Dragon Fruit
-
ఆదాయం అ'ధర'హో
డ్రాగన్ ప్రూట్ సాగులో మంచి ఫలితాలు సాధిస్తున్నారు కొర్రాయి పంచాయతీ శాంతినగర్‌కు చెందిన గిరిజన రైతు గుజ్జెల నాగేశ్వరరావు. ఎకరా విస్తీర్ణంలో సాగు చేపట్టిన ఆయన రూ.2 లక్షల మేర ఆదాయం పొందుతున్నారు. అంతర పంటగా బంతి వేయడం వల్ల ఆదనంగా ఆదాయం వస్తోందని ఆయన తెలిపారు. దళారులు, వ్యాపారులపై ఆధారపడకుండా స్థానికంగా అందుబాటులో ఉన్న మార్కెటింగ్ వనరులను సది్వనియోగం చేసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. డుంబ్రిగుడ: మండలంలోని కొర్రాయి పంచాయతీ శాంతినగర్‌కు చెందిన గిరిజన కుటుంబానికి చెందిన గుజ్జెల నాగేశ్వరరావు డ్రాగన్ ఫ్రూట్ సాగు చేపట్టి మంచి ఆదాయం పొందుతున్నారు. విశాఖ షిప్‌యార్డులో కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తున్న ఆయనకు వ్యవసాయం అంటే ఎంతో ఇష్టం. అయితే అందరిలా కాకుండా ఆయన వినూత్నంగా ఆలోచించారు. ఈ ప్రాంత వాతావరణం అనుకూలంగా ఉన్నందున డ్రాగన్ ఫ్రూట్ సాగుపై దృష్టి సారించారు. గతేడాది ట్రెల్లీస్ పద్ధతిలో జైన్ రకానికి చెందిన రెండు వేల మొక్కలను ఎకరా విస్తీర్ణంలో నాటారు. ఒకొక్క మొక్క రూ.75.. ఒకొక్క మొక్కను గుంటూరులోని ఓ క్షేత్రంలో రూ. 75 చొప్పున కొనుగోలు చేశారు. ట్రెల్లీస్ విధానంలో కీలకమైన సిమెంట్ స్తంభాలు ఒకొక్కటి రూ.350 చొప్పున 500 కొనుగోలు చేశారు. మొత్తమ్మీద మొక్కలు, సిమెంటు స్తంభాలు, కూలి ఖర్చులు కలిపి ఎకరాకు 1.50 లక్షల వరకు పెట్టుబడి అయిందని రైతు తెలిపారు. » నాటిన తొమ్మిది నెలలకు కాపు మొదలైంది. ఈ ఏడాది పూర్తిగా దిగుబడి వచ్చింది. కిలో రూ.200 చొప్పున విక్రయించగా సుమారు రూ.2 లక్షల వరకు ఆదాయం వచ్చిందని రైతు పేర్కొన్నారు. » భూమిని సారవంతం చేసేందుకు రసాయన ఎరువులకు బదులుగా పశువుల ఎరువు వినియోగించారు. ఎకరాకు ఐదు ట్రాక్టర్లు గెత్తం వాడినట్టు రైతు తెలిపారు. దీనివల్ల దిగుబడి పెరగడంతో పాటు పండు నాణ్యతగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఒకసారి నాటితే సుమారు 30 సంవత్సరాల వరకు నిలకడగా దిగుబడి వస్తుందని ఆయన వివరించారు. » ట్రెల్లీస్ విధానంలో సాగు చేపట్టడం వల్ల మొక్కకు గాలి తగిలి ఏపుగా పెరుగుతుంది. మొక్కకు మొక్కకు మధ్య పది అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పు దూరం ఉండాలి. ఒక మొక్క నుంచి సుమారు 20 వరకు పండ్ల దిగుబడి వస్తుందని రైతు తెలిపారు. » పర్యాటక ప్రాంతం కావడం వల్ల మార్కెటింగ్ స్థానికంగా అందుబాటులో ఉంది. అరకు పైనరీ, గిరిజన మ్యూజియంతో పాటు స్థానిక మార్కెట్లో విక్రయించడం వల్ల దళారుల ప్రభావం లేదని రైతు తెలిపారు. దీనివల్ల ఆయన మంచి ఆదాయం పొందగలుగుతున్నారు. » అంతరపంటగా ముద్దబంతి సాగు చేపట్టారు. దీనిపై ఏటా అక్టోబర్, నవంబర్‌లో వచ్చే ఆదాయం తోట నిర్వహణ ఖర్చులకు సరిపోతుందని రైతు తెలిపారు. ఉద్యానవనశాఖ ఎకరాకు రూ.13 వేలు పెట్టుబడి సాయంగా అందజేసిందని రైతు తెలిపారు. ఇంటిల్లపాది కష్టపడి పనిచేయడం వల్ల ఏటా నిర్వహణ ఖర్చులు తగ్గడం వల్ల రెండో ఏడాది మంచి ఆదాయం వచ్చిందని రైతు నాగేశ్వరరావు వివరించారు.సాగును ప్రోత్సహిస్తాం డ్రాగన్ ఫ్రూట్ సాగు చేపట్టే రైతులకు అవసరమైన ప్రోత్సాహం అందిస్తున్నాం. ఉద్యానవన శాఖ తరఫున ఎకరాకు రూ.13 వేల చొప్పున ఆర్థిక సాయం పొందవచ్చు. అయితే ఈ ఏడాది ఎటువంటి నిధులు మంజూరు కాలేదు. వ్యవసాయ, ఉద్యానవన శాఖల ద్వారా సాగునీటి బోర్లు మంజూరైతే తప్పనిసరిగా డ్రాగన్ ఫ్రూట్ రైతులకు కేటాయిస్తాం. – కె.శిరీష,ఉద్యానవనశాఖ అధికారి, డుంబ్రిగుడ -
తైవాన్ పింక్.. వియత్నాం వైట్
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: డ్రాగన్ ఫ్రూట్ అంటే సాధారణంగా గుర్తొచ్చేది.. పింక్, వైట్ రకాలు. కానీ ఏకంగా 32 రకాల డ్రాగన్‌ఫ్రూట్ వెరైటీలతో సంగారెడ్డిలో మేళా నిర్వహించారు. తైవాన్ పింక్.. వియత్నాం వైట్.. ఆస్ట్రేలియన్ ఐఎస్ఐఎస్.. అపోలో ఇజ్రాయెలీ.. వివిధ దేశాల్లో సాగయ్యే వెరైటీలతో పాటు, ఆసుంట.. బ్లడ్మేరీ.. బేబీ సెరడో.. వంటి చిన్న రకాలను ఈ ప్రదర్శనలో ఉంచారు. పెద్ద సైజులో ఉండే జంబోరెడ్, కాన్డార్, ఓరిజోన వంటి ప్రత్యేక రకాలు.. మెక్సికో, సెంట్రల్ అమెరికా వంటి దేశాల్లో సాగయ్యే సాన్ వంటి వెరైటీని సైతం ఈ మేళాలో ప్రదర్శించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో మంగళవారం సంగారెడ్డిలోని ఫల పరిశోధన స్థానంలో డ్రాగన్పూట్ మేళా జరిగింది. ఈ పంట పట్ల రైతుల్లో అవగాహన కలి్పంచేందుకు ఈ మేళా నిర్వహించినట్లు యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. సంగారెడ్డి జిల్లా రంజోల్ గ్రామానికి చెందిన యువ రైతు రమేశ్‌రెడ్డి వ్యవసాయక్షేత్రం, సంగారెడ్డి ఫల పరిశోధన స్థానంలో సాగవుతున్న ఈ రకాలతో ఈ ప్రదర్శన నిర్వహించారు. పోషక విలువలు పుష్కలం.. డ్రాగన్‌ఫ్రూట్‌తో కూడిన ప్రత్యేక ఉత్పత్తులను సైతం ఈ ప్రదర్శనలో ఉంచారు. డ్రాగన్‌ఫ్రూట్‌తో చేసిన చిప్స్, వడియాలు, కుక్కీస్ (బిస్కెట్లు), చాక్లెట్లు, డ్రైపౌడర్ వంటివాటితో పాటు, ఈ ఫ్రూట్‌తో చేసిన సబ్బులు, ఫేస్‌ప్యాక్ వంటి సౌందర్య సాధనాలు ప్రదర్శనలో సందడి చేశాయి. ఈ ఉత్పత్తులు ఆశ్చర్యానికి గురి చేశాయి. ఎడారి మొక్కగా పేరున్న డ్రాగన్ఫ్రూట్లో పోషక విలువలు మెండుగా ఉంటాయి. పీచుపదార్థాలతో కూడిన బలవర్థకమైన ఫలం కావడంతో దీన్ని నిత్యం తీసుకుంటే కేన్సర్ వంటి రోగాల బారిన పడకుండా ఉండవచ్చు. సమశీతోష్ణ వాతావరణానికి తట్టుకునే ఈ పంటను చౌడు నేలల్లోనూ సాగుచేసేందుకు వీలుంది. ఈ పంట ఈదురు గాలుల వంటి ప్రకృతి వైపరీత్యాలను సైతం తట్టుకుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అన్ని నేలలూ అనుకూలమే..ఈ పంట సాగుకు అన్ని నేలలూ అనుకూలమే. కొంత జాగ్రత్తలు తీసుకుని పంట సాగు చేస్తే మంచి లాభాలను ఆర్జించవచ్చు. కమర్షియల్ వెరైటీలతో పాటు మరో 30 వరకు వెరైటీలను పండిస్తున్నా ను. ఇతర రైతులు కూడా ఈ పంట సాగు చేస్తే బాగుంటుంది. ప్రస్తుతం వియత్నాం నుంచి ఈ పండ్లు దిగుమతి అవుతున్నాయి. –రమేశ్‌రెడ్డి, డ్రాగన్‌ఫ్రూట్ రైతు, రంజోల్, సంగారెడ్డి జిల్లాఉద్యానవన రైతులకు ప్రోత్సాహంఉద్యానవన పంటలు సాగు చేసే రైతులకు ప్రభుత్వం అన్ని ప్రోత్సాహకాలు ఇస్తోంది. మా యూనివర్సిటీ ద్వారా రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తున్నాము. డ్రాగన్ ఫ్రూట్ సాగు విస్తీర్ణం రాష్ట్రంలో పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాము. –బి.నీరజ, వీసీ, ఉద్యానవన విశ్వవిద్యాలయం. -
డ్రాగన్ పౌడర్ టెక్నాలజీ రెడీ!
అధికంగా యాంటీఆక్సిడెంట్లు, పీచుపదార్థం, ఇంకా ఇతర పోషకాలతో కూడిన డ్రాగన్ ఫ్రూట్ ఇటీవల కాలంలో సూపర్ ఫ్రూట్‌గా ప్రాచుర్యంలోకి వచ్చింది. ప్రారంభమైన 5–7 ఏళ్లలోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పాటు మరో 9 రాష్ట్రాలకు డ్రాగన్ సాగు విస్తరించింది. పింక్/రెడ్, వైట్ పల్ప్ రకాలు సాగవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ పంటకు ‘కమలం’ అని పేరుపెట్టింది. బెంగళూరులోని భారతీయ ఉద్యాన పరిశోధనా సంస్థ (ఐఐహెచ్ఆర్) గత ఏడాది డ్రాగన్ జ్యూస్ ఉత్పత్తి సాంకేతికతను రూపొందించిన సంగతి తెలిసిందే. తాజాగా, రెడ్/పింక్ డ్రాగన్ ఫ్రూట్‌తో పౌడర్ (పిండి)ని తయారు చేసే టెక్నాలజీని రూపొందించింది. కర్ణాటకలోని కొడగు జిల్లా చెట్టల్లిలోని ఐఐహెచ్‌ఆర్‌కు చెందిన కేంద్రీయ ఉద్యాన పంటల ప్రయోగ కేంద్రం ఈ టెక్నాలజీ అభివృద్ధికి వేదికైంది.డ్రాగన్ పండ్లతో పిండిగా మార్చే ప్రక్రియలో రెండు పద్ధతులున్నాయి. స్ప్రే డ్రైడ్ పద్ధతిలో తయారైన పిండికి కిలో రూ. 4 వేలు, ఫ్రీజ్ డ్రైడ్ పద్ధతిలో తయారైన పిండికి కిలో రూ.12 – 15 వేల ధర పలుకుతోంది. ఈ రెండు పద్ధతుల్లో పిండిని వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయాలంటే భారీ పెట్టుబడి అవసరం అవుతుంది. అయితే, ఇందులో సగం ఖర్చుతోనే డ్రాగన్ పిండిని ఉత్పత్తి చేసే టెక్నాలజీని బెంగళూరులోని ఐఐహెచ్ఆర్ ఇటీవల రూపొందించింది.మార్కెట్లో ఉన్న డ్రాగన్ పిండి కంటే అత్యంత పోషక విలువలతో ఉండే విధంగా ఈ టెక్నాలజీతో డ్రాగన్ పిండిని తయారు చేయవచ్చని, ఈ పిండిని సహజ రంగు పదార్థంగా అనేకప్రాసెస్డ్ ఆహారోత్పత్తుల్లో కలపవచ్చని ఐఐహెచ్ఆర్ తెలిపింది. ఐస్‌క్రీమ్‌లు, మిల్క్‌షేక్‌లు, జ్యూస్‌లు, కేకులు, బిస్కట్లు, టీ బ్యాగ్స్, మఫిన్స్ తయారీలో డ్రాగన్ పిండిని విస్తృతంగా వాడుతున్నారు. ఐఐహెచ్ఆర్ రూపొందించిన డ్రాగన్ పొడి సాంకేతికతను అందిపుచ్చుకొని రైతులకు మెరుగైన ఆదాయం తెప్పించేందుకు వాణిజ్య సంస్థలు/ ఎఫ్పిఓలు/ కోఆపరేటివ్లు కృషి చెయ్యాలి. -
కూతురి కోసం పంటనే పండించింది
తల్లిగుణం అందరి మేలు కోరుతుంది. కూతురి అనారోగ్య సమయంలో డ్రాగన్ ఫ్రూట్ తినిపించాలని వెతికితే దాని ఖరీదు సామాన్యులకు అందుబాటులో లేదనిపించిందామెకు. తన కూతురు లాంటి వాళ్లు ఎందరో ఈ పండుకు దూరం కావలసిందేనా అని బాధ పడింది. పట్టుదలతో ఏకంగా పంటే పండించింది. డ్రాగన్ ఫ్రూట్ రైతు రేణుక కథ ఇది.‘మీ అమ్మాయికి ప్లేట్లెట్స్ బాగా పడిపోయాయి. ప్లేట్లెట్స్ పెరగడానికి డ్రాగన్ ఫ్రూట్ తినిపించమ్మా’ అని డాక్టర్ చెప్పిన మాట ఆ తల్లిని డ్రాగన్ పంట స్వయంగా సాగు చేసే వరకు తీసుకువెళ్లింది. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామానికి చెందిన రేణుక, పరశురాములు దంపతులకు ఒక కూతురు, ఇద్దరు కుమారులు. ఇంటర్ చదువుతున్న కూతురు విజయకు కరోనా కాలంలో సుస్తీ చేసింది. కామారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ప్లేట్లెట్స్ తగ్గిపోయాయని గుర్తించిన వైద్యులు ప్లేట్లెట్స్ పెర గడానికి డ్రాగన్ ఫ్రూట్ తినిపించమని చె΄్పారు. దాంతో తల్లి రేణుక కామారెడ్డి పట్టణంలో పండ్ల దుకాణాలన్నింటా డ్రాగన్ ఫ్రూట్ కోసం తిరిగితే ఎక్కడా దొరకలేదు. ఆఖరుకు ఒక సూపర్ మార్కెట్లో దొరికాయి. ఒక్కో పండు రూ.180 చె΄్పారు. అంత ఖరీదా అని ఆశ్చర్యపోయింది రేణుక. అంత రేటు పెట్టాల్సి వచ్చినందుకు చిన్నబుచ్చుకుంది. అయినా సరే కొనుగోలు చేసి తీసుకువెళ్లి కూతురికి తినిపించింది. ఆమె ఆరోగ్యం మెరుగుపడిన తరువాత ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకువెళ్లారు.మనం ఎందుకు పండించకూడదు?రేణుకకు చదువు లేదు. కానీ వ్యవసాయం మీద మంచి పట్టు ఉంది. రేణుక భర్త పరశురాములు కూడా చదువుకోకున్నా ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేయాలన్న ఆశ ఉంది. అంతవరకూ సంప్రదాయ సేద్యం చేస్తున్న ఆ ఇద్దరూ కూర్చుని ‘డ్రాగన్ ఫ్రూట్’ గురించి చర్చించుకున్నారు. ‘మనం పండించి తక్కువకు అమ్ముదాం’ అంది రేణుక. ఆ తర్వాత భర్తతో కలిసి డ్రాగన్ ఫ్రూట్ సాగు పద్ధతుల గురించి పిల్లలతో కలిసి యూ ట్యూబ్‌లో చూసింది. ఆ పంట పండించాలన్న నిర్ణయానికి వచ్చిన రేణుక, పరశురాములు జగిత్యాల జిల్లాలోని అంతర్గాంలో డ్రాగన్ ఫ్రూట్ కు సంబంధించిన మొలకలు దొరుకుతాయని తెలుసుకున్నారు. ఓ రోజు అక్కడికి వెళ్లి పంట సాగు గురించి వారితో మాట్లాడారు. ఎకరంలో సాగు చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో, ఎన్ని మొక్కలు అవసరమవుతాయో అడిగి తెలుసుకున్నారు. వాళ్లిచ్చిన సూచనల మేరకు ఇంటికి చేరుకున్న తరువాత ఎకరం పొలం దుక్కి దున్నారు. చుట్టూరా ఇనుపజాలీతో కంచె ఏర్పాటు చేశారు. మొక్కల కోసం స్తంభాలు, కర్రలను ఏర్పాటు చేసుకున్నారు. అలాగే డ్రిప్ సౌకర్యం కల్పించుకున్నారు. పొలం తనఖా పెట్టి రూ.3 లక్షలు, అలాగే డ్వాక్రా సంఘం నుంచి రూ. 2 లక్షలు అప్పు తీసుకుని పంట సాగు మొదలుపెట్టారు.43 పండ్లు దక్కాయిపంట సాగు చేసిన తొలి ఏడాది నలబై మూడు పండ్లు మాత్రమే చేతికందాయి. దాంతో మరిన్ని మెళకువలు తెలుసుకుని మరింత కష్టపడి సాగు చే యడంతో రెండో ఏడాదికి వచ్చేసరికి 15 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. దళారులకు అమ్మితే గిట్టుబాటు కాదని భార్య, భర్త ఇద్దరూ గంపల్లో పండ్లను పెట్టుకుని సిద్దిపేట, మెదక్, కామారెడ్డి తదితర పట్టణాలకు తీసుకు వెళ్లి ఒక్కో పండు. వంద నుంచి రూ.150 వరకు అమ్ముకుంటే రూ.2 లక్షల వరకు ఆదాయం వచ్చింది. ఈసారి రూ.4 లక్షలు ఆదాయం సమకూరుతుందన్న నమ్మకంతో ఉన్నారు. పది పదిహేనేళ్లపాటు పంట వస్తుందని, తాము అనుకున్నదానికన్నా ఎక్కువే సంపాదిస్తామన్న ధీమాతో ఉన్నారు.– ఎస్.వేణుగోపాలాచారి, సాక్షి, కామారెడ్డి -
ప్రూట్ పూల్
సాక్షి, రంగారెడ్డిజిల్లా: నగరాన్ని ఆనుకొని ఉన్న రంగారెడ్డి జిల్లాలో పండ్ల తోటల సాగు క్రమేపీ పెరుగుతోంది. అన్ని రకాల పండ్లతోటలు సాగు చేసి రైతులు లాభాలు ఆర్జిస్తున్నారు. భౌగోళిక, వాతావరణ పరిస్థితు లు భిన్నంగా ఉన్నా..వివిధ రకాల పండ్ల తోటలు సాగు చేసి అధిక దిగుబడులు సాధిస్తూ యువరైతులు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. డ్రాగన్ ప్రూట్, కర్జూర, అవకాడో, యాపిల్ ఇలా వివిధ పండ్ల తోటలు జిల్లాలో సాగవుతున్నాయి. పులిమామిడిలో ‘యాపిల్’ ⇒ యాపిల్ అనగానే హిమాచల్‌ప్రదేశ్, కశీ్మర్ మాత్రమే గుర్తొస్తాయి. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలోనూ యాపిల్ తోటలు ఉన్నాయి. కందుకూరు మండలం పులిమామిడి పరిధిలోని శ్రీనిఖిల్ చేతనాకేంద్రం ఆశ్రమ నిర్వాహకులు 2021 డిసెంబర్లో హిమాచల్‌ప్రదేశ్ నుంచి హరిమన్–99 రకానికి చెందిన 170 మొక్కలు తెప్పించి, 30 గుంటల్లో నాటారు. మరో నాలుగు అన్నారకం మొక్క లు కూడా నాటారు. ప్రస్తుతం ఒక్కో మొక్క నుంచి వంద నుంచి రెండు వందల పండ్ల వరకు దిగుబడి వచ్చింది. సాధారణంగా మంచు, చలి ఎక్కువగా ఉండే ప్రదేశంలోనే ఈ యాపిల్ పంట పండుతుంది. కానీ జిల్లాలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతను కూడా తట్టుకొని దిగుబడి వస్తుండటం విశేషం. దెబ్బగూడలో ‘అవకాడో’ ⇒ సాధారణంగా 25 డిగ్రీల వాతావరణంలో మాత్రమే పెరిగే అవకాడో 40 డిగ్రీలకుపైగా నమోదైన ఉష్ణోగ్రతలను సైతం తట్టుకొని నిలబడింది. కందుకూరు మండలం దెబ్బ గూడకు చెందిన రమావత్ జైపాల్ జిల్లాలోనే తొలిసారిగా అవకాడో పండ్ల తోట సాగుచేశారు. ఆయన మూడేళ్ల క్రితం ప్రయోగాత్మకంగా ఎకరం పది గుంటల్లో 220 అవ కాడో మొక్కలు నాటారు. మొక్క నాటే సమయంలో గుంతలో యాప పిండి, గులికల మందు వాడాడు. ఆ తర్వాత డ్రిప్ సాయంతో మొక్కలకు నీరు అందించాడు. చీడపీడల సమస్యే కాదు పెట్టుబడికి పైసా ఖర్చు కూడా లేకపోవడం ఆ యువరైతుకు కలిసి వచి్చంది. ప్రస్తుతం ఆ మొక్కలు ఏపుగా పెరిగి కాపు కొచ్చాయి. ఒక్కో చెట్టు నుంచి 150 నుంచి 200 కాయలు దిగుబడి వచి్చంది.తుక్కుగూడలో ద్రాక్ష సాగు..⇒ నిజాం నవాబుల బ్యాక్‌యార్డ్(ఇంటి వెనుక గార్డెన్)ల్లో ద్రాక్షతోటలు సాగయ్యేవి. ధనవంతుల పెరట్లో మాత్రమే ఈ తోటలు కనిపిస్తుండటంతో వీటికి ‘రిచ్మెన్ క్రాప్’గా పేరొచి్చంది. ఆ తర్వాత టోలిచౌకిలో గద్దె రామకోటేశ్వరరావు తొలిసారి ద్రాక్షపంటను సాగు చేశారు. అప్పట్లో ఎకరానికి ఆరు నుంచి ఏడు టన్నుల దిగుబడి వచి్చంది. సాధారణంగా సమ శీతోష్ణ మండలంలో పండే పంటను హైదరాబాద్ పరిసరాల్లో పండించి చరిత్ర సృష్టించారు. 1991లో హైదరాబాద్ వేదికగా గ్రేప్స్ పంటపై అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. నగరం గ్రేప్స్ రాజధానిగా గుర్తింపు పొందింది. ఇక్కడి రైతులను ఆదర్శంగా తీసుకొని మహారాష్ట్రలో కూడా సాగు ప్రారంభించారు. పంట భూముల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలుస్తుండటంతో 2005 నుంచి ద్రాక్ష పంట క్రమంగా కనుమరుగవుతూ వస్తోంది. ప్రస్తుతం ఒక్క తుక్కుగూడ వేదికగా మాత్రమే ద్రాక్ష సాగవుతోంది.ఈ ప్రాంతాల్లో డ్రాగన్ ఫ్రూట్ సాగు.. జిల్లాలోని యాచారం, కందుకూరు, అబ్దుల్లాపూర్ మెట్, శంషాబాద్, మొయినాబాద్, శంకర్పల్లి తదితర ప్రాంతాల్లో ‘డ్రాగన్ ఫ్రూట్’ సాగవుతోంది.15 ఏళ్లుగా ద్రాక్ష సాగు చేస్తున్నా పదిహేను ఏళ్లుగా ద్రాక్ష పంటను సాగు చేస్తున్నా. ఒక్కసారి మొక్క నాటితే 20 ఏళ్లపాటు దిగుమతి వస్తుంది. మొదట్లో ’థాంసన్’ వెరైటీ సాగు చేశాను. తాజాగా ’మాణిక్ చమాన్’ వెరైటీ ఎంచుకున్నా. ఎకరాకు వెయ్యి మొక్కలు నాటాను. మొక్కల ఎంపిక సహా సస్యరక్షణలో చిన్నచిన్న మెళకువలు పాటించి నాటిన రెండేళ్లకే అనూహ్యంగా దిగుబడిని సాధించాను. ప్రస్తుతం ఒక్కో చెట్టు నుంచి 25 కేజీల వరకు దిగుమతి వస్తుంది. ఎకరా పంటకు కనీసం ఆరు లక్షల ఆదాయం వస్తుంది. ఖర్చుపోను రూ.3 లక్షలు మిగులుతుంది. – కొమ్మిరెడ్డి అంజిరెడ్డి, తుక్కుగూడవిదేశాల నుంచి తిరిగొచ్చి.. మేం ముగ్గురం అన్నదమ్ములం. మాకు 47 ఎకరాల భూమి ఉంది. మాది మొదటి నుంచి వ్యవసాయ ఆధారిత కుటుంబం. నేను బీటెక్ పూర్తి చేసి, ఎంబీఏ కోసం పదేళ్ల క్రితం లండన్ వెళ్లాను. అక్కడ సరైన ఉపాధి అవకాశాలు లేక మళ్లీ వెనక్కి తిరిగొచ్చా. అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న అవకాడో సాగు చేయాలనుకున్నా. ఉన్నత చదువులు చదివి విదేశాల్లో ఉద్యోగం చేసుకోకుండా..వ్యవసాయం చేస్తున్నాడేంటి? అని అంతా నవ్వుకున్నారు.ఏదో ఒక పండ్లతోట సాగు చేయాలని భావించి మొక్కల కొనుగోలుకు జడ్చర్ల నర్సరీకి వెళ్లాను. అక్కడ అవకాడో మొక్కలు చూశా. అప్పటికే ఆ పండు గురించి తెలుసు కాబట్టి..ఆ పంటను సాగుచేశా. మొక్క నాటిన తర్వాత పైసా ఖర్చు చేయలేదు. ఆశించిన దానికంటే ఎక్కువ దిగుబడి వచి్చంది. ఆన్లైన్లో చూసి, స్వయంగా తోట వద్దకే వచ్చి పండ్లు కొనుగోలు చేశారు. – రమావత్ జైపాల్, యువరైతు -
హాంకాంగ్‌లో చూసి కొత్త ఆలోచన
కొమరం భీమ్: ఉపాధి కోసం హాంకాంగ్ వెళ్లిన యువకుడు అక్కడ వేసిన డ్రాగన్‌ఫ్రూట్ పంటను చూడడంతో తనకు ఓ కొత్త ఆలోచన వచ్చింది. తమ చేనులో కూడా డ్రాగన్ ప్రూట్ పంట వేయాలనుకుని విషయం తన అన్నతో చెప్పాడు. అతను కూడా సై అనడంతో పంట సాగుకు ముందుకు వచ్చారు. ఏడాదిక్రితం పంట వేయగా ప్రస్తుతం ఫలాలు ఇస్తుంది. హాంకాంగ్‌లో చూసి ఆలోచన జన్నారం మండలం దేవునిగూడ గ్రామానికి చెందిన కల్లెం రవీందర్‌రెడ్డి, జమున దంపతులకు ఇద్దరు కుమారులు. పిల్లలు చిన్నతనంలోనే తండ్రి అనారోగ్యంతో మరణించాడు. దీంతో తల్లి జమున కూలిపని చేస్తూ వారిని డిగ్రీ వరకు చదివించింది. పెద్ద కుమారుడు శివకృష్ణారెడ్డి వ్యవసాయం వైపు వెళ్లగా సాయికృష్ణారెడ్డి ఉపాధి కోసం హాంకాంగ్ వెళ్లాడు. అక్కడ ఎక్కువశాతం మంది డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తుండడంతో పంట గురించి తెలుసుకున్నాడు. జగిత్యాల రైతు వద్ద అవగాహన జగిత్యాల జిల్లా అంతర్గావ్కు చెందిన రైతు శుభాష్‌రెడ్డి డ్రాగన్‌ఫ్రూట్ సాగు చేస్తున్నట్లు శివకృష్ణారెడ్డి యూట్యూబ్‌లో తెలుసుకున్నాడు. అక్కడికి వెళ్లి రైతు వద్ద పంట గురించి పూర్తిగా తెలుసుకుని తమ్మునికి వివరించాడు. అతను సరే అనడంతో తమకున్న ఎకరం 10 గుంటల భూమిలో 2022 డిసెంబర్లో అదే రైతు వద్ద నుంచి రూ.80కి ఒక మొక్క చొప్పున 2 వేల మొక్కలు కొనుగోలు చేశారు. 500 సిమెంటు దిమ్మెలు తీసుకువచ్చారు. ఒక్కో దిమ్మె చుట్టూ నాలుగు మొక్కలు నాటి డ్రిప్ ద్వారా నీటిని అందించారు. మొత్తంగా రూ.6 లక్షల వరకు ఖర్చు చేశారు. అందుతున్న ఫలాలు గతేడాది డిసెంబర్లో మొక్కలు నాటగా 2023 నవంబర్‌లో కాయలు కాశాయి. మొదటి దశలో ఆశించినంత కాయకపోవడంతో వాటిని సొంతానికి వాడుకున్నారు. ఏటా జూన్ నుంచి నవంబర్ వరకు పంట చేతికి వస్తుందని వారు పేర్కొన్నారు. ప్రస్తుతం మార్కెట్లో కిలోకు రూ.150 ఉందని, ఎకరం పది గుంటల్లో సుమారు 2 టన్నుల పంట వచ్చే అవకాశం ఉందన్నారు. ఒక్కసారి పంట వేస్తే 20 సంవత్సరాల వరకు ఫలాలు వస్తుంటాయని, మొక్క పెరిగిన కొద్దీ కత్తిరిస్తూ ఉంటే ఏటా పంట చేతికి వస్తుందన్నారు. ఏడాదికి రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు లాభాలు వచ్చే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. కొత్త ఆలోచనతో సాగు ఉపాధి కోసం హాంకాంగ్ వెళ్లా. అక్కడ ఆన్లైన్ పనిచేస్తూ అప్పుడప్పుడు బయటకు వెళ్లగా ఎక్కువగా డ్రాగన్‌ఫ్రూట్ పంట కనిపించేది. అదే పంటను మా భూమిలో కూడా వేయాలని కొత్త ఆలోచనతో వచ్చింది. అన్నతో చర్చించి మా భూమిలో మొక్కలు నాటాం. ఇప్పుడు మొదటి క్రాపు చేతికి వచ్చింది. – సాయికృష్ణారెడ్డి సబ్సిడీ ఇవ్వాలి మా తమ్మునికి వచ్చిన ఆలోచనతో ఎకరం పది గుంటల్లో మొక్కలు నాటాం. డ్రిప్‌తో నీరందిస్తున్నాం. ఇప్పటి వరకు రూ.6 లక్షలు ఖర్చు వచ్చింది. వచ్చే జూన్ వరకు రెండో క్రాప్ వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం ఆయిల్‌పాం పంట మాదిరి డ్రాగన్‌ఫ్రూట్ పంటకు కూడా సబ్సిడీ ఇస్తే బాగుండు. ఖర్చులు తగ్గుతాయి. – శివకృష్ణారెడ్డి -
డ్రాగన్ ఫ్రూట్‌తో దిమ్మతిరిగే లాభాలు, మొదటి పంటలోనే 6లక్షలకు పైగా..
కర్నూలు(అగ్రికల్చర్): కరువులో డ్రాగన్ ఫ్రూట్ సాగు కలసివస్తోంది. తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో ఈ పంటను సాగు చేసుకోవచ్చు. గతంలో ఒకరిద్దరి రైతులకే పరిమితమైన తోటలు ఏడాదికేదాది అభివృద్ధి చెందాయి. ప్రస్తుతం ఉమ్మడి కర్నూలు జిల్లాలో 300 ఎకరాల్లో ఈ పంటను సాగు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద డ్రాగన్‌ఫ్రూట్ సాగు చేసే రైతుకు గరిష్టంగా రూ.1.90 లక్షలు సబ్సిడీ ఇస్తోంది. గతంలో దిమ్మెలు పాతి దానిపై టైర్/బండి చక్రం అమర్చడం ద్వారా మొక్కలు పైకిపాకే ఏర్పాటు చేసేవారు. నేడు ట్రెల్లీస్ విధానంలో(దిమ్మెలపై టైరు/ బండి చక్రం అవసరం లేకుండా తీగలతో ) తోటలు అభివృద్ధి చేస్తున్నారు. మొదటి పంటలోనే రూ.6 లక్షల ఆదాయం దేవనకొండ మండలం వరిముక్కల గ్రామానికి చెందిన కంది రవీంద్రకుమార్ యాదవ్ ట్రెల్లీస్ విధానంలో డ్రాగన్‌ఫ్రూట్ సాగు చేస్తున్నారు. ఈయన కేవలం 10వ తరగతి వరకు చదువుకున్నారు. మొదటి పంటలోనే రూ. 6 లక్షల ఆదాయం పొందారు. నరసరావు పేట నుంచి మొక్క రూ.60 ప్రకారం తెప్పించి 2021లో నాటుకున్నారు. సాలుకు, సాగుకు మధ్య 14 అడుగులు, దిమ్మెకు, దిమ్మెకు మధ్య 14 అడుగుల దారంలో పోల్స్ నాటుకున్నారు. పోల్స్‌కు విద్యుత్ లైన్ తరహాలో 4 వరుసలతో లైన్ వేశారు. పోల్స్ కింద ఒకదానిపైన ఒకటి ప్రకారం మూడు వైర్లు లాగారు. ఈ వైర్ల కింద అడుగు, అడుగు దూరంలో డ్రాగన్ ప్రూట్ మొక్కలు నాటుకున్నారు. మొక్కలు తీగ తరహాలో పైకి పెరుగుతూ... పైన వేసిన నాలుగు లైన్లు వేసి తీగలపై అల్లుకున్నాయి. దిమ్మెలపై టైరు/బండి చక్రం అవసరం లేకుండా పోయింది. ఎకరన్నర భూమిలో ఏకంగా 7వేల మొక్కలు నాటుకోగా.. పెట్టుబడి వ్యయం రూ.16 లక్షల వరకు వచ్చింది. అంతరపంటగా వేరుశనగ సాలుకు, సాలుకు మధ్య 14 అడుగులు ఉండటంతో ట్రాక్టరుతో సేద్యం చేసుకోవచ్చు. ప్రతి ఏటా అంతరపంటలు సాగు చేసుకునే అవకాశం ఏర్పడింది. డ్రాగన్‌ప్రూట్ మొక్కలకు ఆకులు రావు. తీగలపైనే అల్లుకుంటాయి. మధ్య ఖాళీగా ఉన్న భూమిలో అంతరపంటగా వేరుశనగ సాగు చేసి అదనపు ఆదాయం పొందుతున్నారు. డ్రాగన్‌ప్రూట్ తోటకు మల్చింగ్ సదుపాయం కూడా కల్పించుకున్నారు. దీంతో కలుపు సమస్య లేకుండా పోయింది. తేమ కూడా ఆరిపోదు.. ప్లాస్టిక్ షీట్లకు అడగు, అడుగు దూరంలో రంధ్రాలు వేసి మొక్కలు నాటారు. మల్చింగ్ వల్ల మొక్క ఆరోగ్యంగా పెరుగుతోంది. ఏపీఎంఐపీ ద్వారా సూక్ష్మ సేద్యం కల్పించుకున్నారు. ఐదేళ్ల నుంచి పెరగనున్న దిగుబడులు పంటకు కేవలం పశువుల ఎరువులు మాత్రమే ఉపయోగిస్తున్నారు. నాటిని ఏడాదిలోపే 2022 అగస్టులో కాపు మొదలైంది. మొదటి పంటలో కేవలం 3 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వచ్చింది. 2023లో దిగుబడి బాగా పెరిగింది. ఈ ఏడాది జూన్‌లో మొదలైన పంట నవంబరు నెలతో ముగింపునకు వస్తోంది. ఈ ఏడాది ఏకంగా 60 క్వింటాళ్ళ దిగుబడి వచ్చింది. టన్ను రూ.లక్ష ప్రకారం విక్రయించారు. ఇప్పటి వరకు రూ.6 లక్షలకుపైగా ఆదాయం పొందారు. వచ్చే ఏడాది మొక్కకు 20 వరకు పండ్లు వస్తాయి. ఇవి 4 కిలోల వరకు ఉంటాయి. ఈ ప్రకారం 28 టన్నుల వరకు దిగుబడి పెరుగనుంది. నాటిన ఐదేళ్ల నుంచి దిగుబడి గరిష్టస్థాయికి చేరుతుంది. మూడు నెలలు అధ్యయనం చేశా డ్రాగన్న్ఫ్రూట్స్ సాగు చేసే ముందు మూడు నెలలు అధ్యయనం చేశా. ఒక అవగాహనకు వచ్చాక ట్రెల్లీస్ విధానంలో మొక్కలు నాటుకున్నా. మల్చింగ్, పోల్స్, వైర్లు, మొక్కలు తదితర వాటికి పెట్టుబడి కింద రూ.16 లక్షల ఖర్చు వచ్చింది. డ్రాగన్ ప్రూట్స్ సాగుకు ఉపాధి హామీ పథకం కింద ప్రభుత్వం రూ.1.90 లక్షల సబ్సిడీ ఇచ్చింది. ఏపీఎంఐపీ కింద డ్రిప్ కూడా మంజూరైంది. – కంది రవీంద్రకుమార్ యాదవ్ సాగును ప్రోత్సహిస్తున్నాం డ్రాగన్ ఫ్రూట్ సాగును ప్రోత్సహిస్తున్నాం. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద సన్న, చిన్నకారు రైతులకు గరిష్టంగా రూ.1.90 లక్షలు సబ్సిడీగా ఇస్తున్నాం. దేవనకొండ మండలం వరిముక్కల గ్రామానికి చెందిన రవీంద్రకుమార్ డ్రాగన్ ఫ్రూట్ సాగులో రాణిస్తున్నారు. – అమరనాథరెడ్డి, ప్రాజెక్టు డైరెక్టర్, డ్వామా -
డ్రాగన్ ఫ్రూట్ ఎలా వాడాలి?..పొరపాటున అలా తింటే..
ప్రస్తుతం డ్రాగన్ ఫ్రూట్స్ మార్కెట్లో బాగా వస్తున్నాయి. ఇటీవల కాలంలో మన రైతులు వీటి సాగుతో లాభలార్జిండంతో మార్కెట్లో బాగా విరివిగా లభిస్తున్నాయి. అలాంటి ఈ పండు ధర కూడా కాస్త ఎక్కువ. చాలామందికి దీన్ని ఎలా తిన్నాలనే తెలియదు. బాగా దీని రుచి కూడా కాస్త పులుపు స్వీట్‌తో కూడిన తాటి ముంజుల్లా ఉంటాయి. వీటిని ఎలా తినాలి. తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి తదితరాల గురించి ఆయుర్వేద డైటిషిన్ శిరీష రాకోటి మాటల్లో తెలుసుకుందాం.! డ్రాగన్ ఫ్రూట్ ఎలా కట్ చేయాలంటే.. పొలుసులుగా పొడుచుకు వచ్చిన ఆకులతో వెలుపలి భాగం కఠినంగా కనిపిస్తున్నప్పటికీ, దాన్ని ముక్కలు చేయడం మాత్రం చాలా సులువే. కట్టింగ్ బోర్డు మీద డ్రాగన్ ఫ్రూట్ ఉంచి పండును సగానికి పొడవుగా కత్తిరించండి. అందుకు పదునైన చెఫ్ కత్తిని ఉపయోగించండి. పైభాగంలో ప్రారంభించి, ఆపై మందమైన కాండంలోకి వెళ్లేలా కట్ చేయండి. ఆ తర్వాత ఒక చెంచా ఉపయోగించి గుజ్జును సగం నుండి నేరుగా తినవచ్చు. లేదా పండును రెండు సగభాగాలుగా కోసి పూన ఉన్న మందపాటి చర్మాన్ని తొలగించి ముక్కలుగా చేసుకుని తినేయొచ్చు. ఈ ఫ్రూట్ ఉపయోగాలు.. ఇందులో మాంసకృతులు, పీచు, పిండి పదార్ధాలు, తీపి, సోడియం, విటమిన్ సి, విటమిన్ ఎ, రిబోఫ్లావిన్, నియాసిన్, విటమిన్ ఇ, ఇనుము, మెగ్నీషియం, కాల్షియం, జింక్, ఫోస్ఫరస్, బెటాలైన్స్, హైడ్రాక్సీసిన్నమేట్స్, ఫ్లేవనాయిడ్స్, ఒమేగా-3, ఒమేగా-9 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. గర్భధారణ సమయంలో రక్తహీనతను దూరం చేస్తుంది. శిశవు ఆరోగ్యంగా పెరగడానికి దోహదం చేస్తుంది. గర్భిణికి నీరసం రాకుండా చూస్తుంది. ఎముకల ఆరోగ్యం కాపాడుతుంది. కీళ్లలో ఎముకల రాపిడి జరగకుండా ఉండే మృదులాస్థి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దీని వలన ఎముకల మధ్య రాపిడి ఉండదు దాని వలన నొప్పిలు ఉండవు. కండరాలు మరియు రక్త నాళాలు పని తీరును మెరుగు పరుస్తుంది. వాపును తగ్గిస్తుంది. జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది. ఇందులో ప్రీబయోటిక్ ఉంటాయి. దాని వలన ప్రోబైయటిక్ పెరిగి జీర్ణ శక్తి మెరుగు అవుతుంది. ఇన్సులిన్ నిరోధకతను తాగించడం ద్వారా మధుమేహం రాకుండా చూస్తుంది. మధుమేహం ఉంటే స్థాయిలను నిర్వహింస్తుంది. క్యాన్సర్ ప్రమాదాలను తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చర్మంపై అకాల వృద్ధాప్య ఛాయలు రాకుండా చూస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కళ్ల ఆరోగ్యం కాపాడుతుంది. చెడు కొవ్వు నియంత్రిస్తుంది. మంచి కొవ్వుని పెంచుతుంది. మెదడు ఆరోగ్యం మెరుగు పరుస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తాగిస్తుంది. కాలేయంలో కొవ్వుని నియంత్రిస్తుంచి ఆరోగ్యగా ఉంచుతుంది. అయితే ఈ డ్రాగన్‌ఫ్రూట్‌ని తొక్క తోపాటుగా తింటే మాత్రం అజీర్తీ వస్తుంది. ఎట్టిపరిస్థితుల్లోనూ అలా తిని లేనిపోని సమస్యలు తెచ్చుకోవద్దు. ఎందుకంటే తొక్క కాస్త మందంగా ఉంటుంది. ముఖ్యంగా జీర్ణ సమస్యల ఉన్నవారికి ఈ పండు వల్ల కలిగే ప్రయోజనాల కన్నా చెడు ఎక్కువ అవుతుంది. అందువల్ల దయచేసి పైన ఉన్న తొక్కను తీసివేసి తినండి. --శిరీష రాకోటి, ఆయుర్వేద డైటిషిన్ (చదవండి: రోజూ ఒక కప్పు 'టీ' తాగితే.. మధుమేహం ఉండదు! పరిశోధనల్లో షాకింగ్ విషయాలు) -
డ్రాగన్ ఫ్రూట్ సాగుతో సత్ఫలితాలు సాధిస్తున్న రైతు
-
రసాయనిక వ్యవసాయంలో లాభాలు రావడం అరుదు
-
రైతులకు మంచి లాభదాయక పంటగా డ్రాగన్ ఫ్రూట్
-
డ్రాగన్ ఫ్రూట్ లో అధికపోషకాలు ఉంటాయి
-
డ్రాగన్ ఫ్రూట్ కు ఫుల్ డిమాండ్...!
-
డ్రాగన్ ఫ్రూట్ సాగులో పెట్టుబడి, శ్రమ రెండూ తక్కువే
-
డ్రాగన్ ఫ్రూట్ సాగుచేస్తూ మంచి లాభాలు పొందుతున్న యువరైతు
-
40 వేల డ్రాగన్ ఫ్రూట్ మొక్కలతో 5 ఎకరాల్లో పంట
-
డ్రాగన్ ఫ్రూట్ కు భారీగా పెరుగుతున్న డిమాండ్
-
83 రకాల డ్రాగన్ ఫ్రూట్స్ ను పండిస్తున్న సంగారెడ్డి రైతు
-
ఒక్కసారి ఈ పంట వేస్తే... 25 ఏళ్ళ పాటు ఆదాయం
-
రైతు సంక్షేమ కార్యక్రమాలు భేష్
పెనుగంచిప్రోలు: ఏపీలో అమలవుతున్న రైతు సంక్షేమ కార్యక్రమాలు బాగున్నాయని ఇథియోపియా ప్రతినిధి బృందం పేర్కొంది. రాష్ట్ర పర్యటనలో భాగంగా ఇథియోపియా బృందంలోని ఆరుగురు సభ్యులు శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో సాగవుతున్న డ్రాగన్ ఫ్రూట్ తోటను పరిశీలించారు. రైతు పెద్ది మోహనరావుతో మాట్లాడి సాగు వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయానికి ఇస్తున్న ప్రోత్సాహకాలు రైతులకు ఎంతో మేలు కలిగేలా ఉన్నాయన్నారు. ఆంధ్రా రైతులు రకరకాల ఉత్పత్తులు లాభసాటిగా పండిస్తున్నారన్నారు. ముఖ్యంగా రైతు భరోసా కేంద్రాలు ఎన్నో రకాల సేవలందిస్తున్నాయని ప్రశంసించారు. ఇక్కడ వ్యవసాయ రంగంలో అమలవుతున్న ప్రతి కార్యక్రమం తమ దేశంలో రైతులకు అందించేందుకు ఆసక్తిగా ఉన్నామని చెప్పారు. ఇథియోపియో ప్రతినిధులు రోసి, ఎల్షడే, అబ్రహాం, ఆలీ, ఏడీఆర్ డాక్టర్ జీఎంవీ ప్రసాదరావు, డీడీఈ డాక్టర్ బి.ముకుందరావు, ఏడీ శివప్రసాద్, గరికపాడు కృషి విజ్ఞానకేంద్రం శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. -
డాబాపై డ్రాగన్ తోట
రాజాం: ఆయనొక సాఫ్ట్వేర్ ఉద్యోగి. వ్యవసాయమంటే మక్కువ. కోవిడ్ సమయంలో ఖాళీగా ఉన్న సమయంలో తల్లిదండ్రుల సాయంతో విదేశాల్లో బాగా కలిసివస్తున్న డ్రాగన్ పంట సాగుపై దృష్టిసారించాడు. ఆ పంటకు ఇక్కడ ఉన్న డిమాండ్ గుర్తించాడు. వేసిన పంట ద్వారా ఫలసాయం పొందాలని భావించాడు. ఏకంగా తన ఇంటి డాబానే వ్యవసాయ క్షేత్రంగా మలిచాడు. వందకు పైగా మొక్కలు నాటాడు. సస్యరక్షణ చర్యలు చేపట్టాడు. డ్రాగన్ తోట ఏపుగా పెరిగి దిగుబడి ఆరంభం కావడంతో... కష్టం ఫలించిందంటూ సంబరపడుతున్నాడు. ఆయనే రాజాం పట్టణం పరిధిలోని డోలపేట గ్రామానికి చెందిన సుదర్శనం అధికారి. ఆరు సెంట్ల విస్తీర్ణంలో... సుదర్శనం అధికారి విశాఖపట్నంలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆయనకు చిన్నప్పటి నుంచి రకరకాల పంటలు సాగుచేయడమంటే ఇష్టం. తల్లిదండ్రులు నర్సమ్మ, శాంతిమూర్తిల ప్రోత్సాహంతో కొంత పొలాన్ని కొనుగోలుచేసి మామిడితోటలు, జీడితోటలతో పాటు పొలాలు, ఇంటి ఆవరణలో వివిధ రకాల మొక్కలు సాగుచేస్తుంటాడు. అదే క్రమంలో కోవిడ్ సమయంలో ఇంటి డాబాపై డ్రాగన్ పంట సాగుకు పూనుకున్నాడు. 25 స్తంభాలు ఏర్పాటుచేసి ఆరుసెంట్లు విస్తీర్ణంలో ఉన్న డాబాపై వందకుపైగా డ్రాగన్ మొక్కలు 2020లో నాటాడు. గతేడాది జూలై నెలలో పూతకు వచ్చాయి. ఒక్కో మొక్కకు 12 నుంచి 15 వరకూ డ్రాగన్ పండ్లు దిగుబడి రావడంతో పాటు నాలుగు నెలలు పాటు పూత సాగింది. ఒక్కొక్కటి 800 గ్రాముల నుంచి 900 గ్రాముల బరువు ఉన్న పండ్లు దిగుబడి వస్తున్నాయి. పోషకాలు మెండుగా ఉన్న డ్రాగన్ పండ్ల కొనుగోలుకు ప్రస్తుతం అధికమంది ఆసక్తిచూపుతున్నారు. నిరంతరం ఇద్దరు.. పొలం, ఇంటి వద్ద మొక్కల సంరక్షణకు ఇద్దరు రైతు కూలీలను నియమించాడు. ప్రతీ రెండు రోజులకు డ్రాగన్ మొక్కలకు నీరు పెట్టడం, ఏపుగా పెరిగిన కొమ్మలు తొలగించడం, పేడ గత్తం, వేప ఆకులతో సేంద్రియ ఎరువు తయారుచేసి మొక్కలపై పిచికారీ చేయడం వంటి పనులను వారు చక్కబెడుతున్నారు. డ్రాగన్ తోట సాగుతో ఇల్లు కూడా చల్లగా ఉంటోందని ఆయన చెబుతున్నారు. అభిరుచితోనే... మా ఇంటిపై ఏవో మొక్కలు వేద్దామని అనుకున్నాను. కోవిడ్ సమయంలో వర్క్‌ఫ్రమ్ హోమ్ కావడంతో ఆలోచన వచ్చింది. నెట్లో చెక్‌చేసి డ్రాగన్ తోటలుపై దృష్టిసారించారు. ఖమ్మం నర్సరీతో పాటు రేగిడి మండలం కాగితాపల్లి వద్ద దూబ రమేష్ నర్సరీ నుంచి మొక్కలు తెచ్చాం. రూ.2 లక్షలు వెచ్చించి తోట వేశాం. ఇప్పుడు ఇవి అందంగా ఉండడంతో పాటు సీజన్లో మంచి పూత వస్తోంది. గతేడాది రూ.1.50 లక్షల వరకు ఆదాయం వచ్చింది. – సుదర్శనం అధికారి, డోలపేట -
రూట్ మార్చిన రైతులు.. కొత్త రకం సాగుతో అన్నదాతకు లాభాలు!
కొందుర్గు, రంగారెడ్డి జిల్లా: ఆహార, వాణిజ్య పంటలతోపాటు కూరగాయలు, ఆకుకూరలు, పూలతోటలు సాగులో అధిక పెట్టుబడులు పెట్టి నష్టాలపాలైన రైతులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఎక్కడో థాయ్‌లాండ్, వియత్నం దేశాల్లో సాగుచేసే డ్రాగన్ పండ్ల తోటలతోపాటు చేపల పెంపకంపై దృష్టి సారిస్తున్నారు. ఎలాంటి చీడపీడలు ఆశించని, తక్కువ పెట్టుబడితో సాగుచేసే డ్రాగన్ పండ్ల తోటలను రంగారెడ్డి జిల్లాలోని కొందుర్గు మండలం ఉమ్మెంత్యాల, ముట్పూర్ గ్రామాల రైతులు ఉద్యాన శాఖ అధికారుల సలహాలతో సాగు చేస్తున్నారు. ఫ్రూట్స్ పండించడంతోపాటు డ్రాగన్ మొక్కలకు సంబంధించిన నర్సరీని సిద్ధం చేసి ఇతర రైతులకు విక్రయిస్తూ లాభాలు గడిస్తున్నారు. వ్యవసాయానికి అంతగా అనుకూలించని గరపనేలల్లోనూ తక్కువనీటితో ఈ పండ్లు సాగు చేయొచ్చని చెబుతున్నారు. యూట్యూబ్ చూసి.. సాగు చేసి కొందుర్గు మండలం ఉమ్మెంత్యాల గ్రామానికి చెందిన రైతు రవీందర్ రెడ్డి యూట్యూబ్ చూసి ఈ పంటను సాగుచేసి అధునాతన ఒరవడి సృష్టించాడు. సంగారెడ్డిలో ఓ రైతు సాగుచేసిన తోటను పరిశీలించి ఆయన అనుభవాలను తెలుసుకున్నాడు. డ్రాగన్ ఫ్రూట్స్ పీ పింక్ రకం మొక్కలు ఎంపిక చేసుకొని ఒక్కో మొక్కకు రూ.70 చొప్పున మాట్లాడుకొని 2 వేల మొక్కలు తెచ్చి మూడెకరాల్లో నాటాడు. ప్రస్తుతం మరో రెండువేల మొక్కలను స్వతహాగా తయారు చేసుకొని మరో మూడు ఎకరాల్లో నాటడంతోపాటు ఇతర రైతులకు మొక్కలను సిద్ధం చేశాడు. అతడిని చూసిన మరికొంతమంది రైతులు డ్రాగన్ తోటలను సాగుచేశారు. కేశంపేట, చేవెళ్ల, భూత్పూర్, మక్తల్, నారాయణపేట ప్రాంతాల్లోనూ డ్రాగన్ తోటలను సాగుచేస్తున్నారు. దిగుబడి, మార్కెటింగ్.. ఈ పంట సాగుచేసిన 8 నెలలకు దిగుబడి ప్రారంభమవుతుంది. ఒక పండు 600 నుంచి 700 గ్రాములు ఉంటుంది. ఒక్కో మొక్కకు దాదాపు 25 కిలోల పండ్లు వస్తాయి. హైదరాబాద్‌లోని ఫ్రూట్ మార్కెట్లలో విక్రయిస్తున్నారు. కిలోకు రూ.150 నుంచి రూ.200 వరకు ధర పలుకుతుందని రైతులు చెబుతున్నారు. చెరువులు తవ్వి.. చేపలు పెంచి మరోవైపు మరికొంతమంది రైతులు చెరువులను తవ్వి చేపల పెంపకంపై దృష్టి సారించారు. ఒక్కో చేప పిల్లకు రూ.16 చొప్పున ఖర్చుచేసి నల్లగొండ నుంచి మూడు నెలల వయస్సు గల చేప పిల్లలను తెచ్చి చెరువుల్లో వదిలారు. అర ఎకరం విస్తీర్ణంలో పదివేల వరకు చేపపిల్లలను పెంచొచ్చని తెలిపారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం దాణా వేయాలని, 8 నుంచి తొమ్మిది నెలల వ్యవధిలో ఒక్కో చేప కిలో బరువు దాటుతుందని అంటున్నారు. రెండో ఏడాది నుంచి దిగుబడి డ్రాగన్ సాగుచేయడానికి మొదటగా పిల్లర్లు, డ్రిప్‌ల కోసం ఎకరాకు రూ.5 లక్షల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. మొదటి ఏడాది కాస్తా దిగబడి తక్కువగా ఉన్నా రెండో ఏడాది నుంచి పెరుగుతుంది. మూడు, నాలుగేళ్ల సమయంలో ఎకరాకు 50 నుంచి 80 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఖర్చులు పోను ఎకరాకు రూ.5 లక్షల దాకా లాభం వస్తుంది. ఈ పంట 30 ఏళ్ల వరకు దిగుబడి వస్తుంది. – రవీందర్‌రెడ్డి, రైతు, ఉమ్మెంత్యాల చేపల పెంపకంతో లాభాలు 15 గుంటల విస్తీర్ణంలో చెరువు తవ్వి 10 వేల చేపపిల్లలను వదిలాను. గుంత తవ్వడం, కవర్ వేయడం, చుట్టూ కంచె వేయడానికి రూ.5 లక్షల ఖర్చు వచ్చింది. దాణాకు మరో రూ.10 లక్షలు అయ్యింది. తొమ్మిది నెలల్లో ఒక్కో చేపపిల్ల కిలో బరువు వచ్చింది. ప్రస్తుతం చెరువు వద్దే కిలో రూ.310 చొప్పున విక్రయిస్తున్నాను. ఇప్పటికి 500 కిలోలు అమ్మగా మరో 6 వేల కిలోల వరకు దిగుబడి వస్తుంది. ఈ ఏడాది ఖర్చులు పోను రూ.5 లక్షల వరకు లాభం వస్తుంది. వచ్చే ఏడాది చేపపిల్లలు, దాణా ఖర్చు మాత్రమే ఉంటుంది. ఈ లెక్కన అర ఎకరం విస్తీర్ణంలో చెరువును తవ్వి చేపలు పెంచితే 10 నెలలకు రూ.10 లక్షలు సంపాదించొచ్చు. – రాయికంటి శ్రీనివాస్‌రెడ్డి, ఉమ్మెంత్యాల. -
ఐటీలో లక్షల జీతం వదిలి సాగుపై ఫోకస్.. రాజారెడ్డి సక్సెస్ స్టోరీ
నెలకు నాలుగు లక్షల రూపాయల వేతనం.. మల్టీ నేషనల్ కంపెనీలో గౌరవప్రదమైన ఉద్యోగం.. దుబాయ్‌లో ఆహ్లాదకరమైన జీవనం.. వీటన్నింటినీ వదులుకుని ఆయన స్వగ్రామంలో రైతుగా మారాడు. వ్యవసాయంపై మమకారంతో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తూ ఆదర్శంగా నిలిచాడు. కర్నూలు(అగ్రికల్చర్): నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం పారుమంచాల గ్రామానికి చెందిన బోరెడ్డి రాజారెడ్డి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్‌లో ఇంజినీరింగ్(బీటెక్) పూర్తి చేశాడు. ప్రొడక్షన్ మేనేజ్మెంటులో ఎంబీఏ కూడా చేయడంతో ఈయనకు దుబాయ్‌లోని ఓ మల్టీనేషనల్ కంపెనీలో ప్రొడక్షన్ మేనేజర్‌గా 2007లో ఉద్యోగం వచ్చింది. నెలకు రూ.4 లక్షల వేతనం ఇచ్చేవారు. కోవిడ్ సమయంలో ఈయన స్వగ్రామానికి వచ్చి, తనకున్న 24 ఎకరాల పొలంలో వ్యవసాయం చేసేందుకు అధ్యయనం చేశాడు. డ్రాగన్‌ప్రూట్ సాగు లాభదాయకమని గ్రహించి, గుజరాత్‌కు వెళ్లి మార్కెటింగ్ తదితర అంశాలను పరిశీలించి వచ్చాడు. మల్టీనేషనల్ కంపెనీల నుంచి ప్రత్యేక ఆఫర్లు వచ్చినా వాటిని తిరస్కరించి, వ్యవసాయం మీదనే ఆసక్తి చూపాడు. ప్రయోగాత్మకంగా 2021 ఏప్రిల్‌లో నాలుగు ఎకరాల్లో డ్రాగన్ ప్రూట్ సాగుకు శ్రీకారం చుట్టాడు. ఈయన శ్రమ ఫలించి, సరిగ్గా 14 నెలలకు కాపు మొదలై, మొదటి పంటలోనే పెట్టిన పెట్టుబడిలో 90 శాతం దక్కింది. సాగు ఇలా.. డ్రాగన్‌ప్రూట్ సాగుకు మొదటి ఏడాది మాత్రమే పెట్టుబడి వ్యయం ఎక్కువగా ఉండి, రెండో ఏడాది నుంచి తగ్గుతూ వస్తుంది. ఎకరా తోటకు 500 సిమెంటు పోల్స్ పాతుకొని, వీటి పైన బండి చక్రం లేదంటే టైరు వంటివి ఏర్పాటు చేసుకోవాలి. అంట్లు తెచ్చుకోవడంతోపాటు డ్రిప్ సమకూర్చుకోవాల్సి ఉంటుంది. వీటి కోసం రాజారెడ్డి ఎకరాకు రూ.6 లక్షల ప్రకారం నాలుగు ఎకరాలకు రూ. 24 లక్షలు పెట్టుబడి పెట్టాడు. సీమామ్(ఎస్ఐఏఎం) రెడ్, థైవాన్ పింక్ రకాల అంట్లు ఒక్కొక్కటి రూ.100 ప్రకారం గుజరాత్ నుంచి తెచ్చుకుని, ఒక్కో సిమెంటు దిమ్మెకు 4 అంట్లు ప్రకారం ఎకరాకు 2,000 నాటుకున్నాడు. నాలుగు ఎకరాల్లో 8 వేల మొక్కలు అభివృద్ధి అయ్యాయి. డ్రాగన్‌ఫ్రూట్‌కు చీడపీడల బెడద ఉండదు. పశువులు తినే అవకాశం కూడా లేదు. బెట్టను తట్టుకుంటుంది. దిగుబడి పెంచుకోవడానికి, బరువు రావడానికి ఎరువులు మాత్రం ఇవ్వాల్సి ఉంది. దిగుబడి ఇలా.. 2021 ఏప్రిల్‌లో అంట్లు నాటుకోగా సరిగ్గా 14 నెలల నుంచి అంటే ఈ ఏడాది జూన్ నుంచి కాపు మొదలైంది. గులాబీ రంగులో కాయలు ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇప్పటి వరకు మొదటి పంటలో 16 టన్నులు దిగుబడి వచ్చింది. మరో టన్ను వరకు వచ్చే అవకాశం ఉంది. కాయ బరువు 400 గ్రాముల నుంచి 700 గ్రాముల వరకు ఉంటోంది. టన్ను సగటున రూ.1.30 లక్షల ధరతో విక్రయించగా రూ.20.80 లక్షలు వచ్చాయి. మరో టన్ను పంట చెట్లపై ఉంది. మొత్తంగా మొదటి పంటలోనే రూ.22 లక్షల ఆదాయాన్ని రాజారెడ్డి పొందారు. పెట్టుబడి రూ.24 లక్షల పెట్టగా, మొదటి పంటలోనే 90 శాతం పెట్టుబడి వచ్చింది. డ్రాగన్ ప్రూట్ 30 ఏళ్లపాటు కాపు వస్తుంది. మొదటి ఏడాది మినహా రెండో ఏడాది నుంచి పెట్టుబడి వ్యయం ఎకరాకు గరిష్టంగా రూ.50 వేల వరకు మాత్రమే వస్తుంది. క్రమంగా దిగుబడి గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. కెమికల్స్‌కు తావు లేకుండా డ్రాగన్ ప్రూట్ పోషకాలకు నెలవు. దీనిని చిన్నారుల నుంచి వయో వృద్ధుల వరకు తింటారు. కెమికల్స్ వాడకుండా ప్రకృతి వ్యవసాయం విధానంలో ద్రవ, ఘనజీవామృతం, పశువుల ఎరువులు, కంపోస్ట్ ఎరువులు మాత్రమే వినియోగిస్తూ డ్రాగన్ ప్రూట్ సాగు చేస్తున్నట్లు రైతు రాజారెడ్డి తెలిపారు. చెట్టుకు కాయలు ఎక్కువగా రావడం, బరువు ఎక్కువగా ఉండడం కోసం తగిన మోతాదులో రసాయన ఎరువులు వినియోగిస్తున్నట్లు చెప్పారు. దీంతో మొదటి పంటలోనే ఎకరాకు 4 టన్నులకుపైగా దిగుబడి వచ్చినట్లు రాజారెడ్డి వివరించారు. ఎంతో సంతోషంగా ఉంది డ్రాగన్‌ఫ్రూట్ సాగు విజయవంతం కావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. మరింత పట్టుదలతో పనిచేసే అవకాశం వచ్చింది. ట్రీపుల్‌ఈ, ఎంబీఏ పూర్తి చేసి 13 ఏళ్లపాటు నెలకు రూ.4 లక్షల వేతనంతో దుబాయ్‌లో పనిచేశాను. ఎప్పుడూ ఇంత సంతృప్తి లేదు. ఎవరైనా డ్రాగన్‌ఫ్రూట్ సాగుకు ముందుకు వస్తే సహకరిస్తాను. తక్కువ ధరకే అంట్లు సరఫరా చేస్తాం. మిగిలిన మా పొలంలో పండ్లతోటలు అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఉన్నాం. – బోరెడ్డి రాజారెడ్డి (91548 71980) -
Dragon Fruit: కరువు నేలపై సిరులు: రూ.5.5 లక్షల ఖర్చు.. 16లక్షల ఆదాయం
సంప్రదాయ పంటతో ఆశించిన ఆదాయం రాకపోవడంతో అన్నదాతలు ఉద్యాన పంటల వైపు దృష్టి సారిస్తున్నారు. అందులో విదేశీ పంటలను కూడా సాగు చేస్తూ వినూత్న పద్ధతులు, మెలకువలు పాటిస్తూ లాభాలు గడిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో దీర్ఘ కాలిక లాభాలు వచ్చే డ్రాగన్ ఫ్రూట్‌ను సైతం సాగు చేస్తున్నారు. మార్కెటింగ్ సదుపాయం, లాభాలే లక్ష్యంగా తోటల సాగుపై దృష్టి సారించారు. సాక్షి, నంద్యాల(ఆళ్లగడ్డ): జిల్లాలో డ్రాగన్ ఫ్రూట్ సాగు విస్తరిస్తోంది. ఔషధ గుణాలు మెండుగా కలిగిన పండు కావడంతో పాటు మంచి గిరాకీ ఉండటంతో రైతులు డ్రాగన్ ఫ్రూట్ తోటల సాగుపై దృష్టి సారిస్తున్నారు. విదేశీ పండుగా చెప్పుకునే డ్రాగన్ ఫ్రూట్ ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొదటి సారి ఆళ్లగడ్డ మండలం పెద్ద ఎమ్మనూరులో 2018 –19లో సాగైంది. అనంతరం చాగలమర్రి, ఉయ్యలవాడ మండలాల్లోని కొందరు రైతలు అటువైపు దృష్టి మళ్లించారు. రైతుల ఆసక్తిని, పంట దిగుబడి ఆదాయాన్ని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం 2021 –22లో డ్రాగన్ ఫ్రూట్‌ను వాణిజ్య పంటగా గుర్తించింది. అలాగే ఎన్ఆర్ఈజీఎస్, ఉద్యానశాఖల సంయుక్తంగా సాగు విస్తీర్ణం పెంచేందుకు రైతులకు మూడేళ్ల పాటు నిర్వహణకు రాయితీలు అందిస్తోంది. దీంతో ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా సుమారు 80 ఎకరాల్లో డ్రాగన్ సాగవుతోంది. అన్ని నేలలూ అనుకూలమే.. డ్రాగన్ ఫ్రూట్ సాగుకు నీరు నిలిచే బంక నేలలు మినహా అన్ని భూములు అనుకూలమే. మెట్ట ప్రాంత భూముల్లో డ్రాగన్ మొక్క బాగా పెరగడంతో పాటు పండ్ల సైజు, దిగుబడి కూడా ఆశించిన స్థాయిలో వస్తుంది. నీటి ఎద్దడిని సైతం సమర్థవంతంగా తట్టుకుంటూ అధిక దిగుబడులను ఇస్తుంది. ఆళ్లగడ్డ మండలం శాంతినగరంలో సాగైన డ్రాగన్ ఫ్రూట్ 30 ఏళ్ల వరకు దిగుబడి .. డ్రాగన్ మొక్కలు నర్సరీలో నాలుగు నుంచి ఐదు నెలలు పెంచి ఆ తర్వాత పొలంలో నాటుకోవాలి. నాటిన 9వ నెల నుంచి ఏడాదిలోపు మొదటి పంట చేతికొస్తుంది. ఏటా ఫిబ్రవరి నుంచి నవంబరు వరకు ఏడాదికి మూడు కాపుల చొప్పున 30 ఏళ్లు దిగుబడి వస్తుంది. ఏటా ఎకరాకు రూ.50 వేల నుంచి రూ.65 వేల వరకు పెట్టుబడి నిర్వహణ ఖర్చులు వస్తాయి. దిగుబడి మాత్రం ఏటేటా పెరుగుతుంది. సాగు ఇలా.. ఎకరం మెట్ట భూమిలో డ్రాగన్ ఫ్రూట్ సాగుకు ప్రస్తుత ధరలను అనుసరించి రూ.8 లక్షల వరకు ఖర్చవుతుంది. ఎకరాకు 400 నుంచి 600 వందల సిమెంట్ స్తంభాలు అవసరం. ఇందులో 2 వేల నుంచి 2,200 మొక్కల వరకు నాటుకోవచ్చు. తొలి ఏడాది మొక్కల ఖర్చు, సిమెంట్ స్తంభాలు, రింగులు, కంచె తదితర వాటిని పరిగణనలోకి తీసుకుంటే ఎకరాకు రూ.8 నుంచి రూ.9 లక్షల వరకు పెట్టుబడి అవుతుంది. మొదటి ఏడాది ఒక్కో చెట్టు సుమారు 10 నుంచి 20 పండ్లు కాస్తుంది. తర్వాత మూడేళ్ల నుంచి ఒక్కో చెట్టు 80 నుంచి 150 పండ్లు కాస్తుంది. ఈ లెక్కన పెట్టుబడి వ్యయం పోనూ ఎకరాకు ఏడాదికి దాదాపు రూ.10 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది సాగుచేస్తున్న డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు ఎకరాకు రూ.6 లక్షల రాయితీ.. డ్రాగన్ ఫ్రూట్ సాగు చేసేందుకు ఉపాధి హామీ పథకం ద్వారా ఒక్కో రైతుకు మూడేళ్లకు రూ.6 లక్షలు ఇస్తారు. ఈ మొత్తంలో నర్సరీ నుంచి మొక్కలు తెప్పించి, కూలీలతో గుంతలు తీయించి వారే నాటిస్తారు. డ్రిప్ సౌకర్యం కల్పిస్తారు. ఎరువులు, కలుపు, సంరక్షణ ఖర్చులు ఇస్తారు. సిమెంట్ స్తంభాలు అందజేస్తారు. ప్రస్తుతం ఖర్చు ఎక్కువగా ఉండటంతో రైతుకు అర ఎకరా వరకే రాయితీ ఇవ్వనున్నారు. పుష్కలంగా ఔషధ గుణాలు డ్రాగన్ ఫ్రూట్లో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. పోషక విలువలు, విటమిన్ – సి, విటమిన్ – బి3తో ఐరన్, మెగ్నీషియంలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు, కార్బోహైడ్రేట్లు అత్యధికంగా ఉంటాయి. పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. మధుమేహ వ్యాధి, రక్త పోటు నియంత్రణలో కూడా బాగా ఉపయోపడుతుందని వైద్యులు చెబుతున్నారు. మార్కెట్లో మంచి గిరాకీ ప్రస్తుతం డ్రాగన్ ఫ్రూట్‌కు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. కరోనా సమయంలో వ్యాధినిరోధక శక్తి పెంపొందాలంటే డ్రాగన్ ఫ్రూట్ తినమని చెప్పడంతో ప్రజలు అందరూ ఈ పండు తినేందుకు ఆసక్తి పెంచుకున్నారు. ఒకప్పుడు పెద్దపెద్ద షాపింగ్ మాల్స్‌కే పరిమితమైన ఈ పండు.. ఇప్పుడు చిన్నచిన్న పట్టణాల్లో తోపుడు బండ్లపై కూడా విక్రయిస్తున్నారు. ప్రస్తుతం రైతుల వద్దకే వచ్చి వినియోగ దారులు కిలో రూ.200 వరకు ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు. ప్రయోగాత్మకంగా సాగు చేశా ఏ పంటలు వేసినా పెద్దగా ఆదాయం రాకపోవడంతో ఒక ఎకరంలో డ్రాగన్ ఫ్రూట్ పంట వేయాలని నిర్ణయించుకున్నాం. యూట్యూబ్ చూసి ఎలా చేపట్టాలో తెలుసుకున్నాం. మొక్కలు తెచ్చుకుని 2019లో నాటాం. మొదటి ఏడాది కాపు వచ్చే వరకు సుమారు రూ.5.5 లక్షల ఖర్చు వచ్చింది. మొదటి కాపు పెద్దగా రాలేదు. రెండో కాపు సుమారు నాలుగు క్వింటాళ్లు వచ్చింది. మూడో సంవత్సరం 8 టన్నులు వచ్చింది. కిలో రూ.200 లెక్కన విక్రయించడంతో రూ.16 లక్షల వచ్చింది. ఇక్కడే పొలం వద్ద విక్రయించడంతో రవాణా ఖర్చు మిగిలిపోయింది. ఈ ఏడాది 10 నుంచి 12 టన్నులకు పైగానే దిగుబడి వస్తుందని అనుకుంటున్నాం. కిలో రూ.150 ప్రకారం అమ్మినా ఎకరాకు రూ.18 లక్షలు వస్తుంది. అందుకే ఈ ఏడాది మరో రెండు ఎకరాల్లో నాటేందుకు నర్సరీలో మొక్కలు పెంచుకుంటున్నాం. – రావూరి ఆంజనేయులు, రైతు, శాంతినగరం, ఆళ్లగడ్డ మండలం ప్రభుత్వ ప్రోత్సాహంతో సాగు చేశా డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తే ఆదాయం వస్తుందని చెప్పుకుంటుంటే సాగు చేయాలనే ఆలోచన వచ్చింది. ముందు మన ప్రాంతంలో పండుతాయో లేదో తెలుసుకునేందుకు బత్తలూరు వద్ద సాగుచేసిన తోటకు వెళ్లి రైతుతో మాట్లాడాను. అంత పెట్టుబడి పెట్టడం ఎలా అని ఆలోచిస్తుంటే ఉపాధి పథకం వాళ్లు సబ్సిడీ ఇస్తామంటే అర ఎకరంలో గత ఏడాది మొక్కలు నాటాను. మొక్కలు బాగా పెరిగాయి. ఇప్పటికి రెండు కోతలు వచ్చింది. రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడ లేదు. మూడో ఏడాది ఖర్చులు పోనూ సుమారు రూ.5 లక్షల వరకు ఆదాయం వస్తుందని అనుకుంటున్నాం. – సుధాకర్, రైతు, పెద్ద ఎమ్మనూరు, ఉయ్యలవాడ మండలం సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వం రాయితీలు అందిస్తూ వాణిజ్య పంటల సాగును ప్రోత్సహిస్తోంది. డ్రాగన్ ఫ్రూట్ పంటను ఉపాధి హామీ పథకంలో సాగు చేపట్టేవిధంగా 2021–22 నుంచి ప్రభుతం అనుమతి ఇచ్చింది. ఆసక్తి ఉన్న రైతులకు అర ఎకరా వరకు సాగు చేపడితే విడతలవారీగా మూడేళ్లకు రూ.3 లక్షల వరకు రాయితీ ఇస్తుంది. ఈ ఏడాది 10 మంది రైతులు నాటుకున్నారు. మరో 160 మంది రైతులు దరఖాస్తులు చేసుకున్నారు. మరింత మంది సద్వినియోగం చేసుకోవాలి. – పి.రామచంద్రారెడ్డి, డ్వామా పీడీ, నంద్యాల -
Dragon Fruit: ఎకరాకు 8 లక్షల పెట్టుబడి! రెండో ఏడాదే అధికాదాయం.. 50 లక్షలకు పైగా!
ఆరోగ్యదాయినిగా పేరుగాంచిన డ్రాగన్ ఫ్రూట్ రైతులకు కాసుల పంట పండిస్తోంది. ఉద్యాన పంటలకు నెలవైన ఉమ్మడి అనంతపురం జిల్లాలో రైతులు లాభదాయకంగా సాగు చేస్తున్న పండ్ల రకాల జాబితాలో తాజాగా డ్రాగన్ ఫ్రూట్ చేరింది. సేంద్రియ పద్ధతుల్లో డ్రాగన్ సాగు చేస్తూ నాణ్యమైన అధిక దిగుబడులు సాధిస్తున్న రైతులు మంచి లాభాలు కళ్లజూస్తున్నారు. ఈ కోవకు చెందిన వారే కేవీ రమణారెడ్డి. అనంతపురం శివారు సిండికేట్‌నగర్‌కు చెందిన రమణారెడ్డి గార్లదిన్నె మండలం మర్తాడులో 3 ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్‌తో పాటు మరో 6 ఎకరాల్లో ఖర్జూరం సాగు చేస్తున్నారు. పదో తరగతి వరకు చదువుకున్న రమణారెడ్డి రెండేళ్ల క్రితం డ్రాగన్ ఫ్రూట్ సాగుకు శ్రీకారం చుట్టి, రెండో ఏడాదే మంచి దిగుబడులు సాధించారు. 2 వేల మొక్కలు.. రెండేళ్ల క్రితం డ్రాగన్ ఫ్రూట్ రెడ్ రకం 6 వేల మొక్కలను తెప్పించిన రమణారెడ్డి మూడు ఎకరాల్లో నాటారు. చెట్ల మధ్య 8 అడుగులు, సాళ్ల మధ్య 10 అడుగులు దూరంలో సిమెంటు స్థంభాలు నాటి... స్థంభానికి నాలుగు మొక్కలు నాటారు. గుంత తీసి అందులో వేపపిండి, వర్మీకంపోస్టు, పశువుల ఎరువు వేసి.. ఎకరాకు 500 సిమెంటు స్థంభాల చుట్టూ 2 వేల మొక్కలు నాటారు. స్తంభం పైభాగంలోకి మొక్కలకు ఆలంబనగా పాత టైరును అమర్చారు. ఎకరాకు రూ.8 లక్షల వరకు పెట్టుబడి మొత్తమ్మీద పంటకు తొలి ఏడాది మొక్కల ఖర్చు, సిమెంటు పోలు, రింగు తదితర వాటిని పరిగణలోకి తీసుకుంటే ఎకరాకు రూ.8 లక్షల వరకు పెట్టుబడి అయ్యింది. తర్వాత నుంచి ప్రతి ఏటా రూ.50 వేలకు కాస్త అటుఇటుగా ఖర్చవుతుంది. నీళ్లు పెద్దగా అవసరం లేదు. డ్రిప్ ద్వారా 15 రోజులకో తడి ఇస్తున్నాను. వర్షాకాలంలో అవసరం లేదు. ఎకరాకు ఏటా 10 నుంచి 12 టన్నుల వరకు డ్రాగన్ పండ్ల దిగుబడి వస్తుందని అంటున్నారు రమణారెడ్డి. వేపనూనె పిచికారీ చేస్తే ఎర్రచీమల సమస్య అదుపులోకి వచ్చిందని రమణారెడ్డి వివరించారు. ఏడాదికి రెండు సార్లు ఐదు ట్రాక్టర్లు పశువులు ఎరువు వేశారు. కొంత కోళ్ల ఎరువు, గొర్రెల ఎరువు వాడాను. పండ్ల కోతకు కూలీల అవసరం తక్కువే. తాను, తన భార్య లక్ష్మీదేవితో పాటు ఇద్దరు ముగ్గురు కూలీలతో సరిపోతోందన్నారు. మొక్కల ద్వారా ఆదాయం అంట్లు కట్టి, మొక్కల అమ్మకం మొదలు పెట్టారు. ఒక కటింగ్‌ను రూ.70కి, రెండు నెలలు పెంచిన మొక్కను రూ.100కి అమ్ముతున్నానని రమణారెడ్డి చెబుతున్నారు. ఇపుడున్న పరిస్థితుల్లో డ్రాగన్ మించిన ఆదాయాన్నిచ్చే పంట మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. రెడ్ వెరైటీ.. ఎండను తట్టుకుంటుంది.. డ్రాగన్ ఫ్రూట్ సాగుకు అనంతపురం జిల్లా నేలలు, వాతావరణం అనుకూలమే. ఇప్పటికి 20 మందికి పైగా రైతులు 70–80 ఎకరాల్లో డ్రాగన్ సాగు చేపట్టారు. మొదటి ఏడాది పెట్టుబడి ఎక్కువ అయినా మున్ముందు లాభదాయకంగా ఉంటుంది. ఒక్కసారి నాటుకుంటే గరిష్టంగా 25–30 ఏళ్ల వరకు పంట దిగుబడి వస్తుంది. డిసెంబర్–మే మధ్య కాలంలో ప్రూనింగ్, పోషకాల యాజమాన్యం, కలుపు నివారణ చర్యలు చేపడితే ఇబ్బంది ఉండదు. మొక్కల ఎంపికలో కొంత జాగ్రత్త తీసుకోవాలి. మర్తాడు రైతు రమణారెడ్డి సాగు చేసిన రెడ్ వెరైటీ డ్రాగన్ పండ్లు సైజు పరంగా, దిగుబడి పరంగా మంచిదే. ఎండకు తట్టుకుంటుంది. – డా. బి.విమల (94938 31009), ఉద్యాన శాస్త్రవేత్త, ఉద్యాన పరిశోధనా స్థానం, రేకులకుంట, అనంతపురం జిల్లా రెండో ఏడాదే అధికాదాయం డ్రాగన్ ఫ్రూట్ పంట ద్వారా రెండో ఏడాది ఊహించిన దానికన్నా అధిక దిగుబడి వచ్చింది. మూడు ఎకరాల్లో ఇప్పటికే 18 టన్నుల పండ్లు అమ్మాను. చెన్నై, బెంగళూరు వ్యాపారులతోపాటు స్థానిక వ్యాపారులు కూడా తీసుకెళుతున్నారు. కేవీ రమణారెడ్డి పండు సైజును బట్టి టన్ను రూ.1.35 లక్షల నుంచి రూ.1.65 లక్షల వరకు పలికింది. కాపు బాగున్నందున ఇంకా రూ.15 టన్నులకు పైగా దిగుబడి రావచ్చు. ఈ లెక్కన రూ.50 లక్షలకు పైగా రావచ్చనుకుంటున్నా. నాటిన రెండో ఏడాది నుంచే రెమ్మలు కత్తిరించి అమ్ముతున్నా. ఇప్పటికి రూ.24 లక్షల విలువ చేసే మొక్కలు అమ్మాను. – కేవీ రమణారెడ్డి, డ్రాగన్ ఫ్రూట్ రైతు , (93469 25502, 94908 56363), మార్తాడు, గార్లదిన్నె మం., అనంతపురం జిల్లా – గంగుల రామలింగారెడ్డి, సాక్షి, అనంతపురం అగ్రికల్చర్ ఫొటోలు: బి.మహబూబ్‌బాషా చదవండి: నేచర్ అర్బైన్.. అతిపెద్ద రూఫ్‌టాప్ పొలం!