లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో చెలరేగిన హింస నేపథ్యంలో జిల్లాలో శాంతిభద్రతలను కాపాడేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. డిసెంబర్ 10 వరకు బయట వ్యక్తులు సంభాల్ జిల్లాను సందర్శించకుండా నిషేధం విధిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ‘డిసెంబర్ 10 వరకు ఎలాంటి బయట వ్యక్తులు, ఏ సామాజిక సంస్థ, ప్రజా ప్రతినిధి అయినా అధికార యంత్రాంగం అనుమతి లేకుండా జిల్లా సరిహద్దుల్లోకి ప్రవేశించకూడదు’ అని కలెక్టర్ రాజేద్ర పెన్సియా పేర్కొన్నారు.
కాగా షాహి జామా మసీదులో ఇటీవల జరిగిన హింసాకాండపై దర్యాప్తు చేసేందుకు అసెంబ్లీ ప్రతిపక్షనేత మాతా ప్రసాద్ పాండే నేతృత్వంలో .15 సభ్యుల బృందం ఏర్పాటైంది. ఈ క్రమంలో శనివారం హింసాత్మక జిల్లాకు వెళుతున్న 15 మంది సభ్యుల సమాజ్‌వాదీ పార్టీ నాయకుల ప్రతినిధి బృందాన్ని అదుపులోకి తీసుకుంది. దీనిపై ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వ పాలనపై విమర్శలు గుప్పించారు.
ప్రభుత్వ పరిపాలనా పూర్తిగా వైఫల్యం చెందిందని, బీజేపీ తన నిర్లక్ష్యాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. జిల్లాలో నిషేధం విధించడం బీజీపీ పాలన, ప్రభుత్వ నిర్వహణ వైఫల్యం. ఇదే ప్రభుత్వం ముందే నిషేధం విధిస్తే సంభాల్‌లో శాంతి వాతావరణం దెబ్బతినేది కాదని అన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు సంభాల్‌లోని మొత్తం పరిపాలనా యంత్రాంగాన్ని సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
प्रतिबंध लगाना भाजपा सरकार के शासन, प्रशासन और सरकारी प्रबंधन की नाकामी है। ऐसा प्रतिबंध अगर सरकार उन पर पहले ही लगा देती, जिन्होंने दंगा-फ़साद करवाने का सपना देखा और उन्मादी नारे लगवाए तो संभल में सौहार्द-शांति का वातावरण नहीं बिगड़ता।
भाजपा जैसे पूरी की पूरी कैबिनेट एक साथ… pic.twitter.com/7ouboVnQu4— Akhilesh Yadav (@yadavakhilesh) November 30, 2024
ఇదిలా ఉండగా మొఘల్ కాలం నాటి షాహి జామా మసీదులో కోర్టు సర్వే చేయాలని ఆదేశించడంతో నవంబర 24న హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్నాయి.సర్వేను వ్యతిరేకిస్తున్న నిరసనకారులు భద్రతా బలగాలతో ఘర్షణ పడ్డారు. దీంతో రాళ్లదాడికి దారితీసింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ట్రయల్ కోర్టు ఉత్తర్వులపై మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
శుక్రవారం ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్‌ల ధర్మాసనం.. సంభల్ జిల్లాలో శాంతి, సామరస్యాలు నెలకొనడం కీలకమని పేర్కొంది. జామా మసీదు వివాదంపై తదుపరి విచారణను తాత్కాలికంగా నిలిపివేయాలని ట్రయల్ కోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ట్రయల్ కోర్టు సర్వే ఉత్తర్వులను తొలుత సుప్రీంకోర్టులో సవాల చేయకుండా హైకోర్టులో సవాల్ చేయాలని మసీదు కమిటీకి ధర్మాసనం సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment