Samajwad Party
-
‘సంభాల్’లోకి ప్రవేశం నిరాకరణ.. అఖిలేష్ యాదవ్ విమర్శలు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో చెలరేగిన హింస నేపథ్యంలో జిల్లాలో శాంతిభద్రతలను కాపాడేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. డిసెంబర్ 10 వరకు బయట వ్యక్తులు సంభాల్ జిల్లాను సందర్శించకుండా నిషేధం విధిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ‘డిసెంబర్ 10 వరకు ఎలాంటి బయట వ్యక్తులు, ఏ సామాజిక సంస్థ, ప్రజా ప్రతినిధి అయినా అధికార యంత్రాంగం అనుమతి లేకుండా జిల్లా సరిహద్దుల్లోకి ప్రవేశించకూడదు’ అని కలెక్టర్ రాజేద్ర పెన్సియా పేర్కొన్నారు.కాగా షాహి జామా మసీదులో ఇటీవల జరిగిన హింసాకాండపై దర్యాప్తు చేసేందుకు అసెంబ్లీ ప్రతిపక్షనేత మాతా ప్రసాద్ పాండే నేతృత్వంలో .15 సభ్యుల బృందం ఏర్పాటైంది. ఈ క్రమంలో శనివారం హింసాత్మక జిల్లాకు వెళుతున్న 15 మంది సభ్యుల సమాజ్‌వాదీ పార్టీ నాయకుల ప్రతినిధి బృందాన్ని అదుపులోకి తీసుకుంది. దీనిపై ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వ పాలనపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ పరిపాలనా పూర్తిగా వైఫల్యం చెందిందని, బీజేపీ తన నిర్లక్ష్యాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. జిల్లాలో నిషేధం విధించడం బీజీపీ పాలన, ప్రభుత్వ నిర్వహణ వైఫల్యం. ఇదే ప్రభుత్వం ముందే నిషేధం విధిస్తే సంభాల్‌లో శాంతి వాతావరణం దెబ్బతినేది కాదని అన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు సంభాల్‌లోని మొత్తం పరిపాలనా యంత్రాంగాన్ని సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.प्रतिबंध लगाना भाजपा सरकार के शासन, प्रशासन और सरकारी प्रबंधन की नाकामी है। ऐसा प्रतिबंध अगर सरकार उन पर पहले ही लगा देती, जिन्होंने दंगा-फ़साद करवाने का सपना देखा और उन्मादी नारे लगवाए तो संभल में सौहार्द-शांति का वातावरण नहीं बिगड़ता। भाजपा जैसे पूरी की पूरी कैबिनेट एक साथ… pic.twitter.com/7ouboVnQu4— Akhilesh Yadav (@yadavakhilesh) November 30, 2024ఇదిలా ఉండగా మొఘల్ కాలం నాటి షాహి జామా మసీదులో కోర్టు సర్వే చేయాలని ఆదేశించడంతో నవంబర 24న హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్నాయి.సర్వేను వ్యతిరేకిస్తున్న నిరసనకారులు భద్రతా బలగాలతో ఘర్షణ పడ్డారు. దీంతో రాళ్లదాడికి దారితీసింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ట్రయల్ కోర్టు ఉత్తర్వులపై మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.శుక్రవారం ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ల ధర్మాసనం.. సంభల్ జిల్లాలో శాంతి, సామరస్యాలు నెలకొనడం కీలకమని పేర్కొంది. జామా మసీదు వివాదంపై తదుపరి విచారణను తాత్కాలికంగా నిలిపివేయాలని ట్రయల్ కోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ట్రయల్ కోర్టు సర్వే ఉత్తర్వులను తొలుత సుప్రీంకోర్టులో సవాల చేయకుండా హైకోర్టులో సవాల్ చేయాలని మసీదు కమిటీకి ధర్మాసనం సూచించింది. -
UP By Election: వరుస వీడియోలతో పోలీసులపై సమాజ్‌వాదీ మండిపాటు
అంబేద్కర్‌నగర్: ఉత్తరప్రదేశ్‌లోని తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల పోలింగ్ నేటి (బుధవారం)ఉదయం ఏడు గంటల నుంచి కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. मुजफ्फरनगर की मीरापुर विधानसभा के किथोड़ा में बूथ संख्या 178, 179 पर पुलिस द्वारा मतदाताओं को वोट डालने से रोका जा रहा है।संज्ञान ले चुनाव आयोग, निष्पक्ष मतदान सुनिश्चित हो।@ecisveep @ceoup @DmMuzaffarnagar pic.twitter.com/u9QUq2Pov1— Samajwadi Party (@samajwadiparty) November 20, 2024ఈ క్రమంలో సమాజ్‌వాదీ పార్టీ తన ట్విట్టర్ హ్యాండిల్ నుండి ఒక వీడియోను షేర్ చేసింది. దానిలో బురఖా ధరించిన ఒక మహిళ తనను ఓటు వేయకుండా పోలీసులు అడ్డుకున్నారని ఆరోపించింది. బూత్ వద్ద తన ఐడీని చూపించినప్పటికీ తనకు ఓటు వేసేందుకు అనుమతినివ్వలేదని ఆమె పేర్కొంది. ఈ వీడియో కింద.. అంబేద్కర్ నగర్‌లోని కతేహరి అసెంబ్లీలోని బూత్ నంబర్ 65లో ఓటు వేయకుండా బురఖా ధరించిన మహిళను పోలీసులు అడ్డుకున్నారు. ఎన్నికల సంఘం దీనిపై దృష్టి సారించి, నిష్పక్షపాతంగా ఓటింగ్ జరిగేలా చూడాలి’ అని సమాజ్‌వాదీ పార్టీ రాసింది.अम्बेडकर नगर की कटेहरी विधानसभा के बूथ संख्या 65 पर पुलिस द्वारा मतदाताओं को वोट डालने से रोका जा रहा है।संज्ञान ले चुनाव आयोग, निष्पक्ष मतदान सुनिश्चित हो।@ecisveep @ceoup @AmbedkarnagarDM pic.twitter.com/tYi9h8XSXo— Samajwadi Party (@samajwadiparty) November 20, 2024ఇదేవిధంగా కాన్పూర్‌లోని సిసామావు అసెంబ్లీ ఓటింగ్‌కు సంబంధించిన వీడియోను సమాజ్‌వాదీ పార్టీ షేర్ చేస్తూ, ఓటు వేయకుండా ఓటర్లను పోలీసులు అడ్డుకుంటున్నారని, వారి గుర్తింపు కార్డులను తనిఖీ చేస్తూ వారిని వేధిస్తున్నారని ఆరోపించింది. ఎన్నికల సంఘం దీనిని గమనించాలని కోరింది.अंबेडकरनगर की कटेहरी विधानसभा के बूथ संख्या 120, 121 पर पूर्व सांसद रितेश पांडे के समर्थकों द्वारा बूथ पर भाजपा का झंडा लगाकर किया जा रहा कब्जा।संज्ञान ले चुनाव आयोग, निष्पक्ष मतदान सुनिश्चित हो।@ecisveep @ceoup @AmbedkarnagarDM pic.twitter.com/sIh4tMcnGN— Samajwadi Party (@samajwadiparty) November 20, 2024ఇదేవిధంగా ముజఫర్గర్లోని మీరాపూర్ స్థానానికి సంబంధించిన వీడియోను షేర్ చేసిన ఎస్పీ, ముజఫర్‌నగర్‌లోని మీరాపూర్ అసెంబ్లీ కితోడాలో బూత్ నంబర్ 178, 179లో ఓటర్లు ఓటు వేయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని రాసింది. మొరాదాబాద్‌లోని కుందర్కి అసెంబ్లీలోని బూత్ నంబర్ 162 వద్ద ఓటర్ల స్లిప్పులను పోలీసులు లాక్కుంటున్నారని ఆరోపించింది.ఇది కూడా చదవండి: UP By Election: అల్లరి మూకలకు అఖిలేష్ హెచ్చరిక -
మెరుగైన ఫలితాలు సాధిస్తాం: అఖిలేశ్
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో జరగబోయే 10 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో సమాజ్‌వాదీ మెరుగైన ఫలితాలు సాధిస్తుందని ఆ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ బుధవారం విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అధికార బీజేపీలో అంతర్గత పోరు ఉందని, అధికారం కోసం వారి కుమ్ములాటలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ఇంతకుముందు ఇతర పార్టీల్లో చీలిక రాజకీయాలు చేసిన బీజేపీ ఇప్పుడు సొంత పార్టీలోనూ చీలికలకు పాల్పడుతోందన్నారు. -
కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు పాకిస్తాన్ సానుభూతిపరులు... ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఆగ్రహం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
‘అసెంబ్లీలో ఈ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో చూడండి?’
లక్నో: శాసనసభా సమావేశాలు రాష్ట్రం, ప్రజల భవిష్యత్తును నిర్ణయిస్తాయి. అధికార, విపక్ష పార్టీల ఎమ్మెల్యేలు తమ వంతు పాత్ర పోషించి.. తీసుకునే నిర్ణయాల్లో భాగమవుతారు. అయితే, కొందరు ఎమ్మెల్యేలు అశ్రద్ధగా వ్యవహరిస్తూ విమర్శల పాలవుతున్నారు. మనకేందుకులే అనుకుని నిద్రపోయిన ఎమ్మెల్యేల సంఘటనలు చాలానే చూసుంటాం. అయితే, ఓవైపు కీలక చర్చ జరుగుతుండగా కొందరు బీజేపీ ఎమ్మెల్యేలు తమకేమి పట్టనట్టు ఫోన్లలో వీడియో గేమ్స్ ఆడటంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీలో జరిగింది. ఎమ్మెల్యేలకు సంబంధించిన రెండు వీడియోలను సమాజ్‌వాది పార్టీ శనివారం ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ‘ఈ వ్యక్తులు ప్రజల సమస్యలకు సమాధానం చెప్పరు. అసెంబ్లీని ఒక వినోద హబ్‌గా మార్చేశారు. ఇది చాలా నీచమైన, అవమానకరమైన చర్య.’ అంటూ పేర్కొంది ఎస్పీ పార్టీ. సమాజ్‌వాది పార్టీ షేర్ చేసిన వీడియోలు సోషల్ మీడియలో వైరల్‌గా మారాయి. మొదటి వీడియోలో.. మొహబా ఎమ్మెల్యే రాకేశ్ గోస్వామి తన మొబైల్ ఫోన్లో కార్డ్స్ గేమ్ ఆడుతున్నారు. మరోవైపు సభ జరుగుతున్నట్లు మాటలు, చప్పట్లు స్పష్టంగా వినిపిస్తున్నాయి. రెండో వీడియోలో.. ఝాన్సీ ఎమ్మెల్యే రవి శర్మ అసెంబ్లీలో కూర్చుని పోగాకు ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. డెస్కు నుంచి రాజ్‌నిగంధ బాక్స్‌ను బయటకు తీస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. सदन की गरिमा को तार-तार कर रहे भाजपा विधायक! महोबा से भाजपा विधायक सदन में मोबाइल गेम खेल रहे, झांसी से भाजपा विधायक तंबाकू खा रहे। इन लोगों के पास जनता के मुद्दों के जवाब हैं नहीं और सदन को मनोरंजन का अड्डा बना रहे। बेहद निंदनीय एवं शर्मनाक ! pic.twitter.com/j699IxTFkp — Samajwadi Party (@samajwadiparty) September 24, 2022 pic.twitter.com/822d0fQDG7 — Samajwadi Party (@samajwadiparty) September 24, 2022 ఇదీ చదవండి: ఐరాస వేదికగా పాక్ పీఎం ‘శాంతి’ మాటలు.. స్ట్రాంక్ కౌంటర్ ఇచ్చిన భారత్ -
ఎస్పీ నేత ఆజం ఖాన్‌కు అస్వస్థత.. ఆస్పత్రికి అఖిలేశ్
లక్నో: ఎస్పీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆజం ఖాన్ గురువారం అనారోగ్యానికి గురయ్యారు. చికిత్స కోసం లక్నోలోని మేదాంత ఆస్పత్రిలో చేరారు. న్యూమోనియా, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలతో ఆజం ఖాన్ బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. ఐసీయూలో ఉన్న ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు చెప్పారు. ఆస్పత్రిలో చేరిన ఆజం ఖాన్‌ను ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆజం ఖాన్ ఆరోగ్యం క్రమంగా కుదుటపడుతోందని, ఆస్పత్రిలో ఉన్న ఆయన కుటుంబ సభ్యులందరితోనూ మాట్లాడినట్లు చెప్పారు. చదవండి: దర్యాప్తు సంస్థల దుర్వినియోగమే.. పార్లమెంట్లో రగడ -
అనూహ్య నిర్ణయం తీసుకున్న అఖిలేష్!
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బాబాయ్ శివపాల్ యాదవ్‌కు దగ్గరైన కొందరు నాయకులపై వేటు వేశాడు అఖిలేష్. దీంతో శివపాల్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘాజీపూర్‌లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా.. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా పని చేసిన మాజీ ఎమ్మెల్యే, కైలాష్ సింగ్, ఘాజీపూర్ జిల్లా మాజీ పంచాయతీ అధ్యక్షుడు విజయ్ యాదవ్ సహా పలువురు పార్టీ సభ్యులను బహిష్కరించారు. ఇదిలా ఉండగా, పార్టీ మిత్రపక్షాలైన అప్నాదళ్ (కె), సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్‌బిఎస్‌పి), రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డి) నాయకులతో యాదవ్ మంగళవారం సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశానికి జస్వంత్ నగర్ నుంచి ఎస్పీ టికెట్ పై పోటీ చేసిన అఖిలేష్ బాబాయ్ , ఎమ్మెల్యే, ప్రగతిశీల సమాజ్ వాదీ పార్టీ (పీఎస్పీ) నేత శివపాల్ యాదవ్ హాజరుకాలేదు. ఆయనతోపాటు అప్నాదళ్ (కె) నేత పల్లవి పటేల్ కూడా సమావేశానికి హాజరు కాలేదు. అఖిలేష్ యాదవ్‌తో జరిగిన సమావేశానికి ఎస్‌బిఎస్‌పి అధినేత ఓం ప్రకాష్ రాజ్‌భర్, ఆర్ఎల్డి లెజిస్లేచర్ పార్టీ నాయకుడు రాజ్‌పాల్ బలియన్ తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఓటిమికి గల కారణాలు, సామాన్యుడి సమస్యలు, నిరుద్యోగం తదితర విషయాల పై చర్చించారు. అయితే సమావేశానికి శివపాల్ యాదవ్ గైర్హాజరు కావడంపై ప్రశ్నించగా.. ఎలాంటి గొడవలు లేవని.. అందరం కలిసి ఉన్నామని అఖిలేష్ చెప్పారు. (చదవండి: బీజేపీపై ఉమ్మడి పోరు ) -
ఈవీఎం మిషన్ల దొంగతనం...ట్రక్కుల్లో తరలింపు
లక్నో: వాస్తవానికి స్ట్రాంగ్ రూమ్‌లో ఉండాల్సిన ఈవీఎంలను తరలిస్తున్న ఓ ట్రక్కును వారణాసి వద్ద అడ్డగించినట్లు సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేశ్ తెలిపారు. మరో రెండు ట్రక్కులు తప్పించుకున్నాయన్నారు. అధికార బీజేపీ ఓట్లను కొల్లగొట్టేందుకు యత్నిస్తోందని ఆరోపించారు. వారణాసి ఎన్నికల అధికారులు మాత్రం.. ఆ ఈవీఎంలు శిక్షణ కోసం వాడేవని స్పష్టంచేశారు. అఖిలేశ్ ఆరోపణలపై డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ఖండించారు. ఈవీఎంలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకునేందుకు వీలుగా అభ్యర్ధులందరికీ ఈసీ తగు ఏర్పాట్లు చేసిందన్నారు. (చదవండి: మేయరైన ఆటోవాలా) -
‘తక్కువ’ మెజార్టీ.. సగానికి తగ్గింది!
యూపీలో కొన్నేళ్లుగా ప్రతి ఎన్నికల్లోనూ బీజేపీ, ఎస్పీ, బీఎస్పీ మధ్య ముక్కోణపు పోరు నడుస్తోంది. దీనికి తోడు కాంగ్రెస్, పలు చిన్న పార్టీలు ఎటూ రంగంలో ఉంటాయి. దాంతో చాలా సెగ్మెంట్లలో అతి తక్కువ మెజారిటీ నమోదవడం ఆనవాయితీగా వస్తోంది. 1985 నుంచి 2012 దాకా చూస్తే సగటున ఏకంగా 150 సీట్లలో 5 శాతం కంటే తక్కువ మెజారిటీ నమోదైంది. 2012లో ఈ సంఖ్య 170కి చేరింది. అలాంటిది, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బీజేపీ ఈ సంఖ్యను సగానికి, అంటే 80కి తగ్గించగలిగింది. మోదీ మ్యాజిక్, యోగి కరిష్మా కలిసొచ్చి అగ్రవర్ణాలతో పాటు ఓబీసీ ఓట్లనూ కొల్లగొట్టి ఏకంగా 40 శాతం ఓట్లు, రికార్డు స్థాయిలో 312 సీట్లు సాధించడమే ఇందుకు కారణం. 159 బీజేపీ అభ్యర్థుల మెజారిటీ 15 శాతం దాటింది. కేవలం 38 మంది మాత్రం గట్టి పోటీ ఎదుర్కొని 5 శాతం కంటే తక్కువ మెజారిటీతో బయటపడ్డారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
‘జనగణమన’ మరిచిపోయి దిక్కులు చూసిన ఎంపీ..!
లక్నో: స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాలు ఆదివారం దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో పలుచోట్ల అపశ్రుతి, తప్పులు దొర్లాయి. తాజాగా ఓ లోక్‌సభ సభ్యుడు జాతీయ గీతం ‘జనగణమన’ మరచిపోయారు. జెండా ఎగురవేసిన అనంతరం జాతీయ గీతం ఆళపిస్తుండగా ఎంపీ నోరు తిరగలేదు. ఆయనతో పాటు ఆయన అనుచరులు, కార్యకర్తలు కూడా జాతీయ గీతం పాడలేక అవస్థలు ఎదుర్కొన్నారు. కొందరు గీతం మరచిపోయి మధ్యలోనే ఆపివేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఎంపీ ఎస్టీ హసన్ ఉత్తరప్రదేశ్ మొరదాబాద్‌లోని గుల్షాహీద్ పార్క్ సమీపంలో స్వాతంత్ర్య వేడుకలకు హాజరయ్యారు. జెండా ఎగురవేసిన అనంతరం ఎంపీ హసన్‌తో పాటు ఆయన కార్యకర్తలు జనగణమన ప్రారంభించారు. వారు జాతీయ గీతాన్ని.పాడుతూ మధ్యలో మరచిపోయి ఇష్టమొచ్చినట్టు పాడారు. చివరకు జయ జయహే అనేది పూర్తిగా అనకుండానే ముగించారు. ఈ గీతం ఆళపిస్తుండగా ఎంపీ హసన్ బిత్తిరిచూపులు చూస్తుండడం వైరల్‌గా మారింది. ఈ సంఘటన రాజకీయ దుమారం రేపింది. ‘ఎంపీ, ఆయన కార్యకర్తలు జాతీయ గీతాన్ని పాడలేకపోయారు. మన నేతల పరిస్థితి ఇలా ఉంది’ అని బీజేపీ సీనియర్ నాయకుడు సంబిత్ పాత్ర ట్వీట్ చేస్తూ ఎద్దేవా చేశారు. So finally they thought that the best way out of the mess that they had created was to quickly move on to “जय है” ..and then move out .. वाह समाजवादियों वाह!! pic.twitter.com/BbqFffanMi — Sambit Patra (@sambitswaraj) August 15, 2021 -
వాళ్ల ఓట్లు కూడా మనమే వేయాలి!
ఛతార్పూర్ (మధ్యప్రదేశ్): దేశంలో లోక్‌సభ ఎన్నికల వేడి రోజుకురోజుకు పెరుగుతోంది. జనాన్ని ఆకట్టుకొని.. తమ పార్టీలకు ఓట్లు రాబట్టేందుకు నాయకులు నానా తంటాలు పడుతున్నారు. కొందరు అనేక రకాల హామీలిస్తుంటే.. మరికొందరు నోటికొచ్చినట్టు మాట్లాడి వివాదాస్పదం అవుతున్నారు. ఇదే క్రమంలో ఓ పార్టీ నాయకుడు జనం ఓట్లు వేయకుంటే.. వారి తరఫున మీరే ఓట్లు వేయండంటూ కార్యకర్తలకు సూచనలిచ్చాడు. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ బహిరంగంగా ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదం రేపుతున్నాయి. మధ్యప్రదేశ్ ఛతార్పూర్కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఆర్ ఆర్ బన్సాల్ ఇటీవల పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రతి ఊరికి మన పార్టీ కార్యకర్తలు వెళ్లాలి. అక్కడ ఓటర్ల వివరాలు తెలుసుకోవాలి. ఓటర్లు ఎవరైనా ఓటు వేయకుంటే.. వారి తరఫున మనమే ఓటు వేయాలి’ అంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆయన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో వెలుగులోకి రావడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం, బీజేపీ నేత కేఎస్ ఈశ్వరప్ప కూడా ఇదేవిధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ముస్లింలు తమ పార్టీకి ఓటు వేయరని, అందుకే వారికి టికెట్లు ఇవ్వడం లేదని ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదం రేపాయి. -
మరో రెండు రాష్ట్రాల్లో ఎస్పీ– బీఎస్పీ పొత్తు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అధికార బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కటైన సమాజ్‌వాదీ పార్టీ–బహుజన్ సమాజ్ పార్టీ (ఎస్పీ–బీఎస్పీ)కూటమి మరో రెండు రాష్ట్రాల్లో పోటీ చేయనుంది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో యూపీతోపాటు మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోనూ కలిసి బరిలోకి దిగాలని ఈ రెండు పార్టీలు నిర్ణయించాయి. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి ఈ మేరకు సోమవారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ‘2019 లోక్‌సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించాం. మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్, టికమ్‌గర్హ్, ఖజరహోతో పాటు ఉత్తరాఖండ్‌లోని గధ్వాల్ స్థానాల నుంచి సమాజ్‌వాదీ పార్టీ పోటీ చేయనుండగా మిగతా చోట్ల బీఎస్పీ తమ అభ్యర్థులను బరిలోకి దించుతుంది’ అని అందులో పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లో 29, ఉత్తరాఖండ్‌లో 5 ఎంపీ స్థానాలున్నాయి. బిహార్‌లో పొత్తుల్లేకుండానే బీఎస్పీ.. పట్నా: బిహార్‌లోని మొత్తం 40 లోక్‌సభ స్థానాల్లోనూ ఒంటరిగానే పోటీకి దిగాలని బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) నిర్ణయించిందని ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, బిహార్ బిఎస్పీ ఇన్చార్జ్ లాల్జీ మేధ్కర్ సోమవారం వెల్లడించారు. బిహార్‌లో బీఎస్పీ టికెట్ ఆశావహులు, పార్టీ పథాధికారులతో గురువారం ఢిల్లీలో అధినేత్రి మాయవతితో సమావేశం ఉందని ఆయన తెలిపారు. ఎన్నికలకు సిద్ధం కావాల్సిందిగా ఆమె తమను ఇప్పటికే ఆదేశించారనీ, పూర్తి సూచనలు ఆమె గురువారం నాటి భేటీలో ఇచ్చే అవకాశం ఉందని మేధ్కర్ తెలిపారు. బిహార్‌లో ఇప్పటికే ఎన్డీయేతర పార్టీల మధ్య సఖ్యత లేదు. అటు కాంగ్రెస్‌ను, ఇటు ఆర్జేడీని కూడా వదిలేసి బీఎస్పీ ఒంటరిగా పోరుకు దిగాలనుకోవడం ఆ రెండు పార్టీలకూ దెబ్బేనని భావిస్తున్నారు. -
మాకూ సైకిలే కావాలి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ(టీడీపీ)కి ఎన్నికల గుర్తు విషయంలో చిక్కొచ్చి పడింది. టీడీపీతోపాటు జాతీయ పార్టీ గుర్తింపు కలిగిన సమాజ్‌వాదీ పార్టీ ఎన్నికల గుర్తు కూడా సైకిలే. దీంతో ఈ ఎన్నికల్లో తమకు అదే గుర్తు కేటాయించాలని ఎస్పీ పట్టుబడుతోంది. గతంలోనూ ఎస్పీ దక్షిణాదిన పోటీ చేసింది. ఆ మధ్య జరిగిన కర్ణాటక ఎన్నికల్లో ఎస్పీ సైకిల్ గుర్తు మీదే పోటీ చేసింది. 2004లో ఉమ్మడిరాష్ట్రంలో మాజీ మంత్రి, సీనియర్‌కాంగ్రెస్ నేత డీకే అరుణ కూడా ఇదే పార్టీ టికెట్‌పై పోటీ చేసి గెలిచారు. అప్పుడు ఈసీ అరుణకు కొబ్బరికాయ గుర్తు కేటాయించింది. ఉమ్మడి ఏపీలో పోటీ చేసినప్పుడు టీడీపీ అభ్యంతరం తెలపడంతో ఎస్పీ అభ్యర్థులు వేరే గుర్తుతో పోటీచేశారు. అయితే, తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డాక సైకిల్ గుర్తు తమకే ఇవ్వాలని ఎస్పీ ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది. ఏపీలో టీడీపీ అధికారంలో ఉన్నందున.. అక్కడ వారి గుర్తుపై తమకు అభ్యంతరం లేదని, తెలంగాణలో మాత్రం సైకిల్ గుర్తుపై పోటీ చేసే అవకాశం ఇవ్వాలని ఈసీని కోరుతోంది. ఇక్కడ టీడీపీ 14 స్థానాల్లోనే పోటీ చేస్తోందని, తమ పార్టీ అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో పోటీ చేస్తున్నారు కాబట్టి, సైకిల్ గుర్తు తమకే ఇవ్వాలని పట్టుబడుతోంది. కాగా, గత ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ తరఫున 15 మంది ఎమ్మెల్యేలు గెలిచినందున సైకిల్ గుర్తును ఎస్పీకి కేటాయించలేమని ఈసీ చెప్పింది. మరో గుర్తు ఎంచుకోవాలని సూచించింది. అయినప్పటికీ టీడీపీ పోటీ చేసే స్థానాల్లో కాకుండా మిగిలిన స్థానాల్లో సైకిల్ గుర్తుపై బరిలోకి దిగే విషయంపై ఎస్పీ న్యాయనిపుణులను సంప్రదిస్తోంది. ఈ సింబల్ వార్ ముదిరితే.. అది కూటమిపై ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నిబంధనల ప్రకారం వెసులుబాటు ఉంది గుర్తు విషయంలో మేం స్పష్టతతో ఉన్నాం. నిబంధనల ప్రకారం.. మాకు మా గుర్తుపై పోటీ చేసే వెసులుబాటు ఉంది. ఒకే గుర్తు ఉన్న రెండు పార్టీలు ఒకే నియోజకవర్గంలో తలపడితే.. అప్పుడు ఎవరో ఒకరు వెనకడుగు వేయాలి. అందులో మాకు అభ్యంతరం లేదు. టీడీపీ పోటీ చేసే స్థానాలు కాకుండా.. మిగిలిన వాటిలో మాకు సైకిల్ గుర్తుతో పోటీ చేసే వీలు ఉంది. ఈ విషయంపై న్యాయనిపుణుల్ని సంప్రదిస్తున్నాం. –ప్రొఫెసర్ సింహాద్రి, ఎస్పీ తెలంగాణ ప్రెసిడెంట్ -
యోగిపై సొంత మంత్రి సంచలన వ్యాఖ్యలు
లక్నో: తాజా ఉపఎన్నికల ఫలితాల నుంచి కోలుకోకముందే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు మరో షాక్ తగిలింది. తన మంత్రివర్గంలోని సొంత మంత్రిపై ఆయన పాలనను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘బీజేపీ సంకీర్ణ ధర్మం పాటించడం లేదు. ఎల్లప్పుడూ వారికి అసెంబ్లీలో ఉన్న సంఖ్యాబలం గురించి గొప్పలు చెప్పుకోవడం మాత్రమే తెలుసు. ప్రజాసంక్షేమం కన్నా గుళ్లూ గోపురాలపైనే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఎక్కువ. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయినప్పటికీ అవినీతి ఏమాత్రం తగ్గలేదు’ అంటూ బీసీ సంక్షేమ మంత్రి ఓం ప్రకాశ్ రాజ్‌భర్ బాంబు పేల్చారు. సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అధినేత అయిన రాజ్‌భర్ బీజేపీ మిత్రపక్షం కావడంతో యోగి మంత్రివర్గంలో చేరారు. ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు.. ఏడాది పాలన పూర్తిచేసుకుంటున్న యోగి సర్కారును ఇరకాటంలో పడేశాయి. భాగస్వామ్య పార్టీలంటే లెక్కలేదు.. రాజ్‌భర్ ఓ జాతీయ చానెల్‌తో మాట్లాడుతూ...‘అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయానికి మేమే కారణం. అయినప్పటికీ మమ్మల్ని వారు నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నారు. మొన్న జరిగిన లోక్‌సభ ఉప ఎన్నికల్లో కూడా ఆ పార్టీ అభ్యర్థులకు మద్దతిచ్చాం. కానీ వారి వైఖరిలో మార్పు రాలేదని’ ఆరోపించారు. ‘మార్చి 23న జరుగనున్న రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి కూడా మమ్మల్ని ఇంతవరకూ సంప్రదించలేదు. మా ఓటు కావాలా అని మేమే వెళ్లి వారిని అడగాలేమో’ అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. విజయావకాశాలే ఎక్కువ.. మిత్రపక్షాలతో కలిసి బీజేపీకి ఉన్న అసెంబ్లీ సీట్లు 324. రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఒక్కో అభ్యర్థికి 37 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఈ గణాంకాల ప్రకారం పది సీట్లలో ఎనిమిదింటిలో సులభంగానే విజయం సాధించవచ్చు. తొమ్మిదో అభ్యర్థి కోసం ఇంకా 28 మంది ఎమ్మెల్యేలు మిగులుతారు కూడా. బీజేపీ అభ్యర్థులు వీరే.. రాజ్యసభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే తొమ్మిది మంది అభ్యర్థిత్వాన్నిఅధికార పార్టీ ఖరారు చేసింది. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ, అశోక్ బాజ్‌పాయ్, విజయ్‌పాల్ సింగ్ తోమర్, సకాల్ దీప్ రాజ్‌భర్, కంటా కర్దం, అనిల్ జైన్, హరనాథ్ సింగ్ యాదవ్, జీవీఎల్ నరసింహారావు, అనిల్ కుమార్ అగర్వాల్ తదితరులు బీజేపీ నుంచి రాజ్యసభకు ఎన్నిక కానున్నారు. కాగా సమాజ్‌వాదీ పార్టీ తన అభ్యర్థిగా జయా బచ్చన్‌ను ఖరారు చేసింది. -
బీజేపీ ఎంపీకి జయాబచ్చన్ కౌంటర్
న్యూఢిల్లీ: మాజీ సమాజ్‌వాదీ పార్టీ నేత, ప్రస్తుత బీజేపీ ఎంపీ నరేష్ అగర్వాల్ తన మీద చేసిన వ్యాఖ్యలపై ఎంపీ జయాబచ్చన్ స్సందించారు. సినీ నటిగా తాను ఎంతో గర్వపడుతున్నానని, చిత్ర పరిశ్రమలో సభ్యురాలు అయినందుకు సంతోషంగా ఉందని ఆమె అన్నారు. ఇతరులు తనపై చేసిన కామెంట్స్ పట్టించుకోనని జయాబచ్చన్ తెలిపారు. తనకు రాజ్యసభలో మరోసారి అవకాశం కల్పించిన సమాజ్‌వాదీ పార్టీకి, అఖిలేష్ యాదవ్‌కి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. సమాజ్‌వాదీ పార్టీ మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని దానిలో భాగంగానే తనకు మరోసారి అవకాశం కల్పించారన్నారు. ప్రజాస్వామ్యంలో అభిప్రాయాలు స్వేచ్ఛగా వ్యక్త పరుచుకునే హక్కు ఉందని, దానిని నియంత్రించే హక్కు ఎవరికి లేదన్నారు. కాగా సమాజ్‌వాదీ పార్టీ తనకు కాకుండా ఒక ఫిల్మ్ డ్యాన్సర్‌కు రాజ్యసభ సీటు ఇచ్చిందంటూ జయాపై నరేష్ అగర్వాల్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. నరేష్ అగర్వాల్ జయాపై వ్యాఖ్యలు చేయడం ఇది ఐదోసారి. గతంలో కూడా తనపై నరేష్ అనేక వ్యాఖ్యలు చేశారని నేనేప్పుడు వాటిని సీనియస్‌గా తీసుకోలేదని తెలిపారు. మరోవైపు జయాపై చేసిన కామెంట్స్‌ను రాజ్యసభలో కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ తీవ్రంగా ఖండించారు. తాను చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో నరేష్ అగర్వాల్...తాను అలా మాట్లాడకుండా ఉండాల్సిందంటూ అన్నారు. -
రాజ్యసభ ఎన్నికల్లో కమలం హవా
27 స్థానాల్లో బీజేపీకి 11, కాంగ్రెస్‌కు 6 - ఎస్పీ ఖాతాలో ఏడు.. రెండు సీట్లు బీఎస్పీ కైవశం - రాజస్తాన్ నుంచి వెంకయ్య, కర్ణాటక నుంచి నిర్మల విజయం - యూపీ, కర్ణాటక, హరియాణాల్లో క్రాస్ ఓటింగ్ - హరియాణాలో అనూహ్యంగా ‘జీ’ చైర్మన్ విజయం న్యూఢిల్లీ: రాజ్యసభలో 27 స్థానాలకు శనివారం జరిగిన ఎన్నికల్లో అధికార బీజేపీ 11 సీట్లు గెలుచుకుని పైచేయి సాధించింది. కాంగ్రెస్ 6 స్థానాలు గెలుచుకుంది. యూపీలో సమాజ్‌వాద్ పార్టీ ఏడు సీట్లు దక్కించుకుంది. కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు రాజస్తాన్ నుంచి, నిర్మలా సీతారామన్ కర్ణాటక నుంచి గెలిచారు. ఎన్నికలు జరిగిన 7 రాష్ట్రాల్లోనూ అధికార పార్టీలే విజయం సాధించాయి. రాజస్తాన్, జార్ఖండ్, హరియాణాల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. కర్ణాటక లో క్రాస్ ఓటింగ్ జేడీఎస్ కొంపముంచగా.. హరియాణాలో కాంగ్రెస్ సభ్యుల ఓట్లు చెల్లకపోవడం బీజేపీ మద్దతుతో బరిలో దిగిన ‘జీ’ గ్రూపు చైర్మన్ సుభాష్ చంద్రకు అనూహ్య విజయాన్నందించింది. జార్ఖండ్‌లో చివరి నిమిషంలో నాటకీయ పరిణామాల మధ్య ఓ జేఎంఎం ఎమ్మెల్యేను పోలీసులు అరెస్టు చేయటంతో ఓటింగ్ బీజేపీకి కలిసొచ్చింది. ఉత్తరాఖండ్‌లో ఉన్న ఒక్కసీటును కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మధ్యప్రదేశ్‌లో బీజేపీ 2, కాంగ్రెస్ 1 మధ్యప్రదేశ్‌లో 3 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ రెండింటిని, కాంగ్రెస్ ఒక స్థానాన్ని గెలుచుకున్నాయి. బీజేపీ నుంచి.. జర్నలిస్టు, బీజేపీ అధికార ప్రతినిధి ఎంజే అక్బర్, మరో సీనియర్ నేత అనిల్ దవేలు గెలుపొందగా.. సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది వివేక్ తంఖా కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. బీజేపీ మూడో అభ్యర్థి వినోద్ గోతియా ఓడిపోయారు. బీఎస్పీ, స్వతంత్ర ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు మద్దతు తెలిపారు. యూపీలో ఎస్పీ మ్యాజిక్.. యూపీలో ఆరుగురికి అవకాశమున్న అధికార సమాజ్‌వాద్ పార్టీ ఏడో అభ్యర్థిని అదనంగా బరిలోనిలిపి అందర్నీ గెలిపించుకుంది. భారీగా క్రాస్ ఓటింగ్ జరగ్గా మొత్తం 11సీట్లలో ఎస్పీ 7, బీఎస్పీ 2, బీజేపీ, కాంగ్రెస్ చెరో సీటు గెల్చుకున్నాయి. కాంగ్రెస్‌కు కావాల్సినంత మంది అభ్యర్థుల మద్దతు లేకున్నా ఆరెల్డీ, ఇండిపెండెంట్ల మద్దతుతో మాజీ కేంద్ర మంత్రి కపిల్ సిబల్ గట్టెక్కారు. ఎస్పీ నుంచి గెలిచిన వారిలో ఇటీవలే పార్టీలో మళ్లీ చేరిన అమర్‌సింగ్, బేణీప్రసాద్ వర్మ ఉన్నారు. జేడీఎస్‌కు క్రాస్ ఓటింగ్ దెబ్బ కర్ణాటకలో భారీ క్రాస్ ఓటింగ్ కాంగ్రెస్ మూడో అభ్యర్థిని గెలిపించింది. బీజేపీ తరపున కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ గెలుపొందగా, కాంగ్రెస్ నుంచి జైరాం రమేశ్, ఆస్కార్ ఫెర్నాండజ్, మాజీ ఐపీఎస్ అధికారి కేసీ రామ్మూర్తి గెలిచారు. 8 మంది జేడీఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు ఓటేశారు. బీజేపీకి ఇద్దరు స్వతంత్రులు మద్దతు తెలిపారు. ఎడారిలో కమలం హవా.. రాజస్తాన్‌లో బీజేపీ ఉన్న 4 సీట్లను అలవోకగా గెలుచుకుంది. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, బీజేపీ ఉపాధ్యక్షుడు ఏపీ మాధుర్ గెలుపొందిన వారిలో ఉన్నారు. తనను గెలిపించిన ఎమ్మెల్యేలకు, ప్రతిపాదించిన అధిష్టానానికి వెంకయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఛత్రపతి వంశస్తుడు నామినేషన్.. శివాజీ వంశస్తుడైన ప్రముఖ శంభాజీ రాజే ఛత్రపతి రాజ్యసభకు కేంద్రం నామినేట్ చేసిం ది. గత నెల రాజ్యసభ నామినేషన్‌ను తిరస్కరించిన గాయత్రీపరివార్ నేత ప్రణవ్పాండ్యా స్థానంలో శంభాజీ నామినేట్ అయ్యారు. సుభాష్ చంద్ర అదృష్టం హరియాణాలో 14 మంది కాంగ్రెస్ సభ్యుల ఓట్లు చెల్లకపోవటం.. బీజేపీ మద్దతుతో బరిలో దిగిన జీ గ్రూపు చైర్మన్ డాక్టర్ సుభాష్ చంద్రకు కలిసొచ్చింది. కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్ మరోసారి ఎన్నికయ్యారు. సుభాష్ చంద్రకు కేవలం 15 మంది మద్దతు మాత్రమే ఉండటంతో.. ఐఎన్ఎల్డీ-కాంగ్రెస్ అభ్యర్థి ఆర్కే ఆనంద్ గెలుపు ఖాయమనే భావించారు. అయితే.. సాంకేతిక కారణాలతో 14 కాంగ్రెస్ ఓట్లు తిరస్కరణకు గురవటంతో.. మ్యాజిక్ ఫిగర్ 34 నుంచి 26కు చేరింది. బీజేపీ మొదటి ప్రాధాన్య ఓట్లను సుభాష్ చంద్రతో పంచుకుంది. పెన్నే కొంపముంచింది!.. హరియాణాలో 14 మంది కాంగ్రెస్ సభ్యుల అనర్హతకు పెన్ను కారణమైంది. ఎన్నికల్లో ఓట్ల ప్రాధామ్యాన్ని వెల్లడించేందుకు రిటర్నింగ్ అధికారిచ్చిన పెన్ను కాకుండా తమ వ్యక్తిగత పెన్నును కాంగ్రెస్ సభ్యులు ఉపయోగించారు. దీంతో సాంకేతికంగా వీరి ఓట్లు చెల్లవని రిటర్నింగ్ అధికారి వెల్లడించారు. ఇదే సుభాష్ చంద్రకు కలిసొచ్చింది. జేఎంఎం ఎమ్మెల్యే అరెస్టుతో గట్టెక్కిన బీజేపీ జార్ఖండ్‌లోని 2 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ, మహేశ్ పొద్దార్ గెలుపొందారు. ఎన్నికకు ముందు జేఎంఎం ఎమ్మెల్యే చమ్రా లిండాను 2013 నాటి కేసులో పోలీసులు అరెస్టు చేయటంతో ఆయన ఓటేయలేదు. నక్వీకి దక్కిన మొదటి ప్రాధాన్యత ఓట్ల పంపిణీతో పొద్దార్ గట్టెక్కారు. జేఎంఎం అభ్యర్థి బసంత్సొరేన్ స్వల్పతేడాతో ఓడారు. -
ములాయం నాకు భయపడ్డారు: ఒవైసీ
ఫైజాబాద్: సమాజ్‌వాద్ పార్టీ నేత ములాయం సింగ్, యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్‌లపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రమైన విమర్శలు చేశారు. వీరిద్దరూ.. ప్రధాని నరేంద్ర మోదీతో కుమ్మక్కై.. సమాజ్‌వాదీ పార్టీలోని ముస్లిం నాయకులను మాట్లాడనీయటం లేదన్నారు. తనను చూసి ములాయం, అఖిలేశ్ భయపడ్డారని.. అందుకే మూడున్నరేళ్లుగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో కాలుపెట్టకుండా అడ్డుకుంటున్నారని ఒవైసీ విమర్శించారు. ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కొత్త అధ్యాయం సృష్టించేందుకు అణగారిన వర్గాలైన ముస్లింలు, దళితులను ‘జై భీం, జై మీం’ నినాదంతో ఏకం చేస్తామన్నారు. బికాపూర్ అసెంబ్లీ స్థానానికి ఫిబ్రవరి 13న జరగనున్న ఉప ఎన్నికల్లో ఎంఐఎం తరఫున ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు.