
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో జరగబోయే 10 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో సమాజ్‌వాదీ మెరుగైన ఫలితాలు సాధిస్తుందని ఆ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ బుధవారం విశ్వాసం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో అధికార బీజేపీలో అంతర్గత పోరు ఉందని, అధికారం కోసం వారి కుమ్ములాటలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ఇంతకుముందు ఇతర పార్టీల్లో చీలిక రాజకీయాలు చేసిన బీజేపీ ఇప్పుడు సొంత పార్టీలోనూ చీలికలకు పాల్పడుతోందన్నారు.