జామపండు ఎలా తింటాం పండింది లేదా కాస్త పచ్చిగా ఉన్నది ఇష్టంగా లాగిస్తాం. కొందరైతే ఉప్పు, కారంతో ఇష్టంగా తింటారు. వేయించిన జామపండు తినడం గురించి విన్నారా..?. వాట్ ఇలా ఎలా తింటాం అని సందేహించకండి. ఎందుకంటే వేయించిన జామపండుతో బోలెడన్ని ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇలా వేయించడం వల్ల జామపండులోని యాంటీ ఆక్సిడెంట్లు మరింత పుష్కలంగా శరీరానికి అందుతాయట. పైగా ఇది అనేక వ్యాధులను నివారిస్తుందని చెబుతున్నారు.
ఎన్ని ప్రయోజనాలంటే..
అలెర్జీ నివారణ
అలెర్జీ విషయంలో కాల్చిన జామపండు తినడం అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. వాస్తవానికి హిస్టామిన్ స్థాయిలు పెరిగిన వ్యక్తులలో అలెర్జీ సమస్యలు సర్వసాధారణం (హిస్టమిన్ అనేది మీ శరీరంలో అలెర్జీలు, అనేక పరిస్థితులలో పాత్ర పోషిస్తున్న ఒక రసాయనం, హిస్టామిన్ ట్రిగ్గర్‌లలో అలెర్జీలు, కొన్ని ఆహార ఉత్పత్తులు ఉంటాయి). ఇటువంటి పరిస్థితిలో కాల్చిన జామపండు తినడం వల్ల అలర్జీలు తగ్గుతాయి. అలాగే శరీరంలో రియాక్టివిటీ తగ్గుతుంది. దీనితో పాటు విటమిన్ సికి అలెర్జీ ఉన్నవారికి కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
కఫం తొలగిపోతుంది
దగ్గు విషయంలో కాల్చిన జామపండు తినడం దగ్గును తగ్గించడంలో అలాగే గొంతు సమస్యను తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. అంతేకాకుండా ఇసినోఫిలియా అంటే అలర్జీ ఉన్నవారికి కూడా జామ తినడం ప్రయోజనకరంగా ఉంటుంది.
ఉబ్బరంలో ప్రయోజనకరంగా ఉంటుంది
ఉబ్బరం సమస్య మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితిలో కాల్చిన జామపండు తినడం వల్ల పొట్టకు అనేక రకాలుగా మేలు జరుగుతుంది. దీన్ని తినడం వల్ల కడుపులోని ఆమ్ల పిహెచ్ తగ్గుతుంది. ఇది ఉబ్బరం సమస్యను తగ్గిస్తుంది.
జలుబు, దగ్గు రాకుండా కాపాడుతుంది
కాల్చిన జామపండు తింటే జలుబు, దగ్గు సమస్య దరిచేరదు. నిజానికి పాత కాలంలో జామపండు తినడం వల్ల అంటు వ్యాధులు దూరంగా ఉంటాయని నమ్మేవారు. ఇలాంటి పరిస్థితుల్లో జామపండు తినడం వల్ల జలుబు, దగ్గు రాకుండా చూసుకోవచ్చు.
(చదవండి: టాబ్లెట్ త్వరగా పనిచేయాలంటే ఇలా చేయండి!)
Comments
Please login to add a commentAdd a comment