attempt murder
-
సీఎం జగన్‌పై హత్యాయత్నం కేసు: పోలీసుల అదుపులో అనుమానితుడు!
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. సీఎం వైఎస్ జగన్ శనివారం రాత్రి విజయవాడ అజిత్‌సింగ్ నగర్లో ‘మేమంతా సిద్ధం’ యాత్ర నిర్వహిస్తుండగా పదునైన రాయితో ఆయనపై దాడి చేసిన అనుమానితుడిని గుర్తించినట్టు సమాచారం. అతనితోపాటు మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు సమాచారం. ఈ కేసులో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన ఓ టీడీపీ నాయకుడిని కూడా పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. అజిత్‌సింగ్ నగర్ డాబా కొట్ల జంక్షన్ వద్ద వివేకానంద స్కూల్ ప్రాంగణం నుంచి పదునైన రాయితో సీఎం జగన్‌పై దాడికి పాల్పడినట్టు పోలీసులు ఇప్పటికే నిర్ధారించారు. ఐపీసీ 307 కింద హత్యాయత్నంగా కేసు నమోదు చేసి ఆరు ప్రత్యేక బృందాలతో కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. వీడియో ఫుటేజిలు, కాల్ డేటా, ఇతర శాస్త్రీయ ఆధారాలను అన్ని కోణాల్లో విశ్లేషించారు. అజిత్ సింగ్ నగర్‌తోపాటు ఆ పరిసర ప్రాంతాల్లోని దాదాపు 60 మంది అనుమానితులను విచారించారు. వారిలో నేర చరితులు, అసాంఘిక శక్తులు, ప్రతిపక్ష టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరించే ముఠాల సభ్యులు, వ్యసనపరులైన అసాంఘిక శక్తుల చేతుల్లో కీలు»ొమ్మలుగా మారిన యువత వంటి వారు ఉన్నారు. అనుమానితులను విడివిడిగా విచారించి కీలక సమాచారాన్ని రాబట్టారు. హత్యాయత్నానికి పాల్పడిన రోజుకు (శనివారానికి) రెండు రోజుల ముందు నుంచి వారు ఎక్కడెక్కడ సంచరించారో వివరాలు సేకరించారు. వారు చెప్పిన సమాచారాన్ని కాల్ డేటా, సీసీ కెమెరాల వీడియో ఫుటేజిలతో పోల్చి చూశారు. సీసీ టీవీ ఫుటేజిల ఆధారంగా కొందరు యువకులపై పోలీసులకు సందేహం కలిగింది. వారిని మరింత లోతుగా విచారించి, కీలక సమాచారాన్ని రాబట్టారు. ఆ యువకుల గుంపే హత్యాయత్నానికి పాల్పడినట్టు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. వారిలో ఒకరు ప్రధాన నిందితుడిగా, మిగిలినవారు అతనికి సహకరించినట్లు భావిస్తున్నారు. దీనిపై ఇంకా పోలీసులు పూర్తి నిర్ధారణకు రాలేదు. తొందరపడకుండా పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి ఒకటికి రెండుసార్లు పరిశీలించి తుది నిర్ధారణకు రావాలని భావిస్తున్నారు. కాగా హత్యాయత్నానికి పాల్పడినవారిని గుర్తించడంపై మంగళవారం వివిధ టీవీ చానళ్లు ప్రసారం చేసిన వార్తలను పోలీసులు నిర్ధారించలేదు. అవన్నీ మీడియా ఊహాగానాలేనని చెప్పారు. ఏదైనా విషయాన్ని తాము అధికారికంగా ప్రకటించేంతవరకు నమ్మవద్దని కోరారు. అప్పటివరకు తాము విచారించిన వారందరూ అనుమానితులే తప్ప నిందితులుగా భావించవద్దని చెప్పారు. ఈ కేసును త్వరలోనే ఛేదిస్తామని పోలీసువర్గాలు తెలిపాయి. -
Imran Khan: నన్ను చంపజూసింది ప్రధానే
ఇస్లామాబాద్/లాహోర్: ప్రధాని షెహబాజ్ షరీఫ్ తనను చంపేందుకు కుట్ర పన్నారని పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. ‘‘ఆంతరంగిక శాఖ మంత్రి సనావుల్లా, ఐఎస్ఐ డైరెక్టర్ జనరల్ ఫైసల్ నసీర్తో పాటు మరొకరికి కూడా ఈ కుట్రలో భాగస్వామ్యముంది. వీరి పేర్లతో కూడిన వీడియోను ఇప్పటికే విదేశాలకు పంపించేశాను. నాకు జరగరానిది జరిగితే ఆ వీడియో బయటకు వస్తుంది’ అన్నారు. దుండగుడి కాల్పుల్లో తన కుడి కాలిలోకి నాలుగు బుల్లెట్లు దిగాయని చెప్పారు. చికిత్స పొందుతున్న తన సొంత షౌకత్ ఖానుమ్ ఆస్పత్రి నుంచి శుక్రవారం ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. 2011లో పంజాబ్ గవర్నర్‌ను చంపినట్లుగానే వజీరాబాద్‌లో తనను చంపేందుకు కుట్ర జరుగుతున్న విషయం ముందే తెలుసన్నారు. ‘‘నాపై కాల్పులకు పాల్పడిన వ్యక్తి ఉగ్రవాది కాడు. నాపై దైవదూషణ నేరం మోపారు. అధికార పీఎంఎల్ఎన్ దాన్ని ప్రచారం చేసింది. అంతా పథకం ప్రకారం జరుగుతోంది. దీని వెనుక కుట్రను ఛేదిస్తాం’’ అన్నారు. గాయం నుంచి కోలుకున్నాక పోరాటం కొనసాగిస్తానన్నారు. దేశంలోని అతిపెద్ద రాజకీయ పార్టీ నేతకు కూడా న్యాయం జరగడం లేదని పాక్ ప్రధాన న్యాయమూర్తి ఉమర్ బందియాల్నుద్దేశించి అన్నారు. ఇమ్రాన్ కుడి కాలి ఎముక విరిగిందని వైద్యులు చెప్పారు. ఇమ్రాన్‌పై కాల్పులను నిరసిస్తూ పాకిస్తాన్ తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్(పీటీఐ) శ్రేణులు దేశవ్యాప్తంగా నిరసనలు తెలిపారు. శుక్రవారం ప్రార్థనల అనంతరం పీటీఐ కార్యకర్తలు రావల్పిండి, ఫైజాబాద్‌ల్లో భారీగా రోడ్లపై బైఠాయించారు. పోలీసులతో ఘర్షణలకు దిగారు. లాహోర్‌లో గవర్నర్ హౌస్‌లోకి చొచ్చుకు వెళ్లేందుకు యత్నించారు. ఈ ఘటనపై పోలీసులు, నిఘా అధికారులతో సంయుక్త విచారణ బృందాన్ని ఏర్పాటు చేయాలని పాక్ ప్రభుత్వం పంజాబ్‌ను కోరింది. ఇమ్రాన్ మాత్రమే చంపేందుకు కాల్పులు జరిపినట్లు నిందితుడు చెబుతున్నట్లుగా ఉన్న వీడియో లీక్‌కు కారకులైన పలువురు పోలీసులను అధికారులు సస్పెండ్ చేశారు. వారి సెల్ఫోన్లను సీజ్ చేసి ఫోరెన్సిక్ పరీక్షకు పంపారు. వజీరాబాద్ పట్టణంలో గురువారం పాకిస్తాన్ తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ ర్యాలీలో దుండగుల తుపాకీ కాల్పుల్లో ఒకరు చనిపోగా ఇమ్రాన్ సహా పలువురు గాయపడిన విషయం తెలిసిందే. -
పెళ్లికి నిరాకరించిందని వివాహితపై హత్యాయత్నం
శంషాబాద్ రూరల్: తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తోందన్న కోపంతో వివాహితపై పెట్రోలు పోసి నిప్పంటించాడో వ్యక్తి. ఆ తరువాత తాను కూడా ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తొండుపల్లిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. శంషాబాద్ మున్సిపాలిటి పరిధిలోని కిషన్‌గూడ వాసి బంటారం మహేశ్‌గౌడ్, మండలంలోని గండిగూడకు చెందిన సంధ్య(29) వివాహం 2012లో జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. తొండుపల్లిలో నివాసముంటున్నారు. మూడేళ్ల క్రితం దంపతుల మధ్య గొడవలు జరగడంతో పిల్లలతో కలిసి సంధ్య గండిగూడలోని పుట్టింటికి వెళ్లింది. ఈ సమయంలో వీరింటి పక్కన నివాసముండే మహ్మద్ అల్తాఫ్తో పరిచయం ఏర్పడి ఇద్దరి మధ్య ప్రేమకు దారితీసింది. కొంత కాలం తర్వాత సంధ్య భర్త వద్దకు వెళ్లిపోయింది. పెళ్లి చేసుకోవాలని వేధింపులు.. ఈ క్రమంలో తొండుపల్లిలో ఉంటున్న సంధ్యకు తరచూ అల్తాఫ్ ఫోన్ చేస్తూ వేదిస్తున్నాడు. తనతో రావాలని, పెళ్లి చేసుకోవాలని లేదంటే చంపేస్తానని బెదిరిస్తున్నాడు. ఇటీవలే ఈ విషయాన్ని సంధ్య తన భర్తకు తెలిపింది. సంధ్య తన మాట వినడంలేదని కక్షగట్టిన అల్తాఫ్ ఆమెను ఎలాగైనా అంతం చేయాలని భావించాడు. ఇందుకోసం పథకం ప్రకారం.. శుక్రవారం మధ్యాహ్నం సంధ్య భర్త మహేశ్‌కు అల్తాఫ్ ఫోన్ చేశాడు. తాను తొండుపల్లి వద్ద వైన్‌షాపు దగ్గర ఉన్నానని, మాట్లాడుకుందాం.. అక్కడకు రావాలని చెప్పాడు. దీంతో మహేష్ ఇంటి నుంచి వైన్‌షాపు వద్దకు వెళ్లాడు. దీంతో సంధ్య ఇంట్లో ఒక్కతే ఉందని గుర్తించి అక్కడకు వెళ్లిన అల్తాఫ్.. తన వెంట బాటిల్లో తెచ్చుకున్న పెట్రోలును సంధ్యపై పోసి నిప్పటించాడు. దీంతో పాటు తాను కూడా పెట్రోలు పోసుకుని నిప్పటించుకున్నాడు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. తీవ్రగాయాలైన సంధ్యను చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అల్తాఫ్‌కు స్వల్పగాయాలవడంతో ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడుపై నేర చరిత్ర.. వివాహితపై పెట్రోలు పోసి నిప్పటించిన అల్తాఫ్‌కు గతంలో కూడా నేర చరిత్ర ఉంది. మహబూబ్‌నగర్ జిల్లా ప్రాంతానికి చెందిన వీరి కుటుంబం కొన్నేళ్ల కిందట వలస వచ్చి గండిగూడలో స్థిరపడ్డారు. సుమారు 8 ఏళ్ల కిందట అల్తాఫ్ తండ్రి హత్యకు గురయ్యాడు. ఈ కేసులో అల్తాఫ్, తన అన్నతో కలిసి జైలుకు వెళ్లి వచ్చాడు. తర్వాత అల్తాఫ్ కుటుంబ గండిగూడ నుంచి ఘాంసిమియాగూడకు మకాం మార్చింది. చదవండి: ఘోర ప్రమాదం.. 11 మంది సజీవదహనం -
జీవన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసులో మరో నలుగురి అరెస్టు
బంజారాహిల్స్ (హైదరాబాద్): ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసులో మరో నలుగురు నిందితులను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. ఆర్మూర్ నియోజక వర్గం కల్లెడ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ లావణ్యగౌడ్ భర్త ప్రసాద్ గౌడ్ ఈ నెల 1వ తేదీన రాత్రి 8.30 గంటల ప్రాంతంలో బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని వేమిరెడ్డి ఎన్‌క్లేవ్‌లో నివసించే ఆర్మూర్ ఎమ్మెల్యే ఎ.జీవన్‌రెడ్డి ఇంట్లోకి ప్రవేశించి కత్తి, గన్ చూపించి బెదరించడమే కాకుండా హత్యాయత్నానికి పాల్పడ్డాడు. నిందితుడిని విచారించగా హత్యకు ఉసిగొలిపిన వారి సమాచారం వెల్లడైంది. కేసులో ఏ2గా ఉన్న ప్రసాద్‌గౌడ్ భార్య లావణ్యతో పాటు ఏ4గా ఉన్న సంగరత్న పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. కొండా సంతోష్‌గౌడ్ (46), బొంత సుగుణ (40), సురేందర్ (56), దయాసాగర్(36)లను బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సస్పెన్షన్‌కు గురైన లావణ్యగౌడ్‌ను తిరిగి సర్పంచ్‌గా నియమించాలంటూ ప్రసాద్‌గౌడ్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి చుట్టూ తిరుగుతున్నాడు. స్పందన లేకపోవడంతో ఆయన అంతుచూసేందుకు ప్రణాళిక వేసి దొరికిపోయాడు. ఈ ఘటనలో ఇంకా పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు. -
‘నాలుగు సార్లు హత్యాయత్నం.. రక్షణ కల్పించండి సారు’
సాక్షి,హైదరాబాద్: తనపై నాలుగు పర్యాయాలు హత్యాయత్నం జరిగిందని.. తనకు రక్షణ కల్పించాలని కింగ్‌కోఠి వాసి అలీబాగ్దాదీ కోరారు. శుక్రవారం కింగ్‌కోఠి తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. సంవత్సరకాలంలో నాలుగు సార్లు తనను హతమార్చేందుకు కొందరు దాడి చేశారన్నారు. ఈ విషయాలపై నారాయణగూడ పోలీస్ స్టేషన్లో చేసిన ఫిర్యాదు చేశానని.. కేసులు కూడా నమోదయ్యాయన్నారు. ఇప్పటి వరకు ఎవరినీ పట్టుకోనందున మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం అర్ధరాత్రి కింగ్ కోఠిలోని ఎస్బీఐ వద్ద బైక్‌పై వెళ్తున్న నలుగురు తనపై రాడ్లతో దాడి చేశారన్నారు. మోకాలు, చేతికి గాయాలు అయ్యాయన్నారు. పోలీసులు తనకు రక్షణ కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై నారాయణగూడ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ భూపతి గట్టుమల్లు మాట్లాడుతూ.. బాధితుడి ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. దాడులు జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నామన్నారు. -
త్రిపుర సీఎంపై హత్యాయత్నం
అగర్తలా: త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ కుమార్ దేబ్‌పై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనలో ఆయన త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి వాకింగ్‌కు వెళ్లినప్పడు ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు కారుతో ఆయనని ఢీకొట్టడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. కాస్త ఆలస్యంగా ఆ ఘటన వివరాలను పోలీసులు శనివారం వెల్లడించారు. హత్యాయత్నానికి ప్రయత్నించిన ముగ్గురిని అదుపులోనికి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం బిప్లవ్ కుమార్ తన అధికారిక నివాసమైన శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ లేన్‌కి సమీపంలో గురువారం ఈవెనింగ్ వాక్‌కి వెళ్లారు. ఆయన చుట్టూ భద్రతా వలయం ఉన్నప్పటికీ వారి మీదుగా హఠాత్తుగా ఒక కారు దూసుకువచ్చింది. కారు రావడాన్ని గమనించిన బిప్లవ్ పక్కకి జరగడంతో పెను ముప్పు తప్పింది. అయితే ఆయన భద్రతా సిబ్బందిలో ఒకరికి గాయాలయ్యాయి. ఆ కారుని పట్టుకోవడానికి సీఎం భద్రతా సిబ్బంది విఫలయత్నం చేశారు. ఆ తర్వాత పోలీసులు గురువారం అర్ధరాత్రి కారుని, అందులో ఉన్న ముగ్గుర్ని అదుపులోనికి తీసుకున్నారు. వారి వయసు సుమారుగా 20 ఏళ్లు ఉంటుంది. వారు ఎందుకు ఈ హత్యాయత్నానికి పాల్పడ్డారో కారణాలు ఇంకా తెలియలేదు. కోర్టు ఎదుట వారిని హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. -
టపాసులతో హత్యాయత్నం.. ఏడ్చేసిన మంత్రి
చెన్నె: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలు హాట్‌హాట్‌గా మారాయి. ప్రధాన పార్టీలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. అయితే ఈ ప్రచార సమయంలో తమ ప్రత్యర్థులు తనను చంపేసేందుకు కుట్ర పన్నారని ఓ మంత్రి ఏడ్చేశారు. తనను ఒంటిరిని చేసి పటాకులు పేల్చి చంపేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఈ ఘటన తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఐటీ శాఖ మంత్రి కదంపూర్ రాజు ఎన్నికల ప్రచారంలో భాగంగా కోవిల్పట్టిలో ఆదివారం పర్యటించారు. ప్రచారం చేస్తుండగా ప్రత్యర్థి పార్టీ వారు కూడా ప్రచారానికి వచ్చారు. ఈ సమయంలో వివాదం ఎందుకు అని చడీచప్పుడు లేకుండా వెళ్తుంటే పటాకులు పెద్ద ఎత్తున పేల్చి వాటిని తన కాన్వాయ్‌పై వదిలారని మంత్రి రాజు ఆరోపించారు. అమ్మ మక్కల్ మున్నేట్ర కజగమ్ (ఏఎంఎంకే) పార్టీ నాయకులు తమ కార్లతో అడ్డగించి అనంతరం 5 వేల పటాకుల లడీ పేల్చారని చెప్పారు. మంటలు తనకు సమీపంలో వచ్చాయని వాపోయారు. కొద్దిలో నా ప్రాణం పోయేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అన్నాడీఎంకే జాతీయ కార్యదర్శి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. అయితే కోవైల్పట్టి నియోజకవర్గంలో శశికళ మేనల్లుడు, ఏఎంఎంకే పార్టీ అధినేత టీటీవీ దినకరన్ పోటీ చేస్తున్నారు. అందుకే ఇక్కడ ఏఎంఎంకే పార్టీ నాయకులు ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రిపై దాడి చేశారని ప్రచారం సాగుతోంది. ఈ ఘటనపై అన్నాడీఎంకే, ఏఎంఎంకే పార్టీల మధ్య వివాదం ఏర్పడింది. 234 స్థానాలు ఉన్న తమిళనాడు అసెంబ్లీకి ఒకేదశలో ఏప్రిల్ 6వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. వీటి ఫలితాలు మే 2వ తేదీన వెలువడనున్నాయి. -
భర్తపై హత్యాయత్నం కేసులో వీడిన ట్విస్ట్
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఓ వ్యక్తిపై తుపాకితో కాల్పులు జరిపిన సంఘటన స్థానికంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే నిందితులు ఈ కేసులో పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. చివరకు పోలీసులు ఈ కేసును చేధించగా విస్తుపోయే విషయాలు వెలుగు చుశాయి. వివాహేతర సంబంధమే ఈ ఘటనకు కారణమని పోలీసులు వెల్లడించారు. పోలీసుల సమాచారం ప్రకారం.. భీమ్రాజ్(45) అనే వ్యక్తి చిరాగ్ ఢిల్లీలో భార్య భాటియా(41)తో కలిసి నివసిస్తున్నాడు. భీమ్రాజ్ బీఎస్ఈఎస్లో పవర్ కాంట్రాక్ట్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అతడి భార్య భాటియాకు 23 ఏళ్ల రోహన్‌తో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. వీరిద్దరి విషయం తెలుసుకున్న భీమ్రాజ్ పలుమార్లు భార్యను మందలించాడు. అయినా ఆమె మారలేదు. ఈ విషయాన్ని ప్రియుడు రోహన్‌తో చెప్పి భర్త అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. దీంతో రోహన్ తనకున్న పలుకుబడిని ఉపయోగించుకుని ఓ దేశీయ తుపాకి కొని, బైకు నెంబర్‌ను మార్చాడు. బుధవారం భీమ్ రాజ్ కారులో వెళ్తుండగా బైక్‌పై వెంబడించి భీమ్రాజ్పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ భీమ్రాజ్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా సంఘటనకు సంబంధించిన దృశ్యం కాస్తా సీసీ కెమెరాల్లో రికార్డయింది. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా పోలీసుల ఆ బైక్‌ను కనుగొనె ప్రయత్నం చేశారు. అయితే నంబర్ ప్లెట్ మార్చడంతో పోలీసు బైక్ ఎవరిదో, నిందితుడు ఎవరో తెలుసుకోవడం కష్టంగా మారింది. దీంతో ఈకేసును ఢిల్లీ పోలీసులు సవాలుగా తీసుకుని దర్యాప్తు చేపట్టారు. చివరికి సాంకేతిక ఆధారాలతో నిందితుడు రోహన్‌ను బుధవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. రోహన్ విచారించగా కొద్ది రోజుల కిందట జరిగిన ఓ చిన్న యాక్సిడెంట్లో తనకు, భీమ్ రాజ్‌కు మధ్య గొడవ జరిగిందని, అందుకే అతడిని చంపాలనుకున్నాను అంటూ ఓ కథ అల్లి ప్రియురాలిని తప్పించే ప్రయత్నం చేశాడు. అయితే ఈ విషయంలో పోలీసులకు అనుమానం రావడంతో తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది. తనకు, భాటియాకు మధ్య వివాహేతర సంబంధం ఉందని, ఆమె తన భర్త అడ్డు తొలగించాలని కోరడంతో ఈ దారుణానికి పాల్పడినట్టు స్పష్టం చేశాడు. దీంతో ఆమెను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆసుపత్రిలో భీమ్ రాజ్ చికిత్స తీసుకుంటున్నాడు. అతడి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు. -
నాచారం దోపిడి, అత్యాయత్నం కేసు ముఠా అరెస్టు
సాక్షి, హైదరాబాద్: వృద్దురాలికి మత్తు మందు ఇచ్చి దోపిడికి పాల్పడిన ముఠాను రాచకొండ సీపీ మహేష్ భగవత్ అరెస్టు చేశారు. నేపాలీ గ్యాంగ్ ఈ దోపిడీకి పాల్పడినట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా సీపీ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 19న నాచారం పోలీసుల స్టేషన్ పరిధిలో దోపిడీ, అత్యాయత్నం కేసు నమోదైనట్లు చెప్పారు. నేపాలీ గ్యాంగ్ ఇంట్లో మొదట పనిమనుషులుగా చేరి అదును చూసి దోపిడీకి పాల్పడినట్లు చెప్పారు. ఈ ముఠాను పట్టుకునేందుకు 25 పోలీసు బృందాలతో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ పంపి అరెస్టు చేశామన్నారు అయితే ఈ ముఠాలో మొత్తం 8 మంది ఉన్నారన్నారు. గ్యాంగ్‌లోని అయిదుగురు వ్యక్తులను అరెస్టు చేసి వారి నుంచి లక్ష తొంబై వేల నగదు, 9 తులాల బంగారం, గోల్డ్ లాకెట్, గోల్డ్ హారం, నిద్ర మాత్రలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. నాచారంలో ప్రదీప్ ఇంట్లో మొదట మాయ, అర్జున్‌లు ఇద్దరూ భార్య భర్తలు అని చెప్పి ఇంట్లో పని మనుషులుగా చేరారని, ఈ నేపథ్యంలో 15 రోజులు పాటు ఇంట్లో పనులు కూడా చేశారన్నారు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఒంటరిగా ఉన్న వృద్దురాలికి మత్తు మందు ఇచ్చి ఇంట్లో ఉన్న 10 లక్షల నగదుతో పాటు 9 తులాల బంగారు నగలు దొంగలించారన్నారు. అయితే ప్రదీప్ తన స్నేహితుడు పురుషోత్తంతో నేపాలీకి చెందిన వారే తన ఇంట్లో పని మనుషులుగా కావాలని చెప్పడంతో పురుషోత్తం డ్రైవర్ రాజు సహాయంతో మాయ, అర్జున్‌లను ప్రదీప్ ఇంట్లో పనిమనుషులుగా చేర్పించారని వెల్లడైందన్నారు. వారితో పాటు మరో ఇద్దరూ ఇక్కడికి వచ్చారని మొత్తం 8 మంది ఈ గ్యాంగ్‌లో ఉన్నట్లు చెప్పారు. ఇప్పటికే ముఠాకు చెందిన అయిదుగురిని అరెస్టు చేశామని, ప్రస్తుతం పరారీలో ఉన్న మిగతా ముగ్గురి కోసం గాలిస్తున్నట్లు సీపీ పేర్కొన్నారు. -
దారుణం: కర్రలతో కొట్టి.. బండరాయితో మోది!
సాక్షి, మునుగోడు(నల్గొండ) : ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని ఓ యువతిపై తల్లిదండ్రులతో పాటు సోదరుడు హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మండల పరిధిలోని ఎల్గలగూడెంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తిరిపారి బుచ్చయ్య లక్ష్మమ్మ దంపతులకు నలుగురు కుమారైలు, కుమారుడు సంతానం. అయితే ముగ్గురు కుమార్తెలతోపాటు కుమారుడి వివాహాలు చేశారు. చిన్న కుమారై కవిత రెండేళ్ల క్రితం ఎంఎస్సీ కెమిస్ట్రీ విద్యను పూర్తి చేసుకుంది. ప్రభుత్వ ఉద్యోగం ఉన్న వ్యక్తికి ఇచ్చి వివాహం చేయాలని, లేదంటే ప్రధాన రహదారి వెంట ఉన్న భూమిని తన పేర పట్టా చేయాలని ఏడాది కాలంగా తల్లితండ్రులను ఒత్తిడి చేస్తోంది. అయినా ఆ కుటుంబ సభ్యులు తమకేమి పట్టనట్లు వ్యవహరించడంతో పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు పలుమార్లు కుటుంబ సభ్యులకు కౌన్సింగ్ ఇచ్చారు. దీంతో కవితను మట్టుబెట్టాలని తల్లిదండ్రులతో పాటు సోదరుడు గోవర్ధన్ నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం తెల్లవారు జామున 3 గంటల సమయంలో కవిత గాఢ నిద్రలో ఉండగా కర్రలతో దాడి చేసి బండరాయితో బలంగా మోదారు. దీంతో కవిత చనిపోయిందని భావించి ఇంటి పక్కనే ఉన్న బాట ముళ్ల పొదలల్లో పడేశారు. దానిని గమనించిన పక్కంటి వారు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తీవ్రంగా గాయపడిన కవితను న ల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కవిత పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. కాగా నిందితులు పరారీలో ఉన్నారని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ రజినీకర్ తెలిపారు. -
లెక్చరర్‌కు నిప్పంటించాడు!
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. 25 ఏళ్ల యువతిపై ఒక దుండగుడు పెట్రోలు పోసి నిప్పంటించిన ఘటన సోమవారం వార్ధా జిల్లాలోని హింగణ్ఘాట్లో జరిగింది. కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్న అంకితని వివాహితుడైన వికేశ్ నగ్రాలె గత కొన్నాళ్లుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. కాలేజీకి బయల్దేరిన యువతిని సోమవారం ఉదయం నందోరి చౌక్ వద్ద అడ్డగించిన వికేశ్.. అకస్మాత్తుగా ఆమె తలపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. 40శాతం కాలిన గాయాలైన బాధితురాలిని స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు. నాగ్‌పూర్‌లో ఆస్పత్రిలో ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్‌చేశారు. మంటల్లో చిక్కుకుని ఆర్తనాదాలు చేస్తున్న ఆ యువతిని వెంటనే రక్షించకపోవడంపై, పైగా.. కొందరు ఈ ఘటనను తమ సెల్ఫోన్లలో చిత్రీకరించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాధితురాలికి సత్వరమే న్యాయం జరిగేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరుపుతామని హోంమంత్రి అనిల్ ప్రకటించారు. బాధితురాలు, నిందితుడు వికేశ్ ఇద్దరూ ఒకే గ్రామానికి చెందినవారు. రెండేళ్ల క్రితం వరకూ ఇద్దరూ స్నేహితులేనని, వేధింపుల వల్ల ఇప్పుడు ఆమె స్నేహంచేయట్లేదని ఇన్స్పెక్టర్ సత్యవీర్ తెలిపారు. వికేశ్కు 9 నెలల బాబు ఉన్నాడన్నారు. వికేశ్ కారణంగా గత సంవత్సరం ఆమె వివాహం విచ్ఛిన్నమైందని బాధితురాలి సోదరుడు శుభమ్ తెలిపారు. -
ముఖం, శరీరంపై 101 కత్తి గాట్లు.. ఆపై..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. భూత వైద్యంలో భాగంగా రేణు అనే మహిళను ఆమె కుటుంబ సభ్యులే పాశవికంగా హింసించిన ఘటన బరేలీ జిల్లాలో జరిగింది. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు ఓ మహిళను గురువారం బరదార్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన గురించి ఎస్సై నరేష్ త్యాగీ మాట్లాడుతూ.. ‘ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ గ్రామానికి చెందిన రేణుకు ఎనిమిదేళ్ల క్రితం సంజయ్‌తో వివాహం జరిగింది. గత కొద్ది రోజులుగా సంజయ్ తండ్రి జగదీష్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో బాధితురాలి వదిన మోనీ(సంజయ్ సోదరి) తన తండ్రి అనారోగ్యాన్ని నయం చేయడానికి భూతవైద్యాన్ని నేర్చుకుంది. రేణుపై తన విద్యను ప్రదర్శించబోయింది. ఈ క్రమంలో రేణు ముఖం, ఇతర శరీర భాగాలపై మోనీ దాదాపు101 కత్తి గాట్లు పెట్టింది’ అని ఎస్సై పేర్కొన్నారు. కాగా ఈ ఘటనలో నిందితురాలు మోనీకి ఆమె భర్త, సోదరుడు సంజయ్‌లు కూడా సహకరించినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు వారి నుంచి తప్పించుకుని పరుగెత్తే క్రమంలో ఆమె రోడ్డుపై స్పృహ\ కోల్పోయిందని.. ఆ సమయంలో పెట్రోలింగ్‌లో ఉన్న పోలీసులు రేణును గుర్తించి హుటాహుటిన ఆసుపత్రిలో చేర్పించినట్లు చెప్పారు. రేణు పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూకి తరలించారని.. రేణు సోదరుడి ఫిర్యాదు మేరకు నిందితులపై ఐపీసీ సెక్షన్ 307(హత్యాయత్నం) కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కాగా రెండు రోజుల తర్వాత మెలకువలోకి వచ్చిన రేణు ఫిర్యాదు మేరకు ఈ కేసుపై విచారణ జరిపి.. మోనీని అరెస్టు చేయగా.. ఆమె భర్త, సోదరుడు పరారీలో ఉన్నట్లు ఎస్సై నరేష్ మీడియాకు తెలిపారు. -
నమ్మించి తీసుకెళ్లి.. నరికాడు..
సాక్షి, పెండ్లిమర్రి: తల్లిదండ్రులతో గొడవ పడుతున్న తనను బాబాయి మందలించడాన్ని జీర్ణించుకోలే ని ఓ యువకుడు బాబాయి కుమారుడిపై ప్రతీకారం తీర్చుకున్నాడు. నమ్మించి ద్విచక్రవాహనంపై తీసుకెళ్లి నరికి పారిపోయాడు. పెండ్లిమర్రి మండలం కొత్తగంగిరెడ్డిపల్లె సమీపంలో జరిగిన ఈ సంఘటన వివరాలు పోలీసుల కథనం మేరకు ఇలా ఉన్నాయి. వల్లూరు మండలం గోసులవారిపల్లె గ్రామానికి చెందిన నరసింహారెడ్డి కుమారుడు భాస్కర్‌రెడ్డి(30) బీటెక్ పూర్తి చేసి ఉద్యోగం కోసం బెంగళూరులో ఉంటున్నాడు. ఇతను సోమవారం రాత్రి ఇంటికి వచ్చాడు. డబ్బుల విషయంలో ఇంటి వద్ద రాత్రి తల్లిదండ్రులతో గొడవ పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న బాబాయి రామసుబ్బారెడ్డి మంగళవారం ఉదయం భాస్కర్‌రెడ్డిని మందలించాడు. అది మనసులో పెట్టుకొని బాబాయి కుమారుడిపై కక్ష తీర్చుకోవాలని భావించాడు. పెండ్లిమర్రి మండలం వెల్లటూరులోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న నందకిశోర్‌రెడ్డి వద్దకు వెళ్లి బంధువుల ఇంటికి వెళ్దాం పద అంటూ ద్విచక్రవాహనంలో ఎక్కించుకుని వచ్చాడు. కొత్తగంగిరెడ్డిపల్లె గ్రామ సమీపంలో నందకిషోర్‌రెడ్డిని రోడ్డుపై పడుకోబెట్టి వెంట తెచ్చుకున్న కొడవలితో మెడపై నరికాడు. బాలుడు స్పృహ తప్పి పడిపోవడంతో చనిపోయాడని భావించి బాబాయికి ఫోన్ చేసి మీ కొడుకును కొత్తగంగిరెడ్డిపల్లె వద్ద చంపానని చెప్పి పారిపోయాడు. రామసుబ్బారెడి సంఘటన స్థలానికి వచ్చే సరికి కుమారుడు రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఆర్.వి.కొండారెడ్డి తెలిపారు. -
శ్రీశైలం పీఆర్వో పై హత్యాయత్నం
-
బ్యూటిషియన్‌పై దారుణం : కాళ్లు, చేతులు కట్టేసి...
సాక్షి, విజయవాడ : కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లో దారుణం చోటు చేసుకుంది. ఓ బ్యూటిషియన్‌పై అత్యంత దారుణంగా హత్యాయత్నం జరిగింది. కాళ్లు, చేతులు కట్టేసి ఆమెపై కత్తితో దాడికి పాల్పడ్డారు దుండగులు. బాధితురాలిని పిల్లి పద్మగా పోలీసులు గుర్తించారు. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ పద్మ, రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ ఉంటే స్థానికులకు గమనించి ఆమెను ఏలూరు ఆసుపత్రికి తరలించారు. వివాహేతర సంబంధమే కారణమా? బ్యూటిషియన్ పద్మ గత కొంత కాలంగా భర్తకు దూరంగా ఉంటూ.. నూతన్‌కుమార్ అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ప్రస్తుతం ఆమె బాపుల పాడులో నివాసముంటోంది. ఆమెపై హత్యాయత్నానికి వివాహేతర సంబంధమే కారణమని ఇటు బంధువులు, అటు పోలీసులు అనుమానిస్తున్నారు. -
జామకాయల సాకుతో...
నేరేడ్మెట్: జామ కాయలు కోసుకుంటామని చెప్పి ఓ ఇంట్లోకి ప్రవేశించి మహిళపై హత్యాయత్నం, దోపిడీకి పాల్పడిన బాలనేరస్తుడితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం నేరేడ్మెట్లోని తన కార్యాలయంలో మల్కాజిగిరి డీసీపీ ఉమామహేశ్వర శర్మ వివరాలు వెల్లడించారు. చత్తీష్‌గడ్‌కు చెందిన కమలేష్‌వర్మ, ఉషావర్మ(28) దంపతులు జవహర్‌నగర్ ఠాణా, అరుంధతి నగర్లో నివాసం ఉంటున్నారు. కమలేష్‌వర్మ కాంట్రాక్టర్‌గా పని చేసేవాడు. వారి ఇంటి ఎదురుగా ప్రైవేట్ ఉద్యో గం చేస్తున్న కొత్త రాహుల్ అలియాస్ నాని(19) కుటుంబం నివాసం ఉంటోంది. ఈనెల 4న రాహుల్ తన సోదరుడు (బాలనేరస్తుడు)తో కలిసి పథకం ప్రకారం కమలేష్‌వర్మ ప్రహరీ దూకి పెరట్లోకి ప్రవేశించారు. ఇంట్లో నుంచి బయటికి వచ్చిన కమలేష్ భార్య ఉషావర్మ వారిని ఎందుకు వచ్చారని ప్రశ్నించగా జామ కాయలు కోసుకునేందుకు వచ్చినట్లు తెలిపారు. అనంతరం ఆమెను మాటల్లో పెట్టి ఇల్లు చూస్తా మని ఆమెతో పాటు లోపలికి వెళ్లారు. పథకం ప్రకారం తమ్ముడు ఇంటి మెయిన్ డోర్ మూసి వేయగా రాహులు ఉషావర్మ జుట్టుపట్టుకుని తలను గోడ కేసి బాదడంతో తీవ్రంగా గాయపడిన ఆమె కుప్పకూలింది. అనంతరం ఆమె ఒంటిపైన ఉన్న బంగారు పుస్తెల తాడు, చెవి కమ్మలు, వెండి పట్టాలు తీసుకున్నారు. ఇంట్లోని తాడుతో ఆమె కాళ్లు, మెడకు బిగించి కప్ బోర్డులోని కత్తితో ఆమె గొంతు కోశారు. ఆమె మృతి చెందినట్లు భావించి వారు అక్కడినుంచి పరారయ్యారు. కొద్దిసేపటికి స్పృహాలోకి వచ్చిన ఉషావర్మ భర్తకు ఫోన్ చేసింది. భర్త తన స్నేహితులకు సమాచారం అందించడంతో వారు బాధితురాలిని ఆసుపత్రిలో చేర్పించారు. తమ ఎదురింట్లో ఉంటున్న రాహుల్, అతని సోదరుడు తనపై హత్యాయత్నం చేసి, నగలు ఎత్తుకెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. డీసీపీ పర్యవేక్షణలో కేసు దర్యాప్తు చేపట్టిన ఏసీపీ రషీద్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ నవీన్, సీఐ సైదులు చోరీసొత్తును రాహు ల్ తనకు వరుసకు సోదరుడు, అమెజాన్‌లో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్న పవన్ కళ్యాణ్ వద్ద దాచినట్లు గుర్తించారు. పవన్ కూడా గతంలో ఓ కేసులో జైలుకు వెళ్లి వచ్చినట్లు డీసీపీ తెలిపారు. సోమవారం బాలాజీ నగర్లో రాహుల్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. అతను ఇచ్చిన సమాచారం ఆధారంగా మిగతా ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, చోరీ సొ త్తుతో పాటు బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు. రెండు రోజుల్లోనే కేసును ఛేదించిన ఏసీపీ, డీఐ, సీఐలను ఆయన అభినందించారు. -
కన్నతల్లిపై కుమారుడి హత్యాయత్నం
కరీంనగర్ : చొప్పదండి మండలం రాగంపేట గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి కోసం కన్న తల్లినే హతమార్చబోయాడో ఓ కుమారుడు. రాగంపేట గ్రామానికి చెందిన సత్తమ్మ(50)కు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు రాజిరెడ్డి(30) ఉన్నారు. కూతుళ్లకు పెళ్లిళ్లు చేసి వరకట్నం కింద కొంత భూమిని వారికి ఇచ్చింది. ఆ భూమి విషయంలో కుమారుడు రాజిరెడ్డి, తల్లి సత్తమ్మతో కొంతకాలంగా గొడవపడుతున్నాడు. ఇదే విషయమై శుక్రవారం తల్లితో గొడవపడి కొబ్బరి బోండాల కత్తితో స్వంత మామిడితోటలోనే హత్యాయత్నం చేశాడు. స్థానికులు అడ్డుకోవడంతో సత్తమ్మ ప్రాణాలతో బయటపడింది. ఘటన అనంతరం రాజిరెడ్డి పరారయ్యాడు. సత్తమ్మను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మహిళకు జైలు శిక్ష
వెలుగోడు: న్యాయవాదిపై హత్యాయత్నానికి పాల్పడిన పట్టణానికి చెందిన కతీఫ్‌మీరున్నిసాబీకి జైలుశిక్ష విధించారు. ఎస్ఐ ప్రవీన్‌కుమార్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు ఇలా ఉన్నాయి. పట్టణానికి చెందిన కతీఫ్‌ఇలియాస్, కతిఫ్‌మీరున్నిసాబీ దంపతుల మధ్య కుటుంబ కలహాలు ఉండటంతో భర్త న్యాయవాది సిద్దిఖ్‌అహ్మద్‌ను ఆశ్రయించారు. దీంతో తనకు అన్యాయం జరుగుతుందని భావించిన మీరున్నిసాబీ 22–07–2016న ఉదయం న్యాయవాదిపై కిరోసిన్ పోసి నిప్పంటించే ప్రయత్నం చేశారు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు అప్పట్లో కేసు నమోదు చేసి ఎస్ఐ దర్యాప్తు చేపట్టగా ఈ కేసును విచారించి ఆత్మకూరు కోర్టు మెజిస్ట్రేట్ చినబాబు ఐదేళ్ల జైలుశిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ తీర్పువెల్లడించారు. ఈ కేసును పబ్లిక్ ప్రాసిక్యూటర్ నూర్‌అహమ్మద్ వాదించారు. -
డాక్యుమెంట్ రైటర్‌పై హత్యాయత్నం
సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఘటన పరుగులు తీసిన జనం లొంగిపోయిన నిందితుడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో భూములు, స్థల క్రయ, విక్రయదారులు, అధికారులు, సిబ్బంది అందరూ చూస్తుండగానే డాక్యుమెంట్ రైటర్‌పై ఓ వ్యక్తి మారణాయుధంతో హత్యాయత్నం చేశాడు.ఈ హఠాత్పరిణామంతో అక్కడున్న వారంతా ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ సంఘటన మడకశిరలో సంచలనం రేపింది. మడకశిరకు చెందిన అతావుల్లా (52) కొన్నేళ్లుగా డాక్యుమెంట్ రైటర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం ఉదయం 11 గంటల సమయంలో సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఉన్న ఇతనిపై బసవరాజు అనే వ్యక్తి పదునైన కొడవలితో తలపై దాడి చేశాడు. అక్కడున్న కొంతమంది అడ్డుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. గాయపడిన అతావుల్లాను సమీపంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హిందూపురం తరలించారు. ప్రస్తుతం బాధితుడు కోలుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. భూముల డాక్యుమెంట్ తయారు చేసే విషయంలో తనకు అనుకూలంగా వ్యవహరించకపోవడంతోనే నిందితుడు దాడి చేసినట్లు చెప్పారు. లొంగిపోయిన నిందితుడు హత్యాయత్నం చేసిన తర్వాత నిందితుడు బసవరాజు పోలీస్‌స్టేçÙన్లో లొంగిపోయాడు. తనకు డాక్యుమెంట్ రైటర్ అన్యాయం చేయడంతోనే దాడి చేసినట్లు పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. నిందితుడిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఆస్పత్రి వద్ద గుమిగూడిన జనం డాక్యుమెంట్ రైటర్‌పై హత్యాయత్నం జరిగినట్లు సమాచారం అందుకున్న వందలాది మంది ప్రజలు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. సంఘటనపై ఆరా తీశారు. ఎమ్మెల్సీ గుండుమలతిప్పేస్వామి ఆస్పత్రికి వచ్చి బాధితుడిని పరామర్శించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి వైసీ గోవర్ధన్‌రెడ్డి, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ లక్ష్మీనరసింహారెడ్డి, గుడిబండ జెడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాసమూర్తి తదితర ప్రముఖులు కూడా అతావుల్లాను పరామర్శించారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితి గురించి మెడికల్ ఆఫీసర్ మంజువాణి, డాక్టర్ బాబాబుడేన్ ఎమ్మెల్సీకి వివరించారు. -
కర్కశం..
♦ చిన్నారి ఒంటినిండా సిగరెట్ వాతలు ♦ తల్లిదండ్రుల ముసుగులో ఘోరం ♦ అడ్డుగా ఉందని హత్యకు యత్నం ♦ పోలీసులను తప్పుదారి పట్టించిన వైనం ♦ బొల్లారం ఘటనపై ‘సాక్షి’ విచారణ ♦ వెలుగు చూసిన కొత్త కోణం సాక్షి ప్రతినిధి,సంగారెడ్డి : చెప్పిన మాట వినటం లేదనే నెపంతో నాలుగేళ్ల చిన్నారిపై తల్లిదండ్రులు అతి కర్కశంగా దాడి చేసిన ఘటనలో కొత్త కోణం వెలుగు చూసింది. జిన్నారం మండలం పోచమ్మ బస్తీలో చోటుచేసుకున్న ఈఘటనపై ‘సాక్షి’ సమాంతర పరిశోధనలో వెలుగుచూసిన అంశాలు ఇలా ఉన్నాయి. ముద్దులొలికే చిట్టితల్లి ఒంటి నిండా సిగరెట్‌తో వాతలు పెట్టి, మొఖం చిట్లిపోయేటట్టు కొట్టిన దుర్మార్గపు తల్లిదండ్రుల్లో... పాప తండ్రిగా చెప్తున్న చక్రవర్తి సొంత తండ్రి కాదని తేలింది. గుంటూరు పట్ణణానికి చెందిన రాధిక అలియాస్ రజియా సుల్తాన్ (పాప తల్లి) ఆరు నెలల కిందటే భర్తను వదిలేసి చక్రవర్తితో రహస్యంగా వచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ మేరకు తన భార్య రజియా సుల్తానా, కూతురు తప్పిపోయిందని ఆమె భర్త హబీబ్ గుంటూరు ఎస్పీ గ్రీవెన్స్‌సెల్‌కు ఫిర్యాదు చేశారు. పసిబిడ్డను దారుణంగా హింసించిన తీరు చూస్తే... వీళ్లు సొంత తల్లిదండ్రులేనా అని ఎవరికైనా అనుమానం వస్తుంది. ‘సాక్షి’కి అదే అనుమానం వచ్చింది. గుంటూరు జిల్లా నుంచి ఒక గుర్తు తెలియని వ్యక్తి ‘సాక్షి’కి చేరవేసిన క్లూతో తీగలాగితే అసలు విషయం బయటికి వచ్చింది. తమది ప్రకాశం జిల్లా పందులపల్లి గ్రామమని, ఐదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నామని, పాప వయసు నాలుగేళ్లని, జీవనాధారం వెతుక్కుంటూ నాలుగు నెలల క్రితమే జిన్నారం మండలం బొల్లారం వచ్చామని, పోచమ్మ బస్తీ నివాసం ఉంటున్నామని పాపను హింసించిన చక్రవర్తి, రాధికలు పోలీసు విచారణలో చెప్పారు. నిజానికి చక్రవర్తి, రాధికలు పోలీసులను తప్పు దారి పట్టించారు. గుంటూరు జిల్లా రామారెడ్డితోట రెండో వీధికి చెందిన రజియా సుల్తానాకు హబీబ్ అనే వ్యక్తితో 8 ఏళ్ల కిందటే వివాహం అయ్యింది. వీరికి ఆశ, రేష్మా ( ప్రియాంక) ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఏడాది కిందట బతుకుదెరువు కోసం గుంటూరుకు వచ్చిన చక్రవర్తి ఇదే ప్రాంతంలో నివాసం ఉంటూ రజియా సుల్తానాతో పరిచయం పెంచుకున్నాడు. ఈ పరిచయం క్రమంగా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ నేపథ్యంలో గత ఏడాది నవంబర్ మాసంలో ఇంట్లో నుంచి రేష్మా అలియాస్ ప్రియాంకను తీసుకొని బయటికి వెళ్లిన రజియా సుల్తానా తిరిగి రాలేదని ఆమె భర్త హబీబ్ ‘సాక్షి’కి వివరించారు. ఆమె తప్పిపోయిందనే భ్రమలోనే ఉన్న హబీబ్ మార్చి మాసంలో తన భార్య, కూతురు తప్పిపోయిందని గుంటూరు ఎస్పీ గ్రీవెన్స్‌సెల్‌కు ఫిర్యాదు చేశారు. మొదటి కూతరు ఆశ తండ్రి వద్దే ఉంటోంది. కాగా చక్రవర్తికి తండ్రి ఆర్మీ జవానుగా రిటైర్డ్ అయ్యారు. చక్రవర్తి వివాహితుడా? కాదా అనే దానిపై స్థానికంగా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆయనకు భార్య ఒక పాప కూడా ఉందని చెప్తున్నారు. నల్లగొండ జిల్లా అని కొందరు, ప్రకాశం జిల్లా అని ఇంకొం దరు చెప్తున్నారు. డిసెంబర్ మాసంలో పోచమ్మ బస్తీకి వచ్చిన రజీయా సుల్తానా తన పేరు రాధికగా, పాప పేరు ప్రియాంకగా మార్చుకున్నారు. స్థానికంగా ఉండే ఓ పరిశ్రమలో చక్రవర్తి పనులు చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నారు. అయితే వారి మధ్య పాప ప్రియాంక ఉండటం ఇబ్బందిగా మారింది. దీంతో పాపను వదిలించుకునే ప్రయత్నం కూడా చేసినట్లు తెలుస్తోంది. పాపను దారుణంగా హింసించి అనారోగ్యం సాకుతో హత్య చేసేందుకు ప్రయత్నం చేసి ఉండవచ్చనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవం ఇలా ఉంటే... పోలీసులు ఇంకా రజియా సుల్తానా, చక్రవర్తి ఇచ్చిన తప్పుడు సమాచారం పట్టుకొనే వేలాడుతున్నారు. విచారణ కోసం గురువారం ఒక ప్రత్యేక పోలీసు బృందాన్ని ప్రకాశం జిల్లాకు పంపుతున్నామని బోల్లారం పోలీసులు పేర్కొనటం గమనార్హం. -
పెళ్లి చేసుకోమంటే నిప్పు పెట్టాడు!
బాధితురాలు బీటెక్ విద్యార్థిని, పరిస్థితి విషమం సాక్షి, నల్లగొండ: పెళ్లి చేసుకోమని అడిగిన ప్రేమికురాలిపై కిరోసిన్‌పోసి నిప్పంటిం చాడో ఘనుడు. ఈ ఘటన మంగళవారం నల్లగొండలో జరిగింది. కనగల్ మండలం కురంపల్లికి చెందిన అరుణ నిట్స్ కళాశాలలో బీటెక్ ఫైనలియర్ చదువుతోంది. ఇదే మండల పరిధిలోని దర్వేశిపురానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ నకిరేకంటి సైదులు, అరుణ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇతను జిల్లా కేంద్రంలోని ప్రకాశంబజార్‌లో ఫైనాన్స్ నడిపిస్తున్నాడు. అప్పటికే వివాహం జరిగిన సైదులుకు భార్యతో పాటు ఇద్దరు పిల్లలున్నారు. అయితే తనను పెళ్లి చేసుకోవాలని అరుణ కొంతకాలంగా అడుగుతూ వస్తోంది. ఈ క్రమంలో సైదులు తన కార్యాలయంలోకి మధ్యాహ్నం సమయంలో ఆమెను పిలిచాడు. ఒక్కసారిగా కిరోసిన్ పోసి నిప్పంటించాడు. అరుణకు 95 శాతానికిపైగా గాలిన గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.