమవుతారని జోస్యం చెప్పారు. ప్రియాంక గాంధీపై బీజేపీ నేతలు వ్యక్తిగత విమర్శలు ఇదే తొలిసారి కాదు. కాగా, ప్రియాంక అందంగా ఉంటారు కానీ ఆమెకు రాజకీయ అనుభవం,నైపుణ్యం లేవని గతంలో బిహార్ మంత్రి వినోద్ నారాయణ్ ఝా ఆరోపించారు. మరోవైపు ప్రియాంక తరచూ భావోద్వేగాలకు లోనవుతరాని, ఆమెది బైపోలర్ మనస్తత్వమని బీజేపీ నేత, ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి విమర్శించారు. ప్రియాంక గాంధీని గత నెల 23న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ నియమించిన సంగతి తెలిసిందే. -
ఆశలన్నీ మోదీపైనే!
సాక్షి, హైదరాబాద్: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రం లో మోదీ మంత్రం పనిచేస్తుందనే ఆశాభావంతో బీజేపీ నాయకులున్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన కేం ద్ర బడ్జెట్లో రైతులు, ఇతర వర్గాల ప్రజలకు చేసిన కేటాయింపులు, గత ఐదేళ్లలో దేశపురోగమనానికి మోదీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు బీజేపీకి అనుకూలంగా ఓట్లు పడేందుకు ఉపకరిస్తాయనే విశ్వాసంతో ఉన్నారు. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు ఐదు శాతం రిజర్వేషన్ల కల్పన అంశం తురుపుముక్కగా పనిచేస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే లోక్ సభ ఎన్నికలు పూర్తిగా భిన్న అంశాలు, జాతీయస్థాయి ఎజెండాకు అనుగుణంగా జరగనున్నందున మంచి ఫలితాలు వస్తాయనే అభిప్రాయంతో ఉన్నా రు. ముఖ్యంగా కొన్ని సీట్లు గెలిచేందుకు అవకాశాలున్నాయని బీజేపీ రాష్ట్రపార్టీ అంచనా వేస్తోంది. మార్చి 2 వరకు వరుస కార్యక్రమాలు... ఈ కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ఐటీ విభాగం సమావేశంలో కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ పాల్గొంటారు. పార్టీ సిద్ధాంతకర్త దీన్‌దయాళ్ ఉపాధ్యాయ వర్ధంతిని పురస్కరించుకుని 11న సమర్పణ దివస్ నిర్వహణ, అదేరోజు మహబూబ్‌నగర్, నాగర్ కర్నూలు, చేవెళ్ల పార్లమెంట్ బూత్ కమిటీ అధ్యక్షులు, ఆపై స్థాయి నేతల సమావేశంలో మరో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పాల్గొంటారు. ఈనెల 12 నుండి మార్చి 2 వరకు ‘నా కుటుంబం– బీజేపీ కుటుంబం’ కార్యక్రమం, 12న రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల ఇళ్లపై బీజేపీ జెండా ఎగురవేస్తారు. ఇందులో భాగంగా బీజేపీ నాయకుల ఇళ్లపైనా, ప్రతి బూత్‌లో కనీసం 25 ఇళ్లపైనా బీజేపీ జెండా ఎగురవేయడం, స్టిక్కర్ అతికించడం. కమల్ జ్యోతి పేరుతో కేంద్ర ప్రభుత్వ లబ్ధిదారుల ఇళ్లలో జ్యోతి వెలిగించే కార్యక్రమం. మార్చి 2న ప్రతి అసెంబ్లీలో విజయ్ సంకల్ప్ బైక్ ర్యాలీలకు బీజేపీ సిద్ధమవుతోంది. కేడర్‌లో జోష్ పెంచేందుకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడానికి పూర్వమే రాష్ట్రవ్యాప్తంగా కేడర్ చైతన్యవంతమయ్యేలా విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టడం, జాతీయ పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా చేపట్టడం ద్వారా జోష్‌ను పెంచాలని భావిస్తోంది. మిగతా పార్టీల కంటే ముందుగానే లోక్‌సభ ఎన్నికలకు పూర్తిస్థాయిలో సిద్ధం కావ డం ద్వారా పైచేయి సాధించేందుకు కార్యాచరణను సిద్ధం చేసింది. ఈ కార్యక్రమాల్లో భాగంగా కేంద్రం నుంచి వివిధ పథకాల ద్వారా లబ్దిపొందిన కుటుంబాలను స్వయంగా కలుసుకునే ఏర్పాట్లు, వారి ఇళ్లలో దీపం వెలిగించే కార్యక్రమాలు, బీజేపీ నాయకులు, కార్యకర్తల ఇళ్లపై పార్టీ జెండాలు ఎగురవేయడం తదితర కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. -
‘అక్రమ వలసదారులే వారి ఓట్ బ్యాంక్’
లక్నో : ఎస్పీ, బీస్పీలు అక్రమ వలసదారులను ఓటు బ్యాంక్‌లా పరిగణిస్తాయని, తమ పార్టీ చొరబాట్లను జాతీయ భద్రతకు సంబంధించిన అంశంగా చూస్తుందని బీజేపీ చీఫ్ అమిత్ షా అన్నారు. యూపీలోని మహరాజ్‌గంజ్‌లో శుక్రవారం ఆయన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఎస్పీ-బీఎస్పీ కూటమిపై నిప్పులు చెరిగారు. అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామమందిర నిర్మాణానికి తమ పార్టీ కట్టుబడిఉందన్నారు. విపక్షాలు రామమందిర అంశంపై తమ వైఖరిని వెల్లడించాలని అమిత్ షా సవాల్ విసిరారు.రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో యూపీలో గతంలో సాధించిన స్ధానాలను నిలబెట్టుకోవాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. కాగా తూర్పు యూపీలో వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ ప్రియాంక గాంధీని ప్రధాన కార్యదర్శిగా బరిలో నిలపడంతో యూపీ ఎన్నికల రాజకీయం వేడెక్కిన సంగతి తెలిసిందే. -
బాబు, లోకేష్‌లపై పొగడ్తల కోసమా?
సాక్షి, అమరావతి: గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శాసనమండలిలో బుధవారం జరిగిన చర్చ సందర్భంగా అధికార టీడీపీ ఎమ్మెల్సీలు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లను పొగుడుతూ ఉపన్యాసాలు చేయడంపై బీజేపీ ఎమ్మెల్సీలు మండిపడ్డారు. ‘గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ అంటే చంద్రబాబు, లోకేష్‌బాబుల పొగడ్తల కోసం పెట్టుకున్న చర్చా..’ అంటూ విమర్శించారు. చర్చ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌లను పొగుడుతూ.. మోదీ, అమిత్‌షాలతోపాటు బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. మోదీ రాష్ట్రానికి ఎలా వస్తారంటూ వ్యాఖ్యలు చేయడంతో బీజేపీ ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, మాధవ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సమయంలో టీడీపీ, బీజేపీ ఎమ్మెల్సీలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. డ్వాక్రా మహిళలను మోసం చేశారు.. లబ్ధిదారులకు పోస్టు డేటెడ్ చెక్కుల్ని పంపిణీ చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానికే దక్కుతుందని.. దేశంలో మరే ప్రభుత్వం ఇలా చేయలేదని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ విమర్శించారు. గత ఎన్నికల్లో డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక మహిళలను మోసం చేశారని, ఇప్పుడు మహిళల బంగారం జప్తునకు బ్యాంకులు నోటీసులు జారీ చేస్తున్నాయని తెలిపారు. పాఠశాల విద్యాశాఖలో 23 వేల టీచరు పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 7 వేల పోస్టుల భర్తీకే ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందని పీడీఎఫ్ ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి తప్పుపట్టారు. కాగా, శాసనమండలి ప్రశ్నోత్తరాల్లో ఓ ప్రశ్నకు మంత్రి దేవినేని ఉమా బదులిస్తూ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు ఐదేళ్లలో రూ. 