![Murder Attempt On Beautician Padma In Krishna District - Sakshi](/styles/webp/s3/article_images/2018/08/25/28.jpg.webp?itok=OmwaEVHX)
బ్యూటిషియన్ పద్మ, ప్రియుడు నూతన్ కుమార్
సాక్షి, విజయవాడ : కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ బ్యూటిషియన్‌పై అత్యంత దారుణంగా హత్యాయత్నం జరిగింది. కాళ్లు, చేతులు కట్టేసి ఆమెపై కత్తితో దాడికి పాల్పడ్డారు దుండగులు. బాధితురాలిని పిల్లి పద్మగా పోలీసులు గుర్తించారు. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ పద్మ, రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ ఉంటే స్థానికులకు గమనించి ఆమెను ఏలూరు ఆసుపత్రికి తరలించారు.
వివాహేతర సంబంధమే కారణమా?
బ్యూటిషియన్ పద్మ గత కొంత కాలంగా భర్తకు దూరంగా ఉంటూ.. నూతన్‌కుమార్ అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ప్రస్తుతం ఆమె బాపుల పాడులో నివాసముంటోంది. ఆమెపై హత్యాయత్నానికి వివాహేతర సంబంధమే కారణమని ఇటు బంధువులు, అటు పోలీసులు అనుమానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment