
లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. దిశ తరహా ఘటన లక్నోలో వెలుగుచూసింది. కదులుతున్న కారులో ఓ మహిళపై అత్యాచారయత్నం చేశారు ముగ్గురు దుండగులు. ఈ క్రమంలో ఆమె ప్రతిఘటించడంతో.. కత్తితో పొడిచి హత్య చేశారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా.. మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు.
వివరాల ప్రకారం.. లక్నోలోని బెహాసా గ్రామానికి చెందిన ఛాయా(26) బ్యూటీషియన్‌గా పనిచేస్తోంది. ఈ క్రమంలో లక్నోకు చెందిన సుధాన్షు అనే వ్యక్తి.. తన ఇంట్లో పెళ్లి వేడుక సందర్భంగా మేకప్ కోసం రావాలని ఛాయాకు ఫోన్ చేసి చెప్పాడు. ఆమె తన ఇంటికి వచ్చేందుకు కారును కూడా పంపాడు. కారులో అజయ్, వికాస్, ఆదర్శ్ కలిసి వెళ్లారు. దీంతో, ఛాయ తన సోదరి పాలక్‌తో కలిసి.. సుధాన్షు ఇంటికి బయలుదేరింది. వివాహ వేడుకల్లో పాల్గొన్న కారణంగా అర్ధరాత్రి 2 గంటల సమయంలో తాను ఇంటికి వెళ్లేందుకు సిద్ధమైంది.
ఈ నేపథ్యంలో కారులో ఆమె ఇంటికి వెళ్తున్న సమయంలో అజయ్, వికాస్, ఆదర్శ్.. ఛాయా ఆమె సోదరి పాలక్‌పై అత్యాచారయత్నం చేశారు. కదులుతున్నా కారులో లైంగిక వేధింపులకు గురిచేశారు. ఈ క్రమంలో ప్రతిఘటించడంతో ఛాయాపై కత్తితో దాడి చేశారు. ఈ సందర్భంగా వేగంతో వెళ్తున్న కారు రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో, కారు బోల్తా పడటంతో పాలక్.. తమకు సాయం చేయాలని గట్టిగా అరిచింది.
అనంతరం, అక్కడి నుండి ముగ్గురు నిందితులు పారిపోతూ పాలక్‌ను బెదిరించారు. ఈ విషయం ఎవరికైనా చెబితే తనను, తన కుటుంబాన్ని చంపేస్తామని హెచ్చరించారు. తర్వాత వారు ముగ్గురు పారిపోయారు. అది గమనించిన స్థానికులు.. వెంటనే ఛాయ, పాలక్‌ను ఆసుపత్రికి తరలించగా.. ఛాయ మృతిచెందినట్టు వైద్యులు వెల్లడించారు. దీంతో, ఈ ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు.. వికాస్, ఆదర్శ్‌ను అరెస్ట్ చేయగా.. అజయ్ ఇంకా పరారీలో ఉన్నాడు. అజయ్ కోసం పోలీసులు గాలిస్తున్నట్టు ఏసీపీ వికాస్ పాండే తెలిపారు.
ब्रेकिंग लखनऊ
ब्यूटीशियन छाया की दुष्कर्म के प्रयास में हत्या
तीन युवको ने ब्यूटीशियन के साथ की छेड़छाड़
छेड़छाड़ का विरोध करने पर हत्या
एक आरोपी गिरफ्तार, दो फरार #BREAKING #Lucknow #Murder #RapeAttempt #indiavoice pic.twitter.com/W4ppJOskGW— India Voice (@indiavoicenews) April 19, 2025