51 వేల కోట్లకుపైగా ఖర్చు చేసినట్లు చెప్పారు. దీనిపై బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ స్పందిస్తూ.. రాజధాని అమరావతి నిర్మాణం దగ్గర్నుంచి విజయవాడ, గుంటూరు నగరాలకు, నీటి ప్రాజెక్టులకు కేంద్రప్రభుత్వం రూ. వేల కోట్ల నిధులిస్తోందని, సభలో వాటి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఎందుకు చెప్పట్లేదని ప్రశ్నించారు. -
నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మరోసారి తన వ్యాఖ్యలతో సొంత పార్టీని అయోమయంలో పడేశారు. రాజు, ప్రభుత్వం, పరిపాలన సెక్యూలర్‌గా ఉండొచ్చు కానీ వ్యక్తి ఎప్పుడూ సెక్యులర్ కాలేడంటూ నర్మగర్భమైన వ్యాఖ్యలు చేశారు. సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్స్‌లో మంగళవారం జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సర్వధర్మ, సమభావనతో పని చేస్తున్నామని చెప్పారు. ప్రాంత, భాష, జాతి, ధర్మం బేధంలేకుండా పరిపాలన సాగుతోందన్నారు. (గడ్కరీ మాటలకు అర్థాలే వేరులే!) 70 ఏళ్ళు అయిన సామాజిక అసమానతలు కొనసాగడానికి కారణం పాలకులేనని విమర్శించారు. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేశారు. ఆర్థిక వివక్ష లేకుండా ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు పది శాతం రిజర్వేషన్లు కల్పించామని చెప్పారు. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి తమ ప్రభుత్వం రిజర్వేషన్లు ఇవ్వడాన్ని చారిత్రక నిర్ణయంగా వర్ణించారు. తప్పుడు పనులు చేస్తేనే కాదు.. మంచి అభివృద్ధి పనులు చేసినా ఎక్కువ మంది శత్రువులు పెరుగుతారని అర్థమయిందన్నారు. ప్రజలను కన్ఫ్యూజ్ చేసే రాజకీయాలు జరుగుతాయని, జాగ్రతగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు. ఎన్నికల్లో గెలవడం ముఖ్యం కాదని హామీలు నిలబెట్టుకోవడం ముఖ్యమని పేర్కొన్నారు. -
కోల్‌కతా బీజేపీ కార్యాలయంపై దాడి
కోల్‌కతా : మమతా బెనర్జీ సారథ్యంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, కేంద్రం మధ్య ఘర్షణ వాతావరణం తీవ్రమైంది. బీజేపీ, తృణమూల్ నేతలు పరస్పర ఆరోపణలతో తలపడుతుంటే సోమవారం కోల్‌కతాలో బీజేపీ కార్యాలయాన్ని దుండగులు ధ్వంసం చేశారు. పాలక తృణమూల్ కార్యకర్తలే తమ కార్యాలయంపై దాడికి తెగబడ్డారని బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు కేంద్రం తమపై కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని కోల్‌కతా పోలీస్ కమిషనర్ నివాసంపై సీబీఐ దాడులను వ్యతిరేకిస్తూ మమతా బెనర్జీ ఢిల్లీలో దీక్షకు దిగడంతో పరిస్ధితి వేడెక్కింది. బెంగాల్లో శాంతి భద్రతలు క్షీణించాయని బీజేపీ ప్రతినిధి బృందం ఈసీని కలిసింది. రాష్ట్రంలో స్వేచ్ఛగా, సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర బలగాలను మోహరించాలని విజ్ఞప్తి చేసింది. సీబీఐ వివాదం నేపథ్యంలో విపక్షాలు మమతా బెనర్జీకి బాసటగా నిలవగా అవినీతిని ప్రతిపక్షాలు సమర్ధిస్తున్నాయని బీజేపీ ఆరోపించింది. మరోవైపు అవినీతి ఆరోపణలున్న వారిని విచారించడం నేరమా అని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నించారు. -
బెంగాల్ వర్సెస్ కేంద్రం : ఈసీని కలిసిన బీజేపీ నేతలు
సాక్షి, న్యూఢిల్లీ : కోల్‌కతా పోలీస్ కమిషనర్ నివాసంపై సీబీఐ దాడుల నేపథ్యంలో కేంద్రం, మమతా బెనర్జీల మధ్య వివాదం తీవ్రరూపుదాల్చింది. బెంగాల్లో శాంతి భద్రతల పరిస్ధితి గాడి తప్పుతోందని బీజేపీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం సోమవారం ఈసీని కలిసి ఫిర్యాదు చేసింది. రానున్న సార్వత్రిక ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా నిర్వహించేందుకు బెంగాల్లో కేంద్ర బలగాలను మోహరించాలని విజ్ఞప్తి చేసింది. ఈసీని కలిసిన బీజేపీ ప్రతినిధి బృందంలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, ముక్తార్ అబ్బాస్ నక్వీ, అహ్లూవాలియా పార్టీ సీనియర్ నేతలు, బీజేపీ బెంగాల్ ఇన్ఛార్జ్ కైలాష్ విజయవర్గీయ తదితరులున్నారు. రాష్ట్రంలో బీజేపీ నేతల ర్యాలీలను మమతా బెనర్జీ నేతృత్వంలోని బెంగాల్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటోందని బీజేపీ నేతలు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ అధికారులను తొలగించాలని తాము ఈసీని కోరామని భేటీ అనంతరం కేంద్ర మంత్రి నక్వీ తెలిపారు. రాష్ట్రంలో స్వేచ్ఛగా, సజావుగా ఎన్నికల నిర్వహణ చేపట్టేందుకు కేంద్ర బలగాలను నియోగించాలని కోరామన్నారు. పశ్చిమ బెంగాల్లో నెలకొన్న దారుణ పరిస్థితులను ఈసీకి వివరించామన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను బెదిరిస్తూ, అకారణంగా నిర్భందిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీ నేతల ర్యాలీలకు అనుమతి నిరాకరిస్తూ వేధింపులకు గురిచేస్తున్న విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. -
రిజర్వేషన్లపై కుట్ర: కృష్ణయ్య
హైదరాబాద్: రిజర్వేషన్ మూలసూత్రాలను దెబ్బ కొట్టేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బహుజన సేన తెలంగాణ ఆధ్వర్యం లో మోదీ సర్కార్ అక్రమ రిజర్వేషన్ల కల్పనపై సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కృష్ణయ్య మాట్లాడుతూ.. సామాజిక వెనుకబాటు, అంటరానితనం తదిత ర అంశాల ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాలి కానీ, పేదరికం ఆధారంగా కాదని చెప్పారు. అగ్రకులాల్లో పేదలుంటే వారికి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలి తప్ప రిజర్వేషన్లు కల్పించడమేంటని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం.. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా అగ్రకులాల వారి కి రిజర్వేషన్ కల్పించారని బీసీ సంఘర్షణ సమి తి అధ్యక్షుడు వీజీఆర్ నారగోని ఎద్దేవా చేశారు. అణగారిన వర్గాలను తొక్కిపెట్టేందుకే రిజర్వేషన్ కల్పించారన్నారు. బహుజన సేన తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ కదిరే కృష్ణ అధ్యక్షతన నిర్వ హించిన ఈ సభలో ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్, సమాజ్‌వాది పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ప్రొఫెసర్ సింహాద్రి, టీమాస్ ఫోరం చైర్మన్ ప్రొఫెసర్ కంచె ఐలయ్య, సొగరా బేగం తదితరులు పాల్గొన్నార -
మత వ్యతిరేక సందేశం.. బీజేపీ నేత అరెస్ట్
తిరువొత్తియూరు: ఓ మతానికి సంబంధించి వ్యతిరేకంగా అభిప్రాయాలను ఫేస్బుక్లో వెల్లడించిన బీజేపీ ప్రముఖుని పోలీసులు చెన్నై ఎయిర్‌పోర్టులో శనివారం అరెస్టు చేశారు. చెన్నై నంగనల్లూరుకు చెందిన కల్యాణరామన్ బీజేపీ ప్రముఖుడు. ఈయన కాక్కచై సిద్ధర్ కళ్యాణ రామన్ పేరుతో ఫేస్బుక్ అకౌంట్ ఉంది. ఇందులో ఓ మతానికి వ్యతి రేకంగా సందేశాలు ఇచ్చినట్లు పలువురు కల్యాణరామన్పై చెన్నై పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కమిషనర్ ఆదేశాల మేరకు ఆయనపై చెన్నై సెంట్రల్ క్రైం పోలీసులు 153ఎ, 295, 505 విభాగంలో కేసు నమోదు చేశారు. శనివారం అహ్మదాబాద్ నుంచి విమానంలో చెన్నైకి వచ్చిన కల్యాణరామన్ను ఎయిర్‌పోర్టు పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కమిషనర్ కార్యాలయానికి తీసుకెళ్లి అతని వద్ద విచారణ చేస్తున్నారు. -
మధ్యతరగతి ఆశలు ఛిద్రం
దుర్గాపూర్/ఠాకూర్‌నగర్: రాబోయే లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పశ్చిమ బెంగాల్లో ప్రధాని మోదీ ప్రచారం ప్రారంభించారు. బీజేపీ కార్యకర్తల హత్యాకాండకు పాల్పడుతున్న అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మధ్యతరగతి ప్రజల ఆశల్ని చిదిమేస్తోందని ఆరోపించారు. బీజేపీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతుండటంతో సీఎం మమతా బెనర్జీకి గుబులు మొదలైందని అన్నారు. ఆమె పాదాల కింద నేల క్రమంగా కదిలిపోతోందని చురకలంటించారు. దుర్గాపూర్, ఠాకూర్పూర్లలో శనివారం జరిగిన రెండు వేర్వేరు కార్యక్రమాల్లో మమతా ప్రభుత్వంపై మోదీ నిప్పులు చెరిగారు. తృణమూల్ కాంగ్రెస్ అంటే తృణమూల్ తోలాబ్జి టాక్స్(ట్రిపుల్ టీ)గా నిలిచి పోయిందని ఎద్దేవా చేశారు. బెంగాలీలో తోలాబ్జి అంటే వ్యవస్థీకృత బలవంతపు వసూళ్లు అని అర్థం. ఇతర దేశాల్లో మతపర వేధింపులు ఎదుర్కొని మన దేశంలో శరణు కోరేవారికి న్యాయం, గౌరవం కల్పించాలంటే పౌరసత్వ బిల్లుకు చట్టరూపం తేవాల్సిందేనని పునరుద్ఘాటించారు. కమ్యూనిస్టుల బాటలోనే మమత.. ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కేందుకు మమత గతంలో పాలించిన కమ్యూనిస్టుల బాటలోనే నడుస్తున్నారని దుర్గాపూర్‌లో జరిగిన ర్యాలీలో మోదీ విమర్శించారు. బెంగాల్లో రూ.90 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేంద్రం అనుమతి ఇచ్చిందని, వాటిని అమలుచేయాలనే ఆసక్తి తృణమూల్ సర్కార్‌కు కొరవడిందని, వారు ఆ పనుల్లో వాటా కోరుకుంటున్నారన్నారు. బెంగాల్‌కు వలసొచ్చిన మతువా అనే ఎస్సీ వర్గం ఠాకూర్పూర్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న మోదీ..పౌరసత్వ బిల్లుకు చట్టరూపం కల్పించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. తూర్పు పాకిస్తాన్‌కు చెందిన మతువాలు 1950లలో బెంగాల్‌కు వలసొచ్చారు. సుమారు 30 లక్షల జనాభా ఉండే ఈ వర్గం కనీసం ఐదు లోక్‌సభ స్థానాల్లో ప్రభావం చూపగలదు. అయితే, వారిలో ఇంకా చాలా మందికి భారత పౌరసత్వం దక్కలేదు. ఈ నేపథ్యంలో మతువాలను బీజేపీకి ఓటుబ్యాంకుగా మలిచేలా మోదీ పౌరసత్వ బిల్లుకు మద్దతుగా ప్రసంగించారు. ఠాకూర్‌నగర్ సభకు ప్రజలు పెద్దసంఖ్యలో రావడంతో తొక్కిసలాట జరిగినంత పనైంది. ఈ ఘటనలో పలువురు మహిళలు, పిల్లలు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. మద్దతుదారులు బారికేడ్లు బద్దలుకొట్టి మరింత లోనికి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించడంతో కొంత గందరగోళం నెలకొంది. ఉన్న చోటే ఉండాలని, ముందుకు రావొద్దని మోదీ వారించినా కొందరు కార్యకర్తలు కుర్చీలు విసిరేస్తూ నానా హైరానా సృష్టించారు. బెంగాల్లో బల ప్రదర్శన! పోటాపోటీ ర్యాలీలకు తృణమూల్, బీజేపీ రెడీ మమతా బెనర్జీ గత నెలలో బీజేపీయేతర పార్టీలతో భారీ ర్యాలీ నిర్వహించిన సంగతి తెలిసిందే. దానికి పోటీగా రాష్ట్ర వ్యాప్తంగా మోదీ, అమిత్‌షాలతో బహిరంగ సభలు నిర్వహించేందుకు బీజేపీ సిద్ధమైంది. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు తమ అగ్ర నాయకులతో ర్యాలీలు నిర్వహించాలని కమలనాథులు ప్రణాళికలు రచించారు. అయితే ఈ ప్రయత్నాల్ని అడ్డుకోవడానికి తృణమూల్ తన వంతు ప్రయత్నాల్ని చేస్తోంది. ఒకవైపు మోదీకి, బీజేపీకి వ్యతిరేకంగా వివిధ పార్టీలను కూడగడుతున్న మమతా బెనర్జీ ఇతర పార్టీల నేతలను తమ పార్టీలో చేర్చుకుంటున్నారు. బీజేపీ ప్రతిపాదించిన ర్యాలీలు, సభలకు అనుమతులను నిరాకరిస్తున్నారు. బీజేపీ సభలకు తృణమూల్ అడ్డుపుల్లలు.. విపక్షాల మహాగట్బంధన్ ర్యాలీకి ఏమాత్రం తీసిపోకుండా బెంగాల్ వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించాలని బీజేపీ భావిస్తోంది. లోక్‌సభ ఎన్నికల నాటికి రాష్ట్రంలోని 32 లోక్‌సభ నియోజకవర్గాల్లో 300 ర్యాలీలు చేపట్టాలని ప్రణాళికలు వేసింది. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లాంటి హేమాహేమీలు ఈ ర్యాలీల్లో పాల్గొంటారు. జనవరి 23న జర్గ్రామ్, సురి ర్యాలీల్లో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పాల్గొనాల్సి ఉండగా, ఆమె హెలికాప్టర్ ప్రభుత్వ హెలిప్యాడ్‌లో దిగేందుకు అనుమతించడంలో జాప్యం జరిగింది. దీంతో స్మతి పర్యటన రద్దయింది. ఈస్ట్ మిడ్నపూర్లోని కాంతి దగ్గర బీజేపీ మద్దతుదారుడి పొలంలో అమిత్‌షా ర్యాలీకి ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం పక్కనున్న భూస్వాములతో ర్యాలీకి వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు చేయించింది. ‘బెంగాల్ నుంచి తృణమూల్‌ను తరిమికొట్టడానికి అనుక్షణం పోరాడతా. నా హెలికాప్టర్ దిగేందుకు ప్రభుత్వం అనుమతించకపోతే హెలికాప్టర్ నుంచే ప్రసంగిస్తా. మా రథయాత్రను అడ్డుకుంటే కాలినడకనే ఊరేగుతాం’అని అమిత్ అన్నారు. -
అసెంబ్లీ సాక్షిగా సహనం కోల్పోయిన చంద్రబాబు
-
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్
పార్లమెంటులో కేంద్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన పీయూష్ గోయల్ (54) మోదీ ప్రభుత్వం అమలు పరిచిన ఆర్థిక సంస్కరణలన్నింటికీ సూత్రధారి. ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ అనారోగ్య కారణంగా తాత్కాలిక ఆర్థిక మంత్రి బాధ్యతలు చేపట్టిన గోయల్ ఆ హోదాలోనే ‘మధ్యంతర’బడ్జెట్ ప్రవేశపెట్టారు. చార్టెర్డ్ అకౌంటెంట్‌గా, న్యాయ విద్యార్థిగా అత్యున్నత ప్రతిభా పాటవాలు చూపిన గోయల్ 2014 ఎన్నికల్లో సామాజిక మాధ్యమాల ప్రచారం ద్వారా ఎన్డీఏ విజయానికి దారులు వేశారు. విపత్కర సమయాల్లో నేనున్నానంటూ ముందుకొచ్చి పార్టీని, ప్రభుత్వాన్ని ఆదుకున్నారు. రాత్రి పొద్దుపోయే వరకు పని చేస్తూ ‘పని రాక్షసుడి’గా పేరుపడ్డారు. రైల్వే మంత్రిగా బులెట్ రైళ్లు, స్పీడ్ రైళ్లతో భారతీయ రైల్వేను పరుగులు పెట్టిస్తున్నారు. రైల్వేల ఆధునీకరణ, ప్రయాణికుల సౌకర్యాలకు పెద్దపీట వేశారు. మోదీ ప్రభుత్వం అమలు చేసిన నిరంతర విద్యుత్, స్వచ్ఛ ఇంధనం, ఉదయ్, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజన వంటి పథకాల రూపకర్త గోయలే. దేశంలోని 5,97,464 గ్రామాలను పూర్తిగా విద్యుదీకరించినందుకుగాను గోయల్‌కు రెండు రోజుల క్రితమే పెన్సిల్వేనియా వర్సిటీ కర్నాట్ బహుమతిని ప్రదానం చేసింది. అంచెలంచెలుగా.. స్వతంత్ర ప్రతిపత్తి గల సహాయ మంత్రిగా మోదీ మంత్రివర్గంలో చేరిన గోయల్ తన శక్తిసామర్థ్యాలను నిరూపించుకుని అనతికాలంలోనే కేబినెట్ స్థాయికి ఎదిగారు. బొగ్గు, విద్యుత్ శాఖ మంత్రిగా బొగ్గు గనుల వేలాన్ని పారదర్శకంగా, విజయవంతంగా నిర్వహించారు. ఉజ్వల పథకం కింద దేశంలో ఎల్ఈడీ బల్బుల వినియోగాన్ని పెంచి కరెంటు ఖర్చు తగ్గించారు. త్వరగా, వినూత్నంగా నిర్ణయాలు తీసుకుంటారని పేరున్న గోయల్‌కు జ్ఞాపకశక్తి అపారం. సీఏలో ఆలిండియా రెండో ర్యాంకు సాధించారు. న్యాయవిద్యలో ముంబై యూనివర్సిటీలోనే సెకండ్ ర్యాంకు సంపాదించారు. స్టేట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా డైరెక్టర్ల బోర్డుల్లో పని చేశారు. కేంద్ర మంత్రి వర్గంలో చేరే నాటికి గోయల్ బీజేపీ కోశాధికారిగా ఉన్నారు. ఆయన తర్వాత పార్టీ మరెవరినీ కోశాధికారిగా నియమించకపోవడం గమనార్హం. కార్పొరేట్ వర్గాలతో సన్నిహిత సంబంధాలున్న పీయూష్ గోయల్ తన 34 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రభుత్వానికి ఎన్నో విజయాలు సాధించి పెట్టారు. గోయల్ తండ్రి వేద్ ప్రకాశ్ గోయల్ బీజేపీ జాతీయ కోశాధికారిగా, కేంద్రంలో మంత్రిగా పని చేశారు. తల్లి చంద్రకాంత గోయల్ మహారాష్ట్ర శాసనసభకు మూడుసార్లు ఎన్నికయ్యారు. నాలుగు నెలలకు రూ.34.17 లక్షల కోట్లు న్యూఢిల్లీ: వచ్చే ఏప్రిల్ నుంచి నూతన ఆర్థిక సంవత్సరం (2019–20)లో మొదటి నాలుగు నెలల కాలానికి గాను (ఏప్రిల్ నుంచి జూలై వరకు) రూ.34.17 లక్షల కోట్ల వ్యయాల కోసం కేంద్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ ద్వారా పార్లమెంట్ అనుమతి కోరింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి స్థూల వ్యయాలు రూ.97.43 లక్షల కోట్లుగా మధ్యంతర బడ్జెట్లో ఆర్థిక మంత్రి అంచనాలను పేర్కొన్నారు. మొదటి నాలుగు నెలల కాలానికి అయ్యే వ్యయాలకు గాను పార్లమెంటు ఆమోదం కోరారు. లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్–మే నెలల్లో పూర్తవుతాయి. తదుపరి ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్‌ను వచ్చే జూలైలో కొత్త ప్రభుత్వం పార్లమెంటుకు సమర్పించనుంది.