మహిళకు జైలు శిక్ష | jail for women | Sakshi
Sakshi News home page

మహిళకు జైలు శిక్ష

Published Wed, Mar 22 2017 12:26 AM | Last Updated on Tue, Sep 5 2017 6:42 AM

jail for women

వెలుగోడు: న్యాయవాదిపై హత్యాయత్నానికి పాల్పడిన పట్టణానికి చెందిన కతీఫ్‌మీరున్నిసాబీకి జైలుశిక్ష విధించారు. ఎస్‌ఐ ప్రవీన్‌కుమార్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు ఇలా ఉన్నాయి. పట్టణానికి చెందిన కతీఫ్‌ఇలియాస్, కతిఫ్‌మీరున్నిసాబీ దంపతుల మధ్య కుటుంబ కలహాలు ఉండటంతో భర్త న్యాయవాది సిద్దిఖ్‌అహ్మద్‌ను ఆశ్రయించారు. దీంతో తనకు అన్యాయం జరుగుతుందని భావించిన మీరున్నిసాబీ 22–07–2016న ఉదయం న్యాయవాదిపై కిరోసిన్‌ పోసి నిప్పంటించే ప్రయత్నం చేశారు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు అప్పట్లో కేసు నమోదు చేసి ఎస్‌ఐ దర్యాప్తు చేపట్టగా ఈ కేసును విచారించి ఆత్మకూరు కోర్టు మెజిస్ట్రేట్‌ చినబాబు ఐదేళ్ల జైలుశిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ తీర్పువెల్లడించారు. ఈ కేసును పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ నూర్‌అహమ్మద్‌ వాదించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement