Benefits
-
ఈపీఎఫ్ఓలో ఇన్ని రకాల పెన్షన్లు ఉన్నాయా?
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పెన్షన్ పథకాల ద్వారా దేశంలోని ఉద్యోగులకు ఆర్థిక స్థిరత్వాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్-95) కింద ఏర్పాటైన నిబంధనలు రిటైర్మెంట్ బెనిఫిట్స్, ముందస్తు క్లెయిమ్‌లు, ఫ్యామిలీ అసిస్టెన్స్ అందించడం ద్వారా ఉద్యోగులకు, వారి కుటుంబాలకు ఆర్థిక భద్రతను కల్పిస్తున్నాయి. అసలు ఈపీఎఫ్‌లో ఎలాంటి పెన్షన్ పథకాలు ఉన్నాయి.. వాటి ప్రయోజనాలు ఏంటి అన్నది ఇక్కడ తెలుసుకుందాం.సూపర్ యాన్యుయేషన్ పెన్షన్ఈపీఎఫ్ఓ పెన్షన్ పథకాలకు ఇది మూలస్తంభం. ఉద్యోగులు కనీసం 10 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసి ఉంటే 58 ఏళ్లు నిండిన తర్వాత నెలవారీ పెన్షన్ పొందడానికి అర్హులు. ప్రయోజనాలను గరిష్టంగా పెంచుకునేందుకు సభ్యులు 60 సంవత్సరాల వయస్సు వరకు ఈ పథకానికి కంట్రిబ్యూషన్ కొనసాగించవచ్చు. తద్వారా అధిక పెన్షన్ మొత్తాన్ని పొందవచ్చు.ముందస్తు పెన్షన్ ఎంపికలుఅధికారిక పదవీ విరమణ వయస్సుకు ముందే ఆర్థిక సహాయం కోరుకునేవారికి, ఈపీఎస్ పథకం 50 సంవత్సరాల వయస్సు నుంచే ముందస్తు క్లెయిమ్‌లను అనుమతిస్తుంది. అయితే 58 ఏళ్ల లోపు ప్రతి ఏడాది పెన్షన్ మొత్తంలో 4 శాతం తగ్గుతుంది. ఇది ఫ్లెక్సీబిలిటీ అందిస్తున్నప్పటికీ, తగ్గిన పెన్షన్ చెల్లింపుల దీర్ఘకాలిక ప్రభావాలను బేరీజు వేసుకోవాల్సి ఉంటుంది.వైకల్య పెన్షన్సర్వీస్ సమయంలో శాశ్వత, సంపూర్ణ వైకల్యం సంభవించినప్పుడు, ఆర్థిక భద్రతను అందించడానికి ఈపీఎఫ్ఓ వైకల్య పింఛన్లను అందిస్తుంది. దివ్యాంగులైన ఉద్యోగులు, వారి కుటుంబాల తక్షణ అవసరాలను తీర్చుకోవడానికి 10 సంవత్సరాల కనీస సర్వీస్ పీరియడ్ అనే తప్పనిసరి నిభందనతో పని లేకుండా ఈ ప్రయోజనాన్ని క్లెయిమ్ చేయవచ్చు.కుటుంబ ప్రయోజనాలుఈపీఎఫ్ఓ పెన్షన్ స్కీమ్ సభ్యుడి అకాల మరణం సమయంలో కుటుంబ సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుంది. ఈ ప్రయోజనాలలో ఇవి ఉన్నాయి:వితంతు పింఛను: జీవిత భాగస్వామి నెలవారీ పింఛనుకు అర్హులు.పిల్లల పెన్షన్: ఇద్దరు పిల్లలకు 25 ఏళ్లు వచ్చే వరకు పెన్షన్ లభిస్తుంది.అనాథ పింఛన్: జీవిత భాగస్వామి లేకపోతే పింఛన్ ను అనాథలకు కేటాయిస్తారు.వైకల్య పిల్లల పెన్షన్: దివ్యాంగులైన పిల్లలకు, అదనపు సహాయం కోసం జీవితకాల పెన్షన్ అందిస్తారు.నామినీ పెన్షన్కుటుంబం లేని సభ్యులకు, వారు మరణిస్తే పింఛను పొందే లబ్ధిదారుడి నామినేషన్‌ను ఈ పథకం అనుమతిస్తుంది.ఉపసంహరణ ప్రయోజనాలుపెన్షన్ అర్హతకు అవసరమైన 10 సంవత్సరాలు పూర్తి చేయకుండా సర్వీసు నుండి నిష్క్రమించిన సభ్యులు ఉపసంహరణ ప్రయోజనాన్ని పొందవచ్చు. దీని ద్వారా తక్కువ సర్వీస్ పీరియడ్ ఉన్నవారు కూడా పదవీ విరమణ లేదా శ్రామిక శక్తి నుండి నిష్క్రమించినప్పుడు ఆర్థిక సహాయం లభిస్తుంది.పెన్షన్ లెక్కింపు ఫార్ములాపెన్షన్ మొత్తాన్ని నెలవారీ పెన్షన్ = (పెన్షనబుల్ శాలరీ × పెన్షనబుల్ సర్వీస్) / 70 అనే ఫార్ములా ద్వారా నిర్ణయిస్తారు. ఇక్కడ "పెన్షనబుల్ శాలరీ" అనేది గత 60 నెలల్లో సగటు నెలవారీ జీతం. -
శాలరీ అకౌంట్ ఉంటే ఇవన్నీ ఉన్నట్టే..
వివిధ సంస్థల్లో పనిచేసే చాలా మంది ఉద్యోగులకు శాలరీ అకౌంట్ ఉంటుంది. ఇది సాధారణ బ్యాంకు ఖాతా లాగే పనిచేస్తుంది. ఇందులో కంపెనీల యాజమాన్యాలు ప్రతి నెలా జీతాన్ని జమ చేస్తారు. ఈ డబ్బును ఖాతాదారులు ఉపసంహరించుకుంటారు.. లావాదేవీలు చేస్తారు.. ఖర్చులను నిర్వహిస్తారు. అయితే శాలరీ అకౌంట్ తో వచ్చే ఎక్స్ క్లూజివ్ బెనిఫిట్స్ ఏంటో తెలుసా? ఖాతా తెరిచే సమయంలో చాలా బ్యాంకులు ఈ ప్రయోజనాలను వెల్లడించవు.క్లాసిక్ శాలరీ అకౌంట్స్, వెల్త్ శాలరీ అకౌంట్స్, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్స్-శాలరీ, డిఫెన్స్ శాలరీ అకౌంట్స్ ఇలా వివిధ రకాల శాలరీ ఖాతాలను బ్యాంకులు అందిస్తున్నాయి. వీటిలో దాగిఉన్న ఆర్థిక ప్రయోజనాల గురించి ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.యాక్సిడెంటల్ డెత్, హెల్త్ ఇన్సూరెన్స్చాలా శాలరీ అకౌంట్లు యాక్సిడెంటల్ డెత్ కవర్ లేదా హెల్త్ ఇన్సూరెన్స్ ను అదనపు భద్రతా ఫీచర్ గా కలిగి ఉంటాయి. ఖాతాదారులకు, వారి కుటుంబాలకు ఆర్థిక రక్షణను అందిస్తాయి.రుణాలపై తక్కువ వడ్డీ రేట్లుశాలరీ అకౌంట్ హోల్డర్లకు బ్యాంకులు వ్యక్తిగత రుణాలు, గృహ రుణాలపై ప్రిఫరెన్షియల్ వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. దీనివల్ల రుణ కాలపరిమితిలో గణనీయమైన మొత్తాన్ని ఆదా చేసుకోవచ్చు.ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీఅత్యంత ఉపయోగకరమైన ప్రయోజనాలలో ఒకటి ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం. ఇది అత్యవసర పరిస్థితుల్లో మీ ఖాతా బ్యాలెన్స్ జీరో ఉన్నప్పటికీ కొంత డబ్బును ఉపసంహరించుకునే అవకాశం కల్పిస్తుంది.ప్రాధాన్య బ్యాంకింగ్ సేవలువేగవంతమైన ప్రాసెసింగ్, డెడికేటెడ్ కస్టమర్ సర్వీస్, ఎక్స్ క్లూజివ్ బ్యాంకింగ్ ఆఫర్లతో సహా అనేక బ్యాంకులు శాలరీ అకౌంట్ హోల్డర్లకు ప్రాధాన్యతా సేవలను అందిస్తున్నాయి.ఉచిత క్రెడిట్ కార్డులు, రివార్డులుబ్యాంకులు తరచుగా శాలరీ అకౌంట్లతో కాంప్లిమెంటరీ క్రెడిట్ కార్డులను అందిస్తాయి. వార్షిక రుసుమును మాఫీ చేస్తాయి. రివార్డ్ పాయింట్లు, క్యాష్ బ్యాక్, ప్రత్యేక డిస్కౌంట్లను అందిస్తాయి.ఆన్ లైన్ షాపింగ్ & డైనింగ్ డీల్స్శాలరీ అకౌంట్ హోల్డర్లకు ఆన్లైన్ షాపింగ్, డైనింగ్‌పై క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో సహా ప్రత్యేక డిస్కౌంట్లు లభిస్తాయి. జీవనశైలి ఖర్చులను మరింత చౌకగా చేస్తాయి.ఉచిత డిజిటల్ లావాదేవీలుసాధారణ ఖాతాల మాదిరిగా కాకుండా, చాలా బ్యాంకులు శాలరీ ఖాతాదారులకు నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్ ఛార్జీలను మాఫీ చేస్తాయి.ఫ్రీగా చెక్ బుక్, డెబిట్ కార్డులుశాలరీ అకౌంట్ కస్టమర్లకు చాలా వరకు బ్యాంకులు ఎటువంటి రుసుములు లేకుండా చెక్ బుక్ లు, డెబిట్ కార్డులను అందిస్తుంటాయి. ఇవి చిన్నపాటివే అయినా పునరావృతమయ్యేవి కాబట్టి ప్రయోజనం ఉంటుంది.ఉచిత ఏటీఎం లావాదేవీలుఅనేక బ్యాంకులు ప్రతి నెలా ఎక్కువ సంఖ్యలో ఉచిత ఏటీఎం ఉపసంహరణలను అనుమతిస్తాయి. దీంతో అదనపు ఛార్జీల గురించి ఆందోళన లేకుండా నగదును యాక్సెస్ చేసుకోవచ్చు.జీరో బ్యాలెన్స్ ఫెసిలిటీచాలా శాలరీ అకౌంట్లు జీరో బ్యాలెన్స్ ఫీచర్‌తో వస్తాయి. అంటే కనీస బ్యాలెన్స్ నిర్వహించాల్సిన అవసరం ఉండదు. ఇది సాధారణ సేవింగ్స్ ఖాతాలకు లేని ప్రయోజనం. -
World Sleep Day అదే మన కొంప ముంచుతోంది!
ప్రపంచ నిద్ర దినోత్సవం ప్రతీ ఏడాది మార్చి 14న జరుకుంటారు. ప్రపంచం ఆరోగ్యానికి అత్యంత నిర్లక్ష్యం చేయబడిన అంశంఏదైనా ఉందీ అంటే నిద్ర. అందుకే నిద్ర ఆవశ్యతక పై అవగాహనను పెంచుతూ ఆరోగ్యానికి మంచి నిద్ర చాలా అవసరమని ప్రపంచ నిద్ర దినోత్సవం గుర్తుచేస్తుంది. పనికి, వినోదానికి ఇస్తున్న ప్రాధాన్యత నిద్రకు ఇవ్వకపోవడం అనేక రుగ్మతలకు దారితీస్తోంది.నిద్ర ముఖ్యమని మనలో చాలా మందికి తెలుసు, దురదృష్టవశాత్తు నిద్ర అవసరాన్ని మాత్రం గుర్తించడం లేదు. సరిగా నిద్ర పోకపోవడం వల్ల గుండె, నరాల సంబంధిత సమస్యలు, జ్ఞాపకశక్తిని కోల్పోవడం, బరువు పెరగడం వంటి సమస్యలొస్తాయనేవిషయాన్ని గుర్తించడం లేదు గుర్తించినా, నిర్లక్ష్యం, జీవనశైలి, ఒత్తిడి, అనారోగ్యం తదితర కారణాలరీత్యా నిద్రకు దూరమవుతున్నారు. నిద్ర ప్రాముఖ్యతనిద్రలో మన నిష్క్రియాత్మకంగా ఉంటాం...కానీ మన శరీరానికి కావాల్సిన మరమత్తులన్నీ నిద్రలోనే జరుగుతాయి. ముఖ్యంగా రాత్రిపూట మనం పోయే నిద్ర మానసిక ఉల్లాసాన్నిస్తుంది. మెదడులాంటి కీలక అవయవాలకు విశ్రాంతి నిస్తుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. అనేక దీర్ఘకాలిక వ్యాధుల నుండి కాపాడుతుంది.కణజాలాల మరమ్మతు , కండరాల అభివృద్ధి జ్ఞాపకశక్తి పెరగడం ఇవన్నీ నిద్రలోనే జరుగుతాయి. మూడ్ మేనేజ్మెంట్కి నిద్ర చాలా అవసరం. ఆందోళన , నిరాశ దూరమవుతాయి. అంతెందుకు నిద్రలేమి ఒబెసీటీకి, మధుమేహం,ఇతర జీవక్రియ వ్యాధులకు దారి తీస్తుంది.ఎవరికెంత నిద్ర అవసరం?ప్రతి వయస్సు వారికి నిద్ర అవసరం ఉంటుంది. అయితే సాధారణ వ్యక్తి రాత్రిపూట 7 నుండి 9 గంటలు అవసరం.శిశువులు (4-12 నెలలు): 12-16 గంటలుపసిపిల్లలు (1-2 సంవత్సరాలు): 11-14 గంటలుప్రీ-స్కూలర్ (3-5 సంవత్సరాలు): 10-13 గంటలుచదువుకునే పిల్లలు (6-12 సంవత్సరాలు): 9-12 గంటలుటీనేజర్లు (13-18 సంవత్సరాలు): 8-10 గంటలుపెద్దలు (18+ సంవత్సరాలు): 7-9 గంటలు నిద్ర ఎందుకు రాదుస్క్రీన్ ఎక్స్పోజర్: రాత్రిపూట స్క్రీన్ సమయం ఎక్కువైతే నిద్ర పారిపోతుంది. నీలి కాంతికి గురికావడం వల్ల మెలటోనిన్ (నిద్ర హార్మోన్) కు అంతరాయం కలిగిస్తుంది.పడుకునే ముందు , ఇమెయిల్స్, సోషల్‌మీడియా స్క్రోలింగ్ దూరంగా ఉండాలి. పనిలో ఒత్తిడి ఒక ప్రధానమైన సవాల్. పని ఒత్తిడితో సమయానికి నిద్రపోకపోవడం.కెఫిన్ , ఆల్కహాల్: ఆల్కహాల్ మత్తునిస్తుంది, కానీ అది స్లీప్ సైకిల్‌ను పాడు చేస్తుంది.నిద్రలేమి, స్లీప్ అప్నియా, రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్నిద్ర నాణ్యతను ఎలా మెరుగుపడుతుందిచక్కటి శారీరక నిద్రను రారమ్మని పిలుస్తుంది. అలాగే మన స్లీప్ సైకిల్‌ను ఒకేలాగా మెయింటైన్ చేయాలి. ప్రతి రోజూ (వారాంతాల్లో కూడా) ఒకే సమయంలో పడుకోవడం, మేల్కొవడం వల్ల సహజ సిర్కాడియన్ సిస్టం బాగుపడుతుంది.నిద్రకు ముందు పుస్తకం చదవడం, ధ్యానం చేయడం లేదా వెచ్చని నీటితో స్నానం చేయడం వంటివి చేస్తే ఉత్తమం.బెడ్రూమ్ను చల్లగా, చీకటిగా, నిశ్శబ్దంగా ఉండటం, నాణ్యమైన పరుపు, బ్లాక్అవుట్ కర్టెన్లను కూడా ఉపకరిస్తాయి.పగటిపూట నిద్రకు బై బై చెప్పేసి.. వాకింగ్ యోగా, ధ్యానం, జిమ్ లాంటికోసం రోజులోకనీసం అరగంట కేటాయిస్తే చక్కటి నిద్ర మీ సొంమవుతుంది. ‘కంటి నిండా కునుకు పడితే మనసు కుదుట పడుతుంద’ని ఊరికే అన్నారా మరి! ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా నిద్ర మిమ్మల్నిపలకరించకపోతే..మీరు వైద్యుడిని సంప్రదించాల్సిన సమయం వచ్చిందని అర్థం. దీన్ని గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. -
ఇంటి ఓనర్ మహిళ అయితే ఎన్ని ప్రయోజనాలో..
ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలంటారు పెద్దలు. కానీ, ఇల్లే ఇల్లాలి పేరు మీద ఉండాలంటారు నిపుణులు! రెండూ నిజమే. మొదటి దాని గురించి చర్చ అవసరం లేకపోయినా.. రెండో దాని గురించి మాత్రం అవసరమే. ఎందుకంటే ఇంటి ఓనర్ లేదా కో–ఓనర్ మహిళ అయితే ఎన్నో ప్రయోజనాలున్నాయి గనక! గృహ రుణం నుంచి మొదలు పెడితే వడ్డీ రాయితీ, ఆదాయ పన్ను మినహాయింపు, స్టాంప్ డ్యూటీ తగ్గింపు.. ఇలా ఎనెన్నో ప్రయోజనాలున్నాయి. అందుకే తెలివైన గృహ కొనుగోలుదారుడు ఇంటిని భార్య, తల్లి లేకపోతే అక్క, చెల్లి మొత్తమ్మీద మహిళ పేరు మీద కొనుగోలు చేస్తారని నిపుణులు చెబుతున్నారు. – సాక్షి, సిటీబ్యూరోస్టాంప్ డ్యూటీలో తగ్గింపు.. పలు రాష్ట్రాలు ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ల సమయంలో మహిళలకు స్టాంప్ డ్యూటీ రాయితీని అందిస్తున్నాయి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మహిళలకు 1 శాతం రాయితీ ఉండేది. ప్రస్తుతం లేదు. ఢిల్లీలో ప్రాపర్టీ కొనుగోలుదారులకు మగవారికైతే ప్రాపర్టీ విలువలో 6 శాతం స్టాంప్ డ్యూటీ వసూలు చేస్తుండగా.. మహిళ ఓనరైతే 4 శాతం చెల్లించాల్సి ఉంటుంది. జమ్మూ అండ్ కశ్మీర్లో అయితే మహిళ ప్రాపర్టీ కొనుగోలుదారులకు స్టాంప్ డ్యూటీనే లేదు. ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోనూ మహిళా ఓనర్లకు స్టాంప్ డ్యూటీ మినహాయింపులు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అయితే పట్టణ, గ్రామీణ ప్రాంతాల వర్గీకరణ ఆధారంగా కూడా స్టాంప్ డ్యూటీలో మినహాయింపు ఉంది.ఐటీప్రయోజనాలు..గృహ యజమాని లేదా సహ–యజమాని మహిళ అయితే ఆదాయ పన్ను మినహాయింపులు కూడా ఉన్నాయి. భార్యభర్తలు ఇద్దరూ ఉద్యోగులైతే ఇద్దరు వేర్వేరుగా అసలు, వడ్డీలపై ఐటీ తగ్గింపులను క్లయిమ్ చేసుకునే వీలుంది. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ ప్రకారం సహ దరఖాస్తుదారు ప్రిన్సిపల్ అమౌంట్‌పై ఏడాదికి రూ.1.5 లక్షల వరకు, చెల్లించిన వడ్డీపై రూ.2 లక్షల వరకు ప్రయోజనాన్ని పొందవచ్చు. అలాగే సెక్షన్ 80ఈఈ కింద ఇతర క్లెయిమ్‌లతో పాటు తొలిసారి గృహ యజమానురాలు మహిళ అయితే ప్రిన్సిపల్ అమౌంట్ మీద రూ.50 వేలు తగ్గింపు కూడా అందుతుంది. అద్దె ఆదాయంపై కూడా.. మహిళలు ఆస్తిని విక్రయించేటప్పుడు క్యాపిటల్ గెయిన్ మినహాయింపులను కూడా పొందవచ్చు. అంతేకాకుండా ప్రాపర్టీని మహిళలు అద్దెకు ఇస్తే.. ఆమె రెండు రకాల తగ్గింపులకు క్లయిమ్ చేసుకోవచ్చు. అద్దెకు ఇచ్చిన ప్రాపర్టీపై ఏదైనా లోన్‌పై చెల్లించే వడ్డీపై పన్ను తగ్గింపుతో పాటు రెంటల్ ఆదాయంపై 30 శాతం స్టాండర్డ్ డిడెక్షన్ లభిస్తుంది. అయితే పన్ను ప్రయోజనాలను క్లెయిమ్ చేయాలంటే మహిళలకు ఆదాయ వనరులు ఉండాల్సిందే. గృహ రుణ వడ్డీ రేట్ల తగ్గింపు..బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థలు మహిళలను విశ్వసనీయ రుణ గ్రహీతలుగా పరిగణిస్తుంటాయి. అందుకే స్థిరాస్తి రంగంలో మహిళా పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక రుణ కార్యక్రమాలను, స్కీమ్‌లను అందుబాటులోకి తీసుకొస్తుంటాయి. తక్కువ వడ్డీ రేట్లకు రుణాలను అందిస్తున్నాయి. ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ వంటి బ్యాంకులలో పురుష రుణ గ్రహీతలతో పోలిస్తే మహిళలకు హోమ్ లోన్ వడ్డీ రేట్లు 0.5 నుంచి 1 శాతం తక్కువగా ఉంటాయి.ఈ శాతం తక్కువగా కనిపిస్తున్నప్పటికీ దీర్ఘకాలంలో డబ్బు, ఈఐఎంను ఆదా చేస్తుంది. ప్రధాన్‌మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద లో ఇన్‌కం గ్రూప్(ఎల్ఐజీ) కేటగిరీ కింద మహిళలకు రూ.6 లక్షల రుణానికి 6.5 శాతం వడ్డీ రాయితీతో.. రూ.2.67 లక్షల వరకు సబ్సిడీని పొందవచ్చు. ఇన్‌కం సోర్స్ లేని మహిళలకు బ్యాంక్‌లు రుణాలను అందించవు.వారసులకు బదిలీ సులువు..మహిళ పేరిట ప్రాపర్టీ ఉంటే అది ఆమె ఎస్టేట్‌లో భాగమవుతుంది. ఎటువంటి చట్టపరమైన చిక్కులు లేకుండా ఆమె వారసులకు సులభంగా బదిలీ అవుతుంది. అయితే విడాకుల సమయంలో సేల్‌డీడ్ ఆధారంగా ఆస్తి కేటాయింపులు ఉంటాయి. ఏదైనా చట్టపరమైన వివాదాలు తలెత్తితే ఆస్తి మహిళ పేరు మీద ఉన్నప్పటికీ భర్త ఉమ్మడిగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. -
దున్నకుండా.. కలుపు తీయకుండా.. రసాయనాల్లేకుండానే సాగు!
రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడకుండా వ్యవసాయం చేస్తున్నారంటే ఇప్పుడెవరూ ఆశ్చర్యపోవడం లేదు. కానీ.. ఎద్దులతోనో, ట్రాక్టరుతోనో దున్నే పనే లేకుండా ప్రకృతి వ్యవసాయం చేయొచ్చంటే.. నమ్మలేం. అయితే, మధ్యప్రదేశ్‌కు చెందిన దివంగత రైతు శాస్త్రవేత్త రాజు టైటస్ మాత్రం 30 ఏళ్ల పాటు ఇలాగే వ్యవసాయం చేసి సత్ఫలితాలు సాధించారు. ‘ప్రకృతి వ్యవసాయం వెనుకబడినదో లేదా ప్రాచీనమైనదో కాదు. ఆధునికమైనది, వినూత్నమైనది అని రాజు టైటస్ రుజువు చేశారు’ అని ఐసిఎఆర్ ప్రశంసించింది. ఆరేళ్ల క్రితం కన్నుమూసినా.. ఆయన కృషి రైతులకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్‌కు చెందిన ‘రాజు టైటస్’ ప్రభుత్వోద్యోగి. అయినా కుటుంబ వారసత్వంగా వచ్చిన 13 ఎకరాల పొలాన్ని సాగు చేయటం మానలేదు. 70వ దశకంలో అందరిలానే ఆయనా ‘హరిత విప్లవం’ ఒరవడిలో రసాయన ఎరువులు, కీటకనాశనులు వాడటం మొదలుపెట్టారు. మొదట్లో దిగుబడులు పెరిగి ఆదాయం వచ్చినా పదిహేనేళ్లు తిరిగేసరికి పంట భూమి నిస్సారమయింది. దిగుబడులు తగ్గి నష్టాల పాలై పొలం అమ్మేయాలని నిశ్చయించుకున్నాడు. ఇది జరిగింది 1984లో. రాజు నిర్ణయంతో తల్లి హతాశురాలయింది. గాంధేయవాదులు నడిపే స్వచ్ఛంద సంస్థ ‘ఫ్రెండ్స్ రూరల్ సెంటర్’ కార్యకర్తలతో ఆమె తన గోడు వెళ్లబోసుకుంది. వారు ఆమె చెప్పినదంతా విని జపాన్ దేశానికి చెందిన ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్త మసనోబు ఫుకుఒకా రాసిన ‘గడ్డిపరకతో విప్లవం’ (వన్ స్ట్రా రివల్యూషన్) పుస్తకాన్నిచ్చి మీ సమస్యకు ఈ పుస్తకం పరిష్కారాన్ని చూపుతుందని చెప్పారు. కలుపు తీయకుండా.. దుక్కిదున్నకుండా.. ఎరువులు వేయకుండా.. పురుగు మందులు పిచికారీ వంటి పద్ధతులు అనుసరించకుండానే పంటలను సాగు చేసే పద్ధతుల గురించి పుకుఒకా ఆ పుస్తకంలో వివరించారు. ఈ పుస్తకాన్ని చదివిన రాజు తను సాగులో తను అనుసరిస్తున్న పద్ధతులు అనర్థ హేతువులని అర్థం చేసుకున్నారు.అడ్డంకులను అధిగమించి.. 15 ఏళ్లుగా రసాయన ఎరువులు వేస్తూ పంటభూమిని ధ్వంసం చేస్తున్నానని అర్థం చేసుకున్న రాజు వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు. 1985 నుంచి పుకుఒకా చెప్పిన పద్ధతులను అనుసరించి వ్యవసాయం చేయటం మొదలుపెట్టారు. అప్పటి నుంచి నేలను దున్నటం, ఎరువులు, పురుగుమందుల వాడకం ఆపేశారు. రకరకాల గడ్డి, చెట్ల విత్తనాలను పొలంలో వెదజల్లి అవి పెరిగాక కత్తిరించి ఆచ్ఛాదనగా వాడేవారు. దీనివల్ల వర్షపు నీరు బయటకు వెళ్లకుండా పొలంలోనే ఇంకి.. నేల గుల్లబారటంతో పాటు తేమను పట్టి ఉంచింది. తొలుత గ్రామస్తులు అవహేళన చేసినా అడ్డంకులను అధిగమించి రాజు ప్రకృతిసేద్యం దిశగా వడివడిగా అడుగులు వేశారు.సోయా విత్తన బంతులు!అంకితభావంతో రాజు టైటస్ చేసిన కృషి ఫలితాన్నిచ్చింది. 1988లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాల్లో పాల్గొనటానికి ఇండియా వచ్చిన ఫుకుఒకా ప్రకృతిసేద్యం చేస్తున్న రాజు గురించి తెలుసుకొని ఆయన పొలాన్ని సందర్శించారు. ఫుకుఒకా సలహాలు సూచనలను అనుసరించి రెట్టించిన ఉత్సాహంతో రాజు పనిచేశారు. పుకుఒకా సూచన మేరకు పంటను విత్తుకోవటానికి బదులు.. ఒక పాలు సోయా విత్తనం, ఏడు పాళ్లు మట్టి కలిపి క్రికెట్ బాల్ పరిమాణంలో ఉండే ‘విత్తన బంతుల’ ను తయారు చేశారు. భార్య శాళిని సహకారంతో.. అడుగుకో బంతి చొప్పున.. పొలంలో వేశారు. దీనివల్ల మొలకెత్తినప్పటి నుంచే మొక్కలు పోషకాలను, సూర్యరశ్మిని ఎక్కువగా గ్రహించి ఏపుగా ఎదిగాయి. ఆ ఏడాది దిగుబడి బావుండటంతో పాటు నాణ్యమైన పంట వచ్చింది. సోయా మొక్కల మధ్య ఎత్తుగా పెరిగిన గడ్డిని కత్తిరించి భూమిపైన ఆచ్ఛాదనగా వేశారు. దీనివల్ల పంటలకు మేలు చేసే వానపాములు, మిత్రపురుగులు, సూక్ష్మజీవులకు ఆశ్రయం లభిస్తుంది. పంటలకు హానిచేసే శతృ పురుగులను ఇవి నిర్మూలిస్తాయి. దీనివల్ల రసాయనిక ఎరువులు, కీటకనాశనుల అవసరం తప్పుతుంది. ఇవి నేలలో చేసే బొరియల వల్ల వర్షపు నీరు భూమిలోకి ఇంకుతుంది. వేర్లు లోతుకంటా చొచ్చుకు΄ోయి తేమను ΄ోషకాలను గ్రహిస్తాయి. నేల గుల్లబారి భూ సారం పెరిగి మంచి పంట దిగుబడులు వస్తాయి. నేలను దున్నాల్సిన అవసరం లేకపోవటం వల్ల ట్రాక్టరు.. ఎద్దుల కోసం అప్పు చేయాల్సిన అగత్యం తప్పింది. రాజు తన పొలంలో నత్రజనిని స్థిరీకరించేందుకు సుబాబుల్ చెట్లను సాగు చేశారు. దీనివల్ల యూరియా రూపంలో రసాయన ఎరవును అందించాల్సిన అవసరం ఉండదంటారాయన. సుబాబుల్ ఆకులు మేకలకు మంచి మేతగా ఉపయోగపడ్డాయి. ఈ చెట్ల కలపతో పాటు మేకల విక్రయం ద్వారా ఆదాయం లభిస్తోంది. ఆ విధంగా 30 ఏళ్లకు పైగా పొలాన్ని దున్నకుండానే సమృద్ధిగా పంటలు పండిస్తూ పేరు΄ పొందారు. వినియోగదారులు అడిగితేనే రైతులు పండిస్తారు!వినియోగదారులు కూడా ఆరోగ్యకరమైన ఆహారం కోసం డిమాండ్ చేసినప్పుడే రైతులు రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడటం మానేస్తారు. ఆరోగ్యకరమైన నేల ద్వారానే ఆరోగ్యకరమైన ఆహారోత్పత్తి సాధ్యమనే విషయాన్ని గుర్తిస్తారు’ అనేవారు రాజు టైటస్. మన దేశంలో ప్రజలకు సోకుతున్న పలు జబ్బులకు మూలకారణం ఆహార పంటల సాగులో వాడుతున్న రసాయనాలు. వీటి వల్ల తొలుత మధుమేహం సోకి పలు దీర్ఘకాలిక అనారోగ్యాలకు దారితీస్తుంది. నాకు పక్షవాతం వచ్చింది. నా భార్య గుండెజబ్బు వ్యాధిగ్రస్తురాలు. అయినా మేం కోలుకోవటానికి ప్రకృతి సేద్య పంట ఉత్పత్తులే కారణం అన్నారాయన. ఇదీ చదవండి: మదర్స్ ప్రైడ్ : తల్లిని తలుచుకొని నీతా అంబానీ భావోద్వేగంమా కుటుంబ అవసరాల కోసం ప్రస్తుతం ఎకరా పొలంలో ధాన్యం, పండ్లు, పాలు, కూరగాయలను సాగు చేస్తున్నాం. ఖరీఫ్‌లో గోధుమ, వరి, మొక్కజొన్న, రబీలో పెసరను సాగు చేస్తున్నాం. రోజురోజుకు వ్యవసాయంలో పెరుగుతున్న ఖర్చులే రైతు ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి. ఫుకు ఒకా విధానంలో ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు అప్పులు చేయాల్సిన అవసరం ఉండదు. ఈ సేద్యం మూలసూత్రాలను ఒంటబట్టించుకుంటే ఏ రైతైనా పొలాన్ని దున్నకుండానే సేద్యం చేయవచ్చు అంటారు రాజు టైటుస్! -
కోర్టుల్లో ఏఐ ప్రయోజనాలపై విశ్లేషణ అవసరం
విశాఖ–లీగల్: ‘కోర్టులు–మీడియా పరస్పర సహకారం, సమన్వయంతో పని చేయాలి. జవాబుదారీతనంతో కూడిన పనితీరును ప్రదర్శిస్తూ, బాధ్యతాయుతమైన పాత్ర పోషించాలని సుప్రీంకోర్టు, వివిధ హైకోర్టుల న్యాయమూర్తులు పేర్కొన్నారు. న్యాయస్థానాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలపైనా విశ్లేషణ అవసరమని అభిప్రాయపడ్డారు. విశాఖపట్నంలోని ఏయూ కన్వెన్షన్ హాలులో రెండు రోజులుగా కొనసాగుతున్న సౌత్ జోన్–2 జ్యుడీషియల్ ప్రాంతీయ సదస్సు ఆదివారం ముగిసింది. చివరి రోజు ‘జ్యుడీషియరీ అండ్ మీడియా, అడ్వాన్సింగ్ జ్యుడీషియల్ గవర్నెన్స్ త్రూ ఎమెర్జింగ్ అండ్ ఫ్యూచర్ టెక్నాలజీస్’ అనే అంశాలపై చర్చ నిర్వహించారు.ముందుగా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్ అధ్యక్షతన ‘కోర్టులు–మీడియా పాత్ర’ అనే అంశంపై చర్చ జరిగింది. రిసోర్స్ పర్సన్లుగా కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దేవన్ రామచంద్రన్, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మౌషిమి భట్టాచార్య వ్యవహరించారు. అనంతరం ‘అడ్వాన్సింగ్ జ్యుడీషియల్ గవర్నెన్స్’పై జస్టిస్ కురియన్ జోసెఫ్ అధ్యక్షతన చర్చ నిర్వహించారు. కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏఎం ముస్తాక్యు, మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.సుందర్ రిసోర్స్ పర్సన్లుగా వ్యవహరించారు. జస్టిస్ కురియన్ జోసెఫ్ మాట్లాడుతూ సమాచారాన్ని చేరవేయడంలో మీడియా పాత్ర, తీర్పులు, ఇతర కోర్టు ప్రొసీజరల్ అంశాల్లో ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ పాత్ర ఆవశ్యకతను న్యాయమూర్తులు తెలుసుకోవాలని, వినియోగంపై విశ్లేషణ చేసుకోవాలని సూచించారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియాలు ప్రస్తుతం పోషిస్తున్న పాత్రపై అవగాహన కలిగి ఉండటంతోపాటు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దేవన్ రామచంద్రన్ మాట్లాడుతూ నిజాలను నిర్ధారించుకుని వాస్తవాలను వార్తలుగా ప్రచురించాలని సూచించారు. ట్రయల్ అంశాలను ముందుగా బహిర్గతం చేయకూడదని హితవుపలికారు.జస్టిస్ ఎం.సుందర్ కోర్టు వ్యవహారాల్లో ఏఐ పాత్ర గురించి వివరించారు. ఏఐ అనేది న్యాయమూర్తులకు సహకారిగా మాత్రమే ఉంటుందని, ప్రత్యామ్నాయం కాదని అభిప్రాయపడ్డారు. న్యాయమూర్తులు ఏఐ టెక్నాలజీని పరిగణనలోకి తీసుకోవచ్చని, కానీ.. దానినే తుది నిర్ణయంగా, అంతిమ ప్రామాణికంగా తీసుకోకూడదని పేర్కొన్నారు. జస్టిస్ ఏఎం ముస్తాక్యు మాట్లాడుతూ కేరళలో కోర్టు వ్యవహారాల నివేదికలను రూపొందించేందుకు ఏఐ, గూగుల్ నోట్‌బుక్ సాయం తీసుకుంటున్నామని తెలిపారు. ఏఐ వినియోగంలో సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి, ఏపీ జ్యుడీషియల్ అకాడమీ ప్రెసిడెంట్ జస్టిస్ రవినాథ్ తిల్హారీ వందన సమర్పణ చేశారు. విశాఖ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎంవీ శేషమ్మ, ఇతర న్యాయమూర్తులు పాల్గొన్నారు. -
కొంచెమైనా.. ముంచేస్తుంది!
అతిగా మద్యం తాగడం ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమని అందరికీ తెలిసిందే. కానీ కొందరు వైద్యులు, సైంటిస్టులు, డైటీషియన్లు వంటివారు రోజూ స్వల్ప మొత్తంలో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల లాభం ఉంటుందని, గుండె జబ్బులను దూరం పెడుతుందని చెబుతూ ఉంటారు. కానీ దీనికి పక్కా ఆధారాలేమీ లేవని, రోజూ కాస్తంత ఆల్కహాల్ తీసుకున్నా కేన్సర్ బారినపడే ముప్పు పెరిగిపోతుందని అమెరికా సర్జన్ జనరల్ వివేక్ మూర్తి స్పష్టం చేస్తున్నారు. దీనికి సంబంధించి పలు అధ్యయనాలు, గణాంకాల్లో తేలిన అంశాలను ఆధారంగా చూపుతున్నారు. సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులపై అవి కేన్సర్‌కు దారితీస్తాయంటూ ఎలా హెచ్చరికలు ముద్రిస్తారో.. అలా ఆల్కహాల్ ఉత్పత్తులపైనా ముద్రించాలని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఆయన నివేదిక ప్రకారం..ఆల్కహాల్‌కు కేన్సర్‌కు లింకేమిటి?⇒ తగిన జాగ్రత్తలు తీసుకుని నివారించుకునే అవకాశమున్న కేన్సర్లలో.. పొగాకు, ఊబకాయం తర్వాత ఎక్కువగా నమోదవుతున్నవి ఆల్కహాల్ కారణంగానే. ప్రపంచ ఆరోగ్య సంస్థ కేన్సర్ రీసెర్చ్ విభాగం కూడా ఆల్కహాల్‌ను ప్రధానమైన కేన్సర్ కారకాల్లో (గ్రూప్ 1 కార్సినోజెన్) ఒకటిగా గుర్తించడం గమనార్హం. ⇒ అమెరికాలో ఏటా ఆల్కహాల్ కారణంగా కేన్సర్ బారినపడి మరణిస్తున్నవారు.. 20 వేల మంది ⇒ 2020లో ప్రపంచవ్యాప్తంగా ఆల్కహాల్ వినియోగం కారణంగా నమోదైన కేన్సర్ కేసులు... 7.4 లక్షల మంది.(ఒక డ్రింక్ అంటే సుమారుగా.. 330 మిల్లీలీటర్ల బీరు లేదా 35 మిల్లీలీటర్ల విస్కీ)7 ఆల్కహాల్‌తో రకాల కేన్సర్ల ముప్పుపొగాకు నేరుగా కేన్సర్లకు కారణమైతే.. ఆల్కహాల్ ఏడు రకాల కేన్సర్లకు దారితీస్తుంది. మన దేశంలో కాలేయ కేన్సర్‌కు ముఖ్య కారణంగా ఆల్కహాల్ నిలుస్తోంది. ఇక ఆల్కహాల్, పొగాకు ఉత్పత్తులు రెండూ కలిస్తే కేన్సర్ల ముప్పు మరింత తీవ్రమవుతుందని కేన్సర్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.ఆల్కహాల్ కేన్సర్‌కు దారితీసేదిలా.. 1. శరీరంలో ఆల్కహాల్ అసిటాల్డిహైడ్‌గా మారుతుంది. ఇది మన కణాల్లోని డీఎన్ఏను దెబ్బతీసి, కేన్సర్ ముప్పును పెంచుతుంది. 2. ఆల్కహాల్ శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను పెంచుతుంది. ఇది శరీరంలో కణాలు, ప్రొటీన్లు, డీఎన్ఏను దెబ్బతీసి కేన్సర్‌కు కారణమయ్యే ఇన్ఫ్లమేషన్కు కారణమవుతుంది. 3. ఆల్కహాల్ కారణంగా శరీరంలో వివిధ హార్మోన్లలో విపరీతమైన హెచ్చుతగ్గులు వస్తాయి. ఇది కేన్సర్‌కు దారితీస్తుంది. ముఖ్యంగా మహిళల్లో ఈస్ట్రోజన్ హార్మోన్‌పై ప్రభావం పడి రొమ్ము కేన్సర్ ముప్పు పెరుగుతుంది. 4. కేన్సర్‌కు కారణమయ్యే పదార్థాలను (కార్సినోజెన్లు) శరీరం ఎక్కువగా సంగ్రహించడానికి ఆల్కహాల్ కారణమవుతుంది.ఎంత తాగితే.. అతిగా తాగినట్టు? ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన పలు అధ్యయనాల మేరకు.. రోజూ కనీసం ఒక డ్రింక్ ఆల్కహాల్ తాగేవారిలో కేన్సర్ల ముప్పు 10 నుంచి 40% వరకు పెరుగుతుంది. డ్రింక్స్ సంఖ్య పెరిగిన కొద్దీ.. ముప్పు అదే స్థాయిలో పెరుగుతూ పోతుంది. అక్కడి అధ్యయనం మనకెందుకు? ప్రపంచంలోనే అత్యధిక జనాభాకు తోడు ఆల్కహాల్ వినియోగం కూడా ఎక్కువగానే ఉండటంతో.. భారత్‌లోనూ ఈ కేన్సర్ల ముప్పు ఎక్కువ. ‘ది లాన్సెట్ అంకాలజీ’ జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధన వివరాల మేరకు... 2020లో భారత్‌లో కొత్తగా 62,100 ఆల్కహాల్ ఆధారిత కేన్సర్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేన్సర్ కేసుల్లో ఇవి 5 శాతానికన్నా ఎక్కువే కావడం గమనార్హం.మన దేశంలో కొన్నేళ్లుగా పెరిగిపోతున్న ఊబ కాయం సమస్యకు తోడుఆల్కహాల్, పొగాకు ఉత్పత్తుల వినియోగం ఈ పరిస్థితికి దారితీస్తోందని అంకాలజీ నిపుణులు చెబుతున్నారు.మరి ఈ కేన్సర్ల ముప్పు నుంచి బయటపడేదెలా?రోజూ స్వల్ప మొత్తంలో ఆల్కహాల్ తీసుకున్నా కేన్సర్ ముప్పు తప్పదని ఈ అధ్యయనం తేల్చింది. అంటే ఈ ముప్పు నుంచి బయటపడటానికి ఉన్న ఏకైక మార్గం... ఆల్కహాల్‌కు పూర్తిగా దూరంగా ఉండటమేనని అంకాలజీ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఒక్కసారిగా అలవాటు మానుకోలేనివారు.. స్వల్పంగా తీసుకుంటూ మానేయాలని, అదే సమయంలో సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులకు కచి్చతంగా దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. –సాక్షి,సెంట్రల్ డెస్క్ -
పోస్టాఫీసులో అకౌంట్ ఉంటే ఇన్ని బెనిఫిట్సా?
నేటి రోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతా ఉంది. ముఖ్యంగా ఉద్యోగులు, వ్యాపారులకు కచ్చితంగా బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. బ్యాంక్ ఖాతాదారులకు సాధారణంగా ఏటీఎం ( ATM ) కార్డ్‌లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌తోపాటు మరిన్ని సౌకర్యాలు ఉంటాయి. అయితే గ్రామీణ ప్రాంతాలలో చాలా మంది ప్రజలు పోస్టాఫీసులో ( Post Office ) పొదుపు ఖాతాలను తెరవడానికి ఇష్టపడతారు.పోస్టాఫీసులు అందుబాటులో ఉండటంతోపాటు అందులో సరళమైన విధానాలే ఇందుకు కారణం. బ్యాంకు ఖాతాతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో దాదాపు అన్ని ప్రయోజనాలు పోస్టాఫీసులో పొదుపు ఖాతాను ( Savings Account ) తెరవడం వల్ల కూడా పొందవచ్చు. పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాను ఎవరు తెరవగలరు.. ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయన్నది ఈ కథనంలో పూర్తిగా తెలుసుకుందాం.పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాను ఎవరు తెరవచ్చు?పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాను తెరవడానికి ముందు మీరు అర్హులో కాదో చూసుకోవడం ముఖ్యం. అర్హత కలిగిన వయసున్న భారతీయ పౌరుడెవరైనా పోస్టాఫీసు అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఇక మైనర్ పిల్లల తరపున తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులు ఖాతా తెరవవచ్చు.పోస్టాఫీసు సేవింగ్స్ అకౌంట్ ప్రయోజనాలు» ఏటీఎం కార్డ్ సౌకర్యం» చెక్‌బుక్ సేవలు» ఈ-బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్» కనీస డిపాజిట్ కేవలం రూ. 500. ఇది చాలా బ్యాంకు ఖాతాలతో పోలిస్తే తక్కువపోస్టాఫీసులో అకౌంట్ తెరవండిలా.. » మీ సమీప పోస్టాఫీసును సందర్శించండి. సంబంధిత అధికారిని కలవండి. అకౌంట్ ఓపెనింగ్ ఫారమ్ తీసుకుని అవసరమైన వివరాలను పూరించండి.» పూర్తి చేసిన ఫారమ్‌కు మీ ఆధార్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్ వంటి అవసరమైన డాక్యుమెంట్లను అటాచ్ చేయండి. మీ దరఖాస్తును సమీక్షించే అధికారికి ఫారమ్‌ను సమర్పించండి. మీ వివరాలను ధ్రువీకరించిన తర్వాత మీ సేవింగ్స్ ఖాతా తెరుస్తారు. -
ఆరోగ్య బీమా ఉంటే.. ఎన్ని ప్రయోజనాలో..
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అయితే, ఆసుపత్రుల కార్పొరేటీకరణ కారణంగా దేశీయంగా ఆరోగ్య సంరక్షణ, వైద్య చికిత్స వ్యయాలు పెరిగిపోతున్నాయి. ఇటీవలి నివేదికల ప్రకారం ఆసియా మొత్తం మీద భారత్‌లో ఇందుకు సంబంధించిన ద్రవ్యోల్బణం అత్యధికంగా 14 శాతంగా ఉంది. ఈ నేపథ్యంలో పెరిగే వైద్య చికిత్స వ్యయాల భారాన్ని తట్టుకునేందుకు ఆరోగ్య బీమా అనేది ఎంతగానో ఉపయోగపడే సాధనంగా ఉంటోంది. ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం, ఆర్థికంగా ఆదా చేసుకోవడం రెండూ ఒకదానికి ఒకటి ముడిపడి ఉన్న అంశాలు. సమగ్రమైన ఆరోగ్య సంరక్షణ పథకాలు ఈ విషయంలో కీలక పాత్ర పోషిస్తాయి. పటిష్టమైన ఆరోగ్య బీమా పథకంలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పాలసీదారులు ఆర్థిక సమస్యల గురించి ఆందోళన చెందకుండా నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందుకోవచ్చు.ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధునిక ఆరోగ్య బీమా పథకాలు అనేక ప్రయోజనాలు అందిస్తున్నాయి. వాటిలో కొన్ని: నగదురహిత చికిత్స: పాలసీదారులు పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా కేవలం తమ పాలసీ నంబరును ఇచ్చి, వైద్య చకిత్సలు పొందేందుకు ఇది ఉపయోగపడుతుంది. మెడికల్ ఎమర్జెన్సీల్లో పాలసీదారును ఇబ్బంది పెట్టకుండా బిల్లులను నేరుగా బీమా కంపెనీతో ఆసుపత్రి సెటిల్ చేసుకుంటుంది. నో క్లెయిమ్ బోనస్: క్లెయిమ్లేమీ చేయని పాలసీదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు చాలా కంపెనీలు నో–క్లెయిమ్ బోనస్‌ను ఆఫర్ చేస్తున్నాయి. తదుపరి సంవత్సరంలో ప్రీమియంను తగ్గించడమో లేదా సమ్ అష్యూర్డ్‌ను పెంచడం రూపంలోనో ఈ ప్రయోజనాన్ని అందిస్తున్నాయి. ఆరోగ్యకరమైన జీవన విధానానికి ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి. టాప్–అప్, సూపర్ టాప్–అప్ ప్లాన్లు: బేసిక్ సమ్ ఇన్సూర్డ్ పరిమితి అయిపోతే, అదనంగా కవరేజీని పొందేందుకు టాప్–అప్, సూపర్ టాప్–అప్ ఉపయోగపడతాయి. తక్కువ ఖర్చులో అదనంగా కవరేజీని పొందేందుకు ఇవి సహాయకరంగా ఉంటాయి. వెల్నెస్, ప్రివెంటివ్ కేర్: బీమా సంస్థలు వెల్నెస్, ప్రివెంటివ్ కేర్‌పై మరింతగా దృష్టి పెడుతున్నాయి. పాలసీదారులు తీవ్రమైన ఆరోగ్య సమస్యల బారిన పడకుండా జాగ్రత్తపడేందుకు ఈ ప్రోగ్రాంల కింద ఉచితంగా హెల్త్ చెకప్‌లు, జిమ్ మెంబర్‌షిప్‌లు, డైట్ కౌన్సిలింగ్ మొదలైనవి అందిస్తున్నాయి. తద్వారా ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పాటించేలా బీమా సంస్థలు ప్రోత్సహిస్తున్నాయి. అవసరాలకు అనుగుణంగా కవరేజీ: పాలసీదారులు తమ నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా కవరేజీని తీసుకునే విధంగా ఆధునిక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు ఉంటున్నాయి. వీటికి అదనంగా రక్షణ కోసం రైడర్లను జోడించుకోవడం కావచ్చు లేదా నిర్దిష్ట కవరేజీ ఆప్షన్లను ఎంచుకోవడం కావచ్చు పాలసీదారులకు కొంత వెసులుబాటు ఉంటోంది. -
ముక్కోణంతో మజిల్స్‌కు బలం
వెన్నునొప్పిని తగ్గించడానికి, కండరాలను బలోపేతం చేయడానికి త్రికోణాసనం సహాయపడుతుంది. సయాటికా సమస్యను తగ్గించడానికి ప్రభావ వంతంగా పనిచేస్తుంది. ఈ ఆసనంలో వెన్నెముక, చేతులు, ఛాతీ స్ట్రెంచింగ్ అవుతాయి. దీనివల్ల కండరాలు దృఢపడతాయి. త్రికోణాసనం వేయాలంటే...∙ముందు పాదాలను దూరంగా పెట్టి నిటారుగా నిల్చోవాలి. ∙తర్వాత చేతులను రెండువైపులకు చాచాలి. దీర్ఘశ్వాస తీసుకోవాలి. ∙నెమ్మదిగా శ్వాస వదులుతూ తుంటి నుంచి శరీరాన్ని కుడివైపునకు వంచాలి. ∙ఇలా వంచేటప్పుడు కూడా నడుము నిటారుగానే ఉంచాలి. ∙ఎడమ చేయిని పైకెత్తి, కుడి చేతిని కుడి పాదానికి తాకించాలి. ∙చేతులు రెండూ ఒకే వరుసలో ఉండేలా చూసుకోవాలి. ∙తల కుడివైపునకు తిప్పి, ఎడమ చేయిని చూడాలి. ∙తర్వాత శ్వాస తీసుకుంటూ యథాస్థితికి రావాలి. ఆ తర్వాత.. మరోవైపున కూడా ఇలాగే చేయాలి. ఈ ఆసనాన్ని రోజూ సాధన చేయడం వల్ల శరీరమంతా స్ట్రెచ్ అవడంతో పాటు, మానసిక శారీరక ఒత్తిడులు తగ్గుతాయి. – అనూషా కార్తీక్ -
ఒకే సమయం నిద్రతో ఒత్తిడికి కళ్లెం
న్యూఢిల్లీ: నిద్ర. అలసిన శరీరాన్ని అమాంతం ఆక్రమించి మరోలోకానికి తీసుకెళ్లే అదృశ్యదేవత. అలాంటి నిద్రాదేవత ఆవాహన చిన్నారుల్లో రోజూ ఒకేసమయంలో జరిగితే ఒనగూరే ప్రయోజనాలు అంతాఇంతా కాదని తాజా పరిశోధనాలో వెల్లడైంది. అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీలోని పరిశోధకులు ఈ మేరకు ఆరేళ్ల వయసు చిన్నారులపై ఒక విస్తృతస్థాయి, సుదీర్ఘ పరిశోధన చేశారు. పుట్టినప్పటి నుంచి రెండున్నరేళ్ల వయసు వచ్చే వరకు కొందరు చిన్నారులను వారి తల్లిదండ్రులు శ్రద్ధాసక్తులతో పెంచేలా ఆ పేరెంట్స్‌కు శిక్షణనిచ్చారు. చిన్నారి వేర్వేరు సందర్భాలకు తగ్గ భావోద్వేగాలు, శారీరక అవసరాలను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు తీరుస్తూ వారి ఆలనాపాలనా బాధ్యతలను చక్కగా నెరవేర్చేలా చూశారు. మారాంచేసినపుడు గారాబం చేయకుండా పరిస్థితిని చక్కగా విడమరిచి చెప్పేలా తల్లిదండ్రులకు తగు తరీ్ఫదునిచ్చారు. అలసపోయి నిద్రలోకి జారుకునేటపుడు నిద్రకు అనువైన వాతావరణం ఉండేలా చూడడం, దీపాలన్నీ ఆర్పేసి చిన్నారులను వీపుపై తడుతూ బుజ్జిగించి పడుకోబెట్టడం వంటివి చేయాలని పరిశోధకులు సూచించారు. పరిశోధనలో ఏం తేలింది? ఇలా చేయడం వల్ల చిన్నారులు రోజూ ఒకే సమయానికి పడుకోగలిగారు. నిద్రసమయం కూడా దాదా పు వారి వయసుకు తగ్గట్లు ఉండేది. దీంతో చిన్నారులు తమ దైనందిన జీవితంలో చవిచూసిన భావోద్వేగాలను చక్కగా నియంత్రించుకోవడం పరిశోధకులు గమనించారు. ఒకే సమయంలో నిద్రపోవడం వల్ల గాఢ నిద్ర సాధ్యమైంది. ‘‘స్థిరమైన నిద్రాకాలం అనేది పిల్లల ఎదుగుదలకూ ఎంతో తోడ్పడింది. నిద్రసరిగా పట్టకపోవడం వంటి సమస్యలు వీరిలో తలెత్తలేదు’’అని పరిశోధకులు చెప్పారు. సంబంధిత వివరాలు డెవలప్మెంటల్ అండ్ బిహేవియర్ పిడియాట్రిక్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఇతర చిన్నారుల్లో ఇబ్బందులు పరిశోధనకు ఎంచుకున్న పిల్లలతో పోలిస్తే అస్తమానం అస్తవ్యస్త్య సమయాల్లో నిద్రించే పిల్లల్లో భావోద్వేగాలపై నియంత్రణ చాలా తక్కువగా ఉందని ఈ అధ్యయనంలో కీలక పరిశోధకుడు అద్వా డాడ్జీ చెప్పారు. ఈయన పెన్సిల్వేనియా స్టేట్ వర్సిటీలో బిహేవియర్ హెల్త్ విభాగంలో సేవలందిస్తున్నారు. పరిశోధకులు పిల్లలు రోజు ఏ సమయానికి నిద్రపోతున్నారు, ఎంతసేపు నిద్రపోతున్నారు, గాఢనిద్ర వివరాలు తెల్సుకునేందుకు వాళ్ల మణికట్టుకు మానిటర్లను అమర్చారు. ఎలాంటి ప్రయోగాలు చేశారు? ఒకేసమయంలో నిద్రించే పిల్లలకు ఒక పెద్ద బొమ్మల సమూహం నుంచి ఒకేఒక్క బొమ్మను తీసుకుని ఆడుకోవాలని సూచించారు. ప్రతి బొమ్మను విడివిడిగా ఒక చిన్న పెట్టెలో తాళం వేసి దాచారు. ఆ పెట్టెల తాళంచెవులను ఇచ్చి తెరచి తీసి ఆడుకోవాలని సూచించారు. ఏ తాళంచెవికి ఏ పెట్టే తెరచుకుంటుందో కనిపెట్టేందుకు.. ఒకేసమయంలో నిద్రించే పిల్లలు మాత్రం శ్రద్ధగా ఒక్కో పెట్టెను తాళంచెవితో తెరచే ప్రయత్నంచేశారు. నిద్రానియమంలేని పిల్లలు మాత్రం ఒక్కో పెట్టెను తెరిచే ఓపికలేక ఆవేశంతో ఆ తాళం చెవులను విసిరిపారేశారు. మరో ప్రయోగంలో రెండు రకాల పిల్లలను ఒకచోటచేర్చి కలిసి ఆడుకోండని సూచించారు. ఈ సందర్భంలోనూ నిద్రనియంత్రణ ఉన్న పిల్లలు తోటి పిల్లలతో కలిసి ఆడుకునే ప్రయత్నంచేశారు. కొందరు పిల్లలను వారంలో ప్రతి రోజూ ఒక 20 నిమిషాలు ముందుగా లేదా 20 నిమిషాలు ఆలస్యంగా నిద్రపోయేలా చేశారు. ఇంకొందరిని వారంరోజులపాటు ఏకంగా రెండు గంటలు ముందుగా లేదంటే ఆలస్యంగా నిద్రపోనిచ్చారు. 20 నిమిషాల తేడాతో నిద్రించిన పిల్లల్లో భావోద్వేగాల నియంత్రణ చాలా ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనలో తేలింది. -
కొర్రలతో కొండంత ఆరోగ్యం!
ఇటీవల చిరుధాన్యాల వాడకం పెరిగిపోయిన కాలంలో కొర్రలకు మంచి ప్రాధాన్యం ఏర్పడింది. చాలామంది కొర్రలను పిండిగా కొట్టించి, వాటితో చేసిన ఆహారాలను వాడటం పరిపాటి అయ్యింది. నిజానికి గోధుమ పిండి కంటే కొర్రల పిండి మంచిదంటున్నారు న్యూట్రిషన్ నిపుణులు. కొర్రలలో ఉండే పోషకాలూ, వీటితో సమకూరే ఆరోగ్య ప్రయోజనాలూ లాంటి అనేక విషయాలను తెలుసుకుందాం...ఒక కప్పు కొర్రపిండిలో ప్రోటీన్ 10 గ్రాములు డయటరీ ఫైబర్ 7.4 గ్రాములు, మెగ్నీషియమ్ 83 మిల్లీగ్రాములతో తోపాటు ఇంకా చాలా రకాల సూక్ష్మపోషకాలు అంటే మైక్రోన్యూట్రియెంట్లూ ఉంటాయి. కొర్రపిండితో సమకూరే కొన్ని ప్రయోజనాలు... కొర్రపిండిలో పీచుపదార్థాల పరిమాణం చాలా ఎక్కువ కాబట్టి దీంతో చేసిన ఆహారాలు తీసుకోవడం వల్ల మలబద్ధకం తేలిగ్గా నివారితమవుతుంది. ఒక్క మలబద్ధకాన్ని నివారించుకుంటే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలూ, అనర్థాలూ దూరమవుతాయన్న సంగతి తెలిసిందే. కొర్రల్లోని ప్రోటీన్లు కండరాల్లోని కణజాలానికి మంచి బలాన్ని ఇస్తాయి. ఈ ప్రోటీన్లే కండరాల్లో తమ రోజువారీ పనుల కారణంగా దెబ్బతినే కండరాలను రిపేర్లు చేస్తుంటాయి. దాంతో దెబ్బలు త్వరగా తగ్గడం, గాయాలు త్వరగా మానడం జరుగుతాయి. బలంగా మారిన ఈ కణజాలాలు మరింత ఎక్కువ ఆక్సిజన్‌ను గ్రహించగలుగుతాయి కాబట్టి మరింత ఆరోగ్యకరంగా ఉంటాయి. అంతేకాదు చాలాసేపు అలసి΄ోకుండా పనిచేయగలుగుతాయి. ఫలితంగా మనం పనిచేసే సామర్థ్యం, అలసి΄ోకుండా పనిచేయగల సమయం (టైమ్ డ్యూరేషన్) పెరుగుతాయి. ఈ అంశాలన్నీ కలగలసి రోగనిరోధక వ్యవస్థ బలోపేతమవుతుంది. డయాబెటిస్ నివారణకూ... కొర్రల్లో చాలా ఎక్కువ పరిమాణంలో ఉండే పీచు దేహంలోని గ్లూకోజ్‌ను చాలా మెల్లగా రక్తంలో కలిసేలా చేస్తుంది. దాంతో డయాబెటిస్ నివారణకు ఇది బాగా తోడ్పడుతుంది. ఈ పీచు పదార్థమూ, ఈ గుణం కారణంగానే టైప్–2 డయాబెటిస్ ఉన్నవారికి ఆరోగ్యకరమైన ఆహారంగా రూపొందాయి. అంతేకాదు కొర్రలు రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఇందులోని మెగ్నీషియమ్ వల్ల ఎముకలు మరింత పటిష్టమవుతాయి. జీవకణాల్లోని ఎంజైములు మరింత సమర్థంగా పనిచేస్తాయి. కొర్రల్లో జింక్ మోతాదులూ ఎక్కువే కావడంతో వ్యాధి నిరోధక శక్తి పెరుగుదలకు ఈ అంశం దోహదపడుతుంది. ఈ జింక్ వల్ల జుట్టు ఊడటం కూడా తగ్గుతుంది. థైరాయిడ్ పనితీరు క్రమబద్ధంగా మారుతుంది. (చదవండి: స్పాండిలోసిస్ అంటే..?) -
సీతాఫల్.. వెరైటీస్ ఫుల్
ఈ సీజన్లో సీతాఫలం రుచి చూడని వాళ్లు అరుదేనేమో... పండ్లలో ఇప్పటికీ పూర్తిస్థాయిలో అమృతం లాంటి రుచిని కోల్పోకుండా అందించే ఏకైక ఫలంగా సీతాఫలాన్ని చెప్పుకోవచ్చు. దాదాపు అందరికీ అందుబాటు ధరల్లోనే ఉండే ఈ ఫలం.. ఇప్పుడు నగర మార్కెట్లో సందడి చేస్తోంది. మరోవైపు ఈ సీజన్లో సీతాఫలాన్ని ఆధారం చేసుకుని రుచులను వడ్డించే రెస్టారెంట్స్, ఐస్‌క్రీమ్ పార్లర్స్ సైతం నగర వాసులకు వెరైటీలను అందించేందుకు సిద్ధమైపోతున్నాయి. కాదే ఫలమూ తినడానికి అనర్హం అన్నట్టే.. కాదే ఫలమూ మేళవింపునకు అనర్హం అంటున్నారు నగరంలోని చెఫ్స్. సీతాకాలంలో విరివిగా లభ్యమయ్యేది సీతాఫలం. ఇది తీపి, క్రీము గుజ్జుతో కూడిన ఉష్ణమండల ఫలం ఇది. ఈ పండులో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉన్నందున గణనీయమైన పోషక విలువలను కలిగి ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన చర్మాన్ని అందిస్తుంది. జీర్ణక్రియను సైతం మెరుగుపరుస్తుంది. అయితే మ్యాంగో సీజన్లో మామిడి పండ్లను వంటకాలలో విరివిగా జత చేసే నగర నలభీములు.. సీతాఫలంతోనూ పలు రకాల వంటకాలు తయారు చేస్తూ నోరూరించడం ఆహార ప్రియులకు సుపరిచితమే.ఆరోగ్యానికి మేలు.. ఉపవాసం సమయంలో ప్రత్యేక ట్రీట్‌గా కూడా దీనిని వడ్డిస్తారు. రబ్దీ పాలలోని కాల్షియం ప్రొటీన్ కంటెంట్ ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది, దీనికి బాదం, పిస్తాలను గారి్న‹Ùగా ఉపయోగిస్తారు. కాబట్టి అవసరమైన కొవ్వు, ఆమ్లాలు, విటమిన్–ఈ లను ఇవి అందిస్తాయి. ఒక లీటరు పాలు, పావు కిలో బెల్లం, అర టీస్పూన్ యాలకుల పొడి, సీతాఫలం గుజ్జు ఒక కప్పుతో చేసిన ఈ రబ్దీని కూల్‌గా సర్వ్ చేసుకోవచ్చు. మరెన్నో రుచులు.. ఇవే కాకుండా పలు రెస్టారెంట్స్‌లో కస్టర్డ్ యాపిల్ ఖీర్, కుల్పీ తదితరాలను కూడా తయారు చేస్తున్నారు. కస్టర్డ్ యాపిల్‌తో ఫుడింగ్ కూడా చేస్తున్నారు. ఫిర్ని అనే నార్త్ ఇండియన్ డిజర్ట్ కూడా దీన్ని జోడిస్తున్నారు. కస్టర్డ్ యాపిల్ పల్ప్‌ను వేడి వేడి జిలేబీ తదితర స్వీట్స్‌పై దీన్ని జతచేసి సర్వ్ చేయడం కూడా కొన్ని రెస్టారెంట్స్‌లో పరిపాటిగా మారింది.స్వీట్ విత్ ఫ్రూట్.. రబ్దీ అనేది భారతీయ వంటకాల్లో ఒక క్లాసిక్ డెజర్ట్, ఇది చాలా కాలం నుంచి వండి వడ్డిస్తున్నారు. సంప్రదాయ పండుగలు లేదా ప్రత్యేక సందర్భాల్లో, విందు వినోదాల చిహ్నంగా దీనిని వడ్డిస్తారు. రబ్దీకి సీతాఫలాన్ని జోడించడం వల్ల ప్రత్యేకమైన రుచిని మాత్రమే కాకుండా మరిన్ని బలవర్ధకాలు సంతరించుకుని ఉత్తమ పోషకాహారంగా మారుతోంది. పండుకు సహజంగా ఉండే తీపి దీనికి చక్కెర అతిగా జత చేయాల్సిన అవసరాన్ని తగ్గిస్తుంది, వంటకాన్ని ఆరోగ్యకరమైనదిగా చేస్తుంది. ఈ సీజన్లో వచ్చే కర్వా చౌత్, దీపావళి తదితర పండుగల సమయాల్లో కుటుంబ సమేతంగా ఆస్వాదించేందుకు ఈ డెజర్ట్ బాగా వినియోగిస్తారు. ఐస్‌క్రీమ్స్ షురూ.. నగరంలో పలు ఐస్‌క్రీమ్ పార్లర్స్ ఈ సీజన్లో సీతాఫల్ ఐస్‌క్రీమ్స్ విక్రయాలకు పేరొందాయి. సీజనల్ పండ్లతో చేసిన ఐస్‌క్రీమ్స్‌ను అందించడంలో పేరొందిన నేచురల్స్‌లో ఇప్పటికే సీతాఫల్ ఐస్‌క్రీమ్స్ అందుబాటులోకి వచ్చాయి. అదే విధంగా క్రీమ్‌స్టోన్ తదితర పేరున్న పార్లర్స్లోనూ ఇవి అందిస్తున్నారు.. ఇక పాతబస్తీలో అచ్చమైన ఆర్గానిక్ ఐస్‌క్రీమ్స్‌కు దశాబ్దాల నాటి నుంచి కేరాఫ్‌గా ఉన్న ఫేమస్ ఐస్‌క్రీమ్స్ కూడా సీతాఫల్ హిమ క్రీముల్ని అందిస్తోంది. నగరంలోని అబిడ్స్‌లో ఉన్న నార్సింగ్ భేల్పురి జ్యూస్ సెంటర్ సైతం ఈ వంటకాలకు పేరొందింది. సీతాఫల్ మలాయ్ పేరుతో ఈ ఫుడ్ అవుట్లెట్ అందించే సీజనల్ రుచి ఫుడ్ లవర్స్‌కి చిరపరిచితమే. ఇలా అనేక రకాలుగా సిటీలోని సీతాఫల ప్రియుల్ని రారమ్మని ఆహా్వనించేందుకు ఓ వైపు రుచిని మరోవైపు ఆరోగ్య ఫలాన్ని అందించేందుకు రెస్టారెంట్స్, ఐస్‌క్రీమ్ పార్లర్స్, కేఫ్స్ పోటీపడుతున్నాయ్. -
ఫెస్టివ్ సీజన్లో మెరిసివాలంటే ఇదిగో చిట్కా, చిటికెలో మ్యాజిక్!
గులాబీలంటే అందరికీ ఇష్టమే. ఒకలాంటి మత్తు వాసనతో కూడిన మృదువైన శృంగార భరిత పువ్వులు. రోజెస్ కేవలం అలకరణకు మాత్రమే కాదు సౌందర్య సంరక్షణలో కూడా అమృతంలా పనిచేస్తాయి. గులాబీ పువ్వుల నుంచి తీసిన రోజ్ వాటర్ ప్రపంచవ్యాప్తంగా శతాబ్దాలుగా చర్మం, జుట్టు రక్షణలో వినియోగిస్తున్నారు. ఇందులో యాంటీ బాక్టీరియల్, క్రిమినాశక లక్షణాలు సమృద్ధిగా ఉన్నాయి. అందుకే అనేక చర్మ సంరక్షణ ఉత్పత్తులలోదీన్ని విరివిగా ఉపయోగిస్తారు. స్వచ్ఛమైన రోజ్ వాటర్‌తో అద్భుతమైన ప్రయోజనాలు, ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం పదండి!మార్కెట్లో దొరికే రోజ్ వాటర్‌కు బదులుగా ఇంట్లోనే తయారు చేసుకోవడం చాలా సులభం. బయట లభించే రోజ్ వాటర్‌లో హానీకరమైన కెమికల్స్ ఉంటాయి. దీని వల్ల మొటిమలు, మచ్చలు వచ్చే అవకాశం ఉంది. అందుకే సహాజంగా ఇంట్లోనే రోజ్ వాటర్ తయారు చేసుకోవడం ఉత్తమం. తయారీ చాలా సులువు కూడా.రోజ్ వాటర్ ఉపయోగాలు అన్ని రకాల చర్మాలకు చక్కగా పనిచేస్తుంది.చర్మాన్ని చల్లబర్చి ,మొటిమలు, మచ్చలను తొలగిస్తుంది. ఎర్రబడటం, మంటను తగ్గించడంలో రోజ్ వాటర్ చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. చర్మ రంధ్రాలను శుభ్రపరచి, పీహెచ్ స్థాయిలను మెరుగుపరుస్తుంది.చర్మాన్ని తేమగా ఉంచి, ఫ్రెష్‌గా, మెరిసేలా చేస్తుంది. సన్ బర్న్స్ తగ్గిస్తుంది.విటమిన్ ఏ సీ పుష్కలంగా ఉండే రోజ్ వాటర్ కళ్ల కింద నల్లటి వలయాలను తగ్గిస్తుంది.చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించి, ముడతలు పడకుండా తొలగిస్తుంది. చర్మంపై మచ్చలు కాలిన గాయాలను నయం చేసే అద్భుత సామర్థ్యం రోజ్ వాటర్‌లో ఉంది. కలిగి ఉంటాయి.ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలిచీడ పీడ లేని తాజా గులాబీరేకులను శుభ్రంగా నీటిలో బాగా కడగండి. ఒక గిన్నెల నీళ్లు తీసుకొని బాగా మరిగించడం. ఆ నీటిలో శుభ్రంగా కడిగి పెట్టుకున్న గులాబీ రేకులను నీటిలో వేసి, తరువాత స్టవ్ ఆఫ్ చేయండి. దీన్ని కనీసం 4-5 గంటలు అలానే పక్కనపెట్టండి. దీంతో గులాబీ రేకుల్లోని లక్షణాలన్నీ ఆ నీటిలోకి చేరతాయి. బాగా చల్లారిన తరువాత చక్కగా వడబోసుకుని తడిలేని గాజు సీసాలోకి తీసుకోవాలి. మంచి సువాసనతో ఉన్న ఈ రోజ్ వాటర్‌ను ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవాలి. ఎలా వాడాలి?రోజూ ముఖం కడిగిన తర్వాత రోజ్ వాటర్‌తో ముఖం తుడుచుకుంటే ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. డార్క్ సర్కిల్స్ ఉన్నవారు రోజ్ వాటర్‌లో ముంచిన కాటన్ బాల్స్‌ను ప్రతిరోజు ఉపయోగిస్తే నల్ల వలయాలు క్రమంగా తగ్గుతాయి. ఇందులోని యాంటీ ఏజింగ్ లక్షణాలు ముఖాన్ని కాంతివంగా మెరిసేలా చేస్తాయి. ముల్తానా మట్టి, ఇతర ఫేస్‌ప్యాక్‌లలో నాలుగు చుక్కల రోజ్ వాటర్ కలిపితే మరింత ఫ్రెష్‌లుక్ వస్తుంది. -
ప్రకృతి సేద్యం ఇంత గొప్పగా ఉంటుందని ఉహించలేదు: ప్రొ.రమేశ్ చంద్
సుభాష్ పాలేకర్ కృషితో ప్రాధమిక రూపంలో ప్రారంభమైన ప్రకృతి వ్యవసాయం గత కొన్నేళ్లలో అనేక ఆవిష్కరణలతో శాస్త్రీయతను సంతరించుకుంటూ క్లైమెట్ ఎమర్జెన్సీని తట్టుకునేలా ఆశ్చర్యకరమైన రీతిలో పరిపుష్టమవుతూ, ప్రకృతి వైపరీత్యాలను దీటుగా తట్టుకుంటూ కొత్త పుంతలు తొక్కుతోందని నీతి ఆయోగ్ సభ్యుడు, వ్యవసాయ నిపుణుడు ప్రొఫెసర్ డాక్టర్ రమేశ్ చంద్ ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి వ్యవసాయ వికాసం తీరు తెన్నులను ఇటీవల రెండు రోజుల పాటు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసిన తమ నీతి ఆయోగ్, ఐసిఎఆర్ నిపుణుల బృందానికి ఒక గొప్ప అభ్యాసం (గ్రేట్ లెర్నింగ్)గా నిలిచిందని ఆయన వ్యాఖ్యానించారు.వినూత్న ఆవిష్కరణలుఏడేళ్ల క్రితం తాను ఆంధ్రలో పర్యటించినప్పుడు ప్రకృతి వ్యవసాయం పాలేకర్ పద్ధతికి మాత్రమే పరిమితమైందని, ఇప్పుడు వినూత్న ఆవిష్కరణలతో శాస్త్రీయత ప్రాతిపదికపై పురోగమిస్తోందని, క్షేత్రస్థాయిలో ఇంత గొప్పగా ఉంటుందని తాము ముందుగా ఊహించలేదన్నారు. పర్యటన అనంతరం ప్రొ. రమేశ్ చంద్ ఒక వీడియో సందేశంలో తన స్పందనను వెల్లడించారు. ఏపీ ప్రకృతి సేద్య ఆవిష్కరణలను వివరిస్తూ, రసాయనిక సేద్యంలో, ప్రకృతి సేద్యంలో పక్క పక్కన పొలాల్లోనే సాగవుతున్న వరి పంటను పరిశీలిస్తే.. కరువు, వరదలు వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ప్రకృతి సేద్యం ఎంత మెరుగైన ఫలితాలనిస్తోందో అర్థమైందన్నారు. అదేవిధంగా, కూరగాయలు, పండ్ల తోటలను పరిశీలించినప్పుడు కూడా ఆశ్చర్యకరమైన ఫలితాలను కళ్లజూశామన్నారు. అరటి తోట సాగు చేస్తున్న ఒక రైతు జీవామృతం వంటి బయో ఇన్పుట్స్ కూడా ఇక వాడాల్సిన అవసరం లేనంతగా తన భూమిని సారవంతం చేసుకోవటం ఆశ్చర్యం కలిగించిందని ప్రొ.రమేశ్ చంద్ తెలి΄ారు. విత్తనాలకు అనేక పొరలుగా మట్టి, జీవామృతాలతో లేపనం చేసి గుళికలు తయారు చేసి, నేలలో తేమ లేని పరిస్థితుల్లో వర్షం రావటానికి ముందే విత్తుతున్నారన్నారు.విభిన్నమైన దృష్టికోణంపంటలతో, ఆచ్ఛాదనతో నేలను కప్పి ఉంచటంతోపాటు అనేక పంటలను కలిపి పండిస్తూ జీవవైవిధ్యాన్ని పెంపొందిస్తున్నారన్నారు. గడ్డిని ఆచ్ఛాదనగా వేస్తే చెదలు సమస్య వస్తుంది కదా అని ఓ ప్రకృతి వ్యవసాయదారుడ్ని ప్రశ్నిస్తే.. చెదపురుగులు తమ మిత్రపురుగులని బదులిచ్చారన్నారు. సాధారణ రైతుల అభిప్రాయానికి ఇది పూర్తిగా విభిన్నమైన దృష్టికోణం అని, అన్ని విషయాల్లోనూ ఈ వ్యత్యాసం ఉందన్నారు. ఈ పర్యటనలో రైతులతో స్వయంగా మాట్లాడి అనేక కొత్త విషయాలను తాము నేర్చుకున్నామని, ఇది గ్రేట్ లెర్నింగ్ అని ఆయన అన్నారు. ఐసిఎఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్, ఫార్మింగ్ సిస్టమ్స్ నిపుణులు, మట్టి నిపుణులు, నీతి ఆయోగ్ ప్రోగ్రామ్ డైరెక్టర్ డా. నీలం పటేల్ కూడా మాతో ఈ పర్యటనలో ఉన్నారన్నారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా రసాయనిక వ్యవసాయానికి సంబంధించిన పద్ధతులను మాత్రమే విస్తరణ, బోధన, పరిశోధన రంగాల్లో అనుసరిస్తున్నామని, ఇక మీదట ప్రకృతి సేద్యాన్ని కూడా భాగం చేయాల్సిన అవసరం ఉందన్నారు.సబ్సిడీ ఎలా ఇవ్వగలం?ప్రకృతి వ్యవసాయంలో పండించిన పంట రసాయన వ్యవసాయంలో పండించిన పంటతో పోల్చితే చాలా మెరుగైనది. నాణ్యతకు తగిన ధర ఎలా కల్పించగలమో ఆలోచించాలి. యూరియా ధరలో 85–90% సబ్సిడీ ఇస్తున్నాం. ప్రకృతి సేద్యాన్ని దేశంలో విస్తరింపజేయటానికి ప్రోత్సాహకాలు ఎలా ఇవ్వాలో ఆలోచించాల్సి ఉందంటూ క్రేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇస్తామన్నారు. -
సెంచరీ కొట్టిన టమాటా, మీరు మాత్రం అతిగా తినకండి!
కూరగాయల ధరలు మండిపోతున్నాయి. భారీ వర్షాలకు పంట దెబ్బతినడం, సప్లయ్ తగ్గిపోవడంతో ఒక్కసారిగా కూరగాయల ధరలు ఆకాశం వైపుచూస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో టమాటా కిలో ధర 100 రూపాయలు పలుకుతోంది. దీనికి తోడు నవరాత్రి ఉత్సవాలు, అన్నదానాల హడావిడి మధ్య డిమాండ్ మరింత పెరిగింది. నిజానికి ప్రతి కూరలో టమాటా వాడటం అలవాటుగా మారిపోయింది. కూరకు రుచిరావడంతోపాటు, మన ఆరోగ్యానికి కూడా మంచి మేలు చేస్తాయి కూడా. అయితే అందని ద్రాక్ష పుల్లన అనుకొని వేరే ప్రత్యామ్నాయాల్ని వెదుక్కోవాలి. అన్నట్టు టమాటాలు అతిగా తినకూడదు. తింటే ఎలాంటి నష్టాలుంటాయి? తెలుసుకుందాం. విటమిన్ సి, విటమిన్ కె, ఫోలెట్, పొటాషియం,యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంco సూపర్ ఫుడ్ టమాటా. టమాటాల్లో ఉండే లైకోపీన్ కొలన్, ప్రొస్టేట్, లంగ్ కేన్సర్లను అడ్డుకుంటుంది. డయాబెటిస్, హైపర్ టెన్షన్, గుండె సమస్యలున్నవారికి కూడా టమాటాలు మేలు చేస్తాయి. టమాటా ధర పెరిగితే ఏం చేయాలి?ఏ కూరగాయ అయినా ధర పెరిగితే మధ్యతరగతి ప్రజలు ప్రత్యామ్నాయాలు వెదుక్కోవాల్సిందే. టమాటా విషయంలో అయితే చింతపండు, పుల్లగా ఉండే ఆకుకూరలను ఎంచుకోవాలి. అలాగే టమాటాలు చవకగా లభించినపుడు సన్నగా తరిగి, బాగా ఎండబెట్టి ఒరుగుల్లా చేసుకొని నిల్వ చేసుకుంటే కష్టకాలాల్లో ఆదుకుంటాయి.అతి ఎపుడూ నష్టమే, ఎవరెవరు తినకూడదు?టమాటా ఎక్కువగా తీసుకోవడం వల్ల కొన్ని సమస్యలు వస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. వంకాయలు, దుంపకూర ల్లాగానే టమాటాలతో కీళ్ల నొప్పులు వచ్చే అవకాశం ఉంది. సోలనిన్ అనే సమ్మేళనం కారణంగా ఆర్థరైటిస్, కీళ్లు, మోకాళ్ల నొప్పులను ఇంకా పెంచుతుంది. ఇప్పటికే ఆస్టియో ఆర్థరైటిస్ లేదా రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి సమస్యలు ఉంటే టామాటా వినియోగాన్ని తగ్గించడం ఉత్తమం.టమాటా గింజల్లో ఉండే ఆక్సలేట్ కిడ్నీ సమస్యలకు దారి తీస్తుంది. టమాటాలు కిడ్నీ స్టోన్స్ తో బాధపడుతున్న టమాటాలకు దూరంగా ఉండాలని చెబుతారు. ఇంకా జీర్ణ సమస్యలు, గుండెల్లో మంట వంటి సమస్యలొస్తాయి. వీటిల్లోని మాలిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్ మన శరీరంలోకి ఎక్కువగా చేరితే యాసిడ్ రిఫ్లక్స్ సమస్య వచ్చే ప్రమాదం ఉంది. టమాటాల్లో లైకోపీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన రక్తంలో ఎక్కువగా చేరితే లైకోపెనోడెర్మియా వస్తుంది. రోజుకు 75 మిల్లీగ్రాముల మోతాదు మించితే ఈ సమస్య వస్తుంది. -
Snake Fruit: స్నేక్ ఫ్రూట్!
‘స్నేక్ ఫ్రూట్’ లేదా సలక్ ఫ్రూట్. శాస్త్రీయ నామం సలక్క జలక్క. అరెకేసియే కుటుంబం. ఈత, ఖర్జూర వంటి పామ్ జాతికి చెందిన ఒక రకం. ఇండోనేషియాలోని జావా, సుమత్ర ప్రాంతం దీని పుట్టిల్లు. ఇండోనేషియా, మలేషియా, థాయ్‌లాండ్ వంటి ఈశాన్య ఆసియా దేశాల్లో విస్తారంగా సాగులో ఉన్న పండు. లేత కాఫీ రంగులో ఉండే ఈ పండు పైన పోలుసు పాము చర్మంపై పోలుసులను పోలి ఉంటుంది. అందుకే కాబోలు, దీనికి స్నేక్ ఫ్రూట్ లేదా స్నేక్ స్కిన్ ఫ్రూట్ అంటారు. పండిన అంజూర పండు సైజులో, అదే ఆకారంలో స్నేక్ ఫ్రూట్ ఉంటుంది. పైపోర పెళుసుగా ఉంటుంది. పైపోరను ఒలిస్తే లోపల తెల్లటి రెబ్బలు (వెల్లుల్లి రెబ్బల మాదిరిగా) ఉంటాయి. వాటి లోపల గోధుమ రంగు గింజలు ఉంటాయి. గింజలు తీసేసి ఈ రెబ్బల్ని తినాలి. రుచి గమ్మత్తుగా, విలక్షణంగా ఉంటుంది. ద ఫ్యూచర్ ఆఫ్ ద హెల్త్ అని, సూపర్ హీరోస్ ఆఫ్ ఫంక్షనాలిటీ అని దీన్ని వ్యవహరిస్తుంటారు. సలక్కు ఇంకా చాలా పేర్లున్నాయి. ఇండోనేషియాలో పోందో, థాయ్‌లాండ్‌లో రకం, చైనాలో సలక లేదా షి పై గ్యో జాంగ్, మయన్మార్‌లో ఇంగన్ అని పిలుస్తున్నారు. న్యూ గినియ, ఫిలిప్పీన్స్, క్వీన్స్లాండ్, ఉత్తర ఆస్ట్రేలియా, పోనపె ఐలాండ్ (కారోలిన్ అర్చిపెలాగో), చైనా, సూరినామ్, స్పెయిన్, ఫిజి తదితర దేశాల్లో స్నేక్ ఫ్రూట్‌ను సాగు చేస్తున్నారు. ఇండోనేషియాలోని ఇతరప్రాంతాల్లో దీన్ని ఆహార పంటగా సాగు చేస్తున్నారు.20 అడుగుల ఎత్తుస్నేక్ ఫ్రూట్ చెట్టుకు కాండం చాలా చిన్నది. అయితే, కొమ్మలు పెద్దగా 20 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. ప్రతి కొమ్మకు ముళ్లతో కూడిన 2 మీటర్ల పోడవైన తొడిమె ఉంటుంది. ముల్లు 6 అంగుళాల వరకు పోడవుంటుంది. కొమ్మకు చాలా ఆకులుంటాయి. ఈ చెట్టు కాండానికి కాయలు గెలలుగా కాస్తాయి. ఆకు అడుగున లేత ఆకుపచ్చగా, పైన ముదురు ఆకుపచ్చగా ఉంటుంది. స్నేక్ ఫ్రూట్ మొక్క నాటిన తర్వాత 3–4 ఏళ్లలో కాపుకొస్తుంది. ఇప్పుడు ముళ్లు లేని వంగడాలు కూడా వచ్చాయి. ఆడ చెట్లు, మగ చెట్లు ఉంటాయి. కొన్ని రకాల స్నేక్ ఫ్రూట్ చెట్లలో (ఉదా.. సలక్ బాలి) ఆడ, మగ పూలు రెండూ ఒకే చెట్టుకు పూసి స్వపరాగ సంపర్కం చెందుతాయి. పూలు గుత్తులుగా పూస్తాయి. ఆడ పూలు 20–30 సెం.మీ., మగవి 50–100 సెం.మీ. పోడవు ఉంటాయి. పరాగ సంపర్కం కోసం మగ పూలలో 20%ని మాత్రమే ఉంచి, మిగతావి తొలగించాలి. మనుషులు చేతులతో పరాగ సంపర్కం చేయిస్తే పండ్ల దిగుబడి పెరుగుతుంది.తీపి కాదు, వగరుసలక్క చెట్ల రకాలు 21 జాతులున్నాయి. మలేషియాలో మూడు రకాలను పెంచుతున్నారు. ఎస్.గ్లాబెరెసెన్స్, ఎస్. ఎడ్యులిస్, ఎస్.సుమత్రాన. ఎస్. గ్లాబెరెసెన్స్ను లోకల్ సలక్గా భావిస్తారు. దీని నుంచి 9 క్లోన్స్‌ను తయారు చేశారు. ఎస్. ఎడ్యులిస్, ఎస్.సుమత్రాన రకాలు ఇండోనేషియా నుంచి మలేషియాకు వచ్చాయి. ఇక ఇండోనేషియాలో దేశీయ, విదేశీ మార్కెట్ల కోసం వాణిజ్యపరంగా ఎస్. జటక్క, ఎస్. ఎడ్యులిస్, ఎస్.సుమత్రాన రకాలను సాగు చేస్తున్నారు. మనోంజయ, బొంగ్కాక్, బంజార్నెగర, కొండెట్, పోందో, బాలి, ఎన్రెంకంగ్, సైడెంపుయన్ వంటి అనేక రకాల స్నేక్ ఫ్రూట్ వంగడాలు సాగులో ఉన్నాయి. స్నేక్ ఫ్రూట్ తియ్యని పండు కాదు, కొంచెం వగరు. బోంగ్కాక్ రకం పండు మరీ ఎక్కువ వగరు. మిగతా రకాల కన్నా తక్కువ తీపి కలిగి ఉంటుంది.పుష్కలంగా పోషకాలుస్నేక్ ఫ్రూట్లో ఇతర పండ్లతో పోల్చినప్పుడు అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. సుక్రోజ్ (7.6 గ్రా/100 గ్రా.), ఫ్రక్టోజ్ (3.9 గ్రా/100 గ్రా.), టోటల్ సుగర్ (17.4 గ్రా./100 గ్రా.), జీర్ణమయ్యే పీచు (0.3 గ్రా./100 గ్రా.), జీర్ణం కాని పీచు (1.4 గ్రా./100 గ్రా.), టోటల్ డైటరీ ఫైబర్ (1.7 గ్రా./100 గ్రా.), నీరు (80గ్రా./100 గ్రా.), కేలరీలు (77 కిలోకేలరీలు/ 100 గ్రా.),ప్రోటీన్ (0.7గ్రా./100 గ్రా.), బూడిద (0.6గ్రా./100 గ్రా.), కొవ్వు (0.1 గ్రా./100 గ్రా.). ఉన్నాయి. సహజ పీచు, సుగర్స్‌కు స్నేక్ ఫ్రూట్ చక్కని వనరు. దీని గుజ్జులో మినరల్స్, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఫాస్ఫరస్ (1161 ఎంజి/కేజీ), పోటాషియం (11.339 ఎంజి/కేజీ), కాల్షియం (220 ఎంజి/కేజీ), మెగ్నీషియం (607 ఎంజి/కేజీ), సోడియం (231 ఎంజి/కేజీ), ఐరన్ (12.0 ఎంజి/కేజీ), మాంగనీసు (10.4 ఎంజి/కేజీ), రాగి (3.36 ఎంజి/కేజీ), బోరాన్ (5.07 ఎంజి/కేజీ), సల్ఫర్ (5.07 ఎంజి/కేజీ), అస్కార్బిక్ ఆసిడ్ (400 ఎంజి/కేజీ), కెరోటిన్ (5 ఎంజి/కేజీ), థయామిన్ (20 ఎంజి/కేజీ), నియాసిన్ (240 ఎంజి/కేజీ), రిబోఫ్లావిన్ (0.8 ఎంజి/కేజీ), ఫొలేట్ (6 ఎంజి/కేజీ) మేరకు ఉన్నాయి. స్నేక్ ఫ్రూట్లో ఆరోగ్యదాయకమైన పీచు, పిండి పదార్థం నిండుగా ఉన్నాయి. ఇతర విదేశీ పండ్లతో పోల్చితే దీని గుజ్జులో పుష్కలంగా యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఈ పండును నేరుగా తినొచ్చు లేదా జ్యూస్ చేసుకొని తాగొచ్చు. డ్రైఫ్రూట్స్, పచ్చళ్లు, చిప్స్, ఊరబెట్టి కూడా వాడుకుంటున్నారు. పోందో (ఇండోనేషియన్ సలక్) రకం లేత కాయలను గింజలతో సహా తినొచ్చు. స్నేక్ ఫ్రూట్ ఆకులను, రెమ్మలను కూడా చాపలు, బుట్టల అల్లికకు వాడుతున్నారు.50 ఏళ్ల పాటు దిగుబడిస్నేక్ ఫ్రూట్‌ను విత్తనాలతో మొక్కలు పెంచి నాటుకోవాలి. అయితే, 50% మాత్రమే ఆడ మొక్కలు వస్తాయి. పండు నాణ్యత ఒకే స్థాయిలో ఉంటుంది. తల్లి మొక్క లక్షణాలు పూర్తిగా రావాలంటే మాత్రం పిలకలు నాటుకోవాలి. 6–12 నెలల వయసు మొక్కను పైన ఆకుల నుంచి కింది వేర్ల వరకు నిలువుగా చీల్చి నాటుకోవచ్చు. పిహెచ్ 4.7 – 7.5 వరకు తట్టుకుంటుంది. లేత మొక్క నీడలో బాగా పెరుగుతుంది. వాణిజ్యపరంగా సాగయ్యే తోటల్లో కొబ్బరి, డ్యూరియన్ చెట్ల నీడన ఈ మొక్కల్ని పెంచుతుంటారు. నాటిన 3–4 ఏళ్లకు కాపు ్రపారంభం అవుతుంది. ఈ చెట్టు 50 ఏళ్ల పాటు హెక్టారుకు 5–15 టన్నుల పండ్ల దిగుబడినిస్తుంది. ఏటా నాలుగు సార్లు పూత వచ్చినప్పటికీ ఏప్రిల్ – అక్టోబర్ మధ్యలోనే పండ్లు వస్తాయి. మొక్కలు 60–70 సెం.మీ. ఎత్తు పెరిగిన 5–7 నెలల తర్వాత నాటుకోవాలి. గుంతలు 40“40“40 సెం.మీ. సైజులో తవ్వాలి. 1.5 “ 3 మీటర్ల నుంచి 2 “ 2 మీటర్ల దూరంలో నాటుకోవాలి. కొమ్మకత్తిరింపు, కలుపు తీత ప్రతి రెండు నెలలకోసారి చేస్తే పూత బాగా వస్తుంది. సరిగ్గా లేని లేదా పాడైన పండ్లను ఏడాదికి ఒకటి లేదా రెండు సార్లు చేయాల్సి ఉంటుంది. గుత్తికి 20–25 పండ్లు ఉంటే దిగుబడి లాభదాయకంగా ఉంటుంది. సాధారణంగా వర్షాధారంగానే పెరుగుతుంది. కొమ్మ కత్తిరించినప్పుడు, పండ్లు ఎదుగుతున్న దశలో, వేడి సీజన్లలో నీరు అందించాలి. పూత దశలో, పండ్ల కోతకు ముందు రోజుల్లో తగుమాత్రంగా నీరివ్వాలి. ఎక్కువ నీరిస్తే కుళ్లిపోతాయి. వాణిజ్యపరంగా సాగు చేసే తోటల్లో అధిక దిగుబడి కోసం కూలీలతో పోలినేషన్ చేయిస్తారు. పువ్వు గట్టిపడితే పోలినేషన్ సక్సెస్ అయ్యిందని గుర్తు. మెత్తగానే ఉండిపోతే ఫెయిలైనట్లు గుర్తించి తొలగిస్తారు. పండు తగిన సైజు, రంగు వచ్చి, పండుపై ఉన్న సన్నని ముళ్లు ఊడిపోయిందంటే పక్వానికి వచ్చినట్లు గుర్తిస్తారు. పండు 70–80% పండినప్పుడు కూలీలతో పండ్లు కోయిస్తారు. తాజా పండ్ల మార్కెట్లో విక్రయించటంతో పాటు స్నేక్ ఫ్రూట్స్‌ను ఊరగాయ పచ్చడి పెడతారు. సుగర్, ఈస్ట్ కలిపి వైన్ తయారీలో కూడా స్నేక్ ఫ్రూట్స్ వాడుతున్నారు. -
కిస్మిస్ని నీళ్లల్లో నానబెట్టే ఎందుకు తినాలో తెలుసా..!
కిస్మిస్ లేదా ఎండుద్రాక్షను నీళ్లల్లో నానబెట్టి తీసుకోమని నిపుణులు చెబుతుంటారు. ఇలానే ఎందుకు అంటే..కడుపు సంబంధిత సమస్యలు ఉన్నవారికి ఇలా అయితే జీర్ణ సంబంధిత సమస్యలు ఎదురుకావు. అలాగే పోషాకాలను త్వరగా విచ్ఛిన్నం చేసి ఎంజైమ్‌లను సక్రియం చేయగలదు. ఇది మంచి శోషణకు దారితీస్తుంది. అంతేగాదు ఇలా నానబట్టి ఎండుద్రాక్షలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందగలమో సవివరంగా చూద్దాం..!.ఐరన్ పవర్: ఎండుద్రాక్ష ఐరన్ మూలం. శరీరం అంతటా ఆక్సిజన్ సరఫరా కావడానికి అవసరమైన ఐరన్ ఇందులో పుష్కలంగా లభిస్తుంది. అలసటను నివారిస్తుంది.శక్తి స్థాయిలను మెరుగుపరుస్తుంది.బ్యాలెన్స్‌గా బ్లడ్ షుగర్ లెవెల్స్: ఎండుద్రాక్షలో సహజ చక్కెరలు ఉన్నప్పటికీ నానబెట్టడం వల్ల రక్తప్రవాహంలో వాటి విడుదలను నియంత్రిస్తుంది. పైగా మధుమేహ రోగులకు మంచి ప్రయోజనాలను అందిస్తుంది.డిటాక్సిఫైయింగ్ డుయో: ఎండుద్రాక్షలను నానబెట్టడానికి ఉపయోగించే నీరు వాటి పోషకాలు, ఫైబర్‌తో నిండి ఉంటాయి. ఇది సహజమైన డిటాక్స్ డ్రింక్‌లా పనిచేస్తుంది. ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగడం వల్ల టాక్సిన్స్ బయటకు వెళ్లి కాలేయ పనితీరు మెరుగుపడుతుంది.బలోపేతంగా రోగనిరోధక వ్యవస్థ: ఇది యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సీతో నిండి ఉంది. బలమైన రోగనిరోధక వ్యవస్థకు ఇవి కీలకం. వీటిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లతో పోరాడేలా ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది.మలబద్ధకం నివారణ: దీనిలోని ఫైబర్ కంటెంట్, నానబెట్టడం ద్వారా మరింత పెరుగుతుంది. సాధారణ ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది, జీర్ణక్రియకు సహాయపడుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది.బోన్ బిల్డర్: ఇందులో బోరాన్ ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి అవసరమైన ఖనిజం. ఇక్కడ నానబెట్టడం వల్ల బోరాన్ జీవ లభ్యత పెరుగుతుంది. ఫలితంగా శరీరం సులభంగా ఆ పోషకాన్ని గ్రహించి, బలమైన ఎముకల కోసం వినియోగించేలా చేస్తుంది.గుండె ఆరోగ్యానికి: ఇందులోని పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు రక్తపోటును నియంత్రించి వాపును తగ్గించడం వంటివి చేస్తాయి. ఇది గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. ఇలా నానబెట్టడం వల్ల మరిన్ని ప్రయోజనాల పొందడమే కాకుండా వివిధ ప్రమాదాల నుంచి హృదయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.సహజ స్వీటెనర్: నానబెట్టిన ఎండుద్రాక్ష పెరుగు, తృణధాన్యాలు లేదా స్మూతీస్‌లో శుద్ధి చేసిన చక్కెరకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం. ఇది తీపి తినాలనే కోరికను నియంత్రిస్తంఉది. చర్మ ఆరోగ్యానికి: ఇందులోని యాంటీఆక్సిడెంట్లు చర్మ కణాలను దెబ్బతీసి వృద్ధాప్యానికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడడంలో సహాయపడతాయి.మవీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యకరమైన, మెరిసే చర్మాన్ని పొందవచ్చు.గమనిక: నానబెట్టిన కిష్మిష్ అనేక ప్రయోజనాలను అందిస్తున్నప్పటికీ, దానిని మితంగా తీసుకోవడం చాలా కీలకం. రోజుకు కొన్ని (సుమారు 20 నుంచి 30 గ్రాములు) తీసుకోవాలి. ఏమైన అంతర్లీనా ఆరోగ్య పరిస్తితుల దృష్ట్యా నిపుణులు లేద్య వ్యక్తిగత వైద్యులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: రోగి భద్రతకు కావాల్సింది భరోసా..!) -
"నెయ్యి టీ"నా..! ఎన్ని లాభాలో తెలుసా?
గ్రీన్ టీ, బ్లాక్ టీ, నిమ్మ టీ వంటి ఎన్నో రకాల చాయ్‌లు గురించి విన్నాం. కానీ ఇదేంటి 'నెయ్యి టీ' అని అనుకోకుండి. ఎందుకంటే పోషకాహార నిపుణులు వారంలో కనీసం రెండుసార్లు ఈ టీని తప్పనిసరిగా తీసుకోవాలని చెబుతున్నారు. మన దైనందిన జీవితంలో దీన్ని భాగం చేసుకుంటే ఎన్నో ప్రయోజనాలు పొందొచ్చని చెబుతున్నారు. అదెలాగో సవివరంగా చూద్దాం..'నెయ్యి టీ' అనేది కొత్తగా వచ్చిన వంటకం ఏం కాదు. శతాబ్దాలుగా ఆయుర్వేదంలో దీన్ని ఉపయోగించేవారని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అంతేగాదు చరక సంహితలో రోజువారీ వినియోగానికి అవసరమైన 11 ప్రధాన ఆహారాలలో దీన్ని ఒకటిగా చెప్పారు ఆయుర్వేద నిపుణులు. దీన్ని సాధారణ టీ మాదిరిగానే చేసుకుంటారు. అయితే చివర్లో ఓ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటే అదే నెయ్యి టీ. ఇది తాగేందుకు టేస్టీగానే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుందట. అదెలా అంటే..?తక్షణ ఎనర్జీని పొందిన ఫీల్ లభిస్తుందట. అందువల్ల చిరుతిండులు తినాలనే కోరికన నివారించడమే కాకుండా ఎక్కువసేపు శక్తిమంతంగా ఉండొచ్చు.ఇది అధిక కేలరీలను కలిగి ఉంటుంది. ఎక్కువ శ్రమ లేకుండా శీఘ్ర శక్తిని పొందడంలో సహాయపడుతుంది.మలబద్ధకం, జీర్ణ సమస్యలకు చెక్ పెడుతుంది. నెయ్యిలో ఉండే బ్యూట్రిక్ యాసిడ్ జీర్ణక్రియను సులభతరం చేస్తుందని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.ప్రకాశవంతంమైన చర్మాన్ని పొందొచ్చట. క్రమం తప్పకుండా తాగితే చర్మానికి మంచి పోషణను అందిస్తుందట. ఇందులో ఉండే విటమిన్లు, ఏ, డీ, ఈ, కేలు చర్మాన్ని హైడ్రేట్ చేసి, పునరుజ్జీవింప చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది. బ్లడ్ షుగర్‌కి చెక్ పెడుతుంది.అయితే ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేనివారు ఈ పానీయాన్ని కనీసం వారానికి రెండుసార్లు అయినా తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. దీన్ని ఉదయం లేదా సాయంత్రం సమయాల్లో తీసుకోవడం మంచిదని అన్నారు. ముఖ్యంగా వ్యాయమాలు చేసేవాళ్లకు ఈ టీ మరింత మంచిదని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. (చదవండి: రెడ్‌లైట్ థెరపీ అంటే ఏంటీ..? నటి సమంత బ్యూటీ సీక్రెట్ ఇదే..!) -
National Watermelon Day: ప్రయోజనాలే కాదు.. చరిత్ర కూడా గొప్పదే..
జాతీయ పుచ్చకాయ(వాటర్ మిలన్) దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆగస్టు 3న జరుపుకుంటారు. పుచ్చకాయలో 92శాతం మేరకు నీరు ఉంటుంది. శరీరం హైడ్రేటెడ్‌గా ఉండటానికి పుచ్చకాయ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ పంట సాగు 2000 బీసీ నుండి కొనసాగుతోంది. పుచ్చకాయ చరిత్రపుచ్చకాయ మొదటి పంటను సుమారు 5,000 సంవత్సరాల క్రితం ఈజిప్టులో పండిచారని చరిత్ర చెబుతోంది. 12వ ఈజిప్షియన్ రాజవంశీయులు తిరుగాడిన ప్రదేశాలలో పుచ్చకాయ, దాని గింజల జాడలను కనుగొన్నారు. కింగ్ టుటన్‌ఖామెన్ సమాధిలోనూ పుచ్చకాయ ఆనవాళ్లు కనిపించాయి. పురాతన ఈజిప్షియన్ శాసనాలలో వివిధ రకాల పుచ్చకాయల పెయింటింగ్‌లు కనిపించాయి.ఆఫ్రికాలోని కలహరి ఎడారిలో ప్రయాణించే వ్యాపారులకు పుచ్చకాయ విత్తనాలను విక్రయించినట్లు తెలుస్తోంది. పుచ్చకాయ సాగు ఆఫ్రికా అంతటా చేశారని తెలుస్తోంది. ఆ తర్వాత ఇది మధ్యధరా దేశాలకు, ఐరోపాలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించింది. తొమ్మిదవ శతాబ్దం చివరి నాటికి, చైనాతో పాటు మిగిలిన ఆసియా దేశాలలో పుచ్చకాయను విరివిగా సాగు చేయడం మొదలుపెట్టారు.జాన్ మరియాని రాసిన ‘ది డిక్షనరీ ఆఫ్ అమెరికన్ ఫుడ్ అండ్ డ్రింక్’ లోని వివరాల ప్రకారం పుచ్చకాయ అనే పదం 1615లో ఆంగ్ల నిఘంటువులో కనిపించింది. యునైటెడ్ స్టేట్స్లో 300కు మించిన రకాల పుచ్చకాయలను పండిస్తున్నారు.ఆరోగ్య ప్రయోజనాలుపుచ్చకాయలో 92శాతం మేరకు నీరు ఉంటుంది . కేలరీలు తక్కువ పరిణామంలో ఉంటాయి. ఈ పండు నిర్జలీకరణాన్ని నిరోధించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారు తమ డైట్లో ఈ జ్యూసీ ఫ్రూట్‌ని చేర్చుకోవాలి. పుచ్చకాయ గుండె సంబంధిత వ్యాధుల ముప్పును తగ్గిస్తుంది. పుచ్చకాయలో హీట్ స్ట్రోక్‌ను నిరోధించే ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. పుచ్చకాయ జ్యూస్ తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. -
వైమానిక యోగా!
బిజీ లైఫ్ స్టైల్లో తీవ్ర ఒత్తిడి, కోపం, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలతో భాగ్యనగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యోగా, ధ్యానం వల్ల మనసుకు ఎంతో ప్రశాంతత చేకూరుతుంది. ఇవన్నీ పూర్వకాలం నుంచి తరతరాలుగా ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు నగరంలో వయసుతో సంబంధం లేకుండా యోగా చేస్తున్నారు. అయితే ప్రస్తుతం యోగాలో కూడా కొత్త ట్రెండ్ నడుస్తోంది. అదే ఏరియల్ యోగా.. దీన్నే రోప్ యోగా అని కూడా అంటారు. సాధారణంగా కింద కూర్చుని యోగాసనాలు వేయడం కామన్.. కానీ గాల్లో వేలాడుతూ వివిధ యోగాసనాలు చేయడమే ఏరియల్ యోగా స్పెషల్ అన్నమాట. గాల్లో యోగాసనాలు ఎలా వేస్తారనే కదా మీ అనుమానం. దీని గురించిన మరిన్ని విశేషాలు తెలుసుకుందాం.. ఏరియల్ యోగాలో చీర పరిమాణంలో ఉన్న ఒక వస్త్రాన్ని పైనుంచి ఊయల మాదిరిగా వేలాడదీస్తారు. ఆ వస్త్రాన్ని శరీరం చుట్టూ చుట్టుకోవాలి. ఇక, వస్త్రాన్ని శరీరానికి చుట్టుకున్న తర్వాత వివిధ యోగాసనాలు వేస్తుంటారు. దీని వల్ల శరీరంలో రక్త ప్రసరణ పెరగడంతో పాటు శరీరానికి ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. అనేక ఆరోగ్య సమస్యలకూ పరిష్కారంగా నిలుస్తోంది.జీర్ణక్రియకు తోడ్పాటు.. ఏరియల్ యోగాతో జీర్ణక్రియ ఎంతో మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. మలబద్ధకం, ఉబ్బరం, కడుపు నొప్పి, అజీర్తి వంటి జీర్ణ సమస్యలను నివారించడంలో ఎంతో ఉపయోగపడుతుంది. శరీరాన్ని సాగతీయడంతో పొత్తికడుపు ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. పేగు సంబంధ సమస్యలు దరి చేరకుండా చూస్తుంది. కడుపు నొప్పి లేదా గ్యాస్ ఉంటే ఏరియల్ యోగాతో తగ్గించుకోవచ్చు. ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది..ఏరియల్ యోగా శరీర కండరాలు సాగేలా చేస్తుంది. గాల్లో ఉంటారు కాబట్టి.. శరీరాన్ని మరింత స్ట్రెచ్ చేసేందుకు వీలు కలుగుతుంది. కొద్ది రోజులకు శరీరం మరింత ఫ్లెక్సిబుల్‌గా మారుతుంది. ఇలా చేయడం వల్ల కండరాలు కూడా బలంగా తయారవుతాయి. వెన్నెముక, భుజం శక్తివంతంగా తయారయ్యేందుకు దోహదపడుతుంది.ఒత్తిడిని తగ్గించే ఆయుధం.. ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలతో బాధపడుతుంటే.. ఏరియల్ యోగా చాలా ఉత్తమమైన వ్యాయామం అని చెప్పొచ్చు. మానసిక స్థితిని మెరుగుపరచడంతో పాటు ప్రవర్తనలో కూడా మంచి మార్పులు తీసుకొస్తుంది. ఒత్తిడి, ఆందోళనను తగ్గి స్తుంది. గాల్లో తల్లకిందులుగా వేలాడుతూ.. ధ్యానం చేస్తుంటే మంచి ఆలోచనలపై దృష్టి పెట్టేందుకు అవకాశం ఉంటుంది. ఏరియల్ యోగాతో మెదడులో రక్త ప్రసరణ పెరిగి మానసిక ఆరోగ్యం మన సొంతమయ్యేలా చేస్తుంది.వెన్నునొప్పి హుష్‌కాకి.. వెన్నెముకపై ఎలాంటి ఒత్తిడీ పడకుండా వెన్నెముక, దాని సంబంధిత సమస్యలను నయం చేయడంలో ఏరియల్ యోగా ఎంతో ప్రభావం చూపుతుంది. వస్త్రంలో పడుకుని వెనక్కి అలా వంగి కాసేపు ఆసనం వేస్తే వెన్నెముక సమస్యలు ఇట్టే తొలగిపోతాయి. ఏరియల్ యోగాతో శరీర తీరుతో పాటు వెన్నెముకను సరిచేసుకోవచ్చు. నడుము నొప్పి కూడా తగ్గుతుంది.బరువు తగ్గిపోతుంది.. ఏరియల్ యోగా బరువు తగ్గించడంలో కూడా ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. 50 నిమిషాల పాటు ఏరియల్ యోగా చేస్తే దాదాపు 320 కేలరీలు బర్న్ చేయగలదు. శరీర కొవ్వును బర్న్ చేసేటప్పుడు ఇది టోన్డ్, లీన్ కండరాలను పొందడానికి సహాయం చేస్తుంది. సమర్థవంతమైన ఫలితాల కోసం వారానికి ఒకసారి దీన్ని ప్రాక్టీస్ చేయవచ్చు.నిపుణుల పర్యవేక్షణలో ..యోగా చేసేటప్పుడు నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే చేయాలి. సొంతంగా చేస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముందు ఎవరైనా గురువు దగ్గర నేర్చుకుని ఆ తర్వాతే అభ్యాసం చేయాలి. కొన్ని యోగాసనాలు చేస్తే పర్వాలేదు. అన్ని ఆసనాలు అందరూ చేయకూడదు. ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు నిపుణుల సలహాలు తీసుకోవాలి. క్రమం తప్పకుండా క్రమపద్ధతిలో చేయాలి. – శ్రీకాంత్ నీరటి, యోగా ట్రైనర్యోగాతో ఎన్నో ప్రయోజనాలుయోగా చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అయితే పతంజలి సూచించిన అష్టాంగ మార్గాల్లోని యమ, నియమను పాటిస్తూ యోగా సనాలు వేయాలి. అప్పుడే మానసిక, శారీరక, ఆధ్యాత్మిక ప్రయోజనాలు చేకూరతాయి. స్థితప్రజ్ఞత సాధించేందుకు యోగా అత్యున్నత మార్గం. – నెతికార్ లివాంకర్, యోగా ట్రైనర్, రామకృష్ణ మఠంకాని్ఫడెన్స్ పెరుగుతుంది.. ఏరియల్ యోగా లేదా యాంటీ గ్రావిటీ యోగా ద్వారా శరీరం చాలా బలంగా తయారవుతుంది. అలాగే మనపై మనకు కాన్ఫిడెన్స్తోపాటు జ్ఞాపకశక్తి, రక్త ప్రసరణ పెరుగుతుంది. మైండ్ రిలాక్సేషన్ అవుతుంది. కాకపోతే సాధారణ యోగాలో కొంతకాలం అనుభవం ఉన్న వారు మాత్రమే దీనిని చేయాలి. ముఖ్యంగా గురువుల సమక్షంలో చేస్తే మంచిది. – కొండకళ్ల దత్తాత్రేయ రావు, అద్వైత యోగా సెంటర్ -
బిర్యానీ ఆకుతో ఎన్ని లాభాలో తెలుసా..!
బిర్యానీ అంటే ఇష్టపడని వారుండరు. బిర్యానీకి మంచి ఫ్లేవర్‌ని ఇచ్చే బిర్యానీ ఆకులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అయితే ఉప్మాలో కరివేపాకులా బిర్యానీలో వచ్చే బిర్యానీ ఆకును ఏరిపారేయడమే. కానీ వీటిని తీసుకోవడం వల్ల చాలా సమస్యలు దూరమవుతాయని తెలుసా? బిర్యానీ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్, ఫైబర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని రెగ్యులర్‌గా తీసుకుంటే కడుపు నొప్పి, జలుబు, తలనొప్పి వంటి సమస్యల్ని దూరం చేస్తాయి. వీటితో ఇంకేం లాభాలున్నాయంటే..డీ టాక్సిఫికేషన్మూత్ర సంబంధిత సమస్యలు దూరమవుతాయి. బాడీ టాక్సిసిటీ తగ్గుతుంది. కిడ్నీలో రాళ్ళ సమస్య తగ్గుతుంది.యాంటీ క్యాన్సర్ గుణాలు..బిర్యానీ ఆకుల్లో యాంటీ క్యాన్సర్ గుణాలు ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల బాడీలోని క్యాన్సర్ సెల్స్ తగ్గుతాయి. దీంతో క్యాన్సర్ వంటి సమస్యల్ని ముందు నుంచే తగ్గించుకోవచ్చు. అంతేకాదు. వీటిలో ఉండే విటమిన్ సి, విటమిన్ ఈ, కెరోటినాయిడ్స్ బ్లడ్ కొలెస్ట్రాల్, యూరిక్ యాసిడ్ లెవల్స్‌ని తగ్గిస్తాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు, ఫైటోకెమికల్స్ ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ని తగ్గిస్తాయి. దీంతోపాటు లివర్, కడుపు సంబంధిత సమస్యల్ని దూరం చేస్తాయి.డయాబెటిస్..బిర్యానీ ఆకులో ఉండే ఫైటో కెమికల్స్ షుగర్ ఉన్న వారికి చాలా మంచిది. దీనిని తీసుకుంటే టైప్ 2 డయాబెటిస్ తగ్గుతుంది.గుండె ఆరోగ్యానికి..పరిశోధనల ప్రకారం బిర్యానీ ఆకుల్లోని కొన్ని ఆర్గానిక్ కాంపౌండ్స్ గుండె గోడలను ఆరోగ్యంగా ఉంచుతాయి. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీంతో గుండె సమస్యలు తగ్గుతాయి.ఎలా తీసుకోవాలి?బిర్యానీ ఆకుల్ని టీలా చేసుకుని తాగొచ్చు. దీనికోసం నీటిలో బిర్యానీ ఆకుల్ని వేసి మరిగించి తాగొచ్చు. అందులో దాల్చిన చెక్క వేస్తే మరీ మంచిది. (చదవండి: బరువు తగ్గడంలో 'పంచకర్మ' ది బెస్ట్!..అనుభవాన్ని షేర్ చేసుకున్న రోహిత్ రాయ్!) -
Bihar: డ్యూటీలో మరణిస్తే రూ. 2.30 కోట్లు
బీహార్ పోలీసులు ఇకపై ఉచిత జీవిత బీమా ప్రయోజనం పొందనున్నారు. తాజాగా బీహార్ పోలీసు విభాగం బ్యాంక్ ఆఫ్ బరోడాతో అవగాహన ఒప్పుందం(ఎంఓయూ) కుదుర్చుకుంది. ఈ మేరకు పోలీసు సిబ్బంది ఎవరైనా విధి నిర్వహణలో చనిపోతే, వారి కుటుంబానికి రూ.2.30 కోట్ల వరకు బీమా ప్రయోజనం అందుతుందని బీహార్ పోలీసులు తెలిపారు.బ్యాంక్ ఆఫ్ బరోడాతో బీహార్ పోలీసులు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న దరిమిలా పోలీసు విభాగానికి చెందిన అదనపు డైరెక్టర్ జనరల్ (హెడ్‌క్వార్టర్స్) జెఎస్ గంగ్వార్ మాట్లాడుతూ తమ సిబ్బంది కోసం ఉచిత జీవిత బీమా ప్రయోజనం కల్పించామన్నారు. దీనిలో సహజ మరణమైతే రూ.20 లక్షల వరకు అందజేస్తారన్నారు. డ్యూటీలో ఉండగా ప్రమాదవశాత్తు మరణించిన సిబ్బందికి బీమా ప్రయోజనం రూ.2.30 కోట్ల వరకు ఉంటుందన్నారు. ఎవరైనా ఉద్యోగి డ్యూటీలో ఉన్నప్పుడు విమాన ప్రమాదంలో మరణిస్తే, వారి కుటుంబానికి రూ. 1.50 కోట్ల అదనపు బీమా ప్రయోజనం లభిస్తుందన్నారు.ఏదైనా ప్రమాదంలో ఉద్యోగి వికలాంగునిగా మారితే రూ.1.50 కోట్ల వరకు బీమా ప్రయోజనం పొందుతారన్నారు. బీహార్ పోలీస్ విభాగంలో పదవీ విరమణ పొందిన సిబ్బందికి కూడా ప్రత్యేక ప్యాకేజీని అందించనున్నట్లు గాంగ్వార్ తెలిపారు. బీమా నిబంధనలలో సిబ్బంది కుమార్తెల వివాహం, విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణిస్తే పిల్లల ఉన్నత చదువులకు ఆర్థిక సాయం కూడా ఉంటుందన్నారు. -
రియల్టీలో సిప్ చేద్దామా!
వాణిజ్య ప్రాపరీ్టపై పెట్టుబడి పెట్టాలంటే సామాన్య ఇన్వెస్టర్లకు అయ్యే పనేనా..! ఎక్కడ చూసినా ధరలు గణనీయంగా పెరిగిపోయిన తరుణంలో.. కొనాలంటే పెద్ద మొత్తమే పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. అయితే, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మాదిరే క్రమానుగత పెట్టుబడి (సిప్) విధానంలో వాణిజ్య ప్రాపరీ్టలపై ఇన్వెస్ట్ చేయాలన్న ఆకాంక్షలకు ఆచరణ మార్గమే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌లు (రీట్లు). వీటిలో ఇన్వెస్ట్ చేయడం ఎలా? వచ్చే ప్రయోజనం ఎంత మేర? తదితర వివరాలను అందించే కథనమే ఇది. రీట్ అంటే...?రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌లు (రీట్లు) పేరులో ఉన్నట్టుగానే.. వివిధ రకాల వాణిజ్య ప్రాపరీ్టలపై పెట్టుబడులు పెడుతుంటాయి. మ్యూచువల్ ఫండ్స్ మాదిరే ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులు సమీకరిస్తుంటాయి. వాటిని వాణిజ్య ప్రాపరీ్టలపై ఇన్వెస్ట్ చేస్తాయి. ఆయా ప్రాపరీ్టలను అద్దెకు, లీజుకు ఇస్తుంటాయి. వీటి ద్వారా వచ్చే ఆదాయాన్ని తిరిగి వాటాదారులకు క్రమం తప్పకుండా పంచుతుంటాయి. ఆఫీసులు, మాల్స్, ఇండ్రస్టియల్ పార్క్‌లు, వేర్‌హౌస్‌లు, హాస్పిటాలిటీ, హెల్త్‌కేర్ సెంటర్లు తదితర వసతులపై రీట్లు ఇన్వెస్ట్ చేస్తుంటాయి. అదే మ్యూచువల్ ఫండ్స్ అయితే బాండ్లు, గోల్డ్, స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఉదాహరణకు ఓ పది మంది స్నేహితుల బృందం ఉందనుకుందాం. తలో రూ.10 లక్షలు వేసుకుని రూ.కోటితో ఒక వాణిజ్య భవనాన్ని సమకూర్చుకున్నారు. దాన్ని ఓ కార్పొరేట్ సంస్థ కార్యాలయానికి లీజుకు ఇచ్చారు. లీజు రూపంలో వచ్చే మొత్తం నుంచి 90 శాతాన్ని పది మంది డివిడెండ్ కింద పంచుకుంటారు. రీట్‌లో ఇదే మాదిరి జరుగుతుంది. కాకపోతే రీట్ల నిర్వహణలో ఇలాంటి వాణిజ్య ఆస్తులు పెద్ద సంఖ్యలో ఉంటాయి. అమెరికా, జపాన్ తదితర దేశాల్లో రీట్లకు ఎంతో ఆదరణ ఉంది. కానీ మన దేశంలో వీటిపై అంత అవగాహన లేదు. అందుకే ఇవి పెద్దగా ప్రాచుర్యానికి నోచుకోలేదు. ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనాలుగా వీటికి తగినంత ప్రచారం కల్పించేందుకు సెబీ తన వంతు కృషి చేస్తోంది. స్టాక్స్, ఫండ్స్ మాదిరే రీట్లు కూడా సెబీ పర్యవేక్షణ కిందకే వస్తాయి. సెబీ నిబంధనల ప్రకారం రీట్లు 80% పెట్టుబడులను అద్దెను సమ కూర్చే ఆస్తులపైనే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మరో 20% మేర పెట్టుబడులను నిర్మాణంలోని ప్రాపరీ్టలపై ఇన్వెస్ట్ చేయవచ్చు. అలాగే, వచ్చే అద్దె ఆదాయంలో నిర్వహణ వ్యయాలు, పన్నులు పోను మిగిలిన నికర మొత్తం నుంచి 90 శాతాన్ని ఇన్వెస్టర్లకు పంపిణీ చేయాలి. ప్రయోజనాలు... అద్దె ఆదాయంరీట్లకు లీజు రూపంలో ఆదాయం వస్తుంటుంది. దీన్ని వాటాదారులకు డివిడెండ్ రూపంలో పంపిణీ చేస్తాయి. సాధారణంగా ప్రతి మూడేళ్లకోసారి 15 శాతం అద్దె పెంచాలన్న నిబంధనతో లీజు ఒప్పందాలు చేసుకుంటుంటాయి. దీంతో వాటాదారులకు వచ్చే డివిడెండ్ ఆదాయం కూడా కాలక్రమేణా పెరుగుతూ వెళుతుంది. కొత్త లీజు సమయంలో అప్పటికి పెరిగిన మార్కెట్ ధరల ప్రకారమే ఒప్పందాలు చేసుకుంటుంటాయి. వడ్డీ ఆదాయం రీట్లు తమవద్దనున్న మిగులు నిధులపై వడ్డీ రాబడిని పొందుతుంటాయి. లేదా ప్రాపర్టీ లీజుదారులకు రుణాలు సమకూర్చడం ద్వారా వాటిపై ఆదాయం పొందుతాయి. ఈ రూపంలోనూ వాటాదారులకు ఆదాయం లభిస్తుంది. మన దేశంలో రీట్లు ప్రధానంగా టైర్–1 పట్టణాల్లోని ప్రాపరీ్టలపైనే ఎక్కువ పెట్టుబడులు పెట్టి ఉన్నాయి. కనుక వీటి ధరలు మరింత పెరిగేందుకు ఆస్కారం ఉంది. పనితీరు భిన్నంస్టాక్స్, బాండ్లు తదితర సాధనాలకు భిన్నంగా రీట్ స్పందన ఉంటుంది. అంటే స్టాక్స్ లేదా బాండ్ల ధరలు పడిపోతే రీట్ల ధరలు కూడా పడిపోవాలనేమీ లేదు. ఆ సమయంలో ఇవి స్థిరంగా ఉండొచ్చు. లేదా లాభాలను ఇవ్వొచ్చు. ఒకవేళ రీట్ల ధరలు కూడా తగ్గినా.. ఇతర సాధనాల స్థాయిలో ఉండదు. ఈ విధంగా పెట్టుబడుల్లో కొంత భాగానికి రిస్క్ తగ్గుతుంది. పెట్టుబడి విలువ వృద్ధిరీట్ల నిర్వహణలోని ప్రాపరీ్టల విలువలు కొంత కాలానికి సహజంగా పెరుగుతుంటాయి. తమ నిర్వహణలోని ఆస్తుల విలువలను ఎప్పటికప్పుడు రీట్లు మదింపు చేసుకోవాలి. దీంతో పెరిగిన ప్రాపరీ్టల విలువ రీట్ యూనిట్ విలువపై ప్రతిఫలిస్తుంది. అలాగే, ఆరి్థకంగా లాభదాయకం లేని, లీజు పరంగా అంత డిమాండ్ లేని ప్రాపరీ్టలను విక్రయించి, డిమాండ్ ఉన్న ప్రాంతాల్లోని ప్రాపరీ్టలపై ఇవి ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఇది కూడా పెట్టుబడి విలువ వృద్ధికి, డివిడెండ్ వాటా పెంపునకు దారితీస్తుంది. అంతేకాదు, కొంత మేర రుణాలు తీసుకుని కొత్త ప్రాపరీ్టలపై వెచి్చంచేందుకు సైతం వీటికి వెసులుబాటు ఉంటుంది. కనుక కాలక్రమంలో, కంపెనీ నగదు ప్రవాహాలు, నికర విలువ పెరుగుతున్న కొద్దీ.. కొత్త ప్రాపర్టీలను అదనంగా సమకూర్చుకుంటాయి. ఆ విధంగానూ పెట్టుబడుల విలువ వృద్ధి చెందుతుంది. ఆదాయం పెరుగుతుంది. మెరుగైన లిక్విడిటీభౌతిక ప్రాపర్టీ కొనుగోలు చేస్తే విక్రయించడానికి చాలా సమయం తీసుకోవచ్చు. అదే రీట్లను పనిదినాల్లో ఏ రోజు అయినా విక్రయించుకుని, మరుసటి రోజే ఆ మొత్తాన్ని బ్యాంక్ ఖాతాలో పొందొచ్చు. ఇవి స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్ట్ అయి ఉంటాయి కనుక లిక్విడిటీ సమస్య ఉండదు.లిస్టెడ్ రీట్లు... బ్రూక్‌ఫీల్డ్ ఇండియా రియల్ ఎస్టేట్ ట్రస్ట్, మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ రీట్, ఎంబసీ ఆఫీస్ పార్క్స్ రీట్, నెక్సస్ సెలక్ట్ ట్రస్ట్ రీట్లు స్టాక్ ఎక్సే్ఛంజ్‌లు లిస్ట్ అయి ఉన్నాయి. ఇవన్నీ కూడా త్రైమాసికానికి ఒకసారి డివిడెండ్‌ను పంపిణీ చేస్తున్నాయి.ఎలా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు? రీట్‌లో పెట్టుబడులకు ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాలు తప్పనిసరిగా ఉండాలి. స్టాక్స్‌ను కొనుగోలు చేసినట్టుగానే రీట్ యూనిట్లను కొనుగోలు చేసుకోవచ్చు. ఇవి డీమ్యాట్ ఖాతాలో జమ అవుతాయి. రాబడులు... వాణిజ్య రియల్ ఎస్టేట్‌పై వార్షిక రాబడులు 8–10 శాతం మధ్య ఉంటాయి. గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్‌పై రాబడులు ఒక్కోసారి 15 శాతం స్థాయిలో ఉంటాయి. కానీ, మన దేశంలో రీట్‌లపై ప్రస్తుత రాబడులు 10 శాతం లోపే ఉన్నాయి. మన ఆరి్థక వ్యవస్థ రానున్న రోజుల్లో మరింత విలువను సంతరించుకుంటుందని నిపుణుల అంచనా. దీనికితోడు ఈ మార్కెట్ పరిణతి చెందిన కొద్దీ రీట్‌లపై వార్షిక రాబడులు 10 శాతం, అంతకంటే ఎగువ స్థాయికి చేరుకుంటాయని నిపుణుల అంచనా. 2022–2024 మధ్య రీట్ల నుంచి డివిడెండ్ రాబడి 6–9 శాతం మధ్య ఉన్నట్టు, పెట్టుబడి విలువలో 12–18 శాతం మేర వృద్ధి ఉన్నట్టు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ నివేదిక చెబుతోంది.ఇవి గమనించాలి..→ రీట్లు స్వల్పకాలానికి కాకుండా దీర్ఘకాలం కోసమే (ఐదేళ్లు అంతకుమించిన కాలం) పరిశీలించడం సూచనీయం. అప్పుడు మూలధన పెట్టుబడి వృద్ధి సాధ్యపడుతుంది. రియల్ ఎస్టేట్ మార్కెట్ సైక్లికల్‌గా ఉంటుంది. స్వల్పకాలంలో రీట్ల ధరలు స్టాక్స్ మాదిరే ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా కొంత మేర హెచ్చుతగ్గులకు గురికావచ్చు. → మనదేశంలో ఇప్పటి వరకు కేవలం నాలుగు రీట్లే లిస్ట్ అయి ఉన్నాయి. ఇందులో నెక్సస్ సెలక్ట్ ట్రస్ట్ మాత్రం రిటైల్ మాల్స్ ఆస్తులపైనే అధిక శాతం ఇన్వెస్ట్ చేసింది. మిగిలిన రీట్లు ఆఫీస్ ప్రాపరీ్టలపై ఇన్వెస్ట్ చేసేవి. పనితీరు పోల్చి చూసేందుకు పరిమిత అవకాశాలే ఉన్నాయి. → ఇన్వెస్ట్ చేసే ముందు ఆయా రీట్ల పరిధిలోని ప్రాపరీ్టలలో ఆక్యుపెన్సీ రేషియో (భర్తీ రేటు) చూడాలి. లీజుకు తీసుకున్న కంపెనీలు అన్నీ ఒకే రంగంలో కాకుండా భిన్న రంగాలకు చెందినవి అయితే రిస్క్ వైవిధ్యం అవుతుంది. రీట్ల నిర్వహణలోని ప్రాపరీ్టల నాణ్యత, డిమాండ్ చూడాలి. → ఆర్థిక సంక్షోభ సమయాల్లో, కరోనా వంటి విపత్తుల సమయాల్లో ఆఫీస్ లీజింగ్ మార్కెట్‌పై ప్రభావం పడొచ్చు. అలాంటి సందర్భాల్లో డివిడెండ్ పంపిణీ, మూలధన పెట్టుబడి విలువ ప్రభావితం కావచ్చు. → మన దగ్గర స్టాక్స్‌తో పోలిస్తే రీట్లకు ప్రాచుర్యం తక్కువ. కనుక స్టాక్ ఎక్సే్చంజీల్లో వీటి లిక్విడిటీ (ట్రేడింగ్ వ్యాల్యూమ్) తక్కువగా ఉంటుంది. → తమకు స్థిరమైన ఆదాయం కావాలని కోరుకునే వారు రీట్లలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అది కూడా తమ మొత్తం పెట్టుబడుల్లో 10 శాతం వరకు కేటాయించుకోవచ్చన్నది నిపుణుల సూచన. పన్ను బాధ్యత... రీట్ పెట్టుబడులపై డివిడెండ్ రూపంలో వచ్చే ఆదాయంపై పన్ను కొంత భిన్నంగా ఉంది. బ్రూక్‌ఫీల్డ్, ఎంబసీ ఆఫీస్ పార్క్స్, మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ రీట్లు రాయితీతో కూడిన పన్ను రేటును ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 115బీఏఏ కింద ఎంపిక చేసుకోలేదు. ఇవన్నీ స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ)పైనే ఇన్వెస్ట్ చేశాయి. కనుక ఇవి పంపిణీ చేసే డివిడెండ్‌పై పన్ను లేదు. ఒకవేళ ఎస్పీవీలు రాయితీ రేటును ఎంపిక చేసుకుంటే, అప్పుడు అవి పంపిణీ చేసే డివిడెండ్ పన్ను పరిధిలోకి వస్తుంది. ఇన్వెస్టర్ తనకు వర్తించే శ్లాబు ప్రకారం దీనిపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. డివిడెండ్‌పై పన్ను వర్తించేట్టు అయితే, రీట్లు 10 శాతం టీడీఎస్ కింద తగ్గించి ఆదాయపన్ను శాఖకు జమ చేస్తాయి. ఇన్వెస్టర్లు తమ వార్షిక పన్ను రిటర్నుల్లో దీన్ని సర్దుబాటు చేసుకోవచ్చు. సొంత ప్రాపరీ్టలపై రీట్లకు వచ్చే ఆదాయం నుంచి వాటాదారులకు డివిడెండ్ పంపిణీ చేసినా, ఎస్పీవీలకు ఇచ్చిన రుణాలపై రీట్లకు వచ్చే ఆదాయాన్ని వాటాదారులకు పంపిణీ చేసిన సందర్భాల్లోనూ.. ఇన్వెస్టర్ వ్యక్తిగత ఆదాయానికే కలుస్తుంది. ఇక రీట్లలోని పెట్టుబడులకు స్టాక్స్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మాదిరే పన్ను నిబంధనలు వర్తిస్తాయి. విక్రయించినప్పుడు వచ్చే లాభంపై మూలధన లాభాల పన్ను చెల్లించాలి. ఏడాదిలోపు విక్రయించగా వచ్చిన లాభంపై 20 శాతం పన్ను, ఏడాది ముగిసిన తర్వాత విక్రయించినప్పుడు వచి్చన లాభం మొదటి రూ. లక్ష తర్వాత మొత్తంపై 12.5 శాతం చెల్లించాలి. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
బాలీవుడ్ నటి అనుష్క శర్మ మోనోట్రోఫిక్ డైట్: నిపుణులు ఏమంటున్నారంటే..!
బాలీవుడ్ నటి, దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె తన అందం అభినయంతో వేలాదిగా అభిమానులను సొంతం చేసుకుంది. ఇద్దరు పిల్లలు తల్లి అయినా కూడా అందం, ఫిట్నెస్ పరంగా యువహీరోయిన్లకు తీసిపోని వన్నె తరగని అందం అనుష్కాది. ఒక ఇంటర్వ్యూలో తన ఫిట్నెస్ రహస్యం, ఫాలో అయ్యే డైట్ గురించి షేర్ చేసుకుంది. తాను ప్రతిరోజు ఒకే రకమైన ఆహారాన్ని తింటానని చెప్పుకొచ్చింది. ఇలా తినడాన్ని మోనోట్రోపిక్ డైట్ అనిపిలుస్తారని చెప్పింది. ప్రతిరోజూ ఒకేరకమైన లేదా ఒకలాంటి ఆహారాన్నే ఈ డైట్లో తీసుకుంటారు. ఇలాంటి డైట్ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ డైట్లో ఆహారం సరళంగా, సౌకర్యవంతంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ డైట్ ఎక్కువగా తినాలనే ఆసక్తిని తగ్గిస్తుంది. అలసటను కూడా పోగొడుతుంది. అనుష్క కూడా అల్పాహారంలో ఇడ్లీ సాంబార్ తినాలనుకుంటే ఆరునెలలపాటు అదే బ్రేక్‌ఫాస్ట్‌లో ఉండేలా చూసుకుంటుందట. ఇక్కడ అనుష్క తీసుకనే సాంబార్, ఇడ్లీ పులియబెట్టినది కావడం వల్ల ఇందులోని గట్ స్కిన్‌ని మెరిసేల చేసుంది. దీనిలో ఉండే విటన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్ల శోషణ మేని ఛాయు ప్రకాశవంతంగా ఉండేలా చేస్తుంది. ఈ మోనోట్రోఫిక్ డైట్ వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు..ఈజీగా ఫుడ్ ప్లాన్భోజన ప్రణాళికను గణనీయంగా సులభతం చేస్తుంది. ప్రతిరోజు ఆహారంలో ఒకరకమైన ఆహారం లేదా ఒకే విధమైన ఆహార తినవల్సి ఉంటుంది. దీనివల్ల ఆహారం ఎక్కువగా తీసుకునే ఆసక్తి తగ్గుతుంది. ఒక విధమైన అలసటను నివారస్తిఉంది. ఒక నియమబద్ధమైన ఆహార నియమావళికి కట్టుబడి ఉండటాన్ని సులభతరం చేస్తంది.జీర్ణశక్తిని మెరుగుపరుస్తుందిఒకేసారి ఒక రకమైన ఆహారాన్ని తినడం వల్ల జీర్ణక్రియ ప్రక్రియ సులభతరం అవుతుంది. శరీరం ఏకకాలంలో బహుళ ఆహార రకాలను నిర్వహించడంలో సంక్లిష్టత లేకుండా ఒకే పోషకాన్ని విచ్ఛిన్నం చేయడం, గ్రహించడంపై దృష్టి పెడుతుంది. ఇది పోషకాల శోషణను మెరుగుపరచడంలో, జీర్ణ అసౌకర్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.కేలరీలు తీసుకోవడం తగ్గిస్తొంది..భోజనాన్ని ఒకే ఆహారం లేదా ఒక విధమైన ఆహార సమూహానికి పరిమితం చేసినప్పుడు..ఆటోమెటగ్గా కేలరీలు తీసుకోవడం తగ్గుతుంది. అలాగే వివిధ రకాల ఆహార పదార్థాల కొరత ఉన్నప్పుడు అతిగా తినడాన్ని అరికట్టడానికి సహాయపడుతుంది. ఎందుకంటే..? ఒకేరకమైన ఆహారం అతిగా తినాలనే ఉత్సాహాన్ని తగ్గిస్తుంది. ఇది చివరికి బరువు నిర్వహణలో సహాయపడుతుంది.మైండ్‌ఫుల్ ఈటింగ్‌లో సహాయపడుతుందిఒక మోనోట్రోపిక్ ఆహారం సంపూర్ణతను ప్రోత్సహిస్తుంది. అనేక రుచులు వైప దృష్టిపోనివ్వకుండా, నెమ్మదిగా ఆహారాన్ని ఆస్వాదించేలా చేస్తుంది. పైగా అతిగా తినడాన్ని నిరోధస్తుంది.నిర్విషీకరణలో సహాయపడుతుందిఒక రకమైన ఆహారంపై దృష్టి కేంద్రీకరించినప్పుడు శరీరం నిర్విషీకరణ ప్రక్రియలలో సహాయపడుతుంది. పండ్లు, కూరగాయలు వంటి ఆహారాలలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి టాక్సిన్లను తొలగించడంలో, మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.ఆహారం పట్ల అవగాహనను పెంచుతుందిమోనోట్రోపిక్ డైట్ వల్ల వివిధ ఆహారాలు, శక్తి స్థాయిలు, మానసిక స్థితి, మొత్తం శ్రేయస్సును ఎలా ప్రభావితం చేస్తాయనే దానిపై అవగాహనను పెంచుతుంది. ఆహారాన్ని వేరుచేయడం ద్వారా, రీరంపై ప్రతి ఒక్కటి ప్రత్యక్ష ప్రభావాన్ని స్పష్టంగా చూడవచ్చు. ఆహారంలో సంక్లిష్టతను తొలగిస్తుందిమోనోట్రోపిక్ డైట్ సరళత ఆహార సున్నితత్వం లేదా అలెర్జీలను గుర్తించడం సులభం చేస్తుంది. ఆహార సమూహాలను వేరుచేసినప్పుడు, ఏ ఆహారాలు ప్రతికూల ప్రతిచర్యలకు కారణమవుతాయో సులభంగా గుర్తించవచ్చు. అలాగే శరీరం ఆహారంలో సర్దుబాట్లు చేసేలా మిమ్మల్ని అనుమతిస్తుంది.(చదవండి: 90 ఏళ్లు... రెండు మైళ్లు..: సొసైటీకీమె దివిటీ) -
గ్రీన్ టమాటాల గురించి విన్నారా? ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలంటే..!
గ్రీన్ టమాటాలో విటమిన్ ఏ, తోపాటు పొటాషియం, కాల్షియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇందులో ఉండే బీటా కెరాటిన్ కంటి ఆరోగ్యం మెరుగ్గా ఉండేలా చేస్తుంది. రోజూ ఒక పచ్చి టమాటా తినడం వల్ల కంటి సంబంధిత సమస్యలు తగ్గుతాయి. సహజంగా అందరికీ ఎర్రగా ఉండే టమాటానే కూరల్లోనూ, పచ్చడిలోనూ వినయోగిస్తారు. చాలామంది టమాటా లేకుండానే కూరే చెయ్యరు కూడా. అయితే అందరికీ ఎర్రటి టమాటా తెలిసినంతగా పచ్చి టమాటా గురించి పెద్దగా తెలియదు. అంతేగాదు గ్రీన్ కలర్లో టమాటా ఒకటి ఉంటుందని కూడా తెలియదు. ఇక్కడ గ్రీన్ టమాటాలంటే..పండని పచ్చిగా ఉన్న టమాటాలనే గ్రీన్ టమాటాలని అంటారు. పండిన టమాటాల కంటే పచ్చి టమాటాలోనే పోషకాలు ఎక్కువగా ఉంటాయి. దీనన్ని రోజువారీ డైట్ భాగం చేసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో చూద్దాం..!.గ్రీన్ టమాటాలో ఉండే విటమిన్లు ఖనిజాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఉండే బీటా కెరాటిన్ కంటి ఆరోగ్యం మెరుగుపడేలా చేస్తుంది. రోజూ ఒక పచ్చి టమాటా తినడం వల్ల కంటి సంబంధిత సమస్యలు తగ్గుతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఇన్ఫెక్షన్లను దూరం చేయడంతో పాటు కేన్సర్ పెరిగే కణాలను కూడ నిరోధిస్తుంది. పచ్చి టమాటాతో రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు. ఇందులో ఉండే విటమిన్స్ రోగనిరోధకశక్తిని పెంచుతాయి. గ్రీన్ టమాటాలో టొమాటిన్ అనే కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, కార్డియో ప్రొటెక్టివ్, యాంటీ బయాటిక్ గుణాలను కలిగి ఉంటుంది. దీనివల్ల శరీరానికి పోషకాల శోషణను పెరగడమే గాక వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ గ్రీన్ టమాటాను పచ్చిగా తినకూడదు. వండుకుని మాత్రమే తినాలి. ఎందుకంటే ఇందులో ఉండే సొలనిన్ ఒక్కోసారి విషపూరితం కావచ్చు. అందువల్ల వీటిని ఉడికించి లేదా వండుకుని మాత్రమే తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.పచ్చి టమాటాలో ఉండే ఫైబర్ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే వాపు, కొలెస్ట్రాల్, శరీర బరువును తగ్గించడంలో సాయపడుతుంది. జీర్ణక్రియను మెరుగ్గా ఉంచి, మలబద్దకాన్ని నివారిస్తుంది. వీటిని తినడం వల్ల ముఖంపై ముడతలు పోయి యవ్వనంగా కనిపిస్తారు. జలుబు, దగ్గు, జ్వరం వంటి వ్యాధుల భారీ నుంచిరక్షణ ఇస్తుంది. ఇందులో ఉండే ఫాస్ఫరస్ ఎసిడిటీ సమస్యను తగ్గిస్తుంది. మధుమేహం ఉన్నవాళ్లకు గ్రీన్ టమాటా బాగా ఉపయోగపడుతుంది. ఈ టమాటాతో ఎముకలు బలంగా పెరుగుతాయి. బోలు ఎముకల వ్యాధి నుంచి విముక్తి పొందాలంటే రోజూవారి డైట్లో ఈ గ్రీన్ టమాటాలను చేర్చుకోవడం మంచిది. దీనిని కేవలం చర్మ ఆరోగ్యానికి మాత్రమే గాక శిరోజాల సంరక్షణలోనూ కీలకపాత్ర పోషిస్తుంది. (చదవండి: దోమలు కొందరినే ఎక్కువగా కుడతాయి..ఎందుకో తెలుసా?) -
సౌందర్యం సాధనంగా వెదురు..బోలెడన్ని లాభాలు..!
సాధారణంగా వెదురును ఇళ్ల నిర్మాణ వస్తువుగానే చూస్తాం. మహా అయితే వెదురుతో చేసే వివిధ రకాల వంటకాలు గురించి విని ఉంటాం. అంతేకానీ ఇది ముఖ సౌందర్యం కోసం వాడటం గురించి చాలామందికి తెలియదు. కానీ నిపుణులు ముఖ వర్చస్సుకు ఎంతగానో ఉపయోగ పడుతుందని నొక్కి మరీ చెబుతున్నారు. ఇందులో ఉండే పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు వివిధ రకాల సౌందర్య సమస్యల్ని దూరం చేయడంలో సమర్థంగా పనిచేస్తాయంటున్నారు. వెదురుతో ఇన్ని ప్రయోజనాలున్నాయి కాబట్టే కొరియన్లు తమ సౌందర్య పరిరక్షణలో భాగంగా దీన్ని విరివిగా వాడుతుంటారట! మరీ అలాంటి వెదురు ఎలా సౌందర్యాన్ని పెంచడంలో ఉపయోగపడుతుందంటే..ఎలా ఉపయోగపడుతుందంటే..వెదురులో సిలికా, కొలాజెన్ స్థాయులు ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మానికి తేమనందించి మృదువుగా మార్చుతాయి. వృద్ధాప్య ఛాయల్ని దూరం చేస్తుందిఅలాగే సిలికా చర్మానికి రక్తప్రసరణను మెరుగుపరిచి చర్మం ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తుంది.మొటిమల కారణంగా చర్మం బయటి పొర దెబ్బతింటుంది. తద్వారా వాతావరణంలోని బ్యాక్టీరియా, ఇతర కాలుష్య కారకాలు చర్మంపై దాడి చేస్తాయి. ఇలా జరగకూడదంటే వెదురు ఎక్స్‌ట్రాక్ట్‌తో తయారుచేసిన సౌందర్య సాధనాల్ని ఉపయోగించమంటున్నారు నిపుణులు. తద్వారా మొటిమల సమస్యకు కూడా చెక్ పెట్టచ్చంటున్నారు.డీటాక్సిఫై ఏజెంట్‌గా వెదురుకు పేరుంది. కాబట్టి దీంతో తయారుచేసిన సౌందర్య ఉత్పత్తులు/సాధనాల్ని తరచూ ఉపయోగించడం వల్ల చర్మంలోని మలినాలు, విష పదార్థాలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా మారుతుంది.వెదురు ఎక్స్ట్రాక్ట్స్లో ఉండే అమైనో ఆమ్లాలు, ఫ్లేవనాయిడ్లు.. సూర్యరశ్మిలో ఉన్న అతినీలలోహిత కిరణాల ప్రభావం చర్మంపై పడకుండా రక్షణ కల్పిస్తాయి.ఫ్రీరాడికల్స్ చర్మ కణాల్ని దెబ్బతీస్తాయి. తద్వారా ముఖంపై ముడతలు, గీతలు.. వంటివి ఏర్పడే ప్రమాదముంది. అదే వెదురుతో తయారుచేసిన ఉత్పత్తుల్ని తరచూ వాడితే ఫలితం ఉంటుంది. వీటి వల్ల చర్మం తేమగా, మృదువుగా మారుతుంది.వెదురు ఎక్స్ట్రాక్ట్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలుంటాయి. ఇవి అలర్జీలు, రాషెస్ వంటి చర్మ సమస్యల్ని దూరం చేయడంలో సహకరిస్తాయి. అందుకే వెదురు ఎక్స్‌ట్రాక్ట్‌తో తయారుచేసిన క్లెన్సర్లు, బాడీవాష్‌లను చర్మానికి ఉపయోగించడం మేలంటున్నారు నిపుణులు.వెదురులోని సిలికా చర్మ సౌందర్యానికే కాదు.. జుట్టు ఆరోగ్యానికీ మేలు చేస్తుంది. ఇది జుట్టు కుదుళ్లకు పోషణను అందించడంతో పాటు రక్తప్రసరణ, ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరుస్తుంది. ఫలితంగా జుట్టు ఒత్తుగా, ప్రకాశవంతంగా పెరిగేందుకు దోహదం చేస్తుంది. గోళ్లు పొడవుగా పెంచుకోవడానికి ఇష్టపడుతుంటారు కొందరు. అయితే సరైన పోషణ అందక అవి పదే పదే విరిగిపోతుంటాయి. అలా జరగకూడదంటే వెదురు ఎక్స్‌ట్రాక్ట్‌తో తయారుచేసిన గోళ్ల సంరక్షణ ఉత్పత్తుల్ని వాడడం మంచిదంటున్నారు నిపుణులు. ఇందులోని సిలికా గోళ్లకు కావాల్సిన పోషణను అందించడంతో పాటు రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.ఎలా ఉపయోగించాలంటే..చర్మ సంరక్షణ, కేశ సౌందర్యం, గోళ్ల పరిరక్షణలో కీలక పాత్ర పోషించే వెదురు ప్రస్తుతం మార్కెట్లో.. సీరమ్, షీట్ మాస్కులు, ఫేస్ మిస్ట్, మాయిశ్చరైజర్లు, క్లెన్సర్ల రూపంలో అందుబాటులో ఉంది. అలాగే వెదురు ఎక్స్ట్రాక్ట్ పరిమాణం ఎక్కువగా ఉన్న కొరియన్ బ్యూటీ ఉత్పత్తుల్ని నిపుణుల సలహా మేరకు వాడచ్చు. ఇక జుట్టు విషయానికొస్తే.. వెదురు ఎక్స్‌ట్రాక్ట్‌తో తయారుచేసిన షాంపూలు, కండిషనర్లు సైతం లభిస్తున్నాయి. అలాగే గోళ్ల ఆరోగ్యాన్ని పెంచే క్రీమ్స్, వెదురుతో తయారుచేసిన మానిక్యూర్ స్టిక్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఎంచుకునే ముందు నిపుణుల సలహా తీసుకోవడం, ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మర్చిపోవద్దు.(చదవండి: ఈ విటమన్ని తక్కువగా తీసుకుంటే ఎక్కువ కాలం జీవించొచ్చట..! పరిశోధనలో షాకింగ్ విషయాలు..ఝ) -
గర్భిణీలు వ్యాయామం చేయాలా? వద్దా?
బిడ్డకు జన్మనివ్వడం అంటే అంత అషామాషీ వ్యవహారం కాదు. గర్భం దాల్చింది మొదలు శరీరంలో అనేక శారీరక మార్పులు చోటు చేసుకుంటారు. హార్మోన్లలో తేడాలొస్తాయి. వాంతులు, మార్నింగ్ సిక్నెస్ లాంటివి మరింత ఇబ్బందిపెడతాయి. వీడికి తోడు అనేక ఏం తినాలి? ఇలా ఎందుకు అయింది? ఇదేమైనా ప్రమాదమా? లోపల బేబీ బాగానే ఉందా? బిడ్డ బాగానే ఎదుగుతోందా? వ్యాయామం చేయాలా? వద్దా? ఇలా సవాలక్ష సందేహాలు కాబోయే తల్లుల బుర్రల్ని తొలుస్తూ ఉంటాయి? బిడ్డ ఆరోగ్యంగా ఎదగాలంటే తల్లి మంచిపోషకాహారం తీసుకోవడం ముఖ్యం. కానీ గర్భధారణ సమయంలోవ్యాయామం చేయడం కూడా అవసరం. అయితే ఎలాంటి వ్యాయామం చేయాలి అనేది పెద్ద ప్రశ్న.అమెరికన్ కాలేజ్ ఆఫ్ అబ్స్టెట్రిషియన్స్ అండ్ గైనకాలజిస్ట్స్ (ACOG) ప్రకారం, గర్భధారణ సమయంలో వ్యాయామం చేయడం వలన తేలిగ్గా ప్రసవం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ముందస్తు జననాలను నివారించవచ్చు.గర్భం దాల్చడం అపురూపమే కానీ, కనీస శారీక శ్రమ చేయకూడనంత కాదు. గర్బిణీలు జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు, కొన్ని వ్యాయామాలు చేయడంద్వారా సుఖ ప్రసవం జరుగుతుంది. కటి కండరాలు, ఎముకలు బలంగా మారి ప్రసవం తర్వాత కొలుకునే సమయాన్ని కూడా తగ్గిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నమాట. అధిక బరువు , గర్భధారణ సమయంలో వచ్చే మధుమేహం లేదా ప్రీఎక్లంప్సియా వంటి అధిక రక్తపోటు రుగ్మతలు దరి చేరవు. ఆందోళన, ఒత్తిడిని తేలికపాటి వ్యాయామం తగ్గిస్తుంది. పొట్ట పెరుగుతున్నపుడు వచ్చే నడుం నొప్పి తగ్గుతుంది. ఎలాంటి వ్యాయామాలు చేయాలో ఇప్పుడు చూద్దాం.గర్భధారణ సమయంలో వ్యాయామం చేయడానికి ముందు మీ గైనగాలజిస్ట్ సలహా తప్పకుండా తీసుకోవాలి. వారి సలహా మేరకు నాలుగో నెల నుంచి సాధారణం వ్యాయామాన్ని అలవాటు చేసుకోవాలి. రోజంతా ఎంత యాక్టివ్‌గా ఉంటే అంత మంచిది. ప్రజారోగ్య మార్గదర్శకాల ప్రకారం గర్భిణీలు వారానికి సుమారు 150 నిమిషాలు (లేదా రోజుకు 30 నిమిషాలు, వారానికి ఐదు రోజులు) వాకింగ్ చేయవచ్చు. వార్మ్-అప్ ,కూల్-డౌన్ వ్యాయామాలు ఎంచుకోవాలి. మానసిక, శారీరక ఆరోగ్యంకోసం తేలికపాటి యోగా చేయవచ్చు.గర్భధారణ సమయంలో పెల్విక్ ఫ్లోర్ వ్యాయామాలు చేయాలి. గర్భాశయం, మూత్రాశయం, ప్రేగులకు మద్దతు ఇచ్చే కండరాలను బలోపేతం చేస్తాయి.ట్రైనర్స్ సహాయంతో ఎలాంటి వ్యాయామాలు చేయవచ్చు. తల్లి స్నానం చేసేటపుడు, పొట్టమీద ఒకసారి వేడి నీళ్లు (సమవేడి) మరోసారి చల్ల నీళ్లను పోసుకుంటూ వాటర్ థెరపీలా చేసుకోవాలట. దీని వల్ల బిడ్డ నాడీ వ్యవస్థ చురుగ్గా ఉంటుందని చెబుతారు. అరగంట సమయానికి పరిమితం కావడం మంచిది. ఏదైనా తేడాగా అనిపించినా, అలసటగా అనిపించినా వైద్యుడిని సంప్రదించాలి. అలాగే సడన్‌గా లేవడం, కూర్చోవడం, ఒక్కసారిగా కిందినుంచి పైకి బరువులు ఎత్తకూడదు. ఏ వ్యాయామం అయినా, మితంగా చేయడం ముఖ్యం. అలసిపోయే దాకా చేయకూడదు. గర్భవతిగా ఉన్నప్పుడు మంచి ఆహారం తీసుకోవాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి. మధ్యాహ్నం భోజనం తరువాత కాసేపు విశ్రాంతి తీసుకోవాలి. బీపీ నియంత్రణలో ఉండేలా చూసుకోవాలి. అలాగే కడుపులో బిడ్డ కదలికలను నిరంతరం గమనిస్తూ ఉండాలి. -
ఎర్ర బచ్చలికూరతో అధిక బరువుకి చెక్!
బచ్చలి కూరతో చేసే వంటల రుచే వేరు. అందులోనూ ఎర్ర బచ్చలి కూర మరింత రుచిగా ఉంటుంది. దీన్ని అమరాంత్ సాగ్ అని కూడా పిలుస్తారు. ఈ అద్భతమైన ఆకుకూరతో బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఆకుకూరని రోజూవారి ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్యంలో వచ్చే మంచి మార్పును గమనించగలుగుతారు. దీని వల్లే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఆరోగ్య నిపుణుల మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా..!దీనిలో ఈ, సీ, కే, ఇనుము, కాల్షియం, వంటి ముఖ్యమైన ఖనిజాలతో నిండిన పోషకాహార శక్తి కేంద్రం. ఇందులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి మొత్తం ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడంలో సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునేవారికి ఎర్ర బచ్చలి కూర అద్భుతమైన ఆప్షన్. దీనిలో అదికంగా ఉండే పోషకాలు మంచి రుచిని అందించడమే కాకుండా మంచి ఫిట్‌నెస్‌కు ఉపయుక్తంగా ఉంటుంది. బరువుని ఎలా తగ్గిస్తుందంటే..ఎరుపు బచ్చలి కూరలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల దీన్ని తీసుకుంటే కడుపు నిండుగా ఉన్న అనుభూతి కలుగుతుంది. అందువల్ల జంక్ఫుడ్లాంటి ఇతర ఆహారాల జోలికిపోరు. అదీగాక బరువు తగ్గాలనుకునే వారికి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తప్పనిసరిఇతర ఆరోగ్య ప్రయోజనాలు..మలబద్దకంతో పోరాడుతుందిజీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. ఇందులో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ మలబద్ధకాన్ని తగ్గించి జీర్ణవ్యవస్థను మెరుగ్గా ఉంచుతుంది. అద్భుతమైన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీనిలో ఉండే ప్రోటీన్, విటమిన్ కే కంటెంట్లు కాలనుగుణ వ్యాధులతో పోరాడటంలో సహాయపడుతుంది. ఇందులో కాల్షియం, ప్రోటీన్లు పుష్కలంగా ఉండటంతో ఎముకలను దృఢంగా ఉంచటంలో కీలకపాత్ర పోషిస్తాయి. ఈ బచ్చలి కూరను పప్పుతో లేదా బంగాళ దుంపతో చేరి కాస్త సుగంధద్రవ్యాలను కూడా జోడించి తీసుకునేందుకు ప్రయత్నించండి.(చదవండి: ‘బ్లీడింగ్ ఐస్’ వ్యాధి అంటే..! సోకితే అంతేనా..!) -
జాను శీర్షాసనం.. తల నుంచి మోకాలి వరకు!
తల నుంచి మోకాలి వరకు ఉండే ఈ భంగిమను జాను శీర్షాసన అంటారు. ‘జాను’ అంటే మోకాలు ‘శీర్ష’ అంటే తల. ఈ ఆసనాన్ని వేసే ముందు మ్యాట్ పైన సుఖాసనంలో కూర్చోవాలి.ఒక కాలును ముందుకు చాపి, చేతులతో ఆ కాలిపాదాన్ని పట్టుకోవాలి. తలను మోకాలి మీదుగా ఉంచాలి. మడిచి ఉన్న రెండవ కాలుపాదం మరొక కాలును తాకినట్టుగా, ΄÷ట్ట దగ్గరగా ఉండాలి. ఈ ఆసనంలో ఎక్కువ సేపు ఉండటం వల్ల వెన్నెముక సాగినట్టుగా, దిగువ శరీరం అంతా రిలాక్స్ అయినట్టుగా అనిపిస్తుంది. జీర్ణక్రియ, శ్వాసకోశ పనితీరును మెరుగుపరుస్తుంది. నడుము నొప్పి, ఒత్తిడి, నిరాశ, అలసటపై ప్రభావం చూపుతుంది.అధిక బరువుకు:మొదట్లో ఈ ఆసనం వేస్తున్నప్పుడు కొంత సవాల్‌గా అనిపిస్తుంది. ఎక్కువ ఒత్తిడి లేకుండా మెల్లగా ప్రయత్నించడం వల్ల ఈ భంగమను సాధన చేయవచ్చు. ఒక కాలును ఒకసారి రెండవ కాలును మరొకసారి 5 సార్లు మార్చుతూ చేయాలి. రోజూ పరగడపున పది సార్లు ఈ ఆసనం వేయడం వల్ల అధికబరువు, గ్యాస్ట్రిక్, మధుమేహం సమస్యలకు మంచి పరిష్కారం లభిస్తుంది. రోజులో ఉండే ఒత్తిడి నుంచి కూడా త్వరగా రిలాక్స్ అవుతారు.సూచన:గర్భిణులు, హెర్నియా, ఆస్తమా, స్పాండిలోసిస్, స్లిప్డ్ డిస్క్ వంటి సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా మేరకు లేదా యోగా నిపుణుల ఆధ్వర్యంలో మాత్రమే సాధన చేయాలి.– జి. అనూషా రాకేష్, యోగా ట్రైనర్ఇవి చదవండి: నైట్ బ్రషింగ్ తప్పనిసరి.. లేదంటే ఈ సమస్యలు రావచ్చు! -
ఆషాఢ గజానన సంకష్ట చతుర్థి : విశిష్టత, లాభాలు
ఆషాఢ మాసంలో వచ్చే సంకష్ట చతుర్థి వ్రతాన్ని గజానన సంకష్ట చతుర్థి అంటారు. ఎంతో భక్తితో జరుపుకునే పండుగ. ఆషాఢ మాసంలోని కృష్ణ పక్షం (క్షీణించే దశ) చతుర్థి (నాల్గవ రోజు) నాడు వస్తుంది. సంకష్ట చతుర్థి అంటే కష్టాలను నాశనం చేసేదని అర్థం. ప్రతి నెల కృష్ణ పక్ష చతుర్థి తిథిని సంకష్ట చతుర్థి అంటారు. ఈ రోజు వినాయకుడిని పూజించడం వల్ల శివుడు, పార్వతి, గణపతి అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. ఆషాఢ మాసంలో యోగ నిద్రలోకి వెళ్లే ముందు విష్ణువు సృష్టి బాధ్యతను శివుడికి అప్పగిస్తాడట. అందుకే ఈ మాసంలో శివుడితోపాటు, ఆయన కుమారుడైన వినాయకుడిని పూజిస్తారు. ఈ వ్రతాన్ని సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు ఆచరిస్తారు. సంకష్ట చతుర్థి నాడు సాయంత్రం వేళలో మహిళలు గణపతిని పూజించి, రాత్రి చంద్రునికి అర్ఘ్యం సమర్పించి ఈ ఉపవాసాన్ని ముగిస్తారు. అత్యంత భక్తిశ్రద్దలతో గణేశుని పూజించి రోజంతా ఉపవాసం ఆచరిస్తారు. గణపతి వ్రత కథను చదువుకుని సాయంత్రం పూజలు చేసిన తర్వాత ఉపవాసం విరమిస్తారు. ఈ వ్రత మహిమ వల్ల అదృష్టం కలిసివస్తుందని అన్ని అడ్డంకులను విఘ్ననాయకుడు తొలగిస్తాడని భక్తుల విశ్వాసం. గజానన సంకష్ట చతుర్థి నాడు దానధర్మాలు చేస్తారు. అన్నార్తులకు అవసరమైన ఇతర బహుమతులు అందించడం శుభప్రదంగా భావిస్తారు. తద్వారా కష్టనష్టాలు తొలగి ఆ గణుశుని ఆశీస్సులు లభిస్తాయని, సకల సంపదలు, శుభాలు కలుగుతాయని మంచి సంతాన ప్రాప్తి కలుగుతుందని కూడా భావిస్తారు. -
నేషనల్ మ్యాంగో డే: నోరూరిస్తూ..ఆరోగ్యానికి మేలు చేసే పండు!
పండ్లలలో రారాజు మామిడి పండు. ఇది అంటే ఇష్టపడని వారుండరు. భారతీయ వంటకాల్లో ఈ మామిడితో చేసే రెసిపీలు అగ్రభాగన ఉంటాయి. ఈ మామిడితో చేపల కూర నుంచి మామిడి స్మూతీస్ వరకు వివిధ రకాల ప్రత్యేక వంటకాలు ఉంటాయి. వేసవిలో సెలవులతో గడిపే పిల్లలు సైతం ఇష్టంగా తినే పండు ఏదైనా ఉందంటే అది మామిడి పండే. అలాంటి మామిడి పండు కోసం ప్రత్యేకమైన రోజు ఒకటి ఉంది. ప్రతి ఏడాది జూలై 22న జాతీయ మామిడి దినోత్సవంగా జరుపుకుంటారు. అసలు ఈ మామిడిపండ్ల కోసం ఓ దినోత్సవాన్ని ఏర్పాటు చేసి మరీ ఎందుకు జరుపుకుంటున్నాం?. దీనికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఏం వచ్చింది?.దీని వెనుకున్న చరిత్ర..భారతీయ సంస్కృతితో మామిడిపండ్లకు ఉన్న సంబంధం ఐదు వేళ ఏళ్ల నాటిది. మామిడి అనే పేరు మలయన్ అనే పదం నుంచి ఉద్భవించింది. పోర్చుగీస్ వారు సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేయడానికి 1498లో కేరళకు వచ్చినప్పుడు "మాంగా"గా మార్చారు. కాలక్రమేణా దీనిని మ్యాంగోగా పిలుస్తున్నారు. ఇది జీడిపప్పు, పిస్తాపప్పుల జాతికి చెంందిన అనాకార్డియోసికి చెందింది. 1987లో, నేషనల్ హార్టికల్చర్ బోర్డ్ ఆఫ్ ఇండియా మామిడి రుచికి, ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధ చెందిన పండ్లగా గుర్తించి ప్రతి ఏడాది జూలై 22న నేషనల్ మ్యాంగో డే జరుపుకోవాలని ప్రకటించింది. అప్పటి నుంచి ఈ దినోత్సవాన్ని ప్రతి ఏడాది ఘనంగా నిర్వహించుకుంటున్నాం. భారత్‌లో మామిడి రకాలు: భారతదేశంలో వాణిజ్య రకాలు సహా మొత్తం 15 వందల రకాల మామిడిని పండిస్తారు. మామిడి ప్రధాన రకాలు ఒక్కొక్కటి ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటాయి. భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలో వివిధ రకాల మామిడి పండ్లను పండిస్తారు.ఆరోగ్య ప్రయోజనాలు..మామిడిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఫోలేట్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు వంటివి అధికంగా ఉంటాయి.మామిడిలోని విటమిన్ సీ, యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడతాయని నిపుణులు అంటున్నారు.మామిడిలోని ఫైబర్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయని అంటున్నారు. 2021 లో "జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్"లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం మామిడి పండ్లు తినడం వల్ల అందులోని పోషకాలు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయని కనుగొన్నారు. ఈ పరిశోధనలో టెక్సాస్ ఏ అండ్ ఎం విశ్వవిద్యాలయంలో న్యూట్రిషన్ అండ్ ఫుడ్ సైన్స్ ప్రొఫెసర్ డాక్టర్ మారియ విల్లరీల్ గాంజాలేజ్ పాల్గొన్నారు.మామిడిలోని ఫైబర్ జీర్ణక్రియ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. గ్యాస్ట్రిక్, మలబద్ధకం సమస్యలను తగ్గిస్తుందని అంటున్నారు.మామిడిలోని విటమిన్ 'ఏ' కళ్ల ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు.మామిడిలోని విటమిన్ సీ, యాంటీఆక్సిడెంట్లు చర్మానికి మేలు చేస్తాయని, ముఖంపై ముడతలను తగ్గించడానికి సహాయపడతాయని అంటున్నారు.మామిడిలో కేలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుందని చెబుతున్నారు.మామిడిలోని యాంటీఆక్సిడెంట్లు కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయని నిపుణులు తెలుపుతున్నారు.(చదవండి: ఈటింగ్ ఛాలెంజ్ చేస్తూ ఇన్ఫ్లుయెన్సర్ మృతి..అంత ప్రమాదమా?) -
Balasana: ఒత్తిడిని తగ్గించే బాలాసనం
బాలాసనంలో శరీరం మొత్తం ముందుకు సాగి, చంటి పిల్లలు బోర్లా పడుకున్నప్పుడు కనిపించే భంగిమలో ఉంటారు. దీనిని శశాంకాసనం అనికూడా ఉంటారు. ఈ ఆసనంలో వెన్నెముక సాగి, మోకాళ్లు బలపడతాయి. పోత్తికడుపులోని అవయవాలకు రక్తప్రసరణ బాగా జరుగుతుంది. నడుం నొప్పి సమస్యలు తగ్గుతాయి. ఒత్తిడి తగ్గి, శరీరం మొత్తం విశ్రాంతి పొందుతుంది.ముందుగా మ్యాట్‌పైన కాలి మడమల మీద హిప్ భాగం ఉండేలా వజ్రాసనంలో కూర్చోవాలి. తర్వాత నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ రెండు చేతులు పైకి ఎత్తాలి. శ్వాస వదులుతూ తల, పోట్ట భాగాన్ని ముందుకు మెకాళ్ల మీదుగా పూర్తిగా వంచాలి. చేతులను నేలపై తలకిరువైపులా వెడల్పుగా ‘వి’ ఆకారంలో ఉంచాలి. ఈ పోజిషన్లో 30 సెకన్లపాటు ఆగి, విశ్రాంతి ΄పోందాలి. తర్వాత తిరిగి వజ్రాసనంలోకి రావాలి. ఇలా సుమారు 10 సార్లు చేయాలి. ఫలితాలు: రోజువారీ పనుల ద్వారా కలిగే ఒత్తిడి, చిరాకులాంటి సమస్యలు దూరం అవుతాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. పేగులు, కాలేయం, మూత్రపిండాలకు బలం చేకూరుతుంది. మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నవారికి మంచి ఉపశమనం లభిస్తుంది. ఎముకల సమస్యతో బాధపడేవారు, హైబీపి ఉన్నవారు నిపుణుల సూచనలు తీసుకోవాలి. – జి. అనూషా రాకేష్, యోగా ట్రైనర్ -
పొట్ట రాకూడదా? పొట్టు తియ్యద్దు మరి!
పొట్టు తీయని ధాన్యాల (హోల్ గ్రేయిన్స్)లో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయన్నది తెలిసిందే. ఈ పొట్టు కారణంగానే అవి చాలా నెమ్మదిగా జీర్ణమవుతుంటాయి. అందుకే వాటిల్లోంచి వచ్చే కార్బోహైడ్రేట్లు రక్తంలో నెమ్మదిగా కలుస్తుంటాయి. ఫలితంగా ఒంట్లోకి విడుదలయ్యే చక్కెర మోతాదులూ ఆలస్యమవుతాయి. పొట్టుతీయని వరి విషయంలో ముడి బియ్యం మాదిరిగానే పొట్టు తీయని ఓట్స్, గోధుమ, బార్లీ వంటి వాటిని అలాగే తీసుకోవడం వల్ల పొట్టుతీసిన వాటితో పోలిస్తే తక్కువగా బరువు పెరుగుతారని, అందువల్ల ఇన్సులిన్ విడుదల యంత్రాంగం కూడా నియంత్రితంగా పనిచేస్తూ పూర్తిస్థాయి ఆరోగ్యకరంగా ఉంటుందంటున్నారు పరిశోధకులు ‘అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్’లో ప్రచురితమైంది. ∙ఇలా తినడం వల్ల ఊబకాయం తగ్గడంతో ΄ాటు స్థూలకాయంతో వచ్చే అనేక అనర్థాలనూ తగ్గించుకోవచ్చన్నది పరిశోధకుల మాట. -
డి ఉంటేనే ఢీ!
లబ్బీపేట(విజయవాడతూర్పు): మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్ డి చాలా అవసరం. సూర్యకిరణాల నుంచి సహజంగా లభించే ‘విటమిన్ డి’కి దూరమైతే మధుమేహం, గుండెజబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధులు సోకే అవకాశం ఉంది. అందుకే బద్ధకం వీడి ఉదయాన్నే లేవండి. కాస్త ఎండన పడండి, ఆరోగ్యంతో జీవించండి అంటూ వైద్యులు సూచిస్తున్నారు. మారిన లైఫ్‌స్టైల్.. మారుతున్న కాలానుగుణంగా చదువు, ఉద్యోగాలు, వ్యాపారాలతో మనిషి జీవితం నిరంతరం బిజీ బిజీగా మారుతోంది. ఉదయం 8 గంటలైనా లేవక పోవడం, రాత్రి 12 దాటినా మేల్కొని ఉండటం, నగర వాసులకు నిత్యకృత్యమైంది. చాలా మంది నగర వాసులకు సూర్యోదయమే తెలియకుండా పోతోంది. తద్వారా డి విటమిన్‌కు దూరమై అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఒకప్పుడు తెల్లవారు జామున 5 గంటలకే నిద్రలేచి దైనందిన కార్యక్రమాల్లో నిమగ్నమయ్యే వారు. కానీ రోజులు మారాయి. సిటీ జనులు మాత్రం చాలా మంది ఉదయం 8 గంటల తర్వాతనే నిద్రలేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు చక్కబెట్టుకుని రోడ్డు మీదకు వచ్చేటప్పటికీ ఎండ మండుతోంది. దీంతో ఉదయపు వేళల్లో సూర్యరశ్మి కారణంగా శరీరానికి అందే విటమిన్ డి పొందలేక పోతున్నారు. ఇటీవల కాలంలో వైద్యుల వద్దకు విటమిన్ డి లోపం సమస్యలతో వస్తున్న వారి సంఖ్య పెరిగింది. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి అన్ని రకాల విటమిన్లు అందాలి. ఏ ఒక్క విటమిన్ తక్కువైనా శరీరం అనారోగ్యానికి గురవుతుంది. అందులో విటమిన్ డి చాలా ప్రధానమైంది. కండరాలు, ఎముకలు, ప్రతి ఒక్క భాగం ఆరోగ్యంగా ఉండాలంటే డి విటమిన్ తప్పనిసరి. నవజాత శిశువులకు అవసరమే.. ఒకప్పుడు పుట్టిన బిడ్డని కాసేపు ఎండలో ఉంచేవారు. తద్వారా చిన్నారులకు డి విటమిన్ సమృద్ధిగా లభించేది. కానీ ప్రస్తుతం పిల్లలను ఎండలో తిప్పితే నల్లబడి పోతారని, ఇంటి నుంచి బయటకు తీసుకురావడమే లేదు. దీంతో చిన్నారులకు నేరుగా సూర్యరశ్మి అందే అవకాశం లేకుండా పోతోంది. విటమిన్ డి చిన్నారులకు సమృద్ధిగా అందితే బరువు పెరగడమే కాకుండా ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు చెబుతున్నారు. నీడపట్టున ఉద్యోగం అనుకుంటే.. నీడపట్టున కూర్చుని పనిచేసే ఉద్యోగం అంటే చాలా లగ్జరీగా భావిస్తారు. కానీ ఇదే వారి అనారోగ్యానికి కారణం అవుతోంది. ఎండ బారిన పడకుండా హాయిగా ఏసీ గదిలో కూర్చుని పనిచేసే వారికి విటమిన్ డి లోపం అధికంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఆఫీస్ గదుల్లోనే ఉండే ఉద్యోగులు, షిఫ్ట్ ఉద్యోగులు, హెల్త్ కేర్ వర్కర్స్కు విటమిన్ డి లోపం ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. విటమిన్ డి తక్కువైతే.. శరీరంలో విటమిన్ డి తక్కువైతే తీవ్రమైన అలసట, బలహీనత, నీరసం, నడుంనొప్పి, బలహీనమైన కండరాలు, ఆలోచన శక్తి తగ్గిపోవడం, డిప్రెషన్, మానసిక స్థితిలో తేడా కనిపిస్తుంది. తరచూ ఇన్ఫెక్షన్ల బారిన పడతారు. తరచుగా ఎముకలు విరగడం, పగుళ్లు రావడంతో పాటు, జట్టు రాలడం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. మెదడు పనితీరుపైనా తీవ్ర ప్రభావం ఉంటుంది. వ్యాధి నిరోధకశక్తి తగ్గుతుంది. పిల్లల్లో రికెట్స్, పెద్దల్లో కీళ్ల వ్యాధులు వస్తాయి. ఇన్సులిన్‌పై ప్రభావం చూపుతుంది. దీంతో రక్తంలోని గ్లూకోజ్ త్వరగా ఖర్చుకాకపోవడంతో సుగర్ వస్తుంది. మహిళల్లో మోనోపాజ్ తర్వాత సహజంగా కాల్షియం తగ్గుతుంది. కాల్షియం తగ్గితే క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ. విటమిన్ డి అవసరం.. శరీరానికి డి విటమిన్ ఎంతో అవసరం. విటమిన్ డి లోపంతో కండరాల, ఎముకలు బలహీన పడతాయి. ప్రతి ఒక్కరూ వ్యాధి నిరోధకశక్తిని పెంచుకునేందుకు విటమిన్ డి అవసరం. ఇది సహజంగా సూర్యరశ్మి ద్వారా లభిస్తుంది. ఎండలో కొద్దిసేపు గడపడంతో పాటు వైద్యుల సూచనలు పాటిస్తే డి విటమిన్ లోపాన్ని అధిగమించవచ్చు. ఇటీవల కాలంలో విటమిన్ డి లోపం ఉన్న వారిని ఎక్కువగా చూస్తున్నాం. – డాక్టర్ కె. సుధాకర్, ఆర్థోపెడిక్ నిపుణుడు, జీజీహెచ్వీటిల్లో విటమిన్ డి పుష్కలం.. చేపలు, లివర్, కాడ్‌లివర్ ఆయిల్, కోడిగుడ్లు, ఆర్గాన్ మీట్స్, పాలు, పన్నీరు, నెయ్యి, వెన్న, పుట్టగొడుగుల్లో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఆహారంలో ఈ పదార్థాలను తప్పక చేర్చుకోవాలి. తరచూ వీటిని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. ఆహారం కంటే ముఖ్యంగా పైసా ఖర్చులేకుండా ఉదయం ఎండలో కాసేపు గడిపితే విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. – గర్రే హరిత, నూట్రీíÙయన్ -
బొకే ఇచ్చి.. బైబై
సాక్షి, హైదరాబాద్: పదవీవిరమణ పొందిన ఉద్యోగుల వీడ్కోలు కార్యక్రమాలు భావోద్వేగ వాతావర ణం మధ్య జరుగుతాయి. ఉద్యోగి దంపతులకు పూలమాలలు, శాలువాలతో సత్కరించి వారి సేవలను ఘనంగా పొగు డుతారు. వారికి రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్లలో కొన్నింటిని అదేరోజు చెల్లించి దర్జాగా సాగనంపుతారు. ఆర్టీసీలోనూ ఈ తంతు సాధారణమే. కానీ కొన్ని నెలలుగా తీరు మారింది. పూలమాలలు, బొకేలు ఇచ్చి వీడ్కోలు చెప్పేస్తున్నారు. పదవీ విరమణ ఆర్థిక ప్రయో జనాల మాటేమిటి అంటే ఆ ఒక్కటి అడగొద్దంటోంది సంస్థ. నష్టాల వల్ల నిధులు లేవన్న కారణంతో రిటైర్డ్ ఉద్యోగులను టెన్షన్ పెడుతోంది. ఇప్పుడు వందలమంది రిటైర్డ్ ఉద్యోగులు తమకు రావాల్సిన ఆర్థిక ప్రయో జనాల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. నిలిచిపోయిన గ్రాట్యుటీ..పదవీవిరమణ పొందిన కొద్ది రోజుల్లోనే గ్రాట్యుటీ మొత్తం చెల్లించే పద్ధతి ఉండేది. కానీ, ఇప్పుడు నెలల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. » ఈ సంవత్సరం జనవరి వరకు వెంటవెంటనే గ్రాట్యుటీ చెల్లించారు. » ఫిబ్రవరి నుంచి బ్రేక్ పడింది. ఆ నెలలో రిటైర్ అయిన వారికి నెల ఆలస్యంగా చెల్లించారు. » మార్చిలో రిటైర్ అయిన వారికి మూడు రోజుల క్రితం చెల్లించారు. » ఏప్రిల్ నుంచి పదవీ విరమణ పొందుతున్న వారు ఎదురుచూపుల జాబితాలో ఉన్నారు. వీరికి ఎప్పుడు చెల్లిస్తారో స్పష్టత లేదు. ఆర్టీసీలో పదవీ విరమణ పొందిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్‌గా వచ్చే వాటిల్లో ఇదే పెద్ద మొత్తం. దీని ఆధారంగా భవిష్యత్ కార్యాచరణకు ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఉంటారు. కానీ, ఆ మొత్తం చేతికందటంలో జరుగుతున్న జాప్యం ఆర్టీసీ కార్మికుల్లో గందరగోళానికి కారణమవుతోంది. డ్రైవర్, కండక్టర్ లాంటి వారికి దాదాపు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఈ మొత్తం అందాల్సి ఉంటుంది. ఈడీ లాంటి పెద్ద పోస్టులోని అధికారులకు రూ.60 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది. చిరుద్యోగులుగా ఉండి రిటైర్ అయినవారు ఇప్పుడు ప్రత్యామ్నాయ నిధి లేక ఈ మొత్తంపైనే ఆశలు పెట్టుకున్నారు. దాదాపు ఐదొందల కుటుంబాలు ఇప్పుడు ఆ మొత్తం కోసం ఎదురుచూస్తున్నాయి. బాండ్ డబ్బులూ అంతే..ఆర్టీసీలో 2013 వేతన సవరణను 2015లో అమలు చేశారు. రెండేళ్ల బకాయిల్లో 50 శాతం మొత్తాన్ని బాండ్ల రూపంలో చెల్లించాల్సి ఉంది. సర్వీసు ఉద్యోగులకు పెండింగ్‌లో పెట్టినా, రిటైర్ అయిన వారికి వెంటనే చెల్లిస్తూ వస్తున్నారు. కానీ జనవరి నుంచి రిటైర్ అయిన వారికి కూడా చెల్లించటం నిలిపేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో అందరు ఉద్యోగులకు బాండ్ బకాయిలు చెల్లించనున్నట్టు మూడునెలల క్రితం సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. కానీ, కొన్ని నిధులే విడుదల కావటంతో ఇటీవల కేవలం డ్రైవర్లకు చెల్లించి వదిలేశారు. జనవరి నుంచి రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లింపులు మాత్రం పునరుద్ధరించలేదు. ఒక్కో ఉద్యోగికి దాదాపు రూ.లక్షన్నర వరకు అందాల్సి ఉంది. దాదాపు 1500 రిటైర్డ్ ఉద్యోగుల కుటుంబాలు ఈ నిధుల కోసం ఎదురుచూస్తున్నాయి.‘చివరి నెల వేతనం’ హుళక్కే..ఉద్యోగి పదవీవిరమణ పొందేప్పుడు చివరి నెల వేతనాన్ని తాత్కాలికంగా నిలిపేస్తారు. ఆ ఉద్యోగి సంస్థకు ఏవైనా బకాయిలు చెల్లించాల్సి ఉంటే, లెక్కలు చూసి చివరి నెల వేతనం నుంచి మినహాయించి మిగతా మొత్తాన్ని అందిస్తారు. రిటైర్ అయిన నెల రోజుల్లో ఆ మొత్తం విడుదల అవుతుంది. కానీ, జనవరి నుంచి ‘చివరి నెల వేతనం’ ఆపేశారు.ఆర్జిత సెలవు మొత్తం ఏమైంది? ఉద్యోగ కాలంలో పోగైన 300 ఆర్జిత సెలవు (ఈఎల్స్)ల ఎన్‌క్యాష్‌మెంట్ ఉంటుంది. ఆ సెలవులకు సంబంధించి నగదు చెల్లిస్తారు. ఆర్టీసీలో పదవీవిరమణ వయసు 60 ఏళ్లకు పెంచిన తర్వాత, తిరిగి రిటైర్మెంట్లు మొదలైన 2022 డిసెంబరు నుంచి ఆర్జిత సెలవుల మొత్తం చెల్లించటం ఆగిపోయింది. ఈ మొత్తం కనిష్టంగా రూ.5 లక్షల వరకు ఉంటుంది.కరువు భత్యం బకాయిలకూ దిక్కులేదు ఆర్టీసీ ఉద్యోగు లకు గతంలో నాలుగున్నరేళ్ల పాటు కరువు భత్యం సవరించలేదు. అవన్నీ పేరుకుపోయాయి. విడతవారీగా ఆ తర్వాత 9 డీఏలను సవరించి వేతనంలో చేర్చారు. కానీ, ఆ డీఏలను వర్తింప చేయాల్సినకాలం నుంచి వర్తింపచేసినకాలం మధ్య రిటైర్ అయినవారికి కూడా ఆ లబ్ధి అందాల్సి ఉంది. కానీ రిటైర్డ్ ఉద్యోగులకు వాటిని చెల్లించలేదు. ఈ మధ్యకాలంలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబసభ్యులకు కూడా వాటిని చెల్లించాల్సి ఉన్నా చెల్లించలేదు.వేతన సవరణ బకాయిలేమయ్యాయి? 2017లో జరగా ల్సిన వేతన సవర ణను గత మే నెల నుంచి అమలులోకి తెచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం 21% ఫిట్మెంట్తో దాన్ని అమలులోకి తెచ్చిన విషయం తెలిసిందే. కానీ వాటి బకాయిలను రిటైర్మెంట్ సమయంలోనే చెల్లించనున్నట్టు అప్పట్లో ఆర్టీసీ వెల్లడించింది. మరి, ఈ ఫిట్మెంట్ అమలులోకి తెచ్చేలోపు రిటైర్ అయినవారి విషయంలో మాత్రం చెల్లింపు ఊసే లేకుండాపోయింది. దానిపై కనీసం స్పష్టత కూడా ఇవ్వటం లేదు.మమ్మల్ని విడిచి వెళ్లొద్దు సార్..కన్నీటి పర్యంతమైన విద్యార్థులుకుల్కచర్ల: విద్యాబుద్ధులు నేర్పడంతో పాటు పాఠశాల అభ్యున్నతికి కృషి చేసిన తమ హెచ్ఎం బదిలీపై వెళ్లడాన్ని విద్యార్థులు తట్టుకోలేకపోయారు. ‘మమ్మల్ని వదిలి.. మీరు వెళ్లొద్దు సార్’ అంటూ కంటతడి పెట్టుకున్నారు. గురువుగా పాఠాలు చెప్పడంతో పాటు తండ్రిలా బంధాన్ని పెనవేసుకున్న తమ సార్ మరో స్కూల్‌కు వెళ్తున్నారని తెలిసి ఆవేదనకు గురయ్యారు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని చౌడాపూర్ ఉన్నత పాఠశాల హెచ్ఎంగా పనిచేస్తున్న తిమ్యా, ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న భాస్కర్ స్కూల్ అసిస్టెంట్ల బదిలీల్లో భాగంగా మరో చోటకు ట్రాన్స్ఫర్ అయ్యారు. మంగళవారం విధుల నుంచి రిలీవ్ అయి వెళ్తుండగా.. విద్యార్థులు వెక్కివెక్కి ఏడ్చారు. వారిని ఊరడించిన మాస్టారు.. ‘బాగా చదువుకోండి. మిమ్మల్ని చూసేందుకు అప్పుడప్పుడు వచ్చి వెళ్తాం’ అని చెప్పి బరువెక్కిన హృదయంతో బైబై చెప్పుకుంటూ వెళ్లిపోయారు. -
లెమన్‌గ్రాస్ టీతో ఎన్ని లాభాలో తెలుసా..!
మనం ఎన్నో రకాల టీల గురించి విన్నాం. వాటిలో కొన్ని ఆరోగ్యకరమైన గ్రీన్ టీ వంటి పలు పానీయాలు గురించి కూడా విన్నారు. అలాంటి కోవకు చెందిన నిమ్మగడ్డి టీ గురించి విన్నారా. దీని వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబతున్నారు నిపుణులు. జీర్ణక్రియ దగ్గర నుంచి బరువు తగ్గడం, రోగ నిరోధక శక్తి వరకు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందించగలదు ఈ టీ. అలాంటి ఈ లెమన్‌గ్రాస్ టీని ఎలా తయారు చేస్తారు? దీని వల్ల కలిగే లాభలేంటో సవివరంగా తెలుసుకుందామా..!లెమన్ గ్రాస్ టీ తయారీ విధానం..కావాల్సినవి:నీళ్లు: నాలుగు కప్పులు, నిమ్మగడ్డి: మూడు కాడలు (పచ్చివి), తేనె: మూడు చెంచాలు (బెల్లం కూడా వేసుకోవచ్చు)తయారీ: ముందుగా గిన్నెలో నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి బాగా మరిగించుకోవాలి. అందులో నిమ్మగడ్డి వేసి మరో పది నిమిషాలు మరిగించి, ఆవిరి బయటికి రాకుండా మూతపెట్టేయాలి. కప్పులో తేనె వేసుకొని, తేనీటిని అందులోకి వడకట్టుకోవాలి. చక్కటి పరిమళంతో పసందైన నిమ్మగడ్డి టీ రెడీ!. మధుమేగ్రస్తులు బెల్లం ఉపయోగించొచ్చు లేదా వేయకుండా తీసుకోవచ్చు. ఆరోగ్య ప్రయోజనాలు..దీనిలో ఉండే సిట్రల్ జెరేనియల్ గుండె జబ్బులు, స్ట్రోక్‌లు వంటివి రాకుండా కాపాడుతుంది. యాంటీ కేన్సర్ సామర్థ్యాలను కలిగి ఉంది. లెమన్ గ్రాస్‌లో ఉండే ఔషధ గుణాలు కేన్సర్‌తో పోరాడటంలో సహాయపడతాయి. సెల్ డెత్‌కు కారణమయ్యే వాటిని నివారించేలా రోగ నిరోధక శక్తిని పెంచి కేన్సర్‌తో పోరాడగలిగే శక్తిని ఇస్తుంది. గ్యాస్ట్రిక్ అల్సర్లకు వ్యతిరేకంగా ప్రభావవంతంగా ఉంటుంది. రక్తపోటుని తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేగాదు ఇందులో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల నిమ్మరసం మూత్ర ఉత్పత్తిని పెంచి రక్తపోటును తగ్గిస్తుంది.కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుందిబరువు తగ్గడంలో సహాయపడుతుంది జీవక్రియను నియంత్రిస్తుంది. శరీరం నుంచి అదనపు వ్యర్థాలను తొలగించి జీవక్రియను వేగవంతం చేస్తుంది. రుతుక్రమంలో ఎదురయ్యే అధిక రక్తస్రావం వంటి అసౌకర్యాలను తగ్గిస్తుంది. ఇది ఎంత సురక్షితమైనదైనప్పటికీ అతిగా తాగితే దుష్ప్రభావాలను ఎదుర్కొనక తప్పదు. అవేంటంటే..తల తిరగడంఆకలి పెరగటంనోరు పొడిబారడంతరుచుగా మూత్రవిసర్జన అలసటదద్దుర్లు, దురద, శ్వాస ఆడకపోవడం, వేగవంతమైన హృదయ స్పందన వంటి అలర్జీలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ గర్భవతిగా ఉన్నట్లయితే, వాళ్లలో తక్కువ హృదయ స్పందన రేటు లేదా తక్కువ పొటాషియం స్థాయిని కలిగి ఉంటే ఎట్టిపరిస్థితుల్లో లెమన్‌గ్రాస్ టీని తాగకూడదు.(చదవండి: హెయిర్ పెర్ఫ్యూమ్లు ఎక్కువగా ఉయోగిస్తున్నారా? నిపుణులు వార్నింగ్) -
అర్జున బెరడు గురించి విన్నారా? దీని ఔషధ గుణాలు తెలిస్తే..!
అర్జున చెట్టు లేదా తెల్ల మద్ది గురించి ఎపుడైనా విన్నారా? ఈ చెట్టు నుంచి తీసిన బెరడులో బోలెడన్ని ఔషధ గుణాలున్నాయి. అర్జున బెరడు తెలుపు, ఎరుపు రంగులను కలగలసి ఉంటుంది. పలు రకాల ఔషధాల తయారీలో దీనిని ఆయుర్వేదంలో విరివిగా వాడతారు. దీని అద్భుత ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.దీని బొటానికల్ పేరు: టెర్మినలియా అర్జున. దీని బెరడు గుండెకు టానిక్‌గా పనిచేస్తుందట. ఈ చెట్టు గురించిన ప్రస్తావన ఋగ్వేదంలో ఉంది. గుండె జబ్బులు, శ్వాసకోసం వ్యాధులు మొదలు సంతాన లేమి సమస్యలతో బాధపడే పురుషులకు కూడా ఇది దివ్యౌషధంలా పని చేస్తుంది.ఎముకల బలహీనతతో బాధ పడే వారికి అర్జున బెరడుచాలా ఉపయోడపడుతుంది. అర్జున బెరడును మెత్తగా పొడి చేసి, తేనె కలిపి రోజుకు పావు స్పూన్ చొప్పున తీసుకుంటే బలహీనమైన ఎముకలు దృఢంగా మారతాయి. ఫ్యాటీ లివర్ వ్యాధికి చక్కటి పరిష్కారం అర్జున బెరడు.అలాగే వాతావరణం చల్లగా ఉన్నపుడు గోరు వెచ్చటి పాలల్లో అర్జున బెరడు పొడిని అర స్పూన్ చప్పున కలిపి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు దరి దాపుల్లోకి రాకుండా ఉంటాయి. ఆస్తమా, శ్వాసకోశ ఇబ్బందులకు కూడా మంచి పరిష్కారం ఇది.సంతాన సమస్యలతో బాధ పడే పురుషులు రోజూ అర్జున బెరడు చూర్ణాన్ని పాలతో కలిపి తీసుకోవాలి. దీంతో వీర్య కణాల వృద్ధిచెంది సంతాన భాగ్యం కలిగే అవకాశాలు పెరుగుతాయి.అర్జున బెరడుతో కషాయాన్ని తయారు చేసుకుని తరచూ తీసుకుంటే గుండె పోటు, ఇతర గుండె సంబంధిత జబ్బులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.ధమనులు, సిరల్లో రక్త ప్రవాహాన్ని సాఫీగా జరిగేలా చేస్తుంది. లిపో ప్రోటీన్, ట్రైగ్లిజరైడ్స్‌ను తగ్గించి కొలెస్ట్రాల్‌కు చెక్ పెడుతుంది. కడుపు అల్సర్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. రోగ నిరోధక శక్తిని వృద్ది చేస్తుంది. రక్త పోటు స్థాయిలను నియంత్రిస్తుంది. శారీరక ఒత్తిడిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇంకా అర్జున బెరడు పొగాకు, ధూమపానం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో తోడ్పడుతుంది.కణుతుల పెరుగుదలను నియంత్రించడంలోఉపయోగపడుతుంది. అర్జున బెరడులోని విటమిన్ ఈ కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల అర్జున బెరడు తోడ్పడుతుంది. -
యాలకుల వాటర్‌తో ఎన్ని లాభాలో తెలుసా..!
జీరా వాటర్, మెంతి వాటర్ తాగడం గురించి విని ఉంటారు. యాలకుల వాటర్ గురించి విని ఉండరు. ఈ యాలకులను స్వీట్స్ తయారీలో మంచి ఘుమ ఘుమలాడే సువాసన కోసం ఉపయోగిస్తుంటారు. అలాగే స్పైసీ కర్రీల్లో కూడా వాడుతుంటారు. అలాంటి యాలకుల వేసి మరిగించిన నీటితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. యాలకుల సుగంధభరతమైన వాసనకి కచ్చితంగా.. ఈ నీళ్లను సులభంగా తాగగలం కూడా. అందులో ఆరోగ్యం కోసం అంటే ఎవరైనా ఎందుకు మిస్ చేసుకుంటారు..?. మరీ ఈ యాలకుల వాటర్‌తో కలిగే ప్రయోజనాలేంటో సవివరంగా చూద్దామా..!యాలకులు ఫినోలిక్ సమ్మేళనాలు, అస్థిర నూనెలు, ఫిక్స్డ్ ఆయిల్స్‌తో నిండి ఉంటుంది. ఇవి జీర్ణక్రియను మెరుగ్గా ఉంచాయి. ముఖ్యంగా ప్రేగుల ఆరోగ్యం బాగుంటుంది. శరీరంలో ఉన్న అదనపు గ్యాస్‌ను బయటకు పంపించడంలో సహాయపడుతుంది. పొట్ట ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.యాలుకుల్లో యాంటీమైక్రోబయాల్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. యాలుకుల్లోని నూనెలు శిలీంధ్రాలను, బ్యాక్టీరియాలను సమర్థవంతంగా పోరాడతాయి. ఇన్ఫెక్షన్లను సమర్థవంతంగా నిరోధిస్తుంది. రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.యాలకుల్లో శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగిన టెర్పెనెస్, ఫినోలిక్ సమ్మెళనాలు ఉంటాయి. ఇవి శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని కలిగించే హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరించడంలో సహాయపడతాయి. ప్రతిరోజు యాలకుల నీటిని తాగితే పెద్ద మొత్తంలో శరీరానికి యాంటీఆక్సిడెంట్లు అందడమే కాకుండా మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుతుంది.రక్తపోటును నియంత్రించి లిపిడ్ ప్రొఫైల్‌లను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అనేక జంతు పరిశోధనలు యాలకుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అంతేగాదు 2015లో జరిపిన అధ్యయనంలో యాలకులలోని యాంటిఆక్సిడెంట్లు గుండెపోటు నుంచి రక్షిస్తాయని తేలింది. అలాగే కొస్ట్రాల్ స్థాయిలు గణనీయంగా తగ్గుతాయిని వెల్లడయ్యింది.ముఖ్యంగా నోటి ఆరోగ్యం కోసం యాలకులను వినియోగిస్తే దుర్వాసన, కావిటీస్, చిగుళ్ల వ్యాధులు దూరం చేస్తుంది. నోటి ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది.(చదవండి: మచ్చల జింక, దెయ్యం అంటూ అవహేళనలు..! ఐనా..) -
పూల్ మఖానా ఎలా తీసుకుంటే మంచిదో తెలుసా..!
తామర పువ్వులను సహజంగానే చాలా మంది పూజల్లో ఉపయోగిస్తుంటారు. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనవి కనుక తామరపూలను పూజల్లో వాడుతుంటారు. అయితే తామర పువ్వుల నుంచి తీసిన గింజలను మార్కెట్లో విక్రయిస్తున్నారు. వీటినే పూల్ మఖానా అని పిలుస్తారు. ఇవి ఖారీదు కూడా ఎక్కువే అయినా ఆరోగ్యానికి అందించే ప్రయోజనాలు మాత్రం అమోఘం. అలాంటి మఖానాలను ఎలా తీసుకుంటే మంచిదో సవివరంగా తెలుసుకుందాం.చాలా మంది ఆరోగ్య నిపుణులు మఖాానాను తక్కువ నూనెలో లేదా నెయ్యిలో వేయించి తింటే ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల రుచికరమైన, ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకున్నట్లు అవుతుంది. ఇది అన్ని వయసుల వారికి ఉపయోగకరంగా ఉంటుంది. మఖాానాను వేయించి తింటే దాని రుచి మరింత పెరుగుతుంది. పైగా సులభంగా జీర్ణం మవుతుంది. ఇలా వేయించడం వల్ల దానిలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పెరుగుతాయి. అయితే అధిక ఉష్ణోగ్రత వద్ద ఎక్కువసేపు వేగకుండా జ్రాగత్త పడాలి. దీని కారణంగా మఖాానాలో ఉండే విటమిన్లు, మినరల్స్ కోల్పోవచ్చు. అదే సమయంలో ఇలా వేయించిన మఖాానాలో ఎక్కువ మసాలాలు ఉపయోగించవద్దు. అదనపు మసాలా దినుసుల వల్ల కొలెస్ట్రాల్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.ప్రయోజనాలుకాల్షియం బాగా ఉంటుంది. దీంతో ఎముకలు, దంతాలు దృఢంగా మారుతాయి. ఎముకల పెరుగుదల బాగుంటుంది. ఎముకలు విరిగిన వారు ఈ మిశ్రమాన్ని తాగితే త్వరగా అవి అతుక్కుంటాయి.మఖానాలలో మెగ్నిషియం, జింక్, కాపర్ అధికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని అందిస్తాయి. వ్యాధులు రాకుండా రక్షిస్తాయి.శిరోజాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. శిరోజాలు దృఢంగా, ఒత్తుగా పెరుగుతాయి.కంటి చూపు మెరుగు పడుతుంది. కంటి సమస్యలు తగ్గుతాయి.నిద్ర చక్కగా పడుతుంది. నిద్రలేమి సమస్య నుంచి బయటపడగలుగుతారుగోరు వెచ్చని పాల్లలో వేయించిన మఖానాలు వేసి, కొద్దిగా పటిక బెల్లం కలుపుకుని తీసుకుంటే..పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరుగుతుంది. పైగా వీర్యం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. అలాగే సంతానం కలిగే అవకాశాలను మెరుగు పరుస్తుంది.(చదవండి: మనిషి ఆనందాన్ని నిర్ణయించే హార్మోనులు ఇవే..!) -
కాఫీ, టీలకు బ్రేక్: ఇలా ట్రై చేద్దామా..!
ఉదయం లేవగానే ఓ కప్పు వేడి వేడి కాఫీగానీ, టీగానీ పడకపోతే కాలకృత్యాల దగ్గర్నించి ఏ పని కాదు చాలామందికి. ఖాళీ కడుపుతో ఇలాంటి వాటివల్ల దీర్ఘకాలంలో ఆరోగ్యానికి చాలా హాని చేస్తాయి. నిజానికి ఉదయం బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి. తద్వారా రోజు చురుకుగా ఉండటానికికావాల్సిన పోషకాలు అందుతాయి. మరి అవేంటో ఒకసారి చూద్దాం.కాఫీ, టీ అయినా అదొక సెంటిమెంట్‌లాగా మనకి అలవాటు అయిపోయింది. కానీ మంచి ఆరోగ్యం కోసం మంచి డైట్ ,కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను చేసుకోవాలి.టీ లేదా కాఫీ ఉదయం పూట టీ, కాఫీలు అలవాటు మానలేని వారు చక్కెరను బాగా తగ్గించేస్తే బెటర్. మధుమేహ వ్యాధిగ్రస్తులు పూర్తిగా మానేయాలి. తాజా పండ్లను, పళ్లతో చేసిన రసాన్ని తీసుకోవచ్చు. క్యారెట్, కీరా, యాపిల్, బీట్రూట్ లాంటివాటితో జ్యూస్ చేసుకోవచ్చు. అయితే ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూస్ జోలికి వెళ్లవద్దు. వీటిల్లో ఫైబర్ ఉండదు,పైగా అధిక మొత్తంలో చక్కెర ఉంటుంది. జింజర్ టీ, హెర్బల్ టీపొద్దున్నే గోరు వెచ్చని నీళ్లు తాగాలి. అలాగే గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, తేనె కూడా కలుపు కోవచ్చు. ఇందులోని విటమిన్ సీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.అల్లం, తులసి, పుదీనా ఆకులు, తేనెతో చేసిన హెర్బల్. జింజర్ టీతాగవచ్చు. కొబ్బరి నీళ్లు: కొబ్బరి నీళ్లలో అవసరమైన పోషకాలు, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, సోడియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలు లభిస్తాయి., అలాగే ఫ్రీ-రాడికల్‌తో పోరాడే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. షుగర్ లెవల్స్‌ను బట్టి దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది.కాఫీ, టీలు రోజులో రెండుసార్లు తీసుకోవడం పెద్ద ప్రమాదం ఏమీకాదు. అయితే ఖాళీ కడుపుతో కాకుండా అల్పాహారం తరువాత తీసుకుంటే మంచిది. అలాగే షుగర్ వ్యాధిగ్రస్తులు చక్కెర వాడకంలో జాగ్రత్త పడాలి. తాగకూడనివిసోడా, కార్బోనేటేడ్ పానీయాలు వీటిల్లో అధిక మొత్తంలో చక్కెర, కెఫిన్ కలిసి ఉంటాయి. ఇంకా వీటిలో ఉండే కార్బన్ డయాక్సైడ్ కడుపులో గ్యాస్, ఉబ్బరం సమస్యలను కలిగిస్తుంది. ఎనర్జీ డ్రింక్స్‌లో అధిక మొత్తంలో కెఫిన్, షుగర్ ఉంటాయి. ఉదయాన్నే వీటిని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయి. దీని కారణంగా రోజంతా శక్తి లేకపోవడం అలసటగా అనిపిస్తుంది. ఇది కాకుండా ఎనర్జీ డ్రింక్స్ గుండె వేగాన్ని, రక్తపోటును పెంచుతాయనేది గమనించాలి. -
అందం ఆరోగ్యం కలగలిపిన సిరి : కలబంద
Aloe Vera Juice: కలబంద రసం ప్రతిరోజు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే?ప్రస్తుత కాలంలో కలబంద పేరువినని వారు లేరంటే అతిశయోక్తి కాదు. అలోయి జాతికి చెందిన ఇది ఉష్ణమండలంలో విస్తారంగా పెరుగుతుంది. అలోవెరా ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనేది కూడా చాలామందికి తెలుసు. అందంనుంచి ఆరోగ్యం దాకా కలబందతోలాభాల గురించి తెలుసుకుందాం.చర్మం, దంత, నోటి , జీర్ణ ఆరోగ్యానికి అలాగే బ్లడ్ షుగర్ లాంటి ఎన్నో సమస్యలకు చెక్ పెట్టడంలో సహాయపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.యాంటీఆక్సిడెంట్ లక్షణాలు సన్‌బర్న్ చికిత్సకు ఉపయోగడతాయి. చర్మం, జుట్టు అందాన్ని కాపాడుతుంది. అందుకే అనేక రకాల బ్యూటీ ప్రొడక్ట్స్‌లో దీన్ని విరివిగా వాడతారు. దీంట్లో ఇంట్లోనే పెంచుకోవడం కూడా చాలా సులువు.కలబందలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. కలబందలో విటమిన్ ఏ, సీ, ఇ , బి-కాంప్లెక్స్, కాల్షియం, మెగ్నీషియం, జింక్, అమైనో ఆమ్లాలు వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఎంజైమ్‌లు, ఫైబర్లు జీర్ణ ప్రక్రియను మెరుగు పరుస్తుంది. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కాలిన గాయాలు , అటోపిక్ డెర్మటైటిస్ (1 ట్రస్టెడ్ సోర్స్, 2 ట్రస్టెడ్ సోర్స్) వంటి ఇతర చర్మ రుగ్మతలకు చికిత్సగా పని చేస్తుంది.కలబంద రసం ఆరోగ్య ప్రయోజనాలుఆహారాన్ని జీర్ణం చేస్తుంది. కొవ్వు నిల్వను నిరోధిస్తుంది. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. షుగర్ బోర్డర్లో ఉన్నవారు, ప్రీ డయాబెటిక్ రోగులకు కూడా ఈ కలబంద రసం బాగా పని చేస్తుంది.కలబంద పొట్టను శుభ్రపరుస్తుంది. జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. కలబంద రసం తీసుకోవడం వల్ల చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కలబంద రసాన్ని తరచుగా తీసుకోవడం వల్ల చర్మం గ్లో పెరుగుతుంది. జుట్టు రాలే సమస్య కూడా దూరమవుతుంది. నోటి దుర్వాసనను తగ్గించడంలో పాటు చిగుళ్ళు, దంతాలను శుభ్రంగా ఉంచడంలో అలోవెరా రసం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. -
సీవీడ్‌తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..!
సీవీడ్ అనేది ఒకరకమైన సముద్రపు నాచు. దీని సుషీ లేదా నోరి అని పిలుస్తారు. దీని వల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కూరగాయాలు, గుడ్లు, చేపలు వంటి వాటితో కలిపి దీన్ని రకరకాల రెసీపీలు చేస్తారు. ఇది జపాన్‌కి చెందింది. ప్రస్తుతం భారత్‌లో కూడా అత్యంత ప్రజాధరణ పొందిన వంటకంగా మారింది. దీన్ని ప్రాసీస్ చేసిన తర్వాత ఆకుపచ్చ షీట్లా కనిపిస్తుంది. ఇది ప్రత్యేకమైన రుచికి ప్రసిద్ధి. అలాంటి సుపీని ఆహారంలో చేర్చుకోవడంలో కలిగే ప్రయోజనాలేంటో సవివరంగా చూద్దాం.పోషకాల గని..సీవీడ్‌లో కేలరీలు తక్కువగా ఉన్నప్పటికీ అనేక ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది థైరాయిడ్ పనితీరుకు అవసరమైన అయోడిన్కి మంచి మూలం. అలాగే, ఇందులో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లతో పాటు విటమిన్లు ఎ, సి, ఇ, కె ఉన్నాయి. బయోయాక్టివ్ కాంపౌండ్స్ ఉనికి..సీవీడ్‌లో అనేక బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి భూమిలోని కూరగాయలలో కనిపించవు. ఈ సమ్మేళనాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్, యాంటీ ట్యూమర్ లక్షణాలను కలిగి ఉంటాయి. అంతేగాదు ఇది క్యాన్సర్, హృదయ సంబంధ వ్యాధులు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని అధ్యయనంలో తేలింది. జీర్ణవ్యవస్థ మెరుగ్గా ఉంచడంలో..నోరి లేదా సీవీడ్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మన గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ ప్రేగు కదలికలను సక్రమంగా ఉంచి మలబద్ధకాన్ని నివారిస్తుంది. తద్వారా జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. అలాగే కొన్ని రకాల సీవీడ్లలో ప్రీబయోటిక్స్ ఉంటాయి. ఇవి గట్ మైక్రోబయోమ్‌ను మెరుగుపరచడంలో సహాయపడతాయి. తద్వారా గట్ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతాయి.గుండె ఆరోగ్యంసీవీడ్లో పొటాషియం, మెగ్నీషియం హృదయ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతాయి. పొటాషియం శరీరంలో సోడియం ప్రభావాన్ని ఎదుర్కొనడమే గాక రక్తపోటు స్థాయిలను తగ్గిస్తుంది. అలాగే, ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.అయోడిన్ మూలంథైరాయిడ్ పనితీరుకు అవసరమైన అయోడిన్ సమృద్దిగా లభించే వాటిలో సీవీడ్ ఒకటి. ఇది థైరాయిడ్ జీవక్రియ, పెరుగుదల, అభివృద్ధికి ముఖ్యమైన హార్మోన్ల పనితీరును నియంత్రిస్తుంది. బరువు నిర్వహణలో..సీవీడ్‌లో ఫైబర్లు, ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. దీన్ని డైట్లో చేర్చుకోవడం వల్ల బరువు నిర్వహణలో సమర్థవంతంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే..?ఇది సంతృప్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది మొత్తం క్యాలరీలను తీసుకోవడం తగ్గించి ఎక్కువసేపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది.ఆరోగ్యకరమైన చర్మంసీవీడ్లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.ఇవి చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ నుంచి రక్షించడానికి, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ సమర్థవంతంగా పనిచేస్తుంది.అలాగే దీనిలో ఉండే విటమిన్ సి, విటమిన్ ఇ వంటివి కొల్లాజెన్ ఉత్పత్తి తోడ్పతాయి. ఇది చర్మ మరమ్మత్తులో ప్రభావవంతంగా పనిచేస్తుంది.యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలుసీవీడ్ యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉందని అధ్యయనాల్లో వెల్లడయ్యింది. ఇవి వైరస్లు, ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి. తద్వారా రోగనిరోధక వ్యవస్థ బలోపేతమవుతుంది. (చదవండి: వెస్ట్ నైలు వైరస్‌ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..) -
ప్రాన్స్‌తో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు! అలా తింటే మాత్రం..
ప్రాన్స్ అంటే ఇష్టపడని వారుండారు. సీ ఫుడ్స్ బలవర్థకమైనవి రొయ్యలే. అలాంటి రొయ్యలు ఏ కూరగాయలతో వేసి వండినా..వాటి రుచే వేరు. తలుచుకుంటేనే నోట్లో నీళ్లూరిపోతాయి. అంత టేస్టీ..టేస్టీ రొయ్యలను వండకునేటప్పుడు జాగ్రత్త! అంటున్నారు నిపుణులు. ఆరోగ్యానికి ఎంత మేలు చేసే ఈ రొయ్యలను గనుక అలా తింటే ప్రాణాలు ప్రమాదంలో పడ్డట్టే అంటున్నారు వైద్యులు. రోయ్యలు రుచి పరంగానే కాదు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాటి రొయ్యలు సరిగా క్లీన్ చేసి తినకపోతే అలెర్జీలు ఎదుర్కొనాల్సి వస్తుంది. అంతేగాదు ఒక్కోసారి ప్రాణాంతకంగా కూడా మారుతుంది. అదేలా అంటే.. ఆ పార్ట్‌ని తొలగించకుంటే.. రొయ్యల వీపుపై ఉండే నల్లని రక్తనాళాలు తొలగించకపోతే తీవ్రమైన సమస్యలు రావచ్చు. వాటిని ఉన్నప్పుడు తినడం వల్ల మరణం కూడా సంభవించొచ్చు. అందుకే వాటిని వండుకునే ముందు చాలా జాగ్రత్తగా శుభ్రం చేసుకోవాలి.రొయ్యల మీద ఉండే నల్లటి రక్తనాళాలు తప్పనిసరిగా తొలగించాలి. ఇది వ్యర్థాలు, విషపదార్థాలను మోసే ఈ సముద్ర ఆహారాల పేగు మార్గం. ఈ సిరలను తొలగించకపోవడం లేదా పాక్షికంగా వాటిని తొలగించడం వలన తీవ్రమైన ఫుడ్ అలెర్జీ రావడమే కాదు, అదే సమయంలో ప్రాణాంతకం కూడా కావచ్చు. అందుకే అలాంటి అలర్జీలు రాకుండా ఉండాలంటే ఈ రక్తనాళాలని తప్పకుండా తొలగించాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నల్లని రక్తనాళాలు తొలగించకుండా తినడం వల్ల ఆహార అలర్జీకి దారి తీస్తుంది. అయితే అది తిన్న వెంటనే ఒక్కోసారి మీకు కనిపించకపోవచ్చు. అది పేగుల్లో వ్యర్థాలు, టాక్సిన్స్, రసాయనాలు రూపంలో ఉంటుంది. ఇవి మన జీర్ణవ్యవస్థ, పేగుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. వాటిని తొలగించకుండా వండుకుని తినడం వల్ల సడెన్‌గా చర్మంపై దద్దుర్లు రావాడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గురక, గొంతులో ఇబ్బంది తలెత్తవచ్చు. ఒక్కోసారి మరణం కూడా సంభవించే అవకాశం ఉంది. అయితే ఇవి తినడం వల్ల ప్రాణాలకి హాని జరుగుతుందనే విషయం తేల్చడానికి మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందని అన్నారు నిపుణులు. అందువల్ల రొయ్యలు తినేటప్పుడు ఈ నల్లటి రక్తనాళాన్ని తొలగించటం వంటి జాగ్రత్తలు తీసుకుని తినడం మంచిదని చెబుతున్నారు. రొయ్యల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.. బరువు నియంత్రణలో.. బరువు తగ్గాలనుకునే వారు తప్పకుండా తమ డైట్లో రొయ్యలను చేర్చుకోవాలి. ఎందుకంటే రొయ్యలు సులువుగా జీర్ణమవడంతో పాటు. శరీరంలో అదనపు కొవ్వును కరిగించి బరువు తగ్గేలా చేస్తాయి. ఇక గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా రొయ్యలతో లభిస్తాయి. అందువల్ల వారానికి ఒకసారైన రొయ్యల్ని తీసుకోవడం మంచిది. కేన్సర్‌కి చెక్.. వీటిలో సెలీనియం కంటెంట్ పుష్కలంగా ఉండటం వల్ల క్యాన్సర్ కణాలను శరీరంలోకి చొరబడకుండా నివారిస్తుంది. ప్రాణాంతక వ్యాధులతో పోరాడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న క్యాన్సర్ నియంత్రణకు రొయ్యలు మంచి ఆహారం. పుష్కలంగా పోషకాలు అలాగే దంతాలు, ఎముకలు బలంగా ఉండాలంటే కాల్షియం అవసరం అన్న సంగతి అందరికీ తెలిసిందే. రొయ్యలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి సహాయపడుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందడంతో పాటు ఎముకలు, కండరాలు బలపడతాయి. చర్మ సౌందర్యానికి.. చర్మకాంతికి తోడ్పడే విటమిన్ ఇ రొయ్యల్లో ఉంటుంది. ఇది చర్మానికి కావలసిన పోషకాలను అందించి చర్మ కాంతిని మెరుగుపరుస్తుంది. రొయ్యల్లో విటమిన్ బి12 అధికంగా ఉంటుంది. తద్వారా మతిమరుపుని త్వరగా రానివ్వదు. అంతేకాకుండా శరీర నిర్మాణ కణాల అభివృద్ధికి ఉపకరించే శక్తి రొయ్యల్లో ఉంటుంది. (చదవండి: ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడు ఇతడే..ఆరోగ్య రహస్యమిదే..!) -
సెలబ్రిటీలు తాగే బ్లాక్ వాటర్ ఏంటీ? నార్మల్ వాటర్ కంటే మంచిదా..!
చాలా మంది సెలబ్రిటీలు.. బ్లాక్ వాటర్ తాగుతూ ఉన్న ఫొటోలు తెగ సందడి చేస్తున్నాయి. క్రికెటర్ విరాట్ కోహ్లీ నుంచి కరణ్ జోహార్, శృతి హాసన్ ఇలా ఎంతో మంది సెలబ్రిటీల వరకు చాలామంది ఈ నీటినే తాగుతున్నారు. ఎందుకు వాళ్లు ఈ నీటిని తాగుతున్నారు. దీని ప్రత్యేకత ఏంటి?. మాములు వాటర్‌కి దీనికి తేడా ఏంటీ అంటే.. బ్లాక్ వాటర్.. ఈ మధ్యకాలంలో చాలా ట్రెండ్ అవుతోంది. ముక్యంగా సెలబ్రెటీలు బ్లాక్ వాటర్ తాగుతున్న లేదా క్యారీ చేస్తున్న ఫోటోలే ఇందుకు కారణం. ఇక ఈ బ్లాక్ వాటర్ దగ్గర కొస్తే ఇది చూడటానికి బ్లాక్‌గా ఉంటుంది. అయితే ఈ వాటర్ తాగితే అప్పటి వరకు శరీరం కోల్పోయిన నీరు తక్షణమే భర్తీ అవుతుందట. ముఖ్యంగా వ్యాయామం వంటివి చేసినప్పుడు కోల్పోయిన నీరు తక్షణమే పొందడంలో తోడ్పడుతుంట. పైగా వీటిలో పోషకాల శాతం అధికంగా ఉంటాయి. దీని వల్ల ఒనగురే ఆరోగ్య ప్రయోజనాలేంటంటే.. డిటాక్స్ డ్రింక్‌గా.. ఈ బ్లాక్ వాటర్ శరీరం నుంచి విష పదార్థాలను బయటకు పంపించే డిటాక్స్ డ్రింక్‌గా పని చేస్తుంది. బ్లాక్ వాటర్‌లో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు.. శరీరంలో వ్యాధులకు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌ను బయటికి పంపించడంలో శక్తిమంతంగా పని చేస్తుంది. దీంతో వృద్ధాప్య ఛాయలు త్వరగా రావు. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.. బ్రాక్ వాటర్ శరీరంలో యాసిడ్ లెవెల్స్‌ని అదుపులో ఉంచుతుంది. ముఖ్యంగా జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. తీసుకున్న ఆహారం నుంచి సూక్ష్మ పోషకాలను శరీరం త్వరగా గ్రహించగలుగుతుంది. పైగా ఇమ్యూనిటీ పెరుగుతుంది. బరువు అదుపులో ఉంటుంది.. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటే జీవక్రియల పనితీరూ మెరుగుపడుతుంది. ఫలితంగా శరీరంలో కొలస్ట్రాల్ పెరగదు. అదీగాక బరువును కూడా సులభంగా అదుపులో ఉంచుకోవచ్చు. రోజంతా ఉత్సాహాంగా, హెల్తీగా ఉంటారు. నార్మల్ వాటర్‌తో ఈ ప్రయోజనాలు పొందగలమా..? నిపుణులు నార్మల్ వాటర్ తోకూడా ఇలాంటి ప్రయోజనాలనే పొందొచ్చని చెబుతున్నారు.ప్రతిరోజు కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగాలని చెబుతున్నారు. అలాగే రోజంతా శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచేలా 12-15 గ్లాసుల నీరు త్రాగాలని చెప్పారు. ఇక్కడ శరీరానికి తగినంత నీరు అందితే.. బ్లాక్ వాటర్ వల్ల పొందే ప్రయోజనాలనే మాములు వాటర్‌తో కూడా సొంతం చేసుకుంటామని అన్నారు. అలా అని డైరెక్ట్‌గా ట్యాప్ వాటర్ తాగొద్దని చెప్పారు. నార్మల్ వాటర్‌ని గోరువెచ్చగా లేదా కాచ చల్లార్చి తాగితే ప్రయోజనాలు పొందగలరిన తెలిపారు. ఇలా చేస్తే.. శరీరంలో టాక్సిన్స్ తొలుగుతాయిన చెప్పారు. ముఖ్యంగా మలబద్ధకం సమస్య దూరం అవుతుంది. దీంతోపాటు శశరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుందని అన్నారు. అంతేగాక మంచి జీర్ణక్రియ కోసం.. ఉదయాన్ని గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, చియా గింజలు వేసి తీసుకోంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందగలరని అన్నారు. బ్యాక్ వాటర్‌తో కలిగే దుష్ప్రయోజనాలు.. ఈ బ్లాక్ వాటర్ తాగితే ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. ఎక్కువగా తీసుకుంటే అంతే స్థాయిలో సైడ్ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో అధికి పీహెచ్ స్థాయిలు ఉంటాయి. దీని కారణంగా శరీరంలో ఆల్కలైన్ స్థాయులు పెరిగిపోయి.. గ్యాస్-ఉదర సంబంధిత సమస్యలు, వికారం, వాంతులు, చర్మ సమస్యలు, ఏకాగ్రత కోల్పోవడం వంటివి వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. దీనిలో ఉండే అధిక pH మీ చర్మాన్ని పొడిగా మార్చే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు. (చదవండి: లిప్ ఫిల్లింగ్ ట్రీట్మెంట్ మంచిదేనా? ఫెయిలైతే అంతేనా..!) -
వేసవిలో కుండలోని నీళ్లే ఎందుకు బెటర్?
వేసవిలో దాహార్తి మాములుగా ఉండదు. ఎంతలా అంటే ఏం తిన్నా ముందుగా దాహం అనిపించేస్తుంది. దీనిక తోడు బయట ఎండ ధాటికి తట్టుకోలేక చలచల్లగా నీళ్లు ఉంటే చాలనిపిస్తుంది. అందుకని ఫ్రిజ్‌లోని బాటిళ్లను ఖాళీ చేసేస్తుంటాం. అయితే చాలామంది కుండలోని నీళ్లే మంచిది అంటారు. ఫ్రిజ్‌లోని నీరు అస్సలు తాగొద్దని హెచ్చరిస్తుంటారు నిపుణులు. అసలు కుండలోని నీళ్లే ఎందుకు బెటర్ అంటే.. వేసవి రాగానే చల్లదనాన్ని అందించే కూలర్లు, ఏసీల అమ్మకాలు ఊపందుకుంటాయి. ఇదే సమయంలో ఫ్రిజ్ అమ్మకాలు కూడా పెరుగుతాయి. నేడు ప్రతి ఇంట్లో ప్రిజ్ తప్పనిసరిగా ఉంటుంది. కూరగాయలు ఇతర పదార్థాలను స్టోర్ చేసుకోవడంతో పాటు ఇందులో నీటిని కూడా ఉంచి చల్లగా చేసుకుంటాం. అయితే ఫ్రిజ్ నీరు తాగడం అంత మంచిది కాదని కొందరు ఆరోగ్య నిపుణులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. పూర్వకాలంలో వేసవిలో ఎక్కువగా మట్టితో చేసిన కుండ నీరు తాగేవారు. ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో కుండ నీరే తాగుతున్నారు. వేసవిలో కుండ నీరు మాత్రమే చల్లగా ఉంటాయి. ఓపెన్ ప్లేసులో పెట్టడం వల్ల ఇవి మరింత చల్లగా మారుతాయి. ముఖ్యంగా మట్టిలో ఎక్కువగా మినరల్స్ ఉంటాయి. అందువల్ల కుండనీరు తాగగానే అవన్నీ నేరుగా శరీరంలోకి వెళ్లి మేలు చేస్తాయి. అందువల్ల ఫ్రిజ్ నీరు కంటే కుండలోని నీళ్లే ఆరోగ్యానికి మంచిది. రిఫ్రిజిరేటర్ నీరు మోతాదుకు మించి చల్లదనం ఉంటుంది. దీంతో శరీరంలోని కొన్ని కణాలు దెబ్బతింటాయి. కుండలో నీరు అయితే సమపాళ్లలో చల్లగా ఉంటాయి. దీంతో ఇవి తాగడం వల్ల ఎలాంటి హాని జరగదు. రెగ్యులర్‌గా కుండలో నీరు తాగడం వల్ల ఎలాంటి జీర్ణ సమస్యలు ఉండవు. ఫ్రిజ్ లో నీరు ఎక్కువగా తాగితే శరీరంలో వేడి అనూహ్యంగా పెరుగుతుంది. చలవ చేయడం మాటే అటుంచి అందులోనూ ఈ వేసిలో వేడిచేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో తెలియంది కాదు. అందువల్ల కుండలోని నీటికే ప్రాధాన్యత ఇవ్వడం మంచిది నిపుణులు సూచిస్తున్నారు. అదీగాక మట్టి కుండలో నీరు తాగడం వల్ల జీవ క్రియలు పెరుగుతాయి. పైగా ఆరోగ్యంగా కూడా ఉంటారు. (చదవండి: Fennel Seeds: సొంపుతో ఇన్ని లాభాలా? ఐతే దీన్ని..!) -
ఇంగువతో ఇన్ని లాభాలా? బరువును తగ్గించే మ్యాజిక్ డ్రింక్
అసాఫెటిడా, హింగ్ లేదా ఇంగువగా ప్రసిద్ధి చెందింది. రుచి , ఘాటైన వాసనతో ఉండే భారతీయ వంటకాల్లో వాడే కీలకమైన సుగంధ ద్రవ్యం. పూర్వకాలం నుంచే భారతీయులు సుగంధ ద్రవ్యాలను ఎక్కువగా ఉపయోగించేవారు. ఇంగువను ప్రతిరోజు వంటకాలలో ఉపయోగిస్తే శరీరానికి మంచిదని ఆయుర్వేద గుణాలు పుష్కలంగా ఉన్నాయని ఆయుర్వేదం చెబుతోంది. దీని వల్ల ఆరోగ్య ప్రయోజనాలు, దుష్ప్రభావాలు గురించి తెలుసుకుందాం. సాంబారు, పప్పు, పులుసుకూరలు, పచ్చడి తాలింపులలో మాత్రమే వాడుతారు అనుకుంటే పొరపాటే. మంచి వాసన, రుచితోపాటు, ఇంగువ అనేక రకాల ఆరోగ్య సమస్యలను నయం చేస్తుంది. ఇంగువ ఆరోగ్య ప్రయోజనాలు బరువు తగ్గడానికిమ్యాజిక్ డ్రింక్: ఇంగువ నీరు తాగడం వల్ల బరువు త్వరగా తగ్గుతారు. ఇంగువలో ఫైబర్, కార్బోహైడ్రేట్, ప్రొటీన్, ఐరన్, కాల్షియం మొదలైనవి పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఇంగువ నీరు మ్యాజిక్‌లా పనిచేస్తుందని చెబుతారు. ♦జీర్ణక్రియనుమెరుగుపరుస్తుంది గ్యాస్, ఉబ్బరం, అపానవాయువు వంటి కడుపు రుగ్మతల నివారణలో ఉపయోగపడుతుంది. కడుపు పూత,కడుపులో నులి పురుగుల సమస్యతో బాధపడేవారు ఇంగువ వాడి, దీన్ని అధిగమించవచ్చు. ఛాతీపై పూయడం వల్ల ఆస్తమా, కోరింత దగ్గు, ఊపిరితిత్తుల వాపు నుంచి ఉపశమనం లభిస్తుంది. ♦ యాంటీవైరల్ , యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉన్న కారణంగా ఇది ఉబ్బసం, బ్రోన్కైటిస్, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం అందిస్తుంది. ♦ ఇంగువ సహజ యాంటిడిప్రెసెంట్.ఒత్తిడి ,ఆందోళన, డిప్రెషన్‌తో బాధపడేవారికి ఇంగువ మంచి మందు. ♦లైంగిక సమస్యలకు: నపుంసకత్వ సమస్యలలో బాధపడుతున్న పురుషులకు ఇది బాగా సహాయపడుతుంది. అకాల స్కలన సమస్యకు కూడా బాగా పనిచేస్తుందని అని నిపుణులు చెబుతున్నారు. స్త్రీ,పురుషుల్లో లైంగిక వాంఛను గణనీయంగా పెంచుతుందట కేన్సర్ ప్రమాదం: కేన్సర్ కణితి, పరిమాణాన్ని తగ్గించడంలో ఇంగువ బాగా ప్రయోజనకరంగా ఉంటుంది. కేన్సర్ వ్యాప్తిని అరికడుతుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కేన్సర్ కణాలతో పోరాడుతాయి. ♦ఊపిరితిత్తులు, కాలేయం ,మూత్రపిండాలలో మెటాస్టాసిస్ నివారణలో పనిచేస్తుంది. మెదడులోని రక్త నాళాలలో ఇన్ఫ్లమేషన్ను తగ్గించడంలో సహాయ పడుతుంది. తలనొప్పిని తగ్గిస్తుంది. ♦ యాంటీ ఏజింగ్: చర్మం ముడతలు, కళ్ల క్రింద నల్లటి వలయాలు ముఖంపై ముడతలను కూడా తొలగిస్తుంది. ఇందులోని టైరోసిన్ నిస్తేజమైన చర్మానికి మెరుపునిస్తుంది. ♦ రుమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాలను తగ్గిస్తుంది కీళ్ల నొప్పి, వాపు తగ్గించే అనాల్జేసిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ,రిలాక్సింగ్ లక్షణాలను కలిగి ఇంగులో ఉన్నాయి. ♦ పీరియడ్స్ సమయంలో తీవ్రమైన నొప్పి లేదా తిమ్మిరితో బాధపడుతుంటే ఇంగువ దివ్యవౌషధంలా పనిచేస్తుంది. ఇందులో ఉండే మూలకాలు బహిష్టు సమయంలో నొప్పిని తగ్గించడంతో పాటు ఇతర సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడతాయి. ♦ పంటి నొప్పికి కూడా ఇంగువ మంచి ఫలితాలనిస్తుంది.ఇంగువలో నొప్పి నివారణ గుణాలు అలాగే యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి నొప్పి తగ్గించి ఉపశమనాన్ని అందిస్తాయి. -
మధుమేహం : ఈ సూపర్ ఫుడ్‌తో చెక్ చెప్పొచ్చు!
ప్రస్తుత కాలంలో డయాబెటిస్ సమస్య అందరిలోనూ కనిపిస్తోంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ముఖ్యంగా జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల మధుమేహం సమస్య నానాటికి పెరిగి పోతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. మధుమేహం విషయంలో, రక్తంలో చక్కెర స్థాయులను సాధారణంగా ఉండేలా చూసుకోవడం మొదటి ప్రాధాన్యతగా తీసుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయి తగ్గించుకోవడానికి కొన్ని సూపర్‌ఫుడ్‌ల సహాయం తీసుకోవచ్చు. అవేంటో చూద్దామా... దాల్చిన చెక్క: రక్త ప్రవాహంలో చక్కెర కదలికను పెంచడం ద్వారా మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. సొరకాయ: సొరకాయలో 92శాతం నీరు, 8శాతం ఫైబర్ ఉంటుంది. దీనిలో గ్లూకోజ్, చక్కెర సంబంధిత సమ్మేళనాల పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. ఇది డయాబెటిక్ రోగులకు అద్భుతమైన కూరగాయగా పరిగణిస్తారు. కాకరకాయ: రుచికి చేదుగా ఉండే కాకరకాయలో పాలీపెప్టైడ్–పి ఉంటుంది. ఇది ఇన్సులిన్ లాంటి హైపోగ్లైసిమిక్ ప్రొటీన్. ఇది కణాలలోకి గ్లూకోజ్‌ని తీసుకురావడంలో సహాయపడుతుంది. మెంతులు: ఇవి ఫైబర్, ఇతర రసాయనాలను కలిగి ఉంటాయి. ఇవి జీర్ణక్రియను నెమ్మదిస్తాయి. శరీరంలోని కార్బోహైడ్రేట్లు, చక్కెరను గ్రహించడంలో సహాయపడతాయి. దీని కారణంగా రక్తంలో చక్కెర సాధారణంగా ఉంటుంది. ఆకు కూరలు: ఈ కూరగాయలలో ఫైబర్, మెగ్నీషియం, విటమిన్ ఎ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెరను తగ్గించడంలో సహాయపడతాయి. జొన్నలు, రాగులు: జొన్నలు, రాగులు వంటి చిరుధాన్యాలలో డయాబెటిస్‌ను నియంత్రించే కారకాలు ఉంటాయి. రాగి జావ, జొన్న రవ్వతో చేసిన ఉప్మా, జొన్న రొట్టెలు, రాగి జావ, రాగి రొట్టెలు తీసుకోవడం డయాబెటిక్స్‌కు చాలా మంచిది. -
కలబంద మొక్కలు ఇన్ని రకాలు ఉన్నాయా!
అలోవెరా అనేది దాదాపు ప్రతి భారతీయ ఇంటిలో కనిపించే మొక్క.. ఇది అందం నుండి ఆరోగ్యం వరకు అన్ని విధాలుగా ఉపయోగపడే అనేక ప్రయోజనాలను కలిగి ఉంది. ఈ మొక్కను నరదిష్టి కోసం కూడా వాడతారు. చాలా సులభంగా పెంచుకునే మొక్కిది. మనకు తెలిసినంతవరకు కలబంద పెద్ద కాడలుగా ఉంటుంది. అయితే ఈ కలబందలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 200 రకాలు వరకు ఉన్నాయట. కానీ వాటిలో నాలుగు మాత్రమే ఆరోగ్యానికి, అందానికి ఉపయోగపడతాయట. మిగతా కలబంద మొక్కలను అలంకరణగా ఉపయోగిస్తారట. అయితే వాటిలో మనకు ఉపయోగపడే కలబంద రకాల మొక్కలు ఏంటీ? వాటిలో ఏవి మన చర్మ సంరక్షణలో ఉపయోగపడతాయో సవివరంగా తెలుసుకుందాం. ఎరుపు కలబంద ఇది చూడటానికి చాలా అందంగా ఉంటుంది. సూర్యకాంతిలో ఉంచినప్పుడు, దాని ఎరుపు రంగు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. దీని ఆకులకు చాలా ముళ్ళు ఉంటాయి. కానీ దాని అందం కారణంగా ప్రతి ఒక్కరూ తమ ఇంటిలో రెడ్ కలబందను నాటాలని కోరుకుంటారు. ఇది ప్రధానంగా దక్షిణాఫ్రికా మొక్క. దీనిని పెంచేందుకు ఎక్కువ నీరు అవసరం లేదు. చిన్న ఆకుల కలబంద లేతరంగు ఆకుల కారణంగా, అవి చాలా అందంగా కనిపిస్తాయి. ముళ్లతో నిండినప్పటికీ, చర్మ సంరక్షణలో దీనిని ఉపయోగిస్తారు. చిన్న లేతరంగు ఆకులతో పాటు, ఇది అందమైన ఎరుపు, పసుపు పువ్వులను కూడా ఉత్పత్తి చేస్తుంది. స్పైరల్ అలోవెరా ఇలాంటి కలబంద మొక్కలు మార్కెట్లో ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ఇది చాలా అందమైన రకాల్లో ఒకటి. ఇది గుండ్రని ఆకారంలో మరియు ఎరుపు నారింజ రంగు పుష్పాలను కలిగి ఉంటుంది. ఈ మొక్క ఇంటి అలంకరణకు ఉత్తమంగా పరిగణించబడుతుంది. కార్మైన్ అలోవెరా.. ఈ కలబంద కూడా గృహ అలంకరణను మరింత ఇనుమడింప చేస్తుంది. ఇంటి అంకరణలో ఈ కార్మైన్ కలబంద ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఇది ఒకరకమైన హైబ్రిడ్ మొక్క. అయితే ఇది నీరు లేకుండా కూడా జీవించగలదు. ఈ నాలుగు కలబంద రకాలు ఆరోగ్యానికి, అందానికి బాగా ఉపయోగడతాయి. ఇక మన ఇళ్లలో పెరిగే కలబంద కూడా చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది. (చదవండి: వేసవిలో ఈ ఫుడ్స్‌కి దూరంగా ఉంటే మేలు!) -
శాస్త్రీయ నృత్యంతో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు!
భరత నాట్యం నుంచి కూచిపూడి వరకు భారతీయ శాస్త్రీయ నృత్యాలలో వ్యాయామానికి సమానమైన అంశాలు ఎన్నో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ తరం శాస్త్రీయ నృత్యాలపై ఆసక్తి ప్రదర్శిస్తోంది. నృత్య సాధనతో ఫిట్నెస్ను సొంతం చేసుకుంటుంది. ముంబైలో ఎంబీఏ చేస్తున్న శివానీ దీక్షిత్‌కు ఏ చిన్న పనిచేయాలన్న బద్దకంగా అనిపించేది. దీని వల్ల చదువు కూడా దెబ్బ తినే ప్రమాదం ఏర్పడింది. తన కజిన్ సలహా ప్రకారం అయిష్టంగానే భరతనాట్యం నేర్చుకోవడం మొదలు పెట్టింది. మొదట్లో ఎలా ఉన్నా ఆ తరువాత మాత్రం భరతనాట్యంపై దీక్షిత్లో అంతకంతకూ ఇష్టం పెరుగుతూపోయింది. ‘నేను ఎప్పుడూ వ్యాయామాలు చేయలేదు. అయితే భరతనాట్యం వల్ల ఎన్నో వ్యాయామాలు ఒక్కసారే చేస్తున్నట్లుగా అనిపించింది. బద్దకాన్ని వదిలించుకున్నాను. మనసు తేలిక అయినట్లుగా ఉంది’ అంటుంది శివానీ దీక్షిత్. ‘అధిక బరువుతో బాధ పడుతున్న నాకు కథక్ నృత్యం కాంతి కిరణంలా కనిపించింది. కథక్ నృత్య సాధనతో బరువు తగ్గడం సంతోషంగా ఉంది. కథక్ డ్యాన్స్ అనేది మచ్ మోర్ దెన్ ఏ వెయిట్ లాస్ ఎక్సర్సైజ్ అనేది నా అభిప్రాయం. బరువు తగ్గడానికే కాదు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ల విషయంలోనూ కథక్ ఉపయోగపడుతుంది’ అంటుంది కోల్‌కతాకు చెందిన ఇరవై రెండు సంవత్సరాల నయనిక. బరువు తగ్గడానికి ఉపయోగపడే ఒడిస్సీ, జాజ్, కాంటెంపరీ వెస్ట్రన్ డ్యాన్స్‌లను కలిపి ఒక డ్యాన్స్ ఫామ్ రూపొందించినట్లు తెలుసుకున్న నయనిక ప్రస్తుతం ఆ సమ్మేళన నృత్యరూపం గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో ఉంది. ‘కేవలం బరువు తగ్గడానికే కాదు ఏకాగ్రతను పెంచడంలో, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో శాస్త్రీయ నృత్యాలు ఉపయోగపడతాయనే విషయాన్ని నృత్యసాధన ద్వారా స్వయంగా తెలుసుకున్నాను. శాస్త్రీయ నృత్యకదలిలకు చేతులు, కళ్ల మధ్య సమన్వయం అవసరం. ఇది ఆటోమెటిగ్గా ఏకాగ్రతను మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది’ అంటున్నాడు బెంగళూరు చెందిన ఇంజనీరింగ్ స్టూడెంట్ సందేష్ సృజన్. శివానిక్ దీక్షిత్, నయనిక, సందేశ్ సృజన్‌ల మాటలు శాస్త్రీయ నృత్యాల పట్ల యువతరం చూపుతున్న ఆసక్తికి అద్దం పడతాయి. ‘మన దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన శాస్త్రీయ నృత్యాల జాబితా పెద్దది. ప్రతి నృత్యానికి తనదైన వేషధారణ, అలంకరణ, సంగీతం ఉంటాయి. శాస్త్రీయ నృత్యాన్ని నేర్చుకునే విధానం చాలా కఠినమైనది. దీనికి తగిన సమయం, శక్తి అవసరం. శాస్త్రీయ నృత్యం నేర్చుకోవడానికి ఆసక్తి మాత్రమే కాదు అంకితభావం చాలా ముఖ్యం, నృత్యం అనేది శారీరక, మానసిక ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది. శాస్త్రీయ నృత్య రూప శైలి ఒకదానికొకటి భిన్నంగా ఉన్నప్పటికీ అభ్యాస ప్రక్రియ కండరాలను బలోపేతం చేస్తుంది. భరతనాట్యం, కూచిపూడి, మోహినియాట్టంలాంటి శాస్త్రీయ నృత్యరూపాలను సాధన చేయడం ద్వారా మజిల్ ఇంప్రూమెంట్ ఉంటుంది. రెగ్యులర్ ప్రాక్టీస్ శరీరంలోని ఆక్సిజన్ స్థాయులను పెంచడంలో సహాయపడుతుంది’ అంటుంది ప్రోఫెషనల్ క్లాసికల్ డ్యాన్సర్, ట్రైనర్ కీర్తి దివాకరన్. కేరళ కొచ్చీలోని వైనవి నృత్యకళాక్షేత్రం వ్యవస్థాపకురాలు కీర్తి.‘డ్యాన్సింగ్ అనేది న్యూరో–మస్క్యులార్ బ్యాలెన్స్‌ను వృద్ధి చేయడంలో సహాయపడుతుంది’ అంటుంది క్లాసికల్ డ్యాన్సర్, ట్రైనర్, కోజికోడ్‌లోని గౌరీశంకరం క్లాసికల్ డ్యాన్స్ థెరపీ ఇన్స్టిట్యూట్ మేనేజింగ్ డైరెక్టర్ డా. ప్రియా మేనన్. శాస్త్రీయ నృత్యరూపకాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఎన్నో అధ్యయనాలు చెప్పాయి. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ అప్లైడ్ రిసెర్చ్ పేపర్ ప్రకారం... ఏదైనా వర్కవుట్ పదినిమిషాల ఒడిస్సీ డ్యాన్స్‌తో సమానం. డ్యాన్స్‌లో భాగంగా కాళ్ల నుంచి మెడ వరకు అన్నీ కదులుతాయి. గంట ఒడిస్సీ నృత్యం 250 కేలరీలు ఖర్చు కావడానికి కారణం అవుతుంది. ‘సైన్స్ అండ్ జర్నల్’లో ప్రచురితమైన రిసెర్చ్ పేపర్ ప్రకారం నాన్–డ్యాన్సర్లతో పోల్చితే కథక్ డ్యాన్సర్ల శరీర బరువు, బాడీ మాస్ ఇండెక్స్... మొదలైన వాటికి సంబంధించి బాడీ కంపోజిషన్ మెరుగ్గా ఉంటుంది. కథక్ డ్యాన్స్‌లోని క్విక్ ఫుట్ వర్క్ వల్ల ఒత్తిడి మాయం అవుతుంది. వ్యాయమాలతో కూడిన డ్యాన్స్ అనగానే ఒకప్పుడు జాజ్, లైన్ డ్యాన్స్, హిప్ హప్, సల్సా... మొదలైన వెస్ట్రన్ డ్యాన్స్‌లు మాత్రమే గుర్తొచ్చేవి. ‘ఎక్కడి దాకో ఎందుకు మన దగ్గరే బోలెడు శక్తిసంపద ఉంది’ అని గ్రహించిన యువతరం మన శాస్త్రీయ నృత్యాలకు దగ్గరవుతోంది. సాధన చేస్తోంది. ఆరోగ్య భాగ్యానికి చేరువ అవుతోంది. బాడీ బయో మెకానిక్స్ బాడీ బయోమెకానిక్స్ను బాగా అర్థం చేసుకోవడం డ్యాన్సర్ కమ్యూనిటీకి ముఖ్యం అంటుంది మధుమతి బెనర్జీ. భరతనాట్య కళాకారిణీ అయిన బెనర్జీ ఎన్నో దేశాలలో ప్రదర్శనలు ఇచ్చింది. ఇండియన్ క్లాసికల్ అండ్ ఫోక్ మ్యూజిక్‌లో కూడా ప్రావీణ్యం సాధించింది. శాస్త్రీయ నృత్యాలు నేర్చుకోవడానికి అవసరమైన స్ఫూర్తిని యువతరానికి ఇస్తోంది. నృత్యం ధ్యాన సాధనం.. ‘రోల్ ఆఫ్ ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ ఇన్ ఎడ్యుకేషన్’ పేరుతో రిమ్లీ భట్టాచార్య ఒక ఆర్టికల్ రాసింది. ‘భారతీయ శాస్త్రీయ నృత్యం మన విద్యా విధానంలో భాగంలో కావాలి. ఇది మన సంస్కృతికి సంబంధించిన శక్తిరూపమే కాదు అద్భుతమైన ధ్యాన సాధనం కూడా. విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా ఉండడానికి ఏకాగ్రత, సృజనాత్మకతను పెంపొందించడానికి శాస్త్రీయ నృత్యం ఉపయోగపడుతుంది. డ్యాన్స్ మూమెంట్స్‌తో శారీరక దృఢత్వం కలుగుతుంది. శరీరంపై నియంత్రణ పెరుగుతుంది. అంతర్గత భావాలను వ్యక్తీకరించే పద్ధతి, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి’ అంటుంది రిమ్లీ భట్టాచార్య. మెకానికల్ ఇంజినీరింగ్‌లో గోల్డ్ మెడలిస్ట్ అయిన రిమ్లీ ఎంబీఏ చేసింది. కార్పోరేట్ సెక్టార్లో పనిచేసింది. మానసిక ఆరోగ్యంపై ఎన్నో వ్యాసాలు రాసింది. ‘ఏ బుక్ ఆఫ్ లైట్’ పేరుతో పుస్తకం ప్రచురించింది. (చదవండి: నర్సు వెయిట్ లాస్ స్టోరీ..ఆ ఒక్క ఎక్స్ర్సైజ్తో జస్ట్ ఒక్క ఏడాదిలోనే..) -
రోజుకు ఒక్క అరగంట చాలు, ఫలితాలు మాత్రం!
నడక అన్ని వయసుల వారికి సరిపడే చక్కటి వ్యాయామం. క్రమ తప్పకుండా వాకింగ్ చేస్తే ఫిట్‌గా ఉండటమేకాదు ఆరోగ్య ప్రయోజనాలు కూడా మెండుగా ఉన్నాయి. రోగ నిరోధకశక్తి బలపడి, మంచి ఆయుర్దాయానికి సాయపడుతుంది. నడక వల్ల ప్రయోజనాలు ♦ నడకతో శరీరంలోని కొవ్వు నిల్వలు కలుగుతాయి. క్రమం తప్పకుండా వాకింగ్ చేస్తే ఊబకాయం కూడా నెమ్మదిగా కరుగుతుంది. ♦ రోజంతా మనసు హాయిగా, తేలిగ్గా ఉంటుంది. కొత్త ఉత్సాహం వస్తుంది. రోగనిరోధక శక్తి పెరిగి జలుబు లేదా ఫ్లూ ప్రమాదం తగ్గుతుంది. ♦ రోజుకు కనీసం 30 నిమిషాలు, వారానికి ఐదు రోజులు నడవడం వల్ల గుండెకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. కొరోనరీ హార్ట్ డిసీజ్ ప్రమాదాన్ని దాదాపు 19 శాతం తగ్గించవచ్చు. రోజూ వాకింగ్ దూరాన్ని పెంచుకుంటే ఫలితాలు ఇంకా బావుంటాయి. ♦ రక్తంలో చక్కెరను తగ్గించడంలో సహాయపడుతుంది ♦ తిన్న తర్వాత కొద్దిసేపు నడవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ♦ అల్పాహారం, భోజనం , రాత్రి భోజనం తర్వాత ఇలా రోజుకు మూడుసార్లు వాకింగ్ చేస్తే మంచిది. ♦ కీళ్ల నొప్పులు తగ్గుతాయి. నడక కాళ్ళ కండరాలను బలోపేతం చేస్తుంది ♦ ఆర్థరైటిస్‌తో బాధపడేవారికి కూడా చిన్నపాటి నడక ప్రయోజనాలను అందిస్తుంది. ♦ ముఖ్యంగా ఆరుబయట నడిచినపుడు సృజనాత్మక ఆలోచనలు పెరుగుతాయని పరిశోధకులు గుర్తించారు. నోట్: వాకింగ్‌కోసం ఉపయోగించే స్థలాలు, లేదా పార్క్‌లు ఎంచుకోవాలి. వాకింగ్‌కు అనువుగా దృఢమైన బూట్లు ధరించాలి. వదులుగా, సౌకర్యవంతమైన దుస్తులు ధరిస్తే మంచిది. నడకకు ముందు పుష్కలంగా నీరు తాగితే బెటర్. ఇది మన బాడీని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. మరీ ఎండలో కాకుండా, ఎండ తక్కువగా ఉన్నపుడు, నీడ ప్రదేశంలో వాకింగ్ చేయాలి. -
ఈ సూపర్ స్వీట్ డ్రింక్ తాగితే..అందం,యవ్వనం మీ సొంతం
వేసవి వచ్చిందంటే మన అందరికీ గుర్తు వచ్చే డ్రింక్ చెరుకు రసం. పిల్లా పెద్దా అంతా ఎంతో ఇష్టంగా తాగుతారు. మండు వేసవిలో దాహాన్ని తీర్చడమే కాదు, చెరుకు రసంలో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలూ ఉన్నాయి. మండు టెండలో, దాహంతో అల్లాడిపోతున్నపుడు చెరుకు రసం బండి కనిపిస్తే ప్రాణం లేచి వస్తుంది. చల్ల చల్లగా గ్లాసు రసం తాగితే తాగితే హాయిగా ఉంటుంది. అయితే చెరుకు రసం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే ఇక అస్సలు వదలరు. శుభ్రమైన చెరుకు రసం ఇన్ఫెక్షన్లను నివారించడంలోనూ, రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ బాగా పనిచేస్తుంది. చెరకు రసంలో యాంటీఆక్సిడెంట్లు ,ఆల్ఫా హైడ్రాక్సీ ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి యాంటి ఏజింగ్ ఏజెంట్లుగా పనిచేస్తాయి. సౌందర్య పోషణలోనూ, జుట్టు సంరక్షణలోనూ దీని ప్రయోజనాలు అద్భుతం అని చెప్ప వచ్చు. చెరుకులో ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉన్నాయి. విటమిన్ B12, ఐరన్‌తో సహా అవసరమైన పోషకాలతో నిండి ఉంది. సహజ కండీషనర్‌గా పని చేసి జుట్టును మృదువుగా, సిల్కీగా తయారు చేస్తుంది. హెయిర్ ఫోలికల్స్ ను బలపరిచే మినరల్స్ చెరకు రసంలో పుష్కలంగా ఉన్నాయి చెరకు రసంలో తేనె కలిపి పావుగంట పాటు చర్మానికి మర్దన చేయాలి. తర్వాత ఇరవై నిమిషాల పాటు ఉంచి కడిగేయాలి. వారానికి రెండు సార్లు ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది. స్కిన్ గ్లోయింగ్, యంగ్‌గా కనిపించాలంటే ఇంకో చిట్కా ఏంటంటే చెరకు రసంతో తయారు చేసిన ఐస్ క్యూబ్లతో ముఖం, మెడ, చేతులపై మసాజ్ చేసుకోవాలి. అలాగే చెరకురసానికి కాస్తంత కాఫీపొడి చేర్చి స్క్రబ్‌లా ఉపయోగిస్తే మొటిమలు, మచ్చలు తొలగి పోయి కొత్త మెరుపు వస్తుంది. బొప్పాయి గుజ్జులో చెరకు రసాన్ని కలిపి పట్టించి, ఆరిన తరువాత చల్లని నీళ్లతో కడిగేసు కోవాలి స్కిన్ టైట్ అయిన ఫీలింగ్ తెలుస్తుంది. చెరకు రసం నెయ్యి కలిపి, చర్మానికి మర్దనా చేస్తే ఎండ వల్ల కమిలిన చర్మం తిరిగి కొత్త నిగారింపును సంతరించుకుంటుంది. శుభ్రమైన చెరుకు రసాన్ని ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు చర్మానికి పట్టిస్తే చర్మం ఆరోగ్యంగా, మృదువుగా మారుతుంది. చెరుకు రసంలో కొద్దిగా అల్లం, నిమ్మరసం కలుపుకొని తాగితే అలసట, నీరసం మాయమై కొత్త శక్తి వస్తుంది. -
రోజ్ హిప్స్‌తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా!
ఏంటీ రోజ్ హిప్స్.. ఎప్పుడూ వినలేదే? ఏంటవి? అని ఆశ్చర్యపోకండి. గులాబీ పూలు వికసించి, రాలిపోయిన తర్వాత.. గులాబీ మొక్కలకు ఇవి అభివృద్ధి చెందుతాయి. ఇవి గుండ్రని, బెర్రీ పండ్లలా ఉంటాయి. రోజ్ హిప్స్ సాధారణంగా ఎరుపు, నారింజ రంగులో ఉంటాయి. వీటిలో విత్తనాలు కూడా ఉంటాయి. అయితే వీటిలో పోషకాల అధికంగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. వీటిని ఆయుర్వేద వైద్యంలో శతాబ్దాలుగా వినియోగిస్తున్నారు కూడా. అలాంటి ఈ రోజ్ హిప్స్ని మన ఆహారంలో భాగం చేసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటంటే.. ఈ రోజ్ హిప్స్‌లో విటమిన్ సి, ఏ, బి5, సి యాంటీఆక్సిడెంట్లు ఇతర ప్రయోజనకరమైన సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. రోజ్ హిప్స్‌లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీవైరల్, యాంటికాన్సర్ లక్షణాలు ఉంటాయి. అంతేగాదు దీనిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది, ఇన్ఫెక్షన్లు రాకుండా అడ్డుకుంటుంది. బలుబు, ఫ్లూ, ఇన్ఫెక్షన్లు, దగ్గు వంటి అనారోగ్యాలను నుంచి రక్షణ కల్పిస్తుంది. రోజ్ హిప్స్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని మంటను తగ్గించడానికి సహాయపడతాయి. హృదయనాళ వ్యవస్థను రక్షిస్తాయి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.రోజ్ హిప్స్‌లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది, ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్‌కు మద్దతు కల్పిస్తుంది. రోజ్ హిప్స్‌లో విటమిన్ ఏ, ఇ సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మ స్థితిస్థాపకతను మెరుగుపరచడానికి, ముడతలను తగ్గించడానికి తోడ్పడతాయి. తద్వారా యవ్వన ఛాయను ప్రోత్సహిస్తాయి.రోజ్ హిప్స్‌లో లూటీన్, జియాక్సంతిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని కూడా రక్షిస్తాయి. వయస్సు సంబంధిత మచ్చల క్షీణత ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి.రోజ్ హిప్స్లోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఆర్థరైటిస్ నొప్పులు, కీళ్ల నొప్పులను తగ్గించడానికి తోడ్పడతాయి. ఇవి శరీరంలోని వాపును తగ్గించి.. నొప్పుల నుంచి ఉపశమనం ఇస్తాయి.రోజ్ హిప్స్‌లో ఉండే ఫైబర్ కంటెంట్ మిమ్మల్ని ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. బరువు కంట్రోల్లో ఉంచడానికి సహాయపడుతుంది. అతిగా తినకుండా నివారిస్తుంది. రోజ్ హిప్స్‌లో ఉండే.. యాంటీఆక్సిడెట్లు మెదడులోని ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి. ఇది మానసికి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. నిరాశ, ఆందోళన, ఒత్తిడి, డిప్రెషన్ వంటి వాటిని దరిదాపుల్లోకి రానివ్వవు. ఎలా తీసుకోవాలి..? ఎండిన రోజ్ హిప్స్‌ను వేడి నీళ్లలో వేసి సుమారు 10 నిమిషాల పాటు నానబెట్టండి. ఆ తర్వాత దానిలో కొంచెం తేనె యాడ్ చేసుకుని తాగొచ్చు. స్మూతీస్‌లో ఎండిన రోజ్ హిప్స్ యాడ్ చేసుకుని ఎంజాయ్ చేయవచ్చు. వాటిలోని పోషకాలు పెరుగుతాయి. చక్కెరతో కలిపి జామ్‌గా తయారు చేసుకోవచ్చు. మీరు మఫిన్లు, కేక్‌లు, కుకీలు లేదా బ్రెడ్ల కోసం ప్రత్యేకమైన, ఆరోగ్యకరమైన ట్విస్ట్‌ని అందించడానికి ఎండిన రోజ్ హిప్స్ యాడ్ చేస్తే టేస్ట్‌కి టేస్ట్, ఆరోగ్యానికి ఆరోగ్యం పొందొచ్చు. (చదవండి: అత్యుత్తమమైన కాఫీల జాబితాలో భారత్ ఎన్నో స్థానంలో ఉందో తెలుసా!) -
ఫాస్టింగ్‌తో బరువు తగ్గడానికి మించిన ఆరోగ్య ప్రయోజనాలు!
బరువు తగ్గాలి అనగానే ముందుగా గుర్తొచ్చేది ఉపవాసం. తర తరాలుగా భారతీయుల్లో ఉపవాసం కొత్తేమీకాదు. బరువు తగ్గాల నుకునే వారు, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకునే వారు ఫాస్టింగ్ చేయడం కూడా చాలా కామన్. అయితే ఎక్కువ కాలం మన దేహాన్ని పస్తు పెట్టడం వల్ల వెయిట్‌లాస్ కంటే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటోంది తాజా అధ్యయనం. ఆ వివరాలు మీకోసం. ఉపవాసంతో శరీరంలో ఏమి జరుగుతుంది? ఉపవాస సమయంలో, మన శరీరం దాని ఇంధన మూలాన్ని స్వీకరిస్తుంది. సులభంగా యాక్సెస్ చేసే చక్కెరల నుండి బాడీలోని నిల్వ ఉన్న కొవ్వులను వాడుకుంటుంది. అయితే ఆహారం లేకుండా ఎక్కువ కాలం పాటు ఉంటే శరీరం ఎలా స్పందిస్తుంది? ఇదే ఈ స్టడిలోని కీలక అంశం. నేచర్ మెటబాలిజం జర్నల్‌లో ప్రచురితమైన ఒక కొత్త అధ్యయనంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. లండన్‌లోని క్వీన్ మేరీ విశ్వవిద్యాలయం, నార్వేజియన్ స్కూల్ ఆఫ్ స్పోర్ట్ సైన్సెస్ పరిశోధకులు 12 మంది ఆరోగ్యకరమైన వాలంటీర్లపై పరశోధన చేశాడు. వారు ఏడు రోజుల పాటు కేవలం నీరు మాత్రమే తీసుకునేలా చేశారు. అలా వారి రక్తంలో వివిధ ప్రోటీన్ మార్కర్ల స్థాయిలలో మార్పులను నిశితంగా పరిశీలించారు. మూడు రోజుల తర్వాతే మంచి ప్రయోజనం ఊహించినట్లుగానే తొలి రెండు, మూడు రోజుల్లో గ్లూకోజ్ నుండి కొవ్వు ప్రధాన ఇంధన వనరుగా మారడాన్ని పరిశోధకులు గమనించారు. దీంతో నిల్వ ఉన్న కొవ్వు కరుగుతూ వస్తుంది. మొత్తంగా, వాలంటీర్లు సగటున 5.7 కిలోగ్రాముల కొవ్వు ,లీన్ మాస్ రెండూ తగ్గాయి. అయితే మూడు రోజుల ఉపవాసం తర్వాత వాలంటీర్ల రక్త బయోమార్కర్లలో విభిన్న మార్పులను పరిశోధకులు గమనించారు. మొత్తం బాడీలో కూడా మార్పులొచ్చాయి. ముఖ్యంగా మెదడు కణాల నిర్మాణ ప్రోటీన్లలో మార్పులు ఆసక్తికరంగా నిలిచాయి. దీంతో మూడు రోజుల తరువాత చేసే ఉపవాసంలో మాత్రమే బరువు తగ్గడాన్ని మించి, మంచి ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఈ అధ్యయనంలో తేల్చారు. క్వీన్ మేరీస్ ప్రెసిషన్ హెల్త్ యూనివర్శిటీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (PHURI) డైరెక్టర్ క్లాడియా లాంగెన్‌బర్గ్ మాట్లాడుతూ, ‘తొలిసారి ఉపవాసం ద్వారా శరీరం అంతా కూడా అతి చిన్న స్థాయిలో కూడా ఏమి జరుగుతుందో చూడగలుగుతున్నామన్నామని ప్రకటించారు. సురక్షితమైన పద్ధతులో ఫాస్టింగ్ చేసినప్పుడు, బరువు తగ్గడం అనేది ప్రభావవంతంగా ఉంటుంది. అలాగే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ విధానం కూడా బరువు తగ్గడ కంటే అంతకు మించిన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నారు. అయితే చాలాకొద్దిమందిపై చేసిన తమ ప్రయోగంలో అందరిలోనూ ఫలితాలు ఒకేలా ఉన్నాయని, మరి ఎక్కువమందిపై ఈ ప్రయోగం చేసినపుడు ఫలితాలు ఎంటా ఉంటాయనేది పరిశీలించాల్సి ఉందన్నారు. -
వేసవిలో బార్లీ నీళ్లు : ప్రయోజనాలెన్నో..!
బార్లీ నీరు వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ తగ్గించడంలో సాయపడుతుంది. గట్ బాక్టీరియాను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. మన ఆరోగ్యంలో గట్ బ్యాక్టీరియా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. బార్లీ ఆధారిత ఆహారాన్ని తీసుకోవడం వల్ల బాక్టీరాయిడ్స్ అనే గట్ బ్యాక్టీరియా తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ⇒ రక్తపోటును అదుపులో ఉంచుతాయి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచి. టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. మధుమేహం ఉన్నవారు తమ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించేందుకు బార్లీ వాటర్ తాగవచ్చు. ⇒ ఎండల ప్రభావం పడకుండా ఉండాలన్న, వడదెబ్బ తగలకుండా ఉండాలన్న ఈ నీళ్లు తాగాల్సిందే ⇒ బార్లీ నీళ్లు తాగితే జీర్ణాశయం కూడా చాలా శుభ్రపడుతుంది. అజీర్తి దూరమవుతుంది. ⇒ పిల్లలకు బార్లీ నీళ్లు తాగిస్తే మంచి ఫలితం ఉంటుంది. మలబద్దకం వంటి సమస్యలు దరి చేరవు. ⇒ గర్భిణులు రోజూ బార్లీనీళ్లు తాగితే మరీ మంచిది. కాళ్ల వాపు సమస్య వారి దరిచేరదు. రోజులో ఉదయం, సాయంత్రం బార్లీ నీళ్లు తాగితే బిడ్డ ఆరోగ్యం కూడా బాగుంటుంది. అలసట కూడా త్వరగా రాదు ⇒ బరువు తగ్గాలనుకునే వారికి కూడా బార్లీ నీళ్లు బాగా ఉపయోగపడతాయి. రక్తంలో కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తాయి. దీని ద్వారా గుండె సంబంధిత వ్యాధులు దూరంగా ఉంటాయి. ⇒ మహిళలను తరచూ బాధించే ప్రధాన సమస్య మూత్రనాళ ఇన్ఫెక్షన్. ఈ సమస్యను దూరం చేసుకోవాలంటే ఉదయాన రోజూ గ్లాసుడు బార్లీ నీళ్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది. మూత్రంలో ఇన్ఫెక్షన్లు కలిగే కారకాలు, వ్యర్థాలు బయటికి పోతాయి. సూక్ష్మమైన రాళ్లు కూడా కరిగిపోతాయి. -
సుష్టిగా తిన్నాక ‘కునుకు’ మంచిదే, కానీ ఈ డేంజర్ కూడా ..!
పగటిపూట అన్నం తిన్నవెంటనే కాసేపు కునుకు తీయడం చాలామందికి అలవాటు. అందులోనూ వేసవి వచ్చిందంటే కాసేపైనా నిద్రపోవాల్సిందే. అయితే ఇది మన ఆరోగ్యానికి అసలు మంచిదా? కాదా? ఎంతసేపు కునుకు తీస్తే మంచిది? పగటిపూట నిద్రపోవడం కొంతవరకూ మంచిదే. పని నుంచి కొంచెం విశ్రాంతి తీసుకోవడంతో అలసట దూర మవుతుంది. ప్రశాంతంగా, కొత్త ఉత్సాహంగా వచ్చినట్టుగా అనిపిస్తుంది.అందుకనే దీన్ని పవర్ న్యాప్ అని అంటారు. మధ్యాహ్నం నిద్ర అనేది మితిమీరితే మాత్రం హానికరమైన ప్రభావం తప్పదంటున్నారు నిపుణులు. పగటి నిద్ర పనికి చేటు అన్నట్టు ఆరోగ్యానికి కూడా ముప్పే. మధ్యాహ్నం ఎక్కువసేపు నిద్రపోవడం ఆరోగ్యానికి హానికరం. ఇదిరాత్రిపూట నిద్రను ప్రభావితం చేస్తుంది. మధ్యాహ్నం నిద్రపోవడం వల్ల స్ట్రోక్ వచ్చే ప్రమాదం 20 శాతం కంటే ఎక్కువ పెరుగుతుందని మెడికల్ జర్నల్ ఆఫ్ అమెరికన్ అకాడెమీ ఆఫ్ న్యూరాలజీ గతంలో చేసిన అధ్యయనం చెబుతోంది. అంతేకాదు మధ్యాహ్నం 90 నిమిషాల కంటే ఎక్కువసేపు నిద్రపోయే వారికి పక్షవాతం వచ్చే ప్రమాదం 25 శాతం ఉంటుందట. కొలెస్ట్రాల్ స్థాయిలలో ఆటంకాలు ఎక్కువ నిద్రను కోల్పోయే రూపంలో కూడా గుర్తించవచ్చని అధ్యయనంలో వెల్లడైంది. వీరికి మినహాయింపు ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంగా ఉన్న వారు గరిష్ఠంగా 90 నిమిషాల పాటు నిద్రపోవచ్చట. మిగిలినవారు గరిష్ఠంగా 10 నిమిషాల నుంచి అరగంట లోపు మాత్రమే పడుకోవాలి. పగటి నిద్ర నష్టాలు ♦ ఊబకాయం ♦ రాత్రి నిద్రకు భంగం, బాడీ బయలాజికల్ సైకిల్ దెబ్బతింటుంది ♦ రాత్రి నిత్ర లేకపోతే అధిక రక్తపోటు, డయాబెటిస్, గుండె జబ్బులు, ఆందోళన లాంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం. ♦ డిప్రెషన్ -
అధికబరువు : చియా సీడ్స్, లెమన్ వాటర్ మ్యాజిక్ తెలుసా?
బరువు తగ్గే ఆలోచనలో ఉన్నారా? యోగా, ఇతర వ్యాయామంతోపాటు, ఈజీగా బరువు తగ్గడానికి కొన్ని ఆహార జాగ్రత్తలు, చిట్కాలతో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బరువు తగ్గొచ్చు. వాటిల్లో ముఖ్యమైన ఒక చిట్కా గురించి తెలుసుకుందాం రండి..! అధిక బరువును తగ్గించడంలో చియా సీడ్స్ ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి. వీటిని నీళ్లలో నాన బెట్టి తినడం వల్ల వీటిలో అధిక మోతాదులో ఉండే ఫైబర్, రిచ్ ప్రోటీన్ శరీరానికి బలాన్నిస్తాయి. అంతేకాదు పొట్ట నిండిన ఫీలింగూ కలుగుతుంది. దీనికి నిమ్మరసం కలిపి మరింత ఉపయోగంగా ఉంటుంది. బరువుని నియంత్రణలోఉంచడంతోపాటు శరీరంలోని మలినాల్ని బైటికి పంపడంలో నిమ్మరసం ముఖ్యమైన హోం రెమెడీ. విటమిన్ సీ సిట్రిక్ యాసిడ్, కాల్షియం , యాంటీ ఆక్సిడెంట్లతో సహా కొన్ని పోషకాల పవర్‌హౌస్ నిమ్మకాయ. జర్నల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ అండ్ బయోమెడికల్ అనాలిసిస్లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, నిమ్మ కాయల్లోని యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని నివారించేలా రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. చియా విత్తనాలలో ఫైబర్ ఉంటుంది ఫైబర్, విటమిన్ బీ కాల్షియం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్ , మెగ్నీషియం పుష్కలంగా ఉన్నాయి. ఈ రెండూ కలిపి తాగం వల్ల వెయిట్ లాస్ జర్నీ మరింత సులభం అవుతుంది. ఎలా తయారు చేసుకోవాలి ముందుగా ఒక గిన్నెలో ఒక టీస్పూన్ చియా సీడ్స్ నానబెట్టాలి. చియా సీడ్స్ చక్కగా ఉబ్బుతాయి.ఇందులో కొద్దిగా నిమ్మకాయ రసం, తేనె వేసి బాగా కలపాలి. కావాలంటే రుచికి పుదీనా ఆకులు కూడా వేసుకోవచ్చు. ఈ వాటర్‌ను 20 30 నిమిషాల తర్వాత మరోసారి హాయిగా తాగేయడమే. భారీ భోజనం తర్వాత లేదా ఉదయాన్నే కూడా త్రాగవచ్చు. సులభంగా జీర్ణం కావడానికి , వ్యర్థాలను తొలగించేందుకు దీన్ని మించిన డ్రింక్ లేదు. -
ఇవి తింటే! బీపీ, కొలెస్ట్రాల్, షుగర్‌కు చెక్! అందానికి అందం!
మనలో చాలా మందికి కూరలు ఎక్కువగా తినే అలవాటు ఉండదు. అలాగే కూరగాయలు తినడం ఆరోగ్యకరమైన అలవాటు అని తెలిసినా, పెద్దగా పట్టించుకోరు. కార్బోహైడ్రేట్లు లేకుండా, పోషకాలు ఎక్కువగా ఉండే కూరగాయలు రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. కూరగాయలు-ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. కూరగాయల్లో జీర్ణశక్తికి ఉపయోగపడే పీచులు అధికంగా ఉంటాయి. కూరగాయల్లో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. కాబట్టి చాలా జబ్బుల నుంచి మనల్ని కాపాడతాయి. విటమిన్-ఎ, ఇ, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్, ఫోలిక్ యాసిడ్ కూరల్లో ఎక్కువగా దొరుకు తాయి. ఇది బరువు తగ్గేందుకు, కొలెస్ట్రాల్ నియంత్రకు దోహదపడుతుంది. బీపీ, డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. ఆకుకూరలు, కూరగాయలు, దుంపకూరల్లాంటివన్నంటిని మన ఆహారంలో ఎక్కువగా చేర్చుకోవాలి. ముఖ్యంగా ఆకుకూరల్ని వారానికి మూడు సార్లయినా తినడం ఉత్తమం. ఈమధ్య కాలంలో మైక్రో గ్రీన్స్ వాడకం బాగా పెరిగింది. బీర,సొర, దొండ, బెండ, లేత చిక్కుళ్లు, గుమ్మడి కాయ కూరను కూడా తినాలి. క్యాలీఫ్లవర్, బ్రకోలీ లాంటివి మైక్రోవేవ్ ఓవెన్లో బేక్ చేసి ఉప్పు, మిరియాల పొడి చల్లుకొని, కాస్త ఎక్కువ పరిమాణంలోనైనా తినొచ్చు. ఇష్టమైన వాళ్లు కూరల్లో ఉల్లి, వెల్లుల్లి కలిపితే గుండెకు మంచిది. కడుపు నిండిన ఫీలింగ్ కూడా కలుగుతుంది. ఇన్ఫ్లమేషన్ : ఇన్ఫ్లమేషన్ను తగ్గించుకోవాలంటే కూరగాయలు ఉత్తమమైన ఆహారం. వీటిల్లో పుష్కలంగా ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ ఇన్ఫ్లమేషన్ను తగ్గించడంలో సహాయపడతాయి. రక్తపోటు అధిక బీపీతో బాధపడేవారు పోషకాలులభించే కూరగాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఎక్కువ పొటాషియం-రిచ్ ఫుడ్స్ తినడం వల్ల అధిక సోడియం బాడీలోకి చేరుతుంది. ఈ నష్టాన్ని తగ్గించుకోవాలంటే బచ్చలికూర వంటి కూరగాయలు పొటాషియం, ఇతర పోషకాలు లభించే కూరగాలు తీసుకోవాలి. వీటిల్లోని ఫైబర్ కూడా గుండెకుచాలామంది. ఫైబర్: 2020-2025 ఆహార మార్గదర్శకాల ప్రకారం, 2,000 క్యాలరీల ఆహారంలో రోజుకు 28 గ్రాముల ఫైబర్ కూడ అందదు. అందుకే తృణధాన్యాలు, పండ్లు, చిక్కుళ్ళు, గింజలు ఎక్కువగా తీసుకోవాలి. చిలగడదుంపలు , బఠానీల్లో ఆపిల్ కంటే ఎక్కువ ఫైబర్ ఉంటుంది. కళ్ళు: రోజంతా కంప్యూటర్స్ ఫోన్ వైపు చూస్తూ ఉంటే కంటి ఆరోగ్యంమీదప్రభావం పడు తుంది. కళ్ళను రక్షించు కోవాలనుకుంటే, ఎక్కువ కూరగాయలు తినడంతోపాటు మధ్య మధ్యలో స్క్రీన్ బ్రేక్‌లు తీసుకోవడం మంచింది. తులసి, క్యారెట్లు, మొక్కజొన్న, ఎర్ర మిరియాలు, బచ్చలికూర ,బ్రోకలీలో కంటినిరక్షించే కెరోటినాయిడ్లు దొరుకుతాయి. అలాగే లుటీన్ , జియాక్సంతిన్ అనేవి రెండు కెరోటినాయిడ్లు, వయస్సు-సంబంధిత మచ్చల క్షీణత (AMD) ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. చర్మం: చర్మ తేమగా ఉండాలంటే కూరగాయలు ఎక్కువగా తినాలి. టొమాటోల్లోని లైకోపీన్ చర్మాన్ని వడదెబ్బ నుండి రక్షించడంలో సహాయపడుతుంది అవకాడోలు ,నీటి కంటెంట్ ఎక్కువగా ఉండే దోసకాయలు ఆకుకూరలు లాంటివి చర్మంలోని తేమను, మృదుత్వాన్ని కాపాడతాయి. బ్లడ్ షుగర్ కూరగాయలలో కేలరీలు తక్కువ, ఫైబర్ , పోషకాలు ఎక్కువగా ఉంటాయి. పిండి పదార్థం ఎక్కువ గా ఉండే దుంప కూరలుమినహా మిగిలినవి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. అందుకే సహజసిద్ధంగా పండించిన కూరగాలు కేన్సర్ నివారణలో పనికొస్తాయి. బ్రస్సెల్స్ మొలకలు , కాలీఫ్లవర్ వంటి క్రూసిఫెరస్ కూరగాయల్లోని యాంటీఆక్సిడెంట్టు కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. పొటాషియం, ఫోలేట్, విటమిన్ సి , ఫైటోకెమికల్స్, అలాగే సల్ఫోరాఫేన్ (బ్రోకలీలో అత్యధికం)లో ఎక్కువగా ఉంటాయి. మెదడు మెదడును పదునుగా ఉంచుకోవాలనుకుంటే, ఆహారంలో కూరగాయలను చేర్చుకోవడం సరైన మార్గం. కూరగాయలు, ముఖ్యంగా ఆకుకూరలు, మైండ్ డైట్లో కీలకం, అల్జీమర్స్ వ్యాధి, మతిభ్రమణం ప్రమాదాన్ని తగ్గించడంలో ఇవి సాయపడతాయని పరిశోధకులు తేల్చారు. యాంటీఆక్సిడెంట్లు,ఫోలేట్ మీ మెదడుకు కీలకమైన పోషకాలు. -
Potato Peel ‘తొక్క’ లే అనుకుంటే పప్పులో కాలేసినట్టే!
#Potato Peel : చిన్నపుడు అమ్మమ్మ బీర కాయ పొట్టు పచ్చడి చేసి. ఇది ఏం పచ్చడో చెప్పండర్రా.. అంటూ పెద్ద పజిల్ వేయడం గుర్తుందా? నిజంగా అమోఘమైన ఆ రుచికి, అసలు అది ఏం పచ్చడో అర్థం కాక.. తీరా గుట్టు విప్పాక, ‘బీర్’ కాయా అంటూ నోరు వెళ్లబెట్టడం కూడా తెలుసు. అలాగే సొరకాయ తొక్కులు, పచ్చి అరటికాయ తొక్కల పచ్చడి, ఆఖరికి పుచ్చకాయల తొక్క లోపల ఉండే తెల్లటి పదార్థంతో కూడా దోసెలు చేసి పెట్టడం కూడా తెలుసు. ఇపుడు అలాంటి తొక్కలు మరొక దాని గురించే తెలిస్తే.. నిజంగా ఔరా అంటారు.. అదిఏమిటంటే.. చిన్న పిల్లలకు ఆలూ ఫ్రై చేసి పెడితే చాలు..మారు మాట్లాడకుండా లాగించేస్తారు. పెద్దలకి కూడీ ఆలూ లేదా బంగాళా దుంప అంత ఫ్యావరేట్. కానీ ఆలూ తొక్కల వాడకం, ప్రయోజనాల గురించి మాత్రం చాలామంది తెలియదు. బంగాళాదుంపల తొక్కల్లో పోషకాలు, ఖనిజాలు, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఈ తొక్కలను చర్మ, సౌందర్య సాధానాల్లో వినియోగిస్తారు. కాలిన గాయాలకు చికిత్స ఆలుగడ్డ తొక్కల్లో యాంటీ బాక్టీరియల్ ఏజెంట్ ఉంటుంది. ఇది చిన్నపాటి కాలిన గాయాలకు చికిత్సగా ఉపయోపడుతుంది. అంతేకాదు వేసవిలో ఎండలకు కమిలిని చర్మానికి సహజమైన చిట్కాగా పని చేస్తుంది. సిల్కీ స్కిన్ మొటిమలతో ఎక్కువగా బాధపడుతున్నవారు ఆలూ తొక్కలను అప్లై చేసుకోవచ్చు.మొటిమల్ని గిల్లకుండా, ఎక్కువ రుద్దకుండా వాటిపై తొక్కలతో మెల్లిగా రాయాలి. అలాగే కళ్లకిందే ఉండే డార్క్ సర్కిల్స్ నివారణలో కూడా ఫలితాలు అందిస్తుంది. కెమికల్స్ లేని సహజమైన ఈ తొక్కల రసాన్ని చర్మానికి అప్పై చేయవచ్చు. ఈ జ్యూస్‌తో సిల్కీగా, ఆరోగ్యకరమైన, మెరిసే చర్మాన్ని పొందవచ్చు. అందుకే వీటిని ఎప్పటినుంచో సౌందర్య సాధనాల్లో ఉపయోగిస్తున్నారు. ఐరన్ పాత్రల తుప్పు పట్టకుండా, స్టార్చ్ సహజమైన గ్రీజుగా పనిచేస్తుంది. అలా వంట ఇంటి చిట్కాగా పనిచేస్తుంది. ఆలూ తొక్కలు మొక్కలకు ఎంతో బలం మొక్కలకు కూడా ఇవి మంచి బాలన్నిస్తాయి. భాస్వరం, పొటాషియం, నత్రజని వంటి ముఖ్యమైన పోషకాలతో నిండిన ఈ తొక్కలు నేల నాణ్యతను మెరుగుపరుస్తాయి. మొక్కల ఎదుగుదల బాగా ఉంటుంది. ఆలూ తొక్కల పీల్ కంపోస్ట్ వేసిన వెంటనే గులాబీ, మల్లె లాంటి పూల మొక్కలు వెంటనే మొగ్గ తొడుగుతాయి. -
పైనాపిల్ మంచిదని తినేస్తున్నారా?
పైనాపిల్ అంటే అందరూ ఇష్టంగా తినరు. ఎందుకంటే అది తినంగానే నోటిలో ఏదో దురదగా అనిపిస్తుంది. కాస్త పులుపు, తీపి కలయికతో కూడిన ఒక విధమైన రుచితో ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ వంటి మూడు దేశాలు ప్రముఖంగా ఈ పండుని ఉత్పత్తి చేస్తాయి. దీన్ని సలాడ్లు, కాక్ టెయిల్ లేదా డిజార్ట్ల రూపంలో చాలామంది తీసుకంటుంటారు. అయితే ఈ పండుని తీసుకోవడం వల్ల చాలా రకాల వ్యాధులకు చెక్‌పెట్టడమే కాకుండా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీన్ని తీసుకోవడం ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అలానే అతిగా తింటే అంతే స్థాయిలో సమస్యలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. పైనాపిల్ తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో న్యూట్రిషన్ అండ్ మెటబాలిజం జర్నల్‌లో ప్రచురితమయ్యింది. ఇది అందించే ప్రయోజనాలను చూసి నిపుణులే ఆశ్చర్యపోయారు. పైగా బరువువ తగ్గాలనే వారికి ఈ పండు గొప్ప వరమని చెబుతున్నారు. అదేసయంలో దీన్ని అధికంగా తీసుకుంటే జరిగే పరిణామాలను కూడా సవివరంగా వెల్లడించారు. అవేంటంటే..? కలిగే ప్రయోజనాలు.. రక్తంలోని కొలెస్ట్రాల్‌ను ప్రభావితం చేసే ప్రత్యేక పోషకం బ్రోమెలైన్ ఉంది. ఇది కొలెస్ట్రాల్ ఫలకాలను విచ్ఛిన్నం చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. దీని కాండంలో ఉండే ప్రోటీన్ జీర్ణ ఎంజైమ్‌ని ప్రోత్సహించి చక్కగా జీర్ణమయ్యేలా చేస్తుంది. ప్రతిరోజూ పైనాపిల్ తింటే హైపర్ కొలెస్టెరోలేమియా స్థాయిలు, లిపోప్రోటీన్(ఎల్డీఎల్) వంటి చెడుకొలస్ట్రాల్లకు చెక్ పెడుతుంది. రోజు దీని ఆహారంగా తీసుకునేవారికి బరువు అదుపులో ఉన్నట్లు పరిశోధనల్లో వెల్లడయ్యింది. ఇందులో ఉండే ఫైబర్, పోటాషియం, విటమిన్ సీ కంటెంట్లు గుండె ఆరోగ్యానికి మంచివి రక్తపోటును అదుపులో ఉంచుతుంది. విటమిన్ సీ వంటి యాంటీఆక్సిడెంట్లు శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. కేన్సర్, ఆర్థరైటిస్, గుండె జబ్బుల వంటి వ్యాధుల బారిన పడకుండా నియంత్రిస్తుంది. అతిగా తీసుకుంటే తలెత్తే పరిణామాలు.. వికారం, విరేచలు లేదా గుండెల్లో మంట వంటి వాటికి దారితీస్తుంది ఇందులో ఉండే బ్రోమెలైన్ అధిక రక్తస్రావం లేదా చర్మంపై దద్దుర్లు వచ్చే అవకావం ఉంది. అలాగే రక్తం గడ్డకట్టాన్ని ప్రభావితం చేస్తుంది. పైనాపిల్ జ్యూస్‌గా తీసుకునేవారు పోటాషియం స్థాయిల విషయంలో జాగురకతతో ఉండాలి. ఎందుకంటే ఇది మూత్ర పిండాల సమస్య ఉన్నవారికి మరింత సమస్యత్మకంగా మారిపోతుంది. అదనంగా ఉండే పోటాషియంను బయటకు పంపడంలో మూత్రపిండాలు విఫలమై లేనిపోని సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. అలెర్జీ దద్దర్లు, కడుపు నొప్పి, వాంతులు, అతిసారం, ముఖం, నాలుకు, గొంతు నొప్పి, పెదవుల వాపు, శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది తదితర సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది శరీరంలో కొలస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ఎంత మంచిది మితంగా తీసుకోకపోతే అంత ప్రమాదం. అందువల్ల వాటిని మీ రోజూవారి ఆహారంలో ఎంతమేర తినడం బెటర్ అనేది న్యూట్రిషియన్లు లేదా వైద్యులను సంప్రదించి తీసుకోవడం ఉత్తమం. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ కథనం ఇవ్వడం జరిగింది. మీ ఆహారంలో భాగం చేసుకోవాలనుకుంటే మాత్రం నిపుణులు లేదా ప్రముఖ డైటీషియన్లను సంప్రదించి తీసుకోవడం మంచిది. (చదవండి: అట్లాంటిక్ డైట్‌తో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు!) -
Oyster Mushrooms: బెనిఫిట్స్ తెలిస్తే.. అస్సలు వదలరు!
పుట్టగొడుగులు చాలా రకాలున్నాయి. ఒక్కో పుట్టగొడుగు ఒక్కో రుచి, ఆకృతిలో ఉంటాయి. అయతే బటన్ మష్రూమ్స్‌తో ఓస్టెర్ మష్రూమ్ ఎక్కువ రుచిగా ఉంటాయివీటిల్లోని గ్లుటామిక్ యాసిడ్ భిన్నమైన రుచిని అందిస్తుంది. సాధారణ బటన్ పుట్టగొడుగుల కంటే ఓస్టెర్ పుట్ట గొడుగుల్లో దాదాపు రెండు రెట్లు ఎక్కువ గ్లుటామిక్ యాసిడ్ ఉంటుంది. పుట్ట గొడుగులు శాకాహారమే అయినప్పటికీ ఖనిజాలు,ఫైబర్, విటమిన్లు ఇతర ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే నాన్‌వేజ్ తినని వారికి విటమిన్లు పూర్తిగా అందడంతోపాటు, సెలీనియంతో పాటు ఎముకలు దృఢంగా ఉండేందుకు అవసరమైన అన్ని ఎలిమెంట్స్ , ఉన్నాయంటున్నారు పోషకాహార నిపుణులు. ముఖ్యంగా ఓస్టెర్ పుట్టగొడుగులు గ్లూటెన్-ఫ్రీ డైట్‌కు అద్భుతం పని చేస్తాయని, తక్కువ కేలరీలు, ఎక్కువ పోషకాలతో బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడతాయి. యాంటీవైరల్, ఇమ్యునోమోడ్యులేటింగ్, యాంటీఆక్సిడెంట్,యాంటీ హైపర్ కొలెస్టెరోలేమియా, యాంటీ-డయాబెటిక్ గుణాలున్నాయని చాలా మంది నిపుణులు నమ్ముతారు. రుచితో పాటు పోషకాలు మెండుగా ఉన్న ఓస్టెర్ పుట్టగొడుగుల వల్ల ప్రయోజనాలు మరికొన్నింటిని చూద్దాం. ఓస్టెర్ పుట్టగొడుగులు: లాభాలు ♦ ఆస్టియోపోరోసిస్ , ఆర్థరైటిస్‌ను నివారిస్తుంది ♦ విటమిన్ డి లెవల్స్ పెరగాలంటేపుట్టగొడుగులు తినాలి. ♦ సుగర్, బీపీ,చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది ♦ రక్తహీనతనుంచి కాపాడుతుంది. ♦ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ♦ పుట్టగొడుగులను తింటే ఎముకలు దృఢంగా మారతాయి. ♦ కేన్సర్ఉంచి రక్షిస్తుంది. ♦ తక్కువ కేలరీలు పుట్టగొడుగులు బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి ♦ నరాల ఆరోగ్యానికి మంచిది: ♦ మానసిక ఆరోగ్యాన్ని కాపాడే డోపమైన్ , సెరోటోనిన్‌ను పుట్టగొడుగులలోని కాపర్ కంటెంట్ మనకు అందిస్తుంది. ♦ ఈ పుట్టగొడుగుల్లో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇంకా ఇందులోని B గ్రూప్ విటమిన్, నిద్ర, జ్ఞాపకశక్తికి చాలా మంచిది. నోట్: పుట్టగొడుగులను తినేముందు అవి మంచివా? కాదా? అని పరిశీలించుకోవాలి. అలాగే పుట్టగొడుగు నాణ్యతను కూడా తప్పకుండా తెలుసుకోవాలి. లేదంటే ప్రమాదం. -
మెంతులు..ఇంతులు అంటూ తెగ తినేస్తున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి!
మన వంటింట్లో దొరికే మెంతులతో చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కేవలం సుగంధ ద్రవ్యంగా మాత్రమే కాదు. అతివలకు మెంతుల వల్ల జరిగే మేలు అంతా ఇంతా కాదు. మధుమేహం సహా అనేక అనారోగ్య సమస్యలకు అవి ఔషధంలా పనిచేస్తాయి. తినడానికి చిరు చేదుగా అనిపించినా మెంతులు వల్ల కలిగే కలిగే ఆరోగ్య ప్రయోజనాల రీత్యా మన ఆహారంలో ఒక భాగంగా చేసుకుంటారు. అందుకే పోపు గింజల్లో మెంతులును ప్రధానంగా చేర్చారు మన పెద్ద వాళ్లు. పౌడర్లు, క్యాప్సూల్స్ , నూనెలతో సహా వివిధ రూపాల్లో లభిస్తున్న ఈ మెంతులు పురుషులు,స్త్రీలలో ఇతర వైద్య పరిస్థితులకు కూడా సహాయపడతాయని నమ్ముతారు. మెంతులను వివిధ రూపాల్లో తీసుకోవడం ద్వారా వివిధ రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. మరి మెంతులలో దాగి ఉన్న ఆ ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందామా..? ప్రయోజనాలు ⇒ మెంతులు (ట్రైగోనెల్లా ఫోనమ్-గ్రేకమ్) అనేది బఠానీ కుటుంబానికి (ఫాబేసి) చెందిన సుగంధ ద్రవ్యం. ⇒ గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది ⇒ జుట్టు పెరుగుదలకు మంచిది ⇒ బ్లడ్ కొలెస్ట్రాల్‌ను, అధిక రక్తపోటును అదుపులో ఉంచుకుంది. ⇒ జ్వరం, అలెర్జీల , గాయాల చికిత్సలో మెంతులు మన రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్దీకరించడంలో బాగా పనిచేస్తాయి. అదేవిధంగా అజీర్తి, కడుపుబ్బరాన్ని కూడా తగ్గిస్తాయి. కాబట్టి మధుమేహం ఉన్నవాళ్లు నిత్యం మెంతులు తీసుకోవడం అలవాటుగా చేసుకోవాలంటారు నిపుణులు. మెంతుల్లో ఉండే ఫైబర్ కడుపు నిండిన భావన కలిగిస్తుంది.అంటే ఒంట్లో కొవ్వు కరుగుతుంది. రాత్రిపూట ఒక చెంచా మెంతి గింజలను నీళ్లలో నానబెట్టి ఉదయం లేవగానే పరగడుపున ఆ నీళ్లను తాగాలి. ఇలా చేయడంవల్ల అజీర్తి సమస్య తగ్గుతుంది. జీర్ణ శక్తి మెరుగు పడుతుంది. అదేవిధంగా విరేచనాలు తగ్గడానికి కూడా మెంతులు ఉపయోగపడుతాయి. మెంతి టీ ద్వారా బ్లడ్ లో షుగర్ అదుపులో ఉంటుంది. చిటపట శబ్దం వచ్చేదాకా మెంతులను వేయించి మెత్తగా పౌడర్లా చేసుకుని , రోజూ ఉదయాన్నే ఆ పొడిని వేడి నీటిలో కలుపుకుని తాగితే ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మెంతులు-ఇంతులు మహిళలు సౌందర్య పోషణలో కూడా మెంతులకు విరివిగా వాడవచ్చు బాగా మెత్తగా దంచిన మెంతిపౌడర్లో కొద్దిగా తేనె కలిపిన మిశ్రమంతో ముఖాన్ని సున్నితంగా స్క్రబ్ చేసుకోవాలి. ఎండిన తరువాత నీటితో చక్కగా కడిగేసుకుంటే.. చర్మం భలే స్మూత్‌గా ఉంటుంది. మెంతులలో ఉండే లెసిథిన్ కనుబొమ్మలే ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. నాన పెట్టిన గుప్పెడు మెంతులను మెత్తని ముద్దగా నూరుకోవాలి. దీన్ని కనుబొమ్మలకు రాసుకుని 20-25 నిమిషాల తరువాత తడి గుడ్డతో చాలా సున్నితంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా వారానికి మూడు- నాలుగు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. పీరియడ్స్ సమయంలో వచ్చే కండరాల నొప్పులకు మెంతులు దివ్యౌషధం అని చెప్పవచ్చు.ఐరన్ లోపాన్ని కూడా ఈ మెంతులు తగ్గిస్తాయి. కఫం,దగ్గు, ఆస్తమా లాంటి సమస్యలకు మెంతు మంచి ఉపశమనం కలిగిస్తాయి. సైడ్ ఎఫెక్ట్స్ పాలిచ్చే తల్లులకు పాలు పడటం కోసం మెండి పౌడర్‌ను ఎక్కువగా వాడతారు. దీని వల్ల పిల్లలకు ఎటువంటి హాని జరగనప్పటికీ, మెంతి సప్లిమెంట్లను తీసుకునే ముందు వైర్భిణీలేదా పాలిచ్చే స్త్రీలు వైద్యులు సలహా మేరకు తీసుకోవాలి. గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా మెంతి సప్లిమెంట్లు లేదా మందులకు దూరంగా ఉండాలంటున్నారు కొంతమంది నిపుణులు. ఎందుకంటే గర్భాశయ సంకోచాలు పెరిగి అవి శిశువుపై ప్రతికూల ప్రభావాలను కలిగి ఉంటాయి, ఒక్కోసారి గర్భస్రావం జరిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు. డెలివరీకి కొద్దిసేపటికి ముందు మెంతులు తీసుకోవడం వల్ల శిశువుల మూత్రం, శరీరంనుండి అసాధారణమైన వాసన వస్తుంది. ఈ వాసన ప్రమాదకరం కానప్పటికీ, మాపుల్ సిరప్ యూరిన్ డిసీజ్ అని పిలిచే జన్యుపరమైన పరిస్థితి వస్తుందంటారు. మెంతులు శరీరంపై ఈస్ట్రోజెన్ లాంటి ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఈ నేపథ్యంలో కొన్ని రకాల రొమ్ము క్యాన్సర్లలో ఈస్ట్రోజెన్-ఆధారిత కణితులను ఇది మరింత ప్రేరేపిస్తుందట. కనుక మెంతి సప్లిమెంట్లను ఉపయోగించాలనుకుంటే వైద్యులను సంప్రదించాలి. మరికొన్ని ⇒ అతిసారం ⇒ అజీర్ణం ⇒ కడుపు ఉబ్బరం ⇒ వికారం ⇒ తలనొప్పి ⇒ తలతిరగడం -
అల్లంతో ఇలా చేస్తే పొడవైన జుట్టు మీ సొంతం!
ఆయుర్వేద పరంగా అల్లం ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలిసిందే. ముఖ్యంగా జలుబు, దగ్గు, కఫం వంటి సమస్యలకు ఈ అల్లం సులభంగా చెక్‌పెడుతుంది. అలాంటి అల్లం జుట్టు సంరక్షణకు ఉపయోగపడుతుందా? అని ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదా!. అందులోనూ అల్లం ఘాటు ఓ రేంజ్లో ఉంటుంది. దాన్ని జుట్టుకి అప్లై చేస్తే వేడి చేస్తుంది కదా!. మరీ అలాంటి అల్లం ఎలా జట్టు పోషణకు ఉపపయోగపడుతుంది అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే నిపుణులు మాత్రం అల్లం కురులను స్ట్రాంగ్‌గా చేసి జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుందని చెబుతున్నారు. ఇదేలా శిరోజాలకు పనిచేస్తుంది ఎలా జుట్టుకి అప్లై చేయాలి తదితరాల గురించి తెలుసుకుందాం! అల్లంలో జింక్, మెగ్నీషియం ఉంటాయి. అందువల్ల ఈ అల్లం రసాన్ని జుట్టు అప్లై చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు బలంగా మారుతుంది. ఇందులోని యాంటీ ఫంగల్ గుణాల వల్ల జుట్టు బలంగా మారుతుంది. ఎలా తలకు అప్లై చేయాలంటే.. ఇందుకోసం ముందుగా ఆలివ్ నూనె తీసుకుని అందులో అల్లం రసం కలపండి. దీనిని జుట్టుకి అప్లై చేసి రాత్రంతా అలానే ఉంచి ఉదయాన్నే జుట్టుని క్లీన్ చేయాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తుంటే జుట్టు మెరుస్తుంది. పొడి జుట్టుకి అల్లం రసాన్ని అప్లై చేసి గంటపాటు అలానే ఉంచి, ఆ తర్వాత షాంపూ, కండీషనర్‌తో క్లీన్ చేసుకోవాలి. అల్లం రసాన్ని జుట్టుకి వాడడం వల్ల హెల్దీగా ఉండే పొడవైన జుట్టు మీ సొంతం అవుతుంది. అంతేగాదు దీని వల్ల జుట్టుకి మరిన్ని లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. పైగా ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చుండ్రు సమస్యను తగ్గస్తుంది. కాబట్టి, జుట్టుకి అల్లాన్ని రెగ్యులర్‌గా అప్లై చేయండి. అలాగే తలపై దురద , చిన్న చిన్న పొక్కులు వంటి సమస్యలకు చెక్ పెడుతుంది కూడా. ముఖ్యంగా ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పొక్కులని దూరం చేస్తాయి. గమనిక: నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. అందం, ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు. (చదవండి: మసాలా దినుసుల ఘాటు పోకూడదంటే..ఇలా స్టోర్ చేయండి!) -
ఈ పప్పు ప్రయోజనాలు తెలిస్తే.. అస్సలు మిస్ కారు!
దక్షిణ భారతంలో మినపప్పు (బ్లాక్ గ్రామ్) లేదా ఉరద్ దాల్ గురించి తెలియని వారుండరు. ప్రముఖ అల్పాహారాలు, ఇడ్లీలు, దోసెలు, వడలు లాంటి తయారీలో ఈ గింజ ధాన్యం కీలక మైంది. అంతేకాదు వంటగదిలో ఇదిలేకుండా పోపుల పెట్టె సంపూర్ణమే కాదు. అలాగే జబ్బు పడిన వారు త్వరగా కోలుకోవాలంటే మినపగారెలు, సున్నుండలు పెట్టడం బాగా అలవాటు. ఇందులోని ఐరన్ కంటెంట్ శరీరానికి త్వరగా శక్తిని ఇస్తుందని ఆహార నిపుణులు చెబుతారు. ఇందులో రుచితోపాటు బోలెడన్ని ఆరోగ్య ప్రయజనాలు కూడా ఉంటాయి. ప్రోటీన్లు మెండుగా ఈ పప్పులో విటమిన్ బీ కూడా పుష్కలంగా ఉంటుంది. ఆయుర్వేదలో మాషా అని పిలుస్తారు. ఆయుర్వేదంలో ఆర్థరైటిస్, ఆస్తమా, పక్షవాతం లాంటి జబ్బుల నివారణలో వాడతారట. అలాగే మినపప్పు తీసుకోవడం వల్ల తల నొప్పి, జ్వరం, ఇంఫ్లమేషన్ వంటి సమస్యలనుంచి దూరం కావచ్చట. సౌందర్య పోషణలో మహిళల సౌందర్యపోషణలో కూడా దీని ప్రయోజనాలు తక్కువేమీ కాదు. మినరల్స్ , విటమిన్లు పుష్కలంగా ఉన్న మినపప్పు సన్ టాన్స్ ను వదలగొడుతుంది. ఆరోగ్యవంతమైన, సూపర్ మెరిసే జుట్టును పెరుగుదలకు తోడ్పడుతుంది. మొటిమల సమస్యతో బాధపడేవారు మినపప్పుని కొద్దిగా పాలల్లో వేసి మెత్తగా నూరి, ఈ మిశ్రమానికి కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి ముఖానికి అప్లై చేసుకుని, ఆ తర్వాత చల్లని నీళ్లతో కడిగేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అంతేకాదు పురుషుల లైంగిక సమస్యలను తొలగించడంలో బాగా సహాయపడుతుందట. మినపప్పు - లాభాలు ►ఫైబర్, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, ఫాస్పరస్ , కాల్షియం అధికంగా ఉన్నాయి. దీనిని తరచుగా తీసుకుంటే ఎముకలకు సంబంధించిన సమస్యలను దూరం చేసుకోవచ్చు. ►పేగు ఆరోగ్యాన్ని (గట్ హెల్త్) మెరుగుపరుస్తుంది: ►బాడీలోని ఐరన్ లెవల్స్‌పెరిగేందుకు తోడ్పడుతుంది ►గుండెను హెల్దీగా, దృడంగా ఉంచేలా చేస్తుంది. ►నాడీ వ్యవస్థను బలపరుస్తుంది, నాడీ బలహీనత, పాక్షక పక్షవాతం, ముఖ పక్షవాతం ,ఇతర రుగ్మతల నివారణకు వివిధ ఆయుర్వేద ఔషధాలలో ఉపయోగిస్తారు. ►మినపప్పు గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తుంది.. సో మధుమేహం ఉన్నవారికి కూడా మంచిదే ►వెయిట్ లాస్లో మినప పప్పు ఉపయోగపడుతుంది, ఎముకలను దృఢంగా ఉంచుతుంది. ►కిడ్నీలను కాపాడటంలో కూడా మినపప్పు ఉపయోగపడుతుంది. -
సోనియా గాంధీ మెచ్చిన 'పప్పు అన్నం'! ఎన్ని ప్రయోజనాలో తెలుసా!
ఇటీవల కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మార్మలాడే(ప్రిజర్వ్డ్ ఫ్రూట్ జామ్) అనే రెసిపీ ప్రీపరేషన్కి సంబంధించిన వీడియోని షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఆ వీడియోలో రాహుల్, ఆయన తల్లి సోనియగాంధీ ఆ రెసిపీని ప్రిపేర్ చేస్తూ ఇక్కడ భారతీయ వంటకాల గురించి మాట్లాడారు. ముఖ్యంగా ఇక్కడ వంటకాల్లో కారానికి అలవాటు పడటానికి తాను ఎలా ఇబ్బంది పడ్డానో వివరించారు. భారతీయ వంటకాల్లో తనకు నచ్చేది 'పప్పు అన్నం' అని ముఖ్యంగా విదేశాలకు వెళ్లి భారత్‌కి రాగనే వెంటనే ఈ వంటకాన్నే తింటానని, అదంటే తనకెంతో ఇష్టమని చెప్పుకొచ్చారు. మన భారతీయులకు పండగలకు, లేదా ఏ సెలబ్రెషన్లో అయినా తప్పనిసరిగా ఉండాల్సింది ఈ దాల్ రైసే. దీని వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా!.. అవేంటంటే.. ఇది చాలా సింపుల్ వంటకం. బియ్యం, కాయధాన్యాల కలియక తో కూడిన పప్పు అన్నం ఆరోగ్యాన్ని ఎంతో మంచిది. శాకాహారులు ఎక్కువగా చేసే వంటకం కూడా ఇదే. ఆరోగ్య ప్రయోజనాలు.. ప్రోటీన్ మూలం.. ఈ ఆహారంలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. పప్పులో ఉండే అమైనో ఆమ్లాలు, బియ్యంలోని కార్బోహైడ్రేట్లతో కూడిన ఆహారం.. కండరాల నిర్వహణకు, పెరుగుదలకు అవసరమైన అన్ని ప్రోటీన్లు సమకూరుస్తుంది. ఫైబర్.. అలాగే కాయాధాన్యాల్లో ఫైబర్ జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. సమతుల్య గట్ మైక్రోబయోమ్‌ను నిర్వహిస్తుంది. ఈ ఫైబర్ కంటెంట్ నిండుగా ఉన్న అనుభూతిని కలిగించి బరువుని అదుపులో ఉంచేలా చేస్తుంది. తక్షణ శక్తి.. బియ్యంలో ఉండే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు స్థిరమైన శక్తిని విడుదల చేస్తాయి. రోజంత శరీరంలో శక్తి స్థాయిలను నిలబెట్టుకోవడానికి పప్పు అన్నం ఒక ఎంపిక. చురుకైన జీవన శైలి లేదా శారీరక కార్యకలాపాలలో నిమగ్నమైన వ్యక్తులకు ఇది మంచి పౌష్టిక ఆహారం. సామాన్యుడికి సైతం .. సామాన్య మానవుడికి సైతం అందుబాటులో ఉండే మంచి ప్రోటీన్లు, ఫైబర్‌తో కూడిన ఆహారం. ఇంట్లో కనీసం కాయగూరలు లేనప్పుడూ దానితో చేసే వివిధ వంటకాలతో కావాల్సినన్ని పోషకాలు పొందగలుగుతారు. పోషకాల నిలయం.. పప్పులో ఐరన్, ఫోలేట్, పొటాషియం తదితర పోషకాలు అందించగా, బియ్యంలో ఉండే 'బీ' విటమిన్లు మాంగనీస్‌ను అందిస్తుంది. ఈ పోషకాలు రక్తం ఏర్పడటానికి, రోగనిరోధక వ్యవస్థకు, ఎముకల ఆరోగ్యం తోపాటు వివిధ శారీరక విధులకు మద్దతు ఇస్తుంది. కంఫర్ట్ ఫుడ్ అందరూ సులభంగా వండుకునే వంటకం, పైగా భారతీయుల ఇంటిలో తప్పనసరిగా ఉండే వంటకం కూడా ఇదే. ఒకరకంగా ఈ వంటకాన్ని తమ వారసత్వ వంటకంగా చెబుతారు. సామాన్యుడికి విలువైన పోషకాలతో కూడిన ఆహార అవసరాన్ని తీర్చే వంటకం ఇదే. ఆరోగ్యకరమైనది, అందరికీ అందుబాటులో ఉండే సౌకర్యవంతమైన రెసిపీగా పేర్కొనవచ్చు. (చదవండి: ప్రపంచంలోనే అత్యంత వరస్ట్ కర్రీగా చోటు దక్కించుకున్న భారతీయ వంటకం ఏంటంటే..?) -
గుడిలో తీర్థం, ప్రసాదాలు ఎందుకు ఇస్తారో తెలుసా? కారణమిదే!
ధనుర్మాసంలో చేసే పూజలకు తగ్గట్టుగానే తులసీతీర్థం, చక్కెర పొంగళి, కట్టె పొంగలి, దద్దోజనం, పులిహోర తదితర పోషక విలువలుండే ప్రసాదాలను ఆరగిస్తారు. అలంకార ప్రియుడైన శ్రీమహావిష్ణువును ఆరాధించడంలో స్వామివారికి ఇష్టమైన ప్రసాదాలను అర్పించడం ఎంతటి పుణ్యఫలమో, అంతటి ఆరోగ్యబలం కూడా. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్దేశించి ఈ ధనుర్మాసంలో అందిస్తున్న ప్రసాదాలు ఎన్నెన్నో పోషక విలువలతో ముడిపడి ఉండటం విశేషం. తీర్థం.. ప్రసాదంగా మనం స్వామివారికి సమర్పించి స్వీకరించే వీటిలో ప్రతి పదార్థానికి చక్కటి ఔషధగుణాలున్నాయి. తులసి తీర్థంతో మానసిక బలం ఆలయాల్లో దేవుడ్ని దర్శించుకున్న తర్వాత అర్చకుడు ఇచ్చే తీర్థమే తులసీతీర్థం. దీనినే భక్తులు తొలి ప్రసాదంగా భావిస్తారు. తులసి పత్రాలు, కర్పూరం.. యాలిక బీజాలను కలిపి తీర్థంగా ఇస్తుంటారు. ఇది మానసిక ఉద్వేగాలను అదుపులో ఉంచుతుంది. దగ్గు, ఆస్థమా, చర్మవ్యాధులు తీర్థ సేవనంతో నయమవుతాయయి. కడుపులో క్రిముల నివారణవుతాయి. కడుపు ఉబ్బరం తగ్గుతుంది. ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం కలుగుతుంది. మానసిక వేదన నుంచి ఉపశమనం లభిస్తుంది. పరమాన్నం.. పరమ ఔషధం.. పాలు, బియ్యంలో బెల్లం లేదా పంచదార వేసి చేసేదే పరమాన్నం. ఇందులో బాదంపప్పు, యాలకులు, పచ్చికొబ్బరి వేస్తారు. దేహానికి బలం, చక్కని కాంతిని ఇస్తుంది. ఆలోచన శక్తిని పెంచుతుంది. వాత, పైత్యాలను తగ్గిస్తుంది. ప్రతి 100 గ్రాముల బియ్యంలో 78 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 8.5 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. 100 గ్రాముల బెల్లంలో 11.4 మిల్లీ గ్రాముల కేలరీలు, ఇనుము ఉన్నాయి దీనికి పుష్టిని ఇచ్చే గుణం ఉంది. వాత రోగాలు నివారణవుతాయి. బాదంలో బలాన్ని చేకూర్చే గుణం ఉంది. ఉత్సాహం పెరగడంతో పాటు నరాల బలహీనత, రక్తపోటును తగ్గుతుంది. జ్వరాలు రాకుండా దద్దోజనం తాళింపు పెట్టిన పెరుగన్నమే దద్దోజనం, ఆవు పాలను మరగకాచి చల్లార్చి తోడుపెట్టిన పెరుగులో మిరియాలు, ఇంగువ, శొంఠి మొదలైన వాటిని అన్నంలో కలుపుతారు. దానిని ఆవునెయ్యితో పోపుపెడతారు. ధనుర్మాసంలోని రెండోపక్షంలో దీనిని ప్రసాదంగా నివేదిస్తారు మంచు, చలి ఎక్కువగా ఉండే ఈ సమయంలో దద్దోజనం తీసుకోవటం వల్ల జలుబు, విష జ్వరాలు, శీతల జ్వరం రాకుండా నిరోధిస్తుంది. అరుగుదలకు పులిహోర.. బియ్యంతో అన్నం వండిన తర్వాత దానికి పసుపు, నూనె, ఆవాలు, ఉప్పు, కరివేపాకు, శెనగపప్పు తదితరాలని కలిపి చేస్తారు. దీనివల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. ఆకలి పెరుగుతుంది. కాలేయానికి మంచిది. జలుబు, తుమ్ములు, ఉబ్బసం, దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది. కట్టె పొంగలితో కీళ్లజబ్బులు నయం ధనుర్మాసంలో చలి, మంచు ఎక్కువగా ఉంటాయి. కట్టె పొంగలిని తినడం వల్ల జీర్ణశక్తి మెరుగ్గా ఉంటుంది. కీళ్ల జబ్బులు తగ్గుతాయి. దగ్గు, జలుబు రాకుండా చేస్తుంది. చక్కటి ఔషధం చక్కెర పొంగలి బియ్యం, పెసరపప్పు సమానంగా పోసి ఆవునేతితో ఉడికించి అందులో పంచదార, ద్రాక్ష, పచ్చకర్పూరం, కుంకుమపువ్వు, యాలకులు వంటి సుగంధ ద్రవ్యాలు వేసి చేసే చక్కెర పొంగలిని సేవించడం వల్ల దేహపుష్టి కలుగుతుంది. ఇది జ్ఞాపకశక్తిని పెంచుతుంది. శూల (నొప్పి)ని, జ్వరాన్ని హరిస్తుంది. పచ్చకర్పూరం వల్ల ఆహారం తేలిగ్గా జీర్ణమవుతుంది. కఫాన్ని, శరీరంలోని మంటల్ని నిరోధిస్తుంది. -
రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్నెస్ సీక్రెట్, పొద్దున్నే ఇది తాగుతుందట
కాఫీ అంటే తెలియని వారు ఉండరేమో. చాలామందికి పొద్దున్నే కాఫీ తాగనిదే రోజు గడవదు. బెడ్ మీద నుంచి లేవడంతోనే కాఫీతో డే స్టార్ట్ చేస్తారు. కాఫీ తాగడం మంచిదే కానీ, కొందరు అదే పనిగా రోజుకు 4-5సార్లు కాఫీని ఎనర్జీ డ్రింక్‌లా తాగేస్తుంటారు. అయితే ఇదంత మంచిది కాదని వైద్యులు సూచిస్తుంటారు. కాఫీలో కోల్డ్ కాఫీ, ఫిల్టర్ కాఫీ, బ్లాక్ కాఫీ.. ఇలా చాలా రకాలున్నా నెయ్యి కాఫీ అన్నింటికంటే ది బెస్ట్ అంటున్నారు. అందుకే ఎంతోమంది సెలబ్రిటీల రొటీన్లో నెయ్యి కాఫీ ముందుంటుంది. నెయ్యి కాఫీ(Ghee Coffee)వినడానికి కాంత కొత్తగా అనిపించినా ఇప్పుడు సెలబ్రిటీలు ఫాలో అవుతున్న ట్రెండ్ ఇదే. నెయ్యి కాఫీ తాగడానికి రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి, చర్మ సౌందర్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అందుకే ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయ్యింది. ప్రముఖ సెలబ్రిటీలు రకుల్ ప్రీత్ సింగ్, భూమి ఫడ్నేకర్ ఇప్పటికే చాలాసార్లు సోషల్ మీడియాలో తమ డే రొటీన్లో నెయ్యి కాఫీ గురించి నెటిజన్లతో పంచుకున్నారు. ఇంతకీ నెయ్యి కాఫీ అంటే ఏంటి? దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటన్నది చూద్దాం. నెయ్యి కాఫీ జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. అసిడిటీని దూరం చేయడంలో తోడ్పడుతుంది. నెయ్యిలో విటమిన్-ఇ, ఎ,కె లు పుష్కలంగా ఉంటాయి. ఇది ఆకలిని తగ్గిస్తుంది. దీనివల్ల బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. మొండి కొవ్వులను కరిగించడంలో నెయ్యి కాఫీ సహాయపడుతుంది. నెయ్యిలో ఒమేగా 3, 6, 9 వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. పరిగడుపున టీ స్పూన్ నెయ్యిని కాఫీలో కలుపుకుని తాగితే గట్ ఆరోగ్యం మెరుగుపడుతుంది. నెయ్యిలోని యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చర్మ సమస్యలను తగ్గిస్తుంది. రకుల్ ప్రీత్ సింగ్ ఫేవరెట్ రెసిపి నెయ్యి కాఫీతోనే తన రోజు మొదలవుతుందని ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. మంచి కొవ్వుతో పాటు చర్మ ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుందని పేర్కొంది. మరి రకుల్ ప్రీత్ సింగ్ ఈ కాఫీని ఎలా తయారు చేసుకుంటుంది? ఏమేం వాడుతుందంటే... ►ముందుగా గ్లాస్లో ఒక స్పూన్ దేశీ నెయ్యి వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్‌కి పైగా కాఫీ పౌడర్, కొలాజిన్‌ను జత చేసుకోవాలి. ఇందులో వేడి నీళ్లు పోసి బాగా కలపాలి. అంతే చిటికెలో నెయ్యి కాఫీ రెడీ అయినట్లే ► ఒకవేళ మీరు చక్కెర వేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన ఏదైనా స్వీటెనర్ వేసుకోవచ్చు. లేదా 2-3 యాలకులు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమానికి కాసిన్ని పాలు కూడా జత చేసుకోవచ్చు. బరువు త్వరగా తగ్గాలనుకునేవారు పాలకు బదులుగా కేవలం వేడినీళ్లు వేసుకోవాలి. అంతే ఇలా ప్రతిరోజూ పరగడుపున నెయ్యి కాఫీ తాగడం వల్ల నెలరోజుల్లోనే రిజల్ట్ కనిపిస్తుంది. View this post on Instagram A post shared by jhaji kitchen (@jhajikitchen13) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) -
ఎల్ఐసీ నుంచి క్రెడిట్ కార్డు.. భలే బెనిఫిట్స్!
ప్రస్తుతం క్రెడిట్ కార్డుల వినియోగం పెరిగింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులతోపాటు ఇతర ఫైనాన్స్ సంస్థలు సైతం క్రెడిట్ కార్డులను అందిస్తున్నాయి. ఇదే క్రమంలో ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) కూడా క్రెడిట్ కార్డులను తీసుకొచ్చింది. దీనిపై ప్రమాద బీమాతో పాటు ఆకర్షణీయమైన ప్రయోజనాలను ఎన్నింటినో అందిస్తోంది. ఎల్ఐసీ, ఐడీఎఫ్సీ బ్యాంక్, మాస్టర్ కార్డులు కలిసి సంయుక్తంగా ఈ క్రెడిట్ కార్డులను ప్రారంభించాయి. ఎల్ఐసీ క్లాసిక్, ఎల్ఐసీ సెలక్ట్ పేరుతో రెండు క్రెడిట్ కార్డులు లాంచ్ అయ్యాయి. ఈ క్రెడిట్ కార్డుల ద్వారా యూజర్లకు ఎన్నో ప్రయోజనాలు లభించనున్నాయి. వీటి ద్వారా బీమా ప్రీమియం చెల్లిచిందనందుకు రివార్డ్ పాయింట్లను పొందవచ్చు. రూ. 5 లక్షల ప్రమాద బీమా ఉచితంగా లభిస్తుంది. వార్షిక ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. వడ్డీ కూడా ఎల్ఐసీ తక్కువగానే వసూలు చేస్తోంది. బెనిఫిట్స్‌లో కొన్ని.. ఎల్ఐసీ క్లాసిక్ క్రెడిట్ కార్డుకు ఎలాంటి జాయినింగ్ ఫీజు, వార్షిక ఫీజు ఉండవు. 48 రోజుల వరకు అన్ని ఏటీఎంలలో క్యాష్ విత్‌డ్రాయల్‌పై ఎలాంటి ఛార్జీలు ఉండవు. ఈ క్రెడిట్ కార్డుతో తొలి ఈఎమ్ఐపైన 5 శాతం క్యాష్‌బ్యాక్. రూ. 399 విలువైన 6 నెలల ఫార్మ్ఈజీ ప్లస్ మెంబర్ షిప్. ట్రావెల్లో డొమెస్టిక్ ఫైట్లను బుక్ చేసుకుంటే రూ. 500 డిస్కౌంట్. లెన్స్‌కార్ట్ గోల్డ్ సభ్యత్వం ఉచితంగా పొందొచ్చు. భారతదేశంలోని అన్ని ఇంధన స్టేషన్స్‌లో ప్రతి నెల రూ. 300 ఇంధన సర్‌ఛార్జ్‌పై 1 శాతం రాయితీ. ఎల్ఐసీ క్లాసిక్ క్రెడిట్ కార్డుపై రూ.2 లక్షల ప్రమాద బీమా ఎల్ఐసీ సెలక్ట్ క్రెడిట్ కార్డుకు కూడా ప్రవేశ, వార్షిక ఛార్జీలు లేవు. ప్రతి మూడు నెలలకు రెండుసార్లు కాంప్లమెంటరీ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్. ఎల్ఐసీ సెలక్ట్ క్రెడిట్ కార్డుపై రూ. 5 లక్షల ప్రమాద బీమా. -
చపాతీలు మిగిలిపోతే పడేస్తున్నారా?.. అయ్యయ్యో వద్దమ్మా!
ఇంట్లో చపాతీలు మిగిలిపోతే పారేస్తున్నారా?. ఐతే ఇక నుంచి పడేయొద్దు. అవే దివ్య ఔషధం అని బోలెడన్ని ఆరోగ్యా ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా డయాబెటిస్ రోగులకు మంచిదని చెబుతున్నారు. చాలామంది నిల్వ అయిన చపాతీలు తినేందుకు ఇష్టపడరు. కానీ ఆరోగ్య నిపుణులు అవే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయంటూ పలు షాకింగ్ విషయాలు చెప్పారు. అవేంటంటే..? తాజాగా అప్పటి కప్పుడు చేసుకున్న గోధుమ చపాతీలనే ఇష్టంగా తింటా. ఒకవేళ మిగిలపోతే కుక్కలకు పెట్టడం లేదా బయటపడేయడం జరుగుతుంది. కానీ ఆరోగ్యనిపుణులు ఇది అనారోగ్యం కాదని నొక్కి చెబుతున్నారు. ఇందులో ఫైబర్ ఎక్కువుగా ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువుగా ఉంటుంది. పైగా సోడియం కూడా తక్కువుగా ఉంటుంది. కాబట్టి దీన్ని మంచి చిరుతిండిగా కూడా పేర్కొనవచ్చు అని అన్నారు. దీని వల్ల కలిగే ప్రయోజనాలు అన్ని ఇన్నీ కావు. ముఖ్యంగా జీర్ణక్రియకు.. రాత్రి పూట అంతా నిల్వ ఉండి లేదా చపాతీలు చేసిన 12 నుంచి 15 గంటల తర్వాత తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయట. అలా నిల్వ ఉండటం వల్ల అదులో చేరిన బ్యాక్టీరియా ప్రేగుల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. తద్వారా గ్యాస్, మలబద్దకం, అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చని చెబుతున్నారు నిపుణులు. మంచి శక్తిని అందిస్తాయి.. అల్పాహారంలో బాసి రోటీ(నిల్వ అయిన చపాతీ! బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్. దీన్ని బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవడం వల్ల రోజంతా శక్తిమంతంగానూ బలంగా ఉంటుంది. ఎక్కువ తిన్న ఫీల్ కలుగుతుంది. ఇందులో సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను సరళమైన రూపాల్లోకి విచ్ఛిన్న చేసేందుక చాలా టైం పడుతుంది. అందువల్ల త్వరితగతిన ఆకలవ్వదు. పైగా పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. 30 రోజుల్లో బరువు తగ్గడానికి.. మిగిలిపోయిన చపాతీల్లో కేలరీలు, ఫైబర్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇది బరువు తగ్గడానికి (30 రోజుల్లో బరువు తగ్గడానికి) సహాయకరంగా ఉంటుంది. నిజానికి, ఉదయాన్నే పాత చపాతీ(నిల్వ చపాతీ) తిన్నప్పుడు పొంట నిండుగా ఉన్నట్లు అనిపించి, త్వరితగతిన ఆకలివేయదు. తద్వారా మీరు అతిగా తినకుండా ఉండగలుగుతారు. దీంతో సులభంగా బరువు తగ్గుతారు. బీపీ, షుగర్ నియంత్రణలో.. డయాబెటిక్ రోగులకు పాత చపాతీలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. దీంతో వీటిని తినడం వల్ల రోజంతా వచ్చే షుగర్ స్పైక్‌ల నుండి ఉపశమనం లభిస్తుంది. అదే సమయంలో, పాత చపాతీల్లో సోడియం పరిమాణం తక్కువగా ఉంటుంది, దీని కారణంగా రక్తపోటును నియంత్రించడంలో ఇది చాలా సహాయపడుతుంది. సరైన పద్ధతిలో నిల్వ చేయడం అనేది ముఖ్యం..! రోటీ లేదా పాత చపాతీ సరైన విధంగా 12 గంటల పాటు నిల్వ ఉంచినప్పుడూ..వాటి రుచి, ఆకృతి స్టార్చ్ కూర్పులు మార్పులకు లోనవ్వుతాయి. ఇది మన ఆరోగ్యానికి ఉపయోగాపడే ఫైబర్ లాగా రెసిస్టెంట్ స్టార్చ్లా మారుతుంది. ఫలితంగా తేలికగా గ్లూకోజ్‌గా విడిపోతుంది. ముఖ్యంగా ఇక్కడ తాజా లేదా పాత చపాతీల మధ్య గ్లైసెమిక్ ఇండెక్స్‌లో వ్యత్యాసం ఉంటుంది. తాజా చపాతీలు రక్తంలోని చక్కెర నియంత్రణను గణనీయంగా ప్రభావితం చేయవు కానీ నిల్వ చపాతీలు చక్కెర స్థాయిలను సులభంగా నియంత్రిస్తుంది. ఇక్కడ చపాతీలు బూజు పట్టకుండా మంచి పద్ధతిలో నిల్వ చేయడం అనేది అత్యం ముఖ్యం అని గుర్తించుకోవాలి. తాజా చపాతీ రుచిగా ఉంటే ..నిల్వ ఉన్న చపాతీలను చాలా నెమ్మదిగా తినాలి, రుచి తక్కువుగా ఉన్నా ఆరోగ్యానికి మంచిది. ఇక్కడ తెలుసుకోవాల్సింది.. నిల్వ ఉండటం వల్ల గోధుమ పులుస్తుంది దీన్నే కిణ్వనప్రక్రియ అంటాం. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే మంచి పోషకాలు పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. (చదవండి: వైట్ లంగ్ సిండ్రోమ్ అంటే..? చిన్నారులకే ఎందుకొస్తోంది?) -
ఐస్‌వాటర్ ముఖ సౌందర్యాన్ని ఎలా రక్షిస్తుందో తెలుసా!
ఇంతవరకు ఎన్నో క్రీమ్‌లు, సౌందర్య లేపనాలు ట్రై చేసి ఉంటారు. కానీ అవన్నీ కూడా ఈ ఐస్ వాటర్ ట్రిక్ ముందు బలాదూర్ అంటున్నారు సౌందర్య నిపుణులు. సెలబ్రెటీలు నుంచి ప్రముఖులు వరకు ఈ ఐస్‌వాటర్ ట్రిక్ని ఫాలో అవుతుంటారట. అందువల్ల వాళ్లంతా నలభైలలో కూడా టీనేజ్‌లో ఉన్నట్లే కనిపించేందకు రీజన్ ఇదేనట. అసలు ఐస్‌వాటర్ చర్మ సౌందర్యాన్ని కాపాడటం ఏంటీ? కామెడీగా అని కొట్టిపారేయకండి. ఇది ఎంత మేలు చేస్తుందంటే.. ఉదయం లేచిన వెంటనే మీ ముఖాన్ని కొద్దిసేపు ఐస్‌వాటర్‌లో డిప్ చేసి ఉంచితే ఒక్కసారిగా నిద్రమత్తుతో ఉన్న ముఖం క్షణాల్లో ఫ్రెష్‌గా కనిపిస్తుంది. అది ముఖంపై ఉండే రంధ్రాలను బిగుతుగా చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే చిన్న రంధ్రాలతో అసహ్యంగా కనిపిస్తున్న చర్మానికి ఇది చక్కటి రెమిడీ అని చెప్పొచ్చు. అయితే ఈ చల్లటి వాటర్‌తో ముఖాన్ని రుద్దకపోవడమే మంచిది. ఎందుకంటే పొడిగా అయ్యి ర్యాష్ వచ్చే ప్రమాదం ఉంది. ఓ రెండు నుంచి మూడు నిమిషాలు ముఖాన్ని చల్లటి నీటిలో ఉంచితే ముఖం గ్లాస్ స్కిన్‌లా మెరుస్తూ తాజాగా కనిపిస్తుంది. View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) అదీగాక అప్పటి దాక సాధారణ టెంపరేచర్లో ఉన్న ముఖం ఒక్కసారిగి ఇలా చల్లటి నీటిలో ఉంచితే..ముఖానికంతటికీ రక్తప్రసరణ జరిగి ఒక్కసారిగా తెలియని ఉత్సాహం వస్తుంది. మనం ఉపయోగించే స్క్రబ్‌లు, మాయిశ్చరైజర్ల కంటే ఈ ఐస్ వాటర్ ట్రిక్ అత్యుత్తమమైనది అని అంటున్నారు. ఇలా రోజులో కనీసం రెండు నుంచి మూడు సార్లు క్రమం తప్పకుండా చేస్తే మెరిసే ప్రకాశవంతమైన చర్మం మీ సొంతమవుతుదంని చెబుతున్నారు. అంతేగాదు ముఖంపై వచ్చే వాపులను కూడా తగ్గిస్తుందట. వాపుగా ఉన్న ప్రాంతంలో... రక్త సరఫరా ఎక్కువ అవ్వడంతో కుచించుకుపోయిన నాళాలకు రక్తసరఫరా తగ్గి యథావిధికి రావడమే గాక నొప్పి కూడా తగ్గుతుందని చెబతున్నారు సౌందర్య నిపుణులు. అంతేగాదు ఇలా ఐస్‌వాటర్‌లో ముఖాన్ని డిప్ చేసి ఉంచే ట్రిక్‌తో తమ అందాన్ని ఎలా కాపాడుకోగలుగుతున్నామో వివరిస్తూ వీడియోలు షేర్ చేసిన కొందరూ సెలబ్రెటీల వీడియోలు నెట్టింట వైరల్ తెగ వైరల్ అవుతున్నాయి. చూసేయండి.. వెంటనే మీరు కూడా ట్రై చేయండి. View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) (చదవండి: ఈ చైర్లో కూర్చొంటే..దెబ్బకు బెల్లీ ఫ్యాట్ మాయం!) -
దివ్యాంగులకు రైల్వేశాఖ అందించే ప్రత్యేక సౌకర్యాలివే..
మనలో చాలామంది దూర ప్రయాణాలకు రైలునే ఇష్టపడతారు. రైలు ప్రయాణంలో అనేక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. దివ్యాంగులకు రైల్వేశాఖ ప్రత్యేక సదుపాయాలు, సౌకర్యాలు కల్పిస్తోంది. అంగ వైకల్యం కలిగినవారు, మానసిక వ్యాధిగ్రస్తులు, అంధులు తమ రైలు ప్రయాణంలో ఈ సదుపాయాలను వినియోగించుకోవచ్చు. దివ్యాంగులకు రైలు టిక్కెట్ ధరలోనూ రాయితీ లభిస్తుంది. అయితే ఇందుకోసం దివ్యాంగులు తమ అంగవైకల్యానికి సంబంధించిన ధృవీకరణ పత్రం కలిగివుండాలి. సీటు సౌకర్యం దివ్యాంగులైన ప్రయాణికులకు ఇది వరం లాంటిది. దివ్యాంగులకు స్లీపర్ క్లాస్‌లో రెండు లోయర్, రెండు మిడిల్ బెర్త్‌లు, ఏసీ-3లో ఒక లోయర్, ఒక మిడిల్ బెర్త్, త్రీఈ కోచ్‌లో ఒక లోయర్ బెర్త్, ఒక మిడిల్ బెర్త్ కేటాయిస్తారు. టిక్కెట్లపై తగ్గింపు దివ్యాంగులైన ప్రయాణీకులకు రైలు టిక్కెట్లలో రాయితీ లభిస్తుంది. దివ్యాంగులైన ప్రయాణికులు టిక్కెట్ల ధరలో 25 శాతం నుండి 75 శాతం వరకు రాయితీని పొందవచ్చు. దివ్యాంగులైన ప్రయాణికులకు స్లీపర్ క్లాస్, ఏసీ-3 నుండి సాధారణ తరగతి వరకు అన్నింటా రాయితీలు లభిస్తాయి. ఈ రాయితీని పొందడానికి, టిక్కెట్‌ను కొనుగోలు చేసేటప్పుడు అంగవైకల్య ధృవీకరణ పత్రాన్ని చూపించడం తప్పనిసరి. చక్రాల కుర్చీ సౌకర్యం భారతీయ రైల్వే దివ్యాంగులైన ప్రయాణికులకు చక్రాల కుర్చీ సౌకర్యాన్ని అందుబాటులో ఉంచింది. స్టేషన్ నుండి రైలు వద్దకు వచ్చేందుకు దివ్యాంగులు ఈ వీల్‌చైర్‌ను వినియోగించుకోవచ్చు. ఈ వీల్ చైర్ సౌకర్యం పొందేందుకు దివ్యాంగులు ముందుగా సంబంధిత అధికారి లేదా స్టేషన్ మాస్టర్‌ను సంప్రదించాల్సివుంటుంది. తరువాత రైల్వే సిబ్బంది వీల్ చైర్‌ను దివ్యాంగుల దగ్గరకు తీసుకువస్తారు. అయితే ఈ సౌకర్యం పొందేందుకు దివ్యాంగులు కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇది కూడా చదవండి: ఆ 17 రోజులు ఎలా గడిచాయంటే.. -
కామన్ అకౌంట్ నంబర్ అంటే ?
-
రాగితో చౌకగా క్యాన్సర్ మందులు తయారు చేయొచ్చు: సైంటిస్టులు
ఆరోగ్యపరంగా రాగి లోహానికి ఉన్న ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్నేళ్లుగా ఆయుర్వేదంలో అనేక వ్యాధుల చికిత్సలో రాగిని వాడుతున్నారు. అయితే ఇప్పుడు రాగిని ఉపయోగించి క్యాన్సర్ డ్రగ్స్ మెడిసిన్స్‌ను చవకగా తయారు చేయొచ్చని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజిల్స్ సైంటస్టులు జరిపిన అధ్యయనంలో తేలింది. సాధరణంగా క్యాన్సర్ చికిత్సకు వాడే మందులు తయారు చేయడానికి ఒక గ్రాముకు సుమారు రూ. 2 లక్షల 60 వేలకు పైగా ఖర్చు అయితే, రాగిని ఉపయోగించి మెడిసిన్స్ చేయడం వల్ల ఒక గ్రాముకు కేవలం రూ. 250 రూపాయలే అవుతుందని సైంటిస్టులు తమ రీసెర్చ్‌లో తేల్చారు. దీని వల్ల భవిష్యత్తులో చవకగా ఔషధాలు తయారు చేసేందుకు మార్గం సుగుమం అయ్యింది. అదెలాగో తెలుసుకోవాలంటే ఈ స్టోరీని చదవాల్సిందే. మనిషి మొదటగా కనుక్కొని వాడిన లోహం రాగి. కొన్ని వేల ఏళ్లుగా మనం రాగి వస్తువులను, రాగి పాత్రలను వాడుతూనే ఉన్నాం. దీన్ని తామ్రము అని, క్యూప్రమ్ అని కూడా అంటారు. రాగితో చేసిన పాత్రలను వాడటం వల్ల శరీరానికి ఎంతో మేలు చేస్తుందని పలు అధ్యయనాల్లో ఇప్పటికే రుజువైంది. నీటిలో ఉండే బాక్టీరియాను నశింపజేసే శక్తి కూడా రాగికి ఉందని ఆధునిక పరిశోధనలు చెబుతున్నాయి. రాగి లోహాలను వాడటం వల్ల అనేక రోగాలు నయమవుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా,చవకగా దొరికే లోహాల్లో రాగి ఒకటి. దీనికి ఉండే ఔషధ గుణాల రీత్యా క్యాన్సర్ చికిత్సలోనూ వాడేందుకు అనువుగా ఉందని ప్రొఫెసర్ ఓహ్యున్ క్వాన్ అన్నారు. క్యాన్సర్ చికిత్సలో సాధారణంగా వాడే మందుల తయారీకి ఒక గ్రాముకు రూ. 2లక్షల 60 వేల(3వేల డాలర్లు)ఖర్చవగా, రాగిని ఉపయోగించి అదే ఔషధాన్ని తయారు చేసేందుకు కేవలం రూ.250 మాత్రమే అవుతుందని పేర్కొన్నారు. ఈ విధానం ద్వారా క్యాన్సర్ వ్యతిరేక c-Jun N- టెర్మినల్ కినేస్ ఇన్హిబిటర్ను కేవలం మూడు దశల్లోనే ఉత్పత్తి చేయగలిగారు. సాధారణంగా దీనికి 12 రసాయనిక చర్యలు అవసరం అవుతాయి. ఇందులో అడెనోసిన్, N6-మిథైలాడెనోసిన్ను సులువుగా అమైన్గా మార్చగలదు. కణాలు, వ్యాధి ప్రక్రియలు మరియు అభివృద్ధిలో జన్యు వ్యక్తీకరణను నియంత్రించడంలో ఈ అమైన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతమున్న క్యాన్సర్ చికిత్సలో దీన్ని ఉత్పత్తి చేయడానికి ఒక గ్రాముకు సుమారు రూ.8వేల 500($103)కు పైగా ఖర్చవుతుంది. అదే రాగిని ఉపయోగించడం వల్ల చాలా చవకగా ఔషధాలను తయారు చేయొచ్చని, భవిష్యత్తులో ఈ పద్దతి మరింత సులభతరం అవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. -
పచ్చి మిర్చిని పచ్చిగా తినడమా? అనుకోవద్దు!.. ఎందుకంటే..?
పచ్చిమిర్చి అంటే అబ్బా!.. ఘాటు అని తేలిగ్గా తీసిపారేయొద్దు. ఎందుకంటే మిగతా కాయగూరల్లానే దీనిలోనూ ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అంతేగాదు రోజు ఓ పచ్చిమిరపకాయను పచ్చిగా తింటే ఎంతో మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మనం పచ్చిమిర్చిని ఘాటు కోసం వాడతాం. ఇది మన ఆహారానికి మంచి స్పైసీని కాదు కావల్సినన్ని పోషకాలను అందిస్తుంది. ఇందులో విటమిన్ ఏ, సీలో తోపాటు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నాయి. ఇది జీక్రియలను పెంచి రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అంతేగాదు ఇందులో ఉండే క్యాప్సైన్ మెటబాలిజం పెంచెందుకు దోహదపడుతుంది. అందువల్ల దీన్ని ఆహారంలో చేర్చడం వల్ల బరువు నిర్వహణలో సమర్థవంతంగా పనిచేస్తుంది. తత్ఫలితంగా క్యాలరీలు ఈజీగా బర్న్ అవుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా ఈ పచ్చి మిర్చి కీలక పాత్ర పోషిస్తాయని పరిశోధనలో తేలింది. అదే సమయంలో శరీరానికి వేడి చేసేలా కాకుండా తగిన మోతాదులో తీసుకోవడం అనేది అత్యంత ముఖ్యం. ముక్కలు చేసిన పచ్చి మిరపకాయల నీటిని సేవించడం వల్ల హైడ్రేటెడ్‌గా ఉండేలా చేస్తుంది. అలాగే మీరు తీసుకునే సలాడ్స్‌లో గ్రీన్ చిల్లీ స్మూతి రుచిని పెంచడమే గాక ఆరోగ్యానికి మంచిది. అలాగే ఇన్ఫెక్షన్లను దూరం చేయడంలో సహాయపడుతుంది. కొలస్ట్రాల్ స్థాయిలను, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది కూడా. ఈ స్పైసీ పదార్థాలను ఎప్పుడూ సరైన పద్ధతిలో వినియోగిస్తే ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయనేది గుర్తించుకోవాలి. (చదవండి: రోజూ ఓ కప్పు స్ట్రాబెర్రీలు తీసుకుంటే..డిమెన్షియా పరార్!) -
ఇల్లే నందనవనం.. టెర్రస్ గార్డెనింగ్‌తో ఎన్నో ఉపయోగాలు
గేటు తీయగానే ఇంట్లో యజమాని కంటే ముందు మొక్కలు పలుకరిస్తాయి. ఎటుచూసినా సుగంధాలు వెదజల్లే వివిధ రకాల పూల మొక్కలు..కనువిందు చేసే రంగురంగుల పుష్పాలు.. సంపూర్ణ ఆరోగ్యానిచ్చే సేంద్రియ ఎరువులతో పండించిన కాయగూరలు, పండ్ల మొక్కలు దర్శనమిస్తాయి. రెండంతస్తుల భవనం..ఎటుచూసినా పచ్చని మొక్కలతో ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది. ఒంగోలు సంతపేటలోని డి.విజయలక్ష్మి ఇంటి వద్ద కనిపించే దృశ్యాలు ఇవి. తొలి నాళ్లలో పూలమొక్కలు పెంచడం అలవాటు చేసుకున్న ఆమె సేంద్రియ ఎరువులతో సహజసిద్ధంగా రకరకాల కాయగూరలు,ఆకుకూరలు,పందిరి కాయగూరలు..వివిధ రకాల పండ్లను పండిస్తున్నారు. ఇంటి ముందున్న ఖాళీ స్థలం మొదలు భవనానికిరువైపులా ఉన్న స్థలంలో..మొదటి, రెండో అంతస్తుకు వెళ్లేందుకు ఏర్పాటు చేసుకున్న మెట్ల పైన.. రెండో అంతస్తులో 1000 చదరపు అడుగుల స్థలంలో మొక్కలు పెంచుతూ నందన వనంగా మార్చేశారు. ఆమె భర్త చెంచురామిరెడ్డి. వృత్తి రీత్యా డాక్టర్. ఇంట్లో నిత్యం వండుకునే ఆకుకూరలు..కాయగూరలు అన్నీ మేము పండించేవే.. రోజూ పూసే పూలతో దేవుడి గది అంతా నిండిపోతుందని మురిసిపోతూ చెబుతున్నారు. ఇలా ఒక్క విజయలక్ష్మే కాదు నగరంలో వందలాది మంది ఇంటి పంటలపై ఆసక్తి చూపిస్తూ తమ పెరట్లో రకరకాల మొక్కలు పెంచుతున్నారు. సాక్షిప్రతినిధి, ఒంగోలు: ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతున్నారు. ఆహారపు అలవాట్లలో అనేక మార్పులు చేసుకుంటూ అనారోగ్యానికి దూరంగా ఉంటున్నారు. పల్లెల్లో, పట్టణాల్లో చాలా ఇళ్లలో పెరటి సాగు కనిపిస్తుంది. కూరగాయల సాగు ఏర్పాటు చేసుకుని స్వయంగా కూరగాయలు పండించుకుంటున్నారు. ఈ ఒక్క ఆలోచన వారి కుటుంబానికి సరిపడా పౌష్టికాహారం అందిస్తోంది. ఇంటి పైనే కూరగాయలు, పూలు, పండ్లు పండిస్తూ వాటినే వినియోగిస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు, మహారాష్ట్ర, తూర్పుగోదావరి జిల్లాలోని కడియం నర్సరీల నుంచి రకరకాల పూలు..పండ్ల మొక్కలను తెచ్చుకుంటున్నారు. అలాగే రకరకాల కాయగూరలకు సంబంధించిన విత్తనాలను వివిధ పట్టణాల నుంచి తెచ్చుకుంటున్నారు. ఇంటి పంటలపై ఆసక్తి ఉన్న హైదరాబాద్‌కు చెందిన తుమ్మేటి రఘోత్తమరెడ్డి నగరంలోని చాలా మందికి ఉచితంగా విత్తనాలను అందజేస్తున్నారు. అంతేకాకుండా మొక్కల పెంపకంపై పలు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఇంటిపంటలో పెంచుతున్న మొక్కలు ఇవి.. నగరంలో చాలా మంది ఇళ్లలో ఎక్కువగా పూలు, ఆకు కూరలు, కూరగాయలు, రకరకాల పండ్ల మొక్కలను పెంచుతున్నారు. వివిధ రకాల క్రోటన్స్, మందారం, బంతి, మల్లి, సన్నజాజి, గులాబి, తులసి, పత్తి మందారం, సంపంగిలతో పాటు బొప్పాయి, జామ, అరటి, మామిడి, సపోట, దానిమ్మ, ఆపిల్‌ను పండిస్తున్నారు. అలాగే బెండ, అరటి, దొండ, బీర, కాకరకాయ, సొరకాయ, పొట్లకాయ, టమోట, పచ్చిమిర్చి, గోరు చిక్కుడు, పందిరి చిక్కుడు, మునక్కాయలు తదితర కాయగూరలతో పాటు తోటకూర, మెంతికూరలను సైతం సాగుచేస్తున్నారు. ప్రతి రోజూ గంట నుంచి రెండు గంటల శ్రమ.. ఇంట్లో మొక్కలు పెంచడం కోసం ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం సమయాల్లో ప్రత్యేక సమయాన్ని కేటాయిస్తున్నారు. ప్రతి రోజూ ఉదయం లేవగానే మొక్కలకు నీళ్లు పడతారు. మొక్కలకు ఏవైనా చీడ, పీడలు ఆశిస్తే వాటిని తొలగించి అవసరమైన చోట సహజసిద్ధ వనరులతో తయారు చేసిన మందులను స్ప్రే చేస్తారు. చాలా మంది సొంతంగా జీవామృతాన్ని, వేపనూనె, పిట్టు, పిడకలను తయారు చేసుకుంటున్నారు.మరికొందరు గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి తెచ్చుకుంటున్నారు. అలాగే నగరంలోని గోశాల నుంచి ఆవు ఎరువు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి గేదె ఎరువులను సేకరిస్తున్నారు. రెండు, మూడు నెలలకొకసారి మొక్కలన్నింటినీ అవసరమైన మందులు జల్లుతారు. ఈ ప్రక్రియ ఒకరోజు పడుతుంది. ఇలా చెట్లను సంరక్షిస్తూ తన ఇంటి పరిసరాలను ఆహ్లాదంగా ఉంచుతూ.. ఇంట్లోకి ఆరోగ్యకరమైన పండ్లను, కూరగాయలను పండించుకుంటున్నారు. సంతపేట విజయలక్ష్మి ఇంట్లో వివిధ రకాల మందారం మొక్కలు ఉన్నాయి. అందులో పత్తి మందారం వెరీ స్పెషల్. ఇది తెలుపు రంగులో పూస్తుంది. మధ్యాహ్నానికి లేత పింక్ కలర్లోకి మారుతుంది. సాయంత్రానికి ముదరు పింక్ కలర్లోకి మారుతుంది. ఇలాంటి ఆసక్తి కలిగించే పూల మొక్కలు ఇక్కడ ఎన్నో ఉన్నాయి. ఆపిల్.. ఆపిల్ మొక్కను పెంచేందుకు సుకన్య ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ముందుగా ఆపిల్ విత్తనాలను 15 రోజుల పాటు ఫ్రిజ్డ్‌లో ఉంచారు. మొలక వచ్చాక వాటిని కోకోపిట్లో ఉంచి తర్వాత కుండీలో పెట్టారు. మూడు సంవత్సరాల నుంచి దీనిని పెంచుతున్నారు. దీనిని తొట్టెలోంచి తీసి భూమిలో పాతాలి. ఐదు నుంచి ఏడేళ్లు వచ్చాక కాయలు కాస్తుందని చెబుతున్నారు సుకన్య. ప్రకాశం మిద్దెతోటల పెంపకం గ్రూప్.. ఇంటి పంటలు పండించే వారి కోసం నగరంలో ‘ప్రకాశం మిద్దెతోటల పెంపకం’ అనే ప్రత్యేకమైన గ్రూపును ఏర్పాటు చేశారు. నగరంలోని మారుతీనగర్‌కు చెందిన ఆలపాటి సుకన్య అడ్మిన్‌గా ఉన్నారు. ఆమెతో పాటు సంతపేటకు చెందిన డి.విజయలక్ష్మి ప్రధానంగా ఉంటూ ఇంటి పంటలు పండించే వారిని ప్రోత్సహిస్తున్నారు. ఈ గ్రూప్‌లో ఇప్పటి వరకూ 130 మందికి పైగా సభ్యులు ఉన్నారు. వారికి అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తున్నారు. హైదరాబాద్ నుంచి రఘోత్తమరెడ్డి, రిటైర్డ్ బ్యాంకు ఆఫీసర్ అప్పారావు తదితరులను తీసుకువచ్చి సలహాలు సూచనలు ఇప్పిస్తున్నారు. దాదాపు మూడేళ్లుగా ఈ గ్రూపు నడుస్తోంది. ఇంటి పంటలపై ఆసక్తిని పెంచేందుకు నిరంతరం సమావేశాలు నిర్వహిస్తామని అడ్మిన్ సుకన్య చెబుతున్నారు. ఐదేళ్ల నుంచి.. మొదట్లో పూల మొక్కలు పెంచా. ఆ తర్వాత సేంద్రియ ఎరువులతో ఇంట్లోనే ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు పెంచుతున్న విధానాన్ని తెలుసుకున్నా. వాటి పెంపకంపై ఆసక్తి పెరిగింది. రకరకాల పూల మొక్కలతో పాటు కాయగూరలు, పండ్లను పెంచుతున్నా. రెండో అంతస్తులో వీటిని పెంచుతున్నా. తొలినాళ్లలో వీటిని సంరక్షించేదాన్ని. ఆరోగ్యం సహకరించకపోవడంతో ఇంట్లో పనిచేస్తున్నా భార్య, భర్తలు ఇద్దరూ నాలుగు నెలలుగా మొక్కలు సంరక్షిస్తున్నారు. సహజసిద్ధమైన ఎరువులతో పండిస్తున్న కూరగాయలు తినడంతో సంతృప్తినిస్తోంది. – డి.విజయలక్ష్మి, సంతపేట, ఒంగోలు సొంతంగా ఎరువుల తయారీ.. మామగారు ఆలపాటి సత్యనారాయణ పొగాకు వ్యాపారి. ఆయన బెంగళూరు నుంచి రకరకాల పూల మొక్కలను తీసుకొచ్చేవారు. అలా ఇంట్లో మొక్కలు పెంచడం అలవాటైంది. క్రమంగా కాయగూరలు, పండ్ల మొక్కలు పెంచడం అలవాటు చేసుకున్నా. కిచెన్ వేస్ట్‌తో ఎరువులు తయారు చేస్తున్నా. జీవామృతాన్ని కూడా సొంతంగా తయారు చేసుకుంటున్నా. సేంద్రియ ఎరువులను సైతం తయారు చేస్తున్నా. అమెరికాలో ఉంటున్న కుమారుడు సైతం రకరకాల కాయగూరలను పెంచుతున్నారు. పెరటి మొక్కల పెంపకంపై నగరవాసులకు ఆసక్తిని పెంచేందుకు మూడేళ్ల కిందట ప్రత్యేక గూప్ను ఏర్పాటు చేశాం. ప్రసుతం 130 మంది సభ్యులు ఉన్నారు. రానున్న రోజుల్లో గ్రూప్‌ను మరింత విస్తరించేలా కార్యక్రమాలు చేపట్టనున్నాం. – ఆలపాటి సుకన్య, మారుతీనగర్, ఒంగోలు ఎన్నో ఉపయోగాలు.. పూల మొక్కలతో పాటు సుందరీకరణ మొక్కలు పెంచడం ఆహ్లాదాన్ని ఇస్తుంది. కూరగాయల సాగు చేయడం ద్వారా రసాయనాలతో పండే కూరగాయలకు దూరంగా ఉంటూ మన చెట్లకు పండే కూరగాయలు తింటూ ఎంతో ఆరోగ్యంగా ఉండొచ్చు. పండ్ల మొక్కలు పెంచడం ద్వారా రసాయనాలు లేని పండ్లను తినొచ్చు. మార్కెట్లో దొరికే పండ్లలో రసాయనాలతోనే పెంచి రసాయనాలతోనే వారిని పండేలా చేస్తారు. దీంతో అందులో పోషకాలు అన్ని పోతాయి. ఇలా మన ఇంట్లో పండిన పండ్లను తినడం ద్వారా అందులో ఉండే పోషకాలన్నీ లభిస్తాయి. -
దానిమ్మ ఎన్ని వ్యాధులకు చెక్ పెడుతుందో తెలుసా!
దానిమ్మ పండు, పువ్వులు, బెరడు, వేర్లు ఆకులు అనేక వ్యాధులు చికిత్స చేయడానికి ఉపయోగించేలా పాలీఫెనాల్స్ వంటి రసాయనాలను కలిగి ఉంటాయి. దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నిఇన్ని కావు. ఇది జీర్ణ రుగ్మతలు, చర్మ రుగ్మతలు, పేగు సంబధింత వ్యాధులకు చక్కటి ఔషధంగా ఉపయోగపడుతుందంటున్నారు ఆయుర్వేద డైటిషన్ శిరీష రాకోటి. ఈ పండును తీసుకోవడం వల్ల ఎలాంటి వ్యాధులు మన దరిదాపుల్లోకి రావో డైటిషన్ శిరీష రాకోటి మాటల్లో తెలుసుకుందామా!. ఇందులో వివిధ విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లతో నిండిన ఒక పోషకమైన పండు దానిమ్మ. ఈ పండ్లను తీసుకోవడం ఏఏ వ్యాధులు దరిదాపుల్లోకి రావంటే.. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. దానిమ్మ ప్యూనికాలాగిన్స్ ఎలాజిక్ యాసిడ్ వంటి పాలీఫెనాల్ యాంటీ ఆక్సిడెంట్లకు మంచి మూలం, ఇది ఫ్రీ రాడికల్స్ అని పిలిచే హానికరమైన అణువుల వల్ల కలిగే నష్టం నుంచి మీ శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. ఇందులో శోథ నిరోధక లక్షణాలు ఉన్నాయి. దానిమ్మలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు మీ శరీరం అంతటా మంటను తగ్గించడంలో సహాయపడతాయి. గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించగలవు. రక్తపోటును తగ్గిస్తుంది. అధిక రక్తపోటు ఉన్నవారిలో దానిమ్మ రసం తాగడం వల్ల రక్తపోటు తగ్గుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గుండెకు రక్త ప్రసరణ మెరుగ్గా అయ్యేలా చేస్తుంది. జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. దానిమ్మ రసం తీసుకోవడం వల్ల వృద్ధులలో జ్ఞాపకశక్తి పెరిగేలా మెదడు పనితీరు మెరుగుపడుతుందని కొన్ని పరిశోధనలు కనుగొన్నాయి. క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలను కలిగి ఉంది. అంతేగాదు కొన్ని అధ్యయనాలు దానిమ్మ సారం క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉండవచ్చని సూచించాయి, ముఖ్యంగా ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మొత్తంమీద, దానిమ్మ, దానిమ్మ రసం తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధనల్లో వెల్లడైంది. ఆఖరికి వంధ్యత్వాన్ని నయం చేయడానికి కొన్ని దేశాల్లో దానిమ్మపండ్ల రసాన్ని ఉపయోగిస్తారని అధ్యయనాలు తెలిపాయి... ---శిరీష రాకోటి, ఆయుర్వేద డైటిషన్ (చదవండి: మీ ఆహారంలో ఇవి చేర్చితే మధుమేహం దరిదాపుల్లోకి రాదు!) -
డ్రాగన్ ఫ్రూట్ ఎలా వాడాలి?..పొరపాటున అలా తింటే..
ప్రస్తుతం డ్రాగన్ ఫ్రూట్స్ మార్కెట్లో బాగా వస్తున్నాయి. ఇటీవల కాలంలో మన రైతులు వీటి సాగుతో లాభలార్జిండంతో మార్కెట్లో బాగా విరివిగా లభిస్తున్నాయి. అలాంటి ఈ పండు ధర కూడా కాస్త ఎక్కువ. చాలామందికి దీన్ని ఎలా తిన్నాలనే తెలియదు. బాగా దీని రుచి కూడా కాస్త పులుపు స్వీట్‌తో కూడిన తాటి ముంజుల్లా ఉంటాయి. వీటిని ఎలా తినాలి. తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి తదితరాల గురించి ఆయుర్వేద డైటిషిన్ శిరీష రాకోటి మాటల్లో తెలుసుకుందాం.! డ్రాగన్ ఫ్రూట్ ఎలా కట్ చేయాలంటే.. పొలుసులుగా పొడుచుకు వచ్చిన ఆకులతో వెలుపలి భాగం కఠినంగా కనిపిస్తున్నప్పటికీ, దాన్ని ముక్కలు చేయడం మాత్రం చాలా సులువే. కట్టింగ్ బోర్డు మీద డ్రాగన్ ఫ్రూట్ ఉంచి పండును సగానికి పొడవుగా కత్తిరించండి. అందుకు పదునైన చెఫ్ కత్తిని ఉపయోగించండి. పైభాగంలో ప్రారంభించి, ఆపై మందమైన కాండంలోకి వెళ్లేలా కట్ చేయండి. ఆ తర్వాత ఒక చెంచా ఉపయోగించి గుజ్జును సగం నుండి నేరుగా తినవచ్చు. లేదా పండును రెండు సగభాగాలుగా కోసి పూన ఉన్న మందపాటి చర్మాన్ని తొలగించి ముక్కలుగా చేసుకుని తినేయొచ్చు. ఈ ఫ్రూట్ ఉపయోగాలు.. ఇందులో మాంసకృతులు, పీచు, పిండి పదార్ధాలు, తీపి, సోడియం, విటమిన్ సి, విటమిన్ ఎ, రిబోఫ్లావిన్, నియాసిన్, విటమిన్ ఇ, ఇనుము, మెగ్నీషియం, కాల్షియం, జింక్, ఫోస్ఫరస్, బెటాలైన్స్, హైడ్రాక్సీసిన్నమేట్స్, ఫ్లేవనాయిడ్స్, ఒమేగా-3, ఒమేగా-9 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. గర్భధారణ సమయంలో రక్తహీనతను దూరం చేస్తుంది. శిశవు ఆరోగ్యంగా పెరగడానికి దోహదం చేస్తుంది. గర్భిణికి నీరసం రాకుండా చూస్తుంది. ఎముకల ఆరోగ్యం కాపాడుతుంది. కీళ్లలో ఎముకల రాపిడి జరగకుండా ఉండే మృదులాస్థి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దీని వలన ఎముకల మధ్య రాపిడి ఉండదు దాని వలన నొప్పిలు ఉండవు. కండరాలు మరియు రక్త నాళాలు పని తీరును మెరుగు పరుస్తుంది. వాపును తగ్గిస్తుంది. జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది. ఇందులో ప్రీబయోటిక్ ఉంటాయి. దాని వలన ప్రోబైయటిక్ పెరిగి జీర్ణ శక్తి మెరుగు అవుతుంది. ఇన్సులిన్ నిరోధకతను తాగించడం ద్వారా మధుమేహం రాకుండా చూస్తుంది. మధుమేహం ఉంటే స్థాయిలను నిర్వహింస్తుంది. క్యాన్సర్ ప్రమాదాలను తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చర్మంపై అకాల వృద్ధాప్య ఛాయలు రాకుండా చూస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కళ్ల ఆరోగ్యం కాపాడుతుంది. చెడు కొవ్వు నియంత్రిస్తుంది. మంచి కొవ్వుని పెంచుతుంది. మెదడు ఆరోగ్యం మెరుగు పరుస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తాగిస్తుంది. కాలేయంలో కొవ్వుని నియంత్రిస్తుంచి ఆరోగ్యగా ఉంచుతుంది. అయితే ఈ డ్రాగన్‌ఫ్రూట్‌ని తొక్క తోపాటుగా తింటే మాత్రం అజీర్తీ వస్తుంది. ఎట్టిపరిస్థితుల్లోనూ అలా తిని లేనిపోని సమస్యలు తెచ్చుకోవద్దు. ఎందుకంటే తొక్క కాస్త మందంగా ఉంటుంది. ముఖ్యంగా జీర్ణ సమస్యల ఉన్నవారికి ఈ పండు వల్ల కలిగే ప్రయోజనాల కన్నా చెడు ఎక్కువ అవుతుంది. అందువల్ల దయచేసి పైన ఉన్న తొక్కను తీసివేసి తినండి. --శిరీష రాకోటి, ఆయుర్వేద డైటిషిన్ (చదవండి: రోజూ ఒక కప్పు 'టీ' తాగితే.. మధుమేహం ఉండదు! పరిశోధనల్లో షాకింగ్ విషయాలు) -
రాళ్ల ఉప్పుకి మాములు ఉప్పుకి ఇంత తేడానా? ఆ వ్యాధులకు కారణం ఇదేనా?
మాములుగా ప్యాకెట్లలో దొరికే సాల్ట్‌కి రాక్ సాల్ట్‌కి తేడా ఏంటో చాలామందికి తెలియదు. దీనికి తోడు టీవీల్లో ప్యాకెట్ సాల్ట్ చాలా మంచిది అని ఇచ్చే అడ్వర్టైస్మెంట్ల కారణంగా వాటినే వాడేస్తుంటారు. అయితే అది క్రిస్టల్‌గా ఉండదు కాబట్టి ఈజీగా కరిగిపోతుంది అనుకుంటారు. ఆయుర్వేద పరంగా రాళ్ల ఉప్పే మంచిదని చెబుతుంటారు. ఇంతకీ ఏది మంచిది? మార్కెట్లో దొరికే ప్యాకెట్ ఉప్పు వాడకూడదా? ప్యాకెట సాల్ట్ యంత్రంలో శుద్ధి అవుతుంది. దీనికి సోడియం, క్లోరైడ్, అయెడిన్ అనే మూడింటి తోపాటు అందంగా కనిపించేలా కృత్రిమ రసాయనాలను కలిపి తయారు చేస్తున్నారు. అందువల్ల దీన్ని వాడటం వల్ల గాయిటర్, గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అధిక రక్తపోటుకి కారణంగా కూడా ఈ ప్యాకెట్ ఉప్పు వల్లనే అని తేల్చారు. మాములు ఉప్పులో 97% సోడియం క్లోరైడ్, 3% ఇతర మూలకాలు ఉంటాయి. ఇక రాతి ఉప్పు లేదా రాక్‌సాల్ట్/ రాళ్ల ఉప్పు సముద్రం లేదా ఉప్పు నీటి సరస్సుల నుంచి తయారు చేస్తారు. ఈ రాతి ఉప్పు ముతకగా ఉంటుంది. ఇందులో దాదాపు 85% సోడియం క్లోరైడ్ ఉంటుంది. ఇక మిగిలిన 15%.. ఇనుము, రాగి, జింక్, అయోడిన్, మాంగనీస్, మెగ్నీషియం, సెలీనియం మొదలైన ఖనిజాలతో సహా సుమారు 84 రకాల మూలకాలు ఉంటాయి. ఈ ఖనిజాలు శరీరానికి మేలు చేస్తాయి. ఈ రాళ్ల ఉప్పులో అయోడిన్ని కలపాల్సిన అవసరం ఉండదు. కానీ ఈ సాధారణ ఉప్పులో మాత్రం అయోడిన్ కలపాల్సి ఉంటుంది. అలాగే బ్లాక్ సాల్ట్‌లో కూడా రాక్‌సాల్ట్ మాదిరిగానే దీనిలో ఎన్నో ఖనిజాలు ఉన్నాయి. ఈ రాళ్ల ఉప్పు వల్ల కలిగే ప్రయోజనాలు.. వివిధ రకాల ఖనిజాలను కలిగి ఉండటం వల్ల, రాతి ఉప్పు అనేక వ్యాధులను నివారించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. ఇది చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. సాధారణ ఉప్పును అధికంగా ఉపయోగించడం వలన అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఎక్కువుగా ఉంటుంది. ఇది సైనస్ చికిత్సలో సహాయపడుతుంది. ఈ రాతి ఉప్పు లేదా రాళ్ల ఉప్పు సరైన క్యాంటిటీలో ఉపయోగిస్తే అధిక బరువు సమస్య ఉండదు. నిద్రలేమి లేదా ఇతర నిద్ర సంబంధిత సమస్యలు ఉన్నవారు రాళ్ల ఉప్పును ఆహారంలో చేర్చుకోవడం మంచిది. కొంతమంది రాతి ఉప్పును బాడీ స్క్రబ్‌గా కూడా ఉపయోగిస్తారు. ఇది చర్మ హైడ్రేషన్‌ను సమర్ధవంతంగా మెరుగుపరుస్తుంది. రాక్ సాల్ట్ చిగుళ్ళను శుభ్రం చేయడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. మైగ్రేన్ నొప్పికి కారణమయ్యే మెగ్నీషియం లోపాన్ని కూడా రాక్ సాల్ట్ భర్తీ చేస్తుంది. మలబద్ధకాన్ని నివారించి జీర్ణ సంబంధిత సమస్యలను మెరుగుపరుస్తుంది. (చదవండి: తక్కువ వ్యాయమమే మంచి ఫలితాలిస్తుంది!పరిశోధనల్లో షాకింగ్ విషయాలు) -
ఏమీ తినకుండా 3నెలల పాటు కఠిన ఉపవాసం చేసిన బాలిక
ఉపవాసం అనేది ఒక్కో మతం ఆచారాలను బట్టి, వ్యక్తులను బట్టి ఉంటుంది. ఉపవాసం పేరుతో కేవలం దైవాన్ని ఆరాధించడమే కాదు.. దాని అంతర్లీన పరమార్థం ఆరోగ్యమనే చెప్పాలి. అందుకే చాలామంది ఉపవాసం చేయడానికి ఇష్టపడుతుంటారు. తాజాగా జైన మతానికి చెందిన ఓ బాలిక ఏకంగా 110 రోజుల పాటు కఠిన ఉపవాసం చేసి ఆశ్చర్యపరిచింది. అసలు అన్ని రోజుల పాటు ఏమీ తినకుండా ఉపవాసం ఎలా చేయగలిగింది? ఉపవాస దీక్ష వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయన్నది ఇప్పుడు చూద్దాం. జైనమతంలో ఉపవాస దీక్షను చాలా నిష్టగా చేస్తారు. ఈ క్రమంలో ముంబైలోని జైన కుటుంబానికి చెందిన క్రిష అనే 16 ఏళ్ల అమ్మాయి ఏకంగా 3 నెలల 20 రోజుల పాటు ఎలాంటి ఆహారం తీసుకోకుండా కఠిన ఉపవాసం చేసింది. మహా మహారుషులు ఇలాంటి తపస్సులు చేయడం చూశాం. కానీ ఇంత చిన్న వయసులో మూడ్నెళ్ల పాటు ఉపవాస దీక్షను చేపట్టడం ఆశ్చర్యమే. ఈ నేపథ్యంలో కుటుంబసభ్యులు ముంబై ఘనంగా వేడుకలు నిర్వహించడంతో ఈ విషయం సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. ఇంతకీ ఆమె అన్ని రోజుల పాటు ఉపవాసం ఎలా చేయగలిగింది అన్న వివరాలను ఆరా తీయగా.. తొమ్మిదేళ్ల వయసు నుంచే క్రిషకు ఉపవాసం చేయడం అలవాటుగా ఉండేదని ఆమె కుటుంబసభ్యులు తెలిపారు. తొలుత 26 రోజుల ఉపవాసం తర్వాత ఆమె 31 రోజుల పాటు ఉపవాసాన్ని పొడిగించింది. ఆ తర్వాత 51 రోజుల పాటు నిరాహార దీక్షను విజయవంతంగా పూర్తి చేసింది. అనంతరం మరికొన్ని రోజులు పొడిగించుకుంటూ 110 రోజుల పాటు కఠినమైన ఉపవాసాన్ని పూర్తిచేసింది. ఈ క్రమంలో సుమారు 18 కేజీల బరువు తగ్గినప్పటికీ ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదురు కాకపోవడం విశేషం. ఇన్ని రోజుల పాటు క్రిష ఎలాంటి ఆహారం తీసుకోకపోవడంతో పాటు తొలి 40 రోజులు యథావిధిగా కాలేజీకి కూడా వెళ్లిందట. అన్ని రోజుల పాటు ఉపవాసం ఎలా చేయగలిగిందంటే.. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల మధ్య మాత్రమే గోరువెచ్చని నీళ్లను మాత్రమే తాగేది. ఇలా ఆహారం తీసుకోకుండా కేవలం నీళ్లను మాత్రమే తాగుతూ చేసే ఉపవాసాన్ని వాటర్ ఫాస్టింగ్ అంటారు. కేవలం నీళ్లను మాత్రమే తీసుకునేటప్పుడు కాస్త గోరువెచ్చని నీటిని తీసుకోవడం మంచిది. అంతేకాదు.. మీరు తీసుకునే నీటిలో కాస్త నిమ్మకాయ రసం, తేనె కలుపుకొని తాగితే మరిన్ని ప్రయోజనాలు చేకూరతాయని డాక్టర్లు సైతం చెబుతున్నారు. మ్మరసం వల్ల శరీరంలో పేరుకున్న కొవ్వు కరగడంతోపాటు.. శరీరం నీరసించకుండా తక్షణ శక్తి లభిస్తుంది. అంతేకాకుండా రోగనిరోధక వ్యవస్థ పనితీరు కూడా మెరుగవుతుంది. ఇలా మీరు ఉపవాసం పాటిస్తున్న రోజులో 8 నుండి 10 సార్లు ఈ మిశ్రమాన్ని తాగితే మీరు ఇతర ఆహారమేమీ తీసుకోకపోయినా ఎలాంటి సమస్యలూ ఎదురుకావు. అంతేకాదు.. ఇలా చేయడం వల్ల జీర్ణవ్యవస్థకు విశ్రాంతి లభించడంతోపాటు, శరీరంలోని వ్యర్థాలూ బయటికి వెళ్లిపోతాయి. ఉపవాసం వాళ్లు చేయకపోవడమే మంచిది ►ప్రయోజనాలు ఉన్నాయి కదా అని అదేపనిగా ఉపవాసం ఉండటమూ మంచిది కాదు. నీరసం సహా ఇతర అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉంది. ► ముఖ్యంగా అస్సలు ఆహారం తీసుకోకుండా ఖాళీ కడుపుతో ఉండిపోతుంటే బలహీనత, అసిడిటీ, డస్సిపోవటం, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. ► మధుమేహం, అసిడిటీ, బీపీ, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు ఉపవాస దీక్షను చేయరాదు. ► ముఖ్యంగా గర్భవతులు కూడా ఉపవాసం చేయకపోవడమే మంచిది. ► వేరేవాళ్లు చేస్తున్నారని మనం కూడా చేయడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. మన శరీరానికి ఏది సూట్ అవుతుందన్నది చెక్ చేసుకోవాలి. అందుకే ఎక్కువరోజులు ఉపవాసం చేయాలనుకుంటే డాక్టర్ సూచనలతో చేయడమే ఉత్తమం. ఉపవాసం సమయంలో ఏం తినాలి? ఉపవాస సమయంలో మజ్జిగ, పండ్ల రసాలు, లెమన్ వాటన్, కూరగాయల సూప్ వంటి ద్రవాహారాలు తరచుగా తీసుకోవాలి. ఇలా చేస్తే అసిడిటీ బాధ కూడా ఉండదు. ఉపవాసం ముగిసిన తర్వాత కూడా కొవ్వు పదార్ధాలు కాకుండా సగ్గుబియ్యం, కూరముక్కల వంటివి కలిపిన ఖిచిడీ, పాలు, పెసరపప్పుతో చేసిన పాయసం వంటివి తీసుకోవాలి. -
పథకం ఒకటే.. ప్రయోజనాలు రెండు
వేతన జీవులు సెక్షన్ 80సీ కింద ఒక ఏడాదిలో రూ.1.5 లక్షల పన్ను ఆదా కోసం సంప్రదాయ సాధనాలైన బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్స్, బీమా పాలసీలు, పీపీఎఫ్, ఎన్ఎస్ఈ తదితర సాధనాలకు ప్రాధాన్యం ఇస్తుంటారు. వీటికంటే కూడా దీర్ఘకాలానికి పన్ను ఆదా సౌలభ్యంతో కూడిన ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) మ్యూచువల్ ఫండ్ పథకాలు రాబడుల దృష్ట్యా ఎంతో మెరుగైనవి. కనీసం ఐదేళ్లు, అంతకుమించి దీర్ఘకాలం కోసం పెట్టుబడులను కొనసాగించే సౌలభ్యం ఉన్న వారు ఈఎల్ఎస్ఎస్ పథకాల్లో పెట్టుబడులపై రెండంకెల స్థాయిలో రాబడులను అందుకోవచ్చు. ద్రవ్యోల్బణాన్ని మించి రాబడులు ఉన్నప్పుడే సంపద సృష్టి సాధ్యపడుతుంది. మరి ద్రవ్యోల్బణాన్ని మించి రాబడులను ఇచ్చేవి ఈక్విటీ సాధనాలే. ఈ విభాగంలో మెరుగైన పనితీరు చూపిస్తున్న పథకాల్లో పరాగ్ పారిఖ్ ట్యాక్స్‌సేవర్ కూడా ఒకటి. రాబడులు ఈ పథకం 2019 జూలై 24న ఇది ప్రారంభమైంది. ఆరంభం నుంచి ఇప్పటి వరకు సగటు వార్షిక రాబడులు 21 శాతానికిపైనే ఉన్నాయి. ముఖ్యంగా గడిచిన ఆరు నెలల్లో 12 శాతం, ఏడాది కాలంలో పెట్టుబడిపై 13.55 శాతం రాబడిని ఈ పథకం తెచ్చిపెట్టింది. పరాగ్ పారిఖ్ ట్యాక్స్ సేవర్ ఫండ్‌కు.. ఈ రంగంలో ఎంతో పేరున్న రాజీవ్ ఠక్కర్ ఫండ్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయనకు మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలో సుదీర్ఘ అనుభవం ఉంది. పరాగ్ పారిఖ్ ఫ్లెక్సీక్యాప్ పథకాన్ని సైతం ఆయనే నిర్వహిస్తున్నారు. ఇక ఈ పథకం గడిచిన మూడేళ్ల కాలంలో ఏటా 22 శాతానికి పైనే రాబడులను తెచ్చి పెట్టింది. ఈ పథ కం ఎక్స్పెన్స్ రేషియో (పెట్టుబడులపై ఇన్వెస్టర్లు ఏటా చెల్లించాల్సిన మొత్తం) 1.86 శాతంగా ఉంది. పెట్టుబడుల విధానం.. ఈ పథకం పెట్టుబడుల్లో వైవిధ్యాన్ని అనుసరిస్తుంది. వ్యాల్యూ ఇన్వెస్టింగ్ విధానంలో స్టాక్స్‌ను ఎంపిక చేస్తుంటుంది. కనీసం 80 శాతం పెట్టుబడులను దేశీయ ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. మరో 20 శాతం మేర పెట్టుబడుల విషయంలో ఈ పథకానికి స్వేచ్ఛ ఉంటుంది. ఈక్విటీల్లోనూ లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ స్టాక్స్‌ను ఎంపిక చేసుకుంటుంది. మంచి యాజమాన్యం, దీర్ఘకాలంలో స్థిరమైన వృద్ధిని చూపించే కంపెనీలను ఎంపిక చేసుకుని, దీర్ఘకాలం పాటు వాటిల్లో పెట్టుబడులను కొనసాగిస్తుంది. ఈఎల్ఎస్ఎస్ పథకాల్లో పెట్టుబడులకు మూడేళ్ల లాకిన్ పీరియడ్ అమలవుతుంది. మూడేళ్లలోపు పెట్టుబడులను వెనక్కి తీసుకోవడానికి అవకాశం ఉండదు. ఇది కూడా పెట్టుబడులు, రాబడుల స్థిరత్వానికి అనుకూలించే అంశమే. ఈ పథకం నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకున్న సమయంలో లాభం రూ.లక్షకు మించి ఉన్నట్టయితే.. రూ.లక్షకు మించి ఉన్న మొత్తంపై 10 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ప్రతీ నెలా సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా దీర్ఘకాలంలో మంచి రాబడిని ఈఎల్ఎస్ఎస్ పథకాల నుంచి ఆశించొచ్చు. పోర్ట్‌ఫోలియో ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.2065 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 85 శాతాన్నే ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసింది. డెట్ సాధనాల్లో 15 శాతం పెట్టుబడులు పెట్టింది. ప్రస్తుతం నగదు నిల్వలు పెద్దగా లేవు. ఈక్విటీ మార్కెట్లు దిద్దుబాటుకు గురై, ఆకర్షణీయమైన అవకాశాలు లభిస్తే, అప్పుడు డెట్‌లో పెట్టుబడులు తగ్గించుకుని ఈక్విటీలకు కేటాయింపులు పెంచుతుంది. పెట్టుబడుల పరంగా ఫైనాన్షియల్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగ కంపెనీలకు ప్రాధాన్యం ఇచ్చింది. 50 శాతం పెట్టుబడులను ఈ రంగాల కంపెనీలకే కేటాయించింది. -
నల్ల పసుపు గురించి విన్నారా? ఎన్ని వ్యాధులకు చెక్ పెడుతుందంటే..
పసుపు, వాటి దుంపలు మనం చూశాం. అది ఎన్ని ఔషధ గుణాలు కలిగిందో కూడా తెలుసు. కానీ నల్ల పసుపు గురించి ఎప్పుడైనా విన్నారా! అది కూడా మనం వాడే పసుపుకు ఎంతో విభిన్నంగా ఉంటుంది. కానీ దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. నల్ల పసుపు మొక్కను నీలకంఠ, నరకచూర, కృష్ట కేదార అని కూడా పిలుస్తారు. దీని దుంప లోపలి భాగం ముదురు నీలం -నలుపు సమ్మేళనంతో ఉంటుంది. పువ్వు ముదురు పింక్ రంగులో ఉంటుంది. నల్ల పసుపును సాధారణంగా భారతదేశంలోని ఈశాన్య, మధ్యప్రదేశ్‌లో పండిస్తారు. నల్ల పసుపులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీని శాస్త్రీయ నామం కర్కుమా సీసియా. మణిపూర్, మరికొన్ని రాష్ట్రాల్లోని గిరిజన తెగల్లో ఈ మొక్కకు ప్రత్యేక స్థానం ఉంది. నల్లపసుపులో కర్కుమిన్ అనే పదార్థం ఉంటుంది. దీనిలో క్యాన్సర్ కణాలను నిరోధించే లక్షణాలు ఉన్నాయి. నల్ల పసుపు మీ ఆహారంలో తీసుకుంటే క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటుంది.వివిధ ఆరోగ్య సమస్యలు ఉపశమనానికి ఎంతో దోహదం చేసే పసుపు క్యాన్సర్‌కు కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని గత పరిశోధనలు చెప్పాయి. అయితే తాజాగా జీర్ణాశయ క్యాన్సర్‌ని నయం చేసే శక్తి పసుపు ఉన్న నేపథ్యంలో ఆరోగ్య నిపుణులుజీర్ణాశయ క్యాన్సర్ చికిత్సలో పసుపును వినియోగించే పద్ధతిని అభివృద్ధి చేసి సక్సెస్ అయ్యారు. సాధారణంగా పసుపు నల్ల మిరియాలు కలిపిన వేడి పాలను తీసుకుంటే గొంతు నొప్పి తగ్గుతుంది అనేది అనాదిగా మనందరికీ తెలిసిన చిట్కా. భారతదేశంలో వేల ఏళ్ళుగా ఈ చిట్కాను అనుసరిస్తున్నారు. నల్ల పసుపు వల్ల కలిగే ప్రయోజనాలు నల్ల పసుపులోని రైజోమ్ చేదు రుచిని కలిగి ఉంటుంది. దీన్ని ల్యూకోడెర్మా (మెలనిన్పిగ్మెంటేషన్కోల్పోవడం) మరియు పైల్స్ చికిత్సలో ఉపయోగిస్తారు. ఈ పసుపు మిశ్రమం బెణుకులు, గాయాల చికిత్సకు ఉపయోగిస్తున్నారు. గిరిజన స్త్రీలు రుతు క్రమ రుగ్మతలకు దీనిని ఉపయోగిస్తారు. దీనిని సాంప్రదాయకంగా గిరిజన ప్రజలు జ్వరం, వాంతులు, విరేచనాలు, కణితులు, లైంగిక వ్యాధులు, మంట మొదలైనవాటి చికిత్సకు ఉపయోగిస్తారు. అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఆది తెగవారు నల్ల పసుపు రైజోమ్‌ను యాంటీ డయేరియాటిక్గా ఉపయోగిస్తున్నారు. అయితే అరుణాచల్‌ప్రదేశ్‌లోని లోహిత్ జిల్లాకు చెందిన ఖమ్మం తెగవారు నల్ల పసుపు దుంప తాజాపేస్ట్ను తేలు, పాముకాటుకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. నల్ల పసుపు బెండులను తరచుగా న్యుమోనియా, దగ్గు మరియు పిల్లలలో జలుబు కోసం కూడా చికిత్సకు ఉపయోగిస్తారు. రైజోమ్లు ల్యూకోడెర్మా, మూర్ఛ,క్యాన్సర్ మరియు హెచ్ఐవి / వ్యతిరేకంగా పని చేస్తాయి. మైగ్రేన్ నుంచి ఉపశమననాకి ఉపయోగిస్తారు. అస్సాంలో తాజా రైజో మ్రసాన్ని ఆవాల నూనెతో కలిపి పశువుల విరేచనాల చికిత్సకు ఉపయోగిస్తార (చదవండి: ఆల్కహాల్ మోతాదుకు మించితే చనిపోతారా? పాయిజిన్‌గా ఎలా మారుతుంది?) -
రోజూ మిల్లెట్స్ తింటున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి
తెలుగు రాష్ట్రాలు వేగంగా మిల్లెట్స్ గొడుగు కిందకు చేరుతున్నాయి. ఇది అన్ని ట్రెండ్స్‌లా ఇలాగ వచ్చి అలాగ వెళ్లిపోరాదు.ఎన్నో వసంతాల పాటు మనతో పాటు చిగురించాలి. మిల్లెట్స్ ఆహారంలో భాగమవుతున్నంత వేగంగా కనుమరుగయ్యే ప్రమాదమూ ఉంది. ఎందుకంటే మనం మిల్లెట్స్ వాడకంలో చూపిస్తున్న అత్యుత్సాహం వాటిని అర్థం చేసుకోవడంలో చూపించడం లేదంటున్నారు ఇక్రిశాట్లో అగ్రానమిస్ట్గా ఉద్యోగవిరమణ చేసి, హైదరాబాద్, బోయిన్పల్లి, ఇక్రిశాట్ కాలనీలో విశ్రాంత జీవనం గడుపుతున్నసీనియర్ సైంటిస్ట్ మేకా రామ్మోహన్ రావు. ఇదీ నా పరిచయం! మాది కృష్ణాజిల్లా, పాగోలు గ్రామం పరిధిలోని మేకావారి పాలెం. బాపట్ల అగ్రికల్చరల్ కాలేజ్‌లో ఏజీ బీఎస్సీ. హైదరాబాద్, రాజేంద్రనగర్‌లోని ఆచార్య ఎన్జీ రంగా (ఇప్పుడది ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ) అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ. ఢిల్లీలోని ఐఏఆర్ఐ (ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్)లో వ్యవసాయ పద్ధతుల మీద పరిశోధన చేశాను. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఇక్రిశాట్లో ఒకడినయ్యాను. ఒక మోస్తరు వ్యవసాయ కుటుంబం మాది. మా కుటుంబంలో తొలితరం విద్యావంతుడిని కావడంతో ఏ కోర్సులు చదివితే ఎలాంటి ఉన్నత స్థితికి చేరవచ్చని మార్గదర్శనం చేయగలిగిన వాళ్లెవరూ లేరు. ఢిల్లీకి వెళ్లి పీహెచ్డీ చేయడం కూడా మా ప్రొఫెసర్ గారి సూచనతోనే. మా నాన్న చెప్పిన మాట నాకిప్పటికీ గుర్తే. కాలేజ్ ఖర్చులు భరించి చదివించగలనంతే. డొనేషన్లు కట్టి చదివించాలని కోరుకోవద్దు’ అన్నారాయన. ఆ మాట గుర్తు పెట్టుకుని విస్తరణకు ఉన్న అవకాశాలను వెతుక్కుంటూ సాగిపోయాను. నా ప్రాథమిక విద్య ఏ మాత్రం స్థిరంగా సాగలేదంటే నమ్ముతారా! ఐదవ తరగతి లోపు మూడుసార్లు స్కూళ్లు మారాను. హైస్కూల్ కూడా అంతే. చల్లపల్లి స్కూల్లో పన్నెండవ తరగతి వరకు చదివాను. జాతీయ పతాక ఆవిష్కర్త పింగళి వెంకయ్యగారు కూడా చల్లపల్లి స్కూల్లోనే చదివారు. – మేకా రామ్మోహన్రావు, సీనియర్ సైంటిస్ట్ (రిటైర్డ్), ఇక్రిశాట్ జ్ఞానాన్ని ఇచ్చి పుచ్చుకున్నాం! ‘‘ఇప్పుడు నేను చిరుధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవడం గురించి పని చేస్తున్నాను. కానీ నా అసలు వృత్తి చిరుధాన్యాల సాగు. పటాన్చెరులో మా పరిశోధన క్షేత్రం. మనదేశంలో వర్షాధార నేలలను సమర్థంగా సాగులోకి తీసుకురావడానికి మిల్లెట్స్ మీద విస్తృతంగా పరిశోధనలు చేశాను. ఆ తర్వాత కామెరూన్, బ్రెజిల్, నైజీరియా, కెన్యాల్లో పని చేశాను. ప్రధాన పంటతో పాటు అంతర పంటగా మిల్లెట్స్‌ను సాగు చేయడం, అలాగే మిశ్రమ సాగు విధానాన్ని వాళ్లకు అలవాటు చేశాం. మన మిల్లెట్స్‌ని ఆయా దేశాలకు పరిచయం చేశాం. ఆ దేశాలు సమర్థంగా అనుసరిస్తున్నాయి. ఇన్ని దేశాలూ తిరిగి మన జ్ఞానాన్ని వాళ్లకు పంచి, వాళ్ల నుంచి నేర్చుకోవాల్సిన మెళకువలను మనదేశానికి తీసుకు వచ్చిన తర్వాత పరిశీలిస్తే... మనదేశంలో వ్యవసాయం సరికొత్త రూపు సంతరించుకుని ఉంది. ఒకప్పుడు పాడి–పంట కలగలిసి సమాంతరంగా సాగుతుండేవి. పంట సాగు చేసే రైతు ఇంట్లో పాడి కూడా ఉండేది. ఆ పశువుల ఎరువుతో సాగు చేసుకుంటూ అవసరానికి కొంత మేర పై నుంచి రసాయన ఎరువులను వాడేవాళ్లు. ఇప్పుడు పాడి రైతు వేరు, పంట రైతు వేరయ్యారు. దాంతో పంట సాగు ఆరోగ్యంగా లేదు, పాడి రైతు కూడా సౌకర్యంగా లేడు. జరిగిన పొరపాటును సరి చేసుకోవడానికి సేంద్రియ సాగును వెనక్కి తెచ్చుకుంటున్నాం. అలాగే ఆహారంలో కూడా ఇప్పుడు మిల్లెట్స్ రూపంలో ఆరోగ్యాన్ని వెతుక్కుంటున్నాం. చిరుధాన్యాలు, వరిధాన్యం తగు పాళ్లలో తీసుకునే రోజుల నుంచి జొన్నలు, రాగులను పూర్తిగా మర్చిపోయాం. ఇప్పుడు చిరుధాన్యాల పరుగులో వరిధాన్యాన్ని వదిలేస్తున్నారు. మిల్లెట్ మెనూ ప్రాక్టీస్‌లో మనవాళ్లు చేస్తున్న పొరపాట్లు చూస్తుంటే వాటిని అలవాటు చేసుకున్న నెల రోజుల్లోనే మిల్లెట్స్‌కు దూరమైపోతారేమోననే ఆందోళన కూడా కలుగుతోంది. అందుకే అవగాహన కల్పించే బాధ్యతను నాకు చేతనైనంత చేస్తున్నాను. టేబుల్ మార్చినంత సులువు కాదు! పుట్టినప్పటి నుంచి కొన్ని దశాబ్దాలుగా అన్నం తినడానికి అలవాటు పడిన దేహాన్ని ఒక్కసారిగా మారమంటే సాధ్యం కాదు. మనం డైనింగ్ టేబుల్ మీద పదార్థాలను మార్చేసినంత సులువుగా మన జీర్ణవ్యవస్థ మారదు, మారలేదు కూడా. అందుకే మొదటగా రోజులో ఒక ఆహారంలో మాత్రమే మిల్లెట్స్ తీసుకోవాలి. జొన్న ఇడ్లీ లేదా రాగి ఇడ్లీతో మొదలు పెట్టాలి. ఒక పూట అన్నం తప్పకుండా తినాలి. రాత్రికి రొట్టె లేదా సంగటి రూపంలో మిల్లెట్స్ అలవాటు చేసుకుంటే ఈ తరహా జీవనశైలిని కలకాలం కొనసాగించడం సాధ్యమవుతుంది. దేహం మొదట మిల్లెట్స్‌ను అడాప్ట్ చేసుకోవాలి, ఆ తర్వాత వాటిని అబ్జార్బ్ చేసుకోవడం మొదలవుతుంది. దేహానికి ఆ టైమ్ కూడా ఇవ్వకుండా ఆవకాయతో అన్న్రప్రాశన చేసినట్లు మెనూ మొత్తం మార్చేస్తే ఓ నెల తర్వాత ఆ ఇంటి టేబుల్ మీద మిల్లెట్స్ మాయమవుతాయనడం లో సందేహం లేదు. మరో విషయం... వరి అన్నం తీసుకున్నంత మోతాదులో మిల్లెట్ ఆహారాన్ని తీసుకోకూడదు. పావు వంతుతో సరిపెట్టాలి. అలాగే అరవై దాటిన వాళ్లు జావ రూపంలో అలవాటు చేసుకోవాలి. సాయంత్రం మిల్లెట్ బిస్కట్లను తీసుకోవాలి. ఇక అనారోగ్యానికి గురయిన వాళ్లు తిరిగి కోలుకునే వరకు మిల్లెట్స్‌కి దూరంగా ఉండడమే మంచిది. ఈ సందర్భంగా ప్రముఖ జర్నలిస్ట్ కుష్వంత్ సింగ్ అనుభవాన్నే ఉదాహరిస్తాను. గట్టి ఆహారం తీసుకునే పంజాబీ కుటుంబంలో పుట్టిన ఆయన వార్ధక్యంలో ‘దక్షిణాది ఆహారం సులువుగా జీర్ణమవుతోందని, ఇడ్లీ, అన్నానికి మారినట్లు’ రాసుకున్నారు. మిల్లెట్స్ మనదేహానికి సమగ్రమైన ఆరోగ్యాన్ని చేకూరుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. నిదానంగా జీర్ణమవుతూ, నెమ్మదిగా శక్తిని విడుదల చేస్తుంది. ఊబకాయం సమస్య ఉండదు. ఈ వివరాలన్నీ చెబుతూ మెనూతో పాటు మోతాదును కూడా గమనింపులో పెట్టుకోవాలని మహిళలకు వివరిస్తున్నాను. వాళ్లకు చక్కగా అర్థమైతే చాలు, ఇక ఆ వంటగది నుంచి మిల్లెట్ ఎప్పటికీ దూరం కాదు’’ అన్నారు రామ్మోహన్రావు. రోజూ ఓ గంటసేపు నడక, పాలిష్ చేయని బియ్యంతో అన్నం, మిల్లెట్ బిస్కట్ తీసుకుంటారు. ‘మిల్లెట్స్‌తో ఎన్ని రకాల వంటలు చేసుకోవచ్చో వివరించడానికి కాలనీల్లో మిల్లెట్ మేళాలు నిర్వహిస్తుంటాం. కానీ నేను మాత్రం వాటిలో ఒక్క రకమే తింటాను’’ అన్నారాయన నవ్వుతూ. – వాకా మంజులారెడ్డి, ఫొటోలు : మోర్ల అనిల్ కుమార్ -
నిరుద్యోగభృతి ఇచ్చాకే కేసీఆర్ ఓట్లు అడగాలి
హుజూర్నగర్: రాష్ట్రంలోని నిరుద్యోగులకు నిరుద్యోగభృతి ఇచ్చిన తర్వాతే సీఎం కేసీఆర్ ఓట్లు అడగాలని నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. 2018 డిసెంబర్ నుంచి నిరుద్యోగులకు ప్రభుత్వం నెలకు రూ.3 వేల చొప్పున బాకీ ఉన్నదని చెప్పారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని అసెంబ్లీలో చెప్పి ఇంతవరకు పట్టించుకోకుండా కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు గత ఎన్నికల్లో దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడు ఎకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక అందరినీ మోసం చేశారన్నారు. రాష్ట్రంలో అతి పెద్ద సామాజికవర్గంగా ఉన్న మాదిగలకు మంత్రి పదవి ఇవ్వలేదని, మరో పెద్ద సామాజికవర్గం ముదిరాజ్‌లకు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా ఇవ్వలేదని, ముస్లింలకు మూడు సీట్లు ఇచ్చినా వాటిలో రెండు ఓడిపోయే సీట్లేనని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ రెండు కలిసిపోయాయని, ఢిల్లీలోని బీజేపీని ఇంటికి పంపాలంటే బీఆర్ఎస్ను ఓడించాలన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ను ఓడించాలని ప్రజలు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 70 పైచిలుకు స్థానాలు గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్న 12 సీట్లను కాంగ్రెస్ గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హుజూర్నగర్, కోదాడలలో 50 వేల ఓట్ల మెజారీ్టతో గెలవబోతున్నామని ఆయన తెలిపారు. -
బ్రౌన్ బ్రెడ్ తింటున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి
ఈ మధ్యకాలంలో చాలామంది మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కోసం బ్రౌన్ బ్రెడ్‌ను వినియోగిస్తుంటారు.గత కొన్ని దశాబ్దాలుగా భారతదేశంలో బ్రెడ్ వినియోగం విపరీతంగా పెరగిపోయింది. అల్పాహారం, శాండ్విచ్, పాన్కేక్.. ఇలా ఒకటేమిటి చాలా రకాలుగా బ్రెడ్‌ను వాడుతున్నారు. మరి బ్రౌన్ బ్రెడ్ ఆరోగ్యానికి ఎంత వరకు మంచిది? వైట్ బ్రెడ్ కంటే బ్రౌన్ బ్రెడ్ ఆరోగ్యకరమైనదా? ఇప్పుడు చూద్దాం. బిజీ లైఫ్ కారణంగా చాలామంది టిఫిన్‌గా బ్రెడ్ టోస్ట్ లేదా ఆమ్లెట్‌తో సరిపెట్టుకుంటారు. అయితే ఇదంత మంచిది కాదు. బ్రెడ్‌లో మైదా ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు శరీరంలో పిండిపదార్థం, ఉప్పు కూడా పెరిగి అధిక రక్తపోటు, గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది. బ్రెడ్‌లో పిండి పదార్థం కారణంగా తిన్న వెంటనే రక్తంలో కలిసిపోతుంది. ఇది చక్కెర స్థాయిలను పెంచుతుంది. ఎక్కువగా బ్రెడ్ తినేవారిలో ఊబకాయానికి కూడా దారితీస్తుంది. బ్రౌన్ బ్రెడ్‌తో పోలిస్తే వైట్ బ్రెడ్ అంత మంచిది కాదు. దీనిలో విటమిన్లు, మినరల్స్, పోషకాలు పెద్దగా ఏమీ ఉండవు. కాబట్టి ఇది తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు లేకపోతే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వైట్ బ్రెడ్ తయారీకి వాడే పిండిలే ఫైబర్ అస్సలు ఉండదు. ఇది జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. దీంతో పాటు అసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలు కూడా వస్తాయి. బ్రౌన్ బ్రెడ్ మంచిదేనా? ►వైట్ బ్రెడ్‌తో పోలిస్తే బ్రౌన్ బ్రెడ్ మంచిది. అయితే నార్మల్ పిండితో కాకుండా మల్టీగ్రెయిన్ బ్రౌన్ బ్రెడ్ తీసుకోవడం బెటర్. ఎందుకంటే ఇందులో కల్తీ జరగడానికి ఆస్కారం ఎక్కువ. మైదా బ్రెడ్కే కలర్ వేసి బ్రౌన్ బ్రెడ్‌గా విక్రయిస్తుంటారు. అందుకే ప్యాకెట్ వెనుక భాగంలో ఉండే ఇంగ్రీడియన్స్ను చెక్ చేసుకోవాలి. ► బ్రౌన్ బ్రెడ్‌ను గోధుమలు, నీళ్లు, ఉప్పు, చక్కెర, ఈస్ట్ ఉపయోగించి తయారుచేస్తారు. ► బ్రౌన్ బ్రెడ్‌లో ఐరన్, జింక్, కాపర్, మెగ్నిషియం వంటి పోషకాలు ఉంటాయి. ► బ్రౌన్ బ్రెడ్‌లో 28 గ్రాముల ధాన్యపు పోషకాలను అందిస్తుందట. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో చక్కగా పనిచేస్తుంది. ► ప్రతి రోజూ బ్రౌన్ బ్రెడ్ తినడం వల్ల శరీరానికి విటమిన్ కే, ఈ, బీ, కార్భోహైడ్రేట్లు, మెగ్నీషియం, ఫైబర్ వంటి పోషకాలు లభిస్తాయి. బ్రౌన్ బ్రెడ్ బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్. ► రోజూ 1-2 బ్రౌన్‌బ్రెడ్ ముక్కలను తీసుకోవడం వల్ల సెరోటోనిన్ అనే హ్యాపీ హార్మోన్ విడుదల అవుతుందని ఓ సర్వేలో వెల్లడైంది. ఈ హార్మోన్ మంచి నిద్రకు ప్రేరేపించడమే కాకుండా, అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. ► మల్టీ గ్రైన్ బ్రెడ్ లో ధాన్యం గింజలు గ్లైసెమిక్ ఇండెక్స్‌ను తక్కువగా ఉండేలా చేస్తాయి. వీటి వల్ల మధుమేహం, క్యాన్సర్, గుండె జబ్బులు వంటి రిస్క్ తగ్గుతుంది. ► మల్టీ గ్రైన్ బ్రెడ్ లో ఫ్యుతోన్యూట్రియన్ అనే యాంటి ఆక్సిడెంట్ ఉంటుంది. ఇవి ఫ్రీ రాడికల్స్ నుంచి కణాలను రక్షించటానికి సహాయపడతాయి. -
సీతాఫలం తరచూ తింటున్నారా? దీనిలోని గ్లైసెమిక్ ఇండెక్స్..
గుమ్మలక్ష్మీపురం: ఏజెన్సీలో సీతాఫలాల సీజన్ ప్రారంభమైంది. తియ్యని ఈ పండ్లలో ఎన్నో పోషక విలువలుండడమే కాకుండా కొన్ని రకాల అనారోగ్యాల నివారిణిగా పనిచేస్తుంది. ఈ పండే కాకుండా చెట్టు ఆకులు, బెరడు కూడా ఔషధ గుణాలను కలిగి ఉన్నాయని రస్తా కుంటుబాయి కృషి విజ్ఞాన కేంద్రం (ఆచార్యా ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం) గృహ విజ్ఞాన విభాగం శాస్త్రవేత్త వై.ఉమాజ్యోతి తెలిపారు. సీతాఫలం తీసుకుంటే కలిగే ఉపయోగాల గురించి ఆమె తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఎన్నో విటమిన్ల కలబోత సీతాఫలంలో ఎన్నో రకాల పోషకాలతో పాటు విటమిన్లు ఉన్నాయి. ఈ పండు తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. విటమిన్ (ఎ), విటమిన్ (బి) మెగ్నిషియం, పొటాషియం, ఫైబర్, ఐరన్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. ఉదయాన్నే తినడం ద్వారా కండరాలు, నరాల బలహీనత వంటి రుగ్మతలు తొలగిపోతాయి. శరీరానికి కావాల్సినంత శక్తి లభిస్తుంది. విటమిన్ (ఎ) పుష్కలంగా ఉండడంతో కంటి సమస్యలు దూరమవుతాయి. మెగ్నీషియం, పోటాషియం, సోడియం సమపాళ్లలో ఉండడం వల్ల రక్తపోటును అదుపు చేసి గుండె సమస్యలు తలెత్తకుండా చూస్తుంది. పేరుకుపోయిన అధిక కొవ్వును కరిగిస్తుంది. అల్సర్, గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. గర్భిణులు తినడం ద్వారా పుట్టబోయే బిడ్డల మెదడు చురుగ్గా ఉంటుంది. క్యాన్సర్ వంటి రోగాలు రాకుండా తోడ్పడుతుంది. బలహీనంగా ఉండే చిన్న పిల్లలకు సీతాఫలాలను ఎంత ఎక్కువగా తినిపిస్తే అంత మేలు. ఈ పండ్లను ఎక్కువగా తినడం ద్వారా రక్తహీనత తగ్గుతుంది. కడుపులో మంట, జీర్ణ సంబంధ సమస్యలున్న వారు ఈ పండ్లను ఎక్కువగా తినడం మంచిది. డైటింగ్ చేసేవారు ఈ పండ్లను క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చు. ఎదుగుతున్న పిల్లలు నిత్యం తింటుంటే కాల్షియం లాంటి పోషకాలు అధికంగా లభిస్తాయి. దీంతో ఎముకలు దృఢంగా ఉంటాయి. శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలను బయటకు పంపడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. రక్తం శుధ్ధి అవుతుంది. గుండె ఆరోగ్యానికి మెరుగు సీతాఫలం చూడడానికి కూడా హృదయాకారంలో ఉంటుంది. శరీరమంతా రక్తప్రసరణ సరిగ్గా ఉండేలా చూస్తుంది. అందువల్ల రక్తహీనత దరి చేరదు. ఈ పండు తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా సరిగ్గా ఉంటాయి. సీతాఫలంలో గ్లైసెమిక్ ఇండెక్స్ 54, అంటే లో–గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. అందువల్ల డయాబెటిస్ ఉన్న వారు కూడా సీతాఫలం తినవచ్చు. అలాగే ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ మలబద్దకాన్ని అరికడుతుంది. ఉదర ఆరోగ్యానికి.. దీనిలో విటమిన్ సి సమృధ్ధిగా దొరుకుతుంది. ఆహారం తేలిగ్గా జీర్ణమయ్యేటందుకు దీనిలోని పీచుపదార్థం తోడ్పడుతుంది. అల్సర్లను నయం చేస్తుంది. ఎసిడిటీకీ చెక్ పెడుతుంది. డయేరియా లాంటి సమస్య రాకుండా అడ్డుకుంటుంది. చర్మ ఆరోగ్యానికి దోహదం ఈ పండులో స్మూత్ స్కిన్ టోన్ అందించే సూక్ష్మపోషకాలు ఉంటాయి. దీన్ని తినడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడి స్కిన్ మెరుస్తుంది. ఆకులతోనూ ప్రయోజనం ఒక్క పండేకాదు, సీతాఫలంచెట్టు ఆకులు కూడా ఉపయోగపడతాయి. ఆకుల్లోని హైడ్రోక్లోరిక్ ఆమ్లం చర్మ సంబంధ సమస్యల్ని తగ్గిస్తుంది. ఆకుల్ని మెత్తగా నూరి రాస్తే చర్మ వ్యాధులు తగ్గుతాయి. ఆకుల్ని మెత్తగా నూరి బోరిక్ పౌడర్ కలిపి మంచం, కుర్చీల మూలల్లో ఉంచితే నల్లుల బెడద ఉండదు. చెట్టు బెరడును కాచగా వచ్చిన కషాయాన్ని అధిక విరేచనాలతో బాధపడేవారికి ఔషధంగా ఇస్తుంటారు. సీతాఫలం గింజల్ని పొడిచేసి తలకు రాసుకుంటే పేల సమస్య ఉండదు. అయితే కళ్లల్లో పడకుండా చూసుకోవాలి. నేరుగా తినడమే మంచిది గర్భిణులు ఈ పండును సాధ్యమైనంత తక్కువగా తినాలి. పొరపాటున గింజలు లోపలికి వెళితే గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉంది. మోతాదుకు మించి తినకూడదు. మధుమేహ వ్యాధి గ్రస్తులు, ఊబకాయులు ఈ పండ్లను వైద్యుల సలహాలతో తీసుకోవాలి. జలుబు, దగ్గు, ఆయాసం, ఎలర్జీ సమస్యలతో బాధపడేవారు పరిమితంగా తీసుకోవడం మంచిది. ఈ ఫలాన్ని రసం రూపంలో కాకుండా నేరుగా తినడమే ఉత్తమం. ఎందుకంటే గుజ్జు నోటిలోపల జీర్ణరసాలను పెంచుతుంది. తద్వారా జీర్ణక్రియ వేగవంతమవుతుంది. పండుగుజ్జును తీసుకుని రసంలా చేసి పాలు కలిపి పిల్లలకు తాగిస్తే సత్వర శక్తి లభిస్తుంది. – వై.ఉమాజ్యోతి, శాస్త్రవేత్త, కేవీకే, రస్తాకుంటుబాయి -
ఆర్టీసీ లో ‘ఆగస్టు’ టెన్షన్
ఆ 183 మంది ఆర్టీసీ ఉద్యోగులుగానే రిటైర్మెంట్ తీసుకుంటారా? ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా అందే అన్ని రకాల బెనిఫిట్స్ పోయినట్టేనా ? ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనమయ్యే ప్రక్రియ ఆలస్యమవుతున్న కొద్దీ వారిలో తీవ్ర ఆందోళన నెలకొంది. కోరుకున్న అవకాశం అందినట్టే అందిచేజారిపోతుందనే బాధ వారిలో స్పష్టంగా కనిపిస్తోంది. సాక్షి, హైదరాబాద్: ఈ నెల నుంచే ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు చెల్లించేందుకు సిద్ధమని ఇటీవల ఆర్టీసీ చైర్మన్ స్వయంగా ప్రకటించారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నామని ఆర్టీసీ ఉన్నతాధికారులూ వెల్లడించారు. ఆర్టీసీ ఉద్యోగుల వివరాలు, వారు పనిచేస్తున్న విభాగాల వారీగా ఆర్థికశాఖకు వెళ్లాయి. జీతాలు చెల్లింపునకు అంతా సిద్ధమవుతోంది. కానీ, ఇప్పటి వరకు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్టుగా ప్రభుత్వ ఉత్తర్వు మాత్రం జారీ కాలేదు. ఏ తేదీ నుంచి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలో ఆ ఉత్తర్వులో పేర్కొనాల్సి ఉంది. ఆ తేదీ విషయంలో స్పష్టత లేకపోయేసరికి ఇప్పుడు ఆర్టీసీ లో గందరగోళం నెలకొంది. ఆగస్టు నెలాఖరుకు ఆర్టీసీలో 183 మంది పదవీ విరమణ పొందాల్సి ఉంది. రిటైర్మెంట్కు ఇంకా 13 రోజులు మాత్రమే ఉంది. ఇప్పటి వరకు ప్రభుత్వ ఉత్తర్వు వెలువడకపోవటంతో తాము విలీన ప్రక్రియ కంటే ముందే విరమణ చేయాల్సి వస్తుందేమోనన్న టెన్షన్ వారిలో ఉంది. వాస్తవానికి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని గత నెల31నే మంత్రివర్గ సమావేశం తీర్మానించింది. దీంతో తాము కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా పదవీ విరమణ చేయొచ్చని ఈ 183 మంది ఆశపడ్డారు. కానీ నెలాఖరు సమీపిస్తున్నా, అసలు తంతు మాత్రం ఇంకా పెండింగ్‌లో ఉండడంతో వారు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. గవర్నర్ ఆమోదంలో జాప్యంతో..: ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనానికి సంబంధించిన బిల్లును ఈ నెల 6వ తేదీన శాసనసభ ఆమోదించింది. ఆ వెంటనే బిల్లు గవర్నర్ ఆమోదానికి పంపిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు రాజ్‌భవన్ దానిపై ఆమోదముద్ర వేయలేదు. పది రోజులు దాటినా గవర్నర్ ఆమోదం లభించలేదు. దీంతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయలేదు. తాజాగా ఆ బిల్లుపై సందేహాల నివృత్తికి న్యాయశాఖ కార్యదర్శి అభిప్రాయం కోసం పంపినట్టు రాజ్‌భవన్‌వర్గాలు అధికారికంగా ప్రకటన విడుదల చేశాయి. దీంతో బిల్లుపై గవర్నర్ సంతకం, ప్రభుత్వ ఉత్తర్వు జారీకి మరికొంత సమయంపట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ బెనిఫిట్స్ కోల్పోయినట్టేనా ? ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ పరిధిలోకి వస్తే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నుంచి సీనియర్ డిపో మేనేజర్ వరకు పెద్దగా ప్రయాజనం లేకున్నా, కిందిస్థాయి ఆర్టీసీ ఉద్యోగుల వేతనాల్లో మంచి పెరుగుదల ఉంటుంది. గ్రాట్యూటీ, పీఎఫ్ మొత్తం కూడా పెరుగుతుంది. కొత్త పీఆర్సీ వస్తే జీతాలు పెరుగుదల మరింతగా ఉంటుంది. ఆర్టీసీలో ప్రస్తుతం ఉద్యోగ విరమణ వయసు 60 ఏళ్లుగా ఉండగా, ప్రభుత్వంలో అది 61 ఏళ్లుగా ఉంది. దీంతో ఒక సంవత్సరం ఎక్కువగా పనిచేసే వెసులుబాటు కలుగుతుంది. పెరిగిన జీతం 12 నెలల పాటు అందుకునే వీలు చిక్కుతుంది. ఉద్యోగ భద్రతకు భరోసా ఉంటుంది. -
దానిమ్మ తొక్కలను పడేస్తున్నారా? ఇవి తెలిస్తే అస్సలు వదిలిపెట్టారు
పండ్లు తిన్న తర్వాత సాధారణంగా తొక్కలను పారేస్తుంటాం. కానీ ఆ తొక్కల్లో ఫైబర్, విటమిన్స్, యాంటిఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయన్న విషయం చాలామందికి తెలియదు. దానిమ్మ పండు విషయానికి వస్తే.. దానిమ్మ గింజలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అనారోగ్యంతో ఉన్నవారికి దివ్య ఔషధం దానిమ్మ. ఎన్నో సమస్యలను ఈ పండు నయం చేస్తుంది. దానిమ్మ పండే కాదు, తొక్క కూడా చాలా ఉపయోగకరం. దీనిలో యాంటిఆక్సిడెంట్స్ ,ఫినోలిక్ యాసిడ్స్,ప్రోటీన్లు, ఫ్యాటీ యాసిడ్స్ మెండుగా ఉంటాయి. అసలు దానిమ్మ తొక్క ప్రయోజనాలు తెలిస్తే మీరు అసలు వదిలిపెట్టరు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ దానిమ్మను ఇష్టపడతారు. దానిమ్మలోని పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. విటమిన్-సి, కె, బి, ఎ ఇందులో పుష్కలంగా ఉంటాయి. దానిమ్మలోని గుణాలు గుండెసమస్యలు, హైపర్ టెన్షన్, క్యాన్సర్, డయాబెటిస్ వంటి సమస్యలను దూరం చేస్తుంది. ఇక దానిమ్మ గింజల్లోనే కాదు, తొక్కలోనూ అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఆరోగ్యాన్నే కాదు, అందాన్ని కూడా పెంచుతుంది. దానిమ్మ రసం కంటే తొక్కలో 50శాతం అదిక మొత్తం యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. మెండుగా యాంటీ ఆక్సిడెంట్లు ► దానిమ్మ తొక్కల్లో ఉండే అధిక యాంటీ ఆక్సిడెంట్లు హార్ట్ ఎటాక్ రిస్క్‌ను తగ్గిస్తుంది. శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ► చర్మ క్యాన్సర్‌ని తగ్గించడంలో దానిమ్మ తొక్కలు బాగా పనిచేస్తాయి. హానికరమైన యూవీఏ కిరణాల నుంచి ఇది రక్షిస్తుంది. దానిమ్మ తొక్కలతో పొడి చేసుకొని దాన్ని ముఖానికి అప్లై చేసుకుంటే ముఖం చాలా కాంతివంతంగా మెరిసిపోతుంది. ► దానిమ్మ తొక్కలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల చక్కెర స్థాయిలను తగ్గించి బరువును కంట్రోల్లో ఉంచేలా చేస్తుంది. ► దానిమ్మ తొక్కలను మరిగించి ఆ రసాన్ని తాగితే కీళ్లనొప్పలు, గొంతునొప్పి నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది. ► దానిమ్మలో రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు మెండుగా ఉంటాయి. దానిమ్మ తొక్కల రసాన్ని మహిళల్లో పీరియడ్స్ సమస్య తగ్గిపోతుంది. ► దానిమ్మ తొక్కలో అధికంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి...తొక్కలను శుభ్రంగా కడిగి రసం తీసి తాగితే , ఆరోగ్యానికి మంచిది. ► కప్పు నీటిలో టీస్పూను దానిమ్మ పొడి, అరచెక్క నిమ్మరసం వేసి తాగినా మంచిదే. దానిమ్మ పొడి చేసుకోండిలా.. దానిమ్మ గింజలను తిని తొక్కలను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. తొక్కలను ఎండలో ఆరబెట్టాలి. చక్కగా ఎండిన తర్వాత మిక్సీలో వేసి పొడిచేసుకొని గాలి చొరబడని డబ్బాలో నిల్వచేసుకోవాలి. దానిమ్మతో అందం, మొటిమలు మాయం టేబుల్‌స్పూను దానిమ్మ పొడిలో అరటేబుల్ స్పూను నిమ్మరసం, అరటేబుల్ స్పూను తేనె వేసి చక్కగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ, చేతులకు స్క్రబ్బర్‌లా రుద్ది కడగాలి. ఈ స్క్రబర్ వల్ల మృతకణాలు , ట్యాన్ తొలగి ముఖ చర్మం మృదువుగా మారుతుంది. దానిమ్మ తొక్కలు మొటిమలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇందుకోసం ఏం చేయాలంటే.. దానిమ్మ పొడిలో కొన్ని నీళ్లు పోసి మెత్తని పేస్టులా చేసుకొని ముఖానికి అప్లై చేసుకోవాలి. 20నిమిషాల తర్వాత చల్లని నీళ్లతో కడిగేయాలి. ఇలా తరచూ చేస్తుంటే మొటిమల సమస్య తగ్గిపోతుంది. వయస్సురీత్యా వచ్చే ముడతలను కూడా దానిమ్మ తగ్గిస్తుంది. ప్రతిరోజూ ఈ పొడిని రాసుకుంటే మార్పు మీకే కనిపిస్తుంది. కొబ్బరినూనెలో దానిమ్మ తొక్కలను కలపి వేడిచేసి చల్లారాక తలకు పట్టించాలి. 15 నిమిషాల తర్వాత స్నానం చేస్తే చుండ్రు పూర్తిగా తగ్గిపోతుంది. దానిమ్మ తొక్కలు చర్మం pHని సమతుల్యం చేస్తుంది. తేమగా ఉంచుతంది. చర్మ కణాలను పునరుత్పత్తి చేస్తుంది. హానీకరమైన యూవీ కిరణాల నుంచి రక్షిస్తుంది. -
సాగుబడి: హైడ్రోపోనిక్స్ పద్ధతిలో గడ్డిసాగుతో మంచి ఆదాయం
ప్రపంచంలోనే అత్యధిక పాలను ఉత్పత్తి చేస్తున్న మన దేశంలో పచ్చిగడ్డి లభ్యత 11 శాతం తక్కువగా ఉందని భారతీయ గడ్డి నేలలు, పశుగ్రాస పరిశోధనా సంస్థ లెక్కగట్టింది. భూతాపం ప్రమాదకరమైన రీతిలో పెరుగుతున్న ప్రస్తుత కాలంలో పచ్చి గడ్డి సాగుకు హైడ్రోపోనిక్స్ పద్ధతి చక్కని ప్రత్యామ్నాయంగా మారుతోంది. ఈ పద్ధతిలో తక్కువ స్థలంలో, పది శాతం నీటితోనే ఏడాది పొడవునా మొలక గడ్డిని పెంచుకోవచ్చు. మొలక గడ్డిని పాడి ఆవులు, గొర్రెలు, మేకలకు మేపటం మన రాష్ట్రాల్లోనే కాదు.. రాజస్థాన్‌లోని థార్ ఎడారి ప్రాంత పశుపోషకులను సైతం ఆకర్షిస్తోంది. అక్కడ ఏడాదిలో రెండు నెలలే వర్షం పడుతుంది. మండు వేసవిలో ఎండ వేడి 120 డిగ్రీల సెల్షియస్‌కు చేరుతుంటుంది. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో జీవించే థార్ ప్రాంత రైతులు, సంచార పశుపోషకులు స్వచ్ఛంద సంస్థలు, స్టార్టప్‌ల తోడ్పాటుతో ఇటీవల హైడ్రోపోనిక్ మొలక గడ్డి సాగు చేపట్టారు. సునాయాసంగా నాణ్యమైన పాల దిగుబడితో పాటు ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. స్వచ్ఛంద సంస్థలు, స్టార్టప్‌లు ఎడారి ప్రాంత రైతులు, పశుపోషకుల కోసం హైడ్రోపోనిక్ మొలక గడ్డిని పెంచే షెడ్లను నెలకొల్పుతున్నాయి. రైతులే వాటిలో మొక్కజొన్నలు, గోధుమలను నానబెట్టి, వర్టికల్ గార్డెన్ మాదిరిగా అనేక దొంతర్లలో ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ ట్రేలలో మొలక గడ్డిని పెంచుతున్నారు. సాధారణంగా పొలంలో పచ్చి గడ్డిని పెంచడానికి 2 నెలలు పడుతుంది. మొలక గడ్డి 8 రోజుల్లో పెరుగుతుంది. ముఖ్యంగా పది శాతం నీటితోనే ఈ గడ్డి పెరగటం థార్ ఎడారి ప్రాంత రైతులు, పశుపోషకులకు ఉపయుక్తంగా మారింది. ఏడాది పొడవునా ఆదాయం స్వచ్ఛంద సంస్థ ఉర్ముల్ సీమంత్ సమితి, డిజర్ట్ రిసోర్స్ సెంటర్‌తో కలసి హైడ్రోగ్రీన్స్, బహుళ నేచురల్స్ స్టార్టప్‌లు మొలక గడ్డి ఉత్పత్తి యూనిట్లను థార్ ఎడారి గ్రామాల్లో ఏర్పాటు చేస్తుండటంతో కొందరు మహిళా రైతులు హాయిగా ఊపిరిపీల్చుకుంటున్నారు. బహుళ నేచురల్స్ వీరి వద్ద నుంచి దేశీ ఆవు పాలను, ఒంటె పాలను సేకరించి, విలువ జోడించి ఆన్లైన్లో విక్రయిస్తోంది. వెయ్యి మంది పాడి రైతులు, 4 వేల మంది పశుపోషకులు తమ ఆవులు, మేకలకు మొలక గడ్డిని మేపుకుంటూ ఏడాది పొడవునా స్థిరమైన ఆదాయం పొందుతున్నారు. పశుపోషణ కోసం గొడ్డు చాకిరీ చేసే మహిళా రైతులకు మొలక గడ్డి అందుబాటులోకి రావటం గొప్ప ఊరటనిస్తోంది. మొలక గడ్డి మేపుతో దేశీ ఆవు పాల దిగుబడి మూడింట ఒక వంతు పెరగడంతో పాటు, నాణ్యత కూడా పెరిగిందని రాజస్థాన్‌లోని ఘంటియాలి గ్రామానికి చెందిన దళిత మహిళా పశుపోషకురాలు ‘పలు’, ఆమె భర్త హెమారామ్ సంతోషంగా చెబుతున్నారు. వీరికి 8 ఆవులు, మేకలు ఉన్నాయి. 4 మైళ్ల దూరంలో ఉన్న పొలానికి వెళ్లి గడ్డి కోసుకొని, ఎండలో నెత్తిన పెట్టుకొని మోసుకు రావటం ఆమెకు కనాకష్టంగా ఉండేది. రెండేళ్ల క్రితం ఇంటి పక్కనే మొలకగడ్డి ఉత్పత్తి యూనిట్‌ను ఏర్పాటు చేసుకున్నాక ఆ బాధ తప్పింది. మిగులు గడ్డిని, గోధుమ గడ్డి పొడిని అమ్ముతూ ఆదాయం పొందుతుండటం విశేషం. హైడ్రోపోనిక్స్.. ఎంత ఖర్చవుతుందంటే.. దూడలకు పెట్టే కాన్సంట్రేట్ మిక్చర్ దాణాను 75% తగ్గించి మొక్కజొన్న మొలక గడ్డిని మేపటం వల్ల మంచి ఫలితం కనిపించిందని బికనెర్ వెటరినరీ కాలేజీ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్.కె. ధురియా అన్నారు. హైడ్రోపోనిక్ మొలక గడ్డి వల్ల మేకల్లో జీర్ణశక్తి, పెరుగుదల బాగుందని సౌదీ అరేబియాలోని కింగ్ సౌద్ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడైంది. మొలకగడ్డి యూనిట్ ఏర్పాటుకు రూ. 18 లక్షల నుంచి 25 లక్షల వరకు ఖర్చవుతోంది. అయితే, ఇసుక తుఫాన్లకు మొలకగడ్డి షెడ్లు దెబ్బతినటం వల్ల నష్టం జరుగుతోంది. అందుకని, మున్ముందు షిప్పింగ్ కంటెయినర్లలో మొలకగడ్డి ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయటమే దీనికి పరిష్కారమని బహుళ నేచురల్స్ భావిస్తోంది. లక్షల ఖర్చుతో కూడిన పని కావటంతో రైతులను బృందాలుగా ఏర్పాటు చేసి మొలకగడ్డి యూనిట్లను నెలకొల్పితే మేలు. అయితే, రూ. 17.500 ఖర్చుతో చిన్నపాటి మొలకగడ్డి యూనిట్లు ఏర్పాటు చేసుకోవచ్చని హైడ్రోగ్రీన్స్ స్టార్టప్ చెబుతోంది. బయోచార్‌తో సేంద్రియ ఇంటిపంటల సాగుపై శిక్షణ సేంద్రియ ఇంటిపంటల సాగుపై పట్టణ/నగర వాసులపై ఆసక్తి పెరుగుతోంది. బయోచార్ (బొగ్గుపొడి) కలిపిన మట్టి మిశ్రమంతో టెర్రస్ గార్డెన్లు, పెరటి తోటలు, బాల్కనీలలో కూరగాయల పెంపకంపై ఈ నెల 24, 25 తేదీల్లో హైదరాబాద్ మలక్‌పేటలోని న్యూలైఫ్ ఫౌండేషన్ శిక్షణ ఇవ్వనుంది. మిగులు పంట దిగుబడులను సోలార్ డ్రయ్యర్‌తో ఎండబెట్టే విధానం కూడా వివరిస్తామని న్యూలైఫ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శివ షిండే తెలిపౠరు. వివరాలకు.. 81210 08002. 17న అమలాపురంలో ప్రకృతి సేద్యంపై శిక్షణ శ్రీనివాస సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 17న కోనసీమ జిల్లా అమలాపురంలోని (ముక్తేశ్వరం– కొత్తపేట రోడ్డు) శ్రీసత్యనారాయణ గార్డెన్స్‌లో ప్రకృతి వ్యవసాయంపై నిపుణులు విజయరామ్ రైతులకు అవగాహన కల్పిస్తారని నిర్వాహకులు నిమ్మకాయల సత్యనారాయణ తెలిపౠరు. ప్రవేశం ఉచితం. ముందుగా పేరు నమోదు చేసుకోవాలి. వివరాలకు.. 64091 11427 (సా. 3 గం. నుంచి 6 గం. వరకు మాత్రమే). -
దానిమ్మ రాత్రిపూట తినకూడదా? ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!
దానిమ్మ పండ్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు ఇందులో ఉంటాయి. ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, జింక్, విటమిన్స్‌తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు దానిమ్మ పండులో మెండుగా ఉంటాయి. సంవత్సరం పొడవునా ఈ పండ్లు మనకు లభిస్తాయి. రక్తహీనతతో బాధపడేవాళ్లు ప్రతిరోజూ దానిమ్మ పండ్లను తీసుకోవడం వల్ల సమస్య నుంచి సులువుగా బయటపడవచ్చు.వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు ఈజీగా పెరుగుతాయి. ఆరోగ్యంతో పాటు అందాన్ని పెంచే దానిమ్మ పండ్లు తింటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? అన్నది ఇప్పుడు చూద్దాం. చూడటానికి ఆకర్షణీయంగా ఉండే దానిమ్మ గింజల్లో అద్భుతమైన పోషక విలువలు ఉంటాయి. మీకు తెలుసా? ఒక దానిమ్మ పండులో సుమారు 600 వరకు గింజలు ఉంటాయట. క దానిమ్మ పండులో 7 గ్రాముల ఫైబర్, 3 గ్రాముల ప్రోటీన్, 30 శాతం విటమిన్ సి, 16 శాతం ఫోలేట్ మరియు 12 శాతం పొటాషియం ఉంటాయి. ఒక కప్పు దానిమ్మపండులో 24 గ్రాముల చక్కెర మరియు 144 కేలరీల శక్తి కూడా ఉంటుంది. రెండు వారాల పాటు రోజూ 150 మి.లీ దానిమ్మ రసాన్ని తాగడం వల్ల రక్తపోటు గణనీయంగా తగ్గుతుందని ఒక అధ్యయనంలో తేలింది. రక్తహీనతతో బాధపడేవాళ్లకు దానిమ్మను మించిన ఔషధం లేదు. యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉండే దానిమ్మ తింటే రక్తకణాల్లో కొవ్వు పేరుకుపోకుండా అడ్డుకుంటుంది. అంతేకాకుండా దానిమ్మ పండ్లతో జ్ఞాపకశక్తి కూడా మెరుగవుతుందని తేలింది. క్రమం తప్పకుండా దానిమ్మను తీసుకుంటే అల్జీమర్స్ వ్యాధిని నివారించొచ్చని వైద్యులు చెబుతున్నారు. దానిమ్మతో ఆ సమస్యలు దూరం ► చలికాలంలో దానిమ్మ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. ► దానిమ్మలో యంటీ ఏజింగ్ గుణాలు మెండుగా ఉంటాయి. ► దానిమ్మ రక్తంలో ఐరన్‌ను డెవలప్ చేస్తుంది. ఇది హిమోగ్లోబిన్ మొత్తాన్ని పెంచుతుంది. ► ఇందులోని ఫ్లేవనాయిడ్స్ క్యాన్సర్ రాడికల్స్‌ను నివారిస్తుంది. ► నిత్యం దానిమ్మ తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. ► వృద్దాప్యాన్ని దారితీసే ప్రీ రాడికల్స్ నుంచి కాపాడి, యవ్వనంగా ఉంచేలా చేస్తుంది. ► దానిమ్మ గింజల్లో విటమిన్ బి, సి, కెతో పాటు పొటాషియం, కాల్షియం వంటి పలు రకాల మినరల్స్ మెండుగా ఉంటాయి. ► మలబద్దకం, ఒబెసిటీ వంటి సమస్యలను దానిమ్మ దూరం చేస్తుంది. దానిమ్మతో అందం దానిమ్మ తినడం వల్ల చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. రోజూ కప్పు దానిమ్మ గింజలు తినడం వల్ల స్కిన్‌టోన్ మెరుగవుతుంది విటమిన్స్, పీచు అధికంగా ఉంటుంది. ఇవి చర్మంపై ముడతలు రాకుండా అడ్డుకుంటాయి దానిమ్మ పండులో ఉన్న ఒమేగా-3 ఫాటీ యాసిడ్స్ చర్మం తేమ కోల్పోకుండా నివారిస్తుంది. చర్మంపై ఉండే జిడ్డు, మొటిమలను శక్తివంతంగా తగ్గించడంలో దానిమ్మ సూపర్ ఫ్రూట్. వివిధ చర్మ సమస్యలను దూరం చేయడంలో దానిమ్మ ఎంతో సహాయపడుతుంది. దానిమ్మ రాత్రిపూట తినొచ్చా? చాలామంది రాత్రిపూట దానిమ్మ తింటే జలుబు చేస్తుందని, కఫం ఏర్పడుతుందని అనుకుంటారు. కానీ ఒట్టి అపోహ మాత్రమే. రాత్రి పడుకునే ముందు దానిమ్మ తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్య తగ్గుతుంది. ఒక గ్లాస్ దానిమ్మ జ్యూస్‌లో ఒక టీ స్పూన్లో అల్లం వేసుకొని తాగితే కీళ్లనొప్పులు, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. ఎముకలు కూడా ధృడంగా తయారవుతాయి. నిద్రించే ముందు దానిమ్మను పెరుగు తీసుకుంటే నాణ్యమైన నిద్రపడుతుంది. రాత్రిపూట దానిమ్మను తింటే ఉదయం వరకు ఆకలి వేయకుండా ఉంటుంది. తద్వారా బరువు నియంత్రణలో ఉంటుంది. -
వెస్ట్రన్ కల్చర్.. తల్లిపాలు ఇవ్వట్లేదు, అరగంటలోపే మరణాలు
పాశ్చాత్య సంస్కృతి అంటూ కొందరు, సౌందర్యం తగ్గుతుందని మరికొందరు, ఉద్యోగరీత్యా ఇంకొందరు తల్లులు బిడ్డలకు పాలివ్వడం లేదు. పుట్టిన నెలరోజులకే పోతపాలు పట్టిస్తున్నారు. ఇది మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానమని, పుట్టిన అరగంటలోపు తల్లిపాలు తాగించడం వల్ల శిశువుకు అనేక ప్రయోజనాలు ఉన్నట్లు వైద్యులు వివరిస్తున్నారు. నేటికీ కొందరు మూఢ నమ్మకాలతో పుట్టిన రెండు, మూడు రోజుల వరకూ తల్లిపాలను ఇవ్వడం లేదని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇలాంటి చర్యల వల్ల బిడ్డలతో పాటు, తాము నష్టపోతున్నామనే విషయాన్ని తల్లులు గ్రహించలేక పోతున్నారని వైద్యులు వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తల్లిపాలలో ఉండే పోషకాలు, బిడ్డ ఎదుగుదలపై చూపే ప్రభావంపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగించేందుకు ప్రపంచ ఆరోగ్యసంస్థ ఏటా ఆగస్టు 1 నుంచి 7 వరకూ వారోత్సవాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా నేత్ర, శిశు సంక్షేమశాఖతో కలిసి వైద్య ఆరోగ్యశాఖ అవగాహన కార్యక్రమాలు నిర్వహించనుంది. శిశు మరణాలు నివారించవచ్చు.. ఎక్కువ మంది శిశువులకు ఇన్ఫెక్షన్స్లు సోకడం, పుట్టగానే కామెర్లు, శ్వాసకోశ వ్యాధులతో మరణాలు సంభవించడం జరుగుతున్నట్లు యూనిసెఫ్ గుర్తించింది. అలాంటి మరణాలను నివారించేందుకు పుట్టిన అరగంటలోపు తల్లిపాలు తాగించడం ద్వారా నెలలోపు శిశువుల్లో సంభవించే మరణాలను తగ్గించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. దీంతో తల్లిపాల ఆవశ్యకతపై గర్భిణులుగా ఉన్నప్పటి నుంచే విస్తృతంగా అవగాహన కలిగిస్తున్నారు. బిడ్డకు పాలివ్వడం ద్వారా తల్లికీ ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. తల్లిపాలతో ప్రయోజనాలెన్నో.. ► బిడ్డకు పాలిచ్చే తల్లులకు బ్రెస్ట్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ. ► రక్తహీనత, ఎముకల బలహీనత వంటి జబ్బులు రావని వైద్యులు చెబుతున్నారు. ► అంతేకాదు బిడ్డకు పాలివ్వడం ద్వారా ప్రసవం అనంతరం అయ్యే రక్తస్రావాన్ని అదుపు చేస్తాయని వైద్యులు వివరిస్తున్నారు. ► తల్లిపాలలో అన్ని పోషకాలు సమపాళ్లలో ఉంటాయి. వ్యాధి నిరోధకశక్తిని కూడా పెంపొందిస్తాయి. ► తల్లిపాలు తాగిన శిశువుల్లో యాంటీబాడీస్ వృద్ధి చెంది ఇన్ఫెక్షన్లు, నిమోనియా, డయేరియా వంటి వ్యాధులు సోకకుండా నివారించవచ్చు. ► మెదడు ఎదుగుదలకు దోహదం చేయడంతో పాటు, జ్ఞాపకశక్తి పెంపొందుతుంది. తల్లిపాలు తాగిన పిల్లల్లో తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. ● పసిబిడ్డకు ► ప్రధాన శత్రువు చలి. బిడ్డను ఒడిలో ఉంచుకుని పాలివ్వడం ద్వారా తల్లిశరీరం నుంచి శిశువుకు అవసరమైన వేడి అందుతుంది. అంతేకాదు తల్లీబిడ్డ మధ్య ఆప్యాయత పెరుగుతుంది. ► ముర్రుపాలు వ్యాధి నిరోధకశక్తిని పెంచడంతో పాటు, శిశువు జీర్ణాశయ అభివృద్ధికి దోహదపడే విటమిన్–ఎ అధిక మోతాదులో ఉంటుంది. ►శిశువు మొట్టమొదట విసర్జించే నల్లటి మెకోనియం అనే మలంతో పాటు, పచ్చకామెర్లు కలిగించే బెలురూబిన్ అనే పదార్థాన్ని కూడా త్వరగా విసర్జించేలా ముర్రుపాలు దోహదం చేస్తాయి. బిడ్డకు మొదటి వారంలో కలిగే పచ్చకామెర్లను నివారిస్తాయి. అవగాహన కల్పిస్తున్నాం తల్లిపాల విశిష్టతపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నాం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేందాల్లో, కుటుంబ డాక్టర్ కార్యక్రమంలో, వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లో గర్భిణులు, బాలింతలకు తల్లిపాల విశిష్టతను వివరిస్తాం. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తాం. బిడ్డకు పాలివ్వడం ద్వారా తల్లికీ ప్రయోజనాలు ఉన్నాయని అవగాహన కల్పిస్తాం. – డాక్టర్ మాచర్ల సుహాసిని, వైద్య ఆరోగ్యశాఖాధికారి, ఎన్టీఆర్ జిల్లా -
ఫారిన్ టూర్.. ఫారెక్స్ కార్డ్ బెటర్
భారత్ నుంచి విదేశాలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగార్థులు, పర్యాటకుల సంఖ్య ఏటేటా పెరుగుతూనే ఉంది. గతంతో పోలిస్తే విదేశీ ప్రయాణం ఎంతో సౌకర్యంగా మారింది. విమానాశ్రయాలు, విమాన సర్వీసుల నెట్వర్క్ విస్తృతం అయింది. ఎక్కడి నుంచి ఎక్కడికైనా వేగంగా, సులభంగా ప్రయాణించే వెసులుబాటు దక్కింది. మరి విదేశాలకు వెళ్లే వారు తమ వెంట ఆయా దేశానికి చెందిన కరెన్సీని కూడా తీసుకెళుతుంటారు. ఈ అవసరాన్ని తప్పించేదే ఫారెక్స్ కార్డ్. ఏ దేశానికి వెళితే ఆ దేశ కరెన్సీ రూపంలో ఈ కార్డ్ ద్వారా చెల్లింపులు చేసుకోవచ్చు. ఫారెక్స్ కార్డ్ ఉంటే కరెన్సీ నోట్లు పాకెట్లో లేకపోయినా ఇబ్బంది పడే పరిస్థితి రాదు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఇది చెల్లుతుంది. డెబిట్, క్రెడిట్ కార్డ్ కంటే ఫారెక్స్ కార్డ్ వల్ల ఎన్నో అనుకూలతలు ఉన్నాయి. ఈ ఫారెక్స్ కార్డుతో ప్రయోజనాలు? ఎలా పనిచేస్తుంది? ఇందులో ఎన్ని రకాలు? చార్జీలు తదితర విషయాలను తెలియజేసే కథనమే ఇది! ఫారెక్స్ కార్డ్ అంటే..? ఇదొక ప్రీపెయిడ్ కార్డ్. మీరు వెళ్లాలనుకునే దేశ కరెన్సీ మారకంలో డిపాజిట్ చేసుకుని, వినియోగించుకునే సాధనం. ఈ కార్డ్‌తో విదేశాల్లో చెల్లింపులు చేయడమే కాకుండా, ఏటీఎం నుంచి ఆ దేశ కరెన్సీని ఉపసంహరించుకోవచ్చు. ఈ కార్డ్ ఉంటే వెంట భౌతిక రూపంలో కరెన్సీని తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. ఫారెక్స్ కార్డుల్లో రకాలు... విదేశాలకు వెళ్లే వారికి క్రెడిట్, డెబిట్ కార్డ్‌లతో పోలిస్తే ఫారెక్స్ కార్డ్ ఎంతో ఉపయోగకరం అని చెప్పుకోవాలి. పర్యాటకుల అవసరాలకు అనుగుణంగా ఈ కార్డుల్లో పలు రకాలు ఉన్నాయి. సింగిల్ కరెన్సీ ఫారెక్స్ కార్డ్ ఇందులో ఒకటి. ఏదైనా ఒక దేశ కరెన్సీనే ఇందులో లోడ్ చేసుకోవచ్చు. మల్టీ కరెన్సీ ఫారెక్స్ కార్డ్ రెండో రకం. ఇందులో ఒకటికి మించిన దేశాల కరెన్సీలను లోడ్ చేసుకోవచ్చు. వివిధ దేశాలకు వెళ్లే వారికి మల్టీ కరెన్సీ ఫారెక్స్ కార్డ్ ఉపయోగకరం. దాదాపు ప్రముఖ బ్యాంకులన్నీ కూడా ఫారెక్స్ కార్డ్‌లను ఆఫర్ చేస్తున్నాయి. ప్రయోజనాలు/సదుపాయాలు విదేశాల్లో చెల్లింపులు సురక్షితంగా చేసేందుకు ఫారెక్స్ కార్డ్ అనుకూలం. క్రెడిట్ కార్డ్‌కు మాదిరే అన్ని రకాల సదుపాయాలు కూడా వీటిల్లో ఉంటాయి. ఇది ప్రీపెయిడ్ కార్డ్ కావడంతో, ముందుగానే బ్యాంక్ ఖాతా నుంచి లోడ్ చేసుకోవాలి. ఫలితంగా విదేశాల్లో వినియోగంపై స్వీయ నియంత్రణ ఉంటుంది. కావాల్సినంతే లోడ్ చేసుకోవచ్చు. అంతే మేర ఖర్చు చేసుకోవచ్చు. ఫారెక్స్ కార్డ్‌ను దాదాపు అన్ని చోట్లా ఆమోదిస్తారు కనుక సౌకర్యవంతగా ఉంటుంది. దీంతో ఏటీఎంలు లేదంటే ఇతర ప్రత్యామ్నాయ చెల్లింపుల సాధనాల కోసం చూసుకోవాల్సిన అవసరం రాదు. ముఖ్యంగా కరెన్సీని తీసుకెళ్లే అవసరాన్ని తప్పిస్తుంది. దీంతో నగదుతో పోలిస్తే సౌకర్యం, సురక్షితంగా ఉంటుంది. అంతేకాదు కరెన్సీ విలువల్లో అస్థిరతల ప్రభావం కూడా ఉండదు. లోడ్ చేసిన రోజు విలువే స్థిరంగా కొనసాగుతుంది. దాంతో రోజువారీ కరెన్సీ మారకం హెచ్చుతగ్గుల సమస్య ఉండదు. క్రెడిట్, డెబిట్ కార్డు చార్జీలతో పోలిస్తే ఫారెక్స్ కార్డ్ చౌక ఆప్షన్. క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌ను ఉపయోగించిన ప్రతి సందర్భంలోనూ కరెన్సీ మారకం చార్జీ పడుతుంది. ఎందుకంటే ఏ దేశంలో ఉంటే ఆ దేశ కరెన్సీలోకి రూపాయిలను మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ మారకం చార్జీని కరెన్సీ మార్కప్ చార్జీగా పేర్కొంటారు. కార్డ్, బ్యాంక్ ఆధారంగా ఈ చార్జీ 2–5 శాతం మధ్య ఉంటుంది. ఫారెక్స్ కార్డుల్లో ఎన్నో సదుపాయాలు ఉండడంతో, సంప్రదాయ చెల్లింపు సాధనాలతో పోలిస్తే ఇవి ఆకర్షణీయమైనవని చెప్పుకోవచ్చు. మల్టీ కరెన్సీ ఫారెక్స్ కార్డ్ ఉంటే, ఒకేసారి ఒక దేశం తర్వాత మరో దేశానికి వెళ్లేట్టు అయితే ఉపయోగకరంగా ఉంటుంది. కావాల్సిన ప్రతిసారీ బ్యాంకుల్లో కరెన్సీని మార్చుకోవడం కంటే ఫారెక్స్ కార్డు తీసుకెళ్లడమే సౌకర్యం. బ్యాంకులకు సైతం ఫారెక్స్ కార్డులతో తక్కువ వ్యయం అవుతుంది. దీంతో అవి ఫారెక్స్ కార్డుదారులకు ఆ ప్రయోజనాలను అందిస్తుంటాయి. భౌతిక కరెన్సీతో పోలిస్తే ఫారెక్స్ కార్డులో లోడ్ చేసుకోవడం వల్ల మరింత మెరుగైన మారకం రేటు సాధ్యపడుతుంది. ఈ కార్డ్ పొందేందుకు ఆయా బ్యాంక్ ఖాతాదారు కావాల్సిన అవసరం లేదు. ఫిక్స్డ్ డిపాజిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇది ప్రీపెయిడ్ కార్డ్ కనుక, బ్యాంక్‌లు సులభంగా మంజూరు చేస్తుంటాయి. మార్కెట్లో వివిధ బ్యాంకులు ఎన్నో ఫీచర్లతో వీటిని ఆఫర్ చేస్తున్నాయి. వీటి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత, తమకు అనుకూలమైనది తీసుకోవచ్చు. ఒకవేళ ఫారెక్స్ కార్డ్‌ను ఎక్కడైనా కోల్పోతే, వెంటనే బ్యాంక్ లేదా ఎన్బీ ఎఫ్సీకి కాల్ చేసి చెబితే మిగిలిన బ్యాలన్స్ దురి్వనియోగం కాకుండా ఫ్రీజ్ చేసేస్తారు. విదేశాల్లోని పీవోఎస్ మెషీన్ల వద్ద ఫారెక్స్ కార్డులను స్వైప్ చేస్తే ఎలాంటి చార్జీలు పడవు. కానీ అదే డెబిట్, క్రెడిట్ కార్డులను స్వైప్ చేసిన ప్రతిసారీ ఎంతో కొంత చార్జీ పడుతుంది. పైగా ఇతర సాధనాలతో పోలిస్తే ఫారెక్స్ కార్డులకు అంతర్జాతీయంగా ఎక్కువ ఆమోదం ఉంటుంది. అంతేకాదు విదేశాల్లో ఆన్లైన్ కొనుగోళ్లకు సైతం ఫారెక్స్ కార్డులతో చెల్లింపులు చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్‌పై విదేశాల్లో ఖర్చు చేస్తే సకాలంలో చెల్లింపులు చేయకపోతే, భారీ వడ్డీ, లేట్ పేమెంట్ ఫీజులు పడతాయి. ఫారెక్స్ కార్డ్ ప్రీపెయిడ్ కార్డ్ కావడంతో ఈ సమస్య ఉండదు. ► ఒకేసారి ఒకటికి మించిన దేశాలను పర్యటించే వారు, ఆయా దేశాల కరెన్సీని వెంట తీసుకెళ్లే ఇబ్బంది లేకుండా, మల్టీ కరెన్సీ ఫారెక్స్ కార్డ్ ఎంపిక చేసుకోవడం నయం. ► కార్డ్‌లో బ్యాలన్స్ మిగిలి ఉంటే, స్వదేశానికి వచి్చన తర్వాత ఆ మొత్తాన్ని తిరిగి నగదుగా మార్చుకోవచ్చు. ► విదేశీ పర్యటన ముగించి స్వదేశానికి వచ్చిన తర్వాత.. తిరిగి విదేశానికి వెళ్లేంత వరకు కార్డ్‌ను డీయాక్టివేట్ చేసుకోవచ్చు. మళ్లీ విదేశీ యాత్రకు ముందు యాక్టివేట్ చేసుకోవచ్చు. దీంతో వినియోగం లేకపోయినా చార్జీలు, పెనాలీ్టలు పడవు. మెయింటెనెన్స్ చార్జీలు కూడా ఉండవు. ► ఫారెక్స్ కార్డ్‌లపై డీల్స్, డిస్కౌంట్లు వస్తుంటాయి. ► ఫారెక్స్ కార్డుల్లో చాలా వరకు లాక్డ్ ఇన్ ఎక్సే్ఛంజ్ రేట్ అనే ఫీచర్‌తో వస్తాయి. అంటే కరెన్సీ రేటులో అస్థిరతలను ఈ సదుపాయంతో అధిగమించొచ్చు. ఉదాహరణకు కార్డులో డాలర్లు లోడ్ చేసుకుంటే, ఆ రోజు ఉన్న విలువ ప్రకారమే లాక్ అవుతుంది. దాని విలువ బ్యాలన్స్ ముగిసే వరకు స్థిరంగా కొనసాగుతుంది. ► ఫారెక్స్ కార్డ్ లేకుండా వెళితే, విదేశాల్లో అవసరమైన చోట కరెన్సీని మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇందుకోసం శ్రమపడాల్సి రావచ్చు. ఫారెక్స్ కార్డ్ అయితే ఉన్న చోట నుంచే కోరుకున్న మారకం రేటులో లోడ్ చేసుకోవచ్చు. ► అంతర్జాతీయ ఈ కామర్స్ పోర్టళ్లపై ఫారెక్స్ కార్డ్‌తో చెల్లింపులు చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ వర్తకులు ఈ కార్డ్‌ను ఆమోదిస్తారు. విమాన టికెట్ బుకింగ్‌లు, హోటల్ బుకింగ్, డైనింగ్, ఆఫ్‌లైన్, ఆన్లైన్ షాపింగ్‌కు వాడుకోవచ్చు. ► ఫారెక్స్ కార్డ్‌తో ఏ దేశంలో ఏటీఎం నుంచి అయినా ఆ దేశ కరెన్సీని విత్‌డ్రా చేసుకోవచ్చు. ఏటీఎం లొకేషన్ ఆధారంగా ఏ దేశంలో ఉన్నారనేది కార్డ్ నెట్వర్క్ గుర్తిస్తుంది. సంబంధిత దేశ కరెన్సీని అందిస్తుంది. ► ఫారెక్స్ కార్డ్‌లలో ఎంబెడెడ్ చిప్ టెక్నాలజీ ఉంటుంది. సున్నితమైన సమాచారం ఎన్క్రిపె్టడ్గా ఉండటంతో మోసాల రిస్క్ చాలా తక్కువ. ► ఇవి కనీసం ఐదేళ్ల ఎక్స్పైరీ తేదీతో వస్తాయి. ► ఒక దేశానికి వెళుతూ కొంత బ్యాలన్స్‌ను లోడ్ చేసుకున్న తర్వాత, చివరికి మిగులు ఉందనుకోండి.. ఆ తర్వాత ఆ బ్యాలన్స్‌ను ఏ దేశంలో అయినా వినియోగించుకోవచ్చు. ► మల్టీ కరెన్సీ ఫారెక్స్ కార్డ్‌ల్లో 16–22 దేశాల కరెన్సీలను లోడ్ చేసుకోవచ్చు. ఫీజులు/చార్జీలు.. కార్డ్ జారీ చేసే సంస్థ ఆధారంగా ఫీజులు, చార్జీలు వేర్వేరుగా ఉంటాయి. సింగిల్ కరెన్సీ కార్డ్‌తో పోలిస్తే మల్టీ కరెన్సీ కార్డ్ చార్జీలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. కార్డు కోసం దరఖాస్తు చేసినప్పుడు ఇష్యూయన్స్ చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఇది రూ.100–500 మధ్య ఉంటుంది. రీలోడ్, రెన్యువల్ చార్జీలు కూడా చెల్లించుకోవాలి. కార్డులో కరెన్సీని లోడ్ చేసిన ప్రతిసారీ రీలోడ్ చార్జీ పడుతుంది. అదనపు కార్డ్ కావాలంటే యాడాన్ కార్డ్ తీసుకోవచ్చు. దీనికి విడిగా ఫీజు పడుతుంది. కార్డులో బ్యాలన్స్‌ను నగదు రూపంలో తీసుకున్న సందర్భంలోనూ చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. విదేశాల్లో కార్డ్ నుంచి నగదు తీసుకున్న ప్రతి సారీ చార్జీ విధిస్తారు. కార్డ్ బ్యాలన్స్ చెక్ చేసుకున్నా కూడా చార్జీ పడుతుంది. మీరు చెల్లింపులు చేసిన కరెన్సీ, కార్డ్‌లో లోడ్ అయి ఉన్న కరెన్సీ వేర్వేరు అయితే అప్పుడు క్రాస్ కరెన్సీ చార్జీ చెల్లించాల్సి వస్తుంది. ఇది 3.5 శాతం వరకు ఉంటుంది. అదే మలి్టపుల్ కరెన్సీ కార్డులో ఈ సమస్య ఉండదు. కార్డ్‌ను కోల్పోయి, తిరిగి తీసుకుంటే అప్పుడు కూడా చార్జీ పడుతుంది. వీటిని గుర్తు పెట్టుకోవాలి.. ► ప్రతి లావాదేవీ అనంతరం కార్డ్ బ్యాలన్స్ చెక్ చేసుకోవాలి. ► ఫారెక్స్ కార్డ్ ఎక్కడైనా పొగొట్టుకుంటే లేదా చోరీకి గురైనా వెంటనే బ్యాకప్ కార్డ్ తీసుకోవాలి. ► ప్రతీ పర్యటనకు ముందు ఏటీఎంకు వెళ్లి పిన్ మార్చుకోవాలి. ► ఫారెక్స్ కార్డ్‌ను విదేశాల్లో ఇల్లు, కారు, రూమ్ రెంటల్స్‌కు వినియోగించుకోవద్దు. ► కార్డ్‌లో లోడ్ చేసిన కరెన్సీ కాకుండా, మరో కరెన్సీలో చెల్లింపులు చేయకుండా ఉండడమే మంచిది. దీనివల్ల అనవసర వ్యయాలను నివారించుకోవచ్చు. ► టోల్ చార్జీలు చెల్లించేందుకు సైతం ఫారెక్స్ కార్డ్‌ను వాడుకోవద్దు. ► కొన్ని బ్యాంక్‌లు తక్కువ మార్కప్, లోడింగ్ చార్జీతో క్రెడిట్ కార్డులను ఆఫర్ చేస్తున్నాయి. వీటిపై రివార్డులను పరిగణనలోకి తీసుకున్నప్పుడు ఇవి కూడా ఆకర్షణీయంగానే కనిపిస్తాయి. కానీ, అన్నీ తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. దరఖాస్తుకు ముందు.. ఫారెక్స్ కార్డ్ తీసుకునే ముందు వివిధ బ్యాంకులు ఆఫర్ చేస్తున్న పలు రకాల కార్డ్‌లు, వాటిల్లోని ఫీచర్లను పూర్తిగా తెలుసుకోవాలి. చార్జీల గురించి అడిగి తెలుసుకోవాలి. బ్యాంక్‌లు, పెద్ద ఆరి్థక సంస్థలు, ప్రముఖ ట్రావెల్ ఏజెన్సీల నుంచి ఈ కార్డ్ తీసుకోవచ్చు. బ్యాంకు శాఖకు వెళ్లి లేదంటే ఆన్లైన్ నుంచి అయినా కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దాదాపు అన్ని సంస్థలు ఒకటికి మించిన కార్డ్‌లను వివిధ రకాల ఫీచర్లతో ఆఫర్ చేస్తున్నాయి. కార్డ్ తీసుకునేందుకు కొన్ని రకాల డాక్యుమెంట్లను సమరి్పంచాల్సి ఉంటుంది. దరఖాస్తుతోపాటు పాస్‌పోర్ట్ కాపీ (స్వయంగా అటెస్ట్ చేసింది), వీసా కాపీ, ఎయిర్‌లైన్ టికెట్ కాపీ, పాన్ కార్డ్ కాపీ ఇవ్వాల్సి వస్తుంది. డెబిట్ కార్డ్ మాదిరే ఫారెక్స్ కార్డుకు అనుబంధంగా పిన్ వస్తుంది. దీన్ని మొదటిసారి మార్చుకోవాలి. కార్డు జారీ చేసిన బ్యాంక్ ఏటీఎంకు వెళ్లి బ్యాలన్స్ చెక్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ నుంచి కూడా ఈ సదుపాయం ఉంది. ప్రతి లావాదేవీ అనంతరం వచ్చే ఎస్ఎంఎస్ను చూసి తెలుసుకోవచ్చు. -
ఇంగువతో ఆరోగ్యం మాత్రమే కాదు, అందం కూడా..
ఇంగువ.. వంటల్లో వాడే మంచి సుగంధ ద్రవ్యం ఇది. అసఫోటిడా అని కూడా దీన్ని పిలుస్తారు. మన దేశీ వంటకాల్లో ఇంగువని చాలా విరివిగా వాడుతుంటాం. దీనిలోని సహజ లక్షణాలు అనేక వ్యాధులను నయం చేయడానికి శక్తివంతంగా పనిచేస్తాయి. ఇంగువను పురాతన కాలం నుంచి అజీర్తికి ఇంటివైద్యంగా ఉపయోగిస్తున్నారన్న విషయం తెలిసిందే. అయితే ఇంగువను చర్మ సంరక్షణలోనూ ఉపయోగిస్తారన్న విషయం మీకు తెలుసా? మృతకణాలు తొలగించి ముఖం కాంతివంతంగా మారడానికి ఇంగువ ఉపయోగిస్తారు. ►రెండు స్పూన్ల ముల్తానీ మట్టిలో స్పూను తేనె, చిటికెడు ఇంగువ, స్పూను రోజ్‌వాటర్ వేసి చక్కగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసి ఇరవై నిమిషాలపాటు ఆరబెట్టాలి. తరువాత చల్లని నీటితో కడిగేయాలి. ఈ ప్యాక్‌ను వారంలో రెండుసార్లు వేయడం వల్ల మొటిమలు, నల్లమచ్చలు, ముడతలు పోతాయి. చర్మం పొడిబారడం తగ్గి ముఖం కాంతిమంతమవుతుంది. ►తేనె ఇంగువ సూపర్ కాంబినేషన్. ఈ రెండింటిలోనూ యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. దీన్ని క్లెన్సర్‌గా ఉపయోగించడం వల్ల ముఖంపై ఉన్న బాక్టీరియాను తొలగించవచ్చు. ఈ ఫేస్‌ప్యాక్ వల్ల చర్మంపై ముడతలు, మచ్చలు తగ్గి యవ్వనంగా కనిపిస్తారు. -
రూ. 7.27 లక్షల వరకు ఆదాయ పన్ను ఉండదు
ఉడుపి (కర్ణాటక): మధ్యతరగతి వర్గాలకు కేంద్ర ప్రభుత్వం పన్నులపరంగా పలు ప్రయోజనాలు కలి్పంచిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వార్షికంగా రూ. 7.27 లక్షల వరకు ఆదాయం పొందే వారికి కొత్త పథకంలో పన్ను భారం నుంచి మినహాయింపు ఇవ్వడం కూడా ఇందులో ఒకటని వివరించారు. 2023–24 బడ్జెట్లో రూ. 7 లక్షల వరకు ఆదాయంపై మినహాయింపు ప్రకటించినప్పుడు ఆ పరిమితికి మించి కాస్తంతే ఎక్కువగా ఆర్జిస్తున్న వారి పరిస్థితి ఏమిటని కొన్ని వర్గాల్లో సంశయాలు తలెత్తాయని ఆమె తెలిపారు. దీంతో అదనంగా ఆర్జించే ప్రతి రూపాయిపై ఏ స్థాయి నుంచి పన్ను కట్టాల్సి ఉంటుందనే అంశం మీద తమ బృందం మళ్లీ కసరత్తు చేసిందని వివరించారు. మొత్తం మీద ప్రస్తుతం రూ. 7.27 లక్షల వరకు పన్ను లేదని, ఆ తర్వాతే ట్యాక్స్ వర్తిస్తుందని మంత్రి చెప్పారు. కొత్త స్కీములో స్టాండర్డ్ డిడక్షన్ లేదంటూ ఫిర్యాదులు రావడంతో దాన్ని కూడా చేర్చినట్లు చెప్పారు. -
రోజుకు 30 ఎకరాలకు మందుల పిచికారీ.. వ్యవసాయానికి డ్రోగో డ్రోన్స్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డ్రోన్ల తయారీ, సాంకేతిక సేవల్లో ఉన్న డ్రోగో డ్రోన్స్ మానవరహిత వైమానిక వాహనం (యూఏవీ) క్రిషి 2.0 ఆవిష్కరించింది. ఇది 10 కిలోల బరువు మోయగలదు. రోజుకు 30 ఎకరాల్లో పురుగు మందులను పిచికారీ చేస్తుంది. డ్రోన్ల తయారీకి అవసరమైన ధ్రువీకరణకు కేంద్ర ప్రభుత్వం నుంచి కంపెనీ అందుకుంది. డ్రోన్లను హైదరాబాద్‌తోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా తాడేపల్లి కేంద్రంలో తయారు చేస్తారు. ఏడాదికి 3,000 డ్రోన్లను ఉత్పత్తి చేస్తామని డ్రోగో డ్రోన్స్ సీఈవో యశ్వంత్ బొంతు తెలిపారు. డిమాండ్‌నుబట్టి సామర్థ్యం పెంచుతామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో 26 సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. -
గడువు సమీపిస్తోంది! ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ జాగ్రత్తలు, లాభాలు
ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్‌కు గడువు దగ్గర పడుతోంది. మీ ఆదాయం, పన్ను పరిధిలోకి వచ్చినా రాకపోయినా, రిటర్న్స్ దాఖలు దాఖలు చేయడం చాలా అవసరం. ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) ఫైల్ చేయడానికి చివరి తేదీ జూలై 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఐటీఆర్ ఫైలింగ్వల్ల వచ్చే లాభాలు, ఇతర అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. ఆదాయం,పెట్టుబడులను వెల్లడించేందుకు ఆదాయ పన్ను శాఖకు ఐటీఆర్‌ను సమర్పించాల్సి ఉంటుంది. ప్రధానంగా 5 అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి. గడువుకు ముందే మీ ఆదాయపు పన్ను రిటర్న్‌లను ఫైల్ చేయడం ఖచ్చితంగా అవసరం. కొత్త బడ్జెట్లో ప్రకటించిన దాని ప్రకారం మీరు ఏ విధానం కిందికి వస్తారో గుర్తించి సరైన పన్ను విధానాన్ని ఎంచుకోవాఇ. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్‌ను దాఖలు చేసిన 30 రోజులలోపు వెరిఫై చేయడం ముఖ్యం. రిటర్న్ ధృవీకరించబడకపోతే, అది చెల్లనిదిగా పరిగణించ బడుతుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC), నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS), లైఫ్ అండ్ మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు , హోమ్ లోన్ వడ్డీలు ప్రామాణిక తగ్గింపులకు అర్హులు. ఎక్కువ రిటర్న్స్ రావాలంటే ఇలాంటి వాటిని క్లెయిమ్ చేయాలి. మీ బ్యాంక్ ఖాతాను ధృవీకరించాలి. ఆదాయపు పన్ను ఫైలింగ్ పోర్టల్‌లో ఎలాంటి పొరపాటు దొర్లకుండా మన బ్యాంకు ఖాతా నంబరును జోడించాలి. తద్వారా రీఫండ్ క్రెడిట్లో సమస్యల్ని నివారించవచ్చు. ఐటీఆర్ ఫైలింగ్, లాభాలు సకాలంలో ఆదాయపు పన్ను రిటర్న్‌లను ఫైలింగ్ ద్వారా, పెనాల్టీలను నివారించవచ్చు . టాక్స్ రిఫండ్ కోసమే కాకుండా, ఇతర ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందవచ్చు. ఒకవేళ చెల్లించిన పన్ను మొత్తం పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని మించి ఉంటే, దాన్ని రీఫండ్ రూపంలో క్లెయిం చేసుకోవచ్చు. వీసా జారీలో సమస్యల్లేకుండా ఉండాలంటే: ఉద్యోగరీత్యానో మరో కారణంగానో విదేశాలకు ఎగిరి పోవాలనుకుంటే వీసా ఖచ్చితంగా కావాలి. మరి అలాంటి వీసాకు దరఖాస్తు సమయంలో ఐటీ రిటర్న్స్ దాఖలు చేసి ఉంటే వీసా పని ఈజీ అవుతుంది. ఆదాయ నిర్ధారణగా: ప్రభుత్వ, ప్రైవేటు వ్యవహారాలు, బిజినెస్ అవసరాల్లో ఆదాయ పన్ను శాఖ ఇచ్చే సర్టిఫికెట్ ఇన్కమ్ ప్రూఫ్ సర్టిఫికెట్ ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. ఈజీగా బ్యాంకు లోను కావాలంటే: అంతేకాదు ఐటి రిటర్న్స్ దాఖలు పూర్తి చేసి ఉంటే వ్యక్తిగత లోన్లతో పాటు, భారీ మొత్తంలో బ్యాంకు రుణం పొందడం కూడా సులువు. బీమా కవర్: అలాగే ఇన్సూరెన్స్ కోసం దరఖాస్తు చేసినపుడు ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ వివరాలను చాలా వరకు బీమా సంస్థలు డిమాండ్ చేస్తాయి -
నల్ల జామపండ్ల గురించి మీకు తెలసా? వీటిని తినడం వల్ల..
పండ్లలో ఎన్నో పోషకాలు దాగున్నాయి. ప్రతిరోజూ పండ్లను తినడం వల్ల అనారోగ్యాల నుంచి దూరంగా ఉండొచ్చు. అలాంటి పండ్లలో జామపండ్లు కూడా ఒకటి. చిన్నపిల్లల దగ్గర్నుంచి పెద్దవారి వరకు జామపండ్లను ఇష్టంగా తింటుంటారు. సాధారణంగా ఆకుపచ్చ రంగులో ఉండే జామాపండ్లు గురించి అందరికి తెలుసు.. కానీ నల్ల జామకాయల గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? సాధారణ జామ పండుతో పోలిస్తే ఈ నల్ల జామ పండులో పోషకాలు రెట్టింపు స్థాయిలో ఉంటాయి. వీటిని తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి ఇప్పుడు తెలుసుకుందాం.. ► నల్ల జామపండ్లు తినడానికి ఎంతో రుచికరంగా ఉంటాయి. శరీరానికి కూడా ఇవి చాలా మంచివి. ► ఇందులో శరీరానికి కావాల్సిన పోషకాలు చాలా ఉంటాయి. విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి వంటివి ఇందులో అధికంగా ఉంటాయి. ► నల్ల జామపండ్లను తరచూ తినడం వల్ల జీర్ణక్రియ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ► అంతేకాకుండా వీటిని తరచూ తినడం వల్ల మలబద్దకం, పొట్ట సమస్యల నుంచి కూడా సులభంగా విముక్తి కలుగుతుంది. ► రక్తహీనతతో బాధపడేవాళ్లు ప్రతిరోజూ నల్ల జామపండ్లను తినడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ► నల్ల జామకాయలను తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీనివల్ల తరచూ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండవచ్చు. ► యాంటీ ఏజింగ్ గుణాలు కలిగి ఉండటంతో వృద్ధాప్యాన్ని నివారించటంలో నల్ల జామకాయలు సహాయపడతాయి. ► నల్లజామకాయలు తీసుకోవడం వల్ల చర్మంపై ఉన్న ముడతలు తొలగించి యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. అయితే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న నల్ల జామకాయలు తినాలంటే మాత్రం ఇండియలో దొరకవు. ఈ పండ్లు ఎక్కువగా బ్రెజిల్, సౌత్ అమెరికాలో ఎక్కువగా దొరుకుతాయి. -
స్టార్టప్ వ్యవస్థ బలోపేతానికి కృషి
గురుగ్రామ్: అంకుర సంస్థలను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. స్టార్టప్‌ల వ్యవస్థను ప్రోత్సహించేందుకే తప్ప నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రయతి్నంచబోదని ఆయన స్పష్టం చేశారు. ఆ వ్యవస్థలో భాగమైన వర్గాలే స్వీయ నియంత్రణ పాటించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. స్టార్టప్20 సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. అంకుర సంస్థల పురోగతికి అవరోధాలు కలి్పంచాలనేది ప్రభుత్వల ఉద్దేశం కాదనే స్పష్టమైన సందేశం స్టార్టప్‌లకు చేరాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. భారత్‌లో అవకాశాలను అందిపుచ్చుకోవాలని అంకుర సంస్థలను ఆహ్వానించారు. 2030 నాటికి అంకుర సంస్థల వ్యవస్థలోకి జీ20 దేశాలన్నీ కలిసి ఏటా 1 లక్ష కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టేలా చూసేందుకు స్టార్టప్20 గ్రూప్ చేస్తున్న ప్రయత్నాలు సాకారమైతే స్టార్టప్‌లకు మరిన్ని ప్రయోజనాలు చేకూరగలవని గోయల్ చెప్పారు. మంచి స్టార్టప్‌లకు నిధుల కొరత లేదు: అమితాబ్ కాంత్ సరైన అంకుర సంస్థలకు పెట్టుబడుల కొరతేమీ లేదని జీ20 షెర్పా అమితాబ్ కాంత్ స్పష్టం చేశారు. పటిష్టమైన వ్యాపార విధానాలున్న మంచి స్టార్టప్‌లకు నిధుల లభ్యత బాగానే ఉందని ఆయన చెప్పారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కార మార్గాలను కనుగొనేందుకు స్టార్టప్ వ్యవస్థ చురుగ్గా పని చేస్తోందని స్టార్టప్20 శిఖర్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. భారత్‌లో 1,00,000 పైచిలుకు స్టార్టప్‌లు, 108 యూనికార్న్‌లు (బిలియన్ డాలర్లకు పైగా విలువ చేసే అంకురాలు) ఉన్నాయని అమితాబ్ కాంత్ తెలిపారు. -
పిల్లల్ని కంటే రూ.5.6 లక్షలు.. ఉద్యోగులకు కంపెనీ బంపరాఫర్!
ప్రపంచంలో అత్యంత జనాభా ఉన్న చైనా ఇప్పుడు యువత జనాభా తగ్గి వయసు మళ్లిన వారి సంఖ్య పెరిగిపోవడంతో ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలో పిల్లల్ని కనాలని ఆ దేశ ప్రభుత్వం కూడా అక్కడ జంటలను ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో చైనాలో అతిపెద్ద ట్రావెల్ ఏజెన్సీ ట్రిప్ డాట్ కామ్ తమ ఉద్యోగులకు బంపరాఫర్ ఇచ్చింది. ఐదేళ్లలో రూ.5.6 లక్షలు కంపెనీలో పనిచేసే ఉద్యోగులు పిల్లల్ని కంటే ఒక్కో శిశువుకు ఏడాదికి 10,000 యువాన్లు (రూ.1.1 లక్షలు) చొప్పున ఐదేళ్లపాటు అందిస్తామని ట్రిప్ డాట్ కామ్ సంస్థ ప్రకటించింది. అంటే ఒక్కో బిడ్డకు ఐదేళ్లలో మొత్తంగా 50,000 యువాన్లు (రూ.5.6 లక్షలు) లభిస్తాయి. జూన్ 30న ప్రకటించిన ఈ ఆఫర్ జూలై 1 నుంచి అమల్లోకి వస్తుంది. వారికి మాత్రమే.. ఈ చైల్డ్ కేర్ బినిఫిట్లు కంపెనీలో మూడేళ్లకు పైగా పని చేస్తున్న ఉద్యోగులకు మాత్రమే. "మా ఉద్యోగులు వారి వృత్తిపరమైన లక్ష్యాలు, సాధనలపై రాజీ పడకుండా వారి కుటుంబాలను పోషించుకునేలా ప్రోత్సహిస్తూ ఆర్థిక సహాయాన్ని అందించే లక్ష్యంగా ఈ చైల్డ్‌కేర్ బెనిఫిట్‌ను ప్రవేశపెట్టాం" అని ట్రిప్ డాట్ కామ్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ జేమ్స్ లియాంగ్ చెప్పినట్లుగా సీఎన్ఎన్ వార్తా కథనం పేర్కొంది. కాగా చైల్డ్ కేర్ బినిఫిట్ల కోసం కంపెనీకి సుమారు 1 బిలియన్ యువాన్ (దాదాపు రూ.1131 కోట్లు) ఖర్చు అవుతుంది. చైనాలో ఒక ప్రైవేట్ కంపెనీ ఈ తరహాలో చైల్డ్ కేర్ బినిఫిట్లు ప్రారంభించడం ఇదే తొలిసారి. చైనా జననాల రేటు గత ఏడాది 1,000 మందికి గానూ 6.77 జననాలకు పడిపోయింది. ఇది 2021లో 7.52 జననాలుగా ఉండేది. ఇది రికార్డ్ స్థాయి అత్యంత తక్కువ జననాల రేటు. కొత్త తరం జనాభాను ప్రోత్సహించేందుకు 2021లో చైనా ప్రభుత్వం ప్రతి జంట ముగ్గురు పిల్లలను కనేందుకు అవకాశం ఇచ్చారు. కోవిడ్ కారణంగా ఇంట్లోనే ఉంటున్నప్పటికీ పిల్లలను కనడంపై జంటలు ఆసక్తి చూపించలేదు. తక్కువ ఆదాయం, పెరిగిన పిల్లల సంరక్షణ, విద్యా ఖర్చులు వంటివి ఇందుకు కారకాలుగా ఉన్నాయి. ఇదీ చదవండి: గుడ్‌న్యూస్.. డబుల్ డిజిట్ బాటలో వేతన ఇంక్రిమెంట్లు -
కుంకుమ పువ్వు ఎందుకంత ఖరీదు? సాగు అంత కష్టమా?
కుంకుమ పువ్వు ఎలా వస్తుంది? కుంకుమతో తయారు చేస్తారా? లేక... మొక్కకు పూస్తుందా? ఇది నిజంగా పువ్వేనా? చూస్తే పువ్వులా కనిపించదే మరి! అయినా... ఈ మొక్కలు ఎక్కడ ఉంటాయి? ఎవరు పెంచుతారు? ఎలా పెంచుతారు? ఈ సందేహాలకు చక్కటి వివరణ ఇస్తోంది... ఎర్ర బంగారాన్ని పండిస్తున్న శ్రీనిధి. కశ్మీర్ కుంకుమ పువ్వుకు మన తెలుగు నేల కేరాఫ్ అడ్రస్‌గా మారింది. వీపుకు బుట్ట కట్టుకుని టీ తోటలో కలియతిరుగుతూ మునివేళ్లతో లేత చివుళ్లను కోసి బుట్టలో వేసుకునే అస్సామీ అమ్మాయిలను చూస్తుంటాం. భూతల స్వర్గంలాంటి కశ్మీర్ నేల మీద లేతనీలిరంగు పూలను కోసి బుట్టలో వేస్తున్న మహిళలనూ చూçస్తాం. కానీ అది కుంకుమ పువ్వు అని నమ్మాలంటే ఏదో సందేహం వెంటాడుతూనే ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అన్నమయ్య జిల్లా, మదనపల్లె, పొన్నేటిపాలేనికి చెందిన ఓ తెలుగమ్మాయి శ్రీనిధి ఆ సందేహాలను నివృత్తి చేస్తోంది. కుంకుమ పువ్వు సాగు చేస్తూ మనకు పెద్దగా పరిచయం లేని రంగాన్ని ఎంచుకుని ట్రెండ్ సెట్టర్ అవుతోంది. కెరీర్ అంటే... ఇంటర్ తర్వాత బీటెక్ చేసి సాఫ్ట్వేర్ కంపెనీలో కంప్యూటర్ ముందు చేసే ఉద్యోగాలే అనుకుంటున్న సమాజానికి కొత్త దారి చూపిస్తోంది శ్రీనిధి. ‘వ్యవసాయ రంగం విస్తారమైనది. ఒకింత సృజనాత్మకత తో ముందుకెళ్తే మనమే మరికొందరికి మార్గదర్శనం చేసినవారమవుతాం’ అంటూ... కుంకుమ పువ్వు సాగులో తన అనుభవాలను ఆమె సాక్షితో పంచుకుంది. ‘‘నేను బెంగళూరులో ఏజీ బీఎస్సీ, వారణాసిలోని బీహెచ్‌యూలో ఎమ్మెస్సీ సాయిల్ సైన్స్ చేశాను. ‘వ్యవసాయరంగం ఎంతో విస్తారమైనది, అందులో నీకు తెలియని ఎంతో జ్ఞానం ఉంది’ అని నాన్న చెప్పిన మాటలే నన్ను నడిపించాయి. ఆ ఇంటరెస్ట్‌తో సాగు కోర్సునే చదివాను. కుంకుమ పువ్వు సాగును ఎంచుకోవడానికి మా పర్పుల్ స్ప్రింగ్స్ కంపెనీ కో పార్టనర్ శ్రీనాథ్ కారణం. తను అగ్రికల్చర్లో పీహెచ్డీ స్కాలర్. కుంకుమ పువ్వు సాగును సిలబస్‌లో ఒక భాగంగా చదివాను, కానీ ఆచరణలో విజయం సాధించడానికి మరింతగా అధ్యయనం చేశాను, ఇంకా చేస్తున్నాను. సాగు శోధన ఈ ఆలోచన 2021లో వచ్చింది. మరుసటి ఏడాది ఫిబ్రవరికి రంగంలోకి దిగాం. అది నేరుగా సాగు కాదు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. రెండు వందల యాభై చదరపు అడుగుల గదిలో అరలను ఏర్పాటు చేసి దాదాపు 550 అడుగుల విస్తీర్ణంలో కుంకుమ పువ్వు గింజలు నాటాం. మట్టి లేకుండా ఏరోఫోనిక్ విధానంలో సాగు చేస్తున్నాం. గదిలో ర్యాక్‌లు, చిల్లర్లు, కశ్మీర్‌కి వెళ్లి సీడ్ కొనుగోలు, రవాణా ఇతర ఖర్చులన్నీ కలిపి పది లక్షలు ఖర్చయింది. ఇది ఏడాదికి ఒక పంట వస్తుంది. తొలి ఏడాది దిగుబడి రెండు వందల గ్రాములు వచ్చింది. ఇప్పుడు రెండో పంట సాగు చేస్తున్నాం. ఈ సాగు సెలవు ఇవ్వదు కుంకుమ పువ్వు సాగు అంటే నిరంతరం పంట క్షేత్రాన్ని కనిపెట్టుకుని ఉండాల్సిందే. వెకేషన్‌కు వెళ్లాలంటే ఆగస్టు నుంచి మే నెల వరకు అసలే కుదరదు. మే నుంచి ఆగస్టు మధ్యలో కొంత వెసులుబాటు ఉంటుంది, కానీ పూర్తిగా హాలిడే కాదు. మరొకరికి బాధ్యత అప్పగించి వెళ్లి, పర్యవేక్షించుకుంటూ ఉండాలి. ఇండోర్‌లో చేసే కుంకుమ పువ్వు సాగుకు ఎక్కువ మంది సహాయకుల అవసరం ఉండదు. ఎందుకంటే శీతల గదిలోకి ఎక్కువ మంది వెళ్లరాదు. చాలా పరిశుభ్రత పాటించాలి. తలకు క్యాప్, చేతులకు గ్లవ్స్ తొడుక్కుని పూలు కోయాలి. ఆ పూలను నీడలో ఆరబెట్టి, ఆరిన తర్వాత పూలలోని రేకలను ఫోర్సెప్స్తో వేరు చేయాలి. ఆ రేకలు(కేసరాలు) కుంకుమపువ్వు. గ్రాము కుంకుమ పువ్వులో వేల రేకలుంటాయి. రేక తీయడం ఓ చాలెంజ్ చెట్టు నుంచి పూలు కోయడం, పువ్వు నుంచి రేకలను విరగకుండా వేరు చేయడంలో నైపుణ్యం చాలా అవసరం. ఈ సాగులో అసలైన సవాలు ఇదే. ఈ సాగు మనకు కొత్త కాబట్టి మన దగ్గర ఎవరికీ పరిచయం ఉండదు. సహాయకులకు నేనే శిక్షణ ఇచ్చాను. పూలు విచ్చుకోవడం మొదలు పెట్టిన తర్వాత 15–25 రోజుల్లో అన్ని పూలూ విచ్చుకుంటాయి, పంట పూర్తవుతుంది. విరిసిన పువ్వుని ఇరవై నాలుగ్గంటల్లోపల చెట్టు నుంచి కోసేయాలి. పూల కాలం పూర్తయిన తరవాత చెట్టు నవంబర్ నుంచి మే నెల మధ్యలో గింజలను పెంచుకుంటుంది. దీనిని సీడ్ మల్టిప్లికేషన్ అంటాం. ప్రతిసారీ కశ్మీర్కెళ్లి విత్తనాలు తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. మనకు కావల్సిన సీడ్స్ మనమే తయారు చేసుకోవచ్చన్నమాట. మేము పరిశోధన దశలోనే ఉన్నాం. పంట పంటకూ విత్తనాల సంఖ్య పెంచుకుంటూ సాగు విస్తీర్ణం పెంచుకోవాలి. కచ్చితంగా చెప్పలేను, కానీ పెట్టుబడి, ఇతర ఖర్చులన్నీ పోయి ఆదాయంలోకి రావాలంటే మరో మూడేళ్లు పట్టవచ్చు. హార్ట్ వర్కే కాదు స్మార్ట్‌గానూ చేయాలి చల్లదనాన్ని పది డిగ్రీల నుంచి 22 డిగ్రీల మధ్యలో పంట దశను బట్టి మారుస్తుండాలి. కరెంటు పోకూడదు, హెవీ కెపాసిటీలో ఒక చిల్లర్ తీసుకోవడం కంటే మీడియం కెపాసిటీ చిల్లర్లు రెండింటిని అమర్చుకుంటే ఒకదానికి రిపేర్ వచ్చినా పెద్దగా ఇబ్బంది ఉండదు. ఏ రంగమైనా సరే... మనం అంకితభావంతో పని చేస్తే మంచి ఫలితాలనే ఇస్తుంది. హార్డ్‌వర్క్‌తో పాటు స్మార్ట్ వర్క్ కూడా అవసరమే. నా పంటను ఆన్లైన్లోనే అమ్మాను. ఇప్పుడు కుంకుమ పువ్వు సాగులో మెళకువలు నేర్చుకుంటున్నాను. ఆ తర్వాత సాగు విస్తీర్ణం పెంచుకుంటూ మార్కెట్‌ను విస్తరిస్తాను’’ అన్నారు శ్రీనిధి. ఎర్ర బంగారం! కుంకుమ పువ్వు అవసరం చాలా ఉంది. అవసరానికి తగినంత లభ్యత లేదు. దాంతో మార్కెట్‌ని నకిలీలు రాజ్యమేలుతున్నాయి. ఇది చాలా ఖరీదైన సుగంధద్రవ్యం. అందుకే ఎర్ర బంగారం అంటారు. మన దగ్గర పంట ఉండాలే కానీ కేజీల్లో కొనేవాళ్లు కూడా ఉన్నారు. సౌందర్యసాధనాల తయారీ పరిశ్రమలు, ఔషధాల పరిశ్రమలు, ఆహార, పానీయాల తయారీదారులు టోకుగా కొంటారు. మన దగ్గర వంటల్లో కుంకుమ పువ్వు వాడకం బాగా తక్కువ. గర్భిణులు మాత్రం పాలల్లో కలుపుకుంటూ ఉంటారు. అయితే... కుంకుమ పువ్వు కలిపిన పాలు తాగితే బిడ్డ తెల్లగా పుడతారనే విశ్వాసాన్ని మేము నిర్ధారించలేం. శాస్త్రీయంగా ఆధారం ఏదీ లేదు. కానీ ఆహారంలో కుంకుమ పువ్వు తీసుకున్న వారి చర్మం ఆరోగ్యంగా, క్లియర్‌గా, కాంతివంతంగా మారుతుంది. అలాగే ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ వంటి కొన్ని ఔషధ గుణాలు గాయాలను మాన్పడం వంటి ప్రయోజనాలతో ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి కాబట్టి గర్భిణులే కాదు మామూలు వాళ్లు కూడా తీసుకోవచ్చు. – పప్పు శ్రీనిధి, కుంకుమ పువ్వు రైతు – వాకా మంజులారెడ్డి,సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
షుగర్ పేషెంట్స్ కొబ్బరినీళ్లు తాగుతున్నారా? అయితే ఇది చదవాల్సిందే
కొబ్బరి నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీఇన్నీ కావు. అనేక అనారోగ్య సమస్యలకు కొబ్బరినీళ్లు దివ్య ఔషధంలా పనిచేస్తాయి. నూటికి నూరుపాళ్లు సహజసిద్ధమైన, కల్తీకి ఆస్కారం లేని పానీయం ఇది. అందుకే ఎవరైనా అనారోగ్యానికి గురైతే కొబ్బరిబోండం తాగమని డాక్టర్లు సలహా ఇస్తుంటారు.శరీరంలోని వేడిని తగ్గించి, డీహైడ్రేట్ అయ్యేలా కాపాడుతుంది. ఆరోగ్యపరంగానే కాకుండానే అందం రెట్టింపు అయ్యేందుకు కూడా కొబ్బరిబోండం సహాయపడుతుంది. ప్రతిరోజూ కొబ్బరినీళ్లు తాగడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది.మెగ్నీషియం, సోడియం, పొటాషియం, ఫాస్పరస్, సీ విటమిన్ వంటి ఎన్నో ఖనిజ లవణాలు కలిగిన కొబ్బరినీళ్లతో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయా? షుగుర్ పేషెంట్స్ కొబ్బరినీళ్లు తాగొచ్చా అన్నది ఈ స్టోరీలో తెలుసుకుంది. కొబ్బరినీళ్లతో బోలెడు ప్రయోజనాలు ► కొబ్బరినీళ్లలో యాంటీఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు ఉంటాయి. ఇవి అనేకరకాల వ్యాధులను దూరం చేస్తాయి. ► కొబ్బరినీళ్లలో 94 శాతం నీరు ఉంటుంది. ఇది వ్యార్థాలను తొలగించి శరీరాన్ని డీటాక్స్ చేస్తాయి. ► కొబ్బరినీళ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. ► జీర్ణక్రియ ప్రక్రియను మెరుగుపర్చడమే కాకుండా పొట్ట సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. ► రోజూ కొబ్బరినీళ్లు తాగడం వల్ల అధిక రక్తపోటును నివారిస్తుంది. ► గుండెజబ్బులు, హార్ట్ ఫెయిల్యూర్ రిస్కును తగ్గించడంలో కొబ్బరినీళ్లు ముఖ్య పాత్ర వహిస్తుంది ► కిడ్నీ సమస్యలలో ఎఫెక్టివ్: కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నవారు కూడా కొబ్బరి నీళ్లు తాగడం మంచిది. ► బరువు తగ్గిపోతున్నామని బావించేవాళ్లు ప్రతిరోజూ కొబ్బరినీళ్లు తాగాలి. ఇందులోని తక్కువ కొవ్వు శరీరానికి మేలు చేస్తుంది. షుగర్ పేషెంట్స్ కొబ్బరినీళ్లు తాగొచ్చా? ♦ డయాబెటీస్ పేషెంట్స్ కొబ్బరినీళ్తు తాగితే రక్తంలో చక్కెర స్థాయిలో పెరుగుతాయనే అపోహ ఉంటుంది. కానీ మధుమేహ వ్యాధిగ్రస్తులకు కొబ్బరినీళ్లు తాగడం వరం లాంటిదని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి నీళ్లు రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుందని వైద్యులు అంటున్నారు. ♦ ఇది టైప్ 2 డయాబెటిస్, ప్రీడయాబెటిస్‌లో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. అయితే డయాబెటిస్ ఉన్న వాళ్ళు ముదిరిన కొబ్బరి నీటిని కాకుండా లేత కొబ్బరి నీటిని తాగడం మంచిది. ఎందుకంటే ముదురు కొబ్బరితో పోలిస్తే లేత కొబ్బరిలో చక్కెర శాతం చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. ♦ అయితే ఈమధ్య కాలంలో ప్యాక్ చేసిన కొబ్బరినీళ్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంటున్నాయి. వీటిని షుగర్ పేషెంట్స్ తీసుకోవద్దని సూచిస్తున్నారు నిపుణులు. ఇందులో ప్రిజర్వేటీస్, చక్కెరలు డయాబెటిస్ పేషెంట్స్‌కి మంచిది కాదని, వాళ్లు మాత్రం సహజంగా దొరికే కొబ్బరినీళ్లు తాగడమే ఉత్తమమని పేర్కొంటున్నారు. -
తాటిబెల్లం ఏయే వ్యాధులను నయం చేస్తుందంటే..!
తాటిబెల్లం మనం వాడుతున్న పంచదారకి అద్భతమైన ప్రత్యామ్నాయం. నిజానికి మనం రోజు తినే పంచదార చెరుకు నుంచి తయారవుతుంది. కాని దీన్ని తయారుచేసే సమయంలో ఇందులో ఉన్న పోషక విలువలు అన్నీ పోయి కేవలం తీపి మాత్రమే మిగులుతుంది. దీనిలో తీపి రుచి తప్ప ఎలాంటి ప్రయోజనాలు ఉండవు. ఈ తాటిబెల్లం దేవుడు ఇచ్చిన ప్రకృతి ప్రసాదంగా చెప్పుకోవచ్చు. ఇందులో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. దీన్ని తాటి చెట్టు నుంచి నేరుగా తయారు చేస్తారు. ఇందులో అవసరమైన ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. చక్కెర కంటే 60 రెట్లు ఎక్కువ ఖనిజాలు ఉంటాయి. ఈ ఖనిజాల తోపాటు అనేక విటమిన్లు దీనిలో ఉంటాయి. ఆహారం జీర్ణం కావడానికి బాగా ఉపయోగపడుతుంది. అందువల్లే కొన్ని ప్రాంతాల్లో ఆహారం తీసుకున్న తర్వాత తాటిబెల్లం ముక్క తింటారు. పేగులను శుభ్రపరచడానికి సహాయపడుతుంది. ఇందులో ఇనుము సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తంలోని హిమోగ్లోబిన్ స్థాయిని పెంచి ఆస్తమాని తగ్గించేందుకు దోహదపడుతుంది. అంతేగాదు ఎముకలకు బలాన్ని ఇచ్చి కాల్షియం, పోటాషియం, భాస్వరం తదితరాలు ఉంటాయి. దీన్ని తరుచుగా తీసుకోవడం వల్ల నీరసం రాదు, పైగా శరీర పుష్టి, వీర్య వృద్ధిని కలిగిస్తుంది. ఎలాంటి వ్యాధులకు చెక్ పెడుతుందంటే.. తాటి బెల్లం తినడం వల్ల క్యాన్సర్ కారకాలతో పోరాడి క్యాన్సర్ రాకుండా చేస్తుంది. శరీరంలో ఉండే విషపదార్థాలను బయటకు పంపిస్తుంది. ఇది శ్వాసకోస, ప్రేగులు, ఆహార గొట్టం, ఊపిరితిత్తులు, చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులులో ఉండే విష పదార్థాలను బయటికి పంపించి పేగు క్యాన్సర్ రాకుండా చేస్తుంది. దీనిలో ఫైబర్ అధికం ఉండటం వల్ల మలబద్ధకం, అజీర్తి చికిత్సకు సహయపడుతుంది. శరీరంలోని హానికర టాక్సిన్ను బయటికి పంపించి మలబద్ధక సమస్యను నివారిస్తుంది. పొడి దగ్గు, ఆస్మా వంటి శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్న వ్యక్తి ఉదయాన్నే దీన్ని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఉదయాన్నే ఒక టేబుల్ స్పూన్ తాటి బెల్లం తీసుకుంటే మైగగ్రెయిన్ తలనొప్పి తగ్గుతుంది. ఇది కొవ్వుని కరిగించి అధికి బరువు తగ్గించడంలో ఉపయోగపడుతుంది. బీపీని కంట్రోల్ చేస్తుంది లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. స్త్రీలలో బహిష్టు సమస్యలను అరికడుతుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు బ్లడ్ ప్యూరిఫై చేసి శరీరంలో దెబ్బతిన్న కణజాలాన్ని పునరుద్ధరిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచి, శరీరంలోని వేడిని తొలగిస్తుంది. షుగర్ వ్యాధిగ్రస్తులు దీనిని తక్కువ మోతాదులో తీసుకోవచ్చు. దీనిని రోజు 25-30 గ్రాముల వరకు తీసుకోవచ్చు. చివరగా ఇది ఎక్కువగా గుంటూరు జిల్లా నిజామా పట్నం మండలం కాలిలో దొరుకుతుంది అలాగే గోదావరి జిల్లా నిడదవోలు,తాడేపల్లిగూడెం,చాగల్లు,కొవ్వూరు,పెదవేగి దేవరపల్లి, గోపాలపురం, భీమవరం, వీరవాసరం, తణుకులో ఎక్కువగా దొరుకుతుంది. దీంతో చేసుకునే సింపుల్ స్నాక్ ఐటెం తాటి బెల్లం నువ్వుల లడ్డు: కావాల్సిన పదార్థాలు: తాటి బెల్లం 2 కప్పులు నువ్వులు 2 కప్పులు తయారీ విధానం: తాటి బెల్లం కోరి చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. ఒక గిన్నెలో నువ్వులు తీసుకుని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేవరకూ వేయించుకోవాలి. వచ్చిన నువ్వులు, తాటి బెల్లం కలిపి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ నుంచి మిశ్రమాన్ని తీసి చిన్న చిన్న ఉండలు చేసుకుంటే తాటి బెల్లం ఉండలు తయారవుతాయి. (చదవండి: వర్షాకాలం..వ్యాధుల కాలం..ఈ జాగ్రత్తలు పాటిస్తే..వ్యాధులు పరార్!) -
అరటిపండుతో అదిరిపోయే అందం.. ఈ ప్యాక్‌తో ఇన్ని ఉపయోగాలా?
అందంగా కనిపించాలని ఎవరికి మాత్రం ఉండదు? వాటికోసం వేలకువేలకు తగలేసి కాస్మొటిక్స్ వస్తువులు కొంటుంటారు. కానీ ఈజీగా ఇంట్లోనే దొరికే అరటిపండుతో నిగనిగలాగే స్కిన్‌టోన్‌ను సొంతం చేసుకోవచ్చు. అరటిపండు తింటే ఆరోగ్యానికే కాదు, చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని మృదువుగా, ముడతలు లేకుండా చేయడంలో సహాయపడుతుంది. అందమైన చర్మం కోసం అరటింపడుతో ఇలా ప్యాక్ వేసుకోండి.. ♦ బాగా పండిన అరటిపండును తీసుకుని గుజ్జులా చేసుకోవాలి. దీన్ని ముఖం, మెడ భాగంలో అప్లై చేసుకోవాలి. అరగంట తర్వాత గోరువెచ్చటి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. ♦ అరటిపండు గుజ్జులో తేనే, పసుపు కలుపుకొని రాసుకుంటే ఇన్స్టంట్ గ్లో వస్తుంది. ♦ అరటిపండును మెత్తగా చేసుకోని దానిలో వేపాకు పౌడర్‌ను కలుపుకొని ముఖానికి పట్టించాలి. ఈ ప్యాక్‌ను తరచుగా వేసుకోవడం వల్ల మొటిమలను నివారిస్తుంది. ♦ మెటిమలు, వాటి తాలూకూ మచ్చలతో ఇబ్బంది పడుతున్నారా? అయితే అరటిపండు మీ సమస్యకు చక్కని పరిష్కారం.ఒక అరటిపండును తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పేస్ట్‌లా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ తేనె, నిమ్మరసం, శనగపిండి కలుపుకొని ముఖానికి అప్లై చేసుకోవాలి. 15-20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ♦ అరటిపండు గుజ్జులో రెండు రెండు స్పూన్ల పెరుగు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. 20 నిమిషాలయ్యాక ముఖాన్ని శుభ్రం చేసుకుంటే మృదువుగా మారుతుంది. -
రోబో చిన్నదే.. ప్రయోజనాలెన్నో!
ఈ రోబో కీటకాన్ని వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఇటీవల రూపొందించారు. తేనెటీగలు ఎగిరే తీరును గమనించి, దీనిని రూపొందించారు. ఇది ఎలాంటి ఇరుకైన ప్రదేశాల్లోకైనా తేలికగా చొరబడగలదు. దీని ముందు రెక్కలు వెనుక రెక్కల కంటే భిన్నమైన వేగంతో ప్రకంపిస్తాయి. (ఇదీ చదవండి: తక్కువ ధరలో బెస్ట్ గ్యాడ్జెట్స్.. ఒకదాన్ని మించి మరొకటి!) రెండువైపుల రెక్కలనూ కార్బన్ ఫైబర్‌తో తయారు చేశారు. భూకంపాల వంటి ప్రమాదాలు జరిగినప్పుడు శిథిలాల అట్టడుగున చిక్కుకున్న వారిని కనుగొనడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇరుకిరుకు ప్రదేశాల్లోని పరిస్థితులను పరిశీలించేందుకు, వాటికి అనుగుణమైన చర్యలు చేపట్టేందుకు దోహదపడుతుంది. -
ఇల్లు కొంటున్నారా ... ఈ జాగ్రత్తలు పాటించాలిసిందే
-
గురువాణి: పాతకొత్తల గొడవ మనకెందుకు!!!
అభ్యుదయం అంటే సమాజానికి మేలు చేయడం. మనుషులలో మంచి గుణాలు ఏర్పడితే అది అభ్యుదయానికి కారణమవుతుంది. మేలు జరగడానికి పాతదా కొత్తదా అని కాదు... పాతదంతా మంచీ కాదు, కొత్తదంతా చెడూ కాదు. అలాగే పాతదంతా చెడూ కాదు, కొత్తవన్ని మంచివీ కావు. రామాయణ భారతాల్లో అన్నీ ఉన్నాయండీ అని కొత్త వాఙ్మయం దేనికండీ అనడం మంచిదికాదు. కొత్తగా వచ్చిన గ్రంథాలలో ఎన్నో మంచి విషయాలుంటాయి. ‘‘పురాణమిత్యేవ న సాధు సర్వం/ నా చాపి కావ్యం నవమిత్యవద్యమ్/ సంతః పరీక్ష్యాన్యతరత్ భజంతే/ మూఢఃపరప్రత్యయనేబుద్ధిః’’ అంటారు మాళవికాగ్నిమిత్రంలో మహాకవి కాళిదాసు. అంటే పాతకాలానికి సంబంధించినది కాబట్టి ఇందులో ఏదీ పనికొచ్చేదీ, మంచిదీ ఉండదు – అనకూడదు. పాతవన్నీ చెడ్డవని ఎలా సిద్ధాంతీకరిస్తారు! ఈ రచన ఇప్పుడు కొత్తగా వచ్చింది, వీటిలో మన మేలు కోరేవి ఏం ఉంటాయి, వీటిని మనం ఆదరించక్కరలేదు... అని చెప్పడమూ కుదరదు. వివేకవంతులు ఏం చేస్తారంటే... అందులో ఏదయినా మంచి చెప్పారా.. అని పరిశీలిస్తారు. జీవితాలకు అభ్యున్నతిని కల్పించే మాటలు ఏవయినా వాటిలో ఉన్నాయా... అని చూస్తారు. కానీ ఎవరో ఏదో చెప్పారని తన స్వంత బుద్ధిని ఉపయోగించకుండా, మంచీ చెడూ విచారణ చెయ్యకుండా వాటినే అనుకరిస్తూ, అనుసరిస్తూ నిర్ణయాలు తీసుకోవడం మూఢుల లక్షణం. ..అంటున్నాడు కాళిదాసు. మనకు పనికొచ్చే విషయాలు ఎన్ని ప్రతిపాదింపబడ్డాయి.. అన్నదానిని పరిశీలించడం నిజమైన అభ్యుదయం. దాని విషయానికొస్తే అది పాతదా, కొత్తదా అని కాదు ఆలోచించాల్సింది, అందులో మంచి ఏముంది, ఇందులో మంచి ఏముంది? అని అంతకన్నా దాటి ఇక పరిశీలన చేయవలసిన అవసరం నాబోటివాడికి అక్కర లేదు. నా వరకు నాకు కావలసినది – అది ఎవరు రాసింది అయినా పాత కాలపుదయినా, కొత్తకాలపుదయినా, ఇప్పుడు సమాజంలో ఉన్న వ్యక్తులు రాసినది అయినా, పాతకాలంలో రుషుల వాఙ్మయం అయినా... అందులో అభ్యుదయానికి చెప్పబడిన మంచి విషయాలు ఏమున్నాయి? అనే. వాటిని స్వీకరించి, జీర్ణం చేసుకుని బాగుపడడానికి ప్రయత్నం చేయడం వరకే. పాతకాలంలో కూడా ఆదరణీయం కానివి, అంగీకారయోగ్యం కానివి, సమాజానికి ఉపయుక్తం కానివి ఎన్నో ఉండవచ్చు. అంతమాత్రం చేత పాతకాలంలో ఉన్న వాఙ్మయంలో పనికొచ్చేవి ఏవీ లేవు.. అని చెప్పడం సాధ్యం కాదు. ‘పురాణమిత్యేవ న సాధు సర్వం ...’ ఇది... ఆకాలంలో కాళిదాసు చెప్పిన మాట. ఈ మాట ఇప్పటికి పనికి రాదా!!! ఇది నేర్చుకుంటే అభ్యుదయం కాదా!!! ఇది నేర్చుకున్నవాడి జీవితం ... చేత దీపం పట్టుకుని నడుస్తున్న వాడిలా ఉండదా? పువ్వు పువ్వు లోంచి తేనెబొట్టు స్వీకరించిన తేనెటీగకాడా !!! అందువల్ల మంచి విషయాలు స్వీకరించడం ప్రధానం కావాలి. అవి ప్రాచీన వాఙ్మయం నుంచి కావచ్చు, కొత్తగా వెలువడుతున్న గ్రంథాలనుంచి కావచ్చు. వ్యక్తులందరూ అలా స్వీకరించాలి, మంచి గుణాలు అలవర్చుకోవాలి, ఆ వ్యక్తుల సమూహమే సమాజ అభ్యుదయానికి కారణమవుతుంది. ఎవరో ఏదో చెప్పారని తన స్వంత బుద్ధిని ఉపయోగించకుండా, మంచీ చెడూ విచారణ చెయ్యకుండా వాటినే అనుకరిస్తూ, అనుసరిస్తూ నిర్ణయాలు తీసుకోవడం మూఢుల లక్షణం అంటున్నాడు కాళిదాసు. -
ప్రస్తుత హెల్త్ పాలసీ నచ్చడం లేదా? మరో పాలసీకి మారిపోండిలా..
హైదరాబాద్‌కు చెందిన క్రాంతి కుమార్ గతేడాది అత్యవసరంగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. సింగిల్ ఏసీ రూమ్‌ను ఆయన ఆసుపత్రిలో తీసుకున్నారు. మూడు రోజులకు కలిపి రూ.88,000 బిల్లు వచ్చింది. అతడికి రూ.4 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ ఉండడంతో నిశ్చింతగా ఉన్నాడు. కానీ, బీమా సంస్థ నుంచి పూర్తి పరిహారం అందలేదు. క్రాంతి తన వంతుగా రూ.33,000ను చెల్లించాల్సి వచ్చింది. అదేమని ప్రశ్నించగా.. బీమా కవరేజీలో రూమ్ రెంట్ పరిమితి 1 శాతంగా ఉంది. కానీ, అతడు ఎంపిక చేసుకున్న రూమ్ రోజువారీ అద్దె 1 శాతం కంటే మించి ఉంది. ఈ షరతు చూసిన తర్వాత అతడు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. దీంతో కొత్త ఇన్సూరెన్స్ ప్లాన్ కోసం అన్వేషణ మొదలు పెట్టాడు. ఇది క్రాంతి కుమార్ ఒక్కడికే ఎదురైన పరిస్థితి అనుకోవద్దు. దశాబ్దం క్రితం హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకుని, కొనసాగుతున్న వారంతా ఎదుర్కొంటున్నారు. క్లెయిమ్ పరిష్కారాల్లో జాప్యం, ఏదో రకమైన కొర్రీ పెట్టి తక్కువ పరిహారాన్ని చెల్లించడం, అధిక ప్రీమియం వసూలు లేదా నాసిరకమైన సేవలతో సరిపెట్టడం.. ఇలా ఎన్నో కారణాలతో పాలసీదారులు ఇబ్బంది పడుతున్నారన్నది వాస్తవం. వైద్య రంగంలో ద్రవ్యోల్బణం అధికంగా ఉంటోంది. దీంతో చికిత్సల వ్యయాలు గణనీయంగా పెరుగుతున్నాయి. అత్యాధునిక టెక్నాలజీ ఫలితంగా ఎన్నో సర్జరీలకు హాస్పిటల్లో చేరాల్సిన అవసరం ఏర్పడడం లేదు. అదే రోజు డిశ్చార్జ్ అయి వెళ్లొచ్చు. ఒకవైపు ఆరోగ్యం కోసం ఖర్చు చేస్తున్నప్పటికీ.. మరోవైపు జీవనశైలి వ్యాధులతో ఔట్ పేషెంట్ సేవల అవసరం పెరుగుతోంది. మారుతున్న ఈ అవసరాలు అన్నీ మన ఆరోగ్య బీమా కవరేజీలో భాగంగా ఉన్నప్పుడు అనుకున్న ప్రయోజనం నెరవేరుతుంది. అందుకే సమగ్రమైన హెల్త్ కవరేజీతో ఇన్సూరెన్స్ పాలసీ ఉండాలి. ఇప్పటికే తీసుకున్న పాలసీ సమగ్ర కవరేజీకి భరోసా ఇవ్వనట్టయితే.. చేతి నుంచి పెట్టుకోవాల్సి వస్తుంటే, బీమా సంస్థ సేవలు సంతృప్తికరంగా లేకపోతే, ప్రీమియం భారంగా మారితే అప్పుడు మన ముందు రెండు రకాల ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి బీమా సంస్థను మార్చడం. లేదంటే ప్రస్తుత సంస్థలోనే మెరుగైన ప్లాన్‌కు మారిపోవడం (మైగ్రేషన్). వీటి గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మీ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ సేవల పట్ల సంతృప్తిగానే ఉండి, పాలసీలోని కవరేజీ ఫీచర్లు, ప్రీమియం విషయంలో సంతృప్తిగా లేకపోతే అప్పుడు మీ ప్లాన్‌ను పోర్టింగ్ పెట్టుకోవడానికి బదులు, అదే బీమా సంస్థలో మెరుగైన ఫీచర్లతో కూడిన మరో ప్లాన్‌ను మైగ్రేట్ అవ్వడం మంచి నిర్ణయం అవుతుంది. పోర్టింగ్ అంటే ప్రస్తుత బీమా సంస్థను వీడి, మరో బీమా సంస్థకు మారిపోవడం. మైగ్రేషన్ అంటే ప్రస్తుత బీమా సంస్థలోనే మరో ప్లాన్‌కు మారిపోవడం. ‘‘హెల్త్ ఇన్సూరెన్స్ నిబంధనల కింద ఒక వ్యక్తి తన పాలసీని ఎలాంటి బ్రేక్ లేకుండా వరుసగా నాలుగేళ్ల పాటు రెన్యువల్ చేసుకుంటే, అప్పుడు ప్రస్తుత బీమా ప్లాన్ ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీ లేకుండా మైగ్రేషన్‌కు అర్హత లభిస్తుంది’’అని హెచ్డీఎఫ్సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ రిటైల్ బిజినెస్ ప్రెసిడెంట్ పార్థానిల్ ఘోష్ తెలిపారు. ఎప్పుడు మార్చుకోవాలి..? ‘‘కస్టమర్లు ప్రస్తుత హెల్త్ ప్లాన్ కవరేజీ పట్ల అసంతృప్తితో ఉంటే లేదా ప్రస్తుత బీమా సంస్థ సేవలు నచ్చకపోతే లేదా సమగ్రమైన, వినూత్నమైన బీమా పాలసీ అందుబాటు ప్రీమియానికి లభిస్తుంటే పోర్ట్ పెట్టుకోవచ్చు. కాకపోతే నూతన పాలసీ ప్రయోజనాలు, నూతన సంస్థ సేవల సదుపాయాలను ప్రధానంగా చూడాలి’’అని షా సూచించారు. ‘‘మార్కెట్లో ఉన్న ప్రతీ నూతన ఉత్పత్తి అందరికీ సరిపోకపోవచ్చు. వేరొక సంస్థలోని ప్లాన్‌లో ఉన్న ఆకర్షణీమయైన ఫీచర్లను చూసి మారిపోవడం సరికాదు. మీ అవసరాలు, కుటుంబ సభ్యులు, వయసు తదితర అంశాల ఆధారంగా కొత్త ఉత్పత్తిని మదింపు వేయాలి’’అని నివా బూపా హెల్త్ ఇన్సూరెన్స్ అండర్ రైటింగ్ డైరెక్టర్ బబతోష్ మిశ్రా పేర్కొన్నారు. ప్రస్తుత బీమా సంస్థ సేవలు సంతృప్తికరంగా లేకపోయినా, కస్టమర్ సేవలు నచ్చకపోయినా, ప్రస్తుత బీమా సంస్థ అందిస్తున్న సేవలు నాసిరకంగా ఉన్నా, సరైన కారణాలు చూపకుండా క్లెయిమ్‌ను తిరస్కరించినా అప్పుడు మారిపోవడాన్ని పరిశీలించొచ్చని యూనివర్సల్ సోంపో జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో శరద్ మాథుర్ సూచించారు. సరైన సమాచారం పొందలేకపోవడం, పారదర్శకత లేమి, కంపెనీ నుంచి సత్వర స్పందన లేకపోవడం, విలువ ఆధారిత సేవలు లేకపోయినా పోర్టింగ్‌ను పరిశీలించొచ్చని తెలిపారు. ఇప్పటికే బీమా పాలసీ ఉండి, అందులోని నిబంధనల వల్ల సొంతంగా చెల్లింపులు చేసుకోవాల్సి వస్తుంటే, రూమ్ రెంట్ పరంగా ఉప పరిమితులు ఉంటే, మీకు దీర్ఘకాలిక వ్యాధి ఉండి ఓపీడీ లేదా డేకేర్ కవరేజీ లేకపోతే, మీ ప్లాన్‌లో రీస్టోరేషన్ (బీమా ఖర్చయితే తిరిగి పునరుద్ధరించడం) ఫీచర్ లేకపోయినా, ముందు నుంచి ఉన్న వ్యాధులకు దీర్ఘకాలం వెయిటింగ్ పీరియడ్ ఉన్నా, అప్పుడు మీ వంతు ఎక్కువ చెల్లించాల్సి రావచ్చు. దీనికి బదులు వేరొక ప్లాన్‌కు మారిపోవడమే నయం. ఉదాహరణకు నివాబూపా సంస్థ రెండు గంటలకు మించి హాస్పిటలైజేషన్ అయితే చాలు చెల్లింపులు చేస్తోంది. అదే ఆదిత్య బిర్లా సంస్థ అయితే ఆరోగ్యకర జీవనశైలిని (కంపెనీ చెప్పినట్టు) అనుసరిస్తే అప్పడు ప్రీమియంలో నూరు శాతం వరకు రాయితీని ఆఫర్ చేస్తోంది. సాధారణంగా పోర్టింగ్ లేదా మైగ్రేషన్‌కు ప్రీమియం ఒక్కటినే ప్రామాణికంగా తీసుకోవద్దు. ఎందుకంటే అన్ని బీమా సంస్థలు కొన్నేళ్లకోసారి ప్రీమియంను సవరిస్తుంటాయి. అలాగే వయసు వారీగా కూడా ప్రీమియం పెంపు ఉంటుంది. అలాగే, బీమా కవరేజీని పెంచుకునేందుకు సైతం పోర్టింగ్ సరికాదు. దీనికి బదులు టాపప్ లేదా సూపర్ టాపప్ రూపంలో అదనపు కవరేజీని యాక్టివేట్ చేసుకోవచ్చు. బేసిక్ ప్లాన్ కవరేజీకి మించి క్లెయిమ్ వచ్చిన సందర్భాల్లోనే టాపప్, సూపర్ టాపప్ చెల్లింపులు చేస్తాయి. ఏమి చూడాలి..? మీ అవసరాలకు సరిపడే ప్లాన్‌ను ఎంపిక చేసుకోవాలి. పాలసీ వర్డింగ్స్, పాలసీ బ్రోచర్‌ను అన్ని పేజీలు చదివితే పూర్తి వివరాలు తెలుస్తాయి. తద్వారా ప్లాన్ ఆకర్షణీయమా? కాదా? అన్నది చూడొచ్చు. క్లెయిమ్ పరిష్కారాల విషయంలో నూతన సంస్థ పనితీరును విశ్లేషించాలి. క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి, క్లెయిమ్ చెల్లింపుల సామర్థ్యాలను చూడాలి. క్లెయిమ్ అభ్యర్థనలను ప్రాసెస్ చేయడంతో బీమా సంస్థల స్పందనను చూడాలి. ప్రీమియం ఎక్కువ ఉన్నా సరే, క్లెయిమ్ సమయంలో పాలసీదారులపై చెల్లింపుల భారం పడని పాలసీని ఎంపిక చేసుకోవాలి. ఓపీడీ కవరేజీ, డేకేర్, రీస్టోరేషన్ కూడా ఉండాలి. ఒక పాలసీ సంవత్సరంలో ఒక క్లెయిమ్ వల్ల బీమా కవరేజీ మొత్తం ఖర్చయినప్పుడు.. రీస్టోరేషన్ కింద బీమా సంస్థ అంతే మొత్తాన్ని పునరుద్ధరిస్తుంది. దీనివల్ల అదే ఏడాది మళ్లీ ఆసుపత్రిలో చికిత్స అవసరం పడితే క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇందులోనూ కొన్ని సంస్థలు ఒక ఏడాదిలో ఒకరు ఎన్ని సార్లు ఆసుపత్రిలో చేరినా, గతంలో క్లెయిమ్ చేసిన వ్యాధులకు సైతం రీస్టోరేషన్ (అన్ లిమిటెడ్) ఇస్తున్నాయి. వీటిని పరిశీలించొచ్చు. ముందు నుంచి ఉన్న వ్యాధులకు సాధారణంగా 3–4 ఏళ్ల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. దీనివల్ల వాటికి కవరేజీ కోసం అన్నేళ్లు ఆగక తప్పదు. దీనికి బదులు ఏడాది, అసలు వెయిటింగ్ పీరియడ్ లేని (రైడర్) పాలసీలు మెరుగైనవి. నో క్లెయిమ్ బోనస్ అనేది ప్రీమియం తగ్గింపు రూపంలో కాకుండా, బీమా కవరేజీ పెంపు రూపంలో ఉంటే ఎక్కువ ప్రయోజనం. రూమ్ రెంట్ పరిమితులు లేకుండా చూసుకోవాలి. ఇంటి నుంచే చికిత్స తీసుకోవాల్సి వస్తే (కరోనా వంటి సమయాల్లో) కవరేజీనిచ్చే డోమిసిలరీ ట్రీట్మెంట్ కవరేజీ ఫీచర్ ఉంటే మంచిదే. దరఖాస్తు తిరస్కరణ..? మంచి ఆరోగ్య చరిత్ర ఉండి, సరైన వివరాలు, డాక్యుమెంట్లు అందిస్తే నూతన సంస్థ పోర్టింగ్ అభ్యర్థనను ఆమోదించి పాలసీ మంజూరు చేస్తుంది. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉండి, ఇచ్చిన సమాచారంలో అస్పష్టత, గోప్యత ఉంటే, లేదా ఇతర కారణాలతో పాలసీ ప్రపోజల్‌ను తిరస్కరించొచ్చు. ఎందుకంటే అప్పటికే ఉన్న ఆరోగ్య చరిత్రను పాత సంస్థ నుంచి నూతన బీమా సంస్థ తీసుకుంటుందన్న విషయాన్ని మర్చిపోవద్దు. పాత బీమా సంస్థకు దరఖాస్తు సమయంలో ఇచ్చిన దానికి భిన్నమైన సమాచారం కొత్త సంస్థకు అందించినట్టయితే తిరస్కరణకు అవకాశాలుంటాయి. అటువంటి సందర్భంలో కొత్త సంస్థను బతిమిలాడే బదులు, ఉన్న సంస్థతోనే కొనసాగడం మంచి నిర్ణయం అవుతుంది. దీనికి బదులు ప్రస్తుత బీమా సంస్థలోనే మెరుగైన ఫీచర్లతో కూడిన ప్లాన్‌కు మైగ్రేట్ అవ్వడం మరో మంచి ఆప్షన్. అప్పటికే దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే, పోర్టింగ్ దరఖాస్తును ఆమోదించాలనేమీ లేదు. ముఖ్యంగా తనకున్న వ్యాధులకు పాత ప్లాన్‌లో క్లెయిమ్ చేసుకుని ఉంటే పోర్టింగ్ దరఖాస్తు తిరస్కరణకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పాత పాలసీ రెన్యువల్‌కు సంబంధించి ల్యాప్సెస్ ఉంటే అది కూడా తిరస్కరణకు కారణం అవుతుంది. నిబంధనల మేరకు రెన్యువల్ సమయంలో సంప్రదించకుంటే అప్పుడు పోర్టింగ్ విజయవంతం కాదు. అందుకే రెన్యువల్‌కు 60రోజుల ముందు సంప్రదించాలి. 70 ఏళ్లు దాటిన వారికి పోర్టింగ్‌కు అవకాశం ఉండదు. పోర్టింగ్ ఎలా..? నూతన సంస్థకు మారిపోవాలని నిర్ణయించుకుంటే రెన్యువల్ సమయంలోనే అనుమతిస్తారు. పాలసీ రెన్యువల్ తేదీకి 60 రోజుల నుంచి 45 రోజుల్లోపు నూతన బీమా సంస్థకు పోర్టింగ్ గురించి తెలియజేయాలి. ఈ సమయంలో వీలు కాకపోతే, తిరిగి రెన్యువల్ వరకు వేచి చూడాల్సిందే. ప్రపోజల్ పత్రం, పోర్టబులిటీ దరఖాస్తు పత్రాలను నింపాలి. ఆరోగ్య చరిత్ర, బీమా సంస్థ కోరిన అన్ని వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. కేవైసీ, ఇతర పత్రాలను కూడా అందించాలి. గత పాలసీ పరిధిలో క్లెయిమ్ చేసి ఉంటే, డిశ్చార్జ్ సమ్మరీ జోడించాలి. అనంతరం ప్రస్తుతం బీమా సంస్థకు పోర్టింగ్ సమాచారం వెళుతుంది. అప్పుడు ప్రస్తుత సంస్థ సదరు పాలసీదారుకు సంబంధించి క్లెయిమ్, ఇతర సమాచారాన్ని కొత్త సంస్థతో పంచుకోవాలి. అప్పుడు నూతన బీమా సంస్థ 15 రోజుల్లోపు తన నిర్ణయాన్ని తెలియజేస్తుంది. పాలసీ దరఖాస్తును ఆమోదిస్తే ప్రీమియం చెల్లించాలి. వీటిని గమనించాలి.. పోర్టింగ్ సమయంలో పాత ప్లాన్‌లో నో క్లెయిమ్ బోనస్ ప్రయోజనాలు ఉంటే, కొత్త ప్లాన్‌లోనూ జతవుతాయి. కానీ, దీనికి కంపెనీలు షరతు పెడుతున్నాయి. ప్రస్తుత కవరేజీ రూ. 5 లక్షలు ఉండి, కొత్త సంస్థలోనూ రూ.5 లక్షలే తీసుకుంటే, పాత ప్లాన్ పరిధిలోని నో క్లెయిమ్ బోనస్ పోర్టింగ్ అవ్వదు. అదే రూ.6 లక్షలు తీసుకుంటే నో క్లెయిమ్ బోనస్ కలుస్తుంది. పోర్టింగ్ లేదా మైగ్రేషన్‌ను కొత్త ప్రపోజల్గానే బీమా సంస్థలు పరిగణిస్తాయి. అండర్‌రైటింగ్ నిబంధనల మేరకు ప్రీమియం నిర్ణయిస్తాయి. బేసిక్ ఇండెమ్నిటీ ప్లాన్‌ను మాత్రమే మరో బీమా సంస్థ పరిధిలోని బీమా ఇండెమ్నిటీ ప్లాన్‌కు మార్చుకోగలరు. అంతేకానీ, టాపప్ లేదా క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్‌ను మార్చుకోలేరు. ఒక బీమా సంస్థ నుంచి మరో బీమా సంస్థకు హెల్త్ ప్లాన్‌ను పోర్టింగ్ పెట్టుకుంటే ఎలాంటి చార్జీల్లేవు. కార్పొరేట్ లేదా గ్రూప్ ప్లాన్లల ఉన్న వారికి ఇండివిడ్యువల్ ప్లాన్‌కు పోర్టింగ్ అవకాశం లేదు. వారు అదే సంస్థతో కొసాగాల్సిందే. -
పన్ను ప్రయోజనాలు కావాలంటే.. ఈ పోస్టాఫీస్ పథకాలపై ఓ లుక్కేయండి!
పేద, మధ్యతరగతి ప్రజలు ఎక్కువ ఆలోచించేది, ఆచరించే మంత్రం ‘పొదుపు’. వారికి ఆర్థిక తోడ్పాటు అందించేందుకు ప్రభుత్వం పోస్టాఫీసు ద్వారా పొదుపు పథకాలను అందిస్తోంది. ఈ పథకాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా డబ్బు పొదుపు చేయడంతో పాటు ఆదాయపు పన్ను ప్రయోజనాలను కూడా పొందొచ్చు.అవేంటో తెలుసుకుందాం! పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) ఈ పథకంలో 15 సంవత్సరాల మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. ఇందులో కనీసం రూ. సంవత్సరానికి 500, గరిష్ట డిపాజిట్ రూ.ఒకే ఆర్థిక సంవత్సరంలో 1.5 లక్షలు జమ చేసుకోవచ్చు. 5 సంవత్సరాల తర్వాత మాత్రమే నిధులను విత్‌డ్రా చేసుకోవచ్చు. అది కూడా ప్రాణాంతక వ్యాధి, ఉన్నత విద్య , నివాస మార్పు వంటి పరిస్థితులకు లోబడి ఉంటుంది. అయితే, వ్యక్తులు 7 సంవత్సరాలు పూర్తయిన తర్వాత పాక్షికంగా విత్‌డ్రా చేసుకునే సౌకర్యం ఉంది. 4 సంవత్సరాల తర్వాత రుణాన్ని పొందవచ్చు. ఈ పథకం కింద చేసిన డిపాజిట్లకు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. అదనంగా, సంపాదించిన వడ్డీ పూర్తిగా పన్ను రహితం. ప్రస్తుత పోస్టాఫీసు PPF వడ్డీ రేటు వార్షికంగా 7.1% ఉంది. సుకన్య సమృద్ధి ఖాతా ఆడపిల్లల భవిష్యత్ కోసం ఉద్దేశించిన ప్రత్యేక పథకం ఇది. 10 ఏళ్లలోపు బాలికలకు ఈ ఖాతాను తెరవవచ్చు. ఖాతా తెరిచే సమయంలో అమ్మాయి వయస్సుతో సంబంధం లేకుండా ఈ పథకం 21 సంవత్సరాల కాల వ్యవధిని కలిగి ఉంది. ఉదాహరణకు, ఖాతా తెరిచే సమయంలో ఒక అమ్మాయికి 7 సంవత్సరాలు ఉంటే, ఆ అమ్మాయికి 28 ఏళ్లు వచ్చేసరికి ఆ ఖాతా మెచ్యూర్ అవుతుంది. ఖాతా తెరిచినప్పటి నుంచి 15 సంవత్సరాల పాటు డిపాజిట్లు చేయాలి. ప్రస్తుత వార్షిక వడ్డీ రేటు 7.60%. ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.250, గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. మెడికల్ ఎమర్జెన్సీ విషయంలో ముందస్తు విత్ డ్రా చేసుకోవచ్చు, కాకపోతే కనీసం 5 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ పోస్ట్ ఆఫీస్ పన్ను ఆదా పథకం కింద చేసిన పెట్టుబడులు సెక్షన్ 80C కింద పన్ను ప్రయోజనాలకు అర్హత పొందుతాయి. ప్రస్తుత పోస్టాఫీసు సుకన్య సమృద్ధి ఖాతా వడ్డీ రేటు సంవత్సరానికి 7.6% అందిస్తుంది. ఆడపిల్లల ఉన్నత చదువుల కోసం, వివాహం కోసం నియమ నిబంధనలను అనుసరించి డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ పథకంలో చేసే పెట్టుబడులపై కూడా సెక్షన్ 80సి కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. అలాగే వడ్డీ గానీ, మెచ్యూరిటీ మొత్తంపై గానీ పన్ను వర్తించదు పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ (TD) పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ అనేది పన్ను మినహాయింపు కోసం ప్రముఖ పోస్టాఫీసు పథకాలలో ఒకటి. ఈ ప్లాన్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిది. పెట్టుబడిదారులు 1, 2, 3, 5 సంవత్సరాల వంటి వివిధ కాల వ్యవధిలో డిపాజిట్లు చేయవచ్చు ఈ పథకంలో గరిష్ట పదవీకాలం 5 సంవత్సరాలు. టైమ్ డిపాజిట్లో కనీస పెట్టుబడి మొత్తం రూ. 1,000, కాగా దీనికి గరిష్ట పరిమితి లేదు. అయితే, పన్ను ప్రయోజనం రూ. 1.5 లక్షలు ఉంటుంది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) పన్ను ప్రయోజనం కోసం ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టాలంటే ఖతాదారుడు మొత్తం పెట్టుబడిని ఒకేసారి చెల్లించాల్సి ఉంటుంది. మెచ్యూరిటీ సమయంలో ఖాతాదారులు అసలు, వడ్డీ రెండు కలిపి మొత్తం కార్పస్‌ను అందుకుంటారు. ప్రస్తుతం ఈ స్కీమ్‌లో 7% వడ్డీ లభిస్తోంది. ఈ పథకంలో కనీసం రూ.100 నుంచి పెట్టుబడులు పెట్టొచ్చు. గరిష్ఠ పరిమితి లేదు. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.50 లక్షల వరకు సెక్షన్ 80సి కింద పన్ను మినహాయింపునకు అర్హత ఉంటుంది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న పెద్దలు, స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన 55 నుంచి 60 ఏళ్ల లోపు వయసువారు ఈ పథకంలో చేరవచ్చు. ఇందులో కనీసం రూ.1000 నుంచి గరిష్టంగా రూ.15 లక్షల వరకు.. ఒకేసారి పెట్టుబడి పెట్టాలి. దీని ప్రత్యేకత ఏమనగా.. పోస్టాఫీస్ అందిస్తున్న పథకాల్లో అత్యధిక వడ్డీ రేటుని అందిస్తోంది ఈ పథకం. ప్రస్తుతం వార్షికంగా ఈ పథకం 8% వడ్డీ రేటు అందిస్తోంది. ఇందులో వడ్డీని త్రైమాసికంగా చెల్లిస్తారు. ప్రతి ఆర్థిక సంవత్సరం ఏప్రిల్, జులై, అక్టోబరు, జనవరి నెలల్లో మొదటి తేదీన వడ్డీ ఖాతాల్లో జమ చేస్తారు. ఈ పథకంలో పెట్టిన పెట్టుబడులపై కూడా సెక్షన్ 80సి కింద రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు. -
జియో మైండ్‌బ్లోయింగ్ ఆఫర్.. ఈ ప్లాన్‌తో 23 రోజుల వ్యాలిడిటీ, 75జీబీ డేటా.. ఫ్రీ, ఫ్రీ!
టెలికాం రంగంలోకి అడుగుపెట్టిన అనతి కాలంలోనే కస్టమర్లకు తనవైపు తిప్పుకుని దూసుకుపోతూ రిలయన్స్ జియో సంచలనంగా మారింది. కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు ప్రత్యేక ప్లాన్లను ప్రవేశపెడుతోంది జియో. ఇప్పుడు మరో వార్షిక రీఛార్జ్ ప్లాన్‌ను విడుదల చేసింది. కొత్త ఏడాది కానుకగా తన కస్టమర్లకు సరికొత్త ప్లాన్ తీసుకొచ్చింది. కొత్తగా ప్రవేశపెట్టిన ఈ ప్లాన్‌తో రీచార్జ్ చేసుకున్న కస్టమర్లకు అదనంగా కొన్ని రోజుల వ్యాలిడిటీ, ఉచిత డేటా వంటి బెనిఫిట్స్‌ని అందిస్తోంది. ఇంతకీ ఆ ప్లాన్ ఏంటో తెలుసుకుందాం! జియో యూజర్లకు.. స్పెషల్ ఆఫర్ వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్లు నెలవారీ ప్రీపెయిడ్ ప్లాన్ల కంటే చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. ఎందుకంటే అవి నెలవారీ ప్లాన్ల కంటే అనేక ప్రయోజనాలను అందిస్తాయి. వార్షిక ప్లాన్లతో, కస్టమర్లు ప్రతి నెలా వారి ఫోన్ నంబర్‌ను రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. బదులుగా, వారు సంవత్సరానికి ఒకసారి రీఛార్జ్ చేసుకోవడంతో బోలెడు బెనిఫిట్స్‌ను పొందచ్చు. రూ. 2999 ధర ఉన్న ప్రస్తుత వార్షిక ప్లాన్‌లో.. రోజుకు 2.5GB రోజువారీ డేటా ప్రయోజనాలు లభిస్తాయి. ఈ ప్యాక్ వ్యాలిడిటీ 365 రోజులు. అంతేకాకుండా ఇందులో అన్లిమిటెడ్ కాలింగ్‌తో పాటు రోజుకు 100 SMSలు పొందుతారు. జియో కస్టమర్లు ఈ ప్లాన్‌లో జియో టీవీ (Jio TV), జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్‌లకు ఉచిత సబ్స్క్రిప్షన్ కూడా పొందుతారు. ఈ వార్షిక ప్లాన్‌లో అందించే 2.5 GB రోజువారీ డేటా ముగిసిన తర్వాత కూడా ఇంటర్నెట్ వేగం 64Kbps స్పీడ్‌కి చేరకుంటుంది.. ఈ బెనిఫిట్స్‌తో పాటు మరింత ప్రయెజనాలు ఈ ప్లాన్‌లో జత చేసింది రిలయన్స్ జియో. ప్రత్యేక ఆఫర్ కింద, 23 రోజుల అదనపు వ్యాలిడిటీతో పాటు 75 జీబీ ఉచితంగా డేటా కూడా ఉంటుంది. చదవండి: Union Budget 2023: కేంద్రం శుభవార్త.. రైతులకు ఇస్తున్న సాయం పెంచనుందా! -
క్రెడిట్ కార్డు తీసుకుంటున్నారా? ఇవి పాటించకపోతే మీ జేబుకు చిల్లు ఖాయం!
ఇటీవల క్రెడిట్ కార్డ్ వినియోగం విపరీతంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మార్కెట్లోకి కొత్త కొత్త పేర్లతో క్రెడిట్ కార్డులు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే రివార్డ్‌లు, తక్కువ వడ్డీలు, ఆఫర్లను అందించేవి బోలెడు ఉన్నా పూర్తిగా తెలుసుకోకుండా వాటిని ఉపయోగిస్తే అవి మన జేబులకు చిల్లు పెట్టే అవకాశం కూడా ఉందండోయ్. అందుకే కేవలం కంపెనీలు అందిస్తున్న ప్రయోజనాలు మాత్రమే కాకుండా మీ అవసరాలకు ఎలాంటి క్రెడిట్ కార్డు సరిపోతుందో తెలుసుకోవాలి. ఆపై వాటిని తీసుకోవడం ఉత్తమం. సాధారణంగా ఒక వ్యక్తి ఆదాయం, క్రెడిట్ స్కోరు ఆధారంగా క్రెడిట్ కార్డు అర్హత లభిస్తుంది. ఇవి తీసుకునేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటో తెలుసుకుందాం! వినియోగం బట్టి కార్డు ఎంపిక ఉత్తమం ముఖ్యంగా మీరు కార్డుని ఎలా వాడుకుంటారు అనేది క్రెడిట్ కార్డు ఎంపికలో కీలకం. ఉదాహరణకు కొందరు ఆన్లైన్ షాపింగ్ ఎక్కువగా చేస్తుంటారు. అలాంటప్పుడు షాపింగ్ వెబ్సైట్లు,బ్రాండ్లపై డిస్కౌంట్లు అందించే కార్డును ఎంచుకుంటే మంచిది. లేదా మార్కెటింగ్ పని చేస్తున్నవారు ద్విచక్రవాహనంపై ఎక్కువగా తిరిగే అవకాశం ఉన్నందున.. పెట్రోలుపై క్యాష్ బ్యాక్, అధిక రివార్డు పాయింట్లు అందించే కార్డును పరిశీలించాల్సి ఉంటుంది. మీ వాడకం బట్టి ఏ తరహా కార్డు కావాలో ఎంపిక చేసుకోండి. అంతేకాకుండా ,డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్, రివార్డ్ వంటి ప్రయోజనాలు ఎలా పనిచేస్తాయన్న విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోని అనంతరం అవగాహనతో మీ కార్డును వినియోగించడం ఉత్తమం. ►మీ ఆదాయం, క్రెడిట్ స్కోరు ఆధారంగా బ్యాంకులు మీ క్రెడిట్ కార్డుకి పరిమితిని నిర్ణయిస్తాయి. పరిమితిలో 50 శాతానికి మించి ఉపయోగించకపోవడమే ఉత్తమం. లేదంటే అది క్రెడిట్ స్కోరుపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. ► కొన్ని బ్యాంకులు వాటి కార్డులపై వార్షిక రుసుములు వసూలు చేయడం లేదు. అయితే ఆ నిబంధన కూడా కొన్ని పరిమితులకు లోబడి ఉంటాయి. సంవత్సరంలో కస్టమర్ ఒక నిర్ణీత మొత్తం ఖర్చు చేసినప్పుడే ఈ రకమైన బెనిఫిట్ పొందగలరు. అన్నింటికంటే ముఖ్యమైనది కార్డు బిల్లుని గడువు తేది లోపు చెల్లించాలి. చదవండి: బడ్జెట్ 2023: కేంద్రం ఫోకస్ పెట్టనున్న కీలక అంశాలు ఇవేనా! -
గ్రీన్ ఫైనాన్స్ నిర్వచనం... వర్గీకరణ అవశ్యం
ముంబై: పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ప్రాజెక్టులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించడానికి, సంబంధిత (పర్యావరణ) కార్యకలాపాలకు ఆర్థిక వ్యవస్థలో ప్రాధాన్యతన ఇవ్వడానికి ఉద్దేశించిన– గ్రీన్ ఫైనాన్స్‌పై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ ఎం రాజేశ్వర్ రావు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా గ్రీన్ ఫైనాన్స్‌కు అంటే ఏమిటో స్పష్టమైన నిర్వచనం, వర్గీకరణ చేయాల్సిన తరుణం ఆసన్నమైందని అన్నారు. దీనివల్ల ఆయా పర్యావరణ పరిరక్షణా కార్యకలాపాలకు, ప్రాజెక్టులకు మరిన్ని నిధులు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. బిజినెస్ స్టాండెర్డ్ ఇక్కడ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గ్రీన్ ఫైనాన్స్‌కు తగిన నిర్వచనం, వర్గీకరణ వల్ల పర్యావరణ పరిరక్షణకు అంటే ఏమిటి? తమ రుణ పోర్ట్‌ఫోలియోలో గ్రీన్ ఫైనాన్స్‌కు ఎంతమేర ప్రాముఖ్యతను ఇవ్వాలి? వంటి అంశాలను బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మదింపు చేసుకోగలుగుతాయని అన్నారు. అలాగే గ్రీన్ ఫైనాన్స్‌ను నిర్లక్ష్యం చేసే అవకాశాలు కూడా గణనీయంగా తగ్గిపోతాయని అన్నారు. గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌లకు ప్రాధాన్యత దేశంలో పర్యావరణ పరిరక్షణ కార్యకలాపాలకు ఫైనాన్స్‌ను వేగవంతం చేయాల్సిన అవసరాన్ని రాజేశ్వర్‌రావు ఉద్ఘాటించారు. ఈ దిశలో గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌లు దేశంలో గ్రీన్ ఫైనాన్స్‌ను పెంచడంలో సహాయపడతాయని చెప్పారు. వాతావరణ మార్పు.. భౌతిక, పరివర్తన ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందన్నారు. వెరసి ఆయా అంశాలు ఆర్థిక పటిష్టతకు, ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి చిక్కులను తెచ్చిపెట్టే అవకాశమూ లేకపోలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో భౌగోళిక వాతావారణ మార్పుల వల్ల చోటుచేసుకునే ఆర్థిక నష్టాలను అర్థం చేసుకోవడానికి, అంచనా వేయడానికి, వీటిని నివారించే దిశలో సమగ్ర ఫ్రేమ్‌వర్క్‌లను అభివృద్ధి చేయడానికి, అమలు చేయడానికి నియంత్రణా సంస్థల ఏర్పాటు అవసరం ఉందని పేర్కొన్నారు. సావరిన్ గ్రీన్ బాండ్ (ఎస్జీబీ)ఇష్యూ నుండి రూ. 16,000 కోట్ల వరకు సమీకరించాలన్న బడ్జెట్ ప్రతిపాదనను డిప్యూటీ గవర్నర్ స్వాగతించారు. గ్రీన్ ప్రాజెక్టుల్లోకి నిధుల ప్రవాహానికి ఈ చర్య దోహదపడుతుందని అన్నారు. -
రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్.. ఒకే ప్లాన్‌లో అధిక ప్రయోజనాలు
హైదరాబాద్: రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ ‘రిలయన్స్ హెల్త్ ఇన్ఫినిటీ’ పేరుతో ప్రీమియం ఉత్పత్తిని విడుదల చేసింది. ఈ ప్లాన్‌లో అపరిమిత కవరేజీ సదుపాయం ఉంటుందని సంస్థ తెలిపింది. రూ.5 కోట్ల వరకు కవరేజీ తీసుకోవచ్చని, మేటరి్నటీ కవరేజీ, అంతర్జాతీయ కవరేజీ, అపరిమిత రీస్టోరేషన్ (సమ్ ఇన్సూరెన్స్ అయిపోతే పునరుద్ధరించడం), 15 వరకు యాడాన్ ప్రయోజనాలు ఉన్నట్టు సంస్థ ప్రకటించింది. ఆర్థికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉన్న వారికి రివార్డులు ఆఫర్ చేస్తున్నట్టు తెలిపింది. మెరుగైన క్రెడిట్ స్కోర్ కలిగిన వారికి, శారీరక వ్యాయామాలతో ఆరోగ్యకర బీఎంఐను నిర్వహిస్తున్న వారికి రివార్డులు అందించనుంది. ఓపీడీ కన్సల్టేషన్ చార్జీలకు సైతం కవరేజీ ఉంది. అలాగే, ఒక్కటే క్లెయిమ్ సమ్ ఇన్సూరెన్స్ దాటినప్పుడు నూరు శాతం అదనపు కవరేజీ లభిస్తుంది. హాస్పిటల్ రూమ్‌ల విషయంలో పరిమితులు కూడా లేవు. -
పసిడి రుణాలపై విస్తృత ప్రచారం
హైదరాబాద్: విద్య సహా పలు కుటుంబ పురోభివృద్ధి చర్యలకు, యువత ఉన్నతకి బంగారం రుణాలను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ దేశంలో విస్తృత ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు దిగ్గజ గోల్డ్‌లోన్ ఎన్బీఎఫ్సీ కంపెనీ ముత్తూట్ ఫైనాన్స్ ఒక ప్రకటనలో పేర్కొంది. ‘మీ బంగారాన్ని సద్వినియోగం చేసుకోండి’ (పుట్ యువర్ గోల్డ్ టు వర్క్) అనే సందేశంలో ఈ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపింది. మూడు దశలుగా విభజించిన ఈ ప్రచారాన్ని విభిన్న మాధ్యమాలు– టీవీ, ప్రింట్, రేడియో, కేబుల్ టీవీ, మ్యాగజైన్, థియేటర్, మల్టీప్లెక్స్, ఓఓహెచ్, బీటీఎల్, ఆన్ గ్రౌడ్ యాక్టివేషన్స్, ఓటీటీ, యూట్యూబ్, సోషల్ మీడియా తదితర డిజిటల్ మార్గాల ద్వారా నిర్వహిస్తున్నట్లు సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేఆర్ బిజిమాన్ తెలిపారు. ఈ మేరకు విడుదల చేస్తున్న ప్రకటనల్లో సుప్రసిద్ధ భారతీయ హాస్యనటులు– బ్రహ్మానందం, జానీ ఆంటోనీ, సాధు కోకి, రెడిన్ కింగ్ల్సేలు నటిస్తున్నట్లు సంస్థ తెలిపింది. -
ఏడాదికి 20రూపాయలే..బెనిఫిట్ రూ.2 లక్షలు
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన ఒకటి. ఈ స్కీమ్ పాలసీ తీసుకున్న పాలసీ దారుడు ప్రమాదవశాత్తూ మరణిస్తే.. వారి కుటుంబాన్ని ఆర్ధికంగా ఆదుకునేందుకు సాయపడుతుంది. రూ.2 లక్షల వరకు ప్రయోజనం ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన పథకంలో ఏడాదికి రూ.20 చెల్లించి రూ. 2 లక్షల ప్రమాద బీమా పొందవచ్చు. మే నెల చివరిలో బ్యాలెన్స్ కట్ పీఎం సురక్ష బీమా యోజన పథకంలో చేరాలనుకునే వారు సంబంధిత బ్యాంకులు, పోస్టాఫీస్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ఈ బీమా పాలసీ తీసుకున్న పాలసీ దారులు ఆటో డెబిట్ పెట్టుకుంటే వారి అకౌంట్ నుంచి ప్రతి సంవత్సరం రూ.20 బ్యాంక్ అకౌంట్ నుంచి నేరుగా కట్ అవుతాయి. కావాల్సిన డాక్యుమెంట్లు ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన పథకంలో చేరాలనుకునే వారికి బ్యాంక్ అకౌంట్,ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. అర్హులు ఎవరంటే కేంద్రం అందిస్తున్న ఈ పథకంలో 18 నుంచి 70 ఏళ్ల వయసు వారు చేరేందుకు అర్హులు. -
సిరులు పండిస్తున్న కొర్రమీను.. ఇలా చేస్తే లాభాలే లాభాలు
తాడేపల్లిగూడెం రూరల్(పశ్చిమ గోదావరి): మత్స్య ఉత్పత్తులకు పెట్టింది పేరు పశ్చిమగోదావరి జిల్లా. దేశ, అంతర్జాతీయంగా ఇక్కడి ఉత్పత్తులకు మంచి పేరు ఉంది. మత్స్య ఉత్పత్తుల్లో పండుగప్పది ప్రత్యేక స్థానం. ఇది సముద్రంలో పెరిగే చేప అయినప్పటికీ ఇక్కడి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో చెరువుల్లో సైతం సాగు చేస్తున్నారు. తరువాత స్థానం కొర్రమీనుదే. ఔషధ గుణాలతో పాటు రుచిగా ఉండటంతో మాంసప్రియులు దీనిని తినేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఇప్పుడు ఈ చేప సీడ్ విక్రయం లాభసాటిగా మారడంతో కొందరు రైతులు తమ ఇళ్లల్లోనే సాగు చేసి లాభాలను చవిచూస్తుండటం విశేషం. చదవండి: జియో ట్రూ 5జీ : అతి త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో సేవలు కొర్రమీను సాగుపై రైతులు మక్కువ చూపుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చెరువుల్లోనూ సైతం సాగు చేసేందుకు రైతులు ముందుకు రావడంతో సీడ్ దశలోనే మంచి గిరాకీ ఉందని సీడ్ సాగుదారులు పేర్కొంటున్నారు. సీడ్‌ను సైతం ప్రకృతి సిద్ధంగా మురుగు కుంటల్లో పెరిగిన కొర్రమీను నుంచి సేకరిస్తున్నారు. ఈ సీడ్‌ను ఇంటి పెరట్లోనే పెంచి చెరువుల రైతులకు విక్రయిస్తూ లాభాలు గడిస్తున్నారు. ఇలా ఒక్క తాడేపల్లిగూడెం మండలంలోనే జగన్నాథపురం, నవాబ్‌పాలెం, కృష్ణాయపాలెం, దండగర్ర గ్రామాల్లో దాదాపు 15 నుంచి 20 మంది రైతులు కొర్రమీను సాగు చేపట్టడం విశేషం. జగన్నాథపురం గ్రామానికి చెందిన మారెడ్డి శ్రీనివాస్ తన కుమార్తెను భీమవరం కళాశాలకు తీసుకెళ్లే క్రమంలో కొర్ర మీను సాగుపై తన బంధువుల ద్వారా తెలుసుకున్నాడు. తాను కూడా ఒక ప్రయత్నం చేయాలనే సంకల్పంతో దాదాపు ఐదు వేల కొర్రమీను పిల్లను రూ.3 వేలకు కొనుగోలు చేశారు. దాదాపు మూడు నెలల వ్యవధిలోనే అంగుళం సైజు పిల్ల రూ.17 చొప్పున మొత్తం రూ.85 వేలకు సీడ్‌ను కైకలూరుకు చెందిన చేపల సాగుదారుడు కొనుగోలు చేశారు. సీడ్‌కు రూ.3 వేలు, మూడు నెలలు చేప పెంపకానికి ఐదు నుంచి పది వేల రూపాయలు వరకు ఖర్చయిందని అంచనా. పెట్టుబడి రూ.13 వేలు పోను రూ.72 వేల వరకు లాభం కనబడుతుంది. దీంతో మరింత ఉత్సాహంగా రైతు మారెడ్డి శ్రీనివాస్ కొర్రమీను పెంపకాన్ని చేపట్టారు. తాను సాగు చేయడంతో పాటు పరిసర గ్రామాల రైతులను సైతం ప్రోత్సహిస్తున్నారు. ఇంట్లోనే 1.50 లక్షల సీడ్ పెంపకం జగన్నాథపురం గ్రామంలోని తన ఇంటిలోనే మారెడ్డి శ్రీనివాస్ దాదాపు 1.50 లక్షల సీడ్‌ను పెంచుతున్నారు. సీడ్ పెంపకానికి మొదట్లో అందుబాటులో ఉన్న ట్యాంకులను వినియోగించినప్పటికీ సీడ్ పెరగడంతో వైజాగ్ నుంచి తీసుకువచ్చిన ట్యాంకుల్లో పెంచుతున్నారు. ఒక్కో ట్యాంకు ఖరీదు రూ.4,500 కాగా, పైప్‌లైన్, ఇతరత్రా పనులకు మరో రూ.500 వెరసి రూ.5 వేల వరకు ఖర్చు చేశారు. ప్రస్తుతం తన ఇంటి వద్ద ఆరు ట్యాంకుల్లో సైజుల వారీగా పెంచుతున్నారు. ఒక్కో ట్యాంకులో ఐదు వేల వరకు పిల్లను పెంచాల్సి ఉండగా, 25 వేల సామర్థ్యంతో పిల్లను పెంచుతుండటం గమనార్హం. పిల్ల పరిమాణం ఆధారంగా మేత మైక్రో సీడ్ నుంచి మూడు అంగుళాల వరకు ఒక్కో దశకు ఒక్కో రకమైన మేతను అందిస్తారు. మైక్రో సీడ్‌కు తొలి వారం రోజులు ఎటువంటి ఆహారాన్ని అందించరు. తదుపరి తవుడు మాదిరి పౌడర్‌ను అందిస్తారు. 0.3, 0.6 సైజులు కలిగిన మిల్లెట్స్‌ను ఆహారంగా అందిస్తారు. ఈ ఆహారం కూడా పోషక విలువలు కలిగిన సోయాబీన్, తవుడు, వేరుశెనగ చెక్కతో తయారు చేసిన వాటినే వినియోగిస్తారు. పది కిలోల బస్తా రూ.1400 నుంచి రూ.2వేల వరకు పిల్ల సైజును బట్టి దాణాను కొనుగోలు చేస్తారు. రెండు నెలలకు సీడ్‌ను విక్రయించే నాటికి పది వేల పిల్లకు రూ.12 వేలు ఖర్చవుతుంది. ఈ పది వేల పిల్లను విక్రయిస్తే రూ.60 వేలు వస్తుంది. ఖర్చులు తీసివేస్తే రూ.48 వేల వరకు మిగులుతుంది. అన్ని పరిస్థితుల్లోనూ ఆరోగ్యంగా.. సాధారణంగా ఆక్వా సాగులో రైతులను వాతావరణ పరిస్థితులు వెంటాడుతుంటాయి. అయితే కొర్రమీను సాగు చేసే రైతులకు ఇటువంటి సమస్యలు ఉండవు. ఇవి ఆక్సిజన్, ఏ నీటినైనా తట్టుకుని జీవించగలవని రైతు మారెడ్డి శ్రీనివాస్ చెబుతున్నారు. బోరు, చెరువు, మంచినీటిలోనూ ఇవి ఆరోగ్యకరంగా పెరుగుతున్నట్టు చెబుతున్నారు. దక్షిణాది రాష్ట్రాలకు సీడ్ ఎగుమతి ఇక్కడ నుంచి అత్యధికంగా కర్ణాటక ఆక్వా సాగుదారులు రెండున్నర నుంచి మూడు అంగుళాల సైజు సీడ్‌ను కొనుగోలు చేస్తున్నారు. రెండున్నర అంగుళాల పిల్లను రూ.3కు, మూడున్నర అంగుళాల పిల్లను రూ.4 నుంచి రూ.6 వరకు విక్రయిస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం ఆక్వా సాగుదారులకు సబ్సిడీలను ఇస్తుండటంతో కొర్రమీను సాగు చేపట్టేందుకు రైతులు ఉత్సాహంగా ముందుకొస్తున్నారు. వీరితో పాటు కైకలూరు, ఆకివీడు, ఇతర రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడుకు సైతం ఎగుమతి చేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, మధురై, బెంగళూరులోనూ కొర్రమీను వినియోగం అధికం. దీంతో ఆయా ప్రాంతాలకు ఎక్కువగా సీడ్ ఎగుమతి జరుగుతుంది. ఇంట్లోనే సులభంగా పెంపకం కొర్రమీను పిల్లను ఇంట్లోనే ట్యాంకుల్లో పెంచుకునే వెసులుబాటు ఉంది. కూలీలు అవసరం లేదు. కుటుంబ సభ్యులే సమయానుగుణంగా ఆహారం, నీటిని మారిస్తే చాలు. ఎటువంటి ప్రతికూల పరిస్థితులనైనా తట్టుకోగలదు. మంచి ఆదాయం కూడా వస్తుంది. వీటి పెంపకంపై శిక్షణ ఇచ్చి యువతను ప్రోత్సహించడం ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. – మారెడ్డి శ్రీనివాస్, కొర్రమీను పెంపకందారుడు, జగన్నాథపురం, తాడేపల్లిగూడెం మండలం స్వయం ఉపాధికి అవకాశం నిరుద్యోగ యువతకు కొర్రమీను పెంపకం స్వయం ఉపాధి రంగంగా నిలుస్తుంది. దీనిపై అవగాహన కోసం సాగుదారుల వద్దకే నేరుగా తీసుకెళ్లి శిక్షణ ఇప్పించేందుకు సిద్ధంగా ఉన్నాం. యువత కొర్రమీను సీడ్ పెంపకాన్ని ఉపాధి మార్గంగా ఎంచుకోవాలి. – డాక్టర్ దేవీవరప్రసాద్‌రెడ్డి, మత్స్య విభాగం శాస్త్రవేత్త, కేవీకే, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం, వెంకట్రామన్నగూడెం, తాడేపల్లిగూడెం మండలం -
జియో యూజర్లకు గుడ్‌న్యూస్.. ఈ ప్లాన్లపై అదిరిపోయే ఆఫర్లు, ఫుల్‌గా బెనిఫిట్స్ కూడా!
దసరా పండుగ వచ్చేసింది. ఈ నేపథ్యంలో కంపెనీలు కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆఫర్లు మీద ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా జియో కూడా తగ్గేదేలే అంటూ తన కస్టమర్లకు అదిరిపోయే పండుగ ఆఫర్లను ప్రకటించింది. దసరా సందర్భంగా రెండు ప్లాన్లపై అదనపు తగ్గింపు ఆఫర్లతో పాటు బోలెడు బెనిఫిట్స్ కూడా అందిస్తోంది జియో. అయితే ఇది పరిమిత కాల ఆఫర్. కొన్ని రోజులే మాత్రమే అందుబాటులో ఉంటుంది. జియో కస్టమర్లకు ప్రకటించిన ఈ ఫెస్టివల్ బొనాంజాలో ఏకంగా రూ. 4,500 వరకు బెనిఫిట్స్ సొంతం చేసుకోవచ్చు. జియో ఫైబర్ తన కస్టమర్లకు ప్రీపెయిడ్ ప్లాన్స్‌తో పాటు పోస్ట్ పెయిడ్ సేవలను కూడా అందుబాటులో ఉంచింది. తాజాగా జియో ఫైబర్‌కు చెందిన రెండు పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ తన కొత్త కస్టమర్ల కోసం రూ. 599, రూ. 899 ప్లాన్లపై అవాకయ్యే ఆఫర్లును జత చేసింది. ఈ ఆఫర్ అక్టోబర్ 9 వరకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. JioFiber ప్రకటించిన ఫెస్టివల్ ఆఫర్లపై ఓ లుక్కేద్దాం.. JioFiber ₹599 ప్లాన్ ఈ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో 30 Mbps డౌన్లోడ్, అప్లోడ్ స్పీడ్‌తో అపరిమిత డేటా ప్రయోజనాలను అందిస్తుంది. అంతేకాకుండా ఇందులో సోనీలివ్( SonyLIV), డిస్నీ+ హాట్‌స్టార్ ( Disney+ Hotstar), వూట్ సెలెక్ట్( Voot Select)తో పాటు మరిన్నింటికి సబ్స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. ఈ ప్లాన్ జియో.కామ్, (Jio.com), మై జియో (MyJio) యాప్‌లో అందుబాటులో ఉంది. ఈ ప్లాన్‌తో కింద బెనిఫిట్స్ కూడా ఉన్నాయండోయ్ ►రిలయన్స్ డిజిటల్లో ₹1000 తగ్గింపు ►Myntra లో ₹1000 తగ్గింపు, Ajioలో ₹1000 తగ్గింపు ►ఇక్సిగోలో ₹1500 తగ్గింపు. జియో ఫైబర్ ఫెస్టివల్ బొనాంజా కింద ఈ ప్రయోజనాలను పొందాలంటే, కొత్త కస్టమర్లు తప్పనిసరిగా కనీసం 6 నెలల వ్యాలిడిటీతో ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవాలి. JioFiber ₹899 ప్లాన్ ఈ ప్లాన్‌లో 100 Mbps డౌన్లోడ్, అప్లోడ్ స్పీడ్‌తో అన్లిమిటెడ్ డేటా ప్రయోజనాలు ఉన్నాయి. వీటితో పాటు సోనీలివ్( SonyLIV), డిస్నీ+ హాట్‌స్టార్ ( Disney+ Hotstar), వూట్ సెలెక్ట్( Voot Select)తో పాటు మరిన్నింటికి సబ్స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. ఈ ప్లాన్ జియో.కామ్, (Jio.com), మై జియో (MyJio) యాప్‌లో అందుబాటులో ఉంది. ఈ ప్లాన్‌తో కింద బెనిఫిట్స్ కూడా ఉన్నాయండోయ్ ►రిలయన్స్ డిజిటల్లో ₹500 తగ్గింపు ► Myntraలో ₹500 తగ్గింపు ►Ajioలో ₹1000 తగ్గింపు ►ఇక్సిగోలో ₹1500 తగ్గింపు. అయితే జియో ఫైబర్ కొత్త కస్టమర్ కనీసం 3 నెలల వ్యాలిడిటీతో ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవాలి. చదవండి: అక్టోబర్‌లో 3 నుంచి 9 వరకు బ్యాంకులు పని చేయని నగరాలు ఇవే! -
ఇంధన సంక్షోభం: ప్రత్యామ్నాయాలు, ప్రయోజనాలు
భూమిలోని క్రూడ్ ఆయిల్ నిల్వలు అయిపోతే ఏం చేయాలి? అందుకే ప్రత్యామ్నాయ ఇంధనం కోసం అన్ని దేశాలు అన్వేషిస్తున్నాయి. కొన్ని దశాబ్దాలుగా కొద్ది కొద్దిగా వాడుతున్న ఇథనాల్ వినియోగం పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి? అసలు ఇథనాల్ దేని నుంచి తయారవుతుంది? దాని వల్ల మేలు జరుగుతుందా? సమాజానికి నష్టమా? • సకల చరాచర జగత్తు ఇంధనం మీదే ఆధారపడి నడుస్తోంది.. • భూమిలో లభిస్తున్న క్రూడ్ ఆయిల్ అయిపోతే..? • మానవాళి మనుగడే ప్రశ్నార్థకం కాదా? • ఈ ప్రశ్నలనుంచి ఉద్భవించిందే ప్రత్యామ్నాయ ఇంధనం.. •పెట్రోలియంకు బదులుగా తయారు చేసుకుంటున్నదే ఇథనాల్.. చెరకు నుంచి పంచదార, బెల్లం తయారు చేసుకుంటాం. చెరకు పిప్పి నుంచి ఆల్కహాల్, మొలాసిస్ తయారవుతాయని కూడా మనకు తెలుసు. బియ్యం దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధాన ఆహారం. మొక్కజొన్నలు కాల్చుకుని వేడి వేడిగా తింటాం. సినిమా థియేటర్లలో పాప్‌కార్న్ పేరుతో వందల రూపాయలు ఖర్చుపెడతాం. కాని ఇప్పుడు చెప్పుకున్న ఈ మూడు పదార్థాల నుంచి ఇంధనం తయారవుతుందంటే నమ్మగలమా? నమ్మాల్సిందే.. 2013 నుంచే మన దేశంలో కూడా చెరకు, బియ్యం, మొక్కజొన్నల నుంచి తయారవుతున్న జీవ ఇంధనాన్ని పెట్రోల్‌లో కొద్ది కొద్దిగా కలుపుతున్నారు. మనకు ఆ విషయం తెలియదు. ప్రపంచమంతా ఇప్పుడు జీవ ఇంధనం దిశగా అడుగులు వేస్తోంది. విదేశీ మారకద్రవ్యం ఆదా చేసుకోవడం, పర్యావరణాన్ని కాపాడుకోవడం, వేగంగా అంతరించిపోతున్న ముడిచమురు నిల్వల్ని మరికొంత కాలం అదనంగా లభించేలా చూసుకోవడం వంటి లక్ష్యాలతో ప్రపంచమంతా జీవ ఇంధనం తయారీ దిశగా అడుగులు వేస్తోంది. భూమి మీద కొన్ని దేశాల్లోనే క్రూడ్ ఆయిల్ లభిస్తుంది. వాటి నుంచే మిగిలిన ప్రపంచమంతా దిగుమతి చేసుకుంటోంది. ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలున్న అమెరికా...అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశం అంటే నమ్మగలమా? అమెరికా తర్వాత రష్యాలోనే అధిక చమురు నిల్వలున్నాయి. ప్రస్తుతం భారతదేశంలో వాడుతున్న పెట్రోల్, డీజిల్‌లో 82 శాతం ఆయిల్ రిచ్ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. మనదేశంలో ఉత్పత్తి అవుతున్నది కేవలం 18 శాతం మాత్రమే. మనం వాడే గ్యాస్‌లో 45 శాతం దిగుమతి చేసుకుంటున్నాం. 202122 ఆర్థిక సంవత్సరంలో భారత్ ముడి చమురు, గ్యాస్ కోసం 119 బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టింది. ఈ మొత్తాన్ని మన రూపాయల్లో లెక్కిస్తే 95,166 కోట్ల రూపాయలు అవుతుంది. ఆధునిక సమాజంలో ఇంధనం లేకపోతే మనిషి మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది. అందుకే కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి భూమి తనలో దాచుకున్న ముడి చమురును ఎడా పెడా తోడేస్తున్నాం. జనాభా పెరుగుతూ, అవసరాలు పెరిగే కొద్దీ సరికొత్త టెక్నాలజీతో చమురు తీసే వేగం కూడా పెరుగుతోంది. ఇలా భూమిలోని చమురును తోడేస్తూ ఉంటే 2052 నాటికి ముడి చమురు పూర్తిగా అంతరించిపోతుందనే అంచనాలు వేస్తున్నారు. అలాగే 2060 నాటికి సహజ వాయువు కూడా అదృశ్యమైపోతుంది. 2090 నాటికి బొగ్గు గనుల్లో బొగ్గు కూడా అయిపోతుంది. ఇవన్నీ అయిపోతే మనిషి మనుగడ ఏంకావాలి? అందుకే నాలుగైదు దశాబ్దాల నుంచే ప్రత్యామ్నాయ ఇంధనం గురించి అన్వేషణ మొదలైంది. ఇప్పటికే గాలినుంచి, సూర్యుడి శక్తి నుంచి విద్యుత్‌ను తయారు చేస్తున్నాం. 50 ఏళ్ళకు పూర్వమే జీవ ఇంధనం వాడకం కూడా మొల్లగా మొదలైంది. జీవ ఇంధనం అంటే మొక్కల నుంచి తయారు చేసుకోవడమే. అన్ని రకాల మొక్కలూ ఇందుకు ఉపయోగపడవు. మనం ఆహారానికి ఉపయోగించే చెరకు, మొక్కజొన్న, బియ్యం, బంగాళాదుంపలు, ఇతర నిరుపయోగమైన ఆహార పదార్థాల నుంచి ఇథనాల్ అనే చమురును తయారు చేసే టెక్నాలజీ ఇటీవల కాలంలో బాగా అభివృద్ధి చెందింది. ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఇథనాల్. ఇథనాల్‌కు అనుగుణంగా వాహనాలను సిద్ధం చేయాలని కేంద్ర ప్రభుత్వం కంపెనీలను ఆదేశించింది. పెట్రోల్‌కు ప్రత్యామ్నాయంగా ముందుకు వచ్చిన ఇథనాల్ ఉత్పత్తికి వాడే ముడి సరుకు ఏంటి? దాని వల్ల మానవాళికి ఏమైనా నష్టం జరుగుతుందా? పర్యావరణానికి మేలు జరుగుతుందా? భూమిలోని చమురు అయిపోతుండటం ఒక కారణం కాగా...చమురు నిల్వలు లేని దేశాలు వాటిని దిగుమతి చేసుకోవడానికి చెల్లించే విదేశీ మారకద్రవ్యం బిల్లులు ఏటేటా పెరిగిపోతుండటం కూడా ప్రత్యామ్నాయ ఇంధనం అన్వేషణకు కారణమైంది. అదే సమయంలో ప్రస్తుతం మనం వాడే పెట్రోల్, డీజిల్ వల్ల పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటోంది. కర్బన పదార్ధాల వల్ల భూమి, పర్యావరణం వేడెక్కి రుతువులు గతి తప్పుతున్నాయి. జీవ ఇంధనం వల్ల పర్యావరణానికి ఎలాంటి ప్రమాదమూ ఉండదు. ఇలా అనేక కారణాలతో ప్రపంచమంతా ఇథనాల్‌ని ప్రత్యామ్నాయ ఇంధనంగా తయారు చేసుకుంటోంది. చమురు నిల్వల్లో అగ్రభాగాన ఉన్న అమెరికానే ఇథనాల్ ఉత్పత్తిలో కూడా ప్రపంచంలో నెంబర్ వన్ స్థానంలో ఉంది. ప్రపంచంలో అన్ని దేశాల కంటే ముందుగా చెరకు నుంచి ఇథనాల్ తయారు చేసే టెక్నాలజీ కనిపెట్టిన బ్రెజిల్ ఇప్పుడు రెండోస్థానంలో ఉంది. చెరకు ఉత్పత్తిలో ప్రపంచంలో నెంబర్ వన్‌గా ఉన్న బ్రెజిల్ చాలా తక్కువ ఖర్చుతో ఇథనాల్ తయారు చేసుకుంటోంది. -ఈవీ బాలాజీ, సాక్షి -
ఏయే ఆదాయానికి ట్యాక్స్ మినహాయింపులిస్తారో..ఇవ్వరో మీకు తెలుసా!
గత వారం ‘ఇతర ఆదాయాలు’ శీర్షిక కింద వచ్చే వివిధ అంశాలను తెలుసుకున్నాం. ఈవారం ఏయే ఆదాయానికి మినహాయింపులిస్తారో..వేటి విషయంలో మినహాయింపులివ్వరో తెలుసుకుందాం. ♦డివిడెండు, వడ్డీని ఆదాయంగా లెక్కించినప్పుడు బ్యాంకరుకు ఇచ్చిన కమీషన్, పారితోషికం, ఇతర ఖర్చులు, వీటిని వసూలు చేయటానికి పెట్టిన ఖర్చులకు మినహాయింపులు ఇస్తారు. షరా మామూలుగానే ఖర్చు సమంజసంగా ఉండాలి. కాగితాలు, రుజువులు ఉండాలి. ♦ప్లాంటు, మెషినరీ, ఫర్నిచర్, బిల్డింగ్‌ల మీద వచ్చే అద్దె/ఆదాయం విషయంలో.. చెల్లించిన అద్దెపరమైన పన్నులు, రిపేర్లు, ఇన్సూరెన్స్, తరుగుదల మొదలైనవి తగ్గిస్తారు. ♦ చాలా మంది ఇంటద్దెని రెండు భాగాలుగా చేసి కొంత ఇంటి మీద అద్దె .. కొంత ఫర్నిచర్ మీద అద్దె అని ప్లానింగ్ చేస్తారు. ఇంటద్దె మీద ఏ కాగితాలు, వివరణ, సంజాయిషీ లేకుండా 30 శాతం స్టాండర్డ్ డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఫర్నిచర్ అద్దెలో అంత వెసులుబాటు ఉండదు. ♦ ఇతర ఆదాయం కింద పరిగణించేటప్పుడు దానిలో మినహాయింపులు రూ. 15,000 లేదా 1/3వ భాగం .. ఈ రెండింటిలో ఏది తక్కువయితే అదే ఇస్తారు. ♦ఏ ఆదాయం ఉన్నా/వచ్చినా సంబంధిత ఖర్చుని మినహాయిస్తారు. వివరణ, రుజువులు కావాలి. ♦ గుర్రాలను పోషిస్తూ, పోటీలు నిర్వహించే వారికి సంబంధిత ఖర్చులు మినహాయింపు ఇస్తారు. ♦నష్టపరిహారం విషయంలో ఖర్చులుంటే క్లెయిమ్ చేసుకోవచ్చు. ♦అలాగే కొన్ని ఆదాయాల లెక్కింపులో ఎటువంటి మినహాయింపులు ఇవ్వరు. వ్యక్తిగత ఖర్చులు ♦క్యాపిటల్ ఖర్చులు .. ప్లాంటు, మెషినరీ, ఫర్నిచర్, బిల్డింగ్, మొదలైనవి. ♦ఆస్తి పన్ను (మున్సిపల్ పన్ను కాదు) ♦విదేశంలోని ఖర్చులు ♦విదేశాల్లో ఉన్నవారికి ఇచ్చిన జీతాలు ♦లాటరీలు, క్రాస్‌వర్డ్ పజిల్స్, రేసులు, గేమ్స్, బెట్టింగ్, జూదం మొదలైన వాటి మీద వచ్చే లాభాలను/పారితోషికం/ఆదాయం మొదలైన వాటిని ‘ఇతర ఆదాయం’ కింద వర్గీకరించి, ఆదాయంగా భావిస్తారు. అంతే కాకుండా ఎటువంటి ఖర్చులను మినహాయింపుగా ఇవ్వరు. ♦చివరగా దృష్టిలో ఉంచుకోవాల్సినది ఏమిటంటే ఆదాయం విషయంలో సంబంధిత ఖర్చులు సమంజసంగా ఉన్నంత వరకు, వివరణ/రుజువులు/కాగితాలతో సమర్ధించుకోవాలి. పన్ను తగ్గించుకునే ప్రయత్నంలో తొందరపడొద్దు. -
ఆదివాసీలు అందరికీ ప్రయోజనాలు అందాలి
‘‘ఆదివాసులకు ప్రత్యేక పాలనా ధికారాలు, స్వయం పాలనా వ్యవస్థలు ఉంటాయి. వాళ్ళ ఆర్థిక, సామాజిక పునాదులపై ఆధారపడి మాత్రమే వారి అభివృద్ధి సాగాలి. వాళ్ళ ప్రాంతానికి సంబంధించి ఏ నిర్ణయాలు తీసుకున్నా వాళ్ళ ప్రత్యేక మండళ్ళ అంగీకారం తప్పనిసరిగా ఉండాలి.’’ నవంబర్ 26, 1949న భారత రాజ్యాంగ సభ అధ్యక్షుడు బాబూ రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఇవి. రాజ్యాంగ సభలో ఆదివాసీల తరఫున డిసెంబర్ 16, 1946న స్వయంగా ఆదివాసీ అయిన జైపాల్ సింగ్ ముండా మాట్లాడుతూ... ‘‘నా జాతి ప్రజలను ఆదివాసీయేతరులు నిరంతరం దోపిడీ చేయడం యావత్ దేశ చరిత్ర నిండా కనిపిస్తుంది. అయితే మనం ఈ రోజు నూతన చరిత్రకు శ్రీకారం చుట్టాలి. స్వతంత్ర భారతంలో నా ప్రజలు నిర్లక్ష్యానికి గురికాకుండా సమానత్వం కోసం కృషి చేయాలని రాజ్యాంగ సభనూ, ప్రత్యేకించి ఈ సభ నాయకుడు జవహర్ లాల్ నెహ్రూనూ కోరుతున్నాను’’ అని అన్నారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆది వాసీల రక్షణకు అనేక ఏర్పాట్లు రాజ్యాంగంలో చేసిన విషయమూ తెలిసిందే. బాబూ రాజేంద్రప్రసాద్, జైపాల్ సింగ్ ముండాలు చేసిన వ్యాఖ్యానాలకూ, డిమాండ్లకూ ఈనాటికీ కాలం చెల్లలేదు. వాళ్ళు ఆశించిన వ్యవస్థ గానీ, పరిస్థితులు గానీ ఈనాటికీ ఆవిష్కృతం కాలేదు. 75 ఏళ్ళ స్వాతంత్య్రం గానీ, 72 ఏళ్ళ రాజ్యాంగ రక్షణ గానీ ఇంకా ఆదివాసులకు రావాల్సినంత స్థాయిలో అందుబాటులోకి రాలేదు. సరిగ్గా ఈ సమయంలోనే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ నాయకత్వంలోని నేషనల్ డెమోక్రా టిక్ అలయెన్స్ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపదీ ముర్మూ పేరును ప్రతిపాదించింది. దీని వెనుక రాజకీయ వ్యూహం ఉందనేది పరిశీలకుల అభిప్రాయం. ద్రౌపదీ ముర్మూ సంతాల్ తెగకు చెందిన ఆదివాసీ మహిళ. భారతదేశంలోని ఆదివాసీ తెగలలో సంతాల్ తెగ జనాభా రీత్యా మూడవ అతిపెద్ద తెగ. ఆదివాసీ తెగలు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ముఖ్యంగా పశ్చిమబెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, రాజస్థాన్, బిహార్ రాష్ట్రాల్లో బీజేపీ ప్రత్యక్షంగా అధికారంలో లేనందువల్ల అక్కడి ఆదివాసీ ఎమ్మెల్యేలను, ఎంపీలను గెలుచు కోవడం ద్వారా రాష్ట్రపతి గెలుపును సులభతరం చేసుకోవచ్చునని బీజేపీ భావించి నట్టు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇది నిజమే కావచ్చు. అంతే కాకుండా ఆదివాసుల పట్ల తమ ప్రభుత్వం ఎంతో చేస్తోందనీ, వారికి అనుకూలంగా ఉందని జాతీ యంగా, అంతర్జాతీయంగా చెప్పుకోవడానికి కూడా ద్రౌపదీ ముర్మూని ముందు భాగాన నిలిపి ఉండవచ్చు. అభిప్రాయాలేవైనా, కారణాలేమైనా ఒక ఆదివాసీ మహిళను రాష్ట్రపతిగా చేయడానికి బీజేపీ నిర్ణయించడం ఆహ్వానించదగినదే. భారతదేశ రాజకీయ చరిత్రలో ఇది ఒక ముఖ్యమైన ఘట్టంగా ఉండబోతోంది. ఎన్డీయే ఇప్పటికే ఒక ముస్లింను, ఒక దళితుడిని రాష్ట్రపతిగా అందించింది. అయితే ముస్లింనూ, దళితుడినీ మొదటిగా రాష్ట్రపతిని చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే కావడం విశేషం. ఒక వ్యక్తిని ముఖ్యంగా అణగారిన వర్గాలు, నిర్లక్ష్యానికి గురైన వర్గాలనుంచి ఏదైనా ఒక ముఖ్యమైన స్థానంలో నియమించినా, నిలబెట్టి గెలిపించినా, దాని ప్రయోజనం ఆ వ్యక్తికే పరిమితం కాకూడదనేది ప్రజాస్వామిక సూత్రం. ఒక సమూహానికి ఒక వ్యక్తి ప్రాతినిధ్యం వహిస్తే ఆ వ్యక్తికే కాక ఆ సమూహానికీ ప్రయోజనం చేకూరాలి. ద్రౌపదీ ముర్మూను రాష్ట్రపతిగా గెలిపించాలనే బీజేపీ సంకల్పం కేవలం ద్రౌపదీ ముర్మూ వ్యక్తిగత హోదాను పెంచడం, దానితో రాజకీయ ప్రయోజనం సాధించడం వరకు ఆగిపోకూడదు. ఇప్పటివరకు నిర్లక్ష్యానికి, దోపిడీ, అణచివేతకు గురైన ఆదివాసుల పట్ల ఒక ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరమే కాదు, బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. అప్పుడు మాత్రమే బీజేపీకి ఆదివాసుల పట్ల ప్రేమ ఉన్నట్లు అర్థం చేసుకోగలం. మిగతా సమాజంతో పోల్చి చూసినప్పుడు ఇప్పటి వరకు ఆదివాసుల జీవితాల్లో వచ్చిన మార్పు చాలా స్వల్పమే. నిజం మాట్లాడాలంటే శూన్యమనే చెప్పాలి. భారతదేశంలో దాదాపు ఒక లక్షా 50 వేల గూడేలున్నాయి. అందులో చాలా గూడేలకు సరైన మౌలిక వసతులు లేవనే విషయాన్ని నవంబర్ 18, 2019న నాటి ఆదివాసీ శాఖా మంత్రి అర్జున్ ముండా లోక్‌సభకు తెలియచేశారు. ఇదే సందర్భంలో మరిన్ని వాస్తవాలనూ ఆయన తెలిపారు. భారత్‌లో మొత్తం గృహాలు 24 కోట్ల 66 లక్షల 92 వేల ఉండగా, ఆదివాసులవి 2 కోట్ల 33 లక్షల ఇళ్ళున్నట్లు, దాదాపు ఒక కోటి యాభై లక్షల ఇళ్ళు సరైన రీతిలో లేవని తెలిపారు. మరుగుదొడ్లు అతి స్వల్పంగా నిర్మాణ మయ్యాయి. 70 శాతం పిల్లలు 10వ తరగతి నుంచే చదువులు మానేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల విషయానికి వస్తే అన్ని తరగతుల్లో కలిపి ఆదివాసీలు 6 శాతానికి మించి లేరు. ఇందులో 4వ తరగతి చిన్నా చితకా ఉద్యోగాలే అధికం. ఆదివాసులు ఎక్కువగా మలేరియా, క్షయ వ్యాధులతో మరణిస్తున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. దేశంలో వంద మంది మలేరియా బారిన పడితే అందులో ఆదివాసులు 30 మంది ఉంటున్నారు. అదివాసీ జనాభాలో ఇది 50 శాతం. పిల్లలకు వ్యాక్సిన్ సదుపాయాలు అందలేకపోవడం వల్ల శిశు మరణాల సంఖ్య చాలా అధికంగా ఉంది. దాదాపు 50 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. క్షయ వ్యాధితో సగటు మరణాలు లక్ష జనాభాకు 256 మరణాలు కాగా, ఆదివాసులలో అవి మూడింతలు అంటే 750కి పైగా ఉన్నాయి. వీటితోపాటు, ఇటీవల దేశాభివృద్ధి పేరుతో ఆదివాసీ ప్రాంతాల్లో వెలుస్తున్న మైనింగ్, రోడ్లు, పరిశ్రమలు, ఇతర ఆదివాసీయేతర వ్యక్తులు నెలకొల్పుతున్న సంస్థల వల్ల లక్షలాది మంది నిరాశ్రయులవుతున్నారు. (క్లిక్: ఆదివాసీ రాష్ట్రపతి కావడానికి ఇన్నేళ్లా?) ద్రౌపదీ ముర్మూను రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టిన బీజేపీ, దాని నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం ఆదివాసీల ప్రగతి, సంక్షేమం పట్ల, వారికి గౌరవంగా జీవించే హక్కును గ్యారంటీ చేసే విషయంలో శ్రద్ధ వహివంచక పోతే ఇది మరొక విఫల ప్రయోగం కాకతప్పదు. (క్లిక్: సిన్హా ఇప్పుడు ముర్మును అని ఏమి లాభం?) - మల్లెపల్లి లక్ష్మయ్య సామాజిక విశ్లేషకులు -
వ్యాధి నిరోధక సంజీవని... యోగా!
యోగా అంటే కలయిక. మన శరీరాన్ని మనస్సుతో సంయోగం చేసే ఒక ఆధ్యాత్మిక ఆరోగ్య ప్రక్రియ. దీనిని నిరంతర సాధన చేస్తే మన గమ్యమైన ముక్తి లేక మోక్షం ప్రాప్తిస్తుంది. అనగా మనస్సును ఐహిక బంధం నుండి వేరుచేయడం అన్న మాట. దైవాంశమైన ఆత్మను క్రమబద్ధంగా నియంత్రించడం వల్ల బంధ విముక్తి పొంది సమున్నత స్థితికి చేరటమే యోగా అని అరబిందో నిర్వ చించారు. యోగాలో చాలా రకాలున్నాయి. జ్ఞానయోగం, భక్తి యోగం, పతంజలి యోగం, కుండలినీ యోగం, హఠ యోగం, మంత్ర యోగం, లయ యోగం, రాజ యోగం, జైన యోగం, బౌద్ధ యోగం వంటివి వాటిలో కొన్ని. అయితే ప్రతి యోగా పద్ధతికి సంబంధించి... నియమావళి, సూత్రాలు, ఆచరణ వేరు వేరుగా ఉంటాయి. వీటిలో ముఖ్యమైనది మన శరీర ఆరోగ్యానికి సంబంధించినదైన పతంజలి యోగా. రోజూ క్రమం తప్పకుండా యోగా చేస్తే రక్తనాళాల్లో అవరోధాలు తొలగిపోయి ప్రతి అవ యవం కండిషన్లో ఉంటుంది. దీనికి తోడు యుక్తా హారం తీసుకొని జీవనశైలిలో మార్పు తెచ్చుకొంటే ఆరోగ్య సమస్యలను రూపుమాపవచ్చు. మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. మనం రోజూ యోగా చేస్తే మన పంచేంద్రియాలు, శరీరం లోని జీర్ణ వ్యవస్థ, రక్త సరఫరా వ్యవస్థ, విసర్జిక వ్యవస్థ, శ్వాసకోశ వ్యవస్థ, పునరుత్పత్తి వ్యవస్థ, నాడీ వ్యవస్థ, వినాళ గ్రంథి వ్యవస్థ వంటి అన్ని వ్యవస్థలూ స్పందించి ఆయా అవయవాలు సక్రమ స్థితిలో ఉంటాయి. యోగా చేసేవారు గురువు సూచనలు పాటించాలి. ఆపరేషన్ చేయించుకున్నవారూ, గర్భిణులూ డాక్టర్ సూచనలు పాటించాలి. వ్యాధి ఒక్కరోజులో సంక్రమించదు. వ్యాధి పెరుగుదల ఐదు దశల్లో ఉంటుంది. మొదటి దశలో ఏ లక్షణాలూ పైకి కనపడవు కానీ శరీరంలో వ్యాధి పెరుగుతుంది. ద్వితీయ దశలో పైకి స్వల్ప లక్షణాలు కనపడతాయి. మూడవ దశలో వ్యాధి లక్షణాలు బాగా కనపడి బాధను కల్గిస్తాయి. ఈ దశలో త్వరగా వ్యాధి నిర్ధారణ చేసి వైద్యం అందివ్వాలి. లేకపోతే నాలుగవ దశలోకి ప్రవేశిస్తాడు. ఈ దశలో అవసరమైన శస్త్ర చికిత్స చేసి అంగవైకల్యానికి పరిమితం చేస్తారు. ఐదో దశ పునరావాసం లేక మరణం. వీటిలో మొదటి రెండు దశల్లోనూ యోగా వల్ల ఉత్పత్తి అయిన రోగ నిరోధక శక్తితో వ్యాధిని విజయ వంతంగా నిరోధించవచ్చు. నేడు ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులలో కార్డియాలజీ, న్యూరాలజీ, డయబెటాలజీ వంటి క్లినిక్‌లలో అనేక వందల మంది రోగులను ప్రతిరోజూ చూస్తున్నాం. రోగుల సంఖ్య అధికమవ్వటం వల్ల డాక్టర్లు వైద్య ప్రమా ణాలు పాటించని లేని స్థితికి చేరి వైద్యం చేస్తున్నారు. ఈ రోగుల సంఖ్యను గణనీయంగా యోగా వల్ల తగ్గించవచ్చు. అంతేకాదు యోగా చేసిన వెంటనే సదరు వ్యక్తి శరీరంలో ఎండార్ఫిన్ అనే సంతోషాన్ని కలిగించే హార్మోన్ విడుదల అవుతుంది. రాత్రి చక్కగా నిద్ర పడుతుంది. అంతేకాదు యోగా వల్ల స్థూల శరీరం తగ్గి చక్కటి ఆకృతి ఏర్పడుతుంది. మన శరీరంలోని కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది. యోగా వల్ల రక్తనాళాలు, నాడులకు ఉన్న సాగే గుణం సురక్షిత మవుతుంది. యోగా వల్ల వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. క్రమం తప్పకుండా యోగా చేస్తే మనస్సు సమస్థితిలోకి వచ్చి అసహ్యం, అసూయ, కోపం వంటి మానసిక ఉద్రేకాలు తగ్గుతాయి. యోగా రక్తపోటు, మధుమేహ మందుల డోసును గణనీయంగా తగ్గిస్తుంది. కాబట్టి ప్రతి వ్యక్తీ రోజూ ఒక గంట యోగా చెయ్యాలి. - వి.వి. రత్నాకరుడు రిటైర్డ్ నాన్ మెడికల్ ఫేకల్టీ ఆఫీసర్ (జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం) -
డ్రై ఫ్రూట్స్ ఎక్కువ మొత్తంలో తీసుకుంటున్నారా? జర జాగ్రత్త!
డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచిదని చాలా మంది సూచిస్తారు. ప్రొటీన్స్, ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్ ఇవన్నీ ఆరోగ్యం మెరుగ్గా ఉండటానికి కావాల్సినవి. వీటన్నింటిని పొందడానికి డ్రై ఫ్రూట్స్ ఒక ఆప్షన్. అయితే ఇవి రుచిగా ఉంటాయి కదా... ఆరోగ్యానికి మంచిది కదా అని.. ఇష్టమొచ్చినట్టు తినకూడదు. దేనికైనా ఒక పరిమితి ఉంటుంది. అయితే ఎంత పరిమాణంలో తినాలి. ఏ డ్రై ఫ్రూట్స్ ఎన్ని తింటే ఆరోగ్యకరం? డ్రైఫ్రూట్స్ తినడం వల్ల కలిగే లాభాలేంటి..? అనే విషయాలను తెలుసుకుందాం... డ్రై ఫ్రూట్స్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే.. షుగర్స్, క్యాలరీ లు కూడా ఉంటాయి. కాబట్టి వీటిని 20 గ్రాముల కంటే ఎక్కువ తినకూడదు. అలాగే నేరుగా తినడం కూడా మంచిది కాదు. కాబట్టి.. డ్రై ఫ్రూట్స్ తినే విధానం, ఏ నట్స్ ఎంత పరిమాణంలో తినాలి అనేది ఇప్పుడు చూద్దాం.. బాదం బాదం పప్పులో మోనో శ్యాచురేటెడ్ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండెకి, మెదడుకి, చర్మ ఆరోగ్యానికి మంచిది. అలాగే ఆల్మండ్స్‌లో విటమిన్ ఈ, మెగ్నీషియం, పొటాషియం ఉంటాయి. ఇవి రక్తప్రసరణ సక్రమంగా ఉండటానికి సహాయపడతాయి. అలాగే రక్త ప్రసరణ సజావుగా సాగడానికి సహకరిస్తాయి. రోజుకి 4 నుంచి 7 బాదం పప్పు తినడం వల్ల వీటిని నుంచి అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. వాల్ నట్స్ వాల్ నట్స్ పైన ఉండే పెంకు తీయగానే.. ఉండే పప్పు అంత రుచిగా ఉండదు. కానీ.. 90 శాతం యాంటీ ఆక్సిడెంట్స్, ఫెనోలిక్ యాసిడ్స్, టానిన్స్, ఫ్లేవనాయిడ్స్ ఈ స్కిన్లోనే ఉంటాయి. గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షించడంలో ఇవి చాలా సమర్థంగా పనిచేస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. వీటిని రోజుకి 3 నుంచి 4 తీసుకోవచ్చు. కర్జూరం ఇందులో ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడే న్యూట్రియంట్స్, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అలాగే ఫ్రాక్టోజ్ ఇందులో రిచ్‌గా ఉంటుంది. మెటబాలిజం స్థాయి చురుగ్గా ఉండటానికి కర్జూరం ఉపయోగపడుతుంది. వీటిని రోజుకి మీడియం సైజులో ఉండే 1 లేదా రెండు తీసుకుంటే సరిపోతుంది. పిస్తా పిస్తా వెల్నెస్ కి చిహ్నం. ఇవి బలానికి, ఆరోగ్యానికి బాగా ఉపయోగపడతాయి. ఇందులో మిగిలిన డ్రైఫ్రూట్స్ లో కంటే ప్రొటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటిని రోజుకి 20 గ్రాముల కంటే ఎక్కువ తీసుకోకూడదు. జీడిపప్పు కమ్మటి రుచిలో ఉండే జీడిపప్పును రెగ్యులర్ గా తినడం వల్ల పిత్తాశయంలో రాళ్లు ఏర్పడకుండా నివారించవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి. రోజుకు నాలుగు జీడిపప్పులను తినడం ఆరోగ్యకరమని ఈ అధ్యయనాలు చెబుతున్నాయి. ఎండుద్రాక్ష తియ తియ్యగా పుల్లపుల్లగా ఉండే ఎండుద్రాక్షను ఎక్కువ మోతాదులో తిన్నా ఎలాంటి సమస్యా లేదు. ఇందులో విటమిన్ బి, పొటాషియం, ఐరన్ పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి రోజుకి గుప్పెడు ఎండుద్రాక్ష తినవచ్చు. 50 ఎండుద్రాక్షలు తినవచ్చు. అయితే మహిళలు రోజుకి ఒకటిన్నర కప్పు, మగవాళ్లు 2 కప్పుల ఎండుద్రాక్ష తినాలని నిపుణులు సూచిస్తున్నారు. -
ఫ్లైఓవర్లు రాకముందు.. వచ్చాకా..
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నగరంలో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం (ఎస్సార్డీపీ) కింద వేల కోట్ల పనులు చేసి పలు ఫ్లైఓవర్లు అందుబాటులోకి తెచ్చారు. ఇంకా తెస్తున్నారు. ఇంతకీ వీటివల్ల ప్రజలకు కలిగిన సదుపాయాలేమిటి? మారిన పరిస్థితులేమిటి? ఒనగూరిన ఆర్థిక ప్రయోజనాలేమిటి? వంటి వాటితోపాటు ఇతరత్రా అంశాల అధ్యయనానికి ప్రభుత్వం సిద్ధమైంది. సిగ్నల్‌ఫ్రీ ప్రయాణం వల్ల కేవలం ట్రాఫిక్ చిక్కులు తప్పడమే కాదని పర్యావరణ పరంగా వాయు కాలుష్యం, ఇంధన కాలుష్యం తగ్గుతుందని, వాహనాల నిర్వహణ ఖర్చులతోపాటు కాలుష్యం తగ్గడం వల్ల ఆరోగ్యపరంగా తలెత్తే సమస్యలు కూడా తగ్గుతాయని, తద్వారా జీవనప్రమాణాలు మెరుగవుతాయని అధికారులు చెబుతున్నారు. రూ.వేల కోట్లతో నిర్మించిన ఫ్లైఓవర్లను కేవలం ప్రయాణ మార్గాలుగా మాత్రమే చూడరాదని, ఇతరత్రా ఎన్నో ప్రయోజనాలున్నాయని చెబుతున్నారు. వాటన్నింటినీ సర్వేద్వారా శాస్త్రీయంగా వెల్లడించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాకముందు.. వచ్చాకా.. ఎస్సార్డీపీ కింద ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ కారిడార్లు, అండర్‌పాస్‌లు, జంక్షన్ల అభివృద్ధి వంటి ఎన్నో పనులు చేపట్టారు. వాటిని పూర్తిచేసేందుకు మతపరంగా సున్నితమైన ప్రాంతాల్లో, శ్మశానవాటికల వద్ద సైతం పనులు చేయాల్సి వచ్చింది. మరోవైపు భూసేకరణ సమస్యలు సరేసరి. యుటిలిటీస్ షిఫ్టింగ్ వంటి కష్టాలు ఉండనే ఉన్నాయి. వీటన్నింటినీ పరిష్కరిస్తూ పూర్తిచేస్తున్న పనుల వల్ల ఇతరత్రా విధానాలుగానూ ఎన్నో ప్రయోజనాలున్నాయని, వాటి గురించి అందరికీ తెలియాలనేది ప్రభుత్వ ఆలోచన. అందుకుగాను ఫ్లై ఓవర్లు వచ్చిన ప్రాంతాలను ప్రత్యేక జోన్లుగా పరిగణిస్తూ సదరు జోన్లలో ఫ్లై ఓవర్లు రాకముందు.. వచ్చాక స్థానికుల పరిస్థితులు, ఆయా మార్గాల్లో ప్రయాణించేవారికి కలిగిన సదుపాయాలు, పెరిగిన దుకాణాలు, వ్యాపారాలు, తొలగిన ట్రాఫిక్ చిక్కులు, సాధ్యమైన సాఫీ ప్రయాణం ఇలా వివిధ అంశాలతో జాతీయస్థాయి కన్సల్టెన్సీ సంస్థతో సర్వే నిర్వహించేందుకు సిద్ధమైంది. దాదాపు 9 మాసాల్లో ఈ సర్వే పూర్తి చేసి నివేదికను వెలువరించనున్నట్లు జీహెచ్ఎంసీలోని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఫ్లై ఓవర్లు వచ్చిన ప్రాంతాల్లో పెరిగిన మొబిలిటీ, తగ్గిన ప్రయాణ సమయం, రహదారి భద్రత తదితర అంశాలు కూడా అధ్యయనంలో వెల్లడిస్తారని పేర్కొన్నారు. ప్రయాణికులతోపాటు విద్య, వైద్యం, బ్యాంకింగ్,మార్కెటింగ్, తదితర రంగాల్లోని వారి అనుభవాలు సైతం పరిగణనలోకి తీసుకొని వారికి కలిగిన ప్రయోజనాలు సైతం నివేదికలో పొందుపరచనున్నారు. ఈ ప్రాంతాల్లో అధ్యయనం.. నగరంలో ఇప్పటికే పూర్తయిన బయోడైవర్సిటీ జంక్షన్ వద్ద రెండు ఫ్లై ఓవర్లు, మైండ్‌స్పేస్ జంక్షన్ ఫ్లైఓవర్, అండర్‌పాస్, అయ్యప్ప సొసైటీ జంక్షన్ అండర్‌పాస్, కూకట్పల్లి రాజీవ్‌గాంధీ జంక్షన్ ఫ్లైఓవర్, జూబ్లీహిల్స్ రోడ్‌నంబర్ 45 ఫ్లైఓవర్. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, షేక్‌పేట ఓయూకాలనీ ఫ్లైఓవర్, చింతల్‌కుంట అండర్‌పాస్, కామినేని దగ్గరి రెండు ఫ్లైఓవర్లు, ఎల్బీనగర్ రెండు ఫ్లైఓవర్లు, అండర్‌పాస్, బైరామల్‌గూడ రెండు ఫ్లైఓవర్లు, బహదూర్‌పురా ఫ్లైఓవర్, ఒవైసీ జంక్షన్ ఫ్లైఓవర్లు, పంజగుట్ట స్టీల్‌బ్రిడ్జిలు ఇప్పటి వరకు అందుబాటులోకి వచ్చాయి. త్వరలో పూర్తికానున్న నాగోల్ జంక్షన్, కొత్తగూడ, కొండాపూర్ ఫ్లైఓవర్లు, శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ తదితర ఫ్లైఓవర్లు ఆర్ఓబీలు, ఆర్యూబీల వల్ల ప్రయోజనాల్ని సైతం నివేదికలో పొందుపరచనున్నారు. బాలానగర్ ఫ్లై ఓవర్ హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో నిర్మించినప్పటికీ ఎస్సార్డీపీలో భాగంగా దానివల్ల కలిగిన ప్రయోజనాలనూ పొందుపరచనున్నారు. (చదవండి: ట్రాఫిక్ ఆంక్షలు... వాహనాలు మళ్లింపు) -
గోల్డెన్ మిల్క్ తో వందలాది వ్యాధులకు చెక్..
-
అద్భుతమైన సౌందర్య పోషకంగా.. ఉల్లిపాయ
-
ఆడపిల్ల ఉన్న ప్రతిఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన పథకమిదే..
పెదవాల్తేరు (విశాఖ తూర్పు): బేటీ బచావో.. బేటీ పడావో కార్యక్రమం కింద కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన పథకం బాలికల బంగారు భవితకు భరోసాగా నిలుస్తుంది. పొదుపు పథకాలపై బ్యాంకులు అందించే వడ్డీ రేట్ల కన్నా సుకన్య సమద్ధి యోజన అందించే వడ్డీ రేటు చాలా ఎక్కువగా ఉండడం విశేషం. ఈ పథకం కింద ఏడాదికి ఒకసారి సవరించి దానిని కేంద్ర బడ్జెట్ సమయంలో ప్రకటిస్తుంది. ఏడాదికి కనీస పెట్టుబడిని కేంద్రం రూ.వెయ్యి నుంచి రూ.250కి తగ్గించడం తెలిసిందే. కాగా, ఈ పథకంలో కనీస పెట్టుబడి రూ.వెయ్యి చొప్పున 14 ఏళ్లు చెల్లించినట్టయితే 21 ఏళ్లు పూర్తయిన తర్వాత, అంటే మెచ్యూరిటీ సమయంలో రూ.48,821 పొందవచ్చు. అలాగే ఏడాదికి రూ.20 వేలు కనీస పెట్టుబడి పెడితే 21 ఏళ్ల కు రూ.9,36,429 పొందవచ్చు ఏడాదికి కనీస డిపాజిట్ రూ.250, గరిష్ట డిపాజిట్ రూ.1.5 లక్షలు చెల్లించేలా గత ఏడాది జూన్ లో పరిమితిని సడలించారు. వార్షిక వడ్డీ 7.6 శాతం చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరింత చేరువగా... : ఆడపిల్లలను వెన్నుతట్టి ప్రోత్సహిస్తే వారు అద్భుతాలు సృష్టించగలరు. వారి చదువులకు, భవిష్యత్తుకు ఆర్థికంగా ఇబ్బంది ఉండకూడదనే లక్ష్యంతో భారత ప్రభుత్వం సుకన్య పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ప్రతి నెల కొంత మొత్తం పొదుపు చేస్తే అవే పిల్లలకు ఆసరాగా ఉంటాయి. పుట్టిన శిశువు నుంచి పదేళ్ల లోపు చిన్నారుల పేరున వారి తల్లిదండ్రులు సుకన్య పథకానికి సంబంధించిన ఖాతాను తెరవడానికి అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లోని పోస్టాఫీసుల్లో ఈ ఖాతాలను తెరిచేందుకు కావాల్సిన అన్ని వసతులు అధికారులు కల్పించారు. ఈ పథకం ఇప్పటికే కొనసాగుతున్నప్పటికీ, మరింతమందికి పేదలకోసం ప్రీమియం చెల్లింపు మొత్తాన్ని తగ్గించింది. దీంతో ఎక్కువ మందికి ఈ పథకం చేరువవుతోంది. ఇదిలావుండగా విశాఖ డివిజన్లో 30 వేల మంది పథకంలో చేరారు. ఆన్లైన్లో కూడా చెల్లింపు అవకాశాలు...: గతంలో సుకన్య ఖాతాను ఎక్కడ ప్రారంభిస్తే అక్కడ మాత్రమే డబ్బులు చెల్లించాల్సి వచ్చేది. దీంతో సంరక్షకులకు ఇబ్బందులు ఎదురయ్యేవి. ప్రస్తుతం చెల్లింపులకు ఆన్లైన్ సదుపాయం కూడా అందుబాటులోకి రావడంతో ఎక్కడైనా చెల్లింపులు చేసుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. దీంతో పాటు ఖాతాను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఉచితంగా బదిలీ చేసుకునే వీలు కల్పించింది. ఈ ఖాతాలో జమ అయిన మొత్తానికి ఆదాయ పన్ను మినహాయింపు ఉంటుంది. ఒక కుటుంబంలో ఇద్దరికి మాత్రమే..: ఈ ఖాతా కాలపరిమితి 21 ఏళ్లు ఉంటుంది. ఒక చిన్నారికి ఒక ఖాతా చొప్పున ఇద్దరికి ఖాతా తెరవడానికి అవకాశం ఉంటుంది.. లేదా ఒకే కాన్పులో కవలలు పుట్టిన సందర్భాల్లో లేదా మొదటి కాన్పులో ఒకేసారి ముగ్గురు ఆడపిల్లలు పుట్టిన సందర్భంలో ముగ్గురు ఆడపిల్లలు ఈ పథకంలో చేరవచ్చు. 21 ఏళ్ల కాలపరిమితి పూర్తయ్యే ముందు అమ్మాయి వివాహం చేసుకున్నట్లయితే ఖాతా అనివార్యంగా మూతపడుతుంది. ఆ రోజు వరకు లెక్కించి నగదు చెల్లిస్తారు. ఖాతా ప్రారంభమైనప్పటి నుంచి కనీసం 14 ఏళ్లు చెల్లించాలి. తపాలాశాఖలో అత్యధిక వడ్డీ ఇచ్చే పథకం ఇదొక్కటేనని అధికారులు చెబుతున్నారు. ఏటా పొదుపు చేస్తున్న మొత్తంపై వచ్చే వడ్డీని ఆ తరువాత ఏడాది పొదుపులో కలిపి మళ్లీ ఏడాది ఈ మొత్తానికి వడ్డీ లెక్కిస్తారు. తద్వారా వడ్డీ, చక్రవడ్డీ రూపంలో జమ అవుతుంది. దీంతో లబ్ధిదారులకు ఎక్కువ మొత్తంలో ప్రయోజనం చేకూరే అవకాశం కలుగుతుంది. బాలికలకు 18 ఏళ్లు నిండిన తర్వాత చదువు లేదా వివాహం కోసం ఈ ఖాతాల్లో ఉన్న నిల్వల్లో 50 శాతం నగదును తీసుకోవచ్చు. 21 ఏళ్లు నిండిన వెంటనే ఖాతాలోని మొత్తం సొమ్మును ఉపసంహరించుకోవచ్చు. లేదా వివాహమైన తర్వాత ఖాతాను రద్దు చేసుకునే వీలు కూడా ఉంది. -
పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకుంటే చాలు .. రూ.లక్షల్లో ప్రమాద బీమా
సాక్షి, మన్యం పార్వతీపురం కురుపాం: అసంఘటిత కార్మికులకు కేంద్రం ఆర్థిక భరోసా కల్పిస్తోంది. ఈ–శ్రమ్ పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకుంటే చాలు రూ.లక్షల్లో ప్రమాద బీమా వచ్చేలా చర్యలు చేపట్టింది. గతేడాది అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ–పోర్టల్‌పై అప్పట్లో కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేయగా, ఇప్పుడు ఈ పథకంపై తగినంత అవగాహన లేకపోవడంతో రిజిస్ట్రేషన్లు మందకొడిగా సాగుతున్నాయి. త్వరగా రిజిస్ట్రేషన్లు చేసుకుని, పథకం లబ్ధి పొందాలని అధికారులు కోరుతున్నారు. 16 నుంచి 59 వయసు కలిగిన వారంతా ఈ పథకానికి అర్హులు కాగా, ప్రమాదవశాత్తు చనిపోతే రూ.2 లక్షలు, అంగవైకల్యం బారినపడితే రూ.లక్ష అందజేస్తారు. రాష్ట్రాలు, కార్మిక సంఘాల సమన్వయంతో సామాజిక సంక్షేమ పథకాలను ఈ పోర్టల్ ద్వారా ఏకీకృతం చేయడాన్ని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుని, ఈ–పోర్టల్ ప్రారంభించిననట్లు సమాచారం. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి 12 అంకెల నంబర్ కలిగిన ఈ–శ్రమ్ గుర్తింపు కార్డు ఇస్తారు. అనంతరం వారికి ఏడాది కాలానికి గాను ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన((పీఎంఎస్బీవై), ప్రధాన మంత్రి కర్షక బీమా పథకం కింద ప్రమాద బీమా వర్తింపజేస్తారు. ఈఎస్ఐ, ఈపీఎఫ్ సౌకర్యం పొందని వారంతా ఈ పథకానికి అర్హులే కాగా, ఈ జాబితాలో భవన నిర్మాణ కార్మికులు, వ్యవసాయ కూలీలు, భూమి లేని రైతులు, మత్స్య కార్మికులు, ఉపాధి హామీ కూలీలు, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు, తోపుడు బండ్ల వ్యాపారులు, డ్రైవర్లు, ఎలక్ట్రీషియన్లు, తాపీమేస్త్రీలు, కార్పెంటర్లు, టైలర్లు, రజకులు, కల్లుగీత కార్మికులు, చేనేత, క్షౌ ర వృత్తి వారు, చిరు వ్యాపారులు ఉన్నారు. పోస్టాఫీసుల్లో రిజిస్ట్రేషన్లు.. ప్రస్తుతం కార్మిక శాఖ అధికారులు తపాలా శాఖ సహాయంతో అసంఘటిత కార్మికుల వివరాలు సేకరిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ సంస్థ సభ్యులు కూడా ఈ–శ్రమ్ పోర్టల్‌లో కార్మికుల నమోదు ప్రక్రియ చేపడుతున్నారు. ఆధార్ లింక్ చేసిన ఫోన్ నంబర్, ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్‌బుక్ లేదా పోస్టాఫీస్ పాస్‌బుక్‌లతో జిల్లాలోని ఏ పోస్టాఫీస్‌కు వెళ్లినా ఈ–శ్రమ్ పోర్టల్‌లో కార్మికుల వివరాలు నమోదు చేస్తారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు.. కోవిడ్ విపత్తు సమయంలో వలస కూలీలు, అసంఘటిత కార్మికులు పడిన ఇబ్బందులు చూసి, వారికి ఎలాగైనా ఆర్థిక భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని సుప్రీంకోర్టు 2021 జూన్ 29వ తేదీన ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ–శ్రమ్ పోర్టల్‌ని అందుబాటులోకి తీసుకురావడం గమనార్హం. 2021 ఆగస్టు 26వ తేదీ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కాగా, అన్నిచోట్ల నుంచి ఇప్పుడిప్పుడే ఈ పథకానికి స్పందన లభిస్తోంది. అయితే దీనిపై పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడంతో రిజిస్టేషన్లు అంతగా జరగకపోవడం బాధాకరం. ప్రస్తుతం కురుపాం, పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు, పాలకొండ, విజయనగరం, చీపురుపల్లి ప్రాంతాల్లోని స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ–శ్రమ్ నమోదు ప్రక్రియ జరుగుతుండగా, రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పథకం సద్వినియోగం చేసుకోవాలి కార్మికులంతా ఈ–శ్రమ్ పథకం లబ్ధి పొందాలి. దగ్గరలోని పోస్టాఫీస్‌కి గానీ, స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ సభ్యుల వద్దకు గానీ వెళ్లి పేర్లు నమోదు చేసుకోవాలి. సి.హెచ్.సాయికిశోర్, ఈ–శ్రమ్ ప్రాజెక్ట్ జోనల్ ఇన్చార్జ్, కురుపాం -
కట్నంతో లాభాలెన్నో!
ముంబై: వరకట్నంతో చాలా ప్రయోజనాలున్నాయంటూ పలు ఉదాహరణలను పేర్కొన్న బీఎస్సీ నర్సింగ్ రెండో ఏడాది పాఠ్యపుస్తకం ఉదంతం తీవ్ర చర్చనీయాంశమైంది. టీకే ఇంద్రాణి రచించిన సోషియాలజీ ఫర్ నర్సింగ్ పుస్తకంలోని ఒక పేరాలో పేర్కొన్న అంశాలను నెటిజన్లు తీవ్రంగా తప్పుబట్టారు. ఆ పేజీ ప్రస్తుతం మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘ ఇంట్లోకి కొత్త కుటుంబసభ్యురాలిగా అడుగుపెట్టేందుకు వరకట్నం ఎంతగానో సాయపడుతుంది. ఇంట్లోకి సమస్త సామగ్రి, వాహనాలు ఇలా అన్నీ కట్నం రూపంలో వచ్చిపడతాయి. అమ్మాయి తన తల్లిదండ్రుల ఆస్తిలో భాగాన్ని ఇలా కట్నంరూపంలో అత్తవారింటికి తెచ్చుకోవచ్చు. కట్నాలు ఇచ్చే స్తోమత లేకే కొందరు తల్లిదండ్రులు అమ్మాయిలను ఉన్నత చదువులు చదివిస్తున్నారు. వారు చదివి, ఉద్యోగం సంపాదిస్తే కట్నం డిమాండ్ తగ్గుతుంది. ఇదొక మంచి ప్రయోజనం. అందవిహీన అమ్మాయిలకు మంచి/అందవిహీన అబ్బాయిలతో పెళ్లి అవ్వాలంటే కట్నం ముట్టజెప్పాల్సిందే’ అంటూ పలు వ్యాఖ్యానాలు ఆ పుస్తకంలో ఉన్నాయి. ఇలాంటి పాఠ్యపుస్తకాలు ఉండటం మన భారతజాతికే సిగ్గుచేటు’ అంటూ శివసేన మహిళా ఎంపీ ప్రియాంకా చతుర్వేది ఆగ్రహం వ్యక్తంచేశారు. పాఠ్య ప్రణాళిక నుంచి వెంటనే ఈ పుస్తకాన్ని తొలగించి, సంబంధికులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు ఆమె లేఖ రాశారు. -
వేసవిలో ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి
-
స్ట్రాబెర్రీతో ఇన్ని ప్రయోజనాలా? ఆరోగ్యంతో పాటు అందానికి కూడా
-
Sweet Potato: చిలగడ దుంప తినడం ఇష్టమా.. ఈ విషయాలు తెలిస్తే!
ఫిబ్రవరి 22న కుక్ ఎ స్వీట్ పొటాటో డేగా జరుపుకుంటారు. ఓహో.. ఇదో రోజు కూడా ఉందా అని అనుకుంటున్నారా? ఎస్ ఉంది. మరి వెల్.. రూట్ వెజిటబుల్ గా చెప్పుకునే ఈ చిలగడ దుంపకు పెద్ద చరిత్రే ఉంది. వేల ఏళ్ల క్రితమే ఉనికిలో ఉన్న స్వీట్ పొటాటో మధుమేహంతో బాధపడేవారికి ఒక వరం లాంటిదట. చిలగడదుంప వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. మధ్య అమెరికా లేదా దక్షిణ అమెరికాలో చిలగడ దుంప లేదా స్వీట్ పొటాటో పుట్టిందని భావిస్తున్నారు. ఇవ ఇతర దుంపల కంటే చాలా ఆరోగ్యకరమైనవట. విటమిన్ ఏ పుష్కలంగా లభించే ఈ చిలగడదుంపల్లో విటమిన్ B-6, మెగ్నీషియం, విటమిన్ సీతోపాటు, అధిక ఫైబర్, తక్కువ కొవ్వు , కేలరీలతో నిండి ఉంటుంది. ఇందులో ఉండే ఫైబ్రినోజేన్ కూడా రక్త గడ్డకట్ట కుండా సహాయపడుతుంది. అలాగే ఈ దుంపలలోని అధిక స్థాయి పొటాషియం హార్ట్ బీట్‌ను క్రమబద్ధీకరిస్తుంది. ఇందులో ఉండే మెగ్నీషియం ఆరోగ్యకరమైన ధమనులకు, గుండె కండరాలకు చాలా మంచిది. చిలగడ దుంపలు మన శరీరంలోని అంతర్గత అవయవాలకు ఆక్సిడేటివ్ ప్రమాదాన్ని తగ్గించే స్పోరామిన్స్ని ఉత్పత్తిచేసే ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉన్నాయి. అలాగే శక్తివంతమైన యాంటీ-ఇన్ఫ్లమేటరరీ, యాన్తోసయానిన్ కూడా లభ్యం. ఇది ఇన్ఫ్లమేషన్ ను తగ్గించి, దానివల్ల వచ్చే ప్రమాదాన్ని నివారిస్తుంది. ఇందులో అధికంగా ఉండే కెరోటినాయిడ్స్, బీటా-కెరోటిన్, శరీరంలో విటమిన్ Aని తయారుచేయడానికి సహాయపడతాయి. ఇది కంటిచూపును మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచి, మన బాడీలోని ఫ్రీ రాడికల్స్‌ని తగ్గించి, తద్వారా వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది కూడా. విటమిన్ D అధికంగా అతికొద్ది ఆహారాల్లో చిలగడ దుంప ఒకటి. సన్ షైన్ విటమిన్‌గా చెప్పుకునే విటమిన్ డీ చిలగడ దుంపలలో తక్షణమే అందుబాటులో ఉంటుంది. చిలగడ దుంపలను ఆహారంలో చేర్చుకోవడం వల్లన చర్మం మెరుస్తుంది. నల్ల మచ్చలను తొలగిస్తుంది. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే మధుమేహం కలవారు మామూలు దుంపలు తీసుకోవడానికి బదులుగా ఈ చిలగడ దుంపలను తీసుకోవడం మంచిది. గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం వల్ల అది మధుమేహా నియంత్రణకు తోడ్పడుతుందని డైటీషియన్స్ చెబుతున్నారు. చిలగడ దుంపల్లో ఉండే అధిక కార్బోహైడ్రేట్లకు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే లక్షణం ఉన్నప్పటికీ ఫైబర్ కంటెంట్ ఈ ప్రక్రియను నెమ్మదిస్తుందని నిపుణులు చెబుతున్న మాట. ఆంథోసైనిన్స్ అనే పాలీఫెనోలిక్ సమ్మేళనం ఇన్సులిన్‌ను నియంత్రిస్తుంది. టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగిస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. మితంగా తింటే, అన్ని రకాల చిలగడదుంపలు ఆరోగ్యకరమేననీ, వీటిల్లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ చాలా ఎక్కువ గనుక డయాబెటిస్-ఫ్రెండ్లీ డైట్లో చేర్చు కోవచ్చని చెబుతున్నారు. చదవండి: Kiwi Fruit: కివీ పండు పొట్టు తీయకుండా తింటున్నారా? ఇందులోని ఆక్టినిడెన్ అనే ఎంజైమ్ వల్ల... Badam Health Benefits: రాత్రంతా నీళ్లలో నానబెట్టి బాదం పొట్టు తీసి తింటున్నారా? వేటమాంసం తిన్న తర్వాత వీటిని తిన్నారంటే.. -
Benefits Of Flax Seeds: అనేక సమస్యలకు అవిసె గింజలతో చెక్
-
గుమ్మడి గింజలు: ఎవరు తినకూడదు? ఎవరు తినవచ్చు!
సాధారణంగా గుమ్మడి కాయల్ని కూరగా చేసుకుంటాం. లేదా స్వీట్ చేసుకుంటాం. గింజల్ని పక్కన పారేస్తుంటాం. అయితే కరోనా మహమ్మారి తరువాత డ్రైఫ్రూట్స్, నట్స్‌తో పాటు గుమ్మడి గింజల వాడకం బాగా పెరిగింది. ఈ సీడ్స్లోని పోషక విలువలు మన శరీరానికి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయట. అయితే కొన్ని సమస్యలు ఉన్నవారు గుమ్మడికాయ విత్తనాల్ని తినకూడదు. ఎందుకలా? వాచ్‌దిస్ స్టోరీ.. గుమ్మడికాయ గింజలు చాలా ప్రయోజనాలను కలిగి ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఇందులో కొవ్వు ఆమ్లాలు, భాస్వరం, పొటాషియం, జింక్ లాంటి అవసరమైన అమైనో ఆమ్లాలు, ఫినోలిక్ సమ్మేళనాలు కలిగి ఉంటాయి. మధుమేహం, గుండె జబ్బులు, కండరాలు, ఎముకల నొప్పి నివారణకు ఉపయోగపడతాయి. హైబీపీని తగ్గిస్తాయి. వీటిని తింటే రుచికి రుచికితోపాటు శక్తికి శక్తిని అందిస్తాయి. వీటిల్లో ఏ సీ ఈ విటమిన్లతోపాటు, ఐరన్, కాల్షియం, జింక్, ఫోలేట్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు చాలా మంచిది. (Chocolate Day Story: వాలెంటైన్స్ డే వీక్, స్వీటెస్ట్ డే.. ‘చాక్లెట్ డే’) మంచిగా నిద్ర పట్టాలంటే గుమ్మడి గింజలు తింటే మంచి ఫలితం ఉంటుంది. అంతేనా జుట్టు రాలడం, మొటిమలను నియంత్రించడంతోపాటు, చర్మ సంరక్షణకు కూడా ఏజెంట్లుగా పనిచేస్తాయి. వీటిల్లో జింక్ పుష్కలంగా ఉండటంతో బట్టతల సమస్యను తొలగించడంలో సహాయపడుతుంది. అలాగే గాయాలను నయం చేయడంలో సహాయ పడుతుంది. చర్మాన్ని యవ్వనంగా, ముడతలు లేకుండా ఉంచుతుంది గుమ్మడి గింజల నూనెలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, కెరోటిన్ ఉంటాయి. ఇంకా చర్మ సంబంధమైన దీర్ఘకాలిక మంటలు, బొబ్బలకు ఉపశమనం లభిస్తుంది. గుమ్మడికాయ గింజలలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్, యాంటీ ఆర్థరైటిక్‌తోపాటు యాంటీ డయాబెటిక్ లక్షణాలున్నాయి. ఇవి క్యాన్సర్, మూత్రాశయ ఇన్ ఫెక్షన్లు రాకుండా కాపాడతాయి. గుమ్మడి గింజలు ఆరోగ్యకరమైన కొవ్వు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లకు నిలయం. అందుకే ఇవి ఊబకాయాన్ని నిరోధిస్తాయి. ఇది స్క్రబ్, లోషన్ రూపంలో లేదా మసాజ్ చేసినప్పుడు బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుంచి కూడా రక్షిస్తుంది. ఈ సీడ్స్ తినడం ద్వారా గుండె రక్త నాళాలు గడ్డలు రాకుండా నిరోధించవచ్చు. స్ట్రోక్ వంటి వివిధ గుండె సమస్యలను నివారించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఈ గింజల్లోని యాంటీ డయాబెటిక్ లక్షణం సుగర్‌ను అదుపులో ఉంచుతుంది. గర్భవతులు తినవచ్చా? అత్యంత పోషకాలతో ఈ సీడ్స్ గర్భధారణ సమయంలో వినియోగానికి పూర్తిగా సురక్షితమే. ఎలాంటి దుష్ప్రభావాలు ఇంతవరకు నమోదు కాలేదు. కానీ ఈ సమయంలో జాగ్రత్త వహించాలి. అసహనం, తలనొప్పి, కడుపునొప్పి, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, డమేరియా లక్షణాలు కనిపించే అవకాశం ఉంది. అలాగే గుమ్మడి గింజలు బీపీ సుగర్ లాంటి సమస్యలున్న గర్భిణీలు, పాలిచ్చే తల్లులు మాత్రం డాక్టర్ల సూచన మేర తీసుకోవాలి. లోసుగర్ ఉన్నవాళ్లు లో-బీపీ సమస్య ఉన్నవారు తీసుకోకుండా ఉంటే మంచిది. ఈ విత్తనాలను మరీ ఎక్కువగా తింటే అజీర్ణ సమస్యలొచ్చే అవకాశం ఉందనేది గమనించాలి. ఇలా కొన్ని పరిమితులు తప్ప ఈ గింజలతో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. -
మీకు తెలుసా..కొత్త ఇంటి కొనుగోలుపై రూ. 5 లక్షలకు పైగా టాక్స్ బెనిఫిట్స్..!
సొంత ఇల్లు కొనుక్కోవడం అనేది ప్రతి ఒక్కరి కల. ప్రభుత్వాలు కూడా ఇళ్లపై పెట్టుబడులను ప్రోత్సహిస్తాయి. అందుకే సెక్షన్ 80C కింద గృహ రుణంపై పన్ను మినహాయింపు వర్తిస్తోంది. మీరు గృహ రుణంపై ఇంటిని కొనుగోలు చేసినప్పుడు పన్ను భారం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ప్రభుత్వం అందిస్తోన్న పలు సెక్షన్ల ద్వారా కొత్త ఇంటి కొనుగోలుపై సుమారు రూ. 5 లక్షలకు పైగా టాక్స్ ప్రయోజనాలను పొందవచ్చును. ఈ ప్రయోజనాలు జాయింట్ హోమ్‌లోన్‌పై వర్తిస్తాయి. పలు సెక్షన్ల కింద వచ్చే ప్రయోజనాలు ఇవే..! సెక్షన్ 80సి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సి తో సుమారు రూ. 1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చును. ఇది నేరుగా గృహ అసలు రుణంపై రానుంది. ఈ రుణాన్ని కేవలం ఆర్బీఐ పరిధిలోకి వచ్చే ఆర్థిక సంస్థల నుంచి తీసుకుని ఉంటేనే అర్హులు. ఇల్లు నిర్మాణంలో ఉన్నా 5 సంవత్సరాల లోపు ఇంటిని విక్రయిస్తే ఈ ప్రయోజనం వర్తించదు. సెక్షన్ 24బీ ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 24 కింద రూ. 2 లక్షల వరకు మినహాయింపు వర్తిస్తోంది. ఇది గృహరుణ వడ్డీ చెల్లింపులపై రానుంది. ఇంటి నిర్మాణం పూర్తి అయిన తర్వాత మాత్రమే టాక్స్ మినహాయింపు క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇంటి నిర్మాణం లోన్ తీసుకున్న 5 సంవత్సరాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. సెక్షన్ 80ఈఈ ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80ఈఈ ప్రకారం రూ. 50 వేల వరకు డిడక్షన్ పొందవచ్చును. ఇది కేవలం సదరు లోన్ అమౌంట్ రూ. 35 లక్షలకు మించకూడదు. దాంతో పాటుగా ప్రాపర్టీ వాల్యూ కూడా రూ. 50 లక్షలకు మించకూడదు. ఇది గృహరుణ వడ్డీ చెల్లింపులపై రానుంది. సెక్షన్ 80ఈఈఏ ఆదాయం పన్ను చట్టంలోని సెక్షన్ 24 లిమిట్ పూర్తైన తర్వాత మాత్రమే సెక్షన్ 80ఈఈఏ కింద డిడక్షన్ పొందేందుకు వీలుంటుంది. ఈ సెక్షన్ కింద రూ. 1.50 లక్షల వరకు అదనపు తగ్గింపు పొందచ్చు. ఆస్తి స్టాంప్ డ్యూటి విలువ రూ. 45 లక్షలకు పెరగకూడదు. ఇది 'అఫర్జబుల్' గృహాలకు మాత్రమే వర్తిస్తుంది. ఈ ప్రయోజనాలను పొందాలంటే..సదరు వ్యక్తులు తొలిసారిగా ఇల్లు కొనుగోలు చేసి ఉండాలి. లోన్ తీసుకునే నాటికి ఎటువంటి రుణం వ్యక్తి పేరుపై ఉండకూడదు. చదవండి: ఆకాశమే హద్దుగా కొత్త ఇళ్ల లాంచింగ్స్...! హైదరాబాద్ జోరు మాత్రం తగ్గేదేలే..! -
వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగులకు బడ్జెట్లో భారీ బెనిఫిట్స్..!
మరికొద్ది రోజుల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2022ను పార్లమెంట్ ప్రవేశ పెట్టనుంది. ఈ బడ్జెట్లో సాధారణ పౌరుల నుంచి వ్యాపార వర్గాలు ఎలాంటి మినహాయింపులు ఉండబోతాయని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా కరోనా రాకతో పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోంకే పరిమితమైన ఉద్యోగులకు ఈ బడ్జెట్లో కేంద్రం పలు కీలక నిర్ణయాలను వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భారం మొత్తం ఉద్యోగులదే..! కరోనా మహమ్మారి రాకతో.. కంపెనీలన్ని వర్క్ ఫ్రమ్ హోమ్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. దీంతో ఆయా కంపెనీలకు అయ్యే ఖర్చు అమాంతం తగ్గింది. కంపెనీలు ఆయా ఖర్చులను తగ్గించుకున్నా ఆ భారం పూర్తిగా ఉద్యోగుల మీద పడుతున్నట్లు తెలుస్తోంది. కొన్ని కంపెనీలు ఆయా ఖర్చును భరించినా..మిగతా కంపెనీలు ఆయా ఖర్చులను ఉద్యోగులకే వదిలేశాయి. ఇదే కాకుండా ఆయా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోంలో ఉద్యోగులను ఎక్కువ పని గంటలు పనిచేస్తూన్నాయనే వార్తలు కోకోల్లలుగా వినిపించాయి. దీనికి తగ్గట్టుగా ఉద్యోగులకు ప్రయోజన కల్పించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకోని బడ్జెట్-2022లో కేంద్రం చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరో రూ.50 వేలకు పెంచాలి..! ఉద్యోగులు ఆఫీసు నుంచి కాకుండా ఇంటి నుంచి పని చేయడం వల్ల కరెంటు బిల్లు మొదలు టీ, స్నాక్స్ వంటి ఆఫీసులు కల్పించే అనేక సౌకర్యాలను ఉద్యోగులు సొంతంగా సమకూర్చుకుంటున్నారు. ఇందు కోసం తమ శాలరీ నుంచి ఖర్చు చేస్తున్నారు. వర్క్ ఫ్రం హోం వలన ఉద్యోగులకు పెరిగిన ఆర్థిక భారాన్ని పన్ను భారం నుంచి మినహాయింపు ఇవ్వాలంటున్నారు. ఇందుకు అనువుగా ప్రస్తుతం అమల్లో ఉన్న స్టాండర్డ్ డిడక్షన్‌కి అదనపు డిడక్షన్‌ను ఉద్యోగులు కోరుకుంటున్నట్లు సమాచారం. గతంలో అడిషినల్ డిడక్షన్ విధానం ఉద్యోగులకు అందుబాటులో ఉండేది. 2018లోనే ప్రభుత్వం స్టాండర్డ్ డిడక్షన్‌ను మళ్లీ ప్రవేశపెట్టింది. అనేక మంది ఉద్యోగులు స్టాండర్డ్ డిడక్షన్ని ఎంచుకున్నారు. అయితే స్టాండర్డ్ డిడక్షన్‌లో ఉన్న వారికి అడిషనల్ డిడక్షన్ లభించడం లేదు. ప్రస్తుత స్టాండర్డ్ డిడక్షన్‌లో వర్క్ ఫ్రమ్ హోమ్ అలవెన్స్‌ను కవర్ చేసేందుకు ఎలాంటి అవకాశం లేదు. దీంతో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారి కోసం ప్రస్తుత స్టాండర్డ్ డిడక్షన్ పరిమితినైనా పెంచాల్సి ఉంది లేదంటే కొత్తగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఖర్చుల కోసం కొత్త డిడక్షన్‌నైనా ప్రవేశపెట్టాల్సి ఉంది. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 16 కింద ప్రస్తుతం ఉన్న స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని రూ.50వేల నుండి రూ.1 లక్షకు పెంచాలని కోరుతున్నారు. ఉద్యోగులకు ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పన్ను చెల్లింపు విధానంలో మరింత సౌలభ్యం కల్పించాలంటున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ అలవెన్స్ కోసం డిమాండ్ తాజాగా డెలాయిట్ ఇండియా వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగులకు అలవెన్స్ అందించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం. ఇదే డిమాండ్‌ను ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) ప్రీ బడ్జెట్ మోమెరాండంలో తెలిపింది. ఈ డిమాండ్‌ను ఆర్థిక మంత్రిత్వ శాఖ అంగీకరిస్తే, వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగులకు రూ. 50,000 వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ అలవెన్స్‌ను పొందవచ్చు. చదవండి: టాక్స్ పేయర్లకు ఊరటనా..లేదా బాదుడేనా..? ఆదాయపు పన్నులో మార్పులు..! -
అలర్ట్: పీఎఫ్ఓ రూల్స్ మారాయ్, ఈపీఎఫ్ అకౌంట్‌తో రూ.7లక్షల వరకు బెన్ఫిట్స్..!
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఖాతాదారులు ఎలాంటి ప్రీమియం చెల్లించకుండా రూ.7లక్షల వరకు ప్రయోజనం పొందే అవకాశాల్ని కల్పిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఎంప్లాయిస్ డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్ (EDLI) స్కీమ్ లో భాగంగా 1976 సంవత్సారానికి చెందిన ప్రతి ఒక్క ప్రావిడెంట్ ఫండ్ లబ్ధి దారులకు రూ.7 లక్షల వరకు ప్రయోజనం చేకూర్చనున్నట్లు ఈపీఎఫ్ఓ అధికారికంగా ట్వీట్ చేసింది. ఈ ప్రయోజనం కేవలం బీమాకే కాకుండా ఇతర ప్రయోజనాలకు వర్తిస్తాయని ట్వీట్లో పేర్కొంది. బీమా ప్రయోజనాలు ఈపీఎఫ్ ఖాతాదారుడు మరణిస్తే , ఆ ఖాతాదారుడి చట్టపరమైన వారసుడు లేదా నామినీకి రూ. 7 లక్షల వరకు ప్రయోజనాలు చెల్లించబడతాయి. ప్రయోజనాలపై పరిమితి ఏప్రిల్ 2021 నుండి రూ.6 లక్షల నుండి రూ.7 లక్షలకు పెంచబడింది. Salient Features of Employees' Deposit Linked Insurance (EDLI) Scheme, 1976.#EPFO #SocialSecurity #PF #Employees #ईपीएफओ #पीएफ #Services @byadavbjp @Rameswar_Teli @PMOIndia @DDNewslive @airnewsalerts @PIBHindi @PIB_India @MIB_India @mygovindia @PTI_News pic.twitter.com/eV3WCspEp0 — EPFO (@socialepfo) October 17, 2021 కనీస హామీ ప్రయోజనాలు ఈడీఎల్ఐ పథకం 1976 కింద కనీస హామీ ప్రయోజనం కింద ఉద్యోగి మరణించిన తరువాత సంవత్సరం పాటు రూ. 2.5 లక్షలు చెల్లింపు ఉంటుంది. 7 లక్షల వరకు ఉచిత ప్రయోజనాలు ఇక బీమా పథకం ప్రయోజనాలను పొందేందుకు ఉద్యోగులు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ఈపీఎఫ్, పీఎఫ్ ఖతాదారులకు ఇది ఉచితంగా అందిస్తుంది. ఈ బీమా పథకానికి సంబంధించిన ప్రీమియం యజమాని ద్వారా చెల్లించబడుతుంది. నెలవారీ వేతనంలో 0.50 శాతం రూ. 15,000 పరిమితితో ఉంటుంది. పీఎఫ్ ఖాతాదారు/ఈపీఎఫ్ ఈపీఎఫ్ఓ సభ్యులు ఈ పథకం కింద ప్రయోజనం పొందేందుకు అప్లయ్ చేయాల్సిన అవసరం లేదు. సభ్యులు ఈపీఎఫ్ సభ్యులు లేదా చందాదారులు అయిన తర్వాత ఈడీఎల్ఐ స్కీమ్ ప్రయోజనాలకు అర్హులు. డైరెక్ట్ బ్యాంక్ బదిలీ ఈడీఎల్ఐ పథకం ప్రయోజనాలు నేరుగా నామినీ లేదా ఉద్యోగి యొక్క చట్టపరమైన వారసుని బ్యాంక్ ఖాతాకు లింక్ చేయబడతాయి. ఈపీఎఫ్ ఖాతాదారులు మరణించిన సందర్భంలో ప్రయోజనాలు నేరుగా ఈ బ్యాంక్ ఖాతాకు జమ చేయబడతాయి. అయితే, స్కీమ్ నామినీ లేదా చట్టపరమైన వారసుడు యొక్క ప్రయోజనాల క్లెయిమ్‌లను పొందడానికి ఫారమ్ 51F నింపి, ఈపీఎఫ్ఓకి సమర్పించాల్సి ఉంటుంది. చదవండి: డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త రూల్స్ ఇవే! -
ఇమ్యూనిటీని పెంచడంలో ఇదే కీలకం.. దూరంపెట్టకండి
కొవ్వు పెరిగేందుకు దోహదం చేస్తుందని, అనారోగ్య కారకమనీ వెన్నను దూరం పెట్టడం సరైంది కాదంటున్నారు న్యూట్రిషనిస్ట్‌లు. విభిన్న రకాల ఆరోగ్య ప్రయోజనాలను వెన్న అందిస్తుందంటున్నారు. యువత వెన్నను ఆహారంలో భాగం చేయడం అన్ని రకాలుగా ఉపయుక్తమవుతుందంటున్నారు. ఇమ్యూనిటీని పెంచడంలో పోషకవిలువలు అందించడంలో బటర్/వెన్నలు కీలక పాత్ర పోషిస్తాయని సహజాహార నిపుణులు కిశోర్ ఇందుకూరి తెలిపారు. హైదరాబాద్ కేంద్రంగా డైరీ ఉత్పత్తులను అందించే సిథ్స్ ఫార్మ్ తయారు చేసిన ఆవు/గేదె వెన్నలను మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా కిశోర్ ఇందుకూరి మాట్లాడుతూ వెన్న వల్ల బరువు పెరుగుతాము అనే అపోహలను ఖండించారు. వెన్నలో 740కిలో కేలరీల శక్తి, 0.6 గ్రాముల ప్రొటీన్స్ లభ్యమవుతాయని, అలాగే ఎ,డి,ఇ విటమిన్లను కూడా ఇవి అందిస్తాయని కిశోర్ వివరించారు. అయితే ఇంట్లో వండుకునే వంటల్లో వీలున్నంత వరకూ ఆవు పాల నుంచి తయారైన వెన్నను వినియోగించాలని ఆయన సూచించారు. అదే ఆరోగ్యకరమన్నారు. అలాగే బేకరీ ఉత్పత్తుల్లో మాత్రం గేదె పాల నుంచి తయారైన వెన్నను వాడుకోవడం... ఇలా విభజిస్తే అటు రుచితో పాటు ఇటు ఆరోగ్యకరం కూడా అని స్పష్టం చేశారు. చదవండి: Nutraceutical: ట్యాబ్లెట్స్ రూపంలో పోషకాలు.. మస్తుగా కెరీర్ అవకాశాలు!! -
APSRTC: ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రజా రవాణా సంస్థ (ఆర్టీసీ)లో 55 ఏళ్ల వయసు దాటిన ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో మూసివేసిన ‘స్టాఫ్ బినవొలెంట్ త్రిఫ్ట్ (ఎస్బీటీ) ఫండ్’ను తిరిగి కొత్తగా ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో దాదాపు 10వేల మందికి పైగా ఆర్టీసీ ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది. ఆర్టీసీలో ఉద్యోగుల కంట్రిబ్యూషన్‌తో ఎస్బీటీ ఫండ్‌ను ఏళ్లపాటు నిర్వహించారు. ఆర్టీసీ ఉద్యోగులు చనిపోయినా/రిటైరైనా ఆ నిధి నుంచి రూ.1.50 లక్షల చొప్పున చెల్లించేవారు. కాగా, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో ఎస్బీటీ స్థానంలో ‘ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్’ (ఏపీజీఎల్ఐ) అమల్లోకి వచ్చింది. కాగా, ఏపీజీఎల్ఐ 55 ఏళ్లలోపు ఉద్యోగులకే వర్తిస్తుంది. దాంతో ఆర్టీసీలో 55 ఏళ్లు దాటిన ఉద్యోగుల కోసం గతంలో ఉన్న అమలు చేసిన ఎస్బీటీ ఫండ్‌ను మళ్లీ ప్రవేశపెట్టాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. దీంతో ఆర్టీసీ ఉన్నతాధికారులు చేసిన ప్రతిపాదనలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఆర్టీసీలో 55 ఏళ్లు దాటిన ఉద్యోగుల కోసం కొత్త ఎస్బీటీ ఫండ్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ ఫండ్ 2021 డిసెంబర్ నాటికి 55 ఏళ్ల వయసు దాటిన వారందరికీ వర్తిస్తుంది. ఆ ఉద్యోగుల నుంచి నెలకు రూ.100 చొప్పున కంట్రిబ్యూషన్ వసూలు చేస్తారు. ఈ మేరకు రవాణా శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. చదవండి: TTD: నాలుగున్నర గంటల్లోనే 7.08 లక్షల టికెట్లు ఖాళీ -
పోషకాలు మెండుగా ఉండే బ్లాక్ రైస్.. కిలో ధరెంతో తెలుసా..
నల్ల బియ్యం.. ప్రస్తుతం ప్రజల నోళ్లలో నానుతున్న పదం. పోషకాలు అధికంగా ఉన్న ఈ బియ్యాన్ని తినేందుకు చాలా మంది ఇష్టపడుతున్నారు. రెండేళ్ల క్రితం జిల్లాలో దీని సాగు మొదలైంది. ప్రస్తుతం నంద్యాల డివిజన్ పరిధిలో 75 ఎకరాల్లో పండిస్తున్నారు. పెట్టుబడి తక్కువ ఆదాయం ఎక్కువ వస్తుండడంతో రైతులు ఈ పంట సాగు చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. సాక్షి, నంద్యాల: సహజంగా తెల్లగా ఉండే బియ్యం రకాలను చూసి ఉంటాం. కాని బ్లాక్ రైస్ మాత్రం నల్లగా ఉంటాయి. పూర్వ కాలంలో వీటిని కేవలం చక్రవర్తులు, వారి కుటుంబ సభ్యులు మాత్రమే తినడానికి కేటాయించేవారని ప్రతీతి. దీంతో వీటికి చక్రవర్తుల బియ్యం అని పేరు వచ్చింది. సాధారణ వరి కంటే బ్లాక్ రైస్ దిగుబడి తక్కువగా ఉంటుంది. అయితే ధర మాత్రం ఎక్కువగానే ఉంది. సాధారణ రకం ధాన్యం ఎకరాకు 25–30 (75 కిలోల) బస్తాల దిగుబడి వస్తే బ్లాక్ రైస్ 10–15 బస్తాలు మాత్రమే వస్తుంది. సాధారణ రకం బియ్యం కిలో రూ.45–50 ఉంటే... బ్లాక్ రైస్ కిలో రూ.170 నుంచి రూ.180కి విక్రయిస్తున్నారు. పురుగు మందులు అవసరం లేదు.. బ్లాక్ రైస్ సాగుకు పెట్టుబడి తక్కువ అవుతుంది. సాధారణ రకం వరి సాగుకు ఎకరాకు రూ.28 వేల నుంచి రూ.30 వేల వరకు పెట్టుబడి అవుతుండగా బ్లాక్ రైస్‌కు రూ.20 వేలు సరిపోతుంది. మామూలు వరికి రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు తప్పని సరి. బ్లాక్‌రైస్‌కు గో ఆధారిత జీవామృతం, గోమూత్రం, ఆవుపేడ, సేంద్రియ ఎరువును వినియోగిస్తారు. ఫలితంగా తెగుళ్ల బెడద ఉండదు. పురుగుల ముందును పిచికారీ చేయాల్సిన అవసరం ఉండదు. సాధారణ వరి 120 నుంచి 130 రోజుల్లో చేతికి వస్తే బ్లాక్ రైస్ 140 నుంచి 150 రోజుల సమయం పడుతుంది. చదవండి: కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రికి సీఎం జగన్ లేఖ ప్రయోజనాలివీ.. ► ఈ బియ్యంలో యాంటి ఆక్సిడెంట్లు ఆరోగ్యాన్ని కాపాడుతాయి ► కేరళ రాష్ట్రంలో వీటిని ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తారు ► ఈ బియ్యం మధుమేహం, క్యాన్సర్, గుండెజబ్బులను నియంత్రిస్తాయి ► శరీరంలోని అవనసర కొవ్వును కరిగిస్తాయి ► కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, జింకు వంటి ఖనిజ విలువలు అధికంగా ఉంటాయి ► ఫైబర్ కూడా ఉండటం వల్ల రక్తంలో గ్లూకోజ్ నియంత్రణలో ఉంటుంది ► అధిక రక్తపోటు సమస్య నుంచి తప్పించుకోవచ్చు ► నల్లబియ్యంలో యాంథో సైనిన్లూ అధికంగా ఉండి కంటి వ్యాధులను నయం చేస్తాయి ప్రతి 100 గ్రాముల బియ్యంలో.. బియ్యం రకం ప్రొటీన్లు ఐరన్ ఫైబర్ పాలిష్డ్ బియ్యం 6.8గ్రా 1.2గ్రా 0.6గ్రా బ్రౌన్బియ్యం 7.9గ్రా 2.2గ్రా 2.8గ్రా నల్ల బియ్యం 8.5గ్రా 3.5గ్రా 4.9గ్రా రైతులకు విత్తనాన్ని అందిస్తా నేను కొన్నేళ్లుగా 65 ఎకరాలకుపైగా వరి సాగు చేస్తున్నా. ఈ ఏడాది రెండు ఎకరాల్లో బ్లాక్ రైస్ వేశా. ఈ బియ్యంలో పోషకాలు అధికంగా ఉంటాయి. మా కుటుంబ సభ్యుల కోసం దీనిని సాగు చేస్తున్నా. వ్యవసాయాధికారుల సలహాలు పాటిస్తున్నాం. ఆసక్తి ఉన్న రైతులకు వచ్చే ఖరీఫ్‌లో విత్తనాన్ని అందిస్తా. – అనంతయ్య, రైతు, నారాయణపురం, బండిఆత్మకూరు మండలం తెగుళ్లు ఉండవు ఈ ఏడాది కొత్తగా బ్లాక్‌రైస్ సాగు చేస్తున్నా. ఈ పంటకు పురుగు మందులు వాడటం లేదు. గోమూత్రం, ఆవుపేడ, ద్విదళ గింజలతో తయారు చేసిన ఎరువును వినియోగిస్తున్నా. ఈ పంటకు తెగుళ్ల ఉండవు. పెట్టుబడి తక్కువ అని వ్యవసాయాధికారులు చెప్పారు. – నాగరాజు, రైతు, పాణ్యం సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహం బ్లాక్ రైస్ సాగును ప్రభుత్వం ప్రోత్సాహిస్తోంది. మార్కెటింగ్‌కు అవసరమైన సదుపాయాలను కలి్పస్తోంది. రెండేళ్లగా ఈ పంటను నంద్యాలలో రైతులు సాగు చేస్తున్నారు. క్రిమిసంహారక మందులు వాడకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండిస్తున్నారు. ఈ బియ్యం ఆరోగ్యానికి ఎంతో మంచివి. – రాజశేఖర్, ఏడీఏ, నంద్యాల -
ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు
సాక్షి, అమరావతి: పదవీవిరమణ చేసిన, ఇతరత్రా కారణాలతో ఉద్యోగాల నుంచి వైదొలగిన ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. 2020, జనవరి 1 తర్వాత రిటైరైన, ఉద్యోగాల నుంచి వైదొలగిన వారికి టెర్మినల్ బెనిఫిట్స్ చెల్లింపునకు మార్గం సుగమం చేసింది. వారికి లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, గ్రాట్యుటీ చెల్లింపుల కోసం అకౌంట్ హెడ్ నంబర్లు కేటాయించింది. ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ గురువారం ఉత్తర్వులిచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులకున్న ఈ ప్రత్యేక అకౌంట్ హెడ్ కేటాయింపులు తొలిసారిగా ఆర్టీసీ ఉద్యోగులకూ రాష్ట్ర ప్రభుత్వం వర్తింపజేసింది. దీంతో సీఎఫ్ఎంఎస్ ద్వారా నేరుగా లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, గ్రాట్యుటీ చెల్లిస్తారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో సంస్థ ఉద్యోగులకూ ఈ అవకాశం కలిగింది. ఇప్పటికే ఆర్టీసీ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును ప్రభుత్వం 60 ఏళ్లకు పెంచింది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఎంప్లాయీస్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్‌ను వర్తింపజేసింది. ప్రమాద బీమా, జీవిత బీమా సౌకర్యం కల్పిస్తోంది. ఉద్యోగుల పిల్లలకు ఉచితంగా పోటీ పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇప్పించేందుకు నిర్ణయించింది. కారుణ్య నియామకాల అంశాన్ని పరిశీలిస్తోంది. ఆర్టీసీ ఉద్యోగుల ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటుండటంపై సంతోషం వ్యక్తమవుతోందని సంస్థ ఎండీ ద్వారకా తిరుమలరావు చెప్పారు. సీఎం వైఎస్ జగన్‌కు నేషనల్ మజ్దూర్ యూనియన్ కృతజ్ఞతలు వినాయక చవితి నాడు ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త అందించిందంటూ నేషనల్ మజ్దూర్ యూనియన్ ఏపీ అధ్యక్షుడు పీవీ రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి వై.శ్రీనివాసరావు ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. నెలాఖరులోగా ఆర్టీసీలో పదోన్నతులు కూడా చేపడుతున్నారని పేర్కొన్నారు. తమ అభ్యర్థన మేరకు ఉత్తర్వులు వెలువరించిన సీఎం జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఇవీ చదవండి: ‘టక్ జగదీష్’ మూవీ రివ్యూ ఏపీ: వైద్యుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం -
ఆఫీసులకు రండి.. మీ కోసం బోలెడు ఆఫర్లు ఉన్నాయ్!
లండన్: కరోనా మహమ్మారి కారణంగా ప్రజల జీవనశైలి మారిందనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వివిధ రంగాలకు చెందిన సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వెసలుబాటును కల్పించాయి. వీటిలో ప్రధానంగా సేవా రంగం, ఐటీ సెక్టార్‌లోని ఉద్యోగులే అధికమని చెప్పొచ్చు. అయితే ఇప్పుడిప్పుడే కరోనా సెకండ్ వేవ్ నుంచి ప్రపంచం కోలుకుంటోంది. దీంతో పలు కంపెనీలు తిరిగి తమ ఉద్యోగులను కార్యాలయాలకు వచ్చి పని చేయాలని కోరుతున్నాయి. అయితే ఉద్యోగులు మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్‌కే మొగ్గు చూపుతున్నారట. దీంతో చేసేదేమిలేక పలు కంపెనీలు ఆఫీసులకు వచ్చిన ఉద్యోగులకు బంపర్ ఆఫర్లంటూ వారిని అకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. రండి బాబు రండి.. బోలెడు ఆఫర్లు ఇటీవల యూకేలో కూడా కరోనా సద్దుమణిగింది. కేసులు కూడా పెద్దగా లేవు. దీంతో ఆఫీసులకు రావాలంటూ ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, ఇతర ప్రైవేటు కంపెనీలు.. తమ ఉద్యోగులను కోరుతున్నాయి. కాకపోతే రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న వారు మాత్రమే రావాలని ఉద్యోగులకు సూచిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. అక్కడ చాలా మంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికే ఇంకా ఆసక్తి చూపిస్తూ ఆఫీసులకు వెళ్లడానికి మొండికేస్తున్నారట. దీంతో లండన్‌లోని పలు కంపెనీలు ఉద్యోగులపై వరాలు జల్లు కురిపిస్తున్నాయి. ఆఫీసుకు వచ్చి పని చేస్తే బోలెడు బెనిఫిట్స్ ఉంటాయని ఆకర్షిస్తున్నాయి. ఇప్పటికే లండన్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ.. ఉద్యోగులు మాత్రం ఆఫీసు అనేసరికి బద్దకిస్తున్నారట. మరికొన్ని సంస్థలు ఉచితంగా లంచ్, బార్బిక్ ఉంటుందని ప్రకటిస్తున్నాయి. ఓ కంపెనీ అయితే ఏకంగా బరిస్టానే ఆఫీసులో పెట్టేసింది. ఇలా ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రప్పించాలని అక్కడి కంపెనీలు పడరాని పాట్లు పడుతున్నాయట. చదవండి: Man Swallowed Phone: ఫోన్ మింగిన ఘనుడు.. కడుపులోకి వెళ్లగానే.. -
ఆస్తుల నగదీకరణ తప్పదు!
‘జాతీయ ఆస్తుల నగదీకరణ’ మంచిదే. ప్రైవేట్ పరిశ్రమకు కట్టబెడుతున్న ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులు అంతిమంగా ప్రభుత్వ యాజమాన్యం కిందే ఉంటాయి. నాలుగేళ్లలో రూ. 6 లక్షల కోట్ల సమీకరణ ద్వారా మౌలిక వసతులను మెరుగుపర్చడమే నగదీకరణ లక్ష్యం. ఇది ఆర్థిక వ్యవస్థను పునర్జీవింపజేసి, మహమ్మారి వల్ల దెబ్బతిన్న అభివృద్ధి పనులను వేగవంతం చేస్తుందని అంచనా. నిరర్ధక ఆస్తులను వాణిజ్యానికి అప్పగించడం లాభసాటి అని కేంద్రం భావన. ఆగస్టు నెల చివరివారంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ జాతీయ ఆస్తుల నగదీకరణ విధానాన్ని (నేషనల్ మోనిటైజేషన్ పైప్‌లైన్) ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ ఆస్తుల నిర్వహణను ప్రైవేట్ యాజమాన్యా లకు అప్పగించడం ద్వారా 2021–22 నుంచి 2024–25 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో ఆరు లక్షల కోట్ల రూపాయల నగదు సమీకరించడమే దీని లక్ష్యం. 12 ప్రభుత్వ శాఖలకు చెందిన 20కి పైగా ఆస్తులు ఈ నగదీకరణలో భాగంగా ఉంటాయి. వీటిలో ప్రధానంగా రహదారులు, రైల్వేలు, విద్యు త్తు వ్యవస్థ ఉన్నాయి. 2022 నుంచి 2025 వరకు ఈ కార్యక్రమం అమలవుతుంది. ఈ విధానం కింద భారతీయ రైల్వేకి చెందిన 400 స్టేషన్లు, 90 ప్రయాణికుల రైళ్లు, 265 గూడ్స్ షెడ్లు, 15 రైల్వే స్టేడియంలు ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తారు. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని 25 విమానాశ్రయాలను ప్రైవేటీకరిస్తారు. ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు తదితర విమానాశ్రయాల్లో ప్రభుత్వ వాటాలను పూర్తిగా విక్రయిస్తారు. 9 మేజర్ పోర్టుల్లో ఉన్న 31 ప్రాజెక్టులను పీపీపీ విధానంలో అప్పగిస్తారు. బీబీఎన్ఎల్, బీఎస్ఎన్ఎల్, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీ కమ్యూనికేషన్స్‌లో ఉన్న ఆస్తులన్నింటినీ ప్రైవేటు వారికి ఇచ్చేస్తారు. జాతీయ స్టేడియంలు, ప్రాంతీయ కేంద్రాలు, పట్టణ ప్రాంతాల్లోని కాలనీలు, అతిథిగృహాలు, హోటళ్లు వంటి వాటిని ప్రైవేటుకు అప్పగిస్తారు. అయితే జాతీయ నగదీకరణ విధానం కింద అప్పగిస్తున్న ఆస్తులు ఆ తర్వాత కూడా ప్రభుత్వ యాజమాన్యం కిందే ఉంటాయని ఆర్థికమంత్రి స్పష్టంచేశారు. కొంతకాలం ప్రైవేట్ నిర్వహణ కింద ఉన్న తర్వాత వీటిని తిరిగి ప్రభుత్వానికి ఇచ్చివేయవలసి ఉంటుంది. ఈ కొత్త విధానం కింద ప్రభుత్వం మౌలిక వసతుల రంగంలో పెడుతున్న వ్యయాన్ని పెంచేలా నగదు లభ్యతను మెరుగుపరుస్తుందని మంత్రి వ్యాఖ్య. మౌలిక వసతుల రంగంలో కేంద్ర ప్రభుత్వం పెడుతున్న వ్యయాన్ని ఇంకా పెంచాల్సిన అవసరముందని, ప్రభుత్వ రంగ మౌలిక వసతుల ఆస్తులను ప్రైవేట్ యాజమాన్యాలకు అప్పగించడం అతి ముఖ్యమైన ఆర్థిక ఎంపిక అని, నూతన మౌలిక వసతుల నిర్మాణానికి ఇది చాలా ముఖ్యమైనదని మంత్రి సెలవిచ్చారు. ఈ కొత్త విధానంలో భాగంగా విమానయాన రంగం నుంచే దాదాపు రూ. 20,800 కోట్ల ఆస్తులను ప్రైవేట్‌కి అప్పగించనున్నారు. టెలికం రంగం నుంచి రూ. 35,100 కోట్ల ఆస్తులను నగదీకరణ కింద అప్పగించనున్నారు. ఇకపోతే రైల్వే రంగం నుంచి రూ. లక్షా 50 వేల కోట్లు, రహదారుల రంగం నుంచి రూ. లక్షా 60 వేల కోట్లు, విద్యుత్ పంపిణీ రంగం నుంచి రూ. 45,200 కోట్ల విలువైన ఆస్తులను ప్రైవేట్ నిర్వహణకు అప్పగిస్తారు. ఆస్తుల నగదీకరణ విధానం ఆర్థిక వ్యవస్థను పునర్జీవింపజేసి, మహమ్మారి వల్ల దెబ్బతిన్న అభివృద్ధి పనులను వేగవంతం చేస్తుందని కేంద్రం అంచనా. దీనికి గాను ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ఆదాయాన్ని గణనీయంగా పెంచుకోవాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. నగదీకరణలో నాలుగు ప్రయోజనాలున్నాయి. 1. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల రాబడులను పెంచడం కోవిడ్ మహమ్మారి ప్రభావం కారణంగా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక స్థితి, ప్రభుత్వ రంగ యాజమాన్యంలోని సంస్థల ఆర్థిక స్థితి విధ్వంసానికి గురైంది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి 7.3 శాతానికి పడిపోయింది. ద్రవ్యలోటు జీడీపీలో 9.3 శాతానికి పెరిగింది. లాక్ డౌన్ల వల్ల ప్రభుత్వ రాబడులు క్షీణించిపోవడమే కాకుండా, పేదలకు ఉపశమనం కలిగించడానికి ప్రభుత్వం తన వ్యయాన్ని బాగా పెంచాల్సి వచ్చింది. దానికి తోడుగా ప్రభుత్వ, కేంద్రప్రభుత్వ రంగ సంస్థల విభాగాలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటూండటం కూడా తెలిసిన విషయమే. ఇవి భారీ స్థాయిలో రుణాలు, నష్టాల బారినపడి కునారిల్లుతున్నాయి. అందుకే ప్రభుత్వ రంగ సంస్థల అభివృద్ధి కోసం పెట్టుబడుల ఉపసంహరణ చర్యలు తప్పనిసరయ్యాయి. భారతదేశంలో నష్టాల బారిన పడుతున్న పీఎస్‌యూల సంఖ్య 2015–16లో 79 నుంచి 2019–20 సంవత్సరానికి 84కు చేరుకుంది. ఇదే కాలానికి లాభాలు ఆర్జిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థల సంఖ్య 175 నుంచి 171కి పడిపోయిందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో వివరించారు. వీటిలో 30 ప్రభుత్వ రంగ సంస్థల నష్టం ఇప్పటికే రూ. 1,06,879 కోట్లకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆస్తుల నగదీకరణ విధానం ప్రభుత్వానికి అదనపు రాబడులను తీసుకువస్తుంది. 2. పీఎస్‌యూలకు బడ్జెటరీ మద్దతును తగ్గించడం ప్రభుత్వ రంగ సంస్థలు తమ మూలధన వ్యయ అవసరాలను నెరవేర్చుకోవడానికి, అంతర్జాతీయ సంస్థలకు రుణాలు తిరిగి చెల్లించడానికి, కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా కొంత నగదును వాటికి అప్పగిస్తోంది. రుణ సేవలు, వీఆర్ఎస్ పథకాలు, ఉపశమన చర్యలు, రాయితీలు, ప్రత్యేక ప్యాకేజీలు వంటివి వీటికి అదనం. ఉదాహరణకు, ఆర్థిక స్థితి దిగజారిపోయిన ఎంటీఎన్ఎల్, బీఎస్ఎన్ఎల్ సంస్థల పునరుద్ధరణ కోసం కేంద్రప్రభుత్వం రూ. 70 వేల కోట్ల ప్యాకేజీనీ ప్రకటించింది. ఆస్తుల నగదీకరణ వల్ల దేశ ఆర్థిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీని వల్ల కేంద్ర ప్రభుత్వం పీఎస్‌యూలకు బడ్జెటరీ కేటాయింపులు కొన్ని సంవత్సరాల కాలంలో గణనీయంగా తగ్గుముఖం పడతాయని అంచనా. దీంతో కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఆర్థిక భారం నుంచి తప్పించుకోవచ్చు కూడా. పైగా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక, ద్రవ్యస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. ప్రభుత్వం పీఎస్‌యూలకు తప్పనిసరిగా పెడుతున్న వ్యయాన్ని సామాజిక సంక్షేమ ప్రాజెక్టులు వంటివాటికి ఉపయోగించవచ్చు. 3. కొత్త మౌలిక వసతుల కల్పనకు నిధులు లభ్యం ప్రభుత్వం నగదీకరణ ద్వారా తన వద్ద నగదు నిల్వలను పెంచుకుంటే కొత్త ఆస్తులను సృష్టించవచ్చు. ఇది దానికదేగా ఉద్యోగాల కల్పనకు వీలు కల్పిస్తుంది. దీనివల్ల పెట్టుబడులను మరింతగా ఆకర్షించి, అభివృద్ధిని ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంది. జీడీపీలో పెట్టుబడుల శాతం తగ్గుతూ వస్తోంది. అదే సమయంలో మహమ్మారి అనంతరం డిమాండు పునరుద్ధరణ చర్యలకు ప్రైవేట్ రంగం వేచి చూస్తోంది. ప్రభుత్వం రంగ సంస్థల వద్ద వనరులు తగ్గిపోయాయి.ఈ నేపథ్యంలో జాతీయ ఆస్తుల నగదీకరణ విధానం ఆర్థిక వ్యవస్థలోకి పెట్టుబడులను పునరుద్ధరిస్తుంది. కోవిడ్ –19 వల్ల ఏర్పడిన ఆర్థిక మందగమనం నుంచి భారత్ కోలుకునేలా చేయవచ్చు. పీఎస్‌యూలు నిర్మాణ రంగ నష్టాలను ఎదుర్కొంటున్నందున వాటి ఆస్తుల నగదీకరణను నిరంతరంగా చేపట్టాల్సి వస్తోంది. అదే సమయంలో ప్రైవేట్ రంగం నష్టభయం లేని ఆస్తుల అండతో ముందుకెళుతోంది. పైగా పర్యావరణ అనుమతులు, ప్రాజెక్టుల జాప్యం ద్వారా నష్టం, వ్యాజ్యాలు వంటివి ప్రైవేట్ రంగానికి ఉండవు. 4. ఉద్యోగాలు, పెట్టుబడులకు కొత్త అవకాశాలు ప్రభుత్వ ఆస్తుల నగదీకరణ ద్వారా ఆశిస్తున్న నగదు పరిమాణంతో ప్రభుత్వరంగ పరిశ్రమల విలువ అమాంతం పెరుగుతుంది. దీనివల్ల ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న గతి శక్తి ప్రణాళికకు గొప్ప చేయూత లభిస్తుంది. ఈ పథకం కింద కేంద్రప్రభుత్వం రూ. 100 లక్షల కోట్ల విలువైన మౌలిక వసతుల కల్పనను ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో సాగే ఆ సృజనాత్మక పద్ధతి వల్ల కార్పొరేట్ రంగం ఆకాంక్షలకు ఊతం లభిస్తుంది. ప్రైవేట్ రంగానికి ప్రభుత్వ ఆస్తులను కట్టబెట్టడం వల్ల ఆర్థిక వ్యవస్థ బహువిధాలుగా లాభపడుతుంది. ఇంతవరకు ఉపయోగంలో లేకుండా వృథాగా పడివున్న ఆస్తులను ప్రైవేట్ రంగం సమర్థంగా ఉపయోగించుకుని కొత్త ఉద్యోగావకాశాలను ఇతోధికంగా పెంచగలుగుతుంది. ప్రభుత్వ రంగ ఆస్తులను వీలైనంతవరకు విడుదల చేసి ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లేందుకు తగిన సమయం ఆసన్నమైందని, ప్రభుత్వం దృఢ నిర్ణయాలు తీసుకొనక తప్పటం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొనడం గమనార్హం. – అమితాబ్ తివారీ, ఆర్థిక రంగ విశ్లేషకులు (యాహూ సౌజన్యంతో) -
తిప్ప తీగ, నిమ్మగడ్డి, అశ్వగంధ ఉపయోగాలు తెలుసా!?
ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతుల మంది చిన్న చిన్న అనారోగ్యాలకు చికిత్స కోసం ఇప్పటికీ సంప్రదాయ మూలికలపైనే ఆధారపడుతున్నారు. ఇంటి తోటలో వీటిని పెంచడం వల్ల రెండు ప్రయోజనాలున్నాయి. ఒకటి సృజనాత్మకమైన సంతృప్తి. మరోటి ఇంట్లో సంప్రదాయ వ్యాధుల చికిత్స. ఈసారి హోం గార్డెనింగ్‌లో భాగంగా ఇంటి తోటలోనే పెంచే ఔషధ మొక్కల గురించి తెలుసుకొని, వాటి పెంపకాన్ని ఆచరణలో పెట్టేయండి. ఈ మొక్కలకు ఎలాంటి మట్టి కావాలి, ఎంత నీరు పోయాలి, ఎలా చూసుకోవాలి అనే విషయాలను కూడా తెలుసుకోండి. అనేక ఉపయోగాల అలోవెరా కలబంద అనేక వ్యాధులకు నివారిణిగా ఉపయోగపడుతుంది. కలబంద రసం చర్మాన్ని యవ్వనంగా, అందంగా ఉంచుతుంది. జీర్ణకోశ సమస్యలకు నివారిణిగా పనిచేస్తుంది. దోమ వంటి ఇతర కీటకాల కాటులో నొప్పి, మంటను తగ్గిస్తుంది. కలబందను కుండీలలో పెంచుకోవచ్చు. సూర్యకాంతి బాగుండాలి. తక్కువ నీరే అవసరం పడుతుంది. రెండు నెలలకు ఒకసారి కాస్తంత ఆవుపేడను ఎరువు గా వేస్తే సరిపోతుంది. తిప్పతీగ గిలోయ్ అనే ఈ తీగ ఆకు గంట ఆకారంలో ఉంటుంది. ఈ ఆకు వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. కాలేయం, మూత్రపిండాల సమస్యలను నయం చేస్తుంది. ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. శ్వాసకోశ వ్యాధులు, మధుమేహానికి ఉపయోగపడుతుంది. దీనికి అమితమై శ్రద్ధ అవసరం లేదు. పెద్ద కుండీల్లో లేదా కుండలో మట్టి పోసి, నాటితే చాలు. సులభంగా పెరుగుతుంది. నిమ్మగడ్డి యాంటీబ్యాక్టీరియల్‌గా పనిచేస్తుంది. దగ్గు, జలుబు, తలనొప్పి సమస్యలను నివారిస్తుంది. జీర్ణక్రియ మెరుగుకు సహాయపడుతుంది. ఈ గడ్డి మొక్కను వెడల్పాటి కుండీలలో పెంచుకోవచ్చు. దీనికి నీళ్లు ఎక్కువ అవసరం. కుండీ మట్టిపై భాగంలో ఇసుక పోయాలి. అప్పుడు అదనంగా నీళ్లు ఉన్నా త్వరగా ఇంకిపోతాయి. సరస్వతి ఆకు మండుకాపర్ణి, బ్రాహ్మి మొక్కగానూ పేరున్న సరస్వతి ఆకు అధిక ఒత్తిడి, అధిక రక్తపోటు, ఇతర మానసిక వ్యాధులను నయం చేయడానికి తోడ్పడుతుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఈ మొక్కకు ఒక భాగం మట్టి, ఒక భాగం ఇసుక, రెండు భాగాలు సేంద్రీయ ఎరువుల మిశ్రమం ఉండాలి. రోజూ నీళ్లు పోయాలి. అశ్వగంధ శరీరాన్ని, మనసును ఆరోగ్యంగా, యవ్వనంగా ఉంచుతుంది. వ్యాధులకు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. మానసిక వ్యాధులకు ప్రయోజనకారి. ఈ మొక్కలో ఆకులు, కాండం, వేళ్లు కూడా చికిత్సలో ఉపయోగపడతాయి. కుండీలలో సులభంగా పెంచగల చిన్న మొక్క. ఎక్కువ నీళ్లు అవసరం లేదు. వర్షాకాలం అసలే జలుబు కాలం. దాంతోపాటే దగ్గు, తుమ్ములు. కరోనా కాలం కూడా కావడం తో ఈ తరహా అనారోగ్యం మనల్ని భయపెడుతుంటుంది. జలుబు, దగ్గు నుండి ఉపశమనం కలిగించే ప్రకృతి ఔషధ వరాలు గల మొక్కలు మన ఇంట్లోనే ఉంటే ఆందోళన కొంత తగ్గుతుంది. -
గంధంతో ఇన్ని ప్రయోజనాలున్నాయా.. ముఖ్యంగా అవి
►గంధం పొడిలో కొద్దిగా రోజ్ వాటర్ వేసి పేస్టులా కలుపుకుని మొటిమలపై రాయాలి. ఈ పేస్టుని క్రమం తప్పకుండా మొటిమలపై అప్లై చేయడం వల్ల ముఖంపై అసహ్యంగా ఉన్న మొటిమలు పోతాయి. ►ముల్తాని మట్టి, గంధం పొడిని సమపాళ్లల్లో తీసుకుని రోజ్ వాటర్‌తో పేస్టులా కలపాలి. దీనిని ముఖంపై ప్యాక్‌లా అప్లై చేసి ఆరిన తరువాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల జిడ్డుకారుతున్న చర్మం తాజాగా మారడంతోపాటు నిగారింపును సంతరించుకుంటుంది. ►శరీరం వేడిగా అనిపిస్తే.. గంధం నూనెను నీటిలో వేసి స్నానం చేస్తే శరీరం చల్లబడుతుంది. ►చర్మ తత్వం ఎటువంటిదైనా తాజాగా ఉండాలంటే 50 ఎమ్ఎల్ రోజ్ వాటర్‌లో పది చుక్కల గంధం నూనె వేసి కలిపి రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి తాజాదనంతోపాటు, రక్షణ కలుగుతుంది. ► బాగా ఒత్తిడికి గురైనప్పుడు మూడు చుక్కల గంధం నూనెను టీ లో వేసుకుని తాగితే ఒత్తిడి తగ్గి ఉపశమనం కలుగుతుంది. -
రంగు రంగుల‘టీ’.. వీటిని ఒక్కసారైనా టేస్ట్ చేయాల్సిందే
మనందరమూ టీ మక్కువతో తాగుతాం. మనం రెగ్యులర్‌గా తాగే టీలు మాత్రమే కాకుండా... రంగుల పేర్లతోనూ టీ ఉండటం మనకు తెలుసు. ఉదాహరణకు బ్లాక్ టీ, గ్రీన్ టీ, వైట్ టీ, చాక్లెట్ టీ, బ్రౌన్ టీ... ఇలాగన్నమాట. ఆ రంగుల టీలతో సమకూరే ఆరోగ్య ప్రయోజనాలెన్నెన్నో. సాధారణ టీ : మనం రోజూ తాగే రెగ్యులర్ టీ ఇది. కాఫీ కంటే టీలో కెఫిన్ తక్కువ. అందుకే కాఫీతో పోలిస్తే టీని ఎక్కువసార్లు తీసుకున్నా పెద్దగా హాని చేయదు. దీన్ని కూడా మరీ ఎక్కువగా తీసుకుంటే అది సాధారణ జీర్ణ ప్రక్రియకు అంతరాయం కలిగించడం, పోషకాలు ఒంటికి పట్టకుండా చేసే ప్రమాదమూ పొంచి ఉంది. ఇలా ఎక్కువ టీ తాగేవారిలో ఐరన్ ఒంటబట్టడం తగ్గుతుంది. వైట్ టీ : పేరును బట్టి ఇదేదో పాలను ఎక్కువ మోతాదులోనూ డికాక్షన్ను తక్కువగానూ కలపడంవల్ల వచ్చే తేలికపాటి టీ కాదది. వైట్ టీ పేరిట ఒక రకం టీని చాలామంది ఇష్టంగా తాగుతూ ఉంటారు. ఇది చాలా లేతగా ఉండే టీ–ఆకులతో తయారైన టీ–పౌడర్‌తో కాచడం వల్ల తయారు చేసే టీ. ఇది సాధారణ టీ రుచితో కాకుండా కాస్తంత పచ్చిగా ఉన్నట్లుంటుంది. అయితే ఇందులో యాంటీఆక్సిడెంట్ గుణాలు ఎక్కువ. దాంతో చాలా రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. బ్లాక్ టీ : సాధారణంగా పాలు కలపకుండా కేవలం డికాక్షన్ మాత్రమే తీసుకుంటే దాన్ని బ్లాక్ టీగా పరిగణిస్తారు. ఇది నలుపు రంగులోనే కాకుండా డికాక్షన్‌కు ఉండే సహజమైన మెరుపుతో ఉంటే మరీ మేలు చేస్తుంది. ఇందులోని హెర్బల్ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అయితే అంతగా అలవాటు లేనివారు బ్లాక్ టీని మితిమీరి తాగడం మంచిది కాదు. బ్లాక్ టీ కారణంగా నిద్రలేమి, గుండెదడ, రక్తం వేగంగా ప్రవహించడం వంటి దుష్పరిణామాలు సంభవించవచ్చు. గ్రీన్–టీ : ఇటీవల ఆరోగ్యం కోసం చాలామంది గ్రీన్–టీ తీసుకుంటూ ఉండటం మనం చూస్తున్నాం. ఇందులోని హెర్బల్ పోషకాలు, ఫైటోకెమికల్స్ రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ఇందులోని యాంటీఆక్సిడెంట్స్ క్యాన్సర్‌ను నివారిస్తాయి. అయితేకాదు... గుండెజబ్బులనూ కొంతవరకు నివారిస్తాయి. కొలెస్ట్రాల్ పాళ్లను తగ్గిస్తాయి. బ్లాక్ టీలోని ‘ఎపిగెల్లో కాటెచిన్–3’ అనే యాంటీ ఆక్సిడెంట్ వల్ల అనేక వ్యాధుల నుంచి రక్షణ కలుగుతుంది. కొందరు ఈ టీలోని మరీ ఎక్కువ చేదుదనాన్ని నివారించడం కోసం తేనె కలుపుకుంటారు. అయితే దీన్ని చేదుగా తీసుకోవడమే ఆరోగ్యానికి మేలు. చాక్లెట్ టీ : ఈ టీ ఒకింత చాక్లెట్ రంగుతో పాటు చాక్లెట్ ఫ్లేవర్‌నూ కలిగి ఉంటుంది. డార్క్ చాక్లెట్స్ వల్ల మన నరాలు ఉత్తేజితం కావడంతో పాటు ఇందులోని పాలీఫినాల్స్ ఆరోగ్యానికీ మేలు చేస్తాయన్న సంగతి తెలిసిందే. ఈ చాక్లెట్ టీని షుగర్ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా తాగడం మంచిది కాదు. బ్రౌన్ టీ లేదా ఊలాంగ్ టీ : ఇది చాలా తక్కువగా ప్రాసెస్ చేసిన గ్రీన్, బ్లాక్ టీల సమ్మిళిత మిశ్రమం. దీన్ని ఎక్కువగా చైనా, తైవాన్ దేశాలలో తాగుతుంటారు. ఊలాంగ్ టీలలో జాస్మిన్, కొబ్బరి, క్యారమెల్ వంటి ఇతర ఫ్లేవర్ కూడా ఇటీవల లభ్యమవుతున్నాయి. టీ ఏదైనా మనల్ని ఉత్తేజితం చేస్తుందన్న విషయం తెలిసిందే. నరాలు ఎక్కువగా ఉత్తేజితం అయితే అవి త్వరగా అలసిపోయి మనం నీరసంగా, నిస్సత్తువగా మారే అవకాశం ఉంది. అందుకే టీ లను ఆరోగ్యం ఇచ్చే పరిమితి మోతాదులో తీసుకుంటూ... అతి వల్ల కలిగే అనర్థాలను నివారించుకుకోవాలి. -
ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేసిన రోజే అన్ని బెనిఫిట్స్ తీసుకెళ్లొచ్చంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అయితే కొందరు ఉన్నతాధికారులు, సెక్షన్ ఇన్చార్జుల నిర్లక్ష్యం కారణంగా అది నెరవేరట్లేదు. ఫలితంగా పదవీ విరమణ చేసిన అధికారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తాజా ఉదాహరణే రిటైర్డ్ ఏసీపీ కేఎన్ విజయ్‌కుమార్ పరిస్థితి. సీసీఎస్‌లో ఏసీపీగా పనిచేసిన కేఎన్ విజయ్‌కుమార్ ఫిబ్రవరి 28న పదవీ విరమణ చేశారు. ఇప్పటికీ ఆయనకు రావాల్సిన బెనిఫిట్స్ దక్క లేదు. ఇటీవల ఆయన కరోనా బారినపడి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మొదట కొద్ది రోజులు గచ్చిబౌలిలోని కార్పొరేట్ ఆస్ప త్రిలో చికిత్స పొందారు. ఆర్థిక కారణాలతో ఆస్పత్రి బిల్లులు చెల్లించలేక ప్రస్తుతం మరో ప్రైవేట్ ఆస్పత్రికి మార్చారు. ఎంతో సేవ చేసిన తన తండ్రిని పోలీస్ విభాగం గాలికి వదిలేసిందంటూ ఆయన కుమార్తె ఓ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, విజయ్‌కుమార్‌ను ఫోన్లో ‘సాక్షి’పలకరించింది. ‘నాకు రావాల్సిన బెనిఫిట్స్ నేను దాచుకున్నవి. నా డబ్బు నాకు తిరిగి ఇవ్వడానికి ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? నా కష్టార్జితం నుంచి పొదుపు చేసుకున్న నగదు ఇప్పుడు చేతికి అందట్లేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: ఇందల్వాయి ఎస్ఐ శివప్రసారెడ్డిపై వేటు మాస్కుతో ఇబ్బందులు.. పీల్చిన గాలే పీల్చి..! -
ఎల్ఐసీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా సంక్షోభ సమయంలో ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) ఉద్యోగులకు త్వరలోనే తీపి కబురు అందనుంది. సంస్థ ఉద్యోగులందరికీ వేతనాల పెంపును ప్రభుత్వం ఖరారు చేసినట్లు సమాచారం. ఉద్యోగులకు 16 శాతం వేతన పెంపును ఆర్థికమంత్రిత్వశాఖ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (డిఎఫ్ఎస్) ఆమోదించినట్టు తాజా అంచనా. అంతేకాదు, ఎల్ఐసి సిబ్బంది ఇకపై వారంలో ఐదు రోజులు మాత్రమే పనిచేయనున్నారు. బ్యాంక్ యూనియన్లు, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ మధ్య చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తక్షణమే అమల్లోకి రానున్న ఈ నిర్ణయంతో దీంతో 1.14 లక్షల మంది ఉద్యోగులు లబ్ది పొందుతారు. తాజా నివేదికల ప్రకారం ఎల్ఐసీ ఉద్యోగుల వేతనాల పెంపు15-16 శాతం వరకు ఉండవచ్చని అంచనా. మరోవైపు 20 శాతం పెంపు ఉండనుందని మరికొంతమంది అంచనా వేస్తున్నారు. నెలకు 25 శాతం పెంపు ఉంటుందని ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐఐఈఏ) ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ మిశ్రా భావిస్తున్నారు. 40 శాతం వేతన పెంపు, ముఖ్యంగా, ఐదు రోజుల పనిదినాలు ఉద్యోగుల సంఘాల డిమాండ్లలో ఒకటి. ఈ పెంపుతో ఎల్ఐసీపై సంవత్సరానికి రూ .2,700 కోట్ల భారం పడనుంది. ఎల్ఐసీ సాధారణంగా ప్రతి ఐదేళ్ళకు ఒకసారి జీతాలను సవరిస్తుంది. అయితే ఆగస్టు 2012 లో చివరిసారి వేతనాలు పెంచిన ఎల్‌ఐఈసీ వేతన సవరణ 2017 నుండి పెండింగ్‌లో ఉంది. ఉద్యోగులు కూడా వేతనాలలో 35 శాతం పైకి సవరణను ఆశిస్తుండగా, 16 శాతం మాత్రమే ఆమోదించడం గమనార్హం. కాగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022 ఆర్థిక సంవత్సరంలో ఎల్ఐసీ ఐపీఓకు రానుందని 2021 కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. దీని ద్వారా రూ .1 లక్ష కోట్లు కేంద్రం ఆశిస్తోంది. -
అప్పటినుంచే వాడకం..ఆ సబ్బుపై నిషేధం
చేతులు శుభ్రంగా కడుక్కున్నావా ఈ మధ్య ప్రతీ ఇంట్లో వినిపిస్తున్న మాట. కరోనా కారణంగా వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన పెరిగింది. తద్వారా ఏదైనా వస్తువును ముట్టుకున్నా, తినడానికి ముందు సబ్బుతో కానీ శానిటైజర్‌తో కానీ చేతులు శుభ్రపరుచుకోవడం అనివార్యం అయ్యింది. మన శరీరంలోనూ కొన్ని వేల సూక్షజీవులు ఉంటాయి. వాటి నుంచి అనారోగ్యానికి గురికాకుండా సబ్బుతో శుభ్రపరుచుకుంటారు. ఇంత ప్రాముఖ్యం ఉన్న సబ్బు అసలు ఎక్కడి నుంచి వచ్చింది ? దీన్ని ఎవరు కనుగొన్నారు ?సబ్బుల్లోనూ హానికారకమైనవి ఎలా గుర్తించాలి..ఇలాంటి ఎన్నో ముఖ్యమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. వాళ్లనే మనం ఫాలో అవుతున్నాం సబ్బును మొట్టమొదటగా పురాతన బాబీలోనియన్లు క్రీ.పూ. 2800 సంవత్సరంలోనే తయారుచేశారు. కలప, బూడిద, కొంచెం నీటిని వాడి సబ్బులా తయారుచేశారు. అయితే దీన్ని వ్యక్తిగత శుభ్రతకు ఉపయోగించలేదు. కేవలం ఉన్ని, పత్తి లాంటి వాటిని శుభ్రపరిచేందుకు వినియోగించినట్లు తేలింది. అయితే ఆ తర్వాత బాబీలోనియన్లు ఉపయోగించిన పదార్థాలతోనే ఈజిప్టియన్లు సబ్బును తయారుచేసి పుండ్లు, చర్మ వ్యాధుల చికిత్స కోసం వినియోగించారు. రోమన్ శతాబ్దాం వరకు వ్యక్తిగత శుభ్రతకు సబ్బును వాడలేదని కొన్ని అధ్యయనాల్లో తేలింది. అయితే దశాబ్దాలు మారినా బేసిక్ సబ్బు తయారీ విధానం మాత్రం మారలేదు. ఏ సబ్బు తయారీలో అయినా సాధారణంగా నీరు, నూనె ( వెజిటేబుల్ ఆయిల్ ) , బేసిక్ ఆల్కలీ, అయానిక్ ఉప్పు ను వాడతారు. సరైన నిష్పత్తిలో ఈ పదార్థాలన్నింటినీ కలపడం ద్వారా రసాయన ప్రక్రియ జరిగి సబ్బు తయారవుతుంది. ఈ పద్దతిని సోపోనిఫికేషన్ అంటారు. సబ్బు తయారీకి చల్లని ప్రక్రియ (కోల్డ్ ప్రాసెస్ ), వేడి ప్రక్రియ ( హాట్ ప్రాసెస్ ) అని రెండు పద్దతులను వాడతారు. అయితే వేడి ప్రక్రియ ద్వారానే సులభంగా సబ్బు చేయడానికి వీలుంటుందని రుజువైంది. ఆ సబ్బుపై నిషేదం నిత్యం ఎన్నో సూక్షజీవులతో మనం జీవిస్తున్నాం. సబ్బులో నీరు, నూనె వంటి గుణాలు ఉండటం వల్ల బాక్టీరియా, క్రిములు తొందరగా ఆకర్షించబడతాయి. దాదాపు 20 సెకన్ల పాటు సబ్బుతో చేతులను శుభ్రపరుచుకోవడం వల్ల క్రిములు నశిస్తాయి. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే..తడిచేతులను అలాగే వదిలేయరాదు. దీని వల్ల సూక్షజీవులు మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉంది. అందుకే టువాలు లేదా టిష్యూలు వాడి చేతులు తడిబారకుండా చూసుకోవాలి. అయితే అన్ని సూక్షజీవులు హానికారం కాదు. కొన్ని మనకు మేలుచేసేవి ఉంటాయి. ఏ సబ్బు అయినా క్రిములను చాలామేర తగ్గిస్తుంది కానీ మొత్తానికే వాటిని నాశనం చేయదు. అయితే యాంటీ బాక్టీరియల్ సబ్బులు మాత్రం బాక్టీరియా లోపలి కణ త్వచాలోకి వెళ్లి చంపేస్తుంది. ఈ సబ్బులోని ట్రైక్లోసన్ లేదా ట్రైక్లోకార్బన్ వంటి పదార్థాలు శరీరంపై దీర్ఘకాలిక దుష్ర్పభావాలను చూపిస్తుందని అధ్యయనంలో తేలడంతో 2016 నుంచి ఎఫ్‌డీఏ యాంటీ బాక్టీరియల్ సబ్బుల అమ్మకాలపై నిషేదం విధించింది. పీహెచ్ లెవల్ పెరిగితే చర్మ సమస్యలు ప్రస్తుతం శానిటైజర్ల వినియోగం బాగా పెరిగింది. అయితే 60-95% ఆల్కహాల్ సాంద్రత కలిగిన హ్యాండ్ శానిటైజర్లు సూక్షజీవులను చంపడంలో ఎక్కువ శక్తిమంతమైనవి. అయితే ఎక్కువసార్లు శానిటైజర్ వాడటం వల్ల చేతులు పొడిబారే అవకాశం ఉంది. పీహెచ్ లెవర్ ఎక్కువగా ఉన్న సబ్బులు వాడటం వల్ల శరీరం దురద, మంట, అలర్జీ వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి తక్కువ పీహెచ్ లెవల్ ఉన్న సబ్బులు వాడాలి. అంతే కాకుండా సబ్బులను డైరెక్ట్ గా వాడకుండా తప్పకుండా నీరు కలిపి వాడాలి. హెర్బల్, యాంటీ ఆక్నె, శరీరం చర్మ తత్వాన్ని బట్టి సబ్బులను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. -
సంక్షేమ జాతర
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: సంక్షేమ జాతర కొనసాగుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. తాజాగా బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు. మత్స్యకార, చేనేత వృత్తులవారు, మధ్యాహ్న భోజన ఏజెన్సీలు, న్యాయవాదులు, హోంగార్డులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగ వర్గాలకు ఎన్నికల ముందు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. వీటి ద్వారా జిల్లాలో దాదాపు 50 వేల కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి. ‘వైఎస్సార్ నేతన్న హస్తం’ ద్వారా చేనేతలకు సాయం.. మగ్గం ఉన్న ప్రతి కుటుంబానికి ‘వైఎస్సార్ నేతన్న హస్తం’ పథకం ద్వారా ప్రయోజనం చేకూర్చనున్నారు. ఒక్కొక్క చేనేత కార్మికునికి సంవత్సరానికి రూ.24 వేల మేరకు ప్రభుత్వం సాయం చేయనుంది. ఈనెలాఖరుకల్లా లబ్ధిదారుల రీ వెరిఫికేషన్ పూర్తి చేసి డిసెంబర్ 21 నుంచి అమల్లోకి తేనుంది. ఈ లెక్కన జిల్లాలో 2 వేల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. మత్స్యకారులకు రూ.10 వేల చేయూత వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలకు రూ.10 వేల చొప్పున ప్రభుత్వం సాయం చేయాలని నిర్ణయించింది. మెకనైజ్డ్, మోటారైజ్డ్, నాన్ మోటారైజ్డ్ బోట్లు ఉన్న కుటుంబాలకు వర్తింపచేయనుంది. తెప్పలపై సముద్రంలోకి చేపల వేటకు వెళ్లేవారికి కూడా ఈ పథకం వర్తిస్తుంది. దీని ప్రకారం జిల్లాలో సుమారు 15 వేల మందికి ప్రయోజనం కలగనుంది. వేట నిషేధ సమయమైన ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు ఈ సాయం వర్తించనుంది. నవంబర్ 21న ఈ పథకం అమల్లోకి రానుంది. మత్స్యకారులకు ఇచ్చే డీజిల్ సబ్సిడీని కూడా 50 శాతం పెంచుతూ కేబినెట్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లీటర్‌కు రూ.6.03 నుంచి రూ.9కి పెంచనుంది. బంకులో డీజిల్ తెచ్చుకుంటున్న సమయంలోనే సబ్సిడీ లబ్ధి చేకూర్చనుంది. మధ్యాహ్న భోజన కార్మికులు, హోంగార్డులకు వేతన పెంపు.. మధ్యాహ్న భోజన కార్మికులకు ఇచ్చే గౌరవ వేతనం రూ.వేయి నుంచి రూ.3 వేలకు పెంచేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జిల్లాలో 6 వేలమంది కార్మికులకు ప్రయోజనం చేకూరనుంది. హోంగార్డుల డెయిలీ అలవెన్స్‌ను రూ.600 నుంచి రూ.710కి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జిల్లాలో 660మంది వరకు లబ్ధి పొందనున్నారు. జూనియర్ న్యాయవాదులకు తీపి కబురు.. ఎన్రోల్ అయి, మూడేళ్లలోపు ఉన్న జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ. 5 వేల స్టయిఫండ్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 3న జాతీయ న్యాయవాదుల దినోత్సవం సందర్భంగా అమలు చేయనుంది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త.. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ద్వారా ఉద్యోగులకు మరింత లబ్ధి చేకూర్చనుంది. దాదాపు 20 వేల మంది ఉద్యోగులకు నేరుగా వారి అకౌంట్లకు జీతాలు వేయనుంది. దీనితో మధ్య వర్తుల ప్రమేయం, దోపిడీకి చెక్ పడనుంది. వైఎస్సార్ ఆదర్శం పథకం కింద యువతకు వాహనాలు.. ఇసుక రవాణా, పౌరసరఫరాలు సహా ప్రభుత్వం వాడే ప్రతి రవాణాలో స్వయం ఉపాధికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వివిధ సంక్షేమ కార్పొరేషన్ల ద్వారా ట్రక్కుల కొనుగోలుకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది. ట్రక్కు కొనుగోలుకు ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వనుంది. లబ్ధిదారుడు రూ.50 వేలు కడితే ట్రక్కు వచ్చేలా స్కీమ్ రూపొందించనుంది. కనీసం నెలకు రూ.20 వేలు ఆదాయం వచ్చేలా, ఐదేళ్ల తర్వాత యువతకు ఆ వాహనం సొంతమయ్యేలా చర్యలు తీసుకుంటుంది. కిడ్నీ ఆసుపత్రి పోస్టులకు గ్రీన్ సిగ్నల్.. సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిన పలాస కిడ్నీ ఆసుపత్రిలో పోస్టులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.50 కోట్లతో నిర్మించనున్న 200 పడకల కిడ్నీ ఆస్పత్రిలో 5 రెగ్యులర్ పోస్టులు, 100 కాంట్రాక్ట్ పోస్టులు, 60 అవుట్ సోర్సింగ్ పోస్టులకు మంత్రివర్గం ఆమోదం పలికింది. -
నిస్సాన్ కార్లపై భారీ ఆఫర్లు
సాక్షి, న్యూఢిల్లీ: అమ్మకాలు పడిపోవడంతో ఆటో కంపెనీలు వరుసగా తమ వాహనాల కొనుగోలుపై పలు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా నిస్సాన్ మోటార్స్ ఇండియా తన పాపులర్ కార్లపై తగ్గింపు ధరలను ప్రకటించింది. అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. నిస్సాన్ సన్నీ మోడల్ కారు కొనుగోలుపై గరిష్టంగా 90,000 రూపాయల వరకు ఆఫర్ ఉంది. నిస్సాన్ మైక్రా, మైక్రో యాక్టివా, సన్నీలపై వివిధ రకాల క్యాష్ బ్యాక్ ఆఫర్ లభ్యం. అయితే నిస్సాన్ కిక్స్ కొనుగోలుపై క్యాష్ బ్యాక్ ఆఫర్ లేదు. నిస్సాన్ కస్టమర్లకు ఫైనాన్స్ సులభతరం చేయడానికి కిక్స్‌లో జీరో శాతం వడ్డీ ఎంపిక అందుబాటులో ఉంది. సెప్టెంబర్ 30, 2019 వరకు ఈ తగ్గింపు ఆఫర్ చెల్లుబాటవుతుంది. ఈ ఆఫర్లు ఆయా నగరం, వేరియంట్‌ను బట్టి మారే అవకాశం ఉంది. ఖచ్చితమైన వివరాల కోసం నిస్సాన్ డీలర్‌షిప్‌ను సంప్రదించండి. నిస్సాన్ సన్నీ: నిస్సాన్ సన్నీపై రూ .30,000 వరకు నగదు తగ్గింపుతో పాటు రూ .30,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను అందిస్తోంది. దీంతోపాటు కార్పొరేట్, బ్యాంక్ ఉద్యోగులు, వైద్యులకు 14,000 రూపాయల వరకు అదనపు డిస్కౌంట్లను కూడా ఇది అందిస్తోంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, సీఏలకు, వాస్తుశిల్పులకు 8,000 రూపాయల వరకు ప్రత్యేక తగ్గింపు ఉంది. నిస్సాన్ మైక్రో: మైక్రో హ్యాచ్‌బ్యాక్ కొనుగోలుపై రూ .25 వేల వరకు నగదు తగ్గింపు పొందవచ్చు. అలాగే రూ .20వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్. కార్పొరేట్, బ్యాంక్ ఉద్యోగులు రూ .10వేల వరకు అదనపు ప్రయోజనాలను పొందవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, సిఏలు, వాస్తుశిల్పులకు రూ .5 వేల వరకు తగ్గింపు వర్తిస్తుంది. నిస్సాన్ మైక్రో యాక్టివా: మైక్రో యాక్టివా కోసం, నిస్సాన్ రూ .15 వేల వరకు నగదు తగ్గింపుతో పాటు రూ .20,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్. బ్యాంక్ , కార్పొరేట్ ఉద్యోగులు, వైద్యులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయవాదులు, సిఏలు, వాస్తుశిల్పులకు ప్రత్యేక తగ్గింపు అందుబాటులో ఉంది. నిస్సాన్ కిక్స్ : పెట్రోల్ వెర్షన్ కోసం 7.99 శాతం వడ్డీరేటు, అయిదేళ్ల వారంటీ, రోడ్‌సైట్ అసిస్టెన్స్ , రూ. 17వేల ఎక్స్ఛేంజ్ బోనస్ ఆఫర్లున్నాయి. అలాగే నిస్సాన్ కస్టమర్లకు మూడేళ్లపాటు జీరో శాతం వడ్డీరేటుతో రుణం. -
పొదుపు ఖాతాలో లక్షపైనుంటే ‘వడ్డీ’ కోత
న్యూఢిల్లీ: ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో (ఎస్బీఐ) మీకు పొదుపు ఖాతా (సేవింగ్స్ అకౌంట్) ఉందా? ఇప్పటివరకూ ఈ ఖాతాలో ఎంత మొత్తం ఉన్నా.. కస్టమర్‌కు వడ్డీ 3.5 శాతం అందేది. ఈ ఖాతాలో రూ.లక్ష దాటి ఉంటే వడ్డీరేటును ఎస్బీఐ తాజాగా పావుశాతం తగ్గించింది. దీనితో ఈ తరహా కస్టమర్లకు 3.25 శాతం వడ్డీయే అందుతుంది. బుధవారం నుంచే తాజా రేటు అమల్లోకి వస్తోంది. అయితే ఈ ఖాతాలో లక్షలోపు ఉంటే వడ్డీరేటు 3.5 శాతంగానే కొనసాగుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటుకు (బ్యాంకులకు స్వల్ప కాలానికి తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6 శాతం) అనుసంధానం చేస్తూ, ఎస్బీఐ తాజా నిర్ణయం తీసుకుంది. వడ్డీ త్రైమాసికం ప్రాతిపదికన చెల్లించడం జరుగుతుంది. 2018 డిసెంబర్ నాటికి ఎస్బీఐ దేశీయ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ల విలువ దాదాపు రూ.10.64 లక్షల కోట్లు. -
రేట్ల కోత అంచనాలతో లాభాలు
బ్యాంక్, ఫైనాన్స్, ఐటీ షేర్ల జోరుతో గురువారం స్టాక్ మార్కెట్ భారీగా లాభపడింది. బీఎస్ఈ సెన్సెక్స్ 38,500 పాయింట్లు, నిఫ్టీ 11,550 పాయింట్ల ఎగువున ముగిశాయి. మోనిటరీ పాలసీలో భాగంగా వచ్చే వారం ఆర్బీఐ కీలక రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు పెరుగుతున్నాయి. అంతేకాకుండా బ్యాంక్‌లకు మరిన్ని మూలధన నిధలు లభిస్తాయన్న అంచనాలు బలం పుంజుకుంటున్నాయి. ఈ కారణంగా వడ్డీరేట్ల ప్రభావిత బ్యాంక్, రియల్టీ, వాహన షేర్లు మంచి లాభాలు గడించాయి. మార్చి సిరీస్ డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు రోజు కావడంతో షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు భారీగా జరిగాయి. లోహ, విద్యుత్ రంగ సూచీలు మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ బలహీనపడినా, స్టాక్ సూచీలు ముందుకే దూసుకుపోయాయి. ముడి చమురు ధరలు తగ్గటం సానుకూల ప్రభావం చూపించింది. బీఎస్ఈ సెన్సెక్స్413 పాయింట్లు పెరిగి 38,546 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 125 పాయింట్ల లాభంతో 11,570 పాయింట్ల వద్ద ముగిశాయి. ఈ రెండు స్టాక్ సూచీల ఆరు నెలల గరిష్ట స్థాయిలకు చేరాయి. రోజంతా లాభాలే... లాభాల్లో ఆరంభమైన సెన్సెక్స్ రోజంతా అదే జోరు చూపించింది. ట్రేడింగ్ జరుగుతున్న కొద్దీ, లాభాలు పెరుగుతూ పోయాయి. వాణిజ్య చర్చల్లో భాగంగా గతంలో లేని ప్రతిపాదనలను చైనా అమెరికా ముందు ఉంచిందన్న వార్తలు సానుకూల ప్రభావం చూపించాయి. మరోవైపు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల జోరు కొనసాగుతుండటంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ మరింత బలపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 461 పాయింట్లు, నిఫ్టీ 143 పాయింట్ల వరకూ లాభపడ్డాయి. బాండ్ల రాబడుల తగ్గినప్పటికీ, ప్రపంచ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. ఈ మార్చి సిరిస్‌లో నిఫ్టీ 777 పాయింట్లు పెరిగింది. నాలుగేళ్ల తర్వాత నిఫ్టీ ఒక సిరీస్‌లో ఇంత అత్యధికంగా లాభపడటం ఇదే మొదటిసారి. బ్యాంక్ షేర్ల జోరు... రేట్ల కోత అంచనాలతో బ్యాంక్ షేర్లు జోరుగా పెరిగాయి. దీంతో బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకింది. ఇంట్రాడేలో 30,496 పాయింట్లను తాకిన బ్యాంక్ నిఫ్టీ 401 పాయింట్ల లాభంతో 30,421 పాయింట్ల వద్ద ముగిసింది. ఈమార్చి సిరీస్‌లో బ్యాంక్ నిఫ్టీ 3,631 పాయింట్లు లాభపడింది. ఒక సిరీస్‌లో ఈ సూచీ ఇన్నేసి పాయింట్లు లాభపడటం ఇదే మొదటిసారి. బ్యాంక్ ఆఫ్ బరోడా 7 శాతం, ఎస్బీఐ 3%, యస్‌బ్యాంక్ 2.8 శాతం, యాక్సిస్ బ్యాంక్ 2.8%, ఆర్బీఎల్ బ్యాంక్‌లు 2.3%చొప్పున పెరిగాయి. కేంద్రం రూ.5,042 కోట్ల మూలధన నిధులు అందించనుండటంతో బ్యాంక్ ఆఫ్ బరోడా 6.6 శాతం లాభపడి రూ. 130 వద్దకు చేరింది. ఎస్బీఐ 3.3% లాభంతో రూ.318 వద్ద ముగిసింది. లక్ష కోట్లు దాటిన టైటాన్ టాటా గ్రూప్‌నకు చెందిన టైటాన్ కంపెనీ ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.1,135ను తాకింది. చివరకు 1.7 శాతం లాభంతో రూ.1,134 వద్ద ముగిసింది. షేర్ జోరు కారణంగా కంపెనీ మార్కెట్క్యాప్రూ.1,372 కోట్లు పెరిగి రూ.1,00,298 కోట్లకు ఎగసింది. మార్కెట్ విలువలో అతి పెద్ద కంపెనీల జాబితాలో టైటాన్ కంపెనీది 30వ స్థానం. రూ.8.62 లక్షల కోట్లుతో రిలయన్స్ ఇండస్ట్రీస్ మొదటి స్థానంలో రూ.7.50 లక్షల కోట్లతో టీసీఎస్ రెండో స్థానంలో ఉన్నాయి. మార్కెట్ కబుర్లు ► స్టాక్ మార్కెట్ భారీ లాభాలతో ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1.52 లక్షల కోట్లు పెరిగి రూ.1.49,83,160 కోట్లకు చేరింది. ► ఐటీ కంపెనీల ఉద్యోగ నియామకాలు గత రెండు నెలల్లో పటిష్టంగా ఉన్నాయన్న వార్తల నేపథ్యంలో ఐటీ షేర్లు రాణించాయి. ► హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ రేటింగ్‌ను బ్యాంక్ ఆఫ్ అమెరికా–మెరిల్ లించ్ సంస్థ తటస్థం నుంచి కొనచ్చుకు అప్‌గ్రేడ్ చేసింది. టార్గెట్ ధరను రూ.1,060 నుంచి రూ.1,250కు పెంచింది. దీంతో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్ 4% లాభంతో రూ.1,082 వద్ద ముగిసింది. ► డీహెచ్ఎఫ్ఎల్ కంపెనీలో పిరమళ్ ఎంటర్ప్రైజెస్ సంస్థ, వాటా కొనబోతుందన్న వార్తల నేపథ్యంలో డీహెచ్ఎఫ్ఎల్ షేర్ 9.5 శాతం ఎగసి రూ.149 వద్ద ముగిసింది. æ స్టాక్ మార్కెట్ భారీగా లాభపడినప్పటికీ వాహన దిగ్గజం, హీరో మోటొకార్ప్ రెండేళ్ల కనిష్ట స్థాయి, రూ.2,517ను తాకింది. చివరకు 1 శాతం నష్టంతో రూ.2,532 వద్ద ముగిసింది. గత మూడు నెలల్లో ఈ షేర్ 20 శాతం పతనమైంది. ► టైటాన్ షేర్‌తో పాటు ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకిన కంపెనీల్లో ఏషియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ హోల్డింగ్స్, బాటా ఇండియా, ఫ్యూచర్ లైఫ్ స్టైల్ ఉన్నాయి.