ఉత్కంపోరులో సీఎస్‌కే ఓట‌మి.. | IPL 2025: Royal Challengers Bengaluru vs Chennai Super Kings | Sakshi
Sakshi News home page

IPL 2025: ఉత్కంపోరులో సీఎస్‌కే ఓట‌మి..

Published Sat, May 3 2025 7:03 PM | Last Updated on Sat, May 3 2025 11:33 PM

IPL 2025: Royal Challengers Bengaluru vs Chennai Super Kings

PC: BCCI/IPL.com

IPL 2025 RCB vs CSK Live Updates: 

ఉత్కంపోరులో సీఎస్‌కే ఓట‌మి..
ఐపీఎల్‌-2025లో చెన్నై సూప‌ర్ కింగ్స్ ఓటముల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో జ‌రిగిన ఉత్కంఠ‌పోరులో 2 ప‌రుగుల తేడాతో సీఎస్‌కే ఓట‌మి పాలైంది. 214 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన చెన్నై 5 వికెట్లు కోల్పోయి 211 ప‌రుగులు చేయ‌గ‌ల్గింది. 

ఆఖ‌రి ఓవ‌ర్‌లో సీఎస్‌కే విజ‌యానికి 15 ప‌రుగులు అవ‌స‌ర‌మ‌య్యాయి. అయితే 20 ఓవ‌ర్ వేసిన య‌శ్ ద‌యాల్ అద్బుతంగా బౌలింగ్ చేశాడు. తొలి రెండు బంతుల సింగిల్స్ ఇచ్చిన ద‌యాల్‌.. మూడో బంతికి ధోనిని ఔట్ చేశాడు. ఆ త‌ర్వాత నాలుగో బంతికి ద‌యాల్ సిక్స్ ఇచ్చాడు.  

అంత‌కు తోడు ఆ బంతి నో బాల్ కావ‌డంతో మ్యాచ్ సీఎస్‌కే వైపు మ‌లుపు తిరిగింది. చివ‌రి మూడు బంతుల్లో సీఎస్‌కే విజ‌యానికి కేవ‌లం 6 ప‌రుగులు మాత్ర‌మే అవస‌ర‌మ‌య్యాయి. ఈ స‌మ‌యంలో ద‌యాల్ అద్బుత‌మైన క‌మ్‌బ్యాక్ ఇచ్చాడు. మూడు బంతుల్లో కేవ‌లం మూడు ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చాడు. 

సీఎస్‌కే బ్యాట‌ర్ల‌లో యువ ఆట‌గాడు అయూష్ మాత్రే(48 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌ల‌తో 94) తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. అత‌డితో పాటు ర‌వీంద్ర జ‌డేజా(77 నాటౌట్‌) రాణించాడు. సీఎస్‌కే ఓడిపోవ‌డంతో వీరిద్ద‌రి ఇన్నింగ్స్ వృథా అయిపోయాయి. ఆర్సీబీ బౌలర్లలో ఎంగిడీ మూడు వికెట్లు పడగొట్టగా.. దయాల్, పాండ్యా తలా వికెట్ సాధించారు. 

విజ‌యానికి చేరువ‌లో సీఎస్‌కే..
సీఎస్‌కే విజ‌యానికి ఆఖ‌రి ఓవ‌ర్‌లో 15 ప‌రుగులు కావాలి. క్రీజులో జ‌డేజా(75), ధోని(11) ఉన్నారు.

సీఎస్‌కే మూడో వికెట్ డౌన్‌..
ఆయూష్ మాత్రే రూపంలో సీఎస్‌కే మూడో వికెట్ కోల్పోయింది. 94 ప‌రుగుల‌తో అద్బ‌త‌మైన ఇన్నింగ్స్ ఆడిన మాత్రే.. లుంగీ ఎంగిడీ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. సీఎస్‌కే విజ‌యానికి 22 బంతుల్లో 42 ప‌రుగులు కావాలి. క్రీజులో జ‌డేజా(59) ఉన్నాడు.

దంచి కొడుతున్న సీఎస్‌కే బ్యాట‌ర్లు..
భారీ ల‌క్ష్య చేధ‌న‌లో సీఎస్‌కే అద‌ర‌గొడుతోంది. 15 ఓవ‌ర్లు ముగిసే స‌రికి సీఎస్‌కే రెండు వికెట్ల న‌ష్టానికి 160 ప‌రుగులు చేసింది. క్రీజులో మాత్రే(91), జ‌డేజా(50) ప‌రుగుల‌తో ఉన్నారు.
సీఎస్‌కే రెండో వికెట్ డౌన్..
సామ్ కుర్రాన్ రూపంలో సీఎస్‌కే రెండో వికెట్ కోల్పోయింది. 5 ప‌రుగులు చేసిన కుర్రాన్‌.. లుంగీ ఎంగిడీ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 8 ఓవ‌ర్లు ముగిసే స‌రికి సీఎస్‌కే రెండు వికెట్ల న‌ష్టానికి 79 ప‌రుగులు చేసింది.

దూకుడుగా ఆడుతున్న అయూష్‌..
సీఎస్‌కే యువ ఓపెన‌ర్ అయూష్ మాత్రే దూకుడుగా ఆడుతున్నాడు. 4 ఓవ‌ర్ వేసిన భువ‌నేశ్వ‌ర్ కుమార్ బౌలింగ్‌లో మాత్రే.. 5 ఫోర్లు, ఒక సిక్స‌ర్‌తో 26 ప‌రుగులు రాబాట్టాడు. మాత్రే 47 ప‌రుగుల‌తో త‌న బ్యాటింగ్‌ను కొన‌సాగిస్తున్నాడు. 

