జామకాయల సాకుతో... | Boy Arrest In Attemt To Murder Case Hyderabad | Sakshi
Sakshi News home page

జామకాయల సాకుతో...

Published Wed, Aug 8 2018 11:51 AM | Last Updated on Thu, Aug 9 2018 12:45 PM

Boy Arrest In Attemt To Murder Case Hyderabad - Sakshi

నేరేడ్‌మెట్‌: జామ కాయలు కోసుకుంటామని చెప్పి ఓ ఇంట్లోకి ప్రవేశించి మహిళపై హత్యాయత్నం, దోపిడీకి పాల్పడిన బాలనేరస్తుడితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం నేరేడ్‌మెట్‌లోని తన కార్యాలయంలో మల్కాజిగిరి డీసీపీ ఉమామహేశ్వర శర్మ వివరాలు వెల్లడించారు. చత్తీష్‌గడ్‌కు చెందిన  కమలేష్‌వర్మ, ఉషావర్మ(28) దంపతులు జవహర్‌నగర్‌ ఠాణా, అరుంధతి నగర్‌లో నివాసం ఉంటున్నారు. కమలేష్‌వర్మ కాంట్రాక్టర్‌గా పని చేసేవాడు. వారి ఇంటి ఎదురుగా ప్రైవేట్‌ ఉద్యో గం చేస్తున్న కొత్త రాహుల్‌ అలియాస్‌ నాని(19) కుటుంబం నివాసం ఉంటోంది. ఈనెల 4న రాహుల్‌ తన సోదరుడు (బాలనేరస్తుడు)తో కలిసి పథకం ప్రకారం కమలేష్‌వర్మ ప్రహరీ దూకి పెరట్లోకి  ప్రవేశించారు. ఇంట్లో నుంచి బయటికి వచ్చిన కమలేష్‌ భార్య ఉషావర్మ వారిని ఎందుకు వచ్చారని ప్రశ్నించగా జామ కాయలు కోసుకునేందుకు వచ్చినట్లు తెలిపారు. అనంతరం ఆమెను మాటల్లో పెట్టి  ఇల్లు చూస్తా మని ఆమెతో పాటు లోపలికి వెళ్లారు. పథకం ప్రకారం తమ్ముడు ఇంటి మెయిన్‌ డోర్‌ మూసి వేయగా రాహులు ఉషావర్మ జుట్టుపట్టుకుని తలను గోడ కేసి బాదడంతో తీవ్రంగా గాయపడిన ఆమె కుప్పకూలింది.     

అనంతరం ఆమె ఒంటిపైన ఉన్న బంగారు పుస్తెల తాడు, చెవి కమ్మలు, వెండి పట్టాలు తీసుకున్నారు. ఇంట్లోని తాడుతో ఆమె కాళ్లు, మెడకు బిగించి కప్‌ బోర్డులోని కత్తితో ఆమె గొంతు కోశారు. ఆమె మృతి చెందినట్లు భావించి వారు అక్కడినుంచి పరారయ్యారు. కొద్దిసేపటికి స్పృహాలోకి వచ్చిన ఉషావర్మ భర్తకు ఫోన్‌ చేసింది. భర్త తన స్నేహితులకు సమాచారం అందించడంతో వారు బాధితురాలిని ఆసుపత్రిలో చేర్పించారు. తమ ఎదురింట్లో ఉంటున్న రాహుల్, అతని సోదరుడు తనపై హత్యాయత్నం చేసి, నగలు ఎత్తుకెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. డీసీపీ పర్యవేక్షణలో కేసు దర్యాప్తు చేపట్టిన ఏసీపీ రషీద్, డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ నవీన్, సీఐ సైదులు చోరీసొత్తును రాహు ల్‌ తనకు వరుసకు సోదరుడు, అమెజాన్‌లో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్న  పవన్‌ కళ్యాణ్‌ వద్ద దాచినట్లు గుర్తించారు. పవన్‌ కూడా గతంలో ఓ కేసులో జైలుకు వెళ్లి వచ్చినట్లు డీసీపీ తెలిపారు. సోమవారం బాలాజీ నగర్‌లో రాహుల్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. అతను ఇచ్చిన సమాచారం ఆధారంగా మిగతా ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, చోరీ సొ త్తుతో పాటు బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు. రెండు రోజుల్లోనే కేసును ఛేదించిన ఏసీపీ, డీఐ, సీఐలను ఆయన అభినందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ ఉమామహేశ్వర శర్మ, ఏసీపీ రషీద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement