సంభాల్‌ ఘటన: యూపీ ప్రభుత్వంపై ప్రియాంక మండిపాటు | Priyanka Gandhi Raised Questions on up Government | Sakshi
Sakshi News home page

సంభాల్‌ ఘటన: యూపీ ప్రభుత్వంపై ప్రియాంక మండిపాటు

Published Mon, Nov 25 2024 11:29 AM | Last Updated on Mon, Nov 25 2024 12:52 PM

Priyanka Gandhi Raised Questions on up Government

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లోగల జామా మసీదు సర్వే పనుల్లో చోటుచేసుకున్న హింసపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా స్పందించారు. ఈ ఘటనలో యూపీ ప్రభుత్వ వైఖరిపై  ఆమె విమర్శలు గుప్పించారు. ఎలాంటి విచారణ లేకుండానే అధికారులు హడావుడిగా చర్యలు చేపట్టారని ఆమె ఆరోపించారు.

అధికారంలో ఉన్నప్పుడు  ఏ ప్రభుత్వానికైనా వివక్ష, అణచివేత, విభజన ధోరణి తగదని ప్రియాంక గాంధీ అన్నారు. సుప్రీం కోర్టు  సంభాల్‌ ఘటనను  పరిగణలోకి తీసుకుని, న్యాయం చేయాలని ప్రియాంకాగాంధీ కోరారు. సంభాల్‌లోని జామా మసీదు సర్వేను వ్యతిరేకిస్తున్న నిరసనకారులు పోలీసులతో హింసాత్మక ఘర్షణకు పాల్పడ్డారు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, 20 మంది భద్రతా సిబ్బంది సహా పలువురు గాయపడ్డారు. ఈ ఘటన అనంతరం జిల్లాలో 12వ తరగతి వరకు పాఠశాలలను మూసివేయాలని  అధికారులు ఆదేశించారు. దీంతో పాటు ఇంటర్నెట్‌పై నిషేధం విధించారు. అలాగే నవంబర్ 30 వరకు బయటి వ్యక్తులు జిల్లాలోకి రాకుండా జిల్లా యంత్రాంగం నిషేధం విధించింది. 


ఇది కూడా చదవండి: డబ్బు కోసం కాదు, మోక్షం కోసం : నృత్యం బాధ నుంచి పుడుతుంది! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement