Sambhal
-
యూపీలో ఆలూ కోల్డ్‌స్టోరేజీలో ప్రమాదం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో బంగాళదుంపలు నిల్వ చేసే ఒక కోల్డ్ స్టోరేజీ పైకప్పు కుప్పకూలిపోయిన ఘటనలో 14 మంది మరణించారు. చాందౌసీ పోలీసు స్టేషన్ పరిధిలో ఇందిరా రోడ్డులో ఉన్న ఈ కోల్డ్ స్టోరేజీ పై కప్పు గురువారం రాత్రి హఠాత్తుగా కుప్పకూలింది. ఆ సమయంలో కోల్డ్ స్టోరేజీ లోపల ఆలూ బస్తాలను అన్లోడ్ చేస్తున్న వర్కర్లు శిథిలాల కింద చిక్కుకున్నారు. సహాయ సిబ్బంది 24 మందిని ఆలూ బస్తాల నుంచి బయటకు తీసుకురాగా వారిలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. సహాయ కార్యక్రమాలు దాదాపుగా పూర్తి అయ్యాయని డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (డీఐజీ) ఆఫ్ పోలీసు శలభ మాథూర్ వెల్లడించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆస్పత్రిని సందర్శించిన యోగి బాధితుల్ని పరామర్శించారు. ఈ ప్రమాదం ఎందుకు జరిగిందో తెలుసుకోవడానికి ఒక కమిటీ వేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున నష్టపరిహారం, గాయపడిన వారికి చికిత్స కోసం రూ.50 వేలు ప్రకటించారు. ప్రమాదం జరిగిన సమయంలో కోల్డ్ స్టోరేజీలో ఉన్న వారిలో ఆరుగురు స్వల్పగాయాలకు చికిత్స తీసుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగా మరో నలుగురికి చికిత్స జరుగుతోందని జిల్లా మేజిస్ట్రేట్ మనీష్ బన్సల్ తెలిపారు. పోలీసులు చెప్పిన సమాచారం ప్రకారం ఈ కోల్డ్ స్టోరేజీని మూడు నెలల క్రితమే నిర్మించారు. ప్రభుత్వం దగ్గర్నుంచి సరైన అనుమతులు లేకుండానే హడావుడిగా దీని నిర్మాణం కొనసాగించినట్టు పోలీసులు చెప్పారు. అంతేకాకుండా కోల్డ్ స్టోరేజీ సామర్థ్యానికి మించి బంగాళ దుంప బస్తాలు నిల్వ చేసినట్టుగా తెలుస్తోంది. ఇవే ప్రమాదానికి దారి తీసినట్టు భావిస్తున్నారు. -
షాకింగ్ వీడియో: యువతి మృతదేహాన్ని..
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వాసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. యువతి మృతదేహాన్ని ఓ వీధి కుక్క కొరుక్కుతినేందుకు ప్రయత్నించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో అధికారుల నిర్లక్ష్యంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరాలు.. రోడ్డు ప్రమాదానికి గురైన ఓ యువతిని సంభాల్ జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ క్రమంలో బాధితురాలి మృతదేహంపై తెల్లని వస్త్రం కప్పి ఆస్పత్రి ప్రాంగణంలో స్ట్రెచర్‌పై పడుకోబెట్టారు. అయితే అక్కడే తచ్చాడుతున్న ఓ వీధి కుక్క శవాన్ని కొరుక్కుతినేందుకు ప్రయత్నించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను కొంతమంది కెమెరాలో బంధించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కాగా ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తమ కూతురు మరణించిందని మృతురాలి తండ్రి చరణ్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. గంటన్నరపాటు ఒక్క వైద్యుడు కూడా అందుబాటులోకి రాలేదని, ఆలస్యం కావడంతో తన కుమార్తె ప్రాణాలు కోల్పోయిందని ఆరోపించారు. వీధికుక్కలు లోపలికి వచ్చినా సిబ్బంది పట్టించుకోవడం లేదని, వారి నిర్లక్ష్యం వల్ల ఇంకెంత మంది ఇబ్బందులు ఎదుర్కోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.(చదవండి: కోవిడ్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. ఐదురుగు మృతి) ఇక ఈ ఘటనపై స్పందించిన చీఫ్ మెడికల్ సూపరిండిండెంట్.. ఆస్పత్రిలో వీధి కుక్కల సంచారం గురించి స్థానిక అధికారులకు సమాచారమిచ్చామని, అయినా వారు స్పందించలేదని పేర్కొన్నారు. యువతి మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించామని, ఇందులో తమ తప్పేమీ లేదని సమర్థించుకున్నారు. అయితే విచారణ అనంతరం స్వీపర్, వార్డ్బాయ్ నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని, వారిద్దరిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అయితే ఆస్పత్రిలో అధిక సంఖ్యలో మృతదేహాలు ఉన్న కారణంగానే వారు అందుబాటులో లేకుండా పోయారని, పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తామని పేర్కొన్నారు. కాగా ఈ ఘటనపై సమాజ్‌వాదీ పార్టీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను ట్విటర్లో షేర్ చేసింది. దీంతో యోగి సర్కారు పనితీరుపై సోషల్ మీడియాలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. संभल में स्वास्थ्य सेवाओं की रोंगटे खड़े कर देने वाली खौफनाक तस्वीर आई सामने।जिला अस्पताल में स्वास्थ्य कर्मियों की लापरवाही की वजह से स्ट्रेचर पर रखे बच्ची के शव को कुत्तों ने नोच कर खाया। जांच करा लापवाही बरतने वालों के खिलाफ हो सख्त कार्रवाई। शोकाकुल परिवार के प्रति संवेदना! pic.twitter.com/3tgEHCTQpb — Samajwadi Party (@samajwadiparty) November 26, 2020 -
ఇలాంటి భర్తతో వేగలేను: విడాకులు ఇప్పించండి!
లక్నో: సాధారణంగా భర్త టార్చర్ పెడుతున్నాడనో, అత్తమామలు, ఆడపడుచుల ఆరళ్లు తట్టుకోలేకపోతున్నామనో వివాహితలు విడాకులు కోరిన ఘటనలు మనం చూస్తూనే ఉంటాం. కానీ ఉత్తరప్రదేశ్‌లో ఓ గృహిణి మాత్రం వింత కారణం చెప్పి.. భర్త నుంచి విడిపోవాలనుకుంటోంది. అతి ప్రేమతో వేగలేకపోతున్నానని, ఒక్కసారి కూడా తనతో గొడవపడని భర్తతో కాపురం చేయలేనంటూ షరియా కోర్టును ఆశ్రయించింది. సదరు మహిళ ప్రవర్తించిన తీరు మనతో పాటు మత పెద్దలను కూడా ఆశ్చర్యపరిచింది. ఓ జాతీయ మీడియా కథనం ప్రకారం.. యూపీలోని సంభల్ జిల్లాకు చెందిన మహిళకు 18 నెలల క్రితం నిఖా జరిగింది. దంపతులు మధ్య ఎలాంటి గొడవలు లేవు. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. (ఆ కారణానికి కూడా విడాకులు ఇచ్చేస్తారా?) అయితే కొన్ని రోజుల క్రితం ఉన్నట్టుండి సదరు వివాహిత షరియా కోర్టును ఆశ్రయించడంతో భార్యాభర్తల మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయేమోనని అంతా భావించారు. కానీ మత పెద్దల ముందు ఆమె చెప్పిన కారణాలు విని అంతా నిర్ఘాంతపోయారు. ‘‘నా భర్త నాపై ఒక్కసారి కూడా అరవలేదు. ప్రతీ విషయంలోనూ నాకే వత్తాసు పలుకుతాడు. తప్పు చేసినా క్షమిస్తాడు. ఒక్కసారి కూడా కోపగించుకోడు. ఏడాదిన్నరగా ఇదే తంతు. తనతో సరదాకైనా గొడవ పడాలని ఉంటుంది. అందుకే ఏదో ఒక విషయంలో గోల చేస్తాను. అయినా తనే వెనక్కి తగ్గుతాడు. అంతేకాదు ఇంటి పనుల్లో కూడా నాకు సాయం చేస్తాడు. ఆయన ప్రేమ నాకు ఊపిరి సలపకుండా చేస్తోంది. అందుకే విడాకులు తీసుకోవాలనుకుంటున్నాను’’ అని చెప్పింది. ఈ క్రమంలో ఈ కారణానికే విడిపోవడం సరికాదని, మరే ఇతర ఇబ్బందులు ఉన్నా తమకు చెప్పాలని అడుగగా.. అలాంటిదేమీ లేదని సమాధానమిచ్చింది. దాంతో ఈ విషయంలో తామేమీ చేయలేమని మత పెద్దలు చెప్పడంతో ఈ వ్యవహారం స్థానిక పంచాయతికి చేరింది. అక్కడ కూడా సదరు మహిళ ఇదే కారణం చెప్పడంతో.. ‘మిస్టర్ పర్ఫెక్ట్ హజ్బెండ్’గా ఉండటం కూడా తప్పేనా అంటూ ఆమె భర్త మొరపెట్టుకోవడంతో పంచాయతి కూడా ఈ విషయంపై ఎటూతేల్చలేక.. కుటుంబ సభ్యుల మధ్య సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. అనుకుంటాం గానీ ఒక్కోసారి అతిప్రేమ కూడా ప్రమాదకరమే..! ఎదుటివారి మనసెరిగి ప్రవర్తించడం అందరికీ మంచిది! ఏదేమైనా చిన్న చిన్న తగాదాలు, సరాదాలు, సంతోషాలు, అలకలు ఉంటేనే జీవితం పరిపూర్ణంగా ఉంటుందంటున్నారు వీరి వ్యవహారం గురించి విన్నవాళ్లు? మరికొంత మంది మాత్రం ప్రేమ పేరిట స్వేచ్ఛను హరించేస్తే ఎవరూ ఎవరి ప్రేమను తట్టుకోలేరు అంటున్నారు? అంతే అంటారా? -
అధ్యక్షుడిని కలవడం కోసం వరుడి వేషంలో..
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఆజం ఖాన్ మీద రాష్ట్రవ్యాప్తంగా పలు కేసులు నమోదయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం ఆ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, ఆజంఖాన్‌కు మద్దతుగా రాంపూర్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ నేపథ్యంలో పోలీసులు రాంపూర్ ప్రాంతంలో 144 సెక్షన్‌ని విధించారు. అయితే ఆ పార్టీ నాయకుడొకరు ఈ నిషేధాజ్ఞలను వినూత్న రీతిలో ఉల్లంఘించాడు. అఖిలేష్‌ను కలవడం కోసం ఏకంగా పెళ్లి కుమారుడి వేషంలో వచ్చాడు. ఆ వివరాలు.. రాంపూర్‌లో పర్యటిస్తున్న అఖిలేష్‌ను కలవడం కోసం సంభల్‌కు చెందిన ఆ పార్టీ నాయకుడు ఫిరోజ్ ఖాన్, కార్యకర్తలతో కలిసి పెళ్లి కుమారుడి వేషంలో వచ్చారు. ఈ సందర్భంగా అఖిలేష్ మాట్లాడుతూ.. ‘యోగి ప్రభుత్వం మా పార్టీ ఎంపీని టార్గెట్ చేసింది. నెల రోజుల వ్యవధిలోనే ఆయన మీద దాదాపు 80 కేసులు పెట్టింది. వాటిల్లో బర్రె, మేక దొంగతనం కేసులు కూడా ఉండటం గమనార్హం. ఇవన్ని నిరాధార ఆరోపణలు. ప్రభుత్వం ఎన్ని అసత్యాలు ప్రచారం చేసినా ప్రజలు ఆజం ఖాన్పైనే విశ్వాసం ఉంచుతార’ని పేర్కొన్నాడు. (చదవండి: గేదెను దొంగిలించాడని ఎంపీపై కేసు) ఆజం ఖాన్ ప్రభుత్వ భూముల ఆక్రమణకు పాల్పడినట్లు జిల్లా యంత్రాంగం నుంచి అనేక ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వ భూములతోపాటు పేద రైతులనుంచి వ్యవసాయ భూములను కూడా స్వాహా చేశాడంటూ అతనిపై వరుస కేసులు నమోదైనాయి. ఈ నేపథ్యంలోనే జూలై 29న యూపీ ప్రభుత్వం ఆజం ఖాన్‌ను ల్యాండ్ మాఫియాగా ప్రకటించింది. అలాగే ఖాన్‌కు చెంది మహమ్మద్ అలీ జౌహార్యూనివర్శిటీకి విదేశీ విరాళాలకు సంబంధించి మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ విభాగం (ఈడీ) కూడా విచారణ చేపట్టింది. ఆయనపై నమోదైన కేసుల (30 దాకా) వివరాలపై స్థానిక అధికారులను ఆరా తీస్తోంది. -
దారుణాతి దారుణం.. పోలీసులూ స్పందించలేదు
మరో దారుణాతి దారుణమైన ఘటన యూపీలో చోటు చేసుకుంది. ఓ వివాహితపై అఘాయిత్యానికి పాల్పడ్డ దుండగులు.. తిరిగొచ్చి దాష్టీకానికి పాల్పడ్డారు. దగ్గరల్లోనే ఓ ఆలయంలోకి ఈడ్చుకెళ్లి మరీ సజీవ దహనం చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే... సంభల్ జిల్లాలోని రాజాపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. భర్త ఘజియాబాద్‌లో కూలీ పనులు చేసుకుంటుండగా.. సదరు మహిళ(35) ఇద్దరి పిల్లలతో గ్రామంలోనే ఉంటోంది. శనివారం వేకువ ఝామున ఇంట్లోకి దూసుకొచ్చిన ఐదుగురు దుండగులు ఆమెపై గ్యాంగ్ రేప్ చేశారు. ఆపై నిందితులు అక్కడి నుంచి వెళ్లిపోగా.. ఆమె 100 హెల్ప్‌లైన్ సెంటర్‌కి ఫోన్ చేసింది. అయితే అవతలి నుంచి ఎలాంటి స్పందన లేకపోవటంతో.. భర్త, సోదరుడిపై ఫోన్ కాల్స్ చేసింది. వాళ్లు పోలీసులను అప్రమత్తం చేసే లోపే.. తిరిగొచ్చిన నిందితులు ఆమెను దగ్గర్లోనే ఓ ఆలయంలోకి లాక్కెల్లారు. అక్కడ యజ్ఞశాలలో ఆమెపై కిరోసిన్ పోసి తగలబెట్టారు. ఆడియో క్లిప్ కీలకం... కాగా, ఘటన తర్వాత స్థానిక మహిళలను క్లూస్ టీమ్‌ను అడ్డుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన ఏడీజీ ప్రేమ్ ప్రకాశ్ వారిని సుముదాయించారు. ‘100కు కాల్ చేసిన స్పందించలేదన్న విమర్శలు వచ్చాయి. దర్యాప్తుకు ఆదేశించాం. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. బాధితురాలు ఫోన్‌కాల్‌లో నిందితుల పేర్లు వెల్లడించింది. ఆ ఆడియో క్లిప్ ఈ కేసులో సాక్ష్యంగా కీలకం కానుంది. ఐదుగురు నిందితులను గుర్తించాం. వారి కోసం గాలింపు చేపట్టాం’ అని ప్రేమ్ ప్రకాశ్ వెల్లడించారు. అత్యాచారం నిజంకాదు: ఎస్పీ ... అయితే ఈ ఘటనలో బాధితురాలిపై అత్యాచారం జరగలేదని, నిందితుల ఉద్దేశం వేరే ఉందని సంభల్ ఎస్పీ ఆర్ఎమ్ భరద్వాజ్ వెల్లడించారు. శనివారం ఉదయం ఓ ఛానెల్‌తో ఆయన మాట్లాడుతూ.. నిందితులంతా స్థానికులేనన్న ఆయన.. త్వరలో అరెస్ట్ చేసి, ప్రెస్మీట్లో అసలు వివరాలు వెల్లడిస్తామని భరద్వాజ్ తెలిపారు. -
బక్రీద్ రోజు జంతు వధ బ్యాన్.. కఠిన చర్యలు!
సాక్షి, సంభల్: బక్రీద్ పూట ఉత్తర ప్రదేశ్‌లోని సంభల్ ప్రాంతంలో జంతు బలి నిషేధంపై అధికారులు వివాదాస్పద ఉత్తర్వులు జారీ చేశారు. ఎవరైనా అలాంటి చర్యలకు పాల్పడితే వారిపై గ్యాంగ్ స్టర్ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్ రషీద్ ఖాన్ హెచ్చరించారు. ‘కుర్బానీ పేరిట ఎవరైనా ఆవు, ఎద్దు, దున్నపోతు, ఒంటెలను బలి ఇవ్వటం నిషేధం. సెప్టెంబర్ 2 నుంచి 4 వరకు ఈ ఆజ్ఞలు అమలులో ఉంటాయి. ఉల్లంఘించిన వారిపై గ్యాంగ్ స్టర్ యాక్ట్ కింద కఠిన చర్యలు ఉంటాయి’ అని ఆయన తెలిపారు. ఆదేశాలు తక్షణమే అమలులోకి వచ్చినట్లు రషీద్ వెల్లడించారు. గ్యాంగ్ స్టర్ యాక్ట్ ప్రకారం సదరు వ్యక్తి పేరును పోలీస్ రికార్డుల్లో చేరుస్తారు. వారిపై నిఘా కూడా ఎక్కువగా ఉంటుంది. మాములు పరిస్థితుల్లో 14 రోజులు, ఉద్రిక్తల సమయంలో 60 రోజులపాటు పోలీస్ రిమాండ్‌లో ఉంచుకునేందుకు ఆస్కారం ఉంది. బకర్ ఈద్(ఈద్-ఉల్-జుహ). అంటే గొర్రెను బలిచ్చే పండుగ అని అర్ధం. ఇబ్రహీం త్యాగానికి ప్రతీకగా బక్రీద్ రోజు ప్రతి ముస్లిం జంతు బలి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. బలి ఇచ్చిన తర్వాత దానిని మూడు భాగాలుగా విభజించి ఒక భాగాన్ని పేదలకు, మరొక భాగాన్ని బంధువులకు పంచుతారు. ఇంకొక భాగాన్ని తమ కోసం ఉంచుకుంటారు. తక్బీర్ ను పఠిస్తూ ప్రార్థనలకు చేస్తూ బక్రీద్ ను జరుపుకుంటారు. -
యూపీలో మరో సామూహిక అత్యాచారం!
ఉత్తరప్రదేశ్‌లో మరో సామూహిక అత్యాచార ఘటన చోటు చేసుకుంది. సంబల్ జిల్లాలోని అసములి ప్రాంత నివాసిస్తున్న ఓ యువతి (35) తనపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారం చేశారని ఆరోపించింది. అత్యాచార నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని సాంబల్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఆ ఘటనపై విచారణ జరిపి నిందితులను అరెస్ట్ చేయాలని ఎస్పీ అదేశాలు జారీ చేశారని స్థానిక పోలీసు అధికారి జగ్వీర్ సింగ్ శనివారం వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే బాధితురాలిని వైద్య పరీక్షల కోసం జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. వైద్య నివేదిక అందిన వెంటనే దర్యాప్తు మరింత వేగవంతం చేస్తామని వెల్లడించారు. జూన్ 5వ తేదీ బాధితురాలు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో నలుగురు యువకులు ప్రవేశించి... ఆమెపై సామూహిక అత్యాచారం చేశారని ఆరోపించిందని పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు.