Roasting process
-
మొలకెత్తిన రాగుల పిండితో లాభాలెన్నో: ఇంట్లోనే చేసుకోండిలా!
రాగులతో మన ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు రాగులు చాలామంచిది. కాల్షియం, ఐరన్ లాంటి ముఖ్యమైన పోషకాలు అందుతాయి. రాగులతో పసందైన వంటకాలను తయారు చేసుకొని ఆస్వాదించవచ్చు. అయితే రాగులను నానబెట్టి,మొలకలొచ్చాక, వేయించి పౌడర్ చేసుకొన వాడితేమరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. పిల్లలు నుంచి పెద్దల వరకు రాగులను అనేక రూపాల్లో తీసుకోవచ్చు. రాగి జావ, రాగి పిండితో దోసెలు, ఇడ్లీలు చేసుకోవచ్చు. అలాగే రాగులతో మురుకులను కూడా తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా రాగులను మొలకలు వచ్చేలా చేసి వాటిని ఎండబెట్టి, లైట్‌గా వేయించి పౌడర్ చేసుకుంటే ఇంకా మంచిది. ఆరోగ్యానికి ఆరోగ్యం. రుచికీ రుచీ పెరుగుతుంది. పోషకాలూ పెరుగుతాయి. రాగుల మొలకలతో పిండిని ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూద్దాం.రాగుల మొలకలతో పిండి తయారీరాగులను రాళ్లు, ఇసుక లేకుండా శుభ్రంగా జల్లించుకోవాలి. ఆ తరువాత వీటిని శుభ్రంగా కడగాలి. ఎక్కువ సార్లు దాదాపు నాలుగు నుంచి పదిసార్లు , తెల్ల నీళ్లు వచ్చేదాకా కడుక్కోవాలి. కడిగిన రాగులను జాలీలో వేసుకొని నీళ్లు మొత్తం వాడేలా చూసుకోవాలి. తరువాత వీటిని పల్చని కాటన్ వస్త్రంలో(కాటన్ చున్నీ, చీర అయితే బావుంటుంది)వేసి మూట కట్టి, లైట్‌గా నీళ్లు చిలకరించి ఒక జాలీ గిన్నెలో పెట్టి, జాగ్రత్తగా వంట ఇంటి కప్‌బోర్డులో(గాలి, వెలుతురు తగలకుండా) పెట్టుకోవాలి. రెండు రోజులకు రాగులు మొలకలు భలే వస్తాయి. మూటలోంచి మొలకలు తెల్లగా బయటికి వచ్చేంత పెరుగుతాయి. వీటిని జాగ్రత్తగా తీసుకొని తడి ఆరేలాగా ఎండబెట్టుకోవాలి. ఆరిన తరువాత వీటిని నూనె లేకుండా ఉత్తి మూకుడులో వేగించుకోవాలి. మాడకుండా గరిటెతో తిప్పుతూ సన్నని సెగమీద కమ్మటి వాసన వచ్చేదాకా వేయించుకోవాలి. చల్లారిన తరువాత మిక్సీలో మెత్తగా పట్టుకోవాలి. అంటే కమ్మని రాగుల మొలకల పిండి రెడీ.ఈ పిండిని జావ, దోసెలు, చపాతీలు తయారీలో వాడుకోవచ్చు. ఇంకా రాగిమొలకలతో చేసిన పిండిలో కొద్దిగా పుట్నాల పొడి, బెల్లం, నెయ్యి కలిపి సున్ని ఉండలుగా చేసి పిల్లలకు రోజుకు ఒకటి పెడితే మంచి శక్తి వస్తుంది.రాగి ఇడ్లీరాగుల పిండిలో గోధు రవ్వ, పుల్లని పెరుగు, సరిపడినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. దీన్ని కనీసం అరగంటపాటు పక్కన పెట్టుకోవాలి. వేడి నూనెలో ఆవాలు జీలకర్ర, జీడిపప్పు, కొన్ని ఎండు మిర్చి,, కొన్ని కరివేపాకులువేసి పోపు రెడీ చేసుకోవాలి. ఇవి వేగాక ఇందులోనే తరిగిపెట్టుకున్న క్యారట్, ఉల్లిపాయముక్కలను వేయాలి. ఇది చల్లారాక రాగుల పిండిలో కలపాలి. తరువాత బేకింగ్ సోడా(పెరుగు పుల్లగా ఉంటే ఇది కూడా అవసరంలేదు) బాగా కలపాలి. కొత్తమీర కూడా కలుపుకోవచ్చు.రాగులతో ఉపయోగాలురాగులు బలవర్దకమయిన ఆహారం. ఇతర ధాన్యాల కంటే రాగుల్లో 10 రెట్లు ఎక్కువ కాల్షియం ఎక్కువ. నానబెట్టి, మొలకెత్తడంవల్ల పోషకాలు మరింత పెరుగుతాయి కొవ్వు కంటెంట్ తగ్గుతుంది. ఈ పిండితో చేసిన ఉగ్గును శిశువులకు కూడా తినిపించవచ్చు.బీపీ మధుమేహం, కాలేయవ్యాధులు, గుండె బలహీనత, ఉబ్బసం లాంటి సమస్యలకు దివ్యౌషధంలా పనిచేస్తాయి. చిన్నపిల్లల్లో ఎముకల వృద్ధికి, అనీమియా నివారణలో ఉపయోగపడుతుంది. వృద్దాప్యంలో వున్న వారు రాగులతో తయారు చేసిన ఆహార పదార్థాలను భుజించడం వల్ల శరీరానికి బలం, శక్తి చేకూరుతాయి -
పచ్చి జామకాయ కంటే కాల్చిందే బెటర్! ఎన్ని ప్రయోజనాలంటే..!
జామపండు ఎలా తింటాం పండింది లేదా కాస్త పచ్చిగా ఉన్నది ఇష్టంగా లాగిస్తాం. కొందరైతే ఉప్పు, కారంతో ఇష్టంగా తింటారు. వేయించిన జామపండు తినడం గురించి విన్నారా..?. వాట్ ఇలా ఎలా తింటాం అని సందేహించకండి. ఎందుకంటే వేయించిన జామపండుతో బోలెడన్ని ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇలా వేయించడం వల్ల జామపండులోని యాంటీ ఆక్సిడెంట్లు మరింత పుష్కలంగా శరీరానికి అందుతాయట. పైగా ఇది అనేక వ్యాధులను నివారిస్తుందని చెబుతున్నారు. ఎన్ని ప్రయోజనాలంటే..అలెర్జీ నివారణఅలెర్జీ విషయంలో కాల్చిన జామపండు తినడం అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. వాస్తవానికి హిస్టామిన్ స్థాయిలు పెరిగిన వ్యక్తులలో అలెర్జీ సమస్యలు సర్వసాధారణం (హిస్టమిన్ అనేది మీ శరీరంలో అలెర్జీలు, అనేక పరిస్థితులలో పాత్ర పోషిస్తున్న ఒక రసాయనం, హిస్టామిన్ ట్రిగ్గర్‌లలో అలెర్జీలు, కొన్ని ఆహార ఉత్పత్తులు ఉంటాయి). ఇటువంటి పరిస్థితిలో కాల్చిన జామపండు తినడం వల్ల అలర్జీలు తగ్గుతాయి. అలాగే శరీరంలో రియాక్టివిటీ తగ్గుతుంది. దీనితో పాటు విటమిన్ సికి అలెర్జీ ఉన్నవారికి కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.కఫం తొలగిపోతుందిదగ్గు విషయంలో కాల్చిన జామపండు తినడం దగ్గును తగ్గించడంలో అలాగే గొంతు సమస్యను తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. అంతేకాకుండా ఇసినోఫిలియా అంటే అలర్జీ ఉన్నవారికి కూడా జామ తినడం ప్రయోజనకరంగా ఉంటుంది.ఉబ్బరంలో ప్రయోజనకరంగా ఉంటుందిఉబ్బరం సమస్య మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితిలో కాల్చిన జామపండు తినడం వల్ల పొట్టకు అనేక రకాలుగా మేలు జరుగుతుంది. దీన్ని తినడం వల్ల కడుపులోని ఆమ్ల పిహెచ్ తగ్గుతుంది. ఇది ఉబ్బరం సమస్యను తగ్గిస్తుంది.జలుబు, దగ్గు రాకుండా కాపాడుతుందికాల్చిన జామపండు తింటే జలుబు, దగ్గు సమస్య దరిచేరదు. నిజానికి పాత కాలంలో జామపండు తినడం వల్ల అంటు వ్యాధులు దూరంగా ఉంటాయని నమ్మేవారు. ఇలాంటి పరిస్థితుల్లో జామపండు తినడం వల్ల జలుబు, దగ్గు రాకుండా చూసుకోవచ్చు.(చదవండి: టాబ్లెట్ త్వరగా పనిచేయాలంటే ఇలా చేయండి!) -
Trevor Noah: పుతిన్ పేరుతో బైడెన్ వెటకారం
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెటకారం ప్రదర్శించాడు. తనను విమర్శించినా పర్వాలేదని అంటూనే.. తానేం పుతిన్‌లా నియంతను కాదంటూ సూటి వ్యాఖ్యలు చేశాడు. ప్రముఖ కమెడియన్ ట్రెవోర్ నోవాహ్.. ఆదివారం వైట్‌హౌజ్‌లో జరిగిన ఆన్యువల్ వైట్‌హౌజ్ కరెస్పాండెంట్స్ అసోషియేషన్ డిన్నర్‌కు హజరయ్యాడు. ఆఫ్రికా(దక్షిణాఫ్రికా) తరపున ఈ ఘనత దక్కించుకున్న తొలి వ్యక్తి కూడా ట్రెవోర్ నోహ్. అయితే ట్రెవోర్ను జో బైడెన్ స్వయంగా వేదిక మీదకు ఆహ్వానించాడు. లేడీస్ అండ్ జెంటిల్మెన్.. ఇప్పుడు మీ ముందుకు రాబోతున్నారు ట్రెవోర్. ఇక నేను నా సీట్లో కూర్చుంటా. ట్రెవోర్.. మీకొక శుభవార్త. మీరు ఇప్పుడు అమెరికా అధ్యక్షుడిని నిరభ్యరంతంగా విమర్శించొచ్చు. మాస్కోలో లాగా మిమ్మల్నేం అరెస్ట్ చేయబోం. మీరు స్వేచ్ఛగా చెలరేగిపోవచ్చు’’ అంటూ బైడెన్ చమత్కరించాడు. ఇక్కడ బైడెన్ కౌంటర్ ఇచ్చింది నేరుగా పుతిన్‌కే. రష్యాతో పుతిన్ ఎవరైనా తనను విమర్శిస్తే కటకటాల పాలు చేస్తారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే పుతిన్ రాజకీయ ప్రత్యర్థి, ప్రతిపక్ష నేత అలెక్సీ నవల్నీ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. 2020లో నవల్నీపై సీక్రెట్ ఏజెంట్ ద్వారా పుతిన్ విషప్రయోగం చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో విమానంలో ఉండగానే.. జర్మనీకి అత్యవసర చికిత్స కోసం వెళ్లాడు నవల్నీ. అక్కడి నుంచి కొంత గ్యాప్ తర్వాత తిరిగి స్వదేశానికి చేరుకున్నాడు. అయితే.. రష్యా వచ్చిరాగానే అక్రమ కేసులు బనాయించి తొమ్మిదేళ్లు జైలు శిక్ష విధించాడంటూ పుతిన్‌పై రాజకీయ పరమైన విమర్శలూ ఉన్నాయి. ఈ సంగతి పక్కనపెడితే.. బైడెన్ హామీ ఇచ్చాడుగా.. అందుకే తనదైన శైలిలో విమర్శలకు దిగి హాస్యం పండించాడు ట్రెవోర్. I’ve always respected @Trevornoah so much but this closing speech from the White House correspondents’ dinner is particularly spectacular. pic.twitter.com/k8GmBOAoYB — Mike Birbiglia (@birbigs) May 1, 2022 చదవండి: పుతిన్‌కు సర్జరీ.. తాత్కాలిక బాధ్యతలు ఆయనకే? -
మాంసాహారం డీప్ ఫ్రై లేదా రోస్ట్ చేస్తే.. ‘హెటెరోసైక్లిక్ అరోమాటిక్ అమైన్స్’ వల్ల
చెడు వినకు, చూడకు, మాట్లాడకు అని నీతి చెప్పే మూడు కోతి బొమ్మలు అందరికీ తెలిసినవే. అలాంటి ముఖ్యమైన మూడు నీతి వాక్యాలే... క్యాన్సర్‌ను ‘‘వండుకోకండి, నిల్వ చేసుకోకండి, తినకండి’’ అనే మాటలు! ఇలా క్యాన్సర్‌ను వండటం, నిల్వచేయడం, తినడం ఎలా జరుగుతుందో చూద్దాం, దానికి దూరంగా ఉందాం. ప్రతి వ్యక్తీ బతికి ఉండటానికి ఆహారం తీసుకుంటాడు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ ఆహారపదార్థాలను తినడం, వాటిని వండుకోవడం, నిల్వ చేసుకోవడం చేస్తుంటారు. అప్పుడు సరిగా వండుకోకపోయినా, నిల్వ చేసుకోకపోయినా, తినకపోయినా క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. వాటిని నివారించడానికి అనుసరించాల్సిన మార్గాలివే... ‘క్యాన్సర్ వంట పద్ధతులు’ వద్దు... ఓ పదార్థాన్ని వండుతున్నామంటే... దాన్ని క్యాన్సర్‌ను రాని రీతిలో వండటం ముఖ్యం. వంటలో మనం ఉడికించడం, వేయించడం, డీప్ ఫ్రై లేదా రోస్ట్ చేయడం లాంటి ప్రక్రియలను అనుసరిస్తుంటాం. వీటన్నింటిలోనూ ఉడికించడం అనేది క్యాన్సర్‌ను దూరంగా ఉంచే ఆరోగ్యకరమైన ప్రక్రియ. వేపుళ్లు, రోస్ట్ చేయడం అనారోగ్యకరమైన పద్ధతులు. ఉదాహరణకు మాంసాహారం లేదా కొన్ని శాకాహారాల్లో డీప్ ఫ్రైలు, రోస్ట్‌లు చేయడం క్యాన్సర్‌కు కారణం కావచ్చు. ఎందుకంటే... ఇలా డీప్ ఫ్రై లేదా రోస్ట్ చేసే సమయంలో ఆహార పదార్థాల్లోంచి ముఖ్యంగా మాంసాహారం నుంచి ‘హెటెరోసైక్లిక్ అరోమాటిక్ అమైన్స్’ (హెచ్ఏఏ) అనే క్యాన్సర్ కలిగించే హానికరమైన రసాయనాలు వెలువడవచ్చు. అందుకే ఎప్పుడో ఓసారి చాలా కొద్దిమోతాలో జిహ్వను సంతృప్తిపరచేందుకు తప్ప... అతిగా వేయించే వేపుళ్లు, రోస్ట్లకు వీలైనంత దూరంగా ఉండటమే మంచిది. క్యాన్సర్ల ‘నిల్వ’ వద్దు ... తినే పదార్థాలను నిల్వ చేసుకుని, అవసరం ఉన్నప్పుడల్లా వినియోగించుకోవడం అనాదిగా మనమంతా పాటిస్తున్న పద్ధతే. ఉదాహరణకు పచ్చళ్లు, బేకరీ పదార్థాలు, ఫాస్ట్‌ఫుడ్‌ను ఎక్కువగా నిల్వ చేస్తుంటారు. చాలాకాలం పాటు తినేపదార్థాలు నిల్వ ఉంచడం కోసం కొన్ని రసాయనాలు వాడుతుంటారు. వెన్న, నెయ్యి చాలాకాలం పాటు ఉంటే చెడిపోతాయి. అలాగే వాటితో చేసిన పదార్థాలూ చాలాకాలం నిల్వ ఉంటే పాడైపోతాయి. అందుకే ‘మార్జరిన్’ అనే పదార్థాన్ని నూనె, వెన్న, నెయ్యికి ప్రత్యామ్నాయం గా వాడుతుంటారు. కానీ మార్జరిన్ చెడు కొవ్వులను పెంచి మంచికొవ్వులను బాగా తగ్గిస్తుంది. అలాగే నిల్వ ఉంచేందుకు తోడ్పడే అనేక రసాయనాల్లో దేహానికి హానిచేసే పదార్థాలు ఉంటాయి. దాదాపు ఇవన్నీ క్యాన్సర్ ముప్పును పెంచుతాయి. ఇక మాంసాహారాన్ని చాలాకాలంపాటు నిల్వ ఉంచేందుకు ‘స్మోకింగ్’ అనే ప్రక్రియను అనుసరిస్తారు. ఇలా చేసేప్పుడు ‘పాలీ సైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్’ (పీఏహెచ్‌స్) అనే రసాయనాలు ఏర్పడతాయి. ఇవి కూడా క్యాన్సర్ కారకాలే. మనం పెట్టుకునే ఊరగాయల్ని ఏడాదంతా నిల్వ ఉంచడానికి ఎక్కువ మోతాదులో ఉప్పు వాడతారు. దాంతో కడుపు లోపలి పొరలు ఒరుసుకుపోవడం, అలాగే ఆ భాగాల్లో నైట్రేట్ల దుష్ప్రభావంతో క్యాన్సర్‌కు అవకాశాలెక్కువ. కడుపులోని యాసిడ్ అన్నింటినీ చంపేసినా ‘హెలికోబ్యాక్టర్ పైలోరీ’ అనే సూక్ష్మక్రిమిని మాత్రం చంపలేదు. ‘హెచ్. పైలోరీ’ వల్ల పొట్టక్యాన్సర్లు వచ్చే ముప్పు ఎక్కువ. అందుకే వంటచేయడం, నిల్వచేయడం, తినడం... ఈ మూడు పద్ధతుల్లోని ఆరోగ్యకరమైన మార్గాలు క్యాన్సర్ నివారణకు చాలా ముఖ్యమని తెలుసుకోవడం అందరికీ అవసరం. -డాక్టర్ సీహెచ్. మోహన వంశీ చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్, ఒమేగా హాస్పిటల్స్, హైదరాబాద్ Ph: 98480 11421, Kurnool 08518273001 చదవండి: Badam Health Benefits: రాత్రంతా నీళ్లలో నానబెట్టి బాదం పొట్టు తీసి తింటున్నారా? వేటమాంసం తిన్న తర్వాత వీటిని తిన్నారంటే.. Jeedipappu Health Benefits: జీడిపప్పును పచ్చిగా తింటున్నారా..! సంతానలేమితో బాధపడే వారు పిస్తాతో పాటు వీటిని తింటే.. -
ఏంటీ... విమానంలో ప్రయాణించేటప్పుడు తినడానికి అది తీసుకువెళ్తావా!
మనం ఎక్కడికైనా ప్రయాణించేటప్పుడూ తినుబండరాలను కూడా తీసుకువెళ్లాం. కాలక్షేపం కోసం లేక మనం వెళ్లిప్రాంతాల్లో తినే పదర్ధాలు ఏవైన దొరక్కపోవచ్చు అందువల్ల ఏదో ఒక తినుబండరాలను తీసుకువెళ్తారు. అయితే అవి మనకు వీలుగా ఉండేవి ఇతరు ప్రయణికులకు ఇబ్బంది కలిగించినవి తీసుకువెళ్తాం కానీ ఇక్కడ ఒక ఆమె ఏకంగా విమానంలో ఒక కాల్చిన చేపను తీసుకువెళ్తుంది. (చదవండి: వామ్మో! అంత ఎత్తులోంచి ఒకేసారి దూకేసారు... చివరికి) పైగా ఆ చేప వాసన విమానం అంతా వ్యాపించడంతో ప్రయాణికులు చాలా ఇబ్బందికి గురువుతారు. విమాన నిబంధనల ప్రకారం ఎక్కువ మొత్తంలో ఇలాంటి ప్రిజర్వేటడ్ ఫుడ్‌ని తీసుకువెళ్లడానికి అంగీకరించవు. అయితే చాలామంది ప్రయాణికులు ఏదోరకంగా తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే సదరు ప్రయాణికురాలు దీనికి సంబంధించిన ఫోటోతో పాటు " నేను మాత్రమేనా ఇలాంటి ఆహారం విమానంలో తీసుకువెళ్లేది" అంటూ క్యాప్షన్ జోడించి మరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. దీంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే ఇలాంటి ఆహారం విమానంలోకి తీసుకువెళ్తారా అంటూ విమర్శిస్తూ రకరకాలుగా కామెంట్లు చేయడం మొదలు పెట్టారు. (చదవండి: అరుదైన వింత సంఘటన... తోకతో పుట్టిన బాలుడు) -
పీడిస్తున్న జీడి కాలుష్యం
జీడి పరిశ్రమ.. పలాస–కాశీబుగ్గ పట్టణంలో ప్రధాన ఆదాయ వనరు. ఈ పరిశ్రమలపైనే వేలాది మంది జీవనాధారం ఆధారపడి ఉంది. అదే సమయంలో కొందరు వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా పరిశ్రమల్లో రోస్టింగ్ విధానం అమలు చేస్తూ పర్యావరణానికి హాని కలిగిస్తున్నారు. పరిశ్రమల నుంచి వస్తున్న విపరీతమైన పొగతో పలాస పట్టణ, పరిసర ప్రజలు శ్వాసకోస సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు రోగాల బారిన పడుతున్నారు. మరోవైపు పలు హోటళ్లలో సైతం యథేచ్ఛగా జీడితొక్కను వంటచెరకుగా వినియోగిస్తూ కాలుష్యానికి కారకులవుతున్నారు. ఇంత జరుగుతున్నా కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు గానీ, మున్సిపల్ సిబ్బంది గానీ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కాశీబుగ్గ: పలాస పట్టణంలోని పలు జీడి పరిశ్రమలు, జీడి తొక్కను వంట చెరకుగా వినియోగించే హోటళ్లు కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి. రోస్టింగ్ విధానాన్ని నిర్మూలించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా పట్టించుకోకుండా ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటున్నాయి. చాపకింద నీరులా విజృంభిస్తున్న జీడి కాలుష్యం కారణంగా పలాస పట్టణంలోని మొగిలిపాడు ప్రాథమికోన్నత పాఠశాలలో సుమారు 150 మంది విద్యార్థులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే పలువురు శ్వాసకోస సంబంధిత సమస్యలతో ఆస్పత్రులను ఆశ్రయించారు. పట్టణంలో గతంలో జనావాసాల్లో ఉన్న జీడి పరిశ్రమలు మూసివేశారు. అయితే తెలుగుదేశం ప్రభుత్వం అండదండలతో కొన్ని జీడి పరిశ్రమలను తిరిగి తెరిచి గుట్టుచప్పుడు కాకుండా జీడి పిక్కల రోస్టింగ్ చేయిస్తున్నారు. ముఖ్యంగా బాయిలింగ్ కాకుండా రోస్టింగ్‌కు వ్యాపారులు ప్రాధాన్యమిస్తుండటంతో కాలుష్యంగా రోజురోజుకూ పెరిగిపోతోంది. పలాస మండల పరిధిలోని బ్రాహ్మణతర్లా, పూర్ణభద్ర, కేదారిపురం, దానగోర, సిరిపురం, హిమగిరి, లొత్తూరు, మహదేవుపురం, మర్రిపాడు, తాళభద్ర తదితర గ్రామాల్లో రోస్టింగ్ విధానాన్ని తిరిగి ప్రారంభించారు. దీనికి సంబంధించి కాలుష్య నివారణ అధికారులు చేతివాటాన్ని ప్రదర్శించడం, కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు అధికారులు వీరికి సహకరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. హోటళ్లలో జీడితొక్క వినియోగం పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో సుమారు 100 హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, టిఫిన్ షాపులు, దాబాలు ఉన్నాయి. వీటిలో చాలాచోట్ల జీడి తొక్కనే వంటచెరకుగా వినియోగిస్తున్నారు. ఇక్కడి నుంచి విడుదలయ్యే పొగతో పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు పట్టదా..? పలాస–కాశీబుగ్గ పట్టణంలో సుమారు 75 వేల మంది నివాసముంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి నిత్యం వేలాది మంది పట్టణానికి తరలివస్తుంటారు. వీరందరిపైనా కాలుష్యం తీవ్ర ప్రభావం చూపుతోంది. అయినా కాలుష్య నివారణ కమిటీ గానీ, ఇటు మున్సిపల్ అధికారులు గానీ పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలాస, కాశీబుగ్గ, శాసనాం, పారిశ్రామికవాడ, సూదికొండ, తిలక్‌నగర్, రోటరీనగర్, శివాజీనగర్, ఎంపీడీఓ కార్యాలయం రోడ్డు, లేబరుకాలనీ, కేటీ రోడ్డు తదితర ప్రాంతాల్లో చాలా పరిశ్రమలు అనుమతి లేకుండా నడుస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కాలుష్యాన్ని అరికట్టాలని పలువురు కోరుతున్నారు.