ప్రియాంకపై బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు | Priyanka Gandhi wears Jeans Top In Delhi Sari Sindoor In Rural Areas | Sakshi
Sakshi News home page

ప్రియాంకపై బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

Published Sun, Feb 10 2019 2:12 PM | Last Updated on Fri, Mar 29 2019 8:30 PM

Priyanka Gandhi wears Jeans Top In Delhi Sari Sindoor In Rural Areas - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వేషధారణపై బీజేపీ ఎంపీ హరీష్‌ ద్వివేది వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక గాంధీ ఢిల్లీలో జీన్స్‌, టాప్‌ ధరిస్తారని, గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించే సమయంలో చీర ధరించి కట్టుబొట్టు పాటిస్తారని అన్నారు. యూపీలోని బస్తీ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమలో హరీష్‌ ద్వివేదీ ఈ వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌ విఫలమైనందునే ప్రియాంక గాంధీని తెరపైకి తెచ్చారని వ్యాఖ్యానించారు.

రాహుల్‌ బాటలోనే ప్రియాంక సైతం విఫలమవుతారని జోస్యం చెప్పారు. ప్రియాంక గాంధీపై బీజేపీ నేతలు వ్యక్తిగత విమర్శలు ఇదే తొలిసారి కాదు. కాగా, ప్రియాంక అందంగా ఉంటారు కానీ ఆమెకు రాజకీయ అనుభవం,నైపుణ్యం లేవని గతంలో బిహార్‌ మంత్రి వినోద్‌ నారాయణ్‌ ఝా ఆరోపించారు. మరోవైపు ప్రియాంక తరచూ భావోద్వేగాలకు లోనవుతరాని, ఆమెది బైపోలర్‌ మనస్తత్వమని బీజేపీ నేత, ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి విమర్శించారు. ప్రియాంక గాంధీని గత నెల 23న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ నియమించిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement