పండ్లలో ఎన్నో పోషకాలు దాగున్నాయి. ప్రతిరోజూ పండ్లను తినడం వల్ల అనారోగ్యాల నుంచి దూరంగా ఉండొచ్చు. అలాంటి పండ్లలో జామపండ్లు కూడా ఒకటి. చిన్నపిల్లల దగ్గర్నుంచి పెద్దవారి వరకు జామపండ్లను ఇష్టంగా తింటుంటారు. సాధారణంగా ఆకుపచ్చ రంగులో ఉండే జామాపండ్లు గురించి అందరికి తెలుసు..
కానీ నల్ల జామకాయల గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? సాధారణ జామ పండుతో పోలిస్తే ఈ నల్ల జామ పండులో పోషకాలు రెట్టింపు స్థాయిలో ఉంటాయి. వీటిని తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి ఇప్పుడు తెలుసుకుందాం..
► నల్ల జామపండ్లు తినడానికి ఎంతో రుచికరంగా ఉంటాయి. శరీరానికి కూడా ఇవి చాలా మంచివి.
► ఇందులో శరీరానికి కావాల్సిన పోషకాలు చాలా ఉంటాయి. విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి వంటివి ఇందులో అధికంగా ఉంటాయి.
► నల్ల జామపండ్లను తరచూ తినడం వల్ల జీర్ణక్రియ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
► అంతేకాకుండా వీటిని తరచూ తినడం వల్ల మలబద్దకం, పొట్ట సమస్యల నుంచి కూడా సులభంగా విముక్తి కలుగుతుంది.
► రక్తహీనతతో బాధపడేవాళ్లు ప్రతిరోజూ నల్ల జామపండ్లను తినడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
► నల్ల జామకాయలను తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీనివల్ల తరచూ ఇన్ఫెక్షన్‌ల బారిన పడకుండా ఉండవచ్చు.
► యాంటీ ఏజింగ్ గుణాలు కలిగి ఉండటంతో వృద్ధాప్యాన్ని నివారించటంలో నల్ల జామకాయలు సహాయపడతాయి.
► నల్లజామకాయలు తీసుకోవడం వల్ల చర్మంపై ఉన్న ముడతలు తొలగించి యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.
అయితే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న నల్ల జామకాయలు తినాలంటే మాత్రం ఇండియలో దొరకవు. ఈ పండ్లు ఎక్కువగా బ్రెజిల్, సౌత్ అమెరికాలో ఎక్కువగా దొరుకుతాయి.
Comments
Please login to add a commentAdd a comment