beautician
-
ఏఐ బ్యూటీషియన్ రంగాన్ని కూడా శాసించగలదా..?
ఏఐ సాంకేతికత ప్రపంచాన్నే మారుస్తోంది. ప్రస్తుతం ఏఐ విద్యా, వైద్య, మార్కెటింగ్,సేల్స్, ఫైనాన్స్ , కంటెంట్ క్రియేషన్ వంటి పలు రంగాలను ప్రభావితం చేసింది. దీంతో ఇక భవిష్యత్తులో ఉద్యోగాలు ఉంటాయా? అనే భయాన్ని రేకెత్తించేలా శరవేగంగా దూసుకుపోతుంది. ఇక మిగిలింది సౌందర్యానికి సంబంధించిన బ్యూటిషయన్ రంగం ఒక్కటే మిగిలి ఉంది. ఇందులో కూడా ఆ సాంకేతికత హవా కొనసాగుతుందా అంటే..సందేహాస్పదంగా సమాధానాలు వస్తున్నాయి నిపుణుల నుంచి. ఎందుకంటే చాలా వరకు మానవ స్పర్శకు సంబంధించిన రంగం. ఇంతకీ ఈ సాంకేతికత ప్రభావితం చేయగలదా? అలాగే ఈ రంగంలో ఏఐ హవాను తట్టకునేలా ఏం చెయ్యొచ్చు.. బ్యూటీషియన్ రంగంలో ఐఏ సాంకేతిక వస్తే.. సరికొత్త ఇన్నోవేషన్‌తో.. వర్చువల్ టూల్స్‌ని మెరుగుపర్చగలదు. అంటే ఎలాంటి మేకప్‌లు సరిపడతాయి, చర్మ నాణ్యత తదితర విషయాల్లో సలహాలు, సూచనలు ఇవ్వగలదు. మానవునిలా ప్రభావవితం చేయలేదు. ఎందుకంటే ఇది సృజనాత్మకత, భావోద్వేగం, టచ్‌తో కూడిన కళ. 2020లో మహమ్మారి సమయంలో ఈసాంకేతికత ప్రభంజనంలా దూసుకుపోయిందే తప్ప మరేంకాదని కొట్టేపడేస్తున్నారు నిపుణులు. అయితే బ్యూటీషియన్ రంగంలోని మేకప్ పరిశ్రమను ప్రభావితం చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఇక్కడ కస్టమర్ మనోగతం ఆధారంగా అందమైన రూపు ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఆ నేపథ్యంలో ఏఐ సరైన మేకప్‌ని కస్టమర్లకు ఇవ్వడం అన్నది సాధ్యం కానీ విషయం. ఓ మోస్తారుగా ఇలాంటి మేకప్ ఇస్తే ఇలా ఉంటుందని వర్చువల్ ఐడియానే అందివ్వగలదే తప్ప కస్లమర్కి నచ్చినట్టుగా క్రియేటివిటీతో కూడిన మేకప్ ఇవ్వడం అనేది అంత ఈజీ కాదు. అలాగే క్లయింట్లకు ఎలాంటి బ్యూటీప్రొడక్ట్లు వాడితే బెటర్ అనేది, చర్శ తత్వం తదితరాలకు మాత్రమే ఐఏ ఉపయోగపడవచ్చని చెబుతున్నారు నిపుణులు. ఐఏ అందానికి సంబంధివచి ప్రభావితం చేయాలేని కీలక అంశాలు గురించి కూడా చెప్పారు. అవేంటంటే..కళాత్మక క్రియేటివిటీ : బ్యూటీషియన్ నిపుణులే మూఖాకృతి తీరుకి సరైన మేకప్‌తో ఒక మంచి రూపాన్ని ఇవ్వగలరు. ఇది నిశితమైన అంతర్దృష్టికి సంబంధించిన క్రియేటివిటీ. ఎమోషనల్ కనెక్షన్: కస్టమర్ల సౌందర్య సంప్రదింపుల్లో ఇది అత్యంత కీలకమైంది. క్లయింట్ వ్యక్తిగతంగా ఏ విషయంలో ఇబ్బంది పడుతున్నారనేది అర్థం చేసుకుని సలహాలు, సూచనలివ్వాల్సి ఉంటుంది. స్పర్శ సేవ: షేషియల్, మసాజ్ వంటి సౌందర్య చికిత్సలలో టచ్ అనేది కీలకం. బ్యూటీషియన్ అనుభవం ఆధారంగా కస్టమర్లకు దొరికే మంచి అనుభూతిగా చెప్పొచ్చు. ఒక వేళ ఏఐ సౌందర్య రంగాన్ని ప్రభావితం చేసినా..బ్యూటీషియన్లు ఈ సవాలుని స్వీకరించేందుకు సిద్ధపడాలి. అలాగే కస్టమర్లకు మెరగైన సేవను అందించి సాంకేతికత కంటే..మనుషుల చేసేదే బెటర్ అనే నమ్మకాన్ని సంపాదించుకునే యత్నం చేయాలి. బ్యూటీషియన్లంతా ఈ రంగంలో అచంచలంగా దూసుకునిపోయేలా ఏఐని స్నేహితుడిగా మలుచుకుంటే మరిన్న ఫలితాలను సాధించే అవకాశం ఉంటుంది. అలాంటి వారే ఎలాంటి సాంకేతిక ఆటను ఈజీగా కట్టడి చేయగలరు అని నమ్మకంగా చెబుతున్నారు విశ్లేషకులు. (చదవండి: 40 ఏళ్ల నాటి గౌనులో యువరాణి అన్నే..!) -
నేను ఎవరనుకుంటున్నారు అంటూ మార్గదర్శి మేనేజర్ భార్య
ఒంగోలు టౌన్: ఒంగోలు నగరంలో ఒక బ్యూటీషియన్ ఇంట్లో మంగళవారం ఉదయం జరిగిన చోరీ ఎంతగా కలకలం రేపిందో ఆ చోరీలో ప్రముఖ వ్యక్తుల భార్యలు నిందితులుగా పోలీసులకు దొరకడం కూడా అంతే సంచలనం సృష్టించింది. స్థానికంగా శ్రీకృష్ణ నగర్లో బ్యూటీ పార్లర్ నిర్వహించే షేక్ రజియా మీద దాడి చేసి ముగ్గురు మహిళలు పట్టపగలే చోరీకి పాల్పడడం తెలిసిందే. దొంగతనం జరిగినట్లు ఫిర్యాదు అందుకున్న ఎస్పీ మలికా గర్గ్ తక్షణమే స్పందించి పోలీసులను అప్రమత్తం చేశారు. వెంటనే రంగంలోకి దిగిన తాలూకా పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాలను పరిశీలించిన వారికి కీలక సమాచారం లభ్యమైంది. తీగలాగితే డొంక కదిలింది. నగరంలోని ముంగమూరు రోడ్డులో ధనవంతులు నివశించే మైటీ హోం అపార్ట్మెంట్, దానికి కొద్ది సమీపంలోని ఐక్య అపార్ట్మెంట్ వద్దకు చేరుకున్న పోలీసులను చూసి అక్కడి జనం ఆశ్చర్యపోయారు. సరాసరి ఒంగోలు మార్గదర్శి మేనేజర్ కరణం నాగేశ్వరరావు ఫ్లాట్ వద్దకు వెళ్లిన పోలీసులు ఈ కేసులో నిందితురాలైన కరణం మోహన దీప్తిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే మిగిలిన నిందితులు ముండ్రు లక్ష్మీ నవత, రిటైర్డ్ ఏఎస్సై కోడలు అలహరి అపర్ణ, దాసరి భాను ఉరఫ్ సాహేర భానును కూడా అదుపులోకి తీసుకున్నారు. స్నేహితురాలే సమాచారం ఇచ్చింది... బ్యూటీషియన్ రజియాకు రాజీవ్ నగర్లో నివశించే దాసరి భాను ఉరఫ్ షేక్ సాహెర భాను మంచి స్నేహితురాలు. తరచుగా ఇద్దరూ కలిసి కబుర్లు చెప్పుకునే వాళ్లు. మంచి, చెడ్డ మాట్లాడుకునేవాళ్లు. అయితే రజియా వద్ద లక్షల విలువ చేసే బంగారం ఉన్న విషయాన్ని గ్రహించిన భానుకు కన్నుకుట్టింది. అదే సమయంలో భానుకు కిలాడీ ముఠాతో కూడా బాగా పరిచయం ఉంది. వారి చేతివాటం గురించి కూడా ఆమెకు తెలుసు. రజియా వద్ద ఉన్న బంగారం, ఆమె ఒంటరిగా ఉండే సమయం గురించి వారికి సమాచారం ఇచ్చింది. అసలే దొంగతనాలకు అలవాటు పడిన ప్రాణాలు కదా.. వెంటనే రంగంలోకి దిగారు. పట్టపగలే దొంగతనానికి తెగబడ్డారు. రెక్కీ చేసి మరీ దొంగతనం... బ్యూటీషియన్ రజియా ఇంట్లో దొంగతనానికి పాల్పడటానికి ముందు ఈ కిలాడీ ముఠా రెక్కీ కూడా నిర్వహించినట్లు సమాచారం. రజియా ఇంటి పరిసరాలు, ఇంటి చుట్టు పక్కల వాతావరణాన్ని కూడా పరిశీలించినట్లు తెలుస్తోంది. అప్పటికే ఒకటికి రెండుసార్లు చోరీలు చేసి ఉండడంతో చేయి తిరిగిన దొంగల్లా చోరీకి పాల్పడ్డారు. ఒకవేళ ఏదైనా ప్రతిఘటన జరిగితే ఎదుర్కొనేందుకు వెంట క్లోరోఫాం స్ప్రే చేసిన రుమాలును, యాసిడ్ లాంటి ద్రావణాన్ని తెచ్చుకున్నారు. అయితే చోరీ సమయంలో రజియా తిరగబడటంతో ఆగ్రహానికి గురైన ఈ ముఠాలోని ఒక మహిళ బూతులు తిడుతూ వెనుక నుంచి గట్టిగా నోరు మూసేసిట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రజియాను బలవంతంగా యాసిడ్ తాగించే ప్రయత్నం చేయడం గమనిస్తే వీరు ఎంత క్రూరంగా ఉన్నారో అర్థమవుతుంది. ఒంటరి మహిళలే టార్గెట్... ఈ ముగ్గురు దొంగల ముఠా గతంలోనూ అనేక దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో అంగీకరించారు. వీరి మీద 20012లో పెళ్లూరు గ్రామంలో జరిగిన ఒక దొంగతనం కేసు నమోదైంది. ఒక అపార్ట్మెంటులో ఒంటరిగా ఉన్న వృద్ధురాలి ప్లాటులో చోరీకి పాల్పడ్డారు. అలాగే పొదిలి, దొనకొండల్లో కూడా వీరు దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసుల ముందు అంగీకరించారు. ఒంటరి మహిళలను, వృద్ధులను టార్గెట్ చేసిన ఈ కిలేడి ముఠా ఇంకా ఎన్ని దొంగతనాలకు పాల్పడ్డారో మొత్తం విచారణ జరిగితే తెలుస్తుంది. ప్రస్తుతం పోలీసులు అదే పనిలో ఉన్నారు. ఈ ముగ్గురి నేరాల చిట్టా తేల్చేందుకు విచారణ చేపట్టారు. గతంలో రుణాలు తీసుకోవడం, తక్కువ వడ్డీలు అంటూ అనేక మందిని మోసం చేసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. కొంతమంది యువకులు కూడా వీరితో కలిసి చోరీలకు పాల్పడుతున్నారని సమాచారం. ఈ ముగ్గురు మహిళల్లో ఒకరి భర్త దగ్గర పనిచేసే యువకులను చేరదీసినట్లు సమాచారం. రచ్చ చేసిన దీప్తి... బ్యూటీషియన్ మీద దాడి చేసి చోరీకి పాల్పడిన కరణం మోహన దీప్తి పోలీసుల ఎదుట రచ్చ చేసినట్లు తెలుస్తోంది. సీసీ కెమెరాలలో లభ్యమైన చిత్రాలు, ఇతర పక్కా సమాచారంతో ఐక్య అపార్ట్మెంటుకు వెళ్లిన పోలీసులతో తొలుత ఆమె వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. మీరు ఎవరి ఇంటికి వచ్చారు..నేను ఎవరనుకుంటున్నారు... మార్గదర్శి మేనేజర్ భార్యను... అంటూ రెచ్చిపోయినట్లు తెలుస్తోంది. పోలీసుల వద్ద ఉన్న సాక్ష్యాలు చూసిన తరువాత కిమ్మనకుండా పోలీసు వ్యాన్ ఎక్కినట్లు ప్రచారం జరుగుతోంది. -
అబిడ్స్‌లో బ్యూటీపార్లర్ నిర్వాకం.. ఆయిల్ పెట్టగానే ఊడిపోయిన మొత్తం జుట్టు
సాక్షి, హైదరాబాద్: హెయిర్ కట్ చేయించుకునేందుకు బ్యూటీపార్లర్‌కు వెళ్లిన మహిళకు షాక్ తగిలింది. బ్యూటీషియన్ నిర్వాకంతో ఆ మహిళకు జట్టు ఊడిపోయిన ఘటన అబిడ్స్‌లో జరిగింది. మహిళకు హెయిర్ కట్ చేసి ఆయిల్ పెట్టగానే మొత్తం జుట్టు ఊడిపోయింది. పీఎస్‌లో బాధితురాలి ఫిర్యాదు మేరకు పార్లర్‌పై కేసు నమోదు చేశారు. బ్యూటీ పార్లర్ నిర్వాహకుల నిర్వాకంతో గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోడంతో బ్యూటీ పార్లర్ అంటే మహిళలు హడలిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫేస్ వ్యాక్స్ చేయించుకున్న మహిళలకు ముఖంపై ఎర్రగా కంది నీటి పొక్కులు రావడం, ఫేస్‌మాస్క్ వికటించి మొహం నల్లగా మారిపోవడం వంటి ఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. కొంతమంది బ్యూటీషియన్లకు సరైన అవగాహన లేకపోవడం, నాణ్యమైన మెటీరియల్ వాడకపోవడంతో మహిళలకు సమస్యలు ఎదురవుతున్నాయి. చదవండి: వదినపై అందరూ చూస్తుండగానే... -
చిత్తూరు జిల్లా బ్యూటీషియన్ దుర్గా ప్రశాంతి హత్య కేసు నిందితుడు అరెస్ట్
-
వద్దన్నందుకు చంపేశాడు.. బ్యూటీషియన్ దుర్గ మృతిలో వీడిన మిస్టరీ
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో సంచలనం సృష్టించిన బ్యూటీషియన్ దుర్గాప్రశాంతి మృతి కేసులో మిస్టరీ వీడింది. దుర్గాప్రశాంతిది హత్యగా పోలీసులు తేల్చారు. ప్రాణాపాయ స్థితిలో తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నిందితుడు చక్రవర్తి నోరు విప్పడంతో అసలు విషయం బయటపడింది. కొద్దిరోజులుగా తనను పక్కకు పెట్టడం, పెళ్లి విషయాన్ని వాయిదా వేస్తూ రావడంతోనే దుర్గాప్రశాంతిని చంపేసినట్లు నిందితుడు అంగీకరించాడు. ఇక్కడ ఆస్పత్రిలో కోలుకున్న చక్రవర్తి ప్రస్తుతం పోలీసుల పహారా మధ్య తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మోచేతితో గొంతుబిగించి.. చిత్తూరుకు చెందిన పోలీసు హెడ్ కానిస్టేబుల్ కుమార్తె దుర్గాప్రశాంతికి, తెలంగాణలోని కొత్తగూడేనికి చెందిన చక్రవర్తికి ఫేస్బుక్ ద్వారా రెండేళ్లుగా పరిచయం ఉంది. దుర్గాప్రశాంతిని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో చక్రవర్తి భద్రాచలంలో ఉన్న తన తల్లిని తీసుకుని చిత్తూరు వచ్చి దుకాణం తెరచి ఇక్కడే ఉంటున్నాడు. ఇటీవల పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడల్లా తనకు కాస్త సమయం కావాలని దుర్గాప్రశాంతి కోరేది. వారం రోజులుగా వారి మధ్య విభేదాలొచ్చా యి. తనకు ఫోన్ చేయవద్దని, పెళ్లి ఇప్పుడే వ ద్దని ఆమె స్పష్టం చేసింది. ఈ మాటలను పట్టించుకోని చక్రవర్తి నిత్యం ఫోన్లు చేస్తుండటంతో తన మొబైల్ చాట్స్ అన్నీ డిలీట్ చేయాలని చక్రవర్తికి చెప్పి అతడి మొబైల్ నంబర్‌ను బ్లాక్ చేసింది. తనను ఎందుకు పక్కకు పెట్టావని ప్రశ్నిస్తూ, పెళ్లి చేసుకోమని కోరుతూ చక్రవర్తి మంగళవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో తన మెయిల్ నుంచి దుర్గాప్రశాంతికి ఎని మిది పేజీల లేఖ రాశాడు. దీనికి ఆమె సమాధానం ఇవ్వలేదు. మధ్యాహ్నం ఆమె బ్యూటీపార్లర్‌లో ఉంటుందని తెలిసిన చక్రవర్తి 12.30 గంటల ప్రాంతంలో పార్లర్‌లోకి వెళ్లాడు. తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసినా దుర్గాప్రశాంతి అంగీకరించలేదు. దీంతో ఓ బ్లేడ్ తీసుకుని చేయి కోసుకున్నాడు. భయపడిన దుర్గ పార్లర్ నుంచి బయటకు పరుగెత్తేందుకు ప్రయత్నించింది. వెంటనే తన మోచేతితో దుర్గ గొంతును ఊపిరి ఆడకుండా గట్టిగా పట్టుకున్నాడు. ఆరడుగుల పొడవు, బలిష్టమైన శరీరంతో ఉన్న చక్రవర్తి పట్టు నుంచి దుర్గాప్రశాంతి తప్పించుకోలేక.. ఊపిరాడక క్షణాల్లో ప్రాణాలొదిలింది. దీంతో భయపడిన నిందితుడు తాను కూడా చనిపోవాలని బ్లేడుతో గొంతు, చేయి, శరీరంపై కోసుకుని తీవ్ర రక్తస్రావంతో పడిపోయాడు. దిశ పోలీసుల దర్యాప్తు ఈ కేసును చిత్తూరు దిశ పోలీసులకు అప్పగిస్తూ ఎస్పీ రిషాంత్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. వన్‌టౌన్ పోలీసుల వద్ద ఉన్న సమాచా రాన్ని దిశ స్టేషన్ డీఎస్పీ బాబుప్రసాద్ తీసుకున్నారు. దిశ సీఐ బాలయ్యతో కలిసి వైద్యులచే దుర్గాప్రశాంతి మృతదేహానికి పోస్టుమార్టం చేయించి, కుటుంబసభ్యులకు అప్పగించారు. నిందితుడు చక్రవర్తిపై హత్య, అట్రాసిటీ, ఆత్మహత్యాయత్నం సెక్షన్ల కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. -
బ్యూటీషియన్ మృతి.. చక్రవర్తి స్పృహలోకి వస్తేనే అసలు విషయం తెలిసేది?
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని మంగళవారం ఓ బ్యూటీషియన్ చనిపోవడం.. పక్కనే ఆమె స్నేహితుడు రక్తపుమడుగులో పడి ఉండటం సంచలనం సృష్టించింది. ఇద్దరూ రక్తపుమడుగులో పడి ఉండటంతో యువతి గొంతు కోసి చంపి.. ఆ తర్వాత ఆమె స్నేహితుడు గొంతు, ఛాతి, చేతులు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించి ఉంటాడని తొలుత భావించారు. అయితే, పోలీసులు వచ్చి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మృతురాలి శరీరంపై ఎక్కడా చిన్నగాయం కూడా కనిపించలేదు. యువతిని ఆమె స్నేహితుడు గొంతు నులిమి చంపేసి, అనంతరం అతను బ్లేడుతో కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. చిత్తూరు నగరంలోని తాలూకా పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నాగరాజు, ఇందిర దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు సంతానం. కుమారుడు 15 ఏళ్ల క్రితం విద్యుత్ షాక్‌తో చనిపోయాడు. పెద్ద కుమార్తెకు ఏడాది క్రితం పెళ్లి చేశారు. రెండో కుమార్తె దుర్గాప్రశాంతి(23) ఎం.ఫార్మసీ పూర్తిచేసి చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో కొంతకాలం పనిచేసింది. ఆమె ఏడాది క్రితం హైదరాబాద్‌కు వెళ్లి బ్యూటీషియన్ కోర్సు నేర్చుకుంది. నాలుగు నెలల క్రితం చిత్తూరులోని కొండమిట్ట ప్రాంతంలో సొంతగా బ్యూటీపార్లర్ ప్రారంభించింది. ఫేస్బుక్ ద్వారా పరిచయమై.. దుర్గాప్రశాంతికి రెండేళ్ల క్రితం ఫేస్బుక్లో చక్రవర్తి (27) అనే యువకుడు పరిచయమయ్యాడు. అతనిది తెలంగాణలోని భద్రాచలం జిల్లా కొత్తగూడెం కాగా, రెండేళ్లు దుబాయ్‌లో వంట మాస్టర్‌గా పనిచేశాడు. ఆ సమయంలోనే చక్రవర్తికి, దుర్గాప్రశాంతికి ఫేస్బుక్ ద్వారా స్నేహం కుదిరింది. రెండు నెలల క్రితం దుబాయ్ నుంచి వచ్చిన చక్రవర్తి.. తన తల్లిని తీసుకుని చిత్తూరు వచ్చి ఇక్కడే ఉంటున్నాడు. నగరంలోని దర్గా కూడలిలో బ్రెడ్ ఆమ్లెట్ దుకాణం పెట్టి జీవనం సాగిస్తున్నాడు. ఇతని తల్లి, దుర్గాప్రశాంతి తల్లి ఇందిర కూడా స్నేహితులుగా మారారు. రెండు రోజుల క్రితం ఇద్దరూ కలిసి కాణిపాకం వినాయకస్వామి ఆలయానికి కూడా వెళ్లి వచ్చారు. దుర్గాప్రశాంతి బ్యూటీపార్లర్ వద్దకు మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో చక్రవర్తి వచ్చాడు. ఇద్దరూ లోపలికి వెళ్లి తలుపులు వేసుకున్నారు. సాయంత్రం 4.30 గంటల సమయంలో ఇందిర వచ్చి బ్యూటీపార్లర్ తలుపు తీసి చూడగా.. దుర్గాప్రశాంతి రక్తపు మడుగులో అచేతనంగా పడి ఉంది. చక్రవర్తి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న డీఎస్పీ శ్రీనివాసమూర్తి, సీఐ నరసింహరాజు ఘటనాస్థలానికి చేరుకుని చక్రవర్తిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దుర్గాప్రశాంతి అప్పటికే చనిపోయి ఉంది. చక్రవర్తి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతి రిమ్స్‌కు తరలించారు. ప్రభుత్వాస్పత్రి మార్చురీ వద్ద దుర్గాప్రశాంతి మృతదేహాన్ని ఎస్పీ రిషాంత్‌రెడ్డి పరిశీలించి ఘటనపై ఆరా తీశారు. చదవండి: 'నేను డేంజర్లో ఉన్నా' అని లవర్‌కు మెసేజ్.. కాసేపటికే ముగ్గురూ బీచ్‌లో.. ఇప్పుడే పెళ్లి వద్దంటూ.. దుర్గాప్రశాంతికి పెళ్లి చేసేందుకు ఆమె తల్లిదండ్రులు ఇటీవల ఒక సంబంధం చూశారు. అబ్బాయి వైద్యుడు అని, పెళ్లి చేసుకోవాలని కోరారు. అయితే, ఏడాది తర్వాత పెళ్లి గురించి చూద్దామని దుర్గాప్రశాంతి చెప్పింది. ఈ నేపథ్యంలో చక్రవర్తి, దుర్గాప్రశాంతికి మధ్య ఏదైనా గొడవ జరిగి.. ఆమె గొంతు నులిమి చంపేసి, అతను బ్లేడ్‌తో కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడా..? అని పోలీసులు అనుమానిస్తున్నారు. దుర్గాప్రశాంతి ఆత్మహత్య చేసుకుందనడానికి ఘటనాస్థలంలో ఎలాంటి ఆధారాలు లభించలేదు. చక్రవర్తి స్పృహలోకి వస్తేనే అసలు విషయం తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు. -
బ్యూటీషియన్‌కు షాక్.. లక్ష కడితే నెలకు రూ.40 వేల వడ్డీ.. చివరికి..
చిత్తూరు అర్బన్: ‘రూ.లక్ష పెట్టుబడి పెట్టండి. ప్రతి వారం రూ.10 వేలు పట్టుకెళ్లండి. మూడేళ్ల తర్వాత మీరు పెట్టిన రూ.లక్ష పెట్టుబడిని వెనక్కు ఇచ్చేస్తాం. మీరు పెట్టిన రూ.లక్షకు బాండు ఇదిగో’ అంటూ ఓ బ్యూటీషియన్‌ను మోసం చేసి ఏకంగా రూ.45 లక్షలు కాజేసిన ఉదంతమిది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. చిత్తూరు వన్‌టౌన్ పోలీసులు సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ నరసింహరాజు కథనం ప్రకారం.. చిత్తూరు నగరంలోని చేపల మార్కెట్ వీధికి చెందిన అనురాధ కొంగారెడ్డిపల్లెలోని బ్యూటీషియన్‌గా పనిచేస్తున్నారు. బజారులో ఉన్న ఏవోజీ అనే కంపెనీలో డబ్బులు డిపాజిట్ చేస్తే మంచి లాభాలు ఇస్తున్నారంటూ తన బంధువు చెప్పడంతో అనూరాధ అక్కడకు వెళ్లింది. రూ.లక్ష పెట్టుబడి పెడితే నెలకు రూ.40 వేలు వడ్డీ ఇస్తామని.. మూడేళ్ల తరువాత పెట్టుబడి రూ.లక్షను సైతం ఇచ్చేస్తామని ఏవోజీ కంపెనీ ప్రతినిధులు చెప్పారు. అయితే, కంపెనీ నిబంధనల ప్రకారం తొలి మూడు నెలల వరకు వడ్డీ రాదని, నాలుగో నెల నుంచి మొత్తం చెల్లిస్తామని చెప్పారు. ఇంత పెద్ద మొత్తం వస్తుందని ఆశపడ్డ అనూరాధ తనతో పాటు తన సమీప బంధువుల నుంచి అప్పు తీసుకుని, ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి ఏవోజీ కంపెనీ ప్రతినిధులకు ఏకంగా రూ.45 లక్షలు చెల్లించారు. చదవండి: జ్యోతిష్యుడితో వివాహేతర సంబంధం .. రెండు ఇళ్లు, డబ్బులు అడగడంతో మూడు నెలలు దాటడంతో వడ్డీ తీసుకుందామని కంపెనీకి వెళ్లిన అనూరాధ బోర్డు తిప్పేసినట్టు గ్రహించి పోలీసులను ఆశ్రయించింది. ఈ కంపెనీలో మరికొందరు కూడా పెద్దఎత్తున నగదు జమ చేసినట్లు తెలుస్తోంది. రూ.కోట్లలో డిపాజిట్లు చేసిన వాళ్లకు అసలు విషయం ఇంకా తెలియలేదు. ప్రస్తుతం బాధితురాలి ఫిర్యాదుపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని, ఇంకా ఎవరైనా బాధితులు ఫిర్యాదు చేస్తే వాటిపై కూడా కేసు నమోదు చేస్తామని సీఐ పేర్కొన్నారు. -
మేం ఆడితే లోకమే ఆడదా...
-
కోకాపేటలో బ్యూటీషియన్ అనుమానాస్పద మృతి.. ఆ టైమ్‌లో బాయ్‌ఫ్రెండ్
సాక్షి, రంగారెడ్డి: స్పాలో పనిచేస్తున్న అస్సాంకు చెందిన ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మిజోరం రాష్ట్రానికి చెందిన రోసీ (23) తన స్నేహితురాలు లాల్వెన్‌తో కలిసి నెల రోజుల క్రితం కోకాపేటలోని ఐఎస్ఏ స్పాలో థెరపిస్టుగా చేరారు. స్పా యజమాని ఆనందరావు కోకాపేటలో వారికి ఓ గది ఇప్పించారు. అయితే రోసీ ఆదివారం గదికి రాలేదు. దీంతో స్నేహితురాలు సోమవారం స్పాకు వెళ్లి రాత్రికి వచ్చింది. రోసీ మంగళవారం ఉదయం పార్సిల్లో ఏదో తెప్పించుకొని తిన్నది. ఆ సమయంలో గదిలో ఆమెతో పాటు నాగాలాండ్‌కు చెందిన ప్రియుడు లన్సో ఉన్నాడు. పార్సిల్లో వచ్చింది తిని బాత్రూంకు వెళ్లిన రోసీ ఎంత సేపటికీ బయటకు రాకపోవటంతో లన్సో డోర్ తొలగించి చూడగా అపస్మారక స్థితిలో పడి ఉంది. అంతేకాకుండా బాత్రూంలో ఇంజెక్షన్ సిరంజి, మాత్రలు కనిపించాయి. దీంతో లన్సో వెంటనే 108 ద్వారా సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా ఆమె అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు ధృ వీకరించారు. మృతురాలి బంధువు బినిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. చదవండి: అమ్మమ్మ పాలకూర కావలంటూ.. పుస్తెలతాడుతో.. -
హైదరాబాద్: రాజేంద్రనగర్‌లో యువతి మృతదేహం కలకలం
సాక్షి, హైదరాబాద్: రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ యువతి మరణం కలకలం రేపుతోంది. చింతల్మెట్లోని ఓ అపార్టుమెంట్ రూమ్ నంబర్ 201లో ఓ యువతి మృతదేహం వెలుగు చూసింది. స్థానికులు ద్వారా సమాచారం అందుకున్న పోలీసుల ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. యువతి మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ బృందాలు రంగంలోకి దిగాయి. అయితే వారం క్రితం ఈ ఘటన జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తంచేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేస్తున్నారని తెలిపారు. మృతురాలు సుమేర బేగంగా పోలీసులు గుర్తించారు. ఆమె బ్యూటీషియన్‌గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఆమెది హత్య? ఆత్మహత్య? అన్న విషయం తెలియాల్సి ఉంది. చదవండి: ఒకే స్పాట్లో మూడు ప్రమాదాలు.. ఐదుగురు మృతి -
బ్యూటీషియన్ అదృశ్యం
సాక్షి, సిరిసిల్ల(కరీంనగర్): ఇంటి నుంచి బయటకు వెళ్లిన తన కూతురు తిరిగి రాలేదని తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు సీఐ అనిల్‌కుమార్ తెలిపారు. సిరిసిల్ల పట్టణం ఇందిరానగర్‌కు చెందిన కల్లెపల్లి అక్షిత(27) ఆదివారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. మళ్లీ తిరిగి రాలేదు. అక్షిత తల్లి ఎల్దండి కళావతి ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. జీవనోపాధి కోసం బ్యూటీపార్లర్ నడుపుతూ ఉండేదన్నారు. సర్ది చెప్పడానికి వచ్చిన మహిళపై దాడి సిరిసిల్ల: తమ ఇంటి ముందు జరుగుతున్న గొడవను నిలువరించేందుకు ప్రయత్నించిన మహిళపై దాడి చేసిన వ్యక్తి సోమవారం సిరిసిల్లటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ముస్తాబాద్ మండలం రాంరెడ్డిపల్లికి చెందిన పల్లపు సునీత సిరిసిల్ల పట్టణం ఇందిరానగర్‌లో నివసించే వాళ్ల అక్కయ్య ఇంటికెళ్లింది. అక్క కూతురు, ఆమె భర్తకు మధ్య గొడవలను సద్దుమణిచేందుకు మాట్లాడడం గురించి వచ్చింది. ఈక్రమంలోనే కుటుంబికుడైన అరవింద్ అకారణంగా దాడి చేశాడు. దీంతో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో దాడిచేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: మాల్దీవ్స్‌లో ఫుడ్, బెడ్, స్పా అంతా మాదే -
భర్తతో గొడవలు.. బ్యూటీషియన్ ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: భర్తతో విభేదాలు రావడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఓ బ్యూటీషియన్ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రవీంద్ర ప్రసాద్ తెలిపిన ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌కు చెందిన ఆన్‌మిట్ లేప్చా (39) భర్తకు హైదరాబాద్‌లో ఉద్యోగం రావడంతో కుటుంబ సభ్యులతో కలిసి మాదాపూర్‌లోని విఠల్‌రావు నగర్‌లోని అలియన్స్ బ్లెండ్ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. చదవండి: (భార్యను భరించలేను.. విడాకులు కావాల్సిందే: సాఫ్ట్వేర్ ఇంజనీర్) భర్తతో గొడవలు రావడంతో ఇద్దరు పిల్లలతో కలిసి రెండు సంవత్సరాలుగా విడిగా ఉంటోంది. ఈ నెల 3వ తేది అర్ధరాత్రి గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమె స్నేహితురాలి ఫిర్యాదుతో మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. చదవండి: (భర్త కుట్టిన బ్లౌజ్ నచ్చలేదని భార్య ఆత్మహత్య) -
దివ్యమైన కల
అమ్మాయిలందరికీ అందంగా కనిపించాలని ఉంటుంది. ముంబైకు చెందిన దివ్య పెరియసామి ఆచార్యకు మాత్రం అతివలను మరింత అందంగా తీర్చిదిద్దడమంటే ఎంతో ఇష్టం. దీంతో బ్యూటిషియన్ కావాలని కలలు కనేది. కానీ సంప్రదాయ కుటుంబంలో పుటి ్టపెరిగిన దివ్య బ్యూటిషియన్ కావడం కుటుంబ సభ్యులు ఎవరికి ఇష్టం లేదు. ఆమె కోరికను వారు వ్యతిరేకించేవారు. అయినా దివ్య మాత్రం తన కలను నిజం చేసుకునే మార్గాలను వెదికేది. ఈ క్రమంలో 2018లో ‘సలాం బాంబే ఫౌండేషన్’(ఎస్బీఎఫ్) వారు ‘స్కిల్స్ ః స్కూల్’ పేరిట శిక్షణ ఇస్తున్నట్లు దివ్యకు తెలిసింది. వెంటనే బ్యూటీ అండ్ వెల్నెస్ ప్రోగ్రామ్‌లో చేరి బ్యూటిషియన్ కోర్సుకు సంబంధించిన అన్ని రకాల శిక్షణలు తీసుకుని, తరువాత ఓ పార్లర్లో ఇంటర్న్‌షిప్ కూడా చేసింది. పట్టుదలతో స్కిల్స్ నేర్చుకుని పార్లర్ పెట్టుకునే స్థాయి ఎదగడంతో తల్లిదండ్రుల మనసు కరిగి సంతోషంతో ఆమెను ప్రోత్సహించారు. దీంతో ఇంటిదగ్గరే ‘దివ్యాస్ బ్యూటీ పార్లర్’ పేరిట పార్లర్‌ను ప్రారంభించి వివిధ రకాల బ్యూటీ సర్వీసులు, ఫేషియల్, మెనిక్యూర్, పెడిక్యూర్, మేకప్, మెహందీ డిజైన్స్ వంటి వాటన్నింటిని కస్టమర్లకు అందిస్తోంది. ‘‘పదిహేడేళ్ల అమ్మాయిగా ప్రభుత్వ పథకాలు పొందడం చాలా కష్టం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఏ పథకాలైనా 18 ఏళ్లు పైబడిన వారికే వర్తిస్తాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఎస్బీఎఫ్ 16–20 ఏళ్లలోపు వారికి అందించే వొకేషనల్ శిక్షణ కార్యక్రమం నా కలను నిజం చేసింది. బడ్జెట్ నిర్వహణ, కస్టమర్లతో ఎలా మెలగాలి, సౌందర్య సాధనాల కొనుగోలు, వాడకం వాటిæరికార్డులు ఎలా నిర్వహించాలి అన్న అంశాలతోపాటు కొత్తరకం వ్యాపార అవకాశాల గురించి తెలుసుకున్నాను. గూగుల్ బిజినెస్, వాట్సాప్ బిజినెస్ అకౌంట్లు ఎలా తెరవాలో నేర్చుకుని సొంతంగా నేనే బ్యానర్, విజిటింగ్ కార్డును రూపొందించుకున్నాను. ఇప్పుడు బ్యూటీపార్లర్ నడుపుతూనే, సొంతఫార్ములాతో హెయిర్ ఆయిల్‌ను తయారు చేసి విక్రయిస్తున్నాను. బ్యూటిషియన్ కావాలన్న నా కలను ప్రారంభంలో కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. వారి మాటలు పట్టించుకోకుండా బ్యూటì షియన్ కోర్సుపై దృష్టిపెట్టి పార్లర్ పెట్టే స్థాయికి ఎదగడంతో అమ్మ వాళ్లు కూడా మనస్పూర్తిగా ప్రోత్సహిస్తున్నారు. భవిష్యత్తులో సొంతంగా స్టూడియో పెట్టుకుని నాలాంటి మరి కొంతమంది అమ్మాయిలను బ్యూటిషియన్‌గా తీర్చిదిద్ది, ఉపాధి కల్పిస్తాను’’ అని దివ్య చెప్పింది. -
బ్యుటీషియన్‌పై అత్యాచారం.. కంగనా బాడీగార్డ్‌పై కేసు
ముంబై: పెళ్లి చేసుకుంటానని నమ్మించి బ్యూటీషియన్‌ను మోసం చేసిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ బాడీగార్డుపై ముంబై పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. ముంబై నగరానికి చెందిన 30ఏళ్ల మహిళ బ్యూటీషియన్‌గా పనిచేస్తూ అథేరీ ప్రాంతంలో నివాసముంటోంది. ఈమెకు ఎనిమిదేళ్ల నుంచి బీటైన్‌కు చెందిన నటి వ్యక్తిగత బాడీగార్డ్ కుమార్ హెగ్డేకు పరిచయం ఉంది. ఆ పరిచయంతో గతేడాది జూన్‌లో పెళ్లి చేసుకుంటానని బ్యూటీషియన్‌తో చెప్పి అప్పటి నుంచి ఆమె ఫ్లాట్‌లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో మహిళతో శారీరక సంబంధం ఏర్పరచుకున్నాడు. తరువాత పెళ్లి చేసుకుందామని బ్యూటీషియన్ అతన్ని ఎన్నిసార్లు అడిగిన ఆ విషయాన్ని దాటేస్తూ వచ్చాడు. ఈ ఏడాది ఏప్రిల్ 27న కుటుంబ అవసరాల కోసం బ్యూటీషియన్ నుంచి రూ.50వేల నగదు తీసుకొని, అతని స్వస్థలమైన కర్ణాటకకు వెళ్లాడు. స్వస్థలానికి వెళ్లిన తరువాత కుమార్ మహిళతో మాట్లాడటం మానేసి ఆమెను దూరం పెట్డడం ప్రారంభించాడు. అనంతరం కుమార్ తల్లి బ్యూటీషియన్‌కు ఫోన్ చేసి తమ కులాలు వేరని, తనతో పెళ్లి జరగదని చెప్పింది. అంతేగాక తన కొడుక్కి వేరే సంబంధం చూసినట్లు పేర్కొంది. దీంతో తనను మోసం చేసి, జూన్ 5వ తేదీన మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు కుమార్ హెగ్డే సిద్దపడ్డాడని గ్రహించిన మహిళ ముంబై పోలీసులను ఆశ్రయించింది. నిందితుడిపై అత్యాచారం కేసు నమోదు చేసింది. బ్యూటీషియన్ ఫిర్యాదు మేరకు బాడీగార్డుపై ఐపీసీ సెక్షన్ 376, 377, 420ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ముంబై పోలీసులు పేర్కొన్నారు. కాగా కుమార్ హెగ్డే బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ వ్యక్తిగత బాడీగార్డ్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి అధికారిక సమాచారం రావాల్సి ఉంది. చదవండి: పెళ్లి రిసెప్షన్ జరుగుతుండగా.. పోలీసుల ఎంట్రీ -
లేజర్ ట్రీట్మెంట్: 'అమ్మాయిగా అనిపించట్లేదు'
లండన్: మరింత అందంగా కనిపించాలని, తన నిగారింపును రెట్టింపు చేసుకోవాలని తహతహలాడిందో బ్యూటీషియన్. ఈ క్రమంలో ఒంటి మీద ఉన్న అవాంచిత రోమాలను శాశ్వతంగా తొలగించుకోవాలనుకుంది. ఇందుకోసం లేజర్ ట్రీట్మెంట్లు తీసుకుంటూ కాస్మొటిక్ సర్జరీలు చేయించుకుంది. మొత్తంగా రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఎనిమిది సార్లు హెయిర్ రిమూవల్ చికిత్స తీసుకుంది. కానీ ఆమె ఆశించినదానికి భిన్నంగా ప్రతికూల ఫలితాలు వస్తున్నాయని అర్థమై అర్ధాంతరంగా చికిత్సను ఆపేసింది. ఇప్పుడు తనకు తాను అమ్మాయిగా అనిపించడం లేదంటూ చింతిస్తోంది. 2018లో ఇంగ్లాండ్‌లోని లివర్‌పూల్‌కు చెందిన సన్నా సోహైల్ అనే బ్యూటీషియన్ అవాంచిత రోమాలను తొలగించేందుకు చికిత్స తీసుకుంది. ఈ క్రమంలో ఓసారి క్లినిక్‌కు వెళ్లినప్పుడు తనను తాను చూసుకుని తీవ్ర నిరాశ చెందింది. తను ఊహించినట్లుగా అందంగా కనిపించడానికి బదులుగా ఏదో హార్మోన్ల సమస్యలు ఉన్నట్లు నిర్జీవంగా కనిపించింది. దీంతో ట్రీట్మెంట్ మధ్యలోనే ఆపేసింది. పైగా చికిత్స తీసుకున్నచోట ఓ గడ్డ(కణతి) ఏర్పడింది. దీని గురించి సన్నా మాట్లాడుతూ.. నా చర్మంపైన కణతి ఏర్పడగానే వారు వైద్యుడికి చూపిస్తామన్నారు. ఓ ప్రైవేటు డాక్టర్‌ను సంప్రదించి దాన్ని తీసేయిస్తామన్నారు. కానీ ఇప్పటివరకు అది జరగలేదు అని సన్నా వాపోయింది. ట్రీట్మెంట్ తర్వాత ఎలాంటి మార్పులొస్తాయనే కనీస విషయాలేవీ వాళ్లు నాకు చెప్పలేదు. కణతి ఉన్నప్పుడు లెగ్గిన్లు, అండర్‌వేర్‌తో పాటు టైట్ దుస్తులు వేసుకోవద్దని చెప్పలేదు. ఇప్పుడు వాటిని ధరించాలన్నా ఎక్కడ మళ్లీ ఆ కణతి ఏర్పడుతుందోనని భయంగా ఉంది. వీటన్నింటి మధ్య నేను అమ్మాయినే అన్న భావన కలగడం లేదు. ఈ సమస్య వల్ల నేనెప్పటికీ జీన్స్ ధరించలేను అని చెప్పుకొచ్చింది. తనను మానసికంగా ఎంతో బాధించిన ఈ సమస్యను సన్నా అంత ఈజీగా వదల్లేదు. లేజర్ ట్రీట్మెంట్ మీద ఆమె పరిశోధనలు చేపట్టింది. ఓ యంత్రాన్ని సైతం కనిపెట్టింది. తను సొంతంగా ఏర్పాటు చేసిన క్లినిక్‌లో ఈ యంత్రాన్ని లాంచ్ చేసింది. చదవండి: ఆటోపై లగ్జరీ హౌజ్.. ఆనంద్ మహీంద్ర ఫిదా పట్టుమని పది సెకన్లు ఉన్న వీడియోకు రూ.48 కోట్లు గుమ్మరించారు -
దారుణం : హత్య చేసి శవాన్ని ఇంట్లోనే ..
పాలక్కడ్ : తనను నమ్మి వచ్చిన ఒక మహిళను మోసగించడమే కాకుండా ఆమెను దారుణంగా చంపి తన ఇంట్లోనే పాతిపెట్టిన ఘటన కేరళలోని పాలక్కడ్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. కొల్లామ్ జిల్లాకు చెందిన 42 ఏళ్ల సుచిత్ర అనే మహిళ కొట్టాయంలో ట్రైనీ బ్యుటిషియన్‌గా విధులు నిర్వహిస్తోంది. కాగా మార్చి 17న తన మామయ్యకు బాగా లేదని, తాను వెంటనే అలప్పుజాకు వెళ్లి ఆయనను చూసుకోవాల్సి ఉందని తనకు సెలవు కావాలని కంపెనీకి మెయిల్ చేసింది. తర్వాతి రోజు మరో ఐదు రోజులు సెలవులు పొడిగించాలంటూ మళ్లీ మెయిల్ చేసింది. అప్పటికే ఇంటికి చేరుకున్న సుచిత్ర తనను ట్రైనింగ్ పని మీద ఎర్నాకుళం పంపిస్తున్నారని ఇంట్లో వాళ్లతో చెప్పి వెళ్లింది. ఐదు రోజులైనా సుచిత్ర ఒక్కసారి కూడా ఫోన్ చేయకపోవడంతో అనుమానుమొచ్చి సుచిత్ర పని చేస్తున్న సంస్థకు ఫోన్ చేయగా ఇక్కడికి రాలేదని, తాను వాళ్ల మామయ్యకు బాగా లేదని చెప్పి ఐదు రోజులు సెలవు తీసుకుందని పేర్కొన్నారు. దీంతో వెంటనే కొట్టాయం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కుటుంబసభ్యులు సుచిత్రపై మిస్సింగ్ కేసు నమోదు చేశారు. సుచిత్ర తన భర్తతో విడాకులు తీసుకొని భర్త తరపు కుటుంబసభ్యులకు దూరంగా ఉంటుందని పోలీసులకు వెళ్లడించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. (వ్యక్తి ప్రాణం తీసిన కోడి ధర) మనాలీకి చెందిన కీబోర్డ్ ప్లేయర్ 32 ఏళ్ల ప్రశాంత్ సోషల్ మీడియా ద్వారా సుచిత్రకు పరిచయమయ్యాడు. కొంతకాలంగా ప్రశాంత్, సుచిత్రల మధ్య ప్రేమాయణం కొనసాగుతందని దర్యాప్తులో తేలింది. ప్రశాంత్‌ను కలవడానికే సుచిత్ర మనాలీ వెళ్లిందని తేలింది. దీంతో కొల్లాయం క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మనాలీ వెళ్లి ప్రశాంత్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. మొదట సుచిత్ర, తాను పెళ్లి విషయమై పోట్లాడుకున్నామని, తర్వాత సుచిత్ర ఆత్మహత్య చేసుకుందని ప్రశాంత్ తెలిపాడు. చివరకు పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం బయటపెట్టాడు. గత కొంతకాలంగా సుచిత్ర తనను ప్రేమిస్తుందని, పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో ఆమెను హత్య చేసినట్లు ప్రశాంత్ ఒప్పుకున్నాడు. తర్వాత ఆమె శవాన్ని తాను ఉంటున్న ఇంట్లోనే పాతి పెట్టానని తెలిపాడు. ప్రశాంత్ చెప్పిన వివరాల ప్రకారం సుచిత్ర పాతిపెట్టిన చోటును తవ్వించగా ఆమె మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో లభించింది.ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించగా ఆ మృతదేహం సుచిత్రదేనని తేలింది. దీంతో ప్రశాంత్‌ను అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. -
బ్యూటీషియన్ దారుణ హత్య
తమిళనాడు, టీ.నగర్: కృష్ణగిరి జిల్లా సూళగిరిలో శనివారం బ్యూటీషియన్ దారుణ హత్యకు గురైంది. శూలగిరి కేకేనగర్ ప్రాంతంలోని ఒక ఇంటిలో 15 రోజుల క్రితం ఇద్దరు పిల్లలతో దంపతులు అద్దెకు చేరారు. విల్లుపురం జిల్లా శంకరాపురం ప్రాంతం నుంచి ఇక్కడికి ఉపాధి కోసం వచ్చినట్లు ఇరుగుపొరుగు వారితో సదరు మహిళ చెప్పారు. తర్వాత సూళగిరి బజారువీధిలో ఉన్న ఒక బ్యూటీపార్లర్‌లో ఆమె పనిలో చేరారు. విదేశాలలో పని చేస్తున్న ఆమె భర్త ఇటీవలే అక్కడ నుంచి వచ్చినట్లు తెలిపింది. కొద్ది రోజుల క్రితం ఇద్దరు పిల్లలను సొంత ఊరికి పంపివేశారు. ఉదయం బ్యూటీపార్లర్ పనికి వెళ్లే ఆమె రాత్రి ఆలస్యంగా పని ముగించుకుని ఇంటికి వచ్చేది. దీంతో భర్త మాత్రం ఇంటిలో ఉంటూ వచ్చాడు. శనివారం చాలా సేపు అయినప్పటికీ మహిళ ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో అనుమానించిన ఇరుగు పొరుగు వారు కిటికీలోంచి తొంగి చూశారు. ఆమె ఇంట్లో ఉన్న కిటికీ ఉరితాడుకు వేలాడుతూ కనిపించింది. దీని గురించి సమాచారం అందుకున్న సూళగిరి పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని విచారణ జరిపారు. హత్యకు గురైన మహిళ శాంతి (33), ఆమె భర్త ఇళయరాజ (37)గా తెలిసింది. విల్లుపురం జిల్లా శంకరాపురం వడమరుది ప్రాంతానికి చెందిన వీరికి ఇద్దరు పిల్లలున్నారు. విదేశాల్లో పని చేస్తూ వచ్చిన ఇళయరాజా కొన్ని రోజుల క్రితం సొంత ఊరుకు వచ్చాడు. ఆమెను గొంతు నులిమి హత్య చేసి హత్యను దారి మళ్లించేందుకు ఉరికి వేలాడతీసినట్లు పోలీసులు భావిస్తున్నారు. అదృశ్యమైన ఇళయారాజాను పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. -
పద్మను విచారించిన పోలీసులు..ఆసక్తికర అంశాలు
కృష్ణా, హనుమాన్‌జంక్షన్ రూరల్ : బ్యూటీషియన్ పద్మపై హత్యాయత్నం కేసులో పలు అంశాలు మిస్టరీగా మారాయి. విజయవాడలోని ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న బాధితురాలు పల్లె పద్మను పోలీసులు మంగళవారం కొద్ది సమయం విచారించారు. ఈ సందర్భంగా పద్మ పలు అంశాలను వెల్లడించింది. అయితే కత్తిపోట్లతో విపరీతంగా రక్తం పోవటం, మెడపై తీవ్ర గాయం కావటంతో పద్మ ఎక్కువ సేపు మాట్లాడలేదని తెలుస్తోంది. అసలు హత్యాయత్నం రాత్రి నూతనకుమార్, పద్మ మధ్య ఏం జరిగిందనే విషయాన్ని పోలీసులు స్పష్టంగా రాబట్టేందుకు యత్నించారు. నూతన్ ఒక్కడే దాడి చేశాడు.. ఈ నెల 23వ తేదీ రాత్రి జరిగిన తీవ్ర వివాదంలో పద్మను నూతనకుమార్ విచక్షణ రహితంగా కొట్టినట్లు ఆమె పోలీసులకు తెలిపినట్లు సమాచారం. ఆమెపై జరిగిన హత్యాయత్నంలో నూతనకుమార్ ఒక్కడే ఉన్నాడని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటి వరకూ హత్యాయత్నం ఘటనలో సుబ్బయ్య అనే మూడో వ్యక్తి ఉన్నట్లు వచ్చి ఊహాగానాలకు తెరపడ్డట్లైంది. తొలుత నూతనకుమార్ తీవ్రంగా కొట్టిన దెబ్బలతో ఓపిక పూర్తిగా నశించిందని, ఆ తర్వాతే తన కాళ్లు కట్టేసి, నోట్లో ప్లాస్టిక్ కవర్లు కుక్కి కత్తితో దాడి చేశాడని ఆమె పేర్కొంది. సోమవారం పద్మ రెండు చేతులకు శస్త్రచికిత్సలు చేయటం, ఆపరేషన్ నిమిత్తం అనస్తీషియా ఇవ్వటంతో మత్తుతో ఉందని, నూతనకుమార్ ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని మంగళవారం కుటుంబ సభ్యులు పద్మకు చెప్పారు. ఇద్దరూ ఆత్మహత్యకు యత్నించారా?! నాలుగేళ్లుగా సహజీవనం చేస్తున్న నూతనకుమార్, పద్మ మధ్య ఏడాదిగా తరుచూ వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పెదపాడు, హనుమాన్‌జంక్షన్ పోలీస్ స్టేషన్లులో పద్మ ఫిర్యాదు కూడా చేసింది. నూతనకుమార్‌కు ఏలూ రులో ఉన్న ఇల్లు విక్రయించగా వచ్చిన రూ.35 లక్షలు వివాదానికి కారణమా అనే అనుమానం కూడా వ్యక్తమవుతోంది. కాగా 23వ తేది రాత్రి పద్మ తన భర్త వద్ద ఉంటున్న పెద్ద కుమార్తెకు ఫోన్ చేసి నూతనకుమార్‌తో కలిసి ఇద్దరం ఆత్మహత్య చేసుకుంటున్నామని చెప్పినట్లు భర్త సూర్యనారాయణ ఇప్పటికే మీడియాతో వెల్లడించాడు. ఇదే విషయాన్ని పద్మ కూడా ఆస్పత్రిలో పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఎందుకు ఇద్దరూ ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకోవాల్సి వచ్చిందనే విషయం మిస్టరీగా మారింది. ఆత్మహత్యకు పద్మ అంగీకరించిందా? లేక నూతనకుమార్ బలవంతం చేశాడా? పద్మను ఆత్మహత్య చేసుకుందామని నమ్మించి ముందుగా మత్తు ఇచ్చి, ఆపై దాడి చేశాడా? అనే విషయాలు పద్మ పూర్తిగా కోలుకుంటేగానీ తెలిసే అవకాశం లేదు. -
భర్తకు మళ్లీ దగ్గరవుతోందన్న అనుమానంతోనే..
హనుమాన్‌జంక్షన్ రూరల్(గన్నవరం): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన బ్యూటీషియన్ పద్మపై హత్యాయత్నం కేసులో నిందితుడు బత్తుల నూతనకుమార్ విక్టర్ ఆత్మహత్య చేసుకోవటంతో దర్యాప్తు దాదాపు ఓ కొలిక్కి వచ్చింది. పద్మపై అత్యంత పైశాచికంగా దాడి చేసిన అనంతరం ఈ నెల 24 నుంచి అదృశ్యమైన నూతన కుమార్ గుంటూరు జిల్లాలోని నాదెండ్ల మండలం నుదురుపాడు వద్ద రైల్వే పైవంతెన కింద ఆదివారం సాయంత్రం శవమై తేలడం తెలిసిందే. కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పల్లె పద్మ ప్రాణాపాయ స్థితి నుంచి బయట పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. తొలుత హైదరాబాద్‌కు పరారీ.. పద్మపై కర్కసంగా హత్యాయత్నం చేసిన నూతనకుమార్ వెంటనే ఘటనాస్థలాన్ని విడిచిపెట్టి తన బైక్‌పై హైదరాబాద్‌కు పరారైనట్లుగా తెలుస్తోంది. పోలీసులు దర్యాప్తు వేగవంతం చేయడం, నాలుగు ప్రత్యేక బృందాలను నియమించటం, అతని స్నేహితులను విచారించటం, మీడియాలో అతని పేరు, ఫొటో సంచలనం కావటంతో నూతనకుమార్‌కు గత్యంతరం లేక బలవ్మరణానికి పాల్పడినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా నూతనకుమార్ హైదరాబాద్‌లో ఉన్నట్లు శనివారం రాత్రి నిర్ధారణకు వచ్చిన హనుమాన్‌జంక్షన్ ఎస్ఐ వి.సతీష్ నేతృత్వంలోని పోలీసు బృందం హుటాహుటిన అక్కడికి బయలుదేరింది. దీంతో పోలీసుల చేతికి చిక్కక తప్పదనే భయంతో నూతనకుమార్ చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త దగ్గరికి వెళ్లిపోతుందనే అక్కసుతోనే.. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని వెన్నవల్లి వారి పేటకు చెందిన బత్తుల నూతన కుమార్ విక్టర్ ఎంబీఏ చదివాడు. ఏలూరులోని ద్విచక్ర వాహనాల షోరూంలో మేనేజర్‌గా ఉద్యోగం చేస్తున్న అతనికి అక్కడే పనిచేస్తున్న పల్లె పద్మతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అతను భార్యను విడిచిపెట్టి, పద్మతో సహజీవనం ప్రారంభించారు. నాలుగేళ్లుగా వీళిద్దరూ కలిసి ఉంటున్నప్పటికీ గత కొంతకాలంగా మనస్పర్ధలు మొదలయ్యాయి. దీంతో పెదపాడు, హనుమాన్‌జంక్షన్ పోలీస్స్టేషన్లలో నూతనకుమార్పై పద్మ ఫిర్యాదు కూడా చేసింది. తాజాగా పద్మ తిరిగి తన భర్త దగ్గరకు వెళ్లిపోవటానికి నిశ్చయించుకోవటంతో నూతనకుమార్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఈ నెల 23వ తేది రాత్రి ఇదే విషయంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుందని స్ధానికులు చెబుతున్నారు. భార్యను సైతం విడిచిపెట్టి పద్మ కోసం వస్తే, మళ్లీ ఆమె భర్త సూర్యనారాయణ దగ్గరకు వెళ్లిపోతుందనే అక్కసుతోనే ఈ దురాగతానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఏలూరులో నూతనకుమార్‌కు తల్లిదండ్రుల ద్వారా సంక్రమించిన ఆస్తిని సైతం ఇటీవలే విక్రయించి, తద్వారా వచ్చిన రూ.35 లక్షలు కూడా పూర్తిగా ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో పద్మ వెళ్లిపోవటం, తన ఆస్తిని కూడా పూర్తిగా కోల్పోవటంపై నూతన కుమార్ విచక్షణ కోల్పోయి ప్రతీకార చర్యకు ఉపక్రమించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పద్మ చేతులకు శస్త్రచికిత్స.. విజయవాడలోని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బ్యూటీషియన్ పద్మకు వైద్యులు సోమవారం శస్త్రచికత్స నిర్వహించారు. ఆమె రెండు చేతులు మణికట్టు పైభాగంలో కత్తిపోట్ల కారణంగా తీవ్రంగా దెబ్బతినటంతో తొలుత చేతులు తొలగించాలని వైద్యులు భావించారు. కానీ పూర్తిస్థాయిలో ఆమెకు నిర్వహించిన టెస్ట్ రిపోర్టుల ఆధారంగా మణికట్టు పైభాగంలో శస్త్రచికిత్స చేస్తే సరిపోతుందని నిర్ధారణకు వచ్చారు. ఈ నేపధ్యంలో ఆమె రెండు చేతులకు ఆపరేషన్ చేసి రాడ్లు వేశారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతోంది. మెడ వద్ద తీవ్ర గాయం కావటంతో హత్యయత్నం వివరాలను వెల్లడించే స్థితిలో లేదని తెలుస్తోంది. నాభర్త ఆత్మహత్యకు పద్మే కారణం తన భర్త ఆత్మహాత్యకు పద్మే కారణమని నూతన్‌కుమార్ భార్య సునీతకుమారి పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఆత్మహత్యకు పాల్పడిన నూతన కుమార్ విక్టర్ మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం నరసరావుపేట రైల్వే పోలీసులు ఆతని భార్య బత్తుల సునీతకుమారికి అప్పగించారు. ఆ సమయంలో పోలీసులకు సునీత ఇచ్చిన వాగ్మూలంలో తన భర్త మంచి వాడని, పద్మ వేసిన ఉచ్చులో పడి దారుణంగా మోసపోయాడని, తన భర్త మరణానికి పద్మే కారణమని ఆరోపించినట్లుగా తెలుస్తోంది. 2014 వరకు తనతో ఎంతో అన్యోన్యంగా ఉండే వాడని, బైక్ షోరూంలో మేనేజర్‌గా పని చేశాడని చెప్పినట్లు సమాచారం. పద్మపై వ్యామోహాంతో ఆస్తిని సైతం నాశనం చేసుకున్నాడని చెప్పినట్లు తెలుస్తోంది. -
బ్యుటీషియన్ పద్మ కేసు: తెరపైకి నూతన్ భార్య
సాక్షి, హనుమాన్ జంక్షన్ : బ్యూటీషియన్ పద్మపై దాడి కేసు అనేక మలుపులు తిరుగుతోంది. పద్మపై హత్యాయత్నం చేశాడని అనుమానిస్తున్న నూతన్ కుమార్ తాజాగా ఆత్మహత్య చేసుకోవడంతో.. ఈ కేసులో అసలు నిందితులు ఎవరు అన్నది మిస్టరీగా మారింది. ఈ నేపథ్యంలో పద్మ ప్రియుడిగా భావిస్తున్న నూతన్ కుమార్ భార్య సునీతను పోలీసులు సోమవారం విచారించారు. తన భర్త చనిపోవడానికి బ్యూటీషియన్ పద్మనే కారణమని సునీత తెలిపింది. 2012లో తమ వివాహం జరిగిందని, తన భర్త నూతన్ ఓ ప్రైవేటు షోరూంలో మేనేజర్ గా పనిచేసేవారని తెలిపింది. ఆ సమయంలో అదే ఆఫీస్‌లో పనిచేస్తున్న పద్మ తన భర్తను లోబరుచుకుందని ఆమె ఆరోపించారు. తన భర్తకు ఇష్టం లేకున్నా వేధింపులకు గురిచేసిందని, విడాకులు తీసుకోవాల్సిందిగా నూతన్‌ను పద్మ హింసించిందని సునీత తెలిపింది. ప్రసుత దారుణమైన పరిస్థితులన్నింటికీ పద్మే కారణమని తెలిపింది. మరోవైపు బ్యూటీషియన్ పద్మ విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆత్మహత్య చేసుకున్నట్టు భావిస్తున్న నూతన్ కుమార్ మృతదేహానికి ఇదే ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. -
బ్యూటీషియన్‌పై దాడి కేసు మరో మలుపు
-
బ్యూటీషియన్‌పై దాడి కేసులో ట్విస్ట్
విజయవాడ: బ్యూటీషియన్ పద్మపై దాడి కేసు మరో మలుపు తిరిగింది. పద్మపై హత్యాయత్నం చేశాడని అనుమానిస్తున్న నూతన్ కుమార్ ఆత్మహత్య చేసుకోవడంతో ఊహించని మలుపు తిరిగింది. గుంటూరు నుంచి నరసరావుపేట వెళ్లే దారిలో రైలు పట్టాల వద్ద ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి నూతన్ కుమారేనని తెలిసింది. అక్కడ లభించిన ఆధార్ కార్డు ద్వారా మృతదేహం నూతన్ కుమార్‌దిగా రైల్వేపోలీసులు, నూతన్ భార్య గుర్తించారు. అయితే నూతన్ కుమార్ మరణంపై కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నూతన్ కుమార్‌ని ఎవరైనా హత్య చేసి ఉండవచ్చునని భావిస్తున్నారు. మరో నిందితుడు సుబ్బయ్య మీద పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను పోలీసులు ఇంతవరకు అదుపులోకి తీసుకోకపోవడంతో కేసును చేధించడం క్లిష్టంగా మారింది. బ్యూటీషియన్ పద్మ వాగ్మూలంలో చెప్పిన ఆ సుబ్బయ్య ఎవరనేది మిస్టరీగా మారింది. వెలుగు చూస్తున్న కొత్త విషయాలు పద్మ ఎడమ చేతిపై 'ఎన్' అనే అక్షరంతో టాట్టూ ఉంది. నూతన కుమార్ గుర్తుగా ఎన్ అక్షరంతో టాట్టూ వేయించుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ 'ఎన్' అనే అక్షరాన్నే మృతుడు నూతన కుమార్ కత్తితో నరికివేశాడు. అలాగే పద్మ నుదుటి మీద 'ఎస్' అక్షరం రాసింది కూడా నూతన కుమారేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. నాలుగేళ్లుగా సహజీవనం చేస్తున్న నూతన కుమార్, పద్మ మధ్య ఏడాదిగా తీవ్ర విభేదాలు తలెత్తాయి. పశ్చిమగోదావరి జిల్లా పెడపాడులో ఇప్పటికే నూతన కుమార్ పై ఎఫ్ఐఆర్ నమోదై ఉంది. హనుమాన్ జంక్షన్ పోలీసులకు గతంలో నూతన్‌పై పద్మ ఫిర్యాదు కూడా చేసింది. ఆపై పద్మ రాజీ పడింది. గతంలో ఒకసారి నూతన్ కుమార్ ఆత్మహత్యా యత్నం కూడా చేసుకున్నట్లు విచారణలో తేలింది. పద్మ భర్త పేరు సూర్యనారాయణ కాబట్టి 'ఎస్' అనే అక్షరం బ్లేడ్‌తో రాసి, 'ఎన్' అనే అక్షరం కోసేస్తే అది పద్మ భర్తే చేశాడని భావిస్తారని నూతన కుమార్ అలా చేసి ఉండవచ్చునని పోలీసులు నిర్దారణకు వచ్చారు. -
పాశవిక హత్యాయత్నం !
జిల్లాలోని హనుమాన్‌జంక్షన్‌లో ఓ బ్యూటీషియన్‌పై జరిగిన దారుణ హత్యాయత్నం తీవ్ర కలకలం సృష్టించింది. నిందితుడు కత్తితో కర్కశంగా ఆమె చేతులు, మెడ కోశాడు. కాళ్లను వైర్‌తో కట్టేసి ఊడిపోకుండా ట్యాగ్లు వేశాడు. ముఖాన్ని కవర్‌తో ముసుగు వేసి పాశవికంగా దాడికి పాల్పడ్డాడు. ఇరుగుపొరుగు వాళ్లకు కేకలు వినిపించకుండా మత్తు ఇంజక్షన్ ఇచ్చి విచక్షణారహితంగా కత్తిపోట్లు పొడిచాడు. తీవ్ర గాయాలతో బాధితురాలు మృత్యువుతో పోరాడుతోంది. హనుమాన్‌జంక్షన్ రూరల్ : హనుమాన్ జంక్షన్లో ఓ బ్యూటీషియన్‌పై జరిగిన దారుణ హత్యాయత్నం తీవ్ర కలకలం సృష్టించింది. కాళ్లు కట్టేసి, చేతులను కత్తితో అత్యంత క్రూరంగా నరికి వేయటం, ముఖానికి పూర్తిగా కవర్ చుట్టి వేసిన అఘాయిత్యం స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. ఇరుగుపొరుగు వాళ్లకు ఆమె కేకలు వినిపించకుండా మత్తు ఇంజక్షన్ ఇచ్చి పైశాచికంగా హత్యాయత్నం చేశారు. మహిళ శరీరంపై విచక్షణరహితంగా కత్తిపోట్లు పొడిచి శాడిజాన్ని చూపించారు. హత్యాయత్నం చేసిన వారు పరారైన తర్వాత బాధితురాలు రక్తపు మడుగులో దాదాపు 36 గంటల పాటు మృత్యువుతో పోరాడింది. వివరాల్లోకి వెళ్లితే.. రాజమండ్రికి చెందిన పల్లె పద్మ, సూర్యనారాయణలకు సుమారు 20 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. కొన్నేళ్ల పాటు ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో ఉన్న వీరు ఆ తర్వాత జంక్షన్ సమీపంలోని ఓ ఫ్యాక్టరీలో సూర్యనారాయణకు ఉద్యోగం రావటంతో ఇక్కడకు మకాం మార్చారు. పద్మ కూడా ఏలూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చూసుకుంది. అప్పటి వరకూ సాఫీగానే సాగిన వీరి సంసారంలో మనస్పర్ధలు మొదలయ్యాయి. దీంతో భర్తతో విభేదించిన పద్మ కొద్దికాలంగా ఏలూరులోని వెన్నవల్లి వారి వీధికి చెందిన బత్తుల నూతనకుమార్ విక్టర్ అనే వ్యక్తితో సహ జీవనం చేస్తోంది. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఓ బ్యూటీపార్లర్‌లో పద్మ బ్యూటీషియన్‌గా పని చేస్తుండగా, నూతనకుమార్ ఓ ప్రైవేట్ బ్యాంకులో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్నాడు. ఇరవై రోజుల క్రితం తారకరామ కాలనీ సమీపంలోని ఓ ఇంట్లో వీళిద్దరూ కలిసి అద్దెకు దిగారు. ఈ నెల 23వ తేదీ రాత్రి పద్మ, నూతనకుమార్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ విషయాన్ని భర్త దగ్గరే ఉంటున్న తన పెద్ద కూతురుతో ఫోన్లో పద్మ ఆ రాత్రే చెప్పింది. ఆ తర్వాత నుంచి ఆమె సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ రావటంతో ఆందోళన చెందిన కుమార్తె తన తండ్రి సూర్యనారాయణకు విషయం చెప్పింది. దీంతో ఇద్దరూ పద్మ అద్దెకు ఉంటున్న ఇంటి వద్దకు శనివారం ఉదయం వచ్చి తలుపులు తీయటంతో రక్తపు మడుగులో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ కనిపించింది. జంక్షన్ పోలీసులకు సమాచారం అందించటంతో హుటాహుటిన 108 అంబులెన్స్‌లో పద్మను విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఘటనా స్థలంలో దృశ్యం అత్యంత క్రూరంగా ఉండటం పోలీసులను సైతం విస్మయానికి గురి చేసింది. ఒంటిపై దుస్తులు తీసివేసి కత్తితో కర్కశంగా చేతులు, మెడ నరికివేయటం, కాళ్లు రెండు వైర్‌తో కట్టేసి, మళ్లీ ఆ వైర్ ఊడిపోకుండా ట్యాగ్లు వేయటం, ముఖానికి కవర్‌తో ముసుగు వేయటం హత్యాయత్నానికి పాల్పడిన దుండగుల పైశాచికత్వాన్ని తెలియజేస్తున్నాయి. పద్మ పడి ఉన్న గదిలో ఇంజక్షన్లు, సిరంజన్‌లు, మందు బాటిళ్లు పడి ఉన్నాయి. చుట్టుపక్కల నివాసం ఉంటున్న వాళ్లకు ఆమె అరుపులు వినిపించకూడదనే ఉద్దేశ్యంతో మత్తు ఇంజక్షన్ ఇచ్చి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. బహుశా 24వ తేదీ ఉదయమే హత్యాయత్నం జరిగి ఉండవచ్చని ఘటనాస్థలిలో ఎండిపోయిన రక్తపు మరకలను బట్టి పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ హత్యాయత్నంపై జంక్షన్ సీఐ వైవీవీఎల్. నాయుడు, ఎస్ఐ వి.సతీష్ ముమ్మర దర్యాప్తు చేపట్టారు. పద్మతో కలిసి సహజీవనం చేస్తున్న ఏలూరుకు చెందిన బత్తుల నూతనకుమార్ విక్టర్పైనే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అతను పరారీలో ఉండటంతో ఆ అనుమానానికి మరింత బలం చేకూరింది. వీళ్లిద్దరూ సహ జీవనం ప్రారంభించిన తర్వాత నూతనకుమార్ వ్యవహారంతో విసుగు చెందిన పద్మ గతంలో జంక్షన్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసినట్లు తెలుస్తోంది. కాగా, అపస్మారక స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పద్మ ఇచ్చే వాంగ్మూలం ఆధారంగానే నిందితుడిని గుర్తించేందుకు ఆస్కారం ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. -
బ్యూటీషియన్‌పై హత్యాయత్నం
-
బ్యూటిషియన్‌పై దారుణం : కాళ్లు, చేతులు కట్టేసి...
సాక్షి, విజయవాడ : కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లో దారుణం చోటు చేసుకుంది. ఓ బ్యూటిషియన్‌పై అత్యంత దారుణంగా హత్యాయత్నం జరిగింది. కాళ్లు, చేతులు కట్టేసి ఆమెపై కత్తితో దాడికి పాల్పడ్డారు దుండగులు. బాధితురాలిని పిల్లి పద్మగా పోలీసులు గుర్తించారు. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ పద్మ, రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ ఉంటే స్థానికులకు గమనించి ఆమెను ఏలూరు ఆసుపత్రికి తరలించారు. వివాహేతర సంబంధమే కారణమా? బ్యూటిషియన్ పద్మ గత కొంత కాలంగా భర్తకు దూరంగా ఉంటూ.. నూతన్‌కుమార్ అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ప్రస్తుతం ఆమె బాపుల పాడులో నివాసముంటోంది. ఆమెపై హత్యాయత్నానికి వివాహేతర సంబంధమే కారణమని ఇటు బంధువులు, అటు పోలీసులు అనుమానిస్తున్నారు. -
అనుమానాస్పదస్థితిలో బ్యూటీషియన్ మృతి
మైసూరు: ఒంటరిగా నివసిస్తున్న బ్యుటీషియన్ అనునాస్పదస్థితిలో మృతి చెందిన ఘటన మంగళవారం నగరంలోని దామోదర లేఅవుట్లో చోటు చేసుకుంది. చెన్నారయపట్టణ తా లూలకా జన్నివార గ్రామానికి చెందిన రమ్య(25)కు ఆరు సంవత్సరాల క్రితం మైసూరు నగరానికి చెందిన ఆనంద్ అనే వ్యక్తితో వివాహమైంది. రెండేళ్ల క్రితం భర్తతో విబేధాలు రావడంతో ఆయనకు దూరంగా ఉంటూ నగరంలోని ఓ ప్రముఖ ప్రైవేటు హోటల్లో బ్యుటీషియన్‌గా పని చేస్తూ దామోదర లేఅవుట్లో ఉండేవారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఎంతకీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన తల్లితండ్రులు గదిలోకి వెళ్లి చూడగా రమ్య ఉరి వేసుకున్న స్థితిలో విగతజీవిగా ఉండడాన్ని గమనించిఆలనహళ్లి పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. -
వ్యభిచారం కేసులో బ్యూటీషియన్..
బంజారాహిల్స్ : బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని ఎన్బీటీ నగర్లో ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం రాత్రి దాడులు నిర్వహించి నిర్వాహకుడితో పాటు సెక్స్ వర్కర్లను అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... ఎన్బీటీ నగర్లో గత కొంత కాలంగా షేక్ ముజుమిల్ రెహమాన్ అనే వ్యక్తి వ్యభిచార కేంద్రం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. నిర్వాహకుడు రెహమాన్‌తో పాటు గాంధీనగర్ దేవిచౌక్ ప్రాంతానికి చెందిన యువతిని అదుపులోకి తీసుకున్నారు. బ్యూటీషియన్‌గా పని చేస్తున్న తాను నెలకు రూ.15 వేలు కూడా సంపాదించలేకపోతున్నానని ప్రతినెలా రూ. 50 వేలు ఇస్తానని రెహమాన్ చెప్పడంతో ఆరు నెలల క్రితం ఈ వృత్తిలోకి దిగినట్లు తెలిపింది. నిర్వాహకుడు కోల్‌కతా, ఢిల్లీ, బెంగళూరు, విజయవాడ, గుంటూరు ప్రాంతాలకు చెందిన పలువురు యువతులను రప్పించి వ్యభిచారం చేయిస్తున్నట్లు వెల్లడించింది. నిందితుడు రెహమాన్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు యువతిని పునరావాసకేంద్రానికి తరలించారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బ్యూటీషియన్ అనుమానాస్పద మృతి
ధారూర్: గమ్యానికి దగ్గరగా వచ్చానని ఫోన్ చేసి చెప్పిన యువతి ఆ వెంటనే రైలు ప్రమాదా నికి గురైంది. రైల్వే స్టేషన్‌కు వచ్చి యువతి కోసం నిరీక్షించిన కుటుంబీకులు ఆమె రాకపోవ డంతో రాత్రంతా రైలు పట్టాల వెంట వెదికారు. ఉదయాన్నే పట్టాల పక్కనే మృత్యువుతో పోరాడుతూ కనిపించిన కూతుర్ని బతికించుకునేందుకు తల్లి, ఇతర కుటుంబీకులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ ఘటన ధారూర్ మండలంలోని మైలారం రైల్వేస్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. కుటుంబీ కులు, రైల్వే పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. యాలాల మండలం పగిడ్యాల గ్రామానికి చెందిన కాశమ్మ, మల్లికార్జున్ దంపతుల మూడో కూతురు అల్లాపురం జ్యోతి (21) రంగారెడ్డి జిల్లా లింగంపల్లిలోని గ్రీన్‌ట్రెండ్స్ బ్యూటీ పార్లర్లో బ్యూటీషియన్‌గా పనిచేస్తోంది. జ్యోతి కుటుంబం బతుకు దెరువు కోసం ఇరవయ్యేళ్ల క్రితమే తాండూరుకు వచ్చి స్థిరపడింది. జ్యోతి రోజూ ఉదయం రైలులో లింగంపల్లి వెళ్లి తిరిగి సాయంత్రం ఇంటికి చేరుకునేది. ఆదివారం రాత్రి విధులు ముగించుకుని బీజాపూర్ ప్యాసింజర్‌లో ఇంటికి బయలుదేరింది. పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామం లో ఉంటున్న అమ్మమ్మ ఇంటి వద్ద ఆదివారం రాత్రి ఫంక్షన్ ఉండటంతో అక్కడికి వెళ్లడానికి తన చెల్లెలు ఉమకు ఫోన్ చేసింది. వికారాబాద్ దాటాను.. అరగంటలో రుక్మాపూర్ రైల్వేస్టేషన్‌కు వస్తాను.. బైక్‌ను పంపిం చమని చెప్పింది. బైక్‌ను తీసుకుని రైల్వేస్టేషన్‌కు వచ్చిన మేనమామ కొడుకు రైలు వెళ్లిపోయినా జ్యోతి రాకపోవడంతో ఇంటికి వెళ్లి కుటుంబీకులకు చెప్పాడు. ఫోన్ చేస్తే రింగ్ అవుతున్నా లేపకపోవ డంతో అనుమానం వచ్చి తెల్లవారే వరకు రైలు పట్టాల వెంట వెదికారు. రుక్మాపూర్–మైలారం స్టేషన్ల మధ్య మైలారం చివరి ఫ్లాట్‌ఫాం వద్ద ప్రాణాలతో పోరాడుతూ కనిపించింది. వెంటనే పుష్పుల్ రైలులో వికారాబాద్‌కు తీసుకొచ్చి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించారు. యువతి పరిస్థితిని గమనించిన వైద్యులు ఉస్మానియా ఆసుపత్రికి రిఫర్ చేశారు. అంబులెన్స్‌లో తరలిస్తుండగా చేవెళ్ల దగ్గర జ్యోతి తుదిశ్వాస వదిలింది. ఈ ఘటనపై జ్యోతి తల్లి కాశమ్మ వికారాబాద్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. జ్యోతి ప్రేమికుడిపై అనుమానం... రైలులో వస్తున్న జ్యోతి రుక్మాపూర్ స్టేషన్లో దిగాల్సి ఉండగా రెండు స్టేషన్ల ముందే రైల్లోంచి ఎలా దూకుతుందనే అనుమా నాన్ని కుటుంబీకులు వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్లుగా ప్రేమిస్తున్న ఓ యువకుడు పెళ్లిని వాయిదా వేస్తూ వస్తున్నాడన్నారు. రైలు ప్రయాణంలో జ్యోతి వెంట అతనూ ఉండవచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జ్యోతికి ఫోన్ చేస్తే లేపట్లేదని.. తమకు ఫోన్ చేయడంపై అనుమానం బలపడుతుందని వారు పేర్కొన్నారు. తన అక్క ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని జ్యోతి చెల్లెలు వాపోయింది. -
మీ ఇంట్లోనే బ్యూటీషియన్
అందాన్ని, ఆరోగ్యాన్ని పెంచే ‘వేప’ను కాదని చర్మసంరక్షణకు బ్యూటీ ప్రొడక్టులు వాడుతూ, పైసలు వసూలు చేసే పార్లర్ల వెంట తిరుగుతూ ఉంటారు. సౌందర్య ఉత్పత్తులలో వేప ఆకులను, వేళ్లను ఉపయోగించడం వెనుక ఉన్న చరిత్ర ఈ నాటిది కాదు 4,000 ఏళ్ళ క్రితం నాటిది. గుప్పెడు వేపాకులు గుప్పెడు వేపాకులు శుభ్రంగా కడిగి, రెండు లీటర్ల నీటిలో వేసి మరిగించాలి. ఎంతవరకు అంటే ఆకులు మెత్తగా అయ్యి నీళ్ల రంగు మారాలి. ఈ నీటిని చల్లార్చి గాజు బాటిల్లో పోసి ఉంచాలి. బకెట్ నీళ్లలో ఒక కప్పు వేపనీళ్లు కలిపి రోజూ స్నానం చేస్తే చర్మసంబంధమైన ఇన్ఫెక్షన్లు, యాక్నె వంటివి మెల్ల మెల్లగా తగ్గిపోతాయి. మృదువైన స్కిన్ టోనర్ స్కిన్ టోనర్‌కి మార్కెట్లో దొరికే ప్రొడక్ట్‌ని తెచ్చి వాడేస్తుంటారు. కానీ, వేప నీళ్లలో ఒక దూది ఉండను ముంచి, రోజూ రాత్రి పడుకునేముందు ముఖమంతా తుడిచేయండి. స్వేదరంధ్రాలలోని మలినాలు తొలగిపోయి చర్మకాంతి పెరుగుతుంది. చర్మం శుభ్రపడటం వల్ల యాక్నె, స్కార్స్, పిగ్మెంటేషన్, బ్లాక్ హెడ్స్ .. మెల్లగా తగ్గిపోతుంటాయి. మిలమిలలు పెంచే ఫేస్‌ప్యాక్ పది వేపాకులను మెత్తగా నూరి కప్పు నీటిలో వేసి మరిగించాలి. చల్లారిన తర్వాత ఈ నీళ్లలో కొద్దిగా తేనె, పెరుగు, సోయా పాలు కలిపి మిశ్రమం తయారుచేసుకోవాలి. దీన్ని వారానికి మూడుసార్లు ముఖానికి పట్టించి, చల్లటి నీళ్లతో కడిగేస్తే వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్, యాక్నె నుంచి విముక్తి లభిస్తుంది. పోర్స్‌లో మలినాలు శుభ్రపడతాయి. కేశాలకు కండిషనర్ వేపాకులను మరిగించిన నీళ్లతో తలస్నానం చేసిన తర్వాత జుట్టు కడుక్కోండి. ఇలా తరచూ చేస్తే చుండ్రు తగ్గడమే కాదు వెంట్రుకలూ మృదువుగా అవుతాయి. అంటే కేశాలకు వేపాకులు సహజసిద్ధమైన కండిషనర్ అన్నమాట. -
ఆడిపాడిన బ్యూటీషియన్లు
-
ఆడిపాడిన బ్యూటీషియన్లు
బీచ్‌రోడ్ (విశాఖ తూర్పు) : అతివల అందాలకు మెరుగుదిద్దే బ్యూటీషియన్లంతా వేడుక చేసుకున్నారు. క్యాట్‌వాక్‌తో కేక పుట్టించారు. అందమైన భామలంతా ఒకే చోట చేరి హొయలుపోయారు. ఆడిపాడుతూ బ్యూటీషియన్స్ డేకు కొత్త అందాన్ని తెచ్చిపెట్టారు. సంప్రదాయ వస్త్రధారణతోపాటు వెస్ట్రన్ స్టయిల్ జోడించి వారెవ్వా అనిపించారు. సోమవారం అంతర్జాతీయ బ్యూటీషియన్స్ డే సందర్భంగా ఓ ప్రైవేటు హోటల్లో విశాఖ బ్యూటీ థెరిపిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జెడ్పీ చైర్ పర్సన్ లాలం భవానీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్యాషన్ షో కళ్లు తిప్పుకోనివ్వలేదు. లేటెస్ట్ సాంగ్స్‌కు కాలు కదుపుతూ మహిళలు ఆకాశమే హద్దుగా ఉల్లాసంగా గడిపారు. ఈ కార్యక్రమంలో వీ టీమ్ వీరుమామా, అసోసియేషన్ అధ్యక్షురాలు అనురాధ, కార్యదర్శి లక్ష్మి, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక ఆకర్షణగా తల్లీకూతుళ్లు కీడ్ని పూర్తిగా పాడైపోయిన కూతురుకు తన కిడ్నీ ఇచ్చి మరోసారి జన్మనిచ్చింది ఆ తల్లి. మురళీనగర్‌లో బ్యూటీ క్లినిక్ నడుపుతున్న గీతా శిరీష్‌కు ఐశ్వర్య అనే కూతురు ఉంది. తనకు 2014లో కిడ్నీ పాడైందని డాక్టర్లు తెలిపారు. ఐశ్వర్యకు సంవత్సరం పాటు డయాలసిస్ చేశారు. కిడ్నీ మార్చక పోతే ఆమె బతకదని డాక్టర్లు చెప్పారు. దీంతో కిడ్నీ ఇచ్చి పునర్జన్మ ప్రసాదించింది తల్లి గీతాశిరీష్. బ్యూటీషియన్ డేలో తల్లీకూతుళ్లు క్యాట్‌వాక్, డ్యాన్స్‌లతో అందర్నీ ఆకర్షించారు. తల్లి ప్రేమను ప్రపంచానికి చాటి చెప్పిన గీతాశిరీష్కు ఈ సందర్భంగా నిర్వాహకులు సన్మానించారు. ఐశ్వర్య ప్రస్తుతం గీతం యూనివర్సిటీలో ఎంబీఏ చదువుతోంది. -
ఆమెదో అందమైన లక్ష్యం
సాక్షి, వీకెండ్: బ్యూటీషియన్ అనే ప్రొఫెషన్ ఎంతో గొప్పది అంటారామె. అంతేకాదు ఏకంగా లక్షమందిని ఈ రంగంలో స్థిరపడేలా చేయడమే తన జీవిత లక్ష్యం అని కూడా అంటున్నారు. చిన్ననాటి కలను సాకారం చేసుకోవడమే కాకుండా మరెందరికో సౌందర్యపోషణ రంగంలో కళాకారులుగా తీర్చిదిద్దుతున్న ఆమె పరిచయం ఈ వారం... – శిరీష చల్లపల్లి ‘గుంపుగా ఎందరో అమ్మాయిలు ఉన్నారు. అంతా ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. ఆ గుంపు మధ్యలో నుంచి ఏదో పింక్ కలర్ మెరుస్తూ ఉండేది. ఆ కల చిన్నప్పటిది. అయితే అదేంటో తెలిసేది కాదు. ఇప్పుడే నా కల గురించి అర్థమైంది’ అంటారు రుబీనా పర్వీన్. అందమే పల్స్.. బ్యూటీవీల్స్... నగరంలో సౌందర్యపోషణ ఎంతో ప్రాధాన్యత కలిగిన అంశంగా మారిందో... తదనుగుణంగానే ఆ రంగంలో నిపుణులకు డిమాండ్ కూడా అంతే పెరిగింది. పార్లర్స్‌లో మాత్రమే కాదు ఇంటికి వచ్చి కూడా సేవలు అందించే బ్యూటీషియన్స్ సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. అయితే ఇలాంటి మొబైల్ బ్యూటీషియన్లు ఒకప్పుడు వ్యక్తిగతంగా తమకున్న పరిచయాలతో మాత్రమే ఆర్డర్లు పొందేవారు. అయితే వ్యక్తిగతంగా కంటే ఇలా ఒక సంస్థ తరపున పనిచేయడం అనేది మహిళలకు సురక్షితం.. అంతే కాదు వారికి ఆదాయపరంగానూ మేలు చేస్తుందంటూ దీన్ని వ్యవస్థీకృతం చేశారు రుబీనా. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే... ఉతమివ్వడం ద్వారా ఉత్సాహం... 16 ఏళ్లుగా సిటీలో ఉంటున్న రుబీనా జన్మతః ఖమ్మం వాసి. ‘జర్నలిజంలో కొంత కాలం ఉన్నా. దాదాపు 500కిపైగా డాక్యుమెంట్రీ ఫిలిమ్స్ తీశా. 300కిపైగా యాడ్ ఫిలిమ్స్, వేల సంఖ్యలో టెలివిజన్ ఎపిసోడ్స్ తీశాను. ఫిలింమేకర్‌గా స్థిరపడ్డాను. అయితే వీటన్నింటికన్నా మహిళలకు ఉపాధిని అందించే విధంగా ఏదైనా చేయాలని, అందులోనే నాకు తృప్తి దొరుకుతుందని అనిపించేది. అదే సమయంలో నాకు తెలిసిన ఎంతో మంది సంపన్న, మధ్య తరగతి మహిళలు సైతం పార్లర్‌కి వెళ్లి బ్యూటీ ట్రీట్మెంట్స్ పొందడానికి సంశయించడం చూశాను. అలా సంశయించేవారికి ఇంటికే పార్లర్ సేవలు అందిచగలిగితే... అనే ఆలోచన వచ్చింది. దీనిమీద తగినంత రీసెర్చ్ చేశాను. ‘బ్యూటీవీల్స్ డాట్‌కామ్’ ఆలోచనను నా భర్తతో చెప్పినప్పుడు ఆయన అభినందించడంతో పాటు అవసరమైన ఆర్థిక సాయం కూడా చేశారు. సరిపడా చదువు వున్నా లేకున్నా తగిన సంభాషణా చాతుర్యం ఉన్న మహిళలెందరో ఉన్నారు. అలాగే చదువుకుని, సరైన ఉపాధి దొరక్క ఖాళీగా ఉంటున్నవాళ్లూ ఉన్నారు. వీరికి ఒక వేదికగా బ్యూటీ వీల్స్ డాట్‌కామ్‌ను నెలకొల్పాను. బంజారాహిల్స్ రోడ్‌నెం.12లో 4 బెడ్రూమ్ ఫ్లాట్‌లో వీరికి నిపుణుల చేత వీరికి బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ ఇప్పిస్తున్నాను. కోర్సు చేసే సమయంలోనే సంపాదన సైతం మొదలయ్యేలా శిక్షణానంతరం నెలవారీగా స్థిరమైన ఆదాయం వచ్చేలా కాన్సెప్ట్ డిజైన్ చేశాను. సోషల్ మీడియా సహకారంతో దీనికి మంచి ప్రాచుర్యం కల్పించాను. ఏడాది తిరగకుండానే దాదాపు 200 మంది మా సంస్థలో పనిచేస్తున్నారంటే అంతకంటే నాకు కావాల్సిన తృప్తి ఏముంటుంది. భవిష్యత్తు ‘భద్రం’.. మా సంస్థలో శిక్షణ తరగతులు నిర్విరామంగా సాగుతుంటాయి. ప్రొఫెషనల్ అప్డేట్స్తో పాటు పర్సనాలిటీ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్ సైతం నేర్పిస్తాం. కస్టమర్ల కోసం ఉదయం 6గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ బ్యూటీషియన్ సేవలు అందుబాటులో ఉంటాయి. బ్యూటీ సర్వీసెస్‌ను ఇంటికే పంపుతున్నా పార్లర్‌తో సమానంగా లేదా అంతకన్నా తక్కువే తప్ప ఎక్కువ ఛార్జ్ చేయం. భద్రతా పరంగానూ ఇబ్బందులు రాకుండా సొంత క్యాబ్్సలో తీసుకెళ్లి తీసుకొస్తాం. ఇక ట్రీట్మెంట్స్ కోసం నేచురల్‌గా తయారైన కాస్మొటిక్స్ మాత్రమే వినియోగిస్తాం. మా కస్టమర్ల కోసం మొబైల్ యాప్ సైతం అందుబాటులోకి తీసుకువచ్చాం. రుబీనా పర్వీన్ -
రేపు జాబ్‌మేళా
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రైవేట్‌రంగంలో ఉద్యోగాల కల్పన కోసం ఈ నెల 31వ తేదీన కలెక్టరేట్లోని ఈజీఎంఎం కౌన్సెలింగ్ సెంటర్లో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు డీఆర్డీఏ పీడీ మ«ధుసుదన్నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. వినూత్న ఫర్టిలైజర్ కంపెనీలో సేల్స్ రిప్రజెంటేటీవ్ ఉద్యోగాల కోసం జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇతర వివరాల కోసం సెల్ నెం : 9618766866 ను సంప్రదించాలని కోరారు. -
టైలరింగ్, బ్యూటీషన్ కోర్సుల్లో ఉచిత శిక్షణ
మహబూబ్‌నగర్ న్యూటౌన్ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ, కేంద్ర గ్రామీణాభివద్ధి మంత్రిత్వ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లాలోని గ్రామీణ నిరుపేద మహిళలకు టైలరింగ్, బ్యూటీషన్ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ జి.లక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. 30 రోజులపాటు ఉచిత భోజనం, వసతి, వ్యక్తిత్వ వికాసం, వ్యాపార నిర్వహణలపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. శిక్షణ అనంతరం ధ్రువపత్రాలు అందజేయనున్నట్లు వివరించారు. 18 నుంచి 35 సంవత్సరాల లోపు వయసు కలిగిన వారు ఆధార్, రేషన్ కార్డు, జిరాక్స్‌లతో పాటు 5 పాస్‌పోర్టు సైజు ఫొటోలతో సెప్టెంబర్ 1వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు 08542–270395, 9963369361 నెంబర్లను సంప్రదించాలని కోరారు. -
మేకప్ చేయాలని బ్యూటీషియన్‌ను పిలిచి...
సాక్షి, బెంగళూరు: బెంగళూరు నగరంలో బ్యుటీషియన్‌గా పనిచేస్తున్న కోల్‌కతాకు చెందిన ఓ యువతి (22)పై దారుణం జరిగింది. మేకప్ వేయాలని పిలిపించి ఆమెపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వివరాలిలా ఉన్నాయి.. బాధితురాలు ఈ ఏడాది జనవరిలో బెంగళూరుకు వచ్చి ఓ బ్యూటీపార్లల్‌లో ఉద్యోగిగా పనిచేస్తోంది. ఈ క్రమంలో ఈనెల 2న తమ ఇంట్లో ఓ యువతికి మేకప్ చేయాలంటూ ఆమె పనిచేస్తున్న బ్యూటీపార్లల్‌కు ఫోన్ వచ్చింది. దీంతో బ్యూటీపార్లల్ యజమాని ఆమెకు విషయాన్ని తెలిపి అడ్రస్ చెప్పారు. యజమాని చెప్పిన చోటికి ఆమె కాలినడకన వెళ్తుండగా అదే ప్రాంతానికి చెందిన నితిన్‌శెట్టి, ధనుంజయ్, రజత్ అడ్డుకున్నారు. తాము మఫ్టీలో ఉన్న పోలీసులమని బెదిరించారు. 'నువ్వు వేశ్య వృత్తిలో ఉన్నావని' బెదిరిస్తూ విచారణ కోసమంటూ ఆ యువతిని కారులో బలవంతంగా ఎక్కించుకున్నారు. అనంతరం దగ్గర్లోని నిర్జన ప్రదేశంలోని గోదాములోకి తీసుకువెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఉడాయించారు. మరుసటి రోజు ఉదయం యజమాని సాయంతో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నగరంలోనే వేర్వేరుచోట్ల తలదాచుకున్న ముగ్గురు యువకులను గురువారం అరెస్టు చేశారు. -
మేల్ ఎస్కార్ట్స్ సరఫరాలోనూ నందిని హ్యాండ్
రోజుకో చీటింగ్ కేసు నమోదు హైదరాబాద్: రోడ్ నెం.72లోని బ్లష్ స్పా అండ్ లగ్జరీ సెలూన్ నిర్వాహకురాలు యలమంచిలి నందిని చౌదరిపై రోజుకొకటి చొప్పున చీటింగ్ కేసు నమోదవుతోంది. ఆభరణాల వ్యాపారం పేరుతో ఓ వ్యాపారిని నిండాముంచి అరెస్టై జైళ్లో ఊచలు లెక్కిస్తున్న నందిని చౌదరిపై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లోనే కాకుండా పంజగుట్ట, నాంపల్లి, సీసీఎస్ ఠాణాల్లోనూ కేసులు నమోదవుతున్నాయి. కోట్లాది రూపాయలు వసూలు చేసినట్లు బాధితులు ఫిర్యాదు చేస్తున్నారు. తన స్పా అండ్ సెలూన్‌కు వచ్చే కస్టమర్లను మభ్యపెట్టి వారి నుంచి లక్షలాది రూపాయల విలువ చేసే ఆభరణాలతో పాటు అప్పు పేరుతో డబ్బు తీసుకొని ఎగ్గొట్టినట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. ఇప్పటికే నాంపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఒకటి, సీసీఎస్ ఠాణాలో రెండు కేసులు పెండింగ్‌లో ఉన్నట్టు తెలిసింది. నందిని చౌదరి తమను రూ.20 లక్షలకు మోసం చేసిందని నాలుగు రోజుల క్రితం చందనా బ్రదర్స్ నిర్వాహకులు పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా.. జూబ్లీహిల్స్ స్టేషన్లో తాజాగా మరోకేసు నమోదైంది. రూ. 20 లక్షల మేర తమను మోసం చేసిందంటూ ఇద్దరు వ్యాపారులు వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. కాగా, ఇటీవల ఆమెను జూబ్లీహిల్స్ పోలీసులు కస్టడీకి తీసుకొని విచారించగా చాలా విషయాలు చెప్పకుండా దాటవేసినట్లు తేలింది. నందిని చౌదరిని మరోమారు తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్లు దాఖలు చేయాలని ఓ వైపు నాంపల్లి పోలీసులు, మరో వైపు సీసీఎస్ పోలీసులు అనుకుంటున్నారు. ఇదిలా ఉండగా హైఫై మహిళలను లక్ష్యంగా చేసుకొని కొందరు యువకులను వారికి మేల్ ఎస్కార్ట్స్‌గా పంపిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడినట్టు సమాచారం. సుమారు పాతిక మంది మహిళలకు మేల్ ఎస్కార్ట్స్‌ను సరఫరా చేసి భారీగా డబ్బు వసూలు చేసినట్లు కూడా తెలుస్తోంది. మరోసారి కస్టడీకి తీసుకుంటే చాలా విషయాలు వెలుగు చూస్తాయని పోలీసులు భావిస్తున్నారు. -
వేసవి మేకప్...
అందమె ఆనందం ఎండ, చెమట వల్ల ఈ కాలం మేకప్ చేసుకున్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ వేడుకలలో అందంగా కనిపించాలంటే మేకప్ తప్పనిసరి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వేసవిలో కూడా సింపుల్ మేకప్‌తో అందంగా మెరిసిపోవచ్చు. ⇒ ముందుగా ముఖాన్ని లిక్విడ్ సోప్‌తో శుభ్రపరుచుకోవాలి. తర్వాత తడి లేకుండా తుడుచుకుని ఐస్‌క్యూబ్‌తో ముఖమంతా 5-6 సార్లు మృదువుగా రబ్ చేయాలి. తర్వాత వాటర్ బేస్డ్ మాయిశ్చరైజర్‌ను ముఖమంతా రాయాలి. ఇలా చేయడం వల్ల మేకప్ ఎక్కువ సేపు ఉండటమే కాకుండా ముఖం తాజాగా కనిపిస్తుంది. ⇒ మేకప్ చేయడానికి ముందు నాణ్యమైన ప్రైమర్ లోషన్‌ని ఎంచుకోవాలి. ఇది మేకప్‌కి బేస్‌గా పనిచే స్తుంది. ప్రైమర్‌ను వాడటం వల్ల మేకప్ మచ్చలుగా కనిపించదు. కంటి పై రెప్పకు కంటి చుట్టూతా కూడా ప్రైమర్‌ను అప్లై చేయాలి. ⇒ లిక్వ్‌డ్ బేస్డ్ ఫౌండేషన్‌ను బ్రష్‌తో ముఖమంతా రాయాలి. ⇒ లిప్‌స్టిక్ ప్యాచ్‌లుగా పెదవులపై కనపడకుండా, చేతులకు అంటుకోకుండా ఉండాలంటే టిష్యూపేపర్పైన కొద్దిగా పౌడర్వేసి, పెదవులపై అద్దాలి. ⇒ ఐ లైనర్‌తో కళ్లను తీర్చిదిద్దాలి. వేసవి కాబట్టి తరచూ నీళ్లు, పండ్లరసాలు తాగుతూ ఉంటే చర్మం త్వరగా పొడిబారకుండా ఉంటంది. ఈ చిన్న చిన్న జాగ్రత్తలను పాటించి మేకప్ చేసుకుంటే వేడుకలో అందంగా మెరిసిపోతారు. - సౌమ్య జాదవ్, బ్యూటీషియన్ -
పొడిబారిన జుట్టుకు...
ప్రశ్న - పరిష్కారం నాకు జుట్టురాలడం, చుండ్రు సమస్యలు ఉన్నాయి. చలికాలం కావడంతో ఈ సమస్య మరీ అధికంగా ఉంది. హెర్బల్ షాంపూలు, నూనెలు వాడినా ఫలితం లేదు. ఈ సమస్యల నివారణకు మంచి సలహా చెప్పగలరు. - వి.ఆర్.మాధురి, ఇ-మెయిల్ మానసిక ఒత్తిడి, విటమిన్లు, మినరల్స్, ఐరన్ శరీరానికి తగినంత అందకపోవడం, కాలుష్యం, వంశపారంపర్యం, నిద్రలేమి, హార్మోన్లలో హెచ్చుతగ్గులు, అనారోగ్యం.. జుట్టు రాలడం, చుండ్రు సమస్యలకు ఇలా అనేక కారణాలు ఉంటాయి. మీరు నెలలో రెండు సార్లు ఆలివ్ ఆయిల్ లేదా బాదం నూనెను కుదుళ్లకు పట్టేలా మసాజ్ చేసుకోవాలి. ఉసిరి, శికాకాయ, ఎండిన నిమ్మ ఆకులను కలిపి తయారుచేసుకున్న మిశ్రమాన్ని తలకు పట్టించాలి. గంట తర్వాత నీళ్లతో శుభ్రపరుచుకోవాలి. చలికాలమైనా సరే కొబ్బరి నీళ్లు తరచూ తాగుతూ ఉండండి. అలాగే రోజూ రెండు బాదంపప్పులు తింటూ ఉండండి. వెంట్రుకలు రాలడం, పొడిబారడం, చుండ్రు సమస్యలు తగ్గుతాయి. నా తల వెంట్రుకలు చాలా బిరుసుగా ఉంటాయి. వారానికి ఒకసారి నూనె రాసుకుంటాను. డ్రై నెస్ పోవడానికి ఎన్నిషాంపూలు మార్చినా ఫలితం కనపించడం లేదు. ఏం చేస్తే నా జుట్టు సిల్కీగా అవుతుంది? - విక్కి, ఇ-మెయిల్ చర్మానికి లాగే జుట్టుకు కూడా మాయిశ్చరైజర్ అవసరం. మీరు వారానికి రెండు సార్లు పెరుగుతో జుట్టు కుదుళ్లకు మాడుకు మసాజ్ చేయండి. పదిహేను, ఇరవై నిమిషాల తర్వాత శుభ్రపరచండి. అలాగే షాంపూతో తలంటుకున్న తర్వాత, తడి జుట్టుకు తప్పనిసరిగా కండిషనర్‌ని ఉపయోగించండి. అయితే, కండిషనర్‌ని నేరుగా మాడుకు పట్టించవద్దు. బయటకు వెళ్లేటప్పుడు తలను క్యాప్‌తో కవర్ చేయండి. గుడ్లు, నట్స్, పాల ఉత్పత్తులలో ప్రొటీన్లు అధికం. వీటిని రోజూ తీసుకోండి. ఈ జాగ్రత్తలు పాటిస్తే మీ జుట్టు సిల్కీగా అవుతుంది. నా వయసు 19. నా పై పెదవి మీద వెంట్రుకలు వస్తున్నాయి. నలుపుగా కూడా ఉంటోంది. దీని వల్ల చాలా ఇబ్బందిగా ఉంటోంది. పరిష్కారం చెప్పగలరు. - ఈషా, ఇ-మెయిల్ ఆడవారిలో పై పెదవి మీద వెంట్రుకలు రావడం అనేది హార్మోన్లలో హెచ్చుతగ్గుల వల్ల జరుగుతుంది. దీనికి థ్రెడింగ్, వ్యాక్సింగ్ మేలైనవి. నలుపు కూడా ఉంది కాబట్టి టొమాటో గుజ్జును పై పెదవి మీద రాసి, ఆరనివ్వండి. తర్వాత శుభ్రపరుచుకోండి. టొమాటోలోని సహజ సిద్ధమైన బ్లీచింగ్ నలుపును తగ్గిస్తుంది. ప్రతిరోజూ ఈ పద్ధతిని పాటించవచ్చు. - గీతాంజలి ప్రియ, బ్యూటీషియన్ -
వివాహేతర బంధాన్ని బయట పెట్టిందని...