సీఎస్‌కే తొలి వికెట్ డౌన్‌
214 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన సీఎస్‌కే తొలి వికెట్ కోల్పోయింది. 14 ప‌రుగులు చేసిన షేక్ రషీద్‌.. కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో ఔటయ్యాడు. 5 ఓవర్లకు సీఎస్‌కే స్కోర్‌:57/1

కోహ్లి, షెఫర్డ్ మెరుపులు.. సీఎస్‌కే ముందు భారీ టార్గెట్‌
చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది.

ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి(62) టాప్ స్కోరర్‌గా నిలవగా.. జాకబ్ బెతల్‌(55), రొమారియో షెపర్డ్(53) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. షెపర్డ్ కేవలం 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లు ఉన్నాయి. సీఎస్‌కే బౌలర్లలో పతిరాన మూడు వికెట్లు పడగొట్టగా.. కుర్రాన్‌, నూర్ అహ్మద్ తలా వికెట్ సాధించారు.

షెఫ‌ర్డ్ విధ్వంసం..
19 ఓవ‌ర్ వేసిన ఖాలీల్ అహ్మ‌ద్ బౌలింగ్‌లో ఆర్సీబీ బ్యాట‌ర్ షెఫ‌ర్డ్ విధ్వంసం సృష్టించాడు. నాలుగు సిక్స్‌లు, రెండు ఫోర్లతో ఏకంగా 33 పరుగులు రాబాట్టాడు. 19 ఓవర్లు ముగిసే ఆర్సీబీ 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది.

రెండు వికెట్లు డౌన్‌..
ఆర్సీబీ వ‌రుస క్ర‌మంలో రెండు వికెట్లు కోల్పోయింది. జితేష్ శ‌ర్మ‌(7) నూర్ అహ్మ‌ద్ బౌలింగ్‌లో ఔట్ కాగా.. పాటిదార్‌(11) ప‌తిరాన బౌలింగ్‌లో పెవిలియ‌న్‌కు చేరాడు. 18 ఓవ‌ర్ల‌కు ఆర్సీబీ 5 వికెట్ల న‌ష్టానికి 159 ప‌రుగులు చేసింది.

ఆర్సీబీ రెండో వికెట్ డౌన్..
విరాట్ కోహ్లి రూపంలో ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. 62 ప‌రుగులు చేసిన కోహ్లి.. సామ్ కుర్రాన్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 14 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఆర్సీబీ రెండు వికెట్ల న‌ష్టానికి 140 ప‌రుగులు చేసింది. క్రీజులో ప‌డిక్క‌ల్‌(150, పాటిదార్‌(7) ఉన్నారు.

విరాట్ కోహ్లి హాఫ్ సెంచరీ..
సీఎస్‌కేతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి హాఫ్ సెంచరీ సాధించాడు. కోహ్లి 62 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు.

ఆర్సీబీ తొలి వికెట్ డౌన్‌..
జాకబ్ బెతల్ రూపంలో ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. 55 పరుగులు చేసిన బెతల్‌.. పతిరాన బౌలింగ్‌లో ఔటయ్యాడు. 11 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 114 పరుగులు చేసింది.

జాక‌బ్ బెత‌ల్ హాఫ్ సెంచరీ..
ఆర్సీబీ యువ ఆట‌గాడు జాక‌బ్ బెత‌ల్ తొలి ఐపీఎల్ హాఫ్ సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు. కేవ‌లం 28 బంతుల్లో బెత‌ల్ హాఫ్ సెంచ‌రీ సాధించాడు. 9 ఓవ‌ర్ల‌కు ఆర్సీబీ వికెట్ న‌ష్ట‌పోకుండా 94 ప‌రుగులు చేసింది. క్రీజులో బెత‌ల్‌(54), కోహ్లి(40) ఉన్నారు.

దూకుడుగా ఆడుతున్న ఆర్సీబీ
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ వికెట్ న‌ష్ట‌పోకుండా 46 ప‌రుగులు చేసింది. ఆర్సీబీ ఓపెన‌ర్లు జాక‌బ్ బెత‌ల్‌(28) , విరాట్ కోహ్లి(18) ఉన్నారు.

ఐపీఎల్‌-2025లో ఆస‌క్తిక‌ర‌పోరుకు తెరలేచింది. చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన  సీఎస్‌కే తొలుత బౌలింగ్ ఎంచుకుంది. 

ఇప్ప‌టికే సీఎస్‌కే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్ర‌మించ‌గా.. ఆర్సీబీ మాత్రం ఈ మ్యాచ్‌లో గెలిచి త‌మ ప్లే ఆఫ్ బెర్త్‌ను ఖారారు చేసుకోవాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉంది. ఈ మ్యాచ్‌కు ఆర్సీబీ స్టార్ బౌల‌ర్ జోష్ హాజిల్‌వుడ్ దూర‌మ‌య్యాడు. అత‌డి స్ధానంలో లుంగీ ఎంగిడీ జ‌ట్టులో వ‌చ్చాడు. సీఎస్‌కే మాత్రం ఎటువంటి మార్పులు చేయ‌లేదు.

తుది జ‌ట్లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): జాకబ్ బెథెల్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(కెప్టెన్‌), జితేష్ శర్మ(వికెట్ కీప‌ర్‌), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, లుంగీ ఎన్గిడి, యశ్ దయాల్

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): షేక్ రషీద్, ఆయుష్ మ్హత్రే, సామ్ కుర్రాన్, రవీంద్ర జడేజా, డెవాల్డ్ బ్రెవిస్, దీపక్ హుడా, ఎంఎస్ ధోని(కెప్టెన్‌), నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, మతీషా పతిరానా

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement