Priyanka Gandhi
-
తెలంగాణ మార్గం చూపింది.. దేశమంతా జనగణన జరగాలి
సాక్షి, హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన మరో వాగ్దానాన్ని నెరవేరుస్తూ బీసీ వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను ఆమోదించిందని లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ ట్వీట్ చేశారు. జనగణన విషయంలో తెలంగాణ.. దేశానికి ఓ మార్గం చూపిందని, ఈ జనగణన దేశమంతా జరగాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ మంగళవారం ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ చేశా రు. ‘జనగణన ద్వారా మాత్రమే వెనుకబడిన వర్గాల హక్కులు సాధ్యమవుతా యని కాంగ్రెస్ పార్టీ మరోమారు స్పష్టం చేసింది. తెలంగాణ తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా ఇప్పటి వరకు రిజర్వేషన్ల విషయంలో ఉన్న 50 శాతం పరిమితి తొలగింపునకు మార్గం సుగమమైంది. విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో బీసీలకు తగిన ప్రాతినిధ్యం లభించనుంది’ అని రాహుల్ ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. మీకు అండగా ఉంటాం: ప్రియాంక ‘కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చింది. 42% రిజర్వేషన్లతో బీసీ వర్గాలు మరింత అభివృద్ధి సాధిస్తారు. తెలంగాణ ప్రజలు, బీసీ వర్గాలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇది కేవలం రిజర్వేషన్ల కల్పన మాత్రమే కాదు. సామాజిక న్యాయంపై కాంగ్రెస్ పార్టీ నిబద్ధతకు నిదర్శనం. మీరు మమ్మల్ని నమ్మినట్టుగానే, మేం మీకు అండగా ఉంటాం. జై తెలంగాణ, జైహింద్, జైకాంగ్రెస్’ అని ప్రియాంక ఫేస్బుక్లో పోస్టు చేశారు. కలలు సాకారమవుతున్నాయి: సీఎం రేవంత్ రాహుల్, ప్రియాంకాగాంధీలు సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్టులకు సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. ‘గర్వించదగిన రోజు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభు త్వం వాగ్దానాలను నెరవేర్చుతోంది. రాహుల్, ప్రియాంక నేతృత్వంలో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కలలను సాకారం చేస్తూ, ప్రజలకిచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ, ప్రతి గ్యారంటీని నిజం చేస్తూ ముందుకెళుతోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పన విప్లవాత్మక నిర్ణయం. సామాజిక న్యాయ అమలులో తెలంగాణ దేశానికి మార్గదర్శనం చేయడం గర్వకారణం. ఆ ఇద్దరి ప్రేరణకు ధన్యవాదాలు’ అని రేవంత్‌రెడ్డి రీట్వీట్ చేశారు. -
New Delhi: కాంగ్రెస్‌కు కొత్త కార్యాలయం.. నేడు ప్రారంభించనున్న సోనియా
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం చిరునామా మారింది. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నేడు (జనవరి 15) పార్టీ కొత్త ప్రధాన కార్యాలయం 'ఇందిరా భవన్'ను ప్రారంభించనున్నారు. గత ఐదు దశాబ్దాలుగా పార్టీ ప్రధాన కార్యాలయం ఢిల్లీలోని 24, అక్బర్ రోడ్లో ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ కొత్త ప్రధాన కార్యాలయం పేరు ‘ఇందిరా భవన్’.. ఇది 9-ఎ కోట్ల రోడ్డులో ఏర్పాటయ్యింది. నేటి ఉదయం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు పలువురు నేతలు పాల్గొననున్నారు. VIDEO | Delhi: Congress MP Priyanka Gandhi (@priyankagandhi) leaves after inspecting Congress' new headquarters - Indira Gandhi Bhawan - in Delhi, ahead of its inauguration on Wednesday. (Full video available on PTI Videos- https://t.co/dv5TRAShcC)#Delhi pic.twitter.com/TLp1zjg7Nf— Press Trust of India (@PTI_News) January 14, 2025మీడియాకు అందిన వివరాల ప్రకారం ఈ నూతన కార్యాలయ నిర్మాణం ప్రియాంక గాంధీ సారధ్యంలో కొనసాగింది. కార్యాలయ మ్యాప్‌ను ఖరారు చేయడం మొదలుకొని పెయింటింగ్, చిత్రాలు, కర్టెన్లు, ఫర్నిచర్ వరకు ప్రియాంక స్వయంగా అన్నింటినీ పర్యవేక్షించారు. ఈ కొత్త కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలు పాత ఛాయాచిత్రాలను ఏర్పాటు చేశారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసీ వేణుగోపాల్ మంగళవారం ట్విట్టర్లో ఇలా పోస్ట్ చేశారు.. ‘2025, జనవరి 15న ఉదయం 10 గంటలకు, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సమక్షంలో కొత్త ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ‘ఇందిరా గాంధీ గాంధీ భవన్’ను ప్రారంభించనున్నారు’ అని తెలిపారు.It is time for us to move ahead with the times and embrace the new!On 15 January, 2025 at 10am, in the esteemed presence of INC President Sh. Mallikarjun @kharge ji and LOP Sh. @RahulGandhi ji, Hon’ble CPP Chairperson Smt. Sonia Gandhi ji will inaugurate the new AICC…— K C Venugopal (@kcvenugopalmp) January 7, 2025కాంగ్రెస్ నూతన కేంద్ర కార్యాలయం ‘ఇందిరా గాంధీ భవన్’ పార్టీలో పెరుగుతున్న అవసరాలను తీర్చడానికి, పరిపాలనా, సంస్థాగత, వ్యూహాత్మక విధుల నిర్వహణకు అనువుగా ఆధునిక సౌకర్యాలతో రూపొందింది. 1978లో కాంగ్రెస్(ఐ) ఏర్పడినప్పటి నుండి పార్టీ ప్రధాన కార్యాలయం '24, అక్బర్ రోడ్'లో ఉంది. -
హైదరాబాద్ బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
-
రాళ్లు, కర్రలతో దాడి.. బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
సాక్షి,హైదరాబాద్ : కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ (priyanka gandhi) పై ఢిల్లీ బీజేపీ కాల్కాజీ ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్ బిదురి చేసిన వ్యాఖ్యలపై వివాదం కొనసాగుతోంది. రమేష్ బిదురి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కేంద్ర మంత్రులను అడ్డుకోవాలని యూత్ కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ (congress party) కార్యకర్తలు హైదరాబాద్ నాంపల్లి బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు. రాళ్లు, కోడిగుడ్లతో దాడులు చేశారు. రమేష్ బిదూరి దిష్టిబొమ్మను దహనం చేశారు.కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడిలో ఓ బీజేపీ (bjp) కార్యకర్త తలకు తీవ్ర గాయమైంది. దీంతో కోపోద్రికులైన బీజేపీ కార్యకర్తలు.. కాంగ్రెస్ కార్యకర్తలపై కర్రలతో దాడులు చేసేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తతకు దారి తీసింది.దాడులపై సమాచారం అందుకున్న పోలీసులు వారిని అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఇరు పార్టీల కార్యకర్తల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా రమేష్ బిదూరి ప్రియాంక గాంధీని ఉద్దేశిస్తూ చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీజేపీ అధిష్టానం ఎందుకు నేతలు ఎందుకు చర్యలు తీసుకోలేదని యూత్ కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. నిరసన చేసేందుకు వచ్చిన తమపై బీజేపీ కార్యకర్తలు కర్రలతో దాడులు చేశారని ఆరోపిస్తున్నారు. కాగా, రమేష్ బిధూరి (Ramesh Bidhuri) ప్రియాంక గాంధీపై నోటి దురుసు వ్యాఖ్యలు చేశారు. తనని గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధి ఎలా చేస్తానో ఉదహరిస్తూ ఆమె పేరు ప్రస్తావించారు. నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గంలో ప్రియాంకా గాంధీ బుగ్గల వంటి సుతిమెత్తని రోడ్లు నిర్మిస్తానని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగింది. రమేష్ బిదురితో పాటు బీజేపీపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. దీంతో తాను ప్రియాంక గాంధీ గురించి అలా మాట్లాడాల్సింది కాదంటూ క్షమాపణలు చెప్పారు. అయినప్పటికీ ఆ వివాదం కొనసాగుతుంది. -
‘నన్ను క్షమించండి.. ప్రియాంక గురించి అలా మాట్లాడాల్సింది కాదు’
ఢిల్లీ: ‘నన్ను క్షమించండి. ప్రియాంక గాంధీ (priyanka gandhi) గురించి అలా మాట్లాడాల్సింది కాదు. నేను చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నాను’అని ఢిల్లీ కాల్కాజీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్ బిదురి (Ramesh Bidhuri) క్షమాపణలు చెప్పారు. మరికొద్ది రోజుల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు (delhi assembly elections) జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఓ వైపు ముచ్చటగా మూడోసారి హస్తిన పీఠాన్ని దక్కించుకొని హ్యాట్రిక్ కొట్టాలని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఉవ్విళ్లూరుతున్నారు. మరోవైపు ఎలాగైనా దిల్లీ గద్దెనెక్కాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.మళ్లీ అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాలని అటు కాంగ్రెస్ ఎదురుచూస్తోంది. అందుకు అనుగుణంగా ఆయా పార్టీలు అభ్యర్థుల ఎంపిక, ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు.ఈ తరుణంలో కాల్కాజీ నియోజకవర్గంలో ప్రస్తుత ఢిల్లీ సీఎం అతిశీపై పోటీ చేస్తున్న బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్ బిదురి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గంలో ప్రియాంకా గాంధీ బుగ్గల వంటి సుతిమెత్తని రోడ్లు నిర్మిస్తానని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రమేష్ బిదూరి చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. బిదూరి వ్యాఖ్యలతో బీజేపీ మహిళా వ్యతిరేక పార్టీ అని మరోసారి రుజువైందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియాశ్రీనేట్ మండిపడ్డారు.మహిళల పట్ల బిదూరి మనస్తత్వాన్నిఆ వ్యాఖ్యలు ప్రతిబింబిస్తాయని, ఇది బీజేపీ నిజ స్వరూపమని పేర్కొన్నారు. బిదూరి చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై మీడియా ప్రశ్నించగా.. అవును. ప్రియాంక గాంధీ గురించి నేను మాట్లాడింది నిజమే. హేమామాలిని బుగ్గల వంటి రోడ్లు వేయిస్తానని బిహార్ మాజీ సీఎం లాలూప్రసాద్ యాదవ్ అన్నప్పుడు ఏం చేశారంటూ బుకాయించారు. అయితే నోటిని అదుపులో పెట్టుకోకపోతే ఏం గత పార్లమెంట్ ఎన్నికల్లో ఏం జరిగిందో..ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అదే జరుగుతుందనే ఏమో ప్రియాంకకు క్షమాపణలు చెప్పారు. 👉చదవండి: ప్రియాంకగాంధీపై బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు నోటిని అదుపులో పెట్టుకోకపోతేనోటిని అదుపులో పెట్టుకోకపోతే ఏం జరుగుతుందో తన పార్టీ మాజీ ఎంపీలకు తెలిసొచ్చేలా చేసింది బీజేపీ అధినాయకత్వం. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో 400పై చిలుకు లోక్‌సభ స్థానాల్ని గెలుపే లక్ష్యంగా పెట్టుకుంది.ఆ క్రమంలో ప్రతి లోక్‌సభ స్థానాన్నీ బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ‘టార్గెట్ 400’ లక్ష్యసాధనకు అడ్డొస్తారనుకుంటే సొంత పార్టీ నేతలను కూడా క్షమించడం లేదు. ఆ క్రమంలో ఎంతటి సీనియర్లనైనా సరే, సింపుల్‌గా పక్కన పెట్టేసింది. దాని ఫలితమే... వివాదాస్పదులుగా పేరుబడ్డ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్, రమేష్ బిదురి, అనంత్‌కుమార్ హెగ్డే వంటి సిట్టింగ్ ఎంపీలకు సీట్లను నిరాకరించింది. వారిలో రమేష్ బిదురి ముందు వరసలో ఉన్నారు. రమేష్ బిదురిఈ సౌత్ ఢిల్లీ సిట్టింగ్ ఎంపీ ఏకంగా పార్లమెంటులోనే అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి బీజేపీకి ఇబ్బందికర పరిస్థితులు సృష్టించారు. నిండు సభలో బీఎస్పీ ఎంపీ డానిష్ అలీని బిదురి అసభ్య పదజాలంతో దూషించడం పెను దుమారానికి దారి తీసింది. ఆయన్నూ సస్పెండ్ చేయాల్సిందేనంటూ విపక్షాలు హోరెత్తించాయి. దాంతో రెండుసార్లు ఎంపీగా, మూడుసార్లు ఎమ్మెల్యేగా చేసిన బిదురికి టికెట్ నిరాకరించింది.అనంత్‌కుమార్ హెగ్డేకర్ణాటకలో సీనియర్ బీజేపీ నేత. ఆరుసార్లు లోక్‌సభ సభ్యుడు. కేంద్ర మంత్రిగానూ చేశారు. రాజ్యాంగంలో చాలా అంశాలను మార్చాల్సి ఉందని, అందుకు బీజేపీకి ప్రజలు 400కు పైగా సీట్లు కట్టబెట్టాలని ఎన్నికల వేళ ఆయన చేసిన వ్యాఖ్యలు మంటలు రేపాయి. విపక్షాలన్నీ వాటిని అందిపుచ్చుకుని బీజేపీని దుయ్యబట్టాయి. హెగ్డే వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని బీజేపీ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. దాంతో ఆయన నాలుగుసార్లు వరుసగా నెగ్గిన ఉత్తర కన్నడ స్థానాన్ని మాజీ స్పీకర్ విశ్వేశ్వర హెగ్డేకు కేటాయించింది.పర్వేష్ సాహిబ్సింగ్ముస్లిం చిరు వ్యాపారులను పూర్తిగా బాయ్‌కాట్ చేయాలంటూ ఏకంగా ఢిల్లీలోనే బహిరంగ సభలో పిలుపునిచ్చి కాక రేపారు. సభికులతోనూ నినాదాలు చేయించారు. దాంతో పశ్చిమ ఢిల్లీ సిట్టింగ్ బీజేపీ ఎంపీ ఆయనకు కూడా టికెట్ గల్లంతైంది. వీరేగాక ఇతరేతర కారణాలతో ఈసారి చాలామంది సీనియర్లు, సిట్టింగ్ ఎంపీలకు బీజేపీ టికెట్లు నిరాకరించింది.ప్రజ్ఞాసింగ్ ఠాకూర్మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించే వారు. కాంగ్రెస్ అగ్ర నేత దిగ్విజయ్‌సింగ్‌ను 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా 3.5 లక్షల పై చిలుకు ఓట్ల మెజారిటీతో మట్టికరిపించిన చరిత్ర ఆమెది. . కాకపోతే మంటలు రేపే మాటలకు సాధ్వి పెట్టింది పేరు. నాథూరాం గాడ్సేను దేశభక్తునిగా అభివర్ణించినా, ముంబై ఉగ్ర దాడుల్లో అమరుడైన పోలీసు అధికారి హేమంత్ కర్కరేకు తన శాపమే తగిలిందంటూ అభ్యంతకర వ్యాఖ్యలు చేసి ఈసీ నుంచి షోకాజ్ నోటీసు అందుకున్నా ఆమెకే చెల్లింది. అందుకే సిట్టింగ్ ఎంపీగా ఉన్నా ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌ను పక్కన పెట్టేసింది. -
ప్రియాంకపై బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ:ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడి నేతల మాటలు హద్దు మీరుతున్నాయి. ఈ క్రమంలోనే ఢిల్లీ బీజేపీ సీనియర్ నేత రమేష్ బిదూరి కాంగ్రెస్ అగ్రనేత,ఎంపీ ప్రియాంకగాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బిదూరి సీఎం అతిషిపై బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ ఆయనను అభ్యర్థిగా ప్రకటించింది. అయితే బిదూరి తాజాగా ప్రియాంకపై మాట తూలారు. తాను ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిస్తే కల్కాజీ నియోజకవర్గంలోని రోడ్లను ప్రియాంకగాంధీ బుగ్గల్లా నున్నగా తయారు చేస్తానని మాట్లాడి వివాదంలో ఇరుక్కున్నారు. ఈ విషయమై మీడియా ఆయనను ప్రశ్నించగా తాను ఆ వ్యాఖ్యలు చేసింది నిజమేనని ఒప్పుకున్నారు. ఒకప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ కూడా హీరోయిన్ హేమమాలినిపై ఇలాంటి వ్యాఖ్యలే చేశారని, ఆయన చేసింది తప్పయితే తనది కూడా తప్పేనన్నారు. లాలూ వ్యాఖ్యలపై కాంగ్రెస్ వైఖరేంటని ప్రశ్నించారు. నిజానికి ప్రియాంకగాంధీ కంటే హేమమాలిని జీవితంలో ఎంతో సాధించారని బిదూరి గుర్తు చేశారు.ఇదీ చదవండి: సోషల్‌మీడియాలో ఆప్ వర్సెస్ బీజేపీ..ఢిల్లీలో హాట్ పాలిటిక్స్ -
జమిలి జేపీసీలో ప్రియాంక
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లోక్‌సభ, శాసనసభ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించేందుకు ఉద్దేశించిన బిల్లులను పరిశీలించేందుకు ఏర్పాటవుతున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)లో కాంగ్రెస్ తరఫున ప్రియాంకా గాంధీ నామినేట్ అయ్యారు. కాంగ్రెస్ తరఫున నామినీల జాబితాలో ప్రియాంక గాంధీ వాద్రా, మనీశ్ తివారీ, సుఖ్‌దేవ్ భగత్ పేర్లను చేర్చారు. అర్హత ఉన్న పార్టీలన్నీ తమ తమ నామినీల పేర్లను లోక్‌సభ స్పీకర్‌కు అందజేశారు. ఇక అధికారికంగా ప్రకటించడమే తరువాయి. మొత్తంగా లోక్‌సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది ఎంపీలు ఈ కమిటీలో సభ్యులుగా ఉండనున్నారు. గురువారం ఈ 21 మంది లోక్‌సభ సభ్యుల పేర్లను స్పీకర్ అధికారికంగా ప్రకటించనున్నారు. న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సంబంధిత తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ కమిటీ తమ నివేదికను వచ్చే సెషన్ చివరివారం తొలి రోజున నివేదించాలని మేఘ్వాల్ ప్రతిపాదించనున్నారు. బీజేపీ తరఫున మాజీ కేంద్ర మంత్రి పురుషోత్తంభాయ్ రూపాలా, భతృహరి మహతాబ్, అనిల్ బాలుని, సీఎం రమేశ్, బాన్సురీ స్వరాజ్, విష్ణు దయాళ్ రామ్, సంబిత్ పాత్రాల పేర్లు ఖరారైనట్లు సమాచారం. గతంలో న్యాయశాఖ సహాయ మంత్రిగా చేసిన పీపీ చౌదరి జేపీసీకి ఛైర్మన్‌గా ఉంటారని తెలుస్తోంది. అయితే అనురాగ్ ఠాకూర్ పేరు సైతం పరిశీలనలో ఉందని సమాచారం. శివసేన తరఫున శ్రీకాంత్ షిండే, సమాజ్‌వాదీ పార్టీ తరఫున ధర్మేంద్ర యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ తరఫున కళ్యాణ్ బెనర్జీ, డీఎంకే తరఫున టీఎం సెల్వగణపతి, టీడీపీ తరఫున జీఎం హరీశ్ బాలయోగి, ఎన్సీపీ(ఎస్పీ) తరఫున సుప్రియా సూలే, ఆర్ఎల్డీ తరఫున చందన్ చౌహాన్, జనసేన పార్టీ తరఫున బాలశౌరి వల్లభనేని కమిటీలో సభ్యులుగా ఉండనున్నారు. బీజేపీ సారథ్యలోని ఎన్డీఏ కూటమి తరఫున కమిటీలో 14 మంది సభ్యులు ఉండనున్నారు. వీరిలో బీజేపీ నుంచి 10 మంది ఉంటారు. రాజ్యసభ నుంచి కాంగ్రెస్ తరఫున రణ్‌దీప్ సూర్జేవాలా, డీఎంకే తరఫున పి.విల్సన్, టీఎంసీ తరఫున సాకేత్ గోఖలే, జేడీ(యూ) తరఫున సంజయ్ ఝా, బీజేడీ తరఫున మానస్ రంజన్ మంగరాజ్ల పేర్లు దాదాపు ఖరారయ్యాయి. జమిలీ ఎన్నికల బిల్లులు రాజ్యాంగ విరుద్ధమని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం విదితమే. -
గాంధీ కుటుంబం రాజ్యాంగాన్ని అవమానించింది: లోక్‌సభలో ప్రధాని మోదీ
Live Updates..రాజ్యాంగంపై చర్చ.. ప్రధాని మోదీ సమాధానంఇవాళ మనం ప్రజాస్వామ్య పండుగను జరుపుకుంటున్నాంరాజ్యాంగ నిర్మాతలతో పాటు దేశ ప్రజలకు ధన్యవాదాలుప్రజాస్వామ్య భావనను 75 ఏళ్లుగా నిలబెట్టుకున్నాంఅందుకు ప్రజలకే మొదట ఘనత దక్కుతుందిభారత ప్రజాస్వామ్యం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందిమనది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమే కాదు.. ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు కూడామనది మదర్ ఆఫ్ డెమోక్రసీదేశం వేగంగా అభివృద్ధి చెందుతోందిత్వరలోనే మూడో బలమైన ఆర్థిక శక్తిగా అవతరించబోతుందిరాజ్యాంగంలో మహిళలు కీలక ప్రాంత పోషించారువివిధ రంగాలకు చెందిన ఆ మహిళలు రాజ్యాంగ నిర్మాణంలో చాలా ప్రభావశీలంగా పనిచేశారు.భిన్నత్వంలో ఏకత్వం భారత్ ప్రత్యేకతభారతీయుల ఏకతనే రాజ్యాంగం కూడా ప్రస్తావించిందిఆర్టికల్ 370 దేశం ఏకత్వానికి అడ్డుగా నిలిచింది.ప్రజాస్వామ్యానికి రాజ్యాంగం తల్లి లాంటిందిభారత ప్రజాస్వామ్యం, గణతంత్రం ఎంతో గొప్పదిమన రాజ్యాంగం ఎన్నో దేశాలకు స్ఫూర్తిగా నిలిచింది.ఎందరో మహానుభావులు మన రాజ్యాంగాన్ని రచించారు.ప్రజా స్వామ్య దేశాలు భారత్‌ను విశ్వసిస్తున్నాయి.గాంధీ కుటుంబం రాజ్యాంగాన్ని అవమానించింది.కాంగ్రెస్ నేతలు రాజ్యాంగ నిర్మాతలను అవమానించారుకాంగ్రెస్ ప్రజాస్వామ్యం గొంతు నొక్కిందిప్రజల మద్దతు లేకుండానే గాంధీ కుటుంబం దేశాన్ని పాలించింది. లోక్‌సభలో రాజ్యాంగంపై వాడీవేడీ చర్చ..కాసేపట్లో ప్రతిపక్ష నేతల ప్రశ్నలపై సమాధానం ఇవ్వనున్న ప్రధాని మోదీపార్లమెంటులో రాజ్యాంగంపై రెండో రోజు కొనసాగుతున్న చర్చరాజ్యాంగ చర్చలో.. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 26.. మతపరమైన విద్యాసంస్థల ఏర్పాటు, నిర్వాహణకు వెసులుబాటు కల్పించింది కానీ, ప్రధాని మాత్రం వక్ఫ్ బోర్డుకు రాజ్యాంగంతో ఏమాత్రం సంబంధం లేదని అంటున్నారు. అసలు ఈ ప్రధానికి పాఠాలు నేర్పింది ఎవరు?. ఆయన్ని(ప్రధాని మోదీని ఉద్దేశించి..) ఆర్టికల్ 26 చదవమనండి. వక్ఫ్ ఆస్తులను లాక్కునే కుట్రను కేంద్రం చేస్తోంది #WATCH | During discussion on 75th anniversary of adoption of the Constitution of India, AIMIM MP Asaduddin Owaisi says, "Read Article 26, it gives religious denomination, the right to establish and maintain institution for religious and charitable purposes. The Prime Minister… pic.twitter.com/5KOoRAe6Vm— ANI (@ANI) December 14, 2024 అందుకే కులగణన.. రాజ్యాంగ చర్చలో రాహుల్ గాంధీ50 శాతం రిజర్వేషన్ అనే గోడను మేం బద్ధలు కొడతాంఅందుకే కులగణనని తెరపైకి తెచ్చాంమీరేం చెప్తారో.. చెప్పుకోండిదేశం కోసం రాజ్యాంగం.. ఇండియా కూటమి సిద్ధాంతంరాజ్యాంగ పరిరక్షణ కోసమే ఈ కూటమి ఉందిఆర్థిక-సామాజిక సమానత్వాలు లేకుండా రాజకీయ ఐక్యత మనుగడ కష్టమని అంబేద్కర్ చెప్పారుఇవాళ అదే ప్రతీ ఒక్కరి ముందు కనిపిస్తోందిరాజకీయ సమానత్వం లేకుండా పోయిందిదేశంలోని వ్యవస్థలన్నింటిని గుప్పిట పట్టేశారుసామాజిక, ఆర్థిక సమానత్వాలు లేకుండా పోయాయిదళితులు, ఆదివాసీలు, వెనుకబడిన కులాలు, రైతులు, శ్రామికులు.. దేశంలో వీళ్లు(బీజేపీ) ఎవరి బొటనవేళ్లు కత్తిరిస్తున్నారో దేశానికి చూపించాలనుకున్నాంఈ క్రమంలోనే కులగణన మా తదుపరి అడుగు అయ్యిందికులగణనతో భారత్‌లో సరికొత్త అభివృద్ధికి బాటలు వేస్తాంఅలా రాజ్యాంగంలో ఉందా? చూపించండి: రాహుల్ గాంధీకుల, వర్ణ, వర్గ, లింగ.. వివక్ష రహిత సమాజం కొనసాగాలని రాజ్యాంగంలో ఉంది.కొన్నిరోజుల కిందట.. సంభల్ నుంచి కొందరు యువకులు నన్ను చూడడానికి వచ్చారుఅమాయకులైన ఐదుగురు నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపబడ్డారుఅలా చంపేయమని రాజ్యాంగంలో రాసి ఉందా?మీరు ఎక్కడికి వెళ్లినా.. ఒక మతంతో మరొక మతానికి వ్యతిరేకంగా ద్వేషాన్ని వెదజల్లుతారు.హాథ్రస్ సామూహిక అత్యాచార బాధితురాలి ఇంటికి వెళ్లి పరామర్శించాబాధితులు మాత్రం ఇంటినుంచి బయటకు రాలేని పరిస్థితి.ఒక మతానికి వ్యతిరేకంగా మరో మతాన్ని ఉసిగొల్పాలని, ఒక దళిత కుటుంబాన్ని బంధించాలని నేరాలు చేసిన వాళ్లను స్వేచ్ఛగా తిరిగేందుకు స్వేచ్ఛ ఇవ్వాలని రాజ్యాంగంలో ఉందా?రాజ్యాంగంలో అలా ఎక్కడ రాశారు? నాకు చూపించండి.. రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ రక్షణ కల్పిస్తోంది. బీజేపీ మాత్రం దానిపై దాడి చేస్తూనే ఉంది లోక్‌సభలో రాజ్యాంగంపై చర్చ.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రసంగంఅగ్నివీర్తో దేశ యువత బొటనవేలు తెంపేశారుదేశవ్యాప్తంగా 70 పేపర్ల లీకేజీ ఘటనలు వెలుగు చూశాయిపేపర్ లీక్‌లతో యువత బొటనవేలు తెంపేశారుఢిల్లీ సరిహద్దులో రైతులపైకి టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్నారు.. రైతులపై లాఠీ ఛార్జీలు చేస్తున్నారువాళ్లు మిమ్మల్ని కోరేది మద్దతు ధర.. ఆ డిమాండ్ సబబైందేకానీ, అదానీ, అంబానీలను అందలం ఎక్కిస్తూ.. అన్నదాతల బొటనవేలు కూడా తెంపేశారుఅభయ ముద్రతో మేం(కాంగ్రెస్) ‘‘భయపడొద్దు’’ అని ప్రజలకు చెప్తుంటే.. మీరేమో వాళ్ల బొటనవేలు తెంచేస్తున్నారుఇదే మీకు మాకు ఉన్న తేడా! లోక్‌సభలో రాజ్యాంగంపై చర్చ.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రసంగంఅనేకమంది మేధావుల లోచనలకు ప్రతిరూపం మన రాజ్యాంగందేశంలో ప్రజలు వివిధ రకాల సిద్ధాంతాలను పాటిస్తారుసావర్కర్ సిద్దాంతాలను తప్పుబట్టిన రాహుల్ గాంధీ మనుస్మృతి సిద్ధాంతాలను అనుసరించి రాజ్యాంగం ఉండాలని సావర్కర్ విశ్వసించారురాజ్యాంగం, మనుస్మృతి వేర్వేరురాజ్యాంగం ఆధునిక భారత దస్త్రం.. కానీ, ప్రాచీన భారతం, దాని ఆలోచనలు అందులో ఉన్నాయిరాజ్యాంగాన్ని తెరిస్తే.. అంబేద్కర్, గాంధీ, నెహ్రూల ఆకాంక్షలు, ఆలోచనలు మనకు కనిపిస్తాయిసావర్కర్ గురించి ప్రశ్నిస్తే నన్ను దోషిగా చూస్తున్నారుమహాభారతంలోని కులవివక్షను ప్రస్తావించిన రాహుల్ గాంధీఏకలవ్యుడు ద్రోణాచార్యుడి దగ్గరకు విలువిద్య నేర్పమని వెళ్లాడునువ్వు మా జాతివాడివి కాదని ఏకలవ్యుడ్ని వెనక్కి పంపాడుద్రోణుడి ప్రతిరూపంతో ఏకలవ్యుడు విలువిద్య నేర్చుకున్నాడుద్రోణుడు కోరితే తన బొటనవేలును గురుదక్షిణగా ఇచ్చాడుద్రోణుడి మాదిరిగానే మీరు(కేంద్రాన్ని ఉద్దేశించి..) కూడా దేశ యువత బొటనవేలును కత్తిరిస్తున్నారు. #WATCH | During discussion on 75th anniversary of adoption of the Constitution of India, Lok Sabha LoP Rahul Gandhi says, "This is Abhayamudra. Confidence, strength and fearlessness come through skill, through thumb. These people are against this. The manner in which Dronacharya… pic.twitter.com/nIropoeCfq— ANI (@ANI) December 14, 2024#WATCH | During discussion on 75th anniversary of adoption of the Constitution of India, Lok Sabha LoP Rahul Gandhi says, "I want to start my speech by quoting what the Supreme Leader, not of the BJP but of the modern interpretation of the ideas of the RSS has to say about the… pic.twitter.com/eS7HGR8Ivp— ANI (@ANI) December 14, 2024 జమిలి ఎన్నికలకు కాంగ్రెస్ వ్యతిరేకం: కార్తీ చిదంబరం👉వన్ నేషన్ వన్ ఎలక్షన్‌పై, కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం మాట్లాడుతూ..‘కాంగ్రెస్ పార్టీ ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తోంది. డీఎంకేతో సహా అనేక ప్రాంతీయ పార్టీలు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి. సమాఖ్య నిర్మాణాన్ని తీసివేయడానికి ప్రభుత్వం చేస్తున్న మరో ప్రయత్నం ఇది. రాష్ట్ర ఎన్నికలు ప్రజాస్వామ్యానికి చాలా మంచివి. రాష్ట్ర ఎన్నికలు రాజకీయ పార్టీలను ఆమోదించడానికి లేదా తిరస్కరించడానికి ప్రజలకు అవకాశం ఇస్తాయి అని కామెంట్స్ చేశారు.#WATCH | Delhi: On One Nation One Election, Congress MP Karti Chidambaram says, "The Congress party will oppose this proposal and many regional parties including the DMK oppose the proposal. It is yet another attempt by the government to take away the federal structure. Having… pic.twitter.com/kK2CfP1KFm— ANI (@ANI) December 14, 2024అలా చేయడం నియంతృత్వమే.. 👉జమిలి ఎన్నికలపై టీఎంసీ ఎంపీ కీర్తి ఆజాద్ మాట్లాడుతూ..‘1966-68 వరకు ప్రతీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు కొనసాగింది. అందుకే అన్ని ఎన్నికలు కలిసి జరిగేవి. కానీ సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడటం ప్రారంభమైన తర్వాత వ్యవస్థ మారిపోయింది. సంకీర్ణాల వల్ల కొన్నిసార్లు ప్రభుత్వం పడిపోతుంది. ఇలాంటి నిర్ణయాలు ఏకపక్షంగా తీసుకోవద్దు. ప్రతిపక్షంతో మాట్లాడకుండా దీనిని తీసుకురావడం నియంతృత్వం అవుతుంది.#WATCH | Delhi | On One Nation One Election, TMC MP Kirti Azad says, “Till 1966-68, all the elections used to happen together because the government used to run for 5 years. But then the system changed because coalition governments started forming and sometimes the government… pic.twitter.com/Cjiz5jzSNA— ANI (@ANI) December 14, 2024 👉దేశంలో మైనారిటీలపై జరుగుతున్న అంశం లోక్‌సభలో చర్చకు వచ్చింది.. ఈ సందర్బంగా ప్రతిపక్షాలకు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు కౌంటరిచ్చారు. 👉లోక్‌సభలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు మాట్లాడుతూ.. మన దేశంలో మైనారిటీలకు రక్షణ లేదని ప్రతిపక్ష నేతలు ఎందుకు అంటున్నారు. దేశ ప్రతిష్టకు భంగం కలిగించే ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. ఏ ఒక్క పార్టీ కోసమో చెప్పడం లేదు. నేను దేశం కోసం చెబుతున్నాను.👉యూరోపియన్ యూనియన్‌లోని సెంటర్ ఫర్ పాలసీ అనాలిసిస్ సర్వే ప్రకారం.. యూరోపియన్ యూనియన్‌లో 48% మంది ప్రజలు వివక్షకు గురయ్యారు. అందులో ముస్లింలు, హిందువులు, మైనారిటీలు కూడా ఉన్నారు. స్పెయిన్‌లో ముస్లింలపై వివక్ష ఎక్కువగా ఉంది. ముస్లింలపై అంతర్గత ద్వేషపూరిత నేరాల నివేదిక ఇచ్చారు. ఈ నివేదికలో కూడా పాకిస్తాన్ పరిస్థితి, బంగ్లాదేశ్‌లో జరుగుతున్న విషయాలను వెల్లడించారు. ఆప్ఘనిస్తాన్ సహా టిబెట్‌లో జరుగుతున్న పరిణామాలను సైతం చెప్పారు. అలాంటప్పుడు ఈ దేశంలో మైనారిటీలకు రక్షణ లేదని ఎందుకంటున్నారు అని ఘాటు విమర్శలు చేశారు. #WATCH | In Lok Sabha, Union Parliamentary Affairs Minister Kiren Rijiju says, "...A narrative is being created. According to the survey of the Center for Policy Analysis in European Union, 48% people in European Union have been victims of discrimination. Most of them are… pic.twitter.com/oqZVtpGLDn— ANI (@ANI) December 14, 2024👉రాజ్యాంగంపై కొంతకాలంగా అధికార, ప్రతిపక్షాల మధ్య సాగుతున్న ఆరోపణలు, ప్రత్యారోపణల యుద్ధం పార్లమెంటుకు చేరింది. ఇరుపక్షాల మధ్య మధ్య ఇవాళ లోక్‌సభలో వాడీవేడి చర్చ జరగనుంది. రాజ్యాంగ వజ్రోత్సవాల సందర్భంగా జరుగుతున్న ప్రత్యేక చర్చలో ప్రధాని మోదీ- ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇవాళ మాట్లాడనున్నారు. 👉లోక్‌సభ చేపట్టిన రెండు రోజుల చర్చలో.. ఇవాళ కూడా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయి. రాజ్యాంగంపై చర్చలో.. రాహుల్ గాంధీ, ఇతర పార్టీల నేతలూ మాట్లాడతారు. సాయంత్రం.. ఆఖర్లో ప్రధాని ప్రసంగంతో ఈ చర్చ ముగియనుంది. ఈ క్రమంలో నిన్న ప్రియాంక గాంధీ.. ఇవాళ రాహుల్ గాంధీ వేసిన ప్రశ్నలకు, విమర్శలకు మోదీ స్పందించనున్నారు.👉పార్లమెంట్ వద్ద ప్రియాంక గాంధీ సహా ప్రతిపక్ష పార్టీల నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్బంగా ప్రియాంక మాట్లాడుతూ.. విపత్తుకు గురైన వయనాడ్‌కు స్పెషల్ ప్యాకేటీ ఇచ్చేందుకు కేంద్రం నిరాకరించింది. హిమాచల్‌లో కూడా ఇలాంటి విపత్తే సంభవించింది. ఈ మేరకు సాయం కేంద్రాన్ని కోరాం. ఈ మేరకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశాం. కానీ, విన్నపాన్ని వారు పట్టించుకోలేదు. విపత్తును కూడా రాజకీయ కోణంలోనే చూస్తున్నారు. అక్కడ నివస్తున్న వాళ్లు కూడా భారతీయలే అని కామెంట్స్ చేశారు.#WATCH | Delhi: Congress MP Priyanka Gandhi Vadra says, "The government is refusing to give a special package to Wayanad. We have requested the Home Minister, we have written to the Prime Minister...Himachal Pradesh has also seen similar large-scale devastation and there is a… https://t.co/mIyBAQipwu pic.twitter.com/7xdie56kHH— ANI (@ANI) December 14, 2024👉తొలిరోజు.. శుక్రవారం బీజేపీ అగ్రనేత, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ చర్చను ప్రారంభించారు. కాంగ్రెస్‌కు ఎప్పుడూ అధికారంపైనే యావ అని, అందుకోసం రాజ్యాంగానికి నిరంతరం తూట్లు పొడుస్తూ వచ్చిందని మండిపడ్డారు. ‘‘కాంగ్రెస్ తన దశాబ్దాల పాలనలో వ్యవస్థల స్వయం ప్రతిపత్తిని ఎన్నడూ సహించింది లేదు. రాజ్యాంగ విలువలకు, స్ఫూర్తికి పాతర వేసేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నించింది. అలాంటి పార్టీ నోట రాజ్యాంగ పరిరక్షణ వంటి మాటలు వినడం ఎబ్బెట్టుగా ఉంది’’ అంటూ ఎత్తిపొడిచారు. 👉ఆయన విమర్శలకు కాంగ్రెస్ తరఫున నూతన ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా గట్టిగా కౌంటరిచ్చారు. పార్లమెంట్లో తొలి ప్రసంగం చేసిన ఆమె.. బీజేపీపై ఎదురుదాడి చేశారు. అసలు దేశానికి రాజ్యాంగం కల్పించిన రక్షణ కవచానికి నిలువునా తూట్లు పొడిచిందే మోదీ ప్రభుత్వమంటూ దుయ్యబట్టారు.ఎల్లుండి జమిలి బిల్లు👉సోమవారం లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు రానుంది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభలో ప్రవేశపెట్టిన అనంతరం జాయింట్ పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు వన్ నేషనల్ వన్ ఎలక్షన్ బిల్ వెళ్లనుంది. 129వ రాజ్యాంగ సవరణ బిల్లుగా సోమవారం లోక్‌సభ బిజినెస్‌లో లిస్ట్ జమిలి ఎన్నికల బిల్లును చేర్చారు. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 82, 83, 172, 327కు సవరణలు ప్రతిపాదిస్తూ బిల్లు రూపకల్పన చేశారు. 👉లోక్‌సభ ఎన్నికలతో పాటే అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా బిల్లును ప్రతిపాదించారు. మధ్యలో అసెంబ్లీలు రద్దయినప్పటికీ మిగిలిన కాలానికే ఎన్నికల నిర్వహణ జరిగేలా బిల్లులో సవరణలు చేశారు. అసెంబ్లీలు ఉన్న ఢిల్లీ, జమ్మకశ్మీర్, పాండిచ్చేరి, కేంద్రపాలిత ప్రాంతాల కోసం మరొక సవరణ బిల్లును ప్రభుత్వం రూపొందించింది. అపాయింటెడ్ డే తర్వాత ఒకే సారి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరిగేలా ప్లాన్ చేశారు. 👉ఇదిలా ఉండగా.. అపాయింటెడ్ డే 2029 కంటే ముందే ఉంటుందా? లేదా అనేదానిపై భిన్నమైన చర్చలు కొనసాగుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ సహకరిస్తేనే జమిలి ఎన్నికల బిల్లు చట్ట రూపం దాల్చే అవకాశం ఉంది. -
ఢిల్లీ-ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లో హైటెన్షన్
-
సంభల్ ఉద్రిక్తతలు.. తిరిగి ఢిల్లీ ప్రయాణమైన రాహుల్, ప్రియాంక
పోలీసుల తీరుపై రాహుల్ గాంధీ తీవ్ర అసహనం ‘మేం సంభల్ వెళ్లేందుకు పోలీసులు మమ్మల్ని అనుమతించట్లేదు. అడ్డుకుంటున్నారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా అక్కడికి వెళ్లే హక్కు నాకు ఉంది. ఇతర నేతలతో కాకుండా ఒంటరిగా వెళ్లేందుకూ నేను సిద్ధమే. పోలీసులతో కలిసి వెళ్లేందుకైనా సిద్ధమే. కానీ, వారు అందుకు అంగీకరించడం లేదు ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని మండిపడ్డారు.అటు వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. ‘‘బాధితులను కలిసే హక్కు రాహుల్‌కు ఉంది. ఆయనను అనుమతించాలి’’ అని డిమాండ్ చేశారు. అయినా, పోలీసులు వారిని అనుమతించలేదు. దీంతో చేసేదేం లేక.. కాంగ్రెస్ నేతలు అక్కడినుంచి వెనుదిరిగి ఢిల్లీకి వెళ్లిపోయారు. ఢిల్లీకి తిరుగు ప్రయాణమైన రాహుల్ ప్రియాంకదాదాపు 2 గంటల తర్వాత ఢిల్లీకి పయనమైన నేతలుసంభల్ సందర్శనకు అనుమతి లేదని అడ్డకున్న పోలీసులు ఘాజీపూర్ సరిహద్దుకు చేరుకున్న ప్రియాంక, రాహుల్ఘాజీపూర్లో వీరి కాన్వాయ్‌ను అడ్డుకున్న పోలీసులు.ఢిల్లీ టు సంభల్ మార్గంలో ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసిన పోలీసులుఘాజీపూర్ సరిహద్దు వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు #WATCH | Lok Sabha LoP & Congress MPs Rahul Gandhi, Priyanka Gandhi Vadra and other Congress leaders have been stopped by Police at the Ghazipur border on the way to violence-hit Sambhal. pic.twitter.com/EcPEOFahIV— ANI (@ANI) December 4, 2024న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని సంభల్ అల్లర్ల ప్రాంతాన్ని సందర్శించేందుకు కాంగ్రెస్ ఎంపీలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా బయలుదేరారు. సంభాల్‌లోని మసీదులో సర్వే కారణంగా చెలరేగిన హింసాకాండ నేపథ్యంలో ఆ ప్రాంతంలో పరిస్థితిని సమీక్షించనున్నారు. రాహుల్, ప్రియాంక వెంట ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఐదుగురు కాంగ్రెస్ ఎంపీలు ప్రతినిధి బృందం కూడా ఉన్నారు. ఈ మేరకు కాంగ్రెస్ కార్యకర్తలు ఢిల్లీలోని 10 జనపథ్ నివాసం వెలుపల భారీగా గుమిగూడారు. దీంతో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.#WATCH | Visuals from Ghazipur border where Lok Sabha LoP & Congress MPs Rahul Gandhi, Priyanka Gandhi Vadra and other Congress leaders have been stopped by Police on the way to violence-hit Sambhal. pic.twitter.com/eqad86lxr0— ANI (@ANI) December 4, 2024 ఢిల్లీ నలుమూలలా భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా ఢిల్లీ–సంభల్ మార్గంలోని వివిధ ప్రాంతాల్లో ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. దీంతో ఢిల్లీ–మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఘాజీపూర్ సరిహద్దులో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.అయితే సంభల్‌లో శాంతిభద్రతల దెబ్బతిన్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ పోలీసులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను ఆ ప్రాంతానికి చేరుకోకుండా ఆడ్డుకునే అవకాశం ఉంది. శాంతిభద్రతల పరిస్థితి కారణంగా బయటి వ్యక్తులను ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి అనుమతించబోమని పోలీసులు, జిల్లా యంత్రాంగం పేర్కొంది. ఈ క్రమంలోనే ఇటీవల సమాజ్ వాదీ పార్టీ ఎంపీల ప్రతినిధి బృందం జిల్లాలోకి ప్రవేశించకుండా నిలిపివేశారు. ఇక నిషేధాజ్ఞలను డిసెంబర్ 31 వరకు పొడిగించారు.జిల్లా కలెక్టర్ రాజేంద్ర పెన్సియా గౌతమ్ బుద్ధ్ నగర్, ఘజియాబాద్ పోలీసు కమీషనర్లకు.. అమ్రోహా, బులంద్‌షహర్ పోలీసు సూపరింటెండెంట్లకు లేఖ రాశారు. రాహుల్ సోనియా గాంధీలను ఆపాలని లేఖలో కోరారు. మరోవైపు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్ మాట్లాడుతూ.. కనీసం నలుగురు సభ్యుల ప్రతినిధి బృందాన్ని సంభాల్‌కు వెళ్లడానికి అనుమతించాలని డిమాండ్ చేశారు.కాగా సంభల్‌లోని షాహీ జామా మసీదు ఉన్న స్థలంలో దేవాలయం కొందని కొందరు హిందూ పిటిషనర్లు గతంలో ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ జరిపిన న్యాయస్థానం సర్వేకు ఆదేశాలు ఇచ్చింది. ఆ సర్వే జరుగుతోన్న సమయంలోనే అల్లర్లు చెలరేగాయి. స్థానికులు, పోలీసులపై కొందరు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. పోలీసులు, అధికారుల వాహనాలకు నిప్పంటించారు. ఆ ఘర్షణల్లో ఐదుగురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. దీంతో సంభల్‌లో నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయి. ఈ ఘటనలో ఇప్పటికే పోలీసులు స్థానిక సమాజ్ వాదీ పార్టీ ఎంపీ జియా ఉర్ రెహ్మాన్, సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే మహమూద్ కుమారుడు సోహైల్ ఇక్బాల్, మరో 700 మందికి పైగా గుర్తు తెలియని వ్యక్తులపై కేసులు నమోదు చేశారు.. -
లోక్‌సభలో ప్రియాంక సీటింగ్ ఖరారు.. మోదీ, రాహుల్ స్థానాలు కూడా!
18వ లోక్‌సభలో ఎంపీల సీటింగ్ ఏర్పాట్లు ఖరారయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీటులో ఎలాంటి మార్పు లేదు. గతంలో మాదిరి ఆయన ముందు వరుసలోని తొలి సీట్లో కూర్చోనున్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రెండో స్థానంలో, హోంమంత్రి అమిత్ షా మూడో సీట్ నెంబర్లో కూర్చోనున్నారు. గతంలో సీటు నెంబర్ 58లో కూర్చొనే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇకపై 4వ స్థానానికి మారారు. ఇక వయనాడ్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రియాంక గాంధీ నాలుగో వరుసలో స్థానం కేటాయించారు. ఈ మేరకు సోమవారం సవరించిన సీటింగ్ జాబితాను విడుదల చేశారు.గతంలో సీట్ నెంబర్ 4, 5 ఖాళీగా ఉండేవి. కానీ ఇప్పుడు వాటిని వేరే వారికి కేటాయించారు. అదే విధంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, ఆరోగ్య మంత్రి జెపి నడ్డా వంటి కీలక మంత్రులకు స్థిరమైన సీట్లు ఖాళీగానే ఉండనున్నాయి.రాహుల్ గాంధీ 498వ స్థానంలో..వీరితోపాటు సీనియర్ ప్రతిపక్ష నేతల సీట్లు మొదటి వరుసలో ఉంటాయి. కాంగ్రెస్ నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ 498వ స్థానంలో కూర్చుంటారు., సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ 355వ స్థానంలో కూర్చోనున్నారు. లోక్‌సభలో తృణమూల్ కాంగ్రెస్ నేత సుదీప్ బందోపాధ్యాయకు 354వ సీటు కేటాయించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌కు రాహుల్ గాంధీ పక్కనే సీటు నంబర్ 497 కేటాయించారు. సమాజ్ వాదీ పార్టీ ఎంపీ అవధేష్ ప్రసాద్ కు లోక్ సభ రెండో వరుసలో స్థానం కల్పించారు. ఫైజాబాద్ నుంచి గెలిచిన ఆయన ఇప్పుడు సీటు నంబర్ 357లో కూర్చుంటారు. డింపుల్ యాదవ్ 358 సీటులో అతని పక్కన కూర్చుంటారు. ఇకప ప్రియాంక గాంధీ నాలుగో వరుసలో 517వ సీట్లో కూర్చోనున్నారు. కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీలు కేరళకు చెందిన అదూర్ ప్రకాష్, అస్సాంకు చెందిన ప్రద్యుత్ బోర్డోలోయ్ పక్కన ఆమె కూర్చుంటారు. -
అటు ప్రేమ, ఇటు వివక్ష
కోజికోడ్(కేరళ): పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ పట్ల అమితమైన ప్రేమ చూపిస్తున్న ప్రధాని మోదీ కేరళలోని వయనాడ్ బాధితుల పట్ల విపక్ష కనబరుస్తున్నారని లోక్‌సభలో విపక్షనేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఘన విజయం తర్వాత కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ తొలిసారిగా సొంత నియోజకవర్గానికి విచ్చేసిన సందర్భంగా కోజికోడ్‌లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆమెతో కలిసి రాహుల్‌గాంధీ పాల్గొని ప్రసంగించారు. ‘‘అందర్నీ సమాన దృష్టిలో చూడాలని మన రాజ్యాంగం ప్ర¿ోధిస్తోంది. కానీ మన ప్రధానికి మాత్రం అవేం పట్టవు. అమెరికాలో అదానీపై కేసులు నమోదయ్యాక ఆయనను భారతీయులంతా ఒక నిందితుడిగా చూస్తుంటే ప్రధాని మోదీ మాత్రం ఆయనను ప్రత్యేకంగా చూస్తున్నారు. అమెరికాలో అదానీపై నేరాభియోగాలు నమోదైనా ప్రధాని మోదీ అస్సలు పట్టించుకోరు. ఆయనను నేరస్తుడు అని అమెరికా సంబోధించినా భారత ప్రభుత్వం ఆయనపై ఎలాంటి నేరాభియోగాలు మోపదు. అదానీపై ఇంతటి ప్రేమ ఒలకబోసే ప్రధాని కేరళలో ప్రకృతి విలయంతో సర్వం కోల్పోయిన వయనాడ్ బాధితుల బాధలను చెవికెక్కించుకోరు. అవసరమైన సహాయక సహకారాలు మద్దతు ఇవ్వాలనే ఆలోచన ఆయనకు లేదు. ఇలాంటి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ సమర్థవంతంగా ప్రజల కోసం పోరాడుతోంది. మన మీద నమ్మకంతో, కాపాడుతామన్న విశ్వాసంతో ప్రజలు మన వద్దకు వస్తున్నారు. వయనాడ్‌లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు న్యాయం జరిగేంతవరకు పోరాడతా’’అని అన్నారు. అంతకుముందు రాహుల్ వయనాడ్ మృతులకు నివాళులరి్పంచారు. బీజేపీ, ప్రకృతి విపత్తు ఒక్కటే: ప్రియాంక రాహుల్ తర్వాత ప్రియాంకాగాంధీ ప్రసంగించారు. ‘‘ప్రకృతి విపత్తు, బీజేపీ మధ్య చాలా పోలికలు ఉన్నాయి. రెండింటి శైలి ఒక్కటే. ప్రకృతి విపత్తు ఎలాగైతే తనకు నచి్చనట్లు చేస్తుందో బీజేపీ కూడా ఎలాంటి నియమనిబంధనలు, వివరణలు, ప్రజాస్వామ్యయుతవిధానాలను అవలంభించదు. బీజేపీ నుంచి ఎదుర్కొంటున్న రాజకీయసవాళ్లు అచ్చు కొండచరియలు విరిగిపడటం లాంటిదే. రాజకీయసమరంలో పాటించాల్సిన కనీస ధర్మాలనూ బీజేపీ పాటించదు. రాజ్యాంగబద్ద సంస్థలనూ నాశనంచేస్తోంది. విధ్వంసకర అజెండాకు మాత్రమే బీజేపీ కట్టుబడి ఉంటుంది. వయనాడ్ ప్రజల మనిషిగా పార్లమెంట్లో మాట్లాడతా. ఇక్కడి వారి సమస్యలను ప్రస్తావిస్తా. సోదరుడు రాహుల్‌గాం«దీపై చూపించిన ప్రేమను నాపైనా చూపించినందుకు మీకు రెండింతల ధన్యవాదాలు. గెలిచి ఇక్కడికొచ్చా. వయనాడ్ ప్రజల ఉజ్వల భవిత కోసం నా శాయశక్తుల కృషిచేస్తా’’అని ప్రియాంక గాంధీ అన్నారు. -
నేడు వయనాడ్‌కు రాహుల్, ప్రియాంక
వయనాడ్: కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ వాద్రా శనివారం కేరళలోని వయనాడ్‌లో పర్యటించనున్నారు. వయనాడ్ నియోజకవర్గంలో బహిరంగ సభలో వారు ప్రసంగిస్తారని కాంగ్రెస్ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. కోజికోడ్ జిల్లాలోని ముక్కమ్‌లో మధ్యాహ్నం బహిరంగ సభ జరుగుతుందని పేర్కొన్నాయి. కరూలై, వాందూర్, ఎడవాన్నా పట్టణాల్లోనూ ప్రజలను ప్రియాంక, రాహుల్ కలుసుకుంటారని తెలిపాయి. వయనాడ్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ప్రియాంక భారీ మెజార్టీతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆమె లోక్‌సభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎంపీ హోదాలో తొలిసారిగా వయనాడ్‌లో పర్యటించబోతున్నారు. తనను గెలిపించినందుకు గాను నియోజకవర్గ ప్రజలకు ప్రియాంక కృతజ్ఞతలు తెలియజేయనున్నారు. -
Parliament Session: ఉభయసభలు రేపటికి వాయిదా
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయసభలు రేపటికి(శుక్రవారం) వాయిదా పడ్డాయి. అటు లోక్‌సభ, రాజ్యసభలోనూ విపక్షాల ఆందోళనలతో సభ కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది. అదాని గ్రూప్ అవినీతి ఆరోపణలపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ సభలను వాయిదావేశారు. పార్లమెంట్ ఉభయ సభలు 12గంటల వరకూ వాయిదా పడ్డాయి.లోక్‌సభ స్పీకర్ కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీతో కేరళలోని వయనాడ్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయించారు. కేరళ సంప్రదాయాన్ని ప్రతిబింబించే ఆహార్యంలో సభకు వచ్చిన ఆమె.. ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆమెకు పలువురు అభినందనలు తెలియజేశారు.పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నాలుగోరోజైన గురువారం ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు ఉభయసభలు మొదలయ్యాయి. #WATCH | Delhi: Congress MP Shashi Tharoor says, " I am delighted as we had campaigned for her. I am happy that she won...as you can see, she is appropriately dressed in a Kerala saree" pic.twitter.com/MFoJPaf4dj— ANI (@ANI) November 28, 2024 కాగా తాజాగా వెలువడిన లోక్‌సభ ఉప ఎన్నికల్లో వయనాడ్ నుంచి ప్రియాంకా గాంధీ నాలుగు లక్షలకుపైగా రికార్డు మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. దీంతో ఆమె తొలిసారిగా లోక్‌సభలో అడుగుపెట్టనుండగా, పార్లమెంటులో ముగ్గురు గాంధీలు ఎంపీలుగా దర్శనమివ్వనున్నారు. ప్రస్తుతం సోనియా రాజ్యసభలో ఎంపీగా ఉండగా, రాహుల్, ప్రియాంక లోక్‌సభలో కూర్చోనున్నారు. వక్ఫ్ బిల్లును పరిశీలించేందుకు ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) తన నివేదికను సమర్పించేందుకు నవంబర్ 29న గడువును పొడిగిస్తూ ప్రతిపాదనను సమర్పించనుంది.ఇక నవంబర్ 25న ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు తొలిరోజు నుంచి స్తంభిస్తూనే ఉన్నాయి. ఉభయ సభలు రోజంతా వాయిదా పడుతున్నాయి. మణిపూర్ హింస, సంభాల్ హింస సహా పలు సమస్యలపై ఎంపీలు ఆందోళనకు దిగుతున్నారు. 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని రెండో రోజు సభ జరగలేదు. మూడో రోజు ఉభయ సభలు గంట వ్యవధిలో వాయిదా పడ్డాయి. -
నేటి పార్లమెంట్లో.. ముచ్చటగా ముగ్గురు ‘గాంధీ’ ఎంపీలు
న్యూఢిల్లీ: కేరళలోని వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ మహిళా నేత ప్రియాంకా గాంధీ తన సోదరుడు రాహుల్, తల్లి సోనియా గాంధీలతో పాటు నేడు (గురువారం) పార్లమెంటుకు చేరుకోనున్నారు. ఈరోజు ఆమె లోక్‌సభ ఎంపీగా ప్రమాణం చేయనున్నారు. రాహుల్ గత లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్, రాయ్‌బరేలీ రెండు స్థానాలలో విజయం సాధించారు. తరువాత ఆయన వయనాడ్‌ను వదులుకున్నారు. తాజాగా ఈ స్థానం నుంచి ప్రియాకా గాంధీ పోటీ చేసి నాలుగు లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.2024 లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయకూడదని సోనియా గాంధీ నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత ఆమె రాజ్యసభకు ఎన్నికయ్యారు. సోనియా సంతానం రాహుల్, ప్రియాంక ఇప్పుడు లోక్‌సభకు చేరుకున్నారు. అంటే పార్లమెంటు ఎగువ సభలో తల్లి, దిగువ సభలో కుమారుడు, కుమార్తె కూర్చోనున్నారు.ఇదేవిధంగా సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆయన భార్య డింపుల్ యాదవ్ కూడా లోక్ సభ సభ్యులు. అఖిలేష్ యాదవ్ లోక్‌సభ ఎన్నికల్లో కన్నౌజ్ నుంచి గెలుపొందగా, ఆయన భార్య ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి స్థానం నుంచి ఎన్నికయ్యారు. అఖిలేష్ యాదవ్ బంధువు అక్షయ్ యాదవ్ ఫిరోజాబాద్ స్థానం నుంచి గెలుపొందగా, మరో బంధువు ధర్మేంద్ర యాదవ్ బదౌన్ నుంచి గెలుపొందారు. అఖిలేష్ కుటుంబానికి చెందిన నలుగులు ఎంపీలుగా ఉన్నారు.బీహర్ నేత పప్పు యాదవ్ పూర్నియా లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. ఆయన భార్య రంజిత్ రంజన్ ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ నుండి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. శరద్ పవార్ ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు. 2014 నుంచి ఆయన సభకు ఎన్నికవుతూవస్తున్నారు. ఆయన కుమార్తె సుప్రియా సూలే మహారాష్ట్రలోని బారామతి లోక్‌సభ స్థానం నుంచి ప్రస్తుత ఎంపీగా ఉన్నారు.ఇది కూడా చదవండి: Pakistan: షియా-సున్నీల ఘర్షణ.. 10 మంది మృతి -
సంభాల్ ఘటన: యూపీ ప్రభుత్వంపై ప్రియాంక మండిపాటు
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్లోగల జామా మసీదు సర్వే పనుల్లో చోటుచేసుకున్న హింసపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా స్పందించారు. ఈ ఘటనలో యూపీ ప్రభుత్వ వైఖరిపై ఆమె విమర్శలు గుప్పించారు. ఎలాంటి విచారణ లేకుండానే అధికారులు హడావుడిగా చర్యలు చేపట్టారని ఆమె ఆరోపించారు.संभल, उत्तर प्रदेश में अचानक उठे विवाद को लेकर राज्य सरकार का रवैया बेहद दुर्भाग्यपूर्ण है। इतने संवेदनशील मामले में बिना दूसरा पक्ष सुने, बिना दोनों पक्षों को विश्वास में लिए प्रशासन ने जिस तरह हड़बड़ी के साथ कार्रवाई की, वह दिखाता है कि सरकार ने खुद माहौल खराब किया। प्रशासन ने…— Priyanka Gandhi Vadra (@priyankagandhi) November 25, 2024అధికారంలో ఉన్నప్పుడు ఏ ప్రభుత్వానికైనా వివక్ష, అణచివేత, విభజన ధోరణి తగదని ప్రియాంక గాంధీ అన్నారు. సుప్రీం కోర్టు సంభాల్ ఘటనను పరిగణలోకి తీసుకుని, న్యాయం చేయాలని ప్రియాంకాగాంధీ కోరారు. సంభాల్‌లోని జామా మసీదు సర్వేను వ్యతిరేకిస్తున్న నిరసనకారులు పోలీసులతో హింసాత్మక ఘర్షణకు పాల్పడ్డారు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, 20 మంది భద్రతా సిబ్బంది సహా పలువురు గాయపడ్డారు. ఈ ఘటన అనంతరం జిల్లాలో 12వ తరగతి వరకు పాఠశాలలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. దీంతో పాటు ఇంటర్నెట్పై నిషేధం విధించారు. అలాగే నవంబర్ 30 వరకు బయటి వ్యక్తులు జిల్లాలోకి రాకుండా జిల్లా యంత్రాంగం నిషేధం విధించింది. ఇది కూడా చదవండి: డబ్బు కోసం కాదు, మోక్షం కోసం : నృత్యం బాధ నుంచి పుడుతుంది! -
వయనాడ్ లో భారీ మెజార్టీతో ప్రియాంక గాంధీ విజయం
-
అన్న రాహుల్ గాంధీ మెజార్టీని దాటేసిన ప్రియాంక
-
Wayanad: ప్రియాంక గాంధీ ఘన విజయం.. మెజార్టీ ఎంతంటే!
వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ రికార్డు స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకున్నారు.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తొలి ఎన్నికలోనే.. తన సత్తా చాటుతున్నారు. వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికలో ఘన విజయాన్ని దక్కించుకున్నారు. ఈ ఎన్నికల్లో ఆమె 4,08. 036 ఓట్ల మెజార్టీతో తన సమీప సీపీఎం అభ్యర్థి సత్యన్ మొకేరిపై గెలుపొందారు.రాహుల్ గాంధీ రికార్డును బ్రేక్వయనాడ్ ఉప ఎన్నికల్లో ఏకంగా సోదరుడు రాహుల్ గాంధీ మెజార్టీ ప్రియాంక బ్రేక్ చేశారు. గత వయనాడ్ ఎన్నికల్లో రాహుల్ గాంధీకి 3 లక్షల 64 వేల ఓట్ల మెజార్టీ రాగా.. ప్రియాంకకు 4 లక్షల 8 వేల ఓట్ల మెజార్టీ లభించింది. సీపీఎం అభ్యర్థి సత్యన్ మొకేరి రెండో స్థానంలో, బీజేపీ నుంచి నవ్య హరిదాస్ డో స్థానంలో ఉన్నారు.కాగా 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున బరిలోకి దిగిన రాహుల్ గాంధీ.. 3, 64, 653 ఓట్ల తేడాతో సీపీఐ అభ్యర్థిపై గెలుపొందారు. రాహుల్‌కు మొత్తం 6,47,445 ఓట్లు రాగా.. సీపీఐ నేత అన్నీ రాజాకు 2,83023 ఓట్లు పోలయ్యాయి. ఇక బీజేపీ అభ్యర్థి కే సురేంద్రన్ను 1, 41,045 ఓట్లు మాత్రమే వచ్చాయి. -
మూడు లక్షల ఆధిక్యం.. వయనాడ్‌లో భారీ లీడ్‌లో ప్రియాంక గాంధీ
ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తొలి ఎన్నికలోనే.. ప్రియాంకా గాంధీ సత్తా చాటుతున్నారు. వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నిక కౌంటింగ్లక్షకు పైగా ఆధిక్యంలో దూసుకుపోతున్నారామె. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని 48 స్థానాలకు నిర్వహించిన ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రియాంక గాంధీ పోటీకి దిగడంతో.. ఫలితంపైనే యావత్ దేశం దృష్టి కేంద్రీకృతమైంది. కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి.. ప్రియాంక గాంధీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతానికి మూడు లక్షల ఓట్ల భారీ ఆధిక్యంలో ప్రియాంక దూసుకుపోతున్నారు. సీపీఐ నుంచి సత్యన్ మొకేరి, బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ వెనుకంజలో ఉన్నారు. మధ్యాహ్నం కల్లా పూర్తి స్థాయి ఫలితం వెలువడే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌బరేలీ, వయనాడ్ నుంచి గెలుపొందిన రాహుల్ గాంధీ.. తరువాత వయనాడ్ ఎంపీ స్థానానికి రాజీనామా చేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ప్రియాంక గాంధీ ఉప ఎన్నిక బరిలో నిలిచారు. తొలిసారి ఆమె ప్రత్యక్ష ఎన్నికల పోటీలో ఉండటం విశేషం. వయనాడ్‌లో ఈ నెల 13వ తేదీన ఎన్నికలు జరిగాయి. ఈ ఉప ఎన్నికల్లో మొత్తం 16 మంది అభ్యర్థులు బరిలో నిలవగా.. ప్రియాంక గాంధీకి సీపీఐ సీనియర్ నేత సత్యన్ మొకేరి, బీజేపీ కౌన్సిలర్ నవ్య హరిదాస్ ప్రధాన పోటీదారులుగా ఉన్నారు. -
నాగపూర్ రోడ్ షోలో బీజేపీ జెండాలు.. ప్రియాంక రియాక్షన్ ఇదే!
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ఆర్ఎస్ఎస్ కంచుకోట అయిన నాగపూర్‌లో ఆదివారం రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక భవనంపై ఉన్న బీజేపీ మద్దతుదారులు ఆ పార్టీ జెండాలను ఊపి నినాదాలు చేశారు. ఇది చూసి కాంగ్రెస్ మద్దతుదారులు కూడా తమ పార్టీ నినాదాలు చేశారు.దీనిని గమనించిన ప్రియాంక గాంధీ.. చిరునవ్వుతో స్పందించారు. బుధవారం జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. మైక్ తీసుకొని వారినుద్దేశించి ఆమె మాట్లాడారు. ‘బీజేపీ మిత్రులారా, మీకు ఎన్నికల శుభాకాంక్షలు. కానీ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, శివసేన(యూబీటీ), ఎన్సీపీ(శరద్ పవార్) నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ కూటమి గెలుస్తుంది’ అని అన్నారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తల నుంచి పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.गढ़ में घुस कर ललकारना इसे कहते हैं नागपुर में गरजीं @priyankagandhi RSS और भाजपा वालों शुभकामनाएँ लेकिन जीतेगी तो महाविकास आघाड़ी ही! pic.twitter.com/YMj5ynuvpg— Supriya Shrinate (@SupriyaShrinate) November 17, 2024కాగా బీజేపీ సైద్దాంతిక మాతృసంస్థ అయిన ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం నాగ్‌పూర్‌లోనే ఉంది. దీనిని బీజేపీ కంచుకోటగా పరగణిస్తారు. 2014 నుంచి నాగ్‌పూర్ లోక్‌సభ స్థానానికి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీని పరిధిలోని ఆరు ఆసెంబ్లీ సెగ్మెంట్లలో నాలుగు ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. ఇక మహారాష్ట్ర నవంబర్ 20న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వయనాడ్ ఉపఎన్నికతో ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగుతున్నారు. మహారాష్ట్రలో నవంబర్ 20 రోడ్‌షోలో పాల్గొన్నారు. నాగ్‌పూర్ వెస్ట్, నాగ్‌పూర్ సెంట్రల్ నియోజకవర్గాల మీదుగా సాగిన ఈ రోడ్‌షోకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. నాగ్‌పూర్ వెస్ట్ ప్రస్తుతం కాంగ్రెస్ ఆధీనంలో ఉండగా.. నాగ్‌పూర్ సెంట్రల్ 2009 నుంచి బీజేపీ చేతిలో ఉంది. -
యూపీ ప్రచారానికి అగ్రనేతలు అనుమానమే?
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేతల ప్రచారంపై సందిగ్ధత నెలకొంది. వయనాడ్ ఉప ఎన్నికకు పోలింగ్ ఈ నెల 13న ముగిసిన నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌గాందీ, ప్రియాంకగాందీలు యూపీలో ఈ నెల 20న 9 స్థానాలకు జరుగనున్న ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని భావించినా ఇంతవరకు పార్టీ తరఫున ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా రాహుల్, ప్రియాంకలు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండటంతో వారు ప్రచారం చేయడం కష్టమేనని తెలుస్తోంది. నిజానికి యూపీలో జరగనున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేయాలని భావించింది. 9 స్థానాలకు గానూ కనీసంగా 4 స్థానాలకు తమకు వదిలేయాలని భాగస్వామ్య పార్టీ అయిన సమాజ్‌వాదీ పార్టీని కోరినప్పటికీ ఆ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ నుంచి సానుకూల స్పందన రాలేదు. చివరి 2 స్థానాలు ఇచ్చేందుకు ఎస్పీ అంగీకరించినా, గెలుపు అవకాశాలు లేకపోవడంతో వాటిల్లో పోటీకి కాంగ్రెస్ నిరాకరించింది. తొమ్మిది స్థానాల్లోనూ ఇండియా కూటమి తరఫున ఎస్పీ అభ్యర్థులే పోటీ చేస్తారని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆయా స్థానాల్లో అఖిలేశ్ యాదవ్ దూకుడుగా ప్రచారం చేస్తున్నారు. అధికార బీజేపీని ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆయనకు మద్దతుగా కాంగ్రెస్ అగ్రనేతలు మాత్రం ఇంతవరకు ప్రచారంలో పాల్గొనలేదు. రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు అజయ్‌రాయ్ సహా మాజీ ఎంపీ పీఎల్ పునియాలు ఎస్పీతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ప్రచారం కోసం కాంగ్రెస్, ఎస్పీలు నియోజకవర్గాల వారీగా సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసి, సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర సీఎల్పీ నేత ఆరాధన మిశ్రా, కాంగ్రెస్ ఎంపీ తనూజ్ పునియాలు ఎస్పీతో కలిసి సంయుక్త ర్యాలీలు నిర్వహిస్తున్నా, అంతంతమాత్రం స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో అగ్రనేతలతో ఉమ్మడి ప్రచార ప్రణాళికను రూపొందించాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఉమ్మడి ఎన్నికల ప్రచారాలు, బహిరంగ సభల కోసం సత్వరమే షెడ్యూల్ ఖరారు చేసి, అధికార బీజేపీ విభజన రాజకీయాలను బట్టబయలు చేసే కార్యాచరణ తీసుకోవాలని ఇరు పారీ్టల నుంచి ఒత్తిళ్లు పెరుగుతున్నా.. అగ్రనేతల ప్రచారంపై ఇంతవరకు ఏఐసీసీ నుంచి ఎలాంటి అధికార ప్రకటన రాలేదు. -
ఢిల్లీకి వస్తే గ్యాస్ ఛాంబర్లో కాలు పెట్టినట్లే: ప్రియాంకా గాంధీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఢిల్లీలో ఏర్పడిన వాయు కాలుష్యంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేరళలోని వయనాడ్‌లో లోక్‌సభ ఉపఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం ఆమె ఢిల్లీకి తిరిగి వచ్చారు. తాను రాజధానికి తిరిగి రావడం ‘గ్యాస్ ఛాంబర్’లో ప్రవేశించినట్లుగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు.ఢిల్లీలో కాలుష్యం ఏటా పెరిగిపోతోందని, స్వచ్ఛమైన గాలి కోసం అందరూ కలసికట్టుగా పనిచేయాలని ప్రియాంక గాంధీ పిలుపునిచ్చారు. ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పోస్ట్‌లో.. వయనాడ్ నుండి ఢిల్లీకి తిరిగి రావడం గ్యాస్ చాంబర్లోకి ప్రవేశించినట్లుగా అనిపిస్తున్నదని పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా ప్రజలంతా స్వచ్ఛమైన గాలి కోసం ఉద్యమించాలన్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారు వాయు కాలుష్యం కారణంగా పలు ఇబ్బందులు పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. Coming back to Delhi from Wayanad where the air is beautiful and the AQI is 35, was like entering a gas chamber. The blanket of smog is even more shocking when seen from the air.Delhi’s pollution gets worse every year. We really should put our heads together and find a solution… pic.twitter.com/dYMtjaVIGB— Priyanka Gandhi Vadra (@priyankagandhi) November 14, 2024కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కేరళలోని వయనాడ్ నుంచి తన ఎన్నికల ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. ప్రియాంక సోదరుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి వైదొలగడంతో ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది. ఆ మధ్య జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ, వయనాడ్ స్థానాల నుంచి గెలుపొందిన రాహుల్ ఆ తర్వాత వయనాడ్ లోక్‌సభకు దూరమయ్యారు.ఇది కూడా చదవండి: ‘ఆమె రీల్స్ చేస్తే.. ప్రజలేందుకు బాధ్యత తీసుకోవాలి’ -
వయనాడ్ బరిలో సత్తా చాటేదెవరో?
కేరళలోని వయనాడ్ పార్లమెంట్ స్థానానికి రేపు (బుధవారం) పోలింగ్ జరగనుంది. నిన్న(సోమవారం) వయనాడ్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారం చివరి రోజు మూడు ప్రధాన రాజకీయ కూటములు రోడ్‌షోలు నిర్వహించాయి. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. సోదరి ప్రియాంకా గాంధీ ప్రచారం చేశారు. 14 లక్షల మంది ఓటర్ల మద్దతు కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రియాంక గాంధీ వాద్రా, సీపీఐకి చెందిన సత్యన్ మొకేరి, బీజేపీకి చెందిన నవ్య హరిదాస్‌లతో సహా మొత్తం 16 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ ఏడాది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. మరోసారి ఇక్కడి నుంచి పోటీ చేసి 3.5 లక్షల ఓట్ల ఆధిక్యతతో గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే.. ఆయన మరో నియోజకవర్గం రాయ్‌బరేలి నుంచి కూడా విజయం సాధించడంతో.. నిబంధనల రిత్యా వయనాడ్‌ను వదులుకోవాల్సి వచ్చింది. దీంతో ఉప ఎన్నిక అనివార్యం కాగా.. కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబం నుంచే ప్రియాంకా గాంధీని ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దింపింది. రాహుల్ సోదరిని పోటీకి దింపడం ద్వారా యూడీఎఫ్ కంచుకోటగా భావించే సీటును నిలుపుకోవాలని కాంగ్రెస్ యోచిస్తోంది. మరోవైపు.. సీపీఐ, బీజేపీ సైతం ఈ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి కైవసం చేసుకోవాలని భావిస్తున్నాయి.2019 నుంచి 2024 వరకు వయనాడ్ ఎంపీగా రాహుల్ పదవీకాలం, వయనాడ్ ప్రజల్లో ఆయనకున్న ఆదరణపై కాంగ్రెస్ దృష్టి సారించింది. మరోవైపు.. ప్రజాభిప్రాయాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడం కోసం రాహుల్ గాంధీ వయనాడ్ నియోజకవర్గాన్ని వదులుకున్నారని ఎల్డీఎఫ్, బీజేపీలు కాంగ్రెస్‌పై ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ప్రియాంకా గాంధీ గెలిస్తే.. ఆమె కూడా తన సోదరుడిలాగా నియోజకవర్గంలో అందుబాటులో లేకుండా పోతారని బీజేపీ విమర్శలు గుప్పించింది. బీజేపీ విమర్శలకు చెక్ పెడుతూ ప్రియాంకా గాంధీ.. తను క్రమం తప్పకుండా వయనాడ్‌కు వస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గంలో మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉననా మనంతవాడి (ST), సుల్తాన్ బతేరి (ST), వయనాడ్ జిల్లాలోని కల్పెట్ట, కోజికోడ్ జిల్లాలోని తిరువంబాడి, మలప్పురం జిల్లాలోని ఎరనాడ్, నిలంబూర్, వండూర్. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎన్నికల విధుల కోసం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), సాయుధ పోలీసు బెటాలియన్‌కు చెందిన పలు కంపెనీల సిబ్బందితో భద్రత కల్పించినున్నారు. బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్‌కు ముందు 24 గంటల కంట్రోల్ రూమ్‌లు, పోలీస్ పెట్రోలింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక.. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరగనుంది.ప్రియాంకా గాంధీ నేపథ్యం..మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కుమార్తె, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ప్రియాంకా గాంధీ వాద్రా తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగారు. 1972, జనవరి 12న పుట్టింది ప్రియాంక గాంధీ. మనస్తత్వశాస్త్రంలో డిగ్రీని, బౌద్ధ స్టడీస్‌లో మాస్టర్స్ పూర్తి చేసింది. 2019లో ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. గత 80 ఏళ్లుగా కాంగ్రెస్ కంచుకోట అయిన రాయ్‌బరేలీలో ఆమె తన తల్లి స్థానంలో నిలబడతారనే అంచనాలు ఒక రేంజ్లో వ్యాపించాయి. వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీపై పోటీ చేస్తారని చాలామంది ఊహించారు. కానీ అవి ఊహాగానాలుగానే మిగిలాయి. 2022లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపలేక పోయింది. దీంతో ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలంటూ పోస్టర్లు వెలిశాయి.తనకు రూ.12 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా స్పష్టం చేశారు. ఆస్తులు, అప్పుల వివరాలను ఆమె తన అఫిడవిట్‌తో ప్రస్తావించారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో అద్దెలు, బ్యాంకు ఖాతాల్లోని నగదుపై వడ్డీ, ఇతర పెట్టుబడుల ద్వారా మొత్తం రూ.46.39 లక్షల ఆదాయం లభించినట్లు తెలిపారు. రూ.4.24 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నాయని, తన భర్త రాబర్ట్ వాద్రా బహుమతిగా ఇచ్చిన హోండా సీఆర్వీ కారు ఉందని తెలియజేశారు.భర్త రాబర్ట్ వాద్రా ఆస్తుల వివరాలను సైతం ప్రియాం తన అఫిడవిట్లో వెల్లడించారు. దీన్నిబట్టి రాబర్ట్‌కు రూ.37.9 కోట్ల విలువైన చరాస్తులు, రూ.27.64 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు స్పష్టమవుతోంది. బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ నేపథ్యం..నవ్య 2007లో కాలికట్ యూనివర్సిటీలోని కేఎంసీటీ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేశారు. బీటెక్ తర్వాత మెకానికల్ ఇంజనీర్‌గా కొన్నాళ్లు ఉద్యోగం చేశారు. పాలిటిక్స్‌పై ఆసక్తి ఉండటంతో రాజకీయాల్లోకి వచ్చారు. నవ్య హరిదాస్ కోజికోడ్ కార్పొరేషన్లో రెండుసార్లు కౌన్సిలర్‌గా పనిచేశారు. బీజేపీలో మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నవ్వ ఎన్డీఏ అభ్యర్థిగా కొజికోడ్ దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ. కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమి. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ADR) ప్రకారం నవ్య హరిదాస్‌పై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు. నవ్యకు రూ.1,29,56,264 విలువైన ఆస్తులు ఉన్నాయని, మొత్తం రూ.1,64,978 అప్పులు ఉన్నాయని ఏడీఆర్ తెలిపింది.సత్యన్ మొకేరి నేపథ్యం..సత్యన్ మొకేరి సీపీఐకి చెందిన ప్రముఖ నాయకుడు. కోజికోడ్ జిల్లాలోని నాదపురం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే. 2014లో వయనాడ్ లోక్‌సభ స్థానంలో పోటీ చేసి ఓడిపోయారు. మొకేరి 1987 నుంచి 2001 వరకు కేరళ శాసనసభలో నాదాపురం నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2015లో ఆయన సీపీఐ కేరళ రాష్ట్ర కమిటీకి సహాయ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. రైతు సంఘాలతో మొకేరికి మంచి అనుబంధం ఉంది. ఆయన సుదీర్ఘ అనుభవం, వ్యవసాయ సమస్యల పట్ల నిబద్ధత వయనాడ్ ఓటర్లకు ప్రతిధ్వనిస్తుందని ఎల్డీఎఫ్ భావిస్తోంది.:::సాక్షి వెబ్ డెస్క్ -
వయనాడ్ విపత్తును బీజేపీ రాజకీయం చేస్తోంది: ప్రియాంకా గాంధీ
తిరువనంతపురం: కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన విపత్తును బీజేపీ రాజకీయం చేస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకా గాంధీ వాద్రా అన్నారు. ప్రియాంకా గాంధీ.. లోక్‌సభ ఉప ఎన్నికల్లో భాగంగా.. వయనాడ్ జిల్లాలోని సుల్తాన్ బతేరి అసెంబ్లీ నియోజకవర్గంలోని కెనిచిరాలో సోమవారంప్రచారం చేశారు.‘‘ప్రజలకు తీరని బాధ కలిగించిన విపత్తును కూడా బీజేపీ రాజకీయం చేసింది. దేశం, ప్రజల ప్రయోజనాలు, దేశ రాజకీయాల గురించి ఆలోచించాల్సిన ప్రదేశంలో నిలబడి ఉన్నాం. కొండచరియలు విరిగిన జిల్లాలోని కుటుంబాలకు తగినంత సహాయం పంపిణీ చేయడంలో కేంద్రం విఫలమైంది. ఈ సమస్యపై పోరాడుతా. పార్లమెంటులో వయనాడ్ తరపున ప్రాతినిధ్యం వహించే అవకాశం ఇస్తే.. నేను మీ కోసం అందరికంటే ఎక్కువగా కష్టపడి చూపిస్తా. ..నేను మీ సమస్యలను ప్రతిచోటా వినిపిస్తాను. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తా. మీ అవసరాలు ప్రమాదంలో ఉన్నప్పుడు వెనక్కి తగ్గని పోరాటయోధురాలుగా మీ పక్కనే ఉంటా. ప్రజల సమస్యలపై దృష్టి సారించకుండా.. ద్వేషం, కోపం, విభజన, విధ్వంసాలను బీజేపీ ఉపయోగిస్తుంది. పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, ఇలా అనేక సమస్యలను పరిష్కరించటంలో బీజేపీ పూర్తిగా విఫలమైంది. బీజేపీ రాజకీయాలు ఇక్కడి సమస్యల నుంచి ప్రజలను పక్కదారి పట్టించటమే లక్ష్యంగా ఉన్నాయి. ఎందుకంటే బీజేపీ ఏకైక లక్ష్యం.. ఎంత ఖర్చు అయినా సరే అధికారంలో ఉండటం’’ అని అన్నారు.జూలైలో వయనాడ్‌లో చోటు చేసుకున్న కొండచరియలు విరిగిపడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనలో సుమారు 200 మందికి పైగా మృతి చెందిన విషయం తెలిసిందే. వంద ఇళ్లు బురదలో కొట్టుకుపోయాయి. -
రాజ్యాంగ పరిరక్షణ కోసమే.. మా పోరాటం: రాహుల్
వయనాడ్: దేశంలో నేడు ప్రధానమైన పోరాటం రాజ్యాంగ పరిరక్షణ కోసమే జరుగుతోందని కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ అన్నారు. ‘‘రాజ్యాంగాన్ని ఆగ్రహం, విద్వేషంతో కాకుండా ప్రేమ, ఆప్యాయత, వినయంతో రాశారు. అంతటి విశిష్టమైన రాజ్యాంగాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. పౌరులుగా మనం పొందుతున్న రక్షణ, దేశ ఔన్నత్యం తదితరాలకు రాజ్యాంగమే కారణభూతం’’ అన్నారు. కేరళలో వయనాడ్ లోక్‌సభ స్థానం పరిధిలోని మనాంథావాడీలో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. వయనాడ్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి, తన సోదరి ప్రియాంకా గాంధీ కోసం ప్రచారం చేశారు. ‘‘ప్రేమకు, విద్వేషానికి ఆత్మవిశ్వాసానికి, అభద్రతకు మధ్య నేడు యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధంలో నెగ్గాలంటే విద్వేషాన్ని, ఆగ్రహావేశాలను హృదయం నుంచి తొలగించుకోవాలి. ప్రేమ, అనురాగం, వినయాలను నింపుకోవాలి’’ అని సూచించారు. తన సోదరిని గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రియాంక కోసం తాను ఓట్లు అభ్యరి్థంచడం ఇదే తొలిసారని రాహుల్ గుర్తు చేశారు. తండ్రి రాజీవ్ గాంధీ హత్య కేసులోదోషి అయిన నళినిని ఆప్యాయంగా హత్తుకున్న మంచి మనస్సు తన చెల్లిదన్నారు. ప్రేమ, సానుభూతి, మానవత్వంతో కూడిన ఇలాంటి రాజకీయాలే మనకు కావాలని ఉద్ఘాటించారు. రాహుల్ తన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ పేరును ప్రస్తావించలేదు. ‘‘మోదీ గురించి చెప్పీ చెప్పీ బోరు కొట్టేసింది. అందుకే ఆయన ప్రస్తావన తేవడం లేదు’’ అన్నారు. అనంతరం రాహుల్ అరీకోడు పట్టణంలో ప్రచారంలో పాల్గొన్నారు. వయనాడ్‌లో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నట్టు చెప్పారు.సంపన్న మిత్రుల కోసమే ఆరాటంప్రధాని మోదీపై ప్రియాంక మరోసారి నిప్పులు చెరిగారు. కొందరు బడా పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసమే మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని ఆరోపించారు. సంపన్న మిత్రుల సేవలో ప్రధాని తరిస్తున్నారని ఎద్దేవా చేశారు. మనాంథావాడీలో సభలో ఆమె ప్రసంగించారు. ‘‘పేదలకు మంచి చేయాలన్న ఆలోచన మోదీకి అస్సలు లేదు. ప్రజలకు మంచి విద్య, వైద్యం, యువతకు ఉద్యోగాలివ్వాలన్న ఉద్దేశం లేదు. దేశ ప్రజల మధ్య మోదీ సర్కారు చిచ్చుపెడుతోంది. వారిని విభజిస్తోంది. హక్కులను కాలరాస్తోంది. ప్రజాస్వామిక సంస్థలను దెబ్బతీస్తోంది’’ అని ధ్వజమెత్తారు. -
వయనాడ్ ప్రజలకు పోరాడే ధైర్యం ఎక్కువ: ప్రియాంక గాంధీ
వయనాడ్: వయనాడ్ ప్రజలకు పోరాడే ధైర్యం ఎక్కువ అని ప్రశంసలు కురిపించారు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ. ఇదే సమయంలో బీజేపీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. మోదీ ప్రభుత్వం ప్రజాక్షేమం కోసం కాకుండా వ్యాపారవేత్తల ప్రయోజనాల కోసమే పనిచేస్తోందంటూ కామెంట్స్ చేశారు.వయనాడ్ ఉప ఎన్నికల సందర్బంగా ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వయనాడ్‌లో ఆదివారం ఎన్నికల ప్రచారంలో ప్రియాంక మాట్లాడుతూ..‘వయనాడ్ ప్రజలకు పోరాడే ధైర్యం ఎక్కువ. వయనాడ్ ప్రజలు అణచివేతదారులకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఏ మతానికి చెందిన వారైనా అందరూ కలిసి జీవించే భూమి వయనాడ్. పజాస్సి రాజా, తలక్కల్ చంతు, ఎడచెన కుంకన్ వంటి నాయకుల స్ఫూర్తి కలిగిన బలమైన చరిత్ర మీకు ఉంది. మీరు ఎల్లప్పుడూ సరైన దాని కోసం పోరాడారు. అణచివేతకు వ్యతిరేకంగా గళమెత్తారు.ఇదే సమయంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై ప్రియాంక సంచలన ఆరోపణలు చేశారు. ఈ సందర్బంగా ప్రియాంక.. తన వ్యాపార మిత్రుల కోసమే మోదీ ప్రభుత్వం పనిచేస్తుంది. దేశంలో నిరుద్యోగుల గురించి మోదీ సర్కార్ ఏనాడు ఆలోచించదు. మెరుగైన ఆరోగ్యం, విద్య కోసం కార్యక్రమాలు చేపట్టడం లేదు. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనే బీజేపీకి ఉండదు. ఏం చేసైనా అధికారంలో ఉండాలన్నదే వారి లక్ష్యం. ప్రజలను విడగొట్టడం, విద్వేషాన్ని వ్యాప్తి చేయడం, ప్రజాస్వామిక సంస్థలను నీరుగార్చడం ద్వారా అధికారంలో కొనసాగడమే మోదీ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు. అలాగే, రాహుల్ గాంధీని విమర్శించడమే బీజేపీ పనిగా పెట్టుకోవడంతో ఆయన ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారని చెప్పుకొచ్చారు. కానీ, వయానాడ్ ప్రజలకు రాహుల్‌కు ఎప్పుడూ అండగానే ఉన్నారని ప్రశంసించారు.ఇదిలా ఉండగా.. వయనాడ్‌లో నవంబర్ 13వ తేదీన పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక జరుగనుంది. కాంగ్రెస్ తరఫున ప్రియాంక గాంధీ బరిలో ఉండగా.. బీజేపీ తరఫున నవ్య హరిదాస్ పోటీలో ఉన్నారు. ఇక, కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. #WATCH | Wayanad, Kerala: Congress leader and party's candidate for Wayanad Lok Sabha by-election, Priyanka Gandhi Vadra says, "Modi ji's government works only for his big businessman friends. His objective is not to give you a better life. It is not to find new jobs. It is not… pic.twitter.com/l5fkrO7pGX— ANI (@ANI) November 3, 2024 -
మదర్ థెరిసా మా ఇంటికి వచ్చారు: ప్రియాంకా గాంధీ
తిరువనంతపురం: కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ వాద్రా వయనాడ్ లోక్‌సభ స్థానంలో పోటీ చేస్తున్నారు. అందులో భాగంగా ఆమె వయనాడ్‌లో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. సోమవారం ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ.. తనకు మానవతవాది, నొబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ థెరిసాతో ఉన్న అనుబంధాన్ని ప్రజలతో పంచుకున్నారు.‘‘నాకు 19 ఏళ్ల వయసులో మా నాన్నగారు( మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ) చనిపోయారు. ఆ సమయంలో మదర్ థెరిసా మా అమ్మను (రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ)ని కలవడానికి మా ఇంటికి వచ్చారు. ఆ రోజు నాకు జ్వరం వచ్చి నా గదిలో ఉన్నాను. ఆమె నన్ను కూడా కలవడానికి వచ్చి.. నా తలపై చేయి వేసి, నా చేతికి రోజరీ అందించారు. మా నాన్న చనిపోయినప్పటి నుంచి నేను బాధలో ఉన్నానని ఆమె గ్రహించి ఉండవచ్చు. .. ఆమె నాతో 'నువ్వు వచ్చి నాతో పని చేయి' అని చెప్పారు. నేను ఢిల్లీలోని మదర్ థెరిసా ఆశ్రమంలో పనిచేశాను. నేను ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పటం ఇదే తొలిసారి. ఆశ్రమంలో నాకు పని నేర్పించారు. బాత్రూమ్లు కడగడం, పాత్రలు శుభ్రం చేయడం, పిల్లలను బయటికి తీసుకెళ్లడం. వారితో కలిసి పనిచేయడం ద్వారా నేను వారు ఎదుర్కొన్న బాధ, ఇబ్బందులు, సేవ చేయడం అంటే ఏంటో అర్థం చేసుకోగలిగాను. ఒక సంఘం ఎలా సహాయం చేస్తుందో తెలుసుకున్నా. ప్రజల అవసరాలు ఏంటో ఇప్పుడు నేను అర్థం చేసుకోవడం ప్రారంభించా. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. నేను వచ్చి మిమ్మల్ని కలవాలనుకుంటున్నా. మీ సమస్యలేమిటో వినాలనుకుంటున్నా’’ అని ర్యాలీలో పాల్గొన్న ఓటర్లతో అన్నారు.ఏప్రిల్-జూన్ సార్వత్రిక ఎన్నికల్లో వయనాడ్ సీటులో గెలిచిన రాహుల్ గాంధీ, ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలీ స్థానంలో కూడా విజయం సాధించారు. వయనాడ్ స్థానానికి రాజీనామా చేయటంతో ఉప ఎన్నిక అనివార్యం అయింది. ఈ స్థానంలో ప్రియాంకా గాంధీని కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపింది. ఇక.. ప్రియాంకా గాంధీ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేస్తున్నారు.చదవండి: రతన్ టాటాను గుర్తు చేసుకున్న ప్రధాని మోదీ -
వయనాడ్‌లో ఖర్గేకు అవమానం నిజమేనా? తేల్చేసిన కాంగ్రెస్
ప్రియాంక గాంధీ నామినేషన్ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కాంగ్రెస్ అవమానపరిచిందంటూ బీజేపీ చేసిన విమర్శలకు పార్టీ గట్టి కౌంటర్ ఇచ్చింది. డోర్ లాక్ అవ్వడం వల్ల ఆయన కొద్దిసేపు మాత్రమే బయట వేచి ఉన్నారని.. నామినేషన్ ప్రక్రియ సమయంలో ఆయన లోపలే ఉన్నారని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. దీనిపై బీజేపీ చేస్తున్న విమర్శలు ఆమోదయోగ్యం కాదని మండిపడ్డారు.తలుపుకి తాళం వేసి ఉండటం వల్ల లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కూడా లోపలికి వచ్చే ముందు కొన్ని నిమిషాలు వేచి ఉన్నారని వేణుగోపాల్ తెలిపారు. ‘బీజేపీ ఇలాంటి అబద్ధాలు ఎలా ప్రచారం చేస్తుంది?. సభ పూర్తయ్యాక కలెక్టరేట్‌కు చేరుకోగానే డోర్ మూసి ఉంది. తరువాత రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ అక్కడికి వచ్చారు.. వారు కూడా కొన్ని నిమిషాలు వేచి చూసి లోపలికి వచ్చారు. ఈ క్రమంలోనే మల్లికార్జున ఖర్గే కూడా వచ్చి తలుపు తాళం వేసి ఉండటంతో నిమిషంపాటు బయట వేచి ఉన్నారు. ఆయన లోపలికి వచ్చిన తర్వాతే ప్రియాకం నామినేషన వేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేపై, పార్టీపై బీజేపీ ఎందుకు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు? ఇది సరైంది కాదు.’ అని పేర్కొన్నారు.కాగా వయనాడ్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ బుధవారం నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి తన తల్లి సోనియా గాంధీ, భర్త రాబర్ట్ వాద్రా, సోదరుడు రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పలువురు కాంగ్రెస్ ముఖ్య నాయకులు హాజరయ్యారు. అయితే నామినేషన్ సమర్పణ సమయంలో ఖర్గేను అగౌరవ పరిచారని, రిటర్నింగ్ అధికారి గదిలోకి రానివ్వకుండా బయటే ఉంచారని బీజేపీ ఆరోపించింది. అంతేకాదు దళితుల పట్ల కాంగ్రెస్ పార్టీ ద్వేషాన్ని పెంచుకుంటోందని విమర్శించింది. ఇందుకు సంబంధించిన ఒక వీడియోను కూడా కాషాయ పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. -
‘ప్రియాంక రోడ్డు షో.. సీజనల్ ఫెస్టివల్ లాంటిది’
తిరువనంతపురం: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, వయనాడ్ అభ్యర్థి ప్రియాంకా గాంధీ వాద్రా నిర్వహించిన రోడ్డు షోకు భారీగా ప్రజలు తరలిరావటంపై బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ విమర్శలు గుప్పించారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రియాంకా గాంధీ రోడ్డు షోకు త్రిసూర్‌తో సహా ఇతర జిల్లాల ప్రజలను తరలించారని అన్నారు. అందుకే భారీగా జనాలు వచ్చారని తెలిపారు.‘‘షూటింగ్‌కు లేదా వయనాడ్‌లోని పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్తామని చెప్పి ప్రజలను ప్రియాంక గాంధీ రోడ్డు షోకు తీసుకొచ్చారు. రోడ్‌షోకు భారీ సంఖ్యలో ప్రజలు తరలి రావటం వెనక కారణం ఇది. ప్రియాంక గాంధీ వయనాడ్‌కు రావటం, రోడ్‌షో నిర్వహించటం ప్రతి సంవత్సరం ఒక్కసారి మాత్రమే వచ్చే ‘సీజనల్ ఫెస్టివల్’ లాంటిది. ప్రజలు అన్నీ గమనిస్తారు. ...ప్రముఖ రాజకీయ కుటుంబ నేపథ్యం ఆధారంగా మాత్రమే ప్రియాంకా గాంధీ అభ్యర్థి అయ్యారు. కానీ, నేను కార్పొరేషన్ కౌన్సిలర్‌గా ప్రజల కోసం ఏళ్ల తరబడి పనిచేశా. అట్టడుగు స్థాయిలో పనిచేసి ప్రజాసేవలో అనుభవం సంపాదించా. ఒక అభ్యర్థి గొప్పతనానికి కుటుంబ ఆధిపత్యమే ప్రమాణమైతే.. దానికి నిదర్శనం ప్రియాంకా గాంధీ మాత్రమే. అయితే.. బీజేపీకి అలాంటి ప్రమాణాలు ఉండవు’’ అని అన్నారు. ఇక.. నవ్య హరిదాస్ ఇవాళ బీజేపీ అభ్యర్థి నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. -
తొలిసారి పోటీ చేస్తున్నా, భారీ మెజారిటీతో గెలిపించండి: ప్రియాంక
తిరువనంతపురం: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా నేడు(బుధవారం) వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికకు కాసేపట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్‌కు ముందు కల్పేట కొత్త బస్టాండ్ నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ భారీ రోడ్‌షో నిర్వహించారు. ప్రియాంక ర్యాలీకి యూడీఎఫ్ నేతలు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు.అనంతరం బహిరంగ సభలో ప్రియాంక మాట్లాడారు. గత 35 ఏళ్లుగా వివిధ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించానని, మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని, తన కోసం తాను ప్రచారం చేసుకుంటున్నానని తెలిపారు. ప్రజలందరి మద్దతు తనకు ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచమంతా తన సోదరుడికి వ్యతిరేకంగా ఉన్న సమయంలో వాయనాడ్ ప్రజలు అండగా నిలిచారని అన్నారు. మీరు ఇచ్చిన మద్దతుతోనే ఆయన దేశంలో 8 వేల కిలోమీటర్ల యాత్ర చేయగలిగారని ఆమె పొగిడారు.‘నా సోదరుడికి మద్దతుగా నిలిచిన మీ అందరికీ మా కుటుంబం రుణపడి ఉంటుందని చెప్పారు. ఆయన ఇప్పుడు మిమ్మల్ని విడిచి వెళ్లాల్సి వచ్చిందని, కానీ నేను ఆయనకు, మీకు మధ్య బంధాన్ని బలోపేతం చేస్తాను. వయనాడ్ నియోజకవర్గం సమస్యల గురించి నా సోదరుడు చెప్పాడు. ఇప్పుడు నేను ప్రత్యక్షంగా మీ సమస్యలు తెలుసుకుంటాను. ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాను. వాయనాడ్‌లో భారీ మెజారిటీతో గెలిపించండి ’ ఆమె హామీ ఇచ్చారు.కాంగ్రెస్ ఎంపీ రాహుల్ మాట్లాడుతూ.. దేశంలో ఇద్దరు ఎంపీలు ఉన్న ఏకైక లోక్‌సభ నియోజకవర్గం వాయనాడ్ అని అన్నారు. దేశంలో ఏ లోక్‌సభ స్థానానికైనా ఒకరే ఎంపీ ఉంటారని, కానీ వాయనాడ్‌కు మాత్రం ఇద్దరు ఎంపీలు ఉంటారని చెప్పారు. ప్రియాంకాగాంధీ అధికారిక ఎంపీగా ఉంటే, తాను అనధికారిక ఎంపీగా కొనసాగుతానని అన్నారు. ఇద్దరం కలిసి వాయనాడ్ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.ప్రియాంక నామినేషన్ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ మాజీ చీఫ్‌లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ హాజరు కానున్నారు. వయనాడ్ జిల్లా కలెక్టర్ ఎదుట ప్రియాంక నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇదిలా ఉండగా తొలిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ. వయనాడ్‌లో ఆమె ముక్కోణపు పోటీ ఎదుర్కొంటున్నారు. దశాబ్దకాలంగా ప్రజాప్రతినిధిగా ఉన్న బీజేప అభ్యర్థి నవ్యా హరిదాస్ ప్రియాంకకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఎల్డీఎఫ్ తరఫున సీపీఐ నేత, మాజీ ఎమ్మెల్యే సత్యన్ మొకెరీ పోటీ చేస్తున్నారు. కాగా ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌బరేలీ, వయనాడ్‌ల నుంచి పోటీ చేసి గెలిచిన రాహుల్ గాంధీ.. వయనాడ్ స్థానాన్ని వదులుకున్నారు. దీంతో ఉపఎన్నిక అనివార్యమైంది. నవంబర్ 13న ఇక్కడ ఉప ఎన్నిక జరగనుంది.#WATCH | Kerala: Congress leader and Lok Sabha LoP Rahul Gandhi arrives in Wayanad for the nomination filing of party's national general secretary and his sister, Priyanka Gandhi Vadra for Wayanad Lok Sabha by-elections. Visuals from Sultan Bathery. pic.twitter.com/EgCeMpGolL— ANI (@ANI) October 23, 2024 -
వయనాడ్ ఉపఎన్నికల అభ్యర్థిగా ఇవాళ ప్రియాంక వాద్రా నామినేషన్
-
వయనాడ్ ఎవరది?.. డైనమిక్ లీడర్ నవ్య Vs ప్రియాంక
తిరువనంతపురం: వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికపై రాజకీయంగా ఆసక్తి నెలకొంది. రాహుల్ గాంధీ రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యం కాగా.. వయనాడ్‌ను దక్కించుకునేందుకు కాంగ్రెస్.. ప్రియాంక గాంధీని బరిలో నిలిపింది. ఈ నేపథ్యంలో ప్రియాంకకు పోటీగా యంగ్ డైనమిక్ లీడర్, కేరళ రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా జనరల్ సెక్రటరీ నవ్య హరిదాస్‌ను ఖరారు చేసింది. దీంతో, వీరి మధ్య పోరు రసవత్తరంగా ఉండే అవకాశం ఉంది.ఇక, బీజేపీ నవ్య హరిదాస్(39) పేరును ఖరారు చేయడంతో ఆమె ఎవరు? ఆమె రాజకీయ ప్రస్థానం ఏంటి? అనే చర్చ నడుస్తోంది. నవ్య ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చారు. బీటెక్ చదవి ఉద్యోగం చేసిన నవ్య.. రాజకీయాలపై ఆసక్తి ఉండటంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలో బీజేపీలో తన ముద్ర వేసి తక్కువ కాలంలోనే అందరి దృష్టిలో పడ్డారు. తాజాగా వయనాడ్ బరిలోకి టికెట్ పొంది బంపరాఫర్ దక్కించుకున్నారు.నవ్య హరిదాస్ రాజకీయ నేపథ్యం..👉నవ్య 2007లో కాలికట్ యూనివర్సిటీలోని కేఎంసీటీ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేశారు.👉బీటెక్ తర్వాత మెకానికల్ ఇంజనీర్‌గా కొన్నాళ్లు ఉద్యోగం చేశారు. పాలిటిక్స్‌పై ఆసక్తి ఉండటంతో రాజకీయాల్లోకి వచ్చారు.👉నవ్య హరిదాస్ కోజికోడ్ కార్పొరేషన్లో రెండుసార్లు కౌన్సిలర్‌గా పనిచేశారు.👉బీజేపీలో మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.👉2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నవ్వ ఎన్డీఏ అభ్యర్థిగా కొజికోడ్ దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ. కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమి.👉అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ADR) ప్రకారం నవ్య హరిదాస్‌పై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు.👉నవ్యకు రూ.1,29,56,264 విలువైన ఆస్తులు ఉన్నాయని, మొత్తం రూ.1,64,978 అప్పులు ఉన్నాయని ఏడీఆర్ తెలిపింది.ఇదిలా ఉండగా.. గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వయనాడ్, రాయ్ బరేలి రెండు స్థానాల నుండి పోటీ చేసిన విషయం తెలిసిందే. పోటీ చేసిన రెండు చోట్ల ఘన విజయం సాధించిన రాహుల్.. వయనాడ్ పార్లమెంట్ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో వయనాడ్ పార్లమెంట్‌కు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 15వ తేదీన వయనాడ్ పార్లమెంట్ ఉప ఎన్నికకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. నవంబర్ 13వ తేదీన వయనాడ్ ఉప ఎన్నిక జరగనుంది.Navya Haridas to take on PriyankaGandhi from the Wayanad Lok Sabha seat on a BJP ticket👍👍 pic.twitter.com/joo5dXrEhT— tsr. (@srikanth690935) October 19, 2024 -
వయనాడ్ బీజేపీ అభ్యర్థి ఎవరంటే..
న్యూఢిల్లీ: కేరళలోని వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి పేరును బీజేపీ ప్రకటించింది. నవ్య హరిదాస్ ఇక్కడి నుంచి తమ పార్టీ తరపున బరిలో ఉంటారని వెల్లడించింది. నవ్య కేరళ బీజేపీ మహిళామోర్చాకు ప్రధానకార్యదర్శిగా ఉన్నారు. వయనాడ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆ పార్టీ అగ్రనేత ప్రియాంకా గాంధీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ రాజీనామాతో వయనాడ్‌కు ఉప ఎన్నిక వచ్చింది. లోక్‌సభ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుంచి గెలిచిన రాహుల్‌గాంధీ వయనాడ్‌ను వదులుకుని ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలి నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు. నవంబర్ 13న వయనాడ్ ఎంపీ సీటుకు ఉప ఎన్నిక జరగనుంది. ఇదీ చదవండి: జార్ఖండ్‌లో కాంగ్రెస్,జేఎంఎం మధ్య కుదిరిన పొత్తు -
వయనాడ్ ఎన్నికల బరిలో ప్రియాంక గాంధీ
తిరువనంతపురం : వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నిక షెడ్యుల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ప్రకటించింది. నవంబర్ 13వ తేదీన ఈ లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికను నిర్వహించనున్నట్లు సీఈసీ వెల్లడించింది. వయనాడ్ నుంచి ఎన్నికల బరిలోకి ప్రియాంక గాంధీ దిగుతున్నట్లు కొద్ది సేపటి క్రితమే ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ,కేరళ వయనాడ్.. ఈ రెండు స్థానాల్లో రాహుల్ గాంధీ బరిలోకి దిగారు. విజయం సాధించారు. దీంతో వయనాడ్ స్థానాన్ని వదులుకుంటున్నట్లు ప్రకటించారు. ఆ స్థానంలో జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ప్రియాంక గాంధీ బరిలోకి దిగనున్నారంటూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జూన్‌లో ప్రకటించారు. తాజాగా, అధికారికంగా ఏఐసీసీ అధికారికంగా వెల్లడించింది. కాగా, ప్రియాంక గాంధీ లోక్‌సభ ఎన్నికల్లో గెలిస్తే, ప్రస్తుత పార్లమెంట్లో గాంధీ కుటుంబం నుంచి ఆమె మూడో ఎంపీ. రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడిగా, సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. -
ఖర్గే మోదీకంటే సీనియర్.. అవమానించడం తగదు: ప్రియాంక ఫైర్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే రాసిన లేఖకు ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం ఇవ్వకపోవడం పట్ల ప్రియాంక గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఖర్గేను ప్రధాని మోదీ అగౌరవపరిచారని, అవమానపరిచారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్ప సంప్రదాయాన్ని అత్యున్నత స్థాయిలో ఉన్న నాయకులు పాటించకపోవడం దురదృష్టకరమని అసహనం వ్యక్తం చేశారు.అంతేగాక మోదీకి బదులుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందింస్తూ ఖర్గేకు కౌంటర్ లేక రాయడంపై ఆమె మండిపడ్డారు. ‘ఖర్గే ప్రధానమంత్రి కంటే పెద్దవారు. ఆయన్ను మోదీ ఎందుకు అగౌరపరిచారు? ప్రధాని మోదీకి ప్రజాస్వామ్య విలువలపై విశ్వాసం, పెద్దలపై గౌరవం ఉంటే ఆయనే స్వయంగా ఖర్గే ఈ లేఖకు సమాధానమిచ్చేవారు. కానీ అలాకాకుండా నడ్డా ద్వారా ఆయన లేఖ రాయించారు. అందులోనూ ఖర్గేను అవమానపరిచారు. 82 ఏళ్ల సీనియర్ నాయకుడిని అగౌరవపరచాల్సిన అవసరం ఏముంది?ప్రశ్నించడం, సమాధానాలు తెలియజేయడం ప్రజాస్వామ్యంలో భాగం. గౌరవం, మర్యాద వంటి విలువలకు ఎవరూ అతీతులు కాదని మతం కూడా చెబుతోంది. నేటి రాజకీయాలు విషపూరితంగా మారాయి. అయితే ప్రధాని తన పదవికి ఉన్న గౌరవాన్ని నిలబెట్టుకొని దీనికి భిన్నమైన ఉదాహరణను చూపాలి. ప్రధాని తమ పదవికి ఉన్న స్థాయిని దృష్టిలోపెట్టుకొని సీనియర్ నాయకుడికి సమాధానం ఇచ్చి ఉంటే ఆయనకు విలువ ఉండేది. ఆయనపై గౌరవం పెరిగేది. ప్రభుత్వంలో అత్యున్నత స్థానాల్లో ఉన్న నాయకులు ఈ గొప్ప సంప్రదాయాలను తిరస్కరించడం దురదృష్టకరం’ అని ప్రియాంక మండిపడ్డారు.కాగా ఇటీవల బీజేపీ నేతలు, ఎన్డీఏ మిత్రపక్షాలు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని, వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని మోదీకి ఖర్గే లేఖ రాసిన విషయం తెలిసిందే. లేఖ రాశారు. దీనిపై బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందిస్తూ రాహుల్ గాంధీని విఫల నాయకుడిగా అభివర్ణించారు.గతంలో రాహుల్ ప్రధానిని ఇదేవిధంగా అవమానపరచలేదా? అని ప్రశ్నించారు. ‘మోదీపై సోనియాగాంధీ ‘మృత్యుబేహారీ’ అని అవమానకర వ్యాఖ్యలు చేయలేదా? అప్పుడు కాంగ్రెస్ రాజకీయ నైతికతను మరిచిపోయిందా? గత ఐదేళ్లలో ప్రధానిని మీ నేతలు 110 సార్లు అవమానించారు. ఎన్నికల్లో విజయం సాధించే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ తమ నాయకుడిని హైలెట్ చేయాలని ప్రయత్నిస్తోంది’ అంటూ పేర్కొన్నారు. कुछेक भाजपा नेताओं और मंत्रियों की अनर्गल और हिंसक बयानबाज़ी के मद्देनज़र लोकसभा में विपक्ष के नेता राहुल गांधी के जीवन की सुरक्षा के लिए चिंतित होकर कांग्रेस अध्यक्ष और राज्यसभा में विपक्ष के नेता श्री मल्लिकार्जुन खरगे जी ने प्रधानमंत्री जी को एक पत्र लिखा।प्रधानमंत्री जी की…— Priyanka Gandhi Vadra (@priyankagandhi) September 20, 2024 -
మాటలు చెప్పడం కాదు.. ప్రధాని మోదీపై రాహుల్, ప్రియాంక ఆగ్రహం
భోపాల్ : మధ్యప్రదేశ్‌లో ట్రైనీ ఆర్మీ అధికారులపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ విచారం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీతో పాటు అధికార బీజేపీని విమర్శించారు.ఈ భయంకరమైన సంఘటన మొత్తం సమాజాన్ని సిగ్గుపడేలా చేసింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో శాంతి భద్రతలు దారుణంగా ఉన్నాయి. మహిళలపై రోజురోజుకు పెరుగుతున్న నేరాల పట్ల బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తుందని రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా స్పందించారు. నేరస్థులు వరుస దారుణాలతో ప్రభుత్వంలో వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడుతుంది. ఆ ఫలితమే ఈ దారుణాలు అని వ్యాఖ్యానించారు. मध्य प्रदेश में सेना के दो जवानों के साथ हिंसा और उनकी महिला साथी के साथ दुष्कर्म पूरे समाज को शर्मसार करने के लिए काफी है। भाजपा शासित राज्यों की कानून व्यवस्था लगभग अस्तित्वहीन है - और, महिलाओं के खिलाफ़ दिन प्रतिदिन बढ़ते अपराधों पर भाजपा सरकार का नकारात्मक रवैया अत्यंत…— Rahul Gandhi (@RahulGandhi) September 12, 2024 ట్రైనీ ఆర్మీ అధికారులపై జరిగిన దారుణం నా హృదయాన్ని ద్రవించి వేస్తుంది. మహిళల భద్రత గురించి ప్రధాని మోదీ ప్రసంగాలు చేస్తారు. మహిళలు మాత్రం రక్షణ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నిరీక్షణ ఎప్పటికి ముగుస్తుంది? అని ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. దేశంలో ప్రతిరోజూ 86 మంది మహిళలపై నిత్యం ఎక్కడో చోట దారుణాలు జరుగుతూనే ఉన్నాయని ట్వీట్లో పేర్కొన్నారు.मध्य प्रदेश में सेना के अधिकारियों को बंधक बनाकर महिला से गैंगरेप एवं उत्तर प्रदेश में हाईवे पर एक महिला का निर्वस्त्र शव मिलने की घटनाएं दिल दहलाने वाली हैं। देश में हर दिन 86 महिलाएं बलात्कार और बर्बरता का शिकार हो रही हैं। घर से लेकर बाहर तक, सड़क से लेकर दफ्तर तक, महिलाएं…— Priyanka Gandhi Vadra (@priyankagandhi) September 12, 2024ట్రైనీ ఆర్మీ అధికారిపై దారుణంమధ్యప్రదేశ్లోని ఇండోర్‌లో దారుణం జరిగింది. స్నేహితురాళ్లతో కలిసి బయటకు వెళ్లిన ట్రైనీ ఆర్మీ అధికారులపై అర్థరాత్రి ఎనిమిది మంది దుండగులు తుపాకులు, కత్తులతో దాడి చేశారు. అనంతరం వారిని బంధించి.. బాధితుల్లోని ఇద్దరిని రూ.10లక్షల తీసుకుని రావాలంటూ బెదిరించారు. దీంతో ఆ ఇద్దరు స్నేహితులు జరిగిన దారుణాన్ని ఆర్మీ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.ఇదీ చదవండి : గణపతి పూజపై రాజకీయ దుమారంఘటన స్థలానికి చేరుకుని బాధితుల్ని ఆస్పత్రికి తరలించారు. వారిలో ఓ ట్రైనీ ఆర్మీ అధికారిపై దారుణానికి ఒడిగట్టినట్లు తేలింది. నిందితుల్లో ఇద్దరిని అరెస్ట్ చేయగా.. మిగిలిన వారి కోసం పోలీసులు గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. -
కోల్‌కతా వైద్యురాలి కేసు: సీఎం మమతకు ప్రియాంకా గాంధీ విజ్ఞప్తి
ఢిల్లీ: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ దారుణంపై జూనియర్ వైద్యులు, నర్సులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. ఈ నిరసనలతో మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ రాజీనామా చేశారు. తాజాగా ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ స్పందించారు. ఈ ఘటన చాలా బాధాకరమని అన్నారు. ఇది హృదయవిదారకమైన ఘటనగా అభివర్ణించారు. ఈ కేసు దర్యాఫ్తును వేగవంతం చేసి, నిందితులను కఠినంగా శిక్షించాలని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి విజ్ఞప్తి చేశారు. నిందితులను కఠినంగా శిక్షించినప్పుడే మృతురాలి కుటుంబానికి, వైద్య సిబ్బందికి న్యాయం జరుగుతుందని అన్నారు. మహిళలు పని చేసే ప్రదేశంలో భద్రత అనేది పెద్ద సమస్యగా మారిందని వాపోయారు. మహిళల భద్రత కోసం తీవ్రమైన కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.कोलकाता के आरजी कर मेडिकल कॉलेज में ट्रेनी डॉक्टर के साथ दुष्कर्म और हत्या की घटना दिल दहलाने वाली है। कार्यस्थल पर महिलाओं की सुरक्षा देश में बहुत बड़ा मुद्दा है और इसके लिए ठोस प्रयास की जरूरत है। मेरी राज्य सरकार से अपील है कि इस मामले में त्वरित और सख्त से सख्त कार्रवाई…— Priyanka Gandhi Vadra (@priyankagandhi) August 12, 2024చదవండి: కోల్‌కతా వైద్యురాలి కేసు.. పోలీసులకు చుక్కలు చూపిస్తున్న నిందితుడు -
వయనాడ్ లో రాహుల్ ప్రియాంక పర్యటన
-
‘వయనాడ్ విషాదం మా మనసుల్ని కలచివేస్తోంది‘: రాహుల్ గాంధీ
తిరువనంతపురం: వయనాడ్ విషాదం మా మనసుల్ని కలచివేసింది అని కేరళ వయనాడు విషాదంపై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ విచారం వ్యక్తం చేశారు. గురువారం కేరళలో కొండచరియలు విరిగిపడిన వయనాడ్‌లోని చూరల్మల ప్రాంతాన్ని సందర్శించారు. ప్రజల క్షేమ సమాచారాన్ని, భద్రతా బలగాల సహాయక చర్యలు ఏ విధంగా జరుగుతున్నాయో అడిగి తెలుసుకున్నారు.అనంతరం మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ.. మానాన్న రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డానో.. ఇప్పుడు అంతే బాధపడుతున్నా.. యావత్ దేశం వయనాడ్ బాధను చూస్తోంది. నేనొక్కడినే కాదు అనేకమంది ఈ బాధను అనుభవిస్తున్నారు. వయనాడ్ విషాదం మా మనసుల్ని కలచివేసింది. రాజకీయాలు మాట్లాడేందుకు ఇది సరైన సమయం కాదన్న ఆయన.. బాధితులకు అన్నీ రకాలుగా సహాయం అందించడమే మా ప్రాధాన్యమని వ్యాఖ్యానించారు. వయనాడ్ ప్రజల బాధను చూడలేకపోతున్నాం. బాధితులకు అండగా నిలిచేందుకు ఇక్కడికి వచ్చాం. హిమాచల్ ప్రదేశ్‌లోనూ ఇలాంటి విషాదాలే చోటు చేసుకున్నాయి. ఈ విషాదం చూస్తే నాకు మాటలు రావడం లేదు అని ప్రియాంక గాంధీ విచారం వ్యక్తం చేశారు. #WATCH | On deaths due to Wayanad landslides, Congress MP & LoP Lok Sabha, Rahul Gandhi says, "Today, I feel how I felt when my father died. Here people have not just lost a father but an entire family. We all owe these people respect and affection. The whole nation's attention… pic.twitter.com/9dSPI6kQdx— ANI (@ANI) August 1, 2024 -
కేరళలో ప్రకృతి విపత్తు : వయనాడ్‌లో పర్యటించిన రాహుల్, ప్రియాంక
తిరువనంతపురం : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ఆ పార్టీ మహిళా నేత ప్రియాంక గాంధీ వాద్ర గురువారం (ఆగస్ట్1) కేరళలో కొండచరియలు విరిగిపడిన వయనాడ్‌లో చూరల్మల ప్రాంతాన్ని సందర్శించారు. వరదల కారణంగా సర్వం కోల్పోయిన స్థానికుల క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు.భారీ వర్షాల కారణంగా మంగళవారం వాయనాడ్‌లో మూడు కొండచరియలు విరిగిపడటంతో ఇప్పటివరకు 256 మంది మరణించారు. కొండచరియలు విరిగిపడటంతో కేరళ జిల్లాలోని ముండక్కై, చూరల్మల, అట్టమాల, నూల్‌పుజా గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.LoP Shri @RahulGandhi & AICC General Secretary Smt. @priyankagandhi ji visit the Chooralmala landslide site in Wayanad where devastating landslides have claimed many lives and left families devastated.📍 Kerala pic.twitter.com/EnPakO8tJC— Congress (@INCIndia) August 1, 2024కొండచరియలు విరిగిపడటంతో 200 మందికి పైగా గాయపడ్డారు. ఆర్మీ సుమారు 1,000 మందిని రక్షించింది . 220 మంది ఆచూకీ లభ్యం కాలేదు. వయనాడ్ వరదల నుంచి ప్రజల నుంచి భద్రతా బలగాలు చేస్తున్న సహాయక చర్యలు గురువారానికి మూడోరోజుకి చేరుకున్నాయి. హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ (హెచ్ఎడిఆర్) ప్రయత్నాలను సమన్వయం చేయడానికి ఆర్మీ కోజికోడ్‌లో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. రెస్క్యూ ఆపరేషన్ కోసం కనీసం 1,500 మంది ఆర్మీ సిబ్బందిని, ఫోరెన్సిక్ సర్జన్లను నియమించామని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు.రానున్న రెండు రోజుల్లో వయనాడ్‌తో పాటు ఇతర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ముందస్తు చర్యల్లో భాగంగా ఇడుక్కి, త్రిసూర్, పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్, కన్నూర్, కాసర్గోడ్ జిల్లాలకు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ ప్రకటించింది. -
ప్రియాంక గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీలో రెండో రోజు పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో ర ఏవంత్ భేటీయ్యారు. సీఎం వెంట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రిఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇన్‌ఛార్జి దీప దాస్ మున్షీ ఉన్నారు.రాష్ట్రంలో అమలు చేస్తున్న రైతు రుణమాఫీ, ఇతర సంక్షేమ కార్యక్రమాల అమలు, నామినేటెడ్ పదవులు, కేబినెట్ విస్తరణ, వరంగల్ సభ గురించి ప్రియాంకకు సీఎం వివరించారు. ఈ నెలాఖరున వరంగల్‌లో రైతు రుణమాఫీ విజయోత్సవ బహిరంగసభ నిర్వహిస్తామని ఇటీవలే సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సభకు ఏఐసీసీ నేతలను ఆహ్వానిస్తున్నారు. మంగళవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉండడంతో, రేపు వీరంతా హైదరాబాద్ రానున్నారు. -
నిరుద్యోగంలో రికార్డ్ బ్రేక్: ప్రియాంక గాంధీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎనిమిది కోట్ల ఉద్యోగాలు సృష్టించామని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ మండిపడ్డారు. బుధవారం ‘ఎక్స్’ వేదికగా తూర్పార బట్టారు. మంగళవారం ఉదయం ముంబై విమానాశ్రయంలో సరకుల లోడింగ్ కేంద్రం వద్ద చిరు ఉద్యోగాల కోసం వేలాది మంది నిరుద్యోగ యువత క్యూ వరసల్లో నిల్చుని తొక్కిసలాట వంటి పరిస్థితి తలెత్తిన ఉదంతాన్ని ఈ సందర్భంగా ప్రియాంక గుర్తుచేశారు. ‘‘ కొద్దిరోజుల క్రితం ముంబైలో మోదీ మాట్లాడు తూ మేం కోట్లాది మందికి ఉపాధి కల్పించి రికార్డ్‌లు బ్రేక్ చేశామని ఢంకా బజాయించారు. కానీ అదే ముంబైలో చిన్నపాటి ఉద్యోగాల కోసం వేలాదిగా యువత ఆశతో ఎగబడటం మనందరం చూశాం. ఇదే ఏడాది గుజరాత్లో 25 ఉద్యోగాల కోసం ఏకంగా లక్షలాది మంది నిరుద్యోగులు తండోపతండాలుగా తరలిరావడమూ మనందరికీ తెల్సిందే. ఇవన్నీ చూస్తుంటే రికార్డ్‌లు బ్రేక్ అయినట్లు తెలుస్తూనే ఉంది. కానీ ఆ రికార్డ్‌లు నమోదైంది ఉద్యోగాల్లో కాదు నిరుద్యోగంలో. దేశాన్ని తీవ్ర నిరుద్యోగ సమస్య పట్టిపీడిస్తోంది. ఇప్పటికైనా మోదీ ఉత్తమాటలు చెప్పడం మానేసి ఉపాధి అవకాశాలపై దృష్టిపెట్టాలి’’ అని ప్రియాంక నిలదీశారు. -
‘ప్రియాంకకు అంత సీన్ లేదు.. అదంతా రాహుల్ జిమ్మిక్కు’
తిరువనంతపురం: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వయనాడ్, రాయ్ బరేలీ స్థానాల్లో పోటీ చేసి, రెండు చోట్లా గెలుపొందారు. దీంతో ఆయన ఏదో ఒక స్థానాన్ని వదులుకోవాల్సి రావడంతో.. వయనాడ్ వదులుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన వయనాడ్ ప్రజలకు భావోద్వేగాలతో కూడిన ఓ లేఖ రాశారు. అయితే ఆయన రాసిన లేఖకూ కేరళ బీజేపీ అధ్యక్షుడు కే. సుందరేశన్ విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ వయనాడ్ ప్రజలకు రాసిన లేఖ కేవలం ఒక పొలిటికల్ జిమ్మిక్కులో భాగమని విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం మాట్లాడుతూ.. ‘’ఇప్పటికే రాహుల్ గాంధీ వయనాడ్ ప్రజలకు ద్రోహం చేశారు. ప్రతిసారి వయనాడ్ తనకు రెండో నివాసం,కుటుంబమని చెబుతారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం క్లారిటీ వచ్చింది. ఆయన తన సోదరిని ఇక్కడ పోటీ చేయిస్తున్నారు. ఇదంతా తన కుటుంబం కోసం చేస్తున్నారు. ఇది కేవలం ఒక జిమ్మిక్కు. వయనాడ్ ప్రజలు రాహుల్ గాంధీని నమ్మరు. ఎందుకంటే ఆయన చేప్పిన మాటలకు ఒక్కదాన్ని కూడా నిలబెట్టుకొలేదు’’ అని సుందరేశన్ అన్నారు.ప్రియాంకా గాంధీ పార్టీలో, యూపీలో పెద్ద పేరు ఉన్నప్పుడు ఆమె ఎక్కడ ఎందుకు పోటీ చేయటం లేదని ప్రశ్నించారు. లోక్ సభ ఎన్నికల్లో యూపీలోని రాయ్‌బరేలీ, అమెథీ స్థానాల్లో ప్రియాంకా గాంధీ ఎందుకు పోటీ చేయలేదని నిలదీశారు. ఇదీ వారికి అనుకూలమైన స్థానమని కాంగ్రెస్ భావిస్తోందని మండిపడ్డారు. కానీ, ఈసారి తాము ప్రియాంకా గాంధీకి గట్టిపోటీ ఇస్తామన్నారు. ఇక్కడ ఎన్డీయే, యూపీఏ మధ్యే అసలు పోటీ నెలకొనుందని అన్నారు. రాహుల్ గాంధీ వయనాడ్ ప్రజలకు రాసిన లేఖలో.. ‘‘ఐదేళ్ల కిందట నేను మిమ్మల్ని మొదటిసారి కలిశా. నేను మీకు పరిచయం లేదు. కానీ మీరు నమ్మి నాకు ఆశ్రయం ఇచ్చారు. నా ఇల్లు, నా కుటుంబం మీరే అయ్యారు. నాకు ప్రేమను, ఆప్యాయత పంచారు. జూన్ 17న వయనాడ్‌ను వదులుకుంటున్నట్టు మీడియా ముందు నిలబడి ప్రకటిస్తున్నప్పుడు కన్నీరు పెట్టుకోవడం మీరు చూసి ఉంటారు. బరువెక్కిన గుండెతో మీకు వీడ్కోలు పలుకుతున్నా. ఇక్కడ మీకు ప్రాతినిధ్యం వహించేందుకు నా సోదరి ప్రియాంక సిద్ధంగా ఉన్నారు. నన్ను ఆదరించినట్టు నా సోదరిని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను’ అని పేర్కొన్నారు. -
వయనాడ్ ప్రజలకు రాహుల్‌గాంధీ భావోద్వేగ లేఖ
న్యూఢిల్లీ: ఎంపీగా నియోజకవర్గాన్ని వదులుకున్న వేళ కేరళలోని వయనాడ్ ప్రజలకు ఆదివారం(జూన్23) రాహుల్ గాంధీ భావోద్వేగంతో కూడిన లేఖ రాశారు. ‘వయనాడ్‌ను వదులుకున్నందుకు బాధగా ఉంది. ఇన్ని రోజులు మీరిచ్చిన సహకారానికి నా కృతజ్ఞతలు. మీరు ప్రియాంకను ఎంపీగా ఎన్నుకుంటే బాగా పనిచేస్తుంది. ఆమెను ఇక్కడి నుంచి పోటీ చేయమని నేనే ఒప్పించా. గతంలో నేనెవరో తెలియనపుడే మీరు నన్ను నమ్మారు. మీ గొంతను పార్లమెంటులో వినిపించినందుకు ఆనందంగా ఉంది. రాయ్‌బరేలి, వయనాడ్ రెండింటి అభివృద్ధికి కట్టుబడి ఉన్నా. దేశంలో విద్వేషాన్ని హింసను రెచ్చగొట్టేవారిపై కలిసి పోరాడదాం’అని రాహుల్‌గాంధీ లేఖలో తెలిపారు. కాగా, ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలి, కేరళలోని వయనాడ్ రెండు నియోజకవర్గాల నుంచి ఎంపీగా గెలుపొందారు. దీంతో ఆయన ఒక నియోజకవర్గాన్ని వదులుకోవాల్సి వచ్చింది. -
వయనాడ్ బరిలో ప్రియాంక.. పోటీ సరికాదన్న సీపీఐ నారాయణ
సాక్షి, ఢిల్లీ: కేరళలోని వయనాడ్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ పోటీ చేయడంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. వయనాడ్ నుంచి ప్రియాంక పోటీ చేయడం కరెక్ట్ కాదని కామెంట్స్ చేశారు.కాగా, నారాయణ శనివారం మీడియాతో మాట్లాడుతూ..‘ప్రియాంక గాంధీని వయనాడ్‌లో పోటీకి దింపడం సరికాదు. కేరళ స్థానిక నాయకులకే వయనాడ్ సీటు వదిలిపెట్టాలి. అలాగే, ఏపీలో కూల్చావేతలకు మేము పూర్తిగా వ్యతిరేకం. కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దు. ప్రభుత్వం చట్టపరంగానే వ్యవహరించాలి’ అని కామెంట్స్ చేశారు.ఇక, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా వయనాడ్, రాయబరేలీ నుంచి ఎంపీగా విజయం సాధించారు. ఈ నేపథ్యంలో వయనాడ్ నుంచి రాహుల్ తప్పుకోవడంతో ఉప ఎన్నికల కోసం ప్రియాంక గాంధీని బరిలో దింపారు. ఇదిలా ఉండగా.. ఇండియా కూటమిలో సీపీఐ భాగంగా ఉన్న విషయం తెలిసిందే. -
వయనాడ్‌లో ప్రియాంకా గాంధీ తరఫున సీఎం మమత ప్రచారం!
ఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ వదలుకున్న వయనాడ్ లోక్‌సభ స్థానంలో.. ఉపఎన్నికలో భాగంగా ప్రియాంకా గాంధీ వాద్రా పోటీ చేస్తారని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రియాంకా గాంధీకి ఇదే మొదటి లోక్‌సభ ఎన్నిక కావటం గమనార్హం. అయితే ప్రియాంకా గాంధీ బరిలోకి దిగే వయనాడ్‌లో టీఎంసీ సుప్రీం నేత, సీఎం మమత ప్రచారం చేయనున్నట్లు కాంగ్రెస్ నేతల్లో చర్చ జరుగుతోంది.లోక్‌సభ ఎన్నికలకు ముందు పొత్తు, సీట్ల పంపకం విషయాల్లో బెంగాల్ కాంగ్రెస్ చీఫ్‌గా ఉన్న అధీర్ రంజన్ చౌధరీకి మమతా బెనర్జీ మధ్య విభేదాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా పశ్చిమబెంగాల్ కాంగ్రెస్ పేలవ ప్రదర్శనకు బాధ్యతగా బెంగాల్ పీసీసీ చీఫ్ పదవికి శుక్రవారం అధీర్ రంజన్ రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ రెండు రోజుల అంతర్గత సమావేశాల్లో భాగంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక.. మమతా బెనర్జీకి తనకు వ్యక్తిగతంగా ఎటువంటి విభేదాలు లేవని, కేవలం రాజకీయంగా మాత్రమే తాను విభేదించినట్లు చూడాలని అధీర్ రంజన్ స్పష్టం చేశారు.కాగా, బెంగాల్లో సీఎం మమతను విభేదించే అధీర్ రంజన్ రాజీనామా చేయటంతో దీదీ.. ప్రియాంకా గాంధీ ప్రచారానికి సిద్ధమైనట్లు కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతోంది. అయితే దీనిపై ఇరు పార్టీల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెల్లడికాలేదు. ఇక.. లోక్‌సభలో ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగిన టీఎంసీ మొత్తం 42 స్థానాలకు గాను 29 సీట్లును గెలుచుకున్న విషయం తెలిసిందే. ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటుకే పరిమితమైంది. ఐదుసార్లు ఎంపీగా గెలిచిన అధీర్ రంజన్ సైతం ఈసారి టీఎంసీ అభ్యర్థి మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ చేతిలో ఓటమిపాలయ్యారు. ఈసారీ కాంగ్రెస్.. లెఫ్ట్ పార్టీలతో కలసి బరిలోకి దిగినప్పటికీ ఆశించిన ఫలితాలు రాబట్టుకోలేకపోయింది. -
వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి ప్రియాంక ఎన్నికల అరంగేట్రం
-
కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానాన్ని వదులుకోనున్న రాహుల్ గాంధీ.. వయనాడ్ ఉప ఎన్నికలో పోటీ చేయనున్న ప్రియాంక గాంధీ.. ఇంకా ఇతర అప్డేట్స్
-
వయనాడ్‌ను వదులుకున్న రాహుల్ .. ఉప ఎన్నికల బరిలో ప్రియాంక గాంధీ
న్యూఢిల్లీ : ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ విజయం సాధించారు.దీంతో వయనాడ్ (కేరళ), రాయ్‌బరేలీ (యూపీ) స్థానాల్లో ఒక నియోజకవర్గాన్ని ఆయన వదులుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీనిపై తాను ఎటూ తేల్చుకోలేకపోతున్నానంటూ ఇటీవల రాహుల్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, తన నిర్ణయం రెండు వర్గాల ప్రజలను సంతోషపరుస్తుందని అన్నారు. ఈ తరుణంలో వయనాడ్ స్థానాన్ని వదులుకున్నట్లు రాహుల్ గాంధీ అధికారింగా ప్రకటించారు. రాహుల్ రాజీనామాతో వయనాడ్‌లో జరిగే ఉప ఎన్నికల్లో ఆయన సోదరి ప్రియాంక గాంధీ బరిలోకి దిగడం అనివార్యమైంది.ఈ సందర్భంగా జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. ‘రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ కొనసాగాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. రాయ్ బరేలితో గాంధీ కుటుంబానికి తరతరాల అనుబంధం ఉంది.వయనాడ్ సీటుకు రాహుల్ రాజీనామా చేస్తారు. ఆస్థానంలో ప్రియాంక గాంధీ పోటీ చేయనున్నారు’ అని ఖర్గే వెల్లడించారు.‘వయనాడ్‌తో నాకు అనుబంధం ఉంది. జీవితాంతం వయనాడ్ నాకు గుర్తుంటుంది. ప్రియాంక గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేస్తారు. కష్ట కాలంలో వయనాడ్ నుంచి నన్ను గెలిపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటాం’ అని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.‘వయనాడ్ నుంచి ప్రాతినిధ్యం వహించడానికి సిద్ధంగా ఉన్నా..రాయ్ బరేలిలో నా సోదరుడికి ఎప్పుడు మద్దతుగా ఉంటా’ అని ప్రియాంక గాంధీ అన్నారు.ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రియాంక గాంధీ ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రియాంక గాంధీ అరంగేట్రంపై గత కొంతకాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు కూడా ఆమె అమేథీ లేదా రాయ్‌బరేలీ నుంచి పోటీ చేస్తారని వార్తలు వినిపించాయి. దీనిపై సుదీర్ఘ ఉత్కంఠకు తెరదించుతూ రాయ్‌బరేలీ నుంచి రాహుల్ పోటీ చేసి విజయం సాధించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంపై దృష్టి సారించేందుకే ఆమె పోటీకి దూరమైనట్లు కాంగ్రెస్ నేతలు చెప్పారు. అయితే, ఎక్కడైనా ఉప ఎన్నిక ద్వారా ఆమె పార్లమెంటుకు వెళ్లవచ్చని అన్నారు. తాజా రాహుల్ గాంధీ వయనాడ్‌కు రాజీనామా చేయడంతో..ప్రియాంక గాంధీ ప్రత్యక్ష ఎన్నికల్లో అరంగ్రేటం అనివార్యమైంది. -
ప్రియాంక పోటీచేస్తే ప్రధాని ఓడేవారు
రాయ్‌బరేలీ: ప్రధాని మోదీ పోటీచేసిన వారణాసి లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ పోటీచేస్తే ఆమె రెండు, మూడు లక్షల ఓట్ల మెజారిటీతో నెగ్గేవారని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. రాయ్‌బరేలీలో తనను, అమేథీలో కిశోరీలాల్ శర్మను గెలిపించినందుకు గుర్తుగా మంగళవారం రాయ్‌బరేలీలో ఏర్పాటుచేసిన ‘కృతజ్ఞత కార్యక్రమం’లో అమేథీ, రాయ్‌బరేలీ ఓటర్లనుద్దేశించి రాహుల్ కొద్దిసేపు ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో ప్రియాంక, అమేథీ ఎంపీ కిశోరీలాల్ శర్మ పాల్గొన్నారు. ‘‘ పార్లమెంట్లో ఎన్డీఏ బలాన్ని తగ్గించేందుకే రాయ్‌బరేలీ, అమేథీ సహా దేశవ్యాప్తంగా నియోజకవర్గాల్లో విపక్షాల ‘ఇండియా’ కూటమి పార్టీలు ఉమ్మడి గా పోరాడాయి. ‘‘ బీజేపీ నాయకుల గెలుపు అహంకారాన్ని మేం పట్టించుకోం. మా ఆలోచనంతా ప్రజా సమస్యల గురించే.అయోధ్యలో రామమందిరం ప్రాణప్రతిష్ఠ, ఇతరత్రా కార్యక్రమాల్లో బడా పారిశ్రామికవేత్తలకు అతి విలువ ఇచ్చి సాధారణ జనాలను మోదీ గాలికొదిలేశారు. వారి సమస్యలను పట్టించుకోలేదు. అందుకే ఏకంగా అయోధ్యలోనూ బీజేపీకి ఓటమి రుచి చూపించి ఓటర్లు బుద్ధి చెప్పారు’’ అని అన్నారు. అవధ్ గొప్ప సందేశమిచ్చింది: ప్రియాంకఅమేథీ, రాయ్‌బరేలీలో బీజేపీని ఓడించి ఇక్కడి అవధ్ ప్రాంతం ఉత్తరప్రదేశ్కేకాదు యావత్భారతానికి చక్కటి సందేశం ఇచ్చిదని, మనకు వాస్తవికమైన స్వచ్ఛమైన రాజకీయాల అవసరం ఉందని ప్రియాంకా అన్నారు. -
Priyanka Gandhi: మీ చెల్లెల్ని అయినందుకు గర్వంగా ఉంది
న్యూఢిల్లీ: తన సోదరుడు రాహుల్ గాంధీ ఎప్పటికీ వెనక్కి తగ్గరని, సత్యం కోసం పోరాటాన్ని ఆపబోరని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ వాద్రా ప్రశంసించారు. లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన రాహుల్‌కు బుధవారం ‘ఎక్స్’లో అభినందనలు తెలియజేశారు. ‘‘మీరు ఎప్పుడూ తలెత్తుకొని ఉంటారు. ఎవరేం చెప్పినా, ఏం చేసినా, ఎన్నిక ప్రతికూల పరిస్థితులు ఎదురైనా మీరు వెనక్కి తగ్గరు. మీ అంకితభావాన్ని ఎవరెంతగా సందేహించినా మీరు మీపై విశ్వాసం కోల్పోరు. కోపం, విద్వేషం వంటివి మిమ్మల్ని ప్రభావితం చేయలేవు. మీరు చాలా ధైర్యవంతులు. మీ చెల్లెల్ని అయినందుకు ఎంతో గర్వంగా ఉంది’’ అని ప్రియాంక పోస్టు చేశారు. -
రాహుల్ గాంధీ నిర్ణయంపై కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్కంఠ
రాహుల్ గాంధీ ఏ సీటు వదులుకుంటారు?.. ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణులతో పాటు రాజకీయ వర్గాల్లో మొదలైన చర్చ ఇదే. కేరళ వయనాడ్‌తో పాటు కాంగ్రెస్ కంచుకోటగా పేరున్న రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానాల నుంచి 3లక్షలకు పైగా మెజార్టీతో విజయం సాధించారాయన. అయితే టెక్నికల్‌గా ఆయన ఏదో ఒక స్థానానికే ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆయన దేని వదులుకుంటారు? దేనికి పరిమితం అవుతారు? అనే ఆసక్తి నెలకొంది. గత ఎన్నికల్లో అమేథీ, వయనాడ్ నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ.. అనూహ్యంగా అమేథీ నుంచి ఓడి, వయనాడ్ నుంచి నెగ్గారు. ఈసారి కూడా తొలుత అక్కడి నుంచే పోటీ చేశారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఇక్కడ బలంగా ఉండటంతోపాటు.. జాతీయ స్థాయిలో విపక్ష కూటమి తరఫున ప్రధానమంత్రి అభ్యర్థి రాహుల్ అయ్యే అవకాశాలున్నాయంటూ స్థానిక కాంగ్రెస్ శ్రేణులు ప్రచారం చేశాయి. ఇక బీజేపీ, వామపక్ష పార్టీ బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపాయి. సీపీఐ నుంచి అన్నీ రాజా, బీజేపీ తరఫున ఏకంగా ఆ రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్ పోటీ దిగారు. ఉత్తర భారతానికి చెందిన రాహుల్ అసలు వయనాడ్‌ను పట్టించుకోవడం లేదని విమర్శలు గుప్పించారు. అయినా కూడా వయనాడ్ నుంచి రెండోసారి 3.64లక్షలకుపైగా ఓట్ల మెజార్టీతో రాహుల్ విజయం సాధించారు.ఇక.. రాయ్‌బరేలీ గత కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్‌కు కంచుకోటగా కొనసాగుతోంది. 1951 నుంచి ఈ నియోజకవర్గంలో కేవలం మూడుసార్లు మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, ఫిరోజ్ గాంధీ, సోనియాగాంధీ వంటి అగ్రనేతలు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించారు. సోనియా గాంధీ ఇటీవల రాజ్యసభకు ఎన్నిక కావడంతో బరిలో దిగిన రాహుల్.. భారీ మెజార్టీ సొంతం చేసుకున్నారు. రాహుల్ రాయ్‌బరేలీని వదులుకుంటే అక్కడ నుంచి ప్రియాంకాగాంధీ పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వ్యూహంతోనే ఆమెను సార్వత్రిక ఎన్నికల్లో వేరే చోట నుంచి బరిలో దింపలేదనే వాదనా ఉంది. అయితే ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ మాత్రం ఎక్కడైనా ఉప ఎన్నిక ద్వారా ఆమె పార్లమెంటుకు వెళ్లవచ్చని ఒక మాటైతే అన్నారు. దీంతో అది రాయ్‌బరేలీ కావొచ్చనే ఊహాగానాలు తెర మీదకొచ్చాయి. -
కిశోరీ భయ్యా మీరు గెలుస్తారని తెలుసు: ప్రియాంక గాంధీ
కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా భావించిన ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ, రాయ్‌బరేలీ.. రెండు నియోజర్గాలో పార్టీ విజయ ఢంకా మోగించింది. రాయ్‌బరేలీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మూడున్నర లక్షల మేజార్టీతో గెలుపొందారు. ఇటు అమేథీలోనూ కాంగ్రెస్ అభ్యర్థి కిషోరి లాల్ శర్మ ఘన విజయం సాధించారు. గత ఎన్నికల్లో రాహుల్ గాంధీని ఓడించిన కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ ఈసారి బొల్తా కొట్టారు. దాదాపు 1.50 లక్షల ఓట్ల తేడాతో కిషోర్ లాల్ శర్మ చేతిలో చిత్తుగా ఓడారు. దీంతో కాంగ్రెస్ కంచుకోట అయిన అమేథీని తిరిగి చేజిక్కించుకుంది.కిషోరీ లాల్ గెలుపుతో తరఫున విస్తృత ప్రచారం సాగించిన కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ స్పందించారు. పార్టీ గెలుపుపై ఆనందం వ్యక్తం చేశారు. ఆమె సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టు పెట్టారు. ‘కిశోరీ లాల్ భయ్యా మీరు గెలుస్తారని నాకు తెలుసు. మీ గెలుపు విషయంలో నేనెప్పుడూ సందేహించలేదు. మీకు, అమేథీ నియోజకవర్గంలోని నా ప్రియమైన సోదర, సోదరీమణులకు అభినందనలు’ అని రాసుకొచ్చారు.किशोरी भैया, मुझे कभी कोई शक नहीं था, मुझे शुरू से यक़ीन था कि आप जीतोगे। आपको और अमेठी के मेरे प्यारे भाइयों और बहनों को हार्दिक बधाई ! pic.twitter.com/JzH5Gr3z30— Priyanka Gandhi Vadra (@priyankagandhi) June 4, 2024 -
Lok Sabha Election 2024: కటాకట్ ఫటాఫట్
నేతల నినాదాలు ఓట్ల వర్షం కురిపించిన సందర్భాలు దేశ ఎన్నికల చరిత్రలో ఎన్నో! గరీబీ హటావో అంటూ దివంగత ప్రధాని ఇందిరాగాంధీ ఇచి్చన నినాదం అప్పట్లో దుమ్ము రేపింది. ఈసారి మాత్రం నినాదాల కంటే కూడా ముఖ్య నేతల నోటి నుంచి వెలువడ్డ వింత పదబంధాలు అందరినీ ఆకర్షించాయి. వాటి అర్థం ఏమై ఉంటుందా అని ఓటర్లలో ఆసక్తి రేపాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాం«దీ, సోదరి ప్రియాంక తమ ప్రసంగాల్లో ‘కటాకట్’ అని విరివిగా వాడారు. అదే పదాన్ని ప్రధాని మోదీ తిరిగి కాంగ్రెస్‌పైకి సంధించారు. ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, ఆర్జేడీ నేత తేజíస్వీ యాదవ్ కూడా వెరైటీ హిందీ పదాలను ప్రయోగించారు. రాహుల్ ఆద్యుడు కటాకట్ అనే హిందీ పదాన్ని తొలుత ప్రయోగించింది రాహులే. మిగతా వారు దాన్ని అందిపుచ్చుకున్నారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ప్రతి పేద మహిళకు ఏటా రూ.లక్ష ఇస్తామని, ధనవంతుల సంపదను పేదలకు పంచుతామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొనడం తెలిసిందే. రాహుల్ తన ప్రచారంలో ఈ హామీలను తరచూ ప్రస్తావించారు. పేదల బ్యాంకు ఖాతాలకు డబ్బులు ‘కటాకట్ కటాకట్’ బదిలీ చేస్తామని ప్రకటించారు. చకచకా అనే అర్థంలో కటాకట్ పదాన్ని ప్రయోగించారు. దీనిపై ప్రజల్లో బాగా స్పందన రావడంతో ప్రియాంక కూడా అందిపుచ్చుకున్నారు. దాంతో కటాకట్ అంటే ఏమై ఉంటుందా అని గూగుల్‌లో శోధన కూడా పెరిగింది. మోదీ కూడా అదే పదాన్ని తనదైన శైలిలో కాంగ్రెస్‌పైకి తిరిగి ప్రయోగించారు. ‘‘ఈ యువరాజులు ప్యాలెసుల్లో పుట్టారు. కష్టపడిందీ లేదు, ఫలితాలు సాధించిందీ లేదు. అందుకే దేశం తనంతట తానే అభివృద్ధి చెందుతుందని వారు అలవోకగా చెబుతుంటారు. ఎలా? ‘కటాకట్, కటాకట్’’ అని చెప్పుకొచ్చారు. రాయ్‌బరేలీ లోక్‌సభ నియోజకవర్గ ప్రజలు వారిని ‘కటాకట్, కటాకట్’ ఇంటిదారి పట్టిస్తారంటూ రాహుల్‌పై చెణుకులు విసిరారు. తేజస్వి ‘ఫటాఫట్’ తేజస్వీ యాదవ్ కూడా రాహుల్‌తో కలసి ఓ సభలో మాట్లాడుతూ నిరుద్యోగులను ఉద్దేశించి.. ‘‘మీకు ఉద్యోగాలు ఫటాఫట్ వచ్చేస్తాయి. ఫటాఫట్. బీజేపీ సఫాచట్, సఫాచట్ (తుడిచి పెట్టుకుపోతుంది). కాంగ్రెస్, లాంతర్‌కు ఓట్లు తకాతక్ పడిపోతాయి’’ అని చెప్పుకొచ్చారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ కూడా గమ్మత్తైన పదాలను ప్రయోగించారు. ‘‘తాము అవినీతి చేసేది లేదు, ఎవరినీ చేయనిచ్చేది లేదని గొప్పలు చెప్పేవారు టీకాల తయారీదారుల నుంచి విరాళాలు, ఎన్నికల బాండ్ల రూపంలో భారీ మొత్తాలు అందుకుంటారు. అలాంటి వారు గటాగట్, గటాగట్, అని చెబుతుంటారు. కానీ ప్రజలు ఓటు ద్వారా వారిని ఫటాఫట్ ఫటాపట్ ఇంటికి పంపించేస్తారు’’ అని బీజేపీపై వ్యంగ్యా్రస్తాలు విసిరారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇంత దారుణంగా మాట్లాడిన ప్రధాని దేశ చరిత్రలోనే లేరు: ప్రియాంక
న్యూఢిల్లీ/గోరఖ్‌పూర్(యూపీ): ప్రతిపక్ష ఇండియా కూటమినుద్దేశించి ‘ముజ్రా’అంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించడంపై కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా తీవ్రంగా మండిపడ్డారు. ఇంత దారుణంగా మాట్లాడిన ప్రధానమంత్రి దేశ చరిత్రలోనే లేరని పేర్కొన్నారు. ‘ప్రధానమంత్రి పదవిని దేశం యావత్తూ గౌరవిస్తుంది. అటువంటి పదవికున్న ఔన్నత్యాన్ని కాపాడండి’అని మోదీకి హితవు పలికారు. యూపీలోని గోరఖ్‌పూర్‌లో శనివారం ఆమె మాట్లాడారు. ‘బిహార్‌లో ప్రధాని మోదీ ఏమన్నారో విన్నారా? దేశ చరిత్రలోనే అటువంటి భాష ను వాడిన ప్రధాని మరొకరు లేరు. అటువంటి మాటలు ప్రధాని నోట రాకూడదు. సహనం కోల్పోయిన మోదీ దేశానికి, దేశ ప్రజలకు ప్రతినిధిననే విషయం మర్చిపోతున్నారు. ఆయన అసలు రూపం బట్టబయలైంది’అని ప్రియాంక అన్నారు. ‘దేశమే తన కుటుంబమని చెప్పుకుంటున్న వ్యక్తి అనాల్సిన మాటలు కావవి. కుటుంబసభ్యులు పరస్పరం గౌరవించుకోవాలి. ఎప్పటికీ అది అలాగే కొనసాగాలి’ అని ప్రియాంక అన్నారు. -
ఒకే వేదికపై ప్రియాంకా గాంధీ, డింపుల్ యాదవ్?
యూపీలో వివిధ రాజకీయ పార్టీల లోక్‌సభ ఎన్నికల ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, ఇండియా కూటమి అభ్యర్థి అజయ్ రాయ్‌కు మద్దతుగా కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ వారణాసిలో ఉమ్మడి బహిరంగ సభ నిర్వహించనున్నారు.దీనికి సంబంధించి ఇండియా కూటమి పార్టీలైన కాంగ్రెస్, ఎస్పీ, ఆమ్ ఆద్మీ పార్టీ, వామపక్షాలు సన్నాహాలు ప్రారంభించాయి. అయితే సభ జరిగే వేదికను, తేదీని ఇంకా నిర్ణయించలేదని కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ తెలిపారు. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. కాంగ్రెస్ మహానగర అధ్యక్షుడు రాఘవేంద్ర చౌబే, జిల్లా అధ్యక్షుడు రాజేశ్వర్ పటేల్ మాట్లాడుతూ ఈ ర్యాలీకి సంబంధించిన ఏర్పాట్లను ముమ్మరం చేశామన్నారు.కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి అధికారులంతా ఈ బహిరంగ సభలో పాల్గొంటారని సమాచారం. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా వారణాసిలో జరిగే ప్రచారంలో పాల్గొననున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి అజయ్‌రాయ్‌కు మద్దతుగా మే 28 లేదా 29న ఈ ఇద్దరు నేతలూ వారణాసిలో రోడ్ షో నిర్వహిస్తారని సమాచారం. -
‘ప్రధాని మోదీ మతం పేరుతో ఓట్లు ఎందుకు అడగాలి?’
కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ప్రధాని మోదీపై మరోసారి తీవ్రంగా మండిపడ్డారు. ప్రధాని మోదీ మంగళసూత్రం, మతం, గేదెలు పేరుతో ఎందుకు ఓట్లు అడుగుతున్నారని నిలదీశారు. ఆమె శనివారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రధాని మోదీ గత పదేళ్లలో తన పాలనపై పూర్తి విశ్వాసం కలిగి ఉంటే.. పాలన పేరుతోనే ప్రజలను ఓట్లు అడగాలి. 45 ఏళ్లలో ఎన్నడూ చూడని విధంగా నిరుద్యోగం పెరిగిపోయింది. పదేళ్లలో చేసిన పని చెప్పి ఓట్లు అడగాలి. కానీ, మోదీ ఎందుకు అలా కాకుండా మతం, మంగళసూత్రం, గేదెల పేరుతో ఓట్లు అడుగుతున్నారు?. కేంద్రం తీసుకువచ్చిన అగ్నిపథ్ నియామక ప్రక్రియి మూలంగా చాలా మంది అభ్యర్థులు తమ విశ్వాన్ని కోల్పోతున్నారు. ద్రవ్యోల్బణం, ధరలు పెరిగాయి. మహిళలు ఐదు నిత్యావసర వస్తులు కొందామని షాప్‌కు వెళ్లితే.. కేవలం రెండు వస్తువులు కొనుగోలు చేసి తిరిగి వస్తుంది. ధరల పెరుగుదల మహిళల్లో తీవ్ర నిరాశ నింపుతోంది. ప్రధాని మోదీ వికసిత్ భారత్ అనే నినాదాన్ని ఇచ్చి.. పదేళ్ల అవుతోంది. మరీ అలాంటప్పుడు ఈ పదేళ్లలో ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారు. ఉజ్వల్ ఎల్పీజీ స్కీమ్, ఊపీఏ-ఎరా స్కీమ్ వంటికి ఎందుకు అభివృద్ధి చేయలేదు?’’ అని ప్రియాంకా గాంధీ మండిపడ్డారు.లోక్‌సభఎన్నికల ప్రచారంలో ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలు ఆదాయన్ని చొరబాటుదారులకు పంపిణీ చేస్తుందిని, మహిళల మంగళసూత్రాలు సైతం లాక్కుంటారని తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై స్పందించిన ప్రియాంకా గాంధీ.. దేశం కోసం తన తల్లి సోనియా గాంధీ మంగళసుత్రాన్ని త్యాగం చేసిందని కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. -
రాయ్‌బరేలీలో పోటీ చేయకపోడంపై ప్రియాంక తొలి స్పందన
ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ, రాయ్‌బరేలీ స్థానాలు కాంగ్రెస్‌కు ఎంతో కీలకం. గాంధీ కుటుంబానికి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మారిన ఈ స్థానాల్లో గెలుపు ప్రస్తుతం ఆ పార్టీకి అత్యంత అవసరం. రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తుండగా.. అమేథీ నుంచి పార్టీకి విధేయుడు కిషోరిలాల్ శర్మ బరిలో నిలిచారు. లోక్‌సభ అయిదో విడతలో భాగంగా ఈ రెండు స్థానాలతోపాటు యూపీలో 14 సీట్లకు మే 20న పోలింగ్ జరగనుంది.కాంగ్రెస్ కంచుకోటగా పేరొందిన రాయ్‌బరేలీలో సోనియా గాంధీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. అయితే ఇటీవల ఆమె రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఆమె తనయురాలు ప్రియాంక గాంధీ ఇక్కడి నుంచి పోటీ చేస్తారని అంతా భావించారు. కానీ ఆమె పోటీ నుంచి తప్పుకొని అందరినీ షాక్‌కు గురిచేశారు. ప్రస్తుతం ప్రియాంక ఈ రెండు నియోజకవర్గాల్లో ప్రచార బాధ్యతలను తన భూజాన వేసుకున్నారు. గత ఎన్నికల్లో కోల్పోయిన అమేథీని తిరిగి దక్కించుకోవడం.. సోదరుడు పోటీ చేస్తున్న రాయ్‌బరేలీలో మరోసారి విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నారు.తాజాగా లోక్‌సభలో పోటీ చేయడకపోవడంపై ప్రియాంక గాంధీ స్పందించారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ తరపున దేశ వ్యాప్తంగా ప్రచారంపై దృష్టి సారించేందుకే తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదని పేర్కొన్నారు. తాను, రాహుల్ ఈ ఎన్నికల్ల పోటీ చేస్తే.. ఈ అంశాన్ని బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకుంటుందని చెప్పారు.‘నేను గత 15 రోజులుగా రాయ్‌బరేలిలో ప్రచారం చేస్తున్నాను. గాంధీ కుటుంబానికి రాయబరేలీతో విడదీయరాని బంధం ఉంది. కాబట్టి, మేము ఇక్కడికి వచ్చి వారిని కలిసి వారితో సంభాషిస్తారని ప్రజలు భావిస్తున్నారు. రిమోట్ కంట్రోల్ ద్వారా ఇక్కడ ఎన్నికలను గెలవలేం’ అని అన్నారు.తోబుట్టువులిద్దరూ(రాహుల్, ప్రియాంక) ఎన్నికల్లో పోటీ చేస్తే.. కనీసం 15 రోజులు తమ నియోజకవర్గాల్లోనే ఉండాల్సి వచ్చేదని అన్నారు. ఆ సమయంలో దేశమంతా ప్రచారం చేయడం కూదరదని తెలిపారు. అయితే భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేస్తారా అని అడిగిన ప్రశ్నకు ప్రియాంక సమాధానం దాటవేశారు.పార్లమెంట్ సభ్యురాలు కావాలని, ఎన్నికల్లో పోటీ చేయాలనీ తానెప్పుడూ అనుకోలేదని అన్నారు. ఏ బాధ్యతలు అప్పజెప్పిన పార్టీ కోసం నిచేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. నేను ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రజలు భావిస్తే పోటీ చేస్తానని తెలిపారు.ఓడిపోతామనే భయంతో ప్రియాంక గాంధీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదిన్న బీజేపీ ఆరోపణలను ఆమె కొట్టిపారేశారు. బీజేపీ వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ నడవడం లేదని ఆమె అన్నారు. తాను, సోదరుడు పోటీ చేస్తే అది బీజేపీకి లాభదాయకంగా మారుతుందని, ప్రచారానికి ఎవరూ అందుబాటులో ఉండరని తెలిపారు. అదే విధంగా అమేథీ నుంచి రాహుల్ ఓటమి భయంతో పారిపోయారంటూ ప్రధాని మోదీ సహా బీజేపీ చేస్తున్న ప్రచారంపై ప్రియాంక మండిపడ్డారు. ‘కాంగ్రెస్ పార్టీ అమేథీ, రాయ్‌బరేలీలను ఎప్పటికీ వదిలిపెట్టదు. కాంగ్రెస్‌కు, ఈ రెండు నియోజకవర్గాల మధ్య అపూ ర్వ బంధం ఉంది. గుజరాత్‌లోని వడోదర ఎన్నికల్లో ప్రధాని మోదీ ఎందుకు పోటీ చేయడం లేదు? ప్రధాని భయపడుతున్నారా? 2014 తర్వాత వడోదర ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదు? గుజరాత్ నుంచి పారిపోయారా?’ అని ప్రియాంక ప్రశ్నించారు. -
‘అమేథీలో నా ప్రత్యర్థి ప్రియాంకానే’
లక్నో: లోక్‌సభ ఎన్నికల్లో తన ప్రత్యర్థి కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ వాద్రా అని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ అన్నారు. తనకు చిన్న పిల్లల వలే రాజకీయాలు చేయటం ఇష్టం లేదని తెలిపారు. స్మృతి ఇరానీ మీడియాతో మాట్లాడుతూ.. ప్రియాంకా గాంధీపై విమర్శలు చేశారు.‘ఈ ఎన్నికల్లో అమేథీలో నా ప్రత్యర్థి.. ప్రియాంకా గాంధీ వాద్రా. నాపై ఆమె తెర వెనక నుంచి పోరాటం చేస్తున్నారు. కనీసం ఆమె సోదరుడు రాహుల్ గాంధీ నయం. ఆయన ప్రత్యక్షంగా పోటీలో ఉన్నారు. 2014లో రాహుల్ 1.07 లక్షల మెజార్టీతో గెలుపొందారు’ అని ప్రియాంకా గాంధీని ఎద్దేవా చేశారు.ఇక.. కాంగ్రెస్ పార్టీ అమేథీ పార్లమెంట్ స్థానంలో గాంధీ కుటుంబానికి సన్నిహితుడైన కిషోరి లాల్ శర్మను బరిలో నిలిపిన విషయం తెలిసిందే. అదేవిధంగా కాంగ్రెస్ కంచుకోట స్థానమైన రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీ కేరళలోని వాయ్‌నాడ్‌లో సైతం పోటీ చేసిన విషయం తెలిసిందే.ఇక.. అమేథీ, రాయ్ బరేలీ స్థానాలు ప్రియాంకా గాంధీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ రెండు స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఆమె కృషి చేస్తున్నారు. ఈ రెండు నియోజకవర్గాలో అన్ని తానై నేతలు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ప్రచారంలో దుసూకువెళ్తున్నారు.అమేథీ, రాయ్‌బరేలీ సెగ్మెంట్లలో ఐదో విడత మే 20న పోలింగ్ జరగనుంది. ఇక.. గతంలో రాయ్‌బరేలీలో సోనియా గాంధీ చేతీలో ఓడిపోయిన దినేష్ ప్రతాప్ సింగ్‌ను మళ్లీ బీజేపీ బరిలోకి దించింది. -
అందరూ ఓటు వేయండి.. ఓటర్లకు ప్రియాంక గాంధీ విజ్ఞప్తి
లక్నో: నాలుగో దశ లోక్‌సభ ఎన్నికలు ఇండియా కూటమికి అనుకూలంగా ఉంటాయని 'ప్రియాంక గాంధీ వాద్రా' సోమవారం విశ్వాసం వ్యక్తం చేశారు. దేశ ప్రజలు మొదటి మూడు దశలను చూశారు. ఈ దశలో జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ తప్పకుండా విజయం సాధిస్తుందని అన్నారు.దేశంలోని ప్రతి ఒక్క ఓటు రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణకు అంకితం. కాబట్టి ప్రజలు తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. తమ కోసం అవిశ్రాంతంగా పనిచేసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బయటకు వచ్చి ఓటు వేయాలని ఆమె ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.తొమ్మిది రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 96 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో లోక్‌సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్ ఈరోజు సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలోని మొత్తం 175 స్థానాలకు మరియు ఒడిశా రాష్ట్ర శాసనసభలోని 28 స్థానాలకు కూడా లోక్‌సభ ఎన్నికలతో పాటు ఏకకాలంలో పోలింగ్ ప్రారంభమైంది.తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలకు, ఆంధ్రప్రదేశ్‌లోని 25 స్థానాలకు, ఉత్తరప్రదేశ్‌లో 13, బీహార్‌లో 5, జార్ఖండ్‌లో 4, మధ్యప్రదేశ్‌లో 8, మహారాష్ట్రలో 11, ఒడిశాలో 4, పశ్చిమ బెంగాల్లో 8 స్థానాలకు పోలింగ్ జరగనుంది. జమ్మూ కాశ్మీర్లో ఒక లోక్‌సభ స్థానానికి ఓటింగ్ జరుగుతుంది. -
Priyanka Gandhi: చిన్న పిల్లాడిలా ఏడుస్తున్నారు
నందుర్బార్: ప్రధాని మోదీ లక్ష్యంగా కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. ప్రపంచంలోనే గొప్ప నేతంటూ మోదీని బీజేపీ నేతలు ఆకాశానికి ఎత్తేస్తుండగా ఆయన మాత్రం తనను వేధిస్తున్నారంటూ చిన్నా పిల్లాడిలా ఏడుస్తున్నారన్నారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ మాదిరిగా ధైర్యసాహసాలను అలవర్చుకోవాలని ప్రియాంక ఉద్బోధించారు. శనివారం ప్రియాంక మహారాష్ట్రలోని నందుర్బార్లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మాట్లాడారు. ‘అవినీతిపై ఒంటరి పోరాటం సాగిస్తున్నట్లు మోదీ చెప్పుకుంటున్నారు. ఆయన వద్దే అధికారం యావత్తు కేంద్రీకృతమై ఉంది. మోదీ అందరి కంటే గొప్పనేత అనీ, ప్రపంచ నేతల మద్దతు ఆయనకు ఉందని బీజేపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. కానీ, మోదీ మాత్రం తనను లక్ష్యంగా చేసుకుని ప్రతిపక్షాలు వేధింపులకు పాల్పడుతున్నాయంటూ ఎన్నికల సభల్లో చిన్న పిల్లాడిలా ఏడుస్తున్నారు. ప్రధాని పదవిలో ఉన్న వ్యక్తి ప్రజల కష్టాలను అడిగి తెలుసుకోవాలి. కానీ, ఆయనే స్వయంగా ఇబ్బందులను చెప్పుకుంటున్నారు. ధైర్యంగా ఉండాలి మోదీజీ, ఇది ప్రజా జీవితం. ప్రధాని పదవిని తక్కువ చేయొద్దు’ అని హితవు పలికారు. ‘దుర్గామాతలా వ్యవహరించిన మాజీ ప్రధాని ఇందిరా గాంధీ నుంచి నేర్చుకోండి. ఆమె పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేశారు. ఆమె మాదిరిగా ధైర్యం, కృతనిశ్చయం కలిగి ఉండండి. కానీ, జాతి వ్యతిరేకి అంటూ ఇందిరను తిట్టిపోసే మీరు, ఆమె నుంచి నేర్చుకునేందుకు ఏముంటుంది?’ అని ప్రియాంక అన్నారు. ప్రధాని మోదీ శుక్రవారం నందుర్బార్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో..తనను సజీవంగా సమాధి చేయాలని ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయంటూ వ్యాఖ్యానించడం తెలిసిందే. -
మోదీ ఓటమి తెలంగాణ నుంచే మొదలుకావాలి
సాక్షి, హైదరాబాద్/సాక్షి, కామారెడ్డి/తాండూరు: ‘రాజ్యాంగాన్ని, దేశాన్ని కాపాడుకోవాలంటే మోదీని, బీజేపీని ఓడించడం తెలంగాణ నుంచే మొదలుకావాలి. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు రాహుల్ గాంధీ నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించి రాహుల్ నాయకత్వానికి అండగా నిలవండి. తెలంగాణ ఇచ్చిన సోనియాగాందీని మీరంతా సోనియమ్మ అంటున్నారు. నన్ను మీ సోదరిగా భావించండి’ అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ అన్నారు. 400 వందల సీట్లు ఇస్తే దేశ రాజ్యాంగాన్ని మారుస్తానని ప్రధాని మోదీ అంటున్నారని, ఈ రాజ్యాంగం దేశం లోని 140 కోట్ల మందిదని, ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చనివ్వమని ఉద్ఘాటించారు. రాజ్యాంగాన్ని రద్దు చేసే ప్రయత్నాలను తెలంగాణ నుంచే అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఆమె శనివారం తాండూరు, కామారెడ్డిలో నిర్వహించిన రోడ్‌షోలు, కార్నర్ మీటింగుల్లో సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. పదేళ్ల మోదీ పాలనలో పేద, మధ్య తరగతి ప్రజలు, కారి్మకులు, రైతులు, మహిళలకు ఎలాంటి మేలు జరగలేదని, తన మిత్రులకే దేశ సంపద దోచిపెట్టారని మండిపడ్డారు. వారికి రూ.16 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిన మోదీ, రైతులకు మాత్రం ఒక్క రూపాయీ మాఫీ చేయలేదన్నారు. కాంగ్రెస్ పథకాలకు మోదీ ఫొటో ఎన్నికల సమయంలో ప్రజల మధ్య విభేదాలు సృష్టించి లబ్ధి పొందాలని ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని ప్రియాంకా గాంధీ ధ్వజమెత్తారు. కోటీశ్వరులకే మోదీ హయాంలో వికాసం జరిగిందని, అధికారం తమ చెప్పుచేతల్లో ఉండాలన్నదే బీజేపీ లక్ష్యమని అన్నారు. నోట్ల రద్దుతో రైతులు, చిన్న వ్యాపారులు, సామాన్యుల నడ్డి విరిగిందని, దేశం ఆర్థికంగా వెనుకబడి పోయిందన్నారు. దేశంలోని మీడియా సంస్థలు ఇద్దరి ముగ్గురి చేతుల్లోకి వెళ్లాయని, వాస్తవాలు ప్రజల్లోకి వెళ్లడం లేదని అన్నారు. పదేళ్లలో ఏం చేశారో చెప్పేంత ధైర్యం మోదీ చేయలేదని అన్నారు. కన్నీళ్లు పెట్టుకున్నారే తప్ప, దేశానికి ఏం చేశారో ప్రధాని ఒక్క వేదికపైనా చెప్పలేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ మేనిఫెస్టో గురించి తప్ప తాను ఏం చేశాడో చెప్పడం లేదన్నారు. కాంగ్రెస్ పథకాలకు మోదీ తన ఫొటో పెట్టుకుని ప్రచారం చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. పాలమూరు–రంగారెడ్డికి జాతీయా హోదా ఏదీ? చిలుకూరు బాలాజీ ఉన్న పవిత్ర ప్రాంతం అంటే తనకెంతో ప్రేమ అని ప్రియాంక గాంధీ అన్నారు. ఇందిరా గాందీకి మీరంతా ప్రేమను పంచారని, తన తల్లిని సోనియమ్మ అంటూ ప్రేమతో పిలిచి తల్లి పాత్ర ఇచ్చి తనకు సోదర సమానులయ్యారని వ్యాఖ్యానించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా అడిగినా బీజేపీ ప్రభుత్వం ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ బీజేపీ హయాంలో ఆగిపోయిందని చెప్పారు. దేశంలో 70 కోట్ల మంది నిరుద్యోగులున్నారని, 30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచి్చన వెంటనే ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. రైతులకు కనీస మద్దతు ధరను చట్ట పరిధిలోకి తెస్తామన్నారు. వ్యవసాయ ఆధారిత వస్తువులపై జీఎస్టీ తొలగిస్తామని, రైతులకు రుణ మాఫీ ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ట్రిపుల్ ఆర్ సినిమా చూశారా అని ప్రజలను అడిగిన ప్రియాంక... మనకు డబుల్ ఆర్ అంటే రేవంత్‌రెడ్డి, మరో ఆర్ అంటే రాహుల్ గాంధీ అని అన్నారు. కేంద్రం రాష్ట్రానికి గాడిద గుడ్డు ఇచ్చింది: సీఎం రేవంత్‌రెడ్డి పార్లమెంట్ ఎన్నికలు రావడంతో సంక్రాంతి పండగకు వచ్చే గంగిరెద్దుల్లా బీజేపోళ్లు రాష్ట్రానికి వస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. పదేళ్లలో మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి గాడిద గుడ్డు ఇచ్చిందని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దబోతున్నాయని చెప్పారు. వైఎస్సార్ ప్రభుత్వ హయాంలో వికారాబాద్ జిల్లాలో కేవలం కందులే కాదు ఇతర పంటలనూ పండించేలా ప్రోత్సహించారు. నాడు రంగారెడ్డి జిల్లా ప్రజలకు సాగునీటిని అందించేందుకు ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును వేల కోట్లు వెచ్చించి నిర్మాణ పనులు చేపట్టారన్నారు. తర్వాత బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు కుట్ర చేసి రద్దు చేసి గోదావరి జలాలను రాకుండా చేశాయని ధ్వజమెత్తారు. ‘మే 9న రైతు భరోసా ద్వారా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తా అని ఆనాడు హామీ ఇచ్చాను. రైతు భరోసా అందిస్తే అమర వీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాయాలని కేసీఆర్‌కు సవాల్ విసిరాను. మే 6న రూ.7,500 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశా. కేసీఆర్ఆర్కు ఏ మాత్రం సోయి ఉన్నా ముక్కు నేలకు రాయాలి’ అని పేర్కొన్నారు. ‘రైతు రుణమాఫీని కాంగ్రెస్ ప్రభుత్వం చేయదని హరీశ్‌రావు అంటున్నారు. తెలంగాణ రైతుల సాక్షిగా, అనంత పద్మనాభస్వామి వారి సాక్షిగా పంద్రాగస్టులోపు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానని ఒట్టు వేస్తున్నా. రుణమాఫీ చేసి రైతుల రుణం తీర్చుకుంటా’ అని తెలిపారు. మోదీ వెంట ఈడీ, ఐటీ, సీబీఐ, ఢిల్లీ పోలీసులు, అంబానీ, అదానీ ఉంటే.. రాహుల్ వెంట ఇందిరమ్మ, రాజీవ్ గాం«దీల త్యాగం, సోనియమ్మ, ప్రియాంక గాంధీ, రేవంత్‌రెడ్డి, కోట్లాది మంది కార్యకర్తలు ఉన్నారని పేర్కొన్నారు. ఈ యుద్ధంలో మోదీ పరివారాన్ని ఓడించి, రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను కాపాడే రాహుల్ నాయకత్వాన్ని బలపర్చాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, మంత్రి దామోదర రాజనర్సింహ, చేవెళ్ల అభ్యర్థి రంజిత్‌రెడ్డి, జహీరాబాద్ అభ్యర్థి సురేశ్ షెట్కార్ తదితరులు పాల్గొన్నారు. -
భారత్‌లో ఎన్నికలు జరుగుతుంటే.. పాకిస్తాన్ గురించి ఎందుకు?: ప్రియాంక గాంధీ
లక్నో: అమేథీ, రాయ్‌బరేలీ నియోజకవర్గాల ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇందులో భాగంగానే అమేథీలో కాంగ్రెస్ అభ్యర్థి కిశోరీ లాల్ శర్మ తరఫున ప్రచారం చేస్తున్న సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలపై ప్రియాంక మండిపడ్డారు. దేశంలో నిరుద్యోగం 45 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరింది. ఇప్పుడు భారతదేశంలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు.. పాకిస్తాన్ గురించి ఎందుకు చర్చిస్తున్నారు అని అన్నారు. వాస్తవ సమస్యలను గురించి తెలియజేసి ఎన్నికల్లో పోరాడాలని అధికార పార్టీని కోరారు.ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ హిందూ ముస్లిం అంశంపై వ్యాఖ్యలు చేస్తోందని.. ప్రజలు మతం, కులం ప్రాతిపదికన ఎన్నికలు జరగాలని కోరుకోవడం లేదని ప్రియాంక గాంధీ అన్నారు.దేశంలో నిరుద్యోగం మాత్రమే కాకుండా.. ద్రవ్యోల్బణం పెరిగిందని అన్నారు. ధరలు పెరగటం వల్ల ప్రజలు నిత్యావరస వస్తువులను కొనుగోలు చేయడానికి కూడా ఆలోచిస్తున్నారని ప్రియాంక గాంధీ అన్నారు. రైతులు కూడా సరైన జీవనోపాధి లేకుండా బాధపడుతున్నారని పేర్కొన్నారు. -
ఉచిత రేషన్‌తో ప్రజల బతుకులు బాగుపడవు: ప్రియాంక గాంధీ
లక్నో: ఇప్పటికే మూడు దశల లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యాయి. ఇంకో నాలుగు దశల్లో వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ తరుణంలో కాంగ్రెస్ నాయకురాలు, లోక్‌సభ ఎలక్షన్ స్టార్ క్యాంపెయినర్ ప్రియాంక గాంధీ గురువారం బీజేపీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.రాహుల్ గాంధీ పోటీ చేసే ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. ఆత్మనిర్భర్ భారత్ మీద విరుచుకుపడ్డారు. కేంద్రం అందించే ఐదు కేజీల రేషన్‌తో ప్రజల బతుకులు బాగుపడవని పేర్కొన్నారు. ఉద్యోగం కావలా? ఐదు కేజీల రేషన్ కావాలా? అని ఎవరినైనా అడిగితే.. తప్పకుండా ఉద్యోగాన్నే కోరుకుంటారని ఆమె పేర్కొన్నారు.ప్రజలు మార్పును కోరుకుంటున్నారని ప్రియాంక గాంధీ అన్నారు. తమ సమస్యలను గురించి తెలుసుకుని, వాటిని పరిష్కారం చూపాలని అన్నారు. బీజేపీ ప్రభుత్వం నిరుద్యోగం కోసం ఏమి చేసింది, ఎక్కువగా ఉన్న ధరలను తగ్గించడానికి ఏమైనా చర్యలు తీసుకుందా? రైతులకు, కూలీలకు ఏమైనా సహాయం చేసిందా అని ఆమె ప్రశ్నల వర్షం కురిపించారు.#WATCH | Raebareli, UP: Congress General Secretary Priyanka Gandhi Vadra addresses a public meeting and says, "... 5 kg ration is not going to make the future. You will not become 'Aatmanirbhar' by this. If I ask you what will you choose between employment and a 5 kg ration, you… pic.twitter.com/lNUhsvTxUn— ANI (@ANI) May 9, 2024 -
‘ డిబేట్‌కి ఎక్కడైనా రెడీ’.. ప్రియాంకా గాంధీకి స్మృతి ఇరానీ సవాల్
లక్నో: కేంద్రమంత్రి, బీజేపీ అమేథీ అభ్యర్థిని స్మృతి ఇరానీ.. కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీకి సవాల్ విసిరారు. ఏ ఛానెల్ అయినా, హోస్ట్ ఎవరైనా, టైం, ప్రదేశం, అంశం ఏదైనా తాను డిబేట్లో మాట్లాడటానికి బీజేపీ సిద్ధంగా ఉందని స్మృతి ఇరాని ప్రియాంకా గాంధీకి ఛాలెంజ్ చేశారు.‘‘నేను ప్రియాంకా గాంధీ, రాహుల్ గాంధీ ఇద్దరికీ ఛాలెంజ్ చేస్తున్నా. ఛానెల్, యాంకర్, ప్రదేశం, టైం విషయం ఏదైనా డిబేట్ చేయడానికి బీజేపీ సిద్ధం. ఒకవైపు.. సోదరుడు, సోదరీ. మరోవైపు.. బీజేపీ అధికార ప్రతినిధి ఉంటారు. మా పార్టీ నుంచి అయితే సుధాంశు త్రివేది చాలు. వాళ్లకు అన్ని సమాధానాలు చెబుతారు’’అని స్మృతి ఇరానీ బుధవారం అమేథీలో సవాల్ చేశారు.దేశంలోని ముఖ్యమన అంశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పెదవి విప్పరని ప్రియాంకా గాంధీ చేసిన ఆరోపణల నేపథ్యంలో స్మృతి ఇరానీ పైవిధంగా ఛాలెంజ్ విసిరారు. 2019లో స్మృతి ఇరానీ.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని 55 వేల మేజార్టీతో ఓడించారు. మరోసారి బీజేపీ స్మృతి ఇరానీకి అమేథీ టికెట్ కేటాయించింది. ఇప్పటికే స్మృతి ఇరానీ అమేథీ పార్లమెంట్ సెగ్మెంట్ మొత్తం తిరిగి ప్రచాం చేశారు. మరోవైపు.. కాంగ్రెస్‌కు కంచుకోట స్థానమైన అమేథీలో నామినేషన్ల చివరి రోజు గాంధీ కుటుంబానికి సన్నిహితుడైన కిషోరి లాల్ సింగ్‌ను బరిలోకి దిపింది. ఇక.. అమేథీ, రాయ్ బరేలీలో గెలుపే లక్ష్యంగా ప్రియాంకా గాంధీ శరవేంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. -
త్వరలో కాంగ్రెస్ చీలిపోతుంది: ఆచార్య ప్రమోద్ కృష్ణం
ఢిల్లీ: మార్చిలో కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఆచార్య ప్రమోద్ కృష్ణం తాజాగా.. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపై కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీ పోటీ చేయడంపై విరుచుకుపడ్డారు.కాంగ్రెస్ త్వరలో రాహుల్ గాంధీ వర్గంగా, ప్రియాంక గాంధీ వర్గంగా చీలిపోవచ్చని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న కుట్రలో ప్రియాంక గాంధీ బలి అయ్యారని కృష్ణం ఆరోపించారు. రాహుల్ గాంధీ అమేథీని వీడిన తీరు కాంగ్రెస్ కార్యకర్తల మనోధైర్యం తగ్గిపోయింది. ప్రియాంక గాంధీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం ఆమె మద్దతుదారుల కొంత నిరాశను మిగిల్చింది.రాహుల్ గాంధీకి పాకిస్తాన్లో ప్రజాదరణ, డిమాండ్ పెరుగుతోంది. కాబట్టి రాయ్‌బరేలీకి బదులుగా రావల్పిండి నుంచి పోటీ చేయాలని నేను భావిస్తున్నాను అని ఆచార్య ప్రమోద్ కృష్ణం అన్నారు.రాహుల్ గాంధీ.. ప్రియాంక గాంధీని ఎన్నికల్లో పోటీ చేయనివ్వరని నేను ముందే చెప్పాను. ప్రియాంక గాంధీపై కుటుంబంలో, పార్టీలో భారీ కుట్ర ఉంది. దీనికి ప్రియాంక గాంధీ బలైపోతోందని మాజీ కాంగ్రెస్ నేత ప్రమోద్ కృష్ణం అన్నారు.#WATCH | Delhi: Former aide of Congress leader Priyanka Gandhi Vadra, Acharya Pramod Krishnam says, "The way Rahul Gandhi has left Amethi, Congress party workers' morale is down. Priyanka Gandhi not contesting the election, this is now taking the shape of a volcano in the hearts… pic.twitter.com/ynbNsTYkqG— ANI (@ANI) May 4, 2024 -
‘ప్రియాంక గాంధీ కాంగ్రెస్‌కు రెబల్‌గా మారనుంది’
లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్‌లోని రెండు కాంగ్రెస్ కంచుకోట స్థానాలైన ఆమేథీ, రాయ్‌బరేలీలో అభ్యర్థులను శుక్రవారం ప్రకటించటంతో సస్పెన్షన్ వీడింది. ఆమేథీలో కిషోరీ లాల్ శర్మ, రాయ్ బరేలీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని పార్టీ అధిష్టానం బరిలోకి దించటంతో వారు నామినేషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఆమేథీ స్థానం విషయంలో బీజేపీ.. రాహుల్ గాంధీ క్యాంప్‌పై తీవ్ర విమర్శలు చేస్తోంది. రాహుల్ గాంధీ క్యాంప్.. ప్రియాంకా గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రాలను కావాలనే కాంగ్రెస్ పార్టీకి దూరం చేసిందని బీజేపీ ఆరోపణలు చేస్తోంది.‘ఆమేథీలో ఎంతో ప్రజాదరణ ఉన్న రాబర్ట్ వాద్రాను ఆ స్థానం నుంచి కావాలనే పక్కకు తప్పించారు. ఇది ఖచ్చితంగా రాహుల్ గాంధీ క్యాంప్ చేసిన పనే. తర్వలో ప్రియాంకా గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా కాంగ్రెస్ నాయకత్వానికి రెబల్‌గా మారుతారు’ అని బీజేపీ నేత అమిత్ మాల్వియా ‘ఎక్స్’ వేదికగా అన్నారు.Sapre a moment for Robert Vadra, who, despite claiming immense popularity in Amethi, was overlooked for the seat. It is obvious that Rahul Gandhi camp is systematically marginalising both, Priyanka Vadra and her husband, in the Congress. How soon before the sister rebels?— Amit Malviya (मोदी का परिवार) (@amitmalviya) May 4, 2024ఇటీవల రాబర్ట్ వాద్రా తనకు ఆమేథీలో ప్రజాధారణ ఉందని పేర్కొన్నారు. అదీ కాక.. తాను క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని దేశంలో కోరుకుంటోందని తెలిపారు. తాను మార్పు తీసుకురాగలనని కాంగ్రెస్ భావిస్తే.. రాజకీయాల్లోకి వస్తాను. తాను ఆమేథీలోనే పోటీ చేయాలని లేదు.. మొరాదాబాద్, హర్యానాలో కూడా పోటీ చేస్తానన్నారు. ఇక.. రాబర్ట్ వాద్రా వ్యాఖ్యలతో ఆయన కాంగ్రెస్ కంచుకోట స్థానమైన ఆమేథీ సీటు ఆశించినట్లు పరోక్షంగా వెల్లడి అయింది.మూడు పర్యాయాలు రాహుల్‌గాంధీ ఆమేథీ స్థానంలో అనూహ్యంగా 2019లో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో ఓటమిపాలయ్యారు. అయితే మరో నియోజకవర్గంలో కేరళలోని వాయ్‌నాడ్‌లో గెలుపొందిన విషయం తెలిసిందే. 2019లో రాయ్‌బరేలీలో విజయం సాధించిన సోనియా గాంధీ రాజ్యసభకు ఎంపిక కావటంతో ఆ స్థానంలో అనేక సంప్రదింపుల అనంతరం రాహుల్ గాంధీ బరిలోకి దిగారు. -
Lok sabha elections 2024: ‘రహస్య వ్యూహం’ ఏమిటో?
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ రాయ్‌బరేలీ నుంచి ని్రష్కమించాక ఆమె కుమార్తె ప్రియాంకా గాంధీ రాజకీయ ఆరంగ్రేటం చేస్తారని గంపెడాశ పెట్టుకున్న స్థానిక నాయకత్వంపై ఏఐసీసీ నీళ్లు చల్లింది. రాయ్‌బరేలీ లేదా అమేథీలో ప్రియాంక కచి్చతంగా పోటీచేస్తారని తెగ ప్రచారం జరిగినా చివరకు ఆమె పోటీకి నిలబడకపోవడం పార్టీ శ్రేణుల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. దీనిపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ స్పందించారు. ప్రియాంకను పోటీలో ఉండకపోవడం వెనుక ‘రహస్య వ్యూహం’ ఉందంటూ చేసిన వ్యాఖ్యలతో అదేమిటన్న ఆసక్తి మరింత ఎక్కువైంది. అరంగేట్రం వయా ఉప ఎన్నిక ! వాస్తవానికి ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేయకూడదని ప్రియాంక బలంగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయినాసరే దశాబ్ధాలుగా రాయ్‌బరేలీతో అనుబంధం పెంచుకున్న గాం«దీలు కచి్చతంగా పోటీచేయాలని స్థానిక నేతల నుంచి డిమాండ్లు ఎక్కువయ్యాయి. విపక్షాల ‘ఇండియా’ కూటమిలో భాగస్వామ్య పార్టీ అయిన సమాజ్‌వాదీ సైతం ఇదే డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో చివరికి రాహుల్ పోటీకి అంగీకరించినట్లు చెబుతున్నారు. ఇప్పటికే రాజస్థాన్ నుంచి రాజ్యసభకు సోనియా ఎన్నికయ్యారు. రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక, అమేథీ నుంచి రాహుల్ పోటీ చేసి గెలిస్తే పార్లమెంట్లో ముగ్గురు గాం«దీలు ఉంటారని, ఇది వారసత్వ రాజకీయాలను వ్యతి రేకిస్తున్న బీజేపీకి పెద్ద అస్త్రంగా మారుతుందన్న ఉద్దేశ్యంతో ప్రియాంక పోటీ నుంచి తప్పుకున్నారన్న విశ్లేషణలూ వినిపిస్తున్నాయి. రాయ్‌బరేలీ, వయనాడ్‌లలో రాహుల్ గెలిస్తే రాయ్‌బరేలీలో రాజీనామా చేస్తారని, ఆ స్థానానికి వచ్చే ఉప ఎన్నిక ద్వారా ప్రియాంక రాజకీయ అరంగ్రేటం చేస్తారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ప్రస్తుత ఎన్నికల్లో పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా ప్రియాంకగాంధీ దేశమంతా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెను ఒక్క రాయ్‌బరేలీ నియోజకవర్గానికే పరిమితం చేయకూడదన్న ఉద్దేశంతో పార్టీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందని విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. -
రాయ్‌బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
రాయ్‌బరేలీ, అమేథీ.. ప్రస్తుతం ఈ రెండు ఈ స్థానాలపైనే అందరి దృష్టి నెలకొంది. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా నిలిచిన స్థానాల్లో నేడు ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించడమే ఇందుకు కారణం..రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తుండగా.. అమేథీ నుంచి పార్టీ సినియర్ నేత కేఎల్ శర్మ బరిలో దిపింది కాంగ్రెస్ అధిష్టానం. తొలుత రాయ్‌బరేలీ నుంచి ప్రియాంకగాంధీ పోటీలో నిలుస్తారని వార్తలు వచ్చాయి. తన సిటింగ్ స్థానం వయనాడ్ నుంచి పోటీకి దిగిన రాహుల్.. అమేథీ నుంచి కూడా బరిలో ఉంటారని ప్రచారం జరిగింది. కానీ అలా జరగలేదు దీంతో ప్రియాంక గాంధీ ప్రత్యక్ష ఎన్నికల్లో ఎంట్రీపై సస్పెన్స్ నెలకొంది. కాగా ప్రియాంకను రాయ్‌బరేలీ లేదా అమేథీ నుంచి పోటీ చేయాలని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కోరినట్లు సమాచారం. కానీ అందుకు ఆమె అయిష్టత చూపినట్లు తెలుస్తోంది. అయితే ప్రియాంక నో చెప్పడానికి ఆమె సోదరుడు రాహుల్, తల్లి సోనియా గాంధే కారణంగా సంబంధిత వర్గాలు తెలిపాయి. గాంధీ కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు పార్లమెంటులో అడుగుపెట్టడం వల్ల.. వారసత్వ రాజకీయాల పేరుతో బీజేపీ చేస్తున్న ఆరోపణలు బలోపేతం చేసినట్లు అవుతుందని ప్రియాంక భావించినట్లు పార్టీ వర్గాల సమాచారం.చదవండి:Amethi: స్మృతి ఇరానీపై కేఎల్ శర్మ పోటీ.. ఎవరీయన?మరోవైపు ప్రియాంక నిర్ణయంపై ఓటర్లలో ప్రతికూల అభిప్రాయం ఏర్పడుతుందని పార్టీకి చెందిన నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఆమె లోక్‌సభ ఎన్నికలకు విస్త్రృత ప్రచారం చేస్తున్నారు. ప్రధాని మోదీ, కాంగ్రెస్‌పై చేస్తున్న విమర్శలను ఆమె గట్టిగా తిప్పికొడుతున్నారు. ముఖ్యంగా మోదీ వ్యాఖ్యలకు కౌంటర్లు ఇస్తున్నారు. ఈ క్రమంలో ఆమె ఎన్నికల్లో పోటీ చేస్తే కాంగ్రెస్‌కు లాభం చేకూరేదని భావిస్తున్నారు.వరుసగా మూడుసార్లు అమేథీ నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించిన రాహుల్.. 2019 ఎన్నికల్లో మాత్రం బీజేపీ నుంచి స్మృతి ఇరానీ చేతిలో ఓటమి చెందారు. కేరళలోని వయనాడు నుంచి ఎంపీగా గెలవడంతో పార్లమెంట్లో అడుగుపెట్టారు. ఈసారి కూడా వయనాడ్ నుంచి మళ్లీ బరిలోకి దిగారు. దీంతోపాటు అమేథీ నుంచి పోటీ చేస్తారని అనుకుంటే రయ్బరేలీ నుంచి రంగంలోకి దిగి ట్విస్ట్ ఇచ్చారు.అమేథీ నుంచి గాంధీ కుటుంబానికి విధేయుడైన కిషోరీలాల్శర్మను ఎంపిక చేసింది పార్టీ. ఇంతకుముందు రాయ్‌బరేలీలో సోనియా గాంధీ ప్రతినిధిగా పనిచేసిన శర్మ మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. నేడు రాహుల్, శర్మ నామినేషన్ దాఖలు చేయనున్నారు. మే 20న అమేథీ, రాయ్‌బరేలీ లోక్‌సభ ఎన్నికల్లో ఐదో దశ పోలింగ్ జరగనుంది.రాయ్‌బరేలీలో బీజేపీకి చెందిన దినేష్ ప్రతాప్ సింగ్‌తో గాంధీ తలపడనున్నారు. అమేథీలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో శర్మ పోటీపడనున్నారు. రాయ్‌బరేలీలో రాహుల్ అఖండ విజయం సాధిస్తారని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అమేథీలోమ అట్టడుగు వర్గాలకు చెందిన శర్మ తప్పక గెలుస్తారని చెబుతున్నారు. -
గాంధీల కంచుకోటలో టికెట్ ఎవరికి ?
-
బీజేపీ వారినే ప్రోత్సహిస్తుంది: ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు
రాయ్‌పూర్: లోక్‌సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతూనే ఉంది. ఈ తరుణంలో ఛత్తీస్‌గఢ్‌లోని మనేంద్రగఢ్-చిర్మిరి-భరత్పూర్ జిల్లాలోని చిర్మిరి పట్టణంలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ పర్యటించారు. కోర్బా లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన జ్యోత్సానా మహంత్ మద్దతు కోసం జరిగిన ర్యాలీలో ఆమె ప్రసంగిస్తూ, నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలోని ఆస్తులను బడా బిలియనీర్లకు ధారాదత్తం చేస్తోందని ఆరోపించారు.బీజేపీ దేశంలో రెండు రకాల నాయకులను ప్రోత్సహిస్తోంది. ఇందులో ఒకరు అవినీతిపరులు, మరొకరు ప్రజల సంక్షేమం, సమస్యల గురించి ఏమీ మాట్లాడకుండా ఉండే వారు. ఐదు కేజీల రేషన్ అందించడం ద్వారా ప్రజలను డిపెండెంట్‌గా మార్చాలని బీజేపీ యోచిస్తోంది. దానికి బదులుగా ఉద్యోగాలు పొందటానికి అవకాశాలు సృష్టించాలని ప్రియాంక గాంధీ కోరారు.నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలోని ఆస్తులను బడా బిలియనీర్లకు ధారాదత్తం చేస్తోందని ఆరోపించారు. దేశంలో ఎలాంటి రాజకీయాలు జరుగుతున్నాయో, దేశంపై ఎలా దాడులు జరుగుతున్నాయో, ఎలాంటి నాయకులను ప్రోత్సహిస్తున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలని ప్రియాంక గాంధీ కోరారు.ధరల పెరుగుదల గురించి బీజేపీ పార్టీ కానీ, ఆ పార్టీ నేతలు కానీ ఏమీ మాట్లాడారు. గత పదేళ్ల నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు అన్యాయం జరిగిందని కాంగ్రెస్ తన మేనిఫెస్టోకు ‘న్యాయ్ పాత్ర’ అని పేరు పెట్టిందని ప్రియాంక గాంధీ అన్నారు. బీజేపీ పాలనలో పేద ప్రజలకు తప్పా.. పారిశ్రామికవేత్తలకు, బడా నేతలకు అన్యాయం జరగలేదని ఆమె స్పష్టం చేశారు.ఛత్తీస్‌గఢ్‌లోని 11 లోక్‌సభ స్థానాల్లో మొదటి రెండు దశల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో నాలుగింటిలో పోలింగ్ జరిగింది. కోర్బాతో సహా మిగిలిన ఏడు స్థానాలకు మే 7న మూడో దశలో పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెల్లడవుతాయి. -
ప్రియాంక ఉంటేనే ఓటు.. గ్రామస్తుల హెచ్చరిక!
దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో యూపీలో ఆసక్తికర రాజకీయం నెలకొంది. ఐదో దశ నామినేషన్లకు గడువు సమీపిస్తున్నా, అటు రాయ్‌బరేలీ, ఇటు అమేధీ లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులెవరనేది కాంగ్రెస్ ఇంకా వెల్లడించలేదు. రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానానికి ఇప్పటి వరకు ప్రియాంక గాంధీ పేరు వినిపించింది. అయితే దీనిపై ఇంకా స్పష్టత రాకపోవడంతో ఇక్కడి పార్టీ నేతలు, కార్యకర్తలు, ఓటర్లు అయోమయంలో చిక్కుకున్నారు. ఇటువంటి పరిస్థితుల నేపధ్యంలో రాయ్‌బరేలీ జిల్లాలోని కనకపూర్ గ్రామస్తులు మరో ముందడుగు వేశారు. గ్రామం బయట ‘ప్రియాంకా గాంధీ పోటీ చేయకుంటే తాము ఓటు వేయం’ అని రాసివున్న బ్యానర్‌ను ఉంచారు. రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక పోటీచేయకుంటే ఓటింగ్‌ను బహిష్కరిస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. గాంధీ కుటుంబంతో తమ అనుబంధం ఏళ్ల నాటిదని, అందుకే గాంధీ కుటుంబం నుండి ప్రియాంక లేదా రాహుల్ ఇక్కడి నుండి ఎన్నికల్లో పోటీ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.మరోవైపు అమేథీ, రాయ్‌బరేలీ స్థానాల నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు గాంధీ కుటుంబం ఆసక్తి చూపడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రియాంకా గాంధీకి రాయ్‌బరేలీ స్థానం నుంచి పోటీ చేయడం ఇష్టం లేదని, రాహుల్ గాంధీ వయనాడ్ స్థానానికి మాత్రమే ప్రాతినిధ్యం వహించాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.ఈ నేపథ్యంలో ఈ రెండు స్థానాల అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ అయోమయంలో పడినట్లు తెలుస్తోంది. ఈ రెండు స్థానాల అభ్యర్థులను కాంగ్రెస్ నేడు (బుధవారం) ప్రకటిస్తుందనే వార్త వినిపిస్తోంది. రాహుల్ గాంధీ, ప్రియాంక ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా లేకుంటే కాంగ్రెస్ ప్లాన్ బీని సిద్ధం చేసినట్లు సమాచారం. -
లోక్‌సభ ఎన్నికల్లో ప్రియాంక పోటీకి దూరం!
కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుంది. మరోవైపు.. ఉత్తరప్రదేశ్‌లో కీలకమైన అమేథీ, రాయ్ బరేలీ స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేయటంతో కాంగ్రెస్ పార్టీ తీవ్ర కసరత్తు చేస్తోంది. ఈ రెండు స్థానాల్లో అభ్యర్థుల ఖరారు నిర్ణయాన్ని కాంగ్రెస్ నేతలు.. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు వదిలిపెట్టారు. ఈ క్రమంలో ఈ రెండు స్థానాల్లో ఏదో ఒక చోట ప్రియాంకా గాంధీ లేదా ఆమె భర్త రాబర్ట్ వాద్రా, మరో స్థానంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బరిలోకి దిగుతారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ప్రియాంకా గాంధీ పోటీ చేయవద్దని నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రియాంకా గాంధీ లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేయకుండా.. కేవలం కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఎన్నికల ప్రచారం చేయటానికి పరిమితం కానున్నట్లు సమాచారం. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి కీలకమైన అమేథీ, రాయ్ బరేలీలో ఏదో ఒక చోట రాహుల్ గాంధీ పోటీ దిగే నిర్ణయాన్ని అదిష్టానం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు... యూపీకి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా ఉత్తరప్రదేవ్‌లో పోటీ చేయాలని కోరుతున్నారు. అమేథీ స్థానంలో మూడుసార్లు గెలిచిన రాహుల్ మళ్లీ ఇక్కడ పోటీ చేస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ప్రియాంకా గాంధీ రాయ్‌బరేలీలో పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే అమేథీ, రాయ్‌బరేలీ రెండు స్థానాలు కాంగ్రెస్‌కు కంచుకోట. ఇక.. ఇక్కడ ఐదో విడతలో మే 20న పోలింగ్ జరగనుంది. -
‘నేను రాజకీయాల్లోకి రావాలని దేశమంతా కోరుకుంటుంది’
డెహ్రాడూన్: దేశం మొత్తం తాను క్రీయాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని కోరుకుంటుందని కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా భర్త రాబర్ట్ వాద్రా అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ కంచుకోట ఆమేథీ నుంచి పోటీచేస్తారని గత కొన్నిరోజులుగా ఉహాగానాలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రచారంపై కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. తాజాగా రాబర్ట్ వాద్రా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ‘దేశం మొత్తం నుంచి ఒకటే అభిప్రాయం వినిపిస్తోంది. దేశ ప్రజలంతా తాను క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు. ప్రజలు తనను వారి ప్రాంతాల్లో ఉండాలని ఆశిస్తున్నారు. నేను 1999లోనే ఆమెథి ప్రచారంలో పాల్గొన్నాను. ఇక్కడ ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్న స్మృతి ఇరానీ ప్రజలకు ఇచ్చిన హామీలను ఏమాత్రం నెరవేర్చలేదు. గడిచిన రెండు విడతల్లోను కాంగ్రెస్ పార్టీ ముందజలోనే కొనాసాగుతోందని పేర్కొన్నారు. ‘దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. బీజేపీతో ప్రజలు తీవ్రంగా విసిగిపోయారు. బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోంది. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ శ్రమను దేశ ప్రజలు చూస్తున్నారు. గాంధీ కుటుంబం వెంటే దేశ ప్రజల ఉన్నారు’ అని రాబర్ట్ వాద్రా అన్నారు. ఆయన తనకు రాజకీయాల్లోకి రావాలని, ఎంపీగా పోటీ చేయాలన్న కోరికను ఉన్నట్లు ఇలా పరోక్షంగా వెల్లడిస్తున్నారని పార్టీ శ్రేణులో తీవ్ర చర్చ జరుగుతోంది.అమెథిలో గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన స్మృతి ఇరానీ సమీప కాంగ్రెస్ అభ్యర్థి అయిన రాహుల్ గాంధీని ఓడించిన విషయం తెలిసిందే. మళ్లీ ఈసారి కూడా బీజేపీ అమెథి సెగ్మెంట్ నుంచి స్మృతి ఇరానీకి టికెట్ కేటాయించింది. -
అమేథీ నుంచి రాహుల్.. రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక? నామినేషన్లకు సన్నాహాలు?
దేశంలో లోకసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలల్లో తమ నామినేషన్లు వేసేముందు వయనాడ్ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాలు అయోధ్యలోని రామ్ లల్లాను దర్శించుకోనున్నారని సమాచారం. కాంగ్రెస్ వర్గాల నుంచి మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఏప్రిల్ 26న కేరళలోని వయనాడ్‌కు పోలింగ్ పూర్తయిన తర్వాత గాంధీ కుటుంబం అమేథీ, రాయ్‌బరేలీ లోక్‌సభ నియోజకవర్గాలపై దృష్టి పెట్టనున్నదని సమాచారం. అమేథీలో రాహుల్ గాంధీ, రాయ్‌బరేలీలో ప్రియాంక గాంధీ వాద్రా నామినేషన్ వేయనున్నారని, దీనికి ముందు వారు అయోధ్యలో కొలువైన రామ్‌లల్లాను దర్శించుకోనున్నారని సమాచారం. వయనాడ్‌లో ఓటింగ్ ఏప్రిల్ 26న ముగియనుంది. అదే రోజున రాయ్‌బరేలీ, అమేథీ స్థానాలకు నామినేషన్ ప్రక్రియ మొదలు కానుంది.మీడియాకు అందిన సమాచారం ప్రకారం అమేథీ, రాయ్‌బరేలీలలో పోటీ విషయమై ఏప్రిల్ 30లోపు కాంగ్రెస్ అధికారిక ప్రకటన చేయనున్నదని సమాచారం. ఈ స్థానాల అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ మౌనం వహిస్తూ వస్తోంది. అయితే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలు.. అమేథీ, రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్న పక్షంలో మే ఒకటి నుంచి మూడవ తేదీలోపు నామినేషన్లు దాఖలు చేసే అవకాశముంది. ఈ రెండు నియోజకవర్గాల్లో నామినేషన్లకు మే 3 చివరి రోజు. మే 20న ఐదవ విడతలో ఈ రెండు లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది.రాహుల్, ప్రియాంకలు యూపీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని కాంగ్రెస్ కమ్యూనికేషన్ సెల్ ఇన్చార్జి జైరాం రమేష్‌తో పాటు పలువురు నేతలు గతంలోనే సూచన ప్రాయంగా తెలియజేశారు. తాజాగా అమేథీలోని రాహుల్ నివసించే బంగ్లాను శుభ్రం చేసి, పెయింటింగ్ వేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో కనిపించాయి. ఈ నేపధ్యంలో రాహుల్ అమేథీ నుంచి, ప్రియాంక రాయ్‌బరేలీ నుంచి పోటీచేయవచ్చని స్పష్టమవుతోంది. -
రాయ్‌బరేలీ పోరులో వరుణ్ గాంధీ.. ప్రియాంకపై పోటీకి నో
ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం హాట్ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ఈ స్థానం నుంచి ఈ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీ చేయనున్నట్లు ప్రచారం సాగుతోది. అయితే ఆమెకు పోటీగా అదే కుటుంబానికి చెందిన వరుణ్ గాంధీని రంగంలోకి దించాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. కానీ పార్టీ ప్రతిపాదనను వరుణ్ గాంధీ తిరస్కరించినట్లు సమాచారం. రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానంలో తన సోదరి ప్రియాంక గాంధీపై పోటీ చేసేందుకు ఆయన నిరాకరించినట్లు సమాచారం. కాగా రాయ్‌బరేలీ, అమేథీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు తన అభ్యర్థులను ప్రకటించలేదు. అటు బీజేపీ కూడా రాయ్‌బరేలీలో తన అభ్యర్థిని ఖరారు చేయలేదు. కాగా కాంగ్రెస్ నుంచి యాంక గాంధీ పోటీ చేసే అవకాశం ఉంది. రాయ్‌బరేలీ నుంచి గత లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసిన మాజీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఈ ఏడాది ఫిబ్రవరిలో రాజ్యసభకు ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్కడి నుంచి ప్రియాంక బరిలో దిగనున్నట్లు సమాచారం.ఈ నేపథ్యంలో తన సిట్టింగ్ స్థానమైన పిలిబిత్ నుంచి బీజేపీ టికెట్ నిరాకరణకు గురైన వరుణ్ గాంధీ.. రాయ్‌బరేలి నుంచి పోటీకి దించితే కాంగ్రెస్‌కు గట్టిపోటీ ఎదురవుతుందని బీజేపీ హైకమాండ్ పావులు కదుపుతోంది. ఈ విషయంపై వరుణ్‌ను సంప్రదించగా.. ఆయన నిరాసక్తి కనబర్చినట్లు తెలుస్తోంది. ‘గాంధీ వర్సెస్ గాంధీ’ పోటీ ఉండటం తనకు నచ్చకపోవడంతో రాయ్‌బరేలీ పోరు నుంచి తప్పుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
‘కపటనీతికి మారుపేరు కాంగ్రెస్!’.. కేటీఆర్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ కపటనీతికి మారుపేరు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అన్ని వర్గాల ప్రజలకు.. ముఖ్యంగా యువతకు అరచేతిలో వైకుంఠం చూపించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. కానీ తమ 120 రోజుల పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులతో సహా అందరికీ ద్రోహం చేయడం ప్రారంభించిందని మండిపడ్డారు. ‘ప్రియాంక గాంధీ వంటి కాంగ్రెస్ అగ్రనాయకులు అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు రూ. 4,000 నిరుద్యోగ భృతి అందిస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక.. అసలు అటువంటి హామీ ఏమివ్వలేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట మార్చారు. ఫిబ్రవరి 1వ తేదీ నుండి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అన్ని వార్తాపత్రికల మొదటి పేజీలో తమ జాబ్ క్యాలెండర్ గురించి ప్రకటనలు ఇచ్చింది. వాస్తవానికి బీఆర్ఎస్ హయాంలో భర్తీ చేసిన 30 వేల ఉద్యోగాలకు కేవలం నియామక పత్రాలను ఇచ్చి ఆ ఉద్యోగాలను నిస్సిగ్గుగా తమ ఖాతాలో వేసుకుంటోంది కాంగ్రెస్. అన్ని పోటీ పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ తాము ఇచ్చిన హామీపై నిస్సిగ్గుగా యూ టర్న్ తీసుకుంటూ.. కాంగ్రెస్ ప్రభుత్వం టెట్ పరీక్ష ఫీజును రూ. 400 నుండి రూ. 2000లకు (2 పేపర్లకు) పెంచింది. బల్మూరి వెంకట్ వంటి కాంగ్రెస్ నాయకులను ఎన్నో కోర్టు కేసులు వేసి.. అనేక పోటీ పరీక్షలు రద్దవ్వడానికి కారణమయ్యారు. నిరుద్యోగుల ఉసురు పోసుకుని, ప్రతిఫలంగా వెంకట్ ఎమ్మెల్సీ పదవిని అందుకున్నాడు. కానీ.. ప్రభుత్వ ఉద్యోగ ఆశావహులను మాత్రం దిక్కుతోచని స్థితిలో వదిలేసింది కాంగ్రెస్. కాంగ్రెస్ అసలు రంగు ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. తమని నట్టేట ముంచిన కాంగ్రెస్ పార్టీకి నిరుద్యోగ యువత గుణపాఠం చెప్పాల్సిన సమయం వచ్చింది’ అని ‘ఎక్స్’వేదికగా మండిపడ్డారు. కపటనీతికి మారుపేరు కాంగ్రెస్! అన్ని వర్గాల ప్రజలకు.. ముఖ్యంగా యువతకు అరచేతిలో వైకుంఠం చూపించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ తమ 120 రోజుల పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులతో సహా అందరికీ ద్రోహం చేయడం ప్రారంభించింది. 👉 ప్రియాంక గాంధీ వంటి కాంగ్రెస్… — KTR (@KTRBRS) April 19, 2024 -
రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్రలు.. ప్రియాంక ఆరోపణలు
దిస్పూర్ : అధికార బీజేపీపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. అధికార బీజేపీ దేశంలో రాజ్యాంగాన్ని మార్చాలని అనుకుంటుంది. అలా జరిగితే దేశంలోని సామాన్య ప్రజలు ఎక్కువగా నష్టపోతారని అన్నారు. అసోంలోని జోర్హాట్ జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థి గౌరవ్ గొగోయ్‌కు మద్దతుగా ప్రియాంక గాంధీ రోడ్‌షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలిస్తే తేయాకు తోటల కార్మికుల రోజువారీ వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారు. ‘ 2-3 ఏళ్ల క్రితం అసెంబ్లీ ఎన్నికలకు ముందు నేను అస్సాంకు వచ్చి తేయాకు తోటలను సందర్శించినప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే వేతనాలు పెంచుతానని హామీ ఇచ్చాను. కానీ మీరు బీజేపీని ఎన్నుకున్నారు. వేతనాలు దాదాపు రూ. 250 నుండి పెంచలేదని’ తెలిపారు. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే తేయాకు తోటల కార్మికులకు వేతనాలు పెంచుతామని మా మేనిఫెస్టో హామీ ఇచ్చిందని మరోసారి చెబుతున్నా’ అని ప్రియాంక గాంధీ సూచించారు. -
స్మృతి ఇరానీ Vs ప్రియాంక.. యూపీలో ఆసక్తికర సమరం!
ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కేటాయింపు అంశంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేథీ, రాయ్‌బరేలీ నియోజకవర్గాల నుంచి ఎవరు పోటీ చేస్తారనేది తేలియాల్సి ఉంది. కాగా, ముందు నుంచి ఈ స్థానంలో రాబర్ట్ వాద్రా పోటీ ఉంటారనే వార్తలు వినిపించినప్పటికీ అది జరగపోవచ్చు అని సమాచారం. కాగా, గాంధీ కుటుంబంతో విడదీయరాని బంధం ఉన్న అమేథీ, రాయబరేలీ స్థానాల్లో ఎవరు పోటీ చేస్తారనే అంశం కాంగ్రెస్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోని ఈ విషయంలో ఒక హింట్ ఇచ్చారు. ఉత్తర్‌ప్రదేశ్ నుంచి గాంధీ కుటుంబ సభ్యులు బరిలో ఉంటారని వెల్లడించారు. కాగా, ఆంటోని బుధవారం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అమేథీ, రాయబరేలీ సీట్లపై ఎలాంటి ఊహాగానాలు వద్దు. యూపీ నుంచి గాంధీ కుటుంబమే పోటీ చేస్తారు. రాబర్ట్ వాద్రా అక్కడ పోటీ చేసే అవకాశం ఉండకపోవచ్చు అని కామెంట్స్ చేశారు. దీంతో, ప్రియాంక లేదా రాహుల్ గాంధీ యూపీ నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. రాహుల్ ఇప్పటికే కేరళలోని వయనాడ్ నుంచి బరిలోకి దిగిన విషయం తెలిసిందే. ఇక, అమేథీలో బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీని ఢీకొట్టేందుకు ప్రియాంకు బరిలోకి దింపుతారా? అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ప్రియాంక కనుక అమేథీ నుంచి పోటీలో నిలిస్తే రాజకీయం ఆసక్తికరంగా మారే అవకాశం ఉంటుంది. మరోవైపు.. ఇండియా కూటమి సీట్ల పంపకాల్లో భాగంగా అమేథీ స్థానం కాంగ్రెస్‌కు దక్కిన విషయం తెలిసిందే. -
రాయ్‌బరేలీ నుంచి ప్రియాంకా గాంధీ? త్వరలో అధికారిక ప్రకటన?
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తర్వాత యూపీలోని రాయ్‌బరేలీ ఎవరిది? ఈ ప్రశ్నకు కాంగ్రెస్ హైకమాండ్ త్వరలోనే జవాబు చెప్పనుంది. తాజాగా రాయ్‌బరేలీ ఎన్నికల బరిలో ప్రియాంక ప్రవేశానికి సంబంధించిన సూచనలు హై కమాండ్ నుంచి జిల్లా కార్యనిర్వాహకవర్గానికి అందిందనట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుందట. ప్రియాంకా గాంధీ రాయ్‌బరేలీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలని కోరేందుకు జిల్లా కమిటీ అధికారులు ఫిబ్రవరిలో ఆమెను కలుసుకున్నారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు రాయ్‌బరేలీ సీటు ఎంతో కీలకం. సమాజ్‌వాదీతో పొత్తు కారణంగా రాష్ట్రంలో కాంగ్రెస్‌కు 17 సీట్లు దక్కాయి. ప్రియాంక గాంధీ రాయ్‌బరేలీ నుంచి ప్రచారాన్ని ప్రారంభిస్తే రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ స్థానాలకు మంచి సందేశం అందుతుందని, అది భారత కూటమికి మేలు చేస్తుందని కాంగ్రెస్ థింక్ ట్యాంక్ నమ్ముతోంది. రాయ్‌బరేలీలో ప్రియాంక గాంధీకి.. ఆమె అమ్మమ్మ ఇందిరా గాంధీ, తల్లి సోనియా గాంధీకి ఉన్నంత ఆదరణ ఉంది. ప్రియాంక తొలిసారి 1999 లోక్‌సభ ఎన్నికల సమయంలో రాయ్‌బరేలీలో అడుగుపెట్టారు. ఆ సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి కెప్టెన్ సతీష్ శర్మ గెలుపు బాధ్యతను ప్రియాంక విజయవంతం చేశారు. రాయ్‌బరేలీ రాజకీయాలపై ప్రియాంకకు మంచి అవగాహన ఉందని విశ్లేషకులు చెబుతుంటారు. -
మేం తప్పుడు హామీలు ఇవ్వం..బీజేపీపై ఖర్గే కామెంట్స్
జైపూర్ : ప్రధాని నరేంద్ర మోదీలాగా తమ పార్టీ తప్పుడు వాగ్దానాలు ఇవ్వదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. శుక్రవారం కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఆ మేనిఫెస్టో అబద్ధాల పుట్టా అంటూ బీజేపీ విమర్శలు చేస్తోంది. ఆ వ్యాఖ్యలపై ఖర్గే పై విధంగా స్పందించారు. జైపూర్‌లో జరిగిన బహిరంగ సభను ఉద్దేశించి మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ..‘మా పార్టీ అధికారంలోకి వస్తే 25 హామీలు నెరవేరుస్తామని హామీ ఇచ్చాం. ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తాం. అంతే తప్పా ప్రధాని మోదీలా అబద్ధాలు చెప్పం’ అని అన్నారు అయితే నేను మిమ్మల్ని (ప్రజల్ని ఉద్దేశిస్తూ.) ఒకేటే అడగాలనుకుంటున్నాను. బీజేపీ ఎన్నో హామీలు ఇచ్చింది. వాటిల్లో ఇప్పటి వరకు ఎన్ని హామీలను నెరవేర్చింది. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చింది. అందుకే గత 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి వచ్చింది. మీకు 20 కోట్ల ఉద్యోగాలు వచ్చాయా లేదా అంటూ వ్యంగంగా మాట్లాడారు. నిరుద్యోగం తగ్గేందుకు బీజేపీ ఏం చేసింది బీజేపీపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ఏర్పాటైన దేశంలోని పెద్ద పెద్ద సంస్థలు నిర్వీర్యమయ్యాయని, నేడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రంపై ప్రజలకు నమ్మకం లేని పరిస్థితి నెలకొందని ఆరోపించారు. దేశంలో నానాటికీ పెరుగుతున్న నిరుద్యోగం పెరిగిపోతుందని, ఆ నిరుద్యోగాన్ని తగ్గించేందుకు బీజేపీ ఏం చేసిందని ప్రశ్నించారు. "Unlike PM Modi, we don't tell lies...": Congress President Mallikarjun Kharge Read @ANI Story | https://t.co/GBMtRCjHMd#PMModi #MallikarjunaKharge #Congress #BJP #CongressManifesto #LokSabhaElections2024 pic.twitter.com/aYBAzBZ4qw — ANI Digital (@ani_digital) April 6, 2024 -
‘జన జాతర’కు ప్రియాంక
సాక్షి, హైదరాబాద్: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ విస్తృతంగా ప్రచారం నిర్వహించనున్నారు. ఇందిరాగాంధీ గతంలో ప్రాతినిధ్యం వహించిన మెదక్ లోక్‌సభ స్థానంతో పాటు పార్టీకి విజయావకాశాలున్న పలు చోట్ల ఆమె చురుగ్గా ప్రచారం నిర్వహించే అవకాశాలున్నాయని గాం«దీభవన్ వర్గాలు వెల్లడించాయి. ఈసారి ఎన్నికల్లో తెలంగాణ పరిధిలో ఆమె సేవలు వినియోగించుకోవాలని ఏఐసీసీ స్థాయిలో నిర్ణయించిన కారణంగానే ఈనెల 6వ తేదీన తుక్కుగూడలో జరగనున్న ‘జనజాతర’సభకు హాజరు కానున్నట్టు సమాచారం. తొలుత ఈ సభకు రాహుల్‌గాందీ, మల్లికార్జు న ఖర్గే మాత్రమే రావాలని నిర్ణయించినా ప్రియాంకను కూడా పంపాలని ఏఐసీసీ నిర్ణయించింది. తుక్కుగూడ సభతో పాటు లోక్‌సభ ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ను ఏఐసీసీతో సమ న్వయం చేసే బాధ్యతలను టీపీసీసీ ముఖ్య నేతలకు అప్పగించినట్టు తెలుస్తోంది. మేనిఫెస్టో.. మరుసటి రోజే తుక్కుగూడ సభను టీపీసీసీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దేశ వ్యాప్తంగా జరిగే లోక్‌సభ ఎన్నికల కోసం ఈనెల ఐదో తేదీన మేనిఫెస్టో విడుదల చేసిన మరుసటి రోజే తుక్కుగూడలో సభ జరుగుతుండడం, సభకు రాహుల్, ప్రియాంక, ఖర్గే తదితర ముఖ్యులు హాజరు కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున జనసమీకరణ చేపట్టాలని భావిస్తోంది. భారీ జనసందోహం మధ్య లోక్‌సభ ఎన్నికలకు తెలంగాణ గడ్డ నుంచే ఏఐసీసీ జంగ్ సైరన్ మోగిస్తుందని టీపీసీసీ వర్గాలు చెపుతున్నాయి. ఈ సభలో పార్టీ మేనిఫెస్టోతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమలుచేయనున్న ఐదు గ్యారంటీలను తెలుగులో విడుదల చేయనున్నారు. అచ్చొచ్చిన చోట.. పది లక్షల మందితో తుక్కుగూడలోని 60 ఎకరాల విశాలమైన మైదానంలో జన జాతర బహిరంగ సభ నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. మైదానం పక్కనే వాహనాల పార్కింగ్ కోసం 300 ఎకరాల స్థలాన్ని అందుబాటులో ఉంచారు. ఈ సభకు కనీసం పదిలక్షల మంది హాజరవుతారని గాందీభవన్ వర్గాలు చెబుతున్నాయి. ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ వరకు, జహీరాబాద్ నుంచి భద్రాచలం వరకు పెద్ద ఎత్తున పార్టీ కేడర్ తరలివచ్చేలా ఎక్కడికక్కడ ఏర్పాట్లుచేస్తున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డితో పాటు పలువురు మంత్రులు ఈ సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో కూడా తుక్కుగూడ నుంచే రేవంత్ నేతృత్వంలో టీపీసీసీ ఎన్నికల సమర శంఖాన్ని పూరించింది. తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా గత ఏడాది సెపె్టంబర్ 17న ఇక్కడ నిర్వహించిన సభకు సోనియాగాంధీ హాజరై ఆరు గ్యారంటీలను ప్రకటించారు. విజయభేరి పేరుతో సభ నిర్వహించిన ఈ ప్రాంతం కలిసివచ్చిందని, తెలంగాణలో అధికారంలోకి తెచ్చిన ప్రారంభ సభ ప్రాంతాన్నే లోక్‌సభ ఎన్నికల కోసం ఎంచుకున్నామని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సభ స్ఫూర్తితోనే దేశంలో పదేళ్లనియంతృత్వ, అప్రజాస్వామిక బీజేపీ పాలనకు తెరదించుతామని చెబుతున్నాయి. ఆసక్తి రేపుతున్న రేవంత్ వ్యాఖ్యలు గత ఎన్నికలకు ముందు తుక్కుగూడలో నిర్వహించిన సభలోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చి తీరుతుందని అప్పటి పీసీసీ అధ్య క్షుడు, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. డిసెంబర్ 9న కొలువుదీరే ప్రజాప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి అందరూ ఆహా్వనితులేనని చెప్పుకొచ్చారు. ఈనెల 6న జరిగే సభ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించేందుకు రెండురోజుల కిందట తుక్కుగూడకు వచ్చిన సీఎం.. జూన్ 9న ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ప్రకటించారు. దీంతో తుక్కుగూడ వేదికగా రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. -
ప్రధాని మోదీ అవి గుర్తు చేసుకోవాలి: ప్రియాంక గాంధీ
ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో జరిగిన మహా ర్యాలీలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ బీజేపీపై కీలక వ్యాఖ్యలు చేశారు. 'అధికారం శాశ్వతం కాదు, అహం ఒక్కరోజు నశించిపోతుంది' అన్న శ్రీరాముడి సందేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తు చేసుకోవాలని అన్నారు. ''అధికారంలో ఉన్నవారు తమను తాము రామభక్తులుగా అనుకుంటున్నారు. వారు ఒక భ్రమలో ఉన్నారని నేను నమ్ముతున్నాను'' అని వ్యాఖ్యానించారు. పురాతన ఇతిహాసం 'రామాయణం'లోని సందేశాన్ని ప్రియాంక గాంధీ గుర్తు చేశారు. రాముడు సత్యం కోసం పోరాడుతున్నప్పుడు, అతనికి వనరులు లేవు, రథం కూడా లేదు. రావణునికి రథం, వనరులు, సైన్యం అన్నీ ఉన్నాయి. కానీ రాముడు రావణుని ఓడించాడు అని అన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ కనుమరుగవుతుంది, కాంగ్రెస్ పార్టీ తప్పకుండా విజయం సాదిస్తుందని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. #WATCH | Delhi: At the Maha Rally at the Ramlila Maidan, Congress General Secretary Priyanka Gandhi Vadra says, "I think that they (BJP) are trapped in illusion. I want to remind them of a thousand-year-old tale and its message. When Lord Ram was fighting for the truth, He did… pic.twitter.com/43vpN9Y107 — ANI (@ANI) March 31, 2024 -
అమేథీ, రాయ్‌బరేలీ కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించేది ఎప్పుడంటే?
హోలీ తర్వాత ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ, రాయ్‌బరేలీతో సహా మిగిలిన లోక్‌సభ అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తామని కాంగ్రెస్ ఉత్తరప్రదేశ్ యూనిట్ చీఫ్ 'అజయ్ రాయ్' పేర్కొన్నారు. రాహుల్ గాంధీని అమేథీ నుంచి, ప్రియాంక గాంధీని రాయ్‌బరేలీ నుంచి పోటీకి దింపాలని కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ నాయకత్వంపై ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. త్వరలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ ప్రకటన వెలువడింది. కాంగ్రెస్ వెల్లడించిన లోక్‌సభ అభ్యర్థుల జాబితాలో అమేథీ, రాయ్‌బరేలీ స్థానాలకు అభ్యర్థుల పేర్లు లేవు. ఈ రెండు స్థానాలు ఒకప్పుడు నెహ్రూ-గాంధీ కుటుంబాల కంచుకోటలు. అయితే బీజేపీ కేంద్రమంత్రి స్మృతి ఇరానీని అమేథీ నుంచి పోటీకి దింపింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి ఆమె రాహుల్ గాంధీపై విజయం సాధించారు . 2004 రాయ్‌బరేలీ నుంచి రాయ్‌బరేలీ ఎంపీగా పోటీ చేసింది. ఆ తరువాత 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఈ ఏడాది ప్రారంభంలోనే ప్రకటించారు. ఈ ప్రకటన తరువాత ఈ స్థానంలో ఆమె కుమార్తె ప్రియాంక గాంధీ పోటీ చేస్తారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఆ నియోజక వర్గంలో ఆమె పోస్టర్లు కూడా దర్శనమిచ్చాయి. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ.. అమేథీ, రాయ్‌బరేలీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలనేది పార్టీ నాయకులు, కార్యకర్తల కోరిక అని అజయ్ రాయ్ అన్నారు. ఈ విషయం మీద పార్టీ అధిష్టానం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. కాగా ప్రధాని నరేంద్ర మోదీపై రాయ్‌కి వారణాసి నుంచి టికెట్ ఇచ్చారు. -
ఊహించని ట్విస్ట్.. అక్కడ పోటీకి రాహుల్, ప్రియాంక దూరం?
దేశ వ్యాప్తంగా ఎన్నికల హడావిడీ నెలకొంది. లోక్‌సభతోపాటు, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో ప్రచారాలతో ప్రధాన పార్టీలన్నీ హోరెత్తిస్తున్నాయి. గెలుపే ధ్యేయంగా దూసుకుపోతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఓ పెద్ద మార్పు సంభవిస్తున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ, రాయ్‌బరేలీ పార్లమెంట్ స్థానాల్లో గాంధీ కుటుంబ సభ్యులు పోటీ చేసే అవకాశం లేదని ప్రచారం జోరుగా నడుస్తోంది. 2024 మార్చి 10న లోక్‌సభ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి, రాహుల్ గాంధీ అమేథీ నుంచి పోటీ చేయనున్నట్లు కాంగ్రెస్ ఉత్తరప్రదేశ్ యూనిట్ ఏకగ్రీవంగా తీర్మానించింది. అయితే ఇప్పుడు వారిరువురు ఆ స్థానాల్లో పోటీ చేయకపోవచ్చని సమాచారం. ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి పోటీ చేయకపోవచ్చు. రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్ నుంచి మాత్రమే పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం మీద పార్టీ అధికారిక ప్రకటన వెల్లడించలేదు. కాబట్టి ఇది నిజమా.. లేక ఒట్టి ప్రచారమేనా అనే విషయాలు తెలియాల్సి ఉంది. 2019లో సిట్టింగ్ ఎంపీ.. కాంగ్రెస్ నేత 'రాహుల్ గాంధీ' అమేథీలో ఓటమిని చవిచూశారు. బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో సుమారు 55, 000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. కాగా మరోసారి ఈ నియోజకవర్గంలో 'స్మృతి ఇరానీ'కి బీజేపీ అవకాశం కల్పించింది. అమేథీ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీకి కేవలం నియోజకవర్గం మాత్రమే కాదు, 1967 నుంచి ఈ ప్రాంతానికి నెహ్రూ, గాంధీకి అవినాభావ సంబంధం ఉంది. అంతటి కాంగ్రెస్ ప్రతిష్టాత్మక ప్రాంతం నుంచి రాహుల్ గాంధీ పోటీ చేయరు అనే వార్తలు.. కార్యకర్తల్లో కొంత ఆందోళన కలిగిస్తున్నట్లు సమాచారం. 1980లో సంజయ్ గాంధీ అమేథీ గెలుచుకున్నారు. ఈయన మరణాంతరం రాజీవ్ గాంధీ ప్రవేశించారు. 1991లో రాజీవ్ గాంధీ చనిపోయే వరకు అమేథీ వారి చేతుల్లోనే ఉండేది. రాజీవ్ గాంధీ మరణించిన తరువాత 1999 సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహించిన స్థానాన్ని 2004లో రాహుల్ గాంధీ చేజిక్కించుకున్నారు. అయితే 2019లో ఓటమిపాలయ్యారు. -
రాహుల్ ఉత్తరప్రదేశ్‌ను విడిచిపెట్టారా?
లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ తాజాగా అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో అసోం, మధ్యప్రదేశ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాలకు చెందిన 43 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. అయితే ఈ రెండో జాబితాలో ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ, రాయ్‌బరేలీల ఊసే ఎత్తలేదు. దీంతో ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ యూపీ ఎన్నికల్లో పోటీ చేస్తారా? లేదా అనేది సస్పెన్స్‌గానే మిగిలింది. మరోవైపు రాహుల్ గాంధీ అమేథీ నుంచి, ప్రియాంక గాంధీ రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయాంటూ యూపీ కాంగ్రెస్ నేతలు తీర్మానం చేశారు. ఇంత జరుగుతున్నా పార్టీ హైకమాండ్ ఈ రెండు సీట్ల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రాయ్‌బరేలీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రియాంక గాంధీ ఆసక్తి చూపడం లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొనేందుకు ఆమె బరేలీకి రాలేదు. అయితే ఆ సమయంలో ఆమె ఆరోగ్యం బాగాలేదని, అందుకే యాత్రలో పాల్గొనలేకపోయారని పార్టీ నేతలు తెలిపారు. ప్రియాంక ఈ ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చని కూడా వారు అంటున్నారు. మరోవైపు 2019 ఎన్నికల్లో అమేథీలో కాంగ్రెస్ కోటను బద్దలు కొట్టిన బీజేపీ ఈసారి రాయ్‌బరేలీపై కన్నేసింది. రాయ్‌బరేలీ రాజకీయాలలో కీలకంగా ఉంటున్న ప్రముఖ నేతలు దినేష్ సింగ్, అఖిలేష్ సింగ్, మనోజ్ పాండేలు బీజేపీకి వెన్నుదన్నుగా నిలిచారు. ఇది కాంగ్రెస్‌కు గట్టిపోటీ నిచ్చేలా ఉంది. రాహుల్ గాంధీ అమేథీ నుంచి పోటీ చేస్తారా? లేదా అనేది ఇంకా స్పష్టం కాలేదు. అయితే రాహుల్ గాంధీ వయనాడ్‌తో పాటు రాయ్‌బరేలీ నుంచి కూడా పోటీ చేయవచ్చని కొందరు విశ్లేషకులు అంటున్నారు. అయితే ఈ విషయంలో రాహుల్ తన నిర్ణయాన్ని ఇంకా ప్రకటించలేదు. -
‘ప్రియాంకా గాంధీ జీ.. రాయ్‌బరేలీ మిమ్మల్ని పిలుస్తోంది!’
1950ల నుంచి కాంగ్రెస్ కంచుకోట ఉత్తర్‌ప్రదేశ్ రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం. అయితే అదే స్థానం నుంచి వరుసగా 5 సార్లు లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన సోనియా గాంధీ అనారోగ్య కారణంగా పోటీ నుంచి తప్పుకుంటుందనే ఊహాగానాలు వెలువడ్డాయి. ఇంతకీ రాయ్‌బరేలీలో కాంగ్రెస్ అధిష్టానం ఎవరిని బరిలోకి దింపాలని భావిస్తోంది? లేదంటే సోనియా గాంధీ కుమార్తె, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ పోటీ చేయనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రియాంక గాంధీ వాద్రా మద్దతుదారులు రాయ్‌బరేలీలో పోస్టర్లు వేసి, పార్టీ నాయకత్వం ఆమెను లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. లోక్‌సభ అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు చేస్తున్న సమయంలో ప్రియాంక గాంధీ వాద్రా మద్దతుదారులు నియోజకవర్గంలో పోస్టర్లను విడుదల చేశారు. ‘ప్రియాంక గాంధీ జీ రాయ్‌బరేలీ పిలుస్తోంది. దయచేసి రండి కాంగ్రెస్‌ను ముందుకు నడిపించండి’ అంటూ సోనియా గాంధీ, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, పార్టీ అధినేత రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, స్వాతంత్ర్య సమరయోధుడు చంద్రశేఖర్ ఆజాద్‌ల ఫోటోలతో ఉన్న పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. కాంగ్రెస్‌కు కంచుకోట ఇక కాంగ్రెస్ కంచుకోట రాయ్‌బరేలీకి గతంలో మాజీ ప్రధాని, దివంగత ఇందిరా గాంధీ ప్రాతినిధ్యం వహించారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే 1977 సార్వత్రిక ఎన్నికల్లో ఇందిరా గాంధీ సొంత నియోజకవర్గమైన రాయ్ బరేలీలో జనతా పార్టీకి చెందిన రాజ్ నారాయణ్ చేతిలో ఓడిపోయారు. అలాంటి ప్రతిష్టాత్మకమైన స్థానంలో రెండు దశబద్ధాలుగా సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు ఆమె రాజ్యసభ సభ్యురాలిగా వెళ్లనున్నారు. ఆమె స్థానంలో ప్రియాంక గాంధీ బరిలోకి దిగనున్నారు. దేశం మొత్తం రాయ్ బరేలీ వైపే చూపు 2019 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మోదీ ప్రభంజనంతో అమేథీలో రాహుల్ ఓటమి, దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు తీవ్ర ప్రతికూలతలు ఎదురైనా రాయ్‌బరేలీలో మాత్రం కాంగ్రెస్ తట్టుకొని నిలబడింది. అందువల్ల, ఈ సీటుకు బీజేపీ అభ్యర్ధి ఎంపిక, సోనియా గాంధీ ఆ స్థానాన్ని ఖాళీ చేస్తే కాంగ్రెస్ అవకాశాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందా అనే అంశంపై దేశ రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది. కమలం వికససించాలని 2019 ఎన్నికల్లో సోనియా గాంధీపై బీజేపీ అభ్యర్ధి దినేష్ ప్రతాప్ సింగ్‌ను బరిలోకి దింపింది. సోనియా గాంధీ చేతిలో 1.60 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయిన సింగ్, ఈసారి ఎవరిని ఎంచుకుంటే వారికే తన పూర్తి మద్దతు ఉంటుందని చెప్పారు. రాయబరేలీలో అధిష్టానం ఎవరిని ఎన్నుకుంటే వారి గెలుపుకోసం శ్రమిస్తాం. కమలం వికసించాలనేది నా సంకల్పం’ అని దినేష్ సింగ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అమోథీ బరిలో రాహుల్ ఉత్తరప్రదేశ్‌లోని కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మకమైన అమేథీలో బీజేపీ తన అభ్యర్థిగా కేంద్ర మంత్రి, సిట్టింగ్ ఎంపీ స్మృతి ఇరానీని నిలబెట్టుకుంది. ఇరానీ అమేథీ నుంచి పోటీ చేయడం ఇది వరుసగా మూడోసారి. 2014 ఎన్నికల్లో పరాజయం పాలైన ఆమె 2019లో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని ఓడించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అమేథిలో ఓటమి పాలైనా.. కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి రికార్డు స్థాయి ఆధిక్యంతో గెలుపొందారు. అమేథీకి గతంలో సోనియా గాంధీ, మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ ప్రాతినిధ్యం వహించారు. వచ్చే ఎన్నికల్లో అమేథీ నుంచి ఎవరు పోటీ చేస్తారనేది స్పష్టత లేదు. -
ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన రద్దు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన రద్దు అయింది. రేపు(మంగళవారం) చేవెళ్లలో ప్రియాంక గాంధీ సమక్షంలో తెలంగాణ ప్రభుత్వం రెండు స్కీంలను ప్రారంభించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. రూ.500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ స్కీమ్‌లను ప్రియాంక గాంధీ చేతులమీదగా ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రియాంక గాంధీ పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేసుకుంది. అయితే.. అనివార్య కారణాల వల్ల ప్రియాంక గాంధీ పర్యటన రద్దు అయింది. -
రాహుల్, ప్రియాంక మధ్య విబేధాలు? బీజేపీ సందేహం వెనుక ఏముంది?
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా శుక్రవారం ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో పాల్గొనలేకపోయారు. తాను యాత్రకు గైర్హాజరు కావడం వెనుక అనారోగ్యమే కారణమని, ఆరోగ్యం మెరుగుపడిన వెంటనే ఈ ప్రయాణంలో భాగమవుతానని ప్రియాంక తెలిపారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న ఈ యాత్ర ప్రారంభమై 34 రోజులు దాటింది. ఈ నేపధ్యంలో ప్రియాంకా గాంధీ తొలిసారిగా దీనిలో పాల్గొనబోతున్నారనే ప్రకటన వెలువడింది. అయితే ఇంతలోనే ఆమె ఈ యాత్రకు గైర్హాజరు కావడంపై బీజేపీ సందేహం వ్యక్తం చేసింది. అన్నాచెల్లెళ్ల మధ్య బేధాభిప్రాయాలే దీనికి కారణమని బీజేపీ ఆరోపించింది. ప్రియాంక గాంధీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో చేసిన పోస్ట్‌లో తాను అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నానని, అందుకే ఆసుపత్రిలో చేరినట్లు తెలియజేశారు. ఆమె తన పోస్ట్‌లో ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ఉత్తరప్రదేశ్‌కు ఎప్పుడు చేరుకుంటుందానని నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. అయితే అనారోగ్యం కారణంగా నేను ఈరోజే ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. నా ఆరోగ్యం కొద్దిగా మెరుగుపడిన వెంటనే, నేను ఆ ప్రయాణంలో భాగమవుతాను. చందౌలీ-బనారస్‌లో జరిగే ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో పాల్గొనబోయే నేతలకు, కార్యకర్తలకు, నా ప్రియమైన సోదరునికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’ అని పేర్కొన్నారు. सबको अपने स्वास्थ्य का ख़्याल रखना चाहिए। जब यात्रा 2.0 शुरू हुई तब भी प्रियंका वाडरा वहाँ से नदारद थीं, और आज जब राहुल की यात्रा उत्तर प्रदेश पहुँची है, तब भी प्रियंका वहाँ नहीं रहेंगी। पार्टी पर मिल्कियत के लिए भाई-बहन के बीच ना पटने वाली ये खाई अब सर्वविदित है। pic.twitter.com/26KaPOBeYY — Amit Malviya (@amitmalviya) February 16, 2024 మరోవైపు డీహైడ్రేషన్, వికారం కారణంగా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ ఆస్పత్రిలో చేరాల్సి వచ్చిందని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా ప్రియాంక గాంధీ తన ఆరోగ్య వివరాల గురించి చేసిన ట్వీట్‌కు బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ స్పందించారు. ప్రియాంక గాంధీ పోస్ట్‌పై ఆయన వ్యాఖ్యానిస్తూ ‘ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. యాత్ర 2.0 ప్రారంభమైనప్పుడు కూడా ప్రియాంక వాద్రా కనిపించలేదు. రాహుల్ యాత్ర ఉత్తరప్రదేశ్ చేరుకున్నప్పుడు కూడా ప్రియాంక హాజరుకావడం లేదు. పార్టీ నాయకత్వం కోసం అన్నాచెల్లెళ్ల మధ్య ఏర్పడిన ఈ పూడ్చలేని అగాధం ఇప్పుడు అందరికీ తెలుస్తోంది’ అని పేర్కొన్నారు. ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ యాత్ర 2024, జనవరి 14న కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో మణిపూర్ నుంచి ప్రారంభమైంది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం మార్చి 20 లేదా 21న ముంబైలో ముగియనుంది. అయితే మార్చి మొదటి పక్షంలోనే ముంబైలో ఈ యాత్ర ముగుస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ యాత్ర శుక్రవారం సాయంత్రం ఉత్తరప్రదేశ్‌లోకి ప్రవేశించింది. ఇది తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల గుండా వెళుతూ, ఫిబ్రవరి 16 నుండి 21 తేదీల మధ్య రాయ్‌బరేలీ అమేథీల గుండా ముందుకు వెళుతుంది. ఫిబ్రవరి 22, 23లలో యాత్రకు విశ్రాంతినివ్వనున్నారు. ఈ యాత్ర పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో ఫిబ్రవరి 24, 25 తేదీలలో తిరిగి ప్రారంభం కానుంది. -
ప్రియాంక గాంధీకి అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక
ఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర త్వరలో యూపీలో ప్రవేశించనుంది. ఈ యాత్రలో రాహుల్‌తో పాటు ప్రియాంక కూడా పాల్గొంటున్నారు. ప్రస్తుతం అనారోగ్యం కారణంగా ప్రస్తుతానికి బ్రేక్ ఇస్తున్నట్టు ఆమె ప్రకటించారు. ఆరోగ్యం కుదుటపడిన తరవాత మళ్లీ యాత్రలో పాల్గొంటానని ఎక్స్ వేదికగా ప్రియాంక వెల్లడించారు. ‘‘యూపీలో భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొనాలని చాలా ఆసక్తిగా ఎదురు చూశాను. కానీ అనారోగ్యంతో హాస్పిటల్లో చేరాల్సి వచ్చింది. కాస్త ఆరోగ్యం కుదుటపడిన తర్వాత మళ్లీ యాత్రలో పాల్గొంటాను. ఈలోగా యూపీలోకి యాత్ర కోసం అడుగు పెడుతున్న అందరికి నా అభినందనలు. రాహుల్ గాంధీకి కూడా శుభాకాంక్షలు చెబుతున్నాను’’ అంటూ ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు. I was really looking forward to receiving the BJNY in UP today but unfortunately, have ended up admitted to hospital. I will be there as soon as I am better! Meanwhile wishing all the yatris, my colleagues in UP who have worked hard towards making arrangements for the yatra and… — Priyanka Gandhi Vadra (@priyankagandhi) February 16, 2024 ఇదీ చదవండి: కేజ్రీవాల్‌కు గుజరాత్ హైకోర్టు షాక్ -
ప్రియాంక గాంధీ కుమారుడు రైహాన్ వాద్రా సోలో ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్!
ఫోటోగ్రఫీ అనేది కేవలం ఒక ఛాయ చిత్రం కాదు. తీసిన ఫోటోలోని కళాత్మక దృష్టితో అర్థమయ్యేలా లేదా వివరించేలా ఉండాలి. నిజానికి అవి చూడగానే మనస్సులో ఏదో తెలియని అనుభూతి, ఆనందం కలుగుతుంది. ప్రకృతిలోని అద్భుతాలను చిన్న కెమెరాతో గొప్పగా భలే బంధించారే అనిపిస్తుంది. అందుకు ఆ వ్యక్తిలో మంచి సృజనాత్మకతో కూడిన నైపుణ్యం ఉండాల్సిందే. ఇక ఆయా ఫోటోలను సోలోగా లేదా గ్రూప్‌గా ప్రదర్శించడం అనేది కూడా ఓ ఆర్టే. ఎందుకంటే? ప్రేక్షకులను ఆక్టటుకునే థీమ్ తోపాటు వారు అటెన్షన్ పెట్టి చూసేలా సరైన క్యాచీ టైటిల్‌తో ఈవెంట్ నిర్వహించాలి. అప్పుడే ఆ ప్రదర్శన పూర్తి స్థాయిలో విజయవంతమవుతుంది. ఇప్పుడూ ఇదంతా ఎందుకు చెబుతున్నాననంటే ఇలాంటి ఫోటోగ్రఫిక్ ఎగ్జిబిషన్‌ని ప్రియాంక గాంధీ కుమారుడు రైహాన్ వాద్రా గత నెల జనవరి 28 నుంచి ఫిబ్రవరి 3 వరకు నిర్వహించారు. ఆ పోటోలు ఎంతగా అలరిస్తున్నాయంటే.. రైహన్ వాద్రా తన సోలో ఫోటో గ్యాలరీ ఎగ్జిబిషన్ బికనీర్ హౌస్‌లోని లివింగ్ ట్రేడిషన్స్ సెంటర్ వేదికగా నిర్వహించారు. అందులోకి అడుగు పెట్టగానే మేఘాలపై నడుస్తున్నట్లు అనిపిస్తుంది. ఆకాశమే నేలగా మారిందా! అన్నంత అద్భుతంగా ఉంటుంది. ఆయన ఈ ఎగ్జిబిషన్‌ని 'ఉపమాన'(పోలిక) అనే వైవిధ్య భరితమైన టైటిల్‌తో నిర్వహించారు. ఆ టైటిల్ తగ్గట్టుగానే ఆ ఫోటోలు ఒక దానికి మించి ఒకటి ఉండటం విశేషం. ఇదేమీ అతని తొలి సోలో ప్రదర్శన కాదు. రైహాన్ సోలో ఎగ్జిబిషన్ 'డార్క్ పర్సెప్షన్ యాన్ ఎక్స్పోజిషన్ ఆఫ్ లైట్, స్పెస్ అండ్ టైమ్' పేరుతో 2021లో నిర్వహించడం జరిగింది. రైహాన్ 8 ఏళ ప్రాయం నుంచి ఫోటోలు తీయడం ప్రారంభించారు. అతను విజువల్ అండ్ ఇన్స్టాలేషన్ ఆర్టిస్ట్ ఫోటోగ్రాఫర్ అని పిలిపించుకునేందుకే ఇష్టపడతాడు. ఆయన తన తాతయ్య రాజీవ్ గాంధీ వలే అందమైన వన్యప్రాణులను కెమెరాలో బంధించడం అంటే మక్కువ. ఇక వాద్రా నిర్వహించిన ఈ ఎగ్జిబిషన్లో ఒక గది మొత్తం రాజస్తాన్‌లోని అభయ అరణ్యాల్లో క్లిక్ చేసిని చిరుతపులి ఫోటో చూస్తే..చెట్లతో ఆవాసం ఏర్పరుచుకున్నట్లు కనిపిస్తుంది. ఇక ఇతర గదుల్లో లైఫ్ సైజ్ మిర్రర్లతో వ్యక్తుల వ్యక్తీకరణ ఫోటోగ్రాఫ్‌లు ఉన్నాయి. నిజానికి ఈ ఆర్ట్ చాలా శక్తిమంతమైన ట్రిక్. అన్ని వర్గాలప్రజల హవాభావాలను తనదైన శైలిలో కెమరాతో బంధించే కళ. ఇది గ్రహణ శక్తికి సంబంధించిన ఆర్ట్ అని చెప్పొచ్చు. ఈ ఎగ్జిబిషన్ రైహాన్ నిర్వహిస్తున్న ఐదు వరుస సోలో ప్రదర్శనల్లో ఒకటి. ఈ ప్రదర్శన తెలియని దానిని తెలిసిన వాటితో పోల్చగలిగే మహత్తర ఊహతీత జ్ఞానం గురించి చెబుతుంది. ఇక రైహాన్ కేవంలో సోలో ప్రదర్శనలే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల్లో గ్రూప్ ప్రదర్శనల్లో కూడా పాల్గొన్నారు. (చదవండి: నరకం ఎలా ఉంటుందో చూడాలనుకుంటే ఈ పార్క్‌కి వెళ్లాల్సిందే!) -
ఎవరీ ఆచార్య ప్రమోద్ కృష్ణం? కాంగ్రెస్ ఎందుకు బహిష్కరించింది
కాంగ్రెస్ తమ సొంత పార్టీ నేతపైనే వేటు వేసింది. ఆచార్య ప్రమోద్ కృష్ణం అనే ఓ నేత ఇటీవల కాలంలో సొంత పార్టీపై వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తుండటంతో కాంగ్రెస్ అధిష్టానం అయన్ని పార్టీ నుంచి బహిష్కరించింది. క్రమశిక్షణారాహిత్యంగా సొంతపార్టీ విధానాలపైనే తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించి హాట్ టాపిక్‌గా మారారు ప్రమోద్ కృష్ణం. ఇటీవల ప్రమోద్ కృష్ణం ప్రధాని నరేంద్రమోదిపై ప్రశంసలు కురిపించారు. అదేవిధంగా రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమాలకు కాంగ్రెస్ హాజరకాబోమని ప్రకటించటంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రమోద్.. కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు శనివారం ప్రకటించారు. పార్టీ క్రమశిక్షణ నియమాలను ఉల్లంఘిస్తూ.. తరచూ కాంగ్రెస్‌పై విమర్శలు చేయటంతో పార్టీ చీఫ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఎవరీ ఆచార్య ప్రమోద్ కృష్ణం? 2019 లోక్‌సభ ఎన్నికల్లో లక్నో సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆచార్య ప్రమోద్ కృష్ణం పోటీ చేశారు. కానీ.. ఆయన అక్కడ ఓటమిపాలయ్యారు. అయినా 1.8 లక్షల ఓట్లు సంపాధించారు. అదేవిధంగా 2014 లోక్‌సభ ఎన్నికల్లో సైతం ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ సెగ్మెంట్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆచార్య ప్రమోద్ కృష్ణం ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో సలహామండలిలో కీలకంగా వ్యవహించేవారు. ప్రియాంకా గాంధీ వాద్రాకు యూపీ ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించినప్పటి నుంచి ఆమెకు యూపీకి సంబంధించి సహాయసహకారాలు అందించేవారు. ప్రియాంకా గాంధీ టీంలో ఆయన కీలక పాత్ర పోషించేవారు. ప్రమోద్ బహిష్కరణకు కారణాలు! సంభాల్ లోక్‌సభ నియోజకవర్గంలో నిర్మించిన కల్కీధామ్ గుడి ప్రారంభోత్సవానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ప్రధాని నరేంద్రమోదీ, రాజ్‌నాథ్ సింగ్ వంటి బీజేపీ నేతలను ఆహ్వానించటం యూపీలో చర్చనీయాంశంగా మారింది. అదే విధంగా తాను ఆశలు పెట్టుకున్న లక్నో, సంభాల్ స్థానాల్లో ఎస్పీ తమకు ఆవే సీట్లు కేటాయించాలని కోరటంతో ఆయన ప్రవర్తిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇటీవల రామ మందిర ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ హాజరుకామని ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయాన్ని తప్పుపడుతూ.. ప్రధాని పొడుతూ.. కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే.. ప్రమోద్ కృష్ణంను బహిష్కరించాలని యూపీ కాంగ్రెస్ తీర్మానానికి కాంగ్రెస్ చీఫ్ ఆమోదం తెలిపారని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటన విడుదల చేశారు. తరచూ సొంత పార్టీపైనే వ్యతిరేకంగా విమర్శలు చేయటంతో కాంగ్రెస్ ఆరేళ్లు వేటు వేసినట్టు తెలిపారు. వాటి విషయంలో రాజీ పడను: ప్రమోద్ కృష్ణం కాంగ్రెస్ బహిష్కరణపై తాజాగా ఆచార్య ప్రమోద్ కృష్ణం ‘ఎక్స్’ ట్విటర్ వేదికగా స్పందించారు. ‘రాముడు, దేశం విషయంలో రాజీ కుదరదు’ అని రాహుల్ గాంధీని ట్యాగ్ చేశారు. राम और “राष्ट्र” पर “समझौता” नहीं किया जा सकता. @RahulGandhi — Acharya Pramod (@AcharyaPramodk) February 11, 2024 -
ప్రియాంక గాంధీ వస్తే నిరసన చేపడతాం: ఎమ్మెల్సీ కవిత వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సెటైరికల్ కామెంట్స్ చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలకు పార్టీ నాయకులను ఎలా పిలుస్తారని ప్రశ్నించారు. పార్టీ సభ కోసం ప్రభుత్వ నిధులను ఎలా ఖర్చు చేస్తారు. 60 రోజుల్లో కాంగ్రెస్ చేసింది ఏమిటి? అని డిమాండ్ చేశారు. కాగా, ఎమ్మెల్సీ కవిత తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘కాంగ్రెస్ పార్టీ నాయకులు నా మీద, జాగృతిపైనా ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తున్నారు. ఇంద్రవెల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి అనేక ఆరోపణలు నాపై చేశాడు. పార్టీ సభకు ప్రభుత్వ నిధులు ఎందుకు వాడుతున్నారు. అధికారికంగా హెలికాప్టర్ వేసుకొని వెళ్లి పార్టీ సభ పెట్టారు. ప్రభుత్వ కార్యక్రమానికి ప్రియాంక గాంధీని ఎలా పిలుస్తారు. ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రియాంక గాంధీని పిలిస్తే నిరసన తెలియజేస్తాం. వేదిక, కుర్చీలు, లైట్లు పెట్టినందుకు ప్రభుత్వానికి లెక్కలు చెప్పారా?. ఇంద్రవెల్లి సభకు అయిన ఖర్చు ఎంత?. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. సీఎం రేవంత్ నిత్యం ఢిల్లీకి ప్రత్యేక విమానం, చార్టెడ్ ఫ్లైట్స్‌లో వెళ్తున్నారు. ఇదంతా ప్రభుత్వ ఖర్చుతోనే వెళ్తున్నారు కదా?. జై సోనియా అంటున్నారు కానీ.. జై తెలంగాణ అనే మాట రేవంత్ రెడ్డి నోటి నుంచి రాలేదు. కాంగ్రెస్ నేతలు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. సీఎం సోదరులు జిల్లా రివ్యూల్లో ఎలా పాల్గొంటారు. 60 రోజుల్లో ఒకే ఒకరోజు ప్రజాదర్బార్‌లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజలు రేవంత్ రెడ్డిని యూటర్న్ సీఎం అని పిలుస్తున్నారు. మలి దశ ఉద్యమంలో అమరులైన అమరులకు కుటుంబాలకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. సీఎం రేవంత్ ఒక్కరోజు కూడా అమరులకు నివాళులు అర్పించలేదు. ఒక్క అమరవీరుడి కుటుంబాన్ని కూడా పరామర్శించలేదు. మాది కుటుంబ పార్టీ అంటున్న రేవంత్, కాంగ్రెస్ నేతలు.. హస్తం పార్టీలోని 22 కుటుంబాలకు ఎమ్మెల్యే టికెట్లు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలు, వారి కుటుంబ సభ్యుల వివరాలను చదివి వినిపించారు. -
సోనియా లేదా ప్రియాంకకు.. నడ్డా రాజ్యసభ సీటు !
షిమ్లా: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాజ్యసభ పదవీ కాలం త్వరలో ముగుస్తోంది. ఈ సీటు సోనియాగాంధీ లేదా ప్రియాంక గాంధీకి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని హిమాచల్‌ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ ప్రతిభా సింగ్ తెలిపారు. సోనియా, ప్రియాంకలకు ఆసక్తి ఉంటే ఈ సీటుకు వారి పేర్లను పరిశీలిస్తామని చెప్పారు. ఈ విషయమై సీనియర్ కాంగ్రెస్ నేతలతో చర్చిస్తామన్నారు. దేశవ్యాప్తంగా 56 రాజ్యసభ సీట్లకు ఎన్నికల కమిషన్ ఇటీవల షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా హిమాచల్ ప్రదేశ్‌లోని నడ్డా ప్రాతినిధ్యం వహిస్తున్న సీటుకు కూడా ఎన్నిక జరగనుంది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 68 సీట్లకుగాను 40 సీట్లతో కాంగ్రెస్‌కు పూర్తి మెజారిటీ ఉండటంతో ఈ సీటు కాంగ్రెస్‌కే దక్కనుంది. వచ్చే నెల హిమాచల్‌ప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు జరగనున్న సమయంలో ఈ సీటుకు ఎన్నిక జరగనుంది. 2018లో బీజేపీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నపుడు నడ్డా హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయన పదవీ కాలం వచ్చే ఏప్రిల్ 2తో ముగియనుంది. రాష్ట్రంలో మొత్తం 3 రాజ్యసభ సీట్లుండగా మూడు ప్రస్తుతం బీజేపీ ఖాతాలోనే ఉన్నాయి. ఇదీచదవండి.. ఇండియాకు తొలి ఓటమి.. బీజేపీపై కేజ్రీవాల్ ఫైర్ -
కాంగ్రెస్‌కు పరీక్షా కాలం
2024 ను ఎన్నికల సంవత్సరంగానే అభివర్ణించాలి. వరుస గెలుపులతో బిజెపి చాలా బలంగా ఉంది. అన్నీ కలిసొస్తే హ్యాట్రిక్ కొట్టే అవకాశాలు వున్నాయి. నరేంద్రమోదీ ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి కాగల అవకాశాలను కొట్టి పారేయలేం. మోదీని దించడమే ధ్యేయంగా ప్రతిపక్ష పార్టీలన్నీ 'ఇండియా కూటమి'గా ఏర్పడ్డాయి. కానీ,ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదు. ఇక ముందు ముందు పనిచేస్తారేమో చూడాలి. విపక్ష పార్టీలలో ప్రధాన పక్షంగా వున్న కాంగ్రెస్ ఇంకా రాటుదేలాల్సిన స్థితిలోనే వుంది.2024 లో అధికారంలోకి రాకపోతే, కాంగ్రెస్ మరింతగాకునారిల్లి పోవచ్చు. ఇండియా కూటమిలోని మిగిలిన పార్టీల కంటే కాంగ్రెస్‌కే ఇది పరీక్షాకాలం. ప్రస్తుతం దేశంలో హిమాచల్ ప్రదేశ్,కర్ణాటక, తెలంగాణ తప్ప, కాంగ్రెస్ ఎక్కడా అధికారంలో లేదు.బిజెపి చాలా రాష్ట్రాలలో అధికారంలో వుంది. మిగిలిన రాష్ట్రాలు వివిధ ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో వున్నాయి. అధికారంలో వున్న ప్రాంతీయ పార్టీలు చాలా వరకూ బలంగానే వున్నాయి.అధికారంలో లేకపోయినా, కొన్ని ప్రాంతీయ పార్టీలు బలంగానే వున్నాయి. అధికారంలోకి వచ్చినా రాకపోయినా బలపడాల్సిన చారిత్రక అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది.ప్రస్తుతం,జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్షంగా ఉనికిలో ఉన్నప్పటికీ, ఈ బలం సరిపోదు. రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్ర రాహుల్ ఇమేజ్ ను పెంచడానికే ఎక్కువ భాగం ఉపయోగపడింది తప్ప, పార్టీ ప్రతిష్ఠను కాపాడడానికి, గెలుపును అందించడానికి పూర్తిస్థాయిలో ఉపయోగపడలేదని చెప్పవచ్చు. కర్ణాటక,తెలంగాణలో అధికారం చేపట్టినప్పటికీ, అది కేవలం జోడో యాత్ర ప్రభావంతో జరిగింది కాదు. కర్ణాటకలో బిజెపి,తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీపై వచ్చిన ప్రజావ్యతిరేకత కాంగ్రెస్ గెలుపుకు కలిసొచ్చింది.ప్రస్తుతం దక్షిణాదిలో రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నా,ఉత్తరాదిలో కాంగ్రెస్ ఉనికిని కోల్పోయింది ( హిమాచల్ ప్రదేశ్ మినహా). తాజాగా జరిగిన మధ్యప్రదేశ్,రాజస్థాన్,ఛత్తీస్గడ్ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం కావడమే కాక,రాజస్థాన్, ఛత్తీస్గడ్ లో వున్న అధికారాన్ని కూడా కోల్పోయింది. మల్లికార్జున ఖర్గే పార్టీ అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మిశ్రమ ఫలితాలు నమోదయ్యాయి.కొన్ని రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయింది, కొన్ని రాష్ట్రాల్లో సంపాయించింది. బిజెపికి వ్యతిరేకంగా కూటమి కట్టడం వరకూ కొంత విజయం సాధించింది.ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరన్న విషయం ఇంకా గందరగోళంగానే వుంది. ముందు గెలుపు - ఆ తర్వాతే ప్రధాని అభ్యర్థి ఎంపిక అనడం కొంత బాగానే వుంది.కానీ, కాంగ్రెస్ లో అగ్రనాయకుడుగా వున్న రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పదార్ధం ( మెటీరియల్ ) కాదా! అనే సందేహానికి అవకాశం ఇచ్చినట్లయింది. జనవరి 14నుంచి రాహుల్ గాంధీ మళ్ళీ యాత్ర మొదలు పెడుతున్నారు.జోడో యాత్ర బదులు 'న్యాయ యాత్ర' అని మార్చారు. కేవలం పాదయాత్ర కాకుండా, రకరకాల రూపాలలో ఈ యాత్ర ఉంటుందని ప్రకటించారు. 1885 లో కాంగ్రెస్ ఏర్పడింది. ఆ తర్వాత అది రకరకాల రూపాలు తీసుకున్నా,జాతీయ కాంగ్రెస్ పార్టీగానే కొనసాగుతోంది. 138 సంవత్సరాలు పూర్తి చేసుకొని, 139 లో అడుగుపెట్టింది.1947లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత, ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికలలో 1984 లో అత్యధికంగా 414 లోక్ సభ స్థానాలను గెలుచుకుంది. ఇప్పుడు అత్యల్పంగా 48 స్థానాలతో బండిని వెళ్ళతీస్తోంది. ఈ 40 ఏళ్లలో కాంగ్రెస్ చెందిన పతనానికి ఇది పెద్ద ఉదాహరణ. 1984లో అంత మెజారిటీ రావడానికి ఇందిరాగాంధీ హత్య నుంచి ఉత్పన్నమైన భావోద్వేగాలు ప్రధాన కారణం. మిగిలిన పార్టీల సహకారంతో పివి నరసింహారావు, మన్ మోహన్ సింగ్ కాలంలో కేంద్రంలో అధికారంలో వుంది. ముఖ్యంగా,మన్ మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా 10ఏళ్ళ పాలనలో నిలబడింది.1991 నుంచి 1996 వరకూ సాగిన పీవీ నరసింహారావు ఐదేళ్ల పాలన చారిత్రత్మకం. దేశాన్ని ఆర్ధికంగా మలుపుతిప్పిన పాలన అది.మన్ మోహన్ సింగ్ పదేళ్లు పాలనలో ఉన్నప్పటికీ, చెప్పుకో తగిన ప్రగతి లేకపోగా, అవినీతి రాజ్యమేలింది. ముఖ్యంగా రెండో తఫా ఇదేళ్ల పాలన అత్యంత బలహీనం,అవినీతిమయం. విసిగిపోయిన ప్రజలు కాంగ్రెస్‌ను గద్దె దింపి, బిజెపికి అధికారాన్ని కట్టబెట్టారు.ప్రధానిగా నరేంద్రమోదీ తిరుగులేని నాయకుడుగా అవతరించాడు.ఈ పదేళ్లలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా దెబ్బతినడమే కాక, పార్టీ నుంచి బలమైన నాయకత్వాన్ని కూడా అందించలేకపోయింది. పార్టీ అగ్రనేతల మధ్య అంతర్గత కలహాలు కూడా పెరిగాయి. పార్టీని బాహాటంగానే విమర్శించే పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీ ప్రజలను సమ్మోహనపరచడంలో, పార్టీని బలోపేతం చేయడంలో విఫలమయ్యారు. పార్టీ ఓడిపోయిన ప్రతిసారీ రాహుల్ గాంధీ కాడి పడేయ్యడం చాలా చెడ్డపేరు మూటగట్టింది.ఇదిగో! జోడో యాత్ర తర్వాత రాహుల్ గ్రాఫ్ కొంత పెరిగింది.ఇంకా పెరగాల్సిన అవసరం వుంది. ఇప్పటి వరకూ వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో పొత్తులు పెట్టుకోవడంలో కాంగ్రెస్ ఘోరమైన తప్పటడుగులు వేసింది.పశ్చిమ బెంగాల్ మొదలుకొని,తాజాగా మధ్యప్రదేశ్ వరకూ అనేక ఉదాహరణలు చెప్పవచ్చు. రేపు జరుగబోయే సాధారణ ఎన్నికల్లో కూడా ఇవే తప్పులు చేస్తే,కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఆంధ్రప్రదేశ్ లో లోక్ సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగనున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ సోదిలో లేకుండా పోయింది.జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ బలంగా అవతరించింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా గిడుగు రుద్రరాజు వున్నారు.అతను ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకొని వున్నారు. మొన్నటి దాకా ఒరిస్సా ఐన్ ఛార్జిగా కూడా పనిచేశారు. పగ్గాలు మార్చి వైఎస్ షర్మిలకు ఇస్తారనే ప్రచారం మాత్రం జరుగుతోంది.పగ్గాలు మారినంత మాత్రాన పార్టీ పెద్దగా బలపడే అవకాశాలు ఇప్పుడప్పుడే లేవు.ముందుగా ఇండియా కూటమి ఐక్యతలో బలం పెరగాలి. క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలోపేతం కావాలి.రాహుల్ గాంధీ, ప్రియాంక నాయకత్వంపై ప్రజల్లో విశ్వాసం పెరగాలి. ఇవ్వన్నీ జరిగితేనే కాంగ్రెస్ కు భవిష్యత్తు ఉంటుంది.లేకపోతే ఉనికికే ప్రమాదమవుతుంది. మొత్తంగా,2024 కాంగ్రెస్ కు పెద్ద పరీక్షా సమయం. - మాశర్మ, సీనియర్ జర్నలిస్టు -
ఈడీ చార్జిషీట్లో ప్రియాంక పేరు
న్యూఢిల్లీ: ప్రవాస భారతీయుడు, వ్యాపారవేత్త సి.సి.థాంపీ నిందితుడుగా ఉన్న అక్రమ నగదు లావాదేవీల(మనీ లాండరింగ్) కేసులో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా పేరును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తమ చార్జి షీట్లో తొలిసారిగా ప్రస్తావించింది. అయితే, ఆమెను నిందితురాలిగా పేర్కొనలేదు. ఈ చార్జిషీట్‌ను గత నెలలో ఢిల్లీలోని ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టులో ఈడీ సమరి్పంచింది. ఈ నెల 22న చార్జిషీట్‌ను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. తదుపరి విచారణను వచ్చే 29వ తేదీకి వాయిదా వేసింది. ఇదే కేసులో గతంలో సమర్పించిన చార్జిషీట్లో ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా పేరును ఈడీ చేర్చింది. చార్జి్జషీట్లో ఏముందంటే.. ► కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా 2005–06లో హెచ్.ఎల్.పహ్వా అనే ఢిల్లీ రియల్ ఎస్టేట్ ఏజెంట్ నుంచి హరియాణాలోని అమీపూర్‌లో 40.08 ఎకరాలు కొన్నాడు. అదే భూమిని 2010 డిసెంబర్లో పహా్వకు అమ్మేశాడు. ► ప్రియాంకాగాంధీ 2006 ఏప్రిల్‌లో పహ్వా నుంచి అమీపూర్‌లో 5 ఎకరాలు కొనుగోలు చేశారు. 2010 ఫిబ్రవరిలో ఆ భూమిని తిరిగి అతడికే విక్రయించారు. ► పహ్వా సహాయంతో సి.సి.థాంపీ 2005 నుంచి 2008 మధ్య అమీపూర్‌లో 486 ఎకరాలు కొన్నాడు. ► రాబర్ట్ వాద్రా, థాంపీ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇద్దరి మధ్య ఉమ్మడి, వ్యాపార ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ► రాబర్ట్ వాద్రాకు, థాంపీకి విక్రయించిన భూమికి గాను లెక్కలోని రాని నగదును పహ్వా స్వీకరించాడు. ► థాంపీ 2020 జనవరిలో అరెస్టయ్యాడు. వాద్రా తనకు గత పదేళ్లుగా తెలుసని ఈడీ విచారణలో అంగీకరించాడు. దుబాయ్‌లో, ఢిల్లీలో పలుమార్లు కలుసుకున్నామని వెల్లడించాడు. -
మనీలాండరింగ్ కేసులో ప్రియాంక గాంధీ
-
మనీలాండరింగ్ కేసు: ప్రియాంక గాంధీకి షాకిచ్చిన ఈడీ
ఢిల్లీ: కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీకి బిగ్ షాక్ తగిలింది. ఎన్ఆర్ఐకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రియాంక పేరును ప్రస్తావించింది. ఎన్నారై వ్యాపారవేత్త సీపీ థంపి, బ్రిటన్ జాతీయుడు సుమిత్ చద్దాపై నమోదైన మనీలాండరింగ్ కేసులో భాగంగా దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో ప్రియాంకగాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా పేర్లను ఈడీ చేర్చింది. వివరాల ప్రకారం.. ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా 2006 సంవత్సరంలో ఫరీదాబాద్ ప్రాంతంలోని అమీపూర్ గ్రామంలో రియల్ ఎస్టేట్ ఏజెంట్ అయిన హెచ్ఎల్ పహ్వా ద్వారా 40 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. 2010లో అదే భూమిని తిరిగి పహ్వాకు అమ్మేశారు. అదే విధంగా 2006లో అమీపూర్ గ్రామంలో హెచ్ఎల్ పహ్వా ద్వారా.. ప్రియాంక గాంధీ ఓ ఇంటిని కొనుగోలు చేశారు. 2010లో అదే ఇంటిని తిరిగి పహ్వాకు అమ్మటం జరిగింది. ఈ భూముల కొనుగోలు సమయంలో జరిగిన ఆర్థిక లావాదేవీలు అన్నీ విదేశాల నుంచి అక్రమంగా వచ్చాయనేది ఈడీ ఆరోపణ. విదేశాలకు చెందిన సీసీ థంపి(యూఏఈ), సుమిత్ చద్దా ద్వారా ప్రియాంక గాంధీ, ఆమె భర్త వాద్రా భూముల కొనుగోలు ద్వారా మనీలాండరింగ్ పాల్పడ్డారని ఆరోపించింది. Enforcement Directorate (ED) has named Congress leader Priyanka Gandhi Vadra in its charge sheet mentioning her role in purchasing agricultural land measuring 40 kanal (five acres) in Haryana's Faridabad from a Delhi-based real estate agent HL Pahwa in 2006 and selling the same… pic.twitter.com/L5zU9XbkKy — ANI (@ANI) December 28, 2023 ఇక, రాబర్ట్ వాద్రాతోపాటు సంజయ్ భండారీ సన్నిహితులు తంపి, సుమిత్ చద్దాలపై ఈడీ ఢిల్లీ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈడీ వీరిరువురిని అరెస్టు చేశారు. నిందితులు సీసీ థంపీ, రాబర్ట్ వాద్రాల మధ్య డబ్బు లావాదేవీలే కాకుండా లండన్‌లో ఉన్న 12 బ్రయాన్స్టన్ స్క్వేర్ ఫ్లాట్‌ను సీసీ థంపి రాబర్ట్ వాద్రా కోరిక మేరకు పునరుద్ధరించారని ఈడీ కోర్టుకు తెలిపింది. లండన్‌లోని 12 బ్రయాన్స్టన్ స్క్వేర్, 6 గ్రోస్వెనర్ హిల్ కోర్ట్, లండన్‌తో సహా అనేక అప్రకటిత విదేశీ ఆస్తులను సంజయ్ భండారీ కలిగి ఉన్నట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. ఈ రెండు ఆస్తుల్ని నేరపూరితంగా వచ్చిన ఆదాయం నుంచి పొందారు. సీసీ థంపి, సుమిత్ చద్దా ఈ నేరాల ద్వారా సంపాదించిన ఆస్తులను దాచిపెట్టి వినియోగించుకున్నట్లు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటి వరకు సంజయ్ భండారీకి చెందిన రూ.26.55 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఈ రెండు ఆస్తులు మనీ లాండరింగ్, 2002 నిబంధనల ప్రకారం నేరం ద్వారా వచ్చిన ఆదాయం నుండి పొందబడ్డాయని తెలిపింది. -
ప్రమాణ స్వీకారానికి సోనియా, రాహుల్
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏఐసీసీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంక, ఇతర కీలక నేతలు తరలిరానున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు ప్రియాంక, 10:30 గంటలకు సోనియా, రాహుల్‌లు హైదరాబాద్‌కు చేరుకుంటారని గాం«దీభవన్ వర్గాలు తెలిపాయి. వారు విమానాశ్రయం నుంచి నేరుగా తాజ్‌కృష్ణా హోటల్‌కు వెళ్లి కాసేపు విశ్రాంతి తీసుకున్నాక ఎల్బీ స్టేడియంలో జరిగే కార్యక్రమానికి హాజరవుతారని వెల్లడించాయి. స్వయంగా ఆహ్వానించిన రేవంత్ సీఎల్పీ నేతగా ఎన్నికైన తర్వాత మంగళవారం రాత్రి ఢిల్లీ వెళ్లిన రేవంత్ బుధవారం అంతా బిజిబిజీగా గడిపారు. పార్టీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఖర్గేలతో.. సోనియా, రాహుల్, ప్రియాంకాగాందీ, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, హరియాణా ఎంపీ దీపేందర్‌సింగ్ తదితరులతో విడివిడిగా భేటీ అయ్యారు. గురువారం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాలని వారిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. అంతకుముందు ఉదయమే ఏపీలోని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు యమునా బ్లాక్‌లోని రేవంత్ నివాసానికి వచ్చి కలిశారు. వారు ఇరవై నిమిషాల పాటు ఏకాంతంగా చర్చించుకున్నారు. చర్చల విషయాన్ని బయటికి వెల్లడించలేదు. పార్లమెంట్లో అభినందనల వెల్లువ కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీల తర్వాత రేవంత్ పార్లమెంట్‌కు వెళ్లారు. అంబేడ్కర్ విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. అక్కడి నుంచి లోక్‌సభలోకి వెళ్లిన రేవంత్‌కు వివిధ పార్టీల ఎంపీలు శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత రాజ్యసభ హౌస్ కమిటీ చైర్మన్, బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ చాంబర్‌కు వెళ్లగా.. టీడీపీ ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్, రామ్మోహన్నాయుడు, ఎంపీ రఘురామకృష్ణ రాజు, వైఎస్ఆర్సీపీ ఎంపీలు నిరంజన్‌రెడ్డి, శ్రీధర్, ఇతర పార్టీల ఎంపీలు రేవంత్‌ను అభినందించారు. స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా ఆ ఎంపీలందరినీ తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాలని రేవంత్ ఆహ్వానించారు. పార్లమెంటుకు వెళ్లిన సమయంలో రేవంత్ తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తారని భావించినా చేయలేదు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక.. ఢిల్లీకి వచ్చి ఎంపీ పదవికి రాజీనామా చేస్తారని తెలిసింది. ప్రజా ప్రభుత్వం వస్తోందంటూ ఖర్గే, రాహుల్ ట్వీట్లు బుధవారం ఢిల్లీలో రేవంత్‌రెడ్డి తమను కలిసిన ఫొటోలను ఖర్గే, రాహుల్ ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం వస్తోందని పేర్కొన్నారు. ప్రజా తెలంగాణ కోసం కాంగ్రెస్ నాయకులంతా సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. తాము హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తామని ఖర్గే పేర్కొనగా.. రేవంత్ నాయకత్వంలో వాగ్దానాలన్నీ నెరవేర్చుతామని రాహుల్ తెలిపారు. రేవంత్‌కు ఘన స్వాగతం అధిష్టానం పెద్దలను కలసిన అనంతరం రేవంత్ బుధవారం రాత్రి 10:20 గంటల సమయంలో ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ ఆయనకు సీఎస్, డీజీపీ, ఇతర అధికారులు, కాంగ్రెస్ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి రేవంత్ నేరుగా హోటల్ ఎల్లాకు చేరుకున్నారు. మీ ఆశీస్సులతోనే ప్రజా ప్రభుత్వం నా ప్రమాణ స్వీకారానికి అందరూ రండి: రేవంత్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: సీఎంగా తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకావాలని సీఎల్పి నేత ఎనుముల రేవంత్‌రెడ్డి ఆహ్వానించారు. ‘‘తెలంగాణ ప్రజలకు అభినందనలు. విద్యార్థుల పోరాటం, అమరుల త్యాగం, సోనియాగాంధీ ఉక్కు సంకల్పంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మనందరి ఆకాంక్షలు నెరవేర్చే ఇందిరమ్మ రాజ్య స్థాపనకు సమయం ఆసన్నమైంది. రాష్ట్రంలో ప్రజాస్వామ్య, పారదర్శక పాలన అందించేందుకు.. బలహీన వర్గాలు, దళిత, గిరిజన, మైనార్టీ, రైతు, మహిళ, యువత సంక్షేమ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు.. మీ అందరి ఆశీస్సులతో 2023 డిసెంబర్ 7న మధ్యాహ్నం 1:04 గంటలకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రజా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయబోతోంది. ఈ మహోత్సవానికి రావాల్సిందిగా మీ అందరికీ ఇదే ఆహ్వా నం..’’అంటూ బుధవారం బహిరంగ ఆహ్వాన లేఖను విడుదల చేశారు. కేసీఆర్, చంద్రబాబులకు పిలుపు! రేవంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా పలువురు జాతీయ నాయకులు, సీఎంలు, మాజీ సీఎంలకు టీపీసీసీ నుంచి ఆహ్వానాలు వెళ్లాయి. మాజీ సీఎం కేసీఆర్, ఏపీ మాజీ సీఎం చంద్రబాబులను రేవంత్ ఆహ్వానించారని గాందీభవన్ వర్గాల సమాచారం. వీరితోపాటు ‘ఇండియా’కూటమిలోని 8 మంది సీఎంలు, కాంగ్రెస్‌కు చెందిన 51 మంది ఎంపీలకూ ఆహ్వానం పంపినట్టు తెలిసింది. రాష్ట్ర కాంగ్రెస్‌లోని పలువురు సన్నిహిత నేతలు, సీనియర్ నాయకులకు రేవంత్ స్వయంగా ఫోన్లు చేసి రావాలని కోరారని.. తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు, ప్రజాసంఘాల నాయకులనూ ఆహ్వానించామని గాం«దీభవన్ వర్గాలు వెల్లడించాయి. -
సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గేను ఆహ్వానించిన రేవంత్
-
నా ఎత్తు ఇప్పుడు తెలిసిందా? ప్రియాంకకు సింధియా కౌంటర్
భోపాల్: మధ్యప్రదేశ్ ఎన్నికలలో బీజేపీ స్పష్టమైన మెజార్టీతో దూసుకెళ్తోంది. కాంగ్రెస్ చాలా చోట్ల ఓటమితో వెనుకబడిపోయింది. ఈ నేపథ్యంలో తన ఎత్తుపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇప్పుడు స్పందించారు. సింధియా ప్రభావం ఉన్న ప్రాంతంగా భావించే గ్వాలియర్ మాల్వా ప్రాంతంలో బీజేపీ ఆధిక్యాన్ని ఆయన ప్రస్తావిస్తూ ‘నా ఎత్తు గురించి ఎవరో మాట్లాడారు. గ్వాలియర్-మాల్వా ప్రజలు ఎంత ఎత్తులో ఉన్నారో చూపించారు’ అన్నారు. గత నెలలో డాటియాలో జరిగిన ర్యాలీలో ప్రియాంక గాంధీ.. సింధియాపై విరుచుకుపడ్డారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిన ‘ద్రోహ’ అని ముద్ర వేశారు. ‘వాళ్ల (బీజేపీ) నాయకులందరూ కొంచెం విచిత్రంగా ఉంటారు. ముందుగా మా సింధియా.. నేను యూపీలో అతనితో కలిసి పనిచేశాను. వాస్తవానికి అతని ఎత్తు కొంచెం తక్కువగా ఉంది. కానీ అహంకారంలో మాత్రం ఘనుడు’ అంటూ విమర్శించారు. ఎన్డీటీవీతో సింధియా మాట్లాడుతూ ‘బీజేపీ గెలుస్తుందని నేను ముందే చెప్పాను. మాకు ఇంత పెద్ద మెజారిటీని అందించిన మధ్యప్రదేశ్ ఓటర్లకు ధన్యవాదాలు. బీజేపీ ప్రధాని మోదీ నాయకత్వం, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా మార్గదర్శకత్వం పనిచేసింది’ అన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అందించిన ప్రజా, సంక్షేమ పథకాలు కూడా పార్టీ విజయానికి దోహదం చేశాయన్నారు. -
మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి
జహీరాబాద్: రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజా ర్టీతో అధికారంలోకి రావడం ఖాయమని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో నిర్వహించిన రోడ్‌షోలో ఆమె పాల్గొని ప్రసంగించారు. బీఆర్ఎస్ పాలనతో విసిగిపోయిన ప్రజలు మార్పు కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఫాంహౌస్‌కే పరిమితం అయిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బైబై చెప్పాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళల కోసం చేసిందేమీ లేదని, రాష్ట్రంలో అత్యాచారాలు పెరిగిపోయాయని, యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదని, పేపర్ లీకేజీలు అయ్యాయని, రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని అన్నారు. రుణమాఫీ హామీ ఎందుకు అమలు చేయలేదని ఆమె ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని, ఈ రెండూ ధనిక పా ర్టీలని, ఈ డబ్బంతా ప్రజలదేనన్నారు. ప్రధానికి రెండు విమానాలు ప్రధాని నరేంద్రమోదీ వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి రెండు విమానాలను కొనుగోలు చేశారని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. దేశంలో రైతు రోజుకు రూ. 27 సంపాదిస్తున్నాడని, మోదీ స్నేహితుడు అదానీ మాత్రం వేల కోట్లు సంపాదించారని చెప్పారు. అయినప్పటికీ అదానీకి వేలకోట్ల రూపాయల రుణాలను ప్రధాని మాఫీ చేయించారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంట్లో అవసరం వచ్చినప్పుడు బీఆర్ఎస్ మద్దతునిస్తోందని, తెలంగాణలో బీఆర్ఎస్కు ఎంఐఎం మద్దతునిస్తోందన్నారు. రాహుల్‌పైనే ఒవైసీ విమర్శలు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కేసీఆర్, బీజేపీలను విమర్శించరని, కేవలం రాహుల్‌గాం«దీపైనే విమర్శలు చేస్తారని ప్రియాంక తెలిపారు. ఎంఐఎం దేశవ్యాప్తంగా 40 కంటే ఎక్కువ సీట్లలో పోటీ చేస్తోందని, తెలంగాణలో మాత్రం 9 స్థానాల్లోనే పోటీకి దిగిందన్నారు. బీఆర్ఎస్ను గెలిపించేందుకే ఆ పార్టీ ఇలా చేస్తోందని ఆమె విమర్శించారు. ప్రజలకోసం ఆరు గ్యారంటీలు.. తెలంగాణ ప్రజల కోసం ఆరు గ్యారంటీ పథకాలు తెచ్చామని, అధికారంలోకి రాగానే అమలు చేస్తామ ని ప్రియాంక గాంధీ అన్నారు. ధాన్యంపై ప్రతి క్వింటాలుపై రూ.500 బోనస్ ఇస్తామని, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, 24 గంటల కరెంటు సరఫరా చేస్తామని ఆమె వివరించారు. ఇందిరమ్మ ఇంటి పథకం కింద స్థలంతో పాటు రూ.5 లక్షల అందిస్తామని, రాజీవ్ ఆరోగ్యశ్రీ యోజన కింద రూ.10 లక్షలతో ఉచిత వైద్యం అందిస్తామన్నారు. వృద్ధులకు రూ.4వేల పింఛన్ అందజేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ అమరుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామన్నారు. నీతి, నిజాయి తీగల తమ పార్టీ అభ్యర్థి ఎ.చంద్రశేఖర్‌ను గెలిపించాలని కోరారు. సభలో కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రే, మాజీ ఎంపీ సురేష్ షెట్కార్, జహీరాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి ఎస్.ఉజ్వల్‌రెడ్డి, నియోజకవర్గం కో–ఆర్డినేటర్ ఎన్.గిరిధర్‌రెడ్డి పాల్గొన్నారు. -
అధికారంలోకి రాగానే...ఆరు గ్యారంటీలపై సంతకాలు
సాక్షి, హైదరాబాద్, మల్కాజిగిరి, నాంపల్లి (హైదరాబాద్): తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీ పథకాల అమలుపై మంత్రివర్గం సంతకాలు చేస్తుందని ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రకటించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్కు ఓటేస్తే మళ్లీ దొరల సర్కారే ఏర్పడుతుందని, కాంగ్రెస్‌కు ఓటేస్తే ప్రజల సర్కార్ ఏర్పడుతుందని పేర్కొన్నారు. ప్రజా సర్కార్ కోసం బీఆర్ఎస్ను ఓడించి కాంగ్రెస్‌ను గెలిపించాలన్నారు. దేశంలో మత విద్వేషాలు లేకుండా చేసేందుకు ఢిల్లీలో నరేంద్ర మోదీని గద్దె దింపాలంటే, ముందుగా తెలంగాణలో కేసీఆర్‌ను ఓడించాలని అన్నారు. దేశంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ విద్వేషాలను వ్యాప్తి చేస్తున్నాయని విమర్శించారు. మోదీ విద్వేషాలతో కూడిన భారతదేశాన్ని తయారు చేశారని, తాము ప్రేమతో కూడిన దేశాన్ని కోరుకుంటున్నామని చెప్పారు. దేశంలో ప్రేమను పంచాలనే లక్ష్యంతోనే భారత్ జోడో యాత్ర చేశానని, ఈ సందర్భంగా ప్రజల కష్టాలను నేరుగా చూశానని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చివరి రోజైన మంగళవారం.. హైదరాబాద్ నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని బజార్‌ఘాట్ చౌరస్తాలో, మల్కాజిగిరి ఇందిరా చౌక్ వద్ద నిర్వహించిన కార్నర్ మీటింగుల్లో రాహుల్ మాట్లాడారు. మోదీతో రాజీపడే ప్రసక్తే లేదు ‘కాంగ్రెస్ పోరాటం కేవలం కాషాయం విద్వేషాలపైనే. మోదీతో రాజీ పడే ప్రసక్తే లేదు. బీజేపీకి బీఆర్ఎస్, ఎంఐఎం బీ టీం కాకుంటే అవినీతిపరుడైన కేసీఆర్‌తో పాటు ఒవైసీపై ఒక్క కేసు, ఈడీ దాడులు ఎందుకు లేవు? మోదీ సర్కార్ తెచ్చిన అన్ని బిల్లులకు బీఆర్ఎస్ మద్దతు పలికింది. ఉత్తరాది, ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో మజ్లిస్ పారీ్టకి కనీసం ఉనికి, ఒక్క ఓటు లేకున్నా బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకు ఎన్నికల బరిలో దిగుతుంది. మజ్లిస్ ఎక్కడ పోటీ చేయాలో కూడా బీజేïపీ నిర్ణయిస్తోంది. కేవలం కాంగ్రెస్‌ను దెబ్బతీయడమే మజ్లిస్ ఉద్దేశం. ఈ మూడూ ఒకటే టీమ్. కలిసే పనిచేస్తాయి..’ అని రాహుల్ ధ్వజమెత్తారు. నేను, ప్రియాంక సైనికుల్లా ఉంటాం ‘అధికారంలోకి వస్తే తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల నుంచి దోచుకున్నదంతా తిరిగి ప్రజల జేబులో వేస్తాం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి చెందింది. హైదరాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రో రైలు ప్రాజెక్టు ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే. వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తే గ్యాస్ సిలిండర్‌ను రూ.400కే అందిస్తాం. విద్యార్థులకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తాం..’ అని హామీ ఇచ్చారు. ప్రజల తరఫున ఢిల్లీలో పోరాడడానికి తాను, సోదరి ప్రియాంక సైనికుల్లా ఉంటామని రాహుల్ చెప్పారు. అసలు ప్రభుత్వాన్ని చూపిస్తాం: ప్రియాంక పది సంవత్సరాల తెలంగాణలో ప్రజలకు కేసీఆర్ ఇల్లు ఇచ్చారా? అని ప్రజలను ప్రియాంకాగాంధీ ప్రశ్నించారు. పదేళ్లూ ఫాంహౌస్ పాలన కొనసాగిందని, ఆయన కుటుంబంలోని వారికి మంత్రి పదవులు వచ్చాయని విమర్శించారు. కాంగ్రెస్ గెలిస్తే అసలు ప్రభుత్వాన్ని చూపిస్తామని అన్నారు. మల్కాజిగిరి రోడ్‌షోలో బోనాలతో మహిళలు, కల్లు గీసే పనిముట్లతో గీత కారి్మకులు, వలలు పట్టుకుని గంగపుత్రులు పాల్గొన్నారు. మూడు రంగుల జెండా పాటకు రాహుల్, ప్రియాంక, రేవంత్, హన్మంతరావు ఉత్సాహంగా నృత్యం చేశారు. కాగా జూబ్లీహిల్స్ యూసుఫ్‌గూడలో కార్యక్రమానంతరం అక్కడి నుంచి నాంపల్లి కార్నర్ మీటింగ్‌కు రాహుల్ ఆటోలో వచ్చారు. రాహుల్ తన ఆటోలో ప్రయాణించడం జీవితంలో మరిచిపోనంటూ ఆటో డ్రైవర్ ఆశోక్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాల్లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కార్యదర్శి మన్సూర్ అలీఖాన్, రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లోత్, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, నాంపల్లి, జూబ్లీహిల్స్, మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్ధులు ఫిరోజ్ ఖాన్, అజారుద్దీన్, మైనంపల్లి హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు. -
BRS ధనిక పార్టీ.. డబ్బు ఎలా వచ్చింది: ప్రియాంక గాంధీ
సాక్షి, జహీరాబాద్: నేటితో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెర పడనుంది. ఈ క్రమంలో చివరి రోజు పార్టీల నేతలు ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఇక, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ.. జహీరాబాద్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్పై విరుచుకుపడ్డారు. ఈ సందర్బంగా ప్రియాంక మాట్లాడుతూ.. పదేళ్లలో బీఆర్ఎస్ ఏంచేసింది. ప్రశ్నాపత్నాలు లీక్ అయ్యాయి. ధరణితో రైతుల కష్టాలు పెరిగాయి. రుణమాఫీ పూర్తి కాలేదు. ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ నెరవేర్చలేదు. అధిక ధరలు సామాన్యుడికి భారంగా మారాయి. బైబై కేసీఆర్.. మార్పు రావాలి. తెలంగాణలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి. ప్రాజెక్ట్‌ల నిర్మాణంలో బీఆర్ఎస్ అవినీతి చేసింది. బీఆర్ఎస్ అత్యంత ధనిక పార్టీ. ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. కర్ణాటకలో మహిళల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నాం.. ఇక్కడ కూడా అమలు చేస్తాం’ అని అన్నారు. -
కాంగ్రెస్ వస్తే ప్రజా ప్రభుత్వం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/ సాక్షి, యాదాద్రి: ‘తెలంగాణ వస్తే తమ ఆకాంక్షలు నెరవేరుతాయని ప్రజలు ఆకాంక్షించారు. కొట్లాడి, చెమట, రక్తం చుక్కలు చిందించి రాష్ట్రాన్ని సాధించుకున్నారు. వేలాది మంది ప్రాణ త్యాగాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అలాంటి రాష్ట్రంలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రజలకు ఏం చేసింది? కేసీఆర్ ప్రభుత్వంలో కలలు సాకారం కాలేదు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడూ ఈ ప్రభుత్వం సహకారం అందించడానికి ముందుకు రాలేదు. ఈ ఎన్నికల సమయంలో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో కేసీఆర్ ఫామ్‌హౌస్ నుంచి పాలన చేస్తున్నారు. కాంగ్రెస్ వస్తే ప్రజా ప్రభుత్వం వస్తుంది. ప్రజాభవన్ నుంచి పాలన చేస్తాం. కేంద్రంలోని నరేంద్రమోదీ దేశసంపదను అదానీ, అంబానీకి ధారాదత్తం చేస్తోంటే.. తెలంగాణలో ఉన్న కేసీఆర్ రాష్ట్ర సంపదను తన కుటుంబానికి దోచి పెడుతున్నారు..’ అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ ధ్వజమెత్తారు. సోమవారం ఉమ్మడి పాలమూరులోని గద్వాల, కోస్గిల్లో ప్రజాభేరి బహిరంగ సభల్లో, భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్వహించిన రోడ్‌షోలో ఆమె మాట్లాడారు. సోనియా ఎప్పుడూ ప్రజల పక్షాన ఉంటారు ‘నా తల్లి సోనియాగాంధీ ఎప్పుడూ ప్రజల పక్షాన ఉంటారు. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను నా తల్లి నెరవేర్చారు. ఈ దేశం కోసం నాయనమ్మ ఇందిరాగాంధీ, నాన్న రాజీవ్‌గాంధీ ప్రాణాలర్పించారు. ప్రాణ త్యాగాలు చేసిన కుటుంబాల పరిస్థితి నాకు తెలుసు. తెలంగాణలో ప్రాణత్యాగం చేసిన వారి ఉద్యమ స్ఫూర్తి వృధా పోకూడదు. తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ ప్రభుత్వం వచ్చింది. సీఎం కేసీఆర్ ప్రజలకు ఏమైనా చేస్తారని అనుకున్నాం. రెండుసార్లు అధికారంలోకి వచ్చినా చేసిందేమీ లేదు. ప్రజల సంక్షేమంపై ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు. తెలంగాణలో నిరుద్యోగం చాలా ఎక్కువగా ఉంది. ఏ ఒక్క ప్రాజెక్టూ సంపూర్ణంగా పూర్తి కాలేదు..’ అని ప్రియాంక విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎంలు ఒక్కటే ‘బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఎలాంటి వ్యత్యాసం లేదు. ఎంఐఎం పార్టీ కూడా బీజేపీ, బీఆర్ఎస్లకు మద్దతు ఇస్తుంది. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎంలు ఒక్కటే. పదేళ్లుగా బీజేపీ కేంద్రంలో, బీఆర్ఎస్ రాష్ట్రంలో అన్నదమ్ముల పాలన సాగిస్తూ ఒకరికొకరు తోడుగా ఉన్నారు. ఎంఐఎం పార్టీ వాటికి చిన్న తమ్ముడిలా ఎప్పుడూ సహాయం చేస్తూనే ఉంటుంది. రాహుల్‌గాంధీ మీద ఒవైసీ అనవసర ఆరోపణలు చేస్తుంటారు. రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి ఒక శక్తిగా ఎదిగారు. దేశ ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు రాహుల్‌ను ఎవరూ ఏమీ చేయలేరు. బీఆర్ఎస్తో పాటు బీజేపీ ప్రభుత్వం పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకే వత్తాసు పలుకుతోంది. ప్రధాని మోదీ ఈ దేశ ఆస్తులను పెద్ద కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేశారు. అదానీ ఒక్క రోజులో రూ.1,600 కోట్లు సంపాదిస్తుంటే.. రైతు కేవలం రూ.27 సంపాదిస్తున్నాడు..’ అని మండిపడ్డారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం ‘కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఐదు గ్యారంటీ పథకాలను అమలు చేశాం. ఇక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ధరణితో లాక్కున్న భూములను తిరిగి మీకు ఇప్పిస్తాం. ఇళ్లు కట్టుకునే వారికి స్థలంతో పాటు రూ.5 లక్షల సాయం చేస్తాం. రాజస్తాన్‌లో 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాం. ఛత్తీస్‌గఢ్‌లో నిరుద్యోగాన్ని తగ్గించాం. బీఆర్ఎస్ హయాంలో ఇక్కడ మాత్రం నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజస్తాన్‌లో మాదిరి 2 లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. అవినీతిని పారదోలతాం. తెలంగాణ అమరుల కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం ఇస్తాం. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతాం. ఆదివాసీలకు భూ పట్టాలిస్తాం..’ అని ప్రియాంక హామీ ఇచ్చారు. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ‘ప్రజల ఆలోచనల్లో మార్పు రావాలి. ఓటు వేసేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. తెలంగాణలో గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఏం చేసిందో మీకు తెలుసు. కాబట్టి రాబోయే ఐదు సంవత్సరాలు పాలించడానికి ఎవరిని ఎన్నుకోవాలి.. మీ జీవితాలు ఎలా బాగుచేసుకోవాలి అనే విషయాన్ని మీరే ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలా? మోసం చేసే బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలా? ఆలోచించుకోండి..’ అని ప్రియాంక అన్నారు. ‘మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే భూ మాఫియా, లిక్కర్ మాఫియా వస్తుంది. మీకు ఉద్యోగాలు రావు. ప్రశ్నపత్రాలు లీక్ ఆవుతాయి. అవినీతి ఆకాశన్నంటుతుంది. అప్పు పదింతలవుతుంది..’ అని హెచ్చరించారు. టీపీసీసీ చీఫ్, కొడంగల్ అభ్యర్థి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ..‘మీరు నన్ను ఆశీర్వదించండి, మీరు అండగా ఉన్నంత వరకు ఇటు రాష్ట్రంలో కేసీఆర్, అటు దేశంలో మోదీ మెడలు వంచే బాధ్యత మీ బిడ్డగా నేను తీసుకుంటా..’ అని అన్నారు. ఈ సభల్లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, అభ్యర్థులు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి (భువనగిరి), సరిత (గద్వాల) తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ కు అవకాశం ఇస్తే 6 గ్యారంటీలు అమలు చేస్తాం: ప్రియాంక
-
ప్రియాంక గాంధీపైనా చర్యలు తీసుకోండి..
Rajasthan Elections 2023: రాజస్థాన్‌లో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రాపై చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ శనివారం కేంద్ర ఎన్నికల కమిషన్‌కి లేఖ రాసింది. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల రోజున ప్రియాంక గాంధీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (ట్విటర్) లో చేసిన పోస్ట్‌తో ఎన్నికల మార్గదర్శకాలను ఉల్లంఘించారని పార్టీ ఆరోపించింది. దీనికి ముందు కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీపైన కూడా బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ప్రజాప్రాతినిధ్య చట్టం, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఆరోపిస్తూ చర్యలు తీసుకోవాలని కోరింది. కాగా ప్రియాంక గాంధీపై ఈసీకి చేసిన ఫిర్యాదులో ఆమె తన ‘ఎక్స్’ ఖాతాలో చేసిన పోస్టు రాజస్థాన్ పోలింగ్ రోజున ఓటర్లను ఉచితాలతో ప్రలోభపెట్టే ఉద్దేశపూర్వక చర్య అని బీజేపీ పేర్కొంది. ప్రియాంక గాంధీ పదవిని తొలగించి, ఆమె ఖాతాను సస్పెండ్ చేసేలా ఆదేశించాలని, క్రిమినల్ కేసు నమోదు చేయాల్సిందిగా రాజస్థాన్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్‌కు సూచించాలని విజ్ఞప్తి చేసింది. -
‘వందమంది కేసీఆర్‌లు వచ్చినా మధిర గేటును కూడా తాకలేరు’
మధిర: వందమంది కేసీఆర్‌లు వచ్చినా మధిర గేటును కూడా తాకలేరు అని కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. శనివారం మధిరలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ఇటీవల సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనపై చేసిన వ్యాఖ్యలకు భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. ఈ సభకు ప్రియాంక గాంధీ కూడా హాజరయ్యారు. పోరాటాల గడ్డ మధిర ‘మధిర పోరాటాల గడ్డ. కేసీఆర్ మొన్న ఇక్కడ సభ పెట్టి ఇక్కడ భట్టి విక్రమార్క గెలవడని చెప్పారు. ఒక్క కేసీఆర్ కాదు వందమంది కేసీఆర్‌లు వచ్చినా మధిర గేటును కూడా తాకలేరు. మధిరలో 50 వేల మెజార్టీతో గెలుస్తా. కేసీఆర్, కేటీఆర్ ఉడత ఊపులకు మధిర ప్రజలు భయపడరు’ అని దీటుగా బదులిచ్చారు భట్టి విక్రమార్క. అలాగే ఆయన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏమేమి చేస్తుందో వివరించారు. నిరుద్యోగులకు ఉద్యోగం రావాలంటే కాంగ్రెస్‌కే ఓటాయాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ అధికారం వస్తే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. ఆనందంగా ఉంది: ప్రియాంక ఇవాళ సంతోషంగా ఉందని, భట్టి నియోజకవర్గానికి వచ్చినందుకు ఆనందంగా ఉందని ప్రియాంక గాంధీ మధిర ప్రచార సభలో పేర్కొన్నారు. పాదయాత్ర చేసినందుకు భట్టి విక్రమార్కను అభినందిస్తున్నానన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఆమె ఎండగట్టారు. బీజేపీపైనా విమర్శలు చేశారు. ‘రాత్రి సోనియా గాంధీతో మాట్లాడాను. హైదరాబాద్‌లో ఉన్నాను, భట్టి నియోజకవర్గానికి వెళ్తున్నానని చెప్పాను. తెలంగాణ వెళ్తున్నావు.. ప్రజలకు ఏం సందేశం ఇస్తావని సోనియా అడిగారు. సత్యమ మాత్రమే చెబుతానన్నాను. మంచి ప్రభుత్వం కోసం తెలంగాణ ప్రజలు ఆశపడ్డారని, తెలంగాణ కలల సాకారం కోసం బలమైన ప్రభుత్వం రాబోతోందని సోనియా చెప్పారు’ అని ప్రియాంక పేర్కొన్నారు. -
ప్రియాంకకు చరిత్ర తెలియకపోవడం దురుదృష్టకరం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు కాంగ్రెస్ పార్టీ చాలా అన్యాయం చేసిందని, ఈ చరిత్ర గురించి కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీకి ఏ మాత్రం అవగాహన లేకపోవడం నిజంగా దురదృష్టకరమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పీవీ మనందరం అభిమానించే గొప్ప వ్యక్తి అని, మట్టిలో పుట్టిన మాణక్యమని తెలిపారు. తన జీవితమంతాకాంగ్రెస్ పార్టీ కోసం సేవ చేసిన వ్యక్తని పేర్కొన్నారు. అలాంటి నిరాడంబరమైన వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ దారుణంగా అవమానించిందని మంత్రి చెప్పారు. ప్రధానమంత్రి ఉన్న పీవీ నర్సింహరావుకు 1996లో పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఎంపీ టికెట్ నిరాకరించి ఘోరంగా అవమానించారని కేటీఆర్ ప్రస్తావించారు., ఆయన చనిపోయిన తర్వాత కూడా కనీసం 24 అక్బర్ రోడ్డులోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలోకి కూడా ఆయన భౌతిక కాయాన్ని అనుమతించలేదని గుర్తు చేశారు.చరిత్ర గురించి ప్రియాంకాగాంధీకి అవగాహన లేకపోవడం దారుణమని అన్నారు. పీవీ కుటుంబానికి రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చదవండి: మోదీకి కేసీఆర్, ఓవైసీ స్నేహితులు: రాహుల్ గాంధీ #WATCH | Hyderabad: On Former PM PV Narasimha Rao, Telangana Minister and BRS MLA KT Rama Rao says, "It's truly unfortunate that Priyanka Gandhi does not seem to have any information on the history of the injustice meted out to late PM PV Narasimha Rao. He is someone we all look… pic.twitter.com/mjMOSdew3j— ANI (@ANI) November 25, 2023 #WATCH | Telangana Minister and BRS MLA KT Rama Rao says, "Rahul Gandhi is jobless today because he lost his job in 2014. He and his party both lost their job in 2014. That's why today he remembered unemployment... I want to ask if Rahul Gandhi has ever written a single entrance… pic.twitter.com/7PkNPpajrx— ANI (@ANI) November 25, 2023 -
ప్రియాంక పలకరింపు.. ఉబ్బితబ్బిబ్బయిన కుటుంబం
సాక్షి, మహబూబాబాద్/సాక్షి, సిద్దిపేట/హుస్నాబాద్‌రూరల్: ‘మందుల షాపులో ప్రతీ మందుపై ఎక్స్ పైరీ తేదీ ఉన్నట్లే.. బీఆర్ఎస్కూ కాలం చెల్లింది. ఓటమికి దగ్గరగా ఉన్న ఆ పార్టీ అంతిమ గడియలు లెక్కపెట్టుకుంటోంది’ అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ అన్నారు. త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణను కేసీఆర్ ఆగం చేశారన్నారు. ‘మా నాయనమ్మ ఇందిరాగాంధీ ఎప్పుడూ చెబుతూ ఉండేది. ప్రజాస్వామ్యంలో ఓటే కీలకం. ప్రజలు చైతన్య వంతులు’ అని గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు ప్రజల్లో చైతన్యం వచి్చందని, రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీస్తోందని చెప్పారు. ఈ చైతన్యంతో ఫాం హౌజ్‌లో ఉండి పాలించే నాయకులు కావాలో.. ప్రజల మధ్య ఉండి పాలించే కాంగ్రెస్ కావాలో తేల్చుకునే సమయం ఆసన్నమైందన్నారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పరిధిలోని తొర్రూరులో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభల్లో ప్రియాంక ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఈ ప్రాంతం ప్రజలు చేసిన పోరాటాలకు ప్రపంచ వ్యాప్తంగా కీర్తి ఉందని చెప్పారు. I wanted to see Indiramma but cannot see, Now I have seen her Granddaughter Priyanka Gandhi Ji. A woman who met Priyanka Gandhi Ji expresses her love towards Gandhi Family.@INCIndia @INCTelangana @SpiritOfCongres pic.twitter.com/fvION4sSJY — Abdur Rahman Ansari (@AnsariiTweets) November 24, 2023 యువత జీవితాలు చీకటి మయం ‘రాష్ట్రం సాధిస్తే ఉద్యోగాలు వస్తాయని యువత ఆశలు పెంచుకుంది. రాష్ట్ర సాధన తర్వాత కేసీఆర్ యువత జీవితాలను చీకటి మయం చేశారు. కష్టపడి చదివినా ఉద్యోగాలు రాని పరిస్థితి నెలకొంది. పేపర్ లీకేజీలతో చదువుకున్న వారి భవిష్యత్ అంధకారంలోకి వెళ్లింది. ఉద్యోగం రాలేదని విద్యారి్థని ఆత్మహత్య చేసుకుంటే. ఆ కుటుంబాన్ని ఓదార్చా ల్సిన ప్రభుత్వం, నాయకులు అసలు ఆమె పరీక్షే రాయలేదని వ్యంగ్యంగా మాట్లాడిన తీరు ప్రభుత్వానికి యువతపై ఉన్న శ్రద్ధకు నిదర్శనం’ అని ప్రియాంక అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాజస్తాన్‌లో మాదిరిగా ఉద్యోగాల భర్తీ క్యాలెండర్‌ను ముందుగానే విడుదల చేస్తామన్నారు. అదేవిధంగా ప్రాథమిక స్థాయి నుంచి మంచి విద్యను అందించేందుకు ప్రతీ మండలంలో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్కూల్‌ను నెలకొల్పుతామన్నారు. మహిళగా వారు పడే బాధలు తెలుసు ‘ఒక మహిళగా తెలంగాణలో మహిళలు పడే ఇబ్బందులు నాకు తెలుసు. పిల్లలు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు, ఉప్పులు పప్పుల రేట్లు పెరిగినప్పుడు, గ్యాస్, కరెంట్ బిల్లులు భారమైనప్పుడు మహిళలే ఎక్కువ ఇబ్బంది పడతారు. ఇటువంటి ఖర్చులను అధిగమించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తాం. గ్యాస్ సిలిండర్‌ను రూ.500కే ఇస్తాం. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం మొదలైన పథకాలు అమలు చేస్తాం’ అని చెప్పారు. రైతుల సంక్షేమం కోసం పాటు పడే పార్టీ కాంగ్రెస్ ఒక్కటే అని అన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం రైతుల భూములను గుంజుకుంటోందని మండిపడ్డారు. సాగునీటి కోసం రూ.లక్ష కోట్లు వెచి్చంచి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ప్రభుత్వానికి ఏటీఎంగా మారిందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే.. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ రెండు పారీ్టలూ ఒక్కటే.. వారికి మద్దతుగా ఎంఐఎం ఉందని ప్రియాంక గాంధీ అన్నారు. డబ్బులు పెరిగితే మనిíÙలో అహం పెరుగుతుందని, ఇప్పుడు ఈ రెండు ప్రభుత్వాలకు అహం పెరిగి ప్రజల సమస్యలు పట్టడం లేదని చెప్పారు. పార్లమెంట్లో పెట్టిన బిల్లులకు బీఆర్ఎస్ మద్దతు తెలపడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఈ రెండు పార్టీలకు అంటకాగుతున్న ఎంఐఎం నాయకులు 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి దేశ ప్రజల స్థితిగతులు తెలుసుకున్న రాహుల్‌ను విమర్శించడం శోచనీయమని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య జరుగుతున్నాయని ప్రియాంక చెప్పారు. ఢిల్లీలో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు ఇస్తే, తెలంగాణ బీఆర్ఎస్కు బీజేపీ మద్దతు ఇస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఎంఐఎం 60కి పైగా స్థానాల్లో పోటీ చేస్తుంటే.. తెలంగాణలో 9 స్థానాల్లోనే ఎందుకు పోటీ చేస్తోందన్నారు. నాన్న (రాజీవ్ గాంధీ) చనిపోయిన తర్వాత తమ కుటుంబానికి పీవీ నరసింహారావు అండగా నిలిచారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ అభ్యర్థులు యశస్వినిరెడ్డి (పాలకుర్తి), పొన్నం ప్రభాకర్ (హుస్నాబాద్), పార్టీ రాష్ట ఇంచార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, కర్ణాటక మంత్రులు దినేష్ గుండూరావు, తీన్మార్ మల్లన్న, తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రజలను నమ్ముకుంది: పొంగులేటి బీఆర్ఎస్ అభ్యర్థి దయాకర్‌రావు డబ్బులను నమ్ముకున్నారని, కాంగ్రెస్ అభ్యర్థి ప్రజలను నమ్ముకున్నారని కాంగ్రెస్ ప్రచార కమిటీ కార్యదర్శి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. గతంలో ఇచి్చన హామీలను నెరవేర్చిన కాంగ్రెస్‌తోనే ఇందిరమ్మ రాజ్యం వస్తుందని ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. ఖమ్మంలో కాంగ్రెస్ 9, మిత్రపక్షం సీపీఐ కొత్తగూడెం గెలుస్తుందని చెప్పారు. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ.. విద్యార్థులు, సబ్బండ వర్గాలు ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ ఆకాంక్ష కోసం పోరాడితేనే ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిందన్నారు. కానీ దాని ఫలాలు మాత్రం కేసీఆర్ మాత్రమే అనుభవిస్తున్నారని, మన త్యాగాల ఫలం మనమే అనుభవించాలంటే కేసీఆర్‌ను ఓడించాలని పిలుపునిచ్చారు. Priyanka Gandhi Surprise visit to a Farmer Family house in Telangana 👉 Today afternoon, Congress leader Priyanka Gandhi suddenly got an opportunity to speak to Ramadevi in the language of love in Telangana, not Telugu / Hindi#PriyankaGandhi #ByeByeKCR #TelanganaElection2023 pic.twitter.com/tYZHUeBaUI — Team Congress (@TeamCongressINC) November 24, 2023 ఉబ్బితబ్బిబ్బయిన కుటుంబం ప్రియాంక ఉన్న ఫళంగా ఓ గీతకార్మికుడి ఇంటికి వెళ్లారు. కుటుంబసభ్యులు ఆమెను చూసి ఒక్కసారిగా ఉబ్బితబ్బిబ్బయ్యారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో సభను ముగించుకొని కొత్తగూడెం వెళ్తున్న క్రమంలో కిషన్‌నగర్‌లో నిర్మాణం అసంపూర్తిగా ఉన్న ఇంటికి మామిడి తోరణాలు, బంతిపూల దండలు కనిపించడంతో ప్రియాంక కారు ఆపి వారి ఇంట్లోకి వెళ్లారు. కుటుంబ యజమాని గీత కార్మికుడు జాగిరి రాజయ్య, రమ దంపతులతో కాసేపు ముచ్చటించారు. ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేస్తుండటంతో పూజ గురించి ఆరా తీశారు. ఇంటి నిర్మాణం ఎందుకు ఆపారని, దుకాణం ఎందుకు పెట్టుకోలేదని అడిగారు. దీంతో ఇంటి యాజమాని ఆర్థిక ఇబ్బందులే కారణమన్నారు. ఇంటి యజమానురాలిని ఆప్యాయంగా పలకరించి ఫోన్ నంబర్ తీసుకున్నారు. -
బడా నేతల ఆగమనం!
సాక్షి, నాగర్‌కర్నూల్: 'ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా ప్రధాన పార్టీల ముఖ్యనేతలతో అభ్యర్థుల ప్రచారం హోరెత్తింది. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బహిరంగసభలను నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని వేడెక్కించారు. శనివారం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కొల్లాపూర్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో బీజేపీ అభ్యర్థి ఎల్లేని సుధాకర్‌రావుకు మద్దతుగా నిర్వ హించనున్న బహిరంగసభలో పాల్గొననున్నారు. ఈనెల 27న నారాయణపేట జిల్లా కోస్గిలో నిర్వహించనున్న కాంగ్రెస్ బహిరంగసభలో ఆ పార్టీ అగ్రనేత ప్రియాంకగాంధీ హాజరుకానున్నారు. ఎన్నికల ప్రచారానికి మరో నాలుగు రోజులు మాత్రమే గడువు మిగిలి ఉన్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ఆయాపార్టీల అగ్రనేతల పర్యటనలతో ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకోనుంది.' ► కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఉమ్మడి జిల్లాలోని కొల్లాపూర్, కల్వకుర్తి, జడ్చర్ల, షాద్‌నగర్ నియోజకవర్గ కేంద్రాల్లో పర్యటించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇప్పటికే అలంపూర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కొడంగల్ బహిరంగసభల్లో పాల్గొన్నారు. అలాగే కర్ణాటక రాష్ట్ర మంత్రులు, ఏఐసీసీ కార్యదర్శులు, పార్టీ పరిశీలకులతో ప్రచా రం ఊపందుకుంది. ఈ నెల 27న కోస్గి పట్టణ శివారులో నిర్వహించే సభలో ప్రియాంకగాంధీ పాల్గొననున్నారు. ఆదివారం మక్తల్‌లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రచారం చేయనున్నారు. బీజేపీ జనాకర్షణ మంత్రం.. ఉమ్మడి జిల్లాలో బాగా కలిసొచ్చే నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున బహిరంగసభ ల నిర్వహణకు బీజేపీ సిద్ధ మైంది. ఇందుకోసం కేంద్రమంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను రంగంలోకి దింపుతోంది. గత నెలలోనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ మహబూబ్‌నగర్ లో నిర్వహించిన బహిరంగసభలో పాల్గొ ని ఆ పార్టీలో ఉత్సాహాన్ని నింపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నారాయణపేటలో పర్యటించగా, కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ ఇటీవల కొల్లాపూర్‌లో ప్రచారం చేపట్టారు. ఇటీవల గద్వాలలో పర్యటించిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మరోసారి రానున్నారు. శనివా రం కొల్లాపూర్‌లో, ఆదివారం మక్తల్ నియోజకవర్గాల్లో ఆయన పర్యటించనున్నారు. ఈ నెల 26న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మహబూబ్‌నగర్‌తో పాటు కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమనగల్లులో నిర్వహించే బహిరంగసభలో పాల్గొననున్నారు. పాలమూరునుచుట్టేసిన సీఎం కేసీఆర్.. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి ఉమ్మడి పాలమూరు జిల్లాపై సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టిసారించారు. షాద్‌నగర్ మినహా అన్ని నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహించి పాలమూరును చూట్టేశారు. ఈ నెల 27న షాద్‌నగర్‌లో సభ జరగనుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మక్తల్‌లో రోడ్‌షో నిర్వహించగా.. పలువురు మంత్రలు అడపాదడపా జిల్లాలో పర్యటిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి అభ్యర్థులకు ఈనెల 28 వరకే గడువు ఉంది. సమయం దగ్గరపడుతుండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. మిగిలిన కాస్త సమయంలోనే ఎక్కువ మంది ఓటర్లను ప్రసన్నం చేసుకునేలా అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఉదయం 7 గంటల నుంచే ఇంటి నుంచి బయలుదేరుతున్న అభ్యర్థులు రాత్రి 10 గంటల వరకు నిరాటంకంగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఆ తర్వాత ముఖ్యమైన నేతలు, కార్యకర్తలతో తదుపరి కార్యాచరణపై మంతనాలు సాగిస్తున్నారు. మిగిలిన నాలుగు రోజుల్లోనూ ప్రధాన పార్టీల సభలు, సమావేశాలతో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. ఇవి చదవండి: త్రిముఖ పోరు! ఆర్మూర్‌లో అనూహ్యంగా దూసుకొచ్చిన బీజేపీ.. -
ప్రాణత్యాగం చేసిన అమరుల ఆకాంక్షలు నెరవేరాయా?: ప్రియాంక ఫైర్
సాక్షి, పాలకుర్తి: తెలంగాణలో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. ఇప్పటికే పలువురు ఢిల్లీ నేతలు తెలంగాణకు వచ్చి ప్రచారంలో పాల్గొంటున్నారు. తాజాగా కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ మరోసారి తెలంగాకు వచ్చారు. ప్రచారంలో పాల్గొని ప్రియాంక కీలక వ్యాఖ్యలు చేశారు. జనగామ జిల్లాలోని పాలకుర్తిలో కాంగ్రెస్ బహిరంగ సభలో ప్రియాంక మాట్లాడుతూ.. ‘యువశక్తి, నారీశక్తిని చూస్తే.. గర్వంగా అనిపిస్తోంది. పాలకుర్తిలో ఒక కుటుంబం ప్రజలకు ఎంతో సేవ చేస్తే.. మరో కుటుంబం ప్రజల భూములు లాక్కుందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ప్రజల త్యాగాల వల్ల ఏర్పడింది. త్యాగాల మీద ఏర్పాటైన రాష్ట్రం అభివృద్ధి చెందాలని భావించాం. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో అందరి ఆకాంక్షలు నెరవేరాలి. ప్రాణత్యాగం చేసిన అమరుల ఆకాంక్షలు నెరవేరాయో.. లేదో.. ప్రజలు ఆలోచించాలి. యువత సాధించుకున్న ఈ తెలంగాణలో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి? ఈ పదేళ్లలో ప్రభుత్వం ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చింది? నిరుద్యోగంలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్‌గా ఉంది. ఈ ప్రభుత్వం నిర్వహించిన ఉద్యోగ పరీక్షల్లో ఎంతో అవినీతి జరిగింది. ఉద్యోగ పరీక్షల పేపర్లు లీక్ కావడంతో యువత నిరాశకు గురయ్యారు. కొందరు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక యువతి ఆత్మహత్య చేసుకుంటే ఆమె చావు గురించి ఈ ప్రభుత్వం వ్యంగ్యంగా మాట్లాడింది. ఆ యువతి పరీక్షకు దరఖాస్తు చేసుకోలేదని మాట్లాడారు. కాంగ్రెస్ గెలిస్తే.. నిరుద్యోగుల కష్టాలు తొలగిపోతాయి. అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ అమలు చేస్తాం. పేపర్ లీకేజీలను అరికడతాం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళల కష్టాలు తొలగిపోతాయి. ప్రతి మహిళ ఖాతాలో నెలకు రూ.2,500 వేస్తాం. రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తాం. కేంద్రం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరల వల్ల అన్ని వస్తువుల ధరలు పెరిగాయి. జీఎస్టీ వల్ల నిత్యావసరాల ధరలు పెరిగాయి. వస్తువుల ధరలు తగ్గాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి. మార్పు రావాలి.. కాంగ్రెస్ రావాలి. కేసీఆర్ సర్కార్‌కు కాలం చెల్లిపోయింది’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. అలాగే, హుస్నాబాద్ సభలో ప్రియాంక మాట్లాడుతూ..‘ప్రజలు కోసం బీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పగలరా?. ముఖ్యమంత్రి కేసీఆర్ మీకు ఉద్యోం ఇచ్చారా? ఆయన కుటుంబ సభ్యులకు మంత్రి పదవి ఇచ్చుకున్నారు. కానీ, మీ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఎంతో కష్టపడి మీ పిల్లలను చదివించుకుంటున్నారు. వారి కష్టం వృథా అయిపోతోంది. ఇలాంటి ప్రభుత్వం మరో ఐదేళ్లు కావాలా?. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్ట్‌లు అవినీతితో కురుకుపోయాయి’ ప్రధాని మోదీ దేశ సంపదను అదానీకి దోచిపెడుతున్నాడు. అదానీ ఒక్క రోజ సంపద రూ.1600కోట్లు. ఈ ఎన్నికలు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటీనే. ఎంఐఎం పార్టీ ఇతర రాష్ట్రాల్లో 40-50 స్థానాల్లో పోటీచేస్తే తెలంగాణలో మాత్రం ఏడు స్థానాల్లోనే పోటీ చేస్తోంది. ఒవైసీ ఎప్పుడూ రాహుల్ గాంధీనే తిడుతుంటారు. ఇప్పటికైనా బీఆర్ఎస్, ఎంఐఎం మధ్య ఉన్న దోస్తీని గుర్తించాలి. అని అన్నారు. -
నేడు, రేపు తెలంగాణలో ప్రియాంక గాంధీ పర్యటన
-
తొలిసారి ఉమ్మడి జిల్లాకు రానున్న ప్రియాంకగాంధీ..
సాక్షిప్రతినిధి, ఖమ్మం: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రియాంకగాంధీ శుక్ర, శనివారాల్లో రెండు రోజుల పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. అసెంబ్లీఎన్నికల బరిలో నిలిచిన పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఆమె ప్రచారం చేస్తారు. తొలిసారి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ప్రియాంకాగాంధీ రానుండడంతో రోడ్‌షోలను విజయవంతం చేసేందుకు గాను నాయకులు భారీ జనసమీకరణలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే రాహుల్‌గాంధీ పినపాక నియోజకవర్గానికి సంబంధించి మణుగూరులో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌కు హాజరయ్యారు. ప్రస్తుతం ప్రియాంకాగాంధీ వస్తుండటంతో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు విజయాన్ని కాంక్షిస్తూ శుక్రవారం ఆమె ప్రచా రం చేయనుండగా, శనివారం ఖమ్మం జిల్లాలోని పాలేరు, ఖమ్మం, సత్తుపల్లి, మధిర నియోజకవర్గాల్లో ప్రచారానికి హాజరవుతారు. రెండు రోజులు ఉమ్మడి జిల్లాలోనే.. కొత్తగూడెంలో శుక్రవారం సాయంత్రం 3.25గంటల నుంచి 4.20 గంటల వరకు జరిగే సభలో ప్రియాంక పాల్గొంటారు. ఆ తర్వాత హెలీకాప్టర్‌లో ఖమ్మం చేరుకుని ఇక్కడే బస చేస్తారు. శనివారం ఉదయం 11.30 గంటలకు జెడ్పీ సెంటర్ నుంచి వైరా రోడ్, మయూరిసెంటర్, కాల్వొడ్డు, పెదతండా మీదుగా నాయుడుపేట వరకు జరిగే రోడ్డు షోలో పాల్గొంటారు. దీంతో ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల అభ్యర్థులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఆమె ప్రచారం చేసినట్లవుతుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 1.05 గంటలకు హెలీకాప్టర్‌లో బయలుదేరి సత్తుపల్లి నియోజకవర్గంలోని కల్లూరుకు చేరుకుంటారు. అక్కడ 1.30నుంచి 2.30 గంటల వరకు జరిగే కార్నర్ మీటింగ్‌లో పార్టీ అభ్యర్థి మట్టా రాగమయితో కలిసి ప్రసంగిస్తారు. అనంతరం సాయంత్రం 3నుంచి 4గంటల వరకు మధిరలో భట్టి విజయాన్ని కాంక్షిస్తూ ఏర్పాటుచేసే సభలో ప్రియాంకాగాంధీ ప్రసంగిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇవి కూడా చదవండి: బీసీలకు రాజ్యాధికారం బీజేపీతోనే సాధ్యం..! పవన్ కల్యాణ్ -
బరిలోకి బడా నేతలు
సాక్షి, హైదరాబాద్: ప్రచార పర్వం మరో వారం రోజులే మిగిలిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బడా నేతలను రంగంలోకి దింపుతోంది. ఎన్నికల్లో చాలా కీలకమైన ఈ వారం రోజుల పాటు బలమైన నాయకత్వాన్ని ప్రజల్లోకి పంపడం ద్వారా ప్రచార రేసులో ఇతర పార్టీల కంటే ఎక్కడా వెనకబడ్డామనే భావన కలగకుండా ఉండేలా పకడ్బందీ ప్రణాళిక రూపొందిస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాందీ, అగ్రనేత రాహుల్ గాందీలతో పాటు వీలును బట్టి సోనియాగాందీని కూడా చివరి వారంలో బరిలోకి దింపనుంది. ప్రతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ప్రతిరోజూ ఏఐసీసీకి చెందిన ఓ ముఖ్య నేత ప్రచారం ఉండేలా సునీల్ కనుగోలు టీం షెడ్యూల్ రూపొందిస్తోంది. హైదరాబాద్‌కు ఏఐసీసీ అధ్యక్షుడు: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బుధవారం తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇందుకోసం మంగళవారం సాయంత్రమే ఆయన హైదరాబాద్‌కు చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, రాష్ట్ర పార్టీ ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, నేతలు హర్కర వేణుగోపాల్, ఫహీమ్ తదితరులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి హోటల్ తాజ్‌కృష్ణకు వెళ్లిన ఖర్గే అక్కడ రాష్ట్ర పార్టీ నేతలతో సమావేశమయ్యారు. బుధవారం ఆయన ఆలంపూర్, నల్లగొండల్లో జరిగే ఎన్నికల ప్రచార సభలకు హాజరవుతారని గాం«దీభవన్ వర్గాలు వెల్లడించాయి. ఇక రాహుల్‌గాంధీ ఈనెల 24న తెలంగాణకు వస్తున్నారు. ఆయన 28వ తేదీ వరకు ఇక్కడే ఉంటారని గాందీభవన్ వర్గాలు చెపుతున్నాయి. అయితే ఆయన ఎన్ని రోజులు ఇక్కడ ఉండాలి, ఏయే నియోజకవర్గాల్లో పర్యటించాలన్న దానిపై సునీల్ కనుగోలు టీం కసరత్తు చేస్తోంది. 10 నియోజకవర్గాల్లో ప్రియాంక ప్రచారం మరోవైపు ప్రియాంకాగాంధీ కూడా ఈనెల 24వ తేదీనే తెలంగాణకు వస్తున్నారు. పాలకుర్తిలో జరిగే బహిరంగ సభకు హాజరు కానున్న ప్రియాంక 25, 27 తేదీల్లో ప్రచారం నిర్వహిస్తారు. ఆమె ఈ దఫాలో మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. ఇలావుండగా సోనియాగాందీని కూడా చివరి వారంలో ఎన్నికల ప్రచారానికి తీసుకురావాలని టీపీసీసీ యోచిస్తోంది. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఏఐసీసీ వెనుకా ముందాడుతోందని, ఒకవేళ సోనియా పర్యటన ఖరారైతే 27, 28 తేదీల్లో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఆమె సభ ఉంటుందని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. పరిస్థితేంటి?: కేసీవీ ఆరా ఎన్నికల ప్రచార సరళి, పార్టీ అభ్యర్థుల పనితీరుపై ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆరా తీశారు. మంగళవారం హైదరాబాద్‌కు వచ్చిన ఆయన పార్టీ పరిశీలకులు, పార్లమెంటు ఇన్చార్జులు, అసెంబ్లీ కో ఆర్డినేటర్లు, పీసీసీ ముఖ్య నేతలతో జూమ్ ద్వారా సమావేశమయ్యారు. బీఆర్ఎస్, బీజేపీల కంటే ప్రచారంలో ఎట్టి పరిస్థితుల్లో వెనుకబడకూడదని, ఈ మేరకు అభ్యర్థులతో సమన్వయం చేసుకోవాలని పరిశీలకులు, సమన్వయకర్తలకు ఆయన సూచించారు. పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు, మేనిఫెస్టోలోని కీలకాంశాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. -
విజయానికి ఏడు హామీలు
రాజస్థాన్‌లో గత 30 ఏళ్లలో అధికార పార్టీ నెగ్గిన దాఖలా లేదు. ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రభుత్వం మారుతూ వస్తోంది. ఈసారి మాత్రం వరుసగా రెండో విజయంతో చరిత్రను తిరగరాసేందుకు సీఎం అశోక్ గహ్లోత్ సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఈ విషయంలో ‘ఏడు హామీ’లపై బాగా ఆశలు పెట్టుకున్నారు. ఆ పథకాలు తనను కచ్చితంగా గట్టెక్కిస్తాయని నమ్ముతున్నారు...! రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పర్వం క్లైమాక్స్‌కు చేరుతోంది. అధికార కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీగా తలపడుతున్నాయి. పోలింగ్‌కు మరో మూడు రోజులే ఉంది. గురువారం సాయంత్రంతో ప్రచారానికి కూడా తెర పడనుంది. ఈ నేపథ్యంలో ప్రచారాన్ని సీఎం గహ్లోత్ టాప్ గేర్‌లోకి తీసుకెళ్లారు. కాంగ్రెస్ తరఫున అంతా తానై వ్యవహరిస్తున్నారు. రాష్ట్రమంతటా సుడిగాలి పర్యటనలతో హోరెత్తిస్తున్నారు. ఈ రెండు రోజుల్లో వీలైనన్ని అసెంబ్లీ స్థానాలను కవర్ చేయనున్నారు. ముఖ్యంగా మహిళలకు రూ.10 వేల భృతి మొదలుకుని రూ.25 లక్షల వైద్య సాయం దాకా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న, అందించబోయే పథకాలను ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ప్రతి ప్రచార సభలోనూ అవి ప్రధానంగా ప్రస్తావనకు వచ్చేలా జాగ్రత్త పడుతున్నారు. జీవన్మరణ సమస్య! 72 ఏళ్ల గహ్లోత్‌కు ఒకరకంగా ఈ అసెంబ్లీ ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారాయి. గత అసెంబ్లీ ఎన్నికల విజయంలో కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్ యువ నేత సచిన్ పైలట్‌ను ఈసారి ఆయన పూర్తిగా పక్కన పెట్టారు. కనుక ఫలితాలు ఏ మాత్రం వికటించినా గహ్లోత్ రాజకీయ జీవితానికి తెర పడవచ్చన్న అభిప్రాయముంది. అందుకే కొద్ది రోజులుగా ఆయన దూకుడు పెంచారు. రోజుకు కనీసం నాలుగైదు సభల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఒక్క రోజు ఏకంగా 800 కిలోమీటర్లు పర్యటిస్తున్నారు! తన ఓబీసీ సామాజిక వర్గ మూలాలను కూడా సమయానుకూలంగా ప్రస్తావిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రతి ప్రచార సభలోనూ ప్రధాని మోదీపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఆయన ప్రసంగాల్లో కాంగ్రెస్ పథకాలనే యథాతథంగా కాపీ కొడుతున్నారంటూ ఎద్దేవా చేస్తున్నారు. తమ ఏడు హామీలకు పోటీగా బీజేపీ తెరపైకి తెచ్చిన ‘మోదీ హామీ’లను ఒక్కొక్కటిగా ప్రస్తావిస్తూ, అవన్నీ కాంగ్రెస్ హామీలకు నకళ్లేనని పదేపదే చెబుతున్నారు. ‘‘ఇది బీజేపీకి బాగా మైనస్‌గా మారుతోంది. ఈసారి కచ్చితంగా గెలుపు కాంగ్రెస్‌దే. ఓటర్లు ఈ మేరకు నిర్ణయించుకున్నారు కూడా’’ అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రోజూ క్రమం తప్పకుండా స్వీయ ప్రచార వీడియోలను కూడా విడుదల చేస్తూ, అవి వీలైనంత మందికి చేరేలా జ్రాగత్తలు తీసుకుంటున్నారు గహ్లోత్. అధిష్టానం అనుగ్రహం కోసం... రాష్ట్రస్థాయిలో గెలుపు కోసం శాయశక్తులా ప్రయత్నాలు చేస్తూనే, అధిష్టానంతో సంబంధాలను కూడా సరిదిద్దుకునే పనిలో పడ్డారు గహ్లోత్. గతేడాది కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో దిగాల్సిందిగా సోనియా ఆదేశించినా ఆయన బేఖాతరు చేయడం తెలిసిందే. దీనిపై గాంధీ కుటుంబం గుర్రుగా ఉన్న నేపథ్యంలో, వీలు దొరికినప్పుడల్లా సోనియా, రాహుల్, ప్రియాంకలను ఆయన ఆకాశానికెత్తుతూ వస్తున్నారు. రాష్ట్ర ప్రచార పర్వమంతా రాహుల్, ప్రియాంక కనుసన్నల్లోనే జరుగుతోందని పదేపదే చెప్పుకొస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఏడు హామీలు... 1. కుటుంబ పెద్ద అయిన మహిళకు ఏటా రూ.10,000 భృతి 2. ప్రభుత్వ కాలేజీలో చేరే ప్రతి విద్యార్థికి ల్యాప్‌టాప్ లేదా ట్యాబ్ 3. చిరంజీవి ఆరోగ్య బీమా పథకం ద్వారా రూ.25 లక్షల దాకా వైద్య సాయం. ఇందులో భాగంగా రూ.15 లక్షల ప్రమాద బీమా 4. అందరికీ ఉచితంగా ఇంగ్లిష్ మీడియం విద్య 5. రాష్ట్రంలో కోటి కుటుంబాలకు రూ.500కే వంట గ్యాస్ సిలిండర్ 6. పాత పెన్షన్ పథకానికి చట్టబద్ధత 7. రైతుల నుంచి రూ.2కు కిలో చొప్పున పేడ కొనుగోలు -
ప్రచార వేగం పెంచిన టీ కాంగ్రెస్
-
అధికారం కోసం కాంగ్రెస్ వంద అబద్ధాలు
సిద్దిపేటజోన్: పక్కనున్న కర్ణాటకలో ఐదు గ్యారంటీలను ప్రకటించిన రాహుల్, ప్రియాంకాగాంధీ పత్తా లేకుండాపోయారని, అక్కడ పరిస్థితి గందరగోళంగా మారిందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లాకేంద్రంలో జరిగిన పలు సంఘాల ఆత్మీయ సమ్మేళనంలో పలు పార్టీల ప్రతినిధులు, నాయకులు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. హరీశ్‌రావు మాట్లాడుతూ వంద అబద్ధాలు ఆడైనా సరే అధికారంలోకి రావా లని కాంగ్రెస్ తాపత్రయపడుతోందని అన్నారు. మనకు బూతు మాటలు మాట్లాడే నేతలు కాదని, భవిష్యత్తు అందించే నాయకులు కావాలన్నారు. బట్టేబాజ్ మాటలు చెప్పే కాంగ్రెస్ పార్టీ నిజస్వరూ పాన్ని ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో మోకాలిచిప్పకు ఉచితంగా ఆపరేషన్లు అని పెట్టారని, కానీ తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇప్పటికే ఉచితంగా మోకాలి చిప్ప ఆపరేషన్లు చేస్తోందని, కాంగ్రెస్ వాళ్లకు అది కూడా తెలవదని ఎద్దేవా చేశారు. భవిష్యత్తులో 112 నియోజక వర్గాల్లో అగ్రవర్ణ కులాల పిల్లలకు కూడా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు. తొమ్మిదేళ్లు వర్గీకరణ అంశంపై జాప్యం చేసి ఇప్పుడు ఎన్నికల ముందు కేంద్రం కమిటీ అని కొత్త నాటకానికి తెర తీసిందని హరీశ్ విమర్శించారు. టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కమిటీ నాయ కులు మంత్రి హరీశ్‌ను కలిసి బీఆర్ఎస్కు మద్దతు ప్రకటించారు. వర్గీకరణకు బీఆర్ఎస్ కట్టుబడి ఉందని, తెలంగాణ ఏర్పడిన తొలి నాళ్లలోనే అసెంబ్లీలో తీర్మానం చేసి బిల్లును కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పంపిందన్నారు. మనకు కావాల్సింది కమిటీ కాదనీ, బిల్లు రావాలని, వెంటనే పార్లమెంటులో బిల్లు పెట్టాలని స్పష్టం చేశారు.బీఆర్ఎస్లో చేరిన బాబుమోహన్ తనయుడు సంగారెడ్డి జిల్లా బీజేపీ అందోల్ నియోజకవర్గ అభ్యర్థి బాబుమోహన్ కుమారుడు ఉదయ్‌భాస్కర్ ఆదివారం సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. -
కేసీఆర్, కేటీఆర్‌ల ఉద్యోగాలు ఊడగొట్టాలి
నిర్మల్/సాక్షి, ఆసిఫాబాద్: ‘‘రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఉన్నారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. అదే కేసీఆర్ కుటుంబంలో మాత్రం అందరికీ ఉద్యోగాలు (పదవులు) ఉన్నాయి. యువతకు ఉద్యోగాలు రావాలంటే.. కేసీఆర్, కేటీఆర్‌ల ఉద్యోగాలు ఊడగొట్టాలి. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలి..’’అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ పిలుపునిచ్చారు. ప్రజలు ఇప్పటికే రెండుసార్లు బీఆర్ఎస్కు ఓటేసి పదేళ్లు దగాపడ్డారని, మళ్లీ బీఆర్ఎస్కు వేస్తే రాష్ట్ర భవిష్యత్తు నాశనం అవుతుందని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామని, రెండులక్షల ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చారు. ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలన్నారు. ఆదివారం నిర్మల్ జిల్లా ఖానాపూర్, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభల్లో ఆమె ప్రసంగించారు. ఖానాపూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి వెడ్మ బొజ్జు పటేల్‌ను, ఆసిఫాబాద్‌లో అజ్మీరా శ్యాంనాయక్‌ను గెలిపించాలని కోరారు. రెండు సభల్లో ప్రియాంకాగాంధీ ప్రసంగం ఆమె మాటల్లోనే.. ‘‘ఇందిరాగాంధీ ఆదివాసీలు, గిరిజనుల గురించి ఆలోచించేవారు. వారి అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. ప్రత్యేక రక్షణ చట్టాలు తీసుకొచ్చారు. అందుకే ఆమె మరణించి 40 ఏళ్లు గడిచినా గిరిజనులు ఆరాధిస్తున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు తెలిసే సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారు. కానీ కేసీఆర్ పదేళ్ల పాలనలో ప్రజలను దగా చేశారు. ప్రజల ఆకాంక్షలు ఒక్కటీ నెరవేర్చలేదు. యువతకు ఉపాధి కల్పించలేదు. కేసీఆర్ కుటుంబానికే ఉద్యోగాలు రాష్ట్రంలో 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వారికి ఉద్యోగాలు రాకపోయినా కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు వచ్చాయి. పరీక్షలు నిర్వహించినా పేపర్ లీక్‌లు జరిగాయి. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ ప్రకారం పరీక్షలు నిర్వహించి 2 లక్షల మందికి ఉద్యోగాలిస్తాం. ప్రత్యేక రాష్ట్రంలో తమ జీవితాలు మారుతాయని ఉద్యమకారులు కలలు కన్నారు. కానీ అలా జరగలేదు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉద్యమకారుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగమిస్తాం. ఈ ఎన్నికల్లో కేసీఆర్, కేటీఆర్‌లకు ఉద్యోగాలు ఇవ్వొద్దు. లక్షల కోట్ల దోపిడీ.. రాష్ట్రంలో కాళేశ్వరం, మిషన్ భగీరథ పేరిట రూ.లక్షల కోట్ల దోపిడీ జరిగింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బడా వ్యాపారవేత్తలకు రుణమాఫీ చేసింది. రైతులకు మాత్రం రుణమాఫీ చేయడం లేదు. ప్రధాని మోదీ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతిపై చర్యలు చేపట్టరు. కానీ కాంగ్రెస్ నేతలపై మాత్రం సీబీఐ, ఈడీలను ఉసిగొల్పుతారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే కాబట్టి అలా చేస్తున్నారు. వారికి ఒక తమ్ముడు ఎంఐఎం అధినేత. కేంద్రంలో బీజేపీకి, రాష్ట్రంలో బీఆర్ఎస్కు ఆయన సహకరిస్తున్నారు. కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు ఇతర రాష్ట్రాల్లో 40, 50 స్థానాల్లో పోటీ చేస్తారు. తెలంగాణలో మాత్రం 9 స్థానాల్లోనే పోటీ చేస్తున్నారు. కేసీఆర్ కర్ణాటక సర్కారుపై విమర్శలు చేస్తున్నారేగానీ.. ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నదేమిటనేది ప్రజలకు చెప్పారు. తెలంగాణను ఎలా అభివృద్ధి చేయాలనే దానిపై కాంగ్రెస్‌కు ఒక విజన్ ఉంది. ఈసారి కాంగ్రెస్‌కు అవకాశం ఇవ్వాలి. ఆరు గ్యారంటీలు కచ్చితంగా అమలు చేస్తాం కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తాం. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతినెలా రూ.2,500 ఖాతాలో వేస్తాం. బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తాం. రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తాం. రైతు భరోసా కింద రైతులు, కౌలు రైతులకు ఏటా రూ.15 వేలు, వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు ఇస్తాం. వరి పంటకు బోనస్‌గా రూ.500 అందజేస్తాం. గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇళ్లు లేని వారికి ఇంటి స్థలంతోపాటు రూ.5 లక్షల ఆర్థిక సాయం చేస్తాం..’’అని ప్రియాంకగాంధీ ప్రకటించారు. జీతేగా ఇండియా.. అంటూ.. క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్లో ఇండియా టీమ్ గెలవాలని కోరుకుందామని, జీతేగా ఇండియా అంటూ ఖానాపూర్ సభలో ప్రియాంకగాంధీ ప్రసంగాన్ని ప్రారంభించారు. సభికులతోనూ ‘జీతేగా ఇండియా..’అంటూ నినాదాలు చేయించారు. ఈ సభల కోసం ఢిల్లీ నుంచి విమానంలో మహారాష్ట్రలోని నాందేడ్‌కు వచ్చిన ప్రియాంక.. అక్కడి నుంచి మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్‌రావు చవాన్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రేలతో కలసి హెలికాప్టర్లో ఖానాపూర్‌కు వచ్చారు. తర్వాత హెలికాప్టర్లోనే ఆసిఫాబాద్‌కు చేరుకున్నారు. -
కేసీఆర్,కేటీఆర్‌కు ఉద్యోగాలివ్వకండి: ప్రియాంక గాంధీ
సాక్షి, ఖానాపూర్: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని, మీరు మాత్రం కేసీఆర్,కేటీఆర్ కు ఉద్యోగాలు ఇవ్వకండని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకగాంధీ తెలంగాణ ప్రజలను కోరారు. ఖానాపూర్‌లో జరిగిన విజయభేరి సభలో ప్రియాంక ప్రసంగించారు.కేసీఆర్ పాలనలో నిరుద్యోగులకు న్యాయం జరగలేదని విమర్శించారు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదని మండిపడ్డారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణను లూఠీ చేశాడని ఫైర్ అయ్యారు. ‘అధికారంలోకి రాగానే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తాం. ధరణి పోర్టల్ లో అన్ని తప్పులున్నాయి. ఇలాంటి ధరణిని బంద్ చేసి మంచి కార్యక్రమం తీసుకువస్తాం. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తాం. బీజేపీ పెద్ద కంపెనీలతో దోస్తానీ చేసి దేశాన్ని నాశనం చేస్తోంది. పది సంవత్సరాల నుంచి తెలంగాణను కేసీఆర్ నాశనం చేస్తున్నాడు. మోదీ తెలంగాణకు వచ్చి కాళేశ్వరం గురించి మాట్లాడడు. ఇద్దరు ఒక్కటే. బీజేపీ, బీఆర్ఎస్ ఎంఐఎం మూడు పక్కపక్కనే ఉండి డ్రామాలాడుతున్నాయి. పవర్లోకి రాగానే రూ.500కు గ్యాస్ సిలిండర్ ఇస్తాం. కర్ణాటక తరహాలో తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తాం. కేసీఆర్ ఇచ్చిన హామీలను ఒక్కటీ నెరవేర్చలేదు. ఇతర స్టేట్స్కు వెళ్లి పోటీచేసే ఎంఐఎం తెలంగాణలో 9 స్థానాల్లోనే ఎందుకు పోటీ చేస్తోంది. తెలంగాణను ఎలా అభివృద్ధి చేయాలనేదానిపై కాంగ్రెస్‌కు ఒక విజన్ ఉంది. మోదీ సర్కార్ కార్పొరేట్లకు రుణమాఫీ చేస్తుంది తప్ప రైతుల గురించి పట్టించుకోదు. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్‌ను పక్కాగా అమలు చేస్తుంది. ఇప్పటికే జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించాం. కాంగ్రెస్ విపక్ష నేతలే టార్గెట్‌గా ఈడీ, సీబీఐలతో మోదీ దాడులు చేయిస్తారు. ఇందిరాగాంధీ గిరిజనులు,ఆదివాసీల కోసం ఎంతో చేశారు. ఆమె చనిపోయి నలభై ఏళ్లయినా ప్రజలు ఇంకా ఆరాధిస్తూనే ఉన్నారు. గిరిజనులు, ఆదివాసీల కోసం ఇందిర ఎంతో చేశారు. ఇవాళ క్రికెట్ ప్రపంచ కప్ ఉంది భారత్ ప్రపంచ కప్ గెలవాలని అందరం కోరుకుందాం’అని ప్రియాంక అన్నారు. ఇదీచదవండి..బాబూ మోహన్‌కు తనయుడి షాక్ -
'పొట్టివాడే కానీ..' సింథియాపై ప్రియాంక గాంధీ ఫైర్
భోపాల్: బీజేపీ నేత జ్యోతిరాధిత్య సింథియాపై కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. సింథియాను ద్రోహిగా పేర్కొన్నారు. యూపీలో గతంలో ఎన్నికల ప్రచారంలో సింథియాతో కలిసి పనిచేసిట్లు చెప్పిన ప్రియాంక గాంధీ.. పొట్టిగానే ఉంటాడు కానీ.. అహంకారం మాత్రం చాలా ఎక్కువని మండిపడ్డారు. మధ్యప్రదేశ్‌లోని దాతియాలోని ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. 'ఎవరు ఆయన వద్దకు వెళ్లినా మహారాజ్ అని పిలవాలి. లేకపోతే ఆయన పెద్దగా స్పందించరు. మన సమస్యలు పరిష్కరించరు. ఈ రకమైన కుటుంబ సాంప్రదాయాన్ని వారు అనుసరిస్తున్నారు. కానీ గ్వాలియర్, చంబా ప్రజలకు మాత్రం సింథియా ద్రోహం చేశారు.' అని ప్రియాంక గాంధీ దుయ్యబట్టారు. మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా సింథియా కూడా కాంగ్రెస్‌పై ఇటీవల తీవ్రంగా ఆరోపణలు చేశారు. మహిళలకు ఆ పార్టీ చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ రాజకీయాల్లో విఫలమయ్యారని విమర్శించారు. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పతనమైందని అన్నారు. 2018లో మధ్యప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. కానీ సీఎం సీటు విషయంలో మనస్పర్ధలు వచ్చాయి. కమల్‌నాథ్‌కు సీఎం పదవి ఇవ్వడంలో సింథియాను ఒప్పించింది అధిష్ఠానం. కానీ కొన్ని నెలల్లోనే సింథియా అసంతృప్తితో బీజేపీ గూటికి చేరారు. 20 మంది ఎమ్మెల్యేలతో పార్టీ ఫిరాయించారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయి.. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. మధ్యప్రదేశ్ ఎన్నికలు నవంబర్ 17న జరగనున్నాయి. ఈ క్రమంలో నేడే ప్రచారానికి తెరపడింది. ఇదీ చదవండి: Madhya Pradesh Election: ఎన్నికల ప్రచారం ఆఖరి క్షణంలో ఖర్గే సభ రద్దు! -
ప్రతి నియోజకవర్గంలో వీఐపీ పర్యటనలు ఉండేలా కాంగ్రెస్ కసరత్తు
-
ఇవ్వాళ పూలున్న బోకే ఇచ్చి వెళ్లాడు మేడం!
మరిచిపోయి నిన్న పూలులేని బోకే ఇచ్చాడని ఇవ్వాళ పూలున్న బోకే ఇచ్చి వెళ్లాడు మేడం! -
కేసీఆర్‌ను ఓడించేందుకు దండుగా నేతలు
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణకు ఉన్న ఒకే ఒక్క గొంతు కేసీఆర్. ఆయన గొంతు నులిమి ఓడించడా నికి చాలా మంది నాయకులు వస్తున్నరు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, 15 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, సామంతు లు, మాజీ మంత్రులు దిగుతున్నరు. కాంగ్రెస్ నుంచి రాహుల్, ప్రియాంక, ఖర్గే, సిద్ధరామయ్య దండు కట్టి తెలంగాణకు క్యూ కడుతున్నరు. కేసీఆర్ బొండిగ పిసికేందుకు ఎంత మంది వస్తున్నా మేము భయపడం. మేము తెలంగాణ ప్రజలనే నమ్ముకు న్నం. సింహం సింగిల్‌గా వస్తుంది. తెలంగాణ గొంతు కేసీఆర్‌ను ఖతం చేసేందుకు ఢిల్లీ దొరలు ఒక్కటై దాడి చేస్తే కాపాడుకొనే బాధ్యత తెలంగాణ ప్రజలపైనే ఉంది’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె. తారక రామారావు అన్నారు. తెలంగాణ భవన్లో మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన విద్యార్థి నేత కురువ విజయ్‌కుమార్, పాలకుర్తి, ముధోల్ కాంగ్రెస్ నేతలు తిరుపతిరెడ్డి, కిరణ్ వాంగ్మోరేతోపాటు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆధ్వర్యంలో హైదరాబాద్, జనగామ, పాలకుర్తికి చెందిన పలువురు నేతలు మంగళవారం కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ‘ఇక్కడ నాయకత్వం లేనట్లు చేతకాని, చేవచచ్చిన కాంగ్రెస్, బీజేపీ పక్క రాష్ట్రాల నుంచి నాయకులను తెచ్చుకుంటున్నాయి. తెలంగా ణ గొంతు కేసీఆర్ ఉండగా మనకు ఇతరుల అవస రం ఏముంది? తెలంగాణ కథకు స్క్రీన్ ప్లే, దర్శక త్వం కేసీఆర్. మన సినిమా బ్లాక్ బస్టర్. కానీ కాంగ్రెస్, బీజేపీకి కన్నడ నిర్మాతలు, ఢిల్లీ దర్శకులు, గుజరాత్ నటులు అని వారి సినిమా డిజాస్టర్‌గా నిలుస్తుంది’ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రేవంత్ రాష్ట్రాన్ని ప్లాట్లు చేసి అమ్మేస్తాడు ‘ఐదేళ్ల క్రితం ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తూ అడ్డంగా దొరికి జైలుకు వెళ్లిన రేవంత్‌రెడ్డి అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని ప్లాట్లు చేసి అమ్మేస్తాడు. తొమ్మిదిన్నరేళ్లుగా కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ది దిశగా నడుపుతున్నారు. తెలంగాణలోని ప్రతి వర్గానికీ కేసీఆర్ మంచి చేశారు తప్ప నష్టం చేయలేదు. విద్యుత్, సాగునీరు, తాగునీరుతో అన్ని రంగాల్లో సమృద్దిని సాధిస్తోంది. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందని ఇల్లు లేదు. పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా 14లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుంది. పాలమూరులో నిండు చెరువులు, పచ్చని పైరులు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్‌కు 11 మార్లు తెలంగాణ ప్రజలు అధికారం, అవకాశం ఇచ్చినా సాగునీరు, తాగునీరు, కరెంటు ఇవ్వలేదు. కాంగ్రెస్ పాలనలో కరెంటు, ఎరువులు, విత్తనాల కోసం రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. మూడు కరెంటు చాలని రేవంత్, రైతుబంధు దుబారా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నాడు. తెలంగాణలో మూడోసారి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోను పూర్తి స్థాయిలో అమలు చేస్తాం’ అని కేటీఆర్ ప్రకటించారు. సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్‌రెడ్డి, దాసోజు శ్రవణ్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, రాకేశ్, ధర్మేందర్, తుంగబాలు, స్వామి తదితరులు పాల్గొన్నారు. -
ప్రియాంకకు చేదు అనుభవం: పుష్పగుచ్చం ఇచ్చారు.. పూలు మరిచారు!
మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల జోష్ తారాస్థాయికి చేరుకుంది. నవంబర్ 17న ఇక్కడ ఓటింగ్ జరగనుండగా, డిసెంబర్ 3న కౌంటింగ్ నిర్వహించి, ఆ తర్వాత ఫలితాలు వెల్లడించనున్నారు. దీంతో రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధాన పోటీ భారతీయ జనతా పార్టీ- కాంగ్రెస్ మధ్యేనే నెలకొంది. రాష్ట్రంలో మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఈ రెండు పార్టీలు చెబుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఇండోర్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారసభలో పాల్గొన్నారు. ఆమె వేదికపైకి రాగానే స్థానిక కాంగ్రెస్ నేతలు స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు. అయితే ఒక నేత ఆమెకు ఇచ్చిన పూలగుత్తిలో పూలు మాయమయ్యాయి. దీనిని గమనించిన ప్రియాంక గాంధీ ఆ పుష్పగుచ్చంలో పూలు లేవని అక్కడున్న నేతలకు చెప్పారు. దీంతో వారంతా నవ్వుకున్నారు. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి రాకేశ్ పాఠక్ స్పందించారు. అతను తన ట్విట్టర్ ఖాతాలో ఇలా రాశారు. ‘ఇదొక గుత్తి స్కామ్, పుష్పగుచ్ఛం నుండి పూలు మాయమయ్యాయి. స్క్వాడ్ పట్టేసుకుంది’ అని రాశారు. ఇండోర్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రియాంక గాంధీ ప్రసంగిస్తూ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మధ్యప్రదేశ్‌లో 18 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉన్నా, ప్రజలకు చేసింది ఏమీ లేదని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం 250 కుంభకోణాలు చేసి, ప్రజా ధనాన్ని దోచుకుందని ఆరోపించారు. ఇది కూడా చదవండి: మహావినాశనం ముందుంది? गुलदस्ता घोटाला 😜 गुलदस्ते से गुल गायब हो गया.. दस्ता पकड़ा दिया 😂😂 मध्यप्रदेश के इंदौर में प्रियंका वाड्रा की रैली में एक कांग्रेसी गुलदस्ता देने पहुंचा लेकिन कांग्रेसी खेल हो गया।#MPElections2023 pic.twitter.com/y7Qmyldp94 — राकेश त्रिपाठी Rakesh Tripathi (@rakeshbjpup) November 6, 2023 -
పాలమూరుకు ప్రియాంక
-
మేమొస్తే రూ.500కే గ్యాస్ సిలిండర్
జల్‌బంధా: ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కొత్తగా మహతారీ న్యాయ్ యోజన పథకం ప్రారంభించి మహిళలకు రూ.500కే వంటగ్యాస్ అందిస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంకా గాంధీ వాద్రా హామీ ఇచ్చారు. సోమవారం ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా జల్‌బంధాలో ఆమె ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు. ‘ మేం మళ్లీ అధికారంలోకి వస్తే దాదాపు 6,000 ప్రభుత్వ ఉన్నత మాధ్యమిక, ఉన్నత పాఠశాలలను స్వామి ఆత్మానంద్ ఇంగ్లిష్, హిందీ మీడియం స్కూళ్లుగా అప్‌గ్రేడ్ చేస్తాం. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అందిస్తాం. స్వయం సహాయక బృందాలు, సాక్ష్యమ్ యోజన కింద రుణాల పొందిన వారి రుణాలను మాఫీ చేస్తాం. కొత్తగా 700 గ్రామీణ పారిశ్రామిక పార్కులను నెలకొల్పుతాం. దీంతో వీటి సంఖ్య ఏకంగా 1,000కి చేరుతుంది. తివారా రకం పప్పు ధాన్యాన్ని రైతుల నుంచి కనీస మద్దతు ధరకే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలుచేయనుంది’ అని ప్రియాంక పలు హామీ ప్రకటించారు. ‘ 2018 ఏడాది వరకు రాష్ట్రంలోని రవాణా రంగంతో సంబంధం ఉన్న 6,600 మందికిపైగా వాహన యజమానుల వాహన పన్నును మాఫీ చేస్తాం’ అని ప్రకటించారు. వంట గ్యాస్‌పై మహిళలకు ఇచ్చే రూ.500 సబ్సిడీని నేరుగా వారి బ్యాంక్ ఖాతాలోనే జమచేస్తామని ర్యాలీ తర్వాత ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ పోస్ట్‌చేశారు. మహిళలను తెలివితక్కువ వాళ్లుగా లెక్కగట్టారు ర్యాలీ సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రభుత్వంపైనా ప్రియాంక నిప్పులు చెరిగారు. ‘ మధ్యప్రదేశ్‌లో 18 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉంది. అయినా అక్కడ మహిళలకు దక్కిన హక్కులు, రక్షణ శూన్యం. హింస పెరిగింది. ఆ రాష్ట్రంలో రోజూ సగటున 17 అత్యాచారాలు నమోదవడం సిగ్గుచేటు. ఇన్నాళ్లూ మహిళలను గాలికొదిలేసిన చౌహాన్ సర్కార్ రెండు నెలల క్రితం లాడ్లీ బెహ్నా పథకం మొదలుపెట్టి మహిళల ఖాతాలోకి కొంత మొత్తం జమచేయడం షురూ చేసింది. ప్రభుత్వం అకస్మాత్తుగా మహిళలపై ప్రేమ ఒలకబోస్తోంది. ఎన్నికల వేళ ఆమాత్రం తెలుసుకోలేనంత తెలివితక్కువ వారిగా మహిళలను లెక్కగట్టింది’ అని ప్రియాంక ఆరోపించారు. -
ఎన్నికల చివరి వారమంతా ఇక్కడే!
సాక్షి, హైదరాబాద్: ఈసారి ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో అధికారం దక్కించుకోవాలన్న లక్ష్యంతో భారీ ప్రచార వ్యూహానికి కాంగ్రెస్ పార్టీ రూపుదిద్దుతోంది. ఇప్పటికే అగ్రనేతలతో బస్సు యాత్ర నిర్వహిస్తోన్న టీపీసీసీ.. కాంగ్రెస్ పార్టీ పెద్దలను పూర్తిస్థాయిలో రంగంలోకి దింపాలని నిర్ణయించింది. ఏఐసీసీ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గేలతోపాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఇతర ప్రముఖులతో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్ రాష్ట్రాల్లోనూ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో.. మిగతా ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, సుక్కులతో సభల ఏర్పాటుకు ప్లాన్ చేస్తోంది. ఈ నెల 28, 29 తేదీల్లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రాష్ట్రానికి వచ్చేలా షెడ్యూల్ రూపొందిస్తోంది. తర్వాత 30, 31 తేదీల్లో ప్రియాంకా గాంధీ వస్తారని, పాలమూరు ప్రజాగర్జనతోపాటు నాగార్జునసాగర్‌లో జరిగే సభలోనూ ఆమె పాల్గొంటారని పీసీసీ వర్గాలు చెప్తున్నాయి. వచ్చే నెల 1, 2 తేదీల్లో రాహుల్‌గాంధీ మరోమారు రాష్ట్రానికి వచ్చి రెండో విడత బస్సుయాత్రలో పాల్గొననున్నారు. నేతల అంగీకారం రాగానే.. అయితే ఈ నెల 31న కొల్లాపూర్‌లో ప్రియాంకా గాంధీ పాల్గొనే సభ మినహా మిగతా పర్యటనలు ప్రతిపాదనలేనని, నేతల అంగీకారం వచ్చాక షెడ్యూల్ ఖరారవుతుందని గాందీభవన్ వర్గాలు చెప్తున్నాయి. ఇక ప్రచార పర్వం ముగిసే చివరి వారంలో మొత్తం కాంగ్రెస్ యంత్రాంగాన్ని రంగంలోకి దింపాలని టీపీసీసీ యోచిస్తోంది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలకుగాను.. నవంబర్ 23న రాజస్తాన్‌లో పోలింగ్‌తో నాలుగు రాష్ట్రాల్లో ప్రక్రియ ముగుస్తుందని.. ఆ తర్వాత ఏఐసీసీ పూర్తిస్థాయిలో తెలంగాణపై దృష్టి కేంద్రీకరిస్తుందని టీపీసీసీ వర్గాలు చెప్తున్నాయి. వచ్చే నెల 23 నుంచి 28 వరకు రాహుల్ గాంధీ సహా జాతీయ స్థాయి నేతలంతా ఇక్కడే మకాం వేసి.. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తారని వెల్లడిస్తున్నాయి. -
తెలంగాణలో కాంగ్రెస్ బస్సు యాత్రకు పలువురు అగ్రనేతలు
-
31న కాంగ్రెస్ పాలమూరు ప్రజాభేరి
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 31న పాలమూరు ప్రజాభేరి పేరుతో కొల్లాపూర్‌లో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. మాజీ మంత్రి జూపల్లి పార్టీలో చేరిక సందర్భంలోనే ప్రియాంకా గాందీతో కొల్లాపూర్‌లో సభ ఏర్పాటు చేయించాలని భావించినా అప్పుడు సాధ్యం కాకపోవడంతో ఇప్పుడు ఆమెతో సభ నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు సభ ఏర్పాట్లపై హైదరాబాద్‌లోని మల్లు రవి నివాసంలో జూపల్లి కృష్ణారావు, జగదీశ్వర్‌రావు, ప్రతాప్‌గౌడ్, విజయభాస్కర్‌రెడ్డి ఆదివారం చర్చించారు. ఈ సందర్భంగా రవి, జూపల్లి, జగదీశ్వరరావు మాట్లాడుతూ పాలమూరు ప్రజాభేరి బహిరంగ సభకు అన్ని వర్గాల ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణలో కేసీఆర్ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని, తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు ఈ ఎన్నికల్లో విజయాన్ని బహుమతిగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. -
ఏది ఫ్యామిలీ పాలిటిక్స్..ప్రియాంక గాంధీకి కవిత కౌంటర్
-
తెలంగాణలో ప్రచారం హోరెత్తిస్తున్న కాంగ్రెస్
-
దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య సమరం
సాక్షి ప్రతినిధి, వరంగల్: స్వాతంత్య్రం కోసం సాగిన పోరాటంలోంచి పుట్టిన కాంగ్రెస్, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే క్రమంలో ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిందని, కానీ ఇది ప్రస్తుతం దొరల తెలంగాణగా మారిందని ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాందీ, ప్రియాంకా గాంధీలు ధ్వజమెత్తారు. దొరల తెలంగాణను ప్రజల తెలంగాణగా మార్చేందుకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతిచ్చి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇది దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య జరుగుతున్న సమరంగా అభివర్ణించారు. కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణను ప్రధాని మోదీ కనుసన్నల్లో ధ్వంసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎంలు ఒక్కటేనని అన్నారు. కాంగ్రెస్‌ను ఓడించేందుకు ఆ మూడు పార్టీలూ ఒక్కటయ్యాయని చెప్పారు. దేశంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ జనాభా దామాషా ప్రకారం సామాజిక న్యాయం కల్పించడంలో ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. కులగణన చేయనిదే సామా జిక న్యాయం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. బుధవారం ములుగు జిల్లా వెంకటాపూర్(ఎం) మండలం రామాంజాపూర్ నుంచి వారు కాంగ్రెస్ ఎన్నికల శంఖం పూరించారు. తొలుత రామప్ప రామలింగేశ్వరస్వామి ఆ లయంలో రాహుల్, ప్రియాంక పూజలు చేశారు. అనంతరం బస్సు యాత్రను ప్రారంభించారు. ఆ తర్వాత రామాంజాపూర్‌లో ఏర్పాటు చేసిన విజయ భేరి బహిరంగసభలో మాట్లాడారు. నిరుద్యోగుల ఆత్మహత్యల బాట: రాహుల్ ‘ఇచ్చిన మాటను నిలబెట్టుకునే క్రమంలో మా అమ్మ సోనియాగాంధీ రాజకీయ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చినా తన రాజనీతిని మరువలేదు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది. కానీ ఇక్కడి ప్రభుత్వం 40 లక్షల మంది నిరుద్యోగులకు మొండిచేయి చూపడంతో వారు ఆత్మహత్యల వైపు పయనించే ప్రమాదం నెలకొంది. ఉద్యోగ ఖాళీలు నింపలేక, కుటుంబ పాలన కోసం కోసం పాటుపడే క్రమంలో 18 శాఖలు తమ చేతుల్లో పెట్టుకొని, జనాభాల్లో బీసీలు 50 శాతం ఉంటే ముగ్గురు బీసీలకు మాత్రమే కేబినెట్ మంత్రి పదవులు ఇవ్వడం సామాజిక న్యాయాన్ని విస్మరించారనేందుకు నిదర్శనం. ఉద్యమాలకు నిలయమైన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో టీచింగ్, నాన్ టీచింగ్ అధ్యాపకులను నింపకుండా ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు పెద్దపీట వేసి పేదలకు ఉన్నత విద్యను దూరం చేస్తున్నారు. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాం«దీ, రాజీవ్‌గాంధీలు దూరదృష్టితో ఐఐటీ, ఐఎంఎ వంటి సంస్థలను నెలకొల్పితే మోదీ సర్కారు బీహెచ్ఈఎల్, రైల్వే వంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తోంది..’ అని రాహుల్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే పోటీ ‘తెలంగాణలో బీఆర్ఏస్, కాంగ్రెస్‌ల మధ్యే పోటీ ఉంటుంది. బీజేపీ, బీఆర్ఎస్లు మిలాఖత్ అయ్యాయని, అవి ఎంఐఎంతో కలిసి ఉన్నాయనడానికి పార్లమెంటులో బీజేపీ ఏమి కోరుకుంటే బీఆర్ఎస్ దానికి మద్దతు పలకడమే నిదర్శనం. కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు ఆ మూడు పార్టీలు కుట్రలు పన్నుతున్నాయి. బీఆర్‌ఏస్‌కు ఓటేస్తే బీజేపీకి వేసినట్టే. బీఆర్ఎస్ పాలన మోదీ రిమోట్ ద్వారా నడుస్తోంది. విపక్ష నేతలందరిపై కేసులు పెట్టినా.. మీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద సీబీఐ, ఈడీ, ఇన్కమ్ టాక్స్ కేసులు లేవు. నన్ను మా నేతలను మాత్రం కేంద్రం వేధిస్తోంది. నా ఎంపీ సభ్వత్వాన్ని రద్దు చేసి 24 కేసులు పెట్టారు. అయినా సిద్ధాంతాలతో కూడిన లౌకిక పార్టీ కాంగ్రెస్‌ను ఎవరూ ఏమీ చేయలేరు..’ అని రాహుల్ అన్నారు. ఇందిరమ్మ మాదిరి చేయూతనిస్తాం.. ‘తెలంగాణలో అధికారంలోకి వచ్చాక హామీలన్నీ అమలు చేస్తాం. ఆరు గ్యారంటీలు తప్పకుండా నెరవేరుస్తాం. ఈ ప్రాంత ఆదివాసీలకు ఇందిరమ్మ మాదిరిగా చేయూతనిస్తాం. అధికారంలోకి రాగానే సమ్మక్క సారక్క జాతరను జాతీయ ఉత్సవంగా ప్రకటిస్తాం. రాష్ట్రంలో పోడు, అసైన్డ్ భూముల విషయంలో అందరికీ న్యాయం చేస్తాం..’ అని రాహుల్ హామీ ఇచ్చారు. లూటీలు చేస్తూ దండుకుంటున్నారు: ప్రియాంకా గాంధీ ‘రాష్ట్రంలో అధికారం చేపట్టిన కేసీఆర్ ప్రజల ఆశలు, అకాంక్షలు నెరవేర్చకపోగా.. ల్యాండ్, శాండ్, వైన్, మైన్ మాఫియాలతో లూటీలు చేస్తూ దండుకుంటున్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగుల పట్ల ఏమాత్రం శ్రద్ధ లేని ప్రభుత్వం ప్రజలను సామాజిక న్యాయానికి దూరం చేసింది. భూదాన్ భూములకు రక్షణ లేకుండా ధరణి పోర్టల్‌తో స్కామ్‌లు చేస్తూ రియల్ ఎస్టేట్ చేస్తోంది. బంగారు తెలంగాణ పేరిట ప్రజల్ని మోసం చేస్తూ లక్షల కోట్లు దండుకుంటూ 50 శాతం బీసీలకు ఉన్న 27 శాతం రిజర్వేషన్‌ను ఆచరణలో 23కి తీసుకువచ్చారు. దళితులకు మూడు ఎకరాల భూమి, ఉద్యోగాల కల్పనలో విఫలమయ్యారు. కాళేశ్వరం పేరిట లక్ష కోట్లు దండుకున్నారు. ధరణి పోర్టల్ పెద్ద స్కామ్. డబుల్‌బెడ్ రూమ్‌లు ఇవ్వలేదు. రూ.లక్ష రుణమాఫీ చేయలేదు..’ అని ప్రియాంకా ధ్వజమెత్తారు. కర్ణాటక, రాజçస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ఇచ్చిన హామీలు నెరవేర్చామని, రాజస్థాన్‌లో ఉచితంగా వైద్యం హామీ కింద రూ.25 లక్షల వరకు ప్రభుత్వమే భరిస్తోందని గుర్తు చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో వరి ధాన్యానికి రూ.2,500 గిట్టుబాటు ధర కల్పిస్తున్నామని చెప్పారు. సంక్షేమ పాలనకు సోనియమ్మ ఆరు గ్యారంటీలు: రేవంత్‌రెడ్డి ‘కల్వకుంట్ల కుటుంబం నుంచి తెలంగాణను విముక్తి కల్పించడానికే రాహుల్ గాం«దీ, ప్రియాంకా గాంధీ ఇక్కడికి వచ్చారు. తెలంగాణ ప్రజలకు సంక్షేమ పాలన అందించడానికి సోనియమ్మ ఆరు గ్యారంటీలు ప్రకటించారు. ప్రతి ఆడబిడ్డకు ప్రతినెలా రూ.2,500 అందించడానికి సోనియమ్మ మాట ఇచ్చారు. రూ.500కే సిలిండర్‌ను మీ ఇంటికి తెచ్చే బాధ్యత సోనియమ్మ తీసుకుంది. ప్రతి ఏటా రైతులకు, కౌలు రైతులకు రూ.15 వేలు, ఉపాధి కూలీలకు రూ.12 వేలు కాంగ్రెస్ అందించనుంది. 200 యూనిట్ల వరకు ప్రతిఇంటికీ ఉచితంగా విద్యుత్ అందించనున్నాం. కల్యాణలక్ష్మి పేరుతో పెళ్లి చేసుకునే ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం అందించనుంది..’ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చెప్పారు. నియంత పాలనకు చరమ గీతం పాడుదాం: భట్టి విక్రమార్క ‘రాజుల నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడిన సమ్మక్క, సారలమ్మ స్ఫూర్తితో నియంత కేసీఆర్ పాలనకు వచ్చే ఎన్నికల్లో చరమగీతం పాడుదాం. తెలంగాణ సంపద, వనరులు ప్రజలకు చెందాలని సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేరలేదు. సోనియా గాంధీ తీసుకొచ్చిన అటవీ హక్కుల చట్టాన్ని నిర్వీర్యం చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి..’ అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. కాంగ్రెస్ తెలంగాణ ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రే, పార్టీ నేతలు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కుందూరు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, డి.శ్రీధర్‌రాబు, మధుయాష్కీగౌడ్, మల్లు రవి, జగ్గారెడ్డి, భూపాపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రామప్ప శిల్ప సంపదకు ఫిదా వెంకటాపురం(ఎం) : రామప్ప ఆలయ శిల్ప సంపదకు రాహుల్, ప్రియాంకా ఫిదా అయ్యారు. పూజలు చేసిన తర్వాత వారు ఆలయాన్ని పరిశీలించారు. ఏ సంవత్సరంలో నిర్మించారు? రామప్ప ఆనే శిల్పి ఒక్కడే నిర్మించాడా? ఎన్నేళ్ల పాటు నిర్మించారు? అంటూ గైడ్ విజయ్‌ని ఆరా తీశారు. శిల్పాలను చూసి ముగ్ధులైన ప్రియాంకగాంధీ నంది విగ్రహాన్ని ప్రత్యేకంగా ఫొటోలు తీసుకున్నారు. నంది విగ్రహం వద్ద వారు ఫొటోలు దిగారు. నేడు పెద్దపల్లిలో రాహుల్ పర్యటన సాక్షి ప్రతినిధి, కరీంనగర్/ సాక్షి, పెద్దపల్లి: రాహుల్‌గాంధీ బస్సుయాత్ర రెండవ రోజు గురువారం పెద్దపల్లి జిల్లాలో కొనసాగనుంది. ఉదయం మంథనిలో రోడ్డ్షోలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటలకు రామగిరి మండలంలో సింగరేణి గెస్ట్‌హౌస్ ప్రాంగణంలో సింగరేణి కారి్మకులతో సమావేశమవుతారు. సాయంత్రం పెద్దపల్లిలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో మాట్లాడతారు. తర్వాత బహిరంగ సభలో పాల్గొంటారు. రాత్రి 7 గంటలకు కరీంనగర్ చేరుకొని 8 గంటల వరకు పాదయాత్ర చేస్తారు. రాత్రికి కరీనంగర్లోనే బస చేయనున్నారు. రామప్ప వయా హైదరాబాద్ సాక్షి, హైదరాబాద్: రాహుల్, ప్రియాంకా గాందీలు బుధవారం ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. బేగంపేట విమానాశ్రయంలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు పలువురు వారికి స్వాగతం పలికారు. రాహుల్, ప్రియాంకా వారితో కొద్దిసేపు కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా టీపీసీసీ నేత జి.నిరంజన్ గురువారం చార్మినార్ వద్ద నిర్వహించనున్న రాజీవ్ గాంధీ సద్భావన దినోత్సవ కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్‌ను అందజేశారు. అనంతరం వారు హెలికాప్టర్లో రామప్పకు బయలుదేరి వెళ్లారు. -
TS Election 2023: రాహుల్, ప్రియాంకగాంధీ పర్యటన.. కాంగ్రెస్ కేడర్‌లో కొత్త ఉత్సాహం!
సాక్షిప్రతినిధి, వరంగల్: ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ పర్యటన కాంగ్రెస్ కేడర్‌లో కొత్త ఉత్సాహం నింపింది. ములుగు జిల్లా రామాంజాపూర్ వద్ద బుధవారం జరిగిన విజయభేరి సభలో తెలంగాణ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. అభ్యర్థులను గెలిపించుకునేందుకు అగ్రనేతలు రాహుల్, ప్రియాంకగాంధీ కాకతీయులు ఏలిన గడ్డ నుంచే పూర్తిస్థాయి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ములుగు, జేఎస్ భూపాలపల్లి జిల్లాల పర్యటనలో భాగంగా బుధవారం సాయంత్రం ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండలం పాలంపేటలో రామప్ప ఆలయాన్ని సందర్శించిన రాహుల్, ప్రియాంక రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాశస్త్యాన్ని తెలుసుకున్న వారు అక్కడి నుంచి అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా బస్సుయాత్ర ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన నాయకులు, కార్యకర్తలతో కలిసి బస్సుయాత్ర ద్వారా రామప్ప ఆలయం నుంచి రామాంజాపూర్ విజయభేరి సభ వద్దకు చేరుకున్నారు. బహిరంగ సభలో ప్రసంగించిన రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంలపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్‌ను ఓడించడం కోసం బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంలు కూటమిగా పని చేస్తున్నాయని ఆరోపించారు. ఈ రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని బీజేపీ కోరుకుంటోందని, అందుకే విపక్ష నేతలందరిపై సీబీఐ, సీఐడీ, ఈడీ దాడులు చేయించి కేసులు పెట్టిన కేంద్రం అవినీతికి కేరాఫ్‌గా మారిన కేసీఆర్‌పై ఒక్క కేసు పెట్టలేదని విమర్శించారు. ఆదివాసీ గిరిజనులు, ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై దుమ్మెత్తి పోశారు. బహిరంగ సభలో మహిళా డిక్లరేషన్‌ను ప్రకటించిన ప్రియాంకగాంధీ అధికారంలోకి వచ్చాక ప్రతీ మహిళకు నెలకు రూ.2,500 అందజేస్తామన్నారు. 18 ఏళ్లు నిండిన యువతులకు ఎలక్ట్రిక్ స్కూటీలను ఇస్తామని, రూ.500కే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపేందుకు అన్నాచెల్లెళ్లు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధి పథకాలను వివరిస్తూ.. తెలంగాణలో అమలు చేయనున్నామని ప్రకటించారు. రాహుల్ ప్రసంగిస్తున్న సమయంలో పీఎం.. పీఎం రాహుల్ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. కాంగ్రెస్ అగ్రనేతల పర్యటన సందర్భంగా ములుగు ఎస్పీ గాష్ ఆలం భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు. 'ఆదివాసీ గిరిజనులతోపాటు అందరికీ ఆరాధ్య దైవాలైన సమ్మక్క, సారలమ్మ జాతర దేశంలోనే అతిపెద్దది. దేశంలో మేం అధికారంలోకి వస్తే జాతరను జాతీయ ఉత్సవంగా ప్రకటిస్తాం. కుంభమేళా తరహాలో నిర్వహిస్తాం.' – రాహుల్‌గాంధీ రామప్పలో పూజలు.. ప్రపంచ ప్రసిద్ధి చెందిన రామప్ప దేవాలయాన్ని బుధవారం సాయంత్రం కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ సందర్శించారు. రామప్పకు సాయంత్రం 4 గంటలకు వారిద్దరు రావాల్సి ఉండగా, 37నిమిషాలు ఆలస్యంగా వచ్చారు. ఆలయ ఆర్చకులు హరీష్‌శర్మ, ఉమాశంకర్ పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆలయంలోకి ఆహ్వానించారు. రామలింగేశ్వరస్వామికి వారు పూజలు నిర్వహించగా పూజారులు ఆశీర్వచనం అందించి శాలువాలతో సత్కరించారు. అనంతరం వారు ఆలయం చుట్టూ కలియదిరిగారు. టూరిజం గైడ్ విజయ్‌కుమార్ ఆలయ విశిష్టత గురించి వివరించారు. జనసంద్రంగా మారిన రామాంజాపూర్.. రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ హాజరైన కాంగ్రెస్ విజయభేరి సభ సందర్భంగా రామాంజాపూర్ జనసంద్రంగా మారింది. ఇటు సీతక్క, అటు గండ్ర సత్యనారాయణ అభిమానులు అధికసంఖ్యలో తరలిరావడంతో గ్రామ పరిసరాలు కార్యకర్తలతో హోరెత్తాయి. ఇటీవల కురిసిన వర్షాలతో ఇబ్బందులు పడిన దొడ్ల, మొండాయి, మల్యాల, మేడారం, ఊరట్టం తదితర గ్రామాల నుంచి ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో ‘సీఎం.. సీఎం’ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్న సమయంలో సీతక్కను దగ్గరకు తీసుకుని ఈమె ఎవరో తెలుసా.. నా సోదరి అంటూ నాలుగు సార్లు ఉచ్ఛరించి సభలో నూతన ఉత్తేజాన్ని నింపారు. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలపై ప్రజలను అభిప్రాయాన్ని అడగ్గా.. సానుకూలంగా స్పందించారు. సభలో పార్టీ తెలంగాణ ఇన్చార్జ్ మాణిక్కం ఠాకూర్, టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కుందూరు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు ధనసరి సీతక్క, డి.శ్రీధర్‌రాబు, నాయకులు మధుయాష్కీగౌడ్, మల్లు రవి, తూర్పు జగ్గారెడ్డి, భూపాపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర సత్యనారాయణ, కొండా సురేఖ, నాయిని రాజేందర్‌రెడ్డి, వేం నరేందర్‌రెడ్డి, సిరిసిల్ల రాజయ్య, రాఘవరెడ్డి, పొదెం వీరయ్య, ఎర్రబెల్లి స్వర్ణ, మల్లాడి రాంరెడ్డి పాల్గొన్నారు. స్వాగతం పలికిన రాష్ట్ర నేతలు రామప్పలోని హెలిపాడ్ వద్ద అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, భూపాలపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర సత్యనారాయణతోపాటు పలువురు నేతలు బొకేలు అందించి స్వాగతం పలికారు. రామప్ప ఆలయం ముందు అగ్రనేతలకు కోయ కళాకారులు కొమ్ము డాన్స్, గిరిజనులు లంబాడా నృత్యం ద్వారా స్వాగతం పలికారు. కేటీపీపీ అతిథి గృహంలో బస.. రాహుల్, ప్రియాంకగాంధీ బుధవారం రాత్రి భూపాలపల్లి జిల్లాకు చేరుకున్నారు. చెల్పూరు కేటీపీపీ అతిథి గృహంలో బస చేశారు. ప్రత్యేక గదిలో రాహుల్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, పలువురు రాష్ట్రస్థాయి నాయకులతో కాసేపు ముచ్చటించారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై సమీక్షించారు. అనంతరం డైనింగ్ హాల్లో రాత్రి భోజనంలో కొంచెం బిర్యానిని టేస్ట్ చేసి మటన్ కబాబ్ తీసుకున్నారు. అలాగే చిన్న పుల్కాతో పాలక్ పప్పు తీసుకొని భోజనాన్ని ముగించారు. రాహుల్‌గాంధీ గురువారం ఉదయం 7 గంటలకు కేటీపీపీ అతిథి గృహం వద్ద వివిధ రాజకీయ పార్టీల నాయకులకు పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్‌లోకి సాదరంగా ఆహ్వానిస్తారు. అనంతరం కేటీపీపీ ఉద్యోగులతో మాటాముచ్చట చేసి, వారి సమస్యల్ని అడిగి తెలుసుకుంటారు. అక్కడి నుంచి భూపాలపల్లి పట్టణంలోని బాంబుల గడ్డ వరకు నిరుద్యోగులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహిస్తారు. ఆ తర్వాత పెద్దపల్లి జిల్లాకు వెళ్తారు. ఇవి చదవండి: ప్లాట్ల విక్రయంలో.. బోథ్ ఎమ్మెల్యేపై చీటింగ్ కేసు! Follow the Sakshi TV channel on WhatsApp: -
ములుగు జిల్లాలో రాహుల్, ప్రియాంక
-
బేగంపేట్ నుంచి రామప్పగుడికి హెలికాప్టర్లో నేతలు
-
సాయంత్రం రామప్ప నుంచి కాంగ్రెస్ బస్సు యాత్ర
-
నేడు తెలంగాణలో రాహుల్, ప్రియాంక పర్యటన
-
నేడు రామప్ప ఆలయానికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రాక.. ఇంకా ఇతర అప్డేట్స్
-
నేడు రామప్ప ఆలయానికి రాహుల్, ప్రియాంక
సాక్షి, హైదరాబాద్/వెంకటాపురం(ఎం): మూడు రోజుల రాష్ట్ర పర్యటనకు రానున్న ఏఐసీసీ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ బుధవారం ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన రామప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడతారని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మంగళవారం మీడియాకు చెప్పారు. సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో రాహుల్, ప్రియాంక పాలంపేటకు చేరుకుంటారన్నారు. అక్కడినుంచి కాన్వాయ్‌లో 4:15 గంటలకు రామప్ప ఆలయానికి చేరుకొని కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల మేనిఫెస్టోను వారు రామలింగేశ్వరుడి ముందు పెట్టి పూజలు చేస్తారని తెలిపారు. శివుడిపై రాహుల్, ప్రియాంకతోపాటు తనకూ విశ్వాసం ఉందన్నారు. అనంతరం 4:45 గంటలకు ఆలయం నుంచి బస్సుయాత్ర ద్వారా రామాంజాపూర్‌లో ఏర్పాటుచేసిన మహిళా విజయభేరి సభా ప్రాంగణానికి బయలుదేరుతారు. అక్కడ రాహుల్, ప్రియాంక మహిళలను ఉద్దేశించి ప్రసంగించి, మహిళా డిక్లరేషన్ కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రకటించనున్నారు. సభ అనంతరం ప్రియాంక ఢిల్లీకి పయనం కానుండగా, రాహుల్ బుధవారం రాత్రి భూపాలపల్లిలో బస చేస్తారు. రాహుల్ గురువారం ఉమ్మడి కరీంనగర్, శుక్రవారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లో బస్సుయాత్ర సాగించనున్నారు. దసరా సెలవుల తరువాత రాహుల్ మలి దశ బస్సుయాత్ర ఉంటుంది. కాగా, రాహుల్, ప్రియాంక పర్యటన సందర్భంగా ములుగు ఎమ్మెల్యే సీతక్క మంగళవారం రామాంజాపూర్ సభాస్థలిని పరిశీలించారు. మహిళా విజయభేరికి పార్టీ శ్రేణులు, అభిమానులు, మహిళలు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
ఈనెల 18న తెలంగాణకు రాహుల్, ప్రియాంక
-
18న కొండగట్టుకు రాహుల్, ప్రియాంక ముడుపుగట్టు!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పుణ్యక్షేత్రం కొండగట్టు నుంచి కాంగ్రెస్ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనుంది. ఈనెల 18న జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంకాగాందీలు హాజరవనున్నారు. రాహుల్, ప్రియాంకాగాందీలు కొండగట్టుపై తొలుత అంజన్నకు పూజలు చేసి అక్కడ పార్టీకి విజయం సాధించాలని ముడుపు కడతారని, అనంతరం అక్కడ సిద్ధంగా ఉంచిన ప్రచార రథాలకు పూజలు చేయిస్తారు. పూజల అనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్ చేపట్టే బస్సు యాత్ర ప్రారంభమవుతుందని కాంగ్రెస్ నేతలు తెలిపారు. రాహుల్, ప్రియాంకల పర్యటనను ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, జగిత్యాల పోలీసులు కూడా ధ్రువీకరించారు. అయితే తమకు ఇంకా అధికారిక షెడ్యూలు మాత్రం అందాల్సి ఉందన్నారు. కాగా, బీఆర్ఎస్కు కంచుకోటగా ఉన్న పాత కరీంనగర్లో కాంగ్రెస్‌కు కేవలం ఒక్క సీటే ఉంది. అలాంటి కంచుకోటను బద్దలు కొట్టేందుకు, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి బస్సుయాత్ర మొదలుపెట్టాలని నిర్ణయించినట్లు సీనియర్ పార్టీ నేత ఒకరు చెప్పారు. -
కాంగ్రెస్ అభ్యర్థులు 70 మంది ఖరారు!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగే 70 మంది అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. దీంతో 119 నియోజకవర్గాలున్న రాష్ట్రంలో సగానికి పైగా స్థానాలకు టికెట్లు ఫైనల్ చేసినట్టయ్యింది. పార్టీలో పనిచేసిన అనుభవం, కుల సమీకరణలు, సర్వేలు, ఆర్థిక బలాలను దృష్టిలో పెట్టుకొని స్క్రీనింగ్ కమిటీ ఇచ్చిన నివేదికల ఆధారంగా తొలి విడతగా 70 మంది అభ్యర్థులను కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) ఎంపిక చేసింది. ఈ మేరకు తొలి జాబితాను 15న విడుదల చేసే అవకాశం ఉంది. సర్వేల ఆధారంగానే.. చైర్మన్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఏఐసీసీ కార్యాలయంలో సీఈసీ భేటీ జరిగింది. సోనియాగాందీ, రాహుల్‌గాందీ, ప్రియాంకా గాంధీ, కేసీ వేణుగోపాల్, ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డితో పాటు ఇతర కమిటీ సభ్యులు హాజరయ్యారు. పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్‌లను సైతం సమావేశానికి ఆహ్వనించారు. రెండున్నర గంటల పాటు జరిగిన భేటీలో ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు సహా ఏఐసీసీ స్థాయిలో చేసిన సర్వేల నివేదికలు ముందుపెట్టుకొని నియోజకవర్గాల వారీగా అభ్యర్థులను పరిశీలించారు. మొదట ఒకే ఒక్క పేరున్న 70 నియోజకవర్గాలు, ఆయా స్థానాలకు సంబంధించిన నేతల పేర్లు పరిశీలించారు. ఏయే ప్రాతిపదికల ఆధారంగా ఇక్కడ ఒకే నేత ఎంపిక జరిగిందో మురళీధరన్ కమిటీకి వివరించారు. ఈ స్థానాలపై ఎవరి నుంచి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాకపోవడంతో ఆ 70 నియోజకవర్గాల్లో ప్రతిపాదిత అభ్యర్థులకు సీఈసీ ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. ఇక రెండో విడత జాబితాను ఫైనల్ చేసేందుకు వచ్చేవారం మరోమారు సీఈసీ భేటీ కానుంది. దసరాకు ముందే 18న రెండో విడత జాబితా విడుదల చేయాలని సీఈసీలో నిర్ణయం జరిగినట్లు చెబుతున్నారు. భేటీ అనంతరం స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ మాట్లాడుతూ.. ‘నేటి భేటీలో 70 సీట్లపై చర్చించాం. మరోమారు సీఈసీ భేటీ ఉంటుంది’ అని తెలిపారు. తొలి జాబితాలో ముఖ్య నేతలు తొలి జాబితాలో రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్కతో పాటు ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యేలు సీతక్క, పొదెం వీరయ్య, శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, సీడబ్ల్యూసీ సభ్యుడు దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, సీనియర్ నేతలు షబ్బీర్‌అలీ, సంపత్‌కుమార్, గడ్డం ప్రసాద్‌కుమార్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర్రావు, ఫిరోజ్‌ఖాన్, ప్రేమ్‌సాగర్‌రావు, అంజన్‌కుమార్ యాదవ్, పద్మావతి రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, కొండా సురేఖ, రామ్మోహన్‌రెడ్డి, బీర్ల ఐలయ్య, అనిరుద్‌రెడ్డి, వీర్లపలి శంకర్, కసిరెడ్డి నారాయణరెడ్డి, మైనంపల్లి హన్మంతరావు, రోహిత్‌రావు, గడ్డం వినోద్, ఎర్ర శేఖర్, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, కేకే మహేందర్‌రెడ్డి, కాట శ్రీనివాస్‌గౌడ్, వంశీకృష్ణ తదితరుల పేర్లు ఉన్నట్టు చెబుతున్నారు. కమ్యూనిస్టులతో పొత్తు, స్థానాలపై చర్చ సీఈసీ భేటీకి ముందు స్క్రీనింగ్ కమిటీ భేటీ జరిగింది. చైర్మన్ మురళీధరన్‌తో పాటు మాణిక్‌రావ్ ఠాక్రే, రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మధుయాష్కీగౌడ్ తదితరులు హాజరయ్యారు. సుమారు రెండు గంటల పాటు జరిగిన భేటీలో సింగిల్ పేర్లతో, రెండు, మూడేసి పేర్లతో ఉన్న అభ్యర్థుల జాబితాలు రూపొందించారు. వాటిని సీఈసీ ముందుంచాలని నిర్ణయించారు. ఇదే సమయంలో కమ్యూనిస్టులతో పొత్తు, వారికి ఇవ్వాల్సి సీట్ల కేటాయింపుపైనా చర్చించారు. మిర్యాలగూడ, మునుగోడు, ఖమ్మం, కొత్తగూడెం, హుస్నాబాద్ స్థానాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. అయితే దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ భేటీ తర్వాత జరిగిన సీఈసీ సమావేశంలోనూ పొత్తు, సీట్ల కేటాయింపు అంశంపై చర్చించారు. ఒకట్రెండు రోజుల్లో పొత్తు తేల్చాలని కేసీ వేణుగోపాల్, రేవంత్‌కు హైకమాండ్ పెద్దలు సూచించినట్లు తెలిసింది. ఇక టికెట్ దక్కని నేతలతో వారికున్న ప్రాధాన్యాన్ని బట్టి నేరుగా హైకమాండ్ పెద్దలు మాట్లాడాలన్న రాష్ట్ర నేతల సూచనకు అధిష్టానం ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. -
దసరా తర్వాతే బస్సు యాత్ర!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేతలంతా కలసి నిర్వహించ తలపెట్టిన బస్సుయాత్రకు బ్రేకులు పడ్డాయి. ఈ యాత్రను ముందుగా అనుకు న్నట్టు ఈ నెల 15 నుంచి కాకుండా దసరా పండుగ తర్వాత ప్రారంభించాలని పీసీసీ నేతలు నిర్ణయించారు. ఎన్నికల ప్రచారం ముగిసేదాకా బస్సు యాత్రను కొనసాగించడం ద్వారా అప్పటివరకు పార్టీ కేడర్‌లో ఉత్సాహాన్ని కొనసాగించవచ్చన్న వ్యూహంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు అభ్యర్థుల ఖరారు ప్రక్రియ ఓ కొలిక్కిరాకపోవడంతో అసమ్మతి బెడద నుంచి బయటపడేందుకే యాత్రను వాయిదా వేసినట్టు పలువురు నేతలు పేర్కొంటున్నారు. రెండు ప్రతిపాదనలు వాస్తవానికి ఈనెల 15వ తేదీ నుంచి రోజుకు మూడు నియోజకవర్గాల చొప్పున అన్ని జిల్లాలను చుట్టివచ్చేలా బస్సుయాత్ర చేపట్టాలని కాంగ్రెస్ సూత్రప్రాయంగా నిర్ణయించింది. రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశంలో చర్చించి దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలని భావించింది. ఈ మేరకు పీఏసీలో బస్సుయాత్రపై చర్చించిన నేతలు రెండు ప్రతిపాదనలు చేశారు. ఈ నెల 15 నుంచి 22 వరకు యాత్ర చేయాలని.. లేదంటే దసరా తర్వాతి నుంచి ఎన్నికలదాకా నిర్వహించాలని.. ఈ రెండింటిలో జాతీయ నాయకత్వం సూచన మేరకు ఏదో ఒక షెడ్యూల్‌ను ఖరారు చేయాలని మంగళవారం జరిగిన సమావేశంలో నిర్ణయించారు. ఇదే విషయాన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మీడియాకూ చెప్పారు. ఇందులో రెండో ప్రతిపాదనకే అధిష్టానం మొగ్గు చూపిందని, దసరా తర్వాతే యాత్రకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని తెలిసింది. ఐక్యంగా ఉన్నామని చాటేందుకే.. బస్సు యాత్ర వాయిదా వెనుక పలు కారణాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అభ్యర్థుల ప్రకటన ఈ నెల 16న లేదా 18న ఉండే అవకాశముంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు తేలకుండానే క్షేత్రస్థాయికి వెళ్లి ప్రయోజనం ఉండదన్న ఆలోచన వచ్చినట్టు తెలిసింది. అంతేగాకుండా ఈనెల 15 నుంచి ప్రారంభిస్తే యాత్ర మధ్యలో ఉండగానే అభ్య ర్థులను ప్రకటించాల్సి ఉంటుందని, టికెట్లు రాని వారి అసమ్మతి ప్రభావం యాత్రపై పడుతుందన్న భావన వ్యక్తమైనట్టు సమాచారం. ఈ మేరకు గొడవల మధ్య యాత్ర నిర్వహించడం ద్వారా ప్రయోజనం ఉండదనే భావనకు అధిష్టానం వచ్చినట్టు గాంధీభవన్ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు దసరా తర్వాత యాత్ర చేపట్టడం ద్వారా.. ఆ సమయంలో సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గే వంటి అగ్రనేతలు హాజరయ్యేలా షెడ్యూల్ రూపొందించి.. ఎన్నికల ప్రచారానికి ఊపు తేవచ్చనే ప్రణా ళికతో వాయిదాకే మొగ్గుచూపినట్టు వివరిస్తు న్నాయి. రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలంతా ఐక్యంగా ఉన్నారని ప్రజల్లో భావన కలిగించే ఉద్దేశమూ దెబ్బ తినదన్న ఆలోచన చేసినట్టు పేర్కొంటున్నాయి. -
తెలంగాణ పర్యటనకు రాహుల్ గాంధీ
-
సోనియా త్యాగంతోనే తెలంగాణ వచ్చింది
లక్డీకాపూల్ (హైదరాబా ద్): సోనియా గాంధీ త్యాగంతోనే ప్రత్యేక తెలంగాణ వచ్చిందని దివంగత ప్రజాగాయకుడు గద్దర్ సతీమణి విమల అన్నారు. ఆమె త్యాగనిరతి ఏంటో తనకు తెలుసని స్పష్టం చేశారు. సీడబ్ల్యూసీ సమావేశాలలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన సోనియా గాంధీ ఆదివారం గద్దర్ కుటుంబాన్ని ఓదార్చారు. ఆరోగ్య కారణాల రీత్యా సోనియా తాను బస చేసిన తాజ్ కృష్ణా హోటల్‌కే విమలను పిలిపించుకున్నారు.ఆమెతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు కూడా గద్దర్ కుటుంబాన్ని ఓదార్చారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ మాట్లాడుతూ.. ప్రజల హక్కుల కోసం గద్దర్ చేసిన పోరాటాలను కొనియాడారు. రాహుల్ స్పందిస్తూ.. గద్దర్ తనకు అత్యంత ప్రియమైన వ్యక్తి అని సోనియా, ప్రియాంకలకు చెప్పారు. ఆయన గద్దర్ కుటుంబానికి ధైర్యం చెప్పారు. అనంతరం విమల మీడియాతో మాట్లాడు తూ.. త్యాగమంటే ఏంటో సోనియాకు తెలు సు కాబట్టే ఆమెను కలవాలనుకున్నానని చెప్పారు. ఆ త్యాగం కేసీఆర్‌కు తెలియదని, ఆయన నిరాహార దీక్షలతో తెలంగాణ సిద్ధంగా లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాజ్యాంగాన్ని పరిరక్షిస్తుందని విమల స్పష్టం చేశారు. -
కాంగ్రెస్ CWC మీటింగ్‌లో కీలక అంశాలపై చర్చ
-
హైదరాబాద్ వేదికగా సీడబ్ల్యూసీ సమావేశం
-
తొలిసారి హైదరాబాద్ గడ్డపై సీడబ్ల్యుసీ సమావేశం