విజయవాడ: వివాహేతర సంబంధాన్ని బయట పెట్టిందన్న కక్షతో విజయవాడలో సునీత అనే బ్యూటీ పార్లర్ నిర్వాహకురాలిపై సుభానీఖాన్ అనే వ్యక్తి దాడి చేశాడు. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 20 రోజుల క్రితం సుభానీఖాన్ మరో అమ్మాయితో బ్యూటీ పార్లర్ కు వచ్చాడు. ఈ విషయాన్ని సుభానీఖాన్ భార్యకు సునీత చెప్పింది. దీంతో కక్ష పెంచుకున్న సుభానీఖాన్ శనివారం రాత్రి కత్తితో సునీతపై దాడికి పాల్పడ్డాడు. గాయపడిన సునీతను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. నిందితుడు సుభానీఖాన్ పరారీలో ఉన్నాడు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. -
రూపం..అపురూపం..
ముద్దమందారంలాంటి ముఖారవిందం.. అరవిరిసిన కలువల్లాంటి కళ్లకు కాటుక బంధం.. సింధూర శోభితమై మెరిసిపోయే కస్తూరి తిలకం.. నునుసిగ్గుల బుగ్గలకు నల్లటి చంద్రబింబం.. సింగారి చేతులకు సిరిగంధం.. హరివిల్లును తలపించే పెళ్లి పట్టుచీర.. కాళ్లకు పారాణి.. అందానికే అర్థం చెప్పే తెలుగింటి నవవధువుకే సొంతమైన ఆభరణాలివి. పసుపు రాసిన ముఖానికి మరింత వన్నెతెచ్చే వయ్యూరాలివి. ఒకప్పుడు ఇంటి అందానికే పరిమితమైన పెళ్లికూతురు ఇప్పుడు బ్యూటీపార్లర్లకు పరుగులు పెడుతోంది. నలుగురిలోనూ నవ వధువే అందంగా కనిపించాలని బ్యూటీషియన్లు కూడా సరికొత్త మేకప్‌లను అందుబాటులోకి తెస్తున్నారు. నుదుట బాసికం నుంచి కాళ్ల పారాణి వరకు సెలక్టెడ్‌గా చూసుకుంటూ పెళ్లి కూతురును సిద్ధం చేస్తున్నారు. విజయవాడ నగరంతోపాటు జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో ఈ తరహా బ్యూటీస్పాలు పెళ్లి కూతుర్ల పాలిట వరాలుగా మారారుు. విజయవాడ : పెళ్లి.. ప్రతి ఒక్కరి జీవితంలో ఒకేసారి జరిగే పండుగ. దీనిని వినూత్నంగా, అందంగా జరుపుకోవాలన్న తపన అందరిలోనూ ఉంటుంది. ఇక నవ వధువునైతే అందంగా ముస్తాబుచేసి మురిసిపోవాలని తల్లిదండ్రులు ఆశ పడతారు. పెళ్లిలో వినూత్నంగా కనిపించి అత్తింటి వారి నుంచి నూటికి నూరు మార్కులు కొట్టేయూలని వధువు అనుకుంటుంది. ఇందుకోసం మరింత అందంగా ముస్తాబవుతుంది. యువతుల ఈ ఆసక్తిని గమనించిన బ్యూటీషియన్లు రకరకాల మేకప్‌లతో బ్యూటీషియన్ సెంటర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. నుదుట బాసికం నుంచి పెళ్లిలో కట్టే చీర వరకు అన్నీ వారే డిజైన్ చేస్తున్నారు. ఇలా.. కొందరిని పెళ్లిరోజు, మరికొందరిని పెళ్లికి వారం రోజుల ముందు నుంచే సిద్ధం చేస్తున్నారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ పెళ్లి వేడుక ఏదైనా.. ఆయా మత సాంప్రదాయాల ఆధారంగా నవ వధువులను ముస్తాబు చేసుందుకు బ్యూటీషియన్లు ముందుకొస్తున్నారు. వాటర్ మేకప్, మడ్ మేకప్, స్ప్రే మేకప్ ఇలా వివిధ రకాల మేకప్‌లను అందుబాటులోకి తెస్తున్నారు. పెళ్లిరోజు చీరను కూడా వారే కడుతున్నారు. రెండు గంటల ముందు నుంచే.. వేడుక ప్రారంభానికి రెండు గంటల ముందు నుంచే పెళ్లి కూతురును ముస్తాబు చేయడం ప్రారంభిస్తారు. తొలుత వధువు పర్మనాలజీ, ముఖ కవలికలను బట్టి ఎలాంటి మేకప్ వేయాలో నిర్ణయిస్తారు. ముఖంపై మచ్చలు ఉంటే కనిపించకుండా కన్సెలర్ మేకప్ వేసి సిరిదిద్దుతారు. కొందరికి నుదుటి భాగం నలుపు రంగులో ఉంటుంది. అలాంటి వాటిని సరిదిద్దేందుకు ఫౌండేషన్ మేకప్ వేస్తారు. అనంతరం కాంపాక్ట్ కోటింగ్ ద్వారా చూడచక్కగా తీర్చిదిద్దుతారు. పెళ్లిలో కట్టే చీరరంగు బట్టి కనురెప్పలపై మేకప్ డిజైన్ చేస్తారు. లిప్‌స్టిక్ కూడా ముఖ కవలికల ఆధారంగానే ఉంటుంది. పెదవులు పెద్దగా ఉన్న వారికి చిన్నవిగా చూపించే లిప్‌స్టిక్ వేస్తారు. ఇలా ప్రతి అంశాలోనూ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ వధువును ముస్తాబు చేస్తారు. ఈ మేకప్ 6 నుంచి 7 గంటలు చెక్కు చెదరదు. శి‘రోజా’లు పెళ్లి సంప్రదాయూన్ని బట్టి బ్యుటీషియన్లు నవ వధువు హెయిర్ స్టైల్ డిజైన్ చేస్తారు. హిందూ సంప్రదాయ పెళ్లయితే పూలజడ, క్రిస్టియన్ పెళ్లి అయితే జుట్టు ముడివేసి ముఖంపైకి వెయిల్, ముస్లిం మ్యారేజ్ అయితే జుట్టు ముడివేసి పూలతో జడలా అల్లడం, ముఖంపైకి పూలు వచ్చేలా చేయడం చేస్తారు. రిసెప్షన్కైతే హెయిర్‌ను ఫ్రీగా వదిలేసి డిజైన్ చేస్తారు. కొందరు పెళ్లి వేడుకకు వారం, పదిరోజుల ముందు నుంచే బ్యూటీస్పా సెంటర్లకు వెళ్తున్నారు. టానింగ్, పేషియల్స్, బాడీ పాలీషింగ్ వంటి సిటింగ్‌ల ద్వారా చర్మంలోని మృత కణాలను తొలగించి సౌందర్యవంతంగా తయూరుచేస్తున్నారు. చేతులు నిగనిగ లాడేందుకు మానెక్యూర్, పాదాలు అందంగా కనిపించేందుకు పెడిచ్యూర్, జుట్టు మిలమిలా మెరిసిపోయేందుకు స్పా చేస్తున్నారు. రూ.10వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తాం.. వధువు ముస్తాబు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. వారి ఇష్టానుసారమే మేకప్ వేస్తాం. ఇటీవల కాలంలో పెళ్లిళ్ల సమయంలోనే కాదు.. పెళ్లి కూతురును చేసేటపుడు కూడా బ్యూటీషియన్లను ఆశ్రయిస్తున్నారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నవ వధువులను తీర్చిదిద్దుతున్నాం. ఈ విషయంలో ముందుగానే బంధువులకు కౌన్సెలింగ్ ఇస్తాం. ఒక్కో వేడుకకు రూ.10వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తాం. పెళ్లి వేడుకల్లో కుటుంబ సభ్యులు డ్యాన్స్ చేసేందుకు ప్రత్యేక శిక్షణ కూడా మేము ఇస్తున్నాం. - ఉడత ముఖేష్‌కుమార్, వెర్టెక్స్ గ్రూప్, డెరైక్టర్ అందానికే ప్రాధాన్యత నవ వధువుకు మేకప్ వేసేందుకు ముందుగా ఆమె పర్శనాలటీ, ముఖ కవలికలు వంటివి పరిగణనలోకి తీసుకుంటాం. పెళ్లి పగలా, రాత్రా అనే అంశాన్ని బట్టీ మేకప్ డిజైన్ ఉంటుంది. కనురెప్పల మేకప్‌తో పాటు లిప్‌స్టిక్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. చేతి గోర్లను షేప్ తీసుకురావడంతో పాటు అందంగా కనిపించేలా మెహిందీ వేస్తాం. పాదాలు మరింత అందంగా కనిపించేలా చూస్తాం. ఎంత సమయం పట్టినా.. పెళ్లి వేడుకలో అందంగా కనిపించడమే లక్ష్యంగా కృషి చేస్తుంటాం. - అను అగర్వాల్, బ్యూటీషియన్ -
మేనికి మెరుగులు...ఉపద్రవాలకు ఉపశమనాలు
ఈ మధ్య ఓ మహిళ తన అందాన్ని ఇనుమడింపచేసుకోడానికి వెళ్తే ఆ చికిత్సకులు కాస్తా ముఖాన్ని అందవికారంగా మార్చారన్న వార్త అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. మంచి చేసుకోబోతే చెడు ఎదురైనట్లుగా అందరూ ఉలిక్కిపడ్డారు. అందం కోసం అతివలు ఆకాంక్షించడం, అందాలకు మెరుగులు పెట్టుకునేందుకు ప్రయత్నించడం చాలా సాధారణమైన విషయం. అందంగా కనపడాలనే ఆకాంక్షతో ఎన్నో ప్రక్రియలను అనుసరిస్తుంటారు. అయితే ఏ చికిత్స చేయించుకుంటే... మరే ప్రక్రియను అనుసరిస్తే అది ఎలా పరిణమిస్తుందోనని చాలామంది ఆందోళన పడుతుంటారు. అలాంటి అనుమానాలను నివృత్తి చేసే ప్రత్యేక కథనం ఇది. పెరుగుతున్న సౌందర్యకాంక్ష...తరుగుతున్న చికిత్సాప్రమాణాలు ఇటీవల మహిళల్లో సౌందర్య కాంక్ష పెరుగుతోంది. దానికి తోడు వివిధ సౌందర్యసాధనాలు, ప్రక్రియలు, చికిత్సలు అందుబాటులోకి వస్తున్నాయి. అనేక ప్రకటనలు వారిని ప్రలోభపెట్టే విధంగా హోరెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సౌందర్యసాధనాల వాడకం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ప్రకటనలపై అప్రమత్తంగా ఉండాలి, చికిత్సల కోసం సరైన విద్యార్హతలు, నిపుణులూ అయిన వారిని ఎలా ఎంచుకోవాలి వంటి అనేక అంశాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇటీవల స్త్రీ, పురుష భేదం లేకుండా అందరూ తమ లుక్స్‌కు ప్రాధాన్యం ఇస్తుండడంతో సౌందర్యరంగంలో వాణిజ్యానికి అవకాశాలు పెరిగాయి. దాంతో నిపుణులు కానివారు, ఎలాంటి అర్హతలూ లేనివారు కూడా ఈ రంగంలోకి వస్తున్నారు. ఫలితంగా సౌందర్యాన్ని ఇనుమడింపజేసుకునేందుకు భారీగానే మూల్యాన్ని చెల్లించాల్సివస్తోంది. క్లినిక్కుల ప్రకటనలే చాలా?...మరి కావాల్సిందేమిటి? సౌందర్యం పట్ల అభిలాష, దాన్ని ఇనుమడింపజేసుకోవాలనే కోరిక పెరగడంతో తమ ప్రత్యేకతలను తెలుపుతూ చాలా క్లినిక్స్ వెలుస్తున్నాయి. వారు తమ వద్ద లభించే ప్రత్యేకమైన ప్రక్రియలూ, ఉపకరణాలూ, ఇతరత్రా సాధనాల గురించి విస్తృతంగా ప్రచారం చేసుకుంటూ ఉంటారు. అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే... కేవలం ప్రత్యేకమైన సామగ్రి, ఉపకరణాలు, యంత్రపరికరాలు ఉండటం మాత్రమే ఒక సంస్థ తాలూకు చికిత్స సామర్థ్యాన్ని నిర్ణయించదు. వాటిని ఉపయోగించడంలో సమర్థులైన వైద్యులు ఉండాలి. వారు తప్పనిసరిగా ఆ సామగ్రిని లేదా చికిత్సాప్రక్రియను చేపట్టడానికి గల విద్యార్హతను కలిగి ఉండాలి. అప్పుడే వాటికి సార్థకత. నూరు శాతం ఫలితాలంటే నమ్మకండి... మీ కురుల విషయంలో... అవి పూర్తిగా నూరు శాతం పెరుగుతాయని నమ్మబలికినా లేదా అవాంఛిత రోమాల విషయంలో అవి నూరు శాతం తొలగిస్తామనంటూ చెప్పినా పూర్తిగా నమ్మకండి. ఎందుకంటే చికిత్స అన్నది ఎప్పుడూ నూరు శాతం ఫలితాలు ఇవ్వకపోవచ్చు. చాలా సందర్భాల్లో మెరుగైన ఫలితాలను మాత్రమే ఇస్తుందన్న చేదు నిజాన్ని అంగీకరించాకే చికిత్సకోసం ముందుకు వెళ్లండి. హక్కుగా అడగవచ్చు... ఏదైనా డెర్మటాలజిస్టు స్పెషలిస్టుగా ఉన్న ఆసుపత్రికి వెళ్లినప్పుడు అక్కడి డాక్టర్ విద్యార్హతలను అడిగి తెలుసుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. వారి పేరు, విద్యార్హత, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) రిజిష్టర్డ్ నెంబరు వంటివి గల ఐడి కార్డును చూపమని అడిగి, వారి అర్హతలను నిర్థరించుకోవచ్చు. విద్యార్హతలు లేని వైద్యులూ ఉంటారు... చర్మవైద్యానికీ, సౌందర్యాలను మెరుగుపరిచే ప్రక్రియలను అనుసరించే రంగంలోకి సరైన విద్యార్హతలు, అనుభవం, నైపుణ్యం లేనివారు సైతం వస్తున్నారు. వారు వైద్యవిద్యను చదవకుండానే, అందులో స్పెషలైజేషన్స్ సాధించకుండానే తమను బ్యూటీషియన్లుగా/కాస్మటాలజిస్టులుగా చెప్పుకునేవారు ఎక్కువవుతున్నారు. దాంతో బ్యూటీపార్లర్కూ, అర్హత గల డెర్మటాలజిస్ట్ నడిపే క్లినిక్‌కూ మధ్య తేడా తగ్గిపోతోంది. అందువల్ల రోగులు పొరబడే అవకాశాలు ఎక్కువ. ఇలా సరైన విద్యార్హతలూ, అదే రంగంలోని ఉన్నత విద్య లేకుండానే చికిత్సలో పాలుపంచుకునేవారిని ‘క్వాక్స్’గా పేర్కొంటుంటారు. మెడికల్షాపులూ వైద్యచికిత్స కేంద్రాల్లా... కొన్ని చోట్ల మందుల దుకాణాలే ఒక క్లినిక్ భూమికను పోషిస్తుంటాయి. క్లినిక్ యజమాని ఇచ్చిన మందులు వాడేస్తుంటారు. ఇలా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడే మందులనే ‘ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్’గా చెబుతుంటాం. ఒక్కోసారి వాళ్లిచ్చే కొన్ని మందులు వికటించి మరిన్ని ఆరోగ్య సమస్యలూ వచ్చే అవకాశం ఉంది. కొన్నిసార్లు మందుల షాపు యజమానులు ఇచ్చే మందులూ తొలుత కొంత నయం చేసి ఆ తర్వాత చాలా తీవ్రమైన సమస్యల్లోకి నెట్టేసే ప్రమాదమూ ఉంది. ఇతర సాధారణ మందులూ.. చర్మంపై వాటి దుష్ర్పభావం.. కొన్నిచోట్ల ఒళ్లు నొప్పులు అనగానే ‘ఓవర్ ద కౌంటర్’ మందుగా నిమ్యులిసైడ్ అనే మందును ఇవ్వడం ఆనవాయితీ. కానీ ఆ మందు వాడటం వల్ల దీర్ఘకాలంలో వారి మూత్రపిండాలు తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. దీన్నే వైద్య పరిభాషలో ‘డ్రగ్ ఇండ్యూస్డ్ నెఫ్రోపతి’గా పేర్కొంటారు. పైగా ఆ మందు ప్రభావం వల్ల ‘స్టీవెన్ జాన్సన్స్ సిండ్రోమ్’ అనే మెడికల్ ఎమర్జన్సీ కండిషన్ ఏర్పడవచ్చు. ఈ చర్మసమస్య ఒక్కోసారి ప్రాణాంతకమూ అయ్యే అవకాశం ఉంది. అందుకే మందుల షాపుల్లోనూ, సొంతవైద్యంతోనూ మందులు వాడకూడదు. సమస్య చిన్నదైనా ఒకసారి అర్హత కలిగిన చర్మవైద్య నిపుణులను కలిసి మాత్రమే మందులు వాడాలి. పెద్ద సెంటర్లలో ఇలాంటి మోసాలు జరగవా? చర్మవ్యాధుల చికిత్స రంగంలో కొన్ని చాలా పెద్ద పెద్ద సంస్థలూ ఆర్భాటంగా, అట్టహాసంగా తమను తాము ప్రమోట్ చేసుకుంటుంటాయి. పేరుకు పెద్ద సంస్థలే అయినా అక్కడి డాక్టర్లు కేవలం వైద్య విద్యను మాత్రమే అభ్యసించిన (ఎంబీబీఎస్) వారై ఉండవచ్చు. వారు డెర్మటాలజీని ఒక కోర్సుగా చదివి ఉండకపోవడం వల్ల వారికి చర్మవ్యాధుల చికిత్స విషయంలో అత్యంత సూక్ష్మస్థాయి పరిజ్ఞానం పూర్తిగా ఉండకపోవచ్చు. కొన్ని పెద్ద సంస్థలు సైతం ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నాయి. అందుకే చర్మవైద్యచికిత్స ప్రక్రియలకు వెళ్లాలనుకున్నప్పుడు తప్పనిసరిగా ఒక సంస్థలోని అత్యున్నత ప్రమాణాలను తప్పక పరిగణనలోకి తీసుకోవాలి. ఒకేలా కనిపించే వేర్వేరు సమస్యలు.. చికిత్సలు చర్మానికి లేదా కురులకు సంబంధించిన అనేక సమస్యలు ఒకేలా కనిపిస్తాయి. కానీ ఒక డెర్మటాలజిస్టే వాటిని నిర్దిష్టంగా గుర్తుపట్టగలరు. ఉదాహరణకు పిగ్మెంటేషన్ అనే కండిషన్లో చర్మంపై ఒకచోట మెలనిన్ అనే చర్మపు రంగు నల్లగా పోగుపడినట్లుగా ఉంటుంది. ఈ కండిషన్‌ను సాధారణంగా ‘మెలాస్మా’ అంటారు. ఈ కండిషన్‌తో పోలి ఉంటే ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి ఉదాహరణకు... పిటీరియాసిస్ వెర్సికొలర్, టీనియా ఫేసీ అనే ఫంగల్ ఇన్ఫెక్షన్స్లో కొన్ని సందర్భాల్లో లెప్రసీలో లెకైన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ అనే కండిషన్లో ఎరిథ్రాస్మా అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లో ఎకాంథోసిస్ నైగ్రికాన్స్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ పై కండిషన్లు అన్నీ దాదాపుగా ఒకేలా కనిపిస్తూ ఒకదాన్ని మరోటి పోలి ఉంటాయి. అప్పుడు అది నిర్దిష్టంగా ఏ సమస్య అన్న విషయాన్ని కేవలం డెర్మటాలజిస్టు గుర్తుపట్టి, దేనికి ఇవ్వాల్సిన చికిత్సను దానికి ఇస్తారు. ఒకవేళ ఒక సమస్యను తప్పుగా గుర్తిస్తే దాని వల్ల ఒనగూరే నష్టం చాలా తీవ్రంగా ఉండవచ్చు, ఒక్కోసారి వెనక్కు తీసుకోలేనిది కూడా కావచ్చు. ఇక మహిళల్లో ముఖంపైన అవాంఛిత రోమాల విషయానికి వస్తే దీనికి కారణమైన అంశాన్ని ముందుగా వివరంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఎన్నో కారణాల వల్ల మహిళల్లో అవాంఛిత రోమాలు ఒక లక్షణంగా కనిపిస్తాయి. ముఖంపై అవాంఛిత రోమాలు లేదా హిర్సుటిజమ్ అనే సమస్యకు ఉన్న అనేక కారణాల్లో పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ ఒకటి. దీనివల్ల కలిగే హైపర్యాండ్రోజెనిసిస్ లేదా ఒవేరియన్ గడ్డల వల్లగానీ, అడ్రినల్ గడ్డల వల్లగానీ, పిట్యూటరీ గడ్డల వల్లగానీ యాండ్రోజెన్ హార్మోన్ ఎక్కువగా స్రవించడం... ఇలా ఎన్నో కారణాలు ఉండవచ్చు. అందుకే ముఖంపై అవాంఛిత రోమాలు ఉన్న ప్రతి ఒక్కరికీ ఒకేలాంటి చికిత్స ఉండదు. కారణాన్ని బట్టి చికిత్స మారుతుంది. కురుల సమస్యలకుటైకోస్కోప్ సహాయమిలా.. ట్రైకోస్కోప్ సహాయంతో కురులను మరింత పెద్దవిగా చూస్తూ వాటి చిత్రాలు (మేగ్నిఫైడ్ ఇమేజెస్ విత్ ట్రైకోస్కోప్) తీసుకుంటారు. వాటిని పేషెంట్‌కు చూపిస్తూ వారి అసలు సమస్యను వివరంగా చెబుతారు. ఇలా మీకు మీ సమస్యలను వివరంగా చెప్పేవారినే నమ్మండి. వెంట్రుకల చికిత్సలో జాగ్రత్తలిలా... ఇటీవల చాలామంది తమ కురుల అందాలను ఇనుమడింపజేసుకోడానికి ట్రైకాలజిస్టులు అనే నిపుణులను సంప్రదిస్తున్నారు. అయితే చాలా సెంటర్లలో కొందరు తమను తాము ట్రైకాలజిస్టులుగా అభివర్ణించుకుంటున్నారు. వాస్తవానికి డెర్మటాలజీలో సూపర్‌స్పెషాలిటీ చేసి, ఆ రంగంలో శిక్షణ పొందినవారే ఆ తర్వాత ట్రైకాలజీ అనే వెంట్రుకలకు సంబంధించిన సబ్స్పెషాలిటీలో మరింత శిక్షణ పొందుతారు. కాబట్టి ట్రైకాలజిస్టులను సంప్రదించేవారు... సదరు వ్యక్తి డెర్మటాలజీ సూపర్‌స్పెషాలిటీ చదివాక ట్రైకాలజీ అనే సబ్స్పెషాలిటీలో శిక్షణ తీసుకున్నారా లేదా అన్నది నిర్ధారణ చేసుకున్న తర్వాతే వారి నుంచి సేవలు పొందాలి. లేజర్ విషయంలో నైపుణ్యం ఎంత అవసరమంటే... లేజర్ చికిత్సలో అది రోమం మూలంలో ఉండే మెలనిన్‌పై ప్రభావం చూపుతుంది కాబట్టి తాము ఏ అవసరం కోసం లేజర్ చికిత్స చేస్తున్నామన్న అంశం ఆధారంగా ఎంత మేరకు లేజర్‌ను వెలువరించాలి, దాని ఫ్రీక్వెన్సీ ఎంత ఉండాలి అన్నది స్పష్టంగా మానిటర్ చేస్తూ ఉండాలి. ఇది కేవలం అందరికీ ఒకేలా ఉండదు. కొందరి చర్మం నల్లగా ఉండవచ్చు. మరికొందరు కాస్త ఫెయిర్ ఉండవచ్చు. వాళ్ల చర్మపురంగు, చర్మపు తీరుతెన్నులు, దాని తరహాను బట్టి కూడా ఈ ఫ్రీక్వెన్సీ మారుతుంది. పొరబాట్లు ఎలా జరుగుతాయంటే..? ఉదాహరణకు కొన్ని వాస్తవ సంఘటనలు చుండ్రు ఎంత చిన్న సమస్యో అందరికీ తెలిసిందే. ఒక సెంటర్లో ఈ సమస్యను సోరియాసిస్ అనే సమస్యగా చూపి పేషెంట్‌ను భయపెట్టారు. దాన్ని తాము పూర్తిగా తగ్గిస్తామనీ, భవిష్యత్తులో మళ్లీ రాకుండా చూస్తామంటూ పెద్దమొత్తంలో డబ్బు వసూలు చేశారు. దీంతో పేషెంట్ తీవ్రమైన షాక్‌కు గురై... ఒకదశలో ఐసీయూలో చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని చర్మసమస్యలు చాలా సంక్లిష్టంగా ఉంటాయి. అలాంటప్పుడు అక్కడి చర్మం ముక్కను సేకరించి బయాప్సీ పరీక్షకు పంపాల్సి రావచ్చు. మరింత నిశితంగా పరిశీలించాల్సి రావచ్చు. ఎందుకంటే చిన్న పుట్టుమచ్చలా ఉన్న సమస్య నిజానికి కార్సినోమా లేదా క్యాన్సర్ కావచ్చు. అందుకే సమస్య తీవ్రతను బట్టి చికిత్స ఉండాలి. అంతేగాని ఒకేలా కనిపించే లక్షణాలన్నింటికీ ఒకే చికిత్స సరిపోదని గుర్తించాలి. ఒక్కోసారి కొందరిలో చాలా పుట్టుమచ్చలు ఒకేసారి వస్తుంటాయి. ఇలాంటి పుట్టుమచ్చలు చాలా సాధారణమే కాబట్టి వాటిని చాలామంది తీవ్రంగా పరిగణించరు. కానీ ఒక్కోసారి అవి కడుపు లేదా పేగుల్లోని క్యాన్సర్లకు సూచన కావచ్చు. చర్మ, కురుల సమస్యలకు ఇచ్చే కొన్ని మందులు ఇతరత్రా మందులు వాడుతున్నప్పుడు ప్రతికూల ఫలితాలు ఇవ్వవచ్చు. అందుకే చర్మవైద్య నిపుణులు అనేక అంశాలను రోగిని అడిగి తెలుసుకుని, మందులను సూచిస్తుంటారు. అందుకే మీ డెర్మటాలజిస్ట్‌తో మీ విశ్వసనీయత చికిత్స విషయంలో కీలక భూమిక పోషిస్తుంది. లేజర్లు... రకాలు... సాధారణ ప్రజలకు లేజర్ అనగానే అదేదో ఒక్కటే యంత్రం అనుకుంటారు. కానీ ఇందులోనూ చాలా రకాల లేజర్ ఉపకరణాలు ఉంటాయి. ఉదాహరణకు ఎన్డీ యాగ్, సోప్రానో, ఎస్హెచ్ఆర్ ( ఐపీఎల్), డయోడ్ లేజర్ లాంటివి. ఇవన్నీ వేర్వేరు తరహా చికిత్సల కోసం ఉద్దేశించిన లేజర్ ఉపకరణాలు. వీటిలో అన్నీ కురుల మూలం వద్ద ఉన్న మెలనిన్ పిగ్మెంట్ను తొలగించేలా పనిచేస్తాయి. అయితే ఇదే టెక్నాలజీ తెల్లవెంట్రుకల విషయంలో పనిచేయదు. అయితే కొన్ని సెంటర్లలో అక్కడి సిబ్బంది తెల్లవెంట్రుకల విషయంలోనూ తాము సమర్థమైన చికిత్స అందిస్తామని తప్పుడు వాగ్దానాలు చేస్తుంటారు. నిజానికి అది సాధ్యం కాదు. ప్రస్తుతం ఉన్న అధునాతన వైద్యవిజ్ఞానంలో మనకు ప్రధానంగా అందుబాటులో ఉన్న లేజర్లు ఆరు రకాలు. వాటితో ప్రయోజనాలివి... 1) అవాంఛిత రోమాలను తొలగించేవి 2) పిగ్మెంటేషన్‌కు చికిత్స చేసేవి 3) పచ్చబొట్టు తొలగించడం కోసం 4) వాస్క్యులార్ ట్యూమర్స్ తొలగించడం కోసం 5) మొటిమలు వాటి వల్ల చర్మంపై ఏర్పడ్డ గుంటల వంటివాటిని సరిచేసేవి. 6) చర్మాన్ని మరింతగా తేజోవంతం (రీజూవినేషన్) చేయడం కోసం, చర్మాన్ని బిగుతుగా చేయడం కోసం. ఇలాంటి లేజర్లు పెద్ద కేంద్రాల్లో చాలా చోట్ల ఉన్నాయి. వాటిని ఉపయోగించడంలో డాక్టర్లు నిర్దిష్టమైన ప్రోటోకాల్స్ (క్రమబద్ధంగా లేదా నియమబద్ధంగా అనుసరించాల్సిన ప్రక్రియలు) ఉన్నాయి. ఆ ప్రోటోకాల్స్ ఆధారంగానే వాటిని ఉపయోగించాలి. అందానికి చికిత్స చేసేవారు... అన్నింట్లోనూ నిష్ణాతులై ఉండాలి అందాన్ని ఇనుమడింపజేసే చికిత్సకులను ‘కాస్మటాలజిస్ట్’లు అంటారు. వీరు కూడా డెర్మటాలజీ తర్వాత ఈ సబ్స్పెషాలిటీలో మరింత లోతుగా అధ్యయనం చేసినవారై ఉంటారు. అందానికి చికిత్స చేసే ప్రతివారూ కాస్మటాలజిస్ట్ కాలేరు. కాస్మటాలజిస్ట్ అంటే... ఒక చికిత్స చేసేటప్పుడు అక్కడి కండరాలు, అక్కడి నరాల తీరుతెన్నులు, వాటికి రక్తసరఫరా జరుగుతున్న తీరు, అక్కడ వ్యాపించి ఉన్న రక్తనాళాల నెట్వర్క్, అక్కడి లింఫాటిక్ డ్రైనేజీ వ్యవస్థ... ఇలా ఎన్నో విషయాలపై పూర్తి అవగాహన, పట్టు కలిగినవారై ఉంటారు. కొందరు ఎలాంటి అర్హత లేకుండానే లేదా కొంతమంది సినిమా రంగానికి చెందిన సెలిబ్రిటీలకు, మోడల్స్‌కు చికిత్స చేశామని చెప్పుకుంటూనో తమను తాము కాస్మటాలజిస్టులుగా అభివర్ణించుకుంటూ ఉంటారు. కానీ నిజమైన కాస్మటాలజిస్టుకు పైన పేర్కొన్న అన్ని అంశాలపై లోతైన పరిజ్ఞానం ఉండాలని గుర్తించండి. ఇటీవల బొటాక్స్ ఇంజెక్షన్‌తో ముఖాన్ని అందంగా చేసుకోవడం, ముఖంపైన ముడతలను తొలగించుకోవడం చేస్తున్నారు. బొటాక్స్ అనే ఆ మందు న్యూరో-మస్క్యులార్ జంక్షన్స్‌ను రిలాక్స్ చేసి ముఖంపై ముడుతలు తొలగిపోయేలా చేస్తుంది. ఒకసారి రిలాక్స్ అయిన న్యూరో-మస్క్యులార్ కండరాలు 4 - 6 నెలల పాటు అలాగే ఉండిపోతాయి. ఆ వ్యవధిలో పేషెంట్ తనను తాను చాలా ఫ్రెష్‌గా, యౌవనంగా (యంగ్ లుక్స్‌తో) ఉన్నట్లు ఫీలవుతాడు. కానీ మందు ప్రభావం తొలగిపోయాక మళ్లీ కండరాలన్నీ యథాతథ స్థితికి వస్తాయి. ఒకవేళ ఇదే బొటాక్స్ చికిత్సను తప్పుగా (రాంగ్ వేలో) చేస్తే, ఒక్కోసారి ముఖానికి పక్షవాతం (ఫేషియల్ పెరాలసిస్) రావచ్చు. అలాగే కొన్ని సందర్భాల్లో ముఖంలో గుంటలు, నొక్కులు ఉన్నప్పుడు ఫిల్లింగ్ అనే ప్రక్రియను అనుసరిస్తుంటారు. కానీ ఫిల్లర్స్ అన్నవి పూర్తిగా శాశ్వత ఫలితాలు ఇవ్వవనే విషయాన్ని గుర్తుంచుకునే చికిత్సకు వెళ్లాలి. వీటి ప్రభావం 9 నెలల నుంచి ఏడాది మాత్రమే. - నిర్వహణ: యాసీన్ - మంజులారెడ్డి -
అనుమానంతో అమానుషం
గొంతుకోసి భార్యను చంపిన సైకో ఉప్పల్, న్యూస్‌లైన్: భార్యపై అనుమానంతో సైకోగా మారిన భర్త పట్టపగలు ఆమెను అతికిరాతకంగా గొంతుకోసి చంపేశాడు. ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం ఈ దారుణం జరిగింది. పోలీసులు, బంధువు శంకర్ కథనం ప్రకారం... కరీంనగర్ జిల్లా ఇరుకుల్లా గ్రామానికి చెందిన తంగల్లపల్లి వాసు(33)కు మేనమామ కూతురు శ్రీలత (26)తో పదేళ్ల క్రితం పెళ్లైంది. వీరికి కుమారుడు సాయి పార్దు(7), కుతూరు సింధూ (5) సంతానం. వాసు కుటుంబం మూడేళ్లుగా రామంతాపూర్ కామాక్షిపురంలో నివాసముంటోంది. భర్త వాక్యూం క్లీనర్ల రిపేరర్ కాగా... శ్రీలత చిక్కడపల్లిలో బ్యూటీషియన్‌గా పని చేస్తోంది. గత కొంతకాలంగా వాసు భార్యపై అనుమానం పెంచుకొని రోజూ గొడవపడేవాడు. మతిస్థిమితం లేనట్టు ప్రవర్తించేవాడు. ఈ క్రమంలో ఆసుపత్రుల్లో కూడా చూపించుకున్నాడు. ఇదిలా ఉండగా... భార్య శ్రీలతను హత్య చేయాలని నిర్ణయించుకున్న వాసు కూతురిని తన తల్లి వద్దకు పంపాడు. బుధవారం మధ్యాహ్నం ఇంటికి వచ్చిన వాసు.. కొడుకుకు రూ. 10 ఇచ్చి చాక్లెట్లు కొనుక్కోమని బయటకు పంపాడు. తర్వాత భార్య కళ్లల్లో కారం కొట్టి.. కూరగాయల కత్తితో గొంతుకోసి చంపేశాడు. తర్వాత ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు నమ్మించడానికి యత్నించాడు. వీలు కాకపోవడంతో హత్యకు ఉపయోగించిన కత్తి, కారం ప్యాకెట్‌ను చేత్తో పట్టుకొని బయటకు వచ్చాడు. అతడిని చూసిన స్థానికులు తీవ్రభయాందోళనకు గురయ్యారు. స్థానికులు అతడిని పట్టుకొని నిలదీయగా.. అసలు విషయం బయట పెట్టాడు. స్థానికుల సమాచారం మేరకు ఉప్పల్ సీఐ బాలకృష్ణారెడ్డి, ఎస్ఐలు కిరణ్, ప్రవీణ్‌లు ఘటనా స్థలాన్ని పరిశీలించి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.