UP By Election: వరుస వీడియోలతో పోలీసులపై సమాజ్‌వాదీ మండిపాటు | Ambedkar Nagar katehari byelection Samajwadi part tweet | Sakshi
Sakshi News home page

UP By Election: వరుస వీడియోలతో పోలీసులపై సమాజ్‌వాదీ మండిపాటు

Published Wed, Nov 20 2024 11:52 AM | Last Updated on Wed, Nov 20 2024 11:52 AM

Ambedkar Nagar katehari byelection Samajwadi part tweet

అంబేద్కర్‌నగర్‌: ఉత్తరప్రదేశ్‌లోని తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల పోలింగ్‌ నేటి (బుధవారం)ఉదయం ఏడు గంటల నుంచి కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి.
 

ఈ క్రమంలో సమాజ్‌వాదీ పార్టీ తన ట్విట్టర్ హ్యాండిల్ నుండి ఒక వీడియోను  షేర్‌ చేసింది. దానిలో బురఖా ధరించిన ఒక మహిళ తనను ఓటు వేయకుండా పోలీసులు అడ్డుకున్నారని ఆరోపించింది. బూత్ వద్ద తన ఐడీని చూపించినప్పటికీ తనకు ఓటు వేసేందుకు అనుమతినివ్వలేదని ఆమె పేర్కొంది. ఈ వీడియో కింద.. అంబేద్కర్ నగర్‌లోని కతేహరి అసెంబ్లీలోని బూత్ నంబర్ 65లో ఓటు వేయకుండా బురఖా ధరించిన మహిళను పోలీసులు అడ్డుకున్నారు. ఎన్నికల సంఘం దీనిపై దృష్టి సారించి, నిష్పక్షపాతంగా ఓటింగ్ జరిగేలా చూడాలి’ అని సమాజ్‌వాదీ పార్టీ రాసింది.

ఇదేవిధంగా కాన్పూర్‌లోని సిసామావు ​​అసెంబ్లీ ఓటింగ్‌కు సంబంధించిన వీడియోను సమాజ్‌వాదీ పార్టీ షేర్ చేస్తూ, ఓటు వేయకుండా ఓటర్లను పోలీసులు అడ్డుకుంటున్నారని, వారి గుర్తింపు కార్డులను తనిఖీ చేస్తూ వారిని వేధిస్తున్నారని  ఆరోపించింది. ఎన్నికల సంఘం దీనిని గమనించాలని కోరింది.

ఇదేవిధంగా ముజఫర్‌గర్‌లోని మీరాపూర్ స్థానానికి సంబంధించిన వీడియోను షేర్‌ చేసిన ఎస్పీ, ముజఫర్‌నగర్‌లోని మీరాపూర్ అసెంబ్లీ కితోడాలో బూత్ నంబర్ 178, 179లో ఓటర్లు ఓటు వేయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని రాసింది. మొరాదాబాద్‌లోని కుందర్కి అసెంబ్లీలోని బూత్ నంబర్ 162 వద్ద ఓటర్ల స్లిప్పులను పోలీసులు లాక్కుంటున్నారని ఆరోపించింది.

ఇది కూడా చదవండి: UP By Election: అల్లరి మూకలకు అఖిలేష్‌ హెచ్చరిక

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement