breaking news
Uttar Pradesh
-
ఫ్రిడ్జ్‌లో పసికందును పెట్టి నిద్రపోయిన తల్లి!
పోస్ట్‌పార్టమ్ సైకోసిస్ (Postpartum Psychosis).. ప్రసవం తర్వాత కొందరు మహిళల్లో కనిపించే తీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్య. ఇది చాలా అరుదైనది అయినప్పటికీ.. తల్లి, బిడ్డకు.. ఒక్కోసారి ఇద్దరికీ ప్రమాదకరమైన పరిస్థితిగా మారొచ్చు. దీని బారినపడే ఓ తల్లి తన చంటిబిడ్డను ఫ్రిడ్జ్‌లో పెట్టి ఏం ఎరుగనట్లు నిద్రపోయింది. ఉత్తరప్రదేశ్ మోరాదాబాద్‌లో అదృష్టం కొద్దీ ఓ చంటిబిడ్డ ఫ్రిడ్జ్ నుంచి ప్రాణాలతో బయటపడింది. స్థానికంగా ఉండే 23 ఏళ్ల యువతి 15 రోజుల కిందట ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే శుక్రవారం రాత్రి తన బిడ్డను ఫ్రిడ్జ్‌లో ఉంచి పడుకునిపోయింది. కాసేపటికి పిల్లాడి ఏడ్పు వినిపించడంతో అమ్మమ్మ అప్రమత్తమైంది. వెంటనే ఫ్రిడ్జి తెరిచి.. బిడ్డను తీసుకుని ఆస్పత్రికి పరిగెత్తింది. పరీక్షించిన వైద్యులు.. బిడ్డ ఆరోగ్యంగానే ఉన్నట్లు తేల్చారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకలా చేశావ్? అని అడిగితే.. బిడ్డ పడుకోవట్లేదని అలా చేశానని ఆమె అమాయకంగా బదులిచ్చింది!!.ఏమిటీ పోస్ట్‌పార్టమ్ సైకోసిక్.. సాధారణంగా ప్రసవానంతర మాంద్యం (Postpartum Depression) కంటే ఇది పోస్ట్‌పార్టమ్ సైకోసిస్ (Postpartum Psychosis) తీవ్రమైంది. లేనివాటిని చూడడం, వినడం(Hallucinations).. మానసిక కల్లోలం అంటే ఉన్నట్లుండి డిప్రెషన్లోకి వెళ్లిపోవడం, తీవ్రమైన గందరగోళం, అనుమానాలు(పారనోయా), నిద్రలేమి, తనకు తాను హాని చేసుకునే ప్రయత్నం.. చివరకు.. బిడ్డకు హాని కలిగించే ఆలోచనలూ కలగొచ్చు. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ స్థాయిలు వేగంగా తగ్గడం(హార్మోన్ల మార్పులు), బైపోలార్ డిజార్డర్, స్కిజోఫ్రెనియా (జన్యు ప్రభావం) శారీరకంగా.. భావోద్వేగంగా అలసిపోవడం, ఇలాంటి సమయంలో కుటుంబ సభ్యుల నుంచి కూడా మద్దతు లేకపోవడంతో ఈ మానసిక సమస్యకు గురయ్యే చాన్స్ ఉంది. మొదటిసారి తల్లి అవడం, గతంలో ఇలాంటి సమస్యలు ఉండడం, తీవ్రమైన ఒత్తిడి, నిద్రలేమి కూడా ఈ పరిస్థితికి దారి తీసే అవకాశం లేకపోలేదు.మోరాదాబాద్ ఘటనలో మహిళకు పోస్ట్‌పార్టమ్ సైకోసిస్ (Postpartum Psychosis) మానసిక సమస్య ఉందని వైద్యులు చెబుతున్నారు తెలిపారు. డాక్టర్ మేఘనా గుప్తా ఈ ఘటనపై మాట్లాడుతూ.. ఇలాంటి మానసిక సమస్యలు చాలా అరుదుగా కనిపిస్తాయి. కానీ అవి తీవ్రమైనవి. మహిళలు ప్రసవం తర్వాత భావోద్వేగంగా అస్థిరంగా ఉండే అవకాశం ఉంది. కుటుంబం నుంచి మద్దతు లేకపోతే, ఈ పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారతాయి అని అంటున్నారామె. ఇదిలా ఉంటే.. ఆమె కుటుంబ సభ్యులు మాత్రం ‘‘చెడు శక్తుల ప్రభావం’’తోనే ఆమె అలా చేసి ఉండొచ్చని భావించి తొలుత సంప్రదాయ పద్ధతులను ఆశ్రయించారు. ఫలితం లేకపోవడంతో.. చివరకు వైద్యులను సంప్రదించారు. ప్రస్తుతం ఆమె కౌన్సెలింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకోవైపు.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.यूपी: 15 दिन का बच्चा रो रहा था तो उसे फ्रिज में रखकर गहरी नींद में सो गई मां, डॉक्टर ने बताई इस हरकत की असली वजहRead more: https://t.co/0tf6hNhY1F#UPNews #Moradabad #Mother #Baby #Fridge pic.twitter.com/xxsBj2kKoo— India TV (@indiatvnews) September 10, 2025 -
ఓట్ల చోరీపై పోరాటం ఉధృతం చేస్తాం
రాయ్‌బరేలీ: ‘ఓటు చోర్, గద్దీ చోడ్’ నినాదం దేశమంతటా వినిపిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. ఓట్ల చోరీ బాగోతాన్ని భిన్నరూపాల్లో బయటపెడతామని చెప్పారు. ఓట్ల దొంగలు పదవుల నుంచి దిగిపోవాలని ప్రజలు నినదిస్తున్నారని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ రెండు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ పార్లమెంట్ నియోజక వర్గానికి చేరుకున్నారు. పార్టీ కార్యకర్తలతో సమావేశమ య్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఓట్ల చోరీ ముమ్మాటికీ నిజమని తేల్చిచెప్పారు. ప్రజల ఓట్లను దొంగలించి గద్దెనెక్కినవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. మహారాష్ట్ర, కర్ణాటకలో జరిగిన ఓట్ల చోరీపై తమవద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని పునరుద్ఘాటించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కోటి మందిని కొత్తగా ఓటర్లుగా చేర్పించి బీజేపీ గెలిచిందని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్, హరియాణా, మధ్యప్రదేశ్, గుజరాత్ తదితర రాష్ట్రాల్లోనూ భారీ ఎత్తున ఓట్ల దొంగతనం జరిగిందని మండిపడ్డారు. ఓట్ల చోరీపై పోరాటం మరింత ఉధృతం చేస్తామని స్పష్టంచేశారు. కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తే రాజ్యాంగాన్ని, జాతీయ జెండాను కూడా కాపాడినట్లేనని రాహుల్ అన్నారు. దేశ సంపద ప్రజలందరికీ చెందుతుందని రాజ్యాంగం నిర్దేశిస్తున్నట్లు గుర్తుచేశారు. ఇదిలా ఉండగా, రాయ్‌బరేలీలో రాహుల్ గాంధీతోపాటు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఫోటోలతో కూడిన పోస్టర్లు ఏర్పాటు చేశారు. ‘భారతదేశం చివరి ఆశ కలియుగ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు’ అంటూ వాటిపై నినాదాలు రాశారు. -
షాకింగ్ ఘటన.. మంటల్లో కాలిపోతూ స్కూటీపై ఆసుపత్రికెళ్లిన మహిళ
ఫరూఖ్‌బాద్: ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖ్‌బాద్‌లో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఓ వివాహిత(33).. స్కూటీపై వెళ్తుండగా అడ్డగించిన యువకుడు, అతని స్నేహితులు ఆమెకు నిప్పంటించారు. నిషా సింగ్ అనే మహిళను యువకుడు దీపక్ గత రెండు నెలలుగా వేధింపులకు గురిచేస్తున్నాడు. అయితే, మంటల్లో కాలుతూనే స్కూటీ నడుపుతూ ఆసుపత్రికి వెళ్లిన బాధితురాలు.. చికిత్స పొందుతూ మృతి చెందింది.తమతో మాట్లాడాలంటూ దీపక్, అతని స్నేహితులు ఆ మహిళపై ఒత్తిడి తెచ్చారు. ఆమె మాట్లాడానికి నిరాకరించడంతో వారి మధ్య వాదన జరిగింది. దీంతో ఆ మహిళకు నిప్పు పెట్టారని పోలీసులు వెల్లడించారు. ఆగస్టు 6న ఈ సంఘటన జరిగింది.మృతురాలి తండ్రి బాల్రామ్ సింగ్ తన కుమార్తెను ఒక వ్యక్తి, అతని స్నేహితులు ఆగస్టు 6న సజీవ దహనం చేశారంటూ ఫిర్యాదు చేశారు. తన కుమార్తె పరిస్థితి గురించి డాక్టర్ ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో తాను ఆసుపత్రికి వెళ్ళానని బాధితురాలి తండ్రి చెప్పారు. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న వారి కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు."డాక్టర్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. మీ కూతురు చాలా తీవ్రంగా కాలిపోయిందని.. త్వరగా రండి అని చెప్పారు. నేను అక్కడికి చేరుకునేసరికి ఆమె చాలా దయనీయమైన స్థితిలో ఉంది. 'నాన్నా నన్ను రక్షించు' అని అరుస్తోంది. దీపక్ తనకు నిప్పు పెట్టాడని చెప్పింది. ఆ వ్యక్తి తనతో మాట్లాడమని, కలవమంటూ బలవంతం చేసేవాడని తన కూతురు చెప్పిందని తండ్రి బాల్రామ్ సింగ్ తెలిపారు. నిషా సింగ్ భర్త మాట్లాడుతూ.. వేధింపులు గురించి తన భార్య ఎప్పుడూ చెప్పలేదన్నారు. -
బీజేపీ ఎంపీ సోదరికి వేధింపులు.. వెలుగులోకి మామ, మరిది అకృత్యాలు..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఏకంగా బీజేపీ ఎంపీ సోదరికే అత్తింటి వారి నుంచి వేధింపులు గురికావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అత్తగారి ఇంట్లో వారి అకృత్యాలు నిలదీసినందుకు మామ ఆగ్రహంతో ఊగిపోయారు. అనంతరం, ఆమెను వీధిలోకి లాగి తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.వివరాల ప్రకారం.. యూపీలోని ఫరూఖాబాద్ ఎంపీ ముకేశ్ రాజ్‌పుత్ సోదరి రీనా సింగ్‌కు 17 ఏళ్ల క్రితమే వివాహం జరిగింది. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇటా జిల్లాలో వీరంతా నివాసం ఉంటున్నారు. అయితే, ఆదివారం అనూహ్యం ఘటన చోటుచేసుకుంది. రీనా సింగ్‌ను తన మామ లక్ష్మణ్ సింగ్, తన భర్త సోదరులు కలిసి.. నడి వీధిలో దారుణంగా కొట్టారు. కర్రలతో చితకబాదారు. తనను కొట్టవద్దని ఎంత వారించినా.. ఆగ్రహంతో ఊగిపోయి దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. అనంతరం, తనపై జరిగిన దాడిపై రీనా సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదులో సంచలన విషయాలను వెల్లడించారు. కొన్నేళ్లుగా తనను అత్తింటి వారు వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.देखिये योगीबाबा के जंगलराज में जब भाजपा सांसद मुकेश राजपूत की बहन को इस तरह पीटा जा रहा है, तो बाकी महिलाओं का क्या हाल होगा ? उनके ससुर ने बीच सड़क बेरहमी से 4 सेकेंड में 5 डंडे मारे। सांसद की बहन चीखती-चिल्लाती रही। कोई मदद को आगे नही आया । pic.twitter.com/Gukk8Xh34R— Shyam Yadav SP (@shyamyadavsp95) September 8, 2025ఈ సందర్భంగా రీనా సింగ్ మాట్లాడుతూ.. ఆదివారం మధ్యాహ్నం నేను స్నానం చేస్తున్న సమయంలో మామ, తన మరిది కలిసి బాత్రూమ్ కిటికీ నుంచి ఫోన్లో వీడియోలు తీసే ప్రయత్నం చేశారు. నా పట్ల అనుచితంగా ప్రవర్తించారు. ఈ విషయమై నేను వారిని ప్రశ్నించడంతో నాపై దాడి చేశారు. నా కుమార్తెను కూడా దారుణంగా కొట్టారు. చాలా రోజులుగా నన్ను వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. దీంతో, రీనా సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. బాధితురాలు బీజేపీ ఎంపీ సోదరి కావడంతో ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. -
17 ఏళ్ల కుర్రాడితో ఆ సంబంధం.. చివరికి ఏం జరిగిందంటే?
హత్రాస్: ఉత్తరప్రదేశ్‌లోని హాత్రాస్ జిల్లాలోని సికంద్రారావు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ఆరేళ్ల చిన్నారి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఒక మహిళ(30), యువకుడి(17)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం ఉదయం 10 గంటల సమయంలో బాలిక అదృశ్యమైంది. బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు గాలింపు చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో బావిలో పడేసిన గోనె సంచిలో బాలిక మృతదేహం లభించింది. ఆమె మెడకు గుడ్డ బిగించి ఉండటంలో తల్లిదండ్రులు షాకయ్యారు.ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ గ్రామానికి చేరుకుని.. విచారణ చేపట్టారు. బాలిక మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించగా.. షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివాహిత మహిళకు, పొరుగున ఉండే యువకుడి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. సెప్టెంబర్ 4న భర్త, అత్త బయటకు వెళ్లడంతో ఆ మహిళ యువకుడ్ని తన ఇంటికి పిలిచింది.కాగా, వారిద్దరూ సన్నిహితంగా ఉన్న సమయంలో ఆ ఇంటికి వచ్చిన ఆ బాలిక చూసింది. దీంతో ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దంటూ ఆ బాలికను బెదిరించారు. తన తండ్రికి చెబుతానంటూ ఆ చిన్నారి హెచ్చరించింది. దీంతో ఆ మహిళ, యువకుడు కలిసి ఆ బాలిక మెడకు గుడ్డ బిగించి హత్య చేశారు. మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కేసి బావిలో పడేశారు. మహిళ, యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ సమయంలో ఆ మహిళ చేతిపై కొరికిన గాట్లు కనిపించాయి. చిన్నారి తనను రక్షించుకునే ప్రయత్నంలో కొరికినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. -
రింకూ సింగ్ జట్టుకు నిరాశ.. యూపీ టీ20 లీగ్ విజేతగా కాశీ రుద్రాస్
ఉత్తర్‌ప్రదేశ్ టీ20 లీగ్ టైటిల్‌ను కాశీ రుద్రాస్ రెండో సారి గెలుచుకుంది. లీగ్ తొలి ఎడిషన్‌లో (2023) ఛాంపియన్‌గా నిలిచిన ఈ జట్టు.. ప్రస్తుత ఎడిషన్‌లో (2025) మరోసారి విజేతగా అవతరించింది. నిన్న (సెప్టెంబర్ 6) జరిగిన ఫైనల్లో రుద్రాస్ డిఫెండింగ్ ఛాంపియన్ (2024) మీరట్ మెవెరిక్స్ను చిత్తుగా ఓడించింది. శివమ్ మావి, అభిషేక్ గోస్వామి, కెప్టెన్ కరణ్ శర్మ రుద్రాస్ గెలుపులో కీలకంగా వ్యవహరించారు. ఫైనల్లో టీమిండియా స్టార్ రింకూ సింగ్ లేని లోటు మెవెరిక్స్లో స్పష్టంగా కనిపించింది. రింకూ ఆసియా కప్ ఆడేందుకు యూఏఈకి ఫైనల్, అంతకుముందు క్వాలిఫయర్ మ్యాచ్ ఆడలేదు. ఈ సీజన్ ఆధ్యాంతం రింకూ అద్బుత ప్రదర్శనలు చేయడంతో మెవెరిక్స్ ఫైనల్స్ దాకా చేరింది.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన మెవెరిక్స్.. రుద్రాస్ బౌలర్లు శివమ్ మావి (4-0-24-2), కార్తీక్ యాదవ్ (3-0-23-2), సునీల్ కుమార్ (4-0-41-2), అటల్ బిహారి రాయ్ (4-0-28-1) ధాటికి నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 144 పరుగులు మాత్రమే చేయగలిగింది. మెవెరిక్స్ ఇన్నింగ్స్‌లో ప్రశాంత్ చౌదరీ (37) ఒక్కడే ఓ మోస్తరు స్కోర్ చేశాడు. మిగతా వారిలో ఒక్కరు కూడా కనీసం 20 పరుగుల మార్కును దాటలేదు. ఆర్సీబీ ఆటగాడు స్వస్తిక్ చికారా డకౌట్ కాగా.. కెప్టెన్ మాధవ్ కౌశిక్ 6 పరుగులు మాత్రమే చేశాడు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన రుద్రాస్.. ఓపెనర్లు అభిషేక్ గోస్వామి (61 నాటౌట్), కరణ్ శర్మ (65) సత్తా చాటడంతో 15.4 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా విజయతీరాలకు చేరింది. అభిషేక్, కరణ్ ఇద్దరు కలిసి మెవెరిక్స్ బౌలర్లను చీల్చిచెండాడారు. ముఖ్యంగా జీషన్ అన్సారీని (3.4-0-0-50) టార్గెట్ చేశారు. బ్యాట్‌తో పాటు బంతితోనూ రాణించిన (2-0-7-0) రుద్రాస్ కెప్టెన్ కరణ్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ సీజన్‌ను కరణ్ శర్మ లీడింగ్ రన్ స్కోరర్‌గా (12 మ్యాచ్‌ల్లో 519 పరుగులు) ముగించాడు. రుద్రాస్ బౌలర్ శివమ్ మావి (10 మ్యాచ్‌ల్లో 22 వికెట్లు) ఈ సీజన్లో లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. -
చెయ్యి అడ్డు తియ్యకుంటే మరిన్ని దెబ్బలు..!
లక్నో: యూపీ రాజధాని లక్నోలోని అమిటీ యూనివర్సిటీ లా కాలేజీ విద్యార్థిని క్లాస్మేట్స్ దూషిస్తూ దారుణంగా కొట్టారు. వర్సిటీ క్యాంపస్‌లోని పార్కు చేసి ఉన్న వాహనంలో ఆగస్ట్ 26వ తేదీన జరిగిన ఈ ఘటన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. ఓ మహిళ ఎడాపెడా చెంపదెబ్బలు కొడుతుండగా పక్కనే ఉన్న మరొకరు దూషణల పర్వం సాగిస్తున్నట్లుగా అందులో ఉంది. బాధిత విద్యార్థి శిఖర్ ముకేశ్ కేసర్వాని దెబ్బలను అడ్డుకునేందుకు ప్రయత్నించగా, ‘చెంపకు చెయ్యి అడ్డు తియ్యి..లేకపోతే మరిన్ని దెబ్బలు తగులుతాయి’అన్న హెచ్చరికలు సైతం రికార్డయ్యాయి. ఒకటిన్నర నిమిషాల వ్యవధిలో కనీసం 25, 30 సార్లు బాధితుడి చెంపలను వాయించారు. దాదాపు ముప్పావు గంటపాటు శిఖర్‌పై దాడి కొనసాగిందని, ఆ దెబ్బలకు అతడు భయంతో అనారోగ్యం పాలై అప్పటి నుంచి ఇంట్లోనే ఉంటున్నాడంటూ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాలేజీకి వస్తే చంపేస్తామని వాళ్లు బెదిరించారన్నారు. శిఖర్ ఫోన్‌ను కూడా పగులగొట్టారన్నారు. ఫిర్యాదు ఆధారంగా ఐదుగురిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు కారణాలు తెలియరాలేదు. వర్సిటీ కూడా దీనిపై ఇప్పటి వరకు స్పందించలేదు. -
మీరట్‌లో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం.. అక్కడేం జరుగుతోంది?
మీరట్: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో "న్యూడ్ గ్యాంగ్" పేరుతో మహిళలపై దాడులు కలకలం రేపుతున్నాయి. కొన్ని రోజులుగా దౌరాలా ప్రాంతంలో నాలుగు ఘటనలు జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. పలు గ్రామాల్లోకి కొందరు పురుషులు నగ్నంగా వచ్చి ఒంటరిగా ఉన్న మహిళలను పొలాల్లోకి లాక్కెళ్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.ఇటీవల మీరట్‌లోని భారాలా గ్రామంలో ఓ మహిళ ఒంటరిగా ఆఫీస్‌కు వెళ్తున్న సమయంలో ఓ ప్రాంతంలో న్యూడ్ గ్యాంగ్ ఆమెను పొలంలోకి లాగడానికి యత్నించినట్లు గ్రామస్తులు తెలిపారు. బాధిత మహిళ కేకలు వేయడంతో.. వారు అక్కడి నుంచి పరారయ్యారని తెలిపారు. వారి కోసం గాలించినా ఫలితం లేదన్నారు. అయితే తనను లాక్కెళ్లడానికి యత్నించిన వ్యక్తులు ఎటువంటి దుస్తులు ధరించలేదంటూ బాధిత మహిళ పేర్కొంది. తమ గ్రామంలోని ముగ్గురు మహిళలకు ఇలాంటి ఘటనే ఎదురు కాగా, భయంతో బయటపెట్టలేదని తెలిపారు. ఇప్పుడు పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులను ఆశ్రయించామని గ్రామస్తులు తెలిపారు.కొంతమంది ఈ ఘటనలను వదంతులుగా కొట్టిపారేస్తున్నారు. పలు గ్రామాల ప్రజలు కూడా తాము న్యూడ్ గ్యాంగ్‌ను చూశామంటూ చెప్పడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే, ఇప్పటి వరకు ఎటువంటి అనుమానితులను గుర్తించలేదని పోలీసులు వెల్లడించారు. న్యూడ్ గ్యాంగ్ కోసం డ్రోన్ల సహాయంతో ఈ ప్రాంతాలను గాలించడంతో పాటు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
మద్యం అమ్మకాల్లో ఉత్తరప్రదేశ్ కొత్త రికార్డు
లక్నో: ఈ ఏడాది మద్యం అమ్మకాల్లో ఉత్తరప్రదేశ్ కొత్త రికార్డు సృష్టించింది. 2025 జనవరి నుంచి ఆగస్టు వరకు రూ.22,337 కోట్లు ఆదాయాన్ని సంపాదించింది. గతేడాది ఇదే సమయానికి వచ్చిన ఆదాయం కంటే.. రూ.3,021.41 కోట్లు అధిక ఆదాయం వచ్చింది. మద్యం వినియోగం పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పెరిగింది. ఒక్క ఆగస్టు నెలలోనే ఆగస్టు నెలలోనే ఆ శాఖ రూ.3,754.43 కోట్లు ఆదాయం ఆర్జించింది. గతేడాది ఇదే నెలలో వచ్చిన ఆదాయం కంటే రూ.174.24 కోట్లు ఎక్కువ సాధించి.. తన ఆదాయ రికార్డును తానే బద్దలు కొట్టిందని ఎక్సైజ్ శాఖ సహాయ మంత్రి నితిన్ అగర్వాల్ చెప్పారు. -
అయోధ్యలో భూటాన్ ప్రధాని
అయోధ్య: భూటాన్ ప్రధానమంత్రి దషో త్సెరింగ్ టాబ్గే శుక్రవారం అయోధ్యలోని భవ్య మందిరంలో బాలరాముడిని దర్శించుకున్నారు. ఉదయం 9.30 గంటలకు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానంలో అయోధ్యకు చేరుకున్న త్సెరింగ్‌కు ఉత్తరప్రదేశ్ మంత్రి సూర్యప్రతాప్ షాహీ, ఎమ్మెల్యే వేద్ ప్రకాశ్ గుప్తా ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన లక్నో–గోరఖ్‌పూర్ మార్గంలో ప్రత్యేక కాన్వాయ్‌లో అయోధ్య ఆలయానికి చేరుకున్నాయి. అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. రామ్‌లల్లా ఆలయంతోపాటు అయోధ్యలోని హనుమాన్ గార్షీని త్సెరింగ్ దర్శించుకున్నారు. ఆయన గౌరవార్థం అధికారులు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. అయోధ్యలో పర్యటన ముగిసిన తర్వాత త్సెరింగ్ మధ్యాహ్నం 1.30 గంటలకు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. భూటాన్ ప్రధానమంత్రి పర్యటనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేకంగా పర్యవేక్షించినట్లు అధికారులు తెలిపారు. భారత్, భూటాన్ మధ్య దశాబ్దాలుగా సన్నిహిత సంబంధాలున్నాయని ఉత్తరప్రదేశ్ మంత్రి సూర్యప్రతాప్ షాహీ పేర్కొన్నారు. భూటాన్ ప్రధాని పర్యటనకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చినట్లు చెప్పారు. -
చిన్నారిని నీళ్ల డ్రమ్ములో పడేసిన కోతులు.. చివరికి ట్విస్ట్
సీతాపూర్: ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలో జరిగిన షాకింగ్ ఘటన ఓ కుటుంబాన్ని విషాదంలో ముంచేసింది. ఓ ఇంట్లో దూరిన కోతులు.. మంచంపై నిద్రపోతున్న రెండేళ్ల పసికందును బయటకు లాక్కెళ్లి.. ఇంటిపై ఉన్న నీళ్ల డ్రమ్ములో పడేయడంతో ఆ పాప ప్రాణాలు కోల్పోయింది. మఖ్రేహ్తా పోలీస్ స్టేషన్ పరిధిలోని సూరజ్‌పూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది.గురువారం.. అనుజ్ కుమార్ కుమారుడు కనిపించకుండా పోయాడు. తల్లి సవిత స్నానం చేయడానికి వెళ్ళిన సమయంలో.. నిద్రిస్తున్న చిన్నారిని ఇంట్లోకి చొరబడిన కోతులు ఎత్తుకెళ్లాయి. పసికందు కనిపించడం లేదని గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఇంట్లో, చుట్టుపక్కల ప్రాంతంలో గాలించారు. చివరికి నీటి డ్రమ్ములో చిన్నారి మృతదేహన్ని గుర్తించారు.అయితే, ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే కుటుంబ సభ్యులు గురువారం సాయంత్రం శిశువు అంత్యక్రియలు నిర్వహించారు. శుక్రవారం ఉదయం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు. శిశువు తండ్రి అనుజ్ కుమార్ ఇంటి బయట ఒక ఎలక్ట్రిక్ షాపును నిర్వహిస్తున్నాడని.. ఇప్పటివరకు కుటుంబం నుండి ఎలాంటి అధికారిక ఫిర్యాదు అందలేదని పోలీసులు వెల్లడించారు. చిన్నారి మృతికి గల కారణాలు తెలుసుకోవడానికి విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
దూకమన్న భర్త! ఆ భార్య ఏం చేసిందంటే..
ఆ భార్యాభర్తల మధ్య ఏం గొడవ జరిగిందో ఏమో.. ఆమెను అతగాడు చితకబాదేశాడు. దీంతో ఏడుస్తూ ఆ భార్య ఇంటి మేడ మీదకు చేరింది. అక్కడి నుంచి దూకేస్తానంటూ బెదిరించింది. దమ్ముంటే దూకమంటూ ఆ భర్త ఆమెకు చాలెంజ్ చేస్తూ పదే పదే చెప్పసాగాడు. కట్ చేస్తే.. ఆమె అన్నంత పని చేసింది. ఉత్తర ప్రదేశ్ అలీబాగ్‌లో దారుణం జరిగింది. గోండా ఏరియా దాకౌలి గ్రామంలో రెండతస్తుల మేడ మీద నుంచి దూకిన ఓ మహిళ.. ఆస్పత్రి పాలైంది. భార్యభర్తల మధ్య గొడవ కారణంగానే ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. భర్త కొట్టడంతో ఆమె ఏడుస్తూ మిద్దెపైకి చేరిందని, అక్కడి నుంచి దూకుతానని బెదిరించిందని, దూకి చావమని భర్త అనడంతో ఆమె అన్నంత పని చేసిందని, భూమిని బలంగా తాకడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. అయితే కిందపడిన తర్వాత కూడా ఆమెపై భర్త దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో ఓ చిన్నారి మమ్మీ.. మమ్మీ.. అంటూ ఏడుస్తూ కనిపించాడు. మహిళ తరఫు బంధువుల ఫిర్యాదు మేరకు ఆమె భర్తపై కేసు నమోదైంది.अलीगढ़ : महिला छत से कूदी, परिजनों का आरोप उकसाकर कूदने पर किया मजबूर। कूदने का वीडियो वायरल, महिला गंभीर घायल। ससुराल पक्ष के खिलाफ थाने में दी तहरीर, थाना गोंडा इलाके के दमकोली गांव की घटना। #Aligarh pic.twitter.com/twWG6yKtuq— Akash Savita (@AkashSa57363793) September 3, 2025 -
అలా... ఆమె ప్రాణాలు కాపాడారు!
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలికి చెందిన అమ్మాయి ఒకరు ‘నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను’ అని అర్థరాత్రి దాటిన తరువాత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. ‘మెటా’ వెంటనే ఈ పోస్ట్‌ను స్టేట్ పోలీస్ మీడియా సెంటర్‌కు పంపి పోలీసులను అలర్ట్ చేసింది. కేవలం పదహారు నిమిషాల వ్యవధిలో ఒక సబ్–ఇన్స్పెక్టర్, కొందరు మహిళా పోలీసులు ఆ అమ్మాయి ఉన్న ఇంటికి చేరుకున్నారు. వాంతులు చేసుకున్న ఆ అమ్మాయి నిస్తేజంగా పడి ఉంది. వెంటనే ఆమెను హస్పిటల్‌కు తీసుకువెళ్లారు. సమయానికి ఆస్పత్రికి తీసుకురావడం వల్ల ఆ అమ్మాయి చావు నుంచి బయటపడింది. ఆమె కోలుకున్న తరువాత... ‘ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నావు?’ అని అడిగితే... తాను ప్రేమించిన వ్యక్తి మాట్లాడడం మానేశాడని, తన ఫోన్ నంబర్ బ్లాక్ చేశాడని...ఇలా చెప్పుకుంటూ పోయింది. పెరుగుతున్న ఆన్లైన్ సుసైడ్ అటెంప్ట్స్‌ను దృష్టిలో పెట్టుకొని ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు, మెటా భాగస్వామ్యంతో ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో సుడైడ్–రిలేటెడ్ పోస్ట్‌లపై నిఘా పెడుతున్నారు. వెంటనే రంగంలోకి దిగుతున్నారు. జనవరి 1, 2023 నుంచి ఆగస్ట్ 25, 2025 వరకు 1,315 మంది ప్రాణాలను కాపాడారు. (చదవండి: తీవ్ర మనోవ్యాధికి సంజీవని!) -
అమ్మాయి కాదు ఆంటీ!
వివాహేతర సంబంధాలు, వాటికి అనుబంధంగా కొనసాగుతున్న హత్యల్లో చాలావరకు సోషల్ మీడియా లింకులు కూడా ఉంటున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఉదంతం.. ఈ తరహా నేరాల్లోని మరో కోణాన్ని బయటపెట్టింది.ఓ ఆంటీ(52) ఇన్‌స్టాగ్రామ్‌కు అడిక్ట్ అయ్యింది. ఫాలోవర్స్‌ను పెంచుకునేందుకు రకరకాల జిమ్మిక్కులు చేసేది. ఫిల్టర్లను ఉపయోగిస్తూ అమ్మాయిలా ఫోజు ఇస్తూ రీల్స్ చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో ఆమె వయసులో సగం ఉన్న ఓ కుర్రాడు.. ఆ రీల్స్‌కు లైకులు, కామెంట్లు పెట్టాడు. మెల్లిగా వ్యవహారం ఇన్స్టాగ్రామ్ నుంచి వాట్సాప్‌కు షిఫ్ట్ అయ్యింది. అక్కడి నుంచి మొదలైంది అసలు కథ..ఉత్తర ప్రదేశ్ మెయిన్‌పురిలో కిందటి నెల 11వ తేదీన గుర్తుతెలియని ఓ మహిళ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే మిస్టరీగా మారిన ఆ కేసును ఎట్టకేలకు చేధించినట్లు బుధవారం పోలీసులు వెల్లడించారు. మృతురాలిని ఫర్రూఖాబాద్ జిల్లా రాణి(52)గా గుర్తించిన పోలీసులు.. ఆమె సోషల్ మీడియా ప్రియుడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు వెల్లడించారు.మెయిన్‌పురికి చెందిన అరుణ్ రాజ్‌పుత్(26).. రాణితో ఏడాదిన్నర కిందట ఇన్స్టాగ్రామ్ ద్వారా దగ్గరయ్యాడు. ఇద్దరి మధ్య చాలాకాలం చాటింగ్, కాల్స్ వ్యవహారం నడిచాయి. అయితే నేరుగా కలిశాక ఆమె తనను మోసం చేసిందని.. తన కంటే వయసులో చాలా పెద్దదని గ్రహించాడు. వదిలించుకునేందుకు చాలా ప్రయత్నించాడు. అయితే అప్పటికే ఆమె అతనికి బోలెడంత డబ్బు(లక్షన్నర రూపాయలకు పైనే) సమర్పించుకుంది.అరుణ్ ఉద్దేశాన్ని అర్థం చేసుకుని.. తన డబ్బుతిరిగి ఇచ్చేయాలని, లేకుంటే తనను వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేసింది. తన కంటే రెట్టింపు వయసు, పైగా నలుగురు పిల్లలున్న ఆవిడను పెళ్లి చేసుకుంటే ఊళ్లో పరువు పోతుందని అరుణ్ భావించాడు. ఎలాగైనా వదిలించుకోవాలని ప్లాన్ వేశాడు. ఆమెను మెయిన్‌పురికి రప్పించాడు. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి.. గొంతుకు ఆమె చున్నీనే బిగించి హత్య చేశాడు. కేసులో ఎలాంటి క్లూలు లేకపోవడంతో.. మిస్సింగ్ కేసులతో సరిపోల్చుకున్న పోలీసులు చివరకు కేసును చేధించగలిగారు. పెళ్లి చేసుకోకుంటే పోలీసుల దగ్గరికి వెళ్తుందేమోనని భయపడ్డానని..ఆధారాలు లేకుండా చేసేందుకు ఆమె ఫోన్‌ను దాచేశానని అరుణ్ పోలీసుల వద్ద నేరాన్ని ఒప్పుకున్నాడు. -
16ఏళ్ల ముచ్చటైన కాపురం...రీల్స్ పిచ్చితో ఏడాదిలో సర్వ నాశనం
ఒకప్పుడు పచ్చని కాపురంలో చిచ్చుపెట్టడానికి చుట్టాలో, చుట్టుపక్కల వారో కారణమయేవారు. కానీ ఇప్పుడు ఆ బాధ్యత కూడా సోషల్ మీడియానే తీసుకుంది. హాయిగా సాగిపోతున్న ఓ చక్కని కాపురంలో రీల్స్ పేరిట చిచ్చు రాజుకుంది. చివరకు భర్తను హత్య చేసేందుకు సైతం తెగించేలా ఓ భార్యను ప్రేరేపించింది.ఈ ఘటన గత శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియా బాద్‌లో ఉన్న పారిశ్రామిక వాడ లోనీలో నివసిస్తూ, తన భర్తను కత్తితో పొడిచి చంపడానికి ప్రయత్నించినందుకు 29 ఏళ్ల మహిళపై కేసు నమోదైంది. ఆ కేసుకు సాక్ష్యంగా నిలిచిన 16 సెకన్ల వీడియోలో ఆ వ్యక్తి తన చేతుల్లో ఒక బిడ్డను పట్టుకుని ఉండగా, ఆ మహిళ అతనిపై కత్తితో దాడి చేస్తోంది. అక్కడే ఉన్న మరో చిన్నారి ఆమెని అడ్డుకుంటూ నుంచి కత్తిని లాక్కునే ప్రయత్నం చేయడం కనిపిస్తుంది.బతుకు జీవుడా అంటూ భార్య కత్తి దాడి నుంచి తప్పించుకున్న అశోక్ విహార్ నివాసి అయిన అనీస్ పోలీసులను ఆశ్రయించాడు. తాను ఇష్రాత్‌ను 2009లో వివాహం చేసుకున్నానని, అప్పటి నుంచి సాధారణ జీవితాన్ని గడుపుతున్నామని, తమకు తొమ్మిది, ఆరు సంవత్సరాల వయస్సు గల ఇద్దరు కుమార్తెలు ఉన్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే తన భార్య 2024లో ఇన్‌స్ట్రాగామ్‌ను డౌన్లోడ్ చేసుకున్న దగ్గర నుంచి తమ ఇంట్లోని పరిస్థితులు డౌన్ కావడం మొదలయ్యాయని వెల్లడించాడు. భార్య వ్లాగర్‌గా మారడంతో పరిస్థితులు మరీ దిగజారిపోయాయయని , రీల్స్ షూట్ చేయడానికి కొత్త ఉపాయాలను కనుగొనే క్రమంలో తరచుగా తమ దంపతుల మధ్య జరిగే చిన్న చిన్న తగాదాలు వాదనలను కూడా ఆమె పోస్ట్ చేసేదని తెలిపాడు. కాలక్రమేణా తన భార్యకు సోషల్ మీడియా ఫాలోయింగ్‌పై వ్యామోహం బాగా పెరిగిపోయిందని, ఆ క్రమంలో ఇంటి పనులను పట్టించుకోవడం మానేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాకుండా ఈ విషయంపై అడిగినందుకు తరచుగా తన వంటిపై తానే గ్యాసోలిన్ పోసుకుని ఛస్తానని బెదిరించడం, అలాగే గోడకు తల కొట్టుకోవడం వంటి ప్రమాదకరమైన విన్యాసాలు చేయడం మొదలుపెట్టిందని వివరించాడు.కొన్నిసార్లు, ఆమె అకస్మాత్తుగా విద్యుత్ తీగను పట్టుకునేదని, గ్యాస్ సిలిండర్‌ను ఉపయోగించి ఆత్మహత్య చేసుకుంటానని కూడా బెదిరించేదని అతను వెల్లడించాడు. తన భార్య గుర్తు తెలియని వ్యక్తులతో కలిసి రీల్స్ చేస్తోందని అది సరికాదని తాను దానికి అభ్యంతరం చెప్పినప్పుడు, వారు తనను చంపేస్తామని బెదిరించారని ఆ వ్యక్తి ఆరోపించాడు. ఫిర్యాదు ఆధారంగా, మహిళపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు లోనీ ఏసీపీ సిద్ధార్థ్ గౌతమ్ తెలిపారు. -
గూగుల్ మ్యాప్స్ టీమ్‌పై దాడి.. వామ్మో అసలు కారణం ఇదా?
కాన్పూర్: గూగుల్ మ్యాప్స్ బృందానికి ఒక్కసారిగా షాక్ కొట్టినంత పనైంది. గూగుల్ మ్యాప్స్ కోసం సర్వే చేయడానికి ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లా బిర్హార్ గ్రామానికి వెళ్లిన బృందంపై గ్రామస్థులు దాడికి పాల్పడ్డారు. అయితే, వారిని దొంగలుగా అనుమానించి గ్రామస్థులు దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. గూగుల్ మ్యాప్స్‌లో రహదారి సమాచారం అందించేందుకు టెక్ మహీంద్రా నుంచి ప్రత్యేకంగా కెమెరాలు అమర్చిన వాహనంతో బృందం గ్రామంలోని వీధులను మ్యాపింగ్‌కు ఫొటోలు తీశారు. అయితే, కెమెరాలు అమర్చిన వాహనాన్ని చూసిన గ్రామస్థులు అనుమానంతో.. వారు దొంగతనం చేయడానికి ముందస్తుగా సమాచారం సేకరిస్తున్నారని భావించారు. ఒక్కసారిగా గ్రామస్థుల గుంపు బృందాన్ని చుట్టుముట్టి, వాహనాన్ని అడ్డగించి ప్రశ్నలు అడగడం ప్రారంభించారు. ఈ క్రమంలో కొందరు గ్రామస్థులు.. బృంద సభ్యులపై దాడికి దిగారు.ఈ సమయంలో పోలీసులు అక్కడికి చేరుకుని గ్రామస్థులు, సర్వే బృందాన్ని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారణ జరిపారు. అక్కడ గూగుల్ మ్యాప్స్ బృందం తమ పని గురించి వివరించడంతో గ్రామస్థులు శాంతించారు. ఇదిలా ఉండగా.. తాము దొంగలం కాదని చెబుతున్నా వినకుండా తమపై దాడి చేసినట్లు సర్వే బృందం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ గ్రామాన్ని సర్వే చేసేందుకు వెళ్లామని, అందుకు డీజీపీ నుంచి అనుమతి కూడా తీసుకున్నామని తెలిపారు.ఈ ఘటనపై పోలీసులు వివరణ ఇస్తూ.. ఇటీవల కాలంలో ఆ గ్రామంలో అధికంగా చోరీలు జరుగుతున్నాయని.. దీంతో గ్రామస్థులు.. వాహనానికి కెమెరాలు అమర్చి గ్రామంలో తిరుగుతున్న గూగుల్ మ్యాప్స్ బృందాన్ని దొంగలుగా భావించి ఉండొచ్చని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని.. ఇరువర్గాలకు నచ్చజెప్పి పంపించినట్లు పోలీసులు చెప్పారు. -
సంభాల్‌లో 15 శాతానికి పడిపోయిన హిందువులు.. 1947లో ఎంతంటే?
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో జరిగిన హింసాకాండపై దర్యాప్తు చేపట్టిన త్రిసభ్య కమిటీ తమ నివేదికను రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ఇటీవల సమర్పించింది. 450 పేజీల ఈ రిపోర్టులో పలు కీలక అంశాలను ప్రస్తావించింది. 2024 నవంబర్ 24న జరిగిన హింసతోపాటు దాని పూర్వాపరాలు వెల్లడించింది. సంభాల్‌లో హిందువుల జనాభా 15 శాతానికి పడిపోయినట్లు స్పష్టంచేసింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇక్కడ జనాభా స్థితిగతుల్లో భారీ మార్పులు వచ్చాయని, మత రాజకీయాలు కొనసాగుతున్నాయని పేర్కొంది. సంభాల్‌లోని షాహీ జామా మసీదులో సర్వే చేయాలని స్థానిక కోర్టు ఆదేశించడంతో పట్టణంలో గత ఏడాది హింస చెలరేగిన సంగతి తెలిసిందే. ఆ మసీదు ప్రాంగణంలో గతంలో హిందూ ఆలయం ఉండేదని పేర్కొంటూ కొందరు కోర్టును ఆశ్రయించారు. సర్వే కోసం వచ్చిన బృందంతో కొందరు నిరసనకారులు వాగ్వాదానికి దిగారు. ఇది క్రమంగా తీవ్ర ఘర్షణకు దారితీసింది. రాళ్ల దాడిలో 20 మందికిపైగా పోలీసులు గాయపడ్డారు. పలు వాహనాలను నిరసనకారులు దహనం చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టు మాజీ న్యాయమూర్తి దేవేంద్ర ఆరోరా నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ నివేదికలోని అంశాలివీ...సంభాల్‌లో 1947 తర్వాత 15సార్లు ఘర్షణలు జరిగాయి. 1947, 1948, 1953, 1958, 1962, 1976, 1978, 1980, 1990, 1992, 1995, 2001, 2019, 2024లో హింసాకాండ చోటుచేసుకుంది.దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సమయంలో సంభాల్‌లో హిందువులు 45 శాతం, ముస్లింలు 55 శాతం ఉండేవారు. ఇప్పుడు హిందువుల జనాభా 15 నుంచి 20 శాతానికి పడిపోయింది. ముస్లింల సంఖ్య 85 శాతానికి చేరుకుంది. తరచుగా జరుగుతున్న ఘర్షణలు, బుజ్జగింపు రాజకీయాలు ఇందుకు దోహదం చేశాయి.2024 నవంబర్ 22న సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జియా ఉర్ రెహమాన్ బార్క్ చేసిన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో సంభాల్‌లో ఘర్షణ మొదలైంది. నలుగురు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడంతో ఘర్షణలు విస్తరించలేదు. అల్–ఖైదా, హర్కత్–ఉల్–ముజాహిదీన్ తది తర ఉగ్రవాద సంస్థలకు సంభాల్‌లో గతంలో స్థావరాలు ఉండేవి. ఇక్కడ ఆక్రమ ఆయుధాలు, మాదక ద్రవ్యాల ముఠాలకు కొదవలేదు. సంభాల్‌లో 68 పుణ్యక్షేత్రాలు, 19 పవిత్ర బావులు ఉండేవి. అవి చాలావరకు ఆక్రమణకు గురయ్యాయి. -
నాలుగు నెలల కుమారుడికి విషమిచ్చి.. దంపతుల ఆత్మహత్య
ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్పూర్లో విషాదం జరిగింది. అప్పుల బాధ తాళలేక ఒక దంపతులు.. తమ నాలుగు నెలల కుమారుడికి విషమిచ్చి ఆత్మహత్య చేసుకున్నారు. సంఘటనా స్థలంలో సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హ్యాండ్లూమ్ వ్యాపారవేత్త సచిన్ గ్రోవర్ (30).. ఆయన భార్య శివాని (28) తమ నాలుగు నెలల కుమారుడు ఫతేహ్.. ఇంటి రెండో అంతస్తులో నివాసం ఉంటున్నారు.బుధవారం ఉదయం ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో పొరుగువారికి అనుమానం వచ్చి.. కిటికీ గుండా చూసేసరికి, గదిలోని ఉరికి వేలాడుతూ భార్యాభర్తల మృతదేహాలు కనిపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లారు. కుమారుడు మంచంపై అపస్మారక స్థితిలో పడి ఉండగా.. భార్యాభర్తల మృతదేహాలు వేర్వేరు గదుల్లో ఉరికి వేలాడుతూ కనిపించాయి.సూసైడ్ నోట్లో తమకున్న అప్పులు తీర్చడానికి తమ కారు, ఇల్లు అమ్మివేయాలని సచిన్ కోరారు. “నా కుటుంబంపై నాకు ఎలాంటి ఫిర్యాదుల్లేవు. వారు నన్ను పూర్తిగా మద్దతు ఇచ్చారు. దయచేసి మా కారు, ఇల్లు అమ్మి అప్పులు తీర్చండి.. తద్వారా ఎవరు మా అప్పులు చెల్లించలేదని చెప్పకుండా ఉండాలి.” అంటూ సచిన్ తన సూసైడ్ నోట్లో రాశారు. సచిన్.. మంగళవారం సాయంత్రం తన తల్లితో మాట్లాడినప్పుడు.. రూ. 5 లక్షలు బ్యాంకు లోన్ కట్టాల్సి ఉందని.. కానీ రూ. 3 లక్షలు మాత్రమే సమకూర్చగలిగానని చెప్పాడని ఆయన తల్లి పేర్కొంది.ఈ ఆర్థిక ఒత్తిడి కారణంగా వారు తీవ్ర మానసిక ఒత్తిడితోనే ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు. మంగళవారం రాత్రి, దంపతులు ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయారని.. వారి కుమారుడిని ముందుగా విషం ఇచ్చి చంపినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. -
కోతి చేతిలో కరెన్సీ నోట్లు.. ఎగబడిన జనం
మంకీ మేనియా అంటే ఇదేనేమో!. కోతి చేతిలో కరెన్సీ కోసం జనం ఎగబడిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. చివరకు ఆ సొమ్ము అసలు ఓనర్ నిస్సహాయంగా చూస్తూ ఉండిపోగా.. దొరికిన నోట్లను పట్టుకుని జనాలు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఉత్తర ప్రదేశ్ ఔరయ్య Auraiya జిల్లా డొండాపూర్ గ్రామంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. అనూజ్ కుమార్ అనే రైతు తన తండ్రి రోహితాష్ చంద్రతో కలిసి భూమి నమోదు కోసం రూ.80,000 నగదు తీసుకుని మోపెడ్‌లో వచ్చారు. రోహితాష్ లాయర్‌తో పత్రాలు సిద్ధం చేస్తుండగా.. ఓ కోతి మోటార్ సైకిల్ ట్రంక్ తెరచి నగదు సంచిని లాక్కొని సమీప చెట్టుపైకి ఎక్కింది. ఊహించని పరిణామంతో ఆ తండ్రీకొడుకులు షాక్‌లో ఉండిపోయారు. ఈలోపు చెట్టు మీద నుంచి కోతి నోట్లను చింపుతూ చుట్టూ విసరడం ప్రారంభించింది. ఆ ప్రాంగణంలో ఉన్నవారు నోట్ల వర్షాన్ని చూసి పరుగులు పెట్టారు. నోట్లు ఎరుకోవద్దని ఆ తండ్రీ కొడుకులు బతిమాలినా ఎవరూ వినలేదు. దీంతో నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.उत्तर प्रदेश के औरैया में एक हैरान करने वाला मामला सामने आया। तहसील परिसर में बंदर किसान की बाइक से बैग ले उड़ा और पेड़ पर चढ़कर उसमें से नोट उड़ाने लगा। अचानक हुई "नोटों की बारिश" देख लोग इकट्ठा होकर पैसे लूटने लगे, जबकि किसान बेबस निहारता रह गया।#ViralVideo #Auraiya #Monkey pic.twitter.com/yEOueSxt9y— Headlines Trend (@headlinetrend) August 27, 2025చివరికి, రోహితాష్ కోతి ఎత్తుకెళ్లిన మొత్తంలో రూ.52,000 మాత్రమే తిరిగి పొందగలిగారు. కోతి చింపగా.. జనాలు ఎరుకుని పోయిన సొమ్ము రూ.28,000 ఉన్నట్లు వాపోయారు. స్థానికుల కథనం ప్రకారం.. బిధూనా తహసీల్ ప్రాంతంలో కోతుల సమస్య చాలా కాలంగా ఉంది. కోతుల దాడి చేస్తాయనే భయంతో ఆ చుట్టుపక్కల ఎలాంటి ఆహార పదార్థాలను అమ్మరంట. ఇలాంటి సంఘటనలు నవ్వు తెప్పించడమే కాకుండా జంతు సమస్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని కూడా సోషల్ మీడియాలో పలువురు గుర్తుచేస్తున్నారు. -
శుభాంశుకు లక్నోలో అపూర్వ స్వాగతం
లక్నో: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో అడుగిడిన మొదటి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన వైమానిక దళం గ్రూప్ కెపె్టన్ శుభాంశు శుక్లాకు సోమవారం లక్నోలో అపూర్వ స్వాగతం లభించింది. యాగ్జియం–4 మిషన్‌ను దిగి్వజయం ముగించుకుని ఇటీవల ఢిల్లీకి చేరుకున్న ఆయన..మొదటిసారిగా సొంతూరుకు చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో తల్లిదండ్రులు శంభు, ఆశా శుక్లా, భార్య కామ్నా, కుమారుడు కియా‹Ùతోపాటు పెద్ద సంఖ్యలో అభిమానులు త్రివర్ణ పతకాలు చేబూని, వందే మాతరం అంటూ నినాదాలు చేస్తూ స్వాగతం పలికారు. సిటీ మాంటెస్సోరి స్కూలుకు చెందిన విద్యార్థులు డ్రమ్ములు వాయిస్తూ బాకాలు ఊదుతూ సందడి చేశారు. సొంతూరు రావడం ఎంతో ఉత్కంఠగా ఉందని శుభాంశు పేర్కొన్నారు. ఉదయం 7.30 గంటలకు లక్నోలో కాలు పెట్టిన దగ్గర్నుంచి అభిమానులతో కనీసం 2 వేల సెలీ్ఫలు తీసి ఉంటానని అన్నారు. ఓపెన్ టాప్ వాహనంలో పూల వాన కురిపిస్తుండగా త్రివేణీ నగర్‌లోని సొంతింటి వైపు ఆయన విక్టరీ పరేడ్ సాగింది. స్పేస్ టెక్నాలజీ చదివే విద్యార్థులకు శుభాంశు శుక్లా పేరుతో స్కాలర్ షిప్పులను అందజేస్తామని ఈ సందర్భంగా సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. నాసా బదులుగా ఇస్రో గురించి అందరూ మాట్లాడుకునే రోజు ఎంతో దూరంలో లేదని డిప్యూటీ సీఎం మౌర్య వ్యాఖ్యానించారు. ఇస్రో చైర్మన్ నారాయణన్ సమక్షంలో శుభాంశు శుక్లాకు సీఎం యోగి సన్మానం చేశారు. లక్నోలోని ఓ పార్కుకు శుక్లా పేరు పెడతామని మేయర్ తెలిపారు. నగరమంతటా పెద్ద సంఖ్యలో ఏర్పాటైన భారీ డిజిటల్, ఎల్ఈడీ స్క్రీన్లపై శుభాంశు శుక్లా ఘనతను ప్రదర్శించారు. శుక్లాను భారత రత్నతో గౌరవించాలని రా్రïÙ్టయ కిసాన్ మంచ్ డిమాండ్ చేసింది. -
UP: ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి
బులంద్‌షహర్: ఉత్తరప్రదేశ్‌లో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బులంద్‌షహర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై ఘటాల్ గ్రామ సమీపంలో ట్రాక్టర్‌ను కంటైనర్ ట్రక్కు ఢీకొట్టింది. ట్రాక్టర్‌ను కంటైనర్ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ట్రాక్టర్ రాజస్థాన్‌లోని గోగామేడికి కాస్గంజ్ నుంచి బయలుదేరింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా, 43 మంది గాయపడ్డారు.అలీగఢ్ సరిహద్దు సమీపంలో రాత్రి 2:15 గంటల సమయంలో జరిగిందని బులంద్‌షహర్ ఎస్ఎస్పీ దినేష్ కుమార్ సింగ్ తెలిపారు. తెలిపారు. కాస్గంజ్ జిల్లాలోని 60 నుంచి 61 మంది భక్తులు ట్రాక్టర్లో ప్రయాణిస్తుండగా, వెనుక నుంచి వచ్చిన కంటైనర్ ట్రక్కు ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ బోల్తా పడింది.ఆసుపత్రిలో 45 మంది చికిత్స పొందుతున్నారని.. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. మిగిలినవారి పరిస్థితి నిలకడగా ఉంది. ప్రమాదంలో బోల్తా పడిన ట్రాక్టర్‌ను ఘటన స్థలంనుంచి తొలగించారు. ఈ ఘటన భక్తుల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చిలింది.#WATCH उत्तर प्रदेश | बुलंदशहर थाना अंतर्गत राष्ट्रीय राजमार्ग 34 पर घटाल गांव के पास, कासगंज से राजस्थान के गोगामेड़ी जा रहे गोगाजी के भक्तों से भरे ट्रैक्टर को एक कंटेनर ने टक्कर मार दी, जिससे 8 लोगों की मौत हो गई और 43 घायल हो गए हैं। pic.twitter.com/CDsRntamck— ANI_HindiNews (@AHindinews) August 25, 2025 -
రైలులో మహిళతో కానిస్టేబుల్ అసభ్య ప్రవర్తన.. లైట్స్ ఆఫ్‌లో ఉండగా..
లక్నో: రైలులో రాత్రిపూట ఓ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన కానిస్టేబుల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అనంతరం, ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం అతడిని సస్పెండ్ చేసింది. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే..వివరాల ప్రకారం.. ఢిల్లీ నుంచి ప్రయాగ్ రాజ్ వెళ్తున్న ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్‌లో జీఆర్పీ కానిస్టేబుల్ ఆశిష్ గుప్తా విధులు నిర్వహిస్తున్నాడు. సదరు రైలులో మహిళల భద్రత కోసం అతడిని విధుల్లో పెట్టారు. అయితే, రైలులో మహిళల భద్రతను కాపాడాల్సిన కానిస్టేబుల్ దారుణంగా ప్రవర్తించాడు. రాత్రివేళలో లైట్లు ఆఫ్ చేసి ఉండటాన్ని అవకాశంగా తీసుకున్న అతను, నిద్రలో ఉన్న ఓ మహిళను అసభ్యకరంగా తాకేందుకు ప్రయత్నించాడు. ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. కోచ్‌లో చీకటిగా ఉండడంతో తన చర్యలను ఎవరూ గమనించలేరనే ఉద్దేశంతో ఈ పాడుపనికి పాల్పడ్డాడు.GRP constable Ashish Gupta suspended for inappropriately touching a sleeping girl on a Delhi-Prayagraj train. Victim recorded video of incident, showing constable apologizing.pic.twitter.com/JoG7T0m6em— Ghar Ke Kalesh (@gharkekalesh) August 23, 2025ఈ క్రమంలో వెంటనే యువతి నిద్రలేచి అతడిని పట్టుకుంది. దీంతో, ఆందోళనకు గురైన కానిస్టేబుల్ తనను క్షమించాలని వేడుకున్నాడు. దండం పెట్టి ఆమెను క్షమాపణలు కోరారు. అయితే, సదరు మాత్రం ఇదంతా తన ఫోన్లో వీడియో తీసింది. అనంతరం, ఈ ఘటనపై బాధితురాలు.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. వీడియో ఆధారంగా ఉన్నతాధికారులు స్పందించి ఆశిష్ గుప్తాను సస్పెండ్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
కుక్కకు ఆహారం వేస్తూనే ఉంది.. చెంప దెబ్బలు తింటూనే ఉంది!
ఘజియాబాద్: వీధి కుక్కలు స్వైర విహారంతో ప్రజల ప్రాణాలకే ముప్పు వాటిల్లుతున్న అంశాన్ని సుప్రీంకోర్టు సైతం తీవ్ర పరిగణించిన సంగతి తెలిసిందే. వీధుల్లో ప్రమాదకరంగా సంచరించే కుక్కలను తగు షెల్టర్లు ఏర్పాటు చేసి వాటిని అక్కడకు తరలించాలని ఇటీవల ఢిల్లీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది ధర్మాసనం. ఇదిలా ఉంచితే, యూపీలో ఒక ఉదంతం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని ఘజియాబాద్‌లో ఒక మహిళ.. కుక్కకు ఆహారం పెడుతూ చెంప దెబ్బల బారిన పడింది. తన అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లో ఉన్న వీధి కుక్కకు ఓ మహిళ ఆహారం పెడుతుంటే దాన్ని ఆ అపార్ట్మెంట్ వాసి ఒకరు అడ్డుకున్నారు. ఇక్కడ ఎందుకు కుక్కకు ఆహారం పెడుతున్నావా? అని అడగ్గా, ఇందులో తప్పేముంది అంటూ ప్రశ్నించింది. దాంతో ఆ మహిళను చెంప దెబ్బ కొట్టాడు సదరు వ్యక్తి. ఇలా ఆమె ఆహారం పెడుతూనే ఉంది.. అతను చెంప దెబ్బలు కొడుతూనే ఉన్నాడు. సుమారు 38 సెకన్లలో 8సార్లు చెంప దెబ్బలకు గురైంది సదరు మహిళ. ఘజియాబాద్‌లోని విజయ్ నగర్‌లోని బ్రహ్మపుత్రా ఎన్క్లేవ్ సోసైటీలో ఇది జరిగింది. ఆ మహిళను చెంప దెబ్బలు కొట్టిన వ్యక్తిని కమల్ ఖన్నాగా గుర్తించారు. ఇదీ చదవండి: స్టెరిలైజేషన్ తర్వాత వదిలేయాల్సిందే -
మొసళ్లతో పోరాడి గెలిచిన మహిళలు
బహ్రెయిచ్: తమ వారికి ఏదైనా ఆపదొస్తే మహిళ అపరకాళిగా మారుతుందన్న విషయాన్ని ఉత్తరప్రదేశ్ మహిళలు రుజువుచేశారు. ప్రవాహంలో హఠాత్తుగా ప్రత్యక్షమై ప్రాణసంకటంగా మారిన మొసళ్ల నుంచి తమ వారికి ఇద్దరు మహిళలు రక్షించుకున్న ఘటనలు ఆదివారం బహ్రెయిచ్ జిల్లాలో జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. «భర్త కాలిని నోట కరిచిన మొసలి నుంచి భార్య కాపాడగా, మరో ఘటనలో ఐదేళ్ల కుమారుడిని మొసలి బారి నుంచి చాకచక్యంగా కాపాడి మరో మహిళ తన తల్లిప్రేమను నిరూపించుకుంది. ఖైరీఘాట్ పరిధిలోని ఘాఘ్రా నదీప్రవాహానికి అనుసంధానంగా ధకియా గ్రామంలో ఒక కాలువ ప్రవహిస్తోంది.ఇందులోకి ఏడు అడుగుల మొసలి వచి్చచేరింది. ఆదివారం కాలువ సమీపంలో ఆడుకుంటున్న ఐదేళ్ల బాలుడు వీరును అది ఒక్కసారిగా నోటకరిచి కాలువలోకి లాక్కెళ్లింది. అక్కడే ఉన్న బాలుడి తల్లి మాయా ఒక్క సెకన్ కూడా ఆలోచించకుండా వెంటనే మొసలిని సమీపించి తన వద్ద ఉన్న ఇనుప రాడ్డుతో దానిపై దాడిచేసింది. ఆపకుండా పలుమార్లు రాడ్‌తో కొట్టడంతో దెబ్బలకు తాళలేక అది బాలుడిని విడిచిపెట్టింది. విషయం తెల్సుకున్న బహ్రెయిచ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ అక్కడికి చేరుకుని కాలువలోకి మళ్లీ మొసళ్లురాకుండా వలలు ఏర్పాటుచేయించారు.మోతీపూర్ పరిధిలోని మాధవపూర్ గ్రామంలో అటుగా వెళ్లేందుకు రామ్తాలియా కాలువ దాటాల్సి ఉంటుంది. ఆదివారం 45 ఏళ్ల సైఫూ తన భార్య సుర్జానా, బంధువుతో కలిసి కాలువ దాటుతుండగా అందులోని పెద్ద మొసలు సైఫూ కాలిని నోట కరిచి కాలువ లోపలికి లాక్కెళ్లింది. ప్రాణభయంతో సైఫూ అరడం మొదలెట్టాడు. పక్కనే ఉన్న భార్య సుర్జానా ఏమాత్రం భయపడకుండా చీర కొంగును అతని వైపు విసిరి పట్టుకుని బయటకు లాగింది. ఇది చూసిన సమీప గ్రామస్థులు పరుగున వచ్చి కర్రలతో మొసలిపై దాడి చేసి సైఫూ కాలిని ఎలాగోలా విడిపించారు. -
ఉత్తరప్రదేశ్‌లో అత్యంత సంపన్నుడు ఎవరంటే?
దేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రాలలో ఒకటైన ఉత్తరప్రదేశ్.. చరిత్ర, సంస్కృతికి నిదర్శనం. ఎంతోమంది గొప్ప రాజకీయంగా నాయకులను అందించిన.. ఈ రాష్ట్రం దేశానికి కొంతమంది సంపన్న వ్యవస్థాపకులు కూడా అందించింది. ఈ కథనంలో యూపీలో అత్యంత ధనవంతులు, వారి నికర విలువ (అంచనా) గురించి తెలుసుకుందాం.➤మురళీధర్ జ్ఞాన్చందాని - ఘాడి డిటర్జెంట్: రూ. 14,000 కోట్లు➤బిమల్ జ్ఞాన్చందాని - ఘాడి డిటర్జెంట్: రూ. 9,000 కోట్లు➤విజయ్ శేఖర్ శర్మ - పేటీఎం: రూ. 8,000 కోట్లు➤దినేష్ చంద్ర అగర్వాల్ - ఇండియామార్ట్: రూ. 5,400 కోట్లు➤అలఖ్ పాండే - ఫిజిక్స్ వాలా: రూ. 4,500 కోట్లు➤ప్రదీప్ కుమార్ జైన్ - పీఎన్సీ ఇన్ఫ్రాటెక్: రూ. 4,400 కోట్లు➤చక్రేష్ కుమార్ జైన్ - పీఎన్సీ ఇన్ఫ్రాటెక్: రూ.4,400 కోట్లు➤యశ్వర్ధన్ అగర్వాల్ - ప్రియాగోల్డ్ బిస్కెట్స్: రూ. 4,200 కోట్లుఇదీ చదవండి: యూజర్లకు షాకిచ్చిన జియో: చౌకైన ప్లాన్ నిలిపివేత -
దుస్తులు చించి, భౌతిక దాడి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో దారుణం జరిగింది. మహిళా కానిస్టేబుల్‌పై ఆమె నివాసముంటున్న ఇంటి యజమాని కుటుంబం దాడి చేసింది. ఆగస్టు 15న సాయంత్రం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లక్నోలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మహిళ తన గదిలో ఉండగా.. ఇంటి యజమాని సల్మా షేక్ వచ్చాడు. ఆమె వాహనాన్ని ఇంటి బయట పార్కింగ్ చేయడంపై అభ్యంతరం చెప్పాడు. ఇంటిని ఖాళీ చేయాలన్నాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. సల్మా షేక్ కుమారులు సుహాన్, ఇమ్రాన్ ఆమెను కులపరంగా దూషించడమే కాదు.. భౌతికంగా దాడి చేశారు. అనుచితంగా తాకారు. సర్వీసు నుంచి సస్పెండ్ చేయిస్తామని బెదిరించారు. దాడితో కానిస్టేబుల్ బట్టలు చిరిగిపోయాయి. స్పృహ కోల్పోయింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
యూపీలో రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. యోగితో పూజా పాల్ భేటీ
లక్నో: ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సమాజ్‌వాద్ పార్టీ(ఎస్పీ) నుంచి బహిష్కరణ ఎదుర్కొన్న ఎమ్మెల్యే పూజా పాల్ తాజాగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో సమావేశమయ్యారు. లక్నోలోని సీఎం నివాసంలో యోగితో ఆమె భేటీ అయ్యారు. దీంతో, ఆమె బీజేపీలో చేరుతున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది.వివరాల ప్రకారం.. ఇటీవల యూపీ అసెంబ్లీలో ఎస్పీ ఎమ్మెల్యే పూజా పాల్.. బీజేపీ ప్రభుత్వం, సీఎం యోగి పనితీరుపై ప్రశంసలు కురిపించారు. అసెంబ్లీలో ఇటీవల విజన్ డాక్యుమెంట్ 2047పై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పూజా పాల్ అసెంబ్లీలో మాట్లాడుతూ.. యూపీలో నేరగాళ్లపై యోగి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. నేరాల అదుపు కోసం తీసుకుంటున్న చర్యలపై రాష్ట్రం మొత్తం ముఖ్యమంత్రి వైపే చూస్తోందన్నారు. తన భర్త (బీఎస్పీ మాజీ ఎమ్మెల్యే రాజు పాల్) హత్య కేసులో నిందితుడు అతీక్ అహ్మద్ ఆగడాలపై చర్యలు తీసుకోవడంతో తనకు న్యాయం జరిగిందన్నారు. దీంతో, అసెంబ్లీలో బీజేపీ నేతలు కూడా ఆమె వ్యాఖ్యలపై సంతోషం వ్యక్తం చేశారు.Samajwadi Party expelled MLA Pooja Pal met Chief Minister Yogi Adityanath at his official residence in Lucknow(Source: UP CMO) pic.twitter.com/H2Bv99U2SM— ANI (@ANI) August 16, 2025ఈ నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలను సమాజ్‌వాజ్ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సీరియస్‌గా తీసుకున్నారు. పూజా వ్యాఖ్యలను పార్టీ తీవ్రంగా పరిగణించింది. ఈ సందర్భంగా అఖిలేష్.. పూజా పాల్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు, క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడ్డరని పేర్కొన్నారు. అనంతరం, ఆమెపై వేటు వేశారు. ముందస్తు హెచ్చరికలు ఉన్నప్పటికీ ఆమె చర్యలు పార్టీకి నష్టం కలిగించారని చెప్పుకొచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె.. సీఎం యోగిని కలవడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. Samajwadi Party expelled MLA Pooja Pal after she praised CM @myogiadityanath ji in her assembly speech for delivering justice through the encounter of gangster Atiq Ahmed.She recalled how Atiq Ahmed murdered her husband and how it was CM Yogi who ensured justice.This is… pic.twitter.com/9sS9E3u8Wj— Tulla Veerender Goud (@TVG_BJP) August 14, 2025 -
రూ. 30,000 కోట్లతో బ్రిజ్ క్షేత్ర అభివృద్ధి
మథుర: ఉత్తరప్రదేశ్‌లో భారీ ఆధ్యాత్మిక ప్రాజెక్టుకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. యూపీలోని బ్రిజ్ ప్రాంతంలో ద్వాపర యుగంతో సంబంధం ఉన్న మథుర, బృందావన్, బర్సానా, గోకుల్(బ్రిజ్ క్షేత్ర)ను రూ.30,000 కోట్లతో అభివృద్ధి చేయబోతున్నట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ శనివారం ప్రకటించారు. ఈ నాలుగు దివ్య క్షేత్రాలను అనుసంధానించబోతున్నట్లు తెలిపారు. పురాణాల ప్రకారం శనివారం శ్రీకృష్ణుడి 5,252వ జన్మదినం. ఈ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ మథుర పట్టణంలో పలువురు యోగులు, గురువులను సన్మానించారు. మథుర–బృందావన్‌లో రూ.646 కోట్ల విలువైన 118 అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం అసాధ్యమని పదేళ్ల క్రితం అన్నారని, ఇప్పుడు అది కార్యరూపం దాల్చిందని చెప్పారు. -
బైక్‌తో చేజ్ చేసి, ఎత్తుకెళ్లి..
బలరాంపూర్: ఉత్తరప్రదేశ్‌లోని బలరాంపూర్‌లో దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు 21 ఏళ్ల దివ్యాంగ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. జిల్లా ఉన్నతాధికారులు నివాసముండే ప్రాంతంలోని రహదారిపై ఆమెను వెంబడించి.. కిడ్నాప్ చేసి మరీ దురాగతానికి పాల్పడ్డారు. గుర్తు తెలియని వ్యక్తులు మూడు, నాలుగు బైక్‌లపై ఆమెను వెంబడిస్తుండటం, యువతి రోడ్డుపై పరుగెత్తుతుండటం ఎస్పీ నివాసంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజీలో రికార్డవ్వడం గమనార్హం. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. తన ఇంటినుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న తన మామ ఇంటికి వెళ్లిన యువతి.. తిరిగి తన ఇంటికి నడుచుకుంటూ వస్తోంది. దారిలో బైక్ ఆపిన వ్యక్తి ఆమెను వెంబడించారు. తరువాత ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. అయితే యువతి ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు వెదకడం ప్రారంభించారు. చివరకు ఒక పోలీసు పోస్టు సమీపంలో పొదల్లో అపస్మారక స్థితిలో కనిపించింది. స్పృహలోకి వచి్చన యువతి.. బైక్‌పై వచి్చన వ్యక్తులు అత్యాచారం చేశారని వెల్లడించింది. వైద్య పరీక్షల అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి.. నిందితులకోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇద్దరు నిందితులు అంకుర్ వర్మ, హర్షిత్ పాండేలను అరెస్టు చేశారు. -
మాన ప్రాణాల కోసం పరిగెత్తి..
చట్టాలు, కఠిన శిక్షలు.. మానవ మృగాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. దేశంలో నిత్యం ఏదో ఒకమూల ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా సీసీ కెమెరాల సాక్షిగా జరిగిన ఓ దాష్టీకం వెలుగులోకి వచ్చింది. తన మాన ప్రాణాలు కాపాడుకునేందుకు ఓ యువతి రోడ్డుపై పరుగులు తీసిన దృశ్యాలు అందులో ఉన్నాయి.కొందరు కీచకులు ఓ బధిర యువతిని బైకుల మీద వెంటాడి.. ఎత్తుకెళ్లి మరీ అఘాయిత్యానికి పాల్పడ్డారు. పోలీసులు ప్రకటనకు విరుద్ధంగా.. సీసీటీవీ ఫుటేజీ ద్వారా ఈ నేరానికి సంబంధించిన వాస్తవ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.ఉత్తర ప్రదేశ్‌లోని బలరామ్‌పూర్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది. సోమవారం సాయంత్రం తన బంధువు ఇంటి నుంచి తన ఇంటికి నడుచుకుంటూ వస్తున్న యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది!. ఆమె ఎంతకీ ఇంటికి రాకపోవడంతో బంధువులు ఆందోళనతో గాలించగా.. పోలీస్ అవుట్‌పోస్ట్ సమీపంలోని పొదల్లో దుస్తులు చినిగిపోయి స్పృహ లేని స్థితిలో ఆమె కనిపించింది.వెంటనే బంధువులు ఆస్పత్రికి తరలించి.. పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలి ఫిర్యాదును స్వీకరించి.. వైద్యపరీక్షల అనంతరం ఆమెపై అత్యాచారం జరిగిందని నిర్ధారించారు. బైక్ మీద వచ్చిన వ్యక్తి తన వెంటపడ్డాడని.. అతని నుంచి రక్షించుకునేందుకు పరిగెత్తానని ఆమె తెలిపింది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టినట్లు ప్రకటించారు. అయితే.. ఈ కేసులో పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. సాక్షాత్తూ జిల్లా మెజిస్ట్రేట్, ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు ఉండే బంగ్లా సమీపంలోనే ఈ దారుణం చోటు చేసుకోవడంపై పలువురు మండిపడుతున్నారు. అదే సమయంలో.. యువతిపై జరిగింది సామూహిక అత్యాచారమని బాధిత కుటుంబం అంటోంది. ఈలోపు స్థానికంగా ఉన్న ఓ సీసీటీవీ ఫుటేజీలో బైక్ మీద కొందరు ఆమెను వెంబడించిన దృశ్యాలు బయటకు వచ్చాయి. దీంతో పోలీసులు ఆ ఫుటేజీని పరిశీలించి ఇప్పటిదాకా ఇద్దరిని అరెస్ట్ చేశారు.A 21-year-old disabled girl was allegedly gang raped in Balrampur. A video has surfaced before the alleged gang rape, in which the girl is seen running on the road to escape from the accused. 5-6 bikes can be seen coming from behind. Police have now released a statement that they… pic.twitter.com/YPRdsaWodJ— Mohammed Zubair (@zoo_bear) August 12, 2025 -
రోజుకు ఐదు ఎన్కౌంటర్లు.. క్రిమినల్స్ గుండెల్లో రైళ్లు
యూపీ పోలీసుల పేరు చెబితే అక్కడి నేరస్థుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. జనాన్ని భయభ్రాంతులకు గురిచేస్తూ తమకు ఎదురే లేదన్నట్టుగా ఇన్నాళ్లూ చెలరేగిపోయిన క్రిమినల్స్ ఆట కటిస్తున్నారు ఉత్తరప్రదేశ్ రక్షక భటులు. తామున్నది శాంతి భద్రతలు కాపాడటానికేనని, నేరాలు చేసిన వారు ఎంతటివారైనా వదిలిపెట్టబోమని తేల్చి చెబుతున్నారు. తమదైన శైలిలో కిరాతకుల పీచమణుస్తున్నారు. ఇందుకు అధికారిక లెక్కలే ప్రత్యక్ష సాక్ష్యం.ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) సీఎంగా పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు సగటున రోజుకు దాదాపు ఐదు ఎన్కౌంటర్లు జరిగినట్టు అధికార గణాంకాలు వెల్లడిస్తున్నాయి. యూపీ పోలీసుల డేటా ప్రకారం.. 2017, మార్చి 20 నుంచి ఈ ఏడాది ఆగస్టు 6 వరకు రాష్ట్రంలో 15,140 ఎన్కౌంటర్లు చోటుచేసుకున్నాయి. ఫలితంగా 243 మంది క్రిమినల్స్ హతమయ్యారు. 9,668 మందికి గాయాలయ్యాయి. 31 వేల మందిపైగా నిందితులు అరెస్టయ్యారు. విధి నిర్వహణలో 18 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోగా, 1720 మంది గాయపడిన్నట్టు యూపీ పోలీసుల అధికారిక డేటా వెల్లడించింది.నో కాంప్రమైజ్రాష్ట్రంలో శాంతిభద్రతల పరిక్షణలో రాజీపడబోమని, నేరాలు చేసే వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని యూపీ డీజీపీ రాజీవ్ కృష్ణ (Rajeev Krishna) స్పష్టం చేశారు. తాము చేపట్టిన ప్రతి చర్య కూడా నిష్పక్షపాతంతో పారదర్శకంగా ఉంటుందన్నారు. మానవ హక్కులను గౌరవిస్తూనే చట్టానికి లోబడి వ్యవహరించామని ఆయన చెప్పారు. ఎదురు కాల్పుల సమయంలో జాతీయ మానవ హక్కుల మార్గదర్శకాలను యూపీ పోలీసులు పాటించారు. గ్యాంగ్‌స్టర్, మాఫియా డాన్లను ఉక్కుపాదంతో అణిచివేస్తాం. ఇదిలాగే కొనసాగుతుందని అన్నారు. నేరస్థులను పట్టుకునే క్రమంలో తమ పోలీసులు ఎంతో దైర్యసాహసాలు ప్రదర్శించారని, విధి నిర్వహణలో ప్రాణాలు త్యాగం చేశారని, కొంతమంది గాయపడ్డారని తెలిపారు.వెస్ట్‌లోనే హయ్యస్ట్యూపీ పోలీసుల అధికారిక లెక్కల ప్రకారం.. మొత్తం ఎన్కౌంటర్లలో సగానికి పైగా పశ్చిమ యూపీలోని పోలీసు కమిషనరేట్లు, జోన్స్ పరిధిలోనే చోటు చేసుకోవడం గమనార్హం. మీరట్ జోన్లో అత్యధిక ఎన్కౌంటర్లు (4,282) చోటుచేసుకున్నాయి. అగ్రా జోన్ (2,326), బరేలీ (2,004) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఒక్క మీరట్ జోన్లోనే 81 మంది ఎన్కౌంటర్లలో హతమయ్యాయి. 2,951 మంది గాయపడగా, 4,568 మంది అరెస్టయ్యారు. ఇదే సమయంలో లక్నో జోన్లో 806 ఎన్కౌంటర్లలో 17 మంది నేరస్థులను పోలీసులు మట్టుబెట్టి 1,781 మందిని పట్టుకున్నారు. ఈ సందర్భంగా 166 మంది పోలీసులు గాయపడ్డారు. గౌతమ్ బుద్ధ నగర్ కమిషనరేట్ పరిధిలో 1,084, కాన్పూర్ జోన్లో 671 ఎన్కౌంటర్లు జరిగాయి.పబ్లిక్ సేఫ్టీ ఫస్ట్పోలీసు కమిషనరేట్ల వారీగా చూస్తే.. గౌతమ్ బుద్ధ నగర్ కమిషనరేట్ పరిధిలో అత్యధిక ఎన్కౌంటర్లు జరిగాయి. తర్వాతి స్థానిల్లో ఘజియాబాద్ (696), ఆగ్రా (430), వారణాసి(124), లక్నో (132) నిలిచాయి. నేరస్థులను పట్టుకోవడానికి వెళ్లినప్పుడు తమపైకి కాల్పులు జరపడంతో ఎన్కౌంటర్లు జరిగినట్టు సీనియర్ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. ప్రజలకు రక్షణ కల్పిస్తూ శాంతి భద్రతలను కాపాడటమే తమ ప్రథమ కర్తవ్యమని చెప్పారు.చదవండి: కోట్లు కుమ్మరిస్తున్నారు... ఎక్కడా తగ్గట్లేదు! క్రిమినల్స్ ఫినిష్యూపీ ఎన్కౌంటర్లలో కరుడు గట్టిన పలువురు నేరస్థులు హతమయ్యారు. డీఎస్పీతో సహా 8 మంది పోలీసులను పొట్టనబెట్టుకున్న వికాస్ దూబేను ఎన్కౌంటర్లో మట్టుబెట్టారు. 60 క్రిమినల్ కేసులున్న అతడి తలపై రూ. 5 లక్షల రివార్డు ఉంది. మరో క్రిమినల్ షకీల్ అహ్మద్‌పై 25 కేసులుండగా, అతడి తలపై రూ. 2.5 లక్షల రివార్డు ఉంది. 10 క్రిమినల్ కేసులు ఎదుర్కొన్న కమల్ బహదూర్‌పై కూడా రూ. 2.5 లక్షల రివార్డు ఉంది. లక్ష్మణ్ యాదవ్ రూ. 1.5 లక్షల రివార్డు ఉంది. వీరిని ఎన్కౌంటర్లలో పోలీసులు హతమార్చడంతో ఆయా ప్రాంతాల్లో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. -
ప్రియుడ్ని ఇంటికి పిలిచి.. దారుణంగా హత్య చేసిన మహిళ!
సాంభాల్: వివాహేతర సంబంధం కారణంగా ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని సాంభాల్‌లో మరో హత్యోందంతం వెలుగుచూసింది. నైతికత మరిచి వివాహేతర సంబంధం కొనసాగించడమే కాకుండా ప్రియుడ్ని పక్కా పథకం ప్రకారం అడ్డు తొలగించుకునే యత్నం చేసింది ఓ మహిళ, ఆ వ్యక్తిని ఇంటికి పిలిచి స్క్రూ డ్రైవర్, ;పట్టకారు సాయంతో హత్య చేసిన ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. 45 ఏళ్ల అనిష్ అనే వ్యక్తికి సితార అనే మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలోనే అతని వద్ద నుంచి రూ. 7 లక్షలను సితార తీసుకుంది. ఆ సొమ్మును ఇవ్వాలని అనిష్ పదే పదే అడగడంతో సితార ప్రణాళిక రచించింది. అప్పు తీసుకున్న విషయం భర్త రాయిస్ అహ్మద్‌కు కూడా తెలిసినదే కావడంతో హత్యా రచన అనేది ఇద్దరూ కలిసే చేశారు. ఈ క్రమంలోనే అనిష్‌ను ఇంటికి పిలిచింది సితార. ఇంటికి వచ్చిన తర్వాత అతన్ని కట్టేసి స్క్రూ డ్రైవర్, ఇంటిలోని ఇతర వస్తువుల సాయంతో అనిష్‌ను హత్య చేశారు. వివాహేతర సంబంధమే కారణం..ఆ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు తమ ప్రాథమిక విచారణలో తేల్చారు. ఆమె ఇంటికి తరుచు వస్తూ పోతూ ఉండే అనిష్‌ను అడ్డు తొలగించుకోవాలని సితార భావించింది. దీనిలో భాగంగానే ఇంటికి పిలిచి హత్య చేసినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు పోలీసులు. అయితే పూర్తి స్థాయి విచారణ తర్వాత మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అడిషనల్ ఎస్పీ రాజేశ్ కుమార్ శ్రీవాత్సవ తెలిపారు. ప్రస్తుతం అనిష్ హత్య కేసులో నిందితులుగా ఉన్న భార్యా భర్తల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు.రూ. 7 లక్షలు తిరిగి ఇవ్వమని అడిగినందుకే..అయితే అనిష్ కుటుంబ సభ్యులు మాత్రం సితారతో వివాహేతర సంబంధం గురించి తమకు తెలియదని అంటున్నారు. ఆమె తమకు తెలుసున్న వ్యక్తి అని, ఆ క్రమంలోనే అనిష్ వద్ద నుంచి రూ. 7 లక్షలను అప్పుగా తీసుకుందని అంటున్నారు. ఆ డబ్బు తిరిగి ఇమ్మని అడిగినందుకే తన కుమారుడు అనిష్‌ను పొట్టనపెట్టుకున్నారని తండ్రి ముస్తకిమ్ తెలిపారు. చాలా దారుణంగా తన తనయుడ్ని హత్య చేశారని, డబ్బులు అడిగినందుకే ఇంత ఘోరానికి ఒడిగట్టారని, అంతకుమించి తనకు తెలియదని తండ్రి తెలిపారు. తన కుమారుడి పెళ్లి ఫిక్స్ అయ్యిందని, ఈ క్రమంలోనే ఇచ్చిన అప్పును అడగడానికి వెళుతున్నట్లు తమకు చెప్పాడని తండ్రి ముస్తకిమ్ తెలిపారు. -
మధుకి నరకం చూపించి మరీ..
భర్తలను భార్యలు కడతేర్చడం, భార్యలను భర్తలు హతమార్చడం.. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్నాం. కాళ్ల పారాణి ఆరకముందే ఈ తరహా నేరాలతో జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు చాలామంది. అయితే.. వివాహం జరిగి ఐదు నెలలు తిరగకుండానే ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. పిల్లలకు పెళ్లి చేసేటప్పుడు కుటుంబం గురించి, ఆ వ్యక్తుల నేపథ్యం గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలనే కామెంట్లు వినిపిస్తున్నాయి సోషల్ మీడియాలో ఈ ఘటనపై.. ఉత్తర ప్రదేశ్ లక్నోలో ఘోరం జరిగింది. మధు సింగ్(32) అనే మహిళ వివాహమైన ఐదు నెలలకే అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. భర్త తన మాజీ ప్రేయసితో వివాహేతర సంబంధం నడపడమే ఆమె మరణానికి కారణంగా తెలుస్తోంది. అయితే.. భార్య ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడిందని ఆ భర్త అంటుంటే.. లేదు ఆ భర్తే నరకం చూపించి మరీ చంపేశాడని ఆమె కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఆ భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ క్రమంలో ఆ భర్త వేధింపుల పర్వం గురించి సర్వత్రా చర్చ నడుస్తోంది. సింగపూర్ షిప్ మేనేజ్మెంట్ కంపెనీలో మర్చంట్ నేవీ ఆఫీసర్ అయిన అనురాగ్ సింగ్ మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ ద్వారా ఈ ఏడాది ఫిబ్రవరిలో మధుతో పరిచయం పెంచుకున్నారు. పెద్దల అంగీకారంతో ఇద్దరూ వివాహానికి సిద్ధమయ్యారు. లాంఛనాల కింద రూ.15 లక్షలు అనురాగ్ కుటుంబం డిమాండ్ చేసింది. అయితే మధు తండ్రి ఫతే బహదూర్ సింగ్ అంత ఇచ్చుకోలేమని తేల్చి చెప్పాడు. దీంతో అనురాగ్ కాస్త తగ్గి వివాహానికి అంగీకరించాడు. అయితే.. పెళ్లై నెల తిరగకముందే ఆ కట్నం కోసం మధుపై అనురాగ్ వేధింపులకు దిగాడు. ఆమెను చితకబాది పుట్టింటికి పంపించేశాడు. దీంతో చేసేది లేక ఆ తండ్రి అడిగినంత కట్నం ఇచ్చేశాడు. ఆపై ఇంటికి తీసుకెళ్లిన అనురాగ్ మళ్లీ వేధించడం ప్రారంభించాడు. అందరితో సరదాగా ఉండే మధుకు ఆంక్షలు పెట్టాడు. పదే పదే ఆమె ఫోన్‌ను తనిఖీ చేస్తూ వచ్చాడు. దీంతో భర్త లేని టైంలోనే ఆమె ఇంట్లో వాళ్లతోనూ ఫోన్లలో మాట్లాడడం ప్రారంభించింది. ఈలోపు.. అకారణంగా మధును అనురాగ్ హింసించడం మొదలుపెట్టాడు. తనతో కలిసి మందు కొట్టాలని వేధించసాగాడు. చివరకు గర్భం దాల్చిన మధుకు బలవంతంగా అబార్షన్ చేయించాడు. ఆపై ఓ అడుగు ముందుకేసి తన మాజీ ప్రేయసితో వివాహేతర సంబంధం మొదలుపెట్టాడు. జులై 31వ తేదీన ఓ హోటల్లో ఇద్దరూ ఏకాంతంగా గడిపారు కూడా. ఇందుకు సంబంధించిన వాట్సాప్ చాటింగ్ అనురాగ్-మధు మధ్య జరిగింది. అయినా సరే మధు అవన్నీ ఓర్చుకుంది. ఈలోపు.. ఆగస్టు 3వ తేదీన ఇద్దరూ కారులో వెళ్తుండగా గొడవ జరిగింది. వర్షం కారణంగా గుంతలను తప్పించేందుకు ఆమె కారును రోడ్డు పక్కగా తీసుకెళ్లింది. అయితే అనురాగ్ మాత్రం మగవాళ్ల వైపు చూస్తూ నడుపుతోందంటూ కారులోనే మధును చితకబాదాడు. ఈ వేధింపులకు సంబంధించిన వాట్సాప్ చాటింగ్‌లను, మధు వాయిస్ ఆడియో రికార్డింగులను పోలీసులకు సమర్పించారు. వీటి ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు అనురాగ్‌ను అరెస్ట్ చేశారు. అతనిపై వరకట్ననిషేధ చట్టం, బీఎన్ఎస్ చట్టాల కింద కేసు నమోదు అయ్యింది. ముందు వెనుక అనురాగ్ గురించి, అతని కుటుంబం గురించి తెలుసుకోకుండా తన కూతురినిచ్చి వివాహం చేసి గొంతుకోశానంటూ ఆ తండ్రి గుండెలు బాదుకోవడం అక్కడున్నవారిని కంటతడి పెట్టిస్తోంది. -
వరద నీటిలో బాహుబలి సీన్ రిపీట్.. వరద నీటిలో పోలీసు అధికారి స్విమ్మింగ్
లక్నో: బాహుబలి సినిమాలో నదీ ప్రవాహంలో మునిగిపోకుండా ఒంటిచేత్తో పసిబిడ్డను పైకెత్తి పట్టుకున్న శివగామి పాత్ర గుర్తుండే ఉంటుంది. అచ్చం అలాగే నదీ ప్రవాహంలో నిజమైన నయా బాహుబలి ఫొటో ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌గా మారింది. దాదాపు భుజం ఎత్తులో ప్రయాగ్‌రాజ్ నగరాన్ని గంగానదీ ప్రవాహం ముంచెత్తడంతో తమ బిడ్డను ఒక జంట ఇలా పైకెత్తి పట్టుకుని భద్రంగా సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లింది. ఆదివారం ప్రయాగ్‌రాజ్ నగర వీధిలో తీసిందీ ఫొటో. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రయాగరాజ్‌లో గంగా నది నీళ్ల తన ఇంటి వద్దకు చేరడంతో యూపీకి చెందిన పోలీసు అధికారి ఒకరు.. వరద నీటికి పూజ చేశారు. అనంతరం, తన ఇంటి రెండో అంతస్తు నుంచి వరద నీటిలో దూకి కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. The Ganga river has entered the residential areas or residential areas have encroached the Ganga river area? pic.twitter.com/PAiel3Fcqw— Piyush Rai (@Benarasiyaa) August 2, 2025 Sub-inspector saab has upper his game - Dive from first floor. - Two camera set-up- Audience https://t.co/kksn2GCchs pic.twitter.com/4HT0EpJl3G— Piyush Rai (@Benarasiyaa) August 3, 2025 -
కాలువలో పడిన కారు.. 11 మంది మృతి
గోండా: ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలో ఆదివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సరయూ నది కాలువలో కారు పడిపోవడంతో అందులోని ఒకే కుటుంబానికి చెందిన 9 మంది సహా 11 మంది మృత్యువాతపడ్డారు. నలుగురు గాయాలపాలయ్యారు. వీరంతా ఖర్గుపూర్‌లోని పృథ్వీనాథ్ ఆలయానికి వెళ్తుండగా బెల్వా బహుతా గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగింది. బాధితులంతా గోండా జిల్లా సిహాగావ్ గ్రామానికి చెందిన వారని ఇటియాథోక్ పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌వో కృష్ణ గోపాల్ రాయ్ చెప్పారు. ప్రమాద సమయంలో వాహనంలో డ్రైవర్ సహా 15 మంది ఉన్నారన్నారు. గ్రామస్తులు, సహాయక బృందాల సాయంతో కాలువలో మునిగిన వాహనం నుంచి 11 మృతదేహాలను వెలికి తీసినట్లు ఆయన వివరించారు. వర్షం కురుస్తుండటంతో రోడ్డంతా జారుడుగా మారిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో అదుపు తప్పి కాలువలో పడిపోయిందని తెలిపారు. వెంటనే పోలీసులకు తెలిపామన్నారు. తాడు సాయంతో వాహనాన్ని బయటకు లాగామన్నారు. మృతుల్లో ఆరుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. సిహాగావ్లో మేవాలాల్ మాధ్యమిక పాఠశాల మేనేజర్‌గా పనిచేస్తున్న ప్రహ్లాద్ కుటుంబంలోని 9 మంది ఉన్నట్లు చెప్పారు. ప్రధాని మోదీ దిగ్భ్రాంతిఆలయానికి వెళ్తున్న వారు ప్రమాదానికి గురి కావడంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులు రూ.50 వేల చొప్పున సాయం అందజేస్తామని ప్రకటించారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఘటనపై స్పందించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున అందజేస్తామని ఆదిత్యనాథ్ ప్రకటించారు. కాగా, మృతుల్లో ప్రహ్లాద్ భార్య బీనా, ఇద్దరు కుమార్తెలు కాజల్, రింకీ, ప్రహ్లాద్ సోదరుడు రాంకరణ్, ఆయన భార్య అనుసూయ, వీరి కుమార్తె సౌమ్య, కుమారుడు శుభ్, ప్రహ్లాద్ మరో సోదరుడు రాంరూప్, ఆయన భార్య నందిని, కుమారుడు అమిత్ ఉన్నారు. ప్రహ్లాద్ పొరుగింట్లో ఉండే రామలలన్ వర్మ భార్య సంజు, అతడి సోదరి అంజు కూడా చనిపోయిన వారిలో ఉన్నారు. ప్రహ్లాద్ కుమారుడు సత్యం, రామ్ లలన్ వర్మ, వాహనం డ్రైవర్ సీతారామన్ గాయపడ్డారు. వీరు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషాదం తెలిసిన సిహాగావ్ గ్రామస్తులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
ఆ భార్య బారి నుంచి దేవుడే రక్షించాడేమో!
ఆ జంటకు పెళ్లై 16 ఏళ్లైంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. సొంతూరిలో ఇల్లు ఉండి కూడా.. సిటీలోనే కాపురం పెట్టాలన్న ఆమె కోరికను తీర్చాడా భర్త. అయినా ఎందుకనో ఆమె భర్తపై చంపేయాలన్నంత కసి పెంచుకుంది. భర్త హత్యకు గుండాలకు సుపారీ ఇచ్చింది. ఆ ప్రయత్నంలో.. భర్త బతికిపోగా, ఆమె ప్లాన్ బయటపడింది.భర్త హత్యకు సుపారీ ఇచ్చిన భార్య ఉదంతంలోకి వెళ్తే.. ఉత్తర ప్రదేశ్ బరేలీలోని ఓ ఆస్పత్రిలో రాజీవ్ పని చేస్తున్నాడు. జులై 21వ తేదీ రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న అతనిపై గుంపుగా వచ్చిన 11 మంది దాడి చేసి చితకబాదారు. అతని కాళ్లు, చేతులు విరగొట్టి కార్లలో సీబీ గంజ్ ఏరియా అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. కనీసం సాయం కోసం అరవలేని స్థితిలో స్పృహ తప్పి పడిపోయాడు రాజీవ్. అక్కడే సజీవంగా పాతేయాలని గొయ్యి తవ్వే ప్రయత్నంలో ఉన్నారు ఆ గుండాలు. ఇంతలో.. ఏదో అద్భుతం జరిగినట్లుగా ఓ వ్యక్తి అటుగా వచ్చాడు. ఆ బ్యాచ్‌ను చూసి గట్టి గట్టిగా కేకలు వేశాడు. దీంతో.. కంగారుపడిపోయిన ఆ దుండగులు రాజీవ్‌ను అక్కడే వదిలేసి పారిపోయారు. ఆపై ఆంబులెన్స్‌కు కాల్ చేసిన ఆ అపరిచితుడు.. రాజీవ్‌ను ఆస్పత్రిలో చేర్పించాడు. అదృష్టవశాత్తూ ప్రాణాపాయం నుంచి బయటపడిన రాజీవ్.. కుటుంబ సభ్యులకు జరిగిందంతా చెప్పాడు. బహుశా.. దేవుడే ఆ ఆజ్ఞాత వ్యక్తి రూపంలో వచ్చి తనను రక్షించి ఉంటాడని కన్నీటి పర్యంతం అవుతున్నాడు రాజీవ్.రాజీవ్ తండ్రి ఇజ్జత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయ్యింది. దాడి చేసిన 11 మందిలో రాజీవ్ సొంత బావమర్దులే ఐదుగురు ఉండడం విశేషం. రాజీవ్ భార్య సాధన ఈ హత్య కుట్రకు ప్రధాన సూత్రధారిగా తేలింది. గత కొంతకాలంగా ఆమె పిల్లలతో కలిసి పుట్టింట్లోనే ఉంటున్నట్లు పోలీసులు ధృవీకరించుకున్నారు. అయితే ఆమె భర్తను ఎందుకు చంపాలనుకుందో తెలియాల్సి ఉంది. స్థానికులు ఆ భార్యభర్తల మధ్య ఆర్థిక విషయాల్లో తరచూ గొడవలు జరిగేవని చెబుతున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న సాధన, ఆమె సోదరుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇదీ చదవండి: కొద్ది రోజులు ప్రియుడు.. కొద్ది రోజులు భర్త..!ఇదీ చదవండి: పడక సుఖం ఇవ్వని భర్తను ఆ భార్య ఏం చేసిందంటే.. -
పీడీఏ స్కూల్స్.. ఎ ఫర్ అఖిలేష్.. డి ఫర్ డింపుల్!
లక్నో: ఎ ఫర్ అఖిలేష్ యాదవ్, డి ఫర్ డింపుల్ యాదవ్, ఎం ఫర్ ముంలాయం సింగ్ యాదవ్.. ఇది ఇప్పుడు యూపీలో సమాజ్‌వాదీ పార్టీ పీడీఏ పాఠశాలను ఏర్పాటు చేస్తూ పీల్లలకు నేర్పుతున్న ప్రాథమిక పాఠం. సాధారణంగా చిన్న పిల్లలకు ఇంగ్లిష్‌ను పరిచయం చేసే క్రమంలో ఎ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, సీ ఫర్ క్యాట్, డీ ఫర్ డాగ్ అని పరిచయం చేస్తారు. మరి యూపీలోని పీడీఏ పాఠశాలల్లో ఎ ఫర్ అఖిలేష్ అనే మాట వినిపిస్తోంది. యూపీలోని సమాజ్‌వాది పీడీఏ పాఠశాలలను ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్టింది. పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సూచన మేరకు పీడీఏ పాఠశాలలను ప్రారంభిస్తోంది. దీనిలో భాగంగా యూపీలో సహరాన్ పూర్ జిల్లాలోని రామ్‌నగర్‌లో తాజాగా పీడీఏ స్కూల్‌ను ఓపెన్ చేశారు. ఎక్కడైతే గవర్నమెంట్ స్కూళ్లు మూసివేయబడుతున్నాయో అక్కడ పీడీపీ స్కూళ్లు ఓపెన్ చేయాలనే అఖిలేష్ ఆదేశాల నేపథ్యంలో పార్టీ కార్యకర్త ఫరాజ్ అలామ్ గడా ఈ స్కూల్‌ను ఆరంభించారు. ఈ స్కూల్లో 60 మందికి పైగా విద్యార్థులు చేరారు. ఇప్పుడు అక్కడ సమాజ్‌వాదీ పార్టీకి చెందిన నేతల పేర్లను ఇంగ్లిష్ వర్ణమాలకు ఉపయోగిస్తూ పాఠాలు బోధిస్తున్నారు.దీనిపై ఫరాజ్ మాట్లాడుతూ.. దళితులు, వెనుకబడిన వర్గాలు, మైనార్టీల కోసం ఈ స్కూళ్లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. తొలుత ఈ స్కూల్లో 25 మంది చేరగా, ఆపై ఆ సంఖ్య 60పైకి చేరిందన్నారు. ‘ఇది స్కూల్ కాదు.. ఒక ఉద్యమం. బీజేపీ గవర్నమెంట్ స్కూళ్లను మూసివేస్తోంది. పేద పిల్లలు చదువుకోవడానికి వీలు లేకుండా చేస్తోంది. మా పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖేలేష్ యాదవ్ దీనిపై దృష్టి సారించారు. ఎక్కడైతే స్కూల్ మూతబడుతుందో అక్కడ పీడీఏ స్కూల్ ఏర్పాటు కావాలని ఆదేశించారు. ఈ స్కూల్లో పిల్లలకు బేసిక్ ఎడ్యుకేషన్‌ను అందివ్వడంతో పాటు మా పార్టీ రాజకీయ సందేశాన్ని కూడా ఇక్కడ జోడిస్తున్నాము. ఇక్కడ ఎడ్యుకేషన్ అంతా ఫ్రీగానే ఉంటుంది. మా నాయకులు గురించి కూడా పాఠాల ద్వారా చెప్పే యత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే ఎ అంటే అఖిలేష్, డి అంటే డింపుల్ యాదవ్(అఖిలేష్ యాదవ్ భార్య), ఎం అంటే ములాయింగ్ సింగ్ యాదవ్( మా పార్టీ వ్యవస్థాపకుడు)ల గురించి కూడా చెబుతున్నాం’ అని పార్టీ కార్యకర్త తెలిపారు.ప్రతీ గ్రామంలో పీడీఏ పాఠశాల..గతవారం బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు అఖిలేష్ యాదవ్ స్కూళ్లు పెయిరింగ్ పాలసీలో భాగంగా చాలా చోట్ల గవర్నమెంట్ స్కూళ్లను యోగి సర్కార్ మూసివేస్తుందంటూ మండిపడ్డారు. గవర్నమెంట్ స్కూల్ ఎక్కడైతే మూతబడుతుందో ఆ గ్రామంలో కచ్చితంగా పీడీఏ స్కూల్ ఓపెన్ చేస్తాం. ప్రతీ గ్రామంలోనూ పీడీఏ స్కూల్ వస్తుంది. రాష్ట్రంలోనే విద్యా వ్యవస్థను బీజేపీ ప్రభుత్వం నాశనం చేస్తోంది. రాజకీయ వనరులను విస్తరిస్తున్న యోగి సర్కార్.. విద్యా వ్యవస్థను పట్టించుకోవడం లేదు’ అని అఖిలేష్ ధ్వజమెత్తారు. -
ఆగస్టు 2న పీఎం కిసాన్ నిధుల విడుదల
సాక్షి, న్యూఢిల్లీ: వ్యవసాయ రైతులకు పెట్టుబడి సాయం కింద కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద అందిస్తున్న నిధులను ఆగస్టు రెండో తేదీన విడుదల చేయనుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ నిధుల విడుదల కార్యక్రమం జరగనుంది. తద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 9.7 కోట్ల రైతుల ఖాతాల్లోకి నేరుగా రూ.20,500 కోట్లకు పైగా నిధులను ప్రత్యక్ష బదిలీ విధానం ద్వారా జమ చేయనున్నారు. పీఎం కిసాన్ కింద ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం రైతులకు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి మూడు విడతల్లో రూ.6,000 ఆర్ధిక సాయాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో 19వ విడత నిధులను విడుదల చేశారు. 19వ విడతతో ఈ పథకం కింద ఇంతవరకు మొత్తంగా పంపిణీ చేసిన మొత్తం రూ.3.69 లక్షల కోట్లకు చేరగా 20వ విడత నిధులతో ఈ మొత్తం ఏకంగా రూ.3.89 లక్షల కోట్లను దాటనుంది. పంటల ఉత్పత్తిని పెంచడం, ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడం, ఉత్పత్తులకు న్యాయమైన ధరలను నిర్ధారించడం లక్ష్యంగా కేంద్రం ఈ నిధులను విడుదల చేస్తోంది. ఈ నిధుల విడుదల కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించే అంశమై వ్యవసాయ శాఖమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ బుధవారం అధికారులతో ఉన్నతస్ధాయి సమావేశం నిర్వహించారు. నిధుల విడుదలపై విస్తృత కార్యక్రమాలను నిర్వహించాలని, కృషి విజ్ణాన కేంద్రాలతో పాటు కృషి సఖీలు, డ్రోన్ దీదీలు, బ్యాంక్ సఖీ, పశు సఖీ, బీమా సఖీ గ్రామ పంచాయతీ సర్పంచ్‌లను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని ఆదేశించారు. ఫసల్ బీమా కింద రూ. 5 వేల కోట్ల బకాయిలు దేశ వ్యాప్తంగా సకాలంలో పరిహారం అందేలా అనేక చర్యలు తీసుకున్నప్పటికీ, ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద బీమా సంస్థలు రైతులకు రూ.5,405 కోట్ల మొత్తాలను బకాయిపడ్డాయని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బుధవారం లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా చెప్పారు. బీమా కార్యక్రమంలో పాలుపంచుకున్న రాష్ట్ర ప్రభుత్వాలు, బీమా సంస్థల మధ్య వివాదాలు, బ్యాంకుల తప్పులు, ఆలస్యమైన బీమా ప్రతిపాదనలు, రాష్ట్రాలు సబ్సిడీ వాటాను ఆలస్యంగా విడుదల చేయడం వంటి కారణాలతో బకాయిలు పేరుకుపోయాయని కేంద్ర మంత్రి వెల్లడించారు. -
గుంజీలు తీసి క్షమాపణలు చెప్పిన ఐఏఎస్ ఆఫీసర్
తప్పులెన్నువారు తండోపతండంబు.. అనే ఓ వేమన పద్యం ఉంది. దాని తాత్పర్యం ఏంటంటే.. ఎదుటివారి తప్పులను లెక్కించేవారు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. కానీ తాము చేసిన తప్పులను తెలుసుకొనేవారు మాత్రం కొంతమందే ఉంటారు. అయినా ఇతరుల తప్పులను లెక్కించేవారు తమ తప్పులను మాత్రం తెలుసుకోలేరని. అలాంటి బాపతు ఓ అధికారికి అనుకోని నిరసన ఎదురైతే.. దెబ్బకు గుంజీలు తీయాల్సి వచ్చింది.ఉత్తరప్రదేశ్ షాజహాన్‌పూర్ జిల్లా సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్‌గా బాధ్యతలు చేపట్టిన తొలిరోజే ఐఏఎస్ రింకు సింగ్ రాహీకి చేదు అనుభవం ఎదురైంది. పబ్లిక్‌గా ఆయన అందరి ముందు గుంజీలు తీసి చెంపలు వేసుకుని క్షమాపణలు వచ్చింది. అందుకు కారణం లేకపోలేదు.సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ హోదాలో తొలిరోజే ఆయన తహసీల్దార్ కార్యాలయం వద్ద తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో కొంతమంది అక్కడ బహిరంగ మూత్రవిసర్జన చేస్తూ కనిపించాడు. దీంతో వాళ్లను పిలిపించుకున్న ఆయన గుంజీలు తీయించాడు. టాయిలెట్లు వాడమని అక్కడ సూచన బోర్డులు ఉన్నప్పటికీ.. కొంతమంది ఇలా బహిరంగ విసర్జనకే మళ్లుతున్నారని, అందుకే శిక్షగా గుంజీలు తీయించామని ఆయన మీడియాతో చెబుతూ కనిపించాడు. అంతేకాదు.. కొంత మంది పిల్లలు బడి ఎగ్గొట్టి ఆ కాంపౌండ్‌లో తిరుగుతున్నారని.. బాధ్యతగా లేని వాళ్ల తల్లిదండ్రులకు ఇదే తరహా శిక్ష తప్పదని హెచ్చరించారాయన. అయితే ఈలోపు..తహసీల్దార్ వద్ద ఉన్న కొంత మంది లాయర్లు ఇదంతా గమనించారు. గుంజీలు తీసిన వాళ్లలో తమకు చెందిన క్లర్క్ ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎస్డీఎం రింకు సింగ్‌ను నిలదీశారు. దానికి ఆయన సమాధానం ఇవ్వగా.. అక్కడి టాయిలెట్లు మరీ అధ్వాన్నంగా ఉన్నాయని, పరిసరాలు చెత్తాచెదారంతో నిండిపోయిన విషయాన్ని ప్రస్తావించారు. ఇందుకు బాధ్యత వహిస్తూ మీరూ గుంజీలు తీస్తారా? అని నిలదీస్తూ ఆ లాయర్లు బైఠాయించి నిరసన చేపట్టారు. దీంతో.. ఏం పాలుపోనీ ఆయన ‘అవును’ అంటూ చెంపలేసుకుంటూ ఆయన గుంజీలు తీస్తూ క్షమాపణలు చెప్పారు. దీంతో ఆ లాయర్లు శాంతించి నిరసన విరమించారు. తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో చెత్త పేరుకుపోయిందని, టాయిలెట్లు పాడైపోయిన స్థితిలో ఉన్నాయనే విషయాన్ని ఓ అధికారి 10రోజుల కిందటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాడట. అయినా ఆ ప్రాంగణమంతా శుభ్రం కాకపోవడం తమ తప్పిదమేనంటూ ఆ ఐఏఎస్ పేర్కొన్నారు. తాను చేసిన పనికి నామోషీగా భావించడం లేదని అంటున్నారాయన.‘Our fault, I accept it’: On Day 1 of posting, #UP SDM Rinku Singh Rahi does sit-ups in front of advocates; takes responsibility for tehsil filthMore details 🔗 https://t.co/7Bm3up0dPp#UttarPradesh pic.twitter.com/Nuglfm9rQK— The Times Of India (@timesofindia) July 30, 2025 -
శివాలయంలో తొక్కిసలాట.. పలువురు మృతి
బారాబంకీ: ఉత్తరప్రదేశ్‌లో విషాదం చోటుచేసుకుంది. ఓ ఆలయంలో తొక్కిసలాట జరిగిన కారణంగా ఇద్దరు భక్తులు మృతి చెందగా.. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆలయంలోని ఓ విద్యుత్ తీగ తెగిపడిన కారణంగానే తొక్కిసలాట జరిగినట్టు స్థానిక పోలీసులు వెల్లడించారు.వివరాల ప్రకారం.. యూపీలోని బారాబంకిలో ఉన్న అవసనేశ్వర్ మహాదేవ్ ఆలయానికి సోమవారం తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. భక్తులు పూజలు చేసుకుంటున్న సమయంలో కొన్ని కోతులు అక్కడికి వచ్చాయి. ఈ క్రమంలో కోతి.. పక్కనే ఉన్న విద్యుత్ తీగలపై దూకడంతో.. కరెంటు వైర్లు తెగి భక్తులపై పడిపోయాయి. దీంతో, అక్కడున్న వారంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అనంతరం, తొక్కిసలాట జరిగిందని పోలీసులు వెల్లడించారు.#BREAKING Stampede at Barabanki's Avsaneshwar Temple before darshan today... 15 devotees injured 📌The injured have been admitted to the hospitalpic.twitter.com/iJaQlnXUr4 #Barabanki #TempleStampede #India https://t.co/rVWlA2a7ab— ⚡️🌎 World News 🌐⚡️ (@ferozwala) July 28, 2025ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో 40 మంది భక్తులు గాయపడినట్టు అధికారులు గుర్తించారు. మృతుల్లో ఒకరిని లోనికాత్ర పోలీస్ స్టేషన్ పరిధిలోని ముబారక్‌పురా గ్రామానికి చెందిన 22 ఏళ్ల ప్రశాంత్‌గా గుర్తించారు. మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి.. వైద్యం అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు భారీ సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు.Barabanki, Uttar Pradesh: A stampede occurred during Jalabhishek at the Awsaneshwar Mahadev Temple after an electric current spread through the premisesDM Shashank Tripathi says, "Devotees had gathered here for darshan on the third Monday of Sawan. Some monkeys jumped onto the… pic.twitter.com/AzLnRnFQKx— IANS (@ians_india) July 28, 2025 -
కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య.. కారణం ఇదే..
లక్నో: ప్రేమ పెళ్లి ఆమె పాలిట శాపమైంది. ఒక పోలీసు అధికారి భార్య.. భర్త ఇంట్లో వేధింపులు భరించలేక తనువు చాలించింది. సెల్ఫీ వీడియో తీసుకుంటూ లైవ్‌లో ఆత్మహత్య చేసుకుంది. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.వివరాల ప్రకారం.. యూపీ రాజధాని లక్నోలోని బక్షి కా తలాబ్ (బికెటి) పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అనురాగ్ సింగ్, మృతురాలు సౌమ్య కశ్యప్ నాలుగు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే, వివాహం జరిగిన నాటి నుంచే సౌమ్యకు భర్త, అత్తింటి వారి నుంచి వేధింపులు మొదలయ్యాయి. సౌమ్య కట్నం తీసుకురాక పోవడంతో అనురాగ్ కుటుంబం కట్నం గురించి ఇబ్బందులకు గురిచేసేవారని బాధితురాలు వీడియోలో తెలిపింది. కుటుంబ సభ్యుల ఒత్తిడితో, అనురాగ్ ఆమెను వేరే వివాహం చేసుకోవాలని కూడా బలవంతం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది.🚨 Shocking! UP Cop’s Wife Dies by Suicide After Emotional VideoLucknow: Soumya Kashyap, wife of constable Anurag Singh, died by suicide.She posted a crying video blaming husband & in-laws for abuse and dowry torture. She showed her wounds, said husband threatened her: “I’m… pic.twitter.com/ripREYqDOQ— زماں (@Delhiite_) July 27, 2025ఇది మాత్రమే కాదు, అనురాగ్ తరచుగా తనను కొట్టేవాడని ఆరోపించింది. ఈ మేరకు సౌమ్య ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక భావోద్వేగ వీడియోను పోస్ట్ చేసింది. అయితే, అత్తింటి వేధింపులు, భర్త కూడా వారికి సపోర్టుగా మారడంతో సౌమ్య మానసికంగా కుంగిపోయింది. తనను మానసికంగా వేధించారని, తన భర్త, ఆయన బావ, బావ సోదరుడు కూడా తనను వేధిస్తున్నారని చెప్పుకొచ్చింది. నా భర్త బావ సంజయ్ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. అతని సోదరులలో ఒకరైన రంజిత్ న్యాయవాది. వీరి వద్ద డబ్బు ఉంది, డబ్బుతో వారు ఏదైనా చేయగలరు. వారు నన్ను ఎంతగానో హింసించారు. ఈరోజు నేను చనిపోతున్నానంటే వీరే కారణం అంటూ ఆత్మహత్యకు పాల్పడింది. అనంతరం, ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అధికారి పొరపాటు..17 ఏళ్ల పోరాటం
మెయిన్‌పురి: పోలీసు అధికారి పొరపాటు కారణంగా గ్యాంగ్‌స్టర్ చట్టం కేసులో ఇరుక్కున్న ఓ వ్యక్తి 17 ఏళ్లపాటు న్యాయ పోరాటం సాగించాడు. చిట్టచివరికి 62 ఏళ్ల వయస్సులో కోర్టు ఆయన్ను నిర్దోషిగా ప్రకటించింది. 22 రోజులపాటు జైలు జీవితం అనుభవించి, కనీసం 300 సార్లు కోర్టు వాయిదాలకు తిరిగి తిరిగీ అలసిపోయిన అతడితో కుటుంబం సంబంధాలు తెంచుకుంది. బడికి వెళ్లాల్సిన ఒక్కగానొక్క కొడుకు రోజు కూలీగా మారాడు. అన్నిటికీ తోడు సొంతూళ్లో అవమాన భారం. ఇదంతా ఏ తప్పూ చేయకుండానే భరించాడు రాజ్ వీర్. దాదాపు రెండు దశాబ్దాల పాటు అనుభవించిన వేదన పోలీసు అధికారి చేసిన చిన్న పొరపాటు ఫలితం కావడం గమనార్హం..! యూపీలోని మెయిన్‌పురి జిల్లా నగ్లా భంట్ గ్రామంలో ఎన్నికల సందర్భంగా జరిగిన గొడవపై పోలీసులు నలుగురిపై 2008 ఆగస్ట్ 31న కేసు నమోదు చేశారు. వీరు మనోజ్ యాదవ్, పర్వేష్ యాదవ్, భోలా యాదవ్, రాంవీర్ సింగ్. అనంతరం వీరిపై గ్యాంగ్‌స్టర్ చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు. రాంవీర్ సోదరుడే రాజ్ వీర్. కొత్వాలీ ఇన్స్పెక్టర్ రాం వీర్‌కు బదులుగా అతడి సోదరుడు రాజ్ వీర్ సింగ్ పేరు నిందితుల పేర్లలో చేర్చారు. దీంతో అతడి జీవితమే మారిపోయింది. రికార్డుల్లో ఉన్న ప్రకారం పోలీసులు రాజ్ వీర్‌ను పట్టుకెళ్లారు. పట్టుకోవాల్సింది రాంవీర్‌నని, తాను అమయాకుడిననీ ఎంత మొత్తుకున్నా అధికారులు వినిపించుకోలేదు. 22 రోజులపాటు జైలులో ఉన్నాక బెయిల్ లభించింది. అప్పటి నుంచి అతడి కష్టాలు మొదలయ్యాయి. అసలు దోషి తాను కాదని నిరూపించుకునేందుకు కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. కేసు ఆగ్రా నుంచి మెయిన్‌పురి కోర్టుకు మారే వరకు దాదాపు 300 సార్లు వాయిదాలకు హాజరయ్యాడు. ‘నా క్లయింట్ గోడును ఎవరూ పట్టించుకోలేదు. అతడికి ఎలాంటి నేర చరిత్ర లేదు. ఏ కేసులూ లేవు. అయినా 22 రోజులు జైలులో ఉండాల్సి వచ్చింది. ఈ వ్యవస్థపై ఇన్నేళ్లూ ఒంటరిగా పోరాటం సాగించాడు’అని లాయర్ వినోద్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ‘రాజ్ వీర్ కుటుంబం బాగోగులను చూసుకోలేకపోయాడు. ఇద్దరి కూతుళ్లకు ఎలాగోలా పెళ్లిళ్లు చేయగలిగాడు. కుటుంబ పోషణకు కుమారుడు వ్యవసాయ కూలీగా మారాడు’అని వివరించారు. గురువారం వాదనలు విన్న మెయిన్‌పురి కోర్టు రాజ్ వీర్‌ను నిర్దోషిగా ప్రకటించింది. జీవితంపై ఎంతో ఆశతో కష్టపడి పనిచేసే వ్యక్తి చట్టపరమైన చిక్కుల్లో పడిపోయాడు. దాచుకున్న డబ్బు హరించిపోయింది. పరువు పోయింది. కుటుంబ జీవితంపై తీవ్ర ప్రభావం చూపింది. తన తప్పు లేకున్నా ఇవన్నీ అనుభవించాల్సి వచ్చింది రాజ్ వీర్. ఈ నెల 24న మెయిన్‌పురి కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి స్వప్న దీప్ సింఘాల్ రాజ్ వీర్‌కు సాంత్వన నిచ్చేలా తీర్పు వెలువరించారు. ‘పోలీసులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఒక అమాయకుడు 22 రోజుల పాటు జైలులో ఉండాల్సి వచ్చింది. ఒక తప్పుడు కేసులో 17 ఏళ్లపాటు పోరాడాల్సి వచ్చింది. దీనిపై విచారణ చేపట్టి, ఇందుకు కారణమైన అధికారులపై తగు చర్యలు తీసుకోవాలి’అని జడ్జి ఆదేశించారు. -
‘రాయబారి’ ముసుగులో ఆర్థిక నేరాలు
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ లో నకిలీ రాయబార కార్యాలయం(ఎంబసీ) ఏర్పాటు చేసిన కేసులో మరికొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ ఎంబసీకి సూత్రధారి అయిన హర్షవర్దన్ జైన్(47) గత పదేళ్లలో 162 సార్లు విదేశీ పర్యటనలు చేసినట్లు పోలీపులు గుర్తించారు. అంతేకాకుండా రూ.300 కోట్ల ఆర్థిక కుంభకోణంతో అతడికి సంబంధాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. ఈ స్కామ్‌పై ఉత్తరప్రదేశ్ ‘సిట్’దర్యాప్తు చేస్తోంది. హర్షవర్దన్ జైన్ వెస్టార్కిటికా, సెబోర్గా, పౌల్వయా, లాడోనియా వంటి దేశాల పేరుతో ఎంబసీలు నిర్వహించాడు. ఇందుకు ఘజియాబాద్‌లోని తన రెండంతస్తుల బంగ్లాను అడ్డాగా మార్చుకున్నాడు. ఈ బంగ్లాపై విదేశీ జాతీయ జెండాలు ఎగురుతూ కనిపించేవని స్థానికులు చెప్పారు. ఖరీదైన కార్లలో తిరగడం జైన్‌కు అలవాటు. వాటిపై విదేశాల నామఫలకాలు, ముద్రలు ఉంటాయి. తనను తాను వెస్టార్కిటికా దేశ రాయబారిగా స్థానికులకు పరిచయం చేసుకున్నాడు. రాయబారిగా నాటకం ఆడుతూ జనాన్ని నిండా ముంచేశాడు. మొత్తానికి జైన్ గుట్టు గతవారం రట్టయ్యింది. ఈ నెల 22న అతడిని పోలీసులు అరెస్టు చేశారు. అతడి ఎంబసీ కార్యకలాపాలు బహిర్గతమయ్యాయి. ప్రపంచ దేశాల్లో తనకు పలుకబడి ఉందని, విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పటిస్తానంటూ జనం వద్ద భారీగా డబ్బులు వసూలు చేసినట్లు జైన్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విదేశాల్లో షెల్ కంపెనీలు కేవలం మోసాలే కాదు, ఆర్థిక నేరాల్లోనూ జైన్ ఆరితేరినట్లు పోలీసులు చెబుతున్నారు. ఫోర్జరీ డాక్యుమెంట్లు, నకిలీ పథకాలు, షెల్ కంపెనీలు, విదేశీ బ్యాంక్ ఖాతాలతో భారీ సొమ్ము కొల్లగొట్టినట్లు పేర్కొంటున్నారు. జైన్ 2005 నుంచి 2015 వరకు 19 దేశాల్లో పర్యటించాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి 54 సార్లు వెళ్లొచ్చాడు. యూకేకు 22 సార్లు వెళ్లాడు. అంతేకాకుండా మారిషస్, ఫ్రాన్స్, కామెరూన్ తదితర దేశాల్లో పర్యటించాడు. విదేశాల్లో జైన్‌కు సంబంధించిన 25 షెల్ కంపెనీల లింక్‌లను స్పెషల్ టాస్‌్కఫోర్స్ వెలికితీసింది. స్టేట్ ట్రేడింట్ కార్పొరేషన్, ఈస్ట్ ఇండియా కంపెనీ యూకే లిమిటెడ్, ఐలాండ్ జనరల్ ట్రేడింగ్ కంపెనీ, ఇందిరా ఓవర్సీస్ లిమిటెడ్ తదితర పేర్లతో ఇవి ఏర్పాటయ్యాయి. అలాగే జైన్ పేరిట విదేశాల్లో 10 బ్యాంకు ఖాతాలున్నాయి. ఆరు దుబాయిలో, మూడు యూకేలో, ఒకటి మారిషస్‌తో తెరిచాడు. 12 నకిలీ డిప్లొమాటిక్ పాస్‌పోర్టులను అతడి నివాసంలో పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. అంతర్జాతీయ రాకెట్ హర్షవర్దన్ జైన్ నెట్వర్క్ కేవలం ఇండియాకే పరిమితం కాదు. అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడు. హైదరాబాద్‌లో జని్మంచిన టర్కీ జాతీయుడు అహసన్ అలీ సయీద్ కూడా జైన్‌కు సహకరించాడు. ఇతడి సాయంతో జైన్ విదేశాల్లో పలు కంపెనీలను రిజిస్టర్ చేయించాడు. రూ.300 కోట్ల కుంభకోణంలో అహసన్ అలీ సయీద్ ప్రధాన నిందితుడు. ఇతడు జైన్‌తో కలిసి స్విట్లర్జాండ్‌లోని కంపెనీలను టార్గెట్ చేశాడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సంస్థలను ఎంచుకున్నాడు. తక్కువ వడ్డీకే రుణాలు ఇప్పిస్తామంటూ పెద్ద మొత్తంలో సొమ్ము గుంజాడు. జైన్, అలీ సయీద్ కలిసి హవాలా మార్గాలు, షెల్ కంపెనీలు, విదేశీ బ్యాంకు ఖాతాలతో ఈ డబ్బును సొంతం చేసుకున్నట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు. సౌదీ అరేబియాకు చెందిన వివాదాస్పద ఆయుధ వ్యాపారి అద్నాన్ ఖషోగ్గీతోనూ జైన్‌కు సంబంధాలున్నాయి. 2002, 2004లో ఖషోగ్గీ రూ.20 కోట్లను జైన్ బ్యాంకు ఖాతాకు బదిలీ చేసినట్లు తెలుస్తోంది. ఈ నిధులు జైన్ దేనికోసం ఖర్చు చేశాడన్న దానిపై ఎస్టీఎఫ్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. తదుపరి విచారణ కోసం నిందితుడిని తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ అధికారులు కోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్‌పై సోమవారం విచారణ జరుగనుంది. జైన్‌ను పూర్తిస్థాయిలో ప్రశ్నిస్తే మరికొన్ని సంచలన విషయాలు బయటపడే అవకాదం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. -
కలియుగ సుమతీ..150 కిలోమీటర్లు భర్తను వీపుపై మోసుకెళ్లి..!
త్రేతాయుగంలో సతీ సుమతీ అనే మహా పతివ్రత గురించి వినే ఉంటారు. సుమతీ భర్త కౌశికుడు. కౌశికుడు ఎంత కోపిష్టివాడో.. అతని భార్య సుమతీ అంత శాంతమూర్తి. కౌశికుడు కుష్టురోగంతో బాధపడుతున్నప్పటికీ, సుమతీ అతనిని విడవకుండా సేవ చేస్తుంది. ఒకానొక సందర్భంలో.. ఆమె భర్తను భుజాలపై ఎక్కించుకుని వేశ్య ఇంటికి తీసుకెళ్తుండగా.. మాండవ్య ముని శాపం వల్ల సూర్యోదయానికి ముందే అతని శరీరం వెయ్యి ముక్కలుగా మారుతుందని తెలుసుకుంటుంది. అప్పుడు సుమతీ తన పతివ్రత్య శక్తితో సూర్యోదయాన్ని ఆపివేస్తుంది. తద్వారా భర్త ప్రాణాలు కాపాడుతుంది. చివరికి దేవతలు ఆమెను అభ్యర్థించి, కౌశికుడిని ఆరోగ్యవంతుడిగా చేస్తారు. ఆ సతీ సుమతీది త్రేతాయుగం అయితే మనం చెప్పుకోబోయే ఈ సతీ సుమతిది కలియుగం.ఆమె భర్త దుర్మార్గుడు కాదు. కానీ కుష్ఠురోగంతో బాధపడుతున్న అతనిని చూసి, నేటి సుమతీ చేస్తున్న సేవలు, చూపిస్తున్న నిబద్ధత అంతా ఇంతా కాదు. ప్రస్తుతం భర్తను వీపుమీద మోసుకుంటూ వెళ్తున్న ఫొటోల్ని చూస్తున్న నెటిజన్లు.. ఈ కాలంలో ఇలాంటి భార్యలు ఉన్నారా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా..ఆ మహాసాధ్వి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారుఘజియాబాద్లోని మోడీనగర్‌లోని బఖర్వా నివాసితులు ఆశా, సచిన్ దంపతులు. శ్రావణ మాసంలో ఉత్తర భారతదేశంలో ఎక్కువగా కన్వర్ యాత్రను చేస్తుంటారు. ఇది శ్రావణ మాసంలో (జూలై-ఆగస్టు) జరుగుతుంది. ఈ సమయాన్ని శివుని ఆరాధనకు అత్యంత విశిష్టమైన కాలంగా భావిస్తారు. శివ భక్తుల తీర్థయాత్రనే కన్వర్ యాత్ర అంటారు. ఈ యాత్రలో భాగంగా భక్తులు హరిద్వార్, గంగోత్రి, రిషికేష్ వంటి ప్రాంతాల నుంచి గంగాజలాన్ని కావడిలో (కన్వర్) నింపుకుని తమ ప్రాంతాల్లోని శివాలయాలకు కాలినడకన తీసుకెళ్తారు. ఈ గంగాజలంతో శివలింగానికి అభిషేకం చేస్తారు. ఇక్కడ కన్వర్ అనేది వెదురు కర్ర, దానికి రెండు వైపులా నీటి కుండలు వేలాడేలా కట్టి భుజాలపై మోస్తారు కాబట్టి దీన్ని కన్వర్ యాత్ర అంటారు. ఇక్కడ ఆశా భర్త సచిన్ గత 13 ఏళ్లుగా కాలినడకనఈ యాత్ర చేస్తున్నాడు. అయితే గతేడాది వెన్నుకి గాయం కావడంతో పక్షవాతానికి గురయ్యాడు. దాంతో ఈ ఏడాది ఆ యాత్ర చేసే అవకాశం లేకుండాపోయింది. అయితే అతడి భార్య..అతడి నియమానికి ఆటంకం కలగకుండా అతడిని వీపుపై మోసుకుంటూ కన్వర్‌యాత్ర చేయ తలపెట్టింది. కూడా ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. ఆశా ఏకంగా 150 కిలోమీటర్లు భర్తను వీపుపై మోసుకుంటూ కాలినడకన యాత్ర పూర్తిచేసింది. ఆమె అపారమైన భక్తి, భర్తపై ఉన్న అచంచలమైన ప్రేమ చుట్టూ ఉన్న యాత్రికులను కూడా మంత్రముగ్దుల్ని చేశాయి. నిజంగా ఆ మహాతల్లి సాహసం స్ఫూర్తిని కలిగించడమే గాక ఎందరినో కదలిచింది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు కూడా స్వర్గంలో ముడివేసిన గొప్ప బంధం అంటే ఈ జంట కాబోలు అంటూ ఆ మహాతల్లి ఆశపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.(చదవండి: 58 ఏళ్ల నాటి తాతగారి బెంజ్‌కారు..! ఇప్పటికీ..) -
జమీన్ కీ బేటీ.. వరినాట్లతో యువ ఎంపీ బిజీ బిజీ
రాజకీయ నాయకులు ఎలా ఉంటారో తెలిసిందే. అందులోనూ పదవీ, అధికారం చేతిలో ఉంటే..వాళ్లు ప్రవర్తించే తీరే వేరెలెవెల్ అన్నట్లు ఉంటుంది. కానీ ఈ ఎంపీగారు మాత్రం ప్రజలతో మమేకమయ్యేలా వ్యవహరించిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే కొందరు ఇది పబ్లిసిటీ స్టంట్ అపి విమర్శలు కురిపించగా కొందరు మాత్రం గ్రామీణ జీవన విధానంతో కనెక్ట్ అయ్యే తీరు ఇదేనని, ప్రజలకు చేరువవ్వాలంటే ఇలానే చేయాలంటూ ఆ మహిళా ఎంపీపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇంతకీ ఆ మహిళా ఎంపీ ఎవరంటే..ఉత్తరప్రదేశ్ సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ, భారత క్రికెటర్ రింకు సింగ్ కాబోయే భార్య ప్రియా సరోజ్ రైతు మాదిరిగా స్వయంగా పొలంలో వరి నాట్లు నాటుతూ కనిపించారు. అందుకు సంబంధించిన వీడియోని ఎంపి ప్రియా తన ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగానే క్షణాల్లో వైరల్ అయ్యింది. ఆ వీడియోలో జౌన్‌పూర్‌లోని మచ్లిషహర్ నుంచి ఎంపీగా ఎన్నికైన ప్రియా సరోజ్, పొలంలో పనిచేస్తున్న మహిళా రైతు కూలీలతో కలిసి ఆమె కూడా వరి నాట్లు వేస్తూ బిజీగా కనిపించారు. నిజానికి ఆమె వారణాసిలోని పింద్రా తహసీల్ ప్రాంతంలోని కార్ఖియాన్‌లో నివసిస్తున్నారు. అయితే ఆదివారం వాతావరణం చాలా బాగుండటంతో తన గ్రామం వైపుగా వాకింగ్‌కి వెళ్తూ..అటుగా తన పొలానికి కూడా వెళ్లారు. అక్కడ పొలంలో పనిచేస్తునన్న ఇతర మహిళలు, తన స్నేహితులతో కలిసి ఆమె కూడా వరి నాటారు. ఏదో తూతూ మంత్రంగా చేసినట్లుగా కాకుండా సుమారు ఐదు ఎకరాల భూమిలో ఆమె స్వయంగా పనిచేశారు. అది ఒక రకంగా శ్రామిక జీవుల పట్ల ఆమెకున్న గౌరవాన్ని తేటతెల్లం చేయడమే గాక ప్రజలకు మరింతగా చేరువయ్యేలా చేసింది. అంతేగాదు ఆ వీడియోని చూసిన ప్రజలు ఆమెను “జమీన్ కీ బేటీ” అని ప్రశంసిస్తున్నారు. ఇదిలా ఉండగా, ప్రియా సరోజ్ తండ్రి తుఫానీ సరోజ్ కూడా రైతే. ఆమె కుటుంబానికి వ్యవసాయంతో చాలా అవినాభావ సంబంధం ఉంది. అందువల్ల ఆమెకు పొలంలో పనిచేయడం ఏమి కొత్త కాదని చెబుతున్నారు స్థానిక ప్రజలు. కాగా, ప్రియా రైతు మాదిరిగా వరి నాట్లు వేయడమే గాక రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ సరఫరా సమస్యల గురించి కూడా విద్యుత్ శాఖ మంత్రికి లేఖ రాసినట్లు సమాచారం. समाजवादी पार्टी की सांसद एवं रिंकू सिंह की होने वाली पत्नी की सादगी तो देखो मजदूरों के साथ धान लगवा रही हैं pic.twitter.com/70WBXfFbYJ— Bhanu Nand (@BhanuNand) July 20, 2025(చదవండి: ఫీల్ యువర్ ఫీలింగ్.. ఆర్ట్ ఆఫ్ హీల్.. ! వ్యాధులను నయం చేయడంలో..) -
కట్నం వేధింపులతో యువతి ఆత్మహత్య... ఒంటిపై సూసైడ్ నోట్
లక్నో: మరింత కట్నం తేవాలంటూ అత్తింటి వారు పెట్టే వేధింపులు తాళలేక ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. తన చావుకు కారణమంటూ భర్తతోపాటు అత్తింట్లో వాళ్ల పేర్లను ఒంటిపై రాసుకుని మరీ ఈ అఘాయిత్యానికి పాల్పడింది. మనీషా అనే యువతికి 2023లో నోయిడాకు చెందిన కుందన్‌తో పెళ్లయింది. మొదట్లో అంతా సాఫీగానే వారి కాపురం సాగింది. ఆ తర్వాత పరిస్థితులన్నీ మారిపోయాయి. పెళ్లప్పుడు బుల్లెట్ బైక్‌ను కొనిచ్చారు మనీషా తల్లిదండ్రులు. అయితే, ఎస్యూవీ కావాలంటూ కుందన్ కుటుంబీకులు డిమాండ్ చేయనారంభించారు. తమకు అంత స్థోమత లేదని చెప్పడంతో మనీషా తల్లిదండ్రులు తెలపడంతో శారీరకంగా, మానసికంగా వేధింపులు తీవ్రతరం చేశారు. ‘అన్నం పెట్టకుండా పస్తులుంచుతున్నారు. గదిలో ఉంచి తాళం వేస్తున్నారు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ కుందన్ బెదిరిస్తున్నాడు’అని మనీషా తన చేతిపై రాసుకుంది. వేధింపులు తట్టుకోలేక మనీషా 2024లో పుట్టింటికి చేరుకుంది. అక్కడున్నా వేధింపులకు మాత్రం అంతం లేకుండాపోయింది. ఇటీవల కుందన్, అతడి తల్లిదండ్రులు, ఇద్దరు సోదరులు గ్రామ పెద్దను తీసుకువచ్చి విడాకుల పత్రాలపై సంతకం చేయాలంటూ మనీషాను, ఆమె కుటుంబాన్ని ఒత్తిడి చేశారు. ఒప్పుకోకపోయేసరికి బెదిరింపులు మొదలుపెట్టారు. ‘నా మరణానికి భర్త కుందన్, మరుదులు దీపక్, విశాల్లే కారణం. పంచాయితీ సమయంలో వారు నా కుటుంబానికి హెచ్చరికలు చేశారు’అంటూ మనీషా తన కాలిపై రాసుకుంది. ‘మంగళవారం రాత్రి మేడపైన పడుకునేందుకు వెళ్లిన మనీషా పురుగుమందు తాగింది. ఉదయానికి విగతజీవిగా కనిపించింది’అని కుటుంబీకులు చెప్పారు. అత్తింటి నుంచి ఎదురవుతున్న ఒత్తిళ్లు, వేధింపులను తాళలేక డిప్రెషన్‌తో బలవన్మరణం చెందిందన్నారు. చనిపోయేముందే శరీరంపై ఆమె ఈ మేరకు రాసుకుందన్నారు. మనీషా మరణానికి విష ద్రావకమే కారణమని పోస్టుమార్టంలో తేలిందని ఏఎస్పీ ఎన్పీ సింగ్ చెప్పారు. ఆమె కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టామన్నారు. -
సైన్యానికి 7 వేల ఏకే–203 రైఫిల్స్
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత సైన్యం సాయుధంగా బలపడుతోంది. దశాబ్దాల కాలం నాటి రైఫిళ్ల వాడకాన్ని దశలవారీగా నిలిపేయనుంది. తాజాగా శిక్షణ పూర్తిచేసుకోబోతున్న సైనికుల బ్యాచ్‌కు మరో రెండు, మూడు వారాల్లో 7,000 దాకా కలాష్నికోవ్ ఏకే–203 రకం రైఫిళ్లను అందజేయనున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని అమేథి నగరంలో ఇండో–రష్యన్ భాగస్వామ్యంతో ఈ రైఫిళ్లను తయారుచేస్తున్న విషయం విదితమే. గత 18 నెలల్లో 48,000 రైఫిళ్లను తయారుచేసి సరఫరాచేశారు. 2023 జనవరిలో ఏకే203 రైఫిళ్ల ఉత్పత్తి అధికారికంగా ప్రారంభమైంది. 2026 కల్లా 1,00,000 యూనిట్లను డెలివరీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సంవత్సరం చివరి నాటికి ఇండో–రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ గడువు ముగియనుంది. తర్వాత పూర్తిగా స్వదేశీ రైఫిల్‌గా ఇది అవతరించనుంది. ప్రస్తుతం రైఫిళ్లను 50 శాతం స్వదేశీ భాగాలతో ఉత్పత్తి చేస్తున్నారు. అమేథీలో ప్రతి నెలా 12,000 రైఫిళ్లు తయారవుతున్నాయి. ప్రతి వంద సెకన్లకు ఒక రైఫిల్ తయారవుతోంది. ఒక సంవత్సరంలో 1.5 లక్షల రైఫిళ్లను ఉత్పత్తి చేస్తారు. పూర్తి ఆర్డర్ అంటే.. 6 లక్షల రైఫిళ్ల తయారీ 2030నాటికి పూర్తి కానుంది. గడువు కంటే దాదాపు 22 నెలలు ముందుగానే అన్ని రైళ్ల తయారీ, సరఫరా పూర్తి చేయనున్నట్టు అంచనా. ఇక ఈ రైఫిల్స్‌కు ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాలకు ఎగుమతి చేయాలంటూ విజ్ఞప్తులు వచ్చాయి. భారత త్రివిధ బలగాల అవసరాలు తీరాక అనంతరం విదేశాలకు ఎగుమతి చేయనున్నారు. ఏకే–203 ప్రత్యేకతలుపాత కలాష్నికోవ్ సిరీస్‌కు ఆధునిక రూపం అయిన ఏకే–203 ఖచ్చితత్వంలో పనిచేస్తుంది. ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలతోపాటు అధిక ఎత్తుల్లో రణక్షేత్రాల్లో సులువుగా ఉపయోగించేందుకు అనువుగా దీనిని రూపొందించారు. నిమిషానికి 700 తూటాలను దీని నుంచి ప్రయోగించవచ్చు. గరిష్టంగా 800 మీటర్ల దూరంలోని లక్ష్యాలను సైతం ఇది ఖచ్చితత్వంతో చేధించగలదు. -
రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు
ఢిల్లీ: భారత్ జోడోయాత్రలో నమోదైన కేసులో భాగంగా ప్రతిపక్ష కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరైంది. భారత్ జోడోయాత్రలో ఇండియన్ ఆర్మీని కించపరిచే విధంగా రాహుల్ వ్యాఖ్యలు చేశారనే పరువు నష్టం కేసులో ఆయనక లక్నో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీనిలోభాగంగా రూ. 20 వేల పూచీకత్తు, రెండు బాండ్లు సమర్పించారు రాహుల్ గాంధీ న్యాయవాదులు. ఈ కేసు తదుపరి విచారణను ఆగస్టు 13కు వాయిదా వేసింది కోర్టు.2022, డిసెంబర్ 16వ తేదీన భారత్ జోడో యాత్రలో భాగంగా భారత్ ఆర్మీ సైనికుల్ని రాహుల్ కించ పరిచారంటూ పరువు నష్టం కేసు దాఖలైంది. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ మాజీ డైరెక్టర్ ఉదయ్ శంక్ శ్రీవాస్తవ తరఫను వివేక్ తివారీ అనే న్యాయవాది రాహల్ వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. ఇండియన్ ఆర్మీని రాహల్ కించపరిచారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లో భారత సైనికులను చైనా ఆర్మీ కొడుతున్నా భారత్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని రాహుల్ జోడోయాత్రలో ప్రశ్నించారు. ఎల్వోసీ వెంబడి చైనా చర్యలకు భారత్ ఎందుకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారని నిలదీశారు. ఈ వ్యాఖ్యలపైనే రాహుల్‌పై కేసు నమోదైంది. భారత్ ఆర్మీని కించపరిచారంటూ పరువు నష్టం కేసు దాఖలైంది. అదే సమయంలో దేశంలోని పలు చోట్ల రాహుల్ గాంధీపై ప్రత్యర్థి పార్టీలు రాజకీయ పిటిషన్లు దాఖలు చేశాయి. మరొకవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాందీకి ఈ జనవరిలో ఊరట లభించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సుప్రీంకోర్టు స్టే విధించింది. 2019లో లోక్‌సభ ఎన్నికల సమయంలో జార్ఖండ్‌లోని చైబాసా పట్టణంలో బహిరంగ సభలో రాహుల్ మాట్లాడుతూ అమిత్ షాపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన హంతకుడు అని మండిపడ్డారు. రాహుల్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీజేపీ నాయకుడు నవీన్ ఝా 2019లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
భర్త కనుపాప అలసి.. న్యాయం కోసం ఎదురు చూపులు..
భార్య నుంచి భర్త భరణాన్ని కోరవచ్చా? చట్టాలు అందుకు సమ్మతిస్తాయా?. పిల్లల్ని మాత్రమే చదివించాలని.. భార్యలను చదివించవద్దని సోషల్ మీడియాలో ఆ మధ్య ప్రచారం ఎందుకు నడిచింది?. భరణానికి.. ఈ ప్రచారానికి అసలు సంబంధం ఏంటి?.. జ్యోతి-అలోక్ కేసు సంచలన తీర్పునకు వేదిక కాబోతోందా?. ఇదంతా తెలియాలంటే ఈ సంచలన కేసు వివరాల్లోకి వెళ్లాల్సిందే.. జ్యోతి మౌర్య ఉత్తర ప్రదేశ్‌లో పీసీఎస్ అధికారిణి. ఆమె భర్త కూడా ప్రభుత్వ ఉద్యోగే(శానిటేషన్ డిపార్ట్మెంట్లో 4వ కేడర్ ఉద్యోగి). అయితే గత కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో తన భార్య నుంచి భరణం కోరుతూ ఆయన కోర్టు మెట్లు ఎక్కారు. తన భార్య జ్యోతి సంపాదన తన కంటే చాలా ఎక్కువని, పైగా తనకున్న అనారోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకుని భరణం ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ వేశాడతను.గతంలో ప్రయాగ్‌రాజ్ ఫ్యామిలీ కోర్టు ఈ పిటిషన్‌ను కొట్టేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆయన అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశాడు. విచారణకు స్వీకరించిన కోర్టు.. జ్యోతి మౌర్యకు నోటీసులు పంపింది. ఈ కేసులో తదుపరి విచారణ ఆగష్టు 8వ తేదీన జరగనుంది. అయితే ఈ కేసు ఇప్పటికిప్పుడే వార్తల్లోకి ఎక్కింది కాదు. బాగా చదివించిన భార్య తనను మోసం చేసి మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందుంటూ చాన్నాళ్ల కిందట వైరల్ అయిన కథనం తాలుకాదే..!పారిశుద్ధ్య కార్మికుడైన అలోక్ మౌర్యకు 2010లో జ్యోతి అనే యువతితో వారణాసి చిరైగావ్ గ్రామంలో జరిగింది. అప్పటికి ఆమె వయసు 20 ఏళ్లు. డిగ్రీ చేసి ఇంటి వద్దే ఖాళీగా ఉంటోంది. దీంతో.. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ కావాలని అలోక్ ఆమెను ప్రొత్సహించాడు. అలా ఆమె కష్టపడి 2015లో పీసీఎస్(Provincial Civil Services) పరీక్షలు రాసి 16వ ర్యాంకుతో సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ జాబ్ దక్కించుకుంది. అప్పటి నుంచి జౌన్పూర్, కౌశంబి, ప్రతాప్‌ఘడ్, ప్రయాగ్‌రాజ్‌లలో ఆమె విధులు నిర్వహించింది. ఆ జంటకు 2015లో కవల పిల్లలు పుట్టారు.2020లో వీళ్ల కాపురంలో కలతలు మొదలయ్యాయి. ఫేస్బుక్ ద్వారా పరిచయమైన హోం గార్డ్ కమాండెంట్ మనీష్ దుబేతో జ్యోతి వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో అలోక్-జ్యోతి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో లక్నోలోని ఓ హోటల్లో ఈ ఇద్దరినీ రెడ్‌హ్యాండెండ్‌గా అలోక్ పట్టుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటన తర్వాత భర్తకు దూరంగా ఉంటూ వచ్చింది జ్యోతి. ఈ క్రమంలో.. 2023లో తనను హత్య చేసేందుకు తన భార్య జ్యోతి కుట్ర పన్నుతుందంటూ అలోక్ పోలీసులను ఆశ్రయించాడు. అదే సమయంలో జ్యోతి కూడా తనను కట్నం కోసం భర్త, అతని కుటుంబం వేధిస్తోందంటూ కేసు పెట్టారు. ఈలోపు జ్యోతి అవినీతి బాగోతమంటూ వాట్సాప్ చాటింగ్, డైరీకి సంబంధించిన పేజీలు ఆన్లైన్లో చక్కర్లు కొట్టాయి. అప్పుడే తనకు న్యాయం కావాలంటూ అలోక్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ వీడియో నెట్లో బాగా వైరల్ అయ్యింది.ఇదిలా ఉండగా.. ఈ కేసు నేపథ్యంలో ‘‘బేటీ పడావో.. బీవీ నహీ(పిల్లలను చదివించండి.. భార్యలను కాదు)’’ అంటూ సోషల్ మీడియాలో మీమ్స్, పోస్టులతో చర్చ నడిచింది. ఏకంగా కొందరు ఈ లైన్ మీద బాణీలు కట్టి యూట్యూబ్‌లలో వదిలారు. సరిగ్గా అదే సమయంలో ఓ కులాన్ని కించపరిచేలా జ్యోతి చేసిన ప్రసంగం నెట్టింట మంట పుట్టించింది. జ్యోతి క్షమాపణలు చెప్పాలంటూ భీమ్ ఆర్మీ నిరసలకు దిగింది. భర్త భరణానికి అర్హుడేనా?హిందూ వివాహ చట్టం 1955లోని సెక్షన్ 24 ప్రకారం.. పోషించుకోలేని పరిస్థితుల్లో భార్యభర్తల్లో ఎవరికైనా సరే భరణం పొందే అర్హత ఉంది. ఈ లెక్కన ఈ భరణం పిటిషన్.. రాబోయే రోజుల్లో చర్చనీయాంశమయ్యే అవకాశం లేకపోలేదు.ప్రొఫెషనల్‌గానూ..వ్యక్తిగత జీవితంతోనే కాదు.. వృత్తిపరంగానూ జ్యోతి మీద విమర్శలు ఉన్నాయి. ఇంతకు ముందు బరేలీ సెమీఖేదా షుగర్ మిల్కు ఆమె జనరల్ మేనేజర్‌గా పని చేశారు. ఆమె హయాంలో వివిధ కార్యకలాపాల జాప్యంతో చెరుకు రైతులు నిరసనలకు దిగారు. ఇటు రైతులే కాదు, అటు తోటి అధికారులు ఆమె వ్యవహార శైలిపై ఫిర్యాదులు చేశారు. దీంతో.. 2023లో ప్రభుత్వం ఆమెను బదిలీ చేసింది. లక్నో హెడ్ క్వార్టర్స్‌కు ఆమెను బదిలీ చేసినప్పటికీ.. ఇప్పటిదాకా ఎలాంటి బాధ్యతలను అప్పజెప్పకపోవడం గమనార్హం. -
త్వరలో యూపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు!
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సగానికి పైగా రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ పూర్తిచేసి, అధ్యక్షులను నియమించిన బీజేపీ అధిష్టానం తమ పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియకు అతిత్వరలో శ్రీకారం చుట్టబోతోంది. మరో పది రోజుల్లో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న దృష్ట్యా.. అంతకంటే ముందే ఈ ఎన్నిక ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తోంది. బీజేపీకి ఆయువు పట్టులాంటి ఉత్తర్‌ప్రదేశ్‌లో రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికను జాతీయ అధ్యక్షుడి ఎంపిక అనంతరమే చేపట్టే అవకాశం ఉన్నట్లు సమచారం. ఉత్తరప్రదేశ్‌కు ఉన్న రాజకీయ ప్రాధాన్యత వల్ల అధ్యక్షుడి ఎంపికలో ఆచితూచి వ్చవహరించాలని బీజేపీ పెద్దలు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 2027 ఎన్నికలే లక్ష్యంగా.. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ బీజేపీకి జాట్ వర్గానికి చెందిన భూపేంద్రసింగ్ చౌదరి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 2023లోనే ఆయన పదవీకాలం ముగిసినా 2024 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పొడిగించారు. లోక్‌సభ ఎన్నికల్లో 80 స్థానాలకు గాను బీజేపీ కేవలం 33 స్థానాలు గెలుచుకుంది. పార్టీ పేలవ ప్రదర్శన దృష్ట్యా ఆయనను మార్చేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్లు మొగ్గు చూపుతున్నాయి. ప్రస్తుతం యూపీలో దళితులు, ఓబీసీలు, ఆదివాసీల చుట్టే రాజకీయాలు పరిభ్రమిస్తున్నాయి. బీజేపీ సైతం ఆయా వర్గాల నుంచి సమర్థులైన నేతలను అన్వేషిస్తోంది. ఓబీసీ వర్గానికి చెందిన స్వతంత్రదేవ్ సింగ్, ధరంపాల్ సింగ్, బీఎల్ వర్మలు ప్రధాన పోటీదారులుగా ఉండగా, కేంద్ర మాజీ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి, సీనియర్ నేతలు బాబూరామ్ నిషాద్, అశోక్ కటారియాలు సైతం రేసులో ఉన్నారు. యూపీ బీజేపీ అధ్యక్షుడిగా ఎవరిని ఎంపిక చేసినా ఆయన సారథ్యంలోనే 2027లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంది. క్రమంగా బలపడుతున్న సమాజ్‌వాదీ పార్టీ, దానికి అండగా ఉన్న కాంగ్రెస్‌ను ఎదిరించాలంటే బీజేపీ శ్రేణులను సమన్వయంతో ముందుకు నడిపించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికిప్పుడు కొత్త అధ్యక్షుడి ఎంపిక సాధ్యం కాదని, జాతీయ అధ్యక్షుడి ఎన్నిక తర్వాతే ఈ ప్రక్రియ మొదలవుతుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీకి సైతం జాతీయ అధ్యక్షుడి ఎన్నిక తర్వాతే కొత్త అధ్యక్షుడి వస్తారని అంటున్నారు. ఢిల్లీలో 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా నేతృత్వంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆయనకే మళ్లీ పగ్గాలు కట్టబెడతారా? లేక కొత్త వారికి అవకావం ఇస్తారా? అన్నది వేచి చూడాల్సి ఉంది. -
హైదరాబాద్‌లో ‘ఉత్తరప్రదేశ్’ రోడ్‌షో
పరిశ్రమలు, పెట్టుబడులు ఆకర్షించడానికి ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్వహించనున్న ‘ఉత్తర ప్రదేశ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో’ (యూపీఐటీఎస్) 2025 కోసం హైదరాబాద్‌లో తాజాగా రోడ్ షో నిర్వహించింది. ఈ మెగా ఈవెంట్‌పై అవగాహన, ఆకర్షణ పెంచడానికి దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్‌లో రోడ్ షో చేపట్టింది.తొలుత ఢిల్లీతో మొదలు పెట్టిన ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం తర్వాత హైదరాబాద్‌లో ఈ రోడ్ షో నిర్వహించింది. నగరంలో జరిగిన కార్యక్రమంలో 150 మందికి పైగా పారిశ్రామిక దిగ్గజాలు, ఎగుమతిదారులు, సోర్సింగ్ కన్సల్టెంట్లు, వాణిజ్య సంస్థలు పాల్గొన్నాయి. గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్ పో సెంటర్ అండ్ మార్ట్ లో సెప్టెంబర్ 25 నుంచి 29 వరకు జరగనున్న యూపీఐటీఎస్ 2025కు ఊపును పెంచడమే లక్ష్యంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.ఈ సందర్బంగా నగరంలోని టీసీసీఐలో జరిగిన కార్యక్రమంలో యూపీ ఎంఎస్ఎంఈ క్యాబినెట్ మంత్రి రాకేష్ సచన్, ఆ రాష్ట్ర పరిశ్రమల అడిషనల్ కమిషనర్ రాజ్ కమల్ యాదవ్, టీసీసీఐ అధ్యక్షుడు సురేష్ కుమార్ సింఘాల్, ఐఈఎంఎల్ సీఈవో సుదీప్ సర్కార్ తదితరులు ప్రసంగించారు. ఆసియాలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్లలో ఒకటైన ఇండియా ఎక్స్పోజిషన్ మార్ట్ లిమిటెడ్ (ఐఈఎంఎల్) సహకారంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం యూపీఐటీఎస్ 2025ను నిర్వహిస్తోంది. బెంగళూరు, ముంబై, అహ్మదాబాద్ లలో రోడ్ షోలు ప్లాన్ చేస్తున్నారు. -
యూపీలో దారుణం.. అనురాధతో తాంత్రికుడి పైశాచిక ఆనందం!
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. తనకు పిల్లలు పుట్టడం లేదని ఓ మహిళ.. స్థానికంగా ఉన్న తాంత్రికుడిని ఆశ్రయించింది. అదే అదునుగా సదరు తాంత్రికుడు.. ఆమెతో అనుచితంగా ప్రవర్తించడం, మంత్రాల నెపంతో దాడి చేయడం, టాయిలెట్ నీళ్లు తాగించడం వంటివి చేశాడు. దీంతో, ఆమె ఆరోగ్యం క్షీణించి బాధితురాలు మృతిచెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్ జిల్లాలోని కంధారపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పహల్వాన్పూర్ గ్రామానికి చెందిన అనురాధ(35)కు పదేళ్ల క్రితమే వివాహం జరిగింది. పదేళ్లు అయిన పిల్లలు పుట్టకపోవడంతో బాధితురాలు వైద్యులను ఆశ్రయించింది. అయినప్పటికీ పిల్లలు పుట్టలేదు. ఈ నేపథ్యంలో ఇరుపొరుగు వారు ఆమెకు ఓ సలహా ఇచ్చారు. స్థానికంగా ఉన్న తాంత్రికుడి చందు వద్దకు వెళ్లాలని సూచించారు. వారి మాటలు నమ్మిన అనురాధ.. అతడి వద్దకు వెళ్లింది.ఈ క్రమంలో రెచ్చిపోయిన తాంత్రికుడు చందు.. అనురాధతో అనుచితంగా ప్రవర్తించాడు. తాకరాని చోట తాకుతూ ఇబ్బందులకు గురిచేశాడు. అంతటితో ఆగకుండా.. అనురాధకు దుష్టాత్మ పట్టిందని నమ్మించాడు. కొన్ని పూజలు చేయాలని చెప్పి.. అతని సహాయకులు ఆమె జుట్టును లాగి, ఆమె మెడ, నోటిని బలవంతంగా నొక్కారు. మురుగు కాలువ, టాయిలెట్ నుండి మురికి నీటిని కూడా తాగించారు. అనంతరం, అనురాధ ఆరోగ్యం క్షీణించింది. దీంతో, సదరు తాంత్రికుడు, బాధితురాలు తల్లి కలిసి అనురాధను ఆసుపత్రికి తరలించారు. అక్కడికి చేరుకున్న కాసేపటికే అనురాధ చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. ఆ తర్వాత మృతదేహాన్ని అక్కడే వదిలేసి తాంత్రికుడి బృందం ఆసుపత్రి నుండి పారిపోయింది. అనురాధ చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు.ఈ సందర్బంగా బాధితురాలి తల్లిదండ్రులు మాట్లాడుతూ.. ఏదో పూజల పేరుతో అనురాధను చందు చిత్రహింసలకు గురి చేశారు. మురుగు నీటిని తాగించ వద్దని మేము వారించినప్పటికీ మా మాట వినలేదు. మా బిడ్డను అన్యాయం చంపేశారు. పూజలు చేయాలని అతడు మా వద్ద నుంచి 22వేలు తీసుకున్నాడు. ఇంకా డబ్బులు ఇవ్వాలని బెదిరించాడు. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో తాంత్రికుడు చందు పోలీస్ స్టేషన్లో లొంగిపోగా.. అతడి సహచరులు పరారీలో ఉన్నారు. -
20 మంది గాళ్‌ఫ్రెండ్స్, ఇద్దరు భార్యలు..
ఇలా ఎలారా.. అని అవాక్కయ్యారా? ఒక్కరితోనే వేగలేక చస్తున్నాం, ఇంత మందిని ఎలా మేనేజ్ చేశావ్ బ్రో అంటూ బుర్ర బద్దలు కొట్టుకోకండి. పాపం ఎప్పటికైనా పండుతుంది. తప్పు చేసిన వాడు ఎప్పటికీ తప్పించుకోలేడు. నౌషాద్ త్యాగి విషయంలోనూ అదే జరిగింది. మహిళల జీవితాలతో చెలగాటమాడిన ఈ కేటుగాడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.ఎవరీ నౌషద్?ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలోని చార్తవాల్ ప్రాంతంలో జూలై 1న నౌషాద్ త్యాగిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసు ఉద్యోగం చేస్తున్నట్టు నమ్మించి పలువురు మహిళలను మోసం చేయడంతో పోలీసులు అతడికి బేడీలు వేశారు. యూపీ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG)లో కానిస్టేబుల్‌గా నటిస్తూ, మారు పేర్లతో కొన్నేళ్లుగా వంచనకు పాల్పడినట్టు అతడిపై ఆరోపణలు ఉన్నాయి. త్యాగికి ఇద్దరు భార్యలు, 20 మంది స్నేహితురాళ్లు ఉన్నారని.. వీరిలో 10 మందితో శారీరక సంబంధాలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు.వారే త్యాగి టార్గెట్..వితంతువులు, భర్తల నుంచి విడిపోయిన మహిళలను లక్ష్యంగా చేసుకుని త్యాగి మోసాలకు పాల్పడ్డాడు. తాను లక్ష్యంగా చేసుకున్న మహిళ మతం ఆధారంగా తన వేషం మారుస్తాడు. హిందూ మహిళలకు రాహుల్ లేదా రికీగా, ముస్లిం మహిళలకు నౌషాద్‌గా పరిచయం చేసుకుని దగ్గరవుతాడు. తర్వాత వారి నుంచి డబ్బు, బంగారం, ఖరీదైన వస్తువులు దోచుకుని ఉడాయిస్తాడు. ముజఫర్‌నగర్‌లో మొదటి భార్య, ఢిల్లీలోని సివిల్ లైన్స్ ప్రాంతంలో అతడి రెండవ భార్య ఉంటారు. వీరిద్దరికీ తెలియకుండా త్యాగి వంచన పర్వం కొనసాగించాడు. మొదటి భార్య అతడి కంటే 23 సంవత్సరాలు పెద్ద.నాలుగు రాష్ట్రాల్లో మోసాలుయూపీతో పాటు ఢిల్లీ, మేఘాలయ, అసోం రాష్ట్రాల్లో ఆరేళ్లుగా నౌషాద్ త్యాగి మోసాలకు పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు. ఘజియాబాద్, బులంద్‌షహర్, మధుర, సంభాల్, ముజఫర్‌నగర్ ప్రాంతాల్లో వేర్వేరు పేర్లతో అతడు వంచన పర్వం సాగించినట్టు తెలిపారు. అంతేకాదు పోలీసు యూనిఫాం ధరించి జనాన్ని బెదిరించి డబ్బులు గుంజేవాడని చెప్పారు. సంబంధిత సెక్షన్ల కింద అతడిపై కేసు నమోదు చేశారు. తన మోసపూరిత చర్యలకు ఉపయోగించిన యూనిఫామ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.దొరికాడిలా..ముజఫర్ నగర్లో దుకాణం నడుపుతున్న ఒక వితంతువును త్యాగి వలలో వేసుకోవడంతో ఈ దురాగతం బయటపడింది. తనను రాహుల్ త్యాగిగా పరిచయం చేసుకుని, ఆమె దుకాణానికి తరచుగా వెళ్లేవాడు. ఆమెపై ప్రేమ నటించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి 2 లక్షల 75 వేల రూపాయలు గుంజాడు. తాకట్టులో ఉన్న 3 లక్షల రూపాయల విలువైన ఆభరణాలను విడిపించేందుకు ఆమెను ఒప్పించాడు. అయితే పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా అతడు తప్పించుకోవడానికి చూసేవాడు. దీంతో అనుమానం వచ్చిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బండారం బయట పడింది. అప్పటికే విషయం అర్థమై కొత్త 'తోడు' కోసం వెతుక్కునే ప్రయత్నంలో ఉండగా పోలీసులు త్యాగి ఆట కట్టించారు. అతడి మొబైల్ ఫోన్లో అనేక మంది మహిళల అభ్యంతరకరమైన ఫోటోలు, వీడియోలు ఉన్నట్టు గుర్తించారు. మారు పేర్లతో అతడు తయారు చేయించిన నేమ్ ప్లేట్లను స్వాధీనం చేసుకున్నారు.చదవండి: ఎంత నరకం అనుభవించాడో..ఫ్రెండ్ యూనిఫాంతో మోసాలు..పోలీసు కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న స్నేహితుడితో ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ ప్రాంతంలో నౌషద్ త్యాగి నివసించేవాడు. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో అతడి ఫ్రెండ్ మధ్యప్రదేశ్‌కు వెళ్లాల్సి వచ్చింది. అతడు అనుకోకుండా యూనిఫాం, ఇతర వస్తువులను త్యాగి వద్ద వదిలి వెళ్లాడు. వీటితో నౌషద్ మోసాలకు తెర తీశాడు. ముజఫర్‌నగర్‌కు మకాం మార్చి.. తనకు తాను పోలీసు కానిస్టేబుల్‌గా చెప్పుకుంటూ చెలరేగిపోయాడు. ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. -
యూపీ, కేరళ విద్యార్థులతో శుభాంశు మాటామంతీ
లక్నో/తిరువనంతపురం: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లోని భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లాతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి కేరళ, ఉత్తరప్రదేశ్ పాఠశాల విద్యార్థులు అత్యంత అరుదైన, మాటల్లో చెప్పలేని అనుభూతిని పొందారు. భారరహిత స్థితిలో స్వేచ్ఛగా గాల్లో కదలాడుతూ బంతితో ఆడుకుంటున్న శుక్లాను చూసి ఆ విద్యార్థులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. పట్టరాని ఆనందంతో పదే పదే ప్రశ్నలు సంధించారు. వాళ్ల ప్రశ్నలకు శుక్లా వివరణాత్మక సమాధాలిచ్చారు. ‘‘ ఆయన అలా శూన్యస్థితిలో చక్కర్లు కొడుతుంటే ఎంతో చూడముచ్చటగా ఉంది. మేము అడిగిన ఎన్నో ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. ఐఎస్ఎస్లో ఎలా గాల్లో ఈదినట్లుగా ముందుకు కదలాలో ఆయన స్వయంగా కదిలి చూపించారు’’ అని కోజికోఢ్లోని నయార్కుళి ప్రభుత్వ హయ్యర్ సెకండరీ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థిని సంఘవి చెప్పారు. శుక్లా సొంతూరు లక్నోలో, తిరునంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లోని విద్యార్థులూ ఆయనతో మాట్లాడారు. ఐఎస్ఎస్లో ఉన్నప్పుడు వ్యోమగాములు ఎలాంటి ఆహారం తీసుకుంటారు?. అలా కదులుతూ ఉంటే నిద్రపోవడమెలా?. హఠాత్తుగా ఒంట్లో బాగోలేకపోతే డాక్టర్ ఉండరుగా. అప్పుడెలా?. ఇక్కడి నుంచి ఐఎస్ఎస్కు వెళ్లాక ఎంతకాలానికి అక్కడి వాతావరణానికి అలవాటుపడతారు?. తిరిగొస్తే ఇక్కడ మామూలుగా మారడానికి ఎంత టైమ్ పడుతుంది?.. ఇలా విద్యార్థులు అడిగిన ఎన్నో ప్రశ్నలకు శుక్లా సమాధానాలు చెప్పారు. ‘‘ ఐఎస్ఎస్లో నిద్రపోవడం ఒక సరదా పని. ఇక్కడ నేల, పైకప్పు రెండూ ఉండవు. అందుకే కొందరు గోడలకు, కొందరు సీలింగ్‌కు అతుక్కుని నిద్రిస్తూ కనిపిస్తారు. కదలకుండా పడుకోవాలంటే నిద్రపోయే స్లీపింగ్ బ్యాగ్‌ను దేనికైనా కట్టేసుకోవాల్సిందే’’ అని ఆయన నవ్వుతూ చెప్పారు. దీంతో విద్యార్థులు విరగబడి నవ్వారు. ‘‘ ఇక్కడి వచ్చినప్పటితో పోలిస్తే ఇప్పుడు నేను ఎంతో మెరుగ్గా ఉన్నా. భారరహిత స్థితికి అలవాటు పడటం కాస్తంత ఇబ్బందిగా ఉంటుంది. తిరిగి భూమి మీదకొచ్చాక గురుత్వాకర్షణ స్థితికి మారడం కూడా ఒక సవాలే’’ అని శుక్లా అన్నారు. ‘‘ ఒంటరిగా ఉన్నామని ఫీల్ అయితే వెంటనే కుటుంబసభ్యులు, స్నేహితులతో వర్చువల్‌గా మాట్లాడి మనసును తేలికచేసుకుంటాం. తరచూ వ్యాయామం చేస్తాం. ప్రయోగాలు సరేసరి’’ అంటూ శుక్లా చెప్పుకొచ్చారు. ఇస్రో వారి విద్యార్థి సంవాద్ కార్యక్రమంలో భాగంగా వ్యోమగాములతో విద్యార్థుల మాటామంతీ పోగ్రామ్‌ను నిర్వహించారు. ‘‘ ఎప్పుడైనా కొన్ని నిమిషాలు తీరిక సమయం దొరికితే వెంటనే కిటికీల వద్దకు వెళ్లి అంతరిక్ష నుంచి మన పుడమిని చూడటం ఎంతో ఆసక్తికరంగా, ఆనందంగా ఉంటుందని ఆయన నాతో చెప్పారు’’ అని ఒక విద్యార్థి ‘పీటీఐ వీడియోస్’తో చెప్పింది. -
ఎమ్మెల్యేను పరారీలో ఉన్న నేరగాడిగా ప్రకటించిన యూపీ కోర్టు
మౌ: ఉత్తరప్రదేశ్‌లోని ఎంపీ/ఎమ్మెల్యేల కేసులను విచారించే ప్రత్యేక న్యాయస్థానం సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేను పరారీలో ఉన్న నేరగాడిగా ప్రకటించింది. ఘోసి ఎమ్మెల్యే సుధాకర్ సింగ్‌పై దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం నమోదైన కేసుపై గురువారం మౌలో ప్రత్యేక న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసిందని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. దొహారీఘాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ విద్యుత్ ఉప కేంద్రం వద్ద 1986లో విద్యుత్ కోతలకు నిరసనగా ఆందోళన జరిగింది. ఈ సమయంలో సుధాకర్ సింగ్ అధికారుల అనుచితంగా ప్రవర్తించడంతోపాటు విధ్వంసానికి పాల్పడ్డాడు. దీనిపై కేసు నమోదైంది. అప్పట్లో ఈ ప్రాంతం ఆజంగఢ్ జిల్లా పరిధిలో ఉండటంతో విచారణ చేపట్టిన ఆజంగఢ్ కోర్టు సింగ్‌కు బెయిలిచ్చింది. అనంతరం, ప్రత్యేక జిల్లాగా మారడంతో కేసు ఆజంగఢ్ నుంచి మౌకు మారింది. కేసు విచారణకు హాజరు కావడం లేదంటూ మౌ కోర్టు 2023లో సింగ్‌ను పరారీలో ఉన్న నేరగాడి ప్రకటించింది. తాజాగా, ఈ కేసును విచారించిన న్యాయస్థానం మరోసారి సింగ్‌ను పరారీలో ఉన్నట్లు ప్రకటించింది. -
కన్వర్ యాత్రకు అవే నిబంధనలు.. మళ్లీ వివాదం తలెత్తేనా?
మీరట్: ఉత్తరాదిన జూలై 11న ప్రారంభమయ్యే వార్షిక కన్వర్ యాత్ర నేపధ్యంలో యూపీలోని మీరట్ జిల్లా యంత్రాంగం పలు నిబంధనలను విధించింది. కన్వర్ యాత్రామార్గంలోని అన్ని ఫుడ్ కోర్టులు తాము విక్రయించబోయే ఆహార పదార్థాల జాబితా, వాటి ధరలతో సహా ఇతర కీలక సమాచారాన్ని బహిరంగంగా ప్రదర్శించాలని మీరట్ జిల్లా యంత్రాంగం ఆదేశించింది. గత ఏడాది ఇటువంటి నిబంధనల నేపధ్యంలోనే ప్రభుత్వానికి వ్యాపారులకు మధ్య వివాదం తలెత్తింది. మీరట్ డివిజనల్ కమిషనర్ హృషికేష్ భాస్కర్ యశోద్ మీడియాతో మాట్లాడుతూ కన్వర్ యాత్రామార్గంలోని అన్ని ఆహారశాలల వెలుపల ఆహార పదార్థాల ధరల జాబితాను ప్రదర్శించేలా జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతోందన్నారు. దీని వలన భక్తుల నుంచి అధిక ఛార్జీలు తీసుకునేందుకు అవకాశం ఉండదు. అలాగే తమకు కావలసిన ఆహారాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుందన్నారు. అలాగే ఆహారశాలల యజమానులు తమ పేరు, రిజిస్ట్రేషన్ నంబర్, ఆహార భద్రత రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లను బహిరంగంగా ప్రదర్శించాలని ఆదేశించారు. ఈ వివరాలతో కూడిన క్యూఆర్ కోడ్‌ను వినియోగదారులకు అందుబాటులో ఉంచాలని హృషికేష్ భాస్కర్ యశోద్ తెలిపారు. ఆహార భద్రతా చట్టం, 2006లోని సెక్షన్ 55 ప్రకారం నిబంధనలకు అనుగుణంగా లేని వ్యాపారాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే రెండు లక్షల రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపారు. #WATCH | Meerut, UP | Commissioner Meerut Division, Dr Hrishikesh Bhaskar Yashod says, "The district administration is ensuring that a list of food items and their prices is displayed outside all the food joints along the Kanwar yatra route. The food safety department will ensure… pic.twitter.com/9wrpzdS7rp— ANI (@ANI) July 2, 2025కన్వర్ యాత్రను శివ భక్తులు చేపడుతుంటారు. శ్రావణ మాసంలో గంగా నది నుండి పవిత్ర జలాన్ని తీసుకువచ్చి. శివునికి అభిషేకం చేస్తుంటారు. ఈ యాత్రకు లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. కాగా 2024లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కన్వర్ యాత్ర మార్గంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార బండ్లు నిర్వహించేవారు తమ పేర్లను ప్రదర్శించాలని ఆదేశించింది. అయితే ఇది వివాదాస్పందంగా మారి, సుప్రీం కోర్టుకు చేరింది. దీంతో సుప్రీంకోర్టు యూపీ ప్రభుత్వ చర్యను నిలిపివేసింది. ఆహారశాలల యజమానులు తాము అందించే ఆహార పదార్థాలను సూచిస్తే సరిపోతుందని, యజమానుల పేర్లు, వారి గుర్తింపులను ప్రదర్శించాలంటూ ఒత్తిడి చేయవద్దని పేర్కొంది.ఇది కూడా చదవండి: అమర్నాథ్ యాత్ర ప్రారంభం.. అంతటా ‘హర్ హర్ మహదేవ్’ నినాదాలు -
ముక్కలు చేస్తా అంటూ భర్తకు భార్య మాస్ వార్నింగ్
-
ఉత్తరప్రదేశ్ నోయిడాలో భారీ అగ్ని ప్రమాదం
-
వీడియో: నోయిడాలో భారీ అగ్ని ప్రమాదం
ఉత్తరప్రదేశ్ నోయిడాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సెక్టార్ 2లోని ఓ ప్రైవేట్ కంపెనీలో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ఘటన ప్రాంతంలో దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.భారీగా మంటలు వ్యాపించడంతో అదుపుచేసేందుకు ఫైర్ సిబ్బందికి కష్టంగా మారింది. అయితే ఈ అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరిగినట్లు ఇంకా తెలియలేదు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా, గత వారం రోహిణిలోని రిథాల ప్రాంతంలో నాలుగు అంతస్తుల భవనంలో సంభవించిన అగ్నిప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.#WATCH | Uttar Pradesh | Updated visuals: A fire breaks out at a private firm in Noida Sector 2. Fire tenders are at the spot. Fire being doused. https://t.co/PJBThX8uSH pic.twitter.com/vPSt1vMoFk— ANI (@ANI) June 27, 2025 -
పొద్దున్నే లేవలేను.. పోలీసు ఉద్యోగం వొద్దు!
డియోరియో: పోలీసు శిక్షణ ఎంత కఠినంగా ఉంటుందో యూపీ పోలీసు నియామకాలు మరోసారి నిరూపిస్తున్నాయి. నాలుగు గంటలకు తాను నిద్ర లేవలేనని, ఈ పోలీసు ఉద్యోగం తనకొద్దని చెబుతున్నాడో పోలీసు. ఉత్తరప్రదేశ్‌లో కొత్తగా కానిస్టేబుల్ నియామకాలు జరిగాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నుంచి నియామక లేఖలు అందుకున్నారు. అయితే.. శిక్షణ ఐదవ రోజునే ఓ కానిస్టేబుల్ తన తండ్రితో కలిసి డియోరియాలోని ఎస్పీ కార్యలయానికి వచ్చాడు. ఎస్పీ విక్రాంత్ వీర్‌ను కల్పించాలని కోరాడు. కారణం ఏమిటని ఎస్పీ ప్రజా సంబంధాల అధికారి (పీఆర్వో) డాక్టర్ మహేంద్ర కుమార్ అడగగా.. తనకు ఉదయం త్వరగా నిద్రలేవడం అలవాటు లేదని స్పష్టంగా చెప్పాడు. అంతేకాదు... ఉదయం 8 గంటల వరకు నిద్రపోయే అలవాటు ఉందని, రోజంతా కఠినమైన శిక్షణ తనకు చాలా కష్టంగా ఉందని వెల్లడించాడు. తన కుమారుడికి బీఎడ్ డిగ్రీ కూడా ఉందని, ఆయన ఉపాధ్యాయుడు కావాలని కోరుకుంటున్నాడని అభ్యర్థి తండ్రి తెలిపాడు. పోలీసు శిక్షణలో శారీరక కఠినత్వం తన కొడుకును పెద్దగా ఉత్సాహపరచలేదని చెప్పాడు. అయితే, కౌన్సెలింగ్ నిర్వహించిన పీఆర్వో మహేంద్ర కానిస్టేబుల్‌కు నచ్చజెప్పి ఒప్పించాడు. శిక్షణా సెషన్లలో ఇటువంటి సమస్యలు సహజమని, తరువాత అంతా సాధారణంగా ఉంటుందని చెప్పారు. చివరికి మనసు మార్చుకున్న కానిస్టేబుల్ ఎస్పీని కలవకుండానే శిక్షణకు వెళ్లిపోయాడు. -
రింకూ సింగ్‌కు ప్రభుత్వ ఉద్యోగం.. పోస్ట్ ఏమిటంటే?!
టీమిండియా స్టార్ క్రికెటర్ రింకూ సింగ్ (Rinku Singh) కొత్త ప్రయాణం ఆరంభించబోతున్నాడు. ఉత్తరప్రదేశ్ విద్యా శాఖ విభాగంలో అతడు ఉద్యోగం చేరనున్నాడు. అలీగఢ్‌కు చెందిన రింకూ సింగ్ పేద కుటుంబంలో జన్మించాడు.పేద కుటుంబంతన తండ్రి ఇంటింటికి గ్యాస్ సిలిండర్లు వేస్తూ కుటుంబాన్ని పోషించగా.. ఆయన బాధ్యతల్లో భాగం పంచుకునేందుకు రింకూ చిరు ఉద్యోగాలు చేశాడు. ఒకానొక సమయంలో స్వీపర్‌గానూ పనిచేసేందుకు వెనకాడలేదని వార్తలు వచ్చాయి. అయితే, కష్టాల సుడిగుండంలో చిక్కుకుపోయినా.. క్రికెటర్‌గా ఎదగాలన్న రింకూ తన కలను సాకారం చేసుకునేందుకు అహర్నిషలు శ్రమించాడు.పట్టుదలతో టీమిండియా స్టార్గాదేశవాళీ క్రికెట్లో యూపీ తరఫున సత్తా చాటిన రింకూ సింగ్ దశ.. ఐపీఎల్‌తో మారిపోయింది. కోల్‌కతా నైట్ రైడర్స్ అతడిని కొనుగోలు చేసి.. ఆరంభంలో పక్కకుపెట్టినా.. ఆ తర్వాత వరుస అవకాశాలు ఇచ్చింది. ఈ క్రమంలో 2018లో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. అద్భుత ఆట తీరుతో అలరించాడు.ఈ నేపథ్యంలో టీమిండియా సెలక్టర్లు రింకూపై నమ్మకం ఉంచి 2023లో ఐర్లాండ్ పర్యటనకు వెళ్లే భారత జట్టులో చోటిచ్చారు. అలా రింకూ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. అదే ఏడాది వన్డేల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. రింకూ ఇప్పటికి భారత్ తరఫున 33 టీ20 మ్యాచ్‌లు ఆడి 546 పరుగులు, రెండు వన్డేల్లో కలిపి 55 పరుగులు సాధించాడు.రూ. 13 కోట్లకు రిటైన్ఇక ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు కోల్‌కతా ఫ్రాంఛైజీ రింకూను తమ మొదటి ప్రాధాన్య ఆటగాడిగా.. ఏకంగా రూ. 13 కోట్లకు రిటైన్ చేసుకుంది. క్యాష్ రిచ్ లీగ్‌లో ఇప్పటికి 58 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న రింకూ 1099 పరుగులు చేశాడు.స్కూల్‌డ్రాపౌట్? ఇలా క్రికెట్ రంగంలో సేవలు అందిస్తూ.. రాష్ట్రానికి పేరు తీసుకువస్తున్న రింకూను ఉద్యోగంతో సత్కరించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలో ఇంటర్నేషనల్ మెడల్ విన్నర్స్ డైరెక్ట్ రిక్రూట్మెంట్-2022 పథకం ప్రకారం అతడిని జిల్లా ప్రాథమిక విద్యా అధికారి (BSA) నియమించేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. స్థానిక మీడియా ఇందుకు సంబంధించిన కథనాలు ఇచ్చింది. కాగా ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. రింకూ తొమ్మిదో తరగతిలో చేరకముందే డ్రాపౌట్ అయినట్లు తెలుస్తోంది.ఎంపీతో నిశ్చితార్థంఇక వ్యక్తిగత జీవితంలోనూ రింకూ సింగ్ కొత్త ప్రయాణానికి సిద్ధమయ్యాడు. లోక్‌సభ ఎంపీ ప్రియా సరోజ్‌తో మూడేళ్ల ప్రేమను పెళ్లి పీటల వరకు తీసుకువచ్చాడు. ఈ ఏడాది జూన్ 8న ప్రియసఖి వేలికి ఉంగరం తొడిగి నిశ్చితార్థం చేసుకున్న రింకూ.. ఈ ఏడాది నవంబరులో లేదంటే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నాడు.చదవండి: తప్పుడు వ్యక్తులతో స్నేహం.. అప్పుడు అతడు తప్పు ఎవరూ మాట్లాడలేదు: పృథ్వీ షా -
ఒట్టి చేతులతో చిరుతపై పోరాటం .. యువకుడి ధైర్యానికి నెటిజన్ల షాక్!
లక్నో: తన ప్రాణాలు తీసేందుకు ప్రయత్నించిన చిరుతపులిపై ఓ యువకుడి ఒంటి చేత్తో పోరాడాడు. ఎలాంటి ఆయుధాలు లేకుండా చిరుతపులిపై తిరగబడ్డాడు. ఆపత్కాలంలో తెగువ, ధైర్య సాహాసానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఆ వ్యక్తి పేరు మిహిలాల్ గౌతమ్ (33). అతనిది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. చిరుతపులిపై పోరాటం చేసిన ఘటన లఖ్మీపూర్ ఖేరిలోని జుగనూపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. అటవి శాఖ అధికారుల సమాచారం మేరకు.. మిహిలాల్ గౌతమ్‌ది ఇర్ధారి పూర్వా అనే గ్రామం.ఇటుక బట్టీల్లో పనిచేసేందుకు గౌతమ్‌తో పాటు మరికొందరు సోమవారం జుగనూపూర్ గ్రామానికి వచ్చారు.ఇటుక బట్టీల్లో పని ప్రారంభించేందుకు గౌతమ్‌తో పాటు ఇతర కార్మికులకు కలిసి ఇటుకుల్ని వేడి చేసే కొలిమి ప్రాంతానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. సరిగ్గా అదే సమయంలో అక్కడే సేదతీరుతున్న చిరుతపులి కార్మికులపై దాడి చేసేందుకు ఒక్క ఉదుటున మీద పడింది.ఒట్టి చేతుల్ని ఆయుధాలుగా మార్చిదాడి చేస్తున్న చిరుతపులిని భయపడకుండా, గందరగోళానికి గురవుకుండా గౌతమ్ తన ఒట్టి చేతుల్నే ఆయుధాలుగా మార్చి దానిని నిలురించే ప్రయత్నం చేశాడు. ఏ మాత్రం బెదరకుండా చిరుతపై ఎదురు దాడికి దిగాడు. ఆ ప్రయత్నాలు సఫలమయ్యాయి. గౌతమ్ బలాబలాల ముందు చిరుత తేలిపోయింది. అప్రమత్తమైన సహచర కార్మికులు గ్రామస్తుల సాయంతో చిరుత నుంచి గౌతమ్‌ను రక్షించే ప్రయత్నం చేశారు. చేతికి దొరికిన వస్తువుల్ని చిరుతపైకి విసిరేస్తూ చిరుతను భయబ్రాంతులకు గురిచేసేందుకు యత్నించారు. ఆ ప్రయత్నంలో చిరుత భయపడి స్థానిక అరటితోటల్లోకి పారిపోయింది. "फिल्मों में देखा होगा हीरो शेर से लड़ता है... लेकिन ये रियल है!"लखीमपुर-खीरी के धौरहरा की बबुरी गांव से चौंकाने वाला वीडियोयहां एक ईंट भट्टे में घुस आया तेंदुआ और सामने था एक युवक... न डर, न भागा — सीधा भिड़ गया! तेंदुए ने झपट्टा मारा, युवक ने डटकर मुकाबला कियागांववालों ने… pic.twitter.com/rd0FiBFEGY— आदित्य तिवारी / Aditya Tiwari (@aditytiwarilive) June 24, 2025 అధికారులపై చిరుత దాడిచిరుతపులి దాడిపై స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఈ ప్రయత్నంలో అధికారులపై చిరుత దాడికి దిగింది. ఈ దాడిలో ఫారెస్ట్ రేంజ్ రాజేష్ కుమార్ దీక్షిత్,రేంజర్ నిరూపేంద్ర చతుర్వేది, పోలీస్ అధికారి రామ్ సంజీవన్,స్థానిక గ్రామస్తుడు ఇక్బాల్‌కు గాయాలయ్యాయి. అత్యవసర చికిత్స నిమిత్తం తొలిసారి దాడికి చేసిన మిహిలాల్ గౌతమ్‌తో పాటు ఇక్బాల్ ఖాన్ ,ఫారెస్ట్ రేంజర్ రాజేష్ కుమార్ లక్ష్మీపూర్ ఆస్పత్రికి, రేంజర్ చతుర్వేది, పోలీస్ కానిస్టేబుల్ రామ్ సంజీవన్లను తాలూకా ఆస్పత్రికి తరలించారు. వైద్య చికిత్స అనంతరం బాధితులు ఆస్పత్రి నుంచి డిశార్జ్ అయినట్లు అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు.ఈ ఘటన తర్వాత అంటే మంగళవారం అదనపు పోలీసు సిబ్బందితో కలిసి అటవీ శాఖ, పోలీస్ శాఖ జాయింట్ ఆపరేషన్‌ను నిర్వహించాయి. అరటితోటల్లోనే ఉన్న చిరుత పులిని బంధించాయి. -
ఢిల్లీకి మారనున్న నితీశ్ రాణా
ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించే నితీశ్ రాణా.. రానున్న దేశవాలీ సీజన్ (2025-26) కోసం జట్టు మారనున్నాడు. రెండేళ్ల క్రితమే ఢిల్లీ నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌కు మకాం మార్చిన నితీశ్ తిరిగి సొంతగూటికి చేరేందుకు సిద్దమయ్యాడు. ఈ మేరకు దేశీయ క్రికెట్ వర్గాల్లో బలమైన ప్రచారం జరుగుతుంది. నితీశ్‌కు అత్యంత సన్నితంగా వ్యవహరించే ఓ వ్యక్తి (చిన్ననాటి కోచ్ సంజయ్ భరద్వాజ్) ఈ విషయాన్ని ధృవీకరించాడు. తదుపరి సీజన్లో నితీశ్ ఢిల్లీ తరఫున ఆడతాడని అతను చెప్పాడు.31 ఏళ్ల నితీశ్ 2023-24 సీజన్‌కు ముందు ఢిల్లీని వీడి ఉత్తర్‌ప్రదేశ్‌కు వలస వెళ్లాడు. గతంలో నితీశ్ ఢిల్లీకి కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. యూపీ తరఫున నితీశ్ పెద్దగా రాణించలేకపోయాడు. గత సీజన్లో అతను అన్ని ఫార్మాట్లలో దారుణంగా విఫలమయ్యాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో 9 మ్యాచ్‌ల్లో 111 పరుగులు.. విజయ్ హజారే ట్రోఫీలో 2 మ్యాచ్‌ల్లో 17 పరుగులు.. రంజీ ట్రోఫీలో 4 మ్యాచ్‌ల్లో 150 పరుగులు మాత్రమే చేశాడు. పేలవ ప్రదర్శనల కారణంగా నితీశ్ యూపీ జట్టులో స్థానం కోసం పాకులాడాల్సి వచ్చేది. ఎవరైనా మిడిలార్డర్ బ్యాటర్ గాయపడితేనే నితీశ్‌కు అవకాశాలు వచ్చేవి. దీంతో ఉపయోగం లేదని అనుకున్న నితీశ్ సొంతగూటికి తిరిగి రావడానికి సిద్దమయ్యాడు.అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో నితీశ్‌కు ఢిల్లీ జట్టులో గతంలోలా తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు కనిపించడం లేదు. పేలవ ఫామ్, జట్టును అకారణంగా వీడాడన్న కారణాల చేత ఢిల్లీ యాజమాన్యం నితీశ్‌ను గతంలో ఇచ్చిన ప్రాధాన్యత ఇవ్వకపోవచ్చు. ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్‌కు చెందిన ఓ వ్యక్తి నితీశ్‌ను ఉద్దేశిస్తూ.. ఇదేమీ డంప్ యార్డ్ కాదని సంచలన కామెంట్లు చేశాడు. దీన్ని బట్టి చూస్తే నితీశ్ ఢిల్లీ జట్టులో చేరినా అతని కెరీర్ నల్లేరుపై నడకలా ఉండకపోవచ్చు. నితీశ్ త్వరలో జరుగున్న ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో తన పేరును నమోదు చేసుకున్నాడు. ఈ దేశీయ లీగ్‌లో అతను సత్తా చాటగలిగితే ఢిల్లీ దేశవాలీ జట్టులో పూర్వవైభవం సాధించవచ్చు.నితీశ్ వర్సెస్ ఢిల్లీ కెప్టెన్ఒకవేళ నితీశ్ ఢిల్లీ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చినా అతని పరిస్థితి అంత ఆశాజనకంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే నితీశ్ ఢిల్లీ సారధి ఆయుశ్ బదోనితో గొడవపడ్డాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ సందర్భంగా నితీశ్, బదోని బాహాబాహీకి దిగినంత పని చేశారు. ఆ సమయంలో అంపైర్లు సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది.ఐపీఎల్‌లోనూ అదే ప్రదర్శననితీశ్ తాజాగా ముగిసిన ఐపీఎల్‌లోనూ పేలవ ప్రదర్శనను కొనసాగించాడు. ఈ సీజన్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్ అతన్ని రూ.4.2 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే అతను సామర్థ్యం మేరకు రాణించలేకపోయాడు. 11 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 217 పరుగులు మాత్రమే చేశాడు. -
మొదటి రాత్రే భర్తకు షాక్ ఇచ్చిన భార్య
-
నేను అమన్ సొంతం.. నాకు అల్లుడే కావాలి..
లక్నో: ఎంతో ఆనందంగా పెళ్లి చేసుకుని.. భార్యతో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన భర్తకు ఊహించని అనుభవం ఎదురైంది. నాటకీయంగా మొదటి రాత్రి వధువు ప్రవర్తనతో వరుడు ఖంగుతిన్నాడు. ‘నన్ను తాకితే.. 35 ముక్కలు చేస్తా.. నేను అమన్‌కు మాత్రమే సొంతం’ అంటూ భర్తకు భార్య వార్నింగ్ ఇచ్చింది. అనంతరం, అర్ధరాత్రి ఇంట్లో నుంచి నవ వధువు పరారీ అయ్యింది. ఈ వింత ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో చోటుచేసుకుంది.వివరాల ప్రకారం.. ప్రయాగ్‌రాజ్‌లోని ఏడీఏ కాలనీకి చెందిన కెప్టెన్ నిషాద్ ఏప్రిల్ 29న సితారను వివాహం చేసుకున్నాడు. అనంతరం, ఏప్రిల్ 30న వధువు తన అత్తమామల ఇంటికి చేరుకుంది. మే రెండో తేదీన కొత్త జంటలకు ఘనంగా రిసెప్షన్ జరిగింది. తర్వాత, కుటుంబ సభ్యులు వారిద్దరూ మొదటి రాత్రికి ఏర్పాటు చేశారు. కొత్త జంటకు లోపలికి వెళ్లగానే.. వరుడికి ఊహించని అనుభవం ఎదురైంది. వధవు..‘నన్ను ముట్టుకుంటే.. నువ్వు 35 ముక్కలుగా కనిపిస్తావు. నేను అమన్‌ను ప్రేమిస్తున్నా. నేను అమన్ సొంతం’ అని సితార తన భర్తను కత్తితో బెదిరించింది. ఈ అనూహ్య ఘటనతో ఖంగుతిన్న నిషాద్కు ఏం చేయాలో తెలియక సైలెంట్ అయిపోయాడు. ఈ విషయం బయటకు చెబితే తప్పుడు కేసు పెడతానంటూ భర్త, అతడి కుటుంబసభ్యులపైనా బెదిరింపులకు పాల్పడింది.దీంతో మరుసటిరోజు వారు గ్రామంలో పంచాయతీ పెట్టించారు. సితారకు ఆమె తల్లిదండ్రులు నచ్చజెప్పడంతో నిషాద్ ఆమెను ఇంటికి తీసుకొచ్చారు. అయినప్పటికీ ఆమె వేధింపులు ఆగలేదు. దీంతో వరుడి కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా.. సితార తన ప్రియుడు అమన్‌తో కలిసి ఇంట్లో నుంచి పారిపోయింది. ప్రస్తుతం పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. కాగా.. సితారకు అమన్ వరుసకు మేనల్లుడు కావడం గమనార్హం. #BREAKING : Touch me and I’ll cut you into 35 pieces’, Bride threatens groom on wedding night in Prayagraj. later jumps wall to escape with lover.After the Sonam murder case, a shocking incident from Prayagraj has surfaced. On the wedding night, a bride threatened her husband… pic.twitter.com/QBGDK9SjEK— upuknews (@upuknews1) June 24, 2025ఈ ఘటన అనంతరం, భర్త నిషాద్ మాట్లాడుతూ..‘నేను గదిలోకి వెళ్లగానే ఆమె నిశ్శబ్దంగా పూర్తిగా ముసుగు వేసుకుని కత్తి పట్టుకుని కూర్చుని ఉంది. ఆమె నాతో సూటిగా ఒక్కటే చెప్పింది. నన్ను ముట్టుకోవద్దు. నేను అమన్ ఆస్తిని. నువ్వు నన్ను తాకాలని ప్రయత్నిస్త.. నిన్ను 35 ముక్కలుగా నరికివేస్తాను అని బెదిరించింది. నన్ను అమన్ వద్దకు పంపించు అని చెప్పింది. దాంతో, నాకు ఏం చేయాలో తోచలేదు. ఆ రాత్రంతా ఆమె కత్తితో మంచం మీద ఉండగా నేను సోఫాలో కూర్చున్నాను. నిద్రపోయే ధైర్యం చేయలేదు’ అని చెప్పుకొచ్చాడు. ఆమె ప్రవర్తనపై అటు నిషాద్ పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. #Prayagraj सुहागरात के दिन घूँघट में सितारा ने पति को चाकू दिखाए और 35 टुकड़ों में काटने की धमकी दी.. 3 दिन तक चाकू और धमकी का सिलसिला चलता रहा.दुल्हन के घर वालों को बुलाया गया और सहमति हुई कि दूल्हा दुल्हन हंसी खुशी रहेंगे, लेकिन सितारा दीवार फांदकर अपने प्रेमी के साथ फरार pic.twitter.com/SPEl9hFsqU— News & Features Network (@newsnetmzn) June 24, 2025 -
రింకూ సింగ్- ఎంపీ ప్రియా సరోజ్ పెళ్లి వాయిదా!.. కారణం?
భారత స్టార్ క్రికెటర్ రింకూ సింగ్ (Rinku Singh)- లోక్‌సభ ఎంపీ ప్రియా సరోజ్ (Priya Saroj)ల పెళ్లి వాయిదా పడినట్లు సమాచారం. ఈ ఏడాది జరగాల్సిన వీరి వివాహం (Wedding Postoponed) వచ్చే సంవత్సరంలో జరుగనున్నట్లు తెలుస్తోంది. కాగా ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)కు ప్రాతినిథ్యం వహిస్తూ వెలుగులోకి వచ్చాడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన రింకూ సింగ్.గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాదిన అతడు.. టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలో 2023లో ఐర్లాండ్‌తో టీ20 సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. నయా ఫినిషర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. అదే ఏడాది వన్డేల్లోనూ అరంగేట్రం చేశాడు.ఇప్పటి వరకు భారత్ తరఫున 33 టీ20లు, 2 వన్డే మ్యాచ్‌లు ఆడిన రింకూ సింగ్.. ఆయా ఫార్మాట్లలో 339, 41 పరుగులు సాధించాడు. ఇక ఐపీఎల్ ఇప్పటికి 58 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఈ కేకేఆర్ స్టార్.. 1099 రన్స్ చేశాడు. ఇందులో నాలుగు అర్ధ శతకాలు ఉన్నాయి.ఎంపీతో ప్రేమలో రింకూనిరుపేద కుటుంబం నుంచి వచ్చి స్టార్ క్రికెటర్‌గా ఎదిగిన రింకూ.. కెరీర్ పరంగా నిలదొక్కుకున్నాడు. ఇటీవలే వివాహ బంధంలో అడుగుపెట్టేందుకు కూడా సిద్ధపడ్డాడు. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారగా.. ఇరు కుటుంబాల అంగీకారంతో ఈ ఏడాది జూన్ 8న వీరి నిశ్చితార్థం జరిగింది. మూడేళ్లుగా ఈ క్షణం కోసం ఎదురుచూస్తున్నామంటూ రింకూ- ప్రియా తమ ఎంగేజ్మెంట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.జూన్ 8న నిశ్చితార్థంఇక లక్నోలోని ఓ హోటల్లో అంగరంగ వైభవంగా జరిగిన వేడుకలో రింకూ- ప్రియా ఉంగరాలు మార్చుకున్నారు. సమాజ్‌వాదీ చీఫ్ అఖిలేశ్ యాదవ్‌తో పాటు జయా బచ్చన్, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ తదితరులు వీరి ఎంగేజ్మెంట్కు హాజరయ్యారు.ఈ క్రమంలో నవంబరు 18న తాజ్ హోటల్లో పెళ్లి వేడుకను జరిపేందుకు పెద్దలు ముహూర్తం ఖరారు చేశారు. అయితే, అమర్ ఉజాలా న్యూస్‌పేపర్ కథనం ప్రకారం.. రింకూ- ప్రియాల వివాహం వాయిదా పడినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరి పెళ్లి జరుగనుందని సమాచారం. కారణం ఇదే?టీమిండియా క్రికెటర్‌గా రింకూ బిజీ షెడ్యూల్ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఈ ఏడాది నవంబరులో టీమిండియా సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. నవంబరు 14- డిసెంబరు 19 వరకు రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది.చదవండి: పంత్ సెంచరీలపై అలా.. కేఎల్ రాహుల్ శతకంపై ఇలా! గోయెంకా పోస్ట్ వైరల్ -
ప్రియుడితో ఏకాంతంగా భార్య.. ఒక్కసారిగా భర్త రావడంతో..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఓ వివాహిత తన ప్రియుడితో హోటల్ గదిలో ఏకాంతంగా ఉన్న సమయంలో ఆమె భర్త ఒక్కసారిగా అక్కడికి రావడంతో.. సదరు మహిళ హోటల్ పై నుంచి కిందికి దూరి పారిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.వివరాల ప్రకారం.. యూపీలోని బాగ్పత్ జిల్లా బడౌత్ పట్టణంలో ఓ వివాహిత తన ప్రియుడి శోభిత్తో కలిసి హోటల్ గదికి వెళ్లింది. హోటల్ గదిలో వారిద్దరూ ఏకాంతంగా ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న వివాహిత భర్త.. హోటల్ గది వద్దకు వచ్చాడు. అది గమనించిన ఆమె.. ఏం చేయాలో అర్థం కాకపోవడంతో హోటల్ గది కిటికి నుంచి పారిపోయే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో హోటల్ భవనం నుంచి.. కిందికి దూకి పారిపోయింది. వెంటనే అప్రమత్తమైన భార్య.. పోలీసులకు సమాచారం ఇచ్చారు.A dramatic incident unfolded in Baraut, Baghpat, where a married woman was caught on video j*mping from a 12-foot roof of an OYO hotel, allegedly to escape her husband, in-laws, and police. According to reports, the woman was staying at the hotel with her lover when her… pic.twitter.com/aWcjEqItgz— ForMenIndia (@ForMenIndia_) June 18, 2025ఆమె ప్రియుడు శోభిత్‌ను మహిళ భర్త పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇక, ఈ ఘటన సోమవారం జరగ్గా.. వారిద్దరి నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆమె భర్త పోలీసులను ఆశ్రయించాడు. తనకు రక్షణ కల్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శోభిత్‌ను అదుపులోకి తీసుకొని కేసు విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా.. వారిద్దరు దంపతులకు 2019లో పెళ్లి కాగా, ఓ కుమారుడు ఉన్నాడు. తరచూ దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్టు తెలిపారు. మరోవైపు.. ఆమె హోటల్ భవనం నుంచి దూకి పారిపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ससुरालियों ने विवाहित युवती को होटल में प्रेमी के साथ पकड़ा,Oyo होटल की पिछली खिड़की से कूदकर महिला हुई मौके से फरार,पति और पत्नी के बीच काफी समय से चल रहा विवाद....@Uppolice#बागपत #बडौत #OyoHotel #LoveAffair #viralvideo pic.twitter.com/xcxtmli0v7— Rahul kumar Vishwakarma (@Rahulku18382624) June 17, 2025 -
ఇది 20 ఏళ్ల కల.. కొడుకుతోపాటే కానిస్టేబుల్ జాబ్ కొట్టాడు
అతనికి పోలీస్ కావాలనే కల. చదువుకునే టైంలో కష్టపడ్డప్పటికీ ఆ కలను నెరవేర్చుకోలేకపోయాడు. ఈలోపు కుటుంబం ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా.. ఆర్మీ ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. కట్ చేస్తే.. ఇరవై ఏళ్ల తర్వాత తన కన్నకొడుకుతో కలిసి పోలీస్ ఎగ్జామ్‌కు ప్రిపేర్ అయ్యాడు. కఠోర శ్రమ తర్వాత కొడుకుతో పాటే కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఉత్తర ప్రదేశ్‌లో రెండేళ్ల కిందట(2023 డిసెంబర్లో) 60 వేల కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఆ పరీక్షలో యశ్పాల్ అనే రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి(41) ఎంపికయ్యాడు. అయితే ఇదే నోటిఫికేషన్లో ఆయన కొడుకు శేఖర్(21)కు కూడా ఉద్యోగం వచ్చింది. అందుకే లక్నో జరిగిన ఈవెంట్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేతుల మీదుగా ఇద్దరికీ అపాయింట్మెంట్ లెటర్లు ఇప్పించారు ఈ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యానాథ్. అందుకు ప్రత్యేకంగా కారణం ఉంది.యశ్పాల్ స్వస్థలం హపూర్ జిల్లా ధౌలానా తాలుకా ఉదయ్‌పూర్ ఉదయ్‌రాంపూర్ నంగ్లా గ్రామం. రెండు దశాబ్దాల కిందట కానిస్టేబుల్ పరీక్షకు ప్రిపేర్ అయ్యాడు. రెండు అటెంప్ట్‌లలో జాబ్ కొట్టలేకపోయాడు. ఆపై 2003లో ఆర్మీలో చేరాడు. 16 ఏళ్ల సర్వీస్ తర్వాత వలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని.. ఢిల్లీ ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్లో పని చేస్తూ వచ్చారు. ఈలోపు యూపీలో మెగా కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదలదైంది. అప్పటికి ఇంటర్ పూర్తి చేసిన యశ్ పాల్ పెద్ద కొడుకు శేఖర్ ఈ పరీక్షకు ప్రిపేర్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. భోజనాల దగ్గర తరచూ ఈ మాట ఆ తండ్రి చెవిన పడింది. తనకు పరీక్షకు ప్రిపేర్ అవ్వాలని ఉందని మనసులో మాట బయటపెట్టాడు. ఆ మాటతో భార్య అనిత సంతోషించింది. రిటైర్ట్ ఆర్మీ ఉద్యోగులకు వయోపరిమితి సడలింపుతో ఇలాంటి ఉద్యోగాలకు అనుమతిస్తారని తెలుసు కదా. అలా ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని యశ్పాల్ భావించాడు. మొత్తం 60 వేల ఉద్యోగాలకు.. 48 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. మొదట్లో శేఖర్ తన తండ్రితో కలిసి పరీక్షకు ప్రిపేర్ అవ్వడానికి ఇబ్బంది పడ్డాడు. అయితే యశ్‌పాల్‌కు జీకేతో పాటు పలు సబ్జెక్టులలో విపరీతమైన నాలెడ్జ్ ఉంది. అది గమనించి తండ్రి నుంచి తన అనుమానాలను నివృత్తి చేసుకునేవాడట. అలాగే తన తండ్రికి లాజికల్, న్యూమరికల్ రీజనింగ్ సాయం చేస్తూ.. ఇద్దరూ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయ్యారు. లోకల్‌గా ఉన్న లైబ్రరీకి కలిసి వెళ్లి చదువుకునేవాళ్లు. అలా రెండేళ్ల ప్రిపరేషన్‌తో.. యూపీ కానిస్టేబుల్ పరీక్షతో పాటు సీడీఎస్, ఎస్సై ఎగ్జామ్‌లు కూడా రాశారు. 2024 ఆగష్టులో రాతపరీక్ష జరిగింది. ఈలోపు పేపర్‌లీక్ వ్యవహారంతో ఈ తండ్రీకొడుకుల నెత్తిన పిడుగుపడ్డట్లు అయ్యింది. అయితే తమ శ్రమనే నమ్ముకున్న ఆ తండ్రీకొడుకులు.. తమ ప్రిపరేషన్‌ను మాత్రం ఆపలేదు. అదే ఏడాది చివర్లో ఫిజికల్ టెస్టులూ జరిగాయి. ఫలితాల్లో.. కొడుకుతో పాటే ఆ తండ్రీ కూడా జాబ్ కొట్టాడు. దీంతో భార్యాపిల్లలు మాత్రమే కాదు.. వాళ్లు ఉంటున్న వాడంతా సంబురాలు చేసుకుంది. లక్నోలో తాజాగా(జూన్ 15వ తేదీన) జరిగిన గ్రాండ్ ఈవెంట్లో అమిత్‌షా చేతుల మీదుగా ఆ తండ్రీకొడుకులు అపాయింట్మెంట్ లెటర్ అందుకున్నారు. శిక్షణ కోసం షాహ్‌జహాన్‌పూర్‌కు యశ్పాల్, బరేలీకి శేఖర్ వెళ్లారు. రెండు దశాబ్దాల తర్వాత తన కల నెరవేరినందుకు యశ్పాల్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. -
Uttar Pradesh: మూడు రోడ్డు ప్రమాదాలు.. 11 మంది మృతి
ఆగ్రా: ఉత్తరప్రదేశ్‌లో జరిగిన మూడు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 11 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఢిల్లీ నుండి బీహార్‌కు వెళ్తున్న బస్సు ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై ఒక ట్రక్కును ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, 15 మంది గాయపడ్డారు. బాధితులను చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. #WATCH | Uttar Pradesh: Two people died, around 15 injured after the bus they were in, collided with a truck on Agra-Lucknow Expressway in Fatehabad area of Agra district. The injured have been sent to hospital for treatment. The bus was going from Delhi to Bihar. (Video: Agra… pic.twitter.com/VwhjAd25wu— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 18, 2025బులంద్‌షహర్ జిల్లాలో జహంగీరాబాద్-బులంద్‌షహర్ రహదారిపై జానిపూర్ గ్రామం సమీపంలో ఒక వాహనం వంతెనను ఢీకొని, అనంతరం బోల్తా పడి, మంటల్లో చిక్కుకోవడంతో ఐదుగురు మృతిచెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. బులంద్‌షహర్ ఎస్పీ (గ్రామీణ) తేజ్వీర్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం ఉదయం 5.50 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. బుదౌన్‌లో జరిగిన వివాహానికి హాజరైన పెళ్లి బృందం ఢిల్లీలోని మాలవీయ నగర్‌కు తిరిగి వెళుతుండగా, ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.ఆగ్రాలో జరిగిన మరో విషాదకర ఘటనలో ఒక పికప్ వాహనం బ్యాలెన్స్ కోల్పోయి సహద్ర ఫ్లైఓవర్‌పై నుంచి కింద పడింది. అది నేరుగా మార్నింగ్ వాకర్స్‌పై పడిపోవడంతో నలుగురు మృతి చెందారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసు అధికారి హేమంత్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం పికప్ వాహనం మామిడి పండ్లను రవాణా చేస్తుండగా, ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కూడా మృతిచెందాడు. అతని సహాయకుని పరిస్థితి విషమంగా ఉంది. ఈ మూడు కేసులను నమోదు చేసుకున్న ఆయా ప్రాంతాల పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. #WATCH | Uttar Pradesh: Two people died, around 15 injured after the bus they were in, collided with a truck on Agra-Lucknow Expressway in Fatehabad area of Agra district. The injured have been sent to hospital for treatment. The bus was going from Delhi to Bihar. (Video: Agra… pic.twitter.com/VwhjAd25wu— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 18, 2025ఇది కూడా చదవండి: శుభాంశు రోదసియాత్ర మళ్లీ వాయిదా -
ఛాతికి గురిపెట్టి.. కటకటాల్లోకి రివాల్వర్ రాణి
డబ్బు ఉందనే పొగరు.. అధికారం ఉందనే అహంకారంతో కిందిస్థాయి సిబ్బందితో కొందరు వ్యవహరించే తీరు తీవ్ర విమర్శలకు తావిస్తుంటుంది. అలాంటిదే ఇప్పుడు చెప్పుకోబోయే ఘటన. కారు దిగమని మంచిమాటగా చెప్పినందుకు.. పెట్రోల్ బంకు సిబ్బందిపైనే ఓ కుటుంబం దౌర్జన్యానికి దిగింది. ఆ ఇంటి బిడ్డ అయితే ఏకంగా తుపాకీతో సిబ్బందినే చంపుతానంటూ బెదిరించింది. వివరాల్లోకి వెళ్తే..ఉత్తర ప్రదేశ్ హర్దోయ్‌లో(Hardoi Viral Video) జరిగిన ఘటన తాలుకా వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇషాన్ ఖాన్ అనే వ్యక్తి తన భార్య, బిడ్డతో కలిసి కారులో బయటకు వచ్చాడు. బిల్గ్రామ్ ఏరియాలోని ఓ సీఎన్జీ పెట్రోల్ పంప్ దగ్గర వాళ్ల కారు ఆగింది. అయితే.. గ్యాస్ నింపుతున్న టైంలో కారు దిగాలంటూ ఇషాన్‌ను మర్యాదపూర్వకంగా అక్కడి సిబ్బంది కోరారు. దీంతో.. ఊగిపోతూ నన్నే కారు దిగమంటావా? అంటూ దుర్భాషలాడుతూ సిబ్బందితో గొడవకు దిగాడు ఇషాన్. ఈలోపు.. అతని భార్య, కూతురు కూడా బయటకు వచ్చి ఆ గొడవలో చేరారు. కూతురు సురుష్ఖాన్(అరిబా) కారు వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లి అందులో ఉన్న రివాల్వర్‌ను బయటకు తీసుకొచ్చింది. నేరుగా అక్కడి సిబ్బంది ఛాతీకి గురిపెట్టి ‘‘కాల్చేయమంటావా?’’ అంటూ బెదిరింపులకు దిగింది. ఈలోపు.. అక్కడున్న జనం వాళ్లను దూరం తీసుకెళ్లి సర్దిచెప్పి పంపించి వేశారు. అయితే అక్కుడున్న సీసీ ఫుటేజీలో ఆ వీడియో అంతా రికార్డయ్యింది.'इतनी गोली मारूंगी की परिवार वाले...' यूपी में 'रिवॉल्वर रानी' की दबंगई का वीडियो वायरलउत्तर प्रदेश के हरदोई जिले से एक सनसनीखेज़ मामला सामने आया है, जहां सीएनजी पंप पर कहासुनी के बाद एक लड़की ने कर्मचारी पर लाइसेंसी रिवॉल्वर तान दी. घटना उस वक्त हुई जब एहसान ख़ान नाम का शख्स… pic.twitter.com/tVNOM5IfJb— NDTV India (@ndtvindia) June 16, 2025ఘటనపై బాధితుడు రజనీష్ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ భార్యభర్తలతో కూడా ఆ రివాల్వర్ రాణిని కూడా అరెస్ట్ చేశారు. రివాల్వర్‌తో పాటు 25 క్యాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఆ రివాల్వర్ ఇషాన్ లైసెన్స్డ్ ఆయుధంగా పోలీసులు నిర్ధారించుకున్నారు. అయితే దురుసుగా ర్తించడంతో పాటు చంపుతామని బెదిరించినందుకుగానూ ఆ కుటుంబంపై మొత్తానికి కేసు నమోదయ్యింది. #HardoiPoliceथाना बिलग्राम पुलिस द्वारा मु0अ0सं0 268/25 धारा 115(2)/352/351(3) बीएनएस व धारा 30 आर्म्स एक्ट से संबंधित कृत कार्यवाही के संबंध में-#UPPolice pic.twitter.com/hsYiegkb1v— Hardoi Police (@hardoipolice) June 16, 2025 -
లక్నో: తప్పిన ఘోర విమాన ప్రమాదం
అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదం ఘటన మరువక ముందే.. వరుస ఉదంతాలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. తాజాగా లక్నో ఎయిర్‌పోర్టులో ఘోర విమాన ప్రమాదం తృటిలో తప్పింది. విమానం టైర్ భాగం నుంచి నిప్పు కణికలు ఎగసి పడ్డాయి. అయితే సిబ్బంది సకాలంలో స్పందించడంతో 250 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. సౌదీ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం హజ్ యాత్రికులతో జెడ్డా నుంచి బయల్దేరి ఆదివారం ఉదయం లక్నో ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. అయితే.. ల్యాడింగ్ సమయంలో ల్యాండింగ్ గేర్ నుంచి నిప్పు కణికలు ఎగసి పడడం సిబ్బంది గమనించారు. విమానం ట్యాక్సీ వేకి చేరుకోగానే.. ప్రయాణికులందరినీ దించేశారు. #BREAKİNG लखनऊ एयरपोर्ट पर बड़ा हादसा टला सऊदी से आए विमान में तकनीकी खराबी लखनऊ एयरपोर्ट पर लैंडिंग के वक्त खराबी लैंडिंग के वक्त विमान के पहिए से निकली चिंगारी#LUCKNOW #LucknowAirport #SV3112 #JeddahToLucknow #planecrash #flightaccident #SaudiArabia pic.twitter.com/GALwi6Q78g— Ritika Rajora (Tv100 News) (@Rrajora07) June 16, 2025ఎడమ టైర్ వద్ద ల్యాండింగ్ గేర్ నుంచి మంటలు వస్తున్నట్లు గుర్తించారు. ఆ వెంటనే ఆర్పేశారు. ప్రమాదంలో ఎవరికీ ఏం కాలేదని.. ఘటనపై విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.జూన్ 12వ తేదీన అహ్మబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం నుంచి లండన్ బయల్దేరిన విమానం టేకాఫ్ అయిన క్షణాల్లోనే కుప్పకూలి పేలిపోయింది. విమానంలోని 241 మందితో పాటు కింద జనావాసాలపై కూలడంతో మరో 33 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన యావత్ ప్రపంచాన్నే నివ్వెర పోయేలా చేసింది. ఈ ఘటనపై హైలెవల్ కమిటీతో భారత ప్రభుత్వం విచారణ జరిపిస్తోంది. -
కుప్పకూలిన హెలికాప్టర్
రుద్రప్రయాగ్/న్యూఢిల్లీ: భక్తిశ్రద్ధలతో చార్ధామ్ యాత్ర చేస్తున్న యాత్రికులను ప్రమాదాలు హడలెత్తిస్తున్నాయి. ఆదివారం తెల్లవారుజామున హిమ సానువుల్లోని కేదార్నాథ్ ఆలయాన్ని సందర్శించుకుని తిరిగొస్తున్న భక్తులు హెలికాప్టర్ కూలి ప్రాణాలు కోల్పోయారు. గౌరీకుండ్ అడవుల్లో ఈ దారుణం జరిగింది. రుద్రప్రయాగ్ జిల్లా విపత్తు నిర్వహణ సంస్థ అధికారి నందన్ సింగ్ రజ్వార్ వివరాలను వెల్లడించారు. ఆర్యన్ ఏవియేషన్ సంస్థకు చెందిన బెల్ 407 హెలికాప్టర్ ఉదయం 5.19 గంటలకు కేదార్నాథ్ నుంచి గుప్తకాశీ బయల్దేరింది.కాసేపటికే కేదార్‌ఘాటీలో గౌరీకుండ్, త్రిజుగ్ నారాయణ్ ప్రాంతాల మధ్య అడవిలో కుప్పకూలింది. అందులోని ఏడుగురూ ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో మహారాష్ట్రకు చెందిన జంట, వారి రెండేళ్ల పాప, పైలట్‌తో పాటు బద్రీనాథ్–కేదార్నాథ్ ఆలయ కమిటీ సభ్యుడు విక్రమ్ సింగ్ రావత్ కూడా ఉన్నారు. పైలట్ రాజ్వీర్ సింగ్ చౌహాన్ ఆర్మీలో 15 ఏళ్లపాటు పైలట్‌గా చేశారు.కేదార్‌నాథ్‌లో హెలికాప్టర్లు అటూ ఇటూ ఎత్తైన పర్వతాల మధ్య లోయ మీదుగా ప్రయాణించాల్సి ఉంటుంది. ప్రతికూల వాతావరణం, మేఘావృతమైన పొగమంచు గుండా ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణించడం ప్రమాదానికి దారి తీసి ఉంటుందని భావిస్తున్నారు. మృతుల్లో మహారాష్ట్ర, రాజస్తాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలవారు.నెలన్నరలో ఐదో ప్రమాదంఏప్రిల్ 30న చార్ధామ్ యాత్ర మొదలైనప్పటి నుంచి హెలికాప్టర్లు కూలిపోవడం ఐదోసారి. ఈ నేపథ్యంలో చార్ధామ్ యాత్రలో హెలికాప్టర్ సేవలను రెండు రోజులు నిలిపేస్తున్నట్టు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. ఆర్యన్ ఏవియేషన్ సంస్థ హెలికాప్టర్ కార్యకలాపాలను తక్షణం నిలిపివేస్తూ డీజీసీఏ ఆదేశాలిచ్చింది. కేదార్నాథ్ లోయలో రాకపోకలు సాగించే అన్ని హెలికాప్టర్ల నాణ్యత, సామర్థ్యాలను తక్షణం సమీక్షించేందుకు అధికారులను పంపుతోంది.దుర్ఘటనపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) సమగ్ర దర్యాప్తు చేయనుంది. ‘‘ఇలాంటి ఘటనల్లో జవాబుదారీతనం పెంచాలి. దర్యాప్తు, భద్రతా ప్రమాణాల అంశంలో కేంద్ర, రాష్ట్రాలు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి’’ అని కాంగ్రెస్ నేత ప్రియాంకాగాంధీ వాద్రా అన్నారు. -
ఆకాశ సిందూరం
అనామిక శర్మ ఆకాశ సాహసాలు కొత్తేమీ కాదు. సాహసానికి సామాజిక సందేశం జోడించడం ఆమె శైలి. ఈసారి ‘ఆపరేషన్ సిందూర్’ పతాకాన్ని ఆకాశమంత ఎత్తున ప్రదర్శించింది. భారత సాయుధ దళాలకు మద్దతుగా థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ గగనతలంలో ఆపరేషన్ సిందూర్ పతాకాన్ని నింగిన ఎగరేసింది అనామిక. రెండు చేతులతో ‘ఆపరేషన్ సిందూర్’ పతాకాన్ని పట్టుకొని సింగిల్–ఇంజిన్ ఎయిర్‌క్రాఫ్ట్ పీఎసీ 750ఎక్స్ఎల్ నుంచి దూకి ‘ఆపరేషన్ సిందూర్’ పతాకాన్ని ప్రదర్శించింది. దాదాపు 14,000 అడుగుల ఎత్తు నుంచి డ్రాప్ జోన్లోకి దూకింది.‘ఈ జంప్ చేసినందుకు సంతోషంగా ఉంది. ముప్పులు, ప్రమాదాల బారి నుంచి దేశాన్ని రక్షిస్తున్న భారత సాయుధ దళాలకు శాల్యూట్ చేస్తున్నాను. మన సాయుధ దళాల సత్తా ఏమిటో మరోసారి ఆపరేషన్ సిందూర్ ద్వారా నిరూపణ అయింది’ అంటుంది అనామిక.ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన అనామిక శర్మ తండ్రి అజయ్‌శర్మ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఎఫ్) కమాండోగా పనిచేశారు. స్కైడైవింగ్‌లో అనామికకు తొలి గురువు. ‘యాక్టివ్ డైవర్స్’గా గుర్తింపు పొందిన ఈ తండ్రీకూతుళ్లు ఎన్నో గగనతల సాహసాలు చేశారు. యునైటెడ్ పారాచూట్ అసోసియేషన్ (యుపీఏ)లో పిన్న వయస్కురాలైన అనామిక శర్మ ‘డి’ కేటగిరి డైవింగ్ లైసెన్స్‌ను పొందింది. మన దేశంలోని ఏకైక మహిళా స్కైడైవింగ్ కోచ్ అనామిక. ప్రయాగ్‌రాజ్‌లో ప్రాథమిక విద్యను పూర్తి చేసిన అనామిక దేశంలోని వివిధ ప్రాంతాలలోని పాఠశాలల్లో చదువుకుంది. బెంగళూరులో బీ.టెక్. చేసింది. పదేళ్ల వయసులోనే మన దేశంలోని యంగెస్ట్ ఫిమేల్ స్కైడైవర్‌గా సంచలనం సృష్టించింది. 300ల స్కైడైవ్స్ చేసింది. గత సంవత్సరం 13,000 అడుగుల ఎత్తులో రామమందిరం పతాకాన్ని, ఈ సంవత్సరం మహా కుంభమేళ పతాకాన్ని బ్యాంకాక్‌లో 13,000 అడుగుల ఎత్తులో ప్రదర్శించింది. అనామిక శర్మ తాజా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. -
ఆంధ్ర జట్టుకు మారిన సీనియర్ రంజీ ప్లేయర్
ఉత్తర్‌ప్రదేశ్ సీనియర్ ఆల్‌రౌండర్ సౌరభ్ కుమార్ వచ్చే రంజీ సీజన్ 2025-26 కోసం ఆంధ్రప్రదేశ్ జట్టుకు మారాడు. ఈ మేరకు ఇరు జట్లకు సంబంధించిన అన్ని లాంఛనాలు పూర్తయ్యాయి. బీసీసీఐ అప్రూవల్ రావడమే తరువాయి. 32 ఏళ్ల సౌరభ్ కుమార్ 2014లో సర్వీసస్ తరఫున ఫస్ట్‌క్లాస్ అరంగేట్రం చేసి దశాబ్ద కాలానికి పైగా ఉత్తర్‌ప్రదేశ్‌కు ప్రాతినిథ్యం వహించాడు. లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన సౌరభ్.. ఇప్పటివరకు 79 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 25 ఐదు వికెట్ల ప్రదర్శనల సాయంతో 324 వికెట్లు తీశాడు. లోయర్ ఆర్డర్లో మంచి బ్యాటర్ కూడా అయిన సౌరభ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 2 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీల సాయంతో 2374 పరుగులు చేశాడు.లిస్ట్-ఏ ఫార్మాట్లో 2015లో అరంగేట్రం చేసిన సౌరభ్ ఇప్పటివరకు 40 మ్యాచ్‌లు ఆడి 52 వికెట్లు తీశాడు. ఓ హాఫ్ సెంచరీ సాయంతో 340 పరుగులు చేశాడు. 2016లో టీ20 అరంగేట్రం చేసిన సౌరభ్.. 33 మ్యాచ్‌ల్లో 24 వికెట్లు తీసి 148 పరుగులు చేశాడు. సౌరభ్ 2017 ఐపీఎల్ సీజన్లో ధోని నేతృత్వంలోని రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్‌కు ఎంపికయ్యాడు. అయితే అతనికి ఐపీఎల్లో ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం కూడా రాలేదు. 2021 సీజన్లో సౌరభ్‌ను పంజాబ్ కింగ్స్ ఎంపిక చేసుకుంది. ఆ సీజన్లోనూ అదే పరిస్థితి. 2022 ఫిబ్రవరిలో సౌరభ్‌కు భారత టెస్ట్ జట్టులో చోటు దక్కింది. శ్రీలంకతో జరిగిన ఆ సిరీస్‌లో సౌరభ్ నెట్ బౌలర్‌గా సేవలందించాడు. ఇటీవలికాలంలో సౌరభ్ ఇంగ్లండ్, బంగ్లాదేశ్, శ్రీలంక సిరీస్‌లకు కూడా నెట్ బౌలర్‌గా ఎంపికయ్యాడు. బీసీసీఐ అధికారిక అనుమతి లభించాక సౌరభ్ రికీ భుయ్, హనుమ విహారి, కేఎస్ భరత్‌లతో కలిసి ఆంధ్ర జట్టుకు ఆడతాడు. -
రూ.20 లక్షలు ఎత్తుకెళ్లిన కోతి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
మధుర: శ్రీకృష్ణుడి జన్మస్థలంగా భావించే ఉత్తరప్రదేశ్‌లోని మధుర–బృందావన్‌లో వానరాల బెడద పెరిగిపోతోంది. భక్తుల వస్తువులు, తినుబండారాలను ఎత్తుకెళ్తుండడం పెద్ద తలనొప్పిగా మారింది. ప్రభుత్వ అధికారులు వాటి ఆగడాలను అదుపు చేయలేకపోతున్నారు. తాజాగా ఓ వ్యాపారి నుంచి రూ.20 లక్షలకుపైగా విలువైన వజ్రాల నగలున్న సంచిని కోతి ఎత్తుకెళ్లింది.అలీగఢ్‌కు చెందిన అభిషేక్ అగర్వాల్ బంగారు అభరణాల వ్యాపారి. కుటుంబంతో కలిసి శుక్రవారం బృందావన్ దర్శనానికి వచ్చాడు. తమ వద్దనున్న నగలను ఓ సంచిలో భద్రపర్చాడు. దర్శనం పూర్తయిన తర్వాత ఇంటికి చేరుకోవడానికి కారు వద్దకు వెళ్తుండగా ఓ కోతి హఠాత్తుగా ఎక్కడి నుంచో వచ్చి, ఆ సంచిని లాక్కెళ్లింది. ఆందోళనకు గురైన అభిషేక్ అగర్వాల్ వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు.పోలీసులు దొంగ మర్కటం కోసం వేట ప్రారంభించారు. 8 గంటల తర్వాత దాని ఆచూకీ కనిపెట్టారు. అదృష్ట ఏమిటంటే నగల సంచి దాని దగ్గరే ఉంది. కోతిని అక్కడి నుంచి వెళ్లగొట్టి, నగల సంచిని జాగ్రత్తగా తీసుకొచ్చి, బాధితుడికి అప్పగించారు. -
పాడైన మిక్చర్ పెడతావా?.. కోర్టు ఉద్యోగికి జడ్జి లీగల్ నోటీసులు
అధికారి తలచుకుంటే దెబ్బలకు కొదవా ? అలాగే న్యాయస్థానం వాళ్ళు అనుకోవాలిగానీ ఏ అంశం మీదైనా నోటీసులు ఇవ్వగలరు.. చొక్కా గుండీలు పెట్టుకోలేదని.. నల్లకళ్లజోడు పెట్టుకున్నావని.. టిప్ టాప్ గా తయారై కోర్టుకు వచ్చావని కూడా శిక్ష విధించగలరు.. నోటీసు ఇవ్వగలరు. పాపం ఉత్తరప్రదేశ్ లోని గొండా జిల్లాలో ఇలాగే ఓ కోర్టు అటెండర్ తనకు తాజా స్నాక్స్ పెట్టలేదని.. చెడిపోయిన మిక్చర్ ఇచ్చాడన్న కారణంతో సదరు జడ్జి కోపానికి వచ్చి ఏకంగా ఆ ఉద్యోగికి లీగల్ నోటీసులు ఇచ్చారు. ఇదిప్పుడు జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది.ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లా కోర్టులో అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జి నాలుగురోజుల క్రితం మధ్యాహ్న విరామ సమయంలో, గోండాలోని సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) కోర్టులో కలిశారు. వారిద్దరూ కాసేపు ఛాంబర్లో మాట్లాడుతూ ఉన్నారు. ఈ సందర్భంగా అతిథికి చాయ్ బిస్కెట్స్ అందించాలని కోర్టు అటెండర్ ను సెషన్స్ జడ్జి చెప్పారు.అయితే పాపం ఆ ఉద్యోగి కేవలం చాయ్ తీసుకొచ్చాడు. దీంతో జడ్జిగారు కోపంతో బిస్కెట్స్ తీసుకురమ్మని ఆదేశించారు. వెంటనే ఆ అటెండర్ పరుగెత్తుకువెళ్లి బిస్కెట్స్ బదులు దాల్మోత్ అనే మిక్చర్ లాంటిది తెచ్చి ఇచ్చాడు. అయితే అది నాణ్యత లేకపోగా చెడిపోయిన వాసనా వచ్చింది. దీంతో జడ్జిగారికి చిర్రెత్తుకొచ్చింది.. వెంటనే టింగ్ టింగ్ అని బెల్లు కొట్టి టైపిస్టును పిలిచి ఈ అటెండర్ నాకు సరిగా స్నాక్స్ ఇవ్వలేదు.. ముందు ఆయనకు నోటీస్ టైప్ చేసివ్వు.. అయన దానికి సమాధానం ఇచ్చుకుంటాడో ఉద్యోగం మనుకుంటాడో చూద్దాం అని హుకుం జారే చేసారు. అయన ఆదేశించిన మరుక్షణం ఉద్యోగి పేరిట నోటీస్ సిద్ధమైంది. ఇంతకూ ఆ నోటీసులో ఏముందంటే..“నేను బిస్కెట్లు తీసుకురమ్మన్నాను. కానీ నీవు బిస్కెట్లు తీసుకురాకుండా, బదులుగా చెడిపోయిన దాల్‌మోత్‌ను సర్వ్ చేసావు. అయితే, రెండు డబ్బాల్లో మంచి నాణ్యత గల బిస్కెట్లు క్యాబినెట్లో సిద్ధంగా ఉండగా కూడా, నీవు అవన్నీ విస్మరించి, బయటపడేయాల్సిన స్థితిలో ఉన్న దాల్‌మోత్‌ను ఇచ్చావు. ఇది గౌరవానికి భంగం కలిగించే చర్యగా, తీవ్రమైన నిర్లక్ష్యంగా భావిస్తున్నాం. దీనికి నువ్వు వివరణ ఇవ్వాల్సిందే అంటూ నోటీస్ ఇచ్చారు. ఈ నోటీస్ ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది.. అయ్యో జడ్జిగారికి కోపం వస్తే ఏమవుతుందో చూసారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు-సిమ్మాదిరప్పన్న -
రాజ్యాంగం వల్లే దృఢమైన భారత్
ప్రయాగ్‌రాజ్: సంక్షోభ సమయాల్లోనూ దేశాన్ని ఐక్యంగా, బలంగా నిలబెట్టిన ఘనత మన రాజ్యాంగానిదే అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ చెప్పారు. ఎన్నో విపత్కర పరిస్థితులు, సమస్యలు ఎదురైనప్పటికీ దేశం స్థిరంగా నిలిచి ఉందని, ఆ క్రెడిట్ రాజ్యాంగానికే దక్కుతుందని స్పష్టంచేశారు. శనివారం ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ హైకోర్టులో అడ్వొకేట్ చాంబర్స్, మల్టి–లెవెల్ పార్కింగ్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయవాదులను ఉద్దేశించి ప్రసంగించారు. 75 ఏళ్ల క్రితం రాజ్యాంగాన్ని రూపొందించి, తుది ముసాయిదాను రాజ్యాంగ సభకు సమరి్పంచిన సమయంలో దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయని గుర్తుచేశారు. రాజ్యాంగంలో సమాఖ్య లక్షణాలు అధికంగా ఉన్నాయని కొందరు, ఏకీకృతంగా ఉందని మరికొందరు చెప్పారని వెల్లడించారు. రాజ్యాంగం పూర్తి సమాఖ్యం కాదు, పూర్తి ఏకీకృతం కాదని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ బదులిచ్చినట్లు తెలిపారు. యుద్ధం, శాంతితోపాటు ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేశాన్ని ఐక్యంగా, దృఢంగా ఉంచే రాజ్యాంగం మనకు లభించిందని హర్షం వ్యక్తం చేశారు. రాజ్యాంగ స్వర్ణ రథానికి రెండు చక్రాలు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మన దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందంటే అందుకు కారణం రాజ్యాంగమేనని జస్టిస్ గవాయ్ స్పష్టం చేశారు. పొరుగు దేశాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో చూస్తూనే ఉన్నామని చెప్పారు. ఈ 75 ఏళ్ల రాజ్యాంగ ప్రయాణంలో దేశంలో సామాజిక, ఆర్థిక సమనత్వాన్ని తీసుకురావడానికి శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు ఎంతగానో కృషి చేశాయని ఉద్ఘాటించారు. సమాజంలో చిట్టచివరి వ్యక్తికి సైతం న్యాయం చేకూర్చడం మన ప్రాథమిక విధి అని న్యాయమూర్తులు, న్యాయవాదులకు పిలుపునిచ్చారు. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు ఆ ఆఖరి వ్యక్తిదాకా చేరుకోవాలని సూచించారు. భూసంస్కరణలతో ఎంతోమందికి మేలు జరిగిందని జస్టిస్ గవాయ్ తెలిపారు. భూస్వాముల నుంచి భూములు పేదలకు బదిలీ అయ్యాయని పేర్కొన్నారు. భూసంస్కరణ చట్టాలను ఎంతోమంది కోర్టుల్లో సవాలు చేశారని వెల్లడించారు. ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కుల మధ్య ఘర్షణ జరిగితే.. ప్రాథమిక హక్కులదే పైచేయి అవుతుందని సుప్రీంకోర్టు తేల్చిచెప్పినట్లు గుర్తుచేశారు. రాజ్యాంగాన్ని సవరించే హక్కు పార్లమెంట్‌కు ఉన్నప్పటికీ.. దాని మౌలిక స్వరూపాన్ని మార్చే హక్కు లేదని 1973లో అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు ఇచ్చినట్లు చెప్పారు. భారత రాజ్యాంగానికి ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలే ఆత్మ అని పేర్కొంటూ, రాజ్యాంగ స్వర్ణ రథానికి ఇవి రెండు చక్రాలు అని వ్యాఖ్యానించారు. ఒక్క చక్రాన్ని ఆపినా మొత్తం రథం ఆగిపోతుందన్నారు. బార్, బెంచ్ అనేవి ఒకే నాణేనికి రెండు ముఖాలు అని జస్టిస్ గవాయ్ స్పష్టంచేశారు. బార్, బెంచ్ కలిసికట్టుగా పనిచేయకపోతే రాజ్యాంగ రథం ముందకు సాగదని చెప్పారు. -
‘వారికి నిద్రలేని రాత్రులు ఎలా ఉంటాయో చూపెట్టాం’
కాన్పూర్: ఆపరేషన్ సిందూర్ తో పాకిస్తాన్ కు వణుకు పుట్టించిన విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి గుర్తు చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ను విజయవంతంగా పూర్తి చేశామన్నారు. భారత్ చేపట్టిన ఈ ఆపరేషన్ సిందూర్ తో పాకిస్తాన్ నిద్రలేని రాత్రులు ఎలా ఉంటాయో చూపెట్టామన్నారు మోదీ. ఈ రోజు(శుక్రవారం) యూపీలోని కాన్పూర్ పర్యటనలో భాగంగా మోదీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.‘ఆపరేషన్ సిందూర్.. దేశ రక్షణ వ్యవస్థ ఎంత బలంగా ఉందో ప్రపంచానికి తెలిసేలా చేసింది. బ్రహ్మోస్ క్షిపణి తరహా రక్షణ వ్యవస్థ కల్గిన మనదేశ సామర్థ్యంతో పాక్ ను చావుదెబ్బ కొట్టాం. ఉగ్రవాదాన్ని అంతం చేసే లక్ష్యంతో చేపట్టిన ఈ ఆపరేషన్ సిందూర్.. పాకిస్తాన్ మూలాల్లోకి పోయి మరీ విధ్వంసం సృష్టించాం. ప్రధానంగా బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగంతో పాక్ కు ఊపిరి సలపలేదు. ఇది భారత్ దేశ శత్రువులకు ఒక హెచ్చరిక లాంటిది. మమ్మల్ని తక్కువ అంచనా వేసే వారికి కూడా ఇది ఒక గుణపాఠం. ఆపరేషన్ సిందూర్ అనేది ఒక ఆరంభం మాత్రమే.. ఇది ఇంకా ముగిసిపోలేదు. దీన్ని మరిచిపోవద్దు’ అంటూ ప్రధాని మోదీ హెచ్చరించారు. పాకిస్తాన్ పాత కాలంలో రాష్ట్ర, రాష్ట్రేతర సంస్థల మధ్య తేడాను చూపించే ఆట ఇకపై పనిచేయదు’ అని మోదీ క్లియర్ మెసేజ్ ఇచ్చారు. -
ముక్కు కొరికేశాడు
కాన్పూర్: అపార్ట్మెంట్లో తనకు కేటాయించిన పార్కింగ్ స్థలంలో వేరెవరిదో కారు నిలిపి ఉండటం చూసి పట్టరాని కోపంతో ఓ వ్యక్తి ఆ అపార్ట్మెంట్ సొసైటీ సెక్రటరీ ముక్కును రక్తమోడేలా కొరికేశాడు. ఈ అనూహ్యపరిణామం ఆదివారం సాయంత్రం ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో జరిగింది. బాధితుడు రూపేంద్ర సింగ్ యాదవ్ కుమారుడు ప్రశాంత్, కుమార్తె ప్రియాంక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. కాన్పూర్ శివారు నారామవూ ప్రాంతంలోని రతన్ ప్లానెట్ అపార్ట్మెంట్లో క్షితిజ్ మిశ్రా ఉంటున్నారు. ఆయనకు కేటాయించిన పార్కింగ్ స్థలంలో ఆదివారం గుర్తు తెలియని కారు ఉండటంతో మిశ్రా వెంటనే సొసైటీకి ఫిర్యాదుచేశాడు. సొసైటీ సెక్రటరీగా పనిచేస్తున్న రిటైర్డ్ ఇంజనీర్ యాదవ్ అదేరోజు సాయంత్రం మిశ్రా దగ్గరకు వచ్చాడు. వాచ్మెన్, సెక్యూరిటీ గార్డులకు చెప్పానని, కారు ఎవరిదో ఆరాతీసి వెంటనే మీ స్థలం నుంచి తీయిస్తానని మిశ్రాకు నచ్చజెప్పారు. అయినాసరే ఏమాత్రం వినిపించుకోని మిశ్రా కోపంతో యాదవ్‌పై పలుమార్లు చేయిచేసుకున్నారు. తర్వాత యాదవ్ మెడను గట్టిగా పట్టుకుని ముక్కు కొరికేశాడు. దీంతో రక్తం ధారలా కారింది. రక్తమోడుతున్న యాదవ్‌ను ఆయన కుటుంబసభ్యులు దగ్గర్లోని రీజెన్సీ ఆస్పత్రికి తరలించారు. శస్త్రచికిత్స అవసరమని వెంటనే ఢిల్లీకి తీసుకెళ్లాలని వైద్యులు సూచించడంతో ఆగమేఘాల మీద ఆయనను ఢిల్లీకి తరలించారు. ‘‘ ప్రస్తుతం యాదవ్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమిస్తే మిశ్రాపై తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదుచేస్తాం’’ అని కళ్యాణ్పూర్ ఏసీపీ అభిషేక్ పాండే చెప్పారు. ‘‘ రక్తమొచ్చేలా కొరికిన కోపిష్టిని పోలీసులు కొద్దిసేపు అదుపులోకి తీసుకుని వదిలేశారు’’ అని బాధితుడి కుమార్తె ప్రియాంక ఆగ్రహం వ్యక్తంచేశారు. ముందుగా ఎలాంటి ఫిర్యాదు అందని కారణంగానే మిశ్రాను విడిచిపెట్టామని, ఇకపై ఎఫ్ఐఆర్ ప్రకారం నడుచుకుంటామని ఏసీపీ చెప్పారు. -
పాపులర్ యూ ట్యూబర్ సీక్రెట్ వెడ్డింగ్ : స్టూడెంట్స్‌కి సర్ప్రైజ్
ప్రముఖ యూట్యూబర్, విద్యావేత్త ఖాన్ సర్ వివాహం ఇపుడు వార్తల్లో నిలిచింది. ఆన్లైన్లో అత్యంత ప్రజాదరణ పొందిన విద్యావేత్తలలో ఒకరు ఖాన్ సర్. అనేక సంవత్సరాలుగా వివిధ పోటీ పరీక్షలకు విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. ఆయన అసాధారణ బోధనా విధానాలు విద్యార్థులు ఆదరణతో ఆన్లైన్ ఆయనకు భారీ ఫాలోయింగే ఉంది. ఆయన అత్యంత నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నారు. కానీ జూన్‌లో విద్యార్థులకోసం విందు ఇవ్వనున్నారు. జూన్ 2న రిసెప్షన్ పాట్నాలో జరగనుంది. ప్రస్తుతం ఖాన్ సర్ పెళ్లి వార్త నెట్టింట వైరల్‌గా మారింది.ఉత్తరప్రదేశ్‌లోని డియోరియాకు చెందినఖాన్ సర్ భారతదేశం-పాకిస్తాన్ ఉద్రిక్తతల కారణంగా, తాను ఎవరినీ ఆహ్వానించకూడదని నిర్ణయించుకున్నానని వెల్లడించారు. దీనికి విడుదల చేసిన ఒక వీడియోలో తన విద్యార్థులతో ఈ వార్తను పంచుకున్నారు.భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా వ్యక్తిగత వేడుకల కంటే దేశం పరిస్థితికి ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలిపారు.. జూన్ 2న రిసెప్షన్ తర్వాత, జూన్ 6న విద్యార్థులందరికీ ప్రత్యేక వివాహ విందును ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఖాన్ సర్ వెడ్స్, ఏఎస్ ఖాన్ అని పేరున్న పోస్టర్ తప్ప, ఆయన తన భార్య పేరును వెల్లడించలేదు. తన వ్యక్తిగత విషయాలను ఎపుడూ గోప్యంగా ఉంచే ఖాన్ సార్ వివాహంగా గుట్టుగా జరిగిపోవడం ఆయన అభిమానులను ఆశ్చర్యపర్చింది. రానున్న విందుకోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
ఊపిరి పీల్చుకున్న నాసా : ఎవరీ యువరాజ్ గుప్తా
మట్టిలో పుట్టిన మాణిక్యాలకు మన దేశంలో కొదువ లేదు. చిన్న వయసులోనే అత్యద్బుతమైన నైపుణ్యంతో అబ్బుర పరచడమే కాదు, అరుదైన ఘనతను సొంతం చేసుకుంటారు. అలాంటి రత్నం లాంటి వ్యక్తి గురించి తెలుసుకుందామా. మహా మహా నిపుణులే కనిపెట్టలేని బగ్‌ను గుర్తించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒకప్పుడు తన పొరుగువారి Wi-Fi ని హ్యాక్ చేసి దానితో ఆడుకునే ఆ పిల్లవాడు, నేడు NASA వంటి ప్రపంచంలోని అతిపెద్ద అంతరిక్ష సంస్థ వెబ్‌సైట్‌ను సైబర్ దాడుల నుండి రక్షించాడు కాన్పూర్‌కు చెందిన యువరాజ్ గుప్తా (Yuvraj Gupta). తన సామర్థ్యాలతో ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యపరిచాడు.ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన 11వ తరగతి విద్యార్థి యువరాజ్ గుప్తానేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) వెబ్సైట్లో తీవ్రమైన భద్రతా లోపాన్ని కనుగొన్నాడు. ఈ బగ్ ద్వారా, ఎవరైనా NASA అధికారిక ఇమెయిల్ నుండి నకిలీ సందేశాలను పంపవచ్చు. ఎంతోమంది సైబర్ నిపుణులు ఈ లోపాన్ని పట్టుకోలేకపోయారు, కానీ యువరాజ్ దాన్ని గుర్తించడం విశేషంగా నిలిచింది.BREAKING NEWS 🚨 📢 14 year old Yuvraj Gupta, who lives in Kanpur, Uttar Pradesh, has done a great feat. Hesaved the website of American space agency NASA from hackers.NASA has included him in the 'Hall of Fame' and also given him a letter of recognition. pic.twitter.com/GzTbgFB8GN— News Arena India (@NewsArenaIndia) May 25, 2025 fy"> NASA బగ్ బౌంటీ కార్యక్రమంలో దాదాపు రెండు వారాల పాటుప్రయత్నించిన , ఇక ఆశ వదిలేసుకుంటున్న సమయంలో ఒక రాత్రి అతను NASA సబ్ డొమైన్లో లోపాన్ని కనుగొన్నాడు. దీనిపై సమగ్ర నివేదికను తయారు చేసి వీడియోతో పాటు నాసాకు పంపించాడు. ఇది మాత్రమే కాదు, అతను నకిలీ ఈమెయిల్స్, రహస్య సమాచారాన్ని చేరవేసే బగ్‌ల గురించి తెలియజేశాడు. యువరాజ్ గుప్తా సాధించిన ఈ ఘనతకు నాసా గుర్తించింది. యువరాజ్‌ను ప్రశంసా పత్రం , 'హాల్ ఆఫ్ ఫేమ్'లో స్థానం కల్పించి సత్కరించింది.కాన్పూర్‌లోని సరస్వతి విద్యా మందిర్ ఇంటర్ కాలేజీ (దామోదర్ నగర్)లో చదువుతున్నాడు . 10వ తరగతిలో 79.4 శాతం మార్కులు సాధించాడు. పరిమిత వనరులు ఉన్నప్పటికీ, అతను యూట్యూబ్, ఆన్లైన్ కోర్సులు, పుస్తకాల ద్వారా ఎథికల్ హ్యాకింగ్‌పై పట్టు సాధించాడు. 6వ తరగతిలో ఉన్నప్పటినుంచీ సైబర్ సెక్యూరిటీపై ఆసక్తి పెంచుకున్నాడు. పట్టువదలకుండా ఎథికల్ హ్యాకింగ్‌లో నైపుణ్యాన్ని సాధించాడు. తాజాగా తన నైపుణ్యంతో నాసాను ఇంప్రెస్ చేయడం విశేషం.యువరాజ్ గుప్తా తండ్రి జై నారాయణ్ గుప్తా ఒక ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి. తల్లి కల్పనా గుప్తా గృహిణి. యువరాజ్ కు ల్యాప్ టాప్ ఇవ్వడానికి, అతని సోదరి స్కాలర్షిప్ , అతని తండ్రి పొదుపు మొత్తాన్ని కలిపి మొత్తం సిస్టంను సమకూర్చుకున్నాడట. దేశానికి డిజిటల్ భద్రతను అందించాలనే సంకల్పంతో ఉన్నామంటోంది యువరాజ్ కుటుంబం. -
పెద్ద సారూ.. పార్టీ ఆఫీసులో ఇదేం పని.. వీడియో వైరల్
లక్నో: బీజేపీ సీనియర్ నేత ఒకరు పార్టీకి చెందిన మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. మహిళా కార్యకర్తను రాత్రి వేళ పార్టీ కార్యాలయంలోకి తీసుకెళ్లడం ఆమెతో అనుచితంగా ప్రవర్తించిన వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో సదరు నేత స్పందిస్తూ.. దీని వెనుక రాజకీయ కారణాలున్నాయని చెప్పడం గమనార్హం. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.వివరాల ప్రకారం.. ఏప్రిల్ 12న రాత్రి 9.30 గంటల సమయంలో గోండా జిల్లా బీజీపీ అధ్యక్షుడు అమర్ కిషోర్ కశ్యప్, ఒక మహిళా కార్యకర్తతో కలిసి కారులో పార్టీ కార్యాలయానికి చేరుకున్నాడు. మెట్ల వద్ద ఆమెను కౌగిలించుకున్నాడు. ఆ తర్వాత ఆ మహిళతో కలిసి పై అంతస్తులోని గదిలోకి వెళ్లాడు. బీజేపీ పార్టీ కార్యాలయంలోని సీసీటీవీలో ఇది రికార్డ్ అయ్యింది. దీంతో ఈ వీడియో క్లిప్ తాజాగా వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో బామ్ బామ్ మహిళా కార్యకర్తతో అసభ్యకరంగా ప్రవర్తించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.#Gonda: बमबम पर आरोप, पार्टी ने जारी किया नोटिस! क्या पद गंवाएंगे भाजपा जिलाध्यक्ष अमर किशोर कश्यप ? @deepaq_singh @Bhupendraupbjp pic.twitter.com/yKU2OFXYpz— GONDA POST (@gondapost) May 25, 2025మరోవైపు ఈ వైరల్ వీడియోపై బీజేపీ నేత అమర్ కిషోర్ కశ్యప్ స్పందించారు. ఈ వీడియోలో ఉన్నది తానేనని ఒప్పుకున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నేను కొనసాగడం ఇష్టం లేని వ్యక్తులు పన్నిన కుట్ర ఇది. కొంతమంది నా ప్రతిష్టను దెబ్బతీసేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. ఇది ఏప్రిల్ 12 తేదీన జరిగింది. ఆ రోజు మహిళా కార్యకర్త అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైంది. దీంతో పార్టీ కార్యాలయంలో విశ్రాంతి తీసుకోవాలని సూచించాను. మానవతా దృక్పథంతో ఆ మహిళకు సహాయం చేశానని చెప్పుకొచ్చారు. అయితే, తనపై కుట్రతో ఇలా చేస్తున్నారని ఆరోపించారు. ‘ఈ వీడియో వైరల్ వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయి’ అని చెప్పుకొచ్చారు. Gonda BJP Chief Responds to Viral Video: “She Was Unwell, Needed Rest” pic.twitter.com/pVY9o8OKoT— The Times Patriot (@thetimespatriot) May 25, 2025ఈ వీడియో బయటకు వచ్చిన నేపథ్యంలో అమర్ కిషోర్‌కు పార్టీ హైకమాండ్ నోటీసులు జారీ చేసింది. ఏడు రోజుల్లో దీనిపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. అనంతరం, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోవింద్ నారాయణ్ శుక్లా స్పందిస్తూ..‘సోషల్ మీడియాలోని వీడియో పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉంది. పార్టీ నేతలకు క్రమశిక్షణ అవసరం. ఈ ఘటనపై నోటీసులు ఇవ్వడం జరిగింది. అనుచితంగా ప్రవర్తించినట్టు తేలితే కఠినమైన క్రమశిక్షణా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. -
ఆ ఒక్క రాష్ట్రంలోనే ఐదు లక్షల కార్లు: SIAM డేటా..
సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ తయారీదారుల (SIAM) డేటా ప్రకారం.. 2024-25లో భారతదేశంలో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలలో 'మహారాష్ట్ర' మొదటి స్థానంలో ఉండగా, ఉత్తరప్రదేశ్ ద్విచక్ర వాహనాల అమ్మకాలలో ముందుంది.SIAM డేటా ప్రకారం.. 2024-25లో మహారాష్ట్రలో ప్యాసింజర్ వాహనాల (PV) అమ్మకాలు 5,06,254 యూనిట్లు (11.8 శాతం)గా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ 4,55,530 యూనిట్లు (10.6 శాతం), గుజరాత్ 3,54,054 యూనిట్లు (8.2 శాతం) అమ్మకాలతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఆ తరువాత నాల్గవ స్థానంలో కర్ణాటక 3,09,464 యూనిట్లతో (7.2 శాతం), హర్యానా 2,94,331 యూనిట్లతో (6.8 శాతం) ఐదవ స్థానంలో ఉన్నాయి.ద్విచక్ర వాహన విభాగంలో.. ఉత్తరప్రదేశ్ 28,43,410 యూనిట్ల అమ్మకాలతో (14.5 శాతం వాటా) అగ్రస్థానంలో ఉంది. మహారాష్ట్ర 20,91,250 యూనిట్లతో (10.7 శాతం), తమిళనాడు 14,81,511 యూనిట్లతో (7.6 శాతం) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. నాలుగు, ఐదు స్థానాల్లో కర్ణాటక (12,94,582 యూనిట్ల), గుజరాత్ (12,90,588 యూనిట్లు) ఉన్నాయి.ఇదీ చదవండి: ఒక్కసారి చెల్లిస్తే చాలు!.. ఏడాదంతా ఫ్రీ జర్నీత్రిచక్ర వాహనాల విభాగంలో.. ఉత్తరప్రదేశ్ అత్యధికంగా 93,865 యూనిట్లు (12.7 శాతం) అమ్మకాలు జరపగా, గుజరాత్ 83,947 యూనిట్లు (11.3 శాతం), మహారాష్ట్ర 83,718 యూనిట్లు (11.3 శాతం) అమ్మకాలు జరిపాయని డేటా తెలిపింది. కర్ణాటక 70,417 యూనిట్లతో (9.5 శాతం) నాల్గవ స్థానంలో, బీహార్ 47,786 యూనిట్లతో (6.4 శాతం) ఐదవ స్థానంలో నిలిచాయి. -
‘నాన్న నన్ను క్షమించండి.. నా చావుకు మామ, వదినే కారణం’
మొరాదాబాద్: అమ్మా, నాన్న.. నన్ను క్షమించండి. నేను ప్రేమ వివాహం చేసుకుని తప్పు చేశాను. నా భర్త నన్ను అర్థం చేసుకోవడం లేదు. నా ఆడపడుచు, మామ వేధింపులు భరించలేకపోతున్నా. ఈ జన్మకు మిమ్మల్ని ఆనందంగా చూసుకోలేకపోయాను. మళ్లీ జన్మంటూ ఉంటే మీకు బిడ్డగా జన్మిస్తాను అంటూ వీడియో రికార్డు చేసి నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.వివరాల ప్రకారం.. మొరాదాబాద్‌కు చెందిన అమ్రీన్ జహాన్(23) నాలుగు నెలల క్రితమే ప్రేమ వివాహం చేసుకుంది. తన భర్త బెంగళూరులో ఉద్యోగం చేస్తుండటంతో అతడు అక్కడికి వెళ్లాడు. అమ్రీన్ అత్తారింట్లోనే ఉంది. ఈ క్రమంలో ప్రేమ వివాహం చేసుకున్న కారణంగా అత్తంట్లో ఆమెకు వేధింపులు ప్రారంభమయ్యాయి. ఇంట్లో ప్రతీ ఒక్కరూ ఏదో ఒక సాకుతో ఆమెను వేధించడంతో బాధను తట్టుకోలేకపోయింది. దీంతో, ఆత్మహత్య చేసుకుంది. తన చావుకు భర్త, ఆడపడుచు, మామనే కారణమని చెప్పుకొచ్చింది. ఈ మేరకు తన ఆవేదనను వీడియోలో రికార్డు చేసింది.వీడియోలో ఆమె మాట్లాడుతూ.. నా భర్త కొన్నిసార్లు నా ఆహారపు ఆటవాట్ల గురించి సెటైర్లు వేస్తారు. నా ఆడపడుచు ఖతిజా ఎప్పుడు నన్ను తిడుతూనే ఉంటుంది. ఏ పని చేసినా వారికి నచ్చదు. కొన్నిసార్లు వారు నా గదికి విద్యుత్ సరఫరాను నిలిపివేస్తారు. నా మామ షాజిద్ నాతో అనుచితంగా ప్రవరిస్తాడు. నా ఆరోగ్యం బాగా లేనప్పుడు కూడా నా బాధను అర్థం చేసుకోలేదు. వారి వేధింపుల గురించి నా భర్తకు చెప్పినప్పటికీ ఆయన పట్టించుకోవడం లేదు. పైగా నన్నే తిడుతున్నాడు. నువ్వు ఎందుకు చచ్చిపోవడం లేదని అంటున్నాడు. నా ఆడపడుచు, మామ కూడా ఇలాగే అంటున్నారు. చచ్చిపో.. చచ్చిపో అని అంటున్నారు. వీరి వేధింపులను నేను సహించలేకపోతున్నాను. నేను చనిపోయేటప్పుడు ఎంత బాధ ఉంటుందో తెలియదు.. ఇప్పుడు అంతకంటే ఎక్కువగా బాధపడుతున్నాను. నా చావుకు నా భర్త, ఆడపడుచు, మామనే కారణం’ అని చెప్పుకొచ్చింది. అనంతరం, ఆత్మహత్య చేసుకుంది.తన బిడ్డ చావు అమ్రీన్ తల్లిదండ్రులకు తెలియడంతో కన్నీటిపర్యంతమవుతున్నారు. అనంతరం, ఆమె తండ్రి సలీం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమ్రీన్ నిన్న తనకు ఫోన్ చేసి ఏడ్చాడని అతను చెప్పాడు. తనపై దాడి జరుగుతోందని, తనను కాపాడమని వేడుకున్నట్టు తెలిపాడు. ఇంటి వచ్చేలోపే బిడ్డ చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై సలీం.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సలీం ఫిర్యాదు ఆధారంగా చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. అమ్రీన్ మృతదేహాన్ని శవపరీక్ష కోసం ఆసుపత్రికి తరలించారు. -
రచ్చకెక్కిన డాక్టర్‌బాబు కాపురం
ఆయన వృత్తిరిత్యా వైద్యుడు. సంఘంలో మంచి పేరుతో గౌరవ మర్యాదలు అందుకుంటూ వస్తున్నాడు. ఉన్నట్లుండి.. షాకింగ్ అవతారంలో ఆయన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ వెంటనే ఆయనగారి భార్య ఇచ్చిన ‘గే’ స్టేట్మెంట్ అందరినీ నోళ్లు వెళ్లబెట్టేలా చేసింది.ఉత్తర ప్రదేశ్ సంత్ కబీర్ జిల్లాలో ప్రభుత్వ వైద్యుడైన డాక్టర్ వరుణేష్ దుబే(Doctor Varunesh Dubey) కాపురం రచ్చకెక్కింది. తన భర్త స్వలింగ సంపర్కుడని, మహిళా వేషధారణతో మగవాళ్లతో నీలి చిత్రాల్లో నటిస్తున్నాడని, ఆపై వాటిని అమ్మి డబ్బు సంపాదిస్తున్నాడని భార్య సింపీ పాండే(simpy pandey) సంచలన ఆరోపణలకు దిగింది.‘‘నా భర్త నన్ను గోరఖ్‌పూర్ నివాసంలో వదిలేశాడు. తనకు ప్రభుత్వం కేటాయించిన క్వార్టర్స్‌లో ఉంటూ అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. మహిళా వేషధారణలో మగవాళ్లతో కలిసి శృంగారంలో పాల్గొంటున్నాడు. ఆ వీడియోలను అమ్ముకుని డబ్బు సంపాదిస్తున్నాడు. కావాలంటే నా భర్త అశ్లీల చిత్రాలు ఇంటర్నెట్లో ఉన్నాయి చూస్కోండి. దీనిపై గట్టిగా నిలదీసినందుకు నన్ను, నా సోదరుడ్ని చిత్రహింసలకు గురి చేశాడు అంటూ పోలీసులను ఆశ్రయించారామె.అదే సమయంలో భార్య చేసిన ఆరోపణలను డాక్టర్ వరుణేష్ ఖండించారు. తనకు అలాంటి గత్యంతరం పట్టలేదని, తన ఆస్తిని కాజేసేందుకు ఆమె పన్నిన పన్నాగమని కౌంటర్ ఇచ్చారాయన. ‘‘వృద్ధుడైన నా తండ్రిని నా భార్య మానసికంగా హింసించి చంపేసింది. ఆస్తి తన పేరిట రాయాలంటూ గత కొంతకాలంగా గొడవలు చేస్తోంది. చివరకు మా బిడ్డను కూడా చంపుతానంటూ బెదిరించింది. నా మీద, నా సోదరి మీద కిరాయి రౌడీలను పంపి దాడి చేయించింది. ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న ఫొటోలు, వీడియోలు నిజం కాదు. నా ఫోన్‌ను హ్యాక్ చేసి ఆమె డీప్‌ఫేక్ వీడియోలు సృష్టించింది. .. అయినా ఇలాంటి వాటిని నేను కుంగిపోయి అఘాయిత్యానికి పాల్పడను. నేను మగాడ్ని.. అమాయకుడ్ని. అది రుజువయ్యేదాకా ఎలాంటి పోరాటం అయినా చేస్తా’’ అని అంటున్నారాయన.భార్యభర్తల పరస్పర ఆరోపణలతో ఈ పంచాయితీ పోలీసులకు చేరింది. ఇరువురి ఫిర్యాదులను స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మొత్తం ఎపిసోడ్లో కొసమెరుపు ఏంటంటే.. ఈ జంటది ప్రేమ వివాహం కావడం!. -
నాడు సన్యాసి.. ఇవాళ కంపెనీ సీఈవోగా..!
ఎందరో మేధావులు, ప్రముఖులు జీవితంలో అనుభవించాల్సిన ఆనందమంతా పొంది, బాధ్యతలు కూడా నెరవేర్చి.. చరమాంకంలో ఆధ్యాత్మికత వైపుకి అడుగులు వేస్తుంటారు. ఇక వారి శేష జీవితాన్ని ఆ దేవుని సేవకు అంకితం చేసిన ఎందరో భక్తాగ్రేసులను చూశాం. అలా కాకుండా వారందరికంటే భిన్నంగా..ఓ వ్యక్తి ఆధ్యాత్మికత నుంచి ఆధునిక జీవన విధానంలోకి వచ్చాడు. ఆయన ఆధ్యాత్మికంగా పరిపక్వత చెంది..చివరికి ప్రాంపించిక జీవితంలోకి రావడమే గాక..కోట్లు టర్నోవర్ చేసే కంపెనీకి సీఈవోగా ఎదిగారాయన. అంతేగాదు కుటుంబ జీవనంలో బతుకుతూనే ఆధ్యాత్మికంగా బతకొచ్చు అని నిరూపించాడు. పైగా అది మన జీవితంలో భాగమే గానీ ఎక్కడో దేవాలయాల్లో, మఠాల్లోనూ పొందే సిద్ధాంతం కాదని అంటారాయన. అది మన జీవన విధానానికే పునాది..అదే కేంద్రం బిందువని చెప్పకనే చెప్పాడు.ఆయనే స్టోన్ సఫైర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో శోభిత్ సింగ్. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జన్మించిన సింగ్ చిన్నప్పటి నుంచి తత్వశాస్త్రం, ఆధ్యాత్మికతవైపు ఆకర్షితుడయ్యాడు. అలా తన చదువు పూర్తి చేసుకున్న వెంటనే..కేవలం 26 ఏళ్లకే రిషికేశ్‌లోని ఒక ఆశ్రమంలో ఆధ్యాత్మికతలో మునిగిపోయాడు. అక్కడే వేద అధ్యయనం చేశాడు. ఇక పూర్తిగా ఆధ్యాత్మిక మార్గంలోనే నడవాలని భావించాడు. అలా ఆ రిషికేశ్ ఆశ్రమం మహర్షి సంస్థలో సభ్యుడిగా కూడా మారాడు. పూర్తి సన్యాసి జీవితం గడుపుతున్న శోభిత్ సింగ్ మఠాన్ని విడిచి పెట్టి..ప్రాపంచిక జీవితంలో గడుపుతూ ఆధ్యాత్మికంగా ఉండొచ్చు అని విశ్విసించడం మొదలుపెట్టాడు. ఆయనకు ఆ ఆశ్రమంలో ఉండగానే ఆధ్యాత్మికత అంటే కేవలం ఆచారాలు లేదా ఏకాంతం లేదా 'సంసారం' నుంచి నిష్క్రమించడం కాదని బోధపడింది. మన దైనందిన జీవితంలో ప్రతిపాత్రలో దీన్ని విలీనం చేసి బతికే జీవన విధానమే అది అని తెలుసుకున్నానని చెబుతున్నాడు శోభిత్. అప్పుడే స్ట్రాంగ్‌గా డిసైడ్ అయ్యా..అందరిలా జనజీవన స్రవంతిలో చేరి కార్పొరేట్ ప్రంపంచలో బతుకుతూ కూడా ఆధ్యాత్మికంగా ఎలా బతకచ్చో ఆచరించి చూపాలని నిర్ణయించుకున్నారట శోభిత్ సింగ్ఆ నేపథ్యంలోనే కొత్తమంది స్నేహితులతో కలిసి వ్యాపారాన్ని ప్రారంభించి అంచలంచెలుగా విజయాలను అందుకున్నానని అన్నారు. ఈ పోటీతత్వంతో కూడిన కార్పొరేట్ వరల్డ్‌లో కూడా తన ఆలోచన విధానంలో ఎట్టి మర్పు రాలేదని ధీమాగా చెబుతున్నారు శోభిత సింగ్. ఆశ్రమంలో లేదా వ్యాపారంలో అయినా..తాను ఆధ్యాత్మికత విద్యార్థినే అంటారు. ఇక్కడ ఆధ్యాత్మికత..వినయం, సానుకూలత, సానుభూతి, గ్రహణశక్తి తదితరాలను ప్రతిబింబిస్తే..వ్యాపారంలో రాణించాలంటే కూడా ఇవన్నీ అవసరం..అదే నన్ను వ్యవస్థాపక జీవితంలోకి తీసుకొచ్చాయని నవ్వుతూ చెబుతారాయన. అదే వ్యాపార సూత్రం..ఆధ్యాత్మికత ప్రాథమిక విలువలైనా..బహిరంగత, వినయం, సానుకూలత, సానుభూతి, ఆత్మపరిశీలన, గ్రహణశక్తి తదితరాలే నా వ్యాపార సూత్రాలంటారు ఆయన. వాటితోనే తాను అందరితో సంబంధాలు నెరపీ..వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటానని చెప్పారు. అలాగే ప్రతి వ్యక్తికి 200% జీవితం ఉంటుందట. అంటే 100% అంతర్గత (ఆధ్యాత్మిక), ఇంకో 100% బాహ్య జీవతానికి కేటాయించి ఉంటుందంటారు సింగ్. ఈ ఆధ్యాత్మికత ప్రయాణం వ్యక్తిగతంగానే కాకుండా వృత్తిపరమైన జీవితంలో కూడా స్పష్టమైన వైఖరితో ఉండటం నేర్పిస్తుందట. పైగా అన్నివేళల మంచి స్పృహతో ఉంటారట. ఈ ఆధ్యాత్మికతలో మనల్ని మనం పరిశీలించటంతో జర్నీ మొదలవుతుంది..అక్కడ నుంచి మన దృక్కోణం మారుతుది..దాంతోపాటు జీవితం కూడా మారుతుంది. అలాగే ఏ విషయాలకు ఎలా స్పందించాలనే విషయంపై పూర్తి అవగాహన ఉంటుంది. అది ఈ ప్రాపంచిక జీవన విధానంలో ఎలా మసులుకోవాలో నేర్పించడమే గాక జీవితంలో ఉన్నతంగా బతకడం వైపుకు మార్గం వేస్తుందని చెబుతున్నారు శోభిత్ సింగ్. కాగా, ఆయన కంపెనీ గుజరాత్‌కు చెందిన కాగితపు ఉత్పత్తుల సరఫరాదారు. దీని టర్నోవర్ కోట్లలో ఉంటుందట. అంతేగాదు ఇది ఆసియాలో అతిపెద్ద ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ సరఫరాదారులలో ఒకటి, పైగా US రిటైలర్ల కాగితపు ఉత్పత్తి అవసరాలను కూడా తీరుస్తుంది. ముఖ్యంగా చిన్నారుల ఆర్ట్ సామాగ్రి, క్రాఫ్ట్ మెటీరియల్, పర్యావరణ అనుకూల స్టేషనరీ తదితర ఉత్పత్తులను అందిస్తుంది. (చదవండి: International Tea Day: 'టీ' వ్యాపారంలో సత్తా చాటుతున్న మహిళలు వీరే..!) -
షాషీ జామా మసీదులో సర్వే కొనసాగుతుంది: అలహాబాద్ హైకోర్టు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని సంభల్‌లో ఉన్న షాషీ జామా మసీదు సర్వేలో కీలక పరిణామం చోటు చేసుకుంది. షాహీ జామా మసీదు సర్వే నిర్వహించాలన్న 2024 నవంబర్‌లో ట్రయల్ కోర్టు ఉత్తర్వుల్ని నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు తిరస్కరించింది.షాహీ జామా మసీదు సర్వే నిర్వహించాలని ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని నిలిపివేయాలని కోరుతూ ముస్లీం సంస్థ ప్రతినిధులు అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై సోమవారం (మే19) అలహాబాద్ హైకోర్టు విచారణ చేపట్టింది. ట్రయల్ కోర్టు ఉత్తర్వులు నిలిపివేయాలన్న పిటిషన్‌ను కొట్టివేసింది. సర్వే కొనసాగుతుందని స్పష్టం చేసింది. -
పురుషులూ మేలుకోండి..హాట్ టాపిక్‌గా ఇద్దరు మహిళల పెళ్లి!
ఉత్తరప్రదేశ్‌లోని బుడాన్లో జరిగిన సంఘటన నెట్టింట చర్చకు దారి తీసింది. ఇద్దరు మహిళలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇందులో వింత ఏముంటుంది.. ఇవి ఈ మధ్యకాలంలో కామనే కదా అనుకుంటున్నారా? అయితే మీరీ అసాధారణ సంగతి గురించి తెలుసుకోవాల్సిందే.బదాయూ జిల్లా కోర్టు ప్రాంగణంలోని శివాలయంలో ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకున్నారు. గత కొంతకాలంగా ప్రాణ స్నేహితులుగా ఉంటున్న వీరిద్దరు ఈ పెళ్లికి చెప్పిన కారణం ఏంటో తెలుసా? వారికి పురుషులంటే ఇష్టం లేదుట. డేటింగ్లు, డేటింగ్ యాప్ మెసాలు, సంప్రదాయాల పేరుతో జరుగుతున్న నమ్మకద్రోహాలతో విసిగిపోయారట. ఎందుకంటే బదౌన్ జిల్లాకు చెందిన ఇద్దరు మహిళలు భర్తలు తమ కులాన్ని, మతాన్ని దాచిపెట్టి పెళ్లి చేసుకున్నారు. ఈ మోసాన్ని భర్తించలేక ఇద్దరూ తమ భర్తల్ని వదిలేశారు. ఇక పురుషులతో కలిసి జీవించేందుకు ఇష్టం లేకపోవడం వల్లనే పెళ్లి నిర్ణయం తీసుకుంటున్నట్లు మహిళల జంట తెలిపింది. మంగళవారం జరిగిన ఈ సంఘటన స్థానికంగా చర్చనీ యాంశమైంది.ఢిల్లీలో పనిచేస్తున్నప్పుడు కలిసిన ఈ జంట, తమకెదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు. ఇద్దరూ ఫేస్బుక్లో ఇద్దరు వ్యక్తులను ప్రేమించి, మోసపోయారు. సోషల్ మీడియాలో చెప్పుకుంటున్న దానికి పూర్తి భిన్నంగా వారి వైఖరి ఉండటంతో చాలా బాధపడ్డారు. పైగా మోసం చేసి పెళ్లి చేసుకున్నారు. ఈ అనుభవమే వారిద్దరిని దగ్గరి చేసింది. డిల్లీలోని ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నప్పుడు ఇద్దరూ స్నేహితులయ్యారు. క్రమంగా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని తమ బాధలను, బాధలను పంచుకోవడం ప్రారంభించారు. వారిద్దరూ తమ కథలను ఒకరికొకరు చెప్పుకున్నప్పుడు, వారి ఇద్దరి అనుభవాలు ఒకేలా ఉండటంతో వారు ఆశ్చర్యపోయారు. మూడు నెలలుగా మంచి స్నేహితులుగా ఉంటున్న వీరు ఇక జీవితాంతం కలిసే ఉండాలని నిర్ణయించు కున్నారు. దీనికి సంబంధించికి న్యాయపరమైన మద్దతు కోరుతూ న్యాయవాదిని కూడా సంప్రదించారు. సమాజంలో భార్యాభర్తలుగా జీవించడానికి అవకాశాలపై ఆరాతీశారు. అయితే, భారతీయ చట్టాల ప్రకారం స్వలింగ వివాహాలకు గుర్తింపు లేదని న్యాయవాది దివాకర్ తేల్చి చెప్పారు. అయినా తమ నిర్ణయానికే కట్టుబడి ఉన్న యువతులు కోర్టు ఆవరణలోని శివాలయంలో ఒకరికొకరు దండలు మార్చుకుని వివాహం చేసుకున్నారు.స్వలింగ వివాహాన్ని న్యాయస్థానం అంగీకరించదని తెలుసు. చట్టం అనుమతి లేకపోయినప్పటికీ, భార్యాభర్తలు తమ జీవితాన్ని కొనసాగిస్తామని వధూవరులు మీరా, స్వప్న(పేర్లు మార్పు) వెల్లడించారు. ముందుగా మా కుటుంబ సభ్యులకు చెబుతాము, వారు అంగీకరించకపోతే ఢిల్లీలో ఇల్లు కట్టుకుంటాం. జీవితంలో సంతోషకరమైన రోజులు గడపడానికే నిర్ణయం తీసుకున్నా మన్నారు.“మా పురుషులు మమ్మల్ని మోసం చేశారు, ఇకపై వారిని విశ్వసించలేము కాబట్టి మేము ఒకరికొకరు కలిసి జీవించాలని నిర్ణయించుకున్నాము” అని సప్నా ప్రకటించింది. వధువు మీరా, వరుడు సప్న న్యాయవాదుల బృందం పర్యవేక్షణలో చట్టబద్ధంగా, స్థానిక హనుమాన్ ఆలయ పూజారి వారిద్దరికీ హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం జరిపించారు. వీరి వివాహానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. -
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉత్తర ప్రదేశ్‌లో సెమీ కండక్టర్ యూనిట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్న సెమీకండక్టర్ పరిశ్రమ ఇప్పుడు భారత్‌లోనూ రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే దేశంలో ఐదు సెమీకండక్టర్ యూనిట్లు నిర్మాణ దశలో ఉండగా ఆరో యూనిట్‌గా ఇది ఏర్పాటవుతోంది.రూ.3706 కోట్ల వ్యయంతో..హెచ్‌సీఎల్, ఫాక్స్‌కాన్ సంయుక్త భాగస్వామ్యంతో యూపీలోని జెవార్ ఎయిర్‌పోర్టు సమీపంలో ఈ కొత్త సెమీ కండక్టర్ యూనిట్ ఏర్పాటు కానుంది.రూ.3706 కోట్ల వ్యయంతో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. 2027 నాటికి ఈ యూనిట్ నిర్మాణం పూర్తయి ఉత్పత్తిని మొదలుపెట్టనుంది. ఇక్కడ మొబైల్ ఫోన్లు, లాప్‌టాప్‌లు, ఆటోమొబైల్స్, పర్సనల్ కంప్యూటర్స్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాల్లో వినియోగించే చిప్‌లను ఇక్కడ ఉత్పత్తి చేయనున్నారు.ప్రతి నెలా 3.6 కోట్ల యూనిట్లను తయారు చేసే సామర్థ్యంతో ఈ భారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే గుజరాత్, అస్సాం రాష్ట్రాల్లో ఐదు సెమీకండక్టర్ యూనిట్లు నిర్మాణ దశలో ఉన్నాయి. ఇక కేంద్ర కేబినెట్ ప్రకటించిన నిర్ణయాల్లో బెంగళూరు, నోయిడా ప్రాంతాలలో డిస్ప్లే చిప్స్ హబ్‌ల ఏర్పాటు ఉంది. అలాగే తిరుపతి ఐఐటీ విస్తరణకు కూడా కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. -
ఆపరేషన్ సిందూర్ : 17 మంది బంగారు తల్లులు, అదో భావోద్వేగం!
టెర్రరిస్టులను మట్టుబెట్టేందుకు కేంద్రం ప్రభుత్వం చేపట్టిన సైనిక చర్య, ఆపరేషన్ సిందూర్ ఉగ్రమూకలకు చుక్కలు చూపింది. కోట్లాదిమంది భారతీయులకు ప్రేరణగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్‌లోని ఒక మెడికల్ కాలేజీలో ఉత్సాహకరమైన పరిణామం చోటు చేసుకుంది.గత నెలలో పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారం తీర్చుకొనేందుకు పాకిస్తాన్‌పై భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఉత్సాహంతోనే తన బిడ్డలకు సిందూర్ పేరు పెట్టుకునేందుకు చాలామంది దంపతులు ముందుకొచ్చారు. మే 10 -11 తేదీలలో కుషినగర్ మెడికల్ కాలేజీలో రెండు రోజుల వ్యవధిలో జన్మించిన 17 మంది నవజాత బాలికలకు వారి కుటుంబ సభ్యులు సిందూర్ అని పేరు పెట్టుకున్నారు. ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్కే షాహి సోమవారం పిటిఐకి తెలియజేశారు.ఇది తమకు గర్వకారణమంటూ తల్లిదండ్రులను సంతోసం ప్రకటించారు. "పాకిస్తాన్‌కు తగిన సమాధానం ఇచ్చినందుకు" తాము ఈ నిర్ణయం తీసుకున్నామంటూ భారత సాయుధ దళాలను ప్రశంసించారు. "పహల్గామ్ దాడి తరువాత, భర్తలను కోల్పోయిన అనేక మంది వివాహిత మహిళల జీవితాలు నాశనమయ్యాయి. దానికి ప్రతిస్పందనగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ నిర్వహించింది. దీనికి గర్విస్తున్నాజ ఇప్పుడు, సిందూర్ అనేది ఒక పదం కాదు, ఒక భావోద్వేగం. కాబట్టి మా కుమార్తెకు సిందూర్ అని పేరు పెట్టాలని నిర్ణయించుకున్నాము" ఇటీవల ఆడ శిశువుకు జన్మనిచ్చిన కుషినగర్ నివాసి అర్చన షాహి అన్నారు. ఆమె భర్త అజిత్ షాహి కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 26 మంది అమాయకులను చంపినందుకు భారతదేశం ప్రతీకారం తీర్చుకున్నప్పటి నుండి, తన కోడలు కాజల్ గుప్తా తన నవజాత శిశువుకు సిందూర్ అని పేరు పెట్టాలని కోరుకుంటుందని పద్రౌనాకు చెందిన మదన్ గుప్తా అన్నారు.ఇదీ చదవండి: రూ. 2 లక్షలతో మొదలై రూ. 8,500 కోట్లకు, ఎవరీ ధీర"ఆ విధంగా, మేము ఈ ఆపరేషన్‌ను గుర్తుంచుకోవడమే కాకుండా ఈ రోజును పండగలా జరుపుకుంటాం" అని మిస్టర్ గుప్తా పిటిఐకి చెప్పారు. భతాహి బాబు గ్రామానికి చెందిన వ్యాసముని కూడా ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు, తమ నిర్ణయం తమ కుమార్తెలో ధైర్యాన్ని నింపుతుందని చెప్పాడు."నా కూతురు పెద్దయ్యాక, ఈ పదం అర్థాన్ని , పరమార్థాన్ని’ తెలుసుకుంటుంది. భారతమాత పట్ల విధేయత కలిగిన మహిళగా ఉంటుంది’’ అన్నారు. ఏప్రిల్ 22న దక్షిణ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని ప్రసిద్ధ పర్యాటక పట్టణం పహల్గామ్ సమీపంలోని బైసారన్ గడ్డి మైదానంలో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఇరవై ఆరు మంది మరణించగా, చాలామంది గాయపడ్డారు. పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత-కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడానికి భారత సైన్యం మే 7న ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించింది. ముఖ్యంగా మహిళా అధికారిణులు కర్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఈ ఆపరేషన్‌తో సంచలనం రేపడం విశేషం.ఇదీ చదవండి:138 కిలోల నుంచి 75 కిలోలకు : మూడంటే మూడు టిప్స్‌తో -
బ్రహ్మోస్ పనీతీరు ఎలా ఉంటుందో పాక్‌కు తెలుసు: సీఎం యోగి
లక్నో: భారత్ (India), పాకిస్థాన్ (Pakistan) దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ రక్షణ మంత్రి (Defence Minister) రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) యూపీ (Uttarpradesh)లోని లక్నోలో బ్రహ్మోస్ క్షిపణి (BrahMos missile) తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. ‘ఉత్తరప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్’లో ఈ కేంద్రాన్ని నిర్మించారు. రాజ్‌నాథ్ సింగ్ వర్చువల్ విధానంలో ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి పాల్గొన్నారు. ఈ యూనిట్‌కు 80 హెక్టార్ల భూమిని యూపీ సర్కార్ ఉచితంగా ఇచ్చింది. ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ఇదే రోజున మన శాస్త్రవేత్తలు పోఖ్రాన్లో అణు పరీక్షలు చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఢిల్లీలో ఉండాల్సి వచ్చింది. నేను లక్నో ఎందుకు రాలేదో మీ అందరికీ తెలుసు. ఇంత తక్కువ సమయంలో ఈ యూనిట్ సిద్ధం చేసిన వారికి అభినందనలు. 40 నెలల్లోనే ఈ ప్రొడక్షన్ యూనిట్‌ను పూర్తి చేశారు అని ప్రశంసించారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా ఉగ్రవాదులకు గట్టి జవాబు ఇచ్చాం. కేవలం పాక్ సరిహద్దే కాదు, రావల్పిండిపైనా దాడి చేశాం. బ్రహ్మోస్ క్షిపణితో శత్రువుకు మన శక్తి తెలియజేశాం. ఆపరేషన్ సిందూర్‌తో ప్రజలను ఎక్కడా టార్గెట్ చేయలేదు. ఉగ్రవాదాన్ని సహించబోమని ఆపరేషన్ సిందూర్‌తో ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఆలయాలు, గురుద్వారాలపై పాక్ సైన్యం దాడి చేస్తే.. మన సైన్యం ఆ దాడులను ధీటుగా తిప్పికొట్టింది. యూరి, పుల్వామా, పహల్గాం దాడుల తర్వాత ప్రతీసారి మన శక్తిని ప్రపంచానికి చూపించాం’ అని అన్నారు. #WATCH | Defence Minister Rajnath Singh says, "At the inauguration of BrahMos Integration & Testing Facility Center today, I feel delighted to speak with you. I wanted to attend in person. But you know why I couldn't come. Looking at the situation we are facing, it was important… pic.twitter.com/rlRSOXXfQZ— ANI (@ANI) May 11, 2025అంతకుముందు.. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ..‘ఆపరేషన్ సిందూర్ సమయంలో మీరు బ్రహ్మోస్ క్షిపణిని ఒకసారి చూసి ఉంటారు. పాకిస్తాన్‌పై బ్రహ్మోస్‌ను ప్రయోగించాం. బ్రహ్మోస్ క్షిపణి పనితీరు ఎలా ఉంటుందో పాకిస్తాన్‌ను అడగండి. బ్రహ్మోస్ పనితీరును ప్రపంచమంతా చూసింది. ఉగ్రదాడి ఏదైనా యుద్ధంగానే పరిగణించాలి. భవిష్యత్తులో జరిగే ఏ ఉగ్రవాద చర్యనైనా యుద్ధ చర్యగా పరిగణిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఉగ్రవాదాన్ని పూర్తిగా అణిచివేయనంత వరకు ఉగ్రవాద సమస్య పరిష్కారం కాదు. ఉగ్రవాదాన్ని పూర్తిగా అణిచివేయాలంటే, మనమందరం ప్రధాని మోదీ నాయకత్వంలో ఏకగ్రీవంగా పోరాడాలి. ఉగ్రవాదం ప్రేమ భాషను ఎప్పటికీ అంగీకరించదు. దానికి దాని స్వంత భాషలోనే సమాధానం చెప్పాలి. ఆపరేషన్ సిందూర్ ద్వారా భారతదేశం మొత్తం ప్రపంచానికి సందేశం ఇచ్చింది’ అని అన్నారు.#WATCH | Lucknow | UP CM Yogi Adityanath says, "You must have seen a glimpse of the BrahMos missile during Operation Sindoor. If you didn't, then just ask the people of Pakistan about the power of the BrahMos missile. PM Narendra Modi has announced that any act of terrorism going… pic.twitter.com/lv2LzYNcXs— ANI (@ANI) May 11, 2025ఇక, ఇక్కడ.. ఏడాది నుంచి 100 బ్రహ్మోస్ క్షిపణులు తయారుచేసేలా ఈ ప్రొడక్షన్ యూనిట్‌ను డిజైన్ చేశారు. రూ.300 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించారు. భారత్, రష్యాల సంయుక్త వెంచర్ అయిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన ఈ బ్రహ్మోస్ క్షిపణి 290 నుంచి 400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను చేధించగలదు. ఈ క్షిపణిని ఫైర్ అండ్ ఫర్గెట్ గైడెన్స్ సిస్టమ్‌తో భూ ఉపరితలం నుంచి, సముద్ర తలం నుంచి, గగనతలం నుంచి ప్రయోగించవచ్చు. కొత్తగా ప్రారంభమవుతున్న ఈ క్షిపణి తయారీ కేంద్రం నుంచి 100 నుంచి 150 కొత్త తరం బ్రహ్మోస్ క్షిపణులను తయారు చేయనున్నారు. ఈ కొత్త తరం బ్రహ్మోస్ క్షిపణులు ఏడాదిలోగా డెలివరీకి సిద్ధం కానున్నాయి. ఈ న్యూజనరేషన్ బ్రహ్మోస్ క్షిపణి పరిధి 300 కిలోమీటర్లు. దీని బరువును తగ్గించారు. ప్రస్తుత బ్రహ్మోస్ క్షిపణి బరువు 2900 కిలోలు కాగా, న్యూ బ్రహ్మోస్ క్షిపణి బరువు 1290 కిలోలు. ధ్వని వేగం కంటే మూడు రెట్లు ఎక్కువ వేగంతో ఇది ప్రయాణించగలదు. -
టెన్త్ పాసయి చరిత్ర సృష్టించాడు!
పదో తరగతి పరీక్షల్లో అన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయిన విద్యార్థితో కేక్ కట్ చేయించి వేడుక చేసిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పరీక్షల్లో ఫెయిల్ అయినంత మాత్రాన జీవితంలో అంతా అయిపోయినట్టు కాదన్న సందేశం ఇచ్చేందుకే ఆ విద్యార్థి తల్లిదండ్రులు ఇలా చేసుంటారని జనం చెప్పుకుంటున్నారు. ఇదిలావుంటే ఇటీవల విడుదలైన ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) టెన్త్ ఫలితాల్లోనూ ఓ అద్భుతం జరిగింది. దళిత విద్యార్థి ఒకరు పదో తరగతి పాసయి వార్తల్లో నిలిచాడు. అయితే అతడేమి స్టేట్ ర్యాంక్ సాధించలేదు. కనీసం స్కూల్ టాపర్ కాదు. మరేంటి అతడి ఘనత?పదో తరగతి చదివే విద్యార్థులు బోర్డు పరీక్షల్లో పాస్‌కావడం అనేది మామూలు విషయం. కానీ ఒక ఊరి నుంచి ఒక విద్యార్థి మాత్రమే పాసయితే.. అదికూడా దేశానికి స్వాతంత్ర్యం (Independence) వచ్చిన ఇన్నేళ్ల తర్వాత ఈ ఘనత సాధిస్తే.. అది అద్భుతమే కదా! అవును ఈ అద్భుతమే ఇప్పుడు నిజాంపూర్ (Nizampur) గ్రామంలో జరిగింది. యూపీ రాజధాని లక్నోకు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఊరు. ఈ గ్రామానికి చెందిన రామ్ కేవల్(15) అనే విద్యార్థి టెన్త్ పాసయి వార్తల్లోకి ఎక్కాడు. నిజాంపూర్ నుంచి పదో తరగతి పాసయిన మొట్ట మొదటి విద్యార్థిగా అతడు చరిత్ర సృష్టించాడు.ఓస్.. టెన్త్ పాసయితేనే ఇంత హడావుడి చేయాలా అని తేలిగ్గా అనకండి. ఎందుకంటే రామ్ కేవల్ (Ramkeval) కుటుంబ పరిస్థితి తెలిస్తే అతడు ఎంత కష్టపడ్డాడో అర్థమవుతుంది. రామ్ కేవల్ది పేద కుటుంబం. తల్లి స్కూల్లో వంటలు చేస్తుంది. తండ్రి కూలి పనికి వెళతాడు. తల్లిదండ్రులకు ఆసరా ఉండేందుకు రామ్ కేవల్.. పెళ్లిళ్లలో లైట్లు మోసే పనికి వెళ్లి రూ. 250 నుంచి రూ. 300 తెచ్చిస్తాడు. పనికి వెళ్లొచ్చిన తర్వాత ఎంత అర్ధరాత్రి అయిన సరే, కనీసం 2 గంటలు చదివిన తర్వాతే నిద్రపోయేవాడు. కాబట్టే తన ఊరిలో టెన్త్ పాసయిన మొదటి విద్యార్థి అయ్యాడు.చదువుతోనే భవిష్యత్తుమంచి చదువుతోనే పేదరికం నుంచి బటయపడతామని రామ్ కేవల్ తల్లి పుష్పా దేవి నమ్ముతున్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా పిల్లల్ని చదివించి తీరుతామని ఆమె చెబుతున్నారు. 'మాకు తినడానికి సరిపడా తిండిలేదు. చిన్నచిన్న కోరికలు తీర్చుకోలేని పరిస్థితి. మా పిల్లలకు ఇలాంటి జీవితం వద్దని అనుకుంటున్నాం. చదువుకుంటేనే వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని గట్టిగా నమ్ముతున్నాను' అని చెప్పారు పుష్పాదేవి. తన మిగతా ముగ్గురు పిల్లల్ని కూడా స్కూల్‌కి పంపిస్తున్నారు. రామ్ కేవల్ ముగ్గురు తమ్ముళ్లు వరుసగా 9, 5, 1 చదువుతున్నారు.స్ఫూర్తిగా నిలిచాడుబారాబాంకీ జిల్లాలో నిజాంపూర్ గ్రామంలో 300 మంది వరకు నివసిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది దళితులు. వీరంతా రోజువారీ కూలిపనులు చేసుకునేవారే. దీంతో ఇక్కడి పిల్లలకు కనీస విద్య తీరని కలగా మిగిలిపోతోంది. అయితే రామ్ కేవల్ పట్టుదలతో పది పాసయ్యాడని బారాబాంకీ జిల్లా స్కూల్ ఇన్స్పెక్టర్ ఓపీ త్రిపాఠి తెలిపారు. 'ఈసారి నిజాంపూర్ నుంచి రామ్ కేవల్ ఒక్కడే బోర్డు పరీక్షలు రాశాడు. అతడిని క్రమం తప్పకుండా బడికి పంపించేలా తల్లిదండ్రులను పోత్సహించాం. వీక్లీ, మంత్లీ పరీక్షల్లో రామ్ మంచి ప్రతిభ కనబరిచాడు. ఈ మార్కులను అతడి తల్లిదండ్రులకు చూపించేవాళ్లం. ఈ పరీక్షలు అతడిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా బోర్డు ఎగ్జామ్స్‌కు సన్నద్ధమయ్యేలా దోహదపడ్డాయ'ని ఓపీ తివారి వివరించారు. రామ్ కేవల్ ఉన్నత విద్య అభ్యసించేలా భవిష్యత్తులోనూ అండదండలు అందిస్తామని హామీయిచ్చారు. నిజాంపూర్ విద్యార్థులకు అతడు ప్రేరణగా నిలిచాడని ప్రశంసించారు.చదవండి: అందుబాటులో అమెరికా విద్యార్థి వీసా అపాయింట్మెంట్లుమేజిస్ట్రేట్ సన్మానంఇంతకుముందు టెన్త్ ఫెయిల్ అయి చదువు మధ్యలో ఆపేసిన లవశేష్, ముకేశ్ అనే ఇద్దరు ఇప్పుడు మళ్లీ పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్నారు. టెన్త్ ఫలితాల్లో తమ ఊరి నుంచి ఒకే ఒక్కడుగా నిలిచిన రామ్ కేవల్‌ను బారాబాంకీ జిల్లా (Barabanki District) మేజిస్ట్రేట్ శశాంక్ త్రిపాఠి సన్మానించారు. కొడుకు చదువుకు అండగా నిలిచిన రామ్ తల్లిదండ్రులకు కూడా సత్కరించారు. ఉన్నత చదువుల్లో సహాయం అందిస్తామని భరోసాయిచ్చారు. ఇంతకీ రామ్కేవల్కి ఎన్నిమార్కులు వచ్చాయో చెప్పలేదు కదూ. బోర్డు పరీక్షల్లో 600 మార్కులకు 322 మార్కులు సాధించాడు. అంటే 53.6 శాతం మార్కులతో పాసయ్యాడు. ఆగ్రా టాప్యూపీలో ఈసారి 25,56,992 విద్యార్థులు టెన్త్ పరీక్షలు రాయగా, 90.11 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 93.87%, బాలురు 86.66% శాతం ఉత్తీర్ణత సాధించారు. 94.99 శాతం ఉత్తీర్ణతతో ఆగ్రా జిల్లా టాప్‌లో నిలిచింది. సోన్‌భద్ర 74.22 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానాన్ని దక్కించుకుంది. జలౌన్‌కు చెందిన యశ్ ప్రతాప్ సింగ్ 97.83 శాతం స్కోరుతో అగ్రస్థానంలో నిలిచాడు. -
వైరల్ వీడియో.. షాపులో ఆ బాలిక చేసిన పనికి అంతా షాక్!
హాపూర్: ఉత్తరప్రదేశ్‌లో ఓ షాకింగ్ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ షాపు యజమానిపై 15 ఏళ్ల బాలిక బ్లేడ్‌తో దాడి చేయడం కలకలం సృష్టించింది.. షాప్‌లో కొన్న వస్తువులను వెనక్కి ఇచ్చేందుకు ఆ బాలిక వెళ్లగా, వాటిని తీసుకునేందుకు ఆ దుకాణదారులడు నిరాకరించాడు. దీంతో కోపంతో బాలిక దాడికి పాల్పడింది. ఘటనకు సంబంధించిన దృశ్యాలు షాప్‌లోని సీసీటీవీ కెమెరాకు చిక్కాగా.. ఆ దృశ్యాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఈ ఘటన యూపీలోని హాపూర్ జిల్లాలో శుక్రవారం జరిగింది.ఆ షాపు యజమాని స్థానిక మీడియాతో మాట్లాడుతూ, ఆ బాలిక తరచూ వస్తువులు కొనుగోలు చేస్తుందని.. అయితే.. వాడిన వస్తువులను తిరిగి ఇచ్చేస్తోందని.. అనేకసార్లు వాటిని వెనక్కి తీసుకున్నానంటూ ఆయన చెప్పుకొచ్చాడు. అయితే బాలిక ప్రవర్తనతో విసిగిపోయిన అతను ఈసారి వాటిని వెనక్కి తీసుకునేందుకు నిరాకరించానని తెలిపారు.ఆ బాలిక బ్లేడ్‌తో దుకాణదారుడిపై దాడి చేయగా.. ఆయన చేతికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటన జరిగిన సమయంలో దుకాణంలో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. వెంటనే అప్రమత్తమై వారు ఆ దుకాణదారుడిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కాగా, దుకాణదారుడిపై దాడి చేసిన తర్వాత బాలిక పారిపోయేందుకు ప్రయత్నించగా.. స్థానికులు ఆ బాలికను పట్టుకున్నారు. అయితే గత కొంతకాలంగా ఆ బాలిక మానసిక స్థితి సరిగా లేదని స్థానికులు అంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. #हापुड़♦नाबालिग ने दुकानदार पर ब्लेड से हमला किया♦सामान वापस न करने पर नाबालिका हुई आक्रोशित♦दुकानदार गंभीर हालत में अस्पताल में भर्ती♦सीसीटीवी में कैद हुई पूरी घटना♦पिलखुवा कोतवाली क्षेत्र का मामला@hapurpolice pic.twitter.com/H9LkuAJsJp— Knews (@Knewsindia) May 4, 2025 -
మనవడితో 50 ఏళ్ల మహిళ పెళ్లి : ఫ్యామిలీని లేపేసేందుకు కుట్ర?
ఇటీవల అల్లుడితో అత్త పారిపోయిన సంఘటన మరిచిపోకముందే మరో విచిత్రకరమైన సంఘటన చోటు చేసుకుంది. తాజాగా ఓ బామ్మ, వరుసకు మనవడయ్యే వ్యక్తిని పెళ్లి చేసుకోవడం అందర్నీ షాక్‌కు గురి చేసింది. ప్రస్తుతం ఈ స్టోరీ నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగింది. అతడిని పెళ్లి చేసుకోవడం వెనుక ఉద్దేశం మరేదైనా ఉందా? అసలేం జరిగింది తెలుసుకుందాం.ఉత్తర్‌ప్రదేశ్ అంబేద్కర్ నగర్ జిల్లాలో జరిగిన ఈ సంఘటన సంచలనంగా మారింది. బందుత్వాలు, మానవ విలువలకు తిలోదకాలిచ్చి మనవడి వరసయ్యే వ్యక్తిని ఓ బామ్మ పెళ్లి చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 50 ఏళ్ల మహిళ ఇంద్రావతి తన 30 ఏళ్ల మనవడు ఆజాద్‌తో పారిపోయి గోవింద్ సాహిబ్ ఆలయంలో వివాహం చేసుకుంది. సింధూరం పూసుకుని , పవిత్ర అగ్ని చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేసి, గ్రామం నుండి పారిపోయారు. ఇందుకోసం నలుగురు పిల్లలు, భర్త ( ఇద్దరు కుమారులు ,ఇద్దరు కూతుళ్లు) కుటుంబాన్ని వదిలేసింది. ఇంతవరకూ ఓకే గానీ. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే...?ట్విస్ట్ ఏంటంటే..?వారిద్దరూ అంబేద్కర్‌నగర్‌లో నివసించేవారు. ఈక్రమంలోనే ఇంద్రావతి, ఆజాద్ ప్రేమలో పడ్డారు. ఇరు కుటుంబాల మధ్య సాన్నిహత్యం కారణంగా వీరిని పెద్దగా అనుమానించలేదు. అయితే ఇంద్రావతి భర్త చంద్రశేఖర్, వారు పారిపోవడానికి నాలుగు రోజుల ముందు వీరిద్దరూ ఏకాంతంగా మాట్లాడుకోవడం చూశాడు. వద్దని వారించాడు. నచ్చజెప్పాలని ప్రయత్నించాడు. వారి వ్యవహారాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. కానీ ఇద్దరూ దానికి సుతరామూ అంగీకరించలేదు. ఇక అంతే తమకు అడ్డురాకుండా ఎలాగైనా భర్తను తప్పించాలని ప్లాన్ వేసింది. ఇందుకోసం ఇద్దరూ కలిసి కుట్రపన్నారు. ఇంద్రావతి ఆజాద్‌తో కలిసి వారికి విషం ఇవ్వడానికి కుట్ర పన్నిందని ఇంద్రావతి భర్త చంద్రశేఖర్ ఆరోపణ.చదవండి: Vaibhav Suryavanshi Success Story: తండ్రి త్యాగం, పట్టుదలతో 13 ఏళ్లకే కోటీశ్వరుడు.. ఇదీ టాలెంట్!ఇదే చంద్రశేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అక్రమంగా ఆజాద్‌ను పెళ్లి చేసుకోవడంతో పాటు, తనతోపాటు తన నలుగురు పిల్లల్ని హత మార్చేందుకు వారిద్దరూ కుట్ర చేశారని పోలీసులకు చేసిన ఫిర్యాదులో బాధితుడు వాపోయాడు. అయితే వారిద్దరూ మేజర్లు కావడంతో పోలీసులు చంద్రశేఖర్ ఫిర్యాదును తీసుకునేందుకు నిరాకరించారు. దీంతో తన భార్యకు పెద్ద కర్మ నిర్వహించి "చనిపోయినట్లు" ప్రకటించాలని నిర్ణయించు కున్నాడు. కాగా ఇంద్రావతి చంద్రశేఖర్‌కు రెండో భార్య. ఉద్యోగరీత్యా అతను ఎక్కువ క్యాంప్‌లకు వెళ్లేవాడట. ఈ సమయంలో ఇంద్రావతి, అజాద్ మధ్య సాన్నిహిత్యం పెరిగిందని భావిస్తున్నారు. ఇదీ చదవండి: Akshaya Tritiya 2025 పదేళ్లలో పసిడి పరుగు, కొందామా? వద్దా? -
నన్ను ఇక్కడే ఉండనివ్వండి
‘నేను పాకిస్తాన్ కుమార్తెను, కానీ ఇప్పుడు నేను భారతదేశ కోడలిని. నాకు పాకిస్తాన్‌కు వెళ్లడం ఇష్టం లేదు. నన్ను ఇక్కడే ఉండనివ్వండి. నన్ను భారతదేశంలో ఉండడానికి అనుమతివ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగిలకు విజ్ఞప్తి చేస్తున్నాను’ఇది పాకిస్తాన్ పౌరురాలైన... ప్రస్తుతం యూపీలో ఉంటున్న సీమా హైదర్ చేసిన విజ్ఞప్తి. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ పౌరుల వీసాలను కేంద్రం రద్దు చేసిన విషయం తెలిసిందే. తనను కూడా పంపించేస్తారేమోనన్న ఆందోళనతో సీమ చేసిన వీడియో విజ్ఞప్తి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఎవరీ సీమా హైదర్. పాకిస్తాన్ పౌరురాలు యూపీ కోడలు ఎలా అయ్యింది? సీమా హైదర్... పాకిస్తాన్ సింధ్ ప్రావిన్స్‌కు చెందిన మహిళ. 2019లో ఆన్లైన్ గేమ్స్ ఆడుతుండగా ఆమెకు యూపీకి చెందిన సచిన్ మీనాతో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. అయితే.. అప్పటికే సీమాకు పెళ్లయ్యింది. భర్త గులాం హైదర్‌తో ఆమెకు నలుగురు పిల్లలు కూడా. అయితే సచిన్ మీద ప్రేమతో.. నలుగురు పిల్లలను తీసుకుని ఆమె భారత్‌కు వచ్చేసింది. నేపాల్ మీదుగా సరిహద్దు నుంచి అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించింది. యూపీలోని సచిన్‌ను పెళ్లి చేసుకుంది. గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలోని రబుపుర ప్రాంతంలో నివసిస్తోంది. వీరి విషయం 2023 జూలైలో బయటకు వచ్చింది. అక్రమంగా ప్రవేశించినందుకు సీమాను, ఆశ్రయం కల్పించినందుకు సచిన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తరువాత ఇద్దరూ బెయిల్‌పై విడుదలయ్యారు. ఆమె కేసును ఏటీఎస్ విచారిస్తోంది. పహల్గాం ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో పాకిస్తాన్ పౌరుల వీసాలను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విష యం తెలిసిందే. నిబంధనల ప్రకారం సీమా సైతం భారత్‌ను వీడి వెళ్లాలి. కాని తాను పాక్‌కు వెళ్లనని, ఇక్కడే ఉంటానని, అందుకు తనకు అనుమతి ఇవ్వాలని సీమా విజ్ఞప్తి చేస్తోంది. తానిప్పుడు సీమా హైదర్‌ను కాదని, సీమా మీనానని, సచిన్‌ను పెళ్లి చేసుకున్నా తరువాత హిందూ మతాన్ని స్వీకరించానని చెబుతోంది. అయితే ఆమె భారత్‌లో నివసించడానికి అర్హురాలని ఆమె తరపు న్యాయవాది ఏపీ సింగ్ సైతం వాదిస్తున్నారు. సచిన్ మీనాతో పెళ్లి తరువాత ఆ దంపతులకు కూతురు పుట్టింది. ఆ చిన్నారి ఇప్పుడు భారతీయురాలు. అంతర్జాతీయ న్యాయస్థానం, సంరక్షణ చట్టాల ప్రకారం చిన్నారి సంరక్షణ బాధ్యత తల్లిది. తల్లి సీమా మీనా భారత్‌ను వీడితే.. చిన్నారిని కూడా వెంట తీసుకెళ్లాల్సి వస్తుంది. భారతీయ పౌరురాలిని పాక్‌కు ఎలా పంపిస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు. పాకిస్తాన్ పౌరులందరూ దేశం విడిచి వెళ్లాలనే ఆదేశం నుంచి ఆమెకు మినహాయింపు ఉంటుందని ఆయన భావిస్తున్నారు. సీమ కేసు భిన్నమైనదని, ఈ విషయమై రాష్ట్రపతి దగ్గర పిటిషన్ కూడా ఉందని ఆయన వాదిస్తున్నారు. అంతేకాదు.. బెయిల్‌పై ఉన్న సీమను అత్తమామల ఇల్లు తప్ప రబుపురా దాటరాదని జెవార్ కోర్టు ఆదేశాలు కూడా ఉన్నందున.. వీసా రద్దు ఉత్తర్వులు ఆమెకు వర్తించవని చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Rahul Gandhi: ‘సుప్రీం’ మందలింపు.. ఆ వెంటనే చిక్కులు!
ముంబై/న్యూఢిల్లీ, సాక్షి: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) చిక్కుల్లో పడ్డారు. పరువు నష్టం కేసులో తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ పుణే కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది. స్వాతంత్ర సమరయోధుడు వీరసావర్కర్‌ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం.ఏఎన్ఐ కథనం ప్రకారం.. 2023 మార్చి 5వ తేదీన లండన్ పర్యటనలో రాహుల్ గాంధీ వీరసావర్కర్(Veer Savarkar)ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ వ్యాఖ్యలకు గానూ రాహుల్‌పై సావర్కర్ దగ్గరి బంధువు పుణే కోర్టులో పరువు నష్టం దావా వేశారు. విచారణ జరిపిన కోర్టు.. మే 9వ తేదీన తమ ఎదుట హాజరు కావాల్సిందిగా రాహుల్‌కు సమన్లు జారీ చేసింది.మరోవైపు.. సావర్కర్‌పై మరో సందర్భంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలనుగానూ కేసు నమోదు అయ్యింది. అయితే.. తాజాగా ఆ కామెంట్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది.2022లో.. భారత్ జోడో యాత్ర సందర్భంగా మహారాష్ట్ర అకోల్‌లో రాహుల్ మాట్లాడుతూ.. వీర్ సావర్కర్ బ్రిటిష్ సేవకుడని, వారి నుంచి పెన్షన్ కూడా తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. నృపేంద్ర పాండే అనే వ్యక్తి యూపీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా రాహుల్ వ్యాఖ్యలు ఉన్నాయని అందులో పేర్కొన్నారు.అయితే, దీనిపై అనేకసార్లు విచారణకు గైర్హాజరవుతున్న నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని న్యాయస్థానం (ACJM) రాహుల్‌కు రూ.200 జరిమానా కూడా విధించింది. అయితే.. ఈ కేసులో తనకు జారీ చేసిన సమన్లను అలహాబాద్ హైకోర్టు రద్దు చేయడానికి నిరాకరించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టులో సవాలు చేశారు. తాజాగా.. విచారణ జరిపిన సుప్రీం కోర్టు రాహుల్‌ను గట్టిగానే మందలించింది.వీర్ సావర్కర్‌కు (Vinayak Damodar Savarkar) మహారాష్ట్ర ప్రజలు ఎంతో గౌరవం ఇస్తారని పేర్కొన్న జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం.. మరోసారి ఇటువంటి వ్యాఖ్యలు చేయొద్దని మందలించింది. స్వాతంత్ర్య సమరయోధులను ఎగతాళి చేయడం తగదని.. మళ్లీ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. దేశం కోసం పోరాడిన స్వాతంత్ర్య సమరయోధులపై ఎవరూ ఇటువంటి వ్యాఖ్యలు చేయడానికి అనుమతించమని పేర్కొంది. ఇకనుంచి వాళ్లను అపహాస్యం చేస్తే ఇకపై కోర్టు సుమోటోగా విచారణ చేపడుతుందని తెలిపింది.అదే సమయంలో.. రాహుల్‌పై దాఖలైన కేసులో ఆయనపై క్రిమినల్ చర్యలను సుప్రీంకోర్టు నిలిపివేసింది. రాహుల్‌పై ఫిర్యాదు చేసిన నృపేంద్ర పాండేకు, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. -
ఇంట్లో ఇల్లాలు.. వీధిలో ప్రియురాలు.. పెళ్లైన 15 రోజులకే..
లక్నో: ఇటీవలి కాలంలో ఉత్తరప్రదేశ్‌లో రకరకాల కేసులు వెలుగులోకి వస్తున్నాయి. వివాహేతర సంబంధాలు ఎక్కువగా సంఖ్యలో బయటకు వస్తున్నాయి. భర్త, భార్యలను హత్య చేసిన ఘటనలు భయానక వాతావరణాన్ని సృష్టించాయి.తాజాగా మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తనకు పెళ్లి జరిగిన రెండు వారాలకే సదరు వ్యక్తి.. మరో మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏమిటంటే.. రెండో పెళ్లి చేసుకున్న ఆమెకి ముగ్గురు పిల్లలు ఉండటం, ఆమె కానిస్టేబుల్ కావడం. ఈ నేపథ్యంలో మొదటి భార్య కేసు పెట్టడంతో ఈ విషయం బయటకు వచ్చింది.వివరాల ప్రకారం.. యూపీలోని రసూల్పూర్ గ్రామానికి చెందిన నేహాకు గజల్‌పుర్ వాసి నవీన్‌తో ఫిబ్రవరి 16న వివాహం జరిగింది. పెళ్లయిన రెండు రోజులకే ముగ్గురు పిల్లలున్న హెడ్ కానిస్టేబుల్ నిర్మలతో నవీన్‌కు వివాహేతర సంబంధం ఉన్నట్లు భార్యకు తెలిసింది. నిర్మలతో కలిసి ఉండాలని నవీన్ భార్యపై ఒత్తిడి తీసుకురాగా, ఆమె ససేమిరా అంది. ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని తెగేసి చెప్పింది. అప్పటి నుంచి భార్యభర్తల మధ్య తరచు గొడవలు జరిగేవి. దీంతో, చేసేదేమీ లేక.. అనంతరం మార్చి ఒకటో తేదీన నిర్మలతో నవీన్ రెండోపెళ్లి జరిగింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 16న రాత్రి మొహల్లా సాకేత్ కాలనీలోని నవీన్-నిర్మల ఏకాంతంగా ఉన్న సమయంలో వీరిద్దరినీ పట్టుకుంది నేహా. ఈ క్రమంలో నేహా వద్ద నుంచి వారిద్దరూ పారిపోయారు. తర్వాత.. ఏప్రిల్ 17న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. నిర్మలను హఫీజ్‌పుర్ పోలీస్‌స్టేషనుకు అటాచ్ చేశారు. ప్రస్తుతం నవీన్, నిర్మల పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్పారు. వీరిద్దరి ఫొటోలు వైరల్‌గా మారాయి. -
భార్య మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. అక్కడ ఫొటో చూసి భర్త..
ఢిల్లీ: ఇటీవలి కాలంలో కాబోయే అల్లుడితో అత్త పరారీ, తన కూతురు మామతో మరో మహిళ జంప్ వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇలాంటి ఘటనలు వారి కుటుంబాలను బజారుకీడుస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే మరోసారి ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. తన భార్య కనిపించకపోవడంతో టెన్షన్ పడి భర్త.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కట్‌చేస్తే.. ఆమె మరో వ్యక్తితో తాజ్‌మహల్ వద్ద కనిపించడంతో సదరు భర్త ఖంగుతున్నాడు.వివరాల ప్రకారం.. యూపీలోకి అలీఘర్కు చెందిన షకీర్, అంజుమ్ భార్యాభర్తలు. వీరిద్దరికీ నలుగురు పిల్లలు ఉన్నారు. కాగా, షకీర్ ఇటీవల తన కుటుంబ సభ్యుల వివాహం కోసం వేరే ప్రాంతానికి వెళ్లాడు. ఈ క్రమంలో ఏప్రిల్ 25న తిరిగి వచ్చేటప్పటికి ఇంటికి తాళం వేసి ఉండటంతో పాటు, భార్య, పిల్లలు కనిపించలేదు. దీంతో, కంగారు పడిన షకీర్.. ఇంటి చుట్టుపక్కల వారిని అడిగి.. అంతా వెలికాడు. అయినప్పటికీ ఆమె కనిపించకపోవడంతో.. పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దీంతో, పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.అయితే, షకీర్ బంధువు ఒకరు తాజాగా తాజ్‌మహల్ పర్యటకనకు వెళ్లారు. ఈ క్రమంలో అంజుమ్ మరో వ్యక్తితో ఎంజాయ్ చేస్తూ కనిపించింది. దీంతో, ఆమె ఫొటో, వీడియోను వాట్సాప్ ద్వారా షకీర్‌కు పంపించారు. దీంతో, షకీర్‌కు ఒక్కసారిగా షాక్ కొట్టినంత పనైంది. ఇదిలా ఉండగా.. సదరు వ్యక్తి తాను పనిచేసే చోటే వర్క్ చేస్తున్నట్టు గుర్తించాడు. దీంతో, వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలపగా.. అలీఘర్ పోలీసులు ఆగ్రా పోలీసుల్ని అంజుమ్ గురించి అప్రమత్తం చేశారు. ప్రస్తుతం ఆ జంట కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
అమ్మా, నాన్న క్షమించండి.. ప్రపంచం నుంచి వెళ్లిపోతున్నా!
నేటి కాలంలో భార్యా భర్తల సంబంధాల్లో ఆస్తులే ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. జీవితాంతం కలిసుండాలని ప్రమాణం చేసిన బంధాల్ని చిదిమేస్తున్నాయి. పెళ్లి సంబంధాలు వేట మొదలుపెట్టిన దగ్గర్నుంచీ అబ్బాయికి ఎంత ఉంది(ఆస్తి).. అమ్మాయి ఎంత స్త్రీ ధనం(కట్నం) తెచ్చుకుంటుందనే తతంగం మరీ ఎక్కువైపోయింది. అసలుకంటే కొసరు ముద్దు అనే చందంగా తయారైంది. అది చివరకు వైవాహిక బంధాలు నాశనం కావడానికి కూడా కారణమవుతోంది. తాజాగా జరిగిన ఘటనలో తన పేరున ఇల్లు రాసివ్వాలని భార్య పట్టుబట్టడంతో పాటు బంధువుల్ని తీసుకొచ్చి నానా రకాల హింస పెట్టడంతో ప్రాణాలు తీసుకున్నాడు భర్త. భార్య నుంచి వేధింపుల్ని తట్టుకోలేక చివరకు బలవన్మరణానికి పాల్పడ్డాడు.ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఎటావాలో 33 ఏళ్ల ఫీల్డ్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన భార్య నుంచి ఎలా వేధింపులకు గురయ్యాడో వీడియో రికార్డ్ చేసి మరీ తనువు చాలించాడు. మోహిత్ యాదయ్‌కు ప్రియా అనే అమ్మాయితో రెండేళ్ల క్రితం పెళ్లయ్యింది. ఏడేళ్ల పాటు రిలేషనలో ఉన్న వీరు 2023లో పెళ్లి చేసుకున్నారు. అయితే అప్పట్నుంచీ అమ్మాయి తల్లి.. వీరి కాపురాన్ని శాసిస్తూ వస్తోంది. చివరకు భార్య ప్రియ గర్బవతి అయినా కూడా అబార్షన్ చేయించిందట అత్త. ఇంట్లో ఉన్న బంగారాన్ని కూడా తన అత్త తీసుకెళ్లిపోయిందని మోహిత్ రికార్డు చేసిన వీడియో ద్వారా తెలిసింది.చనిపోయి ముందే మోహిత్ చెప్పిన మాటలు..‘ఇల్లు తన పేరున రిజిస్టర్ చేయాలని నా భార్య తరచు వేధింపులకు గురిచేస్తోంది. ఇల్లు, ఆస్తి అంతా తన పేరునే రాయాలట. మా అమ్మా, నాన్నలపై కూడా వరకట్న వేధింపుల కేసు పెట్టింది. ఆమె తండ్రి చేత ఒక తప్పుడు కేసు పెట్టించింది. నా భార్య సోదరుడు నా బావమరిది నన్ను చంపుతానని పదే పదే బెదిరిస్తున్నాడు. రోజూ ఇంట్లో ఏదో గొడవ పెట్టుకుంటూనే ఉంది నా భార్య, ఆమె తల్లి దండ్రులకు దీనికి సపోర్ట్ చేస్తున్నారు’ అని పేర్కొన్నాడు.అమ్మా నాన్న క్షమించండి.. నేను ఈ ప్రపంచం నుంచి వెళ్లి పోతున్నా. నాకు న్యాయం జరిగాలి. నా చావుతోనైనా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా. ఒకవేళ నాకు న్యాయం జరగకపోతే నా బూడిదను డ్రైన్ లో కలిపేయండి’ అని వీడియోలో కన్నీళ్లు పెట్టుకుని మరీ ప్రాణాలు తీసుకున్నాడు.ఇదీ చదవండి: నా భార్య వేధింపులు భరించలేకపోతున్నా.. ఇక సెలవు -
‘దిశ’ తరహా ఘటన.. పెళ్లికి వెళ్లడమే ఆమె పాలిట శాపమైంది!
లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. దిశ తరహా ఘటన లక్నోలో వెలుగుచూసింది. కదులుతున్న కారులో ఓ మహిళపై అత్యాచారయత్నం చేశారు ముగ్గురు దుండగులు. ఈ క్రమంలో ఆమె ప్రతిఘటించడంతో.. కత్తితో పొడిచి హత్య చేశారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా.. మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు.వివరాల ప్రకారం.. లక్నోలోని బెహాసా గ్రామానికి చెందిన ఛాయా(26) బ్యూటీషియన్‌గా పనిచేస్తోంది. ఈ క్రమంలో లక్నోకు చెందిన సుధాన్షు అనే వ్యక్తి.. తన ఇంట్లో పెళ్లి వేడుక సందర్భంగా మేకప్ కోసం రావాలని ఛాయాకు ఫోన్ చేసి చెప్పాడు. ఆమె తన ఇంటికి వచ్చేందుకు కారును కూడా పంపాడు. కారులో అజయ్, వికాస్, ఆదర్శ్ కలిసి వెళ్లారు. దీంతో, ఛాయ తన సోదరి పాలక్‌తో కలిసి.. సుధాన్షు ఇంటికి బయలుదేరింది. వివాహ వేడుకల్లో పాల్గొన్న కారణంగా అర్ధరాత్రి 2 గంటల సమయంలో తాను ఇంటికి వెళ్లేందుకు సిద్ధమైంది.ఈ నేపథ్యంలో కారులో ఆమె ఇంటికి వెళ్తున్న సమయంలో అజయ్, వికాస్, ఆదర్శ్.. ఛాయా ఆమె సోదరి పాలక్‌పై అత్యాచారయత్నం చేశారు. కదులుతున్నా కారులో లైంగిక వేధింపులకు గురిచేశారు. ఈ క్రమంలో ప్రతిఘటించడంతో ఛాయాపై కత్తితో దాడి చేశారు. ఈ సందర్భంగా వేగంతో వెళ్తున్న కారు రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో, కారు బోల్తా పడటంతో పాలక్.. తమకు సాయం చేయాలని గట్టిగా అరిచింది.అనంతరం, అక్కడి నుండి ముగ్గురు నిందితులు పారిపోతూ పాలక్‌ను బెదిరించారు. ఈ విషయం ఎవరికైనా చెబితే తనను, తన కుటుంబాన్ని చంపేస్తామని హెచ్చరించారు. తర్వాత వారు ముగ్గురు పారిపోయారు. అది గమనించిన స్థానికులు.. వెంటనే ఛాయ, పాలక్‌ను ఆసుపత్రికి తరలించగా.. ఛాయ మృతిచెందినట్టు వైద్యులు వెల్లడించారు. దీంతో, ఈ ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు.. వికాస్, ఆదర్శ్‌ను అరెస్ట్ చేయగా.. అజయ్ ఇంకా పరారీలో ఉన్నాడు. అజయ్ కోసం పోలీసులు గాలిస్తున్నట్టు ఏసీపీ వికాస్ పాండే తెలిపారు. ब्रेकिंग लखनऊ ब्यूटीशियन छाया की दुष्कर्म के प्रयास में हत्यातीन युवको ने ब्यूटीशियन के साथ की छेड़छाड़ छेड़छाड़ का विरोध करने पर हत्या एक आरोपी गिरफ्तार, दो फरार #BREAKING #Lucknow #Murder #RapeAttempt #indiavoice pic.twitter.com/W4ppJOskGW— India Voice (@indiavoicenews) April 19, 2025 -
క్షేత్రస్థాయిలో బలోపేతంపై బీఎస్పీ దృష్టి
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా బీఎస్పీ అధినేత్రి మాయావతి రాజకీయ పావులు కదుపుతున్నారు. మరో రెండేళ్లలో జరగనున్న ఎన్నికల్లో ఈసారైనా కనీసం డబుల్ డిజిట్‌తో అసెంబ్లీలోకి అడుగుపెట్టాలన్నది ఆమె లక్ష్యంగా ఉంది. ఇందులో భాగంగా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి ముఖ్యంగా ఘర్‌వాపసీ పై దృష్టి పెట్టారు. ఆకాశ్ ఆనంద్, నగీనా మాజీ ఎంపీ గిరీశ్ చంద్ర తిరిగి పార్టీలోకి వచ్చిన తర్వాత, పశ్చిమ యూపీ ప్రాంతానికి చెందిన పార్టీ మాజీ నాయకులను దారి లోకి తెచ్చుకునేందుకు వ్యూహ రచన చేస్తున్నారు. బీఎస్పీ నుంచి బహిష్కరణకు గురైన, బయటకు వెళ్లిన కొందరు నేతలు తిరిగి పారీ్టలోకి వచ్చేందుకు సానుకూలత వ్యక్తం చేస్తున్నారు. ఇందులో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వీరంతా తిరిగి పార్టీ ఛత్రం కిందికి వస్తే బీఎస్పీ క్షేత్రస్థాయిలో బలోపేతమవుతుందని ఆమె అంచనాగా ఉంది. ఒకప్పుడు ఘన చరిత్ర1984లో పార్టీ ఏర్పడినప్పటి నుంచి ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో తమదైన ముద్ర వేసుకున్న బీఎస్పీ ఇప్పుడు పతనావస్థలో ఉంది. 2007 అసెంబ్లీ ఎన్నికల్లో సంపూర్ణ మెజారీ్టతో యూపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించిన మాయావతి...ఆ తర్వాత ఎన్నికల్లో అనుకున్న ఫలితాలను సాధించలేకపోయారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో యూపీలో 20 సీట్లు సాధించిన ఆ పార్టీ, 2014లో కనీసం ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. అయితే, 2019 ఎన్నికల్లో ఎస్పీ, ఆర్ఎల్డీతో కలిసి బరిలో దిగి 10 చోట్ల విజయం సాధించిన బీఎస్పీ 2024 ఎన్నికల్లో మాత్రం ఒక్క స్థానంలో కూడా జెండా ఎగురవేయలేకపోయింది. అంతేగాక 2012–2024 మధ్య జరిగిన మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ తన ఉనికిని సైతం చాటుకోలేక చతికిలపడింది. పాత నేతలకు తిరిగి బాధ్యతలు 2012 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత బీఎస్పీకి క్షేత్రస్థాయిలో ప్రజల మద్దతు తగ్గిపోయిన నేపథ్యంలో, ఒక్కరొక్కరుగా పార్టీని వీడడం ప్రారంభించారు. కాగా పశ్చిమ యూపీ లో ఒకప్పుడు పార్టీకి అండగా నిలిచిన 15 మందికి పైగా మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, సీనియర్ నాయకుల్లో కొందరిని క్రమశిక్షణా రాహిత్యం కారణంతో మాయావతి పార్టీ నుంచి బహిష్కరించారు. మరికొందరు తమకు తాముగానే పార్టీని వీడారు. ఇప్పుడు వీరందరిపైనా బీఎస్పీ కన్నేసింది. అలాంటి కొందరు నేతలు పారీ్టతో టచ్‌లో కూడా ఉన్నారు. అయితే, ఇటీవల అధినేత్రి మాయావతికి క్షమాపణ చెప్పిన తర్వాత మేనల్లుడు ఆకాశ్ ఆనంద్, ఆ తర్వాత మాజీ ఎంపీ గిరీశ్ చంద్ర తిరిగి పార్టీ కండువా కప్పుకున్నారు. వీరిలో గిరీశ్ చంద్రకు బిజ్నోర్, అమ్రోహా పార్టీ ఇన్‌ఛార్జ్‌గా అధినేత్రి బాధ్యతలు అప్పగించారు. అదే సమయంలో నాలుగు నెలల క్రితం పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ప్రమోద్ నిరంకారిని రాంపూర్ జిల్లా అధ్యక్షుడిగా మళ్లీ నియమించారు. -
నా భార్య వేధింపులు భరించలేకపోతున్నా.. ఇక సెలవు
భార్యాభర్తల సంబంధం అనేది చాలా సున్నితమైనది. ఇది ప్రేమ అనే బంధంతో ముడిపడి ఉంటుంది. చిన్నపాటి దారంతో మెలివేసి ఉంటుంది. ఈ బంధాన్ని విచ్ఛిన్నం చేసుకోవడానికి చిన్న పొరపాటు సరిపోతుంది. ప్రేమ దారంతో ముడిపడాల్సిన బంధం.. అనుమానం అనే ఆయుధంతో దాడి చేస్తే కాపురాలు నాశనం అవుతాయి. ఆ బంధాలు శాశ్వతంగా నిలబడువు. ఈ ఘటనలో అదే జరిగింది.వారిది పెద్దగా అన్యోన్యమైన దాంపత్యం కాదు. పెళ్లై ఐదేళ్లే అవుతుంది. అప్పట్నుంచీ ఇంట్లో రోజూ చికాకులు. భార్యాభర్తల మధ్య గొడవలు. ఒకరి కంఫర్ట్ జోన్ లోకి ఇంకొకరు రాలేకపోయారు. దాంతో భర్త ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు. ఉత్తర్ ప్రదేశ్ లోని ఘజియాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. తాను చేయని తప్పుకు భార్య నిందించడంతోపాటు కేసును కూడా పెట్టడంతో భర్త ప్రాణాలు వదిలేశాడు. సమాజం, కుటుంబం తానేమిటీ అన్న విషయాన్ని నమ్మాలంటే అది తన ఆత్మహత్య ద్వారానే సాధ్యమవుతుందని భావించి విషం తాగి ప్రాణాలు తీసుకున్నాడు.34 ఏళ్ల మోహిత్ త్యాగి అనే వ్యక్తికి పెళ్లైన దగ్గర్నుంచీ భార్య నుంచి ఏవో వేధింపులకు గురవుతూనే ఉన్నాడట. 2020, డిసెంబర్లో ప్రియాంక అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న మోహిత్.. ఆపై నరకం చూసాడట.తనకు రెండో పెళ్లి కావడంతో భార్య తన ఆస్తి కోసం, తన సంపాదన కోసమే చేసుకుని ప్రతీరోజూ నరకం చూపించేదని సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక్కడ భార్య ప్రియాంకను, ఆమె తరఫు బంధువులు పేర్లు పేర్కొంటూ సూసైడ్ నోట్ రాశాడు. తాను చనిపోవడానికి నిర్ణయించుకున్న కొన్ని సెకన్ల ముందే ఆ నోట్ తన ఫ్రెండ్స్ అందరికీ పంపించాడు. ఆ వెంటనే విషం తాగాడు. రెండు రోజుల మృత్యువుతో పోరాడి చనిపోయాడు.2024లో మోహిత్ తల్లి చనిపోయిన క్రమంలో భార్య ప్రియాంక బాగా గొడవపడిందట. ఆ సమయంలోనే భార్య కొంతమందిని ఇంటికి తీసుకొచ్చి రూ. 12 లక్షల నుంచి రూ. 15 లక్షల విలువైన బంగారాన్ని మొత్తం అపహరించిందట. ఈ విషయాన్ని మోహిత్ సోదరుడు తాజాగా వెల్లడించాడు.సూసైడ్ నోట్ లో ఏముందంటే..నాపై అనుమానంతో ఒక తప్పుడు కేసును భార్య పెట్టించింది. ఆ కేసుకు నాకు ఎటువంటి సంబంధం లేదు. ఒక ప్లాన్ ప్రకారమే నన్ను పెళ్లి చేసుకుంది. అనేక సార్లు గర్భం వస్తే దాన్ని తీయించుకుంది. నన్ను చాలా హింసించింది. నేను ఇక తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు నాపై పోలీస్ కేసు పెట్టడంతో నా జీవితం ఇక అనవసరం. నేనూ ఏ తప్పూ చేయలేదు. నేను చనిపోతున్నందుకు నాకు బాధేమీ లేదు. కాకపోతే నాకు పుట్టిన కొడుకు పరిస్థితి ఏమౌంతుందో అని ఆలోచిస్తున్నా. నాకు అదొక్కటే విచారంగా ఉంది. వీరంతా నా కొడుకును చంపేసే అవకాశం కూడా ఉంది. మీరు నిజాన్ని నమ్మాలంటే నాకు చావు ఒక్కటే శరణ్యం’ అని పేర్కొన్నాడు. భార్య ప్రియాంక, ఆమె తరుఫు బంధువులే తన చావుకు కారణమని తెలిపాడు. తన చావు తర్వాత భార్య ప్రియాంక కచ్చితంగా చింతిస్తుందని సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు. ఏప్రిల్ 15వ తేదీన సూసైడ్ చేసుకోగా, రెండు రోజులు మృత్యువుతో పోరాడి చనిపోయాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
వావి వరసలు మరచి.. కూతురి మామతో ప్రేమాయణం..
ఈరోజుల్లో బంధాలకు విలువ లేకుండా పోతోంది. వావివరుసలు మరిచి విపరీత పోకడలకు పోతున్నారు కొందరు. తనకు కాబోయే అల్లుడితో అత్త జంప్ అయిన ఘటన మరువక ముందే.. అలాంటి దరిద్రపు ఘటనే యూపీ బదౌన్‌లో వెలుగుచూసింది. ఓ మహిళ.. తన కూతురి మామతోనే సంబంధం పెట్టుకుంది. పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన వారిద్దరూ ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.వివరాల ప్రకారం.. డేటాగంజ్ కొత్వాలి ప్రాంతానికి చెందిన సునీల్, మమత(43)కు 2002లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సునీల్ ట్రక్క్ నడుపుతూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కాగా, తన పెద్ద కుమార్తెను బదౌన్ సదర్ కొత్వాలి ప్రాంతానికి చెందిన శైలేంద్ర కుమారుడికి ఇచ్చి 2022లో వివాహం చేశాడు. అయితే, తన కూతురికి వివాహం చేసిన అనంతరం కూతురు మామ అయిన శైలేంద్రతో మమత ప్రేమలో పడింది. దాదాపుగా రెండేళ్ల నుంచి వీరి మధ్య సంబంధం నడిచింది. సునీల్ ట్రక్క్ నడుపుతున్న కారణంగా నెలలో కొద్దిరోజులు మాత్రమే ఇంట్లో ఉండేవాడు. సునీల్ లేని సమయంలో శైలేంద్ర.. మమత ఇంటికి వచ్చేవాడు. ఇద్దరూ వరుసకు అన్నాచెల్లెలు కావడంతో ఎవరికీ అనుమానం రాలేదు. ఈ క్రమంలో ప్రేమాయణం నడిపిన మమత, శైలేంద్ర.. తాజాగా ఇంటి నుంచి పారిపోయారు. దీంతో, వీరి సంబంధం గురించి బయటి ప్రపంచానికి తెలిపింది.భర్త ఆవేదన..ఈ నేపథ్యంలో బాధితుడు, భర్త సునీల్.. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ.. నేను వేరే ఊరిలో ట్రక్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాను.. అయినప్పటికి నా భార్యకు సమయానికి డబ్బు పంపిస్తున్నాను. కుటుంబ ఖర్చులకు డబ్బు ఇచ్చేవాడిని. నా భార్య నేను లేనప్పుడు.. శైలేంద్రకు ఫోన్ చేసి మాట్లాడింది. అతడిని ఇంటికి రావాలని చెప్పింది. ఇప్పుడు అతనితో పారిపోయింది. ఆమె ఇంట్లో ఉన్న నగలు, డబ్బు అంతా తీసుకుని పారిపోయింది అని ఆవేదన వ్యక్తం చేశారు.బిడ్డల ముందే..మరోవైపు.. మమత కుమారుడు మాట్లాడుతూ.. మా తండ్రి ఇంట్లో లేనప్పుడు మామ శైలేంద్ర మా ఇంటికి వచ్చేవారు. మా తండ్రి ఇంట్లో లేనప్పుడు అమ్మ ప్రతి మూడు రోజులకు ఒకసారి ఆయనకు ఫోన్ చేసేది. మామ.. మా ఇంటికి వచ్చిన ప్రతీసారి మమ్మల్ని వేరే గదికి పంపించారు. ఆమె తన మామతో కలిసి టెంపోలో పారిపోయిందని చెప్పారు. అలాగే, ఈ ఘటనపై స్థానికులు స్పందిస్తూ.. సునీల్ వేరే చోట్ల ట్రక్ డ్రైవర్‌గా పని చేస్తుండే వాడు. నెలలో రెండు మూడుసార్లు మాత్రమే ఇంటికి వచ్చేవాడు. భర్త దూరంగా ఉండటంతో మమత.. శైలేంద్రను ఆహ్వానించేది. అతను రాత్రి 12 గంటలకు ఇంటికి వచ్చి తెల్లవారుజామున వెళ్లిపోయేవాడని చెప్పారు. అతనే మమతను తీసుకెళ్లాడని చెబుతున్నారు. -
ఆ చట్టం కేవలం కోడళ్ల కోసమే చేయలేదమ్మా: అలహాబాద్ హైకోర్టు
లక్నో: గృహ హింస చట్టం కింద రక్షణ కోరే అవకాశం కుటుంబంలోని ప్రతీ స్త్రీకి ఉంటుందని అలహాబాద్ హైకోర్టు తన తాజా తీర్పులో స్పష్టం చేసింది. కేవలం అది కోడలకు మాత్రమే నిర్దేశించిన చట్టం మాత్రమే కాదని, అత్తకు కూడా ఈ చట్టం వర్తిస్తుందని తెలిపింది. తనకు కోడలు పెట్టే గృహ హింస నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన అలహాబాద్ హైకోర్టు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. అది కేవలం కోడళ్లకు మాత్రమే ఉద్దేశించిన చట్టం మాత్రమే కాదని, కుటుంబంలో ఎవరైనా స్త్రీ దీనికి అర్హులేనని పేర్కొంది. జస్టిస్ అలోక్ మాథుర్ నేతృత్వంలోని హైకోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. గృహ హింస ఫిర్యాదులో తన అత్త దాఖలు చేసిన పిటిషన్‌కు సంబంధించి మేజిస్ట్రేట్ జారీ చేసిన సమన్లను కోడలు, ఆమె తరుఫు బంధువులు సవాల్ చేస్తూ అలహాబాద్ హైకోర్టుకు వెళ్లారు. ఇకడ కోడలు పిటిషన్‌ను కొట్టివేసిన అలహాబాద్ హైకోర్టు.. మేజిస్ట్రేట్ ఇచ్చిన తీర్పును జస్టిస్ అలోక్ మాథుర్ నేతృత్వంలోని హైకోర్టు సమర్ధించింది. అది కేవలం కోడళ్ల చట్టమంటూ హైకోర్టుకు..ఆ చట్టం అనేది కేవలం కోడళ్లకి మాత్రమే ఉద్దేశించబడినదంటూ హైకోర్టుకు వెళ్లింది కోడలు. గృహ హింస చట్టం అనేది కోడళ్లకు మాత్రమే చేయబడిదని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై మేజిస్ట్రేట్ తీర్పును సవాల్ చేసింది. దీన్ని కొట్టివేసేన హైకోర్టు,..గృహ హింసకు గురయ్యే ప్రతీ మహిళకి ఈ చట్టం వర్తిస్తుందని తెలిపింది. ఇది కేవలం కోడళ్లకి మాత్రమే చేయబడిన చట్టం కాదని చురకలంటించింది. డీసీ(డొమస్టిక్ వయెలెన్స్) చట్టంలోని సెక్షన్ 12 కింద కుటుంబంలోని ఏ స్త్రీ అయినా రక్షణ కోరవచ్చని తెలిపింది.ఇంతకీ కేసు ఏంటంటే..!యూపీ రాష్ట్రానికి చెందిన గరిమా అనే మహిళ సుధా మిశ్రాను వేధింపులకు గురి చేయడంతో ఆమె కోర్టు మెట్లు ఎక్కింది. రాయబేరీలోని సొంత ఇంటి నుంచి వెళ్లిపోదామని భర్తపై గరిమా పదే పదే ఒత్తిడి తెచ్చింది. దాన్ని తన కొడుకు తిరస్కరించడంతో తనపై కోడలు వేధింపులు అధికమైనట్లు అత్త సుధా మిశ్రా పేర్కొంది.. అదే సమయంలో తన ఇంటి నుంచి కోడలు గరిమా, ఆమె తరఫు బంధులతో కలిసి బలవంతంగా డబ్బును, బంగారాన్ని ఎత్తుకెళ్లినట్లు ఆమె తెలిపింది. దీనిపై గృహ హింస చట్టం కింద కోర్టును ఆశ్రయించింది. -
పాము కాటు కాదు.. భార్య నిర్వాకమే!
ప్రియుడికి తనకు మధ్యలో అడ్డుగా ఉన్నాడని భర్తను ముక్కలు చేసి సిమెంట్ డ్రమ్ములో కుక్కింది ఓ భార్య. ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌లో చోటు చేసుకున్న ఈ ఉదంతం దేశవ్యాప్తంగా ఎంతటి చర్చకు దారి తీసిందో తెలిసిందే. ఈ క్రమంలో తమ ప్రాణాలను రక్షించుకునేందుకు ఒకరిద్దరు భర్తలు తమ భార్యలను ప్రియుడికి ఇచ్చి వివాహం చేసిన సందర్భాలూ చూశాం. ఇప్పుడు అదే ప్రాంతంలో మరో ఘోరం చోటు చేసుకుంది.రెండు రోజుల కిందట సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన ఓ వార్త తీవ్ర చర్చనీయాంశమైంది. నిద్రలోనే ఓ వ్యక్తిని పాము పదిసార్లు కాటేసిందని, ఆ విష ప్రభావంతో అతను కన్నుమూశాడని. రాత్రంతా ఆ పాము అలాగే పక్కలోనే ఉండిపోయింది. ఉదయం దానిని తొలగించి అతన్ని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు కూడా బాగా వైరల్ అయ్యాయి. దీంతో ‘పాపం’ అనుకున్నారంతా. అయితే బుధవారం సాయంత్రం ఈ కేసులో పోస్టుమార్టం నివేదిక బయటకు వచ్చింది. అందులో షాకింగ్ విషయం ఒకటి వెలుగు చూసింది.మీరట్ అక్బర్పూర్ సదాత్ గ్రామానికి చెందిన అమిత్(25) కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో ఏప్రిల్ 14వ తేదీ రాత్రి మంచంలో నిద్రిస్తున్న అతన్ని పాము కాటేయడంతో మరణించాడని ప్రచారం చేశారు. అయితే పోస్టుమార్టం నివేదికలో అతను విషం వల్ల కాకుండా ఊపిరి ఆడకపోవడం వల్లే మరణించాడని తేలింది. దీంతో పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. భార్య రవిత అసలు విషయం బయటపెట్టింది.రవితకు అమర్జీత్ అనే యువకుడితో ఏడాదిగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ విషయం తెలిసి అమిత్ తన భార్యను మందలించాడు. అయినా తీరు మార్చుకోకపోవడంతో ఆ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో ప్రియుడు అమర్జీత్తో కలిసి భర్తను కడతేర్చాలని రవిత స్కెచ్ వేసింది. అమర్జీత్ సాయంతో అమిత్ నిద్రిస్తున్న సమయంలో గొంతు నులిపి ఊపిరి ఆడకుండా చేసి చంపింది. ఆపై రోజుకి రూ.వెయ్యి ఖర్చు అద్దెతో తెచ్చిన ఓ పామును మంచం మీద పడేసింది. పాము కాటు వల్లే చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేసింది. స్థానికుల సాయంతో పాములు పట్టేవాడిని తెచ్చి దానిని తొలగించింది. దీంతో జనం కూడా పాము కాటు వల్లే అతను చనిపోయాడని నమ్మి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. రవితతో పాటు అమర్జీత్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనలో ఇంకా వేరే ఎవరి ప్రమేయం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
‘కేన్సర్.. మనీ వేస్ట్’ : రియల్టర్ ఎంత పనిచేశాడు!
కేన్సర్ మహమ్మారి సోకిందంటే మరణ శాసనమే అని చాలా మంది భావిస్తారు. కానీ ఆధునిక వైద్య పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తరువాత కేన్సర్‌ను జయించవచ్చు. మెరుగైన వైద్యం, కుటుంబ సభ్యుల సహకారంతోపాటు, ఆత్మ విశ్వాసం, మనోధైర్యం ఉంటే ఈ వ్యాధినుంచి బైటపడవచ్చు. మరీ ముఖ్యంగా కేన్సర్ వ్యాధి నివారణలో ముందస్తు గుర్తింపు, అవగాహన చాలా అవసరం. ఈ అవగాహన లేమి కారణంగా పచ్చని కాపురం కుప్పకూలి పోయింది. వివరాలు ఇలా ఉన్నాయ్.ఢిల్లీ సమీపంలోని ఘజియాబాద్‌లో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి కుల్దీప్ త్యాగి (46) తన భార్యను కాల్చి చంపి, ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎందుకంటే తనకు కేన్సర్ వ్యాధి సోకిందని, ఎంత డబ్బు ఖర్చు చేసినా అది నయం కాదని భయపడిపోయాడు. అందుకే ఇలాంటి భయంకరమైన నిర్ణయం తీసుకున్నాడు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కుల్దీప్ తన భార్యను లైసెన్స్ పొందిన రివాల్వర్‌తో కాల్చి చంపి, ఆపై నిన్న ఉదయం 11 గంటల ప్రాంతంలో రాజ్ నగర్ ఎక్స్‌టెన్షన్‌లోని ఇంట్లో తనను తాను కాల్చుకున్నాడు. సంఘటన జరిగిన సమయంలో వారి కుమారులు ఇంట్లో ఉన్నారు. తుపాకీ కాల్పులు విన్న వెంటనే వారి తల్లిదండ్రుల గదికి చేరుకున్నారు. కుల్దీప్ మృతదేహం నేలపై, అన్షు మృతదేహం మంచంపై కనిపించింది. వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వారు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. పోలీసులు పిస్టల్‌ను స్వాధీనం చేసుకుని మృతదేహాలను శవపరీక్షకు పంపారు.‘‘కేన్సర్ ఉందని నిర్ధారణ అయింది. నా కుటుంబానికి దాని గురించి తెలియదు. కోలుకుంటానన్న గ్యారంటీ లేదు. దీనికి చికిత్స కోసం డబ్బు వృధా .. అందుకే ఈ నిర్ణయం. ఇందులో ఎవరికీ ఎలాంటి సంబంధం లేదు, ముఖ్యంగా నా పిల్లలు నిందించాల్సిన అవసరం లేదు" అంటూ సూసైడ్ నోట్ రాశాడు. అలాగే కలిసి ఉంటామని ప్రమాణం చేశాను కాబట్టి తన భార్య అన్షు త్యాగిని కూడా తనతో పాటు తీసుకెళ్లిపోతున్నా అంటూ ఆమెను కూడా కాల్చి చంపేశాడు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు. కుల్దీప్ తండ్రి రిటైర్డ్ పోలీసు. ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నామని సీనియర్ పోలీసు అధికారి పూనమ్ మిశ్రా వెల్లడించారు. -
కాబోయే అల్లుడితో అత్త జంప్ ఎపిసోడ్లో ట్విస్ట్.. ఎందుకిలా చేసిందంటే..
లక్నో: తన కూతురికి కాబోయే భర్తతో సంబంధం పెట్టుకున్న పరారీ అయిన అత్త ఘటన వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఏది ఏమైనా తాను రాహుల్‌తో జీవిస్తానని, అతడిని పెళ్లి చేసుకుంటానని సప్న తెలిపింది. అలాగే, తాను ఇంట్లొ నుంచి వెళ్లేటప్పుడు డబ్బు, బంగారం ఎత్తుకెళ్లినట్లు తన భర్త చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని తెలిపింది. మరోవైపు.. తనతో సంబంధానికి ఒప్పుకోకుంటే చనిపోతాను అని సప్న బెదిరించడంతోనే తాను ఆమెతో పారిపోడానికి ఒప్పుకున్నట్లు రాహుల్ కుమార్ చెప్పాడు.ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీఘర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల ఇలా ఉన్నాయి. అలీఘర్‌లోని దాదోన్‌కు చెందిన సప్న, జితేంద్ర కుమార్ భార్యాభర్తలు. వీరికి శివానీ అనే ఓ కూతురు ఉంది. శివానీకి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. ఈ క్రమంలో రాహుల్ కుమార్ అనే యువకుడితో శివానీకి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు. మరో 10 రోజుల్లో పెళ్లి జరుగుతుంది అనగా ఏప్రిల్ 6, 2025న 40 ఏళ్ల సప్న.. తనకు కాబోయే అల్లుడు రాహుల్ కుమార్‌తో పరారీ అయ్యింది. దీంతో, ఈ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం తెలిసిన వారంతా ముక్కునవేలేసుకున్నారు.అయితే, తాజాగా వారిద్దరూ పోలీసులను ఆశ్రయించారు. పోలీసు స్టేషన్లో లొంగిపోయారు. ఈ క్రమంలో తాను ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో సప్న పోలీసులకు వివరించింది. ఈ తన భర్త జితేంద్ర కుమార్ పెద్ద తాగుబోతు అని, తరుచూ తాగొచ్చి తనను కొట్టేవాడని.. తన కూతురు కూడా తరచూ తనతో గొడవలు పెట్టుకునేదని.. అందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపింది. ఏది ఏమైనా తాను రాహుల్‌తో జీవిస్తానని, అతడిని పెళ్లి చేసుకుంటానని చెప్పుకొచ్చింది. అలాగే, తాను ఇంటి నుంచి వెళ్లేటప్పుడు డబ్బు, బంగారం ఎత్తుకెళ్లినట్లు తన భర్త చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని.. తాను ఇంటి నుంచి వెళ్లేటప్పుడు తన దగ్గర కేవలం ఓ మొబైల్ ఫోన్, రూ.200 మాత్రమే ఉన్నట్లు తెలిపింది.మరోవైపు.. తనను సప్న బెదిరించడంతోనే తాను ఆమెతో పారిపోడానికి ఒప్పుకున్నట్లు రాహుల్ కుమార్ చెప్పాడు. అలీఘర్ బస్ స్టాప్‌లో కలవకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటాను అని సప్న తనకు ఫోన్ లో చెప్పిందని.. దీంతో తాను అక్కడికి వెళ్లానని.. ఆ తర్వాత ఇద్దరూ కలిసి లక్నో వెళ్లినట్టు తెలిపాడు. పోలీసులు తమ కోసం గాలిస్తున్నారు అని తెలియడంతో తామే వచ్చి లొంగిపోయినట్లు చెప్పాడు. అయితే ఇప్పుడు సప్నని పెళ్లి చేసుకుంటావా అని అడినప్పుడు.. తాను సిద్దంగానే ఉన్నట్టు చెప్పుకొచ్చాడు.Aligarh's absconding 'mother-in-law and son-in-law' were caught, what did the mother-in-law say, watch the video#Aligarh #Nepalborder #Bihar #saas #damad #Breaking #Lateat pic.twitter.com/yTOu6qXwig— Indian Observer (@ag_Journalist) April 16, 2025 -
మీరట్ కేసు.. నిందితురాలికి జైల్లో స్పెషల్ సదుపాయాలు
మీరట్: మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్ హత్య కేసులో ప్రస్తుతం జైల్లో ఉన్న నిందితురాలు, అతడి భార్య ముస్కాన్ రస్తోగిని జైల్లోని ప్రత్యేక ప్రసూతి బ్యారక్‌లోకి మార్చడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఆమెతో పాటు గర్భంతో ఉన్న మరో మహిళా ఖైదీని కూడా తరలించనున్నారు.ప్రస్తుతం ఆరు వారాల గర్భవతిగా ఉన్న ముస్కాన్ రాస్తోగిని గర్భిణీ ఖైదీల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బ్యారక్‌లోకి పంపనున్నట్లు జైలు అధికారి తెలిపారు. బిడ్డ జన్మించేంత వరకు ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. ముస్కాన్ రస్తోగికి ఇటీవల నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఆమె గర్భం దాల్చినట్లు గుర్తించిన సంగతి తెలిసిందే. దీనిపై హత్య గావించబడ్డ సౌరభ్ సోదరుడు మాత్రం.. ముస్కాన్‌కు పుట్టబోయే బిడ్డ సౌరభ్ రక్తం అయితే తాము తప్పకుండా పెంచుకుంటామన్నాడు.సౌరబ్ రాజ్‌పుత్ సోదరుడు బబ్లూ రాజ్‌పుత్ మాట్లాడుతూ.. ముస్కాన్ కు పుట్టబోయే బిడ్డ మా అన్నకు సంబంధించిన బేబీ అయితే మేము కచ్చితంగా పెంచుకుంటాం. అన్నీ చూసుకుంటాం.’ అని స్పష్టం చేశాడు. ప్రస్తుతం ముస్కాన్, సాహిల్‌లు ఇద్దరూ మీరట్ జిల్లా జైల్లో వేర్వేరు బారక్‌ల్లో ఉంటున్నారు. తాము కలిసి ఉంటామని ఒకే బారక్ ఇవ్వమని డిమాండ్ చేసినా జైలు రూల్స్ ఒప్పుకోవమని చెప్పి వారికి సెపరేట్ రూమ్‌లే కేటాయించారు అధికారులు.కాగా, సౌరభ్ రాజ్‌పుత్, ముస్కాన్‌లు 2016లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అతడు మర్చంట్ నేవీలో పని చేసేవాడు. వారికి 2019లో కుమార్తె జన్మించింది. ఆ తర్వాత సాహిల్(25)తో ముస్కాన్ వివాహేతర సంబంధం పెట్టుకొంది. దీనిపై వారు విడాకుల వరకు వెళ్లారు. కానీ, కుమార్తె కోసం సౌరభ్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. తర్వాత ఉద్యోగం నిమిత్తం విదేశాలకు వెళ్లిన అతడు.. ఈ ఏడాది ఫిబ్రవరిలో కుమార్తె పుట్టినరోజు కోసం తిరిగొచ్చాడు. ఇది నచ్చని ముస్కాన్.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. అతడి శరీరాన్ని ముక్కలు చేసి.. వాటిని ఓ డ్రమ్ములో వేసి సిమెంట్‌తో సీల్ చేసింది. -
భర్త చనిపోయిన బాధలో అంజలి.. ఆస్తి కోసం ఆమెకు మద్యం తాగించి..
లక్నో: భూమికి సంబంధించిన డబ్బు వివాదంలో ఇద్దరు వ్యక్తులు ఓ మహిళను దారుణంగా హత్య చేశారు. ఆమెకు మద్యం తాగించి తర్వాత గొంతుకోసి మృతదేహాన్ని యమునా నదిలో పడేశారు. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని ఎటావా జిల్లాలో అంజలి(28) జీవిస్తోంది. తన భర్త చనిపోవడంతో తన ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి వద్దే ఉంటోంది. కాగా, అంజలి, రియల్ ఎస్టేట్ వ్యాపారి శివేంద్ర యాదవ్ మధ్య ఓ భూమికి సంబంధించి కొద్ది రోజులుగా వివాదం నడుస్తోంది. అంజలికి శివేంద్ర యాదవ్ డబ్బు ఇవ్వాల్సి ఉండగా.. ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నాడు. దీంతో, తనకు రావాల్సిన డబ్బులు వెంటనే ఇవ్వాలని అంజలి డిమాండ్ చేయడంతో శివేంద్ర తప్పించుకునేందుకు ప్లాన్ చేశాడు. అంజలిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.ఈ నేపథ్యంలో మరో వ్యక్తి గౌరవ్‌తో కలిసి అంజలిని హత్య చేసేందుకు శివేంద్ర ప్లాన్ చేసుకున్నాడు. ఇంతలో అంజలికి ఫోన్ చేసి.. తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తానని తన ఇంటికి రావాలిని శివేంద్ర చెప్పాడు. అతడి మాటలు నమ్మిన అంజలి.. అక్కడికి వెళ్లడంతో.. వారిద్దరూ కలిసి ఆమెకు బలవంతంగా మద్యం తాగించారు. అనంతరం, గొంతు కోసి హత్యచేసి మృతదేహాన్ని యమునా నదిలో పడేశారు. ఈ క్రమంలో గత ఐదు రోజులుగా అంజలి కనిపించకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులకు.. ఫోన్ ట్రాకింగ్, స్కూటీ ఆధారంగా యుమునా నది వద్ద ఉన్నట్టు తేల్చారు. దర్యాప్తులో భాగంగా శివేంద్ర, గౌరవ్.. ఆమెను హత్య చేసినట్టు గుర్తించారు.దీంతో, వారిద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన తీరులో విచారించగా.. అంజలిని తామే హత్య చేసినట్టు ఒప్పుకున్నారు. భూమి వివాదంలో అంజలి పదేపదే డబ్బులు అడుగుతున్న కారణంగానే హత్య చేసినట్టు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం అంజలి మృతదేహాన్ని నదిలో నుంచి బయటకు తీశారు. ఆమెను చూసిన కుటుంబ సభ్యులు, అంజలి బిడ్డలు కన్నీటి పర్యంతమవుతున్నారు. తల్లిదండ్రులు ఇద్దరూ లేకపోవడంతో బోరున విలపిస్తున్నారు. ఇదే సమయంలో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.Etawah, Uttar Pradesh: Senior Superintendent of Police (Etawah), Sanjay Kumar Verma says, "A report was received yesterday at the Civil Lines police station regarding a woman named Anjali, aged around 28-30 years, who had gone missing. She was a widow with two children. Upon… pic.twitter.com/Dc2gfdNwKP— IANS (@ians_india) April 12, 2025 -
అయోధ్య గెస్ట్‌హౌస్‌లో దారుణం.. మహిళలు స్నానం చేస్తున్న వీడియో తీసి..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో దారుణ ఘటన వెలుగుచూసింది. అయోధ్యలోని ఒక గెస్ట్ హౌస్‌లో బాత్రూమ్లో మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీస్తున్న వ్యక్తిని ఉత్తరప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో అతడి ఫోన్లో వందల వరకు వీడియోలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.వివరాల ప్రకారం.. అయోధ్యలోని రామాలయం గేట్ నంబర్-3 దగ్గరలో రాజా గెస్ట్ హౌస్ ఉంది. రామాలయం దర్శనం కోసం అయోధ్యకు వచ్చిన వారు ఈ గెస్ట్‌హౌస్‌లో ఎక్కువ సంఖ్యలో ఉంటారు. అయితే, తాజాగా వారణాసికి చెందిన ఓ మహిళ తన కుటుంబ సభ్యులతో కలిసి అయోధ్యకు వచ్చారు. శుక్రవారం సదరు రాజా గెస్ట్‌హౌస్‌లో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. ఈ క్రమంలో సాయంత్రం 6:00 గంటల ప్రాంతంలో సదరు మహిళ.. బాత్రూమ్లో స్నానం చేస్తుండగా.. గెస్ట్‌హౌస్‌లో పనిచేసే సౌరభ్ తివారీ అనే యువకుడు ఆమెను వీడియో తీశాడు. అది గమనించిన ఆమె.. ఒక్కసారిగా కేకలు వేసింది. దీంతో, ఆమె కుటుంబ సభ్యులు, అక్కడ పనిచేస్తున్న వారు అతడిని పట్టుకున్నారు.అనంతరం, ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్నారు. నిందితుడు సౌరభ్ తివారీని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఉన్న ఫోన్ తీసుకుని పరిశీలించగా.. మహిళలు స్నానం చేస్తున్న పది వీడియోలను, అనేక అశ్లీల ఫోటోలు, వీడియోలు ఉన్నట్టు గుర్తించారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.🚨 Ayodhya | A 30-year-old female devotee was secretly filmed while bathing at Raja Guest House near Gate No. 3 of the #Ayodhya Ram Temple.Another disturbing breach of women's privacy in UP.#Ayodhya #WomenSafety #PrivacyViolation #UPNews #indtoday pic.twitter.com/uWRtfpouvV— indtoday (@ind2day) April 11, 2025ఈ క్రమంలో బాధితురాలు మాట్లాడుతూ.. నేనుస్నానం చేసేందుకు బాత్రూమ్లోకి వెళ్లాను. బాత్రూమ్లో పైన ఒక టిన్ షెడ్ ఉంది. నేను స్నానం చేస్తుండగా, అకస్మాత్తుగా పైన ఒక నీడ కనిపించింది. అప్పుడు ఎవరో మొబైల్ ఫోన్‌తో రికార్డ్ చేయడం చూశాను. నేను భయపడి, అరిచి, నా బట్టలు వేసుకుని బయటకు పరిగెత్తాను. గెస్ట్ హౌస్‌లో బస చేసిన ఇతర అతిథులు కూడా బయటకు వెళ్లి ఆ వ్యక్తిని పట్టుకున్నారు అని తెలిపారు. -
అత్యాచార కేసులో పురోగతి ఎంతవరకూ వచ్చింది?: ప్రధాని ఆరా
వారణాసి: పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా తన పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిలో శుక్రవారం పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ.. రాష్ట్రంలో సంచలన సృష్టించిన అత్యాచార ఘటనపై ఆరా తీశారు. కొన్ని రోజుల క్రితం వారణాసిలో 19 ఏళ్ల యువతి సామూహిక అత్యాచారానికి గురైన సంగతి తెలిసిందే. దీనిపై ప్రధానంగా ప్రధాని మోదీ ఆరా తీశారు.ఆ దారుణ ఘటనకు సంబంధించిన నిందితుల్ని అందరన్నీ అదుపులోకి తీసుకున్నారా లేదా అనే విషయాన్ని పోలీస్ కమిషనర్ ని ప్రధాని అడిగి తెలుసుకున్నారు. ప్రధాని వారణాసి పర్యటనలో భాగంగా ఆయనకు మర్యాద పూర్వకంగా కలవడానికి వెళ్లిన సిటీ పోలీస్ కమిషనర్, డివిజనల్ కమిషనర్, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ లను ప్రధాని మోదీ ప్రశ్నించారు. అత్యాచార ఘటన కేసులో పురోగతి ఎంతవరకూ వచ్చిందని మోదీ అడిగి తెలుసుకున్నారు.ఈ క్రమంలోనే నిందితులకు ఏమైతే శిక్షలు ఉంటాయో అవి అమలయ్యేలా చూడాలన్న మోదీ.. భవిష్యత్ లో ఈ తరహా ఘటనలు జరగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీనిపై సమాధానమిచ్చిన పోలీస్ కమిషనర్.. కేసులో పురోగతి ఉందని స్పష్టం చేశారు. పలువుర్ని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామన్నారు. కాగా, ఓ యువతిని కిడ్నాప్ చేసి, వారం రోజుల వ్యవధిలో 22 గ్యాంగ్ రేప్‌నకు పాల్పడినట్లు యువతి ఫిర్యాదు చేసింది.. వీరిలో ఆరుగురిని అరెస్ట్ చేశామని, మిగతా వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. నగరంలోని లాల్పూర్కు చెందిన 19 ఏళ్ల యువతి మార్చి 29వ తేదీన ఫ్రెండ్‌ను కలిసేందుకని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. అయితే కొన్నిరోజుల పాటు తిరిగి రాలేదు. దీనిపై ఏప్రిల్ 4వ తేదీన ఆమె కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.అదే రోజు, పోలీసులు పాండేపూర్ వద్ద డ్రగ్స్ మత్తులో ఉన్న ఆమెను కిడ్నాపర్ల చెర నుంచి విడిపించారు పోలీసులు. అనంతరం ఆమెసొంతింటికి చేరుకుని తనపై లైంగిక దాడి జరిగిన విషయాన్ని తండ్రికి తెలిపింది. ఈ నెల 6న తండ్రితో వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్థానిక హుక్కా సెంటర్, ఒక హోటల్, ఒక లాడ్జి, ఒక గెస్ట్ హౌస్‌లో తనపై మొత్తం 22 మంది అత్యాచారానికి ఒడిగట్టినట్లు అందులో ఆరోపించింది.కేసు నమోదు చేసిన పోలీసులు హుకూల్ గంజ్, లాల్పూర్ ఏరియాలకు చెందిన కొందరు నిందితులను అదే రోజు రాత్రి అదుపులోకి తీసుకున్నారు. -
అమ్మా.. కాసేపు పడుకుంటా! అని శాశ్వత నిద్రలోకి..
‘‘అమ్మా.. ఇక సెలవు.. శాశ్వతంగా నిద్రలోకి జారుకుంటున్నా’’ అంటూ ఓ కొడుకు రాసిన సూసైడ్ లెటర్ ఆ తల్లిని తల్లడిల్లిపోయేలా చేసింది. ఉత్తర ప్రదేశ్ బరేలీలో బుధవారం ఘోరం జరిగింది. భర్తపై కక్ష గట్టి మరీ ఆ భార్య అతని కటకటాలపాలు చేసింది. అది భరించలేకపోయిన ఓ భర్త.. పైగా ఆ విషయం సోషల్ మీడియాకు కూడా చేరడంతో అఘాయిత్యానికి పాల్పడ్డాడు.రాజ్ ఆర్య, సిమ్రాన్లకు ఏడాది కిందట వివాహం జరగ్గా.. ఈ జంటకు నెలల బాబు ఉన్నాడు. అయితే గతకొంతకాలంగా ఆ కాపురంలో గొడవలు జరుగుతున్నాయి. దీంతో తన సిమ్రాన్ పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే ఓ వివాహ వేడుకకు భార్యతో పాటు హాజరు కావాల్సిన పరిస్థితి రావడంతో రాజ్, అతని తండ్రి షాహ్జన్పూర్లోని సిమ్రాన్ ఇంటికి వెళ్లాడు. అయితే సిమ్రాన్‌ను పంపించేందుకు ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఈ క్రమంలో వాగ్వాదం చోటు చేసుకుని సిమ్రాన్ సోదరులంతా రాజ్, అతని తండ్రిపై దాడి చేశారు. దీంతో చేసేది లేక ఆ ఇద్దర బరేలీకి తిరిగి వచ్చారు. ఈలోపు..ఇంటికొచ్చి మరీ తన కుటుంబ సభ్యులపై దాడి చేశారంటూ రాజ్, అతని తండ్రిపై సిమ్రాన్ కేసు పెట్టింది. దీంతో విచారణ పేరిట బుధవారం రాజ్‌ను పోలీస్ స్టేషన్‌కు పిలిచారు. గురువారం ఉదయం ఇంటికి వచ్చిన రాజ్.. తనకు నిద్రగా ఉందంటూ గదిలోకి వెళ్లి పడుకున్నాడు. స్టేషన్లో తనకు తీవ్ర అవమానం జరిగిందని, అది భరించలేక పోతున్నానంటూ సూసైడ్ నోట్ రాసి ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.అయితే.. సిమ్రాన్ వివాహేతర సంబంధమే దీనంతటికి కారణమని రాజ్ సోదరి అంటోంది. పైగా రాజ్‌పై ఫిర్యాదు చేయడానికి ముందు.. చేశాక.. ‘ఇక ఊచలు లెక్కపెట్టు’ అంటూ ఇన్‌స్టాలో సిమ్రాన్ చేసిన పోస్టులను ఆమె బయటపెట్టింది. అంతేకాదు పోలీస్ అధికారి అయిన సిమ్రాన్ సోదరుడు రాత్రంతా రాజ్‌ను పీఎస్‌లో ఉంచి చితకబాదాడని, ఆ అవమానాన్ని తన సోదరుడు భరించలేకపోయాడని ఆరోపించిందామె. ఇక ఈ ఘటనపై రాజ్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. In the suicide case of #RajArya, a resident of #AkankshaEnclave under the #Izzatnagar police station area in #UttarPradesh's #Bareilly, an FIR has been registered against seven individuals, including his wife #Simran.The report was filed by the deceased's brother, Suresh,… https://t.co/Z4MGrKhyEt pic.twitter.com/otNGtaMmvs— Hate Detector 🔍 (@HateDetectors) April 10, 2025 ఆత్మహత్య ఏ సమస్యకు పరిష్కారం కాదు. తీవ్ర నిర్ణయాలు తీసుకునే ముందు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
నేడు వారణాసికి ప్రధాని మోదీ
వారణాసి/భోపాల్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లలో పర్యటించనున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని సొంత నియోజకకవర్గం వారణాసిలో రూ3,880 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో 130 తాగునీటి పథకాలు, 100 అంగన్వాడీ కేంద్రాలు, 356 గ్రంథాలయాలు, ఒక పాలిటెక్నిక్ కాలేజీ, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉన్నాయని వారణాసి డివిజనల్ కమిషనర్ కౌశల్ రాజ్ శర్మ వివరించారు. మెహెందీగంజ్లో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తారన్నారు. వారణాసిలో సుమారు రెండున్నర గంటలు ప్రధాని గడుపుతారు. -
కన్నీరు కార్చడమే దేశద్రోహమా?
ఉత్తరాది రాష్ట్రాలు ఆశ్చర్యకరమైన వార్తలకు జన్మనిస్తాయి. ఉత్తర ప్రదేశ్ పవర్ కార్పొరేషన్ ఉద్యోగి సాఖిబ్ ఖాన్ (35)ను ఉద్యోగం నుంచి తొలగించారనేది అటువంటి తాజా వార్త. సాఖిబ్ ఖాన్ సహారన్పూర్ జిల్లా కైలాష్పురిలో విద్యుత్ సంస్థకు చెందిన సబ్ స్టేషన్లో కాంట్రాక్టు మీద లైన్ మన్‌గా పని చేస్తున్నాడు. మార్చి 31న ఈద్ నమాజ్ అయి పోయిన తర్వాత పాలస్తీనా జెండా పట్టుకుని ఫొటో దిగి, ఆ ఫొటోను సోషల్ మీడియా మీద పంచుకున్నాడు. ఆ విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఆయనను పిలిచి రెండు గంటల పాటు ప్రశ్నించి ఏ నేరారోపణలూ, కేసూ లేకుండా వదిలివేశారు. ఆయన మీద ఏ చర్యా తీసుకోకపోతే నిరసన ప్రదర్శనలు చేస్తామని స్థానిక సంఘ్ పరివార్ (Sangh Parivar) సంస్థలు పోలీసులను హెచ్చరించాయి. ఈలోగా ఈ విషయం విద్యుత్ శాఖ దృష్టికి వచ్చి, ఆ చర్యను దేశద్రోహ కర చర్యగా పరిగణించి, తక్షణమే ఆయనను ఉద్యోగం నుంచి తొలగించారు. అదే సమయంలో సహారన్పూర్లో అంబాలా రోడ్ ఈద్గాలో నమాజ్ ముగిసిన తర్వాత పాలస్తీనా (Palestine) జెండాను ప్రదర్శించిన కొందరు యువకుల వీడియో తమ దృష్టికి వచ్చిందని, వారిలో ఎనిమిది మందిని గుర్తించి దేశద్రోహ నేరానికి విచారణ జరపనున్నామని నగర పోలీస్ సూపరింటెండెంట్ వ్యోమ్ బిందాల్ వార్తాసంస్థలకు తెలిపాడు. ఈ యువకులు చేసిన నేరం ఏమిటి? చనిపోయిన వారికి కన్నీరు కార్చడం! గత ముప్పై నెలలుగా గాజా మీద ఇజ్రాయెల్ బాంబు దాడులు సాగిస్తున్నది. యుద్ధ విరమణ ఒప్పందం మీద సంతకం చేసిన తర్వాత కూడా మారణహోమం కొనసాగిస్తున్నది. కళ్ళముందర ఘోరకలి సాగిపోతుంటే ఇంకేమీ చేయలేకపోయినా, ‘మీ దుఃఖం పంచు కుంటున్నాము’ అని పాలస్తీనీయుల పతాకను ప్రదర్శించడం అత్యంత మానవీయమైన, ప్రతీకాత్మక చర్య. సానుభూతి ఈ దేశంలో నేరమైపోయిన పాడు కాలానికి చేరాం. నిజానికి పాలస్తీనా జెండా ప్రదర్శించడం, ఆ మాట కొస్తే స్నేహ సంబంధాలున్న ఏ దేశపు జెండానైనా ప్రదర్శించడం భారత చట్టాల ప్రకారం, ప్రత్యేకించి ‘ది ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2002’ ప్రకారం నేరం కాదు. దేశద్రోహం కాదు. కానీ గత రెండు సంవత్సరాలుగా, ముఖ్యంగా గాజా మారణకాండ ప్రారంభమైనప్పటి నుంచీ పాలస్తీనా బాధితుల పట్ల సంఘీభావం వ్యక్తం చేస్తూ ముహర్రం ఊరేగింపులోనో, ప్రార్థనల తర్వాతనో పాలస్తీనా పతాకం ప్రదర్శించిన వందల మంది మీద ఉత్తరాది రాష్ట్రాల పోలీసులు కేసులు బనాయిస్తున్నారు. కొందరి మీద చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కేసులు కూడా పెట్టారు. అదే సమయంలో ఇజ్రాయెల్‌కు అనుకూలంగా ఇజ్రాయెల్ జెండా ప్రదర్శిస్తూ ప్రదర్శనలు జరిపినవారి మీద ఎటువంటి కేసులూ లేవు. దేశంగా పాలస్తీనాతో, పాలస్తీనా ప్రజల ఆకాంక్షలతో, చివరికి సాయుధ పోరాటం చేస్తుండిన పాలస్తీనా విమోచన సంస్థతో, దాని నాయకుడు యాసర్ అరాఫాత్తో భారత ప్రభుత్వానికీ, భారత దేశానికీ ఉండిన సంబంధాల నేపథ్యంలో చూస్తే ఈ కొత్త ‘దేశద్రోహకర నేరం’ ఆశ్చర్యం కలిగిస్తుంది. బ్రిటిష్ ప్రభుత్వం బాల్ఫోర్ డిక్లరేషన్ ద్వారా పాలస్తీనాలో యూదులను స్థిరపరచడానికి ప్రయత్నాలు ప్రారంభించిన నాటి నుంచీ భారత వలస వ్యతిరేక జాతీయోద్యమ నాయకులందరూ బ్రిటిష్ ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ, పాలస్తీనాకు సంఘీభావం ప్రకటించడం ప్రారంభించారు. 1938లోనే ఒక వ్యాసంలో గాంధీ ‘ఇంగ్లండ్ ఇంగ్లిష్ వాళ్లకూ, ఫ్రాన్స్ ఫ్రెంచి వాళ్లకూ ఎలా చెందుతుందో, అదే విధంగా పాలస్తీనా కూడా అరబ్బులకు చెందుతుంది. అరబ్బుల మీదికి యూదులను రుద్దడం తప్పు, అమానుషం’ అన్నారు. పాలస్తీనాను విభజించి ఇజ్రాయెల్ (Israel) ఏర్పాటు చేయాలనే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ తీర్మానానికి 1947 లోనే భారతదేశం వ్యతిరేకంగా ఓటు వేసింది. ఇజ్రాయెల్ ఏర్పాటును 1950లో ఆమోదించినప్పటికీ, 1992 దాకా దౌత్య సంబంధాలు నెలకొల్పలేదు. పాలస్తీనా మీద ఇజ్రాయెల్ దురాక్రమణను ఖండిస్తూ... ‘పాలస్తీనా పాలస్తీనీయులదే’ అని అంతర్జాతీయ వేదికల మీద మాట్లాడుతూ, ఐక్యరాజ్యసమితిలో ఇజ్రాయెల్ వ్యతిరేక తీర్మానాలను సమర్థిస్తూ వచ్చింది భారతదేశం. ఇజ్రాయెల్ మీద సాయుధ పోరాటం ప్రారంభించిన పాలస్తీనా విమోచన సంస్థ (పీఎల్ఓ)ను ‘పాలస్తీనా ప్రజల ఏకైక, సాధికార ప్రతినిధి’గా గుర్తించి, 1974లోనే ఢిల్లీలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడానికి భారత ప్రభుత్వం అనుమతించింది. 1980 నాటికి పీఎల్ఓతో పూర్తి స్థాయి దౌత్య సంబంధాలు ఏర్పరచుకున్నది. 1988 నవంబర్ స్వాతంత్య్ర ప్రకటనతో ఏర్పాటైన పాలస్తీనాను గుర్తించిన తొలి అరబేతర దేశం భారతదేశమే! గాజాలో 1996లోనే భారత ప్రభుత్వ ప్రతినిధి కార్యాలయం స్థాపించింది. అదే సమయంలో 1990ల నుంచే ఇజ్రాయెల్‌తో కూడా భారత ప్రభుత్వం వాణిజ్య సంబంధాలు ప్రారంభించింది. దీంతో పాలస్తీనా నాయకులలో వ్యక్తమైన అనుమానాలను కూడా భారత నాయకులు కొట్టివేస్తూ వచ్చారు. పీఎల్ఓ అధ్యక్షుడు యాసర్ అరాఫాత్ 1997 నవంబర్‌లో భారత పర్యటనకు వచ్చినప్పుడు ఎన్నో వాణిజ్య, పారిశ్రామిక సహకార, సాంస్కృతిక సంబంధాల ఒప్పందాల మీద సంతకాలు జరిగాయి. అప్పుడే అరాఫాత్ హైదరాబాద్‌కు కూడా వచ్చి ఇండో–అరబ్ భవన సముదాయానికి పునాది వేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం (Osmania University)) నుంచి గౌరవ డాక్టరేట్ స్వీకరించారు. ఈ సుహృద్భావాన్నీ, సంఘీభావాన్నీ తోసివేస్తూ, 2014 తర్వాత భారత ప్రభుత్వం అధికారికంగా తన వైఖరి మార్చుకోకుండానే, అనధికారికంగా పాలస్తీనాకు దూరంగా, ఇజ్రాయెల్‌కు దగ్గరగా జరుగుతూ వచ్చింది. ఆ దేశాన్ని సందర్శించిన తొలి భారతీయ ప్రధానిగా నరేంద్ర మోదీ 2017 జూలైలో ఇజ్రాయెల్ వెళ్లి బెంజమిన్ నెతన్యాహూను కౌగిలించుకుని సాన్నిహిత్యాన్ని ప్రకటించారు. చదవండి: కఠిన వాస్తవాలను దాచేస్తారా?అక్కడి నుంచి ఆ సంబంధాలు మరింత బలపడుతూ, 2023 అక్టోబర్ 27న, మారణహోమం మొదలైన ఇరవై రోజుల తర్వాత ఇజ్రాయెల్ దాడిని ఆపి, శాంతి ఒప్పందానికి రావాలని ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టిన తీర్మానానికి భారత ప్రభుత్వం ఓటు వేయకుండా ఉండి పోయింది. మరి, అరవై వేల మరణాలకు కన్నీరు కార్చడం, సానుభూతి ప్రకటించడం దేశద్రోహకర నేరమవుతుందా?ఎన్. వేణుగోపాల్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఇది బాధితురాలి స్వయంకృతాపరాధమే!
వక్షోజాలను తాకడం.. యువతి పైజామాను లాగడం లాంటి చేష్టలు అత్యాచార యత్నం కిందకు రావంటూ వివాదాస్పద తీర్పు ఇచ్చిన అలహాబాద్ హైకోర్టు(ఉత్తర ప్రదేశ్).. మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఓ అత్యాచార కేసులో బాధితురాలిది కూడా తప్పు ఉందని పేర్కొంటూ నిందితుడికి ఏకంగా బెయిల్ మంజూరు చేసింది.లక్నో: ఢిల్లీలో ఉంటూ పీజీ చదువుతున్న ఓ విద్యార్థిని తన క్లాస్మేట్ అత్యాచారం చేశాడని కేసు పెట్టింది. .. మద్యం మత్తులో ఉన్న తనను అతని బంధువుల ఇంటికి తీసుకెళ్లి రెండుసార్లు అత్యాచారం చేశాడని బాధితురాలు ఆరోపించింది. అయితే సాక్ష్యాలు పరిశీలనలో అది అబద్ధమని, పరస్పర అంగీకారంతో ఇద్దరూ కలిశారని నిందితుడి తరఫు లాయర్ వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న తర్వాత.. ధర్మాసనం కీలక అంశాలను పరిగణనలోకి తీసుకుంది.ఈ కేసులో బాధితురాలుగా ఉన్న యువతి ఎంఏ చదువుతోంది. ఏది తప్పో..ఏది ఒప్పో.. నైతికత గురించి ఆమెకు తెలియంది కాదు. ఒకవేళ బాధితురాలి ఆరోపణే నిజం అనుకున్నా.. ఇక్కడ సమస్యను స్వయంగా ఆమెనే ఆహ్వానించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి, జరిగిన దానికి ఆమె కూడా ఓ బాధ్యురాలే. ఇది ముమ్మాటికీ బాధితురాలి స్వయంకృతాపరాధమే!.పైగా వైద్య పరీక్షలో కన్నెపొర(Hymen) చిరిగిపోయినట్లు తేలింది. కానీ లైంగిక వేధింపులు జరిగినట్లుగా వైద్యులు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయలేదు. ఇక ఈ కేసులో నిందితుడికి ఎలాంటి నేర చరిత్ర లేదు. బెయిల్ షరతులను ఉల్లంఘించడని హామీతో పాటు, సాక్ష్యాలను ప్రభావితం చేయలేడన్న నమ్మకం కుదిరిన తర్వాతే నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తున్నాం అని జస్టిస్ సంజయ్ కుమార్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు.ఈ ఘటన కిందటి ఏడాది సెప్టెంబర్‌లో జరిగింది. పీజీ చదువుతున్న బాధితురాలిని ఆమె స్నేహితులు హౌజ్ ఖాస్‌లోని ఓ రెస్టారెంట్‌కు ఆహ్వానించారు. అయితే అర్ధరాత్రి 3గం.దాకా ముగ్గురు స్నేహితులతో కలిసి ఆమె చిత్తుగా తాగింది. ఈ క్రమంలో మత్తులో ఉన్న ఆమె తన గదికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఓ స్నేహితుడిని అతని ఇంటికి తీసుకెళ్లాలని ఆమె కోరింది. అయితే.. బాగా మత్తులో ఉన్న ఆమెను నిందితుడు తన బంధవులు ప్లాట్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడన్నది ఆమె ఆరోపణ. ఈ కేసులో కిందటి ఏడాది డిసెంబర్ నుంచి నిందితుడు జైల్లోనే ఉన్నాడు. ఇక.. ఈ కేసులో ఇలాంటి వ్యాఖ్యలు చేసి మరీ నిందితుడికి అలహాబాద్ హైకోర్టు బెంచ్ బెయిల్ మంజూరు చేసింది మార్చి 11వ తేదీనే. కానీ, పలు ఆంగ్ల మీడియా వరుస కథనాలతో ఇప్పుడు హైలైట్ అవుతోంది. అంటే..ఇదే కోర్టుకు చెందిన జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా ఇచ్చిన వివాదాస్పద తీర్పు కంటే ముందు ఈ కేసు విచారణ జరిగిందన్నమాట!. మార్చి 17వ తేదీన ఓ మైనర్ బాలికపై జరిగిన అత్యాచార యత్నం కేసు విచారణలో జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా సంచలన తీర్పు వెల్లడించారు. మహిళ ఛాతీని తాకినంత మాత్రాన.. పైజామా తాడు తెంపినంత మాత్రాన అత్యాచార యత్నం కిందకు రాదంటూ పేర్కొన్నారు. తద్వారా నిందితులు చేసిన నేరాలు పోక్సో చట్టంలోని సెక్షన్ 18, సెక్షన్ 376 కిందకు రావని చెబుతూనే.. అదే చట్టంలోని సెక్షన్ 9/10 (తీవ్రమైన లైంగిక వేధింపులు), సెక్షన్ 354బి (మహిళల గౌరవాన్ని దెబ్బతీసే ఉద్దేశంతో దాడి) కింద కేసులు నమోదు చేసి విచారించాలని ఆదేశించారాయన. అయితే ఈ తీర్పును సుమోటోగా స్వీకరించిన దేశ సర్వోన్నత న్యాయస్థానం.. తీర్పును, న్యాయమూర్తి తీర్పు సందర్భంగా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ స్టే విధించింది కూడా. -
ఆమెకు 30.. అతడికి 18.. ముగ్గురు పిల్లులున్నా భర్తను కాదని..
లక్నో: ఆమె వయసు 30ఏళ్లు.. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు జరిగాయి. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. తాజాగా రెండో భర్తకు విడాకులు ఇచ్చింది. అనంతరం, మతం మార్చుకుని 12వ తరగతి చదువుతున్న విద్యార్థిని మూడో పెళ్లి చేసుకుంది. అయితే, వీరి వివాహానికి యువకుడి కుటుంబ సభ్యులు అంగీకారం తెలపడం విశేషం. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోకి చోటుచేసుకుంది.వివరాల ప్రకారం.. యూపీలోని అమ్రోహా జిల్లాలోని సైదాన్వాలిలో నివసిస్తున్న షబ్నమ్‌కు తల్లిదండ్రులు లేరు. ఆమెకు మొదట మీరట్‌కు చెందిన వ్యక్తితో పెళ్లి జరిగింది. అనంతరం, కొన్ని కుటుంబ కారణాల వల్ల మొదటి భర్తతో విడాకులు తీసుకుంది. తర్వాత ఆ గ్రామానికి చెందిన తౌఫిక్‌తో ఆమెకు రెండో వివాహమైంది. అయితే 2011లో రోడ్డు ప్రమాదం వల్ల అతడు వికలాంగుడయ్యాడు. దీంతో, తాజాగా 12వ తరగతి చదువుతున్న 18 ఏళ్ల విద్యార్థి శివతో ప్రేమలో పడింది. దీంతో, వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు.ఈ నేపథ్యంలో ఏప్రిల్ 4న వికలాంగుడైన భర్త తౌఫిక్‌కు ఆమె విడాకులు ఇచ్చింది. ఆ తర్వాత హిందూ మతంలోకి మారింది. షబ్నమ్ పేరును కాస్తా.. శివానీగా మార్చుకున్నది. ఈ క్రమంలో స్థానిక గుడిలో హిందూ సంప్రదాయం ప్రకారం విద్యార్థి శివను పెళ్లాడింది. మరోవైపు శివానీతో తన కుమారుడి పెళ్లిని శివ తండ్రి దాతారామ్ సింగ్ స్వాగతించాడు. తన కొడుకు నిర్ణయానికి తాను మద్దతు ఇస్తున్నానని తెలిపాడు. ఆ జంట సంతోషంగా ఉంటే తమ కుటుంబం సంతోషంగా ఉంటుందని చెప్పాడు.ఇదిలా ఉండగా.. ఉత్తరప్రదేశ్‌లో మత మార్పిడి నిషేధిత చట్టం అమలులో ఉన్నది. ఈ నేపథ్యంలో ఈ పెళ్లి అంశాన్ని పరిశీలిస్తున్నట్లు పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో, ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. #Amroha : Shivani became Shabnam in love... Divorcing her first husband & Married with Shiva Shivani left Muslim religion and converted to Hinduism and got married The case of a village of Thana Said Nangli #UttarPradesh pic.twitter.com/QnJyKzl1PZ— Indian Observer (@ag_Journalist) April 9, 2025 -
యూపీ మహిళ నిర్వాకం.. 10 రోజుల్లో కూతురు పెళ్లి.. కాబోయే అల్లుడితో అత్త జంప్!
పది రోజుల్లో కూతురి వివాహం జరగాల్సి ఉంది. ఆహ్వాన పత్రాలు పంచి.. బంధువులను కూడా ఆహ్వానించారు. అంతలోనే షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఆమె తల్లి తన కాబోయే భర్తతో పారిపోవడంతో ఆమెతో పాటు కుటుంబ సభ్యులందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని అలీఘర్‌లో జరిగింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.నాలుగు నెలల క్రితం ఓ మహిళ తన కూతురు వివాహం చేసేందుకు ఓ సంబంధం చూసింది. ఓ యువకుడితో తన కుమార్తెకు పెళ్లి చేయడానికి నిశ్చయించింది. ఈ నెల 16న పెళ్లి జరగాల్సి ఉండగా.. ఆమె తల్లి తనకు కాబోయే అల్లుడితో పారిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. పారిపోయేటప్పుడు తన కుమార్తె వివాహం కోసం దాచిన రూ. 5 లక్షలు విలువ చేసే బంగారంతో పాటు 5.5 లక్షలకు పైగా నగదు కూడా తనతో తీసుకెళ్లింది.అయితే పెళ్లి కుదిరిన కొద్ది రోజుల తర్వాత అల్లుడు తన అత్తకు మొబైల్ ఫోన్ బహుమతిగా అందించాడు. తరుచూ ఆమెతో ఫోన్లో మాట్లాడే వాడు. పలుమార్లు అత్త ఇంటికి రావడంతో పాటు, గంటల తరబడి ఒకే గదిలో అత్తతో మాట్లాడేవాడు. ఈ క్రమంలో అల్లుడితో ప్రేమలో పడిన అత్త, పెళ్లికి మరో పది రోజులు ఉందనగా ఇంట్లోని డబ్బు, నగలు తీసుకొని, అతడితో పారిపోయింది. దీంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీస్ అధికారి మహేష్ కుమార్ మాట్లాడుతూ.. మహిళ ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయిందని తెలిసింది. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నామని వెల్లడించారు. -
Meerut Murder Case: మా అన్న బిడ్డే అయితే పెంచుకుంటాం
మీరట్: గత నెలలో యూపీలో సంచలన సృష్టించిన భర్త హత్య కేసులో నిందితురాలిగా మీరట్ జైల్లో ఉన్న ముస్కాన్ గర్బవతి అని మెడికల్ రిపోర్ట్ లో రావడంతో పుట్టబోయే బేబీ సంగతి ఏంటనే చర్చ మొదలైంది. భర్తను ప్రియుడితో సాహిల్ శుక్లాతో కలిసి హత్య చేసి ఇప్పుడు జైల్లో ఉన్న ముస్కాన్ గురించి కనీసం ఆమె కుటుంబం కూడా పట్టించుకోవడం లేదు. ముస్కాన్ గర్భం దాల్చింది అన్న తర్వాత ఆమె కుటుంబం నుంచి ఒక్క మాట కూడా రాలేదు. భర్తను హత్య చేసిన తర్వాతే ఆమెను పట్టించుకోవడం మానేసిన కుటుంబ సభ్యులు.. ఈ విషయం గురించి కూడా ఎటువంటి ఆసక్తి చూపలేదు.ఈ విషయంపై హత్య గావించబడ్డ సౌరభ్ సోదరుడు మాత్రం.. ముస్కాన్ కు పుట్టబోయే బిడ్డ సౌరభ్ రక్తం అయితే తాము తప్పకుండా పెంచుకుంటామన్నాడు. సౌరబ్ రాజ్ పుత్ సోదరుడు బబ్లూ రాజ్ పుత్ మాట్లాడుతూ.. ‘ ముస్కాన్ కు పుట్టబోయే బిడ్డ మా అన్నకు సంబంధించిన బేబీ అయితే మేము కచ్చితంగా పెంచుకుంటాం. అన్నీ చూసుకుంటాం.’ అని స్పష్టం చేశాడు.ముస్కాన్ గర్భవతి అని తెలిసినా..ముస్కాన్ గర్భవతి అని తెలిసినప్పటికీ ఆమె కుటుంబ నుంచి ఎవరూ కూడా జైలుకు వచ్చి చూడలేదు. కాకపోతే ఆమె ప్రియుడు సాహిల్ కుటుంబ సభ్యులు మాత్రం సోమవారం జైలుకు వచ్చి అతన్ని పరామర్శించి వెళ్లారు. సాహిల్ నాన్నమ్మ జైలుకు వచ్చి మనవడితో మాట్లాడి వెళ్లినట్లు జైలు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ముస్కాన్, సాహిల్‌లు ఇద్దరూ మీరట్ జిల్లా జైల్లో వేర్వేరు బారక్‌ల్లో ఉంటున్నారు. తాము కలిసి ఉంటామని ఒకే బారక్ ఇవ్వమని డిమాండ్ చేసినా జైలు రూల్స్ ఒప్పుకోవమని చెప్పి వారికి సెపరేట్ రూమ్‌లే కేటాయించారు అధికారులు. ముస్కాన్ గర్భం దాల్చిన విషయాన్ని సీనియర్ జైలు సూపరింటెండెంట్ వీరేష్ రాజ్ శర్మ వెల్లడించారు. ముస్కాన్‌కు వైద్య పరీక్షలు నిర్వహించాలని కోరుతూ జైలు అధికారులు సీఎం కార్యాలయాన్ని కోరారు. దీంతో ఇటీవల ఆమెకు గర్భ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలినట్లు చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అశోక్ కటారియా తెలిపారు. కాగా, సౌరభ్ రాజ్‌పుత్, ముస్కాన్‌లు 2016లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అతడు మర్చంట్ నేవీలో పని చేసేవాడు. వారికి 2019లో కుమార్తె జన్మించింది. ఆ తర్వాత సాహిల్(25)తో ముస్కాన్ వివాహేతర సంబంధం పెట్టుకొంది. దీనిపై వారు విడాకుల వరకు వెళ్లారు. కానీ, కుమార్తె కోసం సౌరభ్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. తర్వాత ఉద్యోగం నిమిత్తం విదేశాలకు వెళ్లిన అతడు.. ఈ ఏడాది ఫిబ్రవరిలో కుమార్తె పుట్టినరోజు కోసం తిరిగొచ్చాడు. ఇది నచ్చని ముస్కాన్.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. అతడి శరీరాన్ని ముక్కలు చేసి.. వాటిని ఓ డ్రమ్ములో వేసి సిమెంట్‌తో సీల్ చేసింది. -
మీరట్ హత్య కేసులో మరో ట్విస్ట్.. వెలుగులోకి మరో కీలక విషయం
మీరట్: మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్ హత్య కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ప్రేమించి వివాహం చేసుకున్న భర్తను ప్రియుడి సాయంతో భార్యే దారుణంగా హత్య చేసి, ముక్కలు చేసిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసులో తాజాగా మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న నిందితురాలు ముస్కాన్ రస్తోగి గర్భం దాల్చినట్లు సీనియర్ జైలు సూపరింటెండెంట్ వీరేష్ రాజ్ శర్మ వెల్లడించారు.ముస్కాన్‌కు వైద్య పరీక్షలు నిర్వహించాలని కోరుతూ జైలు అధికారులు సీఎం కార్యాలయాన్ని కోరారు. దీంతో ఇటీవల ఆమెకు గర్భ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలినట్లు చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అశోక్ కటారియా తెలిపారు. రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తున్న ఈ హత్య కేసులో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.ఈ కేసులో అరెస్టైన ముస్కాన్, సాహిల్‌కు సంబంధించి.. గతంలో కూడా పలు కీలక విషయాలను పోలీసులు వెల్లడించిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ మాదకద్రవ్యాలకు బానిసలుగా మారారని పేర్కొన్నారు. జైల్లో ఆహారం తినకుండా తమకు గంజాయి, మత్తు ఇంజెక్షన్లు ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిపారు. అరెస్ట్ నాటి నుంచి అవి దొరక్కపోవడంతో విచిత్రంగా ప్రవర్తిస్తున్నారని.. తరచూ గంజాయి కోసం డిమాండ్ చేసినట్లు కూడా పోలీసులు చెప్పారు.సౌరభ్ రాజ్‌పుత్(29), ముస్కాన్(27) 2016లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అతడు మర్చంట్ నేవీలో పని చేసేవాడు. వారికి 2019లో కుమార్తె జన్మించింది. ఆ తర్వాత సాహిల్(25)తో ముస్కాన్ వివాహేతర సంబంధం పెట్టుకొంది. దీనిపై వారు విడాకుల వరకు వెళ్లారు. కానీ, కుమార్తె కోసం సౌరభ్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. తర్వాత ఉద్యోగం నిమిత్తం విదేశాలకు వెళ్లిన అతడు.. ఈ ఏడాది ఫిబ్రవరిలో కుమార్తె పుట్టినరోజు కోసం తిరిగొచ్చాడు. ఇది నచ్చని ముస్కాన్.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. అతడి శరీరాన్ని ముక్కలు చేసి.. వాటిని ఓ డ్రమ్ములో వేసి సిమెంట్‌తో సీల్ చేసింది. -
యూపీలో ఏం జరుగుతోంది?: సుప్రీంకోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ: ఉత్తర్ ప్రదేశ్ పోలీసుల తీరుపై దేశ అత్యున్నత న్యాయం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సివిల్ కేసుల్ని క్రిమినల్ కేసులుగా నమోదు చేయడంపై సుప్రీంకోర్టు మండిపడింది. యూపీలో చట్టాన్ని అతిక్రమించే చర్యలే ప్రతిరోజూ కనిపిస్తున్నాయంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. ఓ వ్యక్తి తాను తిరిగి తీసుకున్న నగదును ఇవ్వకపోవడంతో అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు యూపీ పోలీసులు. ఈ కేసులో సుప్రీంకోర్టులో విచారణకు రావడంతో అసలు యూపీలో ఏం జరుగుతుందని సూటిగా ప్రశ్నించింది సీజేఐ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్శనాథన్‌లతో కూడిన ధర్మాసనం.‘ఇదొక సివిల్ కేసు.. దీన్ని క్రిమినల్ కేసు కింద ఎందుకు ఫైల్ చేశారు. యూపీ పోలీసుల తీరు ఎంతమాత్రం సహేతుకం కాదు. సివిల్ నేపథ్యం ఉన్న కేసుల్ని క్రిమినల్ కేసుగా ఎందుకు మార్చి రాశారు. చట్ట ప్రకారం ఇది సరైనది కాదు. ఒక మనిషి దగ్గర తీసుకున్న డబ్బును తీసుకున్న వ్యక్తి తిరిగి ఇవ్వలేని పక్షంలో అది క్రిమినల్ కేసులోకి రాదు యూపీలో ప్రతీరోజూ చాలా వరకూ ఈ తరహా కేసులే కనిపిస్తున్నాయి. సివిల్ కేసుల్ని తీసుకొచ్చి క్రిమినల్ కేసుల కింద ఎలా ఫైల్ చేస్తారు. ఇది కంప్లీట్ గా చట్టాన్ని అతిక్రమించడమే’ అని ధర్మాసనం చురకలు అంటించింది. ఇదీ చదవండి: మీ తీరు అమానవీయం’.. సీఎం యోగి సర్కార్‌పై సుప్రీం కోర్టు -
బాల రాముడికి సూర్యతిలకం
అయోధ్య: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో శ్రీరామ నవమి వేడుకలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. భవ్య మందిరంలో కొలువుదీరిన బాల రాముడికి ఆదివారం సూర్య భగవానుడు తిలకం అద్దడం చూసి భక్తులు పులకించిపోయారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన తిలకం 4 నిమిషాలపాటు కొనసాగడం అమితంగా ఆకట్టుకుంది. కొందరు గర్భాలయంలో ఆనందంతో నృత్యాలు చేశారు. శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా సూర్యతిలకం అద్దే కార్యక్రమం నిర్వహించినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు వెల్లడించింది. అలాగే ప్రభు శ్రీరామ్‌లల్లాకు అర్చకులు ప్రత్యేకంగా మహా మస్తకాభిషేకం నిర్వహించినట్లు తెలియజేసింది. 56 పదార్థాలతో కూడిన భోగ్‌ను శ్రీరాముడికి నివేదించారు. ప్రత్యేక హారతి ఇచ్చారు. గర్భాలయంలో సూర్యతిలకం, మహా మస్తకాభిషేకాన్ని నేరుగా చూడలేని భక్తులు టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించి తన్మయులయ్యారు. శ్రీరామ నవమి సందర్భంగా బాలరాముడిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. 10 లక్షల మందికిపైగా తరలివచ్చినట్లు అంచనా. -
Sri Rama Navami: అయోధ్యకు ఐదు లక్షల మంది భక్తులు.. భద్రత కట్టుదిట్టం
అయోధ్య: నేడు (ఆదివారం) దేశవ్యాప్తంగా శ్రీరామనవమి ఉత్సవాలు(Sri Ramanavami celebrations) అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఆలయాలన్నీ భక్తుల సందడితో కళకళలాడుతున్నాయి. శ్రీరాముడు జన్మించిన యూపీలోని అయోద్యలో అత్యంత వైభవంగా శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయి. శ్రీరామదర్బారుకు ఈ రోజు ఉదయానికే ఐదు లక్షల మంది భక్తులు చేరుకున్నారు.శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలోని బాలక్ రాముణ్ణి దర్శించుకునే వేళలను పొడిగించారు. ఈరోజు బాలరాముడు భక్తులకు 18 గంటలపాటు దర్శనమివ్వనున్నాడు. ఉదయం 5 గంటలకు తెరుచుకున్న ఆలయ తలుపులు రాత్రి 11 గంటల వరకూ తెరచివుంచనున్నారు. వీవీఐపీ దర్శనాలను(VVIP visits) కూడా నిలిపివేశారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు సూర్య వంశస్థుడైన శ్రీరామునికి సూర్య భగవానుడు స్వయంగా తిలకం దిద్దనున్నాడు. (ఆ సమయంలో సూర్య కిరణాలు శ్రీరాములవారి నుదుటను తాకనున్నాయి)ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆలయ ట్రస్ట్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అయోధ్యలోని సుమారు ఎనిమిది వేల ఆలయాలు, మఠాలను శ్రీరామనవమి సందర్భంగా అందంగా తీర్చి దిద్దారు. రామనగరి అయోధ్యలో ఈరోజు సాయంత్రం సరయూ తీరంలో రెండున్నర లక్షల దీపాలను వెలిగించనున్నారు.ఇది కూడా చదవండి: Sri Rama Navami: బెంగాల్ నుంచి ముంబై వరకూ.. హై అలర్ట్ -
పెళ్లి రోజే భార్య కళ్ల ముందు కుప్పకూలి..
ఆ జంట విజయవంతంగా పాతికేళ్లు వివాహ బంధం పూర్తి చేసుకుంది. కుటుంబ సభ్యుల సూచన మేరకు సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించింది. బంధువులు, అతిథులంతా ఆ సంబురంలో భాగం అయ్యారు. కొందరు అమ్మాయిలు ఆ జంటతో వేదిక మీద డ్యాన్సులు వేయించారు. అయితే అంతలోనే అనుకోని విషాదం ఆ వేదికను ఆవిరించింది. అచేతనంగా పడి ఉన్న భర్తను చూసి ఆ భార్య గుండెలు అవిసేలా రోదించడం పలువురిని కంటతడి పెట్టించింది. లక్నో: వసీం సర్వత్(Wasim sarwat) ఉత్తర ప్రదేశ్ బరేలీ(Bareilly)లో షూ వ్యాపారి. 25వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా గ్రాండ్‌గా పార్టీ ఏర్పాటు చేశారు. హ్యాపీగా స్టేజ్‌పై తన భార్య ఫరాతో కలిసి డ్యాన్స్ చేశాడు. అయితే, ఉన్నట్లుండి ఒక్కసారిగా కుప్పకూలి కిందపడిపోయాడు. దీంతో అక్కడున్న వారంతా ఆందోళనకు గురయ్యారు. హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించగా లాభం లేకపోయింది. అప్పటికే ఆయన గుండెపోటు(Heart Attack)తో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కళ్లెదుటే భర్త మరణంతో భార్య కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. వసీం స్టేజ్‌పై కుప్పకూలి పడిపోయిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.🚨2 April 25 : Shoe merchant Wasim died of a #heartattack2025 while dancing with his wife on his 25th wedding anniversary in Bareilly district of Uttar Pradesh.#LuciferShotWorking #ChipShot pic.twitter.com/OrHYonE2NP— Anand Panna (@AnandPanna1) April 3, 2025హఠాన్మరణాలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా నమోదు అవుతున్నాయి. అప్పటిదాకా ఆరోగ్యంగా.. హుషారుగా కనిపించవాళ్లు ఉన్నట్లుండి కుప్పకూలి ప్రాణం విడుస్తున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించాలని నిపుణులు సూచిస్తుండగా.. ఇలాంటి అత్యవసర సందర్భాల్లో సీపీఆర్లాంటి వాటిపై ప్రజలకు అవగాహన తప్పనిసరిగా ఉండాలి అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.నోట్: పై వీడియోలోని దృశ్యాలు మిమ్మల్ని కలవరపాటుకు గురిచేయొచ్చు. కేవలం వార్తను అథెంటిక్‌గా అందించే ఉద్దేశంలో భాగంగానే వీడియోను అందిస్తున్నాం. -
ఇకనైనా అరాచకం ఆగేనా!
రాచరికాల్లో అధికారానికీ, దర్పానికీ, దానిద్వారా లభించే న్యాయానికీ రాజదండం చిహ్నం. ఈమధ్యకాలంలో బుల్డోజర్ అలాంటి పాత్ర పోషిస్తున్న వైనం కనబడుతోంది. ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ పాలన మొదలయ్యాక బుల్డోజర్ అర్థం, దాని పరమార్థం మారిపోయాయి. ఆ రాష్ట్రాన్ని చూసి మరికొన్ని రాష్ట్రాలు వాతలు పెట్టుకోవటం కూడా మొదలైంది. ఈ నేపథ్యంలో 2021 మార్చిలో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో అమానవీయంగా, చట్టవిరుద్ధంగా ఆవాసాలను కూల్చేసిన అధికారగణంపై మంగళవారం సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేయటంతోపాటు, ఇళ్లు కోల్పోయిన ఆరుగురు పిటిషనర్లకూ ఆరువారాల్లో రూ. 10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అంతేకాదు... ఈ ఉదంతం తమ అంతరాత్మను తీవ్రంగా కలవరపరిచిందని ధర్మాసనం తెలియజేసింది. అధికారమంటే ఇష్టానుసారం ఏదైనా చేయడానికి దొరికిన లైసెన్స్‌గా భావించే సంస్కృతి దేశంలో ముదిరిపోయింది. ఒక్క యూపీలోనేకాదు... మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ వగైరాల్లో ఇలాంటి ఉదంతాలు చోటుచేసుకున్న తీరు గమనిస్తే ఇదో అంటువ్యాధిగా మారిందన్న అభిప్రాయం కలుగుతుంది. ఏదైనా కేసులో నిందితులుగా ఉన్నా లేదా శిక్షపడినా... అధికార పక్షానికి అనుకూలంగా లేకపోయినా అలాంటివారి ఇళ్లూ, దుకాణాలూ కూల్చేయడానికి బుల్డోజర్లు అత్యుత్సాహంతో ఉరుకుతున్న తీరు ఆశ్చర్యపరుస్తోంది. నిర్మాణ నిబంధనల్ని తీవ్రంగా ఉల్లంఘించారని తేలినా, ప్రభుత్వ భూమినో, మరొకరి భూమినో దురా క్రమించి కట్టారని తేలినా అలాంటివాటిని కూల్చేయటాన్ని ఎవరూ తప్పుబట్టరు. కానీ అందుకొక విధానం ఉండాలి. చట్ట నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలి. తప్పు చేశారని ఆరోపణ లొచ్చినవారికి తగిన నోటీసులిచ్చి వారి సంజాయిషీ కోరాలి. సంతృప్తి చెందనట్టయితే ఆక్రమణ దారులకు హేతుబద్ధమైన వ్యవధినిచ్చి కూల్చివేత ప్రక్రియ ప్రారంభించాలి. ఇప్పుడు సుప్రీంకోర్టు విచారిస్తున్న కేసు సంగతే తీసుకుంటే 2021 మార్చి 1న మొదటిసారి అక్కడ నివాసముంటున్నవారికి నోటీసులు వచ్చాయి. వారికి అంతకు దాదాపు మూణ్ణెల్ల ముందే... అంటే జనవరి 8న నోటీసులిచ్చినట్టు, అందులో ఆ నెల 27లోగా ఎవరికివారు సొంత ఖర్చులతో ఇళ్లు కూల్చేయాలని ఆదేశించినట్టు ఉంది. దానికి స్పందన రాకపోవటంతో తాజాగా నోటీసులు జారీచేశామని అందులో పేర్కొన్నారు. మరో ఆరు రోజుల్లో బుల్డోజర్లతో వచ్చి ఇళ్లు కూల్చేశారు. తొలుత నోటీసులు వ్యక్తిగతంగా ఇవ్వటానికి చేసిన ప్రయత్నం విఫలం కావటంతో ఇళ్ల దగ్గర అతికించామన్న ప్రభుత్వ వాదనను న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ లతో కూడిన బెంచ్ విశ్వసించలేదు. పిటిషనర్లకు సహేతుకమైన వ్యవధినిచ్చిన దాఖలా కనబడటం లేదని, ఇది పౌరులకు రాజ్యాంగంలోని 21వ అధికరణ ద్వారా సమకూరిన ఆవాస హక్కును ఉల్లంఘించటమేనని తేల్చిచెప్పింది. ఈ తీర్పు అనేకవిధాల ఎన్నదగినది. పిటిషనర్లకు ఆ స్థలంపై చట్టబద్ధమైన హక్కుందా లేదా అన్న అంశంలోకి ధర్మాసనం పోలేదు. దానిపై వారు విడిగా న్యాయస్థానాల్లో తేల్చుకోవాల్సిందే! 2023 ఏప్రిల్‌లో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన రాజకీయ నాయకుడు, పలు కేసుల్లో నింది తుడైన అతీఖ్ అహ్మద్ అక్రమంగా ఆక్రమించుకున్న భూమిలో ఈ ఇళ్లున్నాయని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఎన్నడో 1906లో అప్పటి అలహాబాద్ జిల్లా కలెక్టర్ షకీర్ అహ్మద్ అనే వ్యక్తికి 30 ఏళ్లకు లీజుకిచ్చి మరో రెండు దఫాలు పొడిగించుకునే వీలు కల్పించారని రికార్డులు చెబు తున్నాయి. 1960లో జిల్లా మేజిస్ట్రేట్ అనుమతితో షకీర్ దాని హక్కుల్ని వేరేవారికి బదలాయించాడు. ఆ తర్వాత క్రమంలో అది మరికొందరి చేతులు మారింది. చివరకు ప్రస్తుత పిటిషనర్లు దాన్ని కొనుగోలు చేశారు. ప్రభుత్వం వాదిస్తున్నట్టు ఆ కొనుగోలు చెల్లకపోవచ్చు. అది ప్రజా ప్రయోజనం కోసం వినియోగించాల్సిన భూమే కావొచ్చు. అంతమాత్రాన నిబంధనలకు తిలోదకాలిచ్చి ఇళ్లు కూల్చటం సరైన చర్య కాదు. సుప్రీంకోర్టు తీర్పు దీన్ని తేటతెల్లం చేసింది.ఈ సందర్భంగా వేరేచోట బుల్డోజర్ కూల్చివేతలు సాగిస్తుండగా ఒకటో తరగతి బాలిక అనన్యా యాదవ్ తన స్కూల్ బ్యాగ్‌ను రక్షించుకోవటానికి మంటలంటుకున్న షెడ్ సమీపానికి వెళ్లిన వీడియోను న్యాయమూర్తులు ప్రస్తావించటం గమనార్హం. అలాంటి ఉదంతాలు అందరినీ దిగ్భ్రాంతిపరుస్తాయన్న వారి వ్యాఖ్యలతో ఏకీభవించని వారుండరు. గత నవంబర్‌లో జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సైతం ఇటువంటి వ్యాఖ్యలే చేసింది. ‘ఇళ్లు కూల్చినప్పుడల్లా నిశిరాత్రిలో నడిరోడ్లపై చిన్నారులూ, మహిళలూ విలపిస్తున్న దృశ్యాలు అరాచకానికి ఆనవాళ్లుగా నిలుస్తున్నాయి’ అని ధర్మాసనం గుర్తు చేసింది. ఇలాంటి సంద ర్భాల్లో కూల్చివేతలకు పాల్పడిన అధికారుల నుంచి ఇళ్ల, దుకాణాల పునర్నిర్మాణానికి అయ్యే వ్యయం వసూలు చేయాలని కూడా చెప్పింది. ఇతర మార్గదర్శకాలు కూడా రూపొందించింది. సుప్రీంకోర్టు తాజా ఆదేశాలైనా ప్రభుత్వాల కళ్లు తెరిపించాలి. కేవలం అయిదేళ్ల కోసం ఎన్నికై అధి కారంలోకొచ్చిన ప్రభుత్వాలు శాశ్వతంగా నిలిచే రాజ్యాంగ విలువలను కాలరాయటం, ఇష్టాను సారం ప్రవర్తించటం తప్పుడు సంకేతాలిస్తుంది. సాధారణ పౌరుల్ని కూడా చట్ట ఉల్లంఘనలకు ప్రోత్సహిస్తుంది. అందుకే ప్రభుత్వాలు ఎంత త్వరగా మేల్కొంటే అంత మంచిది. నాలుగేళ్లు ఆలస్యమైనా సర్వోన్నత న్యాయస్థానంలో బాధితులకు సరైన న్యాయం దక్కటం హర్షించదగ్గది. -
ప్రియుడితో భార్యకు పెళ్లి చేసిన భర్త.. అసలు ట్విస్ట్ ఇచ్చిన రెండో అత్త
లక్నో: నాడు తన భార్య ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరిపించిన భర్త వ్యవహారంలో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్న రాధికకు రెండో భర్త వికాస్ తల్లి షాకిచ్చింది. రాధికను తిరిగి అతడి మొదటి భర్త బబ్లూకే అప్పగించింది. ఈ క్రమంలో ఆమె అత్త.. కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో, ప్రేమకథ అనూహ్య మలుపు తిరిగింది.వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్ నగర్ జిల్లా కటార్‌జాట్ గ్రామంలో తన భార్య రాధికకు ఆమె ప్రియుడు వికాస్‌తో ఇటీవలే భర్త బబ్లూ పెళ్లి చేయించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఏదైనా ప్రాణహాని తలపెడుతుందనే భయంతో బబ్లూ తన భార్యను ఆమె ప్రియుడికే కట్టబెట్టాడు. అయితే రాధికకు రెండో భర్త వికాస్ తల్లి షాకిచ్చింది. రాధికను తిరిగి అతడి మొదటి భర్త బబ్లూకే అప్పగించింది.ఈ సందర్భంగా రాధిక అత్త మాట్లాడుతూ..‘రాధిక భర్త, అతడి పిల్లల మానసిక క్షోభ గురించి ఆలోచించి, నేను చలించిపోయాను. అందుకే మొదటి భర్త బబ్లూ దగ్గరికి వెళ్లిపొమ్మని రాధికకు తేల్చి చెప్పాను’ అని వికాస్ తల్లి వెల్లడించింది. ఈ విషయంపై కటార్‌జాట్ గ్రామంలో మళ్లీ పంచాయతీ జరిగింది. బబ్లూ తన భార్య రాధికను చూసుకుంటాడని గ్రామ పెద్దల సమక్షంలో ప్రకటించాడు. వారి ఎదుట ప్రమాణం చేసిన తర్వాత రాధికను బబ్లూ తిరిగి స్వీకరించాడు. భవిష్యత్తులో రాధికకు ఏదైనా ప్రమాదం జరిగితే, దానికి తానే బాధ్యత వహిస్తానని హామీ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు వికాస్ తల్లి గొప్ప మనసు గురించి అంతటా చర్చ జరుగుతోంది. -
‘మీ తీరు అమానవీయం’.. సీఎం యోగి సర్కార్‌పై సుప్రీం కోర్టు
లక్నో: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి సర్కార్‌పై సుప్రీం కోర్టు (Supreme Court) మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. మీ తీరు రాజ్యాంగ విరుద్ధం. అమానవీయం. మమ్మల్ని తీవ్ర దిగ్భ్రాంతిని గురి చేస్తోందని వ్యాఖ్యానించింది. 2023లో యూపీకి చెందిన గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ హత్య గురయ్యాడు. హత్యకు గురైన అతిక్ చెందిన స్థిరాస్థుల్ని అధికారులు కూల్చివేశారు. వాస్తవానికి బుల్డోజర్తో కూల్చేసిన నిర్మాణాలతో అతిక్‌కు సంబంధం లేదు. ఆ ఇళ్లు లాయర్లు, ప్రొఫెసర్లతో పాటు ఇతర రంగాల్లో విధులు నిర్వహిస్తున్నవారివి. ఎప్పటిలాగే సంఘ విద్రోహ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపే సీఎం యోగి ప్రభుత్వం (Yogi Adityanath) పొరపాటున బాధితుల ఇళ్లను బుల్డోజర్లతో (Bulldozer justice) కూల్చేసింది. దీంతో బాధితులు సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.రూ.10లక్షల నష్టపరిహారం ఆ పిటిషన్లపై మంగళవారం సుప్రీం కోర్టు జస్టిస్ ఎస్ ఓకా,జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా బూల్డోజర్ చర్యలపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి సర్కార్‌తో పాటు ప్రయాగ్‌రాజ్ అడ్మినిస్ట్రేషన్ విభాగంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మీ తీరు రాజ్యాంగ విరుద్ధం. అమానవీయం. మమ్మల్ని తీవ్ర దిగ్భ్రాంతిని గురి చేస్తోంది. తక్షణమే ఒక్కో బాధిత కుటుంబానికి రూ.10లక్షల నష్టపరిహారం అందించాలని సూచించింది.అది మా పొరపాటేఅంతకుముందు అడ్వకేట్, ప్రొఫెసర్ మరో ముగ్గురు దాఖలు చేసిన పిటిషన్ల గురించి అత్యున్నత న్యాయస్థానం యూపీ ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించింది. నిబంధనలకు విరుద్ధంగా బుల్డోజర్లతో ఇళ్లను ఎలా కూల్చేస్తారు? కూల్చేవేతకు ఓ రోజు ముందు నోటీసులు ఎలా అంటిస్తారని ప్రశ్నించింది. అయితే, సుప్రీం ధర్మాసనం అడిగిన ప్రశ్నలకు యూపీ అధికారులు బదులిచ్చారు. మేం కూల్చేసిన ఇళ్లు గ్యాంగ్‌స్టర్ అతిక్ నిర్మించుకున్నాడేమోనని పొరపాటున బుల్డోజర్ చర్యలకు దిగినట్లు వివరణ ఇచ్చారు.రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా నోటీసులు ఎందుకు పంపలేదుకూల్చివేత నోటీసులు అందజేసిన తీరుపై అధికారులను కోర్టు మందలించింది. కూల్చేసిన ఇళ్లనకు నోటీసులు అతికించామని రాష్ట్ర న్యాయవాది చెప్పగా, రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా నోటీసులు ఎందుకు పంపలేదని అడిగింది. అదే సమయంలో ఈ తరహా చర్యల్ని వెంటనే ఆపాలి. బాధితులు ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులయ్యారు. వారికి నష్టపరిహారం కింద రూ.10 లక్షల పరిహారం చెల్లించండి. పరిహారం ఇస్తే వారికి న్యాయం జరిగినట్లవుతుందని జస్టిస్ ఎస్.ఓకా అభిప్రాయం వ్యక్తం చేశారు.మా మనస్సాక్షిని షాక్‌కు గురిచేస్తున్నాయిఈ కేసులు మా మనస్సాక్షిని షాక్‌కు గురిచేస్తున్నాయి. పిటిషనర్ల ఇళ్లను నిబంధనలకు విరుద్ధంగా కూల్చివేశారని కోర్టు అభిప్రాయ పడినట్లు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇళ్లు కూల్చేస్తున్నట్లు నోటీసులు గాని, నోటీసులు తీసుకున్న వారికి వివరణ ఇచ్చేందుకు తగిన అవకాశం ఇవ్వలేదని ప్రస్తావించింది. అందరూ కలత చెందుతున్నారుఅదే సమయంలో ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్లో బుల్డోజర్ కూల్చివేతల సమయంలో వైరలైన ఓ వీడియో గురించి కోర్టు ప్రత్యేకంగా ప్రస్తావించింది. అధికారులు బుల్డోజర్లతో ఇళ్లను కూల్చే సమయంలో సదరు ఓ ఇంటికి చెందిన బాలిక తన పుస్తకాల్ని చేతపట్టుకుని ఉండడాన్ని చూడొచ్చు. ఇలాంటి దృశ్యాలతో అందరూ కలత చెందుతున్నారు’ అని జస్టిస్ భుయాన్ అన్నారు. -
Uttar Pradesh: భవనంలో అగ్ని ప్రమాదం.. కొనసాగుతున్న సహాయక చర్యలు
నోయిడా: వేసవి కాలం వచ్చిందంటే చాలు.. అగ్ని ప్రమాదాలు(Fire hazards) చోటుచేసుకుంటాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో గల సెక్టార్ 18లోని ఒక భవనంలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అగ్ని కీలల నుంచి తప్పించుకునేందుకు కొందరు భవనంపై నుంచి దూకడాన్ని మనం వీడియోలో చూడవచ్చు नोएडा के सेक्टर 18 स्थित बिल्डिंग में आग लग गई। देखिए लोग कैसे कूदकर अपनी जान बचा रहे हैं: @NavbharatTimes pic.twitter.com/2I4LC0IVgF— NBT Uttar Pradesh (@UPNBT) April 1, 2025మీడియాకు అందిన వివరాల ప్రకారం అట్టా మార్కెట్(Atta Market)లోని ఒక వాణిజ్య భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. మంటల నుంచి తప్పించుకునేందుకు భవనంలోని వారు తొలుత భవనం పైభాగానికి చేరుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. సెక్టార్ 18లోని కృష్ణ అపరా ప్లాజాలో ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కాగా ఈ ప్రమాదం ఎలా జరిగిందన్నదీ ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. తొలుత భవనం బేస్మెంట్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి అగ్ని జ్వాలలు మొదటి అంతస్తుకు, తరువాత రెండవ అంతస్తుకు చేరుకున్నాయి. ప్రస్తుతం సంఘటనా స్థలంలో ఉన్న అగ్నిమాపక సిబ్బంది భవనంలో చిక్కుకున్నవారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.ఇది కూడా చదవండి: Rajasthan: లీకయిన విషవాయువు.. ఒకరు మృతి.. 40 మందికి అస్వస్థత -
రామాయణం చదివైనా బాగుపడు తల్లీ
ముస్కాన్ రస్తోగీ(muskaan rastogi).. గత పదిరోజులుగా ఇటు మీడియా అటు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న పేరు ఇది. ప్రాణంగా ఆమెను ప్రేమించిన భర్తను.. గంజాయి మత్తులో ప్రియుడితో కలిసి జోగుతూ ముక్కలు చేసి, ఆపై డ్రమ్ములో ఆమె దాచిన వైనం ‘మీరట్ ఉదంతంగా’గా తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే ఆమెలో సత్పరివర్తన రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెబుతున్నారు ఎంపీ అరుణ్ గోవిల్.టీవీ రామాయణంతో అన్ని భాషల ప్రజలకు చేరువైన నటుడు అరుణ్ గోవిల్.. మీరట్ ఎంపీ అనే సంగతి తెలిసిందే కదా. తాజాగా.. ఆదివారం చౌదరి చరణ్ సింగ్ జిల్లా జైలుకు వెళ్లి అక్కడి ఖైదీలకు ఆయన 1,500 రామాయణ ప్రతులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తన నుంచి రామాయణం ప్రతి అందుకున్న వెంటనే ముస్కాన్ భావోద్వేగానికి గురైందని ఆయన అన్నారు.‘‘రామాయణం పుస్తకాన్ని(Ramayana Book) అందుకోగానే ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయ్. ఇది ఆమె జీవితంలో కచ్చితంగా చీకట్లు పారదోలుతుందని చెప్పాను. ఇది చదివైనా జీవితంలో బాగుపడమని.. మంచి మార్పు రావాలని కోరుకుంటున్నట్లు ముస్కాన్‌తో అన్నాను’’ అని అరుణ్ గోవిల్(Arun Govil) మీడియాకు వివరించారు. ముస్కాన్‌తో పాటు ఈ కేసులో సహా నిందితుడు సాహిల్ శుక్లా కూడా రామాయణం అందుకున్నాడట. ఇదిలా ఉంటే.. దేశవ్యాప్తంగా 11 లక్షల రామాయణ కాపీలను పంచాలని అరుణ్ గోవిల్ నిర్ణయించుకున్నారు.ఈ క్రమంలోనే ఇంటింటికీ రామాయణం అనే కార్యక్రమం చేపట్టిన ఆయన.. ఇలా ఖైదీలకూ పంపిణీ చేశారు.మీరట్‌లో మార్చి 4వ తేదీన సౌరభ్ తివారీ హత్య జరిగింది. భర్తను ముక్కలు చేసి డ్రమ్ములో ఉంచి సిమెంట్‌తో సీల్ చేసిందామె. ఆపై ప్రియుడితో కలిసి జాలీగా ట్రిప్పులు వేసింది. భర్త మృతదేహాన్ని మాయం చేసే క్రమంలో దొరికిపోతామనే భయంతో తన తల్లిదండ్రులకు ఆమె అసలు విషయం చెప్పింది. దీంతో వాళ్లే ఆమెను దగ్గరుండి పోలీసులకు అప్పజెప్పారు. ఈ కేసులో భార్య ముస్కాన్, ఆమె ప్రియుడు సాహిల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు రిమాండ్ విధించడంతో చౌదరి చరణ్ సింగ్ జిల్లా జైలుకు తరలించారు. మొదట్లో తమకు భోజనం వద్దని.. గంజాయి కావాలని.. ఇద్దరినీ ఓకే బ్యారక్ ఉంచాలంటూ జైలు సిబ్బందితో గొడవలకు దిగారు వాళ్లు. ఈ క్రమంలో వైద్యుల పర్యవేక్షణలో వాళ్లకు చికిత్స అందింది. అయితే వైద్య పర్యవేక్షణ ముగియడంతో అధికారులు వాళ్లకు పనులు అప్పజెప్పబోతున్నారు. రిమాండ్ మీద ఉన్న వీళ్లు.. కోర్టు విచారణ పూర్తయ్యేదాకా కుట్లు అల్లికలతో ముస్కన్, కూరగాయాలు పండిస్తూ సాహిల్ గడపబోతున్నారు.అది ఏఐ జనరేటెడ్ వీడియో!రిమాండ్ ఖైదీగా ఉన్న ముస్కాన్ ఓ పోలీస్ అధికారితో ఏకాంతంగా గడిపినట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో వైరల్ అయ్యింది. అయితే అది నకిలీ వీడియో అని.. తన ప్రతిష్టకు భంగం కలిగించే యత్నమని చెబుతూ సదరు అధికారి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు.. అది ఏఐ జనరేటెడ్ వీడియోగా తేల్చారు. అంతేకాదు.. దానిని అప్లోడ్ చేసిన అకౌంట్‌ను గుర్తించిన పోలీసులు, దీని వెనుక ఉన్నవాళ్లను ట్రేస్ చేసే పనిలో ఉన్నారు. మరోవైపు.. ముస్కాన్, సాహిల్ పేరిట కూడా కొన్ని వీడియోలు వైరల్ అవుతుండడం విశేషం. -
రూ. 800 ఫీజు కట్టలేదని అవమానించారు.. బాలిక ఆత్మహత్య!
ఆ బాలిక చదివేది తొమ్మిదో తరగతి.. ఎగ్జామ్ టైమ్ వచ్చింది. కానీ ఆ బాలిక స్కూల్ ఫీజు రూ. 800 కట్టాల్సి ఉంది. పరిస్థితులు అనుకూలించక ఆ కొద్ది మొత్తాన్ని పరీక్షల నాటికి కట్టలేకపోయింది. ఇంకేముందే పరీక్షలు రాయడానికి స్కూల్ యాజమాన్యం అంగీకరించకపోగా, అవమానించింది. ఇది కూడా బహిరంగంగా ఆ అమ్మాయిని స్కూల్ యాజమాన్యం అవమానించింది. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ప్రతాప్ గడ్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా పెద్ద కలకలం రేపింది.స్కూల్ ప్రిన్సిపాల్ రాజ్ కుమార్ దగ్గర్నుంచీ స్కూల్ మేనేజర్ సంతోష్ కుమార్, ఆఫీసర్ దీపక్ సరోజ్ లు ఆ బాలికను అవమానానికి గురి చేశారు. స్కూల్ పరీక్ష ఫీజు కట్టలేకపోయిందంటూ అవమానించారు. అంతేకాకుండా పరీక్షలకు అనుమతించేది లేదని చెప్పారు. ఇక చేసేది లేక అక్కడ ఏమీ మాట్లాడకుండా ఇంటికి వచ్చేసింది. లోపలకి వెళ్లి తలుపు వేసుకుంది. ఆమె తల్లి పొలం పనికి వెళ్లిపోయింది. తిరిగి సాయంత్రం వచ్చి చూసేసరికి ఆ అమ్మాయి విగత జీవిలా కనిపించింది.స్కూల్ ఫీజు కట్టలేదని ఆమెను పరీక్షకు అనుమతించడమే కాకుండా అవమానించడం దారణమని న్యాయవాది, స్థానిక పంచాయతీ సభ్యుడైన మొహ్మద్ అరిఫ్ స్పష్టం చేశారు. విద్యార్థుల్ని స్కూల్ యాజమాన్యాలు అవమానించాయంటే అది నేరం కిందకు వస్తుందన్నారు.తన కూతురు చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని తల్లి డిమాండ్ చేస్తోంది. దీనిపై భారతీయ న్యాయ సన్నిహిత సెక్షన్ 107 కింద స్కూల్ యాజమాన్యంపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
పొట్టలో మర్చిపోయిన కత్తెరను 17 ఏళ్ల తర్వాత తీశారు!
లక్నో: సిజేరియన్ సమయంలో మహిళ పొట్టలోనే కత్తెరను మర్చిపోయి కుట్లేశాడో వైద్యుడు. 2008లో ఈ ఘటన చోటుచేసుకుంది. దాదాపు 17 ఏళ్ల పాటు కడుపు నొప్పితో ఎంతో బాధపడింది ఆ మహిళ. చివరికి ఎక్స్ రేతో పొట్టలో కత్తెర ఉన్న విషయం తెల్సి ఆపరేషన్‌తో వెలుపలికి తీశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. సంధ్యా పాండే అనే మహిళకు 2008 ఫిబ్రవరి 28వ తేదీన లక్నోలోని ‘షీ మెడికల్ కేర్’ఆస్పత్రిలో సిజేరియన్తో కాన్పు చేశారు. ఆ సర్జరీ జరిగినప్పటి నుంచి పొట్టలో విపరీతమైన బాధతో ఇబ్బంది పడుతున్నారు. ఎందరో డాక్ట ర్ల వద్దకు వెళ్లారు. అయినా ఉపశమనం దొరకలేదు. ఇటీవల సంధ్యా పాండే వైద్య పరీక్షల కోసం లక్నోలోని మెడికల్ కాలేజీ ఆస్పత్రికి వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ ఎక్స్ రే కూడా తీశారు. ఆమె పొట్టలో కత్తెర ఉన్నట్లు ఎక్స్ రే రిపోర్టుతో తెలిసింది. దీంతో ఆమె కింగ్ జార్జి మెడికల్ యూనివర్సిటీ ఆస్పత్రిలో చేరారు. మార్చి 26వ తేదీన ఆపరేషన్ చేసి వైద్యులు కడుపులో ఉన్న కత్తెరను బయటకు తీశారు. ఎంతో సంక్లిష్టమైన ఆపరేషన్ ద్వారా కత్తెరను బయట కు తీశామని, కోలుకున్నాక సంధ్యా పాండేను డిశ్చార్జి చేశామని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. సంధ్య భర్త అరవింద్ కుమార్ పాండే ఫిర్యాదు మేరకు సిజేరియన్ చేసిన డాక్టర్ పుష్పా జైశ్వాల్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
భార్యను ప్రియుడికిచ్చి పెళ్లిచేసిన భర్త.. ఆ తర్వాత ఏమైందంటే?
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. తన భార్య మరో వ్యక్తిని ప్రేమించి, అతడితోనే ఉంటానని చెప్పడంతో భర్త.. వారిద్దరికీ పెళ్లి జరిపించారు. అంతేకాకుండా.. తమ ఇద్దరు పిల్లలను తానే పోషిస్తానని సదరు భర్త చెప్పుకొచ్చారు. దీంతో, ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.వివరాల ప్రకారం.. యూపీలోని సంత్ కబీర్‌నగర్ గ్రామానికి చెందిన బబ్లూ 2017లో గోరఖ్‌పూర్ జిల్లాకు చెందిన రాధికను పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, బబ్లూ జీవనోపాధి మరోచోట పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో రాధిక.. అదే గ్రామానికి చెందిన మరో యువకుడిని ప్రేమించింది. ఈ సంబంధం క్రమంగా గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. వీరి ప్రేమ వ్యవహారం భర్త బబ్లూకు కూడా తెలిసింది. దీంతో, భార్యను మందలించాడు. తీరు మార్చుకోవాలని సూచించాడు. అయితే, ఆమె మాత్రం అందుకు ఒప్పుకోలేదు. ప్రియుడితోనే ఉంటానని తెగేసి చెప్పింది. ఈ నేపథ్యంలో బబ్లూ.. నా భార్య నాతో జీవించాలా లేక తన ప్రేమికుడితో జీవించాలా అని నిర్ణయించుకుంటుందా? అని గ్రామస్తుల ముందు పంచాయితీ పెట్టాడు. ఆ మహిళ తన ప్రేమికుడితో కలిసి జీవించాలనే కోరికను వ్యక్తం చేసినప్పుడు మొత్తం సమాజం నివ్వెరపోయింది.భార్య ప్రవర్తన కారణంగా చేసేదేమీ లేకపోవడంతో.. ముందుగా భర్త తన భార్యతో కలిసి నోటరీ పబ్లిక్ కోర్టుకు హాజరయ్యాడు. ఆపై తన భార్యను ఆమె ప్రియుడితో ఒక ఆలయంలో రెండో వివాహం చేశాడు. తానే దగ్గరుండి ఆమె ఇష్టపడిన వ్యక్తితో పెళ్లి జరిపించాడు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని తెలుస్తోంది. ఇక మొదటి భర్త తన భార్యతో కలిగిన సంతానాన్ని తనతోనే పోషిస్తానని చెప్పాడు. దీంతో, ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. Darr Ka Mahaul HaiKai shocking cases mein jab patiyon ko maar diya gaya, toh pati community mein darr fail gaya hai.Sant Kabir Nagar: Ek naye twist mein, 7 saal ki shadi ke baad, ek aadmi ne apni biwi ka past accept kar liya aur khud usko uske lover ke saath vida kiya, aur… pic.twitter.com/CLwzKzg1e1— F3News (@F3NewsOfficial) March 26, 2025 -
యూపీలో అన్ని మతాల ప్రజలు సురక్షితమేనా?
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో మైనారిటీల భద్రతపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్(Yogi Adityanath) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తానొక యోగినని.. మనుషులంతా సంతోషంగా ఉండాలన్నదే తన అభిమతమని.. అందుకే రాష్ట్రంలో అన్ని మతాల వాళ్లు సురక్షితంగా ఉండగలుగుతున్నారని అన్నారు. ఈ క్రమంలో కేవలం హిందూ మతానికే బీజేపీ సర్కార్ ప్రాధాన్యత ఇస్తోందన్న విమర్శల ప్రస్తావనతో ఆయనకో ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన స్పందిస్తూ..‘‘ఉత్తర ప్రదేశ్(Uttar Pradesh)లో హిందువుల దుకాణాలు తగలబడితే.. ఆ వెంటనే ముస్లింల దుకాణాలు అగ్నికి ఆహుతి అయ్యేవి. హిందువుల ఇళ్లకు నిప్పంటుకుంటే.. కాసేపటికే ముస్లింల ఇళ్లూ తగలబడిపోయేవి. అయితే ఇదంతా 2017కి ముందు నాటి పరిస్థితి. బీజేపీ అధికారంలోకి వచ్చాక అంతా మారిపోయింది. వంద మంది హిందువుల మధ్య ఒక ముస్లిం సురక్షితంగా ఉంటున్నారు. అదే వంద మంది ముస్లింల మధ్య ఒక హిందువుకు భద్రత ఉంటోందా?.. లేదు కదా. అందుకు బంగ్లాదేశ్‌నే ఉదాహరణగా తీసుకోండి. పాకిస్థాన్ మరో ఉదాహరణ. అఫ్గనిస్థాన్‌లో ఏం జరిగిందో తెలుసు కదా!. అవతలివాడు కొట్టక ముందే జాగ్రత్త పడడంలో తప్పేముంది?’’ అని ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.హిందువులు బాగున్నారంటే.. ముస్లింలూ బాగున్నట్లే. నేనొక సాధారణ ఉత్తర ప్రదేశ్ పౌరుడిని. నేనొక యోగిని. నా దృష్టిలో అంతా సమానమే. ప్రతీ ఒక్కరూ సంతోషంగా ఉండడమే నాకు కావాలి. అదే రాష్ట్ర అభివృద్ధికి కీలకం కూడా అని అన్నారాయన. సనాతన ధర్మం ఈ భూమ్మీదే అతిపురాతన మతం అని, దానిని అనుసరించేవారు ఇతరుల విశ్వాసాలను దెబ్బతీయబోరని అన్నారు. హిందూ పాలకులు దండెత్తి ఇతర దేశాలకు ఆక్రమించుకున్న దాఖలాలు కూడా చరిత్రలో లేవన్నారు. కానీ, బదులుగా మనకు దక్కుతోంది ఏంటి? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీలాంటి ‘నమునా’ వల్లే బీజేపీ ఇవాళ దేశంలో బలంగా ఉండగలిగిందని యోగి అన్నారు. భారత్ జోడో యాత్ర పేరుతో దేశమంతా తిరిగారు. విదేశాలకు వెళ్లి మాతృదేశాన్నే తిడతారు. అందుకే ఆయన ఉద్దేశాలేంటో ప్రజలు అర్థం చేసుకోగలిగారు. ఇలాంటి ‘నమునా మనుషులే’ ఇప్పుడు బీజేపీకి కావాల్సింది. అప్పుడే దారులన్నీ సరిచేసుకుంటూ ముందుకు పోగలం. అయోధ్య, కుంభమేళా సహా దేశ ప్రతిష్టకు పేరు తెచ్చే ఏ సందర్భానైనా వివాదం చేయడమే కాంగ్రెస్‌కు తెలుసు అని అన్నారాయన. చట్టాన్నిగౌరవిస్తున్నాం, లేకుంటేనా..ప్రార్థనా స్థలాల వివాదాలపైనా సీఎం యోగి ఏఎన్ఐ ఇంటర్వ్యలో కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయ వ్యవస్థపై అపారమైన గౌరవం ఉందని.. కోర్టు నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని.. లేకుంటే ఈ పాటికే ఏం జరిగి ఉండేదో ఎవరికి తెలుసనని అన్నారాయన. భారతీయ వారసత్వానికి ఆలయాలే గుర్తింపుగా అభివర్ణించిన సీఎం యోగి.. అలాంటి వాటిని వెలుగులోకి తెచ్చి ప్రపంచానికి చాటి చెప్పడమే తమ అభిమతమని అన్నారు. దేవుడు ఇచ్చిన కళ్లు.. ఆ కళ్లు ఉన్న ప్రతీ ఒక్కరూ ఇది చూడాల్సిందే. శంభల్‌లో ఏం జరిగింది.. అదే సత్యం అని యోగి పేర్కొన్నారు. ఆలయాలను కూల్చి మసీదులు కట్టి అల్లా కూడా అంగీకరించడని ఇస్లాంలోనే ఉంది. అలాంటప్పుడు వాళ్లు ఆ పని ఎలా చేయగలిగారు?. ప్రస్తుతానికి శాస్త్రీయ ఆధారాలతో మా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఒక్కొక్కటిగా బయట పెట్టి వెలుగులోకి తీసుకొస్తామని చెప్పారాయన. -
మందుబాబులకు పండుగ.. ఒకటికి మరొకటి ఫ్రీ.. రూ. 200 డిస్కౌంట్
నోయిడా: మద్యం ప్రియులకు శుభవార్త. ఆ రాష్ట్రంలోని మద్యం దుకాణంలో ఒక బాటిల్ కొంటే మరొక బాటిల్ ఉచితం(Buy one bottle, get another bottle free). పైగా ఫుల్ బాటిల్ కొంటే రూ. 200 డిస్కౌంట్. ఇది ఏ ఒక్క మద్యం దుకాణానికో పరిమితం కాదు. పలు జిల్లాల్లో ఈ ఆఫర్ కొనసాగుతోంది. దీంతో మద్యం ప్రియులంతా ఆయా దుకాణాల ముందు బారులు తీరుతున్నారు.ఉత్తరప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో మద్యంపై భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు అందిస్తున్నారు. తాజాగా మంగళవారం నోయిడాలోని ఒక దుకాణంలో ఒక బాటిల్ కొంటే మరొకటి ఉచితం అనే ఆఫర్ పెట్టడంతో మద్యం ప్రియులు భారీ సంఖ్యలో క్యూకట్టారు. కాగా మద్యంపై తగ్గింపు ధరలు ఒక్క నోయిడాకు మాత్రమే పరిమితం కాలేదు. యూపీలోని పలు జిల్లాల్లో మద్యంపై అద్భుతమైన ఆఫర్లు కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల ఒక బాటిల్ కొనుగోలు చేస్తే మరొక బాటిల్, మరికొన్ని చోట్ల పూర్తి బాటిల్ కొనుగోలు చేస్తే రూ. 200 వరకు తగ్గింపు అందిస్తున్నారు.एक बोतल शराब लीजिए, उसके साथ एक फ्री..उत्तर प्रदेश के शराब ठेके वालों को 31 मार्च की रात 12 बजे तक सारा स्टॉक खत्म करना है. वरना बची हुई दारू सरकारी खाते में जमा हो जाएगी और उसकी बिक्री नहीं हो पाएगी. इसलिए ठेके वाले ग्राहकों को खूब ऑफर दे रहे हैं. Video नोएडा का है.#Noida pic.twitter.com/lXZqadqzCd— NDTV India (@ndtvindia) March 25, 2025ఎన్డీటీవీ పేర్కొన్న కథనం ప్రకారం నోయిడా సెక్టార్ 18లోని ఒక మద్యం దుకాణం ముందు ‘ఒక బాటిల్ కొంటే ఒకటి ఉచితం’ అనే బోర్డు పెట్టగానే మద్యం ప్రియులు పరిగెత్తుకుంటూ ఆ దుకాణానికి చేరుకున్నారు. దీంతో అక్కడ ఏదో జాతర జరుగుతున్నలాంటి దృశ్యం కనిపించింది. కొందరు క్యూలో నిలుచుని మద్యం కోనుగోలుకు వేచిచూడగా, మరికొందరు ఇతరులతో గొడవపడుతూ, మద్యం కొనుగోలుకు ప్రయత్నించారు. అక్కడున్నవారికి మద్యం బాటిల్ దొరకగానే ఏదో జాక్‌పాట్ తగిలినట్లు ఆనందించారు. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని ముజఫర్‌నగర్ జిల్లాలో మద్యం దుకాణాలలో భారీ ఆఫర్లు ప్రకటించడంతో ఆయా దుకాణాలకు మందుబాబులు భారీగా చేరుకుంటున్నారు. ఇప్పటికే భారీగా నిల్వవున్న మద్యం బాటిళ్లను ఖాళీ చేసేందుకే ఇక్కడి మద్యం దుకాణాలలో ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నారు. ముజఫర్ నగర్‌లోని ఒక మద్యం దుకాణం వద్ద మద్యం కొనుగోలుకు వేచిచూస్తున్న రాహుల్ అనే వ్యక్తి మాట్లాడుతూ ఒక బాటిల్ కొనుగోలుకు మరొక బాటిల్ ఉచితం అనే ఆఫర్ పెట్టడంతో విపరీతంగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని చెప్పాడు.యూపీలోని మద్యం స్టాకును అమ్మేందుకు మార్చి 25 చివరి తేదీ. అయితే మద్యం కాంట్రాక్టర్లు(Liquor contractors) మరో ఐదు రోజుల గడువుకోరి, డిస్కౌంట్లు అందిస్తూ జోరుగా మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల ఈ-లాటరీ ద్వారా కొత్తగా మద్యం దుకాణాలను కేటాయించారు. ఈ నేపధ్యంలో కొందరు మద్యం దుకాణాల నిర్వాహకులు ఈ-లాటరీలో దుకాణాలను దక్కించుకోలేకపోయారు. మరోవైపు మార్చి 31 నాటికి పాత దుకాణాల్లో స్టాక్‌ను పూర్తిగా ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఫలితంగా మద్యం దుకాణాల్లో తగ్గింపు ధరలు కొనసాగుతున్నాయి. ఇది కూడా చదవండి: Delhi Budget: రూ. ఒక లక్ష కోట్లు.. బీజేపీ వరాల జల్లు -
ఉదయం గర్ల్‌ఫ్రెండ్.. సాయంత్రం మరొకరు..
లక్నో: ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు ఒకే రోజు రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ప్రియురాలి మెడలో ఉదయం తాళికట్టిన అతడు.. పెద్దలు కుదిర్చిన యువతితో సాయంత్రం ఏడడుగులు నడిచాడు. మోసపోయినట్లు తెలుసుకున్న ప్రియురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.వివరాల ప్రకారం.. గోరఖ్‌పూర్ జిల్లా హర్పూర్ బుధాట్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు నాలుగేళ్లుగా ఓ యువతితో సంబంధం నెరుపుతున్నాడు. ఈ క్రమంలో యువతి గర్భం దాల్చగా రెండుసార్లు అబార్షన్ చేయించాడు. ఒకసారి గుడిలో కూడా పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత గర్భం దాల్చడంతో డెలివరీ కోసం ఆస్పత్రికి తీసుకెళ్లాడు. జన్మించిన బిడ్డను నర్సుకు అప్పగించాడు. రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేసుకుంటే తన కుటుంబం కూడా ఒప్పుకుంటుందని నమ్మబలికాడు.ఈ క్రమంలో ఒక రోజు ఉదయం రిజిస్టర్ ఆఫీసుకు తీసుకెళ్లి, తాళి కట్టాడు. అదే రోజు రాత్రి పెద్దలు కుదిర్చిన విధంగా సంప్రదాయబద్ధంగా మరో యువతిని పెళ్లి చేసుకుంది. అనంతరం, విషయం తెలిసి అక్కడికి వెళ్లిన బాధితురాలిని అతడి కుటుంబీకులు దూషించి, వెళ్లగొట్టారు. దీంతో, ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీనియర్ పోలీస్ అధికారి జితేంద్ర కుమార్ తెలిపారు. -
యూపీలో మరో దారుణం
మెయిన్‌పురి: ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లాలో మరో హత్య కేసు వెలుగులోకి వచ్చింది. పెళ్లైన రెండు వారాలకే ప్రేమికుడితో కలిసి కుట్ర పన్ని భర్తను చంపించిందో భార్య. ఒకే గ్రామానికి చెందిన ప్రగతి యాదవ్, అనురాగ్ యాదవ్ పదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే.. ప్రగతి కుటుంబ సభ్యులు ఆమెకు బలవంతంగా మార్చి ఐదో తేదీన దిలీప్ యాదవ్‌తో వివాహం జరిపించారు. అయిష్టంగానే పెళ్లి చేసుకున్న ప్రగతి ఎలాగైనా దిలీప్‌ను అడ్డు తొలగించుకోవాలనుకుంది. అనురాగ్‌తో కలిసి దిలీప్‌ను హతమార్చాలని పథకం వేసింది. ఈ హత్యకు ఏర్పాట్లు చేయడానికి అనురాగ్‌కు ప్రగతి రూ .1 లక్ష ఇచ్చింది.రాంజీ అనే కిరాయి హంతకుడిని ఈ పని కోసం రూ.2 లక్షలకు నియమించుకున్నారు. దిలీప్ మార్చి 19వ తేదీన పని మీద కన్నౌజ్ జిల్లాకు వెళ్లి తిరిగొస్తూ పట్నా కెనాల్ సమీపంలో ఓ హోటల్ వద్ద ఆగాడు. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు దిలీప్ వద్దకొచ్చి తమ బైక్ పాడైందని, సాయపడాలంటూ దిలీప్‌ను తమ ఇంకో బైక్‌పై ఎక్కించుకుని తీసుకెళ్లారు. మార్గమధ్యంలో దిలీప్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచి పొలంలో పడేసి పరారయ్యారు.దిలీప్‌ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినా అప్పటికే పరిస్థితి విషమించడంతో మూడు రోజుల తర్వాత అతను మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి ఘటనాస్థలి సమీప ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా గుర్తుతెలియని వ్యక్తుల దృశ్యాలు రికార్డయ్యాయి. వీటి సాయంతో కిరాయి హంతకుడు రాంజీని గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు. అతనిచ్చిన సమాచా రంతో అనురాగ్, ప్రగతిని అదుపులోకి తీసుకున్నారు. -
నోటీసిచ్చి.. 24 గంటల్లో కూల్చేస్తారా?
న్యూఢిల్లీ: ఇంటిని కూల్చేస్తామంటూ నోటీసు ఇచ్చి 24 గంటల్లోపే బుల్డోజర్తో ఇంటిని కూల్చేస్తున్న ఘటనలపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు (Supreme Court) మరోసారి మండిపడింది. నిబంధనలను పాటిస్తూనే ఇళ్ల కూలి్చవేత ప్రక్రియను యోగి ఆదిత్యనాథ్ సర్కార్ కొనసాగిస్తోందని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి చేసిన వాదనలను జస్టిస్ అభయ్ ఎస్.ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాల సుప్రీంకోర్టు ధర్మాసనం తప్పుబట్టింది. 2023లో పోలీస్ ఎన్కౌంటర్లో చనిపోయిన గ్యాంగ్‌స్టర్ పొలిటీషియన్ అతీఖ్ అహ్మద్‌కు చెందినదిగా భావిస్తున్న ప్రయాగ్‌రాజ్ నగరంలోని భవనాలను అధికారులు కూల్చేశారు(Prayagraj Demolitions). దీనిపై జులి్ఫకర్ హైదర్ అనే న్యాయవాది, ప్రొఫెసర్ అలీ అహ్మద్, ఇద్దరు వితంతువులు, మరో వ్యక్తి అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. గ్యాంగ్స్టర్విగా భావించి మా ఇళ్లను కూల్చేశారని బాధితులు కేసు వేశారు. అయితే ఈ కేసును అలహాబాద్ హైకోర్టు కొట్టేయడంతో వాళ్లంతా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ‘‘ఇళ్లను నిర్దయగా కూల్చేయడం చూస్తుంటే మాకే షాకింగ్‌గా ఉంది. కూలి్చవేతకు అనుసరించిన విధానం సైతం షాకింగ్‌కు గురిచేస్తోంది. మార్చి ఆరో తేదీ రాత్రి నోటీసులు ఇచ్చి మరుసటి రోజే కూల్చేస్తారా?. ఇలాంటి పద్ధతిని న్యాయస్థానాలు ఏమాత్రం అంగీకరించవు. ఒక్క కేసులో వీటిని పట్టించుకోకుండా ఉన్నామంటే ఇక ఇదే కూలి్చవేతల ధోరణి కొనసాగుతుంది. నోటీసులు అందుకున్నాక బాధితులు వాటిపై అప్పీల్ చేసుకునే అవకాశం కూడా అధికారులు ఇవ్వలేదు. 24 గంటల్లోపు భవనాలను కూల్చేశారు. ఈ కేసులో తిరిగి ఇంటిని నిర్మించుకుంటామని బాధితులు కోరితే అందుకు మేం అనుమతిస్తాం. అయితే కేసు తుదితీర్పు వాళ్లకు వ్యతిరేకంగా వస్తే బాధితులే ఆ కొత్త ఇళ్లను నేలమట్టం చేయాల్సి ఉంటుంది’’అని న్యాయస్థానం వ్యాఖ్యానించడం గమనార్హం. దీనిపై ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్(Attorney General) వాదించారు. ‘‘లీజు గడువు దాటాక అక్రమంగా ఆ నివాసస్థలాల్లో పిటిషనర్లు ఉంటున్నారు. వాస్తవానికి 2020 డిసెంబర్లో తొలిసారి, 2021 జనవరి, మార్చి నెల ఆరో తేదీన నోటీసులు ఇచ్చారు. తర్వాతే కూల్చారు’’అని వాదించారు. దీనిపై జడ్జి అభ్యంతరం వ్యక్తంచేశారు. ‘‘గతంలో సాధారణ రీతిలో నోటీసులు ఇచ్చారు. చట్టప్రకారం రిజిస్టర్ పోస్ట్‌లో పంపాలి. అలాకాకుండా మామూలుగా పంపేసి, చివరి నోటీసు మాత్రం రిజిస్టర్ పోస్ట్ లో పంపించి వెంటనే కూల్చేస్తారా?’’అని ధర్మాసనం నిలదీసింది. మళ్లీ ఇంటి నిర్మాణాల విషయంలో అఫిడవిట్ సమర్పించేందుకు పిటిషనర్లను అనుమతిస్తూ కేసు విచారణను న్యాయస్థానం వాయిదావేసింది. ‘క్రికెట్’ నినాదాలతో కూల్చేశారు గత నెల ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లో ఇండియా, పాకిస్తాన్ జట్ల మధ్య క్రికెట్ ఆట సందర్భంగా భారతవ్యతిరేక నినాదాలు చేశారంటూ ఎఫ్ఐఆర్ నమోదుచేసి తమ ఇల్లు కూల్చారంటూ కితాబుల్లా హమీదుల్లా ఖాన్ వేసిన పిటిషన్‌పై స్పందన తెలపాలని మహారాష్ట్ర సర్కార్‌ను జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ల సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం ఆదేశించింది. ఆస్తుల కూలి్చవేతకు సంబంధించి గతేడాది నవంబర్‌లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించిందని, ఈ అంశంలో సర్కార్‌పై, మాలాŠవ్న్ మున్సిపల్ కౌన్సిల్ అడ్మినిస్ట్రేటర్లపై ఉల్లంఘన కేసు నమోదుచేయాలని బాధితుడు సుప్రీంకోర్టును కోరాడు. అయితే ఎఫ్ఐఆర్ నమోదుచేసి సింధుదుర్గ్ జిల్లాలో పాతసామాను దుకాణం, ఇల్లు రెండూ అక్రమ నిర్మాణాలని పేర్కొంటూ అధికారులు ఫిబ్ర వరి 24న వాటిని కూల్చేశారు. భారతవ్యతిరేక నినాదాలు చేశాడంటూ తొలుత పిటిషనర్‌తోపాటు అతని 14ఏళ్ల కుమారుడిని అరెస్ట్‌చేసి తర్వాత కుమారుడిని వదిలేశారు. తర్వాత భార్యాభర్తలను అరెస్ట్‌చేసి జైలుకు పంపారు. ఈ సమయంలోనే ఇల్లు, దుకాణం కూల్చేశారు. -
యూట్యూబ్ సాయంతో సెల్ఫ్ సర్జరీ..! ఐతే అతడు..
ఏదైన తెలియని విషయం నేర్చుకోవాలంటే ఠక్కున గుర్తొచ్చేది యూట్యూబ్ మాయజాలమే. అందులో ఏ వంటకమైన, తెలియని పనైనా సులభంగా నేర్చుకోవచ్చు..నిమిషాల్లో చేసేయొచ్చు. అయితే అది కొన్నింటికే పరిమితం. ఆరోగ్యానికి సంబంధించినవి చాలామటుకు వ్యక్తిగత వైద్యుల సలహా తీసుకునే చేయాలి. లేదంటే ప్రాణాలకే ముప్పు. అయితే ఈ వ్యక్తి ఏకంగా యూట్యూబ్ చూసి తనకు తాను సర్జరీ చేసుకున్నాడు. చివరికి అది కాస్త సివియర్ అయ్యి ఆస్పత్రి మెట్లు ఎక్కక తప్పలేదు. అయితే వైద్య నిపుణులు ఇదెంత వరకు సబబు అని మండిపడుతున్నారు. మరీ ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉందంటే..ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌కు చెందిన 32 ఏళ్ల వ్యక్తి యూట్యూబ్ వీడియోల సాయంతో నేర్చుకున్న పరిజ్ఞానంతో తనకు తానుగా సర్జీర చేసుకునేందుకు రెడీ అయిపోయాడు. అందుకోసం మార్కెట్ నుంచి సర్జికల్ బ్లేడ్లు, కుట్లు వేసే తీగలు, సూదులు వంటివి అన్ని కొనుగోలు చేశాడు. అనుకున్నట్లుగానే అన్నంత పని చేసేశాడు. తనకు తానుగా పొత్తికడుపు కోసుకుని మరీ ఆపరేషన్ చేసుకున్నాడు. అంత వరకు బాగానే ఉంది. ఆ మరుసటి రోజు ఆ వ్యక్తి పరిస్థితి దారుణంగా దిగజారడంతో హుటాహుటినా ఆస్పత్రికి తరలింరు అతడి బంధువులు. ఆస్పత్రి వైద్యులు అతడి చేసిన ఘనకార్యం విని కంగుతిన్నారు. వెంటనే పరీక్షించగా..అదృష్టవశాత్తు సదరు వ్యక్తి పొత్తి కడుపు పైపొర మాతమే కోయడంతో త్రటిలో ప్రాణాపయం తప్పిందన్నారు. ఎందుకంటే కాస్త లోతుగా కోసుంటే ఇతర అంతర్గ అవయవాలు కూడా డ్యామేజ్ అయ్యేవని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నట్లు వైద్యులు వెల్లడించారు.ఘటనపై సీరియస్ అవుతున్న వైద్యులు..ఆన్లైన్లో చూసిన ప్రతిదాన్ని చేసేయాలని చూడొద్దు. ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో పరాచకాలు వద్దు. నిపుణుల సాయం లేకుండా సర్జరీ లాంటివి అత్యంత ప్రమాదకరమని అన్నారు. వైద్యుడిని సంప్రదించకుండా ఇలాంటి సర్జరీలు చేసేటప్పుడూ ఒకవేళ అధిక రక్తస్రావం అయితే పరిస్థితి చేజారిపోతుంది. పైగా ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. డబ్బు ఆదా చేయాలనో లేదా మాకు చాలా పరిజ్ఞానం వచ్చేసిందన్న అత్యుత్సాహంతోనే ఇలాంటిపనులకు అస్సలు ఒడిగట్టద్దు. ఈ మిడిమిడి జ్ఞానంతో స్వీయంగా లేదా వేరేవాళ్లకి సర్జరీలు చేసి లేనిపోని సమస్యలు కొని తెచ్చుకోవద్దు అని గట్టి వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యంగా ఆన్లైన్ హెల్త్ ట్యూటోరియల్స్ లేదా హెల్త్ ట్రెండ్లు వంటి వాటిని చాలావరకు వైద్యులు ఆమోదించరిన అన్నారు. నిపుణుల మార్గదర్శకత్వంలోనే ఇలాంటివి చేయాలి. ఎంబీబిఎస్ చదివి ఎన్నేళ్లో ప్రాక్టీస్ చేసినా వైద్యులే ఒక్కోసారి పొరపాట్లు దొర్లుతుంటాయి. అలాంటిది ఏ మాత్రం అనుభవం లేకుండా .. జస్ట్ చూసి ఎలా చేసేస్తారంటూ మండిపడుతున్నారు వైద్య నిపుణులు.(చదవండి: 'విద్యార్థి భవన్ బెన్నే దోసె'..యూకే ప్రధాని, ఐకానిక్ డ్రమ్మర్ శివమణి ఇంకా..) -
మీరట్ సౌరభ్ కేసులో మరో ట్విస్ట్
మీరట్: మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్ హత్య కేసులో నిందితుల గురించి రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. సౌరభ్ భార్య, నిందితురాలు ముస్కాన్ రస్తోగి తన భర్త సంపాదించిన డబ్బులను ప్రియుడు సాహిల్ శుక్లాకు ఇచ్చినట్లు తెలిసింది. ఆ సొమ్ముతో బెట్టింగ్ ఆడించి వచ్చిన డబ్బుతో వీరిద్దరూ విహారయాత్రలకు వెళ్లినట్లు దర్యాప్తు తేలింది. అలాగే, సౌరభ్‌కు నిద్ర మాత్రలు ఇచ్చిన నిద్రలోకి వెళ్లిన తర్వాత హత్య చేసినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె.. మెడికల్ స్టోర్‌లో కొనుగోలు చేసిన మాత్రల గురించి విచారణ చేపట్టినట్టు తెలిపారు.ఉత్తరప్రదేశ్‌లోని మీటర్లో ప్రేమించి పెళ్లాడిన సౌరభ్‌ను ప్రియుడి సాయంతో ముస్కాన్ రస్తోగి దారుణంగా హత్య చేసి, ముక్కలు చేసిన ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో దర్యాప్తులో భాగంగా ఇప్పటికే పలు కీలక విషయాలు బయటకు వచ్చాయి. ఇక, తాజాగా ముస్కాన్ తన భర్త సంపాదించిన డబ్బులను ప్రియుడు సాహిల్ ఇచ్చినట్టు తెలిసింది. వాటితో బెట్టింగ్ ఆడినట్టు వెల్లడైంది. అలా వచ్చిన డబ్బులతో వారిద్దరూ విహారయాత్రకు వెళ్లారు. అనంతరం హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్లారు. భార్యా భర్తలుగా చెప్పుకుని కసోల్‌లోని ఓ హోటల్లో మార్చి 10న దిగారు. అక్కడే ఆరు రోజులు ఉండి 16వ తేదీన వెళ్లిపోయారు. వారితోపాటు ఓ డ్రైవర్ కూడా ఉన్నట్లు హోటల్ యజమాని పోలీసులకు వెల్లడించాడు.నాలుగు రోజులు హోటల్ గదిలోనే.. అయితే, ఈ జంట మాత్రం రోజు మొత్తం హోటల్లోనే గడిపారని, కేవలం రోజులో ఒక్కసారి మాత్రమే బయటకు వెళ్లేవారని హోటల్ యజమాని పేర్కొన్నాడు. అలా చేయడం అసాధారణంగానే అనిపించిందని, కనీసం రూమ్ శుభ్రం చేసేందుకు సిబ్బందిని కూడా గది లోనికి రానివ్వలేదని చెప్పాడు. హోటల్ నుంచి వెళ్లిపోయేటప్పుడు.. తాము మనాలీ నుంచి వచ్చామని, యూపీకి వెళ్తున్నామని చెప్పినట్లు తెలిసింది.ఫుడ్ కాదు.. డ్రగ్స్ కావాలి.. ఇదిలా ఉండగా.. ఈ కేసులో అరెస్టైన ముస్కాన్, సాహిల్‌కు సంబంధించిన కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు. వీరిద్దరూ మాదకద్రవ్యాలకు బానిసలుగా (Drug Addiction) మారారని పేర్కొన్నారు. జైల్లో ఆహారం తినకుండా తమకు గంజాయి, మత్తు ఇంజెక్షన్లు ఇవ్వాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. అరెస్ట్ నాటి నుంచి అవి దొరక్కపోవడంతో విచిత్రంగా ప్రవర్తిస్తున్నారని.. తరచూ గంజాయి కోసం డిమాండ్ చేస్తున్నారన్నారు. మానసిక స్థితి సరిగా లేకపోవడం వల్ల వారు తోటి ఖైదీలపై దాడి చేసే ప్రమాదం ఉండడంతో వేరేగా ఉంచినట్లు తెలిపారు. హత్య సమయంలోనూ సాహిల్ డ్రగ్స్ మత్తులోనే ఉన్నట్లు అనుమానిస్తున్నారు. దీంతో వారిని జైలులోని డీ అడిక్షన్ సెంటర్లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.హత్య ఇలా.. సౌరభ్ రాజ్‌పుత్(29), ముస్కాన్(27) 2016లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అతడు మర్చంట్ నేవీలో పని చేసేవాడు. వారికి 2019లో కుమార్తె జన్మించింది. ఆ తర్వాత సాహిల్(25)తో ముస్కాన్ వివాహేతర సంబంధం పెట్టుకొంది. దీనిపై వారు విడాకుల వరకు వెళ్లారు. కానీ, కుమార్తె కోసం సౌరభ్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. తర్వాత ఉద్యోగం నిమిత్తం విదేశాలకు వెళ్లిన అతడు.. గతనెల కుమార్తె పుట్టినరోజు కోసం తిరిగొచ్చాడు. ఇది నచ్చని ముస్కాన్.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. అతడి శరీరాన్ని ముక్కలు చేసి.. వాటిని ఓ డ్రమ్ములో వేసి సిమెంట్‌తో సీల్ చేసింది. -
మేము ఇద్దరం జైల్లో కూడా కలిసే ఉంటాం..!
ఉత్తర ప్రదేశ్ మీరట్‌కు చెందిన మర్చంట్ నేవీ ఆఫీసర్ సౌరభ్ రాజ్‌పుత్ మర్డర్ కేసులో వెన్నులో వణుకు పుట్టించే విషయాలు వెలుగులోకి చూస్తుండగా.. ముస్కాన్ రాక్షసత్వంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ నడుస్తోంది. భర్తను చంపాక అతనితో జాలీగా ట్రిప్పులు వేసిన ముస్కాన్.. అతని పుట్టినరోజుతో పాటు హోలీ పార్టీ కూడా జరుపుకుంది. అయితే ఈ కేసులో వీరద్దర్నీ అరెస్ట్ చేసి ప్రస్తుతం పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. దీనిలో భాగంగా చౌదరి చరణ్ సింగ్ జైల్ లో ఉన్న వీరిని పోలీసులు విచారిస్తున్నారు.జైల్లో కూడా కలిసే ఉంటామని..భర్తను హత్య చేసి జైలు పాలయ్యానన్న కనీస పశ్చాత్తాపం కూడా ముస్కాన్ లో కనిపించడం లేదు. జైల్లో కూడా తామిద్దరం కలిసే ఉంటామని పట్టుబట్టారు. ఇద్దర్నీ వేరు వేరు సెల్ లో వేయకండి.. తాము ఇద్దరం ఒకే చోట ఉంటామంటూ పోలీస్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. అయితే ఇది జైలు నియమాలకు విరుద్ధమని, ఇలా ఒక పురుషుడు, ఒక మహిళ కలిసి ఉండటం సాధ్యం కాదని సదరు అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటివరకూ వారిద్దరితో మిగతా ఖైదీలు ఎవరూ మాట్లాడలేదని జైలు సూపరెండెంట్ విరేష్ రాజ్ శర్మ తెలిపారు. తొలిరోజు వీరు ఏమీ తినలేదని, తర్వాత నుంచి భోజనం చేస్తున్నారన్నారు. అయితే ఒకే సెల్ లో ఉంచాలని కోరినట్లు విరేష్ రాజ్ శర్మ పేర్కొన్నారు. ఇది విరుద్దం కావడంతో వారి అభ్యర్థనను తిరస్కరించినట్లు చెప్పారు. వీరిద్దరికి సెపరేట్ బారక్ లు ఇచ్చామని, దాంతో వారు కనీసం మాట్లాడే అవకాశం కూడా ఉండదన్నారు.వీరిద్దరూ డ్రగ్స్‌కు బానిసలువీరిద్దరూ డ్రగ్స్ కు బానిసలైన సంగతని విరేష్ రాజ్ శర్మ పేర్కొన్నారు. మెడికల్ రిపోర్ట్ లు ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా వీరికి ట్రీట్ మెంట్ కు కూడా ఇప్పించడానికి ఏర్పాట్లు చేసినట్లు ఇండియన్ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐకి తెలియజేశారు.మాకు లాయర్ ను ఏర్పాటు చేయండితమ తరఫున వాదించడానికి లాయర్ కావాలని విజ్ఞప్తి చేశారు ఆ నిందితులిద్దరూ. తమ కుటుంబానికి న్యాయవాదిని ఏర్పాటు చేసుకునే స్థోమత లేదని, అందుచేత తమ తరఫున వాదించడానికి ప్రత్యేక గవర్నమెంట్ లాయర్ ను ఏర్పాటు చేయాలని చెప్పినట్లు మరో సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.#WATCH | Saurabh Rajput murder case | On accused Muskan Rastogi and Sahil Shukla, Senior Jail Superintendent Viresh Raj Sharma says, "They arrived 3 days ago and they said that they be lodged together or nearby barracks. They were told that as per the system in jail, there is no… pic.twitter.com/5vKpgzXEe0— ANI (@ANI) March 23, 2025ప్రియుడితో కలిసి భర్త హత్యసౌరభ్ గుండెల్లో కత్తితో మూడు సార్లు పొడిచింది. కత్తి లోతుగా అతడి గుండెల్లో దిగబడింది. ముస్కాన్ అతి దారుణంగా సౌరభ్ గుండెను చీల్చి పడేసింది. తర్వాత తలను శరీరంనుంచి వేరు చేసింది. శరీరాన్ని ముక్కలుముక్కలుగా కొసి పడేసింది. ముక్కల్ని డ్రమ్‌లో పడేసింది. ముస్కాన్ చేసిన దారుణం తెలిసి డాక్టర్లే షాక్ అయిపోయారు.ఇక, పోలీసులు కేసు దర్యాప్తులో భాగంగా హిమాచల్ ప్రదేశ్ వెళ్లారు. ముస్కాన్ పినతల్లిని కలిశారు. ఆమె ముస్కాన్‌పై ఫైర్ అయింది. చేసిన ఘోరానికి తన కూతురికి ఉరి శిక్ష వేయాలని డిమాండ్ చేసింది. ఈ దారుణంలో ముస్కాన్ హస్తంతో పాటు ఆమె ప్రియుడు సాహిల్ హస్తం కూడా ఉంది. ఇద్దరూ కలిసి, పక్కా ప్లాన్ ప్రకారం సౌరభ్‌ను చంపేశారు. మృతదేహాన్ని కనిపించకుండా చేసి తప్పించుకుందామనుకున్నారు. చాలా నాటకాలు ఆడారు. అవేవీ ఫలించలేదు. సౌరభ్ తల్లిదండ్రులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సౌరభ్ గురించి ఎంక్వైరీ చేయగా.. మర్డర్ విషయం బయటపడింది.ప్రేమ పెళ్లి.. ప్రియుడి కోసం..ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన సౌరభ్ రాజ్‌పుత్ అదే ప్రాంతానికి చెందిన ముస్కాన్ రస్తోగి ప్రేమించుకున్నారు. 2016లో పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత భార్యతో గడపడానికి టైం దొరకటం లేదని నేవీలో ఉద్యోగం మానేశాడు. ఇంట్లో గొడవలు అవ్వటంతో భార్యతో కలిసి వేరుకాపురం పెట్టాడు. 2019లో వీరికి ఓ ఆడపిల్ల పుట్టింది. బిడ్డపుట్టిన తర్వాత సౌరభ్‌కు ఓ దారుణమైన విషయం తెలిసింది. ముస్కాన్.. ఆమె స్నేహితుడు సాహిల్‌తో అక్రమ సంబంధం పెట్టుకుందని తెలిసింది. ఈ విషయమై సౌరభ్, ముస్కాన్‌ల మధ్య గొడవలు అయ్యాయి. పరిస్థితి విడాకుల వరకు వెళ్లింది. కూతురు కోసం సౌరభ్ వెనక్కు తగ్గాడు. మళ్లీ జాబ్‌లో జాయిన్ అయ్యాడు. 2023లో విదేశానికి వెళ్లిపోయాడు. 2025 ఫిబ్రవరి నెలలో కూతురి పుట్టిన రోజు ఉండటంతో ఇండియా వచ్చాడు. ఇది నచ్చని ముస్కాన్, సాహిల్ .. అతడ్ని చంపేశారు. ఆరేళ్ల చిన్నారి తండ్రి హత్యను కళ్లారా చూసింది.. తన తల్లి మరో వ్యక్తితో కలిసి తండ్రిని ప్లాస్టిక్ డ్రమ్ములో దాచడం గమనించింది. అయితే, అది దాచడం కాదని, నాన్నను చంపేశారని ఆ చిన్నారికి తెలియదు. మీ నాన్న ఏరమ్మా అని అడిగిన చుట్టుపక్కల వాళ్లకు ‘డ్రమ్ములో ఉన్నాడు’ అంటూ చెప్పింది. ఆ మాటల వెనకున్న విషాదం తెలియక చిన్నపిల్ల ఏదో చెబుతోందని వారంతా అనుకున్నారు. కానీ నిజంగానే పాప తండ్రి నిర్జీవంగా మారి డ్రమ్ములో సమాధి అయ్యాడని వారు ఊహించలేకపోయారు. -
పుట్టగానే చంపేయాలని చూశారు! కానీ ఆ అమ్మాయే ఇవాళ..
ఇంతలా ఏఐ సాంకేతికత దూసుకుపోతున్నా.. ఆడపిల్ల అనగానే అమ్మో..! అనే అంటున్నారు. ఇంకా ముగ్గురూ.. అబ్బాయిలే అయినా భయం ఉండదు. గానీ అదే రెండోసారి లేదా మూడోసారి ఆడబిడ్డ అనగానే ప్రాణాలే పోయినంతంగా తల్లడిల్లిపోతారు చాలామంది. ఎందుకనేది అంతుపట్టని చిక్కు ప్రశ్న. ఎందుకంటే అటు అబ్బాయి లేదా అమ్మాయిని పెంచి పెద్దచేసి విద్య చెప్పించడం వంటివన్ని షరామాములే కానీ..ముగ్గురు అమ్మాయిల తల్లిదండ్రులనగానే సమాజం సైతం టన్నుల కొద్దీ జాలి చూపిస్తుంది. అలాంటి వివక్షనే ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచే ఎదుర్కొంది. చిన్ననాటి నుంచి దానిపై పోరాడుతూనే వచ్చింది. చివరికి తనను వద్దు, చంపేయాలని చూసిన తల్లిదండ్రులనే గర్వపడేలా అత్యున్నత స్థాయికి ఎదిగింది. ప్రపంచమే తనవైపు తిరిగి చూసేలా చేసింది.ఆ అమ్మాయే పూజ తోమర్. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్ సమీపంలోని బుధాన అనే చిన్న గ్రామంలో జన్మించింది. ఆమెకు అంజలి, అను అనే ఇద్దరు అక్కలు ఉన్నారు. ఆ గ్రామస్థులు అమ్మాయి అనగానే కట్నం ఇచ్చి పెళ్లిచేసే కష్టతర బాధ్యతగా చూసేవారు. అలాంటి వాతావరణంలో పూజా తల్లిదండ్రులు కూడా మూడోసారి అమ్మాయి పుట్టకూడదని దేవుళ్లందరికీ దండాలు పెట్టుకున్నారు. కానీ విధి వింత పరీక్షకు ఎవ్వరైనా తలొగ్గక తప్పదు కదా..!. పాపం అలానే ఈ తల్లిదండ్రులకు ఎంతలా వద్దనుకున్నా మూడోసారి ఆడపిల్లే పుట్టింది. తండ్రే ఈ విషయం విని జీర్ణించుకోలేక కళ్లు తిరిగిపడిపోయాడు. ఇక తాము ఈ అమ్మాయిని పెంచలేం అని కుండలోపెట్టి చంపేయాలనుకున్నారు. కానీ ఆ చిన్నారి గుక్కపెట్టిన ఏడుపుకి జాలి కలిగిందో ఏమో..! వెంటనే చేతుల్లోకి తీసుకున్నారు తల్లిదండ్రులు. అలా చిన్ననాడే బతుకు పోరాటం చేసింది పూజ. అలా నెమ్మదిగా పెద్దదైంది. తనంటే ఇంట్లో వాళ్లకి ఇష్టం లేదనే విషయం తెలిసి మౌనమే దాల్చిందిగానీ వారితో పోరాడలేదు. అడుగడుగున ముగ్గురు ఆడపిల్లలు అనే మాటలు ఓ పక్కన, మరోవైపు నువ్వు పుట్టుకుంటే బాగుండును అన్న సూటిపోటి మాటల మధ్య బాధనంత పట్టికింద బిగబెట్టి బతికింది. అప్పుడే ఫిక్స్ అయ్యింది. ఎలాగైన ఆడిపిల్ల భారం కాదు అదృష్టమనే చెప్పాలని నిర్ణయించుకుంది. అదెలాగనేది తెలియదు. అయితే చిన్నప్పటి నుంచి యూట్యూబ్‌లో జాకీ చాన్ పాత్రలే ఆమెకు నచ్చేవి. ఎందుకంటే తాను ఎదుర్కొన్న వివక్ష పోరాటాల అందుకు కారణమై అయి ఉండొచ్చు కూఆ. కానీ పూజ ఎప్పుడు రాజకీయ నాయకురాలు, ఏ ఐపీఎస్ వంటివి లక్ష్యంగా ఏర్పరచుకాలేదు. కరాటేలో రాణించాలనుకోవడం విశేషం. తన చుట్టూ ఉన్న పరిస్థితుల రీత్యా అది నేర్చుకోవడం అంత ఈజీ కాదు అయినా అదే నేర్చుకోవాలనుకుంది. సరిగ్గా ఇంటర్లో ఉండగా ఒక కరాటే టీచర్ స్థానిక పాఠశాలకు రావడం జరిగింది. ఇక ఆమె ఆ టీచర్ సాయంతో దానిలోని మెళుకువలు నేర్చుకుంది. మరింత ఇందులో ఛాంపియన్‌గా రాణించాలంటే ఏం చేయాలో తెలుసుకుంది. ఆ విషయంలో ఆమె మేనమామ కాస్త సాయం అందించడంతో మార్షల్ ఆర్ట్స్‌తో మిళితమైన కరాటేలో ప్రావీణ్యం తెచ్చుకునేందుకు భోపాల్‌కు పయనమైంది. అక్కడ ఐదేళ్లలో పలు కాంపీటీషన్లలో గెలుపొంది కానిస్టేబుల్ ఉద్యోగాన్ని పొందింది. అయితే దీన్ని పూజ చాలా అవమానంగా భావించి వదులుకుంది. మరింతగా దీనిలో రాణించి ఉన్నతోద్యోగం పొందాలంటే ఏం చేయాలని ఆలోచనలో పడింది. ఆ సమయంలోనే అల్టిమేట్ ఫైనల్ ఛాంపియనషిష్(మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్(MMA)) గురించి తెలుసుకుంది. ఇక దాని కోసం ఢిల్లీ వెళ్లాలనుకుంది. కనీసం అందుకు ఎవరైన స్పాన్స్ చేయడంగానీ కాంట్రాక్టులు, జీతం లేదా ఎవరిదైనా హామీ వంటివి ఏం లేకుండానే ఢిల్లీ వెళ్లింది. అక్కడ ఆమె ట్యూషన్ పీజు కట్టేందుకు ఎవరో దాత ముందుకు వచ్చారు. అంతే తప్ప కనీసం ఏ మద్దతు సాయం లేకుండా ఒంటరిగా మొండిగా అక్కడ ఎంఎఏలో శిక్షణ తీసుకుంది. అలా పూజ అల్టిమేట్ ఫైనల్ ఛాంపియన్షిప్ పోటీల్లో బ్రెజిల్‌కు చెందిన రాయన్నే అమండా డోస్ శాంటోస్‌తో తలపడి గెలుపొందింది. దీంతో ఇలా యూఎఫ్‌సీ టైటిల్ దక్కించుకున్న తొలి భారతీయురాలుగా యావత్తు భారతావనిని తనవైపు గర్వంగా చూసేలా చేసింది. 31 ఏళ్ల ఈ పంచర్ ఇప్పుడు తన MMA జట్టులో నెలకు దాదాపు రూ. 1.5 నుండి 2 లక్షలు ఖర్చుచేసే ఛాంపియన్‌గా ఎదిగింది. ఇన్నాళ్లుగా తాను చేస్తున్న పోరాటనికి ఓ అర్థం వచ్చేలా విజయాలు సాధిస్తున్నా అంటూ కంటతడిపెట్టుకుంది. తానెంటన్నది తన కుటుంబానికి చూపించాలనుకోలేదని, ఈ ప్రపంచానికి ఆడపిల్ల భారం అనే మాటకు తావివ్వకూడదు అని చెప్పేందుకే పోరాడనంటోంది పూజ. ఇక ఆమె అనితరసాద్యమైన విజయం అందుకోగానే ఆమె గ్రామంలో ఒక్కసారిగా పండుగ వాతావరణం నెలకొంది. నాడు ముచ్చటగా మూడోసారి ఆడపిల్లగా పుట్టిన శాపగ్రస్తురాలిగా చూసిన వాళ్లే తన కరచలనం కోసం తహతహలాడటం విశేషం. అమె అక్కలు ఒకరు నర్సుగా, మరొకరు డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్లంతా తమ చెల్లి పూజ విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. పూజా తల్లి సైతం ఆమె తన కూతురని గర్వంగా చెబుతూ మీడియా ముందుకొస్తుంది. ఇక చివరగా భారతదేశం అనగానే కేవలం క్రికెట్ మ్యాచ్‌లే కాదు యోధులు కూడా ఉన్నారని చూపించాలనుకుంటున్నా..అని ఆత్మవిశ్వాసంగా చెబుతోంది పూజ. దురదృష్టం ఏంటంటే ఏ ఆడపిల్ల అని అవమానంగా ఫీలయ్యాడో ఆ తండ్రే పూజ విజయాన్ని చూడకముందే కన్నుమూశాడు. ఏదీఏమైనా ఇలాంటి తల్లిదండ్రులందరికీ కనువిప్పు కలిగించేలా పూజ విజయం ఉండటమే గాక తనలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న ఆడపిల్లలందరకీ స్ఫూర్తిగా నిలిచింది పూజ. (చదవండి: ఇనుములో ఓ మనిషే మొలిచెనే) -
Viral video: 95 పైసల కోసం గొడవ.. అసలేం జరిగిందంటే..
నోయిడా: కేవలం 95 పైసల కోసం ఓ మహిళా జర్నలిస్టు, క్యాబ్ డ్రైవర్ వాదించుకోవడం సోషల్ మీడియాలో వైరల్ మారింది. అయితే, నెటిజన్లంతా క్యాబ్ డ్రైవర్‌కే మద్దతు ఇస్తున్నారు. ఈ వాగ్విదానికి సంబంధించిన వీడియోను దీపికా నారాయణ్ భరద్వాజ్ అనే హక్కుల కార్యకర్త సోషల్ మీడియాలో పోస్టు చేసింది. డ్రైవర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని మహిళ ఆరోపించగా, ఆమె తనను బెదిరించి టాక్సీ ఛార్జీ చెల్లించడానికి నిరాకరించిందని డ్రైవర్ ఆరోపిస్తున్నాడు. కాగా, తాను జర్నలిస్టునని సదరు మహిళా జర్నలిస్టు క్యాబ్ డ్రైవర్‌ను బెదిరించినట్లుగా ఆ వీడియోలో ఉంది.మిగతా 95 పైసలు కూడా చెల్లిస్తే పోయేదానికి ఈగోకు పోయి ఆ మహిళా గొడవకు దిగిందని ఓ నెటిజన్.. కేవలం 95 పైసల కోసం క్యాబ్ డ్రైవర్‌ను బెదిరించడం అవసరమా..? అంటూ మరో నెటిజన్ ప్రశ్నలు గుప్పించారు. క్యాబ్ డ్రైవర్‌ది తప్పులేకపోయినా మహిళా కార్డు ఉపయోగించి అతడిని బెదిరించడం కరెక్టు కాదు. చేతిలో డబ్బులు లేకపోతే బస్సులో వెళ్లొచ్చుగా క్యాబ్‌లో వెళ్లి గొడవపడటం ఎందుకు..?’’ అంటూ యూజర్లు ఆ మహిళను తప్పుబడుతున్నారు. ఈ ఘటనపై మహిళా జర్నలిస్టు శివంగి శుక్లా వివరణ ఇస్తూ.. తాను క్యాబ్ డ్రైవర్‌ను బెదిరించలేదని, అతడే తనతో దురుసుగా ప్రవర్తించాడని పేర్కొన్నారు. లోకేషన్‌కు దూరంగా క్యాబ్‌ను ఆపేశాడని, లోకేషన్‌కు తీసుకెళ్లమంటే కుదరదని దురుసుగా సమాధానం చెప్పాడు. దాంతో తాను క్యాబ్ దిగి రూ.129 పేమెంట్ చేశానని, తొందరలో పైన ఉన్న 95 పైసలు చూసుకోలేదు. ఇంతలోనే 95 పైసలు ఎందుకు కొట్టలేదంటూ క్యాబ్ డ్రైవర్‌కు గొడవ దిగాడని, దాంతో తాను జర్నలిస్టునని, దబాయించవద్దని వార్నింగ్ ఇచ్చానని ఆ మహిళా జర్నలిస్టు తెలిపారు.Who is this Journalist threatening @Uber_India driver of police action just because he asked her to pay the fare ? Plz identify her & ask her to travel in bus if she doesn't want to payAlso - in public interest, please ask every cab driver you meet to install cameras pic.twitter.com/PA9qqdBluJ— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) March 21, 2025 -
భర్తను వదిలేస్తే పోయేది కదా!
ఆ భర్త భార్య, బిడ్డనే ప్రాణం అనుకున్నాడు. కానీ, ప్రియుడి మోజులో పడి ఆమె ఆ భర్తనే వద్దునుకుంది. అలాంటప్పుడు వదిలేసి వెళ్లిపోతే సరిపోయేది కదా అంటూ సోషల్‌మీడియా ఇప్పుడు కోడై కూస్తోంది. ఉత్తర ప్రదేశ్ మీరట్‌కు చెందిన మర్చంట్ నేవీ ఆఫీసర్ సౌరభ్ రాజ్‌పుత్ మర్డర్ కేసులో వెన్నులో వణుకు పుట్టించే విషయాలు వెలుగులోకి చూస్తుండగా.. ముస్కాన్ రాక్షసత్వంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ నడుస్తోంది.భర్తను చంపాక అతనితో జాలీగా ట్రిప్పులు వేసిన ముస్కాన్.. అతని పుట్టినరోజుతో పాటు హోలీ పార్టీ కూడా జరుపుకుంది. అందుకు సంబంధించిన దృశ్యాలే ఇప్పుడు బయటకు వస్తున్నాయి.సౌరభ్ శవానికి పోస్టుమార్టం పూర్తయింది. డ్రమ్ములో సిమెంట్‌తో కప్పబడిన శరీరభాగాలను డాక్టర్లు అతి కష్టం మీద బయటకు తీశారు. వాటికి పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం రిపోర్టు ప్రకారం.. నిద్రమాత్రల కారణంగా సౌరభ్ గాఢ నిద్రలోకి జారుకున్న తర్వాత ముస్కాన్ తన రాక్షసత్వాన్ని బయటపెట్టింది.సౌరభ్ గుండెల్లో కత్తితో మూడు సార్లు పొడిచింది. కత్తి లోతుగా అతడి గుండెల్లో దిగబడింది. ముస్కాన్ అతి దారుణంగా సౌరభ్ గుండెను చీల్చి పడేసింది. తర్వాత తలను శరీరంనుంచి వేరు చేసింది. శరీరాన్ని ముక్కలుముక్కలుగా కొసి పడేసింది. ముక్కల్ని డ్రమ్‌లో పడేసింది. ముస్కాన్ చేసిన దారుణం తెలిసి డాక్టర్లే షాక్ అయిపోయారు.ఇక, పోలీసులు కేసు దర్యాప్తులో భాగంగా హిమాచల్ ప్రదేశ్ వెళ్లారు. ముస్కాన్ పినతల్లిని కలిశారు. ఆమె ముస్కాన్‌పై ఫైర్ అయింది. చేసిన ఘోరానికి తన కూతురికి ఉరి శిక్ష వేయాలని డిమాండ్ చేసింది. ఈ దారుణంలో ముస్కాన్ హస్తంతో పాటు ఆమె ప్రియుడు సాహిల్ హస్తం కూడా ఉంది. ఇద్దరూ కలిసి, పక్కా ప్లాన్ ప్రకారం సౌరభ్‌ను చంపేశారు. మృతదేహాన్ని కనిపించకుండా చేసి తప్పించుకుందామనుకున్నారు. చాలా నాటకాలు ఆడారు. అవేవీ ఫలించలేదు. సౌరభ్ తల్లిదండ్రులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సౌరభ్ గురించి ఎంక్వైరీ చేయగా.. మర్డర్ విషయం బయటపడింది.ప్రేమ పెళ్లి.. ప్రియుడి కోసం..ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన సౌరభ్ రాజ్‌పుత్ అదే ప్రాంతానికి చెందిన ముస్కాన్ రస్తోగి ప్రేమించుకున్నారు. 2016లో పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత భార్యతో గడపడానికి టైం దొరకటం లేదని నేవీలో ఉద్యోగం మానేశాడు. ఇంట్లో గొడవలు అవ్వటంతో భార్యతో కలిసి వేరుకాపురం పెట్టాడు. 2019లో వీరికి ఓ ఆడపిల్ల పుట్టింది. బిడ్డపుట్టిన తర్వాత సౌరభ్‌కు ఓ దారుణమైన విషయం తెలిసింది. ముస్కాన్.. ఆమె స్నేహితుడు సాహిల్‌తో అక్రమ సంబంధం పెట్టుకుందని తెలిసింది. ఈ విషయమై సౌరభ్, ముస్కాన్‌ల మధ్య గొడవలు అయ్యాయి. పరిస్థితి విడాకుల వరకు వెళ్లింది. కూతురు కోసం సౌరభ్ వెనక్కు తగ్గాడు. మళ్లీ జాబ్‌లో జాయిన్ అయ్యాడు. 2023లో విదేశానికి వెళ్లిపోయాడు. 2025 ఫిబ్రవరి నెలలో కూతురి పుట్టిన రోజు ఉండటంతో ఇండియా వచ్చాడు. ఇది నచ్చని ముస్కాన్, సాహిల్ .. అతడ్ని చంపేశారు. ప్రియుడితో కలిసి మనాలికిభర్తను హత్య చేసిన తర్వాత ప్రియుడితో కలిసి మనాలికి వచ్చిన ముస్కాన్.. ఆపై ట్యాక్సీలో కాసోల్ లోని తమ హెటల్ కు వచ్చినట్లు స్టాఫ్ ఒకరు తెలిపారు. హెటల్ లో రూమ్ తీసుకున్న తర్వాత రోజులో ఒకసారి మాత్రమే బయటకు వచ్చి చాలా స్వల్ప సమయం మాత్రమే ఉన్నారని హోటల్ స్టాఫ్ లో మరొకరు తెలిపారు.నా వైఫ్ అంటూ సిబ్బందితో గొడవహోటల్ చెక్ ఇన్ లో భాగంగా ఇద్దరి ఐడీ కార్డులను పరిశీలించే క్రమంలో ముస్కాన్ ప్రియుడు ఐడీ కార్డు చూపించాడు. ఆపై ఆమె ఐడీ కార్డును చూసేటప్పుడు హోటల్ సిబ్బంది చేతుల్లోంచి ఆ కార్డును లాక్కొని తన భార్య అంటూ వారితో వాదనకు దిగాడు. ఆపై కొంత ఒత్తిడి తర్వాత ముస్కాన్ ఐడీ కార్డు కార్డును కు ఇచ్చినట్లు సిబ్బంది పేర్కొన్నారు.ఆరు రోజులు రూమ్ లోనే..వారు వచ్చిన తర్వాత ఆరు రోజులు రూమ్ తీసుకున్నారని, ఎక్కడికి వెళ్లకుండా రూమ్ లోనే ఉండిపోయేవారని హోటల్ సిబ్బంది తెలిపారు. సాధారణంగా ఎవరైనా మనాలికి వస్తే కొన్ని ప్లేస్ లకు వెళతారని కానీ వీరు అలా వెళ్లకుండా రూమ్ లోనే గడిపేవారన్నారు. ఫుడ్ ను ఒక్కసారే ఆర్డర్ చేసేవారని, క్లీనింగ్ కి కూడా ఒక్కసారే అనుమతి ఇచ్చేవారని సిబ్బంది తెలిపారు. అసలు బయటకు వచ్చేవారు కాదని, అనుమానం రాకుండా ఉండటానికి కేవలం ఏదొకసారి వచ్చి లోపలికి వెళ్లిపోయేవారట. మార్చి 16వ తేదీన వారు హోటల్ ను వెళ్లిపోయారని, వెళ్లే క్రమంలో ఉత్తర్ ప్రదేశ్ కు తిరిగి వెళ్లిపోతున్నట్లు తమకు తెలిపారని స్టాఫ్ లో ఒకరు తెలిపారు. -
ఆ తీర్పు ముమ్మాటికీ తప్పే!: కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి
న్యూఢిల్లీ: అలహాబాద్ హైకోర్టు జడ్జి రామ్ మనోహర్ మిశ్రా ఇచ్చిన తీర్పు ఇప్పుడు దేశవ్యాప్త చర్చకు దారి తీసింది. మహిళలను అభ్యంతకరంగా తాకడం లైంగిక దాడి కిందని రాదంటూ ఓ మైనర్ బాలిక కేసులో ఆయన తీర్పు ఇవ్వడం తెలిసిందే. అయితే తీర్పు సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయని అంటున్నారు కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి అన్నపూర్ణ దేవి. అలహాబాద్ హైకోర్టు తీర్పు సమ్మతం కాదన్న మంత్రి అన్నపూర్ణ.. దానిని పరిశీలించాలని సుప్రీం కోర్టును కోరారు. అలాంటి తీర్పులతో సమాజంలోకి తప్పుడు సందేశం వెళ్లే అవకాశం ఉందని ఆమె వ్యాఖ్యానించారు. అసలేం జరిగిందంటే..?2021 నవంబరులో.. ఉత్తరప్రదేశ్‌లోని కసగంజ్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ, తన మైనర్ కుమార్తెతో కలిసి బంధువుల ఇంటి నుంచి తిరిగివస్తోంది. అదే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు లిఫ్ట్ పేరిట ఆ బాలికను తమతో బైక్‌లపై తీసుకొచ్చారు. మార్గమధ్యంలో ఆ యువకులు అమ్మాయిపై అత్యాచారానికి యత్నించారు. ఆమెను అసభ్యంగా తాకుతూ వేధింపులకు గురిచేశారు. బాలిక అరుపులు విని అటుగా వెళ్తున్నవారు రావడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. విషయం తెలుసుకున్న బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో నిందితులపై కేసు నమోదు చేశారు. అనంతరం ఈ కేసు అలహాబాద్ హైకోర్టుకు చేరింది. ఇటీవల దీనిపై విచారణ జరిపిన జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళ ఛాతీని తాకినంత మాత్రాన.. పైజామా తాడు తెంపినంత మాత్రాన అత్యాచార యత్నం కిందకు రాదంటూ పేర్కొన్నారు. తద్వారా నిందితులు చేసిన నేరాలు పోక్సో చట్టంలోని సెక్షన్ 18, సెక్షన్ 376 కిందకు రావని చెబుతూనే.. అదే చట్టంలోని సెక్షన్ 9/10 (తీవ్రమైన లైంగిక వేధింపులు), సెక్షన్ 354-బి (మహిళల గౌరవాన్ని దెబ్బతీసే ఉద్దేశంతో దాడి) కింద కేసులు నమోదు చేసి విచారించాలని ఆదేశించారాయన. -
‘నాన్న డ్రమ్ములో ఉన్నాడు’.. చిన్నారి వ్యాఖ్యలపై నాన్నమ్మ ఆవేదన
మీరట్: ప్రియుడి మోజులో పడి భర్తను అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ వెలుగుచూసింది. భర్త హత్య అనంతరం.. ప్రియుడితో కలిసి ఆమె విహారయాత్రకు వెళ్లింది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ కేసులో మృతుడి కూతురు చేసిన వ్యాఖ్యల కారణంగా ఈ హత్యను ఆమె చూసి ఉండవచ్చని తెలుస్తోంది.మీరట్‌కు చెందిన మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్ హత్యకు సంబంధించి తాజాగా మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఈ హత్యను మృతుడి ఆరేళ్ల కుమార్తె చూసి ఉంటుందని సమాచారం. తన తండ్రి డ్రమ్ములో ఉన్నాడని ఆ పాప చుట్టుపక్కల వారికి చెప్పినట్లు తెలిసింది. ఈ మేరకు మృతుడి తల్లి ఈ విషయాలను వెల్లడించారు. ‘నాన్న డ్రమ్ములో ఉన్నాడు’ అని ఆ చిన్నారి పొరుగింటి వారికి పదే పదే చెప్పడం గమనించిన ముస్కాన్ బాలికను వేరే చోటుకు పంపించేసింది’ అని సౌరభ్ తల్లి రేణు దేవీ ఆవేదన వ్యక్తంచేశారు.సౌరభ్ తల్లి రేణు దేవీ మీడియాతో మాట్లాడుతూ.. నా కుమారుడు సౌరభ్‌ను అతడి భార్య ముస్కాన్, ఆమె ప్రియుడు కలిసి హత్య చేశారు. ఆ తర్వాత వారిద్దరూ కలిసి ట్రిప్‌కు వెళ్లారు. తిరిగొచ్చిన తర్వాత మరమ్మతుల కోసం వారు ఉంటున్న ఇంటి యజమాని కూలీలను తీసుకొచ్చారు. ఇంట్లో ఉన్న డ్రమ్మును వారు పైకి ఎత్తలేకపోయారు. దీంతో, లోపల ఏముందని అడిగితే చెత్తాచెదారం అని ముస్కాన్ చెప్పిందట. అనుమానం వచ్చి మూత తీయగా లోపల నుంచి దుర్వాసన వచ్చింది. దీంతో వారు పోలీసులకు సమాచారమిచ్చారు.#WATCH | Meerut, UP | Saurabh Rajput Murder case | Mother of deceased Saurabh Rajput says, "They (Muskan and her partner Sahil) murdered my son, and after that she went for a trip...She locked the body in the room...the owner of the house had asked them (Saurabh and Muskan) to… https://t.co/QyeUSKIwcu pic.twitter.com/hgs3tLfMsk— ANI (@ANI) March 19, 2025అయితే, పోలీసులు వచ్చేలోపే మా కోడలు అక్కడి నుంచి తన పుట్టింటికి వెళ్లిపోయింది. మా ఆరేళ్ల మనవరాలికి కూడా హత్య విషయం తెలిసే ఉంటుంది. చిన్న పాప పదే పదే.. ‘నాన్న డ్రమ్ములో ఉన్నాడు’ పొరుగింటి వారికి చెప్పింది. అది గమనించిన ముస్కాన్.. పాపను వేరే చోటకు పంపించేసింది’ అని ఆవేదన వ్యక్తంచేశారు.డ్రమ్ములో మృతదేహం..సౌరభ్ రాజ్‌పుత్(29), ముస్కాన్(27) 2016లో ప్రేమ వివాహం చేసుకున్నారు. సౌరభ్ మర్చంట్ నేవీలో పని చేసేవాడు. వారికి 2019లో కుమార్తె జన్మించింది. ఆ తర్వాత ముస్కాన్‌కు సాహిల్(25)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. సౌరభ్ ఉద్యోగం మానేసి లండన్‌కు వెళ్లి ఓ బేకరీలో పనిచేసేవాడు. గత నెల కుమార్తె పుట్టిన రోజు కోసం అతడు ఇండియాకు వచ్చాడు. ఇది నచ్చని ముస్కాన్.. ప్రియుడితో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టింది. మృతదేహాన్ని 15 ముక్కలుగా నరికారు. శరీర భాగాలను ఓ ప్లాస్టిక్ డ్రమ్ములో దాచిపెట్టి పైన సిమెంటుతో కప్పిపెట్టారు.మా కుమార్తెను ఉరితీయండి..!నిందితులు ముస్కాన్, సాహిల్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా చేసిన దారుణాన్ని వారు అంగీకరించారు. దీంతో ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. కాగా, భర్తను హత్య చేసిన తమ కుమార్తెకు ఉరిశిక్ష విధించాలని ముస్కాన్ తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. కోటీశ్వరుడైన సౌరభ్ తమ కుమార్తెను ఎంతగానో ప్రేమించాడని, అతడిని తల్లిదండ్రులకు దూరం చేసిన ముస్కాన్‌ను కఠినంగా శిక్షించాలని వేడుకున్నారు. -
పెద్దలను కాదని ఆమెతో ప్రేమ పెళ్లి.. అతడి పరిచయంతో సీన్ రివర్స్..
లక్నో: ఆమెను ఎంతో ఇష్టపడి ప్రేమ వివాహం చేసుకోవడమే అతడి ప్రాణాలు తీసింది. ప్రియుడి కోసం కట్టుకున్న భర్తను భార్య దారుణంగా హత్య చేసింది. ప్రియుడితో కలిసి భర్తను ప్లాన్ ప్రకారం హత్య చేసి.. మృతదేహాన్ని ముక్కులుగా చేసి శరీర భాగాలను సిమెంట్‌తో కలిపిన ప్లాస్టిక్ డ్రమ్‌లో కప్పి పెట్టారు. ఈ క్రైమ్ సీన్ చూసి అక్కడికి వెళ్లిన పోలీసులే ఖంగుతిన్నారు. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.వివరాల ప్రకారం.. యూపీలోని మీరట్‌కు చెందిన సౌరవ్ కుమార్ మర్చంట్ నేవీలో పనిచేస్తున్నాడు. సౌరవ్.. ముస్కాన్‌ను ప్రేమించి 2016లో ఆమెను వివాహం చేసుకున్నాడు. వీరి ప్రేమ వివాహానికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో సౌరవ్‌కు, తన కుటుంబ సభ్యులకు మధ్య ఘర్షణ జరిగింది. దీంతో, మూడు సంవత్సరాల క్రితం, సౌరభ్ తన భార్య ముస్కాన్‌తో కలిసి ఇందిరానగర్‌లోని అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. వీరిద్దరికీ రెండో తరగతి చదువుతున్న 5 సంవత్సరాల కుమార్తె కూడా ఉన్నట్లు తెలుస్తోంది.చిగురించిన మరో ప్రేమ..అయితే, నేవీలో పనిచేస్తున్న కారణంగా సౌరవ్.. విధులకు వెళ్లి వస్తున్నాడు. ఈ క్రమంలోనే ముస్కాన్‌కు సాహిల్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇది కాస్తా ప్రేమకు దారితీసింది. దీంతో, వారిద్దరి శారీరక సంబంధం కూడా ఏర్పడింది. ఈ నేపథ్యంలో వీరిద్దరికీ అడ్డుగా ఉన్న భర్త సౌరవ్‌ను అడ్డుతొలగించుకోవాలని భావించారు. దీని కోసం సౌరవ్‌ను హత్య చేయాలని ప్లాన్ చేశారు. ఈ సందర్బంగా సౌరవ్ మార్చి 4న మీరట్ ఇందిరానగర్‌లోని వచ్చిన వెంటనే అతడిని హత్య చేశారు. అనంతరం, మృతదేహాన్ని ముక్కులుగా చేసి శరీర భాగాలను సిమెంట్‌తో కలిపిన ప్లాస్టిక్ డ్రమ్‌లో దాచిపెట్టారు.#Meerut: Wife Muskan Rastogi along with her boyfriend Sahil Shukla stabbed her husband Saurabh Rajput,The two then chopped up his body into 15 pieces, placed the remains in a drum, and sealed it with cement. After committing the crime, she allegedly went on a vacation with sahil. pic.twitter.com/qs6xnwWpa0— Dilip Kumar (@PDilip_kumar) March 19, 2025పక్కా ప్లాన్‌తో హత్య..మరోవైపు.. భర్తను హతమార్చేందుకు ప్లాన్ వేసిన ముస్కాన్.. భర్తతో కలిసి హిమాచల్ ప్రదేశ్ వెళ్తున్నానని పొరుగువారికి చెప్పింది. దీంతో, వారికి ఎలాంటి అనుమానం రాలేదు. తర్వాత ముస్కాన్ ఒక్కరే కనిపించడంతో సౌరవ్ కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. దీంతో, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా.. ముస్కాన్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా మొత్తం విషయం వెలుగులోకి వచ్చింది. భార్య ముస్కాన్, ఆమె ప్రేమికుడు సాహిల్ కలిసి సౌరభ్‌ను హత్య చేసినట్లు తేలింది. అతని మృతదేహాన్ని ప్లాస్టిక్ డ్రమ్ములో ఉంచి, ఆపై సిమెంట్ ద్రావణాన్ని తయారు చేసి డ్రమ్ములో పోశారు. దీని కారణంగా మృతదేహం లోపల గడ్డకట్టిందని పోలీసులు తెలిపారు. This is very painful,Saurabh Kumar, who works in the Merchant Navy, had a love marriage with his wife. He had come to #UttarPradesh's #Meerut from #London 22 days ago.In Meerut, his wife along with her boyfriend killed Saurabh. Both of them cut the body into pieces and1/2 pic.twitter.com/gdiwwaZDHP— Siraj Noorani (@sirajnoorani) March 18, 2025 -
కుటుంబం తలరాత మార్చిన ‘కుంభమేళా’.. 30 కోట్లు సంపాదన
లక్నో: ఇటీవల ముగిసిన మహాకుంభమేళా నిర్వహణపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న వేళ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దీటుగా బదులిచ్చారు. పడవలు నడిపే కుటుంబాలకు పెద్దగా ఒరిగిందేమీ లేదని సమాజ్‌వాదీ పార్టీ చేసిన విమర్శకు రాష్ట్ర బడ్జెట్‌పై చర్చ సందర్భంగా శాసనసభలో సీఎం యోగి సమాధానమిచ్చారు.ఈ సందర్భంగా సీఎం యోగి మాట్లాడుతూ..‘45 రోజులపాటు కనీవినీ ఎరుగని రీతిలో జరిగిన సనాతన ఆధ్యాత్మిక వైభవం మహాకుంభ్‌మేళా. ప్రయాగ్‌రాజ్‌లో ఒక కుటుంబం విజయగాథ చెప్తా. ఆ కుటుంబానికి 130 పడవలు ఉన్నాయి. 45 రోజుల కుంభమేళా రోజుల్లో ఈ కుటుంబం ఏకంగా రూ.30 కోట్ల లాభాలను కళ్లజూసింది. అంటే ఒక్కో బోటు రూ.23 లక్షల లాభాల తెచ్చింది. రోజుల లెక్కన చూస్తే ఒక్కో బోటు నుంచి రోజుకు రూ.50,000 నుంచి రూ.52,000 లాభం వచ్చింది’ అని అన్నారు.ఇదే సమయంలో కుంభమేళా వివరాలను యోగి వెల్లడించారు. ఒక్క తొక్కిసలాట ఘటన తప్పితే 45 రోజుల్లో ఏకంగా 66 కోట్ల మంది భక్తులు సంతోషంగా మేళాకు వచ్చి వెళ్లారు. ఒక్క నేరం జరగలేదు. మహిళలపై వేధింపులు, కిడ్నాప్, దోపిడీ, హత్య ఘటన ఒక్కటి కూడా జరగలేదు అని అన్నారు.One Boatman family who has 130 boats earn ₹ 30cr in just 45 days during the Kumbh Mela. pic.twitter.com/7UhvKZZosc— Farrago Abdullah Parody (@abdullah_0mar) March 4, 2025వేల కోట్లు పెడితే లక్షల కోట్ల వ్యాపారం..కుంభమేళాకు ఏర్పాట్లు, రక్షణ, భద్రత తదితరాల కోసం అయిన మొత్తం ఖర్చు రూ.7,500 కోట్లు. 200కుపైగా రోడ్లను వెడల్పు చేశాం. 14 ఫ్లైఓవర్లు కట్టాం. 9 అండర్‌పాస్‌లు నిర్మించాం. 12 కారిడార్లను సిద్ధంచేశాం. దీంతో పలు రంగాల్లో మొత్తంగా ఏకంగా రూ.3 లక్షల కోట్ల వ్యాపారం జరిగింది. హోటల్ రంగంలో రూ.40,000 కోట్ల వ్యాపారం జరిగింది. ఇక ఆహారం, నిత్యావసరాల విభాగంలో రూ.33,000 కోట్లు, రవాణారంగంలో రూ.1.5 లక్షల కోట్ల వ్యాపారం జరిగింది. రూ.660 కోట్ల విరాళాలు వచ్చాయి. జాతీయరహదారుల వెంట టోల్‌ట్యాక్స్ రూపంలో రూ.300 కోట్లు వచ్చాయి. ఇతర రెవిన్యూ మార్గాల్లో రూ.66,000 కోట్ల వ్యాపారం జరిగింది. ఈఏడాది దేశ స్తూలజాతీయోత్పత్తికి కుంభమేళా సైతం తన వంతు వాటాను అందించింది అని యోగి చెప్పారు. -
అసెంబ్లీలో ఎమ్మెల్యేల గలీజు పని.. స్పీకర్ ఫైర్
అసెంబ్లీకి వెళ్లిదే ఎవరు.. ప్రజా ప్రతినిధులు. వారు ఎంతో బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది. వారి వ్యక్తిగత అలవాట్లను పక్కన పెడితే, అసెంబ్లీని మాత్రం శుభ్రంగా ల్సిన కనీస బాధ్యత వారిపై ఉంటుంది. అది కూడా ఎమ్మెల్యేలు చేయకపోతే, ఇక ప్రజలకు వారిచ్చే సందేశం ఏముంటుంది. మరి అటువంటి ఎమ్మెల్యేలు తమ బాధ్యతను మరిచి కనీసం అసెంబ్లీని శుభ్రంగా ఉంచడంలో నిర్లక్ష్యం వహిస్తే, ఇలానే ఉంటుంది. అసలు ఏమి జరిగిందనే విషయాన్ని ఒక్కసారి చూస్తే..ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఇవాళ ఆసక్తికరమైన ఉదంతం జరిగింది. అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా అసెంబ్లీ హాల్‌ను సిబ్బందితో కలిసి శుభ్రం చేశారు. అనంతరం విధాన సభలో ఆయన చేసిన ఓ ప్రకటన ఇప్పుడు చర్చనీయాంశమైంది. సభా ప్రాంగణంను శుభ్రంగా ఉంచాలని సభ్యులను కోరిన ఆయన.. తాను శుభ్రం చేయడానికి గల కారణం చెప్పడంతో ఎమ్మెల్యేలంతా తలలు దించుకున్నారు.సెషన్ ప్రారంభమైన వెంటనే స్పీకర్ సతీష్ మహానా సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఈ ఉదయం విధాన సభ హాల్లో జరిగిన ఓ ఘటన గురించి మీకు చెప్పాలి. సభ్యుల్లో ఒకాయన పాన్ మసాలా నమిలి ఉమ్మేశారు. విషయం తెలియగానే నేనే స్వయంగా వెళ్లి అక్కడ శుభ్రం చేశా. ఆ ఎమ్మెల్యే ఎవరనేది ఆ వీడియోలో నేను చూశా. కానీ, పేరు చెప్పి ఒక గౌరవ సభ్యుడి పరువు తీయాలని అనుకోవడం లేదు. తనంతట తానుగా ఆయన నా దగ్గరకు వచ్చి వివరణ ఇచ్చుకుంటే మంచిది. లేకుంటే నేనే పిలవాల్సి ఉంటుంది. ఈ సమయంలో దయచేసి మీ అందరికీ ఓ విజ్ఞప్తి. ఇక మీదట అలా ఎవరైనా చేస్తుండడం మీరు గమనిస్తే.. వాళ్లను అడ్డుకోండి. ఎందుకంటే.. అసెంబ్లీని శుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత అని అన్నారు. #WATCH | Uttar Pradesh Assembly Speaker Satish Mahana raised the issue of some MLA spitting in the House after consuming pan masala. He said that he got the stains cleaned, urged other MLA to stop others from indulging in such acts and also appealed to the MLA to step forward and… pic.twitter.com/VLp32qXlU8— ANI (@ANI) March 4, 2025 -
మరణించిన పిల్లితో రెండురోజులు గడిపి.. చివరికి షాకింగ్ నిర్ణయం
లక్నో: పెంపుడు పిల్లి మృతితో కుంగిపోయిన ఓ మహిళ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తీవ్ర మనస్తాపం చెందిన ఆమె.. మళ్లీ బతికి వస్తుందనే ఆశతో రెండు రోజుల పాటు తన పెంపుడు పిల్లి మృతదేహంతోనే గడిపింది. చివరికి మూడో రోజు ఆత్మహత్య చేసుకుని మరణించింది. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో ఈ ఘటన జరిగింది. హసన్‌పూర్‌లో నివసించే 32 ఏళ్ల పూజకు ఎనిమిదేళ్ల కిందట ఢిల్లీకి చెందిన వ్యక్తితో వివాహం కాగా.. రెండేళ్ల తర్వాత భార్యాభర్తలు విడిపోయారు. దీంతో నాటి నుంచి తల్లి గజ్రా దేవి వద్ద ఆమె నివసిస్తోంది.ఒంటరితనం నుంచి బయటపడడానికి పూజ ఒక పెంపుడు పిల్లిని తీసుకొచ్చి పెంచుకుంటోంది. ఆ పిల్లి హఠాత్తుగా చనిపోవడంతో ఆమె తల్లి.. పిల్లిని పాతిపెట్టమని చెప్పింది. అందుకు పూజ నిరాకరించింది. అది తిరిగి బతికి వస్తుందంటూ.. రెండు రోజుల పాటు ఆ పిల్లి మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచింది. ఖననం చేయామని కుటుంబ సభ్యులు ఎన్ని సార్లు చెప్పిన కానీ పూజ వినిపించుకోలేదు.పిల్లి మృతితో తీవ్ర కుంగుబాటుకు గురైన పూజ.. శనివారం మధ్యాహ్నం ఆమె తమ ఇంటి మూడో అంతస్తులోని తన గదిలోకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడింది. గజ్రా దేవి తన కూతురిని చూడటానికి తలుపులు తీసి చూడగా పూజ సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
ముగిసిన మహా కుంభమేళా
మహాకుంభ్‌నగర్: ప్రపంచంలోనే అతిపెద్ద సామూహిక వేడుకగా రికార్డుకెక్కిన మహా కుంభమేళా శివరాత్రి పర్వదినం సందర్భంగా బుధవారం ముగిసింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ త్రివేణి సంగమంలో పుణ్యస్నానాల ఘట్టానికి తెరపడింది. 144 సంవత్సరాల తర్వాత వచి్చన ఈ మహా కుంభమేళాకు దేశ విదేశాల నుంచి భక్తులు పోటెత్తారు. 45 రోజులపాటు వైభవంగా సాగిన పుణ్యక్రతువులో ఉత్సాహంగా పాల్గొన్నారు. చివరి రోజు బుధవారం భక్తుల పుణ్యస్నానాలతో గంగ, యమున, సరస్వతి నదుల సంగమస్థలి కిక్కిరిసిపోయింది. ఒక్కరోజే 1.32 కోట్ల మంది తరలివచ్చారు. హరహర మహాదేవ అనే మంత్రోచ్ఛారణలతో ఈ ప్రాంతమంతా మార్మోగిపోయింది. చివరి రోజు కావడంతో భక్తులపై హెలికాప్టర్ల ద్వారా పూలవర్షం కురిపించారు. ఈ ఏడాది జనవరి 13న పౌష్య పూర్ణిమ రోజు మహా కుంభమేళా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 26 వరకూ 66.21 కోట్ల మందికిపైగా జనం స్నానాలు ఆచరించారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ సంఖ్య ప్రపంచంలోని చాలా దేశాల ఉమ్మడి జనాభా కంటే అధికం కావడం గమనార్హం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, ప్రముఖ వ్యాపారవేత్తలు, సినీ నటులు మహా కుంభమేళాలో పాలుపంచుకున్నారు. భూటాన్ రాజు సైతం పుణ్నస్నానం ఆచరించారు. మహా కుంభమేళాను విజయవంతం చేయడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈసారి పటిష్టమైన చర్యలు చేపట్టింది. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించింది. డ్రోన్లు, కృత్రిమ మేధ కెమెరాలను రంగంలోకి దించింది. మహాకుంభ్‌నగర్‌లో ప్రత్యేకంగా టెంట్ సిటీని నిర్మించింది. ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని అపశ్రుతులు చోటుచేసుకున్నాయి. -
వధువు స్నేహితురాలి మెడలో వరమాల, చివరికి..
ఆ వరుడు అడిగిన అదనపు కట్నం ఆ అమ్మాయి తండ్రి ఇవ్వలేనన్నాడు. కోపంతో ఎలాగైనా అమ్మాయి కుటుంబం పరువు తీయాలనుకున్నాడు. స్నేహితులతో కలిసి ప్లాన్ వేశాడు. పెళ్లిరోజే పీటలపైకి తప్పతాగి వచ్చాడు. తాగి వచ్చినోడు ఆ మత్తులో వధువు మెడలో కాకుండా ఆమె స్నేహితురాలి మెడలో వరమాల వేశాడు. ఇక అంతే.. అతని చెంప చెల్లుమంది..రవీంద్ర కుమార్(26)కు రాధా దేవికి ఈ నెల 22వ తేదీన వివాహం జరగాల్సి ఉంది. ఊరేగింపుతో పెళ్లి కొడుకు కల్యాణ మండపానికి చేరుకున్నాడు. అయితే అప్పటికే ఆ రెండు కుటుంబాల మధ్య కట్నం విషయంలో గొడవలు జరిగాయి. దీంతో ఎలాగైనా పెళ్లిలో వధువు కుటుంబాన్ని అందరి ముందు అవమానించాలని రవీంద్ర భావించాడు. ఊరేగింపు కంటే ముందే స్నేహితులతో ఫుల్‌గా మద్యం సేవించాడు.తీరా పెళ్లి మండపంలో పెళ్లి తంతు జరుగుతుండగా.. వధువు మెడలో కాకుండా ఆమె స్నేహితురాలి మెడలో వరమాల వేశాడు. దీంతో వధువుకు చిర్రెత్తుకొచ్చింది. తూగుతున్న అతన్ని లాగి అతని చెంప మీద కొట్టింది. తన చేతిలో దండ కింద పడేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో పెళ్లి మండపం కాస్త రణరంగంగా మారింది.बरेली: दूल्हे ने दुल्हन की बेस्ट फ्रेंड को पहना दी वरमाला, दुल्हन ने मारा दूल्हे को थप्पड़, लौट गई बारात.!#UttarPradesh #UPNews #Bareilly #UPPolice pic.twitter.com/WZssqNzG5T— Bansal News (@BansalNewsMPCG) February 25, 2025Video Credits: Bansal Newsఇరువర్గాలు కుర్చీలు విసురుకుంటూ బాహాబాహీకి దిగారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. రాధాదేవి తండ్రి ఫిర్యాదు మేరకు.. అదనపు కట్నం డిమాండ్, ఉద్దేశపూర్వకంగానే రాధాదేవిని అవమానించారని పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ ఎపిసోడ్లో వరుడు, అతని స్నేహితులపై మరో కేసు నమోదయ్యింది. కల్తీ మద్యం కొనుగోలు చేశారని పోలీసులు అభియోగాలు నమోదు చేసి జైల్లో పెట్టారు. ఉత్తర ప్రదేశ్‌లోని బరేలీలో ఈ ఘటన శనివారం చోటు చేసుకుంది.