ప్రస్తుతం డ్రాగన్ ఫ్రూట్స్ మార్కెట్లో బాగా వస్తున్నాయి. ఇటీవల కాలంలో మన రైతులు వీటి సాగుతో లాభలార్జిండంతో మార్కెట్లో బాగా విరివిగా లభిస్తున్నాయి. అలాంటి ఈ పండు ధర కూడా కాస్త ఎక్కువ. చాలామందికి దీన్ని ఎలా తిన్నాలనే తెలియదు. బాగా దీని రుచి కూడా కాస్త పులుపు స్వీట్‌తో కూడిన తాటి ముంజుల్లా ఉంటాయి. వీటిని ఎలా తినాలి. తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి తదితరాల గురించి ఆయుర్వేద డైటిషిన్ శిరీష రాకోటి మాటల్లో తెలుసుకుందాం.!
డ్రాగన్ ఫ్రూట్ ఎలా కట్ చేయాలంటే..
పొలుసులుగా పొడుచుకు వచ్చిన ఆకులతో వెలుపలి భాగం కఠినంగా కనిపిస్తున్నప్పటికీ, దాన్ని ముక్కలు చేయడం మాత్రం చాలా సులువే. కట్టింగ్ బోర్డు మీద డ్రాగన్ ఫ్రూట్ ఉంచి పండును సగానికి పొడవుగా కత్తిరించండి. అందుకు పదునైన చెఫ్ కత్తిని ఉపయోగించండి. పైభాగంలో ప్రారంభించి, ఆపై మందమైన కాండంలోకి వెళ్లేలా కట్ చేయండి. ఆ తర్వాత ఒక చెంచా ఉపయోగించి గుజ్జును సగం నుండి నేరుగా తినవచ్చు. లేదా పండును రెండు సగభాగాలుగా కోసి పూన ఉన్న మందపాటి చర్మాన్ని తొలగించి ముక్కలుగా చేసుకుని తినేయొచ్చు.
ఈ ఫ్రూట్ ఉపయోగాలు..
- ఇందులో మాంసకృతులు, పీచు, పిండి పదార్ధాలు, తీపి, సోడియం, విటమిన్ సి, విటమిన్ ఎ, రిబోఫ్లావిన్, నియాసిన్, విటమిన్ ఇ, ఇనుము, మెగ్నీషియం, కాల్షియం, జింక్, ఫోస్ఫరస్, బెటాలైన్స్, హైడ్రాక్సీసిన్నమేట్స్, ఫ్లేవనాయిడ్స్, ఒమేగా-3, ఒమేగా-9 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి.
- బరువు తగ్గడానికి తోడ్పడుతుంది.
- గర్భధారణ సమయంలో రక్తహీనతను దూరం చేస్తుంది. శిశవు ఆరోగ్యంగా పెరగడానికి దోహదం చేస్తుంది. గర్భిణికి నీరసం రాకుండా చూస్తుంది.
- ఎముకల ఆరోగ్యం కాపాడుతుంది.
- కీళ్లలో ఎముకల రాపిడి జరగకుండా ఉండే మృదులాస్థి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దీని వలన ఎముకల మధ్య రాపిడి ఉండదు దాని వలన నొప్పిలు ఉండవు.
- కండరాలు మరియు రక్త నాళాలు పని తీరును మెరుగు పరుస్తుంది.
- వాపును తగ్గిస్తుంది.
- జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది. ఇందులో ప్రీబయోటిక్ ఉంటాయి. దాని వలన ప్రోబైయటిక్ పెరిగి జీర్ణ శక్తి మెరుగు అవుతుంది.
- ఇన్సులిన్ నిరోధకతను తాగించడం ద్వారా మధుమేహం రాకుండా చూస్తుంది.
- మధుమేహం ఉంటే స్థాయిలను నిర్వహింస్తుంది.
- క్యాన్సర్ ప్రమాదాలను తగ్గిస్తుంది.
- రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
- చర్మంపై అకాల వృద్ధాప్య ఛాయలు రాకుండా చూస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
- జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
- కళ్ల ఆరోగ్యం కాపాడుతుంది.
- చెడు కొవ్వు నియంత్రిస్తుంది. మంచి కొవ్వుని పెంచుతుంది.
- మెదడు ఆరోగ్యం మెరుగు పరుస్తుంది.
- గుండె జబ్బుల ప్రమాదాన్ని తాగిస్తుంది.
- కాలేయంలో కొవ్వుని నియంత్రిస్తుంచి ఆరోగ్యగా ఉంచుతుంది.
అయితే ఈ డ్రాగన్‌ఫ్రూట్‌ని తొక్క తోపాటుగా తింటే మాత్రం అజీర్తీ వస్తుంది. ఎట్టిపరిస్థితుల్లోనూ అలా తిని లేనిపోని సమస్యలు తెచ్చుకోవద్దు. ఎందుకంటే తొక్క కాస్త మందంగా ఉంటుంది. ముఖ్యంగా జీర్ణ సమస్యల ఉన్నవారికి ఈ పండు వల్ల కలిగే ప్రయోజనాల కన్నా చెడు ఎక్కువ అవుతుంది. అందువల్ల దయచేసి పైన ఉన్న తొక్కను తీసివేసి తినండి.
--శిరీష రాకోటి, ఆయుర్వేద డైటిషిన్
(చదవండి: రోజూ ఒక కప్పు 'టీ' తాగితే.. మధుమేహం ఉండదు! పరిశోధనల్లో షాకింగ్ విషయాలు)
Comments
Please login to add a commentAdd a comment