
జయాబచ్చన్ ఫైల్ ఫోటో
న్యూఢిల్లీ: మాజీ సమాజ్‌వాదీ పార్టీ నేత, ప్రస్తుత బీజేపీ ఎంపీ నరేష్ అగర్వాల్ తన మీద చేసిన వ్యాఖ్యలపై ఎంపీ జయాబచ్చన్ స్సందించారు. సినీ నటిగా తాను ఎంతో గర్వపడుతున్నానని, చిత్ర పరిశ్రమలో సభ్యురాలు అయినందుకు సంతోషంగా ఉందని ఆమె అన్నారు. ఇతరులు తనపై చేసిన కామెంట్స్ పట్టించుకోనని జయాబచ్చన్ తెలిపారు. తనకు రాజ్యసభలో మరోసారి అవకాశం కల్పించిన సమాజ్‌వాదీ పార్టీకి, అఖిలేష్ యాదవ్‌కి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. సమాజ్‌వాదీ పార్టీ మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని దానిలో భాగంగానే తనకు మరోసారి అవకాశం కల్పించారన్నారు. ప్రజాస్వామ్యంలో అభిప్రాయాలు స్వేచ్ఛగా వ్యక్త పరుచుకునే హక్కు ఉందని, దానిని నియంత్రించే హక్కు ఎవరికి లేదన్నారు.
కాగా సమాజ్‌వాదీ పార్టీ తనకు కాకుండా ఒక ఫిల్మ్ డ్యాన్సర్‌కు రాజ్యసభ సీటు ఇచ్చిందంటూ జయాపై నరేష్ అగర్వాల్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. నరేష్ అగర్వాల్ జయాపై వ్యాఖ్యలు చేయడం ఇది ఐదోసారి. గతంలో కూడా తనపై నరేష్ అనేక వ్యాఖ్యలు చేశారని నేనేప్పుడు వాటిని సీనియస్‌గా తీసుకోలేదని తెలిపారు. మరోవైపు జయాపై చేసిన కామెంట్స్‌ను రాజ్యసభలో కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ తీవ్రంగా ఖండించారు. తాను చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో నరేష్ అగర్వాల్...తాను అలా మాట్లాడకుండా ఉండాల్సిందంటూ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment